SNo
int64
0
25.8k
text
stringlengths
39
23.5k
24,700
    పేపర్లలో ఈ వార్త రకరకాలుగా వ్యాఖ్యానింపబడింది. ఒక కార్పొరేషన్ నుంచి ఇంత సరుకు రోజూ దొంగిలింపబడుతూ వుంటే ఏమి చర్యలు తీసుకుంటున్నారు అని దాదాపు అందరూ ప్రశ్నించారు.     రెండో పత్రికలో పడిన వ్యాసం అడవులకు సంబంధించిన మాఫియా గురించి....     నేషనల్ సెక్యూరిటీ ఆక్ట్ క్రింద అరెస్టు చేయబడి, మళ్ళీ 48 గంటల్లోగా విడుదల కాబడిన 'జం-గి-ల్ --కా--రా-జా, మిస్టర్ 'కె' గురించిన వ్యాసం అది- జనవరి 12న అరెస్టు కాబడిన ఈ రాజా, ముఖ్యమంత్రి స్వయంగా పూనుకోవడం వల్ల 14వ తేదీన విడుదల చేయబడ్డాడు. కొన్ని పల్లెల్లో వేర్లు చివరి వరకు వ్యాపించిన ఇతడి పలుకుబడికి భయపడి, ఇతడితో శత్రుత్వంవల్ల మళ్ళీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాదేమోనని భావించి, అధికారిపార్టీ ఇతడి విడుదలకి స్వయంగా తొందరపడింది. 1982లో ఇతడి ఇంటిమీద  దాడిజరిపినప్పుడు అడవుల్లో ఉపయోగించే ఆయుధాలు, పరికరాలు లక్ష రూపాయిలకి పైగా దొరికినప్పుడు ఇతడి గురించి చర్చ అసెంబ్లీలో వచ్చింది! అడవిని పరిరక్షించే అధికారులతో దాదాపు యుద్ధ ప్రతిపాదిక (Forest War)లో జరిగిన ఘర్షణలో 1975 నుంచి 1982 మధ్య 23 మంది మరణించారని, 110 మంది అధికారులు తీవ్రంగా గాయపడ్డారని అంచనా! తమ జీవితాలకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని ఈ ఉద్యోగులు స్ట్రిక్ చేయడం, ఈ రాజా ఆగడాలకు పరాకాష్ట. అయినా ఈ జంగిల్-కా-రాజాని ఎవరూ ఏమీ చేయలేకపోయారు. ఈ విధంగా, పతి సంవత్సరమూ కోటి రూపాయిలపైగా కలప దొంగతనం చేయబడుతుందని ప్రభుత్వం వప్పుకుంది. కాదు 50 కోట్లు అని ప్రతిపక్షాలు, అసలు అంకె 700 కోట్లు అని ఫారెస్ట్ అధికారులు అంటారు. అసలు అంకె రాజా (మిస్టర్ కె.) కి మాత్రమే తెలుసు.     (వ్యాసపు ఆ తరువాత భాగం- హిమాచల్ ప్రదేశ్ ఫారెస్ట్ మాఫియా గురించి చర్చించింది).     పదమూడు సంవత్సరాలు (1967-77;1982-85) ఎమ్మెల్యేగా వున్న కే.ఆర్. సి. - 1985 డిసెంబర్ నెలలో ఒక రోజు తన ఇంటిమీదకు అకస్మాత్తుగా దాడిచేసిన అధికారుల్ని చూసి నిశ్చేష్టుడయ్యాడు. అతడి ఇంటిని వారు సెర్చి చేస్తుంటే నిస్సహాయంగా చూస్తూ వుండిపోయాడు. పదమూడేళ్ళు ప్రజాప్రతినిధిగా పనిచేసిన కే.ఆర్. సి- సెక్షన్ 379 (దొంగతనం), 420 (మోసం), 120 (కుట్ర) క్రింద అరెస్టు చేయబడినప్పుడు- తన నిర్దోషిత్వం గురించి ప్రజలకు చెప్పవలసిందిగా మాజీ ముఖ్యమంత్రిని కోరాడు (ఒక రకంగా హెచ్చరించాడు).     ముఖ్యమంత్రి చాలా ఇరుకున పడ్డాడు. అప్పటికే కలప కుంభకోణంలో పాత్ర వుందని అతడు పదవి నుంచి తొలగించబడ్డాడు! దానిమీద ఈ హెచ్చరిక పులిమీద పుట్రలా వచ్చి పడింది. ఎటూ తోచక -కొన్ని నెలలు ఆలోచించి చివరికి -కే .ఆర్ .సీ. -మాఫీయా లీడర్ కాదని పత్రికా ప్రకటన ఇచ్చాడు.     అలా ప్రకటించిన మాజీ ముఖ్యమంత్రి- ఆ తరువాత ఒక రాష్ట్రానికి గవర్నర్ ఎలా అయ్యాడు? ఏప్రిల్ 1985లో సిమ్లా కార్టన్ బిల్డింగ్ లో వున్న C.I.D ఆఫీసు కాలిపోవడం, రికార్డులు మంటలపాలవడం కేవలం యాదృచ్చికమేనా! కలప మాఫియా కేసుల్ని పరిష్కరించి, దోషుల్ని శిక్షించడానికి ఏర్పరచబడిన స్పెషల్ కోర్టులు - 1983 నుంచీ ఎన్ని కేసుల్ని పూర్తిచేశాయి? వాటికి కేటాయించబడిన 80 కేసుల్లో ఎన్ని పూర్తయ్యాయి? ఒక్కటి కూడా పూర్తికాకపోవడానికి కారణం ఏమిటి?     ఈ విధమైన ప్రశ్నలతో వెలువడిన ఆ వ్యాసం ఒక ఆటంబాంబులా పేలింది. అప్పటి వరకూ న్యూస్ పేపర్లు చదవనివారు కూడా ఆసక్తి చూపారు. ఆ వ్యాస కర్త పేరు 'సలీం శంకర్' అని వుండడం పోలీసు వర్గాల్ని కూడా  చకితుల్ని చేసింది.     సలీం శంకర్ గురించి, వసంత్ దాదా గురించి తెలిసిన వారు వారిద్దరికీ చెడిందనే అనుకున్నారు. రూమర్లు వ్యాప్తిచెందడానికి లాజికల్ గా  కారణాలు వుండవు. దాదాకీ శంకర్ కీ చెడింది. అంతే వార్త.....     హైద్రాబాద్ సర్కిల్స్ లో ఈ వార్త మరింత దావానలంలా వ్యాపించింది. చిన్నచిన్న గుండాలకి, చిన్న తరహా రౌడీలకి, కాకా హొటళ్ళల్లో ఇదే చర్చ అయింది.     మూడో వ్యాసం మరింత లోతుకి వెళ్ళి వివరాల్ని బయటపెట్టింది.     ప్రపంచంలో మత్తు పదార్థాలు అయిదు రకాలు. హెరాయిన్, నల్లమందు, మార్ఫిన్, హషిష్, మాన్ డ్రెక్స్..... వీటన్నింటిలోకీ ఖరీదైంది హెరాయిన్. దీన్ని స్మగుల్ చేయడంలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్అథారిటీస్ ఆఫ్ ఇండియా ఉద్యోగస్తులకున్న సౌకర్యం గురించి ఆ వ్యాసం చర్చించింది. యానస్ లో దాచుకుని ప్లాస్టిక్ పాకెట్స్ లో స్మగుల్ చేసే ట్రెయినింగ్ పొందిన వారి పేర్లు ఉదాహరణంగా  ఇచ్చింది. ఆ క్రితం రాత్రే వాళ్ళు అరెస్టు కాబడి ఎన్నో సంవత్సరాలుగా ఈ పనిని నిర్వహిస్తున్నట్టు అంగీకరించారని పోలీసు అధికారులు ధృవీకరించారు. ఒక కెనేడియన్ సంస్థ- భారతదేశం నుంచి కొన్ని లక్షల విలువచేసే పంపుసెట్లు దిగుమతి చేసుకోవడానికి కారణం ఏమిటి? పంపుసెట్ల మధ్యలో హషిప్ పెట్టి ఒక తరహా రంగు వేస్తే - ఎయిర్ పోర్ట్ అధికారుల ఎక్స్-రే పరికరాలకు అది అందదనేగా! ఇంత చిన్న  విషయం అధికారులకు తెలీదా? తెలిసీ తెలియనట్టు వూరుకుంటున్నారా?     విమానంలో ప్రయాణం చేస్తూ ఒక స్త్రీ అకస్మాత్తుగా చచ్చిపొతే మరణ కారణం ధృవీకరించకుండా ఆమెను- అరగంటలో బంధువులకు(?) ఎలా అప్పగించారు? అలా అప్పగించిన 12 గంటల్లో ఆమె శరీరం ఛిద్రమై శ్మశానంలో పాతివేయబడితే- ఏ ఒక్కరికీ అనుమానం రాలేదా? తన శరీరంలో "దాచుకుని" ఆమె  తీసుకువెడుతున్న ప్లాస్టిక్ హెరాయిన్ ప్యాకెట్టు పొరపాటున బ్రద్ధలై ఆమె మరణించి వుండవచ్చనీ, ఆమె శరీరంలో ఇంకా కలవకుండా వుండిపోయిన హెరాయిన్ 'మిగులు' పదార్ధంకోసం ఆమె శరీరాన్ని చీల్చి స్మగ్లర్లు వెతికారనీ ఏ ఒక్కరికీ అనుమానం రాలేదా? ఓడల్లో పంపబడే దినపత్రికల కాగితాల సందుల్లో మాండ్రెక్స్ పొరలు వుంటాయని నిజంగా మన అధికారులకు తెలీదా?     ఈ విధంగా సాగింది ఈ వ్యాసం. ఈ వ్యాసాన్ని ప్రచురించిన దినపత్రిక తెల్లవారు ఝామున నాలుగింటికి బయటకొస్తుంది. ఆ రాత్రే-రాత్రి పదకొండింటికి ఒక విమానాశ్రయపు అధికారి ఇంటిమీద దాడిచేసి, ఎగుమతికి సిద్ధంగా వున్న లక్ష రూపాయిల విలువ చేసే హెరాయిన్ ను శ్రీకాంత్ స్వయంగా పట్టుకున్నాడు.     పత్రిక ఎడిటర్ కాస్త  స్వతంత్రం తీసుకుని, తమ పత్రికాఫీసుకి అందిన వార్తవల్లే పోలీసు అధికారులు ఇలా దాడి జరపగలిగారని ఒక బాక్స్ ఐటమ్ ను ఆ వ్యాసం మధ్య  ప్రచురించాడు.     దాంతో ఆ వ్యాసానికి విపరీతమైన ఆకర్షణ ఏర్పడింది.     దేశంలో ఇంత ఘోరం జరుగుతూ వుంటే (ఆ ఘోరం ఆరోజే ప్రారంభ మయినట్టు) ఇంతకాలం ప్రభుత్వం ఏమి చేస్తుందని అందరూ అనుకోసాగారు.     నాలుగో పత్రికలో పడిన వ్యాసం- తుపాకుల గురించి.     మొదటి వ్యాసం దక్షిణ భారతదేశం (ఆయిల్ మాఫియా), రెండో వ్యాసం మధ్యప్రదేశ్ (ఫారెస్ట్), మూడోది హెరాయిన్ (ఢిల్లీ - బోంబే) గురించీ అయితే ఈ నాలుగో వ్యాసం గుజరాత్ గురించి. స్ట్రయికుల్తోటి, అల్లర్ల తోటీ  అనుక్షణం సతమతమవుతున్న ఆ రాష్ట్రపు అరాచక శక్తులకు ఆయుధాల్ని ఎవరు సప్లై చేస్తున్నారు?     "లైసెన్సు వున్న ప్రతీ తుపాకీకి గుజరాత్ లో లైసెన్సు లేని తుపాకులు పది వున్నాయి. పట్టుబడి ప్రతి తుపాకీకి- పట్టుబడని తుపాకులు ఇరవై వున్నాయని అంచనా".     అన్న హెడ్డింగ్ తో ప్రచురింపబడింది ఆ వ్యాసం.     మహారాష్ట్ర, రాజస్థాన్ నుంచి గుజరాత్ లో ప్రవేశించే రైళ్ళకు సంబంధించిన గార్డులు, ఇంజిన్ డ్రైవర్లు చిన్న చిన్న  పాకెట్లలో ఈ  ఆయుధాల్ని రవాణా చేస్తున్న విషయం నిజంగా రైల్వే పోలీసులకు తెలీదా? -అంటూ ప్రతిపక్షం నిలదీసి వేసిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి ఏం సమాధానం చెపుతారు? గాంధి జన్మస్థానమైన పోర్ బందర్ లో దాదాపు ఇరవై గృహ పరిశ్రమలున్నాయని, ఒక్కొక్క గృహంలోనూ వారానికి అయిదారు రివాల్వర్లు తయారవుతాయని నిజంగా ప్రభుత్వానికి తెలీదా? పాకిస్తాన్ తో దగ్గిర సంబంధాలున్న ".....ఎ" మీద హత్య కేసు నిరూపించలేక కోర్టు వదిలిపెడితే, ఆ తరువాత మరికొంత కాలం  అతడిమీద ఇంటలిజెన్స్ అధికారులు నిఘావేసి వుంచితే- గుజరాత్ లో ఇంతమంది మరణించి వుండేవారా? మిస్టర్ ఏ.తో విరోధంకన్నా స్నేహం మంచిదని లోకల్ పోలీసు అధికారులు అనుకుంటూ వుంటే ఆ తప్పెవరిది?     ఈ విధంగా సాగింది ఆ వ్యాసం.     అయిదో వ్యాసం బొగ్గుకు సంబంధించిన మాఫియా గురించి. బీహార్ కి సంబంధించినది!     వ వ్యక్తి గురించయితే బీహార్ ముఖ్యమంత్రి తరుచు ప్రజల్ని హెచ్చరిస్తూ వుంటాడో, ఏ వ్యక్తి మీదయితే 22 క్రిమినల్ కేసులున్నాయో, ఏ వ్యక్తి 75,000ఓట్లతో ఎమ్మెల్యే అయ్యాడో- ఆ కోల్ - మాఫియా లీడర్ గురించిన వ్యాసం అది!     బొగ్గు గనుల్లో పనిచేసే ప్రతి కార్మికుడు తమ వేతనంలో 'కొంత' సమర్పించుకోవాలిని, యూనియాస్ పేరిట రక్షణ కల్పించే ఈ మాఫియా,  ధన్ బాద్ పరిసర ప్రాంతాలంతా ఆక్రమించుకుని వుంది. రంగధారీ టాక్స్ పేరిట వసూలు చేస్తున్న డబ్బు ఎవరి జేబుల్లోకి వేడుతూంది? ఎవరినయితే డిప్యూటి కమిషనర్ ఆఫ్ పోలీస్  కూడా 'సర్' అని పిలుస్తారో, ఎవరు తమ పార్టీలో వుంటే తమ పార్టీకి ఆ ప్రాంతంలో ఢోకా లేదని అన్ని రాజకీయ పక్షాల వారు భావిస్తారో- ఆ వ్యక్తి నిజస్వరూపం ఏమిటి? భారత్ కుకింగ్ గ్యాస్ ఆడిట్ చేయడానికి వెళ్ళిన చార్టెర్ట్ అకౌంటెంట్ శవం రైలుపట్టాల పక్కన కాళ్ళు చేతులు తెగి ఎలా పడివున్నది? అది కనబడిన నాలుగు గంటల్లోగా ఎస్సై అది ప్రమాదవశాత్తు రైల్లోంచి పడిన శవం అనీ (శవం జేబులో రైల్వే టికెట్ వుంది) వెంటవెంటనే ఎందుకు పూడ్చివేయమనీ ఆర్డర్లు ఇచ్చాడు? మిగతా ఆడిటర్లు గోలచేస్తే తవ్వితీసి తిరిగి పోస్ట్ మార్టమ్ చేస్తే బయటపడిన ఘోరమైన వాస్తవాలపట్ల ప్రభుత్వం ఏమి చర్య తీసుకుంది? తన ఆడిటింగ్ లో పట్టుకున్న విషయాలపై ఆ అకౌంటెంట్- మరణానికి గంటముందు ఎమ్మెల్యేని కలుసుకున్న మాట వాస్తవం కాదా? తాము ఆ ఆడిటర్ని చిత్రహింస పెట్టినమాట వాస్తవమేనని సి.బి.ఐ. దగ్గిర వప్పుకున్న 'కుడిభజం', కోర్టులో తన స్టేట్ మెంట్ ని  సి.బి.ఐ. దగ్గిర వప్పుకున్న 'కుడిభుజం' కోర్టులో తన స్టేట్ మెంట్ ని నిరాకరించి ఎలా తప్పించుకోగలిగాడు?                           *    *    *     మరణిస్తూ విష్ణుశర్మ వ్రాసిన ఉత్తరంలో అయిదు ముఖ్యమైన విషయాలనూ ఆ విధంగా అయిదు ముఖ్యమైన విషయాలనూ ఆ విధంగా అయిదు బాణాలుగా సంధించి ఒక్కసారి వదిలింది అనూష.     ఆమె ఎక్కడా ఏ వ్యక్తి గురించీ వ్యక్తిగతంగా చర్చించలేదు. ఎవరికీ తన మీద పరువునష్టం దావా వేసే వీలు కలిగించలేదు. కానీ బాణాలన్నీ సూటిగా వెళ్ళి  తగిలినయ్! అర్థం అయ్యాయి. వాళ్ళకి అర్థం అయ్యాయి. వాళ్ళు పోలీసులు, రాజకీయ నాయకులు, దాదాలు.
24,701
    "మరొక్క సంగతి. ఇది ఆరంభించడానికి కావాల్సిన సామానులు, చోటు అది చూపించి, మీ అందరినీ ఒకచోట చేర్చడం నా పని. రోజూ మీతోపాటు నేనూ ఈ పని చేయలేను, ఎందుకంటే నాకు యింటిపని, స్కూలు పని, మధ్యాహ్నం మీ చదువు, రాత్రి వయోజన విద్యలాంటి వన్నీ చెయ్యాలి. అంచేత రోజూ మీతోపాటు నేనూ కూర్చోలేకపోవచ్చు. ఇదిగో ఈవిడ ఆర్డరు ఇచ్చి మనచేత చేయిస్తుందని అనుకోవచ్చు. అందుకని ముందే చెప్తున్నాను.     ఈ పనిని మన అన్నపూర్ణమ్మగారు, పద్మావతిగారు, సుగుణ చూసుకుంటారు. ఎవరోఒకరు దగ్గరుంటారు. ఊరగాయలు అవీ పెట్టించడం, అవి సీసాల్లో ప్యాక్ చేయించడం అంతా ఈ ముగ్గురి పర్యవేక్షణలో జరుగుతుంది. ఇందులోవచ్చే లాభాలు నాకేం అక్కరలేదు. ఎంతమంది పనిచేస్తారో అది వారే పంచుకుంటారు..." రాజేశ్వరి అంతా వివరించింది ముందుగానే. అపోహలు తలెత్తకుండా.     "ఎంతయినా రాజేశ్వరిగారు ముందుచూపున్నవారు. అన్నీ ముందే చెప్పారు" ఇంటికెళుతూ అన్నపూర్ణమ్మ అంది.     "మంచిదేగా చెప్పడం. తరువాత మాటమాట అనుకోకుండా..." పద్మావతి అంది.     "నలుగురు ఆడవాళ్ళు కలిస్తే ఇంకొకరిని అనుకోవడం ఆడవాళ్ళ లక్షణం అంటారు. అందులో ఇలాంటి పనులు చేసినవారికి నాలుగు రోజులు పోగానే ఆడిపోసుకుంటాం. అత్తయ్య అందుకే అందరిముందు చెప్పింది" సుగుణ అంది.                                   *    *    *     వారంరోజుల తర్వాత ఓరోజు మార్నింగ్ వాక్ కి వెళ్ళివచ్చేసరికి రాజేశ్వరి ఎవరో అమ్మాయితో మాట్లాడుతూ కన్పించింది. పాతికేళ్ళ అమ్మాయి. సింపుల్ గా వున్న ఆ అమ్మాయి ముఖంలో సంస్కారము, విజ్ఞానం కనపడ్డాయి.     "అదిగో డాక్టరుగారు వచ్చేశారు. ఇదిగో ఈ అమ్మాయి డాక్టర్ శ్యామల...ఇప్పుడే వచ్చింది ఊర్నించి..." రాజేశ్వరి పరిచయం చేసింది.     "ఓ... ఎవరో అనుకున్నాను. వచ్చావన్నమాట అమ్మా ఐయామ్ గ్లాడ్ దట్ యూ హాల్ కమ్ డాక్టర్" ఆ అమ్మాయిలేచి వినయంగా నమస్కారం చేసింది.     "కూర్చోమ్మా కూర్చో... ఈ పల్లెటూరంటే రానంటావేమో అనుకున్నాను. నాకంటే చిన్నదానివి మీరు అంటే బాగుండదు- నిన్ను అంటే ఏమనుకోకమ్మా...నా కూతురికంటే చిన్నదానివి.     "నర్సు విమలగారి ఉత్తరం చూడగానే సంతోషం వేసింది డాక్టర్. మీలాంటి గొప్పవారికింద పనిచేసే అదృష్టం కలిగిందని సంతోషం కల్గింది...పల్లెటూరంటే అమ్మో ఎలా ఉండడం అనిపించి భయంవేసేది. మీరూ వచ్చి వున్నారని విమలగారు రాశాక అమెరికా నుంచి వచ్చిన ఆయనే వుండగా లేనిది నేనెందుకు వుండలేను అన్పించి వచ్చాను సార్."     "చూడమ్మా, యిదేం పెద్ద ఆస్పత్రి కాదు- ప్రమోషన్లుండవు. ఏడాదికేడాది ఇంక్రిమెంట్లు వుండవు. నిస్వార్థంతో డాక్టరుగా నీ వృత్తిని నిర్వహించాలి. ఎలాగో నీకు ఇప్పుడుమంచి ఉద్యోగం లేదు కనక కొన్నాళ్ళుండి- ఇంకేదన్నా మంచి ఆఫర్ వస్తే వదులుకోనక్కరలేదు. ఇక్కడ ఉన్నందుకు నీవు భవిష్యత్తులో నష్టపోకుండా చూసే బాధ్యత నాది.     "తప్పకుండా సార్! ఒకటి రెండేళ్ళయినా మీకింద పని నేర్చుకుంటాను" వినయంగా అంది.     "ఆ... డాక్టర్... గైనిక్ ప్రాబ్లమ్స్ అటెండ్ అవ్వగలవా - నీ అంతట నీవు నిర్ణయాలు తీసుకోవల్సి వుంటుంది. నాకు ఆ సబ్జక్ట్ తో అసలు పరిచయం లేదు. ఇక్కడికి వచ్చే ఆడవారి కేసులన్నీ నువ్వే చూసుకోవాలి. కెన్ యూ మానేజ్ యిట్."     "ఐ థింక్ సో సర్, హౌస్ సర్జన్ గా వున్నప్పుడు చాలా కేసులు అటెండ్ అయ్యాను. సిజేరియన్స్ అసిస్ట్ చేశాను. గత ఏడాది నుంచి నర్సింగ్ హోములో బాగానే ఎక్స్ పీరియన్స్ వచ్చింది. మరీ కాంప్లికేటెడ్ కేసులయితే చెప్పలేనుగాని మిగతావి హేండిల్ చెయ్యగలననే అనుకుంటున్నాను. ఎనీహౌ, ఐ విల్ ట్రై మై బెస్ట్ సర్."        "థాంక్యూ. ఆ మాత్రం భరోసా చాలు." అన్నారు కేశవరావు. లోపల్నించి రెండు కప్పులతో కాఫీలు పట్టుకొచ్చింది రాజేశ్వరి. "మొహం అదీ కడుక్కున్నావా అమ్మా. లేదంటే బాత్ రూము చూపిస్తా. కడుక్కుని వచ్చి కాఫీ తాగు."     "రైల్లోనే కడుకున్నానండి. ఫలానా డాక్టరుగారిల్లెక్కడ అంటే రిక్షావాడు తీసుకొచ్చాడు."     "అది సరే రాజేశ్వరీ... యీ అమ్మాయిని ఎక్కడ వుంచడం" ఆలోచనలో పడ్డారు.     "నర్సు రాసింది. ఆస్పత్రిలోనే ఉండచ్చు. ఆవిడ అక్కడే వుంటున్నదట కదా. యిద్దరం కల్సి ఓ రూములో వుందాం. కలిసి వంట చేసుకుని షేర్ చేసుకుందాం అని రాసింది."     ఆయన సగం భారం తీరినట్లు "వెల్... సిస్టర్ అన్ని ఏర్పాట్లు చేసేసిందన్నమాట... నాపని సుళువయింది"     "డాక్టరుగారూ... మేం యిద్దరం అక్కడే వుంటాం కాబట్టి ఆస్పత్రి పని అంతా మేం చూసుకుంటాం. మీకేం భారం లేకుండా..." శ్యామల అంది.     "థాంక్స్... ఏదో నా అదృష్టం బాగుంది. మీలాంటి మంచి స్టాఫ్ దొరికారు."     "అయితే రాజేశ్వరి వెంకన్ననిచ్చి యీ అమ్మాయిని అక్కడికి పంపించు. ఆ సామాను వాడు తెస్తాడులే అమ్మా. వెళ్ళి రిఫ్రెష్ అవ్వు. నేను తొమ్మిది గంటలకి వస్తాను. అప్పుడు మిగతా విషయాలు హాస్పిటల్లో మాట్లాడుకుందాం" అంటూ లేచారు.     "మన వాళ్ళమ్మాయేనండి. తండ్రి ఏ.జి. ఆఫీసులో గుమాస్తాగా వుండేవారట- స్కూటర్ ఏక్సిడెంట్ లో పోయాడట. అప్పటికి మూడో ఏడు మెడిసిన్ చదువుతుండేదట. తండ్రి పోయాక పెన్షన్, ప్రావిడెంట్ ఫండ్ అది కలిపి ఈ రెండు మూడేళ్ళు గడిపారు.     తమ్ముడు ఇంటర్ చదువుతున్నాడుట. కాస్త ఆ అబ్బాయి చదువయి ఏదన్నా ఉద్యోగం చేసేవరకు యింటి బాధ్యత యీ అమ్మాయిదే పాపం-"     "అప్పుడే అన్ని వివరాలు సేకరించావు" బూట్లు విప్పుకుంటూ అన్నారు.     "ఏదో రాగానే వివరాలన్నీ తనే చెప్పింది. నెమ్మదయిన దానిలాగానే వుంది. పోనీ ఆ అమ్మాయిని ఇంట్లో వుండమందామా. ఇక్కడే తింటుంది, వుంటుంది. అక్కడ నర్సు విమల నాన్ వెజిటేరియన్. ఈ అమ్మాయికి, ఆవిడకి భోజనంలో యిబ్నందిగా వుంటుందేమో. నాకూ కాస్త సాయంగా వుంటుందేమోననిపిస్తుంది" రాజేశ్వరి సందేహిస్తూ అంది.     కేశవరావు ఆలోచించారు ఒక్కక్షణం. "నీకు కావాలంటే వుంచుకో. నాకేం అభ్యంతరం వుంటుంది. కాని అలా కొత్త అమ్మాయిని, ఆ అమ్మాయి అలవాట్లు అవి తెలియకుండా యింట్లో పెట్టుకుంటే నీకు ఆ అమ్మాయి అలవాట్లు, శుభ్రాలు కలవకపోతే, నీవేమో శుభ్రమెక్కువ. బాత్ రూములు, వంటిల్లు అవి చాలా శుభ్రంగా ఎక్కడివక్కడ వుండాలంటావు.     ఆ అమ్మాయి మామూలు మిడిల్ క్లాసు నుంచి వచ్చిన పిల్ల. తీరా యింట్లో పెట్టుకున్నాక నీకు, ఆమెకి కలవకపోతే చెప్పలేక, వుండమనలేక, పొమ్మనలేక అవస్థ పడాల్సి వస్తుందేమో, ఆలోచించుకో. సర్దుకోగలనంటే వుంచుకో..." ఆయన అన్నారు.     రాజేశ్వరి ఆలోచించింది. భర్త అన్నమాటలు నిజమే. అమెరికాలో వుండివచ్చి అక్కడి శుభ్రాలు అవి అలవాటయ్యాక తనకి యిల్లు శుభ్రంగా లేకపోతే నచ్చదు. ఎంత ఓపిక లేకపోయినా అన్నీ స్వయంగా చేసుకోవడం అలవాటయింది. ముఖ్యంగా బాత్ రూములు తనే స్వయంగా కడుగుతుంది యిక్కడ కూడా. పరాయి పిల్లని యింట్లో పెట్టుకుని ఆమె వాడే బాత్ రూములు అవీ తను కడగడం అది చేయగలదా. అంత నిష్టూరం కంటే ఆది నిష్టూరమే మేలు. కేశవరావు ప్రతిది లోతుగా ఆలోచిస్తారు. ఎందుకొచ్చిన గొడవ. ఇంట్లో వుంచుకోడం అంటే చాలానే ప్రాబ్లమ్స్ రావచ్చు. వచ్చిపోతుంటే మర్యాదలు, అభిమానాలు నిలుస్తాయి గాని ఒకేచోట వుంటే వుండకపోవచ్చు."
24,702
    వీధివైపు తాళం వేసి వుంటుంది కాబట్టి పెరటి మార్గమే తనకి రాచమార్గం. పెరటి వైపు ఇంటివాళ్ళు వున్నారు. అయినా ఫరవాలేదు. గోడలు దూకటం చెట్లు ఎక్కటం వగైరాలలో తను గొప్ప శిక్షణ పొందింది. రాత్రి రెండుగంటల వేళ అంతా మంచి నిద్రలో వుంటారు. ఇక్కడ నుంచి వెళ్ళటానికి యిదే మంచి ముహుర్తం.     ఆ రాత్రికి అవంతి నిద్రపోదల్చుకోలేదు.     అవంతికి ఆలోచించి ఆలోచించి కొద్దిగా తల నొప్పి వచ్చింది. తను వెళ్ళిపోతున్నానన్నే ఉషారులో తలనొప్పిని పట్టించుకోలేదు. అప్పటికి టైము పదకొండు అయింది.     ఆలోచన చాలించి అవంతి కుర్చీలోంచి లేచింది.     భోజనం ఏడుగంటలకే చేయటం వల్ల కాస్త కడుపు ఖాళీ అయినట్లు అనిపించి గ్లాసు నిండా హార్లిక్స్ కలుపుకుని తెచ్చుకుంది. నెమ్మదిగా ఊదుతూ వేడి చల్లార్చుకుంటూ గ్లాసెడు హార్లిక్స్ తాగింది. గ్లాసుని అక్కడే పారేసి లేచింది.     అవంతి ముందుగా నీరువా తెరిచింది. తనకి ఏ డ్రస్ బాగుంటుందో అని మొత్తం గుడ్డలు గాలించింది. పంజాబీ మగవాళ్ళు ధరించే డ్రస్సు తలపాగ సెలక్ట్ చేసి పెట్టుకుంది. ఒక ప్రాబ్లం తీరిపోయింది.     అవంతి ఆ తర్వాత వంటగదిలోకి వెళ్ళి అట్లకాడ చిన్న సుత్తి తీసుకుని వచ్చింది.     పెట్టె తాళం పగలగొట్టే ముందు పెట్టెని ఎత్తి చూసింది. ఆ బరువు ఎత్తటం సాధ్యం కాలేదు. అది పూర్వకాలం ఇనప్పెట్టె. మూలల్లో గట్టి బందూకులు బిగించివున్నాయి. పెద్ద తాళం వేశాడు.     "జై పాతాళభైరవి సాయం చేయరా సుత్తిగా" అనుకుని సుత్తితో తాళం మీద ఒక దెబ్బ వేసింది. అబ్బే తాళం తాళంగానే వుంది. ఈ సుత్తిగాడి దెబ్బ తాళం గాడికి సుతిమెత్తగా తగిలి వుంటుంది.     అవంతి పెదవులు గట్టిగా బిగించి సుత్తి పిడిని రెండు చేతులతో గట్టిగా పట్టుకుని బలమైన దెబ్బలు తాళం మీద దబ దబ వేసింది. అలా మళ్ళీ మళ్ళీ వేసింది.     ధన్ మని, వూడివచ్చింది.     ఊడి వచ్చింది పెట్టె తాళంకాదు. సుత్తి తాలూకా పిడి. నీ దుంప తెగ నీవూ యిప్పుడే వూడాలా!" కింద పడిన సుత్తిని చేతిలో మిగిలిన పిడిని చూస్తూ అవంతి అనుకుంది.     ఉత్త సుత్తితో కొడితే తాళంకి బలంగా దెబ్బతగలదు. పిడి వున్న సుత్తి అయితే పట్టుకోడానికి వీలుగా వుంటుంది. అవంతి కింద కూర్చుని సుత్తికి గట్టిగా అమర్చేపనిలో పడిపోయింది. సరీగా అప్పుడే.     ఎవరో తలుపులు దడదడ బాదారు.     అవంతి గాభరా పడుతూ లేచి నుంచుంది.     మరోసారి తలుపులు బాదారు. అంతేకాదు. "నీ అమ్మ సిగదరగ తలుపు తియ్యవే" అన్న మాటలు వినపడ్డాయి.     తలుపులకి బైట తాళం వేసి వుంది. తలుపు తట్టి మరీ పిలుస్తున్నాడు వాడెవడో, తను యింట్లో వున్నట్లు వాడికెట్లా తెలుసు? ఇప్పుడు తనేం చేయాలి! పలకాలా అక్కరలేదా! ఈ కొత్త ప్రమాదాన్ని ఎదుర్కోవాలి! ఇప్పుడు తనకి....     అవంతి తీవ్రంగా ఆలోచిస్తుంటే బైట నుంచి మరో కొత్త కంఠం వినిపించింది.     "వరె అప్పిగా! తలుపు బైట తాళం వేసి వుంది. తలుపులు విరగొట్టి ప్రయోజనం ఏంటిరా!"     "ఏంటి తాళం వేసివుందా!"     "చూడు నీకే తెలుస్తుంది."     వాళ్ళలా మాట్లాడుకుంటుంటే అవంతి నెమ్మదిగా నడిచి తలుపు దగ్గరగా వచ్చి తలుపుకి చెవి ఆనించింది.     బైటవాడు తాళం లాగి చూసినట్లున్నాడు. "అవునురోయ్! వెంకులూ! తాళం కప్ప నా తలకాయ అంతవుంది" అన్నాడు.     "వుంది గందా!"     "ఆ....వుంది. అమరి అదెట్టా పోయిందంటావ్!"     "నాకేం తెల్సురా తలకమాసినావాడా."     "నాకు తెల్సు"     "అయితే చెప్పి తగలడు"     "అది తాళం వేసి సినిమాకి తగలడింది."     "మరెరోయ్!"     "ఏ మొచ్చిందిరా తైనాతి వెధవా! చెవి కింద మేకలా అరిచావ్, నా చెవి గట్టిది కాబట్టి సరిపోయింది. లేకపోతే నీ అరుపుకి ఊడి వచ్చేది."     "సరేలే వెధవ చెవి వుంటే ఎంత వూదితే ఎంత అసలు విషయం ఏమిటంటేరా....!"     "ఏంటి ఏంటంట?"     "ఇది మీ ఇల్లు కాదు హె హ్హెహ్హె."     "ఆసికాలు ఆడుతున్నావా?"     "కాదురా, ఈ తలుపులు చూడు గట్టిగా వున్నాయి. మనింటి తలుపులు తడికతో వుంటాయి. అవునా?"     "అవును."     "ఇప్పుడేం చేద్దాం పోదామా?"     "నాకు వోపికలేదు కాసేపు యిక్కడే తొంగుని ఆ తర్వాత లేచి వెళదాం"      "అయితే ఆ తలుపు నీది ఈ తలుపు నాది. నీవు దానికి అనుకో నేను దీనికి ఆనుకుంటాను"     "అట్ట అన్నావ్ బాగుంది."
24,703
స్వల్పకాలంలో ఎక్కువ ప్రగతి సాధించిన ఆమెని చూసిన కొన్ని దుష్టగ్రహాలు ప్రభుత్వం విరాళంగా యిచ్చిన లాండ్ తమదని కేసులు పెట్టి గొడవచేశాయి. ఆ గొడవలని  ఎదుర్కోడానికి అనూష లాయర్ వీణని కలుసుకుంది. డైనమిక్, డాషింగ్ లాయర్ వీణ. ఆ సమస్యని దూదిపింజలా తీసేసి, ఆ సంస్థ అభివృద్దికి తనవంతు సాయంగా లీగల్ కేసులన్నీ చూసుకోవడానికి అనూషతో కలిసి తన సేవలు ప్రారంభించింది. అలా ప్రారంభమైన ఆ సంస్థ ఇప్పుడు ఎందరికో ఆశ్రయం అయింది. అందుకే దాన్ని ఆశ్రమం అనడం ప్రారంభించారు. అక్కడ ఉన్నవాళ్ళ ఆసక్తికి తగినవిధంగా వాళ్ళకి కొన్ని వ్యాపకాలు కల్పించారు వీణ, అనూష ఇద్దరూ కలిసి, కొందరికి కుట్టుమిషన్లు కొనిచ్చి, వారికి ఉపాధి అవకాశాలను కూడా కల్పించారు. అందుకే ఈ మధ్య నెలలో ఒకటో రెండుసార్లు వచ్చి అక్కడ జరిగే విషయాలన్నీ పర్యవేక్షించి వాళ్ళ ఇబ్బందులు తెలుసుకుని కావాల్సిన సాయంచేస్తూ వుంటుంది.ఇప్పుడు నిస్సహాయ స్థితిలో వున్న స్త్రీలు ఎవరు అయినాసరే, వయసుతో నిమిత్తంలేకుండా ఆ ఆశ్రమానికి నేరుగా వచ్చేస్తారు. వాళ్ళకున్న దాంట్లో ఎంతోకొంత నెలకింత అని చెల్లించేవాళ్ళు కొందరైతే, ఏమీ లేనివాళ్ళకి ఉచితంగానే అక్కడ ప్రవేశం లభిస్తుంది. అక్కడ వాళ్ళందరికీ అనూష దేవత. నిద్రలేచి వాళ్ళు కొలిచేది,పూజించేది ఆమెనే. అక్కడ ఉన్నవాళ్ళందరిలో ఎంతో క్రమశిక్షణ. టైమ్ కి అన్నిపనులూ అందరూ కలిసి చేసుకుంటారు. సుశీల, శ్యామల కలిసివంట చేస్తారు. మిగతావాళ్ళు మిగతా పనులు చేసుకుంటారు.                                            *      *      *      * రోజూలాగే ఆరోజు కూడా ఉదయాన్నే లేచి అందరూ ఎవరి పనుల్లో వారు నిమగ్నమైనారు. సందడిగా, ఆహ్లాదంగా వున్న ఆ ఆశ్రమం గేటులోకి దూసుకుని వచ్చింది డాక్టర్ అనూష కారు. "మేడమ్ వచ్చారు. మేడమ్ వచ్చారు" ఒక్కసారిగా అనేక కంఠాలు పలికాయి. కారు దిగి, చేతిలో పసిపిల్లాడితో లోపలికి వస్తోన్న అనూషని అప్యాయంగా కౌగలించుకుని, బాబువైపు ప్రశ్నార్ధకంగా చూసింది శ్యామల. అటుగా పరిగెత్తుకొచ్చిన మృదులనీ, శారదనీ చూస్తూ "కారులో వున్న అమ్మాయిని జాగ్రత్తగా లోపలికి తీసుకురండి" చెప్పింది అనూష. ఇద్దరూ కారు దగ్గరికి పరిగెత్తారు. సుశీల చేతిలో కాఫీ కప్పుతోవచ్చి, అనూషకి నమస్కరించింది. చేతిలో బాబుని శ్యామల అందుకుంది. కాఫీ కప్పు అనూషకిచ్చి, శ్యామల చేతుల్లోంచి బాబుని సుశీల అందుకుంది. శ్యామల, మృదుల ఆసరాతో లోపలికి వస్తోన్న నీరజని చూసిన వాళ్ళకి పరిస్థితి కొంచెం అర్థమైంది. శ్యామల అక్కడేవున్న ఒక స్త్ర్రీతో " ఆ అమ్మాయికి గదిలో మంచం, పక్కా రెడీ చేయమ్మా గౌరమ్మా" అంది. గౌరమ్మ వడివడిగా లోపలికెళ్ళింది. పది నిముషాల్లో నీరజని మంచంమీద పడుకోబెట్టి శారదా, మృదులా అనూష దగ్గరికి వచ్చారు నీరజ కథ వినాలన్న కుతూహలంతో. అప్పటికే ఆశ్రమంవాళ్ళు చాలామంది వచ్చి అనూషని పలకరించి వెళ్ళారు. "నువ్వు ఇక్కడికొచ్చి నెల దాటుతోంది అనూషా! మళ్ళీ ఈ అమ్మాయి వలన రాగలిగావా?" "లేదు శ్యామలా! ఈమధ్య రెండుసార్లు ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చింది. పైగా హాస్పిటల్ కేసులెక్కువైనాయి. జీవితంలో పెరిగిన వేగానికి, వత్తిళ్ళకేమో వయసుతో సంబంధం లేకుండా ప్రతివాళ్ళకీ హార్ట్ ఎటాక్ లు వస్తున్నాయి." "నిజమే మేడమ్! టెన్షన్ ఎక్కువవుతోంది రోజురోజుకి" శారద అన్నది. "ఇంతకీ ఎవరీ అమ్మాయి?" శ్యామల ప్రశ్నిస్తుండగా మణి కారు వచ్చింది. మణి హడావిడిగా వచ్చి "ఏదీ ఆ అమ్మాయి...?" అంటూ కూర్చుంది ఆయాసంగా. "నువ్వు ముందు కొంచెం రిలాక్స్ అవు." "రిలాక్సా పాడా? అబ్బ ఈ టెన్షన్ భరించలేకపోతున్నాననుకో, ఈ ఉద్యోగం చేసేకన్నా  హాయిగా ఇంట్లో కూర్చుంటే బాగుండనిపిస్తోంది. అన్నీ ఇవే కేసులు...ఈమధ్య పెళ్ళి అయినవాళ్ళు తక్కువైనారు.... డెలివరీ కేసులన్నీ ఈ బాపతే. అమ్మాయ్ సుశీలా! నీ చేత్తో మంచి స్ట్రాంగ్ కాఫీ ఇవ్వమ్మా" గబగబా మాట్లాడింది మణి. "నీకసలే బి.పి.కదా! ఎందుకంత హైరానా పడతావు?" మందలించింది అనూష. సుశీల క్షణంలో కిచెన్ వైపు వెళ్ళి పెద్ద స్టీలు గ్లాసులో కాఫీ తెచ్చింది. "ఆహా! నీ చేతి కాఫీకి మంచి పరిమళం. ఈ పరిమళానికే కాఫీ తాగిన తృప్తి కలుగుతుంది." మణి మాటలకి అందరూ నవ్వారు. ఐదు నిముషాల తరువాత మళ్ళీ అందరూ కలిసి, నీరజ పడుకున్న గదిలోకి వెళ్ళారు. ఆ సందడికి కళ్ళు తెరిచింది నీరజ. మణిని చూస్తూనే ఆమె కళ్ళల్లో భయం నిండిపోయింది.... చూస్తుండగానే కళ్ళలో నీళ్ళు తిరిగి, ఏడుపు ప్రారంభించింది. "ఎందు కేడుస్తావు? చేసిన వెధవపని చాలక.... ఏమ్మా నా ఉద్యోగం ఊడగొట్టాలనా? ఎందుకు పారిపోయావు? ఏం ఉద్దరించాఫు?" కోపంగా అంటున్న మణిని వారించి, " ముందు ఆ అమ్మాయికి మందులేం వాడాలోరాసివ్వు" అంది అనూష. 
24,704
     హటాత్తుగా అదృశ్యమైపోయింది మంగ.     ఆ తర్వాత కిన్నెర యిక వచ్చి మంచినీళ్ళయినా ముట్టుకోకుండా ఎదురుచూస్తూ ఉండిపోయింది.     ఉళ్ళో అడుగుపెట్టిన మంగకు ముందేం చేయాలో పాలుపోలేదు.     పోస్టాఫీసుకు వెళ్ళి అరా తిద్దామన్నా తెల్సుకోవాలనుకుంటున్నది అబ్బాయి గురించి కాబట్టి , ఆ చిన్నపల్లెలో అదేన్ని అనర్ధాలకు దారి తీస్తుందో అని అందోళన పడింది.     అసలే రెండు గ్రూపులతో అట్టుడికిపోతున్న పల్లెటూరు.     పొరపాటున ఆ విషయం ఉదయ్ బాబుక్కాని, వీర్రాజుగారిక్కాని తెలిస్తే కొంపలు మునిగిపోతాయి.     మంగకు చాలా ఇబ్బంది అనిపించింది.     అంత తెలివితేటలున్న రాఘవ ఈ ఉళ్ళో వుంటే అది తనకు తెలియకపోవటం నిజంగా దారుణమని కూడా అనిపించింది.     అదిగో! అలా ఆలోచిస్తూ నడుస్తున్న సమయంలో ఎదురయ్యాడు రాయుడు. అనకాపల్లి నుంచి వస్తున్నట్టున్నాడు.     "బాబాయ్!" పలకరించింది మంగ చనువుగా. "నీతో చిన్న పని పడింది."     ప్రసన్నంగా నవ్వేశాడు రాయుడు. "చిన్నదో, పెద్దదో అసలు ఈ ఉళ్ళో నాతో పనిపడని మనిషేవరు చెప్పు కానియ్!"     రాయుడు టెలిఫోన్ డైరెక్టరి లాంటివాడు మాత్రమే కాదు. అడిగింది చెప్పడం మాత్రమే కాక, చెప్పింది నలుగురిని అడగకుండా చెప్పే అలవాటున్న మనిషి కూడా అనిపించడంతో తెలివిగా ప్రసక్తిని ప్రారంభించింది. "ఈ ఉళ్ళో కవిత్వం రాసే అమ్మాయి ఎవరయినా వున్నారా అని అమ్మాయిగారు తెల్సుకోవాలనుకుంటుంది."     ఆవులించకుండానే పేగులు లెక్కపెట్టెయగల సమర్ధుడైన రాయుడు మంగ మొహంలోకి చూశాడు చిద్విలాసంగా నవ్వుతూ, "నువ్వీ ప్రశ్న ఎందుకు అడిగినా కాని, నాకు తెలిసి మన ఉళ్ళో కవిత్వం రాసే అమ్మాయిలు లేరు. ఉన్నది రాఘవ అనే ఓ బ్యాంక్ ఆఫీసరు. మాణిక్యమ్మ మనవడు. ప్రస్తుతం అనకాపల్లిలో......."     అవసరానికి మించి వివరాలు అందించేశాడు. అని తను తెల్సుకోవాలనుకుంటున్న రాఘవ గురించే.     "థాంక్స్ బాబాయ్!" అంటూ మోడరన్ పనిమనిషిలా ముందుకు నడవబోతుంటే పిలిచాడు.         "సంగతేమిటి మంగా!"     "అబ్బే!" తొట్రుపడింది మంగ. "ఏం లేదు"     "ఏమి లేకపోతే అమ్మాయి గురించి అడిగిన దానివి అబ్బాయి గురించి చెప్పగానే అవసరం తీరినట్టు, అలా పారిపోతున్నవేం?"     "మ....మరేం....లేదు"     "ఏది వున్నా లేకపోయినా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో. రాఘవ యింకా పెళ్ళి కానివాడు కాబట్టి, ఎప్పుడూ ముందు కెళ్ళకు"     ఆశ్చర్యంగా అడిగింది ---"వెళితే ఏం చేస్తాడు?"     "అతనేం చేయడు.....కాని...." క్షణం ఆగి అన్నాడు "నీకే చేయాలనిపిస్తుంది."     "ఏమిటి?"     "మరీ దబ్బపండులా ఉంటాడెమో గబాలున మీద పడి ముద్దెట్టాలనిపిస్తుంది జాగ్రత్తా!"     మనిషి కూడా అంత బాగుంటాడని తెలిసిన మంగ ఇక ఆగలేదు, అఘమేఘాల పై లోగిలిలోకి పరుగెత్తింది.     రాయుడు చెప్పిన ప్రతి పదాన్ని పొల్లు పోకుండా మంగ వినిపించింది.     "అయితే ఎమిటట?" తన మొహంలో కూడని ఏ భావమైనా మంగ చదివేసే అవకాశముంటే ఆ విషయంలో జాగ్రత్త పాటిస్తూ అంది కిన్నెర. "అంత అందంగా ఉంటాడు కాబట్టి అతడిని కలుసుకోకూడదంటాడా? వీల్లేదు మంగా! అతడేలాంటి వాడన్నా, ఏమైనా కానీ బుద్దిచెప్పి గాని విడిచిపెట్టను అంతే!"     బుద్ది చెప్పడానికి ఏ మార్గాన్ని అనుసరించేది కిన్నెర చెపితే మంగ వినాలనుకుంది కానీ, చెప్పలేదామే. అదే మంగ కాస్త భయపడటానికి కారణమయింది. "అమ్మాయిగారు!"     "చెప్పు"     "మాణిక్యమ్మ నాకు తెలుసు."     "అయితే?"     "పిల్లలు పోయాక మనవడిని చదివించుకుంటూ ఇంతకాలము బతుకుతోందని విన్నాను కాని, ఈ రాఘవే ఆవిడ మనవడని ఇప్పుడే తెలిసింది."         "ఇంతకాలం రాఘవ గురించి నీకెందుకు తెలియదు?" అని అడగాలనుకుంది కాని, మంగ అప్పటికే జవాబు చెప్పడం ప్రారంభించింది.     "సామాన్యంగా నాకు ఈ ఉళ్ళో ప్రతి మగాడు కాకపోయినా చాలామంది గురించి తెలుసు. కాని మన కుటుంబానికి ప్రత్యర్ధులైన కొందర్ని చూడనట్టే, ఏదో ఉళ్ళో చదువుతున్న రాఘవ గురించి ఇంతదాకా నాకు తెలియలేదు. పైగా మీ దగ్గర పనికి కుదిరాక నేనూ మీ టైపు ఘోషాను సాగించడం మొదలు పెట్టాను. ఎందుకంటే మీ వంశ ప్రతిష్ట కాపాడటం నా ధర్మాల్లో ఒకటి కాబట్టి."     ఒక చిన్న ప్రశ్నకు ఇంత పెద్ద సైజు జవాబుకు మంగ అనర్గళంగా చెప్పడం అసలు నచ్చలేదు కిన్నేరకు. "ఇప్పుడు నన్నేం చేయమంటావు మంగా!"     "రాఘవ అనే వ్యక్తి మీ విషయంలో తప్పు చేసినా ఇంట్లో అందరికి తెలియకుండా మీరు మాత్రం మందలించి వదిలి పెట్టేయమంటున్నాను. ఎంతైనా మాణిక్యమ్మ మనవడనే జాలి మాత్రమే కాదు, పెద్దయ్యగారికి తెలిస్తే అతన్ని ప్రాణాలతో విడిచిపెట్టరు కాబట్టి."     మంగ అభ్యర్ధన నచ్చింది కిన్నేరకు. నచ్చింది అనేకన్నా ఈ తర్కంతో ఆమె అహం కాస్త చల్లబడింది అంటే బాగుంటుంది.
24,705
    ఒంటరి పోరాటంలో ఒక నారిగా తను చివరి వరకు నిలవగల సత్తా తనకు వున్నదా...?     గెలుపు-ఓటముల విషయం అలా వుంచి, కరడుగట్టిన కఠిన  హృదయుల చేతులలో తమ ఇద్దరి జీవితాలు నాశనమైపోయే ప్రమాదం లేకపోలేదు...     ఈ ప్రత్యక్ష పోరాటంలో ఒకవేళ గెలిచినా, తనకు తన చెల్లి సింధూకు మిగిలేవి మరిన్ని కష్టాలే...! ఓడిపోతే... ఓ... భయానకం... తమ వ్యక్తిత్వాలతో పాటు శీలాన్ని సయితం కోల్పోయి, జీవితాంతం కుమిలి కుమిలి చస్తూ వుండవలసిందే...!     ఆలోచనలు మెదడును తొలుస్తున్నా, ఇహ ఏ మాత్రం తాత్సారం చేయదలచుకోలేదు ధీరజ. చకచకా తాళం తీసి, తలుపులు తెరచి లోనికి వెళ్ళింది.     తన సూట్ కేసును తెరచి ఒక ఫోటోను బయటకు తీసింది ధీరజ. క్షణకాలం దానిని తదేకంగా పరికించింది. ఆ ఫోటో ఆమెకు స్ఫూర్తి. జీవం. జపం !     సూట్ కేస్ ను సర్దుకుని చేత పట్టుకుని ధీరోదాత్తంగా బయటకు వచ్చింది ధీరజ.     తలుపుకు తాళం వేసి, ఆ నిశిరేయిలోనే నిర్భయంగా కదిలింది.     అప్పటికే ఆమె మదిలో వ్యూహం రూపొందింది !                          *    *    *     అది భారత ప్రధాని నివాస భవనం.     వేకువ ఝాము అయిదు గంటల వేళా.     కావలివున్న సెంట్రీ గార్డులు మినహా ఆ కాంపౌండ్ ఆవరణలలో మరెవ్వరూ తచ్చాడుతున్న జాడలేదు. అంతటా నిశ్శబ్దం.     నిర్దిష్టమైన ప్రదేశాలలో ఏర్పాటు చేసిన సెంట్రీ పోష్టుల నుంచి మెషిన్ గన్ లను గురిపెట్టి దశదిశలా పహరాకాస్తున్నారు గార్డులు. వాళ్ళ చేతులలో పవర్ ఫుల్ సెర్చ్ లైట్స్ కూడా వున్నాయి. అందరూ చాలా ఎలర్ట్ గా పరిసరాలను పరిశీలనగా చూస్తున్నారు.     ప్రధాని పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసరు విక్రమ్ పర్సనల్ సెక్యూరిటీ వింగ్ లో స్కాట్ లండ్ యార్డ్ లో ప్రత్యేకంగా తర్ఫీదు పొందివచ్చాడు. ఇప్పుడతను ప్రధాని సెక్యూరిటీని తనదైన సొంత రీతిలో పటిష్టమంతం చేశాడు. కనుకనే సెంట్రీ గార్డులు అంత జాగరూకతతో నిత్యం కావలికాస్తున్నారు.     ప్రధాని నివాస భవనం ముఖద్వారం తలుపులు నెమ్మదిగా తెరచుకున్నాయి.     అభిషేక్, మంజు పోర్టికోలోకి వచ్చారు.     ఆ ఇరువురినీ చూస్తూనే సెంట్రీ గార్డులు విష్ చేశారు.     కారు గేరేజి వైపుకు కదలబోతున్న ఇద్దరూ ఒక్కసారిగా ఉలికిపడ్డారు.     ఎదురుగా- ఔట్ హౌస్ లో నుంచి బయటకు వచ్చి, క్రీనీడలో తమ వైపుకే కదలిన- స్త్రీమూర్తిని వారు చూశారు. ఇరువురూ తడబడుతూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.     ఆమె తమ ఆయా అపర్ణ...!     అభిషేక్, మంజు స్పోర్ట్స్ డ్రెస్ లో వున్నారు. భుజాల ఎయర్ బ్యాగ్స్ వ్రేలాడుతున్నాయి.     ఆమె తమకు చేరువయేలోగా ఇద్దరూ తేరుకున్నారు. కనులతోనే సైగలు చేసుకున్నారు.     "ఆంటీ! నువ్వు కూడా ఇంత వేకువనే లేచావు. మాతోపాటు మోర్నింగ్ వాక్ కూ గట్రా వస్తావా ఏం!" ముందుగా మంజు జోక్ చేసింది.     'వీళ్ళిద్దరూ నిజంగానే స్పోర్ట్స్ ప్రాక్టీస్ చేయడానికే వెడుతున్నారా?' అనుమానించింది అపర్ణ. ఆమె సందేహాలు ఆమెకు వున్నాయి!     అపర్ణ మౌనంగా వుండడంతో ఇద్దరూ మరల జంకారు. 'కొంపదీసి తమ మీద తండ్రికి ఫిర్యాదు చేయదు గదా...' అనుకుంటూ బెంబేలుపడ్డారు.     ఆమెను ఎలా అయినా ప్రసన్నం చేసుకుని, తమ స్వేచ్చను తాము కాపాడుకోవలెననే కృతనిశ్చయానికి వచ్చారు క్షణంలో. ఆమె తమను అర్ధం చేసుకుంటే తమకు ఇక సమస్యలు అంటూ ఉండనే వుండవు! ఇంట్లో ఆమె మాట వేదవాక్కేగదా...!     "ఆంటీ! ఇప్పటికే మేము స్టేట్ స్పోర్ట్స్ మీట్ లో విన్నర్స్ గా వచ్చాం. నేషనల్స్ కు వెళ్ళవలెనంటే ఎంతో కష్టపడి ప్రాక్టీస్ చేయాలి. మా మీద నమ్మకం లేదా?"     ఇరువురూ కూడబలుక్కున్నట్టు ఒకరి తరువాత ఒకరు కోరస్ గా చకచకా అనేశారు.     "భలేవారే! మీ మీద నాకు నమ్మకం లేకపోవడం ఏమిటీ!" దీర్ఘంతీస్తూ నిదానంగా అన్నది అపర్ణ. క్షణం ఇద్దరినీ పరకాయించి చూసింది.     "చూడమ్మా, నువ్వా  ఆడపిల్లవు! అదీగాక, సెక్యూరిటీ విషయాన్ని ఉభయులూ మరచిపోతున్నారు! పోనీ, గన్ మెన్ ను అయినా వెంటబెట్టుకు వెళ్ళగూడదూ!" ఇద్దరినీ మార్చిమార్చి చూస్తూ సూచించింది అపర్ణ.
24,706
           అతనికామ  దావాగ్నికి భార్య పాతదయి పోయినది. ఆమెకు ప్రథమ  సంతానము కలిగినది కూడా. ఇంకా  పనిమనుషులు, వైద్యాలయంలో దాదులు, యురేషియన్ భామలు, మింటుస్ట్రీటులోని అప్సరసలు, సముద్రపు ఒడ్డు మృత్యగ్రందులూ, ఒకరనేమిటి  ఎందరో వృక్షాలై, చిన్న పొదరిండ్లయి, కంటకమహీజాలై, చిట్టిఅడవులై, మహారణ్యాలై ఆహుతి అయినారు. ఆ సమయంలో ఒక స్నేహితుని వల్ల ఈతనికీ అప్పుడు ఇంటరు పరీక్షకు  చదివే  హేమసుందరికీ పరిచయం కలిగింది. ఆ పరిచయం  జరిగిన  క్షణంలో  జానకిరామమూర్తి అనే తీర్థమిత్రుని ఎదురోమ్ముపై '' స్త్రీ'' అనే దివ్యకామామృత కలశం  ఎదురుగా ప్రత్యక్షం అయి మెత్తని చిగురుజొంపముల ముస్టితో ధామ్మని గుద్దినట్లయింది. ఈ కలశం వాంఛించిన అసుర నాయకులలో మహానాయకుడయ్యాడతడు. అప్పటి పదహారేళ్ళ బాల కుమార్తె అయిన  హేమ  అప్పుడే  పాలసముద్రపు అమృతపు జిడ్డులలో నుంచి  ఉద్భవించిన లక్షిబాలలా ఉంది. ఈ బాలకు తానే విష్ణువో లేక రావణాసురుడో కావాలనుకున్నాడు. జానకిరామమూర్తి. ఈ బాలకే  తన రసికత్వ మహారసాల ముఖ్య  శాఖాగ్ర సుందరమైన జహంగీరు పండుకావాలనుకున్నాడు.        తన రసిక మహాపాండిత్యాన్ని, ఈ బాలిక సౌందర్యము సవాలు చేస్తున్నదని అతడు భావించాడు. అంత అందగత్తె అని తాను గర్వపడే తన భార్య ఈ లేత నునుముగుద ఎదుట చాంపేనుద్రాక్షామృతమునందు తాటికల్లయిపోయిందని భావించుకున్నాడు. అంత పెద్దకళ్ళూ, అంత చక్కని మోములో గులాబీలో వాసనలా  ఒదిగిపోయాయి అనుకున్నాడు. ఆమె  ఆ అందం, ఒక లక్ష గులాబీలు విరిసిన  తోటలోని  ఉదయకాలంలా ఉంది అని  అతడనుకున్నాడు. ఆమె  ఆ లేతయవ్వనం  మొదట  పండిన  నాజూకు  పసందు మామిడిపళ్ళ ముక్కలు  కోసి  బంగారు పళ్లెన పెట్టినట్లుంది అని  అతడు ఉప్పొంగి పోయాడు. ఆ  క్షణం  నుంచీ  తీర్థమిత్రుడు అనేక కామ  దేవాలయాలు మరచిపోయాడు. అవి గ్రామదేవతలు, ఇది మధుర మీనాక్షి దేవాలయం, తాను  సుందరేశ్వరుణ్ణి అని  కావ్యం అల్లుకున్నాడు.                                                                    25     కల్పమూర్తి ఆరువేల  నియోగివంశ రత్నాకరముక్తాఫలము. అసలు  పేరు చెన్నూరి  శ్రీనివాసరావు. అతనిది కృష్ణాజిల్లా గుడివాడ  తాలూకాలోని పామర్రు మంచి వసతిగల ఆస్తి. సాలుకు ఖరీదుల తక్కువ  రోజులలో నాలుగువేల రాబడి వచ్చేది. ఈ యుద్ధం  రోజులలో పదివేల రూపాయల రాబడి వస్తూంది. తండ్రి చిన్నతంలో పోయాడు. ఒక్కడే కొడుకు. తల్లి సుబ్బమ్మగారు,  కొడుకును చూచుకోవడంలో దుఃఖంమరచి  గుడివాడలో చదువు  చెప్పించింది. కల్పమూర్తికి  చిన్నతనాన్నుంచి ఆటలు మహా ఇష్టం. ఊలుబంతి  ఆటలో మధ్యగా  నాయకుడై అతడు నడిపే జట్టుకు ఓటమిలేదు. పుట్ బాల్ ఆటలో సెంటర్ ఫార్త్వర్డుగా తన హైస్కూల్ తరపున ఆడుతూ వుంటే, ఎ ఉన్నత పాఠశాల జట్టూ పదిమైళ్ళ దూరానికైనా రావడానికి వీలులేదు. ఒక్కసారిగా  అయిదారుగురు ప్రయివేటు మాస్టర్లు చదువు చెప్పేవారు. వారందరూ కలిసి  ఇతని విద్యానౌకను స్కూల్ ఫైనలు  రేవుకు నెట్టారు. అక్కడ  నుంచీ ఓడ కదలలేదు. ఎల్లగయితేనేం రెండేళ్లకు  ఏమి  మాయచేశారో చుట్టాలు పక్కాలు కల్పమూర్తికి ప్రపంచజ్ఞానం విద్య నేర్పి మామూలు విద్య ఆపుచేయించారు.     మదరాసు క్రికెట్టు జట్టులోనో, టెన్నిస్ లోనో ఆడి పేరు సంపాదించాలని కల్పమూర్తి మద్రాసు కాపురం  పెట్టినాడు. క్రికెట్టులో మదరాసు జట్టులో బౌలింగులో, బంతి  కొట్టడంలో అసమాన ప్రతిభ చూపిస్తూ నాయుడు, మంకాడ్, మర్చంట్ ఇలాహి అయిపోయాడు. ఇప్పుడు యాభైకి తక్కువగాని పరుగులు చేస్తారు. ఆట పూర్తయ్యేసరికి నాల్గయిదు వికెట్లు తింటాడు.     టెన్నిసులో ముఖ్యయోధుడు. అఖిల  భారతీయ టెన్నిస్ పందేలలో దిట్టమైనవాడుగా పేరు సంపాదించాడు. ఇలాంటి ఒక పందెం జరిగేటప్పుడు కాలేజీ బాలికలకు పోటీవచ్చి డబుల్స్ లో  సోఫీ, హేమా విజయం కావించినారు. సోఫీ సింగిల్స్ లో  నెగ్గింది. హేమను  ఓడించిందంటే జబ్బ పుస్టీ, దమ్మూ ఉన్న సోఫీ కొక్కదానికే చెల్లు. ఆ సమయంలో కల్పమూర్తి, హేమకు స్నేహం కలిగింది. హేమ అప్పుడు బి. ఏ. ఆనర్సు మొదటి తరగతి చదువుకుంటున్నది. హేమను ఆట  డ్రెస్సులో చూచిన  కల్పమూర్తి  గుండె పదిహేను నిమిషాలాగిపోయింది. అతడే ఏ కావ్యనాయకుడో అయి ఉంటె! ఆ కోర్టులో విరుచుకు ప్రణయమూర్చలో పడిపోయేవాడే! ఆమె నానారాజ్య  ఒలింపిక్  టెన్నిస్  ఆటలోని బంగారుగిన్నె బహుమానమై అతనికి తోచింది. బ్రాడ్ మన్ గారిని ఓడించగల క్రికెట్టు  ఆట మూర్తికట్టి వచ్చినట్లాతనికి హేమ ప్రత్యక్షం  అయింది. ఆమె  పదివేల  రూపాయల  ఖరీదుగల టెన్నిస్ బేటు అని  ఉప్పొంగిపోయాడు. ఆమె  ఈతని అద్భుతమూర్తిని చూచి ఆటకు తగిన  పురుషుడే అనుకొంది.     హేమ నియోగ బాలిక, పెళ్ళికాని అమ్మాయి. తన గోత్రానికి తగిన గోత్రం అని తెలుసుకోగానే అతడు హిమాలయ పర్వతంలా  ఆకాశం అంటాడు. వెంటనే ఆమె బి. ఏ. ఆనర్సు  చదువుకొంటోంది. అనగానే  పసిఫిక్కు లోతుల్లోపడి ఊరుకున్నాడు. అయితే ఏమి? చదువూ, ఆటలనేర్పు రెండూ ప్రయాగక్షేత్రం కాగలవని అతడు  ధైర్యం తెచ్చుకొని హేమతో  స్నేహం వ్రుద్దిచేసుకొన్నాడు. అతడు మైలాపురం దగ్గర గోపాలపురంలో మేడ కొనుక్కున్నాడు. హేమ చేతనే ఆ మేడంతా అలంకరింపించాడు. ఆ బాలిక  కొనమన్నదల్లా కొన్నాడు. ఆమె ఇది మచిదంటే స్టుడి బేకర్ కారు కొన్నాడు. అతడే స్వయంగా  నడుపుకొనేవాడు. అతడు జిర్రున చీది ఎరుగడు. ఇంతకన్న హేమకు  తగిన భర్త ఎవరు? అని  అనేకులు  పెద్దలతో  సంప్రదించి  సంబంద నిశ్చయానికి  వినాయకరావుగారితో ముచ్చటింపించినాడు. వినాయకరావుగారు '' మా అభ్యంతరం ఏమీ  లేదయ్యా, మా అమ్మాయి ఇష్టమే'' అన్నారు.      ఇంక హేమను అడిగేదేట్లా?  అతనికి ఎవరన్నా, భయంలేదు. అందరూ స్నేహితులే  తండ్రిగారు పత్రాలరూపంగా బ్యాంకులో  డిపాజిట్టుల రూపంలో  నిల్వచేసి వెళ్ళిన  ధనబలం అంతా  అతని వెనకాల ఉంది. విగ్రహం అపోలో విగ్రహం . ఏ గడ్డుపని ఎవరికి అవసరం వచ్చినా అది  అతిసమర్థతతో నిర్వహించగలడు. ఇంతకన్న  ఆ ఆటల సుందరి  భర్తకు కావలసిన గుణగణాలు ఏమిటిగనకా?  
24,707
    "మహా బయలుదేరింది లోకాన్ని ఉద్ధరించడానికి ఈవిడ... ఆడపిల్ల పెళ్ళిచేసి ఓ ఇంటిదాన్ని చేయకుండా ఆ పేపరుకి పుస్తె ముడేయించారు ఈయన. ప్రతిక్షణం భయంతో చస్తున్నాను శారదా."     "డాడీ, ఈ రోజుల్లో గూండాయిజం బాగా పెరిగిపోయింది. చేతికి మట్టి అంటకుండా కిరాయి రౌడీలని పెట్టి ఎంతఘోరమైన చేయిస్తున్నారు. డబ్బుకోసం ఎంతటి ఘాతుకాలైనా చేస్తున్నారు. మీరు జాగ్రత్తగా వుండాలి డాడీ. నీరద ఆడపిల్ల... మరింత జాగ్రత్త అవసరం. అమ్మే కాదు, నాకూ భయంగా వుంది. ఈ బెదిరింపు ఫోన్ కాల్స్ ని మనం మరీ తేలిగ్గా తీసుకోకూడదు" శారద దిగులుగా అంది.         "శ్రీనివాస్, నీవు నీరదని ఎప్పుడూ ఎక్కడికీ ఒంటరిగా వదలద్దు తెలిసిందా! డాడీ, పోనీ ముందు జాగ్రత్తగా పోలీసు కంప్లైంట్ ఇవ్వకూడదూ."     నారాయణమూర్తి చిరునవ్వు నవ్వి.     "అమ్మా, ఏదన్నా రాసిపెట్టివుంటే ఆపడం ఎవరి తరం? శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని మీ అమ్మే అంటుంది గదా!" అన్నారు.     "ఇలాంటివాళ్ళకి ఎవరూ చెప్పలేరులే తల్లీ. పద నీకిష్టమని వేడి వేడి ఉప్మా చేశాను" కూతురిని లోపలికి తీసుకెళ్ళింది లలితమ్మ.     "మీ అమ్మ అనడం కాదు. నాకూ కాస్త భయంగానే వుంది. శ్రీనివాస్, మీ ఇద్దరూ జాగ్రత్తగా వుండండి. కాస్త దూకుడు తగ్గించండి వార్తల్లో" నారాయణ మూర్తి అన్నారు.                                           * * *     "ఏయ్ సుప్రియా! ఏమిటే నేను ఉద్యోగం ఇప్పించానన్న కృతజ్ఞతన్నా వుందే నీకు? మళ్ళీ కనబడలేదు. ఎలాగుంది ఉద్యోగం? మా శ్రీవారు ఏమంటున్నారు? బాస్ లా వున్నారా, కాస్త ఫ్రెండ్లీగా వున్నారా లేదా... విషయాలన్నీ చెప్పవే. కనీసం ఫోనన్న చెయ్యచ్చు గదా... నీకసలు విశ్వాసం లేదే" శారద దబాయింపుగా అంది.     "ఆపవే తల్లీ, శాపనార్థాలు. మీవారు ఇచ్చిన జీతానికి తగిన చాకిరీ చేయించుకుంటున్నారులే. రాత్రి ఎనిమిదివరకు ఆయన వుండేంతవరకు ఆఫీసులో వుండాల్సిందే. ఆదివారమూ సెలవు ఇవ్వరే మహానుభావులు... మీ ఆయన పనిరాక్షసుడే. డబ్బు వస్తున్నకొద్దీ వదలాలనిపించదు గాబోలు. ఏ కేసూ వదలరాయన. ఇంక నాకు మీతో సరదాగా కాలక్షేపం చేసే టైమెక్కడుందే బాబూ, సునీతా కనపడలేదంటుంది. తల్లీ, మీవారితో చెప్పి ఆదివారం అన్నా వదలమను నన్ను... ఆయన నీమాట వింటారనుకోనులే..."     "బాగా కనిపెట్టావు. నెలరోజులలో మావారిని నాకంటే బాగానే స్టడీ చేసేశావు. నేనూ మొత్తుకుంటున్నాను అంతలా డబ్బుకోసం రాత్రింబగళ్ళు కష్టపడాల్సిన అవసరం ఏముంది అన్నా వినరే. ఈ సంపాదన అనేది వస్తున్నకొద్దీ ఇంకా ఇంకా కావాలనే ఓ జాడ్యం అనుకుంటాను.     ఒక ఆరేడేళ్ళు నేను రాత్రింబగళ్ళు ఎంత కష్టపడ్డానో... అది సరేగాని బుద్ధిగా వుంటున్నావా... సునీత చెప్పినట్లు కొన్నాళ్ళు ప్రేమలు దోమలు అనకు. అన్నింటికీ దూరంగా వుండు."     "అబ్బ! ప్రేమించడానికి కిక్కడెవరున్నారే... కేసులు కోసం వచ్చే క్లయింట్లు తప్ప. సివిల్ కేసులు ముసలికంపు... క్రిమినల్ కేసులు రౌడీకంపు... ఎవర్ని ప్రేమిస్తాను! కాగా పోగా నాకు మీ ఆయనే కనిపిస్తున్నాడు కాస్త స్మార్ట్ గా... చిలిపిగా అంది నవ్వి.     "పెట్టిన చేయినే మింగేరకంలా వున్నావు. జాగ్రత్త! ఫాల్స్ హోప్స్ పెట్టుకోకు. ఫాల్స్ హోప్స్ ఆయనకిచ్చావంటే అంతే సంగతులు..." బెదిరిస్తున్నట్లంది.     "మరేం బెంగపడకు. మీ ఆయన అంత సులువుగా బోల్తాపడేరకంలా లేడులే. ఆ విషయంలో నీవు అదృష్టవంతురాలివేలే..."     "అబ్బ! ఆయనగారి గురించి మంచి కాంప్లి మెంట్ ఇన్నాళ్ళకి ఒకటి విన్నాను. థ్యాంక్స్ సుప్రియా. సరేలే ఫోన్ పెడతాగాని ఈ ఆదివారం సునీత ఇంటికి రమ్మంటోంది. నీవూ రా. ముందుగా చెప్పి పర్మిషన్ తీసుకో... ముగ్గురం కాసేపు సరదాగా గడుపుదాం. ఒకే, బై" ఫోను పెట్టేసింది.                                             * * *     "రంజనీ! ప్రతిదానికీ చిన్నపిల్లలా ఏమిటీ అలక. మాట్లాడడం మానేయడం మొహం చాటేయడం... ఈ అలకలు... మనం టీనేజ్ పిల్లలం గాదు... మెచ్యూర్డ్ గా ప్రవర్తించు. ఒక నెలరోజులు ఓపిక పట్టలేవా..." అసహనంగా అన్నాడు రవీంద్ర.     "నెలకాదు... సంవత్సరాలు నీకోసం ఆగుతాను. కానీ, నీ నిర్లక్ష్యధోరణి కంటే కూడా నీ భార్యాబిడ్డలని నీవింకా ప్రేమిస్తున్నావన్న సత్యం భరించలేకపోతున్నాను. నామీద నీకు ఇష్టం తప్ప ప్రేమలేదు. నీకు నామీద మోహం తప్ప నీ గుండెల్లో నేను లేననిపిస్తోంది. నీ భార్యాబిడ్డలమీద వున్న శ్రద్ధ, ప్రేమ, బాధ్యత ఏదీ నాపట్ల నీకు లేదు... ఏం నా మాట అబద్దమంటావా, గుండెలమీద చెయ్యివేసుకుని చెప్పు" నిలేసింది కాళ్ళనీళ్ళు తిరుగుతుండగా.     "నీవిలాగే సతాయిస్తుంటే నిజంగానే నా భార్యే బెటర్ అనుకుని వెనక్కి వెళ్ళిపోవచ్చు. అనేకసార్లు చెప్పాను, సునీత తప్పేం లేనప్పుడు ఆమెను నేనెందుకు ద్వేషించాలి? రక్తం పంచుకునిపుట్టిన పిల్లలమీద ప్రేమ లేకుండా ఎలా వుంటుంది? రియాల్టీని నీవు ఎప్పుడు అర్థం చేసుకుంటావో అపుడు నీకు నామీద సంశయం వుండదు. నీమీద ప్రేమ లేకపోతే తీరి కూర్చుని సుఖంగా సాగిపోయే నా సంసారం ఎందుకు వదులుకుంటాను? ఈ డైవోర్సు ఇవ్వడానికి ఎందుకు సిద్ధపడతాను? రంజనీ... పదే పదే నన్ను అనుమానిస్తూ, సందేహిస్తూ, నీ మాటలతో, చేతలతో నా మనసు నొప్పిస్తే నష్టపోయేది నీవే అని గ్రహించు. ఈ డైవోర్స్ దొరికేవరకు నానుంచి ఇంతకంటే ఏం ఎక్స్ పెక్ట్ చేయద్దు. ఇదే నీకు ఆఖరిసారి చెప్పడం..." చాలా అసహనంగా అన్నాడు.     రంజని రవీంద్ర ధోరణి చూసి కాస్త తగ్గింది. ఎంత వద్దనుకున్నా రవీంద్ర భార్యాపిల్లలతో ఏమాత్రం ఆనందంగా వున్నా సహించలేకపోతోంది. ఇంకా నెల! ఎలాగో భరిస్తే, తర్వాత...                                            * * *     "ఏమ్మా నీరదా! ఇంటికెళదామా, పని అయిపోయిందా" నారాయణమూర్తి నీరద టేబిల్ దగ్గిరకొచ్చి అడిగారు. కంప్యూటర్లో చేస్తున్న పని ఆపి వాచీ చూసుకుంది. కాస్త ఆశ్చర్యంగా "ఏడే అయింది కదా... ఇవాళ అప్పుడే వెళదాం అంటున్నారేమిటి?"          
24,708
    ఇందాకటి ఆమె అభినందన గుర్తుచేస్తూ అన్నాడు విస్సు - "అభినందిస్తున్నాను."       "దేనికి"         "నేను ఎందుకు వచ్చిందీ తెలుసుకున్నందుకు" విస్సులో ఎలాంటి సంచలనమూ లేదు. "అయితే వెళ్ళేముందు ఈ కవరు చూడండి"     కొన్ని లిప్తల విరామం తర్వాత కవరు అందుకుంది కృషి కవరులోని ఫోటోల్ని చూస్తూ అదిరిపడింది.         అవి మామూలు ఫోటోలు కాదు.         అతడి గుండెలపై ఆమె ఆదమరిచి నిద్రపోతున్నట్టు తీయబడిన ఫోటోలు.         నిలువునా కంపించిపోతున్న కృషిని చూస్తూ అన్నాడు "ఇవి మీ తాతయ్యకి చేరకూడదూ అనుకుంటే ఇప్పటి మీ ప్రయత్నాన్ని విరమించుకోవాలి. తప్పదు"         అదిగో అప్పుడు చూసింది కృషి...         ఛాంబర్ లో నుంచి తమవైపే వస్తున్నారు ఉపాధ్యాయ.         ముందు కృషి గొంతు పెగల్లేదు.         వెంటనే తేరుకుని ఉపాధ్యాయ గారికి ఎదురువెళ్ళి  "మీరొచ్చి ఎంతసేపైంది గ్రాండ్ పా" అంది ఫోటోల్ని వెనక దాచేస్తూ..... నిబ్బరంగా నిజాయితీగా బ్రతకడం తెలిసిన కృషికి ఇలాంటి సన్నివేశం అలవాటులేనిది "అదే గ్రాండ్ పా..." అర్ధం కానట్టు చూస్తున్న ఉపాధ్యాయ గారితో అంది.         "ముందుకు దూసుకుపోయే వ్యక్తికి ఓ సమస్య సైంధవుడిలా అడ్డుపడినా క్రియేటివిటీ వుంటే నెగ్గుకురావడం కష్టం కాదని చెబుతున్నాను విశ్వనాథ్ కి."         "యస్సర్" తననో సైంధవుడిగా ఆమె ఆలోచించడం ఇష్టపడని విస్సు వెంటనే అన్నాడు "మిస్ కృషి ఆ మాట అనగానే అమెరికాలో చదివి వచ్చిన మీకు సైంధవుడి గురించి కూడా తెలుసా అన్నాను. అంతే జవాబు కోసం ఆమె వెదుక్కుంటుండగా మీరొచ్చారు."         ఉపాధ్యాయగారి రియాక్షన్ ఏమైనా గాని సైంధవుడి గురించి తనకు తెలీనట్టు విస్సు మాట్లాడ్డం నచ్చలేదు కృషికి - తనను ఓడించడానికి విస్సు ఇక్కడా  సైంధవుడిలాగే అడ్డం పడుతుంటే మొహంలో భావాల్ని అణిచిపెడుతూ అంది "సైంధవుడి గురించి మీకెంత తెలుసో తెలుసుకోవాలని వుంది."         "సింధు దేశాధిపతి వృద్దక్షత్రుని కొడుకు జయద్రధుడు. సైంధవుడంటే అతడే."         "సైంధవుడు దృతరాష్ట్రుడు కుమార్తె. దుర్యోధనుడి చెల్లెలు అయిన దుస్సలని పెళ్ళిచేసుకున్నాడు" కృషి చెప్పడం ప్రారంభించింది వెంటనే "ఒకనాడు ద్రౌపదిని మోహించి ఆమెను బలవంతంగా ఎత్తుకుపోతుంటే భీమార్జునులు వెళ్లి సైంధవుడు పాండవులందర్నీ ఓడించే శక్తినిమ్మని వరమడిగితే ఒక్క అర్జునున్ని తప్ప మిగతా నలుగురు పాండవుల్ని ఒకరోజు ఓడించే వరమిచ్చాడు శివుడు ఆ శక్తితో పద్మ వ్యూహంలో అడుగుపెట్టిన అభిమన్యుడికి సహాయంగా రాబోయిన ధర్మజ భీమ నకుల సహదేవుల్ని అడ్డగించి ఓడించిన సైంధవుడు అభిమన్యుడి చావుకి కారణమయ్యాడు.         ఆ తర్వాత అర్జునుడి చేతిలో హతమయ్యాడు. అలా గొప్పవాళ్ళ పురోభివృద్దికి అల్పుడెవడైనా అడ్డుపడితే అతడ్ని సైంధవుడు అనడం ఆనవాయితీగా మారింది."         విస్సు మాత్రమే కాదు ఉపాధ్యాయ గారూ అవాక్కయిపోయారు కృషి చెప్పింది విని- పెరిగింది ఎక్కడైనా ఏ వాతావరణంలోనైనా గాని ఇక్కడి సంస్కృతి గురించి కృషి మరిచిపోకపోవడం ఒక్కటే కాదు - ఒక సాధనలా విషయాన్ని క్షున్నంగా శోధించడాన్ని అలవాటుగా మార్చుకుంది ఇప్పటిక్కూడా-         మృదువుగా నవ్వారాయణ "సో....సమస్యల సైంధవుల్ని నెగ్గుకురావాలీ అంటే క్రియేటివిటీ వుంటే చాలంటావు."         "యస్ గ్రాండ్ పా..." విశ్వనాథ్ వేపు చూసింది. ఇప్పుడు ఆమె టార్గెట్ విస్సు మాత్రమే- "క్రియేటివిటీ పట్టుదలకీ కారణమౌతుంది. ఆ పట్టుదల ఆలోచనా శక్తిని పెంచుతుంది - ఆ శక్తి పైకి దూసుకొచ్చే చీకటిని ఓడించే విద్యుచ్చక్తి ఉనికిని కనుక్కోటానికి, మనిషి పురోభివృద్దికి, సైంధవులని కడతేర్చే మారణాస్త్రాలని తయారుచేయడానికి, మొత్తం చరిత్ర పరిణామానికి మూలమౌతుంది. దాన్నే కృషి అంటారు."         చురుక్కుమందేమో వెంటనే జోక్యం చేసుకున్నాడు విస్సు "కృషి ఒక్కటే చాలదు మిస్ కృషి....దీక్ష కావాలి....దీక్షంటే మొండితనం కాదు"         "దీక్ష కావాల్సింది తపోభంగం కాకూడదనుకునే ఋషులకి మిస్టర్ విస్సూ....భంగపడుతున్నా ముందుకెళ్ళే ప్రాక్టికాలిటీకి అవసరం మొండితనమే."             "అది రిస్క్ తీసుకోవడం అవుతుంది" తన చర్యని సమర్ధించుకోబోయాడు విస్సు.         "ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న పాప్కార్న్ కంపెనీ అధిపతి ఓర్ వెల్లి రెడెన్ బీచర్ తన జీవితాన్ని ప్రారంభించింది ఓ మామూలు సేల్స్ మెన్ గా - ఆదిలో అంతా అతడ్ని అవమానించారు. పాప్ కార్న్ తో వ్యాపారం చూసి రిస్క్ తీసుకుంటున్నావని ఎగతాళి చేశారు. అయినా మొండితనంతో సాధించాడు. ఇప్పుడు రెడెన్ బేచర్ స్లోగన్ "ఒక్కటే నన్ను ప్రోత్సహించి పైకి తెచ్చింది. ఆనాడు నన్ను నిరుత్సాహపరిచిన వ్యక్తుల స్ఫూర్తి!" అలాగే కాలేజీ నుంచి సస్పెండ్ అయ్యాక టెక్సాస్ ఆయిల్ ఫీల్డులో అడుగుపెట్టి వ్యక్తిగతంగా ఆయిల్ ఎక్స్ ప్లోరేషన్ కి సిద్దపడ్డ 'డ్యూక్ రడ్ మన్' పదకొండు సంవత్సరాల సుదీర్ఘకాలం ఓడిపోయాక చివరికి నూనె నిక్షేపాన్ని సాధించాడు. మొండి పట్టుదలతో రెండు వందల ఇరవై మిలియన్ డాలర్ల ఆస్తికి అధిపతి అయ్యాడు. అతడి స్లోగన్ "నా గెలుపులో ఎక్కువ శాతం నన్ను ప్రోత్సహించింది నేను పొందిన వైఫల్యాలే" అన్నది. "సో...." క్షణం ఆగి అంది. "అమెరికాకి చెందిన ఈ ఇద్దరు ప్రముఖులు ఎదిగింది సమస్యల నుంచి రిస్కుల నుంచి మొండితనం నుంచీ - ఇక్కడ మొండితనం అనే పదాన్ని నేను ఎందుకు వాడాల్సి వచ్చిందీ అంటే ఓటమి ఎదురైతే ప్రతిసారీ వాళ్ళు వెనుకడుగు వేయకుండా మొండితనంతోనే ముందుకు దూసుకుపోయారు కాబట్టి"         "మీ ఆర్గ్యుమెంట్ ని నేను అంగీకరించలేక పోతున్నాను మిస్ కృషి" ఆమె ఆలోచనా విధానం తప్పని నిరూపించడమే తన ధ్యేయం అన్నట్టుగా చెప్పాడు విస్సు "మీరు చెప్పింది అన్ని రంగాలకీ వర్తించదు. పాట పాడలేని వాడు ఎంత మొండిగా కృషి చేసినా సంగీత విద్వాంసుడు కాలేడు."         "అసలు పాటే పాడలేనివాడు సంగీత విద్వాంసుడు కావాలనుకోడు మిస్టర్ విశ్వనాథ్. మరో వ్యాపకం అంటే, తన అభిరుచికి అనుకూలమైన మరో వ్యవహారం వేపు మొగ్గు చూపిస్తాడు. లేదూ మొండిగా సంగీత విద్వాంసుడ్ని మాత్రమే కావాలీ అనుకుంటే ప్రారంభం దగ్గరే అంతమైపోతాడు.         "అంటే మొండితనం ఒక్కటే ఏదన్నా సాధించడానికి సరిపోదనేగా" కంక్లూడ్ చేశాడు విస్సు కృషిని ఖండిస్తున్నట్టుగా "యస్ మిస్ కృషి.....మనిషి ఒక గమ్యాన్ని చేరాలీ అంటే కావాల్సింది ముందు సంకల్పం. తర్వాత దానికోసం ప్రణాళిక. ఆ తర్వాత సాధించింది నిలుపుకోటానికి నిర్విరామ పోరాటం.... ఈ పోరాటం అన్నది ఓ స్థాయికి చేరిన సంగీత విద్వాంసుడు రోజూ చేయాల్సిన సాధనలాంటిది. IF YOU MISS ONE DAY PRACTICE YOU NOTICE THE DIFFERENCE. IF YOU MISS TWO DAYS OF PRACTICE, THE CRITICS NOTICE THE DIFERENCE, IF YOU MISS THREE DAYS OF PRACTICE THE AUDIENCE NOTICES THE DIFFERECE. ఇది కేవలం సంగీతానికే కాదు, మనిషి జీవితంలో ప్రతి ప్రక్రియకీ వర్తిస్తుంది."         తెలివిగల యిద్దరు వ్యక్తుల మధ్య సాగుతున్న ఆ చర్చ ఉత్సాహాన్ని కలిగించిందో లేక వారి చర్చలలో జోక్యం చేసుకోకూడదనుకున్నారో ఉపాధ్యాయ నెమ్మదిగా లేచి వెళ్ళిపోయారు......ఆ గదిలో తన ముందు అణుకువగా నిలబడటం మాత్రమే తెలిసిన విస్సు యిప్పుడు క్రమంగా ఆ యింటిలోని ఓ వ్యక్తిలా కృషితో మాట్లాడం ఆయనకీ ఆనందంగా వుంది....విస్సు ఉనికిని భరించలేనట్టుండే కృషి సైతం విస్సుని తనతో బాటు ఓ మేధావిగా అంగీకరించడం ఆయన కోరుకుంటున్నదే. ఇక్కడకూడా వ్యాపార బంధంలాగే ఆలోచించారు తప్ప అంతకుమించి స్నేహాన్ని ఆయన ఆశించలేదు... ఆశించరుకూడా.... తన సామ్రాజ్య విస్తరణలో కొందరు విశ్వనాథ్ లు తనకు అండగా వుండటాన్ని ఆయన కోరుకుంటున్నారు. అంతే...         ఉపాధ్యాయగారు వెళ్ళాక విస్సు కూడా తన గదివేపు నడవబోతుంటే పిలిచింది కృషి "ఆగు"         నిశ్చలంగా చూశాడు విస్సు "తెలివైనదానివి కృషి....మొత్తానికి మీ గ్రాండ్ పాకి ఫోటోలు చూపించే అవసరాన్ని తప్పించావు"         కృషి పిడికిళ్ళు బిగుసుకున్నాయి "ఎలా తీశా నీ ఫోటోలు"         "అది చెప్పాలీ అంటే కెమెరాలోని రకాలు వాటి ఉపయోగాల గురించి నీకు చిన్న సైజు లెక్చరివ్వాల్సి వుంటుంది."         "ఆ వివరాలు నాకు అవసరం లేదు మిస్టర్ విస్సు.... ఈ సాహసాన్ని ఎక్కడ ఎలా చేయగలిగావూ అని"         "నీ బెడ్ రూంలోనే..."మృదువుగా నవ్వాడు విస్సు.         "అవును కృషి. నీకు ప్రతిరాత్రీ నిద్రపోయేముందు కాంప్లాన్ తాగడం అలవాటుగా. అందులో కొన్ని ట్రాంక్విలైజర్సు కలిపాను..... తర్వాత నువ్వు మత్తుగా నిద్రలోకి జారేక అర్ధరాత్రి నీ బెడ్ రూంలోకి దూరి నిన్ను నా గుండెలపైకి లాక్కుని అప్పుడు..."         "స్టాపిట్" అరిచింది ఆవేశంగా.         "చెప్పనియ్ కృషీ....నిన్ను నా గుండెలపైకి లాక్కున్నాక నాలో కలిగిన రసాయనికమైన మార్పుల గురించి, ఆ తర్వాత నన్ను నేను అదుపు చేసుకోటానికి నేనుపడ్డ శ్రమ గురించి వివరంగా తెలియచేయనియ్.'         "అవసరం లేదు" అది అతడిపైన ద్వేషమో లేక తన ఇంటిలో తనపై చేసిన ప్రయోగానికి తన శరీరాన్ని తనే కోసుకోవాలన్నంత జుగుప్సాకరమైన భావమో కంపించిపోతూ అంది" అసలు ఇలా చేయడానికి నీకెన్ని గుండెలు..."         "ఒక లక్ష్యం సాధించడానికి రిస్క్ ఎంత అవసరమో బిజినెస్ టైకూన్స్ రెడెన్ బేచర్ డ్యూక్ రడ్ మన్ ల కథల ద్వారా యిందాకే తెలియచెప్పావుగా కృషీ....అయినా నిన్ను నేనేం రేప్ చెయ్యలేదే....రెచ్చిపోయే నీలాంటి ఆడపిల్లని అదుపు చేయడానికి అవసరమని ఇలా ఫోటోలు తీశాను....అఫ్ కోర్స్ కొన్ని పుట్టుమచ్చల్ని చూశాననుకో."         "వ్వాట్" రొప్పుతూ చూసింది కృషి "అంటే నువ్వు...."         మనసు విస్ఫోటనంతో మెదడు నిశ్శబ్దం చెదిరిన కృషి కలవరపాటుగా ఆగిపోయింది. అది కలవరం కూడా కాదు. ఏ విషాద నిశీధాల వెన్నెల మరకలో కలుషితమయినట్టు ఇంకా ఒలకని యవ్వన మధు పాత్రలోని అనుభూతుల మాధుర్యాన్నో అనుమతిలేకుండా మరెవరో తాకినట్టు కలత చెందింది.....యింతకు తెగించిన ఈ మనిషి ఇంకా ఏం చేసి వుంటాడు.         "కేవలం చూశావే తప్ప ఏదో చేసినట్టు అంత కంగారు పడతావేం - కృషీ" ఆర్ద్రతకి భావుకతని రంగరించి స్వప్నంలోలా అన్నాడు విస్సు. "అప్పటిదాకా తెలీదు నాకు పగిలిపోతున్న క్షణాలలోని నిశ్శబ్దాల మధ్య అందం కూడా ఓ అస్థిత్వం కాగలదని - మనసు పడితే నేను తలదాచుకునే దివ్యరస సౌధానివి కాగలవని అప్పటిదాకా నాకు అర్ధం కాలేదు. ఏకాంతపు పాలరాతి మందిరాన నీ సన్నిధిలో కూర్చుంటే నిన్నటి నా ఎడారి తీరాల్ని మరిచి విస్ఫారిన నేత్రాలలో నీ తనువంతా వెదకాలనిపించింది - అరమోడ్పులైన నేత్రాంచలాల్లో అనంతానంత లోకాల్ని చూస్తూ కదలని నీ పాద మంజీర ధ్వనుల్ని వింటూ ఏ సుదూర తీరాలకో పారిపోవాలనిపించింది ఒక్క క్షణం ఒకే ఒక్క క్షణం కోరికల గుర్రాల మీద స్వారీ చేసి నీ స్మృతుల జీవన భ్రుతిలో రాలిపోతేనేం అనిపించింది. నీలోని ప్రభాత కోమలత్వాన్ని ఆస్వాదిస్తూ నిన్ను తాకే ప్రత్యూష పవనాన్నై యోగసిద్దిని పొందాలనీ మనసు తొందరపడింది. నఖసిఖ పర్యంతం తక్షకుడిలా కాటు వేయడం నాకు కష్టం కాదు కృషీ. అప్పటి అవకాశం నాది - అయినా నిగ్రహించుకున్నాను ఎందుకో తెలుసా - నువ్వు తరుణివీ వైతరణివీ అన్న ఆలోచన నా మనసు మైదానంలో అలవోకగా మెదిలిన సజీవ స్వప్న లావణ్య శాఖవని."
24,709
         "అన్యాయం. కష్టం నాది, ఫలితం నీకునా" అన్నాడు సిద్ధార్థ.     అతని  మాటలకి ఆమె నవ్వింది.     "నీ కష్టానికి బుణం వుంచుకోనులే, మంచి   ప్రజంటేషన్ ఇస్తాను."     "అంత మంచి బహూమతి ఏమిటో?"      ఇందిర మూతిని   మూడు  ఒంకర్లు తిరిగోపోయేలా చూస్తూ అంది అతనితో-      " నీ కిష్టమైన తియ్యని లడ్డూలు. అంతకంటే  తియ్యని చాక్లెట్స్. చాలా ?"  అంది ఇందిర.      "ఎప్పుడిస్తావో చెబితే రెండు రోజులు భోజనం చేయకుండా ఎదురు చూస్తాను,"       చిన్నగా నవ్వాడతను.       "మా అమ్మ ఊళ్ళో లేనప్పుడు!" ఆమె పెదవులను తడిచేసుకొంటూ చెప్పింది.       సిద్ధార్థ ఆమె మాటలకి  ఉలిక్కి పడ్డాడు.      "ఏమో  అనుకొన్నాను గడసుదానివే!"      "మరి నీలా పప్పుసుద్దనుకొన్నావా?" అని పకపకమని  నవ్వింది. ఆమె నవ్వుతో అతను శృతి కలిపాడు.      అదే అతను చేసిన తప్పు గుమ్మంలో గజలక్ష్మి భద్రకాళిలా నించుని వుంది కళ్ళలో నిప్పులు చెరుగుతూ.      "ఇందూ!" ఖంగుమంది గజలక్ష్మి గొంతు.      ఆగొంతు వినడంతో టే బిక్కచచ్చిపోయారు ఇందిర, సిద్దార్థ.      "  ఈడొచ్చిన పిల్లవి. సిగ్గూ సెరం ఉండనక్కర్లా?" ఆ ముష్టి వెధవతో ఏమిటే  ఆ వికవికలు, పకపకలు...."      సిద్దార్థకి ముచ్చెమటలు  పోస్తున్నాయి.      గజలక్ష్మి తీక్షణంగా చూసిందతనికేసి.      ఈ చూపులోని తీక్షణతకి తను మాడి మసైపోతానా అన్నంత భయం. కలిగి వణికోపతోయాడు సిద్దార్థ.       "పూట గడుపుకోడానికి వచ్చిన  ముష్టి వెధవ్వి. నా బిడ్డని తెలివి తక్కువదాన్ని చేసి మత్తుమందు పెట్టడానికి చూస్తున్నావా? త్రాష్టుడా!"      "నీ మొహానికి వారానికో  పూట భోజనం కాదురా పెట్టాల్సింది. మొహాన పేడనీళ్ళు చల్లాలి.  నలుగురికీ చెప్పి, నాలుగుపూటల్ని ఒదటగొట్టి నీ మొహం ఈ పేటలో కనబడకుండా చేస్తాను" అని కూతురు వేపు తిరిగింది.     " ఏమే! సిగ్గులేనిదానా! యింకా   యిక్కడే తగలడ్డావే. లోపలికి పో.... " అరిచింది.     కానీ ఇందిర కదలలేదు.       " అతనేం చేశాడని అలా తిడుతున్నావు?" అంది ఇందిర.     దాంతో గజలక్ష్మికి శివమెత్తింది. కూతురు ఎదురు చెప్పడంతో మండిపడుతూ సిద్దార్థ కేసి తిరిగింది.       " ఇదిగో ముష్టి సన్నాసీ! నీకిదే చెప్పడం. నీకు ఇదే ఆఖరిరోజు నా  ఇంట పిండాకూడు తినడానికి.  నీకిక వారం  లేదూ,  నెలా లేదు ఇంకె ప్పుడూ ఈ గడప తొక్కకు మళ్ళీ ఈ ఛాయలకొచ్చావంటే కాళ్ళు  విరగ్గొడతాను."     సిద్దార్థ మెల్లగా నోరు విప్పాడు.      "అది కాదమ్మా ఇందిరకి లెక్క తెలీకపోతే" చెప్పబోయాడతను.      తల్లికేసి కోపంగా చూస్తోంది ఇందిర. కానీ ఏమీ చేయలేని స్థితి. సిద్దార్థని ఆమె తిట్టిపోస్తోంటే మాత్రం ఇందిరికి చాలా బాధగా వుంది. ఏడుపొస్తోంది. తన మూలంగా   అతన్ని తల్లి  తిడుతోంది . కానీ అది చాలా  అన్యాయంగా తోస్తోంది  ఇందిరకి.       " మాట్లాడకు నీ బోడిలెక్కలు నాకూ వచ్చు. అది నన్నడక్కగానీ  నీ మాత్రం నేనూ  చెప్పగలను. నీ ముష్టి లెక్కలు. ఇదిగో అబ్బాయ్ నేను మంచిదాన్ని కాబట్టి సరిపోయింది లేకపోతే నీకు గుండు కొట్టంచి సున్నపు బొట్లు పెట్టేదాన్నీ."     అయినా ఆడపిల్లలు వున్న  ఇంటికి అడ్డమైన గాడిదల్ని రానివ్వకూడదన్న జ్ఞానం ఆ  మనిషి కుండాలి.      "  అమ్మా చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు.ఇందిరకిగానీ, నాకుగానీ ఏపాపం  తెలీదు.       తెలీని లెక్కని అడిగితే చెప్పాను. అనవసరంగా గొడవచేసి అల్లరి కావద్దు.      "నేను అనాధని. నాకు పరవాలేదు నలుగురూ వింటే ఆడపిల్ల పరువేం కావాలి."      " ఓరి ఓరి ఓరి..... ముదనష్టపు వెధవా! ఎంతకి తెగించావురా. నా బిడ్డ మర్యాద గురించి నాకే చెబుతున్నావా! ఓయమ్మో తెలిసిందిరో! నువ్వు మామూలు మనిషవికావు, గుండెలు తీసిన బంటుని నన్నే బెదిరిస్తున్నావా? నీ కళ్ళు పోను.      నీ చేతులు విరిగిపోను" గజలక్ష్మి నోటికి ఆనకట్ట తెగింది.      పక్క ఇళ్ళలోంచి  అమ్మలక్కలు గోడ దగ్గరికి చేరి చోద్యాన్ని  తిలకిస్తున్నారు ఆ వాడలోనివాళ్ళు.      సిద్దార్థ  ఎంత  మంచి కుర్రాడో వాళ్ళందరికీ తెలుసు. గజలక్ష్మి నోటి దురుసుతనానికి విస్తుబోతున్నారు.      సిద్దార్థ కళ్ళలో నీరు తిరిగింది. పట్టెడు అన్నం పెడుతోందని వచ్చాడే తప్ప పుట్టెడు శాపనార్దాలు పెడుతోందని  రాలేదు. వూహించని  అవమానం జరిగేసరికి భరించలేకపోయాడు.      అతను మెల్లగా కదిలాడు వెళ్ళిపోడానికి.         "పోరా పో. వారాలు చేసుకొని పొట్ట గడుపుకోడానికి లేని నా మర్ద కాస్త మందలించేసరికి పొడుచుకొచ్చింది. బోడి సన్నాసి పో" విదిలించి  కొడుతూ అంది గజలక్ష్మి.      గుమ్మం దాటుతూ ఒక్కసారిగా  వెనక్కి తిరిగి చూశాడు సిద్ధార్థ.       గజలక్ష్మి  కూతురి  నెత్తిన మొట్టికాయలు  వేస్తోంది. సిద్దార్థ వీధి గుమ్మంలోంచి బయటకిరాగానే  ఆ పక్కంటి ఆవిడ పార్వతమ్మ అతని దగ్గరగా వచ్చింది.       " అంతా విన్నాను బాధపడకు నాయనా!  దాని నోరే ఆంత. పద, రెండు మెతుకులు నా ఇంట్లో తిని వెళుదుగాని" అంది పార్వతమ్మ.      ఆమె ఔదార్యానికి  అతనికి ఏడుపొచ్చేసింది.      ఆమె కేసి ఒక్కసారి చూశాడు.      సాక్షాత్తు పార్వతీదేవిలా కనబడింది ఆమె అతని కళ్ళకి.      ఆమెకి రెండు చేతులెత్తి నమస్కారం చేసి వడివడిగా నడుస్తూ వెళ్ళిపోయాడు సిద్దార్థ.                                    6      అభనయ్ సిగరెట్ పెట్టె కొనుక్కొంటూ వెనక్కి తిరిగిచూశాడు.     ఇందిరా వెళుతోంది.      సన్నగా ఈల వేశాడు.      ఆమె అతన్ని చూసింది.      అతను ఆమె దగ్గరగా వెళ్ళి  " ఇందూ, సిద్దార్థ వచ్చివెళ్ళాడా?అడిగాడు.      ఆరోజు సిద్దార్థకి కొండలరావింట్లో భోజనం అని అభినయ్ కి తెలుసు.       " ఆ వచ్చాడు..... వెళ్ళాడు" అంది నిట్టూరుస్తూ ఇందిర.      "అభినయ్ కి ఆ సమాధానం నచ్చలేదు."      "ఏం అలా అంటున్నావు"  నోరు పారేసుకొంటే వెళ్ళిపోయాడు. బొంగురుపోయింది. ఇందిర గొంతు."      ఆపిల్ల కళ్ళల్లో నీరు సుడులు తిరుగుతోంది.      "సరే. నువ్వెళ్ళు" అన్నాడు సిగరెట్ వెలిగించుకొని మెల్లగా ఇంటికేసి నడిచాడు అభినయ్.       "ఏం నాయనా, బలాదూరు తిరగడం పూర్తయిందా?"
24,710
    "డియర్ ఫ్రెండ్స్!" అన్నాడు గోపాల్రావ్ "మన కాలనీలో ఈ సభ జరగలేదని మనందరికీ తెలుసు! అయినా ఈ న్యూస్ ఇలా రాశారంటే కేవలం ఆ శ్యామల్రావ్ గాడి పనేనని నాకు అనుమానంగా ఉంది-"     "అనుమానంగా ఉంటే ఇంకా ఆలస్యం ఎందుకు? వాడింటికెళ్ళి- బయటకు పిలిచి గిటార్ వాయిస్తే సరిపోతుంది కదా-" అన్నాడు మా కాలనీలో వెయిట్ లిఫ్ట్ ర్ వివిన్ పాల్!     అప్పటికప్పుడే అందరం కలిసి ఊరేగింపులాగా శ్యామల్రావ్ ఇంటి దగ్గరకు నడిచాము. శ్యామల్రావ్ ఇంటి బయట ఇద్దరు పోలీసులు తుపాకులు పట్టుకూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. మమ్మల్ని చూడగానే తుపాకులు చేతిలోకి తీసుకుని పొజిషన్ లో నిలబడ్డారు.     మాకు పరిస్థితి అర్థమయిపోయింది.     "శ్యామల్రావ్ గారూ-" పిలిచాడు శాయిరామ్.     శ్యామల్రావ్ హడావుడిగా చొక్కా వేసుకుంటూ బయటికొచ్చాడు.     "ఏమిటీ- ఇంతమంది వచ్చారు?" అనడిగాడు ఏమీ తెలియనట్లు.     "మీరు నిన్న మన కాలనీలో ఏదో సభ జరిపారట- దాన్ని గురించి తెలుసుకుందామనీ!" అన్నాడు రంగారెడ్డి వెటకారంగా.     "అదా- అదీ జరిగింది మా ఇంట్లోనే-" అన్నాడతను.     "అలాగా- సభకు వచ్చిన జనం మీ ఆవిడా, మీ అబ్బాయ్, మీ కోడలూ అయుంటారు! అవునా?"     "లేదు ఆ చివరింటి ముసలమ్మకూడా వచ్చింది-"     మా కాలనీ బాడీబిల్డర్, వెయిట్ లిఫ్టర్ ఛటుక్కున శ్యామల్రావ్ చొక్కా పట్టుకున్నాడు.     "అలాంటప్పుడు అది కుటుంబ సభ అని రాసుకోక కాలనీ సభ అని ఎందుకు రాయించావ్ బే?"     పోలీసులు ఛటుక్కున రైఫిల్ పైకెత్తి గాలిలోకి రెండు రౌండ్లు కాల్చారు. దాంతో మేము పాల్ ని వెనక్కు లాగేయక తప్పలేదు.     "కాలనీ సభ్యులారా! ఇదంతా ప్రభుత్వం పన్నిన కుట్ర! మన శ్యామల్రావ్ వాళ్ళ దగ్గర ఏ పాతికో పరకో లంచం తిని ఇచ్చిన స్టేట్ మెంట్ అది! అంచేత మనం ఇవాళే మరో స్టేట్ మెంట్ తయారు చేసి ధరల గురించిన నిజానిజాలు అన్ని పత్రికల్లోనూ ప్రచురింపజేద్దాం!" అన్నాడు శాయిరామ్.     అందరం మళ్ళీ వేదిక దగ్గరకెళ్ళి ఓ తీర్మానం తయారుచేసి దానిని పత్రికాఫీసుకి పంపించే బాధ్యత రంగారెడ్డి, గోపాల్రావ్ ల మీద పెట్టాం!     ఆ తరువాత పేపర్లో వార్తలన్నీ మిగతా రాష్ట్రాల్లో ప్రజలు ఎన్ని కష్టాలు పడుతోందీ, అక్కడ ప్రభుత్వాలు ఎంత నికృష్ఠంగా పరిపాలిస్తోందీ- వీటి గురించినవే!     సరిగ్గా అప్పుడే మా కాలనీ తాలూకు కుర్రాడొకడు పరుగుతో మా దగ్గరకొచ్చాడు.     "అంకుల్- మా మమ్మీ మిమ్మల్ని అర్జంటుగా పిలచుకు రమ్మంటోంది-" అన్నాడు శాయిరామ్ తో.     "ఎందుకు?" ఆశ్చర్యంగా అడిగాడు శాయిరామ్.     "మా పక్కింటిలో తాతగారు ఉరివేసుకుని చచ్చిపోయారట-"     అందరం ఆదరాబాదరా పరిగెత్తాం. ఆ కుర్రాడితల్లి భయంగా ఇంట్లో నుంచి బయటకొచ్చింది. ఆమె వెనుకే ఏడుస్తూ ఓ ముసలమ్మ బయటికొచ్చింది..     "ఆ ఇల్లేనండీ! పొద్దున్నుంచీ చడీచప్పుడూ లేకపోతేనూ తలుపు తోసి చూశాను. లోపల ఉరేసుకుని వేలాడుతూ కనిపించారు. పాపం ఈ మామ్మగారు పస్తులుండలేక వాళ్ళమ్మాయి ఇంటికెళ్ళి ఇప్పుడే బియ్యం అప్పుగా తెచ్చుకున్నారు. వచ్చేసరికి ఆయన ఉరి సీన్."     నేనూ, శాయిరామ్ రంగారెడ్డి చప్పున ఆ ఇంట్లోకి నడిచాము. ముసలాయన శరీరం తాడుకి వేలాడుతూనే ఉంది.     టేబుల్ మీద ఓ కాగితం పేపర్ వెయిట్ కింద కనబడుతోంది.     నేను త్వరగా ఆ పేపర్ తీసుకుని చూస్తాను.     "రిటైర్ అయి సంవత్సరం దాటినా ఇంకా నాకు పెన్షన్ రాలేదు. ప్రభుత్వానికి ఎన్నో ఆర్జీలు పెట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది. తినడానికి తిండికూడా లేని పరిస్థితుల్లో- నా జీవితాన్ని అంతం చేసుకోవాల్సి వస్తోంది, నా చావుకి ముమ్మార్లూ ప్రభుత్వానిదే బాధ్యత-"     ఆ పేపర్ తీసుకెళ్లి బయట అందరికీ గట్టిగా చదివి వినిపించాను.     "మరి పేపర్లో ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ ఒక్క ఆర్జీగాని, ఫైల్ గానీ, కేస్ గానీ పెండింగ్ లో లేదని రాశారేంటి?" అడిగింది రాజేశ్వరి కోపంగా.     మేం ఆ తర్వాత కార్యక్రమం నిర్వహించడానికి బయల్దేరాం.     మర్నాడు పేపర్లో వచ్చిన వార్తలు చూసేసరికి మాకు మతిపోయినట్లయింది.     "నిర్భయ్ నగర్ కాలనీలో- ఓ వృద్ధుడు కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసింది. అయితే అతని మానసిక పరిస్థితి సరిగ్గాలేదని కూడా తెలుస్తోంది. అతను మాజీ ప్రభుత్వోద్యోగి. పోలీసులు శవాన్ని మార్చురీకి పంపించారు"     దానికిందే మరోవార్త!.     "ధరలను ప్రభుత్వం అదుపులో పెట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని నిర్భయ్ నగర్ కాలనీలోనే జరిగిన మరో ఊరేగింపు శ్యామల్రావ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆనందోత్సాహాలు పట్టలేక ఇరువురు పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. అందరూ మూకుమ్మడి నృత్యాలు జరిపాక ఆ ఊరేగింపు ప్రశాంతంగా ముగిసింది!"     "ఇది టూమచ్ అన్యాయం ఉన్నాయి-" అన్నాడు నిసార్.     "మనం ధరలు తగ్గినందుకు నృత్యాలు చేశామా? ఏడుపొచ్చినా సంతోషం వచ్చినా పాటలు పాడుతూ డాన్స్ ళు చేయడానికి ఇదేం సినిమానా?" అంది పార్వతీదేవి ఉక్రోషంగా.     "మనం వూరుకుంటే లాభంలేదు. ఈ వార్త అబద్ధమని మరో పేపర్ స్టేట్ మెంటివ్వాలి!" అంది రాజేశ్వరి.     "దానిని మాత్రం ఎవరు పబ్లిష్ చేస్తారు?"     "ఎవరికీ ఏం చేయడానికి తోచలేదు. మేము మాట్లాడుతూండగానే పోలీస్ వాన్ ఒకటి వేగంగా వచ్చి మాకు సమీపంగా ఆగింది. అందులో నుంచి ఇన్ స్పెక్టర్ ఇద్దరు కానిస్టేబుల్స్ దిగారు.     "ఇక్కడ 'ఈక్షణం దినపత్రిక ఛీప్ రిపోర్టర్ గోపాల్రావ్ ఎవరు?"     "నేనే" అన్నాడు గోపాల్రావ్.     "నిన్ను అరెస్ట్ చేస్తున్నాం-"     "ఎందుకు?" ఆశ్చర్యంగా అడిగాడు గోపాల్రావ్.     "కొన్ని వార్తలు సెన్సార్ ఆఫీస్ అనుమతి లేకుండా పబ్లిష్ చేసినందుకు"     "ఏమిటా వార్తలు?"     ఇన్ స్పెక్టర్ పేపర్ తీసుకుని గట్టిగా చదివాడు.     "నిర్భయ్ నగర్ కాలనీలో మెదడువాపు వ్యాధి! ఆరుగురు పిల్లలు మృత్యువుతోపారాటం జరుపుతున్నారు. కాలనీలో యధేచ్చగా తిరుగుతూన్న పందులవల్ల ఈ వ్యాధి మరికొంతమందికి సోకే అవకాశం ఉంది" ఇది ఇది ఎవర్నడిగి రాశారు?"     "ఇందులో అడగాల్సిందేముందీ- మా కాలనీకొచ్చి ట్రీట్ చేసిన డాక్టర్లు చెప్పిందే రాశాను-"     "డాక్టర్లెవరయ్యా చెప్పటానికి! గవర్నమెంట్ చెప్పాలి- వాళ్ళకేం జబ్బో! ప్రెస్ బిల్ అమల్లో ఉన్నప్పుడు అన్ని విషయాలూ గవర్నమెంటే చెప్తుంది! తెల్సిందా?"     "తెల్సిందండీ"     "అసలు ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి అంటువ్యాధులూ లేవనీ, ప్రభుత్వం అన్ని జబ్బులనూ పూర్తిగా నిర్మూలించేసిందనీ ప్రభుత్వం నిన్నే స్టేట్ మెంటిచ్చింది! నువ్వేమో ఇవాళ మెదడు వాపు వ్యాధి ఉందని రాస్తావా?"
24,711
    "ఒక ఆడదానికి కొడుకును పెంచడం చేతకాక చెడగొడితే ఇంకో ఆడది భార్యగా వచ్చి దిద్దుకోవాలా? మగవాడికి లక్ష వ్యవహారాలుంటాయట.  తానూ ఒక ఆడదై వుండి ఒక మగవాడిని ఎలా సమర్దిస్తుందో! కూతురిగా భార్యగా పురుషుడి వల్ల పడ్డకష్టాలు, అవమానాలు తల్లి అయ్యేసరికి  ఒక్కసారిగా  మరిచిపోయి  అతడిని క్షమించడమే కాదు, సమర్దిస్తుంది కూడా! నీ ఇంటికి వచ్చే కోడలు ఏ మచ్చాలేని కడిగిన ముత్యంలా వుండాలి! మీ కొడుక్కి  మాత్రం లక్ష వ్యవహారాలుండొచ్చు! ఇదేం, న్యాయం అత్తగారూ?"     "చూశారు కదా? ప్రతీదానికి ఇదీ కుతర్కం! ఇదసలు కాపురం చేసే ఆడదా? దీనికసలు పెళ్లెందుకు చేశారు? దీనివల్ల నా కొడుకు జీవితం నాశనమైపోయేట్టుంది! ఇంట్లో సుఖశాంతులు కరువైతే  మగవాళ్లు ఎలా తయారవుతారో,  చదువుకొన్నది కదా, ఆ మాత్రం ఆలోచించక్కరలేదా?"     "ఒక్క నావల్లే సుఖ శాంతులు కరువు కావడం లేదని మీరు గ్రహించాలి! సహృదయతా, సంస్కారం లోపించిన అతడి ప్రవర్తనవల్లే ఈ ఇంట్లో సుఖశాంతులు లోపిస్తున్నాయిగాని నా వల్ల కాదు! రేపు ఈ కాపురం కూలిపోవడమే జరిగితే ఈ మంటకు రెండు సమిధలు వేసిన పుణ్యం మీకూ దక్కుతుంది లెండి!"     "అయ్యో, అయ్యో! నాకెందుకమ్మా ఈ అపవాదు? నీ కాపురం వుంచుకుంటావో, ఏట్లో కలుపుకుంటావో నాకెందుకు? రేపే మా వూరెళ్లిపోతాను!" ధుమధుమ లాడుతూ కదలబోతూ వియ్యపురాలికేసి తిరిగి, "ఆడపిల్లను ఇలాగేనా పెంచడం? కూతురిచేత కాపురం చేయించాలనుకొంటున్నావా? విడిపించి ఇంట్లో వుంచుకోవాలనుకుంటున్నావా?  ఇంట్లో వుంచుకోవాలనుకొంటే నేను చెప్పేదేమీ లేదు! నీ ఖర్మకు నువ్వే అనుభవిస్తావు! కాని,  కాపురం చేయించాలనుకొంటే మాత్రం ఆమెకింత గడ్డిపెట్టి పో!" అని, తన గదిలోకి వెళ్లిపోయింది.     హేమలతకు కూడా కూతురు కాపురం చేసేలా కనిపించలేదు! ఇంతా చేసింది కూతుర్ని కాపురం విడిపించి ఇంట్లో పెట్టుకోవడానికి కాదు కదా? "ఆడపిల్లను ఇలాగేనా పెంచడం?" అని ఇవాళ వియ్యపురాలు అన్నట్టే రేపు అందరూ అంటుంటే ఆ అవమానం తను భరించలేదు!     "వ్యక్తిత్వమూ, స్వేచ్చా అన్నవి కాపురం నిలబెట్టుకొని తరువాత ఉపాయంగా అవి సాధించుకోవాలిగాని వాటి కోసమే కాపురం వదిలేసుకోవడం ఏం విజ్ఞత?  ఇదే నీ చదువు, సంస్కారం చెప్పేట్టయితే వాటిని తగలేయాలి!" అంది హేమలత కోపంగా.     "నా వ్యక్తిత్వాన్నే స్వేచ్చనూ బలిపెడితే తప్ప ఈ కాపురం నిలిచేస్థితి కనిపించడంలేదు! ఆలోచనలు లేకుండా ఒక మృగంలాగానో,ఒక బొమ్మలాగానో నేను కాపురం చేయలేను!" ఖండితంగా చెప్పింది హరిత.  "కాపురం ఇబ్బందుల్లో పడి అసహాయంగా రోదించే ప్రతి  ఆడపిల్లకూ ప్రతి తల్లీ యుగయుగాలుగా  ఇదే వార్నింగ్ ఇచ్చి వుంటుందని నా నమ్మకం! ఇవాళా నిన్న ఆడపడుచులకు  జరుగుతున్న  ఇన్ని అవమానాలూ, ఇన్ని దారుణ మరణాలూ, హత్యలూ, ఆత్మహత్యలూ జరుగుతున్నాయంటే వాటి వెనుక వాళ్ల  తల్లి రాతిగుండె తప్పకుండా వుంటుంది!   ఇంత అపురూపంగా పెంచి పెద్దచేసి వీళ్ల చేతుల్లో పెట్టింది రాక్షసుల్లా బలి తీసుకోవడానికా అని ఒక్క నిముషం ఆలోచించగలగితే, పరువు, ప్రతిష్ట, సంప్రదాయం అన్నవి కొంచెం పక్కకు పెట్టి ఆలోచించ గలిగితే, ఆడపడుచుల ఆత్మహత్యల, హత్యల సంఖ్య  ఎంతో తగ్గిపోయేదని నా నమ్మకం." విరక్తిగా నవ్వింది హరిత. "కాపురం వదిలేసి వచ్చి నేను మీ ఇంట్లో తిష్టవేస్తానని భయపడకు మమ్మీ. స్త్రీకి పుట్టిల్లు అత్తిల్లు లేకపోయినా మరోవిధంగా కూడా గౌరవంగా తన జీవితం తను గడపగలదు అని నిరూపిస్తాను!"     "బ్రతకొచ్చే! పిడికెడు ముద్దా, జానెడు గుడ్డా సంపాదించుకోవడం అదో ఘనకార్యంకాదు. మొగుడూ మొద్దు లేని జీవితం అదీ ఒక జీవితమేనా?"     "ఆ మొగుడే ఒక రాక్షసుడైనప్పుడు, ఆ మొగుడు లేకుండా తన జీవితం తను జీవించడం నేరమెలా అవుతుంది? సంప్రదాయ శృంఖలాలు త్రెంచుకుని నీ కూతురున్న పరిస్థితిని వాస్తవంగా చూడటం నేర్చుకో మమ్మీ! వరకట్నం లేని ఆదర్శవివాహాన్ని నేను కోరాను. మీరు ఏంచేశారు? లోపల్లోపల లక్ష కట్నం మాట్లాడుకొని నా ఆదర్శన్ని  దారుణంగా అవమానించారు!  నన్ను మోసం చేశారు. మీరిచ్చింది డెబ్బైవేలేనట! మిగతా ముప్పైవేలు నేను అడిగి తీసుకురాకపోతే  ఆయన నన్ను చంపేస్తానన్నారు. ఆడపిల్లల్ని కని చితిలోకి నెడుతునన్నది మీరమ్మా! శక్తికి మించిన కట్న కానుకలు ఒప్పుకోవడం - ఇవ్వలేక అత్తింట్లో నరకం  కల్పించడం! ఆమె జీవితంలో  నిత్యాగ్ని రగిలించడం! ఆడపిల్లల చావుల వెనుక వున్నది నిజానికి మీ తల్లిదండ్రులు, మీ సంప్రదాయాలు -మీ కుటుంబ గౌరవాలు మీరూ, మీ కుటుంబ గౌరవాలూ నన్ను నిస్సహాయురాల్ని చేసి చంపేయకముందే నేను ఈ చితిలోంచి, ఈ నరకంలోంచి బయటపడాలనుకొంటున్నాను! మగడ చస్తే బతికున్న వాడి భార్యను కూడా వాడితోపాటు  చితిలోకి నెట్టి బలవంతంగా  చంపేసే ఆచారం వుండేదట! ఇప్పుడు మగడు బ్రతికివుండే ఆమెకోపం చితి రగిలిస్తున్నాడు. సమాజం.  తలిదండ్రులు, సంప్రదాయాలు ఈ సతిని బలవంతంగా చితిలోకి నెట్టి కాల్చివేస్తున్నారు.  అది కనిపించే చితి అయితే ఇది కనిపించని చితి!  ఆ చితిలో సతి ఒక్కసారిగా తగలబడి  చనిపోతే ఈ చితిలో రోజురోజుకింత చొప్పున తగలబడుతూ, చస్తూ వుందన్నమాట! నాకీ సతీత్వమొద్దు. ఈ చితిలో నేను చావను. నన్ను నన్నుగా బ్రతకనివ్వండి!" ఆవేశంతో, దుఃఖంతో మాట్లాడుతున్న కూతుర్ని మ్రాన్పడినట్టుగా చూడసాగారు కృష్ణారావు దంపతులు.                          *    *    *    *
24,712
    అతన్ని విష్ చేసినా శరత్ భార్గవ కుడిచేతిని గమనించలేదు గమనించినా గుర్తించలేదు ఆ చేతి బొటన వ్రేలి గోటికి సిక్ పాకెటర్స్ ఉపయోగించే బ్లేడ్ వుంది. చూపుడు వేలికి పొటాషియం సైనైడ్ పూయబడి వుంది.     "రాత్రి ఇద్దరు శిశువులు హత్య చేయబడ్డారట."     "అవును భార్గవా! లక్ష్మి కేసుగెలిచాక మతోన్మాదుల దౌర్జన్యం అయి వుంటుంది. మా కోసం- మాక్కావాల్సిన ఒక్క వారసుడికోసం మీరెందరు కష్టాలనుభవిస్తున్నారో నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను. బాబీ మాయమవటం సుగాత్రిని బాగా కృంగదీస్తోంది. భార్గవా! నేనిప్పటివరకూ ఎవర్నీ క్షమాపల్ని కోరలేదు. ప్లీజ్ పర్ డన్ మీ...."     శరత్ కళ్ళలోని తడి చూసి "ఎలా జరగాలనుంటే అలా జరిగి తీరుతుంది" అన్నాడు.     వాళ్ళిద్దరూ రంగి గదిలోకి నడిచారు.     "రంగీ! ఈయనెవరో తెల్సా? పుట్టబోయే బాబుకు స్పెర్మ్స్ దానం చేసిందీయనే" చెప్పాడు శరత్.     రంగికేం అర్ధంగాకపోయినా "గుడ్డీవినింగ్" అంది.     శరత్ నవ్వి "ఇది ప్రొద్దుటి సమయమే....గుడ్ మార్నింగ్ అనాలి" అన్నాడు.     భార్గవ కూడా నవ్వాడు.     "ఇప్పటికయినా మా మీద కోపం తగ్గిందా....?" తిరిగి అడిగాడు శరత్.     "కోపమేం లేదు. ఈ స్థితుల్లో బయటికి రావటం లేదు. బాబీలేనిలోటు భరించలేకపోతున్నాను. ఎక్కడున్నాడో... ఎలా వున్నాడో...?" అన్నాడు భార్గవ. ఇప్పుడు జరుగబోయే దాంతోనే తన బాబీ బ్రతుకు ఆధారపడుందని మనసులో అనుకుంటూ "సుగాత్రిగారు రాలేదా?" అన్నాడు.     "మామగారు కూడా ఈ బేబీ వ్యతిరేకతతో కన్నుమూసారని.....ఆయన ఆత్మకు శాంతి లేకుండా చేసామని దిగాలుపడిపోతూ ఇంట్లోనే వుంటోంది. నిర్లిప్త స్థితికూడా తెల్సుకదా!"     "తెల్సింది శరత్ గారూ! నిఖిల్ ఎటో వెళ్ళిపోయాట్ట. ఇది తెల్సు కోవడానికే మీ ఇండస్ట్రీ నంబర్ కు ఫోన్ చేశాను. కానీ ఎవరూ రిసీవరెత్త లేదు."     "ఎన్ని రోజుల క్రితం?"     "నాలుగు రోజుల క్రితమే."     "కార్మికులకు, మాకు పొత్తు కుదరక ఇండస్ట్రీకి లాకౌట్ ప్రకటించాల్సి వచ్చింది. కార్ముకులంతా నిరాహారదీక్షల్లో వున్నారు. కష్టాలన్నీ కట్టగట్టుకొని వస్తున్నాయి భార్గవా....! సరే...హోం మినిస్టర్ గారు వెళ్ళిపోయుంటే నువ్వొచ్చావని చెప్పి లక్ష్మిని తీసికొస్తాను. వన్ మినిట్" అని బయటికి వెళ్ళిపోయాడు శరత్.     అదే అవకాశంగా త్రోచింది భార్గవకు.     "రంగీ నీకు జాతకాలంటే ఇష్టమా?" అన్నాడు దగ్గరకొస్తూ.     "ఓ....మా రాయన్న నా ఎడం చేయి చూసి నీకు మంచి మొగుడొస్తాడే అనేవోడు. మొగుడు రాలేదుగాని కడుపొచ్చింది..." నవ్వింది రంగి.     "నాకు తెల్సు! నీ చెయ్యి చూడనా?"     "చూడు" అమాయకంగా ఎడం చేయి ముందుకు చాచింది రంగి.     "నీకు పుట్టబోయేది మగపిల్లాడే" చేయి పట్టుకొని చెప్పాడు.     "ఓస్....అదేనా? అది డాక్టరమ్మగోరే సెప్పారు. మొగని గురించి సెప్పండి" అంది సిగ్గుపడిపోతూ.     స్వతహాగా రచయియిన భార్గవ వర్ణించి చెప్పాడు. మధ్య మధ్యలో బొటనవ్రేలి గోటితో నొక్కుతున్నాడు. ఏదో గుచ్చుకుంటున్నా....మొగుడి గురించి కలలు గంటూ వింటుంది రంగి.     చివరిసారిగా గట్టిగా నొక్కగానే బాధగా మూలిగింది రంగి.     జివ్వున రక్తం చిమ్మటం....తలుపు తోసుకొని శరత్ రావటం ఒకేసారి జరిగాయి.     రక్తం చూసిన అతడు అనుమానంగా "భార్గవా....నువ్వు చేస్తున్న దేమిటి?" అడిగాడు. మరో క్షణమయితే భార్గవ చూపుడు వేలు రక్తానికంటించేవాడు! రంగి చప్పున లక్కోబోయింది. రంగి చేతిని బలంగా త్రిప్పుకున్నాడు భార్గవ. రంగి పెనుగులాడింది. రక్తం చుక్కలు బొట్లు బొట్లుగా గచ్చుపైన పడుతున్నాయి అప్పుడే భార్గవ డొక్కలో శరత్ బూటు కాలిదెబ్బ బలంగా తాకింది. తూలిపడబోయిన భార్గవ నిలదొక్కుకొని.....కసిగా చూసి విసురుగా వెళ్ళిపోయాడు.     "ఎవర్ని నమ్మాలో, ఎవర్ని నమ్మకూడదో తెలీటంలేదు" అంటూ రంగి చేతికున్న రక్తాన్ని తుడిచి బ్యాండేజ్ కట్టాడు శరత్.                                     *    *    *    *    *     ఇది జరిగిన మూడోరోజుకి భార్గవకు ఫోనొచ్చింది.     "హలో భార్గవా! ఓడిపోయావన్న మాట. జీవితాన్ని ఎదుర్కోవటమంటే రచనలు చేసినంత తేలిగ్గాదు. నీ సుపుత్రుడి శవాన్ని హుసేన్ సాగర్ లో చూస్కుంటావా?"     భార్గవ అరిచాడు "నో....ప్లీజ్! మీకు దండం పెడ్తాను. నా బాబీనేం చెయ్యొద్దు. నన్ను చంపండి కానీ నా కొడుకును చంపకండి....ప్లీజ్!"     అవతలివేపు నించి ఆగంతకుడు వికృతంగా నవ్వాడు.     "నేను చెప్పింది నువ్వు చెయ్యలేకపోయావ్! స్పెర్మ్స్ దానం చేసిన ఖర్మానికి అనుభవించాల్సిందే?"     "ప్లీజ్....నా బాబీని హతమార్చకండి, మీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను."        "డబ్బు..." మళ్ళీ విక్పతంగా నవ్వాడు వాడు.     ".............."     "మేం ఆ టెస్ట్ ట్యూబ్ బేబీమీద విసిరే ఆఖరి అస్త్రం ఆ డబ్బే! నీ డబ్బు మాకెందుకురా? కసితీరాలి అంతే!" కసిగా అన్నాడు వాడు.     "మీకు చేతులెత్తి మొక్కుతాను. నా కుడుకునేం చెయ్యొద్దు." భార్గవ రోదిస్తూ ప్రాధేయపడ్డాడు. అయినా అవతలివాడి కర్కశ గుండె కరగలేదు.     "అలా అంటే కుదుర్తుందా? హ-హ-రోజూ సాయంత్రం వెళ్ళి హుసేన్ సాగర్ లో చూస్తూ పుండు నీ కొడుకు ఏ క్షణానయినా గోనెసంచి మూటలో పైకి తేలొచ్చు......" చెప్పి ఫోన్ పెట్టిన చప్పుడు.   
