SNo
int64
0
25.8k
text
stringlengths
39
23.5k
24,500
    "అవునేఁ ఎగ్జాట్లీ! నాకు తెలుసు!" స్ఫూర్తి తొందరగా ఒప్పేసుకుంది.     "అవును కదా!" ఈష్ స్ఫూర్తి వైపు డిసప్పాయింట్ గా చూశాడు.     "మాకేననుకున్నా....నీకు తెలుసా ఈ విషయం!" రేవతి అతితెలివిగా అడిగింది.     "అవును రేవూ... మనకూ తెలిసిది!" ఆనంద్ సపోర్ట్ చేశాడు.     అప్పుడు కామిని మళ్లీ అడిగింది- "మీ అందరికీ ఎలా తెలుసు?" అని  లాజిక్ గా!     క్రాంత్ అటుతిరిగి నవ్వాడు- రేవంత్ కూ, ఈష్ కూ, ఆనంద్ కూ కన్నుకొట్టి.     "ఎలా  తెలుసంటే.... ఎలా తెలుసంటే... తెలుసంతే!" తడబడ్డారమ్మాయిలు! అబ్బాయిలు ఆకాశం వైపూ, కొండల వైపూ చూడసాగారు.... ఆ టాపిక్ విననట్టు!     "తెలిసిపోయింది. మీరందరూ ఒక్కసారన్నా కళ్ళు మూసుకున్నారు.... అవునా? ఒప్పుకొవాలీ!" దొంగల్ని పట్టుకున్న ఇన్ స్పెక్టర్ లా అడిగింది.     "అవునూఁ... నీకెలా తెలుసే?!" జ్ఞాపిక లా పాయింట్ తీసింది.     క్రాంత్ ఇటువైపు తిరిగి కామినిని చూసి నవ్వాడు- టీజింగ్ గా చూస్తూ కామిని వైపు, 'దొరికిపోయావులే....' అన్నట్టు.     "ఎలా తెలుసంటే.... ఎక్కడో.... ఎక్కడో....చదివానన్నమాట!" తడబడింది.     క్రాంత్ మళ్లీ నవ్వాడు. అంతే...! ముగ్గురమ్మాయిలూ చుట్టుముట్టారు.     "ఎక్కడో చదివావు....అవునా?" దబాయించారు. "నిజం చెప్పు... నిజం చెప్పు!" అని చక్కిలిగింతలు పెట్టేసరికి- "చెప్తా! చెప్తా!" అని.., "మీరు మూసుకున్నట్టే నేనూ ఓసారి మూసుకున్నాను. ఒకేసారి సుమా! నిజం!!" అని నమ్మిస్తూ.     "అలా రా దారికి! అందరం దొంగలం కాబట్టి పార్టీ ఖర్చు అందరిదీ!" అని రాజీకొచ్చేశారు.                                            16     హాస్టల్ వైపు నడుస్తున్నారు రేవంత్, జ్ఞాపిక!     చల్లని నీడలలో రాలిన ఆకులూ, పూవులూ ప్రేమజంటకు పూలబాట పరిచినట్టుగా వున్నాయి!     వాటిమీద అడుగు పడకుండా జాగ్రత్తగా నడుస్తోంది జ్ఞాపిక.     "నీ కోసమే వసంతాన్నడిగి పూలబాట వేయించా! నువ్వలా తప్పుకుని నడిస్తే వసంతం చిన్నబుచ్చుకోదూ?!" చిలిపిగా అడిగాడు.     "నీకూ నా మీద ప్రేమ, వసంతానికి నీ మీద గౌరవం- కఠినంగా మార్చి పూలను నా  కాళ్ల కింద నలగమని ఆదేశించినా....వీటి గుండెల్ని తొక్కేసేంత కాఠిన్యం నాకు లేదు" నెమ్మదిగా చెప్పి, పువ్వుపై వెయబోయే కాలును తప్పించబోతూ తూలింది!     గభాల్న పట్టుకుని నిలబెట్టి-     "సరే....మేమంటే కఠినులం! తెలీక పరిచేశాం! నలక్కుండా నువ్వు నడవాలంటే కింద పడిపోవడం తప్పదు! పూలు తొక్కకుండా ఆ చివరికి నువ్వు చేరే తేలికమార్గం చెప్పనీ!" అడిగాడు.     "ఏంటది?" కుతూహలంగా అడిగింది.     "సింపుల్....!" అని రెండుచేతుల్తో జ్ఞాపికను ఎత్తిపట్టుకుని పసిపిల్లలా మోస్తూనడవసాగాడు.     "సింపుల్ లేదూ, డింపుల్ లేదూ... దించు నన్ను! లేపోతే అరుస్తా! కిడ్నాపింగ్ అనుకుని అందరూ కలిసి మాలిష్ చేస్తారు నిన్ను!"     "ఏదీ అరువు! నీ ఓవర్ కాన్ఫిడెన్సేంటో బయటపడుతుంది!"     "చూడు మరి!" బెదిరించింది.     "అరువూఁ...." నింపాదిగానే రెచ్చగొట్టాడు.     దూరంగాఉన్నతని వైపు చూస్తూ- "హెల్ప్.... హెల్ప్ ప్లీజ్... హెల్ప్!" అంది. అతను దగ్గరికొచ్చాడు.     "చూడండీ! నన్ను బలవంతాన ఎత్తుకెళ్తున్నాడు!" కంప్లయింట్ చెప్పింది ఏడుపు గొంతులో! రేవంత్ నవ్వుతూ చూస్తున్నాడు.     ఆ వ్యక్తి నిమ్మళంగా- "నిన్ను బలవంతాన ఎత్తుకెళ్తుంటే అతని మెడచుట్టూ చేతులేసి మరీ మోయించుకుంటున్నా వెందుకమ్మా?" అడిగాడు.     అప్పుడు  చూసుకుంది- తను అనుకోకుండా రేవంత్ మెడచుట్టూ చేతులేసింది. నాలుక కొరుక్కుని చటుక్కున తీసేసింది.     అప్పటికే నలుగురైదుగురు పోగయ్యారు. అప్పటికీ రేవంత్ నవ్వుతూనే ఉన్నాడు. వాళ్ళు ఏవయిందని అడిగారు.     "చూడండీ....ఇతను నన్ను బలవంతాన ఎత్తుకుపోతున్నాడు!" కంప్లయింట్ చెప్పింది మళ్లీ ఏడుపుగొంతుతో.     "అతను ఆగి పదినిముషాలయింది. ఇకనైనా నువ్వు దిగొచ్చు కదమ్మా! మోయించుకుంది కాక, నిన్నేత్తుకు పోతున్నాడనే బూటకవు ఏడుపెందుకు? ఈ కాలం  అమ్మాయిలు అతితెలివి ప్రదర్శించాలనుకుంటారు!" గొణుక్కుంటూ వెళ్లసాగారు.     "అదేవింటండీ! ఇతను నన్నెత్తుకు పోతున్నాడని మొత్తుకుంటున్నా ఎవరూ నమ్మరేం! అదే మీ చెల్లెల్నయితే  ఊరుకుంటారా" దబాయించింది గట్టిగా!     అందులోంచి ఒక శ్రేయోభిలాషి దగ్గరికొచ్చి, "ముందు కిందకు దిగమ్మా! అతనాగి ఎంతోసేపయింది.... మేము నిన్నెత్తుకు  పోతున్నాడనిపించేలా లేదు సీను! ఏ కుంటిపిల్లనో నడవలేకపోతే మోసుకెళ్తున్నాడు పాపం.... అనిపించేలా ఉంది" అన్నాడు.     ఎగిరి కిందకు దూకింది.     "ఏయ్ఁ! ఇదుగో చూడూ.... నేనేం కుంటిపిల్లను కాదు! రెండుకాళ్లూ ఎంత బావున్నాయో!" అని అటూఇటూ నడిచి చూపించింది.     "మరి ఎందుకమ్మా- అతని మెడచుట్టూ చేతులేసి నువ్వూ, నీతోపాటు కిలోవెయిటున్న హైహీల్సూ, రెండు కిలోల బరువున్న హ్యండ్ బ్యాగూ కూడా అతనితో మోయించుకుంటున్నావ్? కాళ్లు రెండూ బావుంటే నడిచెళ్లోచ్చుగా! వెట్టిచాకిరీకి బాగా అలవాటు పడ్డట్టున్నావే!" ఎదురు తిట్టి వెళ్లిపోతూ-     "భలే పిల్లను మోశాను కదయ్యా! ఇప్పటిదాకా మోయించుకుంది కాక, అల్లరి చెయ్యాలని చూస్తోంది. ఏ ముసలమ్మనో మోసి ఉంటే కనీసం ఆశీర్వాదం అన్నా ఇచ్చుండేది కదా!" రేవంత్ వైపు జాలిగా చూశాడు. తిక్కరేగింది గ్నపికకు.     "వెధవ మనుషులు నిజంగా ఎత్తుకుపోతే కూడా పట్టించుకునేట్టు లేరు!" తిట్టింది.     "నీలంటాళ్ళను ఎత్తుకుపోయే ధైర్యం, ఎత్తుకుపోయి పోషించే దమ్మూ ఎవరికుంటుందమ్మా.... వాళ్ళనే నమిలి మింగేసేలా ఉన్నావు!" ఎగాదిగా చూస్తూ అన్నాడు.     "ఏయ్ఁ పోవయ్యా! నువ్వేం నాకు హెల్ప్ చేయొద్దు. ఆడపిల్ల అనే జాలి లేకుండా ఎదురు ఉపన్యాసం ఇస్తున్నావే?!ఇంకెవర్నయినా వెతుక్కుంటా హెల్ప్ కు- నువ్వు పో!" కసిరి కొట్టింది.     రేవంత్ వైపు చూస్తూ 'మెంటలా..?' అని సైగ చేశాడతను.    'కొంచెం..!' అని రేవంత్ సైగ చేశాడు.       "హైహీల్ మడిమ ఎత్తి రేవంత్ కాలు తొక్కింది బలంగా.     "అమ్మా...!" అని అరిచాడు రేవంత్.     "జాగ్రత్త బాబూ! తొందరగా ఇంటికెళ్లు!" అని జ్ఞాపికను చూస్తూ వెనక్కి నడిచాడు.     "నిన్నూ..." అంటూ అతని వైపు వెళ్లబోయింది! పరుగులంకించుకున్నాడు అతను రేవంత్ చేతులు కట్టుకుని నవ్వసాగాడు అదేపనిగా!     "నన్ను టీజ్ చెయ్యాలనా నీ వేషాలూ! తిక్క కుదిరిందా? అందరూ నీకు పిచ్చనుకుంటున్నారు!" రెచ్చగొట్టి మరీ నవ్వసాగాడు.     "అతను నవ్వుతుంటే ఇంకా రెచ్చిపోయి దగ్గరికెళ్లి కాలర్ పట్టుకుని మొహం వంచి నవ్వే రెండు పెదాలూ కలిపి మూసేసింది నడిరోడ్డు మీద!     రేవంత్ కే సిగ్గేసి చటుక్కున వదిలించుకుని ఎంగిలి పెదాలు కర్చీఫ్ తో తుడుచుకుని చుట్టూ చూశాడు- ఎవరయినా చూశారేమోనని!     దూరంగా ఒక గ్రూప్ వీళ్ళనే చూస్తూ నవ్వుతోంది!     "పద వెళ్దాం!" తొందరచేశాడు.     రేవంత్ తొందరకర్ధం తెలిసిపోయింది. అందుకే "నేన్రాను! ఓడిపోయానని ఒప్పుకో...వస్తా!" మొండితనం చూపింది.     వాళ్ళు ఇటే చూస్తున్నారు. వెళ్లిపోకపోతే బావుండదు.     అందుకే 'సరే! ఓడిపోయన్లే... వెళ్దాం రా!" అన్నాక, వెనక ఎక్కి కూర్చుని "బై..." అని వాళ్ళకేసి చెయ్యూపింది.     వాళ్ళు కూడా "బై..." అని, "ఆల్ ది బెస్ట్...యంగ్ కపుల్!" అనరిచారు.     "థాంక్యూ.... థాంక్యూ!" అనరిచింది.     "ప్లీజ్.... షటప్ జ్ఞాపీ!" అన్నాడు.     "నాతో పెట్టుకోకు మరి!" అంది చెవిలో.     చక్కిలిలేసి సడన్ బ్రేకేసాడు. బలంగా రేవంత్ ను వెనకనుంచి తగిలింది జ్ఞాపిక శరీరం మొత్తం.... మెత్తగా!     రేవంత్ లో మధురిమలు ఏవో మెల్లగా రేగసాగాయి. తననుతాను కంట్రోల్ చేసుకోవడానికి ఊపిరి బిగబట్టి-     "జ్ఞాపీ.... అల్లరొద్దు! సీరియస్ గా ఉండు!" మెత్తగా చెప్పాడు.     "నువ్వేగా సడన్ బ్రేక్ వేసి అల్లరి చేసింది! నన్నంటావేం...?" దబాయింపు.     "నువ్వు చెవిలో గుసగుసలాడుతుంటే చక్కిలిగింతేసి బ్రేకేసా! నేనేం అల్లరి చేయాలని కాదు! అలా గుసగుసలు చెప్పకు! దూరంగా ఉండి చెప్పు!"     "సరే అయితే!" అని దూరంగా ఉండి చెప్పు!"     "రేవంత్..!" గట్టిగా అరిచింది.     "వినిపిస్తుంది! కొంచెం మెల్లగా చెప్పు."     "రేవంత్..!" అతిమెల్లగా పిలిచింది.     "వినిపించడంలా... సౌండ్ కొంచెంపెంచు!"     "గట్టిగా అంటే మెల్లగా, మెల్లగా అంటే గట్టిగా అంటావ్! నీకూ నాకూ పడదు బాబూ! నేను నడిచెళ్లిపోతా నువ్వెళ్లు! చీకట్లో నాకేవయినా నువ్వేం బాధపడకు! మన  ఫ్రెండ్సందర్నీ ఆఖరిసారి అడిగానని చెప్పు! అందర్నీ బాగా చదువుకుని గొప్పవాళ్ళను అవ్వమను. నువ్వు కూడా  మంచి అమ్మాయిని పెళ్ళిచేసుకో! నేను గుర్తొస్తే బీరూ, గీరూ తాగకు!" అప్పగింతలు పెట్టసాగింది.... అవే ఆఖరి నిముషాలన్నట్టు.     "వద్దులే! నీ ఇష్టం వచ్చినట్టు చెప్పు! భరించక తప్పుతుందా బ్లాక్ మెయిలింగ్ కు!" దారికొచ్చాడు.     "అలా రా దారికి! ఇప్పుడు చెప్పు- మమ్మాకి పెళ్ళిచెయ్యాలన్న ఆలోచన నీకెప్పుడోచ్చింది?"     "డిగ్రీ ఫస్టియర్లో!"     "ఎందుకొచ్చింది...?"     బైక్ ఆపాడు! అలాగే కూర్చుని  మొదలెట్టాడు.     వెన్నెల గుమ్మడిపూవు పూసినట్టు, గుమ్మపాలు ఒలికినట్టూ అలుముకుంది ఇద్దరి మీద! తడుస్తున్న తమకంలో నేపథ్యంలోకి జ్ఞాపికను చిటికెనవేలు పట్టుకుని తీస్కెళ్లాడు.     "నా చిన్నపుడు అమ్మకు అప్పుడప్పుడు గుండెల్లో నొప్పాచేది. ఏవో టాబ్లెట్స్ వేసుకునేది! మళ్లీ వస్తుండేది, మళ్లీ వేసుకునేది! నెపోచ్చినపుడు ఏదో సాయం చేసేవాడిని, టాబ్లెట్స్ తెచ్చేవాడిని. వంటలో సాయం చేసేవాడ్ని! ఎవరికయినా చెబుదామంటే చెప్పనిచ్చేది కాదు! 'ఏవంత పెద్దరోగం కాదు నాన్నా! నీ గురించీ, నీ చదువు గురించీ ఆలోచిస్తే వస్తుందంతే!" అనేది. నేను నమ్మేవాడ్ని. అమ్మకోసం ఎప్పుడూ చదూకుంటూ ఉండేవాడ్ని! మంచి మార్కులు వచ్చినా అమ్మకు అప్పుడప్పుడూ గుండెల్లో నొప్పొచ్చేది! మళ్లీ అడిగితే  'నువ్వు కాలేజ్ ఫస్టు రాలేదని!' అని నవ్వేది. పంతానికి  కాలేజ్  ఫస్టు తెచ్చుకున్నా మళ్లీ అమ్మకు గుండెల్లో నెపోచ్చేది! నాకెందుకో అమ్మ నా దగ్గరేదో దాస్తున్నట్టు, అమ్మకేదో తగ్గని గుండెజబ్బు వస్తుందన్నట్టు, అమ్మ నన్ను విడిచి నాన్నలాగే వెళ్లిపోతుందేమో... నన్నట్టు భయమేసేది! డిగ్రీ ఫస్టియర్లో డాక్టర్ తాతయ్య దగ్గరికెళ్లా! ఆయన్ని అమ్మ 'అంకుల్ ...' అని పిలిచేది, నేను 'తాతయ్య ' అనేవాడిని! వాళ్ళిద్దరికే తెలుసా విషయం! అమ్మ నాచేత ఒట్టేయించుకుంది.... ఎవరికీ చెప్పోద్దనీ!"     "ఎందుకని! ఏదైనా సీరియస్సా...?" కంగారుపడింది.     మెత్తగా నవ్వి,  "నేనూ అనుకున్నా! కానీ కాదు! అది మమ్మకు నావల్ల జరిగిన అన్యాయం వల్ల  వచ్చింది!"     "ఏం చేశావ్! ఏదయినా పోరపాటా?"     "అవును! మమ్మాకి పెళ్ళి చెయ్యకపోవడం!"     "దానికీ, గుండెనెప్పికీ సంబంధం ఏవిటీ?"     "చాలా ఉంది!"     "నేను డాక్టరు తాతయ్యను కలిసి కంగారుపడ్డప్పుడు, చెప్పకపోతే నామీద ఒట్టేసినపుడు- 'ఇన్నాళ్లూ నీ కర్ధంచేసుకునే వయసు లేదు కనుక చెబుతున్నాను...' అని 'మీ మమ్మాకి చిన్నవయసులో పెళ్ళయింది.  అంటే.... పదో తరగతి  సెలవుల్లో ఇంచుమించు పద్దెనిమిదేళ్ల  వయసు వెంటనే గర్భం వచ్చింది. నిన్ను  మూడు నెలల గర్భిణిగా ఉన్నపుడు మీ డాడ్ యాక్సిడెంట్ లో పోయారు. అప్పుడు మీ మమ్మాకు పందోమ్మిదేళ్లు! మూడోనెల అబార్షన్ చేయించి ఇంకో పెళ్ళి చేస్తామని తలిదండ్రులూ, అన్నయ్యలూ పట్టుబట్టారు. మీ మమ్మా నిన్ను చంపుకోలకపోయింది. వాళ్ళతో గొడవపడి బయటికొచ్చింది. ఇటు పార్ట్ టైమ్ ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తూ చదూకుంది. డిగ్రీ కాగానే టీచర్ పోస్ట్ , పి.జి. కాగానే లెక్చరర్ అయింది. పి.హెచ్.డి చేసింది. నిన్ను పెంచుకుంటూనే తనను పెంచుకుంది.     అయితే.... ఇందులో నువ్వర్థంచేసుకునే సూక్ష్మ విషయం ఒకటుంది. నీమీద ప్రేమతో మళ్లీ తనకు  పెళ్ళి ఆలోచనా, పరపుషుడి ఆలోచనా మెదడుకు రానివ్వకపోయినా శరీరానికి ప్రకృతి ధర్మమయిన కొన్ని ఎంజైములు ఉంటాయి. అలాగే సెక్స్ కు సంబందించిన ఎంజైములు తనలో తనకు తెలీకుండానే ప్రకృతిధర్మంగా ఉత్తేజితమవుతాయి ఆ ఉత్తేజం ఆమెను శారీరకంగా బాధపెడుతుంది. అందులోని కొన్ని బాధలలో ఒక బాధ- ఈ  గుండెకు సంబంధించిన 'మజిల్ పెయిన్' మీ  మమ్మా  దానితోనే బాధపడేది.     నువ్వు పసికందుగా ఉన్నపుడు ఇవన్నీ ఆలోచించి తనను ఇష్టపడి నీతో సహా స్వీకరిస్తానని వచ్చిన వ్యక్తిని పెళ్ళిచేసుకొమ్మని మేమందరం ఎంత బలవంతపెట్టినా చేసుకోలేదు. మీ మమ్మాను ఎంతో  ఇష్టపడ్డ ఆ వ్యక్తీ నిరాశగా వెళ్లిపోయాడు. నువ్వే లక్ష్యంగా బ్రతుకుతున్న మీ మమ్మా ప్రకృతిధర్మం ఇలా గుండెనొప్పి  తెచ్చినా అదేమంత ప్రాణాంతకమయింది కాదు. వేరే  డైవర్షన్ వల్లనో, తాత్కాలిక ఉపశమనపు మందుల వల్లనో  దాన్ని  తగ్గించొచ్చు' అని ఆయన చెప్పాక మమ్మా గుండెనొప్పి వచ్చినప్పుడల్లా మమ్మాకి తెలీకుండా నేనెంతో  గిల్టీగా ఫీలయ్యేవాడిని.  నాకోసం మమ్మా  వదులుకున్న జీవితాన్ని తలుచుకుని ఎలాగైనా  తనకది సాధించి పెట్టాలనిపించేది. నేనెప్పుడు 'పెళ్ళి చేసుకోమ్మా!' అన్నా   పసిపిల్లాడ్ని చూసినట్టు చూసి నవ్వేది తప్పితే- ఏ  సమాధానం ఉండేది కాదు! తను  నవ్వినపుడల్లా నాలో వంతం పెరిగేది. అయినా ఏం చెయ్యలేకపోయేవాడ్ని.... అలగడం, అన్నం తినకపోవడం మినహా!" ఆగాడు.     జ్ఞాపిక కళ్ళలో నీళ్లు..!     "అదేంటి....నువ్వేడుస్తున్నావ్?"
24,501
    పెరుమాళ్ బుట్టను కింద పెట్టాడు. దానిపై రెండు ఎముకలు వుంచాడు. జుట్టుపోలుగాడి బొమ్మ దగ్గరకు వెళ్ళాడు.     "జుట్టుపోలుగా" అని కేకేసినట్టు పిలిచాడు.     "రా ఇక్కడకు రా. ఇటు చూడు. అది పాముల బుట్ట. అందులో పాముండాల. మా రైతులింట్లో వడ్లుండాల. ప్రతి ఇంట్లో పిల్లా పాపా వుండాల. మరి నీ మహత్యం చూపించు. బుట్టలోకి పాము పంపించు" అని ఢమరుకం అందుకున్నాడు.     ఢమరుకం శబ్దం ఏదో తెలియని భయాన్ని గుండెల్లో ఒంపుతోంది.     జనం టెన్షన్ తో చూస్తున్నారు. వెనుక నుంచి పులో, సింహమో వచ్చి నాలుకతో గీరినా పట్టించుకునే స్థితిలోలేరు. వాళ్ళ ధ్యాసంతా పెరుమాళ్ మీదే. వాళ్ళ చూపులంతా అతని మీదే.     ఢమరుకం ఆగింది.     పాము బుట్టను చేతుల్లోకి తీసుకుని "అందరూ చప్పట్లు కొట్టండి" అని అరిచాడు.     చప్పట్లు, ఈలలు!     నిదానంగా బుట్టమూత తీసాడు.     అంతే హనం బెదిరి, ఒక్కడుగు వెనక్కు వేశారు. సత్యనారాయణ రెడ్డి కూడా వులిక్కిపడి సర్దుకున్నాడు.     నాగుపాము బుట్టలోంచి స్ప్రింగ్ మీద నుంచి లేచినట్టు లేచి, అరచేతి వెడల్పుతో పడగ విప్పింది. అది కోపంలో బుస కొడుతుండడం అందరికీ విన్పిస్తోంది.     దానిని అందరికీ చూపించాడు.     బుట్టకింద పెట్టాడు. పాము ఇంకా పడగను ముడుచుకోలేదు.     జనం వలయాకారంగా గుమిగూడుతున్నారు.     "బాబూ! ఇలారా" ముందు నులుచున్న ఓ పదేళ్ళ అబ్బాయిని పెరుమాళ్ పిలిచాడు.     వాడు వెళ్ళడానికి జంకాడు. రానన్నట్టు తల వూపాడు.     "వెళ్ళు మాధవా. అంతా తమాషాకి. నీకేం కాదు" అంది పక్కనున్న జయ ఆ అబ్బాయ్ తో.     ఆమె పెరుమాళ్ మోడీని బాగా ఎంజాయ్ చేస్తోంది. ఆమె ముఖం ఆనందంలో ముంచి లేపుతున్నట్టు మెరుస్తోంది.     "ఒద్దక్కా నాకు భయం" అన్నాడు వాడు.     ప్రేమతో వాడి భుజం మీద చేయి వేసింది జయ.     ఆమె ఆ ఎండలో నల్ల బంగారు బొమ్మలా వుంది .ఆమె కళ్ళు సంతోషం చమ్కీని అద్దుకున్నట్టు ప్రకాశిస్తున్నాయి. యువకులంతా దొంగచాటుగా ఆమెను గమనిస్తున్నారు. ఆమె పగలబడి నవ్వినప్పుడు మరింత అందంగా కనిపిస్తూ అక్కడున్న చాలా మంది నరాలను మెలిపెడుతోంది.     "ఏమిటి ! దొరగారు భయపడుతున్నారా" అడిగాడు జయను పెరుమాళ్.     "అవునట" అంది జయ కిలకిలా నవ్వుతూ.     "మరి రేపు ఏ ఆడపిల్లో గడ్డివాము పక్కకు పిలిస్తే ఇలానే తటపటాయిస్తాడా వెళ్ళడానికి."     జనం నవ్వారు ఆ మాటలకు     "అసలింతకీ నువు మగాడివేనా" అంటూ పెరుమాళ్ ఆ బాబు నిక్కర్ పైకి ఎత్తి అక్కడ చూడడానికి ప్రయత్నించాడు.     వాడు నిక్కర్ పైకి జరగకుండా అణిచిపెట్టడానికి రెండు చేతుల్తోనూ ప్రయత్నిస్తున్నాడు.     జనం మళ్ళీ నవ్వారు.     పెరుమాళ్ నిక్కర్ ను వదిలిపెట్టి పక్కనున్న మరో అబ్బాయిని పిలిచాడు.          వాడు ధైర్యంగా ముందుకొచ్చాడు.     "శభాష్. నువ్వూ మగాడంటే! నీలాంటి వాడికే అమ్మాయిలు తమ మనసును కట్టబెడతారు. అప్పుడు నీ పనంతా పొలాల్లో వాళ్ళతో దొర్లడమే" అని పొగిడాడు పెరుమాళ్.     ఆ అబ్బాయి సిగ్గుపడుతూ తల వంచుకున్నాడు.     "మీ పేరు?"     "రాము."     "మరి నీకు కాబోయే పెళ్ళాం పేరు సీతా!"     మళ్ళీ నవ్వులు.     పెరుమాళ్ ఢమరుకం మ్రోగింది. ఆ అబ్బాయిని పాముల బుట్ట దగ్గరకి తీసుకెళ్ళాడు.     "రామూ! నువ్వు మగాడివేనా?" ప్రశ్నించాడు పెరుమాళ్.     "ఆ" ఆ అబ్బాయి గట్టిగా అరిచాడు.     "నేను ఏం చెప్పినా చేస్తావా?"     "ఆ"     "చాకలి నిర్మలమ్మకు కడుపు చేస్తావా?"     వాడు సమాధానం చెప్పక కిసుక్కున నవ్వాడు.     "ఇప్పుడు అంత పని చేయవద్దు కానీ, ఆ బుట్టలో చేయి పెట్టు చాలు"     ఆ అబ్బాయి అదిరిపోయాడు. తన వల్ల కాదన్నట్టు తల అడ్డంగా వూపాడు.     "ఛీ ... మగపుట్టుక పుట్టి బుట్టలో చేయి పెట్టడానికి భయపడతావా? మగాడు చాలా వాటిల్లో చేయి పెట్టాల్సి వస్తుంది. అప్పుడు కూడా ఇలా తల అడ్డంగా వూపితే నిన్ను మెచ్చి వచ్చిన ఆడపిల్ల జాకెట్ బటన్లు పెట్టుకుని నీ ముఖం మీద ఉమ్మి వెళ్ళిపోతుంది" అని చిరుకోపం ప్రదర్శించాడు పెరుమాళ్.     అలాంటి బూతు మాటలు అక్కడ మామూలే. గ్రామాల్లో బూతు కంటే మరో ఎంటర్టయిన్ మెంట్ లేకపోవడం కారణం కావచ్చు.     జనం ఆ మాటలకు బాగా నవ్వుతున్నారు.     పెరుమాళ్ బలవంతంగా రామూ చేతిని బుట్టలోకి తోశాడు.     వాడు చేయి లాక్కోవడానికి గింజుకుంటున్నాడు. వాడి కళ్ళల్లో భయం.     కొంతసేపయ్యాక బుట్టమూతను పైకి తీశాడు పెరుమాళ్. అందులో పాము లేదు.     రాముతో పాటు అందరూ హాయిగా వూపిరి పీల్చుకున్నారు.     పెరుమాళ్ ఆ తరువాత రామూని కింద పడుకోమన్నాడు. వాడు నేలమీద పడుకోవడానికి నిరాకరించడంతో కింద దుప్పటి పరిచాడు.     వాడు దానిమీద పడుకున్నాడు.     అంతలో రామూ తల్లి జనాన్ని తోసుకుని ముందుకు వచ్చింది.     "అన్నా! వాడ్ని ఇంక లేపు. నీ మంత్రాలవల్ల వాడికేం కాదని తెలుసుగానీ, కన్న పేగు చూడలేకపోతూవుంది. మరెవర్నైనా పిలిచి నీ విద్యలు చూపెట్టు."     అని ఆమె అర్ధించినట్లు చెప్పింది.     "ఏం కాదులే కాంతమ్మ పిన్నీ. అంతా కనుకట్టు" సర్ది చెప్పింది జయ.     అంతలో ఓ ముసలాయన లేచి "ఏమే కాంతం, నీ బిడ్డకు ఇక్కడ ఎవరూ కాకులకూ, గద్దలకు వేయడంలేదుగానీ కాసేపు వుండు. అంతా వేడుకే, నీ బిడ్డకు ఏం గాదు" అన్నాడు.     అంతమంది చెప్పడంతో ఇక విధిలేక కాంతమ్మ జనంలో కలిసి పోయింది.     అంతలో పెరుమాళ్ ముగ్గు మధ్యలో మంటపెట్టి అందులో ఒక ఇనుప గుండును ఎర్రగా కాల్చాడు.
