SNo
int64
0
25.8k
text
stringlengths
39
23.5k
24,900
    మరోసారి తల ఆడించబోయి, తాను చేస్తున్న పని గుర్తొచ్చి నవ్వేశాడు.     "అది కాదు..."     "ఏది కాదు?"     "అవును?"     "ఏమిటవును?"     "ఇదిగో" అంటూ చేతిలోని గిఫ్ట్ ప్యాకెట్ ఆమె కందించాడు.     "ఏమిటిది?"     "నీ బర్త్ డే కదూ. అందుకని..."     "ఓ! ప్రెజెంటేషనా? ఇందులో ఏముంది?"     "టాయిలెట్ సామగ్రి."     "ఛీ" అంది.     అతనికర్థం కాలేదు.     "నేను మెట్రిక్ వరకూ చదువుకున్నాను. టాయిలెట్ అంటే అర్థం తెలుసులే."     "అదికాదు? ఫేస్ పౌడర్,స్నో వగైరాలు వుండే బాక్సు."     "ఓహో అదా? ఉండు మా నాన్నగారికి చెప్పి వస్తాను నువ్వొచ్చావనీ..."     "చూడు వజ్రం!" అన్నాడు కంగారుగా.     ఆమె ఒక్కసారి కళ్ళార్పి, అంతలోనే విశాలం చేస్తూ అతని వంక చూసింది. తనని పేరుపెట్టి పిలవడం ఆమెకెంతో సంతోషాన్నిచ్చింది.     "ఇంట్లో ఓ ఫ్రెండ్ ఉన్నాడు. పాపం చాలా దూరం నుంచి వచ్చాడు. నేవెళ్ళాలి."     "అదేమిటి? భోజనం చేసి వెళ్ళకుండా..."     "చెప్పానుగా ఫ్రెండ్ ఉన్నాడని."     "అయితే మాత్రం. సేమ్యా, కేసరి, రవ్వలడ్డూ, జున్ను, తమలపాకు బజ్జి, అన్నట్టు సాంబారు నేనే పెట్టాను. తెలుసా. ఉండు నాన్నగారిని పిల్చుకొస్తాను. వెడితే నా మీద ఒట్టే." అంటూ వజ్రం లోపలికి పరిగెత్తింది.     శ్రీహర్ష ఏమయితే అయిందని అక్కణ్ణుంచి బయటకు జారుకున్నాడు.                                                       *    *    *    *     హరిజనవాడలోకి ఓ కొత్త కుటుంబమొచ్చింది. ఆ కుటుంబంలోని సభ్యులు నలుగురు. తల్లితండ్రి, ఇద్దరాడ పిల్లలు. ఆడపిల్లల్లో పెద్దమ్మాయికి పదిహేడేళ్ళుంటాయి. పేరు రాగిణి. రెండో అమ్మాయికి యింకా పదేళ్ళు నిండలేదు.     వచ్చినప్పట్నుంచీ తల్లీ తండ్రీ అందరితో కలుపుగోలుగా ఉండేవారు. తండ్రి సంజీవయ్య తొందరలోనే పొలం పని సంపాదించి వెళ్ళి పనిపాటలు చూసుకునేవాడు. తల్లి గోవిందమ్మ ఇరుగుపొరుగు వారితో తలలో నాలికలా మసలుకొనేది.     ఆ కుటుంబం అక్కడికి వచ్చిన నెలరోజులకే ఎల్లమ్మ దేవత రాగిణిని అనుగ్రహించింది. వాడలోని మహ్మకాళమ్మకు పూనకం వచ్చి రాగిణిని జోగి చెయ్యకపోయినట్లయితే కొద్దిరోజుల్లో ఆ ప్రాంతంలో కరువు వ్యాపించగలదని, ఆమెను వెంటనే జోగినిని చెయ్యాలనీ శాసించింది.     "నువ్వు అదృష్టవంతురాలివమ్మా? ఎల్లమ్మ దేవత అనుగ్రహం చాలా తొందరగా పొందావు?" అని ఇరుగూ పొరుగూ రాగిణిని అభినందించారు."     రాగిణి చిరునవ్వు నవ్వి ఊరుకుంది.     "అంతా ఎల్లమ్మదేవత దయ. మాదేముంది? అన్నారు ఆమె తల్లిదండ్రులు.     తర్వాత రెండుమూడు రోజుల్లోనే రాగిణి జోగినిగా మారిపోతుంది. ఆమెలో ఏదో ఆకర్షణ ఉంది. జోగాపురంలోని వారు, దగ్గర గ్రామాలవారు ఆమె దగ్గరకు విరివిగా రాసాగారు.     రాత్రి ఏడు గంటలకల్లా ఆమె దగ్గరకు పొందుకోసం పురుషులు రావటం మొదలయ్యేది. రాగిణిలో ఇంకో నేర్పు ఉంది. వచ్చిన వ్యక్తిని మురిపించి, ముద్దులిచ్చి, అతని కోరిక తనివితీరా తీర్చటం కొద్దివ్యవధిలో ముగించేది. అతని దగ్గర్నుంచి డబ్బులు కూడా లాఘవంగా కాస్త ఎక్కువగానే గుంజి "చాలా అలసిపోయాను. మళ్ళీ రేపు" అని గోముగా వీడ్కోలు ముద్దులిచ్చి పంపించేది. వచ్చిన మనిషికి ఆ అనుభవం, అనుభూతి మరువరానిదిగా ఉండేది.     అలసిపోయానని చెప్పిన రాగిణి, ఓ పదినిమిషాలన్నా గడవకముందే వచ్చిన నూతన వ్యక్తి ముందు తాజాగా తయారై, తిరిగి అన్నీ తాజాగా జరిపించేది.
24,901
    జగ, జగజగ,  జగజగ,  జగజగ, జగజగ, జగజగ     ____________________________     తగం- ణగం -డేగం - జగం     తగణ-, ణగణగ, డెగడె, డెగడెగ, జెగజ, జగజగ     బాధతో-, ఎంతో, బాదతో, గజేంద్రుగని     ఈలాగునను మంఢూకములు ఘోషింపగా .....     తర్రఘర్రట ఘర్రటాకుకు     ఢాకుఢెకుకు ఢేకుడింకుకు     ఉగ్రశాపముతో గజేంద్రుడు     బద్దుడ్తె కాదు మొరలుబెట్టగ     తాకిటతక త త్తదిమి తతతతఝెం     _____     భక్తసులభుడు, భక్తునింగని     బిరబిరను యా వనము జేరియు     నంగిటతక దిద్దికిటతక     ______     చేత చక్రముబట్టి మకరిని సంహరించిన మహిమనూ....     దినుతాంహత తకిటతకుందరి     జానకి కళ్యాణ శ్రీ రఘురామ     భుజబాల భిమ, జగడభిరామ-,     -, కోదండరామా పరాక్,     దాకిటతక దాకిటకిటతక     _____________     ఝేకిటతక ఝేకిటకిటతక     _____________     తరికిటతక త త్తరికిటతక     ______________      తళంగుతక తదిగిణతోం      ౩ సార్లు     _______________                            శిద్దేంద్ర శబ్దము - మిశ్రచాపు                            రచన: వేదాస్తం పార్వతీశం         తత్తడింకుకు  ధణతదీనుత     తద్దిమిధిమి తహతఝెంతరి     ఝెంతజగందరి జగందకుకుందరి     కుకుందతకుందరి తకుందకిణధరితాం     త్తే హి దత్తతాం     కృష్ణప్రాగ్దిశ భూములందున     శిష్టజనసామాశ్రయంబగు     స్రష్టనిలయము బ్రహ్శ్యవాటిని     త్వష్టనిర్మిత దేవళంటున     తిష్టవేసే శిద్దేండ్రు డోకనాడు....     తారితారిత జగకిణాంతరి     సామగానము వల్లేవేయుచు     శిష్యులెల్లరు వెంటరాగా     సోమయాజీ వినమృడ్తెతా     స్వామినటఖిక్షక్తె పిలచేనూ.....     దోకిటతక దోద్దోకిటతక     ____________     చీలికరౌతుల బోలుశిష్యుల     కాకవిధ్వని పలుకులనుమవి     మొలకలెత్త సిద్దేంద్రునికి నిధి     తద్దణాంధిమి తహతఝెంతరి     బిరబిరను భిక్షక్తె నెగెనూ.....     అమృతమస్తని ఆపోననంబిడ     అనంగికృతుడాయె యతి     అంతటను ఆ విపరవర్యులు     అపచారమే  కలిగె ననుచును     తరితాతతకిణ, తరితతకతక     చెదరి చెదరిన హృదయిడ్తె యా     సోమయాజయు నెంతో వేడగ     నాదురచనగు, భామకలాపంబు మీరును     విధివిధిని వాడవాడల, ఆటపాటలు     ఆడుమనగా....     తాకిణంత ఝేకిణంత     వేదంవాక్కులు బల్కు విప్రులు     వేషభాషలు వేళాయనౌన     విలయతాండప మాడదే భువి     విపరవంశము భ్రష్టమౌనన     రికుంద కుకుందరి కుకుంద తకుందరి     కోపఘూర్ణి తలోచనుండ్తె     శాసమిత్తని వెరపు గొల్బగ     తాద్దిగిద్దిగి ద్దిగిద్దిగిద్దిగి     విదివిధంబని విప్రులెల్లరు వల్లె యనగా.....     తాద్ద్దణా-, తఝేణుత తద్దిమీ-,     తద్దిమీత కిటతక     బాగుబాగని వతువులకు తానద వ సాముతో     భామంలాపమును నేర్బెనూ .....     తత్తధృగుడుత ధృగుడుత తాతకిణ     ___________________     వెరవు జెందెదరే లరయయో     విప్రులారా! లెండు వేగమె     శంకరాచార్యు కదకెగగ     వినియు కనియును స్వామి
24,902
    "వస్తున్నా!"     మరో నిముషం గడిచాక తలుపు తెరువబడింది. రవి తొట్రుపాటును అణగత్రొక్కుకుంటూ , తనని తాను సంభాళించుకోలేని స్థితిలో త్రొక్కిసలాడుతూ, చివరకు ధైర్యంచేసి తలవంచి చూసి "రాగిణీ! నీ వచ్చాను" అన్నాడు.     "లోపలకు రండి."     అతను లోపలకు వెళ్ళాక రాగిణి తలుపులు గడియవేసింది. "ఇదేమిటి?" అని తెల్లబోయి మరుక్షణంలో ఓ తువ్వాలు తీసి అతనికి అందిస్తూ, "తుడుచుకోండి" అంది.     అతను దిగజారిపోతున్న చెమటను ఆతృతతో తుడుచుకుని కుర్చీలో కూలబడి "అబ్బా!" అన్నాడు.     "ఏమిటీ రాత్రివేళ ఆగమనం?"     "ఎందుకో నిన్నెప్పుడూ రాత్రులే చూడాలని వుంటుంది రాగిణీ!"     "ఏమో అలా?"     "నీ ముఖం చీకట్లో బాగుంటుంది కాబోలు!"     "అంత మాత్రమే అయితే ఫర్వాలేదు."     "రాగిణీ!" అన్నాడు కొంచెం ముందుకు వంగి.     "కొంచెం పాలు వున్నాయా? ఆకలి వేస్తోంది."     ఆమె ఆశ్చర్యంతో "అదేమిటి? మీరు భోజనం చేయలేదా?" అనడిగింది.     "ఉహు! నేను సినిమానుంచి వచ్చేసరికి లాయర్స్ క్లబ్ కట్టేశారు. నేను హోటళ్ళలో ఏమీ తిననని నీకు తెలుసుకదా? ఒకసారి ఏదో తీపివస్తువులు తినేసరికి వాంతులు అయి అయిదురోజులు తీవ్రంగా జ్వరం కాసింది."     రాగిణి గాద్గదికంగా "నిజం చెప్పండి? మీకే గనుక అమ్మ వున్నట్లయితే ఇలా ప్రవర్తించేవారా? వేళగాని వేళప్పుడు ఇలా చెడుతిరుగుళ్ళు తిరగనిచ్చేదా?" అంది.     "మా చిన్నక్క మా అమ్మను మరిపించగలదు" అన్నాడతను ఆనందంతో కనులు సగంమూసి.     "కానీ, ఆమె అత్తగారింట్లో వుంది కదా? మిమ్మల్ని దగ్గరకు చేర్చుకుని అవీ ఇవీ అడగటానికి ఆవిడకు తీరదు కదా?"     "ఆమె విషయం నీకు తెలీదు రాగిణీ! అటువంటి మాతృమూర్తి ని నేనెక్కడా చూడలేదు. ఆమె వాత్సల్యంతో నాకు తల్లిలేని లోటు తీర్చింది. కానీ ఏ రెండు మూడు నెలలకో ఒకసారి ఆమెను నేను చూడగలిగేది. అదే విచిత్రం."     రాగిణి నేలచూపులు చూస్తూ ఊరుకుంది. తరువాత నాలిక కొరుక్కుని "మందమతిని. ఉండండి, కుంపటి రాజేసి పాలు వెచ్చబెడతాను" అని గబగబ లోపలకు వెళ్ళిపోయింది.     ఆమె పాలగిన్నె కుంపటిమీద పెట్టి విసురుతూ కూర్చుంది. అతను కొంచెం ఇవతలగా పీటమీద కూర్చుని కబుర్లు చెబుతున్నాడు.     "భలేవారే! వెళ్ళండి, ఈ పొగలో మీరెందుకు? నే తెచ్చి యిస్తాగా!" అంది రాగిణి.     "ఉహుఁ నేను వెళ్ళను. ఇవాళ ఈ దృశ్యం ఏం చక్కగా వుంది? నువ్వలా విసురుతూ కూర్చోవడం, నేనిలా నీప్రక్కన కూర్చుని కబుర్లు చెబుతూవుండడం. ఈ సీను ఎవరైనా తలుపు కంతలోనుంచి చూడాలి... వహ్వా" అంటూ అతను నవ్వడం సాగించాడు.     ఆమె అతన్ని కోపంగా మింగేసేటట్లు చూసి, 'ఏం బుద్ధులమ్మా? ఇదేనా ఏమిటి మీరు చదివిన ప్లీడరీ?" అంది.     "ప్లీడరీలో ఇటువంటి విషయాలు కూడా చెబుతారా తెలివితక్కువ వెధవలు అలా చూసినవాళ్ళను ఏం చేయాలో చెబుతారు."     "మంచి మాటే" అని రాగిణి విసుగ్గా గొణిగింది.     "రాగిణీ! అదేమిటో ఆశ్చర్యం. నేనెప్పుడు నీ దగ్గరకు వచ్చినా హఠాత్తుగానే వస్తుంటాను."     "ఆశ్చర్యం సంగతి అలావుంచి ఇవేళ తమరు ఇక్కడికి వచ్చినందుకు కారణం చెప్పండి?" అని రాగిణి ఒక నిముషం విసరటం ఆపి అతన్ని పరిశీలనా దృష్టితో చూసింది.     "బాగుంది. కారణం చెప్పకపోతే వెళ్ళగొడతావా ఏమిటి? నేను చాలా అలసిపోయి వచ్చాను. ఇక్కడినుంచి కదలను సుమా!"     రాగిణి నిట్టూర్పును అతి కష్టంమీద అణచుకుని "అబ్బ! ఏం మాటలు మాట్లాడుతారు? ఇంటికి వచ్చినవారిని బయటకు సాగనంపటమా? అంతకంటే చచ్చిపోతాను." అంది వ్యధతో.     "ఏమో, రెండు మాటలూ నువ్వే అంటావు. సరే, వెనుకటికి నన్ను వెళ్ళగొట్టిన వ్యక్తిపేరు రాగిణి కాదని నమ్ముతాను."     ఆమె దెబ్బతిన్న హరిణిలా బెదిరిపోయి, నిగ్రహంమీద కంఠం అదుపులోకి తెచ్చుకుని "మీ కాళ్ళమీద పడతానుగానీ అవతలకు వెళ్ళండి. ఈ రాత్రి నన్ను ఏడిపించటానికి వచ్చారా ఏం?" అంది.     అతను పెంకిఘటం కాకపోయినా కదల్లేదు. నిండుగా నవ్వడానికి ఓ వ్యర్ధ ప్రయత్నం చేసి, సాఫీగా ఇలా అన్నాడు "నువ్వానాడు ఎ పరిస్థితుల్లో సాగనంపావో గుర్తించాను కానీ ఇంతవరకూ నేరం నీమీదే ఆపాదిస్తూ వచ్చాను. ఇవేళ పూర్తిగా కరిగిపోయాను."     "కరిగిపోయారా? మీకే తెలియాలి."     అతను మాట్లాడకుండా ఊరుకున్నాడు. ఏదో స్మరించి నేత్రాలు ఉజ్వలంగా ప్రకాశించాయి. పాలగిన్నె క్రింద నిప్పుకూడా రాజుకుంది. క్రమక్రమంగా కాంతితగ్గి, రమారమి సుషుప్తావస్థలోకి వచ్చి, ఏదో చురుకు తగిలినట్లు చైతన్యాన్ని స్వీకరించాయి.     "నేను సినిమానుంచి గదికి పోయేసరికి తలుపులే గనుక తీసివుంటే నిన్ను చూడకుండా వెళ్ళిపోయేవాడ్నే!"     "మీకెందుకంత మొండి పట్టుదల నన్ను చూడకూడదని?"     "పట్టుదల లేకపోతే, ఎ ఉత్సాహంతో బ్రతకమంటావు నువ్వే చెప్పు?"     "ఆహా!" అని రాగిణి పరిహాసంగా నవ్వింది. "కబుర్లు మీరే చెప్పాలి. ఎందుకు మహాశయా అవతలవాళ్ళ మతుల్ని గందరగోళపరిచే పలుకుల్ని విసురుతారు? మీ చిన్నక్కగారితోకూడా ఇలాగే మాట్లాడతారా?" అని కుంపటి మీదనుంచి దింపిన పాలగిన్నెలోంచి పాలు ఓ గిన్నెలోపోసి అందించి "పంచదార సరిపోయిందో లేదో చెప్పండి" అంది.     "చిన్నక్కతోనా? ఇంతకంటే పదునైనమాటలు మాట్లాడతాను. కానీ వట్టి దద్దమ్మగా మాట్లాడానని నన్ను నేను రుజువుచేసుకుంటాను."     "అంత తెలివి గలవారా వారు?"     "ఆవిడ తెలివిని గురించి, శక్తి సామర్ధ్యాలగురించి చెప్పేటందుకు నేను ఎంతటివాడ్ని?"
24,903
         "సుబ్బా, నీకోసం కష్టపడి పెట్టానురా వడియాలు"  అంది తల్లి.      "తీసుకెళ్ళి గోదావరిలో పడెయ్యి" అన్నాడు విసురుగా సుబ్బారావు.తల్లి విస్తుపోయింది.      "అన్నయ్యా పువ్వులజడ అల్లుకున్నాను చూడ" అని జడని ముందుకు వేసుకుని గర్వంగా చూపించింది చెల్లెలు.      "చదువు సంధ్యా లేదు కాని పువ్వుల జడలు! ఊరికే యింతింత జుట్టు పెంచుకోవడమూ, వాటికి అత్తర్లూ, పువ్వులూ- నీకూ క్రాపింగ్ చేయించి పారేస్తానుండు" అని  విసురుగా వెళ్ళిపోయాడు.      సుమిత్ర ఊళ్ళో లేనిదే యింత  విప్లవం కలుగుతుందని  ఎవరు అనుకుంటారు? ఆహారం  రుచించక,ఏకాంతం పడక, నలుగురులో తోచక, రాత్రిళ్ళు నిద్రపట్టక, పగలు ఎప్పటికీ  రాత్రి అవక- చిక్కిపోతున్నాడు సుబ్బారావు. అయిదవరోజున సుబ్బారావుకి పార్శెల్ వచ్చింది. అతని మొహం కళకళలాడింది. రోజూ నదివొడ్డుకిపోయి అదేచోటులో కూర్చుని బుల్ బుల్ సారించేవాడు. పాటపాడేవాడు.తాటితోపు  తల ఊపేది. నదిలో నీళ్ళు ఆనందంతో జలజలమని చప్పుడు చేసేవి.     సుబ్బారావు ప్రేమికుడు.ఇది ప్రేమ తపస్సు.     " ఏరా,అడిగావా ఆ  అమ్మాయిని పెళ్ళిమాట?" అన్నదీ తల్లి ఒక రోజున. ఏమిటో మధ్యమధ్య ఆమెకి అనుమానం ఎక్కువౌతూంటుంది. ఒక నెల్లాళ్ళు సెలవుపెట్టడు కొడుకు.తాకట్టుమీద తెచ్చిన డబ్బు అయిపోవచ్చింది. ఎండమావుల్ని నమ్ముకుని  ఎన్నాళ్ళు బతకడం, ఇదే ఆమె సందేహం.     కాని ఆమె 'బుల్ బుల్ పంపడమూ,ఆమె ఉత్తరంలో  'మా మేనత్తతోనూ బావతోనూ మీమాటే చెబుదతుంటాను' అని  వ్రాయడమూ ఇది తిరిగీ ఆమెకి ఆశనీ ధైర్యాన్నీ కలిగించాయి.   ఆ ఏడుకొండలవాడే తలచుకుంటే   ఓడలు ఒళ్ళూ బళ్ళు ఓడలూ అయిపోవా!     అలాగ పాడుకుంటూ, ఆలోచించుకుంటూ రోజులు గడుపుతున్నాడు సుబ్బారావు.     కాని కాలం సరిపోయేదికాదు. సుబ్బారావు ఆలోచించుకోవడానికి. కాలం యిరుకుగా పాత కలకత్తా గల్లీ లాగ వుంది. పాపం ఎన్ని ఆలోచించుకోవాలి తాను. సుమ్రితతో తానింతవరకు గడిపిన ప్రతిక్షణమూ జ్ఞప్తికి తెచ్చుకునేవాడు. ప్రతీ మాట తనలో తను అనుకునేవాడు.ఆమె ప్రతి కదలికనూ ఆలోచించుకొని తన్మయత్వ పొందేవాడు.      ఇంక ఎన్నాళ్ళకి వస్తుందో సెకనులతో సహా లెక్క పెట్టేవాడు. వచ్చిన తర్వాత బెంగుళూరు చల్లని  గాలికి ఆమె వొళ్ళూ మొహమూ ఇంకెంత అందంగా అవుతాయో, తన వివాహ ప్రతిపాదనకి ఎలాగ సిగ్గుపడి ఓరగాచూస్తూ 'అలాగే' అని అంగీకారం సూచిస్తూ నవ్వుతుందో , తమ దాంపత్య జీవితం- ఓ రోజున సుమిత్రకి వేవిళ్ళని  అమ్మ వచ్చి తన చెవిలో ఊదడం- కబుర్లు , ముద్దులూ, కౌగిలిందలు, సర్దాలు పొల అలకలు , షికార్లు-      ఫక్కున నవ్వుకున్నాడు సుబ్బారావు, బల్లమీద అద్దంలో మూడూ  బై అయిదవ వంతు అతని  ప్రతిబింబం కూడా పక్కున నవ్వింది.      సెకండరీ గ్రేడు స్కూలు టీచరు సుబ్బారావు మిల్ ఓనర్ కోటీశ్వరరావుగారి అల్లుడు.      మూడూ బై అయిదవ వంతు అద్దంలోకి అరమోడ్పు  కన్నులతో చూశాడు. సుబ్బారావు.      భవిష్యత్తూని గురించిన ధీమా ప్రాణవాయువులా వెళ్ళి అతని ఛాతీని రెండంగుళాలు పెద్దది చేసింది.       అతని యౌవనం అందమైన స్వప్నాన్ని దండగా అల్లి అతని మెడలో వేసింది.      స్వప్నాలు నిజాలు కాబోయే ఆ క్షణంకోసం అతను  జీవితపు మెయిన్ రోడ్డుమీద నిలబడి చూస్తున్నాడు.      అలా చూస్తూ నిలబడి  వుండగా పోస్టుమన్ ఉత్తరం తీసుకొచ్చు ఇచ్చాడు. ఆతృతతో విప్పి చదివాడు:     "రేపు మధ్యహ్నం బండికి వస్తున్నాము.సాయంత్రం కలుసుకో సుమిత్ర."      అతను చేసిన అస్పష్ట ఆనందరవానికి- కంగారూ వెనకాల తల్లీ చెల్లెలూ వచ్చి నిలుచున్నారు.         " అమ్మా- సుమిత్ర రేపు వస్తోందమ్మా."     " సాయంత్రం నన్ను కలుసుకోమందమ్మా"     " అడిగి తేల్చేసుకుంటానమ్మా" గబగబ అనేశాడు సుబ్బారావు.         " ముహూర్తం తర్వగా పెట్టించెయ్యి. ఏకంగా సెలవు పొడింగించవచ్చును. ఆ తరువాత నుంచీ స్కూలుకి మానకుండా వెళ్ళొచ్చును." అంది తల్లి.     అమాయకురాలైన తల్లికేసి ఎంతో సానుభూతితో చూచాడు.  " ఇంకా నాకు ఆవెధవ స్కూలు మేష్టరీయేనా అమ్మా."     "అదేమిట్రా నెలకి కరకుల్లాగా ఎనభై రూపాయలు వస్తూంటే కాదంటామా- నీకుమాత్రం యేదోపనిలేకపోతే తోస్తుందీ." అంది తల్లి.       "ఎనభై రూపాయలంటే నీకూ, నాకూ పక్కింటి బ్యాంకి గుమాస్తాగారికీ అవతల ఇంటి టైపిస్టు  నౌకర్లుకి మూడవందల రూపాయల జీతాలమ్మ. సుమిత్ర ఖర్చు  నెలకి అయిదువందలే  అయితే  "యింత తక్కువ ఖర్చు పెట్టుకుంటున్నావేం. ఒంట్లో బాగులేదా" అని  కూకలేస్తాడమ్మా వాళ్ళ ఫాదరూ!" అన్నాడు సుబ్బారావు.    
24,904
    "ఎక్కడ?"     చెప్పాడు రాజా.     "నీకెలా తెలుసు?"     "నేను నా కళ్ళతో ప్రత్యక్షంగా చూశాను."     "ఎప్పుడు?"     చెప్పాడు.     కొద్దిసేపు ఆలోచించింది.     "వాళ్ళకి తమిళ తీవ్రవాదులతో సంబంధం ఉందంటావా?"     "అన్ని రకాల అరాచక శక్తులూ ఒక దానితో ఒకటి సంబంధాలు పెట్టుకుంటూనే వున్నాయి ఈ రోజుల్లో!"     "కీర్తికి తమిళ తీవ్రవాదులతో సంబంధాలు వున్నాయా లేదా?"     "పంజాబ్ తీవ్రవాదులతో కూడా సంబంధాలు వుండవచ్చు!"     "అయితే ఇది మన పరిథిలోది కాదు. సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో టాకిల్ చెయ్యవలసిన ప్రాబ్లెం!" అంది విజయకుమారి.     "ఇల్లు కాలిపోతుంటే అప్పుడు కొత్తగా బావి త్రవ్వుతానంటే ఎలా మేడమ్!     కళ్ళెదురుగా కనబడుతున్న దానిమీద మనం యాక్షన్ తీసుకోకుండా సెంట్రల్ ఇన్ వాల్వ్ మెంట్ కోసం చూడడం...."     "నీకు తెలిసిందంతా రాసి నాకివ్వు! నేను ఫార్వర్డ్ చేస్తాను"     "యస్ మేడమ్!" అని బయట వున్న సెక్యూరిటీ రూంలోకి వచ్చి, వైట్ పేపర్ అడిగి తీసుకుని, తను చూసినదీ, గ్రహించినదీ అంతా వివరంగా రాసి, సంతకం పెట్టి ఇచ్చాడు రాజా.         అప్పుడతనికి కాస్త రిలీఫ్ కలిగింది.                                *    *    *    *     ఇంకో వారం గడిచింది.     హోం మినిస్టర్ విజయకుమారి కృష్ణాజీకి పెట్టిన డెడ్ లైన్ ముగిసిపోయింది.     ఆరోజు పొద్దున్నే ఆడంబరంగా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టించింది విజయకుమారి.     "కీర్తి కేసులో పెద్ద టర్నింగ్ పాయింట్ ని గురించి మీకు చెప్పాలని పిలిపించాను" అంది.     "ఏమిటి విశేషం? కీర్తిని పట్టేసుకున్నారా?" అన్నాడు రిపోర్టర్ ముక్కు రాజు.     ఎగ్జయిటెడ్ గా అంది విజయకుమారి.     "పోలీసాఫీసర్ కృష్ణాజీని సస్పెండ్ చేశాం! ఆ తర్వాత బహుశా డిస్మిస్ చేసెయ్యవచ్చేమో కూడా."     ముక్కురాజు వ్యంగ్యంగా అన్నాడు -     "ప్రజలకు కావలసింది కీర్తి అనే పీడ విరగడవడం. కృష్ణాజీ అనే ఓ పోలీసాఫీసరుని సస్పెండ్ చేస్తే ప్రజలకు ఒరిగేదేమిటి? చెయ్యకపోతే తరిగేదేమిటి?"     "సమస్యని అన్ని కోణాల్లో నుంచి చూడాలి! కీర్తిని పట్టుకోలేనందుకు పనిష్ మెంటుగానే కృష్ణాజీని తీసేస్తున్నాం"     "అదే న్యాయం మీకూ వర్తించాలిగా! మీరెప్పుడు రిజైన్ చేస్తున్నారు?"     "ముక్కురాజూ! మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను. ఈ స్టేట్ లో నువ్వన్నా వుండాలి? నేనన్నా ఉండాలి!"     "మంచిది! ఎప్పుడు మీ ప్రయాణం?" అన్నాడు ముక్కురాజు అలవాటుగా.     అలవాటుగానే ఆ విలేఖర్లతో సమావేశం రసాభాసగా ముగిసింది.     ప్రెస్ తో మంచి టరమ్స్ మెయిన్ టెయిన్ చెయ్యడం అన్నది ఒక కళ.     ఆ కళకీ, విజయకుమారికీ చుక్కెదురు. ఒక ఇంగ్లీషు ప్రయోగాన్ని తెలుగు చేసి చెప్పాలంటే, "ఆమెని ద్వేషించడాన్ని ప్రేమిస్తారు విలేఖరులు."     ఇక్కడ విజయకుమారి ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతున్నప్పుడే....     చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళింది విజయకుమారికి సహాయమంత్రిని అయిన అంకిత.     హోం మినిస్టర్ అసమ్మతి వర్గం తాలూకు అయితే....     ఆమె డిప్యూటీ హోం మినిస్టర్ అంకిత మాత్రం అధికార పక్షమే.     చాలా చాకచక్యంగా ముఖ్యమంత్రికి అంతరంగికురాలయి పోయింది అంకిత.     అందుకే, చాలా జూనియర్ మంత్రిని అయ్యి వుండి కూడా, ఆ రోజు ముఖ్యమంత్రితో కలిసి బ్రేక్ ఫాస్ట్ తీసుకునేంత చనువు సంపాదించింది.     "ఏమిటి పొద్దున్నే వచ్చావ్?" అన్నాడు ముఖ్యమంత్రి నవ్వుతూ.         చెప్పడం మొదలెట్టింది అంకిత.     "ఆ విజయకుమారి మిమ్మల్ని ప్రధమ శతృవులాగా ట్రీట్ చేస్తోంది.     "గుడిసెల్లో ఉండేదాన్ని తెచ్చి గౌరవ ప్రదమైన స్థానం కలిపించాను. ఇప్పుడు నాకే ఎసరు పెట్టాలని చూస్తోంది" అన్నాడాయన కసిగా.     "కీర్తి గొడవ తెలుసుగా."     "ఇంత అల్లరవుతుంటే ఎందుకు తెలియదూ?"     "ఇంత అల్లరీ విజయకుమారే చేయిస్తోందని నా అనుమానం!"     "ఎందుకు?"     "మిమ్మల్ని బద్ నామ్ చెయ్యడానికి."     "చేసి?" అన్నాడు ముఖ్యమంత్రి.     కానీ జవాబు ఆయనకే తెలుసు!     తనని అల్లరిపాలు ఎందుకు చేస్తుందీ?     తన పదవికి ఎసరు పెట్టడానికే!     ఆ తర్వాత తనే ఈ పదవిని దక్కించుకోవడానికి!
24,905
    "ఒరేయ్.. న పిస్టల్ ఇస్తావా?... తన్ననా??" కోపంగా అరిచాడు శివరావు.     "అలా అరుస్తావేం?... అలాగేత్తే నీకు తుపాకి నేను ఇవ్వనే ఇవ్వను. అచ్చంగా నేనే తిసేస్కుంటాను... సరేగాని ని దగ్గార క్యాప్స్ ఉన్నాయా... కాస్సేపు పేల్చుకుంటాను?" అన్నాడు పండు కళ్ళుతిప్పుతూ.     "అది దీపావళి పిస్తోలు కాదమ్మా... నిజం పిస్తోలు!!.. నీకు మంచిది వేరే పిస్తోలు కొనిస్తాగా?... అది ఇచ్చేయ్..." బ్రతిమాలద్తూ అన్నాడు శివరావు.     "ఏం వద్దు. నాకిదే బాగుంది. మీ అందర్నీ డాం - డాం అని పెల్చేస్తా... హిహి..." అంటూ ట్రిగ్గర్ నొక్కాడు పండు.     "డాం-"     పిస్తోలు పేలిన శబ్దం  ఆ గదిలో మారుమ్రోగింది.     బుల్లెట్ శివరావు చెవి పక్కనుండి "ఝుం" అని శబ్దం చేస్తూ దూసుకు పోయింది.     ఆదేబ్బాకి భయంతో కెవ్వున అరిచి సోఫా వెనకాల నాక్కాదు శివరావు.     ఎక్కడ పండు మళ్ళి ట్రిగ్గర్ నొక్కుతాడో, ఎక్కడ బుల్లెట్  వచ్చి తగుల్తుందోనని భయంతో అందరూ సోఫాల వెనకాల, తలుపు మూలల్లో దాక్కున్నారు.     "అయ్యో! అమ్మో ఏంటో శబ్దం" వంట గదిలోంచి అరిస్తూ రాబోయింది చాముండేశ్వరి.     "మాయదారి సంత. నువ్వు గదిలోకి రాకు. తుపాకి గుండు తగుల్తుంది" కంగారుగా అరిచాడు రంగనాయకులు.     చాముండేశ్వరి  ఆ ముందు గదిలోనే ఆగిపోయింది.     పెరట్లోని భిమయ్యకి కూడా పిస్తోలు శబ్దం వినిపించింది.     "వాట్ బాబూ! ఆ సౌండ్ వాట్?" అంటూ ఇంట్లోకి పరుగెత్తుకు వచ్చాడు.     "ఒరేయ్ సన్నాసి! అక్కడే ఆగు... లోపలికి వేళ్ళకు... ఎవరో  తుపాకి పేలుస్తున్నారు. గుండు తగిలి చస్తావ్" అంది చాముండేశ్వరి భయంగా.     ఆ మాట వింటూనే 'బాబోయ్' అని అరుస్తూ భీమయ్య ఆ గదిలో మంచం కింద దూరాడు.     కాస్సేపు ముందు హల్లో నిశ్శబ్దం  తండవించింది.     మళ్ళి పేల్చడం? ఈ పండుగాడు ఏం చేస్తున్నాడు??           అందరి మనసుల్లో ఇదే ఆలోచన! కానీ ఊహించని ఆ శబ్దానికి అంత చిన్న పిల్లాడ్తేన పండు పరిస్ధితి ఎలా ఉంటుందన్న ఆలోచన ఏ ఒక్కరికి కలగలేదు.     శివరావు సోఫా వెనకనుండి గబుక్కున బయటికి వచ్చాడు. కాని శివరావుతో బాటే పండుని గ గమనించిన రంగనాయకులు అంతకంటే వేగంగా ముందుకి వచ్చి కిందపడి  వున్నా పిస్టల్ ని అందుకున్నాడు. అంతకంటే వేగంగా శివరావు పండుని రెక్కపట్టుకుని లాగి, ఎత్తుకుని జేబులోంచి బటన్ చాకు తిసి పండు మెడదగ్గర పెట్టి నవ్వాడు.     "మర్యాదగా ఆ పిస్టల్ ఇటు విసిరెయ్  మామ" అన్నాడు.     దక్కున స్ధలాల నుండి ఒక్కొక్కరే బయటికి వచ్చారు.     "నో అయ్యగారు-నో" అంటూ భిమయ్యా ముందుకు వచ్చాడు.     "నాన్నా! ఆ పిస్టల్ వాడికి ఇవ్వొద్దు" అంది చిన్నమ్మాయి.     "అవునంకుల్ ఇవ్వకండి" అంది కాంతామణి.     "మాయదారి సచ్చినాడా, నికిదేం పోయేకాలంరా" అంటూ అరిచింది చాముండేశ్వరి.     "అల్లుడ్ని అలా తిట్టకూడదు అత్తా! మర్యాదగా మీ ఆయన్ని ఆ పిస్టల్ ఇటు పారేయ్యమను లేకపోతే  ని కొడుకుని సఫా చేస్తా. కోడిని కోసినట్టు కోసి పారేస్తా" అన్నాడు శివారావు.     పండు పెద్ద గోంతేస్కుని ఏడవడం మొదలుబెట్టాడు.     భీమయ్య పిడికిళ్ళు బిగించి  రెండడుగులు శివరావు వ్తెపు  వేసాడు.     శివరావు చాకుని పండు మెడకి ఆనించి భిమయ్యకి వార్నింగ్ ఇచ్చాడు! "నువ్వు మరో అడుగు ముందుకు వేసావో పండుగాడి పీక తెగిపోతుంది."     "ఒరేయ్ నువ్వు ఆగరా. వాడు అన్నంత పని చేసినా చేస్తాడు. దరిద్రం సంత" కంగారుగా అన్నాడు రంగనాయకులు.     భీమయ్య ఆగిపోయాడు.     "ఊ! ఇంకా ఆలస్యం చెయ్యకుండా ఆ పిస్టల్ ఇటు పారెయి మామా" అన్నాడు శివరావు.     రంగనాయకులు పిస్టల్ ని శివరావు విసిరాడు. పిస్టల్ శివరావు పాదాల దగ్గర పడింది.     శివరావు కిందికి వంగి పిస్టల్ ని అందుకున్నాడు.     తర్వాత పిస్టల్ ని చిన్నమ్మాయికి గురిపెట్టి "నువ్వు నాతో పద" అన్నాడు.     "నేను నితోరాను. కావాలంటే నన్ను కాల్చి చంపు... నా ప్రాణం  పోయినా ఫరవాలేదు..." అంది చిన్నమ్మాయ్.     "నీ ప్రాణం అంటే నీకు లెక్కలేదని నాకు తెల్సు... కాని పండుగాడి ప్రాణం అంటే మీ అందరికి తిపెకదా?... హహహ..." నావ్వుతూ పండు తలకి గురిపెట్టాడు. అతని  వేలు ట్రిగ్గర్ మీదికి వెళ్ళింది.     "వద్దు... వాడినేమి చేయ్యుద్దు" రంగనాయకులు  బాధగా అన్నాడు.     "రాంగ్ బాబూ రాంగ్... చిన్న పిల్లాడికి కీడు చెయ్యడం రాంగ్" అన్నాడు  భీమయ్య.     "సచ్చినోడా నికిదేం పోయేకాలంరా" చాముండేశ్వరి మెటికలు విరిచింది.     "ఊ... ఊ నోరు జారడం అంత మంచిదికాదు" పండు తలకి పిస్టల్ ని ఆనించాడు.     "వా...."పండు గోలగోలగా ఏడవసాగాడు.     "ఊ....త్వరగా ....నేను మూడు లేక్కబెట్టేలోగా నాతో రావాలి. లేకపోతే పండుగాడి బుర్ర పేలిపోతుంది... వన్... టూ..."     "ఆగు.... నేను నికూడా వస్తాను" చిన్నమ్మాయి శివరావు వ్తెపు అడుగులు వేసింది.     శివరావు పకపకా నవ్వాడు.     "నువ్వు మా అమ్మాయిని తిస్కెళ్ళి ఏం చేస్తావు?" అందోళనాగా చూస్తూ అడిగాడు రంగనాయకులు.     "భయపడకు మామా, మీ అమ్మాయిని ఏమి చెయ్యను. పెళ్ళిచేస్కుంటా..." అని చిన్నమ్మాయ్ వంక చూసి "పద..."అంటూ అడుగులు ముందుకు వేసాడు. అతని చంకలో పండు ఉన్నాడు. చిన్నమ్మాయ్ ఓసారి దినంగా తల్లిద్రండుల వంక చూస్తూ శివరావుని అనుసరించింది.     "పండుగాడిని ఎందుకు తిస్కెళ్తూన్నావ్?" కాంతామణి శివరావుని అడిగింది.     "చిన్నమ్మాయ్ నన్ను పెళ్ళి చేస్కోనని మేరాయిస్తే వీడిని సఫా చేస్తా"     "నేను కూడా మీ వెంట వస్తా..." అంది కాంతామణి అడుగులు ముందుకు వేస్తూ.     "నువ్వెందుకూ?" ఆశ్చర్యంగా చూశాడు శివరావు.     "మరి చిన్నమ్మాయ్ ని పెళ్ళికూతుర్ని చెయ్యుద్దు? నీక్కూడా పెళ్ల్లి చెయ్యాలిగా?" వ్యంగ్యంగా అంది కాంతామణి.     "వెరీగుడ్. అలాగయితే నువ్వు కూడా రా. పెళ్లయ్యేదాకా పనికోస్తావ్. మామా.... మని నీ కారు తాళాలిలా  పారెయ్... మేం వెళ్ళిపోతాం" అన్నాడు శివరావు.     రంగనాయకులు కారు తాళాలు తెచ్చి శివరావుకి ఇచ్చాడు. శివరావు పండుని, చిన్నమ్మాయ్, కాంతామణి ని  వెంటబెట్టుకుని గదిలోంచి బయటికి నడిచాడు.     "బాబూ...రాంగ్ బాబూ... అట్టా సేయ్యకూడదు బాబూ" వెనుకనుండి అరిచాడు భీమయ్య.     "వీడు చేతులిరగా... కాళ్ళు  పడిపోనూ" శాపనార్ధాలు  పెట్టసాగింది చాముండేశ్వరి.     "మాయదారి సంత, దరిద్రం సంత, దిక్కుమాలిన సంత, ముదనస్టపు సంత" తిట్టుకోదాగాడు రంగనాయకులు.     బయట కారు స్టార్టయిన  శబ్దం అయింది.     "ఒరేయి భీమయ్య!పదా" రంగనాయకులు భిమయ్యకి స్తేగా చేశాడు తన వెనకే రమ్మని.     "ఎస్ అయ్యగారూ" అన్నాడు భీమయ్య.     రంగనాయకులు భీమయ్య గబగబా బయటికి పరుగుతిసారు. అప్పడే  కారు కాంపౌండ్ లోంచి మెల్లగా బయటికి వెళ్ళసాగింది. వాళ్ళు ఇద్దారూ  పరుగెత్తుకు వెళ్ళి దిక్కి ఎత్తి వెనకవ్తెపు కూర్చున్నారు. వాళ్ళు అలా కూర్చోడం శివరావు గమనించలేదు.     కారు రాయిన ముందుకు కదిలింది.     అదే సమయంలో కాలనీలో రోడ్డు మీద నడుస్తున్న పరమేశ్వర్రావు పార్వతమ్మల కంటపడింది ఆ కారు.     "చూశావా చూశావా? ఆ కారులో ఎవడి వెంటో పోతోంది చిన్నమ్మాయి! అందుకే  మనబ్బాయిని చేస్కోనంతుందేమో! సిగతరగ, అన్నాడు పరమేశ్వర్రావు భార్యతో.
24,906
         ఎన్నో ఇండియన్ కంపెనీలు తమ కంపెనీని అప్రోచ్ అయినా జపాన్ హోండా కంపెనీ మాత్రం హీరో కంపెనీ సైకిల్ వ్యాపారంచేసే విధానాన్ని, సాధించిన విజయాన్ని తెలుసుకొని హీరో కంపెనీకే తమ కొలాబరేషన్ ని అందించటం జరిగింది.         హీరోహోండా 100 సిసి బైక్ ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో మనందరికీ తెలుసు. ఇప్పటికి 2 లక్షల యాభైవేల హీరోహోండా మోటార్ సైకిల్స్ అమ్ముడుపోతాయి. 1986లో మోస్ట్ పాపులర్ కన్స్యూమర్ ఐటమ్ యిదొక్కటే. ఈ మోటార్ బైక్ కి విపరీతమయిన డిమాండ్ వుండటంతో రెండునుంచి మూడువేల రూపాయలవరకు బ్లాక్ లో అమ్మింది.         అయితే మొట్టమొదటిసారి ఇండియాలో జపనీస్ కొలాబరేషన్ తో మోటార్ సైకిల్ విడుదల చేసిన కంపెనీ టి.వి.యస్. ఆ బ్రాండ్ పేరు ఇండ్ సుజుకి. దాన్ని తరువాత టి.వి.యస్. అని మార్చారు.         ఇప్పుడే టి.వి.యస్. ఏడ్స్ లో it way Cheeper, heavier stranger and speedier అని దాని ఫీచర్స్ ద్వారా క్లెయిమ్ చేశారు. ఈ ఏడ్కంపైన్ టూ వీలర్ మార్కెట్ లో సంచలనాన్ని సృష్టించింది. టి.వి.యస్. సుజుకి షోరూమ్స్ వద్ద రద్దీ పెరిగింది. కానీ అమ్మకాలు ఎంత జరిగాయన్నది నాకు కరెక్ట్ గా తెలీదు.         అయితే ఆ ఏడ్స్ లో టి.వి.యస్. సుజుకి ఇతర బ్రాండ్స్ కంపేర్ చేయడంతో హోండా అది ఆన్ ఫెయిర్ ఎడ్వర్టయిజింగ్ అంటూ ఎమ్.ఆర్.టి.సి.కి కంప్లైంట్ చేసింది. దాన్ని ప్రొటెస్ట్ చేసింది.         ప్రపంచ వ్యాప్తంగా లెక్కేస్తే హోండా కంపెనీయే టూ వీలర్ మార్కెట్ లో నెంబర్ ఒన్. అంతేకాదు అనుభవంలోనూ, నెట్ వర్క్ పరంగా, నాణ్యత, మన్నికలో కూడా జపాన్ హోండా మార్కెట్ కి తిరుగులేని విజయపరంపర వుంది.         అంతర్జాతీయంగా పోలిస్తే హోండా ముందు సుజుకిని చిన్నదిగానే భావించవచ్చు.             వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకునే ధైర్యంగా హీరోహోండా సుజుకీ మీద కంప్లయింట్ చేసింది.         హోండా పెట్రోలు ఆదాచేయటంలో నెంబర్ ఒన్. లీటరు పెట్రోలుకి 60 నుంచి 80 కి.మీ. వరకు వస్తుంది. అద్భుతమైన దాని కార్బొరేటర్ నిర్మాణపు రహస్యం ఎవరికీ తెలీదు.         Fill if.....Shut it.....and forget!         (పెట్రోలు నింపండి.....టాంక్ ని మూయండి.....ఇంక దాని గురించి మర్చిపోండి.)         అనే స్లోగన్స్ తో రెండు చక్రాల వాహన ప్రియుల్ని మంత్రముగ్ధుల్ని జేసింది. హోండా సేల్స్ ముందు సుజుకి, యమహా, కవాసాకి తలవంచక తప్పలేదు.         అప్పటినుంచి సుజుకి హోండా సేల్స్ ముందు సుజుకి, యమహా, కవాసాకి తలవంచక తప్పలేదు.         అప్పటినుంచి సుజుకి హోండానే ఎయిమ్ చేసుక్కూర్చుంది.         మరికొన్నాళ్ళకి టి.వి.యస్. సుజుకి ఒక వివాదాస్పదమైన ఏడ్ ని రిలీజ్ చేసింది.         దానిలో టాప్ హోండా బైక్ ఫోటోని వుంచి, దానిపైన Full it forget it అనే హోండా స్లోగన్ ని వుంచి దానికి ప్రక్కనే but can you really afford to forget what they are not telling you. అని యిచ్చారు. క్రింద ఒక ప్రయోజనాల గురించి రీడిజైన్ చేసిన టి.వి.యస్ సుజుకి AX100 R మోడల్ లా చెబుతుంది- అని ఇచ్చి, క్రింద రెండు టేబుల్స్ వేసి ఎడంవైపు హీరోహోండా సి.డి. 100కి కుడివైపు టి.వి.ఎస్.సుజుకి AX100 R కి కేటాయించారు.         అందులో హోండా డ్రా బేక్స్ ని, సుజుకి ప్లస్ పాయింట్స్ ని ఫోటోలతో సహా యిచ్చి వివాదానికి తలపడ్డారు సుజుకి వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్య కేసు నడుస్తోంది.         ఇండియన్ టూత్ పేస్ట్ మార్కెట్ లో టూ థర్డ్ షేర్ ని కాల్గేట్ ఎంజాయ్ చేస్తోంది. హిందూస్తాన్ లివర్ ఎస్.ఆర్. పెప్సోడెంట్ సిగ్నల్, క్లోజప్ బ్రాండ్స్ ద్వారా టూత్ పేస్ట్ మార్కెట్ ని కైవసం చేసుకోవాలని విశ్వప్రయత్నం చేసి కూడా కనీసం 15 శాతమైనా మార్కెట్ షేర్ ని సొంతం చేసుకోలేకపోయింది. ఇంటర్నేషల్ బ్రాండ్స్ మెక్లీన్, కొలినపస్ ఇండియన్ టూత్ పేస్ట్ మార్కెట్ నుంచి శాశ్వతంగా అదృశ్యమయిపోయాయి. ఫోర్ హెన్స్ ఒక్కటే. ఒన్ సిక్స్త్ షేర్ ను సొంతం చేసుకోగలిగింది. ఆయుర్వేదాన్ని ఆయుధంగా పూని వికో వజ్రదంతి అతితక్కువ కాలంలో రెండో స్థానాన్ని సంపాదించుకుంది. ఆ తరువాత బల్సారావారి ప్రామిస్ టూత్ పేస్ట్ బాగా సక్సెస్ అయింది. మాయా అలగ్ మోడల్ గా లవంగనూనె కాన్సెప్ట్ తో అది సక్సెస్ అయింది.         అయితే పేకింగ్ కలర్స్ తమ పేకింగ్ కలర్స్ కి దగ్గరగా వున్నాయని కాల్గేట్ ప్రామిస్ మీద కోర్టుకి వెళ్ళింది. ప్రామిస్ వారి ఎరుపు తెలుపుల పేకింగ్ కలర్స్ నిజంగానే కాల్గేట్ కి దగ్గరగా వున్నాయి. ఆ తరువాత ప్రామిస్ తన రంగుల్ని మార్చుకుంది. ఆ తరువాత బల్సారా వాళ్ళు అతి తక్కువ ధరపెట్టి బాబుల్ అనే మరో టూత్ పేస్ట్ ను రిలీజ్ చేసింది. బాబుల్ కూడా బాగా విజయవంతమైంది. అప్పుడు కాల్గేట్ తిరిగి బాబుల్ బ్రాండ్ మీద కోర్టుకి వెళ్ళింది. దాంతో బాబుల్ గ్రీన్ డిజైన్ లో రావటం ప్రారంభించింది. కాల్గేట్ ఎంతగా తంటాలు పడుతున్నా ప్రామిస్, బాబుల్ దెబ్బకు వణికిపోతోంది. ఇదంతా కేవలం బల్సారా వారు చేయించుకుంటున్న ఏడ్ కేంపైన్ ప్రభావమే. త్వరలో నిర్మా కార్సన్ భాయ్ పటేల్ ఇప్పటికే ఇండియన్ టూత్ పేస్ట్ మార్కెట్ లో వున్న అన్ని బ్రాండ్స్ కన్నా అతి తక్కువ ధరతో, బ్రహ్మాండమైన పబ్లిసిటీతో బీజ్ చేసేందుకు నిర్మా టూత్ పేస్ట్ ఉత్పత్తిలో లీనమై వున్నాడు.         పబ్లిసిటీ బాగా లేకపోతే ఎంతో పేరు ప్రఖ్యాతులున్న కంపెనీల బ్రాండ్సయినా మార్కెట్ లో దెబ్బతింటాయి. అందుకు ఉదాహరణకి పాండ్స్ కంపెనీ ప్రవేశపెట్టిన టూత్ బ్రష్ మార్కెట్ ఎక్కలేదు. టోమ్ కో కంపెనీ ప్రవేశపెట్టిన రెయిన్ డ్రాప్ సోప్, గాడ్రేజ్ కంపెనీ ప్రవేశపెట్టిన క్రౌనింగ్ గ్లోరీ సోప్ ఘోరంగా దెబ్బతిన్నాయి.         విల్ టెడ్జి, టేంగ్, డబుల్ కోలా, రోత్ మన్స్ సిగరెట్స్, అమెరికన్ టూరిస్టర్స్, ప్లేబాయ్ ఫేషన్ గూడ్స్- ఇవన్నీ గ్లోబల్ మేఘాబ్రాండ్స్, ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ అయిన ఈ అంతర్జాతీయ స్థాయి బ్రాండ్స్ ఇండియాలో ఫెయిల్ అయిపోయాయి.         నిర్మా, టిటాన్, హాట్ షాట్, పాన్ పరాగ్, చార్మ్స్, విమల్, గార్డెన్ పరేలీలాంటి ఇండియన్ బ్రాండ్స్ ఎయిటీస్ లో బాగా సక్సెస్ అయ్యాయి.         కాల్గేట్ మార్కెట్ లో తమ బ్రాండ్ కి మంచి సేల్సున్నా దాన్ని నిలబెట్టుకోవటం కోసం 1988-89లో ఆరుకోట్లు పబ్లిసిటీ కోసం ఖర్చు పెట్టింది.         హిందూస్థాన్ లీవర్ డెల్టా బ్రాండ్ మీద, చార్మినార్ సిగరెట్స్ కంపెనీ చార్మ్స్ మీద, మోడీస్ మోడీ జిరాక్స్ మీద చాలా ఖర్చు పెడుతున్నాయి. ఇవన్నీ మనం జాగ్రత్తగా పరిశీలిస్తుండాలి.         సో... టోటల్ గా వెతి మధ్య బ్రాండ్ వార్ నడుస్తోందో మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాలి.         వీడియోకాన్ టీవీకి-బిపిఎల్ సేనోకి, హీరోహోండా మోటార్ సైకిల్ క్, టివిఎస్ సుజుకీకి, కవాసాకీకి మధ్య భయంకరమైన పోటీ వుంది. అలాగే టూత్ పేస్ట్స్ లో కాల్ గేట్ కి ప్రామిస్, బాబుల్ బ్రాండ్స్ కి మధ్య ప్రచ్చన్నయుద్ధం......మహా కోలాకి, కేంపా కోలాకి, ఖైతాన్ ఫ్యాన్స్ కి, పోలార్ మధ్య, టైమ్స్ ఆఫ్ ఇండియాకి, హిందూస్థాన్ టైమ్స్ కి, గోల్డ్ కేఫ్ ఇన్ ప్లెంట్ కాఫీపొడికి, నెస్ కేఫ్ కి మధ్య, రిన్ కి నిర్మా వాషింగ్ సోప్ కి మధ్య, హిందూస్థాన్ కంప్యూటర్ కి, మోడి జిరాక్సీకి, వంటనూనెల్లో పోస్ట్ మెన్ కి సఫోలాకి మధ్య కెట్ త్రోట్ కాంపిటీషన్ నడుస్తోంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మనం, మన క్లయింట్స్ ప్రోడక్ట్ ని మార్కెట్ లో ఎస్టాబ్లిష్ చేయాలి.         మనం మన అస్థిత్వం కోసంగానీ, మనం నిలదొక్కుకునేందుకు కానీ మనకు తెలీకుండానే విపణి వీధి యుద్ద రంగంలోకి దిగిపోయాం. అంతకంటే ప్రమాదకరమైన మనిషితో మనమిప్పుడు తలపడ్డాం కనుక అందరి కళ్ళు, ముఖ్యంగా భరద్వాజ కనులు మన మీద, మన కంపెనీమీదే వుంటాయి. మన కంపెనీ వైపునుంచి వివరాలు సేకరించాలని విశ్వప్రయత్నం చేస్తుంటారు. మనం జాగ్రత్తగా వుంటే సరిపోదు. మన కంపెనీలో పనిచేసే సిబ్బంది కూడా ట్రేడ్ సీక్రెట్స్ ను కాపాడుతూ కాన్షిడెన్సియల్ గా వుండాలి....." మాధుర్ చెప్పటం ఆపి కొద్ది క్షణాలపాటు ఎటో చూస్తుండిపోయాడు.                                     *    *    *    *    *     "మేడమ్..... మీరు ప్రవేశపెట్టిన గో ఎబ్రాడ్ స్కీమ్ బ్రహ్మాండంగా సక్సెస్ అవుతోంది. ఏ బ్రాండ్ సేల్స్ రిపోర్టు చూసినా గణనీయమైన అభివృద్ధి కనిపిస్తోంది. మన స్కీమ్ ఆనోటా ఆనోటా బయటకు ప్రాకటంతో వేరే కంపెనీలు కూడా మన స్కీమ్ ను అమలు పర్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాయట...." చక్రధర్ ఉత్సాహంగా చెప్పుకుపోయాడు.         మౌనిక ఒక క్షణం హేపీగా ఫీలయింది.
24,907
    4. అశ్వములందు ముఖ్యుడు, శీఘ్రగామి, గతిశీలుడగు దధిక్ర జ్ఞాతవ్యమును ఎరుగును. ఉష, సూర్య, ఆదిత్యగణ, వసుగణ, అంగిరులతో కలిసి దధిక్ర స్వయముగా రథపు అగ్రభాగమున తగులును.     5. దధిక్రా ! అందఱు యజ్ఞము చేయవలెను. అందఱు చక్కని మార్గమున నడువవలెను. అందఱకు దివ్యజలము లభించవలెను.  అందఱకు జ్ఞానము కలుగవలెను. సామర్థ్యము కలుగవలెను. అందఱు దేవతల గుణములు దానము చేయవలెను. అందఱు స్వయముగా దేవతల వంటివారు కావలెను.                                          నలుబది ఐదవ సూక్తము                      ఋషి - వసిష్ఠుడు, దేవత - సవిత ఛందస్సు - త్రిష్టుప్.     1. సవిత రత్నయుక్తమగు తన తేజస్సుతో అంతరిక్షమును పూరించును. అతడు అశ్వమును అధిరోహించును. మానవులకు హితకరమగు అనంత ధనమును రెండు చేతులందు దాల్చును. అతడు ప్రాణులను వారి స్థానములందు భరించి వారిని వారివారి కర్మలకు ప్రోత్సహించుచు విచ్చేయవలెను.     2. దానము కొఱకు ప్రసరించిన విశాల హిరణ్మయ బాహువులతో సవిత అంతరిక్షపు అంచులవరకు వ్యాపించవలెను. నేడు మేము సవితయొక్క ఆ మహిమనే కీర్తింతుము. సూర్యుడు సహితము సవితకు కర్మ స్వేచ్చ నివ్వవలెను.     3. తేజస్వి, ధనాధిపతి సవితయే మా కొఱకు ధనము పంపవలెను. అతడు బహువిశాల రూపము ధరించును. మాకు మానవభోగ యోగ్యమగు ధనము ఇవ్వవలెను.     4. సవిత్ర స్తోత్ర రూపవచనుడు. ఉత్తమ జిహ్వజలవాడు. సుందరహస్తములు కలవాడు. ఆ సవితను మేము స్తుతింతుము. అతడు మాకు విచిత్రము విశాలమగు అన్నము ప్రదానము చేయవలెను. "యూయం పాత స్వస్తిభిః సదానః"                                           నలుబది ఆరవ సూక్తము      ఋషి - వసిష్ఠుడు, దేవత - రుద్రుడు, ఛందస్సు - జగతి, చివరిది త్రిష్టుప్.     1. రుద్రుడు దృఢ ధనుష్టుడు. వేగవంతములను అమ్ములవాడు. అన్నవంతుడు. అజేయుడు. విజేత. సుతీక్ష్ణ అస్త్ర కర్త. అటువంటి రుద్రుని స్తుతించండి. అతడు వినవలెను.     2. భూమిమీద, స్వర్గమందు ఉన్న వారిని ఐశ్వర్యమునుబట్టి తెలుసుకొనవచ్చును. నిన్ను స్తుతించువారిని పాలింపుము. మా ఇంటికి విచ్చేయుము. మమ్ము రోగస్థులను చేయకుము.     3. రుద్రా ! నీవు అంతరిక్షమున పిడుగును విడుతువు. అది నేలను అంటునపుడు మమ్ము తాకరాదు. "స్వసివాత" రుద్రా ! నీ వద్ద వేల ఓషధులు ఉన్నవి. మా పుత్ర, పౌత్రులను హింసించకుము.     4. రుద్రా ! నీవు మమ్ము కొట్టరాదు. మమ్ము విడువరాదు. నీ కోపమున పడిన ఉచ్చులలో మమ్ము పడనీయకుము. ప్రాణులచే ప్రశంసించబడు యజ్ఞమున మమ్ము భాగస్వాములను చేయుము. "యూయం పాత స్వస్తిభిః సదానః"                                          నలుబది ఏడవ సూక్తము                       ఋషి - వసిష్ఠుడు, దేవత - అప్, ఛందస్సు - త్రిష్టుప్.          1. అప్ దేవతా ! నీవు సంస్కరించిన సోమరసము దేవతలు ఇష్టపడునది. అధ్వర్యులు ఇంద్రునకు పానయోగ్యముగా చేసినది. అట్టి శుద్ధము, నిష్పాపము, వృష్టిజల సేచనకారి అగు రసవంత సోమరసమును మేముకూడ సేవింతుము.     2. శీఘ్రగతిగల అపాంనిపాత, అగ్నీ ! దేవతలు నీ రసవత్తమ సోమమును రక్షించవలెను. అందు వసువులు రుద్రులు ఉన్మత్తులు అగుదురు. మేము దేవాభిలాషులము. నేడు ఆ సోమరసమును అందుకొందుము.     3. అప్ దేవత జలదేవత అనేక పావన రూపములవాడు. హర్షోత్పాదకుడు. ప్రకాశమానుడు. దేవతల స్థానములందు ప్రవేశము కలవాడు. అతడు ఇంద్రుని యజ్ఞాది కర్మములకు ఆటంకము కలిగించడు. అధ్వర్యాలారా ! మీరు సింధు మున్నగు జలస్థానమునలకు ఘృతయుక్త హవ్యముతో హోమము చేయండి.     4. సూర్యుడు తన కిరణములతో జలములను విస్తరింపచేయును. ఇంద్రుడు జలగమన మార్గమును ఏర్పరచినాడు. సింధుగణములారా ! మీరు మా కొఱకు ధనము దాల్చుడు. "యూయం పాత స్వస్తిభిః సదానః"                                         నలుబది ఎనిమిదవ సూక్తము            ఋషి - వసిష్ఠుడు, దేవత - ఋభువులు, ఛందస్సు - త్రిష్టుప్.     1. ఋభువులారా ! మీరు నేతలు, ధనవంతులు. మా సోమము పానము చేయుడు. మత్తులగుడు. మీరు వెళ్లుచున్నారు. మా అశ్వములు మీ కార్యములు నిర్వర్తించునవి. సమర్థలు. అవి మా కొఱకని మానవహితకర రథమును ఆవర్తితము చేయవలెను.     2. ఋభువులారా ! మేము మీ వలన ప్రసిద్ధులము అగుదుము. మేము సమర్థులము కావలెను. మీ సాయమున మీ బలముతో మేము శత్రువులను అణచివేసెదము. వాజనామక ఋభువు యుద్ధములందు మమ్ము రక్షించవలెను. ఇంద్రుని సహాయమున మేము వృత్రుని బారినుండి తప్పించుకొన గలము.     3. ఇంద్రుడు ఋభుగణములు తమ ఆయుధములతో మా శత్రుసేనలను అనేకములను ఓడింతురు. యుద్ధము జరిగినప్పుడువారు సమస్త శత్రువులను హతమార్చెదరు. విభ్వ, ఋభుక్ష, వాజలను ముగ్గురు ఋభువులను, ఆర్య ఇంద్రుడు మథించి శత్రుబలములను నష్టపర్చెదరు.     4. ప్రకాశక ఋభువులారా ! మాకు నేడు ధనము ఇవ్వండి.     సమస్త ఋభువులారా ! ప్రసన్నులై మీరు మమ్ము రక్షించండి.     ప్రశస్త ఋభువులారా ! మీరు మాకు అన్నము ప్రదానము చేయండి. "యూయంపాత స్వస్తిభిః సదానః"                                           నలుబది తొమ్మిదవ సూక్తము                     ఋషి - వసిష్ఠుడు, దేవత - అప్, ఛందస్సు - త్రిష్టుప్.     1. జలములందు సముద్రుడు జ్యేష్ఠుడు. అప్ దేవత గమనశీలుడు. శోధకుడు. అతడు అంతరిక్ష మధ్యమునుండి సాగును. వజ్రధరుడు, అభీష్ట వర్షియగు ఇంద్రుడు జలములను విడిచినాడు. ఆ అప్ దేవత ఇక్కడ మమ్ము రక్షించవలెను.     2. అంతరిక్షమున పుట్టిన జలములు. నదులలో ప్రవహించు జలములు. నేల అడుగునుండి త్రవ్వితీసిన జలము స్వయముగా పుట్టి సముద్రమువైపు సాగుజలములు అట్టిదీప్తములగు పవిత్ర జలములన్నియు మమ్ము రక్షించవలెను.     3. జలసమూహముల స్వామి వరుణుడు. అతడు సత్యాసత్యములకు సాక్షీభూతుడై మధ్యలోకమునకు తరులును. అట్టి రసమును వర్షించు ప్రకాశయుక్తములగు, శోధక జలదేవతలు మమ్ము రక్షించవలెను.     4. రాజావరుణుడు నివసించునదియు, సోమము నిలుచునదియు అన్నములుపొంది విశ్వదేవతలు ప్రసన్నలగునదియు, వైశ్వానరుడు ఆసీనమగునదియు ప్రకాశక అప్ దేవత మమ్ము రక్షించవలెను.                                     ఏబదవ సూక్తము          ఋషి - వసిష్ఠుడు, దేవత - వేరు వేరు, ఛందస్సు - జగతి.     1. మిత్రావరుణులారా ! ఈ లోకమున మీరు మమ్ము రక్షింపుడు. నిలిచి ఉండునదియు పాకునదియు అగు విషము మమ్ము చేరరాదు. అజక అను వ్యాధివలె దుర్ధర్శన విషము సమసి పోవలెను. కనిపించక సాగు సర్పము మా పదధ్వనులను గుర్తించరాదు. "మాం పద్యే నిరపపరసా విదత్సరుః"     2. వందననామక విషము నానాజన్మములందు వృక్షాది గ్రంథిస్థానములందు ఉత్పన్నమగును. జాను గుల్మాదులకు వాపు కలిగించు విషమును దీప్తిమాన్ అగ్నిదేవా ! మా మానవులకు దూరముగా ఉంచుము. "మాం పద్యే నిరపపరసా విదత్సరుః"     3. వృక్షఃస్థానమున (రొమ్మున) ఉండు విషమును నదుల జలములందు ఓషధులతో కలుగు విషమును విశ్వదేవగణములారా ! మా నుండి దూరము చేయండి. "మాం పద్యే నిరపపరసా విదత్సరుః"     4. ప్రబల దేశమునకు పోవు నదులు దిగువదేశమునకు పోవు నదులు ఉన్నత దేశమునకు పోవు నదులు జలయుక్తములు, జలశూన్యములై లోకమును తృప్తిచెందించు నదులు మాకు వచ్చు "శిపాద" రోగమును నయము చేయవలెను. మాకు శుభములు కలిగించవలెను. నదులు బాధించరాదు.                                        ఏబది ఒకటవ సూక్తము          ఋషి - వసిష్ఠుడు, దేవత - ఆదిత్యుడు, ఛందస్సు - త్రిష్టుప్.     1. ఆదిత్యుల రక్షణలతో మాకు నూతనము. సుఖకరమగు గృహము లభించవలెను. క్షిప్రకారి ఆదిత్యగణములు మాస్తోత్రములు వినవలెను. ఈ యజ్ఞకర్తను నిరపరాధిని అవిరుద్దుని చేయవలెను.     2. ఆదిత్యగణము అదితి అత్యంత సరళ స్వభావ మిత్ర, వరుణ, ఆర్యమ ఉన్మత్తులు కావలెను. లోక రక్షక దేవగణములు మమ్ము రక్షించవలెను. వారు మమ్ము రక్షించుటకు సోమపానము చేయవలెను.     3. మేము సమస్త ఆదిత్య గణములను సమస్త మరుద్గణములను సమస్త దేవగణములను సమస్త ఋభువులను ఇంద్రుని, అగ్నిని, అశ్వినులను స్తుతించుచున్నాము. "యూయంపాత స్వస్తిభిః సదానః"     (ఆదిత్యులు 12మంది మరుత్తులు 49మంది దేవగణము 3333 ఋభువులు ముగ్గురు.)                                        ఏబది రెండవ సూక్తము          ఋషి - వసిష్ఠుడు, దేవత - ఆదిత్యులు, ఛందస్సు - త్రిష్టుప్.     1. మేము ఆదిత్యులకు ఆత్మీయులము. అవిభాజ్యులము వసువులారా ! మానవులను రక్షించండి. మిత్రావరుణులను భజించుచు మేము ధనములు అనుభవింతుము. ద్యావాపృథ్వులారా మేము శక్తివంతులముకావలెను.     2. మిత్రావరుణాది ఆదిత్యగణములు మా పుత్ర పౌత్రాదులకు సుఖములు కలిగించవలెను. ఇతరుల పాపము మేము అనుభవించకుండవలెను. వసువులారా ! ఏ కర్మము చేయుట వలన మీరు నాశము చేసెదరో అట్టి కర్మను మేము చేయకుండవలెను.     3. క్షిప్రకారులగు అంగిరులు సవితను యాచించి అతని ధనమును పొందినారు. వ్యాపింపచేసినారు. యజ్ఞశీలుడు. మహాపిత, ప్రజాపతి మఱియు దేవగణములు సుమనస్కులై ఆ ధనమును మాకు అందించవలెను.                                        ఏబది మూడవ సూక్తము         ఋషి - వసిష్ఠుడు, దేవత - ద్యావాపృథ్వులు, ఛందస్సు - త్రిష్టుప్.     1. ద్యావాపృథ్వులు విశాలలు. దేవతలకు జననులు. స్తోతలు వారిని స్తుతులతో స్తుతించుచు స్థాపించినారు. అట్టి యజనీయులు. మహిమాన్వితలగు ద్యావాపృథ్వులను ఋత్విక్కుల బాధాసహితుడనై యజ్ఞమున నమస్కారములతో స్తుతింతును.     2. స్తోతలారా ! కొత్త స్తుతులు రచించండి. మాతా పితృరూపులయిన ద్యావాపృథ్వులను యజ్ఞమునందు అగ్రభాగమున స్థాపించండి. ద్యావాపృథ్వులు తమ వద్దగల వరణీయ ధనము మాకు ఇచ్చుటకు దేవతల సహితులై మా వద్దకు రావలెను.     3. వాస్తోష్పతీ ! మేము నీ యొక్క సుఖకరము. రమణీయము. ధనవంత స్థానమును పొందవలెను. నీవు మాకు లభించనిది. లభించిన ధనములను రక్షింపుము. "యూయం పాత స్వస్తిభిః సదానః"                                    ఏబది నాల్గువ సూక్తము         ఋషి - వసిష్ఠుడు, దేవత - వాస్తోష్పతి, ఛందస్సు - వివిధములు.     1. వాస్తోష్పతీ ! నీవు రోగ నాశకుడవు. సర్వ ప్రకార రూపముల ప్రతిష్ఠుడవయి మాకు మిత్రుడవు, సుఖకరుడవగుము.     2. శ్వేతర్ణము ఒక్కొక్క అంశమున పింగళ వర్ణ సరమ వంశోద్భవుడే వాస్తోష్పతి. అతడు దంతములు వెళ్లపెట్టినపుడు తినునపుడును, పెదవి కదలినపుడును అవి ఆదంతములు ఆయుధమువలవలె శోభిల్లును. ఇప్పుడు మాత్రము. నీవు సుఖముగా నిద్రింపుము. "షుస్వప".     3. సారమేయా ! నీవు బయలుదేరిన చోటికే తిరిగి చేరుదువు "పునఃసరః సారమేయః" నీవు దొంగలు బందిపోటుల దగ్గరికి వెళ్లుము. ఇంద్రుని స్తుతించువాని వద్ద కేగి ఏమిచేతువు? మమ్ము ఎందుకు బాధింతువు. సుఖముగా నిద్రింపుము. "షుస్వప"     4. నీవు పందిని చీల్చుము. పంది నిన్ను చీల్చును. ఇంద్రుని స్తుతించువాని దగ్గరకేగి ఏమి చేతువు? మమ్ము ఎందుకు బాధింతువు? సుఖముగా నిద్రింపుము "షుస్వప".     5. నీ తండ్రి నిద్రించవలెను. తల్లినిద్రించవలెను. నీవు నిద్రించవలెను. గృహస్వామి నిద్రించవలెను. బంధువులు నిద్రించవలెను. నలువైపుల జనులు నిద్రించవలెను.     6. ఇచట ఉన్నవాని సంచరించువాని మమ్ము చూచువాని కనులు పొడిచివేయుదుము. ఈ మేర ఎంత నిశ్చలముగా ఉన్నదో వారును అట్లే అయిపోవుదురు.     7. వేయి కిరణముల వృషభము. సూర్యుడు సముద్రము నుండి లేచువాడు. ఆ విజేత సాయమున సకల మానవులను పండపెట్టెదము నిద్రింప చేయుదుము. "స్వాపయామసి"
24,908
    రాముడు నారి సారించి ధనుష్ఠంకారం చేసి బాణ ప్రయోగంతో ఆ మాయను ఛేదించాడు.     అయినా తాటక విజృంభించి మాయను మరింత ఎక్కువ చేసి వారికి అడుగడుగునా అడ్డు తగులుతూ పయనానికి ఆటంకం కలిగించ సాగింది.     అప్పుడు- విశ్వామిత్రుడు 'రామచంద్రా! రఘుకుల తిలకా! తాటక మాయలకు అంతం ఉండదు! దానిని అంతమొందిస్తేనే ఆ మాయలకు ముగింపు'     'గురువరా! తాటక...'     'స్త్రీ అని సందేహించకు! అసుర సంహరణానికి నాంది కావించు! ఇది నా అనుమతి! నా ఉపదేశం!'     'గురువాక్యం త్రికరణశుద్ధిగా ఆచరిస్తాను' మహర్షికి కైమోడ్పులు చేసి బాణం సంధించి మంత్రించి ప్రయోగించాడు.     తాటక మొదట వేరు తెగిన మహా వటవృక్షంలాగా నేలకూలింది.                                                *    *    *    *     విశ్వామిత్రుడు యాగ స్థలానికి చేరుకున్నాడు.     రామలక్ష్మణులు రక్షణగా ఉండగా విశ్వామిత్రుడు దీక్ష వహించాడు. ఆరు రోజులు అన్నదమ్ములు కన్ను చెదరకుండా యజ్ఞవేదిని రక్షించారు. విశ్వామిత్రుడు యజ్ఞం విజయవంతంగా నిర్వర్తించాడు.     ఆ సమయంలో-     మింటిలో జంట రాక్షసులు తమ దుశ్చర్య మొదలుపెట్టారు కానీ రాముడి బాణ పరంపర వారి దుశ్చర్యణు అడ్డుకుంది.     ఆ మీదట రాముడు వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించి మారీచుని గురిచూచి కొట్టాడు. వాడు ఆ బాణం తాకిడికి గాలిలో కొట్టుకుపోయే ఎండు రావి ఆకులా కొట్టుకుపోయాడు. ఆగ్నేయాస్త్రానికి గురై సుబాహుడు మరణించాడు వారివెంట వచ్చిన రాక్షసులు చెల్లాచేడురయ్యారు.     యాగం నిర్విఘ్నంగా పూర్తయ్యింది.                               *    *    *    *     మారీచుడు కుప్పకూలినట్లు పడ్డాడు. కొద్దిసేపటికి తేరుకుని అన్నాడు 'లంకేశ్వరా! విశ్వామిత్రుడి యాగం పరిపూర్తి అయ్యింది. ఆ మహర్షి ఆయుధం పట్టుకోలేదు. కానీ ఇద్దరు ముక్కుపచ్చలారని రాకుమారులు ఆయన వెంట వచ్చారు. వారి బలం ఏమి బలం! వారి తేజం ఏమి తేజం! తేరి చూడరాకుండా ఉంది! రాక్షసేశ్వరా! వారిలో పెద్దవాడు మా తల్లి తాటకను నేలకూల్చాడు! మా సోదరుడు సుబాహును తను మాడాడు! నన్నెందుకో తరిమికొట్టాడు జీవం నిలిచింది. ఇంకా భూమ్మీద నూకలు చెల్లలేదు. నిన్ను సేవించే అదృష్టం ఇంకా మిగిలినట్లుంది. అందుకే బ్రతికి నీ పాలికి వచ్చాను.     మునులు మాయావులు - మన చెడు కోరతారు ప్రభూ! మంత్ర తంత్రాలతో మన నాశనాన్ని దేవతల క్షేమాన్ని కోరతారు. ఇప్పుడు వాళ్ళు నరుల పక్షపాతులయ్యారు ప్రభూ! ఇక దేవతల బారినుండి తప్పించుకోడానికి దైత్యులకు దిక్కులేదు ప్రభూ!'     రావణుడు అంతా విన్నాడు. మౌనంగా ఉండిపోయాడు.     మునులందరూ- విశ్వామిత్ర ఋషి మున్నుగా కోసల రాకుమారులను- రామలక్ష్మణులను ఆశీర్వదించారు. మహర్షుల ఆశీస్సులు పొంది మరింత తేజస్వంతులయ్యారు దాశరధులు.     అప్పుడు - విదేహ రాజ్యం నుండి జనకుడు పంపిన ఆహ్వాన పత్రికలు వచ్చాయి. జనకతనయ - వైదేహి- జానకికి స్వయంవరం ప్రకటించారు జనకరాజర్షి. తరతరాలుగా పురాణకాలం నుండి పూజలందుకుంటున్న మహాధనువు- శివధనస్సును ఎవరు ఎక్కి పెట్టగలడో ఆ ఎక్కిటి జోదుకు తన కుమార్తె సీతనిచ్చి పెళ్ళి చేస్తానని జనకుడు ఆ వార్తాహరుల ద్వారా విషయం తెలియపరిచారు.     ఆపై మునులందరి అనుమతి తీసుకుని పొరుగు రాజ్యాలకు వార్తలందించడానికై సమీప ఆశ్రమాల్లో నివసించే మహర్షులందరికీ విషయం వివరించడానికై బయలుదేరి వెళ్ళారు.     విశ్వామిత్రుడు రామలక్ష్మణులను చూశాడు.     రాముడు వినయవినమితాంగుడై 'గురువర్యులు అనుమతిస్తే మేం అయోధ్యకు బయలుదేరుతాం! మా తండ్రిగారు మా రాక కోసం ఎదురు చూస్తూ వుంటారు! మా తల్లి కైకేయి నా కోసం ఎదురు తెన్నులు చూస్తూ ఉంటుంది. ముని ప్రభూ! మేం తమ వద్ద స్వీకరించిన బాణ విద్యా రహస్య ప్రదర్శనలు ఆమె ముందు ప్రదర్శించి ఆనందింప చేయాలి' అన్నాడు.     విశ్వామిత్రుడు ఆ వినయానికి మరింత సంతసించాడు.     'నాయనా రామచంద్రా! జనకుడి ఆహ్వానము సకల రాజలోకానికీ చేరి ఉంటుంది. అయోధ్యకూ పంపే ఉంటారు. నీవు మాతో వచ్చి ఆ శివధనస్సును సంధించు! మీ కళ్యాణ వేడుకలు మా కన్నులారా చూసి ఆనందిస్తాం!'     విశ్వామిత్రుడి మాట - గుర్వాజ్ఞ- శిరోధార్యంగా భావించాడు రాముడు. త్రికరణ శుద్ధిగా పాటించాడు.     ఆపై రామలక్ష్మణులను వెంట పెట్టుకుని తన ముని శిష్యులనూ వెంట నిడుకుని విదేహ రాజ్యానికి బయలుదేరాడు. మిథిలా నగరం వైపు వారి ప్రయాణం సాగింది. ముందు విశ్వామిత్రుడు వెనువెంట రామలక్ష్మణులు నడుస్తున్నారు.                                      56     అడవి మార్గాన నడుస్తున్నారు ముగ్గురూ. వారిని అనుసరించి మరికొందరు శిష్యగణం.     కొంత దూరం వెళ్ళగానే వారికి పాడుబడిన ఆశ్రమం అల్లంత దూరంలో కనిపించింది. ఫలవృక్షాదులు ఫలించి ఉన్నాయి. కొన్ని వాటిపై పండి- రాలి- మగ్గిపోయి- ఎండిపోయాయి. తీగలు క్రమంగా తీర్చేవారు లేక అల్లిబిల్లిగా అల్లుకున్నాయి. ఎటో సాగిపోతున్నాయి. పర్ణ కుటీరాలు శోభతరిగి శిథిలావస్థకు చేరుకున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా ఆలనా పాలనా లేని కారణాన వాటి ముంగిళ్ళు బీటలు వారాయి. కుటీరం తలుపులు విరిగిపోయాయి. గోడలు బీటలు వారాయి.
24,909
    "ఎగ్జాట్లీ, రాఘవులు లాంటి వాడికి జరగాల్సిన శాస్తి అదే అయినా దొంగతో శ్రీలేఖ వెళ్లడమేమిటి?" అంది.     "మరి ఆమెకోసం ఐ.ఎ.ఎస్. ఆఫీసర్ని ఎక్కడ నుంచి తేను. ఒకవేళ ఆమె ఐ.ఎ.ఎస్ ఆఫీసర్ తో వెళ్ళలేక పోవచ్చు. అతని మీద ఇష్టం కలుగకపోవచ్చు. ఆ దొంగలో ఏ మంచిగుణాన్ని ఆమె చూసిందో మనకు తెలియదు కదా. అందునా ఆ రోజు నువ్వు కథంతా విని అతను దొంగలా లేడు, ఏ గౌతమ బుద్ధుడిలానో, మహాత్మాగాంధీలానో ప్రవర్తించాడని నువ్వు అన్నావ్. గుర్తుందా?"     తల వూపింది కీర్తి.     "మరి జయను చంపేసిన పెరుమాళ్ ను గ్రామస్థులు ఎందుకు సత్కరించారు" అని అడిగింది.     "నాలుగో కథా?" అన్నాను.     అవునన్నట్టు తలవూపింది.     ఈ కథలో పడి ఎక్కడ తెల్లవారి పోతుందోనన్న భయాన్ని పక్కకుపెట్టి నాలుగో కథ ముగింపు చెప్పడం ప్రారంభించాను.                                 రక్తం చెప్పని రహస్యం     బుట్ట ఎత్తేసరికి రక్తంతో అభిషేకించినట్టున్న జయ కిందకు ఒరిగిపోయింది. ఆమె చనిపోయిందని అక్కడున్న అందరికీ అర్థమైంది.     ఆ దృశ్యాన్ని చూసి సత్యనారాయణరెడ్డి నిలువెల్లా వణికిపోయాడు. ఆడవాళ్ళు అప్పటికే గట్టిగా ఏడుస్తున్నారు. యువకులు పెరుమాళ్ కోసం తలోమూలకు పరుగెత్తారు. ముసలీ ముతకా జయ చుట్టూ చేరి మౌనంగా రోదిస్తున్నారు.     తమకున్న ఏకైక పెద్దదిక్కు పోయినట్టు బెంబేలెత్తిపోయారు. వెంటనే ఏం చేయాలో ఎవరికీ అర్థంకాలేదు. తలోరకంగా మాట్లాడడం మొదలెట్టారు.     సత్యనారాయణరెడ్డి కూడా ఏడుస్తుండడం అక్కడున్న చాలా మందిని కదిలించి వేసింది. అంతపెద్ద భూస్వామి ఏడుస్తుంటే ఆయన్ను ఆ స్థితిలో చూసి స్త్రీలు ముక్కులు చీదుకున్నారు. తన సేద్యకత్తె అలా నిస్సహాయంగా పడివుంటే ఆయనకు దుఃఖం ఆగడం లేదు.     మరో రెండు గంటలకు కొందరు సర్దుకున్నారు. ఇక జరగాల్సిన కార్యక్రమం గురించి చర్చించడం మొదలుపెట్టారు.     "ఏదో అయిపోయింది. ఆ రాస్కెల్ గాడ్ని ఎక్కడున్నా పట్టుకుని ఈ వూర్లో కొరత వేయిస్తాను. మీరు గుండె దిటవు చేసుకోండి. నా స్వంత చెల్లెల్లా మెసిలిన జయ ఇక లేదనుకుంటే నాకు ఎంతో బాధగా వుంది. అయినా ఏం చేస్తాం. జరగాల్సిన తంతు జరపండి అంత్యక్రియలకుగాను వేయి రూపాయలిస్తాను" అన్నాడు సత్యనారాయణరెడ్డి. దుఃఖంతో ఆయన గొంతు బొంగురు పోయింది.         మాలలంతా ఆ మాటలకు సరేనన్నట్టు తల ఊపారు. అయితే కొంతమంది మాత్రం పెరుమాళ్ మీద పోలీసు రిపోర్ట్ ఇవ్వాలన్నారు.     దీనికి కొంతమంది జయ బంధువులు ఒప్పుకోలేదు. శవాన్ని పరీక్ష నిమిత్తం ముక్కలుగా కోయడాన్ని వాళ్లు భరించలేరు. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వాళ్లు సుముఖత చూపించలేదు.     "మహాతల్లి, సాక్షాత్తు ఆ మహాలక్ష్మి కిందకు దిగి వచ్చి మనతో పాటే ఉన్నట్టుండేది. ఎవరికి కష్టం వచ్చినా తను కన్నీళ్ళు కార్చేది. ఎంతో మందికి ఎన్నో విధాలుగా సహాయం చేసింది. వయసులో చిన్న అయినా మనసులో మనకంటే పెద్దది. అందరి సుఖం కోసం ముందుండి పోరాడేది. అలాంటి పిల్లను కత్తులతో పొడిచి చంపేశాడు ఆ కిరాతకుడు. వాడ్ని మాత్రం వూరికే వదిలి పెట్టకూడదు. ఇప్పుడు మళ్ళీ పోలీసులచేత కోయించేందుకు శవాన్ని ఇవ్వకండి" అని వాళ్ళు అర్ధించారు. ప్రార్థించారు.     పెరుమాళ్ ను వెతికి పట్టుకోవాలంటే పోలీసు రిపోర్ట్ ఇవ్వాల్సిందే నని కొందరు పట్టుపట్టారు.     సత్యనారాయణరెడ్డి ఎటూ నిర్ణయించలేక పోయాడు. చివరకు ఆయన్ని పోలీసులకు ఫిర్యాదు చేయటానికి ఒప్పించారు.     అప్పటికి టైమ ఏడుగంటలైపోయింది. వూర్లో వాళ్ళంతా మర్రి చెట్టుదగ్గరే వుండడం వల్ల ఇళ్ళలో దీపాలు వెలగడంలేదు. చుట్టూ ముసురు కున్న చీకట్ల కింద ఆ గ్రామం మూర్ఛ రోగిలా కొట్టుకుంటూ వుంది. వెలుగుల తాళాల గుత్తి ఇస్తే తప్ప ఆ గ్రామం తేరుకునేట్టు లేదు.     అర్జెంట్ గా పోలీసులను పిలుచుకు రమ్మని ఇద్దర్ని టౌన్ కి తరిమాడు సత్యనారాయణరెడ్డి.     పోలీసులు వచ్చేసరికి రాత్రి తొమ్మిది గంటలైపోయింది.     ప్రాథమిక విచారణ పూర్తయ్యాక పోస్టుమార్టమ కోసం శవాన్ని జీప్ లో ఎక్కించారు.     జయతోపాటు ఆమె చిన్నాన్న మాత్రం జీప్ లో ఎక్కాడు. తిరిగి శవాన్ని ఎద్దుల బండిలో తీసుకు రావడానిని నిర్ణయించారు. అంత్యక్రియల కోసం కావాల్సిన సామాను తేవడానికి అయిదు వందల రూపాయలిచ్చి పాలేరును పంపాడు సత్యనారాయణరెడ్డి. తన పొలంలోని తల్లిదండ్రుల సమాధి దగ్గర శవాన్ని పాతిపెట్టాలని కోరుతున్న ఆయన్ను చూసి మాలలంతా గౌరవభావంతో నమస్కరించారు.     జీప్ బయల్దేరింది.     సత్యనారాయణరెడ్డి, మిగిలిన వాళ్ళు శవయాత్రకు కావాల్సిన ఏర్పాట్లను చేయడానికి వూర్లోనే మిగిలిపోయారు.     జీప్ వూరు రోడ్డు దాటి, తారు రోడ్డు ఎక్కింది.     ముందు సీట్లో ఎస్.ఐ వున్నారు. వెనుక శవంతోపాటు జయ చిన్నాన్న, సత్యనారాయణ రెడ్డి, పాలేరు, మరో ఇద్దరు కానిస్టేబుల్స్ వున్నారు.     జీప్ స్టేషన్ ముందు ఆగింది.     ఎస్.ఐ. కిందకు దిగాడు. ఆయనతోపాటు మిగిలిన వాళ్ళూ దిగారు.     స్టేషన్ లో అడుగుపెడుతున్న జయ చిన్నాన్న "అదిగో సార్. వాడే పెరుమాళ్, నా బిడ్డను చంపేసింది ఆ కిరాతకుడే" అని అరిచాడు. ఆయన అరుపులకు స్టేషన్ సైతం వులిక్కిపడింది.     స్టేషన్ ముందున్న బోగన్ విల్లా చెట్టుకింద అమాయకంగా నిలబడి వున్నాడు పెరుమాళ్.     అతన్ని చూడగానే పోలీసులతోపాటు, సత్యనారాయణరెడ్డి పాలేరు కూడా ఖంగుతిన్నాడు. జయ చిన్నాన్న అలా అరవగానే కానిస్టేబుల్స్ ఒక్క గెంతు గెంతి, అతన్ని ఒడిసి పట్టుకున్నారు.
24,910
    ఆమె ఆపుకోలేని ప్రేమతో అతని ముఖంమీదకు వంగి పెదాలను ముద్దు పెట్టుకుంది.     "వద్దు!" అన్నాడు రాజారావు కళ్లువిప్పి బలహీనంగా.     ఆమె మళ్లీ ముద్దు పెట్టుకుంది.     "మంజూ! ప్లీజ్!"     ఆమె లజ్జితురాలై కొంచెం దూరంగా జరిగికూర్చుంది.     అతనామె కోమలహస్తాన్ని వణుకుతున్న తన వ్రేళ్లతో పట్టుకుని "మనం ఈ బంధాలనుండి విముక్తులం అయిపోవాలి మంజూ! తప్పదు. ఈ నా అనారోగ్యం తాత్కాలికంగా నా ప్రయాణాన్ని వారించిందంతే. మనం ఇలా పసిపిల్లల్లా ప్రవర్తించకూడదు."        ఆమె అతని హృదయంపై తల వుంచి కన్నీరు విడవసాగింది.                                                * * *     తెల్లవారుఝామున ఐదయింది. వాన పూర్తిగా వెలిసిపోయింది. దూరంగా అక్కడక్కడా సందడికూడా ఆరంభమయింది.     "సెలవు" అన్నాడు రాజారావు నిలబడి.     "పునర్దర్శనం?" అన్నది మంజువాణి చేతులు జోడించి.     "చెప్పలేను.... ఈ ఊరు విడిచి వెళ్ళేలోగా ఓసారి తప్పక కనిపిస్తాను."     "నామీద ప్రమాణం చెయ్యండి... చదువు పాడుచేసుకుని మట్టుకు పోనని" అన్నది మంజువాణి జాలిగా.     "అలాగే! నా మాటల్ని విశ్వసించవచ్చు."     "మీ యోగక్షేమాలు నాకు ఎలా తెలుస్తుంటాయి?"     "ఎక్కడో అక్కడ క్షేమంగానే ఉంటాను. నాగురించి మనుషుల్ని పంపక. నీకు పుణ్యముంటుంది."     ఆమె ఉదాసీనంగా నవ్వి "పంపనులెండి!" అన్నది.          ఇద్దరూ గది వెలుపలికి వచ్చి గేటుదాకా నడిచారు. "నా మనసు మీయందే!" అన్నది గద్గదస్వరంతో ఆమె లోపల నిలబడి.     "వారిని కలుసుకోవడం ఇష్టంలేకే ముందుగా వెళ్లిపోతున్నాను... వీలుంటే చెప్పు.. నమస్కారం!"     "అదేమిటి? మీరు నాకు....?"     రాజారావు కొంచెం దూరంగా పోయి, చిన్నగా నవ్వుతూ "వయసులో కొంచెం పెద్దదానివి... అందుచేత."     "మీ ఆరోగ్యం..!"     "బెంగలేదు" ఈ మాటలు మరీ దూరంగా వినిపించాయి. ఇద్దరు భార్యాభర్తలు విడిపోతున్నట్లుగా అనుభూతి. రాజారావు ఆకృతి పూర్తిగా చీకట్లో కలిసిపోయింది.                                           16     "నా చెయ్యిచూసి భవిష్యత్ చెప్పు? భయపడకు... గోరింటాకు పెట్టుకోలేదులే!"     "ఉహుఁ నీ చెయ్యి చూడను" అన్నాడు చక్రపాణి.     "ఎందుచేత?" అనడిగింది ప్రభావతి కనులెగురవేసి.     "నువ్వు ఒట్టి అల్లరిపిల్లవి!"     "నీకు అల్లరిపిల్లల్ని చూస్తే మహాభయం ఉన్నట్లు?"     "నువ్వు నిజాలు నమ్మవు... అబద్ధాలు నమ్ముతావు ఖర్మ."     "మధూ!"     "నా పేరు మధు కాదు..."     "మరి ఏమిటి?"     "చక్రపాణి!"     ప్రభావతి గడ్డిలో పడుకున్నదల్లా కిలకిలమని నవ్వింది. పమిటచెంగును వేలుకు చుట్టుకుంటూ "నువ్వు దొంగవి" అన్నది.     "ఒట్టి దొంగను కాదు, ఘరానా దొంగను."     "మరి నేనెవర్నో తెలుసా?"     "బంగారు పాపవి."     "ఉహుఁ"     "అప్పుడప్పుడూ గుబులు పుట్టే పెంకిఘటానివి!"     "కాదు" అని ప్రభావతి తల అడ్డంగా త్రిప్పింది.     "మరి ఇంకెవరివి? మహారాణివా?"     "కాదు... దొంగలరాణిని" అంటూ ఆమె మనోహరంగా నవ్వింది.     "మరి చెయ్యి చూడవేం?" అంది మళ్లీ.     "నేను చెప్పేవన్నీ జరుగవు... అబద్ధాలు."     "అవే భలే సరదాగా వుంటాయి" అంటూ ఆమె లేచి కుదురుగా కూర్చుని తన మృదుహస్తాన్ని అతని ముందుకు చాచి "చెప్పు?" అంది.     చక్రపాణి ఇహ విధిలేక ఆమె చేతిని తీసుకుని పరిశీలించసాగాడు.     కొన్ని క్షణాలు పోయాక "నువ్వు త్వరలో పెద్ద ఇల్లు కడతావు" అన్నాడు.     "అబ్బా! నా పెనిమిటి కట్టడన్నమాట అయితే?"     "నువ్వు 75పాళ్లు ఊహల్లో జీవిస్తావు."     "నువ్వు దగ్గరలేనప్పుడు ఊహాలోకమే శరణ్యం."     "నీలో నిరంతరం సంఘర్షణ చెలరేగుతూ వుంటుంది. అది నీ ఉజ్వల భవిష్యత్ కు పునాది."     "నీ గురించే నా సంఘర్షణ. నిన్ను పొందటమే ఉజ్వల భవిష్యత్!"        చక్రపాణి కోపంగా ఆమె చేతిని అవతలికి నెట్టి "నన్ను పొందటం అంత సులభమనుకున్నావా?" అన్నాడు.     "ఏం? నువ్వేమైనా దిగివచ్చావా పైనుండి?"     చక్రపాణి మాట్లాడలేదు.     "గర్వం నీకు - నేనే కదా అందంగా వుంటానని."     "నీతో మాట్లాడను."     "నువ్వు మాట్లాడకపోతే అన్నం, నీళ్లు మానేసి ఏడుస్తూ కూర్చుంటాననుకున్నావా?"     "దెబ్బలాడుకుందామా మనం?" 
24,911
    కిరణ్ కి ఆ నిమిషంలో గ్రహమ్ బెల్ కనపడితే ఫుట్ బాల్ ఆడెయ్యాలన్నంత కోపం వచ్చింది. 'మనిషికి ప్రైవసీ అనేది లేకుండా, హాయిగా ఆలోచించుకోడానికి లేకుండా, ఎప్పుడుపడితే అప్పుడు....ఏది పడితే అది.....మనుషుల చెవుల్లో దూరి అనేసే పరికరాన్ని కనిపెట్టావు కదయ్యా! నయం ఇంకా గదిలోనే మ్రోగుతోంది.....మదిలో కంతా దూరిమ్రోగకుండా!' అని టవల్ చుట్టుకుని ఫోన్ దగ్గరికి వచ్చాడు.              టేబుల్ మీద ఫోన్ వికటంగా నవ్వుతోంది. అది ఎక్కువగా అతని మేనమామ తిట్లనే అందిస్తూ వుంటుంది.          దానివైపు వీలైనంత ఏహ్యంగా చూస్తూ విసురుగా అందుకున్నాడు కిరణ్.          "హలో నేను చాయని!"          కిరణ్ కి ఒక్కసారిగా శరీరంలోని శక్తినంతా పీల్చేసి ఎవరో తేలిక చేసినట్లయింది.          "ఛాయా డార్లింగ్! ఎక్కడ్నించి?" ఉషారుగా అడిగాడు.          "కిరణ్! ఏం చేస్తున్నావు?"          "ఏం చెప్పను? నీ తలపులతో పిచ్చెక్కిపోతున్నాను. ఇంతసేపూ నిన్ను తల్చుకుంటూ ఏం చేశానో తెలుసా?" అతను ఉత్సాహంగా చెప్పుకుపోతున్నాడు.          "కిరణ్! ఖాళీగా వుంటే వెంటనే నువ్వు మా హాస్టల్ బస్ స్టాప్ దగ్గరికిరా" అంది.          "ఖాలీగానా?" అతనికి వాళ్ళ అంకుల్ గాండ్రింపు ఓ లిప్తపాటు గుర్తువచ్చింది. కానీ అలాంటి గాండ్రింపులన్నీ ప్రేమముందు బలాదూర్. "ఆ....పనేం లేదు. ఖాళీగానే వున్నాను. వెంటనే వస్తాను" అన్నాడు.          "వచ్చేటప్పుడు ఓ ఐదువేలు పట్టుకురా అర్జెంట్" అంది చాయ.          "ఐదు వేలా? ఆ....ఆ! అలాగే..." వెంటనే ఒప్పేసుకున్నాడు. ఆలశ్యం చేస్తే ఏం వినాల్సొస్తుందో అని.          "వెంటనే బయలుదేరు.....బయలుదేరుతున్నావా....?" గట్టిగా అంది.          "ఆ.....ఇదిగో.....వస్తున్నా!" వెనక్కి తిరిగి షర్ట్ అందుకుంటూ అన్నాడు. "బై.....సీయూ!" రిసీవర్ పెట్టేసి ఫోన్ ని ముద్దు పెట్టుకున్నాడు.          "ఈ రోజునించీ మనం ఫ్రెండ్స్! నిన్ను కొట్టనూ.....తిట్టనూ.....!" అన్నాడు.          ఫోన్ రాజీకి రానట్టు "ట....ర్....ర్" అంది.          భయం భయంగానే తీశాడు.          "ఏం రాచకార్యాలు వెలగపెడుతున్నావు? అవలేదా అలంకరణ? నేను పనిమీద ఢిల్లీ వెళ్తున్నాను. ఆఫీసు స్టాఫ్ కి జీతాలు ఇవ్వడానికి డబ్బు బీరువాలో పెట్టాను. వచ్చేటప్పుడు తీసుకొచ్చి అందరికీ ఇవ్వు ఒక్క మాట.....నీ జీతంలో ఈ నెల రెండువేలు కట్ చేస్తున్నాను" అన్నాడు.          "ఎ....ఎందుకు?" నాలుక తడారిపోతున్నట్లు అడిగాడు కిరణ్.          "నా కారు ఆఫీసు పనికోసం కాకుండా నీ స్వంత తిరుగుళ్ళకోసం వాడినందుకు ఇలాగే కంటిన్యూ చేస్తే అసలు ఉద్యోగమే వుండకుండా పోతుంది జాగ్రత్త!" చెప్పి ఫోన్ పెట్టేసాడు భగవంతరావు.          కిరణ్ ఉస్సూరుమని ఫోన్ పెట్టేసి, బట్టలు వేసుకుని, జీతాల డబ్బుకోసం భగవంతరావు రూంలోకి వెళ్ళాడు. ఆఫీసు ఫైల్సూ, డబ్బూ వుండే బీరువా కీస్ కిరణ్ దగ్గరే వుంటాయి.          డబ్బు తీసుకుని లెక్కపెట్టి బ్యాగ్ లో పెట్టుకుంటూ, 'చేతికొచ్చేది మూడువేలు! చాయ ఐదువేలు అడిగింది ఎలా?' అనుకున్నాడు. అప్పటికే ఆమెకోసం చాహాల అప్పులు చేశాడు. చేతిలోని నోట్లు ప్రవోకింగ్ గా కన్పించాయి. తర్వాత చూసుకుందాంలే అని, అందులోంచి పదివేలు తీసుకున్నాడు.          మొదటిసరిగా అతని కాళ్ళు ఆ గదిలోంచి వస్తూ వుంటే వణికాయి!                                                    * * *          ఖరీదైన ఆ హోటల్ లో అంతకన్నా ఖరీదైన మనుషులే వున్నారు. లోపలంతా చీకటిగా వుంది. ఒక్క టేబుల్ దగ్గర తప్ప.          "మీకేం కావాలో తినండి. ఎంత బిల్ అవుతుందోనని సందేహించకండి. ఈ రోజు ఖర్చంతా నాదే" గర్వంగా అంది స్నేహితురాళ్ళతో చాయ.          విండో దగ్గరగా వున్న ప్లేస్ లో ఆమె కూర్చుని వుంది. కర్టెన్ కొద్దిగా జరపడం వలన ఆమెమీద వెలుగురేఖ పరుచుకుని వుంది.          అనూరాధ విచిత్రంగా చూస్తూ "ఏమిటి చాయా విశేషం? ఈరోజు నీ పుట్టినరోజా?" అంది.          "హూ! పుట్టినరోజు!" చాయ అదోలా నవ్వి "అంతకన్నా గొప్ప రోజు ఓ గొప్ప నిర్ణయానికి వచ్చినరోజు. డీటైల్స్ ఇప్పుడు చెప్పను. ముందు ఏం కావాలో చూడండి. ఆ తర్వాత పిక్చర్ కి పోదాం" అంది.          చాయ బాటిల్ గ్రీన్ కలర్ ప్లెయిన్ సిల్క్ చీరలో మెరిసిపోతోంది. జుట్టు పొడవుగా వుండి భుజాలమీదుగా జారుతూ వుంటే, మాటిమాటికీ సర్దుకుంటూ, అదోరకంగా కళ్ళుతిప్పుతూ మాట్లాడుతూంటే....చూసినవాళ్ళు చూస్తూనే వుండిపోతున్నారు.          డీప్ 'వీ' షేప్ నెక్ వున్న బ్లౌజ్ పల్చని చీరలోంచి వూరిస్తూ కనిపిస్తోంది. మెడకి దగ్గరగా పెద్ద పెద్ద గ్రీన్ గార్లెట్స్ చైన్ వేసుకొంది. అదేరకం టాప్స్ చెవులకి పెట్టుకుంది. చెవిమీది భాగంలో తెల్లరాయి చమక్కుమని మెరుస్తోంది. జుట్టు పాపిడి తీసిన వైపునించి, ఓ పాయతీసి అపోజిట్ డైరెక్షన్ లో గ్రీన్ హైర్ క్లిప్ పెట్టి వదిలేసింది. దానివల్ల నుదుటికి వింత ఆకర్షణ వచ్చింది. గెడ్డంక్రింద పుట్టుమచ్చో పెట్టుమచ్చో తెలీకుండా చిన్న బ్యూటీ స్పాట్ దిష్టి తగలకుండా అడ్డు వస్తున్నట్లుగా వుంది.          పెద్ద పెద్ద కళ్ళకి మస్కారా వేసిందో లేక మాటి మాటికీ రెప్పలు అల్లార్చడం చేత ఆ ప్రదేశం కంది డార్క్ రెడ్ కలర్ సంతరించుకుందో గానీ, ఏ చిత్రకారుడి కుంచెకీ అందని అద్బుతంగా వుంది ఆ కలర్! పల్చని పెదాలు మూసుకున్నప్పుడు దానిమ్మ మొగ్గల్లా.....విచ్చినప్పుడు దానిమ్మ చిగురుల్లా వున్నాయి. ఆ రంగు లిప్ స్టిక్ బహుశా భూలోకంలో ఇంకా ఏ కంపెనీవాళ్ళు కనిపెట్టి వుండకపోవచ్చు! పైటకి ఈగిల్ ఆకారంలోవున్న బ్రోచర్ పెట్టుకుంది. జాకెట్టుకీ, చీరకీ మధ్యలో చాలా ఖాళీ ప్రదేశాన్ని వదిలేసింది.          కుడిచేతికి ముదురు ఆకుపచ్చా, తెలుపుగాజులు కలగలిపి చేతినిండా వేసుకుంది.          ఎడమచేతికి బ్యాంగిల్ టైపులో వున్న గోల్డు చైన్ వాచ్ పెట్టుకుంది.          చీర కుచ్చిళ్ళకి తెల్లపూసలున్న శారీపిన్ వుంది.          నిలబడగానే అందరి దృష్టినీ ఆకర్షిస్తూ, కుడివైపు చీర కుచ్చిళ్ళ మీదుగా జారుతూ, 'యూ' షేప్ లో వెనక్కి వెళ్లి ఆమె నడుముకి అలంకరించిన బ్లాక్ సిల్వర్ మువ్వలపట్టీ పెట్టుకుంది.          కాళ్ళకి బ్లాక్ కలర్ కి గోల్డెన్ స్ట్రెప్స్ వున్న హైహీల్స్ వేసుకుంది.          ఆమె టేబిల్ దగ్గర వున్నంతసేపూ ఆ చీకటిగా వున్న ప్రదేశం వెలుగుతో నిండిపోయింది!
24,912
    శ్రీహరిరావు బృందం సాయంత్రానికి జబల్ పూర్ చేరారు. మార్గం పొడుగూతా సైనికులు నల్లదుస్తు లేసుకుని, నల్ల బ్యాడ్జీలూ పెట్టుకుని కనిపించారు. కారణమేమిటని కనుక్కుంటే ఆరోజు జార్జి చక్రవర్తి మరణించిన రోజని" తెలిసింది. ఊళ్ళోకెళ్ళుతూనే "ఇక్కడెవరన్నా డాక్టరున్నారా?" అని వాకబు చేశారు.         డాక్టరుగారి అడ్రసు తీసుకుని వెళ్ళారు. డా|| డాసిల్యాని ఆ విధంగా కలవడం తటస్థించింది. ఆయన భార్య కూడా డాక్టరే. శ్రీహరి రావుగారు పరిస్థితంతా వివరించి చెప్పారు.     "ఒక స్త్రీనీ, చంటిపిల్లనీ, లేవలేని మనిషినీ వదిలిపెట్టివచ్చారా?" అని ఆవిడ ఆశ్చర్యపోయింది.         డాక్టరుగారు కూడా ఖంగారుపడి, వెంటనే డ్రైవర్ని పిలిచి, "శ్రీనగర్ అనే చిన్న ఊర్లో, పోస్టాఫీసు అరుగుమీద ఓ స్త్రీ, చిన్నపిల్లా, ఒకాయనా వుంటారు. వెంటనే తీసుకురా" అని పంపించారు.         చీకటి పడిపోయింది రమణకి దుఃఖం ఆగట్లేదు. పిల్ల ఆకలని ఏడుస్తోంది. సత్యనారాయణగారు అపస్మారకంలో వుండి ఆమెకి భయం కలుగుతోంది. ఊరుకాని ఊళ్ళో దిక్కూ దివాణం లేకుండా ఇలా ఎంత సేపు? వెళ్ళిన మనుషుల జాడలేదు. ఒకవేళ రాకపోతే ఏమిటి గతి? రాత్రంతా ఏ విధంగా గడపాలి? ఆమె కొక్కసారిగా తల్లీ దండ్రీ పుట్టిన ఊరు గుర్తొచ్చి వెక్కి వెక్కి ఏడుపొచ్చింది. కాసేపటికి తెప్పరిల్లి రామ నామం చేస్తూ కూర్చుంది. ఎటువంటి ఆపదొచ్చినా, ఆనంద మొచ్చినా ఆమె రామనామం వదిలిపెట్టలేదు        ఎదురుగుండా కారొచ్చి ఆగేటప్పటికీ ఆమె ఉలిక్కిపడి చూసింది. "శ్రీహరిరావు సాబ్! ఆన్ పూట్ బ్యాచ్" అంటున్న అతని మాటలు వినగానే, ఆమెకి పోయిన ప్రాణం లేచి వచ్చినట్లయింది. "మైహూ" అంది ఆనందంగా డ్రైవరూ, ఆమె కలిసి సత్యనారాయణగారికి ఊతమిచ్చి, కార్లో పడుకోబెట్టారు. ఆమె కార్లో కూర్చున్నాక, వెనక్కి వాలి, పిల్లని దగ్గరగా తీసుకుని "రామా! నా మొర ఆలకించావా తండ్రి!" అనుకుంది కళ్ళనిండా నీళ్ళు నిండగా.                                        *    *    *    *         జబల్ పూర్ లో డా|| డాసిల్వా ఆతిథ్యంలో ఎనిమిది రోజులుండి పోయారు. ఆయన, ఆయన భార్యా అత్యంత ఆదరంగా చూశారు. సత్యనారాయణగారికి పూర్తిగా నిమ్మళించాక బయల్దేరారు. బయల్దేరేటప్పుడు, ఆ దంపతుల దారి ఖర్చులకుగాను, వెయ్యి రూపాయల పైకం కూడా శ్రీహరి రావుగారికి బలవంతం చేసి ఇచ్చారు. సత్యకాలం కదా!         తరువాత 'బోరియా' చేరారు. కనుచీకటి పడుతుండగా వూళ్ళో కడుగు పెట్టారు. అక్కడో చెట్టుకింద రొట్టెలు చేసి అమ్ముతుంటే, అందరూ ఆవురావురుమని అవి కొరుక్కు తినేశారు. ఆ తరువాత అక్కడే బిస్తరులు పరుచుకుని నిద్ర కుపక్రమించారు. ఈదురుగాలి రయ్యిమని వీస్తోంది, ఆరుబయట ప్రదేశం అయినా అలిసిపోయి వుండడంవలన 'నిద్ర సుఖ మెరగదు' అన్నమాట నిజం చేస్తూ అందరూ గొడ్లల్లా పడి నిద్రపోయారు.         తెల్లవారి లేచి, బడ్డీకొట్టు దగ్గర టీ కొనుక్కుని తాగుతుండగా, ఆ బండివాడు, "ఇప్పుడో బస్సు ఇక్కడికొస్తుంది, అది ఇక్కడనుండి 'జఖేరా' వెళుతుంది" అని చెప్పాడు.         పిల్లకి కొంచెం ఒళ్ళు వెచ్చగా వుంది. శ్రీహరిరావు వెంటనే నిర్ణయం తీసుకుని, రమణా! నువ్వూ, పిల్లా బస్సులో వెళ్ళిపొండి, మేమందరం సాయంత్రానికల్లా జఖేరా చేరుకుంటాం" అని ఆమె మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తొందరపెట్టి, బస్సు రావడంతో అందులో కెక్కించేశారు. కండక్టర్ తో "రోడ్డు ప్రక్కగా ఏదైనా సత్రం వుంటే అక్కడ దింపెయ్యి" అని చెప్పారు. వయసులో వున్న స్త్రీని, చంటిపిల్లనీ రాష్ట్రం కాని రాష్ట్రంలో భాషరానిచోట అంత ధైర్యంగా వదిలిపెట్టేశారు.         మధ్యాహ్నానికల్లా ఆమెను ఊరి చివర సత్రం, ఓ ఆస్పత్రీ వుంటే అక్కడ దింపి, బస్సు వెళ్ళిపోయింది. పిల్లని భుజాన వేసుకుని, పెట్టెతో దిగింది. ఆమె బిక్కుబిక్కుమంటూ చుట్టూ పరికించి చూసింది. ఒక కిళ్ళి బడ్డీ వుంది. ఎదురుగా పోలీస్ స్టేషన్ లాంటిది. అక్కడో పోలీసు నిలబడి ఇటే చూస్తున్నాడు. పోలీసుని చూడగానే ఆమెకి భయమేసింది. వాళ్ళకి తమకీ వున్న 'వైరం' గుర్తుకొచ్చి ఆస్పత్రి వరండామీద పక్కపరిచి పిల్లని పడుకోబెట్టి, తను మోకాళ్ళమీద గడ్డం ఆన్చుకుని కూర్చుంది. అలా సాయంత్రం నాల్గింటిదాకా కూర్చుంది. పిల్ల లేచి, ఆకలేసింది కామోసు ఏడవసాగింది. లేచి కిళ్ళీబడ్డీ దగ్గరకెళ్ళి రెండు గ్లాసులతో టీ కొని, తను తాగి, పిల్లకి తాగించింది. అంతకన్నా ఏమీ దొరికే ఆస్కారం లేదామెకి.         పిల్లకి జ్వరం ఎక్కువయిపోయింది. ఒళ్ళు పెనంలా కాలిపోసాగింది. ఏడుపు బిగబట్టుకుని జోరుగా రామనామం చెయ్యసాగిందామె, ఇంతలో ఎవరో పెద్దమనిషి అటుకేసి రావడం గమనించింది. అతను వచ్చి ఆస్పత్రి తలుపులు తెరుస్తున్నారు. ఆ నిమిషంలో అతను ఆమెకి దేవుళ్ళా కనిపించాడు.         "ఆప్ డాక్టర్ సాబ్ హై?" అనడిగింది.         అతను ఔనూ, కాదూ అనలేదు. ఆమెవంకా, చేతిలో పిల్లవంకా చూసి, లోపలికి నడిచాడు. ఆమె కూడా అనుసరించింది. పిల్లని పరీక్షించి, ఒక మాత్ర పొడిచేసి గొంతులో వేశాడు. ఇంకో రెండు మాత్రలు పొట్లం కట్టి ఇచ్చి, "రాత్ కో" అన్నాడు. "రాత్రి వెయ్యమంటున్నాడు" అని ఆమెకి అర్ధమయింది. వచ్చినంత హడావుడిగానూ, అతను మళ్ళీ ఆస్పత్రి మూసి వెళ్ళిపోయాడు.         ఆమె ఉసూరుమంటూ పిల్లని పెట్టుకుని మళ్ళీ అరుగుమీద కూర్చుంది.         సాయంత్రం ఆరవుతుండగా, పిల్లకి జ్వరం జారిన గుర్తుగా చెమట్లు పట్టాయి.         చీకటి ముసురుకుంటోంది. 'బడ్డీషాపు' వాడు దుకాణం మూసేసి "మీ వాళ్ళెవరూ రాలేదా?" అని సైగచేసి అడిగాడు. తల అడ్డంగా వూపుతుండగా ఆమెకి దుఃఖం ముంచుకొచ్చేసింది. అతను వెళ్ళిపోయాడు. ఆమె ఇప్పుడు పూర్తిగా మనుష్య తోడులేని ఒంటరిదైపోయింది.         కాసేపటికి చీకటిలోంచి ఒక ఆకారం లాంతరు తీసుకుని రావడం ఆమె గమనించింది. ఎవరై వుంటారా? అని ఆమె నిలువెల్లా ఒణికిపోయింది.