24,713
    రసాస్వాదన అనేది వ్యక్తులపట్ల మనకున్న అభిప్రాయాన్ని బట్టేగాన్ని, కేవలం ఆయా కళ్ళల్లో ఆయా వ్యక్తులకు వున్న చాతుర్యం వల్లనే కాదని రాధతో ఇదివరకు ఇద్దరు ముగ్గురు అని వున్నారు. కాని ఆ విషయం అబద్ధమని రాధ యిప్పుడు తెలుసుకుంది. అతని వాద్య సంగీతాన్ని విని ఆనందించటంలో ఆమెకు అతడిపట్ల వున్న చిరాకు ఏ మాత్రం అడ్డుకోలేకపోయింది.     ఆకస్మికంగా ఉలిక్కిపడింది. రోడ్డుమీద ఎవరో తనకి కొంచెం దూరంలో నిల్చుని తనవంక చూస్తున్నారు. తన చర్యకు సిగ్గుపడింది. భయపడింది. గబగబ అక్కడ్నుంచి కదిలి నడవసాగింది. ఏమనుకున్నాడో ఏమిటో ఆ వ్యక్తికూడా ఆమెను వెంటాడాడు. రాధ హడలిపోయింది. ఆమె గుండె వేగంగా కొట్టుకోసాగింది. అప్పటికప్పుడే వళ్ళంతా చమట్లు పట్టాయి. తడబడుతూ నడక వేగం ఇంకా హెచ్చించింది. వెనక వస్తున్న మనిషి కూడా నడక వేగం ఎక్కువ చేసినట్లు అడుగుల చప్పుడువల్ల తెలుస్తూనే వుంది.     జనసంచారంలేని వీధిలో, చీకటి రాత్రిలో వంటరిగా నడిచి వస్తున్నందుకు తనను తాను దూషించుకుంది. తర్వాత ఇంట్లోకి వచ్చి యెలా పడిందో తనకు తెలీదు. గేటులోంచి విసురుగా లోపలకు పోయి ఒక్కసారి వెనక్కీ చూసింది. అతనక్కడ నిలబడి ఈలవేస్తూ చేత్తో ఏదో సైగచేస్తున్నాడు. ఆమె ఎంతో అసహ్యించుకుని గబగబ అక్కడ్నుంచి లోపలకు వెళ్ళిపోయింది. నారాయణ ఏదో రాసుకుంటున్నట్లున్నాడు. అతని గదిలో లైటు వెలుగుతోంది. రాధ గుండె ఇంకా వేగంగా కొట్టుకుంటూనే వుంది. అంతా నిద్రపోతున్నారు. తెలిస్తే ఏమంటారోనన్న భయం. దగ్గరగా వేసివున్న తలుపుల్ని తోసుకుని మెల్లిగా లోపలకు వెళ్ళింది. ఒక ప్రక్కగా నిలబడి తల్లి దండ్రులు వుండే గదిలోకి తొంగి చూసింది. తండ్రి గురకపెట్టి నిద్రపోతున్నాడు. ఆమె నిట్టూర్చి, యిటునుంచి అటు తిరగటంలో నేలమీదవున్న గ్లాసు క్రిందపడి చిన్న చప్పుడు చేసింది. ఒక్కసారిగా ఆమె ఝల్లుమంది. శారదాంబ అప్పుడే మేలుకుందో, అంతకుముందు నుంచే మేలుకునుందో "ఎవరూ?" అంది.     రాధ ప్రాణాలన్నీ ఉగ్గబట్టుకుని "నేనమ్మా" అంది చిన్నగా.     శారదాంబ లేచి యివతలకు వచ్చింది. రాధ తల వొంచుకుని నిలబడింది. శారదాంబ శుష్కించిపోయిన పెదాలమీద నవ్వు తెప్పించుకుంటూ "ఏ సినిమాకు పోయావమ్మా?" అంది.     రాధ జవాబు చెప్పింది.     "అన్నం తిందువుగాని రా."     "ఆకలి వేయటం లేదమ్మా."     "కాస్త ఎంగిలి పడుదువుగాని రద్దూ."     తల్లి మనసు నొప్పించటం రాధకు ఇష్టంలేకపోయింది. దొడ్లోకి పోయి బావి దగ్గర కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చింది. భోజనం చేస్తూండగా ఎప్పుడు మేలుకుందో ఏమిటో ముసలావిడ "బాగానే వుంది. మరీ అదుపూ ఆజ్ఞ లేకుండా పోతూందే వ్యవహారం" అంది. ఇంకో సమయంలో, ఇంకో సన్నివేశంలో ఐతే నాయనమ్మ మాటలకు రాధ జవాబు చెప్పకుండా వూరుకునేది కాదు. కాని యిప్పుడు ఏమీ అనలేక వూరుకుంది.     ముసలావిడ హద్దూ, పద్దూ లేకుండా వాగుకుంటూ పోతోంది. తన కాలంలోనా- యివన్నీ బాగులేదన్నది. ఆడపిల్లలకు యింత స్వాతంత్ర్యం కూడదన్నది. దీనికి ఫలితం ఎప్పుడో ఓ అప్పుడు అనుభవిస్తారంది. ఏమి అన్నా తల్లీ కూతుళ్ళిద్దరిలో ఎవరూ నోరు మెదపలేదు.     కాని స్పష్టంగానో, అస్పష్టంగానో నారాయణ యి మాటలన్నీ వింటున్నాడు. కాని ముసలామె కదా అని మొదట్లో కొంచెం ఉపేక్షించాడు. ఎంతసేపటికి ఆ నోటికి హద్దూ, పద్దూ అంటూ లేకపోయేసరికి లేచి, లోపలికి వస్తూ "ఏమిటి నాయనమ్మా? అర్థరాత్రి పూటయినా మమ్మల్ని కాస్త శాంతిగా వుండనీయవా ఏమిటి?" అన్నాడు.     ఆవిడ నోరు నొక్కుకుంటూ "అనండిరా బాబూ, అందరూ నన్నే అనండి ఒక రాత్రీ పగలూ లేకుండా ఇష్టం వచ్చినట్లు విచ్చలవిడిగా తిరుగుతున్న దాన్ని అనే వారెవరూ లేరు" అని ఏడుపు గొంతుకతో "మంచి కోసం నేనేం చెప్పినా అర్థం చేసుకోక అంతా నన్ను తిట్టేవాళ్ళే. నేను మరీ పరాయిదాన్ని అయిపోయాను" అని కళ్ళు వొత్తుకుంది.     నారాయణ విసుగ్గా "చాలు, నువ్వు ఏడుస్తూ కూచుంటే ఓదార్చేందుకు యిక్కడ నీకన్నా పెద్దవాళ్ళెవరూ లేరు అన్నాడు. మళ్ళీ తనే వయస్సు చెల్లిన వాళ్ళు కాబట్టి యీ సరదాలు, కాలక్షేపాలు మీకేం అక్కరలేదు. అయినా అనుభవించవల్సిన ఈడులో కూడా ఒక ఆట, పాటలేకుండా ఇంట్లో కాళ్ళు ముడుచుకుని కూర్చోమంటావేమిటి? సినిమాలకి, షికార్లకి తీసుకువెళ్ళే యోగ్యతా, తాహతూ మనకు రెండూ లేవు. ఎవరో స్నేహితురాలితో వెళ్ళక వెళ్ళక ఒకసారి వెడితే అది కూడా వద్దంటావా? ఇదేనా నువ్వు చెప్పేది? పెద్దవాళ్ళయి చూడదలచుకున్న ముద్దు ముచ్చట్లు ఇవేనా ఏమిటి?" అని నాలుగు దులిపేసి తనూ మళ్ళీ మాట్లాడకుండా ముసలావిడను మళ్ళీ మాట్లాడనీయకుండా చేసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత ఏమనుకుందో ఆవిడకూడా నోరు యెత్తకుండా అక్కడ్నుంచి వెళ్ళిపోయింది.     అనంతరం రాధ భోజనం చేయడం ముగించి చేతులు కడుక్కుంటూంటే శారదాంబ వెనుకనుంచి అంది "ఛాయ ఎంతసేపు యేడ్చిందనుకున్నావు?"     "ఎందుకు?" ఆశ్చర్యంతో అడిగింది కూతురు.     "నువ్వు సినిమాకి ప్రమీలతో కలసి వెళ్ళావని సుభద్రమ్మగారు కబురు పంపించింది అది విని తననికూడా  తీసుకు వెళ్ళలేదని ఒకటే ఏడుపు."     నాయనమ్మ తనని కోప్పడినప్పుడూ, ఇంట్లో చెప్పకుండా వెడుతున్నానని మధనపడినప్పుడూ పడిన బాధకన్నా రాధ ఈ మాట విని నీరయిపోయింది. తను నిజంగా పాపిష్టిది. చప్పున ఆమె కళ్ళలో నీళ్ళు తిరిగాయి. తన మనస్సులోనిదంతా తల్లితో చెబుతూ కూర్చుంటే అది పెద్ద ఏడుపుగా పరిణమిస్తుందనే భయంతో, మాట్లాడకుండా పోయి తన ప్రక్కమీద పడుకుంది.     సాధారణంగా నిద్రపోయేముందు చాలామందికి ఆ రోజు చేసిన పనులన్నీ ఒకసారి నెమరువేసుకుని పడుకొనే అలవాటు వుంటుంది. రాధకు కూడా అటువంటి అలవాటే. ఇవాళ జరిగిన విశేషాలన్నీ తలుచుకుంటూ కొంచెంసేపు ఆనంద తరంగాల్లో తెలిపోతున్నట్లూ, కొంతసేపు విచారపు పుటలల్లో మునిగిపోతున్నట్లూ, మరికొంతసేపు జాలిగా తన హృదయం ద్రవించిపోతున్నట్లు అనుభూతి పొంది, చివరకు ఏ అర్థరాత్రికో భారమైన మనస్సుతో నిద్రపోయింది.                               10     తెల్లవారింది. చలి తీవ్రంగా వుంది. రాధ ఆరింటికే లేచి కూర్చుంది. ఒకసారి బద్ధకంగా ఆవులించి, వెచ్చగా దుప్పటి మీద కప్పుకుంది రాత్రంతా సరిగా నిద్ర లేకపోవటంవల్ల కళ్ళు ఎర్రగా వున్నాయి. కొంచెంసేపు అలానే కూర్చునివుండి తరువాతలేచి, వళ్ళు విరుచుకుని, నిలువుటద్ద ముందుకు పోయి నిల్చుంది. ఏమిటో తనలో తనకే ఏదో మార్పు కనబడింది. రోజూ నిద్రలేవగానే ఒకసారి అద్దంలోకి చూచుకోవటం ఆమెకు యీ మధ్యనే అలవాటయింది. కాని రోజూ కనపడని ఓ సంగతి తెలీకుండానే ప్రత్యేకంగా కనబడసాగింది. నిద్రలేక ముఖం నిగారించి వుండటంవల్లా, కళ్ళన్నీ ఎర్రబడి వుండటంవల్లనేమో అనుకుంది.     బయటకువచ్చి తల్లి పడుకునే గది దగ్గరకు పోయి చూసింది. ఆమె ఇందాకే లేచి వెళ్ళినట్లుంది. చిదంబరం పూర్తిగా  ముసుగు కప్పుకొని పడుకుని వున్నాడు. ఛాయ అప్పుడే లేచి కళ్ళు నులుముకుంటోంది.     నెమ్మదిగా లేచి గది బయటకు రాగానే ఒక్కసారిగా రెండు చేతులతో పట్టుకుంది రాధ. "వొదులు, నన్నొదులు" అని ఛాయ పెనుగులాడసాగింది.     "ఊహుఁ, సమాధానం చెబితేగాని వదలను."     ఛాయ మాట్లాడకుండా విడిపించుకునేందుకు ప్రయత్నిస్తూనే వుంది.     "కోపం వచ్చిందా?"     ఛాయ జవాబు చెప్పలేదు. "వదలవేం నన్ను?" తన పెద్ద కళ్ళతో అక్కయ్యవంక కోపంగా చూసింది.     "రాత్రి నిన్ను తీసుకెళ్ళకుండా సినిమాకు వెళ్ళినందుకు కోపం వచ్చింది కదూ?"     ఈ మాట వినగానే ఛాయకు ఎక్కడలేని ఏడుపూ వచ్చేసింది. రెండు చేతులతో ముఖం కప్పుకుని ఏడవసాగింది.     చెల్లెలు ఇంకా ఏడుస్తూ వుంటే అక్కగారి హృదయం ద్రవీభూతమైంది. ముఖంనుండి చేతుల్ని బలవంతంగా విడిపించి, కళ్ళనీళ్ళు పమిట చెంగుతో తుడిచి, బుగ్గలమీద ముద్దు పెట్టుకుంది. ఈ తియ్యని ముద్దుతోకూడా ఆ పిల్లకు శాంతం కలగలేదు. "పో" అంటూ కసితీరా అక్కయ్య ముఖంమీద రక్కి అక్కడ్నుంచి పారిపోయింది.     తల త్రిప్పి ఇటు చూసేసరికి వాసు లోపలికి వస్తున్నాడు.     "అక్కయ్యా? నాకో సహాయం చేస్తావా?" అనడిగాడు.     "ఏమిటిరా?"     "నాకో పావలా కావాలి."     "నా దగ్గరెక్కడిది?"     "పో - నువ్వెప్పుడూ అలాగే అంటావు."     "అంటే ఎందుకంటాను?"     వాడు ఏదో గొణుక్కుంటూ వంటింటిలో అమ్మ దగ్గరకు వెళ్ళాడు. అక్కగార్ని అడిగిందే తల్లిని కూడా అడిగాడు.     "పొద్దున్నే నీకు పావలాతో ఏంపనిరా?" అనడిగింది తల్లి.     "నాకు కావాలి"     ఆవిడ కొంచెం ఊరుకుని "నా దగ్గిరలేదు" అంది.     "ఎవరి దగ్గరా లేకపోతే నాకెవరిస్తారు?" అని వాసు బిక్కమొహం పెట్టి అడిగాడు.     "అసలు అంత అవసరం ఏమి వచ్చిందో కాస్త చెబుదూ?" వాడు కొంచెం విసుగ్గా "ఆఁ అన్నీ నీకు చెప్పాలేమిటి?" అన్నాడు.     "చెప్పలేకపోతే పోనియ్యిలే. ఏం చేస్తాం? పోయి మొహం కడుక్కునిరా" అంది శారదాంబ. అమాయకత్వంతో కూడిన ఒక విధమైన కోపం వచ్చింది వాసుదేవరావుకు. అయితే వాడిది ఒకరిమీద కోపం చూపించే వయసుకూడా కాదు అందుచేత ఏమీ అనలేక బావి దగ్గరకు పోయి, పళ్ళుతోముకుంటూ ఏదో ఆలోచించసాగాడు.     వాడు పావలా అడిగినందుకు తగినంత కారణం వుంది. మొన్న స్కూల్లో ఇద్దరు ముగ్గురు స్నేహితులు సర్కస్ కి వెడుతూంటే వీడికి కూడా వెడదామని బుద్ధి పుట్టింది. కాని ఎప్పుడూ అణా , అర్ధణా కంటే వీడిదగ్గర ఎక్కువ డబ్బులు వుండవు. అన్నయ్యని అడిగితే ఇస్తాడుగాని, ఇది అన్నయ్య దగ్గరకూడా వుండే సమయం కాదు. ఇలా ఆపదలో ఇరుక్కున్న వాసుకు పెట్టుబడి పెడతానంటూ ఒక స్నేహితుడు ఆదుకున్నాడు. ఆ స్నేహితుడి డబ్బులతో మధ్యాహ్నం బడి ఎగగొట్టి సర్కస్ చూశాడు. కాని మరునాటి ఉదయమే పెట్టుబడి పెట్టిన ఆ ఘన మిత్రుడు తన  డబ్బు కోసం వేధించసాగాడు. వాసు ఆశ్చర్యంగా "ఇప్పుడేమి ఇస్తాను. నా దగ్గిర వున్నప్పుడు ఇస్తాను" అన్నాడు. ఆ మిత్రుడు ఒప్పుకోలేదు. ససేమిరా అప్పుడే కావాలని పట్టుపట్టాడు. "ఇవ్వకపోతే ఏం చేస్తావు?" అన్నాడు వాసు. "మీ ఇంటిలో చెబుతాను" అన్నాడతన  ఖండితంగా. వాసుకి భయం వేసి మరునాడు ఇస్తానని చెప్పి అప్పటికి తప్పించుకున్నాడు. అందుకనే వాడికి ఇవేళ లేచినప్పట్నుంచి అది ఒక పెద్ద సమస్యలా కనిపించసాగింది. ఎలాగోలా వాడి అప్పు తీర్చివేయాలి. లేకపోతే ఆ వెధవ స్వభావం తనకు తెలుసు. అన్నంతపనీ చేసే రకం.     కాని చేయగలిగింది ఏమీలేదు. భయపడుతూనే బడికిపోయాడు. ఆ రోజు అప్పు ఇచ్చిన మిత్రుడికి కనిపించకుండా వుండాలని సాధ్యమయినంత ప్రయత్నం చేశాడు. కాని అదేం లాభించలేదు. ఆపద సమయంలో ఆడుకున్న మిత్రుడు వీడిని చూసీ చూడగానే "ఏరా, నా బాకీ తీరుస్తావా?" అనడిగాడు.
24,714
    చివరకు ప్రసవించింది. అప్పటికి రాత్రి రెండు దాటిపోయింది. ప్రజ్ఞ నీరసంగా కాంపౌండింగ్ గదిలోకి వచ్చి వాష్ బేసిన్ దగ్గర ముఖం కడుక్కుని నేప్ కిన్ తో తుడుచుకుంటోంది.     వెనక నీడ పడినట్టయింది. తల త్రిప్పి చూసేసరికి ద్వారం దగ్గర దయాకర్ నిలబడి వున్నాడు.     "అలసిపోయావు కదూ?" అన్నాడు నవ్వుతూ.     "లేదు. మీరు పగలంతా పనిచేసి నైట్ కూడా విశ్రాంతి లేకుండా కష్టపడుతూండగా లేనిది యీ మాత్రం మేము చేస్తే  అలసిపోతామా ?" అంది ప్రజ్ఞ.     "యింకా నీకు అలవాటు కాలేదుగా."     "ఇప్పుడలవాటయిపోయింది" అంటూ అతని ముఖంలోకి చూసింది. పగలు అంతమంది పేషంట్స్ ని చూస్తూ వాళ్ళ సమస్యల్ని పరిష్కరిస్తూ, అవసరమయిన కేసులకు ఆపరేషన్ చేస్తూ _ యిప్పుడు కూడా నిద్రలేకుండా కష్టపడుతున్నా ఎంత స్వచ్చంగా, నిర్మలంగా ఉన్నాడు ! జుట్టు కొంచెం రేగి ముఖం మీదకు పడుతోంది. అంత పరీక్షగా అతని వంకెప్పుడూ  చూడలేదు. ఎంతో అందంగా, హాయిగా ఉన్నట్లనిపించింది.     అప్రయత్నంగా  అతనామె వైపు  చూశాడు. చప్పున కళ్ళు వాల్చుకుంది.     ఎందుకో తడబడినట్లయింది. "మీకో విషయం చెప్పాలి" అంది ఏమనాలో తోచక.     ప్రశ్నార్ధకంగా చూశాడు.     "ఇందాక ...డెలివరీ కోసం ఎడ్మిట్ అయిన వాళ్ళిద్దరూ ..."     "......"     "తల్లీ ...కూతుళ్ళు ..." అంటూ  తాను  విన్నదంతా ...మెల్లగా చెప్పేసింది.     "భర్తపోయాక తన ముగ్గురు పిల్లల్ని వదిలేసి యింకో పురుషునితో వెళ్ళిపోయి యింకా పిల్లల్ని కంటోంది. అదేగా మీ మనస్సుని వేధిస్తోన్న విషయం."     ప్రజ్ఞ అవునన్నట్లు తలాడించింది.     "తల్లి కూతుళ్ళిద్దరూ  యించుమించు ఒకేసారి ఎడ్మిట్ అయి కొన్ని గంటల తేడాతో ప్రసవించడం కూడా నీ మనస్సుని కలచివేసింది"     ప్రజ్ఞ మౌనంగా వూరుకుంది.     దయాకర్ నవ్వాడు. "ప్రపంచం మన యిష్టాయిష్టాలతో సంబంధం లేకుండా నడిచి పోతూ ఉంటుంది. మనం అంగీకరించినా అంగీకరించక పోయినా అనుక్షణం వివిధ అనుభవాలతో సాగిపోయే యీ సమాజం మధ్య మనం బ్రతుకుతూ ఉండాలి. నీలాగే నాదికూడా సున్నితమైన మనస్తత్వమే. కాని ఓ డాక్టరుగా జీవితం ప్రారంభించాక ఎన్నో విచిత్రమైన సత్యాలను చూశాను. అన్నదమ్ముల పిల్లలు _ వరసకు అన్నా చెల్లెళ్ళయినవారు ప్రేమించి పెళ్ళిచేసుకోవటం చూశాను. పద్నాలుగేళ్ళ  బాలికలు పరిస్థితులకులోనై గర్భస్రావాలు చేయించుకోవటం చూశాను. తాతల వయస్సులో ఉన్న వాళ్ళ వికృతమైన కామకృత్యాలూ చూశాను. నాగరికత పేరుతో యీ ప్రపంచం అర్ధం కానంత వేగంతో ముందుకెళ్ళిపోతోంది. సూటైన, స్వచ్చమైన జీవితాన్ని మానవుడు ప్రక్కలకు, _ వికృత మనస్తత్వాల వైపు వెళ్ళిపోతున్నాడు. విపరీతమైన భావాలు, విశృంఖలత్వం, రాక్షస ప్రవృత్తి _ ఈనాడు మానవ జాతిని పరిపాలిస్తున్నాయి. మేధస్సు మంచివైపుకన్నా  చెడువైపు పరుగులు తీస్తోంది. తృష్ణ, పైకి రావాలన్న తపన, డబ్బు సంపాదించలేకపోతున్నామన్న బాధ _ నీతిని గురించిన ఆలోచనల్ని చంపేస్తున్నాయి. మనిషికి రెండు వైపులనుంచి దూసుకువస్తోన్న పోటీ, యితరులు అవలంబించే పద్దతులు మంచిగా ఉంటే బ్రతకలేమన్న భావనను పెంపొందిస్తున్నాయి. ప్రతిక్షణం పడగలు విప్పుతున్న కోరికలు, కనీసం కొంత విలాసవంతమైన జీవితాన్ని గడపాలన్న ఉత్కంఠ, పరిస్థితుల్తో రాజీ పడలేని బలహీనత 'యింతకుతప్ప గత్యంతరం లేదు' అన్నట్టు మనిషిని ప్రక్కదారులు పట్టిస్తోంది. ఆకర్షణే నిజమని భ్రమించిన మానవుడు  రోజు రోజుకూ నైతికంగా దిగజారిపోతున్నాడు."     ప్రజ్ఞ అతని వంక ఆశ్చర్యంగా చూసింది  అతని  భావాలూ, ఆలోచనలూ _ ఆమె కెంతో నచ్చినట్లనిపించింది.     "మీరు ...మీరు ...దేవుడ్ని  నమ్ముతారా?" అనడిగింది కుతూహలంగా.     "చాలా"     "ఏమిటి...నిజం?" అంది మళ్ళీ నమ్మలేనట్లుగా.     "నమ్ముతాను. రోజూ కాసేపు పూజ, మెడిటేషన్ చేసుకొంటాను...నేను పవిత్రతనారాధిస్తాను.... పవిత్రతను వెదుక్కుంటున్నాను."     మీ అన్వేషణ ఫలించలేదా?"     "ఇంతవరకూ లేకపోవచ్చు. కాని ఫలిస్తుందనే  నమ్మకముంది."     'నేనూ ...అదే...అదే స్థితిలో వున్నాను' అనుకుంది చాలా ఉద్విగ్నమైన మనసుతో.     "ఏమిటీ మౌనంగా ఉండిపోయారు?"     బహుశా యీ ఏకాంతం, మనస్పూర్తిగా నచ్చిన అతని భావాలు ఆమెకు ఎన్నడూ లేనంత చనువు కలుగుతోంది. ఆమెలోని స్త్రీ హృదయం కదుల్తోంది.
24,715
    పొగలు చిమ్ముతూ లాంచి వచ్చింది. పెనుధ్వనిచేస్తూ ఆగింది. 'లాంచి - రాజమండ్రి లాంచి' - ప్రయాణీకులను పిలుస్తున్నారు. ఎక్కాను. కూర్చున్నాను. లాంచి రొదపెడ్తూ సాగింది. జోరున వాన మొదలయింది. కుండపోత! గోదావరి పెరుగుతున్నది.     జోరున వాన.     వరదలో నావ.     ఒడ్డున చిక్కని - పచ్చని అరణ్యం!     చెట్లమీద ముడుచుకున్న పక్షులు!!     ఏ పయనం! ఎలాంటి పయనం!! ఎంతటి సంబరం! ఎంతటి ఆనందం!!     ఆనందం అంబరం అవుతున్నది!     వాన నీళ్లలో పడే చప్పుడు!     నీటిని చీల్చుకుని నావ పయనం!!     "గోదావరి పొంగుతూంది. లాంచి మాధారంలో ఆగదు. అమరారంలో దిగాలి" అన్నారు. దిగక తప్పలేదు. చిమ్మన చీకటి! పెనువాన! దారి తెలియదు. ఎక్కడికి పోవాలి? ఏమీ అర్థంకాదు. వణుకుతున్నాను. అమరారంలో సుబ్రహ్మణ్యం బంధువులు ఉన్నారు. అది విన్నాను. అడిగాను. వారింటికి చేరాను. ఇద్దరు పూర్వ సువాసినులు. అత్తా - కోడండ్లు. కోడలు పరువంలో ఉంది. ఉరుకులు పెట్టాల్సింది. నిలిచి ఉంది. పరవళ్ల గోదావరి నిలిచినట్లుంది.     వారు సాదరంగా ఆహ్వానించారు. పొడి బట్టలు ఇచ్చారు. తడికట్టెలు - పొగ - ఇంట్లో వంట చేశారు. పీట వేశారు. విస్తట్లో అన్నం ఆవకాయ వడ్డించారు. కమ్మని నేయి వేశారు. చారు. ఎర్రగా కాగిన పాలు. వీటినిమించి ఇద్దరూ ఎదురుగా కూర్చున్నారు. ముచ్చట పెట్టారు. నేను తెలుసును అన్నారు. సుబ్రహ్మణ్యం చెప్పాడు అన్నారు. మెచ్చుకున్నట్లు మాట్లాడారు.     పొగ చిమ్మే దీపం! మనకవెలుగు!! అందులోనూ ఆమె పరువం!!! కటిక చీకట్లో వెలిగిన వెన్నెల్లా ఉంది.     అది పూరిల్లు. వెదురు తడకలకు మట్టి పూసిన గోడలు. నులక మంచం మీద పడుకున్నాను. బయట వాన. ఇల్లు కురుస్తున్నది. ఒక్కొక్క చినుకు నేలకు చిల్లులు చేస్తున్నది.     నిలిచినా ఉరుకుల గోదారి.     కటిక చీకట్లో వెలుగు వెన్నెల.     ఆ రాత్రి నిదురలేదు. అయినా తెల్లారింది. వాన వెలిసింది. మబ్బులు - విరహపు ప్రియుని కోసంలా ఉరుకుతున్నాయి. పక్షులు తడి రెక్కలతో ఎగిరిపోతున్నాయి. అల్లరిమానిన అమ్మాయిలా అంతా శాంతించింది. సూర్యుడు ఉదయించాడు. వెలుగులు పరుస్తున్నాడు.       నాకు వేడి వేడి బెల్లపు చాయ్ ఇచ్చారు. చాల రుచిగా ఉంది. పీట మీద కూర్చున్నాను. చప్పరిస్తున్నాను. అత్త మాట్లాడుతున్నది. కోడలు పెదవులు కదలవు. ఆమె చూపులు పలకరిస్తున్నాయి.     "చిన్నవాడివి. బాటసాంతం అడివి. ఎలా చేర్తావో? మా పాలేరు గండి దాటిస్తాడు" - అత్తగారు అన్నది. నేను బయలుదేరాను. వెంట పాలేరున్నాడు. అతని చేతిలో బల్లెం ఉంది. ఇద్దరూ నన్ను సాగనంపడానికి వాకిట్లోకి వచ్చారు.     "మళ్లీ వస్తారా?" కోడలు అడిగింది.     "తిరిగి వెళ్లేప్పుడు" అన్నాను - సాగిపోతున్నాడు.     నేను వెనుకకు చూడడం సభ్యత కాదు. ఆమె ఇంకా చూస్తున్నది. అది మనసు చెపుతున్నది.     "గండంటే - దట్టపు అడవి - పులులు, చిరుతలు ఉంటాయి." కోయపాలేరు చెపుతున్నాడు. నేను తేరుకుని చూచాను. ఎండదూరని అడివి. బాట కనపడడు చేసుకోవాలి. కోయదొర బల్లెంతో బాట చేస్తున్నాడు.     "అగ్రతస్తే గమిష్యామి మృద్నన్ పాపాణ కంటకాన్" - "నీముందు నడుస్తాను. రాళ్లూ ముళ్లు తీస్తాను. బాట చేస్తాను" అంటాడు లక్ష్మణుడు రామునితో. ఆ అవసరం తెలిసింది.     ఎక్కడో పులి వాసన - దూరాన చిరుత జాడ. అన్నీ కనిపెడ్తున్నాడు దొర. ముందునుంచే జరజర పాము. ఆపుతున్నాడు దొర. జింకలు చాటుకు నక్కుతున్నాయి. కుందేళ్లు ఉరుకుతున్నాయి. గువ్వలు డప్పులు కొడుతున్నాయి. చిలుకలు పలుకుతున్నాయి. గుంపులు గొరవంకలు.     అడవి భయం. నిజమే. మనసును మరిపించే అందం! మనం ఎంత పోగొట్టుకున్నామో!     గండి దాటిందన్నాడు దొర. మారు మాట్లాడలేదు. నా మాట ఆలకించలేదు. దొర బల్లెంతో వెనుతిరిగాడు. అడవిలో కలిసిపోయాడు.     చిక్కటి అడవి అయిపోయింది. అడవి ఇంకా ఉంది. అది పల్చగా ఉంది. వెలుగు పడుతున్నది. తోడులేక నడవడం గగనమే! గుబులుగా ఉంది. భయంగా ఉంది. గుండె దడదడ లాడుతున్నది. వెనక్కుపోలేను. ముందుకే సాగాలి. మనిషి కనిపించడు. ఊరిజాడ లేదు. సాగుతున్నాను. బాగా నడిచినట్లున్నాను. ఆకలి - అడవిలో ఏం దొరుకుతుంది అనుకుంటాం. అసలు అడవిలో దొరకంది ఏమిటి? మన జ్ఞాన-విజ్ఞానాలు సహితం అడవినుంచే వికసించాయి.     బాటలో - ఈ అడవిలో కాలిబాట ఉంది. పిల్ల కాలువ కనిపించింది. విశ్వనాథ కిన్నెరసానిలా ఉరుకుతున్నది. దాని వడ్డున నేరేళ్లు - నేరేడు చెట్లు. ఆ చెట్ల కింద నేరేడు పళ్లు. నల్లగా - నీగ్రోయువతి బుగ్గలా - రాలి ఉన్నాయి. పచ్చిక మీద కూర్చున్నాను. నేరేడు పళ్లు ఫలహారం చేశాను. దోసిలితో పిల్లకాలువ నీళ్లు తాగాను. కడుపు నిండింది.     మళ్లీ కాలిబాటమీద సాగాను. పచ్చని చెట్లు - చిలకల పలుకులు - గలగల నీటి సవ్వడి - పరిగెత్తే లేళ్లు - సాగుతున్నాను. బాట చీలింది. ఎటు పోవాలో తెలియదు. మనిషి అలికిడి లేదు. దుఃఖం పొంగి వచ్చింది. ఏడ్చాను. ఎందుకు వచ్చినట్లు? ఏమి సాధించనున్నట్లు?     దేవుని వలె ప్రత్యక్షం అయింది ఒక కోయల జంట. బుడుతణ్ణి బుజాన వేసుకుని దొర నడుస్తున్నాడు. దొరసాని వెనుక వస్తున్నది. వారిని చూచాను. ప్రాణం లేచి వచ్చింది. బాట అడిగాను. వారు చెప్పారు. నేను సాగాను.     కొంతదూరం వెళ్లాను. గోదారి కనిపించింది. దాని వడ్డునే బాట. చెట్టూ చేమా ఉన్నాయి. అడవి పల్చబడింది. కొంగల బారులు కనిపిస్తున్నాయి.     మాధారం వచ్చింది. ఉత్సాహం కలిగింది. అది ఊరు కాదు. గూడెం. కొన్నే పర్ణశాలలున్నాయి. ఇల్లు దొరికింది. పెద్ద మనిషి మంచంలో ఉన్నాడు. నా బాధలు విన్నాడు. విల విలలాడారు. రమ్మనటం తప్పయింది అన్నారు. అదేం కాదన్నాను. ఒక్కనికి చదువుచెపితే ఎంతో ఆనందం అన్నాను.     సుబ్రహ్మణ్యం ఏర్పాట్లు చేశాడు. వేణ్ణీళ్లు స్నానం చేశాను. వేడి అన్నం తిన్నాను. కాళ్లు సలుపుతున్నాయి. పడుకున్నాను. నిద్రపోయాను. సాయంత్రం లేచాను. మళ్లీ జల్లు. కుండెడు వాంతి చేసుకున్నాను. పులసరం వాసన. ఇంటి వాళ్లు బెదిరిపోయారు. సుబ్రహ్మణ్యానికి తెలుసు. ఇది మామూలే!     తెల్లవారి ప్రయాణం. మూటా ముల్లే సర్దుకున్నాం. గోదావరి వడ్డుకు చేరాం. లాంచి పోతుంటుంది. బట్టలు పతాకాల వలె ఊపి - కేకలు పెట్టి పిలవాలి. పిలిచాం. లాంచి ఒడ్డుకు రాలేదు. ఇంటికి చేరుకున్నాం. అలా వారం గడిచింది. అది అనుకున్నది కాదు. అమ్మ ఏడుస్తుంది. భద్రాద్రి భయం! మరో మార్గం లేదు. పడవలో గోదావరి దాటాలి. గౌరీదేవి పేట చేరాలి. అక్కణ్ణుంచి భద్రాచలం నడవాలి.     అవతల వడ్డు ఆంగ్రేజు రాజ్యం. అడవి ఇంత లేదు. రోడ్డున్నది. సుబ్రహ్మణ్యం, నేను గౌరిదేవి పేటనుంచి రోడ్డున పడ్డాం. ఇద్దరం పిల్లలమే - రెండుమూడేండ్లు తేడా! మధ్యమధ్యన బెల్లపు చాయ్ తాగుకుంటూ భద్రాచలం చేరాం. కాళ్లు సలుపుతున్నాయి. పడవమీద గోదావరి దాటాం. బస్సెక్కి కొత్తగూడెంలో దిగాం. ఆ రాత్రి అన్నపూర్ణమ్మగారి సత్రం. తెల్లవారి రైల్లో గార్లలో దిగాం.     స్టేషనులో మిత్రబృందం నిరీక్షిస్తున్నది. బతికి వచ్చినందుకు అభినందించారు. ఆలింగనం చేసుకున్నారు. స్టేషను మాస్టర్ డేవిడ్ కూడా సంతోషించాడు. మిత్రబృందంతో వెళ్తుంటే వీధుల్లో అందరూ అడగడమే!     అందరూ నేను తిరిగి రానని నిశ్చయించుకున్నట్లున్నారు!     అమ్మా, చెల్లెళ్లు వాకిట్లో ఎదిరి చూస్తున్నారు. వార్త అందింది. అమ్మ దూరంగానే చూచింది. ఉరికి వచ్చింది. నన్ను ఆధారాన్ని వలె పట్టుకుంది. ఏడ్చింది. కన్ను సుఖానికీ నీరు కారుస్తుంది. దుఃఖానికీ నీరు కారుస్తుంది. సుఖదుఃఖాలు ఒకలాంటివే అనే మహత్తర సత్యాన్ని వెల్లడిస్తాయి కన్నీళ్ళు.     "నవ్వినా - ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి" అన్నారు మిత్రులు ఆత్రేయ.     "నసుఖాల్లభతేసుఖం - సుఖం నుంచి సుఖం పుట్టదు" అంటాడు వాల్మీకి.
24,716
    "ఎ... ఎవరు నువ్వు?" అంది వొణికే కంఠంతో.     వెనకనుండి చిన్న నవ్వు వినిపించింది. గుండెల్ని పరపర కొస్తున్నట్లున్న కఠోరమైన నవ్వు.     "నేనెవర్నో నీకర్థంకాదు, మాట్లాడకుండా పోనియ్యి."     "ఎ... క్క... డ... కు?"     "అలా తిన్నగా పోతూ వుండు. నే చెప్పేదాకా."     "... అసలు... ఏం కావాలి నీకు...?"     "చెబితే ఇప్పుడే హడలిచస్తావు, నోరు మూసుకుని పోనియ్."     మందాకిని గుండె దడదడమని కొట్టుకుంటూన్నది. ఈ దుర్భరమైన పరిస్థితిలో చిక్కుకొన్నందుకు ఒక ప్రక్కనుంచి ఏడుపొస్తున్నది. అసలు కారులోకి ఎలా వచ్చాడు? అశ్వనీకుమార్ ఇంటిముందు కారు పార్క్ చేసినప్పుడు డోర్ లాక్ చేసే లోపలకు వెళ్ళింది. తిరిగి వచ్చేడప్పుడు లాక్ తీసే లోపలకు ఎక్కింది. డబుల్ లాక్ సిస్టం వున్న కారది.     అశ్వని వస్తానంటే తానే వద్దన్నది. ముందుచూపుతోనే అంటే అని వుండవచ్చు. కాని అదెంత ప్రమాదానికి దారి తీస్తుందో ఊహించలేక పోయింది.     కారు నాలుగయిదు ఫర్లాంగుల దూరంపోయాక "ఎడమ ప్రక్కకి త్రిప్పు" అన్నది ఆ గొంతు ఆజ్ఞాపిస్తున్నట్లు.     మందాకిని ఎడమవైపు వీధిలోకి కారుని పోనిచ్చింది అతని ఆజ్ఞ శిరసావహిస్తున్నట్లు. ఆ వీధి మరీ నిర్జనంగా వుంది.     ఏదో చెయ్యాలి. చేసి తప్పించుకోవాలి. లేకపోతే కొన్ని క్షణాలలో ప్రమాదం ముంచుకొచ్చేలా వుంది.     అతని చేతులామె మెడకు చుట్టుకునే వున్నాయి. ఆమె కదలికల్లో ఏమయినా మార్పు వస్తే ఉక్కు తీగెలుగా మారి బిగుసుకునేందుకు సిద్ధంగా వున్నాయి.     ఆమె మనసు చురుగ్గా పనిచేస్తోంది. ఫ్రంట్ సీటులో తన ప్రక్కనే హ్యాండ్ బ్యాగ్ వుంది. దాని ఓపెనింగ్ ను క్లోజ్ చేస్తూ చిన్న చిన్న మెటల్ రాడ్స్ ఉన్నాయి. ఆమె ఎడమచెయ్యి చీకట్లో మెల్లగా కదిలి ఆ బ్యాగ్ ని పట్టుకుంది. శరీరమంతా చెమటలు పడుతూనే ఉంది. గుండె వేగం ఇంకా హెచ్చయింది. అయినా తప్పదు. ఏదో ఒకటి చేసెయ్యాలి. చాలా డెస్పరేట్ గా ఉంది.     ఎదురుగా ఓ కారు వస్తోంది. దాని హెడ్ లైట్స్ డిమ్ లో కాకుండా బ్రైట్ లో వెలుగుతున్నాయి. అసలే వర్షం వల్ల ఎంత వైపర్స్ పని చేస్తోన్నా కళ్ళు సరిగా కనబడటంలేదు. ఆ లైట్ల కాంతి కళ్ళలోపడి చూపును మరికొంత కష్టతరం చేస్తున్నాయి. ఇదే స్థితి వెనక కూర్చున్న వ్యక్తికి కలిగి వుండాలి. తాను కూర్చున్న సీటు ఎత్తుగా ఉంది. తల ఇంచుమించు సీటు ఎత్తుతో సమంగా ఉంది. వెనకనుంచి తన మెడ అందుకోవాలంటే చాలా కష్టం. తాను పొడగిరి కాబట్టిగానీ మామూలు హైట్ లో ఉన్న యువతినైతే ఇలా చెయ్యటం ఇంకా కష్టం. తననింత సులువుగా చేతుల్లో బిగించి పట్టుకున్నాడంటే అతను నిఠారుగా కూచుని ఉండాలి.     ఎదురుగా వస్తోన్న కారు దగ్గర్లోకి చేరింది. దాని వేగం ఏమాత్రం తగ్గలేదు.     టైము లేదు. తెగించాలి. మందాకిని ఊపిరి బిగపట్టింది. కారింకా దగ్గరకు వచ్చింది. తనని పట్టుకుని ఉన్న చేతుల్నిబట్టి అతనెంత దూరంలో ఉన్నాడో ఊహించింది. ఒక్కసారిగా బ్రేక్ వేస్తూ ఎడమచేత్తో హ్యాండ్ బ్యాగ్ తో వెనక్కి విసురుగా, బలమంతా ఉపయోగిస్తూ కొట్టింది.     ఆమె మెడమీద నున్న చేతులు సడలిపోయాయి. కారు పెద్దకుదుపుతో గియ్ మన్న శబ్దం చేస్తూ కొన్ని గజాలు ముందుకు వెళ్ళి ఆగిపోయింది. మందాకిని క్షణమైనా ఆలస్యం చెయ్యలేదు. 'హెల్ప్' 'హెల్ప్' అని అరుస్తూ డోర్ తెరుచుకుని క్రిందకు దూకింది.     అదే సమయానికి ఎదురుగా వస్తున్న కారు ఆమె ప్రక్కనుంచి సాగిపోతోంది. హఠాత్తుగా కారులోంచి దూకుతోన్న యువతిని చూసి డ్రైవ్ చేస్తున్న వ్యక్తి మెరుపులా ప్రక్కకి కోసుకోకపోతే ఆమెకు డ్యాష్ ఇచ్చి యాక్సిడెంటయ్యేదే.     ఆ కారులో వెనక ఇద్దరు మనుషులు కూర్చుని వున్నారు. ఇద్దరూ పీకలదాకా తాగివున్న స్థితిలో ఉన్నారు.     "ఎ... వ్వ... రో... అమ్మాయిలా... వుంది" అన్నాడు అందులో ఒకడు.     "అ... వు... ను."     "పాపం... ఏదో రిస్కులో... వున్నట్లుంది."     "అలాగే కనబడుతోంది..."     "ఏదో అరుస్తున్నట్లుగా వుంది... హెల్ప్ హెల్ప్... అనా?"     "అలాగే వినబడుతోంది."     "కారాపి... హెల్ప్ చేద్దామా?"     "ఈ అర్ధరాత్రిపూట... విషయం తెలీకుండా... మనకి రిస్క్ ఎందుకు బ్రదర్... ఏయ్ డ్రైవర్... పోనియ్. కారాపకు.     ఒకవేళ వాళ్ళు ఆపమన్నా డ్రైవర్ కారాపదల్చుకోలేదు. ఆ యువతెవరో ఆపదలో ఉన్నట్లు నిస్సందేహంగా అర్థమైంది. పరిస్థితి ఏమిటో అవతల ఎంతమంది ఉన్నారో తెలీకుండా రంగంలోకి దూకడం అవివేకం. తాముకూడా ఆపదలో ఇరుక్కోవచ్చు. ఈ త్రాగుబోతు బడుద్దాయలు తనకేవిధమైన సహాయానికీ రారు...     అతని ఆలోచనలతో బాటు కారు వేగంగా ముందుకు దూసుకెళ్ళిపోయింది.     మందాకిని ఒకే ఒక్క క్షణంలో కోలుకుంది. ఆ కారులో వారెవరో తన పరిస్థితి గమనించారో లేదో- ఆగకుండా వెళ్ళిపోయారు. క్రిందనుండి లేస్తూనే తన కారు బ్యాక్ డోర్ తెరుచుకోవటం గమనించింది. ముందూ వెనకా ఆలోచించకుండా ప్రక్కకు తిరిగి పరుగుతీయ నారంభించింది.     తనకు రన్నింగ్ లో మంచి ప్రాక్టీసుంది. శక్తినంతా పాదాల్లోకి తెచ్చుకుని పరిగెత్తగలిగితే తనని అందుకోవటమంత తేలికకాదు. ఈ లోపల ఏదయినా సహాయం లభించకపోదు.     అక్కడక్కడ స్ట్రీట్ లైట్సు వెలుగుతుండడం వల్ల దారి తెలుస్తోంది. కాకపోతే వర్షం కురుస్తూ వుండటం వల్ల కాలుజారిపడే ప్రమాదముంది.     ఆమె ఇవన్నీ ఆలోచించటంలేదు. రక్తనాళాలు తెగిపోయేలా గుండెలు పగిలిపోయేలా పరుగుతీస్తోంది.     ఆ స్థితిలో కూడా ఆమె మస్తిష్కం పనిచేస్తోంది. ఒకవేళ అతను కారులో ఎక్కి తనని వెంటాడితే?     ఈ ఆలోచన వచ్చాక ఆమె కొంచమైనా ఆలస్యం చెయ్యలేదు. మొదటగా కనిపించిన ప్రక్క సందులోకి గభాల్న దారితీసింది.
24,717
"అది పట్టుక్కూచుంటే పుట్టగతులుండవు." తోటపాండు పేపర్ వెయిట్ తీసుకున్నాడు. "ఆనెస్టుగా బతికేవాళ్లు నా దృష్టిలో మూర్ఖులు." పేపరు వెయిట్ ని ఆ చేతిలోంచి ఈ చేతిలోకి మార్చుకుంటున్నాడు తోటపాండు. "అయ్ హేట్ దెమ్!" అనగానే తోటపాండు ఆ పేపరు వెయిట్ ని సత్యమూర్తి మీదికి విసిరేడు. ఆ దెబ్బకి సత్యమూర్తి ముక్కు పచ్చడైంది.   నెత్తురు  కారుతోంది. అక్కడ్తో ఆగలేదు  తోటపాండు. మేకపిల్ల మీద పెద్దపులి  దూకినట్లు సత్యమూర్తి మీదకి తోటపాండు దూకెడు. సత్యమూర్తి కింద పడ్డాడు. పడ్డవాడు లేచి నిలబడే అవకాశ మివ్వకుండా తోటపాండు తన  కాళ్లూ, చేతులూ వాడి -  సత్యమూర్తిని కైనూ చేస్తున్నాడు. దెబ్బలకు తట్టుకోలేక సత్యమూర్తి ఆర్తనాదం చేస్తున్నాడు. కేవలం కొట్టడమే గాకుండా నోటి కొచ్చిన  బూతులు  కూడా  ప్రయోగిస్తున్నాడు. ఏం జరిగిందో  తెలీని ఆఫీసు సిబ్బంది అతి కష్టమ్మీద సత్యమూర్తిని ఆ  గదిలోంచి లాక్కుపోయేరు. తోటపాండు ఫోన్ డయల్ చేసేడు. అవతల్నుంచి  ఆనందం "హాల్లో" అన్నాడు. అతని కంఠం వినగానే తోటపాండు కోపంతో ఊగిపోతూ అంటున్నాడు - "నోర్ముయ్ రాస్కెల్! యస్సల్నీ పరీక్షల్లో లెక్కలు కాఫీ  కొట్టి పాసైతే పాసవచ్చు. అంతమాత్రాన నేను ఆనెస్టీని ఆప్టరాల్ గా తీసిపారేసే మనిషినికాను. డోంటా క్! నేను చెప్పేది పూర్తిగా విను. నన్నుఅవమానించాలని  నీ ఉద్దేశం. అందుకేవాడిని - వాడి పేరేమిటి? .... సత్యమూర్తిని నా మీదకి ఉసిగోల్పేవు. వాడు..... ఆ బాస్టర్డ్... ఏం చేసేడో చెప్పను .... పిచ్చికూతలు కూసేడు. నా ముందే నా కిష్టంలేని పదజాలం ఉపయోగించేడు. ఒరే! అనందం! ఇంకో  తడవ నువ్వు నాతో మాటాడినా - ఆఖ్ఖర్లేదు. కనిపించినా చాలు! కాల్చిపారేస్తాను. అసలు ఇవ్వాళే ఆ పని చేద్దును. నాకు ప్లయిట్  టైమవుతోంది. అంచేత బతికిపోయేవు. అంతమాత్రాన సంతోషించకు. అమెరికా నుంచి వచ్చేక నిన్ను కాల్చి చంపుతాను. అయ్ విల్ సీ యువరెండ్!" అని ఫోన్ ని గాల్లోకి ఎగరేసి గాలి పీల్చుకుంటున్నాడు తోటపాండు.                                       *    *    * తోటాస్ టైర్స్ నుంచి - నెత్తురు మరకల్తో, చిరిగిన దుస్తులతో బయటపడుతున్న సత్యమూర్తిని చూసేడు పరమానందం. గబగబా సత్యమూర్తిని చేరుకొని అడిగేడు - "ఏమిటయ్యా? ఏం జరిగింది?" పరమానందాన్ని చూచి బావురుమన్నాడు సత్యమూర్తి. "ఏం చెప్పమంటారు! ఇదంతా నా ఖర్మ! ఉద్యోగమిమిస్తానంటే కాబోసనుకుని వచ్చేను. ఇంటర్వ్యూలో ఆయన అడిగిన ప్రశ్నకి ఆయన మెచ్చుకునే విధంగా సమాధానం చెబితే - ఇదుగో సార్, ఇదీ ఫలితం! ఉద్యోగం ఇవ్వకపోగా నన్ను ఈ విధంగా చితగ్గోటేడు.  చొక్కా చించేడు." "అయ్యో పాపం! కొందరంతే నాయనా! అన్నం పెడతాం అని ఆహ్వానించి  సున్నం  పెడతారు. వెళ్లేళ్లు. దెబ్బలకి సున్నం రాసుకో!" అని ఉచిత సలహా ఒకటి విసిరి వెళ్లిపోతున్నాడు పరమానందం. వెళ్లిపోతూ - "ఆహా! దునియా నువ్వు అసాధ్యుడివి! ఇంక నిన్ను విడిచి పెట్టకూడదు!" అని దునియాని మనసారా మెచ్చుకున్నాడు పరమానందం.                                                         36 చింతామణి శారీ మందిర్. ఆ షాపులోకి వెళ్లబోయే ఆనందాన్నీ షాపు బయటే కలిసేడు సత్యమూర్తి. సత్యమూర్తిని చూడగానే ఆనందం చాలా విచారించేడు. "హు! పాండు గాడికి ఆవేశం ఎక్కువ. గొడ్డుని బాదినట్టు బాదేడు" అన్నాడు ఆనందం. "వద్దండీ, పోలిక లొద్దు! అసలే మీ  ఫ్రండు కొట్టిన దెబ్బలకి నేను చితికిపోయేను. నా ముక్కు చూడండి. చితికిపోయింది. నా మొహం చూడండి. అప్పడం లాగా అన్యాయమైపోయింది. అతనేమో నన్ను చితగొట్టేడు. మీరేమో నన్ను చావనీకుండా నాకెందుకు సార్ ఆశలు కలిగించేరు?" అన్నాడు సత్యమూర్తి ఏడుస్తూ. "నీకో దారి చూపించి నేనో దారి వెతుక్కుందామని ముచ్చట పడ్డాను." "వద్దు! మీ ముచ్చట్లు నా ప్రాణమ్మీదికి తిప్పకండి. నా మీద ప్రయోగాలు చేయకండి. గోవిందం నా మీద దాడి చేస్తున్నాడంటే దానికో మీనింగుంది. నేను మీకు చేసిన ద్రోహమేమిటి? వచ్చేవాణ్ని చావనీకుండా చంపుకుతింటున్నారు మీరు!" అన్నాడు సత్యమూర్తి ఉక్రోషంగా. ఆనందం లాలనగా సత్యమూర్తి భుజం తట్టెడు. "నిజానికి తోటపాండు చాలా మంచివాడు ఉద్రేకం ఎక్కువైతే పట్టుకోలేం గాని, మామూలు పరిస్థితుల్లో తోటపాండు చాలా  సౌమ్యంగా వుంటాడు. అతనికి ఉద్రేకం కలిగించే మాటలేమైనా అన్నావా?" "లేదు. అతనికిష్టమైన ... ఎంతో ఇష్టమైన మాటలే తూచి తూచి అన్నాను." "ఏమన్నావు?" "ఆనెస్టీని తిట్టిపోసేను." ఆ మాట వినగానే ఆనందం ఖంగారుపడుతూ అడిగేడు - "ఏమిటేమిటి? ఆనెస్టీని తిట్టిపోసేవా?" "అవునండి! ఆ టాపిక్ అతనికి చాలా  ఇష్టం గదాని రెచ్చిపోయి తిట్టను." "కొంప ముంచేవ్!" అన్నాడు తాపీగా. "సార్?" ఆనందం సత్యమూర్తి చెయ్యి పట్టుకుని అక్కడికి కొంచెం దూరంలో వున్న బస్టాపుకి తీసుకొచ్చి అన్నాడు - "నీకు  తెలుసో, తెలీదో! తోటపాండుకి ఆనెస్టీ ఆరోప్రాణం నాయనా! ఆనెస్టీ ఎవరైనా విమర్శిస్తే నిప్పులు కక్కుతాడు!" "అవునా?" అని  విస్మయంగా అడిగేడు సత్యమూర్తి. "అందుకే కాబోలు, ఫోన్లో నా మీద కారాలూ మిరియాలూ నూరేడు. అయినా - తోట పాండుకి ఆనెస్టీ పడదని నీ కెవరు చెప్పేరు?" "ఎవరో సిక్కుల కుర్రాడు. అతనికి ఆ కంపెనీలో అందుకే ఉద్యోగమొచ్చిందట!" "ఎందుకు? ఆనెస్టీని తిట్టినందుకా?" "అవును." "ఇదేదో గోల్ మాల్ వ్యవహారంగా వుందే?" "అంతేనంటారా!" అని నీళ్లు నముల్తూ అడిగేడు. "అయినా, ఎవడో చెప్పింది నువ్వెందుకు నమ్మాలి?" "ఏమిటోనండి! నా చేతుల్లో ఏమీ లేకుండానే అంతా  జరిగిపోయింది." "తోట పాండు మళ్లా ఆర్నెల్లకు గాని తిరిగి రాడు." "నా పెళ్లి గడువు అంతకంటే ముందే ముగుస్తుంది." "నీ పెళ్లి విషయం అట్లా వుంచు. నా పచ్చటి బతుకు సర్వనాశనమైపోతుంది!"   "ఏమిటండీ? ఏమిటి మీరు  మాటాడేది?" అన్నాడు సత్యమూర్తి - ఆనందం మాటల్లో అంతరార్థం బోధపడక. "నా పెళ్లి ఆగిపోతే  మీ పచ్చటి బతుకు ఎందుకు సర్వనాశనమవుతుంది? నా పెళ్లీకీ, మీకూ సంబంధమేమిటి?" అని ప్రశ్నల వర్షం కురిపించబోగా - "వద్దు! వివరాలడగవద్దు. సమయం వచ్చినప్పుడు అన్నీ చెబ్తాను. నేను నీశ్రేయోభిలాషిని, ఇది చెప్పడు మాటలు విని చెడిపోయే ప్రమాదం కొని తెచ్చుకోకు!" అని హెచ్చరించి ఆనందం అక్కడ్నించి వెళ్లిపోయేడు. అప్పుడే - ఒక బస్సు వచ్చి ఆ బస్టాపులో ఆగింది. అందులోంచి శారద దిగుతోంది. శారదను చూడగానే పారిపోయేందుకు సిద్దపడ్డాడు సత్యమూర్తి. అయితే, అతను ఆ పని చెయ్యడముందే శారద అతన్ని చూచింది. సత్యమూర్తికి తగిలిన దెబ్బల్ని చూస్తో ఖంగారుగా అడిగింది శారద. "అయ్యయ్యో! ఏం  జరిగింది? ఈ దెబ్బలేమిటి?" "మామూలే! ఏక్సిడెంట్లు, దెబ్బలు తినడాలూ నాకు తెలీకుండానే జరిగిపోతుంటాయి. రీజన్లుండవు!" "అసలేం జరిగింది?" "అభిప్రాయ భేదాలు అనేకం వస్తుంటాయి శారదా! అట్లాంటి పరిస్థితుల్లో మాటా  మాటా  అనుకోడం, చెయ్యీ, కాలూ వాడటం  అతి సాధారణమైన విషయం!" అన్నాడు సత్యమూర్తి. "అర్థం లేని మాటల్ని పొడిపొడిగా వాడుతూ నువ్వేదో దాస్తున్నావ్ కదూ?" అడిగింది శారద. "కొన్ని సంఘటనలు నువ్వు తెలుసుకొకపోవడమే మంచిది, శారదా!  
24,718
    కామేశ్వరరావు అదోలా చిరునవ్వు నవ్వాడు.     "అలా చేస్తే కథే లేదు."     "మరి! ఏం చేశాడు?"     "ఇంటికి వచ్చాడు. అదును చూసి తల్లిని చంపాడు. గుండెకాయ కోసి దోసిట్లో పదిలంగా పెట్టుకొని ప్రేయసి ఇంటికేసి పరుగుతీశాడు."     "ఎవరండీ ఈ కథ రాసిన సచ్చినోడు? ఏం చెప్పాలని రాశాడు తల్లుల్ని చంపమంటాడా?"     "పూర్తిగా విను!"     "ఇంకా ఏం వినాలి? మన అబ్బాయిలు అలాంటివాళ్లు కాదని చాలా మంచివాళ్లనీ చెప్పాలనేగా ఈ కథ చెబుతున్నారు?"     "కాదు!"     "మరి?"     "ఆ గుండెకాయను ప్రేయసికి ఎప్పుడెప్పుడు అందించి మెప్పును పొందాలా అన్న ఆతృతతో పరుగు తీస్తున్నాడు. ఉన్నట్టుండి ఎదురుదెబ్బ తగిలి బొక్కబోర్లా పడ్డాడు. చేతిలో వున్న గుండెకాయ ఎగిరి అల్లంత దూరంలో పడిపోయింది."     "మంచిపని అయింది పాపిష్టి ముండాకొడుకు ఆపడడం పడడం నేలకు కరుచుకుపోయి చచ్చి వుంటాడు. అంతేగా? పాపం! కథ చివర్లో అలాంటి కొడుకులకు మంచి బుద్దే చెప్పాడులెండి ఆకథ రాసినవాడు."     "అలా అయితే అది మామూలు కథే అయి వుండేది."     "అంటే వాడు చావలేదా?"         "లేదు లేచి నిల్చున్నాడు. గుండెకాయ పడివున్న చోటకు పరుగుతీశాడు. దాన్ని దోసిట్లోకి తీసుకోబోయాడు" ఆగి కామేశ్వరరావు భార్యముఖంలోకి చూస్తూ చిరునవ్వు నవ్వాడు.     ఆమె విసుగ్గా చూసింది "వెధవ కథ! ఇదేం కథ-" అన్నట్టు.     "వంగి దాన్ని చేతిలోకి తీసుకోబోతుండగా "దెబ్బతగిలిందా నాయనా!" అని కొడుకుని అడిగింది ఆ గుండెకాయ బాధగా.     సుందరమ్మకు తల మీద సుత్తి దెబ్బతగిలినట్టుగా అయింది.     ఈ కథ ద్వారా భర్త తనకు ఏం చెప్పాలనుకున్నాడో అర్ధం అయింది .తల్లి ప్రేమ అంటే అలా వుండాలి. నీలో తల్లి హృదయం లేదనేగా చెప్పదల్చుకున్నది? సుందరమ్మ మనసు చివుక్కుమంది. తనలో తల్లి మనసు లేదా? తల్లి ప్రేమంటే ఏమిటో తనకు తెలియదా? అంటే బిడ్డలు ఏంచేసినా కిమ్మనకుండా పడివుండడాన్నే ప్రేమగా భావించాలా!     "ఏమిటి సుందరీ అంతగా ఇదైపోతున్నావు?"     "తల్లి ప్రేమ అంటే ఏమిటో నాకు తెలియదనేగా మీ ఉద్దేశం!"     "ఛ! అదేమిటి? నేను అలా అన్నానా?"     "అవును అనలేదు - కాని నాకు తెలియ జెప్పాలనుకొంది అదే! లేకపోతే ఇప్పుడు నాకు ఈ కథ ఎందుకు చెప్పినట్టు?     కామేశ్వరరావు తన పొరపాటును గ్రహించాడు. అవును. నిజమే! ఈకథ చెప్పడంలో తన ఉద్దేశం అదేగా?     "చెప్పండి."     "ఏమిటి?"     "ఆ కథ చెప్పడంలో మీ ఉద్దేశం ఏమిటి?"     "ప్రత్యేకంగా ఏమీలేదు. నువ్వు బాధ పడుతూ వుంటే చిన్నవాళ్లు ఏం చేసినా మనం పెద్దవాళ్ళం సర్దుకుపోవాలన్న ఉద్దేశంతో చెప్పాను. అంతేకాని నీకు బిడ్డల మీద ప్రేమ లేదని ఎత్తి చూపించడానికి చెప్పలేదు. నువ్వు నీ బిడ్డల్ని ఎంతగా ప్రేమిస్తావో నాకు తెలియదా సుందరీ! నీ పిల్లల్లో ఏ ఒక్కడికైనా జరగరానిది జరిగితే..."     "ఏమండీ! ఏమిటా మాటలు! అశుభం పలకకండి వాళ్ళందరూ బాగుండాలి. నా బిడ్డలకు ఏమీ జరగదు. జరగకూడదు. వాళ్లు క్షేమంగా వుండాలి." భర్తమాటల్ని మధ్యలోనే అందుకొని ఆవేశంగా అన్నది.     "చూశావా మరి! అదే తల్లిప్రేమ అంటే. ఇది చెప్పాలనే ఆ కథ చెప్పాను." నవ్వుతూ అన్నాడు కామేశ్వరరావు.     "పర్వాలేదు. వాళ్లు మనల్ని చూడకపోయినా పర్వాలేదు. వాళ్లు సుఖంగా వుండాలి. వాళ్లు సంతోషంగా వుండాలి." మంద్రస్థాయిలో తనకు తనే చెప్పుకుంటున్నట్టుగా అంది.                                 *   *   *     చెప్పుల శబ్దం విని, సుందరమ్మ చేతులు కొంగుకు తుడుచుకుంటూ బయటికి వచ్చింది. లోపలకు వస్తున్న భర్త కన్పించాడు.     "అప్పుడే వచ్చేశారా? ఇవ్వాళ ట్యూషన్స్ లేవా?"     "చిన్నవాడు ఉత్తరం రాశాడు. పోస్టుమ్యాన్ రోడ్డు మీద కన్పించి ఇచ్చాడు. అది ఇచ్చి వెళ్దామని వచ్చాను." అంటూ కవరు సుందరమ్మకు అందించాడు.     "ఏం రాశాడు?"     "చదువు"     "మీరు చదవలేదా? చెప్పండి ఏం రాశాడు? అందరూ బాగున్నారా? మనల్ని రమ్మనమని రాశాడా?"     "ఇంకా నేను చదవలేదు."     "చదివి చెప్పండి." కవరు భర్తకు అందించింది.     కామేశ్వరరావు ఉత్తరం చదువుతున్నంతసేపూ సుందరమ్మ కుతూహలంగా భర్తముఖంలోకి చూస్తూ వుండిపోయింది. ఆయన ఉత్తరం చదివి, మడత పెట్టి, కవర్లో దూర్చి సుందరమ్మకు అందించాడు.     "ఏం రాశాడు? మనల్ని రమ్మని రాశాడా?"     "ఊ"     సుందరమ్మ ముఖం విప్పారింది.     "వాడు రాస్తాడని నాకు తెలుసు. వాడు మనల్ని వదిలెయ్యడండీ. వెంటనే జవాబు రాయండి వచ్చేస్తున్నామని. చిన్న సన్యాసి. వాడిదగ్గరే పడివుందాం."     "నీధోరణి నీదేనా?"     "ధోరణి ఏమిటండీ? వాడు రమ్మని రాస్తే - వెళ్దాం అన్నాను. మీకు ఇష్టంలేదా?"     "నిన్ను వెంటనే బయలుదేరి రమ్మన్నాడు."     సుందరమ్మ భర్త ముఖంలోకి ఆశ్చర్యంగా చూసింది.     "నన్ను రమ్మని రాశాడా? మరి మిమ్మల్ని రమ్మనలేదా? తమాషాకు అంటున్నారుకదూ?"     "కాదు. నిన్నే రమ్మని రాశాడు."     "మిమ్మల్ని రమ్మని రాయలేదా?"     "నేను వెళ్ళి ఏం చేయాలి?"     "అదేమిటి? అర్ధం అయ్యేలా చెప్పండి."     "ఏం లేదు. మామూలే! హైదరాబాద్ లో కొత్తగా కాపురం పెట్టాడుగా?"     "ఆఁ! అయితే"     "కోడలికి అంతా కొత్తగా వుందట. ఇంకా మంచి పనిమనిషి కూడా దొరకలేదట. తను ఎక్కువ రాత్రి డ్యూటీలు చెయ్యాల్సి వస్తుందట. రాత్రిపూట వంటరిగా వుండడానికి కోడలు భయపడుతుందట. వాళ్ళ అత్తగారు మంచి పనిమనిషిని చూసి పంపిస్తానని చెప్పిందట. అంతవరకూ నువ్వు వుంటావని రమ్మని రాశాడు."     సుందరమ్మ వెర్రిదానిలా చూసింది. మూగదానిలా చూసింది.     "వెంటనే రమ్మన్నాడు. రేపు బయలుదేరితే సరి!"     "నేను వెళ్ళను"     "అదేమిటి?"     "పనిమనిషి దొరకలేదా? మంచి పనిమనిషిని వాళ్ళ అమ్మ పంపించేంతవరకు, నేను పనిమనిషిగా వెళ్ళాలా?" తనకు తానే చెప్పుకుంటున్నట్టు అన్నది. 
24,719
    మొదట తన్ను  గజనీ మొహమ్మదు తన  రాజసభా  కవిరత్నాలలో  ఒకణ్ణిగా తీసుకున్నప్పుడు  పిరదౌసీ  ఆ  సుల్తాన్ పై  ఆత్యద్భుతమైన పద్యాలల్లాడు.  నేడు కోపంలో  ఆ భాగం అంతా  షానామా  నుంచి  తీసివేశాడు. పైగా గజనీని  హేళనచేస్తూ భయంకర  హాస్యకావ్యం ఒకటి  రచించాడు. పదేళ్ళు  నిలువనీడలేక తిరిగి చివరకు  లూబరిస్తాను సుల్తాను సభాకవిగా అతడు చేరాడు. ' యూసుఫ్ జులైఖా' అనే  కావ్యం  రచించి   ఆ  సుల్తానుకు  అంకితం  చేశాడు. తన  ప్రాణం  టస్ నగరంచేరి అక్కడ  దుఃఖంతో ప్రాణాలు  విడిచాడు.     అక్కడ గజనీమొహమ్మదు  పారిపోయినప్పటినుంచీ  కించపడి తన మంత్రిన్నీ, పిరదౌసీ ప్రాణస్నేహితుడూ  అయిన  ఆల్ మియమాందీ సలహా  పాటించి  తనకడనుండి  పారిపోయిన  ఇరవై  ఏళ్ళకు  అరవై వేల  బంగారు  దీనారాలు  ఒంటెలపై  ఎక్కించి ససైన్యంగా  పంపించాడు.  ఆ  సమయంలోనే పిరదౌసీ  శవాన్ని  తీసుకుపోతున్నారు. పిరదౌసీని  అతని  తోటలోనే  సమాధిచేశారు. షియా అవడంవల్ల  సాధారణ  ముస్లిం సమాధి స్థలంలో  కొందరు  మతకర్తలు అడ్డం  పెట్టారట.     ఎక్కడ ఉన్నదీ మహాకవి గోరీ? నగరం  అంతా  హంపీ శిథిలాలకన్న పాడైన స్థితిలో  వున్నది. అక్కడ కొందరు  ఇది అని నగరపు  గోడల దగ్గర  ఒక స్థలం  చూపించారు. ఆ  ప్రదేశమేనని జనశ్రుతివస్తూ  వుంది. ఓ  మహాకవీ! నీ  కవిత్వమే ఆకాశాన్ని  అంటే దివ్యభవనం నీకు  నీ  దేశస్థులే ఒక భవనం కట్టలేకపోయారా? నువ్వు  సర్వదేశాలకు వినిపించిన  ఉత్తమ  కావ్యం  మసక  మసకలాడక దెసలన్నీ నింపే కాంతై వెలుగుతూ వుంది. ఆ  సాయంకాలం  ఆ  శిధిలాలలో  కూరుచుండి పిరదౌసీకి  నా  హృదయాంజలి అర్పించాను.                                       16     1935 డిశంబరు  నెలాఖరుకు  ఈజిప్టు చేరాను. పిరమిడ్లు, తీబ్సు, కొనారక, మొపిస్ పట్టణాలలో ఉన్న ప్రాచీన ఈజిప్టుదేశ  సంస్కృతి  దర్శించి, 1936 జనవరిలో  గ్రీసుదేశం  చేరాను. ఏథెన్సు, స్పార్టా, ఒలింపను, కారిస్తు, డెల్ఫీ మొదలయిన  ప్రదేశాలు చూచి ఇస్తంబోలు పట్టణం చూచాను. అక్కడ నుంచి బెల్ గ్రేడ్, సోఫియా  పట్టణాలు  చూచి, ఇటలీ చేరుకున్నాను. ఇటలీలో  రోము, వెనీసు, ప్లారిన్సు, నేపిల్సు మొదలయిన  శిల్పక్షేత్రాలు దర్శించి ఉత్తరాఫ్రికా మొరాకో  1936 మార్చిలో చేరాను. ఫెజ్, ట్యూనిస్, సహారాలో  చాలా కొద్ది భాగం చూచుకొని,  అక్కడ నుండి  స్పెయిను వెళ్ళి  మాడ్రిడ్ పట్టణం, అల్హంబ్రా మొదలయిన ప్రదేశాలన్నీ చూచాను.     1936 ఏప్రిల్ నెలాఖరున పారిస్ పట్టణము  చేరాను. పారిస్ లో  లోవరి  ప్రదర్శనశాలలో రోజులు  గడిపి, మార్సలే, వార్సైల్, రీమ్సు దేవాలయం మొదలయినవి దర్శించాను.     మే  ఉత్సవాలకు  రష్యా  చేరాను. రష్యా దేశంలో  శిల్పక్షేత్రాలను  చూడడానికి,  నవీన సాహిత్యం,  శిల్పం దర్శించడానికి  పూర్తిగా  ఒక నెలా ఇరవై రెండు  రోజులు  పుచ్చుకున్నది.      జూను  నెలాఖరుకు  నార్వేచేరి జూలై  పదవతారీఖువరకు  నార్వే, స్వీడనులు చూచి, ఇంగ్లండు, స్కాట్లండు, వేల్సు, ఐర్లండులు  దర్శించడంలో ఆగస్టు  పూర్తయింది. సెప్టెంబరు మూడవ తారీఖున బెల్జియంలో దిగాను. బెల్జియం, హాలెండు, డెన్మార్కులు చూచేసరికి అక్టోబరు పదిహేనవ  తారీఖు వచ్చింది. మళ్ళీ లండను  మహానగరంపోయి, అక్కడ  అక్టోబరు ఇరవై తారీఖున  ఏర్పాటు చేసిన   నా  చిత్ర లేఖన ప్రదర్శన సమయంలో  వున్నాను. ప్రదర్శన విషయంలో  అనేక  పత్రికలు అనేక రకాలుగా  మెచ్చుకుంటూ వ్రాశాయి.     1936 డిశంబరు నెలలో మళ్ళీ  నా  దేశం చేరుకున్నాను. దేశాలు తిరగడం ప్రారంభిస్తే, అది  నల్లమందలవాటైపోతుంది. 1937-38 సంవత్సరాలు రెండూ  మా  అమ్మగారితో  భారతదేశ క్షేత్రాలన్నీ దర్శించాను.     ఇన్ని  దేశాలు  తిరిగినది నన్ను  కర్మవీరుణ్ణి చేసుకొనేందుకే కాదూ? ఏదో నాలో  అసంతృప్తి బయలుదేరింది. ఒక్కొక్క  మహాశిల్పమే దర్శించి  నా  అల్పత్వాన్ని  తలచికొని నిట్టూర్పులు పుచ్చాను. నాలో శిల్పం శక్తి ఎంత? ఏమి  నేను రచించాలి? ఏ  మహాభావ్యం మూర్తించగలను?  యూరపులో  ఈ  ఆవేదనే  అనేక  వెర్రితలలు వేసింది. డాడాయిజము, సర్ రియలిజము, క్యూబిజము, సింబాలిజము, ప్రిమిటిజము ఇలా అని, వారికేమీ తెలియని, స్థిమిత హృదయంకాని స్థాయి చిక్కని ఆరాటంలో అన్ని వైపులకూ శిల్పులూ, చిత్రకారులూ పరుగులిడుతున్నారు. దేశకాల పాత్రలను  పట్టి మార్పులు రావచ్చును. శిల్పంఅంతా ఒకేనది కావాలి. ఆ  నందికొండల్లో ఒకవిధంగా ప్రవహిస్తుంది. బయళ్ళలో  ఇంకోవిధంగా యానం చేస్తుంది. వేసవికాలంలో నీలజలాలతో కృశాంగి అవుతుంది. వానాకాలంలో  మహావేగియై  గట్టులుపొర్లి ప్రవహిస్తుంది,  అంతేకాని  సంవత్సరానికో  కొత్తనది వానచూరుకాల్వలా బయలుదేరదు. అసంతృప్తి, ఆవేదనా కళలలో  సిద్ధిని ప్రసాదించవు. నా దేశం  తిరగటములోనే  నా  జీవియొక్క స్థాయీ భావం ప్రత్యక్షం అయింది. అది దూరదూరాననే! ఆ  స్థాయిని నాకు సన్నిహితం  చేసుకోవడం ఎలాగు? యూరపునుంచి వచ్చినప్పటినుండీ  ఈ  అసంతృప్తి నన్ను  హత్తుకుపోయింది. ఒక చిత్రము పూర్తిగా  రచింపలేను, ఒక శిల్పమూ పూర్తిగా విన్యాసం చేయలేదు. గీతాలుగా కొన్ని, రంగులు పులుముడులుగా కొన్ని, రూపం తేలని మూర్తులు, భావం తేలని కలయికలు, స్పుటత్వం తాల్చని కుంచెసారింవులైపోయినవి.     నేను  స్వామీజీ   దగ్గరకుపోయి, '' స్వామీజీ! నాలోవున్న  కళ నాశనం  అవుతున్నదా? '' అని అడిగాను.     '' ఓయి శిల్పి! నీలో  సగం లోటుగా ఉంది. నువ్వు  పాశ్చాత్యకళలు  దర్శించావు. విల్హె ల్మినా, సుశీలతో చేసిన  స్నేహచరిత్ర రహస్యం  కొంచెం  నాతో చెప్పావు. నీలో లోటయిన ఆ సగమేమిటో నువ్వు  గ్రహించలేకపోయావా?  నీ యూరపు  యాత్రలలో, ఏదో  వాంఛ  నిన్ను  వెంబడిస్తూన్నట్లు భావించాను అని  నాతో చెప్పావు.  అంగకరువాటులోని నాట్యస్త్రీ శిల్పం  దగ్గర  కన్నులు నీరు  తిరిగినవి అన్నావు. పాలం పేట నృత్యమూర్తి దగ్గర  ఏదో మహత్తరమైన  బాధ అనుభవించానన్నావు. శ్రీనాథమూర్తీ! నీ పరీక్షా  సమయం  ఇంకా  దాటలేదోయి, నువ్వు నీ అర్ధభాగాన్ని  వెదికి  వెదికి  ప్రత్యక్షం  చేసుకో! ఆ  తపస్సుతో, ఆ  దర్శనంతో  నీకు సిద్ది  సంభవిస్తుంది'' అని స్వామీజీ  నాకు   ఉపదేశించారు. ఆయన  మాటలు  నాకేమీ అర్థంకాలేదు.  
24,720
    మైనార్టీ తీరిన మరుక్షణం ఆ ఆస్థిని తన పేరుమీద రాయమని నన్ను బలవంతం చేయడం ప్రారంభించాడు. అది మా పిన్ని ఒత్తిడి మూలంగానే అని నాకు తెలుసు. నా తల్లిని పొట్టన పెట్టుకున్నవారిని క్షమించలేకే ఆ ఆస్తిని వారికి రాయలేదు నేను.     ఒకపక్క అహోబలపతి నన్ను కిడ్నాప్ చెయ్యడానికి ప్రయత్నాలు, మరోపక్క స్వంత తండ్రి ద్వారా నేననుభవించే చిత్రహింసలు. ఆ హింసల్ని భరించలేక ఎన్నోసార్లు నేను తప్పించుకుపోయాను. నాకోసం రెండు పార్టీల మనుషులూ వెతికేవారు.     ఎందుకు ఇదంతా? ఇంతమంది నాకోసం ఎందుకు వెతుకుతున్నారో అర్ధం కావడానికి నాకు చాలా సమయం పట్టింది.     మా తాతయ్య, అంటే... అమ్మ తండ్రి రఘుపతి లేకపోతే నన్నెప్పుడో గుర్రం పెద్దబ్బాయి చంపేసి వుండేవాడు. మా తాతయ్య రఘుపతి ఎక్స్ మిలటరీ మెన్. ఆయనకున్న పలుకుబడి, ఆర్ధిక స్థోమత చూసి నా తండ్రి నన్ను చంపించే ప్రయత్నం చేయలేదు. రఘుపతి తాతయ్య తను చనిపోతూ తన యావదాస్తినీ నాకు రాసేసి చనిపోయారు. ప్రస్తుతం మనం వుంటున్న శివదేవునిపల్లి బంగ్లా... మొత్తం నూటయాభై ఎకరాల ఎస్టేట్ అందులో భాగమే.     మన పెళ్ళికి మూడు నెలలు ముందు మా తాతయ్య చనిపోయారు. నేను నిన్ను పెళ్ళిచేసుకోవడం మా నాన్నకు అసలు ఇష్టంలేదు. మనం పెళ్ళి చేసుకుని ఎవరికీ తెలియకుండా రహస్యంగా వుండడం నీకు తెలుసు. మా నాన్నకు మన పెళ్ళి ఇష్టం లేకపోవడంవల్లే మనం రహస్యంగా వున్నామని నువ్వు అనుకునేదానివి కానీ ప్రాణభయంతో రహస్య జీవనం గడుపుతున్నానన్న విషయం నాకే తెలుసు.     ఎలాగైనా నా పేరు మీదున్న ఆ నాలుగుకోట్ల రూపాయల విలువైన భూమిని నయానో, భయానో తన పేరుమీద మార్పించుకోవాలని నా తండ్రి ప్రయత్నం ఒకపక్క, మరోపక్క నా దగ్గర నుంచి ఆ లాండ్ కు చెందిన డాక్యుమెంట్స్ ని సంపాదించి మొత్తం కేసునే తిరగతోడాలని అహోబలపతి మరొకపక్క-     పదిహేనేళ్ళ క్రితం నాలుగుకోట్ల రూపాయల విలువైన ఆ లాండ్ విలువ ప్రస్తుతం ఎంతుంటుందో ఊహించుకో... కనీసం పదికోట్లు.     మనం రహస్యంగా విశాఖపట్నంలో బ్రతుకుతున్న కాలంలోనే నా తండ్రి గుర్రం పెద్దబ్బాయి అప్పటి చీఫ్ మినిస్టర్ రామచంద్రరెడ్డి మద్దతుతో నాకు తెలీకుండా నా పేరుమీద కన్ స్ట్రక్షన్ కంపెనీని స్టార్ట్ చేసి నా పేరు మీద బిజినెస్ చేసి-     నా సంతకాన్ని ఫోర్జరీ చేసి రియల్ ఎస్టేట్ బిజినెస్ ప్రారంభించాడు.     కొన్ని లక్షల రూపాయల్ని ఆక్రమంగా వసూలు చేశాడు.     గుర్రం పెద్దబ్బాయి చేస్తున్న యీ అక్రమమైన బిజినెస్సుకు ఎలాగైనా దెబ్బకొట్టాలని నిర్ణయించిన అహోబలపతి చీఫ్ మినిస్టర్ మీద వత్తిడి తెచ్చాడు. తను రాజీనామా చేస్తానని బెదిరించాడు. ప్రతిపక్ష నాయకుడి వ్యాపారంతో చీఫ్ మినిస్టర్ కుమ్మక్కయ్యాడని పేపర్ ప్రకటనలు ఇచ్చాడు. ఇంటా బయటా మీటింగులు పెట్టి చీఫ్ మినిస్టర్ ని అన్ పాపులర్ చెయ్యడానికి ప్రయత్నించాడు.     చీఫ్ మినిస్టర్ రామచంద్రారెడ్డి రెండుమూడుసార్లు హెచ్చరించాడు.     అప్పటికీ ఊరుకోలేదు అహోబలపతి.     రాష్ట్రమంతటా యాజిటేషన్ చేయిస్తామని... పవర్లోంచి దించేస్తానని హెచ్చరించాడు అహోబలపతి.     చీఫ్ మినిస్టర్ తన పవర్ నంతా ఉపయోగించి రాత్రికి రాత్రి అహోబలపతి అక్రమ వ్యాపారాల మీద దాడులు జరిపించాడు. పోలీసులు... ఇన్ కమ్ టాక్స్ వాళ్లచేత రైడ్ చేయించాడు.     ఆ తర్వాత వాళ్ళిద్దరూ ముఖాముఖీగా దెబ్బలాడుకుంటున్నారు...     అప్పుడే అహోబలపతి శపథం చేశాడు చీఫ్ మినిస్టర్ తో....     నన్ను కాదనుకున్నవాడు... నా ఆస్తులమీద దాడులు చేయించినవాడు ఎవడూ చీఫ్ మినిస్టర్ గా బ్రతకలేడని.     అది జరిగిన తర్వాత సిగ్గా పదిహేనురోజులకు నిజాం కాలేజీ సభలో చీఫ్ మినిస్టర్ రామచంద్రారెడ్డి హత్య జరిగింది.     రామచంద్రారెడ్డి అహోబలపతితో అంతటి తగువు పడడానికి కారణం- నా తండ్రి గుర్రం పెద్దబ్బాయి. నా పేరుమీద అక్రమంగా తను చేస్తున్న రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఫిఫ్టీ పర్సెంట్ వాటా చీఫ్ మినిస్టర్ రామచంద్రారెడ్డికి ఎరపెట్టటమే.     సరిగ్గా చీఫ్ మినిస్టర్ హత్య జరగడానికి వారం రోజులు ముందు మా నాన్న చేస్తున్న ఈ అక్రమ వ్యాపారాల సంగతి తెల్సుకున్న నేను బిజినెస్ పని మీద బొంబాయి వెళ్తున్నానని నీతో చెప్పి, హైద్రాబాద్ వచ్చి గుర్రం పెద్దబ్బాయిని కలిసాను...     తను చేష్టున్న అక్రమ వ్యాపారంతో నాకు సంబంధం లేదని... ఆ మేరకు పోలీస్ కంప్లయింట్ ఇస్తానని బెదిరించాను. చీఫ్ మినిస్టర్ని తన వేపు లాక్కోడానికి ఇదంతా ఓ డ్రామా అని గుర్రం పెద్దబ్బాయి నన్ను నమ్మించడానికి చూశాడు...     బెదిరించాడు... భయపెట్టాడు... ఆఖరికి ఆ లాండ్ ను తన పేరు మీద రాసిచ్చెయ్యమని, బలవంతం చేశాడు.     నేనొప్పుకోలేదు. ఇరవైనాలుగు గంటలు నాకు టైమిచ్చాడు. నేను లొంగలేదు. ఇక ఏం జరుగుతుందో తెలీదు.     ఆరోజు రాత్రి, నేనున్నా హోటల్ సూట్ పై పోలీసులు దాడి జరిగింది. ఛీటింగ్ బిజినెస్ చేస్తున్నానని నన్ను పోలీసులు అరెస్టు చేశారు. చీఫ్ మినిస్టర్ హేండ్ వుండడం వల్ల అన్నీ పకడ్బందీగా జరిగిపోయాయి. ఆర్ధిక నేరం కారణమంటూ... నన్ను ముషీరాబాద్ జైల్లో పెట్టారు. జైల్లో పెట్టిన మర్నాడు గుర్రం పెద్దబ్బాయి నా దగ్గరకొచ్చాడు.     ఆ లాండ్ తన పేరు మీద రాస్తే... ఏ గొడవలూ రాకుండా చూస్తానని నువ్వూ, నీ భార్యా, బేబీ... హాయిగా వుంటారని లేకపోతే... నువ్వు జైల్లోనే ఛస్తావని... నీ భార్యా పిల్లల్ని అనాధలుగా చేస్తానని బెదిరించాడు.     కానీ... నేనప్పటికే చేసిన పని నీక్కూడా తెలీదు. నాలుగు కోట్ల రూపాయల విలువైన లాండ్ ని నీ పేరుమీద రాశాను. అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ లాకర్లో వుంచాను.     అదే విషయం చెప్పాను మా డాడీ గుర్రం పెద్దబ్బాయితో.     అలా చేస్తానని ఆయనెప్పుడూ ఊహించలేదు. దాంతో షాక్ తిన్నాడు. నన్ను విడుదల చేయించి, నా ద్వారా నీ విషయం కనుక్కుని ఆ డాక్యుమెంట్లను సంపాదించాలని చూశాడు. కానీ-ఆ పథకాన్ని తలకిందులు చేసినవాడు గుర్రం పెద్దబ్బాయి శత్రువుగా మారిన అహోబలపతి.     నా నుంచి డాక్యుమెంట్లను అతను సంపాదించాలనుకున్నాడు. అన్ని వేపుల నుంచీ నరుక్కొచ్చాడు.     చీఫ్ మినిస్టర్ రామచంద్రారెడ్డి హత్యతో పొలిటికల్ సీనంతా రాత్రికి రాత్రే మారిపోయింది.     అహోబలపతి చీఫ్ మినిస్టరైపోయాడు.     అటు గుర్రం పెద్దబ్బాయి... ఇటు అహోబలపతి... ఇద్దరికీ నా దగ్గరున్న డాక్యుమెంట్లు కావాలి.
24,721
    ఫణివర్మ మాటల వెనక భావాన్ని అర్థం చేసుకున్న మార్టిన్ సైలెంట్ గా సైలెన్సర్ ఫిక్స్ చేసిన రివాల్వర్ ని తీసి కమల్ నుదుటివైపు గురిపెట్టాడు.     "ఇది ద్రోహం... ఇది అన్యాయం. మీకు కావలసిన వివరాలు చెప్తే నన్ను వదులుతానన్నారు. ప్లీజ్ నన్ను చంపొద్దు. నేనీ ఊరు విడిచి దూరంగా వెళ్ళిపోతాను సార్!" ప్రాధేయపడుతున్నాడు కమల్.     ఆ మాటకు పెద్దగా నవ్వాడు ఫణివర్మ.     ఒకడి ఖేదం ఇంకొకడి మోదం.     మార్టిన్ చేతివేళ్ళు రివాల్వర్ ట్రిగ్గర్ ని తాపీగా నొక్కాయి. అరక్షణంలో అతడి నుదురును చీల్చుకుంటూ దూసుకుపోయింది బుల్లెట్.     ఆ పరిసరాల్లో పేరుకొని వున్న చిక్కటి నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ వెళ్ళింది కమల్ కంఠం నుంచి వెలువడిన హృదయవిదారకమయిన ఆర్తనాదం.     "దట్స్ గుడ్! అప్పటికీ, ఇప్పటికీ నీగురిలో మార్పు లేదు మార్టిన్" అంటూ లేచాడు ఫణివర్మ.     నవ్వీ నవ్వనట్టు నవ్వాడు మార్టిన్. ఒక మనిషి ప్రాణం తీసిన ఫీలింగ్ అతడిలో ఏ కోశానా లేదు. అరుదైన ప్రొఫెషనల్ కిల్లర్స్ మాత్రమే అలా వుండగలరు.     మార్టిన్ తో ఫణివర్మ ఇంకేదో చెప్పబోతుండగా మోగింది కార్డ్ లెస్ ఫోన్. అందుకున్నాడు ఫణివర్మ.     అతడు "హలో" అనగానే-     "సక్సెస్ ఫణీ! నువ్వు చెప్పినట్టుగానే లైన్ క్లియర్ చేశాను" అని కామిని కంఠం ఫోన్ కి ఆవైపు నించి వినిపించగానే ఫణిముఖంలో సంతోషం తొణికింది.     "కామినీ... వెంటనే వచ్చెయ్ క్విక్" అరిచాడు ఫణివర్మ ఎగ్జయిటింగ్ గా.     ఆ తరువాత బటన్ ని ఆఫ్ చేసి ఫోన్ ని సోఫా మీదకు విసిరేసి- "ఎరీనాను ప్రిపేర్ చేయాలి మార్టిన్" అన్నాడు ఫణివర్మ గంభీరంగా. మార్టిన్ విస్మయంగా చూశాడు ఫణివర్మ మాటలకు.     "మనతో దోబూచులాడేవాళ్ళు బతకరు. మనకు సిన్సియర్ గా రహస్యాలు చెప్పేవాళ్ళు కూడా బతకరు. దిసీజ్ మై పాలసీ" అంటూ మార్టిన్ వైపు చూసి నవ్వి- పడివున్న శవంవైపు చూస్తూ- "ఈ శవాన్ని బయట ప్రపంచానికి కనబడనివ్వకండి. దూరంగా తీసుకెళ్ళి పెట్రోలుపోసి తగలెట్టెయ్యండి" ఆర్డర్ వేసి ముందుకు సాగిపోయాడు ఫణివర్మ.     ఇద్దరు వ్యక్తులు ఒక గోనెసంచీని తీసుకొచ్చి కమల్ శవాన్ని అందులో నెట్టేశారు.                                 *    *    *    *     చిత్రవధ చేసి రహస్యాన్ని రాబట్టుకున్నానుకున్న ఫణివర్మకు తెలీదు. ఆ వ్యక్తి ఒక ప్రగాఢమైన రహస్యాన్ని తనలోనే దాచుకుని మరణించాడని, ఆ రహస్యం సామాన్యమైనది కూడా కాదని.                                                    *    *    *    *     డిన్నర్ తీసుకున్నాక అపార్ట్ మెంట్ కు వచ్చారు శృతి, అన్వేషి. అలసటగా సోఫాకి చేరబడిపోయిన అన్వేషిని గమనించి కాఫీ కలపడానికి లోనికి వెళ్ళింది శృతి. సోఫాలో కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నాడతను. అంతకు ముందు హోటల్లో డిన్నర్ చేస్తున్న సమయంలో శృతి క్రితంరోజు జరిగిన సంఘటనకు సంబంధించి మరోసారి సారీ చెప్పింది.     "నిజంగా నీ డైరీ కోసమే రహస్యంగా ఫ్లాట్ కొచ్చాను. నీ మీద నిఘాతో కాడు"     "ప్రస్తుతానికి నీ మాటల్ని నమ్ముతాను" మామూలుగా అన్నాడు అన్వేషి.     "నిన్ను నమ్మించాలంటే నేనేం చేయాలి?" చిరుకోపంతో అడిగింది శృతి.     "విశ్వాత్మ ఫౌండేషన్ లో జాబ్ రిజైన్ చేయాలి. చేస్తావా?" సీరియస్ గా అన్నాడు అన్వేషి.     బెంబేలుపడుతూ అన్వేషి ముఖంలోకి అనుమానంగా చూసింది శృతి. "వాట్ డూ యూ మీన్" ఆశ్చర్యంతో ఆమె కళ్ళు పెద్దవయ్యాయి.     "అయ్ మీన్ టు సే.... మైడియర్ లేడీ. మనం పెళ్ళి చేసుకున్నాక నువ్వు జాబ్ చేయడం నాకిష్టం లేదు..." ఐస్ క్రీమ్ తింటూ అన్నాడు అన్వేషి.     అప్పుడు కదా. ఇప్పుడే రిజైన్ చేయమంటావేమోనని కంగారు పడిపోయాను" అంది.     ఆ సంభాషణంతా జ్ఞాపకం తెచ్చుకుంటుండగా కిచెన్ రూమ్ లోంచి రెండు కప్పుల్తో కాఫీని తెచ్చి ఒక కప్పు టీపాయ్ మీద వుంచిందామె.     అన్వేషి ఇదేమీ గమనించనట్టుగా వుండిపోయాడు.     కొద్దిక్షణాలు నిశ్శబ్దంగా గడిచాక తనే కాఫీ కప్పుని అన్వేషికి అందించింది శృతి.     కాఫీ కప్పుని తీసుకుంటూ మౌనంగా ఆమె కళ్ళవైపు నిశితంగా చూశాడు అన్వేషి.     ఇద్దరి మధ్యా మౌనంగా నిమిషాలు యుగాలుగా వెక్కిరిస్తూ గడిచి పోతున్నాయి.     నిన్న రాత్రి తనకొచ్చిన కలలు, తను ధృతకుమార్ దగ్గరకు వెళ్ళడం, ఆ విషయాలన్నీ చెప్దామానుకుని అంతలోనే ఆ ఆలోచనను విరమించుకున్నాడు.     "ఏవైనా మాట్లాడొచ్చుకదా!" అంది శృతి.     "ఏం మాట్లాడమంటావు?" అనడిగాడతను.     "ఏదో ఒక విషయం. పోనీ మన పెళ్ళి గురించి తర్వాత జరగబోయే సంసారం గురించి" అందామె.     "పెళ్ళీ, సంసారం... తర్వాత ఏమిటీ, కోడైకెనాల్లో సాంగ్, ఇదేమ తెలుసు సినిమా అనుకున్నావా? అర్థం పర్థం లేకుండా వుండడానికి" అన్నాడు అన్వేషి.     "నువ్వు ఈ క్షణంలో దేని గురించి ఆలోచిస్తున్నావో నాకు తెలుసులే" కనుబొమలెగరేస్తూ అంది.     ప్రశ్నార్థకంగా ఆమెవైపు చూశాడతను.     భారంగా వూపిరి విడుస్తూ "అయితే చెప్పండి మేడమ్ ఏమిటో?" అన్నాడు అన్వేషి.     "పునర్జన్మల గురించి... యామై కరెక్ట్?" అంది శృతి కనుబొమలని అందంగా ఎగరేస్తూ.     షాక్ తిన్నాడు అన్వేషి. చటుక్కున శృతి వైపు చూశాడు. శృతి వూహించింది కరెక్టే. తను అంతర్లీనంగా ధృతకుమార్ చెప్పిన విషయాల గురించే ఆలోచిస్తున్నాడు. పునర్జన్మ గురించే ఆలోచిస్తున్నాడు. విశ్వాత్మ గురించే ఆలోచిస్తున్నాడు. విశ్వాత్మ ఆలోచన వెనక వున్న పథకం గురించి ఆలోచిస్తున్నాడు.     "పెళ్ళి.... పునర్జన్మ... ఈ రెండేనా నీకు తెలిసిన విషయాలు..." అంటూ ఖాళీ అయిన కాఫీ కప్పును టీపాయ్ మీద పెడుతూ అడిగాడు అన్వేషి.
24,722
    ఈ విషయాలన్నీ కృష్ణయార్యునీ, మంగమాంబనీ బాధిస్తూనే ఉన్నాయి. వారు వినేట్లుగా మాట్లాడి, బాధపడుతుంటే ఆనందించటం తమ విజయంగా భావించారు సోమయాజి అనుయాయులు. వాళ్ళు అంతకంటే ఇంకే చెయ్యగలరు?     ఒకరోజు సోమిదమ్మ పనిగట్టుకుని మరీ కృష్ణయార్యుని ఇంటికి వచ్చింది. చాలాసేపు కూర్చుని ఊళ్ళోవాళ్ళ కబుర్లన్నీ చెప్పింది. అత్తా కోడళ్ళిద్దరికీ భయమే - ఈ సంభాషణ ఎటు దారితీస్తుందోనని. అనుకున్నంతా అయ్యింది.     "అక్కా! వెంకూ ఏదీ? గుడికెళ్ళిందా?" అని అడిగింది ఉయ్యాలబల్ల మరోసారి ఊగటానికి కాలితో నేలనితన్ని.     "అదిగో నమ్మా! అక్కడ పంచలో బియ్యం విసురుతోంది" అంది కృష్ణయార్యుని తల్లి.     "సక్కుబాయికి కృష్ణుడిలాగా, మన వెంకుకి వెంకన్న సాయం చేస్తాడేమోలే విసరటానికి" అంది, ఉయ్యాలబల్లమీంచి లేచి, పంచలోకి తొంగిచూస్తూ.     అత్తాకోడళ్ళిద్దరూ ఏం మాట్లాడలేదు.     "అయితే ఇంటి పనులు కూడా చేస్తుందన్నమాట"     "అవును అత్తగారూ! ఇంటి పనులన్నీ మా వెంకూనే చేస్తుంది. నేనూ అత్తయ్యా ఇట్లాగే ఈ బల్లమీద కూర్చుంటాం. అంతే!"     "ప్రశ్నలూ, శకునాలూ చెప్పుతుందనుకున్నా! పనిమంతురాలే! ఏ మాటకామాట చెప్పుకోవాలి. బాగానే చెపుతుంది. ఒక్కమాట పొల్లుపోలేదింత వరకూ!" ఆగింది.     అత్తా కోడళ్ళకేం చెప్పాలో తెలియలేదు.     "పారిజాత కొడుకు మామిడిపిందెల మొలతాడు పాలేరు తలపాగాలో ఉంటుందని చెప్పింది చూసినట్టు. ఎట్లా చెప్పిందో! ఏమో?"     "పిల్లవాడిని పాలేరు నెత్తిన పెట్టుకుని ఊరంతా తిప్పాడుగా, ఏడుస్తుంటే. అక్కడ ఇరుక్కుపోయిందని చూసినవాళ్ళెవరైనా చెపుతారు! చూసిందికాబోలు అదే చెప్పి ఉంటుంది. అంతే!" మంగమాంబ తేలికగా తీసిపారేసింది.     "అదేం కాదు. ఏదో శక్తి ఉంది మనవెంకులో. లేకపోతే అవధానిగారి కోడలికి పట్టిన దెయ్యాన్ని ఎట్లా వదిలించింది చెప్పవే కోడలు పిల్లా."     "వెంకు దెయ్యాలని వదలించటమేమిటి? అంతా అబద్ధం వాళ్ళే ఏదో పొరపాటు పడి ఉంటారు. అసలు దెయ్యాలెక్కడ ఉన్నాయి? ఉన్నా మన ఊళ్ళోకి రావు. మన ఊరికి నరసింహస్వామి కాపాడుతున్నాడు. వాటికి స్వామి అంటే భయం."     "మరి, మీ ఇంట్లో దెయ్యం ఎట్లా ఉంది? ఎంత తెలివిగా కూతురి విషయం కప్పిపెట్టినా, నేను వదులుతానా?" అనుకుంది మనస్సులో, పైకి మాత్రం     "కాని, ఊళ్ళో అంతా మన వెంకుయే దెయ్యాన్ని వదిలించింది అనుకుంటున్నారు" అంది.     "ఎవరెట్లా అనుకున్నా అన్నీ తెలిసినదానివి. పండిత వంశంలో పుట్టినదానివి నువ్వు మాత్రం అట్లా అనుకోవుగా సోమిదమ్మా!" అంది కృష్ణయ్య తల్లి, మరోమాటకి అవకాశం లేకుండా.     "నేను అనుకోనులే అక్కా! లోకులు పలుగాకులు కదా! వాళ్ళ నాలికలకి నరాలుండవు. ఏదేదో వాగుతారు. మన పిల్ల కదా అని నాకు బాధ. అక్కడికీ వాళ్ళతో వాదిస్తాననుకో - ముక్కుపచ్చలారని 'పిచ్చి' పిల్ల గురించి అట్లా మాట్లాడవద్దని. ఎంతమంది నోళ్ళని మూయించగలను చెప్పు. వాళ్ళకేదన్నా అవసరం వస్తే 'వెంకమ్మా!' అంటూ వస్తారు గుళ్ళో ఉన్నప్పుడు 'నువ్వు మాదేవతవి' అంటారు. తరవాత 'దెయ్యం', 'భూతం' అంటారు."     "... ... ..."     "కాని, అక్కా ఒక్క సంగతి నిజం మన వెంకులో ఏదో శక్తి ఉంది. అదేంటో దాన్ని చూస్తుంటే ఒక్కొక్కసారి భయం వేస్తుంది. ఇప్పుడు చూడు నావంక ఎట్లా చూస్తోందో!"     అత్తాకోడళ్ళిద్దరూ పంచలోకి తొంగిచూశారు. తలవంచుకుని విసురుతోంది వెంకమాంబ.     అప్పుడే లోపలికి అడుగుపెట్టిన కృష్ణయార్యుని తండ్రి,     "అవును. వెంకుతల్లిలో శక్తి ఉంది. దైవశక్తి, నా మనుమరాలు దైవాంశ సంభూతురాలు. అదే బాలాజీ, అదే బాలాజీ, అదే చౌడీశ్వరీ దేవి, అదే నరసింహస్వామి, అదే శ్రీకృష్ణపరమాత్మ. తెలుసా! మంచి వాళ్ళకి దేవత, చెడ్డవాళ్ళకి దెయ్యంలాగా కనపడుతుంది వాళ్ళేదెయ్యాలు కనుక" అన్నాడు.     సోమిదమ్మ కంగారు పడింది పెద్దాయన రాకకి, మాటలకి.     "సోమయాజికి, అమ్మలక్కలకీ ఈ మాట చెప్పమ్మా!" అన్నాడు శాంతంగా.     "బావగారికి కోపం వచ్చినట్టుంది. నాదేముంది! అందరూ అనుకున్న మాట చెప్పాను అంతే! పొద్దుకూకుతోంది. వెళ్ళొస్తాను అక్కా! కోడలుపిల్లా జాగ్రత్త!' అని కదిలింది బొట్టూతాంబూలం తీసుకుని.     ఇంట్లో అందరి మనసులూ బరువెక్కాయి. మంగమాంబ కూతురి దగ్గరచేరి తిరగలిలో బియ్యం తనుపోస్తూ     "ఎందుకే వెంకూ ఈ నిందలు నీకు. హాయిగా అందరిలా ఉండచ్చుకదా! అందరి సంగతి మనకెందుకు?" అంది.     "అమ్మా! ఆ అజ్ఞానుల సంగతి వదిలెయ్యి! చదువులేదు, తెలివిలేదు" అంటూ పిండి ఎత్తటంలో మునిగిపోయింది వెంకమాంబ.                                                             * * *     ఇంతకు ముందే పనులు చేయటం నేర్పించాలనుకున్న మంగమాంబ ఇప్పుడు మరింత పట్టుదలగా నేర్పటం మొదలు పెట్టింది, ఈ పనులలో దృష్టిపెట్టి ఊళ్ళోవాళ్ళసంగతులు పట్టించుకోటం మానేస్తుందని, అత్తవారింట్లో ఇబ్బంది ఉండదని. వెంకమాంబ ఎంతో శ్రద్ధగా నేర్చుకుని పనులన్నింటిలో నేర్పరితనం సంపాదించింది. కాని ఎవరైనా భర్తమాట ఎత్తితేచాలు చిరాకు పడేది.     ఒకసారి రామక్క అడిగింది "ఎప్పుడే కాపురానికి వెళ్ళేది?" అని     "నేనెక్కడికీ వెళ్ళను" అంది వెంకమాంబ.     "నీ అత్తవారింటికి వెళ్ళవా?"     "నాకత్తవారిల్లు తిరుపతే"     "నువ్వు భర్తదగ్గరికి వెళ్ళవా?" 
24,723
    కళ్ళు తుడుచుకొని తలుపుతీసింది.     "అక్కా నువ్వు అన్నం తినలేదటగా?"     "ఆకలిగా లేదు"     "ఊహూ, నువ్వు తినకపోతే నేనూ తినను. నాకు మహా ఆకలిగా ఉంది" మారాం చేస్తున్నట్టు అన్నది రాధిక.     రేణుక రాధ వెనకే డైనింగ్ హాలులోకి వెళ్ళింది.                                                                      16     రాధ సుధీర్ తో తిరుగుతోందని వింటూనే ఉన్నది.     రేణుక మళ్ళీ ఆ విషయంలో కలుగజేసుకోలేదు.     రెండు మూడుసార్లు రాధ ఏదో చెప్పాలని ప్రయత్నం చేసింది. రేణుక ముభావంగా ఉండడంవల్ల ఏమీ చెప్పలేకపోయింది.     ఆ రోజు కాలేజీ నుంచి త్వరగా వచ్చింది. వస్తూనే గది తలుపులు బిగించుకుని పడుకుంది. తల్లి ఎంత పిల్చినా తలుపులు తెరవలేదు. చిన్న తమ్ముడు రఘూ కూడా పిల్చాడు. లోపలనుంచే సమాధానం ఇచ్చింది. తనకు ఆరోగ్యం సరిగా లేదని గొడవ చెయ్యొద్దని విసుక్కుంది.     రేణుకకు ఆ రోజు అర్జంటు కేసు రావడం వల్ల ఆపరేషన్ లో ఉండిపోయింది. ఆలస్యంగా ఇంటికి వచ్చింది. వస్తూనే తల్లి ఏడుస్తూ "దానికి ఏమైందో? లోపల ఆరుగంటలు నుంచి తలుపులు బిగించుకొని పడుకుంది" అని చెప్పింది.       రేణుక తలుపు కొట్టింది. రాధ తలుపు తీసింది. జుట్టు రేగి ఉంది. కళ్ళు వాచి ఉన్నాయి. ఏడుస్తూ పడుకొని ఉంటుందని అర్థం అయింది.     "ఏమయింది రాధా?" ఆప్యాయంగా అడిగింది.     రాధ రేణుక అలా అడగ్గానే బావురుమంది.     రేణుక రాధను పట్టుకుని బుజ్జగించింది.     "ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావ్?" అని అడిగింది.     "సుధీర్ మోసం చేశాడు అక్కా!" అంటూ మళ్ళీ వెక్కివెక్కి ఏడవసాగింది.     రేణుకకు ఏం మాట్లాడాలో బోధపడలేదు. చెల్లెల్ని రెండు చేతులతోనూ పొదివి పట్టుకొని ఉండిపోయింది.     "రాధా, అసలు ఏమైందో చెప్పమ్మా" లాలనగా అడిగింది.     "అంత మంచితనం చూపించకు అక్కా! నేను భరించలేను. నీ మాట వినలేదు. నిన్ను అవమానించాను. నన్ను తిట్టు కొట్టు, కాని జాలిపడకు"     "రాధా, ఏమిటా పిచ్చిమాటలు? అసలు ఏం జరిగిందో చెప్పకుండా?"     రాధ కళ్ళు తుడుచుకుంది.         "సుధీర్ ను నీదగ్గరకు తీసుకురావాలనుకున్నాను. అతను రోజూ ఏదో సాకుతో తప్పించుకోసాగాడు. చివరకు ఈ రోజు పెళ్ళి విషయం సిగ్గు విడిచి నేనే అడిగేశాను"     "ఏమన్నాడు?" ఆతృతగా అడిగింది రేణుక.     "తనకు అభ్యంతరం లేదట"     "మరి?"     "అతని తల్లిదండ్రులు లక్షలు కట్నం ఇచ్చే పిల్లకోసం గాలిస్తున్నారట. వాళ్ళను ఎదిరించే శక్తి తనలో లేదట."     "ఊ"     రాధ రేణుక ముఖంలోకి చూసింది.     రేణుక ముఖం గంభీరంగా ఉన్నది.     "మీ అక్క అంత సంపాదిస్తోంది. లక్ష రూపాయలు కట్నంగా ఇవ్వలేదా?" అంటున్నాడు.     రేణుక రాధ ముఖంలోకి చూస్తూనే ఉండిపోయింది.     "రేపు నీతోవచ్చి మాట్లాడతానన్నాడు"     రేణుక ఆలోచనలో పడింది.     "లక్ష రూపాయలు మా అక్క ఎక్కడనుంచి తెచ్చిస్తుంది? నువ్వు వచ్చి మాట్లాడినా లాభం లేదన్నాను."     రేణుక ముఖంలోకి ఓ క్షణం చూసి మళ్ళీ రాధ అన్నది.     "కనీసం ఏభైవేలన్నా లేకపోతే వాళ్ల అమ్మా నాన్నా ఒప్పుకోరు అంటున్నాడు"     "ప్రేమించేటప్పుడు అమ్మనూ, నాన్ననూ అడిగే ప్రేమించాడా?" కోపంగా అన్నది రేణుక.     రాధ తలదించుకున్నది.     "ఇవాళే చెప్పేస్తాను. కట్నం ఇచ్చే పిల్లనే చేసుకోమని. అందరిలా నాకు కన్నతండ్రి ఉన్నాడా? కట్నం ఇచ్చి పెళ్ళి చెయ్యడానికి?" అంటూ చివ్వున లేచి చరచరా బయటికి వచ్చి బాత్ రూంలోకెళ్ళి తలుపు బిగించుకుంది రాధిక.     రేణుక కణత మీద కంకరరాయి తగిలినట్టే అయిపోయింది. రాధిక వెళ్ళినవైపే వెర్రిదానిలా చూస్తూ ఉండిపోయింది. ఓ నిముషం తెప్పరిల్లి లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది.     బుర్ర పని చెయ్యడం లేదు. బట్టలు కూడా మార్చుకోకుండానే మంచానికి అడ్డంగా పడింది. బాగా అలసి ఉన్న మనసు నిద్రలోకి జారిపోయింది.     రేణుక అకస్మాత్తుగా మెలుకువ వచ్చింది. గోడ గడియారం కేసి చూసింది. చీకట్లో గడియారం ముళ్ళూ, అక్షరాలూ మెరుస్తున్నాయి.     పన్నెండున్నర దాటుతోంది. కడుపులో ఏదో మంటగా ఉన్నది. ఆ మంట గుండెలదాకా ఎగబాకుతోంది.     "ఏమిటిది ఇలా ఉంది?     తను భోజనం చెయ్యకుండా పడుకున్నట్టు గుర్తుకు వచ్చింది.     వెంటనే లేచి డైనింగ్ హాలులోకి వెళ్ళింది. ఫ్రిజ్ తెరచి నీళ్ళ బాటిల్ తీసుకున్నది. గటగట రెండు గ్లాసుల నీళ్లు తాగాక గాని కడుపులో మంట ఆరలేదు. ఎదురుగా ఉన్న పళ్ళెం నుంచి రెండు అరటిపళ్ళు తీసుకొని తినేసింది. గదిలోకి వచ్చి పడుకుంది. నిద్ర పట్టడంలేదు. మనసులో ఎలాగో ఉన్నది.     రేణుక ఆలోచించసాగింది.     తనకు మెలుకువ వచ్చింది. రాగానే కడుపు మంట గురించి తప్ప మరో ఆలోచన రాలేదు. ఆ మంట చల్లారిన తరువాత గాని బుర్రలోకి వేరే ఆలోచన రాలేదు. మరి ఈ దేశంలో నూటికి డెబ్బయ్ వంతు ప్రజలు బీదవాళ్ళేగా? వాళ్ళ ఆలోచనలు ఎప్పుడూ కడుపు చుట్టూనే వుంటాయన్న మాట వాళ్ళు ప్రేమను గురించి ఆలోచించరు. వాళ్ళు కల్పనా లోకంలో విహరించరు. ఆకలివేస్తే అన్నం తిన్నట్టు, దాహం వేస్తే మంచినీళ్ళు తాగినట్టు సెక్సును అనుభవిస్తున్నారేగాని దానికి రంగులు పూసి ప్రేమలోకంలోకి, విసిరివేసే కథలంటే ఎందుకు జనం ఇంతగా పడి చస్తున్నారు? ఎవరాజనం కడుపు నిండినవాళ్ళేగా?     ఏమిటి తను ఇలా ఆలోచిస్తోంది? తను ఇప్పుడు ఆలోచించవలసింది సాహిత్యాన్ని గురించా?