24,502
     కాసేపు తను కృష్ణలా చిందులు వేస్తె పిలూ రాధలా గంతులేసిందిట.     ఎంత బాగుంది. ఎంత బాగుంది అనుకున్నాడు. అలాగైనా ఆ పిలూ మేడమ్ ని పట్టుకోవాలి.     నిన్న ఎక్కడైతే కనిపించిందో ఇవ్వాళా అక్కడే నిలబడాలి.     అతనికి ఎక్కడో చదివిన వాక్యం గుర్తొచ్చింది.     'ఎక్కడైతే పోగొట్టుకున్నావో అక్కడే వెతుక్కోవాలన్నా' వాక్యం అది.                                                                      * * *     పిట్టగోడ అవతలవైపు నుంచి విజిల్ వినిపించింది.     సత్తిపండు వచ్చాడన్న విషయం అర్ధమైంది శ్రీచంద్రకు. టిఫిన్ తినేసి నీళ్ళు తాగి తనూ విజిల్ వేసాడు వస్తున్న ఆగమన్నట్లు.     ఓసారి తన మొహాన్ని అద్దంలో చూసుకుని బయటకు వస్తుండగా బామ్మ డ్రెస్సింగ్ మిర్రర్ ముందు నిలబడి షోగ్గా తయారవ్వడం కనిపించింది.     "ఏంటి బామ్మా ఏం చేస్తున్నావే?" అడిగాడు బిత్తరపోయి శ్రీచంద్ర.     "లిప్ స్టిక్ పుసుకుంటున్నా కనబడ్డంలా?" అంది తాపీగా లిప్ స్టిక్ పెదాలకు రాసుకుంటూ.     ధబ్ మని వెనక్కి విరుచుకుపడబోయి తమాయించుకుని "అయినా ఇప్పుడీ వయసులో పెదాలకు లిప్ స్తిక్కేందుకే" మొత్తుకున్నాడు శ్రీచంద్ర.          "ఇంగ్లీషు పిక్చర్ ఒహటి సేవన్ హెవన్ దియెటర్ లో మార్నింగ్ షో అడుతోందట. కటింగ్ లు కూడా వేస్తున్నారట. కాస్త గ్లామర్ గా వెళ్తే తప్పేంటి? నీకూ మీ తాతయ్య బుద్దులే వచ్చాయి. నేను అందంగా కనిపిస్తే మీ తాతయ్యంతే కళ్ళల్లో నిప్పులు పోసుకునేవాడు. ఎక్కడ ఏ జగదేకవీరుడు వచ్చి నన్ను ఎగరేసుకుపోతాడోనని పెద్ద ఉపోద్ఘతమే మొదలుపెట్టింది బామ్మ.     "చీ...చీ....నాకు బుద్దిలేదే. నిన్ను కదిలించాను చూడు అది......అది నా బుద్ది తక్కువ" అంటూ రెండు చేతులతో తన చెంపలు తనే వాయించుకుని వెంటనే ఓ డౌట్ వచ్చి "ఈ లిప్ స్టిక్ నికేక్కడిదే" అడిగాడు శ్రీచంద్ర అనుమానంగా.     "మీ నాన్న చొక్కా జేబులోంచి కొట్టేశాను" అంది మరింత తాపీగా.     ఈసారి నిజంగానే వెనక్కి విరుచుకుపడ్డాడు.     "అమ్మ నా రొమాంటిక్ నాన్నా. నీకి వయసులో లిప్ స్టిక్ కావాలా ?" అనుకున్నాడు శ్రీచంద్ర.                                                            * * *     "ఏంటి గురూ! ఇవాళ వన్....టూ....త్రీ....అని పరుగెత్తకుండా డీలాగా హీనంగా , ఎండాకాలంగా నడుచుకుంటూ వచ్చావు. ఎందుకంటావ్?" అమాయకమైన ప్రశ్నొకటి వదిలాడు శ్రీచంద్ర వైపు చూస్తూ.     శ్రీచంద్ర సత్తిపండు వైపు చరచరా చూస్తూ "ఇప్పుడది అంత ఇంపార్టెంట్ అంటావా? అయినా నేను ఇంట్లో నుంచి నడుచుకుంటూ వస్తే అన్నీ పదాలతో నన్ను అడగాలా పోట్టిలాగు వెధవా?" కసురుకున్నాడు.     "ఏదో కన్ ఫర్మేషన్ కోసం అడిగా గురూ" అంటూ ఇంకేదో మాట్లాడబోయి ఒక్కసారిగా "గురూ" అని అరిచేశాడు.     వీపు మీద చరుచుకుని కోపంగా సత్తిపండు వైపు చూసి "ఏమిట్రా! జడుసుకుని చచ్చేలా కొంపలు మునిగిపోతున్నట్టు అరిచావు" అన్నాడు శ్రీచంద్ర.     "ఓసారి అటువైపు లుక్కేసుకో. నువ్వూ అరుస్తావు" అన్నాడు సత్తిపండు.     సత్తిపండు చూపించిన వైపు చూసి సత్తిపండు కన్నా నాలుగైదు డేసిబుల్స్ సౌండ్ పెంచి అరిచేశాడు.     సత్తిపండు వీపు చరచుకున్నాడు.     ఎదురుగా గరుడాచలం మాములుగా వేసుకునే పంచె, లాల్చీ కాకుండా పులచొక్కా, ప్యాంటు చేసుకున్నాడు. అది టక్ చేశాడు. కళ్ళకు పెద్ద గాగుల్స్ పెట్టుకున్నాడు. స్టయిల్ గా నడుస్తూ వస్తున్నాడు.     "గురూ! మన నన్నేనా? సారి సారి ....నేను చూస్తున్నది మీ నాన్ననేనా! బాబాయ్ నేనా?" కళ్ళద్దాలు సరిచేసుకుని చూసి మరి అడిగాడు.     "ఏమోరా! నాకూ అయోమయంగా వుంది" అన్నాడు. అప్పటికే గరుడాచలం వీళ్ళని చూసుకుంటూ ఒక్క బూతు మాట కూడా మాట్లాడకుండా వీళ్ళని దాటి అటో పిలిచి అందులో కూచుని "పోనీ" అన్నాడు.     "అదేంటి గురూ! ఎప్పుడూ ఎవడో ఒకడ్ని తిట్టి అవసరమైతే తిట్టినవాడినే లిప్ట్ అడిగి వెళ్ళే బాబాయ్ ఏంటి ఇలా పులరంగడిలా తయారై ఆటోలో వెళ్తున్నాడు? తెల్లదొరసాని పిన్ని దగ్గరకు కాదుకదా?" నిన్న కనిపించిన ఆంగ్లో ఇండియన్ లేడిని దృష్టిలో పెట్టుకుని అన్నాడు.     ఆకాశంలోకి చూస్తున్నాడు శ్రీచంద్ర. తండ్రి గెటప్ చూసి షాకయ్యాడు.     అప్పుడే మరో షాక్ తగిలేలా మళ్ళీ అరిచాడు సత్తిపండు.     "మళ్ళీ ఏమైందిరా? అలా అరిచి చచ్చావు గుండాగిచచ్చేలా" అన్నాడు శ్రీచంద్ర.     ఆకాశంలోకి చూస్తున్న తలని సత్తిపండు వైపు తిప్పి.     "మరో షాక్ గురూ. మీ బామ్మ చూడు. ఎన్ని వన్నెలు చిన్నెలతో వయ్యారాలు పోతూ వస్తుందో" చెప్పాడు సత్తిపండు.     బామ్మ కళ్లకు స్టయిల్ గ్లాసెస్ పెట్టుకుని బయటకు వస్తోంది. చేతిలో హ్యాండ్ బ్యాగ్, పెదాలకు బాగా దట్టించినట్టు లిప్ స్టిక్.     "బామ్మా....." గట్టిగా అరిచి జుట్టుపిక్కున్నాడు శ్రీచంద్ర.                                                                    * * *     యమధర్మరాజు ఉలిక్కిపడ్డాడు.     ఎవరో అరిచినట్లు వినిపించింది.     తలవంచి కిందకి భూలోకం వైపు దృష్టిని సారించాడు. ఆకాశం వంక చూస్తూ జుట్టు పిక్కుంటూ "బామ్మా" అని అరిచిన శ్రీచంద్ర కనిపించాడు.     యమధర్మరాజు కళ్ళు చిత్రంగా మెరిసాయి.     "చిత్రగుప్తా!' పిలిచాడు ఓ కేకేసి యమధర్మరాజు.     ఘంటంతో పాపుల చిట్టా రాస్తున్నా చిత్రగుప్తుడు ఉలిక్కిపడి వీపు చరుచుకుంటూ...."ధూ.....ధూ" అనుకుని ఈ ముసలి యమధర్మరాజుకు చాదస్తము, ఆవేశము అధికమగుచున్నది. నా ప్రాణములు ఈతని పిలుపునకే ఝడుసుకుని ఎగిరిపోవునెమో? అనుకుని.     "చిత్తం వస్తున్నా ప్రభూ!" అన్నాడు లేస్తూ.     "చిత్రగుప్రా! మనం తక్షణం భూలోకమునకేగవలె" అన్నాడు.     "తమరేగుడు ప్రభూ ముసలిముండావాడిని నేనెందులకు" అన్నాడు.     "చిత్రగుప్తా!"     "చిత్తం ఝడుసుకుంటిని ప్రభూ!"     "చిత్రగుప్తా! ఈసారి గొంతు తగ్గించి శాంతంగా అన్నాడు.     "బ్రతికిపోతిని ప్రభూ" అన్నాడు చిత్రగుప్తుడు.     "అదిసరే ఆ మానవుడి ప్రాణములు హరించవలె. అదియును అతనికతనే మరణించవలెనని నిశ్చయించుకుని మృత్యువును ఆహ్వానించునటుల చేయవలె" అన్నాడు.     "ప్రభూ! ఇటువంటి ఆలోచనలు చేయడం.....తంపుల మారి నారదులవారే సమర్ధులు" అన్నాడు చిత్రగుప్తుడు తను ఆ సంకటస్థితి నుంచి తప్పించుకోవాలని.     తధాస్తు దేవతలు తధాస్తు అన్నారు.
24,503
    ఘంటసాల పాడిన ఓ లలిత గీతం అది. అందరూ నోళ్ళు వెళ్ళబెట్టి ఆశ్చర్యంగా వినసాగారు. అచ్చం ఘంటసాల పాడినట్లే ఉంది. "తల నిండ పూదండ దాల్చిన రాణి ..." అంటూ రాధనే చూస్తూ పాడుతున్నాడు మురళి.     అందరికన్నా ఎక్కువ పరవశం చెందిన రాధ మనసంతా మురళీ రూపంతో నిండిపోయింది. అతను అంత అద్భుతంగా అచ్చం ఘంటసాల లాగా పాడగల విద్యార్ధి అని తనకు తెలీనే తెలీదు. అంత ప్రతిభ ఉన్న గాయకుడినా తను చెంప దెబ్బ కొట్టింది !     ఎంత దారుణం ! అలాంటి వ్యక్తి తనను ముద్దు పెట్టుకున్నా సహించాలి ! సంగీతమంటే అంత గౌరవం తనకు.     ఈ లోపులో రామలింగం నెమ్మదిగా కర్టెన్ వెనుకకు చేరుకున్నాడు. ఓ మూలగా గ్రామ్ ఫోన్ కనిపించిందతనికి. దాని దగ్గరకు నడిచి తన నెవరూ చూడటం లేదని నిర్ధారణ చేసుకున్నాక పాట స్పీడుని 90 మీదకు మార్చాడు. అంతే !     రికార్డు వేగంగా తిరగటం ప్రారంభించింది. "తల్నిండ్పూదన్ డదాల్చిన్రాణీ ..." అంటూ హటాత్తుగా పాట స్పీడు మారేసరికి మైకు ముందు నిల్చున్న మురళి కంగారుపడి పెదాల వేగం పెంచేశాడు. ఆడిటోరియం అంతా నవ్వులు, కేకలు వినిపించినయ్.     అతని వంకే ఆరాధనా పూర్వకంగా చూస్తున్న రాధ మొఖంలో అసహ్యం కనిపించింది. "ఇడియట్ !" అంది కసిగా.     రామలింగం అక్కడితో తృప్తి పడలేదు. ఈసారి వేగాన్ని 33కి తగ్గించాడు. దాంతో రికార్డ్ నెమ్మదిగా తిరగటం మొదలయింది. "తా ... లా ... నిడ్డా ... పూ ... దన్ డా ..." అంటూ !     మురళీకి చెమటలు పట్టేయసాగినయ్.     ఆ తరువాత రామలింగం వేగాన్ని వెంటవెంటనే ఇష్టమొచ్చినట్లు 33 నుంచి తొంభయ్ కీ, 90 నుంచి 33 కీ మార్చటం మొదలు పట్టాడు. ఈ గొడవంతా చూచి అమితాబ్ బచన్ పరుగుతో గ్రామ్ ఫోన్ దగ్గరకు చేరుకున్నాడు. రామలింగం చేస్తోన్న పని చూడగానే అతనికి వళ్ళు మండిపోయింది. రామలింగాన్ని ఒకే ఒక్క తన్ను తన్నాడు. వెనుక నుంచీ ! వేగానికి రామలింగం గ్రామ్ ఫోన్ తో సహా రెండు మొగ్గలు వేసి గోడకు కొట్టుకుని కింద పడ్డాడు. పాట ఆగిపోయింది. పాట హటాత్తుగా ఆగిపోయేసరికి మురళికేం చేయాలో అర్ధం కాలేదు. "థాంక్యూ" అనేసి స్టేజి దిగిపోయాడు.     "ఇడియట్ !" అని మరోసారి అనుకుంది రాధ కసిగా.     రామలింగం మూలుగుతూ, కుంటుతూ రిక్షాలో యింటికి బయలుదేరాడు.                             *    *    *        తన గదిలో దిగాలుపడి కూర్చుని ఉన్నాడు మురళీ. అతని గాంగ్ మెంబర్స్ అందరూ తలో విధంగా సానుభూతి చూపుతున్నారు.     "ఆ రామలింగంగాడిని మనం ఎంత దారుణంగా నమ్మేశాం ! నమ్మించి గొంతు కోసేశాడు" అన్నాడు మురళి.     ఆంజనేయులు పరుగుతో వచ్చాడు గదిలోకి.     "గురూ ! నీకు ఫోనొచ్చింది !"     "మగ ఫోనే !"     "అయితే లేనని చెప్పు."     "చెప్పాను గురూ ! కానీ వాడు మాట్లాడదల్చుకున్నది 'ఆడపిల్ల వ్యవహారం గురించి అట ..."     ఆ వాక్యం పూర్తవకుండానే మురళి బులెట్ లా దూసుకుపోయి ఫోన్ అందుకున్నాడు. పక్కనే రామలింగం వింటున్నాడు. అతడిని గమనించలేదు మురళి. అతడి కాలికి బ్యాండేజి వుంది.     "హలో మురళీ హియర్ ! ఎవరు మాట్లాడుతున్నారు ?"       "నీ నీడను !"     "నీడా ! అలాంటి పేరు గల పక్షులెవరూ మన లిస్ట్ లో లేరే !"     "నీ డూప్లికేట్ ని !"     మురళి గుండెలు వేగంగా కొట్టుకున్నాయ్.     "అంటే ..." అన్నాడు.     "అవునోయ్ పక్షీ ! మీ ఫ్రెండ్ దగ్గర అప్పూ - బార్బరు షాపూ - చాలా ?"     "చాల్చాలు ! గుర్తు కొచ్చేశావ్ ! ఎవర్నువ్వు ? ఎందుకిలా చేస్తున్నావ్ ?"     "అదంతా చెప్పటానికి నేను నీలాంటి ఫూల్ ని కాదు !"     "అయితే మరెందుకు ఫోన్ చేసినట్లు ?"     "నీ పిరికితనం తెలివి తక్కువతనం చూచి జాలిపడి-"     "నేను పిరికి వాడినా - నా సంగతి నీకు తెలీదింకా -"     "ఆపరా ఫూల్ ? ఎంత పిరికివాడివి కాపోతే ఆ రోజు ఆ పిల్ల నేను ముద్దు పెట్టుకున్నందుకు నీ చెంప పగలగొడితే - భోరున ర్డుస్తూ రూమ్ కెళతావా ? దమ్ముంటే, తెలివుంటే, ఇంకేదయినా పైఎత్తు వేసి అసలు విషయం ఋజువు చేసి ఉండే వాడివి ! అవునా ?"     "అవును."     "చూశావా 'అవును' అని వప్పుకున్నావ్! నువ్వు తెలివి తక్కువ, పిరికి ఎక్కువ అనడానికి ఇది మరో ఋజువు."     ఫోన్ డిస్కనెక్ట్ అయిపోయింది.     "హలో  హలో" అన్నాడు మురళి.       హటాత్తుగా అతని మెదడులో ఓ మెరుపు మెరసింది..     "ఎవరు తెలివిగల వాడో రుజువు చేస్తాను-" అంటూ రూమ్ వేపు పరుగెట్టాడు.                         *    *    *