24,913
         తండ్రి చెబుతున్న మాటల్ని మేఖల కూడా విని ఆశ్చర్యపోయింది.         మనిషిని చూడకపోయినా అచ్యుత్ ఎంత దుర్మార్గుడో, ఎంత రాక్షసుడో విని వుంది మేఖల. తన తమ్ముడు అచ్యుత్ మనుషుల్ని ఎదుర్కొన్నందుకు ముందుగా ఆమె భయపడలేదు. ఆశ్చర్యపోయింది. అంత బలం, ధైర్యం, మొండితనం, తెగింపు తమ్ముడికున్నాయా?         ఆటో రణరంగంలా మారిన ప్రాంతానికి పది గజాల దూరంలో ఆగిపోయింది.         అరుణాచలం హడావిడిగా ఆటో ఫేర్ ఇచ్చేసి భార్య చేయి పట్టుకొని బరబరా ఆ వేపుకి లాక్కెళ్ళి పొసాగాడు. వారి వెనుకే మేఖల కూడా పరుగెత్తింది.         అభిరామ్ ఒక మనిషిని అమాంతం గాల్లోకి లేపి ప్రక్కనే ఉన్న మురికి కాలువలోకి విసిరివేశాడు. ఆ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసిన ఆదిలక్ష్మి, మేఖల షాక్ తిన్నారు.         అచ్యుత్ అనుచరులు అభిరామ్ పన్నిన పద్మవ్యూహంలో ఇరుక్కుపోయి ప్రాణభయంతో అటూ ఇటూ పరిగెత్తుతున్నారు.         అభిరామ్ మిత్రబృందం చేయి అప్పటికే పైన ఉండటంతో ఉత్సాహంతో అచ్యుత్ అనుచరులను వేటాడుతున్నారు.         చుట్టూ చేరిన జనం నరకాసుర వధ జరుగుతున్నంత ఆనందంగా ఫీలవుతూ చూస్తున్నారు.         ఆ ప్రాంతమంతా అస్తవ్యస్థమై పోయింది. పరిస్థితి గందరగోళంగా వుంది.         "ఏమిట్రా చూస్తున్నారు? సిగ్గులేదు మీకు? ప్రభుత్వం పన్నులడిగితే ఎగ్గొడతారు....? మున్సిపాలిటీలు ఇంటి పన్నడిగితే ఇంటి వెనక్కి వెళ్ళి దాక్కుంటారు. ఇన్ కమ్ టాక్స్ వాళ్ళు వస్తే ఇన్ కమే లేదంటారు. అందుకు చచ్చినన్ని అబద్దాలాడతారు. ఈ వెధవలొచ్చి అడిగితే నోళ్ళు మూసుకొని అడిగినంత ఇచ్చేస్తారు. మీరు బ్రతుకుతున్నది మంగోలియన్ అడవుల్లోనా? మాతృభూమ్మీదా....? ఏంట్రా ఇంకా చూస్తారు? అందిన వాడ్ని అందినట్టే బాదండి. బాది మీ కసి తీర్చుకోండి....." చుట్టూ మూగి చూస్తున్న జనాల్ని ఉద్దేశించి ఓ ప్రక్క అంటూనే, మరో ప్రక్క అచ్యుత్ అనుచరుల్ని వేటాడుతూనే వున్నాడు అభిరామ్.         పరిస్థితి చేయిదాటి పోతోందని ఆదిలక్ష్మి గ్రహించింది. అప్పటికే కొడుకు బట్టలన్నీ రక్తంతో తడిసిపోయాయి.         మొండిగా ముందుకు వెళ్ళిపోయి కొడుక్కి అడ్డంగా నించుంది ఆదిలక్ష్మి.         హఠాత్తుగా తన ఎదుట తల్లి ప్రత్యక్షం కావటంతో అభిరామ్ దిమ్మెర పోయాడు.         జరిగింది క్షణాల్లో ఊహించాడు.         "నువ్వు ప్రక్కకు తప్పుకోమ్మా..... ఈ రోజుతో ఈ ఊరికి పట్టిన పీడ పోవాలి" అన్నాడు పట్టుదలగా అభిరామ్.         "నా మాట విను ఈ గొడవలు మనకొద్దు. వాళ్ళడిగిన చందా నాన్న గారిచ్చేస్తానంటున్నారు...." అంది ఆదిలక్ష్మి కొడుక్కి మరింత దగ్గరగా వెళుతూ.         "అమ్మా.....నాకు అడ్డం రాకు" అంటూ అభిరామ్ ఒక అడుగు వెనక్కి వేస్తున్నంతలో పెద్దగా ఎవరిదో కేక వినిపించింది.         ఉలిక్కిపడి అందరూ అటువేపు చూశారు.         "అచ్యుత్ ముఠా వాళ్ళు మరో పదిమంది దాకా వచ్చిపడుతున్నారు" అంటూ ఓ యువకుడు పరిగెత్తుకుంటూ వస్తూ అరిచాడు.         అరుణాచలం గజగజా వణికిపోయాడు.         ఆదిలక్ష్మి నవనాడులు స్థంభించిపోయాయి.         "నువ్వయినా ప్రయత్నం చేయ్ తల్లీ, లేదంటే వాడు మనకు దక్కడు" అంటూ అరుణాచలం కూతురి చేతులు పట్టుకొని ప్రాధేయపడ్డాడు.         మేఖల ఒకడుగు ముందుకువేస్తుండగా అభిరామ్ "అమ్మా" అంటూ ఎగిరి తల్లిని ప్రక్కకు లాగాడు.         మెరుపు వేగంతో అతనా పని చేసుండకపోతే అచ్యుత్ అనుచరుడు వేయబోయిన దొంగ దెబ్బకు ఆమె అక్కడే కుప్పలా కూలిపోయేది.         చుట్టు ప్రక్కల వున్నవాళ్ళు కూడా చివరకు ఆ కొట్లాట ఎక్కడికి దారి తీస్తుందోనని బిక్కచచ్చిపోయారు.         అప్పటివరకు వెనుకంజ వేసి మొండిగా పోట్లాడుతున్న అచ్యుత్ అనుచరులు కూడా ఆ పొలికేక విన్నారు.         తమకి అండగా మరికొంతమంది రాబోతున్న వార్త వారిలో తిరిగి ఉత్సాహాన్ని నింపింది.         పరిస్థితి మొత్తాన్ని ఆకళింపు జేసుకున్న మేఖల క్షణం ఆలస్యం చేయకుండా వేగంగా ఆ వ్యూహంలోకి జొరబడి నేర్పుగా వాళ్ళని తప్పించుకుంటూ అభిరామ్ ముందుకెళ్ళి ఆగింది.         అక్కను చూస్తూనే అభిరామ్ షాక్ తిన్నాడు.         తలెత్తి అక్కవేపు చూడలేదు.         తల దించుకుని నేలకేసి చూశాడు.         మేఖల ఇక ఆలస్యం చేయదల్చుకోలేదు.         "తమ్ముడూ నా మీద ఏమాత్రం గౌరవం వున్నా తక్షణం ఈ పోట్లాటమాని ఇక్కడి నుండి నువ్వు నీ ఫ్రెండ్స్ అదృశ్యమైపోవాలి....." శాసిస్తున్నట్లుగా అంది.         అప్పటివరకు చిచ్చరపిడుగులా, చిరుతపులిలా విజ్రుంభించి వీర విహారం చేసిన అభిరామ్ ఇపుడు పిల్లయిపోయాడు. చేష్టలు దక్కి నిల్చుండి పోయాడు. అందుకే అందరూ ఆశ్చర్యపోయారు అభిరామ్ ని చూస్తూ.         "అక్కా....." అని అభిరామ్ చిన్నగా ఏదో చెప్పబోయాడు.         "ఆర్గ్యుమెంట్ వద్దు. వెళతావా లేదా?" మేఖల కంఠంలో ఈసారి ఒకింత కాఠిన్యం తొంగిచూసింది.         అంతే ఆ మరుక్షణం అభిరామ్ రెండు చేతులెత్తి గాల్లో ఊపి క్షణాల్లో అక్కడి నుంచి ప్రక్కకు తప్పుకున్నాడు. అభిరామ్ సంజ్ఞనందుకున్న అతని ఫ్రెండ్స్ కూడా వేగంగా అక్కడి నుండి కదలి అదృశ్యమైపోయారు.         ఆ మరునిమిషంలోనే అరుణాచలం, ఆదిలక్ష్మి మేఖల అక్కడి నుండి తప్పుకున్నారు.         అక్కడున్న అందరూ జరిగిందేమిటో అర్ధంకాక పిచ్చెక్కిపోయారు.         అభిరామ్ అక్క మేఖల అతనికో సెంటిమెంటల్ ఏంకర్ అని అక్కడున్న వారికే కాదు వార్నికన్న తల్లిదండ్రులకే తెలీదు అప్పటి వరకు.         ఉరుములు, మెరుపులు, పిడుగులతో క్షణకాలం క్రితం వరకు దద్దరిల్లిన ఆ ప్రాంతం ఇపుడు స్మశాన వైరాగ్యాన్ని నిశ్శబ్ధాన్ని ఆశ్రయించింది.         అచ్యుత్ పంపిన మనుష్యులు ఆ వీధి మలుపు తిరిగే సరికి ఆ వీధంతా నిర్మానుష్యమైపోయినట్లయింది.         దెబ్బలుతిని క్షతగాత్రులైన అచ్యుత్ అనుచరులు లేచి ఒళ్ళు దులుపు కుంటూ ఆ వేధిలో అపుడు తాము మాత్రమే ఉన్నట్లు గ్రహించి పళ్ళు పటపటా కొరుక్కున్నారు.         కొత్తగా వచ్చిన పదిమంది తమ అనుచరులు మాత్రమే దెబ్బలు తిని ఒంటరిగా ఉండటాన్ని చూసి జరిగింది అర్ధంకాక తికమక పడ్డారు.         ఏం జరిగిందంటూ వాళ్ళు, వీళ్ళను పరామర్శిస్తుండగా అచ్యుత్ నలుగురు అనుచరులతో ఎక్కి వచ్చిన జీప్ సరిగ్గా వారి ముందాగింది.         అచ్యుత్ కూడా కళ్ళెదుట కనిపించిన దృశ్యాన్ని చూసి అయోమయంలో పడిపోయాడు.         జీప్ లోంచి ఎగిరి దూకి-         "ఏమైంది...? వాళ్ళేరి....?" అంటూ గద్దించాడు.         "జస్ట్ ఇపుడే మేం చూస్తుండగానే ఇక్కడి నుంచి తప్పుకున్నారు" అన్నాడో అనుచరుడు ధైర్యం చేసి.         "పిరికి పందలు.....పారిపోయారన్న మాట....."అచ్యుత్ తనలో తాను అనుకుంటున్నట్లుగా అన్నాడు.         "పారిపోలేదు. మన మనుష్యులు మరింత మంది వస్తున్నారన్న భయంతో వాళ్ళు వెళ్ళిపోలేదు" కేతువు రోడ్డు ప్రక్కనున్న గోతిలోంచి లేస్తూ అన్నాడు.         కేతువు స్వరూపాన్ని చూసి అచ్యుత్ షాక్ తిన్నాడు.         మొఖమంతా వాచిపోయి, బట్టలన్నీ చినిగిపోయి, రక్తసిక్తమై ఉన్న కేతువును చూసి ఆవేశంతో వూగిపోయాడు అచ్యుత్.         ముగ్గురు నలుగురు మనుష్యులకైనా తేలిగ్గా సమాధానం చెప్పగల కేతువు ఎందుకలా అయిపోయాడు? మిగతా వాళ్ళ పరిస్థితి కూడా దాదాపు అలాగే వుంది.         అంటే.....అంటే.....వాళ్ళు సామాన్యమైన వాళ్ళు అయుండరు. ఖచ్చితంగా ప్రొఫెషనల్స్ అయి ఉంటారు. ఆలోచనల్నుంచి తేరుకుంటూ "పారిపోలేదా? మనవాళ్ళు వస్తున్నారనే భయంతో వెళ్ళలేదా? మరి....? పోలీసులొస్తున్నారనా?" అచ్యుత్ ఆశ్చర్యపోతూ అడిగాడు.
24,914
    "అయితే నెయిల్ పాలిష్ సెలక్ట్ చేయడంలో నాకు కాస్త హెల్ప్ చేస్తారా?"     ప్రణయ్ తన చెవుల్ని తనే నమ్మలేకపోయాడు.     ఇది కలా నిజమా?     "ఓ...అలాగే....ఓ.కె...దాందేముంది....మహదానందంగా....విత్ ప్లజర్" ఉక్కిరిబిక్కిరి అయిపోతూ అనసాగాడు అతను.     "ఇంకచాలు ఆపండి" అంటూ షాపువాడివైపు తిరిగింది ఆమె.     "టిప్స్ అండ్ టోస్ కావాలమ్మా? లాక్మేనా?" అడిగాడు షాపువాడు ఆమె అడక్కముందే. వాళ్ళ సంభాషణ అంత క్లీన్ గా ఫాలో అవుతున్నాడన్న మాట.     "టిప్స్ అండ్ టోస్" చెప్పింది ఆమె.     షాపువాడు టిప్స్ అండ్ టోస్ లోని షేడ్స్ అన్నీ తెచ్చి వాళ్ళ ముందు పెట్టాడు.     "ఏ షేడ్స్ తీస్కోమంటారు?" ఆమె ప్రణయ్ వంక చూస్తూ అడిగింది.     "ఏ షేడ్ అయినా మీ చేతులకి బాగుంటుంది. మీ చేతులు అందంగా వుంటాయి కదా?" అన్నాడు అతను ఆమె అరచేతులవంక చూస్తూ.     ఆమె నవ్వింది మనోహరంగా.     "మీరు చాలా పొగిడేస్తున్నారు...."     "పొగడ్త కాదు! నిజం. ఏదీ మీ అరచేతులు యిలా బోర్లా త్రిప్పి చూపించండి."     ఆమె అలానే చేసింది. ఆ చేతులు చాలా అందంగా వున్నాయి....వేళ్ళు పొడవుగా, గోళ్ళు చక్కగా ఒక షేప్ లో కత్తిరించబడి వున్నాయి.     "టిప్స్ అండ్ టోస్ వాళ్ళ అడ్వర్ టైజ్ మెంట్ కి మీ చేతులు పనికి వస్తాయి. అన్నాడు ఆ చేతులవంక విప్పారే  కళ్ళతో చూస్తూ. ఆ సమయంలో అతనికి ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకోవాలనిపించింది.     అతను అన్న మాటలకు ఆమె సిగ్గుపడి చేతులు వెనక్కి తీసేసుకుంది.     ఇద్దరూ కలిసి నాలుగు రకాల షేడ్స్ సెలక్ట్ చేశారు.     ఆమె హాండ్ బ్యాగ్ లో గోళ్ళరంగు సీసాలు వేసేసుకుని షాపువాడికి డబ్బులు పే చేసేసింది.     ఇద్దరూ షాపులోంచి బయటికి వచ్చేశారు.     "మీరు ఇంటికేనా?" అడిగాడు ప్రణయ్.     ఆమె అవునన్నట్టు తలవూపి అంది.     "నేను మా ఫ్రెండ్ ఇంటినుండి ఇక్కడిదాకా నడుచుకుని వచ్చాను. ఒక్క ఆటోకూడా కనిపించలేదు. మీరు లిఫ్ట్ ఇస్తారా?"     అతనికి అప్పటికే ఆఫీసుకు చాలా ఆలస్యం అయిపోయింది. అతను పెట్టిన లేట్ పర్మిషన్ కూడా అయిపోయింది....రెండు క్షణాలు ఆలోచించాడు.     "మీకు ఇబ్బంది అయితే వద్దులెండి" మళ్ళీ ఆమే అంది.     "ఇబ్బంది కాదు....ఆఫీసుకు వెళ్ళాలి. ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది."     "సరే....అలాగైతే నేను మరికాస్త దూరం ముందుకు నడుచుకుంటూ వెళ్తానులెండి...ఏదో ఒక ఆటో దొరక్కపోదు."     "ఓ పనిచేద్దాం...మీరు నా కారు ఎక్కండి. ఎలాగూ మా ఆఫీసుకు ఈ దారివెంటే వెళ్ళాలి కాబట్టి సగం దూరం వెళ్ళాక మిమ్మల్ని ఏదో ఒక ఆటో ఎక్కించి పంపిస్తాను."     ఆమె సరేనన్నట్టు తల వూపింది.     ప్రణయ్ కారు దొర తెరిచి తాను డ్రైవింగ్ సీట్లో కూర్చుని అటువైపు డోర్ తెరిచాడు.     ఆమె కారు ఎక్కి కూర్చుని డోర్ వేసుకుంది.     డోర్ అద్దం ఆమె దించబోతే "ఉండండి....నేను దించుతా" అని గబుక్కున ప్రక్కకి వంగి హ్యాండిల్ త్రిప్పుతూ అద్దం దింపసాగాడు. అలా హ్యాండిర్ త్రిప్పుతున్నప్పుడు ఒకసారి ఓ క్షణంపాటు ఆమె ఎత్తైన గుండెలు అతని మోచేతికి మెత్తగా తగిలాయి.     అతని గుండె ఝల్లుమంది. శరీరంలోంచి కరెంట్ ప్రాకినట్టయింది.     అద్దం దించిన తర్వాత ఓసారి దొంగగా ప్రక్కకి చూశాడు. ఆమె మొహంలో ఏ ఫీలింగ్ లేదు. కారు విండోలోంచి బయటికి ఎటో చూస్తుంది.     'హమ్మయ్య...చికాకు పడ్తుందేమో అనుకున్నా' అనుకున్నాడు.     ప్రణయ్ కారు స్టార్ట్ చేశాడు.     కారు రివ్వున ముందుకు దూకింది.     ఆమె ప్రణయ్ పేరు, ఏ ఆఫీసులో పని చేస్తున్నాడు, కుటుంబసభ్యుల వివరాలు మొదలైన విషయాలు అడిగి తెలుసుకుంది.     ప్రణయ్ ఆమె వివరాలు కనుక్కోవాలని నోరు తెరిచేలోగా ఆమె తనని ఉక్కిరిబిక్కిరి అయ్యే ప్రశ్న వేసింది.     "ఇందాక షాపులో మీరు హత్య అని ఏదో అంటున్నారు? ఏమిటది?"     ప్రణయ్ కి కొన్ని క్షణాలు బుర్ర పనిచేయలేదు.     "హత్యా? ఏమిటది??" తేరుకుని అమాయకంగా ప్రశ్నించాడు.     "నటించకండి....మీరు ఫోన్ లో ఏదో హత్య గురించి ఎవరినో వార్న్ చేయడం నేను విన్నాను. అదేంటో చెప్పరా?"     "అయితే నేను ఫోన్ లో మాట్లాడిన విషయం వినేసిందన్నమాట!" అనుకున్నాడు.     సందేహిస్తూ ఆమెవంక చూశాడు.     "చెప్పడం ఇష్టం లేకపోతే వద్దులెండి" అందామె.     "అలా...అలా అనికాదు..." నసిగాడు ప్రణయ్.     "రహస్యమా?" అడిగింది.     ప్రణయ్ అవునన్నట్టు తల వూపాడు.     "నేను మీకు ఫ్రెండ్ నే కదా? నాకు చెప్తే ఏం కాదులెండి....మీరు చెప్పే ఆ రహస్యాన్ని ఎవరికీ చెప్పను. నా గుండెల్లోనే దాచుకుంటాను. నమ్మకం లేదా?"     చటుక్కున స్టీరింగ్ మీద ఉన్న ప్రణయ్ ఎడమ చేతిని తన కుడి చేతిలోకి తీసుకుని తన ఎడమ అరచేయి అతని ఎడమ అరచేతిలో పెట్టి "ప్రామిస్....ఎవరికీ చెప్పను" అంది.     అంతే! ప్రణయ్ ప్లాట్ అయిపోయాడు. అతని ఊపిరి బరువెక్కింది. మొహం ఎర్రగా అయిపోయింది. సీట్లో యిబ్బందిగా కదిలాడు.     ఆమె అతని చేతిని వదిలేసింది.     ప్రణయ్ నిమిషంపాటు రిలాక్స్ అయి తర్వాత గొంతు సవరించుకున్నాడు ఆమెకి చెప్పడానికి.                                             *    *    *    *     ప్రణయ్ కారు ఆపాడు.     ఓసారి చుట్టుప్రక్కల చూశాడు ఎవరయినా కనిపిస్తారేమోనని.     కాస్త దూరంలో టీనేజ్ అబ్బాయిలు ముగ్గురు నిలబడి మాట్లాడుకుంటున్నారు.     కారు ఆగడంతో వాళ్ళ తలలు ఇటువైపుకు తిరిగాయి.     ప్రణయ్ వాళ్ళని రమ్మని అన్నట్లు సైగచేశాడు. ఆ ముగ్గురిలో ఒక అబ్బాయి కారు దగ్గరికి వచ్చాడు.     ప్రణయ్ తన జేబులోంచి ఒక కాగితం స్లిప్ తీసి ఆ అబ్బాయి చేతికి యిచ్చాడు.     "ఆ అడ్రస్సులు ఎక్కడో చెప్పగలరా?"     ఆ అడ్రసు చూస్తూనే ఆ అబ్బాయి ఆ అబ్బాయి కనుబొమ్మలు ముడుచుకొన్నాయి. అతను తన చేతిలోని స్లిప్ ని ప్రణయ్ కు యిచ్చేస్తూ చెప్పాడు.     "మీరు కాస్త ముందుకు వెళ్ళి ఎడమప్రక్కకి తిరిగి మూడు ఇళ్ళు దాటిన తర్వాత ఒక తెల్ల బిల్డింగ్ వస్తుంది. దానికి ఎదురుగా రోడ్డుకి అటు ప్రక్కన ఒక బ్లూ కలర్ మేడ వుంటుంది. ఆ యిల్లే...."     "థాంక్స్" అన్నాడు ప్రణయ్.     "వెల్ కం"     ప్రణయ్ జేబులో స్లిప్ పెట్టేసుకుని కారు ముందుకు పోనిచ్చాడు.     అప్పటికే ఆ అబ్బాయి మిగతా ఇద్దర్నీ చేరుకున్నాడు. కారు రియర్ వ్యూ మిర్రర్ లోంచి వాళ్ళు ముగ్గురూ విరగబడి నవ్వుకోవడం చూశాడు ప్రణయ్.     "వాళ్ళెందుకు అలా నవ్వుతున్నారు? నన్ను ఏడిపించడానికి తప్పుడు డైరెక్షన్ యివ్వలేదుకదా?" అనుకున్నాడు.     అయినా కారుని లెఫ్టుకి తిప్పి ఆ అబ్బాయి చెప్పిన బ్లూ కలర్ మెడ ముందు ఆపాడు.
24,915
    "పాపం బుద్ధిమంతుడు" అన్నది తల్లి.     "ఈయన లేకపోతే చాలా యిబ్బంది పడివుందుము కదా" అన్నది వసంతబాల తల్లి ఆ మాట అనగానే.     ఆమె కూతురివైపు చూసింది. అనుకోని విధంగా ఆమెమీద ఎనలేని జాలి కలిగింది. ఇది వట్టి పిచ్చితల్లి. అమాయకురాలు. ఈ లోకం ఆమెని సులభంగా మోసం చేసివేస్తుందేమోనన్న భయం కలిగింది.     "వసంతా!" అంది గాద్గాదికంగా.     "ఏమిటమ్మా?" అంది కూతురు ఆ కంఠధ్వనికి చకితురాలయి.     "ఏమీలేదు. ఏమీలేదు" అని తప్పించుకోజూసింది.     "కాదమ్మా. ఏదో వుంది. చెప్పాల్సిందే" అని వసంతబాల బలవంతం చేసింది.     "ఏమీ లేదమ్మా! నువ్వింత అమాయకురాలవు. నేను లేకపోతే..."     కూతురు ఒక్కసారిగా నిలువునా వొణికి "అదేమిటమ్మా! అర్థాంతరంగా స్టేషన్ లో ఇలాంటి మాటలు..."          "ఏమీ లేదమ్మా! ఏదో ఆవేశంలాంటిది కలిగింది అంతే" అని తల్లి చెంగుతో కళ్ళు తుడుచుకుంది.     మూడు నిముషాలు గడిచాక రామం వచ్చాడు. "రండి కనెక్షన్ ట్రైన్ లైన్ మీదికి వస్తోంది. ఇంకో పావుగంటలో బయల్దేరుతుంది" అన్నాడు.     అంతా కలిసి నడవసాగారు.     కాసేపయినాక వాళ్లు ఎక్కిన డీజిల్ బండి క్రమంగా వెంకటకృష్ణరాయపురం, సర్పవరం దాటి కాకినాడ చేరుకుంది.     వాళ్లు ఎంత వారిస్తున్నా వినకుండా అతను గాంధీనగర్ దాకా వాళ్ళతో వెళ్లి ఇంటిదగ్గర దిగబెట్టాడు.     "చాలా థాంక్స్ అండీ. లోపలకు వచ్చి వెళ్ళండి" అంది వసంతబాల.     "అబ్బ! ఇప్పుడు రాలేనండీ. వీలు చూసుకుని సాయంత్రమో రేపో వస్తాను."     "నీ మేలు మరిచిపోలేము నాయనా. తప్పకుండా వస్తూ వుండు" అంది తల్లి.     "అలాగేనండీ" రామం రిక్షా ఎక్కి ఇంటిదారి పట్టాడు.                                                                            12     "ఎవరూ?" అన్నారు విశ్వనాథంగారు అడుగుల చప్పుడు విని.     "నేను నాన్నగారూ!"     విశ్వనాథంగారు ఈజీచైర్ లో కొంచెం ముందుకువంగి "నువ్వా రామం? ట్రైన్ ఆలస్యంగా వచ్చిందా ఏం?" అన్నారు.     "అవునండీ."     "రెండు మూడు రోజుల్నుంచీ వస్తావని ఎదురు చూస్తున్నాంరా. వెళ్లిన పని సక్సెస్ ఫుల్ గా అయిందా?"     "అయిందండీ. అక్కడ మంచి ఆర్డర్లు సంపాదించాను. ఈ ఏడాది బిజినెస్ ఇంకా ఇంప్రూవ్ అవుతుందండి. మరో పదివేలన్నా పెరుగుతుందని అంచనా వేస్తున్నాను. మా సోప్సుకి మంచి డిమాండ్ వస్తోంది."     ఆయనకు కొడుకుమీద ఎనలేని జాలి, వాత్సల్యం కలిగాయి. అతను ప్రయాణపు బడలికతో మరీ డస్సిపోయి వున్నాడు. "మధ్యాహ్నం అన్నం తిన్నావా?" అని అడిగారు ఆదరంగా.     "లేదండీ. టిఫిన్ తీసుకున్నాను."     "అందుకనే బాగా బలహీనంగా కనిపిస్తున్నావు. పోయి స్నానంచేసి ఏమైనా తీసుకో. వెళ్ళు."     రామం తన గదిలోకి వెళ్ళి బద్ధకంగా కుర్చీలో కూర్చుని హమ్మయ్య అనుకుంటూ వెనక్కి వాలాడు. మధ్యాహ్నం మూడుదాటింది. మాఘమాసం కావటంవలన ఎండలు యిప్పుడిప్పుడే ముదురుతున్నాయి. ఈ కాలంలో కాకినాడలో రాత్రిళ్ళు చలీ, పగలు ఎండ జోరుగా వుంటాయి.     అడుగుల చప్పుడైతే కళ్లు విప్పి చూశాడు. ఎదురుగా ఆశ నిలబడి తిలకిస్తోంది అతడ్ని.     "మంచి ఎండలో వచ్చావన్నయ్యా."     "అవును ఆశా... నువ్వలా వున్నావేం?"     ఆశ ఇంతకు ఓ గంట ముందువరకూ ఏడ్చివుంది. తర్వాత పుట్టంతా మునిగిపోయినట్లు తల్లి కేకవేస్తే లేచి క్రిందకు వెళ్లింది.     "ఏమి లేదన్నయ్యా! ప్రొద్దుటినుంచీ బాగా తలనొప్పిగా వుంది. అందుకని..."     ఓ క్షణం ఆగి ఆమె "అన్నయ్యా! మెడ్రాస్ నుంచి నాకేం తెచ్చావు?" అనడిగింది చిన్నపిల్లలా.     "వంద రూపాయలుపెట్టి మంచి చీరె తీసుకువచ్చాను ఆశా! అది కట్టుకుని నువ్వలా ముందు నిల్చున్నావంటే ఆ సన్యాసి రాఘవుడు ఐస్ అయిపోవాలి. అన్నట్టు అతనేమైనా ఉత్తరం రాశాడా?"     అతను ఆశ పెనిమిటిని సన్నాసి అనీ, బడుద్ధాయి అనీ సంబోధిస్తూ వుంటాడు. అతనలా అనటం వాళ్ళకూ అలవాటయిపోయింది. తన చెల్లెలికి చాలా అన్యాయం జరిగిపోయిందనీ, ఆమెకే విధంగానూ తగని వాజమ్మ దొరికాడనీ అతననుక్షణం బాధపడుతుంటాడు.     "రాశాడన్నయ్యా!"     "ఏమంటాడు? ఎప్పుడొస్తాట్ట? లేకపోతే మమ్మలెవర్నయినా తీసుకొచ్చి దిగబెట్టమంటాడా?"     ఆశ అసలు విషయం అతనికి చెప్పటం ఇష్టంలేక "వీలు చూసుకుని వస్తానన్నారన్నయ్యా" అంది.     "నీకోసం తెచ్చిన చీర తీసియిస్తాను వుండు ఆశా" అంటూ రామం కుర్చీలోంచి లేవబోతున్నాడు.     "తొందరేముందిలే, అన్నయ్యా! బాగా అలిసిపోయి వున్నావు. స్నానం చేయటానికి రమ్మంటూంది అమ్మ. వేడినీళ్ళు పెట్టింది రా మరి" అంటూ ఆమె అతన్ని బలవంతంగా లేవతీసి క్రిందకి తీసుకువెళ్లింది.
24,916
           ఆ మధ్యాహ్నం అతనూ, మోహన్, అతని బావగారూ, చిన్న అన్నగారూ చేరి సావిట్లో పెకాడుతున్నారు. ఇంతలో లోపలనుంచి ఆడవాళ్ళు "పాము పాము" అని అరిచారు. మొగవాళ్ళంతా హడావుడిగా లోపలకు పరిగెత్తారు. ఆదుర్దాలో, ఉబలాటంలో అది కొత్తచోటు అని మరిచి శివనాథరావు కూడా వాళ్లవెంట వంటింటి పెరట్లోకి పరిగెత్తాడు. స్పష్టంగా కనిపించింది గోధుమ వన్నెతరచు. చాలా పొడవుగా, పొగరుగా వుంది. వాళ్ళంతా అలా చూస్తుండగానే యిటుకలమీద నుంచి మహావేగంతో జరజరమని ప్రాకుకుంటూ ప్రక్క యింటికి సరిహద్దుగా వున్న సగం పడిపోయిన గోడలో ఓ కన్నంవుంటే అందులో దూరింది. ఆడవాళ్ళు పిల్లల్ని గట్టిగాపట్టి వుంచుతున్నారు ముందుకు పోనీయకుండా వాళ్ళు వారిస్తున్నా వినకుండా మోహన్ బావగారు ప్రక్కనే వున్న బావి గట్టుమీద కూర్చుని ఎక్కడైనా కనిపిస్తుందేమోనని చూపులతో గాలిస్తున్నాడు. మోహన్ బాగా దూరంగా నిలబడి "లోపలికి పొండి" అని పిల్లల్ని ఆడవాళ్ళని గదమాయిస్తున్నాడు. శివనాథరావుకు చాలా ఉత్సాహంగా వుంది. పాములవాడి బుట్టలోకాకుండా స్వేచ్చగా తిరుగుతూన్న ఓ పామును యిదే మొదటిసారి అతను చూడటం. ముందుకు ఓ అడుగు వేయబోతుంటే మోహన్ కాలరు పట్టి బలంగా గుంజాడు.         ఎవరో పాములావాడిని పిలుచుకురావటానికి పోయారు. ఇరుగుపొరుగు వాళ్ళు చాలామంది గుమికూడారు. పాములు రావటం అలవాటే అయినా ఎప్పటికప్పుడు ఈ ఉత్సాహం వాళ్ళకు వుంటూనే వుంది. అది యింకా అక్కడే వుండదనీ, దొంగదారిగుండా వెళ్ళిపోయి వుంటుందనీ ఒకరిద్దరు అన్నారు. శివనాథరావు మెల్లిగా జరిగి మోహన్ బావగారి దగ్గరకు చేరాడు.         పాములవాడు వచ్చాడు, కూడా ఓ ఆడదికూడా వుంది. ఎవరో గునపం అందించారు. పాములాడు గోడ త్రవ్వటం మొదలుపెట్టాడు. శివనాథరావు ఏదో క్షణంలో అది రివ్వున బయటకు ఎగిరి పడుతుందని చూడసాగాడు. పాములవాడు ఓ నిముషం త్రవ్వటం ఆపి పరిశీలనగా చూసి "లోపల వుంది" అని అరిచాడు. చాలాభాగం త్రవ్వడం అయిపోయి, కన్నం తగ్గిపోతోంది. అయినా సర్పం లో లోపలకు యింకా ముడుచుకుపోతోంది. అది బయటకు ఎంత భయంకరంగా...         అతని ఆలోచన పూర్తిగాకముందే సర్రున నాగు బయటికొచ్చేసింది. శివనాథరావు ఆవేశంతో లేచి నిలుచున్నాడు. అందరూ భయంతో రెండడుగులు వెనక్కువేశారు. పాములవాడు తొణకలేదు, బెణకలేదు. ఒడుపుకోసం కాబోలు ఆలోచిస్తూ ఓ క్షణం నిలబడ్డాడు. ఈలోగా అది యిటుకలరాశి మీదనుంచి జారిపోతోంది. మోహన్ పట్టుకొమ్మని గట్టిగా అరిచాడు. కూడా వచ్చిన ఆడది ముందుకు ఉరికి దాని తోక పట్టుకుని ఇవతలకు గిరాటు వేసింది. పడగవిప్పి బుస కొట్టందేం అనుకుంటున్నాడు శివనాథరావు పాము నేలమీదపడి చుట్టూ మనుషులను చూసి బెదిరి, దారితోచక అక్కడున్న తులసి చెట్టుకు చుట్టుకుంది. పాములవాడు ఎటూ పోనీయకుండా దాన్ని పట్టుకుని లాగాడు. క్రిందపడి కదల్లేక కదిలింది. మోహన్ 'చంపెయ్యి' అని అరిచాడు. పాములవాడు కర్రఎత్తి మెదక్రింద కొంచెం యిట్లా అన్నాడు నేర్పుగా కదల్లేక కొట్టుమిట్టాడుతోంది. తరువాత మెడమీద జాగ్రత్తగా కర్ర ఆనించి చేత్తో పామును పట్టుకున్నాడు. దాని నోరుతెరచి కోరలు చూపించాడు. వాడు పాములవాడే అయినా-ఆ వృత్తి చేయటం లేదుగావును క్రిందపడేసి కర్రతోబాధి చంపేశాడు.         ఇంటికి కొంచెం అవతలగా వీధిలో చితిని పేర్చారు. నాగుపాముని అందులో పడేసి నిప్పంటించారు. పిల్లలు అందులో కాణీలు పడేశారు. దాదాపు గంటసేపు కాలింది. పాము బూడిద అయిపోయింది. పిల్లలు కాలిన కాణీలు తెచ్చి దాచుకున్నారు.                                   *    *    *         కాలం మందంగా పరిగెడుతోంది. రాత్రి భోజనానికి లోపలికి పోయే సమయంలో దీపం వెలుగులో ఓ దృశ్యం చూసి చకితుడయ్యాడు శివనాథరావు.         ఆ వెలుతురు చాలు!         అబ్బ! అంత అందం! మోహన్ వాళ్ళ కుటుంబంలో పిల్ల అంటే నమ్మశక్యం గాలేదు. చిత్రకారుడు వెదుక్కునే విశాల విచిత్రనేత్రాలు. ఎండముఖం ఎరుగని దానిలా ఆమె శరీరపు వన్నెచిన్నెలు-పరవశం కలిగించే దివ్యకాంతులు. గ్రామీణ వాతావరణంలో అమరిన సౌష్టవం ఆమె ప్రత్యేకత. అందం ఆనందాన్ని రగిల్చింది. అతని ఊహలో జ్యోత్స్నాహిసారిక అతి వయ్యారంగా నడుస్తోంది.         ఆ వెలుతురు చాలదూ?         అతన్ని చూసి ఆమె లేవలేదు. చాపమీద పడుకుని వుంది. చూస్తోంది కానీ అతన్నికాదు. వచ్చినరోజు దూరంనుంచి చూశాడు. పడుకునే వుంది కానీ అప్పటికి ఈ సౌందర్యం బోధపడలా ఆమె పెదవికదపగా అతను చూడలా.         అతను వ్యాకులపాటుతో స్నేహితుడివెనుక లోనికి వెళ్ళిపోయాడు.             రాత్రి పదకొండు దాటి వుంటుంది. మిగతావాళ్ళు నిద్రపోతున్నారు. శివనాథరావు అటూఇటూ కదుల్తున్నాడు. అతనిలో హృదయం దద్దరిల్లింది. ఓ గావుకేక, ఓ ఆక్రందనం పెనుగాలి రయ్యిమని వీచినట్లయింది. ప్రకృతినుంచి ప్రభవించిన ఆహ్వానంలా పోకడలుపోయింది. అతనిలో ఓ స్త్రీ జాగా చేసుకుని విలపిస్తోంది. హఠాత్తుగా సరోజిని రూపం కంటిముందు సాక్షాత్కరించింది. రాత్రి పదకొండుగంటలకు ఏంచేస్తూ వుంటుందో సరోజిని? వద్దు ఆమెను గురించి యిప్పుడు ఆలోచించవద్దు.. కానీ...         మళ్ళీ మూలుగు, ఆర్తనాదం..         శ్మశానవాటికలో పిశాచం గాఢతిమిరంలో నవ్వినట్లు శరీరంలోని అణువు లన్నీ ఒక్కపెట్టున ఏడిచినాయి భయం చీకటి ముసుగు కప్పుకున్న హృదయాంత రాళంనుంచి ఉబికి వస్తోన్న కంపన అధికమై, మరింత ఆహ్దికమై మహావేగంతో విజ్రుంభించి, సర్వం తనే అయి యుగాంతంలో దిగంతాలన్నీ తృటిలో నుసి అయినట్లు హఠాత్తుగా సమసిపోగా ప్రకృతికాంత చేసిన వికటాట్టహాసంగా జంకించి జంకించి విడచిపెట్టింది.         చీమ చిటుక్కుమన్నా వినిపించే నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దాన్ని బ్రద్దలుచేస్తూ హాహాకారాలు లేచి చూద్దామనుకున్నాడు కానీ ఏదో అదృశ్యపాశం మంచానికి కట్టి పడవేసింది. మోహన్ ని గొంతెత్తి పిలవబోయాడు. స్వాధీనంకాలా ఒక దొర్లు దొర్లి వుంటాడు. పెద్దగా వేశాననుకున్న కేక, చెట్టు మొక్కనుంచి పువ్వు రాలి పడినంత స్వల్పంగా వినిపించింది.         భుజంమీద ఒక మెత్తని చెయ్యిపడింది "ఝడుసుకున్నావా?" అంది మోహన్ గొంతు.         "ఊ"         మోహన్ వెళ్ళి దీపం పెద్దదిచేశాడు. ఇంత జరిగినా అతని బావగారు నిద్ర లేవలేదు. లోపలినుంచి ఓ స్త్రీ గొంతు ఎవరినో సముదాయిస్తున్నట్లుగా  వినిపిస్తోంది.         మోహన్ దగ్గరకు వచ్చాడు "బయటకు వస్తావా?" అన్నాడు. శివనాథరావు మెల్లగా లేచి నిలబడ్డాడు. ఇద్దరూ బయటకు పోయి అరుగుమీద కూర్చున్నారు.         "ఏం చేశాను?" అన్నాడు శివనాథరావు తడారిపోయిన గొంతుకతో.         మోహన్ జవాబు చెప్పకుండా సిగరెట్ వెలిగించుకున్నాడు. "మా చెల్లెలు" అన్నాడు కొంచెం ఆగి.         "జబ్బా ఏమయినా?"         "విను చెబుతాను" మోహన్ ముఖం ప్రక్కకి త్రిప్పుకుని చెప్పసాగాడు. "భవాని దాని పేరు. మా అందరిలోకీ అదే చాలా అందమైనది. మా యింట్లో అందరికీ  చెప్పలేని గారాబం అదంటే. ఈ పల్లెటూరిలో కూడా బోలెడు డబ్బు ఖర్చుపెట్టి సంగీతం మేష్టారిని పిలిపించి సంగీతం చెప్పించాం ఆ రోజుల్లో అది గొంతువిప్పితే వంద కోయిలలు కూసేవి. చివరకు మానాన్న చనిపోయేటప్పుడు కూడా మమ్మల్ని చేరబిలిచి "భవానిని జాగ్రత్తగా చూసుకోండిరా దానిని కొంచెమైనా నొప్పివ్వకండి. అది చాలా సుకుమారి" అంటూ ఎంతో ఆవేదన పడ్డారు. అప్పుడు డానికి పదకొండేళ్ళు. మేమంతా ప్రాణానికి ప్రాణంలా చూసుకున్నాం. ఓ ఏడాది గడిచాక ఏం జరిగిందంటే.....             మోహన్ కంఠం అపశృతులతో ఒణుకుతుంది.         అది వేసవికాలం గాలికోసం మేమంతా ఆరుబయటే పడుకున్నాం. అది యిక్కడే ఈ అరుగుమీదే పడుకుంది. అర్దరాత్రి దాటివుంటుంది. ఒక్క గావు కేక వినబడి మేమంతా త్రుళ్ళిపడి లేచాం. చీకటి నేను ప్రక్కనే పెట్టుకున్న టార్చి వెలిగించి చూశాను. భవాని నేలమీద పడి కాళ్ళూ, చేతులూ కొట్టుకుంటూ వణికిపోతోంది. అసలా రూపంవేరు.         అంతే! అప్పటినుంచీ బాహ్యస్మృతి కోల్పోయింది. ఎంతోమంది డాక్టర్లకి చూపించాం. వేలకు వేలు ఖర్చుపెట్టాం. అనేక ఊర్లు తీసుకుపోయాం. ఎవరూ నయం చేయలేకపోయారు. మనతో మాట్లాడదు. చెబితే అర్ధం చేసుకోదు. వేరే ప్రపంచంలో నివశిస్తుంది. దాని అందం దాన్ని కాపాడలేదు. రాత్రిళ్ళు అప్పుడప్పుడూ అరుస్తుంది, ఆర్తనాదాలు చేస్తుంది. నరకయాతన పడుతుంది.
24,917
    ఇంతలో బెల్ అవటంతో కొద్దిక్షణాల వ్యవధిలో పిల్లలందరూ వారివారి సీట్లలో కూర్చున్నారు వచ్చి.     డ్రాయింగ్ మాష్టారు అనేది పాఠం చెప్పనవసరంలేదు. బ్లాక్ బోర్డు మీద బొమ్మవేసి ఎలా వెయ్యాలో మరో బొమ్మగీసి చూపించి వేసి చూపించమని చెప్పటమే! అలాగేచేసి తనచేతిలోవున్న నాటిక పుస్తకం చదువుకోసాగారు.        కావేరి తను సినీతార కాబోతున్న అనుభూతినుంచి తేరుకోక ఆ ఊహాలోకంలో విహరించసాగింది. బ్లాక్ బోర్డుమీద బొమ్మ తన డ్రాయింగ్ బుక్ లో వేసుకోవాలన్నదే లేకపోయింది తనదంటూ వున్న ఊహా లోకంలోకి వెళ్ళిపోయింది.     అదిచూసిన సుబ్బులు నవ్వుకోసాగింది. దీనికి నిలువెల్లా సినిమాతార పిచ్చిపట్టింది. కూడూ నిద్రామాని కూడా పగలూ రేత్రి కూడా ఇలాగే ఆలోచించుతూ వుంటుంది కాబోలు! యిలాంటివాళ్ళు ఆ సినీ ప్రపంచంలో ఎన్నివేలమంది వున్నారో?....దీనికి సినీతార అయ్యే యోగంవుంటే ఈ మారుమూల పల్లెటూరిలో ఎందుకు పుడుతుంది? గొప్ప కళాకారుడి యింత పుట్టేది! అన్ని కళలూ నేర్చుకునేటట్లుగా పెద్ద పట్నంలో పుట్టేది. దీనికి పిచ్చిగానీ! ....అని ఎంతో తేలికగా అనుకుంది. కావేరీని చూసి నవ్వుకునేది.     ఆ సాయంత్రం హైస్కూలునుంచి వస్తూ కూడా దారిలో ఇద్దరూ మాట్లాడుకోలేదు. సుబ్బులు తనకు పలుకరించకుండా వుంటే చాలుననుకుంటోంది కావేరి! తన ఊహాగానాలకి విజ్ఞం కలిగించుతుందేమోనన్న భయం కలిగి మౌనంగా తలవంచుకుని సుబ్బులుకి ఎడంగా నడుస్తున్నది.     "అటూ చూడు కావేరీ!" నడుస్తున్న సుబ్బులు ఆగి కావేరి దగ్గిరకు వచ్చిన తరువాత చెయ్యిజాపి వేలితో చూపించింది.     అటూ చూసిన కావేరికి సైకిల్ కి స్టాండువేసి వున్నది! ఎవరూ కనిపించలేదు!...ఏం విచిత్రం చూసిందని తనకి చెప్పటం?     "ఏముందే అక్కడ? వట్టి సైకిలే కదా?" విసుక్కున్నది.     "నీకు కనిపించింది ఆ సైకిల్ ఒక్కటేనా? చెట్టు మొదలులో ముడుచుకుని పడుకున్న ఆ వ్యక్తి ఎవరో గుర్తు పట్టావా?"     "ఉహుఁ...ముడుచుకుని పడుకున్నాడు కదే? ఎలా గుర్తుపట్టేది? నీకేమయినా తెలిసిందా చెప్పు"     "నేను చెప్పనుగానీ! నువ్వు కొంచెం దూరంగా వుండి ఈ మట్టిగెడ్డతో కొట్టు! అతనే లేస్తాడు!" అని మట్టిగెడ్డ తీసి యిచ్చింది.     "అమ్మో! నాకు భయం! ఏమయినా అనుకోగలరు!"     "ఇంత పిరికిదానివి! రేపు మద్రాసువెళ్ళి సినిమాహీరోయిన్ వి ఎలా కాగలవు? పెద్ద పెద్ద హీరోలతో ఎలా యాక్ట్ చేయగలవు? యిప్పటి నుంచే ధైర్యం తెచ్చుకోవాలి! ధైర్యంగా వుండాలి! వుండాలీ అంటే ఇలాంటివన్నీ చెయ్యాలి! తప్పదు! ఉఁ...రాయితో కొట్టు!"     సుబ్బులు అంతగా చెప్పుతుంటే చేయకపోతే "నువ్వేం హీరోయిన్ వి" అని హేళన చేస్తుందని భయపడి కొద్ది దూరంలో నిలబడిరాయితో వీపుకి తగిలేలా కొట్టి గట్టిగా కళ్ళుమూసుకున్నది.     మట్టిరాయి అయినా దెబ్బబాగానే తగలటంతో చెట్లు నీడలో పడుకుని వున్న వినాయకరావు త్రుళ్ళిపడి లేచి నిలబడి చుట్టూ చూసేసరికి కళ్ళు మూసుకున్న కావేరి, నవ్వుతూ నిలబడివున్న సుబ్బులు కనిపించారు.     "ఏయ్ కావేరీ! ఏమిటిలా కొట్టావు?..." అనడిగాడు.     తన బావ కంఠం వినిపించగానే కళ్ళమీద వున్న చేతులు తీసేసి ఒక్క పరుగులో దగ్గిరకు వచ్చి అంది.     "నువ్వనుకోలేదు బావా!"     "నీ కోసమే యిక్కడ కాసుకుని కూర్చున్నాను. మరలా నీకు కడుపులో నెప్పి వస్తుంది! తిరిగి యింటికి వచ్చేస్తావు. నడవలేవని సైకిల్ మీద ఎక్కించుకుని తీసుకుని వెళ్ళవచ్చునని!...అన్నట్టు నీకు బస్తీ నుంచి ఏం తెచ్చానో చెప్పగలవా?"     "సినిమా పత్రికలు!"     "అబ్బబ్బా! నీకెప్పుడూ సినిమాగోలే! యింకొకటి లేదు!" విసుక్కున్నాడు వినాయకం సైకిల్ కి వేలాడ గట్టిన మూటని తీస్తూ! బావకి కోపం వచ్చింది! అనుకుని చిన్న బుచ్చుకుంది కావేరి!     "పోనీ నువ్వు తెచ్చిన వేమిటో చూపించుబావా!" అంది నెమ్మదిగా. చెప్పులు తీసి కావేరీ పాదాలదగ్గిరవుంచి కాలు పట్టుకుని తనే తొడిగాడు. బాలన్సు కుదరక కెవ్వుమంటూ సుబ్బులుని పట్టుకున్నది. ఆ తరువతః సరిగ్గా నిలబడి యింకొక చెప్పుకూడా వేసుకుని తన రెండు పాదాలను అటుయిటు చూసుకుంటూ.     "ఎంత బాగున్నాయో! అమ్మో! మెత్తగా కూడా వున్నాయి...పాదాలకి మట్టి అవదు! రాళ్ళు ముళ్ళూ గుచ్చుకోవు!" అని సంబరపడి పోయి అటుయిటు నడిచి చూసింది. తప్పట్లు కొట్టింది. వినాయకరావు కావేరీ కాలు పట్టుకుని చెప్పు  తొడుగుతుంటే సుబ్బులుకి జెలసీలాంటిది మనసులో ప్రవేశించింది. అసూయతో పెదాలు కొరుక్కున్నది. బస్తీ నుంచి చెప్పులు తెచ్చి దారిలో కాసుకుని కూర్చుని చెప్పులు తొడిగాడంటే వీళ్ళిద్దరి ప్రేమా అంతా తక్కువది కాదు! చాలా గట్టిదే! కాని తను వినాయకరావుని చేసుకోవాలను కోవటం వట్టి భ్రమ క్రిందదే లెక్క! ఎంతయినా వాళ్ళిద్దరూ మేనత్తా, మేనమామల బిడ్డలు! కావేరీని కాదని తనను ఎలా చేసుకుంటాడు? తనతండ్రి కిరాయికి బండి తోలుకుని వున్న ఎకరం పొలంలోని వంటతో గుట్టుగా సంసారం లాక్కువస్తున్నాడు."బండి వీరయ్య" అన్ని తేలికయిన ముద్ర పడిపోయింది. ఎర్రని ఏగానీ కట్నంగా యివ్వలేని తమ పేదరికం, ఆస్థి గల వినాయకాన్ని చేపట్టగలిగే అదృష్టం తనకి లేదు! తను ఊరికే ఆశలు పెంచుకోవటం వరకే గాని! తనతల్లి సీతమ్మ వున్నదంటే నలుగురి ఇళ్ళకి వెళ్ళటం, వారికి పనుల్లో సహాయపడటం తప్ప ఏ సమయానికి ఎలా లౌకికం ప్రదర్శించాలో తెలియని పాతకాలపు మనిషి. యింకా తనతండ్రే ఎంతో మెరుగు! నలుగురితోనూ మాట్లాడుతాడు ఎవరిదగ్గర ఎలా ప్రవర్తించాలో తెలుసు! బాడుగ డబ్బులులోనే మిగిల్చి తన పెళ్లికని దాచి వుంచాడు. కావేరికి ఎలాగూ సినిమా తార నవ్వాలన్న పిచ్చి వున్నది. ఆ పిచ్చిని యింకాస్త ఎక్కువ చేస్తే తన దారికి అడ్డు రాకుండా వుంటుందేమో యిప్పటినుంచే ప్లానువేసి తన తల్లితండ్రులను ఈ రంగంలోకి దింపితే పర్యవసానం ఎలా వుంటుందో? ప్రయత్నించటంలో తప్పుకాదుగా? అనుకుంది.     సైకిల్ కి చెరొకవైపునా నిలబడి పట్టుకుని ముందుకి నడుస్తున్న కావేరీని వినాయకరావుని కోపంగా చూసింది. యిప్పటివరకూ యిద్దరం కలిసి వచ్చాం! యిప్పుడు తనని వదలి బావతో కలిసి వెళ్ళుతుందా? అలా ఎంతదూరం? ఎంతకాలం కలిసి నడవగలరో నేనూ చూస్తాను! అనుకుంటూ, తన ఉనికిని మరిచిపోయి వెళుతున్న వారిని వేగంగా నడిచి దాటుకుని ముందుకి వెళ్ళిపోయి విసవిస నడవసాగింది సుబ్బులు!     అది చూసిన కావేరీకి అప్పుడు గుర్తుకు వచ్చింది....అసలే సుబ్బులుకి కోపం ఎక్కువ! కబుర్లలో పడిపోయి బావతో కలిసి వచ్చేస్తోంది తను. యింక రేపటినుంచి తనతో మాట్లాడదు!....తనను గురించి లేనిపోని అబద్దాలన్నీ కల్పించి చెప్పుతుంది. అది నిజమేనని నమ్మి తనను హైస్కూలు చదువు మానిపించుతుంది! ఈ సుబ్బులుని ప్రసన్నం చేసుకోకపోతే లాభంలేదు. అసలుకే ముప్పు వస్తుంది! అనుకున్న కావేరి గబగబా ముందుకు పరుగులాంటి నడకతో సుబ్బులుని చేరి భుజం పట్టుకుని ఆపి బ్రతిమాలే ధోరణిలో అంది.  
24,918
     "నాకు తెలుసు, నీవూ లడ్లే ఇస్టపడతావని" అన్నాడు సుందరమూర్తి.     "ఒకరోజు పూజ ప్రసాదం ఖర్చు చాలానే అవుతుందనుకుంటాను?"     "బాగుంది. పూజ ప్రసాదం అంటే మాటలా!"     "డబ్బు కావద్దూ"     "డబ్బు విషయం నీకెందుకు? మగవాణ్ణి నే చూసుకుంటాగా" సీత కాసేపాగింది.     సుందరమూర్తి ప్రసాదం గురించి ఆ రోజు పూజ గురించి దీర్ఘాలోచనలో పడ్డాడు.     "మనం ప్రతి నెలా ఎంతో కొంత జీతంలో మిగిల్చి నిలువచేస్తే బాగుంటుంది" అంది సీత చాలా ముందుచూపుతో.     "ఎందుకు?" అన్నాడు సుందరమూర్తి.     "బ్యాంకిలో కాస్త కాస్త వేసి, కొంత మొత్తం చేరిస్తే అవసరానికి ఆదుకుంటుంది."     "అంత అవసరాలే మొస్తాయిలెద్దూ. తిండికి గుడ్డకి కరువులేకుండా భగవంతుడిచ్చాడు. అమ్మ చల్లగా చూస్తే హాయిగా రోజులెల్లిపోతాయి."     "అన్నిరోజులు ఎప్పుడూ ఒకేలాగుండవు. ఎప్పుడూ మనిద్దరమే వుంటామా! పిల్లలు కలిగి సంసారం పెరిగి....' పిల్లలు అని కాస్త సిగ్గుపడి ఆగిపోయింది సీత.     పిల్లలు కలక్కముందే భార్య పిల్లలు విషయం ఎత్తితే భర్త అనేవాడిలో ఏ మాత్రం రసికతవున్నా కనీసం హాస్యానికి అర్ధం తెలిసినా "అబ్బో! అప్పుడే రాణిగారికి పిల్లల మీద మనసయిందే. ఇహ లాభంలేదు. నీకోర్కె తిర్చాల్సిందే. తీర్చాలంటే...." అంటూ చిలిపిమాట విసురుతాడు. ఈ ఒక్కమాటతో స్రీలో సిగ్గు పులకింత, భర్త మీద అనురాగం ఎక్కువవుతాయి.     సుందరమూర్తి సీత సిగ్గుపడటం గమనించలేదు. "పిల్లలు కావాలా! దజనా రెండు దజన్లా!" అంటూ హాస్యంగా బుగ్గపై చిటిక వెయ్యలేదు. పిల్లలు సంసారం పెరగటం అన్న మాట మాత్రం విన్నాడు. "అన్నింటికి నీకు భయం. నారు పోసిననవాడే నీరుపోస్తాడు" అని మిన్నకుండిపోయాడు.     సర్వం త్యజించిన, చాతగాని వాళ్ళు చెప్పేదే వేదాంతం. సుందరమూర్తి సర్వం త్యజించిన త్యాగికాదు. చేతగాని వాడు కాదు. ఒక్కో సమయంలో వేదంతంలోకి వెళ్ళిపోతాడు. "నారు పోసినవాడే నీరు పోస్తాడునే " భర్త దంత వేదాంతానికి సీతకేం చేయాలో తెలియలేదు.     సుందరమూర్తి దీర్ఘాలోచనలో మునిగిపోతే సీత ఇంటి పనిలో మునిగిపోయింది.                                                   26      "సుందరం, సుందరం." అంటూ పిలిచాడు శ్రీపతి.     సుందరమూర్తి యింట్లో లేడు. వంటగదిలో వున్న సీత భర్తనెవరో పిలవటం వింది. అక్కడినుంచే లేరని చెప్పక వంటింట్లోంచి బయటికొచ్చింది సీత.     "ఇంట్లో లేరండి" అంది సీత. వచ్చిన వ్యక్తిని సరిగ చూడకుండానే.     "ఎక్కడికి కెళ్ళాడు?"     "తెలియదు. ఓ గంటదాకా రానని చెప్పారు"     "సుందరం వచ్చింతర్వాత శ్రీపతి వచ్చి వెళ్ళాడని చెప్పండి."     "అలాగే" అంటూ శ్రీపతిని చూసింది సీత.     "మిమ్మల్ని ఎక్కడో చుసినట్లుంది..." అంటూ శ్రీపతి నొసలు ముడివేసి అంతలోనే గ్రహింపుకురాగా కళ్ళు పెద్దవిచేసి సీతని చూశాడు.     శ్రీపతిని లీలగా ఎక్కడో చూసినట్లే అనిపించింది సీతకి కూడా.     శ్రీపతి గాలిలో చిటికేసి "ఆ గుర్తుకొచ్చింది. మీ పేరు సీత. నన్ను గుర్తించలేదు కదూ? నా పేరు శ్రీపతి. ఇంకా గుర్తురానట్లుంది. పెళ్ళిచూపులు. నేను మిమ్మల్ని చూడటానికొచ్చాను" అన్నాడు.     శ్రీపతిని ఏ సందర్భంలో చూసింది సీత కప్పుడు గుర్తొచ్చింది. పెళ్లిచుపులప్పుడు ఎన్నో ప్రశ్నలేశాడు. మాటల్లో ఆదర్శలు వల్లించినట్లు కూడా గుర్తు. వారు కోరిన కట్నం యివ్వలేనందున ఈ సంబంధం తప్పిపోయింది. పిల్లవాడు బాగుంటాడు, సర్దాగా మాట్లాడుతాడు అని తండ్రి బాధపడటం అన్ని గుర్తుకొచ్చాయి సీతకి.     "మీరు చివరికి మా సుందరం భార్య అయారన్న మాట."     సీత ఏం మాట్లాడలేదు.     శ్రీపతి కుర్చీ లాక్కుని కూచున్నాడు.     సీతకి శ్రీపతి చనువు నచ్చలేదు. ఎప్పుడో పెళ్ళిచూపులకొచ్చాడు, ఇప్పుడు భర్త ఫ్రెండ్ గా వచ్చాడు. ఏం పరిచయం వుందని ఆడగా పెట్టకుండా కుర్చీ లాక్కుని కూచున్నాడు? కొత్తలేదేమో, ఇతని తీరు ఇంతే కావచ్చు. ఎదుటివారి ఇబ్బంది కూడా గ్రహించాలి కదా!     "మీరేం మాట్లాడటంలేదు." సీతని కళ్ళార్పకుండా చూస్తూ అడిగాడు శ్రీపతి.     "ఏం మాట్లాడను."    
24,919
    ఇకపోతే మురళీ !     ఈ హరికృష్ణగాడి వ్యవహారాలకు అతడే సతమతమవుతున్నాడు. అదీగాక రాధను పెళ్ళి చేసుకున్నప్పుడు ఆ హరికృష్ణగాడు వాడెవడో ఓ దొంగ సన్యాసిని పంపించి ఆడిన నాటకం మురళి ఎలా మర్చిపోతాడు ? హరికృష్ణతోపాటు ఆ నాటకంలో పాలుపంచుకున్న శారదమ్మమీద కూడా ద్వేషం ఏర్పడింది వాడికి ! ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళతో చేయి ఎందుకు కలుపుతాడు ?     నరసింహానికేమీ పాలుపోవటంలేదు. ఎంతసేపు ఆలోచించినా అనుమానాలన్నీ మళ్ళీ మురళి మీదకే మళ్ళుతున్నాయ్.     ఒకవేళ శారదమ్మ తనమీద కుట్రపన్ని ఇద్దరు కొడుకులకూ అసలు జరిగిన కథంతా చెప్పి ఈ నాటకం ఆడించటం లేదుకదా ? అలాంటి పరిస్థితిలో అయితేనే మురళి వాళ్ళతో చేయి కలిపే అవకాశం వుంది__కానీ!     మురళి హరికృష్ణకు సహాయం చేస్తాడు అనడానికంటే చేయడు అనడానికే ఎక్కువ కారణాలున్నాయ్. అతడి డైరీలే దానికి తార్కాణం.     ఏదేమయినా ఒకటి మాత్రం ఖాయం ! తన ఇంటినుంచే తమ రహస్యాలు ఆ హరికృష్ణగాడికి చేరుతున్నాయ్.     కనుక తను తన ఇంటి చుట్టూ ఉచ్చు బిగించి ఉంచాలి. రంగాతో పాటు వాడి అనుచరులు నలుగురిని కూడా రంగంలోకి దించాలి. అప్పుడు గానీ ఏమయినా ఫలితం ఉండదు.      తెల్లారిపోతుండగా మేడదిగి మెట్ల పక్కనే వున్న గదిలోకి నడిచాడు నరసింహం.     రంగా గాఢనిద్రపోతున్నాడు. టేబుల్ మీదున్న గ్లాసుతో నీళ్ళు చేత్తో అతని మొఖం మీద చిలికాడతను.     రంగా భారంగా కళ్ళు విప్పాడు. నరసింహాన్ని ఎదురుగ్గా చూడగానే అతికష్టంమీద లేచి కూర్చున్నాడు.     "ఏమిటి సార్ ? ఏమయినా పని పడిందా !"     "వెంటనే వెళ్ళి మీ గాంగ్ లో నలుగురిని తీసుకురా ! బయట ఎక్కడోచోట వుండమని చెప్పు ! మనింటి నుంచి బయటకు ఎవరు వెళ్ళినా, ఎవరు వచ్చినా వెంబడించమను."     రంగా ఆశ్చర్యంగా చూశాడు. "అంటే - ఆ హరికృష్ణగాడు మళ్ళీ వస్తాడంటారా ?"     "తప్పకుండా వస్తాడు. లేదా వాడికి వివరాలు జేరవేసే వాడి ఏజంట్ అయినా దొరుకుతాడు !"     "అలాగే సార్ !" లేచి నిలబడుతూ అన్నాడతను. నరసింహం అతనివేపు సంతృప్తిగా చూశాడు. రంగా దగ్గర తనకు నచ్చిన గుణం ఒకటుంది. పనిచేయటం అతనికిష్టం ! ఇరవై నాలుగ్గంటలూ పని చేయడానికయినా రడీయే ! ఆ పని ఎంత ప్రమాదకరమయిన దయినా సరే! ఎటొచ్చీ ఆ పనివల్ల నాలుగు డబ్బులు సంపాదించగలగాలి ! అంతే ! మరి కొద్దిక్షణాల్లో రంగా తమ కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళటం కనిపించింది నరసింహానికి.                         *    *    *     మురళి గారేజ్ నుంచి కారును బయటకు నడిపాడు.     ఘూర్ఖా సెల్యూట్ కొట్టాడు.     "ఇదిగో - ఇప్పుడే చెప్తున్నా విను ! నేను మళ్లీ నా కార్లో వస్తేతప్ప...ఎవ్వరినీ లోపలకు రానీకు తెలిసిందా ?"     "తెలిసింది సాబ్-"     నరసింహం వడివడిగా మెట్లు దిగి మురళి దగ్గర కొచ్చాడు.     "జాగ్రత్త, వాడి జాడ తెలుసుకుంటే చాలు- మిగతాదంతా నేను చూచుకుంటాను-" అన్నాడు ఆందోళనతో.     మురళి నవ్వాడు. తన కోటు జేబులో నుంచి పిస్టల్ తీసి నరసింహానికి చూపించాడు.     "ఏం భయంలేదు మావయ్యా ! ఏ పరిస్థితినయినా ఎదుర్కోగలను- వాడెక్కడున్నా సరే- వెదికి- పట్టుకునేది ఖాయం ఇవాళ !"     కారు ముందుకు దూసుకుపోయింది.     రోడ్డు అవతలి వేపునున్న మోటార్ సైకిల్ ఒకటి తన కారుని వెంబడించటం అతనికి తెలుసు.                                15     శారదమ్మ దిగాలుపడి కూర్చుని వుంది. ఉదయం పదిగంటలవుతోంది. ఇంకా కృష్ణ జాడలేదు. మనసంతా ఏమిటోగా అయిపోతోంది. క్షణక్షణానికీ ఆదుర్దా పెరిగిపోతోంది. కృష్ణ కేమైనా కీడు సంభవించలేదు కదా !     "భగవాన్ ! ఈ ఒక్కరోజు వాడిని క్షేమంగా ఇంటికి చేర్చు - వెంటనే ఇద్దరం ఈ ఊరు వదిలేస్తాము. ప్రశాంతంగా జీవితం గడుపుతాము-" చేతులు జోడించి ప్రార్దిస్తోందామె.     "అమ్మా !" తలుపు తట్టిన చప్పుడుతోపాటు  కృష్ణ గొంతు వినిపించింది.     ఒక్క ఉదుటున లేచి వెళ్ళి తలుపు తీసింది.     కృష్ణ లోపలికొచ్చాడు. మళ్ళీ తలుపు మూసేసి తల్లివంక ఆప్యాయంగా చూశాడు.
24,920
                           భ్రమరగీత             (శాంతిలో అశాంతి అశాంతిలోనే శాంతి అనుభవించగలడు శ్రీశ్రీ)    గిరగిరగిరాం     భ్రమరం     గిరాం భ్రమణం     భ్రమం     'భ్రమరణం'     భ్రమణ భ్రమరం     భ్రమర భ్రమణం     గిరగిర గిరాగిరాగిరాం భ్రమణం     రణం     మరణం     రణమరణం దారుణ హననం     ధిషణానిధనం     వృథామథనం     అది నా చెవిలో కథనం     లోకధనం     కదనం     కదన కథాకథనం     అది నా యెదలో రణనం     ఝణ ఝణ ఝంఝణ ఝణా ఝణా నిక్వణనం     అది నా నయనంలో ప్రథ మారుణ కిరణం     రణ నిస్సహణం     వధా విధా నాచరణం     నాలో లోలోపల భ్రమా భ్రమర సంచరణం     రణద్రణ నిస్సహణ ప్రణవం     అది నా హృదయంలో రుధిర జ్వలనం గీతాజననం!!!                           * * *
24,921
    మళ్ళీ అదే మాట తెలిసిన వారయితే మిమ్మల్ని గుర్తు పెట్టటానికి!     అప్పారావు ఒక్క నిమిషం ఆలోచిస్తూ వుండిపోయాడు. ఆపై బలంగా రాజారావు చేతిమీద చరిచి అరే ఫూల్! నీ జోక్స్ నీ తమాషాలూ ఇంకా మానలేదన్నమాట!! అన్నాడు.     వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. మీకయినా బ్రెయిన్ లూజ్ వుండాలి నా కయినా వుండాలి. నా పేరు అనంతం కాదు రాజారావు అని చెప్పాను.     విసుగ్గా అన్నాడు.     బేరర్ కుర్రాడు టిఫెన్ ప్లేటు తెచ్చి టేబుల్ పైన పెట్టి వెళ్ళాడు.     చూడు అనంతం! నా పేరు అప్పారావునే. అప్పులడిగిన మాట వాస్తవమే. ఇది వరలో ఐదు పది కావాలని అడిగేవాడిని నీవిచ్చేవాడివి అప్పటికి నా పరిస్థితులు సరిగా లేక తీర్చలేదు. అది మనసులో పెట్టుకుని నన్ను గుర్తించనట్లు నటిస్తావురా? అప్పారావు దీనంగా ముఖం పెట్టి అన్నాడు.     రాజారావు జాలిగా చూశాడు అప్పారావు వైపు.     మీరు చెప్పే అనంతం గారికి నాలు పోలికలుండి ఉంటాయి. అది గ్రహించక మీరు పొరబడి వుంటారు?      నా ఎదురుగా నీవు కూర్చుని పోలికలంటావేమిటిరా అప్పారావు ఆవులిస్తే పేగులు లెక్క పెడతాడని ఎన్ని సార్లనే వాడివి?     నా పేరు రాజారావు. ఈ విషయం గురించి ఇహ మాట్లాడకండి కాఫీని సేవిస్తూ వార్నింగ్ ఇస్తున్నట్లే అన్నాడు రాజారావు.     ఈ విషయంలో అప్పారావు తగ్గదలుచుకోలేదు.     చూడు అనంత పద్మనాభశాస్త్రి నేచెప్పేది సాంతం విని వాదించు. అయిదేళ్ళ క్రితం మనం ప్రాణ స్నేహితులం. నే అప్పులు చేయడం నీకిష్టం వుండేది కాదు. మాటలకు ముందు అప్పు చేయటం ఓ పెద్ద తప్పు అంటూండేవాడివి.     అయిదేళ్ళ క్రితం నువ్వు రంగూన్ వెళ్ళావు అక్కడ చిన్న వ్యాపారం పెట్టి పెద్ద బిజినెస్ మాన్ వయ్యావని తెలిసింది. డబ్బు సంపాదించిన మనిషి నీవు నలగలేదా.     అయిదేళ్ళ క్రితం ఎర్రగా బుర్రగా వంకులు తిరిగిన నల్లని క్రాపుతో ఎలా వున్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు. డబ్బు సంపాదించావు గాబట్టి ఖరీదైన దుస్తులు వేసుకున్నావు అంతే తేడా అదేకాక కుడి కంటికింద కందిగింజంత పుట్టుమచ్చ పెదవి పక్కన అరంగుళం గాటు, ఇడ్లీలో పూరికూర నంజుకుతినే అలవాటు కాఫీ తాగేటప్పుడు నెమ్మదిగా సిప్ చేస్తూ తాగటం మాటకు ముందు నొసలు ముడేయటం ఇంకే వివరాలు కావాలిరా నువ్వే అనంత పద్మనాభశాస్త్రివని చెప్పడానికి? కళ్ళార్పకుండా రాజారావుని చూస్తూ అన్నాడు అప్పారావు.     అయిందా కధ అన్నాడు రాజారావు తాపీగా. గతుక్కు మన్నాడు అప్పారావు.     నిన్ను నేను గుర్తించానురా అనంతం. నువ్వే బహుశ నన్ను గుర్తించి వుండవు. ఈ అయిదేళ్ళలో చాలా చాలా మార్పు వచ్చింది. నా శ్రీమతి ఐదుగురి పిల్లలకి తల్లి అయింది. నా ఉద్యోగం ఎదుగూ బొదుగూ లేనిది. ఆఫ్ ట్రాల్ ఒక గుమస్తా గాడిని చొక్కా చిరిగితే తొడుక్కోటం తప్పదు.     కుటుంబ భారంతో సగం నెత్తిమీద జుట్టు వూడింది. ఆ వున్న నాలుగు పాయలూ వెండి రూపం దాల్చాయి. అయినంత మాత్రాన నన్ను గుర్తుపట్టలేరా? ఈ తపా అయినా రాజారావు గుర్తు పడతాడేమోనని ఆశగా చూశాడు అప్పారావు.     అయిందా కధ?     రాజారావు తాపీగా అన్నాడు.     ఒరేయ్ అనంతం నీతో లాభం లేదురా! ఇది వరకు అంతే నన్ను గంటల తరబడి ఏడిపించే వాడివి. ఇప్పుడూ అలాగే నాటకం ఆడుతున్నావు. కానియ్యి రేపు నువ్వు నా ఇంటికి పరుగెత్తుకొచ్చి ఒరేయ్ అప్పారావు నిన్న నాటకం ఆడారా నేను. రాజారావుని కాదు అనంత పద్మనాభశాస్త్రిని నేను. నేను నీ స్నేహితుడిని. అనకపోతావా సరేలే రేపు ఎలాగో మా ఇంటి కొస్తావుగా. అప్పుడిచ్చేస్తాను ఓ టెన్ రూపీస్ వుంటే ఇవ్వరా! ఇదివరకు లాగా ఎగెయ్యనులే రేపు ఇస్తాగా అయి.     అప్పారావు మాటలు సాంతం వినకుండానే రాజారావు కుర్చీలోంచి చర్రున లేచాడు.     చూడు మిష్టర్! నీ పేరు అప్పారావు అని అన్నావు కదా సార్ధక నామధేయుడివి. పదిరూపాయలు అప్పుకోసమా ఈ కట్టుకధ అల్లావు?     ఇంతకన్నా నీకు జరుగుబాటు లేదు. ఒక పది రూపాయలు కావాలని అడిగితే ఇచ్చేవాడిని. ఈ రాజారావుతో జోక్ చేయడానికి ప్రయత్నించకు. ఫలితం అనుభవించాల్సి వుంటుంది. గుడ్ బై" అంటూ రాజారావు పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ ఇవతలకి వచ్చేసాడు.     అప్పారావు అంటూ నోరు తెరిచి అలా వుండిపోయాడు.     అంతవరకు ఈ ఇరువురి సంభాషణ వింటున్న వెనుక టేబులు వద్ద కూర్చున్న లాంగ్ కోటు నెత్తిన హ్యాటు కూలింగ్ గ్లాసెస్ గల ఓ పొడుగాటి వ్యక్తి రాజారావు కుర్చీలోంచి లేవడం చూసి తనూ లేచాడు.                                          22     సాయంత్రం 5 గంటలయింది.     పెద్ద బజారు వచ్చే పోయే జనంతో, వాహనములతో కిటకిట లాడుతున్నది.     రాజారావు దీర్ఘంగా ఆలోచిస్తూ చిన్నగా పేవ్ మెంట్ మీద నడుస్తున్నాడు.     అదే పేవ్ మెంట్ మీద రాజారావుకు ఎదురుగా వస్తున్న సుందరం రాజారావును చూశాడు. చూస్తూనే నాలుగు అంగలలో రాజారావును సమీపించి రాజారావు భుజాల మీద చేయివేసి బలంగా వూపుతూ అరే అనంతం ఎప్పుడు వచ్చావు రంగూను నుంచి? ఏం మారలేదు సుమా? ఐదేళ్ళ క్రిందట ఎలా వున్నావో ఇప్పుడు కూడా అలాగే వున్నావు. ఏమిటి విశేషములు?" అన్నాడు రాజారావు భుజాల మీదనున్న సుందరం చేతులు తొలగిస్తూ మీరు__అన్నాడు.     "మీరేమిట్రా? నేనురా నీ సుందరంను. ఆ రోజులలో నన్ను సుకుమార సుందరా అని ఏడిపిస్తూ వుండేవాడివి మరచిపోయావా? అవును లేవోయ్ రంగూను వాతావరణము డబ్బు బిజినెస్ అణాకాని వెధవని నేను గుర్తుంటానా?" సుందరం చిరుకోపంతో అన్నాడు.
24,922
    "ప్రజాసేవ మంచిదేగా?"     "పెళ్ళి ఆలోచన తుడిచిపెట్టుకోకపోతే ప్రజాసేవ అంటూ ఎందుకు బయలుదేరుతుంది?"     "............"     "విశాల్! నాకొక ఉపకారంచేసి పెట్టయ్యా. ఈ ఒక్కటే. ఇంకెప్పుడూ నిన్నేమీ అడగను." ఉద్విగ్న స్వరంతో అంది.     "చెప్పత్తా."     "నేనుబ్రతకను. ఒక్కసారి ప్రేమికను చూడాలని గాఢంగా ఉంది! ఒకసారి తీసుకువచ్చి చూపవూ? ఇదొక్కటే నిను కోరే చివరికోరిక."     "ఎప్పుడు తీసుకురావాలి?"     "ఇప్పుడే....ఈ క్షణమే బయల్దేరు."     "ఇంత హఠాత్తుగానా? ఇంటినిండా బంధువు లున్నారు."     "ఉండనీ!"     "ఇన్నాళ్ళు ఏ రహస్యాన్ని కాపాడుకొంటూ వచ్చావో అది ఇవాళ అందరిముందూ బ్రద్దలు చేయాలనుకొంటున్నావా?"     "బ్రద్దలవుతుందో, గుప్తంగా ఉంటుందో నీ కెందుకు? నువ్వు మాత్రం ప్రేమికని తీసుకురావాలి. ప్రేమికని తీసుకువస్తే నీ కొక మంచి బహుమతి ఇస్తానని చెప్పాను ఓసారి. అది నేను తప్పకుండా నిలబెట్టుకొంటాను."     "ఇప్పుడు కాదత్తా. వీళ్ళంతా వెళ్ళిపోనీ."     "ఎవరు ఉండనీ! ఏమైనా కానీ. నువ్వు మాత్రం వెంటనే బయల్దేరు. ఇంకెప్పుడో అంటే నేనుంటాననుకొన్నావా? ఎప్పుడు, ఏ క్షణాన ఈ ఊపిరి ఆగిపోతుందో!"     "ఎందుకింత అధైర్యం? నీకేం కాదు."     "వ్యధ ఈ గుండెమీద సుత్తిదెబ్బలు కొట్టికొట్టి ఎంత బలహీన పరిచిందో నీకేం తెలుసు? ఏమాత్రం ఆశాభంగాన్నీ తట్టుకోలేను. ఒక్కసారి ప్రేమికని చూడాలి. ఇంకేకోరికాలేదు నాకు. నిరీక్షించడం నాచేతకాదు. ఈ క్షణం బయల్దేరు, విశాల్." ఆవేశంతో, దుఃఖంతో వణికిపోతూంది గీతా భవాని.     కొద్దినిమిషాల తరువాత ఒక నిశ్చయానికి వచ్చినట్టుగా లేచాడు విశాల్. "సరే, గీతత్తా! అలాగే వెడుతున్నాను."     "ప్రేమికతోటే నిన్ను చూస్తానని మాటివ్వు!"     దుర్భాలంగా ఉన్న ఆమె చేతిని రెండు చేతులతో అదిమి పట్టుకొన్నాడు. "సాధ్యమైనంతవరకు ఆమెను తీసుకు రావడానికి ప్రయత్నిస్తాను. రానంటే ఆమె ముందే తలబద్దలు కొట్టుకుచస్తాను! నేనూ నీకిచ్చిన మాట నిలబెట్టుకొంటానత్తా!"     "నువ్వు ప్రేమికని తీసుకురాలేకపోయినా, నువ్వు ఒక విధంగా గెలిచావు, విశాల్. ప్రేమిక నన్ను క్షమించగలిగిదంటే, అది నువ్వు తీసుకువచ్చిన మార్పేకదా? నువ్వే వెళ్ళకపోతే ప్రేమికనన్నింకా అలాగే ద్వేషిస్తూఉండేది. నా ఊహకూడా భరించలేనంతగా ద్వేషిస్తూ ఉండేది. కన్నకూతురి చేత ద్వేషించబడడం కంటే నరకడమేముంటుంది చెప్పు, ఏ ఆడదానికైనా? ఆ నరకంనుండి తప్పించావు నన్ను."     వీధిలో జనం ఇసుకవేస్తే రాలనట్టుగా ఉన్నారు. విస్తళ్ళువేసి వడ్డించేవాళ్ళు వడ్డిస్తూంటే, నీళ్ళుపోసేవాళ్ళు పోస్తుంటే జనం కొట్లాడుకొంటూ, త్రొక్కిసలాడుతున్నారు. మరీ బిచ్చగాళ్ళ కోలాహలం ఎక్కువగా ఉంది.     వాళ్ళని అదుపులోఉంచి భోజనకార్యక్రమం సవ్యంగా జరిగేట్టు చూడమని చెప్పాలని విశాల్కోసం వస్తున్నారు గిరిధరంగారు.     కారు తాళం చెవులతో ఎదురు పడ్డాడు విశాల్.     "నేను హైదరాబాద్ వెడుతున్నాను, మామయ్యా! మళ్ళీ వస్తాను."     "హైదరాబాదా! ఇప్పుడా? ఎందుకు?"     "వచ్చాక చెబుతాను!"     బాణంలా దూసుకుపోయిన అతడిని నివ్వెరపాటుతో చూడసాగారు గిరిధరంగారు. ఆయన భార్యగదిలోకి వచ్చి, "విశాల్ ఇంత హఠాత్తుగా హైదరాబాద్ వెళ్ళాడెందుకు?" అనడిగాడు.     "నేనే పంపించాను"     "ఎందుకు?"     "ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకురమ్మన్నాను."     "విశాల్ ప్రేమించిన పిల్లా? ఎందుకు?"     "ఎందుకో ఆ అమ్మాయిని తీసుకు వచ్చాక చెబుతాను."     గిరిధరంగారికోసం ఎవరో రావడంతో ఎక్కువగా ప్రస్నించకుండా వెళ్ళిపోయారు. మళ్ళీ గీతాభవాని గదిలోకి రావడానికి ఆ రోజంతా కుదరనే లేదాయనకు. అందరిభోజనాలయ్యి చివరగా ఆయన భోజనం వంతు వచ్చేసరికి అపరాత్రి అయింది. అప్పుడు తింటే అన్నం అరగదని కొంచెం పాలు తీసుకొని విశ్రమించారు.     ఆ రోజు అన్నదానానికి అయిదు బస్తాల ధాన్యం ఉడికింది.                                              40     ఉదయం పది గంటల సమయం.     వచ్చిన బంధువుల్లో ఆడవాళ్ళంధరూ గీతాభవాని గదిలో సమావేశమైనట్టుగా కూర్చొన్నారు. గిరిధరంగారి పెద్దకూతురు ఉష గీతాభవాని జుట్టు దువ్వి చిక్కులు తీస్తూంది. చిన్న కూతురు శిరీష నెయిల్ కట్టర్ తో ఆమె గోళ్ళు తీసేస్తూ ఉంది.  
24,923
    తీరా దిగాక ఎక్కడి కెళ్ళాలో తోచలేదు. బిక్కమొహం వేసుకొని దిక్కులు చూడసాగింది.     అప్పుడే ఒక ముసల్ది దగ్గిరకొచ్చి ఆప్యాయంగా పలకరించింది. ఎక్కడికి వెళ్ళాలని అడిగింది. లలిత దుఃఖం ఆగిందికాదు. ఏడ్చేసింది. ఆ ముసలిదానికి అసలు విషయం అర్ధం అయింది. తను ఏదైనా ఉద్యోగం చూపిస్తాననీ, అంతవరకూ తనదగ్గరే వుండొచ్చుననీ ధైర్యం చెప్పి ఇంటికి తీసుకొచ్చింది.     లలిత ఆ ముసలిదానికి మనసులోనే మొక్కుకుంది. ఆమె ఇంట్లో చాలామంది ఆడవాళ్ళు కన్పిస్తే ఆశ్చర్యపడింది. ఆ వాతావరణం కొత్తగా కన్పించింది. అక్కడ తనకు ఊపిరి సలపనట్టు అనిపించింది. కాని అదేమిటో అర్ధం కాలేదు.     లలితకు ఒక గది చూపించింది. అలసిపోయిన లలిత అన్నం తిని త్వరగా నిద్రపోయింది. ఆ రాత్రి ఆమెకు ఏమీ తెలియదు.     తెల్లవారి అక్కడున్న ఆడవాళ్ళు లలితను ఏవేవో ప్రశ్నలు వేశారు. లలితకు చిరాకు వేసింది. ఆ ఆడవాళ్ళంటే అసహ్యం వేసింది.     ఆ రాత్రిగాని లలితకు పూర్తిగా తను ఎక్కడకు చేరిందో అర్ధం కాలేదు.     ఆ సాయంత్రం ఆమెకు మంచి టెర్లిన్ చీర ఇచ్చి కట్టుకోమన్నది ముసల్ది. లలిత సంతోషంగా కట్టుకుంది. రిస్టువాచీ పెట్టుకోమని ఇచ్చింది. లలిత ఆనందానికి అంతులేదు. లలితకు రిస్టువాచీ పెట్టుకోవాలనే కోర్కె ఎంతో కాలంగా వుంది. ఆ ముసల్ది ఎంత మంచిది అనుకుంది.     చదువుకున్న అమ్మాయంటే, రిస్టువాచీ పెట్టుకున్న అమ్మాయంటే గిరాకీ ఎక్కువని ఆ ముసల్దానికి తెలుసు.     ఆ రాత్రి మంచంమీద పడుకున్న లలిత ఉలిక్కిపడి కూర్చుంది.     నల్లగా తుమ్మ మొద్దులా వున్న మగవాడు లోపలకు వచ్చాడు. అతని వేళ్ళకు వుంగరాలున్నాయి. మెళ్ళో బంగారు గొలుసు వుంది. పెద్ద బొజ్జకూడా వుంది. కాళ్ళమీదా, పొట్టమీదా తామరకూడా వుంది.     లలిత తెల్లబోయి చూస్తూ నిల్చుంది.     వాడు నవ్వాడు. తోడేలు నవ్వినట్టు నవ్వాడు.     లలిత భుజంమీద చెయ్యివేశాడు. లలిత భయంతో వణికిపోయింది. అతని చెయ్యి తోసేసి బయటికి పారిపోవాలనుకుంది. తలుపులు బయటినుంచి వేసి వున్నాయి.     గోలచేసింది. అరిచింది. ఏడ్చింది. చివరకు కబంధుడి హస్తాల్లో ఇరుక్కుంది. అంతే.     మూడోరోజు రాత్రి తరుణ్ వచ్చాడు.     తరుణ్ ను చూసింది ఏడ్చింది. తనగోడు చెప్పుకుంది.     ..............     "ఇంటికి పంపిస్తే వెళ్ళిపోతావా?" అడిగాడు తరుణ్.     "ఆ ముసల్ది వెళ్ళనివ్వదు, ఎక్కడ పారిపోతానోనని కాపలా కాస్తుంది, బెదిరిస్తుంది. ఎక్కడికెళ్ళినా మళ్ళీ లాక్కొస్తారట" భయంతో వణికిపోతూ అన్నది లలిత.       "అదంతా నేను చూసుకుంటాలే. నీకు వెళ్ళిపోవాలని వుందా?" అడిగాడు తరుణ్.     "వెళ్తాను." తడుముకోకుండా చెప్పింది.     "మరి మీవాళ్ళు రానిస్తారా?"     లలిత ఆలోచనలో పడింది. ముఖంలో, కళ్ళలో భయం కన్పించింది.     "ఏమో!" వణికిపోతూ అన్నది.     "బహుశా రానిస్తారనే అనుకుంటాను, నేను వచ్చి నాలుగు రోజులేగా అయింది" అన్నది మళ్ళీ అమాయకంగా.     "ఈ పాటికే అందరికీ తెలిసిపోయిందనుకో-పైగా పెళ్ళికూడా ఆగిపోయిందా!" అన్నాడు తరుణ్ లలిత ముఖంలోకి చూస్తూ.     లలిత బెదురుచూపులు చూసింది.     తరుణ్ ఆలోచనలో పడ్డాడు.     "అయినా వెళ్తాను..."     "మీవాళ్ళు రానివ్వకపోతే ఏం చేస్తావ్?"     "అప్పుడు ఏం చెయ్యాలో అప్పుడే ఆలోచించుకుంటాను. ముందు నన్ను ఈ నరకంనుంచి రక్షించు" అన్నది లలిత దీనంగా ముఖంపెట్టి.     "సరే, ఆ ముసలిదాంతో మాట్లాడతాను."     "బాబోయ్, దానికి చెప్పొద్దు."     "ఫర్వాలేదు. భయపడకు. విద్యార్ధులంటే దానికి భయం. నేను గట్టిగా చెప్తే కాదనలేదు" అన్నాడు తరుణ్.     తరుణ్ బయటికి వస్తుంటే "ఏటిబాబూ, అప్పుడే వెళ్ళిపోతున్నారు?" అన్నది ముసల్ది ఎదురొచ్చి.     "నీతో మాట్లాడాలనే వచ్చాను."     "ఏం జరిగిందేటి? ఆ కుంటకొంగ లొంగలేదా? కొత్తపిట్ట. కాస్త మచ్చిక చేసుకోవాలి." గార పళ్ళనుచూపిస్తూ వెకిలిగా నవ్వింది.     తరుణ్ కు ఆ ముసలిదాని పీక పిసకాలనిపించింది.     వ్యాపారం చేస్తుంది.     ఉప్పూ, చింతపండూ అమ్మినట్టే ఆడవాళ్ళ శరీరాల్ని అమ్ముతూంది.     రక్తమాంసాలను అమ్ముతూంది.     చౌకగా-ఉప్పూ చింతపండుకంటే చౌకగా అమ్ముతూ వుంది.     హ్యుమన్ బ్లెడ్ ఈజ్ చీపర్ దాన్ టామ్ రిండ్!     "ఏటి? బాబూ ఆలోచిస్తున్నావ్?"     "ఆ అమ్మాయి నాకు తెలిసినవాళ్ళ పిల్ల!"     ముసల్ది అతని ముఖంలోకి విస్మయంగా చూసింది.     "ఇంటికి వెళ్తానంటోంది, పంపిస్తాను."     అతని ముఖంలోకి పిచ్చిదానిలా భయం భయంగా చూసింది.     "ఏమిటి మాట్లాడవ్?" కోపంగా అన్నాడు అతను.     తరుణ్ తో తగాదా పెట్టుకొని ఆ ఊళ్ళో తను బతకలేనని ఆ ముసల్దానికి తెలుసు. విద్యార్ధులంటే దానికి చచ్చేంత భయం.     దాని వ్యాపారం అంతా దాదాపు వాళ్ళమీదే ఆధారపడివుంది.     "ఏటి బాబూ నువ్వనేదీ?" నీరసంగా, కుంగిపోతూ అడిగింది.     "ఆ అమ్మాయిని వాళ్ళింటికి పంపించి వేస్తాను. ఆ అమ్మాయి పెద్దింటి పిల్ల. నువ్వు అబద్ధాలు చెప్పి తీసుకొచ్చావ్. పైగా ఆ అమ్మాయిని రాత్రి..."     "అట్టాగే బాబూ! నువ్వు చెప్తే కాదంటానా?" మధ్యలోనే అందుకొని అన్నది.     "సరే అయితే ఇప్పుడే తీసుకెళ్తాను."     "అట్టాగే...దానిమీద ఖర్చుచేసిన డబ్బు ఇచ్చేసి తీసుకెళ్ళు" అన్నది ముసల్ది కొంచెం గట్టిగానే.     "ఎంత ఖర్చుచేశావేమిటి?"     "సిల్క్ చీరలూ - జాకెట్లూ - లంగాలూ - రిస్టువాచీ కొన్నాను. దాదాపు రెండు వేలు ఖర్చు అయింది."     తరుణ్ ఓ క్షణం ముసలిదాని ముఖంలోకి చూశాడు.     కాని దానితో వాదనకు దిగాలనిపించలేదు.     "సరే, ఆ రెండువేలూ రేపు తెచ్చిస్తాను."     "అప్పుడే దాన్ని తీసుకెళ్ళు."     ముసలిదాన్ని నాలుగు తన్నాలనిపించింది. అతను కోపాన్ని దిగమింగుకున్నాడు.     "అట్లాగే, ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూడు. ఏమైనా ఆ పిల్లతోగాని......"     "ఎంతమాట బాబూ! మీకు కావాల్సిందని తెలిశాక చేస్తానా?" చెంపలు వేసుకుంది ముసల్ది.     "దొంగముండ! నక్క వినయాలు పోతుంది," అనుకుంటూ లలిత ఉన్న గదిలోకి వెళ్ళాడు.     "రేపు వచ్చి నిన్ను తీసుకెళతాను. ఉదయం వస్తాను" అన్నాడు.     "ఈ రాత్రి......" భయంతో వణికిపోయింది లలిత.     "నే చెప్పాలే. ఇక నీ జోలికి రాదు. తలుపులు వేసుకొని నిద్రపో!" అని చెప్పి తరుణ్ వెళ్ళిపోయాడు.     అతనికా రాత్రి నిద్రపట్టలేదు.     ఇంతకాలం - వాళ్ళు సరుకు అమ్ముతున్నారు - తను కొనుకుంటున్నాడు..... అనుకుంటూ వచ్చాడు.     అంతవరకే ఆలోచించాడు. వాళ్ళు బతకాలి, కనుక తనలాంటివాళ్ళు ఆ సరుకు కొనుక్కోవాలి అనుకున్నాడు.     కాని మనిషి మాంసం, మేక మాంసంకంటే కారుచౌకగా అమ్ముతుంటే తనలాంటివాళ్ళు కొనుక్కుంటున్నారు.     ఎంత దారుణం? ఎంత అమానుషం?     ఆ అమ్మాయిలు ఇష్టంతో ఆ పని చెయ్యడంలేదు. షావుకారు సంతోషంగా గిరాకీకి సరుకు అమ్ముతాడు. ఇక్కడ అట్లాకాదు.     ఈ దేశంలో ఆడదాని జీవితం ఇంత అధ్వాన్నంగా వుంటే, వేదికలెక్కి నాయకులు మన దేశంకంటే గొప్పదేశం లేదంటారేం!?     ఆధ్యాత్మిక చింతన గల దేశమట!     ఒకసారి ఇల్లు విడిచిన ఆడది బజార్లో తనకు తను అమ్ముకుంటేగాని బతకలేదు ఈ దేశంలో!     ఇదేనా ఆధ్యాత్మిక చింతన అంటే?                                         15     రెండో రోజు స్నేహితుల దగ్గిర రెండువేల రూపాయలు అప్పుగా తీసుకొని చంద్రమ్మకు ఇచ్చాడు.     లలిత పెట్టె తీసుకొని బయలుదేరింది.     "ఆ నెక్లెస్ చీర మార్చి నీ చీర ఏదైనా ఉంటే కట్టుకోరాదూ?" అన్నాడు తరుణ్.     లలిత తనకే ఆ ఆలోచన రానందుకు సిగ్గుపడింది.     వెంటనే లోపలకు వెళ్ళి వాయిల్ చీర కట్టుకొని వచ్చింది.     ఇంకా పన్నెండు కాలేదు. బండి రాత్రి ఎనిమిది గంటలకుకాని లేదు.     టికెట్ కొని, పెట్టె స్టేషన్ లో పెట్టించి, లలితతో బయలుదేరాడు.     లలితకు తరుణ్ తో నడుస్తుంటే సంతోషంగా వుంది, గర్వంగా వుంది.     ఆమెను హోటల్ కు తీసుకెళ్ళాడు. ఇద్దరూ భోజనం చేశారు.     "సినిమాకు వెళ్దామా? సాయంత్రంవరకూ టైం గడపాలిగా?"అన్నాడు తరుణ్.     లలిత సంతోషంగా ఒప్పుకుంది.     అతని పక్కన కూర్చొని సినిమా చూస్తోంది. కాదు ఆలోచిస్తోంది.     తరుణ్ పక్కన కూర్చొని సినిమా చూస్తోంది. ఆనందంగా ఉంది, బాధగా వుంది. సంతోషం - బాధా - తమాషా అనుభూతి.     "ఈ జన్మకు ఈ అనుభూతి చాలు" అనుకుంది లలిత.     మనిషి నూరేళ్ళ బతుకులో నిజంగా జీవించేది కొన్ని గంటలో లేక కొద్ది నిముషాలో. ఇప్పుడు లలిత జీవిస్తూవుంది. తరుణ్ లాంటి భర్తనే లలిత కలల్లో ఊహించుకుంది.     అంతదృష్టం తనకు లేదు. కాని కొద్ది గంటలు తన కలల్లోని రాకుమారుడితో గడిపే అవకాశం కలిగింది.     ఈ అనుభవం - ఈ అనుభూతి చాలు - తనకు జీవితాంతం మననం చేసుకుంటూ బతకడానికి.     లలిత కళ్ళవెంట నీరు కారిపోతూ వుంది.     అతను ఏదో అన్నాడు సినిమా గురించి.     లలిత ఉలిక్కిపడింది.     కళ్ళు తుడుచుకుంది.     "ఏడుస్తున్నావా?" జాలిగా అడిగాడు.     "ఏడవడంలేదు. ఇవి ఆనందబాష్పాలు" అంది.     "ఆనందమా?" ఆశ్చర్యంగా ప్రశ్నించాడు.     "అవును. నేను చాలా సంతోషంగా వున్నాను. నేను ఊహ తెలిసిన తర్వాత ఇంత ఆనందాన్ని ఎప్పుడూ పొందలేదు. ఇక ముందుకూడా ఈ అనందం నాకు దొరకదని నాకు తెలుసు" అన్నది లలిత చిన్నగా తనకు తనే చెప్పుకుంటున్నట్టు.     తరుణ్ కు అర్ధంగాలేదు. ఇటువంటి సమయంలో ఆమెకు ఆనందం కలగడం ఏమిటి? ఇంటికి వెళ్తే ఏమవుతుందోనని దిగులుగా లేదా? నాకే ఆమె గురించి ఆలోచిస్తూ వుంటే ఏదోగా వుందే?     "ఇంతకు ముందెప్పుడూ సినిమా చూళ్ళేదా?......" అడిగాడు తరుణ్ విస్మయంగా.     "చూశాను, చాలాసార్లు చూశాను. కాని, నీ పక్కన కూర్చుని చూడలేదుగా! ఇక చూడలేనని కూడా తెలుసు. అయినా ఆనందంగా ఉంది. నా జన్మకు ఇది చాలు!" అన్నది లలిత.     అతనికి గుండెల్లో దేవినట్టయింది. ఏమనాలో తెలియడం లేదు, లలిత మీద జాలి వేసింది.     "సినిమా బాగుందా?" అడిగాడు అతను.     "తెలియదు."     "అదేం"? ఆశ్చర్యంగా ప్రశ్నించాడు.     "నేను సినిమా చూస్తుంటే గదా?"     తరుణ్ కు ఏం మాట్లాడాలో తోచలేదు, సినిమా చూస్తూ కూర్చున్నాడు.     సినిమా చూస్తుంటే అతనికి చిరాగ్గా వుంది. ఈ సినిమాకా జనం విరగబడి చస్తున్నారు!     అది సామాజికం, పౌరాణికం, జానపదం, క్రైం మొదలైన అన్ని హంగులూ వున్న సినిమా.     ఆ హీరోయిన్ తెరను సగభాగాన్ని ఆక్రమించుకుంది. ఇక హీరో సంగతి చెప్పనే అక్కర్లేదు. ఆ ఇద్దరూ డ్యూయెట్ పాడుతూ చెట్ల మధ్యగా పరుగులు తీస్తూ వుంటే రెండు గున్న ఏనుగులు పోట్లాడుకుంటున్నట్టు అనిపించింది అతనికి. తెలుసు సినిమా ప్రేక్షకుల టేస్ట్ పెరగడానికి ఇంకెంతకాలం పడుతుందో?     సినిమా అయిపోయింది. లలితకు కాఫీ, టిఫెన్ ఇప్పించి స్టేషన్ కు తీసుకెళ్ళాడు.     తరుణ్ గంభీరంగా వున్నాడు. ఏమీ మాట్లాడలేకుండా ఉన్నాడు.     లలిత చిన్నప్పటి స్కూల్లో చదువుకున్న రోజుల నాటి విషయాలు జ్ఞాపకం చేస్తూవుంది. ఉత్సాహంగా కబుర్లుచెబుతూ వుంది.     తరుణ్ కు దిగులుగా వుంది. ఆ అమ్మాయి భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు.
24,924
    డాక్టర్ కృష్ణచైతన్య బాగా అప్ సెట్ అయిపోయాడు. బయటకు రావటం మానేశాడు. ఎవరెంత ప్రయత్నించినా ఇంటర్వ్యూళు ఇవ్వలేదు.     రంజిత అతన్ని కలుసుకునేందుకు ఎంతగానో ప్రయత్నించి విఫలమై డాక్టర్ ప్రద్యుమ్నని కలుసుకోవటానికి బయల్దేరింది.     ఆమె వెళ్ళేసరికి రాత్రి తొమ్మిది దాటింది. బజర్ నొక్కగానే డాక్టర్ ప్రద్యుమ్నే వచ్చి తలుపు తీశాడు.     "నా పేరు రంజిత" అని పరిచయం చేసుకుంది.     "రండి" అన్నాడు.     లోపలకడుగు పెట్టింది. సోఫా ముందున్న టీపాయ్ మీద విస్కీ సీసా గ్లాసు, సోడాలు సరంజామా అంతావుంది.     "సారీ! వేళ కానివేళ వచ్చారు."     "ఫర్వాలేదండి."     "కూచోండి."     అతనికి కొంచెం దూరంలో వున్న చిన్న సోఫాలో కూర్చుంది.     "నేను డ్రింక్స్ తీసుకుంటూ మాట్లాడతాను. ఏమైనా అభ్యంతరమా?" అన్నాడు.     "కానివ్వండి."     అతను గ్లాసు చేతిలోకి తీసుకుని "సంకేతిని గురించి మాట్లాడదామని వచ్చి వుంటారు" అన్నాడు.     "అవును."     "సంకేతినీ, నేనూ ఎం.బి.బి.ఎస్. చదివేరోజుల్నుంచీ ప్రేమించుకున్నాం. ఇద్దరం పెళ్ళి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నాం. మధ్యలో కొన్నిరోజులు పరిస్థితుల ప్రాబల్యం వల్లే నేనామెకు కనబడకుండా ఉండాల్సి వచ్చింది. నేనంటే గిట్టనివాళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఆమెకు నామీద ఉన్నవీ లేనివీ నూరిపోశారు. దురదృష్టవశాత్తూ ఆమె వాటిని నమ్మి నేను తిరిగి వచ్చాక చాలా తీవ్రంగా అవమానించింది. నేనుకూడా ఈ హఠాత్ పరిణామానికి అప్ సెట్ అయి, ఉద్రేకానికి లోని, ఆ ఉద్రేకంలో ఏం మాట్లాడుతున్నానో తెలీకుండా ఏమేమో అనేసి అక్కడ్నుంచి వెళ్ళిపోయాను.     డాక్టర్ ప్రద్యుమ్న కొంచెంసేపు ఆగి డ్రింక్ తీసుకున్నాడు. రంజిత అతనివైపు చూడనట్లు నటిస్తూనే మధ్యమధ్య గమనిస్తోంది. అతని మాటల్లో నిజాయితీ కనబడుతున్నా, మొహంలో- ముఖ్యంగా కళ్ళలో ఓ విధమైన క్రూరత్వం ఉట్టిపడుతుంది.     తర్వాత ఇద్దరం విడిపోయాం... కొన్నాళ్ళ తర్వాత... ఎంతోకాలంగా నిగ్రహంతోవున్న నా మనోధైర్యం సడలిపోయింది. సంకేతినిని చూడకుండా వుండలేకపోయాను. దానికి తగ్గట్లు పద్మనేత్రాలయలో జాబ్ కోసం అప్లయ్ చేస్తే వచ్చింది. సంకేతినిని తిరిగి కలవాలన్న ఉద్దేశ్యంతోనే ఇక్కడికి వచ్చి చేరాను."     "ఇక్కడికి వచ్చాక ఆమెను కలుసుకున్నారా?"     "లేదు."     "ఎందుకని?"     "ఆమెకు నామీద ఇంకా కోపం పోలేదని తెలుసు. సమయం, మూడ్ చూసుకుని కలుసుకుందామనుకున్నాను."     "ఆమె పద్మనేత్రాలయకు వచ్చిపోయే విషయం మీకు తెలుసా?"     "ముందుగా తెలీదు. ఒకరోజు ఒ.పి.లో నడుస్తోంది డ్రాప్స్ వేసుకుని కళ్ళు మూసుకుని కూర్చున్న ఆమెను చూసి చకితుడ్నయ్యాను. తర్వాత తెలిసింది."     "ఆమె మిమ్మల్ని గమనించిందా?"     "లేదనుకుంటాను."     ఆమె డాక్టర్ కృష్ణచైతన్య దగ్గర ట్రీట్ మెంట్ తీసుకోవటం, ఆపరేషన్ కోసం ఎడ్మిటవటం- ఇవన్నీ తెలుసా?"     "తెలుసు."     "సంకేతిని హాస్పటల్లో ఎడ్మిటైన రోజున మీరెక్కడున్నారు?"     "ఇంట్లోనే వున్నాను."     "ఆరోజైనా ఆమెను కలుసుకోవాలని మీకనిపించలేదా?"     "అనిపించింది. కాని సరిగ్గా ఆపరేషన్ ముందురోజు కలిసి ఆమె మూడ్స్ డిస్టర్బ్ చెయ్యటమిష్టంలేక వూరుకున్నాను. ఇన్ ఫ్యాక్ట్! నేనిక్కడ జాబ్ లో చేరటం, ఆమె కేటరాక్ట్స్ తో బాధపడుతూ ఇక్కడికి వస్తూ వుండటం, నేను తప్పించుకొని తిరుగుతూ వుండటం, చాలా ఇబ్బందిగానే ఫీలయ్యాను. కాని అంతటి భయంకరమైన పరిణామం విరుచుకుపడుతుందని తెలిస్తే- ఎలాగైనా కలుసుకునేవాడ్ని" అతని గొంతు గాద్గదికంగా ఒణికింది.     "మీరిద్దరూ పెళ్ళి చేసుకుందామనుకుంటూన్న రోజుల్లో పరిస్థితుల ప్రాబల్యం రీత్యా కొన్నాళ్ళు ఆమెకు దూరంగా వుండాల్సి వచ్చిందనీ, అది అపార్థాలకు దారితీసిందని అన్నారే. ఆ పరిస్థితులేమిటో చెప్పగలరా?"     "సారీ! పర్సనల్."     "సరే. నేనొస్తాను" అంటూ ఆమె లేచి బయటకు వచ్చింది.     అంతకుముందు కొంతసేపట్నుంచీ ఆకాశం మేఘావృతమై, రెండు నిముషాల నుంచీ వర్షం మొదలై చాలావేగంగా తీవ్రస్థాయికి చేరుకుంటోంది.     రంజిత కారులో కూర్చుని స్టార్ట్ చెయ్యబోతూండగా ఆమె ప్రక్కనుంచి ఓ కారు దూసుకుపోయింది. దాన్ని డ్రైవ్ చేస్తోన్న వ్యక్తి వంక యధాలాపంగా చూసిన రంజిత ఉలిక్కిపడింది. ఒక్కదూకుతో కారుని ముందుకు పోనిచ్చి ముందు పోతోన్న కారుని వెంటాడసాగింది.     ఆమె వెళ్ళిపోయిన ఒకటి రెండు నిమిషాలదాకా డాక్టరు ప్రద్యుమ్న ఏదో ఆలోచిస్తోన్నట్లు స్థబ్దుగా కూర్చుని చేతిలోవున్న గ్లాస్ లోని డ్రింకంతా గబగబా త్రాగేశాడు. ఆ తర్వాత లేచి రైన్ కోటు వేసుకుని, క్యాప్ పెట్టుకొని బయటకు వచ్చి, ఇల్లు లాక్ చేసి వర్షంలో నడవసాగాడు.                                     *  *  *
24,925
    అప్పుడు కనిపించింది నేలమాళిగ అన్వేషికి.     అండర్ గ్రౌండ్ లోకి మెట్లున్నాయి.     అప్పటికే అక్కడ లైట్లు వెలుగుతుండటం చూసి ఆశ్చర్యంగా అడిగాడు అన్వేషి. "మీరు స్విచ్ లేవీ వెయ్యలేదుకదా... లైట్లెలా వెలుగుతున్నాయి?"     "విశ్వాత్మని మీరు తక్కువగా అంచనా వేస్తున్నారు. లోనికి రావటానికి ఇనుప చట్రాన్ని తిప్పుతున్నప్పుడే అండర్ గ్రౌండ్ లోని జనరేటర్ ఆటోమేటిగా ఏక్టివేట్ అవుతుంది" చెప్పింది శృతి చిన్నగా నవ్వుతూ.     నిశ్చేష్టుడైపోయాడు ఆ మాటలకు అన్వేషి.     అండర్ గ్రౌండ్ లోకి మెట్లు దిగుతున్నప్పుడు చెప్పింది శృతి ఏదో గుర్తొచ్చినట్లు.     "విశ్వాత్మ మరణించాక అతను క్యాన్సర్ తో చనిపోయారనుకున్నారంతా. కాని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలియటానికి చాలాకాలం పట్టింది. విశ్వాత్మ ట్రస్ట్ వాళ్ళే సీక్రెట్ గా వుంచారీ విషయాన్ని".     "విశ్వాత్మ సూసైడ్ చేసుకుని చనిపోయారా? ఇట్స్ సర్ ప్రైజింగ్!" విచిత్రంగా మెరుస్తున్న శృతి కనుబొమల వైపు చూస్తూ అన్నాడు అన్వేషి.     "అవును. చాలాకాలంగా ఈ విషయమై పరిశోధనలు కూడా జరిగాయి. అంతటి కోటేశ్వరుడు ఆకస్మికంగా ఆత్మహత్య చేసుకోవటం, అప్పట్లో చాలా సెన్సేషన్ సృష్టించిందట. ఎట్టకేలకు ఆయన డైరీల ద్వారా తెలిసిందేమిటంటే-     తను ఆత్మహత్య చేసుకుంటేనే- వెంటనే పునర్జన్మ ఎత్తుతాననే ఒక ప్రగాఢమైన నమ్మకమే ఆయనని ఆ పనికి పురిగొల్పిందని మనోశాస్త్రజ్ఞులు తేల్చి చెప్పారు."     చెప్తూ ముందుకు నడుస్తోందామె. సగం వెలుతురు, సగం చీకట్లో నుంచుంది శృతి. పాలరాతితో చేసిన శిలాప్రతిమలా వింతకాంతితో మెరుస్తోందామె.     "ప్రపంచంలోనే చాలా అరుదైన వ్యక్తిలా వున్నాడు విశ్వాత్మ" తనలో తను నెమ్మదిగా అనుకున్నాడు అన్వేషి.     క్రిప్టోగ్రాఫ్ రూం విశాలంగా లేదు. అలాగని ఇరుకుగా కూడా లేదు.     రూంలోని పాతకాలపు వాసన ముక్కుపుటాలకు సోకుతోంది.     పొడవాటి, ఎత్తయిన పాతకాలపు కుర్చీ, దాని ముందు టేబుల్, దానిమీద కంప్యూటర్ మెషీన్. ఆ మెషీన్ ను క్షుణ్ణంగా పరిశీలించాడు అన్వేషి.     కీ బోర్డ్, వెనక వున్న కనెక్షన్... అన్నీ పకడ్బందీగా వున్నాయి.     కీ బోర్డ్ ని ఆపరేట్ చెయ్యటానికి కొద్దిగా ముందుకు వంగి దానిమీద చెయ్యి వేయబోయాడు అన్వేషి.     మెరుపు వేగంతో ముందుకు దూకి కీ బోర్డుపై వేయబోతున్న అతని తిని గబుక్కున వెనక్కి లాగేసింది శృతి.     "నో మిస్టర్ అన్వేషీ! హయ్యర్ అథారిటీ పర్మిషన్ లేనిదే మీరు కీ బోర్డును ఆపరేట్ చేయటానికి ఏమాత్రం వీల్లేదు" అంది శృతి.     చిరుకోపం వచ్చింది అన్వేషికి.     చివాలున తలతిప్పి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు. ఆ కళ్ళు నిర్మలంగా వున్నాయి.     తన కుడిచేయి ఆమె చేతిలో వుండటం గమనించాడు అన్వేషి. ఆ చేయి మెత్తగా వుంది. ఆ స్పర్శ కొత్తగా వుంది.     "సారీ! మీకు కోపం వచ్చిందా...?" చేతిని వెనక్కి తీసుకుంటూ అంది శృతి.     "దేనికి? మీ చెయ్యి మీరు తీసుకుంటే నాకెందుకు కోపం?" ఆమె వైపు నవ్వుతూ చూస్తూ అన్నాడతను.     ఆ విషయం అతను గమనించలేదేమోనన్న భ్రమలో వున్న శృతి మనసులోనే సిగ్గుపడింది. మనసులో సిగ్గుపడినా, మౌనంగా సిగ్గుపడినా, ఆడవాళ్ళు సిగ్గును కానీ, కోపాన్నిగానీ దాచి వుంచలేరు. అలాగే ప్రేమను కూడా.     ఆమె ఏదో అనబోయింది గానీ ఎందుకనో మాటలు రాలేదు. వారు వచ్చి ఇరవై అయిదు నిముషాలు గడిచాయి.     రకరకాలుగా విశ్వాత్మ పనుల్ని ఎనలైజ్ చేస్తున్నాడు అన్వేషి. అక్కడున్న పరిస్థితికి అన్వేషి అంచనా సరయినదేననిపించింది ఆమెకు. వాచీవైపు చూసుకుంటూ "వెళదామా?" అంది శృతి.     అన్వేషికెందుకో అక్కడనుంచి వెళ్ళాలని లేదు. మెట్లవైపు దారి తీసింది శృతి. మెట్లు ఎక్కుతున్న అన్వేషి ఒక పక్కకు కాస్త కుంటుతున్నట్లు నడవటం గమనించిన శృతి ఆశ్చర్యపోయింది.     "ఏమిటలా నడుస్తున్నారు?" ప్రశ్నించింది.     "బైక్ కిక్కిచ్చినప్పుడు కుడికాలు కాస్త స్లిప్ అయింది. ఆ పెయిన్ ఇప్పుడు తెలుస్తోంది" చెప్పాడు అన్వేషి.                                    *    *    *    *     ప్రేమంటే నీ మనసు గురించి నువ్వు తెలుసుకోవడం కాదు- ఎదుటి మనసులోని లోతుల్ని గుర్తించడం కూడా. ఎప్పుడో, ఎక్కడో చదివిన ఆ వాక్యం చప్పున ఆ సమయంలో గుర్తుకు వచ్చింది శృతికి.     సాయంకాలం ఆరుగంటలు దాటింది.     జూబ్లీహిల్స్ ఎత్తుపల్లాల రోడ్లమీద చల్లని గాలి కూడా వంపులు తిరుగుతూ పరుగెడుతోంది.     అటూ ఇటూ దట్టమైన చెట్ల మధ్యలోంచి కారు ముందుకు దూసుకుపోతోంది.     స్టీరింగ్ వైపు చూడకుండా సూటిగా రోడ్డువైపు చూస్తూ డ్రైవ్ చేస్తున్న అన్వేషిని, గాలికెగురుతున్న అతని జుత్తుని చూస్తోంది శృతి- ఆ చూపుల్ని మిర్రర్ లోంచి గమనిస్తున్నాడు అన్వేషి.     "ఎక్కడకు వెళ్తున్నాం మనం? నన్ను ఎక్కడకు తీసుకువెళుతున్నారు?" నెమ్మదిగా అడిగింది శృతి.     "నేనెక్కడకు వెళ్తే మీరక్కడకు వస్తానన్నారు కదా?"     "అలాగని చెప్పాచెయ్యకుండా ఎక్కడికో తీసికెళ్ళిపోతానంటే ఎలా?" నవ్వుతూ అంది శృతి.     "కొత్తగా ఎక్కడకు తీసుకెళుతున్నాను. ఇక్కడ అన్నీ మీకు తెలిసిన రోడ్లే కదా" అన్నాడతను.     "రోడ్లన్నీ తిప్పి తిప్పి కొండల్లోకి తీసుకెళుతున్నారు. కొండల్లో కెందుకూ?" అనడిగింది.     "ఎందుకంటే...ఏం చెప్పాలి? ఏకాంతం కోసం"     "కాంతలు పక్కనుంటే ఏకాంతం ఎలా అవుతుంది. గందరగోళం అవుతుంది" మరింతగా నవ్వుతూ అంది.     "కొంతమంది అమ్మాయిలు పక్కనుంటే, ఏకాంతానికి అందం వస్తుంది" అన్నాడు అన్వేషి.     "ఏకాంతం తాలూకూ అందం మీకు తెలుసన్నమాట. చెప్పరేం... మిమ్మల్ని చూసి అమాయకులనుకున్నాను. ఎవరెవరితో ఏకాంతంగా ఎక్కడెక్కడ గడిపారో చెప్పకూడదూ... ఆనందిస్తాను" ఆమె చున్నీ ఎగిరి అతని భుజమ్మీద పడింది.     అన్వేషి ఏం మాట్లాడలేదు.     మరో మూడు నిమిషాలు గడిచిన తర్వాత, కారు ఓ కొండపక్కకెళ్ళి ఆగింది. దూరంగా ఎండిపోతున్న చిన్న చెరువు, ఆ చెరువుకి దక్షిణం వైపున కూలిపోతున్న పాతకాలపు కట్టడం.     కారులోంచి బయటకు దిగి ఒళ్ళు విరుచుకుంటూ నలువైపుల పరికించి చూశాడు.