24,724
     "రాస్తే చాలదా?"          "ఎందుకనో?"          "రాబోయే పరీక్షలకి తట్టుకోవటానికి"          "అలాగైతే ఈ పరీక్షల్లో జయంపొందితీరుతావా?"         "అవును"         "నా మాట వినండి"         "వింటాను"          "తప్పక"          "తప్పక"          అలా ఏకబిగిని మాట్లాడేస్తున్న గీతాంజలి మధులవైపు ఎవరు మాట్లాడితేవాళ్ళవైపు ముఖం తిప్పుతూ చూస్తున్నాడు సారధి.          "మీకిప్పుడిప్పుడే బంగారు పంజరంలోకి వెళ్ళాలని లేదా?"         "ఊహు"          "పిట్టజత అక్కరలేదా"          "కావాలి"          "మరి......పంజరంలోకి వెళ్ళినా వెళ్ళకున్నా ఆ పిట్ట తోడుగా ఎప్పుడూ వుంటుంది"          "ఉహూ"          "ఔను"          "అయితే ఆ మధుర మీనాక్షమ్మతో ఇలా మొక్కుని మార్చుకున్నానని మళ్ళీ మొక్కుకుని చెప్పండి"          "చెప్పండి"          "ఈ పరీక్షల్లో నెగ్గితే తప్పక నీవాడినౌతానని"          "అరే! ఎంత బాగా చెప్పారు నా మట్టి బుర్రకి తట్టనే లేదు చూడండి.....అవునా సారధీ.....బావుంది కదూ?"         "చాలాబావుంది బ్రదర్"          "అయితే ఏమంటావ్"          "నేనేమంటాను బ్రదర్, లాయర్ కావాలని అనుకునే వాడి దగ్గరనేనే అప్పుడప్పుడూ సలహాలు తీసుకోవటంప్రారంభించి సంవత్సరంపైగా అయింది"         "మంచిదంటావ్"          "ముమ్మాటికీ"         సంతోషించిందే వదనంతో అన్నాడు మధురం.          "కరెక్ట్! బ్రదర్.....బుర్రపగలేసుకుంటున్న నాకు పరిష్కారం చెప్పారు. ఆల్ రైట్ వస్తా సైకిల్ ఎక్కబోయాడు.          "ఆల్ రైట్ ఎలా వెడతావో చూస్తా"          కొత్తగొంతు విని విభ్రాంతితో తల తిప్పి చూశారు. ఎవరో ఓ వ్యక్తి సైకిల్ కారియరు పట్టుకుని నిలేశాడు.          "ఆనాడు దారిలో కలిసిన పిచ్చివాడిలా వున్నాడే" అనుకున్నాడు మధురం.          సారధికి అతనెవరో అర్ధంకాలేదు. కానీ ఎక్కడో ఎప్పుడో చూసినట్లుగా గుర్తు తగులుతుంది గీతాంజలికి లీలగా ఏదో గుర్తుకి వస్తోంది.          "ఏమిటి బ్రదర్.......ముగ్గురుఅలా నిస్తేజులైపోయారు. అంటే అర్ధం కాలేదా? అంటే భవదీయముఖారవిందములు వెల్లువైన వేమా? అని"        ఎవరూ జవాబు చెప్పలేదు.          'ఓహో టీకాటూక మపేక్ష్యతి- టీప్పణంకావాలా?.....పోనీలే....ఎక్కడికి బ్రదర్ ఈ ప్రయాణం?"          "......."          "నామాటలు విని భయపడుతున్నారా?"          "......."          "నేనుపిచ్చివాడిని కాదు-రాజకీయవాదిని కాదు- వాస్తవిక వాదిని"          "........"          "ఉన్నమాట ఢంకా బజాయించి-కుండబద్దలుకొట్టి-తెలుగు మేష్టారుకి స్కేలు తక్కువైసరిగా చెప్పలేదు- తర్వాత ఇంకా కొన్ని విశేషణాలు వెయ్యాలి-గుర్తుకి.          "ఏమిటి? ఓహో నా కావ్యం సంగతా? అరరే! ఎంత శ్రద్ద అమ్మాయ్ నీకు.....నాకావ్యం ఎత్తుకుని పోకపూరం నీవే ఇలా కనిపించి అడిగితే నా పద్యాలన్నీ నీకంఠస్థం అయ్యేట్టు మనసుకి హత్తుకునేట్టు చెప్పేవాడివి. కానీ అది వున్నన్నాళ్ళూ ఎవర్ని చదవమన్నా 'అబ్బ' ఇప్పుడు కాదు-ఇదితీరిగ్గా చదవాలి. మళ్ళీ చదువుతాలే అనేవారు..... అందుకే నా ఖండ కావ్యం ఎవడో ఎత్తుకుని పోయాడు.         తీరిగ్గా కూర్చుని చదువుకుంటూ వుంటాడు- పెంచుకున్న తీగను తెంచినట్టు వ్రాసుకున్న కావ్యాన్ని తగిలేసినట్టు-గీసుకున్న బొమ్మని చించినట్టు కట్టుకున్న ఇల్లుపడగొట్టినట్టు-నాకావ్యం ఎత్తుకుపోయాడు.....అమ్మా......!" దుఃఖం భరించలేక ఏడుస్తూ సారధీ గీతాంజలి మధ్యగా దూసుకుని గీతాంజలిని రాసుకుంటూ వెళ్ళిపోయాడు.          కొంతసేపు అందరూ అలాగే మ్రాన్పడిపోయారు. కొద్దిసేపయ్యాక సారధి అన్నాడు.          "ఎక్కడో ఎప్పుడో పరిచయం కలిగినట్లయింది. అతని మాటలధోరణి వింటూంటే! కానీ గుర్తుకి రావటంలేదు"          "ఇంతకుపూర్వం నాకు ఓసారి కనిపించాడు బ్రదర్, అప్పుడూ ఇదే ధోరణిలో ఏదో వాగి వాగి వెళ్ళిపోయాడు అంతు చిక్కని ధోరణిలో అర్ధం వుండీ వుండని మాటలు వాగుతుంటాడు ఎప్పుడూ కానీ ఎవరో నాకూ తెలియదు" గీతాంజలి గుర్తుకు తెచ్చుకుంటూ అంది.          "అప్పుడు మనం ఫస్టియర్ లో ఉన్నాం. మన కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతూ ఉండే వాడు. 'గురుదేవ్' అని చాలా చక్కగా కవిత్వంవ్రాసేవాడు."        "అవును ప్రైవేటుగా సంస్కృతం కూడా చదివేవాడు బి.ఎ. మేధమేటిక్స్ లో ఉండేవాడు.....కాలనీలో వుండేవాడు" గుర్తుపట్టి అన్నాడు సారధి.          గీతాంజలి చెప్పసాగింది. "నవలలుకూడా రాసేవాడు ఏదో పోటీకి పంపితే తన నవల ఒకటి తిరిగి వచ్చిందనీ, రక్తం సిరాగా మార్చి తనశక్తినంతా ధారపోసి రాశానని అందులో ఏదో అన్యాయం జరిగిందని చాలాబాధపడుతూ వుండేవాడు-అప్పుడే అతనింట్లో దొంగతనం జరిగింది. మక్కువతో మనసారా వ్రాసుకున్న పద్యాలు పోయాని చాలామంది కవులకి మల్లేతన పద్యాలు తనకి గుర్తుండవనీ ఏవో పద్యపాదాలు కొన్ని ఉదాహరిస్తూవాని పూరణలు ఇంకా    మధురంగా ఉన్నాయని గుర్తుకి రావటంలేదని రాత్రింబవళ్ళు కుమిలిపోయేవాడట.....వినలేదా?"          "అవునవును గుర్తుకి వస్తోంది. అతనితోనాకు కొంచెం పరిచయంకూడా వుంది......ఒకసారి బజార్లో నీవు కనిపించావు. అప్పుడు నాతోనే వున్నాడతను.....నీవేణికను జూచి అన్నాడు నాతో.              "మబ్బు చాలువేణిమగున తావిరిబోణి-కన్నడగడయమిన్నకలువకన'ఇందులో 'చాలు' అనేపదం మీద అరగంట ఉపన్యాసం ఇచ్చాడు. అదేపాదంలోని విరిబోణి అనే పదానికీ మగువ తా అనేపదం అతకటంలో 'తావి' కూడా వుందని ఆ సొగసు తెచ్చిన నీ సొగసుకి ఎంతో మురిసిపోయాడు- నాకుబాగా గుర్తుంది"          గీతాంజలి అంది'          "అవును ఏ శ్రీనాధ మహాకవికాలంలోనో లేకపోతే రాయలవారిరసి సామ్రాజ్యంలోనో వుండవలసినవాడు. ఎవరో పుష్పలావికనుజూచి శ్రీనాధుడు పద్యం చెప్పాడు అంటే నమ్మలేని ఈ దేశానికి ఇతన్ని జూపితేసరి.....సరి..... ఆతర్వాత అతను సరదా వాటినేమనసులో అనుకుంటూ అలాంటి కవిత్వాన్ని పోగొట్టుకున్నందుకు తనని తాను తిట్టుకుంటూ ఎప్పుడూ ఏడ్చేవాడట. ఒకరోజు హఠాత్తుగా ఏవేవో గీతాలు గేయాలు పాడటం మొదలుపెట్టి ఆశువుగా పద్యాలల్లుతూ వున్నట్టుండి వెర్రిగా నవ్వాడట......          తిరిగికవిత ధోరణిలో పడ్డందుకు సంతోషిస్తున్న స్నేహితులకి ఉన్నట్టుంది అతనులేచి ప్రక్కనే వున్నదుప్పటి మీద వేసుకుని బయటికి లేచిపోవటంతో ఆశ్చర్యమేసి బయటికివెళ్ళి అతని ఆపారట. వాళ్ళని చంపేట్టుగా చూస్తూ అన్నాడట.              "ఎవరు మీరు? రాజ భటులా? రక్షక భటులా? లేక పోతే రాక్షసులా? ఈ శాలువా నాది నా రసిక మంజరివిని రాయలవారు స్వయంగా శాలువా కప్పారు......ముట్టుకోకండి"          "అతనిలో కలిగిన మనఃచాంచల్యానికి దుఃఖిస్తూ వెనుదిరిగి వెళ్ళిపోయారట వాళ్ళు"          చాలారోజులు కాలేజి అతన్ని మరువలేక పోయింది. లిటరరీ అసోసియేషన్ సమావేశం జరిపిప్రిన్సిపాల్ గారు అతను మాటలు చెప్పుతూ కన్నీరుకూడా పెట్టుకున్నారు"          "అతన్ని గురించి చెపుతున్న ఆమెలో కూడా భావచలనం మనస్సు నిండాదుఃఖం పొంగి కన్నీళ్ళువచ్చాయి మౌనంగా ముగ్గురూ నడక సాగించారు-
24,725
        జుష్టోవాచో భూయాసం జుష్టోవాచస్పతయే దేవీవాక్ |         యద్వాచో మధుమత్తస్మిన్నాధాః స్వాహా సరస్వత్యై ||                                            మూడవ ప్రపాఠకము                                           మొదటి అనువాకము     1. అగ్నీ! నీవు కాంతిమంతుడవు. నీవు దేవతలందరిలో కాంతిమంతుడవు అగుదువుగాక. మానవులందు నన్ను ఆయుష్మంతుని చేయుము. బలవంతుని చేయుము. నాకు దీక్షాసంబంధియు, తపస్సంబంధియునగు కాంతి కలుగుటకు గాను నిన్ను హోమము చేయుచున్నాను.     2. అగ్నీ! నీవు తేజస్సును గూర్చి తెలిసినవాడవు. తేజస్సు నన్ను విడువకుండునుగాక. నేను తేజస్సును విడువకుందును గాక. కావున ఎన్నటికిని తేజస్సు నన్ను విడువకుండునుగాక.     3. ఓజోవంతుడవైన ఇంద్రా! నీవు దేవతలందరిలో ఓజస్సు కలవాడవు. నన్ను ఆయుష్మంతుని చేయుము. ఓజోవంతుని చేయుము.     ఇంద్రదేవతాక అతిగ్రాహ్యమా! నాకు బ్రాహ్మణ, క్షత్రియ ఓజస్సు కలుగవలెనని నిన్ను హోమము చేయుచున్నాను.     ఇంద్రా! నీవు ఓజస్సును గురించి తెలిసినవాడవు. ఓజస్సు నన్ను విడువకుండునుగాక. నేను ఓజస్సును విడువకుందునుగాక. కావున ఎన్నటికిని ఓజస్సు నన్ను విడువకుండును గాత.     4. సూర్యదేవా! నీవు దీప్తిమంతుడవు. నీవు దేవతలందరిలో దీప్తి కలవాడవు అగుదువు గాక. మానవులందు నన్ను ఆయుష్మంతుని, దీప్తిమంతుని, వర్చస్విని చేయుము.     సూర్యదేవతాక అతిగ్రాహ్యమా! నాకు వాయు, ఉదక సంబంధ దీప్తి కలుగవలెనని నిన్ను యజించుచున్నాను.     సూర్యదేవా! నీవు స్వర్గము తెలిసినవాడవు. స్వర్గము నన్ను విడువకుండునుగాక. నేను స్వర్గమును విడువకుందునుగాక.     5. మయి మేధాం మయి ప్రజాం మయ్యగ్ని స్తేజో దధాతు - అగ్నిదేవా నాకు మేధను, ప్రజను, తేజస్సును కలిగించుము.         మయి మేధాం మయిప్రజాం మయీన్ద్ర ఇంద్రియం దధాతు.         మయి మేధాం మయిప్రజాం మయి సూర్యో భ్రాజోదధాతు                                      రెండవ అనువాకము     1. గానము చేయదగిన సామము అయిదు విధములు. మొదటి దానిని వాయువు గానము చేయుము. రెండవదానిని అగ్నిరూపుడగు ప్రస్తోత అను ఋత్విజుడు గానము చేయును. ప్రజాపతి సంపూర్ణ సామస్వరూపము. బృహస్పతి రూపుడగు ఉద్గాత అను ఋత్విజుడు మూడవ సామభాగమును గానము చేయును. మరుద్రూపులగు ప్రతిహర్తలు నాలుగవది యగు ప్రతిహారభాగమును గానము చేయుదురు. అయిదవది అగు పంచమ నిధన భాగమును ఇంద్రుడు గానము చేయును. విశ్వేదేవతలు ఉపగాయకులు అగుదురు.     వాయువు మున్నగు వారు ప్రాణపోషకులు. వారు నాయందు ప్రాణములను నిలుపుదురుగాక.     (ప్రస్తోత, ఉద్గాత, ప్రతిహర్తలు సామగానము చేయుచుండగా అన్య ఋత్విజులు సామూహికముగా 'ఓం' అని ఉపగానము చేయవలెను. యజమాని 'హో' అని ఉపగానము చేయవలెను. అది ఎంత దివ్యముగ, ఎంత శ్రావ్యముగ, ఎంత అద్భుతముగా ఉండును!!!.)       2. అధ్వర్యుడు సోమగానము చేయువారికి అనుజ్ఞ ఇచ్చును. అదియే అభ్యనుజ్ఞ అగుచున్నది. అప్పుడు అధ్వర్యుడు వాయువు మున్నగు దేవతలను తనయందు ప్రవేశపెట్టుకొనినవాడు అగును.     3. ఇడ దేవగోరూప. ఆమె దేవతలను ఆహ్వానించునది అగును. మనువు యజ్ఞ ప్రవర్తకుడు అగును. బృహస్పతి మంత్ర వాక్య విశేషములను ప్రశంసించిన వాడగును.     మధుమనిష్యే మధుజనిష్యే మధువక్ష్యామి మధువదిష్యామి మధుమతీం దేవేభ్యోవాచ ముద్యాసగ్ం.     తీయని ఆలోచనలనే మనసునందు ఉంచుదును. తీయని ఫలము లిచ్చు పనులనే చేయుదును. తీయనిదే మాట్లాడుదును. తీయగనే చెప్పుదును. దేవతల కొరకు, సవన త్రయమున, తీయని స్తుతులు చేయుచున్నాను.     నా యొక్క ఈ మధురవాక్కును దేవతలు రక్షింతురుగాత. పితరులు ఆనందింతురుగాక.                                          మూడవ అనువాకము     1. సోమాంశమా! వసుదేవతలు నిన్ను గాయత్రి ఛందస్సుతో చేర్చెదరుగాక. నీవు అగ్నికి ప్రియమగు అన్నరూపము దాల్చుము.     రుద్రులు నిన్ను 'త్రిష్టుప్' ఛందస్సుతో చేర్చెదరుగాత. ఇంద్రునకు ప్రియమగు అన్నరూపమును దాల్చుము.     ఆదిత్యులు నిన్ను జగతీ ఛందస్సుతో చేర్చెదరు గాక. విశ్వేదేవతలకు ప్రియమగు అన్నరూపము దాల్చుము.     2. ప్రకాశించుచున్న సోమమా! నీ సారము ప్రకాశవంతము. దానిని మందగతి గల ఉదకములందు కదలించుచున్నాను. మంగళకర ఉదకములందు కదలించుచున్నాను. జ్ఞానాకార ఉదకములందు కదలించుచున్నాను. అభినవ ఉదకములందు కదలించుచున్నాను. వేగము గల ఉదకములందు కదలించుచున్నాను. పోటీ పడుచున్న ఉదకములందు కదలించుచున్నాను. విశ్వమును ధరించు ఉదకమునందు కదలించుచున్నాను. మధుర ఉదకములందు కదలించుచున్నాను. దిశలవంటి ఉదకములందు కదలించుచున్నాను. దీప్తివంతములగు ఉదకములందు కదలించుచున్నాను. నీకు సంబంధమగు ప్రకాశవంతసారము సర్వత్ర కదలించుచున్నాను.     3. దధిద్రవ్యమా! నీ యొక్క సారమును సోమసార సహితముగ పగటిసూర్యకిరణములచేర్చి గ్రహించుచున్నాను.     4. ఈ పాత్రయందు తీవ్రములగు సోమరసధారలు ద్యులోకమునుండి పడి కలయుచున్నవి.     5. వర్షము కలిగించు ఇంద్రుని మహాస్వరూపము వలె వర్షలక్షణము వెలుగొందుచున్నది. ఇది లతారూప సోమము. ఇది దేవతారూప సోమమునకు తొలిరూపము.     6. సోమమా! నీ పేరు నిర్లక్ష్యము చేయ జాలనిది. అది అప్రమత్తము. సోమాయస్వాహా.     7. సోమదేవీ! నీవు మనోహరవు. నీవు అగ్నికి ప్రియమగు అన్నరూపము దాల్చినావు. గాయత్రీ ఛందోరూపమవు అయినావు. మరల సోమసమూహమున చేరుము.     సోమదేవీ! నీవు సకల ప్రాణులకు స్వాధీనవు. ఇంద్రునకు ప్రియమగు అన్నరూపము దాల్చినావు. త్రిష్టుప్ ఛందోరూపమవు అయినావు. మరల సోమసమూహమున చేరుము.     సోమదేవీ! మాకు స్నేహ పాత్రమైన దానవు. విశ్వేదేవతలకు ప్రియమగు అన్నరూపము దాల్చినావు. జగతీఛందోరూపమవు అయినావు. మరల సోమసమూహమున చేరుము.     8. ప్రాణము దూరప్రాంతము నుండి మమ్ము చేరును గాత. అంతరిక్షము నుండి మమ్ము చేరునుగాత. స్వర్గపు ఉపరిభాగమున ఉన్నను మమ్ము చేరునుగాత.     హిరణ్యమా! నీవు భూమి మీద ఆయువునకు కారణము అగుచున్నావు. అమృతత్వ హేతువు అగుచున్నావు. అట్టి నిన్ను పరిగ్రహించుచున్నాను.     (భూమి మీద జీవించుటకు ధనము అవసరము అను సత్యమును చెప్పినాడు.)     9. ఇంద్రాగ్నీ మే వర్చః కురుతాం - ఇంద్రాగ్నులు నాకు వర్చస్సు కలిగింతురుగాక, వర్చః సోమో బృహస్పతిః వర్చో మే విశ్వేదేవాతాం వర్చో మే ధత్తమశ్వినా.     10. యజ్ఞమునకు సంబంధించిన విధులను అన్నింటిని వేదము వచించినది. వానిని అన్నింటిని మనసున నిలుపుకొనుచున్నాను. కావ్యమువలె వాచ్యముగ చెప్పనట్టి విధులు ఈ యజ్ఞమున చక్రనేమి వలె వ్యాపించి ఉన్నవి.                                         నాలుగవ అనువాకము     1. 'మన్దాది' ఇత్యాది పదములు ఉదకములను గూర్చి చెప్పబడినవి. అవియే ఉదకములకు గోప్యములగు నామములు. కావున ఉదకాభిమాన దేవతల ప్రీతికై 'మన్దాసుతేశుక్రే' ఇత్యాది మంత్రములను చదువవలెను. ఉదకముల గోప్యనామముల చేతనే ద్యులోకమునుండి వర్షమును పొందవచ్చును.     2. "దధిద్రవ్యమా! నీయొక్క సారమును సోమసార సహితముగ పగటి సూర్యకిరణముల చేర్చి గ్రహించుచున్నాను" అనునది మంత్రార్థము. రాత్రియే పగటికి కారణము అగుచున్నది. సూర్య కిరణములు వర్షమునకు కారణములు అగుచున్నవి.     ఈ మంత్రపఠనము వలన యజమాని పగటివలనను, సూర్యకిరణముల చేతను ద్యులోకము నుండి వర్షము కురిపించుచున్నాడు.     3. ఈ పాత్రయందు తీవ్రములగు సోమరసధారలు ద్యులోకము నుండి పడి కలియుచున్నవి' అనునది మంత్రోక్తవిధియే. వ్యాఖ్య అక్కరలేనిది అగును.     4. వర్షమును కలిగించు ఇంద్రుని మహా స్వరూపము వలె లక్షణము వెలుగొందుచున్నది అనుట వలన యజమాని వర్షమును పొందుచున్నాడు. అది ఇంద్రుని మహాస్వరూపము వంటిది అని అర్థమగును.     5. 'సోమదేవీ! నీ పేరు నిర్లక్ష్యము చేయజాలనిది - అప్రమత్తము' అని మంత్రము చెప్పినది. యజమాని 'అదాభ్య' పాత్రను గ్రహించి సోమము కొరకు హోమము చేయవలెను. అప్పుడు అతడు హవిస్సును యాగము చేసినవాడు అగును.     6. అంశునామక సోమమును పాత్రయందు గ్రహించిన యజమాని యొక్క ఆయువు, ప్రాణము దిగజారుచున్నవి. 'ప్రాణము దూరప్రాంతము నుండి మమ్ము చేరునుగాత' అను మంత్రము వలన ఆయువు, ప్రాణము యజమాని యందు స్థిరపడుచున్నవి.     7. హిరణ్యమా! నీవు ప్రాణమవు. అమృతత్వమవు, అని సోమాభిషవము నందు పడవేయు హిరణ్యము పై శ్వాసను విడువవలెను. బంగారము అమృతత్వహేతువు. ఆయువు ప్రాణస్వరూపము.కావున అమృతత్వహేతువగు హిరణ్యము పైని శ్వాసవిడుచుట చేత ఆయురూపమగు ప్రాణమును తనయందు స్థాపించుకొనువాడు అగుచున్నాడు.     8. హిరణ్యము శతసంఖ్యాకము కావలెను. మానవుడు శతాయువు. శతీంద్రియములు కలవాడు. కావున నూరు ఇంద్రియములందు నూరేళ్లు ఆయువు స్థాపించుకొనిన వాడు అగును.     9. "ఇంద్రాగ్నీ" అను మంత్రములచేత నీటిని తాకవలెను. భేషజం వా ఆపో భేషజం కురుతే - నీరు ఔషధమగును. నీరు చికిత్సచేయును.                                          అయిదవ అనువాకము     1. సోమమా! నీవు వాయువువు. ప్రాణమవు. విడుచుశ్వాసవు అగుచున్నావు. సవితాదేవుని ఆధిపత్యమున ఉండుము. నాకు అపానము - పీల్చుశ్వాసను కలిగించుము.     నీవు నేత్ర, శ్రోత్ర స్వరూపమవు అగుచున్నావు. ధాత ఆధిపత్యమున ఉండుము. నాకు ఆయువును ప్రసాదించుము.     నీవు రూపమవు, వర్ణమవు అగుచున్నావు. బృహస్పతి ఆధిపత్యమున ఉండుము. నాకు సంతతి కలుగజేయుము.     నీవు మనసునందలి ఋతమవు, వాక్కు నందలి ఋతమవు అగుచున్నావు. ఇంద్రుని ఆధిపత్యమున ఉండుము. నాకు క్షాత్రమును కలిగించుము.     నీవు భూతకాలమవు, భవిష్యత్కాలమవు అగుచున్నావు. పితృదేవతల ఆధిపత్యమున ఉండుము. అపామోషధీనాం గర్భం ధా - నాకు నీరు, ఓషధుల మూలమును ప్రసాదించుము.
24,726
                              సీనూ - భానూ     సీనూ భానూ చక్కని     స్నేహితులని చెప్పాలి.     కలిసి బడికి పోతారు.     కలిసి యిళ్ల కొస్తారు.         సీనూ భానూ ఎంతో         స్నేహంగా ఉంటారు.         కలిసి చదువుకుంటారు.         కలిసి ఆడుకుంటారు.     కొత్త కొత్త పుస్తకాలు     కొనడం వాళ్లకి సరదా!     కొత్త కొత్త ఆటల్లో     కూడా వాళ్లకి సరదా.         ఆటలలో ఒక రోజున,         మాటమీద మాట వచ్చి,         సీనుడొచ్చి భానుగాణ్ణి         చెంపమీద వేశాడు     భాను మాత్ర మేం తక్కువ?     సీనుమీద విరుచుకు పడి,     వీసె గుద్దు లొక నాలుగు     వీపున వడ్డించాడు         వీ ళ్ళిట్టా పోట్లాడే         వేళ వాళ్ల నాన్నలు ఆ         చోటికొచ్చి చూశా రీ         చోద్యమైన గుద్దులాట.     సీను నాన్న తప్పంతా     భాను దనీ, భాను నాన్న     సీను దనీ తీవ్రంగా     వాదనలో పడ్డారు.         వాదనతో ఆగలేదు!         వా ళ్లిద్దరి మధ్యా అది         పెరిగి పెరిగి తుట్టతుదకు         పెద్ద గుద్దులాటయింది.     తండ్రుల యుద్ధం చూస్తే     తమకెంతో వింత కలిగి,     సీనూ భానూ ఎప్పటి     స్నేహితులై మిగిలినారు         మళ్ళీవాళ్లిద్దరూ తమ         మామూలాటల్లో పడి,         కొట్లాడే తమ తండ్రుల         మాటే మరిచారు     ఆ పిల్లలు వెనుకటి వలె     ఆటలాడు తున్నారు     తండ్రుల యుద్ధం మాత్రం     తగ్గే సూచన లేదు!                                          - చందమామ, మాసపత్రిక - డిసెంబరు, 1949
24,727
    అదీ అతని ప్లాన్.     జాన్ ఒక్కసారి తన జేబులో చెయ్యి పెట్టి తడుముకున్నాడు.     అతని చేతికి రివాల్వర్ మడమ చరుక్కున తగిలింది.     జాన్ మొహంలో ఎంతో అసహనం!     కారణం......అతడు వున్న పొదవైపు వీపు పెట్టి ప్రమీల కూర్చుని వుంధి. ప్రమీలకు ఎదురుగా ప్రణయ్ కూర్చుని వున్నాడు. అంటే అతనిని షూట్ చేద్దామంటే అతనికి అడ్డుగా ప్రమీల వుందన్నమాట!!     ప్రమీల కాస్త అడ్డు తప్పుకుంటే ప్రణయ్ ని షూట్ చెయ్యొచ్చు. కానీ ఆమె కదలకుండా అడ్డుగా కూర్చుంది.     ఎలా?ఎలా?? ఎలా???     జుట్టు పీక్కున్నాడు జాన్.     జాన్ నాలుక కొరుక్కుని విగ్గుని తలమీద బోర్లించుకున్నాడు.     "ఆ.....పల్లీ! పల్లీ! కావాల సార్?"     ఉలిక్కిపడి ప్రక్కకి తిరిగి చూశాడు జాన్.     బుట్టలో పల్లీలు పెట్టుకుని అమ్ముకునేవాడు!     జాన్ కంగారుపడ్డాడు.     కొంపదీసి విగ్గు పీక్కుని మళ్ళీ నెత్తిమీద బోర్లించుకోవడం వాడుగానీ చూళ్ళేదు కదా?     జాన్ గబుక్కున ప్యాంటు జేబులోంచి దువ్వెన తీసి విగ్గుమీద వెంట్రుకలను జాగ్రత్తగా పైపైనే దువ్వుకుని, దువ్వెనని మళ్ళీ ప్యాంట్ బ్యాక్ పాకెట్లో పెట్టుకున్నాడు.     అలా దువ్వుకుని పల్లీలు అమ్మే వాడివంక చూసి చిరునవ్వు నవ్వాడు జాన్.     "పల్లీ సార్!" అన్నాడు వాడు పళ్ళికిలిస్తూ.     "చూశావా నా జుట్టు ఎంత ఒత్తుగా వుందో. అంత ఒత్తుగా వుంటుంది కదా.....అందుకని అందరూ దీన్ని విగ్గు అని అనుకుంటారు. కానీ విగ్గు అయితే యిప్పుడే నేను దువ్వెనతో అంత గట్టిగా దువ్వాను కదా.....ఊడి నేలమీద పడిపోదూ.....?" నవ్వుతూ అన్నాడు జాన్.     "సార్! గరం గరం పల్లీ కావాలా సార్?" జాన్ చెప్పేదానితో తనకేమీ సంబంధం లేదన్నట్టు చూస్తూ అడిగాడు వాడు.     "వద్దు......వద్దు వద్దు......వద్దులే....."అన్నాడు అతను.     వాడు వెళ్ళిపోయాడు.     జాన్ ఓసారి తేలికగా వూపిరి పీల్చుకుని పొద వెనకాలనుండి ప్రణయ్ వాళ్ళవంక చూశాడు.     వాళ్ళు కూర్చున్న పొజిషన్ లో ఏమాత్రం మార్పులేదు. ఇంకా ఆమె అతనికి అడ్డుగా కూర్చుని వుంది.     అటూ ఇటూ చూశాడు.     చుట్టుప్రక్కల తనని గమనించేవాళ్ళు ఎవరూ లేరు.....వెంటనే పొజిషన్ మార్చుకోవాలి! ఆలస్యం చెయ్యకూడదు.     జాన్ మెరుపులాంటి వేగంతో అక్కడికి దగ్గర్లో వున్న మరో పొద దగ్గరికి పరుగుతీశాడు. ఆ పొద దగ్గరికి వెళ్ళగానే అక్కడి దృశ్యం చూసి కంగారుపడ్డాడు జాన్.     ఒక జంట.....     ఒకరి కౌగిలిలో మరొకరు.     జాన్ ని చూస్తూనే వాళ్ళు కెవ్వున అరిచి ఒకరికొకరు దూరంగా జరిగారు.     "ఉష్.....అరవకుండా మీ పని మీరు చూస్కోండి. క్యారీ ఆన్" అంటూ కంగారుగా పరుగుతీసి సెమీ సర్కిల్ రౌండ్ కొట్టి మరో పొద దగ్గరికి వెళ్ళి ఆగాడు. ఈసారి డైరెక్ట్ గా పొద వెనకాలకి వెళ్ళిపోకుండా ముందు మెల్లగా తొంగి చూశాడు.     అక్కడా ఎవరూ లేరు.     "అమ్మయ్య!.....అవి ఊపిరి పీల్చుకుని పొదవెనక్కి వెళ్ళాడు.     అక్కడినుండి తొంగి చూశాడు.     అతని కళ్ళు మెరిసినయ్.     ఇప్పుడు పొజిషన్ బాగుంది. ప్రణయ్, ప్రమీల ఎదురెదురుగా కూర్చుని సైడ్ యాంగిల్స్ లో కనిపిస్తున్నారు అతనికి.     "ఇంకా నీకు ఆయువు మూడిందిరా....." ప్రణయ్ ని చూస్తూ కసిగా అనుకుని రివాల్వర్ కోసం జేబులో చెయ్యి పెట్టుకున్నాడు జాన్.     "సార్....పల్లీ!!! గరం గరం పల్లీ సార్!!!"     ఉలిక్కిపడి కంగారుగా జేబులోంచి చెయ్యి వెనక్కి తీసేశాడు జాన్.     "పల్లీ వద్దయ్యా బాబూ...." ప్రక్కకి తిరిగి విసుగ్గా చూస్తూ అన్నాడు జాన్.     "అరే!.....ఆ పొద వెనకాల మీలాగే ఒకాయన వున్నాడు సార్! అచ్చు ఆయన క్రాపింగ్ కూడా విగ్గులాగా మీలాగే వుంది."     "ఇందాక ఆ పొద వెనకాల వున్నది నేనే.....ఇప్పుడు యిక్కడ సెటిల్ అయ్యాను...." అని జేబులోంచి దువ్వెనతీసి కాస్త దువ్వుకుని "నువ్విక వెళ్ళు" అన్నాడు.     "గరం గరం పల్లీసార్....ఒక్క రూపాయిని తీస్కోండి..." అన్నాడు వాడు జిద్దులా వదలకుండా.     "నాకు వద్దుగానీ....ఆ పొదవెనకాల వున్నవాళ్ళని అడుగు. వాళ్ళు తప్పకుండా కొంటారు" ఇంతకుముందు తను వెళ్ళిన పొదవంక చూపించాడు జాన్.     "మీరు చెప్పాలా సార్! ఇందాకే ఆ పొద వెనకాలకి వెళ్ళాను సార్. అప్పుడు వాళ్ళు ముద్దు పెట్టుకుంటున్నారు. నన్ను చూసి ఆయన ఇంతెత్తున లేచి ఇంకోసారి వస్తే నడ్డిమీద తంతాను అన్నాడు సార్."     "ఆలాగా?....నేను కూడా అదేపని చేస్తా ఇంకోసారి నా దగ్గరికి వచ్చావంటే" అన్నాడు జాన్ పళ్ళు నూరుతూ.     పల్లీలు అమ్ముకునేవాడు గొణుక్కుంటూ అక్కడినుండి వెళ్ళిపోయాడు.     జాన్ మెల్లగా జేబులోకి చెయ్యిపెట్టాడు.     అతని చేతికి రివాల్వర్ చల్లగా తగిలింది.     "ఏంటి.....? ఏదో ముఖ్యమైన విషయం చెప్తానని పార్కుకి తీసుకొచ్చి ఏమీ మాట్లాడకుండా కూర్చున్నావ్?" ప్రమీల వంక ఓసారి, చేతి వాచ్ వంక ఒకసారి చూస్తూ అడిగాడు ప్రణయ్.     "ఒక ఆడపిల్ల పార్కుకి రమ్మని పిలిచిందంటే అర్ధం కాలేదాండీ? విడిగా మళ్ళీ చెప్పాలా?" ప్రమీల ప్రణయ్ మొహంలోకి సూటిగాచూస్తూ అబ్ది.     ప్రణయ్ ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు.     "ఐ లవ్ యూ ప్రణయ్ గారూ.....మా అమ్మా నాన్నలకు కూడా మీరెంతో బాగా నచ్చారు. మీ ఇంటికి వచ్చి మీ అమ్మా నాన్నలతో మాట్లాడాలని అనుకుంటున్నారు. మీకూ, మీ ఆమ్మానాన్నలకూ నచ్చితే మనిద్దరికీ పెళ్ళి చేద్దామని అనుకుంటున్నారు" గబగబా చెప్పేసింది ప్రమీల.     ప్రణయ్ గబుక్కున కూర్చున్న స్థలంనుండి లేచి అయిదారు పిల్లి మొగ్గలు వేసి మళ్ళీ ప్రమీల ముందు కూర్చుని ఎగశ్వాస పీల్చాడు.     పొదల వెనకాల వున్న జాన్ "ఓహ్ జీసస్!" అంటూ జుట్టు పీక్కున్నాడు. మళ్ళీ విగ్గు చేతికి ఊడివచ్చింది. `    కంగారుగా అటూ ఇటూ చూసి విగ్గుని మళ్ళీ నెత్తిమీద బోర్లిం చేసుకున్నాడు.     సరిగ్గా పొజిషన్ కుదిరి ట్రిగ్గర్ నొక్కాలని అనుకుంటుండగా ప్రణయ్ పిల్లిమొగ్గలు వేశాడు.     అది అతని బాధ.     "ఏమైందండీ?....ఎందుకలా పిల్లిమొగ్గలు వేశారు?" కంగారుగా అడిగింది ప్రమీల.     "ఏమో మరి. నువ్వలా చెప్పగానే నాలో ఏదో అలజడి లాంటిది, మరేదో సంచలనం లాంటిది....ఇంకేదో ఆందోళన లాంటిది...అదేదో ఉద్వేగం లాంటిది కూడా కలిగి అలా చేశానన్నమాట" అన్నాడు ప్రణయ్ గడ్డిపరక నొకదాన్ని తుంపి నోట్లో పెట్టుకుంటూ.     "అలాగా.....? మరి మీ అభిప్రాయం ఏంటి?"     "మె హె హె హె...." అన్నాడు ప్రణయ్.     ప్రమీల ప్రణయ్ కేసి వింతగా చూసింది.     "వాట్?...."     "మె హెహెహె....." మళ్ళీ అన్నాడు అతను.     ప్రమీల అతని నోటిలోంచి సగం వెళ్ళాడుతున్న గడ్డిపరకని చేత్తో పట్టుకుని లాగి పారేసింది.
24,728
    కొత్తగా పెళ్ళయిన అల్లుడ్ని కూతుర్ని చూసి పూర్వవాసనలు ఏవో తట్టి పిలిచినట్లయి నాన్న అమ్మ దగ్గరగా జరిగి "సౌదా...ఏదీ పూర్వపు ఆ ముగ్దమనోహర సౌకుమార్య లావణ్య హాసరేఖా?" అనగానే అమ్మ ఫక్కుమని చాలా అందంగా, పరవశంగా నవ్వింది.     మా ఇంట్లో దీపావళి పండుగనాటి ప్రమిదలు కూడా అంతటి ప్రమాదాన్ని ఇవ్వలేదు.     "నక్షత్రాలస్తమిస్తున్నాయి. శూన్యం ప్రభాతం వైపుకి. త్వరపడు... నిరంతర శూన్యంలోకి మాయమౌతుంది.     ఆ వృధా వ్యయంలోంచి ఒక్క నిమిషం జీవిత స్రవంతిని రుచిచూసేందుకు మిగిలింది.     ఈ క్షణం త్వరపడు...     అన్నట్లుగా వున్నాయి నాన్న చూపులు. సారంగీ వాద్యంలా నవ్వులు చిందిస్తూ వంచిన వెన్నుతో అమ్మ ఆ నిశీధిలో పెరట్లో సందెదీపంలా మెరిసిపోయింది.     "ఇంకా పుట్టని రేపూ, పుట్టి చచ్చిన నిన్నా!     వాటిని తలుచుకు చిరాకు పడకు.     'ఇప్పుడే అదే ఈ క్షణమే మిగిలింది మనకు' నాన్న రుబాయీలు చెపుతున్నాడు. నేను కాళింది నవ్వుతున్నాం.    తాతగారు జపానికి భంగమై ఒక్కక్షణం కళ్ళు చిట్లించి నాన్న మొహంలో నవ్వుని చూసి తనే అక్కడ్నించి దూరంగా తొలగిపోయారు.     పాత తరం కొత్త తరాన్ని అర్థం చేసుకుని వైదొలగాలి. రేపు అమ్మా నాన్నా అయినా, ఎల్లుండి మేమైనా అంతే!                                                              *  *  *     పెద్దక్క కాపురానికి వెళ్ళిపోయింది.     చిన్నక్క మెడికల్ కాలేజ్ హాస్టల్ కి వెళ్ళిపోయింది. నేను ప్రతి రోజూ స్కూల్ కి వెళ్ళొస్తున్నాను. బావి దగ్గరికి రాగానే శివ గుర్తొచ్చేవాడు. వెళ్ళాక ఓ ఉత్తరం వ్రాశాడు. కాలేజ్ చాలా బావుంది. దారి పొడుగునా అందమైన ఆడపిల్లలు కనిపిస్తారనీ సాయంత్రాలు ఆడపిల్లల కాలేజీల ముందు కెళ్ళి తన స్నేహితులంతా బీట్ కొడ్తారనీ తను అలా చెయ్యడంలేదనీ వ్రాశాడు. శివ బుద్ధి నాకు తెలుసు తప్పకుండా వెళ్తాడు. కానీ వెయ్యవలసినంత జెలసీ వెయ్యలేదు! మెచ్యూరిటీ వస్తోందేమో నాకు!     సుబ్బలక్ష్మి తల్లికి పెద్ద ఆపరేషన్ చెయ్యాలన్నారట. ఆ అమ్మాయి అమ్మ దగ్గరకొచ్చి ఒకటే ఏడుపు. ఇంట్లో వరసకు మేనత్త వుందట. కానీ ఆవిడకి చూపు సరిగ్గా ఆనదట. వంటదీ చెయ్యలేదుట.     ఆస్పత్రిలో సుబ్బులు తల్లిని కనిపెట్టుకుని వుంటుందిట. నన్ను తనకు ఇంట్లో తోడుకు పంపమంది.     అమ్మ సరేనంది. తనూ స్వయంగా వచ్చి వాళ్ళమ్మని చూసింది. ఆవిడికి ఏం భయంలేదనీ ఆముక్తని సుబ్బులుకి తోడుగా పంపుతాననీ మాటిచ్చింది.     నాకు చాలా సరదాగా అనిపించింది.     వాళ్ళ ఇంట్లో టేప్ రికార్డర్ లో పాటలు వినవచ్చు, టీ.వీ.లో సినిమా చూడచ్చు. ఇవన్నీ మా ఇంట్లో లేవు!     నేను సుబ్బులూ కలిసి వంట చేసుకోవటం, బట్టలు ఉతుక్కోవడం, పాటలు వినడం, అస్తమానం టీ.వీ. చూడటం జీవితం అంటే ఇదే అనిపించింది.     ఆ రోజు రాత్రి టీ.వీ.లో 'కవిత' సినిమా వస్తోంది. సుబ్బులు బఠానీలు నవుల్తూ సినిమా చూస్తోంది. నేను నోట్స్ రాసుకుంటూనే సినిమా చూస్తున్నాను. వాళ్ళ నాన్న వచ్చి మా ముందు సోఫా మీద కూర్చున్నాడు.     నేను ముందుకు వంగి బాటనీ రికార్డులో బొమ్మలు వేస్తున్నాను. ఎవరో నన్ను గుచ్చి గుచ్చి చూస్తున్నట్లుగా అనిపించి తలెత్తి చూశాను. సుబ్బులు తండ్రి ఆబగా నా జాకెట్టులోకి చూస్తున్నాడు.     నేను అదిరిపడి సర్దుకుని కూర్చున్నాను. సుబ్బులు హాయిగా సినిమా చూస్తోంది. నాకు ఆ తర్వాత అక్కడ ఉండటం ముళ్ళ మీద వున్నట్లుగా వుంది.     నేను పక్క గదిలోకి వెళుతుంటే పొరపాట్న వచ్చినట్లు ఢీకొట్టాడు. రాత్రి తొమ్మిదయిపోయింది. ఇంటికి వెళ్ళిపోవాలనిపించినా ఎలా వెళ్ళాలో సుబ్బులుకి ఏం చెప్పాలో అర్థం కాక అలాగే దాని పక్కన పడుకున్నాను.     కాస్త నిద్రపడుతుండగా నామీద ఏదో బరువుగా అనిపించింది. ఉలిక్కిపడి లేవబోతుంటే నానోరు తన చేత్తో ఠక్కున మూసేశాడు. చూస్తే సుబ్బులు తండ్రి... "శబ్దం చేయకు... కాస్సేపే... కదలకు" అంటున్నాడు.     నేను చీకట్లో పెనుగులాడాను.     సుబ్బులు మొద్దునిద్ర పోయింది.     ఆయన కాళ్ళతో నా కాళ్ళని నొక్కిపట్టి నా మీదకి రావాలని ప్రయత్నిస్తున్నాడు. అంతబలం ఎలా వచ్చిందో కానీ గట్టిగా మోచేతిమీద కరిచేశాను.     "అమ్మ... రాక్షసీ..." అంటూ నెప్పికి వదిలి పెట్టేశాడు.     నేను ఒక్కసారి విదిలించుకుని లేచికూర్చుని "సుబ్బులూ! సుబ్బులూ..." అని దాన్ని లేపేశాను.     అది చటుక్కున నిద్రకళ్ళతోటే "ఏవైందే...దొంగాడొచ్చాడా?" అంటోంది.     నేను దాన్ని చుట్టుకుపోయి ఏడ్చేశాను.     "ప్రొద్దుటే "ఆ పిల్లని వాళ్ళింటికి పంపెయ్యి. రాత్రి ఏం కలకందో ఏమో దడుసుకుని ఒకటే అరుపులు" అన్నాడు.     నాకు నిజంగానే దడుపు జ్వరం వచ్చేసింది.     "పదవే" అంది సుబ్బలక్ష్మి.     "సుబ్బులూ, నేను కల కనలేదు" అన్నాను.     "మా నాన్న లుంగీ కప్పుకుని పరుగెడ్తుంటే నేను చూశాలే...సారీ ముక్తా..." అని సుబ్బలక్ష్మి ఏడ్చింది.
24,729
           "ఇలా మనిద్దరం రావడం తప్పంటాడా, ఎందుకో తప్పు ఒక ముద్దూ, ఒక ముచ్చట, ఒక నవ్వు, ఒక సినిమా, జీవితం నిండా లేస్తే 'శ్రమ', కూర్చుంటే 'శ్రమ' నాకేం అర్ధం కావడం లేదు" విసుక్కుంటూ అన్నాడు విమల్.         "విమల్ ఏంటా మాటలు ఎప్పుడయితే నువ్వు ఒక ఆశయానికి జీవితాన్ని 'డెడికేట్' చేస్తావో, కొన్ని కోల్పోవాల్సి వస్తుంది. తప్పదు." సీరియస్ గా అంది మేఖల.         'తల్లీ-ఆఖరికి నువ్వు కూడా నాకు 'లెసన్స్' చెప్పడానికి రెడీ అన్నమాట....నాకు 'డెడికేషన్' లేదు. 'అభీ'కి వుంది అంతే కదా."         "పోనీలే. ఇక్కడకెందుకు తీసుకొచ్చావో చెప్పు." ఆ మాటకు వళ్ళు మండిపోయింది విమల్ కి.         "ఇదిగో మేఖలా-నాకు కళ్ళు కన్పించవు. ఈ బిర్లా మందిర్ చూపించి, నాచెయ్యి దగ్గరుండి పట్టుకుని ఎక్కిస్తావని రమ్మన్నాను అంతే. నువ్వో మదర్ థెరిస్సావని, నన్నీ మెట్లెక్కిస్తావని" అడిగాడు విమల్.         "ఇవాళెందుకు ఫైరయి పోతున్నావ్. చెప్పు అసలు నీ కోపానికి కారణం ఏమిటో చెప్పు. నా బుజ్జి కదూ-నా కొండ కదూ చెప్పు తండ్రీ."         విమల్ ముఖంలో కొంచెం మార్పొచ్చింది.         "హమ్మా ఏం ఫేసండీ హిట్లర్ కజిన్ బ్రదర్ ఫేసూ, మీరూను" మళ్ళీ అంది-         ఆ మాటకు నవ్వేసాడు విమల్.         "అది కాదు మేఖల....ఎన్నాళ్ళనుంచో నీతో ఒక విషయం మాట్లాడాలని....టైమ్ దొరకదు. దొరక్క దొరక్క ఇవాళ టైం దొరికితే ఇలా...."         "చెప్పులే." మేఖల సూటిగా అతని చూపుల్లోకి చూస్తూ అంది.         "నాకసలే సిగ్గు. నువ్వలా నా కళ్ళల్లోకి చూస్తే నేనేం చెపుతాను." తల దించుకుంటూ అన్నాడు విమల్.         "ప్రేమ విషయమా-నాకు తెలుసులే నన్ను నువ్వు ప్రేమిస్తున్నావని నాకు తెలుసు." మేఖల నోటినుంచి ఆ మాట రాగానే ఆశ్చర్యపోయాడు విమల్.         "నీకెలా తెల్సు" అమాయకంగా అడిగాడు.         "నాకా-చెప్పనా-ఓరోజు నువ్వు నిద్రపోతున్నప్పుడు, నీ అరచేతి వేపు చూశాను. బాల్ పెన్నుతో రాసుకున్నావ్ మేఖల అని. ఇంకో రోజు నీ హేండ్ కర్చీఫ్ చూసాను. దాని చివర 'యం' అనే అక్షరం వుంది. అంటే నేనే కదా. ఆ మాత్రం తెలుసుకోలేనా." చాలా సహజంగా అంది మేఖల.         సహజంగా ప్రేమ విషయం అబ్బాయి ఎత్తగానే అమ్మాయిలు ముడుచుకుపోవడం, బుగ్గలు ఎర్రగా అవడం, కొంచెం సిగ్గు పడడం యిలాంటి ప్రక్రియలేవీ మేఖల దగ్గర కనిపించకపోతే అనుమానం వచ్చింది విమల్ కి.         "ఈ అమ్మాయికి అనుభూతులేవీ లేవా." అని, అదే ప్రశ్న ఆ  అమ్మాయిని అడిగాడు. అప్పుడు మేఖలకు కోపం వచ్చింది.         "నాకు ఫీలింగ్స్ లేవు నేను జడపదార్దాన్ని, నువ్వు ప్రేమిస్తున్నానని అనగానే నేనేం చెయ్యాలట. సిన్మాల్లో లాగ, ఏ క్లాత్ స్టోర్స్ కో బయలుదేరి, ఓ అరడజను చీరలు తెచ్చుకుని మూన్నిముషాలకో చీర కట్టుకొని పాత పాడాలా? ఈ మెట్ల మీంచి దూకుతూ, ఆ స్తంభాలు పట్టుకుని తిరుగుతూ 'డేన్స్' చెయ్యాలా? చెప్పు. ఏం చెయ్యమంటావ్?"         "రౌడీ పిల్ల."         "ఏంటీ-ఏంటో గొణుగుతున్నావ్."         "ఏం లేదులే. చిన్నప్పుడు రౌడీపిల్ల అనే సిన్మా చూశాను. ఆ సినిమా జ్ఞాపకం వచ్చింది. అంతే మరి నాతో జగడాలాడకు. ఈ ప్రేమకో నమస్కారం.....! నీకో నమస్కారం...." విమల్ విసుగుదలకు మేఖలకు నవ్వొచ్చింది.         "అయితే ముందుగా కుట్రచేసి, నీప్రేమ వ్యవహారం నాతో చెప్దామని ఇక్కడకు తీసికొచ్చావన్న మాట." విమల్ జుట్టుని అల్లరిగా అటూ ఇటూ కుదుపుతూ అంది మేఖల.            "ఎస్ మేఖల ఐ లవ్యూ సోమచ్."         "అంత సీరియస్ గా మొహంపెట్టి అంటేనే తప్ప ప్రేమిస్తున్నట్టుగా అర్ధం అవదా." ఆ మాటకు ఇద్దరూ నవ్వేసారు.         "ఈ ప్రేమ చాలా గొప్పది మేఖల. అందుకే గాలిబ్ ఒకచోట ఇలా అన్నాడు.         కత్తి చేతలేక కదనమ్ము జరిపేది.     ఇంతికెవ్వ డసువు లీయకుండు? "అంటే అర్ధం తెలుసా?"     తెలీదన్నట్టుగా తలూపింది మేఖల.         "మీ ఆడవాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసా? కత్తి లేకుండానే యుద్ధం చేస్తుంటార్ట. అలాంటి వాళ్ళ చేతుల్లో అందరూ ఓడిపోతార్ట బాగుందికదా"            "ఈ మధ్య నీకు కవిత్వం కూడా వస్తున్నట్టుందే." మొట్టికాయపెడుతూ అంది మేఖల.         "సర్వకళలూ ప్రేమలోనే వున్నాయి. ప్రేమలోంచే పుడతాయి. పిల్లా, అగ్గిపుల్లా' ఆమె ముఖాన్ని దగ్గరగా పట్టుకుని ముద్దుకు లాక్కుంటున్న సమయంలో-         "విమల్ అటు చూడు." అని అంది గాభరాగా మేఖల.         మెట్లెక్కి వస్తున్న ఆ వ్యక్తిని చూడగానే స్తంభం పక్కకెళ్ళి పోయింది మేఖల.         ఆ వ్యక్తి, ఆ పక్కనున్న యింకో వ్యక్తి నెమ్మదిగా నడుచుకుని గుడి ఆవరణలో కొచ్చారు. వాళ్ళు ముందుకెళ్ళగానే మేఖల స్థంభం చాటు నుంచి బయటకొచ్చి రహస్యంగా-         "పద...క్విక్....పోదాం" గబగబా దిగుతోంది. ఆ వెనక విమల్.         సడన్ గా ఎవరో అక్కడనుంచి దిగుతుండడంతో ముందుకెళ్ళిన ఆ వ్యక్తి మెట్లవైపు చూసాడు.         ఓ అమ్మాయి, ఓ అబ్బాయి.         తను వస్తున్నప్పుడు ఆ అమ్మాయి లేదు. అంటే దాగున్నదన్నమాట! అంటే-తనను చూసి దాగోవలసిన అవసరం ఏమిటి?         "ఒరె రారా" అంటూ స్పీడుగా దిగడం ప్రారంభించాడు అచ్యుత్.         మెట్లుదిగి గబుక్కున కార్లోకి ఎక్కి స్టార్ట్ చేసింది మేఖల.         అప్పుడు స్పష్టంగా చూసాడు అచ్యుత్ మేఖలను.         వాడు మేహ్కలను ముఖాముఖి ఎప్పుడూ చూడలేదు. ఫోటో చూడ్డమే అయినా పోల్చుకున్నాడు.         "బాస్.....ఢిల్లీ కుర్రాడే వాడు...." జీవువేపు వస్తున్న అచ్యుత్ ని చూడగానే జీపులో కూర్చున్న అష్టావక్రుడు అరిచాడు.         "స్టార్ట్....స్టార్ట్..." అరుస్తూ జీపెక్కాడు అచ్యుత్.         ఝుయ్ మని జీపు పరుగుతీసింది.         మేఖల కారు సెక్రటేరియట్ మీదుగా, ఖైరతాబాద్ ఫ్లయ్ ఓవర్ బ్రిడ్జి మీదుగా వెళుతోంది.         "ఇప్పుడు మనం మన 'ప్లేస్'కి వెళ్ళటం మంచి పద్దతి కాదు...." డ్రైవ్ చేస్తూ అంది మేఖల.         "ఎక్కడికెళతావో అర్జెంటుగా చెప్పు" అరిచింది మేఖల.         "క్రాస్ రోడ్డు మీదుగా యూనివర్సిటీవేపు వెళదాం" తన మెదడులో కొచ్చిన ఆలోచన పూర్తిగా రూపుదిద్దుకోక పూర్వమే అన్నాడు.         ఎనభై కిలోమీటర్ల స్పీడుతో కారు పరుగెడుతోంది. రెండుమూడు చోట్ల చిన్నప్రమాదాలు 'లక్కీ'గా తప్పిపోయాయి. వెనుక అంతే స్పీడులో వస్తున్నాడు అచ్యుత్ జీపులో.         టాంక్ బండ్ చౌరస్తా దగ్గర రెడ్ సిగ్నల్ గమనించినా ఆగలేదు మేఖల. పోలీసు అరుస్తూ ముందుకొచ్చాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన అచ్యుత్ జీపు ఒక్కక్షణం ఆగక తప్పలేదు.         మేఖల కారు క్రాస్ రోడ్స్, అజామాబాద్, విద్యానగర్ బ్రిడ్జి, యూనివర్సిటీ రోడ్డువైపు వెళుతోంది.         "ఇటెటు?" అసహనంగా అడిగింది.         "ఇటా-చెప్తాలే.....ఆ ఉమెన్స్ హాస్టల్ దగ్గర రైట్ కి తీసుకొని కారాపు" రైట్ కి తీసుకుని, పొదల పక్కన కారాపింది మేఖల.         "నువ్వు కార్లోనే కూర్చో...." అంటూ 'కీస్' తీసుకుని డిక్కీ లోంచి ఇనపరాడ్ తీశాడు. అప్పుడే నెమ్మది నెమ్మదిగా చీకటి ప్రవేశిస్తోంది. ఎక్కడా యింకా లైట్లు వెలగలేదు.         అచ్యుత్ జీపు స్పీడు బ్రేకర్ల దగ్గర కూడా ఆగకుండా వస్తోంది. రోడ్డు ప్రక్కన 'రాడ్'తో నిలబడ్డ విమల్ ని చూడలేదు. సడన్ గా చూసి 'స్టాప్' అంటూ గట్టిగా అరవడం, డ్రైవర్ బ్రేకు వెయ్యడం, అదే సమయంలో విమల్ ఇనపరాడ్ ని సూటిగా అచ్యుత్ కి తగిలేటట్లు విసరడం, అది కరెక్టుగా అచ్యుత్ కంఠంమీద తగలడం, అచ్యుత్ బాధగా అరవడం అన్నీ ఏక క్షణంలో జరిగిపోయాయి.         ఆ జీపులో అచ్యుత్ కాకుండా ఇంకా ముగ్గురున్నారు. వాళ్ళు జీపు దిగి విమల్ మీద పడ్డారు. విమల్ ధాటికి వాళ్ళు ఆగలేకపోతున్నారు. కిందపడిన 'రాడ్' అందుకుని అభిమన్యుడిలా తిప్పుతున్నాడు రాడ్ ని.         అచ్యుత్ సర్దుకుని పక్కన కార్లో కూర్చున్న మేఖలను చూసి పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ కదిలాడు.         తనవేపు అచ్యుత్ రావడం గమనించిన మేఖల వెంటనే కారు 'స్టార్ట్' చేసి, ఒకేసారి 'రైజ్' చేసి 'ధడేల్మని' అచ్యుత్ ని గుద్దింది. ఆ దెబ్బకు అచ్యుత్ ఎగిరి 'జీప్' మీద పడ్డాడు. కారు మళ్ళీ వెనక్కి తీసుకుని మళ్ళీ అదే స్పీడుతో ముందుకొచ్చిన సమయంలో-
24,730
    ఎంతో బరువుగావున్న వడ్డాణాన్ని చూడగానే దానివిలువ ఎన్ని వేలు వుంటుందో మనసులోనే అంచనా వేసుకున్నాడు. వడ్డాణాన్ని తన యింటిలో దాచుకుని గాజులను మాత్రం అమ్మి ఆధునీకమయిన పర్నీచర్ కొన్నాడు కావేరికోసమని! వాటిని లెక్కల్లో పదింతలు ఖరీదుగాచెప్పి నమ్మించేశాడు. కాని అవి నిజానికి నెలకి యింత అని అద్దెకి తెచ్చినవి! ఆ సంగతి కావేరికి తెలియదు.నెలఅద్దె ముందుగానే చెల్లించాడు.     ఇంకా అతను చేసేపని కావేరిని తనకి రాబడివున్న వాళ్ళందరినీ పరిశ్రమలో పెద్ద నిర్మాతలని, డైరెక్టర్లనీ పరిచయంచేయటం. వాళ్ళదగ్గిర మాత్రం ఒక్కరాత్రికి అయిదువందలనుంచి వెయ్యిరూపాయలవరకూ వసూలుచేయటం! అలా వారిని తీసుకువచ్చినప్పుడు కావేరిని, ఆ వ్యక్తిని ఆ యింటిలో వదిలి తను తనయింటికి వెళ్ళిపోవటం! కాపలాకిమాత్రం అంబుజం వుంటుంది.     తనకి సినిమా చాన్సులు ఇస్తారన్న ఉద్దేశ్యంతో వాళ్ళుచెప్పినట్లుగా వాళ్ళని సంతృప్తిపర్చటం కావేరీవంతు అయింది.     రోజురోజుకీ ఆ జీవితానికి అలవాటుపడిపోయింది. ఇప్పుడు వచ్చిన వేలాయుధం పెద్ద నిర్మాత అని తనూ వినియున్నది అతను తీసే జంతువుల సినిమా షూటింగ్స్ కి తనూ వెళ్ళింది. వేలాయుధం తనకంటూ తనతోనే కారులో తనకుర్చీ తెచ్చుకుని మరీ కూర్చునేవాడు. తన పిక్చర్సుకి పేరుపొందిన డైరెక్టర్ ని పెట్టుకునేవాడు. తను చెప్పినవిధంగానే ఆ డైరెక్టర్, కెమెరామెన్ నడుచుకోవటం, ఈ షాటు యిలా తీయాలీ? అనంటే ఆ విధంగానే డైరెక్టర్, కెమెరా మెన్ తీసేవారు. ఆయన జంతువులపై సినిమాలు అనేకంతీసి లక్షలకి లక్షలు సంపాదించి దివాళా తీసిన స్టూడియో యజమానిదగ్గర తక్కువ ధరకి స్టూడియోని కొని అంతకంటే తక్కువ పెట్టుబడితో జంతువుల సినిమాలుతీసి విపరీతంగా సంపాదించిన వేలాయుధం ఆ స్టూడియో కొన్నతరువతః ఎంతో ఆధునీకం చేశాడు. రికార్డింగ్ థియేటర్, కలర్ లాబ్ వంటి సౌకర్యాలన్నీ కలుగచేశాడు.     ఇప్పుడు వేలాయుధం స్టూడియో అంటే ఎక్కడుందో ఇట్టేచెప్పగలను లైట్ బాయ్ నుంచి దారేపోయే దానయ్యతోసహా!     ఆయన పెద్ద ప్రొడ్యూసర్ క్రిందలెక్క! ఆయన తన పిక్చర్ లో హీరోయిన్ గా బుక్ చేశాడంటేనే చాలు! నిర్మాతల వర్గంలో సంచలనం రేపినట్లే!     ఆ హీరోయిన్ నటించిన సినిమా షూటింగు పూర్తిచేసుకోకముందే ఆమె ఎలా నటించింధో చూడకుండానే అనేకమంది నిర్మాతలు క్యూలో నిలబడి తాము తీయబోయే పిక్చర్ లో నటించేందుకు బుక్ చేసుకునేటందుకు క్యూలో నిలబడతారు. ఎంత రేటుకయినా బుక్ చేసుకుంటారు.     ఈ విషయం అంబుజం వెంకట్రావులద్వారానే కాక తనను వేలాయుధం తీస్తున్న జంతువుల సినిమా షూటింగుకని తీసుకెళ్ళినప్పుడు తనూ చూసింది.     పెద్ద డైరెక్టర్ అనేవాడుకూడా వేలాయుధంముందు పిల్లికూన అయిపోతాడు ఆయన కరుణా కటాక్ష వీక్షణాలకోసం ఎంతోమంది అమ్మాయిలూ తాము వివిధ ఫోజులలో తీయించుకున్న ఫోటోలు చేతపట్టుకుని ఆయన పిలుపుకోసం పడిగాపులు పడతారు. అలాంటి వేలాయుధం తనదగ్గరకే వచ్చాడంటే కావేరికి ఎంతో ఆనందంగావుంది. మరెంతో గొప్పగావుంది.     కావేరి తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ పూసగుచ్చినట్లు చెప్పి వెళ్ళిపోయాడు వెంకట్రావు.     "ఈ హాలులో కూర్చుని మాట్లాడుతుంటే అందరికీ వినపడతాయి. మనం ఫ్రీగా మాట్లాడుకోవాలంటే ఏకాంతం కావాలి! నీతో ముఖ్యమయిన విషయాలు చర్చించాలి! నాకు సంతృప్తికరమయిన జవాబులు లభించితే నిన్ను వరుసగా నేను తీసే నాలుగు పిక్చర్సులో హీరోయిన్ ని చేస్తాను" అన్నాడు కావేరీనే నిశితంగా పరిశీలించుతూ!     "అలాగేనండీ! ఈ గదిలో కోర్చుని మాట్లాడుకుందాం! రండి! రండి!" అంది ఎంతో ఆనందంగా.     వేలాయుధం తనలోని బలాన్నంతటినీ ఊపులోకి తెచ్చుకుని లేచేసరికి సోఫా కిర్రుకిర్రుమంటూ ఎక్కువగా శబ్దంచేసింది. మరొక్కసారి ఊపితేచాలు విరిగిపోయేటట్లుగా అనిపించింది కావేరికి!     ఇద్దరూ ఆ యింటికి ఓ మూలగావున్న పడగగదిలోకి వెళ్ళారు. ఆ గదిలోవున్న డబుల్ కాట్, పూవులున్న దుప్పటి పరుపుమీద పరిచి వుంది. ఓ మూలవున్న టీపాయ్ మీద అగరవత్తులు కాలుతూ వున్నాయి. అలా కాలుతూ అవి వెదజల్లుతున్న సుగంధ పరిమళం ఆ గదంతా ఆక్రమించుకున్నది.     ఆ డబుల్ కాట్ తప్ప ఆ గదిలో ఓ కుర్చీగానీ, సోఫాగానీ లేదు! వచ్చినవాళ్ళు ఆ మంచంమీద కూర్చోవలసిందే!     వేలాయుధం యిలాంటి గదులెన్నింటినో ఆయన హయాములో ఎన్నింటినో చూశాడు. ఆగదుల నాలుగుగోడలమధ్యా ఎంతోమంది అందమయిన అమ్మాయిలను అనుభవించాడు.     అందులో కొందరికి తన సినిమాల్లో చిన్నచిన్న వేషాలు ఇచ్చాడు. మరికొందరిని హీరోయిన్ చేస్తానని, ఇంకెవ్వరూ ఆ అమ్మాయిని తమపిక్చర్ లో బుక్ చేసుకోకుండాను, తన అధీనంలోనేవుండేటట్లుగా రెండు సినిమాల్లో నటించేటందుకు అగ్రిమెంటు వ్రాయించుకోవటం, నెలకి ఇన్నివందలని ఆ అమ్మాయి పోషణకి యివ్వటం, తన అధీనంలో వుంచుకోవటం, తనకి అవసరం అయినా రాత్రిళ్ళు ఆ అమ్మాయిదగ్గిరకు వెళ్ళటం, తన కోరికలు తీర్చుకోవటంవరకే వాళ్ళని పరిమితం చేసేవాడు తప్ప వాళ్ళకోసం తీసే సినిమాని ప్రారంభించకపోవటానికి కారణం?     సాలెగూడులాంటి ఈ రంగుల విషవలయంలో చిక్కుకున్న ఏ ఆడపిల్లా హీరోయిన్ గా రాలేదు! రాదుకూడాను!     యిలాంటి ఎన్ని వందలమంది ఏవేవో ఊహలతో మద్రాసు మహానగరంలో అడుగుపెట్టి వెంకట్రావులాంటి బ్రతుకుతెరువుకోసం వెంపర్లాడి పారిపోయివచ్చిన అమ్మాయిలను వలవేసి పట్టుకుని వారికి మరెన్నో ఆశలుకల్పించి వేలాయుధంలాంటి వారికి అంకితం అయిపోయి సాలెగూడులాంటి ఆ ఉచ్చులో చిక్కుకుపోయి బయటపడలేక చివరికి సమిధలుగానే మిగిలిపోయిన వాళ్ళెంతమందో?     "తలుపులు వేసిరా!" అన్నాడు వేలాయుధం యికిలించుథూ! అలవాటయినచేతులు సంకోచించకుండా తలుపులుమూసి గడియపెట్టివచ్చి వేలాయుధం పక్కనకూర్చుంది కావేరి.     నశ్యంకంపు గుప్పుమంది.     ముక్కులు నలుపుకునే నెపంతో నలుపుకుంటూ వుండిపోయింది.     "నీగురించి వెంకట్రావు నాకంతా చెప్పాడు. నీలాంటి ఔత్సాహిక ఆర్టిస్టులే కావాలి! నీకు నటనానుభావం చాలాచాలా వుందన్నాడు. ఎంతో అందమయినదానివని నీ ఫోటోలు చూపించాడు. ఫోటోలు చూస్తే ఏం తెలుస్తుంది? స్వయంగా చూసి నీ గురించి అంచనావేసుకుని, కొత్తవాళ్ళతోనే తీయబోయే పిక్చర్ లోకి హీరోయిన్ గా నువ్వు పనికి వస్తావో? లేదో? నిర్ణయించుదామని వచ్చాను. నా కంటికి బాగా నచ్చావు హీరోయిన్ పాత్ర యిస్తే చేయగలవో? లేదో ఇంకా చూడాలి! చూద్దామనే వచ్చాను. తీరుబడిచేసుకుని నీకోసం! అబ్బబ్బా! ఒక్కక్షణం తీరుబడి వుండదంటే నమ్ము!     వారంరోజులనుంచీ వెంకట్రావు బ్రతిమాలగా యిదిగో....ఇప్పటికి వీలయింది!" అంటూ కావేరివైపుకి చూశాడు వేలాయుధం! తనమాట లకి ఏ విధంగా స్పందించుతుందోనని.     స్పందించిన లక్షణాలే ఎక్కువగా కనిపించేసరికి ఎంతో ధైర్యం వచ్చింది వేలాయుధానికి! ఎంతో ఆప్యాయంగా చెయ్యిపట్టుకుని-
24,731
           "పిరికితనం మానవుడ్ని చిత్రవధ చేస్తుందేగాని ప్రయోజనం సున్నా పరిధులు గీసుకుని, హద్దుల్లోదాగి మన ప్రవర్తనకు మారుపేరు పెట్టుకుని అనుభవాలనుంచి దూరంకావటం అసమర్ధత. మనచుట్టూ గీసుకున్న గీతాలు మనని అశక్తుల్ని చేయకూడదు. ఉదాత్తుల్ని చేయాలి. పదండి" అన్నాడు శివనాథరావు.         "ఎక్కడికి?" అంది ఉష తెల్లబోతూ.         "మీ ఇంటికి నా కార్లో దిగబెడతాను రండి."         ఆమె మొహమాటపడుతూ "వద్దండీ మీకు శ్రమ, రిక్షాలో వెళ్ళిపోతాను."         కాని అతనామెను బలవంతం చేస్తూ "ఉహు, అలాకాదు. మీతో ఇంకా కొంచెం మాట్లాడాలి రండి" అని లేచి నిలబడ్డాడు. ఆమె తప్పనిసరిగా లేచి అతన్ని అనుసరించింది.         ఇంటిలో నౌకరు వీరయ్య ఉన్నాడు. వంటవాడు గోవిందు లోపలెక్కడో ఉన్నాడు. శివనాథరావు గారాజ్ లోంచి కారు బయటకు తీశాక, అతను ముందు తలుపు తెరిచి ఆమెను పిలిచాడు. అం ఎపోయి ముందుసీటులో అతని ప్రక్కన కూర్చుంది. కారు బయలుదేరింది.         "మావి చాలా విచిత్రమైన జీవితాలు" అన్నాడు శివనాథరావు సందు మలుపు త్రిప్పుతూ.     ఆమె ప్రశ్నార్ధకంగా చూసింది.         "మోహన్, నేను, చంద్రం, కృష్ణ అనే యింకో అతనూ చిన్నప్పుడు కలిసి చదువుకున్నాం. ప్రాణ స్నేహితులమయ్యాము. పెరిగి పెద్దయిన తర్వాత అంతా తలోదిక్కూ పోయినా ఒకరికొకరు దూరంకాలేదు. ప్రతివాడినీ తీవ్రమయిన అనుభవాలు చుట్టుముట్టాయి. కృష్ణ ఒక అగ్నిప్రమాదంలో ఇరుక్కుని చనిపోయాడు. చంద్రం సుజాతను ఎన్నో విఘాతాలనెదుర్కొని పెళ్ళి చేసుకున్నాడు. ఆమె మహానటి. ఎప్పుడయినా విన్నారా?"         "విన్నాను" అన్నదామె.         "ఆమె చంద్రాన్ని పెళ్ళి చేసుకోవటంలో అనేక అడ్డంకులు ఏర్పడినై. ఆమెకో అక్క ఉండేది. ఆమెమీదకు ఓ హత్యానేరం వచ్చింది. తన కసిని తీర్చుకోవటానికి ఆ హత్య చేసినట్లు ఆమె ఒప్పుకుంది. కేసు జరుగుతూండగానే ఆమె జైల్లో ఆత్మహత్య చేసుకుని మరణించింది."         "అవును. నే నా కేసును పేపర్లలో ఫాలో అయ్యాను" అంది ఉష.         "ఇహ మోహన్-అతని ఊళ్ళో అతనికి చాలా పలుకుబడి వుంది. మంచి ఉద్రేకి, జీవితపధాన్ని ఇట్లా ఎందుకు మార్చుకున్నాడో గట్టిగా చెప్పలేనుగాని, ప్రయత్నిస్తే రాజకీయంగా చాలా పైకి వచ్చేవాడు. కానీ యిక్కడ సెటిల్ అవుదామని ప్రాక్టీస్ పెట్టాడు. ఒంటరిజీవితాన్ని గడుపుతున్నాడు."         మోహన్ ప్రసక్తి వచ్చేసరికి ఆమె గప్ చిప్ గా ఊరుకుంది. మనసు పరిపరి విధాలుగా పోసాగింది.         శివనాథరావు నవ్వాడు. ఆమెవంక క్రీగంట చూస్తూ "మీరు ఈ ఊరువారు కాదు. కానీ ఎక్కడినుంచో యిక్కడికి వచ్చి జూనియర్ గా చేరటంలో ఉద్దేశం తెలుసుకోవచ్చా?" అన్నాడు.         అతని ప్రశ్నలోని అంతరార్ధం ఆమె పసికట్టింది. కొంచెం గట్టిగానే జవాబు చెబుదామనుకుంది. ఇంతలో ఉలిక్కిపడి "మీరు ఎటుపోతున్నారు? మా ఇల్లు ఇటుకాదు" అంది కొంచెం కంగారుగా.         "నాకు తెలుసు" అన్నాడు శివనాథరావు తాపీగా.         "నన్నెక్కడికి తీసుకుపోతున్నారు?"         "మోహన్ దగ్గరకు."         ఆమె నీరస నేత్రాలతో అతనివంక చూస్తూ "అదేం పని?" అన్నది చిన్నగా.         "మీ అంతరాత్మకు తెలుసు."         "అంటే?"         "మీకెప్పుడూ మీ ఆత్మ ఏమీ చెప్పలేదా?"         ఆమె అయోమయంగా చూసింది.         "మీకు తెలియని రహస్యాలు మీ ఆత్మకు తెలుసని మీకు తెలుసా?"         "ఏమిటి డాక్టర్ ఇది?"         "కంగారు పడకండి ప్లీడరుగారూ...ఆత్మ ఓ దివ్వెలాంటిది పరిస్థితుల ప్రాబల్యంలో  అది తరచు ఆరిపోయే ప్రమాదం ఉంది. అప్పుడు మన మనుగడే ఆగిపోతుంది. సర్వం చీకటి. ఏదో అగాధంలో వుంటాము. అడుగుతీసి అడుగు వేయలేం. అందుకే ఆ దీపాన్ని మాటిమాటికీ ప్రజ్వలితం చేసుకుంటూ పోవాలి. అసలారిపోనివ్వకూడదు. ఆ వెలుగులో, ఆ ప్రకాశంలో తడబడకుండా నడిచిపోవాలి. ఈ ప్రపంచంలో మనము చాలా ఒంటరిగాళ్ళం. ఇతరుల్ని చూసి ఉద్రేకం పొంది మనల్ని మనం పెంచుకుంటూ పోవాలేగానీ, ఎవరూ వచ్చి, మనని పైకి లేవతియ్యరు. అల అజరిగినా, అది ఒట్టి కల్తీయేగాని స్వయం ప్రకాశంలోని తృప్తి లభించదు. నేను మిమ్మల్ని మోహన్ దగ్గరకు మీ వ్యక్తిత్వం చెడకుండా తీఉస్కుపోగలను. కానీ అలా వద్దు. కళ్ళు మూసుకుని తీవ్రంగా ఆలోచించండి. మీ దగ్గర పెట్రోల్ వుంది. నిప్పుపుల్లలూ ఉన్నాయి. బద్దకిస్తున్నారంతే. ఆ బద్దకంలో మందమతులైపోతున్నారు. అది అంటించే బాధ్యత మీదే. కళ్ళు తెరవండిప్పుడు, ఇదిగో మోహన్ ఇల్లు దిగండి, ఇప్పుడిహ సంకోచించరు నాకు తెలుసు. సరాసరి లోపలకు వెళ్ళండి. మీకోసమే ఎదురుచూస్తున్నట్లు ఆ నిర్భాగ్యుడు కూర్చుని వుంటాడు. ఆలస్యం చేయకండి."         ఉషానేదో ఇంద్రజాలం ఆవహించినట్లయింది. మంత్రముగ్ధలాగా తలుపు తీసుకుని క్రిందికి దిగింది. చీకట్లో నడిచివెళ్ళి, గేటు తెరచుకుని లోపలకు పోసాగింది.         శివనాథరావు తృప్తిగా నవ్వుకుని కారుని వెనక్కి పోనిచ్చాడు.                                  32         సరోజిని బండి దిగింది. ఏమిటిది ఇల్లంతా చీకటిగా వుంది? బండివాడికి డబ్బులిచ్చి పంపేసి లోపలకు వెళ్ళింది. వసారాలో ఎవరిదో మూర్తి కనిపించింది.         "అత్తయ్యా!" అంది అనుమానిస్తూ సరోజిని.         చీకట్లో గోడకానుకుని నిలబడి వున్న మనిషి సావిత్రే. "నువ్వా అమ్మా సరోజినీ! ముందుగా ఉత్తరం రాయకుండా వచ్చావేం?" అంది దగ్గరకు వస్తూ.         "ఊరికినే రాయలేదత్తయ్యా! చీకటిగా వుందేం ఇల్లంతా?"         "లైట్లు పోయాయి, సమయానికి ఇంట్లో కిరసనాయిలు లేకపోయింది. తీసుకురావటానికి వీరయ్యను బజారు పంపాను. మీఇంట్లో అంతా కులాసానా అమ్మా?"         "అంతా కులాసానే అత్తయ్యా...." అని సరోజిని ఏదో అడగటానికి తటపటాయిస్తోంది.            "శివుడు మేడమీద గదిలో వున్నాడమ్మా, పైకివెళ్ళు" అంది సావిత్రి.         సరోజిని మెట్లుఎక్కి పైకి పోయింది. చీకట్లో తడుముకుంటూ గదిలో అడుగుపెట్టింది.         "సరోజినీ!" అని పిలిచింది శివనాథరావు కంఠం నీరసంగా.         ఆయనకు ఎలా తెలిసింది తన ఆగమనం? ఆమె ఆశ్చర్యపడుతూ ముందుకు ఒక అడుగువేసింది.         "సరోజినీ! అబ్బ! ఎప్పుడు వస్తావు సరోజినీ? నామీద కొంచెంకూడా కనికరం లేదా నీకు?"         సిగ్గుతో ఆమె శరీరం గగుర్పొడిచింది. తనరాక విషయం ఆయనకు తెలియలేదు. నిద్దర్లో కలవరిస్తున్నాడు తనకోసం.         "అబ్బ! ఇది కలకాదని నీకెట్లా అర్ధమవుతుంది సరోజినీ? నాకేదో జరిగింది, చచ్చిపోతున్నాను. గుండెల్లో ఏదోపోటు ఈ చివరిదశలో నిన్ను కళ్ళారా చూసుకునే భాగ్యం లేకపోయింది సరోజినీ నాకు. అయ్యో!"         ఆమె గుండె బ్రద్దలయిపోయింది. ఇది కలకాదు. తన బ్రతుకు బండలు కాబోతుంది. "ఏమండీ!" అంటూ చీకటిని లెక్కచెయ్యకుండా పరుగెత్తి అతని పాదాలమీద వాలిపోయింది.         పెద్దపెట్టున నవ్వు వినిపించింది. శివనాథరావు బిగ్గరగా నవ్వుతూ లేచి కూర్చున్నాడు. సరోజిని విహ్వలచిత్త అయింది. అతనామెను దగ్గరగా తీసుకుని "భయపడ్డావా సరోజినీ?" అన్నాడు ప్రేమగా.         అతని హృదయంపై తలదాచుకుని ఆమె మెల్లగా "భయపడనూ?...అంతా అబద్దమేనా?" అంది.         "అబద్దము కాకపోతే, నిన్ను విడిచి నేనెలా చచ్చిపోతాను సరోజినీ? నా తరమా?" అన్నాడు శివనాథరావు.         "ఉండండి, క్రిందనుంచి దీపం వెలిగించి పట్టుకువస్తాను" అని లేవబోయింది సరోజిని.         కానీ అతనామెను వెళ్ళనీయకుండా "ఉహు, పోనివ్వలేను నిన్ను అయినా ఇంతపెద్ద దీపం ఇక్కడుండగా మరొకటి ఎందుకూ?" అన్నాడు.         "ఎక్కడా?"             "ఇదిగో" అని అతనామె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు.         "అదేమిటి?"         "అవును, నువ్వే నా దీపానివి."         సరోజిని కిలకిలమని నవ్వింది "మరి మీరో?"         "నేను చీకటిని."         "అబ్బ! అలా మాట్లాడకండి" అంది సరోజిని భయంగా.         అతడామెను తన హృదయానికి హత్తుకుంటూ "వెలుగురేఖా! నా ఆశాజ్యోతీ!" అన్నాడు.         "మీరే నా ఆశాజ్యోతి" అనుకుంది సరోజిని.                                   33            సుజాత జీవితాన్నిగురించి చాలామంది సందేహాస్పదులవుతారు. ఆమెకోసం అక్క అలాంటిత్యాగం చేసింది. తన ప్రాణాల్ని ఇచ్చింది. ఈ వేదనంతా భరిస్తూ ఎట్లా జీవిస్తోందనీ? నిజమే! పాపం ఎంతో జాలి పడాల్సిన వ్యక్తి సుజాత. నాకుకూడా ఆమెపట్ల చాలా సానుభూతి త్యాగం చేయటంకన్నా ఆ త్యాగం భరించటం చాలా కష్టం. త్యాగమూర్తి విలువ కోసం కొందరు ఎంతో కష్టాన్ని వరించాల్సి వుంటుంది. అలాంటి విషాదజీవి సుజాత. ఎవరూ ఆమెను అసహ్యించుకోవద్దు, జాలిపడండి. నీమీ ఏమయిందో తర్వాత నాకూ తెలియదు. ఆ పర్వతసీమల్లో విహరిస్తోందో, తపస్సు చేస్తోందో, ఈశ్వరుడ్ని తెలుసుకుందో ఏ దశలో వుందోమరి. సావిత్రిని గురించికూడా సందేహం వస్తుంది. ఆమె అక్కడే, శివనాథరావుతోపాటు నివసిస్తోంది. బహుశా రాఘవరావుగానీ, అలాంటి మరో వ్యక్తిగానీ ఆమె జీవితంలో యిహ తారసపడటానికి అవకాశంలేదు. పోతే మాధవి, ఆరోజు కృష్ణ కన్నుమూశాక తనూ అతన్ని చేరుకుందామనే ప్రయత్నించింది. కానీ ఆమె విషయంలో విధి వేరుగా ఉంది. ఇంకా అనేక సంఘటనలను ఎదుర్కోవలసివచ్చింది. అదంతా ఇక్కడ ఎందుకో రాయాలనిపించటంలేదు. కానీ మాధవిని నేను మరిచిపోను, ఆమెను గురించి యింకో పుస్తకం రాస్తాను.                                        ---సమాప్తం---
24,732
    అతనామెవంక చూడలేకపోయాడు. ఉండలేకపోయాడు చూడకుండా.     "నువ్వు కూడా చూడమ్మా మా వాడ్ని. అంత సిగ్గుపడితే ఎలాగ? మావాడు నీకు నచ్చాడో లేదో చూసుకో" అంటోంది లలితమ్మగారు.     అందరూ పోరగా పోరగా జ్యోతి అతికష్టంమీద తన విశాలనేత్రాలను కొంచెం పైకి ఎత్తింది. ఆమెకు అతని పాదాలు కనిపించాయి. సున్నితమయిన తెల్లని పాదాలు, ఆ పాదాలనుండి ఏదో ఆమెను లాగినట్లయింది. వాటిని స్పర్శించినట్లు అనిపించింది. ఆమె పులకాంకిత అయింది. సిగ్గుపడి చప్పున కళ్ళని క్రిందకు వాల్చివేసింది.     ఇంటికి వచ్చాక లలితమ్మగారికి దిగులు పట్టుకుంది. అంత చక్కని కోడలు అసలు తండ్రిమాట తీసివేయలేక మొక్కుబడి తీర్చుకోవటం కోసం వచ్చాడు కొడుకు. వొద్దంటాడేమో!     ఆమె భయపడుతూ సుందరాన్ని అడిగింది. "ఎలా వుందిరా పెళ్ళికూతురు?"     సుందరం తాను అక్కడికి వెళ్ళకముందు అన్నమాటలు మరచిపోయాడు. మనసులోది చెప్పటానికి అతనికి సిగ్గువేసింది. ఎలాగో గొంతు స్వాధీనం చేసుకుని "నాకు ఇష్టమేనమ్మా" అని తలప్రక్కకి త్రిప్పేసుకున్నాడు.     లలితమ్మగారు సంతోషంతో ఉక్కిరిబిక్కిరయి కొన్నిక్షణాలు మాట్లాడలేక పోయింది.                                                                     *  *  *     అనేశాడేగాని ఆ క్షణంనుంచీ బాధపడనారంభించాడు సుందరం. తాను ఏమిటి తొందరపడి ఇలాంటి నిర్ణయానికి వచ్చేశాడు? తాను మామూలు మనిషి కాదు. తనలో లోపం వుంది. అది అన్యులెరగని లోపం. తాను వ్యాధిపీడితుడు. పెళ్ళిచేసుకుని మరోజీవితాన్ని అశాంతిపాలు చేయబోతున్నాడు. అన్యాయం చెయ్యబోతున్నాడు. అసలిది అన్యాయం చెయ్యటమవుతుందా? ఏం నేరం చేశాడు తను!     అతనికి పాలుపోవటల్లేదు. జ్యోతిని చూశాక ఆ అపురూపమూర్తిని నిర్లక్ష్యం చేస్తే దూరమయిపోతుందనే భీతితో తల్లి అడగగానే ఒప్పేసుకున్నాడు. ఇప్పుడు అనేక సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. సమాధానంలేని ప్రశ్నలు. ఆకృతిలేని ఆరాటం.     అవతల పెళ్లిప్రయత్నాలు జోరుగా సాగిపోతున్నాయి. ఇంత తొందర ముహూర్తం నిశ్చయింపబడుతుందని కలలోకూడా అనుకోలేదు. తల్లిదండ్రుల్ని చూసినా, అక్కచెల్లెళ్ళలో ఎవరి ముఖం చూసినా సిగ్గుతో చచ్చిన చావుగా వుంది. వీదిలోనికి వెళ్ళాలంటే సిగ్గేస్తోంది.     అన్నిటినీ మించి తను తన మనస్తత్వం, అనారోగ్యం.     ఏమయితేనేం. అతను ఎన్ని అనుకొంటేనేం, సుందరం పెళ్ళి జరిగిపోయింది.     అతనికంతా ఇబ్బందే. పెళ్లిలో ఏవో తతంగాలు చాలా చేయిస్తారు. అబ్బ ఎలాగ అవి భరించటమనుకొన్నాడు. బంతులాడిస్తారు. బిందెలో ఉంగరంవేసి ఇద్దర్నీ చేతులుపెట్టి తీయమంటారు. పేర్లు చెప్పిస్తారు. ఈ తలంబ్రాలు తతంగం... ఎలా బాబూ?     కాని తీరా అవి జరుగుతున్నప్పుడు అనుకొన్నంత కష్టమనిపించలేదు అతనికి. కాకపోగా హృదయంలో ఏమూలో ఆనందపు స్పర్శ కలిగింది.     జ్యోతి! ఎప్పుడూ ఆమెని చూడాలనీ, మాట్లాడాలనీ తహతహగా వుండేది. అంతులేని మధురభావాలు. పీటలమీద ప్రక్క ప్రక్కన కూర్చున్నప్పుడు ఆమె స్పర్శకు అతనిలో విద్యుత్ ప్రవహించినట్లు వుండేది. అదేదో తాడులాంటిది ఇచ్చి ఆమె నడుముకు కట్టమన్నారు. అతనలా చేస్తోంటే ఆమె కాస్త తలత్రిప్పి ఓరగా చూసింది. ఆ భంగిమ అతని మనసులో ముద్రితమైపోయింది. మంగళసూత్రం కడుతున్నప్పుడు, తలంబ్రాలు పోసుకుంటున్నప్పుడు, విడిదింట్లో బంతులాడిస్తున్నప్పుడు అతనికి ఏమీ ఎబ్బెట్టు లేకపోగా అతను పులకాంకితుడు కాసాగాడు.     మూడునిద్రలకు పెళ్లి జరిగిపోగానే అంతా కాకినాడ వచ్చారు. విందులతో, వేడుకలతో ఒకరోజు గడచిపోయింది. భార్యని చూడాలనే తహతాహ అణచుకోలేక సుందరం పెద్ద పనివున్నట్లు ఆ గదినుంచి యీ గదికి, యీ గదినుంచి ఆ గదికీ తిరుగుతూండేవాడు. ఆమె ఎక్కడ కూర్చుందో, ఆ చుట్టూ తారట్లాడుతూ వుండేవాడు. పెళ్ళికూతురితోబాటు ఆమె చెల్లెలూ, మేనత్తా వచ్చారు. "బావగారూ! అక్కయ్య ఆ గదిలో లేదండీ. ఈ మూల వుంది" అంటూ మరదలు పరిహాసం చేసేది.     "బావగారూ! మాకు వూరు చూపెట్టరూ?" అనడిగింది మరదలు.     "ఏముందండీ కాకినాడలో చూడడానికి? చడీ చప్పుడూ లేనివూరు."     "బీచికి పోదామండీ" అంది ఉత్సాహంగా మరదలు.     "ఇక్కడ బీచి ఎక్కడ వున్నదండీ. సముద్రం వుంది అంతే."     "పోనీ సముద్రమే చూపెట్టండీ!"     ఆ సాయంత్రం లలితమ్మగారుకూడా "వాళ్ళను అలా సముద్రం వైపు తీసుకుపోరా! నీ మరదలు ఒకటే గోలచేస్తోంది" అని బలవంతం చేసింది.     సుందరం మనసులో కోరుకుంటూన్నదే అయినా యీ అలుముకున్న నూతన వాతావరణం అతడిని లజ్జితుడ్ని చేస్తోంది. ఎలాగో కారులో ఎక్కుతూ ఆశనుకూడా రమ్మని బలవంతం చేశాడు.     "నేను రాను బాబూ! బయటకు చెప్పలేదుగానీ వదిన మనసులో విసుక్కుంటుంది" అని ఆశ నవ్వుతూ తప్పించుకుంది.     జ్యోతికి సిగ్గుతో తల వాలిపోయింది.     ముగ్గురు ప్రక్క ప్రక్కన కూర్చున్నారు. అతనికి భార్యను పలకరించాలని మనసు వువ్విళ్ళూరుతోంది. కాని సిగ్గుతెరలు క్రమ్మివేస్తున్నాయి. మరదలు మాట్లాడుతూంటే ఆమెకు జవాబులు చెబుతూ కూర్చున్నాడు.     కారు సముద్రతీరందాకా పోదు. మధ్యలో రోడ్డు విరిగిపోతే బాగు చేస్తున్నారు. అందుకని అక్కడ కారుదిగి నడుస్తూ తీరానికి చేరుకున్నారు.     "బావగారూ! ఈ సముద్రం పేరు ఏమిటి?" అనడిగింది మరదలు కుతూహలంగా.     "బంగాళాఖాతం."     "బాప్ రే! బంగాళాఖాతం అంటే ఇదేనా? మా జాగ్రఫీలో చదివి ఇంకా ఎక్కడో వుందనుకున్నాను. బంగాళాఖాతం కాకినాడలో వుందన్నమాట" అంటూ ఆ పిల్ల మిగతా ఇద్దరి ఉనికినీ క్రమంగా మరిచిపోయి అటూ ఇటూ పరిగెత్తుతూ, గవ్వలు ఏరుకుంటూ, యెండ్రకాయల్ని తరుముతూ మైమరచి పోయింది.
24,733
        "ఎవరడిగారురా ఈ సోదంతా, పెళ్ళి చేసుకు వచ్చావా అని మాత్రమే అడిగాను దానికి జవాబివ్వు" రామచంద్రం కోపం నిగ్రహించుకుని అడిగాడు.     "అదికాదు నన్నా!"     "నేనడిగిన ప్రశ్నకిది జవాబుకాదు. పెళ్ళి చేసుకు వచ్చావా?"     "అవును"     "ఎవరినడిగి? నేచచ్చాననుకున్నవా?"     "నాన్నా" అన్నాడు బాబా          "నాన్నా" అంది సీత.     "నువ్వుండమ్మా" అన్నాడు రామచంద్రం.     "నేనేం తప్పుపని చెయ్యలేదు. నా మాట కాస్త వినండి." ప్రాధేయ పడుతూ అన్నాడు బాబా.     "వింటారా! ఏదో చెపుతావు పీక మీద కొచ్చిందంటావు ఇంకేదో చెపుతావు. చెప్పేవాడికి వినేవాడు లోకువ. నీ తెలివి నీ ఆవేశం, నీ గొప్ప ఎవరికి తెలియవురా. నీ వెప్పుడు పట్టినా మూడుకాళ్ళ కుందేలే వలలో పడుతుంది. అది నీ ప్రతాపం అది నీ...."     బాబాకి కోపం వచ్చింది "మీరు నా మాట వినేదేమయినా వుందా?' అన్నాడు.     "నాన్నా! నాన్నా! కాస్త బాబా చెప్పేది వినండి. అరిచి అవేశాపడితే లాభమేముంది" సీత తండ్రి చేయి పట్టుకుని అంది.     రామచంద్రం కొంచెంలో కొంచం కోపం నిగ్రహించుకున్నాడు. అదయినా సీత చెప్పబట్టి. ఏం జరిగిందో చెప్పమని మాత్రం అడగలేదు. పూర్తిగా నిశ్శబ్దమయ్యాక బాబా చెప్పబోయే తన కధకి నాంది "హు...హ్హు" అంటూ కంఠం సవరించుకున్నాడు.     "మీరు పూర్తిగా నేచేప్పింది విని తప్పో వప్పో నిర్ణయించండి. నాన్నా! హైదరాబాద్ లో నాతో పాటే మా ఆఫీసులో కౌసల్య జాబ్ చేస్తున్నది. కౌసల్య పరిచయంతో పాటు వాళ్ళ ఫ్యామిలీ కూడా పరిచయం అయింది. కౌసల్య మెతక మనిషి గాని వాళ్ళ వాళ్ళు మాత్రం కాదు. నేను కౌసల్య ప్రేమించుకున్నాము. మీతో చెప్పి వివాహం చేసుకోవాలని అనుకున్నాము.     ఇంతలో...." అంటూ కాస్త ఊపిరి పిల్చుకోటానికి ఆగాడు బాబా.     రామచంద్రం తలఎత్తి చాలా సేపు తీక్షణంగా చూసి మళ్ళి తల తిప్పేసుకున్నాడు.     "మా ప్రేమ విషయం వాళ్ళ వాళ్ళకి చెప్పకముందే తెలిసింది. వెంటనే వాళ్ళు నన్ను చాలా బలవంతం చేశారు. నేను మా నాన్న గారికి తెలిపి పబ్లిక్ గానే పెళ్ళి చేసుకుంటానన్నాను. కట్నం కూడా అక్కరలేదనే మాట ముందే చెప్పను. వాళ్ళు వినలేదు. నేనేదో మోసగాడినన్నట్లు తులానాడారు. వాళ్ళు మా విషయంలో అంత కఠినంగా వుండటానికి కారణం లేకపోలేదు. కౌసల్యది బాల్యవివాహం, వెంటనే చనిపోవటం విడోకావటం జరిగింది. నా మూలకంగా కౌసల్య అల్లరి పడిపోతుందేమోనని వాళ్ళ భయం. వాళ్ళ వాళ్ళు మా ఆఫీసు వాళ్ళు ఏకమయ్యారు. అందరూ కలిసి మాది ఆదర్శ వివాహం అంటూ గొప్పగా పొగిడారు. విడోని పెళ్ళాడటం, కట్నం తీసుకోక పోవటం నన్ను గొప్పవాడిని చేశాయి. అదలా జరిగిపోయింది. నే పెళ్ళి చేసుకున్నాక టెలిగ్రాం కొట్టే బదులు నాతో కౌసల్యని తీసుకొచ్చి జంటగా కనిపించి జరిగింది చెప్పి మీ ఆశీర్వాదం పొండుదామనుకున్నాము. ఈ కాళీ రోజుల్లో ప్రతివాళ్ళు సింపుల్ గా పెళ్ళి చేసుకుంటే సగం దేశం బాగుపడుతుంది. ఏమంటారు నాన్నా" తాను చెప్పేదంత పూర్తిగా చెప్పి ఉషారుగా అడిగాడు బాబా.     రామచంద్రంలో ఆవేశం కట్టలు తెచ్చుకుని ప్రవాహంలా దూకింది. తోక తొక్కిన తాచులా చర్రున లేచాడు కుర్చిలోంచి.     "ఏమంటావురా! నువ్వు చెప్పింది నిజమేనంటాను సగం దేశం బాగుపడుతుంది. మరి మిగతా సగందేశం మట్టిగాలిసి పోతుందా? నీ లాంటి వారివల్ల కదూ సగం దేశం కలకలలాడేది. అందరూ నీలాగే వుండరే? సీతకి ఇప్పటికి పది సంబంధాలు చూశాను. వాళ్ళలో వక్కడు కట్నం వద్దని అనలేదే..."     "దొరుకుతారు కాస్త ఆగితే..." అంటూ బాబా మధ్యలో అందుకున్నారు.     "నోరుముయ్యరా, ఇవతల సీతకి సంబంధాలు చూస్తున్నాను. కట్నాలు చాలా అడుగుతున్నారు. పెళ్లీడు కూడా దాటి పోతున్నది. కాస్త కష్టమయినా మనం తట్టుకుని సీత పెళ్ళి చేయాలి అంటూ నికేన్ని లెటర్స్ రాశానురా! వాటికీ రిప్లయిలు మటుకు చిలకపలుకుల్లా యిచ్చావు. సీతకు నీకు ఏం వయసు వారుందిరా? దాని పెళ్ళి కోసం ఇక్కడ నేను దిగులు పడుతుంటే నీ పెళ్ళికి తొందరోచ్చింది. మగాడివి ఏమంత వయసు ముదిరిపోయింది. ఆదర్శ చేసుకున్నానని అనందించనా! కట్నం లేకుండా పెళ్ళాడావని సంతోషించనా? సీత పెళ్ళి ఎలా చేయను. ఎలా, చెప్పరా చెప్పు?" ఆవేశంతో వుగిపోయాడు రామచంద్రం.     "నేనేం కానిపని చెయ్యలేదు." కొద్ది కోపంతో అన్నాడు బాబా.     "ఊరుకో నాన్నా! బాబా పెళ్ళి చేసుకొచ్చాడు. ఇప్పుడేమి అనకు" అంది సీత.   
24,734
    జగన్నాధరావు లోపలినుండి ఎదురువచ్చాడు వీళ్ళకు  "రండి, రండి!" సగౌరవంగా ఆహ్వానిస్తూనే మోహన్ రావు వెనుకగా హూందాగా అడుగులు వేస్తూన్న యువకుడిని చురుగ్గా చూశాడు. సంతృప్తితో, సంతోషంతో నిండిపోయింది ఆయన ముఖం. తమకు దూరపు బంధువొకాయన కోమలమ్మ వాళ్ళ సంబంధం గురించి చెప్పినప్పుడు తమ అంతస్తుకు తూగరుకదా అనుకొని ఆయన అసంతృప్తికి లోనయ్యాడు.     "మీకు తగిందికాదని అసంతృప్తి పడకండి. వాళ్ళకు మీ అంత ఆస్తి లేకపోవచ్చు. కాని పిల్లవాడు రత్నం. ఎం.ఎ. చదువుకున్నాడు బుద్దిమంతుడు" అని చెప్పాడు ఆ బంధువు.     సరే, ఓసారి చూద్దాం అనుకున్న జగన్నాధరావు బావమరిదిని మధ్యవర్తిగా వ్యవహారం నడిపాడు.     బావమరిది వెనుకగా నడిచి వస్తూన్న వరుడి స్ఫురద్రూపం జగన్నాధరావుకు ముచ్చట గొలిపింది. ఇతడికి చిల్లి గవ్వ ఆస్తి లేకపోయినా ఇతడి రూపంచూసి ఇవ్వొచ్చు నా కూతురుని అనుకున్నాడు.     ఆ ఇంటిని, ఆ ఇంటి పరిసరాలనూ, వాళ్ళ మర్యాదలనూ, ఆ ఇంటి దాసదాసీ పరివార జనాన్నీ చూసేసరికి కోమలమ్మకు గుండె దడదడలాడింది. తనూ ఓ లక్ష ఆస్తికి అధికారిణి అయినా వీళ్ళ ఐశ్వర్యం ముందు, ఆడంబరం ముందు సూర్యుడి ముందు దివిటీలాంటిది. ఇంత గొప్ప ఇంటిపిల్ల తన కోడలైతే గొప్పతనం సంగతి దేవుడెరుగు ఎన్ని సమస్యలు ఎదురౌతాయో?     అల్పాహారం టీలాంటి కనీసమర్యాదలు పూర్తి అయ్యేసరికి పెళ్ళికూతురు రావించబడింది.     "పేరేమిటమ్మా?" కోమలమ్మ ప్రశ్న.     "రజని"     అయిదు నిమిషాల తర్వాత, "అమ్మా, రజనీ! మనోహరరావుకు నీలైబ్రరీ అదీ చూపించమ్మా తీసుకెళ్ళి!" అన్నాడు జగన్నాధరావు.     "రండి!" అన్నట్టు మనోహర్ వైపు చూసింది రజని. అతడు లేచి అనుసరించాడు.     పెద్దలు వ్యవహారంలోకి దిగారు.     "మీకు ఒక్కతే పిల్లకదా! అల్లుడిని ఇల్లరికం పెట్టుకోవాలన్న ఉద్దేశ్యం ఉంటే ఆ సంగతి ముందే స్పష్టంగా చెప్పివేయండి!" సూటిగానే అడిగింది కోమలమ్మ.     "అబ్బే! అదేంలేదు." జగన్నాధరావు నవ్వాడు.  "పిల్లే అత్తవారింటికి వస్తుంది. ఇక్కడ ఉంచుకొనే ఉద్దేశ్యం లేదు."     "పిల్లను విడిచిపెట్టి మీ రుండగలరా?"     "ఉండాలి ఆడపిల్లను కన్నవాళ్ళకు ఆ బాధ తప్పుతుందా?"     "ఆ మాటమీదే ఖచ్చితంగా ఉండాలి. ఆ తరువాత పిల్లను విడిచి ఉండలేమని, కూతురూ అల్లుడూ మా దగ్గరే వుండాలంటే కుదరదు. నాకో నలుగురు కొడుకులు వుంటే ఒకణ్ణి ఇల్లరికం ఇచ్చేద్దును! నా కున్నది ఒక్కడు!"       "ఆ సంగతి మాకు తెలుసు. వున్న ఒక్కణ్ణీ ఇల్లరికం ఇచ్చేస్తారని మాకు ఆశేమీ లేదు. ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళి వస్తూంటేనే ఆప్యాయతా, అనురాగం. మాకు అంతగా పిల్లను చూడాలనిపిస్తే మీ ఇంటికే వచ్చి చూసి నాలుగు రోజులుండి వస్తాంగాని!"         కోమలమ్మకు పెద్ద సందేహం పుట్టుకొచ్చింది. పిల్లకు పెళ్ళిచేసి పంపేసి ఎవణ్ణో దత్తుచేసుకొని ఆస్తి వాడిపాలు చేయరుకదాని. ఈ సందేహం తీర్చుకోడానికి వుపాయమేదీ కనిపించలేదామెకు. "ఇక కట్నం కానుకలు........"       "మా తాహతుకు తగినట్టుగానే వుంటాయవి." జగన్నాదరావు గంభీరంగా అన్నాడు. "అడిగారు కాబట్టి చెబుతుననాను. రాజేంద్రనగర్ లో వున్న మేడ, షాద్ నగర్ సమీపంలో త్రివేణీ ద్రాక్షతోట, త్రివేణీ టెక్స్ టైల్ మిల్, ఫియట్ కారు, ఇప్పటికి రజని పేరుమీదున్న ఆస్థి, పెళ్లయ్యాక కూడా ఇవి ఆమెకే వుంటాయి. పోతే అల్లుడికొక కారు, చదవాలనుకుంటే ఫారిన్ చదువుకయ్యే ఖర్చు, లక్ష రూపాయల కట్నం వగైరా. మా తదనంతరం ఈ ఆస్తి రజనికే చెందుతుంది కదా?"     "ఆఁ ఆఁ, అది నిజమే ననుకోండి. మీ ఆస్తి మీ పిల్లకు కాక ఇంకెవరికి చెందుతుంది?" కోమలమ్మ వుప్పొంగిపోతూ అంది.        ముఖంలో మనసును చదివేయగల నేర్పరి జగన్నాధరావు. కోమలమ్మ అంతర్యమేమిటో గ్రహించిన అతడు గుంభనంగా నవ్వుకున్నాడు. పిల్లను అత్తవారింటికి పంపేవుద్దేశ్యం ఆయనకు అసలులేదు. ఈ సంగతి ఇప్పుడే బయట పడితే ఈ సంబంధం కుదరదు. మనోహర్ ను చూశాక, అతడి అందచందాలు చూశాక ఇతడిని ఎంతమాత్రం జారిపోనివ్వకూడ దనుకున్నాడు. పిల్ల, పిల్లవాడు ఒకటయ్యాక పిల్లను విడిచి అతడెక్కడికి వెడతాడు? అప్పుడీ గుంటనక్క ఏ గోతిలో వెళ్ళి దిగుతుందో?                            *    *    *
24,735
     "ఊహూ! మా ఆవిడ దద్దోజనం, పులిహొరా, చక్రపొంగలి మాత్రమే చేస్తుంది. అవే తెలుసు" చెప్పాడు గరుడాచలం.     "ఛ....ఛ......నువ్వు చూస్తే ఇంత స్మార్ట్ గా వున్నావు . అవేంటి తినడం. నీలాంటి హ్యాండ్ సమ్ పిజ్జాలు, బర్గర్ లు తినాలి" అంది.     ఈలోగా చికెన్ పిజ్జా వచ్చింది.     అది తింటూ ఎక్కడెక్కడో విహరించాడు ఉహల్లో గరుడాచలం.     "గరుడా డియర్. మనం లేచిపోదామా?" చాలా తాపీగా అడిగింది పీలూ.     ఉలిక్కిపడ్డాడు గరుడాచలం.     "అదేంటి డియర్! నువ్వు పొన్నాంబళంలా ఉలిక్కిపడ్డావేంటి?" అడిగింది పీలూ.     " పొన్నాంబళం ఎవరు?" అడిగాడు అర్ధం కాక గరుడాచలం.     "మా ఇంటి వోనర్!"     "అతనేందుకు ఉలిక్కిపడ్డాడు?" మరింత అయోమయంగా అడిగాడు గరుడాచలం.     "అతడ్ని....ఇలాగే లేచిపోదామా?" అని అడిగినందుకు.     ఈసారి చికెన్ పిజ్జా గొంతుకు అడ్డం పడ్డట్టు అనిపించింది. భయంగా పీలూ వైపు చూసాడు.     తర్వాత శాంతంగా "తప్పు పీలూ.....నువ్విలా ఎవర్నిపడితే వాళ్ళని లేచిపోదామా? అని అడక్కూడదు" అంటూ అనునయించాడు.     "హబ్బ.....నువ్వూ మా ఆయనలాగే మాట్లాడతావు. పోనీలే.....అన్నట్టు నాకు డిస్కోదేక్ కు వెళ్ళే టైమయింది. బై గరుడా!" అంటూ లేచి బయటకు నడిచింది.     గరుడాచలం తనూ లేచాడు తప్పదన్నట్లు!" అతనికి ఇంకా కాసేపు పీలూతో కలిసి కూర్చోవాలని వుంది. కానీ కూర్చుంటే ఏదో ఒకటి అర్ధర్ చేస్తూనే వుంటుంది పీలూ, డబ్బులు వేస్ట్ అనుకున్నాడు.     "మేడమ్ బిల్లు.....వెయిటర్ వచ్చి బిల్లు టేబుల్ మీద పెట్టి వినయంగా అన్నాడు.     "గరుడా....బిల్లట, కట్టేసిరా......నేను ఈలోగా బయట కలకత్తా పాన్ తీసుకుంటాను" అంది.     "ఛ.....అడ రౌడిలా పానేమిటి?" అందామనుకున్నాడు. కానీ పీలూకి కోపం వస్తుందేమోనని ఊరుకున్నాడు.     బిల్లు డెబ్బయి అయింది. రెండు పిజ్జాలకు. ఒక కేక్ కు అంతయ్యేసరికి గుండెలు బాదుకుని జేబులోని ఏడు పది రూపాయల కాగితాలు తీసిచ్చి ఏడుపు మొహంతో బయటకు వచ్చాడు.     టిప్పు ఇవ్వకుండా సరిగ్గా బిల్లు అమౌంట్ ఇచ్చిన గరుడాచలం వైపు కంట్రీ బ్రూట్ లా ఉన్నాడే అన్న ఫీలింగ్ వచ్చేలా లుక్కేసి వెళ్లిపోయాడు వెయిటర్.     గరుడాచలం బయటకు వచ్చేసరికి పాన్ నములుతూ స్కూటర్ బయటకు తీస్తోంది పీలూ.     "గరుడా! ఆ పాన్ షాప్ లో డబ్బులిచ్చేసి వెళ్ళు. రేపు ఇక్కడే ఇదే సమయానికి కలుద్దాం" అంది గరుడాచలం బుగ్గమీద చితికేస్తూ.      ఆ మాత్రానికే తెగ ఇదయి మెలికలు తిరిగిపోయాడు గరుడాచలం.     డిస్కోతెక్ అంటే ఏంటని అడగాలని నోటిదాకా వచ్చినా అడగలేకపోయాడు గరుడాచలం.                                                             * * *     "గురూ! ఇందాక నాకో వెరైటీ ఆలోచన వచ్చిందని చెప్పాను గుర్తుందా?" అడిగాడు సత్తిపండు శ్రీచంద్రను.     "గుర్తుంది గానీ అదేంటో చెప్పి చావు" అన్నాడు విసుగ్గా.     "మరేం లేదు గురూ! నువ్వు కాసేపు గుడ్డివాడి పాత్ర వేసావనుకో....."     "వేస్తె...." అనుమానంగా అడిగాడు శ్రీచంద్ర.     "నీ పక్కన నిలబడి లేదా నిన్ను నడిపిస్తూ" నడిపించు నా నావ" అని పడుతూ వెళ్తాను. గుడ్డోడంటే సింపతి ఎక్కువ వుంటుంది. కాబట్టి డబ్బులు బాగా పడతాయి. నేను నీ చొక్కా విప్పి అడుగుతాను. ఆ తర్వాత మరో సెంటర్ కు వెళ్లి నిన్ను కూచోబెట్టి బాబూ మా గురువు పుట్టుగుడ్డోడు అయ్యా! ఓ వన్ రూపి దానం చేయండయ్యా అని అడగుతా. నో శ్రమ. నో రిస్క్. ఓన్లీ ప్రాఫిట్. ఎలాగుంది గురూ" అడిగాడు.     శ్రీచంద్ర సత్తిపండును తిట్టే ఓపిక లేక కళ్ళు మూసుకున్నాడు. అయినా సత్తిపండు చెప్పిన దృశ్యాలే కళ్ళ ముందు విజువలైజ్ అయి కనబడుతున్నాయతనికి.                                                                           * * *     శ్రీచంద్ర గుడ్డివాడికి మల్లే తడబడుతూ నడుస్తున్నాడు.     సత్తిపండు శ్రీచంద్ర చేయి పట్టుకుని 'నడిపించు నా నావ' అంటూ పాడుతూ టాంక్ బండ్ నుంచి వచ్చిపోయే వాళ్లని ముష్టి అడుగుతున్నాడు.     "చూడ్రా! పాపం గుడ్డి ముష్టివాడికి సాయంగా మరో పొట్టి లాగు ముష్టివాడు" అంటూ జనం పావలా, అర్ధ దానం చేస్తున్నారు.     కాసేపయ్యాక టాంక్ బండ్ కు ఓ మూల శ్రీచంద్రని కుచోబెట్టాడు. శ్రీచంద్ర మొహానికి కాసింత ఆయిల్ పూసాడు.     "బాబూ....పుట్టు గుడ్డోడు. ఈడ్ని నేనే పోషించాలయ్యా. ఒక్క పైవ్ రుపిస్ వుంటే దానం చేయండి. అమెరికాలో కంటాపరేషన్ చేయిస్తాను బాబూ" అంటూ సౌండ్ పెంచి అరుస్తున్నాడు.     అదంతా వింటున్న అక్కడున్న ఒకతను "ఏం బాబూ! కంటాఫరేషన్ అమెరికాలో చేయించాలా? ఇక్కడ చేయించకూడదా?" అన్నాడు వెక్కిరింతగా.     "ఇక్కడ సేయిత్తే గ్లామరెటుంటదయ్యా! అమెరికాలో అయితే కాస్త రిచ్ గా వుంటాది" అన్నాడు వళ్లు మండుతున్న సత్తిపండు.     "ఏడవలేకపోయావు!" అంటూ వెళ్లిపోయాడు అతను.     "డబ్బులు వెయ్యాలేదు గానీ డౌట్స్ క్లియర్ చేసుకుంటారు ఎదవనాయాళ్ళు" అనుకున్నాడు సత్తిపండు.     శ్రీచంద్ర ముందు తన చొక్కాను పరిచాడు. వచ్చిపోయేవాళ్ళు చిల్లర వేస్తున్నారు.     సమీర అటే వెళ్తూ వీళ్ళని చూసి ఆగింది. సీన్ అర్ధమయి "ఒరే పోట్టిలాగు! పాపం మీ గురువుకు కళ్ళు పోయాయా? అయితే మీ గురువుకన్నా నువ్వే బెటర్. పోట్టిలాగు నైనా పొడవుబుద్ది వుంది" అంది.     శ్రీచంద్ర సమీర గొంతువిని కోపంగా కళ్ళు తెరిచాడు.                                                                    * * *     "అదేంటి గురూ! అలా సీరియస్ గా చూస్తున్నావు?" అడిగాడు సత్తిపండు ఏదో డేంజర్ సిగ్నల్ అందడంతో.     చుట్టూ చూసాడు సమీర లేదు. తను గుడ్డి, ముష్టి గెటప్ లో లేడు. ఇదంతా తన వుహ అన్నమాట. హమ్మయ్య.     సత్తిపండు మాటలు విని తను అలా ఉహించేసుకునే సరికి భరించలేకపోయాడు.     "సత్తిపండు .....ఇలా రారా" శాంతంగా పిలిచాడు శ్రీచంద్ర.     "ఎందుకు గురూ!" భయంగా అడిగాడు శ్రీచంద్ర రియాక్షన్ గమనిస్తూ.     "ఒసారిలా రారా నా చిట్టికన్నా" అన్నాడు.
24,736
    కారు  వేగంగా దూసుకుపోతూనే వుంది.     డ్రయివ్ చేస్తున్న హాస్పిటల్  సూపరింటెండెంట్ ఆలోచనలు అంతకన్నా వేగంగా పరుగులు దిస్తున్నాయి.     లెక్చరర్ నీలిమా మనిషికాదు అన్న విషయం  బహుశా ఎవరికీ తెలిసి వుండదు. కళ్ళారా చూశాడు కాబట్టి తనకు  అనుమానం కలిగింది. మనిషి రూపంలో వున్న దెయ్యం నలుగురి మధ్యనా  తిరుగుతుంటే ముందు ముందు ఏ మ్రామాదాలు జరుగుతాయో వూహించడం కష్టం. నీలిమా నిజ రూపం ఎలాంటిదో తెలియక  తాము ఒక మనిషిలా భావించి ట్రీట్ మెంట్ యిస్తున్నామే తప్పు, అందువల్ల  ప్రయోజనం  లేదని ఇప్పుడు  తెలుస్తోంది.     అందుకే తనకు తెలిసిన నత్యన్నీ  నలుగురికి చెప్పాలని బయలు దేరాడాయన.     దూరంగా ట్రాఫిక్ సిగ్నల్ పడడంతో కారు వేగాన్ని తగ్గించాడు.     ముందున్న వెహికల్స్  ఆగిపోవడంతో బ్రేకు వేశడతను.     కానీ....ఆ కారాగలేదు నరికదా  ముందుకు వెళుతూనే  వున్నది. బంగారుగా బ్రేకులు నొక్కి చూశాడతను.     ఉహు....అదే  వేగంతో కారు వేశుతూనే వున్నది.     అసలు విషయం  అతనికప్పుడు బోధపడింది.     బ్రేక్స్  ఫెయిల్!     కొన్ని నిమిషాలక్రితం బ్రేక్ వేసినప్పుడు కూడా  నిక్షేపంగా వున్నాయి. ఇంతలోనే ఎలా పెయిలయ్యాయి.     అయోమయం, ఖంగారులకు తోడు భయం ఒక్కసారిగా అతన్ని నిలువెల్లా  ఆవరించాయి.     కొన్ని అడుగుల దూరం మాత్రమే  వుంది  ముందున్న  టాక్సికి, తన కారుకు మధ్యనున్న ఖాళి....సమయంలో  బ్రేక్స్  పడకపోవడమంటూ జరిగితే ఏమవుతుందో అర్ధం కావడంతో అతని శరీరం చేమట్లతో తడిసిపోతోంది.     అప్పడే  యధాలాపంగా అతని దృష్టిపదంలో పడింది రాబందు.     ఒక బిల్డింగ్  ప్తె అంతస్దు ప్తె నుంచి కొరకొరా....తనవ్తెపే  చూస్తున్న ఆ రాబందుని గమనించగానే బ్రేక్స్ ఎందుకు పెయిలయివుంటాయో తెలిసి వచ్చింది.     ఎస్...నీలిమా దెయ్యం  పనే ఇది!     ఆమె నిజరూపాన్ని  గురించి తెలిసిన తన నోరు నోక్కేయడానికి చేసిన ప్రయత్నం  ఇది.     అతనలా అనుకుంటుండగానే అతని కారు వెళ్ళి ముందున్న   తాక్సిని గుద్దుకుంది. ఆ అదటుకు ఖంగారుగా బ్రేక్  వేశాడు ముందున్న టాక్సివాలా.     ముందుకు వెళ్ళే మార్గం లేకపోవడంతో ఆ స్పీడ్ కు ముందున్న రెండు చక్రాలు  ప్రక్కకు తిరిగి, ఆ దిశగా ట్రాఫిక్ కానీస్టేబుల్  నిలుచున్నా ట్రాఫిక్ ఐలాండ్ వ్తెపు దూసుకుపోయింది సూపరింటెండెంట్ కారు.     ప్రాణాలమీద భయంతో కారు తలుపులు  తెరుచుకుని  బయటకు దూకేద్దామని అతను చేసే ప్రయత్నాలేమీ ఫలించలేదు.     ఎవరో తాళాలు వేసి  బంధింఛినట్టు  కారు తలుపులు బిగుసుకుపోయివున్నాయి.     అది కూడా నీలిమ దయ్యం  పనే అని భావించాడతను.     భూతంలా దూసుకొస్తున్న ఆ కారుని గమనించి పిచ్చిగా  అరుస్తూ దూరంగా ఎగిరిదూకి ప్రాణాలను రక్షించుకున్నాడు ఆ ట్రాఫిక్  కానీ స్టేబుల్.     అప్పడే ఎదురుగా  వచ్చే ట్రాఫిక్  రిలీజ్  కావడంతో గట్టుతెగిన ప్రవాహంలా ఒక్క సారిగా అటువ్తెపు వాహనాలు ముందుకు  కదిలాయి.     సూపరింటెండెంట్ డాక్టర్ కారు సూటిగాపోయి ఆ ట్రాఫిక్ లోకి జొరబడింది.     తోడేళ్ళ మధ్య జొరబడ్డ సింహంలా దూసుకుపోయిన ఆ కారు వెళ్ళడం వెళ్ళడం ఒక హేవిలోడ్ లారి మధ్యకు వెళ్ళి డికొంది.     అంతటిలో దాని ఇంజన్  పని అయిపోయింది కాబోలు గాలి తీసిన బెలూన్ లా  తుఫ్....తుఫ్  మనే చిన్న  శబ్దాలు చేస్తూ తుక్కుతుక్క్తే ఆగిపోయింది.     అప్పటికే ఎక్కడ ట్రాఫిక్  అక్కడ స్తంభించిపోయింది.     స్పృహ తప్పి రక్తపుముద్దలా పడివున్న ఆ డాక్టర్ ను అతికష్టం మీద బయటకుతిసి, ఇంకా అతనిలో ప్రాణాలు వున్నాయని గ్రహించి హాస్పిటల్ కు  తరలించారు.
24,737
    ఒక సాయంత్రం రాధ పసిగట్టింది, తన వెనుక ఎవరో వస్తున్నారని. ఆ అమ్మాయి తల తిప్పకుండానే, కళ్ళు కదల్చకుండానే ఇలాంటి విషయాలు పసిగట్టేయగలదు.     రాధ సన్నగా వణికింది.     ఇలాంటివి కొత్త, అసలు తనను కూడా 'అనుసరిస్తారని' ఆ అమ్మాయి కలలో కూడా ఎప్పుడూ అనుకోలేదు. ప్రొద్దున్నే అయిదింటికి స్నానం చేసి, తులసి చెట్టు ముందు దీపం వెలిగించి, చదువుకు కూర్చోవటంతో ఆమె దినచర్య ప్రారంభమవుతుంది. ప్రతీ శుక్రవారమూ కాళ్ళకి పసుపు రాసుకోవటం, ఏ చిన్న తప్పు జరిగినా లెంపలు వేసుకుని, కృష్ణ కృష్ణా' అనుకోవటం ఆమె అలవాటు.     అటువంటి రాధమ్మ వెనుక ఎంత అల్లరిపిల్లాడైనా యెలా పడతాడు ? పడగలడు ??     కానీ పడ్డాడు. ఆ విషయం తెలుస్తూనే వుంది.     రాధకి ఏడుపొచ్చింది. ఆ అమ్మాయికి ఈ అనుభవం భయంగా వుంది. 'కృష్ణ కృష్ణా ! ఈ రోజు నా అలంకరణలో ఏదో లోపం వున్నట్టుంది. అందుకే ఎవరో కుర్రవాడు ఇలా చేస్తున్నాడు. నన్ను మన్నించు తండ్రీ!' అనుకుంది.     అంతలో ఎదురుగా తన స్నేహితురాలు రావటం కనిపించి ప్రాణం వచ్చింది. 'ఒసేయ్' అనబోయి, అంతలో ఎవరైనా వింటారని, గబగబా అటువైపు నడిచింది. అంతలోనే అనుకోని సంఘటన ఒకటి జరిగింది.     వెనుక వస్తూన్న కుర్రవాడు వేగంగా ముందుకొచ్చి ఆమె భుజాలు పట్టుకుని వెనక్కి తిప్పి, ఆమె కెవ్వున అరిచే లోపులో బుగ్గమీద గట్టిగా ముద్దెట్టుకుని, మిగతా జనం అలర్ట్ అయ్యేలోపులో అక్కణ్నుంచి మాయమైపోయాడు.     రాధకి, భూమి గిరగిరా తిరుగుతున్నట్టు అనిపించింది. వళ్ళంతా చెమట పట్టేసింది. ఆమె స్పృహతప్పి పడిపోయేదే - కానీ అదృష్టవశాత్తు ఎదురుగా వస్తున్న స్నేహితురాలు పలకరించింది.     "ఇక్కడ ఎక్కువసేపు ఇలా నిలబడితే జనం గుంపులుగా పోగయి మననే వింతమృగాల్ని చూసినట్టు చూస్తారు. తొందరగా వెళ్ళిపోదాం, నడు" అని కంగారుపెట్టింది.     అదృష్టవశాత్తు ఎక్కువమంది జనం పోగవలేదు. ఉన్న కొద్దిమందీ-'కలియుగ మహిమ' అనుకుంటూ ఎవరి దారిన వాళ్ళు సాగిపోయారు. రాధకి సానుభూతి చూపిద్దామనుకున్న వాళ్ళు మాత్రం, ఆ అవకాశం పోయినందుకు బాధపడ్డారు.     భూమి రెండుగా చీలిపోతే బావుణ్ణు అనిపించింది రాధకి. రోడ్డు మీది అందరూ తననే చూసి నవ్వుతున్నారన్న భావం ఆమెని కుంచింప చేస్తూంది. పక్కనే గానీ స్నేహితురాలు లేకపోతే ఏమయ్యేదో పరమాత్మ కెరుక.     "వాడి పని పడదాం లేవే" అందా స్నేహితురాలు కసిగా పళ్ళు కొరుకుతూ.     అంత బాధలోనూ రాధ ఆశ్చర్యంగా తలెత్తి, "వాడు నీకు తెలుసా ?" అని అడిగింది.     "ఎందుకు తెలీదు. మా అన్న స్నేహితుడే. ఆ దౌర్భాగ్యుడి పేరు మురళి" అంది.                        *    *    *     గాళ్స్ వెయిటింగ్ రూమ్ చాలా సందడిగా ఉందా రోజు.     గది మధ్యలో రాధ దిగాలుపడి కూర్చుని ఉంది.     "ఎంత ధైర్యం ! నేనయితే వాడి మొఖం చట్నీ చేసేదానిని..." అంది శ్యామల కోపంగా.     "నేనయితే గట్టిగా కేకవేసి ఆ రోడ్డుమీదే చావగొట్టేదానిని" అంది రాజేశ్వరి.     "నేనయితే సరాసరి పోలీస్ స్టేషన్ కెళ్ళి కాంప్లెయింట్ ఇచ్చే దానిని__"     "అయినా వాడలా పైట పట్టుకుని లాగుతూ ముద్దు పెట్టుకుంటూంటే నువ్వెలా ఊరుకున్నావే ? నిజంగా నువ్వు రాధవూ, వాడు కృష్ణుడూ అనుకున్నావా ఏమిటి?" అడిగింది సీత.     రాధ ధీనంగా తలెత్తి చూసింది.     "నేనేం చేయను ! కాళ్లూ చేతులూ ఆడలేదు నాకప్పుడు.     "హరికథలు చెప్పకు. అంత పిరికిదానివి కాలేజీలో ఎందుకు చేరావ్ ? గీతాశ్రమంలో చేరాల్సింది -"     రాధ మాట్లాడలేదు.     "ఇదిగో రాధా ! ఇవాళ నిన్ను ఇంత గొడవ చేసినా కూడా వాడిని వదిలేస్తే రేపు మమ్మల్ని కూడా ఇలాగే ఆటలు పట్టిస్తాడు ! ఏమయినా సరే మనందరం వెళ్ళి ప్రిన్సిపాల్ కి రిపోర్టిద్దాం !" అంది శ్యామల మళ్ళీ.     "అమ్మో ! ప్రిన్సిపాల్ కి రిపోర్టే -" భయంగా అంది రాధ.     "ఏం ? ఎందుకు భయం ? ప్రిన్సిపాలేం మింగేస్తాడా ?"     "అది కాదే ? వాడా కోపం పెట్టుకుని మళ్ళీ అల్లరి పెడితే..."     "అప్పటి సంగతేమోగానీ - రిపోర్టివ్వకపోతే మాత్రం రోజూ నిన్నిలాగే అల్లరి పెడతాడు. ఆఫ్ కోర్స్ - నీకిష్టమయితే మేమేమీ చెయ్యలేం అనుకో."     "అంత మాటనకే ఏడుపొస్తుంది" అంది రాధ బిక్కమొహం పెట్టి.     "అలా అయితే మరి ఇంకో పని చేస్తావా ?" 