24,504
    "తప్పకుండాను" అని అనలేదు రామచంద్రం" ఈ విషయంలో రవంత ఆశ కూడా పెట్టుకోకు బాబాయ్! అని గట్టిగా చెప్పేశాడు.     "ఇంత ముర్ఖుడెం వీడు?" అనుకున్నాడు శివరావు.     రామచంద్రం శివరావుల సంబాషణ వింటున్న సీత "అమ్మయ్య నన్నెంత మంచివాడు." అనుకుంది తృప్తిగా.     కాసేపు పొడి పొడిగా రామచంద్రంతో మాట్లాడి శివరావు వెళ్ళిపోయాడు.     మానుతున్న గాయాన్ని కేలికినట్లు ఉంది రామచంద్రంకి.                                                     4     మ్యాట్ని ఇంగ్లిషు పిక్చరు కెళ్ళచ్చాడు బాబా. గుమ్మం లోపల అడుగు సాంతం పెట్టక ముందే "రారా బాబా నీ కోసమే చూస్తున్నాను" అన్నాడు రామచంద్రం. చేతిలో న్యూస్ పేపరుంది. ముఖంలో సంతోషంకన్నా గంభిర్యమే ఎక్కువగా వుంది.     "దేనికి నాన్నా!" తండ్రికి తన కోసం ఎదురు చూసే పనేం పడింది అర్ధంకాలేదు బాబాకి.     "ఎక్కడికి వెళ్ళొస్తున్నావ్?"     ఫ్రెండ్స్ పిక్చరుకి లాక్కెళ్ళరు. వాళ్ళ బలవంతం మీద...."     "ఆహా...."     "నా కోసం అన్నారు దేనికి నన్నా?"     "ఫ్రెండ్స్ బలవంతం మీదే కాదు సినిమకెళ్ళింది.?"     "అదేగా చెప్పను....."     "చెప్పావు లేవోయ్ మరోసారి నీ నోటంట విందామని...."     "అసలు విషయం చెప్పకుండా ఈ అనవసరం సంభాషణ దేనికో బాబాకి అర్ధం కాలేదు. తండ్రి మొహం ప్రసన్నంగా లేకపోవటం, ఎక్కడ తిరిగొచ్చినా ఇదేమని ఎప్పుడూ అడగనివాడు ఈ రోజు అడగడం వింత భయం కలిగించింది.     "ఊ అయితే ఎవరైనా కాస్త బలవంతం చేస్తే విన్తవన్నమాట...."      ఏం చెప్పాలో తెలియలేదు బాబాకి. అప్పుడే సీత లోపలినుంచి వచ్చింది బాబాకి ఎదురుగా తండ్రి వుండటంవల్ల సీత ఏ మడుగుదామన్నా కుదరలేదు.     తెచ్చిన కాఫీ గ్లాసు తండ్రి కిచ్చి దండెం మీద బట్టలు సర్దుతూ అక్కడే నుంచుంది సీత.     "మాట్లాడవేం రా!" అన్నాడు రామచంద్రం.     "ఏం మాట్లాడను?"     "బలవంతం చేస్తే వింటావా అని అడుగుతున్నాను"     "ఏదో ఒకసారి పోనీ కదా అని విన్నాను ప్రతిసారి వినాలంటే వింటనేమిటి?"     "ఆహా ఆ వక్కసారి నా మాటవింటే బాగుండేదిగా?"     "నేను మీ మాట వింటూనే వున్నాగా నాన్నా?"     "వింటే బాగానే వుండేది. ఇలా ఎందుకు జరుగుతుంది." రామచంద్రం ఏ విషయంలో అన్నాడో ఇంకా బాబాకి అర్ధం కాలేదు.     "కస్టపడి చదువుకోమని ఒకసారా వందసార్లు బలవంతం చేశాను. గట్టిగా చెప్పను. విన్నావా? బలవంతం చేస్తే సినిమాకి వెళ్ళవు.     "పిక్చరు కంటే ఒకసారి వెళతాం. రోజు చదువుకుంటూనే వున్నాను. రోజు వున్నదానికి.....     బాబా సాంతం మాట్లాడక ముందే రామచంద్రం పేపరు తీశాడు. "ఇంటర్ పరీక్షాఫలితాలు పడ్డాయి" అన్నాడు నెమ్మదిగా.     బాబా అడుగు ముందుకు వేసి చటుక్కున పేపరందుకున్నాడు.     "దాంట్లో నీ నెంబరు లేదులే. నీ ఫ్రెండ్స్ ఎవరైనా పాస్ అయారేమో కావాలంటేచూడు."     బాబా చేతిలోని పేపరు జారిపోయింది.     "ఈవినింగ్ కొన్ని పేపర్లో నయినా రిజల్ట్స్ రావచ్చని అందరికి తెలిసింది. పరిక్ష రాసి ఫలితానికి ఎదురుచూసే నీకు మాత్రం ఈ సంగతి తెలిలేదా? తెలిసినా నిర్లక్ష్యమా?"     పరిక్ష తప్పినందుకు విచారిస్తుంటే తండ్రి మాటలు ఓ పక్క శులాల్లా తగులుతున్నాయి బాబాకి. గొప్పగా రాయలేదు అయినా పాస్ కావటం  గ్యారంటి్ అనే ధిమాతో తిరుగుతున్నాడు బాబా.     నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారా, బరువు భాద్యత తెలియకుండా అమ్మ ఉన్నప్పుడు లేనప్పుడు ఒకేలాగా తిరుగుతున్నావు. నీ పని హాయి. సీత చూడరా అటు చదువు ఇటు పని కష్టం సుఖం తెలిసి మెలుగుతున్నది బజారునుంచి వచ్చావు. దోవలో ఎవరు పేపరు రిజల్ట్ పడ్డాయని అనుకోవడం వినలేదంటే నీ వాసాలు మనుషుల ముఖాలు చూసి నడిచావా? సినిమాలో సీన్లు కళ్ళముందు కదలాడుతుంటే అలానే దోవ పొడుగుత చూస్తూ వచ్చావా?" అన్నాడు కాస్త గట్టిగానే రామచంద్రం.     "బాబా తల వంచేసుకున్నాడు.     ఊరుకో నన్నా' అంది సీత.          "ఊరుకొక ఉరేసుకున్నానా అమ్మా!" అన్నాడు రామచంద్రం. పిల్లల భవిస్యత్తు గురించి ఎన్నో కళలు కని, మూసిన భార్య గుర్తుకొచ్చింది.     ""వెళ్ళి కళ్ళు చేతులు కడుక్కురా, వంటింట్లో ఫ్లాస్క్ లో కాఫీ వుంది." అంది సీత.     బాబా రెండంగల్లో లోపలికి వెళ్ళిపోయాడు.     బాబా వెళ్ళాక "నాన్నా" అంది సీత తండ్రి దగ్గిర కొచ్చి.     "ఏమిటమ్మా?"          "బాబా ఈసారి గట్టిగా చదివి పాస్ అవుతాడులే నన్నా"     "అలా అనుకుని తృప్తి పడల్సిందేనమ్మా.     "విచారించకు నాన్నా"     "విచారించను లేమ్మా!"     బాబా తప్పినందుకు తండ్రి చాలా బాధపడుతున్నాడని సీతకి తెలుసు తోటి పిల్లవాడు ఆటలాడుతూ కిందపడి కలికి దెబ్బ తగిలి ఏడుస్తుంటే పక్కనున్న పిల్లవాడు ఏడవకు తాయిలం పెడతాగా అదే తగ్గిపోతుంది." అని ఒదర్చితే దెబ్బ తగిలిన పిల్లవాడు "సరేలే" అన్నట్టు , తండ్రి కూతురు పసివాళ్ళ తంతులా ఒకరినొకరు మాటలతో ఊరడించుకున్నారు.     సీతకన్నా ఏణర్ధం పెద్దవాడు బాబా. అయినా సీత 'అన్నయ్యా" అని పిలవడు బాబాని. పేరు పెట్టి పిలవటం చిన్నప్పటినుంచే అలవాటయింది. బాబా, సీత, తర్వాత పుట్టినవాళ్ళు మాత్రం....వీళ్ళిద్దరిని అన్నయ్య అక్కయ్య, అనే పిలుస్తుంటారు. సీత తర్వాత పిల్ల రూప ఉత్త గడుగ్గాయి. బాబా తప్పిన వార్త బైట నుంచి వస్తూనే తెలుసుకుంది.     "అన్నయ్య పరిక్ష పోయిందిగా, వాడికలా రోగం కుదరాల్సిందే మహా సంతోషపడిపోతూ అంది రూప.   
24,505
    "అయితే కృష్ణారావు చచ్చేప్పుడు అతడికి చేసిన వాగ్దానం సంగతి ఏమిటి?"     "పారిజాత అతడి కాళ్ళమీదపడి తీసుకువచ్చి ఆమాట చెప్పించింది అతడితో."     "పోమ్మా! స్నేహితురాలివైపు వకాల్తా తీసుకొంటే ఇక్కడ నమ్మేదెవరు? అతడు కలవాళ్ళ అబ్బాయి. ఈమె అందమైన అమ్మాయి. ఇద్దరూ ఒక కాంపౌండ్ లో ఉన్నారు. ఇద్దరూ ఆకర్షణలో పడకపోతే ఆశ్చర్యంకాని పడితే ఆశ్చర్యం ఏం లేదు."     పారిజాత చెడిపోయినదానిలా ప్రచారం కావడం చూసి ఖిన్నురాలైంది లలిత. రంగనాధం లాంటి పెద్దమనిషి కేవలం ఈర్ష్య చేత అలా అనడు. బయట ఎవరో అనుకోగా వినే అని ఉంటాడు.     రంగనాధంతో ఇక ఏంవాదించడానికీ మనస్కరించక మౌనంగా వచ్చేసింది లలిత. కామమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి స్నేహితురాలిని తీసుకురమ్మని భర్తను కోరితే, అతడు ఆఫీస్ లో ఆడిట్ అవుతున్నదనీ ఒక పూటకూడా సెలవు తీసుకోడానికి వీలుకాదని చెప్పేశాడు. స్నేహం ఎంత అమూల్యమైన దైతేనేం? తనేమీ సహాయం చేయలేకపోతున్నందుకు కుమిలిపోయింది లలిత.                                  12     పారిజాత పెళ్ళికూతురు అయ్యింది. కామమ్మ రెక్కపట్టి లాక్కుపోసాగింది. పీటలమీదికి.     "ఈ పెళ్లి నేను చేసుకోను. నాకీ పెళ్ళి వద్దు" అరుస్తూ, ఏడుస్తూ, గింజుకోసాగింది పారిజాత.       "చేసుకోదట! చేసుకోక ఏం చేస్తుందో? ఆ మూడు ముళ్ళూ పడితే కుక్కినపేనులా పడివుండదూ?" కామమ్మ పారిజాతను లాక్కుపోయి పీటలమీద దభిల్లున కూలేసింది.     "మంగళసూత్రం తీసికోండి.... బాజాలు మ్రోగించమనండి" బ్రాహ్మడు వడివడిగా మంత్రాలు చదవసాగాడు.     గున్న ఏనుగు లేచినట్టుగా లేచాడు హనుమంతు. మంగళసూత్రం తీసుకొన్నాడు.     "ఆగండి"     గర్జనలా వినిపించింది ఒక కంఠం.     ఆశ్చర్యంతో, భయంతో అందరి కన్నులు అటు తిరిగాయి.     బలిష్టంగా, పొడుగ్గా ఉన్న యువకుడొకడు నిలబడి ఉన్నాడు. నడుముకు చేతులు పెట్టుకొని గంభీరంగా, తీక్షణంగా చూస్తున్నాడు. మృగరాజును చూసిన అడవి జంతువుల్లా అందరూ గజగజ వణికి పోసాగారు.     ముందుగా కామమ్మ తేరుకొని, "ఎవరు, నాయనా? నువ్వు" అని అడిగింది.     "పారిజాతను ప్రేమించినవాణ్ని. పారిజాతను పెళ్ళి చేసుకోబోతున్న వాడిని." మనోహర్ గంభీరంగా పలికాడు. "లే, పారూ" పారిజాతకు చెయ్యి అందించాడు.     అతడి చెయ్యి అందుకుని ముగ్ధలా నడవ సాగింది పారిజాత     పెళ్ళివాళ్ళంతా నోళ్ళు తెరుచుకు చూడసాగారు.     స్వర్గంలో తేలిపోతున్నట్టుగా ఉంది పారిజాతకు.     పారిజాత వీపుమీద దభీమని వ్రేటుపడింది. పారిజాత అందంగా చిత్రించుకొంటున్న కలచెదిరి పోయింది.     "ఏమిటే ఆ మైమరపు? గంటసేపటినుండి చేతిలో ఆగిన్నె అలా పట్టుకొని ఏ లోకంలోకి చూస్తూన్నావు? ఏం కలలు కంటున్నావు?" కామమ్మ కాళిలా ఎదుటనిలబడింది.     "అయిపోయిందత్తా!" పారిజాత గబగబా గిన్నె రుద్దసాగింది.     "తొందరగా తెములు. వంట పన్నెండు గంటలకల్లా అయిపోవాలి. మీ మామకు పన్నెండుగంటలకల్లా కారియర్ పంపించెయ్యాలి?"     ఆజ్ఞ జారీచేసి అవతల వ్యవహారానికి వెళ్ళింది కామమ్మ.     ప్రొద్దుటినుండి తనకు పరిచితమైన పదధ్వనులకోసం చెవులు రిక్కించుకొని వింటూన్నది పారిజాత. మనూకి నిన్న ఉత్తరం అంది ఉంటుంది. ఆ రోజు తప్పకరావాలి! అతడి రాకకోసం వేయికళ్ళతో ఎదురు చూస్తున్నది పారిజాత.     రెండురోజుల నిరీక్షణ నిస్పృహగా మారిపోయింది. కళ్ళలో విషాదం లాంటి భావం చోటు చేసుకొంది. మనూ! నువ్వెంత మారిపోయావు? మన మధ్యఉన్న అనుబంధం మిధ్య అయినా కనీసం ఒక పరిచయస్తుడిగా , మనసున్న ఒక మనిషిగానైనా నన్ను ఆదుకోడానికి రాలేక పోయావా? కనీసం ఒక మనిషిగానైనా! సహాయం చేయడానికి మీ అమ్మకూ, లోకానికీ జడిశావా?