24,926
                                ఫాలాక్షుడు                                                             _సూర్యదేవర రామ్ మోహనరావు                                               ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్...     అర్దరాత్రి పన్నెండు గంటలు దాటి పదిహేను నిమిషాలయింది. చీకటి దుప్పటి కప్పుకొని యూనివర్సిటీ హాస్టల్స్ నిద్రపోతున్నాయి. రోడ్డుకి దూరంగా ఓల్డ్ పి.జి. హాస్టల్లో మాత్రం లైట్లు అక్కడక్కడ వెలుగుతున్నాయి.     ఆ హాస్టల్ కు ఎదురుగా రోడ్డు పక్కనున్న ఓపెన్ ప్లేస్ లో ముగ్గురు పోస్టుగ్రాడ్యుయేట్ స్టూడెంట్సు ఆరాధన ధియేటర్లోంచి వచ్చి అక్కడ కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు.     "ఏంది... గోవిందు... సినిమాల... ఆ వయొలెన్స్ ఏంది? ఈడ్ని... ఆడు... ఆడ్ని ఈడు... పొడుసుకు సంపుకోడమేనా... పని. గ్యాంగ్ వార్ లు, గూండాల స్టోరీలు తీసి... సంపేస్తన్నారు... జనాల్ని" అన్నాడు యాదగిరి.     "సిటీల్లో ఏం జరుగుతోందో... అదే తీస్తున్నారు... ఏం జరగడం లేదా?" అన్నాడు ముఖేష్ రెడ్డి.     యాదగిరి మౌనంగా వున్నాడు.     "పిచ్చి యాదగిరీ... హైద్రాబాద్ లో తప్పబుట్టావ్... జనరేషన్స్, జనరేషన్స్ చదువులు పూర్తి చేసేసుకుని వెళ్లిపోతున్నా- నువ్వు యూనివర్సిటీ ఫౌండర్ లా, హాస్టల్లో పదేళ్ళుగా వుండడమే తప్ప... సిటీ జ్ఞానం బొత్తిగా లేదు. పోలిటిక్స్, జ్ఞానం లేని, పొలిటికల్ స్టూడెంట్ వి." ముఖేష్ రెడ్డి తిరిగి అన్నాడు నవ్వుతూ.          "ఓల్డ్ సిటీని తీసుకో... న్యూసిటీని తీసుకో... పొలిటికల్ లీడర్స్ ని తీసుకో... కర్ఫ్యూలు, కమ్యునల్ గొడవలు... బంద్ లు... హర్తాళ్ళు... మర్డర్స్... వీటన్నిటికీ కారణం ఏంటంటావ్... ఇలాంటి వాటన్నిటికీ సిటీలే పుట్టినిళ్ళవుతున్నాయ్... ఏడాది కేడాది, వయొలెన్స్ రేట్ ఎంత స్పీడుగా పెరుగుతోందో... తెల్సా... యూనివర్సిటీలు వేలకొద్దీ, కొత్త నిరుద్యోగుల్ని తయారు చేస్తే... ఈ వయొలెన్స్ - కొత్త, కొత్త, క్రిమినల్స్ ని మర్డరర్స్ ని తయారు చేస్తోంది. యూనివర్సిటీలో స్టూడెంట్ ఎలక్షన్స్ పేరిట... ఎంత వయొలెన్స్ జరుగుతుందో... నీ కళ్ళకు కన్పించడం లేదా..." ఆవేశంగా ప్రశ్నించాడు గోవిందరాజు.     "యూనివర్సిటీల్లో పొలిటికల్ పార్టీస్ ఇన్ ఫ్లుయన్స్ ని తగ్గిస్తేనే, వయొలెన్స్ తగ్గుతుంది" ముఖేష్ రెడ్డి అన్నాడు.     "లేదు భాయ్... ఎలక్షన్స్ ని బేన్ చెయ్యాలి" యాదగిరి ఆ మాటని, రోడ్డువేపు చూశాడు కేజువల్ గా.     ఆర్ట్స్ కాలేజీ రోడ్డు దగ్గర మలుపు తిరిగి... వరసగా నాలుగు జీపులు... ఓల్డ్ పి.జి. వేపే వస్తున్నాయి.     చిమ్మచీకటిలో, జీపుల హెడ్ లైట్లు వాళ్ల మీదే పడ్తున్నాయి సూటిగా.     "ఏ రాడికల్స్ కోసమో పోలీసులు... మళ్ళీ వేట ప్రారంభించారన్న మాట... పద... పద..." ముఖేష్ రెడ్డి గొంతులో ఆత్రుత ధ్వనించింది.     ఎందుకైనా మంచిదని - ముగ్గురూ గబగబా లేచి, రోడ్డు క్రాస్ చేసి, హాస్టల్ వేపు పరుగెడుతున్నారు-     ఒకింత సేపటికి సడెన్ గా వాళ్ళ ముందుకే వచ్చి ఆగాయి జీపులు.     దగ్గరగా వచ్చి ఆగిన జీపుల్ని చూడగానే అర్ధమైపోయింది యాదగిరికి. అవి పోలీసు జీపులు కావని- అందుకే ఆగి, ఆసక్తిగా చూడడం మొదలుపెట్టాడు.          "ఏయ్... ఆగు... ఓల్డ్ పిజి... ఇదేనా..." డ్రైవర్ సీట్లో కూర్చున్న ఓ వ్యక్తి, కరుకు గొంతుతో అడిగాడు యాదగిరిని.     "అవ్...." జవాబిచ్చాడు యాదగిరి!     "ఆదిత్య... ఏడుంటాడు...?" ఇంకో గొంతు అడిగింది.     చెప్పాడు ముఖేష్ రెడ్డి.     "ఆదిత్య ఎందుకు... ఎవరు... మీరు..." గోవిందరాజ్ నోట్లోంచి, ఈ మాట బయటకింకా రాలేదు-     జీపుల్లోని వ్యక్తులందరూ... వడివడిగా బయటకు దిగి - అక్కడక్కడా నుంచున్నారు.     "ఆదిత్యకోసం... అహోబలపతి... సార్ వచ్చిండ్రు..." అందులో ఒకడు చెప్పాడు.          అహోబలపతి....     పవర్ పార్టీ మాజీ ఎమ్మెల్యే... పవర్ పార్టీ వైస్ ప్రెసిడెంట్... ఓల్డ్ జాకాల్... అహోబలపతి...     టాంక్ బండ్ మీదున్న విగ్రహంలా వున్నాడు... అక్కడక్కడ నెరిసిన తల...     చేతిలో త్రిబుల్ ఫైవ్ సిగరెట్ ప్యాకెట్... నోట్లో సిగరెట్...     "మీరిక్కడ వుండండి... నేను మాట్లాడొస్తాను..." జీపులోంచి దిగి, హాస్టల్ మెట్లెక్కాడు అహోబలపతి!     ఆదిత్యకుమార్ ఫైనలియర్ లా స్టూడెంట్ - ఏ పొలిటికల్ పార్టీనీ సమర్ధించడు - ఏ పొలిటికల్ పార్టీలోనూ మెంబర్ షిప్ లేదు - పొలిటికల్ లీడర్స్ లో ఫ్రెండ్స్ లేరు - స్టూడెంట్ ఎలక్షన్స్ క్కూడా దూరంగా వుంటాడు - మరి...?     అలాంటి-     ఆదిత్య కోసం-     అహోబలపతి ఎందుకొచ్చినట్టు? ఆలోచిస్తూనే ముందుకి నడుస్తున్నాడు యాదగిరి. ఆ పక్కన ముఖేష్ రెడ్డి... గోవిందరాజ్...
24,927
    చేపల మార్కెట్ లో గుట్టలు పోసినట్టు ఆ అయిదారుగురి శరీరాలు ఒకదానిమీద ఒకటి పడివున్నాయి. ఒక్కొక్కటే స్ట్రెచర్ మీదికి చేర్చబడుతుంది. హాస్పిటల్ వార్డ్  బోయ్స్ లా తెల్లడ్రెస్ లో వున్న  వ్యక్తులు ఆ  శరీరాల్ని బయటకు చేరుస్తున్నారు.     ఒక మనిషి శరీరం బల్ల మీద పడుకోబెట్టబడి వుంది. అతడి శరీరం నుంచి రెండు వైర్లు కార్డియో గ్రాం కి కనెక్ట్ చేయబడి వున్నాయి. అతని గుండె చప్పుడు ఆ మిషన్ లో చుక్క రూపంలో ప్రయాణం చేస్తూ వుంది.     అంతలో ఆ మనిషి దగ్గరే నిలబడి డాక్టర్లా పరీక్షిస్తున్న వ్యక్తి తన మొహంమీద వున్న మాస్క్ తీసేసింది. ఆ వ్యక్తి ఒక అమ్మాయి. ఆమెని చూసి హంసలేఖ ఉలిక్కిపడింది.     తన అక్కని ఆ స్థితిలో అక్కడ చూస్తానని, ఆ విధంగా చూస్తానని హంసలేఖ ఊహించలేదు.     ఆమె  హంసలేఖ కన్నా నాలుగైదు సంవత్సరాలు పెద్దది. ఆమె వేసుకున్న తెల్లకోటు ఆమెనో డాక్టరుగా సూచిస్తూంది. ఆమె  కళ్ళలో విజ్ఞానం తొంగి చూస్తుంది. కళ్ళక్రింద నల్ల గీతలు విషాదాన్ని, అలసటనీ చెపుతున్నాయి. అన్నిటికన్నా ఏదో తెలియని 'కసి' ఆమెలో కనపడుతూంది.     ఆమె పేరు స్వర్ణరేఖ.     ఆమె అక్కడినుంచి కదిలి, గాజు బీకర్ల దగ్గరకు వెళ్ళింది. వరుసగా వున్న గాజు పెట్టెల్లో పది కుందేళ్ళు వున్నాయి. ఆమె బీకర్ల చివరవున్న సంప్ తిప్పగానే, వాటికి అమర్చబడివున్న పైప్ లోంచి గ్యాస్  ఆ పెట్టెల్లోకి వెళ్ళింది. కుందేళ్ళు నెమ్మదిగా అచేతనమయ్యాయి. వరుసగా తగిలిన బుల్లెట్స్ కి ఒక్కొక్క సైనికుడూ కూలిపోయినట్టు కుందేళ్ళు ఒకదాని తరువాత ఒకటి మరణించటాన్ని హంసలేఖ స్తబ్ధురాలై చూసింది.     అంతలో ఆమె వెనుక నీడ పొడుగ్గా పాకింది. ఆమె ఇంకా ఆ నిశ్చేష్ఠావస్థలో వుండగానే భుజం మీద చెయ్యి పడింది. కెవ్వున పెట్టాలనుకున్న కేకని అతి కష్టంమీద ఆపుకుంది. కారణం -ఎదురుగా  తండ్రి నిలబడి వుండడం.     "ఏమిటమ్మా  ఇక్కడ నిలబడి వున్నావు?"     "నాన్నా..... యిక్కడ ..... యిక్కడ ......... ఏం జరుగుతూ వుందో తెలుసా?"       సర్పభూషణరావు నవ్వాడు "ఏమీ జరగడం లేదమ్మా. భయంకరమైన కాన్సర్ వ్యాధిని నయంచేసే ప్రక్రియ గురించి అక్క  ప్రయోగం చేస్తూ వుందంతే."     "కానీ........ ఈ జనం..........?" అంది శవాకారంలో వున్న మనుషుల్ని చూపిస్తూ.     "ఎలాగూ కొద్దికాలంలో మరణించబోయే కాన్సర్ పేషెంట్లు. మిగతా విషయాలు బయటకువెళ్ళి మాట్లాడుకుందాం రామ్మా. వీళ్ళకెందుకు డిస్ట్రబెన్స్" అంటూ భవంతి బయటకు తీసుకొచ్చాడు.     సరిగ్గా అదే సమయంలో నేత్ర అక్కడికి వచ్చి చెట్ల చాటు నుంచి చూసాడు.     సర్పభూషణరావు సెక్రెటరీ కొన్ని రోజులక్రితం కార్లో తనతో చెప్పిన విషయం గుర్తొచ్చింది. "ఆయన కూతురు కూడా రిసెర్చి చేస్తుంది. విషయం ఏమిటో తెలీదు. చాలా రహస్యంగా జరుగుతూ వుంటాయని."     అతను వాళ్ళకి  దూరంగా వున్నాడు. వాళ్ళు మాట్లాడుకుంటున్నది అతడికి వినపడలేదు. లోపల నుంచి శరీరాల్ని తీసుకువచ్చి వ్యాన్ లో ఎక్కిస్తున్నారు. ఆ క్షణమే వాళ్ళిద్దర్నీ అరెస్టు చేయించవచ్చు. కానీ....... ఆ సాక్ష్యం సరిపోదు. టోటల్ రైడింగ్ చేయించాలి. దానికన్నా ముందు ఆ ప్రయోగం ఏమిటో తెలుసుకోవాలి. ఆ శరీరాలు బ్రతికి వున్నవో లేదో తెలుసుకోవాలి. అవి బ్రతికున్నవినా, లేదా వాళ్ళు చేసేది శవాలమీద ప్రయోగాలలైనా తను అనవసరంగా బయటపడినట్టు అవుతుంది. వాళ్ళకి అంత చిన్న శిక్ష సరిపోదు.     ఇన్ని ఆలోచనలతో అతనుండగా వ్యాన్ దగ్గర  హంసలేఖ తండ్రిని అడుగుతోంది "బయట తాళం వేసి వుండటాలూ, లోపల ప్రయోగాలూ ఏమిటి నాన్నా యిదంతా...."     యస్. బి. ఆర్. భారంగా నిశ్వసించాడు. "లోక కల్యాణార్థం చేసే పన్లకి కూడా చాటు అవసరం. హంసలేఖా. రేప్రొద్దున మేము ఈ మందు కనిపెడితే మాకు  నోబెల్ బహుమతి రావచ్చు. కానీ...... యిలా అనుమతి లేకుండా ప్రయోగాలు చేస్తున్నామని తెలిస్తే ప్రభుత్వం ఒప్పుకోదు. అందుకే మన తోటని ఎన్నుకున్నాం."     నేత్ర తన జేబులోంచి వాకీ టాకీ తీశాడు. మైలుదూరంలో చీఫ్ దగ్గర బెల్  మోగింది. భగీరథరావు స్పీకర్ ఆన్ చేసి "హలో" అన్నాడు.     "నేను ఏజెంట్ నేత్రని మాట్లాడుతున్నాను. యస్.బి. ఆర్. తోటలో అతని కూతురు అనుమానాస్పద పరిస్థితుల్లో ప్రయోగాలు చేస్తూంది. మిగతా విషయాలు నేనొచ్చి చెపుతాను" అని వాకీటాకీని ఆఫ్ చేశాడు. ఎ క్షణమైనా ఏజెంటు ప్రాణాలు పోవచ్చు. అంత ప్రమాదకరమైనది వాళ్ళపని. అందువల్ల ఏజెంట్లు తన పరిశోధనా ఫలితాన్ని చివరి వరకూ వెల్లడి చెయ్యకుండా ఆపు చెయ్యకూడదు. ఎప్పటికప్పుడు తమ డిపార్ట్ మెంట్ కి అంచెలంచెలుగా వివరాలు (ప్రోగ్రెస్_ అందచేస్తూ వుండాలి.     నేత్ర వాకీటాకీ జేబులో పెట్టుకుంటూన్న సమయానికి సర్పభూషణరావు కూతుర్ని  కారెక్కించాడు.     "ఈ విషయం యిక్కడే మర్చిపోతానని, ఎంత బలవంతం చేసినా ఎవరికీ చెప్పనని నామీద ఒట్టెయ్యమ్మా....."     "ఒక మంచి పనికోసం మీరు చేస్తున్నదాన్ని నేనెందుకు బయట పెడతాను నాన్నా...."     "నామీద ఒట్టేస్తేగానీ తృప్తి వుండదమ్మా."     "అలాగే...... నీ మీదొట్టు...... చెప్పను. సరేనా?" కారు కదిలింది. తండ్రి చూస్తూ నిలబడ్డాడు. ఒక్కసారి ఆ కారు గేటు దాటటం ఏమిటి, సెక్యూరిటీ చీఫ్ "ప్రొసీడ్" అన్నాడు. కుక్కలు రంగంలోకి దూకాయి. గార్డ్సు పరుగెడుతున్నారు. అక్కడ వాతావరణం వున్నట్టుండి మారిపోయింది. "అంగుళం అంగుళం గాలించండి" అరుస్తున్నాడు యస్.బి.ఆర్.     నేత్రకి అంత సంచలనం ఒక్కసారిగా ఎందుకొచ్చిందో అర్థం కాలేదు. చిన్నతోట అది. కుక్కల బారినుంచి తప్పించుకోవడం కష్టం. గార్డులు కూడా సుశిక్షితులైన వారిలాగే వున్నారు. కేవలం హంసలేఖ అక్కడినుంచి వెళ్ళిపోవడం కోసం వాళ్ళు ఆగారని అతడికి తెలీదు.     అలారం మోగిన ఇంత సేపటికి వాళ్ళు వెతకటం మొదలుపెట్టటం అతడికి అందుకే ఆశ్చర్యం కలిగించింది.     మృత్యువు తోసుకు వస్తున్నట్టు తోచింది. ఒక గార్డు రెండు కుక్కల్ని పట్టుకుని అటే వస్తున్నాడు. వాటి ఫోర్సుని ఆపటానికి ఆ గార్డు చాలా కష్టపడవలసి వస్తున్నట్టు అతడు పట్టుకున్న గొలుసులే చెబుతున్నాయి. పరాయి వ్యక్తి తాలూకు వాసన పసిగడ్తూ దూసుకు వస్తున్నాయవి.     నేత్ర బిల్డింగ్ వైపు పరుగెత్తాడు. పక్కనున్న చెట్టెక్కి బిల్డింగ్ మీదకు దూకాడు.     వెనుక వస్తూన్న కుక్కలు ఆ చెట్టువరకు వచ్చి మొరగడం ప్రారంభించాయి.     గార్డ్ చెట్టుమీదకు గన్ పేల్చడం ప్రారంభించాడు. దట్టంగా కొమ్మలు, ఆకులు వున్న చెట్టు అది. ఒక రౌండ్ కాల్చి ఆపి, ఒక గార్డు చెట్టెక్కడం మొదలు పెట్టాడు.
24,928
         శ్రీరాం వాళ్ళ ఇంటికి ప్రతిమ వచ్చేసి నాలుగు రోజులవుతోంది. జరిగినదంతా కల కాదనీ, నిజమేననీ నమ్మాలంటే కష్టమనిపిస్తోంది. తనకి ఇరవై నాలుగేళ్లపాటు సాదాగా, సీదాగా సాగిపోయింది తన జీవితం. ఎలాంటి వేళలో శ్రీరాం తనని పెళ్ళి చేసుకుంటానని ప్రపోజు చేశాడో గానీ, అప్పటినుంచీ నమ్మశక్యంగాని సంఘటనలన్నీ జరుగుతున్నాయి. తను బతికి ఉండగానే అంత్యక్రియలు జరిపించేశాడా తండ్రి! ఎందుకంత పగ తనంటే? తను అంత కానిపని ఏం చేసింది?          తను ఇల్లు వదిలి వచ్చేసిందా?          తను! ప్రతిమ! చీకటిపడితే సందు చివరిదాకా వెళ్ళడానికి జంకే ప్రతిమ, ఎవ్వరితో ఒక్క మాటయినా చెప్పకుండా ఇల్లు వదిలి వచ్చేసిందా? పెళ్ళి కాకుండానే, కాబోయే భర్త ఇంట్లో ఉంటోందా తను? 'అత్తగార్లు అంటే రాక్షసి మూకలు' అని చిన్నప్పట్నుంచీ అమ్మ నూరిపోసిన మాటల్ని పటాపంచలు చేస్తూ, దేవతలాంటి అత్తగారి పంచన చేరిందా తను?     ఆమె తనమీద చూపిస్తున్నంత అభిమానం అమ్మ కూడా ఎప్పుడూ చూపించలేదు.          వంటిల్లూ, కాలేజీ, హాస్పిటలూ తప్ప వేరే ప్రపంచం తెలియకుండా పెరిగిన తను - ముంగి అని కజిన్స్ వెక్కిరించే తను ఏదో సినిమా హీరోయిన్ లా ప్రేమలో పడిపోయి, ప్రేమించిన వాడి కోసం ప్రపంచాన్ని ఎదిరించి వచ్చేసిందా?          ఇదంతా నిజంగానే జరుగుతోందా అసలు?          మళ్ళీ ఇంతలోకే ఇంకో భావన. ఇదంతా ప్రేమకోసం చేస్తోందా తను? శ్రీరాంని అంతగా ప్రేమిస్తోందా?          చాలాసార్లు ఈ ప్రశ్న తనని తాను వేసుకుని తరచి చూసుకుంది ప్రతిమ.          ఉహు! ఇది ప్రేమ కాదు!          అతనిపట్ల తనకు ప్రత్యేకమైన 'ప్రేమ'  లేదు కానీ, వైముఖ్యం కూడా లేదు -నిశ్చయంగా.        ఒకవేళ తను నిజంగానే ప్రేమలోపడి ఉంటే ఇలానే ఉంటుందా తన మానసిక స్థితి! ఉహు! కాదు. తను శతకోటి పుస్తకాలలో చదివింది. ప్రేమ అంటే ఏదో మధురమైన ఎగ్జయిటింగ్ ఎక్ స్ పీరియెన్స్ అని రాస్తారు.          అంత ఎక్సయిట్ మెంట్ ఏమీ ఫీలవటం లేదు తను.          పుస్తకాలలో రాసినదాని ప్రకారమైతే తను అతన్ని తలుచుకోగానే, చూడగానే ఉద్వేగం పొందాలి. అతన్ని తలుచుకోకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోవాలి. అతన్ని చూడాలనీ, అతన్ని తాకుతూ దగ్గరగా నిలబడి మాట్లాడాలనీ తహతహలాడిపోవాలి.          అలాగేం అనిపించడం లేదు తనకి!          ఒకవేళ నిజంగానే తను ఉద్వేగం పొందుతూ ఉంటే అతన్ని గురించి ఇంత క్లినికల్ గా, లేబరేటరీలో ప్రాక్టికల్సు చేస్తున్నంత మామూలుగా ఆలోచించడం సాధ్యం కాదు. అతన్ని తలుచుకోగానే తన చేతిమీద ఉన్న ఈ సన్నటి రోమాలు నిలుచోవాలి. గగుర్పాటు కలగాలి.          అదీ ప్రేమ కలిగించే ఎగ్జయిట్ మెంట్ అంటే!          సర్టెన్లీ తనకా అనుభూతి కలగటం లేదు. కానీ, అదే సమయంలో అతనంటే తనకు నెగెటివ్ ఫీలింగ్సేమీ లేవు. అతన్ని వెళ్ళి చేసుకోవడానికి అభ్యంతరాలు లేవు.              ష్యూర్!          పైగా, అతను తనకోసం చాలా అవమానాలు సహించాడన్న అభిమానం ఉన్నది తనకి. తనవల్ల అతనికి తలవంపులు కలిగిందే అన్న గిల్టీ ఫీలింగ్ కూడా ఉంది. తనని ఆ పిచ్చాసుపత్రిలాంటి ఇంట్లోనుంచీ విడుదల చేశాడన్న కృతజ్ఞత కూడా ఉంది.          "పొద్దస్తమానం అలా కలలు కంటూ కూచోకే! మహా అయితే ఇంకో ఇరవై రోజులు! ఆ తర్వాత థియరీ ముగిసి, ఎంచక్కా ప్రాక్టికల్సు మొదలవుతాయి. అండ్ యాజు యూజువల్ యూ విల్ కమ్ అవుట్ విత్ ఫ్లయింగ్ కలర్స్! కాస్త వోపిక పట్టూ!" అంది శృతి లోపలికి వస్తూ.          "నాకేం తొందరలేదు! నేనే ప్రాక్టికల్సు గురించి తహతహలాడి పోవడంలేదు. అండ్ యూ బెటర్ హోల్డ్ యువర్ టంగ్! వూరికే వాగకు!" అంది ప్రతిమ కోపంగా.          నవ్వి, సరస్వతి దగ్గరికి వెళ్ళిపోయింది శృతి.          శ్రీరాం వాళ్ళ ఇంటి కొచ్చేసినప్పటినుంచీ హాస్పిటల్ కి వెళ్ళలేదు ప్రతిమ. పెళ్ళి రిజిస్టర్ అయ్యేదాకా హాస్పిటల్ కి పంపనని చెప్పేసింది సరస్వతి.          ఇదివరకయితే హాస్పిటల్ నుంచి తిరిగిరాగానే తను ఏదన్నా చదువుకుంటూ కూర్చోవాలని అనుకోవడమూ, అంతలోనే అమ్మ ఏదన్నా పని అప్పగించేసి తరమడమూ జరిగేది.          ఈ ఇంట్లో అలా కాదు.          ఇక్కడికి వచ్చిన రెండో రోజున తను డ్రాయింగ్ రూంలో షెల్ఫులో అందంగా పేర్చి ఉన్న పుస్తకాలు తీసింది. 'జాస్', 'కోమా' రెండూ ఒకదాని తర్వాత ఒకటి చదివేసరికి సాయంత్రం ఆరయింది.          ఉలిక్కిపడి లేచింది ప్రతిమ. తను ఇక్కడ వంట చెయ్యనక్కర్లేదా?          పక్కనే ఖాళీ కాఫీ కప్పు కనబడింది.          తను కాఫీ కూడా తాగిందా! ఎప్పుడు?          తన పరధ్యానానికి తనమీద తనకే కోపం వచ్చింది ప్రతిమకి. ఇంక తన అలవాట్లు మార్చుకోవాలి. లేకపోతే బావుండదు.          నేరం చేసినట్లు ఫీలవుతూ లివింగ్ రూంలోకి వెళ్ళింది. సరస్వతి కూర్చుని వక్కపొడిలోకి సుగంధ ద్రవ్యాలేవో నూరుతోంది.         "ఏమ్మా! అయిందా చదువు? దా!" అంది నవ్వుతూ.          ఇబ్బంది పడిపోతూ "నేను వంట చెయ్యగలను - మొదలెట్టమంటారా?" అంది ప్రతిమ.          "ఎందుకూ? సుబ్రమణి ఉన్నాడుగా! నువ్వేం హైరానా పడిపోనక్కర్లేదు. ఇంకో కప్పు కాఫీ ఇచ్చేదా? లేకపోతే పెందరాళే భోజనం చేసేస్తావా?"          "సారీ! మీరేనా ఇందాక కాఫీ ఇచ్చింది! నేను గమనించను కూడా లేదు. చదువుతున్నప్పుడు నన్ను నేనే మర్చిపోతుంటాను." అంది ప్రతిమ, క్షమాపణ చెబుతూ.              "చదువు మీద ధ్యాస ఉండడం మంచిదే!" అని నవ్వి, "సుబ్రమణీ! అమ్మాయికి కాఫీ ఇవ్వు. అలాగే నాకూ ఓ కప్పు ఇవ్వు!" అంది సరస్వతి వంట మనిషితో.                                                                    * * * * *          "త్వరగా బయలుదేరండి. శాస్త్రిగారు చెప్పిన ముహూర్తం దాటిపోతుంది!" అని హడావిడి చేస్తున్నాడు శ్రీరాం.          ఆ రోజే రిజిస్ట్రార్ ఆఫీసుకెళ్ళి సంతకాలు పెట్టాలి.          "వస్తున్నా ఉండరా! మరీ హడావిడి పెట్టెయ్యకూ!" అంది సరస్వతి. ఆవిడ హైరాన పడిపోతోంది. ఆవిడతోబాటు సతమతమైపోతోంది శృతి.          శ్రీరాం కొనితెచ్చిన చీర కట్టుకుంది ప్రతిమ. ఆ ఇంటికి వచ్చిన మర్నాడే - సరస్వతి రెండు చీరలు కొనుక్కురమ్మని చెప్పింది శ్రీరాం. అతను తనే సెలక్టు చేసి తీసుకొచ్చాడు.
24,929
        అచ్యుతం తల్లి కనకం శోకాలు పెడుతూ వచ్చింది ఆచారి ఇంటికి.     "నాలుగు మంత్రాలు నేర్చుకుని నాకు జీలనాధారం అవుతాడని నీ దగ్గర వదిలి వెళ్లానయ్యా! నీ వెధవ చెల్లెలు ఇలా కొంపముంచుతుందని, వాడిని  సర్వనాశనం చేస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు! వాడు  చచ్చినా ఇంత బాధ పడకపోదును! మాకు సంపదలేకపోవచ్చును. కాని, మచ్చ లేని వంశం. వంశానికే కళంకం తెచ్చాడు ఆ వెధవ పీనుగ. అమ్మో! నోట్లో వేలుపెడితే కొరకలేనట్టుగా వుండేవాడు ఇంత పని చేశాడంటే నేను నమ్మలేకుండా వున్నాను! ఇదంతా నీ చెల్లెలు ప్రోత్సాహమే అయి వుంటుంది."     "......."నోట మాటలేక అవమానభారంతో తలొంచుకున్నాడు ఆచారి.     వెనుక నుండి అందుకొంది జయలక్ష్మి. "నిజంగా నీ కొడుకు అమాయకుడే, పిన్నీ! ఈ నెరజాణ ఏం మాయ చేసిందో! ఎలా వల్లోకి లాగిందో! మీ అచ్యుతం ఈ ఇంటికి వచ్చినప్పటినుండి ఆమె కళ్లన్నీ అతడిమీదే!అక్కడికీ నేను మందలిస్తూనే వున్నాను ఆమెను. అందుకే మబ్బుపట్టిన ఆకాశాన్నీ, మగడు చచ్చిన ముండనూ నమ్మొద్దన్నారు."      "పట్టుమని పది పైసలు సంపాదించుకోలేని కుంక వీడిని కట్టుకుని అదేం సాదిద్దామనుకుందో? ఎలా బ్రతుకుదామనుకొందో!"     "ఇడ్లీ ఇడ్లీ, సాంబార్ సాంబార్ అని వీధుల్లో కేకలేస్తూ బాగానే బతుకుతున్నారులెండి."     "అంటే వీధినబడి నా కొడుకు ఇడ్లీ అమ్ముతున్నాడా? అయ్యో! బిడ్డ ఏనాడైనా ఇంత పరువుమాలిన పనిచేశాడా? మా దగ్గర కాసులు లేకపోయినా ఎంత పరువుగా బ్రతికాం! చివరికి ఎలాంటి గతి పట్టిందమ్మా బిడ్డడికి! స్త్రీ బుద్ది ప్రళయాంతకం అని ఈ ముండ ఎంతపని చేసిందమ్మా! అభం శుభం తెలియని కుర్రాడిని లేవదీసుకువెళ్లి" మళ్లీ ఒక రాగంతీసింది కనకమ్మ. "ఇదంతా  వింటూంటే  అది తిన్నగా వీడితో కాపురం చేస్తుందనిపించడం లేదు! ఎంతమందిని మారుస్తుందో. మహాతల్లి. అటు ఇటు కాక నా బిడ్డ అన్యాయమై, ఆ అవమానం భరించలేక ఏ అఘాయిత్యానికి తలపడతాడో! వాడి మనస్సంత సున్నితం!"     "ఇక సున్నితమంతా వదులుతుంది లెండి, పిన్నిగారూ! వీపు దెబ్బ, చెంప దెబ్బా గోడ దెబ్బా తగులుతూంటే!"     "అయ్యో! నా బిడ్డకి ఎన్ని కష్టాలు వచ్చాయమ్మా! అలా శెట్టి అంగడికి వెళ్లి పప్పు, ఉప్పు తెమ్మంటేనే మహా బిడియపడిపోయేవాడు! వాళ్ల అడ్రసు తెలిస్తే రాసియ్యవయ్యా!"     "నాకు తెలియదత్తా!"     "మరి వాడు వీధుల్లో ఇడ్లీ లమ్ముకుంటున్నాడని చెబుతూందే నీ భార్య?"     "మొన్న నడిమింటి గోపాలం పట్నం వెళితే మలక్ పేటలోనో, ఎక్కడో అచ్యుతం ఇడ్లీలమ్ముతూ కనిపించాడట!" ఆ సంగతి వచ్చి చెప్పాడు ఎక్కడుంటావు, ఏమిటి అని అడుగుదామనేసరికి  అచ్యుతం ముఖం తప్పించాడట!"     "వాడి అడ్రసు తెలియంగానే నాకు కబురుపెట్టునాయనా!వెళ్లి వెధవను ఈడ్చుకువస్తాను!"     "ఇహ వాళ్ల అడ్రసుతో మాకేంపని అండీ! మాకు అది చచ్చినదానితో సమానం! ఎక్కడున్నారో, ఎలా వున్నారో మాకు అక్కరలేదు" ఈసడింపుగా చెప్పింది జయలక్ష్మి.                      *    *    *    *         మిసపప్పడాలు ఒక్కొక్కటే వత్తి పేపరుమీద వేస్తున్నది శంకరి.     గుమ్మంలో చేతులు కట్టుకు నిలబడి చూస్తున్నాడు. అచ్యుతం.     రెండు గంటలుగా ఆమె ఏకాగ్రంగా అదేపని చేస్తూంది ఎంత అలసట చెందిందీ చెమటలు  కారిపోతున్న ఆమె ముఖమే చెబుతూంది!  నీళ్ళలో అప్పుడే ముంచి  తీసిన గులాబీ పువ్వులా వుంది ఆమె ముఖం. చెమటకు ముంగురులు నుదుటికి అంటుకుపోయాయి. అంత  అలసటలోనూ ముఖంలో అందం ఇనుమడించినట్టుగా వుంది. అయితే అచ్యుతం  ఇందాకటినుంచి చూస్తున్నది ఇనుమడించిన ఆమె  అందాన్ని కాదు, ఆమెముఖంలో వ్యక్తమౌతూన్న అలసటని చూస్తున్నాడు. అంత అలసటలోనూ ఆమె పని ఆపక పోవడం చూస్తున్నాడు.     నొప్పెడుతూన్న చేతుల్ని ఒకసారి ఝాడించి తిరిగి పిండి పిసగబోతూ గుమ్మంలో చేతులు కట్టుకొని తదేకంగా తననే చూస్తున్న అచ్యుతాన్ని చూసింది శంకరి. "అదేమిటి? ఎవరో బయటి మనిషిలా అక్కడే నిలబడిపోయావేం?" విస్మయంగా అడిగింది.     "ఇంతపని ఎందుకు పెట్టుకొంటున్నావు? ఉదయం బుట్టెడు మురుకులు పండి కాల్చావు! ఇప్పుడు అప్పడాలు! మనం యిద్దరం బ్రతకడంకోసం ఇంతపని చేయాలా?"     "మరి కాస్త వచ్చి సాయం చేయరాదూ"     అచ్యుతం దగ్గరికివచ్చి ఆమె చేతులలో వున్న పిండి ముద్ద తీసుకోబోతూ ఎర్రగా రక్తం చిమ్ముతున్నట్టుగా  వున్న ఆమె చేతుల్ని చూశాడు.  పిండిముద్దల్ని వదిలేసి ఆమె చేతుల్ని అందుకొన్నాడు. అతడి కళ్ళల్లో నీటితడి మెరిసింది. "ఈ సుఖంకోసమేనా నువ్వు ఇంట్లోంచి వచ్చేసింది?"      
24,930
     చిరాగ్గా వున్న పులి కోపంతో గాండ్రించి, పంజాతో ఒక్కదెబ్బ కొట్టింది కింద పడిన పాల పిట్టను.          నీలం రంగు పాల పిట్ట ఎర్రగా మారింది.          నిశ్చలంగా ఆగిపోయి చూశాడు సుధీర్. ఆ జూలో అడుగు పెట్టిన తర్వాత అతను దృష్టి కేంద్రీకరించి చూసిన దృశ్యం అది ఒకటే! భీభత్సంగా, ఉద్రేకపూరితంగా ఉందా దృశ్యం.          "అయ్యో పాపం!" అంది శశి, జాలిగా ఆ పిట్టను చూస్తూ.          "అమ్మో!" అంది వసుమతి, భయంగా పులిని చూస్తూ.          "యూ బాస్టర్డ్!" అన్నాడు రాజన్, పులిని చూసి పిడికిలి గాల్లో వూపుతూ.          ఆ దృశ్యం చూసిన తర్వాత శశీ, వసుమతీ, రాజన్ కాస్త డల్ గా అయిపోతే, సుధీర్ మొహంలోకి ఉత్సాహం వచ్చింది.          "యూనో! ఇది రాయల్ బెంగాల్ టైగర్! ఎంత అందంగా ఉందో!" అన్నాడు మెచ్చుకోలుగా చూస్తూ.          "మీకు బొత్తిగా భయం లేదు!" అంది శశి సుధీర్ వైపు ఇష్టంగా చూస్తూ. అతనిలోని క్రౌర్యాన్ని ఆమె ధీరత్వంగా భ్రమపడింది.          "అవునవును! పేరే సుధీరుడుకదా! పొరబాట్న డాక్టరైపోయాడు. పెద్ద వేటగాడు కావలసినవాడు" అన్నాడు రాజన్.          "పెద్ద వేటగాడే లెండి! మంచి 'లేడీ'నే పట్టుకున్నాడు" అంది వసుమతి, శశిని చూపించి అర్ధవంతంగా నవ్వుతూ. కానీ ఆమెకి మనసులో అదోలా ఉంది. మొదటిసారిగా సుధీర్ ప్రవర్తన అసహజంగా కనబడింది. 'అయ్యో పాపం!' అనిపించాల్సిన దృశ్యాన్ని అతను హుషారుగా చూశాడు.          ఇంకో అరగంట తర్వాత బాగా పచ్చిక ఉన్న స్థలం వెదుక్కుని జంబుఖానా పరిచారు.          హాట్ కేస్ తెరిచింది వసుమతి. కట్ లెట్లు, శాండి విచెస్, సమోసాలు.          తళతళ మెరుస్తున్న స్టీలు కారియరు విప్పింది శశి. పులిహోర, పెరుగన్నం....సంప్రదాయసిద్దంగా ఉన్న ఉపాహారం.          "మీరు పాత కొత్తల మేలు కలయిక" అన్నాడు రాజన్.          మొహమాటంగా నవ్వింది శశి.          తినడం పూర్తయ్యాక కాసేపు కార్ద్సు ఆడారు సరదాగా.          శశిది ఎనభై రూపాయలు పోయింది. వసుమతిది ఇరవై రూపాయలు, సుధీర్ ధీ అరవై ఆరూ పోయాయి. డబ్బంతా రాజన్ గెల్చేసుకున్నాడు. పట్టపగ్గాల్లేకుండా ఉంది అతని సంతోషం.          సుధీర్ మొహంలో చిరాకు కనబడింది. వోడిపోయినందుకు అసహనంగా వుంది మనసు.         శశి లేచి వాటర్ బాటిల్ తో నీళ్ళు తేవడానికి పంపు దగ్గరి కెళ్ళింది. రాజన్ ఏదో చెబుతూంటే వింటూంది వసుమతి.          అప్పుడు ఎగురుతూ వచ్చి అతని మీద వాలిందొక సీతాకోకచిలుక, తరవాత జారుతూ గడ్డిలో పడింది.          తీక్షణంగా దాన్ని చూసి, చేత్తో కొట్టాడు సుధీర్.          గడ్డిలో అణిగిపోయింది సీతాకోకచిలుక. తెగిన రెక్కలు గాలికి మెల్లిగా ఎగిరిపోయాయి.          అప్రయత్నంగా అటు చూసిన వసుమతి నిశ్చేష్టురాలై పోయింది. పాలపిట్టని పంజాతో కొట్టిన పులి గుర్తొచ్చిందామెకి.          "ఏమిటలా ఉన్నావ్?" అన్నాడు రాజన్.          "ఏమీ లేదు!" అంది వసుమతి తెప్పరిల్లుకుంటూ.          శశి నీళ్ళు పట్టుకుని వచ్చింది. సుధీర్ చెయ్యి కడుక్కోవడానికి పంపు దగ్గరకి వెళ్ళాడు.                                                                    * * *          ఒక ఇంటిముందు ఆగి, "రామ్మూర్తీ" అని కేకేశాడు శంకర్రావు.          రెండోసారి పిలుపుకి-"వోయ్! వస్తున్నా!" సమాధానం వినబడింది.          శనివారం పొద్దున్న-ఆరుంపావు ప్రాంతం. రేడియోల్లోంచి సుప్రభాతం వినబడుతూంది.          గోడకి కన్నంలా ఉన్న ద్వారం. దానికి రేకు తలుపు. అది తెరుచుకుని బయటికి తొంగి చూశాడు రామ్మూర్తి.          "దా కాఫీ తాగి వెళ్దాం!" అన్నాడు.          కాఫీ దేముందిలే! తాగే వచ్చాను. నువ్వు త్వరగా రా!" అన్నాడు శంకర్రావు.          "అయితే ఒక్క అయిదు నిమిషాలు!" అన్నాడు రామ్మూర్తి. పది నిమిషాల తరవాత బయటికి వచ్చాడు.          పోట్లాడుకుంటున్న రెండు కుక్కల్ని చూస్తూ నిలబడ్డాడు శంకర్రావు.          "వెళ్దామా?" అన్నాడు రామ్మూర్తి.          ఇద్దరూ త్వరత్వరగా నడుస్తున్నారు.          "చాలా దూరమా?" అన్నాడు శంకర్రావు.
24,931
"ఈయనకి మతిమరుపు అని చెపుతున్నారు కదా, అక్కడ ఆయన యింట్లో బ్యాగ్ మరచిపోయి ప్రయాణమయి వుంటాడు. వెంటనే అక్కడికి వెళ్ళి చూడండి." ఇన్ స్పెక్టర్ నవ్వుతూ అన్నాడు. ఆయన మాటలకి అందరూ నవ్వారు. రావుబహద్దూర్ రంగరాజన్ గారు అయిదు వేలరూపాయలని చంద్రానికి యిచ్చారు. అందరూ వద్దన్నారు, చంద్రము వద్దన్నాడు. "ఇది నా సంతోష పూర్వకంగా యిస్తున్న బహుమతి. లక్షలాది విలువచేసే నగలు మళ్ళీ మాకు దొరికాయి. జేబుదొంగ రాజులుగాడు వివరంగా చెప్పటం వల్ల మా మేనేజర్ తో నగలు పంపించే విషయం తెలిసిన మూడోవ్యక్తి మా లెక్కలు రాసే గుమస్తా గురుమూర్తి. ఎందుకంటే గురుమూర్తిని వర్ణించి చెప్పాడు కదా! ఇంటికి వెళ్ళంగానే వాడి పని చూస్తాను...." అని రావుబహద్దూర్ ఆనందంగా అయిదువేల రూపాయలని బలవంతంగా చంద్రం చేతిలో పెట్టి "ఘనంగా పుట్టినరోజు జరుపుకోవోయి." అని బుగ్గమీద మీటి మేనేజరు సాంబమూర్తితో కలసి వెళ్ళిపోయాడు. అందరూ కలసి ఇన్ స్పెక్టర్ వద్ద శలవు తీసుకుని పోలీసుస్టేషను నుంచి బైటికి వచ్చారు. ఆ తర్వాత చంద్రం రూమ్ కి వెళ్ళారు. రామానుజాచారి కొడుకుని తీసుకుని వెళ్ళిపోయాడు. "చంద్రం పుట్టినరోజు మనింట్లో జరుపుదాము. అందరం కలసి ఊరికి వెళదాము." అంది పార్వతి. ఆ సాయంత్రమే చంద్రము అతని స్నేహితుడు సుబ్బారావ్ తో సహా అందరూ కలసి ఊరికి బయలుదేరారు. పచ్చబ్యాగ్ సస్పెన్స్ మాత్రం అలాగే మిగిలిపోయింది.                                    36పుండరీకాక్షయ్య తలుపు తాళం తీశాడు. పుండరీకాక్షయ్య ముందుగా గదిలో కాలుపెట్టాడు. ఆయన వెనుకనే ఒక్కొక్కరూ లోపలికి నడిచారు. మంచం కిందుగా పచ్చబ్యాగ్ పదిలంగా వుండి కనిపించింది. "నా మతిమరుపు మండిపోను పచ్చబ్యాగ్ యిక్కడే వుంది." అన్నాడు పుండరీకాక్షయ్య. "మతిమరుపు వల్ల చాలా మేలు జరుగుతుందని యీ అనుభవం ద్వారా తెలిసింది కదా బాబాయ్!" శివరావు తేలికపడ్డ మనసుతో అన్నాడు. "నాకు మతిమరపు వస్తే బాగుండును." నవ్వుతూ అన్నాడు మోహనరావు. "ఇప్పుడు నా ప్రాణం పూర్తిగా కుదుటపడింది. ఈ బ్యాగ్ ఎవరైనా బాబాయి చేతిలోంచి దొంగిలించారేమో బ్యాగ్ లోని హల్వా తిని ప్రాణాలు కోల్పోయారేమోనని హడలి చచ్చాను. తెలిసి చేసినా తెలియక చేసినా నేను చేసిన హల్వా తిని ఆపై ప్రాణం పోయినట్లయితే ఆ పాపం... ఆ నేరం.... నాదయ్యేది." అంది పార్వతి. "అమ్మా! ఇప్పుడా బ్యాగ్ లో వున్న హల్వాని ఏం చేద్దాం?" చంద్రం అడిగాడు. విషం కలిపిన హల్వాని కాకులు కూడా తినకుండా పారేయాలని చంద్రం ఉద్దేశ్యం. "గంగలో పారేద్దాము." నవ్వుతూ సలహా చెప్పాడు సుబ్బారావ్. "హల్వా చేసిన హడావిడి ఆఖరిక్షణం దాకా హడలు పుట్టించి చంపింది. అది చాలకనా బాబూ! గంగలో కలపటం? ఇప్పటికే ఆ గంగమ్మ తల్లి సర్వ పాపాలని, సర్వ కల్మష విషాలని తన కడుపులో దాచుకుని ఉంది. యింక ఈ విషం కూడానా వద్దు వద్దు." అన్నాడు పుండరీకాక్షయ్య. ఆయన కంగారుకి ఆయన అన్న తీరుకి అందరూ నవ్వారు. అందరి మనసులు పచ్చబ్యాగ్ ని అక్కడ చూడంగానే తేలిక పడ్డాయి. పచ్చబ్యాగ్ మాత్రం తనకేమి పట్టనట్లు ఇంకా అక్కడే వుంది. మరి పచ్చబ్యాగ్ లోని విషం కలిపిన హల్వాకి ఆఖరిక్షణం ఎప్పుడో! ఎప్పుడో కాదు ఇదిగో ఇప్పుడే. [నీతి-మనిషి అన్నవాడికి మతిమరపు వుండాలి. మతిమరపు తెచ్చుకున్న మంచి ఫలితాలు ఎన్నో....]                                                           * సమాప్తం *
24,932
    ఇక్కడ ఉన్నంత సేపూ  రోడ్డుమీద నుంచి  ఎన్ని కార్లు పోయినా తననెవరూ  గమనించరు. తాను అరిచి కేకలు  పెట్టినా  వాళ్ళకు వినిపించదు.     ఇందులోంచి  ఎలాగైనా బయటపడాలి. చేతికి కారు డోర్ తగిలింది. బలమంతా  ఉపయోగించి త్రోశాడు. ఊడిరాలేదు.     భుజం వెనకా, కడుపులోనూ  నిప్పు ముద్దలు  పెట్టినట్లు  మండుతోంది. చేత్తో కత్తితో  పొడిచిన  చోట తడిమి చూసుకున్నాడు. రక్తంతో తడిసిపోవటంవల్ల బాగా చల్లగా తగిలిందిగానీ, ప్రస్తుతం  రక్తం  కారటం లేదు. బ్లడ్  కో ఆర్జ్యుయేలయి ఉంటుంది. లేకపోతే  గాయం అంతలోతుగా  వెళ్ళలేదేమో? లేకపోతే హెమరేజ్ ఎందుకు  ఆగిపోతుంది?     కారు తలక్రిందులుగా   వుంది. రెండోవైపు  తలుపు తెరవటానికి  సాధ్యపడదు. ఇందాకటి  తలుపే  మరికాస్త ముందుకు జరిగి, హ్యాండిల్ కదిలిస్తూ  రెండు చేతుల్తోనూ, భుజాలతోనూ  గట్టిగా  తోశాడు.     పది నిమిషాలు గడిచాక  డోర్  కొంచెం కదిలింది.     మనసులో  ప్రజ్ఞ  రూపం  మెదుల్తోంది. అక్కడ ఆమె ...ఉద్రేకం పదింతలవగా  లేచి శక్తినంతా  తెచ్చుకుని  డోర్  గట్టిగా త్రోస్తున్నాడు.     చివరికతని  శ్రమ ఫలించింది. డోర్  తెరుచుకుంది. మెల్లగా పాక్కుంటూ, క్రింద పడిపోకుండా  జాగ్రత్త  పడుతూ  బయటకు వచ్చాడు.     చలిగాలి  రివ్వుమని తగిలి  వొంటిమీద  గాయాలన్నీ  భగభగమని  మండిపోయాయి. కారులోంచి  బయటకు  రావటంతో  శరీరం  చాలా చోట్ల  గీట్లుపడి  తిరిగి రక్తసిక్తమవుతోంది. నెమ్మదిగా  కారులోంచి  పూర్తిగా  దిగి నేలమీదకు వచ్చాడు.     బయటంతా  కటిక చీకటిగా వుంది. కళ్ళు చిట్లించుకుని చూసి తాను రోడ్డుకి  యించుమించు యిరవై  అడుగుల దిగువ  భాగంలో వున్నట్లు గ్రహించాడు. పైగా  తన చుట్టూ  తుప్పలూ, పొదలూ నిండివున్నాయి.     శరీరంలో  శక్తి ఏమాత్రం లేదు. రక్తస్రావం విపరీతంగా జరగటం వల్లా అసలు నిలబడటం కష్టంగా వుంది. ఈ స్థితిలో  యిరవై అడుగులు దూరం పైకి  ఎక్కగలడా ? ఎక్కి తీరాలి.     పైకి వెళ్ళాలంటే  ఏటవాలుగా  ప్రాకాలి. ఒక్కొక్క అడుగూ వేస్తూ, ప్రక్కన నేల్లో మొలిచిన  చిన్న చిన్న మొక్కల్ని  ఆధారం చేసుకుని పడిపోకుండా  నిలబడుతూ  కాస్త కాస్త  పైకి  వెడుతున్నాడు.     అయిదారడుగులు  కూడా ఎక్కి  వుండడు. ప్రక్కనే వున్న  చెట్టు  కొమ్మ చేతిలోంచి పట్టుజారిపోయింది. కాళ్ళు  బ్యాలెన్స్ తప్పి  తిరిగి వెనక్కి దొర్లిపోయాడు.                     *               *               *     యోగి నవ్విన నవ్వు తరంగాలుగా వ్యాపిస్తూండగా  ఒక్క క్షణం ప్రజ్ఞ నిర్ఘాంతపోయి నిలబడింది.     "ప్రజ్ఞా! ఈ యింట్లోకి  నువ్వు నిన్నగాక  మొన్న వచ్చావు. ఇది నేను పుట్టి పెరిగిన యిల్లు. ఏ వస్తువెక్కడుంటుందో  నాకు క్షుణ్ణంగా  తెలుసు."     ఆమె నిశ్చేష్టతనుండి  తేరుకుంది. టైము లేదు. చెయ్యి  పైకెత్తి గడియమీద వేసింది.     ఒక్క దూకులో అతనామె  దగ్గరకు వచ్చాడు.  గడియ  సగం కూడా తీసి ఉండదు. అతని ఉక్కు పిడికిలితో  ఆమె మృదువైన వ్రేళ్ళు నలిగిపోయినాయి.     బాధతో  కెవ్వుమని అరవబోయి  తమాయించుకుంది.     "నన్ను తప్పించుకోవటం  నీ తరం కాదని చెప్పానా?" అంటూ ఆమె చెయ్యి  వదిలిపెట్టి  చెంప  పగిలిపోయేటట్లు  ఫెడీమని  కొట్టాడు.               చెంప భగ్గుమంది. తల తిరిగినట్లయి  రెండడుగుల  దూరంలోకి  తూలింది.     "రాక్షసీ! ఎంత పొగరే నీకు? నువ్వు కావాలని, నిన్ను పొందాలని  నేను అలమటిస్తోన్న  కొద్దీ  అహంతో  మిడిసిపడుతూ  ఎదురు తిరుగుతావా? ఈ రోజు  నీ అహాన్ని  ముక్కలు  ముక్కలు  చేస్తాను" అంటూ దగ్గర కొచ్చి  కసితీరా  ఆ చెంపా యీ  చెంపా  వాయగొట్టాడు.     ప్రజ్ఞ  శిలా  విగ్రహంలా  అలాగే  నిలబడివుంది.     "రా" అంటూ ఆమె రెక్కపుచ్చుకుని  దయాకర్  పడకగదిలోకి  విసురుగా  లాక్కువెళ్ళాడు.     "ప్రజ్ఞా! ఎదురుగావున్న  నిలువుటద్దం  చూచావుకదూ! ఆ అద్దంలో  నీ నగ్న రూపం  ఎలా వుందో  చూసుకుందువుగాని. నీ బట్టలు  ఒకటొకటీ  వొలిచి ..." అంటూ ఆమె చీరె కుచ్చెళ్ళ మీద చెయ్యి  వెయ్యబోయాడు.     "ఆగు?" అంది ప్రజ్ఞ. ఆమె  ముఖంలోకి  చూశాడు.     "యోగీ! నెలల తరబడి  నాకోసం తపించావు. నన్ను  లోబర్చుకుందామని  ఎన్నో  ప్రయత్నాలు  చేశావు. ఇన్నాళ్ళూ  నిన్ను  ధిక్కరిస్తూ  వచ్చినమాట నిజమే. నీతో  పోటీ  పడ్డాను. యుద్ధానికి సిద్ధ పడ్డాను. కాని చివరికి  నువ్వే జయించావు. ఇప్పుడు ...యీ స్థితిలో  అనంగీకారంతో  నీకు లోబడిపోవక  తప్పటం  లేదు. జరిగిందేదో  జరిగిపోయింది. ఈ ఓటమిలో నన్ను  రాజీ పడనియ్యి. నన్ను బలత్కారించనక్కరలేదు. నాకుగా నేనే  నీకు అర్పించుకుంటున్నాను."     ప్రజ్ఞ  అతనికి  ఎదురుగా  నిలబడి  తన చీరె  ఊడదియ్యసాగింది.                 *                    *                  *     ప్రజ్ఞ! ప్రజ్ఞ! ప్రజ్ఞ!     ఆమె రూపమే, ఆమెని కాపాడాలన్న దీక్షే  దయాకర్ కు ఎక్కడ లేని శక్తి వస్తోంది.  
24,933
    "అది నేను ఊహించి చెప్పలేను. ఆ మంత్రగాళ్ళను పట్టి బంధించటంలో సహకరిస్తే ఆ విషయాలు తెలుస్తాయి"అన్నాడు.     "ఏమో !మాకు భయం..."     " అదిగో !అదే మనిషిలో ఉన్న భయమే పెద్ద దయ్యం. ఆ భయాన్ని దూరం  నెట్టండి ఏ కార్యక్రమమయినా క్రమ పద్దతిలో చేయాలి సిద్దార్థ వంటి యువకులు మీకు సహకరిస్తారు.మరొక్కసారి మీ నీటి బావులను  పరీక్ష చేయిస్తాను."అన్నాడు.         అందరూ చప్పట్లు కొట్టారు.     మొదటిరోజు, మందు తీసుకోవటానికి నిరాకరించిన వారంతా ఆస్పత్రికివెళ్ళారు. సర్పంచి, కలెక్టరుకు టీపార్టీ ఇచ్చాడు     "కలక్టరుగారూ! బాలరాజు విషయం ఏమాలోచించారు?"     "అతను రంగంలోకి రాలేదు. ఏ ఆధారంతో వెళ్దాం అంటారు!"అన్నాడు ఆయన  టీ సిప్ చేస్తూ.     "నా క్లాసుమేటు స్నేహితుడు అలా వెళ్దాం."     "బావుందిగాని నేను రావటం సమంజసంగా ఉండదు. మీరు  వెళ్ళండి"అన్నాడు.     అతడిని సాగనంపారు అందరూ.     "నా మాట విను బాబూ! ఆ బాలరాజు ఇంటికి వెళ్ళినవారు రక్తం కక్కుకు చచ్చిపోతున్నారట."     'నీళ్ళు కలుషితం యెవరు చేసారో విన్నాక కూడా మీరు అలాంటి విషయాలను నమ్ముతున్నారంటే విచారంగా ఉంది."అన్నాడు.     అతను కాసేపు భరత్ తో ఆడుకుని, తండ్రిని చూడాలని వెళ్ళాడు. ఆయన లేచి తిరగకల్గుతున్నాడు.     "రాధిక రాలేదా అమ్మా?"     "ఫైనలియర్ పరీక్షలు! రావటం, వెళ్ళటం నలిగిపోతుందనిక్కడే హాస్టల్లో గెస్టుగా ఉంటున్నది "అన్నదితల్లి.     "మంచిపని చేసావ్. రాధిక నాకు పరాయిదా, మనిషి గా పుట్టినాక ప్రక్కవాడి సమస్యకు స్పందించలేకపోతే యెలా!"అన్నాడు.     ఆమె భోజనం పెట్టింది.     "ఇంకా ఎన్నాళ్ళురా అమ్మ, నాన్నలపై కోపం!"     "నాకు నేనుగా వెళ్ళలే్దు. నాన్న పొమ్మన్నారు,ఆయనరమ్మంటే  తప్పక వస్తాను." అన్నాడు.     "ఆయనకు మనసులో ఉన్నది కాని. నువ్వు ఏమంటావో అని అనలేకపోతున్నారు."     "అననీ. అదికాక ఇప్పుడు నన్ను రమ్మంటే భరత్ కు ఆశ్రయం ఇవ్వాలి."     "భరత్ యెవరు?"     "అదే అన్నయ్య కొడుకు."     " సిద్దూ..." ఆమె ముఖాన రంగులు మారిపోయాయి.     అనుభూతలకన్నా,అనుభంధాలకన్నా , ప్రాణంలేని స్పందనలేని బంధాలకు ప్రాధాన్యత ఇస్తారు మధుమూర్తి ఒకే ఉద్దేశంతో ఇద్దరు స్త్ర్రీలతో కాపురం చేస్తాడు.     ఒకరు చట్ట సమ్మతంగా వారసులు. మరొకరు చట్టానికి వ్యతిరేకులు. అతను గంభీరంగా మారిపోయాడు.     "మీ ఇద్దరి మధ్య నేను నలిగిపోతున్నానురా." అన్నదామె ఆవేదనగా.        " నాన్నగారికి నచ్చచెప్పరాదూ!" అన్నాడు.     "నాకంత ధైర్యం ఉంటే బావుండేదిరా నాయనా"అన్నది ఆమె నిట్టూర్చి, అతను నవ్వాడు.     "పెద్ద చెట్టు  నీడలో మొక్కలు  ఎదగవు.ఇదొకరకంగా మంచికే  అయిందమ్మా. ప్రపంచం తెలుస్తుంది. యెంతదూరం వెళ్ళాను?" అని ఓదార్చాడు.అతని దృష్టీ అంతా బాలరాజు పైనే కేంద్రీకృతం అయిఉండి                                                                                24      రెండు రోజుల తరువాత రాంబాబును తీసుకుని, బాలరాజు ఇంటికి వెళ్ళాడు.     ఊరవతల పోరంబోకు , కంచె,బిదలకు ప్రభుత్వం వారుఇచ్చారు.అదిసాగు చెయ్యలేక ,ఊరిమీద పాలమ్ముకుని బ్రతికే జంగయ్యకు పూట గడవటమే గగనమని అందరికి తెలుసు, మరలాంటిదిఆ స్థలంలో చక్కని బంగళా కట్టాడు.
24,934
    "అదే తెలివితక్కువ పని. ఈ సైకిలు అసలు దొగతనం చేయటానికి ఎవరికైనా మనసు పోయిందా అని ఆశ్చర్యం. నాకన్నా అభుగ్యుడు ఆ పని చేశాడనుకుందాం. ఈ అల్పమైన వస్తువుకోసం పోలీసు వాళ్ళని శ్రమపెట్టడం అవివేకం. ఒకవేళ శ్రమపడి పట్టుకున్నారనుకుందాం, 'ఈ  ముష్టిదానికోసం మమ్మల్ని ఇంత చిరాకు పరిచావా?' అని మనని తిట్టిపోస్తారు. దాన్నలా వొదిలేస్తేనే మంచిది."     నారాయణ ఇలా చెబుతుండగా ప్లీడరుగారి భార్య ఒకసారి బయటకు వచ్చి యిద్దర్నీ తొంగిచూసి మళ్ళీ లోపలకు చక్కాపోయింది.     "ఆవిడలా తొంగిచూసి పోయిందేమిటి?" అన్నాడు నారాయణ.     "ఆవిడంతే. అదోరకం."     తర్వాత ఇద్దరూ లోపలకు వచ్చారు. నారాయణ చెప్పకపోయినా రాధ మాత్రం సైకిలు పోయిన విషయం యింట్లో అంతా చాటింది. అది యింట్లో అందరి ఆందోళనకు హేతువుకూడా అయింది. శారదాంబ కళ్ళు కూడా తుడుచుకుంది.     ఆ సాయంత్రం ప్లీడరుగారు యింటికి వచ్చాక ఆయన అర్ధాంగి ఏమని చెప్పిందోగాని, ఆయన సరాసరి చిదంబరం దగ్గరకువచ్చి అన్నాడు : "సంసారులకు సరియైన మర్యాద జరుగుతుందనే అభిప్రాయంతోనే ఈ యింట్లో చేరాను."     "ఇప్పుడు మీకు ఏం లోటు జరిగింది?" అని చిదంబరం అడిగాడు.     "జరగాల్సిందే జరిగింది. మీ పెద్దబ్బాయ్ మా ఆవిడవంక ఎగాదిగా చూస్తున్నాడుట!"     చిదంబరం సమాధానం చెప్పకుండా ఊరుకున్నాడు.     "పెద్దవారు కాబట్టి చెప్పాను. మీ పిల్లల్ని అదుపులో పెట్టుకోండి" అని ఆయన గబగబ వెళ్ళబోతుంటే చిదంబరం ఆపి- - -     "అయితే కోర్టు వ్యవహారం యేమయింది?" అని అడిగాడు.     "ఒక్క అరగంట ఆగి మా యింటికి రండి."     ఈ సంభాషణ అంతా నారాయణ, రాధ యిద్దరూ వింటున్నారు.     "అన్నాయ్! యిదేమిటి విడ్డూరం? నువ్వెప్పుడూ దాన్ని కన్నెత్తి అయినా చూడలేదే" అన్నది.     నారాయణ నవ్వి అన్నాడు. "ఈ లోకంలో రకరకాల తరహాల మనుషులుంటారు. అందులో ఈమె వొకిత్తె. రెండో భార్య. మనసులో ఏదో దూరాలోచనలో వున్నవారే యిటువంటి అభాండాలు వేస్తుంటారు."     "అయితే మట్టుకు యిలా అభాండాలు వేస్తుంటే అప్రతిష్ట కాదా?"     "ఎందుకు కాడు? ప్రతి మనిషీ తప్పు చేస్తాడు. చాలా సౌందర్యవతినని ఆమె అభిప్రాయం కాబోలు. మరి అందగత్తెలని ఎగాదిగా చూస్తూంటారు కదా. అలాగే తనవంక కూడా అందరూ చూస్తూవుంటారని అనుకుంటోంది. నిజానికి మొదటిసారి ఆమెను చూసినప్పుడు పేరు శునకమ్మకూ సరి" అని పక పక నవ్వి "ప్రతి వారూ తప్పులు చేస్తారు. కొంతవరకూ క్షమించటం మానవధర్మం. వ్యవహారం మరీ ముదిరితే అప్పుడు చూద్దాం" అన్నాడు.     ఆ రోజు గడిచిపోయింది. నారాయణ మరునాడు తమ్ముడికి ఉత్తరం రాశాడు. మూడురోజులు గడిచినా అతని దగ్గర్నుంచి జవాబు రాలేదు. ఇంకా కొన్ని రోజులు గడిచిపోయాక ఆ ఉత్తరం నిండా ముద్రలు వేసుకొని తిరిగి అతని దగ్గరికే వచ్చింది. అదిచూసి రాధ అంది. "చిన్నన్నయ్య మద్రాసులో లేడా?"     "లేనట్లే మరి?"     "ఎక్కడకు పోయివుంటాడు?"     "ఎలా తెలుస్తుంది మనకు?"     మళ్ళీ అతనే అన్నాడు "అక్కడికి వెడితేనేగాని తెలియదు. కాని మద్రాసు పోవటం అంటే మాటలా?" యెంత ఖర్చు?"     "నిజమే" అంది రాధ.     "ఇప్పుడేమి చేయాలో పాలుపోకుండా వుంది. కొన్నాళ్ళయాక వాడే ఉత్తరం రాస్తాడేమో ననుకొంటాను."     "అలాగే జరగవచ్చు."     శారదాంబ యింకా అడుగుతూనే వుంది. కొడుకుని చూసి చాలా రోజులయింది. ఆమెకు తహతహగా వుంది. వాసుకూడా మంచంమీద పడుకొని రాధని "చిన్నన్నయ్య యెప్పుడు వస్తాడక్కా?" అని అడగసాగాడు. నారాయణ ఒక్కసారి అబద్ధం గూడా చెప్పాడు, కొద్ది రోజులలో వస్తున్నానని ఉత్తరం రాశాడని.     సుగుణ వెళ్ళి నేలరోజులయాక ఉత్తరం రాసింది, భర్తను తనని వచ్చి తీసుకెళ్ళమని. రాధగూడా "వదినను తీసుకురా అన్నాయ్" అని బలవంతం చేసింది. సరే అని నారాయణ ఒక్క ఆదివారం గుడివాడ వెళ్ళాడు.     అల్లుడికి చాలా మర్యాదలు చేశారు అత్తగారింట్లో. అతనికి యెక్కువ బావ మరుదులూ, మరదళ్ళూ లేరు. ఒకడే బావమరిది, ఒక్కతే మరదలు. వాళ్ళతో నారాయణ సరదాగానే గడిపాడు. అసలతను వెళ్ళినరోజే భార్యను తీసుకొని వచ్చేద్దామనుకున్నాడు. కాని వాళ్ళు చాలా బలవంతం చేయటంవాళ్ళ విధిలేక ఆగాల్సి వచ్చింది. "రేపు సెలవు లేదు మొర్రో" అన్నా, వాళ్ళు వినిపించుకోలేదు.     ఆ రాత్రి భోజనాలయ్యాక గోవిందరాజుగారు నారాయణ వీధి సావిట్లో కుర్చీలమీద కూర్చున్నారు. సుగుణ వచ్చి బల్లమీద తాంబూలం పెట్టి వెళ్ళింది.     "మీతో కొన్ని విషయాలు మాట్లాడుదామనుకుంటున్నాను చాలా రోజుల్నుంచి" అన్నారు మావగారు.     తనతో ఆయనంత ముఖ్యంగా మాట్లాడవలసింది ఏమిటో అర్థం కాలేదు నారాయణకు.     "మీ ఇంటి విషయాలు."     కాసేపు ఆగి బయట చీకట్లోకి చూస్తూ ఆయనే అన్నాడు. "మిమ్మల్ని చూస్తూంటే నా కనిపిస్తూ వుంటుంది." మీరెందుకింత కష్టపడాలో అర్థం కావటం లేదు" అన్నాడు.     ఈయన ధోరణి నారాయణ కర్థం కాలేదు. "నేనేం కష్టపడుతున్నాను. మా ఆఫీసులో వున్న మిగిలిన గుమాస్తాలెంతో నేనూ అంతే" అన్నాడు.....     "అదే నేను చెప్పే పాయింటు అన్నాడాయన. "వాళ్ళకూ మీకూ ఎంతో భేదం వుంది."     "ఎక్కడ?"     "వాళ్ళు సంపాదించే ఆ నాలుగు డబ్బులూ వాళ్ళకోసమే ఖర్చు పెట్టుకొంటున్నారు. వాళ్ళకోసం అంటే వాళ్ళకోసమే."     "నా కర్థం కావటంలేదు."     "అర్థం చేసుకోవాలి."     "ఎలాగ? మాకోసం మేమూ ఖర్చు పెట్టుకుంటున్నాం."     "అక్కడే నా పాయింటు" అన్నాడాయన. "మీ కోసం అంటే...... మీ........ మీ అందరి కోసమూ. అంతేనా?"     "మేము అంటే మేమందరమూ గాక వేరే ఎవరుంటారు? మీ ఉద్దేశ్యం నాకు బోధపడలేదు."     "ఉహూఁ, అదికాదు" అని. ఆయన తన ఉద్దేశం ఏమిటో విపులంగా చెప్పటానికి పటాయిస్తున్నాడు. చివరికి అన్నాడు.     "మీ శ్రేయస్సును వాడ్ని కాబట్టి చెబుతున్నాను. కాస్త ఆలోచించండి. మీ యింటిలో ఎంతమంది సోమరితనంగా వున్నారు?"     ఆయన అంత చనువు తీసుకోవటంచూసి నారాయణ ఆశ్చర్యంగా వింటున్నాడు.     "అంతమంది తీరిగ్గా కూర్చుంటే మీరెందుకు కష్టపడి పనిచేయాలి?"     నారాయణ ఏదో చెప్పబోయాడు.     "నా ఉద్దేశం - మీ కష్టంలోని సుఖాన్ని యితరులు యెందుకు అనుభవించాలి?"     "వాళ్ళెవరు? నాకు పరాయివాళ్ళా?"     "కాదు. కాని నేను చెప్పేది ఆలోచించండి. ఈ స్థితిలో వున్నప్పుడే యెవరైనా చెమటలు  ఓడ్చి పనిచేయగలిగేది. ఇంకా పదేళ్ళు గడిచాక ఉబలాటం వున్నా సత్తువే వుండదు. మనలో శక్తి సామర్థ్యాలు వున్నప్పుడే భవిష్యత్ మీద ఓ కన్ను  వేసి వుంచుకోవాలి."     "మీ ఉద్దేశ్యం ఏమి చేయమని?"     "అహఁ. నా ఉద్దేశం యేముంది? మీకు చెప్పే అధికారం నాకు లేదు. కాని మీ అభివృద్ధి చూద్దామన్న కుతూహలం వుంది. ఇంత చిన్న వయస్సునుంచి ప్రపంచంలోని సుఖాలేమీ అనుభవించటానికి ప్రయత్నించక, యెదుటివారి సుఖం కోసం కండలు కరిగించుకోవటం."     గోవిందరావుగారి ముఖం చీకటిలో సరిగ్గా కనబడలేదుగాని నారాయణ ముఖం ఎర్రబడింది. కోపంతో "మీ ఉద్దేశ్యం నా కర్థమయింది." అని కటువుగా అన్నాడు.     ఈ కంఠంలో కాఠినత్వం కనిపెట్టి ఆయన తెల్లబోతూ "అదికాదు" అంటూ ఏదో అనబోయాడు.     నారాయణ నిర్మొహమాటంగా "నా కంతా బోధపడింది. ఒక్క మాటలో చెప్పాలంటే మా కుటుంబం  నుంచి నన్ను వేరుపడమనేగా  మీ భావం ? అయితే మీ అల్లుడిని అర్థం చేసుకోవటంలో మీరు చాలా పొరబడ్డారు. నేనేం ప్రయోజకుణ్ని కాకపోయినా, దయావిహీనుణ్నీ, హృదయంలేని పశువుని కాదు. ఇక వొకరి బాగోగుల విషయం నేను పట్టించుకోను. ఒకరు శ్రమపడటల్లేదే అని నొచ్చుకోను. నాకు చాతనైనంతవరకూ శ్రమపడతాను. అంతే. నాతో ఇటువంటి మాటలనకండి" అంటూ అక్కడ నుంచి లేచి గదిలోకి వచ్చేశాడు.     జరిగినదంతా అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది. మామగారూ, తను అసలు యెందుకు చనువుగా మాట్లాడుకోరు. అటువంటిది ఇంత చొరవగా ఎట్లా మాట్లాడగాలిగారా అసహ్యంగా వుంది. ద్రోహాన్ని తలపెట్టే ఇటువంటి మాటలు వినటం అతనికిదే ప్రథమం "బాగానే, సమాధానం నిష్కర్షగా చెప్పానులే" అని సంతోషించాడు.     చాలాసేపు అతనలా వంటరిగా మధనపడుతూ కూర్చున్నాక సుగుణలోపలికి వచ్చింది. ఆమె రాకను గమనించికూడా అతను తల త్రిప్పి చూడలేదు. ఆమె దయ వచ్చి "కోపమా?" అంది.     "చాల్లే"---- నీ గుణం చూపించావు" అన్నాడు నారాయణ.     "నేనేం చేశాను?"     "లేకపోతే ఆయనకు ఇంత ప్రోద్భలం చేయవలసిన అవసరం యేం పట్టింది.     ఆమె ఖిన్నురాలై అతని ముందుకువచ్చి నిలబడి "అందుకు బాధ్యురాలిని నాన్న మీతో ఈ సంభాషణ తీసుకువస్తాడని నాకూ తెలీదు" అంది.     "ఆయన కివన్నీ యెలా తెలిశాయి?"     సుగుణ అమాయకంగా "నిజంగా నాకేం తెలియదు. నేను ఈ ఇంటికి అక్కడనుండి వచ్చిన మొదటి రోజుల్లో నన్ను అక్కడి పరిస్థితులన్నీ చెప్పమని వేధించేవారు. వొట్టువేసి చెబుతున్నాను. నేను  చెడుగా ఏమీ  చెప్పలేదు. బాగానే గడిచి పోతుందని చెప్పాను. కాని వాళ్ళు నమ్మినట్లు లేదు. విడిగా అర్థాలు తీశారేమో. ఇవాళ మీతో అలా మాట్లాడుతుంటే విని నేను  ఆశ్చర్యం పొందాను. ఇప్పటిదాకా అమ్మతో దెబ్బలాడి వచ్చాను. నా మాట నమ్మరా?" అని అతని కళ్ళలోకి ప్రాధేయపడుతూ చూసింది.     నారాయణ కరిగిపోయాడు : అన్నాడు "ఈ స్థితిలో నిన్ను చూస్తూ నీమాట నమ్మలేనంత మూర్ఖుణ్ని కాదు. నన్ను నువ్వు పూర్తి అర్థం చేసుకున్నావు. కాని నిన్ను నేను ఇంకా అర్థం చేసుకోలేక పోయాను పొరపాటు నాదే."     ఆమె అతనికి మరీ దగ్గరగా వచ్చి "ఊరుకోండి" అంది.     నారాయణ ఊరుకొని "మీ అమ్మగారికి జ్వరం నయమైపోయింది కదా, మనం రేపు వెళ్ళిపోదాం" అన్నాడు.     "అలాగే."     "మరునాటి ఉదయం ఎవరెంత చెప్పినా వినకుండా భార్యను తీసుకొని బయల్దేరాడు నారాయణ. అతను ప్రయాణమయ్యే వేళకి మామగారు ఇంటిలో వుండకుండా వెళ్ళిపోయాడు. అత్తగారు ఏదో సర్దిచెప్పింది.
24,935
    "అక్బార్ తెచ్చిండట కద!" అసలు విషయం బయట పెట్టాడు తాసిల్దారు.     బయలుదేరేప్పుడు అనుకున్నారు వీరయ్యగారు, పిలిచింది ఇందుకోసమేనని. అయినా ఆ ప్రశ్నకు కాస్త తికమకపడ్డారు. "తెల్వక తెచ్చిండుండి."     "తెల్వక తెచ్చినాడు! యెవ్వడు తెచ్చినోడు?"     నీళ్ళు నమిలారు వీరయ్యగారు. "నా మేనల్లుడు-అక్క కొడుకు."     "అందుకే బతికిపోయిండు. లేకుంటే పీనిగెల బిందలోకి పోయెటోడు. ఎందుకు తెచ్చిండు?"     "పట్నం నుంచి వస్తాండె, తెచ్చిండు. చెప్పినగద తెల్వక తెచ్చిండని."     "పట్నం ఎందుకు పాయె అసల్" అడిగాడు, పట్నం పోవడం కూడా నేరమేనన్నట్లు.     "పోలేదుండి. ఆడనే ఉండి చదువుకునె. చదువు అయిపోయింది. వచ్చిండు."     "చదువుభీ చదివినాడు.అయితే ఖతర్నాక్* ఏం చదివిండు?"     "నాకు తెలుస్తాదుండి ఆ చదువులేందో! ఏమో ఖానూన్ చదివిండట. ఏదో అంటరు లెలెబి."     "ఏందేంది? ఖానూన్ చదివినాడు! ఖానూన్! ఆంగ్రేజొస్తదా?"     "అంత చదివె. రాకుండుంటాది. తెలుస్తాదుండి నా బొంద."     "సర్లె ఎన్నొద్దులుంటడు?"     "యాడికి పోతడు"     "ఏమీ? యాడికి పోడా? ఈడనే ఉంచుకుంటవా? ఖానూన్ చదివినోడు ఖతర్నాక్. మీదికెల్లి అక్బార్ చదువుతడు. పామున్నడు పాము. నెత్తికెక్కించుకుంటమా? నైజాన్తా జాగీర్ల ఉండెతంద్కు వీల్లేద్."     "అట్లంటె ఎట్ల? అయ్య, అమ్మ చచ్చిరి. అల్లుడు కాడుండి. నాకు కొడుకులున్నరు గన్కనా. బిడ్డనిచ్చి ఇంట్ల ఉంచుకుంటా, బుద్ధిమంతుడు సర్కార్!"     "ఏందేంది అక్బార్ చదివిటోన్కి బిడ్డనిస్తావు? నవాబుసాబ్ ఇజాజత్1 కావలె. లగ్గానికి2 ఖానూన్ కా బచ్చా. యహాఁరహనా నహిఁ అచ్ఛా. వీల్లేదు. ఒప్పుకోను భేజ్ దేవ్!"     "ఖానూన్ చదివితే మాత్రం సర్కార్ కంటె ఎక్కువ తెలుస్తాదుండి! మా రఘు అసువంటోడు కాడు నా జిమ్మేదారీ3. నన్ను నమ్మరా?"     "ఏందేంది? పేరు భీ ఎట్లనో ఉన్నది. యల్లయ్య కాదు మల్లయ్య కాదు. కమీనిస్టున్నట్టున్నాడు. బఢాదేవ్" గట్టిగా అరచాడు తాసిల్దారు. తరువాత మాట్లాడలేదు. వీరయ్యగారు మౌనం వహించారు.     "పేరులో ఏమున్నది సర్కార్" నసిగారు వీరయ్యగారు. "నా జిమ్మేదారి అంటున్న గద. ఇంత జాయిదాదున్నది4 పారిపోతనా? వాడేమన్న చేస్తే నా తల తీయించుండి."     "అచ్ఛా! కుక్కిన పేనోలె పడుండాలె. నఖ్రాల్ గిఖ్రాల్ చెయొద్దు. అక్బార్ గిక్బార్ చదువొద్దు. ఖానూన్ జతాయించిండా ఇడ్చెడ్డిలేదు. మీ జిమ్మెదారి మీద ఉంచుతున్నం. ఖైర్. నజ్రానా యెంతిస్తవు!" __________________________________________________________*ప్రమాదం. 1.అనుమతి. 2.పెండ్లికి 3.బాధ్యత. 4.ఆస్తి     "నైజాన్తా, తీన్ సౌ. చలో అబ్ నిక్లో1. పొద్గాల పైకం పంపాలె. ఇక పొండి."     వీరయ్యగారు ఇంకేదో చెపుదామనుకుంటుండగానే ఆడదాని కేకలు వినిపించాయి. మరుక్షణంలో ఇద్దరు మనుషులు ఒక అమ్మాయిని లోనికి లాక్కొచ్చి తాసిల్దారు కాళ్ళమీద పడేశారు. ఏడుస్తూ కేకలు వేస్తున్న పిల్ల లేచి గుమ్మంవైపు పరుగెత్తింది. మళ్ళీ ఆ తెచ్చిన ఇద్దరు పట్టుకొని లాక్కొచ్చారు.     వీరయ్యగారు చూడలేకపోయారు. ముఖం తిప్పుకొని బయటికి నడిచి పోయారు.     ఆ పిల్ల మల్లి. వడ్డెర పీరయ్య కూతురు. మంచి వయసులో వుంది. మిసమిసలాడే యవ్వనం, రంగు నలుపే. అయినా నీలమణిలా వుంది. తలారి శివయ్యకు ఎన్నడో కన్ను పడ్డది దానిమీద. వడ్డెర గూడెంలో కన్ను కొట్టాడు. మల్లి తలవంచుకొంది. ఆ రాత్రి అయ్యతో చెప్పింది. పీరయ్య మల్లమ్మను తప్పించేశాడు. మరో వూరికి పంపాడు. అందమైన ఆడది గూడెంలో ఉండరాదు. అది తాసిల్దారు ఇంటికి చేరాల్సిందే. తన కూతురికి ఆ గతి పట్టరాదనుకున్నాడు వీరయ్య. తల్లి ప్రసవిస్తే చూడ్డానికి వచ్చింది మల్లమ్మ. అదీ చాటుగానే. అయినా కనిపెట్టాడు శివయ్య. ఆ రాత్రి ఇంటిమీద దాడిచేశాడు. తనకు అందకుంటే తాసిల్దారుకు సమర్పించాలనుకున్నాడు. లాక్కొని వచ్చాడు. పారిపోతుంటే పట్టుకున్నాడు.     మల్లమ్మ గింజుకుంటున్నది. వదిలించుకోడానికి శత ప్రయత్నం చేస్తున్నది. గట్టిగా పట్టుకున్నాడు శివడు. 'సర్కార్ దీన్ని దాచిపెట్టిండు పీరిగాడు. పట్టుకొస్తాంటె మీదపడి కొడ్తాండు. చుక్క సర్కార్ చుక్క ఇది! సర్కార్ కొలువులుండాలె. గూడెంల వుండి ఏం చేస్తదని తెచ్చిన, బాంచను."     ఇంతలో పీరయ్య ఉరికివచ్చి తాసిల్దార్ కాళ్ళమీద పడ్డాడు. "దొరా! నీ బాంచను, కాల్మొక్త, చర్మం ఒలిచి చెప్పులు కుడ్త. నా బిడ్డ నిడువుండి." అని కన్నీరు కార్చుతూ బ్రతిమిలాడాడు.     "అబె భంచత్ లే. ఏందిబే నఖ్రాల్చేస్తున్నవు. నీ చెప్పులు ఎవనికి కావాలెబె. చల్ బాహర్ మాధర్ ఛోద్" అని గట్టిగా తన్నాడు డొక్కలో తాసిల్దారు. గజం దూరాన పడి విలవిల లాడాడు పీరయ్య. మల్లమ్మ గుండె వక్కలైంది. తండ్రిమీద పడి రక్షించాలనుకుంది. ఉరికింది. ఇద్దరు రెండు రెక్కలు పట్టుకొని ఉన్నారు. ఆ ఊపుకు కుడిచేయి పుటుక్కుమంది. ఎముక తొలగింది. "హో" అని ఏడ్చి పడిపోయింది. పీరయ్య లేచాడు. కూతురువైపు సాగాడు. ఇద్దరు మనుషులు అతన్ని లాక్కెళ్ళి బయట పారేశారు. తలుపులు వేశారు.     తాసిల్దారు దివాణంలోకి అనేకమంది అంగనలు అలా వచ్చినవారే. అలాంటి వారిని చాలామందిని 'నిఖా' కట్టుకున్నాడతను. ఒక వీధి సాంతం అతని పెళ్ళాలే వున్నారు. దాని పేరే తాసిల్దారు వీధిగా మారిపోయింది. వారిని మహమ్మదీయులుగా మార్చి వారి సంతానం పెంచి ఇస్లాంకు సేవ చేస్తున్నాడు అన్వర్ బేగ్ తాసిల్దార్. సేవ సంగతి ఎలా వున్నా ఆడది అంటే పడిచస్తాడతను.     ఒకసారి ఈ జాగీరు ప్రక్కనున్న మరో పిల్లజాగీర్దారు "ఖాన్ సాహెబ్" ఈ జాగీరు నుంచి ఒక అమ్మాయిని ఎత్తుకుపోయాడు. ఆమెమీద పూర్వం నుంచె కన్నువుంది తాసిల్దార్ కు. దాంతో ఆ "ఖాన్ సాహెబ్"తోనే యుద్ధానికి దిగాడు తాసిల్దార్. గుర్రాలమీద గుండాలతో ఆ వూరి మీద దాడిచేశాడు. ఖాన్ సాహెబ్ తక్కువవాడా! పఠాను రక్తం ప్రవహిస్తూంది అతని నరాల్లో. అతడూ కత్తి పట్టాడు. ఇద్దరూ గుర్రాలమీద ఉండే పోట్లాడుతున్నారు. ఇద్దరిలో ఎవరూ ఓడినట్లు కనిపించలేదు. ఎవరూ గెలిచినట్లు కనిపించలేదు. సంధి జరిగింది. అమ్మాయిని రెండు ముక్కలు చేసి చెరొక ముక్క తీసుకోవాలనుకున్నారు. అంతపనీ చేశారు. ఇద్దరూ గెలిచామనుకున్నారు. _________________________________________________________1.ఉదయం     పాపం అమాయికను, అబలను బలిగొన్నారు! అందుకోసమే యే ఆడదాన్ని పట్టినా కిక్కురుమనరు అక్కడి జనం. మరి పీరయ్య మాత్రం ఏం చేయగలడు? అతనికి బలం లేదు. శక్తి లేదు. అధికారం లేదు. శక్తి ఉన్నంతవరకు ఏడ్చాడు గుమ్మం ముందు పడి, లేచి వెళ్ళిపోయాడు.                                      *  *  *  *     ఆ రాత్రి వీరయ్యగారికి నిద్ర పట్టలేదు. అన్నం తిన్నాననిపించి లేచారు. చుట్ట కాల్చుకున్నంతసేపూ ఏవేవో ఆలోచనలు వచ్చాయి. ఆలోచనలను తరిమివేయాలనుకొన్నారు. మంచంలో మేను వాల్చారు. నిద్రపోవడానికి ప్రయత్నించారు. కాని మల్లి కళ్ళలో ఆడసాగింది. మల్లమ్మ పాపం పసిపిల్ల! ఎలా లాక్కొచ్చారామెను! తప్పించుకొనడానికి ఎంత గింజుకుంది? ఏమైందో దాని గతి? ఏమౌతుంది? అలాంటి అందరికీ పట్టిన గతే పట్టి ఉంటుంది. కాని అందరినీ తాను చూడలేదు. తాను చూచింది మల్లమ్మనే! పాపం ఆ పిల్ల! ఇప్పటికి పాడైపోయి వుంటుంది. మల్లమ్మతో జానకి కనిపించింది వారికి. గుండెలో అగ్గివాన కురిసింది. అలా కాకూడదు. కాదు. కారాదు. అనుకున్నారేగాని ఏవేవో పిచ్చి పిచ్చి ఊహలు వచ్చాయి. ఆ ఆలోచనను బలవంతంగా పక్కకు నెట్టారు. పత్రికంటే తాసిల్దారుకు అంత భయం ఎందుకు? ఏముంటుంది అందులో? అది చదువుతే తాసిల్దారు ఓడిపోతాడా? ఆరిపోతాడా? ఎందుకంత భయం? అందులో ఏముంటుందో చూడాలనుకున్నారు. లేచారు. చిరిగిన పత్రికలన్నీ తెచ్చారు. లాంతరు దగ్గరపెట్టి కూర్చారు. చదవడానికి ప్రయత్నించారు. ఏవో యుద్ధ వార్తలు.ఎక్కడో బాంబులు పడ్డాయి. ఎవరో గెలుస్తున్నారు. ఎవరో ఓడుతున్నారు. ఏమీ అర్థం కాలేదు. ముక్కలు అక్కడే పారేసి పండుకున్నారు. రఘుతో పత్రిక చదవడం మాన్పించాలా? అతను చేస్తున్న దానిలో తప్పుందా? ఏమేమిటో ఇలాంటి ఆలోచనలు మెదడును చీల్చసాగేయి!         జానకి కూడా ఆ రాత్రి నిద్రపోలేదు ఆమె కళ్ళలో బావ చేరాడు. పొంగిన చెంప, చేతిలో పెట్టె, చిరిగిన పత్రిక! బావ తనను పలుకరించలేదు; మరిచిపోయాడా! మారిపోయాడా! తాను చెరుకు తింటున్నది. బావ వచ్చి లాక్కున్నాడు. తాను పెద్దగా ఏడ్చింది. అత్తమ్మ వచ్చి బావను బాదింది. అయినా ఏడవలేదు. అత్తమ్మ వెళ్ళిపోయిం తరువాత తనను బాదాడు. ఈ తడవ తాను అత్తమ్మను పిలవలేదు. ఇద్దరూ కొట్టుకున్నారు. రాకకుకున్నారు. ఆ బావేనా యీ బావ! ఎంత మారిపోయాడు. తనకోసం ఏం తెచ్చాడో పట్నం నుంచి! చీరలు, జాకెట్లు, రిబ్బన్లు, గాజులు.     రంగు రంగుల చీరలు ఆమె మనసులో రెపరెపలాడేయి.
24,936
      తోటివారు చావడం చూచి మహాపార్శ్వుడు వానరుల  మీదపడి చీల్చిచండాడాడు. ఋషభుడు పరిగెత్తుకుంటూ వచ్చి "నిలు నిలు" అంటూండగానే వాడు గదతో కొట్టేశాడు. దాంతో ఋషభుడు రక్తం కక్కుకుని వూగిపోయాడు. కాని క్షణంలో తేరుకొని వాడి  గదలాక్కొని వాడి నెత్తిమీదనే కొట్టాడు.  వాడితల బద్దలై విలవిల తన్నుకొని చచ్చాడు. రాక్షస సైన్యం చెల్లాచెదురైపోయింది.     తనవారంతా చచ్చారు. సైన్యం చెల్లాచెదరైపోయింది. అది చూసి సహించలేకపోయాడు అతికాయుడు. వెయ్యి సూర్యగోళాల్లా వెలిగిపోతున్న రథం ఎక్కి  యుద్దరంగానికి దూకాడు. వానరులెంతో మంది  అతణ్ని  ఎదుర్కొన్నారు.  అప్పుడతడు  "ప్రాకృతులతో నేను యుద్దం చేయను. సమరోత్సాహం కలవాడైనా  వుంటే  నామీదకి  రావాలి" అన్నాడు.  అదివిని ధనుర్దారియైన లక్ష్మణుడు వాణ్ని ఎదుర్కోవడానికి సన్నద్దుడై ముందుకు సాగాడు. అది చూసి అతికాయుడు బాణం విడిచాడు. సర్పంవంటి బాణాల్ను ముక్కలు చేశాడు లక్ష్మణుడు. అతికాయుడు  అగ్గియై అయిదు బాణాలు వేశాడు. వాటిని ముక్కలకింద కొట్టేశాడు లక్ష్మణుడు. తర్వాత ఒకబాణం లాగివిడిచాడు లక్ష్మణుడు. అది అతికాయుని నొసట గుచ్చుకోగా వాడు గడగడ వణికిపోయాడు. అయినా నిలువరించుకొని సూర్యబింబాల్లాటి బాణాలు విడిచాడు అతికాయుడు. లక్ష్మణుడు గుండెమీద కొట్టాడు అతికాయుడు. లక్ష్మణుడికి రక్తం చిమ్మింది.కృద్దుడై లక్ష్మణుడు ఆగ్నేయశాస్త్రం ప్రయోగించాడు. అతికాయుడు సౌరాస్త్రం విదిలాడు. రెండూ  ఆకాశాన ఒకదాన్నొకటి నాశనం చేసుకున్నాయి. అతికాయుడు ఇషీకాస్త్రం ప్రయోగించగా లక్ష్మణుడు ఇంద్రాస్త్రంతో దాన్ని ఖండించాడు. అతికాయుడు  యామ్యాస్త్రం  ప్రయోగించగా  లక్ష్మణుడు  వాయవ్యాస్త్రంతో  దాన్ని కొట్టేశాడు.  ఎన్ని బాణాలు  వేసినా అతికాయుడు  చలించలేదు. లక్ష్మణుడు బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. దాంతో గ్రహ, నక్షత్రాదులు గడగడలాడేయి. దిక్కులూ, ఆకాశమూ, భూమీ అదిరిపోయాయి. అతికాయుడది  చూసి అనేక బాణాల్తో దాన్ని ఆపడానికి ప్రయత్నించి విఫలుడైనాడు. అది మెల్లగా వచ్చి  వాడి తల తిరగేసింది.సకీరీటియైన అతని తల పర్వతశిఖరంలా నేలకూలింది. రాక్షసులు గగ్గోలుపెడ్తూ పారిపోయారు. వానరులు హర్షద్వానాలు చేసి లక్ష్మణుణ్ని పూజించారు. రాముడు తమ్ముణ్ణి మెచ్చుకున్నాడు.     ఇంద్రజిత్తు 2     అతికాయుడు మున్నగువారు చనిపోయారని తెలిసింది. అది విని అతడు మూర్చపోయాడు. జయం గలగడం దుర్లభం అని అతడు దుఃఖించాడు. ఇంద్రజిత్తు తండ్రిదగ్గరికి వెళ్లి ఓదార్చాడు. తాను జీవించి వుండగా దుఃఖించాల్సిన అవసరం లేదన్నాడు. రావణుడు సంతోషించి కొడుకును యుద్దానికి పంపించాడు. స్వేతచ్ఛంత్రంతో  నిండుచంద్రునిలా ప్రకాశించే ఇంద్రిజిత్తు రాజమార్గాన బైల్దేరాడు. యుద్దరంగంలో  ప్రవేశించగానే రథం చుట్టూ రాక్షసుల్ను కాపుంచాడు. యథావిధిగా  హోమంచేశాడు. నల్లని మేకను గొంతునరికి హోమం చేశాడు. విజయసూచకంగా అగ్ని పొగలేకుండా మండింది. అతడు బ్రహ్మస్త్రమంత్రం జపించి తన ధనస్సూ, రథమూ అభిమంత్రించాడు. హోమం పూర్తి అయ్యేటప్పటికల్లా ఇంద్రజిత్తు రథంతో కూడా అదృశ్యుడైనాడు.      రాక్షసులకు ఉత్సాహం వచ్చింది. సింహనాదాలు చేస్తూ వానరులు చెట్లతోనూ,  గుట్లతోనూ అతణ్ని కొట్టారు. కాని అవేవీ అతణ్ణి బాధించలేదు. అతని బాణఘాతానికి  వానరవీరులు  చాలమంది మూర్చిల్లారు. వారిలో సుగ్రీవుడూ, అంగదుడూ,  జాంబవంతుడు కూడా వున్నారు. అలా వానర వీరుల్నందర్నీ మూర్చిల్లజేసి రామలక్ష్మణుల మీద శరవర్షం కురిపించాడు. బ్రహ్మాస్త్రాన్ని  గౌరవించాలనుకున్నాడు రాముడు. అనుజసహితుడై  మూర్ఛిల్లాడు. అది చూసి ఇంద్రజిత్తు సింహనాదం చేసి తండ్రికి చెప్పడానికి లంకకు వెళ్లిపోయాడు.
24,937
         మట్టి పెళ్ళలతో నిండిపోయి వుంది. పైనున్న టెర్రస్ ఎప్పుడో కూలిపోయింది.     నెమ్మదిగా ఆ మట్టిగుట్ట ఎక్కాడు అతను.     "పూర్ణా!" అరిచాడు కిందనించి కమల్.     ఆ కేక విని కిందకి తొంగి చూశాడు పూర్ణ. అక్కడ జనంలో తన అభినయ్, కైరవి, గీత, కమల్, దాసు, సిద్ధార్ధ అందరూ వున్నారు.     దాంతో పూర్ణకి ఎక్కడలేని ధైర్యం వచ్చింది.     అందరూ వున్నారు. తన వాళ్ళందరూ వున్నారక్కడ.     విజయగర్వంతో కూడిన దరహాసం అతని పెదవులపై తొణికిసలాడింది. కానీ అక్కడనించి కిందికి దిగడానికి దారి కనబడలేదు. మళ్ళీ గుండె గుభిల్లుమంది. ఆ సమయానికి ఫైర్ స్టాప్ క్రేన్ తో వచ్చి వుంటారన్న ఆశ నిరాశే అయంది.     అభినయ్ కేక పెట్టాడు....     "పూర్ణా! కదలకు... అక్కడే వుండు. లోపల అంతా కూలిపోయింది. మేం రావటానికి వీలులేదు. నువ్వు రాలేవు క్రేన్ వచ్చేవరకు ఆగు."     మిత్రులని చూస్తున్న అతని మనసు ఆనందంతో నిండిపోయింది.     "శ్వేతా!" ఆమె తల్లి ఏడుస్తూ కేకలు పెడుతోంది. కిందనుంచి ఎన్నో గొంతులు. హాహాకారాలు వినబడుతున్నాయి.     గాలి వీస్తోంది. వాన సన్నగా కురుస్తోంది.     తల్లి పిలుపుకి ఆ చిన్నారి గుండె లయ తప్పింది.     అక్కడ తల్లి....     ఇక్కడ తను....     ఎలా చేరాలి?     పూర్ణ కాళ్ళు తడబడుతున్నాయి. అంతవరకూ పెదవుల వెనక బిగపట్టిన బాధను అణచుకోలేకపోతున్నాడు.     "అభీ! పూర్ణని చూడు. నాకెందుకో భయంగా వుంది. బాగా దెబ్బలు తగిలినట్టుంది" కైరవి ఆందోళనగా అంది.     అప్పుడు గమనించాడు అభినయ్-పూర్ణ ఏదో అవ్యక్తమైన బాధతో సుడులు తిరుగిపోతున్నాడు.     "పూర్ణా! ఆర్ యూ ఆల్ రైట్!" గీత అడిగింది.     "ఓ.... ఓ... క్....క్.... కే...." వణుకుతున్న శరీరాన్ని అదుపు చేయడానికి విశ్వప్రయత్నం చేస్తూ అన్నాడు. కానీ ఆ సమాధానం అతని చెవులకే వినబడలేదు.     చెవులలో ఉత్తుంగ తరంగాలు విరిగిపడుతోన్న ఘోష గింగురుమంటోంది.     కళ్ళు తిరిగిపోతున్నాయి.     అంత చలిగాలిలోను చెమటలు పోస్తున్నాయి.     గొంతు తడారిపోతుంది అతనికి.     కైరవి చూట్టూ చూసింది. ఎవరో నిచ్చెన తెస్తున్నారు. కానీ ఆ నిచ్చెన చిన్నది ఎత్తు చాలదు.     మూడో అంతస్తు దగ్గర వున్నాడు పూర్ణ.     ఇప్పుడేం చేయాలి?     పూర్ణ ఎక్కువసేపు అక్కడ వుండలేడనిపిస్తోంది.     కైరవి తీవ్రంగా ఆలోచిస్తోంది.     ఏదో ఆలోచన ఆమె మెదడులో ప్రవేశించింది.     అంతే!     ఆమె క్షణం ఆలస్యం చేయలేదు.     ఒంటిమీద చీరని విప్పేసింది.     లంగా, జాకెట్ తో నిలబడింది. అంతమంది ముందు ఆమె అలా నించోడానికి సిగ్గుపడటం లేదు.     జరగబోతున్న ప్రమాదాన్ని నివారించాలన్న ధ్యాస మాత్రమే ఆమెలో వుంది.     ఆమె చేస్తున్నదేమిటో అభినయ్ కి సైతం అర్ధం కావడంలేదు.     "క్విక్ అభీ! ఈ చీరని నాలుగు చివరలా నలుగురు గట్టిగా పట్టుకోండి. పూర్ణని పాపని చీర మీదకు విడిచి పెట్టమని చెప్పు" అంది.     అభినయ్ ఆమె చీరని పట్టుకున్నాడు. ఇంకెవరికి విడమరిచి చెప్పనవసరంలేదు. మరుక్షణం చీరని మడతవేసి నాలుగు కొసలు నలుగురు గట్టిగా పట్టుకున్నారు.     "పూర్ణా! పాపని మెల్లగా కిందికి విడిచిపెట్టు" అరిచాడు అభినయ్.     "అమ్మో!" ఆ పిల్ల తల్లి కళ్ళు గట్టిగా మూసుకుంది.     "మీరేం చేస్తున్నారో తెలుసా?" ఆ పిల్ల తండ్రి కోపంతో, భయంతో అరిచాడు.     "షటప్!" అన్నాడు అతనికేసి కూడా చూడకుండా అభినయ్.     చూస్తున్న జనం హాహాకారాలు చేస్తున్నారు.     రకరకాల అరుపులు.     పూర్ణ జారిపోతున్న బలాన్ని కూడదీసుకుని శ్వేతని వణుకుతున్న చేతుల్లోకి తీసుకున్నాడు.     తను ఏమాత్రం పొరపాటు చేసినా ఆ పసిదాని ప్రాణం దక్కదు.     మూసుకుపోతున్న కనురెప్పల్ని బలవంతంగా విప్పి చూశాడు.     మసకగా కనిపిస్తోంది.     ఏదో జరుగుతోంది తనకు.     "క్విక్" అభినయ్ అరిచాడు మళ్ళీ.     రెండు చేతుల్లోకి శ్వేతని బంతిలా తీసుకుని కనురెప్పలు కొద్దిగా క్లియర్ గా కనిపించగానే శ్వేతని గాలిలోకి జారవిడిచాడు పూర్ణ.                                       23     భూనభోంతరాలు దద్దరిల్లేలా అరిచింది శ్వేత. క్రిందినుంచి కేకలు ప్రతిధ్వనించాయి. గాలిలో తేలిపోతూ కిందికి జారిపోతుంది శ్వేత. భయంతో ఆమెకి స్పృహ తప్పిపోయింది.     శ్వేత మల్లెమొగ్గలా వచ్చి చీరలో పడింది.     "హమ్మయ్య!" భారంగా నిట్టూర్చి కిందకు చూడబోయాడు పూర్ణ.     శ్వేత తల్లీ తండ్రీ పరుగెత్తుకొచ్చి పాపని తీసుకుని గుండెలకు హత్తుకున్నారు.     కృతజ్ఞతతో వాళ్ళ మొహాలు వెలిగిపోతున్నాయి.     కానీ అదే సమయంలో--     ఫెళ ఫెళమని శబ్ధం పూర్ణ కాళ్ళకింద భూమి కదిలినట్టయింది.     అది గ్రహించేలోపునే వరండా కూలిపోవడం, మట్టి పెళ్ళలతో పాటుగా పూర్ణ గాలిలోకి గిరికీలు కొడుతూ జారడం జరిగిపోయింది.     వేగంగా భూమిని తాకుతున్న ఉల్కలా పూర్ణ రోడ్డుమీద నీటిలో ధడేల్న పడ్డాడు. అంతా కనురెప్పపాటులో జరిగిపోయింది.     జనం కంగారుతో అరవసాగారు.     "పూర్ణా!" భయంకరంగా అరిచాడు అభినయ్. పరుగున వెళ్ళాడు ఆ చోటుకి.     నీటిలో పడుతున్న సమయంలోనే పూర్ణ తలకి రాయి తగిలింది.     పూర్ణని ఒడిలోకి తీసుకుని తడుముతూ "పూర్ణా!" అన్నాడు రుద్ధకంఠంతో అభినయ్.     మిత్రబృందం కళ్ళల్లో నీరు సుడులు తిరుగుతుంది.     రాఘవరావు కంగారుగా పరుగెత్తుకొచ్చాడు.
24,938
    రఘువీర్ మాటలకి పార్వతి అడ్డు తగిలింది "మీ నోటంట నేరస్తులు, శిక్షలు తప్ప మరో మాట లేదు! వీళ్ళకి శిక్షనే చెపుతాను! ముందు ఈ విషయం చూడండి. వందన వాళ్ళ మామయ్య ఉదయం నా దగ్గరకొచ్చాడు. నాకు ఉద్యోగం లేదు, ఆస్తీ లేదు! గోపాలరావు డబ్బు పంపేవాడు! అదీ లేదు! నా సంగతి ఆయనతో చెప్పి చూడండమ్మా అన్నాడు!"     "ఆయనకూడా గోపాలరావుతో చేతులు కలిపి వందన మెడలు వంచాడు. ఆయన సంగతి తర్వాత చూద్దాం. వీళ్ళకేసే శిక్ష ఏమిటో చెపుతున్నావు- అదేమిటో తొందరగా చెప్పు పారూ!"     "పెళ్ళి. జైరాజుకి నందితాదేవిని- పృధ్వీరాజ్ కి వందనాదేవిని యిచ్చి ఓకే పందిట్లో ఓకే టైంలో వివాహం జరిపిద్దాము. మన బాధ్యత మనం నిర్వహిద్దాము. ప్రస్తుతం పెద్దలం మనమేమే కదా! పెళ్ళిచేస్తే వాళ్ళ గోల వాళ్ళు పడతారు. వీళ్ళకి వెంటనే పెళ్ళి చేయటమే సరి అయిన శిక్ష" అంది పార్వతి.     "ఓ మైగాడ్! పెళ్ళి ఒక శిక్షా! అంటే మనకు పెళ్ళయి ఓకే ఇంట్లో కాదు... కాదు. ఓకే జైలులో బంధించబడి శిక్షననుభవిస్తున్న జంట ఖైదీలమన్నమాట. పాపం వాళ్ళకి ఈ శిక్ష వేయాల్సిందే నన్నమాట" రఘువీర్ అన్నాడు.     "బావ పాపం పాపం అంటున్నాడు. పాపం ఏదో బాధపడుతున్నట్లున్నాడు" పృధ్వీరాజ్ అన్నాడు.     "ఆ బాధ అట్లాంటి ఇట్లాంటిది కాదు. తియ్యని బాధ! అవునా పారూ! చిలిపిగా అన్నాడు రఘువీర్.     పార్వతి పిల్లలముండు ఏమిటీ హాస్యం అన్నట్లు భర్తవేపు ఓ చూపు విసిరి సిగ్గుతో ముఖం ఎర్ర చేసుకుంది.     వాళ్ళిద్దరినీ చూసిన రెండు జంటలు ఫక్కున నవ్వాయి.                                                      -- అయిపోయినది-- 
24,939
    "హోమియోపతి ప్రకృతి సహజమైన అతి ముఖ్యమైన ప్రిన్సిపుల్ మీద పనిచేస్తోంది. ముఖ్యంగా మన ప్రాచీన భారత వైద్య శాస్త్రానికి హోమియోపతి వైద్యం ఎంతో దగ్గరగా ఉంది. ఉదాహరణకు 'ఉష్టం ఉష్ణేన శీతలం' అనేది మన ప్రాచీన వైద్య విధానానికి చెందిన సూత్రం. హోమియోపతి కూడా అదే సిద్ధాంతం ప్రకారం పని చేస్తుంది. అందుకే హోమియోపతి మందులు ముందు రోగి జబ్బుని మరింత పెంచి అప్పుడు దానిని తగ్గించేందుకు చర్య ప్రారంభిస్తుంది-"     నాకు ఆ మాటల్లో ఏదో గొప్ప మెసేజ్ కనిపించింది.     ఆ రూల్ మా ప్లాట్స్ గొడవకు కూడా వర్తిస్తుందనిపించింది.     అంటే అన్యాయాన్ని అన్యాయంతోనే ఎదుర్కోవాలి! అక్రమాన్ని అక్రమాలతోనే ఎదుర్కోవాలి! గూండాయిజాన్ని గూండాయిజంతోనే ఎదుర్కోవాలి.     అంతేకానీ తెల్లారి లేస్తే ఆ గూండాల దయాదాక్షిణ్యాల మీద బ్రతికే పోలీస్ సహాయం కోరగూడదు. ఎదుటిమనిషి ఎంత పెద్దమనిషి అన్న విషయం వదిలేసి వాడు తెచ్చుకున్న సాక్ష్యాధారాలకు విలువిచ్చే కోర్ట్ ల సహాయం తీసుకోకూడదు.     ఉదయం లేస్తూనే ఆవేశంగా వెళ్ళి శాయిరామ్ ని నిద్రలేపాను.     "వెంటనే మన వాళ్ళందర్నీ పిల్చుకురా! రాత్రి నాకు బ్రహ్మాండమైన అయిడియా వచ్చింది. మన ప్లాట్స్ లోనుంచి ఆ గుడిశెల వాళ్ళను ఒక్కరోజులో లేపేద్దాం-" అన్నాను.     పావుగంటలో అందరూ వేదిక దగ్గర గుమిగూడి పోయారు. నేను చాలా గర్వంగా నా ప్లాన్ వాళ్ళకు చెప్పాడు.     "మనం చేయాల్సింది చాలా సింపుల్! శంకర్ దాదా దగ్గరకెళ్ళి ఎంతోకొంత రేటు మాట్లాడి డబ్బు ఇచ్చేశామంటే మన ప్లాట్స్ లోనుంచి వాళ్ళందరినీ దెబ్బకు ఖాళీ చేయిస్తాడు శంకర్ దాదా!"     అందరికీ ఆ ఆలోచన నచ్చింది.     నిజానికి గూండాయిజాన్ని ప్రోత్సహించడం మాలో ఎవరికీ ఇష్టం లేదు కానీ మేము కష్టార్జితానికి నీళ్ళు వదులుకోకుండా వుండాలంటే అంతకంటే గత్యంతరం లేదు.     అప్పటికప్పుడే తలో వెయ్యి రూపాయిలూ పోగుచేసి, ఆ మొత్తం తీసుకుని శంకర్ దాదా ఇంటికి చేరుకున్నాం. అప్పటికి టైమ్ పదవుతోంది.     అప్పుడే గుడుంబాతో మొఖం కడుగుతున్నాడు శంకర్ దాదా.     మమ్మల్ని చూసి ఆశ్చర్యపోయాడు.     "ఏమ్ సంగతి- చాల్దినాలకొచ్చిన్రు" అన్నాడు మొఖం కడగగా మిగిలిన ద్రావకం త్రాగేస్తూ.     సంగతంతా చెప్పామతనికి.     కొద్దిక్షణాలు ఆలోచనలో పడ్డాడు శంకర్ దాదా.     "ఆ ఏరియా దాదా ఎవరు? పాండూ దాదానా?" అడిగాడు మమ్మల్ని.     "అవున్సార్"     "గట్లనా? ఆడయితే కొంచెం కిరికిరి కొడుకే" మళ్ళీ ఆలోచనలో పడ్డాడు.     "మీరెంత డబ్బంటే అంత ఇచ్చేస్తాం సార్!" అన్నాడు రంగారెడ్డి ఆ మాటతో శంకర్ దాదా మొఖంలోకి కళ వచ్చేసింది.     "అగో చెప్పక పోతిరి మల్ల! ఇంకా మీ కేస్ లో పుకట్ గా పని జేయాలనుకుంటున్న! పైసల్దెస్తే కిరికిరి మున్నదివయ్యా? నిమిషాల్ల ఖాళీ జేయ్ పిస్త! సమజయిందా?"     "అయింది సార్!"     "ఎన్ని పైసలు తెచ్చిన్రు?"     "పదివేల్సార్"     "పదివేలా? పదివేలకు గిసంటి ఖతర్ నాక్ పనులెవళ్ళు జేస్తారయ్యా! పదిహేను వేలయినగాని వుండాలె!"     మేము మారు మాట్లాడకుండా పదిహేనువేల రూపాయలు అతని చేతిలో పెట్టాము.     అతను మావేపు ఆప్యాయంగా చూశాడు.     "ఇగో- ఇంక ఇండ్లకు పోయి భేపికరుండండి! రేపీ టైమ్ కల్లా మీ జాగాలన్నీ ఖాళీ అయిపోతై సమజయిందా?"     "అయింది సార్" అన్నాడు యాదగిరి.     "అయితే ఇకపోండ్రి"     మేమంతా కాలనీ కొచ్చేశాము.     మర్నాడు ఉదయం మేము ప్లాట్స్ దగ్గరకెళ్ళేసరికి సగం గుడిశెళు కనిపించడంలేదు.     అయితే మిగతా సగం ఇంకా ఉండటం ఇబ్బందికరంగా అనిపించి మళ్ళీ శంకర్ దాదా దగ్గరకెళ్ళాం. ఆ టైమ్ లో గుడంబాతో స్నానం చేస్తున్నాడతను.     "ఏమాయే? ఖాళీ జేసిన్రుగదా ఆళ్ళు-" అడిగాడతను గుడంబా నెత్తినబోసుకుంటూ.     "సగం మందే చేశారు సార్"     "మిగతా వాళ్ళు ఆ ఏరియా ఎమ్మెల్యే గ్యాంగ్ రాభయ్! నేను పోయి ఎమ్మెల్యేను బ్రతిమిలాడితేగానీ పోరు-"     "ఒక్కసారి ఆయన్తో మాట్లాడండి సార్"                      "మాట్లాడిన లాభంలేదురాభయ్! ఆడసలే పైసల్ కోసం గడ్డితినేటైప్- కనీసం ఓ పదివేలైనా వానికియ్యకపోతే ఒప్పుకోడు."     గత్యంతరం లేక శంకర్ దాదాకి ఇంకో పదివేలిచ్చాం.     "మంచిది బిడ్డా! నేనిప్పుడే ఎమ్మెల్యేతానకు బోయి- సెటిల్ జేస్తా-" అన్నాడతను.     రెండోరోజు ఉదయానికి పూర్తిగా గుడిశెలన్నీ ఆనవాల్లేకుండా లేచిపోయినయ్.     పోలీసుల వల్లా, కోర్టుల వల్లా కాని పని కేవలం గూండావల్ల అయిందంటే నిజంగా మన రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందో, మన రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఉన్నత స్థితిలో వుందో, మనరాష్ట్ర ప్రజలు ఎంత అదృష్టవంతులో- మాకు అర్థమయింది. తిన్నగా అందరం శంకర్ దాదా ఇంటికి చేరుకున్నాం.     "మళ్ళీ వచ్చిన్రేమి సంగతి? ఇంకెవళ్ళయినా ఖాళీ చేయకుండ మిగిలిన్రా?" అడిగాడతను.     "లేద్సార్! అన్ని గుడిశెలూ లేచిపోయాయ్! మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలీడం లేదు" అన్నాడు రంగారెడ్డి.     "అరె- నీ యవ్వ- దాన్దేమున్నది భాయ్! ఒక జాగాల వున్నోళ్ళం! మంచిగ ఒకరి గురించి ఒకళ్ళు సహాయం చేసుకోవాలె! ఏం జెపున్నా! గట్లనే జరవచ్చే ఎలక్షన్ల గురించి గూడా ఖ్యాల్ తోటుండండి! నేనే ఎంపీగా ఈ ఏరియాకి నిలబడుతున్నా-"     అందరం అతనికే ఓట్లువేస్తామని ప్రామిస్ చేసి అక్కడి నుంచి మా కాలనీ వైపు బయలుదేరాం ఆనందంగా. దాదాలూ, మర్డరర్లూ, గాంగ్ లీడర్లూ, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా ఎందుకు ఎన్నికౌతున్నారో అప్పుడే తెల్సింది మాకు.                                                        *  *  *  *  *
24,940
      "నే ఒక్కడినీ వెళ్ళి చూసి వస్తాను " కమల్ అన్నాడు.     "వద్దు అవేళ్ళేదెదో అందరం కలిసే వెళదాం. ముంచైనా చెడైనా కలిసే అనుభవిద్దాం" అన్నాడు విజయ్.     "మనం నిశ్సబ్దంగా వెళ్ళటం మంచింది" కృతి సూచన ఇచ్చింది.     "అవును మనం మాట్లాడుకోవద్దు" సుబ్బారావు ఓ సూచన తానూ యిచ్చాడు.     "రైట్ , ఇంక బ్యాల్దేరుదాం" కమల్ అన్నాడు.     నలుగురూ నెమ్మదిగా మరో గుహలోకి ప్రవేశించారు.     అందరికీ ఒక్కసారిగా అమిత ఆశ్చర్యం కలిగింది.     ఆ గుహలో ఏ శబ్దమూ వినిపించడం లేదు.     చేవి యొగ్గి జాగ్రత్తగా విన్నారు అయినా వినిపించలేదు.     "మాయగా వుందే!" సుబ్బారావు అన్నాడు చాలా నెమ్మదిగా     మళ్ళీ ఆ గుహలోకి వెళ్ళి చూద్దాం" విజయ్ కి ఈ మిస్టరీ ఏమిటో అర్ధంకాలేదుగాని వెళ్ళి చూస్తె ఏమనా అర్డంమవుతుందేమో అన్న ఆలోచన వచ్చింది.     నలుగురూ వెనక్కీ మరలి ఇందాకటి గుహలో కాలు పెట్టారు.      ఆ గుహలో అయితే లీలగా శబ్దం వినవస్తున్నది.     " విన్నావా ఆ శబ్దం ? ఇక్కడెక్కడో మహామా౦త్రీకుడు వుండి వుంటాడు. మనరక దివ్యదృష్టితో చూసి మన్ని తికమక చేసి తిప్పలు పెడుతున్నాడు"     "సుబ్బూ! మాత్రీకులు మాయజాలలు దెయ్యాలు భూతగణం అంటూ ముందా వెధవ కబుర్లు మానేయి. బాగా ఆలకించు శబ్దం ఇటుగా వస్తున్నది. మనమేమో అటు గుహలోకి వెళ్ళాం పదండి ఇటు వెళ్ళి చోద్దాం." విజయ్ నెమ్మదిగా అన్నాడు.     సుబ్బారావుకో అనుమానం వచ్చింది గాని కక్కకుండా దిగమింగేశాడు.     నలుగురూ అటుకేసి నడిచారు.     ఇప్పుడు శబ్దం క్రుగా విన వస్తున్నది.     ఆ వింతేమీటో చూడాలంటే గుహలో కాలు పెట్టాలి కళ్ళారా చూస్తె తప్ప ఎప్పుడూ వినని ఆ వింత తెలిసిపోతుంది.     "ప్రమాదమో ప్రమాదామో చూస్తె తప్ప తెలియదు. ఆ గుహలో బాగా చీకటిగా వుంది. గుహలో అడుగుపెట్టడం మంచిది కాదు. మార్గం వద్ద ఆగిపోయి గుహలోకి లైటు వేసి చూద్దాం ప్రామాణభరిత మైనా దృశ్యం కనిపిస్తే లైటు అర్పుతాను. ఆ వెనుక గుహలోకి జమ్ఫ్ చేద్దాం. అంతకన్నా మార్గంలేదు.     "అంతేఅలాగే చేద్దాం విజయ్" అంది కృతి     "పదినిముషాలు ఆగుదాంశబ్దంలో మార్పు వస్తుందేమో కనిపెట్టి ము౦దడుగు వేయడం మంచిది" కమల్ సలహా ఇచ్చాడు.     "మీ అంత క్విక్ ధైర్యం తెచ్చుకుని వాళ్ళతో పాటు రెడీ అయ్యాడు.     ఈ యాత్రకు బయల్దేరేముందు అన్నీ సమకూర్చుకోవడానికి టైమ్ క్కువ లేకపోయింది. అయినా విజయ్ డబ్బుకు ఆశపడే ఓ బ్రోకర్ ని పట్టుకుని అతని వ్దారా ఓ రివల్వర్ట్ సపాదించాడు. నాలుగు డజన్ల గుళ్ళు మాత్రం చాలా ఖరీదికి దొరుకాయి. ప్రాణం మీదకొస్తే తప్ప రివాల్వర్ వుపయోగించరాదని ముందు నిర్ణయించుకున్నారు. అప్పుడే తెలివిగా కమల్ ఓపని చేశాడు నాటకాలలో వుపయోగించే రకం టాయ్ పిస్టల్స్ నాలుగు కోనుక్కున్నాడు.     వాటిని చూసి "ఇవేందుకురా కమల్! దారిలో ఆడుకోవటానికా" విజయ్ అడిగాడు.     "ఇవి టాయ్ పిస్టల్స్ కావచ్చు కాని పేలిస్తే నిప్పురవ్వలు వేలుపడతాయి పరిసరాలు దద్దరిల్లేలా ద్వని వస్తుంది. ఏ కూరజంతువుతో ఎదురైతే ఇది పెలుద్దాం. భయంతో అది పారిపోతుంది ఓ విధమైనరక్షణాయుధం మనకి!" పిస్టల్ గురించి యింకా కొంత వివరించాడు కమల్.         కమల్ ఐడియా అందరికీ నచ్చింది. తలో పిష్టలు దగ్గర వుంచుకున్నారు. వాళ్ళకి నిత్యం దగ్గరవుండే ఆయుధం రూళ్ళకర్ర కన్నా జానేడు పొడుగున్న మంచిరకం చేతికర్ర. పోలీసువాడి చేతిలో లాఠీకర్రలాంటిదే ఇదికూడా.     చేతిలో కర్రలు బిగించి పట్టుకున్నారు సుబ్బారావు కృతి.     విజయ్ రివాల్వర్ తీసి చేతిలో వుంచుకున్నాడు.     "ఎంతోఅవసరం అయితే తప్ప గుండు వేస్ట్ చేయకు విజయ్! బెదిరింపుకోసం ముందుగా నా టాయ్ పిష్టల్ ని వుపయోగిస్తాను" తనూ రెడీ అవుతూ అన్నాడు కమల్.     "ఓ.కే" అన్నాడు విజయ్.     వీళ్ళ సంబాషణ అతినేమ్మదిగా జరిగింది.     ఆ గుహలోకి వెళ్ళేమార్గం దగ్గరగా అడుగువేస్తూ అక్కడికి చేరాడు విజయ్. అతని పక్కన వేనుకగా చేరారు మిగతావాళ్ళు.     కుడిచేతిలో రివాల్వర్ రెడీగా పట్టుకుని ఎడంచేతిలోని టార్చిలైటు వెలిగించి ఫోకస్ గుహలోకి వేశాడు అలాగేవుంచి అటూ ఇటూ తిప్పాడు.     ముందు నుంచున్న విజయ్ కి కమల్ కి కనిపించిన ఆ దృశ్యం వీళ్ళ వెనుకనే నుంచున్న కృతికి సుబ్బారావుకి కనిపించలేదు.     విజయ్ లైటు అర్పూతూనే నవ్వాడు.     కమల్ అంతకన్నా గట్టిగా నవ్వాడు.     వాళ్ళిద్దరి నవ్వులూ తెరలు తెరలుగా ఆగకుండా వస్తున్నది.     "ఏం జరిగిందిరా?" బిక్క ముఖంవేసి అడిగాడు సుబ్బారావు.     "ఆగండి ఏమిటా పిచ్చి నవ్వు ఆగటంలేదు. ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నారు కుదరటంలేదు.     నవ్వు నవ్వు నవ్వు                                  17     విపరీతమైన వాళ్ళ నవ్వుచూసి కృతికి రవంత భయం వేసింది.     కమల్ భుజంగిల్లాడు విజయ్.     కృతి ముందుకు జరిగి టార్చ్ లైట్ వెలిగించి ఆ గుహలోకి వేసి చూసింది.     ఇప్పుడు వాళ్ళిద్దరితో పాటు కృతి కూడా నవ్వడం మొదలు పెట్టింది.     "వీళ్ళు చూసిన దృశ్యం ఏమిటోగాని వీళ్ళ మతులు పూర్తిగా పోయాయి. ముగ్గురూ పిచ్చినవ్వులు నవ్వుకున్నారు. వీళ్ళకి మతిపోయింది. భగవంతుడా! నాకింకేం దారి. అదేమిటో నేను చూద్దామంటే నా మతిపోయి వెర్రిఅవ్వులోకి దిగుతానేమో"     సుబ్బారావుకి ఏం చేయాలో తెలియటంలేదు. నెమ్మదిగా వణుకుతున్నాడు.     "సుబ్బూ! మైడియర్ సుబ్బూ!" విజయ్ అన్నాడు.     "ఎ..... ఎ...... ఏంటిరా ?" సుబ్బారావు స్వరంలో కంపన చక్కగా తెలుస్తున్నది     "భయపడుతున్నా వెంటిరా సుబ్బూ?"     "పిచ్చిపట్టినట్టు మీరెందుకురా నవ్వుకున్నారు?"     "ఓ అదా " అంటూ నవ్వి కొండనుతవ్వి ఎలుకను పట్టుకున్నందుకు పద చూద్దువుగాని" అని లైటు వేసి ముందుకు నడిచాడు విజయ్!     సుబ్బారావుకంతా అయోమయంగా వుంది అడుగులు తడబడుతుండగా వాళ్ళ వెనుకనే నడిచాడు.     ఆ గుహా తతిమ్మా గుహలకన్నా చిన్నదే ఎత్తుమటుకు చాలా వుంది. గుహలో ఎపక్క కంట్లా వుంది. దానిలోంచి ఫావుర్సుగా నీరు వచ్చి ఎదుటి గోడకు కొట్టుకుని కింద కంతలోకి వెళ్ళిపోతున్నది. ఈ నీటిశబ్దమే వాళ్ళు విన్న విచిత్రద్వని.     "ఇదేంటిరా!" సుబ్బారావు తెల్లబోతూ అడిగాడు.     "ఇదా నాయినా నీళ్ళు."     "కనబడుతూనే వుంది. మీరెందుకు నవ్వారురా!"     "నీలాగా తెల్లబోటం చేతగాకరా నాయనా! భయంకర దృశ్యం చూడబోతున్నామని భ్రమపడి ప్రమాదం మీదపడుతుందేమో అని జాగ్రత్తపడి పధకం వేసుకుని ఎంతో జాగ్రత్త వహించి అడుగుముందుకువేస్తె ఇక్కడ మనకు నీళ్ళు దర్శనమించాయి. నా జాగ్రత్తకి నాకే నవ్వు వచ్చింది."     "మీ నవ్వు చూసి మీకు పిచ్చి పట్టిందేమో అని హడలి చచ్చాను కదరా!"     "ఇలా మధ్య మధ్య నిన్ను హడలు కొడితే నీలో భయం దూరమయి ధైర్యసహాసాలు  దండిగా ఏర్పడతాయని.....!"     అరేయ్! నన్ను చూస్తె నవ్వులాటగా వుందిరా! సమయం రాకపోదు నేనోక్కడినే మిమ్మలంతాఏడిపించి నేనొక్కడిని నవ్వకపోను."     "హరినీ. భీష్మ ప్రతిజ్ఞ పడుతున్నావే ఫరవాలేదురా సుబ్రావ్ పైకి వస్తావ్?"     తధస్తూ , అవునుగానిరా ఏ గుహలో కానరాని నీళ్ళు ఈ గుహలో ఎలా వచ్చాయిరా ?" తనే తధస్తూ అనుకుని అడిగాడు సుబ్బారావు.     "మనంవుంది కొండగుహలో ఇక్కడ నీళ్ళు వుండటంలో విచిత్రం ఏముంది? కొన్ని కొండలమీద అక్కడక్కడ నీళ్ళు వుంటాయి" అన్నాడు విజయ్.     "విజయ్ ! ఈ నీళ్ళుచూడు గోరువెచ్చగా వున్నాయ్!" దోసిటతో నీళ్ళుపట్టి తాగుతూ అంది కృతి.