24,738
    ఒకరిమీద నుంచి ఒకరు కళ్ళు దించకుండా ఒకరికొకరు అభిముఖంగా నడుస్తున్నారు. ఆమె వాడిచూపుల్లో కొంటెతనం కాదుగాని, కవ్వించే ఏదో గుణం. ఇంక ప్రక్కలకు తప్పుకోవల్సిన సమయం వచ్చింది. ఆ శరపరంపరలకు తప్పుకోలేక క్రిందకు కళ్ళను వాల్చింది ముందు తనే.     "అబ్బ! ఏమి సుందర తరళ నయనాలు!"అని ఆశ్చర్యపోయాడు చక్రపాణి.     ఒకనాడు స్నేహితులిద్దరూ కలిసి పెద్ద ఉపాయం పన్నారు. దాని ప్రకారం చక్రపాణి బజార్లో ఒక సంపెంగ, ఒక గులాబీ కొని దారిలో కాశాడు. ఆమె వచ్చే సమయం అయేసరికి గుండె గబగబ కొట్టుకోవటం ప్రారంభించింది. భయంతో, లజ్జతో ముఖమంతా ఎర్రబడసాగింది. తను పలకరించాలా ఆమెను? అమ్మో, ఆమె రాకపోతే బాగుండుననుకున్నాడు.     చివరికా దుర్ఘడియ దాపురించింది. ఆకుపచ్చ చీరె కట్టుకుని వయ్యారంగా, సుతారంగా, అద్భుతంగా హంసనడకతో రానేవచ్చింది మాలతి.     "మాలతీ! ఇదిగో"     "నీకు గులాబీ ఇష్టమా? సంపెంగ ఇష్టమా?"     "............."     "చెప్పవ్ గదూ, గులాబీయే కాబోలు."     "నాకుమట్టుకు సంపెంగ ఇష్టం."     అతని గొంతు బిగుసుకుపోతోంది. యావచ్ఛక్తి ఉపయోగించినా నోట్లోంచి మాట బయటకు రావడంలేదు. కాళ్ళు కదలడం లేదు భూమ్మీద నుంచి. అతని ప్రక్కనుంచీ అతని వదనమండలంలోకి చూసుకుంటూ, అందంగా నవ్వుతూ వెళ్ళిపోయింది.     "మాలతీ...! మా ..." అతని ఊహలు బ్రద్దలయిపోయాయి. కన్నీరు ఇంకిపోయినాక మరో ... మరో ప్రయత్నం.        అప్పటికి పరీక్షలు సమీపించాయి. చదువుకు సున్నా చుడుతున్నాడు. మనిషి కొంచెం చిక్కి నల్లబడ్డాడు. కాలేజీ చివరిరోజులు. రోజూ ఏదో ఒక క్లాసువాళ్ళవి టీపార్టీలు, మీటింగులు జరుగుతున్నాయి. ఒక సాయంత్రం కాలేజీ సోషల్ గేదరింగ్ జరిగింది. ధైర్యం చేసి బస్సులో ఆమె వెంటపడ్డాడు. దిగంగానే తనూ దిగాడు. వెనువెంటనే అనుసరించి నడవసాగాడు. దూరంగా ఆమె ఇంటికి అడ్డదారి అది. రోడ్డుకు ఇరుప్రక్కలా పాకలు, సందడి చేస్తున్న మనుషులు. ఉండి ఉండి మెడత్రిప్పి వెనక్కి చూస్తూ వేగం తగ్గించి నడుస్తోంది మాలతి. అతనికి గర్వంగా ఉంది. తాను ఒక అందమైన పిల్లను వెంటాడుతున్నాడు. మధురానుభూతితో నేను పులకరించింది.     కాని ఇది ఇలా ఎంతసేపు? మబ్బులైతే గాఢంగానే పట్టాయి. కాని వర్షం పడదేం?     పైగా నిమిషాలు గడిచినకొద్దీ ఆమె ఇల్లు సమీపిస్తోంది. సహనం అంతరించి, ఉత్సాహం చచ్చిపోతోంది. అతని నాలుకకు పలుకు, గుండెకు దిటవు లేకుండా సర్వాంతర్యామి ఆజ్ఞాపించాడు.     ఒకవేళ ఆ సమయంలో ఈ యువకుడు ఏదో చెప్పదల్చుకుని నా వెంటపడ్డాడు. చెప్పనియ్యి, త్వరగా తెమల్చడేం? అని మాలతి అనుకునివున్నా అందులో వింత ఏమీ లేదు. అనుకున్నదనే నా ఉద్దేశం.     చివరకు ఆమె ఇల్లు ఉన్నసందు వచ్చింది. మలుపు తిరిగితే చేసిన ప్రయత్నమంతా వృధా. కాని సుకుమారుడైన ఈ కుర్రవాడు నోరు మెదపకుండా, చొరవ చేయకుండా వూరుకుంటాడేం?     మాలతికి భయం వేసింది, బాధా కలిగింది. హఠాత్తుగా ఆమెకో విచిత్రమైన ఆలోచన, తెగింపు అలముకున్నాయి. చప్పున ఆగి, అతని ముఖంకేసి ప్రశ్నార్థకంగా చూస్తూ "ఏమిటో చెప్పండి బాబూ! చంపక" అంది.     ఇలాంటి అదృష్టం ప్రపంచంలో ఏ యువకుడికి పడుతుంది గనుక? కాని అక్కడ వున్నది చక్రపాణి అనే ఒక అవకతవక కుర్రవాడు అయివుండె.     "ఏం చెప్పను?" అన్నాడు.     "చెప్పేందుకేమీ లేదా?"     చక్రపాణి తల అడ్డంగా ఈపాడు.     "మరి నన్ను ఎందుకింతదూరం వెంటాడారు?" అని ప్రశ్నించింది మాలతి.     దానికి మాటల్లో రెండు నిముషాలపాటు చక్రపాణి వాగినదాని తాత్పర్యం చూసుకుంటే "అబ్బే! నిన్ను వెంటాడానా ఏమిటి? నా పనిమీద నేను వెడుతుంటేనూ?" అని వుంది.     మాలతి గాయపడిన హృదయంతో "అయితే చెప్పేందుకేంలేదూ?" అంది తీక్షణంగా. అలా అని అక్కడ ఇహ ఒక్కక్షణంకూడా ఆగకుండా వెళ్ళిపోయింది.     చక్రపాణి స్థబ్ధుడై నిలబడిపోయాడు. "కాదు మాలతీ! నీతో చెప్పాల్సింది ఎంతోవుంది, ఇంకో ఛాన్సు ఇవ్వవూ?" అని బలహీనంగా అనుకున్నాడు.     మలినవదనంతో గదికి వచ్చిన చక్రపాణిని చూసి రాజారావు వులిక్కిపడ్డాడు. తరిచి తరిచి అడిగి సంగతి తెలుసుకున్నాడు. ముందు స్నేహితుణ్ణి తిట్టాడు. తరువాత తనని తిట్టుకున్నాడు. తల బాదుకున్నాడు."ఇహపో వాజమ్మా! జీవితమంతా చీకటి ఛాయలు పులుముకో" అంటూ అరిచాడు.                                         * * *     వేసవి ఎండల్లో చక్రపాణి కన్నీరు ఇంకిపోయాయి. కాని వాటి తాలూకు చారలుమాత్రం హృదయక్షేత్రం మీదనుంచి చెరిగిపోలేదు.     మిత్రులిద్దరూ రోజూ కలుసుకునేవాళ్ళు. చక్రపాణి బలహీనుడు. అనేక పన్లు చేయాలని అతని మనసు ఉవ్విళ్ళూరుతూ ఉండేది. కాని ఎప్పుడూ అనుకోవటంతోనే సరిబుచ్చుతూ వుండేవాడు. రాజారావుకు జీవితాన్ని తొలుచుకుంటూ పోదామనీ, ఏదో తెలియనివి సాధిద్దామనీ ఎప్పుడూ లేదు.     అసలు శెలవులకు విజయవాడలో వుండాల్సిన పని రాజారావుకు లేదు. ఊరు పాతికమైళ్ళదూరంలోనే  వుంది. ఇక్కడ వుంటే మిత్రులతో కాలక్షేపం బాగుంటుంది. పైగా ఇంటికిపోతే చికాకులు హెచ్చు. తల్లి నిస్సహాయురాలు. అన్నలిద్దరికీ పెళ్ళిళ్ళయినాయి. వాళ్ళ స్వభావాన్ని నిర్వచించేందుకు భాషతో సాముచేయాల్సి వుంటుంది. వాళ్ళు అవసరం వస్తే ఆపేక్ష పొర్లినట్లు మాట్లాడతారు లేకపోతే అతని ఉనికిని గురించి కూడా పట్టించుకోరు. ఈ ఊరిలో అతను ఎలా వుంటున్నదీ ఎప్పుడూ ప్రశ్నించరు. కాకపోగా ఆ పల్లెటూళ్ళో వుండి ఇప్పుడతను చేసే పనేంలేదు తోటలో కూర్చొని పుస్తకాలు చదవడం తప్ప, ఇంటికి వచ్చిన చుట్టాలతో అనుభవాల్లో పొర్లటం తప్ప.     చుట్టాలు...! వీళ్ళ రాకపోకలకు అంతులేదు. కుటుంబవ్యాప్తి చాలా ఎక్కువదేమో. వరుస అయినవాళ్ళు చాలామంది అన్నలు వంటింట్లో చేరి వాళ్ళతో పరాచకాలాడుతూ వుండేవాళ్ళు. తనకూ పరాచకాలాడటం, కవ్విస్తూ మాట్లాడటం చేతకాకపోలేదు. కాని ఒకళ్ళంటే ఒకళ్ళకి అనుమానాలు, అసూయలు, నిందలు. ఈ వాతావరణం అతనికి అసహ్యం.
24,739
    "ఓ ప్రాకృతిక  సత్యమా...     ఓ జీవ పరిణామ పర్యవరణమా...     ఓ మానవ నిర్మిత కణసముదాయమా.... నీకు మా జోహార్లు!     మాకు జన్మ నిచ్చినందుకు ధన్యవాదాలు!     అమ్మలేని మాకు, నాన్న తెలియని మాకు     అమ్మనూ, నాన్ననూ చేకూర్చిన మీకు ప్రణామాలు!     వాళ్ళతోపాటు నిరంతరం,     మానవజీవినే కాక ప్రతి ప్రాణినీ,     ప్రతి దృశ్యాన్నీ, అదృశ్య విశ్వాన్నీ     ప్రేమించే గుణం సదా ఉంచమనీ,     ధరణీ జన్ములమయి మేము ప్రేమరహితులమై     దరిద్రులుగా మారకుండా ఉంచమని ప్రార్థన..!"     -ఏక కంఠంతో చిన్నారులందరూ స్పష్టమైన తెలుగు ఉచ్చారణతో ప్రార్థన ముగించి, వంగి నమస్కరించి వరుసగా రూమ్స్ లోకి సాగిపోయారు.     గేటు తెరవబడింది. అందరూ లోపలికి నడుస్తున్నారు. దూరంగా ఎంతో ఎత్తున ఉన్న వేదికపై తమ స్నేహితులు- ఆకాశం నుండి అలవోకగా దిగిన రాజహంసల్లాగా, గాలికి కాలాన్ని జయించిన విజేతల్లా ఉన్నారు.     అడుగులో అడుగుగా వాళ్ళవైపు నడుస్తున్నారు.     అన్ని జంటలూ లవాయిపోయి, ఆకారాలు మారిపోయి ఉండటాన చూడగానే ఓ  క్షణం తటపటాయించి, ఆ తర్వాత ఆతృతగా దగ్గరికి వచ్చి-     "హాయ్ఁ.... ఈష్, క్రాంత్, ఆనంద్!!" అంటూ రేవంత్,     "స్ఫూర్తీ..., రేవూ..., కామీ..!" అంటూ జ్ఞాపిక-     వడివడిగా చుట్ట చుట్టేసుకున్నారు. అందరి కళ్ళల్లోనూ ఉద్వేగంతో నీళ్లు తిరిగాయి. పిల్లలు దూరంగా నిలబడి వీళ్ళవైపే ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఎంతో పెద్దవాళ్ళయిపోయారనుకున్న తమ తల్లిదండ్రులు ఎల్. కె.జి. పిల్లల్లాగా అలా ఎమోషనల్  అయిపోవడాన్ని చూడడం అదే మొదటిసారి!     "నిజమా...! మీరేనా....మిమ్మల్ని మేము చూడగలుగుతున్నామా?" జ్ఞాపిక గొంతు పెగల్చుకుంది.     "అవును జ్ఞాపీ...మేమే! మిమ్మల్ని చూడాలనిపించి వచ్చేశాం!" రేవతి ఇంచుమించుగా ఆనందంతో ఏడ్చేస్తూ అంది.     రేవంత్ కు  మాటలు రావడం లేదు. మగవాళ్ళంతా ఒకరి చేతులు ఒకరు బిగించి పట్టుకున్నారు.     "హలోవ్ఁ.... మేము కూడా ఉన్నాం ఇక్కడ!" అంటూ పిల్లలందరూ కోరస్ గా అరవడంతో అందరూ వెనక్కి తిరిగారు.     "వీళ్ళూ..." ఆగిపోయాడు రేవంత్.     "మా పిల్లలు రేవంత్! మేమే కన్నాం! కదూ ఆనంద్...?!" రేవతి కళ్ళు తుడిచేసుకుని నవ్వుతూ చెప్పి, ఎవిడెన్స్ కోసం ఆనంద్ వైపు చూసింది. ఆనంద్ నిలువుగా తలూపాడు... ఖచ్చితంగా మేమే నన్నట్లు!     ఎవరి పిల్లలు ఎవరో పరిచయం చేసుకున్నారు.     "అమ్మెలా ఉంది?" రేవంత్.     "బావుంది..! ఈష్.     "డాడీ...?" జ్ఞాపిక.     "బావున్నారు...!" అమ్మాయిల సమాధానం.     "చాలా తరచుగా కలుస్తుంటాం! వాళ్ళు బావుండాలానే మీ అభీష్టం వాళ్ళకు తెలుసు!" క్రాంత్.     రేవంత్, జ్ఞాపిక కళ్ళల్లో వెన్నెల లాంటి ఆనందం ప్రభవించింది.     "పదండి లోపలికి!" రేవంత్ అందర్నీ ఆహ్వానిస్తూ ఇంట్లోకి నడిచాడు.     ముందుగా పెద్దవాళ్ళు, వాళ్ళను అనుసరిస్తూ పిల్లలూ లోపలికి వెళ్లారు. పిల్లల్ని చనువు చేసుకున్నారు. అందరూ కలిసి భోజనాలు ఏర్పాటుచేసుకున్నారు.     భోంచేసేటప్పుడు బోసిగా ఉన్న జ్ఞాపిక మెడను చూస్తూ-     "మీరిద్దరూ... పెళ్ళి..." అంటూ ఆగిపోయింది రేవతి.     "ఉహూఁ..." జ్ఞాపిక అడ్డంగా తలూపింది.     "మరి- పిల్లలు ప్రార్థనలో మిమ్మల్ని అమ్మానాన్నలుగా సంబోధించారుగా?!" స్ఫూర్తి అడిగింది.     "మీరు పెళ్ళి చేసుకుని, వైవాహిక జీవితం గడిపి తల్లిదండ్రుయ్యారు. మాకా కష్టాలు లేకుండా ఇంత మందికి అమ్మానాన్నలమయ్యాం!" అన్నాడు రేవంత్.     ఆ మాటలు అంటున్నప్పుడు ముఖంలోకి పాకిన ఏదో మాటలకందని భావం వింత వెలుగును తెచ్చింది.     "అదేంట్రా....మరి, మీ ప్రేమ?" ఈష్.     "ఏం....ప్రేమించుకుంటే పెళ్ళి చేసుకుని, శారీరకంగా ఏకమయి పిల్లల్ని కనితీరాలా? విడివిడిగా ఉండలేం, పెళ్ళి చేసుకోలేం. కనుక కలిసి ఉన్నాం ఒకేచోట, ఒకే ఆశయంతో! ఇంతమంది పిల్లలకు అమ్మానాన్నలం అయ్యాం!" అంది జ్ఞాపిక.     "ఇప్పటికీ విద్యార్థి దశలోని ఆవేశం పోలేదిద్దరికీ!" క్రాంత్ అన్నాడు.     "ఎలా పోతుంది.... మేం ఆ దశలోనే జీవితాలను ఆపేసుకున్నాక?!" రేవంత్ అన్నాడు.     "సంతోషంగా ఉన్నారా?" ఆనంద్ అడిగాడు.     "ఎందుకు లేమూ? మీరెలా  జీవితమూ , పిల్లలూ, వారి భవిష్యత్తూ అని ఆలోచిస్తూ, వారికోసం పాటుపడుతూ ఆనందంగా ఉన్నారో...మేమూ అంతే! ఈ పిల్లల భవిష్యత్తే మా జీవితమూ.... సింపుల్!"రేవంత్ భుజాలెగరేశాడు ఈజీగా.     "శారీరక వాంఛల్లేని సాధువులైపోయారా?' అన్నాడు ఈష్.     "ప్రాణాలు పోయిన స్థితిని శరీరం అనుభవించాక తక్కిన వాంఛలన్నీ అల్పమయిపోయాయి. మేము ఒకరికోసం ఒకరం ప్రాణాలతో ఉండడమే మా లక్ష్యం. ఆ తర్వాతివన్నీ అంత ముఖ్యమైనవిగా అనిపించలేదు...!" రేవంత్ అన్నాడు.     "మరి, మీ ప్రేమ...? దానికర్థం లేదా..? అడిగింది కామిని.     "ఎందుకు లేదు? మా ఇద్దరి మధ్యే  ఉన్నదల్లా వీళ్ళందరి వరకూ వ్యాపించింది" చెప్పింది జ్ఞాపిక.    "థియరీ బావుంది. కానీ...." స్ఫూర్తి.     "ప్రాక్టికల్ గా కూడా బావుంది. ప్రేమ ఇద్దరు వ్యక్తుల మధ్య మాత్రమే ఉన్నంతవరకూ అతి సంకుచితత్వంగా ఉంటుంది. అది విశ్వవ్యాప్తమయినప్పుడు ఎంతమందికైనా పంచి పెట్టగలిగే అక్షయపాత్ర అవుతుంది. ఈ పిల్లలందరూ మా హృదయపు పాత్రల్లో పుట్టిన ప్రేమ చిహ్నాలే! వీళ్ళున్నంత వరకూ.... అంటే- అనాధత్వం ఉన్నంతవరకూ మాలాంటి పెళ్ళికాని, చేసుకోలేని, చేసుకోవాల్సిన అవసరం రాని అమ్మానాన్నల అవసరం ప్రపంచానికి ఉంది. ప్రేమించుకుని పెళ్ళి చేసుకోలేని పరిస్థితులు ఎవరికి కలిగినా- వాళ్ళు అమ్మానాన్నలవడానికి అనాధత్వం ఓ వరం!" ఇద్దరూ ఒకేసారి అన్నారు.     ప్రేమకు వాళ్ళు చెబుతున్న నిర్వచనం ఇంతవరకూ ఎవరూ చెప్పనిది! ఎవరూ ఆచరించనిది...., అసలు ఎవరి ఊహకూ రానిది!!     ఎవరంటారు- ప్రేమకు పెళ్ళి, శారీరకం బంధం గమ్యం అని! ప్రేమకు గమ్యం.... మానసిక పరిపక్వత! ప్రేమంటే కేవలం...     'నన్ను-నీవు...నిన్ను-నేను' అనే భావంలోంచి     'మనం ....అందర్నీ' అనే భావనగా మారడమే!     ప్రేమ ఫలించడం అంటే హృదయంలోంచి దాన్ని విశ్వంలోకి వ్యాపింపజేయడం!     హృదయంలో పుట్టే ఆ రెండక్షరాలు విశ్వవ్యాప్తం చెయ్యగలిగిన  నాడే... అది పరిపూర్ణం! పరిశుద్ధం! పరిపక్వం! పరమాత్మకం! పరమోదకం!     ఓం....     హృదయశ్శాంతిః     మేధఃశ్శాంతిః     దేహార్తి శ్శాంతిః                                                                     (శుభం)   
24,740
    అతను ఆమె నడుం చుట్టూ చెయ్యివేసి, చెవిలో ఏదో చెప్పటంతో ఆమె ముసిముసిగా నవ్వుతోంది వాళ్ళని చూసిన చాయ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి.          ఆమె ఆశ్చర్యానికి కారణం ఆ జంట కోమలా, రాజూ కావడమే!          వాళ్ళు ఎవర్నీ పట్టించుకునే స్థితిలో లేరు. కోమల కడుపు ఎత్తుగా వుంది!          హాలు బయటికి వచ్చాకా అతను మిరపకాయ బజ్జీలు పొట్లం కట్టించాడు. ఈ లోగా కోమల రెండు మూరల మల్లెపూలు కొంది. ఇద్దరూ మళ్ళీ ఆనందం అంతా ఆ రోజే అనుభవించేయాలన్నంత ఆత్రంగా కబుర్లు చెప్పుకుంటూ, ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని గూడురిక్షా ఎక్కారు.          వాళ్ళు ఎక్కిన రిక్షా వెళ్ళిపోయింది. కానీ వాళ్ళ నవ్వులూ, కబుర్లు మాత్రం ఇంకా చాయ చెవుల్లో గుంగురుమంటూనే వున్నాయి.          'డబ్బు లేకుండా కూడా అంత ఆనందంగా వుండగలరా?' చాయకి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. కోమల నవ్వుముఖం, బరువుగా అడుగులు వేస్తూ వుంటే, రాజు అపురూపంగా ఆమెని పొదివి పట్టుకోవడం గుర్తుకొస్తుంటే, తలలో ఎవరో సూదులతో పొడుస్తున్నట్లుగా అనిపించింది. ఆ బాధలో చిరాకులో ఆటో ఎక్కి ఇల్లు ఎలా చేరిందో ఆమెకే తెలీదు. బాత్రూంలో కెళ్ళి షవర్ తిప్పి చన్నీటితో స్నానం చేసింది. చన్నీళ్ళు శరీరాన్ని కోస్తున్నంతగా 'జిల్' మనిపిస్తుంటే ఆమెకి కాస్త బాధ తగ్గింది.          హౌస్ కోట్ వేసుకుని తల తుడుచుకున్నాక తలనొప్పి కొద్దిగా తగ్గినట్లయింది. అయినా ఇంకా తలలో బాధగానే వుంది. వేడి వేడి టీ త్రాగితే బాగుంటుందేమోనని వంటింట్లోకి వెళ్ళింది.          నాయర్ రాత్రి వంటకి కూరగాయలు తరుగుతున్నాడు.          "నాకు కాస్త టీ చేసివ్వు" అధికారంగా చెప్పింది.          నాయర్ తరుగుతున్న కూరల్ని పక్కకిపెట్టి టీ కలపడానికి వెళ్ళాడు.          దోసకాయలూ, చింతకాయలూ పళ్ళెంలో వున్నాయి.          "రాత్రికి వంటేం చేస్తున్నావు?" యధాలాపంగా అడిగింది చాయ.          "దోసకాయ చింతకాయ పచ్చడీ, బంగాళదుంపల కుర్మా సాంబారూ, రసం, టమేటా పెరుగుపచ్చడీ..." అని నాయర్ చెప్పుకుపోతున్నాడు.          ఇంతలో "నాయర్.....అయ్యగారికి చపాతీ చెయ్యి" అంటూ కాంచన అక్కడికి వచ్చింది.          కాంచనని చూడగానే చాయకి ఓ ఆలోచన వచ్చింది. పళ్ళెంలో నుండి రెండు చింతకాయలు అందుకుని- "అబ్బా! ఎంత బావున్నాయి.....నాయర్! నాకు రోజూ రెండు చింతకాయలు తెచ్చిపెట్టవూ...?" అంది నోట్లో పెట్టుకుంటూ.          "చింతకాయలకేం భాగ్యం అమ్మాయిగారూ అలాగే తెస్తాను" టీ కప్పు అందిస్తూ అన్నాడు నాయర్.          "అదేమిటో నాలికకి పులుపు తినాలనిపిస్తోంది" అంటూ చాయ తీ గుటక వేసి వికారంగా ముఖంపెట్టి "వేక్" అంటూ టీ కప్పు క్రింద పెట్టేసింది.          కాంచన ఆదుర్దాగా చూసింది.          "అబ్బా.....వాంతొస్తోంది. ఒకటే వికారం...." అంటూ చాయ సింక్ దగ్గరికి పరిగెత్తింది.          "అయ్యో....అదేంటమ్మా....వాంతులా?" పనిమనిషి అరుపులు కాంచన చెవులకి బావిలో నుండి వినిపిస్తున్నట్లుగా వినవస్తున్నాయి.          "డాక్టర్ దగ్గరకి వెళ్ళాలి రంగమ్మా.....నీకు తెలిసిన లేడీ డాక్టర్ ఎవరైనా వున్నారా? త్వరగా ఆయన వస్తే బావుండ్ను, ఆయనే తీసుకెళతారు" అంది పనిమనిషి భుజంమీద వాలి నడుస్తూ చాయ.          కాంచనకు పళ్ళెంలో చింతకాయలూ.....వాంతి చేసుకుని భారంగా నడుస్తున్న చాయ రూపం మసక మసకగా కనిపించసాగాయి. తూలిపడకుండా వుండడానికి ఆమెకి గోడ ఆసరా కావాల్సివచ్చింది. అతి కష్టంమీద తననితాను నిగ్రహించుకుని వెనుతిరిగింది.          ఆమె మస్తిష్కంలో నగ్నంగా, జయచంద్ర వెనుక నిలబడ్డ చాయ మెదుల్తోంది.          చాయ వాంతి చేసుకుంటున్న ధ్వని చెవుల్లో గింగురుమంటోంది.          'భగవాన్ ఏమిటీ విపరీతం? ఆ పిల్ల తల్లి కాబోతోందా!' అనుకుంది. ఇటువంటి ప్రమాదాన్ని కాంచన ఊహించలేదు. ఈ విషయం సంధ్యకి తెలిస్తే ఎలా ప్రతిస్పందిస్తుందీ?' అని ఆలోచిస్తే మెదడంతా మొద్దుబారిపోయింది. గుండెని ఎవరో రాయితో చితక్కొడుతున్నంత నొప్పిగా అనిపించింది. అతి కష్టంమీద మంచం వరకూ నడిచి పక్కమీద వాలిపోయింది.                                                                     * * *          కాంచన మనస్థితి ఎలావుంటుందో చాయ ఊహించసాగింది. ఆమెకి సన్నని కూనిరాగం తీయాలనిపించింది.          తలనొప్పి పూర్తిగా తగ్గిపోయింది.          తీ.వీ.లో స్టార్ మూవీస్ లో ఏదో హారర్ మూవీ వస్తోంది. ఓ స్త్రీ భయంకరమైన తలనొప్పితో బాధపడుతోంది.          భరించలేని బాధతో అరుస్తోంది. అంతలోనే లేచి అల్మారాలోంచి చాకు తీసుకుంది.....నెమ్మదిగా అడుగులేసుకుంటూ బెడ్ రూంలోకి వచ్చింది. అక్కడ తెల్లగా.....ముద్దుగా....ఆదమరిచి నిద్రిస్తోంది ఆ పిల్లిపిల్ల ఆ స్త్రీ నెమ్మదిగా దాని దగ్గరకు నడిచి కసుక్కున బాకు దాని మెడమీద దింపింది.          "కె....వ్వు"మని అరిచింది ఆ దృశ్యం చూసిన సంధ్య.          కళ్ళు రెండు చేతులతో మూసేసుకుంది.          "ఏవయిందమ్మా?" అంది అటుగా వచ్చిన పనిమనిషి.          నిలువెల్లా చెమటపట్టి ఒణికిపోతున్న సంధ్య- "ఆ టీవీ ఆఫ్ చెయ్యి- నేను చూడలేను" అంది.          ఆమె కళ్ళనుండి కన్నీరు కారసాగాయి.          టీ.వీ.లో స్త్రీ పగలబడి నవ్వుతోంది. ఆమె తలనొప్పి తగ్గిపోయినట్లుంది.          పనిమనిషి టీవీ ఆఫ్ చేసేసింది.          గదిలోని చాయకి కూడా పూర్తిగా తలనొప్పి తగ్గిపోయి హాయిగా నిద్రపట్టింది.          టీవీలో స్త్రీ చేసిన పనికన్నా చాయ చేసినపనే ఎక్కువ కిరాతకమైనది          మనుష్యుల్ని ఒక్కసారిగా హత్యచేయకుండా నెమ్మది-నెమ్మదిగా మానసికంగా చంపుతోంది.          సంధ్య ఆ సినిమా పూర్తిగా చూసి ఆ మానసిక రుగ్మత గురించి తెలుసుకుని వుంటే, చాయ ప్రవర్తన మీద అనుమానం వచ్చి వుండేది.          కొన్ని జీవితాలు కాపాడబడేవేమో!                                                                       * * *          "నేను చచ్చిపోవాలి.....తప్పదు!" గట్టిగా అనుకుంది కాంచన.          ఆమెకి సంధ్య గుర్తొచ్చింది. ఆమె భవితవ్యం తలుచుకుంటే దిగులేసింది.
24,741
    "కుక్కలకి గాలిలో విహరించే ఆత్మల్ని చూడగల శక్తి వుంటుంది. అందుకే అది బయటికి తీసుకొచ్చిన ప్రతిసారీ యిటు చూసి అరిచేదట. ఈరోజు కూడా నేను గమనిస్తుండగా అలాగే అరిచిందది...."          "పది పన్నెండు రోజులుగా అరుస్తోందని అన్నారు. ఆ విషయం మీకెలా తెలుసు?"          "ఆ ఇంటి యజమానే చెప్పాడు"          అభిరాంకి అతను చెబుతున్న విషయాలకి చెమటలు పడుతున్నాయ్.          "నిన్న రాత్రి ఈ ఇంటిలో విన్పించిన విచిత్ర శబ్దాలు, మహదేవ్ బాబు ఒక్కరోజులో శుష్కించిపోవడం, ఆ కుక్క యిటే చూసి అరవటం... ఇవన్నీ కలుపుకుంటూ ఆలోచించండి.... ఈ యింటిలో ఆకారాలు లేని ఆత్మలేవో వున్నాయి."        వరప్రసాదం మాటలు వింటూనే ఒళ్ళు జలదరించింది అభిరాంకి.          "మనం సాధ్యమైనంత తొందరగా ఈ ఇంటినుంచి మహదేవ్ బాబుని దూరంగా తీసుకుపోవాలి" అన్నాడు వరప్రసాదం.        అభిరాం తీవ్రంగా ఆలోచించసాగాడు.          'ఎందుకు జరుగుతుందిలా? అన్నింటికంటే ఆశ్చర్యం.... వేటినయితే మహదేవ్ నమ్మడో అవే అతనిలో ప్రవేశించడం.....' అనుకున్నాడతను.          "ప్రస్తుతం ఏం చేద్దాం?" తనకి తోచనట్టు వరప్రసాదంను అడిగాడు అభిరాం.          "ఈ రాత్రికి చేయగలిగేదేమీ లేదు. ఉదయమే ఈ చోటునుంచి అతన్ని తీసుకుపోవాలి."          "ఎక్కడికి తీసుకెళదాం?"          "ఈ చోటు నుంచి ఎక్కడికయినా ఫర్వాలేదు"          "మా యింటికి తీసుకుపోదామా?"          "అక్కడికా?" ఆశ్చర్యంగా అడిగాడు వరప్రసాదం.          "ఎందుకని అలా అడిగారూ?" అతని ఆశ్చర్యాన్ని గమనించి అడిగాడు అభిరాం.          "అక్కడికొద్దు... అమ్మమ్మ భయపడొచ్చు.... ఇతన్ని వెన్నంటి ఏ గలయినా వచ్చి బీభత్సం సృష్టించిదంటే ఈ వయసులో అటువంటివి చూసి తను తట్టుకోలేకపోవచ్చు" అన్నాడు.          "మరెక్కడికి తీసుకుపోదాం?"          "అది మీరే ఆలోచించండి. ఇంకెవరూ తెలిసిన ఫ్రెండ్స్ లేరా?" అనడిగాడు వరప్రసాదం.        ఒక్కక్షణం ఆలోచించాడు అభిరాం.        తన ఎగ్జిక్యూటివ్స్ లో ఇద్దరు కుర్రాళ్ళు కలసి ఒక రూంలో వుంటున్నారు. వీలయితే అక్కడుంచచ్చు- అనుకున్నాడు.          "మీరింక ఇంటికెళ్ళండి అభిరాం బాబూ! అమ్మమ్మ ఎదురు చూస్తూ వుంటుంది" అన్నాడు వరప్రసాదం.          "లేదు! ఫోన్ చేసి పనిమీద బయటికి వెళ్ళాల్సి వచ్చిందని చెప్పేస్తాను. ఎదురింట్లోని వాళ్ళ పనిపిల్లని తోడుగా పడుకోమని చెప్పమంటాను. ఇంతకుముందు కూడా నేనామెని వదిలి వుండవలసి వచ్చినపుడు అలాగే చేశాను. మీరొక్కరూ ఇక్కడుండటం నాకెందుకో ప్రమాదమనిపిస్తోంది. ఇంత నీరసంగా కనిపిస్తున్న మనిషి కూడా నన్ను బంతిలా ఎలా విసిరేశాడో మీరే చూశారుగా..."          అది కూడా నిజమే అనిపించింది  వరప్రసాదానికి.          "ఒక పనిచేద్దాం. నేను ఫోన్ చేసి వచ్చేవరకూ మీరొక్కరూ ఈ గదిలో వుండద్దు. ఏదయినా ప్రమాదం జరిగే అవకాశం వుంది. అందుకని ఈ గది తలుపులు మూసివేద్దాం. మీరు హాల్లో కూర్చోండి. నేను ఫోన్ చేసి అమ్మమ్మకి ఈరోజు అర్జంటు పనిమీద వెళుతున్నానని చెప్పి వస్తాను" అన్నాడతను.          "అలాగే!" అన్నాడు వరప్రసాదం.          మరుక్షణం మహదేవ్ ఉన్న గది తలుపు మూసి గొళ్ళెం పెట్టి హాల్లోకి నడిచారు యిద్దరూ.          అభిరాం బయటకి వెళ్ళిపోయాడు.          వరప్రసాదం హాల్లోని సోఫాలో కూర్చున్నాడు.          ఇల్లంతా నిశ్శబ్దంగా- రానున్న తుఫానుకు ముందటి ప్రశాంతతని తలపిస్తోంది. క్షణాలు భారంగా దొర్లుతున్నాయి.          వరప్రసాదం కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నాడు.          'మహదేవ్ నోట్లోంచి వచ్చిన పదాలకి అర్ధమేమిటి బహుశా వ్యక్తుల పేర్లా? అయితే ఇనీసా ఎవరు? కృపస్కయి అంటే...' అతను ఆలోచనలలో వుండగానే అభిరాం వచ్చేశాడు.          "ఫోన్ చేశారా?" అడిగాడు వరప్రసాదం.          "ఆఁ..." అన్నాడతను.          ఇద్దరూ మెల్లగా నడుస్తూ వెళ్ళి చప్పుడు కాకుండా మహదేవ్ గది తలుపులు తెరిచారు.          ఒక్కక్షణం ఉలిక్కిపడ్డారు. ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి.          మంచంమీద కూర్చుని వున్న మహదేవ్ అగ్నిగోళాల్లాంటి కళ్ళతో, బుగ్గల నుంచీ, చేతుల నుంచీ కారుతున్న నెత్తురుతో భయానకంగా కనిపించాడు. లోపలికొస్తున్న ఇద్దరివంకా రౌద్రంగా చూశాడు.          వరప్రసాదం అభిరాంని ఆపేశాడు.          "హౌ ఆర్ యూ" అని తీవ్రంగా అడిగాడు ముందుకొస్తున్న అభిరాంని చూసి.          "ఐ యామ్ అభిరాం.... మే ఐ నో యువర్ గుడ్ నేమ్ ప్లీజ్" శాంతంగా అన్నాడు అభిరాం. అప్పుడతను చెప్పిన పేరు విని యిద్దరూ స్థంభించిపోయారు.                                                                  *    *    *    *    *          అది జటాఝాటధారి నివాసం!          అలసిన శరీరాలు సొక్కి సోలిపోయి ఆత్మలుగా మారే ఆవాసం. భ్రష్ట రోదనలతో, అపశ్రుతులు నిండిన వికృత సంగీత సామ్రాజ్యం.          వెలుగెరుగని మసిబారిన చిక్కని చీకట్లు నిండిన ప్రదేశం. అది మొదలుకుని అంతంవరకూ చివరికి శూన్యంతో కలిపి ఎక్కడా లేని గాలి ఆ ప్రదేశంలో చేరి బ్రహ్మప్రళయం వచ్చినట్లు రొద.... చెవులు తెగి కింద పడిపోతాయేమో అన్నంతగా...
24,742
    "ఎందుకే అలా మింగేసేలా చూస్తావు నా వంక?" గాయత్రి అడిగింది.     "నా వంక చూస్తే నిముషానికి ఇంత పన్ను కట్టాలని టాక్స్ వెయ్యి" అంది ఆమని.     "అలాగే వేసుకోవచ్చు. వచ్చే డబ్బంతా నాకు యివ్వొచ్చు కాని ఆ టాక్స్ నించి నన్ను మాత్రం మినహాయించాలి" అన్నాడు వాల్మీకి.     అబ్బ ఎంతాశబాబూ! ఎప్పుడూ రెప్పవేయకుండా అక్కవంకే చూస్తూ కూర్చుండి పోదామనా? పన్నులు తప్పుకునే ప్రతాపం మీ వ్యాపారాల్లో ఉంటుంది కాని పెళ్ళాం విధించే పన్నుల నించి ఎంత ప్రతాపవంతుడయినా తప్పించుకోలేడు. మినహాయింపు అనేది ఏదైనా ఉంటే అది నాకే ఇవ్వవే అక్కా! చిన్నతనం నించి మనిద్దరం స్నేహం కదా!     మధ్యలో ఈ బావగారొకరొచ్చి చీల్చేశారు. పాత స్నేహం మర్చిపోకు" అంది ఆమని! ముగ్గురూ హాయిగా నవ్వుకున్నారు.     ఆ రాత్రికి వారి ప్రయాణం నిర్ణయమయింది.     సోదరీమణుల గుండెలు బరువెక్కాయి.     వాస్తవానికి వాల్మీకి కూడ ఆమని మీద చాల ఎఫెక్షన్ పెంచుకున్నాడు. ఆమె వ్యక్తిత్వంలో నిర్మలతా తెలివితేటలలో చురుకూ అతనిని ఆకర్షించటం కాదు దిగ్భ్రాంతి పరిచినాయి.     "ఈ చిన్నారి చిట్టి తల్లి నా బిడ్డ! నాకు బిడ్డలు కలిగే ఆశ ఇకలేదు. కాబట్టి ఆమెను బిడ్డగా చూచుకోవాలి. ప్రాణమిచ్చి పెంచుకోవాలి.     ఆమని కలెక్టర్ గా కావాలని జీవితాశయంగా పెట్టుకుంది.     ఆ కోర్కెను తీర్చటమే మా దంపతుల జీవితాశయం కావాలి!     ఎప్పుడయినా ఆమె పెళ్ళాడి బిడ్డల్ని కంటే ఓ బిడ్డని యాచించి తెచ్చి పెంచుకోవాలి! మరో చిన్ని ఆమని మచ్చలేని చందమామలా ఆ ఇంటిలో పెరగాలి అని ఎంతో వాత్సల్య పూరితంగా ఆలోచించాడు వాల్మీకి.     మళ్ళీ మొత్తం పటాలాన్ని కదిలించి అయిదు కార్లలో సెండాఫ్ ఇవ్వటానికి వస్తోంది ఆమని. రైలు కదిలేంతవరకూ అంతా కోలాహలం!     వెండి జరీ పోగులతో ఎంబ్రాయిడరీ చేసిన ఆకుపచ్చ కాశ్మీర్ షాల్ మమ్మీకి కానుకగా పంపించింది ఆమని!     "కలెక్టరై వచ్చాకనే కాళ్ళకి మొక్కుతానని మమ్మీకి చెప్పు" అంది.     చిత్తడి అవుతున్న చెంపల్ని తుడుచుకుంటూ రైలు కదిలే సమయాన చేతులు ఊగించింది! క్రమంగా ఆ రూపం కలలాగ కరిగిపోయింది.     "ఈ పిచ్చిపిల్ల చాలా ప్రతిభాశాలి! విడిచి వెళ్ళాలంటే వెక్కిళ్ళు వస్తున్నాయి" అంది గాయత్రి! వాల్మీకి అదొకలా చూచాడు.     "ఆడవాళ్ళు అదృష్టవంతులు. కష్టం కలిగినప్పుడు మనసువిప్పి మగవాళ్ళతో చెప్పుకోగలరు!" అన్నాడు. గాయత్రి భుజం చుట్టూ చేయి బిగించి ఓదార్చాడు.     ఆమని అంటే ఒక కల! అడిగినప్పుడు రాదు.     ఆమని అంటే ఒక అల! వచ్చిపోవటమే దాని స్వభావం.     ఆమని అంటే ఒక వల! పట్టిలాగటమే కాని పడిపోవటం ఎరుగదు!     రైలు శబ్ధంతో వారి ఆలోచనలు లయబద్ధం అయినాయి!     రిపోర్ట్సు వచ్చినా ఈ విషయం గాయత్రికి చెప్పకూడదు.     ఎప్పుడూ గాయత్రి ముఖంలో ఈ చిరునవ్వే చూడాలి అనుకున్నాడు వాల్మీకి!                           *    *    *     కాలం అప్రతిహతం! అది దురతిక్రమం!     ఎవరికోసమూ ఆగకుండా దొర్లిపోవటం దాని స్వభావం.     సంవత్సరానికి పైగా గడిచిపోయింది.     ఓ అందమయిన ఉదయం సుమిత్ర లాన్ చెయిర్ లో గులాబి మొక్కల మధ్య కూర్చుని ఉంది. ఆమని వ్రాసిన ఉత్తరాన్ని నిన్నటినించి అయిదుసార్లు చదివింది. ఇంకా అర్ధం కాలేదు.     గాయత్రి ఫాంహౌస్ లో పనులు చూచుకుంటోంది. రెండురోజులుగా రాలేదు. వాల్మీకి అక్కడికే వచ్చి వెడుతున్నాడని వార్తలు వచ్చాయి.     ఒంటరితనాన్ని జయించేందుకు ఇంకా మనవడు రాలేదు.     వచ్చే సూచనలు కూడ కన్పించలేదు.     ఇంకా అందరి ఆలోచనల్లో ఆ యింటిలో పసిపాపగానే ఉన్నాయి ఆమని జ్ఞాపకాలు! ఆ మనస్సులో తన చిన్న పాపాయి రూపాన్ని చెరిపేస్తూ ఆమని వ్రాసిన ఉత్తరం అది. ఎన్నిసార్లు చదివినా ఆ వాక్యం అర్ధం కాలేదు.     మళ్ళీ మరోసారి మడతలువిప్పి చదువుతోంది సుమిత్ర!     మమ్మీ! నమస్తే! అక్కకు బావకు మీకు ఓ హాపీన్యూస్!     డిగ్రీ డిస్టింక్షన్ తో పూర్తిచేశా! ఐఏఎస్ కి అప్లయ్ చేశా! ముందుగా కొన్ని టెక్నికల్ క్వాలిఫికేషన్స్ సంపాదించటం మంచిదంటున్నారు.     హార్స్ రైడింగ్ సర్వసాధారణం అయిపొయింది.     అర్సియరీ నేర్చుకోమన్నారు. వద్దన్నాను గోల్ఫ్ కూడ యమబోర్!     నాకు మౌంటెనీరింగ్ లో ఆసక్తి ఉంది. డార్జిలింగ్ లో ఈ ఎండాకాలం గుడుపుతా! మాస్టర్ డిగ్రీకి కూడ అప్లయ్ చేశా! ఐఏఎస్ కి మౌంటెనీరింగ్ డిప్లమాతోడయితే మంచి ఉద్యోగాలు వస్తాయంటున్నారు.     క్రీడలలో ప్రత్యేక టాలెంట్ సంపాదించుకుంటే మనలాంటి ఒ.సి.లకి ఉద్యోగం సంపాదించటం సులభమవుతుందని న ఐడియా!     నేను కూడా బచేంద్రిపాల్ కాలేకపోయినా ఏదో ఒకనాడు కైలాస శిఖరం ఎక్కేస్తా మమ్మీ! హిమాలయాలు నన్ను కౌగిలించుకుంటాయి!     అక్క డాక్టర్ రిపోర్ట్ గురించి ఇంకా బాధపడుతోందా? వద్దని చెప్పు!     పిల్లోస్ మీద వ్రాసిన లవ్ లీ ఆమని అనే అక్షరాలు ఇంకా ఉన్నాయా? చెరిగిపోయాయా? డార్జిలింగ్ నించి ఫీనట్స్, ఆ క్రూట్ వగైరాలు తెచ్చి పంపిస్తా. ఒక్కసారి మీ పాదాలు తాకాలని మనసు దురపిల్లుతోంది మమ్మీ!     కాని నేనింకా కలెక్టర్ని కాలేదు కదా?     అంత పౌరుషం తక్కువదాన్నేం కాదు. మాట తీర్చుకునే వస్తాను.     "సీయూ! బై!" అంటూ ఉత్తరాన్ని ముగించింది.     ఉత్తరాన్ని ముద్దు పెట్టుకుని గుండెలకు హత్తుకుని ఒడిలో దాచుకుంది సుమిత్ర.     డాక్టరుగారి రిపోర్టు విషయం బాధపడుతోందా అక్క అని వ్రాసింది అదేమిటో మాత్రం ఆ తల్లికి అర్ధం కాలేదు.     నగరానికి వెళ్ళి తిరిగి వచ్చిన తరువాత డాక్టర్ పరీక్షలు చేయించినట్టు చెప్పారు. కాని ఫలితాంశాన్ని స్పష్టంగా చెప్పకుండా దాటవేశారు.     గాయత్రికి కూడా తెలియదేమో! వాల్మీకి అదొకలా వుంటున్నాడు.     పిల్లల ప్రస్తావన వచ్చినప్పుడల్లా "ఆమని చిన్నపిల్ల! అన్ని ముచ్చట్లు తీర్చేస్తోంది కదా" అంటూ దాట వేస్తున్నాడు.     అక్కడ డాక్టర్ రిపోర్టు గాయత్రికి తెలిసి ఉంటుందని ఆమని ఊహ. కాని తెలియదు. అదేమిటో తెలుసుకోవాలి అని నిర్ణయించుకుందామె. డాక్యుమెంట్స్ అన్నీ ఫాంహౌస్ సేఫ్ లో దాచుకుంటాడు వాల్మీకి. వాటిని చూడాలనుకుంది. వెంటనే ఫాంహౌస్ కి వెళ్ళింది.     "ఈ రోజు నేను ఇక్కడ విశ్రాంతి తీసుకుంటాను. అబ్బాయిగారు ఇంటికే వస్తారు వెళ్ళు గాయత్రీ!" అంది కీ బంచెస్ అన్నీ ఆమెకు హాండోవర్ చేస్తూ ఐరన్ సేఫ్ తాళాలు కూడా ఇచ్చి వెళ్ళిపోయింది గాయత్రి.     అలవాటు ప్రకారం ఆరు గంటలు దాటిన తరువాత వాల్మీకి వచ్చాడు.     గాయత్రిగారు వెళ్ళిపోయారని, పెద్దమ్మగారు ఉన్నారని పనివాళ్ళు వార్త అందించారు.     "అత్తాయమ్మగారూ! మీ ఆరోగ్యం ఎలా ఉంది?" అని అడిగాడు.     "నేను ఎలా ఉన్నా వక్కటే! కాని బాబూ! నేనొక విషయం అడుగుతాను చెప్తావా?"     "అదేమిటి? మీరు మాకు పెద్దలు ఆజ్ఞాపించండి."     "నిజం చెప్తానని మాట యివ్వు బాబూ!"     "ఓ గాడ్! ఏనాడయినా మీకు అబద్ధం చెప్పానా ఒక్కటయినా? ఎందుకు అలాంటి అనుమానం వచ్చింది మీకు?"     "అబద్ధం చెప్పలేదు కాని నిజాన్ని దాచావు బాబూ! రెండు ఒక్కటే"     ఆ మాట విని అతడు షాక్ అయాడు.     "ఆమని ఉత్తరం వ్రాసిందా?" అన్నాడు అప్రయత్నంగా.     "అవును బాబూ! అక్క ఇంకా దిగులుగా ఉందా?" అని అడిగింది.     "దిగులు పడేందుకు అసలామెకు వాస్తవం తెలియదు"     "నాకూ తెలియదు, ఏమిటా వాస్తవం?"     "డాక్టర్ రిపోర్ట్స్ అన్నీ ఫైల్ చేశాను. కీస్ కూడ గాయత్రి దగ్గరే ఉన్నాయి. కాని నేను లేకుండా ఎప్పుడూ సేఫ్ తీయదు? కావాలంటే మీరు చూడండి. గాయత్రికి మాత్రం చెప్పవద్దు అనుకున్నాం.     "సరే! అమ్మాయి ఇంటి దగ్గర నీకోసం ఎదురుచూస్తూ ఉంటుంది వెళ్ళు!"     "అత్తాయమ్మగారూ! మీరు నాకు ఒక మాట యివ్వాలి."     "ఏమిటి బాబూ అది---?"     "ఆ రిపోర్టు చదివి మీరు కూడా అప్ సెట్ అవకూడదు"     "భర్త చనిపోయి ఇద్దరు బిడ్డల్ని పెంచాల్సి వచ్చినప్పుడే నేను బండరాయిగా మారాను. ఇంకా నాకు బాధలేముంటాయిలే వెళ్ళిరా!" అన్నదామె!     అతడు వెళ్ళిపోయాడు. ఆ రాత్రి చాల పరధ్యానంగా ఉన్న వాల్మీకిని చాలాసార్లు హెచ్చరించింది గాయత్రి. కవ్వించాలని ప్రయత్నించింది.     "ఎందుకో నా మనసు కీడు శంకిస్తోంది" అన్నాడు.     "అదేమిటి డిగ్రీ పరీక్షా ఫలితాలు వచ్చాయట?"     "ఆమని డిస్టింక్షన్ లో వచ్చింది. చాలారోజులు అయింది. ఈరోజు ఉత్తరం వచ్చింది. మౌంటునీరింగ్ డిప్లమా ఉంటే ఐఏఎస్ ఉద్యోగాలకి రిజర్వేషన్ కోటాలో యిస్తారట! క్రీడల కోటా అది. మంచి తెలివి ఉపయోగిస్తుంది."     "తెలివితేటలు డానికి స్వంతం కదండీ!"     "మరి నీకు స్వంతాలేమయినా ఉన్నాయా?"     "మీరే నాకు స్వంతం. మీలోనే ప్రపంచం అంతా చూచుకుంటాన్నేను. తాంబూలం అందుకోండి." అంటూ చిలకలు చుట్టి అందించింది గాయత్రి.
24,743
     ప్రస్తుతం ఆమె జీతం రెండువేల రూపాయాలకు పెరిగింది. అంటే దాదాపు పది రెట్లు పెరిగింది. కుటుంబ పోషణ బాధ్యత అంతా తనే చూసుకుంటుంది. చెల్లెల్ని డాక్టర్ని చేయాలనే పట్టుదలతో చదివిస్తుంది. ప్రస్తుతం ఏఫ్.ఏ. చేస్తుంది. అది పూర్తయిన తరువాత ఎం.బి.బి.ఎస్. లో చేర్పించాలని జయంతి కోరిక. తులసి కూడా అక్క కోరికను తిర్చాలనే పట్టుదలతో కష్టపడి చదువుకుంది. ఆమెకు ఇక్కడే విజయవాడలో కాలేజికి సంబంధించిన లేడిస్ హాస్టల్లో వుంచే చదివిస్తుంది.      పెద్ద తమ్ముడు రోజు ఇంటిదగ్గర నుంచి బస్సులో పట్నం వచ్చి చదువుకుంటున్నాడు. పెద్ద తమ్ముడు టెన్త్క్ క్లాస్, చిన్న తమ్ముడు ఎయిత్ క్లాస్. ఉళ్ళోనే జయంతి చదివిన స్కూల్లోనే చదువుకుంటున్నాడు. వాళ్ళ ఇద్దర్ని కూడా ప్రయోజకుల్ని చేయాలనేది ఆమె ఆకాంక్ష.     కస్తూరి కూతుర్ని పెళ్ళిచేసుకో, అని చెప్పి చెప్పి విసిగిపోయింది. ఈమధ్య అసలు ఆమె పెళ్ళి మాట ఎత్తటంలేదు. జయంతి ఒకటే నిర్ణయం తీసుకుంది. చెల్లెల్ని డాక్టర్ని చేయాలి. డాక్టర్ కావాలంటే మరో అయిదేళ్ళు పడుతుంది. అయిదేళ్ళవరకు ఆమె పెళ్ళి గురించి ఆలోచించదలుచుకోలేదు. చెల్లెలు డాక్టర్ కావటం, పెద్ద తమ్ముడు డిగ్రీ పుర్తవటం, వాడు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగంలో చేరటం, చిన్న తమ్ముడికి కూడా డిగ్రీ పుర్తవటం అన్ని అయిదు సంవత్సరాల్లో జరిగిపోయాయి. అందుకే ఆమె ఈ కఠిననిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఆమె పెళ్ళి చేసుకుంటే తనను చేసుకునే భర్త తనకు సహకరిస్తాడనే నమ్మకం ఏముంది?     నా జీవితం చెల్లెళ్ళకోసం, తమ్ముళ్ళకోసం ఖర్చు పెట్టటం అతనికి ఇష్టం లేకపోతే వాళ్ళ జీవితాలు అన్యాయం అయిపోతాయి కదా! ఇంత వరకు ఎలాగో ఓపికపట్టాను. ఎన్నో విమర్శలను ఎదుర్కున్నాను. మరో అయిదేళ్ళు ఇలానే కళ్ళు మూసుకుంటే అన్నీ సక్రమంగా జరిగిపోతాయి. అప్పుడు నన్ను చేసుకోవటానికి ఎవరైనా ముందుకొస్తే పెళ్ళిచేసుకుంటాను. లేకపోతే ఇలాగే వుండిపోతాను, నష్టం ఏంటి? జీవితానికి పెళ్ళి చేసుకుంటేనే సార్ధకత కాదు కదా! తనను నమ్మిన వాళ్ళని ప్రయోజకుల్ని చేయటంలో లభించే తృప్తి పెళ్ళిలో వస్తుందని అనుకోను? పెళ్ళి చేసుకున్న వాళ్ళంతా ఏం సాధిస్తున్నారు?     పిల్లల్ని కనటం, వాళ్ళని పెంచి పోషించటం.....పైగా భర్తగారి మాటకు జవదాటకుండా మెలగటం....నాకు ఇప్పుడు పెళ్ళి చేసుకోకుండానే పిల్లలున్నారు కదా! తమ్ముళ్ళను, చెల్లెల్ని నా సొంత పిల్లలే అనుకుంటే సరిపోతుంది. దీన్లో నాకు ప్లస్ పాయింట్ ఎంటంటే భర్త పోరులేదు, అన్నీ నా స్వంత నిర్ణయాలే తీసుకోవచ్చు. మరొకరి సలహాలను, సంప్రదింపులను తీసుకోకుండా ఎంచక్కా స్వేచ్చగా బ్రతకొచ్చు. ఈ జీవితమే బావుంది.     నా స్నేహితులందరికీ పెళ్ళిళ్ళయిపోయి పిల్లలు కూడా పెద్దవాళ్ళయి పోయారు. నేనింకా పెళ్ళి చేసుకోకుండా వున్నానని తెలిసి వాళ్ళు ఆశ్చర్యపోతుంటారు. "ఏంటే నీ పిచ్చి.....తమ్ముళ్ళకోసం, చెల్లెలు కోసం పెళ్ళి చేసుకోకుండా వుండటం ఏంటి? నీలాంటిదాన్ని మేము ఎక్కడా చూడలేదు అంటుంటారు. నా కాలేజ్ మేట్ సుహాసిని అయితే అప్పుడే రెండు పెళ్ళిళ్ళు చేసుకుంది. మొదటి పెళ్ళి మూడేళ్ళకే పెటాకులు అయితే, వెంటనే సంవత్సరంలోపే మరో పెళ్ళి చేసుకుంది. పేరుకే సుహాసిని. దాని బతుకంతా విషాదమే! నవ్వే మర్చిపోయింది. అప్పుడప్పుడు కనిపించినప్పుడు అంటుంటుంది.     "నువ్వే బెటర్. ఒక ఆశయంకోసం పెళ్ళిచేసుకోకుండా వుండిపోయావు. నిన్ను చూసి నేను గర్వపడుతున్నాను. నేను ఎండమావి లాంటి జీవితం కోసం పరుగు తీసి, తీసి అలసిపోయాను" అంటుంది.     ఆశయంలాంటి పెద్దపెద్ద మాటలు అనను కానీ, ఎందుకు నా వాళ్ళని నేను పైకి తీసుకువచ్చిన తరువాతే నేను లైఫ్ లో సెటిల్ కావాలని నిర్ణయం తీసుకున్నాను. ఇది మంచో, చెడో నాకే తెలియదు. ప్రస్తుతం మంచే అనుకుంటున్నాను. వాళ్ళు ప్రయోజకులయితే అంతే చాలు.          అప్పుడు నా జీవితం గూర్చి ఆలోచిస్తాను అనుకుంది జయంతి. ఆమె బస్సులో వస్తూ ఆలోచిస్తోంది. పాపం అమ్మను చూస్తే జాలేస్తుంది. నా పెళ్ళి చూడాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తుంది. ఆమె బ్రతికుండగా ఆమె కోర్కెను తిర్చగలనో లేదో నాకే తెలియదు.     అమ్మ మాత్రం తిట్టి తిట్టి అలసిపోయింది. ఇక ఆమె నా పెళ్ళి విషయం ఎత్తకపోవచ్చు. బస్సు రావిచెట్టు దగ్గర ఆగింది. ఆమె మెల్లగా దిగింది.                                                           *    *    *    *     ఇంటిముందు అరుగుల పైన దాక్షాయణి, శివపార్వతిలు ఇద్దరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఆ బజారులో చాలా మార్పులు వచ్చాయి. ఇదివరకు సర్వోత్తమరావు ఇల్లు, అయన పక్కనే మరో ఇల్లు చెంచమ్మ అత్తది వుండేది.     ఇంటిల్లిపాదీ పిల్లలంతా ఆమెను అత్తమ్మా....అత్తమ్మా అని పిలిచేవారు. ఆమెకు ఇరవై ఏళ్ళ వయసులోనే భర్త చనిపోయాడు. ఒక్కతే కూతురు, ఆమె కోసమే జీవించి వుంది గాని కూతురు లేకపోతే ఏనాడో చనిపోయేది.     సర్వోత్తమరావుని అన్నయ్యా అని, కస్తూరిని వదినమ్మా అని ఆప్యాయంగా పిలుస్తుంది. వీళ్ళందరికి అమెంటే ప్రత్యేకమైన అభిమానం. భర్త లేనిదని ఆమెకు కొండంత అండగా వుండేవారు. భర్త ఆమెకు సంపాదించి పెట్టిన ఆస్తి ఆ ఇల్లు. మూడెకరాల పొలం. ఆ పొలం సురేంద్రనే కొలుకు తీసుకుని ఆమెకు ఏడాదికి సరిపడా గింజలు ఇస్తుంటాడు. వాటితో ఆమె కాలక్షేపం చేస్తుంది. ఆమె ఇల్లు మాత్రమే వుండేది సర్వోత్తమరావు ఇంటిపక్కన, అయితే గత అయిదేళ్ళలో మరో అయిదిళ్ళు వెలిశాయి. ఊరు కూడా పెరిగింది.     జయంతి సందు చివరినుంచి చూసింది. అరుగులపైన కూర్చుంది ఎవరా అనుకుంటూ వస్తుంది. దూరంనుంచే దాక్షాయణిని గుర్తుపట్టింది గానీ ఆమె పక్కనే వున్న వ్యక్తిని గుర్తుపట్టలేదు.     దగ్గరకు వచ్చిన తరువాత గుర్తుపట్టింది. చిన్నపిన్ని శివపార్వతి.
24,744
    "చెవుల్లో ఏవో శబ్దాలు, అరుపులు, ఆజ్ఞలు - మృత్యుగహ్వరంలోకి అడుగుపెడ్తున్నట్లు ఉంటుంది. అయినా ఆ సాహసం నాకు చెయ్యాలని ఉంటుంది. ఉండటం కాదు, చెయ్యకుండా ఉండలేను. నా ఆశలు, వాంఛలు నన్ను బానిసను చేస్తాయి.     వెడతాను. చేతులు ముందుకు జాచుతాను. అవి కదలవు. ముందుకు సాగవు. కంటికి కనిపించని వాతావరణపు పొరలు వాటిని అడ్డుకున్నట్లు ఉంటాయి. ఆమెను తాకాలని విశ్వప్రయత్నం చేస్తాను. చేతులు వొణుకుతూ ఉంటాయి. శరీరం గగుర్పొడుస్తూ ఉంటుంది. అట్లాగే రాక్షసబలంతో ముందుకు జరిగి ఆమెమీదకు వొరగబోయేసరికి గుండెల్లో విపరీతమైన నొప్పి, నరాలు ఎవరో పట్టకారుతో నొక్కినట్లు పటపటలాడతాయి. అది వర్ణనాతీతమైన బాధ. ఆ బాధ భరించలేక వెనక్కి పడిపోతాను. కాసేపటివరకూ వళ్లు తెలియదు.         తర్వాత లేచి అద్దంలోకి చూసుకుంటే నా శవాన్ని చూసుకుంటున్నట్లుగా ఉంటుంది. ఎక్కడా జీవకళ కనబడదు. వళ్ళంతా నల్లగా మాడిపోయినట్లూ, మచ్చలూ నానా భీభత్సంగా ఉంటుంది.     "తెల్లవారి వెల్తురు వ్యాపించాక మామూలు మనిషిని అయిపోయినట్లుగా ఉంటుంది తిరిగి".     ప్రతిరోజూ అదే సంఘటన. కార్బన్ కాపీలా జరిగిపోతూ ఉంటుంది. పగలు తర్వాత సాయంత్రమూ, సాయంత్రము తర్వాత చీకటి ఎంత నిజమో, చీకటి తర్వాత ఈ సంఘటనకూడా నిత్యకృత్యమయిపోయింది. ఈ విషవలయనుండి, ఊబినుండి బయటకు రావాలనుకుంటానుగాని అది నా శక్తిని మించిన పని అయిపోయింది. ఆ సమయం రాగానే అయస్కాంతంచేత ఆకర్షించబడినట్లు ఆటే లాగుతాయి కాళ్లు. ఆమె ముఖంలోకి వొంగి చేతులు జాచుతాను, ఆమెను గట్టిగా హత్తేసుకుందామని. వాటిని ఎవరో ఆపుతారు. చెవుల్లో ధ్వనులు, శాసింపులు, నా మొండితనం.... గుండెల్లో నొప్పి!       అలాగే గడిచిపోతున్నాయి రోజులు, వారాలు, నెలలు. నేను హరించిపోతున్నాను. నన్నేదో భూతం పరిపాలిస్తోంది. ఆ పరిపాలనలో మగ్గిపోతున్నాను. విముక్తి కనబడటంలేదు. ఉండదు కూడా.     శాయి నీళ్ళు నిండిన కళ్ళతో అస్పష్టంగా కనబడుతూన్న దూరపు దృశ్యాలను యాదృచ్ఛికంగా అవలోకిస్తూ తన వేదనాభరితమైన కధ యావత్తూ విపులంగా విప్పి చెప్పాడు.     సక్సేనా కళ్ళలోకూడా నీళ్ళు నిండుకొచ్చాయి. స్నేహితుడికి దగ్గరగా జరిగి అతని భుజంమీద ప్రేమగా చెయ్యివేసి 'శాయీ!' అన్నాడు ఆర్థ్రస్వరంతో.     "ఊఁ!"     "ఈ సందర్భంలో సలహాలు చెప్పే యోగ్యత నాకులేదు. సలహాలు పనికివచ్చే కాలం నువ్వు ఆనందపురంలో మొదటిసారి గుడిలో వేదితను కలుసుకున్నప్పటికే అతిక్రమించిపోయింది."     కొంత సమయం నిశ్శబ్దంగా గడిచింది.     "కానీ, నీ ఆరోగ్యం గుల్లయిపోయింది. ఇంకా పాడుకావటానికి వీలుకానంత చివరి దశకు వచ్చేసింది. ఇహ మేలుకుని జాగ్రత్త వహించకపోతే లాభంలేదు. పద, డాక్టరు దగ్గరకు తీసుకుపోతాను." అని అతన్ని లేవతీయటానికి ప్రయత్నించాడు.     శాయి చిన్నగా నవ్వి అతన్ని వారించటానికి ప్రయత్నిస్తూ అమాయకుడివి సక్సేనా నువ్వు, ఈ విషయంలో డాక్టరేం చేయగలడు?" అన్నాడు లేవకుండా.     "కనీసం నీలోవున్న వ్యాధి డయాగ్నైజ్ చేయగలడు. నీ ఆరోగ్యాన్ని కొంత కాకపోతే కొంతయినా ఇంప్రూవ్ చేయటానికి ప్రయత్నించగలడు. లేలే" సక్సేనా లేచి నిల్చుని అతని చెయ్యికూడా పట్టుకుని లాగాడు.     ఇహ వెళ్ళకపోతే అతను విడిచిపెట్టడని, ఇష్టం లేకపోయినా తనుకూడా లేచి స్నేహితుడ్ని అనుసరించాడు శాయి.                                               * * *     డాక్టరు సక్సేనాకు తెలిసినవాడు. వెళ్ళేటప్పటికి అప్పుడే క్లినిక్ తెరిచి తీరిగ్గా కూర్చుని ఉన్నాడు. "రండి రండి" అని ఆదరపూరకంగా ఆహ్వానించాడు. ఇద్దరూ కూర్చున్నాక సక్సేనా శాయిని పరిచయం చేసి "ఇతన్ని మీరు థరోగా ఎక్జామిన్ చెయ్యాలి డాక్టర్! ఈ మధ్య చాలా కొద్ది కాలంలో బాగా డిటూరయొరెట్ అయిపోయాడు" అన్నాడు.     డాక్టర్ శాయివంక పరిశీలనగా చూచి "మీ బాధేమిటి?" అని ప్రశ్నించాడు.     "నాకు ఇతరత్రా ఏ బాధాలేదు, తరుచు గుండెనొప్పి వస్తూ ఉంటుంది. దాన్ని బట్టి మిగతా నీరసాలూ అన్నీ ఉన్నాయి" అన్నాడు శాయి.     తర్వాత డాక్టరు అతన్ని అనేక ప్రశ్నలు వేశాడు. అతని వయసూ పరిసరాలూ, కుటుంబ వ్యవస్థ గురించీ, వెనుకటి బాధలేమయినా ఉన్నాయా, అతని అలవాట్లూ, మొదట ఎలా వచ్చిందీ, ఎంతకాలంనుంచి వస్తోందీ, ఏం చేస్తే పోతోందీ ఇలా అన్నీ వివరాలు అడిగాడు. తరువాత షర్టు తియ్యమని, బల్లమీద పడుకోబెట్టి పొట్టనొక్కి చూశాడు. స్టెతస్కోప్ తో ఊపిరితిత్తులు, గుండె పరీక్షించాడు. బ్లడ్ ప్రెషర్ కూడా చూసి డార్క్ రూములోకి తీసుకువెళ్లి ఎక్స్ రే స్క్రీనింగ్ చేసి గుండె, ఊపిరితిత్తులు మళ్లీ పరీక్షించాడు. తర్వాత మరో గదిలోకి తీసుకువెళ్ళి, బల్లమీద పడుకోబెట్టి ఎలెక్ట్రో కార్డియామ్ తీసి రీడ్స్ అన్నీ పరిశీలించాడు. నెత్తురుతీసి ప్రిజర్వ్ చేసి తర్వాత పరీక్ష చేస్తానని చెప్పాడు.       "ఎలావుంది డాక్టర్? గుండె జబ్బేమయినా వుందా?" ఆత్రుతలేని కంఠంతో ప్రశ్నించాడు శాయి.     "మీకు హైపర్ టెన్ షన్ వుంది. అంటే బ్లడ్ ప్రెషర్ రైజ్ అయింది. దాన్నిబట్టి హార్ట్ కూడా వీక్ అయింది. కాని మీరు చెప్పినంత సివియర్ గా హార్ట్ లో దోషం కనిపించలేదు. ఇ.సి.జి. కూడా ఎబ్ నార్మల్ గా లేదు. లంగ్స్ క్లియర్ గానే ఉన్నాయి. లివర్ కొద్దిగా ఎన్ లార్జి అయింది. మీ జనరల్ కండిషన్ బాగా పూర్ గా వుంది. ఈ వయసులో బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా వుంది అంటే! మీరు చాలా జాగ్రత్తగా ఉండటమవసరం. మీ అలవాట్లు మానుకోవాలి. సిగిరెట్లు తగ్గించాలి. డ్రింకింగ్ కు పూర్తిగా స్వస్తి చెప్పాలి. నేను రాసిస్తూన్న మందులూ, టానిక్కులూ తీసుకోవాలి" అని డాక్టరు అన్నీ వివరంగా చెప్పి ప్రిస్క్రిప్షన్ పాడ్ మీద మందులూ,టానిక్కులూ రాసిచ్చి, అవి ఎలా వాడాలో విశదీకరించాడు.
24,745
    2. ద్రోహ వివర్జిత దేవద్వయమా ! మాకు మీవద్ద మా భోజనమునకుగాను అన్నలాభము కలుగవలెను. రుద్రపుత్రులారా ! మేము మీ స్తోతలము. మేము మీవారలము కావలెను. సమృద్దులము కావలెను.     3. రుద్రపుత్రులారా ! మీ ఉభయుల రక్షణలతో మమ్ము రక్షించండి. మాకు ఇష్టప్రాప్తి కలుగవలెను. అనిష్ట నివారణ జరుగవలెను. అభిమత ఫలము లభించవలెను. మేము మాపుత్రుల సహితులమయి శత్రువులను హింసించవలెను.     4. ఆశ్చర్యకర కార్యములు చేయువారలారా ! మేము ఇతరులను పూజించుట వలన లభించిన ధనమును అనుభవింపము. మేము మీ అనుగ్రహమున సమృద్దులము. మేము ఇతరుల ధనముతో దేహ పోషణచేసికొనము. పుత్ర పౌత్రుల యుక్తమయిసహితము మీకు వ్యతిరిక్త ధనమును అనుభవించము. మా కులమందు ఎవరును మీరు కాక ఇతరులవలన లభించిన ధనమును అనుభవించరు.                                           డెబ్బది ఒకటవ సూక్తము  ఋషి - ఆత్రేయ బాహువృక్తుడు, దేవత - మిత్రావరుణులు, ఛందస్సు - గాయత్రి     1. మిత్రావరుణులారా ! మీరు శత్రు ప్రేరకులు. శత్రుహంతలు. మీరు హింసావర్జితమగు మా ఈ యజ్ఞమునకు విచ్చేయండి.     2. ప్రకృష్ట జ్ఞానయుక్త మిత్రావరుణులారా ! మీరు అందరకు స్వాములు. ఫలప్రదానము ద్వారా మా కార్యములను పాలించండి.     3. మిత్రావరుణులారా ! మీరు మా అభిషుత సోమము కొఱకు విచ్చేయండి. మేము హవి అందించు వారలము. మేము సమర్పించు సోమపానము చేయుటకు విచ్చేయండి.                                               డెబ్బది రెండవ సూక్తము   ఋషి - ఆత్రేయ బాహువృక్తుడు, దేవత - మిత్రావరుణులు, ఛందస్సు - ఉష్ణిక్.     1. మా గోత్ర ప్రవర్తకుడగు అత్రివలె మేము మంత్రములతో మిమ్ము ఆహ్వానింతుము. మిత్రావరుణులారా ! మీరు సోమపానమునకుగాను కుశాసనమున ఆసీనులు అగుడు.     2. మిత్రావరుణులారా ! మీరు జగదుద్దారక కర్ములు. మీరు స్థానచ్యుతులు కారు. ఋత్విక్కులు మీకు యజ్ఞప్రదానము చేసెదరు. సోమపానమునకు గాను కుశాసనమున ఆసీనులుకండి. "నిబర్హీషి సదతం సోమపీతయే"     3. మిత్రావరుణులారా ! మీరు మా యజ్ఞమునుకోరి స్వీకరించండి. సోమపానమునకుగాను కుశాసనమున కూర్చుండుడు "నిబర్హీషి సదతం సోమపీతయే"     (ఆంధ్రవచన ఋగ్వేద సంహిత ఐదవ మండలమున నాలుగవ అష్టకము ఐదవ అనువాకము సమాప్తము)                ఆరవ అనువాకము             డెబ్బది మూడవ సూక్తము         ఋషి - ఆత్రేయ పౌరుడు, దేవత - అశ్వినులు, ఛందస్సు - అనుష్టుప్.     1. లెక్కకు మిక్కిలి యజ్ఞములందు భుజించు అశ్వినీకుమారులారా ! మీరు ఇప్పుడు అత్యంత దూరదేశమగు అంతరిక్షమున ఉన్నారు. ద్యులోకమున ఉన్నారు. అట్లయ్యు అన్ని స్థానములనుండి ఇచటికి విచ్చేయండి.     2. అశ్వినులారా ! మీరు అనేక యజమానులకు ఉత్సాహదాతలు. వివిధ కర్మల కర్తలు. వరణీయులు. అప్రతిహతగాములు. అనిరుద్ధకర్ములు. ఈ యజ్ఞమున మేము మీవద్దకు చేరెదము. విశేష భోగము, రక్షణ కొఱకు మేము మిమ్ము ఆహ్వానించుచున్నాము.     3. అశ్వినులారా ! సూర్యుని స్వరూపమును ప్రదీప్తము చేయుటకుగాను రథపు దీప్తిమంతమగు చక్రమును నియమించినారు. మీ సామర్థ్యమును మానవుల అహోరాత్రికాలమును నిరూపించుటకుగాను అన్య చక్రములను లోకములందు పరిభ్రమింప చేసినారు.     4. వ్యాపక దేవద్వయమా ! మేము మిమ్ము స్తుతించు స్తోతలము ఇది 'పౌరు'ని ద్వారా సుసంపాదితము. పృథిక్ ఉత్పన్నులు - నిష్పాపులగు మీరు మాకు బోలెడు అన్నము ప్రసాదించండి.     5. అశ్వినులారా ! మీ భార్య సూర్యమీ సర్వథా శీఘ్రగామి - రథమున ఎక్కినపుడు - అప్పుడు వెలుగులు చిమ్ము మీ దీప్తి నలుదిశల క్రమ్ముకొనును.     6. నేతలగు అశ్వినులారా ! మా తండ్రి అత్రి మిమ్ము స్తుతించినపుడు అగ్ని తాపము సుఖ సేవ్యమయినది. అతడు అందుకు కృతజ్ఞతచిత్తమున మీ ఉపకారమును స్మరించినాడు.     7. అశ్వినులారా ! మీ రథము గట్టిది. ఉన్నతము. నడకనేర్చినది. ఆ రథము యజ్ఞములందు ప్రసిద్ధము. మా తండ్రి అత్రి మీవలననే తరించినాడు.     8. మధుర సోమరసమును కలుపు దేవద్వయమా ! మేము సమర్పించు పుష్టికరమగు స్తుతి మీ మీద మధుర రసమును చల్లవలెను. మీరు అంతరిక్ష సీమను అతిక్రమింతురు. సుపక్వ హవ్యము మిమ్ము పోషించును.     9. అశ్వినులారా ! పండితులు మిమ్ము సుఖదాతలనుగా పేర్కొందురు. అది నిశ్చయ సత్యము. మా యజ్ఞమునకు సుఖదానార్థము ఆహ్వానించుచున్నాము. మీరు అతిశయ సుఖదాతలు కావలెను.     10. శిల్పి రథమును అందముగా చెక్కినట్లు మేము అశ్వద్వయమును సంవర్థితులను చేయుటకు స్తుతులు సమర్పించుచున్నాము. ఆ స్తుతులు అశ్వినులకు ప్రీతికరమును కావలెను.                                         డెబ్బది నాలుగవ సూక్తము         ఋషి - ఆత్రేయ పౌరుడు దేవత - అశ్వినులు, ఛందస్సు - అనుష్టుప్.     1. అశ్వినులారా ! మీరు స్తుతిధనులు. ధనవర్షులు. మీరు నేడు ఈ యజ్ఞ దినమున ద్యులోకమునుండి విచ్చేయండి. భూమి మీద నిలువండి. ఈ స్తోత్రమును వినండి. ఈ స్తుతిని మీ కొఱకు అత్రి సర్వదా పఠించును.     2. దీప్తిమంతులగు నా సత్యద్వయము - అశ్వినులు ఏరి? నేటి ఈ యజ్ఞదినమున ద్యులోకమునందలి ఏ స్థానము నుండి శ్రుతులగుచున్నారు?     దేవద్వయమా ! మీరు ఏ యజమాని దగ్గరకు విచ్చేయచున్నారు? ఏ స్తోత మీ స్తుతులకు సహాయకుడు అగుచున్నాడు?     3. అశ్వినులారా ! మీరు ఏ యజ్ఞము - ఏ యజమానివద్దకు ఏతెంచుచున్నారు? అట్లు వెళ్లి ఎవరిని కలిసి కొందురు? ఎవరి ఎదుట నిలిచి మాట్లాడుటకు రథమునకు గుఱ్ఱములు కట్టుచున్నారు? ఎవరి స్తోత్రములు మీకు ప్రీతికరములు? మేము మిమ్ము పొందవలెనను కోరికగలవారము.     4. పౌరసంబంధి అశ్వినీ కుమారులారా ! మీరు పౌరునివద్ద జలవాహక మేఘమును ప్రేరేపించండి. అడవిలో పులులు సింహమును కొట్టినట్లు యజ్ఞకర్మ వ్యాప్త పౌరునివద్ద మేఘమును కొట్టుడు.     5. చ్యవనుడు జరా జీర్ణుడు. పురాతనుడు. కురూపి. అశ్వినులారా ! మీరు అతనిని కవచమువలె విముక్తము చేసినారు. మీరు చ్యవనుని మరల ప్రాయపు వానిని చేసినపుడు అతనిని రూపమును సురూపయువతి కామించినది. పొందినది.     6. అశ్వినులారా ! ఈ యజ్ఞస్థలమునకు మీ స్తోతలు వచ్చియున్నారు. మాకు సమృద్ధి కలుగుటకుగాను మేము మీ దృష్టిలో ఉండవలెను. నేడు మీరు మా ఆహ్వానమును ఆలకించండి. మీరు అన్నరూప ధనవంతులు మీరు రక్షణలతో ఇటకు ఏతెంచండి.     7. అశ్వినులారా ! మీరు అన్నరూప ధనవంతులు. మానవులను మిమ్ము మించి ప్రసన్నులను చేయువాడు ఎవడు? జ్ఞానులచే వందితులగు దేవద్వయమా ! ఏ జ్ఞాని మిమ్ము అందరిని మించి ప్రసన్నులను చేయగలడు?     8. అశ్వినులారా ! దేవతలందరి రథములలో మీ రథము వేగవంతము, అసంఖ్యాక శత్రుసంహారకము. ఆ రథమును యజమానులు నుతింతురు. మీ రథము దూరహితమును కోరవలెను. మావద్దకు చేరవలెను.     9. మధుమంతులగు అశ్వినులారా ! మీ కొఱకుగాను మరల మరల సమకూర్చిన స్తోత్రములు మాకు సుఖములు కలిగించవలెను. విశిష్ట జ్ఞానసంపన్నులగు అశ్వద్వయమా ! మీరు శ్యేన పక్షివంటి సర్వత్ర సంచరించు అశ్వమును ఎక్కి మాకు అభిముఖముగా రండి.     10. అశ్వినులారా ! మీరు ఎక్కడ ఉన్నను మా ఆహ్వానమును వినిపించుకొనుడు. మీ వద్దకు వచ్చుటకు అతురపడు ఈ హవ్యము మీవద్దకు చేరవలెను. మీకు అందవలెను.                                          డెబ్బది అయిదవ సూక్తము         ఋషి - ఆత్రేయ అవస్యుడు - దేవత - అశ్వినులు, ఛందస్సు - పంక్తి.     1. అశ్వినులారా ! అవస్యు ఋషి మీ ఉభయుల స్తుతికర్త. అతడు మీ ఫలప్రద, ధనపూర్ణ రథమును అలంకృతము చేయును. మధు విద్య ఎరిగిన వారలారా ! మా ఆహ్వానమును ఆలకించండి. "మమశ్రుతం హవమ్"     2. అశ్వినులారా ! మీరు శత్రుసంహారకులు. హిరణ్మయ రథారూఢులు. ప్రశస్త ధనసంపన్నులు. నదులను ప్రవహింప చేయువారు. మధువిద్యావిశారదులు. మీరు అందరు యజమానులను అతిక్రమించి ఇచటకి విచ్చేయండి. అందువలన మేము సమస్త విరోధులను ఓడించగలము. మీరు ఆహ్వానములు వినండి. "మమశ్రుతం హవమ్"     3. అశ్వినులారా ! మీరు సువర్ణ రథారూఢులు. స్తుతియోగ్యులు. అన్నరూపధనవంతులు. యజ్ఞమున అధిష్ఠించినారు. మధువిద్యావిశారదులు. మీరు మా పిలుపు వినండి. మా కొఱకు రత్నములు తీసికొని రండి.     4. ధనమును వర్షించు అశ్వినులారా ! నేను మీ స్తోతను. ఈ స్తోత్రములు మీ కొఱకు ఉచ్చరించబడినవి. ప్రసిద్ధుడు, మూర్తిమంతుడగు యజమాని ఏకాగ్రచిత్తమున మీకు హవి సమర్పించును. "మమశ్రుతం హవిం"     5. అశ్వినులారా ! మీరు విజ్ఞ మనస్కులు. రథారూఢులు. ద్రుతగాములు. స్తోత్రశ్రవణకర్తలు. మీరు త్వరగా రథమునెక్కి కపటము ఎరుగని చ్యవనుని వద్దకు వెళ్లినారు. మీరు మధువిద్యావిశారదులు  "మమశ్రుతం హవమ్"     6. నేతలగు అశ్వినులారా ! మీ గుఱ్ఱములు సుశిక్షితములు. ద్రుతగాములు విచిత్రరూపులు. ఆ అశ్వములు మిమ్ము ఐశ్వర్యయుక్తముగ సోమపానమునకుగాను ఇచటికి తీసికొని రావలెను.  "మమశ్రుతం హవమ్"     7. అశ్వినులారా ! మీరు ఇచటికి ఏతెంచండి. మీరిద్దరు ప్రతికూలురుకారాదు. అజేయ ప్రభువులారా ! ఏ ప్రచ్చన్న ప్రదేశమునుండియైనను యజ్ఞగృహమునకు వేంచేయండి. మధువిద్యావిశారదులారా ! "మమశ్రుతం హవమ్"     8. జలాధిపతులు, అజేయులగు అశ్వినులారా ! ఈ యజ్ఞమున మీ స్తోత్రకారుడగు అవస్యుని అనుగ్రహించండి. మధువిద్యావిశారదులారా ! "మమశ్రుతం హవమ్"     9. ఉషస్సు వికసించినది. సముజ్వల కిరణ సంపన్న అగ్ని వేదిమీద సంస్థాపితమయినది. ధనవర్షకారులు, శత్రుసంహారకులగు అశ్వినులారా ! మీ అక్షయ్య రథమును అశ్వయుక్తము చేయండి. మధువిద్యావిశారదులారా ! "మమశ్రుతం హవమ్"                                         డెబ్బది ఆరవ సూక్తము         ఋషి - ఆత్రేయ భౌముడు, దేవత - అశ్వినులు, ఛందస్సు - త్రిష్టుప్.     1. ఉషఃకాలమున జాగృతుడయిన అగ్ని ప్రజ్వరిల్లును. మేధావులగు స్తోతల దేవాభిలాష స్తుతులు ఉద్గీతములగును. రథాధిపతులగు అశ్వినులారా ! నేడు మీరు ఈ యజ్ఞస్థలమునకు అవతరించండి. సోమరస పూర్ణ సమృద్ధ యజ్ఞమునకు విచ్చేయండి.     2. అశ్వినులారా ! ఇది సంస్కారవంతమగు యజ్ఞము. దీనిని హింసించరాదు. కాని యజ్ఞమునకు త్వరగా వచ్చి స్తుతిభాజనులుకండి. ప్రాతఃకాలమున రక్షణ సహితులయి విచ్చేయండి. అందువలన అన్నమునకు అభావము కలుగదు. హవ్యదాత యజమానిని సుఖవంతుని చేయండి.     3. అశ్వినులారా ! మీరిద్దరు రాత్రిశేషమున పాలుపితుకుకాలమున ప్రాతఃకాలమున అపరాహ్నమున రాత్రిపూట ఏ సమయమందయినను సుఖకర రక్షణలతో విచ్చేయండి. అశ్వినులను విడిచి ఇతర దేవతలు సోమపానమునకు ఉద్యుక్తులుకారు.     4. అశ్వినులారా ! ఈ ఉత్తర వేది మీకు నివాసయోగ్యమగు ప్రాచీనస్థలము. ఈ సమస్త గృహము ఆలయము మీ కొఱకే అగును. మీరు ఇరువురు వాయుపూర్ణ, మేఘ సమాకీర్ణ అంతరిక్షము నుండి అన్నము, బలమును తీసికొని మా వద్దకు చేరండి.     5. మేమందరము అశ్వినుల శ్రేష్ఠరక్షణలు సుఖప్రద ఆగమములతో ముడిపడవలెను. అమర దేవద్వయమా ! మీరు మాకు ధనము, సంతానము, సమస్త కళ్యాణములను ప్రసాదించండి.                                      డెబ్బది ఏడవ సూక్తము           ఋషి - ఆత్రేయుడు, దేవత - అశ్వినులు, ఛందస్సు - త్రిష్టుప్.     1. అశ్విద్వయము ఉదయమే - అందరి దేవతలకన్నముందు విచ్చేయుదురు. ఋత్విక్కులారా ! వారిని పూజించండి. కాంక్షగల అదానపరులగు రాక్షసులు మున్నగువారికన్నముందే వారు హవ్యపానము చేయుదురు. వారు ప్రాతఃకాలముననే యజ్ఞమును భజింతురు. పూర్వకాలపు ఋషులు ప్రాతఃకాలమున అశ్విద్వయమును ప్రశంసించినారు.
24,746
    "చాల్లే. చిన్నపిల్లవాడి మాటలకి ఉడుక్కుంటావెం?"  కన్నారావుని మంద లించి పండు వ్తేపుకి తిర్గాడు చిట్టబ్బాయ్...."చెప్పబాబు"     "ఏంటి చెప్పాలి?"     "మీ ఇంటి పేరు ఏంటి?"     "హయ్యో... ఇల్లు ఏమ్తెనా మనిషా? ఇంటికేక్కడ్తెనా పెర్లుంటాయా? హవ్వా...హిహిహి"     కన్నారావు తల పట్టుకున్నాడు.     "అది కాదు బాబు... ని పేరేంటి చెప్పు?     "ప్రశాంత్...." గర్వంగా అన్నాడు పండు.     "ఏ ప్రశాంత్....అంటే ని పేరు ముందు 'ఏ' ఉందా 'బి' ఉందా 'సి' ఉందా లేకపోతే వేరే లెటర్ ఎద్తేనా ఉందా? ఇపుడు చెప్పు...ని పేరేంటి!"     "ఎ బి సి డి ఇ యెఫ్ జి హెచ్...  యక్స్   వ్తే జడ్ ప్రశాంత్ "     ఈ సారి చిట్టబ్బాయి  తలపట్టుకున్నాడు.     'అలా' హ్తెరానా పడిపోకపోతే   స్కూల్ బ్యాగ్ లోంచి పుస్తకాలు తిసి చూడకూడదు? వాటిమీద అంటించిన లేబుల్స్ మీద విడి పేరు వాళ్ళ నాన్నో, అక్కో రాసి ఉంటారు"  అన్నాడు కన్నారావు.     "నేను పడ్తున్న అవస్తలు  చూస్తూనే ఉన్నావ్.  ఈ ఐడియా ఇందాకే చెప్పి ఉండొచ్చుగా!" చిట్టబ్బాయి  విసుక్కున్నాడు.     "నాకూ ఇప్పడే తట్టింది" చెప్పాడు కన్న్రారావు.     చిట్టబ్బాయి పండు స్కూల్ బ్యాగ్ లోంచి పుస్తకాలు తిసి చూశాడు.     "కె. ప్రశాంత్ అని ఉంది విడి పుస్తకాల మీద 'కె' అంటే ఎంటో?"  ఆలోచిస్తూ అన్నాడు చిట్టబ్బాయి.     "ఏమిటయితే నికెంటి? మనకి రంగనాయకులు ఫోన్ చేద్దాం..."  అన్నాడు కన్నారావు.     "ద!..." పండు చేయిపట్టి లేవదిస్తూ అన్నాడు చిట్టబ్బాయి.                                                                                            5     పోలిస్ స్టేషన్ లో....     ఇన్ స్పెక్టర్ బంగార్రాజు గదిలో.....     ఇన్ స్పెక్టర్ బంగార్రాజు తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. అతనిఎదురుగచిన్నమ్మాయి, రంగనాయకులు కూర్చుని ఉన్నారు.     కానిస్టేబుల్ ఏడుకొండలు కూడా దీర్ఘంగా ఆలోచిస్తూ అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. అతని బూట్లు చేసే టకటక శబ్దం ఆ గదిలోంచి నిశ్శబ్దాన్ని భంగాపర్తుస్తుంది     ఇన్ స్పెక్టర్ బంగార్రాజు చికాకుగా మొహం పెట్టి ఏడుకొండలు వంక చూశాడు.     "మిస్టర్ సెవెన్ హిల్స్?" అంటూ అరిచాడు.     అటూ ఇటూ పచార్లు చేస్తున్న ఏడుకొండలు చటుక్కున ఆగిపోయాడు.     "యస్ సార్".     "ఇన్ స్పెక్టర్ ని నేనా?  నువ్వా?"     "మిరే సార్...."     "మరి అలాగ్తేతే నువ్వే ఇన్ స్పెక్టర్ అయినట్లు అలా సీరియస్ గా పచార్ల చేస్తావెం? మర్డరు చేసేస్తా జాగ్రత్త!!...."     "ఆ బాబుని ఎవరు ఎందుకు ఎత్తుకుని  వెళ్ళారో  ఆలోచిస్తున్నా సార్"     "అది ఆలోచించాల్సింది  నేను.... నేను ఏది చెప్తే అది చెయ్యల్సింది నువ్వు!"     "యస్ సార్...."     కానిస్టేబుల్ ఏడుకొండలు ఓ మూలకి వెళ్ళి నిల్చున్నాడు.     ఇన్స్ పెక్టర్ బంగార్రాజు రంగనాయకులు వ్తెపుకి తిరిగాడు.     "బాగా గుర్తు చేస్కొండి....ఇందాక మీకు పాత కేడిలా ఫొటోలన్ని చూపించాము కదా?.... వాటిల్లో  మీ అబ్బాయిని తిస్కెళ్ళినవాడి ఫోటో లేదా?     "లేదు ఇన్స్ పెక్టర్!.. మాయదారి సంత... వాడు  ఈ వృత్తిలోకి కొత్తగా దిగాడెమో!!" దిగులుగా అన్నాడు రంగనాయకులు.     "మీరు మా పండుని ఎలాగ్తెనా వెతికి పట్టుకోవాలి ఇన్స్ పెక్టర్ గారూ" చిన్నమ్మాయి కళ్ళనీళ్ళు  పెట్టుకుంటూ అంది.     "అయ్యో! నువ్వు అంతగా చెప్పాలా అమ్మా!....  అది మా డ్యూటి.  మీ తమ్ముడిని  ఎత్తుకుని వెళ్ళిన వాళ్ళని తప్పకుండా పట్టుకుని వాళ్ళని మర్డర్  చేస్తాను. ఈ గోల్డెన్ కింగ్ అంటే బంగార్రాజు తడాఖా గురించి నీకింకా తెలిదు"     "అంత పసివాడు.... వాడు ఎవరికీ అన్యాయం చేశాడని ఇన్ స్పెక్టర్ వాడిని తిస్కెళ్ళరు? ఆ తిస్కెళ్ళేది నన్త్నేనా తిస్కెళ్ళరు  కాదు" గద్గద స్వరంతో అన్నాడు రంగనాయకులు.     "మిమ్మల్ని తిస్కెళ్ళడం కష్టమని బాబుని  తిస్కెళ్ళి ఉంటారు. మీరూరుకోండి సార్... ఆ దుండగుల్ని పట్టుకుని నేను మర్డర్  చేస్తాగా?" ఊరడిస్తూ అన్నాడు బంగార్రాజు.     "మీరు ఎవర్ని మర్డరు చేయనక్కర్లేదు మాయదారి సంత! మా బాబుని  మాకు తేచ్చివ్వండి చాలు"     "ఆ వీధిలో ఇంకా చిన్న పిల్లలు ఎవరూ లేరా?" కళ్లు చిట్లించి అడిగాడు బంగార్రాజు.     "లేకేం? చాలామంది ఉన్నారు"  చెప్పాడు రంగనాయకులు.     "మరి అంతమంది పిల్లలు ఉండగా మివాడినె  ఎందుకు ఎత్తుకుని పోయారు?..."     "దిక్కుమాలిన సంత!.... అదే అర్ధం అయి చావడంలేదు  ఇన్ స్పెక్టర్"     "మీకు శత్రువులేవర్తెనా  ఉన్నారా?"     ""అట్లాంటి పనికిమాలిన  సంత నాకెవరూ లేరు ఇన్ స్పెక్టర్ ....."     "మీ పండుని ఎవరో కొడ్నాప్ చేసి తిసుకెళ్ళరాణి మీకు ఎప్పుడు తెలిసింది?"      "నేను కూరగాయలు కొంటుంటే నాకు బజార్లో రామయ్య కనిపించాడు. అప్పడే తెలిసింది. అప్పటికి పండు ఇంట్లోంచి వెళ్ళి దాదాపు రెండు గంట ల్తెంది"  చెప్పింది చిన్నమ్మాయి.     "అసలు స్కూల్లోనే ఉన్నాడేమో చూశారా?"     "స్కూలు ప్రిన్సిపాల్ కి ఫోన్ చేశాం ఇన్ స్పెక్టర్.... పండు ఈ వేళ స్కూలుకి రాలేదని వాళ్లు చేవ్పారు."     "ఆ రామయ్య ఉన్నాడా?"     "బయటి నిల్చుని ఉన్నాడు" అన్నాడు రంగనాయకులు.     "ఏయి సెవెన్ హిల్స్?"     "యస్ హర్"     "బయట నిల్చుని ఉన్న రిక్షావాడిని లాక్కురా"     "యస్సార్"     ఏడుకొండలు బయటికివెళ్ళి రామయ్యని లాక్కొచ్చాడు.     బంగార్రాజు రామయ్యని ఏం జరిగిందో చెప్పమన్నాడు. రామయ్య పండుకు జ్వరం వచ్చిందని ఈ వేళ  స్కూలు రాడు అని ఎవరో చెప్పి పంపించడం గురించి చెప్పాడు.     'ఆ మనిషి ఎలా ఉన్నాడు?'     రామయ్య వర్ణించి చెప్పాడు.     ఇన్ స్పెక్టర్  బంగార్రాజు చిన్నమ్మాయి వంక చూశాడు.     "మీరు చెప్పిన వర్ణన ప్రకారం చూస్తే మీరు మాట్లాడింది మరో  మనిషితో.... కాబట్టి పండుని కిడ్నాప్ చేయడంలో  ఇద్దరి హ్యండ్ ఉంది...  వాళ్ళిద్దర్ని  మర్డర్  చేస్తా...." పళ్ళు  బిగించి అన్నాడు బంగార్రాజు.      అంతలో ఫోన్ మోగింది.... బంగార్రాజు ఫోన్ ఎత్తుకున్నాడు.     "హలో... ఎవరూ? ...ఆ...ఒహొ!!! మర్డరు జరిగిందా?  లేదా? వట్టి దోంగాతనంమే  జరిగిందా? ఎక్కడ? ఆ... ఆ... ఆ... ఇప్పడే వస్తున్నా..."     పోన్ పెట్టేసి సీట్లోంచి హడావిడిగా లేచాడు బంగార్రాజు.     "దొంగతనం కేసు....నేను వెంటనే వెళ్ళాలి..."
24,747
                                     భయం గుప్పిట్లో     మధ్యాహ్నం పన్నెండు గంటలు దాటింది.      రోడ్డుమీద ట్రాఫిక్ రద్దీగానే వుంది. అయితే ప్రొద్దున 9-11, సాయంత్రం 5-7 గంటల మధ్య వుండే రద్దీతో పోలిస్తే  ఈ మహా నగరంలో ఆ సమయంలో వున్న ట్రాఫిక్ ఒక లెక్కలోది కాదు. శనివారాలు కేంద్ర ప్రభుత్వ ఆఫీసులకు సెలవు. ఆదివారం అందరికీ సెలవు. అందువల్ల ఈ రెండు రోజులూ, మిగతా ఐదురోజులతో పోలిస్తే ట్రాఫిక్ తక్కువగానే వుంటుంది.      ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కి వచ్చేవారు తరచుగా ఒక విమర్శ చేస్తుంటారు  -  'ఇక్కడి ప్రజలు మంచివారు. ఆత్మీయంగా మాట్లాడతారు. సహాయక గుణం వున్నవారు. కాని, బాగా చదువుకున్నవాళ్లలో కూడా చాలామందికి బొత్తిగా ట్రాఫిక్ సెన్స్ వుండదు. కార్లేమిటి, స్కూటర్లేమిటి, సైకిళ్లేమిటి - ఎవరికి వారు తాము వెళ్లిపోవడమే చూసుకుంటారు కాని, ట్రాఫిక్ నిబంధనలను అసలు పట్టించుకోరు. ఆ విషయంలో జైపూర్ కూడా అంతే. ఈ రెండు నగరాల ప్రజలస విషయంలో అన్నీ బాగున్నా,  బాగుండని లక్షణం ఇదొక్కటే!' అని. ఈ విషయంలో ఎవరో అన్నారని మనం బాధపడవలసిన అవసరం లేదు. ఆత్మవిమర్శ చేసుకుంటే ఆ మాటలు అక్షరాలా నిజమని మనకీ అనిపిస్తుంది.     చౌరస్తాలో ఆటోమాటిక్ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర రెడ్ లైట్ ఆన్ లో వుంది.     ఎల్లో లైట్ ఇంకా రాకుండానే చాలా స్కూటర్ లు లైన్ దాటేసి రన్నింగ్ రేస్ లో లాగా బాగా ముందుకి వచ్చి సిద్దంగా వున్నాయి. నిజానికి - ఎల్లో లైట్ ఆన్ లో వుండగా వెళ్తున్న  వాహనాలు, ఆ సమయంలో పూర్తిగా వెళ్ళిపోవాలి. దాంతో ట్రాఫిక్ క్లియర్ అవుతుంది కనుక  అప్పటివరకూ రెట్ లైట్ వున్న కారణంగా వేచి వున్నవారు గ్రీన్ లైట్ రాగానే సులువుగా వెళ్లవచ్చు. ఈ మాత్రం రూల్స్ పాటిస్తే చాలా యాక్సిడెంట్ లు జరగవు. కాని, మనవాళ్లకి అంతమాత్రం ఓపిక ఎక్కడుందీ?!     ట్రాఫిక్ కానిస్టేబుల్ ఒకతను చౌరస్తాలో ఒక ప్రక్కగా నిలబడి అవసరానికి తగగ్ట్టుగా విజిల్ వేస్తూ ట్రాఫిక్ కి డైరెక్షన్ ఇస్తున్నాడు.      కొంచెం దూరంలో యూనిఫారంలోవున్న ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ ప్రకాష్ తన మోటారుసైకిల్ రోడ్డుకి ప్రక్కగా ఆపి, దానివెనుక నిలబడి వున్నాడు. మోటారుసైకిల్ మీద రసీదు పుస్తకాలూ,  ఇంకేవో పుస్తకాలూ బొత్తిపెట్టి వున్నాయి. ఆయనకు కొంచెం దూరంలో  మరో ట్రాఫిక్ కానిస్టేబుల్ వున్నాడు. వాళ్ల డ్యూటీ..... ట్రాఫిక్ రూల్స్ ని అతిక్రమించిన  వారిని అటకాయించి పట్టుకుని కేసులు పెట్టడం,  చలాన్ చేసి పైసలు కట్టించుకుని రసీదులు ఇయ్యడం, అవసరమైతే వెహికిల్ ని సీజ్ చేయడం!      ఉరుకులు, పరుగులతో ఆఘమేఘాల మీద గమ్యాస్థానం చేరాలన్న ఆత్రుతతో వున్నవారిలో సురేష్     ఒకడు.     అతను ఒక ప్రసిద్ద ప్రైవేట్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్. ఆరోజు మూడు గంటలకి కంపెనీ బోర్డు మీటింగ్ వుంది. దానికి ఏర్పాట్లు చూడాల్సిందీ, అవసరమైన కాగితాలు తయారుచేయవలసిందీ, సమాచారం అందించవలసిందీ అతనే!     మీటింగ్ కి ఒక గంట ముందే వెళ్ళి అన్నీ చుసుకుందామనుకున్నాడు. ఇంటి నుంచి ముందుగానే బయలుదేరాడు. కాని, అనుకోకుండా మూడు నాలుగు చోట్ల ట్రాఫిక్ జాంలలో ఇరుక్కుపోయాడు. ఊళ్ళో ఏదో పార్టీ ర్యాలీలు నిర్వహిస్తున్న కారణంగా చాలాచోట్ల ఇలా ట్రాఫిక్ జాం లు ఏర్పడ్డాయి. వాటిలో ఒకసారి ఇరుక్కుంటే ముందుకి వెళ్ళడానికీ వీలుండదు... వెనక్కి తిరగాలన్నా కుదరదు. ఆ ట్రాఫిక్ క్లియర్ అయ్యేదాకా భజన చేయాల్సిందే!     ఈ అవాంతరాలతో బాగా ఆలస్యం కావడంతో... చాలా కంగారులో వున్నాడు సురేష్, రెడ్ లైట్ పోయి ఇంకా ఎల్లో లైట్ రాకుండానే స్కూటర్ స్టార్ట్ చేసి ఒక్క ఉదుటున నడిపాడు.     ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంటనే విజిల్ వేశాడు. అతనితోపాటు ప్రకాష్ ప్రక్కనున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా విజిల్ వేశాడు.     అయినా సురేష్ ఆగలేదు.     ఆగితే పోలీసులు పట్టుకోవడం, వాళ్ళు నాలుగు నీతిసూత్రాలూ, పది రూల్సూ చెప్పి, అనేక యక్ష ప్రశ్నలు వేసి చివరకు చలాన్ చేయడం.... మామూలు వ్యవహారం! అందులో ఇరుక్కుంటే ఇంక ఆఫీసుకి టైముకి వెళ్లలేడు. అందుచేత ఏమైతే అదే అవుతుందిలే.... అని దేవుడి మీద భారం వేసి స్కూటర్ వేగం పెంచాడు సురేష్ - వెనక్కి తిరిగి చూడకుండా.     చేసిన తప్పు ఒప్పుకుంటే  ఎవరికైనా సానుభూతి కలుగుతుంది. ఆ తప్పుని కప్పిపుచ్చుకోవాలని చూస్తే ఎలాంటివారికైనా కోపం వస్తుంది. అటువంటిది - మండుటెండలో ట్రాఫిక్ డ్యూటీ చేసే పోలీసులకు తిక్కరేగడంలో ఆశ్చర్యం లేదు.      ఎప్పుడైతే సురేష్ పదేపదే విజిల్స్ వేస్తున్నా ఆగకుండా సాగిపోయాడో, ఇన్ స్పెక్టర్ ప్రకాష్ కి సహజంగానే  కోపం వచ్చింది. తన మోటార్ సైకిల్  మీదుంచిన రసీదు పుస్తకాలు  వగైరాలను ప్రక్కనున్న  కానిస్టేబుల్ కి  అప్పచెప్పి తన మోటార్ సైకిల్ ను స్టార్ట్ చేశాడు. సిగ్నల్ గ్రీన్ లో వుండడంతో  ఏ ఆలస్యం లేకుండా సురేష్ ని వెంబడించసాగాడు.       తనను ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ వెంబడిస్తుండడాన్ని  సురేష్ గమనించాడు. అతని  పైప్రాణాలు పైనే పోయాయి. అసలు అతనికి పసితనం నుంచే పోలీసులంటే చచ్చే భయం! చిన్నప్పుడు అన్నం తినక మారాం చేస్తుంటే - వాళ్లమ్మ - "అదుగో.... పోలీసు వస్తున్నాడు  అన్నం తినకపోతే నిన్ను ఎత్తుకుపోతాడు" అని భయపెట్టేది. ఆ భయంతో ఆకలి లేకపోయినా, రుచిగా లేకపోయినా తినేసేవాడు. అప్పటినుంచీ కూడా పోలీసులంటే 'యమదూతలు' అన్నంత భయం పట్టుకుంది అతనికి. పెద్దవాడయ్యాక పేపర్లలో పోలీసుల 'చిత్రహింసలు','లాకప్ డెత్ లు' వంటి వార్తలు చదివాక ఆ భయం మరీ పెరిగిపోయింది. దాంతో సాధ్యమైనంతవరకూ పోలీసుల దరిదాపులకు వచ్చేవాడు కాదు. వారు కనిపిస్తే తప్పించుకు తిరిగేవాడు. అటువంటిది - ఈరోజున పోలీసు చేతిలో పడబోతున్నాడంటే వెన్నులోంచి వణుకు  పుట్టింది.      ఆ భయంలో మరింత వేగంగా డ్రైవ్ చేయడం, ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ ను తప్పించుకోవడం కోసం సందులు, గొందులు, అడ్డదారుల వెంట వెళ్ళడం మొదలుపెట్టాడు.     విసుగు చెందని విక్రమార్కుడిలాగా ప్రకాష్ అతన్ని అనుసరిస్తూనే వున్నాడు.     అలా కొంతదూరం ఈ దొంగనాటకం సాగాక - సురేష్ స్కూటర్ ఆగిపోయింది. ముందుకి వెళ్లనని మొరాయించింది.     ఎంత కొట్టినా స్టార్ట్ కాలేదు.     చివరిబొట్టు దాగా ఫ్యూయల్ అయిపోయాక అది ఇంకేం స్టార్ట్ అవుతుంది? చేసేది లేక స్కూటర్ కి స్టాండ్ వేసి ప్రక్కనే నిలబడ్డాడు రొప్పుతూ.     మరో రెండు నిముషాలలో ఇన్ స్పెక్టర్ ప్రకాష్ కూడా అక్కడికి వచ్చాడు. అయనా మోటార్ సైకిల్ కి స్టాండు వేసి నిలబడ్డాడు. ఆయన కూడా రొప్పుతున్నాడు.     ఆయన దగ్గరకు రాగానే -"సారీ సార్! అర్జంటు పని వుండడం వల్ల సిగ్నల్ రాకుండానే  బండిని  నడిపాను. నేను చేసింది తప్పే!" అన్నాడు సురేష్ రొప్పుతూనే.
24,748
     "ఇంతమాత్రానికి ప్లీడరు గారెందుకయ్యా. ఇలాంటి  లం....తో ఎవరు కాపరం చేస్తారయ్యా నేనే యిస్తాను విడాకులు ఏయే కాయితాలమిద ఎక్కడెక్కడ సంతకాలు పెట్టాలో చెప్పండి. పెట్టిపారేస్తాను.అసలు యీ రంకుముండయ్యా..." అంటూ బిళ్ళ బంట్రోతు బయటకు  లాక్కెళ్ళేదాకా వాగుతూనే వున్నాడు.తర్వాత బయటికొచ్చి  చెట్లక్రింద నిలబడి ప్లీడర్లూ, అక్కడున్న రకరకాల మనుషులూ వినేలా అరవసాగాడాడు.     "ఇదిగో.... ఆ  లం..లేదూ?అది నా పెళ్ళాం.అది వాడ్ని వుంచుకుంది. వీడ్ని వుంచుకుంది. దానికి పాతికమందితో సంబంధముంది. మా వాడకట్టులో అది తిరగని మొగాడు లేడు. పైగా నామిద విడాకులు కావాలని కేసుబెట్టింది. దాని రోగాలన్నీ నా కంటించింది. లం...     అందరూ గుమిగూడి వింటున్నారు.ఒక్కళ్ళూ అతన్నాపటానీకి ప్రయత్నించలేదు.     పైపెచ్చు ఏదో లెమ్మన్నారు కూడా.     పాపకు బంగార్రాజు నుంచి విడాకులు లభించింది.                                         26     శకుంతల కేమి చెయ్యాలో తెలీదు ,ఒకటి రెండు రోజులు లోతుగా ఆలోచించి భూలోకమ్మ దగ్గరకెళ్ళింది.     "ఏంటి పిల్లా కులాసాగా  వున్నావా?" అని భూలోకమ్మ సాదరంగా పలకరించి సర్వర్ని కేకేసి కాఫీ తెప్పించింది.     "ఏమిటి దిగులుగా కనిపిస్తున్నావు?" అనడిగింది భూలోకమ్మ కాఫీ త్రాగటం పూర్తయాక.          శకుంతల గురువుల్ని గురుంచీ అతను తనని పెడుతోన్న యిబ్బందుల గురించి చెప్పింది.     " గురువులగాడా? ఆ గిరజాలజుట్టు గాడేనా? బచ్చాగాడు. వాడింత పోటుగాడయ్యాడా?ఏం సాయం కావాలో చెప్పు. వాడ్ని శాల్తీ లేపెయ్యమంటావా?"     శకుంతల గుండె గబగబ కొట్టుకుంది. "అమ్మో, వద్దండి అతన్ని నా జోలికి రాకుండా చేస్తే చాలు" అంది.     "సరే, ఆ సంగతి కొంత ధైర్యమొచ్చింది. ఆమెకి కృతజ్ఞతలు తెలియచేసి యింటికెళ్ళి పోయింది.     ఆ సాయంత్రమే భూలోకమ్మ గురువులకి కబురుచేసింది. చీకటి పడ్డాక అతనొచ్చాడు.  "ఏంటి భూలోకమ్మా, కబురు చేశావు. ఎవర్నయినా ఫినిష్ చెయ్యాలా?" అనడిగాడు,     "నీ బొంద. నీలాంటి సన్నాసులతో వ్యవహారాలు నడిపేటంతటి చవటను కావు. నువ్వెంత? నీ బతుకెంత? చీడీలమిద కూచుని రోడ్డుమిద పోయేవాళ్ళని అల్లరిచేసే పిల్లరౌడీ వెధవ్వి."     "మాటలు  జాగ్రత్తగా రానియ్ భూలోకమ్మ. నేను మునపటి గురువుల్ననుకుంటున్నావేమో నైన్ టీన్ ఎయిటీ ఎయిట్ గురువులు. నీ ఆటలు నాదగ్గరేం సాగవు జాగ్రత్త."     "నోర్ముయిరా పిల్లకాకివెధవా!నువ్వు ఎయిటీ ఎయిట్ గురువులయితే నేను  నైన్  టీన్ ఎయిటి ఎయిట్ గురువులయితే నేను నాటీన్  భులోకమ్మ. మిలాంటి పిచిక వెధవలకన్నా చాలా ఎడ్వాన్సయిపోయాను.          "అలాగా?" అన్నాడు వ్యంగ్యంగా .ఆసరే దేనికీ పిలిపించావుట?"     "ఏమిటి? శకుంతల వేధిస్తున్నావుట."     "ఆ లొకాలిటీ నాది. అక్కడున్న వాళ్ళంతా నా చెప్పుచేతల్లో వుండాల్సిందే. శకుంతల నన్నెదిరిస్తోంది.అలాంటి పొగురబోతు వేషాలేస్తే వూరుకోను."     " నువ్వు. శాడిమామూలే గాకుండా ఆ అమ్మాయిని కూడా లొంగిపొమ్మని అంటున్నావుట."     "అంటే అంటారు.  అది నాకు  నచ్చింది కాబట్టి. "         "గురువులూ, ఆ పిల్ల వెనక నేనున్నాను. దాన్నే మయినా అంటే నేవూరుకోను జాగ్రత్త.     " ఏం చేస్తావు"?     " మక్కెలిరగ తన్నిస్తాను. అవసరమైతే శాల్తీనే లేకుండా  లేపేస్తాను."     " అబ్బా!" అన్నాడు  వ్యంగ్యంగా. "భులోకమ్మా నువ్వూ నా పవరూ నాకు తెల్సు. కాని నేనెంత ఎదిగానో నీకు తెలీదు. నా యిష్టమొచ్చినవాళ్ళు జోలికి నేను వెడతాను. నాదారి కడ్డంరాకు. నా మక్కెలిరగకొట్టటం శాల్తీ లేపెయ్యటం...అవన్నీ నీతల్లో జేజెమ్మకూడా చెయ్యలేదు"     " అలాగా?" అంది భూలోకమ్మ.  "సరే చూద్దాం."     "చూద్దాం" అంటూ గురువులు విసురుగా బయటకు వచ్చాడు. రోడ్డుమిద వేగంగా నడవసాగాడు.     రెండు మూడు ఫర్లాంగులు దూరమైనా వెళ్ళివుండడు. ఇంతలో నలుగురు మనుషులొచ్చి అతనిమిద కలియబడ్డారు.     " ఓహో!భూలోకమ్మ మనుషులా?  నాతడాఖా చూద్దురుగాని రండి" అంటూ వాళ్ళతో పోపరాటానికి సిద్ధపడ్డాడు.     " ఏడిశావు?" అంటూ వాళ్ళలో ఒకడు అతని పొట్టలో తన్నాడు. గురువులు  ఎదురుదెబ్బ తీసేలోపల వెనుక  నుంచి తలమిద బలంగా దెబ్బపడింది.ఇంకొకడు కాలు పట్టుకుని లాగటంతో క్రిందపడిపోయాడు. అక్కడ్నుంచీ వూపిరి తీసుకునేందుకు కూడా అవకాశం లేకపోయింది. వొళ్ళంతా హూనమైపోయింది. తెలివిప్పి పడిపోయే దాగా చితక బాది వెళ్ళిపోయారు.                                           27      విడాకులు తీసుకొన్నా పాపను బంగార్రాజు వదల్లేదు.     ఆమె రోడ్డుమిద ధైర్యం చేసికొట్టుపెడితే అక్కడికి వచ్చి అల్లరి చేసేవాడు.ఎవరింట్లోనైనా పనికి కుదురితే అక్కడికి వచచి నానా గోల చేసేవాడు.         ఇంటి వాళ్ళ దగ్గరకొచ్చి " మా ఆడాళ్లు న్నారు పిలవండి అనేవాడు.     " మి ఆడవాళ్లా? మిరిద్దరు విడాకులు తీసుకున్నారటగా.     " విడాకులా? రిడాకులా? తీసుకొంటే?" మాత్రం  నేను మొగుడ్నే అది పెళ్ళామే, అని రోడ్డుమిద జనమంతా  విలపేట్లు సేపు బూతుల పంచాంగం చదివి, తర్వాత వెళ్లి పోయేవాడు.     అతని గొడవ భరించలేక, ఆ యింటి వాళ్లా మెను పని లోంచి తీసేసేవారు.     పోలీసులు తన్నినా, భయంలేదు. నలుగురూ అసహ్యించుకుంటారని సిగ్గులేదు.     అతనో చిత్రమైన , నీచమైన జంతువు.          "ఏ మేయిలారా" అని పిలిచేవాడు. పెళ్లాన్ని ఆమె పని చేసే చోటు కెళ్ళి.     " ఏమిటి? మి అయ్యగారి గదిలోంచి వస్తున్నావు. వ్యవహారం పూర్తిచేసుకొచ్చావా?" అనేవాడు.         అతన్నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియటంలేదు. ఆమెహృదయంతో సూర్యచంద్ర ఎన్నోసార్లు మెదిలాడు. అతను చాలా సున్నిత  మనసు- మృదు స్వభావుడు. ఇటు వంటి నీచుడి ప్రక్కని నిలబెట్టి అతని వ్యక్తిత్వాన్ని కించపర్చటం, యీ అసహ్యమైన వాతావరణంలోకి అతని రికించటం ఆమె కిష్టంలేకపోయింది. అతన్ని చూడాలని, అతన్తో మాట్లాడాలని మనసెంత ఉవ్విళ్లురుతున్నా నిగ్రహించుకొనేది.