24,506
    ముందుగా చూసి నాగులుని గుర్తు పట్టలేకపోయాడు. ఈ మధ్య అసలు కలవలేదు. కలిసి కూడా చాలా కాలమయింది. అదయినా కావేరీకి తనకి వివాహమని లగ్నం పెట్టుకున్న తరువాత రెండవ ఆట సినిమాకి వస్తే ఎంతో మర్యాద చేశాడు నాగులు!     ఆ రోజు కలవటమే! మరలా కలవలేదు! నాగులు బాగా వళ్ళు చేయటం, క్రింద పెదవి కనిపించకుండా మీసాలు పెంచటం, ఖరీదుగల బట్టల్లో ఎంతో హుందాగా వున్నాడు.     సైకిల్ ని ఆపి స్టాండు వేశాడు వినాయకం!     "ఈమధ్య బొత్తిగా కనిపించటం లేదేమిటి బాబుగారూ?"     అనడిగాడు నాగులు!     "ఏదో టైంలో వచ్చి వెళుతుంటాను."     "మీకు అదే లగ్నానికి పెళ్ళి అయిందని తెలిసిందండీ?"     "అవును!..."     "అమ్మాయిగారికి సినిమాపిచ్చి వుందని నాకూ తెలుసు! అందుకే సినిమా వాల్ పోస్టర్సు, సినిమా పాటల పుస్తకాలూ తెచ్చి యిస్తుండేవాడిని! యింట్లోనుంచి లేచి వెళ్ళిపోయే పరిస్థితి కలుగుతుందని అనుకోలేదు!..." అన్నాడు నాగులు ఎంతో విచారంగా!     "ఏం చేస్తాం?...కావేరీకి ఆ బుడ్డి పుట్టింది!....వంటరిగా వెళ్ళి అక్కడ ఎన్ని బాధలు పడుతున్నదో?"     "మీరింకా అమ్మాయిగారిని మరిచిపోలేదా బాబుగారూ?"     "ఎలా మరువగాలను? చిన్నప్పటినుంచీ ఒకేచోట వుండి పెరిగి పెద్దవాళ్ళం అయ్యాం! కాబోయే భార్యా భర్తలుగా నమోదుఅయిపోయాం ఇంతలోనే ఇలా చేస్తుందని అనుకోలేదు!"     "ఈ విషయం ఆలస్యంగా తెలిసింది నాకు! పరామర్సకి వస్తే మీరు మరింత బాధపడతారని రాలేకపోయాను."     వినాయకం ఏం మాట్లాడలేకపోయాడు. కావేరీతో తను గడిపిన రోజులను గుర్తు చేసుకోసాగాడు.     "మీరేమీ అనుకోనంటే మీకొక విషయం చెప్పాలనిపించింది. అందుకే పిలిచాను!...అన్యదా భావించవలదు!...."     "నేనేమీ అనుకోను! చెప్పు నాగులూ!"     స్కూటర్ బాగ్ లోనుంచి ఒక ప్రముఖ సినీవారపత్రికను, మరి కొన్ని వారపత్రికలు తీసి సీటుమీద వుంచి ముందుగా సినీవారపత్రిక పేజీలు తిప్పి ఓ పేజీ దగ్గిర ఆగి మడతపెట్టి వినాయకం చేతికి ఇచ్చాడు చూడమని!     ఆ పేజీనిండా రకరకాల దుస్తులుతోను, ఆధునీకంగా వుండి కెమెరాకి ఫోజులిస్తున్న కావేరీని "కావ్యశ్రీ" గా తొలిసారిగా నూతన నటిని తెరకి పరిచయం చేస్తున్న నిర్మాత వేలాయుధం."     అన్న పెద్ద పెద్ద అక్షరాలతో వ్రాయబడివున్నది. సినిమా షూటింగ్ వివరాలు, నటి కావ్యశ్రీని గురించిన పరిచయం వ్రాయబడివుంది అదంతా చదవాలన్న ఉత్సుకత కలిగింది వినాయకానికి.     రకరకాల దుస్తులతో ఎంతో అందంగా వుంది వినాయకం కళ్ళకి కావేరీ!     "మొత్తంమీద తన కోరిక నెరవేర్చుకుంది అమ్మాయిగారు! సినీఫీల్డులో యింత త్వరగా హీరోయిన్ గా రావటం చాలా గొప్ప అదృష్టం. అందునా వేలాయుధం సినిమాలంటే జనం పడిచస్తారు. ఎన్ని సంవత్సరాలయినా ఆ సినిమాకి హౌస్ ఫుల్ కలెక్షన్సు తప్ప తక్కువ కలక్షన్సు ఎప్పుడూ వుండవు! అలాంటి ఆయన సినిమాల్లో నటించుతున్నదంటే? ఈ సరికే ఎన్నో సినిమాల్లో బుక్ అయిపోయి బిజీగా వుండివుంటారు అమ్మాయిగారు.     అమ్మాయిగారి కోసమయినా మద్రాసు వెళ్ళాలి! మీరు కూడా వస్తారా బాబుగారూ? యిద్దరం వెళ్దాం?"     "ఇద్దరం వెళ్ళే సంగతి తరువాత చెప్పుతానుగాని ఈపత్రిక నేను తీసుకెళతాను. చదివి ఈసారి వచ్చినప్పుడు తీసుకొచ్చి యిస్తాను!" అన్నాడు మడతపెడుతూ!     "ఈ పత్రికల్లో కూడా అమ్మాయిగారి ఫోటోలు వేశారు. కావాలంటే యివి కూడా తీసుకెళ్ళండి. నాకు అవసరం లేదు!"     అని అవి కూడా మడత పెట్టి వినాయకనైకి యిచ్చాడు.     వాటినన్నింటినీ చేతి సంచిలో పెట్టుకుని సైకిల్ కి తగిలించుకుని నాగులు దగ్గిర సెలవు తీసుకుని బయలుదేరాడు.     కొంతదూరం వచ్చిన తరువాత సైకిల్ ని ఆపాడు. ఎవరూ లేనిచోట కొంతసేపు కూర్చుని కావేరి ఫోటోలు చూడాలని, కావేరి గురించి ఏం వ్రాశారో చదవాలనిపించి అటూ యిటు చూశాడు.     అది ప్రధాన రహదారి కావటం వలన ఎవరో ఒకరు వెళ్ళటం రావటం జరగటంతో, యిక్కడయితే లాభం లేదనుకుని సరాసరి తన గ్రామం వచ్చి యింటికి వెళ్ళకుండా పొలం వెళ్ళి ఎవరికీ తను కనిపించకుండా వుండేలా కూర్చుని సంచిలో నుంచి పుస్తకాలు తీశాడు. ముందుగా నాగులు చూపించిన పత్రిక తెరిచి కావేరి ఫోటోలున్న పేజీ తీసి పదే పదే ఆ ఫోటోలను చూసుకున్నాడు. తనను గురించి వ్రాసినదంతా చదివి చిన్నగా నిట్టూర్చాడు. మిగతా పత్రికల్లో ఏం వ్రాశారో చదివాడు! ఇంత ఎక్కువగా రాయలేదు గాని వ్రాసింది కొంచెం అయినా, "కావేరి గొప్ప నటీమణి అవుతుందని, అవగలదని!" అంటూ క్లుప్తంగా వ్రాసి వుంది.     "ఒక్కతే వెళ్ళిందా? లేక ఇంకెవరయినా తోడు వున్నారా?" అన్న సందేహం కలిగింది.     ఒక్క దానికేం తెలుసు?...నాటకాలు వేయించిన ఆ మాస్టారే తీసుకెళ్ళివుంటాడు. వాడికే తెలుసు సినిమాల సంగతి!     అని సమాధానపడ్డాడు బాధతోనే! కావేరీని దాదాపు అందరూ మరిచిపోయారు.     పరంధామయ్య సుభద్రమ్మలయితే తమ కూతురు చనిపోయిందన్నట్లుగానే భావించుకుని, ఆ శోకం నుంచి యిప్పుడిప్పుడే తేరుకున్నట్లుగా నాలుగు గోడల మధ్య నుంచి వెలుపలికి వచ్చి గాలి పీల్చుకోసాగారు....తనయితే సుబ్బులుతో కాపురం చేస్తున్నాడేగాని కావేరి గుండెల్లో నిలిచిపోయింది. మరిచిపోవాలని ప్రయత్నించి విఫలుడై పోయాడు.     అందునా సుబ్బులు ఎత్తిపొడుపు మాటలు! తను పరధ్యాన్నంగా వుంటే చాలు!     "కావేరి గుర్తు వచ్చినట్లున్నదే?..."     తను మాట్లాడకపోతే మరలా అంటుంది.     "అవునులే!...ఎలా మరిచిపోతారు? దానికి స్నో, పౌడర్లు, పుస్తకాలు తెచ్చిచ్చేవాళ్ళయ్యే!....సైకిల్ మీద స్కూలుకి సినిమాలకి తీసుకెళ్ళి తిరిగి తిరిగి తెలవారుఝాముకి వచ్చే వారయ్యే?...చిన్నప్పటినుంచీ ఒక మంచంలో పడుకుని, ఒక కంచంలో తిన్నవాళ్ళయ్యే! మరిచిపోవటం సాధ్యమా?"     ఆ సూటీపోటీ మాటలు భరించలేక తనులేచి దూరంగా వెళ్ళిపోతే చాలు! వలవలా ఏడ్చేస్తూ ఎత్తుకునేది దండకం!     "అది పోతూ పోతూ నిన్ను గూడా తీసుకెళ్ళవలసింది. నిన్ను నా పాలిత పడవేసిపోయింది. లోకం కోసం న్నను పెళ్ళి చేసుకున్నావు గాని నన్ను సుఖ పెట్టటానికా? దాన్ని తలుచుకుంటూ జపం చేయటమే నీ పని అయిపోయింది!"     సుబ్బులు ఎందుకు ఏడుస్తున్న దోనని భయంతో వంట యింటిలో నుంచి పరిగెత్తుకు వచ్చేది కామాక్షమ్మ.     "ఏం జరిగింది రా వినాయకం?"     అని కొడుకునయిన తననే అడిగేది గాని కోడలిని అడిగేది కాదు! కొడుకే లోకువ అయిపోయాడు ఈ మధ్య! కోడలిని ఏమయినా అంటే పుట్టింటికి వెళ్ళిపోతానంటుందేమోనన్న భయం! కూతురిని వెనుక వేసుకుని వెంకయ్య సీతమ్మ తన మీద యుద్ధం ప్రకటించుతారేమోనన్న హడల్!  
24,507
         ఆమె వెక్కివెక్కి ఏడవసాగింది, రెండు చేతుల్లో తలదాచుకుని.         ప్రభాకరం ఆమె ప్రక్కన దీనవదనంతో కూర్చున్నాడు. "నన్ను క్షమించు" అన్నాడు.         ఆమె ముఖాన్ని కప్పివున్న చేతులు తొలగించి అతని ముఖంలోకి సూటిగా చూసింది. ఒక్కనిముషం అలాచూసి లాగి ఒక్క చెంపకాయ కొట్టింది.         ఒక్కక్షణం నిర్ఘాంతపోయి, ఆమె భుజంచుట్టూ చెయ్యిపోనిచ్చి జాలిగా "నీకు తీరని అపచారం చేశాను సుజాతా" అన్నాడు.         ఆమె ఆ చేతిని పరమఅసహ్యంగా అవతలకు త్రోసివేసింది. "దూరంగా వుండు" అంది.         మరుక్షణంలో ఆమె లేచి నిలబడింది. ఆమెనేత్రాలు అగ్నిశిఖల్లాగా వున్నాయి. గబగబ బయటకు వచ్చేసింది. వెనకనుంచి ప్రభాకరం కీచుకంఠంతో అన్నమాటలు ఆమె వినిపించుకోలేదు.         అనూరాధ ఊళ్ళోలేదు. సుజాత యింటికివచ్చి దీపంవేసి ఆలోచించసాగింది. తలుచుకున్నకొద్దీ ఆమెకు దుఃఖం పొంగిపొర్లి వస్తోంది. ప్రభాకరం తన జీవితాన్ని నాశనం చేశాడు. దుర్మార్గుడు, తానిప్పుడు అనాఘ్రత పుష్పం కాదు. ఇన్నాళ్ళనుంచీ అతన్ని చూసి తను ఎందుకు భయపడిందో యిప్పుడు అర్ధమైంది. ఈ శరీరాన్ని ఎన్నోసార్లు చంద్రం కోరాడు. పాపిష్టిది. మృదువుగా తిరస్కరించినది. ఎన్నిసార్లు? అబ్బ! ఎన్నిసార్లు తిరస్కరించింది? అదంతా ఎందుకు? ఈ ప్రభాకరానికి అర్పించటం కోసమేనా?     ఇవాళో రేపో చంద్రం వస్తాడు. తను అతనిముఖం ఎట్లా చూడగలదు? చంద్రం! తనని ప్రభాకరంనుంచి రక్షించుకోలేకపోయాడు. తనకేం ప్రమాదం జరగదని నమ్మాడు. తను అనుకోకుండా అతనికి తీరని అన్యాయం చేసింది. ఒట్టి పాపిష్టిది. అయోగ్యురాలు! ఛీఛీ! తన జీవితాన్ని విషపూరితం చేసుకుంది.         ఆమెకేదో గుండెల్లో తొలుస్తున్నట్లుగా వుంది.             ఎన్ని అనుభవాలు? ఈ అల్పమైన జీవితంలో ఎన్ని విఘాతాలు? ఎన్ని దారుణ పరంపరలు? అన్నిరకాల జీవితాన్నీ చవిచూసింది. చివరకు తీరని అశాంతి మిగిలింది. ఈ చిన్నాభిన్నమైన జీవితాన్ని ఇహ జీవించలేదు. "ఆగిపో సుజాతా! యిక్కడే ఆగిపో" నువ్వింక ముందుకు వెళ్ళటానికి వీలులేదు. ఇంక ఈ ప్రయాణం విరమించు. బ్రతికి మరికొన్ని అగాధాలను త్రవ్వకు."         ఆమె కృతనిశ్చయురాలయింది. తనకు యిదే చివరిరోజు. ఇహ శాశ్వతంగా సెలవు తీసుకుంటుంది.         ఆమెకళ్ళు తుడుచుకుంది. గబగబ యివతలకి వచ్చి  తలుపులు తెరిచింది. వాకిట్లో ఎదురుగుండా ఓ వ్యక్తి నిలబడ్డాడు. ఆమె నిర్ఘాంతపోయి ఒక అడుగు వెనక్కి వేసింది.         చంద్రం నవ్వుతూ "నేను వస్తానని ముందుగానే తెలిసిందా సుజాత?" అంటూ లోపలకి వచ్చాడు.         ఆమె ఆధారాలు కంపించసాగాయి, కాళ్ళలో బలం నశించినది. తలఎత్తి అతనిముఖంలోకి తిన్నగా చూడలేకపోయింది.         "అలా వున్నావేం సుజాతా?" అన్నాడు చంద్రం లాలనగా.         ఆమె యిట్లా అనుకుంది. "ఓ! నీకేం చెప్పను జరిగిందాన్ని గురించి? నువ్వెందుకు ఇన్నాళ్ళు ఉపేక్షించావు? ఆనాడే నీతో మొరపెట్టుకున్నాను. అనుకున్నంత అయింది. చూడు. ఇప్పుడు చచ్చిపోయేందుకు పోతున్నాను."         "చెప్పు సుజాతా?"         ఆమె హఠాత్తుగా అతని హృదయంలో తలదాచుకుంది. అతను నివ్వెరపోయాడు. "కోపం వచ్చిందా?" అన్నాడు. ఆమె చుబుకం పైకెత్తి "ఊ?"         ఆమె తలపోయసాగింది "నేనేం చేద్దామనుకున్నాను? చచ్చిపోదామనుకున్నాను. అతను నామీద అత్యాచారం చేశాడు. పగతీర్చుకున్నాడు. ఒట్టి అబలనై పోయాను. ఇతనికేం సమాధానం చెప్పను? ఎన్నోసార్లు నీ కోరిక తిరస్కరించాను. చివరకు ఈ శరీరాన్ని తీసుకువెళ్ళి ఆ రాక్షసుడికి అప్పగించాను. మండిపోదేం నా గుండె? పగిలి ముక్కలు ముక్కలు కాదేం? అవునూ? ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? చచ్చిపోయేది ఖాయం. కానీ ఈ చంద్రానికి అన్యాయం చేసిపోనా? ఎలా పోను? పాడు సుజాతా! చివరకు నీ జీవితం ఈ రూపు దాల్చింది."         ఆమెకు తెలియకుండానే కళ్ళనుండి నీళ్ళు స్రవించసాగాయి. అతను చేత్తో తుడుస్తూ "నేనేమైనా అపచారం చేశానా?"         "ప్రియా!" అన్నది సుజాత. ఆమె పెదాలు వణుకుతున్నాయి. "ఇతనికి అంకితమై జీవితాన్ని అంతం చేసుకుంటాను." తన ముఖాన్ని అతని ముఖానికి దగ్గరగా చేర్చింది. "ఇది మీది ప్రియతమా గ్రహించండి."         అతనామె పల్చని పెదవులను చుంబించాడు.         "ఏమలా?"         ఆమె అతని కంఠం వెనగ్గా చేతులు పోనిచ్చి, అతన్ని తనకు దగ్గరగా అదుముకుంది. "ఇది మీ శరీరం, ఇది మీ శరీరం" అన్నది కంపిత స్వరంతో.         అతన్నేదో మైకం క్రమ్మివేసింది. తన కలలపంట, అందాల రాశి, తన ప్రాణం, తన జీవం తనలో ఇప్పుడు కరిగిపోతోంది. ఈ ఊరువచ్చి యింకా అరగంటైనా కాలేదు. హోటల్లో సామాను పడేసి, తలైనా దువ్వుకోకుండా సరాసరి యిక్కడకు వచ్చాడు. ఎదురుపడింది సుజాత-ఇట్లా-అద్భుతంగా అర్దిస్తోంది. అతనామెను గట్టిగా కౌగలించుకున్నాడు. అతని కనులు మూతలు పడసాగాయి. ఆమె మెలకువగానే వుంది. అతన్ని చూస్తోంది. ఏదో అస్పష్టంగా పలుకుతోంది. చివరకు స్పృహ తప్పిపోయింది.                                 *    *    *         రాత్రి రెండుదాటింది. సుజాత మంచంమీదనుంచి లేచికూర్చుంది. ప్రక్కన చంద్రం ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. అతని పెదాలపై తియ్యని చిరునవ్వు. అతనివంక పిచ్చిగా, ప్రేమగా చూసింది. దుఃఖంతో ఆమె కనురెప్పలు బరువెక్కాయి. ఆప్యాయంగా అతడి చెంపలు నిమిరింది. నిట్టూర్పు విడిచింది. మెల్లిగా లేచి నిల్చుంది. తన కర్తవ్యం నెరవేరింది. బెడ్ లైట్ సన్నగా వెలుగుతోంది. చిన్నగా అడుగులు వేసుకుంటూ ఆ మందమైన కాంతిలో గుమ్మందాకా వచ్చింది. తలుపులు తెరుద్దామని గడియమీద చేయి వేసింది.         "నేనేం చేస్తున్నాను?" అనుకుంది సుజాత హఠాత్తుగా.         ఆమె అంతరాత్మ ఎదురుతిరిగింది. "నేనెందుకు చావాలి చేయని తప్పుకు? బ్రతికివుండి సుఖాలెందుకు అనుభవించకూడదు? ఆ అర్హత పోగొట్టుకున్నానా? ఏమిటా అర్హత? ఎట్లా పోయింది?"         బ్రతికివుండాలి. కాని ఈ అగ్ని చల్లారటం ఎలా? జ్వాలను శాంతింపచేయటం ఎలాగ? ఇది కసి, పగ, ఈ పగను తనతోనే తీసుకుపోతే ప్రపంచానికి యిచ్చే సందేశం ఏమిటి?         ఆమె కళ్ళు క్రోధారుణ ప్రజ్వలితాలైనాయి. చెయ్యి వెనక్కి తీసుకుంది. పెదాలపై విషహాసం ఒకటి ఉదయించింది. కళ్ళలో మెరుపొకటి మెరిసింది.                                  28         మాధవరావు జీవితానికి మహా అఘాతం ఒకటి తగిలింది.         ఆ దెబ్బకు తట్టుకోలేక "అబ్బా!" అని గుండె పట్టుకుని కూలబడిపోయాడు.         ఈ ప్రపంచంలో ఆయన ప్రాణప్రదంగా చూసుకున్నవాళ్ళు శివనాథరావు సావిత్రి. మొదటిభార్య గతించినప్పటినుంచీ ప్రాణానికి ప్రాణంగా, అతి సుకుమారంగా పెంచాడు కొడుకుని ఆ కొడుకు జేవేఇతంలో యిటీవల కొన్ని తగాదాలేర్పడ్డాయి. అతడు సరోజిన్ని ప్రేమించాడు. ఆ కుటుంబమంటే తనకు ద్వేషం. సరోజిన్ని శివుడు పెళ్ళిచేసుకోవటానికి వీలులేదు. విఘాతం కలిగించాడు. కొడుకు బాధపడ్డాడు. అతనికోసం ఎన్నో సంబంధాలు వస్తున్నాయి. "వాడికి త్వరగా పెళ్ళిచేసెయ్యాలి" అనుకున్నాడు. ఉత్తరాలు రాశాడు, చెప్పాడు. అతను తిరస్కరించాడు. అంతేకాదు ఎన్నడూ ఎదురు తిరగనివాడు "నేను సరోజిన్ని తప్ప ఎవర్నీ చేసుకోను" అని కరాఖండిగా జవాబు రాసేశాడు.         ఇదేకాదు ఆయనకు తగిలిన దెబ్బ అది ఇంకొకటి. సరిగ్గా ఎక్కడ తగలాలో అక్కడే తగిలింది. ఎవరినైతే ఆయన పువ్వులాగా చూసుకున్నాడో, బంగారంలా వాడుతున్నాడో ఆ వ్యక్తి అతని హృదయంలో మంటలు రేపింది. ఆ మంటలు యిహ ఆరవు.