24,941
    బిర్లా మనవళ్ళు ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ గా పనిచేసి, అక్కడ నుంచి ఒక్కొక్క మెట్టూ ఎక్కి, ప్రతి విషయాన్ని ప్రాక్టికల్ గా అబ్జర్వ్ చేసి ఉన్నత పదవుల్లోకి వచ్చారు. ఇది తెలుసా మీకు? ఆలాంటి బిర్లాల డిసిప్లిన్ మనిషికి అవసరం. అమెరికాలో ఎంత పదవుల్లో వున్న ఉద్యోగస్తులైనా, తమ కొడుకులు ఖాళీగా గడపడాన్ని ఇష్టపడరు. ఏదో ఒక పార్టు టైం జాబ్ ని చెయ్యమని ఎంకరేజ్ చేస్తారు. అలాకాని పక్షంలో గార్డెనింగ్, డ్రైక్లీనింగ్, వాషింగ్, మార్కెటింగ్, హౌస్ కీపింగ్ లాంటి ఇంటి పనులను అప్పగించి, వాళ్ళు చేసే పనిగంటలకి విలువకట్టి పాకెట్ మనీగా ఇస్తారు. ఒరేయ్ తీసుకోరా బాబూ... అని ఇవ్వరు. జపాన్ అతి తక్కువ సమయంలో ప్రపంచ దేశాల్ని సాంకేతికంగా శాసిస్తున్న దశకు చేరిందంటే, దానిక్కారణం వింటే మనం ఆశ్చర్యపోతాం.     జపనీస్ ఏకైక స్లోగన్ ఒకటే!     'కొత్త వస్తువును సృష్టించు- కొత్త ప్రయోగాన్ని చెయ్' చిన్నప్పటి నుంచి వాళ్ళ పిల్లలకిచ్చే ట్రైనింగ్ కూడా అదే. నీ మెదడుకి, నీ దేహానికి ఎన్ని గంటలు రెస్టు కావాలో అన్ని గంటలు రెస్ట్ తీసుకో. కానీ అంతకు రెట్టింపు గంటలు పనిచెయ్యి.     ఆ పని ఫలితాన్నివ్వాలి.     ఏదీ? మన భారతదేశంలో ఆ కాన్సెప్ట్ ఏదీ?     పనిచేసేవాడిని వెక్కిరించడం, వ్యక్తిత్వమున్నవాడిని అగౌరవపరచటం.     రేపటి ప్రపంచం బాగుపడాలంటే ఇవాళ మనిషి కష్టపడాలని చెప్పడం కోసం ఎంతమంది తమ ప్రాణాల్ని ధారపోసారో గుర్తుకు తెచ్చుకుంటే, వాళ్ళ జీవితాల్లోని సంఘటనలు చదివితే చాలు ఇవాల్టి యువతరంలో సగం నిరాశపోతుంది."     ఆమె చెప్తున్న దానిని నిశ్శబ్దంగా వింటున్నారు వాళ్ళిద్దరూ. మహతిలోని రేర్ క్వాలిటీస్ కి, ఆమె వెలిబుచ్చిన అభిప్రాయాలే సాక్ష్యం అనుకున్నాడు మేనమామ.     మహతితో, మధుకర్ ని బేరీజు వేసుకుంటున్నాడాయన.     "మధుకర్ ని నువ్వు రిపేర్ చెయ్యగలవు. ఆ పని నువ్వు చేస్తావా?" నెమ్మదిగా అడిగాడాయన.     "నేనేం మెకానిక్ కాను, మధుకర్ పాడైపోయిన మిషనూకాదు. అయినా ది గ్రేట్ బిజినెస్ మాగ్నెట్ రాఘవేంద్రనాయుడుగారే వుండగా మధుకర్ ని నేను రిపేర్ చెయ్యడం ఏమిటి? ఆయనకు చాతకాదా? ఒక మనిషి బాగుపడటం అన్నది అనుభవాల మధ్యపడి నలిగిపోవటం ద్వారానే సాధ్యమవుతుంది. ప్రక్క మనిషయినా, రచయితయినా ప్రేరణ మాత్రమే ఇవ్వగలరు. లేదంటే చేతకాదని ఆయన్నే నాతో స్వయంగా చెప్పమనండి."       మేనమామ రవికిరణ్ వేపు చూసాడు.     "ఆయనే నిన్ను స్వయంగా అడిగితే, మధుకర్ ని పెళ్ళి చేసుకుంటావా?"     చివరి ప్రయత్నంగా అడిగాడాయన.     "మధుకర్ మేనమామగారూ! మరోసారి మీకు స్పష్టంగా చెపుతున్నాను. నాక్కావలసింది డబ్బున్న ఫాదరిన్లా కాదు- డబ్బు సంపాదించగల భర్త" దృఢంగా, నిశ్చయంగా అన్న ఆ మాటతో మరేం మాట్లాడలేకపోయాడు.     "నేను అనుభవజ్ఞురాలినని చెప్పడంలేదు. కానీ మధుకర్ లో నిజంగా మార్పు రావాలని రాఘవేంద్రనాయుడుగారు కోరుకుంటున్న పక్షంలో మధుకర్ ని ఇంట్లోంచి పంపెయ్యమని చెప్పండి. తన కాళ్ళమీద తను నిలబడాలని చెప్పమనండి.     చేతిలో పైసా లేకుండా, స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదుగుతూ, ఒక్క తరంలో కోట్లాది సంపదను సంపాదించుకోగలిగిన సెల్ఫ్ మేడ్ మేన్ అని జనం అంటుంటే- ఆ విధంగా పైకొచ్చిన వ్యక్తి ఎంతటి గొప్ప ఆనందాన్ని, తృప్తిని, గర్వాన్ని అనుభూతినిస్తాడో... అలాగే రాఘవేంద్రనాయుడుగారు కూడా... నేను చూడకపోయినా, ఆయన్ని ప్రత్యక్షంగా కలిసి పరిశీలించకపోయినా, ఎవరయినా అలా ప్రెయిజ్ చేస్తే ఆయనా అలాగే అనుభూతిస్తారు. హీ డిజర్వ్స్ ఇట్! ఆయనకా అర్హత వుంది. కాని అయన కొడుకును మాత్రం కష్టమంటే తెలీకుండా, కందిపోతాడేమో అన్నట్లు పెంచటం పెద్ద తప్పు. రాఘవేంద్రనాయుడుగారిలాగే జెమ్ షెడ్జీ తాతా, జి.డి. బిర్లా అనుకుంటే మనదేశం పారిశ్రామికంగా ఇంత ముందంజ వేసేదా? వాళ్ళ తరువాత తరాలు కూడా కష్టపడబట్టే కదా ఈనాడు ఆ సంస్థలు అంతగా ఎదిగాయి! తను కష్టపడాలి. తను సంపాదించాలి. తను ఎదగాలి- తనను చూసి అందరూ సెల్ఫ్ మేడ్ మేన్  అని ,మెచ్చుకోవాలి. దాన్ని తలచుకొని తాను ఆనందించాలి. బాగానే వుంది. మరిదే ఆనందం, తృప్తి వారి కొడుకైన మధుకర్ కి దక్కనక్కర్లేదా? అదాన్యాయం. ఈరోజు రాఘవేంద్రనాయుడుగారు స్థాపించిన సంస్థల్లో వేలాదిమంది బ్రతుకుతున్నారు.     ఆయన జవసత్వాలు వున్నంతవరకు ఆ వేలాదిమంది కుటుంబాలకు చీకూ చింతా లేదు. ఆ తరువాత తన కొడుక్కేగదా ఆ సంస్థల్ని అప్పగిస్తారు? తను సంపాదించింది గనుక ప్రేమతో తన కొడుక్కి వాటిని ధారాదత్తం చేస్తారు. వాటిని పెంచి పోషించే ఆత్మబలం లేని తన కొడుక్కి వాటిని అప్పగిస్తారు. బాగానే వుంది. మరా వేలమంది- వారి కుటుంబాల గతేమవుతుంది? ఆస్థితోబాటు ఆత్మ విశ్వాసాన్ని, క్రమశిక్షణ, శ్రమించగల శక్తిని కూడా ఆయన తన కొడుక్కి అందించకపోతే ఆ సంస్థ గతి, వాటిల్లో పనిచేసే సిబ్బంది గతేమిటి?     Power in the hands of one who did't acquire it. Gradually is often fatal to success. Quik riches are move dangerous than poverty.     కష్టపడి తండ్రులూ, తాతలూ సంపాదించిన డబ్బును నీళ్ళలా ఖర్చుపెట్టే యువతీ, యువకులకు జీవితం, జీవితంలో విజయాలూ దూరంలో వుంటాయి ఇది తెల్సుకోమనండి చాలు.     తండ్రి ఆస్థిలోంచి, తండ్రి పలుకుబడిలోంచి, తండ్రి గీసిన వలయాల లోంచి బయటికొచ్చిన మరుక్షణం మధుకర్ లైఫ్ బాగుపడుతుందని నా నమ్మకం.     ఇంతకంటే చెప్పలేనట్టుగా ఆగిపోయింది మహతి.     మేనమామ, రవికిరణ్ వేపు చూశాడు వెళ్దాం అన్నట్టుగా.     "ఓ.కే అమ్మా! నీ టైంని వేస్టు చెయ్యలేదు కదూ" అంటూ ఇద్దరూ లేచి గుమ్మం వరకూ వచ్చారు. వాళ్ళిద్దరిలో మేనమామవైపు చూసి నవ్వుకుంది మహతి.     ఒక్కసారి ఆమె దృష్టి టీపాయ్ మీద వున్న ఉంగరం మీద పడింది.     "రాఘవేంద్రనాయుడుగారూ!" ఆ పిలుపుకి నాయుడుగారు ఉలిక్కిపడ్డారు. ముందుగా ప్లాన్ ప్రకారం మధుకర్ మేనమామగా పరిచయం చెయ్యమని ఆయనే రవికిరణ్ తో చెప్పాడు.     కాని మహతికెలా తెల్సింది? రాఘవేంద్రనాయుడుగారు విస్మయంగా చూసాడామెవేపు.     "మీ ఉంగరం" అంది మహతి చిర్నవ్వుతో.     రాఘవేంద్రనాయుడుగారికో అలవాటుంది. తను మాట్లాడుతున్నప్పుడు, తన వేలికున్న ఉంగరాన్ని బయటకు తీసుకోవటం, పెట్టుకోవటం ఆయన కలవాటు- అప్పుడప్పుడు అలా మరిచిపోవటం కూడా జరుగుతుంటుంది.     "ది గ్రేట్ బిజినెస్ మేగ్నేట్ ని ఇలా చూడగలనని ఊహించనైనా లేదు. మిమ్మల్ని చూసాక నా అభిప్రాయాలు మరింత సాంద్రతను సంతరించుకుంటాయి. థాంక్యూ వెరీమచ్ సర్" అంది మహతి. అంత పెద్ద వ్యక్తిని ప్రత్యక్షంగా, అతి సమీపంగా చూడగలిగినందుకు ఎక్సైట్ మెంట్ కి గురవుతూ.                                 *    *    *    *    *
24,942
          పట్టాభిరామయ్య బంధుప్రీతి రోజురోజుకీ పెరుగుతూనే వచ్చింది. బంధువుల్లో గాని, ఊరివాళ్ళలోగాని ఎవరయినా ఆర్ధిక పరిస్థితి బాగాలేక పిల్లలను చదివించ లేకపోతే ఇంటికి రప్పించి తనింటిలోనే వుంచి ఫీజులు కట్టి మరీ చదివించేవాడు. స్వంత సంతానం ఒక్కరే అయినా ఇంటినిండా ఎప్పుడూ పిల్లలు బిలబిలమని తిరుగుతూండేవారు. తమ్ముళ్ళూ, చెల్లెళ్ళూ ఆయనలోని బలహీనతను క్యాష్ చేసుకునేవాళ్ళు ఎప్పుడూ ఏదో ఒక ఇబ్బందిని చెప్పి డబ్బు కూడా తీసుకునేవారు. అన్నపూర్ణమ్మ ఎప్పుడు చూసినా వంటింటిలోనే కనిపించేది. ఎవరినుండీ ఎలాంటి మాట రాకుండా వుండటానికి శతవిధాల ప్రయత్నం చేయడంతోటే ఆమె జీవితమంతా గడిచిపోయింది.         అనూరాధకు తనకు తోడబుట్టిన వాళ్ళు లేరనే కొరత తీరుతుందనుకున్నాడు పట్టాభిరామయ్య కాని ఆమెకు మాత్రం వాళ్ళంతా వెళ్ళిపోయి యిల్లు ప్రశాంతంగా వుంటే బాగుండుననిపించేది. వీలయినప్పుడల్లా తోటలోనే తిరుగుతూండేది. చెట్లమీద తిరిగే ఉడతలు, తొండలు, బారులుగా పాకే చీమలు, ఎగిరే పక్షులు ఆమెకు నేస్తాలు వాటికే ఉపన్యాసాలు యిచ్చేది, పాఠాలు అప్పగించేది.         ఒకరోజు ఆ కుటుంబంలో అనుకోని సంఘటన జరిగింది.         పట్టాభిరామయ్య చాలా పట్టుదల మనిషి ఆఫీసులో ఒక అధికారితో గొడవపడి ఉద్యోగం రిజైనుచేసి ఇంటికి వచ్చేశాడా రోజు. ఎక్కడోచోట మంచి ఉద్యోగం దొరక్కపోదనే నమ్మకం వుండబట్టి తొందర పడ్డాడు. కాని అనుకున్నవి అనుకున్నట్లుగా జరగడం ప్రతిసారీ సాధ్యపడదు. మరో ఉద్యోగం దొరికేలోపున ఎన్ని అవస్థలు పడాలో ఆయనూహించలేకపోయాడు. కుటుంబం చిన్నదే కాని బాధ్యతలు ఎక్కువ, పొదుపు అసలు లేదు. ఆ సమయంలో ఆసరా ఇవ్వాల్సిన బంధువులు, మొండిచెయ్యి చూపించారు. ఒక బస్తా బియ్యం పంపి ఒక తమ్ముడు, రెండువేలు పంపు మరొక తమ్ముడు అన్న భారం తగ్గించేశామని గొప్పలు చెప్పుకున్నారు. అపకారికి ఉపకారం చేయాలనుకోవడం, ఒక చెంప కొడితే రెండో చెంప చూపించాలనే గాంధీతత్వం గల పట్టాభిరామయ్య వాళ్ళమీద కక్ష కట్టలేదు. అది తనకో పరీక్షా సమయం అనుకున్నాడు. దాదాపు సంవత్సరంపాటు ఆయనకు ఉద్యోగం లేకుండా పోయింది. పన్నెండేళ్ళ అనూరాధ అపుడే మొదటిసారి బీదరికాన్ని చవిచూసింది. సంగీతం మాస్టారు రావడం మానేశారు. డానికి ఆమె బాధపడలేదు. తల్లిదండ్రుల ఇబ్బంది ఆమెకు కొద్దిగా అర్ధమవుతోంది. ఆమెకు అర్ధంకానిది ఒక్కటే, అంత కష్టంలోనూ తండ్రి ఎవర్నీ ఇంట్లోంచి పంపేయకపోగా అప్పులు చేసి వాళ్ళను పోషిస్తూ ఫీజులు కట్టడం దేనికో పనిమనిషినిమాన్పించడంతో తల్లి ఒక్కతే ఇంటెడు పనీ చేసుకుంటూ సతమతమవుతుంటే చూడలేక సాయపడడం మొదలుపెట్టింది. అంత చిన్నతనంలోనే ఇంటి పనంతా చేయడం, తల్లికి ఆరోగ్యం సరిగా లేకపోతే పదిమందికి వంటచేసి భోజనాలు పెట్టడం అలవాటయి పోయాయామెకు. ఇంటిలో వున్న బాబాయిల పిల్లలంతా మగపిల్లలు కాబట్టి ఆమె పనికి వంకలు పెట్టి ఆనందిస్తూండేవారు. వాళ్ళకు దూరంగా వుండడానికి ఆమె తోటనీ, ఒంటరితనాన్నీ  మరింత ఆశ్రయించేది. ఒకరోజు పట్టాభిరామయ్య తమ్ముళ్ళ ద్వారా ఏదయినా అప్పు దొరుకుతుందేమో ప్రయత్నించడానికి స్వంత ఊరికి వెళ్ళాడు. వస్తానన్న రోజుదాటి నాలుగు రోజులయిపోయింది. ఇంటిలో వస్తువులన్నీ నిండుకున్నాయి. అన్నపూర్ణమ్మ యెప్పుడూ యెవరి దగ్గరా చేయిచాచి అడగలేదు. వాళ్ళింటికి కాస్త దూరంలో తోట అంచున కొన్ని ఇళ్ళున్నాయి. అందులో వుండేవాళ్ళంతా మధ్యతరగతి కుటుంబీకులే వాళ్ళకు అన్నపూర్ణమ్మగారంటే వల్లమాలిన అభిమానం. అవసరానికి ఎప్పుడేది అడిగినా కాదనలేదావిడ. వాళ్ళకు ఇప్పటి పరిస్థితి కొంతవరకు తెలుసు. ఆమె ఇబ్బందిలో వుందని తెలియగానే చేతిలో వున్న డబ్బు తెచ్చి ఇచ్చారు. పదిమందికి మూడు పూటలా భోజనానికి ఎన్నాళ్ళు సరిపోతుందది? పైగా స్కూలు ఫీజులు కట్టాలని గొడవపెడుతున్నారంతా.         "బామ్మగారింటికి వెళ్ళి నాలుగుశేర్ల బియ్యం వున్నాయేమో అడిగి వస్తావా రాధా?" అన్నపూర్ణమ్మ గత్యంతరం లేక రాధను పంపాలని నిశ్చయించుకుంది.         "పోమ్మా, నేనూ వెళ్ళను. మనింటికి వస్తే ఇల్లంతా తన స్వంతంలా తిరుగుతుందిగాని వాళ్ళింటికి వెళితే లోపలకు రాకు వరండాలో నిలబడు' అంటుందావిడ. వాళ్ళ వంటింటిలో కాలుపెడితే మైలపడి పోతుందట. నే వెళ్ళను" అంది రాధ కోపంగా.         "అట్లా అనుకుంటే ఎలాగమ్మా? వాళ్ళ చాదస్తాలు, ఆచారాలు వాళ్ళవి. మనం అలా విమర్శించగూడదు. ఒక్కసారి వెళ్ళిరామ్మా అన్నయ్య వాళ్ళు అప్పుడే తొందరపెడుతున్నారు" బ్రతిమాలింది ఆవిడ.         అనూరాధ చిరాకు పడుతూనే వెళ్ళి బియ్యం తెచ్చింది.         "ఎక్కువ లేవుట, ఇవే ఉన్నాయని ఇచ్చింది. త్వరగా వండుతావా అమ్మా ఆకలేస్తోంది" అంది.         "మా అమ్మగదూ యీ రొట్టె తినేసి వెళ్ళిపో, లేకపోతే ఆలస్యం అయిపోతుంది. సాయంత్రం వచ్చేటప్పటికి వేడి వేడి అన్నం, కూరా వండి ఉంచుతాను" ప్లేటులో ఓ రొట్టెముక్క పచ్చడివేసి అందించిందావిడ.         అనూరాధకు అప్పుడు ఏడుపు రాలేదు. వెంటనే పరిగెత్తుకుంటూ తోటలోకి వెళ్ళిపోయింది. గున్నమామిడి చెట్టుకింద కూర్చుని తల మోకాళ్ళ మధ్య దాచుకుంది.         'అమ్మలెందుకు కొడతారు? అల్లరిచేస్తే, చెప్పినమాట వినకపోతే కొడతారు. బాగా చదువుకోకపోతే, అదీ యిదీ కావాలని పేచీ పెడితే కొడతారు. చిన్నప్పుడు అన్నం తినకపోతే కొట్టేది అమ్మ కాని ఆకలివేసి అన్నం తిన్నందుకు కొట్టిందిప్పుడు. కడుపునిండా అన్నం తిన్నా ఇదేం న్యాయం? ఆడపిల్లను కాబట్టి దెబ్బలు తిన్నాను. అదే అన్నయ్య వాళ్లనయితే అలాగే కొట్టేదా? సృష్టిలో ఆడపిల్లగా పుట్టడం అంత నేరమా?' అనుకుంటే అప్పుడొచ్చింది ఏడుపు. తలెత్తి చూస్తే తన బాధను అర్ధం చేసుకున్నట్లుగా నేస్తాలన్నీ దగ్గరలోనే తిరుగాడుతున్నాయి. మెడకింద ఎరుపు మచ్చ వున్న తొండ 'ఇంత పెద్దదానివయి ఏడుస్తున్నవా' అన్నట్లు తలకిందకూ పైకీ ఆడిస్తోంది. కొమ్మమీద ఉడుత తన దుఃఖంలో పాలు పంచుకున్నట్లుగా జాలి చూపులు చూస్తోంది. పైకొమ్మ మీద కోయిల 'కూ' అని విషాదగీతం మొదలుపెట్టింది. వాటిని చూడగానే ఆమెలో ఏడుపు ఎగిరిపోయింది. చాలాసేపు వాటినే చూస్తూ కూర్చుండిపోయింది.         ఆరోజు ఉదయం అమ్మమీద పెద్ద అన్నయ్యలంతా సరిగ్గా ఫీజులు కట్టక స్కూల్లో మాటలు అనిపించుకోవలసి వస్తోందని, కడుపు నిండా తిండైనా పెట్టడం లేదని ఎగిరి పడ్డారన్న విషయం ఆమెకు తెలియదు. తమ తల్లిదండ్రులు వూరినించి అన్నీ పంపిస్తున్నా ఆవిడే సరిగ్గా చూడటం లేదన్నట్లు ప్రవర్తించారు. ఆమె జవాబు చెప్పలేక ఏడుస్తూ కూర్చుండిపోయిన విషయం ఆ రాత్రి తండ్రి వచ్చాక తెలిసింది. తల్లి అన్నం తిని అప్పటికే నాలుగు రోజులయ్యిందన్న విషయం కూడా అప్పుడే వింది.         అమ్మ తనను ఎందుకు కొట్టిందో అర్ధమయ్యి 'ఎవరయినా తప్పు చేస్తే ఎందుకు చేశారు?' అన్న ఆలోచన మొదటిగా రావాలి అని గ్రహించుకుంది అనూరాధ జీవితంలో గొప్ప ఫిలాసఫీ అది.         అవతలివారి ప్రవర్తనని ఆ కోణంలోంచి ఆలోచించటం...         కొద్ది నెలల్లో తండ్రికి ఏదో ఉద్యోగం దొరికింది. వాళ్ళ కష్టాలు గట్టెక్కాయి. కానీ ఆనాటి పాతరోజులు ఆమె జీవితాంతం మర్చిపోకుండా మనసులో ముద్రించుకుపోయాయి. బీదరికం ఆమెను మరెప్పుడూ భయపెట్టలేదు. చుట్టుప్రక్కలవాళ్ళ జీవిత రీతులను గమనించడం మొదలు పెట్టిందప్పుడే.         కుడివైపున చివరింట్లో బామ్మగారు ఆమె తమ్ముడు, కొడుకూ, కోడలూ, పెళ్ళికాని కూతురూ వుంటారు. బామ్మగారికి చాలా చాదస్తం. కూతురికి ఎందుకు పెళ్ళికాలేదో తెలియదుగాని ఆమె కొడుకునీ, కోడల్నీ నవ్వుతూ మాట్లాడుకోనిచ్చేది కాదు. అత్తాకోడళ్ళు ఎప్పుడూ కీచులాడు కుంటూనే వుంటారు. అమ్మమాట విని భార్యను తెగ బాదేవాడు ఆ ప్రబుద్దుడు. భార్యది తప్పుకాదని తెలిసినా ఎదురు చెప్పలేక ఆమెమీద చెయ్యి చేసుకునే అతడిని అసహ్యించుకునేది అనూరాధ. "నేనే ఆ పరిస్థితిలో వుంటే రెండు వాయించి పుట్టింటికెళ్ళిపోతాను" అనుకునేది.         రెండో ఇంట్లో వుండే తోటమాలి కుటుంబం చూడముచ్చటగా వుండేది. మాలి భార్య కూడా రోజల్లా కష్టపడేది. ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేస్తూనే వుండేది. ఇద్దరు పిల్లలనూ క్రమం తప్పకుండా బడికి పంపేది. వాళ్ళను చూస్తుంటే డబ్బు లేకపోయినా ఫర్వాలేదు అనిపించేది.         మరోపక్క చిన్న పోర్షన్ లో వుండేది దుర్గమ్మ. ఆమె ఒంటరిగా వుండేది ఆమె గుణం మంచిదికాదని ఎవరొఇఒ ఆమెను ఇంటికి రానిచ్చేవారు కాదు. అనూరాధకు ఆమె అంటే ఇష్టం. అప్పుడప్పుడూ ఎవ్వరూ లేకుండా చూసి వచ్చి తోటలో కూర్చునేది దుర్గమ్మ. "నేనో దురదృష్టవంతురాలిని. మగవాళ్ళ మాటలు నమ్మి జీవితం నాశనం చేసుకున్నాను. చదువు లేక ఇలా అయిపోయాను. నువ్వు బాగా చదువుకోమ్మా మంచి ఉద్యోగం చెయ్యి, మగవాడిమీద ఆధారపడకుండా బ్రతకడం నేర్చుకో" అని చెప్పేది. బామ్మగారిని అందరూ "దుర్గమ్మ - మీ మరదలు" అని ఎందుకు వెక్కిరిస్తుంటారో చాలా రోజులు అర్ధంకాలేదు. ఒకరోజు ఉదయం పూలు కోసుకుంటుంటే బామ్మగారి తమ్ముడు దుర్గమ్మ ఇంట్లోంచి బయటకు రావడం చూసింది. ఆయనకు లేని వ్యసనం అంటూ లేదు పేకాట, గుర్రప్పందాలు, ఇంట్లో ఇద్దరు భార్యలు, అరడజను సంతానం అయినా బామ్మగారు అతడిని ఒక్కమాటయినా అనదు. "ముదనష్టపుది నా తమ్ముడిని వలలో వేసుకుంది" అని దుర్గమ్మను తిడుతుండేది.
24,943
    "నాకెవరు కన్నారావు అనే పేరుగల స్నేహితులు లేరే!" ఆశ్చర్యంగా అన్నాడు శివరావు.     "మీరిద్దరూ ఒకటో తరగతిలో కల్సి చదూకున్నారుటండి.. మరేమోనండి మీరు మొదటివర్సలో కూర్చుంటే ఆయనేమో ఆఖరి వర్సలో కూర్చునే వారంటండి.     "నాకేం గుర్తులేదే!!.."     "కానీ ఆయనకి మాత్రం మీరు బాగా గుర్తున్నారండీ... స్నేహితుల్ని మర్చిపోయే దగుల్బాజీ కాదండీ ఆయన..." వినయంగా చేతులు కట్టుకుని అన్నాడు వెంకట్రావు.     శివరావు దెబ్బతిన్నాడు.     "ఓ...ఆయనా?... గుర్తులేకేం హిహి... బాగానే గుర్తున్నాడు... ఆయన మీ నాన్నగారా?..." బలవంతంగా నవ్వుతూ అడిగాడు శివరావు.     "కాదండి... ఆయనతో బాటు నాలుగో తరగతి మా నాన్న కలిసి చదివాడండి. మా నాన్నపేరు నారాయణండి. నాకు హైదరాబాద్ లో ఉద్యోగానికి ఇంటర్వ్యూకి పిలుపు వచ్చిందని తెలిసి కన్నారావు నాకు హైద్రాబాద్ లో మంచి ఫ్రెండున్నాడు... వాడింటికి మీ అబ్బాయిని పంపించు... తెల్సినవాళ్ళుండగా హోటల్లో ఉండడం ఎందుకూ డబ్బు దండగా అని మా నాన్నతో అన్నాడండి..."        "అబ్బే... డబ్బు దండగెందుకౌతుందీ... రేపొద్దున్న నువ్వు సెలెక్ట్ అవుతే వందలువేలూ సంపాదిస్తావుగా!" కళ్లు తుడుచుకుంటూ అన్నాడు శివరావు.     "అబ్బే... డబ్బు దండగేనండి... మీకు తెలీదు... పదండిలోపలికి పోదాం..." అంటూ గుమ్మం వైపు అడుగులు వేసి ఆశ్చర్యపోయాడు.     అక్కడ గుమ్మంకి అడ్డంగా ఒకావిడ పడుకుని ఉంది.     "ఎవరండీ ఈవిడ ఇక్కడ అడ్డంగా ఇలా నిద్రపోతున్నారు....?     "ఆవిడపేరు పార్వతమ్మ... ఆవిడేం నిద్రపోడంలేదు. బహుశా గుమ్మందగ్గర నించుని మనమాటలన్నీ విని ఉంటుంది. మూర్ఛపోయింది..." జాలిగా భార్యవంక చూస్తూ అన్నాడు శివరావు.     "ఇద్దరూ పార్వతమ్మ మొహం మీద నీళ్లు చిలకరించి లేపారు.     "పోయిన వారం ఒకాయన ట్రాన్స్ ఫర్ పనిమీదొచ్చి మా యింట్లోదిగి నిన్ననే వెళ్లాడు బాబూ... అంతకుముందు ఉద్యోగం ప్రయత్నం కోసం ఒకబ్బాయి మా యింట్లో దిగి నెల్రోజులున్నాడు బాబూ... ఆ అబ్బాయికి ముందు మరోకాయనహైదరాబాద్ ఊరు చూద్దామని వచ్చి మాయింట్లో దిగి నాల్రోజులున్నారు బాబు... ఇప్పుడేమో నువ్వొచ్చావ్... అందుకే కళ్లు తిరిగాయ్... ఏవనుకోకు బాబూ..." అంది పార్వతమ్మ మెల్లిగా.     "నువ్వు మరీ అంత మర్యాదగా మాట్లాడితే వీడు ఊరెళ్లింతర్వాత అక్కడినుండి హైదరాబాద్ వచ్చే ఎవడైనా ఉంటే వాడ్ని మనింటికి పంపిస్తాడు. నువ్వు కాస్త నోర్మూస్కో..." పళ్లు కొరుకుతూ భార్య చెవిలో అన్నాడు శివరావు.     "ఏంటో ఆవిడగార్కి చెవిలో ఏంటేంటో ఇన్స్ ట్రక్షన్స్ ఇచ్చేస్తున్నారే!... నాకోసం బిర్యానీలూ, స్వీట్లు లాంటి స్పెషల్స్ చెయ్యమని ఆవిడ్నేమీ బలంవంతం పెట్టకండి... రెండు మార్లు రసం, సాంబారు, ఆవకాయ, పెరుగు ఉంటే చాలు. ఎడ్జస్టయిపోతా..." అన్నాడు వెంకట్రావు వినయంగా.     "అసలు నీకు మా యింట్లో వంటలు సహించవేమో... హైదరాబాద్ హోటల్సులో భోజనం ఎంత రుచిగా ఉంటుందో నీకు తెల్సా?..." అన్నాడు శివరావు కసిగా వేళ్లు విరుచుకుంటూ.     "అబ్బే!... హోటల్ మీల్సు నా ఒంటికి పడదండీ... అర్రే!... ఇంకా గుమ్మంలోనే నిలబడిపోయామే!!... పదండి పదండి... లోపలికి పదండి" అంటూ లోపలికి అడుగు పెట్టి ఒక్కసారిగా కెవ్వుమని సంతోషంతో కేకపెట్టాడు.     "ఏమైందేమైంది?..." కంగారుగా అడిగారు ఇద్దరూ.     "ఆ సోఫాలో కూర్చుని ఉన్న ఓణీ వేస్కున్న అమ్మాయి మీ అమ్మాయేనా?..." కళ్ళింతింత చేస్కుని చూస్తూ అడిగాడు.     "అవును యేం?" భయం భయంగా అడిగాడు శివరావు.     "హబ్బా...నేనెంత లక్కీనో?"... ఠాప్...ఠాప్...లొట్టలు వేశాడు.     "యేం నాయనా... ఎందుకూ?... స్టాప్ మీద మరుగుతున్న సాంబారు వాసన నీకు తగలిందా?... అది నీకు నచ్చిందా?..." పార్వతమ్మ సంబరంగా అడిగింది.     "అది కాదులెండి... మీకు వయసులో ఉండే కూతురుంటే అది నాకు అదృష్టమే కదండీ... చక్కగా తియ్య తియ్యగా కబుర్లు చెప్పుకుని కాలక్షేపం చెయ్యొచ్చు. లేకపోతే మీ యింట్లో ఉండడానికి బోర్ కొడ్తుంది. ఇప్పుడైతే ఎన్ని రోజులైతే అన్ని రోజులుండొచ్చు... ఠాప్....ఠాప్"     "ఏవండోయ్! అబ్బాయికి అమ్మాయి నచ్చినట్టుంది... అల్లుడిగారికి ఉద్యోగం వస్తే అమ్మాయినిచ్చి చేసేద్దామా?" భర్త చెవిలో సంబరంగా అడిగింది పార్వతమ్మ.     శివరావు భర్యవంక చూసి పళ్లు బైటపెట్టి"ఈ..." అన్నాడు కోపంగా.     శివరావ్ కి తిక్కరేగి జుట్టు పీక్కున్నాడు.     "ఒసేవ్ కమలా!... నువ్వెందుకిక్కడ? లోపలికెళ్లు" అంటూ గావుకేక పెట్టాడు సోఫాలో కూర్చుని ఉన్న కూతుర్ని చూస్తూ శివరావు.     భోజనాల దగ్గర కూరలో కారం ఎక్కువైంది. సాంబార్లో ఉప్పు తక్కువైంది అంటూ పేర్లు పెట్టుకుంటూ తిన్నాడు వెంకట్రావు. రోజూ ఆ కూర చేస్తే బాగుంటుంది ఈ పులుసు చేస్తే బాగుంటుంది. అంటూ కోరికలు కూడా కోరసాగాడు. ఏ మాత్రం అవకాశం దొరికినా కమలతో కబుర్లేసుకోసాగాడు వెంకట్రావు. శివరావుకి మాత్రం ఒంటికి కారం పూసినట్టుగా ఉంది.     "ఆ ఏవోయ్... ఈ రోజేనా మన ప్రయాణం" కులాసాగా అడిగాడు శివరావు ఇంటర్య్వూ నుండి వచ్చిన వెంకట్రావుతో.     "అదేంటండీ మీరు మరీను... ఇంటర్య్వూ ఎలా చేశానో అడక్కుండా నా ప్రయాణం గురించి అడుగుతారేం?..." అన్నాడు వెంకట్రావు చిన్న బుచ్చుకుంటూ.     "సర్లె... సర్లె... ఇంటర్య్వూ ఎలా చేశావ్?"     "బాగానే చేశానండి..."     "మరి ప్రయాణం ఈ రోజే కదా?..." వెంకట్రావుకి సంతోషంగా కన్నుకొట్టి కులాసాగా అడిగాడు.     "అబ్బే... ఇంకో వారం ఉంటానండీ ... వచ్చే వారం ఆ ఆఫీసుకెళ్తే ఇంటర్వ్యూ రిజల్సు చెప్తారు."     "ఇక్కడ ఉండడం ఎందుకూ?... మీ ఊరెళ్తే నువ్వు సెలెక్టయిన తరువాత అర్దర్సు వాళ్లే పోస్టులో పంపిస్తారుగా?" పాలిపోయిన మొహంతో అన్నాడు శివరావు.     "ఆ... ఆ పోస్టులు వాళ్లని ఎవరు నమ్ముతారు లెండి... ఎక్కడ పారేస్తారో ఏమో... నేనిక్కడ ఉండే ఆఫీసుకెళ్లి కనుక్కుంటా... మీరీ ఊళ్ళో ఉండటం నాకెంత లక్కీనో." అన్నాడు వెంకట్రావు.     ఇలా లాభంలేదని శివరావు తన పేర్న తనే ఒక దొంగ టెలిగ్రాం ఇచ్చుకున్నాడు.     "వార్నాయనో... మా తాతకి సీరియస్ గా ఉందట్రో దేవుడో... మేం వూరికి వెళ్లిపోవాలి నాయ్ నో... నువ్వు హోటల్లో దిగాలి దేవుడో... అంటూ గోలగా ఏడ్చాడు శివరావు.     మీరు ఊరెప్పుడెళ్తారు ఇప్పుడు ట్రైన్ ఏమీలేదే?"     "రేపెళ్తాను..." కళ్లు తుడుచుకుంటూ అన్నాడు శివరావు.     "నేనిప్పుడే వస్తాను..." అంటూ బయటికి వెళ్లాడు వెంకట్రావు.     మర్నాడు తెల్లారగాట్టే శివరావుకి టెలిగ్రాం వచ్చింది. దాన్ని వెంకట్రావే అందుకున్నాడు.     "మీ తాతగారికి కులాసాగానే ఉందనీ... మీరు ఊరికిరానక్కర్లేదనీ టెలిగ్రాం వచ్చింది. అయితే నేనిహ మీ యింట్లోనే ఉండొచ్చు" చిలిపిగా చూస్తూ అన్నాడు వెంకట్రావు.     శివరావు గోడకేసి సున్నితంగా తలకొట్టుకున్నాడు.     అతనికి అర్ధమైపోయింది ఆ టెలిగ్రాం వెంకట్రవే ఇచ్చాడని!                                                     *   *   *
24,944
    అనూష వంగి డ్రాయర్ లోంచి 'ప్లాస్టిక్' అని వ్రాసి వున్న ఫైలు తీసి అతడి ముందుకు తోస్తూ "వీటిని అమ్మెయ్యమని మీరు వ్రాసింది ఏప్రిల్ 24న! ఇందిరాగాంధీ జపాన్  ప్రయాణం ఏర్పాటయింది మే 16న" అంది తాపీగా.     రామలింగేశ్వర్రావు మొహం వెల వేలబోయింది. కానీ వెంటనే సర్దుకున్నాడు.     "అవును, రెండు నెలలు ముందుగానే ఆ విషయం పేపర్లో వచ్చింది" అన్నాడు.     "చూసారా, అక్కడే మీ అనుభవమూ తెలివితేటలూ కనబడుతున్నాయి. వీటి నుంచి మేము నేర్చుకోవలసింది".     రామలింగేశ్వర్రావు కాలరు సర్దుకున్నాడు.     "ఎలా వుంది మీ పార్శ్వపు నొప్పి?"     "పార్శ్వపు నొప్పి ఏమిటి?"     "మొన్న సిక్ లీవ్ పెట్టారుగా".     "ఓ అదా..... తగ్గింది".     "నాకు ఈ ప్రాంతం కొత్త. మీకు తెలుసుగా నేనొక్కదాన్నే వుంటున్నాను. నాకు మీ ఫామిలీ డాక్టర్ ని పరిచయం చేయాలి కాస్త. ఆయన మంచి హస్తవాసి వున్నాయనేనా?"     'ఒక్కదాన్నే వుంటున్నాను; అన్నవాక్యం దగ్గర అతడి కళ్ళు మెరవటాన్ని ఆమె  సునిశితమైన చూపు పట్టుకుంది. ప్రపంచానికి ఎక్సెప్షను లేదు.     "తప్పకుండా తీసుకెళ్తాను. డాక్టర్  శాస్త్రి అని...... మంచివాడే".     "శాస్త్రా....." అంది ఆమె. "మీ సిక్ లీవ్ సర్టిఫికెట్ ఎవరో జోసెఫ్ అని ఇచ్చారే! పైగా గాంధీనగర్ అని వుంటే అంత  దూరంలో ఫామిలీ డాక్టర్  ఏమిటా అనుకున్నాను".     "అదా...... మా శాస్త్రిగారు పది రోజులు టూర్ వెళ్ళారు. అందుకని....." అతడి మొహంలో అదోరకమైన ఇబ్బంది కనపడింది.     అంతలో ఫోన్ మ్రోగింది. పండా "ఒకసారి ఇలా వస్తావా అమ్మా" అని అడిగాడు ఫోన్లో. "ష్యూర్" అని ఫోన్ పెట్టేస్తూ "మిమ్మల్ని చైర్మన్ పిలుస్తూన్నారు" అంది. రామలింగేశ్వర్రావు మొహంలో రిలీఫ్ కనపడింది. లేచి వెళ్లాడు.     అతడు వెళ్ళగానే ఆమె చైర్మన్ కి ఫోన్ చేసి, "మీ దగ్గరకి రామలింగేశ్వర్రావు గారు వస్తున్నారు. అయిదు  నిముషాలు ఎలాగైనా మీ దగ్గరే ఆపుచేయండి" అని చెప్పింది.     పండా కంఠంలో విస్మయం కనపడింది. "ఎందుకు?" అని అడిగాడు.     "చెపుతాను".     "ఆమె ఫోన్ పెట్టేసి, డైరెక్టరీ చూసి డాక్టర్ శాస్త్రికి ఫోన్ చేసింది. ఆయన లైన్లోకి వచ్చాక "మీరు 14వ తారీఖున ఏదైనా టూర్ లో వున్నారా?"     "అట్నుంచి విసుగ్గా "ఎవరు మాట్లాడుతున్నారు?" అని వినపడింది.     "సెంట్రల్ ఇంటెలిజెన్స్"     అటు చప్పున సర్దుకున్న  ధ్వని. గౌరవంగా "లేదు మాడమ్. ఏం ఏమైంది?" కంగారు కూడా కాస్త మిళితం.     "ఏమీ లేదు".     "నెల రోజులుగా  నేనసలు వూరు దాటలేదు".     "థాంక్స్"     ఆమె ఫోన్ పెట్టేసి పది నిముషాల  తరువాత చైర్మన్ దగ్గరకి వెళ్ళింది- "ఎందుకో పిలిచారట".     "దానిదేముంది గానీ, ముందిది చెప్పు- ఎందుకు అతడిని నా గదిలో అట్టే పెట్టమన్నావు?"     "ఒక తప్పు సరిదిద్దుకోవటానికి అతడొక తప్పు చేశాడు. నాకన్నా  ముందుగా అతడు తన డాక్టర్ కి ఫోన్ చేయకుండా అడ్డుపడటం కోసం-"     "నాకేమీ అర్థం కావటం లేదు".     "స్టాక్  హొంకి నష్టం తెప్పిస్తున్నదెవరో తెలుసుకున్నాను".     "ఎవరు?"     "మన సెక్రటరీ - రామలింగేశ్వర్రావు-"     పండా చేతిలో పైపు జారిపోయింది. "నిజమా" అన్నాడు.     ఆమె చెప్పటం ప్రారంభించింది.     "ఆ రోజు సెక్రటరీ శలవులో వున్నాడనగానే నాకు అనుమానం వచ్చింది. ఆయనే గానీ వుండి వుంటే కవరు ఆయనే అందుకుని చింపి తెచ్చిన వాడిని నిలదీయటం జరిగేది. ఈ వ్యవహారాన్నించి ఆయన దూరంగా వుండాలని నిశ్చయించుకున్నట్టు కనపడింది. కానీ ఈ ఆలోచన నూటికి నూరుపాళ్ళూ కరెక్టు కాదు. మొత్తం మీద అనుమానం మాత్రం కలిగింది. ఆయన టైప్ చేసిన ఉత్తరాలు తెప్పించి చూశాను. (స్టాక్ హొం లాంటి సంస్థలో ముఖ్యమైన ఉత్తరాలు పై  అధికారులే వ్రాసుకుంటారు. లేదా టైప్ చేసుకుంటారు.) మనకొచ్చిన రిపోర్టూ, రామలింగేశ్వర్రావు టైపు చేసిన వుత్తరాలూ చూస్తే- రెండూ ఒకరే టైప్ చేసినట్టు కనపడింది. చేతి వ్రాతని ఎలా గుర్తుపట్టగలమో వేర్వేరు మిషన్ల మీద టైప్ చేసినా చేసింది ఓకే వ్యక్తి అయితే దాన్ని గుర్తుపట్టగలిగేశాస్త్రాన్ని 'అన్ ఫోల్డ్  టైప్ టెక్నిక్' అంటారు. A-S-D-F-అక్షరాల్ని వ్రేళ్ళు నొక్కే విధానం, లైను చివర ఆపే పద్ధతి ఇవన్నీ సహాయం చేస్తాయి. అన్నిటికన్నా ముఖ్యంగా మనలో నూటికి తొంభైమంది చేసే తప్పు - YOURS FAITHFULLY అని వ్రాయటానికి బదులు YOURS  FAITHFULLY అని వ్రాయటం - తన వుత్తరాల్లోనూ, ఈ రిపోర్టులోనూ అతడు చేసాడు" ఆమె ఆగి చెప్పసాగింది.     "ఇందిరాగాంధీకి జపాన్ పర్యటన  ఆలోచన  వున్నట్టు ఏ పేపర్లోనూ రాలేదు. కేవలం పెద్ద వాళ్ళకి మాత్రమే తెలుసు. సాధారణంగా తప్పుచేసినవాడు  దాన్ని కప్పి పుచ్చుకొనే ప్రయత్నంలో ఆడే  అబద్దాలు చాలా సులభంగా తేలిపోయేవి అయి వుంటాయి. ఇందిరాగాంధీ పర్యటన వార్త పేపర్లో చదివానని అతననటం కేవలం  అలాటి తప్పే. ఇంతకన్నా  దారుణమైన తప్పు అతడి పార్శ్వపు నొప్పి. మొత్తం మీద  దీని వెనుక ఎవరెవరున్నారన్నది తెలియాలంటే కొంతకాలం మనకేమీ తెలియనట్టు అతడిని గమనించటమే!!"     స్టాక్ హొం ఛైర్మన్, అంత పెద్దవాడు  ఆమె వివరంగా చెప్పినదాన్నీ, చేసుకుంటూ వచ్చిన దాన్నీ విని చాలాసేపటి వరకూ మాట్లాడలేకపోయాడు. చివరికి "గుడ్" అన్నాడు. "అమ్మాయ్! ఈ సీట్లో కూర్చొని నేనెంతో మంది మేధావుల్ని చూసాను. షేర్లతో ఆడుకునే  వాళ్ళనీ, ఎత్తులకీ ఎత్తులు వేసే లౌక్యుల్నీ చూసాను. కానీ ఇంత చిన్న వయసులో ఇంత తెలివిగా, తార్కికంగా ఆలోచించగలిగేదాన్ని నిన్నొక్కదాన్నే చూసాను. నువ్వు ఇలా ఈ సంస్థలోకి రాకుండా ఏ ఇంటలిజెన్స్ కో వెళ్ళి వుంటే మొత్తం నేరస్తులూ, మాఫియా అంతా దాసోహం అయివుండేది!" అన్నాడు.     అనూష నవ్వుతూ లేచి నిలబడి "అలా అనకండి. తథాస్తు దేవతలుంటార్ట! ఎదుర్కోవడం మాట అటుంచి, అసలా చీకటి  ప్రపంచంవైపు చూడటమంటేనే నాకసహ్యం......." అని అక్కణ్ణుంచి వెళ్ళిపోయింది.     సరీగ్గా అదే సమయానికి రామలింగేశ్వర్రావు హడావుడిగా  తన గదిలో ఫోన్  తిప్పుతున్నాడు. "హాల్లో- డాక్టర్ శాస్త్రిగారా...... హమ్మయ్య. ఎంతసేపట్నుంచో ప్రయత్నిస్తూ వుంటే ఇప్పటికి లైన్లో దొరికారు. మీరో సాయం చెయ్యాలి. ఎవరన్నా అడిగితే మొన్నటి వరకూ మీరు టూర్లో వున్నట్టు చెప్పాలి".     "అరె - ఇప్పుడే ఎవరో ఇంటలిజెన్స్ నుంచి అడిగారే-"     "ఇంటెలిజెన్సా?"     "ఎవరో స్త్రీ"     "స్త్రీయా?" రామలింగేశ్వర్రావు నుదుటన చెమట పట్టింది...... పెదాలు కొరుక్కున్నాడు.                                 6     ఉత్పల తన పక్కనున్న ఇద్దరి వైపూ పరిశీలనగా చూసింది.     చివరికీ ముగ్గురమ్మాయిలు మిగిలారు!     రెండొందల రూపాయిల జీతానికి రెండొందల మంది అభ్యర్థులు వచ్చారన్న విషయం తల్చుకుంటే, భారతదేశంలో నిరుద్యోగం ఎంతలా ప్రతిబింబిస్తూందోఅర్థమవుతుంది! రోజుకి పదిమంది చొప్పున ఓపిగ్గా ఇంటర్వ్యూ చేసాడు పాపం ముసలి డాక్టరు. ఇరవై రోజుల తరువాత ఫైనల్ ఇంటర్వ్యూకి రమ్మని పిలుపొచ్చింది. రెండొందల రూపాయిలకి రెండుసార్లు ఇంటర్వ్యూ ఏమిటా  అని ఇంట్లోవాళ్లు ఎగతాళి చేసినా అంతమందిలో సెలక్టయినందుకు గర్వంగా వుంది ఆమెకి!     ఆమె ఆలోచనల్లో వుండగానే తలుపు తీసుకుని డాక్టర్ హరనాధరావు ప్రవేశించాడు. ముగ్గురూ లేచి నిలబడ్డారు. "కూర్చోండి - కూర్చోండి" అంటూ తనూ కూర్చున్నాడు.     "రెండొందల మందిలో మీరు ముగ్గురూ మిగిలారు. కంగ్రాట్స్. బైదిబై నేను  పిచ్చివాడిని అని చాలామంది అనుకుంటూ వుంటారు. మీకూ అలా అనిపించటం లేదుకదా!"     లేదన్నట్టు మౌనంగావుండి, అవునన్నట్టు మనసులో అనుకున్నారు ముగ్గురూ.     "కౌటిల్యుడి గురించి కూడా ఆ రోజుల్లో ప్రజలు ఇలాగే అనుకునేవారట" అన్నాడు హరనాధరావు. ముగ్గురూ మాట్లాడలేదు. అంతలో ఒక నర్సు  చిన్న ప్లేటులో అయిదు ఆడవాళ్ళు బొట్టు పెట్టుకునే స్టిక్కర్లు తెచ్చింది.     "చాలా పురాతన కాలంనాటి సమస్య ఇది. దీన్ని ఆర్యభట్టు తయారు చేసాడంటారు. అర్థశాస్త్రం వ్రాసిన కౌటిల్యుడికే ఈ సమస్య  తేల్చటానికి అరగంట పట్టిందట. చూద్దాం మీకెంత కాలం పడుతుందో" అంటూ నవ్వేడు. కౌటిల్యుడికే అరగంట పట్టిందంటే తనకి అయిదు సంవత్సరాలు పట్టవచ్చు అనుకుంది ఉత్పల.     "ఈ ప్లేట్లో అయిదు స్టిక్కర్లు వున్నాయి చూడండి" అన్నాడు. ఉత్పల ప్లేటు వేపు చూసింది. రెండు నల్లబొట్లు, మూడు ఎర్ర బొట్లు వున్నాయి.     "ముగ్గురూ ఒకేసారి కళ్ళు మూసుకుంటారా?" అని అడిగాడు. "మా నర్సు మీకు బొట్లు పెడుతుంది". శ్రావణ శుక్రవారం పేరంటానికి వచ్చినట్టు ముగ్గురు అభ్యర్థులూ కళ్ళు మూసుకున్నారు. తన నుదుటి మీద ఒక బొట్టు అంటించబడటం స్పర్శ ద్వారా గ్రహించింది ఉత్పల.     "ఇక కళ్ళు తెరవొచ్చు".     ఆమె తెరిచింది. ఈ  లోపులో మిగతా రెండు బొట్లూ డ్రాయర్ లో దాచేసాడు అతడు.     "ఇప్పుడు మీరు చేయవలసిందల్లా, ఎదుటి ఇద్దరి బొట్లూ చూసి, మీ నుదుటి మీద ఏ బొట్టు అతికించబడిందో చెప్పటం..... ఎవరు ముందు చెపుతారో వారికే ఈ ఉద్యోగం".     ఉత్పలకి మతిపోయింది. ఎదుటి ఇద్దరి వైపూ చూసింది. ఇద్దరి అభ్యర్థుల నుదుటి మీద  ఎర్రబొట్లు వున్నాయి.     మిగిలినవి రెండు నల్లబొట్లూ, ఒక ఎర్రబొట్టు. అందులో ఏది తన నుదుటిని అలంకరించింది?     మిగతా ఇద్దరు కూడా  తన వైపు అయోమయంగా చూడటం గమనించింది!     ఆర్యభట్టూ ...... కొంప ముంచావుకదా! తన నుదుటిమీద ఏ రంగు బొట్టు వుందో ఆ ఇద్దర్లో ఎవరైనా చెపితే ఎంత బావుణ్ణు. ఎందుకు చేపుతారూ....... వాళ్ళూ తనుచెపుతే బావుణ్ణు అనుకుంటూ వుండి వుంటారు.     "మళ్లీ ఒకసారి కళ్ళు మూసుకుంటారా?"     ముగ్గురూ మూసుకున్నాక బొట్లు వొలుచుకుని వెళ్ళిపోయింది నర్సు.     "నాకో హెర్నియా ఆపరేషన్ వుంది. ఐ మీన్ - నేను చెయ్యాల్సింది! అది  చేసుకుని వచ్చేలోపులో మీకు కొద్ది క్షణాల క్రితం ఏ రంగు బొట్టు పెట్టబడిందో ఆలోచించి చెప్పండి" అని వెళ్ళిపోయాడు.     అయిదు నిముషాలు గడిచాయి.     పది .....పావుగంట..... అరగంట..... హరనాధరావు తిరిగొచ్చే టైమైంది. మిగతా వాళ్ళిద్దరూ ఆలోచించటం మానేసి, వెళ్ళిపోతే బావుండదని, కుటుంబ నియంత్రణ పోస్టర్లు చూస్తున్నారు. విశాలమైన వరండా.     అద్దాల్లోంచి, వరండా చివర ఫోను.....
24,945
    వాణి ఎండోమెంట్స్ ఆఫీసర్ ద్వారా పంపిన వార్తను అనుసరించి ఆ ఉదయం అక్కడొక అద్భుతం జరుగనుంది. కాని, అదేమిటో వారికి తెలియదు.     సంశాయాస్పదమయిన ఆ అంశం గురించి ఆలోచించి, దిగులుపడి బాగా అలసిపోయినారు కేశవరావుగారు ఆ సందేహాలు ఇంకా తీరలేదు.     కాని, వాణి వాసుకి, నాగాల అండదండలతో క్షేమంగా, ఉల్లాసంగా ఉండటాన్ని చూచిన వారికి మహదానందమయింది. స్వప్న తృప్తిగా నిట్టూర్చాడు.     అల్లరి కృష్ణుడు తల్లిని చూచి కేరింతలు కొడుతున్నాడు చిగురాకులాంటి చేతులు ఊగిస్తున్నాడు తన భవితవ్యాన్ని, జీవితాశయం తాలూకు సాఫల్యాన్ని, చావుబ్రతుకుల సమస్యను ప్రత్యక్షంగా తేల్చి వేసుకునే తుది ఘడియలు అవి. అందునించి వాణి రాయిలా మారిపోయింది.     "ఈ జరగనున్న పోరాటంలో విజయం తనవంతు అయితే తండ్రీ, భర్తా, బిడ్డా, ఈ లోకం - అంతా తనవారే అవుతారు. అలాకాక తాను విఫలమయి శ్వేతనాగు పగకు బలి అయితే బంధాలన్నీ ఏమవుతాయి? ఎవరికెవరు?" అని ఆలోచించిందామె.     అందునించి మమతలన్ని అవతల పెట్టి కటిన శిలా రూపంగా మారిపోయిందామె.     వారివంక కన్నెత్తి అయినా చూడలేదు. వాసుకి అప్పటికే సర్పయాగం తాలూకు కార్యక్రమాన్ని ప్రారంభించింది. వాణికి వచ్చి తన ప్రక్కగా కూర్చోవలసిందని ఆదేశించింది.     వాణి వెళ్ళి ఆమె ప్రక్కన కూర్చుంది.     జరుగుతున్న అద్భుతాన్ని చూచెందుకు కేశవరావుగారు, స్వప్న, ఎండోమెంట్స్ ఆఫీసర్, వారి మిత్రులు మరికొందరు ఒక వంకకు చేరిపోయినారు. నాగాలు, వారితోపాటుగా వచ్చిన చెంచుగూడెం వారు మరొక వంక నిలిచారు.     భ్రమరాంబా మల్లిఖార్జునస్వామిని మనసులో స్మరించి మహాగరుడ యోగాన్ని ప్రారంభించింది వాసుకి. ఒకప్పుడు ఇలాగే సర్పయాగాన్ని చేసిన యోగిని ముందుగా తలపోసిందామె. అప్పుడు పోలిమేరలలోంచి శ్వేతనాగు ఆ మంత్రవలయాన్ని ఛేదించుకుని పారిపోయింది. అటువంటి అవకాశం మరొకమారు దానికి లభిస్తే వాణి జీవితం సంశాయాస్పదమే అవుతుంది. ఆమెను రక్షించి తీరాలని యోగి తనువు చాలిస్తూ నిర్దేశించినాడు.     అందునించి సర్పయాగాన్ని సఫలీకృతం చేసేందుకు మనఃశక్తులన్నింనీ సమీకరించుకుంది వాసుకి. ఇంతకాలం కొండ గుహలలో తాను సాధించిన ఏకాగ్రతనంతటినీ కేంద్రీకరించటం ప్రారంభించింది.     నేలమీద పసుపుతో పద్మాలు రచించి, దానిమీద పులితోలు పరచి కూర్చుందామె. యోగ సాధన ద్వారా సాధించలేనిది ఏమీ లేదని నిరూపించే మహత్తరమైన క్షణాలు దగ్గరయినాయి. వాణి మూసిన కన్ను తెరవలేదు.     వాసుకి యోగం ప్రారంభించింది. శాక్తేయులలో కొన్ని శాఖల వారు ప్రయోగించే శక్తివంతమైన యోగసాధన అది.     యోగంలో ముఖ్యమయిన అంగాలు మూడు ఉన్నాయి.     పూరించిన వాయువును కుంభకం ద్వారా శక్తివంతంగా మార్చే ప్రయోగం అది. కొన్ని అడుగుల మేర వ్యాపించే వాయువును పూరించి, దానిపై ఒత్తిడి తెచ్చి సూక్ష్మీకరించాలి. గాలి మీద ఒత్తిడి చేయగలిగితే అది శక్తిగా మారుతుంది. ఆ శక్తిని చతుర్దశ నాదీ మండలాలలో శోధించాలి. ఆ పైన నిద్రించే సర్పాకృతిలో ఉండే అపురూప మానవశక్తి అయిన కుండలినిపై ప్రయోగించాలి.     సూక్ష్మీకరించటం ద్వారా అత్యంత శక్తివంతంగా మారిపోయిన వాయువును సరస్వతీ నాడిలోకి నడుపుతోంది వాసుకి. అప్పటికి ఆమె ముఖం ఉజ్జ్వలంగా కాంతివంతంగా అయింది. సరస్వతీ నాడిలోకి ప్రవేశించిన సూక్ష్మ వాయు శక్తి కుండలినిని ప్రేరేపించుతోంది. ఆ విద్య వాసుకికి బాగా అలవాటయిన విద్య.     కొద్ది నిమిషాల తరువాత కుండలిని జాగృతమయింది. మానవ శరీరంలో యోగులకు మాత్రమే తెలిసిన కుండలిని అత్యద్భుత శక్తి. అది జాగృతమైతే, అలా చేయగలిగితే ఆ మానవుడు అమృతమయుడవుతాడు. అత్యంత సంకల్ప శక్తి సంపన్నుడు అవుతాడు.     వాసుకి ఆ శక్తిని మేల్కొలిపింది. ఆమె సంకల్ప శక్తులు విజ్రుంభించినాయి. "ఓం" అంటూ అమృతనాదం ఆమె శరీరంలోంచి వినిపించసాగింది.     శ్రోతలు విభ్రాంతులయినారు.     అమృతమూర్తిగా మారిపోయిన వాసుకి సంకల్పశక్తులు బహిరమైన పరిసరాలలో శక్తి తరంగాలను సృష్టించినాయి.
24,946
కానీ, అనందానుభూతి అనిర్వచనీయమై గుండె కదిలి, వీరైకంట్లో చెమర్చిన ఇలాంటి మధురక్షణాలు కొన్నే... అవి కేవలం అనూష సాంగత్యంలోనే అనిభావానికి వచ్చాయి. ఆ ఇద్దరు స్నేహితురాళ్ళు ఆ గాఢ  పరిష్వంగంలో కాలం స్నేహాన్ని కొత్తగా నిర్వచించడానికి వేగంగా కదుల్తున్నట్టు చీకటి కమ్ముకుంది. భరణి బైక్ శబ్దం వినిపించడంతో ఇద్దరూ ఉలిక్కిపడి సర్దుకున్నారు. అనూష లైటు వేసింది. భరణి లోపలకి వస్తూనే  వీణని చిరునవ్వుతో పలకరించాడు.... "బాగున్నారా?" "నువ్వెలా వున్నావు భరణీ!" అడిగింది. "మీ దయవలన చాలా సంతోషంగా వున్నాను." "పత్రిక ఎక్కడిదాకా వచ్చింది?" "వస్తుంది. స్పెషల్ ఇష్యూ వేస్తున్నాను. మాకేమన్నా యాడ్స్ ఇప్పించకూడదూ!" "యాడ్సా? దాందేముంది? తప్పకుండా ఇప్పిస్తాను" వీణ బ్యాగ్ లోంచి రెండు విజిటింగ్ కార్డ్స్ తీసిచ్చి "రేపు వీళ్ళిద్దరినీ కలుపు. నేను ఫోన్ చేసి చెప్తాను" అన్నది. "థాంక్యూ! థాంక్యూ మేడమ్!" వికసించిన మోహంతో అన్నాడు. అనూష వైపు తిరిగి "నీ వంతుకూడా ఏదన్న కాంట్రిబ్యూషన్ వుందా?" అడిగాడు. "ఎ రకంగా?" అడిగింది. పని కుర్రవాడు ముగ్గురికీ మంచినీళ్ళు, బిస్కట్లు, టీ తీసుకొచ్చాడు. "ఈ రకంగా...." విజిటింగ్ కార్డు చూపిస్తూ అన్నాడు. "దేనికని?" అడిగింది. "ఎందుకేమిటి? మా పత్రిక బొత్తిగా లాన్ తో నడుస్తుంది. ఏదో నీ పేరు చెప్పుకుని, రెండుసార్లుగా సర్కులేషన్ పెంచుకున్నాకానీ, అడ్వర్ టైజ్ మెంట్లు లేవు. అవి లేకపోతే డబ్బుండదు. డబ్బు లేకపోతే పత్రికరాదు. పత్రిక రాకపోతే నేను అన్ ఎంప్లాయిస్ అవుతాను." "ఎంత డబ్బు కావాలి?" "ఎందుకంత?" ఆశ్చర్యంగా చూసింది. "డబ్బు లేకుండా ఎలా? పత్రిక నడపటం అంతే తమాషా కాదు.నీలాగా ఫర్ న  కోసి, సర్ న డబ్బులు తీసుకోవడం కాదు. ఎంత కష్టపడాలో తెలుసా! పైనాన్షియల్ గా చాలా ఇబ్బందిగా వుంది." అనూష చివ్వున  సోఫాలోంచి లేచి లోపలకికెళ్ళింది. ఆమె ఎందుకలా  వెళ్లిందో అర్ధంకాని వీణ, భరణి ఒకరి మోహలోకరు చూసుకున్నారు. రెండు క్షణాల్లో అనూష చెక్కుతో వచ్చింది. "ప్రస్తుతానికి నా తరుపున కాంట్రిబ్యూషన్ ఇది. అడ్వర్ టైజ్ మెంట్లు ఇప్పించే శక్తి నాకు లేదు" అన్నది చెక్కు భరణి చేతికిస్తూ. భరణి మొహంలో ఆ క్షణంలో కనిపించిన అనందం, వెలుగు చూసిన వీణ మనసెందుకో చివుక్కుమంది. భరణి మంచివాడేనా? ఒక ప్రశ్న బాణంలా గుండెని తాకింది. తనకు తానే సర్దుకుని సోఫాలోంచి లేచింది. "ఓ.కే.అనూ! నే వస్తాను. గుడ్ నైట్... గుడ్ నైట్ భరణీ!" "బోంచేసివెళ్ళకూడదూ!" అనూష అంది. "వద్దు. ఇవాళ పార్టీ వుంది. ఒక సీనియర్ లాయర్ కి జడ్జిగా ప్రమోషన్ వచ్చింది. అయన పార్టీ ఇస్తున్నారు." "అలాగా!" అనూష కూడా లేచింది. వీణ గుమ్మందాకా నడిచి, ఒక్కసారి వెనక్కి తిరిగింది. హాల్లో పైన గోడకి తగిలించిన నిలువెత్తు వెంకటేశ్వరస్వామి పాఠం చూసింది. ఆ పటానికి అటూ,ఇటూ వున్న అనూష తల్లితండ్రుల ఫోటోలు చూసి, బైటికి నడిచింది. "భక్తి  ఎక్కువైనట్టుంది" వెనకే వచ్చిన అనూష అంది. వీణ ఏం మాట్లాడకుండా, అనూష లోపలకి నడిచింది. ఆ రాత్రి అన్యమనస్కంగా వున్న అనూషని దగ్గరకి తీసుకుంటూ, "ఏంటి డల్  గా వున్నావు?" అడిగాడు భరణి. అనూష సన్నగా నిటూర్చి అన్నది. "ఏం లేదు. వీణ క్కూడా ఎవరన్నా తోడు దొరికితే, పెళ్ళిచేయాలని వుంది." "ఆవిడ్ని ఎవరు చేసుకుంటారు?" చివ్వున దూరం జరిగింది. "ఎందుకలా అన్నావు?" ఆమె ప్రశ్నలోని తీవ్రతకి కొంచెం జంకి, తమాయించుకుని అన్నాడు. "ఆవిడా క్యారెక్టర్ మంచిది కాదంటారు. చాలామందితో సంభందాలున్నాయట." "భరణీ!" తీవ్రంగా పిలిచింది. "ఇంకెప్పుడూ వీణ గురించి ఇలా మాట్లాడకు. మొదటిసారి కాబట్టి క్షమిస్తున్నాను. జర్నలిస్టువి, చదువుతున్న వాడివి.... నువ్వు కూడా ఇలా మాట్లాడగలవా?" "వీణాగారూ నాకూ ప్రేండేగా. నువ్వు పెళ్ళిమాట ఎత్తావు కాబట్టి, నలుగురూ అనుకునే మాట నేను అన్నాను. ఆవిడ జీవితం సెటిల్ అయితే నాకు మాత్రం అనందం కాదా!" నెమ్మదిగా అన్నాడు. అతడి మొహంలో, కళ్ళలో, స్వరంలో కదిలిన పశ్చాత్తాపం గమనించిన అనూష అతడి దగ్గరగా జరిగి నెమ్మదిగా అన్నది. "ఎవరి జీవితం వాళ్ళది. ఎవరికీ నచ్చినట్టు వాళ్ళు బతికే అధికారం, హక్కు వున్నాయి. ఇంకెప్పుడూ ఇతరుల జెవిట విధానాన్ని విమర్సించవద్దు." "అలాగే..." మరి మాట్లాడలేదు భరణి.                                                          *    *    *    * భరణి పేపర్ స్పెషల్ ఇష్యూ వచ్చింది. పెళ్ళిఫోటోలు, వార్తతో ఓ పేజీ మొత్తం స్పెషల్ గా కేటాయించాడు. అనూష కొద్దిగా అసంతృప్తి ప్రదర్శించింది. "ఎందుకీ పబ్లీసీటి?" అన్నది "నీ అంత గొప్ప స్త్రీకి భర్తనైనానన్నవిషయం ప్రపంచానికి చాటాలనిపించింది" అన్నాడు ఆమె ఒళ్ళో తల పట్టుకుని పడుకుంటూ.
24,947
    "ఎవరు 'శ్రీ' ?" కాస్త చనువు తీసుకుని ధైర్యంగా అడగనే అడిగింది ధీరజ.     "అబ్బ ఆశ... 'శ్రీ' గురించి తెలిస్తే పోలీసులకు సమాచారమిచ్చి కోటి రూపాయలు కొట్టేద్దామనుకున్నావా!" అతని ముఖంలో హేళన, గాంభీర్యత ఒకేసారి చోటుచేసుకున్నాయి.     "అంతేనా నువ్వు నన్ను అర్ధం చేసుకుంది...?" గోముగా అంటూ అతని నుదుటి మీద చేయి వేసింది ధీరజ.     "నీకు కాక మరెవరికి చెబుతాను ధీరజా ! నేను నిన్ను పూర్తిగా నమ్మాను. నా ప్రాణాలు నిలబెట్టావు. నా ప్రాణేశ్వరివి  నువ్వు..." అంటూ ఆమెను తన అక్కున చేర్చుకున్నాడు.     ఆ సీక్రెట్ ను కాస్తా ఆమె చెవిలో ఊదాడు. "బాస్ ఉరఫ్ ఆనంద్ ఉరఫ్ శ్రీ"     "వ్వాట్..." నివ్వెర పోయింది ధీరజ. ఆమె ముఖంలో రంగులు మారడం అతను గమనించనే లేదు...                                              *    *    *     *     డార్క్  రూమ్ నుంచి బయటకు వచ్చాడు రవితేజ.     ఫిల్మ్ ను ఎంత ఎక్స్ ఫోజ్ చేసినా డెవలప్ కావడం లేదు. తను మినీ కెమారాతో చాలా జాగ్రత్తగా తీశాడు. కాని ఫోటో పడలేదు!     ఆ సమయంలో ముందు జాగ్రత్తగా  అతను కదిలాడా లేక ముఖానికేదయినా రసాయనాన్ని పూసుకువచ్చాడా ... ?     ఆ ఫోటో మీద తను ఎంతో ఆశపెట్టుకున్నాడు! దానిని కాస్తా ఎవరో ఎగరేసుకుపోయినట్టయింది...     ఇక మిగిలింది ఒకే ఒక్క ఆధారం- అదే బ్లడ్ శాంపిల్ ....     దీనిని అనాలసిస్ చేస్తే తను చూసిన వ్యక్తి గురించిన బ్లడ్ గ్రూపు, డి.ఎన్.ఎ., ఫింగర్ ప్రింట్స్ తెలుస్తాయి.     డీ ఆక్సీ రైబో న్యూక్లిక్ ఆసిడ్ (డి.ఎన్.ఎ.) మనిషి శరీరంలో ప్రతి కణంలో ఇమిడి వుంటుంది. మనిషి వ్రేలి ముద్రలు పోలిన వ్రేలి ముద్రలు లేనట్టే డి.ఎన్.ఎ. కూడా ప్రత్యేక లక్షణంతో వుంటుంది.     ముద్దాయికి సంబంధించిన సెమన్, బ్లడ్, హెయిర్ మొదలయినవి బాధితుల శరీర భాగంలో కాని, నేర స్థలంలో కాని, బట్టల మీద కాని లభించినట్టయితే, అనుమాతుని నుంచి బ్లడ్ శాంపిల్ తీసి డి.ఎన్.ఎ. పరీక్ష చేయవచ్చు. రెండూ ఒకటే అయితే నిందితుడు పట్టుబడినట్టే !     ఇప్పుడు, లభించిన బ్లడ్ శాంపిల్ ను అనాలసిస్ కోసం లాబ్ కు పంపి రికార్డు చేయించాలి. తరువాత, అనుమానితులు ఎవరైనా దొరికినప్పుడు వారి బ్లడ్ ను కూడా తీసి పరీక్ష చేస్తే విషయం బయటపడుతుంది.     తను తీసుకు వచ్చిన బ్లడ్ శాంపిల్ ను వెంటనే లాబ్ కు పంపాడు రవితేజ.     అంతకన్నా ముఖ్యమైన విషయం -తను వెంటనే "జగజ్యోతి" కార్యాలయానికి వెళ్ళి ఆనంద్ ను చూడాలి. అతనితో మాట్టాడాలి.     ఆ ఆలోచన వచ్చీరాగానే వెంటనే 'జగజ్యోతి' కార్యాలయానికి బయలుదేరాడు రవితేజ.     అతను కార్యాలయం చేరెప్పటికే- ఆనంద్ దీర్ఘకాలం శెలవు పెట్టి వెళ్ళిపోయాడని తెలుసుకున్నాడు !     అంటే, ఆనంద్ ఇక "జగజ్యోతి" కార్యాలయానికి రాకపోవచ్చు! దీనితో ఆనంద్ మీద అనుమానం రెట్టింపు అయింది రవితేజకు.     "క్లూ" దొరికినట్టే దొరకి చేజారిపోతున్నది.     ఆనంద్ ను పట్టుకోగలిగితే "శ్రీ" గురించి తెలుసుకోవడం సాధ్యమవుతుంది.     వెంటనే తళుక్కున అతని మెదడులో ఆలోచన మెరసింది. ఆనంద్ కు సంబంధించిన ఫోటో కాని, ఐడెంటిటీ కార్డుకాని కార్యాలయంలో దొరుకుతుందేమో ప్రయత్నించాలి.     ఆ ప్రయత్నం కూడా చేశాడు. కాని విఫలమయింది !     ఆనంద్ తనకు సంబంధించిన చేతి వ్రాతలుగాని, ఫోటోలు గట్రా గాని ఏమీ లేకుండా ముందే జాగ్రత్త పడ్డాడు...!     తన అనుమానం నూటికి నూరు పాళ్ళూ  రూడి అయింది ! ఇప్పుడు ఆనంద్ కోసం వేటాడాలి. ఎలా? ఆలోచనలతో బుర్ర వేడెక్కుతున్నది రవితేజకు.     "శ్రీ" ని ఎవరో అజ్ఞాత వ్యక్తి ఇంటర్వ్యూ చేసినట్టు అన్ని పత్రికలకు ప్రతులు పంపవలెనని నిర్ణయించు కున్నాడు రవితేజ.     అప్పటి పరిణామాన్ని  బట్టి 'శ్రీ' "ఆనంద్" వేరువేరా ఒక్కరేనా అని తేల్చివేయవచ్చు !     తన ఈ సరికొత్త పథకాన్ని  అమలు చేయడానికి తిరిగి సి.బి.ఐ. డైరక్టరు కార్యాలయానికి బయలుదేరాడు రవితేజ.                        *    *    *     ప్రధాని తల్లిదండ్రులు విడిది చేసిన గది.     అంత హఠాత్తుగా తమ కొడుకు ఆ సమయంలో తమ వద్దకు వస్తాడని ఊహించని ఆ వృద్ద దంపతులిద్దరూ ఏం జరిగిందోనన్న ఆందోళనతో క్షణం కలవరపడ్డారు.     అవధాని కొడుకు భుజమ్మీద ఆప్యాయంగా చేయివేసి లోపలకు తీసుకువచ్చి తన మంచమ్మీద తన పక్కనే కూర్చోబెట్టుకున్నారు.     దేశానికి ఇతను ప్రధాని చక్రవర్తి కావచ్చు కాని, తనకు కొడుకే !     "ఏం నాయనా, ఒంట్లో బాగోలేదా!" కొడుకు ముఖాన వున్న చిరుచెమటలు బట్టి, ముఖం నల్లబడి ఉండడంతోను, నుదిటి మీద చేయి వేసి జ్వరం చూస్తూ అడిగింది అన్నపూర్ణమ్మ.     ఆ వయసులో కూడా వాళ్ళు తనపట్ల కురిపిస్తున్న వాత్సల్యాభిమానాలకు చక్రవర్తి శరీరం పులకరించింది. నోటి వెంట మాటలు రావడం లేదు.     ఎలా? ఎలా తన బాధను వాళ్ళతో పంచుకునేది ?     పండు వయసులో కృష్ణా రామ అనుకుంటూ ఏ కోర్కెలు లేకుండా, ఈ భవ బంధాల కన్నింటికీ అతీతంగా శేష జీవితాన్ని గడిపేస్తున్న పుణ్య దంపతులు.     వాళ్ళకు ఏ కష్టం, నష్టం కలుగకుండా చూడవలసిన బాధ్యత తనయునిగా తన మీద వుంది.     
24,948
     ఈ వేళ మరీ రెచ్చిపోతున్నాడు రాఘవ. పడక గదిలో అడుగు పెట్టడానికే భయంగా ఉంది.     అయినా తొమ్మిది నలభై అయిదు నిమిషాల కల్లా లోపలికి వచ్చింది. ఏదో చదువుతున్న రాఘవ నవ్వుకుంటున్నాడు తనలో తానే.     "ఏమిటి?"     "వారపత్రికలో జోక్."     "బాగుందా!" అంది అతడి సమీపంలో కూర్చుంటు.     మాటలతో తప్ప రాఘవను మభ్యపెట్టడం కష్టమనిపించి, "ఏమిటది?" అంది తనూ ఆసక్తిని చూపిస్తున్నట్లుగా.     "వెనుకటికి ఓ చాదస్తపు తల్లికి నా లాంటి కొడుకు ఉండేవాడు. పెళ్ళి చేసుకోరా అబ్బీ అంటూ తెగ వెంటపడేదట. అయితే పెళ్ళి చూపులకు వెళ్ళిన ప్రతిసారి ఈ అమ్మాయి నాలాగా పాతకాలంది కాదు, మరో అమ్మాయి కట్టూ, బొట్టూ నాలా లేదు, ఇంకో అమ్మాయి నాలాగా వంట తెలిసిన దానిలా లెదూ అంటూ తనే సంబంధాలు సెటిల్ కాకుండా అడ్డుపడేదట! ఆలాంటి సమయంలో ఓ స్నేహితుడు ఆ అబ్బాయికి సలహా ఇచ్చాడట. మీ అమ్మలాంటి అలవాట్లున్న ఆమ్మాయినే కట్టుకుంటే సమస్య పరిష్కారమవుతుంది కదరా అంటే, చాలా గాలించి ఓ పిల్ల నచ్చింది అన్నాడట. వాళ్ళమ్మ ఓ.కే. అంది. అంతే! ఈసారి తండ్రి అడ్డం పడ్డాడట.'     "ఎందుకు?"     "మీ అమ్మలాంటి ఆడపిల్లను కట్టుకుంటే నాలాగే జీవిత మంతా ఇబ్బంది పడాల్సివస్తుంది అని."     పకాలున నవ్వింది.     "ఇప్పుడు నేనూ అలా సఫర్ అవుతున్నానని కాదు కిన్నెర కనీసం ఈరోజన్నా కరుణించేశావనుకో.....!"     "అదేం కుదరదు. మన ఒప్పందం ప్రకారం మీరు నన్ను ఓడించాలి."     "ఓడిస్తాను.' ధీమాగా చెప్పాడు. "కాని, నువ్వు ఒట్టోడియాలు ఎలా చేస్తారు, గుత్తొంకాయ కూర గుజరాత్ లో ఎలా చేస్తారంటూ పిచ్చి ప్రశ్నలు వేయకూడదు.'     "ఓ.కే.!" నిబ్బరంగా అంది కిన్నెర.         అసలు అతన్ని ఇబ్బంది పెట్టాలని ఆమె ఎంత గట్టి కృషి చేసి ప్రశ్నలు సేకరించింది రాఘవకు తెలియదు.     మధ్యాహ్నం బ్యాంకుకు వెళ్ళేముందు లైబ్రరీలో చాలా పకడ్బందిగా ప్రిపెరయిపోయింది.     "కానియ్!" తొందర చేశాడు రాఘవ ఇక ఆలస్యం తాళలేనట్టుగా.     "ఒకే ఒక్క ప్రశ్న అడుగుతాను.'     "వెరి గుడ్!"     అమ్మవారికి మనసులోనే మొక్కుకుంది కిన్నెర.     "ఒక మనిషి అబద్దం చెబుతుంటే తెలుసుకోవటానికి పోలీసులు 'లై డిటెక్టర్స్ ' అని వాడుతుంటారుగా. అది యిప్పటికి అమెరికా లాంటి దేశాలలో క్రిమినల్స్ నుంచి నిజాన్ని రాబట్టటానికి పోలిస్ ఫోర్సెస్ ఉపయోగిస్తున్నా, ప్రపంచంలో ఓ దేశం దాన్ని అన్యాయంగా నిర్ణయించింది. ఆ దేశం ఏది? అసలు తొలిసారి ఈ లై డిటెక్టర్ ని ఎప్పుడు, ఎవరు కనుగొన్నారు? 1980 దాకా అమెరికా లాంటి దేశాలలో జాబ్ రిక్రూట్ మెంట్స్ లై డిటెక్టర్స్ ని వాడే కంపెనీలు ఎందుకు, ఏ కేసుతో లై డిటెక్టర్స్ సక్రమం కాదని వాడటం మానేశాయి. ఈ కేసు వివరాలు ఏమిటి?"     ఒకటని చెప్పి పది ప్రశ్నల దాకా అయినా ఒకే ప్రశ్నలో ఇమిడ్చింది. చెప్పలేడని బలంగా నమ్మింది కాని, "వహ్వా!" అన్నాడు రాఘవా జవాబు తెలిసినట్టుగా.     భయంతో కంపించిపోయింది కిన్నెర.     "ఇదెంతని కిన్నెరా! అర నిమిషంలో చెప్పేస్తాను!"     కిన్నెర అడిరిపడుతూ అడ్డం పడింది. "ఒక్క అక్షరం పొల్లు పోయినా నేను అంగికరించను.!"     "ఆ సమస్యే లేదు. అసలే ఐయ్యేయెస్ కి ప్రిపేరైన వాణ్ణి ఈ ప్రశ్నేంతని?"     కిన్నెర నుదుట స్వేదం పేరుకుంటుంది.     "నువ్వు ప్రశ్న ఎక్కడో ప్రారంభించి , మరెక్కడికో వెళ్ళావు. నేను క్రమంలో చెబుతాను కిన్నెరా!" రాఘవకు ఎంత ఉత్సాహంగా ఉందంటే , కిన్నెర ఈ రోజు పూర్తిగా ఓడిపోతుందన్న సంతోషంలో అడిగిన దానికి మించి జవాబు చెప్పాలన్న ఆవేశం వచ్చేసింది.     "మొట్టమొదటి మోడరన్ 'లై డిటెక్టర్ ను డెవలప్ చేసింది 1921 లో . ఆ వ్యక్తి పేరు జాన్ ఎలార్సన్. కాలిఫోర్నియా యూనివర్సిటీలో మెడికల్ స్టూడెంట్. కనిపెట్టింది అడిగితే డెవలప్ చేసిన వ్యక్తీ పేరు చెప్పినందుకు మీరు ఓడిపోయారు అంటావు కాబట్టి, అసలు దీనికి కారణం కూడా చెబుతాను. అబద్దం చెప్పేవాడు ఎమోషనల్ గా ఒత్తిడికి గురవుతాడని, ఆ ఒత్తిడి ఉచ్వాస నిశ్వసాలా వేగాన్ని, పల్స్ రేట్ ని పెంచి చెమట పట్టిస్తుందని, వాటిని రిక్కర్డ్ చేయడం ద్వారా అబద్దం చెప్పే వాడిని గుర్తించొచ్చని గ్రహించి, అలాంటి యంత్రాన్ని తొలిసారి కనిపెట్టింది ఇటలీకి చెందిన క్రిమినాలజిస్ట్ సీఆర్ లాంబ్రోసో.......! 1890 లో."     ఇప్పుడు కిన్నెర పల్స్ రేట్ పెరిగిపోతుంది భీతావహంగా.
24,949
        అయితే డీలక్స్ హోటల్లో, మూడో అంతస్తులో, పదమూడో నంబరుగదిలో     అలా మాట్లాడుతూ చనిపోవడం సభ్యతకాదన్న విషయం నిర్వివాదాంశం     స్వామి విధేయుడైన గుమాస్తా కోటేశ్వరరావు ఆఫీసు పనిమీద వెళ్ళివుంటే     సాంతంగా పనిఅయేలోపున చనిపోవడం డెరిలిక్షన్ ఆఫ్ డ్యూటీ అనొచ్చు     మూడంతస్తుల వరకూ వున్న మేడ మెట్లెక్కడం వలన     (లిఫ్టు అంటే అతనికి భయం, ఎప్పుడూ దాన్ని కోరలేదు ఉద్యోగంలో)     విధేయుడైన అతని విధేయపు గుండెలు     ఎదురుతిరిగి శఠించడంవల్ల అనొచ్చును.     ఏమైనా కోటేశ్వరరావు చనిపోవడం నిజం     డాక్టరు తీర్పుకన్న మేనేజరురాగానే లేచి నుంచోకపోవడమే ఇందుకు     నిదర్శనం     ఇతని తాలూకు వివరాలేమీ ప్రమాదకరంగా లేవు     ఇతని తండ్రి గుమస్తా, తాత గుమస్తా, ముత్తాత గుమస్తా     సాంప్రదాయకమైన వినయ విధేయతలకీ, గౌరవప్రదమైన దరిద్రానికీ     వీళ్ళ వంశం ఒక రాస్తా     ఇతనికి యింట్లో ఆరుగురు పిల్లలూ, ఒక ముసలి తల్లీ, బక్క పిల్లీ     ఒకర్తె నీరసంగా వున్న భార్య     ఇతనద్దెకున్న వాటాలో రెండున్నర గదులూ, ఒక టెలివిజన్ లాంటి       బాత్ రూమూ ఒక అటకా     ఇతను ఎర్రచొక్కాలు ధరిస్తాడు, కాని కమ్యూనిస్టు కాడు     ఇతను సందుల్లోంచి నడుస్తాడు, కాని సర్రియలిస్టు కాడు     నడుస్తూ నడుస్తూ నవ్వుతాడు, గొణుక్కుంటాడు, కాని యోగి కాడు     అలా ఆకాశం కేసి వెర్రిగా చూస్తాడు, కాని అసలు కవేకాడు     ప్రతినెలా పాలబాకీ, కిరాణాకొట్టుబాకీ అణాపైసలతో యిచ్చేస్తాడు     అందుకని అఖరివారంలో భార్యతోకలసి రాత్రుళ్ళు పస్తుంటాడు     వీ.డీ.లు ఎందుకొస్తాయో తెలియదు, అఖరుకి     బీడీలు కాల్చడమైనా ఎరుగడు.     ఏడాదికో సినిమాకివెళ్ళి క్యూలో అఖర్న బుద్ధిగా నిలబడతాడు     రాజకీయ సాహిత్య సాంఘిక సంస్థలలో దేనికీ సభ్యుడుకాడు     ఎన్నికలలో వోటు పై ఆఫీస రెవరికిమ్మంటే వారికిస్తాడు     ప్రతి శనివారం దేవుడు పటాన్ని పూజిస్తాడు, పటికబెల్లం ప్రసాదం     తింటాడు
24,950
    "పత్తో!"        "ఏమిటి?" అన్నది పార్వతి నోటికి అడ్డంగా పెట్టుకున్న చీర చెంగు తొలగించుకోకుండానే.     "నీ మీద నాకు చాలా కోపం వస్తున్నది."     ఈసారి దేవదాసు కంఠస్వరం వికృతమైపోయింది_"నాన్నగారు లేరు. ఇది నేను ఆపదలో వున్న కాలం. అయినా నీవు వుంటే నాకు ఏమీ చింత వుండదు. వదినగారి విషయం నీకు తెలిసే వుందికదా? అన్నగారి స్వభావం నీకు తెలియదేమీ కాదు! నీవే ఆలోచించు! అమ్మను తీసికొని నేను ఏం చేసేది? నా విషయం ఏమవుతుందో ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. నీవు వుంటే అంతా నీ చేతికి ఒప్పగించి నేను నిశ్చింతగా వుండిపోతాను. ఏం పత్తో?"     పార్వతి బోరున ఏడ్చింది." ఏడుస్తున్నావా ఏం? అయితే ఇక ఏమీ చెప్పను" అన్నాడు దేవదాసు.     పార్వతి కళ్ళు తుడుచుకొంటూ "కాదు, చెప్పు" అన్నది.     దేవదాసు ద్వారాన్ని సరిచేసికొని "పత్తో! ఇప్పుడు నీవు పూర్తిగా గృహిణివై పోయావు గదూ?" అన్నాడు.     ముసుగు లోపలే పెదవులు పంటితో నొక్కుకుంటూ, మనసులోనే అనుకున్నది_"గృహిణిని ఏమయ్యానో! బూరుగు పువ్వును ఎన్నడైనా దేవుని సేవకు ఉపయోగిస్తారా?"     దేవదాసు నవ్వుతూ "నాకు బాగా నవ్వు వస్తుంది. నీవు ఎంత చిన్నదానివి, ఇప్పుడు ఎంత పెద్దదానివై పోయావు? గొప్ప భవంతి, పెద్ద జమీందారీ, పెద్ద పెద్ద కొడుకులూ, కూతుళ్ళూ వున్నారు. అందరికన్నా పెద్దవారు చౌదరిగారు. ఏం పత్తో?" అన్నాడు.     చౌదరిగారు పార్వతికి బాగా నవ్వుకొనే వస్తువు. అయన గుర్తుకు రాగానే ఆమెకు నవ్వు వస్తుంది. అంచేతనే ఇంత దుఃఖంలో కూడా ఆమెకు నవ్వు వచ్చేసింది. దేవదాసు తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో "ఏం, ఒక ఉపకారం చేసి పెట్టగలవా?" అన్నాడు.     పార్వతి తలెత్తి "ఏమిటీ?" అన్నది.     "మీ గ్రామంలో మంచిపిల్ల ఎవరైనా లభించగలదా?"     పార్వతి కొంచెం దగ్గి "మంచి పిల్లా? ఏం చేసుకుంటావు?"     "లభిస్తే పెళ్ళి చేసుకొంటాను. ఒకసారి గృహస్థుణ్ణి కావాలని కోర్కె కలుగుతున్నది."     "బాగా అందమైనది కదూ?" అడిగింది పార్వతి గాంభీర్యంగా.     "అవును. నీ మాదిరిగా."     "మరి బాగా శాంత స్వభావం గలదిగా ఉండాలా?"     "బాగా శాంత స్వభావంతో పనిలేదు. పైగా నీలాగా నాతో పోట్లాడగలగడానికి కొంచెం దుష్ట స్వభావం గలదిగా కూడా ఉండాలి."     పార్వతి మనసులో అనుకొన్నది_ఇది ఎవరూ చేయలేరు దేవదాదా! ఎంచేతనంటే దీనికోసం నాతో సమానంగా ప్రేమ కావాలి" తరువాత పైకి అన్నది_"నేను దురదృష్టవంతురాలివి. నేనెంత? నాలాంటి వాళ్ళు నీ పాదధూళి తీసికొని ధన్యులు కావాలని భావించేవాళ్ళు ఎన్నో వేలమంది ఉన్నారు."     దేవదాసు పరిహాసంగా నవ్వుతూ_"ఏం ఇప్పుడే అటువంటి అమ్మాయిని ఒక దానిని తీసుకురాగలవా?" అన్నాడు.     "దేవదాదా, ఏం, నిజంగా పెళ్ళి చేసుకుంటావా?"     "అటువంటి అమ్మాయినే, నేను చెప్పినట్లుగా వుంటేనే."     ఆమె మినహా యీ ప్రపంచంలో ఆయనకు జీవిత సహచరిణిగా మరెవ్వరు కాలేరని కేవలం విప్పి చెప్పలేదు అంతే!     "దేవదాస్! ఒక మాట చెపుతావా?"     "ఏమిటీ?"     "పార్వతి తనను తాను అదుపులో పెట్టుకుని "నీవు మధ్యం త్రాగడం ఎలా నేర్చుకున్నావు?" అన్నది.     దేవదాసు నవ్వి "త్రాగడం కూడా ఎక్కడైనా నేర్చుకోవలసి వుంటుందా?" అన్నాడు.     "అది కాకపోతే పోనీ అభ్యాసం ఎలా చేసుకున్నావు?"     "ఎవరు చెప్పారు? ధర్మాదాసా?"     "ఎవరైనా చెప్పనివ్వు, ఇందులో నిజం వుందా లేదా?"     దేవదాసు దాచలేదు "కొంచెం వుంది" అన్నాడు.     పార్వతి కొంచెం సేపే స్తబ్దంగా వున్న తరువాత "ఇంకా ఎన్నివేల రూపాయల ఆభరణాలు చేయించి ఇచ్చావు?" అని అడిగింది.     "ఇవ్వలేదు. చేయించి వుంచాను. నీవు తీసుకొంటావా?"     పార్వతి చేయిచాపి "ఇవ్వు, ఇదుగో చూడు, నా ఒంటిమీద ఒక్క ఆభరణం కూడా లేదు.     "చౌదరిగారు నీకు ఇవ్వలేదా?"     "ఇచ్చారు, కాని నేను వాటి నన్నిటినీ ఆయన పెద్దకూతురుకు ఇచ్చేశాను."     "ఇప్పుడు నీకు అవసరం లేదన్నట్లుగా కన్పిస్తూ వుంది."     పార్వతి ముఖం ఊపి తల వంచుకున్నది. దేవదాసు కళ్ళు చెమ్మగిల్లాయి. సాధారణమైన దుఃఖంలో వున్న స్త్రీలు తమ ఆభరణాలు తీసి ఇవ్వరు అని దేవదాసు మనసులో అనుకున్నాడు. కాని కంటి నుంచి వెలువడుతున్న అశ్రువులను ఆపుకొని నెమ్మదిగా అన్నాడు_"నేను ఏ స్త్రీని ప్రేమించలేదు, ఏ స్త్రీకీ నేను ఆభరణాలు ఇవ్వలేదు. ఇది అబద్దం."     పార్వతి దీర్ఘంగా నిట్టూర్చి మనసులో "నా నమ్మకం కూడా అదే" అనుకొన్నది.      కొంచెం సేపటి దాకా ఇరువురూ మౌనంగా వున్నారు. తరువాత "ఇక మధ్యం త్రాగనని ప్రతిజ్ఞ చేయి" అన్నది పార్వతి.     "ఇది చేయలేను. నీవు నన్ను మరపించగలనని ప్రతిజ్ఞ చేయగలవా?"     పార్వతి ఏమీ అనలేదు. ఇదే సమయంలో బయటి నుంచి సంధ్యాకాలపు శంఖధ్వని వినిపించింది. దేవదాసు కిటికీలో నుంచి బయటికి చూసి "సాయంత్రం మయిపోయింది. ఇక ఇంటికి వెళ్ళు పత్తో!" అన్నాడు.     "నేను వెళ్ళను, నీవు ప్రతిజ్ఞ చేయి."     "ఎందుకు? నేను చేయలేను!"     "ఎందుకు చేయలేవు?"     "ఏం అందరూ అన్ని పనులు చేయగలరా?"     "కోరుకుంటే తప్పకుండా చేయగలరు."     "ఈ రాత్రికి లేచి పారిపోదాం, మరి నీవు నాతో పాటు రాగలవా?"     పార్వతి హృదయ స్పందన హఠాత్తుగా ఆగిపోయినట్లే వుంది. అప్రయత్నంగానే ఆమె నోట "ఇది సాధ్యమా?" అనే మాట వచ్చింది.     దేవదాసు కొంచెం మంచం పైకి జరిగి కూర్చొని "పార్వతీ! తలుపు తెరువు" అన్నాడు.     దేవదాసు నిలబడి నెమ్మదిగా అంటూ వున్నాడు__పత్తో, బలవంత పెట్టి ప్రతిజ్ఞ చేయించడం మంచిదా? దాని వలన ప్రత్యేకమైన ప్రయోజనం ఏమైనా వుందా? ఇవ్వాళ చేసిన ప్రతిజ్ఞ బహుశా రేపు వుండక పోవచ్చు. ఎందుకు నన్ను అసత్యవాదిగా చేస్తావు?"     మరికొన్ని క్షణాలు ఊరకనే నిశ్శబ్దంగా గడిచిపోయాయి. ఇదే సమయంలో ఏ ఇంట్లోనే గాని టన్ టన్ మంటూ తొమ్మిది గంటలు కొట్టింది గడియారం. దేవదాసు హడావిడిగా "తలుపు తెరువు పత్తో!" అన్నాడు.     పార్వతి ఏమీ మాట్లాడలేదు.     "వెళ్ళు పత్తో!"     "నేను వెళ్ళనే వెళ్ళను." అని పార్వతి హఠాత్తుగా మైకం వచ్చిపడిపోయింది. చాలా సేపటి వరకు వెక్కి వెక్కి ఏడుస్తూ వుంది. ఈ సమయంలో గదిలో గాఢాంధకారమే వుంది. ఏమీ కన్పించడమే లేదు. దేవదాసు కేవలం తన ఊహ ప్రకారం పార్వతి నేలమీద పడి ఏడుస్తున్నదని తెలుసుకున్నాడు. "పత్తో!" అని నెమ్మదిగా పిలిచాడు.     పార్వతి ఏడుస్తూనే "దేవదాదా, నాకు చాలా బాధ కలుగుతూ వుంది" అన్నది. దేవదాసు నెమ్మదిగా దగ్గరకు జరిగి వచ్చాడు. ఆయన కళ్ళల్లో గూడా నీళ్ళు నిండిపోయాయి కాని స్వరం మాత్రం వికృతం కాలేదు. "ఇదేమిటి, నాకు తెలియదు పత్తో!" అన్నాడు.     "దేవదాదా నేను చచ్చిపోతాను కూడా. కాని ఎన్నడూ నీకు సేవ చేయలేక పోయాను, అది నా చిరకాల వాంఛ."     చీకటిలో కళ్ళు తుడుచుకుంటూ "ఆ సమయం కూడా వస్తుంది" అన్నాడు దేవదాసు.     "అయితే నాతోపాటు వచ్చేసెయ్. ఇక్కడ నిన్ను చూసే వాళ్ళు ఎవరూ లేరు."     "నీ ఇంటికి వస్తే బాగా సేవ చేస్తావా?"     "అది నా బాల్యకాలపు కోర్కె. ఓ స్వర్గంలోని దేవుడా! నా యీ కోర్కెను నెరవేర్చు. ఆ తరువాత నేను మరణించినా నాకేమీ దుఃఖం వుండదు."     ఈసారి దేవదాసు కళ్ళు కూడా అశ్రువులతో నిండిపోయాయి. దేవదాస్ నా దగ్గరకు వచ్చేసెయ్!" అని పార్వతి మళ్ళీ చెప్పింది.     దేవదాసు కళ్ళు తుడుచుకొని "సరే మంచిది, వస్తాను" అన్నాడు.     "వస్తాను అని నా తల మీద చేయివేసి చెప్పు!"     దేవదాసు తడుముకుంటూ పార్వతి కాలు తాకి "ఈ మాట నేను ఎన్నటికీ మరచిపోను. నేను వచ్చినందువల్లనే నీ దుఃఖం తొలగిపోతుందని భావిస్తే నేను తప్పకుండా వస్తాను. చావబోయే ముందు కూడా యీ మాట జ్ఞాపకం వుంటుంది" అన్నాడు. 
24,951
    ఆలోచనామృతము     ఇది ఆవును సాగనంపుట! ఎంత ఆర్ద్రముగ ఉన్నది! మనసును కరిగించుచున్నది!!! ఎంతటి కరుణారసభరితము! ఎంతటి వాత్సల్యము!! ఎంతటి అనుబంధము!!!     పశువును సహితము తోటిప్రాణిగా భావించుట వేదసంస్కృతి! భారతసంప్రదాయము!! మన కరుణార్ధ్రత!!!     ఈకరుణార్ధ్ర దృశ్యము కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలము నందలి శంకుతలను సాగనంపుటను తలపించుచున్నది. అచట ప్రకృతిసాంతము అశ్రుపూర్ణమగును.     యాస్యత్యద్య శకుంతలేతి హృదయం సంస్పృష్టముత్కంఠయా     కంఠః స్తమ్భిత బాష్పవృత్తి కలుషశ్చింతాజడం దర్శనమ్ |     వైక్లవ్యం మమ తావదీదృశమపి స్నేహాదరణ్యౌకసః     పీడ్యంతే గృహిణః కథంను తనయా విశ్లేషదుఃఖైర్నవైః ||     ఇవ్వాళ శకుంతల వెళ్లిపోతున్నది. ఈమాటయే నాగుండెలో బాధగూడు కట్టినది. గొంతు పూడుకున్నది. కన్నీరునిండి చూపుమందగించినది. నేను అడవిలోని వానిని. మునిని. ఈ స్నేహము అబ్బో! నన్నే ఇంత బాధించుచున్నదే! పాపంబిడ్డను కన్నవారు కూతురును కొత్తగా అప్పగింతలు పెట్టునపుడు ఎంత బాధపడుదురో కదా!     అంటాడు కణ్వుడు శకుంతలను సాగనంపుతూ.     ఇంతటి మానవత, ప్రేమ, అభిమానము, వాత్పల్యము, కరుణ భారతజాతికి ఎన్ని  యుగుముల పున్నెపుపంట!     వేదములు, ఉపనిషత్తులు, రామాయణాది మహాకావ్యములు, బుషులు, మునులు, తాత్వికులు వారి తత్త్వబోధలు భారతీయులలో ఇంతటి అనుబంధమును, అనురాగము నింపి భారత జనజీవనమును అమృతతుల్యము చేసినది.     ఇంతటి మహాతపస్సును మరల పొగగొట్టపు పొగ బూడిదచేసినది. అది మనిషి మనసును పొగతో నింపినది. ఆత్మీయతలు, అనుబంధములు, అనురాగములు అన్నింటిని ఆవిరిచేసినది!     "అదిత్యాః అఖండనీయా పృథివ్యాః" అని మహీధరుడు. ఈపృథ్వి సాంతము ఒక్కటియే. అది ఖండించరానిది. ముక్కలు చేయరానిది అని అర్థము.     భగవంతుడు ఈ సమస్త భూమండలమును ఏకఖండముగా-అఖండనీయముగా సృష్టించినాడు. రాజులు, రాజకీయులు వారి అధికార దాహమునకు ఈనేలను ముక్కలు చెక్కలుగా చేసి పాలించుచున్నారు. గత అర్థశతాబ్దమును అప్పటి భారతదేశము -రాజకీయుల అధికారదాహమునకు బలియై - భారత, పాకిస్తాన్, బంగ్లాదేశ్ మూడు ముక్కలైనది.     "మృత్పిణ్డోజలరేఖయా వలయితస్సర్వోప్యయం నన్వణుః     స్వాంశీకృత్య సపన సంయుగశతై రాజ్ఞాంగణైర్భుజ్యతే" అన్నాడు భర్తృహరి.     ఈభూమి ఎంత? సముద్రము చుట్టిన మట్టి ముద్ద! ఇది ఈస్పష్టిలో ఎంత? అణువంత! ఈ అణువంత కోసం రాజుల యుద్ధాలు! పంచుకోవటాలు! పాలించుటలు!!!     24. యజమాని అనవలసినది:-     అధ్వర్యులారా! సొమము వద్దకు వెళ్లండి. ఇది నీ గాయత్రీ ఛందోభాగము, అని నాసందేశముగా చెప్పండి. అధ్వర్యులారా! ఇది నీ  త్రిష్టుప్ ఛందోభాగము, అని నాసందేశముగా చెప్పండి. అధ్వర్యులారా! ఇది నీ జగతీ ఛందోభాగమని నా సందేశముగా చెప్పండి. అధ్వర్యులారా! 'సోమమా! నీవు అశేష ఛందో సామ్రాజ్యమును అలంకరించుము' అని నాసందేశముగా చెప్పండి.     సోమమా! నీవు మావాడవు. ఇంద్రుడు మున్నగు దేవతల పానపాత్రములందు నిండిన నీవు సర్వసమర్థుడవు. ఋత్విక్కులు బుద్ధిమంతులు. వారు మిమ్ము వేరువేరుగా ఉంచగలరు.     25. సవిత ద్యావాపృథ్వులందున్నవాడు కొంత ప్రజ్ఞుడు. సత్యమూర్తి. రత్నదాత. ప్రియతముడు. కవి. బుద్ధికుశలుడు. అట్టి ద్యోత మానుడగు సవితను నేను పూజింతును. సూర్యుని కాంతి బ్రాహ్మణక్షత్రియాదులను వారి పనులకు నియోగించును. సవిత అట్టివాడు. స్పృహణీయుడు. సుప్రజ్ఞుడు, అతడు తన సంకల్పమున స్వర్గమును నిర్మించినాడు.     (సోమపు ముక్కలను తలగుడ్డలో చుట్టుకొని)     సోమమా! నాకు సంతానము కలుగుటకు నిన్ను కట్టుచున్నాను. నా సంతానము నీకు ప్రాణప్రదానము చేయగలదు. నీవు మా సంతానమునకు ప్రాణప్రదానము చేయుము.     26. సోమమా! నీవు దీప్యమానవు. నిన్ను దీప్యమాన స్వర్ణమున ఖరీదు చేయుదును. ఆహ్లాదకరమును, ఆహ్లాదకరముతోను, అమృతస్వరూపమును అమృతస్వరూపమునను ఖరీదు చేయుదును.     సోమము విక్రయించుదానా! మా గోవులు, బంగారము నీకు చెందవలెను. ఆహ్లాదకర సోమము మాకు చెందవలెను.     (మేకను సోమపు మూల్యముగా ముందుకుజరిపి) నీవు తపోదేహమవు> ప్రజాపతి వర్ణమవు> సోమమా! నీరాక వలన మాపుత్ర, పశ్వాదులు వేయింతలు పెరుగవలెను.     27. మంచిమిత్రులను కూర్చగల సోమమా! నీవు మమ్ము మిత్రుని ద్వారా చేరుకొనుము. నీవు కోరదగిన సుఖకరుడవు. యుజమాని యొక్క సుఖకరమగు కుడితొడమీద కూర్చుండుము. స్వాన. భ్రాజ, అంధారే- వింభారే - హస్త, సుహస్త, కుషానులారా! మీరందరు 'సోమమును' రక్షించువారు. ఇవి సోమము ఖరీదుచేయు గోవులు, మేకలు, స్వర్ణాదులు. మీరు వానిని రక్షించండి.     సోమరక్షకులారా! సోమమును-గోవులు మేకలను రక్షించునపుడు మిమ్ము రాక్షసాదులు పీడించకుండనై నేను నా ఆయుర్దాయము నుండి అమృతత్వమును అందుకొందును.     29. మేము శుభంకరము- పాపరహితమగు మార్గమున ప్రవర్తిల్లుచున్నాము. ఈ మార్గమున మానవుడు దుష్టత్వమును విడుచును. దానితో పాటు తప్పక ధనమును అందుకొనును.     30. కృష్ణమృగచర్మమా! నీవు నేలతోలువంటిదానవు. నేలమీద చాచుకొనుము.     (పరచిన మృగాజినమున సోమమును ఉంచవలెను. అట్లుంచిన సోమము వరుణ స్వరూపమగును)     వరుణుడు వరప్రదుడు. ద్యులోకమున స్తంభింపచేసిననాడు. పృథ్వివ్యంతరిక్షములను విస్తారము చేసినవాడు. శ్రేష్ఠత్వమును కొలిచినవాడు. వరుణ సామ్రాట్టు సమస్త భువనములందు వ్యాపించును స్థిరపడును.     ఇవన్నియు వరుణుని ప్రశంసనీయ కార్యములు.     31. వరుణుడు వృక్షాగ్రములందు అంతరిక్షమును విస్తరించినాడు. అతడు అశ్వములందు వేగమును గోవులందు క్షీరములను-యజమానుల హృదయములందు యజ్ఞమును- ప్రజలందు అగ్నిని - ద్యులోకమునందు సూర్యుని -పర్వతములందు సోమమును స్థాపించినాడు. అట్టి వరుణుని మేము స్తుతింతుము.     32. కృష్ణాజినమా! నీవు సూర్యుని చక్షువు- అగ్ని యొక్క కంటిపాప అంతటి ఎత్తుకుచేరుము. అచట నీకు రాక్షసాది బాధలుండవు. అచటినుండి అధ్వర్యులు నిన్ను అశ్వముల మీద  తీసికోని వెళ్లుదురు.     33. ఎద్దులారా! మీరు అశ్రురహితముగ సంతోషముగ బండిలాగుదురు. మీరు కొమ్ములతో మా శిశువులను క్రుమ్మరు. బ్రహ్మణులను యజ్ఞమునకు ప్రోత్సహింతురు. మీరు శకటమునకు సంయోజితులు కండి. మీకు శుభములు కలుగును గాత. మీరు యజమాని గృహమునకు చేరండి.     34. సోమమా! నీవు నాకొరకు బృహత్ శుభంకరుడవు. నీవు ఋత్విజాదుల స్వామివి. నీవు వెళ్ళు మార్గములన్నింటికి నన్ను చేర్చుము. మార్గమును నిన్ను దొంగలు దొంగిలించరాదు. రాక్షసాదులు హింసించరాదు. బందిపోట్లు, పాపిష్టితోడేళ్లు నిన్ను పట్టరాదు. యజమాని గృహమే అధ్వర్యుడనగు నాకు- నీకు అనుకూలస్థానము.     36. కొలలారా! మీరు సోమమును వహించు బండిన నియంత్రించువారలు. సోమమును వహించు బండికి కట్టిన ఎద్దులను విడిపోకుండ నిలుపువారలు. పీఠమా! నీవు యజ్ఞమున కూర్చుండ స్థానమవు. (పీట మీద మృగ చర్మమును పరచి) మృగచర్మమా! నీవు సోమమును ఉంచుటకు తగిన స్థానమవు. నీవు పీఠము మీద ఆసీనుడవగుము.     37. సోమమా! ఋత్విజులు ఏ ఏ స్థానములందు నిన్ను హవి అర్చించి- పూజింతురో అట్టి అన్ని స్థలములకు యజ్ఞము విస్తరిల్లవలెను. నీవు యజమాని గృహమును వర్థిల్లచేయుదువు. తరింపచేయుదువు. సుపుత్రులను ప్రసాదింతువు. పుత్రపౌత్రులను హింసించవు.     సోమమా! నీవు యజమాని గృహములందు స్వేచ్ఛగా సంచరించుము.                                       దాశరథి రంగాచార్య విరచిత              శ్రీమదాంధ్ర వచన శుక్ల యజుర్వేద సంహితయందలి             శాలాప్రవేశాస్త మంత్రముల నాలుగవఅధ్యాయము సమాప్తము.                                     సర్వేపి సుఖినస్సంతు.