24,749
    "నీకు ఎంతసేపు నీవృత్తే ముఖ్యమైతే నేనెందుకు? ప్రేమెందుకు? పెళ్ళెందుకు......గుడ్ బై......నేను కావాలనుకుంటే నాతోపాటు తక్షణమే బయలుదేరు.....లేదంటే యిదే మన ఆఖరి కలయిక....." విసురుగా లేచింది మంగళ.     తనకన్నా తన మాటకన్నా తన వృత్తే ముఖ్యమా అనే కోపం ఆమెలో నాల్కులు చాచింది.     ఆ మాటలకు మనోహర్ కి శ్వాస బంధించినట్లయింది. తన పరిస్థితి అర్థం చేసుకోకుండా అంత మూర్ఖంగా మారుతుందని ఏనాడు వూహించని మనోహర్ మానసిక స్థితి తల్లక్రిందులైంది.     "నా పరిస్థితి పూర్తిగా తెలుసు నీకు. నేను పందెం నుంచి మానుకుంటే మొదట పిరికివాడ్నవుతాను. నా పరువు, ప్రతిష్టలు మంట గలిసిపోతాయి, ఆఖరున నా ఆస్తులన్ని పోతాయి. ఇవేమీ కాదనుకున్నా తెలిసి తెలిసి ప్రదీప్ లాండి వాడ్ని వదిలేస్తే ఆ, నా పాపానికి నిష్కృతి వుండదు. మోడల్స్ తో ఆటలాడుకుంటున్న ఆ రాక్షసుడ్ని, వార్ని దోచుకుంటున్న ఆ బాస్టర్ ని వదిలితే ఆ అశాంతిలో నేను జీవితాంతం ప్రశాంతంగా బ్రతకలేను....."     తనకన్నా ఆ చాలెంజ్ తో గెలుపే ముఖ్యమనుకుంటున్న మనోహర్ మీద కోపం, ప్రమాదాల్ని కోరి తెచ్చుకుంటున్నాడన్న బాధ, తనమాటను లెక్కచేయనందుకు ఉక్రోషం మంగళను పిచ్చిదాన్ని చేశాయి.     మంగళ విసురుగా  రెండడుగులు వేసింది. అంతలో ఫోన్ మోగింది. విసురుగా ఫోన్ తీసిన మనోహర్ ఫోన్ లో మాటలు విని తోక తొక్కిన త్రాచులా బుస్సున పైకి లేచాడు. ఫోన్ పై చేతివేలు నరాలు చిట్లిపోయేలా బిగుసుకున్నాయి. ఆవేశంతో వూగిపోతున్నాడు. కొద్ది క్షణాల్లో అపర రుద్రుడిలా మారిపోయాడు.     "నా చాలెంజ్ కి చరమగీత లేదు.     నా పందెం ఎప్పుడూ చేదు ఆట కాదు.     నేనే గెల్చి తీరతాను____ఆ గెల్పుతో వృత్తిని కళంక పరుస్తున్న నీకు అభేద్యమైన సమాధి కడతాను" అంటూ విసురుగా ఫోన్ పెట్టేశాడు.     తలెత్తి చూసేసరికి విసురుగా వెళుతూ మంగళ కనిపించింది.     గుండెల్ని పిండినట్లుగా అయింది. తన వార్ని తనకు కాకుండా చేస్తున్న ప్రదీప్ ని ఊరికే వదలకూడదు.     ఇప్పుడతనిలో కోపం, కసి, పగ పట్టుదల విశ్వరూపం దాల్చాయి.                                                                      *    *    *     మనోహర్ ఇచ్చిన చెక్ వైపు ఓ క్షణం చూశాడు మధు. చెక్ ఇస్తూ ఉపయోగించని నీ తెలివితేటలు ఎందుకన్నట్లు? ఇది క్రాస్ట్ చెక్. ప్రదీప్ మార్చుకోవాలి తప్ప మరెవ్వరికీ పనికిరాదు. ఎందుకలా అన్నారు బాస్......??     అంతలో ప్లాష్ లా వెలిగింది ఓ ఐడియా. హుషారుగా ఈలవేస్తూ ఫోన్ ఎత్తాడు. అవతలవైపు నుంచి ప్రదీప్ గొంతు వినిపించింది.     "నేను  మధు చక్రవర్తిని మాట్లాడుతున్నాను......" అన్నాడు. ప్రదీప్ భయంకరమైన నవ్వు తెరలు తెరలుగా ఫోన్ డయాఫ్రమ్ ని బద్దలు కొట్టేంత పెద్దగా. ఠక్కున ఆగిపోయింది నవ్వు "మీ బాస్ ని పాతిక లక్షలు సిద్ధం చేమకోమను. కోరమాండల్ కంపెనీకి 15 లక్షలు, నాతో కాసిన పందానికి 10 లక్షలు. మొత్తం పాతిక......"     తన బాస్ ప్రదీప్ తో విడిగా పది లక్షలు పందెం కాసినట్టు మధుకి అంతవరకూ తెలియదు. ఓక్షణం ఒళ్ళు జలదరించింది భయంతో.     చప్పున తేరుకున్న మధు "గెలుపెవరిది అన్నది తేలడానికి మరో పదిహేను రోజులుంది. ఊరికే సంతోషపడకు. ఇప్పుడో షాక్ న్యూస్ వదులుతాను విను. అమాయకురాలు, అండలేని రోమాని చంపడం మగతనంకాదు. నిన్ను దారుణమైన నష్టానికి గురిచేస్తున్నాను. దమ్ముంటే కాచుకో. పాపం నీ టైర్స్ యాడ్ ఫిల్మ్ ని సెన్సార్ వాళ్ళు పుట్ బాల్ ఆడేశారు. అంటే  మూడింటికి మునిగావు. ఆగాదు, మధ్యలో అడ్డురాకు. సరికొత్త శుభవార్త విను. నీకివ్వమని ఢిల్లీ బివాష్ ముఖర్జీ పదిలక్షలకి చెక్ మా బాస్ అందించాడు. మీ ఇద్దరి గొడవ తెలియక ఆ పని చేశాడు. ఇప్పుడా చెక్ నా దగ్గర వుంది. దాన్నిప్పుడు నేను చెడుగుడు ఆడేస్తాను- పదిరోజులపాటు. చెక్  అందలేదని ఢిల్లీ ఫోన్ చేస్తావు. మనోహర్ కి ఇచ్చానని చెబుతారు. దాన్నతను చెడుగుడు ఆడేస్తున్నాడని చెబుతావు. వాళ్ళు నమ్మరు. ఎందుకంటే నీలాంటివాడుకాదు మనోహర్ అంటారు. నాలుగురోజులు ఆగమంటారు. ఆగుతావు. మరలా ఫోన్ చేస్తావు. వాళ్ళు మాకు ఫోన్ చేస్తారు. సారీ.....మిస్ ప్లేస్ అయిందంటాం. నమ్మేస్తారు. కొత్త చెక్ ఇవ్వమంటావు. పాత చెక్ నెంబర్ డేట్ ఇస్తూ దాని కలెక్షన్ ఆపమని బ్యాంక్ కి రాస్తారు. వారు సరేనని రాస్తారు. ఆ తర్వాత మరోచేక్ తయారుకావడానికి మూడురోజులు. మొత్తం పది రోజులకిగాని క్యాష్ నీ చేతికి అందదు. పదిలక్షలకి పదిరోజులకి వడ్డీ ఎంతో నీకు బాగా తెలుసు. నీ టర్నోవర్ మీద చావుదెబ్బ..........నెలకి వందకి రెండు రూపాయల వడ్డీ. ఆ లెక్కన పది లక్షలకి పదిరోజులకి.........లెక్క తెలుసా! చెప్పనా? మర్చే పోయాను. పదకొండోరోజు మరో చావుదెబ్బకి సిద్ధంగా వుండు" అని ఫోన్ పెట్టేశాడు మధు.     ఏమీ  తెలియని పిచ్చికోపం ప్రదీప్ ని ఉన్మత్తుడ్ని చేసింది. మధు రెచ్చగొట్టడంతో, శాంతి షినాయ్ గొడవతో టైర్స్ యాడ్ ఫిల్మ్ ఆగిపోయింది. అంతలో మరలా ఇది. అతని కళ్ళు కణకణ మండిపోతున్నాయి. కైలాష్ ని పిలిచాడు. కళ్ళజోడు తీశాడు విక్రమ్ ని పిలవమన్నాడు.                                                                           *    *    *     మనోహర్ కమలిని ఇంటికి వెళ్ళేసరికి రాత్రి 7-30 కావస్తోంది. గేటు తీసుకొని, ఇంటివైపు వెళుతుండగా  కమలిని ఒంటరిగా లాన్ లో కూర్చుని కనిపించింది. లైట్ వేసుకొని కారణాన మసక చీకట్లో కమలిని అస్పష్టంగా కనిపిస్తోంది. నిశ్శబ్దంగా ఆమెవైపు నడిచాడు.     యాడ్ వరల్డ్ లో తన అందచందాలతో, నటనా  కౌశలంతో, అభినయంతో సంచలనం సృష్టించినట్లుగా  లేదు. సాదాసీదా చీరలో, తలస్నానం చేసి ఆరబెట్టుకున్న కురులు నలువైపులా పర్చుకొని ఒక సాధారణ గృహిణిలా, సర్వస్వం కోల్పోయిన విరాగిణిలా కనిపించింది.     "లైట్ వేసుకోకుండా చీకటిలో కూర్చున్నారేం......?"     "వెలుగులో చెప్పుకోతగ్గంత గోప్ప జీవితాలు కావు మనవి" ఆమె కంఠంలో బరువు, మాటలో జీర సృష్టమవుతున్నాయి.     "నేనలా అనుకోవటంలేదు. వృత్తికి నేనెప్పుడూ ద్రోహం చేయలేదు. దాన్ని అడ్డం పెట్టుకొని అవినీతిగా ఎప్పుడూ ప్రవర్తించలేదు...."     "ఆఫ్ కోర్స్.......కాని నీవీ వృత్తికి పనికిరావు" స్థిరంగా అంది.     ఆ మాటలకు విస్మయపడ్డాడు మనోహర్.     "నాకర్థం కాలేదు.....ఏ తప్పు చేయనప్పుడు పనికిరాక పోవటమేంటి?"     "ఏ తప్పు చేయలేవుగనుకే పనికిరావు. ఎథిక్స్, మొరాలిటి అంటూ ప్రాకులాడే నీలాంటివారు ఈ పారిశ్రామిక కుక్కల ప్రపంచంలో బ్రతకలేరు. మనవృత్తిలో ముఖ్యంగా కావల్సింది క్రియేటివిటి. ప్రస్తుత పరిస్థితుల్లో అదికాదు కావాల్సింది. నేడు వృత్తిని దగా, మోసం, దోపిడి, వంచన అనే మేఘాలు క్రమ్ముకున్నాయి. క్రమ్ముకున్న కాలుష్య కారు మేఘాల మధ్య చిరుదీపానివి నీవు నీ చీరుదీపాన్ని కాపాడుకొనే శక్తి నీకింకారాలేదు. కాపాడేందుకు నీకు అండగా మరొకరు లేరు......" ఓ క్షణం ఆగిజుత్తంతా ప్రోదిచేసి ముడివేసుకుంది.     "ఈ రోజెందుకో మీరు వింతగా మాట్లాడుతున్నారు."     నిశ్శబ్దంగా, వేదాంతిలా నవ్వింది. ఆ నవ్వులో ఎప్పటిలా జీవంలేదు.     "నీవీ పందెం నుంచి మానుకోలేవా?" పట్టిపట్టి అడిగింది......అడగకూడదనుకుంటూనే. ఒక్కక్షణం అర్థంకానట్లుగా చూశాడు. మీరీకోర్కె మనస్ఫూర్తిగా అడిగి వుండరు. అవునుగదా?"     ఆమె మాట్లాడలేదు. మెడలోని ఒంటిపేట గొలుసు పెదవులమధ్య పట్టుకుంది సాలోచనగా చూస్తూ.     "దిగవలసినంతవరకు___పీకల వరకూ దిగిపోయాను. ఇప్పుడిక వెనకడుగు వేయలేను. నాక్కావాల్సిన మీరంతా నాలో స్థయిర్వాన్ని, ధైర్యాన్ని నింపండి. లేదంటే మాత్రం వెనుకంజ వేయమని సలహా ఇవ్వొద్దు......"రోషాన మనోహర్ మొహం ఎర్రబడింది.     ఎవరు పందెం నుంచి విరమించుకోమని అడిగినా మనోహర్ లో కోపం ప్రజ్వరిల్లుతోంది.     "నన్నర్థం చేసుకోటానికి ప్రయత్నించు. మంగళ క్కూడా ఇది ఇష్టంలేదు. పెళ్ళి చేసుకొని సుఖంగా...."     "ఆపండి మేడమ్......భయపెట్టి, ప్రలోభపెట్టి నా ప్రయత్నంలో నన్ను నీరు కార్చవద్దు......లేదంటే చెప్పండి వెళ్ళిపోతాను......" అంటూ లేచాడు.     ఉలికిపాటుగా లేచి మనోహర్ చేయి పట్టుకొని ఆపింది.     అప్పుడు చూశాడామె కళ్ళలోకి మనోహర్. దీనంగా, శూన్యంగా ఉన్న ఆమె చూపులు___ఆ చూపుల చుట్టూ ఉబికివస్తున్న కన్నీరు.     చలించిపోయాడు ఆమెనాస్థితిలో చూసి. ఆమెకు దగ్గరగా వచ్చి చూపుడువేలితో ఆమె కంటినీరును తుడిచాడు.     "సారీ.....వెరీసారీ......నా ఆవేశం మీకు తెలుసుగా......అందుకే అలా.....మీ మీద నాకున్న గౌరవానికి, అభిమానానికి మరొక విషయంలో అయితే మీ మాట జవదాటే వాణ్ని కాదుకాని____"     "నామీద నీకుంది గౌరవం, అభిమానమేనా?" అడిగింది బాధగా చూస్తూ.     ఆమె ఇంకా తననుండి ఏం ఆశిస్తుందో అర్థంకాక తికమకపడ్డాడు.     "నీకు హాని తలపెడతాడా రాక్షసుడు___అనే భయంతో అలా అన్నాను కానీ......గో ఎ హెడ్..... నీ లాంటివారివల్లే వృత్తికి మంచి రోజులు రావాలి. నాదో కోరిక తీరుస్తావా......?" అంది ఆశగా చూస్తూ.     వింతగా చూశాడు కమలిని వైపు ఎప్పుడూ ఎంతో ధైర్యంగా, నిబ్బరంగా ఉండే మేడమ్ ఈ రోజెందుకు బేలగా  వుంది.....?" చెప్పండి అదొక్కటితప్ప ఏదైన, ఎంతటిదైనా తీరుస్తాను" అన్నాడు ఆమెవైపు గౌరవంగా చూస్తూ.     "ఆ నమ్మకంతోనే నీమీద బరువైన, బాధ్యతాయుతమైన పని పెట్టబోతున్నాను......"     "చెప్పండి.......ఏమిటది?" ఆతృతగా అడిగాడు.     "ఇప్పుడుకాదు____తరువాత తెలుస్తుంది......" అంది నిరాసక్తంగా.     "మీరెందుకో ఇవ్వాళ విచారంగా, అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకని?" ఆమెనా స్థితిలో ఎప్పుడూ చూడని మనోహర్ కు బాధగా వుంది.     "ఎక్కడో పుట్టాను......ఎక్కడో పెరిగాను.......ఎంతో సంపాదించాను .... పేరు ..... డబ్బు ..... కాని ..... కాని....." ఆమె గొంతు చిక్కబట్టి నట్లయింది.     మనోహర్ మౌనంగా చూస్తున్నాడు.     "అన్నీ అనుభవించాను. కాని ఒక అసంతృప్తి మిగిలిపోయింది. సెంటిమెంటు.......మాతృపరమైన సెంటిమెంటు. అది సెంటిమెంటో......చెదిరిన నా జీవితానికి పరమార్థమో, అదేంటో తెలుసా......తల్లి కావాలనే కోర్కె.....'స్త్రీ పరమైనచిన్నకోర్కె.....'     తల్లిని కావటం ద్వారా నేను చేసిన పాపాల్ని, భయల్ని,  బాధల్ని కడుక్కుందామని గాదు. కేవలం స్త్రీ జన్మకు సార్థకత కోసం......"     "చాలాసార్లు అడుగుదామని అడగలేకపోయాను......మీరెందుకు పెళ్ళి చేసుకోలేదు......?"     నిర్జీవంగా నవ్వింది. పగలబడి నవ్వింది. ఆ నవ్వులో అంతర్లీనంగా ఆమె పడుతున్న బాధ స్పష్టమవుతోంది.     "ఒకప్పుడు వెర్రిగా, పిచ్చిగా సంపాదించాను యంత్రంలా టైమ్ లేదు ప్రేమించటానికి, పెళ్ళి చేసుకోవటానికి. ఆ హడావుడి అంతా అయ్యాక చూసుకుంటే పెరిగిన వయస్సు, ఆకర్షణ కోల్పోతున్న శరీరం, కావాల్సినంత డబ్బు తీసుకొని ఆ తరువాత నేను   చెడ్డదాన్నని వదిలేసిన నా  కుటుంబసభ్యులు____మిగుల్చుకున్న డబ్బు మిగిలాయి. ఆ తరువాత నన్ను ప్రేమించామంటూ వచ్చిన నిజాయితీగల ప్రేమికుల్ని చూసి___విసిగి వేసారి నా జీవితం నాకు నేర్పిన పాఠాల వలన వారిని గుర్తించలేదు. నా ఒంటరి జీవితానికి తోడు అవసరం స్ఫురణకు రాలేదు.     మగవాణ్ణి నమ్మలేకపోయాను. అందరు మగాళ్ళు దుర్మార్గులే అనుకొని. కొంతకాలానికి నాకు ఒక మంచి మనిషి కనిపించాడు. కాని అప్పటికి చీకటి పడిపోయింది. అతడు నన్ను గుర్తించలేనంత చీకటిలాంటి వయస్సు పైనబడింది. నాకు నాలుగు పదులు. అతనికి మూడు పదులు కూడా లేవు. నా కోర్కె వింతగానూ వుంటుంది. విలువ లేకుండానూ వుంది. కాని నా  ప్రేమలో నిజాయితీ వుంది. సిన్సియారిటీ వుంది. నలుగురినీ నేను (మోడల్స్) ప్రేమించగలను. ప్రేమించాను అని గర్వంగా చెప్పు కోవాలనే వెర్రి ఆశ. అది ఫలించకపోయినా చెప్పుకొని తృప్తి పడదామనే పిచ్చి ఆశ. కాని నా ప్రేమకు అవినీతిని అంటగడతారు. వళ్ళుపై తెలియక నీకంటే 15 ఏండ్ల చిన్నవాడ్ని ఎలా ప్రేమించావంటారు? ప్రేమకు స్పందన ముఖ్యమని నాకు తెలుసుగాని, వయస్సు అని నాకు నా వయస్సుకు తెలియదు. అమలిన శృంగారానికి దర్పణమైన, అద్భుత ప్రణయామృతానికి అర్థం చెప్పిన నండూరివారి ఎంకి - నాయుడుబావల పవిత్ర, పరవశ శృంగారానికే మచ్చ అంటగట్టే ప్రబుద్దులున్న సమాజం మనది.     ఏమైతేనేం నా ప్రేమ విఫలమయింది. అతన్ని కాదని మరొకర్ని చేసుకోలేకపోయాను. రాజీపడి, మనస్సు చంపుకొని పెళ్ళి చేసుకుందామనే అనుకున్నాను-కనీసం తల్లినన్నా అవుదామన్న ఆశతో. కాని కాలాతీతమైంది. నా కడుపు పండేందుకు వీలులేనంతగా  ఎండిపోయిందంట. అది తెలిశాక మరిక పెళ్ళెందుకు కనిపించింది. చివరకు వృద్దకన్యగా మిగిలిపోయాను. అయినా తల్లి కావాలనే మాతృపరమైన కోర్కె నన్ను అనుక్షణం చిత్రహింసకు గురిచేస్తూనే వుంది" అంటూ తన కడుపుమీద చేయివేసి నిమురుకుంటూ "అయినా నా పిచ్చిగాని నలుగురు నడిచిన దారిలో మొక్కలెలా మొలుస్తాయి......? అందుకే ప్రియుడిగా చూసుకున్న అతనిలో యిప్పుడు కొడుకును చూసుకుంటున్నాను. చిత్రంగా లేదూ.....?" అంటూ ఆగిపోయింది.     ఆమె మౌనంగా రోధిస్తుంది. వెక్కిళ్ళు పడుతోంది. అక్కడ అలుముకున్న శ్మశానానిశ్శబ్దంలో ఆమె ఏడుపు హృదయవిదారకంగా వుంది.     మనోహర్ గుండెల్ని పిండినట్లు విలవిలల్లాడాడు.     చాలా సేపటివరకూ మాట్లాడుకోలేదు. కమలిని హఠాత్తుగా లేచి మనోహర్ దగ్గరకు నడిచి అతని తలను ఎత్తి నుదురుమీద ఆప్యాయంగా ముద్దెట్టుకుంది. అలా ఎందుకు చేసిందో మనోహర్ కి అర్థంకాలేదు. మంగళ వెళ్ళిన విషయం చెప్పాడు. అతనిలో మంగళ వెళ్ళిపోయిందన్న బాధమెలిపెడుతోంది. తను ఒకరికోసం......ఆ ఒకరు మరోకరికోసం......ఆ మరొకరు దేనికోసమో!!! జీవితం చాలా చిత్రమైంది. అంత బాధలోంచి చప్పున తేరుకుంది కమలిని, "మన పర్సనల్ విషయాలు తరువాత, తరంగిణి దొరికిందా?" అడిగింది.     "దొరికినట్లే దొరికి తప్పిపోయింది......." అంటూ జరిగినదంతా చెప్పాడు.     కమలిని నిట్టూర్చింది.     "నీవేం నిరుత్సాహపడకు. కడవరకు పోరాడు. నీ ప్రయత్నంలో పట్టుదలలో నిజాయితీ వుంది. అంతిమ విజయం నీదే" అంది మనోహర్ లోని నిస్పృహను పారద్రోలే ప్రయత్నంలో భాగంగా.     ఆమెవైపు కృతజ్ఞతగా చూశాడు.     "కాని ఇంతవరకూ నా సందేహాన్ని నివృత్తి చేయలేదు....." అంది నిశ్శబ్దంగా నవ్వుతూ.     అర్థం గానట్లు చూశాడు మనోహర్.     "ముందుగానే సోఫియాని నీ ప్రాజెక్టుకి మోడల్ గా తీసుకున్నావ్ . అలాంటప్పుడు ప్రకటన ఎందుకిచ్చావ్?"     మనోహర్ కి ఆశ్చర్యమేసింది___ఆమెకా విషయం ఇంకా గుర్తున్నందుకు. అంటే ప్రతి చర్య గురించి అంత సునిశింతగా ఆలోచిస్తోందా?!!     "సోఫియాని మోడల్ గా తీసుకున్నట్లు ప్రదేప్ కి తెలియగూడదనే పాతికవేలు ఖర్చుపెట్టి ప్రకటన ఇచ్చి అతని దృష్టి మరల్చాలనుకున్నాను. కాని ఫోటోలు తారుమారుచేసి పెద్ద దెబ్బ కొట్టాడా బాస్టర్డ్......"     "కేవలం ప్రదీప్ ని తప్పుదారి పట్టించడానికే పాతికవేలు ఖర్చు పెట్టడం నీ స్వవిషయం. నీ వ్యాపార ఎత్తుగడ. కాని ఆ ప్రకటన చూసి ఎంతోమంది అమ్మాయిలు ఆశగా అప్లయ్ చేసి ఎరురుచూస్తూంటారు. వారిలో ఆశలు రేపిన నీవు వారికిచ్చే సమాధానం......?" కాస్త కరుకుగానే అడిగింది.
24,750
    జానకిరాముడికి అతడంటే గౌరవం, భయం భక్తి అన్నీ. చూస్తూ ఉండగానే తనని ప్రెసిడెంట్ ఎలా చేశాడో అతడికి ఇప్పటికీ నమ్మశక్యం కాదు.     అతడికి మాత్రం ఆనందంగా వుంది- తన అంచనాలకు మించి జానకిరాముడు ఆ పదవిలో చాకచక్యంగా పనులు నిర్వహించటం, అయితే ఇందులో చాలాభాగం ఖ్యాతి అడ్వయిజరీ బోర్డుకి వెళ్ళాలి. ఏదో ఒక 'భయం' వుంటేగానీ ఈ దేశ ప్రజలు మాటమీద సవ్యంగా నడుచుకోరు అని గ్రహించిన ఆ కమిటీ దాదాపు మార్షల్ పద్ధతిలోనే పరిపాలన కొనసాగిస్తుంది.     అయితే దీనికి వ్యతిరేకులు కూడా వున్నారని ముందే చెప్పటం జరిగింది. పరిపాలనా యంత్రాంగంలో నష్టపోతున్న కాపిటలిస్టులంతా ఒక సిండికేట్ గా ఏర్పడ్డారు.     సరిగ్గా ఆ రోడ్డుమీదే- రోడ్డుకి పక్కగా వున్న మేడమీద, ఒక గదిలోంచి ఒక గన్ - రోడ్డుమీదకు గురి పెట్టబడివుంది. భద్రతా సిబ్బందిలో ఒకరు ఈ సిండికేట్ తో కుమ్మక్కై, జానకిరాముడి హత్యకు తోడ్పడుతున్నారు. ఆ సిబ్బంది మనిషి- జానకిరాముడి వెనుక వస్తున్న గుర్రాల్లో ఒకదాని మీద వస్తున్నాడు. ఆ గుర్రం పేరు కూడా జానకిరాముడే.     ప్రెసిడెంట్ ఎన్నికల సమయంలో జానకిరాముడిని ఎగతాళిచేయటం కోసం వంకచెక్కా రామ్మూర్తి తన గుర్రానికి ఆ పేరు పెట్టాడు. ఇప్పుడు ప్రెసిడెంట్ ని చంపటానికి ఆ గుర్రాన్ని ఉపయోగిస్తున్నాడు.     సిండికేట్ పథకం ఏమిటంటే నిర్ణీతమైన స్థలానికి వచ్చేక - వెనక వున్న గుర్రాల్లోంచి ఇది ముందుకు వచ్చి- ప్రెసిడెంట్ కారు పక్కగా పరుగెడుతుంది. చూసేవాళ్ళకి అది బెదురుతూ వచ్చిందనుకుంటాను. ఈ లోపులో ఆ గుర్రం మీద వున్నవాడు గ్రేనేడ్ ని ప్రెసిడెంట్ వున్న కారులోకి విసురుతాడు. విస్ఫోటనం జరిగి- ప్రెసిడెంట్ హత్య కావింపబడతాడు. ఆ గుర్రాన్ని నడిపే వాడికి అయిదు లక్షలు లంచంగా ఇవ్వబడింది.     ఈ ప్లాన్ లో ఏదైనా ఆటంకం ఏర్పడితే, మేడ మీద గన్ ద్వారా హత్య జరుగుతుంది. అందుకే దాన్ని కూడా సిద్ధంగా ఉంచారు.     ఈ విధంగా రెండు రకాలుగా వ్యూహం పన్నబడింది.     ఇంకో అయిదు నిముషాల్లో జానకిరాముడి కారు అనుకున్న స్పాట్ కి చేరుకుంటుంది.     ఇనస్పెక్టర్ విజయ్ భద్రతా ఏర్పాట్లు చూసుకుంటూ ముందువెళుతున్నాడు. అంతకుముందు రెండు రోజుల్నుంచే ప్రెసిడెంట్ వెళ్ళబోయే దారికి ఇరువైపులా వున్న ఇళ్ళ ఫోటోగ్రఫీ పరిశీలించబడింది.     వాణి, సింహాలతో అతడు ముందు జీపులో వెళుతున్నాడు. అకస్మాత్తుగా అతడి దృష్టి ఒక పోర్టికో మీద పడింది. అక్కడ కూడా జనం వున్నారు. కానీ అందులో ఇద్దరు వ్యక్తులు-     ఒకరు వంకచెక్కా రామ్మూర్తి!     మరొకరు కృష్ణమూర్తి!!     వారిద్దర్నీ అక్కడ... ఆ ప్రదేశంలో చూసి అతడి కేదో అనుమానం పొడసూపింది. మామూలు ప్రజల్లాగా ప్రెసిడెంట్ ని చూడటానికి అలా రోడ్డు పక్కన నిలబడవలసిన అవసరం వారికి లేదు. అంతేకాదు. వారు నిలబడిన విధానం కూడా అనుమానాస్పదంగా తోచింది.     నెమ్మదిగా వెళుతూన్న సింహం, వాణీలకు అతడెందుకు దిగాడో అర్థం కాలేదు. సింహం కూడా దిగాడు. వాళ్ళిద్దరూ జనంలో కలిసి పోయారు.     సరిగ్గా ఆ సమయంలో జి.కె. అతడిని చూశాడు.     తల్లిగా నటించమని పంపిన స్త్రీ, దొంగ తల్లి అని అతడికి తెలిసి పోయిందని తెలియగానే అతడు తనని చిత్రవధచేస్తాడనీ అనుకున్నాడు. అతడు అదోలాటి వైరాగ్య భావంతో ఈ ద్వేషాలకి అతీతంగా మారాడని అనుకోలేదు.     అతడిని ఇలా అకస్మాత్తుగా చూడగానే జి.కె. భయభ్రాంతుడయ్యాడు.     అంతలో వంకచెక్కా రామ్మూర్తి కూడా అతడిని చూశాడు! తనని చూడగానే అసంకల్పితంగా రామ్మూర్తి చూపు ఎదురింటి మేడవైపు సారింపబడటం అతడి దృష్టిని దాటిపోలేదు. వెంటనే అతడు కూడా అటు వైపు చూశాడు.     అదే సమయానికి కిటికీలోంచి బయటకు రాబోతున్న బారెల్ చప్పున లోపలికి వెళ్ళిపోయింది. కొస మాత్రం కనపడింది.     అంతలో ప్రజల హర్షధ్వానాలు దగ్గిరయినయ్.     ప్రెసిడెంట్ కారు సమీపిస్తున్న సూచన అది.     అతడు మరి ఆలస్యం చేయకుండా ఆ మేడవైపు పరుగెత్తాడు.     అంతకు కొద్ది క్షణాల ముందే కృష్ణమూర్తి ఆ మేడ వెనక్కు చేరుకున్నాడు.     తన వైపే పరుగెత్తుకు వస్తూన్న అతడిని చూడగానే జి.కె. అనుమానం బలపడింది. ఇన్నేళ్ళు పనులు చేయించుకుని చివర్లో దొంగ తల్లిని చూపించినందుకు అతడు పగ తీర్చుకోవటానికే వస్తున్నాడనుకున్నాడు. అతడు తల్లికోసం ఎంతగా ఎదురు చూశాడో జి.కె. కి తెలుసు. ఇక తనని వదలడు.     జి.కె. మరి ఆలస్యం చేయకుండా జేబులోంచి రివాల్వర్ తీసి అతడిని కాల్చాడు. అయితే జి.కె. తన వెనుక వైపు వస్తూన్న ప్రమాదాన్ని గుర్తించలేదు. అతడు సింహం! జి.కె. పేల్చిన గుండు 'అతడి' భుజంలో దిగబడింది. కానీ సింహం, మరో బుల్లెట్ పేల్చబోతూన్న జి.కె. మెడమీద వెనుక నుంచి చరిచాడు. అది ఎంత బలంగా తగిలిందంటే- ఉరితీత ఖైదీ మెడ వాలిపోయినట్టు జి.కె. మెడ విరిగిపోయింది. ఇన్నేళ్లు అతడు ఆడిన నాటకానికి శాశ్వతంగా తెరపడింది. అతడు మాత్రం బిల్డింగ్ వైపు పరుగెత్తాడు తుపాకీ కనపడిన కిటికి, మూడో అంతస్థులోవుంది.     ప్రజల హర్షధ్వానాల మధ్య ఈ బుల్లెట్ చప్పుడు ఎవరికీ అంతగా వినబడలేదు. పోలీస్ ట్రయినింగ్ పొందిన ఉన్నతాధికారులు మాత్రం ఏదో అపాయాన్ని శంకించారు. వారిలో విజయ్ ఒకడు. అతడు ఈ ఘర్షణ జరుగుతున్న ప్రదేశానికి మరీ దగ్గిరగా వున్నాడు. దాంతో అతడూ జనంలోకి వచ్చాడు.     ఇదంతా దూరం నుంచి చూస్తూన్న వ్యక్తి వంకచెక్కా రామ్మూర్తి!     అతడు మనసులోనే జి.కె.ని విపరీతంగా తిట్టుకున్నాడు. తన అనవసర భయంతో అతడు మొత్తం ప్లాన్ అంతా బయట పెట్టేశాడు.     ఇందిరాగాంధీ హత్య కేసులో హంతకుడు పట్టుబడ్డాడు. కానీ ఈ హత్యలో హంతకుడు గుర్రంతో సహా బ్లాస్ట్ అయిపోతాడు. కాబట్టి ఇక సాక్ష్యాధారాలుండవు.     చాలా ఇరుకు సందు ఇది. రెండు వైపులా ఎత్తయినభవంతులు... పురాతనమైన చెక్క బాల్కనీలు. రోడ్డు కిరువైపులా అయిదారు అంతస్థులున్నాయి. కేవలం ఈ హత్యా ప్రయత్నంలో ఒక భాగంగా ఎన్నో లక్షలు లంచం ఇచ్చి ప్రెసిడెంట్ ప్రయాణానికి అలాటి ఇరుకుసందు గుండా రూట్ ప్లాన్ వేయించింది సిండికేట్.     మరణానికి సిద్ధపడి ఈ పనికి వప్పుకున్న గుర్రం మీదున్న రౌతు తన కాళ్ళ దగ్గిరున్న గ్రెనేడ్ సీలు విప్పాడు. అంటే ఇంకా సరీగ్గా పదిహేను సెకన్ల తరువాత అది పేలుతుంది అన్నమాట. పది సెక్షన్ల తరువాత గుర్రాన్ని ముందుకు దూకించాలి. అయిదు సెకనులలో గుర్రం ప్రెసిడెంట్ కారుని చేరుకుంటుంది.     చచ్చిపోయిన రౌతు కుటుంబానికి సిండికేట్ అయిదు లక్షల రూపాయలు చెల్లించాలని కాంట్రాక్టు. సగం అడ్వాన్సు ఇచ్చేసింది కూడా! ... జానకీ రాముడు మరణిస్తే కలిగే లాభాలతో పోల్చుకుంటే ఆ కాపిటలిస్ట్ లకి ఇదో పెద్ద ఖర్చు కాదు.     కానీ ప్రస్తుతం సమస్య అదికాదు. రౌతు మరణిస్తే పర్వాలేదు. కానీ మేడమీద తుపాకీతో నిల్చున్న వ్యక్తి పోలీసులకి పట్టుబడితే మాత్రం మొత్తం తమ గుట్టు బయటపడుతుంది. అతడిని అక్కణ్ణుంచి వెళ్ళిపొమ్మని వెంటనే చెప్పాలి!
24,751
    'ప్రభూ!'     'ఔను! అహల్యా! నువ్వు గౌతముడి వెంటే వెడుతూంటే నా సర్వాధికారాలూ ఆయన హోమాగ్నిలో వేసే తృణంతో సమానం కావనిపించింది. అఖిలలోక పాలన అమరలోక నినాదం. అంతా వృధా! వృధా! అనిపించింది. నిన్ను చేపట్టలేని అధికారం వ్యర్ధం అనిపించింది. రాక్షసులు మా లోకంపై దండెత్తి వచ్చి మమ్ములను జయించి మా లోకంలోని అచ్చెరలణు చెరపట్టినట్లు- నిన్ను ఆ మహర్షి నుండి బలాత్కారంగా పొందాలనిపించింది.'     'ప్రభూ!'     'కానీ- పెద్దరికం అడ్డు వచ్చింది.'     'ప్రభూ!'     'అవును. మా పెద్దరికం కాదు. పరమేష్టి పెద్దరికం. గౌతముల పెద్దరికం అడ్డు వచ్చాయి.'     'ప్రభూ!'     'కానీ ఆ బ్రహ్మ ఆయనకి నిన్ను ధారపోస్తే నువ్వు నన్ను వెదుక్కుంటూ రావడం నా అదృష్టం దేవీ!'     'ప్రభూ!'     అప్పుడే నీ చూపులు నాపై వలపుని చెప్పకనే చెప్పాయి. అందరికంటే ముందు భూ ప్రదక్షిణం చేసి వచ్చాననీ, అమరేంద్రుడననీ నన్ను నీవు గుర్తించి చూసిన తొలిచూపు ఒక్కటే చాలు అహల్యా!     అన్నింటికంటే మిన్నగా అభిషక్తుడిని చేసినట్లుగా భావించాను!'     'ప్రభూ!'     'కదలకు అహల్యా! నిన్ను కోరి కోరి నీవు దొరక్క విరహంలో వేగి వేగిపోయిన ఈ గుండెలకు నీ స్పర్శతో శాంతిని కల్గించు. నీకోసం పరితపిస్తూ నీరాక కోసం నిరీక్షిస్తూ రెప్ప పాటు లేక నిలిచిపోయిన నాకు- నువ్వే కరుణించి కనికరించి నా చెంతకు వచ్చిన అదృష్టాన్ని చెరగనీకు'     'ప్రభూ!'     'అవును. ప్రభువునే! అఖిల లోకాలకూ ప్రభువును. అచ్చెరలకు ప్రభువును. మహర్షులకు ప్రభువును. మానవులకు ప్రభువును. కానీ నీకు ప్రభువును కాను అహల్యా! పతి కాలేకపోయిన అదృష్టహీనుడ్ని! నన్ను 'ప్రభూ' అని కించపరచకు!'     'ప్రభూ! ప్రభూ! నేను ప్రభూ. కనులు విప్పి చూడండి. నేను అహల్యను కాను...'     ఆశనిపాతం లాంటి ఆ మాటలు వినీ వినగానే ఇంద్రుడు చలించిపోయాడు. అప్రమత్తుడయ్యాడు.     కళ్ళు తెరిచి చూశాడు.     అప్పటికే కౌగిలి వీడిన ఆమె- దూరంగా నిలుచుంది. ఆమె దూతిక. ఇంద్రుడి ఆంతర్యం ఎరిగిన దూతిక.     శచీదేవి అలిగినా, ఆగ్రహించినా, పతిని మన్నించకపోయినా శచీదేవిని ఇంద్రుడి యెడల ప్రసన్నం చేసే ఆంతరంగిక చెలి.     అన్య వనితలన్నా, అందమైన అతివలన్నా ఆశపడి అందం వెంట అహరహం వెంటపడే ఇంద్రుడంటే శచీదేవికి కోపం రానిదెప్పుడూ? అందుకే శచీదేవి మనస్సుని మళ్ళించే పని ఆమెకే! చప్పున నమస్కరించింది.     'తమరు ఒంటరిగా ఉన్నారనీ, అన్య మనస్కంగా ఉన్నారనీ, ఏదో తెలియని ఆవేదన తమని నిరంతరం వేధిస్తున్నదనీ శచీదేవమ్మగారు చెప్పారు. తమ దిగులుకి హేతువు తెలుసుకుని తమ దిగులు తీర్చే గురతర బాధ్యతని నా మీద మోపారు. అందుకే నేను ఇక్కడికి సాహసించి రాగలిగాను. తమరు అహల్యా చింతనలో చిక్కిపోయారని చెప్పకనే చెప్పుకున్నారు.'         'ఊ!' అన్నాడు ఇంద్రుడు.     'నన్ను విశ్వసించండి ప్రభూ! తమ గుండెల నిండుగా నిండుకున్న అహల్యాదేవి గురించి శచీదేవి గారికి తెలియనివ్వను. నేను అమ్మగారిని అంతరంగిక దాసినే! కానీ తమరి ఏలుబడిలోని దాన్ని. తమకే నమ్మిన బంటును. ఇంతకాలం తమపై ఆగ్రహించిన అమ్మగారిని ప్రసన్నం చేసే బాధ్యత నేను మోశాను.     ఇప్పుడు ప్రయత్నించి ఆ అహల్యమ్మగారు తమ యెడల ప్రసన్నం అయ్యేట్లు చేసే బాధ్యత స్వీకరిస్తున్నాను. ఆడవారి మనసెరిగి అతికినట్లు బొంకి ఒప్పించగల నేర్పున్న నాకది అసాధ్యం కాదనుకుంటున్నాను!'     'దూ.. తి.. కా...'     'మన్నించండి మహేంద్రా! అన్ని లోకాలకూ అధినాధులై- అందరినీ శాసించగల మీరు ఒక అబల, ఒక మానవ కాంత కోసం యిలా పరితపించడం చూడలేను! నయాన్నో, భయాన్నో, సామంతోనో, దానంతోనో ఆమె మనసు మార్చగలను. ఆ ప్రయత్నంలో విజయం సాధించి ప్రభువులకు మనశ్శాంతి చేకూర్చగలను. అని నమ్మినదాన్ని నేను. చేజారిన తమ సుఖాన్ని తమ చేతులకు అమృత ఫలంగా అందించే ప్రయత్నం చేస్తాను.'     'ఊ!'     'ప్రభూ! స్త్రీలు చల చిత్తులు. చపల చిత్తులు. అందునా బ్రహ్మకూతురిగా సృష్టింపబడి- దేవేంద్రాది దేవతలు తనని పెండ్లాడాలని భూప్రదక్షిణ పుణ్యం కోసం పరుగులెత్తి- చివరికి ముక్కు మూసుకుని జప తపాల్లో మునిగే ఒక జడదారికి ధారపోయబడి అసంతృప్తితో అడుగులు వేసిన ఆడదాని మనసు మార్చటం ఎంతసేపు ప్రభూ?'     'దూతికా...'
24,752
     అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చాడు.     "నాకోసం నువ్వు పడ్డ అవమానం......" ఏడుపు తన్నుకు రావడంతో ఆపై మాటలు పెగలక, అలానే చూస్తూ కళ్ళనీళ్ళు తుడుచుకుని నన్ను నేను అదుపులో పెట్టుకుని- "ఇంతకంటే ఎలా  ఓదార్చాలో తెలియడంలేదు....." అంటూ ఆనంద్  చేతులు పట్టుకుని నా దగ్గరికి లాక్కున్నాను.     నా తలమీద పడ్డ వర్షం ధారకట్టి భగీరధుడి గంగ దుమికినట్లు ముక్కు మీదకు దూకి, అక్కడినుంచి ఏడుకొండల్లో పుట్టి కపిలేశ్వరుడి పాదాలపై వాలిన కపిలతీర్థం జలపాతంలా పెదవుల మీదపడి సోయగాల కృష్ణవేణమ్మ అయి, అక్కడి నుంచి వక్షస్థలం మధ్యకు జారి పాపికొండల నడుమ ప్రవహించే గోదావరై పారి బొడ్డును తడిపి. సముద్ర గర్భంలో కలిసేందుకు పరుగులుతీసే కావేరి అవుతోంది.     నావైపు చూస్తున్న అతను చలించిపోయాడు. ఏదో తెలియని ఆవేశం నన్ను ఊపేస్తుంటే మీదికి లాక్కున్నాను.     "ఇక్కడే కదా నా భర్త కర్రతో కొట్టింది" అంటూ పిచ్చిపట్టిన దానిలా ముద్దులతో అక్కడంతా తడిపాను.     "ఇక్కడే కదా..... ఇక్కడే కదా..... ఇక్కడే కదా...." నా భర్త తన్నిన చోటల్లా నోటిని అద్దాను.     తట్టుకోలేని నా అభిమానానికి, నా వాత్సల్యానికి, నా ప్రేమకు, ఎంతో విలువైన ఆ ఓదార్పుకు కృతజ్ఞతలు చెప్పడానికన్నట్లు పాదాల దగ్గర ఆగిపోయిన నన్ను పైకి లేపి గట్టిగా  కౌగిలించుకున్నాడు.     "అందుకే స్త్రీలంతా మంచివాళ్ళే" అదే అతను నాతో మాట్లాడిన మొదటి వాక్యం.          అనుమానపు మొగుడిమీద కసి తీర్చుకోవాలంటే అతనితో పూర్తి సుఖాన్ని అనుభవించాలనిపించి తలను పైకొత్తి అతని పెదవులను సుతిమెత్తగా కొరికాను.     "అబ్బా" అన్నాడు. సుఖమైన బాధ ఎలా వుంటుందో అతని ముఖం చూసి తెలుసుకున్నాను.     ఇక తమకం భరించలేనట్లు తన రెండు చేతుల్లో నన్ను బంధించి, పెదవులపై నోటిని గట్టిగా అదిమి, కోరిక విజృంభిస్తుండగా  నన్ను అలానే పైకి లేపాడు.     ముని కాళ్ళమీద లేచి అతని ముఖంపై నాలుకతో రాశాను. నాలుకను అతని నోట్లోకి జొనిపాను. వక్షస్థలాన్ని బలంగా అతని ఛాతీకి అదిమాను.     నా వీపు చుట్టూ అల్లుకున్న అతని చేతులు ఇంకాస్త కిందికి దిగి నడుం ముడతల దగ్గర ఆగిపోయాయి.     వర్షం జోరుగా కురుస్తోంది. చిల్లుల గొడుగులా వున్న చింతచెట్టు కింద అప్పటికే నీళ్ళు నిలబడిపోయాయి.     మేమిద్దరం పూర్తిగా తడిసిపోయాం. కానీ అది పూర్తి ఆరుబయలు ప్రదేశమనిగానీ, చినుకులకు తడిసి ముద్దయి పోయామనిగానీ, మేమిద్దరం ఎదురెదురు ఇళ్ళవాళ్ళమణి గానీ  గుర్తుకురాలేదు.     ఒకరినొకరు గాఢంగా కోరుకుంటున్న స్త్రీ, పురుషులం అన్న ఒక్క భావన తప్ప ఇంకో ధ్యాసలేదు. అద్వైతం అంటే ఇదే కాబోలనిపించింది నాకు.     చినుకులతోపాటు గాలి కూడా కొడుతుండడంతో చలి పుడుతోంది.     కాని నా ముఖంలో ముఖంపెట్టి వున్న అతని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వెచ్చగా తగులుకున్నాయి. అతని వక్షస్థలం అగ్నిగుండంలా అనిపిస్తోంది. అతని నడుం చలిమంటలా తోస్తోంది. నాకు ఒరుసుకుంటున్న అతన్ని కాళ్ళు కాలుతున్నట్లు భ్రమ కలుగుతోంది.     వెచ్చగా అనిపిస్తున్న అతన్ని ఇంకా పూర్తిగా నాలోకి ఇముడ్చుకోవాలన్న కాంక్షతో మరింత గట్టిగా  అదుముకున్నాను.     ఇక అలా వీలు కాదనిపించినట్లు అతను అటూ ఇటూ చిన్నగా  కదిలి, నన్ను వదిలి, ఆ తర్వాత చెట్టు మొదట్లో కూర్చుని, నా చేతులను పట్టుకుని కిందకి గుంజాడు.     కిందంతా నీళ్ళు లేపిన బురదతో చిత్తడిగా వుంది. ముందే చెప్పానుగా ఇలాంటి ధ్యాస లేదని. అందుకే ఏమీ సంకోచించకుండా అతని పక్కన అతను పూర్తి అదుపు సాధించాడు.     ఆ తరువాత పదినిముషాలపాటు వాన కురిసిందో, లేదో నాకు ఇప్పటికీ గుర్తు లేదు.     నా చుట్టూ గమ్మత్తుగా ఆవరించుకున్న మత్తు నుంచి తేరుకుని ఆనంద్ దగ్గర వీడ్కోలు తీసుకుని ఇంటికి బయల్దేరాను.     ఇంటి కొచ్చానన్న మాటేగానీ ఆ అందమైన అనుభవాన్ని గుర్తుకు తెచ్చే వానలో తడుస్తూ వుండాలనిపించింది.                                                   *    *    *     సాయంకాలం ఆరుగంటలప్పుడు నా భర్త ఇంటికొచ్చాడు. చెప్పులు వదలనైనా లేదు. అప్పుడే ప్రారంభించాడు.     "వాడు ఏమంటున్నాడు? దెబ్బలు తిన్నా అలాంటివాడికి బుద్ధి రాదు. నువ్వూ వెధవకి మద్దతు నిస్తున్నట్లే నాకనిపిస్తోంది. లవ్ లెటర్ లు ఏమైనా రాశాడా?"     నేను అడ్డు తగిలాను. "లవ్ లెటర్ ఏం రాయలేదు గానీ, మాట్లాడు కోవాల్సినవన్నీ మా శరీరాలు మాట్లాడేసుకున్నాయ్" అన్నాను.     అప్పుడు ఆయన ముఖం చూడాల్సిందే.     "నీలాంటి అనుమానపు మొగుడికి ఇలాంటి మాటలు అర్థం కావులే. మొత్తానికి అనుమానం నిజమైంది. పెళ్ళాం చెడిపోవడం కన్నా, అనుమానం నిజమైందన్న ఆనందమే నీలాంటివాడికి ఎక్కువనుకుంటాను. మీ అనుమానం నిజమయ్యేవరకూ మీరు ఏదో  ఒక విధంగా భార్యల్ని రెచ్చగొడుతూనే వుంటారు.     నా విషయంలో కూడా అదే జరిగింది. నువ్వే ఆ ఆనంద్ ని చూసేటట్లు చేశావ్. సైగలు చేసే  కోరికను కలిగించావ్. చివరికి సుఖం పంచుకోవాలన్న వెర్రి కోరిక  కూడా పుట్టేట్టు చేశావ్. ఇక నువ్వు ఎలాగైనా చావు -  నాకు అనవసరం. ఇప్పుడే నేను వెళ్ళిపోతున్నాను. సెలవ్' అని అలానే  కట్టుబట్టల్తో బయల్దేరాశాను.     ఊరు దాటాక ఎక్కడికెళ్ళాలో తోచలేదు. అలాంటివాడితో బతకడం దుర్లభమని బయల్దేరానుగానీ ఎక్కడికెళ్ళాలో అంతుబట్టలేదు. పుట్టింటికి వెళ్ళి తీరిగ్గా ఆలోచిద్దామని నిర్ణయించుకున్నాను. ఇక వడివడిగా అడుగులు పడ్డాయి.     బస్టాండ్ చేరుకున్నాను.     బస్సు కోసం చూస్తూ కూర్చున్నాను.     కాసేపటికి ఎవరో వస్తున్నట్లనిపించి ఊరివైపు తిరిగాను.     వగర్చుకుంటూ వస్తున్న ఆనంద్ కనిపించాడు. భర్తను వదిలేసి వెళ్ళిపోతానన్న వార్త అప్పటికే ఊరంతా పొగలా లేచినట్టుంది.     విషయం తెలియగానే పరిగెత్తుకొచ్చినట్లున్నాడు. ఇంకా ఆయాసం తగ్గలేదు.     "ఎక్కడికి?" ఆందోళనగా అడిగాడు.     "పుట్టింటికి."     "అంటే?"          "శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. పెళ్ళి బంధం తెంచుకుని."     "ఎక్కడి కెళుతున్నావ్?"
24,753
    "ఆయన ఫ్రెండ్ కూతుర్ని....." చెప్పి "ఆ స్కూల్ అడ్రస్  తెలుసాండి...." అని అడిగింది ఇందు.     "తెలీదమ్మా! టి.వీ. సీరియ్స్ డైరెక్టర్ కదా..... సులభంగా తెల్సిపోతుంది....." ఒక్కక్షణం ఏం చెయ్యాలో తోచలేదు. ఆ దగ్గరలో వున్న స్కూళ్ళ వివరాలు తెలుసుకొని, జంక్షన్ లో కొచ్చింది ఇందు.      మూడు గంటలు గడిచాయి.     సుధాకర్ భండారీగారి అడ్రసు దొరకలేదు ఇందుకు. తిరిగి బస్టాండ్ కొచ్చి, ముఖం కడుక్కుని, క్యాంటీన్ లో టిఫిన్ చేసి ఏం చెయ్యాలో తోచక తన పరిస్థితికి తనమీద తనే జాలిపడుతూ కూర్చుంది ఇందు.     సరిగ్గా అదే సమయంలో ఇందుకు శ్రీమహాలక్ష్మి పరిచయమయింది. శ్రీమహాలక్ష్మికి నలభై అయిదేళ్ళుంటాయి. పొట్టిగా, నల్లగా, ఆకర్షణీయంగా వుంటుంది. మంచో, చెడో లొడలొడ మాట్లాడడం ఆమె అలవాటు.     "బావను వెతకటం కోసం వచ్చావా.... ఇక్కడ చుట్టాల అడ్రస్ కూడా దొరకలేదా? ఇంట్లో చెప్పాచెయ్యకుండా రావచ్చా..... చూడమ్మాయ్! నీలాంటి ఆడపిల్లలు మోసపోయేది ఇలాంటి పిచ్చిచేష్టల వల్లే..... నాతోరా. నిన్ను విజయవాడ బస్సెక్కిస్తాను.  మాది అంధ్రానే" అంది శ్రీమహాలక్ష్మి.     "లేదండి! మా బావ నాకు కనిపిస్తాడనే నమ్మకం వుంది" అంటూ మైత్రేయ గురించి అంతా చెప్పింది.     "పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయినోడు మైసూర్ లోనే  వుంటాడని ఎలా అనుకున్నావ్ తల్లీ..... ఏ హైదరాబాదో, మద్రాసో వెళ్ళిపోయుంటాడు. నిన్ను చూస్తే నువ్వు, నీ బావను సీరియస్ గా ప్రేమిస్తున్నావని తెలుస్తోంది. వాడిక్కూడా అలాంటి ప్రేమే వుంటే..... జరిగిందంతా నీ దగ్గరికొచ్చి చెప్పును కదా.... ఎంతగా మనక్కావలసిన వ్యక్తయినా మగాడ్ని మాత్రం నమ్మకు" సిన్సియర్ గా సలహా యిచ్చింది శ్రీమహాలక్ష్మి.     మైత్రేయ కలిస్తే, అతనితోనే వుండిపోవాలనుంది ఇందుకు. మరి నందిగామ వెళ్ళాలని లేదామెకు. ఆ విషయాన్నే శ్రీమహాలక్ష్మికి చెప్పింది ఇందు.     ఇందు అమాయకత్వానికి జాలిపడింది శ్రీమహాలక్ష్మి.     "అయితే ఓ పని చెయ్యి.... ఈ పట్నంలొ ఒంటరిగా ఎక్కడుంటావ్? గానీ రెండ్రోజులు మా ఇంట్లో వుండు. నీ బావని వెతుక్కో దొరక్కపొతే మీ ఇంటికి వెళ్ళిపోవాలి. సరేనా?"     అంగీకరించింది ఇందు.     మరో పావుగంటకు బస్టాండ్ నుంచి మైసూర్ లోని ఛామరాజ్ మొహల్లా వెళ్ళే, సిటీబస్సు వచ్చింది. ఇద్దరూ ఎక్కారు. దారిలో తన గురించి చెప్పింది శ్రీమహాలక్ష్మి.     "మాదీవూరు కాదులే. జగ్గయ్యపేట దగ్గర పల్లెటూరు. పదేళ్ళక్రితం పొట్ట చేత్తో పట్టుకుని నేనూ, మా ఆయనా ఈ ఊరొచ్చేశాం. ఛామరాజ్ మొహల్లాలో పాన్ షాపు పెట్టుకున్నాం. ఈ వురొచ్చిన అయిదేళ్ళకు బస్ ఏక్సిడెంట్ లో మా  ఆయన  చనిపోయాడు. ఒక్క కొడుకు. పదో తరగతి చదువుతున్నాడు" దారంతా ఆ విషయాలు, ఈ విషయాలు చెప్తూనే వుంది శ్రీమహాలక్ష్మి ఆమె  అంటే మంచి అభిప్రాయం ఏర్పడింది ఇందుకు.     మెయిన్ సర్కిల్ కి పాతిక గజాలదూరంలో వుంది శ్రీమహాలక్ష్మి ఇల్లు. రెండు గదుల పాతకాలం  నాటి ఇల్లు.     "రా ఇందూ..... రా..." ఇంట్లోకి నడిచింది శ్రీమహాలక్ష్మి.     అరుగుదాటి లోనికి వెళ్ళబోయిన ఇందు, లోనగది మధ్యన ఈజీఛైర్లో కూర్చుని సిగరెట్  తాగుతున్న వ్యక్తిని చూసి ఆగిపోయింది ఒక్కక్షణం.     ఆ వ్యక్తి పొడవుగా, దృఢంగా వున్నాడు. 'ఎవరా కొత్తమనిషి' అన్నట్టుగా కళ్ళార్పకుందా ఇందువేపే చూస్తున్నాడతను.     "సిన్మా విలన్ లా  వున్నాడని భయపడకు. లోపలికి రా ఇందు...." అని, ఆ మగాడివైపు తిరిగి "ఇందని నాకు తెల్సిన వాళ్ళమ్మాయి. చిన్నపనుండి వచ్చింది. బయటికెళ్ళి రెండు టీలు తీసుకురా" అని చెప్పింది శ్రీమహలక్ష్మి. అనుమానపు చూపుల్తో ఇందునే చూస్తూ ఆ మగవ్యక్తి బయటికెళ్ళాడు.     "వాడి చూపులు చూసి భయపడుతున్నావా? ఏం భయం లేదులే..... మనిషి మంచోడే. రెండు పెగ్గులు వేసుకున్నప్పుడు మాత్రమే వాడలా చూస్తాడు అంతే" చీర మార్చుకుంటూ చెప్పింది శ్రీమహాలక్ష్మి.     "ఎవరాయన?" అడిగింది ఇందు.     "మహాపట్టణాల్లో ఆడది ఒంటరిగా బతకలేదు గదమ్మాయ్. అందుకే ఒక దిజ్జుగా వుంటాడని నేనే వుంచుకున్నాను...." నవ్వుతూ చెప్పింది శ్రీమహాలక్ష్మి.     "అంటే మీ భర్తా! రెండోపెళ్ళి చేసుకున్నారా?"     "ఉంచుకున్నాడంటే పెళ్లాంటావేంటి.... ఇలాంటి మాటలు నువ్వెప్పుడూ వినలేదా? ఆడికి వేరే స్వంత పెళ్ళాం, పిల్లలూ బృందావన్ గార్డెన్స్ కి  వెళ్ళేదారిలో వున్నారు. నేనంటే మోజుపడ్డాడు. కుక్కలా నాకోసం పడిగాపులు కాసేవాడు. నాక్కూడా అభిమానం ఏర్పడిందిలే" ముసిముసిగా నవ్వుతూ అంది శ్రీమహాలక్ష్మి.     "అయితే మీ ఇద్దరూ ప్రేమించుకున్నారా?" ఇందుకి ఆ యిద్దరి విషయం చాలా ఇంట్రెస్టుగా వుంది.     "అయిదేళ్ళక్రితం సంగతి..... ణా మొగుడు పోయాడు. నేను, నాకొడుకు..... కిళ్ళీబడ్డీ.... ఇక్కడ నాకెవరున్నారు? స్వంత వూరు వెళ్ళిపోదామనుకున్నాను. ఆ మాత్రం బతకలేనా అని మళ్ళీ ఓ ధైర్యం.... ఒంటరిగా బతకాలనుకునే ఆడవాళ్ళకు ముఖ్యంగా వుండాల్సింది వాళ్ళమీద వాళ్ళకు ధైర్యం, నమ్మకం. ఆ నమ్మకంతోనే కిళ్ళీబడ్డీ నడుపుతుండేదానిని.... ఒకరోజు ఈ మగాడు సిగరెట్ల కోసం షాపు దగ్గరికొచ్చాడు. మాటా, మాటా కలిపాడు. అప్పట్లో లారీ డ్రైవర్ గా పనిచేస్తుండేవాడులే. రోజూ ఉదయం, సాయంత్రం వచ్చేవాడు, బడ్డీముందు కూర్చునేవాడు. కబుర్లు చెప్పేవాడు.     రెండు, మూడుసార్లు ఇంటికొచ్చాడు. ఒకరోజు చీర కొని తెచ్చిచ్చి, నా  చేతిలో పెట్టి, "నువ్వంటే నాకిష్టం. నిన్ను పెళ్ళి చేసుకుంటా'నన్నాడు. నేను నమ్మేశాను.     ఒకరోజు రాత్రి బాగా తాగొచ్చాడు. వస్తూ వస్తూ ఒకావిడను తీసుకొచ్చాడు. వాళ్ళావిడను పరిచయం చేశాడు. ఆవిడెదురుగా నాతో మళ్ళీ చెప్పాడు. నేనంటే ఇష్టమని...."     నేను ఆవిడ అభిప్రాయం అడిగాను.     "నన్నూ, నా పిల్లల్నీ గాలికి వదిలేయకుందా చూసుకుంటే ఆయన ఇష్టాన్ని నేనెందుకు కాదంటాను" అందామె.     కేసు సెటిలైపోయింది. నాకో మగదిక్కు దొరికింది. మా గణేష్ రాత్రంతా ఆటో నడుపుతాడు. పగలు షాపు దగ్గర నాకు సహాయం చేస్తాడు. మగాడి కుండాల్సిన బుద్ధులన్నీ వున్నాయిగానీ, మా గణేష్ నా దగ్గర జాగ్రత్తగా వుంటాడులే" కథంతా చెప్పుకొచ్చింది శ్రీమహాలక్ష్మి.     "భలే వుంది మీ ప్రేమకథ" నవ్వుతూ అంది ఇందు.     "మాది ప్రేమ కథేంతే తల్లీ.... ఎడ్జస్ట్ మెంట్ అని అంటారే..... అలాంటిదే.... ప్రేమ కథంటే నీది. బావ మర్డర్  చెయ్యడం, పరారీలో వుండడం బావని వెతుక్కుని నువ్వు రావడం..... ప్రేమకథంటే నీది" శ్రీమహాలక్ష్మి ఆ మాట అంటుండగానే రెండు టీ కప్పులో లోపలికి వచ్చాడు గణేష్. ఆ కప్పుల్ని అందుకుని ఒక కప్పుని ఇందు చేతికందించింది.     "పెరట్లో స్నానం చేసిరా, భోంచేద్దాం. ఈలోపల మావాటితో కూడా నీ  విషయం మాట్లాడుతాను" అంది శ్రీమహాలక్ష్మి.     టీ తాగాక, సూట్ కేస్ లోంచి బట్టలు తీసుకుని పెరట్లో వున్న బాత్ రూమ్ వేపు నడిచింది ఇందు.     సిగరెట్ వెలిగించుకుంటూ, అలా ఆమెవేపే చూస్తున్నాడు గణేష్.                                              *    *    *     చేతికందిన అలారం పీస్ ని గోడకేసి కొట్టాడు వెంకటయ్య.     "ఇలాంటి వెధవ బుద్ధులొస్తాయనే, ఎదిగిన ఆడపిల్లను చదవించవద్దన్నారు పెద్దలు. ఏమయింది? ఇప్పుడేమయింది. బస్టాండ్ వెతికాం, రైల్వేస్టేషన్ వెతికాలం..... ఫ్రెండ్స్ ఇళ్ళు, చుట్టాలిళ్ళు..... ఏదీ..... ఎక్కడికెళ్ళిపోయింది. ఎందుకెళ్ళిపోయింది, అదెక్కడికెళ్ళిందో నీకు తెలీదంటే నన్ను నమ్మమంటావ్ అంతేనా?"     "మీ మీదొట్టు! దేవుడి మీదొట్టు.... నాకే విషయం తెలియదండీ.... నన్ను  నమ్మండి" ఏడుస్తూ చెప్తోంది సావిత్రమ్మ.     గోడవారగా నిల్చుని, బిక్కమొహం వేసుకుని ఆ దృశ్యాన్ని చూస్తోంది సరోజ.     "మీ  ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్! ఇందు ఏ విషయం నీ దగ్గర దాయదని నాకు తెలుసు. దయచేసి చెప్పమ్మా... అది  చచ్చిందో, బతికుందో చెప్పు...." వెంకటయ్య కళ్ళంట ఉబికి వచ్చిన కన్నీళ్ళని చూస్తోంది సరోజ.     ఆమెక్కూడా కళ్ళవెంట నీళ్ళొచ్చేశాయి. వెక్కి వెక్కి ఏడుస్తోంది.     "అంకుల్! నేనెంత చెప్పినా, ఎంత బతిమిలాడినా ఇందు వినిపించుకోలేదు. అంకుల్, నిన్నరాత్రి పదిగంటల బస్సులో....." జరిగిందంతా చెప్పింది సరోజ.     అంతా విన్నాక సావిత్రమ్మ బావురుమంది.     "ఆ ముదనష్టపు గాడిదకొడుకుని వెతుక్కుని, ఈ దిక్కుమాలింది వెళ్ళిందా? వాడేం మైసూర్ బస్టాండ్ లో ఎదురుచూస్తుంటాడా? ఇప్పుడు నేను ఎక్కడికని వెళ్ళను. ఎక్కడ వెతకను? దాని బదులు ఏ నుయ్యో, గొయ్యో చూసుకుని చస్తే పీడా విరగడైపోను" కుర్చీలో కూలబడిపోయాడాయన.     "మీ ఫ్రెండెవరో సుధాకర్ భండారీగారని ఉన్నర్ట కదా...." సరోజ నోటిలోంచి ఆ మాట రాగానే తలెత్తి సూటిగా ఆమెవైపు చూసాడు వెంకటయ్య.     "అక్కడికే వెళతానని చెప్పిందా" ఆత్రంగా అడిగింది సావిత్రమ్మ.     "అవునాంటీ.... అక్కడికే వెళుతుంది."     "అక్కడినుంచి ఇంకెక్కడికీ వెళ్ళిపోకుండా, అర్జంటుగా ఫోన్ అయినా చెయ్యండి" బతిమిలాడింది సావిత్రమ్మ.     "వెళ్ళాల్సిందే. సూట్ కేస్ లో బట్టలు సర్దు" చిరాగ్గా అన్నాడు ఆయన.     సావిత్రమ్మ లేచి బెడ్ రూమ్ లోకి పరుగెత్తింది.                                              *    *    *     బర్కిలీ సిగరెట్ తీసి, వెలిగించి గుండెల నిండా పొగ పీల్చి, మళ్ళీ ఆ పొగను బయటకి వదులుతూ శ్రీమహాలక్ష్మి ముఖంలోకి చూశాడు గణేష్.     "ఆ పిల్ల చెప్పింది కాకమ్మకతలా వుంది తప్ప, నమ్మబుద్ధి కావడంలేదు" అన్నాడతను.     "ఆ పిల్ల పెద్దింట్లో, పుట్టినపిల్ల..... కనిపించడంలేదూ, బజారుపిల్లలా కనిపిస్తోందా నీ కళ్ళకు" కోప్పడింది శ్రీమహాలక్ష్మి.     "అయితే ఇప్పుడేం చెయ్యమంటావ్?"     "మీ ఆటోవాళ్ళకి పోలీసులతో పరిచయాలుంటాయి కదా.... నాలుగు పోలీస్ స్టేషన్ల లోనూ వాకబు చేస్తే ఆ అబ్బాయి గురించి తెలుస్తుంది కదా. ఆడకూతురికి సాయం చేస్తే పుణ్యం" అంది శ్రీమహాలక్ష్మి.     "అసలే మర్డర్ కేసు! పోలీసుల గురించి నీకు తెలీదు. వాళ్లకి కేసు కావాలంటే నడుస్తున్న ఆటోని జంక్షన్లో మాయం చేసేస్తారు. మనుషులో లెక్కా. రేపు కనుక్కుంటాలే" తాపీగా చెప్పాడు గణేష్.                                                                  *    *    *          మర్నాడు ఉదయం-     ఎనిమిదిగంటల సమయం-     బస్ కాంప్లెక్స్ దగ్గర ఆటోస్టాండ్ లో ,ఆటో పక్కన నుంచున్నాడు గణేష్     త్రీ టవున్ పోలీస్ స్టేషన్  హెడ్ కానిస్టేబుల్ సర్రున సైకిల్ మీద వెళ్ళిపోతూ కన్పించాడు. ఆయనతో పరిచయముంది గణేష్ కి.     "హెడ్డుగారూ! చిన్నమాట" టక్ మని  బ్రేకు వేసి " ఏంటి కత గణేషూ! ఈయాళ పగలు డ్యూటీ ఏటీ..... నిన్న రాత్రి డ్యూటీలో రంగు, రంగుల పిట్టలేవీ తగల్లేదేటి?" బోసినవ్వు నవ్వాడు హెడ్డు.
24,754
    చాలాసేపటికి ఆమె కళ్ళు విప్పింది. మనసులోని డోలాయమానాన్ని అతిక్రమించటానికి ప్రయత్నిస్తున్నట్లుగా, స్ఫుటమైన గంభీర భావంతో ప్రకాశిస్తున్నాయామె నేత్రాలు.     "కల్యాణ్" అంది ఎంతో సున్నితంగా చెప్పటానికి ప్రయత్నిస్తూ. సాయంత్రం వరకూ నాకు గడువియ్యి . నేను చాలా లోతుగా ఆలోచించుకోవాలి.     అతను ముందుకువచ్చి ఆమె చెయ్యిపట్టుకుని ప్రేమగా నొక్కాడు. "ఆలోచించు వేదితా. నీ ఇష్టమొచ్చినంతసేపు ఆలోచించు. కాని దయవుంచి 'కాదు' అని మాత్రం రానివ్వకు."     "క్షమించు కళ్యాణ్! నా మతి ఏమీ స్థిరంగా లేదు! నువ్వు అన్యధా భావించకపోతే  సాయంత్రంవరకూ ఏకాంతంగా ఉండగోరుతున్నాను" అన్నది వేదిత మళ్ళీ మృదువుగా.     క్షణంపాటు అతని ముఖం మలినమై, తిరిగి యధాస్థితికి వచ్చింది. "అలాగే వేదితా! నీ అభిలాషలన్నింటినీ నేను గౌరవిస్తాను. ఇంటికివెళ్ళి సాయంత్రం వరకూ ఎలాగో గడిపి అయిదుగంటలకల్లా వస్తాను. అంతకన్నా వేచివుండటం నా తరం గాదు" అంటూ వెళ్ళిపోవటానికి ఉద్యుక్తుడై, నెమ్మదిగా చెయ్యి తీసుకోబోయాడు.     కాని ఆమె ఈసారి అతని చెయ్యి వొదలకుండా ఆపుతూ అంది. "ఈలోపల తొందరపడి ఓ నిశ్చయానికి వచ్చి ఈ వార్త ఎవరికీ వెల్లడి చేయవద్దు. వేచి వుండు సుమా!" ఓ మలిన మందహాసం ఆమె పెదవులమీద తొణికిసలాడింది.     "అలాగే -అలాగే" వెయ్యి భయాలు, లక్ష అనుమానాలు అతన్ని ఆవహించాయి. గుండె నిబ్బరం చేసుకుని చెయ్యి విడదీసుకోబోయాడు.     ఆమె ఇంకా అతని చేతిని విడిచిపెట్టలేదు. "వెడుతున్నావా?" అంది. ఆమె గొంతుక్కేదో అడ్డుపడినట్లయింది.     "ఈ ఒక్కసారికే నేను వెళ్ళటం. ఇహమీద టెప్పుడూ నేను వెళ్ళటం జరగదు" అతను కదలబోయాడు.       కాని ఆమె చెయ్యి యింకా అతని చేతిని పట్టివుంచింది. "కళ్యాణ్ నువ్వు... అమృతమూర్తివి. నీ శుభమూ, శ్రేయస్సే నేను కోరుతాను" అంది రుద్ధ కంఠంతో. ఆమె కపోలాలు బాధతో నల్లగా కమిలిపోతున్నట్లయిపోయాయి.     అతను దిగాలుపడి ఆమెవంక చూస్తూ నిలబడిపోయాడు. ఆమె కనులలోని నీలి మేఘాల - చిక్కనైన నలుపును పులుముకుని అతని కనులలో వర్షించినట్లయింది.     ఈసారి అతని చేతిని విడిచి పెట్టేసింది "వెళ్ళిరా కళ్యాణ్!" అంది పొడిగా.     అతను కదిలాడు. అతని అడుగులు కదిలాయి. అతని ఉనికి కదిలింది. అంతర్యం మాత్రం ఆ హోటలు గది చూరు పట్టుకుని వ్రేలాడుతోంది.     వెళ్ళిపోతున్న ఆ వ్యక్తి నుండి శూన్యాన్ని చూస్తున్నదో, శూన్యంలో నుండి ఆ వ్యక్తిని చూస్తున్నదోగాని, వేదిత నిలబడి అలాగే చూస్తున్నది.                                             * * *     అంత సుదీర్ఘమయిన రోజును కల్యాణమూర్తి గడిపివుండలేదు. నిముషాలు యుగాలై, గంటలు మన్వంతరాలై గడిచాయి.     ఎక్కడకూ బయటకు పోలేదా రోజు. తను బయట కనిపిస్తే స్నేహితులుగాని, తోటి ఉద్యోగులుగాని కనిపించి పెళ్ళి ప్రసక్తి తీసుకువస్తారనీ, లేకపోతే పెళ్ళివారే కనిపించి తన భరతం పట్టిస్తారానీ అతని భయం.     ఇంట్లో కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నాడు. ఒకచోట కూర్చోబుద్దికాదు. ఏమీ తినబుద్దికాదు. త్రాగ బుద్దికాదు. జ్వరం వచ్చినట్లు వళ్ళు వేడెక్కుతోంది.     కష్టంమీద నాలుగయింది. ఇహ బయల్దేరటానికి ఆయత్తపడి, ముఖం కడుక్కుని బట్టలేసుకున్నాడు. నాలుగున్నరదాకా రిస్టువాచి చూసుకుంటూ అసహనంతో గడిపాడు.     తర్వాత బయటకు వచ్చి యిల్లు తాళం పెట్టి బయల్దేరాడు. టాక్సీ దొరికేసరికి మరో పది నిముషాలు పట్టింది.     సరిగ్గా అయిదవుతూండగా హోటలు ముందు టాక్సీ ఆగింది. డ్రైవర్ కు డబ్బు చెల్లించి ఆదరా బాదరాగా లోపలకు పరుగెత్తి మెట్లెక్కుతున్నాడు.     "సార్!" వెనకనుండి వినిపించింది ఓ కంఠం     తలత్రిప్పి చూసేసరికి కౌంటర్ దగ్గర నిలబడిన మేనేజర్ అతన్ని పిలుస్తూండటం కనిపించి, విసుగ్గా ఎక్కిన నాలుగు మెట్లూ దిగి అతని దగ్గరకు వెళ్ళి "ఏమిటి?" అన్నాడు.     "ప్రొద్దున ఒకామెతో వచ్చి యిరవై మూడో నంబరు గది తీసుకుంది మీరే కదూ?" అన్నాడు మేనేజరు.     "అవును. ఏం?"     "మీ పేరు కల్యాణమూర్తి గారేనా?"     అతని గుండె గబగబ కొట్టుకుంది. నుదుటన చెమటలు పట్టాయి.     "అ...వు...ను..." అన్నాడు.     మేనేజరు డ్రాయరు సొరుగులోంచి ఓ కవరు బయటకు తీశాడు. "మధ్యాహ్నం ఒంటిగంటకు ఆమె గది ఖాళీచేసి వెళ్ళిపోయారు. అయిదు గంటలకు మీరు వస్తారనీ, ఈ కవరు మీ కిమ్మనీ చెప్పారు" అంటూ అందించాడు.     మిన్ను విరిగి మీద పడ్డట్టయింది. ముఖం రక్తం లేనట్లు తెల్లగా పాలిపోయింది. 'ఎంతపని చేశావు వేదితా!" అనుకుంటూ కవరు అందుకుంటూంటే చెయ్యి గజగజమని వొణికింది.     "చూడండి, కాసేపు నేను యేకాంతంగా ఉండుగోరుతున్నాను. ఇక్కడేమైనా సదుపాయముందా?"     మేనేజరు ఒక నిమిషమాలోచించి "రూమ్ నంబరు యిరవైమూడు ఖాళీగా వుంది. మీరు వెళ్ళి కావలసినంతసేపు వాడుకోండి. ఫర్వాలేదు" అంటూ కీ బోర్డుమీద నున్న తాళంచెవి తీసి అందిచ్చాడు.     తాళంచెవి తీసుకుని భారంగా మెట్లమీద ఒక్కొక్క అడుగూ వేస్తూంటే ప్రాణం ఉసూరుమంది. జీవచ్ఛవంలా, మైనపు బొమ్మలా కదులుతున్నాడు.     తలుపులు తీసి గదిలోకి ప్రవేశించాడు. ఆ గదిలో వేదిత కొద్ది గంటలు నివసించినా యుగాల తరబడి నివసించినట్లు అక్కడి వాతావరణమంతా ఆమె ఉనికినీ, ఆమె పరిమళాన్నీ వెదజల్లుతున్నాయి.
24,755
    మరొక్కక్షణం  అక్కడ నిలబడలేదు, ఇంటిలోకి పరుగెత్తుకుని వచ్చింది. తెరలు తెరలుగా వచ్చే దుఃఖన్నీ ఇక ఆపుకో లేకపోయింది. టేబిల్ ముందు  కూర్చొని, చేతుల్లో మొహం దాచుకొని  వెక్కి వెక్కి ఏడవసాగింది.     ఆమె చేతుల్లోంచి జారిన ఆమె మొదటి ప్రేమలేఖ మురిక్కాలవలో పది ఎక్కడికో కొట్టుకుపోయింది.                                                              18     "నిజమా?"  అంది నమ్మలేనట్టు  సిత. సుబ్బులు విషాదంగా నవ్వి అవునన్నట్టు తలూపింది. ఆ అమ్మాయితో ప్రస్తుతం స్ధబ్దత గూడు కట్టుకొని వుంది. ఇది ట్రాన్సిమిషన్  ఇక్కడ్నుంచి రెండుదార్లు ఒకటి__ అనుభవాల్ని తేలిగ్గా తీసుకొని బ్రతకటం. రెండోది__ ఈ భయంతో మిగిలిన జీవితాన్ని నిజాయితిగా  బ్రతకటం. మధ్య తరగతి అమ్మాయిలో మొదటిరకం వాళ్ళు చాలా తక్కువ. భావిష్యత్తుపట్ల  భయంవల్ల వాళ్ళు రెండోదానినే ఎన్నుకొంటారు. స్త్రి కావాల్సిన నీడకోసం  చాలా అందంగా  చేసుకొనే ఆత్మవంచన  ఇది. ఈ రెండిటికి  అతీతంగా  ఇంకో  దారి వుంది__ ఇది చాలా కొద్దిమందికే వర్తిస్తుంది. ఈ ఒక్క చిన్న అనుభవంతో వాళ్ళు  చాలా ఎదిగిపోయి  జీవితంపట్ల కొన్ని  నిర్ణయాలను, నిశ్చయాలనూ ఏర్పరచుకొంటారు. విరి మిగతా జీవితం అంతా  చాలా పవిత్రంగా గడుస్తుంది. దురదృష్టవశాత్తూ ఈ రకం  మనుష్యులు  చాలా తక్కువ. ఎందుకంటే వ్యసనాలన్నిటిలోనూ భయంకరమ్తెన  వ్యసనం ద్రిల్ . దానికి ఒకసారి అలవాటు పడ్డ తరువాత ఆ అలవాటు నుంచి  తప్పించుకోవటం కష్టం. అసలు సిగరెట్ తాగనివాడికన్నా, ఒకసారి తాగి మానేసినవాడు గొప్పవాడు.     సుబ్బుల్లో  యిప్పుడు  ఏదో కనబడుతూంది. ఆ కన్నుల్లో  యేదో నిర్మలత్వం. రాత్రంతా పడ్డ మంచులో ప్రక్షాలితమ్తెన మల్లెలా- ఆమె  సహజ స్వభావము, ఆమె కివ్వబడిన శిక్షణ. ఆమెకున్న విద్య బుద్దులు- తల్లిదండ్రుల  సంసారపు స్ధాయి. వీటన్నిటిని డామినేట్  చేసిన ఒక్క అనుభవం__ అది ఎంత చిన్నద్తేతేనేం?___ దానివల్ల ఆమె ప్రక్షాలితం అయింది. ప్రపంచ భ్రాంతికాని, అసత్యంకాని కాదు. శూన్యం కాదు. దాని సత్యత్వము 'కేవలము' (బ్రహ్మము) కేవలము మాత్రమే  సృజింపబడనిది దివ్వ సత్యత్వమే!     "....నువ్వేం బాధపడకు " అంది సిత ఓదారుస్తున్నట్టు.     సుబ్బులు ఆమెవ్తెపు  ఆశ్చర్యంగా చూసి "నేనేం బాధపడటం లేదే_" అంది. ఈసారి ఆశ్చర్యపోవటం సిత వంతయింది. సుబ్బులు మొహంలోకి చూసింది. ఆమె మొహంలో ఏ భావమూ లేక నిర్వికారంగా వుంది.     "ఇంకటు వెళ్ళకసలు" అంది సిత. సుబ్బులు ఒకక్షణం మాట్లాడలేదు. తరువాత నెమ్మదిగా  అంది__"రాఘవరావునీ పెళ్ళి చేసుకుంటానని నేను చెప్పేశాను ఇంట్లో."     "ఏవిటి?"     "అవును" అంది సుబ్బులు.     "ఎందుకు?"     ఎందుకో సుబ్బులుకే తెలిదు. మన జీవితాల్లో మనం కొన్ని నిర్ణయాలు ఎందుకు  తిసుకుంటామో, ఎలా ప్రవర్తిస్తామో మనకు  తెలియకుండానే జరిగిపోతూ వుంటాయి. తార్కికంగా ఆలోచించగలిగే సమయం , శక్తి ,ఓర్పు ఉండవు. తరువాత సమర్ధన 'ఎస్కేపిజం' ఈ ఎస్కేపిజంలోనే  మనిషికి ఆనందం గుర్తించ గలిగేవాడూ ఈ విషయంలో తన మనసులో సత్సంబదాంలు ఏర్పరచుకోలేక అనుక్షణం  ఘర్షణ పడుతూ  వుంటాడు. ఈ ఘర్షణవల్లే మనిషి పెరిగేది. అది వేరే సంగతి. ఆనందం  లేకపోయేక ఎదిగి లాభం  ఏమిటి? ఈ ప్రపంచంలో రచయితలూ, కవులూ, తాగుబోతులూ, ప్రేమికులూ, భావకులూ, జూదర్లూ_ వీళ్ళంత దురదృష్టవంతులు ఇంకెవరూ ఉండరు. ఇదంతా చూస్తూంటే  అమాయకంగా జీవితాన్ని నమ్మేయతంలో ఉండే ఆనందం  యెందులోనూ  లేదనిపిస్తుంది. కాని ఇంత  చిన్నవిషయం తెలిసేసరికే మనిషి తన అమాయకపు  పరిధిలోంచి బ్తేటకు వచ్చేస్తాడు.     "___సితా" పరంధామయ్య లోపల్నుంచి  పిల్చేడు. సిత లేచి "ఇప్పడే  వస్తాను" అంది.     "వద్దు. నేను  వెళ్తాను....ఇది చెప్పటానికే  వచ్చాను" అంది  బయటకి అడుగు పెడుతూ. ఆమె మెట్లు  దిగుతూ ఉంటే  రాఘవరావు యెదురుపడ్డాడు. అతన్ని చూసి చప్పన  వెనక్కి అడుగు వేసింది ఆమె.     అతను కూడా క్షణం పాటు తొట్రుపడ్డాడు. కాని వెంటనే  సర్దు కొని "ప్రకాశం  ఉన్నారేమోనని" అన్నాడు అస్పష్టంగా  సుబ్బులు మాట్లాడలేదు. రాఘవరావు  ఆమెవ్తెపు చూడటంలేదు. ఆమె మాత్రం  కంటికోణాల్లోంచి అతన్ని చూస్తూంది. సన్నగా పొడుగ్గా ఉన్నాడు. తెల్లటి చొక్కా __ తెల్ల పెంటూ....చాలా  సామాన్యంగా ఉన్నాడాతను. మధ్యాహ్నం అవడంవల్ల  రోడ్డంతా  నిర్మానుష్యంగా ఉంది. దూరంగా ఎక్కడో కుక్క ఒకటి మొరుగుతూంది. అంతా నిశ్శబ్దం  ఆలోచన రేకెత్తించే నిశ్శబ్దం....ఏదో ఆకర్షణ ఆమెని  కట్టిపడేస్తూంది. అతనిలో  ఎవిలేదు. ముఖ్యంగా సుబ్బారావుతో పోల్చుకుంటే, కాని....ఏదో  బంధం - అతను తనవాడు అన్న భావం- ఆ భావంలో  ఏదో సంతృప్తి.... తరతరాలుగా స్త్రి నీ  సంతృప్తిపరిచే విష్యం -దేవుడు స్త్రీకి యిచ్చిన వరం!          వెనుక చప్పడవటంతో ఉలిక్కిపది వెనక్కి తిరిగింది. వెనుక ప్రకాశం ఉన్నాడు. ఆమెకి సిగ్గు ఒక్కసారిగా  ముంచు కొచ్చింది. ఆమె పక్కకి తిరగ్గానే  ప్రకాశానికి అతను కనపడ్డాడు. ప్రకాశం ఒక్కసారి ఇద్దర్ని  పరికించి బిగ్గరగా నవ్వేడు. సుబ్బలు చేతుల్తో మొహం కప్పుకొని లోపలికి పరుగెత్తింది. సిగ్గుతో రాఘవరావు మొహం ఎర్రగా కందిపోయింది.
24,756
    లోపలికి వెళ్ళీవెళ్ళగానే అతను గమనించాడు.     ఇంటర్వ్యూ బోర్డు మెంబర్లలో ముఖ్య స్థానంలో కూర్చుని వున్నది...     ఇంకెవరో కాదు....     కృష్ణాజీ!     అతను కృష్ణాజీనే!     తన గురువు! తన దైవం!     తనకి తెలియకుండానే రెండు చేతులూ జోడించాడు అతను.     ఎన్నాళ్ళకెన్నాళ్ళకు చూస్తున్నాడు ఈయనని.     రాజా కళ్ళలో తడి!     రాజా అభివాదాన్ని అందుకున్నట్లు తల పంకించాడు కృష్ణాజీ. కానీ అతను రాజాని గుర్తుపట్టలేదు.     అదీ సహజమే కదా!     తొమ్మిదేళ్ళ క్రితం చూశాడు రాజాని అతను.     అప్పట్లో రాజా చిన్నపిల్లవాడు!     ఇప్పుడు ఎదురుగా ఉన్న రాజా సూపర్ మాన్ లా కండలు తిరిగివున్న యంగ్ మాన్!     "నీ పేరు..." అన్నాడు కృష్ణాజీ.     "రవిరాజ్ కుమార్" అన్నాడు రాజా.     అంతేగానీ తను ఫలానా అని చెప్పి గుర్తు చెయ్యలేదు కృష్ణాజీకి.     కృష్ణాజీకి తనెవరో తెలిస్తే రెండు రకాలుగా వుండవచ్చు పరిస్థితి.     ఒకటి....     కృష్ణాజీకి ఇంకా తన మీద కోపం పోయి వుండకపోవచ్చు.     ఆనందరావు మాటల ఎఫెక్ట్ ఇంకా ఆయన మనసులో ఉండి తనంటే వ్యతిరేకత ప్రకటించవచ్చు.     ఆయనకు తెలియకుండానే, ఆయన మనసులో ఉన్న వ్యతిరేకత వర్క్ చేసి,అది తను పోలీసు డిపార్ట్ మెంటులో చేరే ఛాన్సెస్ ని దెబ్బతియ్యవచ్చు.     అలా కాకపోతే....     కృష్ణాజీకి తనపట్ల ఉన్న అపోహలు ఈ మధ్యకాలంలో తొలిగిపోయి వుండవచ్చు.     ఆయన ఎప్పటిలాగా తనంటే వాత్సల్యం చూపించి, తనకు అనవసరంగా ఫేవర్ చెయ్యాలని చూడవచ్చు.     అది కూడా సంభవమే!     అలా ఒకరి దయాదాక్షిణ్యాల మీద సెలెక్షన్ రావడం తనకి ఇష్టం లేదు.       తనకి సెలెక్షన్ అంటూ వస్తే, అది కేవలం తన ప్రతిభ వల్లే రావాలి అంతే!     మరో కారణం వల్ల...అది ఏదయినా సరే... వస్తే తనకి నచ్చదు! దానికి మాత్రం తిరుగులేదు.     పెద్దవాడయిన రాజాని కృష్ణాజీ గుర్తుపట్టలేదు - సహజంగానే.     కృష్ణాజీ కూడా మారాడు.     అయితే గుర్తు పట్టలేనంగా మాత్రం కాదు. మనిషి ధృఢంగానే ఉన్నాడు. కానీ జుట్టు చెంపల దగ్గర నెరిసింది. ముందువైపు జుట్టు కాస్త పలచబడి, బట్టతల రాకని సూచిస్తోంది.     తన ముందువున్న పేపర్స్ కాసేపు పరికించి, తరువాత ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాడు కృష్ణాజీ.     ముందుగా రొటీన్ క్వశ్చన్స్.     ఆ తరవాత రాజా వ్యక్తిత్వాన్నీ, మనస్తత్వాన్నీ ప్రోబ్ చేస్తూ...డీప్ గా, తరచి తరచి చూస్తున్నట్లు ప్రశ్నలు!     గుర్రానికి పై పళ్ళు ఎన్ని?     గాడిద తోకలో ఉండే వెంట్రుకలు ఎన్ని? అన్న వెకిలి పద్ధతిలో అనవసరమైన "జనరల్ నాలెడ్జి" ప్రశ్నలు కాకుండా.     నిజంగా మనసు లోతులని త్రవ్వి చూసే ప్రశ్నలు!     ఈ ఉద్యోగం అంటే ఎందుకు అభిరుచి కలిగింది?     పొట్ట కూటికా?     కమిట్ మెంట్ కోసమా.     పెడదారుల్లో సంపాదన కోసమా?     సాటి మనుషుల కోసం, దేశం కోసం ఏం చెయ్యాలని ఉంది?     ఏం చెయ్యగలవు?     ఇంతవరకూ ఏం చేశావు?     నిప్పులాంటి నిజాయితీపరుడు మాత్రమే నిస్సంకోచంగా అడగగలిగిన ప్రశ్నలు అవి!     కృష్ణాజీ వరసబెట్టి అడుగుతున్న ప్రశ్నలన్నిటికీ తడుముకోకుండా, మెషిన్ గన్ తో రాపిడ్ ఫైరింగ్ చేసినట్లు గబగబా జవాబులు చెప్పేస్తున్నాడు రాజా.     అరగంటసేపు అలా అడిగాక, అప్పుడు తృప్తిగా అన్నాడు కృష్ణాజీ.     "దిస్ ఈజ్ రియల్లీ ఎక్స్ ట్రార్డినరీ! నీ లక్ష్యం గురించీ, ఆ లక్ష్యం సాధించడానికి అనుసరించవలసిన మార్గం గురించీ నీకు పూర్తిగా అవగాహన ఉంది. ఎక్కడా, ఏ విషయంలోనూ ఏమాత్రం కన్ ఫ్యూజన్ లేదు నీకు. కమిట్ మెంటూ, క్లియర్ థింకింగూ రెండూ కలిస్తేగానీ ఇలాంటి వ్యక్తిత్వం ఏర్పడదు! వెల్ డన్ యంగ్ మాన్!"     "థాంక్యూ సర్!" అన్నాడు అతను చిరునవ్వుతో.     కొద్ది క్షణాలపాటు అతనివైపు తదేకంగా చూశాడు కృష్ణాజీ.     తరువాత అన్నాడు.
24,757
జనమంతా మంద బుద్ధుల్లా అతని మాటలు వింటున్నారు. ఆ హృదయేష్ ని ఒకసారి ఆగమని చెప్పి తన టేప్ ని ఆన్ చేసి విన్నాడు లేసర్ కిరణ్. స్పష్టంగానే రికార్డయ్యాయి అతని మాటలన్నీ. అజిత్ తన టేపు ఆన్ చేశాడు. టేపు తిరుగుతోంది. కానీ శబ్దమేమీ రావటం లేదు. "అదేమిటి? మీ రికార్డరు వర్కింగ్ కండిషన్లో లేదా?" అన్నాడు లేసర్. "రికార్డరు శుభ్రంగా పనిచేస్తోంది. అంచేత ఈ కుర్రాడు చెప్పిన అబద్ధాలేవీ రికార్డు చెయ్యలేదు. అతని చేతికి ఇచ్చిన మైక్రోఫోన్ లో 'లై డిటెక్టర్' ఉంది. అతని శారీరక స్థితిని బట్టీ అతను అబద్ధాలు చెబుతున్నాడని గ్రహించి, ఆటోమాటిక్ గా ఆఫ్ అయిపోయింది" అని హృదయేష్ వైపు చూసి, "థాంక్స్ ఫర్ ది ఫన్!" అన్నాడు అజిత్. ఆశ్చర్యంగా చూస్తున్న లేసర్ తో వస్తామని చెప్పి బయటికి నడిచారు అజిత్, అపురూపా. "అదిగో పులి అంటే ఇదిగో తోక అనే ఇలాంటి మనుషుల వల్లే చాలా విషయాల తాలూకు నిజానిజాలు ఎటూ తేల్చుకోలేకుండా ఉండిపోతాం" అన్నాడు అజిత్. "అవును! నిజమే!" అంది అపురూప. ఇద్దరూ కారెక్కారు. "ఒక్కసారి మళ్ళీ ఆ విమానం కూలిపోయిన స్థలం చూడాలని ఉంది నాకు" అన్నాడు అజిత్. కాసేపటి తర్వాత ఊరి బయట విమానం పడిపోయిన చోటికి వచ్చారు. తీవ్రంగా ఆ పరిసరాలన్నీ పరిశీలించాడు అతను. తర్వాత రేడియో యాక్టివిటీని కనిపెట్టే చిన్న పరికరాన్ని తీశాడు. గజగజలాడుతోంది దానిలోని ముల్లు. చేతికి ఉన్న వాచ్ చూసుకున్నాడు. అది ఆగిపోయింది. కానీ దిక్సూచీలో, ఉత్తర దక్షిణాలని చూపించవలసిన ముల్లు మాత్రం గిర్రున సెకెండ్ల ముల్లులా తిరుగుతోంది చిత్రంగా. అక్కడ ఊరికే నిలబడితేనే కడుపులో తిప్పినట్లు వికారంగా ఉంది. నుదురు చిట్లించి ఆలోచించాడు అజిత్. ఒక వైపంతా తాటిచెట్లు. అతని సునిశితమైన దృష్టికి ఆ తాటి ఆకుల్లో ఏదో విశేషం కనిపించింది. పాదరసం పూసినట్లు మెరుస్తున్నాయి ఆ ఆకులు - వాటిపైన ఏదో గుర్తు తెలియని వాహనం సుతారంగా కాసేపు ఆగి వెళ్ళిపోయినట్లు. ఒక్క అంగలో తాటి చెట్టుని చేరి చకచక పైకి ఎక్కాడు. పైకివెళ్ళి చూస్తే ఏమీలేదు. మామూలుగానే ఉన్నాయి ఆకులు. మరి ఇందాక...? బహుశా ఎండ పొడ పడి అలా మెరుస్తున్నట్లు కనబడి ఉండొచ్చు. కిందకి దిగి మళ్ళీ చూశాడు అజిత్. ఇప్పుడు మామూలుగానే పచ్చగా కనబడుతున్నాయి. నో! ఇందాక ఇలా కనబడలేదు ఆకులు! మెరుస్తున్నాయి ఇందాక అవి! తను చెట్టు ఎక్కేలోగా ఆ మెరుపు మాయమయింది. "అపురూపా! విమానం కూలిపోకముందు నిశ్చయంగా ఇక్కడేదో విశేషం జరిగింది! మనం ఒక్కసారి ఆ పైలట్ తో మాట్లాడాలి. కమాన్!" అన్నాడు. ఈసారి అతని కారు నేలమీద పరిగెత్తలేదు. హెలీకాఫ్టర్ లా తిన్నగా గాలిలోకి లేచి బాణంలా ముందుకు దూసుకుపోయింది. కొద్దిక్షణాల తర్వాత హాస్పిటల్ ముందు దిగింది కారు. అక్కడ మెట్ల దగ్గరే నిలబడి ఉన్నాడు కమీషనర్ విక్రమ్. వాళ్ళని చూడగానే మొహం చిట్లించాడు. "కమీషనర్! ఒక్కసారి - ప్లీజ్ ఒక్కసారి పైలట్ తో మాట్లాడాలి నేను." "బహుశా అది సాధ్యం కాదేమో!" అన్నాడాయన కాస్త వ్యంగ్యంగా. "అయిదు నిమిషాల క్రితమే చనిపోయాడు పైలట్!" హతాశుడైపోయాడు అజిత్. "మిస్టర్ అజిత్! మళ్ళీ ఒకసారి చెబుతున్నాను. దయచేసి మీ లిమిట్స్ దాటకండి. మా డ్యూటీకి మీరు అడ్డం పడకపోయినా మాకు వచ్చే నష్టమేమీ లేదు." అన్నాడు కమీషనర్ కటువుగా. ఇల్లు చేరేసరికి సొమ్మసిల్లిపోయినట్లయింది అపురూప ప్రాణం. టీ.వీ. ఆన్ చేసి ఒక ప్రైవేట్ ఛానెల్ కి ట్యూన్ చేశాడు అజిత్. వెంటనే స్క్రీన్ మీద లేసర్ కిరణ్ కనబడ్డాడు. 'మన పాలపుంతలో వింతలు!' అన్న ప్రోగ్రాం చేస్తున్నాడతను. అజిత్ 'లై డిటెక్టర్' ద్వారా శుద్ధ అబద్ధాలని తేలిపోయిన హృదయేష్ ఇంటర్వ్యూని యధాతథంగా వినిపించాడు. తర్వాత అజిత్, అపురూపా కనబడ్డారు స్క్రీన్ మీద. గ్రహాంతర నాగరికతలను గురించి అజిత్ చెప్పినదంతా కూడా వినిపించాడు. తర్వాత తా కామెంటరీ చెప్పడం మొదలెట్టాడు లేసర్ కిరణ్. "గ్రహాంతర వాసులని గురించి ప్రఖ్యాత సైంటిస్టు సంజీవ్ కుమారుడు అజిత్ చెప్పింది విన్నారు. గ్రహాంతర వాసులని ప్రత్యక్షంగా చూసిన హృదయేష్ తో ఇంటర్వ్యూ కూడా విన్నారు. గత రెండు మూడు రోజులలో జరిగిన విచిత్రమైన సంఘటనలు జోడించి చూస్తే నిజంగా జరిగినదేమిటో మనకు అర్థం అవుతుంది. ఎవరో గ్రహాంతర వాసులు భూగోళం మీదకి వాళ్ళ ఫ్లయింగ్ సాసర్లలో వచ్చారు. వారు తమ శక్తితో డాక్టర్ సంజీవ్ సృష్టించిన 'నరహరి' అనే రాబొట్ ని వశపర్చుకుని, దానిచేతే ఆయన్ని చంపించారు. ఆ రాబొట్ చేతే డాక్టర్ శోధనని బంధించి ఆమె తయారుచేసిన విషక్రిమిని సంపాదించారు. అయితే గ్రహాంతర వాసులకు ఆ విషక్రిమితో అవసరమేమిటన్న ప్రశ్న రావచ్చు. దీనికి జవాబు స్పష్టంగా కనబడిపోతూనే వుంది. ఆ విషక్రిమిని ప్రయోగిస్తే కొద్దిరోజుల్లో ఈ భూగోళం మీద ఒక్క ప్రాణి కూడా మిగలదు. నిర్జీవమైపోతుంది. ఈ నరహరి అనే రాబొట్ మనిషిని మించిన తెలివి గలది అన్న సంగతి మనకు తెలుసు. తగిన ముడిపదార్థాలు ఉంటే ఇది తనలాంటి మరమనుషులని డిజై చేసి అసంఖ్యాకంగా తయారుచెయ్యగలదు కూడా! అలా భూమిమీద జీవరాసులన్నీ చనిపోయి ఆ స్థానాన్ని మరమనుషులు ఆక్రమించుకుంటాయి. ఆ మరమనుషులని తమ గ్రహంలో నుంచే రేడియో సిగ్నల్స్ ద్వారా అదుపు చేస్తూ భూగోళాన్ని తమ రెండో స్థావరం చేసుకుంటారు గ్రహాంతరవాసులు. దేవుడే రక్షించాలి ఇక మనల్ని! "థాంక్యూ లేడీస్ అండ్ జెంటిల్ మెన్! ఈ ప్రోగ్రాంలో ఇంటర్వ్యూ ఇచ్చి సహకరించిన హృదయేష్ కి హృదయపూర్వక ధన్యవాదాలు. అజిత్ కీ, అతని ప్రేయసి అపురూపకీ అభినందనలు!" ఉలిక్కిపడి "వాట్ హెల్!" అంది అపురూప కోపంగా. "ఎవరు ఎవరికి ప్రియురాలు? మీరలా చెప్పారా అతనితో?" "ఇంటర్వ్యూ టైంలో మీరు నా పక్కనే వున్నారు" అని గుర్తుచేశాడు అజిత్ తన తప్పేమీ లేదన్నట్లు. కాలితో నేలని బలంగా తన్ని తననితాను నిగ్రహించుకోవడానికి ప్రయత్నించింది అపురూప. ఆమె కళ్ళలో ఎర్రజీర కనబడింది. "సారీ అపురూపా! అతను కేవలం సెన్సేషన్ క్రియేట్ చెయ్యడానికి ఏవేవో చెబుతున్నాడు. మెడకీ, కాలుకీ లంకె వేసినట్లు ఎంత తమాషా సిద్ధాంతం తయారుచేశాడో చూడండి. ఇలాంటి వాళ్ళని లక్ష్యపెట్టకూడదు" అన్నాడు అజిత్. "ఇతని మొహం చూస్తేనే పాపం!" అని ఆగ్రహంగా ఛానెల్ మార్చింది అపురూప. వెంటనే న్యూస్ అయిటమ్ ఒకటి వినబడింది. "...దేశములో ఒక మారుమూల ప్రాంతంలో ఒక చిత్రమైన వ్యాధి వ్యాపించింది. ఈ వ్యాధి సోకిన వాళ్ళకి శ్వాస అందకపోవడం, పెద్ద పెట్టున జ్వరం రావడమే కాకుండా, కనుపాపలు ఆకుపచ్చగా మారుతున్నాయి. ఈ లక్షణాలు బయటపడిన కొద్ది నిముషాల్లోనే డాక్టరు సహాయం అందేలోపలే మరణం సంభవిస్తోంది. వ్యాధికి కారణం తెలియరావటం లేదు. ఈ ఊళ్ళో ఈ వింత వ్యాధి సోకి చనిపోయిన వారి సంఖ్యా ఇప్పటికే మూడువేలు దాటిందని తెలుస్తోంది." ఫ్లయింగ్ సాసర్ల భయం అదుపుతప్పి పెరిగిపోవడం అలా మొదలయింది.                                                           * * * *"అపురూపా! మెకానికా దేశపు సరిహద్దుల్లో జాడ్యంలా వ్యాపిస్తున్న ఆ చిత్రమైన జబ్బేమిటో కనుక్కోవాలి. నేను వెళుతున్నాను." అని ఒక్కక్షణం ఆగి, "అపురూపా! మీ పరిచయాన్ని నిజంగా నేను అపురూపమైన అదృష్టంగా భావిస్తున్నాను. ఇది వూరికే ముఖస్తుతి కాదు - మనస్పూర్తిగా చెబుతున్నాను. సోలాంగ్!" అని చెయ్యి వూపి కదలబోయాడు అజిత్. ఒకసారి అతనివైపు ఆందోలనగా చూసింది అపురూప. "అమ్మ ఎక్కడ ఉందో, ఆ విషక్రిమి ఏమిటో, ఇవన్నీ తెలిసేదాకా నా మనసు మనసులో వుండదు. నేనూ మీతో వస్తాను. ప్లీజ్! నేనొక్కదాన్నే ఇక్కడ వుంటే - ఆదుర్దాతో నాకు బ్లడ్ ప్రషర్ రావడమో, సస్పెన్సుతో నరాలు తెగిపోవదమో తప్పదు!" అంది. అజిత్ సాలోచనగా చూశాడు ఆమెని. "నాతో మీరు వచ్చారనుకోండి! మళ్ళీ ఏ లేసర్ కిరణో, ఎక్సరే కిరణో చూసి ఏవేవో కథలల్లేయవచ్చు." "కథలు కాదు, నవలలు అల్లుకోమనండి! నాకు పంతం వస్తే ప్రపంచంలో ఎవరేం అనుకున్నా కేర్ చెయ్యను" అంది అపురూప బింకంగా. ఆమె కళ్ళలో ఇందాకటి ఎరుపుజీర కనబడటం లేదు ఇప్పుడు. ఇందాక లేసర్ కిరణ్ తనని అజిత్ ప్రేయసిగా పరిచయం చెయ్యకముందు అతనిపట్ల ఎలాంటి భావమూ లేదు తనలో.
24,758
                           ఆడెన్ గీతం     నీడ కింద కుర్చీలో నేను     తోటచేసే చప్పుళ్లు విన్నా     అప్పుడు నాకు తెలిసింది ఔను     చెట్టుకీ పిట్టకీ భాష సున్నా     ఇంటిపేరులోని భాషరాని పిట్ట     పక్షి గీతాన్ని పాడుతున్నాది.     పువ్వులు మౌనంగా తుమ్మెదో తెమ్మెరో     పురోహితుడు కావాలని వేడుకున్నాయి     అబద్ధాలెప్పుడూ అవి ఆడలేవు     మరణిస్తామనే జ్ఞానం వాటికిలేదు     యతిప్రాసలతో కాలాన్ని బంధించగల     బాధ్యత ఏ ఒక్కటీ పట్టించుకోదు     నవ్వినా ఏడ్చినా మనమూ చేస్తాం చప్పుళ్ళూ     మాటలనేవి కావాలి మాటనిలబెట్టుకొనే వాళ్ళకి                    * 
24,759
    ఇంకాస్సేపు యిక్కడే గడపాలనిపించినా మరీ రాత్రయి వెడితే నిజంగానే ఇంట్లో అనుమానాలు తలెత్తే ప్రమాద ముందనిపించింది జీవితకు. అతడిని వదలలేక వదులుతూ, మళ్ళీ మనం కలుసుకునేదెప్పుడు?" అంది.     "కాలేజీలో రోజూ కలుస్తాంగా?"     "అది కాదు-ఇలా!"     "నువ్వెప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను! ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను."     "నాతో నరకానికైనా?"     "ఆఁ"     "అగ్నిసాక్షిగా నా పాణిగ్రహణం చేయండి! మిమ్మల్ని నేను స్వర్గానికి తీసుకు వెడతాను. మీ జీవితం స్వర్గతుల్యం చేస్తాను!"     చెట్లకొమ్మల చాటునుండి వెన్నెల కిరణాలు దూసుకువచ్చి జీవిత ముఖంమీద పడుతున్నాయి. ముగ్ధమనోహరంగా కనిపిస్తోంది ఆమె. "అబ్బా! జీవితా! నీ సమక్షంలో ఇంకాస్సేపుంటే నేనేమైపోతానో నాకే తెలియదు. నా నిగ్రహం సడలిపోతే నీకే మంచిది కాదు."     "ఒంటరిగా ఒక ఆడపిల్ల దొరికినా, అదీ మనసిచ్చిన ఆడపిల్ల దొరికినా మీరు హద్దులు దాటలేదు. మీరెంతో ఉన్నతులు కాకపోతే ఈ నిగ్రహం మీకుండదు. మీరంటే ప్రేమే కాదు, గౌరవంకూడా కలిగింది, అమర్!"     "ఇలా మాట్లాడుతుంటే మాటలు తరగవు! ఇలాగే రాత్రి గడచిపోతుంది. మీ యింట్లో ఏం సమాధానం చెబుతావు?"     "ఈ రోజు కాకపోయినా రేపైనా ఇంట్లో తెలియాల్సిందేగా?"     "ప్లీజ్! యిప్పుడే మన విషయం బయటికి రానీయకు."     "ఆడపిల్లను! నేను భయపడాలి! మీకెందుకు భయం?"     "నాకుండే సమస్యలు నాకున్నాయి."     "సమస్యలా? ఏమిటవి?"     "అవి ఒక్క ముక్కలో చెప్పేవి కాదులే! ముందు నువ్వెళ్ళు! తరువాత నేను వెడతాను!"                                      *    *    *    *     జీవిత పరీక్షలై పోయాయి.     రేపటినుండి కాలేజీకి సెలవులు.     అమర్ వాళ్ళ ఊరికి వెళ్ళిపోతున్నాడు.     "మీ అడ్రస్ ఇచ్చి వెళ్ళండి" అంది. అంతకు ముందురోజు అతడిని కలుసుకొన్నప్పుడు.     "దేనికి? లెటర్స్ వ్రాయడానికా?"     "మిమ్మల్ని చూడకుండా ఒక్క రోజుకూడా వుండలేననిపిస్తూంది. కనీసం మీకు రోజుకో లెటర్ వ్రాయడం వల్లయినా ఈ వియోగబాధ మరచిపోతానేమో! మీరుకూడా మా ఇంటి అడ్రస్ కు లెటర్స్ వ్రాయండి. నా పేరుమీద వచ్చే లెటర్స్ మా యింట్లో ఎవరూ చించి చదవరు."     "మతి పోయిందా ఏమిటి? అలా ఎప్పుడూ లెటర్స్ వ్రాయొద్దు! నేనుకూడా వ్రాయను. అవి ఎవరి చేతిలోనైన పడితే లేనిపోని తలనొప్పి. చెప్పాకదా? నా ఎమ్.ఇడి. కంప్లీట్ కావాలి! నా చెల్లి పెళ్ళి కావాలి? అంతవరకు మన విషయం రహస్యంగా ఉంచక తప్పదు."                                       *    *    *    *     అమర్ లేకుండా సెలవులు అతిభారంగా గడిచిపోతుంటే పులిమీద పుట్రలా మరో గండమొచ్చిపడింది.     జీవితకు వాళ్ళింట్లో సంబంధం చూశారు.     "నాకిప్పుడే పెళ్ళొద్దు! కనీసం నేను డిగ్రీ పూర్తి చేసేవరకు నాకు పెళ్ళొద్దు" అంది జీవిత.     "దాని మొహం! దానికేం తెలుసు? మళ్ళీ కావాలన్నప్పుడు ఇంత మంచి సంబంధం దొరకొద్దూ? వాళ్ళనైతే  వచ్చి పిల్లను చూసి పొమ్మనండి" అంది తల్లి. "కావాలంటే పెళ్ళయ్యాక చదువుకోవద్దన్నారా ఏమిటి?"     చూసినంత మాత్రాన పెళ్ళయిపోతుందా అనుకున్న జీవిత అప్పటికి మౌనం వహించింది. వాళ్ళు చూడాలి! తను నచ్చాలి! వాళ్ళు ఊరికి వెళ్ళి ఉత్తరం వ్రాసేలోగా అమర్ వచ్చేస్తాడు. అతడొచ్చాక ఏదో ఒకటి చేయొచ్చు.     కాని జీవిత ఊహలన్నీ తలక్రిందులై పోయాయి.     అబ్బాయి, అబ్బాయి తల్లిదండ్రులూ వచ్చి చూడ్డం, పిల్ల నచ్చిందని చెప్పడం, సంబంధం ఖాయం చేసుకోవడం_ అంతా ఒక్క రోజులోనే జరిగిపోయాయి. తాంబూలాలు కూడా పుచ్చేసుకున్నారు. ఆ రోజు తిథిచాలా బాగుందని!     దిక్కుతోచలేదు జీవితకు.     "ఒక్కమాట నన్నడగకుండా ఈ సంబంధం ఖాయం చేయడం ఏమిటి? నాకీ సంబంధం యిష్టంలేదు."     "ఈ సంబంధానికి ఏం లోపముందని చేసుకోవు?"     "నాకిప్పుడే పెళ్ళోద్దు."     "చేసుకోవడానికి చేసుకోక పోవడానికి నీ యిష్టం ఎవరు అడిగారని? నోరు మూసుకుని పడివుండు!" పిచ్చి కోపంలో అరిచాడు తండ్రి.     "మీరు ఈ సంబంధమే చేయాలనుకొంటే నన్ను పెళ్ళికూతురుగా చూడరు? శవంగా చూస్తారు."     ఈ సంబంధం ఒద్దని ఆమె ఎందుకింతగా పట్టుబడుతుందో వాళ్ళకి అర్ధంకాలేదు.     ఈ సంబంధానికి ఏ లోపంలేదు. అబ్బాయి మంచి అందగాడు. చదువుకుని ఉద్యోగం చేస్తున్నాడు. మంచి మర్యాదస్తులు. ఆర్ధికంగా తమకంటే ఎన్నోరెట్లు బాగున్నవాళ్ళు.     ఎందుకని ఈ పెళ్ళి వద్డంటున్నట్టు?     ఆ రోజంతా జీవిత గదిలో ఉండి తలుపు మూసుకుని తెరువలేదు.     మరురోజు పిలువగా పిలువగా తలుపు తెరిచింది. కాని ఎవరితో మాట్లాడలేదు. కనీసం టీ, టిఫిన్ కూడా తీసుకోలేదు.
24,760
    "ఇల్లూ, వాకిలీ ఏం లేదా? ఎప్పుడూ యిలా తిరుగుతూనే వుంటావా?"     "నాకెవరూ లేరు."     "అందరూ ఏమయ్యారు?"     "మా నాన్నకు భక్తి ఎక్కువ! ఒక గురువు వుండేవాడు. నన్నూ అమ్మను తీసుకెళ్ళి ఆ గురువు ఆశ్రమం దగ్గరే వుంచేశాడు. అమ్మ ఆశ్రమంలోనే అన్ని పనులూ చేస్తూండేది. నాన్న వుద్యోగానికెళ్ళి అప్పుడప్పుడూ వచ్చిపోతూండేవాడు. ఒక రోజు అమ్మను స్వామీజీ రేప్ చేశాడు. ఆ కేకలకు నేను నిద్రలేచాను. నన్ను స్వామీజీ భక్తులు బయటకు లాక్కెళ్ళి యింకో గదిలో పడేసి బయట గొళ్ళెం పెట్టారు. ఆ రాత్రంతా అమ్మ అరుపులు వినబడుతూనే వున్నాయి నాకు. ఊళ్ళోవాళ్ళు కొంతమంది అమ్మ కేకలు విని ఆశ్రమానికి పరుగెత్తుకొచ్చారు కానీ అమ్మను కలుసుకోనీకుండా ఆమెకు పిచ్చి ఎక్కిందని చెప్పి పంపించేశారు. నేను అదంతా కిటికీలోనుంచి చూస్తూనే వున్నాను.     తెల్లవారుజామున అమ్మను కార్లో వేసుకుని తీసుకెళ్ళి వూరిబయట నదిలో పడేశారు. మర్నాడు ఆమె శవం నదిలో దొరికింది. పిచ్చి ఎక్కటం వల్ల అర్ధరాత్రి ఆశ్రమం నుంచి పారిపోయిందని అందరూ చెప్పారు. ఆ కేస్ విచారించడానికి వచ్చిన ఎస్పీ స్వామీజీ శిష్యుడు. అందువల్ల ఆ కేస్ క్లోజయిపోయింది. ఆ తరువాత నేను ఆశ్రమంలోనే పెరిగాను. పదేళ్ళ తర్వాత మళ్ళీ హిస్టరీ రిపీట్ అయింది.     నేనూ, నాలాంటి అభాగినులు మరికొంతమంది ఆశ్రమం హాస్టల్లో వుండేవాళ్ళం. మా అందరికీ స్వామీజీయే చదువు, భోజనం, బట్టలూ అన్నీ సమకూర్చేవారు. ఆ తరువాత మాలో ఒక్కొక్కరినీ ఆయనే స్వయంగా రాత్రుళ్ళు తన గదిలోకి పిలిచి, తన సెక్స్ కి బలి చేసేవారు. ఒకసారి స్వామీజీ మా శరీరాన్ని తాకాక అప్పుడు ఆయన శిష్యులు కూడా మమ్మల్ని బలవంతంగా అనుభవించటం జరుగుతూండేది.     కొంతకాలానికి మా హాస్టల్లో వున్నవారందరికీ అనాధ యువకులతో వివాహాలు చేశారు. కొంతమంది భర్తలతో బాగానే సంసారం చేస్తున్నా, మరి కొంతమంది కొంతకాలం మమ్మల్ని వుపయోగించుకుని తరువాత ఏదోక సాకుతో వదిలేశారు.... ఆ తరువాత ఎవరి దారి వాళ్ళది, ఎవరి బ్రతుకు వాళ్ళది అయిపోయింది.     నేను అదృష్టవశాత్తూ ఈ సేవా సంస్థలో వుద్యోగం సంపాదించగలిగాను. ఇలా జరిగిపోతోంది జీవితం"     రాజశేఖరం నిశ్చేష్టుడయి వింటూండిపోయాడు.     అంతవరకూ స్వామీజీల మీదా, ఆశ్రమాల మీదా అతనికున్న గౌరవం పటాపంచలయిపోయింది.     "మరి ఈ విషయాలన్నీ నువ్వు మీ నాన్నగారితో చెప్పలేదూ?"     "అమ్మ మీద అత్యాచారం జరిగినప్పుడే చెప్పాను. కానీ ఆయన కప్పటికే స్వామీజీ మీద భక్తి పిచ్చి ముదిరిపోయింది. అలా మాట్లాడవద్దనీ, కళ్ళు పోతాయనీ కొట్టి తిట్టారు. అందుకే తర్వాత నామీద అత్యాచారం జరిగినా ఎవరికీ చెప్పలేదు. ఎందుకంటే మమ్మల్ని ఆ మాత్రం కనిపెట్టి పోషించే వారింకెవరూ లేరు. ఇంకో ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే మా హాస్టల్లో చాలామంది స్వామీజీ తమను శారీరకంగా అనుభవిస్తే తమ జన్మ ధన్యమయిపోతుందని భావించేవాళ్ళు. స్వామీజీ మీద అంత గొప్ప భావం మాకు చిన్నప్పటి నుంచే ఆశ్రమంలో కలిగించేవాళ్ళు. అందుకే చాలామంది ఎంతో యిష్టంతో స్వామీజీ పిలుపుకోసం ఎదురు చూస్తూండేవాళ్ళు. స్వామీజీతో సంపర్కం పెట్టుకుంటే, భగవంతునితో సంపర్కం కలిగినట్లేనని వాళ్ళకు చిన్నప్పటినుంచే నూరిపోసేవారు. స్వామీజీ భక్తులందరూ స్వామీజీ కోసం ఏం చేయడానికయినా తయారుగా వుంటారు. వాళ్ళకు ఇలాంటివన్నీ చాలా చిన్న విషయాలు. స్వామీజీ కోరితే వాళ్ళే ఆనందంతో వప్పుకుంటారు."     ఉదయం ఆమె వెళ్ళిపోతూంటే రాజశేఖరానికి ఆమె మీద జాలి కలిగింది.     ఎన్ని రకాల జీవితాలు?     ఎన్ని రకాల అన్యాయాలు? ఎన్ని రకాల మోసాలు?     ఆ రాత్రి సోనీ ఇంటి ముందు పడుకుని నిద్రపోతూంటే కేకలు వినిపించి చటుక్కున మెలకువ వచ్చింది.     సోనీ తనను హడావుడిగా తట్టి లేపుతోంది.     "పద! ఏదో గొడవ జరుగుతోంది."     రాజశేఖరం చప్పున లేచి నిలబడ్డాడు.     "పద త్వరగా!"     సోనీ వెంబడి పరుగెత్తాడు నిద్రమత్తుతోనే.     అప్పటికే రాణి పాక ముందు జనం పోగడ్డారు.     రాణి గట్టిగా వేస్తున్న కేకలు వినిపిస్తున్నాయి.     అందరినీ తోసుకుంటూ ముందుకి నడిచింది సోనీ!     రాణీని నలుగురు వ్యక్తులు ఎక్కడికో లాక్కెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు.     ఎవ్వరూ మాట్లాడలేదు.     "ఏం జరుగుతోంది?" అడిగాడు రాజశేఖరం సోనీని.     "ఆళ్ళు ఆడాళ్ళతో వ్యాపారం చేసే గ్యాంగ్. అప్పుడప్పుడూ స్లమ్ కొచ్చి రాణి వయసున్న చిన్న పిల్లలను ఎత్తుకుపోతూంటారు."     "ఎందుకు?"     బొంబాయి నుంచి వచ్చిన వాళ్ళకు అమ్మేస్తారు. వాళ్ళు ఆ పిల్లలను తీసుకుపోయి వ్యాపారంలోకి బలవంతంగా దించేస్తారు."     "వాళ్ళలా బలవంతంగా లాక్కెళుతూంటే మరి మీరందరూ అలా చూస్తూ వూరుకుంటారా?"     "ఇంకేం చేస్తాం? అడ్డుతగిల్తే అందరినీ పొడుస్తారు. వాళ్ళను ఎదుర్కొనే శక్తి యిక్కడ ఎవరికుంటుంది?"     "పోనీ పోలీసులకు చెప్పచ్చుకదా?"     "వాళ్ళు వీళ్ళనేమీ చేయరు. వీళ్లకూ, వాళ్ళకూ లావాదేవీలుంటాయి."     రాజశేఖరం ముందుకి నడిచాడు.  
24,761
    అలుపు వస్తోంది. శరీరమంతా చెమటలు కారుతోంది. కాళ్లు తడబడుతున్నాయి. అయినా ఆగలేదు.     కళ్ళతో అటూ ఇటూ వెతుకుతూ ఎక్కుతూనే ఉంది.     అడుగో కల్నల్! అటువైపు ఒకపెద్ద రాయిప్రక్కన - ఈ ప్రపంచాన్ని పట్టించుకోనట్లు ఎటో శూన్యంలోకి చూస్తూ కూర్చునివున్నాడు. ఆమెని గమనించలేదు.     అతన్ని చూడగానే ఆమెకు ఎక్కడలేని బలమూవచ్చింది. ఒక్కనిముషం అలాగే నిలబడి ఆయాసం తీర్చుకుంది. తర్వాత కొంచెందిగి అతనివైపు నడుచుకుంటూ వెళ్ళి వెనక నిలబడింది. అప్పటికీ అతను గమనించలేదు.     "కల్నల్ సాబ్!" ఎప్పుడూ అలా పిలువలేదు. గభాలున నోటిలోంచి వచ్చేసింది.     కల్నల్ తల త్రిప్పి వెనక్కి చూశాడు. "మీరా?" అన్నాడు ఆశ్చర్యంగా.     "ఏం? మీకోసం ఇంత ప్రయాసపడి ఒక ప్రాణి వెతుక్కుంటూ వచ్చిందంటే నమ్మశక్యం కావటంలేదా?" అంటూ అతని ప్రక్కకి వెళ్ళి నిలబడింది.     అతని ముఖంలో ఇందాకటి ఆవేశంలేదు. ఏదో బాధ...అసంతృప్తి..వేదన..     "మాట్లాడరేం?" అంటూ అతనిప్రక్కన కూర్చుంది.     "నమ్మశక్యం కానివి జరిగితే - ఎంత ఆనందకరంగా వుంటాయో బోధ పడింది" అతను చివరకు మాట్లాడాడు.     "ఈ సృష్టిలో ఇంత ఆనందం ఉంటుందని తెలిసేనా పారిపోయి వచ్చారు?"     "తెలిసినంత మాత్రంచేత నిబంధనలని అతిక్రమించే హక్కు నాకులేదు."     "కల్నల్ సాబ్!" అంది చూడామణి "మళ్ళీ ఇప్పుడు ఏమంత కానిపని జరిగిందని ఈ ప్రపంచంతో తెగత్రెంపులు చేసుకుందామన్నంత తెగింపు వచ్చింది మీకు?"       "చాలా జరిగింది. నా ఆశయాల గాలిమేడలన్నీ నిర్దాక్షిణ్యంగా కూలిపోయినాయి. నా సమర్ధతతో, క్రమశిక్షణతో ప్రపంచాన్ని తీర్చిదిద్దగలననుకున్న ఆత్మవిశ్వాసం పటాపంచలయిపోయింది. నా దగ్గర పనిచేస్తోన్నవారిలో నేను నీతి, నీజాయితీ కల్పించలేకపోయాను. జీవితంలో దారుణంగా ఓటమి చెందాను. నా గర్వం తునాతునకలైపోయింది. ఐ...ఐ లాస్ట్ ఎవ్విరిథింగ్" అతని గొంతు వణికింది. అతని ముఖంలో ఆవేశం బదులు విచారం ప్రస్ఫుట మౌతుంది.     "అయితే ఏమిటట నష్టం?"     అతనామెవైపు ఆశ్చర్యంగా చూశాడు. నష్టంలేదా? ఇంత జరిగితే నష్టం ఏమీలేదా?     "అది మీకు అర్ధంకాదు" అన్నాడు.     "కల్నల్ సాబ్!" అంది చూడామణి.     "మీలాగే ఇటీవల నేనూ అనుకుంటూ వచ్చాను. కొన్ని కొన్ని సంఘటనల వల్ల నాలో అలజడి చెలరేగిందని నాకూ తెలుసు. కానీ నా మనస్సుని నేనర్ధం చేసుకుంటూ వచ్చాను. మీరు అహంతో నిజాన్ని గుర్తించటానికి నిరాకరిస్తూ వచ్చారు. కళ్ళెదురుగా ఎన్నో సత్యాలను చూశారు. అయినా వాటిని కఠోరంగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నించారు. ఏమిటి ఫణీ, శైలజావాళ్ళు చేసిన తప్పు? పెళ్ళి చేసుకున్నారు. ఆర్థిక పరిస్థితులు - ఈ కంపెనీ రూల్సు కఠినంగ వున్నా ఇక్కడే ఉద్యోగం చెయ్యడానికి పురిగొల్పాయి. వారి రక్షణ నిమిత్తం, వారి జీవిత కనీసావసరాలకోసం మిమ్మల్ని మభ్యపెట్టారేగానీ మిమ్మల్ని వంచించాలన్న దురాలోచన ఏమీలేదే! ఏం చేస్తారు? విద్యావంతులైవుండీ మన సమాజంలో నికృష్టపు ఆర్థిక విధానానికి నలిగిపోయారు. ఈ కంపెనీలో మీ నిబంధనలకూ, నిర్ణయాలకూ మరింత నలిగిపోయారు. వారిమీద జాలి చూపించాల్సింది పోయి, మహానేరం చేసేసినట్లు దూషిస్తారేమిటి?"     అతని మనసులో చిన్న ప్రకంపన ప్రారంభమైంది. ఏమంటోంది చూడామణి? తనని ఎక్కడికి తీసుకుపోతోంది.     "ఇంకో ప్రశ్న. ప్రేమంటే మీకంత కోపందేనికి? పోనీ ఇంకా కొంచెం పొగరుగా అడుగుతాను. ప్రేమంటే మీకంత భయం దేనికి?"     "భయమా? నాకా?........"     "అవును. భయంచేతనే ప్రేమ మీ దగ్గరకువస్తోన్నా మీరు దూరంగా పారిపోతున్నారు. పౌరాణిక గాధలు చూడండి. చరిత్ర తీసుకోండి. కాల్పనిక జగత్తులో ఎన్నో యదార్ధ జీవితాలు తీసుకోండి. ప్రేమని ఎవరూ ధిక్కరించలేరు. పతితులు, దుష్టులు, దుర్మార్గులు కూడా ఏదో మధురక్షణంలో ప్రేమ బద్ధులై జన్మల్ని చరితార్ధం చేసుకున్నారు. దాని మాధుర్యం అనుభవించి ధన్యులయ్యారు. మీరో? దానికి ఆనకట్టలు కట్టటానికి ప్రయత్నించారు. మీ పిచ్చిగానీ ఎక్కడన్నా ప్రేమ అనేది ఆనకట్టలు కడితే ఆగుతుందండీ? ఇంకా పైకి ఎగసి పొంగి పొరలి ప్రవహిస్తుందిగానీ. మీకో ఇంకో రహస్యం చెప్పనా?.."     ప్రశ్నార్థకంగా చూశాడు.     "మీ కంపెనీలో పని మీరు అనుకున్న స్థాయిలో జరగలేదని ఎప్పుడూ ఖేదం పొందుతూ వుండేవారు. వారి జీవితాలని ప్రేమరాహిత్యం చెయ్యటానికి ప్రయత్నించటమే మీ కంపెనీలో పని మందగించటానికి కారణం....."     "అయితే...అయితే ఇప్పుడు నేనేం చెయ్యాలి?" కల్నల్ అడిగాడు అయోమయంగా.     "ప్రేమించాలి" అన్నది చూడామణి నవ్వుతూ.     "ఎవర్ని?"     "నన్ను."     పులకితుడయ్యాడు. కనులు ఆర్ద్రమైనాయి. ముఖంలోని బాధ, అసంతృప్తి హఠాత్తుగా అంతరించి కొత్తకాంతి చోటుచేసుకుంది. ఆమెవంక తదేకంగా, తన్మయంగా చూశాడు.     "నా కెందుకింత గొప్ప వరమిచ్చారు మీరు?"     "నాకోసం."     "అంటే?"     "ఇన్నాళ్ళూ నాకు తెలీకుండా వెతుక్కొన్న తోడు మీరని తెలుసుకున్నాను కాబట్టి."