24,508
    అతనికి శీలంపట్ల ఏమీ శ్రద్ధలేదు. చేతికి అందిన అనుభవాన్ని జార విడవటం అతనికి సుతరామూ యిష్టంలేదు. పైగా అతనిలో భోగలాలసతకు తక్కువేమీ లేదు. పైకి కనిపించని ధైర్యసాహసాలు చాలా వున్నాయి. సాధ్యమైనంత వరకూ యింట్లో బయటపడకుండా అతడు జీవితాన్ని ఖర్చు పెట్టసాగాడు.     అతను బి.ఏ. ఫైనలియర్ చదువుతుండగా యింటర్మీడియట్ లో మనోరమ అని ఒక అమ్మాయి వుండేది.     మనోరమ కాలేజీకంతటికీ అందగత్తె.     ఆమె తండ్రి పెద్ద ఆఫీసరు. ఆమె రోజూ కాలేజీకి కారులో వచ్చేది. కారుదిగి హంసగమనంతో అలా లోపలకి వస్తుంటే విద్యార్థులంతా పిచ్చెక్కినట్లు ఆమెవంక చూసేవాళ్ళు. నిజంగా ఆమె రూపసుందరి. అలాంటి వాళ్ళు ఏ రెండుమూడేళ్ళకో ఓసారి కళాశాలల్లో తటస్థపడుతుంటారు. రామం దృష్టిలో ఆమె ఏనాడో పడింది. కాని ఆమె మిగతా పిల్లలమాదిరి కాదని అతను గ్రహించాడు. ఆమె అందరితోనూ నవ్వుతూ మాట్లాడుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టిస్తుంది. నవ్విస్తుంది. కవ్విస్తుంది. కాని ఆమెను అంతకంటే సమీపించటం కష్టం అని తెలుసుకున్నాడు. కాని ఆమె సౌందర్యం అతడ్ని ప్రలోభపెట్టడం మానలేదు.     ఓసారి అతను తన ఉపన్యాసం ముగించి స్టేజీదిగి వస్తుంటే ఆమె ఎదురుగా వెళ్లి కంగ్రాచ్యులేట్ చేసింది.     "థాంక్స్" అన్నాడతను. అని వదిలిపెట్టలేదు. క్రమంగా వాళ్ళ యింటికి వెళ్ళి మాట్లాడటంవరకూ నడిపాడు వ్యవహారం.     ఆమెతండ్రికి వెయ్యిరూపాయల వరకూ జీతం వస్తుంది. ఆమెకి తల్లిలేదు. సవతి తల్లి వుంది. ఆయనకు మనోరమ ఒక్కతే కూతురు. సవతితల్లి ఈమెను బాగానే చూస్తున్నట్లు కనబడుతుంది.     రామం వివిధ విషయాల్లో పరిచయం వున్నవాడు. దేన్నిగురించి అయినా అందంగా మాట్లాడగలడు. మనోరమ యింగ్లీషు, తెలుగూ చాలా మధురంగా మాట్లాడుతుంది.     ఓసారి ఆమె సౌందర్యం భరించలేక, అతను పొరపాటున అన్నట్లు ఆమెప్రక్కన నిలబడి వుండగా మోచేత్తో పొడిచాడు.     మనోరమ వికసించిన మొహంతో అతనివంక చూసింది. "మీరట్లా చేస్తే చాలా బావుందండీ. మళ్లీ అనండి అట్లా" అన్నది.     అతను "ఎట్లా" అన్నాడు.     "ఇప్పుడు అన్నారే అట్లా" అన్నది ఆమె.     అతనామెను మళ్ళీ మోచేత్తో పొడిచాడు.     "మళ్లీ అనండి" అన్నదామె.     అతను మళ్ళీ అన్నాడు.     "మీరు బాగా అంటారండీ" అన్నదామె.     ఆమె వెటకారంగా అన్నదో, అనుభూతితో అన్నదో అతనికి అర్థంకాలేదు. ఎంత చొరవ వున్నా కాస్తా యిబ్బందిగానే ఫీలయ్యాడు.     "మీరెప్పుడూ నన్ను వెక్కిరించరేం?" అనడిగింది మరోసారి. అతను నాలిక బయటపెట్టి వెక్కిరించాడు.     "అబ్బ! ఎంత అందంగా వుంది మీరు వెక్కిరిస్తోంటే" అని అతనిచేత అట్లా మళ్ళా మళ్ళా చేయించుకుంది.     అట్లా వాళ్ళిద్దరిమధ్య స్నేహం అధికం కాసాగింది. ఆమె ఏం మాట్లాడినా అందులో పసితనమేగాని తృష్ణ ఏమీ గోచరించేది కాదు. ఒక్కోసారి యింత అమాయకురాలు ప్రపంచంలో వుండదేమో అనిపించేది. పుస్తకాల్లో పాత్రలా అందంగా, సున్నితంగా, ఆలోచనాత్మకంగా జీవించేది ఆమె.     ఎన్నడూ ఎరగని రామం ఆమెను ఆరాధించనారంభించాడు. ఆమె కనిపించకపోతే బాధగా, వేదనగా వుండేది.     ఓ సాయంత్రం ఆమెతో మాట్లాడుతూ వుండగా ఎందుకో అతని ఎడమకన్ను అదిరింది.     "భలే కన్నుకొట్టారే" అన్నదామె విస్మయంగా.     అతను అప్రతిభుడయ్యాడు. "లేదు" అందామనుకొన్నాడు. కాని యింతలోనే మనోరమ "మళ్ళీ కొట్టండి కన్ను" అంది ఉత్సాహంగా.     అతను అట్లా చేశాడు.     మళ్ళీమళ్ళీ అడిగి ఆమె అతనితో అట్లా చేయించింది.     ఉన్నట్లుండి అతను "మీరు నాకు కన్నుకొట్టండి" అన్నాడు.     ఆమె కొట్టింది.     "మళ్ళీ"     ఇట్లా ఇదరూ ఒకరికెదురుగా ఒకరు కూర్చుని చాలాసేపు కన్ను కొట్టుకున్నారు. ఆ రాత్రి సంపుల్లమానమయిన మనస్సుతో యింటికి వస్తూ "మనోరమ ఏంచేసినా అసహ్యం ఎరుగనివ్యక్తి. ఈ కాలేజిలోకెల్లా నన్ను అదృష్టవంతుడ్ని చేసిన అపురూపసుందరి" అనుకున్నాడు ఉల్లాసంగా.     ఇంతలో అతని పరీక్షలు దగ్గరకు వచ్చాయి. పరీక్ష తప్పితే తన పరిస్థితి శోచనీయంగా వుంటుందని అతనికి తెలుసు. అందుకని కష్టపడి చదవసాగాడు. కాని ఈ చదువులోకూడా మనోరమ అతని దృష్టిపథంనుండి తొలగిపోలేదు. ఆ ద్వంద్వమైన మనసుతో సతమతమౌతూ ఎట్లాగో పరీక్షలకు చదివాడు.     పరీక్షలు ముగిశాక మనోరమ అతన్ని కలుసుకుంది.     "బాగా రాశారా?" అని అడిగింది.     "తప్పకుండా ప్యాస్ అవుతాను" అన్నాడు రామం.     "అదే నా కోరిక" అంది మనోరమ.     అతను ప్యాస్ అయ్యాడు. కాని చెప్పుకోతగ్గ మార్కులు రాలేదు. పై చదువులు చదవాలని పెద్ద ఇచ్చలేదు. కాని తండ్రి ఎలానూ అంగీకరించడన్న భయంతో ఎం.ఏ. సీటుకు అప్లికేషన్ పెట్టాడు అయిదారు యూనివర్శిటీలకు. అతని నుదుట అదృష్టరేఖ లేదు. సీటు రాలేదు.     "ఏం చేస్తారు?" అనడిగింది మనోరమ.     అతనికే తెలియటల్లేదు. ఆరువందల రూపాయల ఉద్యోగం చేసి రిటైరయిన మనిషి తండ్రి. ఈ బి.ఏ. క్వాలిఫికేషన్ తో తాను ఆయన అంతస్తుకు ఏమి ఎదుగుతాడు? తండ్రిముఖం యెదుట పడటానికి సిగ్గుగా వుండేది. ఆయన కూడా తన విషయం ఏమీ పట్టించుకోనట్లు ముభావంగా ఊరుకున్నాడు. క్రమంగా రోజులు గడిసినకొద్దీ పరాయి ఇంట్లో వుంటున్నట్లు అనుభూతి కలగసాగింది. తిండి తింటూంటే దయాభిక్షలా వుండేది.
24,509
    అరుణ్ చావ్లా ప్రణయ్ వంక సీరియస్ గా చూశాడు.     "వాళ్ళూ సంగతి నాకు తెలీదు! నువ్వు రమేష్ భండారీ మనిషినన్నది.....!! నాకు తెలుసు" అన్నాడు.     "నేనూ రమేష్ భండారీలాంటి ఒక స్మగ్లర్ కి సంబంధించిన మనిషిని అయితే పోలీసులతో ఎందుకు తిరుగుతాను? రమేష్ భండారీ ఎవరో....ఎక్కడ వుంటాడో నాకు తెలిస్తే ఇన్స్ పెక్టర్ స్వామినాథన్ నాచేత అతని రహస్యాలన్నీ కక్కించి అతన్ని ఏనాడో అరెస్ట్ చేసి వుండేవాడు కదా!" అన్నాడు ప్రణయ్.     "షటప్.....స్వామినాథన్ భండారీ దగ్గర శానా డబ్బు తిన్నాది.....అంద్కునే వాడికీ స్మగ్లింగ్ సేసినా ఏమీ సేస్తలేదు.....నాకీ పోలీసుల్ అంతా అడ్డూ పడ్తున్నార్."     "మరి నేనేం చేశాను?"     "నువ్వు నేను ఎక్కడ.....ఎక్కడా సేసే స్మగ్లింగ్ ఇన్ ఫర్మేషన్ పోలీసుల్ కీ యిస్తుంది.....సెప్పు ....ఇంకా నీకీలాగా ఎంతామందీ ఇన్ ఫార్మర్స్ వున్నాది?" గద్దించి అడిగాడు అరుణ్ చావ్లా.     "నాకేం తెలీదు బాబోయ్ అంటే వినవేం?" విసుగ్గా, బాధగా అన్నాడు ప్రణయ్.     "ఏమీ తెలీదని నాదీ లచ్చల్ డబ్బూ విసిరేశావు. నాకీ దగ్గరకు పోలీసుల్ని తీసుకొచ్చావ్.....ఇదీ స్వామినాథన్ గౌనూ ఎత్తి నాకీ మూర్ఛ పోగొట్టావ్?" అన్నాడు చావ్లా.     "బాస్! వీడు వుట్టినే ఎందుకు చెప్తాడు బాస్!!? వీడి ఫామిలీ మెంబర్స్ నీ....వీడికో లవర్ వుంది....దాన్నీ, దాని ఫామిలీ మెంబర్స్ నీ యిక్కడికి తీసుకొచ్చి బంధించితే రహస్యాలన్నీ చచ్చినట్టు వాడే కక్కుతాడు...." అన్నాడు జాన్.     "శభాష్! జల్దీ వాళ్లందరికీ బంధించి తీస్కురా హ్హహ్హహ్హ...."     గట్టిగా నవ్వాడు అరుణ్ చావ్లా.     "జీపు స్టేషన్ ముందు ఆపి డ్రైవర్ రామయ్య హడావిడిగా లోపలికి పరుగుతీశాడు.     పోలీస్ స్టేషన్ లోపల ఒక్క కానిస్టేబుల్ తప్ప ఎవరూ లేరు.  అంతా ఖాళీగా వుంది.     "ఏంటీ? స్టేషన్ లో ఎవరూ లేరు అంతా ఏమయ్యారు?" కంగారుగా అడిగాడు రామయ్య.     "అందరూ ఒక్కో డ్యూటీకి వెళ్ళారు" చెప్పాడు కానిస్టేబుల్.     "అదేంటి? స్టేషన్ లో ఎవరూ లేకుండా అందరూ వెళ్లిపోయారా?"     "ఏం? స్టేషన్ కి కాపలాగా నేను వున్నానుగా?" అన్నాడు బక్క చిక్కిన ఆ కానిస్టేబుల్.     "నువ్వంటే ఏం లాభం? అయ్యో ఇప్పుడేలాగ?" ఆందోళనగా అన్నాడు డ్రైవర్.     "ఏమైందసలు? ఎందుకిలా కంగారు పడుతున్నావ్?" అడిగాడు కానిస్టేబుల్.     డ్రైవర్ అరుణ్ చావ్లా ఇంటిదగ్గర ఇన్స్ పెక్టర్ స్వామినాథన్ నీ, కానిస్టేబుల్ నారాయణనీ బంధించడం గురించి చెప్పాడు.     "అయ్యో! అలాగా! అయినా అక్కడికి వెళ్ళి వాళ్ళని విడిపించాలి. కానీ ఎలా స్టేషన్ లో ఎవరూ లేరే?" ఈసారి కానిస్టేబుల్ కూడా కంగారుపడుతూ అన్నాడు.     "సబ్ ఇన్స్ పెక్టర్  యాకుబ్ ఎక్కడికి వెళ్ళాడు?"     "మెహందీకి వెళ్ళాడు.     "ఎందుకు?"     "ఎందుకేమిటి? బ్రోతల్ కేసుల్ని రెయిడ్ చెయ్యడానికి? లేకపోతే ఏంటా ప్రశ్న? ఒక ఇన్స్ పెక్టర్ మెహందీకి ఎందుకు వెళతాడు?" అడిగాడు డ్రైవర్ రామయ్య.     "మారేడ్ పల్లిలో ఒక ఇంట్లో ఒక నక్సలైట్ సమావేశం జరుగుతోందని తెలిసి మొత్తం అందరూకలిసి రెండు జీపుల్లో వెళ్ళారు" చెప్పాడు కానిస్టేబుల్.     "అయితే మన స్టేషన్ స్టాఫ్ అంతా మారేడ్ పల్లిలో వున్నారన్న మాట" ఏదో ఆలోచిస్తున్నట్లుగా అన్నాడు డ్రైవర్.     "కాదు.....సనత్ నగర్ వున్నారు" అన్నాడు కానిస్టేబుల్.     "అదేంటి? నక్సలైట్ల సమావేశం మారేడ్ పల్లిలో జరుగుతోందని కదా బయలుదేరారు?" ఆశ్చర్యపోతూ అన్నాడు డ్రైవర్.     "అయితే మారేడ్ పల్లికి వెళితే వాళ్ళు మనవాళ్ళ మీదకి గ్రెనేడ్లు విసిరి చంపుతారు. అందుకని అక్కడికి వెళ్ళకుండా సనత్ నగర్ వెళ్ళారు. నక్సలైట్స్ ని పట్టుకోవడానికి సనత్ నగర్ వెళ్ళాంగానీ అప్పటికే వాళ్ళు ఉడాయించారని పేపర్ వాళ్ళకి చెపుతారు."     "ఓహో! అలాగా? మనవాళ్ళ ఐడియా బాగానే వుంది" మెచ్చుకున్నాడు డ్రైవర్. "మరి ఇప్పుడు ఇన్స్ పెక్టర్ స్వామినాథన్, నారాయణని రక్షించడం ఎలా?" మళ్ళీ వెంటనే అడిగాడు.     "కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి సంగతి చెప్దాం......" అంటూ ఫోన్ వైపు చెయ్యి చాపాడు కానిస్టేబుల్.                                            *    *    *    *         "బాస్" ఆనందంగా అరుచుకుంటూ లోపలికి వచ్చాడు జాన్.     "క్యాహై....నీకీ ఎంద్కు ఆ కుషీ? నీదీ పెళ్ళాం నచ్చిందీ? పనీ సేస్కునీ రాకుండా ఒక్కడివే ఎందుకు వచ్చింది?" అన్నాడు అరుణ్ చావ్లా మండిపడుతూ.     "లేదు బాస్! నేను ఒక్కడివే రాలేదు!!! అందరినీ బంధించి తీసుకొని వచ్చాను" అన్నాడు జాన్.     జాన్ వాక్యం పూర్తికాకముందే రౌడీలు కనకమహాలక్ష్మి,  మారుతీరావ్, కోమలి, మంగళాదేవి, సోమేస్వరర్రావ్, భీమేస్వర్రావ్, ప్రమీలలను వీపుమీద చెయ్యిపెట్టి లోపలికి నెట్టుకుంటూ తీసుకొని వచ్చారు.     "శభాష్ జాన్! శానా మంచిపని చేశావ్! హ్హహ్హహ్హ....." వికటాట్టహాసం చేశాడు అరుణ్ చావ్లా.     "చూడు జాన్ బాబూ....మీ బాస్ నేమ్స్ ఏంటో ......?" అడిగింది కనకమహాలక్ష్మి.     "అరుణ్ చావ్లా" చెప్పాడు జాన్.     "మా అందరిని బంధించింగ్స్ చేసి తీస్కొస్తే శభాష్ అని నిను ప్రేయిజింగ్స్ చేస్తునాడుగా? వాడి వైఫ్స్, సిస్టర్స్, డాటర్స్ అందర్నీ కూడా బంధించింగ్స్ చేసి యిక్కడికి లాక్కురా.....అప్పుడు హీలుక్స్ మా ఫీలింగ్స్ వాట్ అని."     కనకమహాలక్ష్మి మాట పూర్తి కాకముందే మంగళాదేవి అందుకుంది.     "జాన్ బేటా!  ఈమె చెప్పినట్టు కరో....తుమ్ ఐసా కరేతో వీడికి మా బాధ మాలూమ్ హోగా....."     "ఇంతకీ ఈ గన్నాయిగాళ్ళు మనల్ని యిక్కడికి ఎందుకు తీసుకుని వచ్చినట్లు?"  అన్నాడు మారుతీరావ్ తనలో తాను అనుకుంటున్నట్లుగా.     "ఏమో సార్! ఈ క్రిమినల్స్ తిన్నగా వుండరు.....ఏదో ఒక క్రైం చేస్తేగానీ వీళ్ళకి తోచదు. లేకపోతే ఒళ్ళంతా తీటతీటగా వుంటుంది" అన్నాడు సోమేస్వర్రావు.     "ఏంటో? అంతా కలిసి ఇక్కడికి లాక్కొచ్చారు. ఇప్పుడు నాకు ఎక్సర్ సైజులు చేసుకునే టైమైంది.... ఎప్పుడు వదుల్తారో ఏమో? పోనీ యిక్కడే ఎక్సర్ సైజులు చేసుకోడానికి పరికరాలన్నీ వున్నాయా జాన్ గారూ?" అడిగాడు భీమేస్వర్రావ్.     "ఖామోష్....."     గట్టిగా అరిచాడు అరుణ్ చావ్లా.     "జాన్! సబ్ కూ బాంద్ దో...... వీళ్ళు షానాషానా గడ్ బిడ్ చేస్తావుంది....నాకీ బీపీ ఎక్కువ అవుతున్నాది......అందర్నీ నోరు మూసుకోమని షెప్పు...." అన్నాడు అరుణ్ చావ్లా.     "ఇది ఎన్న చావ్ ళా....నోరు దావుండేది సొల్లడానికి గానీ మూసుకునే దానికా? ఏమప్పా ఇది?" అన్నాడు ఇన్స్ పెక్టర్ స్వామినాథన్.     "షటప్!" అరిచాడు అరుణ్ చావ్లా.     "అమ్మా! అన్నయ్య యిక్కడే వున్నాడే!" అంది కోమలి స్తంభానికి కట్టేసివున్న ప్రణయ్ ని చూస్తూ.     ప్రమీల అప్పటికే ప్రణయ్ దగ్గరికెళ్ళి మాట్లాడుతూ వుంది.     "ఏంటి సార్? బాగున్నారా?" అడిగింది ప్రమీల.
24,510
                                         ఎక్సేంజ్     "ఒరేయ్......నువ్వు ఈ సాయంత్రం మాయింటికి రావాలిరా!" అంటూ వచ్చాడు మూర్తి.     "ఎందుకూ.....మీ ఇంట్లో ఏమైనా పేరంటమా?" అన్నాడు శంకర్ నవ్వుతూ.      "ఏం- పేరంటం మీద మనసు పోతోంది...... మగవాడిని కాస్తా మగువవుతున్నావా ఏమిటి?" అన్నాడు మూర్తి నవ్వుతూ.     "నలుగురు బిడ్డల తండ్రినయ్యాక -ఇప్పుడు మారినా పర్వాలేదులే కాని, సంగతేమిటో చెప్పు."     "మరేం లేదు. నా కొత్త టెలివిజన్ ని చూద్దువుగాని!"     "కొత్తదా? మొన్నామధ్య చూపించావుగా! మా అందరికీ పార్టీ కూడా ఇచ్చావు."     "అది అంత బాగాలేదు. అందువల్ల దాని ఎక్చేంజి చేశాను. నిన్ననే వచ్చింది"     "టెలివిజన్ ఎక్చేంజా! అవున్లే..... ఎంతైనా కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ వి. నువ్వు అడిగితే కాదనగలరా?"     "అక్కడికి నువ్వు తక్కువైనట్లు -నువ్వు ఎక్సయిజ్ సూపరింటెండెంట్ వేగా!"     సరదాగా జోక్స్ వేసుకుంటూ మిత్రులిద్దరూ మూర్తి ఇంటికి చేరారు.     "ఇదుగో చూడు..... ఎంత బాగుందో! కావాలంటే మాత్రం - ఇటువంటిది దొరుకుతుందా?" అంటూ తన కొత్త టెలివిజన్ చూపించాడు మూర్తి.     ఆ టెలివిజన్ చూడగానే శంకర్ గుండె ఝల్లుమంది.     అది అంతకుముందు తాను కొన్నదానిలాగే ఉంది. దగ్గరకు వెళ్లి -తలుపులూ అవీ తీసి పరీక్షగా చాసిస్ నంబరూ అవీ చూశాడు.      సందేహం లేదు. అది మొదట తాను కొని, బాగాలేదని ఇచ్చేసి మరొకదానితో ఎక్చేంజి చేసినట్టిదే! ఈ లెక్కన తాను ఎక్చేంజి తీసుకున్నది ఇంకెవరికైనా నచ్చక వదిలేసినదేమో! అని అనిపించింది అతనికి.     "ఎలా ఉంది కొత్తసెట్టు? బ్రహ్మాండంగా ఉందికదూ?" అని మూర్తి అడుగుతుంటే, పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్లయింది శంకర్ కి.                           - పల్లకి వార పత్రిక.......26 జూలై ' 84                                      ***********************                                            అందాకా ఎందుకు.......?     పరంధామయ్యగారు అద్దె డబ్బులు వసూలు చేసుకోడానికి వచ్చారు. ఊహాలోకంలో విహరిస్తున్న కళాసాగర్ - "కొంతకాలం తర్వాత ప్రజలు 'ఈ గదిలో ప్రఖ్యాత చిత్రకారుడు కళాసాగర్ అద్దెకుండేవాడు' అని చెప్పుకుంటారు!" అన్నాడు ఎటోచూస్తూ.     "అందాకా ఎందుకూ....... రేపటిలోగా నీ అద్దె బాకీలు రాకపోతే ఎల్లుండి నుంచే చెప్పుకుంటారు!" అన్నాడు పరంధామయ్య పళ్ళు నూరుతూ.                                                ***   
24,511
       అందరూ ఒక్కసారి మహాకవి శ్రీశ్రీ ఆవేదనని ఆగ్రహాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు.         మరో ప్రపంచం     మరో ప్రపంచం     మరో ప్రపంచం పిలిచింది!     పదండి ముందుకు        పదండి త్రోసుకు.     పోదాం పోదాం పైపైకి.     కదం తొక్కుతూ.     పదం పాడుతూ        హృదాంతరాళం గర్జిస్తూ        పదండి పోదాం     వినబడలేదా     మరో ప్రపంచం జలపాతం?     దారి పొడుగునా గుండె నెత్తురులు        తర్పణ చేస్తూ పదండి ముందుకు!     బాటలు నడచీ,     పేటలు కడచీ        కోటలన్నిటిని దాటండి        నదీనదాలూ     అడవులు, కొండలు     ఎడారులూ మన కడ్డంకి!     పదండి ముందుకు     పదండి పదండి త్రోసుకు;     పోదాం, పోదాం పైపైకి;     ఎముకలు క్రుళ్ళిన     వయసు మళ్ళిన     సోమరులారా చావండి        నెత్తురు మండే,     శక్తులు నిండే,     సైనికులారా! రారండి     "హరోం! హరో హర!     హర!హర!హర!హర!     హరోం హరా" అని కదలండి.     మరో ప్రపంచం     మరో ప్రపంచం     ధరిత్రి నిండా నిండింది.     పదండి ముందుకు     పదండి త్రోసుకు!     ప్రబంజనంవలె హోరెత్తండి!     భావ వేగమున ప్రసరించండి!     వర్షుకాభ్రముల ప్రళయ ఘోషవలె     పెళ పెళ పెళ పెళ విరుచుకు పదండి.     పదండి     పదండి     పదండి ముందుకు     కనబడలేదా మరో ప్రపంచపు        కణకణ మండే త్రేతాగ్ని     ఎగిరి, ఎగిరి, ఎగిరి పడుతున్నవి        ఎనభై లక్షల మెరుపులు!     తిరిగి, తిరిగి, తిరిగి సముద్రాలే     జల ప్రళయ నాట్యం చేస్తున్నవి     సలసల కాగే చమురా! కాదిది     ఉష్ణరక్త కాసారం     శివ సముద్రమూ     నయాగరా వలె     ఉరకండీ! ఉరకండి ముందుకు     పదండి ముందుకు        పదండ్రి త్రోసుకు     మరో ప్రపంచపు కంచు నగరం        విరామ మెరుగక మ్రోగింది        త్రాచుల వలెనూ-     రేచుల వలెనూ -     ధనంజయునిలా సాగండి     కనబడలేదా మరో ప్రపంచపు     అగ్ని కిరీటపు ధగధగలు        ఎర్రబావుటా నిగనిగలు     హోమజ్వాలల భుగభుగలు     మరో ప్రపంచం....మరో ప్రపంచం     మరో ప్రపంచం....పిలిచింది.                            *    *    *    *    *         హైదరాబాద్-         హయత్ నగర్ కు ముఫ్ఫై కిలోమీటర్ల దూరంలో ఎడంవేపు నున్న విశాలమైన పది వేల ఎకరాల ప్రదేశం.         కొండలూ, గుట్టలూ, రాళ్ళు, రప్పలు, చెట్లు, చేమలతో వుంది.         ఆ కొండ మీద నిలబడి చుట్టూ చూసాడు అభిరామ్. ఈ పది ఎకరాల ప్రదేశం దాటితే దట్టమైన అడవి ప్రారంభమౌతుంది. ఒకవేపు పెద్ద చెరువు. ఒకవేపు కొండలు.         "సరైయిన స్థలం కదూ" ఆ పక్కన నిలబడి చూస్తున్న మిగతా వారివేపు చూస్తూ అన్నాడు అభిరామ్.         "ఎంత బాగుందో" ముచ్చట పడింది క్రాంతి.         "నీ ప్లానేంటో చెప్పు" కూర్చుంటూ అంది మేఖల. మిగతా ముగ్గురూ మూడు వేపుల కూర్చున్నారు.         అయిదు నిమిషాల సేపు ఏం మాట్లాడలేదు అభిరామ్.         "ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని నష్టాలొచ్చినా, ఎన్ని అభిప్రాయ భేదాలొచ్చినా మనం విడిపోగూడదన్నది, మన నలుగురం విధించుకున్న మొట్టమొదటి నిబంధన" నెమ్మదిగా చెప్పాడు అభిరామ్.