24,952
    చుట్ట కొనకొరికి తుపుక్కున ఊశాడు. "ఊఁ చూస్తాను. దీని అంతు తేల్చుకుంటాను. రేపే ప్రెసిడెంటుతో మాట్లాడుతాను" అంటూ ముందుకు కదిలాడు వీరభద్రయ్య.     కామాక్షమ్మ గుండెలనిండా గాలి పీల్చుకుంది.     "పదమ్మా! పోయి భోంచేద్దాం! ఆలస్యం అయిపోయింది" ఉత్సాహంగా అన్నది గ్రామసేవికతో.     సునంద సెక్రటరీతో మాట్లాడి పంపించి, క్యారియర్ విప్పి భోజనం చేసింది. మీనాకుమారి కొరకు ఎదురుచూస్తూ కూర్చుంది.     అప్పుడే వచ్చిన మీనాకుమారిని "ఇంత ఆలస్యం చేశావేం?" అడిగింది సునంద.     "భోజనం చేసి రావద్దూ?" నిర్లక్ష్యంగా జవాబిచ్చింది మీనాకుమారి.     సునంద గ్రామసేవిక ముఖంలోకి చూసింది.     ఈ గ్రామసేవికలకు వుండే ఇన్ ప్లుయన్స్ గెజిటెడ్ ఆఫీసర్లకు కూడా వుండదు. పంచాయితీ రాజ్యానికి పునాది గ్రామం. గామ సేవిక పునాదిలో తిష్టవేసి, బలవంతుల అండదండలు సంపాదిస్తుంది. ఆమెను ఎవరూ కదిలించలేరు. అందుకే అంత నిర్లక్ష్యం.     "సరేపద! హరిజనవాడ వెళ్దాం!"     "మీరెళ్ళండి. నేను రాలేను. ఇవ్వాళ నాకు కాళ్ళు నొప్పులుగా ఉన్నయ్!" అన్నది గ్రామసేవిక.     సునంద గ్రామసేవికనుంచి అటువంటి సమాధానం వస్తుందని అనుకోలేదు. విస్మయంగా చూసింది.     "ఊళ్ళో వున్న హరిజనవాడకు వెళ్ళడానికి కాళ్ళు నొప్పులేమిటి? నువ్వు ఉద్యోగం చేస్తున్నావ్! ఆ సంగతి గుర్తుంచుకో! బయలుదేరు" ఖచ్చితంగా అన్నది సునంద.     "నేను రాలేను. అర్ధరోజు శెలవు పెడ్తున్నాను" అంతకంటే ఖచ్చితంగా అన్నది మీనాకుమారి.     సునంద ఓ క్షణం ఆలోచిస్తూ నిలబడింది.     మరోమాట మాట్లాడి ప్రయోజనం లేదని తెలుసుకుంది. వడివడిగా ముందుకు సాగిపోయింది.     అలా వెళుతున్న సునందను వెనకనుంచి చూస్తూ ముసి ముసిగా నవ్వుకుంది గ్రామసేవిక మీనాకుమారి.     సునంద హరిజనవాడ చేరుకుంది. చిరిగిన మురికి బట్టల్లో దరిద్రం, అజ్ఞానం ఓడుతూ, పసివాళ్లు ఆమె దగ్గరకు పరుగెత్తుకొచ్చారు.     "దగాపడిన తమ్ముళ్ళూ, చెల్లాయిలు" అనుకుంటూ అందర్నీ దగ్గరకు తీసుకుంది సునంద. ఆమె కళ్ళలో గిర్రున నీరు తిరిగింది.                                         29     సునంద సంచి చంకకు తగిలించుకొని, ఒక చేత్తో క్యారియర్ పట్టుకొని రోడ్డు ప్రక్కగా చకచకా నడచిపోతోంది.     అప్పటికే బారెడు పొద్దెక్కింది. ఎండ చిటపట లాడిస్తోంది.     వెనకనుంచి వచ్చిన సమితి జీప్ సునందను దాటుకెళ్ళి ఆగింది.     సునంద జీప్ దగ్గరకు వచ్చింది. జీప్ లో ముందు సీట్లో సమితి ప్రెసిడెంటు నరహరి కూర్చుని వున్నాడు. అతని పక్కన చిలకలపాడు గ్రామసేవిక స్వరాజ్యం కూర్చునివుంది.     "దిగు! వెనక్కెళ్ళి కూర్చో!" అన్నాడు నరహరి స్వరాజ్యంతో.     స్వరాజ్యం ముఖం చిన్నది చేసుకొని జీపు దిగింది. సునంద నరహరికి నమస్కరించింది. నరహరి ముఖమంతా కళ్ళుచేసుకొని సునందను చూశాడు. సునందకు ఏదోలా అనిపించింది.     "రా! ఎక్కు!" మృదువుగా ఆహ్వానించాడు నరహరి.     సునంద అతని ఆహ్వానాన్ని ఎట్లా తిరస్కరించాలో తోచక మౌనంగా నిలబడిపోయింది.     స్వరాజ్యం చిన్నబుచ్చుకొని వెనక్కువెళ్ళి చక్రం మీదుగా ఎక్కడానికి ప్రయత్నిస్తూంది. స్థూలకాయం అవడంవల్ల కొంచెం ఇబ్బందిగానే వుంది. రెండుసార్లు జారి మూడోసారి లోపలకు ఎక్కగలిగింది.     "ఎక్కు! డిప్రమోషన్! పాపం" చిన్నగా అన్నాడు సమితి క్లర్కు.     నరహరి పక్కన ఆమె కూర్చోవడం నచ్చలేదు అతనికి. అంతవరకూ ఆడవాళ్ళకు లభించే అవకాశాన్ని తల్చుకొంటూ వుడికిపోతున్న అతనికి స్వరాజ్యం దిగి వెనక్కు రావడం సంతోషాన్ని కలిగించింది.     స్వరాజ్యం సీట్లో కూలబడి రొప్పుతూ వుంది.అది చూచి జీపులో వున్న వి.డి.ఓ. లు ఇద్దరూ ముసిముసిగా నవ్వుకున్నారు. స్వరాజ్యం రోషంతో ఉడికిపోయింది.     "ఏమిటాలోచిస్తున్నావ్? ఎక్కు సునందా!" అతని కంఠంలోని ఆ తియ్యదనం ఎబ్బెట్టుగా విన్పించింది సునందకు.     స్వరాజ్యం వెనక్కు తిరిగి ఈర్ష్యగా చూసింది.     "ఎందుకులెండి సర్. దగ్గరకొచ్చేశానుగా. నడిచే వెళ్తాను." మరో మాటకు అవకాశం ఇవ్వకుండా తల వంచుకొని ముందుకు సాగింది సునంద.     నరహరి దెబ్బతిన్న బెబ్బులిలా అయాడు. వెనక కూర్చునివున్న తన సబార్డినేట్సు తననుచూసి నవ్వుతున్నట్టనిపించి గిర్రున వెనక్కు తిరిగి చూశాడు. కాని అతను అనుకున్నట్టు ఎవరూ నవ్వడంలేదు. అందరూ బిగుసుకుని కూర్చున్నారు.     స్వరాజ్యం ముఖం మాత్రం వికసించివుంది.     "రా! ముందుకొచ్చి కూర్చో!" కటువుగా పిల్చాడు నరహరి.     ఆ అవకాశం కోసమే ఎదురుచూస్తున్న స్వరాజ్యం, అంతలావు శరీరాన్ని అతితేలిగ్గా చక్రం మీదుగా కిందకు జారవేసింది.     "మళ్ళీ ప్రమోషన్" గొణుక్కున్నాడు క్లర్క్.     స్వరాజ్యం నరహరి పక్కన కూర్చుంది బితుకు బితుకుమంటూ. నరహరి చాలా కోపంగా వున్నాడు.     "పోనియ్!" కసురుకున్నాడు డ్రైవర్ను.     డ్రైవర్ ఉలిక్కిపడి ఒక్కసారిగా స్టార్టుచేశాడు. జీపు ఒక్కసారి ముందుకు దూకింది. ఆ కుదుపుకు ఒళ్ళో ఫైల్సు పెట్టుకొని వెనక వేలాడుతున్న ప్యూన్ కిందపడ్డాడు.     జీప్ ముందుకు సాగిపోతూంది. ప్యూన్ పడటం చూసినవాళ్ళు తమకేమీ పట్టనట్లు చూస్తూ వుండిపోయారు. కాని ప్యూన్ వెంటనే లేచి దుమ్ముదులుపుకోవడం కన్పించింది. అప్పుడుగాని క్లర్కు గొంతు పెగల్లేదు.     "సర్! సింహాచలం పడిపోయాడు సర్!"     "వెధవని పడనియ్!" కోపంగా వున్న నరహరి అన్నాడు. తను విన్నదేమిటో. తన సమాధానం ఏమిటో అర్ధం చేసుకోవడానికి కొంత సమయం పట్టింది.     "ఆపు వెధవ పడ్డాడట. వెనక్కు తిప్పు!" అన్నాడు నరహరి డ్రైవర్ తో.     "అక్కర్లేదు సార్! వాడే వస్తున్నాడు పరిగెత్తుకుంటూ" అన్నాడు వి.డి.ఓ.     జీపు ఆగింది. నరహరి సునంద గురించి ఆలోచిస్తున్నాడు. మనసు అవమానంతో దహించుకుపోతుంది.                                                    *    *    *    *     రోడ్డువారగా నడుస్తున్న సునంద పక్కగా ఓ చిన్నకారు ఆగింది. సునంద నిలబడి చూసింది.     శేఖర్ దిగి "నమస్తే !" అన్నాడు.     సునంద ప్రతినమస్కారం చేసింది. శేఖర్ కళ్ళు సంతోషంతో వెలగడం సునంద గమనించింది.     సునంద ముందుసీట్లో కూర్చొనివున్న రాణీని చిరునవ్వుతో పలకరించింది.     రాణీ మౌనంగా కూర్చుంది. అప్పుడు అక్కడ తను కన్పించడం రాణికి సంతోషాన్ని కలిగించలేదనే విషయం సునందకు స్పురించింది. సునంద మనసు చివుక్కుమన్నది. రాణీ ప్రవర్తనకు శేఖర్ కూడా నొచ్చుకున్నాడు.       "మొన్న మీ నాన్నగారు కన్పించారు" అన్నాడు శేఖర్.     "ఎలా వున్నారు?" ఆత్రంగా అడిగింది సునంద.     "బాగానే ఉత్సాహంగానే వున్నారు. అమ్మాయి కన్పిస్తూ వుంటుందా అని కూడా అడిగారు" అంటూ సునంద కళ్ళలో దేన్నో వెతకడానికి ప్రయత్నిస్తున్నట్టు లోతుగా చూశాడు.     సునంద చూపులు మరల్చుకుంది.     "రండి! ఎక్కండి! డ్రాప్ చేస్తాను" కారు వెనకడోర్ తెరిచి పట్టుకొని ఆహ్వానించాడు శేఖర్.     "ఎందుకండీ! దగ్గిరకు వచ్చేశానుగా" తటపటాయిస్తూ నిల్చుంది. శేఖర్ ఆహ్వానాన్ని ఎందుచేతనో తను తేలిగ్గా తిరస్కరించలేక పోతోంది.     "ఇంకా చాలా దూరం వుంది. ఎక్కండీ!" అన్నాడు శేఖర్.     సునంద యాంత్రికంగా కారు ఎక్కి కూర్చుంది. శేఖర్ వచ్చి స్టీరింగు దగ్గిర కూర్చుని "నువ్వెళ్ళి వెనుక కూర్చో?" అన్నాడు రాణితో.     రాణీ రుసరుసలాడుతూ దిగి డోర్ చాలా గట్టిగా కసిగా కొట్టింది.     రాణీ ముఖం కందగడ్డలా చేసుకొని సునంద పక్కన కూర్చుంది.     తను కారు ఎక్కాల్సిందికాదు. రాణీకి ఇష్టం వుండదని తెలిసీ తను ఎందుకు ఎక్కి కూర్చుంది? నరహరి ఆహ్వానాన్ని తిరస్కరించినట్టు శేఖర్ ఆహ్వానాన్ని ఎందుకు తిరస్కరించలేక పోతుంది? శేఖర్ ను చూడగానే, ఒక్కసారిగా తలుపులూ, కిటికీలూ తెరుచుకున్న గదిలా ఎందుకు వెలుగుతో నిండిపోతుంది తన మనసు? తన మనసుకు ఏమైంది? ఏమీ కాలేదు. అంతా భ్రమ! శేఖర్ ఎక్కడా? తనెక్కడా? అతని అంతస్థూ తన అంతస్థూ.... పైగా రాణి అతన్ని ప్రేమిస్తూంది.... అతను కూడా రాణిని....లేదు....అతను రాణిని ప్రేమిస్తున్నట్టు తనకు అనిపించడంలేదు. తనను చూడగానే అతని కళ్ళెందుకు అలా వెలిగిపోతాయి? తను భ్రమలోపడి పోతుంది. కేవలం భ్రమ మాత్రమే....అంతే....వాస్తవంలేదు....  
24,953
          "ఇది నా గది. అంటే నేను వుండే గది కాదు. తోచనప్పుడల్లా ఈ గదిలో కూర్చుని ఒక్కన్నే ఆడుకుంటూ వుంటాను. అన్నట్టూ మీకు కొరియన్ చెక్కర్ వచ్చా?"          అతడు అర్ధంకానట్టు బ్రహ్మానంద వేపు చూశాడు. అక్కడి నుండి దృష్టి మరల్చి బల్లవైపు చూశాడు. బల్లమీద నక్షత్రం ఆకారంలో చైనీస్ చెక్కర్ బోర్డు. దానికి గుచ్చబడి పావులూ వున్నాయి.          బ్రహ్మానంద ఎదురుగా వున్న కుర్చీలో కూర్చుంటూ- "దానికీ దీనికీ పెద్ద తేడా లేదు. దాంట్లో మన పావులన్నీ అవతల వారి గళ్ళలోకి చేరాలి. దీంట్లో అలాకాదు. కింగ్ పిన్ (రాజు) అవతలి శిఖరాగ్రం చేరుకుంటే చాలు. ఒక ఆట ఆడదామా?"          "ఇప్పుడా?"          "బైట వర్షం వచ్చేటట్టు వుంది. తగ్గాక వెళుదురుగాని".          అతడు తిరిగి బల్లమీదకు చూశాడు. మిగతా చిన్న చిన్న పావులకి విరుద్దంగా కింగ్ పిన్ పావు ఎత్తుగా లావుగా వుంది. అతడికి వర్షం తగ్గేవరకూ ఏం చెయ్యాలో తోచలేదు. ఎదుటి కుర్చీలో కూర్చున్నాడు.          "మొదలు పెడదామా?"          "సరే!"          బ్రహ్మానంద- "ఒక్కో మనిషికీ ఒక్కో వ్యసనం వుంటుంది. కొంతమందికి సిగరెట్టు... కొంతమందికి భజన చెయ్యటం .... ఇలా .... నాకున్న వ్యసనం ఇదొక్కటే. కానీ మిగతా వాటితో పోలిస్తే ఇది ఆరోగ్యకరమైన అలవాటు. మెదడుకు పదును పెడుతుంది. ఇదే లేకపోతే, మనుష్యులకి దూరంగా ఇలా బ్రతకటం కష్టమయ్యేది అనుకుంటాను. రెండువైపుల ఎత్తులు వేసుకుంటూ ఒక్కన్నే ఆడుకుంటూ పోతూ వుంటే ఎంతకాలం గడిచిందీ తెలీదు. ఆటకేముంది. ముందు పళ్ళు స్వీకరించండి" అంటూ పళ్ళెం అతడి వైపుకి తోశాడు.          అతడు ఒక పిన్ ముందుకు జరుపుతూ, "ఒక్కళ్ళే  ఆడుకోవటానికి అంత తెలివితేటలు అవసరం లేదనుకుంటానే!" అన్నాడు.          బ్రహ్మానంద వెనక పిన్ ని ముందుదాని మీదనించి గెంతించి అవతలిగదిలో పెడుతూ నవ్వాడు. "పైకి అలా కనిపిస్తుంది. పైకి మామూలుగా కనిపించే వాళ్ళందరూ తెలివితక్కువ వాళ్ళు అనుకోవటం ఎంత తెలివితక్కువో - పైకి మామూలుగా కనిపించే ఈ ఆట అంత తెలివి తక్కువది అనుకోటం కూడా తెలివి తక్కువే. నేనూ మొదట్లో మామూలుగానే అనుకునేవాడిని, కానీ నేను ఒక్కన్నే కూర్చుని ఆడుతున్న కొద్దీ గొప్ప గొప్ప విషయాలు బయటపడేవి. ఒక్క చిన్న పావే ఎంతో పెద్ద కింగ్ పిన్ ని చాలా ఇబ్బంది పెడుతుంది." అంటూ అడ్డుగా వున్న ఇంకొక పిన్ ని కూడా కదిపాడు. దాంతో కింగ్ పిన్ ముందు నిచ్చెన మెట్లలాగా ఖాళీలు ఏర్పడ్డాయి. తర్వాత ఎత్తులో ఒక గెంతుతో అతడి పిన్ ప్రత్యర్ధి దుర్గంలోకి వెళ్ళిపోయేలా కనిపించింది.          అంతలో పెద్ద ఉరుముతో బైట వర్షం మొదలైంది మళ్ళీ.          "ఆంజనేయులూ, సౌదామిని బాగా ఆడతారు. కానీ నాతో సమానంగా అడగలిగేది సౌదామిని ఒక్కతే! అన్నట్టూ ఇలా ఆశ్రమానికి గ్రాంటు శాంక్షన్ చేసేదీ, ఇచ్చేదీ ప్రభుత్వంలో ఏ డిపార్టుమెంటు? ఎండోమెంట్సా? లేక రెవెన్యూనా?"          "కాదు. దీనికి వేరేగా మరో డిపార్ట్ మెంటు వుంది" అంటూ తర్వాత ఎత్తు ఏమెయ్యాలా అని ఆలోచించబోయాడు. ఈ లోపులో పెద్దగా అరుస్తూ, చిలుక లోపలికి వచ్చి పంజరంలోకి చేరింది. ఉన్నట్టుండి అది అరిచే అరుపు ఆ గోడలమధ్య వికృతంగా ప్రతి ధ్వనించి ఏకాగ్రతను చెడగొడుతోంది. ఆ హడావిడిలో అనాలోచితంగా మరో పావును ముందుకు కదిపాడు.          అతడు కదపడం అయిపోయి, బ్రహ్మానంద వంతు రాగానే ఎవరో మంత్రించినట్టు చిలుక అరవటం మానేసింది.          "సాధారణంగా ఎంత గ్రాంటు ఇస్తారు?"          ఆ వ్యక్తి తడబడి, "నెలకి పదినుండి పదిహేను వేల వరకూ" అన్నాడు.          "అబ్బో అంతా! నెలకి రెండు మూడు వేలకన్నా ఎక్కువ వుండదనుకున్నానే."          "ఏమో! నాకంత తెలియదు. నేను మరో శాఖనుండి ఈ డిపార్ట్ మెంటుకి కొత్తగా వచ్చాను."          బ్రహ్మానంద తన కింగ్ పిన్ ని తీసి ప్రక్కరంధ్రంలో పెడుతూ, "అంతకుముందు మీరు ఏ శాఖలో పనిచేసేవారు?" అని అడిగాడు.          "న్యాయశాఖ".          "ఇలా మీరు పరీక్షకి వచ్చినపుడు ఇక్కడ మనుషుల "అవకతవకల్ని" బాగా లోతుగా పరిశీలిస్తారనుకుంటా కదూ" అని, అతడు చప్పున తలెత్తడంతో నవ్వి"..... నా ఉద్దేశం గ్రాంటులు ఇవ్వాలా? వద్దా అని...." అంటూ పూర్తిచేశాడు.          అతడూ తేలిగ్గా నవ్వేస్తూ "అంతే అంతే" అన్నాడు.          "చూశారు గదా! ఏమిటి అభిప్రాయం?"          "చాలా చక్కగా వుంది. ఎవరి విధులు వాళ్ళు బాగా నిర్వర్తిస్తున్నారు. చివరికి చిలుకా, లేడిపిల్లా కూడా" అతడి కంఠంలో నవ్వు ధ్వనించింది.          "అయితే మేం అడిగితే గ్రాంటు వచ్చేదే అంటారు."          "తప్పకుండా! మీరు అడిగినా అడక్కపోయినా నేనైతే రిపోర్టు పంపించాలి కదా! మీకూ ఒక కాపీ అందజేస్తాను చదువుకుందురుగాని, అదేమిటి? మీ పిన్ అలా ముందుకు జరిపారు? ఇప్పుడు ఒక్క గెంతులో నా కింగ్ మీ స్థావరాన్ని చేరుకుంటుంది గమనించారా?"          బ్రహ్మానంద నవ్వాడు. "మీరు మా అతిథి. మీరు గెలిచినా అది నా ఓటమికాదు. అదీగాక పైకి అలా కనబడిన మీరూ గొప్ప ఆటగాళ్ళే..... ఈ విషయం ముందే తెలిస్తే మీతో పోటీకి కూర్చునేవాడినే కాను...."          వచ్చిన అతిధి కొద్దిగా గర్వాన్ని చిరునవ్వుకి మిళితం చేస్తూ ఆఖరి ఎత్తు వేయటానికి తన కింగ్ పిన్ ని చేత్తో పట్టుకున్నాడు. అంతే.          "ఆccccc"          అతడి గొంతునుండి బయల్పడిన కేక సగంలోనే ఆగిపోయింది. అడుగునుండి తిమింగలం కొడితే నీళ్ళల్లోంచి ఉవ్వెత్తున పైకి లేచిన పడవలా అతడా కుర్చీలోంచి గాలిలోకి లేస్తూ వికృతంగా అరిచాడు. గాలిలో అతడి శరీరం పాములా మెలికలు తిరిగి దబ్బుమన్న శబ్దంతో నేలమీద పడింది. హైపవర్ కరెంటు అతడి శరీరంలోంచి ప్రవహించడం వల్ల అతడి వెంట్రుకలు కాలిపోయాయి. పెదాలు నల్లగా మారిపోయాయి. మాంసం ఉడికినట్టు శరీరం కమిలిపోయింది. బంతిలా ఎగిరిన శరీరం నేలమీద ఒక్కక్షణం గిలగిలా కొట్టుకొని ఆగిపోయింది.          ఇంత జరుగుతున్నా ఇదంతా మామూలే అన్నట్టు ఎదురు కుర్చీలోంచి బ్రహ్మానంద కదల్లేదు. పడిపోయిన వాడిని చాలాసేపు అలాగే చూస్తూ వుండిపోయాడు. తరువాత నెమ్మదిగా నవ్వేడు. వంగి టేబుల్ అడుగున వున్న ప్లగ్ తీసేసి అతడు పట్టుకున్న కింగ్ పిన్ ని రంధ్రంలోంచి బైటకి లాగి, వైరుని యధాస్థానంలోకి తోసేశాడు.    పైకి అమాయకంగా కనబడుతుంది .... కొరియన్ చెక్కర్.          .... అప్పుడే వర్షం వెలిసింది. సన్నటి తుంపర్లు మాత్రం ఇంకా పడుతూనే వున్నాయి. కోట బురుజులాంటి గోడ ప్రక్కనున్న రోడ్డుమీద ఓ పదిమంది గుమిగూడి వున్నారు.          రోడ్డు ప్రక్కన ఒక వ్యక్తి చచ్చిపడి వున్నాడు. వర్షంవల్ల ఆ శవం బట్టలు శరీరానికి అతుక్కుపోయి వున్నాయి. వాటినుంచి నీళ్ళు క్రిందకి కారుతున్నాయి. అతడి ప్రాణంపోయి ఎంతోకాలం కాలేదు. ఉధృతంగా కురిసిన వర్షానికి తెగిన ఎలక్ట్రిక్ తీగ అతడిమీద పడి వుంది.          "ఎవరో పాపం షాక్ కొట్టిపడిపోయాడు" అంటున్నాడు- అక్కడ చేరిన వాళ్ళల్లో ఒకడు!          అంతలో బ్రహ్మానంద అక్కడికి చేరుకున్నాడు. అతణ్ణి గుర్తించిన వాళ్ళు నమ్రతగా తొలగి నిలబడ్డారు.          "ఎవరీ అభాగ్యుడు?" అని అక్కడ వారిని ఉద్దేశించి అడిగాడు.          "పడిపోయి వుండటంచూసి బతికున్నాడేమోనని కదిపాం. అప్పటికే చచ్చిపోయి చాలాసేపు అయిందనుకుంటాను. జేబులు వెతికితే చిన్న కార్డు దొరికింది."          "ఏం కార్డు?"          "పోలీస్ డిపార్ట్ మెంట్."          పోలీసు జీపు దగ్గరైంది. "వర్షం కురిసినప్పుడు కరెంటు స్తంభం ప్రక్కనుండి నడవకూడదని తెలీదు కాబోలు" అంటూ బ్రహ్మానంద వంగాడు. అతడి జేబులోంచి సిగరెట్టు లైటర్ తీసి పరీక్షించినట్లు చూసి మరుక్షణం మళ్ళీ పెట్టేశాడు. జీపు ఆగుతూ వుండగా గుంపులోంచి బైటపడి కోటవైపు నడిచాడు.          శవం జేబులోంచి సిగరెట్ లైటర్ తీసి పెట్టేస్తున్న కొద్ది క్షణాల్లో అతడి కళ్ళు కెమెరా ఫిల్ముకన్నా వేగంగా కదలడం అక్కడ ఎవరూ గమనించలేకపోయారు.                                                  *    *    *          ఆంజనేయులు బ్రహ్మానంద వున్న గదిలోకి ప్రవేశించాడు. అతడి చేతిలో పది పన్నెండు ఫోటోలున్నాయ్.          చనిపోయిన వ్యక్తి జేబులోంచి తీసిన సిగరెట్ లైటర్ కెమెరాలో ఉన్న రీలు తాలూకు ఫోటోలు అవి.          "ఏం, నా అనుమానం కరక్టేనా?" అడిగాడు బ్రహ్మానంద.          "కరెక్టే" అంటూ ఆంజనేయులు ఒక ఫోటో అందించాడు. లేడికాలుని బ్రహ్మానంద కట్టుదగ్గర సరిచేస్తున్న దృశ్యం అది ఫోటో వెనక్కి అందిస్తూ "రాంప్రసాద్ ని పిలువు" అన్నాడు.          ఆంజనేయులు వెళ్ళిపోయిన కొద్దిసేపటికి రాంప్రసాద్ వచ్చాడు. పానకం అందించిన కుర్రాడు అతడు. అయితే అప్పటిలా నిక్కరుమీద లేడు. ఫాంటుతో ఉన్నాడు.          "రావోయి! రా! అంతా సరిగ్గా సరిపోయిందా?"          "సరిపోయింది సార్? అంతా మీరు చెప్పినట్టే చేశాను. శవాన్ని పడేయటం..... కత్తిరించిన వైరు పడేట్టు చూడడం.....సిగరెట్టు లైటర్ లో ఫిల్ము తీసి ఆంజనేయులుగారికి అందించటం....అంతా అనుకున్నట్టే జరిగింది."          "రాంప్రసాద్ నీ వయసెంతోయ్?"          "ఇరవై రెండు సార్!"          'ఎంతకాలం అయ్యింది నువ్విక్కడ చేరి?"          "పన్నెండేళ్ళు."          "జీతం ఎంత వస్తుందోయ్?"          అకస్మాత్తుగా అతడి మొహంలో నవ్వు మాయమైంది.          "రెం...." అతడి మాట పూర్తికాలేదు. దాన్ని కట్ చేస్తూ బ్రహ్మానంద అన్నాడు.          ".... ఆపైన చేసిన ప్రతీ పనికి బక్షీస్ మామూళ్ళు! .... అవునా? ఇది కాక ఏదైనా రవాణా చేస్తే అందులో కమీషను. మొత్తం అంతా కలిపి నాలుగైదు వేలదాకా వుండొచ్చు. అంటే ఒక ఐ.ఏ.యస్. ఆఫీసర్ క్కూడా రానంత డబ్బు!!!నువ్విక్కడ పనికుర్రాడిగా చేరినప్పుడు నీ జీతమెంతోయ్? నూట ఇరవై కదూ! హ్హె హ్హె పది పన్నెండు సంవత్సరాల్లో నలభై రెట్లు పెరిగింది. కేవలం నీ స్వయంకృషివల్లే పెరిగింది. కంగ్రాచ్యులేషన్స్."          "థా... థాంక్యూ సార్!"          "రాంప్రసాద్! నీ వయస్సులో నేను టీ కప్పులు కడిగాను. రాత్రిళ్ళు వీధి అరుగుల మీద పడుకున్నాను. చలికి వణికాను. వర్షంలో తడిశాను. అన్నట్టు నీకన్నా నేను తెలివైన వాడినేనా?"
24,954
    సినిమాహాలు ఆవరణదాటి కారురోడ్డు ఎక్కింది. "కిరణ్ నీకు సినిమా చూడాలని ఉంది కదూ?" "ఉంది" "మరెందుకు నన్ను కూర్చోమని వత్తిడి చేయలేదు?" "ఇష్టం లేక" "అంటే నన్ను బలవంతంగా కూర్చోబెట్టడం ఇష్టం లేకనా?" "కాదు సినిమా ఇష్టం లేక" "అదుగో మాట మారుస్తున్నావ్. నిజం చెప్పు" ముందున్న లారీని ఓవర్ టేక్ చెయ్యడంలో నిమగ్నమై ఉన్న కిరణ్ సమాధానం ఇవలేదు. "వెళ్దామనగానే బయటికి వచ్చేశావ్?" "ఉండమని బలవంతం చేస్తాననుకొన్నావుగదూ?" "అవును కిరణ్" అతడి ముఖంలో ఏదో వెదకడానికి ప్రయత్నించింది. "అలా అనుకునే వెళ్దామన్నావా?" కిరణ్ పెద్దగా నవ్వేశాడు. "నో!నో!" అతడి నవ్వులో ఆమె మాట కలిసిపోయింది. 'క్వాలిటీ' ముందుకొచ్చి కారు ఆగింది. "కిరణ్!" అతనికేసి ఆశ్చర్యంగా చూసింది. "కమాన్!" అంటూ అతనుకారు దిగాడు. అతడికీ ఇతడికీ ఎంతతేడా? నిన్న తను బలవంతం చేస్తేగాని డిన్నర్ కు అంగీకరించలేదు అతను. ఇతనో? తాను అడక్కుండానే లంచ్ కు తీసుకొచ్చాడు. "ఇంకా కూర్చున్నావేం? దిగు!" కిరణ్ కార్లో ఆలోచిస్తూ కూర్చొన్న మహతి చెయ్యి పట్టుకొని కార్లో నుంచి దించాడు.         "కిరణ్! ఇటెక్కడి?" "అప్పుడే ఇంటి కెళ్ళేంచేస్తాం?" "మరిప్పుడెక్కడికెళ్దామని?" ఆదుర్దాగా అడిగింది మహతి. "లవ్ స్టోరీకి" "మళ్ళీ పిక్చర్ కా?" "బుర్రలో నుంచి ఆ బూజు తొలగిపోవాలి" "ఏ బూజు?" మహతికి ఏమిటో గా ఉంది. కాఉర్కు సడన్ బ్రేకుపడింది. పిచ్చివాడొకడు గొనె సంచి భుజం మీద వేసుకొని కారుకు అడ్డంగా నిలబడ్డాడు. మురికి బట్ట చుట్టి నకర్ర నొకదాన్ని ఎత్తిపట్టుకున్నాడు. కారు పక్కకువచ్చాడు. "మీ ఓటు నాకే ఇవాలి" కార్లో కి తల దూర్చి అరిచాడు. "ఇదివరకు వేసిందికూడా నీకే?" కిరణ్ నవకుండానే అన్నాడు. "అది అసెంబ్లీకి ఈసారి పార్లమెంటుకు వెయ్యి" "వేస్తాలే" "ఈ అమ్మాయి వెయ్యలేదు" మహతిని తీవ్రంగా చూస్తూ అరిచాడు. "ఈసారి వేస్తుందిలే" "వెయ్యకపోతేనీ కాళ్ళు విరగ్గొడతా. గొంతు పట్టుకొంటా" అంటూ విండోలోనుంచి తల తీశాడు. అదను చూసి కారు పోనిచ్చాడు కిరణ్. కదిలిపోతున్నకారు మీద దరువు వేసి మీ పవిత్రమైన మురికి ఓటు నాకే' అంటూ అరిచాడు పిచ్చివాడు. "పాపం! ఓట్ల పిచ్చి" "ప్రేమపిచ్చికీ ఓట్లపిచ్చికీ తేడా ఏమిటి?" కిరణ్ మాటలు ఆమె గుండెలో ములుకుల్లా నాటాయి. ముఖానికి పట్టిన చెమటను పైటకొంగుతో తుడుచుకుంది మహతి.         "మళ్ళీ ఎక్కడికి!" ఆమె ఆదుర్దాగా. "ఇంకా ఆరున్నరన్నా కాలేదు. ఇప్పుడే ఇంటికెళ్ళి ఏం చేస్తావోయ్?" "నేను మా అంకుల్ దగ్గిరకెళ్ళాలి" గట్టిగా అంది మహతి. "ఆ పిచ్చి డాక్టర్ దగ్గరికా?" పక పక నవ్వాడు స్టీరింగ్ మీద వేళ్ళాడిస్తూ కిరణ్. "పిచ్చి డాక్టర్ కాదు. పిచ్చి వాళ్ళకు డాక్టర్" రోషంతో ఉడికి పోయింది మహతి. "అందుకే వెళ్తున్నావా?" ఆమె వళ్ళు చల్లబడింది. ముచ్చెమటలు పోశాయి. "ఆయన మా ఫాదర్ కు క్లోజ్ ఫ్రెండ్. మా ఫామిలీ ఫ్రెండ్" "ఫామిలీ డాక్టరా?" "కిరణ్ స్టాపిట్ హాస్యానికి కూడా హద్దుండాలి" "ఆ హద్దేదోనీకూ వర్తిస్తుంది" "ఇప్పుడు నేనేం హద్దు మీరానని?" కోపంగా అంది మహతి. ఆమె కళ్ళలోని ఎరుపును చూస్తూ అతడు ప్రశాంతంగా నవ్వాడు. "పైగా నవ్వుతావ్ సిగ్గులేకుండా?" "సిగ్గెందుకు డియర్లేడీ? ప్రేమపిచ్చి పట్టుకొన్న వాళ్ళకు సిగ్గుండదని నీకు తెలుసునని నాకు బాగా తెలుసు".         "కిరణ్ కారాపు!" మహతి అరిచింది. "ఏం? దిగిపోతావా?" "ఆ( నువ్విలా మాట్లాడితే---?" "నేను మాట్లాడితేనే నీకింత కోపం వచ్చిందే? మరి నువు చేసినపనికి నాకెంత...." "నేనేం చేశాను?" మహతికి ఇక ఏడుపే తక్కువ. "మీ అంకుల్ అదే ప్రొఫెసర్ పరశురాం దగ్గరకు నన్నెందుకు తీసుకెళ్ళావ్? నేను పిచ్చి వాన్ననే గానీ ఉద్దేశ్యం?" "అవును నీకు నిజంగా నే పిచ్చి అందుకే అంకుల్ దగ్గరకు తీసుకెళ్ళాను" కసిగా అంది మహతి. అతను హాయిగా నవ్వాడు. ఆమె ముఖానికి చేతులడ్డం పెట్టుకొని తన్నుకొస్తున్న ఏడుపును ఆపుకోవడానికి విఫలప్రయత్నం చేసింది. "మహతీ, ఏడుస్తున్నావా? ఛ! ఛ! ఊరుకో ఏదో తమాషాగా అన్నాను. ఇంత మాత్రానికే ఏడ్వాలా?" కిరణ్ రోడ్డుపక్క చెట్టుక్రింద కారు ఆపాడు. మహతి కళ్ళుతుడుచుకుని తలపైకెత్తి చూసింది. అప్పటికే కారు ఊరుదాటిపది కిలోమీటర్ల దూరం వచ్చింది. "ఎందుకిక్కడకు తీసుకొచ్చావ్?"         "ఆ సంగతేదో తెలుసుకొందామని?" ఆమెకు లోపల ఏదో భయంగా ఉంది. "ఏ సంగతి?" మొండిగా అంది. "మీ అంకుల్ నా గురించి ఏమన్నాడు?" "ప్రేమించిన వాళ్ళకు పిచ్చి పట్టించేమనిషి అన్నాడు" "నువు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా?" "నువు నమ్మకపోతే నేనేమీ చెప్పలేను. అది నా దురదృష్టం" బాధగా అంది. "అయితే నువింకా ఆ స్నీకీబాస్టర్డ్ ను  ఎందుకు చేరదీస్తున్నావ్?" అతని కంఠంలో కాఠిన్యంలేదు. మహతి ఆశ్చర్యంగా అతని ముఖంలోకి చూసింది. కంటిమీద నీటి పొరలు ఆవరించి ఉన్నాయి. మహతిహృదయం కలుక్కుమన్నది. తాత్కాలికమే కావచ్చు. అయినా కిరణ్ ఇలా అయిపోతాడని తను ఊహించలేదు. "కిరణ్!" ఆమె కంఠం పూడిపోయింది.     "రవి మీద నీకంత ద్వేషం ఎందుకు కిరణ్? మనసు విప్పి మాట్లాడవూ? అతను నన్ను ఆరాధిస్తున్నాడనేనా?" అతని ముఖంలోకి లోతుగా చూస్తూ అంది. "కాదు. వాడు నిన్ను ప్రేమిస్తున్నాడని" "ఒకవేళ నువు అనుకున్నట్టే రవి నన్ను ప్రేమిస్తున్నాడే అనుకో. అందుకు నువు అంతగా దేషించాల్సిన అవసరం ఏమిటి?" "ఏమో నాకు తెలియదు" "నేను అతడ్ని ప్రేమించడం లేదని నీకు తెలియదా?" "తెలుసు" "మరి అలాంటప్పుడు అతడి మీద నీకున్న ద్వేషం, పగ, కసి, అసూయ అర్ధంలేనివే కదా? అకారణమైనవేగా?" "ఆ సంగతి అతడికి తెలుసా?" "ఏదీ, నువతడ్నిదేషిస్తున్న విషయమా?" "కాదు" "మరి?" "నువతడ్ని ప్రేమించడం లేదన్న సంగతి?" మహతి ఓ క్షణం తటపటాయించింది. ఏం సమాధానం ఇవాలో తోచక అయోమయంగా ఆకాశం కేసి చూసింది. చెట్ల ఆకుల సందుల్నుంచి తదియనాటి నెలవంక చిన్నచిన్న ముక్కలుముక్కలుగా కన్పిస్తోంది. "మాట్లాడవేం మహతీ?" అతడి కంఠం వింటూనే త్రుళ్ళిపడింది. అది అదిరింపో, బెదిరింపో, ప్రాధేయపడటమో తేల్చుకోలేకపోయింది మహతి. "బహుశా తెలియదేమో!" "నన్ను చెప్పమంటావా?" "నువా!" ఆమె కాళ్ళకింద భూమి కంపించింది. నక్షత్రాలు ఊడి నేలమీద రాలుతున్నట్టుగా అన్పించింది. "నేనే--నేనే చెప్తాను" "ఎప్పుడు?" "వీలు చూసుకుని చెప్తాను రండి. చాలా సున్నితమైన మనసు. అతను బాధపడకుండా...."
24,955
         ఇప్పుడు ఆమె అడుగులు జోరుగా పడుతున్నాయి.                                                                                  *    *    *    *                       చెక్ పోస్ట్ కు రాగానే గోపాల్రావుకి ఊపిరి వచ్చినట్టయింది. అంతవరకు గాలి తగలకుండా తనని చీకటి కొట్లో వేసేసినట్టు, ఒక్కసారిగా ఆ గదిలోంచి బయటపడ్డట్టు ఫీలయ్యాడు. ఉదయం నుంచి వూపిరి సలపనివ్వని పనులు. వాటి తాలూకు విపరీతమయిన టెన్షన్. సాయంకాలం ఏడు గంటల వరకు అంతే.     ఆ తరువాత తొందరతొందరగా అన్ని వ్యవహారాలు ముగించుకుని చెక్ పోస్ట్ కు వచ్చెయ్యడం ఈ మధ్యకాలంలో అలవాటైన విషయం. అక్కడ దొరికే అమృతంతో అన్ని బాధలూ కొట్టుకుపోతున్నాయి.     ఆ రోజు కాంచనమాల శేఖర్ తో క్లోజ్ గా వుండడం, ఆ రోజు రాత్రి తను శృంగారం మధ్యలో డైవర్ట్ కావడం, ఆ తరువాత కాంచనమాల తన చెంప ఛెళ్ళుమనిపించేటట్టు ఇద్దరం కలిసి ఓ మగాడ్ని వెతుక్కుందామని అనడం- అవి అతనిలో చాలా మార్పు తీసుకొచ్చింది.     ఆ రోజు జరిగినవి అతనిలో పూర్తిగా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాయి. కాంచనమాల తనది అని ఏదైనా భ్రమ వుంటే అది ఆ రోజుతో బద్ధలైపోయింది. ఆమె తనకేమీ కాదనిపించింది. ఏదో పూర్వజన్మలో శాపం మేరకు ఇద్దరూ కలిసి ఓ ఇంట్లో జీవిస్తున్నట్టు అనిపించింది. అవమానభారం అతను మోయలేకపోయాడు. వీటిని మరిచిపోవడానికి చెక్ పోస్ట్ లో ఆగడం ప్రారంభించాడు.     ఎన్ని పనులున్నా రాత్రి ఏడు గంటలకు ముగించేస్తున్నాడు. ఏడూ ఏడున్నర మధ్యలో చెక్ పోస్ట్ కు వస్తాడు. మెకానిక్ షెడ్ ముందు కూర్చుంటాడు. పిల్లవాడిచేత మందు తెప్పించుకుంటాడు.     నిదానంగా తాగడం ప్రారంభిస్తాడు. మొదటి పెగ్గుకు అభిమానాన్ని మర్చిపోతాడు. రెండో పెగ్గుకి ఆత్మవిశ్వాసం వస్తుంది. తను ఏదైనా చేయగలడన్న ధైర్యం వస్తుంది. మూడో పెగ్గుకి కాంచనమాలకు గుణపాఠం చెప్పాలన్న కసి ప్రారంభమై, ఉమను చేరదీయాలన్న కోరికతో ముగుస్తుంది. ఇక అప్పుడు లేచి ఇంటికి స్కూటర్ మీద వచ్చేస్తాడు. ఉమ మీద ఎంత ఇష్టం వున్నా ధైర్యం చేయలేకపోతున్నాడు. ఆమె ఒప్పుకోకుండా అల్లరిచేస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియకపోవడంవల్లే అతను ప్రొసీడ్ కాలేకపోతున్నాడు. అయితే ఉమ ఊహలే లేకుంటే, తను మరింత టెన్షన్, బాధ అనుభవించేవాడని అతనికీ తెలుసు. తన బాధా నివారిణి ఉమ అనే సంగతిని అతను ఎప్పుడో గ్రహించాడు. అయితే ఆ ఒక్క కారణం వల్లే ప్రతిరాత్రీ ఉమ ఇంటి దగ్గర బ్రేక్ వేయాలని చెక్ పోస్ట్ నుంచి అనుకుంటూ వెళ్ళినా ఆగలేకపోతున్నాడు.     మామూలు టైమ్ కంటే ఈరోజు ఓ పదినిముషాల ముందే చెక్ పోస్టుకి వచ్చాడు గోపాల్రావు.     అతను స్కూటర్ ను పక్కన పార్క్ చేస్తున్నప్పుడే కుర్రాడు ఓ పక్కగా కుర్చీవేశాడు. దానిముందు టీపాయ్ లా వుపయోగించుకోవడానికి స్టూల్ వేశాడు.     "ఏరా బుడ్డోడా! మీ ఓనర్ ఎక్కడ?" అని అడుగుతూ కుర్చీలో కూర్చున్నాడు గోపాల్రావు.     "ఇంటికెళ్ళాడయ్యా."     "సరేలే-కావాల్సినవి తెచ్చెయ్."     గోపాల్రావునుంచి డబ్బు తీసుకున్నాడు కుర్రాడు.     అక్కడికి రాగానే ఏదో కొత్త హుషారు వచ్చినట్లుంది అతనికి. బాధలు గుర్తుకురావడంలేదు. భయాలు మనసులో దూరడంలేదు. పైపెచ్చు తనమీద తనకే నమ్మకం కుదురుతోంది. తను ఎవరి దయాదాక్షిణ్యాలమీద ఆధారపడనవసరంలేదు. తనమీద ఎవరి పెత్తనం, ఎవరి అధికారం ఉండాల్సిన పనిలేదు. ఎదుటివ్యక్తుల ప్రేమాభిమానం కోసం తను వెంపర్లాడాల్సిన అగత్యంలేదు. తను అభిమానం లేనివాడు కాదు. తన స్వతంత్రతని ఎవరూ అడ్డుకోలేరు. తను ఎవరికోసం వెంపర్లాడాల్సిన పనిలేదు-భార్య అయినా సరే.     మందు పడకపోయినా చెక్ పోస్ట్ కి రాగానే తన ఆలోచనా ధోరణిలో మార్పు రావడం అతను కనిపెట్టాడు. రోజులో అక్కడున్న రెండుమూడు గంటలే తనకోసం బతుకుతున్నట్లు మిగిలిన రోజంతా ఇతరులకోసం బతుకుతున్నట్లు, కష్టపడుతున్నట్లు అన్పిస్తుంది.     అంతే కాకుండా, ఈ భూప్రపంచంలో తన పుణ్యక్షేత్రం చెక్ పోస్టే అయినట్టు కూడా అతను భావిస్తున్నాడు. ఇంట్లోగానీ, వీధిలోగానీ, మరెక్కడైనాగానీ తనకు ఉనికిలేదు. రక్తమాంసాలున్న మనిషికాదు.     స్పందించే మనసులేదు. చిత్రంగా చెక్ పోస్ట్ కి రాగానే అవన్నీ వున్న ఫీలింగ్ కలుగుతోంది అతనికి. ఇంట్లో ఎంత నరకంగా ఉంటుందో ఇక్కడంత బావున్నట్టు అనిపిస్తుంది. ఇంట్లో-కాంచనమాల తనపట్ల ప్రవర్తించే తీరుచూస్తుంటే తను బతికున్న శవంలా తోస్తుంది. తన రక్తానికి రంగుపోయిన భావన కలుగుతుంది.     తను ఒకడున్నాడన్న ఫీలింగ్ లేని భార్యతో గడపడం ఎంత ఘోరంగా వుంటుందో తను అనుభవిస్తున్నాడు. ఆమె తనపట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించే తీరును తలుచుకుంటేనే ఏదోలా అయిపోతోంది. అయితే విచిత్రంగా చెక్ పోస్ట్ కు రాగానే ఆవేదనంతా మాయమైంది. మనసుకే కాదు, శరీరానికీ వయసు తగ్గినట్టుంటుంది.     గోపాల్రావు మరింత రిలాక్స్ డ్ గా కూర్చున్నాడు.     అంతలో కుర్రాడొచ్చాడు.     తను తెచ్చినవన్నీ స్టూల్ మీద పెట్టాడు.     "అవసరమైనప్పుడు పిలుస్తాగానీ వెళ్ళి పనేమన్నావుంటే చూసుకో" అని గోపాల్రావు ముందుకువంగి బాటిల్ ఓపెన్ చేశాడు. గ్లాస్ లో మందు పోసుకుని షోడా కలిపి ఓ సిప్ చేశాడు. వెంటనే అతని స్వంత ప్రపంచం కళ్ళముందు తెరుచుకున్నట్టు ఫీలయ్యాడు. ఆ ప్రపంచంలో అతన్ని అన్నీ ఉత్తేజపరిచే విషయాలే.     అన్నిటికన్నా ముఖ్యంగా ఉమ. తను కన్పించగానే ఆమె కళ్ళల్లో కన్పించే తొట్రుపాటు, సిగ్గు, బిడియం, గౌరవం తనలో ఎంత సంతోషాన్ని నింపుతాయో! మరీ గొప్పగా ఆనందించే విషయం ఒకటుంది. అది ఆమె సమక్షంలో తను ఓ మగవాడిగా ఫీలవడం. ఈ భావన కలిగేటట్లు ఆమె ప్రవర్తిస్తుంది.     తనను చూస్తూనే లేచి నిలుచుంటుంది ఉమ. ఆ నిలబడడం కూడా ఏదో క్యాజువల్ గా కాదు. గౌరవం శరీరాన్ని లేపుతున్నట్టు నిలబడుతుంది.     తన మీద ఆమెకు ఉన్న అమితమైన అభిమానం కళ్ళల్లో నీళ్ళయి తేలుతుంది. భయమూ, భక్తీ తొట్రువాటులో బయటపడతాయి.     అలా లేచిన ఆమె తనను చూడడమే అదృష్టమన్నట్టు మెరిసే కళ్ళను ప్రదర్శిస్తుంది. భయంతో అదిరే ఒంటిని అటూ ఇటూ కదులుస్తూ అదుపులో వుంచుకున్నట్లు కుర్చీనో, స్టూలునో లాగుతుంది. భక్తిని కనబరుస్తూ ఆ స్టూల్ మీదున్న దుమ్మునీ, ధూళినీ పైటకొంగుతో విదిలిస్తుంది.     అప్పుడు తనను కూర్చోమన్నట్టు సంజ్ఞ చేస్తుంది.     తను కుర్చోగానే ఆమె ఎదురుగా కొంత దూరంలోని ద్వారానికి ఆనుకుంటుంది. ఎదురు మొక్కకు అల్లుకున్న మల్లెతీగంత హొయలు ఒలకబోస్తుంది. మాటల మధ్యలో పైట జారిపోతుంది. అదే జారిపోతుందో లేక ఆమే కావాలని జారుస్తుందో తనకి ఇంతవరకూ అర్ధంకాని మిలియన్ డాలర్ల ప్రశ్న.
24,956
    "మీరుండండి! ఇదిగో విశ్వం. ఈ చంద్రహారం పది తులాలుంటుంది .దీన్నమ్ముకుని వాళ్ళ వాటా తీసుకోమను. తక్షణం నా ముందునుంచి వెళ్ళిపొమ్మను. వాళ్ళ ముఖాలు చూసినా పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి. రౌరవాది నరకాలు ప్రాప్తిస్తాయి." అని మెడలోని చంద్రహారం తీసి సర్రున విసిరేసింది.     దాన్నందుకుని "సరే మీ యిష్టం" అన్నాడు విశ్వం.     "అదెట్లా? ఆ బంగారంలోనూ మాకు వాటా రావాలి" అంది జ్యోతి.     "నువ్వు నోర్ముయ్! అది నా పుట్టింటి వాళ్ళు నాకిచ్చిన బంగారం. అదే కాదు, నా గాజులు, నెక్లెస్, జడ బిళ్ళ, నా గొత్తులు గొలుసు అంతా నా పుట్టింటి బంగారమే. కావలసి వస్తే పేర్లు చూడు. మావయ్యనడుగు"     ఆ మాటలకి జ్యోతి నోరెత్తలేదు.     "ఒరే విశ్వం! వాళ్ళిద్దరినీ వాటా సొమ్ముగా ఆ బంగారం ముట్టినట్లు రసీదివ్వమను. తక్షణం నా ఇంటినుండి వెళ్ళిపొమ్మను_"     "అప్పుడే అయిందా అత్తగారూ! మెళ్ళో హారం విసిరేయగానే పూర్తయిందా! ఇంట్లో మీరు పూజచేసే విగ్రహం మాటేమిటి?"     నువ్వెరపోయారంతా! "అంటే జానకి పూచిక పుల్ల కూడా వదలదల్చుకోలేదన్నమాట!" అనుకున్నారు.     "అదీ అంతేనే! అది శ్రీకృష్ణదేవరాయలు మా పూర్వీకులకు యిచ్చిందట, అల్లసాని పెద్దనగారికి బంధువట ఈయన. ఆయన చెబితే అగ్రహార యిచ్చారు. దాని వెంటే ఈ విగ్రహం కూడా ప్రసాదించారుట. మా నాన్నగారు మా అన్నయ్య వెధవ కావటం చూసి పూజా పునస్కారాలు పాటించే అల్లుడికి కన్యాదానం అప్పుడు యిచ్చారు, అది నీలాంటి నాస్తికుల కెందుకే? అమెరికాకి అమ్మేస్తావా? బంగారం కరిగించి సొమ్ము చేసుకుంటావా?" ఆవేశంగా అంది పార్వతి.     జ్యోతికి నోరు పెగల్లేదు. ఒక్కక్షణమాగి "అన్నిటికి అన్ని సమాధానాలు చెపుతున్నారు. పాత్ర సామాను అదీ యివ్వరా?" అంది.     "ఊహూఁ అంతా నాపుట్టింటివాళ్ళు యిచ్చింది మీ మామగారు సంపాదించిందీను. ఆయన స్వార్జితంలో మీకు దమ్మిడీరాదు. ఇక వెళ్ళు ఇంకా వాగావంటే ముఖాన చీపురుపెట్టి చిమ్ముతా" అంది ఆవేశంగా.     "పార్వతీ!"     "చూడండి ఈ నంగనాచి ఎలా అడుగుతుందో అన్నీను. ఆనాలి ముచ్చు నోర్ముసుకుని ముసుగేసుకున్నాడు. ఆ వెధవా అంతే ఆడంగి వెధవ. పెళ్ళానికి పెత్తనం కట్టారు. వాళ్ళు ఎలా ఆడిస్తే అలా ఆడుతున్నారు."     జానకిరాం లేచాడు_     అయోధ్య లేచాడు_     ఇద్దరూ విశ్వంవైపు చూశారు.      అదిచూసి_ "పదండ్రా వెళదాం! బాబాయ్ రేపు ఈ సొమ్ము ముట్టినట్లుగా డాక్యుమెంట్స్ వ్రాయించి ఇస్తాను. రిజిష్టర్ చేయిద్దాం" లేచాడు విశ్వం.     జ్యోతి, అహల్య కూడా కదిలారు.     జ్యోతి ఒక్కక్షణం ఆగి పార్వతి దగ్గరికి వచ్చింది.     "అత్తయ్యా నిన్ను 'పార్వతీ!" అని పిలవాలనిపిస్తుంది."     పార్వతి బాధతో కృంగిపోయి వుంది_ "కానియ్ తల్లి అదికూడా కానివ్వండి" అంది స్పష్టంగా.     "కానీ నాలోని సంస్కారం అప్రయత్నంగా అత్తయ్య అని పిలిపించింది. నువ్వు మామచాటున వుండి ఆడిస్తున్నావు"     "నీవు నీ మొగుడి చాటున వుండి ఆడించటం లేదూ?"     "ఆడిస్తున్నానని మురిసిపోవచ్చు. మాకేమీ యివ్వకుండా బయటికి పంపే ఆలోచన చేస్తున్నావు. ఫర్వాలేదు మేమేమీ కాము. మేం ఇద్దరం చదువుకున్నాం_ఉద్యోగాలు చేసుకుంటున్నాం! హాయిగా బ్రతుకుతాము."     "మరి ఈ ముష్టి కెందుకొచ్చారు?" పార్వతి తీవ్రంగా చూస్తూ అడిగింది.     "హక్కున్నది కనుక అడగాలని వచ్చాము. మీ మనసుల్లో ఇంత కుళ్ళు వుందనుకోలేదు. కానీ కొడుకులందరికీ చెడ్డయిపోయి, ఆయన నువ్వూ తల చెడిన కోడలితో ఎలా నెగ్గుకొస్తారో మేం చూస్తాం."     పార్వతి, శాస్త్రిగారు ఖిన్నులైపోయారు.     పదిహేను నిముషాలు కాలం బరువుగా కత్తిమీద సాములా గడిచింది. అక్కడ గాలి లేక ఉక్కిరిబిక్కిరై పోతున్నట్లు అనిపించసాగింది.     దాశరధిలేచి  తండ్రి వద్దకి వచ్చి కూచున్నాడు.     దాశరధి మాట్లాడలేదు. అతని కంఠం దుఃఖంతో పూడుకుపోయింది. గుండెలో బాధ రగులుతోంది. ఆడుకున్న గుండెలమీద నిర్ధాక్షిణ్యంగా తన్నేసి ఎలా వెళ్ళిపోగలరీ ప్రబుద్ధులు? అతని మనసంతా అసహ్యంతో నిండిపోయింది.     "మీ అమ్మని సప్తపర్ణి అనే వాడిని. ఏడుగురు కొడుకులతో ఏడాకుల అరటిలాగా దినదిన వర్ధమాన మయ్యేది సంసారం. మీ అమ్మని తమాషా పట్టిస్తుండేవాడిని. ఆఖర్న అమ్మాయి పుడితే అష్టలక్ష్మివే అనేవాడిని. ఇంకొకరు పుడితే నవగ్రహం అంటారేమో అనేది మీ అమ్మ. ఆఖరికి సప్తపర్ణినే ఖాయం చేశాడు కోదండం."     "ఇప్పుడు ఒక్కో ఆకూ విడిపోయి ఆఖరికి మీ అమ్మని అపర్ణని చేస్తారేమో బాబూ!"     "ఊరుకోండి నాన్నా! తవ్వుకునేకొద్దీ దుఃఖం పెరుగుతుంది."     "ఏం చూసుకుని శాంతంగా ఉండాలి దాశరధీ! ఎంతో బుద్ధిమంతుడనుకునే పట్టాభి కూడా వెధవయ్యాడు"     "వయసు నాన్నా! తప్పు చేశారు_ పెద్దవారు మీరు క్షమించాలి."     "హు అంతకంటే చేయగలిగిందేముంది?"     "ఏమండీ?" అని పిలిచింది పార్వతి.     "ఏమిటి?"     "ఇక పడుకోండి అర్దరాత్రి దాటింది. నువ్వూ ఇక్కడే పడుకోరా దాశరధీ!"     "వస్తానాన్నా! పిల్లల్ని తీసుకురాగానే వస్తాను" అని కదిలాడు.     చూస్తూ వుండిపోయారిద్దరూ.     తెల్లగా తెల్లారింది పార్వతి లేచేసరికి.     రాత్రి అందరూ వెళ్ళిపోయాక చాలాసేపటి దాకా భార్యాభర్తలిద్దరూ ఒకర్నొకరు ఓదార్చుకుంటూ తమ తమ కర్మాన్ని నిందించుకుంటూ విలపించారు.     "ఏమండి లేవండి, తెల్లారిపోయింది." అని భర్తని నిద్రలేపి ఇంట్లోకి వెళ్ళింది. భార్య వెంటే వెళ్ళి దంతధావనానికి ఉపక్రమించారు.     "ఏమిటో ఇంకా విద్యా, స్వాతి కూడా లేవలేదు."     "పడుకోనీ రాత్రంతా మన గొడవవింటున్నారేమో?"     "ఏమో!"     "పట్టాభి కూడా లేవలేదా?"     "లేచినట్టే వున్నాడు. బ్యాట్ కనిపించలేదు హాల్లో. ప్రాక్టీసుకి వెళ్ళాడేమో?" అంది భర్తకి కాఫీ అందిస్తూ. 
24,957
    రాముడు అది విన్నాడు. గుహుని స్నేహం చూచాడు. అతని కళ్లు చెమ్మగిల్లాయి. "మిత్రమా! నీవు కాలినడకన వచ్చావు. గొప్పస్నేహం కనబరచావు. అంతేచాలు. నీవు తెప్పించిన సామాగ్రిని చూచాను. కాని నేను వాటిని స్వీకరించలేను. వనవాసం చేస్తున్నాను. కందమూలాలే తింటాను. ఈ గుర్రాలు మా తండ్రి అయిన దశరథుడివి. వాటికి కావలసినది స్వీకరిస్తాను" అన్నాడు.     రాముని ఆజ్ఞ మేరకు గుహుడు గుర్రాలకు మేత వేయించాడు. అంతలో సాయంకాలం అయింది. రాముడు సంధ్య ముగించుకున్నాడు. లక్ష్మణుడు గంగాజలం తెచ్చాడు. అవి మాత్రం పుచ్చుకున్నాడు. ఆ రాత్రికి రామునికి అదే ఆహారం.     రాముడు, సీత నేలమీద పడుకున్నారు.     లక్ష్మణుడు గుహుని దగ్గర కూర్చున్నాడు. రాముని గుణగణాలను వివరించాడు. అయోధ్యలోని దుఃఖాన్ని వర్ణించాడు. గుహుడు దుఃఖంతో కన్నీరు కార్చాడు. ముచ్చట్లోనే తెల్లవారింది.     గుహుడు గంగ దాటడానికి ఏర్పాట్లు చేశాడు. గట్టి పడవను ఏర్పాటుచేశాడు. తెడ్లు వేసేవాళ్లను బలమైన వాళ్ళను నియమించాడు.     రాముడు గంగదాటడానికి సిధ్ధపడుతున్నాడు. సూతుడు వచ్చాడు. చేతులు జోడించాడు. "నీవు లేని అయోధ్యలో ఉండలేను. నీతోపాటు అడవులకు వస్తాను. కాదంటే అగ్నిలో దూకుతాను" అన్నాడు.     రాముడు సుమంత్రుని వారించాడు. "నీ భక్తి నీకు తెలియనిదికాదు. అయినా నీవు అయోధ్యకు వెళ్లాలి. మేము అడవులకు వెళ్లిన విషయం తెలియకుంటే కైకకు మనశ్శాంతి ఉండదు. నాతండ్రి సత్యవాదిత్వం నిరూపించబడదు. మా తండ్రికి, తల్లులు కౌసల్యకు, సుమిత్రకు మేం అడవులకు వెళ్లినందుకు దుఃఖించవద్దని చెప్పు. మేం క్షేమంగా అయోధ్యకు తిరిగి వస్తామని చెప్పు. భరతుని తీసుకొనివచ్చి పట్టంకట్టు. నీవు రాజు విషయంలో ఎలా ప్రవర్తిస్తావో తల్లుల విషయంలో కూడా అలాగే ప్రవర్తించవలసిందని నా మాటగా భరతునికి చెప్పు"     వెంట్రుకలు జడలుకట్టించుకోవడానికి రాముడు మర్రిపాలు తెమ్మన్నాడు. గుహుడు తెచ్చాడు. రామలక్ష్మణులు ఆ పాలతో వెంట్రుకలు జడలు కట్టించుకున్నారు. జటావల్కలధారులైన రామలక్ష్మణులు ఋషుల్లా కనిపించారు.         లక్ష్మణుడు సీతను జాగ్రత్తగా పడవ ఎక్కించాడు. లక్ష్మణుడు ఎక్కాడు. తరువాత రాముడు ఎక్కాడు. రాముడు మాత్రం జపించాడు. ఆశమనం చేశాడు. గంగకు నమస్కరించాడు. సీత, లక్ష్మణులు కూడా గంగకు దండం పెట్టారు.     వారు సుమంత్రునివద్ద, గుహునివద్ద శెలవు తీసుకున్నారు. నావ కదిలింది. నడిమధ్యకు చేరింది. సీత గంగకు నమస్కరించింది. "దేవీ! మేము మళ్లీ అయోధ్యకు తిరిగి వచ్చిం తరువాత నీకు వేయిబానల కల్లు, మాంసంతో కూడిన అన్నం సమర్పిస్తామని మొక్కింది.     సీత గంగకు మొక్కింది. నారాయణునికి మొక్కలేదు. శివునికి మొక్కలేదు. అది దైవాన్ని గురించిన ఒకరూపం ఏర్పడనికాలం, దైవాన్ని గురించిన రూపాలు కూడా మానవుని నాగరికత పరిణామాల మీద ఆధారపడి ఉంటాయి.     ఆదిమానవునికి అగ్గి కనిపించింది. అది కాలాన్ని దహించివేస్తున్నది. దాన్ని ఒక శక్తిగా భావించాడతను అగ్నికి కోపం రాకుండా ఉండాలనుకున్నాడు. అగ్నికి ప్రార్థించాడు. అలాగే వర్షం అవసరం అని తెలిసికున్నాడు. వర్షాన్ని ప్రార్థించాడు. సూర్యచంద్రాదుల మనిషి మనుగడకు అవసరం అనుకున్నాడు. వారిని పూజించారు. మనిషి వాటికి ఆకారాలు కల్పించలేదు.     తల్లిని మించిన ధైవం లేదనుకున్న మనిషి, తల్లిని దైవం చేశాడు. ఆమెను ఆదిశక్తిగా చేశాడు.     ఆ తరువాత తండ్రిని దేవుడిలా భావించాడు. ఆనాటి మనిషి నాగరికతనుబట్టి శివుణ్ణి సృష్టించాడు. శివుడు గుట్టలు మీద ఉంటాడు. తోలు కట్టుకుంటాడు. పాములు మెడలో వేసుకుంటాడు. మూడో కంటితో ప్రపంచాన్ని నాశనం చేయగలడు.     అది మనిషి భయానికి లొంగిన కాలం. భయపడి పనులు చేసినకాలం. కాబట్టి శివుణ్ణి భయంకరంగా తయారుచేశారు. ఆది శక్తిచే శివునికీ సమన్వయం కుదర్చడానికి ఆదిశక్తిని శివుని భార్యగా చేశారు.     మనిషి నాగరికత వృద్ధిచెందింది. అప్పుడు నారాయణుడు వచ్చాడు. అంతలో నాగరకుడు పట్టుబట్ట కడ్తాడు. పాముపై పండుతాడు. పాలసంద్రంలో ఉంటాడు. లక్ష్మిని భార్యగా చేసుకుంటాడు. అతడు సంపన్నుడు. సంపన్నుడు ఉపాయంతో లొంగదీస్తాడు. ఎత్తులూ, యుక్తులూ చేయగలడు.     రామాయణ కాలాన్ని చూస్తే ఇంకా ప్రకృతి శక్తులనే ఆరాధిస్తున్నట్లు అనిపిస్తుంది. ఎక్కడా ఒక సాకారం అయిన దైవం కనిపించదు. ఉపవాసాలమీదా వ్రతాలమీదా, నమ్మకాలున్నట్లు కనిపిస్తుంది. రాముడు ఉపవాసం చేస్తాడు. కౌసల్య ఉపవాసాలూ, వ్రతాలూ చేస్తుంది.     సీత గంగకు మొక్కటం ఇందుకు బలమైన నిదర్సనం.     చిత్రకూటం:     సీతా, రామలక్ష్మణులు నావలో దక్షిణ దిశకు చేరారు. నావ దిగారు. నడక సాగించారు. ముందు లక్ష్మణుడు వెనుక సీత, ఆ వెనుక రాముడు నడక సాగించారు. అలా కొంత దూరం నడిచారు. సాయంకాలం అయింది. రామలక్ష్మణులు మనుబోతును, దుప్పిని, ఇర్రిని వేటాడి తెచ్చారు. దాని మాంసం సిద్ధం చేసుకున్నారు. ఆ రాత్రికి ఒక చెట్టు క్రింద పడుకున్నారు.     తెల్లవారింది. మళ్లీ నడక సాగించారు. సాయంకాలానికి గంగా యమునల సంగమం చేరుకున్నారు. అక్కడ భరద్వాజుని ఆశ్రమం ఉంది. వారు మహర్షిని దర్శించుకున్నారు. రాముడు, భరద్వాజునికి తన కథంతా చెప్పాడు. ఆ రాత్రికి కందమూలాలు తిన్నారు. ఆ రోజు అక్కడ గడిపారు.     తెల్లవారి భరద్వాజుడు రామునితో ఇది గంగా, యమునల సంగమ స్థలం. మీరు ఇక్కడే ఉండడం మంచిది అన్నాడు.     అందుకు రాముడు "ఇక్కడికి జానపదాలు దగ్గరలో ఉన్నాయి. జనం వచ్చి పోతుంటారు. ఇక్కడ ఉండడం నాకు ఇష్టంలేదు. ఏకాంత ప్రదేశంలో ఆశ్రమం నిర్మించుకొని ఉండాలని ఉంది" అన్నాడు. అయితే చిత్రకూటం అందుకు అనువైన ప్రదేశమని చెప్పాడు భరద్వాజుడు. అక్కడికి వెళ్లాల్సిన దోవకూడా చెప్పాడు.     సీతారామలక్ష్మణులు చిత్రకూటానికి బయలుదేరారు. కొంతదూరం నడిచారు. వారికి యమున అడ్డం వచ్చింది. ఒక తెప్ప కట్టుకున్నారు. నదిని దాటారు. అక్కడ వారికి ఒక పెద్ద మర్రిచెట్టు కనిపించింది. సీత మర్రిచెట్టుకు నమస్కరించింది. "మేము ముగ్గురం మళ్లీ కౌసల్యనూ, సుమిత్రనూ కలుసుకునేటట్లు అనుగ్రహించు" అని మొక్కింది. మళ్లీ నడక సాగించారు. కొంతదూరం వెళ్లారు. చీకటిపడింది. అక్కడ పడుకున్నారు.
24,958
        మునిపంటను బాధను అణగద్రొక్కుకుంటూ శూన్యంలోకి చూస్తోందామె ఎందుకో.         ఆ సమయంలో ఆమెకు ఒక్కక్షణం మొట్టమొదటిసారి పక్కింటి బాత్ రూమ్ వేపు తను చూడగా-         గాయత్రి శివాజీల గోడచాటు ముద్దు గుర్తుకొచ్చింది. యూనివర్సిటీ వంతెన దగ్గర రిక్షా కార్మికుడు అతని భార్యా గుర్తుకొచ్చారు. షంషాబాద్ వెళుతున్నప్పుడు పల్లెటూరి యువతీ యువకులు జ్ఞాపకానికొచ్చారు.         కలలెప్పుడూ నిజం కావు అన్నమాట మరోసారి రుజువైనట్టుగా అన్పించిందామెకు.         "సీ......యూ......మళ్ళీ కలుద్దాం" అని గబగబా ఆ రూమ్ లోంచి బయటికెళ్ళి పక్క రూమ్ లోకి దూరిపోయాడు జ్వాలాముఖిరావు.         వెన్వెంటనే మయూష బిగాగ్రగా ఏడ్చేసింది.         చీకటిలో ఆ ఏడుపు హృదయవిదారకంగా వుంది. ఆ రాత్రంతా ఆమె అలా ఏడుస్తూనే వుండిపోయింది.                                                   *    *    *    *         ఎప్పుడూ ఉత్సాహంగా పుట్టింట్లో ఉదయాన్నే అయిదు గంటలకు లేచే మయూష మర్నాడు ఉదయం ఎనిమిది గంటలకు గానీ లేవలేకపోయింది.         ఏదో తెలియని బాధ నిస్సత్తువ. కళ్ళిప్పి నలువేపులా చూసింది చప్పుడు చెయ్యకుండా ప్రవహిస్తున్న ఎయిర్ కండిషనర్ గాలి.         రూమ్ లోని గోడలవేపు చూసిన మయూష ఒక్కసారిగా విస్తుపోయింది. గదిలో మూడు గోడల మీద అసభ్య భంగిమల్లో పెయింటింగ్స్ వాత్స్యాయనుడి కామసూత్రాల చిత్రణ.         బెడ్ రూమ్ లో ఎడమవేపున ఒక మూల నిలువెత్తున్న కామంతో వేగిపోతున్న నిలువెత్తు యువతి నగ్న ప్రతిమ.         ఆ బొమ్మను ఒక్కసారిగా చూడగానే మయూషకు పట్టలేని కోపం వచ్చింది.         తన గదిలో తన భర్త ఆ ఏర్పాట్లు ఎందుకు చేయించాడో అవన్నీ ఎందుకు అమర్చాడో అర్ధం చేసుకున్న మయూష  కోపంతో గబుక్కున మంచం మీంచి లేచి ఆ నగ్న ప్రతిమను చేతిలోకి అందుకుని నేలకేసి విరిసికొట్టింది.         ఆ ప్రతిమ ముక్కలు ముక్కలైపోయింది.         కసిగా, కోపంగా, అసహ్యంగా ఆ ముక్కలవేపు చూసి విసురుగా గోడవేపు అడుగువేసి గోడకు వేలాడుతున్న ఒక పెయింటింగ్ ని బలంగా లాగి మెయిన్ డోర్ వేపు విసిరికొట్టింది.         రెండో పెయింటింగ్ వేపు నడుస్తుండగా-         చిత్రమైన నవ్వు విన్పిస్తే తల తిప్పి చూసింది మయూష.         గ్రే కలర్ సూట్ లో ఎర్రటి పెదవులతో జ్వాలాముఖిరావ్.         "నాకు తెలుసు కొత్తగా పెళ్ళయిన అమ్మాయికి అలాంటి ప్రతిమలు ఎదురుగా వుంటే ఏమవుతుందో నిన్ను టెంప్ట్ చేయడానికే వాటిని అక్కడ పెట్టించాను" ధిలాసాగా అన్నాడతను.         "నీ కాముకత్వానికి అవి నిదర్శనాలు అందుకే పగలగొట్టాను. ఇవాళ ఈ పెయింటింగ్స్ పగలకొట్టాను. రేపు ఈ బిల్డింగ్ ను, ఎల్లుండి నిన్నూ.......ఇలాగే పగలకొడతాను" కసిగా అంది మయూష.         "కాలేజీలోని రాడికల్ భావాలు, కొన్నాళ్ళపాటు నీలో వుంటాయి నన్ను నువ్వు పగలగొట్టడానికి నేనేం పెయింటింగ్ నీ కాను. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన ప్రతిమనూ కాను. ఉక్కు మనిషిని. నీలాంటి వంద మందితో ఒకే టైమ్ లో సెక్సువల్ గా ఎంజాయ్ చెయ్యగలిగే సత్తా గలిగిన ఉక్కు మనిషిని" డ్రెస్సింగ్ టేబుల్ మీదున్న డీసెంట్ సెంట్ ను తీసుకుని డ్రెస్సు మీద స్ప్రే చేసుకుంటూ అన్నాడు జ్వాలా ముఖిరావు.         "ఛీ.....సిగ్గులేదూ అలా చెప్పుకోడానికి నువ్వు కాముకుడివే అనుకున్నాను. సమూహ లైంగికత్వాన్ని కోరుకునే పశువ్వని ఇప్పుడే తెల్సుకున్నాను పర్ఫెక్ట్ డ్ సెక్స్ మానియక్ వి."         "గుడ్ వెరీ గుడ్ అయామ్ వెరీ హేపీ దట్ యూ ఆర్ నోయింగ్ వన్  బై వన్ పాయింట్. బట్ నేను నీ భర్తను. నీకన్నా పెద్దవాడిని. మీరు అని గౌరవించడం సంప్రదాయం అనుకుంటాను."         "నిను మీరని పిలవడమా? నలుగురి ఎదుట మాత్రమే నువ్వు నా భర్తవని నువ్వే అన్నావ్ కదా ఇక్కడ నిన్ను నిన్నుగానే పిలిస్తేనే నాకు ఆనందం" ఆవేశంగా అంది మయూష.         "ఒకే....కానీయ్ నువ్వు కోరుకునేది చిన్న ఆనందం లిటిల్ బిట్ ప్లెబర్ భార్యగా ఆ మాత్రమైనా ఆనందాన్ని ఇవ్వాల్సిన బాధ్యత నాకుంది కదా. అయితే ఒకటి మాత్రం జ్ఞాపకం ఉంచుకో.         నువ్వీ బందీవి నువ్వెక్కడికీ వెళ్ళలేవు. ఇక్కడ నీతో ఎవరూ మాట్లాడరు. నువ్వు బయట ప్రపంచంలో ఎవ్వరితోనైనా మాట్లాడడానికి వీలు పడదు. ఎందుకంటే నీ రూమ్ లో ఫోన్ మాత్రమే శాశ్వతంగా డెడ్ అయి వుంటుంది ఇంక నీ కోసం నీ బంధువులెవరూ రారు. ఇంకో ముఖ్యమైన విషయం నాతో తప్ప నువ్వు బయటకు వెళ్ళడానికెప్పుడూ అవకాశం వుండదు. నిన్ను మరీ అవమాన పరచాలనుకున్నప్పుడు మాత్రమే నేను నిన్ను బయటకు తీసికెళతాను."         "నీతో నేను బయటకు రావడమా నెవ్వర్" టీపాయ్ మీదున్న బొమ్మను అతనివేపు గిరాటు వేస్తూ అంది మయూష కోపంగా.         ఆ సమయంలో కొన్ని క్షణాలు ఆమె వేపు సూటిగా చూసాడు జ్వాలాముఖిరావు.         "ఏంటీ నా వేపు అలా చూస్తున్నావ్. కోరిక కలిగిందా?" వేళాకోళంగా అడిగింది మయూష.         "నాతో అనవసరంగా గొడవపడి నా చేతిలో ఇరుక్కుపోయావ్. లేకపోతే భర్త పేరుతో వచ్చే కోరికలతో కాగిపోయే ఏ కుర్రాడికో నీ అందాన్ని విచ్చలవిడిగా సమర్పించుకునే దానివి కదూ?" అంటూ జ్వాలాముఖిరావు పక్కకు తిరిగాడు.         "అవును నీలాంటివాడు ఊహలతోనే కదా బతికేది ఊహల్లోనే జారిపోయే మగతనం....." అసహ్యంగా అంది ఆ మాటల్ని కావాలనే.             ఆ రూమ్ లోంచి బయటకు వెళ్ళబోతున్న వాడల్లా ఆ మాటకు తల తిప్పి ఆమె ముఖంలోకి సూటిగా చూసి దగ్గరగా వెళ్ళి ఆమె చుబుకాన్ని పట్టుకుని "నువ్వు చాలా అందంగా ఉంటావ్. అయ్ నో దట్. నీ జుత్తు దగ్గర్నుంచి నీ కాలి గోరు వరకూ కసికసిగా యవ్వనంతో కాలిపోతున్న దశలో ప్రస్తుతమున్నావని నాకు తెలుసు, ఊహల్లోనే జారిపోయే మగతనమని, నన్ను ఈసడించడం కాదు. ఎలాగోలా నన్ను రెట్టించి నాతో సంసారం చేయాలనుకుంటున్నావ్. తెలివైన దానివే."            "నీతో సంసారం చేసి నేనేం సుఖపడతాను" అలా తనని గడ్డిపోచలా తీసేస్తుందని జ్వాలాముఖిరావు ఊహించలేదు.         అంతెత్తున సర్రుమని లేచిన కోపాన్ని అరనిమిషంలోనే అణచేసుకుని చూపుడు వేలితో ఆమె పెదిమల మీద రాసి.....         పక్క రూమ్ లోకెళ్ళి కార్డ్ లెస్ టెలిఫోన్ తీసుకొచ్చి ఒక బటన్ ని ప్రెస్ చేసాడు.         "మిస్టర్ గిరీ, ఇవాళా రేపు ఎంగేజ్ మెంట్స్ ఏవైనా ఉన్నాయా" అని అడిగాడు.         "ఎస్ సర్. సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ ని రేపుదయం మీరు ఢిల్లీలో కలుస్తున్నారు సార్" పి.ఎ చెప్పాడు వినయంగా.         "ఓ.కే. ఆ విషయం మరిచే పోయాను తర్వాత......"         "నొయడాలో జరిగే బిజినెస్ గేదరింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు."         "నేను పార్టిసిపేట్ చెయ్యకపోయినా పెద్ద నష్టమేం లేదుగా."         ఆ మాటకు పి.ఎ ఏం జవాబివ్వలేదు.         "కేన్సిల్ ద నొయిడా మీటింగ్. రేపు సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ ని కలుసుకున్న సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చే ఫ్లయిట్ కి టిక్కెట్ తీసుకో."         "ఓ కే సార్."
24,959
    జయమ్మ కళ్ళల్లో ఆనందాశృవులు గిర్రున తిరిగాయి. కొద్దిసేపు నోట మాటరాలేదు.     తన గతం....ఇందర్ లాంటి వాడితో చెపితే తన నష్టాలు గట్టెక్కిస్తాడేమో! అనుకుంది జయమ్మ.     జయమ్మ అలా అనుకోవటమే ఇందర్ కి కావాల్సింది.     జయమ్మ నుంచి ఒక పెద్ద రహస్యం బైటికి లాగాలంతే ఇలా కాకాకీయం చేయక తప్పదు. దానిలో భాగమే ఇందర్ గుడికి వెళ్ళి రావటం జరిగింది. అయితే గుడిలో జయమ్మ బిడ్డకోసం నిజంగానే పూజ చేయించాడు.     "నీకు భగవంతుడు ఎంతో శక్తి సామర్ధ్యాలు ఆయురోగ్యాలు యివ్వాలని మనసావాచా కోరుతున్నా బాబూ!" జయమ్మ అంది.     "ఆంటీ! అవన్నీ నాకెప్పుడో ఆ పైవాడు యిచ్చాడు. నా శక్తి యుక్తులతో చాలా సాధించాను. ఇంకా ఎన్నో సాధించాలనుకుంటున్నాను. సాధిస్తాను. ధైర్యాన్ని పట్టుదలని నమ్ముకుంటే  ఏ కార్యమైనా సాధించవచ్చు" ఇందర్ అన్నాడు చాలా తేలికగా.     "బాబూ....!"     "చెప్పండి ఆంటీ! నా శక్తి ఏమిటో చూపిస్తాను."     "నేను....నేను....నీతో రహస్యంగా ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను"     "చెప్పండి ఆంటీ! చేయగలిగితే చేస్తాను లేకపోతే లేదు. మీరు ఏమి చెప్పినా అది ఎంత భయంకరమైనా ఈ గోడలు దాటి ఒక్కమాట కూడా బైటికిపోదు. ప్రామిస్, ఇంత తొందరగా రహస్యం బైటికి లాగ గలుగుతున్నానని ఇందర్ అనుకోలేదు. ఆమె చెప్పబోతున్నది అందుకే అతనికి చాలా సంతోషంగా వుంది.     ఇందర్ మాటల మధ్యలో భయంకరమైన అన్నాడు. ఆ పదం ఉపయోగించటం వల్ల మొదటికే మోసం అయింది. జయమ్మ ఆ భయంకర రహస్యం చెప్పినట్లయితే బహుశా ఇందర్ షాక్ తిని పడిపోయేవాడేమో! తను అనుభవించిన ఆ కొద్దిరోజులు జయమ్మకి చెప్పితే ఆమె సంతోషం పట్టపగ్గాలు వుండేవా! ఆమెకి ఎంత దగ్గర అయేవాడు. ఏదీ తెలుసుకోవాలో అది ఆ నిమిషాన తెలుసుకోలేక పోవటం నిజంగా దురదృష్టం.     "ఏంటి ఆంటీ! అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు."     నీవు చెప్పటమే ఆలస్యం అని నేను అనుకుంటుంటే! ఇందర్ అన్నాడు.     "ఈ రోజు సంతోషంగా వుండాలనుకుంటున్నాను. ఆ విషయం మరోసారి చెపుతాను. మాయింటి యిలవేల్పు గాయత్రీదేవి. నీవు ఆ అమ్మకే పూజ చేయించావు. నీలాంటి మంచి బిడ్డ నాకు దొరికినప్పుడు. ఈ రోజు కాకపోతే మరోరోజు నా కష్టాలు యీడేరవా!" జయమ్మ ఆనందంగా అంది.     "నీ యిష్టం ఆంటీ! నీవు ఎలా అంటే అలా ఇందర్ తేలిగా నవ్వుతూ అన్నాడు. లోలోపల మాత్రం అయ్యో అనుకున్నాడు.     ఇదేమి తెలియని జయమ్మ తృప్తిగా నిట్టూర్పు విడిచింది.                            *    *    *     సాయంత్రం అయిదు పది నిమిషాలు.     కాళీచరణ్ బైట షికారుకి తిరగటానికి వెళ్ళాడు.     కాళీచరణ్ కి బాగానే కాలక్షేపం అవుతున్నది. ముఖ్యంగా అతను బైట షికారు తిరిగిరావటానికి ఆస్కార ముండటంతో ఇంట్లో బయలుదేరి అలా వూళ్ళోం చి  రోజురోజుకో వీధి చూస్తూ ఊరిచివర కొండలు పొలాలు విసుగు పుట్టిందాకా తిరిగి వస్తాడు.     కాళీచరణ్ డొంకమార్గాన నడిచి అలా పొలాలవేపు వెళ్ళేటప్పుడు ఆ దారి ఎటు వెళుతుందో తెలియక అక్కడవున్న అతన్ని దారి వివరం అడిగాడు. అదీ వాళ్ళ మొదటి పరిచయం. వాడికి పట్నం వాళ్ళంటే చాలా యిష్టం. వాళ్ళతో మాట్లాడటం గొప్పగా భావించుకుంటాడు. వాడి పేరు రవ్వల మాణిక్యం. వాడికి అన్నీ తెలుసు. కాకపోతే ఏది మాట్లాడవచ్చో ఏది కూడదో తప్ప.     అటుదారిన వెళుతూ, వస్తూ రవ్వల మాణిక్యంతో తెలివిగా మాటలు కలిపేవాడు కాళీచరణ్. పట్నంబాబు తనతో మాట్లాడుతున్నాడు కదా అని సంతోషం పట్టలేక తెలిసీ తెలియనివన్నీ బాగా తెలిసినట్లు చెప్పేవాడు. వాళ్ళ మాటలు పెరిగాయి. అటు తిప్పి ఇటు తిప్పి రవ్వల మాణిక్యం నుంచి చాలా విషయ సేకరణ చేశాడు. దాంతో చాలా విషయాలు కాళీచరణ్ కి తెలిశాయి. ముఖ్యంగ యస్వంతరావు ఇంటి విషయాలు ఆ తర్వాత ఊరివారి పద్ధతులు. తను తెలుసుకున్నవి ఏవి రూపమతికి చెప్పలేదు కాళీచరణ్. పల్లెటూరి వాతావరణం ఆహ్లాదకరంగా వుంటుంది. ఊరికి ఓ పక్కన బుల్లిబుల్లి కొండలు వున్నాయి. పెద్ద చెరువు వుంది లాంటి మామూలు కబుర్లు చెప్పేవాడు.     కాళీచరణ్ ఆరోజు షికారుకి వెళ్ళిం తరువాత రూపమతికి ఏమీ తోచక మంచానికి అడ్డంగా పడుకుంది. తను దేనికి ఈ వూరు వచ్చింది. ఏం సాధించగలిగింది! అనుకుంది. లేదు యింకా టైము వుంది. పద్మవ్యూహంలో తేలికగానే ప్రవేశించగలిగింది కదా! నెమ్మదిగా తెలివిగా సమయంచూసి రంగంలో దిగాలి అనుకుంది.     కాళీచరణ్ విషయం తెలియని రూపమతి అతను చాలా మంచివాడు. అవసరానికి తనకో హాండ్ కావాలి. దొరికాడు అనుకుంది. నిజంగానే అతను సమయానుకూలంగా ప్రవర్తిస్తూ తనవంతు పాత్రని చక్కగా నిర్వహిస్తున్నాడు. రాత్రి పగలు ఉండటానికి ఇద్దరికీ ఒకే గది యిచ్చారు. ఒంటరిగా వున్నా అతనేమి పిచ్చివేషాలు వేయటం లేదు. అతి చనువుతో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించటంలేదు. ముక్తసరిగ గంభీరంగా వుండి మాట బైట పడకుండ మెలుగుతున్నాడు. తను చెప్పింది తు.చ. తప్పకుండ వినడం తప్ప అదికాదు ఇది అనటంలేదు. నిజంగా అతను మంచి భర్త. అతన్ని భర్తగా పొందేది చాలా అదృష్టవంతురాలు. ఆ యువతి ఎక్కడ పుట్టి వుందోగాని....   
24,960
    "అక్కా! నీవు నాతో బైలుదేరు. ఈ నరకంలో వుండవద్దు. జీవితాంతం నా దగ్గర హాయిగా వుందువుగాని" ఆవేశంగ అంది సీత.     "అది అయే పనికాదు, నీవు బయలుదేరు." అంది సావిత్రి.     కధల్లో కధానాయికల్లాగా, సినిమాల్లో హీరోయిన్లులాగా సీత ఆవేశంగ ఏదేదో మాట్లాడింది. మనిద్దరం కలిస్తే పుల్లారావు ఏం చేయలేడు. ముఖాన ముక్క చివాట్లు పెట్టి వెళదాం. అసలు యీ బాధలన్నీ ఎవరు పడమన్నారు? నేనైతేనా అందుబాటులో వున్న రోకలి బండగాని కత్తిపీటగాని తీసుకుని ముఖం బద్దలు చేసేదాన్ని. అసలు ఈ బాధలన్నీ ఎలా భరిస్తున్నావ్? ఎందుకు భరించాలి? చెప్పు అక్కా!     అమాయకురాలా అన్నట్లు చూసి పేలవంగ నవ్వింది.     "నీకు తెలియదు సీతా! అనుభవం నాది అమాయకత నీది. ఎంతో చెపితేగాని నీకర్ధం కాదు సీతా! అంతా చెప్పేటంత సమయము లేదు. వక చెడు చేయటానికి పదిమంది కలిసేలా వక మంచిపని చేయటానికి కలవరు. మీ బావ నిన్ను ఊరి పొలిమేరలు దాటనీయకుండా చేయదలుచుకుంటే మాత్రం నీకు న్యాయం జరగదు." అమాయకంగ మాట్లాడే సావిత్రి నిదానంగ మాట్లాడే సావిత్రి గంభీరంగ జీవితానుభవమంతా రంగరించి కాచి వడబోసి తాగి జీర్ణించుకున్న దానిలా అంది.     సీత క్షణం ఆలోచించింది అంతే.     "వెళ్ళొస్తాను అక్కా!"     "వెళ్ళొస్తాను కాదు వెళుతున్నాను అని చెప్పు. రాక రాక చాలా కాలానికి నా యింటికి వచ్చిన చెల్లెలికి నేనేమీ ఇవ్వలేక ఉత్తిచేతులతో పంపిస్తున్నాను." డగ్గుత్తికతో అని "నేను స్వతంత్రంగ చేయగలిగింది. ఇవ్వగలిగింది వకటుంది. అది యిచ్చి పంపుతాను. ఉండు సీతా!" అని సావిత్రి పక్క గదిలోకి వెళ్ళింది.     అక్క ఏం తెచ్చి యిస్తుంది? సీత ఆలోచిస్తూ నుంచుంది.     సావిత్రి కుంకుం బరిణ తీసుకుని వచ్చింది. సీత నుదుట బొట్టు పెడుతూ "నేను నీకు యిచ్చే కానుక యిదే సీతా! చిటికెడు కుంకుమ." అంది.     క్షమించమని అడగటాలు, పాద నమస్కారాలు శరత్ శ్రీకాంత్ లాంటి నవలల్లోను అసలు సిసలైన తెలుగు సినిమాలలోను చూసి, చీ..... యిలా ఎవరైనా చేస్తారా? వెర్రి వేషాలు, చాదస్తాలు, అనుకునేది.     అలాంటి సీత.     ఆ క్షణాన.     సావిత్రి కాళ్ళదగ్గర గబుక్కున చేతులు ఆన్చి ఆ చేతులనలాగే పైకి తీసుకుని కళ్ళకద్దుకుంది సీత.     "సీతా!" అంది సావిత్రి.     "నన్నేమీ ప్రశ్నించవద్దు అక్కా!" అంది సీత.     ఆ తర్వాత కొద్ది నిమిషాలకే.     సీతామనోహరి ఆ ఇంట్లోంచి బయటపడి వేగంగ ముందుకు సాగింది.     అప్పుడు సమయం పది నిమిషాలు తక్కువ పది.                                          32     అతడి పేరు జోగారావు.     ఆమె పేరు చిత్రాదేవి.     వాళ్లిద్దరూ భార్యాభర్తలు. సీతామనోహరి వాళ్ళింటికి వచ్చి రెండురోజులు అయింది. ఈ రెండు రోజులూ ప్రాణం ఎంత హాయిగా వుందో మాటలతో చెప్పలేదు.     ఆ రోజు సీతకి వెంటనే బస్సు అందింది. గోడకి కొడితే వెనక్కి తన్నిన బంతిలా తిరిగి పుట్టింటికి బయలుదేరింది. కాని ఆ బస్సునుంచి మరో బస్సు మారేటప్పుడు గుర్తుకొచ్చి పక్కఉళ్ళోనే చిత్రాదేవి వుండేదని.     సీత స్నేహితురాలు చిత్ర. ఎన్నోసార్లు సీతని తన యింటికి రమ్మని ఆహ్వానించింది. సీతకి వెళ్ళటానికి కుదరలేదు. పని గట్టుకుని వెళ్ళాలంటే బద్ధకం వేసింది. ప్రయాణం మధ్యలో చిత్ర గుర్తుకు వచ్చేసరికి స్నేహితురాలితో సరదాగ గడపోచ్చని ఇటువేపు వస్తున్న బస్సు ఎక్కి చిత్రా వాళ్ళింటికి వచ్చేసింది.
24,961
    ఆ తర్వాత సుధీర్ వేగంగా పనిచేశాడు రొప్పుతూనే.     పావుగంట తర్వాత__     అడుగులోతు తవ్వాడు సుధీర్.     ఇంకా అడుగున్నర లోతు తవ్వితేగాని పెట్టెని పెట్టటానికి లేదు.     టెన్ షన్ తో సుబ్బారావుకి, పనిచేస్తున్న సుధీర్ కి ముచ్చెమటలు దిగజారుతున్నాయి.     శంకర్రావు యింటి ముందు సరీగా అప్పుడే ఆటో ఆగింది.     ఆటోలోంచి శంకర్రావు భార్యా బిడ్డలు దిగారు.     ముందుగా యిది చూసింది సుందరి.     సుందరి పై ప్రాణాలు పైనే పోయాయి.     అయినా వెర్రిముఖం వేసుకుని అక్కడే నుంచోక రయ్యిన పరుగెత్తుకు వచ్చి గోడమీద నుంచి తొంగి చూస్తూ భర్తని కేక పెట్టింది. "ఏమండోయ్ యిటు రండి" అంటూ.     సుబ్బారావు వస్తూనే అడిగాడు. "ఒంటరిగా వుండటానికి భయంగా వుందా?"     "వాళ్ళు వచ్చేశారండీ?" సుందరి గాభరాగా చెప్పింది.     "వాళ్ళా, వాళ్ళంటే....?"     "శంకర్రావు పెళ్ళాంతో దిగాడు..." సుందరి మాట పూర్తిచేయకముందే సుబ్బారావు రయ్యిన వెనక్కి పరుగుతీశాడు.     విసిరేస్తే గోడకి తగిలిన బంతి ఎంత వేగంగా ఎదురు వస్తుందో అంత వేగంగా సుధీర్ పలుగు, పార పుచ్చుకుని, సుబ్బారావు టార్చిలైటు పుచ్చుకుని పెట్టెని అక్కడే వదిలేసి పూడ్చకుండా పరుగున వచ్చారు.     శంకర్రావు ఇంట్లోంచి సుధీర్ సుబ్బారావు గోడదూకి తమ యింట్లోకి వచ్చి పడ్డారు.     ముగ్గురూ వేగంగా ఇంట్లోకి వచ్చి తలుపులు వేసుకున్నారు.     శంకర్రావు తలుపు తాళం తీసి యింట్లోకి వచ్చినట్లున్నాడు యింట్లో లైట్లు వేశాడు.     ఇప్పుడు ఏమవుతుంది?     ఏమో!     ఏమైనా కావచ్చు.     ప్రస్తుతానికి మటుకు_     సుందరి, సుబ్బారావు, సుధీర్ ళ చాప్టర్ క్లోజ్.                                           23     రాత్రి- రెండుంబావు     యు. శంకర్రావు, అతని భార్య శకుంతల, ఇద్దరు పిల్లలు ఊరు ప్రయాణంచేసి అలసిపోయి వుండటంవల్ల యింట్లోకి రాంగానే బాత్ రూమ్ లోకి వెళ్ళి కాళ్ళూ, చేతులు కడుక్కునివచ్చి తలోగ్లాసుడు మంచినీళ్ళు  తాగి పడుకుని నిద్రపోయారు.     వాళ్ళ పెరట్లో ఓ మూలగా మూరెడు లోతుగోయ్యి తవ్వి వుందనిగాని, ఆ గోతి పక్కనే శవం వున్న చెక్కపెట్టె వుందని గాని ఊహామాత్రం కూడా తెలియని శంకర్రావు-కలలోకూడా ఈ విషయం కంచని శంకర్రావు హాయిగా ఆదమరచి నిద్రపోయాడు.     తెల్లారింది.     శంకర్రావుగాని, శకుంతలగాని, పిల్లలుగాని పెరట్లో ఆ మూలకి ఎవరూ వెళ్ళలేదు.     ఉదయం పది.     శంకర్రావు పిల్లలు బంతిఆట ఆడుకుంటూ బంతి విసిరేయటంతో మూలకెళ్ళి పడింది.     బంతి తెచ్చుకోటానికి పిల్లలు అటువెళ్ళి పెట్టెని చూశారు.     ఆ పెట్టె ఏమిటి అన్న ఆలోచన వాళ్ళకి రాలేదు.     ఇద్దరూ కలసి పెట్టెని మధ్యకి యీడ్చుకొచ్చి దానిమీద కూర్చుని ఆట మొదలు పెట్టారు.     అరగంట తర్వాత__     శకుంతల పెట్టెని చూసింది.     పెట్టె పకడ్ బందీగా మేకులు దిగకొట్టి వుంది. పిల్లలు కూర్చోటానికి తీశామని చెప్పారుగాని ఎక్కడ మంచి తీసింది. వాళ్ళు చెప్పలేదు. వాళ్ళకి ఆటలో ఆ సమయంలో పోట్లాట వచ్చింది. దాంతో అరుచుకుంటున్నారు.  
24,962
         ఓ మూల మోకాళ్ళపైన తలానించుకుని నేలచూపులు చూస్తూ కూర్చుని వుందామె.          "మీరలా మంచంపైన పడుకోండి" చెప్పాడు మర్యాదపూర్వకంగా.          "మరి మీరో?"          "నేను ఈ మూల..." గొణుగుతున్నట్టుగా అన్నాడు.          ఇద్దరూ ఒకే గదిలో పడుకోవాలీ అన్న ఆలోచన అతన్ని ఆ క్షణంలో మూగవాడిని చేసింది.          "ఫర్వాలేదు! ఈ రాత్రికి జాగరణ చేద్దామనుకుంటున్నాను."          "అదేం?"          "అలవాటు చేసుకోవాలని."          "అంత అవసరమేమిటి?"          "ఆదిత్యా!" ఆమె గొంతు చిత్రంగా ధ్వనించింది. "చాలా చాలా నిర్ణయించుకుని మీ దగ్గరకు వచ్చినదాన్ని ఆ నిర్ణయాలు నా వాళ్ళకు రుచించేవి కాకపోవచ్చు. అప్పుడు కొన్ని రోజులపాటు నేను నిద్రలేకుండా గడపాల్సి రావచ్చు. ప్రాక్టీసు కానివ్వండి."          విస్మయంగా చూస్తూ వుండిపోయాడు.          "ఇంతదాకా వచ్చేక మీకో విషయం నేను స్పష్టం చేయాలి...ఆదిత్యా! అసలు నేను వచ్చింది స్నేహపూర్వకంగా కాదు, మీతో శాశ్వతంగా వుండిపోవాలని."          "వ్వాట్?" పక్కలో పిడుగు పడ్డట్టు అదిరిపడ్డాడు.          "ఆశ్చర్యాలూ, అందోళనలూ, ఆరాటాలూ లాంటివి మరిచిపోయి నేను చెప్పేదేమిటో అర్ధం చేసుకోండి. ఐ లవ్యూ అండ్ ఐ వాంట్ బి విత్యూ" తిరుగులేని ఓ నిర్ణయం గురించి అనేసి ఆ తరువాత మంచం మీదికి వెళ్ళింది."          ఓ గొప్పింటి అమ్మాయి, అందులోనూ మెచ్యూరిటీ గల యువతి ఏకపక్షంగా ఇలాంటి విషయాన్ని తెగేసి చెప్పడంతో నిద్ర ఎగిరిపోయింది.          ఇదేమిటి? ఇంత ధైర్యాన్ని ప్రదర్శిస్తూందేం? ఇప్పుడేం చేయాలి?          పరిచయం, ప్రేమ అనే రెండు దశలూ పూర్తిగా రూపుదిద్దుకోక ముందే శాశ్వతంగా తనతోనే వుండిపోవడం గురించి మాట్లాడుతూందేం?          రేపు తెల్లవారాక ఏం జరగబోతూంది? అందరూ ఏమనుకుంటారు?          ఆదిత్య ఇలా ఆలోచిస్తుండగానే బయట జీపు ఆగిన చప్పుడయింది. అరనిముషం వ్యవధిలో పోలీసులు వచ్చారక్కడికి.          అవాక్కయిపోయాడు.          వచ్చింది ప్రబంధ కోసమే అనుకున్నాడు కాని, ఎస్సై సరాసరి ఆదిత్యని సమీపించి- "మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాం" అన్నాడు.          "దేనికి?" ద్వారం దగ్గర నిలబడిన ప్రబంధ అడిగింది.          "ఆదిత్యకి తీవ్రవాదులతో సంబంధం వుంది కాబట్టి."          "బుల్ షిట్!" అడ్డంగా నిలబడింది ప్రబంధ. "మిస్టర్! ఓ వ్యక్తిని బలవంతంగా మూసేయాలీ అంటే మీరు మీ మార్గంలో వస్తారని నే నూహించగలను."          "దయుంచి పక్కకు తప్పుకోండి."          "నే నెవరో మీకు తెలిసే వుండాలి" హెచ్చరించింది.          "తెలుసు ప్రబంధగారూ! తెలిశాకనే ఇలా రావడం జరిగింది."          కొద్దిగా అనుమానించింది- "ఆదిత్యని నిర్బంధిస్తే మా నాన్నతో మాట్లాడాల్సి ఉంటుంది."          "మాట్లాడకనే అతడిని అరెస్ట్ చేస్తున్నాం."          తన అనుమానం నిజమైపోయింది. ఆమె ఏం చేయాలో తెలీనిస్థితిలో నిలబడి వుండగానే ఆదిత్యని తీసుకుపోయారు.          అర్దరాత్రి, ఒంటరితనం, తనమూలంగానే ఇదంతా జరిగిందన్న బాధ ప్రబంధనెంత కదిలించాయీ అంటే, ఆమె కళ్ళల్లో నీళ్ళు నిలిచాయి.          అసలు దేనికీ జంకే అలవాటులేని తత్వం గల అమ్మాయి ప్రబంధ. ఇక్కడ ఆమె బాధపడుతున్నది తన ఉనికి అంగీకరించి క్రమంగా తనకు దగ్గరవుతున్న ఆదిత్య మనసుపైన ఈ సంఘటన ఎలాంటి ప్రభావాన్ని చూపించేదీ అర్ధంకాక.          "బాస్టర్డ్స్!" అలా తిట్టుకున్నదెవర్నో ఆమెకీ తెలీదు. ఉక్రోషంగా మంచంమీద చతికిలబడింది.          సమస్యని పరిష్కరించాలీ అంటే ఎక్కడినుంచి ప్రారంభించాలీ అని ఆమె ఆలోచిస్తున్న సమయంలో సౌదామిని వచ్చింది గదిలోకి.          అంతే! ప్రబంధ నిగ్రహించుకోలేకపోయింది. అది ఉద్విగ్నతో, లేక వెంటనే ఏమీ చేయలేకపోయినందుకు ఉడుకుమోత్తనమో అశ్రుసిక్త నయనాలతో చెప్పేసింది జరిగిందంతా.          "తెలుసు ప్రబంధా! ఇలా జరుగుతుందని ముందు తెలియబట్టే మీ అన్నయ్యని వెంటాడుతూ ఇలా వచ్చాను."          "అంటే ఇదంతా చేయించింది అన్నయ్యా?" విభ్రమంగా అడిగింది.          "కాదు.... మీ నాన్న!" నిశ్చలంగా అంది సౌదామిని. "నీకు తెలియకుండా నీ పెళ్ళి నిశ్చయించిన మీ నాన్న మార్గంలో ముళ్ళని ఇలా ఏరిపారేయమని మీ అన్నయ్యని నియమించాడు."          ప్రత్యర్ధి స్థానంలో తండ్రి నిలబడ్డాడని తెలిసి కొద్దిగా జంకింది ప్రబంధ. ఎప్పుడో ఆ స్థితినీ ఎదుర్కోవాల్సి వస్తుందనుకుంటే అప్పుడే తనూ రంగంలోకి దిగిపోయాడు.          "ఇప్పుడు ఆదిత్యనేం చేస్తారు?"          ప్రబంధలో ఈ మాత్రం వెసులుబాటు" చాలు దూసుకుపోవటానికి. సౌదామిని కోరిందీ అదే- "నిజమైన తీవ్రవాది కాని ఆదిత్యని కస్టడీలోకి తీసుకున్నది అడ్డం తొలగించుకోవాలనే ప్రబంధా!"          "అంటే."          "బహుశా చంపేసి ఎన్ కౌంటర్ లో చనిపోయాడంటారు."          "ఆంటీ!" కంపించిపోతూంది ప్రబంధ.          "ఇది జరుగుతున్న చరిత్రేగా ప్రబంధా! పైగా ఓ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ఇలాంటివి నిర్వహించడం సమస్యకాదు."          "నో... అలా జరగటానికి వీల్లేదు!" రొప్పుతూ కాదు, జలజలా రాలుతున్న కన్నీళ్ళను తుడుచుకుంటూ అంది. "జరగనివ్వను!"   
24,963
    "చెప్పటమేమిటి....?" ఆమె కౌగిలించుకోమంటేనే కౌగిలించుకున్నాను...." తన మీద తనకే కోపం వస్తుండగా అన్నాడు మనోహర్.         "మరందుకే నాకు చెడ్డ చిరాకు వచ్చేది ఆమె కౌగిలించుకోమంటేనే కౌగిలించుకున్నాను...." తన మీద తనకే కోపం వస్తుండగా అన్నాడు మనోహర్.         "మరందుకే నాకు చెడ్డ చిరాకు వచ్చేది. ఆమె కౌగిలించుకోమని అడిగితే, అందమయిన ఆడపిల్లను ఎవరయినా ఎంత మృదువుగా కౌగిలించుకుంటారో నాకు తెలియదనుకోకు....నువ్వు పుట్టి బుద్దెరిగాక ఆడపిల్లనే చూడనట్లు పచ్చడి అయ్యేలా, పనికిరాకుండాపోయేలా, భీమున్ని ధృత రాష్ట్రుడు కౌగిలించుకున్నట్లుగా చేస్తావా?"         దుర్గాప్రసాద్ ప్రశ్నలకి ఏమని సమాధానం చెప్పాలో అర్ధం కాలేదు మనోహర్ కి. బిక్క మొహం వేసి బేలగా చూశాడు అతని వేపు.         "చెప్పు...సమాధానం చెప్పు" మనోహర్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు దుర్గాప్రసాద్.         "ఆకాశంలో సగభాగానికి జేజేలు ఎందుకు పలకాలో తెలియాలంటే నన్ను కౌగిలించుకో, అని ఆమె నన్ను అడిగింది అందుకే కౌగిలించుకున్నాను" ఎంతో నిజాయితీగా చెప్పాడు మనోహర్. అప్పటికే అతడ్ని అతనే చెడామడా తిట్టేసుకుంటున్నాడు లోలోపల.         "ఏంటి బాబూ....ఆకాశంలో సగభాగం-దానికి జేజేలు పలకటం....ఆ జేజేలు ఎందుకు పలకాలో తెలుసుకోవాలంటే ఆడపిల్లలను కౌగిలించుకోవాలి. అంతేనా? అసలాకాశంలో ఆ సగభాగంలో ఏముంది? తెలుసుకోవలసిన అవసరం నీకేముంది? మార్కెటింగ్ వింగ్ లో ఉద్యోగం చేసే నీకు ఆకాశంలో సగభాగం గురించి ఎందుకు తెలుసుకోవాల్సి వచ్చింది. దానికి, నీ ఉద్యోగానికీ సంబంధం ఏమిటీ?" తిరిగి నిలదీశాడు దుర్గాప్రసాద్.         తనను తాను చెడామడా తిట్టుకునే కార్యక్రమంలో పడిపోయాడు మనోహర్. ఆ గొడవలో పడిపోయి కోర్టు కెళ్ళాల్సిన విషయాన్నే మరిచిపోయాడు.         అలా మనోహర్ మరిచిపోయేలా చేయటమే అతని పని__ఆ పని అతనికి కేటాయించింది మిస్ మాయాదేవి.         విషయం ఒక్క దుర్గాప్రసాద్ కే తెలుసు.         "నా ఖర్మ....ఇలాచేస్తే అలా ఏదో తెలుస్తుందని ఆ రాక్షసి చెప్పటమేమిటీ.....నేను వెనుకా ముందూ చూసుకోకుండా ఆమెని కౌగిలించుకోవడం ఏంటీ? ఏంటో నాకేం అర్ధమయిచావటంలేదు" జుట్టంతా పిచ్చి పిచ్చిగా చెరిపేసుకుంటూ ఏడుపు ముఖంతో అన్నాడు మనోహర్.         వస్తున్న నవ్వును బలవంతంగా ఆపుకున్నాడు దుర్గాప్రసాద్!                                               *    *    *    *         ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఆ కోర్టులో కోర్టు సిబ్బంది ఉత్కంఠ భరితంగా లాయర్ల వేపు, జడ్జివేపు చూస్తున్నారు.         యధావిధిగానే విలేఖరులకు ప్రవేశంలేదు. ఆయా టి.వీ. ఛానల్స్ కు చెందిన వ్యక్తులందరూ వరండామీద, మెట్లమీద నిలబడి ఒకరితో ఒకరు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.         మల్టీకోర్ బిజినెస్ తో, దేశంలోనే పేరెన్నికగన్న ఒక పేరు మోసిన కంపెనీ ఎం.డి.మీద, అందులో పనిచేసే ఒక ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగి కేసు వెయ్యడం!         కొంతమంది కోర్టులోని వ్యక్తుల ద్వారా ఆ కేసు స్త్రీ పురుషుల మధ్య సంబంధానికి' చెందినదని బైటకు పుకార్లు వచ్చాయి.         స్త్రీ పురుషులమధ్య సంబంధం...అంటే...లీగల్ కనెక్షనా.....?ఇల్లీ గల్ కనెక్షనా.....? లీగల్ కనెక్షన్ అయితే ఆ కేసు ఎందుకు వస్తుంది?         ఇల్లీగల్ కనెక్షన్ కావచ్చు.         ఒక లేడీ ఎం.డి.కి, ఒక ఉద్యోగికి మధ్య కేసంటే...ఏమయి వుంటుంది? ఇలా రకరకాలుగా కోర్టు కారిడార్ లో ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఆ ఊహాగానాలను రకరకాల వార్తలుగా మలచడానికి విలేఖరులు నానాపాట్లూ పడుతున్నారు.         "ప్రొసీడ్..." జడ్జి మెహతా అనుమతితో లాయర్ మాలవ్య లేచి నిలబడి, మాయాదేవివేపు చూసింది.         లాయర్ ఆదిత్య మనోహర్ వేపు చూశాడు.         "మిస్ మాయాదేవీ.....కోర్టులో ప్రొసీడింగ్స్ పాయింట్ టు పాయింట్ గానే వుండాలి....అండర్ స్టాండ్...." మాయాదేవి ఆమెవేపు కోపంగా చూసింది.         "చూడండి మిస్ మాయాదేవీ! మా క్లయింట్ మిస్టర్ మనోహర్ ను మీరు సెడ్యూస్ చేసే పథకంలో భాగంగా మీరు మొదట ఆయన్ని కిస్ చేశారా?"         "నేను దానిని కిస్ అనను....ఇట్స్ ఏన్ ఎక్స్ ప్రెషన్ ఆఫ్ లవ్! కిస్ ఈజ్ నాటెటాల్ ఎ క్రైమ్....యూనో?" గంభీరంగా ప్రశ్నించింది మాయాదేవి.         "ఎస్....క్రైమ్ కాదు. కానీ ఈ కేసులో మీరు, నా క్లయింట్ ను బలవంతంగా కిస్ చేశారు. అవునా....కాదా?"         "ఎస్!"         "నోట్ దిస్ పాయింట్ యువరానర్" జడ్జీవేపు చూస్తూ అంది లాయర్ మాలవ్య.         "ఎక్కడ కిస్ చేశారు?"         ఆ ప్రశ్నకు బదులు చెప్పలేదు మాయాదేవి.         "మిస్ మాయా....మిమ్మల్నే."         "జ్ఞాపకం లేదు."         "అంటే.....దానర్ధం....చూడండి మిస్ మాయా! ఒక ఏకాంతమయిన ఆఫీసు రూమ్ లోకి, ఒక ఎంప్లాయిని పిలిచి ముద్దు పెట్టుకోవడం తప్పా కాదా?" అడిగింది మాలవ్య.         "మన ఇండియన్స్ ఏకాంతమయిన రూమ్ లోనే ముద్దు పెట్టుకుంటారు. బహిరంగంగా ముద్దు పెట్టుకోవడం మన సమాజంలో భాగం కాదు" అంది మాయాదేవి.         "ముద్దు పెట్టుకోవడం నేరం కాదా?"         "ఒక లవర్ ఇంకో లవర్ ని ముద్దు పెట్టుకోవడం నేరంకాదు" అంది మాయ.         "ఐ ఆబ్జక్ట్ యువర్ ఆనర్....మా క్లయింట్ మిస్టర్ మనోహర్, మిస్ మాయకు లవర్ కాదని గమనించాలి" లాయర్ ఆదిత్య అన్నాడు.         "ఓకె! ఎలా ముద్దు పెట్టుకున్నారో చెప్పండి. లిప్ టు లిప్....టంగ్ టు టంగ్."