24,762
                        17.  విటమిన్ 'ఎ' లోపంవల్ల వచ్చే అంధత్వం         పైకి బాగానే వున్నట్ట్లున్నా కమలకు కనురెప్పలను నులుముకోవాలలపిస్తోంది. అ బాధ ఎప్పుడూ వుండటంలేదు. అందుకే ఆ విషయం పట్టించుకోకుండా ఊరుకుందామే. కాని తరువాత కళ్ళు బరువుగా వున్నట్లు అనిపించసాగాయి. వెలుతురును చూడగానే కళ్ళలలోనీళ్ళు గిర్రున తిరుగుతున్నాయి. పైకి వ్యాధి కనబడలేదు. కానీమనస్థిమితం ఉండటం లేదామేకు. తీరా లక్షణాన్ని బయట పడుతున్నాయని తేలింది.     ట్రకోమా కళ్ళకు వచ్చే వ్యాధి దీనినే "దుర్మాంసం పెరగటం" అంటారు. ట్రకోమావ్యాధి ఆసియ, ఆఫ్రికాదేశాలల్లోఎక్కువ. కొన్ని లెక్కలప్రకారం ప్రపంచ జనాభాలో ఐదవవంతుమంది ఈ కళ్ళవ్యాధిలో బాధపడుతుంటారు. కంటికి సంభందించిన ఇంకేదేనా చికిత్సకోసం వెళ్ళినప్పుడు డాక్టరు పరీక్షచేస్తూ, కనురెప్ప పైకిమడిచిచూస్తె ఈ వ్యాధివున్నట్లు బయటపడుతుంది. చంటిపిల్లలనుంచి వృద్దులవరకూ అన్ని వయసులవారికిఈ కంటివ్యాధి సంక్రమిస్తుంది. చ్గిన్నపిల్లలలో ఈ వ్యాధి వచ్చి ఎటువంటి చికిత్స లేకుండానే తగిపోవచ్చు. లేదా జీవితాతం ఎటువంటిబాధ లేకుండానేవ్యాధి మిగిలిపవచ్చు. కొందరికి తగ్గిపోయి మరలారావచ్చు కూడా.     ట్రకోమావ్యాధి రావడానికి అతిసూక్ష్మంగావుందే ఒకరకమైన వైరస్ క్రిమి కారణం. ఇది ఒకరినుంచి మరొకరికి అతితెలికిగా సంక్రమిస్తుంది. ఈ కంటివ్యాధి వున్న వ్యక్తి ఉపయోగించిన వస్రాలను ఇతరదుస్తులను ఇతరులు వాడితే అతితొందరగా ఈ వ్యాధి రెండవ వారికీ సంక్రమిస్తుంది. క్రిములు కంటికి చేరిన రెండు మూడు రోజుల్లోనే వ్యాధి లక్షణాలు బయట పడతాయి.     ఈ వ్యాధి వచ్చినవారి కంటిలో వుందే పల్చని పోర గట్టిపడుతుంది. ముఖ్యంగా పై కనురెప్ప లోపలి భాగంలో ఈ వ్యాధి క్రిములు చేరటంవలన చమటపొక్కులంత పరిమాణంలోఅనేకం పొక్కులు వస్తాయి. వీటిని 'పాలికిల్స్' అంటారు. ఒకే కంటిలో కాకుండా రెండు కళ్ళలోనూ ఈ వ్యాధివస్తుంది. ఈ వ్యాధి ముఖ్యంగా అపరిశుభ్రమైన పరిసరాలలోనూ, జనసాంద్రత ఎక్కువ వుండేచోటనివసించే వారిలో వస్తుంది. ఒక్కొక్కసారి ఈ వ్యాధి అంతు వ్యాధిలా విజ్రుంభీంచి అనేక మందికి సంక్రమిస్తుంది. అటువంతప్పుడు ముఖ్యంగా చంటి పిల్లలు ఈ కంటివ్యాధి గురి అవుతారు.     చాలమందిలో కళ్ళకలక వ్యాధివచ్చి తగ్గినా తరువాత పరీక్షచేసి చూస్తె కళ్ళల్లో "పాలికిల్స్" స్పష్టంగా కనబడతాయి. అంతమాత్రాన కళ్ళకలకవలన ఈ వ్యాధి వచ్చినట్లుకాదు. అంతవరకు బయటపడకుండా ఉన్న ఈ వ్యాధి కళ్లకలక ర్క్యావడంతో వ్యాధి లక్షణాలని సంతరించుకుంటుంది. దాంతో కళ్ళు తరచూ ఎర్రబాడటం బరువుగా అనిపించడం, నొప్పిగా వున్నట్లు అనిపించటం సహజ లక్షణాలవుతాయి.     'ట్రకోమా' వ్యాధి ఉందని గుర్తించిన వెంటనే పూర్తీ చికిత్స పొందకపోతేఅనేక దుష్పలితాలు కలుగుతాయి. రెప్పలు బరుకేక్కుతాయి. పైరెప్ప ముడుచుకోలేక కన్ను సగానికి పైగామూసే వుంటుంది. ఇంకొందరికి కంటిరెప్పలుకంటి లోపలి ముడుచుకునిపోతాయి.      అందువలన కంటిరెప్పకి వుండేవెంట్రుకలు కంట్లో గ్గుచ్చుకుని బాధ కలిగిస్తాయి. అంతేకాదు_ కాంతిని కంటిలోకి ప్రసరింపచేసేనల్ల గుడ్లు కూడా దెబ్బ తింటుంది. అందుకునే అంధత్వాన్ని కలిగించడంలో "ట్రకోమా" ప్రముఖ పాత్రవహిస్తోంది. సల్ఫా బిళ్ళలు,టెట్రా సైకిలిన్స్, కంటి ఆయింట్ మెంట్లువాడితే ఈ వ్యాధి తెలికిగా తగ్గిపోతుంది.                                                                                                   ****
24,763
                                             -: పద్మకోశ హస్త లక్షణము :-    శ్లో!!    విరాళాః కించిదంగుష్యః  కుంచితాః పద్మకుట్మలః     ఋషిర్విధిర్జ నిర్విష్ణో  శ్వేతవర్ణశ్చ భార్గవః !     అధిదైవం యక్షజాతి ర్వినియోగోస్య కధ్యతే !!     చేతివ్రేళ్ళన్నియు  కొంచెము ఎడముగా పట్టిన, పద్మకోశహస్తము వచ్చును. ఈ పద్మకోశమునకు ఋషి బ్రహ్మ, విష్ణువు వల్ల పుట్టినది. తెలుపు వర్ణము, అధిదేవత భార్గవుడు. యక్షజాతి.     వినియోగములు :-     పాము, పుట్ట, కమలము, ఘంట, బంతి, అద్ధము, చకోరము, కొప్పు గుండ్రని వస్తువు, రధచక్రము, (చక్రవాకము) వికాసము, మామిడిపండు, పూలవర్షము, చెంబు, కొబ్బరిబొండము మొదలగునవి. పూమొగ్గ, కొండగోగు తీగెలు మొదలైనవి వంచుట కారణము, శృంగారము, స్తనములు, వీనియందు హస్తము చెల్లును.                                      -: మృగశీర్ష హస్త లక్షణము :-    శ్లో!!    సర్పళీర్షే కనిష్టాంగుష్టోన్నత్యా మృగశీర్షకః !     గౌర్యాజనిర్హ రోదైవ, మృషిర్మార్కండ  ఉచ్యతే,     మునిజాతి శ్వేతవర్ణో, వినియోగోస్య కధ్యతే !!     సర్పశీర్షహస్తమందలి  కనిష్టికాం గుష్టములను, చాచిపట్టిన మృగశీర్ష హస్తము వచ్చును. నిది పార్వతివల్ల పుట్టినది. శివుడు దైవము. మార్కండేయుడు ఋషి. ముని జాతి. తెలుపు వర్ణము.     వినియోగములు :-     పసిపిల్లలు, స్త్రీ వాదము, సంతోషము, ప్రత్యక్షముచేయుట, అవుట, చెమట తుడుచుకొనుట, వస్త్రము, శరీరము, గొడుగుపట్టుకొనుట, గుఱ్ఱము, పైరు ,గృహము, పక్షిముక్కు, గంధము మొదలగునవి  పూయుట. సోపానములు, శాంతము, సమానము, గోడ, పుణ్యము, మృగముఖము, సిగ్గు, చమత్కారము, సంజ్ఞ, రంగవల్లి (ముగ్గు) ఇష్టము, శివలింగము, నేను అను అర్ధము. కన్యక, ఎద్దు. ("సరిగమపదని") యను సప్తస్వరముల యందలి "గ" యనుస్వరము. గాంధారము, శిశ్నము, తెరపించుట, బవ_బాలవాదికరణములు లేక త్రికరణములు. జింక, వీనియందు  సమయోచితముగ మృగ శీర్షహస్తము  వినియోగించుచున్నది.                             -: లాంగూలహస్త లక్షణము :-        శ్లో!!    పద్మకోశే నామికాచేల్లాంగూలః కుంచితాభవేత్     ఋషిరగ్నిర్జని శ్శంభో, ర్గౌరోవర్ణో అధిదేవతా.     లక్ష్మినాధశ్శిద్ధజాతి ,ర్వినియోగో అస్యకధ్యతే !!                         పద్మకోశమందలి  అనామికను అరచేతిలోకి  వంచిన లాంగూల హస్తమగును, అగ్నిహోత్రుడు, ఋషి ఈశ్వరునివలన పుట్టినది. గౌరవరణము, అధిదేవతలక్ష్మినాధుడు. శిద్ధజాతి.     వినియోగములు :-         పూగుత్తి, పండు, గజ్జె, (కింకిణి) గుండ్రనివస్తువు (గోలి), చాతకపక్షి, చకోరపక్షి వక్క, నిమ్మ, నేరేడు, ద్రాక్షపండు, వడగండ్లు, కరక్కాయ, సీసము, మితభోజనము, పగడము, గడ్డము పట్టుకొనుట, రుద్రాక్ష పుష్యరాగమణి, నక్షత్ర సముదాయము, ప్రాశస్తము, వీనియందు లాంగూల హస్తము వినియోగించును.                             -: సింహవదన హస్త లక్షణము :-       శ్లో!!    మధ్యమానామికాంగుష్ట  శిఖరామేళనాత్తధా !     అన్యప్రసారణాత్సింహవదనః పరికీర్తితః.     ఆముష్యక్షత్రియాజాతిః వినియోగోనిగధ్యతే !!     మధ్యమ_అనామికాంగుష్టములు  గూర్చి పట్లి కనిష్టిక తర్జనులు చాచి పట్టిన, సింహవదన హస్తమగును, దీనికి ఋషి బ్రహ్మ. తండ్రి దక్షుడు. వర్ణము నీలము. దైవము శివుడు. జాతి క్షత్రియ.     వినియోగములు :-        కమలము, పూలమాల, చిరునవ్వు, సువాసన, ఎద్దు, మంగళస్తానము, సింహము, హోమము, వైద్యము, నీతి, మోక్షము, సంధానము, దర్భను కదలించుట, కంచు, శుద్ధిచేయుట, ధైర్యము, వంటకము, వజ్రమణి, గాంధారము, (సప్త స్వరములలో నొకటి) సింహాసనము, ఉప్పు, చెవి, జపమాలధరించుట, గున్నఏనుగు, వీనియందు ఈ సింహవదన హస్తము చెల్లును.
24,764
    "ఉన్నమాటన్నందుకు మీరు థాంక్స్ చెప్పినా నేను  పుచ్చుకొను...."     నిర్మల కళ్ళు చెమ్మగిల్లాయి. వోణితో ఒత్తుకుంటూ- "నేనంటే మీ కెందుకింత అభిమానం?" అంది.     "నిర్మలా! నిజం చెబుతున్నాను- వినండి! మనం  రోజూ చూసే  పని మనిషి  పదిళ్ళలో వెట్టిచాకిరీ చేసినా మనసు చలించదు. కానీ ఒక దేవత , ఒక రాజకుమారి తనపనులు తాను చేసుకుంటేనే చూసి భరించలేను. మిమ్మల్ని చూడగానే ఏ రాజాంతఃపురంలోనో హంసతూలికాతల్పఁపైన దాస దాసీల  సేవలందుకుంటూ వైభవంగా జీవించవలసినవారనిపిస్తుంది. మిమ్మల్నిలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. ఏదో విధంగా మీకు సాయపడాలి. అదే నాకు తృప్తినిస్తుంది. మీ ముఖంలో చెరగని నవ్వుండాలి. అదే నా జీవితాశయం...."     నిర్మల అతడి మాటలకు కరిగిపోయింది- "మీవంటి స్నేహితుడు లభించడం నా అదృష్టం...." అందామె.     "అదృష్టం నీది కాదు. నాది. ఎంత డబ్బిచ్చినా తిరుపతి వెంకన్న  దర్శనం అరగంటకు మించిఉండదు. మిమ్మల్ని దగ్గరగా ఇలా ఎంతసేపట్నించో చూడగలగడం నా అదృష్టం...."     "అది మీ అభిమానం !" అని - "మళ్ళీ  బట్టలు మార్చుకుని వస్తాను. అవతల చాలా పనులున్నాయి...." అంది నిర్మల.     "అందుకుపాయం చెబుతానన్నానుగా - ఏమిటని అడగరేం?"     "చెప్పండి-"     "మీరీ దుస్తుల్లో ఇలాగే ఉండి నన్ను చూస్తూండండి. మీ కళ్ళముందే ఆ పనులన్నీ అయిపోతాయి....." అన్నాడు సాగర్.     "అంటే ఆ పనులన్నీ మీరు...."అని- "వద్దు...." అంది నిర్మల.     "ఈ ఒక్కరొజూకూ వద్దనడానికి వీల్లేదు...." అన్నాడు సాగర్.     అయితే నిర్మల ఓ పట్టాన అంగీకరించలేదు. మంచిమాటలతో సాగర్  ఆమెను ఒప్పించి- "మిమ్మల్ని చూస్తూ కూర్చుంటే నాకు తెలియకుండానే ఆకాశాన్ని పిండికూడా చేయగలనని  నిన్ననే నాకు తెలిసింది...." అన్నాడు.     నిర్మల నాలిక్కరుచుకుని- "నిన్న మీరు చేసిన సాయానికి కనీసం థాంక్సైనా  చేపాలని ఇంతవరకూ నాకు తోచనేలేదు" అంది.     "ఎంత చేసినా  దేవి భక్తుడికి బుణపడదు. భక్తుడే దేవికి బుణపడతాడు. పదండి...." అన్నాడు సాగర్.     ఆ తర్వాత  అతడు పనులు చేస్తూంటే ఆమె నిలబడి చూసింది. అదా ఆమెకు యిబ్బందిగానేఉన్నా తప్పలేదు.     "ఇలాంటి పనులు నేను మా అమ్మకు చేశాను. నా సేవలందుకునే అర్హత ఆమెకు లేదు. నా పనులకామె సంతోషించనూలేదు. మీకు సేవలుచేసుకుంటే నా కెంతో తృప్తిగా ఉంది" అన్నాడు సాగర్.     "నాకు  మీరు సేవలుచేయదమెందుకు?     "రాణిని రాణిలా చూడలనుంది. మిమ్మల్ని మహారాణి హొదాలో చూడాలనుకున్న నా కోరిక తీరడానికింతకుమించిన ఉపాయమేముందో మీరే  చెప్పండి!"     "మీరు మరీ ఆకాశానికెత్తేస్తున్నారునన్ను...." అంది నిర్మల సిగ్గుతో ఆమె ముఖం ఎర్రబడి అప్పుడే విచ్చుకున్న గులాబిలాఉంది.     "నేనేమంటున్నానో నాకు తెలియదు. కానీ అది చంద్రుడికో నూలు పోగో, ఉడతాభక్తో అని మాత్రమే అనిపించుకుంటుందని నాకు తెలుసు....."     నిర్మల మరి మాట్లాడలేదు. అతడు చాలా తెలివిగా  మాట్లాడుతున్నాడని ఆమె గ్రహించింది. అతడి మాటలామెకు నచ్చాయి. అంతేకాదు- అతడి నామె నమ్ముతోంది.     వరుసగా అతడు పనులన్నీ చేశాక- "ఇప్పుడు మనం కాసేపు తీరికగా కబుర్లుచెప్పుకోవచ్చు" అన్నాడతడు.     "ఇంక బట్టలు  మార్చేసుకుంటాను...." అంది నిర్మల.     "అప్పుడే?"     "అమ్మ వచ్చేస్తే?"     "ఇంకో గంటదాకా అమ్మరాదు...."     నిర్మలకా బట్టలప్పుడే విప్పాలనిలేదు. కానీ మాణిక్యాంబ వస్తుందన్న భయమూ ఉందామెకు.     "ఇంక కబుర్లేముంటాయి?" అంది నిర్మల.     "దేవీదర్శనమైనప్పుడు కాళిదాసునోట ఆగకుండా కావ్యాలువచ్చాయి"     "ఒక్కక్షణం మీరాగితే నేను చెప్పవలసిందీ కొంత ఉంది" అంది నిర్మల గంభీరంగా.     ఉన్నట్లుండి ఆమె అలాగానేసరికి సాగర్ తెల్లబోయాడు. తన కష్టమంతా వృథాకాదుగదా అని భయపడ్డాడతడు.     "చెప్పండి మీ మాటలు వీణానాదంలా ఉంటాయి. అసలు మిమ్మల్ని  మాట్లాడించాలానే  నేను  మాట్లాడుతున్నది....."     "నేను చెబుతున్నది విని మీరేమీ అనుకోకూడదు" అంది నిర్మల.     సాగర్ లో భయం పెరిగింది. వ్యవహారం చంచల్రావు విషయంలో లాగే ఇప్పుడు బెడిసికొట్టదుకదా అనుకున్నాడతను.     "మీరు నన్ను శపించినా అదే  పరమనుకుంటాను. నేనేమీ అనుకోను. చెప్పండి" అన్నాడు  సాగర్.     "మీరు నన్ను దేవత అన్నారు. అందుక్కారణం మీ అబిమానం కావచ్చు. కానీ నేను దేవతనుకానని నాకు తెలుసు. నేను  అసహాయురాలిని. ఎవరినీ దేనికీ ఎదిరించలేదు. నా భవిష్యత్తుపైకూడా నాకేమీ పెద్దగా ఆశలు లేవు. దేవుడిచ్చినదానితో సరిపెట్టుకుంటాను. మా అమ్మ నాలో దేవతనుచూడడంలేదు. దెయ్యాన్ని చూస్తోంది. అయినా నేను దెయ్యాన్నన్నీ అనుకోవడం లేదు. వాస్తవజీవితం తెలుసుకుని మసులుతున్నాను. అయితే ఈరోజు నాకు నేను  నిజంగా దెయ్యాన్నే మోననిపిస్తుంది....."     "ఎందుకు?" అప్రయత్నంగా అడిగాడు సాగర్.     "రాకుమారి, దేవత మహారాణి అని నన్నంటున్నారు మీరు. కానీ  అది వాస్తవంలోనిజంకాదు. అదంతా మీ ఊహ అయితే మీరు రాకుమారుడు అన్నది వాస్తవంలోకూడా నిజం. నన్ను సానుభూతితో అభిమానించిన మీలో దైవస్వరూపమూఉంది. వయసునుబట్టి రాజకుమారుడనాలి తప్పితే  మీరు  నిజంగా మహారాజవై భోగంలో ఉన్నారు. ఇలాంటి మీరు నన్నభిమానించారు. ఫలితమేమిటి? అంట్లుతోముతున్నారు. బట్టలుతుకున్నారు. కూరలు తరుగుతున్నారు. వంటచేస్తున్నారు...."
24,765
    "బాగుంది. గుహలోపల మనిషి వుందనుకున్నాను. ఏది ఏమైనా చూడాలనిపిస్తున్నది. నీకు వీలుంటే ఉదయం పూట వచ్చి చూద్దాము"     "అలాగే. అబ్బ ఇక్కడనుంచి అటు చూడరా ఊరు పొలాలు అద్భుతంగా కాన వస్తున్నాయి. చూడ రెండు కళ్ళూ చాలవనుకో."     సూర్యారావు నవ్వాడు. "ఎప్పుడూ చూసే నాకు నీవు చెప్పే అందాలు తెలియవుగాని, ఇక్కడ అక్కా చెల్లెలి గుహ వుంది చూపిస్తాపద" అన్నాడు.     "అక్కా చెల్లెళ్ళ గుహ అంటున్నావు వాళ్ళూ దేవతలనేనా?"     "ఉహూ. పక్క పక్కనే వున్న రెండు గుహలు ఇసుమంత బేధంలేకుండా ఒకేలాగా వుంటాయి. కనుక మేమే ఆపేరు పెట్టాము. ఇదిగో ఇదే ఆ గుహ" అన్నాడు సూర్యారావు ఓ గుహముందు నిలిచి.     "లోపలికి వెళ్ళొచ్చునా?" అడిగాడు కైలాసగణపతి.     "చాలా పెద్దగుహ. రెండు గదులంత ఉంది. అరె! ఇక్కడ నీటిపాయకూడా వుందే. ప్రాణం హాయిగా వుంది కాసేపు కూర్చుని వెళదాం."     "ఏం కాళ్ళు నొప్పులు పుడుతున్నాయా?" సూర్యారావు బండమీద కూర్చుంటూ అడిగాడు.     "ఈ మధ్య కొండలు ఎక్కలేదు కదా కాళ్ళు నొప్పులు పుట్టక ఏం చేస్తాయి? పైగా ఈ మధ్యనే కాళ్లు నొప్పులు కూడా బైలుదేరాయి."     "మరి రోజూ కొండ ఎలా ఎక్కుతావు?     "కొండ మొత్తం ఎక్కక్కరలేదు. అటు తిరిగి ఇటు తిరిగికాస్త ఎక్కితే చాలు. రోజూ ఇంతపైకి ఉహూ రాను."     "అమ్మయ్య కొండ ఎక్కక్కరలేదన్నమాట. ఇప్పుడు నా ప్రాణం హాయిగా వుంది."     సూర్యారావు ముఖంలో రిలీఫ్ కనపడింది.     కైలాసగణపతి నవ్వుకున్నాడు.     "ఈ కొండకి ఆనుకుని అటుసైడు ఇంకో కొండవుంది. రెండింటి మధ్యలోయ ఉంది. ఆ లోయలో మాత్రం బత్తుగా అడవిలాగా చెట్లు వుంటాయి. ఇటువైపు కొండ ఎక్కటం చాలా తేలిక. అటుఅలాకాదు. పెద్ద పెద్ద చట్టుబండలు వున్నాయి. పైగా అవి నిలువుగాను, మరీ ఏటవాలుగాను వుండటంవల్ల కొండ ఎక్కటం చాలా కష్టం." సూర్యారావు కబుర్ల మధ్యలో చెప్పాడు.     "ఆ మూల ఏమిటి ఎవరో ఏనాడో వంటచేసుకున్నట్లు గుర్తుగా మసి వుంది?" గణపతి ఓ మూలకి దృష్టి సారించి అడిగాడు.     "ఈ కొండ మహాపర్వతంకాకపోయినా, దీనికో చరిత్ర, ఓ వంద కధలు వున్నాయి. నక్స్ లైట్లు, కమ్యూనిస్టు ఉద్యమం రోజుల్లో కమ్యూనిస్టులు పోలీసులకి దొరక్కుండా ఈ కొండ గుహల్లో దాక్కునికాలం గడిపేవారు. పోలీసులు పసిగట్టి పట్టుకోవటానికి వస్తే కొండకి అటువేపు దిగి లోయలోకి వెళ్ళి మాయం అయ్యేవారు."     "కొంపదీసి వాళ్లు ఇప్పుడు కూడా వున్నారేంటి?"     "ఆ పార్టీ ఇంకా బతికేవుందని పేపరులో చదివినప్పుడు అనుకుంటాను. రాజ్యం కోల్పోయిన రాజుల్లాగా పబ్లిక్ గా వాళ్ళు ఊళ్ళల్లో అక్కడక్కడ తిరుగుతుంటే పోలీసులకేమి పట్టింది వాళ్ళని పట్టుకోటానికి! అలాగే వాళ్ళకి దాక్కొనే అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళు వుండీలేనివాళ్ళకింద లెక్క"     "బందిపోట్లు లాంటివాళ్లు దాక్కోవటం లాంటిది వుందా?"     "ఉహూ. మాకు దొంగల భయం అన్నదే లేదు. ఇంక బందిపోట్లు దాకా ఎక్కడ? గొడ్లుకాచే కుర్రాళ్లు పుల్లలు ఏరుకోవటానికి ఒకరూ ఇద్దరూ తప్పించి ఎవరూ కొండ ఎక్కరు. సీతాఫలాలు చెట్లకి ఇప్పుడే పడుతున్నాయి. అవిపెద్దయి పక్వానికి వచ్చేసమయంలో పిల్లకాయలు పైకెక్కి కోసుకొస్తారు. అక్కడక్కడ తేనెతుట్టెలు వున్నాయి. అవి దులుపుకోటానికి పెద్దవాళ్లు నూటికో కోటికో వస్తారు అంతే."     "ఈరోజుకి ఇంకా పైకి ఎక్కలేనుగాని వెళ్ళిపోదాం రెండు మూడు రోజులు నీవు తోడువచ్చి కొండ అంతా చూపించరా సూరీడూ! ఆ తర్వాత ప్రతిరోజూ నేనే వచ్చి-     కైలాసగణపతి నోరుజారి పరిశోధన అంటాడేమో అని కంగారుపడిపోయి "షికారుకి షికారుకి వస్తావు అంతే కదూ?" అన్నాడు సూర్యారావు.     "షికారుకి కాదు కొండగాలి మేయటానికి వస్తాను. పైరుగాలికన్నా కొండగాలి ఆరోగ్యానికి పైగా నాబోటి రోగిష్టివాడికి చాలా మంచిది తెలుసా" అన్నాడు కైలాసగణపతి.     "అవును" అని అమ్మయ్య అనుకున్నాడు పరిశోధన మాట ఎత్తనందుకు ఆనందంతో సూర్యారావు.     "ఇంక లేద్దాము"     "అలాగే. రేపు ఇంకా పెందరాలే వద్దాము.     "సరే." అన్నాడు సూర్యారావు.     ఇరువురూ పక్కగుహకూడా చూసి కొండ దిగటం ప్రారంభించారు.                                        12     "పిండతైలం రాస్తావా?" సూర్యారావు అడిగాడు.     "పిండతైలమా! అదేమిటిరోయ్ సూరీడూ! అసలు ఏ జీవి తాలూకా పిండం అది?" కైలాసగణపతి మోకాలు నొక్కుకుంటూ అడిగాడు.     "మందుపేరు పిండతైలం. ఆయుర్వేదం మందు. కీళ్ళ నొప్పులకి అద్భుతంగా పనిచేస్తుంది. మహాయోగ రాజగుగ్గిలం మాత్రలు మింగుతూ ఈతైలం రాస్తే వాత నొప్పులు కీళ్ళ నొప్పులు ఉష్ కాకీ అంటూ ఎగిరిపోతాయి."     "నీవు చెప్పింది నమ్ముతున్నాను. కానీ నాకు పనిచేయవు."     "అదేమి! నీకొచ్చింది స్పెషల్ జబ్బా?"     "దీనిని కొండవాతం అంటారు."     "అదేమిటిరోయ్! ఈపేరు నేను ఎప్పుడూ వినలేదే?" ఆశ్చర్యంగా అడిగాడు సూర్యారావు.     "నువ్వు వినకపోవచ్చు. నాకు బాగా తెలుసు. అనుభవం నాది కదా! కొండంతా తిరిగిచూద్దామనే ఉత్సాహంతో వరసగా మూడు రోజులబట్టీ నిన్ను వెంటబెట్టుకు వెళ్ళి తిరిగా కాదా! ఆ ఉత్సాహంతో వయసు మాట మరచిపోయి కుర్రాడిలాగా ఎగిరి గంతులు వేసేసరికి కాలిపిక్కలు మోకాళ్ళు ఏ మాత్రం మొహమాటం లేకుండా పట్టెశాయి. దీనికి కొండవాతం అని పేరు పెట్టానులే" నవ్వుతూ చెప్పాడు కైలాసగణపతి.
24,766
    శిల్పకి పళ్ళు తోమడానికి భరణి బాత్రూంలోకి తీసుకెళుతూ వుంటే, తనే వెళతానని చేత్తోనే వారించింది.     "అబ్బో నువ్వే తోముకుంటావేంటి?" అంటూ వెళ్ళి మంచంమీద కూర్చుంది భరణి.     భరణి అందించిన పాలగ్లాసులోని పాలన్నీ తాగేసి గ్లాసుకింద పెట్టింది శిల్ప. అప్పటికే స్నానం చేసేసి ముస్తాబయివచ్చింది రాగిణి. ఎఱ్ఱటి షిఫాన్ చీరమీద, తెల్లటి పువ్వులూ, ఎఱ్ఱటి బ్లౌజు, దోసగింజ బొట్టు, తీర్చిదిద్దిన కాటుక.     "ఎక్కడికక్కా?" అడిగింది భరణి.     "కల్చరల్ సెంటరుకే" జడల్లుకుంటూ అంది.     "అతనే ఫోన్ చేస్తానన్నాడుగా"     "మనం వెళితే వచ్చిన నష్టం ఏమిటి?"     "నేనూ రానా?"     "నువ్వు శిల్పతోటుండు. నే వెళ్తాలే!" అంటూ గబగబా రెండు బ్రెడ్డు ముక్కలు తిని, టీ తాగి బయలుదేరింది రాగిణి.     శిల్ప ఆమెకేసి చూస్తూ వుండిపోయింది.                                         *    *     "ఉదయమనగా రెండు బ్రెడ్డుముక్కలు తిని వెళ్ళింది, యింకా రాలేదు" అంది సరోజిని మధ్యాహ్నం భోజనాలు అయ్యాక వొక్క పొడి నములుతూ, భరణికేసి చూసి.     "బయటికెళితే టైమ్ తెలీదు అక్కకి" దెప్పుతున్నట్టుగా అంది భరణి.     "ప్రోగ్రామ్ ఫిక్సయిందేమో : లేకపోతే వాళ్ళెవరో ఆర్గనైజర్లు కలిసుండరు. వాళ్ళని కలిసి ఆ పని సాధించుకొస్తే తప్ప, దానికి తోచదు. అది ఊరుకోదు. అంత పట్టుదల దానికి." మెచ్చుకుంటూ అంది సరోజిని.     "శిల్పా కాసేపు నిద్దరపోతావా టైమ్ రెండయింది. నాలుగింటి వరకూ పడుకో."     తల అడ్డంగా ఊపింది శిల్ప, పడుకోను అన్నట్టుగా.     "అబ్బబ్బబ్బా! ఊటీ వెళ్ళినా ఈ తలూపడం తప్ప, నోరు విప్పి మాట్లాడడం చాతకాలేదింకా."     "శిల్పూ మూగది! మాటలు సరిగ్గారావు. అందుకే మొద్దులా తలూపుతుంది" అంది కొంటెగా భరణి శిల్పని చూస్తూ.     శిల్ప తలొంచుకుని కూర్చుంది, ఫ్రాక్ కి వున్న గుండ్రని గుడ్ల గూబ కళ్ళలాంటి గుండీలని ఇటూ అటూ తిప్పుతూ.     నిద్రరావడం లేదు. కూర్చుంటే ఏమీ తోచడం లేదు. ఇదే ఊటీలో అయితే, సిస్టర్ ఫెర్నాండిస్ ఏవో కథలు చెప్పేది. తన సమాధానానికి ఎదురు చూడకుండానే, మాట్లాడుతూపోయేది. తను మాట్లాడకపోయినా, చెవులు ఆమె చెప్పేవి వింటూనే వుండేవి..... కళ్ళు ఆమెని చూస్తూనే వుండేవి - అనుకుంటూ ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆ గుండీని గట్టిగా తిప్పేసరికి అది ఊడి చేతికొచ్చింది.     "అయ్యో! చూడమ్మా! కొత్త ఫ్రాకు బటన్ ఊడబీకేసింది అంది భరణి శిల్ప చేతిలోని గుండీని అందుకుంటూ, కంప్లెయింట్ చేస్తున్నట్టుగా.     "అన్నీ పిచ్చి వేషాలే! దీని దగ్గర ఒక్క వస్తువూ నిలవదు, అదేం పిల్లోకానీ, ఆ బొమ్మలూ అవీ జాగ్రత్త! పగలగొట్టినా గొట్టేస్తుంది ఒక్క రోజులో" అంది సరోజిని మంచంమీద వాలుతూ.     శిల్ప కళ్ళలో నీళ్ళు తిరిగాయి. 'అమ్మ ఎందుకలా అంటుంది.......? ఎందుకు పగలగొడుతుందీ తను? అయినా ఆమెకీ తనమీద కన్నా ఆ బొమ్మలమీదే ప్రేమున్నట్టుంది.' అనుకుంటూ బాధతో మెల్లగా వెళ్ళి రాగిణి గదిలోని మంచంమీద పడుకుంది ఆలోచిస్తూ. ఎప్పుడు నిద్ర పట్టిందో తెలీదు కళ్ళు తెరిచేసరికి రాగిణి గొంతు వినబడుతోంది. "కల్చరల్ సెంటర్ వాళ్ళ కార్యక్రమాలు ఈసారి ఇక్కడకాకుండా ఢిల్లీలో పెడతారట. దానికి ఎవరో గీతారాణి పేరు సజెస్టు చేశారట. కానీ సెక్రటరీ గురునాథంగారు ఎలాగైనా నన్నే ఢిల్లీ పంపించాలని పట్టుబట్టారట. నేను వెళ్ళగానే ఎంత సంతోషించారనుకున్నావ్? గీతారాణి దగ్గరనుంచి రెండు సార్లు ఫోనొస్తే లేరని చెప్పించేశాడాయన" హ్యాండ్ బ్యాగ్ ని టీపాయ్ మీద పెట్టి, సోఫాలో కూర్చుంటూ చెబుతోంది రాగిణి.     "డబ్బెంత ఇస్తామన్నారూ?" అడిగింది సరోజిని.     రానూ పోనూ టిక్కెట్లు - అంటే నాతోపాటు ఇంకొకరు రావొచ్చును. ప్లస్ ఆర్కెస్ట్రా, అక్కడ గెస్ట్ హౌస్ రిజర్వేషనూ భోజనాలూ అన్నీ పోను నాలుగు వేలడిగాను."     ఐదు వేలడిగినా ఇచ్చుండేవారు. ఢిల్లీలో ప్రోగ్రాం కదా! నీతోపాటు నేనొచ్చుంటే అడిగేదాన్ని గట్టిగా."     "అవును నాకు చాతకాదు" కిల కిలా నవ్వింది రాగిణి.     "నిన్ననే వచ్చింది కదా శిల్ప అని నీతో రాలేదు ఇవ్వాళ. దాంతోపాటు ఇంట్లో వుండి కాలక్షేపం చేద్దామనుకున్నాను."     "నీతో బాగానే మాట్లాడిందా? దానిలో మార్పొచ్చిందా ఏమైనా?" కాళ్ళకున్న శాండల్స్ ని విప్పదీసి పక్కకి పెడుతూ అడిగింది.     "ఏమీ లేదు. అదే మౌనం, అదే బుద్ధావతారం. ఏమిటో ఉలుకూ పలుకూ లేదు. ఏ ఆటా పాటా లేదు. నవ్వులేదు మొహంలో అదేం పిల్లో ఏమిటో!" దండకంలాగా చెప్పుకుపోతోంది సరోజిని.     పక్క గదిలోని మంచంమీంచి తొంగిచూస్తూ వాళ్ళ సంభాషణంతా వింది శిల్ప. వాళ్ళలా మాట్లాడుకోవడం, తనకేమాత్రం నచ్చలేదు. అమ్మ తనమీద అక్కతో ఏదో పితూరీలు చెబుతున్నట్టుగా అనిపించింది. ఏడుపొచ్చినంత పనైంది. అమ్మంటే కొంచెం కోపం కూడా వచ్చింది! అందుకే మంచందిగి లేచొద్దామనుకున్నదల్లా మానేసి అలాగే పడుకుంది.     రాగిణికి కప్పులో కాఫీ పోసి అందించింది భరణి.     "నువ్వు తాగావా?"     "ఆఁ....."     "శిల్పూ ఇంకా లేవలేదా?"     "ఊహూఁ......"     "పాపం! ఊటీ స్కూల్లో హోం వర్కు అదీ చాలా ఎక్కువ వుంటుంది కదా! బాగా అలిసిపోయి వుంటుంది. పడుకోనీ, లేపొద్దు అంటూ కాఫీ కప్పు టీపాయ్ మీదే పెట్టేసి స్నానం చేసి బట్టలు మార్చుకోవడానికి బాత్ రూంలో కెళ్ళింది.     శిల్పకి ఆ క్షణంలో అక్కే ఎంతో మంచిదనిపించింది.     ఓ పది నిమిషాలకల్లా రాగిణి స్నానం చేసి తెల్లటి ఇస్త్రీ చీర కట్టుకుని చిన్నది ఎర్రటి గుండ్రపుబొట్టు పెట్టుకుని శిల్ప మంచం దగ్గరికొచ్చింది. భరణి! అక్కేమోనని మెల్లగా కళ్ళుతెరచి శిల్పని చూసి నవ్వుతూ "అమ్మదొంగా! దొంగనిద్రపోతున్నావా?" అంటూ చంకలకింద చక్కిలిగింతలు పెట్టింది.     శిల్ప పకపకా నవ్వింది. ఆ నవ్వుకి ఇంటిల్లిపాదీ ఆ గదిదగ్గర కొచ్చారు. "ఇవాళ ఎండో వానో ఏదో ప్రళయం తప్పదు" అంది సరోజిని.     "ఏం జరిగిందీ" అన్నారు రామానుజం అప్పుడే లోపలికొస్తూ విషయం అర్థంకాక     "శిల్ప పకపకా నవ్వుతోంది" అంది సరోజిని.     రామానుజం గారు మాట్లాడలేదు. ఒకసారి శిల్పకేసి చూసి అవతలకి వెళ్ళిపోయారు.     శిల్ప రామానుజం కేసి చూసింది. ఆయన వెళ్ళిపోతూవుంటే, అంతలోనే ఏవో ఆలోచనలు ఆ చిన్నారిని గజిబిజి చేయడంతో మళ్ళీ మూగదానిలా అయిపోయి లేచికూచుంది.     భరణి కూడా స్నానం చేసొచ్చింది. శిల్ప రాగిణినీ, భరణినీ తిప్పి తిప్పి చూసింది. రాగిణిముందు భరణి అసహ్యంగా అనిపించింది.     "ఏంటలా చూస్తున్నావ్?" అంది భరణి.     "ఏమీలేదు" అన్నట్టుగా తలవూపి మంచం దిగింది.     "అక్కా! ఢిల్లీ ప్రోగ్రాం ఎప్పుడు?" అడిగింది భరణి.     "మళ్ళీ ఆదివారం. శుక్రవారం ఎ. పి. ఎక్స్ ప్రెస్ లో ప్రయాణం. రేపట్నించి రిహార్సల్సు పెట్టుకోవాలి. సంగీతం మాస్టరుకీ, ఆర్కెస్ట్రా మెంబర్లందరికీ చెప్పాలి. రేపే రిజర్వేషన్ చేయించుకోవాలి."
24,767
    సుబ్బలక్ష్మి దగ్గరగా వచ్చి గుసగుసగా "మీరు రమ్మంటే మీతో నేను వచ్చేస్తాను." అంది.     ఉలికిపడ్డాడు భాస్కర్.     "మరి నీ సామాను?"     "సామానేముంది? నా చీరలు తెచ్చుకున్నాను." పైటచాటున దాచుకున్న చేతి సంచి చూపించింది సుబ్బలక్ష్మి.     నిర్ఘాంతపోయిన భాస్కర్ "నేను నిన్ను తీసికెళ్తాననే అనుకున్నావా?" అన్నాడు.     "జ్యోత్స్నగారు రాలేదుగా నన్నెందుకు తీసికెళ్ళరూ?" అని తెలివి తేటలు ప్రదర్శించింది సుబ్బలక్ష్మి. ఆ క్షణంలో సుబ్బలక్ష్మిని చూస్తోంటే పట్టరాని అసహ్యం కలిగింది భాస్కర్ కి.          "సరే! పద! రైలెక్కు." అన్నాడు.     సుబ్బలక్ష్మి సంబరంగా రైలెక్కి కూచుంది. తను కొన్న రెండు టిక్కెట్లూ సుబ్బలక్ష్మి చేతికిచ్చాడు. అవి జాగ్రత్తగా తన జాకెట్ లో దాచుకుంది సుబ్బలక్ష్మి.     గంట కొట్టారు. ట్రైన్ కదిలింది. భాస్కర్ గభాలున రైలు దిగి ఫ్లాట్ ఫాంవైపు నడిచాడు. సుబ్బలక్ష్మి కంగారుపడిపోతూ అయ్యో! భాస్కర్ గారూ! భాస్కర్ గారూ!" అంటూ పెట్టే కేకలు, రైలు కూత చప్పుడులో కలిసిపోయాయి.         సుశీల రావలసింది శనివారంనాడు. అంచేత తను మామూలుగా ఇంటికి వెళ్ళిపోయి మచ్చల డాక్టర్ కిచ్చిన ఉత్తరం తీసుకుందామనుకున్నాడు. తరువాత స్తిమితంగా జ్యోత్స్న ఎందుకు రాలేదో కనుక్కోవాలనుకున్నాడు. తీరా ఇంటికి వచ్చేసరికి ఎదురయిన పరిస్థితి ఇది!         సుశీల గర్భవతి అని తెలుసుకున్న భాస్కర్, "ఎంత ప్రమాదం తప్పి పోయిందీ?" అనుకున్నాడు మనసులో....     తన తండ్రి స్వార్థంతో తన బ్రతుకు పాడు చేశాడన్న కోపాగ్ని ఈనాటికీ మరిచిపోలేక పోతున్నాడు భాస్కర్. ఈనాటికీ తండ్రిని క్షమించలేక పోతున్నాడు. కానీ, తను చెయ్యబోయిన దేమిటి.     ఇంకా తన తండ్రి ఏమీ చదువుకోని అర్చకుడు, పరమమూర్ఖుడు. చదువు సంస్కారాలున్నా తన తండ్రి కంటే ఏ విధంగా అధికుడు? స్వార్థమనేది ఏ రూపంలో ఉంటేనేం? అది డబ్బు కౌపీసమయితే నేం? ప్రేమదాహమయితే నేం?        ఆభమూ, శుభమూ తెలియని పసికందుల్ని ఈ లోకంలోకి తీసుకొచ్చిన తరువాత బాధ్యతారహితంగా వాళ్ళని వొదిలేసి తమ సుఖం తాము చూసుకొనే అధికారం తల్లిదండ్రులకుందా? అలాంటి తల్లిదండ్రులు క్షంతవ్యులేనా? తన కొడుకు.... తన కన్నబిడ్డ.... దిక్కూ దివాణం లేకుండా.... చదువు సంధ్యలు లేకుండా.... రోడ్లమీద బికారిలా తిరుగుతోంటే....     ఆ ఆలోచనను భరించలేక వణికిపోయాడు భాస్కర్.     "ఏ పరిస్థితుల్లోనూ నా సంతానాన్ని భాద్యతారహితంగా వదిలెయ్యలేను. నేను ఏయే సుఖాలు నష్టపోయినా సరే!" అని నిశ్చయించుకున్నాడు.     తను వదిలి వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నందుకు సుశీల ఏయే ప్రశ్నలు వేసి ఎంతగా సతాయిస్తుందోనని హడలిపోయాడు భాస్కర్ - కానీ, సుశీల ఏమీ జరగనట్లు ప్రవర్తించసాగింది. తడుముకుంటూ, తడుముకుంటూ తనకోసం తనకిష్టమయిన పదార్థాలు తయారు చెయ్యాలని తాపత్రయపడుతున్న సుశీలని చూస్తే భాస్కర్ కి జాలితో కళ్ళలో నీళ్ళు తిరిగాయి.     జ్యోత్స్న వెళ్ళిపోయింది. మళ్ళీ తిరిగి తన వాటాలోకి రాలేదు. పైకి ఏమీ అనకపోయినా లోలోపల జ్యోత్స్న ఏమయిపోయిందా, అనే ఆరాటం పోలేదు భాస్కర్ కి.       భాస్కర్ పేర పెద్దకవరు వచ్చింది. అందులో రెండు ఉత్తరాలు ఉన్నాయి. ఒకటి వెంకట్రావు వ్రాసింది. రెండవది జ్యోత్స్న వ్రాసింది. "డియర్ భాస్కర్!     నేను జ్యోత్స్నను పెళ్ళి చేసుకున్నాను. ఎంతో విడ్డూరంగా కనిపించే విషయానికి సంజాయిషీ లాంటిది నా ఉత్తరం.     ఇన్ కంటాక్స్ వాళ్ళు నా ఇంటిని సోదా చెయ్యటం నాకు ఏ విధమయిన ఆస్తిపాస్తులూ, బేంక్ బేలెన్సులూ లేవన్న విషయం బయటపడటం.... నీకు తెలిసినదే! నిజానికి నాకు మొదటినుంచీ డబ్బులేదు. వ్యాపారస్థుల దగ్గిర ఏజెంట్ గా పని చెయ్యటం వల్ల బాగా డబ్బున్న వాళ్ళ వేషాలు మాత్రం అబ్బాయి.       అంతేగాదు. లోకం కేవలం డబ్బుని బట్టి ఒక మనిషిని ఎంత గౌరవిస్తుందో కూడా అర్థమయింది.         భాస్కర్! నిజానికి ఒక మనిషికి ఎంత డబ్బు కావాలి? మనం తినేదెంత? కట్టుకొనేదెంత? ఖరీదైన బట్టలు, పెద్ద పెద్ద మేడలు, ఇవన్నీ ఇతరులకు మన గొప్ప చూపించుకోవటానికే కదూ! జాగ్రత్తగా ఆలోచిస్తే డబ్బు విలువ మనం అనుభవించటానికి కాదు. నలుగురిలో మన గొప్ప చూపించుకోవటానికి అనిపిస్తుంది.         ఇన్నాళ్ళుగా అందరూ నేను గొప్పవాణ్ణి అనుకుంటున్నారు. అలాగే గౌరవిస్తున్నారు - అందుకే భయపడుతున్నారు. నాకు డబ్బు లేకపోయినా, డబ్బున్నవాళ్ళు అనుభవించే ఆనందమంతా నేను అనుభవించాను.        అయితే ఏనాటికైనా నాకు డబ్బులేదనే రహస్యం బయటపడుతుందేమోననే భయం నన్ను పీడించేది. అంతర్గతంగా ఉన్న ఈ భయానికి బ్లడ్ ప్రషర్ తోడయి ఫిట్స్ రావటానికి దారి తీసింది. ఒకనాడు జ్యోత్స్న దగ్గిర కూడా ఇలాగే ఫిట్స్ వచ్చి పడిపోయాను. పాపం, జ్యోత్స్న సహనంతో నాకు తెలివివచ్చేవరకూ ఏదో తనకు చేతనైన ఉపచారాలు చేసింది. నాకీ జబ్బు ఉన్నట్లుగా ఎవరికీ చెప్పవద్దంటే ఆ రహస్యాన్ని తనలోనే దాచుకుంది.
24,768
    "కాళ్ళదగ్గరే ఉండడం మీకిష్టమన్నమాట. సెల్ లో ఉండరన్న మాట - కానీ పెట్టీకేస్ మీద వచ్చి వెళ్ళిపోయే దొంగలుమీరు. నా దగ్గర శిష్యరికం చెయ్యాలంటే పర్మనెంట్ జైలుశిక్ష, యావజ్జీవ ఖయిదీలై ఉండాలి."     "పర్మనెంట్ జైలుశిక్ష పడాలంటే, ఏంచెయ్యాలి గురువుగారూ?"     ముగ్గురివేపూ ఎగాదిగా చూశాడు ఆందోళనరావు.     జైల్లో ఎవర్నయినా మర్డర్ చేసేసి, జైల్లోంచి సొరంగం తవ్వుకుని బయటకు వెళ్ళిపోయారనుకోండి_ ఇట్స్ ఏ సీరియస్ కేస్....ఫర్ ఎగ్జాంపుల్. అలాంటి పరిస్థితే మీకొస్తే, ఎవర్ని మర్డరు చేస్తారు?" చిత్రంగా అభినయిస్తూ అన్నాడు ఆందోళనరావు.     "మిమ్మల్నే" ముగ్గురూ ఏక కంఠంతో అనేసరికి, ఢామ్మని కింద పడిపోయాడు ఆందోళనరావు.                                       ౦    ౦    ౦     ఉదయం పది, యాభయి నిమిషాలయింది.     మెయిన్ బిల్డింగ్ కి కొంచెం దూరంలోవున్న రెసిడెన్స్ ఆఫీస్ రూమ్ లో పి.ఎ. రమాకాంత్, జి. ఎమ్. అరుణాచలం తదితరులు వెయిట్ చేస్తున్నారు.     సరిగ్గా పదిగంటలకల్లా ఇంటిలోంచి బయటికొచ్చే కాళేశ్వరప్రసాద్ టైమ్ సెన్స్ తప్పడం ఆశ్చర్యంగా వుంది రమాకాంత్ కి.     "అరుణాచలంగారూ! మన గెస్ట్స్ పదకొండు గంటలకల్లా వచ్చేస్తారు కదా! మీరు వార్ని ఎంగేజ్ చేస్తుండండి. సార్ ని తీసుకుని నేనొచ్చేస్తాను" పి.ఎ రమాకాంత్ చెప్పాడు.     "గుడ్ ఐడియా! నేను వెళతాను మరి" అరుణాచలం గబ గబా వెళ్ళిపోయాడు.     సరిగ్గా అదే సమయంలో బిల్డింగ్ లోంచి వచ్చిన ఆయాను అడిగాడు రమాకాంత్.     "మేడమ్ ఎక్కడున్నారు ఆయా."     "గుడికెళ్ళారు కదా!     "మరి అయ్యగారూ?"     "బాబుని ఆడిస్తున్నారు."     "అయ్యగారు బాబుని ఆడించడమా! ఈ టైమ్ లోనా?" నిర్ఘాంతపోయాడు రమాకాంత్.                                                                          ౦    ౦    ౦         "ఏడవకు, ఏడవకు వెర్రి నాగన్నా!     ఏడిస్తే నీకళ్ళు నీలాలు కారు-     నీలాలుకారితే- నే జూడలేను-నేజూడలేను!" ఆపాట ఫినిష్ చెయ్యడానికి, చివరి చరణం నోటికిరాలేదు కాళేశ్వరప్రసాద్ కి.     "వీడ్ని తీసికెళితే- అక్కడందరూ రకరకాల ప్రశ్నలు, హడావుడి పైగా దిష్టికూడాను. అరగంటలో వచ్చేస్తాను- నేను రాగానే మీరు ఫ్యాక్టరీకెళ్ళిపోదురుగాని" తేజను, అతని చేతిలో పెట్టేసి పూల సజ్జతో బయటికెళ్ళిపోయింది సుదేష్ణాదేవి.     పది నిమిషాలసేపు బాగానే ఆడుకున్నాడు తేజ__ ఆ తర్వాత మొదలయింది అసలు కథ. ఏడుపు మొదలెట్టాడు. కాసేపు సముదాయించి పాలసీసాను నోటికందిస్తే విసిరికొట్టాడు తేజ.     "ఏంకావాలి- నీకు- గాగుల్స్, వాచీ, టై, బ్రౌనీ చూడు. బ్రౌనీ తోక ఎంత వంకరగా ఉందో- ఈ తోకకి మనం ఇప్పుడు ఒక స్కేలు కట్టి, స్ట్రయిట్ గా చేద్దాం- సరేనా" అంటూ రబ్బర్ బ్యాండుతో స్కేలుని కుక్కతోకకి కట్టాడు కాళేశ్వరప్రసాద్.     ఒక్క నిమిషం ఆ తోకవేపు, ఆ స్కేలువేపు చూసి తేజ, చేత్తో ఆ స్కేలుని లాగేసి, కిందపడేసి మళ్ళీ ఏడవడం మొదలెట్టాడు.     "వాట్ డూ యూ- వాంట్ మై చైల్డు" అంటూ టాయస్ రూమ్ లోకి తీసికెళ్ళాడు___అక్కడ     బొమ్మలన్నింటినీ విసిరికొడుతూ, ఏడుస్తున్నాడు తేజ.     పాక్కుంటూ, పాక్కుంటూ నెమ్మదిగా, దూరంగా గోడకు తగిలించివున్న తల్లి ఫోటోవేపు చూస్తూ__     "అ...మ్....మ్..మ్...." అని చేతులు చాస్తుంటే__     "మమ్మీ కావాలా" అంటూ "ఆయా, ఆయా" అని పిలిచాడు.     ఆయా ఆ టైములో తన రూమ్ లో వుంది.     తల్లిని చూపిస్తూ మరీ ఏడుస్తున్నాడు.     మనీపర్స్, ఉంగరం, ఏనుగుబొమ్మ, టెలిఫోన్, లైట్స్ ఆన్ ఆఫ్....ఏంచేసినా తేజ ఏడుపు మానకపోవడంతో ఆలోచనలో పడ్డాడు.     ప్లాష్ లాంటి ఐడియా వచ్చింది కాళేశ్వరప్రసాద్ కి.     "పెద్ద పెద్ద సమస్యల్ని అవలీలగా పరిష్కరించగలిగే ఈ బిజినెస్ మాగ్నెట్ ఈ చిన్న ప్రాబ్లమ్ ని పరిష్కరించ లేడనుకున్నావా?' అంటూ గబ గబా బీరువా తెరిచి, సుదేష్ణాదేవి పట్టుచీరను చేతుల్లోకి తీసుకుని, అద్దం ముందు నుంచొని, సూటుమీదే ఆ చీరను కట్టుకుని, పైట వేసుకుని తేజవేపు చూశాడు.     తల్లి చీరను చూసాడో లేక చీరను కట్టుకున్న తండ్రి విచిత్రంగా అనిపించాడో గానీ టక్ మని ఏడుపు ఆపేసాడు.     "అ....హ్....హ - కరెక్టు మెడిసన్ ఫర్ కరెక్టు ప్రాబ్లమ్__ నీ దృష్టి మమ్మీ వేపు పోయిందన్నమాట" అంటూ కొడుకుని ఎత్తుకుని ముద్దాడుతుండగా, చిన్నారి తేజ కుడిచేయి తండ్రి రొమ్ముమీద పడింది.     ఒరేయ్__ నేను మమ్మీని కాదూ__ నీకు పాలు పట్టడానికి" అని గట్టిగా అని నలువేపులా చూసి రహస్యంగా కొడుకు చెవిలో__     "ఒరేయ్ చిట్టికన్నా- మగవాళ్ళు పాలు పట్టలేరు. ఆడవాళ్లే పడతారు, తెలుసుకో" అంటూ వాడ్ని బెడ్ మీద కూర్చోబెట్టి, భార్యవచ్చి తన వేషాన్ని చూసేసి ఎగతాళి చేస్తుందేమోననే గబ గబా చీర విప్పేసాడు.     చీర విప్పేసిన తండ్రిని చూసి తేజ మళ్ళీ ఏడుపు లంకించుకొన్నాడు.     "ఓర్నాయనోయ్- నన్నీచీరతో సెటిల్ చేయించేస్తావేంట్రా__" అంటూ మళ్ళీ చీర కట్టుకున్నాడు.     అదేదో మంత్రం వేసినట్టుగా తేజ మళ్ళీ ఏడుపు కట్టేశాడు.     ఇలా పది నిమిషాలసేపు కార్యక్రమం కొనసాగగా_     మీసాల తల్లిలా తేజను ఒడిలో కూర్చోపెట్టుకుని ఆడిస్తూ "మమ్మీకి చెప్పకేం" అని అంటుండగా_
24,769
    "ఛ ఛ, అదికాదు. నేను నా చెవుల్ని నమ్మలేకపోతున్నాను. అదీగాక నేనా నాట చరణాల్ని వింటూ ఏదో ఆలోచనలో వుండిపోయాను." ఆమె స్పీకర్ వైపు అప్రయత్నంగా చూసింది.     वो अफ़साना जिसे अंजाम तक     लाना न हो मुमकिन     उसे एक ख़ूबसुरत मोड ढेकर     तोडना अच्छा__                "ఏ కథనైతే మనం చివరివరకూ తీసుకు వెళ్ళలేమో ఆ కథని అందమైన మలుపు తిప్పి అక్కడే వదిలెయ్యటం మంచిది అంటున్నాడు కవి. అది నిజమైనా బావుణ్ను" అన్నాడు.     "ఏది?" అంది.     "ఉహూ_ఏమీలేదు" అతడు చప్పున సర్దుకుని "నాకు....అదే....నేను....ప్చ్....ఏం మాట్లాడాలో నాకు అర్ధం కావటంలేదు. నాకు....నాకు మిమ్మల్ని చూసిన మరుక్షణమే ఇలాంటి స్నేహితురాలు వుంటే ఎంత బావుణ్ణు అనిపించింది. కానీ నా అంతస్థు గుర్తుకొచ్చి మరి ఆ వైపు ఆలోచించలేదు. నాలో మీరు ఒక మంచి స్నేహితుణ్ని చూస్తున్నందుకు కృతజ్ఞతలు. కానీ నేను మీ క్రింద పనిచేసే గుమాస్తాని...."     చెప్పుకుపోతున్నాడేగానీ అతడికి తన మాటలు తనకే మెలో డ్రమటిక్ గా అనిపించసాగినయ్. సిగ్గుగా వుంది. అయినా సర్దుకున్నాడు.     "ఆ మాటలొద్దు. గుమాస్తా ఏమిటి గుమాస్తా? నాన్నగారు నిన్ను ఈ కాంట్రాక్టుకోసం గోవా పంపించారంటేనే అది ఎంత పెద్ద బాధ్యతో తెలుసా? గుమాస్తా కెవరూ అంత ప్రాముఖ్యత ఇవ్వరు. అందులోనూ మా నాన్నగారు ఎంపిక చేశారంటే దానికి తిరుగులేదు."     ఆ మాట మాత్రం నిజమే- అనుకున్నాడు మనసులో.     "వేణూ!"     "ఊ!"     "కేవలం నేను అడిగితే నువ్వు నాతో స్నేహం చేయటం లేదు కదూ?"     "లేదు లేదు. చెప్పానుగా ముందే."     "నా మాటలూ, ప్రవర్తనా_ నీకు మరీ చిన్నపిల్లలా కనిపిస్తున్నాయా?"     "ఉహూ లేదు. నేను అర్ధం చేసుకోగలను. ప్రతి మనిషికీ ఏదో ఒక టైములొ తను ఈ ప్రపంచంలొ చాలా ఒంటరివాడనీ, తనకెవరూ లేరనీ అనిపిస్తూ వుంటుంది. సరిగ్గా అదే సమయంలొ నేనున్నాననే స్నేహితుడి కోసం తపించిపోతూ వుంటాడు. ఈ విషయం నాకు బాగా తెలుసు!"     "ఎలా తెలుసు?"     "చాలాసార్లు ఇదే వంటరితనాన్ని నేనూ అనుభవించాను కాబట్టి."     ఆమెలో అప్పటివరకూ కనపడుతూన్న అస్పష్టమయిన సందిగ్ధత పోయి, మొహం విప్పారింది. సంతోషంతో "థాంక్స్" అంది. "నాకు ఎప్పుడైనా, ఏదైనా సాయం కావల్సివస్తే స్నేహితుడిగా నువ్వు చేస్తావ్ గా?"     "తప్పకుండా!"     "ప్రామిస్!" చెయ్యి సాచింది.     "ప్రామిస్!" ఆమె చేతిని మొట్టమొదటిసారి తాకుతూ అన్నాడు. "అయినా నాలాంటి వాడి సహాయం మీకెందుకు వస్తుంది ప్రేమా!"     అతడి మాటలు పట్టించుకోకుండా, 'అన్నట్టు ఇంకో విషయం....' అందామె.     "ఏమిటి?"     "మనమిప్పుడు స్నేహితులం. నన్ను 'మీరు' అనడం మానెయ్యాలి."     అతడు ఇబ్బందిగా తలూపుతూ "సరే" అన్నాడు. "నా తరపు నుంచి కూడా ఒక విషయం...."     "ఏమిటి?"     "మనమిప్పుడు స్నేహితులం కాబట్టి మీరు.... నువ్వూ నాకోసాయం చెయ్యాలి....అంటే నా మాట వినాలి."     "ఏం మాట అది?"     "ఈ రాత్రికి ప్రయాణం మానెయ్యటం."     ఆమె ముందు తెల్లబోయి, అంతలో అర్ధమై, "సరే-సరే" అని తేలిగ్గా నవ్వేసింది.     అతడు సంజాయిషీ చెప్పుకుంటున్నట్టు- "రేపే కాంట్రాక్టు సంతకాలు పెట్టవలసింది! ఒక్కరోజు ఆగితే పని పూర్తయిపోతుందని నా ఉద్దేశ్యం" అన్నాడు.     "సరే అన్నానుగా" అంది. అంతలో వెయిటర్ వచ్చి బిల్లు టేబిల్ మీద పెట్టాడు. అతడు టిప్ తో సహా డబ్బు ప్లేట్లో వేసి లేచాడు. ఆ పాటికే ఆమె లేచి మెట్లవైపు నడిచింది. అతడూ అటువైపుకి రెండు అడుగులు వేశాడు.     అతడు పక్క టేబిల్ వద్దకు వచ్చేసరికి అక్కడ కూర్చొని నిద్రకు జోగుతున్నట్టు వున్న వృద్ధుడు-ఇంగ్లీషు కౌబోయ్ పిక్చర్ లోలా- హాట్ కాస్త పైకెత్తి గొణుగుతున్నట్టు "కంగ్రాచ్యులేషన్స్" అన్నాడు.     వేణు పెదాలు కదిల్చీ కదల్చకుండా "థాంక్స్" అంటూ ముందుకు సాగిపోయాడు.                                                                       5     "నాకు అర్ధం కావటంలేదు" అన్నాడు వేణు. "ఆమె ఎందుకలా ప్రవర్తించిందో.... అంత చనువు ఎందుకు ప్రదర్శించిందో...."     "నాకూ నిన్నరాత్రి అర్ధంకాలేదు" అన్నాడు ప్రసాదరావు. "....కానీ రాత్రి రూమ్ కి వచ్చాక ఆలోచిస్తే అర్ధమయింది."     "ఏమిటి?"     ప్రసాద్ తో గొడవవల్ల ఆమె మానసికంగా బాగా కృంగిపోయింది. అటువంటి పరిస్థితులలో మనుష్యులు, ముఖ్యంగా ఆడవాళ్ళు ఏ చిన్న ఆధారం దొరికినా చాలనుకుంటారు. నిన్న రాత్రి అది కలిసొచ్చింది. ఇక కథ కలయిమాక్స్ కి వచ్చేసినట్టే...."     "క్లయిమాక్సుకా?"     "ఆఁ! అవును.... ఆమె వంటరితనం ఫీలింగ్ నిన్నరాత్రి నువ్వు చాలా బాగా ఉపయోగించుకున్నావు. నువ్వు ఏం మాట్లాడతావా, ఆ పరిస్థితిని ఎలా హాండిల్ చేస్తావా-అని కంగారుపడ్డాను. చక్కగా నటించావు."     'అది నటనకాదు. ఆ క్షణంలో తనూ అలాగే ఫీలయ్యాడు' అని చెప్పాలనిపించింది కానీ మాట్లాడలేదు.     ప్రసాదరావు కొనసాగించాడు. "దీనికంతటికీ చాలాకాలం పడుతుందనుకున్నాను. నువ్వింకా జగపతిరావు ఇంట్లో చాలాకాలం పని చెయ్యాలనీ, ఆమెకి క్రమక్రమంగా దగ్గిరవ్వాలనీ, చెయ్యవలసింది ఎంతో వుందని అనుకున్నాను. నాకు కొంత అనుమానంగానే వుండేది. ప్రేమలాంటి అమ్మాయిలు ఎంత ప్రేమలోపడ్డా, పెళ్ళికిముందే శారీరకంగా దగ్గరవ్వటానికి వప్పుకుంటారా అని! కాని అదృష్టం మనని ఈ గోవా ప్రయాణ రూపంలో వరించింది. ప్రసాద్ మధ్యలో తప్పుకోవటం కూడా అదృష్టమే!     వేణూ! ఇక నీదే ఆలస్యం. ఇనుము వేడిగా వున్నప్పుడే వంగుతుంది. ఆమె మానసికంగా ఇలా బలహీనంగా వున్నప్పుడే మన పని సులవవుతుంది. అందుకే ఈ రాత్రికే...."     వేణూ అదిరిపడి, "ఈ రాత్రికా!" అన్నాడు.     "అవును, ఈ రాత్రికే. మనం వేస్తున్న ఈ మాస్టర్ ప్లానుతో ఈ కథ ఈ రాత్రికి ముగింపుకి వచ్చేస్తుంది."     "ఏమిటా మాస్టర్ ప్లాన్?"     ప్రసాదరావు చెప్పటం ప్రారంభించాడు.     "చక్కటి సాయంత్రం!"     పడమటివైపు కృంగిపోతున్న సూర్యుడు ఆకాశం కాన్వాస్ మీద కుంచెతో అందంగా ఎరుపురంగు దిద్దుతున్నాడు. గోవా ప్రత్యేకత ఏమిటంటే, ప్రొద్దున్నా సాయంత్రం కూడా గాలి సముద్రం మీదనుంచే భూమి మీదకు వస్తూ వుంటుంది.     కారు నెమ్మదిగా వెళుతూంది. కానీ బలంగా వీస్తున్న గాలికి ఆమె ముంగురులు చెంపలమీదుగా మెడపైన జీరాడుతున్నాయి. విండో మీద మోచెయ్యి ఆన్చి అరచేతిలో గెడ్డం పెట్టుకుని కనురెప్పలు ఆర్పకుండా ఆమె బైటకి చూస్తూంది. ఆ భంగిమ ఎంతో ముగ్ధమనోహరంగా వుంది.     వేణూ కూడా తొందరేమీ లేనట్టు తాపీగా డ్రైవ్ చేస్తున్నాడు. అతడి మనసంతా ఉత్సాహంతో నిండి వుంది.     ఆ రోజు చాలా మంచిరోజు.     మధ్యాహ్నం కాంట్రాక్టుమీద సంతకాలు జరిగినయ్. అతడి మాట మీద ఆమె వుండిపోవటం మంచిపనే అయింది.     వీళ్ళు చెప్పిన ధరకి అవతల పార్టీ ఇష్టపడటమే కాక వీలయితే కాంట్రాక్టుకన్నా ఎక్కువ సరుకు తీసుకుంటామని అన్నారు. ఇటువంటి అవకాశం మళ్ళీ రాదని అతడు జగపతిరావుకు ఫోన్ చేద్దామనుకున్నాడు.     ప్రేమ అక్కరలేదంది! ఒకరి తరపున ప్రతినిధిగా పంపించినప్పుడు ఆ మాత్రం నిర్ణయం తీసుకునే హక్కు అతడికి ఎప్పుడూ వుందని వాదించింది. చివరికి అతడు మామూలుకన్నా మూడింతలు ఎక్కువ సరుకు పంపేటట్టు కాంట్రాక్టు వ్రాసేరు. ఆమె సంతకం పెట్టింది.     తన నిర్ణయంమీద ఆమె అంత నమ్మకముంచినందుకు అతడికి సంతోషం వేసింది. కానీ ఎక్కువ సంతోషాన్నిస్తున్న విషయం అదికాదు. తను కోరగానే ఆమె ప్రయాణం ఆపుచేసుకుని వెళ్ళకుండా వుండిపోవటం ఆప్యాయత చాలా చిన్న విషయాలద్వారా ప్రకటింపబడుతూ వుంటుంది. నిద్రలేని రాత్రులు-బర్త్ డే బహుమతులే అఖ్కరలేదు.     కారు సముద్రపు అంచునే రోడ్డుమీద సాగిపోతూంది.     "నాకేమనిపిస్తుందో చెప్పనా!" నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ ఆమె అంది.     "ఏమనిపిస్తూంది?"     "ఇలాగే ప్రయాణిస్తూ ఈ సముద్రపు చివర ఎక్కడుందో కనుక్కోవాలనిపిస్తూంది."     అతడు నవ్వేడు.     ఆమె అంతలోనే- "ఈ లోపులో సముద్రాన్ని వదిలేసి రోడ్డు పక్కకి వెళ్ళిపోతుంది" అంది.     "వెళ్ళదు పందెం కడదామా కావాలంటే?"     "ఏమిటి పందెం?"     "కార్లో పెట్రోలు అయ్యే లోపులో రోడ్డు సముద్రాన్ని వదిలేస్తుందని నువ్వూ, పక్కనుంచి వెళుతుందని నేను."     "పెట్రోలు అయిపోతే వెనక్కి ఎలా వస్తాం?"     "చూసేవా! ఎంత భయపడుతున్నావో...."     "నేనేం భయపడటంలేదు" ఉక్రోషంగా అంది.     "సరే, పందెమా?"     "ఏమిటి పందెం?"     "ఓడిపోయినవాళ్ళు, గెలిచినవాళ్ళు ఏం అడుగుతే అది ఇవ్వాలి."     "సరే!"     కారు సముద్రం పక్కనుంచి వెళుతూంది.
24,770
    "ఎక్కడికే బయల్దేరావ్ ముసల్దానా?" అంది కామాక్షి కఠినంగా. నోటివెంబడినిప్పులు కక్కుతున్నట్లు వస్తున్నాయి ఆమె మాటలు.     నిజంగానే ఆ సమయంలో ఆ వైర్లలో నుంచి ఛక్ ఛక్ ఛక్ మని ఎలక్ట్రిక్ స్పార్క్ లు వెలువడ్డాయి.     భయకంపితురాలయిపోయింది అహల్య. "నన్ను....నన్ను క్షమించండి!" అంది తడపడుతూ.     "క్షమించడమానిన్నా!" అని మళ్ళీ విరగబడి నవ్వారు సృజనా, కామాక్షీ. నవ్వుతూ తీగెల్లాగా ఊగిపోయారు మళ్ళీ.     కళ్ళు మరింతగా మసకలుకమ్మాయి అహల్యకి. కళ్ళు మరింతగా చిట్లించి చూసింది.     ఇప్పుడు ఆమెకి సృజనా, కామాక్షీ కనబడటంలేదు. కేవలం రెండు ఎలక్ట్రిక్ వైర్లు కనబడ్డాయి. అంతే!     ఏదీ! సృజన ఏదీ! ఇప్పటి దాకా ఇక్కడే కనబడింది కదా! ఇప్పుడు కనబడదేం! తన కళ్ళే తననిమోసం చేస్తున్నాయా?     అప్పుడు మళ్ళీ వినబడింది సీత గొంతు. "ఎక్కండి నాన్నగారూ!" అంటోంది.     ఆగొంతు నిజంగా సీత గొంతేనా?లేకపోతే అదీ తన భ్రమేనా? సీతా వాళ్ళ నాన్న నిజంగా వచ్చారా?     ఆరాటంతో అల్లాడిపోతోంది అహల్య అంతరంగం.     కారు ఇంజన్ స్టార్టు అయిన శబ్దం వినబడింది.     అంటే..సీతవాళ్ళ నాన్నతో కలిసి వెళ్ళిపోతోందా? ఇంతదూరం వచ్చితనని చూడకుండానే వెళ్ళిపోతోందా? ఇంతకంటే గుండెకోత వేరే ఏదన్నా ఉంటుందా?     మనసు ముక్కలు ముక్కలు చెక్కలైపోతున్నట్లు అనిపించింది అహల్యకి.     "సృజనా!" అని కేకపెట్టింది హృదయవిదారకంగా. సీత తనపిలుపు వినాలి విని తిరిగిరావాలి?     కానీ ఆమె పెట్టిన పెనుకేక ఆమె పెదవులు దాటిబయటకు రానేలేదు. అప్పటికే మాటపడిపోయింది ఆమెకి.     బయటకారు కదిలిన శబ్దం.     తనకు కనబడకుండానే సృజన వెళ్ళిపోతోందేమోననే ఆలోచనే అహల్యకి అంతులేని తెగువనీ, ఎక్కడలేని శక్తినీ ఇచ్చింది. లేచి నిలబడింది తను.     ఎదురుగా వేళ్ళాడుతున్న లైన్ కరెంట్ వైర్స్ ని లెక్కచెయ్యలేదు ఆమె. సృజనని చూడాలి. అదొక్కటే ఆమె మనసులో మెదులుతోంది.     బయటకు అడుగుపెట్టింది అహల్య.     ఆమెకోసమే కాచుకుని ఉన్న కాలసర్పాలలా వెంటనే ఆమె కాళ్ళని చుట్టేసుకున్నాయి కరెంటు తీగెలు. సృజన, కామాక్షి ఆ  ఇంట్లోనుంచి బయటకు రానివ్వకుండా తనని పట్టుకున్నట్లు! ఆ షాక్ కి గజగజగజ లాడిపోయింది అహల్య శరీరం. క్షణాల్లో ఆమెకాళ్ళు చచ్చుబడిపోయాయి.     మళ్ళీ భ్రమ. ఆ భ్రమలో ఒక దృశ్యం.     తన పరిస్థితి చూసి విరగబడినవ్వుతోంది కామాక్షి. "నా కాలిబొటన వేళ్ళునరికితే నాకెంత బాధ కలిగి ఉంటుందో నీకిప్పుడు తెలుస్తోందా?" అని అంటోందా కసిగా.     ఇదంతా చూస్తూ కూడా సృజన తన సాయానికి రాకుండా నిర్లిప్తంగా నిలబడి ఉంది.     తనుచేసిన, తను చేయించిన పాపాలజాబితా అంతా ఆ చివరిక్షణాల్లో ఒక్కసారిగా గుర్తువచ్చింది అహల్యకి. తనచేతుల్లో చిక్కిబుగ్గి అయిపోయిన వేవేలకన్నెపిల్లల బతుకులు గుర్తువచ్చాయి. వాళ్ళ ఆర్తనాదాలూ, శాపనార్దాలూ వేవేల ఒల్టుల విద్యుత్ గా మారి తనని భస్మం చేస్తున్నట్లు భావన కలిగింది.     విలవిల్లాడుతూ, దారుణమైన బాధ అనుభవిస్తూ ఆ ఇంట్లోనుంచి బయటకు రాలేక, ఆ గుమ్మంమీదే విరుచుకుపడిపోయింది అహల్య.     క్షణాలలో కమిలిపోయింది ఆమె శరీరం చూస్తూవుండగానే మాడిపోయింది.     చనిపోయే చివరిక్షణం ఆమె మనసులో మెదిలిన చివరి ఆలోచన---     "నిన్ను చూడలేకపోయాను సృజనా!"     వ్వవ్వవ్వ     టాక్సీవెళుతున్నంతసేపూ ఆపకుండా ఏదేదో చెబుతూనే ఉన్నాడు రమణమూర్తి.     ఉన్నట్లుండి డ్రైవర్ తో అన్నాడు ఆయన "ఇక్కడ ఆపు"     టాక్సీ ఆగింది.     "దామ్మా! దా! దిగు" అన్నాడు రమణమూర్తి తను ముందు దిగుతూ.     సంకోచంగా దిగింది సీత.     అమ్మ నీ! సంజయ్ నీ, స్పందననీ చూడబోతోంది తను!"     ఇప్పుడు పద్దెనిమిదేళ్ళ తర్వాత!     ఆమె మనసు ఉద్వేగంతో నిండిపోయింది.     కిందికిదిగగానే గబగబ నాలుగు అడుగులు వేసి, ఒకచోట ఆగాడు రమణమూర్తి తర్వాత ఎలుగెత్తిపిలిచాడు. "జానకీ! ఓ జానీ! చూడు ఎవరొచ్చారో?"     తెల్లబోయితండ్రివైపు చూసింది సీత. ఆయన నిలబడి ఉన్నది తమ ఇంటిముందు కాదు. అది ఒక కిరాణా షాపు. ఒకప్పుడు ఆ స్థలంలోనే తాము అద్దెకి వున్న ఇల్లు ఉండేది.     ఎందికిలా ప్రవర్తిస్తున్నారు ఆయన? జరుగుతున్నదంతా అర్ధమయీకానట్లే ఉంది సీతకి. దిగులుగా అయిపోయింది ఆమె మనసు.     "జానీ! సృజన వచ్చింది! త్వరగా రా! అన్నం ఉడికిందా? తొందరగా పెట్టేయ్ సృజనకి! స్కూలు టైమవుతోంది? నేను స్కూటర్ మీద దిగబెట్టివచ్చెయ్యనా?" అంటున్నాడు రమణమూర్తి.     ఆ కిరాణా షాపులో ఉన్నవాళ్ళందరూ ఆయనవైపు వింతగా చూస్తున్నారు.     వాళ్ళెవ్వరినీ పట్టించుకోలేదు రమణమూర్తి షాపులోపలికి వెళ్ళిపోయి సామానులు అమర్చివున్న షెల్ఫుమీద తలుపుకొడుతున్నట్లు దబదబ బాదాడు.     జానీ! ఒజానీ! సృజన వచ్చిందంటే వినిపించుకోవేం! స్కూలుకి టైమయిపోతోంది! తలుపు తెరు! తొరగా!     ఆయన అలా కొట్టడంలో షెల్పు తాలూకు అద్దాలు పగిలాయి. సామాన్లు కొన్ని ధనధన కిందపడిపోయాయి.     షాపు ఓనరు కోపంగా లేచివచ్చి రమణమూర్తి మెడమీద చెయ్యి వేశాడు. "బయటకు నడవరా పిచ్చి వెధవా! నడవమంటుంటే! ఈ సారి మళ్ళీ వచ్చి గోల చేశావంటే, పీక పిసికేస్తాను! పదపద!" అని అదిలించి బలంగాతోశాడు.     ఆ విసురుకి వెనక్కి వచ్చి సీతకాళ్ళ దగ్గరపడ్డాడు రమణమూర్తి. తర్వాత తల ఎత్తి జాలిగా ఆమె మొహంలోకి చూశాడు.     "చూడమ్మా నీకు స్కూలుకి టైమయిపోతుందనేకదా నా తొందర! మీ అమ్మ ఎంతకీ తలుపు తియ్యకపోతే ఎట్లా? స్నానం చేస్తోందేమో? ఉండు! వెనకవైపు తలుపుతీసి ఉందేమో చూసివస్తాను" అని లేచి అటు వెళ్ళబోయాడు.     సజలనయనాలతో ఆయనను నివారించింది సీత.     "వద్దునాన్నగారూ! రండి వెళ్దాం!"     ఆయన విస్తుబోయి చూశాడు.
24,771
    "ఛ.....ఛ....నేనలా అనలేదు .దేన్నయినా సక్రమమైన మార్గంలో సాధించమని...."      " మీ నాన్న సంపాదన అంత సక్రమమైన మార్గంలో నే వ్చచిందా "      "బాలూ!"     " ఎందుకా ఉలకిపాటు.!"      "నీ  ఆలోచనకు....."     " నా ఆలోచనకు  నువ్వేం సానుభూతి చూపవద్దు. నాకు తెలుసు సక్రమ మార్గంలో యెవరూ, దేన్నీ సాధించలేరు."     " మీ మూర్ఖత్వానికి జవాబు లేదు."     "  మీది న్యాయం , నాది మూర్ఘత్వం అంటే నేను చెప్పేదేంలేదు."     సిద్దార్ధ ఆలోచిస్తూ  నిలబడిపోయాడు.      " రండి. రిక్షా వచ్చింది." శ్వేత పిలిచింది.      బాలరాజుకు చేయూతనిచ్చి లేపి రిక్షాలో కూర్చోబెట్టాడు.         " నీ ఆలోచనలు దారుణమైనవి. బాలూ! మరొక్కసారి ఆలోచించు"అన్నాడు భుజం తట్టి రిక్షా వెళ్ళిపోయింది.         " యెలా ఉంది లైఫ్!" శ్వేత నవ్వింది.      " మీకు నవ్వు వస్తుందా!"      "నవ్వక చేసేదేముంది! ఈ జనం  అమాయకులా అతితెలివి మంతులా అర్ధం కావటంలేదు."అన్నది .ఇద్దరూ నడిచివస్తుంటే దారిలో ఒక గ్రేప్ గార్డన్ కనిపించింది.         అక్కడ గుజరాతీలు రాళ్ళలో డబ్బులు గుప్పారు. ద్రాక్షతోటలు వేసారు. ప్రతీ తోటలో ఒకబంగఏళా కట్టుకున్నారు.      ఒక తోటముందు పచ్చికలో కూర్చున్నారు. మిగిలిన టీ రెండు భాగాలుచేసి ఒకటి సిద్ధార్ధకు యిచ్చింది. ప్లాస్క్ తోనే తను త్రాగేసిందామె.      రెండు గ్రుక్కలే అయినా అతనికెంతో రిలీఫ్ నిచ్చింది.     ఆమె యెటో చూస్తూ ఆలోచిస్తుంది.      "ఏమాలోచిస్తున్నారు!"     "మన సమాజంలో స్త్ర్రీ , పురుషులిద్దరూ,ఇద్దరు పరుషుల్లాగా, స్త్ర్రీలలాగా కలిసి ఉండలేరా!"     "అంటే-"     "సెక్సువల్ ఇన్వాల్వ్ మెంటు లేకుండా."     అతని ముఖం ఎఱ్ఱబడింది.      "ఆకర్షణ నుండి  తప్పించుకోవటం కష్టం అనుకుంటాను."      "  అకర్షణ ప్రతీ స్త్ర్రీ, ప్రతీ పురుషుడి మధ్య ఉంటుందనుకోను."     " మీ ఉద్దేశం!"     " కనిపించిన ప్రతి స్త్ర్రీ ని చూడగానే హృదయం స్పందిస్తుందా!"      " ఉహు! "     "ఉత్తమ పురుషుడు యెప్పడూ స్పందించడు. కనిపించిన స్త్ర్రీఅల్లా కావాలనుకోవటం రాక్షసత్వం."      " నాకీ విషయాలు యెందుకు చెబుతున్నారు. "     " మీ ఇంట్లో మీకు ప్రత్యేక మైన గుణం వచ్చింది కాబట్టి చర్చించాల్సివస్తుంది" అన్నది నవ్వుతూ.          అతను అది అభినందనో, వెటకారమో తెలియక తల ఎత్తాడు.     ఆమె ముఖం కాంతివంతంగా వుంది. సిద్ధార్ధనే సూటిగా చూస్తుంది. ఆచూపులను తట్టుకోలేకపోయాడు.      అభినందనలే.....      చందనకు కుసుమ పరిమళాలే-      అది తోట కాకపోతే,చుట్టూ జనం లేకపోతే ఒక్కసారి ఆమెను ఎత్తి గిరగిర తిప్పేవాడే.      " ఏమిటి  నేను అతిశయోక్తి మాట్లాడానా!"
24,772
ఆ వెలుగులో, తనవాళ్ళు కొందరు సీట్లకి అడ్డదిడ్డంగా, కొందరేమో సీట్ల మధ్య ఇరుక్కుపోయి, కానరావటంతో మళ్ళీ ఆడవాళ్ళంతా వక్కసారిగా గొల్లుమన్నారు. ఆ వెలుగులోనే వాళ్ళవాళ్ళని పైకి తీయటానికి ప్రయత్నించారు. అగ్గిపుల్ల ఆరిపోయింది. అతను రెండో అగ్గిపుల్ల వెలిగిస్తూ "మీ దగ్గర అగ్గిపెట్టె వుంటే బయటకి తియ్యండి. ఇంక నా అగ్గిపెట్టెలో నాలుగే పుల్లలు వున్నాయి" అంటూ ముందు జాగ్రత్తతో చెప్పాడు. దురదృష్టమేమిటంటే, ఆ బస్సులో ఎక్కినవాళ్ళ ఎవరి జేబుల్లో అగ్గిపెట్టెగాని, సిగరెట్ లైటర్ గాని లేవు. నిండు అగ్గిపెట్టె ఒకతని జేబులో మాత్రం వుంది. అతనెవరో కాదు, ఆ బస్సు డ్రైవరే. అతని ప్రాణాలు అంతక్రితమే అనంత వాయువుల్లో కలిసిపోవటం వల్ల తన జేబులో అగ్గిపెట్టె వుందని చెప్పే అవకాశం అసలే లేదు. మోహన్ రావుకి మంచి ఆలోచన వచ్చింది. "ఏవండీ మీరొకసారి ఇలా వచ్చి మరో అగ్గిపుల్ల వెలిగించి ఇక్కడ చూపిస్తే నా బ్యాగ్ ఎక్కడ వుందో చూస్తాను." మోహన్ రావు మాట పూర్తి చెయ్యక ముందే మరొక ఆయన గయ్యిన లేచాడు. "చాలు చాల్లేవయ్యా చస్తూంటే సందె మంత్రం అంట. అలావుంది నీ వరస. ఇక్కడ చావు బ్రతుకుల్లో ఉన్నవాళ్ళ సంగతి చూడాల్సింది పోయి బ్యాగ్ కనపడలేదు వెతుక్కుంటానంటా వేమిటి?" "బ్యాగ్ వెతుక్కోటానికి కాదండీ అగ్గిపుల్ల వెలిగించమంది, నా బ్యాగ్ లో టార్చిలైటు వుంది. బ్యాగ్ కనపడితేకాని, టార్చిలైటుని తియ్యటానికి వీలుకాదు." అంటూ వివరించాడు మోహనరావు. "టార్చిలైటులో బ్యాటరీలు వున్నాయా?" అంత ప్రమాదంలో కూడా కొంటె కుర్రాడెవరో పెద్ద కంఠం వేసుకుని మరీ అడిగాడు. "క్రొత్త టార్చిలైటు అది నిక్షేపంగా వెలుగుతుంది." మోహనరావు చెప్పాడు. చేతిలో అగ్గిపెట్టె వున్న తను మూడో అగ్గిపుల్ల వెలిగించి మోహనరావు దగ్గరకి వచ్చాడు. నాలుగో అగ్గిపుల్లా, ఐదో అగ్గిపుల్లా ఖర్చు అయ్యాయి. అప్పుడు కనిపించింది మోహనరావు బ్యాగ్ సీటు క్రిందకి పడివుంది ఆ బ్యాగ్. మోహనరావు బ్యాగ్ అందుకున్నాడు. ఆ చీకట్లోనే బ్యాగ్ లోకి చెయ్యి పోనిచ్చి, బ్యాగ్ లో వున్న వస్తువులని అటూ ఇటూ కెలికి మొత్తానికి టార్చిలైటుని పట్టుకో గలిగాడు. మరో నిమిషంలో, టార్చిలైటు ప్రకాశవంతంగా వెలిగింది.                                       18బస్సు అంత ప్రమాదానికి లోను అయినా, బస్సులో వున్న కొందరు చాలా చిన్న చిన్న గాయాలతో క్షేమంగానే వున్నారు. అయితే, బాగా వున్నవాళ్ళు ఎనిమిది మంది, గాయాలు తగిలినవాళ్ళు నలభై ఎనిమిది మంది. ఆ నలభై ఎనిమిది మందిలో ఏడెనిమిది మంది అప్పటికే మరణించి వున్నారు. పది మంది స్పృహ లేకుండా పడివున్నారు. మిగతావాళ్ళు చేతులు విరిగి కాళ్ళు విరిగి పూర్తిగా పైకి లేవలేని పరిస్థితిలో కొందరు మూలుగుతూనూ, కొందరు బాధ భరించలేక ఏడుస్తూనూ వున్నారు. అక్కడికి, సమయానికి ఏ దేముడూ వచ్చి రక్షించలేక పోయినా, మోహనరావు చేతిలోవున్న టార్చిలైటు వాళ్లకి వెలుగు చూపటానికి ఆధారమయింది. బాగా వున్నవాళ్ళు చకచకా రంగంలోకి దిగారు. మోహనరావు కుడిచేతికి దెబ్బ తగలటం వల్ల, ఆ చేతిని శరీరానికి గట్టిగా నొక్కి పట్టివుంచి ఎడమ చేతితో టార్చీ వెలిగించి చూపిస్తూ వుంటే బస్సులో వున్న ఒక్కొక్కరినీ బయటకి తీసుకువచ్చి రోడ్డు మీద పడుకోపెట్టటం మొదలుపెట్టారు మిగతా వాళ్ళు.
24,773
ఆ సాయంత్రం ఫోన్ వైపు భయంగా చూస్తూ కూర్చుంది. జీవన్  స్వభావం బాగా తెలిసిన ఆమె అతడు మళ్ళా తప్పకుండా ప్రయత్నిస్తాడని ఎదురు చూడసాగింది.ఆమె అనుమానించినట్లే ఫోన్ మోగింది. ఫోన్ ఐదారు సార్లు రింగ్ అయ్యేవరకు ఫోన్ తియ్యకుండా కూర్చుంది. తరువాత నిగ్రహించుకోవటం ఆమె వశం కాలేదు. వొణికే చేతులతో ఫోన్ తీసి "హల్లో!" అంది అటువైపు నించి వినిపించిన గొంతు ఆ ఆశించినట్లు జీవన్ ది కాదు."నేనమ్మా! గిరీశాన్ని! గుర్తుపట్టావా?" అరిచాడు అటు వైపు నించి.వెంటనే మాట్లాడలేకపోయింది. ఆ గొంతు జీవన్ ది కానందుకు తనకి కలిగిన ఆశాభంగానికి, తనే ఆశ్చర్యపోయింది. ఇంకా ఎంత ప్రేమిస్తోంది అతన్ని."ఏమ్మా! మాట్లాడవు నన్ను గుర్తు పట్టలేదా? మీ అయన స్నేహితున్ని మీ యింటికి రెండు మూడుసార్లు భోజనానికి కూడా వచ్చాను. ఇంట్లో పార్టీలు కుదరవని నువు విసుక్కున్నావు గుర్తొచ్చిందా?"అతని మాటలకి నవొచ్చింది ఆమెకి మనషులు యింత కలగలుపుగా ఎలా వుంటారో.ఇతడిలో అనేక లోపాలు ఆమెకు తెలుసు కాని యీ బోలతనంలో కుత్సితుడిలా కనిపించక కులాసా మనిషిలా తోస్తాడు. అతడు మాట్లాడుతున్నంత సేపూ అతని బలహీనతలు గుర్తురావు. నవులజల్లుల్లో ఎగిరిపోతాయి."గుర్తుంది ఏమిటి విశేషం? ఎక్కడ్నుంచి ఫోన్ చేస్తున్నారు?""హైదరాబాదు నుంచే ఒక ధర్మసంకటంలో పడ్డానమ్మా! నీ సలహా కావాలి.""హైదరాబాదు నుంచి ఇక్కడికి ఫోను చేసి అందుకోవలసిన సలహా ఏమిటండి?""ఓ రహస్యం ఉంది. చెప్తే జీవన్ కి ద్రోహం చెసినట్లవుతుంది. చెప్పకపోతే ఒక ఉత్తమ యిల్లాలికి- అంటే నీకు అన్యాయం జరిగిపోతుంది. ఏం చెయ్యమంటావు?" అణులో ఉత్కంట పెరిగింది. జీవన్ తల్లి, అక్క అతణ్ణి బలవంత పెట్టి రెండో పెళ్ళికి వోప్పిస్తారేమో అనేదే ఆమె భయపడే విషయం."జీవన్ మళ్ళీ పెళ్ళి చేసుకోబోతున్నాడా?""అయ్యాయ్యో! కాదమ్మాఇది అంతకంటే చాలా ఘోరమైన విషయం. చెప్పడానికే నోరు రావడం లేదు.""చెప్పండి చంపక" భరించలేక విసుక్కుని గభాల్న నాలిక్కరుచుకుంది."నిన్ను చంపకుండా వుండటానికే ఫోను చేస్తున్నానమ్మా! నేని విషయం చెప్పకపోతే నువు నిజంగా చచ్చిపోయే ప్రమాదం వుంది."మరోసారి చెప్పండి అని అడగలేదు అణు ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని కూర్చుంది.ఒక నిమిషం చూచి గిరీశం తనే చెప్పాడు.మీ అయన నీ కూతుర్ని కిడ్నాప్ చేసి తీసుకురమ్మని ఒక గుండాని పంపాడు. అతడు చైల్డ్ రేపిస్ట్. విషయము ముందుగానే చెప్తే నీ జాగార్తలో నువు వుంటావని...."అణుచేతిలో నించి రిసీవరు జారిపోయింది. అటువేపు నుంచి గిరీశం "హల్లో! హల్లో!" అని అరుస్తున్నా ఆమె పట్టించుకోలేదు. జీవన్ ఎందుకిలా వేధిస్తూన్నాడు తనని. అంత మహాపదాధంయేం చేసింది? ఆమె ఆలోచనలు పదేళ్ళు వెళ్ళాయి. అంగవైకల్యం కలిగిన శిశువులకు శిక్షణ యివటం కోసం నడుపుతున్న పాఠశాల అది, తిరుపతి దేవస్థానం వారి ఎడ్మినిస్ట్రెటివ్ ఆఫీసు పక్కనున్న బహిరంగస్థలంలో ఆ పాఠశాల సహాయార్ధం అణువేద నృత్య ప్రదర్శన ఇస్తోంది. విధివశాన శారీరక వైకల్యాలు వచ్చినా మానసికంగా చెదిరిపోకుండా రకరకాల వ్యాపకాలతో ఎంతో యాక్టివ్ గా కాలం గడువుతున్న పాఠశాలలో బాలబాలికలు అన్ని దశల వాళ్ళు వచ్చి వాళ్ళ వాళ్ళు టిచర్ల గైడెన్సు లో ముందు వరుసల్లో కూర్చున్నారు తెర వెనుక నుంచి లాల్ గుడి జయరామన్ తిల్లానా మంద్రస్వరంలో వినిపిస్తుండగా తెరపైకి లేచింది. భరతనాట్య భంగిమతో అణువేద సభకు నమస్కరించగానే సభలో కరతాళధ్వనులు మారుమ్రోగాయి. చక్కని అంగ సౌష్ఠవం , కధలు చెప్తున్నట్లనిపించే ఆకర్షనీయమైన నల్లని కళ్ళు , అపురూపమైన నృత్యాభినయం, పరవశించిపోయారు ప్రేక్షకులు.మొదట తిల్లానా తరువాత త్యాగరాజు కృతి, తరువాత ఒక దేశభక్తి గీతం అభిన్యించింది. ప్రేక్షకులలో ప్రతి ఒక్కరి హృదయంలోను ముద్రితమై పోయాయి. ఆమె అభినయ భంగిమలు. ప్రదర్శన ముగిసిం తరువాత అలంకరణతోనే స్టేజి దిగివచ్చి వికలాంగులైన బాలబాలికలను ఒక్కొక్కరిని ప్రేమగా భుజంతట్టి పలకరించింది. పొంగిపోయాయి ఆ బేల మనసులు. ఉహల్లో వుండే స్వర్గాదిపత్యమేదో తమకు అబ్బినంతగా ఉప్పొంగిపోయారు. పెద్ద పెద్ద వెళ్లేందరో ఆమెను పలకరించాలని, ఆమెను ఆహ్వానించాలని ప్రయత్నించారు. కానీ ఆమె మాత్రం బాలబాలికలందరిని పలకరించే వరకు మరేవరిని తలెత్తి చూడలేదు. వికలాంగ బాలిబాలికలతో మాట్లాడటం పూర్తి చేసాక వాళ్ళ ముఖంలో చిరునవులను సంతృప్తిగా చూసుకున్నాక అపుడు తిరిగింది పెద్దలవైపు.అక్కడ చేరిన వారిలో ప్రతిఒక్కరు తమ హొదాలు చాటుకోవడానికి రకరకాలుగా తాపత్రయపడుతున్నారు. బంగారు చైన్ వున్న ఖరీదైన ఫేవర్ లూ చేతిగడియారం ఒకడు పైకి కనబడేలా చెయ్యి జాపాడు. మెడలో రవల లాకెట్ వున్న గోల్డ్ చైన్ సిల్కు లాల్చిలోంచి బయట పడేసుకున్నాడు మరో పెద్దమనిషి పొందురు జారీ అంచు ఖద్దరు పంచె పైన అత్తాకోడళ్ళ జరి కండువాను దర్జాగా సర్దుకున్నాడొక ప్రజానాయకుడు.     అణువేదకి అందరి ముఖాలు ఒకేలాగా కనిపించాయి. గాజు బొమ్మని చూసినట్టు అందరిని చూస్తూ చిరు నవుతో చేతులు జోడించి ఒకరికి తనతో మాట్లాడే అవకాశం యివ్వకుండా వచ్చి కారులో కూర్చుంది. కారు హొటల్ భీమాస్ చేరుకుంది.అక్కడే ఆమె బస. తన గదిలోకి వెళ్లి వేషం మార్చుకుని స్నానం చేసి నిరాడంబరంగా తయారై చదువుకుంటూ కూర్చుంది. అన్నీ చోట్లా ఎల్లవేళలా ఆమెని కని పెట్టుకునుండే ఆమె ఎటెండరు కోసల్య తలుపు దగ్గర కూర్చొని ఆరోజు అణువేద అభినయించిన దేశభక్తి గీతం కూనిరాగాలు తీస్తోంది."లోపలికి రావచ్చునా?" వినిపించింది హైమవతి గొంతు. చదువుతున్న పుస్తకం మూసేసి 'రా! నీ కోసమే యెదురు చూస్తున్నాను,' అంటూ గుమ్మం దగ్గరికి యేదురొచ్చి చటుక్కున ఆగిపోయింది అక్కడ. హైమపక్కన ఆజానుబాహువైన మరొక యువకుడున్నాడు. వేష భాషలు చూస్తే పాతకాలపు యువరాజావారిలా వున్నాడు. చుడిదార్ పైజమా, మోకాళ్ళు దిగిన పొడుగు చేతుల సిల్కు లాల్చి, రాజసం ఉట్టిపడే విశాలమైన కళ్ళు, ఆకర్షణియమైన చిరునవు. హైమ వైపు చూసి మొహం చిట్లించింది. కంగారు పడిపోయింది హైమా. అణువేద మనసు ఆమెకు తెలుసు బస చేసిన చోటికి మగవాళ్ళని తీసుకు రావడం ఆమె కిష్టముండదు. "సారీ! అణు! నీకు ముందుగా చెప్పకుండా తీసుకొచ్చేశాను. ఈయన ఒకప్పటి చల్లపల్లి జమిందారు గారి మునిమనుమడు. అద్బుతమైన క్రికెట్ ప్లేయర్ ఎం. ఎస్ సి. పాసైయ్యారు. మా పాఠశాలకి ఇరవైవేలు విరాళంఇచ్చారు. నిన్ను కలుసుకుని నీతో మాట్లాడుతానంటే తీసుకొచ్చాను." గబగబా చెప్పింది హైమా. హైమ వికలాంగుల పాఠశాలలో టిచరు అణువేదకి చిన్నప్పటి క్లాస్ మేట్, ఫ్రేండు.
24,774
    మేము మున్షీగారి ఉపన్యాసం విందామని వెళ్లాం. నిరాశతో తిరిగి వచ్చాం. పార్టీ నిర్ణయం సరియైంది కావచ్చు. నందిగామలో వారి చర్య నాకు ఏమాత్రం నచ్చలేదు. ఎదుటివానిమాట వినడం ప్రజాస్వామ్యం అవుతుంది. మాట్లాడనీయకపోవడం నియంతృత్వం అవుతుంది. నియంతృత్వం ఏరూపంలో ఉన్నా - ఛాందసం ఏరూపంలో ఉన్నా - ఇవ్వాళ్టికీ - నాకు నచ్చదు!     "పాపీచిరాయుః"     ఇది ఇలా ఉండగా 1947 డిసంబరు 4 న నిజాం నవాబుమీద బాంబు విసిరారు.     నిజాం నవాబు రోజూ నమాజుకు - కింగ్ కోటీనుంచి మక్కా మసీదుకు వెళ్తాడు. అతని వాహనం చేరుకునే దానికి కొంతముందు - పోలీసులు ఒక పక్క ట్రాఫిక్ కాళీ చేయిస్తారు. ప్రభువుల దురహంకారం ఏమంటే - తమ శాసనాలను పాటించరు. నిజాంకారు. ఎడమ భాగంకాదు - రోడ్డుకు కుడి భాగంనుంచి సాగుతుంది.     ఆనాటి సాయంకాలం ముగ్గురు యువకులు - నారాయణరావు పవార్ - గండయ్య - జగదీశ్ నైజాం నవాబును హతమార్చడానికి వ్యూహం ఏర్పరచుకున్నారు. ముగ్గురూ మూడు బాంబులు తీసుకున్నారు. 1. నారాయణరావు పవార్ ఆల్ పెయింట్స్ దగ్గర బాంబు విసరుతాడు. అది తప్పుతే 2. మరికొంత దూరంలో గండయ్య బాంబు వేస్తాడు. అదీ తప్పుతే 3. మరికొంత దూరంలో జగదీశ్ బాంబు విసురుతాడు. ఇదీ వ్యూహం. ఆ సాయంకాలం నిజామును ఖాతం చేయాలని పథకం.     నిజాం వాహనాల బిడారు కింగ్ కోటీనుంచి సాగింది. పోలీస్ విజిల్స్ - జనాన్ని పక్కకు నెట్టడం - హడావుడి ప్రారంభం. బిడారు సాగిపోయింది.     నిజాంకారు ఆల్ సెయింట్స్ ముందుకు వచ్చింది.     పవార్ నిజాం కారుమీద బాంబు విసిరాడు.     బాంబు గురి తప్పింది! కారు తలుపుకు తగిలింది. తుస్సుమన్నది.     డ్రైవరు కారును నిలిపాడు. వెనక్కు తిప్పాడు. నవాబు క్షేమంగా కింగ్ కోటీ చేరాడు. పాపీచిరాయుః.     నారాయణరావును వెంటనే అరెస్టు చేశారు. గండయ్యను మూడు రోజుల తరువాత పాలమాకులలో అరెస్టు చేశారు. అప్పటికే జగదీశ్ నిజాం పొలిమేరలు దాటాడు.     నారాయణరావునూ - గండయ్యనూ సెషన్స్ జడ్జి ముర్తుజాఖాను విచారించాడు. నారాయణరావుకు ఉరిశిక్ష - గండయ్యకు యావజ్జీవ కారాగార శిక్ష విధించాడు.     ఈ ఉదంతం విని అన్నయ్య దాశరథి జైల్లో రచించిన "అగ్నిరసం" -     "ఒక కప్పు అగ్నిరసం త్రాగిన     నారాయణరావ్!     నీ హస్తం విసిరిన రవిగోళం     నరకాసుర మర్దనానికి     నడచిన యాదవ యోధుని     కోదండ వినిర్గత బాణం."     నారాయణరావు - గండయ్యలు శిక్షలు ధృవీకరించకముందే పోలీసు చర్య జరిగింది. వారిని విడుదల చేశారు.     నేను మున్సిపల్ కార్పొరేషనులో పని చేస్తున్నపుడు జగదీశ్ నా ఆధీనంలో పనిచేసే 'కామటి' అంటే కూలి. అది ఆరవ దశకం. తెల్లని కద్దరు బట్టల్తో చిరునవ్వుతూ - చేతులు కట్టుకొని నుంచునేవాడు. జగదీశ్ ను నాతో సమంగా కూర్చోబెట్టుకున్నాను. ఇద్దరం కలిసి చాయ్ తాగాం. అతనికి కూలిపని తప్పించగలిగాను.     బ్యూరోక్రసీని ఉర్దూలో "నౌకర్ షాహీ" అంటారు. అంటే నౌకర్ల రాజ్యం. ఆఫీసరు, గుమాస్తా అందరూ నౌకర్లే! ప్రజా ప్రభుత్వంలో 'ప్రజ' పేరు కే. ప్రభుత్వం కనిపించదు. కనిపించేది నవుకర్ణ సర్కారే!     జగదీశ్ సమారా యోధుల పెన్షనుకు అప్లైచేశాడు.     జేలు సర్టిఫికేటు సమర్పించమన్నారు!     భగత్ సింగ్ తల్లిని కూడా జేలు సర్టిఫికేటు అడిగారట!     మన అధికారులు అంతటి దేశభక్తులు!     నేను రాజ్యంలో ఎక్కడున్నా అరెస్టు చేయమని నిజాం ప్రభుత్వపు హోం సెక్రటరీ వారంటు జారీ చేశారు. నేను అది సమర్పించుకున్నాను. "చెల్లదు" అని జవాబు వచ్చింది!     అనంతరం పెద్దలు గ్రహించారు. జగదీశ్ కు, నాకూ పెన్షను వచ్చింది.     సూర్యబింబం రాలింది:     తుపాకి శిక్షణ పూర్తి చేసుకుని బెజవాడ చేరుకున్నాను. కార్యక్రమం చేపట్టే ముందు కేసరిపల్లి వచ్చాను. అమ్మా - చెల్లెళ్లు బావున్నారు. అమ్మకు - ఏదో బరువు దింపుకున్నట్లనిపించింది. ఉభయ మిత్రులూ వారికి ఎలాంటి లోపం రానివ్వడం లేదు. అన్నయ్య దగ్గరినుంచి అప్పుడప్పుడూ ఉత్తరాలు వస్తున్నాయి.     నిజాం నుంచి బయట పడ్తే ఏదో జేలునుంచి - నిర్బంధం నుంచి - యమకూపం నుంచి బయటపడినట్లుంది. స్వతంత్ర దేశంలో - విశాల ప్రపంచంలో - వెలుగులోకి వచ్చినట్లుంది. ఏదో ఒక రకంగా పోరాటంలో పాల్గొంటున్నామని తృప్తి ఉంది.     ఆర్జించడంలో ఆనందం లేదు.     త్యాగంలో ఆనందం ఉంది.     అది ఇంకెందులోనూ లేదు.     1948 జనవరి 30 శుక్రవారం. మేమంతా ప్రకాశరావు కిళ్లీ బడ్డీమీద కూర్చున్నాం. సాయంత్రపు సోడాలు తాగాం. సిగరెట్లు కాల్చాం. సరదా కబుర్లలో ఉన్నాం.     బస్సు బెజవాడనుంచి గన్నవరం పోతున్నది.     "మహాత్ముని హత్య చేశారు!" బస్సులోంచి కేక వేసి చెప్పారు.     అమాంతంగా నిశ్శబ్దం.         అంధకారం అలముకుంది.     నేను తల బాదుకున్నాను. ఎలుగెత్తి ఏడ్చాను. అందరూ దుఃఖంలోనే ఉన్నారు. ఏడ్చింది మాత్రం నేనే. తల బాదుకొని ఏడ్చాను. నా ఏడుపే ఊరికి ఎరుకపరచింది. అమ్మ పరిగెత్తుకొని వచ్చింది. నన్ను పట్టుకున్నది. తల నిమిరింది. ఓదార్చింది. అప్పుడన్నాను:-     వెలుగులేని లోకంలో     బ్రతికేదెట్లా భాయీ!     ఊరంతా పంచాయితీ రేడియో దగ్గర కూడింది. వార్త అదే. జగ్గయ్య వార్తలు చదివినట్లు గుర్తు. ఖంగుమనే గొంతులో విషాదం!     ఊరు సాంతం మూగపోయింది.     "The light has gone out of our lives" అని - సరిగ్గా నేను తెలుగులో అన్నమాటలే జవహర్ లాల్ నెహ్రూ భారత ప్రధాని - ఇంగ్లీషులో అన్నారు.     ఆ దురంతం చూడలేకపోయాడు. సూర్యుడు అస్తమించాడు. లోకంలో చీకట్లు కమ్ముకున్నాయి! వివరాలు:--     1948 జనవరి 30 శుక్రవారం సాయంత్రం 4.00 గంటలు. సర్దార్ పటేల్ మహాత్ముని దర్శించారు. ఇద్దరూ మాట్లాడుతున్నారు. అయిదు అయింది. ప్రార్థన సమయం. మహాత్ముడు సర్దార్ ను పంపించారు.     మహాత్ముడు గడియారం తీశాడు. చూచారు. 5.10 అయింది. ప్రార్థనకు బయలుదేరారు. మనుమరాళ్లు మను, అభ పక్కన ఉన్నారు. వారు ప్రార్థనాస్థలానికి సాగారు. ఇద్దరు పిల్లలమీద రెండు చేతులు వేశారు. నడిచారు.     మహాత్ముడు కొంతదూరం నడిచారు. ప్రార్థనకు వచ్చిన జనం కనిపించారు. వారంతా నమస్కరించారు. గాంధీజీ పిల్లల బుజాలమీదినుంచి చేతులు తీశారు. చేతులు జోడించారు. ఎల్లరకూ నమస్కరించారు.     అలా సాగుతున్నారు జాతిపిత. అప్పుడు నాధూరామ్ గాడ్సే గుంపును నెట్టుకుంటూ దూసుకు వచ్చాడు. 'మను' గాడ్సేను చూచింది. అతడు బాపూజీకి పాదాభివందనం చేయడానికి వస్తున్నాడనుకుంది. అతని బుజం పట్టుకుంది.     గాడ్సే 'మనూ'ను విదిలించాడు. విడిపించుకున్నాడు.     బాపూజీ ముందుకు వంగారు.     గాడ్సే పిస్తోలుతో బాపూరొమ్ముకు పేల్చాడు.     నమస్కరించడానికి లేచిన బాపూ చేతులు మెల్లగా వాలేయి. గుండు రొమ్ముకు కుడిపక్కన తాకింది!     గాడ్సే వెంటనే మరో రెండు బుల్లెట్లు పేల్చాడు.     మహాత్ముడు కుప్పకూలారు!
24,775
        ప్రభ౦జనరావు అసహనంగా మళ్ళీ పచార్లుచేస్తున్న ఆ సమయంలో ఫోన్ రింగయింది.     రెండు లిప్తాలు గడిచాయి. "ఎస్..... ప్రభంజరావ్ హియర్ ." ఫోన్ చేసింది. ఎవరన్నా కాని ముక్తసరిగా ముగించేద్దామన్నంత ఉద్విగ్నత.     "నేను .... సాకేతని."     ఉలికిపడ్డాడు ముందు. "ఎక్కడున్నుంచి?"     "ప్రస్తుతం సేఫ్ గానే వున్నాను. వేటని తాత్కాలికంగా ఆపేసిందీ. హనిత. అది గ్రహించక ఇప్పుడు ఇంటికి వెళుతూ మీకు ఫోన్ చేసింది. నిజం. వట్టిగా బెదిరించిందేమో ..... నన్నిప్పుడు గూండాలు వెంటాడటం లేదు."     "కావచ్చు సాకేతా! హనిత వ్యవహరదక్షురాలే. తప్ప, హంతకు రాలు కాదు." సరిగ్గా ఈ వాక్యం అంటుండగా ప్రభంజనరావు మెదడులో ఓ ఆలోచన తళుక్కుమంది.     అది క్రమంగా పెరిగి ఆకాశమంత మెరుపై అతన్ని వ్యవహరదక్షుడిగా నిరూపించుకునే అవకాశమిచ్చింది.     "అర్జెంటుగా రాగలవా సాకేతా?"     "ఎందుకు?"     "నీ ప్రత్యర్ధిపైన ఓ అస్రం సంధించే సమయం ఆసన్నమైంది. అందుకు నిన్ను రంగంలోకి దింపాలని ఉంది."     "కొన్ని క్షణాలపాటు నిశ్శబ్దం తరువాత అంది సాకేత __ అర్ధం కావడంలేదు."     "ఇక్కడికొస్తే వివరంగా చెబుతాను."     "ఇప్పుడే రావాలా?"     "ఇప్పుడే ... ఈ క్షణంలోనే!"     "ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు."     "ఎస్ .... ఇప్పుడు నిజంగానే నీ సహాయం మాకు కావాలి."     "మాకూ అంటే?"     "చెబుతాను ప్లీజ్! ఇక్కడికిరా."     "అభ్యంతరంలేదు ప్రభంజనరావ్ . నీతో చేతులు కలుపుతున్నానని తెలిస్తే హనిత మళ్ళీ విజ్రుంభిస్తుందేమో?"     "బెదిరిపోయావా?"     "అదికాదు .... ఎదురుచూస్తున్నాను."     "దేనికి?"     "పగ అన్నది వేడి పానీయ౦లాంటిది . చల్లబడుతున్న కొద్దీ రుచుని పెంచుకుంటుంది."     "అంటే ? నీ పాగని చల్లర్చుకుంటున్నావా?"     "ఆహా .... చల్లబడిందనుకున్నాక పగ తీర్చుకావాలనుకుంటున్నాను. అవును ప్రభంజనరావ్ ! ఏమీలేదని హనిత సైతం అనుకుంటున్న సమయంలో ఓ చావు దెబ్బ తీయడం సమంజసం అనుకుంటున్నాను."     "నీ మేధని శకించడంలేదు. సాకేతా. కానీ ఓ విషయం చెప్పనా? ప్రత్యర్ధి బలాన్ని కోల్పోతున్న సమయంలో పైనబడి ఊపిరి పీలిచుకునే అవకాశమివ్వకపోవడమూ ఓ అద్భుతమైన స్ట్రేటజియే .... హనిత తండ్రి పరిస్థితి బాగైలేదని ఈ క్షణంలో నువ్వు రంగప్రవేశం చేస్తే చాలా మేలు జరిగిపోతుంది నీకూ, నీలాగే హనితకి ప్రత్యర్దులయిన మాకందరికీ."     "వెల్ .... వస్తున్నాను" ఫోన్ క్రేడిల్ చేసిన చప్పుడు.     "ఎవరు?" అడిగారంతా ఒకేసారి.     చెప్పాడు ప్రభంజనరావు. కొందరు నమ్మలేదు. మరికొందరు 'ఒకే పోలికలున్న మరో మనిషి ఉండటమేమిటి' అంటూ విస్మయంగా చూశారు. అంతా నిశ్చష్టులై ఆలోచిస్తుండగానే ప్రభంజనరావు చెప్పుకుపోయాడు.     "వేదకపోయిన తీగ కాలికి తగలడమంటే ఇదే ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు కొన్ని క్షణాలలో ఓ అద్భుతాన్ని చూడటమే కాదు .... చూశాక అవాక్కయిపోతారు....."     "ఒకే పోలికలు౦డోచ్చు. ఉంటే మాత్రం అది మనకే విధంగా ఉపయోగపడుతుంది ?" సత్యానంద్ అడిగాడు.     "చాలా మంచి ప్రశ్న వేశారు మిస్టర్ సత్యానంద్ . ఇన్నాళ్ళూ సాకేత ఉనికి నాకుమాత్రమే తెలిసిన నిజం. ఇప్పుడు మీకూ తెలుస్తూంది. వెంటనే నేను చేయబోతున్నది ఏమిటో తెలుసా?" సాకేతని ఒప్పించి రేపు హనిత స్థానంలో ఫ్యాక్టరీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లో అడుగు పెట్టించడం."     అప్రతిభులై వుంటున్నారంతా.     "మన అభియోగాలకి సంబంధించిన ఫైల్సు. ఆ కేసేట్సు లాంటివన్నీ లాకర్ లో నుంచి తెలివిగా బయటకి రప్పిస్తాను."     "కాని హనిత ...."     "మరో రెండు రోజులదాకా చాంబర్ లో అడుగు పెట్టదు. కారణం తండ్రి ప్రస్తుత పరిస్థితి."     సత్యానంద్ కూట్రాటగా అయిపోయాడు.     "ప్రమాదమమో? అదికాదు, ఎవరయినా గురిస్తే ...."     "గుర్తించే ప్రశ్నేలేదు సత్యానంద్ . అంత పోలికలున్న ఆడపిల్ల సాకేత. ఇక్కడ ఈ రాత్రికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్త హనిత బిహేవియర్ గురించి, తన సబార్డినెట్స్ తో ప్రవర్తించే తీరు గురించి, అక్కడ ఆమె డీల్ చేసే స్టాఫ్ గురించి సాకేతకి వివరంగా తెలియచెప్పడం ఆ మాత్రం చాలు ..... తెలివైన సాకేత ఇమిడిపోతుంది. మన గురించి రహస్యంగా సేకరించిన సమాచారాలున్న ఫైల్సు నెక్ గా తీసి అటు హనిత అట కట్టిస్తుంది."     "కాని తాళాలు ...."     "ఆ డిటైల్స్ నేను చూసుకుంటాను సత్యానంద్ ....." ఉల్లాసంగా నవ్వాడు చాలాసేపటి తరువాత. "ఇక్కడ సాగించబోతున్న మరో అతిముఖ్యమైన ప్రయోగం కిరీటిపైన."     "అదెలా?"     "హనితకి కిరీటి చాల ఆత్మీయుడైనట్టున్నాడు కదూ" అగాడో క్షణం సాలోచనగా "ఇప్పుడు హనిత స్థానంలో వెళుతున్న సాకేతకిరీటిని తెలివిగా రెచ్చగోడుతుంది. ఒక చిత్రమైన ఆహ్వానంతో కిరేటి హనిత దగ్గర తొందరపడేటట్టు చేసి అతని పునాది కదలడానికి ఓ అంకురం వేస్తుంది."     స్పష్టంగా కాకపోయినా కొద్దికొద్దిగా అర్ధమౌతుంది అందరికీ.     హనిత స్థానంలో వెళుతున్న సాకేత కేవలం ఫైల్సు బయటకి రప్పించడమేకాక, కిరీటిని ఓ అసభ్య సన్నీవేశంలోకి తెలివిగా నెట్టి అసలు హనిత ముందు దోషిగా నిలబెడుతుంది.     అదిగో సరిగ్గా అప్పుడు లోపలి ప్రవేశించి౦ది సాకేత.     "వెల్ కం " ప్రభంజనరావు సాదరంగా ఆహ్వానించి ఒక్కొక్కర్నీ పరిచయం చేస్తుంటే అంతా నివ్వెరపోయి సాకేతనే చూస్తున్నారు.     శివరావు మునిపంట పెదవుల్ని కొరుక్కున్నాడు. పోలికలేకాక ఓంపుల్లోనూ హనితలాగే అన్పిస్తున్న సాకేతని చూస్తూ.                                          *    *    *    *        అనంతాకాశంలో ఉద్భవించిన వజ్రకీరటంలా సూర్యుడు మళ్ళీ ఉదయించాడు.     జ్ఞాపకాల ఖజానాలో నుంచి ఒక్కుమ్మడిగా లేచిన స్ప్రుతుల్లా కిరణాలు వాడిగా నేలపైకి ఉబుకుతున్నాయి.     వేనీషియన్ బ్లయి౦డ్స్ దాటినా సూర్యరశ్మి గదిలోకి చొచ్చుకోస్తుంటే రోఫ్ తో ఎడ్జస్ట్ చేస్తూ వెనక్కి తిరిగింది హనిత.     అప్పటికే కళ్ళుతెరిచి ఆమెనే తదేకంగా చూస్తున్నారు. సుదర్శన రావుగారు.     తెల్లవారుతుండగా డాడీని ఇంటికి తీసుకువచ్చిన హనిత అయన అప్పుడే నిద్రలేస్తారనుకోలేదు.     "నిద్రపొండి డాడీ." ఒక పసికందును లాలించే తల్లి గొంతులోని అర్ధ్త్రత హనిత కంఠంలో......     "మనసు బాగోలేదు బేబీ నిద్ర రావడంలేదు."     "ఇప్పుడేంమైందని?" ఆయనకి అభిముఖంగా కూర్చున్నా సూటిగా తండ్రి కళ్ళలోకి చూడలేకపోతూంది. "అసలు మీరు మానసికంగా అలిసిపోయారు డాడీ యూ నీద రెస్ట్ . ఫ్యాక్టరీ వ్యవహారాలు చూసుకోవడానికి నేనున్నానుగా!"     "నేను ఆలోచిస్తున్నది ఫ్యాక్టరీ గురించి కాదు బేబీ. నీ గురించి"     "అయాం క్వయిట్ ఒకే డాడీ " పెదవులమీద నవ్వుతో మనసు లోని అందోళన దాచుకోవాలని ప్రయత్నించింది ఎన్నడూలేనిది రాత్రి నుంచి అయన ప్రవర్తన ఆమెకీ విస్మయాన్ని కలిగిస్తూ౦ది ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నారని ఆమెకీ తెలుసు, తెలుసుకోవాలని తనకీ వుంది. కాని ఇది అదను కాదు. అందుకే మాట తప్పించేస్తూంది.     "డాక్టర్ అంకుల్ ఏం చెప్పారో తెలుసా డాడీ?"     "చెప్పు,"     "మిమ్మల్ని పసిపిల్లాడిన బుజ్జగించలనుకున్నారు."     "అంటే నిన్ను నాకు తల్లిలా ప్రవర్తించమన్నారన్నమాట!"     తలవంచుకుంది నిశ్సబ్దంగా.     "దురదృష్టం కదూ?"     హనిత పైకి లేవబోయింది.     "కూర్చో బేబీ. నీతో చాలా మాట్లాడాలి."     డాడీ!"     "నన్ను మాట్లాడనివ్వు హనితా. బహుశా మళ్ళీ నాకు అవకాశం రాకపోవచ్చు. నేను పోయేలోగా చేయాల్సిన అతిముఖ్యమైన పనులు మాత్రమే కాదు, చేప్పాల్సిన విషయాలూ ఉన్నాయి."     "ప్లీజ్ డాడీ!" హనిత కనుకొలకుల్లో ఓ నీటిబొట్టు నిలిచింది.     "మిమ్మల్ని రెస్ట్ తీసుకోంటున్నావా. అవన్నీ తరువాత మాట్లాడు కోవచ్చు."     "నీకు తల్లిని దూరం చేసిన వాణ్ణమ్మా."     "ఫర్ గేటిట్ డాడీ. ఆ వివరాలాన్నీ నాకు అక్కర్లేదు. అయినా నాకేం తక్కువ చేశారని? అమ్మా, నాన్న అనీ మీరే అయ్యరుగా!"     "వాస్తవం తెలిస్తే  నువ్వు నన్ను క్షమించలేవు."
24,776
     ఎగిరి దాటాడు.          ఇసుకలో పడిన పాదం మెలికపడి నొప్పి పుట్టింది.          గట్టు ఎక్కుతున్నాడు.          పాదం వేశాడో లేదో ఏదో సర్రున కదిలిన శబ్దం మరో అడుగు వేశాడు. ఈసారి శబ్దంతో పాటు పాదాన్ని ఏదో పట్టుకుని కొరికింది.          అతను ఆగాడు.          పాదాన్ని ఎత్తి పట్టుకుని చూశాడు.          కొరికినచోట మంట ప్రారంభమై రక్తంలో కలిసిపోతుంది.          అతనికి ఏదో అనుమానం వచ్చింది.          అటూ ఇటూ చూశాడు.          మళ్ళీ కదిలిన చప్పుడు. ముళ్ళ పొదలోకి పోతున్న పాము తోక కనపడింది.          అతని అనుమానం నిజమైంది.          అంటే పాము కరిచిందన్న మాట.          అది నిజంగా పామో కాదో, అది తనను కరిచిందో లేదో నిర్దారించుకునేందుకు ఆగలేదు అతను. కారణం పన్నెండు గంటలకల్లా ఊరికి చేరుకోవాలి.          అందుకే అతను దాన్ని గురించి పట్టించుకోకుండా ముందుకి కదిలాడు.          అడుగులు ఇంతకు ముందంత ధాటీగా పడడం లేదు. ఒక పాదం నొప్పితో వంకర్లు పోతుంది.          క్షణక్షణానికీ నొప్పి ఎక్కువవుతోంది. నొప్పి నిముషాలతో హెచ్చించినట్టు తీవ్రమైన బాధ శరీరమంతా తిరుగుతోంది.          కళ్ళు బైర్లు కమ్ముతున్న భావన.          పాదం దగ్గిర మంట మరింత పెరిగింది. రక్తంలో కలిసిపోయిన మంట శరీరాన్ని మండిస్తోంది.          అతను వీలయినంత వరకు దాన్ని పట్టించుకోకుండా నడుస్తున్నాడు.          ఊరు సమీపిస్తుంది.          హరికథ ఇంకా ముగిసినట్టు లేదు, భాగవతారిణి గొంతు చెవుల్లో వినిపిస్తోంది.          అతను నడక వేగం మరింత పెంచాడు.          ఊరి మొదట్లో ఇంకా నిద్రరాని కుక్క అతన్ని చూసి మొరిగి, అంతలోనే అతను తన ఊరివాడిలాగా గ్రహించి తోక ఆడించుకుంటూ ముందుకి వచ్చింది.          అతను రెండో వీధిలోకి మలుపు తిరిగాడు.          మరో పది అడుగులు వేస్తే లిఖిత ఇల్లు వచ్చేస్తుంది.          వూరు వూరంతా నిశ్శబ్దంగా వుంది.          అతను నడుస్తున్నాడు గానీ మెదడంతా మొద్దుబారినట్టు భారంగా తయారైంది.          అతను లిఖిత ఇంటికి చేరుకున్నాడు. ఆ ఇంటిలో ఏది ఎక్కడుందో అతనికి బాగా తెలుసు.          అతను ఆ ఇంట్లోకి ఎప్పుడూ వెళ్ళలేదు. కానీ ఆమె మీద వున్న ఇష్టం వల్ల ఆమెకు సంబంధించిన ప్రతిదాన్ని తెలుసుకున్నాడు.          ఇంటికి తూర్పువేపు వున్న సందులోకి నడిచి కిటికీ దగ్గర ఆగాడు.          ఆ గదిలోనే లిఖిత పడుకునేది.          కిటికీ పైరెక్కల్ని మూసి వుంచలేదు.          మంచంమీద సౌందర్యం విశ్రాంతి తీసుకుంటున్నట్టు లిఖిత పడుకుని వుంది.          నిద్రలో కదలడం వల్ల కాబోలు పైట కాస్తంత పక్కకు జరిగింది. చందమామ ఆకాశంలో ఎందుకు లేదో గుర్తుకు వచ్చింది అతనికి. వెన్నెలంతా ఆమె ఎదమీద రెండు భాగాలుగా ఘనీభవించినట్టు తోచింది.          బెడ్ లైట్ మంచి వెలుగు ఆ గదిలోకి సన్నగా జారుతున్నట్టుంది.          గోడమీద గడియారం పన్నెండును చూపుతోంది.          'హమ్మయ్య ఆలస్యం కాలేదు' అనుకున్నాడు ఇంకా కొంతసేపు అలా ఊచల్ని పట్టుకుని పైకి చూడడానికి వీలు కావడం లేదు.          కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. ఒళ్ళంతా తేలిపోతుంది. శ్వాసపీల్చడం కష్టమయిపోతుంది. ఏదో మగత శరీరాన్ని పడదోయడానికి ప్రయత్నిస్తోంది.          అతను తన శరీరంతో తనే పోట్లాడుతున్నట్టు కాళ్ళు చేతులు విదుల్చుకున్నాడు. కళ్ళను అరచేతులతో రుద్దుకున్నాడు. పాము కరిచిన చోట చేత్తోరాశాడు. నొప్పి మరింత ఎక్కువైందే తప్ప తగ్గలేదు.          మరో రెండు నిముషాల్లో తనకు ఏదో అయిపోతుందని అతను గ్రహించాడు. తను స్పృహ తప్పవచ్చు. లేదా చచ్చిపోవచ్చు. అంతలో ఆమెకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలి. సరిగ్గా పన్నెండు గంటలకు ఆమె పుట్టినరోజులో ప్రవేశిస్తుంది.          అతను శక్తినంతా చేతుల్లోకి తీసుకుని ఊచల్ని పట్టుకున్నాడు.          శ్వాస పీల్చడం కష్టమైపోతుంది. అయితే అతని ధ్యాస ఆమె మీదే వుంది.          "ఏమండీ లిఖితగారూ!" మెల్లగా పిలిచాడు.          ఆమె కూడా కలత నిద్ర పోతుండడం వల్ల మేల్కొంది.          శబ్దం వచ్చిన వైపుకి తల తిప్పింది.          కిటికీ వూచలకి రెండు కనుగుడ్లు అతుకున్నట్టయి కనిపించగానే భయంతో కెవ్వున అరవబోయి ఆపై తమాయించుకుంది.          "ఎవరూ"          మంచం మీద నుంచి లేచి కిటికీ దగ్గరికి ముఖాన్ని తెచ్చిపెట్టి అడిగింది.          "నేను జితేంద్రను"          ఆమెకు ఠక్కున మగతంతా ఎగిరిపోయింది.          చివాలున మోకాళ్ళమీద కూర్చుని "నువ్వా" అంటూ ఆశ్చర్యపోయింది.          "ఏమిటి ఇంత రాత్రిపూట" ఆమె ఏవేవో వూహించుకుంటోంది. అందువల్లే భయంలాంటిది గుండెల్లో పుట్టింది.          "మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. టైమ్ పన్నెండు దాటింది. కదా అందుకని" అతను చెప్పాడు.