24,964
     "అమ్మో! అవి తేళ్ళు - మండ్రగబ్బాలునూ! విషప్పురుగులు! మనం వాటికీ దూరంగా ఉంచడమే మంచిది" అనుకుని ఉరుకుంటే అవి ఇవాళ కాకపోతే రేపు మన ఇంట్లోకి వచ్చి మనల్ని కాటేయ్యవచ్చు -     సొసైటీలో ఎక్కడయినా సరే మాములుగా జరిగేది అదే! రౌడియిజమే ఉంది.     "మనం రౌడిలకు దూరంగా వుంటే ఈ రౌడియిజం మనల్నేం చేస్తుంది! అనుకుంది పాతతరం.     కానీ ఇవాళ ఆ రౌడియిజం మంచివాళ్ళని, చెడ్డవాళ్ళని విచక్షణ లేకుండా అందరిని తన గుప్పెట్లో ఇరికించుకుంటోంది. చివరికి రాజకీయాలు కూడా రౌడీల చేతుల్లోకి పోయాయి.     సరే! మళ్ళీ ఉదాహరణకి వస్తే మనం ఏం చెయ్యాలి?     బండని పక్కకి తొయ్యాలి. అక్కడ ఉన్నదేదో మనకి సరిగ్గా కనబడకపోతే టార్చ్ లైట్ వేసి మరి చూడాలి. తేళ్ళు వుంటే చెప్పుతోనే కొట్టాలి. చంపాలి!     అంతేగాని!     అమ్మో అక్కడున్నది తేలు! నేనేమో మంచిదాన్ని! నేను దాని జోలికిపోకపోతే అది నాజోలికి ఎందుకు వస్తుంది? అంచేత దాని ఉసే నాకు అనవసరం! అనుకుంటే ఇవాళ - కాకపోతే రేపు -రేపు కాకపొతే ఎల్లుండి తేలు నిన్ను కుట్టడం ఖాయం!     సరిగ్గా అందుకే - తను ఆ ఫ్లెష్ ట్రేడ్ గురించి అంతు తెలుసుకోవాలి.     అంతా తెలుసుకున్నాక .........     అప్పుడింక తిరగాబడాలి!     ఎవరూ తనవెంట రాకపోయినా సరే - ఒంటరిగా తనొక్కతే తిరగబడుతుంది.     ష్యూర్!     అలా ఒక నిశ్చయానికి వచ్చాక, "సెక్స్ ఇండస్ట్రి గురించి మల్ హోత్రా ఇచ్చిన మిగతా నోట్సు , మేటరూ మళ్ళీ చదవడం మొదలెట్టింది మీనాక్షి.     కొంత చదివి తర్వాత అసహ్యంగా మొహం చిట్లించి , అప్రయత్నంగానే , ఇంకొన్ని పేజీలు  తిప్పేసింది.     తర్వాత ఒక పెజీలో రాసి వుంది.     "అమ్ స్టర్ డామ్ నగరంలో ఒక ఎరోటికల్ మ్యూజియం, ఒక సెక్సు మ్యూజియం ఉన్నాయి - పురాతన కాలం నుంచి శృంగారంలో ఉపయోగపబడిన సాధనాలు ఇక్కడ ప్రదర్శిస్తారు. అలాంటి మ్యూజియం మన హోటల్లో సెల్లార్ లో పెట్టవచ్ఘు.     అసహనంగా ఇంకొన్ని పేజీలు  తిప్పింది మీనాక్షి.     "ఫాన్స్ లో లైన్ షోలు ఎక్కువ! పారిస్ లో యివి మరీ ప్రసిద్ది!"         "బార్ సెలోనాలో వేశ్యలు క్రెడిట్ కార్డ్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు."     "కోపెన్ హెగెన్ లోని క్లబ్ 20 కి వెళ్ళే జంటలు కంపల్సరీగా పార్టనర్స్ ని మార్చుకోవాలి.     గ్రూప్ సెక్స్ తప్పనిసరి."     అతి జుగుప్సాకరంగా వున్న వివరాలు వదిలేసి ముఖ్యమయిన సమాచారం మాత్రమే చదువుతూ వున్నా కూడా మీనాక్షి కి వికారం కలిగినట్లయింది.     ఆ వెగటు పోవాలంటే నోట్లో యాలక్కాయో, లవంగమో పెట్టుకోక తప్పదనిపించింది.     వీళ్ళు మనుషులా? జంతువులా?     అబ్బే! జంతువులు కూడా కాదు!     జంతువుల శృంగారానికి కూడా ఒక సీజన్ ఒక నియమము వుంటాయి -     ఈ ఇరవయ్యో శతాబ్దపు మనుషులు మాత్రం పశువులూ , పక్షుల కంటే దిగజారిపోయి.........     చీ చీ....         మీనాక్షి అలా అనుకుంటూ ఉండగానే.........     తలుపు దబదబా చప్పుడయింది.     ఉలిక్కిపడి లేచి కాయితాలు కనబడకుండా ఆదరాబాదరాగా పక్కన పెట్టేసి, పమిట సవరించుకుంటూ తలుపు తీసింది మీనాక్షి.     అక్కడ-     గుమ్మానికి అడ్డంగా నిలబడి వున్నాడు సర్కిల్ యిన్స్ పెక్టర్!     గుమ్మంలో హటాత్తుగా ఓ పొలిసు ఆఫీసర్ ని చూసేసరికి షాకయింది మీనాక్షి!     సర్కిల్ ఇన్ స్పెక్టర్ ఉపోద్ఘాతం ఏమి లేకుండానే అన్నాడు.     "మల్ హోత్రా ఇక్కడికి వచ్చాడా?"     మీనాక్షి మోహంలో కన్ ఫ్యుజన్, భయమూ రెండూ కనబడ్డాయి.     "ఏమిటి......?" అని అంతలోనే 'అవును' అంది.     "లోపల ఉన్నాడా?" అన్నాడు సర్కిల్ పౌరుషంగా.     తల కొట్టేసినట్లయింది మీనాక్షికి.     "ఎక్కడికెళ్ళాడు?"     "తెలిదు! ఒక అరగంట క్రితం వచ్చి వెళ్ళాడు. "మీనాక్షి గొంతు వణుకుతోంది. గొంతుతోబాటు ఒళ్ళు కూడా వొణకడం మొదలెట్టింది.     ఆమె పరిస్థితిని గమనించాడు సర్కిల్. కొంచెం మృదువుగా మారింది అతని గొంతు.     "భయపడకమ్మా! మల్ హోత్రాగాడు మహా కిలాడి! వాడిని అరెస్ట్ చేస్తున్నాం. నువ్వు పొలిసు స్టేషన్ కు వచ్చి హోటల్లో జరిగినదంతా రాసి సంతకం పెట్టాలి. అరగంటలో నిన్ను ఇక్కడ దింపేస్తాం" అన్నాడు.     ఒక్కక్షణం తటపటాయించి , ఆ తర్వాత ఒక్కసారి తన తల్లి వైపు చూసి, సర్కిల్ తో బాటు నడిచింది మీనాక్షి.     ఆమె ఎక్కి కూచోగానే , జీపు కదిలి, తక్షణం వేగం అందుకుంది.     పావుగంట ప్రయాణం చేశాక హటాత్తుగా ఒక పెద్ద బంగాళా తాలుకు గేట్లో ప్రవేశించింది పొలిసు జీపు.     "ఎక్కడికి!" అంది మీనాక్షి భయంగా.     నవ్వాడు సర్కిల్.     "దేశ్ పాండే దగ్గరికి" అన్నాడు.     "దేశ్ పాండే ఎవరూ?"     "వాడు మల్ హోత్రాకి రైవల్! గట్టి ప్రత్యర్ధి!" అన్నాడు ఇన్ స్పెక్టర్.     "అతని దగ్గరికి నేనెందుకు?"     "నిన్ను అతనికి హేండోవర్ చేసేస్తున్నాం"     "వాటీజ్ దిస్?" అంది మీనాక్షి కోపంగా......     మళ్ళీ నవ్వాడు ఇన్ స్పెక్టర్.     "సింపుల్! మల్ హోత్రా గాడు నాకు ఇవ్వాల్సిన మామూలు ఎగ్గోట్టాడు. వాడి విరోధి అయిన దేశ్ పాండే నాకు దండిగా డబ్బు ముట్టచెప్పాడు.     అందుకని నా సపోర్టు దేశ్ పాండేకే! వాడు చేసే దందానే వీడూ చేస్తాడు. నీకు మాత్రం ఎవరిదగ్గరున్నా ఒక్కటే!" అన్నాడు.     తక్షణం పెద్ద గా అరవబోయింది మీనాక్షి.     వెంటనే - వెనకనున్న ఒక కానిస్టేబుల్ మొరటుగా ఉన్న చేత్తో ఆమె నోరు నొక్కేశాడు. అతని రెండో చేతిలో వున్న సర్విస్ రివాల్వర్ మీనాక్షి నడుముని చల్లగా తాకుతోంది.     "అరిచి అల్లరి చేయ్యాకు" అన్నాడు ఇన్ స్పెక్టర్ కటినంగా.                                                     * * *     "రాణీ పూర్ పాలెస్ లో........     అక్కడ రెండు పెద్ద హాల్సు వున్నాయి. ఒకదాని పేరు దివాన్ - ఏ- అమ్. రెండో దాని పేరు దివాన్- ఏ- ఖాస్.     మొగలాయి పద్దతిలో పెట్టిన పేర్లు అవి.     అందులో "దివాన్ - ఏ- అమ్" (???) అంటే రాజు తన ప్రజలకు దర్శనమిచ్చే దర్బారు హాలు. బహుశా దివానే అమ్ లో నుంచే దివాణం అనే పదం వచ్చి వుంటుంది.     "దివానే ఖాస్" అంటే రాజు తన మంత్రులతో, సన్నిహితులతో , యంత్రాంగంతో సాగించే చోటు.     రాణీపూర్ పాలెస్ లోని దివానే అమ్ హాలు తాలుకు గోడలు, కప్పు అంతా కూడా అంగుళం ఖాళి లేకుండా బంగారు లతలు నగిషితో నిండిపోయి వుంది. నేలంతా ఇటాలియన్ పాలరాయి!     అక్కడ ఒక పెడగా నిలబడి వున్నారు సూట్ వాలా సుందరం, ధోవతి , షర్టులలో వున్న సద్గుణం. వాళ్ళిద్దరూ విక్రమదేవరావుగారు పెట్టిన ట్రస్టీలు. సుందోపసుందుల్లా కరటక దమనకుల్లా ఉంటారు వాళ్ళు.     చింతపండు బస్తాలా ఉన్న సుందరం తన నోట్లో వున్న ఒక కట్ట తమలపాకుల నములుతూ అన్నాడు!     "లేటెస్ట్ డెవలప్ మెంట్స్ ఏంటని అడగవెం?"     "ఏం డెవలప్ మెంట్స్?" అన్నాడు సద్గుణం అనాసక్తిగా.     "మన జస్వంతరావుగాడు విక్రమదేవరావుగారి వారసుణ్ణి పట్టేశాడు" అన్నాడు సుందరం డ్రమేటిక్ గా.     "అయితే?" అన్నాడు సద్గుణం విసుగ్గా.     తెల్లబోయి చూశాడు సుందరం.     "అటంబాంబుకి బాబులాంటి సమాచారం చెపితే ఆ బ్లాంక్ ఫేసెంటి?" అన్నాడు అనుమానంగా.     "చెప్పదల్చుకున్నది త్వరగా చెప్పు!" అన్నాడు సద్గుణం.
24,965
    కారు తారురోడ్డులోకి ప్రవేశించినప్పుడే నీలిమ గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయి.     అసలే ఆకాశం మేఘావృతమయింది. అందునా చీకటిరాత్రి...పైగా నిర్జన ప్రదేశం.     తనకు ఆ అనుభవం కొత్తేమరి! అంతలోనే గుండెల్లో గుబులు, మనసులో భయం చోటుచేసుకున్నాయి.     తనకు అతనిమీద అమితమైన ప్రేమ వుంది. తను అతనిని పూర్తిగా నమ్మింది.     అతనూ తనంటే ప్రాణం ఇస్తున్నాడు. మరి ఇప్పుడు అతనిని అనుమానించడం ఎందుకో?     తను ఎంత చదువుకున్నా ఆడపిల్ల అన్న సంగతి పదేపదే గుర్తుకురావడమే ఆ హెచ్చరికకు కారణం కావచ్చు.     తను కాస్తంత మెత్తబడితే, అమ్మో ఇంకేముంది అతను విజృంభించడూ!     అయినా ఇలా ఆరు బయట  విచ్చలవిడి శృంగారమా! అసలు సిగ్గనేది తనకి మొదటే వుండాల్సింది, అది కాస్త నడిబజారులో వదిలేసి తను తగుదునమ్మా అంటూ రవిచంద్రతో జాలీ ట్రిప్పులు, అతనితో డూయట్ పాటలు, మధ్యమధ్యన చిలకొట్టు దొంగముద్దులు.     ఇంతదూరం వచ్చాక ఆ కాస్త అయిపోవాలన్న పట్టుదలమీద అతను వున్నట్టు అతని ప్రతిచర్య చప్పకయే చెబుతుంది.     ఉన్నట్టుండి స్టీరియో ఆన్ చేశాడు రవిచంద్ర. వెష్ట్రన్ మ్యూజిక్ మరింత రెచ్చగొట్టే రీతిలో వుంది.     ఆమె భుజమ్మీద చేయి వేశాడు.     ఆమె తల వంచుకుంది__     రెండోచేత్తో ఆమె చుబుకంపట్టి లేపాడు.     ఆకలిగొన్న  అతని కళ్ళలోకి సూటిగా చూడలేక నీలు చూపు మరల్చింది__     "ఏయ్ సిగ్గా?...భయమా?" కన్నుగీటుతూ అడిగాడు.     "రవీ ఇదేమీ బాగోలేదు...ఇప్పటికే లేటయ్యింది పిచ్చివేషాలు మాని కారు స్టార్ట్ చేయి" ముక్కు పుటాలు అదురుతుండగా వస్తున్న కోపాన్ని అదిమిపట్టి మరీ అంది.     "గుడ్ జోక్..." పరిహాసంగా నవ్వేస్తూ అన్నాడు.     "షటప్...కారు స్టార్ట్ చేస్తావా లేక నన్నే కారు దిగి కాలినడకన వెళ్ళిపొమ్మంటావా?" మరింత సీరియస్ గా అంటూ కారుదోర్ తీసింది నీలు.     "సారీ డియర్..." కోపంలో నువ్వెంత అందంగా వున్నావో తెలుసా?...అంటూ ఆమె భుజమ్మీద చేయివేశాడు రవిచంద్ర.     "ఊ..."     విదిలించి కొట్టింది నీలిమ.     అప్పుడు తీశాడు డాష్ బోర్డు నుంచి బటన్ నైఫ్.     కొత్తదేమో అంత చీకటిలో కూడా తళతళ మెరుస్తున్నది.     నీలిమ నవనాడులు కుంగిపోయాయి. అంత చల్లదనంలో సయితం ముఖాన చిరుచమటలు పట్టేశాయి...     ఇప్పుడు అతని ముఖం ఎర్రబడి కందగడ్డలా వున్నది.     ఆమెకు గుండెదడ ప్రారంభమయింది.     ఈరోజు అతని వింతప్రవర్తన అర్ధంకాకుండా వుంది. కొంపదీసి బెదిరించి తనను చెరచడుకదా...     ఆ వూహకే తట్టుకోలేకపోయింది.     "ఐ హేట్ యూ... ఐ హేట్ యూ..." అంటూనే హఠాత్తుగా కారు డోరు తెరుచుకుని కిందకు దిగింది.     ఛటాలున అతను కారు దిగాడు.     కత్తిని ఎడమచేతిలోకి తీసుకుని ఒక్క అంగలో ఆమెను సమీపించాడు.     ఆమె నోరువిప్పి ఏదో అనబోతుండగానే కుడిచేతితో ఆమె చెంప చెళ్ళుమనిపించాడు.     "యూ...యూ పూర్ క్రీచర్...కత్తితో బెదిరించి నీ శీలం దోచుకుంటాననుకున్నావా...ఇంతేనా నువ్వు నన్ను అర్ధం చేసుకున్నది..." అంటూనే ఈసారి కత్తిని కుడిచేతికి తీసుకుని ఎడమ అరచేయిని సర్రున కట్ చేసుకున్నాడు.     అంతే...     ఎర్రని రక్తం చివ్వున చిమ్మింది...     ఆ దృశ్యం చూస్తూనే నీలిమ అవాక్కయింది.     "ఆ వాంఛను ఆపుకునే శక్తి నాలో ఉందనుకోవడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే!..." అంటూ కత్తిని దూరంగా విసరివేశాడు.   
24,966
      స్వచ్చమైన ఇంగ్లీషులో ధారాళంగా మాట్లాడుతున్న సాకేతని చూస్తుంటే కిరిటీకి గొంతు తడారిపోయింది.     ఒక మామూలు అమ్మాయి గట్టిగా ఇంగ్లీషులో గ్రామరు పొరపాట్లు సైతం దొర్లకుండా మాట్లాడలేదన్ననుకున్న యువతి ఇప్పుడు హనితలా అసాధారణంగా, అద్భుతంగా మాట్లాడుతూంది.     "1980 వ సంవత్సరం నుంచి భారతదేశపు పారిశ్రామిక చరిత్రలో ఓ కొత్త శకం ప్రారంభమైంది తన సాకేతిక ప్రగతి, ఎగుమతుల విధానం , రాష్ట్రాల మధ్య అంతర్గతమైనా సహకారం ఎంతో విదేశ మారక ద్రవ్యాన్ని ఆర్జించిపెట్టింది. అంతర్గతమైన సహకారం ఎంతో విదేశ మారక ద్రవ్యాన్ని ఆర్జించిపెట్టింది. కాని అప్పటికీ వనరులు అండర్ యుటిలై జేషన్ పేరిట సరైన ఉత్పాదక శక్తికి కారణం కాలేక పోతున్నాయి. దానికి తోడు ఈ ఏడాది హఠాత్తుగా తల ఎత్తిన ప్రకృతి సిద్దమైన కరువుకటాకాల మూలంగా పందోమ్మిది రాష్ట్రాలలోనూ అరవై రెండు శతం యూనియన్ టెర్రిటరీస్ లోనూ  ఆహార ధాన్యాల ఉత్పత్తి పది శతం దాకా పడిపోయింది. అంటే యిప్పటిదాకా ఈ కరువు కి ప్రభుత్వం అదనంగా ఖర్చు చేసిన మొత్తం అయిదువేల ఆరువందల కోట్లు .... దానికి తోడు శ్రీలంకలో మన రక్షక దళాలను రోజుకి ఆరు కోట్ల ఖర్చుతో మరో భారాన్ని తలపై పెట్టుకుని ......"     కిరిటీ కూర్చోలేదు.     అక్కడ సాకేత కాదు .... హనితని మించిన మేధగల ఓ మెరుపు కనిపిస్తూంది.     అలా ఎంతసేపు నిలబడ్డాడో తెలీదు.     హఠాత్తుగా తేరుకున్నాడు. అనూహ్యమైన ఆఫ్ లాజ్ తో ఆహూతులు అభినందంగా చప్పట్లు కొడుతుంటే.     సాకేతని కలుసుకోవాలనుకుంది అభినంది౦చాలనీ ఉంది.     అప్పుడు చూసుకున్నాడు టైం.     ఆరూ నలభై ఏడు.     "అంతే!     సాకేత చెప్పిన బాధ్యత గుర్తుకొచ్చినట్టు వేగంగా బయటికి నడిచాడు.     సరిగ్గా అదే సమయంలో ......     మర్రేపలంలోని ఇరుకుగా ఉన్న వీధిలోకి ప్రభంజనరావు సురేష్ తో సహా వచ్చాడు.     "ఇక్కడ ప్రభంజనరావుతనే ప్రత్యేకించి రావడంలో ఉద్దేశ్యం తెలివిగా పెద్దమనిషి తరహాలో మభ్యపేట్టి ఆమెను తీసుకువెళ్ళాలని, తన పెద్దరికంలో ఆమెకు నాయనా భయానా నచ్చజెప్పి సాకేతని దారిలోకి మళ్ళించాలనుకున్నాడు.     ఓ మధ్య తరగతి పెంకుటిల్లుకి నడిచారు ద్వారం దాటి.     బయట వీధిలోకి పిల్లల కేకలు అస్పష్టంగా వినిపిస్తున్నాయి.     వీధిలోకి మెర్క్యూరీ లైటు కాంతి వాలుగా పడుతూంది ఆవరణలో.     చప్పుడు విన్న ఓ వృద్దురాలు నెమ్మదిగా వెనక్కి తిరిగింది.     అంతే!     ప్రభంజనరావు గుండెలో నుంచి ఓ శతగ్ను దూసుకుపోయినట్టయింది.     సాకేత తన తల్లిగా చెప్పిన ఆ వృద్దురాలు ఎవరో కాదు.     ఇన్నాళ్ళూ ఏమైందో తెలీని రుక్మిణిదేవి!     సుదర్శనరావు  భార్య!     "ను.... వ్వు ...." ప్రభంజనరావు గొంతు తడారిపోతూంది. "ఇంకా .... బ్రతికే ఉన్నావా?"     రుక్మిణి జవాబు చెప్పలేదు.     రెండు దశాబ్దాల క్రితం తన స్థానం నుంచి జారిపడినా ఇప్పటికీ చెక్కుచెదరని స్నిగ్నత , ఆకర్షణ అలాగే వున్నాయి. మకిలిపట్టిన దేవతా విగ్రహంలా ఉన్న ఆమెలో వచ్చిన ముఖ్యమైన మార్పు ఒక్కటే .... బాగా తల నెరిసిపోయింది.     "నీకు .... నీకు పిచ్చి పట్టిందిగా?"     "పట్టింది . నువ్వు పిచ్చి పట్టేట్టు నన్ను ఆనాడు రెచ్చగొట్టావు. నా భర్త దగ్గర ప్రాపకం సంపాదించుకోవడానికి ప్రయత్నించి గెలిచావు."     "ఇన్నాళ్ళూ నువ్వు లేవనే అనుకున్నాను. ఇక్కడికేలా వచ్చావు? అసలు నీకూ, సాకేతకీ సంబంధమేమిటి?"     "సాకేత నా కూతురు ."     ఓ పిడుగులా వినిపించింది.     "నో!" అరిచాడు ప్రభంజనరావు. ఇప్పుడు అతనికి పిచ్చేక్కేట్టుంది. "సాకేత నీ కూతురు కాదు."     "మరి?"     "సుదర్శనరావు కూతురు."     నిర్లిప్తంగా నవ్వింది.     "నా భర్త కూతురు నా కూతురు కాకుండాపోతుందా?"     "లేదు. సాకేత నీ కూతురు కాదు. ఇన్నాళ్ళూ తల్లీ, అనారోగ్యం అంటూ మాతో చేతులు కలిపిన సాకేత తల్లిని నువ్వు కాదు. ఎక్కడో ఏదో మోసం జరిగిపోయింది. అయినా ఈ స్థానంలోకి నువ్వెందు కొచ్చావు?"     "ఆ ప్రశ్నకు జవాబు నేను చెబుతాను ప్రభంజనరావ్!"     పక్కనుంచి మరో కంఠం వినిపించింది.     అప్పుడు చూశాడు ప్రభంజనరావు.     చాలా చేరువలో నిలబడి ఉన్నాడు పార్ధసారధి .     సుదర్శనరావుగారి బావమరది. ఒకనాడు రిక్మిణికి మతి భ్రమించి నప్పుడు చెల్లిని తీసుకుపోయిన రుక్మిణి అన్న .....     "గుర్తుపట్టావా ప్రభంజనరావు?"     సుమారు ఏభయ్యేళ్ళ వయసులో ఉన్న పార్ధసారధి గ్రే కలర్ మాటులో హుందాగా నవ్వుతున్నాడు.     "మా బావగారికి ఒ సెక్రటరీ ఉండేది. అవునా?"     "ఆ .... వు ... ను .. సుజాత ..."     "నీ జ్ఞాపకశక్తి ఆమోదం మిస్టర్ ప్రభ౦జనరావ్!" నిర్లిప్తంగా నవ్వుతున్నాడు. "కరెక్ట్ సుజాత. ఆమెతో మా బావకున్న సబంధాన్ని ఫోటోల ద్వారా ఎస్టాబ్లిష్ చేసి అప్పుడు నా చెల్లి మనసును కోరి గాయపరిచావు గుర్తించి కదూ?"     ప్రభంజనరావు మౌనంగా వుండిపోయాడు.     "అ సుజాత  కూతురే సాకేత."     "నో ... సుజాత ..." అరవబావుయిన ప్రభంజనరావు ఆగిపోయాడు. ఒకనాడు సుదర్శనరావు మోసగించిన ఆడదానికి పుట్టిన అడ పిల్లవని సాకేత చెప్పడం అతనికి స్పష్టంగా గుర్తుంది .... "కావచ్చు .... కాని సుజాత...."         "ఎప్పుడో చచ్చిపోయింది . ఆ తరువాత ఈ కథలో నా చెల్లి పాత్రని పునఃప్రవేశం చేయించాలని నిశ్సబ్దంగా ఇటు పక్కనుంచి నేను ప్రయత్నం చేశాను."     మెదడు నరాల్ని ఎవరో బలంగా పీకుతున్నట్టనిపిస్తుంటే అందోళనగా చూస్తున్నాడు ప్రభంజనరావు. ఎక్కడో ఏదో అర్ధం కాని ఒ లింకు వుంది. అదేమిటో అంతుపట్టడంలేదు.     సాకేత సుజాత కూతురు కావచ్చు. సుజాతని సుదర్శనరావు మోసం చేసి వుండొచ్చు . కాని సాకేత రుక్మిణీ తల్లిగా ఎలా అంగీకరించింది? ఇంత కాలం తనని ఎందుకు మభ్యపెడుతూంది? సుదర్శనరావు పైన పగ సాధించాలందే!     అసలు హానిత స్థానంలోకి తను రావాలని ముందే కోరుకుందా? లేక అవసరార్ధం తాము రప్పించారా? అదీ కాకపోతే తెలివిగా అందర్నీ పూల్స్ చేసిందా?     సారధి తెరవెనుక నుంచి ఇన్నాళ్ళూ నాటకం ఆడించిందీ., ఇప్పుడు ఈ పెంకిటి౦ట్లో సాకేత తల్లి స్థానంలో నిలబెట్టుకుంది తనకు షాక్ కొట్టించలానా?     "మిస్టర్ ప్రభంజనరావు ! సరిగ్గా నువ్వేం అలోచిస్తున్నదీ నేనూహించగలను. ఇంతకు పూర్వమే నా చెల్లిని తన స్థానంలోకి పంపక పోవడానికి కారణం ఆమె మామూలు స్థితికి రాకపోవడం క్రమంగా సాకేత తన ప్రయత్నంలో ఆమెను మనిషిని చేసింది. ఒకనాడు మా బావ సుదర్శన.రావుని ద్వేషించే అమ్మాయి అయినా ఆమె ఊహించినట్టు అతడు దుర్మార్గుడు కాడని తెలుసుకుని, హనితని మీరు కడతేర్చినట్టు గ్రహించి తను కోరి ఆ స్థానంలోకి వచ్చింది. ఎలాగు ఆ తండ్రి కూతురే కాబట్టి ఇప్పుడు తల్లినీ రప్పించుకుంటూ౦ది."     ప్రభంజనరావు నిర్విణ్ణుడై చూస్తుండగానే అంతసేపూ ఒ మూల నిలబడి ఈ చర్చని అంతా వింటున్న కిరీటి నెమ్మదిగా గదిలోకి వచ్చాడు.     అందరూ చూస్తుండగానే రుక్మిణీ దేవిని సమీపించి .... "వెల్ కమ్ మేడమ్" అన్నాడు.     మధ్యలో ఈ స్వాగత వచనాలేమిటో అర్ధంకాని ప్రభంజనరావు అప్రతిభుడౌటూ అన్నాడు. "మధ్య నీ పెత్తనం ఏమిటీ?"     "ఇది మిస్ హానిత ఆదేశం......"     "అది హానిత కాదు." అని అరవబావుతూ ఆగిపోయాడు ప్రభంజనరావు.     రిక్మిని కదలబోతుంటే ప్రభంజనరావు అడ్డు రాబోయాడు. "ఇక్కడితో కథ ముగిసిపోలేదు మిస్టర్ సారధీ! సరిగ్గా ఇప్పుడే ప్రారంభమైంది. ఈ మేడం ను అదుపులోకి తీసుకుంటే తప్ప ఆ మేడం మా మాట వినేట్టు లేదు."     "కొడుకు సురేష్ వేపు చూసేసరికి కిరీటితో పోరాటానికి ఆయత్తమవుతున్నట్టు రెండడుగులు ముందుకేశాడు.     కిరీటి అది పట్టించుకునే ఆసక్తి లేనట్టు ఆమెను కారు దగ్గరికి నడిపిస్తుంటే "అగు" అన్నాడు సురేష్.     "నీ పితృవాక్య పరిపాలని నేను అభినందిస్తున్నాను సురేష్! ఇప్పుడు నేను ప్రదర్శించాలనుకుంటున్నది స్వామి భక్తుని . అంటే సుదర్శనరావుగారి ఉప్పుతింటున్న నేను ఎవడడ్డమొచ్చినా వాణ్ణి అంతు చూసినా తీసుకువేళతానన్నమాట" నిన్నగాక మొన్న భార్య విషయంలో సుదర్శన రావుగారు ఎంత పశ్చాత్తాపపడింది గుర్తుకొచ్చింది. ప్రస్తుతం అయన ఆరోగయం దృష్ట్యా కూతురి తో బాటు భార్య వుంటే అది వెయ్యేళ్ళు అయుస్సుకు కారణమవుతుంది.                       
24,967
    "ఇన్నాళ్ళ దారి వేరు. ఇప్పుడు రఘు పెళ్ళి అవుతూంది. వాళ్ళిద్దరూ చిలకాగోరింకల్లా తిరుగుతూంటే ఇది మోడులా పడి వుండటం దానికెంత బాధ. మనకెంత బాధ? ఆ వియ్యపురాలు పెళ్ళికి ముందే ఇలా అంది. రేపు కోడలు వచ్చాక ఇది వాళ్ళకి ఎంతలోకువవుతుందో తెలుసా? ఇంట్లో కోడలేమన్నా అంటే అది ఎంత బాధపడ్తుంది? అది విని ఎటూ చెప్పలేక మనం ఎంత బాధపడాలి? అనకుండా వూరుకుంటే అది విపరీతంగాని, పుట్టింట్లో పడివున్న ఆడపిల్లని అనడం సహజం. నాకు తెలుసు ఇలాంటివన్నీ జరుగుతాయని. పెద్దలు అనుభవంతో చెపుతారు."          "చాలిస్తావా నీ సాధింపు? ఏం, ఆ వియ్యపురాలికి నా కూతురు బరువయిందటనా? ఎన్నాళ్ళుంటుందో, వుంచుకుంటామో అది ఆవిడ కేం బాధ? ఈసారంటే నోరు ముయ్యమను." కోపంగా అన్నారు శివశంకరంగారు.         "ఇవాళ వియ్యపురాలంది - రేపు కోడలంటుంది. ఎన్నాళ్ళు ఎవరి నోళ్ళు మూయించగలం? అందులో రఘు ఇక్కడుండేవాడు. పోనీ, ఏదో పై వూరిలో ఉద్యోగం అనుకుంటే అదోదారి - రేపు ఇంట్లో ఆ కోడలు దీన్ని చిన్న చూపు చూస్తే......"       "అంతదాకావస్తే వాళ్ళని బయటికి నడిచి వేరింటి కాపురం పెట్టుకోమను. నీవు అన్నింటికీ పెడ ఆలోచనలు చెయ్యకు." విసుక్కున్నారాయన.        మిగతా విషయాలలో శివశంకరంగారికి ఎంతటి లోకానుభవం వున్నా కూతురి విషయంలో మాత్రం ఆయన అనుభవాన్ని అనురాగపు పోరా కమ్మింది. ఎవరి మాటలు, ఎవరి విమర్శలు ఆయన వినరు. లెక్క చెయ్యరు. తనకి డబ్బు ఉంది. ఆ డబ్బుతో కూతురి సుఖానికి బాట వెయ్యగలనన్నవిశ్వాసం ఉంది ఆయనకి. లోకంలో డబ్బు ఒక్కటే అన్నీ సమకూర్చదన్న విషయం గ్రహించడానికి ఇష్టపడరు. తనది కన్న కడుపు కనక కూతురి విషయం కడుపులో పెట్టుకుంటారు. కూతురిపట్ల సానుభూతి వుండాలి. మిగతావారికి ఎందుకుంటుంది? ఎందుకుండాలి? అని ఆలోచించడానికిష్టపడరు.        పెళ్ళిళ్లయ్యేవరకే తమ బిడ్డలు. కోడళ్ళు వచ్చాక వాళ్ళ సంసారాలు, వాళ్ల స్వార్థాలు వాళ్ళవి. ఈనాడు చెల్లెలి పట్ల వున్న ప్రేమాభిమానాలు రేపుండవు అన్న నిజం ఆయన గ్రహించలేదు. భార్య శారదాంబ కన్నతల్లి అయి వుండీ ఎంత లోకజ్ఞానంతో మాట్లాడుతుందో అర్థం చేసుకోకుండా కూతురు అక్కడ వుండటం ఆమెకిష్టం లేదన్నట్టు మాట్లాడి సాధించేవారు.       రఘు పెళ్ళి అట్టహాసంగా, ఆడంబరంగా జరిగింది. ఒక్క ఆడపిల్ల అని పెళ్ళి బాగా చేశారు. లాంఛనాలు, మర్యాదలు బాగానే జరిగాయి. కూతురికి మంచి ఫర్నీచర్, ఫ్రిజ్, గోద్రేజ్ ల దగ్గరనించి అన్నీ ఇచ్చి పంపారు అత్తవారింటికి. రఘు కళ్ళు నేలమీద ఆననట్టే భార్యని చూసుకొని ఊహా లోకాల్లో తేలిపోతూ, చుట్టూ జరుగుతున్నది పట్టించుకోడం మానేశాడు. నిర్మల ఎంత సంతోషంగా, ఎంత హడావిడిగా అన్న పెళ్ళిలో తిరిగినా ఏదో వెలితిగా అన్పించింది. అదేమిటో ఆమెకి అర్థం కాలేదు.     పెళ్ళికి వచ్చిన చుట్టాలు 'అమ్మాయి మరి వెళ్ళదా, అల్లుడేమన్నాడు, మళ్ళీ పెళ్ళి చేస్తారా?' లాంటి ప్రశ్నలు కొందరు డైరెక్ట్ గా అడిగితే, మరికొందరు ఇన్ డైరెక్ట్ గా అడిగారు. ఆ మాత్రం చనువులేని వాళ్ళు ఆ భావాలు చూపులతో వ్యక్తం చేశారు. అటు ఆడపెళ్ళివారు నిర్మలని చూసినప్పుడల్లా గుసగుసలాడుకునేవారు. కళ్ళతో సౌజ్ఞలు చేసుకునేవారు. 'ఈ అమ్మాయే మన దివ్య ఆడపడుచు. మొగుణ్ణి వదిలేసిందట. మూడేళ్ళబట్టి పుట్టింట్లోనే వుంటోంది' అంటూ గుసగుసలాడేవారు. నిర్మల అదంతా పట్టించుకోకుండా దులిపేసుకోవాలన్నాఒక్కోసారి ఆ మాటలు ఆమె చెవినపడి మనసు చివుక్కుమనేది. మొహం చిన్నపోయేది. తప్పు చేసిన దానిలా తప్పించుకు వెళ్ళిపోయేది.       గృహప్రవేశం, రిసెప్షన్ హడావిడి, ఆ తరువాత హనీమూన్ ట్రిప్ అయ్యాక దివ్య కాపురానికి వచ్చింది. ఆ అమ్మాయి స్వతహాగా సరదా అయింది. ఈ కాలం పిల్లలభావాలు కలది కనక నిర్మల గురించి మొదట ఏం అనుకోలేదు. ఇంట్లో తల్లి, చుట్టాలు రకరకాలుగా మాట్లాడుకోవడం విన్నాక ఆమెకి తెలియకుండానే ఆమెలో నిర్మలంటే అదోరకం చులకన భావం వచ్చింది.            అసలు ఆ కొత్త వైవాహికజీవితంలో నిర్మల గురించి ఆలోచించే తీరికే లేదు ఆమెకి. ఎంతసేపు రఘు ఆమె, సినిమాలు, షికార్లు, గదిలో తలుపులు బిడాయించుకుని ఒకరి కౌగిలిలో ఒకరు కరిగిపోవడంతో ఓ నెలగడిచిపోయింది. అప్పటికి ఆ దంపతులిద్దరికీ కాస్త కొత్తమైకం వదిలి ప్రపంచంలో పడ్డారు. రఘు కోర్టుకి వెళ్ళడం ఆరంభించారు. దివ్య లా ఫైనల్ ఇయర్ లో ఉంది కనక చదువు ఆపకుండా పూర్తి చెయ్యాలని ఇద్దరూ అనుకున్నారు. కనక మళ్ళీ దివ్య కాలేజీకి వెళ్ళడం ఆరంభించింది. కాలేజీకి వెళ్ళిరావడం, సాయంత్రం షికార్లు, సినిమాలు, రాత్రిభోజనాలవగానే గదిలో దూరడం. ఉదయం ఏడు లోపల లేవరు ఇద్దరూ. ఉదయం కాఫీ - టిఫిన్లు గదిలోకి తీసుకెళుతోంది దివ్య బ్రేక్ ఫాస్ట్, స్నానాలు పూర్తిచేసిగాని గదిలోంచి బయటపడరు, ఉదయం పూట ఎవరి హడావిడిలో వారు తయారై కాలేజీలకి, ఆఫీసులకి వెళ్ళడం......          అన్న పెళ్ళి అయితే దివ్యతో తనకి బాగా కాలక్షేపం అవుతుందనుకున్న నిర్మలకి చాలా ఆశాభంగం కల్గింది. ఇంట్లో ఎదురుపడితే హాయ్ అనడమో, ఇప్పుడే వచ్చారా ఇంటికి అని ఓ చిన్న పలకరింపు తప్ప, ఇద్దరూ ఒక ఈడు వాళ్ళయినా కూర్చుని మాటా మంతీ ఆడుకునే అవకాశమే రాలేదు నిర్మలకి. రాత్రి భోజనాలపుడు మాత్రం వాళ్ళెక్కడికీ వెళ్ళని రోజు అంతా కల్సి భోజనం చేసే అవకాశం వచ్చేది. అప్పుడు మామగారున్నారనేమో ఎక్కువ మాట్లాడేది కాదు. జనరల్ గా లోకాభిరామాయణమో, కుటుంబ విషయాలో మాటల్లో దొర్లేవి. ఆ పరిస్థితిలో దివ్యతో చనువుగా ఎలా వుండటమో నిర్మలకి అర్థం కాలేదు.     అటు శారదాంబకీ కోడలు వచ్చిన ముద్దు ముచ్చట తీరలేదు. ఆ అమ్మాయి ఇంట్లో వున్న కాసేపు అయినా అందరి మధ్యకురాదాయె అనుకుంటుంది. ఆదివారం వస్తే దివ్య, రఘు ఇద్దరూ ఆమె పుట్టింటికి వెళ్ళి భోజనాలు చేసి రాత్రికి కాని రారు. అత్తగారేదన్నా అడిగితే జవాబు చెప్పటం తప్ప తనంతట తానుగా ఏదీ మాట్లాడని కోడలితో శారదాంబకీ పరిచయం పెంచుకునే అవకాశం లేకుండా పోయింది. అత్తవారిల్లు, అత్తగారిని కాస్తో కూస్తో చేదోడుగా ఉండాలని, ఆ ఇల్లు తనది, పనీపాట కాస్త చూసుకోవాలని కూడా అనుకోకుండా ఏదో హోటల్లో ఉన్నట్టు వేళకి కాఫీ టిఫిన్లు, భోజనాలకి రావడం తప్ప ఏదీ కల్పించుకోకుండా గెస్ట్ మాదిరి గడుపుతున్న కోడలిని ఏమనాలో తెలియలేదు శారదాంబకి.     ఇంట్లో వంటకి మనిషి వున్నా, ఎన్ని పనులుంటాయి? కనీసం ఇది చెయ్యనా అత్తయ్యా అని రాని కోడలిని ఏం అనుకోవాలో తెలియలేదు ఆవిడకి. రఘు అయితే పెళ్ళయ్యాక ఓ వంటిల్లు వుంటుందని, వంటపని వుంటుందన్న విషయం మర్చిపోయినట్టు దివ్య గదిలోకి కాఫీ ఫలహారాలు తెస్తే తినడం తప్ప మిగతా విషయాలు పట్టించుకోవడం మానేశాడు. ఓ వారం రోజులు వంటావిడ సెలవు పెడితే తల్లి పనితో సతమతమవుతుంటే నిర్మల సాయం చేసేది కాని దివ్య వంటింటి వైపన్నా వచ్చేది కాదు. "కోడలు వచ్చినా నా పాట్లు తప్పలేదు" అని ఒకటి రెండుసార్లు గొణుక్కుంది శారదాంబ.
24,968
    ఆ రాత్రి నేను నిశ్చింతగా నిద్రపోయాను. నా జీవితానికి ఒక సంపూర్ణత్వం లభించినట్టు అనిపించింది. ఆ మరుసటిరోజే మా బావగారికి ప్రమోషన్ ఆర్డర్స్ వచ్చాయి. ఇంకేముంది? ఇంట్లో అందరూ నన్ను ఆకాశానికెత్తేశారు. అమ్మాయి అడుగుపెట్టిన వేళావిశేష మన్నారు.     ఆఫీసులో మ విషయం క్షణాల్లో పాకిపోయింది. మొత్తం స్టాఫ్ అందరికీ ఆ సాయంత్రం డిన్నర్ ఇచ్చాడు సురేష్. ఆ విషయంలో మాత్రం అతనిది భారీ చెయ్యే. ఆ సంగతి నేను షూటింగ్ టైమ్ లోనే గమనించాను. అందరికీ నాలుగు రోజుల్లో పూర్తయ్యే షూటింగ్ పదిరోజులు చేసి అద్భుతంగా తీశాడు. అయితే అందరికీ నలభైవేలయ్యే మొదటి ఎపిసోడ్ అతడికి లక్ష అయింది.     ప్రమోషన్ మీద కలకత్తా వెళ్ళిన బావగారు అక్కడి తిండి సరిపడక మూడో రోజునే మంచాన పడడంతో సురేష్ వాళ్ళ వదిన హడావుడిగా ప్రయాణం కట్టింది. నేను చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో పడ్డాను. ఆ విషయమే సురేష్ తో ప్రస్తావించాను.     "మనం తొందరగా పెళ్ళి చేసుకోవడం మంచిది కదా!"     సురేష్ నవ్వుతూ, "ఏం, ఇప్పుడు మనం భార్యాభర్తలంకాదని నీకేమైనా అనుమానం వచ్చిందా?" అన్నాడు.     "అదికాదు, సురేష్! నువ్వు నావైపు నుంచి ఆలోచించు. పెళ్ళికాకుండా ఒకింట్లో ఎలా వుంటాం? ఆఫీసులో అందరిముందూ మెళ్ళో మంగళసూత్రం లేకుండా ఎలా తిరగను? అందరూ ఇప్పటికే చెవులు కొరుక్కుంటున్నారు".     నా మాటలింకా పూర్తికాకుండానే, గడ్డం చేసుకుంటున్న వాడల్లా చివుక్కున తల తిప్పాడు- "ఎవరన్నారు? ఎవడైనా ఏమైనా అన్నాడా? చెప్పు. మొత్తం అందర్నీ గడ్డివామేసి తగలబెట్టేస్తాను! ఏమనుకుంటున్నారు నా గురించి? అమ్మాయిని లేపుకు వచ్చినవాడిలా కనబడుతున్నానా?" అతడి ఆవేశం చూసి నాకు భయమేసింది. కాస్త బెదురుతూ, "మనం కాస్త సామాజిక న్యాయాల గురించి కూడా ఆలోచించాలి కదా!" అన్నాను.     అతడు నా దగ్గరగా వచ్చి- "ఏమిటి సామాజిక న్యాయం? ఎంతమంది మగవాళ్ళు తాము కట్టిన మంగళసూత్రాలకి గౌరవం ఇస్తున్నారు? ఈ సామాజిక న్యాయం ఆడవాళ్ళ నేమైనా రక్షిస్తోందా?" గట్టిగా గద్దించినట్టు అడిగాడు.     నేను సమాధానం చెప్పలేదు.     "ఏం, మాట్లాడవేం?" రెట్టించాడు.       నేను తల దించుకుని నిశ్శబ్దంగా అక్కణ్ణించి వెళ్ళిపోయాను.     ఆ సాయంత్రం అతడు ఆఫీసునుంచి వస్తూ హుషారుగా- "నీ కోసం నేనేం తెచ్చానో చెప్పుకో!" అంటూ గుప్పిట విప్పాడు. అందులో మంగళసూత్రం వుంది. నేనేదో అనబోయేంతలోనే మెడలో దాన్ని కట్టెయ్యబోయాడు. నేను కంగారుపడి అడుగు వెనక్కి వేసి, "ఆగండి, ఏవిటీ హడావుడి పెళ్ళంటే ఇదా?" అన్నాను.     "మరి మంగళసూత్రం కావాలన్నావుగా?"     "పురోహితుణ్ణి పిలిచి, పదిమంది సమక్షంలో ..." నా మాటలింకా పూర్తికాలేదు. అతడా సూత్రాన్ని బల్లమీదకి విసిరేసి "ఓహో! సాక్ష్యాలు కావాలన్నమాట! అయితే రిజిష్టర్డ్ మారేజి చేసుకుందాం. విడిపోయినప్పుడు నీకు ఆస్తిలో వాటా లభిస్తుంది" అన్నాడు.     నేను నొచ్చుకుంటూ "అయ్యో! నా ఉద్దేశం అదికాదండీ..." అంటూ ఏదో చెప్పబోయాను.     "మరేవిటీ నీ ఉద్దేశం? పనీ పాటా లేని వాళ్ళందర్నీ పిలిచి అక్షింతలు వేయించుకుంటావా?"     "కాస్త మంచిరోజు చూసి, కనీసం మీ అన్నయ్యా, వదినలనైనా పిలిచి ఈ తతంగం పూర్తిచేస్తే బావుంటుందని నా ఉద్దేశం"     అతడో క్షణం ఊరుకుని "సరే నీ ఇష్టం!" అని వెనుదిరిగాడు. "ఆగండి" అన్నాను వెనకనుంచి. టేబుల్ దగ్గరకెళ్ళి మంగళసూత్రాన్ని తీసుకుని అతనికిస్తూ "కట్టండి!" అన్నాను.     గోడలకి తగిలించి వున్న దేవుడి బొమ్మ తీసుకొచ్చి బల్లమీద పెట్టాడు. "మనిషికన్నా దేవుడు గొప్పవాడని కదా నీ అభిప్రాయం? ఆ అభిప్రాయాన్ని అలాగే వుంచుకో. కాని ఎప్పుడైనా కాస్త తీరిక దొరికితే నీలోకి నువ్వు వెళ్ళి ఆలోచించుకో! నువ్వేమన్నావ్? మెళ్ళో మంగళసూత్రం లేకపోతే అందరి ముందూ ఇబ్బందన్నావ్. నీ ఇబ్బంది అర్థం చేసుకోగలిగాను. మంగళసూత్రం తెచ్చాను. అది మెడలో వేసుకోవచ్చు కదా! పదిమంది సాక్ష్యం కావాలన్నావ్. పురోహితుడూ, మంత్రాలూ అన్నావ్. నీలో కోర్కె ఎలా పెరుగుతోందో చూశావా? ఎక్కడ కోర్కె వుంటుందో అక్కడ సంతృప్తి వుండదు. ఈ నాలుగు గోడల మధ్య నేను కట్టానో, నువ్వు కట్టుకున్నావో ఎవరైనా చూస్తారా? మన పెళ్ళికి మన మనసులే సాక్షి. ఈ తాడుముక్కకాదు. నన్నెవరూ అర్థం చేసుకోరు. అలా అర్థం చేసుకోని వాళ్ళ లిస్ట్ లో నువ్వు కూడా చేరినందుకు నాకు విచారంగా వుంది".     "అంతవరకూ ఎందుకు? ఒంటరిగా నువ్వు ఈ ఇంటికి అర్థరాత్రి వచ్చావు. మనిద్దరమే ఈ ఇంట్లో వుంటున్నాం. ఎప్పుడైనా నేను నీ పట్ల చనువు తీసుకున్నట్టు చూశావా? ఎలాగూ పెళ్ళి చేసుకోబోతున్నా కదాని నేను నీ పట్ల అసభ్యంగా ప్రవర్తించానా? లేదే! నా సిద్ధాంతాల్ని గాఢంగా నమ్మినవాణ్ణి నేను. ప్రతీ ఉద్యమానికి ఎక్కడో ఓ ప్రారంభం కావాలి. దాన్ని నాతోనే మొదలు పెడదామనుకున్నాను. నీ మొదటి చర్యతోనే నన్ను వెనక్కి లాగావు. ఆడదానికి పెళ్ళైనట్టు సాక్ష్యం మంగళసూత్రమే అయితే, అది మగవాడే కట్టాలన్నది సాంఘిక నియమమైతే, తరతరాలుగా, యుగయుగాలుగా వస్తున్న ఆ సాంఘిక నియమాన్ని నిలబెట్టడం కోసం నేను నా ఓటమిని అంగీకరించి, తలవంచి నీ మెళ్ళో..."     అతడి మాటలు పూర్తికాకుండానే నా మెళ్ళో మంగళసూత్రాన్ని వేసేసుకున్నాను.                                                               *    *    *     ఆ రాత్రి అతను నన్ను దగ్గరికి తీసుకోబోయాడు. నేను కాస్త దూరం జరిగి "ఒక చిన్న కోరిక కోరితే మీరేం అనుకోరుగా!" అన్నాను.     "ఒకటేమిటి? పదడుగు. అయినా అడగడమేమిటి? భార్యగా డిమాండ్ చేసే అధికారం నీకుంది".     "అంతంత పెద్దమాటలెందుకండీ?" అని ఆగి సన్నటిస్వరంతో చెప్పాను.     "పగలంతా నా కెందుకో దిగులుగా అన్పించింది. మీరు చెప్పిందంతా నిఅజ్మే. కానీ... చిన్న హోమం... పురోహితుల మంత్రోచ్చారణ...మూడు ముళ్ళు వేస్తుంటే మెడమీద మీ చేతివేళ్ళ కదలికలు... నాలుగు వైపుల నుంచీ వచ్చిపడే అక్షింతలు... ఆ ఫీలింగ్... ఆ అనుభూతి మిస్సయ్యానేమోనన్న బాధ రోజంతా నన్ను వెంటాడుతూనే వుంది".     అతడొక్క ఉదుటున మంచంమీద లేచి కూర్చొని "నువ్వొక ఇడియట్ వి. స్టుపిడ్ వి" అని అరిచాడు.     నేను బెదిరిపోయి గువ్వలా వెనక్కి ముడుచుకుని "ఏమైందండీ?" అన్నాను భయంగా.     "మరందులో అంత మంచి ఫీలింగ్ వుందని నాకెందుకు చెప్పలేదు?"     నాకు నవ్వాలో, ఏడవాలో తెలీలేదు.     "సర్లే, రేపే శుభలేఖలు ప్రింట్ చేయిస్తాను. ఆ పురోహితుడి సంగతీ, హోమం సంగతీ నువ్వు చూడు" అన్నాడు విషయం సెటిల్ చేస్తున్నట్టు.
24,969
    "ఇప్పుడు కాఫీ ఎందుకండీ?"     "పరవాలేదండీ! సత్యం మీకేమైనా ఉత్తరం రాశాడా? నాలుగు నెలలుగా ఉత్తరం ముక్కైనా రాయలేదు. కాస్త మీరు గట్టిగా మందలిస్తూ ఉత్తరం రాద్దురూ- నాలుగేండ్లయింది వాణ్ణిచూసి. ఒకసారికూడా శెలవులకు రాలేదు. కనీసం నేలకు ఒక వుత్తరం అయినా రాయమని గట్టిగా మందలించండి!" అన్నాడు చంద్రయ్య.     "శెలవులకు వస్తే అనవసరపు ఖర్చని సత్యం అభిప్రాయం. పైగా ఐదేళ్ళు ఆ వాతావరణంలో కళారాధన చెయ్యాలనీ, ఒక క్షణం కూడా వ్యర్ధం చెయ్యడం తనకు ఇష్టం లేదనీ రాశాడు. అందుకే నేనుకూడా సత్యాన్ని శెలవులకు రమ్మని రాయటం లేదు. నాకు నెలకు ఒక ఉత్తరం రాస్తూనే వున్నాడు. మీకు ఎందుకింత ఆలస్యం చేశాడో తెలియదు. రేపే మందలిస్తూ రాస్తాడు లెండి" అన్నాడు కేశవరావు.     "మరో సంవత్సరం వుండాలి!" అన్నాడు చంద్రయ్య.     "అవును. మరో సంవత్సరం ఎంతలో తిరిగివస్తుందిలెండి" అన్నాడు కేశవరావు.     "ఏమో నాయనా! మరో సంవత్సరం వాణ్ణి చూడకుండా ఉండాలంటే నాకు మరో యుగం వుండాలనిపిస్తుంది"- కాఫీ గ్లాసుతో అప్పుడే అక్కడకు వచ్చిన శాంతమ్మ అంది.     కేశవరావు ఏమీ మాట్లాడలేదు. ఏదో ఆలోచిస్తున్నాడు.     "మీరు ఇవ్వాళ ఉత్సాహంగా లేరు. కారణం తెలుసుకోవచ్చునా?" చంద్రయ్య అడిగాడు.     "ఏమీ లేదండీ!"     "కాదు, దాస్తున్నారు. చెప్పండి; నేను వినదగిందయితే చెప్పండి!"     "వినకూడంది ఏమీలేదండీ! నేను ఇక్కడ ఉద్యోగం వదిలేసి వెళుతున్నాను."       చంద్రయ్య అర్ధంకానట్లు చూశాడు.     "ఇక్కడ సమితి ప్రెసిడెంట్ గారికీ నాకూ పడడంలేదు. ఆయనకు కావల్సిన కుర్రవాళ్ళకు, ఆయన కోరిన మార్కులు వెయ్యాలి. అది నావల్లకాదు. హెడ్ మాష్టరుకూడా ప్రెసిడెంటు మాట వినాల్సిందేనంటాడు. రోజు రోజు చీటికీ మాటికీ బాధిస్తూ ఉన్నారు. అందుకే నేను రాజీనామా ఇచ్చాను" అన్నాడు కేశవరావు నిట్టూరుస్తూ.     "మీరు తొందరపడలేదు కదా?"     "లేదండీ! ఒక్క క్షణం కూడా ఈ ఊళ్ళో ఉండలేను. అనేక రకాలుగా బాధిస్తున్నారు. హైదరాబాదులో ఒక హైస్కూల్లో నాకు ఉద్యోగం వచ్చింది. అక్కడ నాకు మంచి స్నేహితులున్నారు. పిల్లల చదువులకు కూడా ఇబ్బంది వుండదు. కాకపోతే ఇంతకాలంగా వున్న ఈ ఊరు ఈ విధంగా వదలాల్సి వచ్చినందుకు కొంచెం బాధగా వుంది."     "కాఫీ తాగండి, చల్లారిపోతుంది. ఎప్పుడు వెళుతున్నారు?"     "రేపు సాయంత్రం."     "ఇంత త్వరగానా?" అన్నాడు చంద్రయ్య.     "అవునండీ! వచ్చే సోమవారం అక్కడ డ్యూటీలో జాయిన్ కావాలి."     "ఒకటి అడుగుతాను, ఏమీ అనుకోకండీ!" అన్నాడు చంద్రయ్య.     "పరవాలేదు, అడగండి."     "మీకు డబ్బు ఏమయినా అవసరం అయితే తీసుకెళ్ళండి. నా దగ్గిర సందేహించకండి."     "మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి. డబ్బు అవసరం ఏమీలేదు" అన్నాడు కేశవరావు. కాని కేశవరావు ఏదో అడగాలని ప్రయత్నిస్తూ అడగలేకపోతున్నాడని చంద్రయ్య లీలగా గ్రహించాడు. కాని ఎంత ఆలోచించినా అదేమయివుంటుందో అంతుపట్టలేదు.     "సత్యం వచ్చిందాకా ఉండలేకపోయాను."     "వాడు మీ దగ్గరకు రాకుండా వుంటాడా? ముందు మిమ్మల్ని చూసే ఇక్కడకు వస్తాడని నా నమ్మకం" అన్నాడు చంద్రయ్య.     "నేను ఈ వూరినుంచి వెళ్ళేసమయంలో మిమ్మల్ని ఒకటి అర్ధించటానికి వచ్చాను" అన్నాడు కేశవరావు నీళ్ళు నములుతూ.     "చెప్పండీ! మీకు మా కుటుంబం ఎంతో ఋణపడి వుంది. మీకేదయినా చెయ్యగలిగితే అది మా భాగ్యంగా తలుస్తాం" అన్నాడు చంద్రయ్య.     "ఆఁ-అది చాలాకాలంగా మీ దగ్గిర చెప్పాలనుకుంటూ సందేహించానండీ!"     "చెప్పు అన్నయ్యా! అంత వెనకాముందూ ఆడతావేం?" అంది శాంతమ్మ.     "అదేనండీ! సత్యం అంటే నాకెంత అభిమానమో మీకు తెలుసుగా?" నసిగినట్లు అన్నాడు కేశవరావు.     "అది మీ నోటిమీదగా చెప్పాలా? మాకు తెలియదా?"     "మా ఇంట్లో అందరికీ సత్యం అంటే అభిమానం. ముఖ్యంగా మా పెద్దమ్మాయికి సత్యం అంటే వల్లమాలిన అభిమానం."     సరళ చేస్తున్న పనిని ఆపుచేసి చెవులు రిక్కించుకొని వినసాగింది.     చంద్రయ్యా, శాంతమ్మలు కేశవరావు ఏం చెప్పదలచుకున్నాడో అర్ధంకానట్లు చూశారు.     "మీకు కులాల పట్టింపులు లేకపోతే మా పెద్దమ్మాయిని సత్యానికి ఇవ్వాలనివుంది. అది ఇప్పుడు గుంటూరులో ఇంటరు చదువుతూందని మీకు తెలుసుగా?"     సరళ చేతిలోని లాంతరు గ్లాసు రాతిమీద జారిపడి పగిలింది. అందరూ ఉలిక్కిపడి అటుచూశారు. సరళ అక్కడనుంచి లేచి గబగబా ఇంట్లోకి పరుగెత్తుకెళ్ళింది. కేశవరావు ప్రశ్నార్ధకంగా చంద్రయ్య ముఖంలోకి చూశాడు.     చంద్రయ్య ముఖం వెలవెలబోతోంది. శాంతమ్మ కాఫీ తాగిన ఖాళీ గ్లాసును తీసుకొని లోపలకు వెళ్ళిపోయింది. ఆ వాతావరణం తనకు వ్యతిరేకంగా వున్నట్లు అర్ధం అయింది కేశవరావుకు.     "మీకు కులాల పట్టింపులు వుంటే ఈ ప్రసక్తిని ఇంతటితో వదిలేయండి. మాకు అలాంటివి లేవు. అమ్మాయి మనస్సును అర్ధం చేసుకొని, మీ దగ్గిర నా అభిప్రాయాన్ని వెలిబుచ్చకుండా వుండలేకపోయాను. తండ్రిగా నా బాధ్యత అయిపోయింది. తరువాత దాని అదృష్టం!" కేశవరావు స్వరంలో జీర పలికింది.     చంద్రయ్య సర్దుకుని కూర్చున్నాడు. ఒకసారి సకిలించి గొంతు సవరించుకున్నాడు.     "క్షమించండి కేశవరావుగారూ! కులాల విషయం కాదు నేను చెప్పబోయేది. నేను చెప్పేదంతా విని, మీరు ఏం చెయ్యమంటారో చెప్పండి, అలాగే చేస్తాను." చంద్రయ్య చుట్టతీసి ముట్టించుకున్నాడు. కేశవరావు కుతూహలంగా చంద్రయ్య ముఖం చూస్తూ కూర్చున్నాడు. అతనిలో మళ్ళీ ఏదో ఆశ తల ఎత్తింది.     "ఇంతకుముందు లోపలకు పరుగెత్తిన సరళను చూశారుగా? అది నా మేనకోడలు. తల్లీ తండ్రీ లేరు. నా దగ్గరే పెరిగింది. అది పుట్టిన నాడే సత్యం భార్యగా నిర్ణయం జరిగింది. క్రమంగా పసి హృదయాల్లో కూడా అలాంటి భావమే వయసుతోపాటు పెరుగుతూ వస్తోంది. వాళ్ళిద్దర్నీ చూస్తుంటే ప్రపంచంలో ఏ శక్తీ వాళ్ళను విడదీయలేదు అనిపించేది నాకు. దాన్ని రక్షించడానికే వాడు చెయ్యి పోగొట్టుకున్నాడు. మీ మాటలు వినగానే దాని చేతిలో గ్లాసు కింద పడిపోవటం చూశారుగా! ఇంతకంటే నేను మరేమీ చెప్పలేను!"     "అక్కరలేదు లెండి! నాకు ఈ విషయం తెలియదు. అనవసరంగా మిమ్మల్నందర్నీ బాధ పెట్టాను" అన్నాడు కేశవరావు.     చంద్రయ్య మాట్లాడలేదు.     "వస్తానండీ! మీరు బాధ పడకండీ!" అంటూ కేశవరావు లేచి నిల్చున్నాడు.     "నాకు నిజంగా బాధగా వుంది మాస్టరుగారూ!" చంద్రయ్య డీలాపడిపోతూ అన్నాడు.     కేశవరావు పెదవులమీద విరిగిపోయిన పాలలాటి చిరునవ్వు వెలసింది.     "మాకు అంతే అదృష్టం అనుకుంటాం. మీరే నన్ను క్షమించాలి. చాలా బాధ పడుతున్నాను, విషయం తెలుసుకోకుండా తొందరపడినందుకు" అంటూ కేశవరావు గబగబా వెళ్ళిపోయాడు.     అలా వెళ్ళిపోతున్న కేశవరావును చూస్తూ చంద్రయ్య నిట్టూర్చాడు.                                          12     ఐదు సంవత్సరాల అనంతరం సత్యం శాంతినికేతన్ లో విద్యా, విజ్ఞానం ఆర్జించుకొని, కళాకారుడిగా తిరిగి ఇంటికి వచ్చాడు. నిండు యవ్వనుడిగా వచ్చిన కొడుకును చూసుకొని మురిసిపోయాడు చంద్రయ్య. తనకంటే ఓ గుప్పెడు ఎత్తుగానే వున్నాడు అనుకున్నాడు. బెంగాలీ వేషభాషలలో స్పురద్రూపి అయినా సత్యాన్ని చూసిన సరళకు శరత్ నవల్లోని హీరోలు గుర్తుకొచ్చారు.     సూర్యం విశాఖపట్నంలో ఇంటర్ ఫైనల్ చదువుతున్నాడు. చిన్నతనంలోనే మితభాషిగా ఉండే సత్యం ఇప్పుడు చాలా గంభీరంగా తయారయ్యాడు. సరళ సెకండ్ ఫారంతోనే చదువు మానేసిందనీ, చవకబారు నవలాసాహిత్యం పఠనం దాటి ఆమె ఆలోచనలు పోవనీ, ఇంకా అంత అమాయకంగానే వుందనీ, చూసిన మరుక్షణంలోనే తెలుసుకున్నాడు సత్యం.     ఆ రాత్రి భోజనాల దగ్గర కూర్చున్నప్పుడు సత్యం కేశవరావుగార్ని గురించి అడిగాడు. తను ఎన్ని ఉత్తరాలు రాసినా సంవత్సరంగా జవాబు లేదని చెప్పాడు తండ్రితో.     కేశవరావు విషయం అంతా చెప్పాడు చంద్రయ్య. ప్రస్తుతం హైదరాబాదులో వుండివుండా లన్నాడు. కాని ఎవరూ ఆనాడు కేశవరావు తమ ఇంటికి వచ్చి, సత్యానికి తన కూతుర్ని ఇవ్వాలని వుందని అన్నాడని చెప్పలేదు. చంద్రయ్యకు తెలుసు సత్యం మనసు. కేశవరావు యెడల సత్యం మనస్సులో ఎలాంటి కృతజ్ఞతాభావం ఉందో తెలుసు. అలాంటి సత్యం కేశవరావు కొరకు ఏమయినా చెయ్యగలడనీ, ఎలాంటి త్యాగం చెయ్యటానికయినా వెనుకాడడనీ తెలుసు. అందుకే ఆ విషయాన్ని అతని దగ్గర ఎవరూ ప్రస్తావించలేదు.     ఆ రాత్రి చాలాసేపు సత్యం కేశవరావుగురించి ఆలోచిస్తూ పడుకున్నాడు. మధ్యమధ్య కేశవరావు కూతురు, ఆకాశంలో కంటికి కనిపించని చిన్న నక్షత్రంలా తళుక్కుమంటూనే వుంది సత్యం స్మృతిపథంలో. ఎలాగయినా అతని అడ్రసు సంపాదించి హైదరాబాదు వెళ్ళి కేశవరావుగార్ని కలుసుకోవాలనీ, ఆయనకు తన కృతజ్ఞతలు తెలుసుకోవాలనీ నిశ్చయించుకున్నాడు.     కేశవగారుగారి అడ్రసు సంపాదించాలని ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. హైదరాబాదులో ఏదో స్కూల్లో పనిచేస్తున్నాడనేవారేకాని, ఫలానా స్కూలు అని ఎవరూ చెప్పలేకపోతున్నారు. సత్యం చాలా నిరాశ చెందాడు.     సత్యం వచ్చినప్పటినుంచి నియమంగా ఉదయం, సాయంత్రం పొలాలకేసి వెళుతున్నాడు. కుంచెలూ, స్టాండూ మొదలైనవి తీసుకొని మరీ వెళతాడు. ఇంట్లో ఉన్నప్పుడయినా ఎక్కువభాగం చదవటంతోనూ బొమ్మలు దిద్దుకుంటూ కూర్చోవటంతోను గడుపుతుంటాడు. రోజూ ఒక గంట సరళకు హిందీ, ఇంగ్లీషు నేర్పిస్తుంటాడు.     "ఏరా సత్యం! బి.ఏ. పాసయావుగా, ఏదయినా ఉద్యోగం చూసుకోకూడదూ?" చంద్రయ్య ఒకసారి చిన్నగా కదిలించాడు.     సత్యం ముఖం గంభీరంగా మారింది. ఓ క్షణం మౌనంగా వుండి "నాకు ఉద్యోగం చెయ్యాలని లేదు నాన్నా! అసలు నేను ఆ ఉద్దేశంతో చదవలేదు" అన్నాడు తల వంచుకుని వినయంగా.     చంద్రయ్యకు కొడుకు మాటలు చిత్రంగా వినిపించాయి.     "మరి ఇంత చదువూ చదివింది గీతలుగీస్తూ కూర్చోవటానికేనా?"     "అవును నాన్నా! ఆ గీతల్లోనే నా జీవిత పరమార్ధం ఇమిడి వుంది. అందులో లభించే ఆనందం నాకు ఏ పనిలోను లభించదు. నాకు పెద్ద ఆడంబరంగా బతకాలని లేదు. ఇంటిపట్టునేవుండి నీకు పెద్దతనంలో తోడుగా వుంటాను. పొలం పనులు చూసుకుంటా. స్వతంత్రంగా బ్రతుకుతాను" అన్నాడు సత్యం. ఆ స్వరంలో దృడమైన నిర్ణయం వినిపించి చంద్రయ్య అక్కడనుంచి లేచి వెళ్ళిపోయాడు. ఆ తరువాత మళ్ళీ ఎప్పుడూ ఆ విషయం కొడుకు దగ్గర ఎత్తలేదు.     ఒకరోజు మధ్యాహ్నం సత్యం ఒక చిత్రానికి ఫయినల్ టచెస్ ఇస్తున్నాడు. సరళ వెళ్ళి వెనగ్గా గమనిస్తూ కూర్చుంది. దూరంగా కొండలు, ఆ కొండల వెనుక జేవురు రంగులో సగం కనిపిస్తున్న సూర్యబింబం సంధ్యారాణి నొసటిమీద కుంకుమబొట్టు చెరిగినట్లుంది. పడమటి అరుణిమను పులుముకున్న ఆకాశం దగ్గరగా చెట్టు వుంది. చెట్టు క్రింద ఓ స్త్రీమూర్తి, గుడ్డల మూటమీద తమాషా భంగిమలో కూర్చొనివుంది. ముఖంలో అలసట కనిపిస్తోంది. అవయవాలు పొంకంగా, బలిష్ఠంగా వుండి మనిషి ఆకర్షణీయంగా వుంది. కడియాలువున్న కాళ్ళను తమాషాగా పెట్టుకొని కూర్చొంది. సరళకు ఆ స్త్రీమూర్తిని ఎక్కడో చూసినట్లనిపించింది. మళ్ళీ మళ్ళీ చూసింది. ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసుకొని మరీ చూసింది.     సందేహం లేదు. తమ ఇంటి చాకలి కోడలు, దానిపేరు మాణిక్యం. మాణిక్యం ఇంత అందంగా ఉంటుందా? తనకు ఎప్పుడూ అది అందంగా కనిపించలేదే? బావ దాని బొమ్మను వేశాడు అంటే అది బావకళ్ళకు చాలా అందంగా కనిపించివుండాలి. అందుకే బొమ్మను అంత అందంగా వేశాడు. కాని బావ అచ్చం దానిలాగే వేశాడు. ప్రత్యేకంగా అది అందంగా కనిపించాలని ఏమీ నగలూ గట్రా వెయ్యలేదే! మరి బొమ్మలో అది అంత అందంగా ఎలా వచ్చింది? తను అందంగా ఉంటుందని అందరు అంటారు. ఆ మాణిక్యం అయితే మరి తన అందాన్ని కళ్ళార్పకుండా చూస్తుంది బట్టలు తెచ్చినప్పుడల్లా. తన బొమ్మ గీస్తే- ఆ బొమ్మ ఇంకెంత అందంగా ఉంటుందో!     కాని బావ తన బొమ్మ గీస్తా ననలేదు. పైగా ఒక్కనాడయినా తన అందాన్ని మెచ్చుకోలేదు. చివరకు బావ కళ్ళకు తనకంటే మాణిక్యం అందంగా కనిపించిందన్నమాట!     పని పూర్తిచేసుకొని నిల్చున్న సత్యం దృష్టిని సరళ ఆకర్షించింది.     "ఏమిటి సరూ! అలా కూర్చున్నావు? బొమ్మ బాగుందా?" అన్నాడు సత్యం.     "ఊ" అని మాత్రం వూరుకుంది సరళ ముభావంగా.     "అందులోవున్న బొమ్మ ఎవరో తెలిసిందా?" సత్యం ప్రశ్నకు సరళకు వళ్ళు మండింది.     చాలా గొప్ప ప్రశ్నే! రోజూ చూసే మాణిక్యం, తన మురికి గుడ్డలు ఉతికే మాణిక్యం గురించి ఎంత గొప్పగా ప్రశ్నిస్తున్నాడో?     "ఏం బావా, మాణిక్యం నీకు అంత అందంగా కన్పించిందా?" సరళ స్వరంలోని తీవ్రతకు సత్యం బొమ్మమీదనుంచి తన కళ్ళను సరళ వైపుకు తిప్పాడు.     "మాణిక్యం అంత అందంగా నేను లేనూ!"     సత్యం సరళ ముఖంలోకి గుచ్చి చూశాడు. సత్యం పెదవులపైన సన్నని హాసరేఖ కదిలింది.     "దేనికంటే ఏది అందమైందో చెప్పటం కష్టం సరళా! ఒకో వస్తువుకు, ఒకో ప్రాణికి, ఒకో వ్యక్తికి, ఒకో రకమైన అందం వుంటుంది. నా కళ్ళకు సృష్టిలోని ప్రతి వస్తువులోను ఏదో రకమయిన అందం కనిపిస్తుంది. చూసేకళ్ళూ, అనుభవించే సంస్కారంగల హృదయమూ ఉండాలి."     సరళకు సత్యం మాటలు సరిగా అర్ధం కాలేదు. అర్ధం అయిందల్లా తనూ, మాణిక్యం ఇద్దరూ భావ కళ్ళకు అందంగానే కనిపిస్తాము. సరళకు రోషం తన్నుకొచ్చింది.     "నువ్వు అందంగా లేవని నేను ఎప్పుడయినా అన్నానా?" అన్నాడు ఆప్యాయం ఉట్టిపడే స్వరంతో, చిన్న ముఖం చేసుకున్న సరళను అనునయిస్తున్నట్లు.
24,970
     "నాన్సెన్స్! అసలు ఈ సైనేడన్నది......" రాజేంద్ర సైంటిఫిక్ గా ఏదో మాట్లాడబోతుంటే వారించింది కిన్నెర.     "మీరలా ఆవేశపడకండి అన్నయ్యగారూ! ఈ మధ్య మా నాన్న తరచూ దినపత్రికలు చదువుతూ ఎల్ టిటిఇ ఆత్మాహుతి దళం గురించి మాట్లాడ్డం గుర్తుకొచ్చి సమయస్పూర్తితో ఆ పదాన్ని వాడాను."     "హార్ని!" అనుకున్నాడు రాజేంద్ర.     తరతరాల వైషమ్యాలు చెరిగిన రెండు కుటుంబాల చిత్రపటానికి కిరణాల కుంచెతో పచ్చని ఛాయను అడ్డుతున్నట్టు సూర్యుడు ప్రకృతి వేపు నిశ్చేష్టుడై చూస్తున్నాడు.                                                                    *    *    *    *    *     "బావగారూ! ఏది ఏమైనా మీరో విషయం అంగికరించి తీరాలి" అన్నారు వీర్రాజు ఎదురుగా కూర్చుని మందు సేవిస్తున్న భోజరాజుని చూస్తూ.     "మా అమ్మాయి కిన్నెర మహా అసాధ్యురాలు. మన కళ్ళు తెరిపించింది."     "ఒప్పుకోను బావగారూ" ఉక్రోషంగా అన్నారు భోజరాజు వియ్యంకుడ్ని చూస్తూ.     "మన కళ్ళు తెరిపించింది మా రజని అన్నది నా అభిప్రాయం. అసలు రజని గర్భవతే అయ్యుండకపోతే యీ కధ యిలాంటి మలుపు తిరిగేది కాదుగా.     "అదే నిజమైతే మా అబ్బాయి ఉదయ్ ని అభినందించాలి."     "దేనికి?"     "వంశ వృద్ది చేయలేని కుటుంబం దేశ పురోభివృద్ధికి ఎలా పాటుపడగలదనే మీ మాటకి బదులుగా మా అబ్బాయి మీ అమ్మాయికి కడుపు చేసినదుకు."     "అసలు మా అమ్మాయి ఒప్పుకోకపోతే మీ అబ్బాయికి అది ఎలా సాధ్యమయ్యేది?" మంటగా అనేశాడు భోజరాజుగారు.     "అలాంటి అవకాశమిచ్చిన మా అమ్మాయిని అభినందించాలి"     "అవకాశం యిస్తే మాత్రం అది నిరూపించుకోటానికి ముందు అబ్బాయిలో సత్తా ఉండాలిగా."     "సత్తా వున్నా గాని మీ కిన్నెర విషయంలో రాఘవ ఫెయిలయ్యాడుగా."         "దానికి కారణం పందెం కాసిన మీ భవ్యేగా"     "అంటే అప్పుడు మా భవ్య మీ వంశవృద్దిని ఆపి గెలుపు సాధించి నట్టేగా?"     "ఇది మీ భవ్య గెలుపెలా అవుతుంది. అలాంటి నిగ్రహాన్ని పాటించిన మా కిన్నెరని అభినందించాలి గాని."     "అయ్యా!" ఇక నిభాయించుకోలేకపోయాడు యిద్దరి నడుమ కూచుని అప్పటికే హాఫ్ బాటిల్ మందు కొట్టేసిన రాయుడు. "అర్ధరాత్రి మద్దెల దరువు నాకేం నచ్చడం లేదు. ఇంతకాలం విడివిడిగా మిమ్మల్ని కలుసుకుని బుజ్జగించే నేను యిప్పుడు మీరిద్దరూ వియ్యంకులై పోయిన యీ తరుణంలో ఎవర్ని సమర్ధించాలో తోచడం లేదు."     కొన్ని క్షణాల పాటు చీకటిని చూస్తూ టెర్రేస్ పై నిలబడ్డ వీర్రాజుగారు హటాత్తుగా ఏదో గుర్తుకొచ్చినట్టుగా అన్నారు "అసలు నిన్ను అభినందించాలి రాయుడు.....ఎందుకంటే......"     "ష్....."పెదవులకి అడ్డంగా వెలినుంచారు భోజరాజుగారు ఉన్నట్టుండి ఏదో చప్పుడు వినడంతో.     "ఏమైంది?" అడిగాడు వీర్రాజు ఉత్సుకతగా.     "ఏదో ఆర్తనాదంలా వినిపిస్తేను"     "ఎక్కడి నుంచి?"     "బహుశా మీ కిన్నెర గదిలో నుంచనుకుంటాను"     ఈ అపరాత్రివేళ అలాంటి శబ్దం వినిపించేది ఏ స్థితిలోనో తెలిసినట్టు వెంటనే రియాక్టయిపోయారు. "తప్పకుండా ఆ చప్పుడు మా అబ్బాయి ఉదయ్, మీ అమ్మాయి రజనీ వున్న గదిలోనుంచని నా నమ్మకం."     "అబ్బే!" మరోమారు ఖండించేశారు భోజరాజుగారు.     "ఇది తప్పకుండా మీ కిన్నెర, రాఘవల గదిలో నుంచన్నది నా అభిప్రాయం."     `"మీరు పొరపడుతున్నారు బావగారు!"     "మీరే"     "అసలు మా కిన్నెర అంత బలహినురాలు కాదు"     "మా రజని మాత్రం......"     "అయ్యా" అర్దిక్తిగా ఖండిస్తూ తల పట్టుకున్నాడు రాయుడు. "అక్కడికి ఆ చప్పుళ్ళని మీ శరీరాలపై పడే హంటర్ దెబ్బలుగా భావించి మీరిలా రెచ్చిపోవడం న్యాయం కాదు" అంతకన్నా అపరాత్రి వేళ మీ మీ వంశాభివృద్ది జరుగుతున్న మోతగా ఆలోచిస్తే నయం....."     ఇది నిజంగా న్యాయమనిపించిందిద్దరికి.     ఆ తర్వాత ఏ గదిలో నుంచైనా గాని నిన్నటి తరంపై నేటి తరం సాధించిన విజయానికి సంకేతల్లా నవ్వులు, కేరింతలు వినిపించాయి చప్పుళ్ళకి బదులుగా......     మీసాలు మేలేశారిద్దరూ ఒకేసారిగా.     పడమటి దిక్కు నుంచి వేగంగా సాగి వచ్చిన ఓ గాలి అల తూర్పు గుండెల్లోని పూర్పుగా మారి మార్పుకి సంకేతమైంది.                                                        _____శుభం_____ 
24,971
    చెన్నపట్టణం  నుంచి  ఆరోజు ఉదయానికి  తెనాలికి నా పేర  వేలకొలది  గులాబిపూలు  వచ్చే  ఏర్పాట్లు  చేశాను. చుట్టుప్రక్కల  గ్రామాలనుంచి బుట్టలు బుట్టలు మల్లెమొగ్గలు వచ్చేటట్టు చూచినాను. అనేక  రకాలైన పళ్ళు  చెన్నపట్నం నుంచి వచ్చినవి.  చబుల్ దాసునుండి నగల ప్యాకెట్టు  వచ్చినది.  నూట యాభై  రూపాయల  బెంగుళూరిచీర  జిలుగులు  తళుకులున్న వికుసుంబాపువ్వు వంన్నెకలది కొన్నాను. దానిమ్మ  పూవురంగు  పట్టురవిక  కుట్టించాను.     మా పురోహితుడు  పెట్టిన ముహూర్తం  పదినిమిషా  లుందనగా  శకుంతలను  ఆ చీర  పసుపు పెట్టి కట్టుకొమ్మన్నాను. ఆ రవిక  తొడుక్కోమన్నాను. మా గదిలో తూర్పువైపు  గోడదగ్గిర  కమలపుపట్టు  వేశాను. ఆ పీట   పైసరిగ  పూలపట్టు  రూమాలు పరచినాను,  దానిపై  వేయి  గులాబిపూవులు  చల్లినాను. ఆ పీటపై  శకుంతలను  కూర్చోమన్నాను.     '' ఇదేమిటండీ?''     '' శకూ, నేను   చెప్పినట్లు  చెయ్యి , దీనిలో ఒక పరమార్థముంది. అది తర్వాత  చెప్తా!''     శకుంతల  వెరగుపడిన  చిరునవ్వుతో  ఆ  పీటలమీద  కూర్చున్నది. ఆమె మోము కోలనైనది. స్నిగ్ధమై, మెత్తనై,  కమల  కుట్మలాలైనవి  ఆమె చెక్కిళ్ళు. వెడదలై, సోగలై, నల్లని  పొడుగాటి  రెప్పలు  కరిగిన వామె కన్నులు.  సమంగా వచ్చి చిట్టచివర   సెలయేటి  వంపు  తిరిగిన దామె ముక్కు. పల్చనై, వెడల్పు తక్కువైన  కనకాంబర పూపుటము  లామె ముక్కు పుటములు.  కుడిముక్కు పుటాన   ఏడురవ్వల బేసరి ఉంది.  పై పెదవి పై భాగము  ఒత్తుగా  వికసించైన  కాశ్మీర  కుసుమ క్షేత్రంలా ఉంది. మధ్య నొక్క చిన్న  పాలయేరులా ఉంది. ఉదయించే సూర్యుని  పై   అంచు వంపుకు, అందాలు దిద్దే పై పెదవి  రేఖకు  రెండు వంపుటంచులు. ఆ పైపెదవి సూర్యకిరణాలు  ప్రసరించిన  పాలసముద్రపు వీచిక. వీచికల తాకుడుచే  మధింపబడి, తేరిన  వంపు వెన్నె  రేఖపై   అరుణకిరణాలు ప్రసరించిన   క్రింద పెదవి, కొంచం విడివడిన  ఆ రెండు  పెదవుల మధ్య, తఱిమెన   పట్టిన ఆణిముత్యాల వరుస ఆమె పళ్ళు. వసంతకాలపు మధ్యాహ్నాలమాల  ఆమె పళ్ళు వరుస. పాలసంద్రంలోని   సహస్రకమలముకుళ  మామె చిబుకము.     ఆకసపు లోయలోని  స్వర్ణది  ఆమె కంఠము. ఆమె బుజాలు ఉదయ సాయంకాలాలు. లోకంలోని  మధురాలు  సేకరించి, కరిగిన  బంగారులో ఒలికించి, పోతపోసి, మొనలుతేల్చి, ఆ మొనలపై  స్విన్నత  నందిన సరస్వతీ  కంఠహారసోణ రత్నాలు పొదిగినవి  ఆమె ముగ్ధవక్షోజాలు. ప్రాణముపోసి కొన్న బంగారువర్ణం ఆమె దేహకాంతి, శిల్పుల   తపఃఫలం ఆమె రూపం.     ఆమెను పూజించాను.ఆమెకు  షోడశోపచారాలు  అర్పించాను. మల్లె పూలు  వర్షము కురిపించాను. గులాబిపూలు  ధారలు  కట్టాను. మాలతీ  జాజీ మాధవీ పుష్పాలు  దోసిళ్ళర్పించాను. ఆణిముత్యాలు  గుప్పిట సేసలు చల్లాను. నగల అర్పణలిచ్చాను. ఆమె  ఎదుట  మోకరిల్లాను. మృదులాలై, సౌందర్య శ్రీలు చెన్నారే, ఆమె చిన్నారి  పాదాలు నా హృదయాన్ని చేర్చుకొని  ఫాలానా అదుముకొని ప్రతివేలు, పాదము యావత్తూ తనివోవ ముద్దు పెట్టుకొన్నాను.     ఆమెను సువ్వున పూలమాలలా  యెత్తి  నా హృదయాని  కద్దుకొని, తీసుకొనిపోయి, మా తల్పం మీద పరుండబెట్టాను.  ఆమె వివశయై  ఈ లోకంలో లేదు. ఆమె మోము దివ్య కాంతులు  ప్రసరిస్తున్నవి. '' శకుంతలా! శకుంతలా!''  అని  భయముతో,  డగ్గుత్తికతో  పిలిచాను. ఆమె చైతన్య రహితయై  మారు పలకలేదు. '' శకుంతలా! శాకుంతలా!'' అని అస్పష్టంగా వణికిపోతూ, నా కన్నుల నీరు జల జల  వర్షిస్తుండగా  పిలిచాను.     ఆమె చిరునవ్వు నవ్వుతూ కన్నులు తెరిచింది. బంగారు వెన్నెల కిరణాలైన  ఆమె చేతులు  రెండూ నావైపు చాచి '' నేను  మీ పూజకు తగుదునా  ప్రాణేశ్వరా!'' అన్నది.     '' నా సర్వస్వము, నా తపస్సు, నా జన్మాశ్రయం, నీ పాదాల మ్రోలకాదా  శకూ!''     '' ఈ కల వినండి! మీరు  పూజించగానే, నేనో గంధర్వ  బాలికనై ఒక విమానంలో ఎగిరి వెడుతున్నానట. '' నా ప్రాణేశ్వరుడేడీ'' అని దిక్కులు  చూస్తూ  వణికిపోతూ  విమానంమీద  కూర్చున్నాను. ఆ విమానం తిన్నగా  చంద్రలోకం  పోయిందట. అక్కడ ఓ కలవపూవుపై  నామూర్తే  పవళించి నిదురపోతూన్నదట. నేను వెళ్ళగానే ఆమూర్తి  పెదవులు  కదిపి '' నేను పూర్ణరూపాన్ని. నువ్వు  నాలోసగం.  పూర్తిగా  మన తపఃఫలాన్ని  నువ్వెలా అనుభవిస్తావు?'' అన్నదట!  భయపడి  ఆమె పాదాలమీద  వాలానట. ఇంతట్లో మీరు  '' శకుంతలా!'' అని  దూరాన్నుంచి నన్ను  పిలిచినారు, విని కూడా లేవలేకపోయాను. మళ్ళీ మీ పిలుపు  వినబడింది. లేచాను. ఇంతలో నాకు మెలకువ వచ్చింది. నాకు చాల భయం వేసిందండీ.!''     '' శకుంతలా! నువ్వు లేవకు, తలగడపై  చెయ్యి  ఉపధానం చేసుకొని  పడుకో! నీ మీద  నా పాట నీకు  అంకితం  ఇవ్వాలి, నీవు రాణివి, నేను నీ కవిని.                                                           '' ఓ దేవీ! నీ  దివ్యజన్మకే                                                             నాడు సర్వస్వమ్ము ఇత్తునో!                                                             నా జన్మ,నా బ్రతుకు, నా కలలు                                                             ఏ జీవితాద్భుత  రహస్య  మ్మొ                                                             ప్రత్యక్ష  మొనరింపవచ్చేనో                                                             ప్రజ్వలిత  మొనరింపవచ్చేనో!                                                             ఆ దివ్య  సిద్ధియే నీవునై                                                             ఆ దివ్య మోక్షమే నీవునై                                                             నీ పరమ  పాదాబ్జముల నేను!                                                             నీ పవిత్ర హృదయాన  నేను.''     అని పాడి, మంచముకడ  మోకరించి, పరుపు  అంచుననున్న  ఆమె పాదాలపై  నా మోము నంచినాను. ఆమె లేచి  నా చేతులు  రెండును పట్టి  తనకడకు  లాగుకొని, నీరు తిరుగు కన్నులు  వాన వెలిసిన చంద్రకాంతిలా  మెరిసిపోవ, నా మోము చూస్తూ '' మీరు  నా దేవుళ్ళు, నా సర్వస్వమూ మీలోని  భాగం,  మిమ్ము  మీరు పూజించుకొంటారా? మనం  ఇద్దరం కలిసి పూర్ణ రూపం  అవుతాము. ఆ పూర్ణపురుషునిలోని దివ్యత్వం మీరు, నేను మానవత్వాన్ని, నేను మిమ్ము పూజించాలి. అదే  కాదూ, సీతా, సావిత్రీ  మొదలైన  వాళ్ళు  చెసిందీ?  అదే నిజం!'' అన్నది.         
24,972
"చిన్నపిల్లని అక్కడా యిక్కడా పెట్టకపోతే నేరుగా వాళ్ళమ్మకే యిచ్చేయకపోయావా?" కోపంగా అడిగాడు సుబ్బయ్య. ఈ మాటలకు ఉలిక్కిపడ్డాడు జాన్ కళ్ళు పెద్దవి చేసి సుబ్బయ్యని చూశాడు. యమ్మాయమ్మకి ఆశ్చర్యం కలిగింది. "ఆ యింటి చుట్టుపక్కల మన చుట్టాలు మఫ్టిలో తిరుగుతున్నారు. ఆ వూబిలో పడితే బయట పడ్డట్టే ఒక్కక్కడు న రక్తమాంసాలు పీల్చి గాని వదిలిపెట్టడు." "కాని తాతయ్య- అతడికి బ్రోతల్స్ తో సంబంధాలున్నయన్నావు కదా! రాగ లాంటి అందమైన పిల్లని అతడికప్పగిస్తే వూరుకుంటాడా?" "తాతయ్య బ్రోతల్స్ నడపడు. బ్రోతల్స్ లో విసిరేసి పారేసే మగ పిల్లల్ని చవకగా కొని మారు బేరానికి అమ్ముతుంటాడు. మాట తప్పలేదింతవరకు." మాట్లాడలేదు సుబ్బయ్య ఆలోచిస్తూ కూర్చున్నాడు. జాన్ మొహం కోపంతో రగిలిపోయింది. "నాకు పాప నేనా యియ్యాలా! డబ్బు లేనా యియ్యాలా! లేకపోతే ఎన్ని మర్డర్స్ అయినా సేసేత్తా" అతడి బెదిరింపులకు భయపడలేదు సుబ్బయ్య. శాంతంగా "జాన్! నీలో ఎందు కిలాంటి విపరీత బుద్ది? పసిపిల్లల్ని రేప్ చెయ్యాలనే కోరిక ఎందుకు కలుగుతుంది నీకు?" అడిగాడు. వదలిపోయింది జాన్ ముఖం. మనసులోని పచ్చి పుండుగా వున్న అతి సున్నితమైన చోట సూదితో గుచ్చినట్లయింది. రోషంతో కళ్ళు భగ్గుమన్నాయి. భరించలేని బాధ అణుచుకుంతున్నట్లు పళ్ళు గిట్టకర్చుకున్నాడు. సుబ్బయ్య జాన్ భుజం మీద చెయ్యి వేసి, "బ్రదర్! ఏం జరిగిందో నాకు చెప్పు? ఇలాంటివి మనసులో పెట్టుకుని కుమిలెకంటే బయటికి చెప్పెస్తే సగం బరువు తగ్గుతుంది కనీసం మనసులో. మనమైనా నిజాయితీగా- నిర్భయంగా మట్లాడుకుందాం" జాన్ చెప్పాడు వివరంగా- అప్పట్లో జాన్ పేరు గోవింద్ మాత్రమే. జాన్ చేర్చుకోవలసిన అవసరం కలుగలేదు. ఎక్కడో అడవుల మధ్య గిరిజన గ్రామం లో పుట్టాడు. గొర్రెలు మేపుకుంటూ కొండ సెలయేళ్లలో ఈతలు కొడ్తూ తోటిపిల్లలతో పులి-మేక, కోతి కొమ్మచ్చులు ఆడుకుంటూ చీకు చింత లేకుండా కాలం గడిపేవాడు. అతని వయసు పన్నెండేళ్ళయినా అతని వొంటి మీద గోచీ గుడ్డ తప్ప మరో బట్ట వుండేది కాదు. ఆ గిరిజన గ్రామాల్లో పిల్లలకి ఎవరికైనా అంతే. ఆ రోజు పట్నం నుంచి గోవిందు మావయ్య వచ్చాడు. పన్నెండేళ్ళు నిండాక జేవితంలో మొదటిసారిగా నిక్కరు షర్టు వేసుకున్నాడు గోవిందు. అవి రెండే అతని బతుకు మొత్తాన్ని మరో మార్గం పట్టిస్తాయని అతనికి తెలియదు. గోవింద్ మావయ్య, తండ్రి చాలా సేపు మాట్లాడుకున్నారు. "నాతో పట్నం వస్తావురా?" అన్నాడు గోవిందు మావయ్య. "ఓ! అన్నాడు సంబరంగా. వాళ్ళ ఊహల్లో పట్నం అంటే ఏదో అద్భుత ప్రపంచం అలా మావయ్యతో కలిసి యమలోకంలో అడుగు పెట్టాడు గోవింద్. ఆకాశాన్నంటే మేడలు, అద్దాల షాపులు, నిండా రకరకాల తిను బండారాలు- బట్టల షాపుల్లో రంగు రంగుల బట్టలు- అన్నీ తనకోసమే అనుకున్నాడు. అమయకంగా ఆ లోకంలో తన స్టానమెక్కడో తెలియని గోవిందు మావయ్య చెయ్యి పట్టుకుని సంబరంగా గెంతులు వేస్తూ నడిచాడు. పర బ్రహ్మం గారింట్లో చేరుకున్న రెండో రోజుకే యీ లోకంలో తన స్థాన మేమిటో అర్ధమైపోయిందతనికి. పర బ్రహ్మంగారింట్లో పనికి కుదిర్చి నెలకు యాభై రూపాయల జీతం మాట్లాడుకుని వెళ్లిపోయాడు మావయ్య. ఆ యింట్లో వున్న ఖరీదైన సోఫాలు- అద్దాల షోకేసులో వున్న వింత బొమ్మలు తానెప్పుడు విని యెరుగని పాటలు పాడే రేడియో అన్నిటిని కళ్ళప్పజెప్పి చూస్తున్న గోవిందు, "దేభ్యం వెధవా! అలా బొమ్మలా నిలబడితే ఎలారా? వచ్చి యీ గ్లాసులు కడుగు." అనే అరుపుతో యీ లోకంలోకొచ్చాడు. "వీళ్ళు చెప్పినట్టల్లా విను- బుద్దిగా వుండు." అనే మావయ్య మాటలు గుర్తొచ్చి ఒక్క పరుగున వెళ్ళి గ్లాసులు కడిగియిచ్చాడు. ఆ క్షణం నుంచి ఆ యింట్లో అతడు యంత్రంలా తిరగడం తప్ప ఒక చోట పట్టుమని పది నిముషాలు కూడా కూర్చోలేక పోయేవాడు. ఎప్పుడూ ఏదో ఒక పని. "ఈ గ్లాసులు కడుగు బల్లతుడువు- సిగరెట్లు పట్రా- చెత్త పారబోయి- బట్టలిస్త్రి కిచ్చిరా- " ఇలా ఏదో ఒక పిలుపు చెవుల్లో గింగురుమంటునే వుండేది. ఇలాంటి పిలుపులు అలావాటయి పోయి ఎప్పుడన్నా ఖాళీగా వున్న ఎవరో పిలుస్తున్నట్లే భ్రమపడి ఉలిక్కిపడేవాడు. ఆ యింట్లో మనుష్యులందరిలో శమంత అంటే అతనికి చాలా ఇష్టంగా వుండేది. శమంత ఏడేళ్ళ పిల్ల బొద్దుగా ముద్దుగా చురుగ్గా వుండేది. చిన్నపిల్లలకి సహజంగా చిన్నపిల్లలంటే యిష్టం కలుగుతుంది. శమంతతో కలిసి బంతి ఆదుకోవాలని, ఆ పిల్ల చదివే బొమ్మల పుస్తకాలు చూడాలని ఎంతో ఉబలాటంగా వుండేది గోవిందుకి. శమంత మాత్రం గోవిందుని ఒక పురుగులా గోవిందుని ముట్టుకోనిచ్చేది కాదు. తన ఫ్రెండ్స్ తో శమంత ఆడుకుంటున్నప్పుడు కుతూహలం పట్టలేక గోవిందు రహస్యంగా తలుపు చాటున నిలబడి తొంగి చూస్తుంటే "యూ , డర్టీ రోగ్," అని గొడుగుకర్రతో గోవిందుని చితకబాదింది. గోవిందు ఏడుస్తుంటే యింట్లో ఎవరూ ఓదార్చలేదు. శమంతని మందలించలేదు సరికదా ఎదురు గోవిందునే "దొంగవెధవలా అక్కడ నిలబడి నిన్నెవరు చూడమన్నారు?" అని తిట్టారు. గోవిందుకి తగిలిన దెబ్బల్ని ఎవరూ లక్ష్యపెట్టలేదు. ఆ పిల్ల మీద కసి మొలక చూసింది. అతని లేత మనసులో. ఆ పిల్ల యెప్పుడు స్వీట్స్- చాక్లెట్స్ తెప్పించుకుని తింటుండేది. వాటిని ఆశగా చేసే గోవిందుని చూసి హేళనగా నవేది. అక్కడితో ఊరుకోక సీటుని నోటితో కొరికి అతని ముందుకి విసేరేసేది, దుమ్ములోకి, తిండి మీద ఆశ చంపుకోలేక గోవిందు దుమ్ములోది ఏరుకుని దులుపుకు తింటుంటే హేళనగా నవ్వి "డర్టీ!" అని ఏడిపించేది. మొదట్లో డర్టీ అంటే ఏమిటో అర్ధం కాక గోవిందు అమాయకంగా నవ్వితే, "ఈడియట్- ఫూల్- క్రాక్-" అంటూ మరింత హేళనగా నవేది. ఆ మాటలకి అర్ధాలు తెలియకపోయినా ఆ నవులో హేళన అర్ధమై మనస్సు చివుక్కుమంది. తరువాత చినబాబు నడిగి ఆ మాటలకర్దాలు తెలుసుకున్నాక రోషంతో మనసు మండింది. శమంత మీద కసి పెరిగింది. అయితే ఆ వయసులో అతనికి తెలియని మరొక విషయం వుంది. కసితో పాటు ఏదో ఆరాధన భావం కూడా తనలో వుందని. ఇంటి యజమానురాలు ఏదో పని మీద ఊరికెళ్ళింది. " ఏయి గోవిందు!" అని కేక పెట్టింది శమంత బాత్రూమ్ లోంచి. బ్రాత్రూమ్ బయట నిలబడి, "ఏంటండమ్మాయిగోరూ!" అన్నాడు గోవిందు. మొదట్లో అతను అందరిలా శమంత అని పిలిస్తే పరబ్రహ్మంగారి భార్య వాడిని రెండు కొట్టి, "వెధవా! పేరు పెట్టి పిలుస్తావా? అమ్మాయిగారూ అని పిలు," అని కసిరింది. "ఒరేయ్! వచ్చి నా వీపు రుద్దు, "మళ్ళీ లోపల్నించి అరిచింది. తన చెవులను తనే నమ్మలేకపోయాడు గిరిజన గ్రామాల్లో సైతం ఆ వయసులో ఆడపిల్లలెవరు మగపిల్లల్ని వీపులు రుద్దటానికి పిలిచేవారు కాదు. సంకోచిస్తూ నిలబడితే, "రావేరా!" అని మళ్ళీ కసిరింది. లోపలి కెళ్ళాడు. తడివంటితో నగ్నంగా వున్న శమంతని చూడగానే అతడి వొంట్లో ఏదో చిత్రమైన కదలిక కలిగింది. సబ్బు తీసుకుని వీపు రుద్దుతొంటే చేతివేళ్ళకి లేత శరీరం పుపులా సోకి అతని శరీరంలోకి విద్యుత్తరంగాలని పంపింది. అతడు మళ్ళీ మళ్ళీ రుద్డుతుంటే, " ఎంత సేపు రుద్దుతావు? ఇంకపో!" అని కసిరింది. బిక్కమొహం వేసుకుని బయటికొచ్చేశాడు ఆ మరుసటి రోజు కూడా అలాగే పిలిచింది. ఎలాగో అయిపోతున్నాడు గోవిందు. అతనికి మాయలోకంలోకి వచ్చినప్పటి నుంచి ఒకేమాట పదేపదే వినిపిస్తూ వచ్చింది. అది డబ్బు........డబ్బు..........డబ్బు ఎవరి నోటంట విన్నా యీ రెండక్షరాలే డబ్బుంటే మంచి స్వీట్స్ తినొచ్చు, కార్లల్లో తిరగొచ్చు- మంచి బట్టలు వేసుకోవచ్చు డబ్బు లేకపోతే పాచిపోయిన అన్నానికి కూడా గతుండదు. తిట్లు అవమానాలు చిదరింపులు భారిస్తుండాలి. చిరిగిపోయిన నిక్కరు చొక్కా తప్ప మంచి బట్టలు వేసుకోవాదానికి వీలుండదు. ఇది అతనికి తెలిసింది.
24,973
    " థాంక్ గాడ్!"  పోనీ తను బావుంది."     "టీ త్రాగుతావా బాబూ!"     " వద్దు...." అంటుండగానే కరీమ్ చాచా హడావుడిగా లోపలికి వచ్చాడు.     "నీకు అక్కరలేదేమో, నాకుకావాలి..." అంటూ కూర్చున్నాడు.     " ఖాదరి సాబ్ మీ అల్లుడని చెప్పలేదేం చాచా!"     " నాకు అతను ఈ ఊరు వచ్చుతున్నట్టు చెప్పలేదు బేటా. రేపు మాఇంట్లో బువ్వ తినాలి. మీ చాచి చెప్పమంది."     "రేపా యెందుకు!"     "సేతా బేటీ పోతుంది అందుకు."అన్నాడు. పార్వతమ్మ ఇచ్చిన టీ త్రాగి అతను వెళ్ళిపోయాడు.     అతడికి రాధికను చూడాలనిపించింది. ఇంటికి వెళ్తే తండ్రి చేసే వెటకారం గుర్తుకు వచ్చింది. ఆయన బ్రతుకలేక వచ్చావు అంటాడు.     అయినా  మెల్లగా ఇంటికి వెళ్ళాడు. తండ్రి  లెనట్టున్నాడు నిశబ్దంగా వున్నది.     "అన్నయ్యా...." రాధిక వచ్చి అన్న చేతులు పట్టుకుంది.     "ఏమ్మా బావున్నావా!" అన్నాడు ఆమె భుజాల చుట్టు చేతులు వేసి. యశోదమ్మ ముఖంలోకి కాంతి వచ్చింది.     "ఇన్నాళ్ళకు, అమ్మ,చెల్లి గుర్తుకు వచ్చారుట్రా!"     "ప్రతి నిమిషం గుర్తుకు వస్తూనే ఉన్నారు. మీరు రావద్దన్నారు. కదా." అన్నాడు.     ఆమెకు  ఆవేశంగా ఎన్నో అనాలని ఉన్నది కాని  అంటే కొడుకు తనకు దొరుకకుండా పోతాడు.     "రిజల్ట్స్ వస్తే అమ్మకు కనిపించవా!ఈ అమ్మ బాధ అక్కరలేదు..."     "లేదమ్మా! నాన్నగారి నిఘ్టారాలు గుర్తుకు వచ్చిరాలేదు. బయటికి వచ్చి చూడమ్మా, మనగురించి యెంత గొప్పవిషయాలు వినిపిస్తాయో"     "నాకు తెలుసురా."     ఇద్దరికి ఆమె సున్ని వుండలు పెట్టింది.     "వీళ్ళు ఇంత దారుణానికి వడి కడతారని తెలిస్తే నేను చచ్చినా శ్రీనివాస్ పేరెత్తె దాన్ని కాదు." అన్నది ఏడుస్తూ.     " ఏడ్వవద్దు రాధీ! ఏడ్చి ఏం సాధిస్తాం."     అదే అనిపిస్తుంది. నాలాంటిది బ్రతికి ఏం సాధిస్తుంది.     " రాధీ!నువ్వు మళ్ళీ చదువాలమ్మా."     "అన్నయ్యా! వెళ్ళిపో.... అదిగో జీపు శబ్దం. కోడల్ని పరామర్శించటానికి వెళ్ళాడు. మన నాన్న.... "అన్నది రాధిక.     సిద్దార్థ లేచాడు.     "సిద్ధూ! రేపు పుట్టినరోజు . నేను కోరికలు ఏం తీర్చలేక పోయినా ఇంత పాయసం వండి పెట్టగలను నాయనా. "అన్నది.     అలాగే వస్తానమ్మా." అన్నాడు.     అతను చర,చర వెళ్ళిపోయాడు.                                     17     తల్లి ఇచ్చిన కొత్తకి  లాల్చి వేసుకుని ఆమె పెట్టిన పాయసం తిన్నాడు.రాధిక నవ్వుతూ అన్నగారి క్రాపు దువ్వింది.     "  లంచ్ వరకుండన్నయ్యా."అన్నది.     "ఉండటానికేం ?అక్కడ కరీమ్ చాచా పిలిచాడు"అన్నాడు.     "వెళ్ళు ! ఈరోజు నాన్న త్వరగా వస్తాడు." అన్నది.      "నువ్వంత దిగులుగా ఉండవద్దు రాధీ నువ్వు నవ్వుతూ ఉండాలమ్మా. మనిషి జీవితంలో చీకటి,  వెలుగు, సుఖం , దుఃఖం ఉంటాయి." అన్నాడు.         "అందుకే బ్రతికాను"అన్నది.     అతను గేటు దాటుతుండగా బేబి, బబ్లు  పరుగెత్తుకుంటూ  వచ్చారు. చిన్నాన్నా,  'చిన్నాన్నా'అంటూ
24,974
     "నీ ఉపన్యాసాలు కాదు నాకు కావాల్సింది ఇన్ని  తెలిసినవాడివి చట్టాన్ని నీ చేతుల్లో కి తీసుకోవడం తప్పని తెలీదా?"     రాబర్టు లేచి నించున్నాడు అతని పెదవులపైన  ఓ తాత్విక మయిన చిరునవ్వు తేలిపోయింది.     "చట్టం గుడ్డిది కమిషనర్ కేవలం సాక్షులు చెప్పేమాటలు విని ఆ మాటలమీద ఆధారపడిపోతున్న చట్టం ఓ పారస్తేట్ లాంటిది కమిషనర్ ప్రభుత్వానికి చేవూలూ చట్టానికి కళ్ళూ కావాలి. ఆ కళ్ళు లేకపోబట్టి ఇన్నేళ్ళూ పాపం మీరు నాకోసం శ్రమపడి వెదికారు. బహుశా నేనే దొరికివుంటే  నేను నిర్దోషినన్న సాక్ష్యాధారాలు నాకు  లేవుగనక ఏనాడో  నన్ను 'ఉరి' తీసేసేది చట్టం.     వందమంది నేరస్తులు తప్పించుకు పోవచ్చు కానీ ఒక్క నిరపరాధి కి శిక్షింపబడకూడదని న్యాయశాస్త్రం చెబుతోంది.     కానీ విషవలయంలో చిక్కుకొని చేయని నేరానికి ఎంత మంది  అమాయకులు శిక్షల ననుభవించడంలేదు.     ఎందుకిలా జరుగుతోంది?     కుట్రలు, వంచనలు మోసాలు-దౌర్జన్యాలు  దోపిడీలు-వీటి వెనకనున్న  చీకటి తెరల ఉచ్చులే  మీ చేతుల్ని బిగుస్తున్నాయి.     పిల్లిని గదిలోపెట్టి బాదడం మొదలుపెడితే  ఎదురు తిరిగి కళ్ళుపికేస్తుంది.     ఎందుకు? దానిప్రాణ రక్షణకోసం మనిషికూడా డెవిల్ గా అలానే మారతాడు కమిషనర్ గారు.     అభంశుభం తెలీని నా బతుకులో నిప్పలవాన  కురిసింది.     అడుగడుగునా  విషమ సమస్యలు వాటితో  పోరాడి పోరాడి  అలిసి పోయాను నాకు విశ్రాంతి కావాలి" రాబర్టు బరువుగా నిట్టూర్చాడు.     కమిషనర్ అతని మాటల్లోని  ఆవేదనని అర్ధం చేసుకునన్నాడు.     రాబర్టు కమిషనర్ కేసి నిశితంగా చూసేడు.     "కమిషనర్  గారూ తప్పు చట్టానిది కాదు దాన్ని తమ ప్రమోజనాలకోసం  బలిచేస్తున్న స్వార్ధపరులది. పటిష్టమయిన చట్టాన్ని నిర్విర్యం చేసి సామాన్యమయిన ప్రజల ఘేషకి దాన్ని గురిచేస్తున్న  సంఘవిద్రోహుల్ని ముందుగా చట్టం తన అధీనంలో తీసుకోవాలి.     మనిషిని మనిషిగా  బతకనివ్వని   ఈ వ్యవస్దని ముందు తవ్వి పాతరేయాలి. ఆప్పడే సామన్య  ప్రజలకి రక్షణ దోరుకుతుంది.     రాబర్టు మాటలకి కమిషనర్ మొహం ఎర్రబడింది.     "కమిషనర్ గారూ"     "యస్... ..."     "కాసిని మంచినీళ్ళు కావాలి"     కమిషనర్ స్తెగా  చేశాడు. ఓ కానీస్టేబుల్ గ్లాసుతో నీళ్ళు తెచ్చి రాబర్టుకి అందించాడు.     అతని పెదవులపతే ఓ చిరునవ్వు తేలిపోయింది అప్యాయంగా ఆ గ్లాసులోని నీళ్ళను తృప్తిగా తాగేడు రాబర్టు గొంతునిఅ సవరదిసుకున్నాడు.     ఆ గ్లాసునీ కానీస్టేబుల్ అందిస్తూనే మెరుపులా పిట్టగోడ దగ్గరికి పరిగెత్తాడు రాబర్టు.     కమిషనర్  ఆయనతోపాటు మిగిలిన పొలిసు అధికారులు  తేరుకొనేలోగా రాబర్టు ఆ కంట్రోల్ రూమ్ పైనించి కిందికి దూకేశాడు.     రాబర్టు పైనించి కిందికి పడిపోయే ఆ కొన్ని క్షణాల్లో దేవుడ్ని ప్రార్ధించాడు.     "దేవుడా, తిరిగి జన్మంటూ వుంటే నాకు మనిషి జన్మమాత్రం వద్దు"     భూదేవిని చేరి రక్తపు మడుగులో కొన్ని క్షణాలు గిలగిలా కొట్టుకున్నాడు రాబర్టు అతని గుండెల్లో ఎన్నో సంవత్సరాలుగా రగిలిన జ్వాల చల్లారింది.                           ____: స మ ప్తం :____
24,975
    "మీ నాన్నగారు  పోయాకా ఈ జ్ఞానోదయం?"     "ఇంకా అమ్మ ఉందికదా?"     "ఆవిడకు వంట మనిషిని, మంచి చెడ్డలు చూడడానికి కాస్తధగ్గరి వాళ్ళ నెవరిన్తేనా  చూసి వెడదాం!"     అవేవి అమ్మకు  నా సమానం కావు!"     "రెక్కలు వచ్చాక పిల్లలు ఎగిరిపోవడం సహజమే కదా?  అంత బాధపడతారేందుకు?"     "జ్ఞనం  తక్కువున్న పక్షుల్లో,  పశువుల్లో అది సహజమేకావచ్చు! జ్ఞానవంతుడ్తెన మనిషికి అది సహజం కాదు,  భావన! ప్-పిల్లల్ని  పెంచి పెద్ద జేసేందుకు తల్లిదండ్రులు ఎంత బాధ్యత తల్లిదండ్రుల  విషయంలో తీసుకోవడం  ధర్మం! కానీ,  నేనేంచేశాను? నా అభివృద్ది,  నా సుఖం ముఖ్యం అన్నట్టుగా ప్రవర్తించాను!"     "మీ పశ్చాత్తాపం మిమ్మల్ని వెనక్కి వెనక్కి తీసికెళ్ళి త్రిపుర సుందరి దగ్గర నిలుపుతుందేమో?"     భావన ఎత్తిపోడుపుకు మల్లిక్ ముఖంలో శుష్కమ్తెన  నవ్వు మెరిసింది!  "నిలబడితే నలబెడుతుందేమో!   కానీ, ఇప్పాడా  విషయంలో నేనేమి చేయలేనుకదా? అది పూర్తిగా ముగిసిపోయిన కథ.  ఎట్టి  పరిస్దితిలోనూ మొదలు పెట్టడం జరగని కథ!"     "అలా  ఎందుకనుకోవాలి?  రెండు పెళ్ళిళ్ళు చేసుకొన్న  మగవాళ్ళు సహజంగా మొదటి భార్యతో కాపురం ముగిశాక  రెండో భార్యతో మొదలు పెడతారు? మీరు ఈ కథని అడ్డం తిప్పి చూడండి.  చాలా ధ్రిల్లింగ్ గా ఉంటుంది కథ!"     త్రిపుర ఇప్పటిక్తేనా  మారిందనుకోను! నేనూ మారలేదు! మా ఇద్దరి వ్యక్తిత్వాలు, అభిరుచులు,  ఆలోచనలు  ఎన్నటికి కలవని రెండు సమంతర  రేఖలు!"                 "జరిగిపోయిన తప్పులను దిద్దుకోనే ప్రయత్నంలో ఉన్నారు కదా?  ఈ తప్పను కూడా దిద్దుకొంటారేమోనని "     "ఎన్నడు లేనిదీ ఇప్పుడు త్రిపుర సంగతి ఎందుకు ఎత్తుతున్నావు?"     "పాతికేళ్ళ  తరువాత ఇవాళ వెనక్కి తిరిగి చూచుకోంటూంటే "     పాతికేళ్ళ వెనక్కి తిరిగి  చూచుకోంటే ఎవరుకానిస్తున్నారు? అప్పడే తోలిరేకులు విచ్చుకోంటున్న  మొగ్గలాంటి  ఒకమ్మాయి,  పచ్చని పసిమిచాయతో,  పెద్ద పెద్ద కళ్ళతో, ఒత్తుగా,  పొడవుగావున్న  తలకట్టుతో జిగేల్ మనే ఒక మెరుపుతీగలా  కనిపించే త్రిపురసుందరి. కానీ,  అంత లేత వయసులోనే ధృడమైన  వ్యక్తిత్వం వికసించింది. తన  భావాల్ని నిస్సంకోచంగా బయట  పెట్టేది.  తన కిష్టంలేని ఏ విషయంలో న్తెనా  ద్తేర్యంగా ఎదురు తిరిగేది.     త్రిపుర ఇప్పుడు ఎలా ఉందో?     ఎలా ఉంటుంది?  ఆచార్య వ్యవహారాల్ని పొల్లుపోకుండా అనుష్ఠిస్తూ  పూజలు జపాల్లో ప్రోద్దుపుచ్చుకుంతూ ఉంటుంది.  పాపం!                                                *                      *                         *     చివరికి అయిష్టంగానే అంగీకరించింది భావన!  తాము వచ్చేవరకు నాయనమ్మకు తోడుగా  అజిత్ ని ఇక్కదేవదిలి వెల్లడ్సానికి కూడా నిశ్చయం జరిగింది.     వాసుదేవ్ సహాయంతో  మంచి లోకాల్టిలో ప్లాట్ ఒకటి సెలక్ట్ హేసి కోనేయ్యడమూ,  ఆరు నెలలలో  బిల్డింగ్ పూర్తి చేయడానికి అవసరమైన  ఏర్పాట్లన్నీ  చకచక పూర్తిచేశాడు మల్లిక్.  నర్శింగ్ హొం చే బాధ్యత అజిత్ కి అప్పగించడం జరిగింది. వాసుదేవ్ కూడా ఇంజనీ రే!  అవసరమైన సలహాలు  మామ నుండి తీసుకొమ్మని  కొడుకుతో చెప్పాడు.     భావన వాళ్ళు  స్టేట్స్ కి తిరిగి వెళ్ళే ముందు  రాధ అడిగింది.  "సాధనని అజిత్ కి  చేసుకొనే   సంగతి ఇప్పడ్తేనా చెప్పా. వదినా!"     మగపిల్లవాడి తల్లి దర్పం ముఖంలో కొద్దిగా తోంగిచూస్తూంటే,  "ఇంతకు ముందే నికా సంగతి తెలియజేశాను కదా? అది పెళ్ళి చేసుకొనే ఆ ఇద్దరిని అడగాల్సిన సంగతి అని!" అని జవాబిచ్చింది భావన.     "అజిత్ ఒప్పకోంటే  నీ అభ్యతరం,  అన్నగారి అభ్యతరం ఏం లేదుగా?"     "ఏం లేదు!"     ఆరోజే అజిత్ నీ   అడగింది రాధ  "సాధనని  నికివ్వాలను  కొంటున్నాం!  నీ అభిప్రాయం ఏమిటి?  నువ్వు అంగీకరిస్తే మీ అమ్మ నాన్నకి ఏం అభ్యతరం లేదన్నారు!"     "సాధన అభిప్రాయం అడిగారా,  అత్తయ్యా?"        "ముందు నీ అభిప్రాయం తెలియాలి కదా?"     "ఉహు  మీ అమ్మాయికి  మీరు చేస్తున్న పెళ్ళికి,  ముందు అభిప్రాయం తెలుసు కోవల్సింది మీ అమ్మాయినే!  తన అభిప్రాయం  తెలిశాకే నన్నడగండి!"     "తను ఇష్టంపడుతుంధనుకో! అప్పుడు నీ అభిప్రాయం ఏమిటి?"     "అబ్బే! అదేం లాభం లేదత్తాయ్యా!  మీరు ఎంత తెలివిగా ప్రశ్న వేసినా ముందుగా  నా అభిప్రాయం బయట పెట్టించలేరు! సాధన ఏమందో తెలిశాకే నా అభిప్రాయం చెప్పడం!" అజిత్ గడుసుగా  నవ్వాడు.     అజిత్ మాట్లాడుతూంటే ఇక్కడ  అందరికి తమాషాగా  ఉంటుంది!   తెలుగు బాగా మాట్లాడడం వేర్చుకోవాలన్న తాపత్రయంతో ఎప్పడూ తెలుగులోనే మాట్లాడుతుంటాడు! కొన్ని  మాటలు దొరకక  చప్పన ఇంగ్లీష్ లోకి వెళ్ళిపోతుంటాడు!     "ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళతో హాయిగాగ్లిష్ లో మాట్లాడేయ్యాక   ఎందుకొచ్చిన అవస్ధ?"  అని అడిగింది ఒకసారి,  సాధన.     "మీ పామిలిలో ఒక అమ్మమ్మ మినహా అందరూ ఇంగ్లీష్ లో  అవర్గళంగా  మాట్లాడగలిగిన వాళ్ళే!  ఇంకెవరితో మాట్లాడను తెలుగు?"     "అమ్మమ్మతోటే  మాట్లాడు!"     "ఉహు  మాతృభాష సరిగా  రానందుకు  నేనిప్పటికే సిగ్గుపడుతున్నాను.  ఇక  ఆలస్యం చేయడానికి వీల్లేదు.   మీలాగా తెలుగు చక్కగా మాట్లాడడం ఎప్పుడు నేర్చుకొంటానా  అని నాకెంత తాపత్రయంగా ఉందో?"