24,777
    "డాక్టరుగారూ ! అత్తయ్యకేమీ  ఫరవాలేదంటారా ?" అంది, ఒకచోట ఆగిపోయి.     అప్పుడు చూశానామె వంక. చెంగు ముఖంమీద నుండి  ప్రక్కకి  జారిపోయింది. చకితుణ్నయి నిలబడిపోయాను .దీపం వెలుగులో  పాల నురుగులా  గోచరించిందామె.     ఏదో చెప్పాను. ప్రశ్నలు  వేసింది ,ఆదుర్దా  వ్యక్తపరుస్తూ. అన్నిటికీ  ఓపికగా జవాబు చెప్పి డ్యూటీ  రూమ్ వైపు  సాగిపోయాను.     ఈ సంఘటన గుర్తు రావటానికి  ఇంతసేపు  పట్టింది నాకు. అంత అవలీలగా  ఆమె ఎలా  జ్ఞాపకం  చేసుకుందో.     "కొంచెం దగ్గరగా  రండి డాక్టర్!" ఒకసారి కళ్ళను  అటూ  యిటూ కదిపి, ఎవరూ లేరని  నిర్ధారణ చేసుకుంది కాబోలు, అభ్యర్ధిస్తున్నట్లుగా  అంది.     రెండడుగులు  ముందుకువేసి, ఆమె  ముఖానికి చేరువగా  నిల్చున్నాను.     "ఎవరికీ  చెప్పరుగా  యీ విషయం. మీలోనే  దాచుకుంటారుగా. మరే...." అంటూ ఏదో చెప్పబోయి   ఆగిపోయింది ఆమె. కళ్ళకు  ఏదో యిష్టంలేని దృశ్యం  కనిపించినట్లు, చూపు ఒకచోట ఏమీ తోచనట్లు  నిలబడి పోయింది.     "ఎలా వుంది డాక్టర్ మా ఆవిడకు ?" వెనక నుండి  కంఠం వినబడి తలత్రిప్పి చూశాను.     "ఫిమేల్ వార్డులోపలకు   అడుగు పెట్టినందుకు  క్షమించండి డాక్టర్ ! నా ఆదుర్దా అలాంటిది." నా వంక చూస్తూ వినయంగా  అన్నాడతను.     ఆమె సంభాషణలో  కల్పించుకుని  "మావారిని పాపం, లోపల కాసేపు  వుండటానికి  అనుజ్ఞ యివ్వండి డాక్టర్ ! ఎంతయినా  భార్యాభర్తలం కదా. అంతరంగికంగా  కాకపోయినా  విధిగా  మాట్లాడుకోవాల్సిన విషయాలనేకం  వుంటాయి" అన్నది  అతన్ని  సానుభూతిగా  ఓసారి  తిలకించి.     "ఇదిగో లక్ష్మీ ! నువ్విప్పుడు  ఎలాంటి  పరిస్థితిలో  వున్నావో తెలుసా ? ఏమీ మాట్లాడకూడదు .పూర్తిగా  విశ్రాంతి తీసుకోవాలి" అన్నాడు భర్త, ఆమెకు నచ్చచెబుతున్నట్లు.     "పాపం ! మిమ్మల్ని  చూస్తే  జాలేస్తోందండీ నాకు. మీ వల్లే కాలిపోయినట్లు  బాధపడుతున్నారు" అని ఒక్క నిముషం  మాట్లాడకుండా ఊరుకుంది.     ఇంతలో  సిస్టర్  సిరెంజి  చేతిలో  పట్టుకుని  నా దగ్గరకు  వచ్చి "డాక్టర్ ! మార్పియా మరో డోసు యివ్వమని  అసిస్టెంటు మరీ మరీ చెప్పి వెళ్ళారు. ఇదిగో తీసుకువచ్చాను. ఇవ్వండి" అంది.     అవును. ఆమె ముఖం చూస్తుంటే, తెలియని భయం  నన్నావహించింది .ఆమెనలా  మాట్లాడనివ్వటం  మంచిదికాదని  సిరంజి  అందుకుని  ముందుకు  వంగాను.     ఆమె ముఖంలో  ఆకస్మికంగా  చెప్పరాని  భయం, ఆతృత కనిపించాయి. "ఏమిటీ, నాకు మత్తు మందు  యిస్తున్నారా ? వీల్లేదు. నన్ను యిలాగే  తెలివిగా  వుండనివ్వండి. నా బాధనంతా  భరిస్తూ యిలాగే నవ్వుతూ  బ్రతకనివ్వండి. నా  కదే యిష్టం .అవును. నా అనుమతి  లేకుండా  బలవంతంగా  నాకు మత్తుమంతు యిచ్చే  అధికారం ఏమున్నది మీకు ? మీరు పిరికివాళ్లైతే, నా రూపం చూడలేకపోతే మీరు తీసుకోండి మార్ఫియా ! నేను ధైర్యంగల  పిల్లను. అన్నీ కళ్ళతో  చూద్దామనుకుంటున్నాను. నా చావును  స్వయంగా  పర్యవేక్షించాలనుకున్నాను" అంటూ గట్టిగా అరుస్తోంది ఆమె.     నేను లెక్కచేయకుండా  సిస్టర్ సహాయంతో  ఇంజెక్షన్  ఇచ్చేశాను.     ఆమె కళ్ళు పెద్దవి చేసి  నావంక  కోపంగా  చూసింది. "నాకేమన్నా భయమనుకున్నారా ? ఒకటికాదు, వంద మార్పియా యింజక్షన్ లు యిచ్చుకోండి. నాకేం తెలివి తప్పదు. నే నిలానే  కళ్ళు తెరుచుకుని, దెయ్యంలా  చూస్తూ వుంటాను."     నేను అక్కణ్నుంచి వెళ్ళిపోతూ  మంచం  ప్రక్కనే  నిలబడి  వున్న ఆమె పెనిమిటివంక  ఒకసారి  చూశాను. అతని మనసులో ఏముందో అర్ధం  చేసుకోలేకపోయాను. దిగులుందో, సంతోషముందో, కౄరత్వ ముందో, అపరాధినా  అన్న సంశయం వుందో, అమాయకత్వముందో  పోల్చుకోలేకపోయాను.     అంతటి రూపవతిని  పొందినందు కతడు  అదృష్టవంతుడు.     ఈ భావం అతడి విలువను  పెంపొందించింది.     నేను వెళ్ళిపోతూంటే  వెనకనుండి  ఆమె గట్టిగా  అరుస్తూనే  వుంది.     బయట  నాకోసం  ఓ మెమో  సిద్దంగా  వుంది. మేల్ వార్డు నుంచి వచ్చింది. అక్కడికి వెళ్ళేసరికి  అంతకు  ముందే  అక్కడికి  అసిస్టెంట్స్ వచ్చారుగాని, కేసు చూస్తున్నారు.     పేషెంటు   నలభై ఏళ్ళ మనిషి  పొట్టదగ్గర  ఎత్తుగా ఉబ్బినట్టు కనిపిస్తోంది.     శేఖరంగారు తల ఎత్తి చూసి "అంబిలికల్ హెర్నియా. ఇప్పటికే వీళ్ళు ఆలస్యం చేశారు, వెంటనే ఆపరేట్ చెయ్యాలి" అన్నారు.        అనకూడదుగాని  అప్పుడెంత సంతోషం   కలిగింది ! ఒకరకంగా వైద్య వృత్తి  అతి కౄరమైనది. ఆపరేషన్ చేయటానికి  అద్భుతమైన  కేసు లభించింది   కదా  అని నేను  ఉప్పొంగిపోతున్నాను. అది ఆ వ్యక్తికి  జీవస్మరణ సమస్య. అలాగే ఓ అసలైన  హార్ట్  కేసు చూసి ఫిజీషియన్  "ఆహా ! వినండి, వినండి. మర్మర్ ఎంత  బ్యూటీఫుల్ గా వినిపిస్తోందో" అంటాడు. ఈ వృత్తిలో ఎంత దారుణం వుంది !     ఆ కేసును  ఆపరేషన్ థియేటర్ కు తీసుకువెళ్ళి  అక్కడి హంగామా అంతా పూర్తి చేసుకుని  ఆపరేషన్ జయప్రదంగా  జరిపించి  బయటపడేటప్పటికీ  మూడు గంటలసేపు  పట్టింది. ఈ మూడు గంటలలోను  ఎన్నోసార్లు మా గుండెలు పీచుపీచుమన్నాయి. ఒకసారి  బి.పి. పడిపోయింది. ఒకసారి ఆక్సిజన్ పెట్టవలసి  వచ్చింది. ఒకసారి రక్తప్రవాహం  ఎక్కువైపోయి  ఎంతకూ  కట్టుబడలేదు .మొత్తం మీద గడ్డుకాలం  దాటిపోయి, ఆపరేషన్ పూర్తి అయి పేషెంటు బ్రతికే సూచనలు  కానవచ్చాయి.     అతన్ని  స్ట్రెచర్ మీద  వార్డుకు  పంపించేసి, థియేటర్  బట్టలు విప్పేసి, ప్యాంటూ, షర్టూ వేసుకుని టైము చూసుకునేసరికి  మూడు దాటిపోయింది. ఫిమేల్ వార్డుకు  వెళ్ళాలనిపించి  అటుకేసి  బయల్దేరాను.     వరండాలో గోడకానుకుని  రామలక్ష్మి  పెనిమిటి  నిద్రపోతున్నాడు. సిస్టర్ వార్డులో పేదు. ప్రక్క వార్డులోని  సిస్టర్ తో బాతాఖానీ  కొట్టటానికో ,టీ త్రాగటానికో  వెళ్ళి  వుంటుంది. వార్డంతా నిశ్శబ్దంగా వుంది. అంతా గాఢ నిద్రలో  మునిగి వున్నట్లు  కనిపించారు.     రామలక్ష్మి  బెడ్ దగ్గరకు  వెళ్ళి  నిల్చున్నాను. మార్పియా  ఆమెమీద బాగా పనిచేసింది. బరువుగా  మూతలుపడిన  ఆమె కనుదోయి  ఎంతో  సహజంగా  కనిపించింది.     "ఏమిటి చెప్పాలనుకున్నారు నాతో ? నేను వచ్చాను ,చెప్పరూ ?" అన్న ప్రశ్న నా పెదవుల వెనుక ఎన్నోసార్లు మననం  చేసుకున్నాను.     ఆమె కదలలేదు. కనులు విప్పి చూడలేదు.     ఆ సమయంలో  నా కనిపించింది. ఈమె  గురించి  ఏమి తెలుసుకోకూడదు. ఆమె నాకేమీ  చెప్పకూడదు. రూపంలో  కనిపించిన  బరువు, ఆర్ద్రత  ఆమె మాటల్లోని సత్యంలో  వుండకపోవచ్చు. ఆ సత్యం నేను తెలుసుకోకపోవటమే  మంచిది.     మెల్లగా  వెనుతిరిగి  డ్యూటీ  రూమ్ వైపు  సాగిపోయాను.     ఒక మంచంమీద మెడికల్  హౌస్ సర్జన్  పడుకుని నిద్ర పోతున్నాడు, హాయిగా. అలసట  అనిపించి  రెండో మంచంమీద  నడుంవాల్చాను.     కనులముందు  ఏవో చిత్రాలు, నల్లని  మబ్బులు.... ....కలత నిద్ర పట్టింది.     తిరిగి మెలకువ  వచ్చేసరికి  ఆరుదాటిపోయింది. ఒక్క నిముషం బద్ధకం తీర్చుకున్నాక నా కాళ్ళు నాకు తెలియకుండానే  ఫిమేల్ వార్డువైపు  తీసుకుపోయాయి.     రామలక్ష్మి కళ్ళు  తెరుచుకుని పైకి  చూస్తోంది. ఆమె కళ్ళ నుండి మత్తు  యింకా  విడివడినట్లు  లేదు. అలికిడి విని నన్ను చూసి, "వచ్చారా ? ఘనకార్యం  చేశారు కదూ! మెచ్చి  మేకతోలు  కప్పుతాననుకున్నారా ?" అంది.     "ఎట్లా వుంది మీకు ?" అన్నాను.     "చెప్పను" అంది.     చెయ్యి అందుకుని పల్స్ చూశాను. పలుచగా  కొట్టుకుంటోంది. "ఇప్పుడు చెప్పండి" అని అడుగుదామనుకున్నాను.     'ఏమిటి' అంటుంది. 'ఎందుకు చెప్పాలి' అంటుంది. ఆమె ముఖం వంక చూస్తూ ఆలోచిస్తున్నాను.     "ఎలా అడగటమా  అని ఆలోచిస్తున్నారా ? మీరేం ఆలోచిస్తున్నారో  నాకు తెలుసులెండి మీరంటే  నాకేం కోపంలేదు, ఇట్లా  దగ్గరకు రండి !"     నేను వెళ్ళి ఆమె తల దగ్గర  నిల్చున్నాను.     "చాలా ముఖ్యమైన  విషయం  ఒకటి  చెప్పబోతున్నాను. మనసులో  వుంచుకోండి."     "ఏమండీ ! పర్వాలేదంటారా ?" అన్న గొంతు  వినబడింది  ఆమె భర్త నా ప్రక్కకు వచ్చి నిల్చున్నాడు.     ఆమె నిట్టూర్పు  విడవడం  నా కళ్ళబడింది.     "అలాగే వుంది" అని  చెప్పి  కేసుషీటు  తీసుకుని  అవతలకు  వెళ్ళి పోయాను.     కేసు షీటు  పూర్తిచేసి, యథాస్థానంలో వుంచి, రాత్రి ఆపరేషన్ చేసిన కేసు ఎలా వుందో  చూడటానికి  మేల్ వార్డుకు వెళ్ళాను.     అతని పరిస్థితి బాగానే  వుంది. బ్రతికి  బయటపడ్డట్లే  కనిపించాడు. దుష్పలితాలేమీ  కనిపించలేదు.     వార్డులో మిగతా   పనికూడా  చూసేసరికి  ఎనిమిదయిపోయింది. అక్కడి నుండి అలసిపోయిన  శరీరంతో  కాళ్ళీడ్చు కుంటూ  క్వార్టర్స్ వైపు  వెళ్ళిపోయాను.     ముఖం కడుక్కుని  కాఫీ త్రాగాక, బాగా బద్దక మనిపించి  మంచం మీద నడుం వాల్చాను. రాత్రి రెండు మూడు గంటల  నిద్రపోయినా గాని, ఇంకా ఎంతో  అలసటగా  వున్నట్లు  శరీరం  విశ్రాంతి  కోరుతోంది  మనసంతా  వికలమైనట్లు  అనిపించింది.     కళ్ళ ముందు మళ్ళీ  అవే మసక  తెరలు....నల్లని  కారు మబ్బులు. కళ్ళు మూతలు పడిపోయాయి.
24,778
    అతను నవ్వాడు- "అతన్ని అడగడమే అవసరం లేదన్నావ్. మరి అతను వద్దన్నాడని బండి కొనడం క్యాన్సిల్ చేయడం మాత్రం దేనికి?"     నేను జవాబు చెప్పలేనట్టు, అతనికి దొరికిపోయినట్లు, నిస్సహాయంగా చూశాను. అతను మళ్ళీ నవ్వి, నన్ను కూర్చోమన్నట్లుగా చెయ్యి వూపాడు. నేను కూర్చున్నాను.     అతనన్నాడు- "చూడూ, నేను ముందే చెప్పాను. నా ఇంట్లో వాళ్ళందరి అవసరాలూ నా అవసరాలు కూడానని. అందుకే ఒకటి చెప్తాను విను. ఆ వెహికల్ ఏదో నేనే కొని పెడతాను. అప్పుడు ఇంట్లోవాళ్ళు కూడా ఏమీ అనలేరు" అని.     నేను దిమ్మెరపోయాను. నాకు బండి ఆయన కొనిపెట్టడం ఏమిటి? నా అహం దెబ్బతిన్నది.     కంట్రోల్ చేసుకుంటూ, "చూడండి, ఇక్కడ ప్రశ్న నేను వెహికల్ కొనాలా, లేదా అనేది కాదు. ఆ సమస్య మనస్తత్వాలకి సంబంధించినది. నాకు బండి కొనలేకపోతున్నాననే బాధకంటే, అతను దానికి చూపించిన కారణాలు, నా ఆలోచన పట్ల కొంచెం కూడా గౌరవం లేనితనం ఎక్కువగా బాధిస్తున్నాయి. ఆయనకే అంత పట్టనప్పుడు మూడో మనిషి నాకు కొనిపెట్టడం అన్నది నా కెందుకో సమంజసంగా తోచడంలేదు" అన్నాను ఇంగ్లీషులో.     ఆతనిక నన్ను ఒప్పించలేనట్లుగా ఒక నిట్టూర్పు విడిచి, భుజాలు ఎగరేసి వూరుకుండిపోయాడు.     ఆ తర్వాత ఇద్దరం కారులో బయల్దేరాం. కారులో ఆతనిక ఆ విషయం ఎత్తలేదు. కానీ ఇల్లు సమీపిస్తూండగా మాత్రం నిశ్శబ్దం ఛేదిస్తూ అన్నాడు- "గొడవలని ఎప్పుడూ తెగేదాకా లాగకు సుమా! నువ్వు చాలా తెలివైన, ముక్కుసూటైన మంచి అమ్మాయివి. నీకు వున్నదున్నట్లుగా మనసులో దాచుకోకుండా మాట్లాడడం. వెంట వెంటనే రియాక్టయిపోవడం అలవాటు. అది అసలు మంచి పద్ధతే కానీ ఎప్పుడూ కాదు. కొంచెం లౌక్యం నేర్చుకో..."     నేనెటో ఆలోచిస్తూ అతను చెప్తున్నది వింటున్నాను. అతను ఆపేశాక అప్పుడడిగాను- "ఇప్పుడు ఆ స్కూటర్ షోరూం తెరిచి వుంటుందాండీ?" అని!     నా మొండి వైఖరి అతనికి ఆశ్చర్యమే కలిగిందో, మరేంటో నాకు తెలీలేదు కానీ ఓ క్షణం తదేకంగా నా మొహంలోకి చూశాడు. తర్వాత నెమ్మదిగా అన్నాడు-     "అసలు నీతో చెప్పాలనే అనుకోలేదు కానీ నీ వైఖరి చూశాక చెప్పాలనిపిస్తోంది. పొద్దున నువ్వు కాలేజీకి వెళ్ళిపోయాక మీ గదిలో వాడితో మాట్లాడాను. వాడూ బాగా విసిగిపోయి వున్నాడు. వాడు సాధారణంగా కూల్ మనిషి. నేను వాడిని సమర్థించడంలేదు. వాడిని ఎక్కువకాలం చూసిన వ్యక్తిగా చెప్తున్నాను. వాడంటే చెడ్డ అభిప్రాయమున్న వ్యక్తి భూప్రపంచంమీద మరెవరూ లేరు- నీవు తప్ప. అదే ఎందుకో నా కర్థంకాలేదు. నువ్వు ఒక వెహికల్ కొనుక్కోవాలనుకున్నావు. అదీ నీ డబ్బుతోనే. దాన్ని కాదనడానికి ఎవరికీ హక్కులేదు. కానీ సంసారం అన్నాక కేవలం హక్కులే కాదు కదా! నువ్వొక్కమాట అతనితో చెప్పి వుంటే అతడి అహమూ సంతృప్తి చెంది వుండేది. దానివల్ల నీకొచ్చే నష్టం కూడా ఏమీలేదు. ఆ విషయమే నీతో మాట్లాడదామనుకున్నను. నీవు మంచి మూడ్ లో లేవు. నిన్న నువ్వు గదిలో ఏం చేస్తున్నావో అని అందరం ఎంత కంగారుపడ్డామో తెలుసా? సర్లే; ఇల్లు దగ్గర పడింది. నీ మూడ్ బావున్న రోజు మరెప్పుడైనా మాట్లాడుకుందాం" అన్నాడు.     "అతని మీద అంత సానుభూతి కలిగాక ఇక నాతో మాట్లాడడం, చర్చించడం అనవసరం!" అన్నాను. ఈసారి నా కంఠంలో దిగులు ధ్వనించింది. ఎవరూ నన్ను అర్థం చేసుకోరు అనే వ్యధ దాంట్లో ప్రతిఫలించింది. నా ఒక్క హక్కుని వినియోగించుకుంటానని నేననగానే, అంతవరకు నేను నెత్తిన వేసుకుని భరిస్తున్న బాధ్యతల విషయం అందరూ మర్చిపోయారు. ఇక వీళ్ళతో వాదాలు అనవసరం. వెహికల్ కొనుక్కుంటున్న విషయం ముందే మా ఆయనకి చెప్పి అనుమతి తీసుకోవచ్చుగా- అని నా బావగారి వాదం! ముందే చెప్పినా మా ఆయన '...నో' అంటాడుగా. చెప్పాల్సిందేముంది? అన్నది నా వాదం.                                          *    *    *     కారు ఇంటిముందు ఆగగానే నా భర్తే వచ్చి తలుపు తీశాడు. నేనతన్ని పలకరించకుండా లోపలికి వెళ్ళిపోయాను. అతనూ నన్ను పలకరించే ప్రయత్నం చేయలేదు.     ఇంట్లోకి అడుగు పెట్టిన వెంటనే మొహం, కాళ్ళు చేతులు కడుక్కుని, చీర మార్చుకుని వంటింట్లోకి జొరబడి పనిలో పడిపోయాను. ఎవరితోనూ మాట్లాడాల్సిన అవసరమేం కన్పించలేదు నాకు. ఇంట్లో వాతావరణం మామూలుగానే వుంది.     నిశ్శబ్దంగానే భోజనాలు ముగించి పడుకున్నాం. నేను పడుకునే సరికి నా భర్త టేబుల్ ముందు కూచుని ఏదో ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నాడు. అతను అర్థరాత్రి లైటాఫ్ చేసి మంచంమీద పడుకుని దుప్పటి ముసుగు పెట్టుకుని అటు తిరిగి పడుకోవడం ఏదో కలలోలా లీలగా గుర్తుంది.     ఆ తర్వాత నిశ్శబ్దమే నా ఆయుధమై పోయింది. నేను మొండిగా కొనుక్కొస్తానేమోనని ఇంట్లో వాళ్ళు ఎదురు చూసినట్టున్నారు. కానీ నేను నా బావగారితో మాట్లాడిన తర్వాతి రోజు ఉదయమే వెళ్ళి కాన్సిల్ చేయించాను.     చాలా రోజులవరకూ నా బావగారూ నాతో మాట్లాడటానికి ప్రయత్నించలేదు. బహుశా నేను ఆయన సూచనని పాటించకుండా బండి కొనడం మానేసినందుకు ఆయనకు కోపం వచ్చి వుంటుందని, అందుకే పట్టించుకోవడం మానేసి వుంటారని భావించాను. అయినా నేనేం బాధపడలేదు.     ఉద్యోగం వచ్చిన తర్వాత డబ్బులు సమస్య కాకపోయినా, రీసెర్చి వల్ల పెద్దగా ప్రయోజనం వుండదు. ఎలాగూ నేను టీచ్ చేసేది బయాలజీయే కదా అని పి హెచ్.డి. ఆలోచన విరమించుకున్నాను. కానీ ఇప్పుడు నా ఆలోచనల నుంచి తప్పించుకోవడానికి నాకేదైనా మార్పు కావాలి. చదువు ఒక్కటే దానికి మార్గంగా తోచింది నాకు.     యూనివర్శిటీలో ప్రస్తుతం నేను పనులు తేలిగ్గా చేయించుకోగలనన్న ధైర్యం వచ్చింది. వెంట వెంటనే అన్ని ఏర్పాట్లూ చేసుకున్నాను. నా ఆర్టికల్స్ జర్నల్స్ లో పబ్లిష్ అయిపోయాయి. నాకో గైడ్ ని కూడా వెతికి పట్టుకున్నాను.     ప్రస్తుతం నా రాత్రులు కలత నిద్రతోనూ, కన్నీళ్ళతోనూ గడపడం లేదు. సీరియస్ గా వ్రాత, చదువులో మునిగిపోయాను. ఇంట్లో ఏం జరుగుతుందో పట్టించుకోవడం మానేశాను. రొటీన్ గా పనిచేసుకుపోవడం మాత్రమే నా పని అనుకున్నాను.     ఒకరోజు నేను కాలేజీకి బయలుదేరబోతుంటే నా బావగారు నన్ను ఆపేసి, "నేనదే దార్లో వెళుతున్నాను. మీ కాలేజీ దగ్గర డ్రాప్ చేస్తాను. ఐదు నిమిషాలు వెయిట్ చెయ్యి" అన్నాడు.     దారిలో అతను నాతో వ్యక్తిగత విషయాలేవీ మాట్లాడలేదు. నా చదువు, అతని బిజినెస్ గురించి ఏదో కాస్త మాట్లాడుకున్నా మంతే. సాయంత్రం నేనింటికి వచ్చేసరికి మళ్ళీ మా బావగారూ, అత్తగారూ మాత్రం వున్నారంతే. ఆయన ఇడ్లీలు తింటున్నాడు. నన్ను పలకరిస్తే ఇక తప్పదన్నట్లుగా అక్కడ కూర్చున్నాను.     నా అత్తగారు లోపలికి వెళ్ళి నాకు ఇడ్లీలూ, చట్నీవేసి పట్టుకొచ్చింది. "అయ్యో! నేను తెచ్చుకునేదాన్ని కదండీ! మీ కెందుకు శ్రమ?" అని నొచ్చుకున్నాను.     "ఫర్లేదులేమ్మా! దీంట్లో శ్రమేముంది? ఇప్పుడే పెద్దబ్బాయి చెప్తున్నాడు. ఓ రెండు మూడు నెలలపాటు ఎవరో డీలర్ తో పనుంటుందిట. ఆ దార్లోనే వెళ్ళాలి అమ్మాయిని రోజూ కాలేజి దగ్గర దింపచ్చు అన్నాడు. పోన్లే నీకూ కొంతకాలం పాటు శ్రమ తప్పుతుంది" అంది.     ఆవిడ మొహంలో ఎక్కడైనా వెటకారం కనపడుతుందేమో అని చూశాను. కానీ ఖచ్చితంగా అదేంలేదు. ఆవిడ అదోరకం మనిషికానీ బేసికల్ గా మంచిదే అనిపించింది. కానీ ఆ భావన నన్నే అయోమయంలో పడేసింది. ఆవిడోసారి చాలా నెరజాణలా, ఒకోసారి మెత్తగా, ఒకోసారి అమాయకురాలిలా కనపడుతూ నన్నలా అయోమయంలో పడేస్తుందెందుకో అర్థంకాలేదు.     ఆ తర్వాత రోజునుంచే నేను నా బావగారితో కారులో వెళ్ళడం మొదలుపెట్టాను. కారులో వెళ్ళడం వల్ల, ఇంట్లో పని చేసుకోవడం కాస్త ఆలస్యమైనా నాకు క్లాసుకి లేటయ్యేది కాదు. ముఖ్యంగా అలసట వుండేది కాదు. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోననే జంకు అప్పుడప్పుడూ కలిగేది కానీ ఇంట్లో వాళ్ళెవరూ ఏమీ అనుకోరు. ఇక బయటి వాళ్ళేమనుకుంటున్నారో తెలిసే అవకాశం లేకపోవడంవల్ల పట్టించుకోవలసిన అవసరం కనిపించలేదు. టైమ్ సేవ్ అవుతున్నంత వరకూ నేనవీ, ఇవీ ఆలోచించ కూడదని నిశ్చయించుకున్నాను. అది నేను చేసిన రెండో తప్పు.                                                                      13     మేమిద్దరం కార్లో వెళ్ళేటప్పుడు ఒక్కోసారి ముందు డీలర్ దగ్గరకు వెళ్ళి ఆ తర్వాత నన్ను డ్రాప్ చేయడం జరిగేది.     ఆ డీలర్ ఇతనికి నమ్మకస్తుడవడం వల్ల అతని పర్యవేక్షణలో నా కాలేజీ దగ్గరలోనే మరో ఫ్యాక్టరీ పెట్టాలనే ఆలోచన ఇతనికి వున్నట్టు నాకు అర్థమైంది.     "అక్కడ ఫ్యాక్టరీ మాత్రమే పెడతారా? లేక ఆఫీసు కూడానా?" అడిగాను.     "అంటే?" అన్నాడతను అర్థంకానట్టు.     నేను నవ్వి "మరేం లేదు. ఆఫీసు కూడా పెడితే ఎప్పటికీ కారులోనే రావచ్చు. పోవచ్చు కదా అని" అన్నాను.     అతను ఆశ్చర్యంగా నా వంక చూసి నవ్వేసి "సిల్లి! డూ యూ రియల్లీ థింక్ సో?" అని అడిగాడు.     నేను తల అడ్డంగా వూపుతూ నవ్వి "ఛ అదికాదు. పట్టుమని పదిహేను కిలోమీటర్ల దూరంలేదు. రెండు ఆఫీసులు పెట్టడం అనవసరమేమో అన్పించింది. అంతేకాదు, ఒకే ఆఫీసయితే సెంట్రలైజ్డ్ అథారిటీ కూడా వుంటుంది కదా! ఫ్యాక్టరీలో కూడా అంతా కొత్తవారినే తీసుకునే బదులు పాతవాళ్ళను ఇక్కడకు బదిలీ చేయడం మంచిదేమో...." అన్నాను.     అతను తన మొహంలో ఆశ్చర్యం కనపడనివ్వకుండా, "మరి అక్కడ పాత ఫ్యాక్టరీలో ఉత్పత్తి తక్కువవదూ?" అనడిగాడు.     "ప్రొడక్షన్ మొదలవడానికి ఇంకా చాలా టైముంటుంది కదా, అప్పట్లోగా అప్రెంటీస్ ట్రెయినీస్ ని తీసుకోండి పాత ప్లాంట్ లో. కానీ వాళ్ళను మాత్రం కొత్త ప్లాంట్ కి మార్చొద్దు". అన్నాను. "ఎందుకు?" అన్నాడతను కుతూహలంగా.     "కొత్త ప్లాంట్, కొత్త మిషనరీతో ఏ ఒడిదుడుకులైనా రావచ్చు. వాటిని ఎదుర్కోవాలంటే సమర్థులూ, అనుభవజ్ఞులూ అయితేనే మంచిదేమో అని నా ఉద్దేశం. అయినా మీకు తెలీనిదేముంది?" అన్నాను.     అతడొక క్షణం మౌనంగా వుండి "నువ్వర్జెంటుగా ఉద్యోగం మానెయ్యాలి" అన్నాడు గంభీరంగా.     నేనొక్కసారిగా తెల్లబోయి "ఏం?" అనడిగాను. అతని సీరియస్ నెస్ చూసి, నేనతిగా వాగానేమో, అతనికి నచ్చలేదేమో అని భయమేసింది.     "మరేం లేదు. నాతోపాటు వ్యాపారంలోకి దిగు" అన్నాడతను నవ్వేసి.     నేనూ తేలిగ్గా నవ్వుతూ "అయ్యో! నేను కొత్త విషయాలేమీ చెప్పలేదండీ. నేనేదో గొప్పగా మీకు ఉచిత సలహాలిస్తే మీరు మరీ ఎక్కువ చేసి పొగిడేస్తున్నారు" అన్నాను. మొహమాటంగా. కానీ అతను మెచ్చుకోవడం నన్ను బాగా సంతృప్తి పరిచింది. "పొగడడం కాదు. నిజంగా చెప్తున్నాను. ఒకవైపు జెనెటిక్స్ లో గోల్డ్ మెడల్ సంపాదించి, మరోవైపు బిజినెస్ గురించి ఇంత లోతుగా మాట్లాడడం, ఆలోచించడం చూస్తోంటే ముచ్చటేస్తుంది. Sometimes I feel marriage has shad- owed you... honestly....." అతని గొంతులోని సిన్సియారిటీ నన్ను కదిలించింది. తిరిగి అతనే అన్నాడు- "నా తమ్ముడు నిన్ను పెళ్ళి చేసుకోబోతున్నాడంటే ఎవరో కొత్త అమ్మాయి వస్తుంది కాబోలు. అత్తగారితో గొడవలు పడకుండా ఇంటిపనులు పంచుకుంటే బావుండునని అనుకున్నాను. నీ క్వాలిఫికేషన్ తెలిశాక 'పి.జి. చేసి ఇంట్లో కూర్చుంటుందా? ఈ అమ్మాయిలు ఫ్యాషన్ కోసం ఎందుకు చదువుతారో...అదీ అంత కష్టపడి మెడల్స్ సంపాదించుకుని' అని చిరాకుపడ్డాను. నిజం చెప్పొద్దూ".
24,779
          కైలాసపర్వత  పాదమునందు  నిశ్చలమై ప్రత్యక్షమయ్యే మానస సరోవరంలో  స్నానాలు సలిపి,  అక్కడినుండి  బయలుదేరి  మూడురోజులలో  ద్యూపాంగు బౌద్ద సంఘారామం  చేరాము. అచ్చటి లామాలు  మాకు  ఆతిథ్యమిచ్చారు. వచ్చిన రోజు సాయంకాలం  శర్వరీభూషణ శ్రీనాథమూర్తిని కులపతికడకు  తీసికొనిపోయి  ఆయనకు  నమస్కారం చేయించాను.                                              11         ద్యూపాంగు సంఘారామం  ఆంధ్ర  శాతవాహన సామ్రాజ్య రాజధానీ నగరమైన  ధాన్యకటక  సఘారామం  పేరున  నెలకొల్పబడింది. ద్యూపాంగు  అంటే  టిబెట్టు  భాషలో  ధాన్యకటకం  అని అర్ధం. ద్యూపాంగు  బహుశః  ఆరవశతాబ్దంలో భారతీయులైన  బౌద్దసన్యాసులు  టిబెట్టు  వలస బోయి అక్కడ నెలకొల్పి  వుంటారు.  ఆంధ్ర మహాయాన  బౌద్ద  సంప్రదాయం  ఇక్కడ  నుండే టిబెట్టు అంతా  ప్రసరించింది.  ఆంధ్రశిల్ప చిత్రలేఖన సంప్రదాయాలు  ఇక్కడ నుండే త్రివిష్టప్రదేశం  అంతా  శాఖలల్లుకుపోయినవి. అనేక ఆంధ్ర  గ్రంథాలు తిబెత్తుభాషలో  అనువదించబడ్డాయి. అవన్నీ ద్యూపంగు  సంఘారామంలో వున్నాయి.  మా అద్వైత్వానికి  పనికి వచ్చే  గ్రంథాలెన్నో త్రివిష్టప భాషలో  వున్నాయి అక్కడ.     శ్రీనాథమూర్తి శిల్పి, చిత్రకారుడు, కవి. చక్కని కంఠంతో  తాను  రచించుకొన్న పాటలు  పాడగలడు. ముఖ్యంగా శిల్పి  పాశ్చాత్య విధానంలో  అందమైన  బొమ్మలెన్నో  మైనంతో  ప్లాస్టరు సుద్దతో  విన్యాసం  చేశాడు. అతనిలో  ఆశక్తి  వుత్తమ రూపంతో  గర్భితమైవుంది.        పాశ్చాత్య విధానమూ, భారతీయ విధానమూ  ఈ  రెంటి  విషయమై నాకూ శ్రీనాథమూర్తికీ   చక్కని  వాదోపవాదాలు  జరిగాయి  అతడు పాశ్చాత్య విధానమూర్తమైన శిల్ప, చిత్రలేఖన, వాస్తు  శాస్త్రాలను గూర్చి  అఖండంగా చదువుకొన్నాడు. ఆ  చదువుకొన్న  రోజులలో  ఆ సంప్రదాయాల  సంపూర్ణ భావం  తెలియకపోయినా, ఈనాడీ కైలాసపర్వత  నిశ్చల పవిత్రజ్యోత్స్నా స్నాతుడైన అతని మనస్సు  అతినిశితమై, వెనుకటి చదువును ప్రతిభతో  స్మృతికి తెచ్చుకొని, సూక్ష్మభావాలు కూడా  సమన్వయం చేయించగలిగింది. అందుకనే  అతణ్ణి భారతీయ  విధానానికి  మార్చగలను  అనే నమ్మకం  నాకు బాగా  కలిగింది. ఒక సంప్రదాయంలో పండితుడైన  వ్యక్తి వేఱొక   సంప్రదాయం  బాగా  అర్థంచేసుకోగలడు. పాశ్చాత్య సంగీత విధానంలో  పండితుడై స్వర, శ్రుతి, తాళ, లయలను  బాగా  అర్థంచేసుకోగలడు. మొదట  పాశ్చాత్య శిల్పచిత్రకళాశయాల రహస్యం  ఏమిటో చెప్పమని శ్రీనాథమూర్తిని కోరాను.     శ్రీనాథమూర్తి  వుపక్రమించాడు. మేమంతా సఘారామ  మధ్య  గృహంలో  చేరాము. ఆశ్రమవాసుడైన  శిల్ప  చిత్రాచార్యులు, కొదరు పండిత లామాలు చేరారు. నాకు తిబెత్తు భాష  బాగా వచ్చి వుండడం వల్ల  శ్రీనాథమూర్తి   సంభాషణ  అంతా  వారికి  ఎప్పటికప్పుడు  భాషాతరీకరణం  చేసి  చెప్పినాను.     '' స్వామీజీ, మానవప్రకృతిలో  జంతుప్రకృతి ' ఆహార  నిద్రా భయమైధునాని' అన్నది  ప్రథమ  అనే  తామన్నారుగదా. దానిపైన తనేమిటి, తనచుట్టూ ఉండే సమస్తమూ  ఏమిటి అనే  జిజ్ఞాన వస్తుంది మనుష్యునికి. అది  మనస్సుకు  సంబంధించింది. ఇదీ  తామే  అన్నారు. మనస్సు  ఎలక్ట్రాను ప్రోటానుల నుండి  వచ్చిందా? లేక భౌతిక  పదార్ధము  మనస్సు  నుంచి వుద్భవించిందా? అనే విషయాన్ని గురించీ  తామే  చర్చించారు. ప్రాణశక్తి ఎలక్ట్రాన్ ప్రోటానుల  కలయికవల్ల  ఎలా  రాదో, ప్రాణశక్తి  మనస్సు  యొక్క  భౌతిక శక్తిపైన  వచ్చిన  రెండో  రూపమైన  శక్తిమాత్రమో  అవన్నీ తామే సెలవిచ్చారు. మనస్సు యొక్క  మూడోశక్తి, సౌందర్యదర్శనానందం. ఈ ప్రకృతిలో  దృశ్యంగాని, మానవ చరిత్రలో  సఘటనగాని సౌందర్య  వంతమై  ప్రత్యక్షమైతే, స్మృతికి వస్తే  మనుష్యుడు  ఆనందం  పొందుతాడు.  ఈ మూడోశక్తి  సౌందర్యాధనశక్తి  అని తామే సెలవిచ్చారు. ఈ మూడు శక్తులను గూర్చీ పాశ్చాత్య పండితులందరూ  తమ భావాలను  పూర్తిగా  చెప్పారు.''     '' అవును  శ్రీనాథమూర్తీ! ప్లేటో, అరిస్ టాటిల్  దగ్గరనుంచి, అతి ఆధునిక  రష్యాతత్త్వవేత్తలవరకు నిర్వచించిన  వాదనలు  మన రసవాదం అన్నీ పూర్తిగా విచారించి  చెప్పవలసిన ముక్కలే!''     '' చిత్తం. ఆవేశ  రూపమైన  సౌందర్యపూజ   శాస్త్రాతీతమని  జేమ్సునర్లీ అంటాడండీ. కాని సౌందర్య  పూజ    మానవ  భౌతిక  సంబంధమని వాదించేవారూ  లేకపోలేదు. ఈ  రోజులలో  ముఖ్యంగా  రాజకీయ, ఆర్ధిక, శాస్త్ర, పారిశ్రామిక వాతావరణాలు  మనుష్యుని  పూర్తిగా  కమ్మివేసి  ఉన్నప్పుడు, సౌందర్యానికీ, ఆర్థికోపయోగ  భావానికీ,  రాజకీయ భావాలకూ, శాస్త్రభావాలకూ ఎక్కువ చుట్టరికం  వచ్చింది. ఎంత అయినా  సౌందర్య  విచారణా, ఆనందమూ మనస్సుకే అని  అందరూ  ఒప్పుకుంటారు. లలితకళ లెందుకు  అన్న విషయం ఉద్భవిస్తుంది. అప్పుడే ఇది  మానవ  ప్రకృతి  అని నిర్థారణ  చేశారు.     ఈ మానవ  ప్రకృతికి  మఖ్యమైన  గుణం, తానే ఆ  సౌందర్యాన్ని సృష్టించాలని ఇచ్చ  కలగడం, అది సృష్టించడం. ఆ  తర్వాత  తానుగాని ఇతరులుగాని  అలా సృష్టించిన సౌందర్యాన్ని  దర్శించి ఆనందించడం. ఇంతవరకూ  పాశ్చాత్య శాస్త్రజ్ఞులందరూ ఒప్పుకుంటారు స్వామీ!''     '' అవును, ఈనాటి  వారి  ఉపయోగవాదం  త్రివిష్టపశిల్పులైన సన్యాసులకు  చిట్టచివర  నువ్వు  చెప్పితీరాలి.  ఆ తర్వాత  త్రివిష్టప పండితుల  అభిప్రాయా లేమిటో తెలుసుకుందాము.     '' చిత్తం, పాశ్చాత్య  సౌందర్యతత్వం  మనవి చేసుకుంటాను. ఈలోగా  లలితకళలంటే  పాశ్చాత్యుల భావమూ, సిద్దాంతాలూ  మనవి చేసుకుంటాను. కళ మనుష్యుని పని.  ప్రకృతిలోని  వస్తువును  మనుష్యుని ఉపయోగం కోసంగాని, మనుష్యుని  సంతోషం కోసంగాని, మనుష్యుని వెఱ్ఱికోసం కాని మార్చడం, కలపడం కళ అని పాశ్చాత్యులు పేరు పెట్టారు. ఇక్కడ  కూడా  తత్త్వవేత్తలు ఇప్పటివరకు  రెండు పక్షాలుగా  వాదిస్తున్నారు. ప్రకృతిలో  లేని పని  ఏదయ్యా  అని కొందరు  అంటారు. అవి వేదాంత విషయాలుగా  రావచ్చును అంటారు కొందరు. కాని పనిని గూర్చి  ఆలోచించి, విధానం నిర్థారణ  చేసికొనిగానీ, కొంతవరకూ నిర్థారణ చేసికొనిగానీ మనుష్యుడు  చేసే  పని  కళే.''  
24,780
    "ఎరుపు ఎరుపు ఎంతో చక్కని ఎరుపు. ఎర్ర ఎర్రని ఎరుపు" అంటూ చిన్నరాగం తీసి "పెట్టె చాలా బాగుంది. ముఖ్యంగా ఆ ఎర్రని రంగు దానిమీద ఎర్రగులాబీల డిజైను" అంది మనోరమ.     రైలులో వుండగానే ఆ పెట్టె గురించి ఇరుగు పొరుగుకి ఏం చెప్పాలో ముందే ఆలోచించుకుని రెడీగా వున్నారు వెంకుమాంబ, కోదండరామయ్య.     "మీ ఆడవాళ్ళు ఉన్నారు చూశావ్!" అన్నాడు కోదండరామయ్య.     "మీరలా పదే పదే వెక్కిరింతలు, వేళాకోళాలు చేశారంటే నాకు మండిపోతుంది. ఈ పెట్టెని యిలాగే ఎవరికో ఒకరికి దానధర్మాలు చేస్తాను." వెంకుమాంబ రుసరుసలాడింది.     "విషయమేమిటి పిన్నిగారూ!" అంది పంకజం.     "నీకు తెలిసిందే కదమ్మాయ్! నేను దేనికీ ముచ్చటపడను. అది కావాలి యిది కావాలి కొనండి అని వేదించాను. ఖర్మకాలి ఈ పెట్టె నా కళ్ళబడ్డది. సరీగ యిలాంటి పెట్టె నా చిన్నతనంలో మా అమ్మమ్మ గారింట్లో వుండేది. అప్పటినుంచీ యిలాంటి పెట్టె మీద మోజు వుండేది. ట్రంకుపెట్టెలు అమ్మే కొట్లో ఈ పెట్టె నాకళ్ళ పడింది. నోరు తెరిచి కొనండి అన్నాను. ఏ కళనున్నారో వెంటనే కొన్నారు. కొన్నవారు వూరుకోవచ్చా, దోవ పొడుగూత ఒకటే సాధింపు" వివరించింది వెంకుమాంబ.     "నీ కర్ధమైంది అంతే. పెట్టె కొన్నందుకు కాదు నా బాధ. రైలులో నా స్నేహితుడు కలసి ఈ వూళ్ళో వున్న తన భార్య పుట్టింటి వాళ్ళకి సామాను ఇవ్వమని బండెడు సామాను నా కంటగట్టాడు. పెట్టంటూ వుండేసరికి అన్ని దానిలో కుక్కటం అయింది. పెట్టె కొన్నది వాడి సామానులు మోయటానికి లాగుంది. పోనీ కూలీలకోసం డబ్బు యిచ్చాడా-అదేమీ కాదు. మూట నీది. బరువు నాది అన్నట్లు తయారయింది. స్టేషనులో కూలీలతో పోట్లాట అయింది. అందుకే నోరుమూసుకుని రిక్షావాడికి డబ్బులుయిచ్చాను" కోదండరామయ్య తలుపు తాళం తీసి సూట్ కేసు లోపల పెట్టి వస్తూ కథ వినిపించాడు.     ఆయన చెప్పిన కథలో ఎక్కడో ఫాల్ట్ వున్నట్లు అనిపించింది మనోరమకి, పంకజంకి. అయినా వాళ్ళు ఈ కథని నమినట్లు ముఖం పెట్టారు.     కోదండరామయ్య, వెంకుమాంబ చెరోవైపు పట్టుకుని ఎర్ర పెట్టెని యింట్లోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేయబోతుండగా ఓ పక్క మనోరమ మరోపక్క పంకజం పెట్టెకున్న రింగులని పట్టుకుని పైకి ఎత్తారు.     "బాబోయ్, చచ్చే బరువు వుంది" అంది పంకజం.     "దీని లోపల ఉంది సామాను కాదు యినుప దిమ్మెలు" నవ్వుతూ అంది మనోరమ.     "ఇనప దిమ్మెలు కాదు. సిమెంటు అచ్చులు" తనూ నవ్వుతూ అని పెట్టె అడుగున ఓ చెయ్యి వేశాడు కోదండరామయ్య.     అతి కష్టంమీద పెట్టెని యింట్లోకి చేర్చారు.     "ఒకసారి చూస్తే మరచి పోలేనంత అందంగా వుంది ఈ పెట్టె" అంది పంకజం.     "వి.ఐ.పి.లు సఫారీలు మార్కెట్ లోకి వచ్చిన తర్వాత వీటి ముఖం చూసే వాళ్ళు కరువయ్యారు," మనోరమ అంది.     కాళ్ళూ చేతులు కడుక్కుని మంచినీళ్ళు తాగి తాము వూరికి వెళ్ళిం తర్వాత కొడుకులు, కూతుళ్ళు రాసిన ఉత్తరాలు కిటికీలోంచి లోపలికి పోస్ట్ మేన్ పడేసినవి చదువుకొంటూ కోదండరామయ్య వెంకుమాంబ వీళ్ళతో మాట్లాడలేదు.     ఈ లోపల     అక్కడే కూర్చున్న మనోరమ, పంకజం పెట్టెలు వాటి పూర్వోత్తరాలను గురించి మాట్లాడుకున్నారు.     ఆ తర్వాత-     "యాత్ర విశేషాలు ఏమిటి బాబాయిగారూ!" మనోరమ అడిగింది.     "మీరు లేకపోతే ఇల్లు చిన్నబోయింది" అంది పంకజం.     ఆ యింట్లో బాబాయిగారి పార్టీ మనోరమ.     పిన్నిగారి పార్టీ పంకజం.  
24,781
                             అధ్యాయం-4     ఈ ప్రపంచంలో వర్షాన్నీ, ఎండనీ, చివరికి భూకంపాన్నీ కొలిచే సాధనాలున్నాయి కానీ, మనిషి కష్టాన్ని కొలవటానికి మాత్రం ఏ మీటరూ లేదు.     ఈ ప్రపంచంలో ప్రతి మనిషీ తనకొచ్చినంత పెద్ద కష్టం ఇంకెవరికీ రాదని అనుకుంటూ వుంటాడు. తను కాబట్టి ఈ మాత్రమన్నా బతికున్నానని, ఇదే కష్టం ఇంకెవరికైనా వస్తే ఈపాటికి చచ్చిపోయుండేవారు అనుకుంటూ డిప్రెషన్ కి లోనవుతాడు. కొంతమంది మాత్రమే తమకొచ్చిన కష్టాల్ని భవిష్యత్తులో విజయాలకి సోపానాలుగా వాడుకుంటూ వుంటారు. కష్టాన్ని ఎనలైజ్ చేసి దాన్లోంచి బయటపడటానికి మార్గాన్ని అన్వేషిస్తారు. కష్టం గురించి నిరంతరం ఆలోచించటం కన్నా దాంట్లోంచి బయటపడే మార్గం ఆలోచించటం ఎంతో మంచి పద్ధతి. కానీ, చాలామందికి మానసికంగా అది సాధ్యంకాదు.     నిఖిత మొదటివర్గానికి చెందిన వ్యక్తయితే- ధాత్రి రెండో వర్గానికి చెందిన  అమ్మాయి.     నిజానికి ధాత్రి పెద్ద కష్టాలంటూ ఏమీలేవు. టెన్సిస్ ఆడమనీ, నాట్యం నేర్చుకోమనీ ఆమె తల్లి నిరంతరం వేధిస్తున్నమాట నిజమే. అయినా ఫుట్ పాత్ మీద పడుకునేవాళ్ళు, వుండటానికి చిన్న ఇల్లు లేనివాళ్ళు, కట్టుకోటానికి మంచి బట్టల్లేనివాళ్ళు, ఆకలితో నకనక లాడేవాళ్ళు, భర్తలచేత హింసింపబడే వాళ్ళు, అర్థరాత్రి ఇంట్లోంచి బయటికి గెంటివేయబడిన ఆడపడుచులూ- వీళ్ళ సమస్యలతో పోల్చుకుంటే ధాత్రి సమస్య చాలా చిన్నది. కానీ దాన్నే ఆమె చాలా పెద్దగా ఊహించుకుంటూ బాధపడుతూ వుంటుంది.     ధాత్రికి ఆత్మీయులైన స్నేహితులంటూ ఎవరూలేరు. ప్రేమ రాహిత్యంలాగే స్నేహరాహిత్యం కూడా ఒక శాపం. ఒంటరితనాన్ని ఇష్టపడే మనస్తత్వం కాదు ఆమెది. చిన్నప్పటినుంచీ టెన్నిస్ కోచింగ్ సెంటర్లలోనూ, డాన్స్  స్కూళ్ళల్లోనూ ఆమెకి క్లాసు పిల్లలే కాక చాలామంది అమ్మాయిలు స్నేహితులుగా ఏర్పడ్డారు. కానీ అందరూ క్రమక్రమంగా దూరమయ్యారు. కారణం ఆమె కాదు. ఆమె తండ్రి! ఆమె ఇంటికి ఎవరైనా స్నేహితులు వస్తే వాళ్ళు వెళ్ళేవరకు ఆమె ముళ్ళమీద కూర్చున్నట్టే కూర్చునేది. ఇంటికెవరైనా ఆడపిల్ల రాగానే, ఆమె తండ్రి ఏ పరిస్థితిలో వున్నా అలాగే  బయటికొచ్చేసి, వాళ్ళకెదురుగా కూర్చుని కబుర్లు చెప్పటం మొదలుపెట్టేవాడు. వాళ్ళతో ఆప్యాయంగా మాట్లాడేవాడు. భార్యని పిలిచి కాఫీ, టిఫిన్లు ఇమ్మని చెప్పేవాడు. కానీ అతని చూపులు మాత్రం  వాళ్ళ బట్టల్లోంచి లోపలికి దూసుకుపోయి ఆ చిన్నపిల్లల శరీరాల్ని నఖశిఖపర్యంతరం పర్యవేక్షిస్తూ వుండేవి. చూపులతోనే వాళ్ళని అణువణువు తాకుతూ వుండేవాడు.     "ఏమిటి, మీ డాడీ అలా చూస్తాడు? ఎందుకో వళ్ళు కంపరమెత్తినట్లుంటుంది" అని ఒకరిద్దరు స్నేహితులు ధాత్రి స్నేహితురాళ్ళందరూ  ఆమెకి దూరమయ్యారు. ఇంటి బయట ఆమెతో వాళ్ళు మాట్లాడటానికి ఉత్సాహం చూపించినా కూడా ఈ కాంప్లెక్స్ వాళ్ళ ఆమే తనంతటతాను వాళ్ళని దూరం చేసుకుంది.     ఈ పరిస్థితిలో అనుకోకుండా ప్రీతమ్ ఆమెకి దగ్గరయ్యాడు.     ఆ రోజు కాలనీ నుంచి వెళుతూ వుంటే స్కూటర్ యాక్సిడెంటై ప్రీతమ్ కలిసిన తర్వాత, అతడన్న మాటలు ఆమెకి బాగా గుర్తున్నాయి "ఈ యాక్సిడెంటు మనిద్దర్నీ యాక్సిడెంటల్ గా కలిపింది. ఇది ఎక్కడికి దారితీస్తుందో" అని.     ఆ మరుసటిరోజు ప్రీతమ్ తన డాన్సింగ్ స్కూల్ దగ్గరికి వచ్చేసరికి ఆమే ఒక్కక్షణం ఆశ్చర్యపోయినా తర్వాత ఆనందించింది. అతడంత గుర్తు పెట్టుకొని తన స్కూల్ కి మళ్ళీ వస్తాడు అని ఆమె అనుకోలేదు. ధాత్రి నిజానికి అంత అందమైన అమ్మాయి కాదు. ఆ కాంప్లెక్స్ కూడా కొంత ఆమెలో వుంది.     ప్రస్తుత సమాజంలో పెళ్ళికిముందే బాయ్ ఫ్రండ్స్ వున్న అమ్మాయిల స్టాటి స్టిక్స్ తీసుకుంటే ఎక్కువమంది అమ్మాయిలు సగటు కన్నా తక్కువ అందమున్న వాళ్ళే అయ్యుంటారు. తమలో వున్న కాంప్లెక్స్ ను అధిగమించటానికే అమ్మాయిలు ఆపోజిట్ సెక్స్ నుంచి అనైతికమైన పరిచయాల్ని ఆశిస్తారు అని ఫ్రాయిడ్ ఏనాడో చెప్పాడు.     ఆ విధంగా ప్రీతమ్ తనిచ్చిన అడ్రస్ పట్టుకొని వెతుక్కుంటూ రావడం ధాత్రికి సంతోషమిచ్చినా, అలా రావటంలో ప్రీతమ్ అవసరం కూడా  కొంత వుంది.     ఆ రోజు పొద్దున్నే అతడు  ఊరినుంచి వచ్చాడు. స్టేషన్ దగ్గిరే ప్రీతమ్ కి అతని  స్నేహితుడు కలిశాడు. ప్రీతమ్ చెల్లెలు కాలేజీముందు టెంట్ వెయ్యటం, మినిష్టర్  కొడుకుతో ప్రేమవ్యవహారం తేల్చుకోవటం కోసం నిరాహారదీక్ష చెయ్యటం, ఆమె ఆరోగ్యం పాడుకావటం మొదలైన విషయాలన్నీ ఆ స్నేహితుడు అతనికి చెప్పాడు. ప్రీతమ్ ఆవేశంతో వణికిపోయాడు.     అయితే ఆ ఆవేశం చెల్లి చేసిన పని గురించి కాదు.     తన చెల్లెలు యిన్ని కష్టాల్లో ఇరుక్కున్నందుకు. ఆ ఆవేశంతోనే ఇంటికొచ్చాడు. ప్రీతమ్ ఇంట్లోకి అడుగు పెడుతూనే తల్లీతండ్రి అతడిమీద కోపంతో ఎగిరారు. "ఏరా నాల్రోజుల్లో వస్తానన్న వాడివి, పదిరోజులకా రావటం? ఒక ఫోన్ అన్నా చెయ్యకూడదా?" అన్నాడు కృష్ణమూర్తి.     "ఇక్కడే ఇంత గొడవ జరిగింది. సమయానికి నువ్వు లేకుండా పోయ్యావ్" అంది రుక్మిణి.     ప్రీతమ్ ధీమాగా అన్నాడు. "ఇప్పటికైనా మించిపోయిందేంలేదమ్మా. ఈ రోజే నా ఫ్రెండ్స్ తో వెళ్ళి వాడి తోలు వలిచేస్తాను".     ఇలాంటి మనస్తత్వం దాదాపు చాలామందిలో కనపడుతూనే వుంటుంది. ఏదైనా ఒక ప్రమాదం రాగానే  రకరకాలుగా దాని పరిష్కారం "ఊహించేసుకొని" విజయం సాధించినట్లు సంతృప్తి పడటం! "పోలీస్ స్టేషన్లో ఫలానా పని చేయిస్తాను నా స్నేహితులతో వెళ్ళి విజయం సాధించుకొస్తాను- అవతలివాడి గర్వం పూర్తిగా అణిచేస్తాను- ప్రత్యర్థిణి మరి లేవకుండా కొడతా"..... ఇలా తాము చేయలేని  పనులన్నింటినీ చేసినట్లు ఊహించేసుకొని, ఒక ప్రమాదం రాగానే అవతలివాళ్ళ ముందు గొప్పలు చెప్పుకునేవాళ్ళు చాలామంది. ప్రీతమ్ వయసులో యువకులకి యిలాంటి భావాలు ఎక్కువగా వుంటాయి.     ఆ రాత్రి తల్లి వరసగా జరిగినదంతా చెబుతూవుంటే, ప్రీతమ్ ఆ విధంగానే వూహించుకున్నాడు. పదిమంది కూర్రోళ్ళణి తీసుకెళ్ళి ఆ సందీప్ పని  పట్టాలనుకున్నాడు. కాలర్ పట్టుకొని లాక్కొచ్చి, తనచెల్లెలి కాళ్ళమీద పడేసి వాళ్ళద్దరి పెళ్ళి చేసినట్లు కూడా కల వచ్చింది. అయితే ఆ మరుసటిరోజు పొద్దునకి ఆ ఆవేశం తగ్గిపోయింది. పొద్దున్నే స్నేహితులతో కలిసి బయటికెళ్ళటానికి డబ్బుల్లేవు. నిన్నటి సమస్యకన్నా ఈ రోజు సమస్య ఇంకా పెద్దదిగా కనబడింది. తల్లిని. డబ్బడిగితే "సర్లే. ఆ రోజు గొడవ జరిగినప్పటినుంచీ మీ నాన్నగారు నా చేతికి పైసా డబ్బు ఇవ్వటంలేదు. చెక్కుబుక్, పాస్ బుక్ కూడా  తీసేసుకున్నారు. డబ్బుచేతిలో వుంటే నేను పాడైంది కాక, మిమ్మల్ని కూడా పాడుచేస్తున్నానంట" అంది.     ప్రీతమ్ కి ఏం చెయ్యాలో తోచలేదు. పొద్దుననించీ అలాగే కుడితిలోపడ్డ ఎలకలా తిరుగుతున్నాడు. అకస్మాత్తుగా అతనికి ధాత్రి గుర్తుకొచ్చింది.     శ్రీలక్ష్మి, విష్ణువర్ధన్ ల ఏకైక కుమారై. పన్నెండేళ్ళ క్రితం కాలనీ నుంచి వెళ్ళిపోయి తర్వాత కలిసిన ధాత్రి....     ఆ విధంగా అతను, ధాత్రి డాన్స్ స్కూల్ నుంచి బయటకొచ్చే సరికి అక్కడ నిలబడి ఆమెకోసం ఎదురు చూస్తున్నాడు.     ప్రీతమ్ ణి చూడగానే ధాత్రి ఒక్కక్షణం ఆశ్చర్యపోయింది. తనిచ్చిన అడ్రస్ గుర్తుపెట్టుకుని అతనలా వస్తాడని ఆమె వూహించలేదు. అయితే ఆ రోజు ధాత్రి మూడ్ సరిగ్గాలేదు. ప్రొద్దున్నే ఆమె తల్లికీ, తండ్రికీ మధ్యా పెద్ద గొడవ జరిగింది.     పల్లెలో వున్న ఇల్లూ, పొలం అమ్మేసేసి, వచ్చిన ఆరేడు లక్షలు బ్యాంకులో వేసి కూతురు కోసం పెళ్ళి సంబంధాలు చూద్దామంటాడు విష్ణువర్థన్. అతడి దగ్గర  డబ్బుంటే ఎలా తగలేస్తాడో శ్రీలక్ష్మికి తెలియనిది కాదు.     "మనవాళ్ళంతా విశాఖపట్నంవైపే వున్నారు. అక్కడికెళ్ళి ఒక ఫైవ్ స్టార్ హొటల్లో దిగి, ఒక కారు అద్దెకి తీసుకొని సంబంధాలు వెతకటం మొదలుపెడితే ఒక నెలలో మంచి సంబంధం దొరుకుతుంది" అంటాడతను.     అతడు స్టార్ హొటల్లో దిగటం, ఆ ఖర్చు అదంతా దేనికోసమో వూహించలేనంత అమాయకురాలు కాదు శ్రీలక్ష్మి. ఇద్దరికీ మధ్య ఆ విషయమై పెద్ద గొడవ జరిగింది. అతడు  విసురుగా ఇంట్లోంచి వెళ్ళిపోగానే శ్రీలక్ష్మి కూతురువైపు తిరిగి "ఇదంతా నీ అసమర్థతవల్లే జరుగుతోంది! మంచి డాన్సర్ వైతే ప్రపంచ యాత్రలన్నీ చేయించేదాన్ని. రాష్ట్రస్థాయిలో మంచి టెన్సిస్ ప్లేయర్ వి అయ్యుంటే పిలిచి మంచి ఉద్యోగం యిచ్చి వుండేవారు. అటు చదువులోనూ పైకి రాలేదు. ఇటు డాన్సర్ వి కాలేదు. ఆయనేమో నీ పెళ్ళయ్యేవరకూ కూడా ఆగకుండా వున్న ఆస్థంతా తగలేస్తున్నాడు. ఇదంతా నా ఖర్మ" అని తల బాదుకుంటూ ఏడవసాగింది.     టీనేజ్ సంతానం ముందు తల్లిదండ్రులు ఈ విధంగా పోట్లాడుకోవటం ఏడుపుతో బరస్ట్ అవటం వాళ్ళమీద  మానసికంగా  ఎంత దెబ్బతీస్తుందో చాలామంది తల్లిదండ్రులు వూహించలేరు.     ధాత్రి ఇంకా ఆ మూడ్ లోనే వుంది. అందువల్ల ప్రీతమ్ కనబడినా కూడా ఆమె మొహం సంతోషంతో విప్పారలేదు. అయితే ఆ విషయాన్ని ప్రీతమ్ వెంటనే గ్రహించాడు. కొంతసేపు ఇద్దరూ మౌనంగా నడిచాక "ఎందుకలా డల్ గా వున్నావు ధాత్రీ?" అని అడిగాడు.     "ఏమీలేదు".     "ఏం చెయ్యాలి నేనిప్పుడు?" అకస్మాత్తుగా అడిగాడు.     ఆమె అర్థంకానట్టు చూసి "ఏం చేయటం ఏమిటి?" అని అడిగింది.     "నేను ఏం చేస్తే నువ్వు నీ బాధని మర్చిపోయి నవ్వగలవ్? నాకు నాట్యం రాదు. భరతనాట్యం అస్సలు రాదు. అయినా చేసి చూపిస్తానుండు" అంటూ  సినిమాలో హీరోయిన్ నడుస్తూ వుంటే హీరో రెండడుగులు ముందుకేసి ఆమె ముందు ఎలా డాన్స్ చేస్తాడో అలా చేయటం మొదలుపెట్టాడు.     ధాత్రి చిన్నగా నవ్వి "ప్లీజ్ ప్రీతమ్! అందరూ చూస్తున్నారు. నాతో కలిసి  నడువ్" అంది. అప్పటికే వాళ్ళిద్దరూ చాలా పరిచయమున్నట్టు మాట్లాడుకోసాగారు.     ఆమెతో కలిసి నడుస్తూ ప్రీతమ్ అన్నాడు. "నీ బాధేమిటో నాకు తెలియదు అదేమిటో చెప్పమని కూడా నేనడగను. కానీ ఎప్పుడైనా నీ మనసు బాధపడితే  అక్కడికి తొంగి చూడు. ఆ మనసులోనే ఒక స్నేహితుడుంటాడు".     "థాంక్స్" అంది ధాత్రి మనస్ఫూర్తిగా.     ప్రీతమ్ త్వరగా అడ్వాన్స్ అవదల్చుకోలేదు. అంతకుముందు అలా అడ్వాన్స్ అయినప్పుడు నిఖిత నేర్పిన పాఠాన్ని అతడు  మర్చిపోలేదు. తొందరపాటుతో వ్యవహరిస్తే ఆడపిల్లలు వెంటనే కట్ చేసుకునే అవకాశం వుందని అతడికీ అనుభవం నేర్పింది.     "మనం ఇప్పుడు అర్జంటుగా ఒక చోటుకి వెళ్ళాలి" అన్నాడు సీరియస్ గా.     "ఎక్కడికి?" అనడిగింది అమాయకంగా.     "నువ్వు ఉదయం నుంచీ ఏమీ తినలేదన్న విషయం నిజమేకదా?"     నిజమే. ఆ విషయం  కూడా  ఆమెకి గుర్తులేదు. ఉదయం నుంచి ఇంట్లో యుద్ధం జరుగుతోంది. తల్లి వంట కూడా చేయలేదు.     "అయితే వెళ్దాం పద" అంది.     "చూడు ధాత్రీ, ఏ విషయమైనా ఫ్రాంక్ గా మాట్లాడటం నాకు అలవాటు. నిన్నిప్పుడు హొటల్ కి తీసికెళ్ళాలని వుంది. కానీ నా దగ్గిర డబ్బుల్లేవు" అన్నాడు.     ధాత్రి విప్పారిన నేత్రాలతో అతడివైపు చూసింది. "ఎంత ఫ్రాంక్ గా మాట్లాడుతున్నాడు" అనుకుంది. అమ్మాయితో పరిచయమైన మొదటి సారే ప్రతి అబ్బాయీ తనెంత ఫ్రాంక్ గా మాట్లాడతాడో తెలపాలకుంటాడని, ఆ ఫ్రాంక్ నెస్ ద్వారానే  ఆమెని  గెలవాలనుకుంటాడని తెలియనంత అమాయకురాలు ఆమె.     ఇద్దరూ హొటల్ లో కూర్చున్నారు. ఎదురుగా పెట్టిన పదార్థాల వంక చూస్తుంటేనే గాని, తనకి నిజంగా ఎంత ఆకలిగా వుందో ధాత్రికి అర్థంకాలేదు. ప్రీతమ్ ఎక్కువ తినలేదు. ఆమెతో సరదాగా కబుర్లు చెబుతూ గడిపాడు. సంభాషణ, టిఫినూ పూర్తయ్యేసరికి ధాత్రి దాదాపు తన బాధని మర్చిపోయింది.     "బిల్ పే చెయ్యి" అంటూ రెండు వంద రూపాయల నోట్లని అతనికి అందించింది. అతడు మారుమాట్లాడకుండా వాటిని అందుకున్నాడు.     రెస్టారెంట్ నుంచి బయటికొచ్చేసరికి బాగా చీకటిపడింది. "నేనిక ఇంటి కెళ్తాను" అంది ధాత్రి.     "అలాగే. వెళ్దువుగాని.... రెండు నిమిషాలాగు" అని చెప్పి పక్కనే వున్న కిళ్ళీ షాప్ లోకి వెళ్ళి వచ్చాడు. చనువుగా ఆమె పర్సు అందుకొని, చేతిలో వున్నది అందులో పడేశాడు.     "ఏమిటిది?"     "పాన్"     ధాత్రి కంగారుగా "నా కలవాటు లేదు" అంది.     "అలవాటు లేకపోయినా ఇది వేసుకో. ఇప్పుడు కాదు, రాత్రి పడుకునే ముందు తిను. మంచి నిద్రపడుతుంది" అతని కంఠం ఆర్ద్రంగా, సానుభూతిగా, జాలిగా మారింది "ఆ నిద్ర నీకు చాలా అవసరం ధాత్రీ. అప్పుడుగానీ నీలో ఆ దిగులు తగ్గదు. ఒక నిజమైన స్నేహితుడిగా చెబుతున్నాను. నువ్వెప్పుడూ హాయిగా మనస్ఫూర్తిగా నవ్వుతూ వుంటే నాకు చాలా బావుంటుంది" అని అక్కడినుంచి కదిలి వెళ్ళిపోయాడు. ధాత్రి పర్స్ పట్టుకొని అలాగే నిలబడి వుంది. అప్పటికే ఆమె పూర్తిగా కరిగిపోయింది. ప్రస్తుతం ప్రీతమ్ ఆమెకి చాలా ఆప్తుడిలా కనిపిస్తున్నాడు.                              *    *    *     ఇంటికి వచ్చేసరికి పరిస్థితిలో మార్పేమీ కనపడలేదు. విష్ణువర్థన్ అప్పటికే బాటిల్ ఓపెన్ చేసి ఆ లోకంలో మునిగిపోయాడు. శ్రీలక్ష్మి ముసుగుతన్ని పడుకుని వుంది. ధాత్రి తన గదిలోకి వెళ్ళి డ్రస్ మార్చుకొని, మంచంమీద వాలిపోయింది.     చాలా విచిత్రమైన పరిస్థితి ఇది. ఇంట్లో తను అడుగు పెట్టినప్పుడు కనీసం  తనని మందలించేవాళ్ళు కూడా లేకపోవటం మనసుకి సంతృప్తినివ్వకపోగా  మరింత అసంతృప్తికి గురిచేసింది. అప్పుడే ఆమెకి ప్రీతమ్ ఇచ్చిన ప్యాకెట్  గుర్తొచ్చింది. పర్స్ తీసి అందులోంచి ఆ ప్యాకెట్ బయటికి తీసింది. హొటళ్ళల్లో పెట్టే పేపర్ నేప్ కిన్ అది. విప్పితే లోపల కిళ్ళీతో పాటు బిల్ పే చేయగా మిగిలిన చిల్లరుంది. నేప్ కిన్ మీద హడావుడిగా ఉత్తరం వ్రాసినట్టుగా కూడా వుంది.     "ధాత్రి,     స్నేహమంటే చెప్పకుండానే ఎదుటి వారి బాధని అర్థం చేసుకోవడం, పరోక్షంగా ఓదార్పు నివ్వటం అని నేను నమ్మతాను. నేను నీకు మంచి స్నేహితుడిని అని నీకు తోడుగా వుండటానికి నేనున్నానని గుర్తుతెచ్చుకొ. నా స్నేహితుడు రాజా ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. నువ్వు ఫోన్ చేసి  ఎప్పుడు కలవమంటావో చెబితే చాలు, రెక్కలు కట్టుకొని నీ ముందు వాలుతాను, ధాత్రీ నా పరిచయం నీ కిష్టంలేకపోయినా, నా కంపెనీలో నీకు ఆనందం కలగకపోయినా నాకు ఫోన్ చెయ్యకు. నా అంతట నేను నిన్ను కలవటానికి ప్రయత్నించనని వాగ్దానం చేస్తున్నాను.                                                                    ప్రీతమ్"     ఆ పక్కనే ఫోన్ నెంబరుంది. తను వాష్ బేసిన్ దగ్గరి కెళ్ళినపుడు బహుశా ఈ ఉత్తరం వ్రాసి వుంటాడు. ధాత్రి ఆ ఉత్తరాన్ని అలాగే పట్టుకొని చాలాసేపు  నిలబడింది. ఆమె మనసులో బాధ పూర్తిగా తగ్గిపోయిట్లనిపించింది. కిళ్ళీ తీసి  నోట్లో వేసుకుంది. నములుతూ వుంటే ముందు చేదుగా అనిపించినా అర్థంకాని తియ్యటిమత్తు ఆమెని క్రమక్రమంగా ఆవరించింది. గాల్లో మెల్లగా తేలిపోతున్నట్లు నీటిమీద పడుకొని లూగుతున్నట్లు తెలియని గిలిగింత!     ఆ హాయిని అనుభవిస్తూనే ఆమె నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. తెల్లవారేవరకు అసలు మెలుకువే రాలేదు.     ఆ మర్నాడు పొద్దున్నే ఆమె ఫోన్ చేసి  ఆ మధ్యాహ్నమే ప్రీతమ్ ని కలుసుకుంది. సాయంత్రం వరకూ వాళ్ళిద్దరూ ప్రపంచంలోని విషయాలన్నీ మాట్లాడుకున్నారు. ధాత్రి తన ఇంటి పరిస్థితినీ, తన బాధనీ  పూర్తిగా  విప్పి చెప్పింది. చీకటి పడుతుండగా ఇద్దరూ సెలవు తీసుకొని విడిపోయారు. వెళ్ళేముందు అడిగి మరీ కిళ్ళీ కొనిపించుకొని వెళ్ళింది.     ఆ రాత్రి ఆమెకో కల వచ్చింది. ఏదో సినిమాలోలాగ ఆమె నిప్పుల మధ్య నాట్యం చేస్తూ సొమ్మసిల్లి పడిపోయింది. తల్లి హంటర్ తీసుకొని కొడుతూ "డాన్స్.....డాన్స్...." అని అరుస్తోంది. తండ్రి దూరంగా కుర్చీలో కూర్చొని, టేబుల్ మీద బాటిల్ పెట్టుకొని డ్రింక్  చేస్తున్నాడు. ఆమె అతికష్టంమీద  లేచి  నిలబడి మళ్ళీ నాట్యం చేయటం ప్రారంభించి సత్తువలేక తూలిపోతోంది. తల్లి చేతిలో కొరడా మళ్ళీ గాలిలోకి లేచింది. ఆ సమయంలో మేఘాల్లోంచి ఎగురుకుంటూ ప్రీతమ్ వచ్చాడు. తల్లి చేతిలో కొరడా  లాగి దూరంగా విసిరేసి, తనని తీసుకొని రథం ఎక్కించుకొని మళ్ళీ మేఘాల్లోకి వెళ్ళిపోయాడు. ఆమె అలా గాలిలో తేలుతోంది. మేఘాల్లో నక్షత్రాల్లాగ 'కిళ్ళీలు' ఆకాశమంతా నిండి వున్నాయి.                                                                       2     "అవినాష్..... అవినాష్....." తలపుమీద దబదబా బాదుతున్న చప్పుడికి ఆలోచనల నుంచి బయటపడి తలుపు తీశాడు అవినాష్. ఎదురుగా తండ్రి నించొని వున్నాడు. శంకరం మొహం సంతోషంతో వెలిగిపోతోంది.     "వెంటనే బయలుదేరు"     అవినాష్  ఆశ్చర్యంగా "ఎక్కడికి డాడీ?" అని అడిగాడు.     "బాంబేనుంచి ట్రంకాల్ వచ్చింది. నువ్వు రేపు ఉదయమే ఉద్యోగంలో చేరాలట. బట్టలు సర్దుకో. ప్లయిట్ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నాను" అన్నాడు శంకరం హడావుడిగా.     అవినాష్ అర్థంకానట్లు మొహం చిట్లించి "అదేమిటి, జాయినింగ్ టైం ఇంకో వారంరోజుల వరకు వుందిగా" అన్నాడు.      
24,782
    కనుక అత్యంత అతి సంక్లిష్టమైన క్రిప్టోగ్రాఫ్ పరీక్షకు అంగీకరిస్తే మనం, కాలం సద్వినియోగం అవుతుందేమో ఒకసారి ఆలోచించండి" అన్నాడు శివస్వామి ఎంతో సౌమ్యంగా.          మిగతావాళ్ళు ఆలోచనలో పడిపోయారు.          అలా ఒక గంటపాటు వారిలో వారు తీవ్రంగా చర్చించుకున్నారు.          ఆ చర్చ జరుగుతున్నంతసేపు శృతి అన్వేషి గురించి ఆలోచిస్తోంది. అన్వేషి జాడలేకపోవటం, అతని గురించి అక్కడ ఏ ఒక్కరూ పట్టించుకోక పోవటం శృతికి బాధగా వుంది.          ఒక గంట తరువాత అకియోతోనో క్రిప్టోగ్రాఫ్ పరీక్షకు నిలవబెట్టాలని నిర్ణయానికొచ్చేశారు.          ఆ నిర్ణయం శృతి కళ్ళలో నీళ్ళు తెప్పించింది. అలా అని చేయగలిగింది కూడా ఏమీలేదు. అందుకే ఆమె దర్శనలింగస్వామి, లలాటనేత్ర స్వామి, డాక్టర్ రంగారావుకేసి అభ్యర్ధనగా చూసింది.          ఆమెలో తొణికిసలాడిన భావాన్ని ఆ ముగ్గురూ స్పష్టంగా అర్ధం చేసుకున్నారు. ఆ భావాన్నే ఆమెకి తమ కళ్ళద్వారా తెలియజేశారు. శృతి అప్పటికిగాని ఉద్రిక్తత నుంచి బయటపడలేదు.                                                       *    *    *    *             "మైడియర్ ఫ్రెండ్స్! ఇప్పుడు రెండో అధ్యాయం ప్రారంభం కాబోతూంది. ఈ అధ్యాయంలో విశ్వాత్మ స్వయంగా రూపొందించిన క్రిప్టోగ్రాఫ్ కంప్యూటర్ అకియోతో ఆపరేట్ చేయటం మొదటి దశ అవుతోంది. అందులో నిక్షిప్తమయిన ప్రశ్నలకు అతను సమాధానం చెప్పడం రెండో దశ అవుతుంది. లెటజ్ మూవ్" అంటూ మిత్రా లేచారు.          మిగతా కమిటీ సభ్యులందరూ లేచి మిత్రాను అనుసరించేందుకు సిద్దమయ్యారు.          జరగరానిదేదో జరుగుతున్నట్లు, జరగబోతున్నట్లుగా ఫీలయింది శృతి.          తనలో కదలాడుతున్న భావాల్ని నిర్భయంగా వ్యక్తం చేయలేక ఉన్మత్తతతో కూడిన ప్రశాంతతలో, నిస్సహాయతలో కూరుకుపోయి వారిని అనుసరించేందుకు సిద్దమయింది చివరికి.          "మనమిప్పుడు ఈ బిల్డింగ్ అండర్ గ్రౌండ్ లోనే వున్న క్రిప్టోగ్రాఫ్ మెషిన్ దగ్గరకు వెళుతున్నాం" అంటూ ఆ హాలులోంచి విశ్వాత్మ బెడ్ కేసి నడవటం ప్రారంభించాడు డైరెక్టర్ మిత్రా.                                      *    *    *    *             సరిగ్గా అదే సమయానికి ఆ ప్రదేశానికి ఎక్కడో దూరంగా బందీగా వున్న అన్వేషి శరీరం ఒక్క క్షణం ఉలికిపాతుకు గురి అయింది.          అతని కళ్ళు నెమ్మదిగా తెరుచుకున్నాయి.          ఎదురుగా గాడాంధకారం.....          క్రమంగా అతని కళ్ళు చీకటిలో సైతం చూడగల మార్జాలపు కళ్ళలా మారిపోయాయి.          ఆ మరుక్షణం ఆ కళ్ళనుంచి లేజర్ బీమ్స్ లా ఓ రకమైన కాంతి కిరణాలు తలుపువైపు ప్రసరించసాగాయి నెమ్మదిగా.          సప్తసముద్రాల కావలనుంచి గిరి శిఖరాల కొండల అంచుల్లోంచి జగజ్జేయమానంగా భారతావని పరిపాలించి శత్రువుల గుండెల్లో సింహస్వప్నం అయిన కోటల గోడల్లోంచి, బురుజుల్లోంచి శత్రురక్షణ పర్యవేష్టితమైన కందకాల్లోంచి ఓ ఉద్వేగభరితమైన ప్రణవనాదం ఝాం అంటూ తుమ్మెదనాదంలా ఆ గదిలో క్రమంగా వూపిరి పోసుకుంటోంది.          అది శృతి లయబద్దంగా ఆ గదిలో ప్రతిధ్వనిస్తోంది.          ఒక జీవికి, గురు ప్రపంచం మహాతపోశక్తితో తమలోని సర్వశక్తుల్ని ఒక కాంతికిరణంలో జొప్పించి, మహాశక్తి సంపన్నుల్ని చేస్తున్న వుద్వేగభరితమైన అపూర్వ  సన్నివేశం అది....          విజయాన్ని సాధించిన ప్రతి వ్యక్తి గొప్ప బాధ్యతను సక్రమంగా నిర్వర్తించినవాడే...          నువ్వు నా అపారసంపదను కాపాడవా?          నా అధ్యాత్మిక నమ్మకాన్ని పరిరక్షించవా?          నా నమ్మకాన్ని నిజం చేయవా?          నా ఆత్మ పరితపిస్తోంది.          నా ఆత్మ శోభిస్తోంది...          నా అంతరంగం అతలాకుతలం అవుతోంది.          గుసగుసలుగా అంటున్నట్లు ఆ మాటలు అన్వేషి చెవుల్లో ధ్వనిస్తున్నాయి.          అది ఒక బ్రహ్మయజ్ఞంలోని పూర్వకర్మ...          అది అనితర సాధ్యం... అది అఖండం.          అది అపూర్వం... అది అనన్యం...          రవ్వంత శాస్త్ర విజ్ఞానానికి అంతుపట్టని అమేయ ఆధ్యాత్మిక ప్రపంచపు అట్టడుగు పొరల్లో రేగుతున్న సంచలనం...          క్రమంగా ఒక కాంతికిరణం జ్యోతిరూపంలో శూన్యాన్ని ఆధారంగా చేసుకొని మలయమారుతంలా, మందగమనంతో వెళ్ళి పద్మాసనంలో నిష్ణాగరిష్టుడై కూర్చున్న అన్వేషి నాభిప్రాంతాన్ని అతి సున్నితంగా తాకింది.          నాభి ద్వారా తల్లి గర్భంలో ప్రాణం పోసుకునే జీవం తల్లి నుండి విడివడ్డాక తిరిగి ఆ జీవిని బలోపేతం చేసే అతీంద్రయానుభవం...          గదిలో దివ్య పరిమళాలు హఠాత్తుగా చోటు చేసుకున్నాయి....          సాంబ్రాణిని, నిప్పులపై వేసి కాల్చిన భావన.... క్రమంగా ఆ గదిలో తెలిమంచుల్లాంటి పొగ ప్రవేశించసాగింది.          నెమ్మది నెమ్మదిగా అన్వేషి పద్మాసన బంధనాల్నుంచి విముక్తుడై లేచి నిలబడ్డాడు.                                                       *    *    *    *             మరో అయిదు నిమిషాలకు అకియోతోని తను వెంట తీసుకెళుతున్న విశ్వాత్మ ఫౌండేషన్ కమిటీ సభ్యులు, తాళం వేసి సీలు చేసి వున్న విశ్వాత్మ పర్సనల్ రూం ముందున్నారు.          అక్కడున్న అందరిలోను పెను ఉద్వేగం గూడు కట్టుకొని వుంది. అప్పటికీ కొన్నివందల మంది అభ్యర్ధులు తామే విశ్వాత్మ అంటూ ఆగది లోంచి నేలమాళిగకు చేరుకున్నారు.          విశ్వాత్మ తన అపారమైన మేధస్సును, సాంకేతికనిపుణతని, అకుంఠిత దీక్షతో రంగరించి సృష్టించిణ అనన్యమైన, అపురూపమైన అనితర సాధ్యమైన క్రిప్టోగ్రాఫ్ మెషిన్ ముందు తలవంచక తప్పలేదు.
24,783
     "నన్ను గురించి నాకే తెలియని ఈ సమాచారం అసలు నీకెలా తెలిసింది మీనాక్షి?"     చెబుదామా వద్దా అని ఒక్క క్షణం తటపటాయించి, తర్వాత చెప్పింది మీనాక్షి.     "ట్రస్టీ సుందరం చెప్పాడు?'     "ఓహ్! ఐసి! అయినా వాడు నీకే ఎందుకు చెప్పాడూ?"     లజ్జితురాలాయినట్లు తల వంచుకుంది మీనాక్షి.. తర్వాత మాటలు కూడదీసుకుంటూ నెమ్మదిగా చెప్పింది.     "మీతో ప్రేమ నటించి, పెళ్ళిదాకా తీసుకువచ్చి, ఆ విధంగా మిమ్మల్ని మీ ఆస్తికి దూరం చేస్తే, నాకు అయిదు లక్షలు ఇస్తానన్నాడు సుందరం."     "మరి నాటకం మొదలుకాకుండానే మానేశావెందుకు?"     "మీతో కలిసి ఆ కాసేపు కార్లో వస్తున్నప్పుడు మీ మంచితనం గ్రహించాను. ఇంత మంచి మనిషికి ద్రోహం చెయ్యడం మహా పాపం అనిపించింది. అందుకనే మానేశాను" అని అంతలోనే అర్జంటుగా  అంది మీనాక్షి.     "నేను మీ అయిదు లక్షలకి ఆశపడి ఇలా నాటకం ఆడడానికి వప్పుకున్నమాట నిజమే! అయితే ఆ అయిదు లక్షలూ నేను ఎంజాయ్ చెయ్యడానికి కాదు. ఆ డబ్బు అమ్మ ట్రీట్ మెంటుకి పనికి వస్తుందనుకుని ఆశ పడ్డాను. కానీ నేను చేస్తున్నది తప్పు అని గ్రహించాక, తక్షణం ఆ అయిదు లక్షలు సుందరంగాడి మొహాన కొట్టేశాను.     "మరి మీ అమ్మకి ట్రీట్ మెంట్ ఎలా అనుకున్నావ్?"     "దేవుడు లేడా అని అనుకున్నాను. కానీ ఇప్పుడనిపిస్తోంది - దేవుడనే వాడుంటే నా మొర ఆలకించి ఎప్పుడో నన్ను తన దగ్గరికి పిలిపించుకునేవాడు. నేను రెండుసార్లు దారుణమైన ప్రమాదాల్లో ఇరుకున్నా కూడా నమ్మశక్యంకానీ విధంగా బతికిబయటపడ్డాను! పాపీ చిరాయువు అంటారు కదా!"     "నువ్వు పాపివెం కాదు కానీ, ఇంతకుముందు జరిగిన ఆ రెండు ప్రమాదాలూ ఏమిటి?"      క్లబ్బుల్లో తనని ,మల్ హోత్రా బలవంతం చేయ్యబోతుంటే విమానం కూలడం, తను బతికి బయటపడడం, అలాగే దేశపాండే గూండాలు తనని కిడ్నాప్ చేసినప్పుడు ఒక రైలు పట్టాలు తప్పి అదే ఇంట్లోకి రావటం, ఆ కలకలంలో తను పారిపోవడం వివరంగా చెప్పింది మీనాక్షి.     ఆ రెండు ప్రమదాలని నివారించడంలో తన పాత్ర ఏమిటో చెప్పాడు రాజా.     చిత్రంగా అతని వైపు చూస్తూ అంది మీనాక్షి.     "ఆరెండు ప్రమాదాలు గడిచాయా, ఇపుడది మూడోది! ముచ్చటగా మూడోసారి కూడా మీవల్లే నేను రక్షింపబడటం చూస్తే ........"     "ఇదేదో విధి లిఖితం అనిపిస్తోందా!" అన్నాడు రాజా నవ్వుతూ.     "కొద్దికొద్దిగా అలాగే అనిపిస్తోంది" అంది మీనాక్షి.     తదేకంగా ఇంత మంచిదానివి అని తెలిసిన తర్వాత నిన్ను పెళ్ళి చేసుకోకుండా ఎలా వదిలేస్తాడు మీనాక్షి?"     "నన్ను పెళ్ళి చేసుకుంటే - మరి మీ ఆస్తి?"     "నీకంటే నాకు పదివేలు కోట్లు ఎక్కువా?" అతను అలా అనగానే, సన్నటి గర్వం, బోలెడంత సంతోషం సంతోషం, మాటల్లో వర్ణించలేని అర్ధ్రతాభావం ఒక్కసారిగా మీనాక్షి మనసుని ఆవరించేశాయి.     ఆ అమ్మాయిని చూపుడు వేలుతో సరదాగా బెదిరిస్తూ అన్నాడు రాజా. "ఇదిగో! ఇంకెప్పుడు నాతొ ఇలా మనసులో ఒకటీ, పైకి ఒకటీ పెట్టుకుని నాటకాలు ఆడకు. అర్ధమయిందా? అసలు నేను ఒక నాటకం ఆడడానికి గానూ.......పాలెస్ లోకి వచ్చాను - అంతేగానీ ఆస్తికోసం కాదు. నా నాటకం పుర్తయిపోగానే ఇద్దరం హాయిగా పెళ్ళి చేసుకుందాం. ఏమంటావ్?"     "నేను కాస్త ఆలోచించుకోవాలి" అంది మీనాక్షి.     "ఆలోచించడం మొదలెడితే నీకు లక్షరకాల ఆలోచనలు వస్తాయి గానీ ........." అని ఆగి, క్షణంలో సగంలోనే ఒక నిశ్చయానికొచ్చేసినట్లు అన్నాడు రాజా.     "ఇంక ఆలోచనా గీలోచనా జాన్తానై! ఇంక వెర్రి మొర్రి ఆలోచనలు రాకుండా చెయ్యడానికి ఒకే పద్దతి ఉంది."     "ఏమిటన్నట్లు" చూసింది మీనాక్షి.     "నిన్ను ఇప్పుడే, ఇక్కడే నా సొంతం చేసుకుంటాను."     "అంటే ......?" అంది మీనాక్షి బెదిరిపోతూ.     "అంటే .......ఇదీ ....." అని, చటుక్కున ఒక చెయ్యి మీనాక్షి వీపు మీద వేసి ఇంకో చేత్తో ఒత్తుగా ఉన్న ఆమె జడని మెడ దగ్గర పట్టుకుని, ఆమె మొహాన్ని తన మొహం దగ్గరికి తీసుకొచ్చాడు రాజా.     "అయ్యో ........వద్దు ..........వద్దు ........వ........" అంటుండగానే రాజా పెదిమలు ఆమె పెదిమలని మూసేశాడు.     వద్దు వద్దని గింజుకుంటుంది మీనాక్షి. కాని ఆ గింజుకోవడంలో బలం లేదు. అతని బిగికౌగిలి వదిలించుకోవడానికి ఆమె చేస్తున్న ఆమె ప్రయత్నాలలో బలహేనతే ఆమెకి అతనిపట్ల ఉన్న ఇష్టాన్ని సూచిస్తోంది.     ఈలోగా -     పైన వున్న సన్నటి రంద్రం ద్వారా వానకురవడం మొదలయింది. అంత ఎత్తు నుంచి పడుతున్న ఒక్కొక్క చినుకూ , వాళ్ళ మీద పడేలోగా మరింత సన్న తుంపరలాగా మారి, పన్నీరు జల్లుతున్నట్లు అనిపిస్తోంది.     అతని పెదిమలు, ఆమె పెదిమలని , చెంపలనీ , కనురెప్పలనీ స్పృశిస్తున్నాయి - ప్రతి నిమిషానికి ఒక్కసారి, తను అతని కౌగిట్లో ఉండరాదనే విషయం గుర్తు వచ్చినట్లు సూచనప్రాయంగా కాస్త కదులుతోంది మీనాక్షి. మళ్ళీ అంతలోనే పరవశంగా అతనికి మరింత దగ్గరగా జరిగి, హత్తుకుపోతోంది -     ఆ వాన తుంపర తన జాకెట్ నీ, చీరనీ నెమ్మదిగా తడిపేస్తూ, అతనిముందు తనని అర్ధనగ్నంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తోందని ఆమెకి తెలుసు. అయినా కూడా ......     వాళ్ళు మరింతగా దగ్గరయిపోతుండగా ......     అక్కడ - హటాత్తుగా గందరగోళం చెలరేగింది.     మరిక్షనంలో -     వంటవాడు భీం సెయిన్ చేత "చిక్కడు -దొరకడు " అని నామకరణం చేయబడిన పందికొక్కు , అయేషాగారి పిల్లిని తరుముతూ అటువైపు వచ్చింది. అది ఇంతకుముందు ఓసారి పిల్లి తోకని పొరబాటున కొరకడం - ఆ దెబ్బకు పిల్లి అదురుకుని గందరగోళం సృష్టించడం మనకు తెలిసిందే - అప్పట్నుంచే ఆ పందికొక్కుకి ఆ పిల్లి అంటే చెలగాటం కూడా! రివర్స్ గేర్!     పందిలా వున్న పందికొక్కు తరుముతూ ఉంటే పిల్లి ప్రాణభయంతో పరిగెత్తుకు వచ్చి రాజా ఒళ్ళో దూరింది. పందికొక్కు దారితప్పి మీనాక్షి కుచ్చెళ్ళలో దూరిపోయింది.     తక్షణం - "అమ్మావ్!" అని గావుకేక పెట్టింది మీనాక్షి. కేకపెడుతూనే రాజాని మరింత గట్టిగా వాటేసుకుంది.     మీనాక్షిని చేతుల్లో ఎత్తేసుకుని చటుక్కున లేచి నిలబడ్డాడు రాజా .     పందికొక్కు , పిల్లి పారిపోయాయి.     "మనమిక్కడ ఇంక ఒక్క క్షణంకూడా ఉండొద్దు" అంది మీనాక్షి గాభరాగా.     నవ్వాడు రాజా.     "[పదండి వెళ్దాం!" అంది మీనాక్షి తొందరచేస్తూ.     "సరే పద! అయితే గుర్తుంచుకో! మనం పెళ్ళి చేసుకునేవరకూ నువ్వు నా దగ్గరే , ఈ పాలెస్ లోనే నా స్టాఫ్ తో కలిసి పనిచేస్తూ ఉంటావు - అర్ధమయింది కదా!" అన్నాడు.     తల వూపింది మీనాక్షి.     కొద్దినిమిషాల తర్వాత ఇద్దరూ పాలెస్ ఆవరణలోకి చేరుకున్నారు.     అక్కడే కనబడ్డాడు కెప్టెన్ జస్వంతరావు.     వెంటనే జస్వంతరావుకి చెప్పాడు రాజా.     "అంకుల్! ఇవాళ నుంచి ఈ అమ్మాయి మనతోబాటే పని చేస్తుంది - షీ విల్ బీ మై స్పెషల్ అసిస్టెంట్. ఇక్కడ పద్దతులూ అవీ ఆమెకి అర్దమాయేలా చెప్పండి."     "తప్పకుండా! అని రాజాతో చెప్పి, మీనాక్షి వైపు తిరిగి, నాతో రామ్మా!" అన్నాడు జస్వంతరావు.     ఒకసారి రాజా వైపు చూసి జస్వంతరావుతో నడిచింది మీనాక్షి.     మీనాక్షిని తన ఆఫీసులోకి తీసుకెళ్ళాడు ఎస్టేట్ మేనేజర్ జస్వంతరావు - లోపలికి వెళ్ళి వెళ్ళగానే హటాత్తుగా అతని మోహంలో భావాలు మారాయి. గంభీరంగా అన్నాడు మీనాక్షితో.     "మీరిద్దరూ పెళ్ళి చేసుకుందామని ఒక నిశ్చయానికి వచ్చినట్లున్నారే! అప్పుడే నీ మోహంలో పెల్లికుతురి కళ కనబడుతోంది!"     చివుక్కున తల ఎత్తి జస్వంతరావు వైపు చూసింది మీనాక్షి.     జస్వంతరావు అన్నాడు. "ఆఫ్టరాల్! మీ ప్రేమ బలం ముందు పదివేల కోట్ల రూపాయల ఆస్తి పనికిరాదని మీరు అనుకుని ఉంటారు - అవునా? కానీ అది అంత సులభం కాదు! సారి! పరిస్థితి ఇంతవరకూ వచ్చింది కాబట్టి నీకు ఇక్కడో షాకింగ్ న్యూస్ చెప్పాలి! అన్నాడు.     జస్వంతరావు చెప్పిన ఆ షాకింగ్ న్యూస్ వినగానే మీనాక్షికి ప్రపంచం అంతా ఒక్కసారిగా తలక్రిందులయినట్లు అనిపించింది .     అయితే ఇన్నాళ్ళకు     డైమండ్ రాజా, అఠీన్ రాణీ కలిసిపోయారన్నమాట!" అన్నాడు జస్వంతరావు నాందీగా.     రోషంతో మొహం ఎర్రబడగా చివుక్కున తల ఎత్తి చూసింది మీనాక్షి.     జస్వంతరావు మోహంలో కనబడుతున్న భావం ఒక్క భావం కాదు. అనేక భావాల ఛాయలు కనబడుతున్నాయి అతని మోహంలో. ఆమెని చాకితురాలిని చేశాయి అవి.     పక్కా మిలటరీ మాన్ అయిన జస్వంతరావు మొహం పాలిపోయి వుంది. సన్నగా కంపిస్తోంది అతని శరీరం. అతని మోహంలో విషాదం కనబడుతోంది. దానితోబాటే కోపచ్చాయలు కనబడుతున్నాయి. అంతలోనే అదో రకమైన నిర్వేదం కూడా కనబడుతోంది.     జస్వంతరావు మోహంలో క్షణానికోసారి తెరతెరలుగా మారుతున్న భావాలని చూస్తూ అచేతనంగా అలాగే నిలబడిపోయింది. మీనాక్షి. అతని మాటలకి పదునుగా జవాబు ఇవ్వాలనే ఆలోచన అణగారిపోయింది.
24,784
    "అదే ఆలోచిస్తున్నాను" అన్నాడు బెనర్జీ.         "అంత ఆలోచన ఎందుకు బాస్! మక్కెలిరగతన్ని తీసుకొచ్చే మంటావా?" రెండోవాడన్నాడు.         "ఆ పని చెయ్యడం చాలా సులభం......నా చెల్లి మాయా అంటే ఎవర్రా.....నా ప్రాణానికి ప్రాణం....ఆ పిచ్చిది...వాడ్ని ప్రేమించింది....దాని ప్రేమ ఎంత గొప్పదో....ఆ ఇడియట్ అర్ధం చేసుకున్నాడా? లేదు.....దానిమీద కోర్టులో కేసు వేస్తాడా.....అది, ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి కారణం....వాడు కాదూ....         నా చెల్లి ఇప్పటికీ, వాడ్ని ప్రేమిస్తోంది. కాబట్టి వాడు బ్రతికిపోయాడు...లేకపోతే....ఎప్పుడో వాడ్ని ముక్కలు, ముక్కలుగా నరికేసే వాడ్ని....         ఎమ్.డి.పదవినీ, కోట్లాది ఆస్థినీ, ఆఖరికి తన మారుతీకారుని తృణప్రాయంగా అలా వదిలేసి వెళ్ళిపోయిందిరా....ప్రేమకోసం అలా, అంత గొప్ప తండ్రిని వదిలేసి వెళ్ళిపోయిన మనిషిని ఈ కాలంలో ఎవరినైనా చూశార్రా...నో...అందుకే అయ్ వాంట్ టు డు సమ్ థింగ్ ఫర్ హెర్....కానీ__ఆ విషయం...మాయకు తెలియకూడదు ఎందుకంటే తెలిస్తే బాధపడుతుంది. అదెంత గంభీరంగా, పట్టుదలగా వుంటుందో అంత పసితనం దానిలో వుంది..." డ్రింక్ ను గడగడా తాగేసి, చిన్నపిల్లాడిలా బాధపడుతున్నాడు బెనర్జీ.         "అయితే ఏం చెయ్యమంటావ్?" అడిగాడు ఎదురుగా కూర్చున్న ఫ్రెండ్.         "ఆ మనోహర్ ఎక్కడున్నా తీసుకొచ్చేయండి. తర్వాత సంగతి నేను చూసుకుంటాను" నెమ్మదిగా అన్నాడు బెనర్జీ సిగరెట్ తీసి వెలిగించుకుంటూ.         "రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ...అతన్ని తీసుకొచ్చి నీ ముందు పెట్టే బాధ్యత మాది ఒకే....డోంట్ వర్రీ...చీ....చీర్ ఫుల్...." అలా అంటున్న ఇంకో ఫ్రెండ్ వేపు చూసి, నవ్వలేక నవ్వాడు బెనర్జీ.                                                            *    *    *    *         పొలానికెళ్ళి అరగంటలోనే తిరిగొచ్చిన భర్త కుటుంబరావు వేపు అనుమాస్పదంగా చూస్తూ "ఏంటి వెంటనే వచ్చేశారు..." అంది విశాలాక్షి.         కుటుంబరావు మాట్లాడలేదు.         విశాలమైన వరండాలో పిచ్చెత్తిన వాడిలా తిరుగుతున్నాడు. అరగంటసేపు అలా పచార్లుచేసి రకరకాలుగా ఆలోచించి-         పెరట్లోకి వచ్చాడు. కూతురు సరోజ కోసం చూశాడు. ఎక్కడా కనబడలేదు.         "అమ్మాయి ఏది?" కనిపించటంలేదు" అని అడిగాడు.         "పక్కింటి లక్ష్మితో గుడికెళ్ళింది" అని బదులిచ్చి-         "ఏంటలా వున్నారు?" అని అడిగిందామె భర్తచేతికి కాఫీ గ్లాసునందిస్తూ.         "కానీ వాళ్ళని కాదని, అయిన వాళ్ళని నమ్మినందుకు నాకు బాగా బుద్దొచ్చింది. మేనల్లుడు, మేనల్లుడు అనీ, నెత్తిన పెట్టుకోవద్దని, అప్పటికీ నువ్వు చెపుతూనే వున్నావ్. తగిన శాస్తి జరిగింది విశాలా....మన సరోజకి ఆ ఏలూరు సంబంధం చేసేద్దాం. నువ్వేమంటావ్?"         పెరట్లో, మెట్లమీద కూర్చుంటూ, కాఫీ తాగుతూ అడిగాడతను.         అప్పటికిగానీ ఆ మాటల వెనక బాధ అర్ధంకాలేదామెకు.         "ఏం జరిగిందో చెప్పకుండా, ఆ ఏలూరు సంబంధం ఏమిటి? చెప్పండి ఏం జరిగిందో?"         "హైదరాబాద్ నుంచి పోస్టు మేస్టర్ అనంతరామయ్య ఉదయాన్నే వచ్చాడు. దారిలో కలిశాడు. మన మనోహర్...ఆ మాయ అమ్మాయిని ఇంట్లోకి తెచ్చేశాడట."         "ఆ...." అని నిర్ఘాంతపోయింది ఆ మాటలకు విశాలాక్షి.         "ఏమిటి....పెళ్ళాంగానే" అందామె.         "పెళ్ళాంగా తెచ్చుకున్నాడో, ఉంపుడుగత్తెగా తెచ్చుకున్నాడో....నాకనవసరం. ఈ విషయం తెలిస్తే, సరోజ మనసు ముక్కలుముక్కలై పోతుంది...ఏం చేద్దాం."         "ఏం చేద్దామని....నెమ్మదిగా అడుగుతారేంటండీ. వాడికి బుద్ధిలేకపోతే అన్నపూర్ణమ్మకు, ప్రకాశర్వుకు ఏమైందీ...చూడండీ....వాళ్ళ పరువు ఎలాగూ పోయింది. చిన్నప్పటినుంచి మనోహర్ నీ మొగుడూ అని మనం అనబట్టేగదా మరెవడ్నీ చేసుకోనని సరోజ కూడా పట్టుబట్టింది. నేనొకటి చెప్తాను...వింటారా ఏ పరిస్థితుల్లో ఆ పిల్ల, అంటే ఆ మాయ ఆ ఇంటికొచ్చిందో మంకయితే తెలియదు. మనం ఇప్పుడే బయల్దేరుదాం. విషయం చెప్పకుండా సరోజను కూడా తీసికెళదాం. ముహూర్తాలు పెట్టుకుని వచ్చేద్దాం. మనం అక్కడకు వెళితే అన్ని విషయాలు తెలుస్తాయి కూడానూ" అందామె కొంచెం శాంతంగా.         అప్పుడే లోనికి అడుగుపెట్టిన సరోజకు-         "ముహూర్తాలు పెట్టుకుని వచ్చేద్దాం" అన్నమాట వినబడడంతో తల్లి దగ్గరకొచ్చింది నేరుగా.         "సరోజా! సూట్ కేస్ సర్దు....మనం హైదరాబాద్ వెళుతున్నాం" అందామె.         "కాలేజీయో" అందామె.         "ఆ కాలేజీ ఎక్కడికీ పోదుగానీ....ముందు తయారవు. ఇప్పటికే ఆలస్యమైంది....ముహూర్తాలు పెట్టేస్తేనే అన్ని రోగాలు కుదిరిపోతాయి. చూడండీ....అక్కడికెళ్ళాక, మీరేం మాట్లాడొద్దు. వ్యవహారం నేను సెటిల్ చేస్తాను" పెద్ద పట్టుదలతో అంది విశాలాక్షి.                                                           *    *    *    *         సాయంత్రం అయిదు గంటలు దాటింది.         స్నానం చేసి, బీరువాలోని నీలం పువ్వుల చీర తీసుకుని కట్టుకుని, పాతకాలపు నిలువెత్తు అద్దంముందు నుంచుని తలదువ్వుకుంటోంది మాయ.         అన్నపూర్ణమ్మ తనపట్ల కోడలిగా ఆప్యాయత చూపిన దగ్గర్నించీ-         "ఈ ఇల్లు నాది....ఈ వ్యక్తులు నా వాళ్ళు" అనే భావనతో చాలా సంతోషంగా వుందామెకు.         అదే సమయంలో వంటగది దగ్గర్నించి విన్పిస్తున్న మాటలు చెవినపడడంతో, తలుపు దగ్గరకెళ్ళి నిలబడింది.         "కోర్టులో కేసు వేసిన పిల్ల, అదేదో సినిమాలోలాగా, నీకొడుకుని గెలుచుకుందటగా" ఒకామె గొంతు బొంగురుగా వుంది.
24,785
                       జ్ఞాననందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం |                       ఆధారస్సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మమే ||                                ముప్పది అయిదవ అధ్యాయము     (పితృమేధ సంబంధినో మన్త్రా ఉచ్యన్తే - పితృమేధ సంబంధ మంత్రములు చెప్పబడుచున్నవి) 1.    అపేతో యన్తు పణయ్కో సుమ్నా దేవపీయవః|     అస్యలోకః సుతావతః|     ద్యుభిరహోభిరక్తు భిర్వక్తం యమో దదాత్వవ సానమస్మై ||     అసుఖకారులు, దేవహింసకులగు పణులు ఇచటి నుండి తొలగి పోవలెను. ఇదియే అభిషవకారి స్థానమగును. ఋతువులు, దివసములు, రశ్ములు యొక్క ఈ స్థానమును యముడు ఈ మృతునకు ప్రదానము చేయును గాత.     2. మృతుడా! నీ  అంగముల కొరకు సవిత పృథ్వి లోపల స్థలము కోరును గాత. అందుకు ఎద్దులను కూర్చుము.     3. ఈ స్థలమును వాయువు పవిత్రము చేయును గాత. సవిత పవిత్రము చేయును గాత. అగ్నితేజము, సూర్యుని కాంతి ఈ స్థానమును పావనము చేయుదురు గాత.         (ఆ స్థలమున నాలుగు చాళ్లు నాగలి దున్నవలెను)         ఎద్దులను నాగలి నుంచి విడువవలెను.     4. (ఆ స్థలమును త్రవ్వి మృతుని అస్థికలను పాతి పెట్టవలెను.)     ఓషధులారా! అశ్వత్ధమున మీరు ఆసీనులు అయి ఉన్నారు. పలాశపత్రములందు నివసించి ఉన్నారు. మీరు నరుని సేవించవలసి ఉన్నది. భూమిలోన చేరండి.     5. మృతుడా! సవిత నీ అస్థికలను భూమి వడియందు చేర్చును గాత. భూదేవీ! ఈ  మృతుని కొరకు నీవు శాంతి దాయినివి అగుము.     6. మృతుడా! నీటితావరము వద్ద నిన్ను ప్రజాపతి యందు చేర్చుచున్నాను. ఆ ప్రజాపతి మా పాపములను దహించును గాత.     7. మృత్యువా! నీ మార్గము దేవయానము మాత్రముకాదు. మరేదైనా దూరపు మార్గమున తొలగిపొమ్ము. చెవులు కన్నులున్న నీతో చెప్పుచున్నాను. నీవు మా సంతానమును తాకకుము. మా వీరులను తాకకుము.     8. మృతుడా! వాయువు నీకు సుఖకరుడు అగును గాత. సూర్యుడు సుఖంకరుడు అగును గాత. ఇటుకల సుఖంకరములు అగును గాత.     (సమాధియందు ఇటుకలను పేర్చవలెను.)     మృతజీవీ! ఈ పార్థివ అగ్నులు నీకు సుఖము కలిగించుము గాత. అవి నిన్ను దహనము చేయకుండును గాత.     9.  నీ కొరకు దిశలు ఏర్పడును గాత. నీకు జలము అత్యంత సుఖదమగును గాత. నదులు నీకు సుఖములను ఇచ్చును గాత. అంతరిక్షము శుభప్రదమగును గాత. దిశలన్నియు నీకు వెల్లడి యగును గాత.     10. బంధువులారా! ఇది గులకరాతి నది. సంబాళించుకొనండి. నిలదొక్కుకొనండి. దాటండి. అశుభములను అన్నింటిని ఈ నదిలో విడుచుచున్నాము. శుభంకరములు, పథ్యములగు అన్నములచే దాటుచున్నాము.     11. అపామార్గమా! నీవు కిల్బిషము, కృత్య, దుష్ట స్వప్నమును మా నుండి తొలగించుము.     12. జలము మరియు ఓషధులు మాతో నిజమైన స్నేహము చేయవలెను. మేము ద్వేషించువారికి- మమ్ము ద్వేషించువారికి జలములు, ఓషధులు శత్రు భావము వహించును గాత.     13. మేము ఎద్దుతోకను పట్టి దానిని తాకుచున్నాము. ఈ వృషభము సురభి పుత్రుడగును. ఇది మాకు శుభములు సమకూర్చవలెను. దేవతలకు ఇంద్రుని వలె ఇది మాకు రక్షణ యగును.     అగ్నిదేవా! హవిని అందించుము.     14. అంధకారమునకు ఆవల స్వర్గీయ జ్యోతిని దర్శించినాము. దేవతలందు ఏకమాత్ర దేవతయగు సూర్యుని, అతని ఉత్తమ జ్యోతిని చేరుకున్నాము.     15. (గ్రామ శ్మశానాన్తరే మర్యాదాలోష్టం నిదధాతి - గ్రామ శ్మశానమునకు అవతల లాంఛన ప్రాయమగు శిలను ఉంచవలెను.)     ఇది - ఈశిల జీవించియున్నవారికి హద్దు అగుచున్నది. అన్య జీవితుడు ఎవడును మృత్యువాత పడరాదు. జీవులు మృత్యువును పర్వతపు చాటున దాచివేయుదురుగాక. జీవులందరు బహుకర్మవ్యాప్రుతులై 'శతం జీవంతు శరదః' - శతశరత్తులు జీవింతురు గాత.     16. అగ్నీ! మా ఆయువులను పావనము చేయుము. మాకు వర్షము కలిగించుము. "ఆరే బాధస్వ దుచ్ఛునామ్" తుచ్ఛులను మాకు దూరమున హింసించుము.     17. అగ్నీ! నీవు హవి వలన వర్ధిల్లువాడవు. ఘృతము వలన పరిపూర్ణ స్వరూపుడవు. ఘృతమున పుట్టి పెరిగెదవు. మధురము, రుచికరమగు గోఘృతమును పానము చేయుము. తండ్రి తన కొడుకువలె - మా పుత్రాదులను రక్షించుము. స్వాహా.     18. ఇతడు గోదానము చేసినాడు. అగ్నికి ఆహుతులు అర్పించినాడు. దేవతలకు హవిని అందించినాడు.     శ్మశానము నుండి తిరిగి వచ్చినవారిని ఏడిపించగలడు?     19. పచ్చిమాంసము తిను అగ్నిని పారద్రోలుచున్నాను. అది పాపము మోసుకొని శ్మశానమునకు తరలునుగాక.     ఇచట - ఈ యజ్ఞ గృహము నందలి - ఈ అగ్ని తద్భిన్నమైనది. ఇచట పుట్టినది. అతడు దేవతలను ఎరుగును. స్వాధికారమును ఎరుగును. "దేవేభ్యో హవ్యం వహతు' దేవతలకు హవిని వహించవలెను.     20. అగ్నీ! నీవు జాతవేదివి. పితరులు దూరమున ఎచట ఉన్నారో నీకు తెలియును. వారి కొరకు వపను కొని పొమ్ము. ఆ పితరుల కొరకు మేద యొక్క నదులు ప్రవహించును గాత. "సత్యా ఏషామాశిషః సన్నమంతాం స్వాహా" వారి నిజమగు ఆశీస్సులు మాకు అందును గాత. స్వాహా.     21. భూమీ! నీవు మాకు కంటకరహితవు. శుభ ప్రదవు అగుము. మాకు ఎన్నో సుఖములను కలిగించుము. ఈ జలము మా పాపములను కడిగి మమ్ము పరిశుద్ధులను చేయునుగావుత.     22. అస్మాత్త్వమధి జాత్కోసి త్వదయం జాయతాం పునః |     అసౌ స్వర్గాయ లోకాయ స్వాహా.     అగ్నీ నీవు ఇతని నిమిత్తము ఆవిర్భవించినావు. ఇతడు మరల నీలో జన్మించును గాత. ఇతనికి స్వర్గము కలుగునట్లు స్వాహా.                                దాశరథి రంగాచార్య విరచిత                   శ్రీమదాంధ్ర వచన శుక్ల యజుర్వేద సంహిత యందలి                పితృమేధమను ముప్పది అయిదవ అధ్యయము సమాప్తము.                             "యచ్ఛానః శర్మం స ప్రాథాః"
24,786
        "బ్రాహ్మడికి యాచన తప్పులేదమ్మా! జోలెపట్టి ఊళ్ళో అడుక్కు వచ్చి మీకు పెడతాను. మిమ్మల్ని ఆకలికి చంపను"     "తిండికోసమే బ్రతికి ఉన్నామనుకొంటే ఈ కష్టాలు, అవమానాలు పడలేక ఏనాడో గుక్కెడు విషం మింగి చచ్చేవాళ్ళం. బ్రతికి ఏదైనా సాధించాలి! జయమో, అపజయమో, చచ్చేవరకు ఈ పోరాటం సాగించాలి"       "ఏం సాధించావమ్మా ఇక్కడికి వచ్చి? వంద రెండొందల జీతం కోసం ప్రొద్దున లేచి తినీ తినకా పరుగులు. చీకటి పడుతూంటే పీక్కుపోయిన ముఖంతో వడలిపోయి ఇంటికి రావడం. మళ్ళీ వంటా మార్పు రాత్రికి ఏ కలత నిద్రపోతావో! సూర్యుడు మేలుకొన్న వేళకి నువ్వూ మేలుకొని మళ్ళీ పొట్ట తిప్పలుకి పరుగులు. ఈ పరుగుల్లో నీ ఆరోగ్యాన్నీ యవ్వనాన్నీ కరిగించుకొంటూంటే నువ్వు నా విస్తరిలో పెట్టే కూడు నీ రక్తంతో కలిపి పెట్టినట్టుగా ఉంటుందమ్మా! ఆ కూడు మనస్పూర్తిగా తినలేక ఏభై ఏళ్ళకే బ్రతికిన శవంలా అయ్యాను. పదమ్మా!నువ్వీ వెట్టిచాకిరీ చెయొద్దు! మన ఊరెళ్ళితే, మనఊరి రైతులు మనల్ని చంపరు. ఇంటికి పట్టెడు గింజలు పెట్టినా మన కడుపులు నిండుతాయి. తిన్నది ఒంటికి అంటితేనే నేను బాగవుతాను. నాకు కాళ్ళు లేకపోతేనేం? కూర్చొని పిల్లలకి పాఠాలు చెప్పగలను. పదో పాతికో వస్తాయి. ఎవరైనా అడిగితే తాటి ఆకులు ఇస్తారు. మన ఇల్లు గుడిసెలా కప్పుకొందాం. వెళ్ళిపోదాం పదమ్మా!"     జీవితంలో బాగా బ్రతికి దెబ్బతిన్న తండ్రికి తను ఆడపిల్ల ఐనా కష్టపడి సంపాదించి పట్టెడన్నం పెట్టగలుగుతున్నానన్న ఆత్మతృప్తి తండ్రి గుండెలు బద్దలైనట్టుగా వెలువడిన మాటలతో నామరూపాల్లేకుండా నాశనమైపోగా అసలే గాయపడిన అపురూప విలవిల్లాడుతూ విహ్వలంగా చూసింది తండ్రికేసి.       తండ్రి ఆక్రోశంలో అర్ధముంది.     ఆయన ఒకనాడు విలక్షణంగా బ్రతికిన మనిషి.     పాడి పంటలతో కలకలలాడే ఓ అందమైన పల్లెటూరు తమ స్వస్థలం.     పది పన్నెండేళ్ళ క్రితం -     అక్కడ తమకో అందమైన లోగిలి వుండేది.     కొరత లేని సుఖశాంతులుండేవి.     ఇప్పుడు తలుచుకొంటే ఏదో గత జన్మ స్మృతిలా అనిపిస్తూంది.     ఆనందంగా సాగిపోతున్న నావ ఒకనాడు హఠాత్తుగా పల్టీ కొట్టింది!     ప్రవాహంలో పడికొట్టుకుపోతూ ఎలాగో ఒడ్డుకు చేరినట్టుగా ఈ సిటీకి వచ్చి పడ్డారు. చదువుకోవాలన్న ఆశయమైతే నెరవేరింది. కాని, పిల్లలైన తాము ఎటువంటి బ్రతుకు పోరాటం సాగించారో తండ్రి సాక్షి కాబట్టే ఆయనకా హృదయవేదన.     "అర్పిత చదువు పూర్తి అయితే అలాగే వెళ్ళిపోదాం, నాన్నగారూ! మనం ఇప్పుడు వెళ్ళిపోతే దాని చదువు అర్ధాంతరంగా ఆగిపోతుంది" ఆయన మాట కాదని ఆయన్నింకా బాధపెట్టడం ఇష్టం లేక అనునయంగా అంది అపురూప.       "చదువు పూర్తిచేసి మీరుచేసే ఉద్యోగాలేమిటమ్మా? ఆ కాన్వెంటు ఉద్యోగాలేగా? వీధి వీధికో కాన్వెంటు పుట్టగొడుగుల్లా పుట్టుకు వచ్చి మీ లాంటి డిగ్రీ హోల్డర్లని పెట్టి మనుషులుగా తయారు చేస్తూంది! రెండు మూడు వందల కోసం మీ రక్త మాంసాలు కరిగిస్తారు కదమ్మా?"     నదులన్నీ సముద్రంలో చేరినట్టుగా పల్లెలో పని దొరకక కడుపు మాడిన వాళ్ళంతా పట్నాలు చేరుతున్నారు. ఇక్కడ కష్టం చేసే వాళ్ళకు పని వుంది. కాస్త కాస్త చదువున్న వాళ్ళయినా, అసలేమీ చదువుకోక పోయినా మట్టిపనో, ఫ్యాక్టరీల్లో పనో -ఏదో ఒకటి దొరుకుతుంది. ఫ్యాక్టరీల్లో పని చేసో, కాన్వెంట్లలో చదువు చెప్పో మూడొందలు తెచ్చుకొనే ఆడపిల్ల సైతం చక్కగా తయారై భుజానికి హాండ్ బాగ్ తగిలించుకొని ఏ ఆఫీసరు ఉద్యోగమో చేస్తున్నంత దర్జాగా బస్సుల్లో వెడుతుంది. వచ్చేది మూడొందలే అయినా  'నేనూ చేస్తున్నాను ఉద్యోగం! నాకూ ఉంది ఆర్ధిక స్వాతంత్ర్యం!' అన్న ఆత్మ విశ్వాసంతో బ్రతుకుతుంది. వాళ్ళు పని చేయించుకొని ఇచ్చే మూడొందలు చాలా తక్కువే కావచ్చు! వెట్టి చాకిరే కావచ్చు! కాని, ఆర్ధిక స్వాతంత్ర్యం మాత్రం కాస్త చదువు కొన్న ఆడపిల్లలకు ఈ పట్నం ఇవ్వగలుగుతుంది.     "వదరలో కొట్టుకు పోయే వాళ్ళకు గడ్డిపోచే గొప్ప ఆధారం కద, నాన్నగారూ?"       "ఆధారంగా కనిపిస్తుందేగాని నిజంగా ఆధారం కాలేదు కదమ్మా??"       ఈనాడు అస్థి పంజరంలా మంచానికి అంటుకుపోయిన తండ్రి ఒకనాడు మంచి పండితుడిగా గుర్తింపు పొందిన వాడు. చక్కని పాటలు, పద్యాలతో, హరికథలతో ఊరి జనాల్ని ఎంతగానో అలరించినవాడు.       ఓడలు బళ్ళు అయినట్టుగా తారుమారైన తండ్రి పరిస్థితి తలుచుకొంటే అపురూప కళ్ళలో నీళ్ళు చివ్వున ఊరుతాయి! గుండె భారమైపోతుంది.
24,787
వంచలేను నా శిరస్సు ఏ అధికారంముందు ఒప్పలేను మానసిక దాస్యాన్ని ఏ ప్రభుతయందు నాకు వద్దు మీ రంగురంగుల కాగితపు బురఖాలు పాత వుచ్చులు తీసి తగిలించకు వినూత్న శృంఖలాలు!ఒక సత్యం మరో సత్యాన్ని ఖూనీ చెయ్యకు పరదేశ స్తుతిలో స్వకీయ సంస్కృతి విస్మరించకు ఇంకా కరిగి నీరైపోలేదు హిమాలయ శిఖరాలు ఇంకా మరిచిపోలేదు తథాగతుని మహాత్ముని ప్రవచనాలు!వివేకంలేని ఆవేశం విపత్కరమౌతుంది సంయమంలేని సౌఖ్యం విషాదకారణ మౌతుంది సమ్యక్ సమ్మేళనం లేని తౌర్యత్రికం కఠోరమౌతుంది కరుణలేని కవివాక్కు సంకుచితమౌతుంది!    (ఆంధ్రప్రభ దినపత్రిక, ఆదివారం సంచిక             జనవరి 23, 1955)                       ప్రకటన               (పరారీ అయిన వ్యక్తికోసం)స్టేషన్లో టిక్కెట్లను జారీ చెయ్యకండి ఎక్కడి రైళ్ళు అక్కడ ఆపివెయ్యండి దేశదేశాలకి కేబుల్ గ్రామ్స్ పంపించండి దేవాలయాల్లో నిత్యం పూజలు చేయండి.ఆకాశవాణిలో యీ విషయం ప్రకటించండి కాఫీహోటళ్ళలో క్లబ్బులలో కర్మాగారాల్లో కాస్త జాగ్రత్తగా నిశితంగా పరిశీలించండి సముద్ర తీరాలలో నదీ జలాలలో వెదకండి.సాయుధ దళాల్ని దిక్కులలో నిలబెట్టండి రాకెట్లను అంగారకాది గ్రహాలకు పంపించండి అడుగుజాడల్ని కూపీ తియ్యండి వ్రేలి ముద్రల్ని పరీక్షించండి.
24,788
    జగన్ వాలకం చూసి కృష్ణ గాభరా పడ్డాడు.         అంతలోకె జగన్ సర్దుకున్నాడు.         "పాప పుట్టగానే తల్లికి దూరమయింది" జగన్ కంఠం ప్రశాంతంగ ఉంది.         కృష్ణ గుండెలనిండా గాలి పీల్చుకొని టాక్సీలో సర్దుకు కూర్చున్నాడు.         "పాపం! మోస్ట్ అన్ ఫార్ట్యునేట్! డెలివరీ కాగానే పోయిందా? ఏ ఆసుపత్రిలో! మెడికల్ ఫెసిలిటీ...."         "అబ్బే అదేమీకాదు. ఆమె పోలేదు. బ్రతికేవుంది!" మధ్యలోనే అందుకొని అన్నాడు జగన్.         కృష్ణ గిర్రున తలతిప్పి చూశాడు.         జగన్ కళ్ళల్లోకి చూశాడు.         ఏమిటి వీడు చెప్తున్నది.         పాప తల్లి పుట్టగానే దూరమైందన్నాడు.         మళ్ళీ ఆమె బ్రతికే ఉందంటాడు.         అయితే ఆమె ఏమైనట్టు?         రోగిష్టా?         కేన్సర్- బ్లెడ్ కేన్సర్ పేషెంటా?         ఛ! ఛ! ఏమిటీ ఆలోచనలు?         కృష్ణ బుర్రంతా కుతకుతలాడిపోతున్నది.     "కృష్ణా! దిగు" అంటూ డోర్ తెరిచి పట్టుకున్న జగన్ కేసి రెప్పలార్చకుండా చూడసాగాడతను.         "ఏమిట్రా అలా చూస్తావ్? దిగు! పాపను చూడవా?"         కృష్ణ మైకంలోనుంచి బయటపడినవాడిలా తల విదిలించుకొని టాక్సీ దిగాడు.         గేటు దాటి కాన్వెంటు ఆవరణలో జగన్ పక్కనే నడుస్తూ "పాప పేరేమిటి?" అనడిగాడు.         "మోనో."         "మోనో? అదేం పేరురా?"         "మోనో లిసా!"         "మోనోలిసా?" కృష్ణ నోరు తెరిచాడు.         "అవును! మోనోలిసాయే." ఏవో దివ్యానుభూతుల్లో తేలిపోతూ "మోనోలిసాయే." ఏవో దివ్యానుభూతుల్లో తేలిపోతూ "మోనోలిసా" పేరును ఉచ్చరిస్తున్న జగన్మోహనరావును ఎగాదిగా చూశాడతను.         "ఆ పేరు నీకంత ఇష్టమా?"         "అదేం కాదు."         "మరైతే ఆ పేరెందుకు పెట్టావ్?" ఈసారి నిజంగానే కృష్ణకు చిర్రెత్తిపోయింది.         అతడి ప్రశ్నకు సమాధానంగా జగన్ చిరునవ్వు చిందించాడు.         సమాధానం చెప్పకుండా ఇలా నవ్వుతాడేం అనుకుంటూ జగన్ ముఖంలోకి లోతుగా చూశాడతడు.         "అదంతా ఓ పెద్దకథ" తాపీగా అన్నాడు జగన్మోహనరావు.         "కథా?"         "ఆఁ అవును. కథే! కథకాని కథ."         "ఆఁ అవును. కథే! కథకాని కథ."         "ఆఁ ఏమిటీ? కథలేని కథా?"         "కథలేని కథకాదు. కథకాని కథరా బాబూ?"     డార్మెత్రీ మెట్లెక్కుతూ ఆగి కృష్ణ జగన్ ముఖంలోకి ముఖం పెట్టి చూశాడు.         "ఏమిట్రా అంత ఆశ్చర్యం? కథకాని కథలుండవనా నీ ఉద్దేశ్యం?" అతడి కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు జగన్.         "ఎందుకుండవూ? కథలేని కథలూ ఉంటాయి" ఠపీమని పుల్ల విరిచినట్టు అన్నాడతను.         "గుడ్ ఈవెనింగ్ సర్! మోనో ఈజ్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్. షల్ ఐ బ్రింగ్ హర్?"         "ప్లీజ్!" జగన్ వంగి మాట్రెస్ కు విష్ చేశాడు."         మేట్రెస్ ఐదు నిమిషాల్లో పాపతో తిరిగొచ్చింది.         "డాడీ!" పాప రెండు చేతులూ ముందుకు చాచి జగన్ దగ్గిరకు పరుగెత్తుకొచ్చింది.         జగన్ ఆత్రంగా పాపను ఎత్తుకొని గుండెలకు హత్తుకున్నాడు.         "అంకుల్ కృష్ణకు నమస్తే చెప్పు పాపా!" అంటూ జగన్ పాపకు అతడిని చూపించాడు.         పాప ముందు సంకోచించింది. జగన్ ప్రోత్సాహంతో "గుడ్ ఈవెనింగ్ అంకుల్" అంది.         "గుడ్ ఈవెనింగ్ మోనో - గుడ్ ఈవెనింగ్" లేతగులాబిరేకుల్లా మెరిసిపోతున్న పాప చెక్కిళ్ళను నిమిరాడు మురళీకృష్ణ.         పాపకు ఇవ్వడానికి ఏమీ తీసుకురానందుకు మనసులోనే నొచ్చుకున్నాడు.         "మోనో చూడమ్మా అంకుల్ నీకు డ్రస్ తెచ్చాడు, థాంక్సు చెప్పు" పాపను కిందకు దింపి చేతిలోవున్న ప్యాకెట్ అందించాడు జగన్.         ప్యాకెట్ అందుకొని, కృష్ణను చూస్తూ "థాంక్యూ అంకుల్" అంది పాప.         అమాంతం వంగి పాపా చెక్కిళ్ళను నిమిరాడతను.         జగన్ ను తను ఏమో అనుకున్నాడు. తన మనసు చదివినట్టే చేశాడు. డ్రస్ తను తెచ్చినట్టు పాపకు చెప్పాడు. వెళ్ళేప్పుడు డబ్బు వాడి జేబులోపెట్టిపోతే బాగుంటుంది. ఆ అవకాశం తనకు కలిగించినందుకు కృష్ణ సంతోషపడ్డాడు.         డార్మెటరీలోనుంచి గంట గణగణ మోగడం విన్పించింది.         "సర్! ఇటీజ్ టైం ఫర్ హర్ డిన్నర్" మృదువుగా హెచ్చరించింది మేట్రన్.         ఆ మాట వింటూనే మోనో గిర్రున వెనక్కుతిరిగింది.         కృష్ణ ఆశ్చర్యపోయాడు.         అంత డిసిప్లిన్ తో పిల్లల్ని పెంచడం కాన్వెంటువాళ్ళకే సాధ్యమేమో అనుకున్నాడు.         "పాపా! ఛీరియో! బై బై!" జగన్ వెనకనుంచి అన్నాడు.         మోనో తిరిగి చూడకుండానే "ఛీరియో డాడీ" అంటూ చెయ్యి ఊపుతూ ముందుకు పరుగులు తీసింది.         మేట్రన్ దగ్గిర శెలవు తీసికొని ఇద్దరూ తిరిగి టాక్సీ దగ్గిరకు వచ్చారు. వాళ్ళెక్కి కూర్చోగానే టాక్సీ బయలుదేరింది.         "మున్నాలే పామ్ గ్రో హోటల్ కు పోంగో! అంగెరింది అడయార్ కు పోహణం" వెనక సీట్లోనుంచి ముందుకు వంగి అన్నాడు జగన్.         "కథగాని కథ ఏదో చెబుతానన్నావ్?" స్నేహితుడి భుజం తడుతూ అన్నాడు కృష్ణ.         జగన్ సన్నగా నవ్వి "ఇంటికి వెళ్ళాక తీరిగ్గా చెబుతాలే!" అన్నాడు.         "ఇంటికా?" నొసలెత్తి అడిగాడు కృష్ణ.         "ఏం? రాకూడదా?" కనుబొమలు చిట్లించాడు జగన్మోహనరావు.         "అబ్బే రాకూడదని కాదు. ఇప్పుడు టైం లేదుకదా అని!"         "ఇప్పుడు మనం హోటల్ కు వెళ్ళి రూం ఖాళీచేసి ఇంటికెళదాం."         "తెల్లవారుఝామునే ఎయిర్ పోర్టుకు వెళ్ళాలే మరి?" కొంచెం ఆగి "అయితే ఒక పనిచేద్దాం! ముందు మీ ఇంటికి వెళ్ళి కాసేపుండి తిరిగి హోటల్ కు వచ్చేస్తా. సరేనా?" మళ్ళీ అన్నాడు.         "అదేం కుదరదు. హోటల్ ఖాళీచేసి ఇంటికి వెళ్ళిపోదాం. తెల్లవారి ఇంటిదగ్గర్నుంచే ఎయిర్ పోర్టుకు వెళ్ళొచ్చు."         "అంత పొద్దుటే టాక్సీ దొరకదేమో?" నీళ్ళు నములుతూ అన్నాడతడు.     "ఆ ఇబ్బందేమీ ఉండదు. వెళ్ళేప్పుడే టాక్సీస్టాండ్ బంక్ లో చెప్పి వెళదాం. టైంకు వచ్చేస్తారు, గాభరాపడకు."         "ఎన్నాసార్! ఎయిర్ పోర్టుకు పూడుస్తురా?" డ్రైవర్ వెనక్కు వంగి అడిగాడు.         "ఇప్పిల్లేబ్బా! రేప్పొద్దున్న" ముభావంగా చెప్పాడు జగన్.         "ఆమసార్! ఏ ఇమాండ్రం అనిదా అడుగుతా సారూ!"         "హైదరాబాద్ వెళ్ళాలి. ఆరింటికల్లా ఎయిర్ పోర్టులో ఉండాలి. ఐదుగంటలకు ఇంటికి రాగలవా?" అన్నాడు కృష్ణ.         "ఆమాఁ సార్! కండిపావస్తా!"         "నువ్వుండేదెక్కడ?"         "అడయార్ దానా సామీ! టాక్సీస్టాండ్ పక్కతెరువుదా మన వీడు"         "సరే! అలాగే వద్దువుగాని, ముందు పామ్ గ్రోవ్ హోటల్ కు పద" అని జగన్ కృష్ణకేసి చూశాడు.         కృష్ణకు హోటల్ గది ఖాళీచేసి వెళ్ళాలనిలేదు. కాని జగన్ బలవంతం చెయ్యడంతో మెత్తపడ్డాడు.         మరో ఐదు నిమిషాల్లో టాక్సీ పామ్ గ్రోవ్ హోటల్ చేరింది.         హోటల్ గది ఖాళీచేసి కృష్ణ సామానుతో వచ్చి టాక్సీలో కూర్చున్నాడు.         తీరా టాక్సీ బయలుదేరాక కృష్ణకు తనేదో పొరపాటు చేసినట్టు అన్పించసాగింది.         ఈ టాక్సీవాడు తెల్లవారుఝామున ఐదుగంటలకు రాకపోతే తన ప్రయాణం ఆగిపోతుంది. అయినా ఇప్పుడు జగన్ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? ముందే అతని ఇంటికెళ్ళి హోటల్ కు తిరిగొస్తే బాగుండేది.         "ఈటాక్సీవాడు రాకపోతేనో?" అప్రయత్నంగానే అనేశాడు కృష్ణ.         "ఇది కాకపోతే మరో టాక్సీ. ఆ ఇబ్బందేమీ ఉండదిక్కడ. తెల్లవార్లూ స్టాండులో టాక్సీలుంటాయి, డోంట్ వర్రీ."         కృష్ణ మనసు కుదుటపడింది.         టాక్సీలో రిలాక్స్ డ్ గా కూర్చున్నాడు.         టాక్సీ జెమినీ దాటి మౌంట్ రోడ్డు ఎక్కింది.         రోడ్డు పక్కగా ఉన్న పెద్ద పెద్ద సినీమాపోస్టర్లు చూస్తూ కూర్చున్నాడు కృష్ణ.         చల్లటి సముద్రపుగాలి ముఖాన్ని తాకుతూవుంటే హాయిగా వుంది. హఠాత్తుగా మోనోలిసా చిత్రం మనసులో కదిలింది.         మోనోలిసా!         కూతురికి బలే పేరు పెట్టుకున్నాడు.
24,789
              "సైజులన్నీ ఊహించి తెచ్చాను. పట్టుకుంటే తిట్టుకోకు" అన్నాడు అతను సన్నగా కన్నుగీటుతూ.     "ఊరికే ఇస్తే తీసుకోను. వీటికి అయిన డబ్బులిచ్చేస్తాను. మీ దగ్గిరికే వచ్చయిన తీర్చేస్తాను. అలా అయితేనే తీసుకుంటాను" అంది. ఉచితంగా బహుమానం తీసుకోవడానికి మనసొప్పడంలేదు ఆమెకి.      డబ్బులు తీసుకోవడానికి అతను ఒప్పుకోలేదు. కానీ చివరికి ఆమే గెలిచింది. డబ్బులు తీసుకునేందుకు మొండిగా అతన్ని ఒప్పించింది.     "నువ్వు నిలుచునే వున్నావ్ కూర్చో" అంటూ అతను ఎంతో చొరవతో ముందుకు లాగాడు.     అతను అలా లాగుతాడని ఆమె ఊహించలేదు.     విసురుగా వచ్చి మీదపడిపోయింది. అతను వెనక్కి వాలిపోయాడు. ఆమెమీద పడిపోయిందిగానీ  తిరిగి వెనక్కి లేవడానికి చేతకావడంలేదు.      అందులోనూ శరీరం అతన్ని వదిలిపెట్టడానికి అనుమతించలేదు.   ముఖ్యంగా ఎదభాగం అయితే మరింత నొక్కుకుపోవాలనుకుంటోందే తప్ప తప్పుకోవటంలేదు. అతను మెల్లగా ఆమె మీద చేతులు వేసి మరింతగా తన మీదకి లాక్కున్నాడు సుధాకర్.        అతను తన పెదవుల్ని ఆమె పెదవులకి ఆన్చి వాటిని లోపలికి లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నాడు.     నిజంగా ఆమెకు మతిపోయినట్లయింది. ఏదో ఇంగ్లీషు, సినిమాలో అట్లా పెట్టుకుంటారుగానీ నిజానికి అట్లా ముద్దుపెట్టుకుంటారని తెలియదు.  ఏం రుచి? మొత్తం మనిషినంతా చక్కెరపాకంలో ఊరబెట్టినంత మధురంగా వుంది ఆ చర్య.      అతను ఆమె పెదవుల్ని వదిలిపెట్టలేదు. ఆమె కూడా పెదవుల్ని వెనక్కి లాక్కుందామని అనుకోలేదు. ఎంగిలంత  రుచిగా వుంటుందని ఇద్దరికీ అంతకు ముందు తెలియని విషయం.     అతని చేతులు కంఠాన్ని దాటి కిందకు దిగాయి.     ఆమె ఎలా అయిపోయిందంటే పారవశ్యం లాంటిది కమ్ముకొస్తుంటే  కళ్లు దానంతటవే మూసుకుపోయాయి. అతనేం చేసినా అతని ఇష్టం  అన్నట్టు శరీరం అతనికి పూర్తిగా ట్యూన్ అయిపోయింది.     అతనికీ కొత్తేనన్న విషయం ఆమెకీ తెలుస్తోంది. జాకెట్టుకు ముందో,  వెనకో ఎక్కడ హుక్ లు వున్నాయన్న విషయం సరిగ్గా కనిపెట్టలేకపోయాడు. కానీ అలా వెదుక్కుంటున్నప్పుడు అతని వేళ్ల కదలికల నుంచి సంగీతం విన్పిస్తుండడాన్ని ఆమె ఫీలయ్యింది.     మొత్తానికి అతను విజయం సాధించాడు.     ఆమెకి ఎంత సిగ్గొచ్చిందంటే ఇక ఎప్పటికీ తను కళ్లుతెరిచి అతన్ని చూడలేనేమోననిపించింది. మధ్యలో విడిపోయిన జాకెట్టు సీతాకోక చిలుకలా  వుంది.     అతను ఆ భాగం  నునుపునంతా  ముఖంతో తడుముతున్నాడు. ఆమె కళ్లు మూసుకుంది.     అతనివేళ్లు మరింత కిందకు దిగి పనసపండు  తొనలాంటి ఆమె బొడ్డులో కూరుకుపోయాయి.      ఆమె గట్టిగా కౌగిలించుకుంది ఇక వదలనట్టు.     ఏదో వత్తిడి మేరకే అతను ఆమెను పక్కకు తిప్పాడు.     ఆమె మంచంమీద వాలిపోతే, అతను మంచంమీద పాతికభాగమే వున్నాడు. అతను  బరువుగా  అనిపించకపోవడం ఆ సమయంలోనూ ఆమెకి గుర్తొచ్చింది.     ఏదో చెయ్యాలన్న వత్తిడి ఇద్దరికీ వుందిగానీ మిగిలినదంతా ఆల్ జీబ్రా లెక్కలా బోధపడడంలేదు.     ఆమెకంటే అతను కొంచెం మెరుగు.  ధీరిటికల్ నాలెడ్జ్ అయినా  వుంది. అందులోనూ లోపల  కలుగుతున్న వత్తిడి కొంతమార్గాన్ని సూచిస్తోంది.     తనను ఆమెను తనవేపుకు తిప్పుకోవడంలో ఆమె కూడా మంచం మీద పాతికభాహగమే వుంది. అతను ఆమెను  మరింతగా తనలో కలుపుకోవాలని చూస్తున్నాడు. ఆమె కళ్లు మూసుకున్నా నవవసంతాలు విచ్చుకున్నట్టుంది. మంచువర్షంలో తడుస్తూ, మల్లెపూల గొడుగు  పట్టుకుని దిగంతాలవైపు  నడుస్తున్నట్లుంది. స్వర్గానికి వెళుతూ వెళుతూ మానస సరోవరం లోకి తొంగిచూస్తున్నట్లుంది అతనికి.     అతను ఆమెను మరింత హత్తుకున్నాడు.     తేనెవాగులోంచి జారుతూ మాధుర్యపు సుడిగుండంలో చిక్కుకు పోతున్నట్టు  అన్పిస్తోంది.      ఠక్కున ఆమెకి ఏదో స్పురించింది. కళ్లు విప్పింది.     "వద్దు.. .ఇప్పుడొద్దు" కంగారు ముఖంలో కన్పిస్తోంది.     అతను ఆమెలోకి సూటిగా చూస్తున్నాడు.     "  ఇప్పుడు .... మంచిదికాదు.... మగాడు  చచ్చిపోతాడట...." ఆమె ఏమన్నదో అతనికి అర్దంకాలేదు.     "చచ్చిపోతానా?" అన్నాడతను విస్మయంగా.     " ఆ  - ఇప్పుడు నేను ఇంటికి దూరం" అంది ఉమ కళ్లను మరింతగా సాగదీస్తూ.      అప్పుడు తెలిసింది అతనికి విషయం ఏమిటో.     "ఛీఛీ! అదంతా పచ్చి అబద్దం... .అన్ సైంటిఫిక్" అతను ఎంత మాత్రం ఒప్పుకోలేదు.      అతను తను అన్నదాన్ని వ్యతిరేకించడం, అలాంటిదేమీ లేదనడం ఎందుకనో బావుంది. కానీ ఎక్కడో లోన భయం కళ్ళల్లోంచి బయట పడుతోంది.     అతను ఆగలేదు. తిరిగి పొదివిపట్టుకున్నాడు. ఆ ఆరుబయటే  కొట్టంలో వాళ్లిద్దరూ ఒకటైపోయారు.     వాళ్లిద్దరూ ఎంతగా పరిసరాల్ని మర్చిపోయారంటే - అది పందిరి అనిగానీ, అక్కడికి ఎవరైనా వస్తే మొత్తం కనిపెట్టేస్తారనిగాని  గుర్తుకే రాలేదు.     మరో పావుగంట వరకు వాళ్లకి కాలం స్తంభించింది. అతను వెళ్లిపోయాకకూడా ఆమె అక్కడ్నించి లేవలేదు. అలానే కళ్లుమూసుకుని పడుకుండిపోయిందామె.      చివరలో అంతా అయిపోయాక " ఐయామ్ సారీ......! నేను చాలా తొందరపడ్డాను" అని అతను బాధపడడం, ప్రపంచం ఏదో మునిగిపోయినట్టు అమ్మాయి ఏడ్వడం లాంటి అసహజమయిన సీన్ లేమీ  జరగలేదు అక్కడ.     ఇద్దరూ ఆ అనుభూతినుంచి తేరుకున్నాక "ఓ.కే. వస్తాను....." అన్నాడు సుధాకర్.     ఆమె సింపుల్ గా తలవూపింది.     అతను అక్కడ్నించి వెళ్లిపోయాకకూడా ఆమెకు లేవబుద్దికాలేదు. శరీరమంతా  ఏదో మధురమైన నొప్పులు. తీపులంటారే అలాంటివి.   అసలు తన శరీరమే తనకు కొత్తగా వుంది. దానికి అంతలా సుఖపడటం తెలుసని గూడా ఇంతవరకూ తెలియదు.     నిజంగా ఆవి ఆమెకు అధ్బుతమైన క్షణాలు.... బాధలాగే సుఖం కూడా సలుపుతుందని మొదటిసారి అర్దమైంది ఆమెకు.     రెండురోజులు గడిచాయి.
24,790
    భగవంతుడు ఈ ముసలమ్మ భక్తికి మెచ్చి వస్తున్నాడా? సనకస నందనాది మహామునులు, వాల్మీకాది భక్తులు సంవత్సరాల తరబడి నిద్రాహారములు లేక తపస్సు చేసినా అనుగ్రహించని భగవానుడు ఈ లంక పొగాకు చుట్టలు తగలేసే ఆయన భార్యకు, కనిపిస్తున్నాడా అని కొందరు నాస్తికులు అన్నారు. అంటే మట్టుకు ఆ మాటలకు విలువ లేకపోయింది.     హరనాథ్ బాబా స్పిరిట్ వచ్చి ఇల్లాగ చేస్తున్నదనీ స్వర్గీయమయిన ఆత్మలు ఇల్లాగ వచ్చి, మనతో మాట్లాడటం మొదలైన పనులు ఇప్పుడు జరుగుతున్నవని, పశ్చిమ దేశాలలో ఈ విషయమై కొంత పరిశోధన జరుగుతున్న విషయము నేను చదివాననీ, మా ఆవిడతో చెప్పాను. అంతట ఆవిడకు ఈ విషయంలో మరీ నమ్మకం ఏర్పడింది.                     ప్రతి శుక్రవారం తీరిక జేసుకొని, మా ఆవిడ కూడా ఈ భజనలకు వెళ్ళేది. ఒక రోజున అరటిపండ్లూ, ఇంకో రోజున వెన్నా, ఇంకో రోజున పాలూ ఇల్లాగ ప్రతిమారూ ఏదో ఒకటి అంతర్ధానమై పోతూ వచ్చింది. ఆవిడకు హరనాథ్ బాబాలో నమ్మకం కూడా హెచ్చు అయింది. ప్రత్యక్షంగా కళ్ళ యెదట పదిమంది మధ్యా జరుగుతున్న విషయాన్ని గురించి నమ్మకం కలగకుండా ఎట్లా ఉంటుందీ?                                                                              2     కొన్నాళ్ళు జరిగిన తరువాత భజన చేసే వాళ్ళల్లోనే కొందరు ఆమెను సమీపించి మీరు చేస్తేనే ఇల్లాగ జరుగుతుందా? మేము భజనచేసినా ఆరగింపు చేస్తాడా అని అడిగారు.     మీ పూర్వజన్మ సుకృతం మీద ఆధారపడియున్న విషయం అది ఎట్లా చెప్పగలము. సంచితం ఏమీ లేకపోతే ఆయన కరుణిస్తాడు అని ఏమేమో వేదాంత వాక్యాలు నాలుగు సాగదీసి చెప్పేసి, అయినా ప్రయత్నం చేయండి, భక్తితో సాధించరాని దేముంది? భక్తి వలన మీ సంచిత కర్మా నశిస్తుంది. భగవదారణా కలుగుతుంది. ఆమాట అని ఆవిడగారు చెప్పినది.     తదారభ్యః కొందరు హరనాధ బాబా భజన ప్రారంభించారు. మొదట్లో, ఎవ్వరింట్లోనూ ఏమీ ఆరగింపు కాలేదు.     ఈ విషయం ఆవిడతో చెప్పుకొంటే ఆవిడ "మీరు ఇంకా తీవ్రభక్తితో భజన చేయండి. బాబా కరుణామయుడు, తప్పక మీ గృహాన్ని పావనం చేస్తాడు అని హితం చెప్పి పంపింది.     చాలామంది విశ్వాసంతో భజనలు అల్లాగే చేశారు మానకుండా నాలుగైదు వారాలు గడచినా దయ కలగలేదు బాబాకు. ఆ భక్తురాలు ఒక్కొక్కవారం ఒక్కొక్క ఇంటికి వెళ్ళి భజనలు జయప్రదంగా సాగించింది. ఆవిడ సాన్నిథ్యంలో మాత్రం ఆరగింపు అవుతుండేది. ఆవిడ పరోక్షంగా మాత్రం ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడే ఉండేవి. కాని ఆవిడ ప్రోత్సాహంవల్ల ఆయనకు ఎప్పుడో ఒకప్పుడు దయ కలుగుతుందనే నమ్మకంతో అమ్మలక్కల భజనలు మానలేదు.     ఆ వారంలో శుక్రవారపు భజనలో సుబ్బమ్మగారి ఇంట్లో పైనుంచి కర్పూరం పడ్డదని ఒక పుకారు పుట్టింది. అంతా జెప్పుకొని సంతోషించారు. ఆవిడ పుణ్యాత్మురాలన్నారు.     ఆ రోజు నుంచీ, ఆవిడ ఆ భక్తురాలుకు ఆప్తురాలైంది. వాళ్ళిద్దరూ ఒక దగ్గరే కూర్చుని భజన చేయడం ఒకేసారి తన్మయత్వంలోకి పోవటం, ఒకేమారు ఉలిక్కి పడటం మొదలెట్టారు.     వాళ్ళను చూచి ఇతరులు "అయ్యో మనమెంత పాపులమో, మన తపస్సు ఇంకా ఫలించలేదు కాబోలు? అని విచారపడ్డారు. కాని ఎవ్వరూ నిరుత్సాహ పడలేదు. అందరి ఇళ్ళల్లోనూ శుక్రవారం_శుక్రవారం భజనలు జరుగుతూనే వున్నాయి. మనవాడు (భక్తురాలి భర్త) లంక పొగాకు చుట్ట బాగా రూళ్ళ కర్రంత లావుపాటిది వాకిట్లో కూర్చుని తగలేస్తునే ఉన్నాడు.                                          3     సుబ్బమ్మగారి యింట్లోపడ్డ తరువాత వారం రోజులకు వెంకమ్మగారింట్లోను, తరువాత వరుసగా అన్నమ్మ గారింట్లోనూ ఆండాళ్ళ గారింట్లోనూ ఆరగింపులైనాయని పుకారు పుట్టింది ఇవ్వాళ మా యింట్లో ఆరగింపు అయిందంటే యివ్వాళ మా ఇంట్లో అయిందని భజన పరులంతా ఒకరితో ఒకరు చెప్పుకొని సంతోషించారు.     ఆ స్థితిలో మా ఆవిడ కూడా భజన చేస్తానన్నది. నేనన్నానూ, మనమెందుకు చేయడం, మనం పుణ్యాత్ములమని నాకేం నమ్మకం లేదు. ఆ హరనాథ్ బాబు మన ఇంటికి కూడా వచ్చి ఫలహారాలు ఆరగిస్తే సరే ఉంది, లేని పక్షంలో, అంతా మనలని వట్టి పాపిష్టి వాళ్ళని అనుకోవచ్చు వద్దు సుమా' అని అంటే, బుర్ర కెక్కితేగా  మా ఆవిడకూ, 'అయ్యో అందరింట్లోనూ, ఆరగిస్తున్నాడండీ మన కర్మం ఏం గాలింది? రంకుముండ నాగామకంటే మనం తీసిపోయినామా అత్తలకు కోడళ్ళకు తెంపులు పెట్టి, కొంపలుతీసే రాకాసి రంగమ్మ కంటే తీసిపోయినామా! మన నెందుకు బాబా అనుగ్రహించడో చూస్తా" నన్నది. ఒకరికి ఎప్పుడూ, అపకారం తలపెట్టక గుట్టుచక్కంగా కాపరం చేస్తున్న మా యందు ఆయనకు ఎందుకు అనుగ్రహం కలగదని నాకూ నమ్మకం కలిగి సరేనన్నాను. మా పిల్లలు కూడా సరదా పడ్డారు.     సరే మర్నాడే మా ఆవిడ భజన ప్రారంభించింది. మొదటిరోజున, ఆ భక్తురాలు పాపం పని వేళా వచ్చి ఆ తంతు అంతా నేర్పిందీ మా ఆవిడకు, తర్వాత వరసగా నాలుగు వారాలు ఈవిడ భజన చేసింది. మా ఇంట్లో వాళ్ళూ అద్దెకున్న వాళ్ళూ ముసలీ ముతగా, అంతా ఇరవైమంది చేరేవాళ్ళు శుక్రవారం శుక్రవారం.     ప్రతి శుక్రవారం సాయంత్రం నేను యింటికి వడివడిగా నడిచివచ్చి, ఆఁ ఏమిటి? ఏమైంది? ఏమన్నా, పడ్డదా అని ఆదుర్దాగా అడుగుతుండేవాడిని, మా ఆవిడ, "అయ్యో అయ్యో మనబోటి వాళ్ళకే, అంత అదృష్టం. ఈ ముఖాలు చూసే ఆయన ఆరగించడం" అని ముక్కి మూలిగేది. హరనాథ బాబు ఆరగించక పోవటానికి పూర్తిగా కాకపోయినా, చాల వరకు నేనే కారణభూతమైనట్లు ఆమె మాట్లాడేది. నేనే పాపం ఎరుగనుగదా నిజానికీ, అయితే ఏమిటి? ఆవిడతో కలిసి, స్కూలు అయినా మానేసి నేను కూడ భజన చేయలేదనీ, హరనాథ్ బాబా యందు పూర్తియైన నమ్మకం నాకు లేదనీ ఆవిడకు నా యందు కోపం.     "పోనీ నా ముఖం చూసి రాకపోతే నీ ముఖం చూసి అయినా రాకూడదా" అన్నాను ఒకరోజున నేను విసుగెత్తి, "అదిగాక మొగుడు చేసిన పాపం పెళ్ళాన్ని అంటదనీ, పుణ్యంలో మాత్రం సగభాగం పంచుకొంటుందనీ, పెద్దలు అంటారు కాబట్టి నాతోనూ, నా ముఖంతోనూ, నీ భజనకు ఏమీ సంబంధం లేదు. నమ్మకంతో నీవు సాగించ" మని హితం చెప్పాను.     అందరిళ్ళల్లోనూ వారం వారం భజన చేస్తున్నప్పుడల్లా ఆయన ఆరగింపు చేసి పోతున్నాడని, అందరూ అనటం ఈవిడ ఒకర్తే ఇల్లాగ కేటాయింపు అయిపోవటం మూలాన ఆడవాళ్ళల్లో మా ఆవిడకు కొంచెం చిన్నతనం అయింది. అందరిళ్ళల్లోను అయిదో వారాన జొరబడ్డ బాబా పదోవారమైనా మా ఇంటికి రాలేదు. ఆ ఆచూకీ లేదు.
24,791
      "ఎవరు కావాలి" సెక్యూరిటీ గార్డులు అలవాటుగా ప్రశ్నించారు.         "ఎవరు కావాలని అడుగుతావ్ బే" ఆ నలుగురు వ్యక్తుల్లోని ఒకడు సెక్యూరిటీ గార్డును కొట్టాడు. వెనకనుంచి వచ్చిన మరో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు నలుగురు వ్యక్తులమీద కలియబడడంతో మాటా మాటా పెరిగి ఒకరి జుత్తు ఒకరు పట్టుకున్న సమయంలో__         మరో ముగ్గురు వ్యక్తులు వ్యాన్ లోంచి దిగి లోనికి పరుగెత్తారు.         గేటుదగ్గర ఏదో గొడవ జరుగుతోందని తన రూమ్ లోంచి బయటికొచ్చిన మయూష-         రెండు చేతుల్నీ ఇద్దరు పట్టుకొన్నారు. మూడోవాడు ఆమె నోరు మూయడానికి ప్రయత్నించడం, ముగ్గురూ ఆమెను పట్టుకుని పరుగెత్తుకొచ్చి గేటుదాటి వ్యాన్ లో పడేయడం.         వ్యాన్ అక్కడనుంచి అదృశ్యం కావడం అంతా క్షణాల్లో జరిగిపోయింది.         అప్పటివరకూ సెక్యూరిటీ గార్డులతో కుస్తీలు పడుతున్న వ్యక్తులుకూడా మాయమైపోయారు.         ఈ గొడవ జరుగుతున్న సమయంతో నవనీత్ బాత్ రూమ్ లో వున్నాడు.         బయటికొచ్చిన తర్వాత సెక్యూరిటీగార్డులు చెప్పింది విని నివ్వెరపోయాడతను.         ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన వెహికల్ వేపు దూసుకుపోయాడతను.                                                                      *    *    *    *         హాస్పిటల్ ఇరవై అడుగుల దూరంలో వుందనగా వ్యాన్ స్లో చేశాడు డ్రయివర్. డ్రయివర్ పక్కన కూర్చున్న వ్యక్తులు హాస్పిటల్ ముందు చేతుల్లో ప్లేకార్ద్సుతో, బ్యానర్లతో వున్న వ్యక్తుల్ని చూసి ఆశ్చర్యపోయి ఒకరిమొహాలొకరు చూసుకున్నారు.         దాదాపు మూడువందలమంది స్త్రీలు హాస్పిటల్ గేటుకి అడ్డంగా నిలబడ్డారు. వాళ్ళ చేతుల్లో వున్న ప్లేకార్ద్సుమీద__         "ఆధునిక యుగంలో కన్యత్వ పరీక్షలా? సిగ్గుచేటు...."         "అబలల్ని అవమానిస్తే తాట వలిచేస్తాం."         "కన్యత్వ పరీక్షల పేరుతో దిగజారుతున్న ఆరోగ్యమంత్రీ గద్దె దిగు....."         "కన్యత్వ పరీక్ష చేయడానికి సిద్దమైన డాక్టర్ ని సస్పెండ్ చేయాలి....."         నినాదాలు మిన్నంటు తున్నాయి.         అంతా రహస్యంగా జరుగుతుందనుకున్న డి.సి.పి. వెల వెల బోయాడు. అక్కడకు కొంచెం దూరంలో వున్న అంబాసిడర్ కారులో కూర్చున్నాడతను.         "వీళ్ళంతా మీ ఫ్యాక్టరీ లేడీసా...." పక్కనే వున్న భుజంగపతిని అడిగాడు.         "సగం మంది ఫ్యాక్టరీ వాళ్ళలాగే వున్నారు. మిగతా సగం మంది ఫెమినిస్టులట. ఆ బోర్డుల్ని ఒకసారి చదవండి....." చిరాగ్గా అన్నాడు భుజంగపతి.         "వీళ్ళందరూ ఇక్కడికెలా వచ్చారు. వీళ్ళందర్నీ యిక్కడకు ఎవరు మొబలైజ్ చేసారు? అంతా సీక్రెట్ గా చేస్తానని చెప్పారు.....ఏంటీ యిలా చేసారు?....." భుజంగపతి మీద విరుచుకు పడ్డాడు డి.సి.పి.         "అదే నా కర్ధంకావడం లేదు" వెల వెలబోతూ అన్నాడు భుజంగపతి.         "ఈ కన్యత్వ పరీక్షకు, ఆరోగ్యమంత్రికీ ముడిపెట్టారు. యాజ్ ఎర్లీ యాజ్.....ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయకపోతే, నా పీకకు చుట్టుకుంటుంది....."         సరిగ్గా అదే సమయంలో-         వ్యాన్ లో వున్న మయూష, పక్కనున్న వ్యక్తుల్ని తోసేసి గభాలున కిందకు ఉరికి-         ఆ స్త్రీల గుమ్పువేపు పరుగెత్తింది.         ఆర్గనైజర్స్ మయూషను కిడ్నాప్ చేసి తీసుకొచ్చారని తెలుసు కోవడంతో-         అందరూ ఒక్కుమ్మడిగా హాస్పిటల్ మీద రాళ్ళు రువ్వడం ప్రారంభించారు.         ఏం చేస్తే ఏమౌతుందోనని పోలీసులు, అధికారుల ఆర్డర్స్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో-         సబ్ ఇన్ స్పెక్టర్, డి.సి.పి దగ్గరకు పరిగెత్తి-         "పరిస్థితి చేజారిపోయే ప్రమాదం వుంది సార్.....లాటీచార్జి చేయమంటారా?" అడిగాడు.         "లాటీచార్జీ వాళ్ళని కాదు నన్ను చెయ్యి.....ఈయన్ని తీసికెళ్ళి, నాలుగు ఉతకండి....." భుజంగపతి వేపు చూస్తూ కోపంగా అన్నాడు.         పది నిమిషాలయ్యాక-         హాస్పిటల్ సూపరింటెండెంట్ బయటికొచ్చి-         తనకు తెల్సి తమ హాస్పిటల్లో ఎవరికీ కన్యత్వ పరీక్షలు చేయాలని నిర్ణయించలేదని, ఈ సంఘటనకు కారకురాలయిన లేడీ డాక్టర్ ని సస్పెండ్ చేస్తున్నానని ప్రకటించడంతో ఉద్యమకారులు శాంతించారు.         సరిగ్గా అదే సమయంలో నవనీత్ అక్కడికి రావడం, మారుతీ వ్యానులోని వ్యక్తుల్ని గుర్తుపట్టడం, తనని కిడ్నాప్ చేసినది వాళ్ళేనని మయూష కూడా చెప్పడంతో నవనీత్, ఆడవాళ్ళు కలసి ఆ రౌడీలకు దేహశుద్ది చేసారు.         ఆ రౌడీల్ని ఎస్. ఐ. అరెస్టుచేసి, డి.సి.పి దగ్గరకు తీసుకొచ్చాడు.         పరిస్థితి అలా ఎదురు తిరుగుతుందని, రౌడీల్ని పోలీసులు అరెస్ట్ చేసే పరిస్థితి ఏర్పడుతుందని ఊహించని భుజంగపతి-         "నాకర్జంటు పనుంది వస్తాను మరి" అని డి.సి.పి. తో చెప్పి, అక్కడ నుంచి జారుకొనే ప్రయత్నంలో వుండగా అక్కడకొచ్చిన నవనీత్-         "ఏం పతీ.....కిడ్నాప్ కార్యక్రమం యిలా దుఃఖాంతమైందని బాధగా వుందా...." అని సూటిగా అడిగేసరికి భుజంగపతి బిక్కచచ్చి పోయాడు.         "ఏం నవనీత్....ఒళ్ళు పొగరెక్కిందా-మర్యాదగా మాట్లాడు ఉగ్రుడైపోయాడు భుజంగపతి.         "నీతో మర్యాదేమిటి? ఈ మర్డర్స్ వెనక ఎవరి పధకముందో - ఈ కిడ్నాప్ వెనక అసలు  కీలకమేంటో .....అతి త్వరలో సాక్ష్యాలతో నిరూపించకపోతే నా పేరు నవనీతే కాదు....."         డి.సి.పి. ఎదుట నవనీత్ అలా చాలెంజ్ చేసేసరికి, తల కొట్టేసి నట్టయింది భుజంగపతికి.         అతని కాలర్ పట్టుకుని పక్కకులాగి-         "చూడు కన్నా__ఈ భుజంగపతితో పెట్టుకోకు. కేరాఫ్ ఎడ్రస్ వుండదు. నీ ఆటలు ఇంకా ఎన్నాళ్ళో సాగవు గుర్తుంచుకో..... ఈ భుజంగపతితో ఢీ కొనడం అంటే మయూషతో చాటు మాటు సరసాలు కాదు....."         సరిగ్గా అదే సమయంలో అక్కడ కొచ్చింది మయూష.         "చాటుమాటుగా కాదు......పబ్లిగ్గానే సరసం చేస్తా నువ్వేం చేస్తావో చూస్తా" సవాల్ చేశాడు నవనీత్.         "ఒరేయ్ నవనీత్.....నువ్వే మగాడివయితే ఇప్పుడు యిక్కడ ఈ క్షణంలో మయూష మీద చెయ్యి వెయ్యి చూస్తాను" ప్రతి సవాల్ విసిరాడు భుజంగపతి.
24,792
    వాల్మీకి రామాయణం కావ్యాన్ని రచించాడు. అది గానం చేయటానికి అనువైంది. గానం చేసేవారు అతనికి కనిపించలేదు. అందుకతడు చాల బాధపడ్డాడు. అలాంటప్పుడు కుశలవులు వచ్చారు. వారు అన్నదమ్ములు, యశోవంతులు, అందమైనవారు, మేధావులు చక్కగా పాడగలవారు. వారు రామాయణం నేర్చుకుంటామన్నారు. వాల్మీకి వారికి రామాయణం ఆసాంతం నేర్పాడు. దాన్ని లోకంలో ప్రకటించమన్నాడు.     రామాయణం అభిగీతమైంది. కుశలవులు సంగీతం బాగా తెల్సినవారు. వారు రామాయణాన్ని చక్కగా పాడారు. సభలకు, సమావేశాలకు వెళ్లారు. వాటిల్లో రామాయణం పాడి వినిపించారు. అందరూ వారిని మెచ్చుకున్నారు. రామాయణాన్ని కీర్తించారు.     రాముడు కూడ వారిని పిలిపించాడు. నిండుకొలువులో కుశలవులు, రామాయణం పాడారు. వారు వీణలు పట్టుకొని లయ తప్పకుండా మధురంగా గానం చేస్తుంటే రాముడు ఆనందించాడు. వారు చెప్పిన రామాయణ కథ సంగ్రహంగా ఇలా వుంటుంది.         అయోధ్య     ఈ భూమండలాన్ని తొలిసారిగా పాలించినవాడు వైవసత్వమనువు. అతని తర్వాత పాలించిన వాళ్లలో ఇక్ష్వాకు వంశంవారు ముఖ్యులు. వారిలో సగరుడు ప్రసిద్ధి. అతని వల్లనే సముద్రానికి సాగరం అని పేరు వచ్చింది.     ఇక్ష్వాకు వంశంవారు పాలించింది కోసలదేశం. అది సరయూ నదిని ఆనుకొని వుండేది. ఆ దేశానికి రాజధాని నగరం అయోధ్య. అయోధ్య పొడవు 12 యోజనాలు, వెడల్పు 3 యోజనాలు. ఆ నగరానికి బలమైన ప్రాకారముండేది. అది ఒడ్డాణంలా వుండేది. ఆ ప్రాకారానికి అగడ్త వుండేది. అది లోతుగానూ,  వెడల్పుగానూ వుండేది. ఆ కోట బలమైంది. ఎన్ని యుద్ధాలు వచ్చినా తట్టుకోగల శక్తి గలది.     ఆ నగరంలో శిల్పులుండేవారు. వందిమాగధులుండేవారు. సామంతరాజు లుండేవారు. అక్కడి బ్రాహ్మణులు పండితులు. అక్కడి క్షత్రియులు మహావీరులు. వైశ్యులు కుబేరులు. శూద్రులు స్వధర్మ నిరతులు.     ఆ నగరంలో అనేక గుణ్ణాలుండేవి. వాటిలో కాంభోజపుని, బాహ్లీకవువి, వదాయుదేశపువి ఉండేవి. కొన్నింటిని సింధూ నది తీరము నుండి కూడ తెచ్చారు.  అక్కడ లక్షల ఏనుగులుండేవి. వాటిని వింధ్య పర్వత ప్రాంతాలనుండి, హిమవత్పర్వత సానువుల నుండి తెచ్చారు. వాటిలో కొన్ని ఐరావత జాతివి, కొన్ని అంజన జాతివి, కొన్ని వామన జాతివి.     ఆ నగరాన్ని దశరథుడు పాలిస్తుండేవాడు. అతడు అతిరధుడు, ధర్మాత్ముడు, జితేంద్రియుడు, రాజర్షి, చంద్రుడు నక్షత్రాలను పాలించేట్టు, అతడు పౌరులను పాలించాడు. అతడు మాట తప్పనివాడు, ధర్మార్థకామాలు ఏమరకుండ అయోధ్యను పాలించాడు.     దశరథునికి ఎనిమిదిమంది మంత్రులు, వారు దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్దార్ధుడు, అశోకుడు, మంత్రిపాలుడు, సుమంతుడు మున్నగువారు. వారు మంత్రాంగం క్షుణంగా తెల్సినవారు. పరాక్రమవంతులు, విఖ్యాతులు, అప్రమత్తులు, సత్యసంకల్పులు, సత్యవాదులు. అపరాధం చేస్తే తప్ప శత్రువునైనా శిక్షించరు. తప్పుచేసినవాణ్ణి మిత్రుడైనా మన్నించరు. మంత్రులంతా ఒక్కమాట మీద నడుచుకుంటారు. అందున కోసల దేశంలో అసత్యవాది గాని, కుటిలుడు గాని, పరస్త్రీ రతుడు గాని వుండేవారు కారు. నగరం, రాష్ట్రం ఎప్పుడూ ధనధాన్యాలతో తులతూగుతూ ఉండేది.     ఋశ్యశృంగుడు     దశరథునికి ముగ్గురు భార్యలు. వారు కౌసల్య, కైక, సుమిత్రలు. దశరథునికి చక్కని రాజ్యం వుంది. మంచి మంత్రులున్నారు. రాజుగా అతడు గొప్పవాడు. అయినా కుటుంబంలో ఒక లోటుంది. అతనికి సంతానం లేదు. సంతానం కావాలని అతడు పరితపించాడు. సంతానం కోసం అశ్వమేధం చేయాలనుకున్నాడు. అశ్వమేధం చేస్తే సంతానం కలుగుతుందని అతని ఆశ. ఆ విషయం మంత్రులకు తెలిపాడు. వారు పురోహితులను సంప్రదించారు. దశరథునికి వశిష్టుడు, వామదేవుడు పురోహితులు. జాబాలి మున్నగువారు ఋత్విజులు. మంత్రుల మాట విన్నారు పురోహితులు. రాజు దగ్గరకి వెళ్లారు. "మహారాజా! మీ సంకల్పం నలుగురూ మెచ్చదగింది. సామాగ్రి సమకూర్చండి. యజ్ఞాశ్వం విడువండి. మీ మనోరథం సిద్ధిస్తుంది" అన్నారు.     దశరథుడు సామాగ్రి సమకూర్చవలసిందని మంత్రులను ఆదేశించాడు. యజ్ఞాశ్వాన్ని విడిచిపెట్టడానికి ఏర్పాట్లు చేయమన్నాడు. ఎలాంటి లోపం జరగకుండా యజ్ఞం జరగాలని హెచ్చరించాడు. మంత్రులు ఏర్పాట్లు చేయడంలో నిమగ్నులయినారు.     దశరథుడు అంతఃపురానికి వెళ్లాడు. భార్యలను ముగ్గురినీ పిలిచాడు. సంతానం కోసం అశ్వమేధం చేస్తున్నానని చెప్పాడు. వారిని దీక్షగా ఉండాల్సిందన్నాడు. రాణులు ఆ మాట విన్నారు. అప్పటికి వారి ముఖాలు హేమంతంలో కమలాల్లా వున్నాయి. ఆ మాట విన్నారు. వారి ముఖాలు వసంతంలో కమలాల్లా వికసించాయి.     ఇలా వుండగా సుమంత్రుడు దశరథునికి ఒక సలహా యిచ్చాడు. ఋశ్యశృంగునితో అశ్వమేధం చేయించాల్సిందన్నాడు. ఋశ్యశృంగుని గురింతి తనకు తెలిసిన కథ చెప్పాడు. అది సంగ్రహంగా ఇలా వుంటుంది :-      కాశ్యపుని కొడుకు విభండకుని కొడుకు ఋశ్యశృంగుడు. ఋశ్యశృంగునికి అరణ్యమే ప్రపంచం. అతనికి జనపదం తెలియదు. మరో ప్రపంచం ఉందని తెలీదు. తండ్రికి సేవచేయడం, అడవుల్లో ఉండడమే తెలుసు. అలా ఉండగా అతనికి యవ్వనం అంకురించింది. అతనికి యవ్వన వ్యాపారం సహితం తెలియదు.     అడవిలో అతడలా ఉన్నాడు. అప్పుడే అంగదేశంలో కరువు ఏర్పడింది. అంగదేశాన్ని రోమపాదుడు పాలిస్తున్నాడు. అతడు అధర్మంగా పాలించాడు. అందుకే కరువు వచ్చిందన్నారు. రోముపాదుడు వణికిపోయాడు. పురోహితులను పిలిపించాడు. తాను చేసిన అధర్మం ఏమిటో చెప్పమన్నాడు. కరువు తీరే మార్గం చెప్పమని వేడుకున్నాడు.     పురోహితుడు ఆలోచించారు. ఋశ్యశృంగుని గురించి చెప్పారు.  "ప్రాకృత భోగాలెరుగని మహానుభావుడతను. అతన్ని రాజ్యానికి పిలిపించండి, వర్షాలు కురుస్తాయి కరువు దూరం అవుతుంది. ఋశ్యశృంగుడు ఎల్లకాలం ఇక్కడే ఉండేట్టు మీ కూతురు శాంతను చేయండి" అన్నాడు.     ఋశ్యశృంగుణ్ణి పిలిపించే ఉపాయం చెప్పాల్సిందని రాజు పురోహితులను ప్రార్థించాడు. అందుకు పురోహితుడు "ఋశ్యశృంగుడు మహాతపస్వి. ఆగ్రహనుగ్రహ సమర్థుడు. మేం అతని దగ్గరకి వెళ్తే మమ్మల్ని శపిస్తాడు. ఋశ్యశృంగుడు యవ్వనంలో వున్నాడు. విషయ వాంఛలు ఎరుగడు. అందమైనవాళ్లూ, చురుకైనవాళ్ళూ అయిన వేశ్యలను పంపిస్తే వారు కార్యం సాధించగలరు. ఋశ్యశృంగుణ్ణి అంగరాజ్యానికి తేగలరు" అని చెప్పారు.
24,793
    ఇది కలకాదు. నిజం.     ఇక్కడ నుంచి మొదట తను తప్పించుకోవాలి- రెండు-ఎక్కడికి వెళ్ళాలన్నా తనకి డబ్బు కావాలి.     నిశాంత బ్రెయిన్ పనిచేయడం మొదలెట్టింది.     అకస్మాత్తుగా ఆమె పెదవుల మీదకు చిరునవ్వును తెచ్చుకుంది.     "ఠైరో సాబ్... భయపడినట్టు నటించాను. నలుగురూ ఒక్కసారంటే కష్టం కదా ఒక్కొక్కరూ మీ జేబుల్లో డబ్బులు తియ్యండి" అంది నిశాంత లేని యిష్టాన్ని నటిస్తూ.     ఒక్కొక్కరూ జేబులో చెయ్యి పెట్టారు ఆనందంగా.     వంద రూపాయల నోటు తీసి ఒకడిచ్చాడు.     యాభై రూపాయలు, నలభై రూపాయలు, పాతిక రూపాయలు. ఆ డబ్బుల్ని తీసి జాకెట్లో దాచుకుని గుడిసె వైపు అడుగువేస్తూ-     "మొదట నువ్వు రా లోనికి" అని చెప్పి లోనికెళ్ళింది నిశాంత.     వంద రూపాయలిచ్చిన వాడు మిగతావాళ్ళ వైపు గర్వంగా చూసి లోనికి అడుగుపెట్టాడు.     అయిదు నిమిషాలు గడిచాయి.     లోన్నించి పెనుకేక వినబడేసరికి మిగతా ముగ్గురూ లోనికి దూసుకెళ్ళారు.     వంద రూపాయలిచ్చినవాడు బాధగా నేల మీద పొర్లుతూ అరుస్తున్నాడు. ఆ గుడిసెకు వెనక భాగంలో పెద్ద రంధ్రం వాళ్ళను వెక్కిరిస్తూ కన్పించింది.     "ఛోక్రా... టోక్రా దియా" మిగతా ముగ్గురూ బైటకొచ్చి అటూ ఇటూ చూసి గల్లీలో పరుగెత్తడం ప్రారంభించారు.     పదిహేను వరసల మురికివాడల గల్లీలవి. ఆ గల్లీలు దాటి బయటికొస్తే మెయిన్ రోడ్డు. ఆ మెయిన్ రోడ్డు చివర నేషనల్ హైవే. ఒకటి బొంబాయి వైపు వెళ్తుంది. రెండోది గోవాకి వెళ్తుంది.     ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మెయిన్ రోడ్డుమీద పరుగెడుతోంది నిశాంత.     వెనక ఆ ముగ్గురూ పరిగెడుతున్నారు.     అలిసిపోయింది నిశాంత. వంటినిండా చెమటలు పట్టేశాయి. ఒకే ఒక రోజులో అధఃపాతాళానికి వెళ్ళిపోయిన తన పరిస్థితిని తల్చుకుంటే తనకే దుఃఖంగా వుంది.     నిశాంతకు, ఆ ముగ్గురు వ్యక్తులకు మధ్య ఇరవై అడుగుల దూరమే వుంది. దారిలో వెళుతున్న రెండు మూడు లారీలు ఆపడానికి ప్రయత్నించి విఫలమైంది. ఆ ముగ్గుర్లో ఒక వ్యక్తి జేబులోంచి చాకు తీసి పెను వేగంతో ముందుకు దూసుకువస్తున్నాడు.     పరుగెత్తలేకపోతోంది నిశాంత.     "హెల్ప్... హెల్ప్... బచావో" అరుస్తోంది.     మెయిన్ రోడ్డు దాటి నేషనల్ హైవే మీదకొచ్చింది. అదే సమయంలో రోడ్డుకి కుడివైపు నుంచి ఓ మెటాడోర్ వ్యాన్ వస్తోంది.     అరుస్తూ చేత్తో సైగ చేస్తోంది ఆపమన్నట్టుగా.     మెటాడోర్ వ్యాన్ స్లో అయ్యింది. వ్యాన్ ఫ్రంట్ డోర్ తెరుచుకోవడం, నిశాంత ఎగిరి అందులోకి ఎక్కటం...     వ్యాన్ వేగంగా ముందుకు వెళ్ళిపోవడం అంతా క్షణాలలో జరిగిపోయింది.     ఒక్కక్షణం ఏ మాత్రం ఆలస్యమైనా నిశాంత వాళ్ళకు చిక్కిపోయి వుండేది.     ఆయాసాన్ని, ఉద్వేగాన్ని అదుపుచేసుకుంటూ ఒకింతసేపు తనని తాను కంట్రోల్ చేసుకుంటూ కూర్చుండిపోయింది నిశాంత.     డ్రైవర్ నిశ్శబ్దంగా డ్రైవ్ చేసుకుపోతున్నాడు. కొద్ది క్షణాలు ఆగాక తలెత్తి డ్రైవర్ వైపు చూసింది. అక్కడకు బొంబాయి పదిమైళ్ళ దూరంలో వుంది.     రోడ్డు పక్కన మైలురాయి వైపు చూసి అకస్మాత్తుగా తల వెనక్కి తిప్పిన నిశాంత-     వెనక సీట్లో కూర్చున్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయింది.     ఆ వ్యక్తి దేశ్ ముఖ్.                                 *    *    *    *     Rich people are usvally boring because they pon't face reality.     ఎప్పుడో అయిదారేళ్ళ క్రితం ఎవరి ద్వారో విన్న వాక్యాన్ని ఎక్కడో రాసుకున్నాడు సిద్ధార్ధ.     పేపర్ మీదో, నోటు బుక్కులోనో గుర్తుకురావడం లేదు. వారానికో రోజు అనంతమూర్తి సిద్ధార్ధ బుక్స్ అన్నిటినీ వెరిఫై చేస్తాడు. సిద్ధార్ధ ఆలోచనల్ని గమనించడం, ఎప్పటికప్పుడు ఒక రిపోర్ట్ ను తయారుచేసి, మహంతకు పంపడం అనంతమూర్తి రెస్పాన్స్ బిలిటీలో ఒకటి.     తను నోటు పుస్తకాల మీద రాసుకున్న రాతల్నీ, గీసుకున్న గీతల్నీ ఎప్పటికప్పుడు చెరిపేసుకోవడం ఎప్పుడో అలవాటు చేసుకున్నాడు సిద్ధార్ధ.     కానీ ఈ వాక్యాన్ని పదిలంగా రాసి దాచుకున్న గుర్తుంది అతనికి. వెతుకుతున్నాడు.     అతి సుకుమారంవల్ల అంతలోనే అలిసిపోయాడు సిద్ధార్ధ.     ఆలోచిస్తూ కూర్చున్నాడు.     తనలాంటి పాతికేళ్ళ వయసులో వున్న కుర్రాళ్ళు ఏం చేస్తుంటారు?     ఇక్కడకు రాకపూర్వం న్యూయార్క్ లో వుండేవాడు. తను రకరకాల డ్రెస్సులు వేసుకుని, కుర్రాళ్ళు అమ్మాయిల భుజాలమీద చేతులు వేసుకుని రోడ్డుమీద తిరగడం... సముద్రతీరాల్లో పరిగెత్తడం, బార్లలో మత్తుగా తాగడం, చిత్తుగా దొర్లడం...     ఒకసారి తను రహస్యంగా బీరు తాగడం గుర్తుకొచ్చింది అతనికి. అమ్మాయిలవైపు కోరికగా చూడడం గుర్తుకొచ్చింది.     ఫస్ట్ కిస్ ఆఫ్ ది లేడీ... లాస్ట్ పఫ్ ఆఫ్ ది సిగరెట్... అర్ధనగ్నత యూరోపియన్ కంట్రీస్ లో కామన్... ఇక్కడ...     ఎప్పుడో న్యూయార్క్ నుంచి స్పెషల్ ఫ్లయిట్లో వచ్చినప్పుడు... కార్లో ఇక్కడికి వస్తున్నప్పుడు...     రోడ్డు పక్కన నవ్వుకుంటూ వెళ్ళిపోతున్న అమ్మాయిల్ని చూశాడు పదేళ్ళ క్రితం... అంతే...     ఇన్నేళ్లుగా మరో ఆడమనిషిని తను చూసెరగడు.     ఇంత పెద్ద బిల్డింగ్ లో ఒక్క సర్వెంట్ మెయిడ్ కూడా ఎందుకో లేదు.     సిద్ధార్ధ మెదడులో కొచ్చిన పురుగులాంటి ప్రశ్న. తోటమాలి రఘువీర్ తనకో కూతురుందని, ఆ కూతురు పేరు ఆరతి అని చెప్పినప్పటి నుంచీ అతడిని ఆ ఆలోచన తొలిచేస్తోంది. నిన్నటి సాయంత్రమే...     ఆ ఆలోచనతోపాటు ఇంకో ఆలోచన ప్రవేశించిందతనిలో. అప్పటినుంచీ అతను నిలవలేకపోతున్నాడు.     ఐ వాంట్ టు సీ... ఆరతి... ఆరతిని చూడాలి. ఆరతితోపాటు యీ వూరును చూడాలి ప్రజలను చూడాలి... వీలైతే రోడ్డుమీద నడవాలి. (సిద్ధార్ధ ఆర్డినరీ రోడ్డుమీద నడవడం చాలా అరుదు) రోడ్డు పక్కన కిరాణా షాపులో చాక్ లెట్లు కొనుక్కుని తినగలడా తను" ఐస్ క్రీమ్ తినగాలడా తను?
24,794
    "ప్రేక్షకుల కోరిక మీద మళ్ళీ సినిమా మొదటి నుంచీ వేస్తున్నాం అనే స్లెయిడు వేడి సినిమా మళ్ళీ వేయండి..."     వాళ్ళ మధ్య నుంచి చిరాగ్గా వెళ్ళిపోతూ అన్నాడు మేనేజర్-     శక్తి కాబిన్ రూమ్ లోంచి బయటకు నడిచాడు.     ఆపరేటర్ వైపు చూసి మీసం మెలేస్తూ రమణరావు ముందుకు నడిచాడు. ఆ వెనుకే మిత్రబృందం లోపలకు వెళ్ళింది.     అద్భుతమైన ఓపెనింగ్ తో తిరిగి చిరంజీవి స్క్రీన్ మీద దిగాడు.     టైటిల్స్ దగ్గర నుంచి సినిమా తిరిగి ప్రారంభం అయ్యింది.                            *    *    *    *     ఇల్లు దగ్గర పడటంతో అంతవరకూ నోట్లో ఉన్న సిగరెట్ ను గబగబా ఊదేసి ప్రక్కన పారేసి- కర్రగేటు మీద చెయ్యి వెయ్యబోయాడు శక్తి.     అపుడు శక్తికి చటుక్కున ఓ విషయం గుర్తుకు వచ్చింది.     చెల్లెలి ట్యూషన్ దగ్గరకు వెళ్ళి తల్లి తీసుకురమ్మని చెప్పటం అప్పుడు గుర్తుకొచ్చింది. ఆ విషయాన్ని మర్చిపోయినందుకు నాలిక కరుచుకున్నాడు.     తల్లీ, తండ్రీ తన మీదకు అంతెత్తు లేచే దృశ్యాన్ని ఊహించుకుని తప్పదన్నట్లు పిల్లిలా నడుచుకుంటూ లోపలకు వెళ్ళాడు.     అప్పుడు...     రాత్రి పదకొండు గంటలైంది.     దగ్గరగా చేరవేసి వున్న తలుపుల్ని తోసుకొని లోనికి అడుగుపెట్టిన శక్తి ఎదురుగా కన్పించిన దృశ్యాన్ని చూసి కంగారుపడ్డాడు.     పాతకాలపు మంచం మీద తండ్రి పడుకుని వున్నాడు.     తల్లి ఆయన గుండెల మీద చేత్తో రాస్తూ ఉంది. శారద స్థంభానికి ఆనుకుని కూర్చుని ఉంది దిగులుగా.     "ఏం జరిగింది..." గబగబా ముందుకు వెళ్ళాడు శక్తి. శారద స్థంభానికి ఆనుకుని కూర్చుని ఉంది దిగులుగా.     "ఏం జరిగింది..." గబగబా ముందుకు వెళ్ళాడు శక్తి. కలలు కంటూ- తల్లిదండ్రుల మాటల్ని గౌరవించకపోయినా- వాళ్ళంటే శక్తికి చాలా ప్రేమాభిమానాలున్నాయి.     "మీ నాన్నకు మళ్ళీ గుండెల్లో నొప్పొంచ్చిందిరా..." అంది తల్లి బాధగా.     "డాక్టర్ దగ్గరకు వెళ్ళలేదా?" కంగారుగా అడిగాడు శక్తి.     "ఇప్పుడే వెళ్ళొచ్చాం..." శారద చెప్పింది చిన్నగా.         "ఏమన్నాడు..." ఆతృతగా అడిగాడు శక్తి.     "ఇంజక్షన్స్ చేసారు... మెడిసిన్స్ కొనమన్నారు. సమయానికి నువ్వు లేవు. ఆడపిల్ల అర్దరాత్రి అంత దూరం వెళ్ళి మందులు తెచ్చింది." తల్లి నిష్ఠూరంగా అంది.     "ఎలా ఉంది నాన్నా...." జానకీ రామయ్య కళ్ళలోకి చూస్తూ అడిగాడు శక్తి- లోలోపల గిల్టీగా ఫీలవుతూ.     "ఈసారికి గండం గడిచింది...." నెమ్మదిగా అన్నాడాయన.     "అదేమిటండీ... ఆ మాటలు..." తల్లి బాధపడుతూ అంది.     కాసేపయ్యాక శారద లేచింది.     "రా అన్నయ్య... కాళ్ళు కడుక్కో.... వడ్డిస్తాను?" అంది.     నెమ్మదిగా అక్కడి నుంచి కదిలాడు శక్తి తప్పు చేసిన వాడిలా తలవంచుకుని.     శక్తి అన్నం తింటున్న సమయంలో-     "నువ్వెళ్ళి పడుకో శారదా... ఉదయాన్నే కాలేజీకి వెళ్ళాలి కదా." అంటూ కొడుకు ఎదురుగా కూర్చుంది తల్లి.     "నువ్వు అర్థరాత్రీ... అపరాత్రీ వరకు తిరగటాలు తగ్గించాలిరా, ఏ క్షణంలో ఏమౌతుందోనని బెంగతో చస్తుంటే, నువ్వు బైట బలాదూర్లు తిరిగితే ఎలాగరా..." లక్ష్మీదేవి బాధగా ఉంది.     భోజనమైపోయి చెయ్యి తుడుచుకుంటూ లేవబోయిన శక్తి తల్లి మాటలు విని ఆమె వైపు సూటిగా చూడలేకపోయాడు.     "నాన్నగారు పనిచేసే కిరాణా షాపులో, నాన్నగారి పని నేను చేయాలా?" చిరాకును కప్పిపుచ్చుకుంటూ అడిగాడు శక్తి.     "నేనేం అర్థంకాని భాషలో చెప్పటంలేదు. ఎలాగూ వీధుల్లో పాత బస్టాండ్ పిట్టగోడల మీద కాపలా వాళ్ళలాగా కూర్చునేబదులు, ఆ కిరాణా షాపులో కూర్చుంటే... కుదురూ ఏర్పడుతుంది. పనీ అలవడుతుంది" అందావిడ నచ్చజెప్పే ధోరణిలో.     "ఆ ఓనర్ రెండు రోజులు నాన్నగారికి సెలవివ్వడా.... అదేం ఆర్మీనా? నేవీనా? సెలవు దొరక్కపోవటానికి" విసురుగా, కోపంగా అన్నాడు శక్తి.     "సెలవిస్తాడు కానీ... జీతం ఇవ్వడు. కిరాణా కొట్టంటే ఆర్మీ కాదు- నేవీ కాదు గదా- శెలవు పెట్టినా జీతం ఇవ్వటానికి, వెధవ రీజనింగులు, లాజిక్కులు మానేసి నా మాట విను. నా ఎలిమెంటరీ స్కూల్లో జీతం... నాన్నగారి ఆ జీతంతోనే బండి నడుస్తోంది. అన్ని విషయాలూ అర్థం చేసుకునే వయసు వచ్చింది. వితండవాదం చెయ్యకు." నెమ్మదిగా నచ్చజెప్పే ధోరణిలో అంది.     మరేం మాట్లాడలేక తన గదిలోకి వెళ్ళిపోయాడు శక్తి. గదిలో మంచాన్ని చూడగానే అన్ని ఆలోచనలనూ మర్చిపోయేడు- వరదలా నిద్ర ముంచుకు వచ్చింది.     నిద్రపోతున్న భర్త జానకీరామయ్య ముఖంవైపొక సారి చూసి, దుప్పటి సర్ది, రెండో గదిలోకి వచ్చింది లక్ష్మీదేవి. అప్పటికే శారద ముసుగుతన్నేసింది. కానీ నిద్రపోవటం లేదు. శారదకు కంటిమీద కునుకు రావటం లేదు.     కాలేజీలో ఎగ్జామ్స్ ఫీజ్ కట్టటానికి ఎల్లుండే ఆఖరిరోజు. తల్లితో ప్రతిరోజూ ఆ విషయం చెబుతూనే ఉంది. ఆ రోజు కాలేజీ నుంచి రాగానే తల్లిని గట్టిగా అడగాలని నిర్ణయించుకుంది- కానీ తండ్రికి ఒంట్లో బాగుండక పోవటంతో అడగలేకపోయింది.     రేపు ఎలా? ఏం చెయ్యాలి?     చాలాసేపు అలా ఆలోచనలతోనే గడిపింది పద్దెనిమిదేళ్ళ శారద.                                             *    *    *    *     రోడ్డు విశాలంగా ఉంది- విశాలమయిన ఆ రోడ్డుమీద జనం. సిటీ బస్సుల్లోంచి ఎక్కుతూ, దిగుతూ జనం.     అప్పుడే వచ్చి ఆగిన సిటీబస్సులోంచి చెమటలు కక్కుకుంటూ దిగాడు శక్తి. చేతిలో చిన్న బ్రీఫ్ కేస్- బస్సునీ, జనాన్నీ, నలిగిపోయిన తన డ్రెస్ నీ చూసుకుని విసుక్కున్నాడు శక్తి.     "మేనర్ లెస్ బ్రూట్స్... ఇక ఎప్పుడూ బస్సెక్కకూడదు..." విసుక్కుంటూ ముందుకు నడిచాడు.     అరఫర్లాంగు నడిచేక ఎడం పక్కవేపు తలతిప్పి చూశాడు.     కెనరా బ్యాంక్ బోర్డ్ కనిపించింది.
24,795
    ముద్దుముద్దుగా, తెల్లగా, బొద్దుగావుండే ఆమె పిల్లలు కాన్వెంటుకి వెళుతూంటే ముచ్చటపడుతుంది. ఆమె ఇంటికి తరచూ వెడుతూ ఆ కబుర్లు మహా ఉత్సాహంగా చెబుతుంది సుబ్బారావుతో.     భార్య ఆడంబరానికి ఇచ్చే విలువ చూసి చూసి- "ఇన్నిసార్లు నువ్వు వెళుతున్నావు. ఆవిడ మనింటికసలు వచ్చిందా?" అన్నాడు ఒకరోజు.     జ్యోతి గతుక్కుమంది మనసులో.     నిజమే. శ్యామల ఈ మూడునెలల్లో ఒక్కసారయినా రాలేదు. ఓసారి ఎక్కడికో వెడుతూ కిందికిదిగుతూ గుమ్మందగ్గిర నించున్న జ్యోతిని చూసి పలకరించి.... గదిలోకి తొంగిచూసి-     "మీ ఇంట్లో ఎన్ని గదులు, రెండేనా?" అంటూ లోపలికి వచ్చి ఇల్లు చూసింది.     జ్యోతికి తలకొట్టేసినట్లు సిగ్గుపడుతూ "కూర్చోండి" అంది కుర్చీ జరిపి.     "అబ్బే కూర్చోనండి, షాపింగ్ కి వెళ్ళాలి. ఏం చేస్తున్నారు? పాపం! కాలక్షేపం ఏమీ లేదుగాదూ- ఓ రేడియో అన్నా కొనుక్కోకూడదూ?" అంది సానుభూతిగా అన్నట్టు.     జ్యోతి గుటకలు మింగింది.     "వస్తా మరోసారి వస్తా" అంటూ బ్యాగ్ ఊపుకుంటూ వెళ్ళి పోయింది.     ఆ మరోసారి మూడునెలల్లో ఒక్కసారన్నా రాలేదు. ఆ మాట మొగుడితో చెప్పి తేలిపోవడం ఇష్టంలేక జ్యోతి దర్పంగా "ఎందుకు రాలేదు? ఒకసారి వచ్చింది" అయినా నేనే రమ్మనను. ఆవిడ వస్తే కూర్చో పెట్టటానికి మంచి కుర్చీఅన్నా లేదు. పిలవడం సిగ్గుచేటు."     "నీవు డజనుసార్లు వెళతావు. ఆవిడ ఒకసారి వచ్చిందన్నమాట. పోనీ ఆవిడకి, నీకు అంత స్నేహమేమో - ఆవిడింట్లో అన్ని పార్టీలు జరుగుతుంటాయి. ఒక్కసారన్నా నిన్ను పిలిచిందా? నీవు వూరికే ఆవిడని పూసుకు తిరుగుతావుగాని...."     "ఎలా పిలుస్తారు? మీరు ఎన్నడన్నా ఆయనతో మాట్లాడారా? పరిచయం చేసుకున్నారా? నన్ను ఒక్కర్తినే ఎలా పిలుస్తారు పార్టీలకి?" జవాబు దొరికిందని గయ్ మంది.     ఆయన నేనో క్షుద్రుడనన్నట్టు ఎదుట కనిపించినా ఓ చిరునవ్వు నవ్వితే కొంప మునిగిందన్నట్టు సీరియస్ గా మొహంపెట్టి వెళ్ళిపోయాడు. నాలుగైదుసార్లు మొదట్లో. అలాంటి అతనితో పూసుకుతిరిగి పరిచయం చేసుకుని, వాళ్ళింటికెళ్ళే ఖర్మేమిటి నాకు. ఏదో అతనికింద నేను గుమస్తాలా అనుకుంటాడు గాబోలు" అన్నాడు సుబ్బారావు.     "ఏం? వెడితే తప్పేమిటి? అనవసమైన స్నేహాలు చేసేకంటే కాస్త పనికొచ్చే వాళ్ళతోచేస్తే ప్రయోజనం వుంటుంది."     "ఏం? ఆయనగారు నాకేమన్నా ఉద్యోగం యిప్పించాలా? లేక ఏమన్నా మూటఇస్తాడా? నీకు అభిమానం, పౌరుషం లేకపోతే నీవు తిరుగు ఆవిడ ఇంటిచుట్టూ. నాకా అవసరంలేదు" కాస్త తీవ్రంగా అన్నాడు.     "కుళ్ళు, అసూయ. అంతకంటే ఏంకాదు. దీన్నే ఇన్ ఫీరియార్టి కాంప్లెక్స్ అంటారు ఇంగ్లీష్ లో" హేళనగా ఎత్తి పొడిచింది జ్యోతి.     సుబ్బారావు ఒళ్ళు మండింది.     "అలాంటి కుళ్ళు, అసూయ, ఏడుపులు అవన్నీ నీకు. వీళ్ళని, వాళ్ళని చూసి మనకి లేవని ఏడిచేది నీవుగాని, నేనుకాదని నీకూ తెలుసు. నోటికి వచ్చినట్లు మాట్లాడకు. ఊరుకుంటుంటే మరీ ఎక్కువవుతూంది" తీక్షణంగా అన్నాడు.     "ఊరుకోక ఏంచేస్తారు?" రెట్టించింది జ్యోతి.     "ఏం చేస్తానా? చెంప పగలగొట్టి నోరు మూయించగలను. కాని అంత కుసంస్కారిని కాదుగనుకనే ఈబాధ" విసురుగా అని అక్కడనించి వెళ్ళిపోయాడు.     ఇలాంటి తగవులు ఇంచుమించు ప్రతిరోజూ ఏదో ఒకటి ఇద్దరి మధ్య వచ్చేవి. ఏదో అంటూ, అతన్ని రెచ్చగొట్టేది.     ప్రతి చిన్న విషయానికి రాద్ధాంతంచేసి సాధించడం, దెప్పడం, అది చిలికి చిలికి గాలివాన అవడం మామూలు అయిపోయింది. రెండురోజులు భార్యాభర్తల మధ్య మాటలు బంద్ అయ్యేవి.     ఎన్నాళ్ళయినా సుబ్బారావే జరిగింది మరిచి, తన తప్పు లేకపోయినా కిందకి దిగివచ్చి జ్యోతిని బతిమిలాడుకుని, ప్రసన్నురాలిని చేసుకోవలసి వచ్చేది.     ఆమె మాటలకి. దెప్పులకి అతనికీ మనసు దెబ్బతిని పౌరుషం వచ్చేది. ఎంత వద్దనుకున్నా ఒకోరోజు అతని అహం దెబ్బతిని, అతడూ అరిచేవాడు.     ఆ ప్రధమకోపం తగ్గగానే పశ్చాత్తాప పడేవాడు. పట్టుకుని పెళ్ళి చేసుకుని మూడునెలలన్నా గడవకముందే తామిద్దరిమధ్య ఈ తగువులేమిటి అని బాధ పడేవాడు.     వైవాహిక జీవితం గురించి ఎన్నో మధురానుభూతులని ఊహించాడు. ఇలా జరిగిందేమిటి? ఈ జ్యోతికి బుద్ధిలేకపోతే తనబుద్ధి ఏమైంది? ఆడదాని మనసు ఎరిగి ఆమెని తనవైపు తిప్పుకోడం మగాడి పని. ఆమెని ఆకర్షించలేకపోవడం తన లోపం గాబోలు అంటూ తప్పు తనమీదే వేసుకుని బాధపడి, మళ్ళీ జ్యోతితో మాటలు కలిపాడు.     అవతల జ్యోతీ అంతే. ఒక్కొక్కసారి ఆమె మనసు కాస్త బాగున్నప్పుడు పాపం సుబ్బారావు మంచివాడే. గుమస్తా ఉద్యోగం అంటే అతనేం చేస్తాడు?     అది తెలిసేగా చేసుకుంది. ఇప్పుడనుకొని బాధపడి ప్రయోజనం ఏముంది? అని సరిపెట్టుకుని కాస్త సౌమ్యంగా ప్రవర్తించేది. కాని ఇంతలోనే మూడ్ మారిపోయేది.     ఏ అందమైన జంటని చూసినా, ఏ మంచి సినిమా చూసినా, ఏదన్నా నవల చదివినా. మంచిచీర కంటపడి అది తను కొనుక్కోలేనిది అనుకున్నా, బజార్లో ఏదన్నా ఫర్నిచర్ చూసినా ఆమె మనసు మళ్ళీ కోతి అయ్యేది.     "ఏం జీవితం యిది? ఛీ ఛీ!" అన్పించేది.                        
24,796
    మధూహ దిగ్భ్రాంతురాలై అతడినే చూస్తోంది. అతడి మాటల్లో ఆవేశాన్ని కాదు. కళ్ళలో సిన్సియారిటీని....     నిజంగా ప్రేమంటే ఇంత తీవ్రంగా వుంటుందని ఆమె మొదటిసారి చూడటం. అతడిని అభినందించాలని ఆమెకి అనిపించింది. అతడితో ప్రేమించబడిన అమ్మాయికన్నా అదృష్టవంతురాలెవరైనా వుంటుందా? అసలే స్త్రీ అయినా ఇంత ప్రేమని నిరాకరించగలదా! ఈర్ష్య కూడా వేలమందిలో ఒకర్నే ఎన్నుకోవటం.....నువ్వు నాకు ప్రపంచంలో అన్నిటికన్నా ఇష్టమైనదానివి..... అని స్పష్టంగా చెప్పగలగటం.....     "ఏమిటాలోచిస్తున్నారు?"     ఆమె తెప్పరిల్లి "ఏమీలేదండీ. వెళ్లోస్తాను. మీరు కోరినట్టే ఈ విషయాలేవీ పేపర్లో రావు" అంటూ కదలబోయింది.     "ఆగండి" అన్నాడు. ఆమె ఆగింది.     "లక్ష్మీ అడ్రసు ఇస్తానన్న షరతుమీదే  మీకీ విషయాలన్నీ చెప్పాను."     మధూహ గతుక్కుమంది.     సంభాషణలో పడి అసలు విషయం మర్చిపోయింది.     ఇపుడు, తమ పత్రికలో వ్రాస్తున్న లక్ష్మి అడ్రసు తమకి తెలీదంటే.....ఇంతసేపూ మోసం చేసినందుకు ఇక్కడే చంపి పాతేస్తాడు.     "ఆమె  అడ్రసు పత్రికాఫీసులో వుంది" అంది తప్పించుకుంటున్నట్టు.     పదండి. నేను మీతో వస్తాను: చెప్పులవైపు నడుస్తూ అన్నాడు. ఆమె పరిస్థితి పెనంమీద నుంచి పొయ్యిలో పడినట్టు అయింది. "ఆమె  ఫోన్  నెంబర్ ఇస్తాను కావాలంటే" అంది.     అతడు ఆగాడు. అతడి మొహంలో వెయ్యి క్యాండిల్స్ బల్భు వెలిగినట్టయింది.     "40009"     చెప్పేసింది - అతడు అతికష్టంమీద అప్పటికప్పుడు ఫోన్  దగ్గరకి పరుగెత్తుకు వెళ్ళకుండా వుండటం కోసం మర్యాదకి కంట్రోల్ చేసుకుంటున్నాడని తెలుస్తోంది.     "వెళ్లొస్తాను" గుమ్మం దగ్గరకి వెనుదిరిగి, "ఒకవేళ మీకు కావాల్సింది. మా పత్రికలో వ్రాసే రచయిత్రి లక్ష్మి కాకపోతే మాత్రం నన్ను క్షమించాలి. ఆమె మీరిక వేధించకూడదు" అంది.     ప్రహసిత్ మొహం ఎర్రబడింది. "ఏమనుకుంటున్నారు నా గురించి" అన్నాడు. ఆమె నవ్వి "సారీ" అని అక్కణ్ణుంచి కదిలింది. వెళ్తూ. అనుకుంది.     "....ఇతడు ఫోన్ చేసేలోపులోనే లక్ష్మికి ఫోన్ చేయాలి. లేకపోతే విషయం అర్థంకాక బెదిరిపోతుంది. ఆంధ్రదేశంలో ప్రతీ మూడో అమ్మాయి పేరూ 'లక్ష్మి' అవటం అదృష్టానికే వచ్చింది. అతడు  ప్రేమించిందీ.....మా పత్రికలో వ్రాసేదీ.... నా స్నేహితురాలూ ఫోన్ నెంబర్ ఇవ్వొచ్చునన్న ఆలోచన రావటం కూడా మంచిదయింది. ఈపాటికే ప్రహసిత్ నేనిచ్చిన నెంబర్ కి చేసుంటే లక్ష్మి ఎలా మాట్లాడుతుంది? కోపంగా తిట్టి పెట్టేస్తుందా? ఇలా రకరకాల ఆలోచనలతో ఆమె టెలిఫోన్ బూత్ వైపు నడిచింది.     ఆంధ్రదేశంలో కొన్ని లక్షలమంది లక్ష్మీలుండవచ్చు. కానీ తన స్నేహితురాలే ఆ రచయిత్రి అనీ, పొరపాటున ఇచ్చినా..... అసలు నెంబరే ఇచ్చి..... ప్రహసిత్ కి సంబంధించేంతవరకూ ఎవరూ  చేయనంత సాయం  తాను చేసిందని ఆమె తెలీదు. అలా ఇవ్వటం  ద్వారా  నలుగురి జీవితాలు అనూహ్యమైన మలుపు తిరుగుతాయని ఆమె ఆ క్షణం వూహించలేదు.     ఆమె టెలిఫోన్ బూత్ నుంచి చేస్తే అటు విష్ణు ఫోన్ ఎత్తాడు.     "నేనూ మధూహని మాట్లాడుతున్నాను" అంది.     "హాయ్. హౌ ఆర్యూ" అన్నాడు.     "ఫైన్. లక్ష్మి వుందా?"     "లేదు. ఏమిటి విశేషాలు. అసలు కనపడడంలేదేమిటి?"     ఇతడికి ఇది అలవాటు. ఆడవాళ్ళు కనపడితే వదలడు. లా అని అసభ్యంగా ప్రవర్తించడు. ఏదోలా సంభాషణ పొడిగిస్తాడు. పొగుడుతాడు.  జోకులు వేస్తాడు. భోజనానికి రమ్మంటాడు. భార్యముందే చనువుగా వుండటానికి ప్రయత్నిస్తాడు. అదంతా చాలా సాధారణమైనట్టు తన స్వభావమైనట్టు ముసుగువేస్తాడు. వాళ్ళింటికి తను తరచు వెళ్ళకపోవడానికి అదో కారణం. లక్ష్మికి అర్థంకాదా విషయం. భర్తంటే వల్లమాలిన ప్రేమవున్నట్లు మాట్లాడుతుంది. పల్లెత్తు మాట అననీయదు. ఏమో, తనే కరెక్టేమో. వాళ్ళది నిజంగా మంచి దాంపత్యమేనేమో. తనే అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తుందేమో. అతడు భార్యని అపురూపంగా ఎక్కువ ఆలోచిస్తుందేమో. అతడు భార్యని అపురూపంగా చూసుకుంటూ వుండి వుండొచ్చు.     "నీలో నాకు నచ్చే గుణం అదే" అట్నుంచి విష్ణు అన్నాడు.     "ఏది?"     "మాట్లాడుతూ ఆలోచనల్లోకి వెళ్ళిపోతావు. ఎంతో డెప్త్ వున్నవాళ్ళే అలా ప్రవర్తిస్తారట."     ఇతడిలో ఇదొకటి. తనకి చాలా తెలివితేటలున్నాయని అనుక్షణం అన్యాపదేశంగా అవతలివాళ్ళు గుర్తించేలా ప్రవర్తిస్తూ వుంటాడు. మాటల్లో కూడా కనపడుతూ వుంటుంది.     "అదిగో మళ్ళీ ఆలోచన్లు.....ఎవరి గురించి ఆలోచిస్తున్నావ్? బోయ్ ఫ్రెండ్  గురించా?" నవ్వేడు.     "లక్ష్మీ వుందా?" కాస్త సీరియస్ గా అడిగింది.     అతడు గుర్తించినట్టున్నాడు. "లేదని చెప్పాగా" అన్నాడు.     "ఎక్కడికెళ్ళింది?"     "విశాల్ క్లినిక్ కి"     మధూహ భృకుటి ముడిపడింది. వి.....శా.....ల్..... క్లినిక్.     "తనకీ మధ్య ఈ పిల్లల పిచ్చి ఎక్కువైంది. బాబాలకీ గుళ్ళకీ తిరుగుతోంది. ఇదిగో ఇప్పుడు ఈ క్లినిక్ కి. నేను చెపుతూనే వున్నాను. ఇప్పుడు వయసేం మించిపోయింది చెప్పు? ఏదైనా చేస్తే నేను చేయాలితప్ప ఈ క్లినిక్ లేం చేస్తాయంటే వినదు" జోకాడు.     "ఎంతసేపయింది వెళ్ళి?"     "పది నిమిశాలైంది" అంటూ అతడేదో ఇంకా మాట్లాడబోతూంటే ఫోన్  పెట్టేసింది.     ప్రహసిత్ కూడా ఆమెకోసం ఫోన్ లో ప్రయత్నిస్తూ వుండి వుంటాడు. లక్ష్మిని వెళ్ళి కలుసుకుని చెప్పాలి. ప్రహసిత్ ఫోన్ విష్ణు రిసీవ్ చేసుకుంటే అనవసరమైన అనుమానాలు రావచ్చు. అనవసరంగా తను ఆ నెంబరిచ్చింది.     ఆమె విశాల్ క్లినిక్ కి వెళ్ళడానికి నిశ్చయించుకుంది. పబ్లిక్ బూత్ కి డబ్బు ఇచ్చేసి అక్కడికి బయల్దేరింది.     అదే మొదటిసారి అక్కడికి వెళ్ళడం. ఇంతకుముందు ఆ క్లినిక్ వేరేచోట వుండేది. దాన్ని 'హిప్నోమైండ్ మాగ్నో క్లినిక్' గా మార్చి ఈ సంతానోత్పత్తి కేంద్రాన్ని వేరే చోటికి షిప్టు చేశాడు.     అక్కడికి వెళ్లింది మధూహ.     బయట క్లినిక్ ముందు చాలా స్కూటర్లున్నాయి. ఆమె లోపలికెళ్ళింది.     ఆమెకి చాలా ఆశ్చర్యం కలిగింది.     అక్కడ అన్ని జంటల్ని చూడడం. ఒంటరి స్త్రీలు కూడా చాలామంది వున్నారు. గదిలో నాలుగువైపులా బల్లలున్నాయి. ముందు వరండాలో కూడా బల్లలున్నాయి. అంతా జనమే. కిటకిటలాడుతున్నారు. పిల్లలులేని జీవితం జీవితమే కాదన్న నిర్లిప్తత, అందోళన, టెన్షన్ అందరి మొహాల్లోనూ కనపడుతున్నాయి. మగవాళ్ళు గంభీరంగా తన లోపం ఏదీ లేదన్నట్టు స్టయిల్ గా వుండడానికి ప్రయత్నిస్తున్నారు. దేశంలో జనాభా సమస్య ఇంత తీవ్రంగా ఎందుకుందో అర్థం అయిందామెకు. 'మాతృత్వంలోనే వున్నది ఆడజన్మ సార్థకం' అన్నపాటని చీల్చి చెండాడిన ఒక రచయిత ఆర్గ్యుమెంటు గుర్తొచ్చింది. పిల్లలు పుట్టకపోతే, ఎటువంటి పరిస్థితుల్లోనూ అది సాధ్యంకాకపోతే - స్త్రీ ఎం చెయ్యాలో చెప్పాలో తప్ప  నీ జీవితానికిక సార్థకత లేదు అని నిర్ణయం  చేసెయ్యటమేమిటి? పిల్లలంటే బావిలో నీళ్ళా? చేదవేసి తోడుకోవడానికి? స్త్రీని డిప్రెషన్ కి లోనుచేసే ఇలాటి పాటల్ని నిజంగానే 'బాన్' చెయ్యాలి.     ఆమె ఆలోచన్లలో వుండగానే  కన్సల్టేషన్ రూమ్ లోంచి లక్ష్మి బయటికి వచ్చింది. మధూహని చూసి ఆమె మొహం విప్పారింది. "ఏమిటిలా వచ్చావ్?" రాజు కోసమా?" అనిఅడిగింది సంతోషంగా.     "కాదులే. రాజు ఇక్కడుండడుగా. నీ కోసమే" అంది మధూహ.     "నా కోసమా. భలే..... అబద్ధాలు చెప్పకు. ఆడపిల్లలు పుడతారు" నవ్వింది లక్ష్మి.     "పెళ్ళికాకముందయితే కష్టమే" మధూహ కూడా నవ్వుతూ అంది. "ఏమంటున్నారో క్లినిక్ లో....." అని అడిగింది.     "90 శాతం ఛాన్సులున్నాయట"     "కంగ్రాచ్యులేషన్స్" అంది మధూహ. "పరీక్షలన్నీ చేశారా"     "లేదే"     మధూహ అదిరిపడింది. "పరీక్షలేమీ చేయకుండా 90 శాతం ఛాన్సుంది అని ఎలా  చెప్పారు?" ఇద్దరూ ఇంటివైపు వెళ్తూండగా లక్ష్మి చెప్పింది. "మనసులో కలతలు, టెన్షన్లు మొదలైనవి వుంటే పెర్టిలైజేషన్ మీద కూడా దాని ప్రభావం వుంటుందట."     "మనసుకీ కడుపుకీ ఏమిటి సంబంధం?" విస్తుపోతూ అడిగింది.     "ఏమో. నాకైతే నిజమేననిపిస్తోంది."     "నీకేమిటి వర్రీ?"     "పిల్లలు కలగకపోవడం. డాక్టరుగారు కూడా అదే చెప్పారు"     "ఏమని? పిల్లలు పుట్టటం లేదన్న వర్రీ వుండడంవలన నీకు పిల్లలు పుట్టటం లేదనా?"     అందులో వెటకారం లక్ష్మి గుర్తించలేదు. "పోనీలేవే. దేవుడి దయవల్ల ఇక్కడయినా ఫలితం కనపడితే చాలు" అంది భక్తిగా.     "ఫీజు ఎంత తీసుకున్నారు?"     "వంద రూపాయలు"     బయట కూర్చున్న జంటలు కనిపించారు. "మనసులో ఏ  ఆలోచనా లేకుండా పడుకోండి. పిల్లలు పుడతారు..... అని చెప్పడానికి వంద రూపాయలు తీసుకున్నారా?" అంది కసిగా.     "పోనీలేవే. ఇంత ఖర్చుపెడుతున్నాం. 'ఏ పుట్టలో ఏ పాముందో. ఆర్నెల్లు తిరిగేసరికల్లా మూడోనెల అని స్వీట్లు పంచిపెడతారు మీరు' అని గ్యారంటీ ఇచ్చారు డాక్టరు గారు. టెస్టులకి వచ్చేనెల రమ్మన్నారు."     "ఇలాటివి విష్ణుకి ఇష్టం వుండవుగా"     "అదే నేనూ చెప్పాను. ముందు నన్నొక్కదాన్నే రమ్మన్నారు"     ఇక లాభంలేదన్నట్టు మధూహ చెప్పడం ప్రారంభించింది. "చూడు లక్ష్మి, ఒక దంపతులకి పిల్లలు పుట్టాకపోవడానికి సగం మగవాడు, సగం స్త్రీ  కారణమవుతారు. భర్తని పరీక్షించకుండా నిన్నోక్కదాన్నే పరీక్ష చేసి ఏం చెపుతారు?"     "నీకు పెళ్ళికాలేదుగా. నీకేం తెలుసు?"     మధూహ మొహం ఎర్రబడింది. "ఇది తెలియటానికి ఆరోక్లాసు చదువు చాలు" అంది. "ఇంకో విషయం  తెలుసా? నేను ఒక ప్రముఖ  సైన్స్ మ్యాగజైన్ లో చదివాను. నిస్సంతు దంపతులకు ఎన్ని ట్రీ ట్ మెంట్స్ ఇచ్చినా కేవలం45 శాతం మాత్రమె గర్భం వచ్చే అవకాశం వుంది. నువ్వనట్టు 90 శాతం కాదు"     "పోనీలే. ఆ నలభైఐదులో మేమూ ఉన్నామనుకో...."     "కానీ ఆ డాక్టర్ అలా అబద్ధం చెప్పకూడదుకదా."     "నన్ను సంతోషపెట్టడానికి చెప్పి వుండొచ్చుగా.     "ఆ డాక్టరేమీ జనోద్ధరణకి కంకణం కట్టుకున్న ప్రవక్త కాదు. మాటల్తోను, సలహాల్తోను, సమాదానాల్తోనూ సంతోషపెట్టడానికి. డాక్టరన్నాక ఫాక్ట్స్ చెప్పాలి. కడుపు గురించి అడిగితే మనసు గురించి చెప్పకూడదు."     లక్ష్మి నవ్వింది. "నీకు తెలియని డాక్టరు మీద నీకెందుకు అంత కోపం.....
24,797
    "అవును... ఇన్ని రోజులు ఎవరన్నా చూస్తారేమోనన్న భయంతో నేను దొంగలా బతికాను.. నిన్నూ, నన్నమితంగా ప్రేమించే నిన్ను దొంగలా చేశాను... అవన్నీ జ్ఞాపకానికొస్తున్నాయి. నేనెక్కడకు రమ్మంటే అక్కడకు భయాల్నీ, బాధల్నీ బెంగల్నీ లెక్కచేయకుండా వచ్చిన నిన్ను, నీ ప్రేమను తలుచుకుంటుంటే... నీ లాంటి భార్య నాకు దొరకడం కన్నా మరే అదృష్టం నాకొద్దు... ఇక మననెవరూ ఏం చెయ్యలేరు... ఇంకో ఇరవై నాలుగ్గంటల్లో మనం... ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేకుండా కొత్త ప్రపంచంలో ఉంటాం. ఆ ప్రపంచం మనిద్దరిదే.. ఆ విషయం ఊహిస్తుంటేనే... నాకెంతో హాయిగా ఉందో తెల్సా..."     ఆ మాటలకు ఆమె మనసు పరవశంతో నిండిపోయింది.     అవినాష్ జుత్తు మీద, బుగ్గలమీద, పెదవులమీద చేతులమీద వత్తయిన జుత్తున్న గుండెల మీద ముద్దు పెట్టుకుంది.     ఇద్దరూ బెడ్ మీద పక్కపక్కనే కూర్చున్నారు.     తన గుండెలమీద పెదాలతో ముద్రలు వేస్తున్న ఆమె తలమీద ఫ్యాను గాలికి రెపరెపలాడుతున్న మెత్తని జుత్తుని వేళ్ళతో పక్కకు తీస్తూ-     రెండు భుజాలతో ఆమెను పొదివి పట్టుకుని, తలగడను సరిచేసి మంచమ్మీదకు చేర్చాడు అవినాష్.     "ఇప్పుడొద్దమ్మా..." సగం ఇష్టంగా, సగం అయిష్టంగా అంది గౌతమి.     అవినాష్ ఆ మాటను విన్పించుకోలేదు. అతని చేతులు తన పనిని తను చేసుకుని పోతున్నాయి.     "ఇలాగే నన్ను తినేస్తావా..." నవ్వుతూ, ఉద్రేకంతో వేడెక్కుతున్న అవినాష్ చేతుల్ని పట్టుకుంటూ అంది.     తెల్లటి ట్యూబులైటు పాలవెలుగు ప్రవాహం గదంతా నిండి ఉంది.     ఆ వెలుగులో గౌతమి పాలరాతి బొమ్మలా ఉంది.     ఆ పాలరాతి బొమ్మమీద నిండుగా ఒరగడానికి అవినాష్ సిద్ధమౌతున్న సమయంలో-     అవినాష్ చేతులు ఆమె నడుంమీంచి కొద్దిగాపైకి కదిలిన సమయంలో-     సరిగ్గా అదే క్షణంలో-     బయట తలుపు టకటక లాడింది.     ఎవరో తలుపు తడుతున్నారు.     ఎవరై ఉంటారు... ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. ఇద్దరి మనస్సులో సందేహం... పోలీసులా... పోలీసులేమో పోలీసులైతే... ఆ ఆలోచన రావడంతోనే అవినాష్ వంటికి చెమట్లు పట్టేశాయి.     కాకపోతే... ఈ సమయంలో... ఇక్కడ... ఎవరూ పరిచయస్తులు లేని ఊళ్ళో... ఏదో జరిగి ఉంటుంది... గబుక్కున మంచమ్మీంచి లేచి, లుంగీ సర్దుకున్నాడు అవినాష్.     గౌతమి పక్కనే ఉన్న దుప్పటిని ముసుగ్గా కప్పుకుని గోడ పక్కకు తిరిగిపోయింది. నెమ్మదిగా అడుగులేసుకుంటూ వచ్చి, ఎందుకైనా మంచిదని- ముందు జాగ్రత్త చర్యగా, ట్యూబ్ లైట్ స్విచ్ ఆపేసి-     తలుపు గెడ తీసాడు అవినాష్.     ఎదురుగా-     ఎవరో ముసలాయన.     వదులు ఫాంట్, లూజ్ షర్టు, ముక్కుమీంచి జారిపోతున్న గోల్డ్ ఫ్రేమ్ కళ్ళద్దాలు...     "ఎవరు మీరు...?" అవినాష్ నోటంట మాట వచ్చేటంతలోనే...     "హేయ్... నా రూంలో మీరు... హు.. ఆర్..యూ" ఆశ్చర్యంగా నోరు తెరుస్తూ, చీకట్లో లోనున్న మంచంవేపు చూస్తూ అడిగాడా ముసలాయన.     ఆయన మాటలతో హట్ గుప్పుమంటూ విస్కీవాసన బయటికొస్తోంది. ఆ వాసనతో పాటు ఆ ముసలాయన అటూ ఇటూ చిన్నగా కదుల్తున్నాడు. అదంతా 'మందు' మహత్యం అని తెల్సిపోయింది అవినాష్ కి.     అవినాష్ లో అంతవరకూ చెలరేగిన భయం తగ్గిపోయింది.     "చూడండి మాస్టారూ... ఇప్పుడు మేముంటున్నది... మా కాటేజ్ లోనే- మీ కాటేజ్ పక్కనే ఎక్కడో ఉంటుంది- కాసేపు వెతికితే- అదే కనబడుతుంది - చూడండి-" అన్నాడు మర్యాదగా.     "ఆర్-యూ-ష్యూర్-" మందు నవ్వు నవ్వాడా ముసలాయన.     "అయితే - సారీ - సారీ- సారీ- మైడియర్ - యంగ్ ఫ్రెండ్- ఐ విల్ సెర్చ్ ఫర్ మై కాటేజ్ - ఐ కెన్ గెట్ - మై బాయ్ - ఐకెన్-" అంటూ తూలుతూ ముందుకి నడిచాడు.     అవినాష్ కాటేజ్ పక్కనే ఉన్న కాటేజ్ దగ్గరకెళ్ళి ఆ తలుపు వేపు నిశితంగా చూసి, జేబులోంచి 'కీ' తీసి తాళం తెరవడానికి ప్రయత్నం చేస్తూ-     "దిసీజ్ మై కాటేజ్ - దిసీజ్ మై కాటేజ్-" అంటూ అవినాష్ వేపు చూస్తూ అరిచాడు ఆ ముసలాయన.     "ఓ.కె- గుడ్ నైట్-" అవినాష్ కూడా అరుస్తూ చెప్పాడు.     తలుపువేసేసి లోనకొచ్చి లైటు వేశాడు అవినాష్.     పక్కకాటేజీలోంచి ఆ ముసలాయన అరుస్తున్న అరుపులు బాగా స్పష్టంగా విన్పిస్తున్నాయి.     గది నిండా వెల్తురు నిండింది.     గది గోడవేపు చూశాడు అవినాష్.     గోడ గడియారం సరిగ్గా పది గంటల్ని చూపిస్తోంది.     "ఎవరట" ముఖమ్మీద ముసుగుతీసి, దుప్పటిని వంటి చుట్టూ చీరగా కప్పుకుంటూ బాత్ రూంకి వెళ్ళడానికి లేస్తూ అడిగింది గౌతమి.     "ఎవరో పానకంలో ఓల్డ్ మేన్-" విసుక్కుంటూ అన్నాడు అవినాష్.     "జస్ట్ మినిట్ డియర్-" అంటూ బాత్ రూంలోకి నడిచిందామె.     లోన తలుపుకి గెడ పెట్టిన చప్పుడు స్పష్టంగా విన్పించింది.     ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నాడు అవినాష్.     ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అవినాష్ ముందుకి కదిలాడు. గబగబా తన జేబుల్లోంచి సూట్ కేసు 'కీ' తీసి సూట్ కేసుని చప్పుడుకాకుండా తీసి, బట్టల మడతల్లో ఉన్న 'అంటిమనీ' సీసాను పైకి తీసి మళ్ళీ సూట్ కేసు యధా ప్రకారం వేసేసాడు.     అప్పుడతని చూపులు-     బెడ్ పక్కనే ఉన్న స్టూలు మీద పడ్డాయి. స్టూలు మీద ఓ ఫ్లాస్కుంది. ఆ ఫ్లాస్కులో కాఫీ ఉంది. పధకం ప్రకారం తను కాటేజీకి వస్తున్నపుడు రెండు కాఫీల్ని పోయించుకుని వచ్చాడు అవినాష్.
24,798
    మొత్తం వంద ఎకరాలు. రోడ్డు నుంచి కిలోమీటరు దూరం లోపలికి పోగానే కేంద్రం ప్రారంభమవుతుంది.     చుట్టూ ఫెన్సింగ్ పూర్తయింది.     నేలకూడా కుంకుమలాగా ఎర్రగా వుంది. అక్కడున్న చెట్టూ చేమనంతా నరికించింది సరితాదేవి. రోజూ నలభైమంది పనిచేస్తున్నారు.     "మొత్తం చదునైపోయింది. ల్యాండ్ చాలా సారవంతమైంది. మామిడితోటలు, జామచెట్లు, సపోటా చెట్లు లాంటివి బాగా పెరుగుతాయి" అంది సరితాదేవి వర్క్ జరుగుతున్న స్పాట్ వైపుకి నడుస్తూ.     పరమేశదాసు ఏమీ మాట్లాడలేకపోయాడు. తన కష్టాన్ని వేరేవాళ్లు లాక్కుపోయినంతగా గిజగిజలాడిపోయాడు.     అయితే ఇవేమీ ఆయన ముఖంలో ప్రదర్శించలేదు. అందుకే ఆయన రాజకీయాల్లో ఎదురు లేకుండా పోయింది.     సరితాదేవి వైపు నవ్వుతూ చూస్తూ "కుంకుమలాగా వుంది నేల. విత్తనం వేస్తే చెట్టు అయిపోయేంత సారవంతమైంది" అన్నాడు.     సరితాదేవి పొంగిపోయింది.     రైతుకూలీలు గుంతలు తవ్వి మామిడిచెట్లు నాటుతున్నారు.     "అన్నీ బానిస్ చెట్లే. బెంగళూరు నుంచి తెప్పించాను"     "డబ్బు బాగా సెలవవుతున్నట్లుంది"       "ఆఁ ప్రభుత్వం ఇచ్చిన గ్రాంటును రిలీజ్ చేయించుకున్నాను. వాళ్ళ ప్రకారం రైతుకి శిక్షణా కాలంలో రోజుకు ఏభై రూపాయలివ్వాలి. కానీ ఇక్కడ రైతులు కూడా చీప్ గానే దొరుకుతున్నారు. రోజుకు ముప్ఫైయిస్తున్నాను." అన్నది.     "సెహభాష్" దాసు మెచ్చుకున్నాడు.     షెడ్లోకెళ్ళి ఇద్దరూ కూర్చున్నారు.     సైట్ మేనేజర్లు వచ్చి మొత్తం వర్క్ ను గురించి చెప్పి వెళ్ళిపోయారు.     ఆ తరువాత మ్యాప్ లో ఏయే బిల్డింగులు ఎక్కడ వస్తాయో, ఏయే ప్లేసుల్లో ఏయే తోటలను పెంచాలనుకుంటుందో మొత్తం వివరించింది ఆమె.     అదంతా వింటుంటే దాసు కడుపులో దేవినట్లనిపించింది. మొత్తం వంద ఎకరాల తోటలు. నిజానికి సరితాదేవి సేవాసదన్ కి ఆ భూమిని ప్రభుత్వం కేటాయించడానికి చాలానే కష్టపడ్డాడు దాసు.     రైతు శిక్షణా కేంద్రంగా దానికి రూపుదిద్ది, దానికి గ్రాంట్లు మజూరు కావడానికి తన పరపతినంతా వుపయోగించాడు.     సరితాదేవి సగం భాగం యిచ్చివుంటే ఆయనకి పేచీ వుండేది కాదు.     ఎప్పుడైతే ఆమె ఈ ప్రపోజల్ కు తిరస్కరించిందో అప్పట్నుంచీ ఆయనకి సరితాదేవిని అడ్డు తొలగించుకుని మొత్తం ఆ భూమినంతా కొట్టెయ్యాలన్న నిర్ణయానికి వచ్చాడు.     ఈ ద్వేషం మరోసారి మనసంతా మసిలాగా అల్లుకోవడంతో రాత్రుల్లో ఆమె ఇచ్చే సుఖం కూడా గుర్తులేదు. ఆమె తనపట్ల చూపిస్తున్న అభిమానం నటనలా తోస్తోంది.     "ఈ వర్క్ కిక ఢోకా లేదు. ఫండ్స్ వున్నాయి గనుక పనులు జరిగిపోతాయి" అంది సరితాదేవి మ్యాప్ మూస్తూ.     ఇద్దరూ అక్కడ నుంచి లేచారు. ఒక దగ్గర ఆఫీసు బిల్డింగ్ కోసం పునాదులు తీస్తున్నారు. అక్కడికివెళ్ళి నిలుచున్నారు.     "ఇది ఆఫీస్ కోసం. త్వరలోనే బిల్డింగ్ పూర్తిచేసి స్టాఫ్ ను ఏర్పాటు చేస్తాను"     ప్రతి పనికోసం తనను సంప్రదించే సరితాదేవి ఇప్పుడు స్వయంగా నిర్ణయాలు తీసుకుంటోందని గ్రహించాడు దాసు. త్వరలోనే ఆమె తన చేతిలోంచి ఎగిరిపోతుందనిపించింది.     అక్కడున్న మేస్త్రీ వాళ్ళను చూసి నమస్కారంపెట్టి దగ్గరికి వచ్చాడు.     "ఏం సూరీ! వర్క్ బాగా జరుగుతోందా?" అని అడిగింది ఆమె.     "బాగా జరుగుతోందండీ! త్వరలోనే పిల్లర్లు లేపే పని ప్రారంభించవచ్చు"     సరితాదేవి సంతృప్తిగా తలాడించింది.     "ఆఫీస్ బిల్డింగ్ పనులు పూర్తికాగానే శిక్షణాకేంద్రానికి అవసరమైన బిల్డింగ్ లు కడతాను" అంది పరమేశదాసు వైపు తిరిగి.     కనీసం మాటల్లో కూడా తనను కలుపుకోవడం లేదన్న విషయాన్ని ఆయన గ్రహించాడు. ఇది మొత్తం తనకే చెందుతుందన్న భావాన్ని ఆమె ఏమీ జంకు లేకుండా బయటపెడుతోంది.          "ఓపెనింగ్ సెర్మనీకి ఎవర్ని పిలవాలా అని ఆలోచిస్తున్నాను. ముఖ్యమంత్రి, గవర్నర్ ర్యాంక్ లాంటి వాళ్ళను పిలవాలనుంది" అంది సరితాదేవి అక్కడ్నుంచి కదులుతూ.     అంటే ఓపెనింగ్ కు కూడా తనని ఆహ్వానించడం లేదు. ఇక లాభం లేదు. ఫుల్ స్టాప్ పెట్టేయాలనుకున్నాడు దాసు. అయితే అదంత ఈజీ పని కాదు. తనకీ, ఆమెకీ వున్న సంబంధం అందరికీ తెలుసు గనుక మొదటి అనుమానం తనమీదకే వస్తుంది అలాంటి అనుమానం పుడితే చాలు ఇక ప్రతిపక్షాలు, స్వపక్షంలోనే వున్న విరోధులు తనకు వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభిస్తారు. అందువల్లే తనమీదకి అనుమానం రాకుండా పని ఫినిష్ చేయాలనుకున్నాడు.     "నేను అదేపనిగా మాట్లాడుతుంటే మీరేమిటి మౌనంగా వున్నారు?" అని అడిగింది సరితాదేవి ఆయనవైపు చూస్తూ.     ఇద్దరూ తిరిగి షెడ్డు వైపు నడుస్తున్నారు.     "ఏదో ఆలోచన - అంతే!"     ఏమిటా ఆలోచన అని ఆమె అడగలేదు. దాసు ఆ పొలం చూడగానే ఇది తనకు దక్కనందుకు ఫీల్ అవుతాడని ఆమెకు తెలుసు. మొదట ఆ ప్రాజెక్ట్ శాంక్షన్ కాగానే దాసు మాట్లాడిన మాటల్లోని అంతర్యాన్ని ఆమె గ్రహించింది. కానీ వంద ఎకరాల్లో భాగం పంచుకోవడానికి ఆమెకీ మనసొప్పలేదు. వంద ఎకరాల ఎస్టేట్ ని మెయిన్ టైన్ చేయాలన్నది ఆమె కోరిక. అదిప్పటికి తీరింది.       ఈ ప్రాజెక్ట్ తనకి రావడానికి దాసుతోపాటు ఆమె కూడా చాలా కష్టపడింది.     కేంద్రప్రభుత్వానికి సంబంధించి వచ్చినవారికి సకల సదుపాయాలను ఆమె ఏర్పాటు చేసింది. వాళ్ళని మంచి హోటళ్ళలో దింపింది. వాళ్ళు మత్తులో మునిగి ఏం కావాలంటే దాన్ని ఏర్పాటు చేసింది.         ఇదంతా దాసుకు ఆమె ఏనాడూ చెప్పలేదు. ఆయనకి మంచి మూడ్ లో వున్నప్పుడు దీనికోసం గట్టిగా ప్రయత్నించమని చెప్పింది. అతని పరపతితోనే ప్రాజెక్టు వచ్చింది. అయితే ఇందులో భాగం ఇవ్వడానికి మాత్రం ఆమెకి సుతరామూ ఇష్టం లేదు. అయితే ఇందుకు తన తన ప్రాణాన్నే మూల్యంగా చెల్లించాల్సి వస్తుందని ఆమె వూహించలేకపోయింది.     దాసు అంత దారుణంగా ఆలోచిస్తాడని ఆమె కలలో కూడా అనుమానించలేదు. దానికి కారణం ఆయన్ని అచ్చు భర్తలాగా ట్రీట్ చేసింది. కట్టుకున్న వాడ్ని సైతం బయట పడుకోబెట్టి తను ఆయనతో బెడ్ రూంను పంచుకుంది. అలా మొత్తం తనని తాను అర్పించుకున్న తర్వాత తన మీద ఎంతో కొంత అభిమానం వుంటుందనే ఆమె నమ్మింది.     తనకు లాభం వస్తుందంటే ఎంతటి కిరాతకానికైనా వెనకాడని రాజకీయ నాయకుడు ఆయన అని వూహించలేకపోయింది.     అందుకే ఇప్పటికీ ఆయనతో ఫ్రీగానే వుంది.
24,799
                          ఇల్లు కట్టిచూడు                      ప్రపంచ తెలుగు మహాసభలకు ఎలాగయినా వెళ్ళాలని అందరం దానితాలూకూ సీక్రెట్ ఇన్ ఫర్మేషన్ లాగే ప్రయత్నంలో ఉన్నాం.     "కాంగ్రెస్ వాళ్ళను పట్టుకుంటే చాలా తేలిగ్గా వెళ్ళిపోవచ్చు" అన్నాడు జనార్ధన్.     "కానీ వాళ్ళను ఎలాపట్టుకోవటం?" అడిగాను నేను.     ఆ ప్రశ్నకు అందరూ గొల్లున నవ్వారు. నన్నో వెర్రివెంగళాయిని చూసినట్టు కూడా చూశారు.     "రాజకీయ నాయకుల్ని ఎలా పట్టుకోవాలో తెలీదా! భలేవాడివయ్యా నువ్వు! ప్రపంచంలో అతితేలికయిన విషయం అదే"     ఆ విషయం గురించి డిస్కషన్ పూర్తయిపోయాక రంగారెడ్డి అసలు విషయం ప్రస్తావించాడు.     "ఆ మధ్య మా అమ్మమ్మ చనిపోయిన విషయం మీకందరికీ తెలుసుకదా! ఇప్పుడు ఆమెతాలూకూ ఇంటిస్థలం ఒకటి నాకు సంక్రమించింది. అదెక్కడుందో, ఏమిటో ఇంకా వివరాలు తెలీవు. సరే- హైద్రాబాద్ లో స్థలం దొరకటమే మనలాంటి వాళ్ళకు అపురూపమయిన విషయం గనుక అక్కడ ఇల్లు కడదామని మా ఆవిడ గొడవచేస్తోంది."     మాకందరికీ హఠాత్తుగా రంగారెడ్డి మీద ఈర్ష్య కలిగింది.     రాజధానిలో స్థలం దొరకటం, ఇల్లుకట్టడం ఒక్క చీఫ్ మినిష్టర్ కీ మిగతా మంత్రులకీ తప్ప మరెవరికీ సాధ్యంకాదని మా అనుమానం.     ఎందుకంటే వాళ్ళకు ప్రభుత్వ రూల్సేమీ వర్తించవు గనుక.     ఏదేమయినా మా అందరికీ సొంత ఇల్లు లేకుండా వుండటం కంటే మాలో ఒక్కడికయినా ఇల్లు వుండటం మంచిదే అనిపించింది కాసేపయ్యాక.     "ఇంక ఆలోచనెందుకు కట్టిపారెయ్" అన్నాడు శాయిరామ్.     "కానీ అది అంతతేలిక్కాదని విన్నాను. మన ఫ్రెండ్స్ సర్కిల్లో ఇల్లు కట్టిన వాడెవడయినా వుంటే వాడిసలహా అడుగుదాం" అన్నాడు గోపాల్రావ్.     "దాన్దేముందీ? బాబు వున్నాడు కదా! రీసెంట్ గానే ఇల్లు కట్టాడు. పదండి! అతని దగ్గరకెళదాం" అన్నాడు జనార్ధన్.     అందరం బాబు ఇల్లు వెతుకుతూ బయలుదేరాం. అరగంట సేపట్లో మా స్కూటర్లు నగరం బయట కొచ్చేసినాయి. వనస్థలిపురం కూడా దాటిపోయేసరికి మాకు ఓపికపోయింది.     "ఇంకెంత దూరం వెళ్ళాలి?" అడిగాడు గోపాల్రావ్.     "ఆ!- ఎంత? ఇంకో నాలుగు కిలోమీటర్లు! చాలా దగ్గర"     మరోరెండు కిలోమీటర్ల దూరంవెళ్ళాక మెయిన్ రోడ్ నుంచి పక్కకు తిరిగాం. అదో మట్టిరోడ్డు.! అంతాగుట్టలూ, రాళ్ళూ, చెట్లూ తప్పితే ఇంకేమి కనిపించటం లేదక్కడ.     మరో కిలోమీటర్ దూరం తర్వాత మట్టిరోడ్డు కూడా ఆగిపోయింది. ఓ సన్నని కాలి త్రోవ మాత్రం కనబడుతోంది.     "ఇంకెక్కడ?" అడిగాడు యాదగిరి ఆగిపోయి.     "అదిగో! ఆ చెట్టుచాటున సగం కట్టినిల్లు కనిపించటంలేదూ? అదే మనోడిల్లు"     అందరం అదిరిపడ్డాం.     "ఏమిటి. ఇంత మారుమూల ఇరుగుపొరుగూ లేకుండా ఒక్కడే కాపురముంటున్నాడా?" ఆశ్చర్యంగా అడిగాడు శాయిరామ్.     "ఇది మారుమూలేమిటి? బాగా డిమాండ్ వున్న ప్లేస్.అయినా మనాడింటికి కిలోమీటర్ దూరంలో ఇంకొకతనుకూడా ఇల్లు మొదలుపెట్టాడట! ఇంక సందడికేం తక్కువని!"     అందరం బాబు ఇంటికి చేరుకున్నాం.     కాంక్రీట్ పిల్లర్స్ తో కట్టాడది. ఉత్తి స్తంభాలూ, పైన కాంక్రీట్ శ్లాబ్ మాత్రం లేసివుంది. రెండుగదులకు మాత్రం వున్నాయ్. మిగతాగదులన్నీ ఓపెన్ గానే వున్నాయ్. దగ్గరకు వేసివున్న గది తలుపు తట్టాడు జనార్ధన్.     లోపల దభేల్ మన్న చప్పుడూ దానివెనుకే పరుగెడుతున్న అడుగుల చప్పుడూ వినిపించింది. మాకు ఏమీ అర్థంకాలేదు.     "బాబూ!" మళ్ళీ తలుపు తట్టాడు జనార్ధన్.     ఈసారి మళ్ళీ పరుగు చప్పుడు వినిపించింది. ఆ తరువాత రెండునిముషాలకు వాళ్ళావిడ తలుపు కొంచెంగా తీసి అడ్డం నిలబడింది.     "ఆయన ఊళ్ళోలేరండీ. విశాఖపట్నం వెళ్ళారు ఆఫీస్ పనిమీద. ఇంకో వారం రోజులవుతుంది తిరిగిరావటానికి-" అంటూ జనార్ధన్ నీ, మమ్మల్ని చూసి చిరునవ్వుతో తలుపు తెరిచింది.     "మీరా అన్నయ్యా! రండి! ఇంకెవరో అనుకున్నాను" అంది. అందరం బిలబిలమంటూ లోపలకు నడిచాం.     ఆ గదిలో కుర్చీలు, టీపాయ్, టీ.వీ, ప్లవర్ వాజ్ అంతా బాగానే వుంది. కాకపోతే గోడలకింకా రంగువేయలేదు.     "వైజాగ్ ఎప్పుడు వెళ్ళాడు? నిన్న సాయంత్రం కూడా కనిపించాడు గానీ నాతో ఏమీ చెప్పలేదే" అన్నాడు జనార్ధన్.     ఆమె జవాబు చెప్పటానికి సిగ్గుపడింది.     "నిజానికి ఆయన వైజాగ్ వెళ్ళలేదన్నయ్యా! ఇంట్లోనే ఉన్నారు కానీ- అంటూ లోపలి గది అటకవేపు చూస్తూ" ఏవండీ! దిగండి! మనకాలనీవాళ్ళే వచ్చారు" అంది.     డబ్బాలూ, అట్టపెట్టెలూ అన్నీ పక్కకుతోసుకుంటూ అటకమీదనుంచి కిందకు దిగాడు బాబు. మొఖం, బట్టలూ అంతా దుమ్ము అంటుకుపోయి భయంకరంగా కనిపించసాగాడు.     మాకు కొద్దిక్షణాలవరకూ నోటమాట రాలేదు.     టవల్ తో మొఖం తుడుచుకుంటూవచ్చి కుర్చీలో కూర్చున్నాడు బాబు.     "మరేం లేదు. అప్పులాళ్ళేమో అనుకుని అటక మీదెక్కాను' చిరునవ్వుతో చెప్పాడతను.     "అప్పులాళ్ళేమిటి?" ఆత్రుతగా అడిగాడు రంగారెడ్డి.     "అదే! ఇల్లుకట్టాను కదా! అంచేత కొద్దిరోజులు కొంచెం యిలా అప్పులవాళ్ళనుంచి తప్పించుకోక తప్పదులే!"     "కొద్దిరోజులంటే ఎన్నాళ్ళు?"     "ఆ! మహా అయితే అయిదారేళ్ళు. అప్పులిచ్చేవాళ్ళు మొదటి అయిదారు సంవత్సరాలే మహా దూకుడుగా వుంటారు. తర్వాత వాళ్ళ పవర్ కొంచెం తగ్గిపోతుంది. అప్పుడు ఎదుటపడినా ఏం ఫర్లేదు. కాసేపు గొణిగిపోతారు. అదే మరో అయిదేళ్ళు బాకీ తీర్చలేదనుకోండి. అప్పుడు ఆ గొణగడం కూడా వుండదట. మనం కనబడితేచాలు భోరునేడుస్తూ కాసేపు మనవెంటపడతారట. మనం అదేం చూడనట్లు, వాడి ఏడుపుతో మనకేమీ సంబంధంలేనట్లూ వెళ్ళిపోవాలట. మనకాలనీలో ఉండే బోస్ చెప్పాడివన్నీ. వాడు ఇల్లుకట్టి చాలా కాలం అయిపోయింది కదా?" రంగారెడ్డి కొంచెం నిరుత్సాహపడినట్లు మాకనిపించింది.