24,976
                                                                                                                          20-11-96      రఘుగారికి,     రిజిస్టరు  పోస్టు అందింది.  తెలుగు చెయ్యగలనో  లేదో ప్రయత్నిస్తాను.కనీసం,  ముఖ్యమ్తెన పదాలు.     మీ నలుగురికి శుభాకాంక్షలు.                                                                                                                  -వడ్డెర చండీదాస్.                                                                                                                         23-12-96             రఘుగారికి,                  నమస్తే.     మా అమ్మాయికి వుత్తరం రాస్తూ మీ న్యూజిలాండ్ మిత్రుల ఫోను నంబరు రాయబోతే కనిపించలేదు మీ వుత్తరం,యెంత వెదికినా. శ్రమ అనుకోక నాకు మళ్ళి రాస్తారు కదూ!     మీ నలుగురికి శుభాకాంక్షలు.                                                                                                                  -వడ్డెరచండిదాస్.                                                                                                                                                  తిరుపతి                                                                                                                              6-1-97        రఘుగారికి,     మీ వుత్తరం అందింది. నంబర్లు మా అమ్మాయికి పంపిస్తాను. తెలుగులో  పదాలు దొరకటంలేదు నాకు. Contradictoriness ని  వ్తెరుధ్యత్వం అని రాశాను. రేవతీదేవిగారి  ఫోటో పుస్తకం అత్తమీద వుంది కదా? సరే వేరే ఫోటో  పంపిస్తున్నాను. వ్తెవిధ్యంగా వుంటుందని.     మీ నలుగురికి శుభాకాంక్షలు.                                                                                                                    -వడ్డెర చండీదాస్.                                                                                                                                   7-1-97        రఘుగారికి,     "దిపశిలతో మరోసారి"  చదివాను. It' a key to understand  Deepasila.  చాలా బావుంది.  ఆ పుస్తకానికి  చాల అవసరమ్తెందినూ.                                                                                                                 -వడ్డెరచండీదాస్.                                                                                                                                                            తిరుపతి                                                                                                                               25-1-97     రఘుగారికి,        నమస్తే,        "శిలాలోలిత " ప్తె వ్యాసం కోసం  "వార్త"  తెప్పించాను 18న. రాలేదు.25న  తెప్పించాను. రాలేదు. వొచ్చినప్పుడు మిరే Zerox Copy పంపించండి, ప్లీజ్.     మీ నలుగురికి శుభాకాంక్షలు.                                                                                                                -వడ్డెరచండీదాస్.                                                                                                                              16-2-97     రఘుగారికి,     నిరుత్సాహపడకండి, పబ్లిషర్స్ కి  పంపిస్తూండండి.                                                                                                                  -వడ్డెరచండీదాస్.                                                                                                                                  14-4-97      రఘుగారికి,     నమస్తే,     లక్నో విషయాలు చదివి సంతోషించాను.  నిరుత్సాహపడక పబ్లిషర్స్ కి  పంపిస్తూండండి.  వ్యాసాలు రాయబోతున్నందుకు సంతోషం.     మీ నలుగురికి శుభాకాంక్షలు.     PS: వ్యాసం పంపిన వుత్తరం అందింది. మరుగున వున్న ముఖ్యాంశాలను వెలికితీసే మీ వ్యాసాలకు ముగ్ధుణ్ణివుతున్నాను.                                                                                                                         -వడ్డెర చండీదాస్.                                                                                                                                   4-6-97     రఘుగారికి,     MY Son-in-law went to New york.  And my  daughter is about to go.  నేను కూడా వెళ్ళాలి.     నాకు Pass-portకావాలి USAకి. daughter అక్కడ వుంది. vaddera chandidas aged 60. అనిచెప్పి pass port application కాగితాలు తీసుకుని నాకు పంపండి. తరవాత stageలో  Addl DGP  influence తో ప్రయత్నించ వచ్చు.     మీ నలుగురికి  శుభాకాంక్షలు.     p.s. pSSPORT  Office Exhibition  grounds లో వుంది.                                                                                                                                         -వడ్డెర చండీదాస్.
24,977
    "దీనికి మీ సమాధానం?" అడిగాడు వేగా జడ్జీ ఆల్ఫాకేసి తిరిగి. "ఇంత పెద్ద జనాభా వున్న గ్రహవాసులమీద మీకెందుకు కనికరం లేదు."     "లేదు. ఆ సూర్యుడినే తెచ్చుకుంటే మాకు శక్తి ఒక్కటే కాదు దొరికేది. మరిన్ని లాభాలున్నాయి." అంటూ ఆల్ఫా ఒక చిన్న సీసా లాంటిది బయటకు తీశాడు. "ఇదేమిటో మీ కందరికీ తెలుసు. ఈ మధ్య దీన్ని అన్ని గ్రహాలకు మేము శాంపిల్స్ గా పంపాం. చాలా రుచికరంగా వుందని మీరంతా మెచ్చుకున్నారు. ఆ భూమి మన ఆధీనంలోకి వస్తే ఈ  ఆహారం మన అయిదు గ్రహాల వాళ్ళకు కొన్ని వందల వేల సంవత్సరాలకు సరిపోతుంది. మా అందరికీ ప్రీతికరమయిన భోజనం అది."     "ఏమిటిది?" అడిగాడు యశ్వంత్ అనుమానంగా.     "మా ప్లయింగ్ సాసర్ మీ భూమికి దగ్గిరగా వచ్చినప్పుడు మీ అంతరిక్ష నౌక ఒకటి దాని సామీప్యంలోకి వచ్చింది. మేము అందులోని వ్యక్తిని హిప్నటైజ్ చేసి బయటకు లాగాం, అతని పేరు....."     ".......రాయ్" అన్నాడు యశ్వంత్.     "అవును. రాయ్.....!" అని అగి, నెమ్మదిగా అన్నాడు ఆల్ఫా "అతని మాంసం ఇది-"     అనూహ్య కెవ్వున అరిచి మొహాన్ని చేతుల్తో కప్పుకుంది. వింటున్న నలుగురి శరీరాలు జలదరించాయి. యశ్వంత్ మొహం కోపంతో ఎర్రబారింది. అతికష్టంమీద తన ఆవేశాన్ని కంట్రోలు చేసుకున్నాడు. అతడి గొంతు వణికింది.     "మా భూమిమీద అనాగరికులైన జాతి 'కానిబాల్స్'. కాని యింత విజ్ఞానాన్ని సంపాదించిన మీ గ్రహవాసులు కూడా తోటి మనుషుల ప్రాణాలు తీసి మాంసాన్ని పీక్కుతినేటంత అధమస్థితికి దిగజారే వారనుకోలేదు."     "తోటిమనుష్యులు" అన్న పదానికి నేను ఆబ్జెక్టు చేస్తున్నాను. మనం మనుష్యులం కాదు మిలార్డ్. కొంచెం ఆలోచించి మాట్లాడమనండి యశ్వంత్ ని. ఎవరు అధమస్థితికి దిగజారినవాళ్ళు? భూమీమీద మాంసం తినడం లేదా? మేకల్ని, గొర్రెల్ని, చేపల్ని చేతికందిన పక్షుల్ని చంపి నిల్వచేసే టిన్నుల్లో పెట్టి అమ్ముకోవడం లేదా?"     "మా భూమిమీద మాంసాహారం తినే జనం వున్నారు నిజమే! కాని యిలా తోటి మనుష్యులను, ముఖ్యంగా బుద్ధిజీవులని చంపి తినేటంత నీచస్థితిలో లేరు. జంతువుల మాంసం మాకు ఆహారం. అది తీసుకోవటం తప్పనిసరి."     "ఎలా తప్పనిసరి అయింది? అవి నోరులేని జీవులు. బలహీనస్థితిలో వున్నాయి. అదేగా కారణం? అలా అయితే మా వివేకం, విజ్ఞానం, ఆధునీకరణ ముందు మనుష్యులుకూడా ఎందుకూ పనికిరాణి జీవాలు. మీకు అవి జంతువులైతే, మాకు మీరు జంతువులు" అన్నాడు ఆల్ఫా.     అక్కడ సూదిపడితే వినపడేంత నిశ్శబ్దం ఆవరించుకుంది.     అందరూ యశ్వంత్ వైపు చూస్తున్నారు. అతడేం సమాధానం చెపుతాడో వాయుపుత్రకి అర్థంకాలేదు.     "మీరు మా కంటే అన్నివిధాలా అధికస్థాయిలో వున్నారు. మా కంటే విజ్ఞానవంతులు, బలవంతులు. అయినా మేము చేసే తప్పునే మీరూ చేయాలని ఎందుకనుకుంటున్నారు. ఆ వేగా గ్రహంలోనో, మరో గ్రహంలోనో మనుషులు బలహీనులయితే వాళ్ళని అలా చంపి తినగలరా మీరు. మేము జంతువులం కాము. మాకు మాట్లాడే శక్తి వుంది. భావాల్ని విశదీకరించగలిగే భాష వుంది. దయ, కరుణ లాటివి మాకూ వున్నాయి."     యశ్వంత్ వాదన వింటున్న ఆల్ఫా నవ్వి పక్క అనుచరుడికి సైగ చేశాడు. జడ్జీల ఎదురుగా పెద్ద టీ.వీ. స్క్రీన్ లాంటిది కనిపించింది. తరువాత చిత్రం కనిపించడం మొదలయింది.     పెద్ద బోను. దానిలో ఒక ఇరవై వరకు గండుపిల్లులున్నాయి ఒక మనిషి దగ్గరగా వచ్చాడు. అతడిని చూడగానే అవి భయంతో అటూ ఇటూ పరుగెడుతున్నాయి. అతడు బయట ఊచల్లోంచి ఒక దానితోక అందిపుచ్చుకున్నాడు. అది భయంతో గింజుకుంటూంది. సన్నటి సూదిలాంటి వస్తువుతో దాని శరీరమంతా గీరడం మొదలుపెట్టాడు. సన్నటి పొడి రాలుతోంది. ఒళ్ళంతా గీరడం అయ్యాక ఆ సూదిని దాని మర్మాంగంలోకి గుచ్చాడు. భయంకరంగా కేక పెట్టిందది. అతడు మాత్రం తన పని తాను చేసుకుపోతున్నాడు. దాని మర్మాంగం నుంచి కారుతున్న జిగురు పదార్థాన్ని ఒక ట్యూబ్ లోకి ఎక్కిస్తున్నాడు.     తెరమీద దృశ్యం మారింది. అనంతమైన సముద్రం స్పీడ్ బోట్లమీద మనుష్యులు తిరుగుతున్నారు. అందరి చేతుల్లోనూ పొడవాటి బల్లేం, వాటి చివర ఏదో కట్టినట్లు కనిపిస్తున్నాయి.     వాటిని వెంటనే గుర్తుపట్టాడు యశ్వంత్. బల్లేం చివర కట్టబడ్డవి శక్తివంతమైన బాంబులు.     స్క్రీన్ మీద తిమింగలం కనిపించింది. అంతే. అందరూ ఒక్కుమ్మడిగా దానిమీద దాడిచేశారు. శరీరం నిండా బల్లేలతో రక్తసిక్తమై అది నీటిలోకి దూసుకుపోయింది. ఆ తర్వాత ఒక్కో బాంబు పేలుతుంటే నిస్సహాయంగా కొట్టుకుంటూ, బాధతో విలవిల్లాడుతోంది. దాన్ని ఒడ్డుకు లాక్కుపోయి పెద్దపెద్ద కత్తులతో కోసి దాని పెగుల్లోంచి ఏదో పదార్థాన్ని తీస్తున్నారు.     ఆ తర్వాత తెరమీద గుర్రాలు కనిపించాయి. గర్భంతోవున్న ఒక గుర్రాన్ని పట్టుకొచ్చి కర్రలతో దాని కడుపుమీద  కొట్టటం మొదలుపెట్టారు. బాధతో అది  విలవిల్లాడుతుంటే కూడా వదల్లేదు, ఆల్ఫా చెప్పటం ప్రారంభించాడు.     "నాగరికులమని చెప్పుకునే మనుషులు చేస్తున్న పనిని చూశారు. ఆ గండుపిల్లుల్ని ఎందుకంతగా హింసించారో తెలుసా? ఆ చర్మపు పొడిని వీళ్ళు శరీరానికి రాసుకునే కాస్మెటిక్స్ వాడతారు. అలాగే తిమింగలం ప్రేవుల్లో వున్న  ఏంబర్ గ్రిన్ అనే పదార్ధం సుగంధాలను తయారు చేయడానికి వాడతారు. ఇక ఆ  గుర్రాలన్నీ గర్భిణీలు. వాటి మూత్రంతో ఎస్ట్రోజెన్ అనే పదార్ధం క్రీములకూ, లోషన్లకూ వాడడానికి పనికొస్తుంది. వాటిని వెంటనే గర్భం ధరించేలా చేసి, మూత్రం ఎక్కువగా పోయ్యడానికి మందులిచ్చి, అవసరం తీరిందనుకోగానే వాటి గర్భాల్లో శిశువులని కొట్టి కొట్టి చంపుతున్నారు. వాటికి మళ్ళీ గర్భం వచ్చేలా చేస్తున్నారు. ఇంత దారుణాన్ని మరెక్కడైనా చూశారా? కడుపుతో వున్న తల్లిని కొట్టటం? దంతాల కోసం ఏనుగుల్ని, చర్మాల కోసం సీల్ చేపల్ని చంపడం వీళ్ళ హాబీలు. చనిపోయిన తర్వాత బావోదని, బ్రతికి వుండగానే వెన్నముద్దలాంటి అమాయకమైన అందమైన కుందేలు పిల్లల చర్మాన్ని వలుస్తారు. వాటితో పర్సులు తయారుచేస్తారు. అవి పెట్టే ఆక్రందనల్ని ఆనందంతో వింటారు. ఇటువంటి మనుష్యుల మీదనా దయా, క్షమా చూపించవలసింది?"     నిఖిల్, వాయుపుత్ర, అనూహ్య-ముగ్గురూ యశ్వంత్ నే చూస్తున్నారు. యశ్వంత్ అన్నాడు.     "ఏ ప్రాణి అయినా పరిణామ సిద్దాంతంమీదే ఆధారపడి వుంటుంది జస్టిస్! కొందరు స్వార్థపరుల తప్పుని పూర్తి మానవాళికి అన్వయించటం తప్పు. మేము జంతువులం కాము. 'వేగా' గ్రహవాసులు 'ఆల్ఫా; గ్రహవాసులంత తెలివైనవాళ్ళు కాకపోవచ్చు. అంత మాత్రాన వీరు వారిని చంపుతాం అంటే ఇక నీతి న్యాయం ఎక్కడుంది? మనమంతా ఒక్కటే, కొంత శాస్త్రవిజ్ఞానం, బుద్ధి కుశలత తేడా! అంతే- కేవలం మేం నిస్సహాయులమని చెప్పి మమ్మల్ని బలిపెట్టకండి-"     అల్ఫా అన్నాడు- "సరే మీరూ మేమూ ఒకటే అనుకుందాం కొన్ని అనివార్య పరిస్థితుల్లో మేము మీ కన్నా  బలహీనులమయ్యాం అనుకోండి. అప్పుడు మీరు మా మీద దాడి చెయ్యరా?"     "చెయ్యం-" దృఢంగా అన్నాడు యశ్వంత్.     "మరొకసారి ఆలోచించుకొని చెప్పండి చెయ్యరా?"     "చెయ్యం."     ఆల్ఫా చేయి సాచేడు. టీ.వీ స్క్రీన్ మీదా ఒక బొమ్మ వచ్చింది. "మిలార్డ్! తెలివిలో తమతో సమానమైన వాళ్ళమీదా, సాటి జీవుల మీద దాడి చెయ్యం అని ఈ "మనిషి" అంటున్నాడు. కొన్ని లక్షల కోట్ల కంఠాలు జైలు శిక్ష వద్దు వద్దు అంటున్న జాతి నాయకుడు యితను. దీనికి యశ్వంత్ ఏం సమాధానం చెబుతాడు?"     యశ్వంత్ స్థాణువయ్యాడు.     "నోరులేని జీవాన్ని హింసించటంలో తప్పులేదని, అది పరిణామ సిద్దాంతమనీ, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అనీ వాదించిన ఈ మానవుడు- ఈ ఆటవిక న్యాయానికి సరియైన సమాధానం చెప్పగలిగితే, మా గ్రహవాసులు భూమిమీద దాడి చెయ్యరు. భూలోకవాసుల మాంసాన్ని భుజించరు. మనుష్యుల్ని కూడా సాటి ప్రాణులుగా గుర్తిస్తారు.... ఈ బొమ్మకు, ఈ బొమ్మ తాలూకు జాతికీ జరిగిన అన్యాయానికి సమాధానం చెప్పమనండి చాలు-"     యశ్వంత్ ఏం మాట్లాడాలో తెలియక అలా వుండిపోయాడు.     టీ.వీ. తెరమీద విల్సన్ మండేలా జైల్లోవున్న బొమ్మ వుంది.     ఆల్ఫా పూర్తిచేశాడు. "అంతే మిలార్డ్. నా వాదన పూర్తయింది-"                                            8     "జడ్జీలు తమ నిర్ణయాన్ని రేపు ఉదయం చెపుతారు" అన్నాడు వేగా.     ఎవరూ సమాధానం చెప్పలేదు.     "మేము గెలుస్తామా?" అడిగాడు నిఖిల్ నెమ్మదిగా.     "మా సానుభూతి మీ పట్లే వుంది నిఖిల్. కానీ ఆల్ఫావాసులు చాలా పట్టుదలగా వున్నారు. వాళ్ళ వాదనలో నిజం వుంది కూడా."     "అవును అతని వాదన వింటూంటే కరక్టే అనిపించింది. మానవజాతి సిగ్గుతో తలవంచుకోవలసిన వాదన అది" యశ్వంత్ అన్నాడు.     వేగా శలవు తీసుకుని వెళ్ళిపోయాడు.     అందరూ మౌనంగా కూర్చున్నారు. ఎవరికీ మనసు మనసులో లేదు. వాయుపుత్ర తన గదిలోకి వెళ్ళిపోయాడు సీరియస్ గా. అతడి గదిలోంచి సంగీతం వినిపిస్తోంది. వాళ్ళ జడ్జిమెంటు తెలిసిపోయినట్లుగా వుంది అందరికీ.     "మనకి ఇక్కడే మరణం తప్పదు" అన్నాడు నిఖిల్.     "మరణం గురించి బాధకంటే ఇంతవరకు వచ్చి యిలా ఫెయిలవడం చాలా బాధ కలిగిస్తుంది" అన్నాడు యశ్వంత్.     గదిలోకి వెళ్ళినంత వేగంగానూ బయటకు వాయుపుత్ర వచ్చాడు. అతడి మొహం ఫ్రెష్ గా వుందిప్పుడు.     "ఎందుకీ వైరాగ్యం? బ్రతికిన నాలుగు రోజులూ హాయిగా అనుభవిద్దాం. అందరికీ విందు భోజనం తయారు చెయ్యి అనూహ్యా. నిఖిల్ నువ్వు సహాయం చెయ్యి" అంటూ హుషారుగా పనిలో పడ్డాడు. మధ్యలో బ్రహ్మవిద్యతో ఆటలాడుతున్నాడు. గదిలో సంగీతం మారుమ్రోగుతోంది. అతడి బలవంతం మీదే అందరూ డైనింగు టేబుల్ చుట్టూ కూర్చున్నారు.     "ఎందుకంత మౌనంగా. భోం చేస్తున్నారు? నవ్వండి, కబుర్లు చెప్పండి. ఏమిటి గురూగారు మనం బయలుదేరిన మొదటిరోజు తీసుకున్న నిర్ణయం మర్చిపోయారా?"     "ఎలా మర్చిపోతాను. కాని సమస్య మన గురించి కాదు. పూర్తిగా విఫలమయి పోయామన్న దిగులు. మానవజాతికి మనం ఏ విధంగానూ సాయపడలేక పోతున్నామనే బాధ."   
24,978
    భర్త చనిపోతాడమే విషయం ముందుగా తెలుసుకున్న దురదృష్ట వంతురాలయిన ఆడది ఆ యిల్లాలు! ఎలా భరించగలదు? ఎలా జీవించగలదు?     ఎవరో ఒకదారినపోయే దాసరాలు మాటలు నమ్మటం! యోగిని తీసుకురమ్మని అత్తగారు తనని పంపటం ఒక కలగా అనిపించిందామెకు. భర్త పోలీసు అధికారి.     మరో అధికారి ప్రాణాలు రక్షించేందుకని వెళ్ళి అతడు నాగదోషానికి గురి అయ్యాడు. అతని ప్రాణాలు రక్షించేందుకు తాను బయలుదేరింది.     భర్త చేసింది వృత్తిధర్మం. తాను చేస్తోంది ప్రవృత్తి ధర్మం. స్త్రీ ప్రవృత్తి!!     ఇదంతా విధి ఆడించుతున్న నాటకంలాగ అనిపించింది.     ఆ యోగి కన్పిస్తాడా! విభూతి అందిస్తాడా? భర్త బ్రతుకుతాడా?     దిక్కుమాలిన దానిలా అనారోగ్యపు కంపుకొడుతున్న సత్రం తాలూకు వీధి అరుగుమీద పడుకుని రోదిస్తోంది. ఆ నిశ్శబ్దవాదన ఎవరు వింటారు?     ఒక స్త్రీ ఆర్తి నిండిన మనసుతో రహస్యంగా చీకటిలో కన్నీరు పట్టుకుని ఎన్నిమారులు పై కొంగుతో అద్దుకున్నా ఎవరు పట్టించుకుంటారు.     ఆమెకు చేరువలో కొంతమంది చింకిపాతలు కట్టుకున్న సన్యాసులు చేరి గంజాయిదమ్ము కొట్టటం ప్రారంభించారు.     వారిలో వారికి తగువులు పడుతున్నారు. వాగ్వివాదాలు జరుగుతున్నాయి పందెం పెట్టుకుని పొగ పీల్చుకున్నప్పుడు గంజాయి చిలుముతాలూకు వెడుగు గోడమీద పడేలా గట్టిగా లాగుతున్నారు.     వారి చర్చలు కూడ నగరంలో జరుగుతున్న పరిణామాలు గురించే! అడుక్కునే వారు సన్యాసులు కేవలం పొట్టతిప్పలకే పాటుపడుతుంటారని వారికి లోకం సంగతి ఏమీ తెలియదని అనుకోవటం పొరపాటు!     సాధారణ కుటుంబికుల లాగే వారికీ అనేక చర్చనీయాంశాలుంటాయి. నలుగురికి అనుబంధమయిన విషయాలలో ఆసక్తి ఉంటుంది. తిరుగుతూ ఉంటారు తీరిక ఎక్కువకాబట్టి నాలుగు మూలల నించి సమాచారం ఒక చోటుకి చేరుతూ ఉంటుంది. కడుపు నింపుకోవటానికి అడుక్కోవటం ఒక్కటే దారి అయినా ఆ తరువాత గంజాయి త్రాగటం మాట్లాడుకోవటం మాత్రమే వారికి ఉండే కార్యక్రమాలు!!     "నగరం గగ్గోలుగా ఉందిభాయ్!" అన్నాడు ఒక యువసన్యాసి!     "మళ్ళీ మతకలహాలొచ్చాయా?" అని ప్రశ్నించాడు మరోడు చిలుము అందిస్తూ.     "మత కలహాలు కాదు! ఈసారి మరోరకం!"     "ఏమిటా రకం బాంబులు పడుతున్నాయా?"     "అవేమీకాదు. పోలీసులకి, పాములకి పోరాటం! పోలీసులు గుహమీద దాడిచేసి వందల సంఖ్యలో పాముల్ని తగులబెట్టారట. అవి పగపట్టి నగరం మీద దాడి చేయబోతున్నాయట!"     "పోలీసులమీద ప్రతీకారమా? నగరంమీద నాగులు దాడిచేస్తాయా?"     "అవును. మనుషుల్లాగే అవి కూడ జంతువులుగాదా! మనిషి ద్విపాద పశువు. పాములు పాదాలులేని పశువులు" అన్నాడు దమ్ముతల కెక్కగా!     "అసలీ వైరం ఎలావచ్చిందంటావు?"     "ఈ బడుద్దాయిలు యోగిని పట్టుకుంటారట!"     "ఓయమ్మో! ఎంత సాహసం?" అన్నాడు ఎక్కింది దిగిపోగా!     "భాయ్! అసలు యోగి అనేవాడు ఉన్నాడంటావా?" ఆసక్తిగా అడిగాడు అప్పుడప్పుడే గంజాయి దమ్ముకి అలవాటు పడుతున్న కుర్రసన్యాసి!!     "నేను చూచాను. రాత్రిపూట ఏదో ఒక సమయంలో స్మశానం లోకి వస్తాడు."     "అతన్ని చూడాలని వచ్చిన ఒక కాలేజీ అమ్మాయి కళ్యాణి అనిపేరు. ఆమె చచ్చిపోయాక అతడు రావట్లేదని చెప్పుకుంటున్నారు కదా!"     "పొరపాటు! అంతకు పూర్వం యోగి రాత్రి సమయంలో ఎక్కువగా స్మశానంలో ఉండేవాడు. ఆ సంఘటన జరిగినా తరువాత అక్కడకు అప్పుడప్పుడు వచ్చిపోవటం మాత్రమే జరుగుతోంది!"     "ఇవన్నీ పుకార్లేనా? ఎవరయినా చూశారా?"     "నేను చాలాసార్లు యోగిని దూరం నించి చూచి వచ్చాను"     "భాయ్! మాకు కూడా చూడాలని వుంది తీసుకుపోతావా?"     "నిరభ్యంతరంగా! అయితే దూరంనించే చూడాలి. చప్పుడు చేయకుండా అతని ధ్యానానికి భంగం లేకుండా తిరిగిరావాలి. ఒకసారి కళ్ళు మూశాడంటే మళ్ళీ ఎప్పుడు తెరుస్తాడో! కళ్ళు తెరవగానే మొదటిసారి అతని దృష్టిలో పడినవారు మలమల మాడిపోతారట!     శివుడు మూడో కన్ను తెరిచినట్లే!" అని వివరించాడు అనుభవం కల సన్యాసి.     మిగిలినవారు అతని మాటల్ని ఎంతో ఆసక్తిగా విన్నారు.     "అయితే మనం ఏ సమయంలో బయలుదేరాలంటావు?"     "రాత్రి సమయంలో మూడవ ఝాము ప్రారంభంకాగానే వెళ్ళాలి"     "అంతసేపు నువ్వు మేలుకుంటావా?"     "చూడాలనుకుంటే మేలుకో! లేకపోతే నీ ఖర్మ" అంతటితో వారి సంభాషణ ఆగిపోయింది. మళ్ళీ చిలుములోకి గంజాయిని నులిమి దట్టించటంలో మునిగిపోయారు. కొందరు తిక్క తలకెక్కగా నిద్రకు వాలిపోయారు.     వారిమాటలను శ్రద్దగా ఆలకించింది యువ అధికారి భార్య!     అయితే యోగి స్మశానంలో ఉంటాడన్నమాట!     అందరికన్నా ముందుగా తానే వెళ్ళాలని తీర్మానించుకుంది.    
24,979
    "వాడ్ని__ ఆ సోఫా మీదో, ఆ బెడ్ మీదో నిద్రపుచ్చొచ్చు గదా- మరీ సొంత తండ్రిలా ఫీలైపోతూ అలా భుజాల మీద, కాళ్ళ మీద నిద్ర పుచ్చాల్సిన పనేం లేదు!" కాళ్ళు బారజాచుకుంటూ, కూర్చుంటూ అన్నాడు.     "సోఫా మీద, బెడ్ మీద పడుకోబెడితే, వీడు టింగ్ మని  వైర్ లా లేచిపోతున్నాడు. పోతురాజు ఉయ్యాల తెచ్చేవరకూ - ఈ నిలువు జీతం తప్పదు!" అన్నాడు సేతురాజు.     "ఉయ్యాల ఏమిటి?"     "ఎదురింటి బామ్మగారి దగ్గరకెళ్ళి ఉయ్యాల సెటప్ చేశా!" చెప్పాడు పోతురాజు.     "బామ్మెవారూ అంటే- ఆవిడ ఇంటిపేరూ, హజ్బెండు పేరూ నాకు తెలుస్తుందా? వాళ్ళింట్లో ఉయ్యాల చూసా. ఎవరూ లేనపుడు బామ్మగార్ని అడిగా- మళ్ళీ రెండు రోజుల్లో ఇచ్చేస్తానని చెప్పా!"     "మీరూ మన వాలేస్వరర్రావ్ టైపులో బ్రెయిన్సు తీయించేసుకుంటే బెటరు- ఆ ఉయ్యాల ఐడియా ఎవడిది? ఎవడిదంట.....     నీకు బ్రెయిన్లేదని, ఈ కాలనీ వాళ్ళందరకూ బ్రెయినుండదను కున్నావా? ఇప్పటికే మనం వాలేస్వర్రావ్ తో ఛస్తున్నాం- ఆ బామ్మ ఉయ్యాల విషయం, మనింట్లో పిల్లాడి విషయం- టాంటాం చేసిందనుకో__"     "ఆ బామ్మకు చెవుడు-ఎలా చెప్తుందీ?"     "ఒరేయ్ ఇడియట్ చెవికొచ్చే రోగాన్ని చెవుడని అంటారు. డబ్బాలాంటి నోరుందిగదా- ఆ ఉయ్యాల విషయం మర్చిపొండి. మరీ అవసరమయితే అందరూ నిద్రపోయాక ఒక ఉయ్యాల్ని కొనితెండి."     "ఆ బామ్మ, తనే స్వయంగా ఉయ్యాలతెచ్చి, నీ మేనల్లుడ్ని చూస్తానని అంటే" విషయం గుర్తుకొచ్చి, దేభ్యం మొహంపెట్టుకుని ఫ్యాన్ వేపు చూస్తూ ఉండిపోయాడు పోతురాజు.                                  ౦    ౦    ౦     ఫ్రంట్ రూమ్ లో ఈజీ చైర్లో, సంవత్సరం క్రితం పేపర్ లోని న్యూస్ ని నిద్ర ముంచుకొస్తున్న కళ్ళతో చదువుతూ ఆశ్చర్యపోతున్నాడు వీర్రాజు.     అతనికి కొంచెం దూరంలో, చాపమీద బోర్లాపడుకున్నాడు సేతురాజు. ఎప్పటికయినా మంచిదని ఇంటి వాసాలు లెక్కెడుతున్నాడతను.     లోన రూమ్ లో బెడ్ మీద ఆదమరచి నిద్రపోతున్న తేజవేపు చూసి "ఎన్నాళ్ళకు పడుకున్నావురా చిట్టి తండ్రీ..." అంటూ బెడ్ షీట్ ను అతని గుండెలవరకూ కప్పి, ఆ పక్కనే ఉన్న కుర్చీలో కాలుచాపుకుని, ఏవీ తోచక కాసేపు బుర్ర గోక్కుని, మరికాసేపు ఈగలు తోలుకుని, ఇరవై అయిదు లక్షలొస్తే ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు పోతురాజు.     మారుతీకారు, కారు డ్రైవర్ గా అందమైన అమ్మాయి, ఆ అమ్మాయితోపాటు తను టాంక్ బండ్ మీద షికార్లు....నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు పోతురాజు.     నిద్రలో అపుడపుడు చేపపిల్లలా తపతపలాడడం అలవాటు పోతురాజుకి. అలా తపతపలాడుతున్న అతనికాలు బెడ్ కి తగలగానే, నిద్రలోంచి తేజ ఉలిక్కిపడి లేచాడు.     బెడ్ షీట్ ను పక్కకి తోసి కీ ఇచ్చిన బొమ్మలా లేచి కూర్చుని మంచం చివరివరకూ వచ్చి, బెడ్ చివర్న పోతురాజుకాలు పట్టుకుని జారుడుబండలా కిందకు జారాడు.     అటూ ఇటూ చూస్తూ, బాల్కనీవేపు పాకరసాగాడు తేజ.                                         ౦    ౦    ౦     ఆ యింటిపక్కనే నాలుగంతస్తుల అపార్టుమెంట్ బాల్కనీ, ఈ రూమ్ బాల్కనీ దాదాపు కలిపే వున్నాయి. మధ్యలో ఐరన్ గ్రిల్సే అడ్డం     బాల్కనీలోకి వెళ్ళి తేజ, పక్క బాల్కనీ ఐరన్ గ్రిల్స్ పట్టుకుని అటూ ఇటూ ఊగుతున్నాడు.     ఆ ఐరన్ గ్రిల్స్ కు కొంచెందూరంలో ఎర్రని పువ్వుల్తో, ఏదో మొక్క వింత వింతగా కన్పిస్తోంది వాడికి.     ఆ పువ్వుల్ని అందుకోవడానికి, కుడిచేతిని ముందుకు చాపాడు.... అందలేదు. ఈ బాల్కనీలోంచి కుడికాలుని, ఆ బాల్కనీ అంచుమీద వేశాడు. ఆ కాలు ఏ మాత్రం స్లిప్ అయినా తేజ అంతఎత్తునుండి పడిపోవడం ఖాయం.     కానీ తొమ్మిది నెలల ఆ పసిబాలుడికి తెలీదు....తనొక డేంజరస్ సర్కస్ ఫీట్ చేస్తున్నానని.     ఒకటి...రెండు....మూడు...నాలుగు...ఐదు...క్షణాలూ గడుస్తున్నాయి.                                                                   ౦    ౦    ౦     డోర్ దబదబామని చప్పుడవగానే వీర్రాజు పాతపేపర్ ని చికాగ్గా పక్కకు విసిరేసి, లేచినుంచున్నాడు.     "ఎవరూ...కొంపదీసి....పోలీసులైతే" ఆలోచన రావడంతో, పిల్లిలా అడుగులు వేస్తూ, డోర్ దగ్గరకెళ్ళి "ఎవరూ" అని అడిగాడు.     "నేనే...."     ఆ గొంతును గుర్తుపట్టాడు. హౌస్ ఓనర్ వాలేస్వరర్రావు. వీడికి బ్రెయిన్ లేదని, ఎదుటివాడి బ్రెయిన్ తినడానికి వస్తున్నట్టున్నాడు గొణుక్కుంటూ-     తలుపు తెరిచి-     "ఏం కావాలి..." అని అడగబోయి, లేని నవ్వును ముఖమ్మీదకు తెచ్చుకున్నాడు.     "చూడు వీర్రాజు నిజంగా పిల్లవాడు లేడన్నమాట నిజమేనా" అంటూ లోనికి దూసుకొచ్చాడు వాలేస్వరరావు.     "అంత డౌటయితే చూసుకో" అంటూ నోరుజారేసి, రెండో రూమ్ కి  అడ్డుగా నిలబడ్డాడతను.     "ఉన్నట్టు లేడే...లేనట్టే వున్నాడు" అని అంటూ రెండోరూము డోరు దగ్గరకెళ్ళి లోన బెడ్ మీదున్న బెడ్ షీట్ వేపు, ఆ పక్కన వున్న ఆటబొమ్మలవేపు చూస్తూ అడ్డంగా వుంచిన వీర్రాజు చేతిని తీసుకొంటూ లోనికెళ్ళాడు.     ఆ దెబ్బతో వీర్రాజు ప్రాణాలు పైనే పోయాయి.
24,980
    "మోటార్ బైక్ యాక్సిడెంట్. బజారు వెళ్ళాను, నా కళ్ళముందే ఓ లారీ స్పీడ్ గా వచ్చి మోటార్ బైక్ గుద్ది కళ్ళుమూసి తెరిచేలోగా మాయం అయింది. అతను కొన ప్రాణంతో నాలుగు ముక్కలు మాట్లాడి చనిపోయాడు."     "ఏం మాట్లాడాడు?"     "నేను ప్రేమించినమ్మాయితో ఎల్లుండి నా పెళ్ళి, ఈ పెళ్ళి ఆపకపోతే ప్రాణం తీస్తానని బెదిరింపు లెటర్స్ వచ్చాయి. అయితే నేను లెక్కచేయలేదు. వాళ్ళే నా ప్రాణం తీశారు" అన్నాడు.     "ఎవరు బాబు వాళ్ళు!" అని అక్కడ వున్న వాళ్ళు అడిగారు.     "పేరు గొణిగి తల వాల్చేశాడు. ఆ పేరు ఎవరికీ వినపడలేదు. మొదటి అక్షరం యం. ఆ తర్వాతది తెలియదు" అంటూ జగదీష్ వివరించాడు.     "ప్చ్....... ఆ పిల్ల దురదృష్టం. పోయిన వాళ్ళంతా అదృష్టవంతులే. ఇంతకీ అతని ఎడ్రస్ తెలిసిందా?"     "నేను వచ్చేశాను. ఎడ్రస్ పోలీసులు పట్టేస్తారు. ఆపై కధ మామూలే. యం. అనే అక్షరంలో కూపీ ఎవరూ లాగలేరు. అదయినా అతను మరణిస్తూ అన్న మాటలు మాబోటి వాళ్ళం విన్నాము. సాక్ష్యాలు. కోర్టులు ఎవరికీ పట్టాయి. ఒకటి మాత్రం నిజం. ఆ దురదృష్ట వంతుడిది లవ్ మర్డర్." జగదీష్ అన్నాడు.     "అవును లవ్ మర్డర్." భుజంగరావు నెమ్మదిగా అన్నాడు.     వాళ్ళమాటలు వింటున్న అమల బుర్రలో ఓ మెరుపు మెరిసినట్లయింది.     భుజంగరావు కూతురు సరోజ ప్రభాకర్ కూడా లవర్స్ పెళ్ళికి ముందు అతను ప్రమాదంలో మరణించాడు. ఇది కూడా లవ్ మర్డర్ కాదు కదా? ఏమో ఎవరికీ తెలుసు వీటి వెనుక ఏదైనా హస్తం వుందేమో?"     అమల చాలా తీవ్రంగా ఆలోచించింది.     చనిపోవటం సహజం. హత్య అసహజం. అసహజం వెనుక చాలా పెద్ద విషయమే వుంటుంది.     "రోజా ఆలోచనలు ఎలా వుండేవి! అభిప్రాయాలు ఎలా వుండేవి! డైరీ లాంటివి రాసేదా! రాస్తే డైరీలో ఏం రాసేది, రోజా పుస్తకాల షల్ఫ్ అలమర వగైరా గాలించాలి. కొత్త విషయం పట్టగలిగితే పట్టాలి."     అమల తన కొచ్చిన కొత్త ఆలోచనలకి చాలా మురిసిపోయింది.     ఈ సాయంత్రం నుంచి ఆచరణలో పెట్టాలనుకుంది.     భుజంగరావు జగదీష్ యింకా మాట్లాడుకుంటూ వున్నారు. రకరకాల కబుర్లు చెప్పుకోటం వాళ్లకలవాటే.     అలానే పడుకున్న అమలకి నిద్ర పట్టింది.     వాళ్ళ కబుర్లు మాత్రం యింకా తెగలేదు.                                                                              14         శంకరం ఎప్పుడు తనని చూసినా మామూలుగా చూడడు. అంతులేని కామంతో వళ్ళంతా తెగబలిసి కొట్టుకు చస్తున్నాడు. చూపులతోనే దుస్తులు వలిచేసి దిగంబరంగా చేసి చూసినట్లు చూస్తాడు ముందు వీడిరోగం కుదర్చాలి.     అమల దీర్ఘంగా నిట్టూర్పు విడిచి అనుకుంది.     రెండు రోజులనుంచి అమల చాలా ధైర్యంగా వుంది. కొత్తశక్తి వచ్చింది. తను భయపడినందువల్ల లాభంలేదు. జరిగేది జరక్కపోదు. అందుకే తెలివిగా అన్నింటికీ సిద్దమైనదానిలా మెలగదల్చుకుంది.     అమల ఆలోచిస్తూ కూర్చుంటే శంకరం అటుగా వచ్చాడు.
24,981
     "మా నాన్నగారు గుర్తొస్తున్నారు" అంది సృజన ఏడుపు గొంతుతో.     "మా నాన్నగారు కూడా నీ అంత పొడుగ్గా ఉంటారు"     "స్సీనీయవ్వ! నన్ను సూత్తే నీ నాన్న గుర్తురావడమేందే! నన్ను సూత్తే సినీయాట్టరు నాగేస్సర్రావు గుర్తురావడలేదూ? ఈరోలా ఉంటానే నేను! నువ్వు నా ఈరోయిన్ వి అవునాక్కాదా?"     "ప్లీజ్! నాకు భయంగా ఉంది! నన్ను పంపించేయ్! ప్లీజ్! ప్లీజ్!"     "అహె! నోర్ముయ్యమంటూంటే!" అంటూనే ఆమె మీదికి ఒరిగాడు రాఘవులు.     ఆబరువుకి వంట్లోని ఊపిరి అంతా బయటికి వచ్చేసినట్లు అనిపించింది సృజనకి.     ఆ తర్వాత తనని నిలువునా కత్తితో చీల్చేస్తున్నట్లు వర్ణింపశక్యం కాని బాధ.     "హ్ మ్మా!" అని దిక్కులు పిక్కటిల్లేలా గావుకేకపెట్టింది సృజన. వెంటనే ఆమెకి స్పృహ తప్పిపోయింది.     నిమిషాలు గడిచాయి. మళ్ళీ కళ్ళు తెరిచేసరికి.....     రాఘవులు మొహం తన మొహానికి అతి దగ్గరగా కనబడింది. బెదిరిపోయి కేకవెయ్యబోయిన సృజన పెదిమలని అతని పెదిమలు నొక్కేశాయి.     తర్వాత మెల్లిగా దూరంగా వెళ్ళిపోయింది, రాఘవులు మొహం.     మళ్ళీ వెంటనే దగ్గరయింది.     మళ్ళీ దూరం.     మళ్ళీ దగ్గర, మళ్ళీ దూరం.     వంట్లోని ప్రతి ఎముకా, ప్రతికీలూ విరిగిపోతున్నట్లు అనిపిస్తోంది సృజనకి. ప్రతినరం తెగిపోతున్నట్లూ ప్రతి కండా కోసివేయబడుతున్న వరింప శక్యం కాని బాధకలుగుతోంది. కళ్ళలో నీళ్ళు పడి చూపులు మసగ్గా అయిపోయాయి.     ఆకన్నీటి పొరలోనుంచి దగ్గరగా కనబడుతోంది రాఘవులు మొహం దగ్గరవుతోంది దూరమవుతోంది.      క్రమంగా శారీరక బాధకు అతీతమైన స్థితికి చేరుకుంది సృజన. మనసుపడే బాధే తెలుస్తోంది గానీ శరీరం పడుతున్న బాధగమనానికి రావడం లేదు. మెల్లిగా కళ్ళలోని నీళ్ళు ఇంకిపోయాయి. ద్వేషం తాలూకు తీక్షణతో.     అస్పష్టంగా తెలుస్తోంది ఆమె లేత మనసుకి.     జరగరానిది ఏదో జరిగిపోయిందనీ, ఇంకఇకముందు తన జీవితం అందరి జీవితాల్లాగా సక్రమంగా జరిగిపోవడం కుదరదనీనూ! పసితనంలోనే తన జీవితం మసి అయిపోయిందన్న భావన కలిగించిన కసి. రాఘవులుకి అతని కోర్కె వలన కలిగిన కసికంటే కనీసం కోటి రెట్లు తీవ్రంగా ఉంది. కసి కసిగా సృజన వైపు చూస్తున్నాడు రాఘవులు. అంతకంటే కసిగా అతని మొహంలోకే చూస్తోంది సృజన. భూతద్దంలో భూతంలా కనబడుతోంది అతని మొహం. అతని మొహంలోని ప్రతిరేఖనూ, ప్రతివంపునీ ఎత్తుపల్లాలనీ కత్తిగాటు నీ, మొటిమలవల్ల ఏర్పడ్డ గుంటలనీ, ఆజన్మాంతం గుర్తు ఉంచుకోవడం కోసం అన్నట్లు నిర్నిమిషంగా, తీక్షణంగా చూసింది సృజన.     తలుపు దడదడ చప్పుడయింది. బండ తిట్లతో విసుక్కుని, లేచాడు రాఘవులు. తలుపు వెనక జాన్ నిలబడి ఉన్నాడు. అతని పక్కన పదమూడేళ్ళ పిల్ల. ఆమె చేతులు విరిచిపట్టుకుని ఉన్నాడు జాన్.     "నువ్వు నాకు మాంచి సారా తేవాలిబ్రెదరూ! నీకు కూతురుపుట్టిందిట! మీ ఊరినుంచి మునుస్వామివచ్చి చెప్పాడు" అన్నాడు జాన్.     "ధూత్తెరికీ! కూతుర్నే కన్నదీ శనిముండ? వద్దే అని చెప్పినా వినిపించుకోలేదన్నమాట!" అన్నాడు రాఘవులు తిక్కగా.     "ఈడికోసం జూడు! శాస్త్రప్రకారంపోతే ఎవురికో కుక్క పిల్లలు పుట్టాయట! అట్టాగే ఉంది నీ వరస! మొగాడేపుడతాడో, ఆడదే పుడుతుందో అది మనచేతిలో ఉందిటయ్యా రాఘవులూ!" కళ్ళు మూసుకుని వింటోంది సృజన. వాళ్ళు మాట్లాడుతున్న అన్ని మాటలలోనూ ఒకే ఒక్క వాక్యం ఆమె చెవుల్లోగింగురుమనడం మొదలెట్టింది.     రాఘవులుకి కూతురు పుట్టింది!     రాఘవులుకి కూతురు పుట్టింది!     రాఘవులుకి కూతురు పుట్టింది!     ఆమె మనసు ఆ విషయాన్ని జాగ్రత్తగా నోట్ చేసుకుంది.     "ఈపిల్లెవరు?" అంటున్నాడు రాఘవులు.     "ఇంకెవరు? టీచరమ్మగారి అమ్మాయి కామాక్షి!"     "ఎట్టా అయితేనేం ఎత్తుకొచ్చావన్నమాట! ఉండోల్సినవాడివిలే!"     "వస్తావస్తా అహల్య కాడికెళ్ళి బేరం కూడ కుదుర్చుకొచ్చా! రెండేల ఐదొందలు! నీకంత కంటే చిల్లిగవ్వకూడా ఎక్కువ రాదు. ఒప్పేసుకో రాఘవులు!"     "నేనొప్పేసుకుంటే నీకు దక్కే కమీషనెంతో!" అని జనాంతికంగా అని "అట్టాగే కానియ్! ఇంక జెప్పెదేముంది!" అన్నాడు రాఘవులు.     "ఎత్తుకురానయితే ఎత్తుకొచ్చాంగానీ ఈళ్ళని అహల్య కొంపకు జేర్చేదెలా? పోలీసులు గడబిడచేస్తున్నట్లున్నారే!" అన్నాడు జాన్.     కాసేపు ఆలోచించాడు రాఘవులు.     "ఆటోడ్రైవరు నవాబు ఉంటేశానా బాగుండేది"     "ఆడులేడుకదా!"     "మరయితే ఇక రిచ్చాలో ఏస్కోనిపోవాల!"     "తేలిగ్గా చెపుతున్నావేబాయబ్బా! అందరూ చూడరేంది?"     "గోనెసంచుల్లో కుక్కి అంజయ్య రిచ్చాలో ఏస్కెళ్తే సరి!"     అప్పుడు సృజనవైపు చూశాడు జాన్. తర్వాత నవ్వు మొహంతో రాఘవులువైపు తిరిగాడు.     "నీ అసాజ్జెం గూల! ఫినిష్ చేసేశావన్న మాట!"     సిగ్గుపడుతున్నట్లు ఇకిలించాడు రాఘవులు.     తర్వాత వాళ్ళు ఇద్దరూ కలిసి ఆ ఇద్దరు ఆడపిల్లల నోళ్ళలో టైట్ గా గుడ్డలుకుక్కారు. రెండు గోనెసంచులు తెచ్చాడు జాన్. ఇద్దరినీ చెరొక బస్తాలో అమానుషంగా దింపి సంచులుమూతలు నులకతాటితో కట్టేశారు.     అంతలో అంజయ్య రిక్షా తలుపుదగ్గరికి వచ్చి ఆగింది.     "అదేమిటి?" అన్నాడు జాన్, ఆగిపోయి, సృజన ఉన్న గోనెసంచివైపు చూస్తూ.     రాఘవులుకూడా అటువైపు చూశాడు.     సృజన ఉన్న గోనె సంచిమీద ఎర్రటి దాగుపడి ఉంది. నెమ్మదిగా వ్యాకోచిస్తోంది అది.     రాఘవులు జాన్ భయంగా మొహామొహాలు చూసుకున్నారు.     రాఘవులుకి వళ్ళంతా చెమటలుపట్టింది.     "అయిందేదో అయింది! రిచ్చాలో ఏసుకుని అహల్య ఇంటికెళ్ళి పోదాం! నోరెత్తకుండా ఏం చేస్తే అది చేసేడాక్టర్లు ఆమెకాడ ఉంటారు" అన్నాడు జాన్.     తల ఊపాడు రాఘవులు.     ఆడపిల్లలు ఉన్న రెండు గోతాల నీ రిక్షాలోకి సామాను ఎక్కించినట్లు ఎక్కించారు. వాళ్ళ శరీరాలు సగం సీటుమీదా, సగం కాళ్ళు పెట్టుకునే చెక్కమీదా ఉన్నాయి. సీటు అంచు వాళ్ళపక్క టెముకలని నొక్కేస్తోంది.     రిక్షా కదులుతుండగా మళ్ళీ స్పృహ తప్పిపోయింది సృజనకి.     గోనెసంచిమీద ఎర్రడాగు మరింత పెద్దదయింది.     ఎవరివో మోటు చేతులు తనని సున్నితంగా తాకుతుంటే నెమ్మదిగా స్పృహలోకి వచ్చి కళ్ళు తెరిచింది సృజన.     ఒక మొహం తనమీదికి ఒరిగి చూస్తోంది.     ఉలిక్కిపడి మళ్ళీ కళ్ళు మూసేసుకుంది సృజన, కళ్ళు మూసుకుంటే ఆ మొహం మళ్ళీ కనబడకుండా అదృశ్యమైపోతుందన్న భ్రమతో.     ఎవరిదామొహం? రాఘవులుదా?     కాదని చెబుతోంది మనసు.     అప్రయత్నంగా మళ్ళీ కళ్ళు తెరిచింది సృజన.     తనమొహంలోకే చూస్తోంది ఆ మొహం. చెవులకు రింగులు, ముక్కుపుడక, నుదుట పెద్దబొట్టు. నున్నగా షేవ్ చేసుకున్న గెడ్డం!     బెదిరిపోయింది సృజన.     పీడకల కంటోందా తను?     కళ్ళు చిట్లించి చూసింది.     ఎవరామనిషి?     ఆడా? మగా?     చీర, జాకెట్టూ---మెళ్ళో గొలుసులూ!     "మెలకువొచ్చిందా పాపా?" అంది ఆమె.     బండగా ఉన్న మగగొంతు!     నోటెంబడి మాటరానట్లు చూస్తోంది సృజన.     "నీకేంభయంలేదు! లేచి కూర్చో! ఇంద! ఇది తాగు!" అంది ఆమె వెండిగ్లాసులో ఉన్న ఒక ద్రవాన్ని సృజన నోటి దగ్గరికి తెస్తూ.     ఆకుపచ్చటి ఆకుపసరులా ఉంది ఆ ద్రవం. వెగటు వాసన వస్తోంది.     పెదిమలు బిగించి తల అడ్డంగా ఆడించింది సృజన.     "తాగమంటే తాగాలి!" అంది ఆమె గద్దిస్తూ మళ్ళీ అంతలోనే సౌమ్యంగా అంది "నా పేరు రంగేలీ! నీ పేరేమిటి?"   
24,982
    ఏదో వినిపిస్తోంది చూడు పద్మా! ఎవరో నా చెవిలో ఏమో చెపుతున్నారు. అర్ధం కావటంలేదు."     "నాకేమీ వినిపించడంలేదే!" గాభరాగా లేచి కూర్చుంది.     ఉన్నట్లుండి, "ఎవర్నువ్వు?" అని కోపంగా అరిచాడు గిరి.     "గిరీ!" అతన్ని తట్టింది పద్మజ భయంగా.     "నో....నో...." అతను చేతులతో తలను పట్టుకున్నాడు గట్టిగా. కనుగుడ్లు పైకి తేలిపోతున్నాయి. మనిషి వణుకుతున్నాడు.     "గిరీ?" అతన్ని కదుపుతూ అంది పద్మజ.     కాస్సేపటికి  అతను కళ్ళు తెరిచాడు. కళ్ళలో ఎర్రటి జీరలు మొహం వికృతంగా తయారైంది.     'నేను సోమశేఖరాన్ని  పద్మజా! నన్ను గుర్తుపట్టలేదా?" అడిగాడతను తాపీగా.     పద్మజ తాచుపాముని  పట్టుకున్నట్లు  ఉలిక్కిపడి  అతన్ని వదిలివేసింది. భయం భయంగా దూరంగా జరిగింది. అర్ధనగ్నంగా వున్న  తన వక్షోజాలపై  అతని చూపు పడడంతో ఒక్కసారిగా చీర తీసి కప్పుకుంది.     "భయపడకండి పద్మజా! నేను మిమ్మల్నేమీ చెయ్యను. నాలో అంత సాహసంలేదని మీకు తెలుసు" అన్నాడతను.     ఇప్పుడు గిరి స్వరం అతడిదిలాలేదు. అచ్చు సోమశేఖరం లాగానే వుంది.     "ఇందాక తోటలో  నేను చూసింది నిజమేనా? భ్రాంతి కాదా?"         తనలో  తనే అనుకొంటున్నట్లుగా  అంది.     "లేదు పద్మజా! పార్టీలో  వున్న గిరిని నేనే ఆహ్వానించాను! రమ్మనగానే  దగ్గరికి వచ్చాడు.  మిమ్మల్ని దగ్గరగా చూసి, మాట్లాడాలనే కోర్కెను అతడి ద్వారా తీర్చుకో గలిగాను."     "ఎందుకు? నేనేం పాపం చేశానని నన్నిలా వేధిస్తున్నారు?" అడిగింది పద్మజ. ఆమె కంఠం వణుకుతోంది. ఇంకా షాక్ నించి పూర్తిగా తేరుకోలేదు.     "నేను మిమ్మల్ని మనస్పూర్తిగా ప్రేమించాను పద్మజా! కానీ ఎప్పుడూ చెప్పలేక పోయాను. అప్పుడు చేయలేని ధైర్యం ఈనాడు  ఇలా చెయ్యగలుగుతున్నాను. మీ సాన్నిధ్యం కోసం తపించి కొట్టుకులాడుతోంది నా ఆత్మ. పూర్తి సంతృప్తి కలిగితేనేగానీ పోలేను.     కొన్నాళ్ళు నాకు మీ సాన్నిహిత్యం కావాలి. నన్ను ప్రేమించక పోయినా  ఒక స్నేహితుడిగా నా కోరిక తీర్చమని వేడుకుంటున్నాను."     "శేఖరం - ఇది చాలా అన్యాయం. నా భర్తను, తద్వారా నన్ను మీరెంత బాధపెడుతున్నారో మీకేమయినా తెలుస్తూందా ? మీరు నాకు స్నేహితులయితే  నా సుఖం కోరాలిగదా !"     "మీకేం అపకారమూ జరగదు పద్మజా ! నన్ను నమ్మండి."     "నేను ఏం చెయ్యగలను?" అడిగింది భయంగా.     "మాట్లాడండి. కాస్సేపు మాట్లాడితే నాకెంతో తృప్తి కలుగుతుంది. వెళ్ళిపోతాను."     "హు....ఏం మాట్లాడను?"     "ఏదయినా యిదివరకు మనం మాట్లాడుకునేవి. ఆఫీసు విషయాలు దేశభక్తి, సాహిత్యమూ, సంగీతమూ ఏదయినా సరే."     "నో....నేను మాట్లాడలేను" రెండు చేతుల్లో ముఖం కప్పుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది పద్మజ.     "వద్దు పద్మజా - మీరలా  బాధపడితే నేను భరించలేను. వెళ్ళిపోతున్నాను. మీ మనసు బాగున్నప్పుడే వస్తాను."     అతని స్వరం వినిపించటం ఆగిపోయింది.     నెమ్మదిగా కళ్ళు తెరిచింది పద్మజ. గిరి కళ్ళు మూసుకుని మంచానికి చేరగిలబడి కూర్చున్నాడు. అతని ముఖంనిండా  చెమటలు.     "గిరీ" మెల్లిగా పిలిచింది.     నెమ్మదిగా కళ్ళు తెరిచాడతను. కళ్ళు మామూలుగానే ఉన్నాయి.     "ఏమిటిది? నేను కూర్చునే నిద్రపోయానా? ఏమయింది నాకు" లేచి తల విదిలించాడు. "ఏదో జరగకూడంది జరిగినట్లుగా  అనిపిస్తూంది పద్మా!"     పద్మజ అతన్ని పరిశీలనగా చూసింది. అతను గిరే. అప్పటివరకూ అతనిలో  కనిపించిన విపరీతపు లక్షణాలేవీ కనిపించడం లేదిప్పుడు.     "గిరీ" ఒక్కసారి అతని మీదకు వాలిపోయింది.     "అరే, ఏడుస్తున్నావా? ఏమయింది - నిన్నేమైనా హర్ట్ చేసానా?" అడిగాడు.     "లేదు నాకేమిటో భయంగా ఉంది."     "భయమా! నీకా!!" అతను పకపకా నవ్వాడు, "ఎందుకు? ఈ రాత్రి నిన్ను భయాందోళనలకు దూరంగా స్వర్గానికి అతి దగ్గరగా తీసుకెళ్ళే భారం నాది. ఓ.కే?" అంటూ దగ్గరికి తీసుకున్నాడు.     జీవితంలో అవతలి పార్టనర్ ని సంతృప్తి పర్చటం కోసం ఎన్నో కొన్ని పన్లు  చేయాలి, కానీ సెక్స్ లో అవతలి పార్టనర్ ని సంతృప్తిపర్చే  ఒకే ఒక పని....మనం హాయిగా సంతృప్తి చెందటమే! అలా చెందినట్టు అవతలి వ్యక్తికి తెలిసేలా ప్రవర్తిస్తేచాలు. అంతకన్నా  సంతోషం అవతలి వ్యక్తి (ఈగో) వేరే ఏమీ వుండదు.                                 7     రాత్రి రెండు గంటలు దాటింది. గుజరాత్ రాష్ట్రంలోని గంగా నగర్ జిల్లా నుంచి పంజాబ్ లో ఫిరోజ్ పూర్ జిల్లావైపు వెళ్ళే సరిహద్దు హైవే.     పాత మిలటరీ ట్రక్కు అది. డ్రైవరు కాకుండా మరో ఇద్దరూ జవాన్లు కూర్చున్నారందులో. సరిహద్దు చెకింగ్ పోస్టు  యింకో పదిమైళ్ళ దూరంలో  ఉండగా  ట్రక్కుని  పక్కదారిలోకి నడిపాడు డ్రైవర్. రోడ్డు గతుకులు గతుకులుగా ఉంది. మిలటరీ ట్రక్కు కాబట్టి  నిదానంగా సాగిపోతోంది రాళ్ళూ, గుట్టలూ ఎక్కుతూ.     వెనుక నుంచి హారను వినిపించడంతో రియర్ వ్యూ మిర్రర్ లోంచి చూశాడు డ్రైవర్.     మోటారు సైకిలు మీద యిద్దరు ఖాకీ దుస్తుల వాళ్ళు....ట్రక్కుని ఆపాడు డ్రైవర్, మోటారు సైకిలు వచ్చి అడ్డంగా ఆగింది. ఒక ఇన్ స్పెక్టర్ దగ్గరగా వచ్చాడు.   
24,983
        "ఛట్! అలాంటి పని చేస్తే చేయను"     "చేయకపోతే ఆకలితోటి చస్తావ్"     "చచ్చినా సరేగానీ చేయను"     "అయితే చావ్"     ఆ రాత్రంతా ఆకలి బాధ ఓ పక్క దోమలు-బొద్దింకల బాధ మరోపక్క పీడిస్తోంటే నిద్ర లేకుండా గడిపాడతను. అయితే అంతకు ముందు రోజులా చలి మాత్రం లేదు.     పొద్దున జైలు 'టీ' తాగేసరికి పోయిన ప్రాణం తిరిగొచ్చినట్లైంది.     "ఏయ్ రాజూ! నువ్వేం పరేషానవ్వకు. మధ్యాహ్నం భోజనం పెడతారు వీళ్ళు! నువ్వురెండు దినాలకెళ్ళి తినలేదంటివిగా?"     అతనికి ఆశ కలిగింది.     అవును జైల్లో వున్నందుకు భోజనం పెట్టాలికదా!     ఒక విధంగా తనను జైల్లో వేయటం మంచిదే అయ్యింది.     లేకపోతే ఆ చలికీ, ఆకలికీ చచ్చేవాడు.     మధ్యాహ్నం భోజనం కోసం అందరూ ఆతృతగా ఎదురు చూడసాగారు.     రెండయిపోయినా భోజనం రాకపోయేసరికి అందరికీ అనుమానం వచ్చేసింది.     "ఇంక భోజనం పెట్టరు" అన్నాడు రాములు.     అతను ఆశ్చర్యపోయాడు.     "అదేమిటి? జైలులో వున్నవాళ్ళందరికీ భోజనం పెట్టాలిగా?"     "మనలాంటి ఏక్ దిన్ కా సుల్తాన్ గాళ్ళకు పెట్టరు" యాదగిరి విచారంగా అన్నాడు.     "ఎందుకని?"     "మననెలాగూ సాయంత్రం వదిలేస్తారు కదా! అందుకని ఒకపూట రేషన్ కాజేస్తారన్నమాట యీ జైలు వాళ్ళు" ఇంకో ఖైదీ అన్నాడు.     ఈలోగా సెంట్రీలు అటు వచ్చేప్పటికి అందరూ సెంట్రీ వెంబడి పడ్డారు భోజనం కోసం.     "ఆజ్ ఖానా నహీ హై" ఖండితంగా చెప్పాడతను.     "అదేంటి? ఎందుకు లేదు? గవర్నమెంటు రేషన్ అంతా ఏమయిపోయింది?" ఎవరో అరిచారు.     "ఏయ్! లొల్లీ పెట్టిన్రంటే లాఠీతోటి ఎడతా భోజనం! సమజయ్యిందా?"     అంతే! ఆ తరువాత ఎవరూ మాట్లాడలేదు.     ఆ సాయంత్రం ఏడు గంటలకు సెంట్రీ భోజనం ప్యాకెట్లు తెచ్చి ఆ గదిలో వున్నాళ్ళందరికీ తలోటి యిచ్చాడు.     రెండు రొట్టెలు, కొంచెం కూరా వున్నాయి అందులో.     రాజశేఖరం ఆతృతగా తినేశాడవి.     జీవితంలో అది మొదటిసారి అలాంటి ఆహారం తీసుకోవటం.     పోయిన సత్తువలో కొంచెం తిరిగొచ్చినట్లనిపించిందతనికి.     ఆ రాత్రి రాములు, యాదగిరి పాటలు పాడుతూంటే ఎప్పుడు నిద్ర పట్టిందో తెలీదు. తెల్లారేసరికల్లా అందరినీ బయటకు గెంటేశారు.     రాజశేఖరానికి ఇంకా నమ్మబుద్ధి కావటంలేదు.     ఎంతమంది పలుకుబడి వున్న గూండాలు, ఇతర నేరస్తులు తమ బదులుగా డమ్మీలా జైలుశిక్ష అనుభవించేట్లు చేస్తున్నారో తెలీదు.     రాములు, యాదగిరితోపాటు స్లమ్ కి తిరిగొచ్చాడతను.     సోనీ భుజానికి గోనె సంచీ తగిలించుకుని ఎదురయింది.     "నీయవ్వ! కాగితాలు, ప్లాస్టిక్ లు ఏరుకొద్దామంటే జమీందార్ లెక్కన నకరాల్జేశావు... జైలు మంచిగుందా?" అడిగింది హేళనగా.     "ఇవాళ్టి నుంచీ నీతో వస్తా."     "అయితే పద."     ఆమెతోపాటు రోడ్ల వెంబడి నడవసాగాడతను.     కొద్ది దూరం నడిచేసరికి కాళ్ళు నొప్పులు పట్టుకున్నాయి.     "ఇంక నేను రాలేను" అన్నాడు ఆగిపోయి.     "సరే ఇక్కడే కూర్చో నేను మార్కెట్ అంతా చూసుకొస్తాను."     బస్ స్టాప్ లో కూర్చున్నాడు రాజశేఖరం.     "రోడ్ చాలా రద్దీగా వుంది.     హఠాత్తుగా ఎగ్జట్ మెంట్ తో లేచి నుంచున్నాడు రాజశేఖరం.     తన బెంజ్ కారు వేగంగా వస్తోంది.     ఎంత లగ్జరియస్ కారది?     ఆ కార్లో తిరగాల్సిన వాడికిదేం ఖర్మ?     ఎందుకిలాంటి తెలివితక్కువ పందెం కట్టాడు తను? తిరిగి ఇంటికెళ్ళిపోతే? నో! పందెం ఓడిపోవడానికి వీల్లేదు. ఇంతవరకూ ఎప్పుడూ ఓడిపోలేదు.     ఆ కారు తన ముందు నుంచీ వెళ్ళిపోతోంది.     లోపల కనకారావు దర్జాగా కూర్చుని వున్నాడు.     మార్క్సిస్ట్ కనకారావు.     "ఒరేయ్ కనకారావ్?" కారు పక్కన చేయి వూపుతూ పరుగెత్తాడు గానీ అతను తనవంక కూడా చూడలేదు.     "ఏయ్! ఏమిటా పిచ్చి చేష్టలు? ఇక్కడికొచ్చే ముందు పిచ్చాసుపత్రిలో వుండేవాడివా?" పక్కకొచ్చి నిలబడుతూ అడిగింది సోనీ.  
24,984
    "అంత భయమేమిటి - నేను రామాన్ని, గుర్తుపట్టలేదా" -సన్నగా పొడుగ్గా వున్నాడు. స్కూటరు తాళాలు చేత్తో అటు ఇటు తిప్పుతూ అన్నాడు.         "ఆ. రామం' - తెలుసుకున్న ముఖమే. ఎక్కడ చూసిందీ. వెంటనే గుర్తురాలేదు.         'మీ స్నేహితురాలు లలిత గుర్తుందా' రామం నవ్వుతుంటే శారదకి నవ్వొచ్చింది.         'అదేమిటి -లలితని ఎలా మర్చిపోతాను'         'ఆ లలిత పక్కవాటాలో చాలా ఏళ్ళుగా వున్న అబ్బాయిని - గవర్నమెంటు ఉద్యోగిని ఒకసారి హైదరాబాదు అలవాటు పడ్డవాడు దీన్ని వొదిలి వుండలేడు కదూ.         శారద రామం మాటలు వింటూనే బస్ వస్తుందేమోనని అటు చూస్తోంది.         'ఇంకా బస్సు వస్తుందనే ఆశ వుందామీకు --- రాదు"         'అయ్యో - రాదా' శారదకి భయమేసింది - ఏ రిక్షా అయినా కనిపిస్తే బావుండును - ఇంటికెలా వెళ్ళాలితను.         'రండి, నా స్కూటరు మీద మీ యింటి దగ్గర దించుతాను. అయినా నేనుండేదీ అక్కడేగా" రామం అన్నదానికి శారద సమాధానం చెప్పలేదు. వర్షం మెల్లగా పెరుగుతోంది. రామం కాసేపు ఆగాడు.         "నేను వెడతాను" రామం స్కూటరు దగ్గర కెళ్ళాడు.         'వస్తున్నాను' - శారద రామం స్కూటరు వెనక కూర్చుంది.         శారద గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. వర్షం మరీ పెద్దదయింది. ఆ ప్రయత్నంగా శారద చేయి రామం భుజంమీద పడింది. ఒళ్ళు జలదరించింది. అతన్ని పట్టుకు కూచోకపోతే ఈ వర్షంలో పొరబాటున జారిపడితే - భయం భయంగా అటు ఇటు కదులుతోంది శారద.         ఇంటిముందు స్కూటర్ ఆగటం, శారద ఇంట్లోకి పరిగెత్తటం ఒక్కనిముషంలో జరిగిపోయాయి.         ఊరినించి వచ్చిన రాజారావు శారదతండ్రి ముందుగదిలోనే వున్నాడు. "ఎలా వచ్చావమ్మా ఇంతవానలో" అన్నాడు తల తుడుచుకుంటున్న శారదతో.         'ఆ.....ఆ....రిక్షాలో, రిక్షాలో వచ్చాను. అయినా తడిసిపోయాను అంది శారద అద్దంలో చూసుకుంటూ.         ఎందుకు అబద్దం ఆడుతోందితను, రామం స్కూటర్ మీద వచ్చాను అని చెప్పచ్చుగా....ఏమో!!         శారదకి ఎలాగో అనిపించింది. స్త్రీపురుషుల ఆకర్షణ వయసుని బట్టి వుంటుందా, అవసరాన్ని బట్టి వుంటుందా - రామంస్కూటర్ మీద ఎందుకు రావడం - నిజంగానే ఇంకో పదినిముషాలు బస్ స్టాపులో వుంటే బస్సేవచ్చేదో, రిక్షా ఏ దొరికేదో - ఆలోచన పరిపరి విధాలుగా పోతోంది.         శారద వానపడుతుంటే కిటికీ దగ్గర నిలబడి వీధిలోకి చూస్తోంది. తను స్నేహితులతో, బంధువులతో, పెళ్ళి తప్పనిసరి కాదని, పెళ్ళిచేసుకోక పోయినా హాయిగా బతకవచ్చని చెప్తోన్నమాటలలో నిజం వుందా - ఆడదానికి ఒక వయసు వచ్చాక మగతోడుకావాలి -ఖచ్చితంగా కావాలి - కాకపోతే, రామంతో, తనకి స్నేహం లేదు - పెద్ద పరిచయం లేదు - తన ఆఫీసుకాదు - లలిత ఇంట్లో అద్దెకుంటాడు - అంతమాత్రం చేత అతను రమ్మంటే స్కూటర్ వెనక కూచుని రావాలా?! - ఆ ప్రశ్నకి సమాధానం రాలేదు శారదకి !!         శారద ఏ విషయంలోనైనా నిర్ణయం తీసుకోటానికి ఎవరిపైనా ఆధారపడదు - తన మనసుకి ఎంత తోస్తే అదే - చిత్రంగా శారద మనసు రామం స్నేహంకోరటం ప్రారంభించింది. బస్ స్టాపులో నిలబడి వర్షం లేకపోయినా రామం కోసం ఎదురు చూడటం మొదలుపెట్టింది శారద.. అతనితో కలసి స్కూటర్ పైన కూచుని సినిమాలకి, హోటళ్ళకి వెళ్ళటంలో తప్పేమీ లేదని మనసుని సమాధానపరచుకుంటోంది ఈ మధ్య. లలిత ఎక్కడైనా కనిపిస్తుందే మోనని భయపడుతోంది కూడా - అంటే పురుసులంతా చెడ్డవాళ్ళే - అడదానికి పెళ్ళి అవసరం లేదని భావించిన శారద ఒక మెట్టు దిగిందా - ఇక పిల్లలు - చూద్దాం - శారద తీసుకొనే నిర్ణయాలు తనవే - ఎవరి బాధ్యతా లేదు అందులో!         రామంతో పరిచయం స్నేహంగా మారి ఏడాదికావస్తోంది. తన అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాడతను - అతన్ని తన జీవిత భాగస్వామిగా ఎంచుకోవటం మంచిదేకదా - శారద మనసు అంగీకరించింది.         రామం చిన్నపుడే తండ్రి మరణించాడు. రామం తల్లి యశోదమ్మ ఆ ఊళ్ళోనే వ్యవసాయం పనులు చేయించుకుంటూ కాలక్షేపం చేస్తూంది. ఆమె పంచ ప్రాణాలు రామంపైనే. అతను ఏమంటే అది తల్లికి అంగీకారమే.         లలిత ఇంట్లో అద్దెకుంటూ వండుకుతింటున్నాడు రామం. లలిత స్నేహితురాలిగా శారదని చాలాసార్లు చూసాడు. శారద గురించి లలిత చెప్పేమాటలు శారదపై ఒక సదభిప్రాయాన్ని కూడా ఏర్పరచాయి. దాంతోపాటు శారదపై ఆకర్షణను కూడా పెంచాయి.         "మీ ఫ్రెండు పెళ్ళి చేసుకోదా. నాన్సెన్స్ - ఇలా అన్న అమ్మాయిలే అందరికన్న ముందుగా పెళ్ళిచేసుకుంటారు. ఒక్క స్నేహితుడు కనిపిస్తే చాలు అలా అలా అల్లుకుపోతారు. వనితా, లతా నిరాధారంగా వుండవంటారు పెద్దలు - లలితా, చూడుమరి, మీ శారదని నేను పెళ్ళి చేసుకుంటాను - అలా చేసుకోకపోతే నా పేరు మార్చేయి- ఏమంటావు" రామంమాటలకి లలిత వెక్కిరిస్తూ.         'చాలు చాలునీ ప్రతిజ్ఞలు - శారద అంటే ఏమనుకుంటున్నావు. అందరిలాటి ఆడపిల్ల అనుకుంటున్నావా. పొరబాటు - నీ స్కూటరు చూసి, నీ పర్సనాలిటీ చూసి మెచ్చి వెంటపడి వచ్చేస్తుందను కుంటున్నావులా వుంది - దానితో అలాంటివేమికుదరవు - దాని పద్దతి వేరు - దాని ఎన్నికవిధానమే వేరు అంది లలిత నిదానంగా.         కాలం ఎవరికోసమూ ఆగకుండా ముందుకెళ్ళిపోతోంది. శారదా రామంలు ఏకమయే సమయమొచ్చింది. నిరాడంబరంగా పెళ్ళి చేసుకోవాలని నిశ్చయించుకున్నారిద్దరూ. మా అమ్మకూడా రావద్దా' అన్నాడు రామం.     'మీ అమ్మ వద్దు - మా అమ్మ వద్దు. అయినా రిజిస్టరు పెళ్ళికి ఎవరు మాత్రం ఎందుకూ - పెళ్ళి అయ్యాక అందరినీ కలుద్దాం' - శారద ఖచ్చితంగా అన్నాక 'దేవిగారి ఆజ్ఞ' అన్నాడు రామం.         "నన్ను నువ్వు గౌరవించాలి - నా అభిప్రాయాలకి విలువనివ్వాలి" అంది శారద.         "నన్ను నువ్వు గౌరవించాలి. నా అభిప్రాయాలకి విలువ నివ్వాలి" అన్నాడు రామం.         రిజిస్టరు ఆఫీసునించి తిరిగి వస్తూ హోటల్లో భోజనం చేశారు ఇద్దరూ.         భార్యాభర్తలుగా శారద రామం ఆహ్లాదంగా జీవిస్తున్నారు. ఇద్దరూ ఉద్యోగస్థులే - స్నేహితుల్లా కలసిమెలసి వుండాలని ముందే అనుకోబట్టి ఎవరిపై ఎవరి పెత్తనం, ఎవరెక్కువ ఎవరు తక్కువ అనే ప్రశ్న ఉదయించలేదు. కానీ శారద మాత్రం తన వ్యక్తిత్వం ఎక్కడ దెబ్బ తింటోందోనని ఎప్పుడూ జాగ్రత్త పడుతూనే వుంటుంది. పెళ్ళి చేసుకున్నంత మాత్రాన ఆడది చెప్పిన దానికల్లా గంగిరెద్దులా తల ఊపాలా, బానిసలా పడివుండాలా - తన అభిప్రాయాలుతనవి - ఈ భావం శారద అంతరంగంలో వుండి శారదను హెచ్చరిక చేస్తూనే వుంటుంది.
24,985
                                కథ సుఖాంతం     కోటేశ్వర్రావు భార్య కాంతామణికి నెలలు నిండాయ్.ఆమె లేక లేక గర్భం ధరించింది.     అందుకనే ఆ భార్యా భర్తలిద్దరూ యమసంతోషంగా ఉన్నారు.     "ఏవండీ...మీకేం కావాలి?"     పేపర్ చదువుకుంటున్న భర్తని ప్రశ్నించింది కాంతామణి.     "నాకు అమ్మాయ్ కావాలి!..."పేపర్ పక్కనబెట్టి గారాలు పోతూ అన్నాడు  కోటేశ్వర్రావు.     "ఏం...ఇప్పట్లో నేను పనికిరాననా వెధవ్వేషాలు?" కోపంగా అంటూ నెత్తిన 'ఠక్'మని మొట్టింది కాంతామణి.     "హయ్యో రామా...ఇదెక్కడిగోల??... అమ్మాయ్ అంటే పడుచుపిల్ల అని కాదు...నాకు పాప కావాలని అర్థం..." అంటూ కాంతామణి పొట్టకేసి చూపిస్తే అన్నాడు కోటేశ్వర్రావు.     "ఆ...ఆ...మీరు చెప్పిన వాళ్లని కనడానికి నేను తేరగా ఉన్నానిక్కడ... నేను అబ్బాయ్ నే కంటా..."     "ఊహూ...అమ్మాయ్ నే కనాలి!!..."గారాలుపొతూ కాంతామణి చెయ్యి వెనక్కి మెలితిప్పి చిలిపిగా వీపుమీద ఒక గుద్దుగుద్దాడు కోటేశ్వర్రావు.     "అబ్బా ఆశ!...నేను అబ్బాయ్ నే  కంటా..."అంటూ కోటేశ్వర్రావు జుట్టుపీకి చెంపమీద ఓ చరుపు చరిచింది కాంతామణి కొంటెగా.     "కాదు అమ్మాయ్..."కోటేశ్వర్రావు కాంతామణి జడపైకెత్తి ఓ జల్లకాయ్ కొట్టాడు.     "కాదు కాదు!...అబ్బాయే!!" అంటూ కాంతామణి కోటేశ్వర్రావు కాలుపట్టి లాగి కిందపడేసి పకపకా నవ్వింది.     "అమ్మాయే అమ్మాయే అమ్మాయే..."కింద నుంచి లేచి సోఫాలో కూర్చుంటూ అన్నాడు కోటేశ్వర్రావు.     "మనకీ వాదన రోజూ ఉండేదేగానీ...చెప్పండి ఏం కావాలో..."     "చెప్పాగా...అమ్మాయ్ కావాలని!!"     "అబ్బా!...నేను అడిగేది దాని గురించికాదు...మీకు కాఫీ కావాలా టీ కావాలా అని అడుగుతున్నా..." నెత్తికొట్టుకుంటూ అంది కాంతామణి.     "నాకు కాఫీ కావాలి!!..."     కాంతామణి భర్తకి కాఫీ తెచ్చి ఇచ్చింది. అతను కాఫీ తాగింతర్వాత కాంతామణి అంది "ఏవండీ...ఈ నెల డాక్టర్ దగ్గరికి చెకప్ కోసం వెళ్లలేదు..."     "ఇప్పుడే వెళ్దాం...నువ్వు తయారవు!" సోఫాలోంచి లేస్తూ అన్నాడు కోటేశ్వర్రావు.     ఇద్దరూ బట్టలు మార్చుకుని లేడీ డాక్టరు సీతాలు దగ్గరికి వెళ్లారు.     డాక్టర్ సీతాలు కాంతామణిని పరీక్షించి మొదట పెదవి విరిచింది...తర్వాత ఫకాల్మని హాయిగా నవ్వేసింది.     ఆవిడ అలా ఎందుకు చేసిందో అర్థంకాక ఇద్దరూ వెర్రిమొహాలేస్కుని చూశారు.     "మొదట మీరెందుకు పెదవి విరిచారు... ఆ తర్వాత ఫకాల్మని ఎందుకు నవ్వారు?... చెప్పరా...ప్లీజ్!" అన్నాడు కోటేశ్వర్రావు చేతులు జోడిస్తూ.     "అదా?...వెరీసింపుల్...పెదవి ఎందుకు విరిచానంటే ఆవిడ గర్భంలో బిడ్డ అడ్డం తిరిగింది.మరేమో...ఫకాల్మని హాయిగా ఎందుకు నవ్వానంటే మరి బిడ్డ అడ్డం తిరిగిందిగా...అలా అడ్డం తిరిగితే మా నర్సింగ్ హోంలోనే సిజేరియన్ ఆపరేషన్ చేసి బిడ్డనిబయటికి తీస్తాంగా...అందుకు!హి...అసలు ఈ బిడ్డలు మా మెటర్నిటీ హోంలని పోషించడం కోసమే అడ్డం తిరిగిపోతుంటారు...హిహి" అంది డాక్టర్ సీతాలు ఉప్పొంగిపోతూ.     "ఏవండీ... ఆపరేషన్ చేసే తీరాలంటారా?" నీళ్లు నముల్తూ అడిగాడు కోటేశ్వర్రావు.     "అమ్మో...చెయ్యకపోతే చాలా ప్రమాదం. తల్లీబిడ్డా ఇద్దరూ గోవిందా గోవింద!!" అంది సీతాలు.     వాళ్లిద్దరి మొహాలూ పాలిపోయాయ్. వాళ్ల భయాన్ని గమనించిన సీతాలు ముసిముసిగా నవ్వుకుంది.     "మీ బిడ్డింకా నయం...కేవలం అడ్డం తిరిగాడు...మొన్నీ మధ్య బాగా డబ్బుండే ఒకావిడ బిడ్దేమో గర్భసంచిలో ఏకంగా మొగ్గలే వేస్తున్నాడు. ఇలా అయితే చాలా ప్రమాదం అని చెప్పి ఆపరేషన్ చేసి బిడ్డని బయటికి తీసేశాను. వాళ్లు నాకు అయిదువేలిచ్చారు. మీకు అంతెక్కువేం అవదు.మీ బిడ్డ కేవలం అడ్డం తిరిగాడు కాబట్టి మూడువేలు అవుతుంది..."     "అలాగే డాక్టరుగారూ...మేమింక వస్తాం" నీర్సంగా అన్నాడు కోటేశ్వర్రావు.     "అలాగే గానీ ...మీ క్రాపు చాలా బాగుందండీ...చక్కగా బఫ్ వచ్చేలా దువ్వుకున్నారు..."అంది డాక్టర్ సీతాలు అతని క్రాపువంక మెచ్చికోలుగా చూస్తూ "మా ఆయన్ని కూడా ఇలానే దువ్వుకోమంట..."     "బపూ కాదు నా బొందా కాదు. ఇందాక మా ఆవిడ బొడిపె వచ్చేలా మొట్టింది.అందుకే అక్కడ ఎత్తుగా అలా లేచింది..."సిగ్గుపడ్తూ అన్నాడు కోటేశ్వర్రావు.     "అవునా?...బాగుందే!!! ఈ రోజు ఇంటికెళ్లింతర్వాత నేను కూడా ఆయన్ని గట్టిగా మొడ్తా..." సంబరంగా అంది డాక్టర్ సీతాలు.     కాంతామణి,కోటేశ్వర్రావు సీతాలు దగ్గర శలవు తీస్కుని ఇంటికెళ్లారు.     "డాక్టర్ చెప్పింది విన్నాక నాకు చాలా డల్ గా ఉందండీ...మనసంతా చికాకు చికాకుగా ఉంది.అందుకని ఎక్కడికైనా లాంగ్ డ్రైవ్ కి వెళ్దామండీ..."కోటేశ్వర్రావు గుండెలమీద వెంట్రుకలు పీకుతూ అంది కాంతామణి.కోటేశ్వర్రావ్ బాధగా ఓ కేకపెట్టాడు.     "సినిమాల్లో చూడ్లేదూ?నవలల్లో    చదవలేదూ?? ఏదైనా చెప్పదల్చుకున్నప్పుడు ఛాతీమీది వెంట్రుకలు మెల్లగా లాగుతూ చెప్తారు...నువ్వేంటి గడపీకుతున్నట్టు పీకుతున్నావ్?" పళ్లు కొరుకుతూ అన్నాడు కోటేశ్వర్రావ్.     "సారీ అండీ!...ఇహనుండి మెల్లగానే పీకుతాను సరేనా?"     "నువ్వ పీకక్కర్లేదు...మనం వెళ్దాం పద!!..."అన్నాడు కోటేశ్వర్రావ్ కాంతామణి చేతిని ఛాతీమీదది నుంచి లాగేస్తూ.     ఇద్దరూ ఇంటి దగ్గరనుంచి కార్లో బయలుదేరారు.     "ఎక్కడికి వెళ్దాం?"అడిగాడు కోటేశ్వర్రావు.     "ఎక్కడికైనా పర్లేదు...దూరం అలా అలా తిప్పుకుని రండి"చెప్పింది కాంతామణి.     కారు ఒక ఫర్లాంగు దూరం మామూలుగా నడిచింది.తర్వాత ఉన్నట్టుండి ఎగిరి జంప్ చేసింది.     ఆ కుదుపుకి కాంతామణి ఎగిరి ముందుకుపడి మళ్ళీ సర్దుకుని కూర్చుంది.     "ఏంటీ...ఏదైనా సర్కస్ కంపెనీలో పని చెయ్యాలని అనుకుంటున్నారా?...కారు సరిగ్గా నడపండి" విసుక్కుంది కాంతామణి.     "నేను సరిగ్గానే నడుపుతున్నా..."గొణిగాడు  కోటేశ్వర్రావ్.     కారు మరి కాస్త దూరం సాఫీగానే నడిచింది. ఉన్నట్టుండి గంతులేస్తూ నడవడం మొదలెట్టింది.     "ఏంటిది...మనం కార్లో వెళ్తున్నామా లేకపోతే గుర్రం మీద వెళ్తున్నామా?" కంగారుగా అడిగింది కాంతామణి.   
24,986
    తా: నాయకుడు ఇచ్చించిన తానిచ్చించుట, అతడు కోపించుకొనిన తానూ కోపించుకొనుట. అతడు నిజము పల్కిన తాను నిజము  పల్కుట, అతడపరాధము చేసిన తానపధాధము చేయుట, అతడు స్నేహించిన తాను స్నేహించుట ఈ రీతి గుణములు గలది "మధ్యమ" నాయిక యనబడును.                                  ఆధమ నాయిత  లక్షణము     కఅస్మాత్కుప్యలిరుషం ప్రార్ధితాపినముంచతి !     సురూపంవావిరూపంవాగుణవంతమధాగుణం !!     స్థవిరం తరుణం వాపియావాకామయతే ధృతం !     ఈర్ష్యాకోపవిషాదేషు, నియతాసాధమామతా !!     తా: ఏ నాయిక అకారణముగ  నోపించుచున్నదో  ప్రార్ధించినను, కోపమును విడువదో చక్కనివాడైనను, తరుణుడైనను, ఎట్లున్నను, నాయకుని  ఇచ్చించుచున్నదో, ఈర్ష_కోపము_వ్యసనము వీనిని గలదిగా నున్నదో అది "అధమ" నాయిక యనబడును.     నిష్పత్పత్తిర్విభాపస్యకార్యజ్ఞాప్తిస్తతః పరం !     అనుభావస్య కార్యస్య సంపుష్టిర్వ్యభీధారిణః !!     ఇతిసూత్రస్థనిష్పత్తి సబ్టార్థః పరికీర్తితః !!     తా: విభావమునగు  కార్యమును  కలుగచేయుటకును, అనుభావమునకు కార్యమును జ్ఞాపించుటకును, వ్యభిచారి భావమునకు  కార్యమును పోషించుటయును "నిష్పత్తి" శబ్దార్టమని చెప్పబడినది.                           భావ_విభావ_అనుభావ_లక్షణములు     భావలక్షణము :- వాచిక _ ఆంగిక _ సాత్వికాభినయోపేతములైన కావ్యార్ధములను (అనగా రసములను), భావింపచేయునవి గాన ఇవి  "భావము" లనబడినవి. "భూ" అను ధాతువునకు  "కరణము" (అనగా చేయుట) అని అర్ధము. కావుననే భావితము, కృతము, వాసితము. అను పదములు ఏకార్దములగుచున్నవి. లోకమందుకూడా "అహో" ఈ గ్రంథముచే లేదా ఈ రసముచే సర్వమును భావితమైనదనుట ప్రసిద్ధమే. కావున భావపదమునకు "వ్యాప్తి" అనగా వ్యాపించుట అని అర్ధము, ఏ అర్ధము విభావముచే ఆహృతమై అనగా నిష్పాదితమై అనగా నిష్పాదితమై అనుభావములచేతను వాగంగ సత్వాభినయములచేతను. గమ్యమానమగునో అనగా అభివ్యక్తము  చేయబడునో. ఆ అర్ధము భావమగును. వాచిక_ఆంగిక_ ముఖరాగాత్మకమైన, అభినయనముచేతను, సాత్వీకాభితయముచేతను, కవ్యంతరగతమైన  భావమును భావింపజేయునది అనగా ఆస్వాదయోగ్యముగా చేయునదికాన యిది భావమనబడినది. వాగంగాది వివిధాభినయ  సంబంధములైన  రసములను భావింపజేయునది అనగా ప్రేక్షకులచే ఆస్వాదింపచేయునది కాన  ఇది "భావ" మనబడినదియని నాట్య ప్రయోక్తలు తెలియవలయును.                                 విభావ లక్షణము     విశిష్ట జ్ఞానహేతువైనది లేదా విజ్ఞానము అను అర్ధము కలది "విభావ" మనబడును. విభావము_నిమిత్తము_హేతువు ఇవి పర్యాయ పదములు. వాచిక_ఆంగిక_సాత్వికాభినయములు. దీనివలన  విభాప్యములగును. అనగా విశిష్టములుగా తెలుసుకొనబడును. కాన ఇది "విభావ" మపబడినది. వాగంగాభినయాశ్రములైన  పెక్కు అర్ధములు దీనివలన  విభావ్యములగును. కాన దీనికి  "విభావ"మను పేరువచ్చినది.                                      అనుభావ లక్షణము     వాగంగసత్వకృతంబైన అభినయము దీనివలన అనుభావ్యమగును. అనగా అనుభవయోగ్యముగా చేయబడునుగాన ఇది "అనుభావ" మనబడినది, వాగంగాభినయములచే  అర్ధము అను భావ్యమగును కాన యిచ్చట ఇది "అనుభావ" మనబడినది, మరియు ఈ అనుభావము శాభా (హస్త) అంగ ఉపాంగ సంయుక్తముగా వుండును.                                       ర స  ల క్ష ణ ము     విభావైరనుభావైశ్చ వ్యభిచారిభిరేవచ !     ఆనీయమానస్వాదుత్వంస్థాయి భావోరసస్మృతః !!     తా: స్థాయిభావానుభావ వ్యభీచారీ భావములచే మనోజ్ఞ త్వంబును పొందింపబడి  "రస" మగుచున్నది.                            స్థాయిభావ లక్షణ వినియోగములు          సజాతీయై ర్విజాతీయైర్భావైర్యేత్వతిర స్మృతాః !     క్షీరాబ్దివన్నయంతన్యాక్ స్వాత్మతం స్థాయినోహితే !!     తేత్వష్టావితివిజ్ఞేయాః స్థాయినోమునిసమ్మతాః !     రత్యుత్యాహౌచశోకాశ్భ విస్మయశ్చ తతఃపరం !!     హాసోభయజుగుప్సేచ క్రోధోనాట్యే ప్రకీర్తితాః !!     తా: సజాతీయ విజాతీయ భావములచేత  ఆతిరస్కృతములై  క్షీర సముద్రమువలెనే  యితర  భావములను స్వాతంత్వమును  బొందించుకొనునని "స్థాయిభావములు," ఇవి ఎనిమిది విధములుగ ఋషులచే చెప్పబడియున్నవి. వాటిపేర్లు :- రతి, ఉత్సాహము, శోకము, విస్మయము, హాసము, భయము, జుగుప్స, క్రోధము యని నాట్యమందు చెప్పబడియున్నవి.
24,987
    ఆ మధ్య ఒక గృహిణి ఒకడు బ్లాక్ మెయిల్ చెయ్యసాగాడు. భర్తలేనప్పుడు ఇంటికి వచ్చి నోటికి వచ్చినవి మాట్లాడేవాడు కారణం కాలేజీలో చదువుకొనే రోజుల్లో ఇద్దరూ సన్నిహితంగా ఉండేవాళ్ళు. ఇద్దరూ కలిసి తీయించుకున్న ఫోటోలు ఉన్నవి వాళ్ల లవ్ ఎఫైర్ గురించి ఆ కాలేజీలో చదివిన చాలామందికి తెలుసు అతను కట్నం కోసం వేరే అమ్మాయిని పెళ్ళిచేసుకున్నాడు.        ఆమె తల్లిదండ్రులు చూసిన అబ్బాయిని బుద్ధిగా పెళ్ళి చేసుకుంది ఒకరోజు అతన్ని తన ఇంటికి రావద్దని గట్టిగా చివాట్లు వేసింది ఆమె భర్తకు ఫోటోలు, ఉత్తరాలు చూపిస్తానని బెదిరించాడు తనతో రహస్య సంబంధం పెట్టుకుంటే ఈ విషయం బయటకు రాకుండా చూస్తానన్నాడు ఆ అమ్మాయికి కోపం వచ్చింది అసహ్యం వేసింది.       అతను ఆలోచించుకోడానికి రెండు రోజులు అవకాశం ఇచ్చి వెళ్ళాడు ఆమె ఆ నరకాన్ని భరించలేకపోయింది ఆ దుర్మార్గుడు అన్నంత పని చేస్తాడని ఆమెకు తెలుసు అందుకే ధైర్యం చేసి ఆ రాత్రి భర్తతో తనే అన్ని విషయాలూ చెప్పింది.         అతను ఆ రాత్రి ఏమి అనలేదు రెండో రోజు ఆమెతో ముభావంగా ఉన్నాడు బాంబు ఎప్పుడో పేలుతుందని ఆమెకు తెలుసు ఆదివారం ఉదయమే అతను వచ్చాడు ఆఫీసు గదిలో భర్తతో అతడు మాట్లాడుతున్నాడు నిలువెల్లా వణికిపోతూ తలుపు చాటున వాళ్ళ సంభాషణ వింటూ నిలబడింది.     "మిస్టర్! నాకంతా తెలుసు సుశీల నాకు అన్నీ చెప్పింది ఆమె చేసిన తప్పే నువ్వూ చేశావు. కాని ఆమె బ్లాక్ మెయిల్ చేస్తుందనే భయం నీకులేదు. ఎందుకంటే నువ్వు మగవాడివి నీ భార్య నిన్ను వదిలెయ్యదు పెళ్ళికి ముందు నేనూ ఒక అమ్మాయిని ప్రేమించాను ఆమెతో తిరిగాను నా భార్య ఎవరూ చెయ్యని ఘోర అపరాధం ఏదో చేసిందని నేను అనుకోవడం లేదు ఇక నుంచి ఈ గడప తొక్కకు. యూ గెట్ అవుట్!" అన్నాడు ఆమె భర్త. అతను తల దించుకుని వెళ్ళిపోయాడు ఆమె భర్త ఆమె దగ్గిర ఆ విషయాలు ఎప్పుడూ మాట్లాడలేదు ఎప్పటిలాగే ఉంటున్నాడు ఇలాంటి సంస్కారం ఎందరిలో ఉంటుంది పురుషులంతా ఇలా ఆలోచించగలిగితే స్త్రీల కథలు ఇలా వుండవు.     బ్లాక్ మెయిల్ చేసే మగవాడు హంతకుడి కంటే హీనుడు. అలాంటి వాళ్ళను సహించి వూరుకోకూడదు.                                           ఎవరితోనూ చెప్పకేం?     చాలామందికి రహస్యాలను మనసులో దాచుకోలేరు ఈ విషయం ముఖ్యంగా ఆడవాళ్ళను గురించే చెప్పాలి." ఆడదాని నోట్లో నువ్వు గింజ నానదు" అంటూంటారు కొంత వరకు అది నిజమేనేమో అనిపిస్తుంది. "ఎవరితో చెప్పవద్దు. నా మీద ఒట్టే" అంటూ ఏదో రహస్యం కమల విమలతో చెబుతుంది ఆ చెప్పినప్పటి నుంచీ కమలకు నిద్ర పట్టదు విమల ఎవరితోనైనా చెప్పిందేమోనని కమల తను తన మనసులో దాచుకోలేని విషయాన్ని విమల మాత్రం ఎలా దాచుకోగలుగుతుంది అని ఆలోచించదు విమల మరొకరికి "ఇలా కమల చెప్పిందని నేను చెప్పినట్లు ఎవరికీ చెప్పకేం? కమలకు మాటిచ్చాను ఎవరినీ చెప్పనని" అంటుంది విమల.     తీరా చెప్పాక భయం పట్టుకుంటుంది ధనస్సు నుంచి బాణం వదిలాక పశ్చాత్తాప పడి లాభం లేదు. ఆ తరువాత ఎప్పుడైనా కమల కనిపించి ఏ కారణం చేతనైనా సరిగా మాట్లాడకపోతే విమలకు సుజాత మీద అనుమానం వస్తుంది సుజాతను వెళ్ళి నేను చెప్పిన విషయం కమలకు చెప్పేశావా అని అడుగుతుంది సుజాత ఎన్ని ఒట్లు వేసుకున్నా కమల నమ్మదు విమలలో గిల్టీ కాంక్షస్ (అపరాధభావం) ఏర్పడి కమలతో మొదటిలా హాయిగా మాట్లాడలేదు.     కొందరు ఇంటిగుట్టును కూడా బయట పెట్టేసుకుంటారు మనసుకు బాధపెడుతున్న విషయాల్ని ఎవరికైనా చెప్పుకోవాలని మానవహృదయం ఆరాటపడుతుంది మరొకరికి చెప్పగానే కొంత గుండెల్లోని గుబులును దించేసుకున్నట్లు, తాత్కాలికంగా మనసు వూరట చెందవచ్చును కాని అది ఎంతోకాలం నిలవదు అసలు రహస్యం బయటపడుతుందేమోననే భయం మనసును చిట్టి వేస్తుంది అసలు బాధకంటే ఈ బాధ ఎక్కువై నిద్రకు కూడా దూరం కావాల్సి వస్తుంది.     పుట్టింటి రహస్యాలు అత్తగారింటిలోనూ అత్తింటి రహస్యాలు పుట్టింటిలోనూ చెప్పే ఆడపిల్లలకు మనశ్శాంతి ఉండదు పుట్టింటివారు అత్తవారింటిని విమర్శించినపుడు అత్తగారింటిని, అత్తగారింట్లో పుట్టింటిని విమర్శించినపుడు పుట్టింటిని సమర్థించడంలోనే సుఖశాంతులు ఇమిడి ఉంటాయి.       స్నేహితుల మధ్య కూడా ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. మీనాక్షీ, సుందరీ, సరోజా సన్నిహితంగా ఉంటారు కాని అందులో ఏ ఇద్దరూ మూడో వ్యక్తి లేకుండా కలుసుకున్నా మూడో వ్యక్తి మీద మాట్లాడుకుంటారు. సరోజ ఒకరోజు సుందరితో మీనాక్షికి చదువుకునే రోజుల్లో ఒక ప్రియుడు ఉండే వాడనీ వాళ్ళిద్దరి కథా చాలా దూరం వెళ్ళిందనీ, ఒక అబార్షన్ కూడా అయిందనీ, చెప్పేసింది సరోజా మీనాక్షీ కలసి చదువుకున్నారు తీరా చెప్పాక సరోజకు భయం పట్టుకున్నది సుందరి చేత ఒట్టు కూడా వేయించింది ఒకసారి ఏదో విషయం మీద సుందరికీ, సరోజకూ మధ్య మాటా మాటా పెరిగింది ఇంకేముంది సుందరి మీనాక్షితో "సరోజని గురించి ఇలా చెప్పింది" అంటూ చెప్పేసింది స్నేహంగా ఉన్నప్పుడు చెప్పుకున్న విషయాలను విరోధం వచ్చినప్పుడు బయటపెట్టడంకు సంస్కారానికి తార్కాణం.     కొందరికి "ఫలానా వాళ్ళు నిన్ను ఇలా అన్నారు అలా అన్నారు" అని చెప్పే అలవాటు ఉంటుంది. అలాంటి వారివల్ల మనసుకు వ్యధ కలుగుతుంది చెప్పుడు మాటలు వినడం వల్ల ఎన్నో అనర్థాలు కలుగుతాయి ఫలానా వాళ్ళు నీ గురించి ఇలా అన్నారు అని చెప్పే వ్యక్తి నీ గురించి కూడా అలాగే చెబుతుందని అర్థం చేసుకోవాలి. అలా చెప్పేవాళ్ళు మళ్ళీ అడగవద్దని ప్రాధేయపడతారు.     మా పక్కింటి వాళ్ళకూ, మాకూ ఒకే పనిమనిషి ఉండేది ఒకరోజు మా పనిమనిషి లక్ష్మి వచ్చి "అమ్మా! పక్కింటి కాంతమ్మ మీకు గర్వం అంటూ ఉంటుంది మీరు పైకి చూసి నడుస్తారట మేడమీద నిలుచుని కుళాయి దగ్గర పోట్లాటలు గురించి రాస్తారట" అంటూ ఇంకా ఏమేమో చెప్పసాగింది నాకు కోపం వచ్చింది కాంతమ్మ మీద కాదు అలా వచ్చి చెప్పిన లక్ష్మి మీద "కాంతమ్మను అడగనా?" అన్నాను. "నీ కాళ్ళకు మొక్కుతా అడక్కండి. అడక్కండి. నా కొలువుపోతుంది." అంటూ ప్రాధేయపడసాగింది.     ఇంకెప్పుడూ నా దగ్గిరకు వచ్చి వాళ్లు ఇలా అన్నారూ. వీళ్ళు అలా అన్నారూ అని చెప్పకు" అంటూ మందలించాను? లక్ష్మి ముఖం ముడుచుకున్నది కాంతమ్మతో ఒకప్పుడు హాయిగా మాట్లాడేదాన్ని ఇప్పుడు మాట్లాడలేకపోతున్నాను బాగా చదువుకున్న వాళ్లు కూడా ఇలా చెబుతూ ఉంటారు నిజంగా అలా వచ్చి చెప్పే వాళ్ళకు మన మీద అభిమానమే ఉంటే మనకు వచ్చి మన మనసును బాధపెట్టరు అలా అన్న వాళ్ళనే మందలిస్తారు.       "కాలు జారితే తీసుకోవచ్చును నోరు జారితే తీసుకోలేం" అంటారు నిజమే మాట్లాడితే ముందే మాట్లాడాలి ఒకవేళ కష్టం సుఖం చెప్పుకున్నా యోగ్యుల దగ్గిర చెప్పుకోవాలి. లేదా - "నేను అలా అనలేదు ఇలా అన్నాను." అంటూ ప్రతివారికీ సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వస్తుంది. చాడీలు చెప్పడం దురలవాటు వినడం కూడా చెడు అలవాటే. ఎక్కడ విన్నవి అక్కడే మరిచిపోవడానికి ప్రయత్నించాలి.        ఇద్దరి స్నేహితుల మధ్య గండి ఏర్పడే మాటలు చెప్పకూడదు అలా చెప్పే వాళ్ళని మందలించాలి వాళ్లు అడగవద్దని ప్రాధేయపడ్డా అడిగి నిజం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి అప్పుడు గాని ఇలాంటి మాటలు చెప్పే వాళ్ళకు బుద్ధిరాదు ఎక్కువ మాట్లాడటం ఒక జబ్బు. ఎక్కువ వినడం ఒక కళ. దీన్నీ అలవరుచుకున్న వాళ్ళను ఎక్కువమంది గౌరవిస్తారు ప్రేమిస్తారు.                                                       ఉన్న మాట అంటే?     "మీకింత స్త్రీ పక్షపాతం పనికిరాదు. తప్పకుండా మగవాళ్ళదేనంటారా? గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పండి!" ఒక యువకుడు నిలదీసి అడిగాడు.     "ఏ విషయం?"     "అదే మానభంగాల గురించి రాశారుగా? ఇలాంటి దుశ్చర్యలకు మీ ఆడవాళ్ళే కారణం! ఎందుకంటారు కదూ? మన సాంప్రదాయం ప్రకారం బట్టలు వేసుకుంటున్నారా మీ ఆడవాళ్ళు? ఈ మాక్సీ లేమిటి? ఈ ప్యాంటు లేమిటి? అంగసౌష్టవ ప్రదర్శనలు చేస్తూ బజార్లో తిరుగుతుంటే చూస్తూ ఊరుకుంటారా మగవాళ్లు!"       'ఊరుకోకపోతే పళ్ళురాలగొడ్తారు' మనసులోనే అనుకున్నాను. ఆ యువకుడ్ని కిందకు పైకి చూశాను మెడల వరకు జుట్టు, లంగాలాబెల్ బాటం ప్యాంటు చుక్కల షర్టు నాకు నవ్వు వచ్చింది 'బాబూ! కోప్పడకు: ఒకటి అడుగుతాను చెప్పు: నీ డ్రస్సు మన సంప్రదాయ ప్రకారమే ఉందా? చక్కగా ధోవతి కట్టుకొని, పిలక పెట్టుకొని, వల్లెవాటువేసుకోక ఇదేం వేషం చెప్పూ:" అన్నాను పొద్దున్నే యింటికి వచ్చిన వ్యక్తిని బాధపెట్టాల్సి వచ్చినందుకు కొంచెం బాధపడుతూనే అన్నాను.     అతని ముఖం ముడుచుకుపోయింది.     "అది కాదండి? మన సంప్రదాయం ప్రకారం ఆడపిల్ల ఒక చక్కటి చీర, రవిక తొడుక్కుని కంటికి కాటుక, నొసటన బొట్టూ పెట్టుకొని, వదులుగా వాలుజడ వేసుకొని పువ్వులు పెట్టుకొని.... వయ్యారంగా హంస నడకలు నడుస్తుంటే.... -- "ఆహా! ఏమి వర్ణనయ్యా:" అన్నాను మధ్యలోనే అందుకొని. ఆ యువకుడి ముఖం కోపంతో తుమతుమలాడింది" బాబూ: నీకు ఈ సంగతి తెలియదేమో గతంలా మక్సీలు తగిలించుకోవడంలో, ప్యాంటూ షర్టూ వేసుకోవడంలో లేని ఆకర్షణా, అందం ఆ మాటకొస్తే నువ్వు చెప్పిన డ్రెస్సులోనే వుంది.
24,988
    ఈవేళ ఏదయినా స్వీటుచెయ్యాలి. ఆమెకైతే చాలా వచ్చు. కానీ తన ప్రావీణ్యం చూపించటానికి ఇక్కడ సరంజామా లేదు, టైమూ లేదు.  తేలిగ్గా చెయ్యటానికి వీలుగా ఉండేది మైసూర్ పాక్. అది తయారుచేసింది.     వంట చేస్తున్నంతసేపూ ఎన్నో ఆలోచన్లు. ఈ పెళ్ళివల్ల ఇద్దరూ ఏం సుఖపడుతున్నారు? కనీసం మొదటిరోజయినా.     విధి నిర్దాక్షిణ్యంగా త్రుంచేసింది. ఇద్దర్నీ దూరదూరంగా విసిరేసింది.     ఒద్దు. దాన్ని గురించిన ఆలోచన వద్దు.     అతను క్యాంటీన్ లో భోజనం చేస్తున్నాడు- తానిక్కడ వుండి, ఎదురుగా వుండి.     ఎంత పాపిష్టి జన్మ!     ఆమె కళ్ళల్లో నీళ్ళు నిండాయి.     టైమయిపోతోంది. చిన్న టిఫిన్ గిన్నెలో మైసూర్ పాక్ లు సర్దింది. ఎలా అతనికి పంపించటం? కాసేపు బయట నిల్చుంటే రాముడు కనిపిస్తాడు. వాడ్ని బ్రతిమిలాడితే ఫణికి యిచ్చిరావచ్చు. కానీ వాడిముందు బయటపడటం ఇష్టంలేదు.     సరాసరి ఇంట్లోకి వెళ్ళి ఇచ్చేసి, "కొలీగ్ కాబట్టి, నా పుట్టినరోజు కాబట్టి ఇచ్చాను" అని చూసినవాళ్లకు చెబుతే?     బావుండదు. అనేక అపార్థాలకు అవకాశమిచ్చినట్లు వుంటుంది.     మరి ఇది ఎందుకు చేసినట్లు...........?     కాలుగాలిన పిల్లిలా అటూఇటూ తిరిగింది. ఏమీ తోచలేదు. కంపెనీకి వెళ్ళే టైము దగ్గరపడుతోంది.     ఇక్కడ్నుంచి విసిరేస్తే...? అతను లాఘవంగా పట్టుకోవచ్చు. కానీ ఎవరయినా చూస్తే....? అమ్మో!     చివరికాపూట భోజనం చెయ్యనేలేదు. పదికి ఇంకో ఏడెనిమిది నిముషాలుందనగా టిఫిన్ పాత్ర చేతిలో పట్టుకుని బయటకు వచ్చి కంపెనీ వైపు బయలుదేరింది.     ఆమెకు ముందు....పది పదిహేను గజాల దూరంలో ఫణి నడుస్తున్నాడు.     ప్రక్కన ఇంకా ఎవరెవరో నడుస్తున్నారు.     ఎంత నిర్దాక్షిణ్యం! ఆమె నిట్టూర్పు అణచుకుంది.                                                                *    *    *     లంచ్ అవర్.     అంతా బయటకు వెడుతున్నారు.     ఫణి, శైలజా తమ సీట్లలోంచి కదలలేదు. చూడామణికూడా తన సీటుకు అతుక్కుపోయి, పెన్సిల్ తో కాగితాలమీద ఏవో ఫార్ములాలు గీస్తూ, అందులో లీనమై వుండిపోయింది.     "లేవదేం? కనీసం బాత్ రూమ్ కయినా వెళ్ళదేం?"     నిముషాలు గడచిపోతున్నాయి. శైలజకు అసహనంగా వుంది. ఫణికి వెర్రెత్తి పోతున్నట్లుగా వుంది. కాసేపు అలా గడిచాక యిహ ఏదో పనిచేస్తున్నట్లు అక్కడ నటించటం చేతగాక అతను లేచి బయటకువచ్చి క్యాంటీన్ వైపు వెళ్ళాడు.     శైలజకు ఏం చెయ్యాలో తోచలేదు. రెండుమూడు క్షణాలాగి యిహ వుండలేక తనూ లేచి నిలబడింది.     చూడామణి చేస్తున్న పనిని ఆపి ఆమెవంక ఆశ్చర్యంగా చూసింది.     తలనొప్పిగా వుందన్నట్లు సౌంజ్ఞచేసి ఆమె బయటకు కదిలింది.     క్యాంటీన్ కి ఆమె ఎన్నడూ వెళ్ళలేదు. అందుకని చేతిలో స్టెయిన్ లెస్ స్టీలు టిఫిన్ బాక్స్ పట్టుకుని ఆమె లోపలకు అడుగుపెడుతూంటే అందరూ ఆమెవంక వింతగా చూశారు.     కమలామణి ఆమెకెదురుగా వచ్చింది. "ఏమిటండోయ్, ఎప్పుడూ లేనిది ఇలా వచ్చారు?"     "తల నొప్పిగా వుంది, కాఫీ త్రాగుదామని."     "రండి, ఇలా కూర్చుందాం."     కూపను తీసుకున్నాక ఇద్దరూ ఓ టేబుల్ దగ్గరకెళ్ళి కూర్చున్నారు. శైలజ కళ్ళుమాత్రం నలువైపులా కలయతిరుగుతున్నాయి.     "ఏమిటండీ చూస్తున్నారు?"     "ఎప్పుడూ చూడలేదు కదండీ. రోజూ ఇక్కడికి ఇంతమంది వస్తారా అని...."     "ఈ గంటేకదండీ, స్వీచ్చగా ఊపిరి పీల్చుకోగలిగేది. మిగతా టైమంతా చెరసాలలో ఉన్నట్లేకదండీ."     శైలజ ఏమీ జవాబు చెప్పలేదు.     "ఇక్కడైనా గోడలకు చెవులున్నాయి. ఊపిరివరకే స్వేచ్చ! మాటల విషయంలో జాగ్రత్తగానే వుండాలి."     శైలజ ఆమె చెప్పేది వింటూనే అటూఇటూ దృక్కులు సారిస్తున్నది. అదిగో ఫణి. దూరంగా ఓ టేబుల్ దగ్గర కూర్చునివున్నాడు. శైలజ అతనికేసి చూసిన టైముకే కమలామణి కూడా చూసింది.     "అతను ఫణీంద్ర! మొన్ననేకదూ ఉద్యోగంలోకి వచ్చి చేరాడు."     "అవును. మా డిపార్టుమెంటే" అంది శైలజ.     "మీరెన్నయినా చెప్పండి. అతనిమీద నాకు సదభిప్రాయం కలగలేదు."     "అదేం?" అంది శైలజ గతుక్కుమని.     "అతను ఆడవాళ్ళని ఎగాదిగా చూస్తాడు. మనిషి బాగానే వుంటాడనుకోండి. అయితేమాత్రం, చూడండి మనవంక ఎలా చూస్తున్నాడో.."     శైలజకు కమలామణి అతన్ని నిందిస్తోంటే బాధగా వుంది. అతని అందాన్ని మెచ్చుకుంటూంటే కోపంగా వుంది.     "అన్నట్టు ఈ టిఫిన్ ఏమిటండీ?"     "ఇదీ....ఈవేళ నా పుట్టినరోజండీ, స్వీట్సు చేశాను."     "చెప్పరేం మరీ?" అని కమలామణి చొరవగా టిఫిన్ మూత ఊడదీసింది.     "హాయ్! మైసూర్ పాక్!" అంటూ ఒకటి చేతిలోకి తీసుకుంది.     ఇంతలో అటుకేసి యింకో నలుగురుయిదుగురు ఆడవాళ్ళు వచ్చారు.     "ఏమిటి కమలా! మాకు పెట్టకుండా కొట్టేస్తున్నావు?" అంది వాళ్ళలో ఒక అమ్మాయి.     "ఈవేళ శైలజగారి బర్తుడే, అందుకనీ." 
24,989
    ఈ పధ్నాలుగేళ్ళ అమ్మాయి వాళ్ళకి మొదటి సంతానం. పేరు నీల.     నీల కూలి  పనికి వెళ్ళకపోయినా చిన్న చిన్న పనులు చేసేది.     పేడ పోగేయడం, పుల్లలు ఏరుకురావటం. తన తరువాత పిల్లల్నీ ఆడించటం. ఇలా ఏదో ఒకటి చేసేది.     నీల ఆ సాయంత్రం తన ఈడు పిల్లలతో కలిసిపుల్లలు ఏరుకు రావటానికి డొంకకి వెళ్ళింది. తతిమా పిల్లలు చూడలేదు. అటునించి కొండపక్కకి వెళ్ళింది.     మృత్యువు అక్కడదాకా లాక్కెళ్ళి తనపొట్టన పెట్టుకుంది నీలని.     ఈ తఫా కొండ గుహలోను కాదు. ఊళ్లోను కాదు కొండ మొదట్లోనే పెద్ద బండ చాటున హంతకుడు నీల మాన ప్రాణాలను భక్షించాడు.     మరోసారి ఊరు అట్టుడికిపోయింది.     ఈతఫా పోలీసులే కాదు. ఓ దినపత్రికనుంచి కూడా విలేఖరి వచ్చాడు. నలుగురితోమాట్లాడి మేటర్ సేకరించాడు ఫోటోలు తీసుకున్నాడు.     ఉరుముకొండ చరిత్ర పేపరుకెక్కబోతున్నది.     "ఉరుముకొండలో హంతకుడు ఉరిమాడు" అనే హెడ్ లైన్ లో ఆ వార్త ప్రచురించబడుతుంది.     పోలీసులు వచ్చారు. జనం చూడటానికి వెళ్ళారు.     నీలహత్యతో రాత్రుళ్ళు కాపలా వృదా అని తేలిపోయింది.     ఊళ్ళో వాళ్ళు ఆ మాట అనుకోవాలనే కాస్త ధైర్యంచేసి వారం తిరక్కుండానే నీలని రేప్ చేసి చంపాడు.     డొంకలో పుల్లలేరుకోడానికి వెళ్ళిన నీల కొండదాకా ఎవరితో చెప్పకుండా ఎందుకు వెళ్ళింది? నీలని అక్కడిదాకా ఎవరూ ఎత్తికెళ్ళలేదు. ఎందుకంటే పుల్లలు ఏరి బుట్టలో వేసుకుంటుంది. ఆ బుట్ట నిక్షేపంగా పక్కనేవుంది.     నీల తనంతట తానుగా వెళ్ళి వుండదు. హంతకుడే అక్కడి దాకా రమ్మని పిలుచుకెళ్ళి వుంటాడు.     నీల నిర్భయంగా వెళ్ళింది అంటే నీలకి హంతకుడితో పరిచయం వుండే వుంటుంది. ఓ వేళ మగాడితో పరిచయం వుంటే మాత్రం పిలవంగానే వెళ్ళిందా? ఇది తతిమా పిల్లల కంట ఎలా పడలేదు?     ఇవన్నీ ప్రశ్నలు అందరికీ వచ్చిన అనుమానాలు. ఇవి తీర్చేనాధుడు మాత్రం ప్రస్తుతం లేడు.     నిజం తెలిసి చెప్పగల నీల ఈ లోకంలోలేదు.     అందరూ వెళ్ళి నీల శవాన్ని చూసి వచ్చారు.     రవి కూడా వెళ్ళి చూసి వచ్చాడు.     విమల డిటెక్టివ్ పుస్తకాలు చదువుతూంది. పరిశోధన అంటే భలే ఇష్టం. మంగ శవాన్ని చూడలేదు. కాంతం శవాన్ని చూడలేదు. నీల శవాన్ని చూద్దామనుకుంది. వెళ్ళొద్దని తల్లీతండ్రీ యిరువురూ కోప్పడ్డారు.     విమల కోరిక తీరలేదు.     నీల శవాన్ని రవి చూసి వచ్చిన తరువాత "శవం ఎలా వుందో వర్ణించవా?" అని విమల అడిగింది.     రవి గొంతులో పచ్చి వెలక్కాయ అడ్డంగా పడినట్లు అయింది. రివాల్వర్ గుండ్లు పొట్టలో రెండు, ఛాతీలో ఒకటి దిగబడింది అని చెపుతాడా! పది కత్తిపోట్లు తగిలాయని చెపుతాడా? తేలికగా చెప్పడానికి ఆ హత్య అలా జరగలేదు! దారుణంగా రేప్ చేసి అంతకన్నా దారుణంగా హత్య చేయబడింది. రవి ఎలా వర్ణించి చెపుతాడు.     "శవం ఎలా వుంటుంది. శవం లాగానే వుంటుంది. అంతకన్నా నాకు వర్ణించటం చాతకాదు," అంటూ తప్పించుకున్నాడు రవి.     విమల మళ్ళీ మళ్ళీ అడిగిచూసింది. రవి చెప్పలేదు.     ఆ తర్వాత విమల తండ్రిని అడిగింది.     "ఏమిటి చెప్పాలి?" అంటూ కోప్పడే ధోరణిలో మాట్లాడాడు సూర్యారావు.     విమల ఉత్తమొండి పిల్ల కైలాసగణపతిని అడిగింది. కైలాసగణపతి మాత్రం ఎలా చెపుతాడు. కానీ అదే తమాషా చెప్పాడు.     "నీవు నిన్న రివాల్వర్ అనే మాగ్జయిన్ యిచ్చావు చూడమ్మా! దానిలో మూడో హంతకుడు అన్న కధలో సోమనాథం ఊర్మిళని ఎలా చంపుతాడో అలా ఈ వూరి హంతకుడు నీలని చంపాడు" ఒక్కమాటలో చెప్పాడు కైలాసగణపతి.     మళ్ళీ నోరెత్తలేదు విమల!
24,990
    "మరి! ఆశ్చర్యంగా గిర్రున కళ్ళుతిప్పి చూసింది విజయకుమారి.     "అదంతా ఓ పెద్దకథ. నాకే  సరిగా అర్థంకాలేదు. నీకేం చెప్పగలను. వెయిట్  అండ్ సీ!బైదిబై...డాక్టర్ రావ్ ఎన్ని గంటల కొస్తాడూ?" ఏదో ఆలోచిస్తూ వాచీ చూసుకున్నాడు ఉదయ్.     ఆమె సమాధానం చెప్పే ప్రయత్నంలొ ఉండగానే  మళ్ళీ  అన్నాడు "ఒకపని చెయ్యి విఅజయా ఈ పూటకూడా అతడ్నే  పేషెంట్సును చూడమను. నా మూడ్ ఏమీ బాగాలేదు. వళ్ళంతా విరగొట్టేసినట్టుంది. నిద్రముంచుకొస్తున్నది. నేను ఇంటికెళ్తాను. మధ్యాహ్నం రెస్టు తీసుకొని సాయంత్రం  వస్తాను. డాక్టర్ రావును తన క్లినిక్ లొ పని ముగించుకొని సాయంత్రం ఆరుగంటలకల్లా రమ్మను ఇక్కడికి. ఈరోజు సాయంకాలం వచ్చిన వాళ్ళందరికీ డాక్టర్ గారు  యవైల్ బుల్ గా  లేరని చెప్పు!"     "సారీ ! వాళ్ళు  ఒకపట్టాన వదలరు. సమాధానంచెప్పి వాళ్ళను పంపించేసరికి మా తల ప్రాణం తోకకు వస్తుంది డాక్టర్ , నాలుగు రోజుల్నుంచీ ఒకటే గొడవ డాక్టర్ గారు  ఎప్పుడోస్టారంటూ, డాక్టర్ రావుగారి ప్రాణాలు తోడేశారంటే నమ్మండి. వాళ్ళకు  సర్దిచెప్పడంతోటే ఆయనకు సరిపోతూంది ట్రీట్  మెంట్  మాట అటుంచి...."     "అలా అయితే విజయా ఓ పనిచెయ్యి. నేను సాయంకాలం అసలు నర్సింగ్ హొమ్ కురాను. డాక్టర్ రావును తన క్లినిక్ లొ వుండమను అక్కడికి నేనే  వస్తానని చెప్పు. ఈ రోజు నువ్వూ మేరీ  కలిసి ఎలాగో పేషెంట్సును చూసుకోండి. డాక్టరుగారు రేపు ఉదయం తప్పకుండా వస్తారనీ, అందర్నీ  చూసుకుంటారానీ చెప్పి పంపించి వెయ్యండి."     డాక్టర్ ఉదయ్ చంద్ర  ఇంటికి చేరుకోనేసరికి నౌకరు కుర్రాడు ఎదురొచ్చాడు.     గేటు తెరిచి కారు లోపలకు వచ్చాక వెళ్ళి మెయిన్ డోర్ అన్ లాక్ చేసి డోర్  తెరిచాడు.     "ఏం? తలుపు తాళంవేసి  వుంచారెందుకూ? అమ్మగారూ ఎక్కడి కెళ్ళారు?" గాబరాగా అడిగాడు ఉదయ్ .     "రెండు రోజులనుంచి అమ్మగారు మీకోసం ఎదురుచూస్తున్నారు ఒకటే బాధపడిపోతున్నారు."     "ఇప్పుడెక్కడి కెళ్ళారు?" ఆతృతగా అడిగాడు.     "బి.పి. ఎక్కువైపోయింది. వంటమనిషి కాంతమ్మను తీసుకొని డాక్టర్ రామారావు గారి  దగ్గర కెళ్ళారు." చెప్తూ ఉదయ్ వెనకే ఇంట్లోకి నడిచాడు పని కుర్రాడు.     ఉదయ్ నేరుగా ఫోన్ దగ్గిరకెళ్ళి డయల్ చేశాడు.     "హల్లో! డాక్టర్! నేను డాక్టర్ ఉదయ్ ను మాట్లాడుతున్నాను. మా అమ్మగారు .....అనసూయమ్మ....."     "యస్! యస్. ఇక్కడే వున్నారు. ఇప్పుడే ఎగ్జమిన్ చేశాను చాలా హై బి.పి. ఉంది. వన్ ట్వెంటీ బైవన్ యైటీ  వుంది. ఆమె చాలా వర్రీ అయిపోతున్నారు. మీవల్లనే ఆమెగారికి బి.పి. పెరిగింది. రెండు రోజుల్లో వస్తానని  చెప్పి వెళ్ళావట నాలుగురోజులైంది. ఇంకా రాలేదని ఆమె బెంగపెట్టుకొని ఇదయిపోతున్నారు ఐయామ్ గ్లాడ్ ఇప్పటికైనా వచ్చావు."     "ఓ మై గాడ్! అంత బి.పి వుందా? డాక్టర్  యూడూ వన్ ధింగ్. మీ నర్సింగ్ హొమ్ లొ అడ్మిట్ చెయ్యండి. నేను బయలుదేరి వస్తున్నాను."     "అరెరే! అంత ఖంగారెందుకూ? షి ఈజ్ ఆల్ రైట్."     "నేను బయలుదేరుతున్నాను. ఆమెను అక్కడే వుంచండి."     "ఇంజక్షన్ ఇచ్చిపడుకొబెట్టాను. నువ్వు వచ్చావని తెలిస్తే ఆమె బి.పి. అంతా నార్మల్ అవుతుందిలే. డొనేట్ వర్రీ . మళ్ళీ నువ్వు రావడమెందుకూ?"     "నేను కారు తీసుకొస్తాను."     "అక్కర్లేదు. నా కార్లో పంపిఅస్తాను. మెడిసన్ కూడా ఇచ్చి పంపిస్తున్నాను. ఆమె రెగ్యులర్ గా మందులు వాడేట్టు చూడు  ఉదయ్. ఉంటాను."     "థాంక్యూ డాక్టర్!"     డాక్టర్  రిసీవర్ పెట్టేశాడు. తల్లి ఆరోగ్యం గురించి అశ్రద్ధ చేశానన్న బాధ, మనసులో మెదులుతున్నది. బయటికి వచ్చి  గెట్లో తల్లికోసం ఎదురుచూస్తూ నిల్చున్నాడు.     రెండురోజులకు వస్తానని చెప్పి  నాలుగు రోజులదాకా రాకపోయే సరికి ఆమె చాళా ఖంగారు పడిపోయి వుంటుంది. తనకు ఊహ తెలిసిన  దగ్గర్నుంచి ఆమె  తనను ఒక్కరోజుకూడా  వదిలి ఉన్నట్టు గుర్తులేదు.     ఒక్కగంట ఆలస్యంగా వస్తేచాలు నానా హైరానా పడిపోతుంది. అలాంటిది రెందురోజులు ఆలస్యంగా వస్తే బి.పి. పెరగడంలొ ఆశ్చర్యపడవలసిందేమీ లేదు.     థ్యాంక్  గాడ్! తను  ఇప్పటికైనా రాగలిగాడు.     ఆమె మానస్తత్వం తనకు  తెలుసు. ప్రతిక్షణం తనకు ఏదో అయిపోతుందనే  భయంతోనే వుంటుంది. ఒకటే ఆందోళన పడుతూవుంటుంది. ఆమె భయానికి కారణం తను ఎంత తరిచి తరిచి చూసినా, ఆలోచించినా అర్థంకావడంలేదు.     బహుశా తను ఆమె ఏకైక సంతానం కావడమే  కావచ్చు.     తల్లీ తండ్రీ  తనే అయి తనను పెంచింది.     ఆమె ఆశలన్నీ తన చుట్టూనే  అల్లుకొన్నది.     ఆమె నుంచి  మమకారం పెంచుకొనే మరో వ్యక్తి ఎవరూ లేరు. ఇరవైఏళ్ళనాడు, పుట్టిపెరిగిన ఊరూ, దేశమూ, వదిలేసి, పసివాడైనా తనను తీసుకుని అమెరికా వెళ్ళింది. న్యూజెర్సీలొ తనను కంటికిరెప్పలా కాపాడుకుంటూ వచ్చింది.     ఆమెకు అమెరికానుంచి ఇక్కడకు రావడం ఇష్టంలేదు. తన బలవంతంమీదే వచ్చింది. వచ్చినప్పటినుంచి ఏదో ఆపదను శంకిస్తున్నట్టే అందోళనగా వుంటున్నది, అనుక్షణం ఏదో భయం ఆమెను వెంటాడుతున్నట్టు తను గ్రహించాడు.     వయసు, దానికితోడు రక్తపుపోతూ ఉండటంవల్లనే  ఆమె అలా ఆందోళనకు గురి అవుతున్నదని తనకుతానే సర్దిచెప్పుకుంటూ వున్నాడు.     తల్లి గురించి  పరిపరివిధాల ఆలోచిస్తూ గెట్లో నిల్చుని వున్న ఉదయ్ కు, తల్లి  కారుదిగి వంటమనిషి సాయంతో లోపలకు రావడం కన్పించింది.      ఎదురెళ్ళి ఆమెను ఆప్యాయంగా పట్టుకొన్నాడు.     ఆమె కోపాన్ని నటిస్తూ ముఖం పక్కకు తిప్పుకుంది.     "అమ్మకు  కోపం  వచ్చింది కాంతమ్మా! చూడు?"     "మరిరాదా బాబూ? మీరెళ్ళి ఎన్నాళ్ళయిందీ?" కాంతమ్మ వత్తాను పలికింది.     "వచ్చేశానుగా ? ఇంకా  వారంరోజులుండాల్సిన పని వున్నది. అయినా వచ్చేశాను. అమ్మకోసం వచ్చేశాను."     ఆఁ! మహ ప్రేమ! వచ్చేశావులే" తల్లి కళ్ళల్లో కదిలిన  వెలుగు రేఖలు చూసి ఉదయ్ ఆనందంతో ఉబ్బిపోయాడు.     లోపలి వచ్చాక కాంతమ్మ  "అమ్మగారూ? మీ మందులు ఈ టేబుల్  మీద పెడ్తున్నా" అన్నది.     "ఇంకా నాకా మందులు ఎందుకు కాంతమ్మ? ఇక వాటి అవసరం లేదు. నువ్వెళ్ళి వంటపని చూసుకో త్వరగా వంటపూర్తిచెయ్. ఈ నాలుగు రోజుల్నుంచీ ఏం  తిన్నాడో ఏమో? ఆ ముఖం చూశావుగా? వారంరోజులు లంఖణాలు పడి లేచిన వాడిలా వున్నాడు.     "నిజమే అమ్మగారు! బాబుగారేమిటిలా అయిపోయారు?" ఉదయ్ ను ఎగాదిగా  చూసి కాంతమ్మ  వంటగదిలోకి వెళ్ళింది.     "అమ్మా డాక్టర్ రామారావుగారు ఏం చెప్పారో తెలుసా,"     "ఏం చెప్పారేమిటి?"     "నువ్వు మందులు తప్పకుండా వేసుకోవాలని...."     "విన్నానురా" కొడుకును ఆప్యాయంగా చూచుకొంటూ హాయిగా నవ్వింది ఆమె.     డాక్టర్  జయంత్ రావు నర్సింగ్ హొమ్.     రాత్రి ఎనిమిది గంటలు దాటింది.     "సో! జరిగింది ఇది."     డాక్టర్ ఉదయ్ చంద్ర డైరీ మూశాడు.     డాక్టర్ రావు ఉదయ్  చెప్పిందంతా నోట్ చేసుకున్న కాగితాలు సర్ది పెట్టుకొని తలెత్తి  ఉదయ్ ముఖంలోకి చూశాడు.     "ఓ రౌండ్  విస్కీ.... షల్ ఉయ్?" రావు అడిగాడు.     "ఏం తల దిమ్మెక్కిపోయిందనుకొంటాను." రావు కళ్ళల్లోకి సూటిగా చూస్తూ మెల్లగా అన్ బిలీవబుల్ స్టోరీ! నా మెదడు మొద్దుబారి పోయింది. ఐ మస్ట్ హేవ్...."     "గో ఎ హెడ్! నో అబ్జెక్షన్"     "డాక్టర్ రావు రెండుగ్లాసుల్లో విస్కీపోసి సోడా కలిపాడు. ఉదయ్ కు ఒక గ్లాసు అందించి "ఛీర్ ఫర్ యువర్ హెల్త్" అంటూ తనగ్లాసు ఎత్తి పట్టుకున్నాడు.     "నా ఆరోగ్యానికేమైంది?" పెద్దగా నవ్వాడు ఉదయ్ చంద్ర.     "ప్రాణాలతో తిరిగోచ్చావు చాలదా?"     "నన్ను చంపితే వాళ్ళకేమొస్తుంది? పైగా ఇన్నిరోజులనించి వాళ్ళు పడ్డ శ్రమంతా వ్యర్థం అయివుండేది.     "ఎలా?" రావ్ గ్లాసు టేబుల్ మీద ఉంచి సిగరెట వెలిగించాడు .     "రావ్ ! నువ్వు రాసుకొన్న నోట్సు మరోసారి జాగ్రత్తగా చూడు! చాలా  గేప్స్ వుండొచ్చు. గుర్తున్న వివరాలన్నీ  చెప్పాను  నేను  ఇరవై తొమ్మిది ముప్పైఒకటి అంటే నిన్న జరిగిన సంఘటనలుకూడా అన్నీ చెప్పననే అనుకుంటున్నాను. ఏమైనా  మైనర్ విషయాలు వదిలేస్తే వదిలేసి  వుండొచ్చు ముఖ్యమైన విషయాలన్నీ బాగానే గుర్తున్నాయ్" ఓ క్షణం ఆగి..."జయంత్! చూడు . నేను కొన్ని నిర్ణయాలకొచ్చాను అందులో కొన్ని  సరైనవికావచ్చు, కాకానూపోవచ్చు. నువ్వుఆలోచించి విశ్లేషణ చెయ్యడానికి ప్రయ్నంచు! నువ్వుకూడా ఒకనిర్ణయానికి వచ్చాక ఏంచెయ్యాలో ఆలోచిద్దాం" అని విస్కీ  సిప్ చేశాడు ఉదయ్.     "తొందరేంలేదు. సావధానంగానే ఆలోచించు" ఓ క్షణం ఆగి మళ్ళీ  అన్నాడు డాక్టర్  ఉదయ్     డాక్టర్ రావు  గ్లాసు  ఖాళీచేసి  మరో పెగ్  విస్కీ  పోసుకున్నాడు.     "ఊ? కమాన్ ఫినిషిట్?"     ఉదయ్  గ్లాసు  ఎత్తి  త్వరత్వరగా సిప్ చేసి ఖాళీ గ్లాసు రావు ముందుంచాడు.     డాక్టర్ రావు గ్లాసు విస్కీ సోడాతోనింపి ఉదయ్ కు  అందించాడు.     జయంత్ మౌనంగా కూర్చుని దీక్షగా రాస్తున్న నోట్సు చూస్తున్నాడు.     ఉదయ్ గ్లాసు చెత్తోపట్టుకొని కిటికీదగ్గర నిలబడి, వెన్నెల్లో అందంగా తీర్చిదిద్దిన పూలమొక్కల్ని  చూస్తున్నాడు.     అరగంట గడిచిపోయింది.     "ఉదయ్!"     "ఊఁ" తల తిప్పకుండానే  పలికాడు నిలబడ్డాడు.     "కమాన్___లేటజ్ స్టార్ట్" డాక్టర్ జయంత్ రావు ఉత్సాహంగా అన్నాడు.     ఉదయ్, జయంత్ దగ్గిరకొచ్చి నిలబడ్డాడు.     "ఊఁ ప్రారంభించు!" కుతూహలంగా జయంత్  ను చూస్తూ అన్నాడు ఉదయ్.     "నేను మొదటినుంచి వస్తాను సరేనా?"     "అసలు నువ్వు  చెయ్యవలసిందే అది. అలా చేస్తేనే మిస్సింగ్ లింక్స్ ఏమైనావుంటే బయటపడ్తాయి."     "రైట్! దెన్ ఐ విల్ స్టార్ట్!"     "ఓ.కె." కుర్చీ లాక్కుని  జయంత్ కు ఎదురుగా కూర్చున్నాడు ఉదయ్.     గొంతు  సవరించుకొని ప్రారంభించాడు జయంత్.     ఉదయ్  ముందుకు వంగి శ్రద్దగా వినసాగాడు.     "మానసికి ఎ రకమైన రుగ్మతాలేదు. అసలు  పేరుకూడా మానసి  కాకపోవచ్చు. నాటకాల్లో అనుభవం గడించిన నటీమణి అయివుండాలి."     "మానసి అనే పేరు ఆమె పెట్టుకుందంటావా?" కనుబొమ్మలు ముడిచి అడిగాడు ఉదయ్.    
24,991
                  ఆరవ అనువాకము         తొంబది ఏడవ సూక్తము         ఋషి - వేరువేరు. దేవత - పవమనా సోమము. ఛందస్సు - త్రిష్టుప్.     1. సోమము సువర్ణమున శోధితము, ప్రదీప్త కిరణవంతము. తనరసమును దేవతల వద్దకు పంపును అభిషుత సోమము నినదించుచు - ఋత్విక్కులు యజమాని యొక్క పశువంత, సునిర్మిత గృహమునకు వెళ్లినట్లు - పవిత్రమునకు వెళ్లుము.     2.సోమమా! నీవు యుద్ధయోగ్యుడవు. అచ్ఛాదకుడవు. కళ్యాణకారివి. తేజస్వివి, పూజ్యుడవు, కవివి. ఋత్విక్కుల వాక్కును ప్రశంసించ గలవాడవు. సర్వద్రష్టవు, నిరంతర జాగృతుడవు. యజ్ఞమునందు అభిషవణ ఫలకముల మీద ఆసీనుడవగుము.     3. సోమమా! నీవు యశోవంతులలో యశస్వివి. నేలమీద పుట్టినవాడవు. ఆనందదాయకుడవు ఉన్నతమగు మేషలోమ పవిత్రమున శోధితుడవగుదువు. శోధితుడవై అంతరిక్షమున ధ్వనించుము. మంగళమయ రక్షణలతో మమ్ము రక్షింపుము.     4. స్తోతలారా! చక్కగా స్తుతించండి. దేవతలను పూజించండి. ప్రచుర ధనప్రాప్తికి సోమమును ప్రోత్సహించండి. రుచికర సోమము మేషలోను పవిత్రమున శోధితమగును. కలశమున నిలుచును.     5. దేవతలమైత్రి కోరిన ధారావంత సోమము కలశమందు కరుగును. కర్మనిష్ఠులచే స్తుతుడగును. అంతరిక్షమునకు తరలును. "అగన్నింద్ర మహతే సౌభగాయ" మహాసౌభాగ్యము కొరకు ఇంద్రుని వద్దకేగును.     6.హరితవర్ణ, శోధిత సోమమా! నిన్ను స్తుతించుచున్నాము. మాకు ధనము ఇచ్చుటకు విచ్చేయుము. యుద్ధమునాకు సాగు ఇంద్రుని కొరకు నీమదకర రసమును పంపుము. దేవతల రధమున ఆసీనుడవై రమ్ము. యూయం సాత్ స్వస్తిభిః సదానః - నీవు ఎల్లవేళల శుభములు కలిగించి మమ్ము రక్షింపుము.     7. ఉశన కవితో సమముగా కావ్యముగా కావ్యములు రచించిన ఈ మంత్రకర్తయగు ఋషి ఇంద్రాది దేవతల జన్మ  వివరములు తెలియును. సోమము విశేషకర్మి. సాధుమిత్రుడు పవిత్రతా ఉత్పాదకుడు దినములకు రాజు అతడు  శబ్దముచేయును. పాత్రలందు చేరును.     8. వృషగణనామక ఋషులు హంసగమనులు. వారు శత్రుబలమునకు బెదరినారు. క్షిప్రఘాతక, శత్రుహంత సోముని ఆశ్రయించినారు. యజ్ఞగృహమున చేరినారు. మిత్ర రూప స్తోతలు స్తోత్రయోగ్య, దుర్ధర్ష, క్షరణషీలా సోముని గూర్చి వాద్య సహితముగ గానములు చేసినారు.     9. సోమము శీఘ్రగామి. అనేకులచే స్తుతించబడువాడు. అనాయాసముగ ఆటలాడువాడు. అతనిని ఇతరుల అనుసరించజాలరు. సోమము తీక్ష్ణ తేజస్వి. అతడు వివిధ తేజస్సులను వ్యక్తపరుచును. అంతరిక్షమున ఉన్న సోమము పగలు హరిత వర్ణుడుగను, రాత్రి శుభ్ర ప్రకాశ యుక్తుడగను అగుపించును.     (సోమము పగలు సూర్యుడు రాత్రి చంద్రుడు అగునని.)     10. సోమము క్షరణశీలుడు బలవానుడు గమనశీలుడు. అతడు ఇంద్రునకు బలము కలిగించు రసము నంపును ఇంద్రునకు మత్తు కలిగించుటకు ద్రవించును. సోమము రాక్షసకులహంత. వరణీయ ధనదాత బలములకు రాజు నలుదిశల శత్రువులను సంహరించును.     11.  సోమము శిలలచే అభిశుతుడు. మదకర ధారలవాడు. దేవతలను పూజించువాడు పవిత్రముననిలిచి క్షరితగును. ద్యోతమాన, మదకర సోమము ఇంద్రుని స్నేహమును ఆశ్రయించును. ఇంద్రుని బలమునకు ద్రవించును.     12.సోమము కాలముననుసరించి ప్రియకార్యములు చేయువాడు. శోధితుడు. క్రీడావంతుడు. తన రసమున ఇంద్రాది దేవతలను పూజించుటకు కరిగిపోవును. పది అంగుళులు అతనిని  ఉన్నతము, మేషలోమ పవిత్రమునాకు పంపును.     13. ఆవులను చూచి లోహితవర్ణ వృషభము అరచును. అట్లే నినదించుచు సోమము ద్యావా పృథ్వుల కరుగును. యుద్ధమున సోమము ఇంద్రుని వలె గర్జించును. తనను అందరకు ఎరుక పరచుటకు సోమము పొలికేక పెట్టును.     14. సోమమా! నీవు దుగ్ధయుక్తుడవు. క్షరణశీలుడవు. శబ్దకర్తవు. నీ రసము మధుర రసము నీవు జలపరిషిక్తు డవగుము. శోధితుడవగుము. నీ ధారలను విస్తృత పరచుము. ఇంద్రుని కొరకు సాగుము.     15. మదకర సోమమా! జలధరముచే వర్షింప చేయుటకు నీ ఘాతుక ఆయుధమున మేఘపు తలవంచునట్లు చేతువు - బలము కొరకు క్షరితుడవగుము. శుభంకర, శ్వేతవర్ణ, పవిత్రమున అభిషిక్త, మాగోవులను అభిలషించు సోమమా! క్షరితమగుమా.     16. దీప్తసోమమా! మా స్తుతులకు ప్రసన్నుడవగమును. మా కొరకు వైదిక మార్గములను సుమము చేయుము. ద్రోణ కలశమున ద్రవించును. గట్టి ఇనుప ఆయుధములతో దుష్టరక్కసులను సంహరించుము. ఉన్నత, మేషలోమ పవిత్రమునకు ధారలతో కదలుము.     17. వర్షము ద్యులోక ఉత్పన్నము. గమనశీలము అన్నవంతము. సుఖముల నిచ్చునది. దానములు చేయునది సోమమా! అట్టి వర్షము కురిపించుము. భూమి మీది వాయువులు ప్రేమపాత్ర పుత్రునివంటివి. వాని కొరకు వెదకుచు - వెదకుచు విచ్చేయుము.     18. ముడిని సడలించి విప్పుదురు. సోమమా! అట్లే నన్ను పాపముల నుండి దూరము చేయుము. నాకు చక్కని మార్గము చూపుము. బలము నిమ్ము. నీవు హరిత వర్ణుడవై పాత్రలందు నిలిచి - వేగవంత అశ్వమువలె ధ్వనులు చేయుదువు. దేవా ! నీవు శత్రుహింసకుడవు గృహవంతుడవు నా వద్దకు రమ్ము.     19. నీవు పర్యాప్త బలవంతుడవు. దేవతల యజ్ఞమునకును, మేషలోను పవిత్రమునకును ధారలతో వెడలుము. బహుధారాయుకు డవగుము. సుగంధసంపన్ను డవగుము. మానవులు యుద్ధములు కల్పించుకున్నారు. అన్నలాభము కొరకు ఆయుద్ధముల నలువైపుల క్రమ్మకొనును.     20. త్రాడులేని, రథములేని, కట్లులేని గుఱ్ఱము అలంకృతమై యుద్ధమున తన లక్ష్యమువైపు ఉరుకులు పెట్టును. అట్లే యజ్ఞమున నిర్మితము, దీప్తమగు సోమము కలశము దిశగా ఉరుకులుపెట్టును.     21. సోమమా! మా యజ్ఞము లక్ష్యముగా నీ యొక్క సారమును ద్యులోకము నుండి మాచమసమలందు సోమము  మాకు మేము కోరిన వృద్ధిగల, వీరపుత్రుని ప్రసాదించుము. బలిష్ఠ ధనమును అందించుము.     22. అభిలాషులగు స్తోతల వచనములు మనసునుండి వెడలినప్పుడు - విచిత్రములగు యాజ్ఞిక ద్రవ్యములు అనుష్ఠాన స్థానమునకు తెచ్చినప్పుడు - అప్పుడు ఆవుపాలు ఆతురతగా సోమమువైపు పారును. అప్పుడు సోమము కలశమును చేరును. సోమము ఎల్లరకు ప్రేమ పాత్రుడగు యజమాని వంటివాడు.     23. సోమము ద్యులోక ఉత్పన్నుడు. ధనదాతల కోరికలు తీర్చువాడు. సుమేధ సత్యస్వరూపుడగు ఇంద్రుని కొరకు అతడు తనరసమును  అర్పించును. సోమము మహారాజు అతడు ధర్మబలుడు. పది అంగుళులు మరింత సోమమును అందించును.     24. సోమము పవిత్రమున శోధితుడు మానవద్రష్ట దేవతలకు, మానవులకు ప్రభువు. ధనస్వామి. కళ్యాణకర జలములు కలవాడు.     25. అశ్వము యుద్ధమునకుపోవును. సోమమా ! అట్లే నీవు యజమానుల అన్నము కొరకు వెడలము. ఇంద్ర వాయువుల పానము కొరకు వెడలుము. మాకు బహువిధ, ప్రవృద్ధ అన్నమును అందించుము. మా కొరకు ధనములు సాధించుము.     26. సోమము దేవతలను తృప్తిపరచువాడు. పాత్రలందు సిక్తుడు సుబుద్ధి యజ్ఞకర్త, స్వరసేకర్త, హోతలవలె ద్యులోకమునందలి దేవతలను స్తుతించువాడు. అత్యంతమాదకుడు అతడు మాకు వీరపుత్రుని, గృహమును ప్రసాదించవలెను.     27. స్తుత్యసోమమా ! నిన్ను దేవతలు పానము చేయుదురు. దేవతల యజ్ఞమున మహాభక్షకుడవగుము దేవతల పానమునకు క్షరితుడవగుము. నీవు మమ్ము యుద్ధములకు పంపుము అప్పుడు మేము మహా బలముల శత్రువును ఓడింతుము. నీవు శోధితుడవగుము. మా కొరకు ద్యావాపృథ్వులను నివాసవంతము చేయుము.     28. సోమమా! నీవు సింహమువలె అరి భయంకరుడవు నీది మనసును మించిన వేగము, సోమాభిషవ కర్తలకు ఋత్విక్కులచే యోజితుడవు. నీవు అశ్వము వలె ధ్వనులు చేయుదువు. దీప్త సోమమా! సులభ మార్గముల మామనసులను ప్రసన్నము చేయుము.     29. సోమమా! నీవు దేవతల కొరకు పుట్టినావు. నీ ధారలు వందలై వర్థిల్లినవి. క్రాంత దర్శకులు బహువిధమగు నీ  ధారలను శుద్ధిచేయుదురు. మా పుత్రుల కొరకు ద్యులోకమునందలి గుప్త ధనమును పంపుము. నీవు మహాధనముల అగ్రగామివి కదా!     30. దినములను కలిగించు సూర్యకిరణములవలె సోమధారలు ఏర్పడును. సోమము ధీరుడగురాజు మంచి మిత్రము కర్మకర్తయగు పుత్రుడు తండ్రిని ఓడించడు - సోమమా! అట్లే నీవు నీ ప్రజను ఓడించకుము.     31. సోమమా! నీవు జలమునుండి మేషలోమ పవిత్రమును దాటుదువు. అప్పుడు మా కొరకు మధురధారలు సిద్ధమగును. నీవు దుగ్థము లక్ష్యముగా క్షరితమగుదువు. నీవు పుట్టినప్పటి పూజ్యతేజమున ఆదిత్యుని పరిపూర్ణుని చేయుదువు.     32. అభిషుత సోమము సత్యరూప యజ్ఞమార్గమున మరిమరి శబ్దము చేయును. అమర, శుక్లవర్ణ సోమమా! నీవు మరింత శోభిల్లుచున్నావు. కవుల బుద్ధికి వాక్కును అందించు సోమమా! నీవు మరింత శోభిల్లుచున్నావు. కవుల బుద్ధికి వాక్కును అందించు సోమమా! నీవు మదకరుడవగుము. ఇంద్రుని కొరకు ద్రవింపుము.     33. సోమమా! నీవు దివుజుడవు. సుపర్ణుడవు దేవతల యజ్ఞమున కర్మమూలమున ధారలు కలిగింతువు. దిగువకు చూడుము. కలశమువైపు సాగుము. ధ్వనులు చేయుము. సూర్యుని కాంతిని చేర్చుకొనుము.     34. యజమానులు "తిస్రోవాచ" మూడు వేదములను స్తుతింతురు వారు -  యజ్ఞకారక, సుదృఢ సోమపు శుభస్తుతులను ప్రోత్సహింతురు. ఆబోతు ఆవువైపు ఉరికినట్లు తమ  పతిదేవునకు పాలందించుటకు ఆవులు సోమము పరుగులిడును. అభిలాషులగు స్తోతలు స్తుతించుటకు సోమము  వద్దకు చేరెదరు.     35. ప్రసన్నకర గోవులు సోమమును అభిలషించును. విప్రస్తోతలు సోమమును స్తుతింతురు పృచ్ఛింతురు. పాలతో కలసి, అభిషుత సోమమును ఋత్విక్కులు పూజింతురు "త్రిష్టుభః సంనవస్తే" త్రిష్టుభమంత్రములు సోమమును చేరును.     36. సోమమా! పాత్రలందు పరిషిక్తుడ వగుము. శోధితుడవగుము. మాకు శుభములు కలుగునట్లు క్షరితుడవగుము. మహా ధ్వనులు చేయుచు ఇంద్రుని ఉదరమున చేరుము. స్తుతులను వర్థిల్లచేయుము. స్తవములను విస్తృతపరచుము.     37. జాగృత, సత్యస్తోత్ర జ్ఞాత, శోధిత సోమము చమసములందు ఆసీనుడగుము. పరస్పరము కలిసిఉన్న, ఎన్నో కోరికలుగల, సుహస్తులగు పురోహితులు పవిత్రమున సోమమును స్పృశింతురు.     38. వర్షము చేరినట్లే ఇంద్రుని వద్దకు శోధితసోమము చేరును. సోమము తన మహిమచే ద్యావా పృథ్వులను పూరించును. స్వతేజమున చీకట్లను తరుమును, సోమపు ప్రియతమ ధారలు రక్షణ కలిగించును. పని చేయించుకున్నవాడు భృతి ఇచ్చినట్లు సోమమా! మాకు త్వరగా  ధనమును ప్రసాదించుము.     39. సోమము దేవతల వర్థకుడు. తాను స్వయం వర్థకుడు. పవిత్రమున  శోధితుడు. మనోరథపూరకుడు. అతడు స్వతేజమున మమ్ము రక్షించవలెను. అంగిరులు సర్వజ్ఞులు సూర్యజ్ఞాతలు. పితరులు వారు సోమపానము చేసినారు. పణులు అపహరించిన గోవు అడుగుల గుర్తులు కనుగొన్నారు. అంధకారమయ పర్వతమున సోమపు వెలుగున గోవులను చూచినారు. తెచ్చినారు.     40. సోమము మహారాజు. జలవర్ణకుడు అతడు సకల భువనముల విస్తృత జలములను తనలో దాల్చినాడు, అంతరిక్షమున ప్రజలను సృష్టించినాడు. అందరిని దాటిపోయినాడు. కామవర్షక, అభిషుత, దీప్తసోమము ఉన్నతము, మేషలోమ పవిత్రమున యధేచ్ఛగా పెరుగును.     41. పూజ్యసోమము మహాకార్యములు చేసినాడు. జలములను గర్భమున దాల్చినాడు. దేవతలను ఆశ్రయించినాడు. శోధితుడైనాడు. ఇంద్రుని కొరకు బలము సాధించినాడు. "జనయ త్సూర్యేజ్యోతిరిన్దు." సోమము సూర్యునిలో జ్యోతిని సృష్టించినాడు.     42. సోమమా! మాకు అన్నము, ధనము కలుగుటకు వాయువును ఉన్మత్తుని చేయుము. శోధితుడవగుము. మిత్ర వరుణులను తృప్తిపరచుము. మరుత్తుల బలమును పెంచుము. ఇంద్రాదులను ఆనందపరచుము. ద్యావా పృథ్వులను మిత్రులను చేయుము. మాకు ధనమునిమ్ము.     43. సోమము ఉపద్రవనివారకుడు. వేగవంతుడు రాక్షసహింసకుడు. హింసకుల బాధకుడు. తన రసమున పాలను కలుపు కొనును. పాత్రలందు చేరును. "ఇంద్రస్యత్వం తవవయం సఖాయః" నీవు ఇంద్రని మిత్రుడవు మేము నీ  మిత్రులము.     44. సోమమా! మధుర భండారమును క్షరింపచేయుము. ధనవర్షక రసమును క్షరింపచేయుము. మాకు వీరపుత్రుల నిమ్ము. పూజ్య అన్నము ప్రసాదించుము. శోధితమగుము. ఇంద్రునకు రుచికరుడవగుము. మాకు అంతరిక్షమునుండి ధనము తెమ్ము.     45. అభిషుత సోమము తనధారలతో - వేగవంత అశ్వమువలె - పరుగులిడును. ప్రవహించు నది పల్లమునకువలె - కలశమునకు పారును. శోధిత సోమము వృక్షోత్పన్న కలశమున ఆసీనుడగును.     46. ఇంద్రా !నీవు సోమాభిలాషివి. ప్రాజ్ఞ, వేగశీల సోమము నీ కొరకు చమసము నందు క్షరితమగును. సోమము సర్వదర్శి రథవంతుడు బలశాలి దేవకామి యజమానుల కొరకు కల్పవృక్షమగును.
24,992
    దారే పోయే దానయ్యను అడిగాడు భరత్ భూషణ్.     సదరు దానయ్య భరత్ భూషణ్ ను ఎగాదిగా చూశాడు. కారా కిళ్ళి సొంగ తుడుచుకున్నాడు. వింతగా సకిలించాడు.         "ఏ దేశం మనది? ఐ మీన్, ఏ ప్రాంతమూ అంట! ఇంకెక్కడి ధర్మసత్రాలు ? అవి  బేతాళ కథల్లో కలిసి కాశీకి పోయాయి. ప్రస్తుతం లాడ్జింగులు, బోర్డింగులూ వున్నాయి. కావాలంటే హాస్టళ్ళూ, గెస్ట్ హౌస్ లూ కూడా వున్నాయి. నీదే కులం ? ఐ మీన్, నీకు ఏ కులపు హాస్టల్ కావాలి ? పో పో....పోయి, ఏదైనా గుడిలో పడుకో ! ఐ మీన్...."     విస్తుపోయాడు భరత్ భూషణ్.     ధర్మసత్రాలు లేవు... కులాల వారీ హాస్టళ్ళు...     భరత్ భూషణ్ మనసు మూలిగింది.     దూరంగా దేవాలయం కనుపించింది. కదిలాడు....     గుడిని సమీపించాడు భరత్ భూషణ్.     గుడిలో దీపాలు లేవు.     అది ఏ దేవుడి గుడో ! ఏ కులపు దేవుడో !     తలుపులు మూసివున్నాయి,     ఎదుట అరుగుల మీద కొందరు సన్యాసులు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు.     కొందరు తత్వాలు గొణుగుతుంటే మరికొందరు గంజాయి దమ్ములాగుతున్నారు.     ఒక అరుగు మీద ఒక మూల ఖాళీ జాగా కనుపించగా, భరత్ భూషణ్ నిదానంగా అక్కడకు వెళ్ళి పై తుండుతో దుమ్ము దులిపి, దానినే పరచి, నడుం వాల్చబోయాడు.     అంతే ! వెంటనే అప్రకటిత యుద్ధం ప్రారంభమయింది ?     "ఎవడివిరా నువ్వు ? మా జాగాను ఆక్రమించుకుంటున్నావేంది ? ఏందిరా కథ, వొళ్ళెట్టా  వుంది ? బుక్కా పకీరులా వుండావ్ _ మీకు మీ మశీదులుండగా, మా గుడే కావలిసొచ్చిందంట్రా ?"     హడలిపోయాడు భరత్ భూషణ్. దిగ్గునలేచాడు.     కండువ భుజాన వేసుకుంటూ కదిలాడు....     స్వతంత్ర  భారతదేశంలో కులాలు, మతాల పిచ్చి....     సర్వసంగ పరిత్యాగులైన సన్యాసులకే మతం పిచ్చి. ఇక సామాన్యులకు....     వీళ్ళు సన్యాసులు కారు, సన్నాసులు !     వీళ్ళు స్వతంత్ర భారత పౌరులుకారు, కుల, మతతత్వ బానిసలు....     స్వాతంత్ర్య సమర కాలంలో కులాలు మతాలు ఇలా వుంటే అసలు స్వాతంత్ర్యం సిద్ధించేదా ?     స్వాతంత్ర్యం వచ్చింది కుల మతాల పునరుద్దరణకే....?     ఇదేమి దౌర్భాగ్యస్థితి ! ఇదెక్కడి కుహనా సంస్కృతి !     వీళ్ళు మనుషులా ? వీళ్ళలో మరి మానవత ఎక్కడ ?     భరత్ భూషణ్ ఆలోచనాధోరణిలో ఆవేశం, ఆందోళన, ఆగ్రహం చోటు చేసుకుంటున్నాయి. ఆ వృద్ద హృదయం కంపించిపోతున్నది.                 ఏమిటి  ఈ కుత్రిమత ? ఎందుకని మనుషులు ఇంకా కుంచించుకు పోతున్నారు ?     ఇదేనా తను కలలుగన్న స్వాతంత్ర్యం ? వీళ్ళా స్వతంత్ర భారత పౌరులు ?     ఇటువంటి అసమంజస అనర్ధదాయక సమాజాన్ని  చూడడానికేనా తను బ్రతికున్నది ?     పరిష్కారం ఏమిటి....?                           *    *    *         "స్వాతంత్ర్య  సమర  యోధుల  విశ్రాంతి   మందిరము"     బోర్డును చూసిన భరత్ భూషణ్ క్షణకాలం ఆశ్చర్యపోయాడు.     అక్కడ మందిరం లేదు. స్థూపం వున్నది.     మహాత్మాగాంధీజీ విగ్రహం కాబోలు ఒకటున్నది.     చుట్టు ముళ్ళకంచ, మధ్యన గేటు. కటకటాల గేటు ! కటకటాలు....ది  సెల్....     కించింత్ ఊపిరి పోసుకున్నట్టు అనుభూతి చెందాడు భరత్ భూషణ్.     కటకటాల గేటును తోసుకుని హుందాగా లోనికి ప్రవేశించాడు. తన సొంత ఇంటికి ఏదో తను వస్తున్నట్టు తృప్తిచెందాడు.     చుట్టూ కలయజూశాడు. స్వాతంత్ర్య సమర యోధులు ఎవరైనా కనుపిస్తారేమోననుకున్నాడు. ఎవ్వరూ లేరు.       ఒక మూలగా కంప చాటున ఊరకుక్కలు ఊరికే ఆడుకుంటున్నాయి.     ముళ్ళ చెట్లు, పిచ్చి మొక్కలు, పల్లేరు తీగలు....బ్రహ్మజెముడు....     స్వాతంత్ర్య సమరంలో సమిధులైపోయారు  మహాత్ములు, మహర్షులు...     'నా దేశానికి భావస్వాతంత్ర్యం వచ్చేంతవరకు, ప్రజలలో చైతన్యం రగిలేంత వరకు, కుల మత తత్వాలు వీడి మనుషులందరు ఏకోదరులుగా బ్రతికేంత వరకు _ ఓ భగవంతుడా _ నాకు జవసత్వాలను ప్రసాదించు ! నా కలం బలం పుంజుకునేట్టు దీవించు ! నా దేశానికి అసలు సిసలైన స్వాతంత్ర్యం రావాలి _ అంతదనుక నన్ను బ్రతికించు....'     భరత్ భూషణ్ ఆలోచనలు ఒకదాని వెంట ఒకటి తరుముతుంటే, ఆక్రోశిస్తున్న ఆ వృద్దునిలోని యువత మనసును సమాధానపరచలేని హృదయం చలన హీన అయింది, శరీరం కుప్పకూలిపోయింది.     చుట్టూ కంచ కటకటాలు....     ది  సెల్...                 ____* THE END * ____   
24,993
    నరేంద్ర ఇంకా బయటికి రాలేదు.     రోడ్దు కేసి కన్నార్పకుండా, ఊపిరిబిగబట్టి చూడసాగింది అనసూయ.         నరేంద్ర బయటకు రాలేదు.     అతడు కూడా రాలేదు.     అతడు వస్తాడోలేడో?     అతడు వచ్చేంత వరకూ తను ఇలాగే కూర్చోవాలా? మరో గంట ఇలాగే  కూర్చుంటే తన గుండె ఆగిపోయి చచ్చిపోతుంది. అనసూయ ఆదురుతున్న గుండెను చెత్తో ఒత్తుకున్నది. దూరంగా రోడ్దుమీద మలుపు తిరుగుతున్న కారు  హెడ్ లైట్లు కాంతి హఠాత్తుగా అనసూయ ముఖం మీద పడింది.     ఆమె కళ్ళు చెదిరిపోయినై     అతడు వస్తున్నాడు.     ఆమెకు ముచ్చెమటలు పోశాయి.     కాళ్ళల్లోకి, నరాల్లోకి లేని సత్తువను తెచ్చుకొని లేచి నిల్చుంది.     చేతిలోని కాగితాలు కన్పించేళా పట్టుకొని గేటుముందుకు వచ్చింది.     హెడ్ లైట్స్ కాంతితోపాటు, కారుమోతకూడా విన్పించసాగింది.     వెలుతురు దగ్గరౌతున్నకొద్దీ ఆమె గుండె వేగం పెరగసాగింది.     కారు గేటుకు 20 గజాల దూరంలో ఆగింది.     అనసూయ హెడ్ లైట్ల వెలుగులో కారుకు అడ్డంగా పరుగు తీసింది మళ్ళీ వెనక్కు  తిరిగి ప్రహరీ గేటులో నుంచి చెట్లమధ్య పరుగు తీసింది. ఆమె చేతిలోఉన్న కాగిహాలు గాలికి రెపరెపలాడాయి.      అనసూయ చెట్లు మధ్యదూరంగా ఉన్నకారు దగ్గరకు పరుగు తీసింది. ఆ చెట్లమధ్య కారు గాభారాలో వెంటనే కన్పించలేదు.     మళ్ళీ వెనక్కు తిరిగింది. కుడివైపుగా మామిడిచెట్టు కింద ఉన్న ఎర్రమారుతి కన్పించింది.     పరుగు పరుగున వచ్చి వెనకడోర్ తెరిచి వెనకసీట్లో కూలబడింది ఆయాసపడుతూ.     భయంకరమైన ప్రమాదం నుంచి బయటపడ్డట్టు రెండు చేతులతో కళ్ళు మూసుకుంది.     ఆమె కూర్చోగానే కారు బయలుదేరింది.     అలసిపోయిన ఆమె శరీరం సీటు వెనక్కు వాలిపోయింది.     ఆమెకు కొంత సేద తీరినట్టు అయింది.     తేలిగ్గా గుండెల నిండా గాలిపీల్చుకుంది.     కళ్ళు తెరిచి చూసింది.     కారు తెరిచి చూసింది.     కారు శరవేగంతో పోతుంది.     రోడ్దుపక్కన కొండగుట్టలూ, చెట్టూ, పొదలూ వెనక్కుపోతున్నాయ్.     తనెక్కడ ఉంది?     కారు ఎటుపోతుంది?     ఇంకా ఊళ్ళోకి రాలేదేం?     కారు ఊరుదాటి పోతోంది. ఎక్కడకు?     ముందు సీట్లో స్టీరింగ్ దగ్గర  కూర్చున్న వ్యక్తికేసి చూసింది.     "ఏయ్! మిస్టర్ మనం ఎక్కడికి పోతున్నాం?" అన్నది అనసూయ.     "స్వర్గానికి" ముఖం మీదకు వంగిఉన్న హాట్ ను ఎత్తకుండానే అన్నాడు డ్రైవ్ చేస్తున్న వ్యక్తి.     "డిటెక్టివ్ నరేంద్ర నన్ను ఇంటికి పంపించే ఏర్పాటు చేశానన్నాడే? ఏమిటి నువ్వంటున్నది?     "అవును చేశాడు ఏర్పాటు నిను శాశ్వితంగా ఇంటికి పంపించే ఏర్పాటే చేశాడు" అంటూ అతడు వికటంగా నవ్వాడు.     "ఎవరు నువ్వు?"     "యముడ్ని"     "కారాపు!" వెర్రిగా అరిచింది.     "నీ అరుపులు వినేవాళ్ళెవరూ ఇక్కడలేరు". మళ్ళీ వికటంగా  నవ్వాడు.     అనసూయ కారు తలుపుతీసి దూకడానికి ప్రయత్నించింది.     "కారు 80 మైళ్ళ వేగంతో పోతోంది కారులోనుంచి ఈ కొండరాళ్ళమీద పడితే ఏమౌతుందో తెలుసా? నీ తలకాయ కొబ్బరికాయలా పటుపటుకున్న పగులుతుంది" అని పకపక నవ్వాడు.     అనసూయ తలుపుతీసి ప్రయత్నం ఠక్కున ఆపేసింది.     ముందు సీట్లోకి వంగి, అతడి భుజాలు పట్టుకొని ఊపుతూ "ఏమిటి నీ ఉద్దేశ్యం? ఎక్కడికి తీసుకెళుతున్నావ్?"     "చెప్పాగా స్వర్గానికని!" అని హఠాత్తుగా బ్రేకు వేశాడు.     ఆమె నుదురు ముందు సీటుకు కొట్టుకున్నది.     "అబ్బా!" అని మూలుగుతూ మళ్ళీ  వెనక  సీట్లోకి జారగిలపడి పోయింది.                                      22     బంగళాగేటు ముందు కారు ఆగింది.     ఇన్స్ స్పెక్టర్ అద్వాయితమూ, నలుగురు కానిస్టేబుల్సూ కారులో నుంచి బయటికి దూకారు.     "ఏయ్! హెడ్డూ! ఇప్పుడు కారుకు అడ్డంగా పరిగెత్తి మళ్ళీ  గేటులో నుంచి  తోటలోకి పరిగెత్తింది. ఆ అమ్మాయిని పట్టుకో ఓఒ త్వరగా పరుగెత్తండి. తోటంతా వెదికి పట్టుకో" అన్నాడు అద్వయితం హెడ్డూతో.     మిగతా కానిస్టేబుల్స్ కేసి చూసి "మీరంతా బంగళా చుట్టూ కాపలా కాయండి. ఒక పిట్టకూడా బయటకి పోవడానికి వీల్లేదు" ఆజ్ఞాపించారు.     "యాస్సార్!" అంటూ హెడ్ కానిస్టేబుల్ తోటలోకి పరుగు తీశాడు.     మిగతావాళ్ళు బంగాళా ప్రహరీ చుట్టూ మూగారు.     ఇన్ స్పెక్టర్ అద్వయితం, బెల్టులోనుంచి రివాల్వర్ తీసి, అడుగులో అడుగు వేసుకుంటూ, బంగళాపోర్టికోలో రావడమూ, లోపల్నుంచి డిటెక్టివ్ నరేంద్ర తలుపు నెట్టుకొని పోర్టికోలోకి రావడమూ ఒకేసారి జరిగాయి.     రివాల్వర్ గురిపెట్టి "హాండ్స్ అప్" అంటూ ఇన్స్ స్పెక్టర్ నరేంద్రను చూసి నివ్వెరపోయాడు.     నరేంద్ర అద్వయితాన్ని ఆ సమయంలో అక్కడచూసి ఆశ్చర్య పడ్డాడు.     "నువ్వా?" అన్నాడు అద్వయితం.     "అవును ఇన్స్ స్పెక్టర్ నువ్వు ఇలా ఊడిపద్దవేం?" ఆశ్చర్యం నుంచి పూర్తిగా బయటపడని నరేంద్ర అడిగాడు.     "అది నా వృత్తిధర్మం!"     "సరిగ్గా చెప్పు!"     "నువ్వే చెప్పాల్సిన వాడివి. నువ్వు ఇంతరాత్రప్పుడు ఈఇంటి తాళం పగలగొట్టి, లోపల జొరబడి ఏం చేస్తున్నావ్? ఈ బంగ్లా తోటలోకి పరిగెత్తిన అమ్మాయి ఎవరు? నువ్వు  సరైన సమాధానం చెప్పక పోతే, ఈ పళాన నిన్ను అరెస్టుచేసే అధికారం నాకుంది. తెలుసుగా?"  అన్నాడు ఇన్స్ స్పెక్టర్ అద్వయితం.     "ఆ కారాణాలన్నీ అవసరమైనప్పుడు చెప్తాను."     "ఇప్పుడే చెప్పాలి"     "చెప్పను. నాపని పూర్తిఅయింది. ఇప్పుడు నువ్వు నన్ను అరెస్టు చేసిన నాకేమీ అభ్యతరం లేదు", అన్నాడు నరేంద్ర చిరునవ్వుతో.     అద్వయితం అయోమయంగా నరేంద్ర ముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు కొన్నిక్షణాలు.     అంతలో ఓ కారువచ్చి పోర్టికోలో ఆగింది. కారులో నుంచి విజయ్  దిగాడు. విజయ్ గాభరాపడ్తూ ఏదో చెప్పబోయాడు.     "అనసూయను ఎక్కడ ఉంచావ్? ఆమెను వంటరిగా  వదిలేసి  ఇక్కడి కెందుకొచ్చావ్? విజయ్ కేసి  కోపంగా చూస్తూ అన్నాడు నరేంద్ర .     "అనసూయ? ఆమె నాకు కన్పించలేదే?" తోటలో నీ కారు  కూడా లేదు. నేను ఇప్పుడే వస్తున్నాను."     "ఇంతసేపు ఎక్కడున్నావ్? ఏం చేశావ్?"     "మనం అనుకొన్న టైంకు రాలేకపోయాను. నీకు టెలిఫోన్ చేసి టెలీఫోన్ బూత్ లో నుంచి బయటికి వచ్చేసరికి కారు టైరులో గాలిపోయి ఉంది. కారు బంక్ దాకా తోసుకెళ్ళి గాలికొట్టించేసరికి ఆలస్యము అయింది." ఒక్కగుక్కలో చెప్పాడు విజయ్.     అద్వయితానికి వాళ్ళ సంభాషణ అర్థం కావడం లేదు.     డిటెక్టివ్ నరేంద్రకు నెత్తిన పిడుగుపడ్డట్టు అయింది.     "నాకు భయంగా ఉంది. నా కాళ్ళు వణుకుతున్నాయి" అంటూ  దీనంగా పలికిన అనసూయ రూపం కళ్లల్లో మెదిలింది.     "ఓమైగాడ్! ఎంత పని చేశావ్ విజయ్! మన ప్లానంతా తల్ల కిందులై పోయింది. హంతకుడే నీ కారు టైర్ లో మంచి గాలి తీసేసి  ఉంటాడు. అంటే మన ప్లానంతా అతడు పసికట్టాడన్న మాట, అనసూయ ఈ పాటికి మైగాడ్" ఆపైమాటలు నరేంద్ర కంఠంలో నుంచి బయటపడలేదు.     "ప్లాన్? హంతకుడా? అనసూయ? ఏమిటి మీరంటున్నది?" అయోమయంగా కూస్తూ అడిగాడు ఇన్స్ స్పెక్టర్ అద్వయితం.     నరేంద్ర అద్వయితం మాటలు విన్పించుకోలేదు, ఒక్క దూకులోవెళ్ళి కార్లో స్టీరింగ్ ముందు కూర్చున్నాడు కారుస్టార్ట్ చేశాడు.     "మిస్టర్ అద్వయితం, త్వరగా  ఎక్కు, గెటిన్!" అని అరిచాడు నరేంద్ర.     అద్వయితం యాంత్రికంగా ఒక గంతులో కారెక్కి ముందు సీట్లో నరేంద్ర పక్కన కూర్చున్నాడు.     కదులుతున్న కార్లోకి విజయ్, మరో ఇద్దరు కానిస్టేబుల్స్ ఎగిరి ఎక్కి వెనక సీట్లో కూర్చున్నారు.     నరేంద్ర వళ్ళు తెలియని ఆవేశంతో  యాక్సిలేటర్ తొక్కసాగాడు.     కారు వెనకే పోలీసు జీపు బయలుదేరింది.     కారు 80 మైళ్ళ వేగంతో పోతోంది.     బంజారాహిల్స్ దాటి జూబ్లీహిల్స్ లో ప్రవేశించింది.     "మిస్టర్ నరేంద్రా ! ఇటు  ఎక్కడికి? కారు వెనక్కు తిప్పు; స్టేషన్ కు పోనియ్." ముందు సీట్లో చిరాగ్గా కదులుతూ అన్నాడు అద్వయితం.     అదేమీ పట్టించుకోకుండా నరేంద్ర కారు వేగం  పెంచాడు. దీంతో అద్వయితానికి కోపం వచ్చింది.     నరేంద్రను అరెస్టు చేసే అవకాశం ఇప్పుడు తనకు ఉంది. కాని అతడే తనను ఒక బందీని చేసి తీసుకెళ్తూన్నాడు. అసలు  ఎక్కడకు తీసుకెళుతున్నాడు? ఎందుకు తీసుకెళుతున్నాడు? తనను ఒక అర్పకుడిగా, ఆప్రయోజకుడిగా చూస్తున్నాడు నరేంద్ర.     ఆలోచించికొద్దీ నరేంద్ర మీద కోపం పెరుగుతుంది. అతడి ఆత్మాభీమనం దెబ్బతిన్నది.     "మిస్టర్ అద్వయితం!అనవసరంగా  ఉద్రేకపడకు, నీ చేతిలో రివాల్వర్ ఉంది. నీ వెనక ఇద్దరు కానిస్టేబుల్స్ ఉన్నారు. భయమెందుకు? నేను  నిన్నేం  చేస్తానని భయపడ్తున్నావ్?"     "నాకా భయమా? ముందు  కారు వెనక్కు తిప్పుతావా లేదా?" అరిచినట్టే అన్నాడు అద్వయితం.     "కారు వెనక్కు  తిప్పడానికి  నాకేమీ అభ్యంతరంలేదు. కాని నీమూలంగా ఒక స్త్రీ హత్యకు గురి కావడం ఇష్టంలేదు."     గంభీరమైన కంఠంతో అన్నాడు నరేంద్ర.     "మరో స్త్రీ  హత్యా?" అద్వయితానికి గుండె గొంతులోకి ఎగబాకినంత పనిఅయింది.     "అవును మరో స్త్రీ శవం! కావాలా? ఆమె హత్యకు గురి అయితే  నీ ప్రమోషన్ సంగతేమోగాని, ఏ ఆదిలాబాద్ కో ట్రాన్స్ ఫర్ తప్పదు."             "నరేంద్రా! నాకేమీ  అర్థం కాడవంలేదు నాకు మతిపోతోంది సంగతేమిటో చెప్పు."     "చూడు అద్వయితం మనం త్వరగా వెళ్ళాలి. ఇలా  కబుర్లు చెప్పుకుంటూ వెళ్తే. హంతకుడు పారిపోతాడు. నన్ను మాట్లాడించకు, ఆమెను రక్షించాలి."     "పోనియ్! ఎక్కడకు పోతున్నాం?"     రాధారాణి హత్య జరిగిన ప్రదేశానికే?"     అద్వయితం తృళ్ళిపడ్డాడు.     "వాడేనా  హంతకుడు?"     చూస్తాంగా?" అని నరేంద్రకారు స్పీడు పెంచాడు.     "ఆ శంక్రరావు గాడేగా?"     "నరేంద్ర సమాధానం ఇవ్వలేదు.                                                                               23     అల్లంత దూరాన కొండలు.     కొండల మధ్య పల్లంలో ఓ పెద్ద మర్రిచెట్టు.     చెట్టుమీది నుంచి చందమాను మబ్బుల్లో నుండి వెలవెలబోతూ చూస్తోంది.     రామచిలక ఒకటి "గీ" పెడ్తు చెట్టుమీద వాలింది.     రాబందు రెక్కల చప్పుడుకు రామచిలుక తల్లడిల్లి పోయింది.     అనసూయ కొండరాళ్ళ మీదగా  పరుగులు తీస్తోంది.     అతడి బూట్ల నాడాలు కొండరాళ్ల మీద శబ్దం చేస్తూ ఆమెను తరుముతున్నాయి.     ఆమె పిచ్చిగా చెట్టుకేసి పరుగులు తీస్తోంది.     రాబందు రెక్కల విసురుకు చెట్టు కొమ్మలు ఊగాయి.     ఆకుల మధ్య ఉన్న రామచిలుక వణికి పోతున్నది.     ఆమె చెట్టు కిందకి  పరుగు తీసింది.     ఆమె పాదం పైన అతడి  బూటు కాలు పడింది.     అనసూయ "కెవ్వున" కేక పెట్టింది.     దూరంగా వినిపిస్తున్న బూటు కాళ్ళ త్వనులు దగ్గర తున్నాయి.     కింద జారిపోతున్న అనసూయ శరీరాన్ని అతడి బలమైన చేతులు పైకి  లాగాయి. 
24,994
        "కృతజ్ఞుణ్ణి! కాని నేను వెళ్ళక చేయగలిగిందేముంది చెప్పండి! ఈ రోజున బయలుదేరడమే బుద్దిపొరపాటు. మధ్యాహ్నం కొంచెం తెరిపియిస్తే ఫరవాలేదుకదా అని బయల్దేరాను. ఎవరినడిగినా నాలుగడుగులువేస్తే స్టేషన్ వచ్చేస్తుందని చెప్పారే! ఏం మనుషులండీ వీళ్ళు! అబ్బ! చేతులు నొప్పి పెడుతున్నాయి" అంటూ వేళ్లు సాచి ముడుచుకున్నాడు కీళ్ళు సడిలేందుకు.     "మీకు దూరమని తెలియదా?"     "తెలియదు. నేను ఈ దారిని రాలేదుగా వచ్చేటప్పుడు? అసలు నేనీ ప్రాంతానికి కొత్తవాణ్ణి. అందులో ఈ వర్షాకాలంలో పల్లెటూళ్ళకి వెళ్ళడం తెలివితక్కువ."     యువతి చిన్నగా నవ్వింది. "అయితే యిప్పుడేం చేస్తారు మీరు?" అంది.     "ఏం చెయ్యను! ఎలాగో అలాగ తంటాలుపడి స్టేషన్ కి చేరుకుంటాను."     "మీ గొంతు విన్నట్టుగా ఉందే ఎప్పుడో ఎక్కడో!" అంది విస్మయాన్ని సూచిస్తూ.     "కంఠధ్వనిలో పోలికలుంటాయిలెండి. కాని మీరు నన్ను కానీ, నేను మిమ్మల్ని కానీ కలుసుకోలేదని నిక్కచ్చిగా చెప్పగలను" అన్నాడా వ్యక్తి.     "ఎలా చెప్పగలరు?" అంది యువతి కుతూహలంతో.     "ఈ ప్రాంతానికి నేనెప్పుడూ రాలేదని చెప్పాను కదా, అదీగాక చాలాకాలం ఈ దేశంలోకూడా లేను" అంటూ ఆ వ్యక్తి తిరిగి పెట్టెనీ, గొడుగునీ చేతపట్టుకున్నాడు. "నమస్కారం! నేను వెళ్ళొస్తాను. రోడ్డు విషయమై మీరు చేసిన హెచ్చరికను మరిచిపోను" అన్నాడు.     "మీరు నామాటనర్ధంచేసుకోలేదు. మీరింక ప్రయాణం సాగించడం శ్రేయస్కరంకాదు. ఈ రాత్రికి ఇక్కడ పరుండి పొద్దుటే వెడితే మంచిది, మీకభ్యంతరం ఏమీ లేకపోతే" అంది యువతి.     నూతన వ్యక్తి ఆలోచించాడు. "అంతేనంటారా?" అన్నాడు.     "అవును ఉదయం ఆరుగంటలకి రైలువుంది. అప్పటికి వర్షం కూడా చాలామట్టుకు తగ్గొచ్చును."     వర్షం మళ్ళీ హెచ్చింది. వానజల్లు వరండాలోకి వచ్చి పడుతోంది. నూతన వ్యక్తి హతాశుడై "సరే. సరే మీరు సూచించిన మార్గమే ఉత్తమంగా కనపడుతోంది. తెల్లవారాక మున్సిపాలిటీవాళ్ళు ఏ గోతిలోంచో బురదలోంచో కూరుకుపోయిన నా శవాన్ని పైకి తీయడం అంతగా ఆశించదగినదిగా లేదు. మీ దయకు కృతజ్ఞుణ్ణి" అంటూ సంకోచంగా నవ్వుతూ అన్నాడు.     ఇంతలో ముసలిది దీపం పట్టుకుని వచ్చింది. దీపపు వెలుగులో అతని ఆకారం మరింత స్పష్టంగా కనబడింది. మనిషి ఒడ్డూ పొడుగూ ఉన్నాడు. బుగ్గలు కొంచెం చిక్కినట్టున్నా మహం అందంగానే వుంది. చామనచాయ. మొత్తంమీద విగ్రహంలో గాంభీర్యం స్పురిస్తోంది. పంచె అంతా బురదతో నిండివుంది. ముసలిది దీపం పైకెత్తి దగ్గరగా పట్టుకుని పరీక్షగా చూస్తూ "ఏ వూరు బాబూ మీది?" అంది. దీపకాంతిలో మెరిసిన అతని వదనాన్ని చూసి యువతి ఉలిక్కిపడింది. తెల్లబోయి రెండు కళ్ళూ అప్పగించి అలాగ చూస్తూ నిలబడింది. ముసలిది మోచెయ్యితో యువతిని పొడిచి "దెయ్యం పట్టినట్టు ఏమిటే ఆ చూపు పిల్లా?" అంది.     యువతి యింకా తేరిచూస్తూ "మీ పేరు?" అంది.     "జగన్నాథం" అన్నాడా వ్యక్తి.     యువతి కళ్ళలో ఆశాభంగం అద్దంలా కనపడింది. అది గమనించిన అతనికి సంకోచం ఎక్కువయింది. "మీరు నన్నాహ్వానించడంలో ఏదో పొరపాటు జరిగిందనుకుంటాను. మీ ధోరణి చూస్తే. ఈ వర్షపు తీవ్రత తగ్గగానే వెళ్ళిపోతాను. నేనేమీ అనుకునేవాణ్ణి కాను" అన్నాడు.     యువతి తనలో కలిగిన ఉద్రేకాన్ని అణుచుకొని సహజస్వరంతో "కాదుకాదు. మీరు నేనెరిగిన ఒక వ్యక్తిలాగ వున్నారు. అంతే. మీరు అపార్ధం చేసుకుని వెళ్ళిపోతే నేను చాలా బాధపడతాను" అంది. వ్యక్తి నిట్టూర్చి పెట్టె కింద పెట్టాడు. ముసలిది తేలికగా పెట్టెని ఎత్తి లోపలికి తీసుకువెళ్ళింది.     యువతి జగన్నాధాన్ని ఒక గది దగ్గరకు తీసుకువెళ్ళి "అవ్వ ఈ గదిలోనే మీ పెట్టెని పెట్టింది. మీరు బట్టలు మార్చుకుని విశ్రాంతి తీసుకోండి. మీకు భోజనం ఏర్పాటు చేసివస్తాను" అని వెళ్ళిపోయింది. జగన్నాథం గదిని నలువైపులా పరీక్షగా చూశాడు.     పాతకాలపు పందిరిమంచం ఒకటుంది. దానిమీద తెల్లని పక్కవేసివుంది. మంచానికి పక్కగా ఒక ఎత్తైన ముక్కాలిపీట వుంది. పేముతో అల్లిన కర్ర కుర్చీ కూడా వుంది. ఒక మూలగా హరికేన్ లాంతరు వెలిగించి వుంది. అతను తొందర తొందరగా దుస్తులు మార్చుకున్నాడు. అతనికాకలి ఎక్కువగా ఉంది. వొళ్ళంతా చలితో, తేమతో ముద్దకట్టుకుపోయినట్టుంది.     ముసల్ది వచ్చి భోజనానికి రమ్మని పిలిచింది. అరిటాకులో అన్నమూ, పదార్ధాలూ వడ్డించి వున్నాయి. ముసలిది నిశ్శబ్దంగా వడ్డిస్తూవుంది. ఏదో చెప్పాలని నోరు తెరుస్తుంది. కాని తలుపుచాటుకి చూసి మానివేస్తుంది. ఆకలితో వున్న అతనికి భోజనం రుచిగా వుంది. ముసలిది మాట్లాడబోయి మానివేయడం గమనించి తలుపుచాటుకు చూశాడు. తలుపుచాటుగా యువతి కూర్చుని వుంది. అతనికేదో విచిత్రమైన అనుభూతి కలిగింది. తనలో తాను నవ్వుకున్నాడు.     భోంచేసి గదిలోకి వెళ్ళగానే ముక్కాలిపీటమీద తమలపాకులూ, వక్కా అమర్చబడిన వెండిపళ్ళెం కనపడింది. అగరువత్తులు వెలిగించబడి గోడకున్న చిన్న చిల్లులో గుచ్చబడివున్నాయి. తలవని తలంపుగా లభించిన యీ ఆతిధ్యానికి ఆదరానికీ అతనికి విస్మయానందాలు రెండూ కలిగాయి. కాసేపట్లో గుమ్మంవద్ద గాజుల చప్పుడు విన్నాడూ. తల పైకెత్తి "రండి, జన్మలో మీరు చూసిన ఆదరాన్ని మరిచిపోలేను. రైల్లోనో, రైలుస్టేషన్ లోనో తిండి తిప్పలులేక పడి ఉండవలసిన విధినుండి తప్పించారు మీరు" అన్నాడు.
24,995
          అంటే...నాటకం ఆడుతున్నానని భరద్వాజ చెప్పినా వీనస్ ముమ్మాటికీ జె.జె. మనుమరాలే అయుంటుంది. ఏ స్వార్ధమూ లేని, నిజాయితీపరుడైన రమణయ్య ఎవరో భరద్వాజ కూతుర్ని తీసుకెళ్ళి జె.జె.కి మీ మనుమరాలని ఎలా పరిచయం చేస్తాడు? ఖచ్చితంగా చెయ్యడు. అందుకు తగిన ఆధారాలు లేందే, అది నిజం కానిదే?         వీనస్ జె.జె. మనుమరాలు అనే రహస్యం భరద్వాజకు, రమణయ్యకి తెలిసి వుంటుంది.         ఎంపైర్ లో వీనస్ పేరిట వాటాకోసం రమణయ్యను బెదిరించి ఇలా చేసి వుండవచ్చు.         ఇది కేవలం నాటకం అని వీనస్ కి, తనకి చెప్పాడంటే అది వీనస్ కి తెలియకూడదనే? తెలిస్తే తన ఎత్తు పారదనే!!         విడిపోయిన అల్లుడ్ని, కూతుర్ని కలవటానికి యింత పెద్ద మోసం చేయక్కర్లేదు. ప్రపంచంలోనే ఎవరూ ఇంతవరకు చేసి వుండరు. కనుక అతనికి ఆ యిద్దర్నీ కలిపే ఉద్దేశం లేదు. ఇక మిగిలింది వాటా....ఆ వాటా అతనికి ఆ యిద్దర్నీ కలిపే ఉద్దేశం లేదు. ఇక మిగిలింది వాటా.... ఆ వాటా రాగానే వీనస్ ని మోసంచేసి తను చేజిక్కించుకుంటాడు. అప్పుడు వీనస్....?         ఆమె ఒక్కసారి ఉలిక్కిపడింది.         తన సర్వీస్ లో తను ఎందరో నొటోరియస్ క్రిమినల్స్ ని చూసింది గాని- ఇప్పుడు వాళ్ళెవరూ భరద్వాజకు సరిపోరనిపించింది.         వీనస్ భోళా మనిషి కొన్ని విషయాలలో ఆవేశమే కనబరుస్తుంది తప్ప ఆలోచన చేయదు.         భరద్వాజ మాటలు నమ్మి వాటాయే కావాలి అని అడిగితే మాధుర్ ఆమెకు దక్కడు. దక్కకపోతే వీనస్ తట్టుకోలేదు.         తన దగ్గరకు వచ్చి నా సంసారం నెలబెట్టు అక్కా అని ప్రాధేయపడినప్పుడే ఆమెకి న్యాయం జరగాలని తను కోరుకుంది. ఆమెకి న్యాయం జరగాలనే ఉద్దేశంతోటే అవమానం ఎదురవుతుందని వూహించి కూడా తన అత్తా, మామల్ని కలిసింది.         ఇప్పటికే కాలాహరణం జరిగింది.         రమణయ్య వీనస్ ని జె.జె ఛాంబర్ లోకి తీసుకెళ్ళేలోపే తను వీనస్ ని కలవాలి అనే నిర్ణయానికొస్తూ ఓ ఎస్.ఐ.కి సైగచేసి జీప్ సిద్దం చేయమని చెప్పి అప్పుడే తెరుస్తున్న ఫ్యాన్సీషాప్ వేపుకు దూసుకుపోయింది.         "ఇఫ్ యూ డోంట్ మైండ్. ఒక ఫోన్ కాల్ చేసుకుంటాను" షాపతనితో అంటూనే సునీల్ వర్మకు రింగ్ చేసింది.         ఆ వైపు సునీల్ వర్మ లైన్ లోకి వచ్చాడు.         "హలో సునీల్ వర్మగారు... నేను ఎస్.పి. ప్రమీలారాణిని మాట్లాడ్తున్నాను" అంది ఆతృతగా.         "చెప్పండి మేడమ్! వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ" సునీల్ వర్మ ఆ వేపునుంచి అడిగాడు.         "నాకు ఒక నిజం చెప్పాలి! లేదంటే మీరు, నేను చాలా పెద్దతప్పు చేసిన వాళ్ళమవుతాం. అంతేకాదు ఒక అమాయకురాలి ఉసురు పోసుకుంటాం... ప్లీజ్.... నేను ఇప్పుడు ఎస్.పి.గా మిమ్మల్ని ప్రశ్నించటంలేదు. సాటి స్త్రీ బాధను అర్ధంచేసుకున్న ఒక స్త్రీగా అర్దిస్తున్నాను. ప్లీజ్..." ప్రాధేయపడింది ప్రమీలారాణి.         సునీల్ వర్మ ఆశ్చర్యపోతూ "సర్టెన్ లీ మేడమ్... అడగండి. దాని కోసం మీరింత ఇదిగా అడగాలా?" అన్నాడు.         "మాధుర్, వీనస్ లకు పెళ్ళయిందని మీకు తెలుసా?"         "తెలుసు."         "మాధుర్ వీనస్ నుంచి విడాకులు కోరాడా?"         "లేదే.... నిజానికి నా భార్యను నా దగ్గరకు పంపించమని కోర్ట్ ని ప్రాధేయపడ్డాడు."         ఆమె మరో షాక్ తింది.         అంటే.... తనూహించింది నిజమే అన్నమాట.         "తన కూతురు సంసారానికి పనికిరాదని భరద్వాజ కోర్ట్ లో సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేసాడా?"         "చేశారు మేడమ్... బాట్ దటీజ్ ఫేక్... పెద్దవాళ్ళ గొడవల్లో తల దూర్చటం ఇష్టంలేక నేనీ కేస్ డీల్ చేయలేదు."         "భరద్వాజ ఫైల్ చేసిన సర్టిఫికెట్ ని కోర్ట్ నమ్మిందా?"         "భార్యాభర్తలు ఇద్దరూ కావాలని అడగాలి గదా? ఆ తర్వాత మాధుర్ విరక్తి చెంది దూరంగా వెళ్ళిపోయాడు. కానీ సంవత్సరం క్రితమే తనూ విడాకులు కావాలని కోర్టును అర్ధించాడు. బహుశా త్వరలోనే విడాకులు లభించవచ్చు..... ఎందుకు మేడమ్ ఇవన్నీ?"         "తరువాత చెబుతాను. ఇప్పుడు టైమ్ లేదు.... థాంక్యూ ఫర్ యువర్ కైండ్ ఇన్ ఫర్మేషన్" అంటూనే ఫోన్ ని క్రెడిల్ చేసి జీపువేపుకు పరుగెత్తుకు వచ్చి ఎగిరి జీప్ ఎక్కింది.         అది మరుక్షణం జెజె.ఎంఫైర్ కేసి దూసుకుపోసాగింది.                                               *    *    *    *    *         జె.జె. ఛాంబర్ లోని వాతావరణం బాగా వేడెక్కిపోయింది.         "ఇంతకీ ఫైనల్ గా ఏమంటావు బేబీ....?" జెజె కంఠం గంభీరంగా వుంది.         ఆయనకి ఏది ఇష్టమో, ఏది అయిష్టమో కూడా ఎదుటవున్న వారికి ఓ పట్టాన అర్ధంకాదు- మంచికి, చెడుకి లాభనష్టాలకి అందనంతగా చలించక పోవటమే అందుకు కారణం.         "మీ మనుమరాలిగా, ది గ్రేట్ బిజినెస్ మెన్ వారసత్వానికి అసమర్ధత అనే అపప్రధ అంటకుండా విజయం సాధించాను. అందుకు మీరు ఆనందించారు కూడా.         ఇకిప్పుడు ఓ మనిషిగా, వ్యక్తిత్వమున్న యువతిగా నన్ను నేను జస్టిఫై చేసుకోవాలంటే..."         ఆమె చెప్పటం ఆపింది.         "ధైర్యంగా చెప్పమ్మా.... ఈ జె.జె. వారసత్వంలో పిరికితనం అనేది వుండకూడదు చెప్పు" జె.జె. ఆప్యాయంగా అన్నాడు.         "నేను ఏ స్థితిలో అయితే మాధుర్ దగ్గరకు వెళ్ళి మోసగించానో తిరిగి ఆ స్థితికి నేను వెళితే నేను చేసిన మోసం ప్రక్షాళనమైపోతుంది. ఐ మీన్.... నేను నిజంగా మధ్యతరగతి ఆడపిల్లగా మారటం-"         డిక్, రమణయ్య షాక్ తిన్నట్లు చూశారు మౌనిక వేపు. ఆ వెంటనే జె.జె. వేపు చూశారు ఆయన రియాక్షన్ ఏమిటని.         "విధి చాలా విచిత్రమైంది..... నేనెవరి కోసమయితే నా జీవితాన్ని ధారపోసి ఈ ఎంఫైర్ ని సృష్టించానో వారికే ఇది అక్కరలేదు అని తెలిసిన మరుక్షణం నాకు నేను ఓ ప్రశ్నగా మిగలాలనిపిస్తోంది" జె.జె. నిస్పృహగా అన్నాడు.         "సారీ గ్రాండ్ ఫా... మిమ్మల్ని కావాలని బాధించటంలేదు. ఈ ఎంపైర్ ని మీరెంత శ్రమించి నిర్మించారో నాకంటే మరెవరికీ ఎక్కువగా తెలిసుండదు.         బట్ ఐ వాంట్ మాధుర్. తృప్తి, ప్రశాంతత, ఆనందం, అనుభూతి కేవలం డబ్బు ఒక్కటే ఇవ్వలేదు. బట్ ఐ నో ది వేల్యూ ఆఫ్ మనీ జీవితాన్ని ఎన్ని విధాలుగానైనా అనుభవించవలసిన వయసు నాది. ఈ వయస్సులో సంపాదన వెంట పరుగెడితే మరికొన్ని వందలకోట్లు సంపాదించగలనేమో.         కానీ మళ్ళీ పోయిన వయస్సును మరిచి బ్రతకలేని వ్యక్తిని అప్పుడు సంపాదించుకోగలనా?" మౌనిక మత నిర్భయంగా, నిస్సంకోచంగా తన మనస్సులోని భావాలను జె.జె. ముందు బయటపెట్టటం యిదే తొలిసారి.         ఆమెలోని ఆశలు, ఆశయాలు, భావాలు ఇంత నిర్దుష్ట రూపాన్ని సంతరించుకుంటాయని అక్కడున్న ఎవరూ వూహించలేదు.         "ఆత్మవంచన చేసుకోకుండా చెబుతున్నాను. నాకు డబ్బంటే ఇష్టముంది. సంపాదించాలని వుంది. నేను సర్వసంగ పరిత్యాగం చేయాలని కూడా అనుకోవడంలేదు. కానీ సంపాదనకంటే జీవితం గొప్పది. ఆ జీవితంలో ప్రేమను అనుభవించే కాలం చాలా గొప్పది. అందంగా, తృప్తిగా, ఆనందంగా బ్రతకగలగటం నా దృష్టిలో చాలా గొప్పది" మౌనిక చెప్పడం ఆపింది ఒకింతసేపు. డిక్, రమణయ్యలు భయంగా జె.జె.కేసి చూశారు. జె.జె. మాత్రం మౌనిక ముఖంలోకి చూశాడు. ఆమె మోములో ఏమాత్రం సంకోచం లేదు. భయం అంతకన్నా లేదు. దృఢ నిశ్చయంతో నిండుకుండలా కనిపిస్తోంది.         అప్పుడనుకున్నాడు జె.జె. గర్వంగా. "ఏమైనా నా మనుమరాలు" అని. కానీ ఆ భావాన్ని కనబరచలేదు. నిన్నా, మొన్నటి స్వీట్ బేబీ, ఆక్వర్, టీనేజర్ కాకుండా పరిపూర్ణమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకుని పెద్దదయింది. చలించే మనస్తత్వంతో తన వ్యక్తిత్వాన్ని దిగజార్చుకోలేదు. తనకేం కావాలో తాను తెలుసుకునే స్థాయికి వచ్చింది. ఎందుకు కావాలో, వద్దనేది ఎందుకు వద్దో కూడా విశ్లేషణాత్మకంగా చెప్పగలుగుతోంది.         నిర్మలమైన కళ్ళతో, నిబ్బరంతో, క్లియర్ మైండ్ తో తెగేసి చెప్పిన తన మనుమరాలిని చూసి జె.జె. జీవితంలో తొలిసారి విభ్రాంతికి గురయ్యాడు. "ఒక సంవత్సరకాలం నీలో ఎన్ని మార్పులు తెచ్చిందమ్మా? నేను క్రియేట్ చేసిన జెయింట్ మెగాలిత్ ని నీకు అప్పగించాక కూడా మరికొన్నేళ్ళు నా వయసును పక్కన పెట్టయినా దీన్ని సమర్ధంగా పరిపాలించడానికి తగిన ట్రైనింగ్ ఇద్దామని ఆశించాను. నా కొడుకు నా సిద్దాంతం తప్పని నానుంచి వేరుపడినవాడు, నీ తల్లి నాన్నగారి సిద్దాంతమే గొప్పదని, నా తరఫున వాదించి, తన అన్నకు శత్రువయిపోయింది నాతోపాటు. అప్పుడు నాలో రేగిన పట్టుదల ఏమిటో తెలుసా? నా కూతుర్ని ఇంటర్నేషనల్ సెలబ్రటీస్ సరసకు చేర్చాలని.
24,996
    ఆమె మనసులో ఆనాటి సంఘటన మెదలడంతో మాటలు కరువైనట్టుగా మిగిలిపోయింది.     గదిలోని నిశ్శబ్ధాన్ని చీల్చుతూ టేప్ రికార్డర్ లో మెహదీహసన్ సంగీతం వినిపిస్తోంది.     హృదయతంత్రుల్ని మీటే రసరమ్య సంగీతఝరిలో తడిసిపోతూ ఎంతోసేపు అలాగే వుండిపోయిన కన్య తనెందుకు వచ్చినట్టు అని ప్రశ్నించుకుని సమాధానం దొరక్కపోయేసరికి సిగ్గుతో కుంచించుకుపోయింది.     కనీసం యోగేంద్రయినా మాట్లాడొచ్చుగా?     అతని పరిస్థితీ తనలాగే వుందా?     "ఇంత రాత్రివేళ మీరిలా మా ఇంటిని పావనం చేస్తారని వూహించలేకపోయాను."     యోగేంద్ర మాటలతో ఆమె ఆలోచనలు తెగిపోయాయి.     "ఊహించివుంటే ఏం చేసేవారు? ఇలాంటి ఏర్పాట్లన్నీ నాకు కనిపించకుండా జాగ్రత్తపడేవారా?" బలవంతంగా తల పైకెత్తింది.     "నిజమే, నేను అతిగా గౌరవించే వ్యక్తుల ముందు దోషిలా నిలబడటం నాకిష్టం వుండదు."     అతని మాటలు కన్యకెంతో ఇంపుగా వినిపించాయి.     "అంటే నన్ను మీరు చాలా గౌరవిస్తున్నారని నమ్మమంటారు."     ఆమెకు తెలియకుండానే ఆమె నేత్రాలు అరమోడ్పులయ్యాయి.     "మీరు ఎక్కువగా నమ్మే విషయాలలో ఇదీ ఒకటి అన్నది నా నమ్మకం" అతడి మాటల్లోని చమత్కారానికి మైమరచిపోయింది.     "అలా అయితే యీ నాలుగు రోజులుగా మొహమెందుకు చాటేస్తున్నారు" అంది మనసులోని ఉద్వేగాన్ని కనపడనీయకుండా.     "అది అడుగుతూ ఇప్పుడు మీరెందుకు తల వాల్చుకున్నారు."     అతడి సూటిప్రశ్నకు కన్య బిత్తరపోయింది. తన మనోభావాల్ని అతడు చదివేయగలిగాడన్న ఆలోచన రాగానే ఎంత ప్రయత్నించినా జవాబు చెప్పలేకపోయింది.     "మేడమ్!"     యోగేంద్ర అలా సంబోధించటం ఆమె కెందుకో నచ్చలేదు.     "నిజానికి నాకు ఒంటరితనమంటే చాలా భయం.... అందుకే నలుగురి మధ్య తిరుగుతూ నోటికి వచ్చినట్టు జోక్స్ పేల్చేయాలని ప్రయత్నిస్తుంటాను. ఒకవిధంగా అది నా బలహీనత... అలాంటి నేను యీ నాలుగు రోజులుగా నా చుట్టూ ఓ గిరి గీసుకుని ఒంటరిగా గడపాలని ప్రయత్నిస్తున్నానంటే..." ఆర్ధోక్తిగా ఆగిపోయాడు.     ఏదో చెప్పాలన్న ఉద్వేగం... చెప్పలేని అశక్తత.     "కారణం... ఆనాటి సంఘటన... అఫ్ కోర్స్... యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనే అయినా అది నాలో విపరీతమైన మానసిక సంఘర్షణకు కారణమైందంటే మీరు నమ్మగలరా?" అతడి కంఠం వణికింది మొహంలోని భావాలు కనపడనీయకూడదన్నట్టుగా వెనక్కి తిరిగి కిటికీలోనుండి బయటకు చూస్తూ నిలబడ్డాడు.     "కన్యా! ఎప్పుడూ ఛలోక్తులు విసిరే యోగేంద్ర సీరియస్ గా మాట్లాడటమేమిటి చెప్మా అని ఆశ్చర్యపోకండి. పగలబడి నవ్వే ప్రతివాడి గుండెల్లో వుండేదేమిటో నాకు తెలీదుకాని నా మనసు మాత్రం విషాదానికి పుట్టిల్లు. బహుశా అందుకే మనసారా నవ్వడం చేతకాని నేను అందర్నీ నవ్వించాలని ప్రయత్నిస్తుంటానేమో... జీవితాన్ని ఓడించగల జ్ఞానులు ఏ కొద్దిగానో తారసపడే యీ ప్రపంచంలో ఓడించిన జీవితంతో రాజీపడే వ్యక్తులే యెక్కువ. అందులో నేనూ ఒకడ్ని. మీలాగే నేనూ వివాహితుడ్నే" గుండె గొంతుకడ్డంపడ్డట్టుగా ఆగిపోయాడు.     పరిసరాలను మరిచి తదేకంగా యోగేంద్రనే చూస్తూ వుండిపోయింది కన్య.
24,997
    తన దృష్టిని పరిశోధనల మెడ కేంద్రీకరించాలి. ఊహూ... వద్దు... దీని కన్నా ముందు విశాలీ ఓదార్చాలి... అతనో నిర్ణయానికి వచ్చి లేచి భార్య వున్న పూజ గదివైపు అడుగులు వేశాడు.                                                                             ***     భర్త అడుగుల శబ్దం విని, పూజగదిలో మోకాళ్ళ మధ్య తల పెట్టి ఏడుస్తున్నా విశాలి తలెత్తింది.     నెల మీద కూర్చున్నాడు భరద్వాజ.     "విశాలీ...! నన్ను క్షమించు" అన్నా పదాలతో నీ కడుపు కోతకు ఊరడింపు లభించదు. మన మొదటి రాత్రి నువ్వో మాటన్నావు గుర్తుందా? మనకు పిల్లలు పుట్టకపోతే... ఎలా? అని నేను సరదాగా అడిగిన ప్రశ్నకు నువ్విచ్చిన సమాధానం ఏమిటో తెలుసా... నా కింకా గుర్తుంది విశాలీ..."     "నాకు ఆల్రెడి ఓ బిడ్డ వున్నాడుగా..." అన్నావు. ఆ బిడ్డని నేనే అన్నావు... అప్పుడు చెమర్చిన కన్నీటి చెమ్మా యింకా పదిలంగా నా గుండె గదిలోనే వుంది. చిన్నప్పుడు అమ్మకు దూరమయ్యాను. ఇప్పుడు బిడ్డకు దూరమయ్యాను. నిన్నూ, నీ బిడ్డకు దూరం చేశాను. అందుకు నివ్వేశిక్ష విధించినా స్వీకరించాడనికి సిద్దంగా ఉన్నాను..." అతను ఆమె ఓడిలో తల పెట్టి మాట్లాడాసాగాడు.     అప్పుడు వర్షించింది ఆమె కంటి ఆకాశంలో నుండి కన్నీటి మేఘాలు కుమ్భావ్రుష్టియి...     మెల్లిగా కళ్ళు తుడుచుకుని వంగి భర్త నుడురును చుంభించింది. ఆమె మనసు అర్దమైంది. తన బాధ చూడలేక తల్లడిల్లుతొన్న భర్త మనసు అవగతమైంది విశీలికి!     "ఏవండి... దూరమైనా బిడ్డా మీద మమకారమే తప్పా, మీ మీద ద్వేషంలేదు, తల్లి ప్రేమతో, మీ భర్త మనసును అనుమానించాను. జరిగిపోయిన విషాదం వదిలేయండి. మీలోని సైంసిస్ట్ నిద్రలేపండి. మళ్ళా  పరిశోధన లకు ఉపక్రమించండి..." అంది విశీలి మనస్పూర్తిగా.     అతని మనసులో చిత్రమైన, అద్బుతమైన స్పందన, భర్త మనసేరిగే భార్య దొరకడం కన్నా ఆ మేధావికి మరో గొప్పా విజయం ఏముంటుంది?                                                    ***     "విశాలీ...! నా లోని సైంసిస్ట్ భరద్వాజ ను కన్నకొడుకుతోపాటే పాతిపెట్టీశాను..."     "శుక్రవారం పూట అవేంమాటలండీ..." అంది నొచ్చుకుంటూ విశాలి.     "నిజం విశాలీ...! నేను సైంసిస్ట్ ని కాకపోయుంటే, నా కన్నా కొడుక్కివున్న 'కన్ను' ని చూసి ఏదోసృష్టివిచిత్రం అని సరిపేట్టుకునేవాడిని.     నేను సైంసిస్ట్ ని కాకపోయుంటే, నా వెంట ఆ కరంజయా పడేవాడుకాదు. ప్రాణభయంతో మనం పారిపోయేవాళ్ళం కాదు. అనుక్షణం భయం గుప్పిట్లో బ్రతకటానికి కారణం నా వృత్తే.     ఇన్నాళ్ళూ నా కిష్టమైన వృత్తి కోసం నిన్ను నిర్లక్ష్యం చేశాను. నా ప్రయోగాలు... నా పరిశోధనలు... ఇవే నా ప్రపంచంగా బ్రతికాను. చివరకు కానేసం బిడ్డను చూసుకుని బ్రతికే అవకాశం కూడా నీకివ్వలేదు.     దేశం కోసం ఎన్నో పరిశోధనలు చేయాలనుకున్నాను. ఈ విషయమే  గుర్తుచడం లేదు. యిది ఈ ప్రభుత్వాన్ని నిందించటం కోసం కాదు. నాకు నేను ఆత్మ విమర్శ చేసుకుని, ఓ నిర్ణయం తీసుకోవాడానికి అంటోన్నా మాటలు.     నీకు బాధాకరమైన మరో సిరీజయన్ చేయాల్సి వచ్చినప్పుడు... డాక్టర్ చెప్పిన మరో షాక్ న్యూస్ ఏమిటో తెలుసా... నీకు... నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదు. భవిషత్తు లో మనం అమ్మా నాన్నలం కాలేము..."     ఒక శరాఘాతం హృదయానికి తగిలినట్టు...     ఒక విద్వంసం గుండెలో వేనవేల ప్రకంపనాలు సృష్టించినట్టు...     భర్తవైపు విషణ్ణవదనంతో చూసింది విశాలి.     "అందుకే విశాలీ... యిక నుంచి నేనే నీ బిడ్డను అనుకో... ఓ మామూలు భర్తగా నీతో గడుపుతాను. ప్రభుత్వం గుర్తించని ఈ సైంసిస్ట్ వృత్తి నా కొద్దు నివ్వూ, నేనూ...     ఏ చిన్నా ఉద్యోగమో చూసుకుంటాను. ఇది నా నిర్ణయం... తిరుగులేని నిర్ణయం..."     భర్తవైపు విస్మయంగా చూసింది.     పరిసోధనే ప్రపంచంగా బ్రతికిన ఆ వ్యక్తి...     ల్యాబ్ కు తాళం వేశాడు. అది ఎటువంటి పరిస్తితుల్లోనూ తెరవకూడదనుకున్నాడు.     భర్తను ఓదార్చే ప్రయత్నంలో, కన్నా తీపి కోతను దిగమింగుకుంది. కానీ పాతికేళ్ళ తర్వాత, మళ్ళీ ఇదే సమస్య ఆ ఇంటిని వెనవేలల ప్రకంపనలను సృష్టిస్తుందని వూహించలేదు విశాలి.                                                   ***     న్యూఢిల్లీ...     కన్నాట్ ప్లేస్      మెయిన్ సర్కిల్ లో ఓ ఖరీదైన బిల్డింగ్ లోకి కారు ఎంటరయింది.     మెయిన్ గేటు దగ్గర సెంట్రీ కారు ఆపాడు.     "పాస్ వర్డ్ ప్లీజ్.." అడిగాడా సెంట్రీ.     "ఫిన్ ఫోర్ టు త్రీ..." చెప్పాడు డ్రైవర్.     గేటు తెరిచాడు సెంట్రీ.     కారు లోపలకి వెళ్ళగానే గేటు మూసుకుంది.     ఆ ప్రహరీలో కొంతమంది అయూధాలతో కాపాలా కాస్తున్నారని బయట ప్రపంచానికి తెలిసే అవకాశం లేదు.     బ్లాక్ డ్రెస్ లో వున్నరంతా.     కారు ఆగగానే డ్రైవర్ వచ్చి బ్యాక్ డోర్ తీశాడు. కారులో నుంచి దిగాడు కరంజయా. అతనితోపాటే లల్లూరామ్.     ఇద్దర్నీ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరకి తీసుకువెళ్ళిమెటల్ డిక్టేటర్ దగ్గర నిలబెట్టారు సేక్యూరీటి వాళ్ళని చెక్ చేసి, వాళ్ళిద్దరి దగ్గరా ఆయుధాలు లేవని కన్ ఫార్మ్ చేసుకుని లోపలకి పంపించారు.                                                    ***     "వేల్ కమ్ ప్రెండ్ వేల్ కమ్" రివాల్వింగ్ చెయిర్ లో గిర్రున తిరుగుతోన్న ఖాన్ ఆగి అన్నాడు.     "ఖాన్ సాబ్... ప్రైమినిష్టర్ దగ్గర కూడా ఇంత టైట్ సేక్యూరీటి లేదు. అయినా మేము నీ దోస్త్ లం... మాక్కూడా ఈ ఫార్మాలటీ స్ అవసరమా?" వస్తూనే అడిగాడు కరంజయా.
24,998
          పదిహేను రోజులు పోయాక గోవిందరావు తిరిగివచ్చి మామకూ, పెళ్ళానికీ అమెరికాలో తానేం చూసిందీ వల్లించేస్తున్నాడు. అతన్ని అలసిపోయేదాకా వాగనిచ్చి మామ ఉన్నట్టుండి కాలరు పట్టుకున్నాడు. నిజం చెప్పమని నిలదీశాడు. గోవిందరావులో ఓ విశేషం వుంది. పరిస్థితి పీకలమీదికి వచ్చినా సరే అడ్డంగా దబాయించి పారేస్తాడు. అతను అమెరికానుంచే వచ్చానని మరింత గట్టిగా దబాయించేస్తున్నాడు. మామ ఏరోడ్రమ్ ఆఫీసర్లని బ్రతిమాలి పిలిపించాడు. వాళ్ళే అబద్దమాడారా అన్నంత ధీమాగా వాళ్ళముందే, వాళ్ళు తెల్లబోయేటట్లుగా దులిపేస్తున్నాడు గోవిందరావు.         అతను నోటితో ఒప్పుకోకపోయినా అతని బండారం బయటపడి పోయింది. మామ కేసు పెడతానన్నాడు. కూతురు అయిందేదో అయిపోయింది. ఏడాది పాటు కాపురం కూడా అఘోరించాను కదా అని ఏడ్చింది. చివరకు గప్ చుప్ గా ఊరుకున్నారు.         అదీ గోవిందరావు పూర్వకథ.         అతనిభార్య ఎప్పుడూ పుట్టింట్లోనే వుంటుంది. అతను ఏవేవో ఉద్యోగాలు చేస్తున్నానని చెబుతూ ఊళ్ళు పట్టుకుని తిరుగుతూవుంటాడు.         విమలవాళ్ళ తరపు చుట్టం ఇంట్లో దిగగానే ప్రభావతికి రిలీఫ్ ఇచ్చినట్లుగా వుంది.         తన అన్న ఇంట్లో వుంటుంటే ఆమెకేదో బరువుగా ఉన్నట్లుండేది. ఇప్పుడు ఇంటికి బరువు యిబ్బుడై, ఆమెకు మాత్రం బరువు తీసేసినట్లుగా వుంది.         గోవిందరావు అందరితోనూ చనువుగా మాట్లాడతాడు. కుమార్ తో పెద్ద పరిచయం లేకపోయినా సంవత్సరాలనుంచి పరిచయం ఉన్నట్లుగా అతన్ని పట్టుకుని ఊపేస్తున్నాడు. ఇహ హరిని ఒక్కక్షణం వదిలిపెట్టకుండా అతను ఎక్కడికి పోతే అక్కడికి, అతని స్నేహితుల ఇంటికి, అతన్తోపాటు పేకాటకి, పార్టీలకు అంటిపెట్టుకుని పోతూ అతనికి జిడ్డులా తగులుకుని వున్నాడు.         ఇదివరకు కుమార్ ని చూస్తే హరికి జాలిగా వుండేది.         ఇప్పుడు హరిని చూసి కుమార్ కి సానుభూతిగా వుంది. తను పడుతున్న బాధ ఇంకొకరు పడటంతో కుమార్ కి తృప్తి, ఆనందంకన్నా బాధే ఎక్కువగా వుంటుంది.         అదలావుంచి భాస్కరం, గోవిందరావు ఫ్రెండ్సయిపోయారు. ఇద్దరూ చెట్టాపట్టాలు వేసుకుని తిరగేస్తున్నారు. వాళ్ళమాటల్లో ఎవరికంటే ఎవరు గొప్పవారో తేల్చుకునే ప్రయత్నం ఎక్కువగా కనిపిస్తూ వుంటుంది. ఒకరికొకరు తీసిపోని విధంగా ఇద్దరూ అనర్గళంగా మాట్లాడేస్తున్నారు.                                                   * *  *         తను కారు కొనాలి.         కుమార్ కి ఈ రంధి ఎక్కువయిపోయింది. కారు కొనుక్కోవాలని అభిలాష లేకపోయినా ఫర్వాలేదుగానీ, అనుక్షణం ఆ కోరికను పెంచుకుంటూ, దాన్నుంచి దూరంగా వుండటం రంపపుకోతగా వుంటుంది.         అతనికి కోరిక-జీవితంలో థ్రిల్ నంతా అనుభవించెయ్యాలని కారు కొనాలి. పిల్లల్ని కారులో స్కూలుకు పంపిస్తూ వుండాలి. ఇంకా ఎన్నో అందమైన ఆలోచనలున్నాయి. తను కారు డ్రైవ్ చేసుకుంటూ ఎక్కడికి పడితే అక్కడకు, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోతూ వుంటాడు. ఆదివారం సాయంత్రాలు భార్యనూ, పిల్లల్ని తీసుకుని పిక్నిక్ కో, షికారుకో తీసుకెళ్ళిపోతూ వుంటాడు.         "మీరు కారుకొంటే నాకు డ్రైవింగ్ నేర్పిస్తారా?" అంది ప్రభావతి.         "ఓయస్" అన్నాడు కుమార్.         "ఇప్పుడలాగే అంటారు. తర్వాత ఆడవాళ్ళు, మీకెందుకు?" అని తప్పించుకుంటారు.         "ఉహు, అనను. నువ్వు డ్రైవింగ్ నేర్చుకోవటం నాకూ మంచిదే."         తనెలాగూ కొత్త కారు కొనలేడు. సెకండ్ హ్యాండ్ ది తప్పనిసరి అవుతుంది.         కుమార్ ఆ ప్రయత్నంమీద వున్నాడు.         తెలిసినవాళ్ళందరికీ చెబుతున్నాడు. అతని దగ్గరకు కారు బ్రోకర్సు వస్తున్నారు. వాళ్ళతో వెళ్ళి ఏవేవో కార్లు చూస్తున్నాడు.         చివరకు అతనికి ఓ కారు నచ్చింది.         ఫియట్ కారు. ఆరేళ్ళక్రితం మోడలు. అతనికి డ్రైవింగువచ్చు. ఎమ్.బి.బి.ఎస్. చదువుకుంటున్న రోజుల్లో నేర్చుకున్నాడు. తెలిసివున్న మెకానిక్ ను తీసుకెళ్ళి చూపించారు. అతను దాన్ని ఏవో పరీక్షలుచేసి బాగానే వుందని సర్టిఫికెట్ ఇచ్చాడు. సింగిల్ ఓనరు కారుకాబట్టి ఫర్వాలేదని భరోసా ఇచ్చాడు. కారు ఓనరు పద్నాలుగువేలు చెబుతున్నాడు. కుమార్ కు బేరాలు చెయ్యటమూ అదీ రాదుగానీ తనదగ్గర అంత డబ్బులేదు. అతని తరపున అతని స్నేహితులు బేరం చేస్తున్నారు. చివరకు పదమూడువేలకు ఒప్పందం కుదిరింది. ఒక వెయ్యి ఎక్కడయినా అప్పు తీసుకోవచ్చుననుకున్నాడు.         అప్పుడు తోచింది కుమార్ కి, ఈ సంగతి తానిన్నాళ్ళూ తండ్రికి చెప్పలేదని. చెప్పవలసిన అవసరం వుందా లేదా అని ఆలోచించాడు. చెప్పకపోతే ఆయన నొచ్చుకుంటాడనిపించింది.     "నేను కారు కొంటున్నాను" అన్నాడు చివరకు.         రంగారావుగారు ఏమిటి, ఎక్కడా ఇవన్నీ వాకబుచేశారు. చివరకు "ఇప్పుడు కారు కొనుక్కోవటం అంత అవసరం కాదేమో ఆలోచించు. అంతకన్నా ఉపయోగకరమైనది చేయవచ్చునేమో చూడు" అన్నారు.           "కారు కొనుక్కోవటం నేనవసరమైనదనే అనుకుంటున్నాను."         "నువ్వనుకుంటున్నావనుకో,  నీ వయస్సులో నాకు కారులేదు. నేను చాలాకాలం సైకిళ్ళమీద తిరిగాను. సరే, ఆ తరువాత గుర్రబ్బళ్ళూ, రిక్షాలూ.....జాగ్రత్తగా ఆలోచించు....."         కుమార్ ఆయనతో ఎక్కువగా తర్కించలేదుగానీ ఆ రోజే వెళ్ళి ఎడ్వాన్స్ ఇచ్చివచ్చాడు. ఆ రాత్రి రంగారావుగారు భార్యదగ్గర కొడుకు తొందరపాటు గురించి మండిపడ్డాడు.         మరునాడుకూడా కుమార్ తో "సెకండ్ హ్యాండ్ కార్లు కొనడం చాలా రిస్క్ ఎడ్వాన్స్ ఇస్తే ఇచ్చావు, ఇంకొకసారి ఆలోచించు" అన్నాడు.         కుమార్ ఏమీ మాట్లాడలేదు.         రెండురోజుల్లో కుమార్ కారు తీసుకుని ఇంటికి వచ్చేశాడు.         ఇంట్లో వాళ్ళలో కారుని మొట్టమొదట చూసినవాడు గోవిందరావు.         గేటులో కారాగివుంటే బయటకు వచ్చాడు.         కుమార్ కార్లోంచి క్రిందకు దిగుతున్నాడు.         "ఏమండోయ్! ఇదేనేమిటి కారు? ఎంత అయిందేమిటీ?" అన్నాడు.         కుమార్ జవాబు చెప్పాడు.         "అబ్బా! చాలా ఎక్కువ పెట్టారండీ. సిక్స్ టీ టూ మోడలా! సిక్స్ టీ త్రీ మోడలా?" అంటూ కారుచుట్టూ ప్రదక్షిణలు చేస్తూ తన విమర్శనాత్మక నేత్రాలతో పరీక్షించసాగాడు.         "కలర్ బాగా ఫేడయింది. డోర్సు బాగాలేవు. మీరు కొనటానికి వెళ్ళినప్పుడు నన్ను తీసుకెళ్లాల్సింది. ఏమయినా మీరు బోల్తా కొట్టారండీ" అంటూ వ్యాఖ్యానాలు చేయసాగాడు.         కుమార్ కి ఒళ్ళు మండిపోతుంది. ఏమీ అనలేక దిగమ్రింగి ఊరుకున్నాడు.         కొంతమంది ఎప్పుడూ అశుభం పలుకుతూ ఉంటారు. అవతలివాళ్ళు నొచ్చుకుంటారన్న జ్ఞానంకూడా వాళ్ళకుండదు.         ఎంతో ముచ్చటపడి కొత్తబట్టలు కుట్టించుకుంటే అవి చూస్తూనే "ఏదీ! అటుతిరుగు, ఇటుతిరుగు" అని అడక్కుండానే మొదలుపెట్టి "ఎవడు బాబూ ఇది కుట్టింది?" అనో "ఎక్కడ తీశావు బాబూ ఈ బట్టలు?" అనో వ్యాఖ్యానాలు మొదలుపెడతారు.         వాళ్ళకు ఏదీ నచ్చదు.         గోవిందరావుకూడా ఆ కోవకు చెందినవాడే. వచ్చినరోజునే బాత్ రూమ్ లో వాటర్ హీటర్ ను చూసి "ఉహుఁ ఇది కొన్నారూ! ఈపాటికి షాక్ కొడుతూ వుండాలే....ఏమిటి కొట్టటల్లేదా? కొన్నాళ్ళలో తప్పకుండా కొడుతుంది" అంటూ మొదలుపెట్టాడు.         అంతేకాదు హరితోబాటు బయటకు వెళ్ళినప్పుడు హరి ఏ షాపింగ్ కనో వెళ్తే అతనెంతో మోజుపడి కొనుక్కుందామనుకున్నది "అబ్బెబ్బే! అదంతా చెత్త సరుకండీ" అంటూ అతని టేస్టు వట్టి పనికిరానిదిగా తేల్చి, ఇంకో రకంది "ఫస్టుగా వుంటుంది" అని మెచ్చుకుంటూ హరికి ఇష్టం లేకపోయినా బలవంతంగా కొనిపించేవాడు.
24,999
    రాధమ్మగారు అసలే చాలాకాలం నుంచీ రోగంతో తీసుకుంటోంది. భర్త మరణించినప్పటినుంచీ, ఆ దిగులుతో కొంతా, కూతురిమీది బెంగతో కొంతా మరీ శుష్కించి పోసాగింది. ఒకనాటి ఆమె సౌందర్యం ఇప్పుడా శరీరం మీద రేఖా మాత్రంగా నన్నా నిలిచిలేదు.     చెల్లెల్ని గురించి యీ సందేహమే సత్యమూర్తికి కలిగింది. కాని అతను దాన్ని గురించి అంత తీవ్రంగా ఆలోచించలేదు. "అలాంటి బండ మనసు కాబోలు" ఆనుకుని ఊరుకున్నాడు.                                             *    *    *     హడావుడి అంతా క్రమంగా అంతరించసాగింది. వీలున్నన్నాళ్ళు కూర్చుని యిహా పనులు వున్నాయంటూ వచ్చిన చుట్టపక్కాల్లో చాలా భాగం నిష్క్రమించారు. కొంతమంది ఇప్పుడిప్పుడే వెళ్దామా వద్దా అన్న అస్పష్ట దశలో వున్నట్లు కనిపించింది. బలరామయ్యగారి జాతకం ఏమిటో గాని ఆయనకున్న బంధువులంతా బొత్తిగా అర్ధశూన్యులు. అందుకని ఇక్కడే బాగుందని కొద్దిమంది కదలకుండా వుండటానికి దృఢంగా నిశ్చయించుకున్న ఛాయలు గోచరించాయి. కాని వీళ్ళందర్నీ పట్టటానికి ఒక వైపునుంచి వీరభద్రం, మరోవైపు నుంచి రామక్రిష్ణయ్యగారూపూనుకున్నారు. ఇద్దరూ మొహమాటమంటే తెలియని వ్యక్తులు. దాడి నిర్ధాక్షిణ్యంగా జయప్రదంగా జరిగింది. జీవితంలో డక్కాముక్కీలు తిని, ఇలాంటి అనుభవాలతో తల నెరిసిపోయివున్న ఒకరిద్దరు వృద్దులు ఈ దండయాత్రను మొదట్లో లెక్కచేయక ముభావంగా ఊరుకున్నట్లు లక్షణాలు కనిపించినా, ఎదుటి పక్షంవాళ్ళు సర్వశక్తులూ వినియోగించి విజ్రుంభణకు ఉపక్రమించేసరికి  ఎట్లాగో సత్యమూర్తిని కలుసుకుని, "నాయనా వెళ్ళివస్తాం. స్వర్గంలో వున్న ఆ మహనీయుని ఆత్మకు శాంతి కలుగగాక. దేముడు నీకు..." అని ఇలాంటి ఆశీర్వచనాలు అప్పచెప్పి చల్లగా నిష్క్రమించారు.     ఇహ తనకూ ఉద్వాసన తప్పదని గ్రహించి మొదట్లోంచీ వరుసలు కలుపుతూన్న ఓ తల్లీ, తన పదహారేళ్ళ కూతుర్ని పిలిచి "బావకు చెప్పకుండా వెళ్ళిపోతే అతను ఏమయినా అనుకోడుటే వెర్రిమొహమా! పో. పోయి సెలవు తీసుకొనిరా" అని మందలించి పంపింది.     ఆ అమ్మాయి గుమ్మం దగ్గరకువచ్చి తారట్లాడటంచూసి సత్యమూర్తి తలయెత్తి "ఏం కావాలి?" అని ప్రశ్నించాడు నెమ్మదిగా.     ఆ అమ్మాయి సిగ్గుపడుతూ, కళ్ళు క్రిందకువాల్చి "అమ్మ వెళుతున్నామని చెప్పమంది" అన్నది.     "మంచిది" అన్నాడు సత్యమూర్తి.     ఆ అమ్మాయికి మళ్ళీ ఏమి మాట్లాడాలో తోచక కాసేపు తటపటా యించి "మళ్ళీ యిప్పట్లో రామేమో" అన్నది గోముగా.     "పోనీ" అన్నాడు అతను.     పాపం మరీ సందిగ్ధావస్థ వచ్చిందా అమ్మాయికి. కొంచెం బెదిరింది కూడా. అయినా ఎలాగో లేనిపోనీ నవ్వుతెచ్చుకొని "చెప్పేటందు కేమీ లేదా?" అంది.     "ఏముంది?" అన్నాడు అతను.     చేసేదిలేక ఆ పిల్ల మౌనంగా అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. సంగతి తెలుసుకొని తల్లి కూతుర్ని తిట్టిపోసింది. "చవట మొహమా! ఏబ్రాసీ, ఆకర్షించే తెలివితేటలు లేకపోతేపోయె. కనీసం రైలుఖర్చులన్నా గుంజడం చేతకాకపోయె..." అని.     మొత్తంమీద ఒకరు తర్వాత ఒకరు చుట్టాలమంటూ చెప్పుకొనివచ్చిన వాళ్ళంతా నిష్క్రమించక తప్పలేదు.     ఇల్లు సొంత మనుషులతో మిగిలింది.                                                                                           8     రాత్రి ఎనిమిది దాటింది. ఇల్లంతా అలికిడి లేనట్లు నిశ్శబ్దంగా ఉంది.     సత్యమూర్తి అద్దంవైపునుండి ప్రక్కకితిరిగి, కిటికీదగ్గరికి వచ్చి నిల్చున్నాడు.     "అవును, నేనే. ఇలా అవుతోంది నేనే" పదే పదే ఘోషిస్తోంది మనసు.     ఉష తనకు రాసిన జవాబును ప్రత్యుత్తరం ఇన్నాళ్ళూ ఎందుకివ్వలేదు అని ప్రశ్నించుకుంటున్నాడు. సరయిన సమాధానము కనబడదు. తికమకగావుంది. ఉష ఇప్పుడు కలలోని వస్తువుగా, లీలగా పొడగట్టుతోంది.     అతని ఉత్తరం అందిన వెంటనే ఆమె జవాబు రాసింది.     మూర్తిగారూ!     మీరు అభిమానంతో రాసిన ఉత్తరం అందింది. మీరు వెళ్ళిన మరునాడు అన్నయ్య వచ్చాడు. మిమ్మల్ని కలుసుకోలేకపోయినందుకు ఎంతగానో బాధపడ్డాడు. మీ గదికివెళ్ళి సామానులన్నీ ఇక్కడకు తెచ్చేసి గది ఖాళీ చేసేశాము. మీ అనవసరపు సామానులతో మా యిల్లు సగము నిండిపోయింది. (నిజమనుకొని కంగారుపడేరు. అతిశయోక్తి) మీ నాన్నగారికి వంట్లో ఎలావుంది? ఈపాటికి నిమ్మదించి ఉంటుందనుకుంటాను. అక్కడ మీరేం చేస్తున్నారు? ఎట్లా తోస్తోంది? మీరు వెళ్ళినప్పటినుంచీ