24,512
    (జననవ్యాపారము మైథునము, రతి అగును. సంరోహము శుక్ర శోణిత సంశ్లేషము. నిరోహము అవయవ అభివ్యక్తి.)     17. ఉత్పన్న ప్రజాభిమానదేవతా! నీవు పుట్టిన వారిని నిలిపి ఉంచువాడవు. పోషణమునకు సరిపడు సిరి కలవాడవు. ఇందువలన ప్రజలు స్థిరపడినవారు అగుచున్నారు.                                             మూడవ అనువాకము     1. అగ్నిదేవుని చేతను, గాయత్రి, త్రివృత్ ఛందస్సుల చేతను, రథంతర సామము చేతను, వషట్కార వజ్రము చేతను పరకీయ సేనను జయించుచున్నాను. పూర్వజులగు శత్రువులను అణచివేయుచున్నాను. గొలుసులతో కట్టి వేయుచున్నాను. నశింపచేయుచున్నాను.     నేను విష్ణుస్వరూపుడనగు యజమానిని. మమ్ము ద్వేషించువారిని, మేము ద్వేషించువారలను అందరిని నా కాళ్లక్రింద నలిపి వేయుచున్నాను.     2. ఇంద్రుని చేతను, త్రైష్టుభ, త్రిష్టుప్ ఛందస్సులచేతను, పంచదశస్తోమము చేతను, బృహత్ సామము చేతను, వషట్కార వజ్రముచేతను, పరకీయ సేనను జయించుచున్నాను. సహజాత శత్రువులను అణచి వేయుచున్నాను. శృంఖలలచే బంధించుచున్నాను. నశింపచేయుచున్నాను.     3. విశ్వేదేవతల చేతను, జగతీ ఛందస్సు చేతను, సప్తదశస్తోమము చేతను, వామదేవ్యసామము చేతను, వషట్కార వజ్రముచేతను పరకీయ సేనను జయించుచున్నాను. అపరజ శత్రువులను అణచివేయుచున్నాను. శృంఖలలచే బంధించుచున్నాను. నశింపచేయుచున్నాను.     (శత్రువులు మూడు విధములవారు. 1. పూర్వజులు - వీరు తండ్రి తాతల సంబంధులు. 2. సహజాతులు - వీరు తోబుట్టుల సంబంధులు. 3. అపరజలు - వీరు పరులు - వెంటనే కార్యములు చెడగొట్టువారు.)     4. ఇంద్రా! నీ అనుగ్రహమున మా శత్రువులు మాకు ప్రతికూలురు కానట్లుగా వధించుచున్నాము. పరసేనలను ఎదిరించి నిలుచు శక్తి గలవారమైనాము.     అగ్నిదేవా! నీ తేజస్సున నేను తేజస్వివి అగుదునుగాక. నీ బలము వలన నేను బలవంతుడను అగుదునుగాక. నీ కాంతివలన నేను కాంతివంతుడను అగుదునుగాక.                                         నాలుగవ అనువాకము     1. భూమి మీద యజ్ఞహననము చేయు దేవతలున్నారు. అగ్నిదేవుడు మమ్ము వారినుండి రక్షించునుగాత. మేము యజ్ఞమును సంపూర్ణముగ అనుష్ఠింతుముగాత. యజ్ఞఫలమును పొందుదుముగాత.     భూమి మీద యజ్ఞమును అపహరించు దేవతలు ఉన్నారు. అగ్నిర్మాతేభ్యోరక్షతు గచ్చేమ సుకృతో వయం.     2. మిత్రావరుణులారా! మీరు శ్రేష్ఠులు. రాత్రులందు మీకు యజ్ఞభాగము సమర్పించినాము. అందువలన మాకు దివమునకు పైన వెలుగొందుచున్నదియు, యజ్ఞసంబంధియు, లోకములందు మూడవది అగు స్వర్గము లభించినది.     3. యే దేవా యజ్ఞహనో యజ్ఞముప్కోన్తరిక్షే అధ్యాసతే వాయుర్మా తేభ్యో రక్షతు గచ్చేమసుకృతోవయం.     ఒకటవ మంత్రమున భూమికి బదులు అంతరిక్షము, అగ్నికి బదులు వాయువు చేరినవి.     4. సవితృదేవా! ద్యావాపృథ్వుల మధ్య నీకు సంబంధించిన రాత్రులు ఉన్నవి. అవిమాకు దేవతలను అందించునట్టివి. మేము ఆ రాత్రులందు కర్మలు చేయుచున్నాము. అందువలన గృహమున ఉన్న భృత్య, పుత్ర సహితులమై స్వర్గ సుఖములు అనుభవింతుముగాక.     5. యే దేవా యజ్ఞహనో యజ్ఞముషో దివ్య ధ్యాసతే సూర్యో మాతేభ్యో రక్షతు గచ్చేమ సుకృతినో వయం.     సూర్యుడు, దివి తప్ప మంత్రము 3 వంటిదే.     6. అగ్నీ! ఉత్తమ హవిస్సును నీవు ఇంద్రునకు అందించినావు. ఆ హవిస్సుతోనే ఈ యజమానిని వర్థిల్లచేయుము. ఇతనికి తనవారిలో ఆధిక్యత కలిగించుము.     7. మూడు లోకములందును యజ్ఞమును నాశనము చేయువారును, యజ్ఞమును అపహరించువారును అగు దేవతలు ఉంటున్నారు. అట్లే యజమాని యజ్ఞములందు ఇచ్చిన దక్షిణలను అపహరించువారు, అతని గ్రహ చమసాదులకు భంగము కలిగించువారు ఉన్నారు.     8. "యే దేవా యజ్ఞహనః పృథివ్యా మధ్యాసతే యే అన్తరిక్షే యే దివీత్యా మహే" అను మంత్రము వలన యజమాని ఈ లోకములను దాటిపోవుచున్నాడు. గృహపశుసమేతుడై స్వర్గమునకు చేరును.     9. సోమయాగము చేసిన యజమాని నుండి దేవతలును, యజ్ఞమును తొలగిపోవును. అందువలన యజమాని అగ్ని దేవతాకమగు పంచకపాల పురోడాశయుత ఉదవసానీయమను కర్మను నిర్వాపము చేయవలెను. అగ్ని సర్వదేవతా స్వరూపము. యజ్ఞము పంచ సంఖ్య కలది. అందువలన యజమానికి దేవతలును, యజ్ఞమును లభించుచున్నవి.     10. అగ్ని గాయత్రీ ఛందస్సంబంధి. గాయత్రీ ఛందస్సుకల యజమాని ఉదవసానీయ కర్మను పంచకపాల పురోడాశముగా నిర్వాపము చేసినచో అగ్నిని గాయత్రీ ఛందస్సు నుండి విడదీసినవాడు అగును.     గాయత్రీ ఛందస్సు ఎనిమిది అక్షరములది. అట్లగుటచే అష్టాకపాల పురోడాశమును నిర్వాపము చేయవలెను. అందువలన యజమాని అగ్నితో గాయత్రీ ఛందస్సును కూర్చినవాడగును. అందువలన అతనికి సమృద్ధి కలుగును.     11. ఉదవసానీయము నందలి హవిస్సునకు సంబంధించిన యాజ్యాను వాక్యలు పంచసంఖ్య కలవి అగుచున్నవి. యజ్ఞము 1. ధానాః 2. కరమ్భః 3. పరివాపః 4. పురోడాశః 5. పయస్యా అను పంచసంఖ్య గలది. కావున యజమాని నుండి యజ్ఞము తొలగిపోవుటలేదు.     (సోమయాగము వలన తొలగి పోయిన దేవతలు, అగ్ని మరల చేరుటను 10, 11 మంత్రములందు వివరించినాడు.)                                              అయిదవ అనువాకము     1. సూర్యదేవుడు యజ్ఞవిఘాతకులగు దేవతల నుండి మమ్ము రక్షించును గాత. వాయుదేవత అంతరిక్షమున ఉన్న యజ్ఞవిఘాత దేవతల నుండి మమ్ము రక్షించును గాత. అగ్ని దేవత విరోధులగు దేవతల నుండి మమ్ము రక్షించునుగాత. సోమదేవా! సక్షః, శూషః, సవితః, విశ్వచర్షణే అను నామములచే నిన్ను సేవింతుము. సూర్య, వాయు, అగ్ని నామములతో కూడ నిన్ను సేవింతుము.     2. యజమానినగు నేను పరభాగమునందు పాత్రను ఉంచుచున్నాను. అపరభాగమునందు పాత్రను ఉంచుచున్నాను. ఈ ఆదిత్య గ్రహపు తేజస్సుచే చీకట్లను పోగొట్టినాను. అంతరిక్షము నన్ను తండ్రి వలె పాలించునుగాత. నేను సూర్యుని ఉభయతః దర్శించినాను. నేను నా వారియందు అధికుడను అగుదునుగాక.     3. ఆదిత్యగ్రహము సముద్రమంతటిది. ప్రజాపతి ఆదిత్యుని సాగరపర్యంతము వ్యాపింప చేయునుగాత. అంతరిక్షమందంతటను వ్యాపింపచేయునుగాత. ఇంద్రుడు ఈ గ్రహమును పొదుగువలె నిండుది చేయునుగాత. మరుత్తులు వర్షము కలిగించునుగాత.     4. ఆదిత్యదేవా! ఈ నేలను బాగుగా తడుపుము. దివ్యమగు మేఘమును భిన్నము చేయుము. దివియందున్న జల సమృద్ధిని మాకు అందించుము. నీవు సమర్ధుడవు. మేఘము నీటి తిత్తివలె ఉన్నది. దానిని విప్పుము.     5. ఆదిత్యుడు పశువులకు కారణమగు దేవత. అగ్ని క్రూరుడు. కావున ఓషధులను అగ్నియందుంచి ఆదిత్య గ్రహమును హోమము చేయవలెను. అందువలన క్రూరమగు అగ్నివద్దనుండి పశువులను అంతర్ధానము చేసినట్లు అగును. అంతేకాక ఓషధులందు పశువులను స్థాపించినట్లగును.     6. ఆదిత్యగ్రహము యజ్ఞము తెలిసినది. ఎంతో ప్రకాశించుచున్నది. ద్యులోకపు పై భాగము నందలి స్వర్గమార్గమును విస్తరింపచేయునది.     అగ్నీ! నీవు స్వర్గఫలమును ఇచ్చువాడవు. దేవదూతవు. హవ్యవాహనుడవు. హవిస్సులందుకొని ఆ స్వర్గ మార్గముననే పోవుచున్నావు.     7. అగ్నీ! నీకు సంబంధించిన సమస్త సమిధలు జ్వలించుచున్నవి. ఆ జ్వాలలే భూలోకమందును, యజ్ఞభూమియందును, సూర్యుని యందును వెలుగులు కలిగించుచున్నవి. ఆ వెలుగులన్నియు ఘృతాహుతులందు చేరునుగాత. యజమాని దేవతలను కోరుచున్నాడు. వారు అతనికి సుఖములు ప్రసాదింతురుగాక.     8. యూపస్తంభమా! బృహస్పతి నిన్ను ధనము కొరకు యజమానికి వప్పగించినాడు. నీవు యజమానినగు నాకొరకు అనుభవయోగ్యమును, అశ్వములతో కూడినదియు నగు ధనపుష్టిని కోరుచుండుము.                                           ఆరవ అనువాకము     1. యాజమానపత్నీ! నిన్ను క్షీరము, ఆజ్యము నిమిత్తము త్రాటితో కట్టుచున్నాను. ఓషధుల కొరకు, జలము కొరకు బంధించుచున్నాను. సంతానము నిమిత్తము ఈ కర్మయందు బంధించుచున్నాను. మాకు అన్నము ప్రసాదించుటకు యాజమానపత్ని దీక్ష వహించునుగాక.     2. యాజమానపత్ని పత్నీశాలనుండి వెడలవలెను. యజ్ఞవేది యందు అధివసించవలెను.     3. నేను యాజమానపత్నిని. యజమాని ఆనుకూల్యమును కోరుచున్నాను. నా స్థానమున కూర్చొనుచున్నాను.     4. నేను సంతానవతిని. ధర్మపత్నిని. ఎవరిచేతను తిరస్కరించబడని దానను. అగ్నీ! నీవు శత్రునాశకుడవు. నిన్ను ఎవరును తిరస్కరింపజాలరు. నీ దగ్గర కూర్చొనుచున్నాను.     5. మంచి జ్ఞానము గల సవితారూపమగు వరుణపాశము నన్ను బంధించినది. నేను దానిని విప్పివేయుచున్నాను. అందువలన పుణ్యఫలమగు పరమేశ్వరుని స్థానమునందు భర్తతో కూడి సుఖములు సంపాదించుచున్నాను.     6. యాజమాన పత్నీ! శాలముఖీయ స్థానము నుండి 'వన్నేజనీ' జలము తెచ్చుటకు వెడలుము. యజ్ఞప్రేరకుడగు అగ్ని నిన్ను అనుమతించినాడు ప్రోత్సహించినాడు. భూమి నీకు దారిని ఇచ్చునుగాత. ఉపద్రవకారియగు దేవత నిన్ను విడిచినాడు. అందువలన 'యువతి' అను సార్థకనామము కలదానవు అయినావు. నేష్ఠనగు నన్ను బాధించకుము.     7. వన్నేజని జలములారా! వసువులు, రుద్రులు, ఆదిత్యులు, విశ్వేదేవతల కొరకు మిమ్ము అందుకొనుచున్నాము. యజ్ఞము కొరకును నిన్ను అందుకొనుచున్నాను.     8. వన్నేజని జలములారా! వసువులు, రుద్రులు, ఆదిత్యులు, విశ్వేదేవతలు, యజ్ఞము కొరకు మిమ్ము ఉంచుచున్నాను.     9. అగ్నీ! నీవు విశ్వాత్మకుడవు. విశ్వవంతుడవు. బలవంతుడవు. నీ అనుగ్రహమున యజ్ఞమును నిర్వహించుచున్నట్టి నేను అనేక వీర్యములను నా పత్నియందు స్థాపించుచున్నాను.     10. ఈ యజ్ఞము దేవతలను చేరునుగాక. ప్రకాశించునట్టి జలములు ఈ యజ్ఞమును దేవతలకు స్పష్టముగా వివరించినది. యజమాని సోమాభిషవము చేసినాడు. ఆహుతులు అర్పించినాడు. వాని వలన యజమానికి సముద్రమంతటి స్వర్గఫలము లభించునుగాక.     వాయుదేవుని ప్రేరణ వలన ఫలప్రదములగు స్తోత్రములను ఋత్విజులు ఉచ్చరించినారు.
24,513
                       వాసంతిక ఎవరిదీ ఉగాది                                                  (యుగళగీతి)     అతడు:    ఇదిగో ఇంకో ఏడాది                   ఎవరిదీ ఉగాది?     ఆమె:      అడగాలా? ఇది నీదీ నాదీ                   మన భావి సుఖాల పునాది     అతడు:    ఈ ఉగాది మనకిచ్చేదేది?                  రోజురోజుకి తెచ్చేదేది?     ఆమె:      రోజూ సూర్యుని తెస్తుంది                  వెలుతురు కానుక లిస్తుంది ||     అతడు:    వెలుతురు వెనకే చీకటిలేదా?                   సుఖాల వెంబడి దుఃఖం రాదా?     ఆమె:      దుఃఖంలోనే ఆశాదీపిక                   చీకటిలోనే తారాగీతిక ||     అతడు:    ఎవరికోసమూ ఆగదు కాలం     ఆమె:       కాలతోనే మారునులోకం     అతడు:     కాలం మనదే లోకం మనదే     ఆమె:       అవి తెచ్చే రుచులన్నీ మనవే ||                                                                             వాణి - 22.3.1965
24,514
    "అదేమిటి? ఇచ్చిందంతా వెంకమ్మకి కదా!"     "అయ్యోరామా! నువ్వింత వెర్రిదానివేమిటి రామక్కా! వెంకమ్మది వట్టి సన్యాసి బతుకు. నగలు పెట్టుకుంటుందా? చీని చీనాంబరాలు కట్టుకుంటుందా? పేరొకరిది నోరొకరిది అన్నట్టు పేరువెంకమ్మది, అనుభవం మంగమ్మది."     "ఔనుసుమా! పాపం! అనుభవించాల్సిన వయసులో ఈ దురదృష్టం?"     "అయినా బొట్టూజుట్టూ తియ్యలేదుగా! ఏం సన్యాసం? వట్టి సన్నాసి."     "పోదూ! అదేదో పంతానికి పోయింది. అయినా అది తరవాత తరవాత ఆడాళ్ళందరికీ మంచిదేగా!"     "ఏం మంచో కామంచి. అది పంతం కాదు. అహంకారం."     "పొగరు. కండకావరం అంటారు మా ఇంట్లో." సోమిదమ్మ అందుకుంది ఎప్పుడు వచ్చిందో.     "అదేదో విప్లవంట. విప్లవకారిణి అని కూడా అంటారుటగదా!" లక్షిందేవి అందించింది.     "ఏమోనమ్మా! ఏమన్నా అననీండి. బోలెడు సొమ్ములు, ఇంటెడు సామాను" భ్రమరాంబకి నగల తళతళలు కళ్ళల్లో మెరుస్తున్నాయి.     సోమిదమ్మ మనస్సులో కలుక్కుమంటూనే ఉంది. అనవసరంగా తన భర్త వెంకమ్మని అవాకులూ, చెవాకులూ పేలి అల్లరి చేశాడు. ఆగడాలు చేశాడు. తనూ అల్లరిపాలు, అవమానాల పాలూ అయ్యాడు. లేకపోతే గ్రామపెద్దగా, బ్రాహ్మణసంఘంలో పెద్దగా ఇంతోఅంతో గౌరవం వెంగమాంబతోపాటు తనభర్తకీ దక్కేది. తనూ అనవసరంగా వాళ్ళని తూలనాడింది. ఈసడించింది. లేకపోతే ఆ నగలు ఎరువుతెచ్చిపెట్టుకునైనా మోజు తీర్చుకునేది. తరవాత తిరిగి ఇవ్వకపోయినా మంగమ్మ అడగదు కూడా. కనీసం వాళ్ళింటికి వెళ్ళి రాజుగారు కానుకగా ఇచ్చిన వస్తువుల్లో ఏదో ఒకటి నచ్చింది తెచ్చుకోవటమో, అపురూపమైన ఆ తినుబండారాలు కడుపారా తినటమో చేసేది. నిట్టూర్చింది.     మంగమాంబ, నాంచారమ్మ కలిసి వస్తూ కనిపించారు. మంగమాంబ బిందెలోనుండి చిన్నచిన్న మూటలు బయటికి తీసి కాశ్మీరం నుండి వచ్చిన కాశ్మీరఫలాలు, మాదీఫలాలు ఆలుబుఖరాలు మొదలైన పళ్ళు, కుంకుమపువ్వు, కాబూలు దానిమ్మలు, బాదంపప్పులు, ఎండుద్రాక్షలు, అక్రోటులు, అంజీరలు ... ఇలా ఎన్నో, మహారాజు తమ ఇంటికి పంపినవన్నీ అందరికీ పంచింది.     తమకిచ్చిన వాటిని పక్కవాళ్ళకిచ్చిన వాటితో పోల్చుకుంటూ, సంతోషమో, విచారమో పడుతూ ఉండిపోయారేకానీ ఒక్కళ్ళూ ఒక్కమాట మాట్లాడలేదు. చాలామందికి మనసులోనైనా కృతజ్ఞతా భావం కలగలేదు. మంగమాంబే మాట్లాడింది.     "అత్తా! మీ కోడలు కడుపుతో ఉందిటకదూ! కుంకుమపువ్వు పాలలో వేసి ఇవ్వురోజూ! పాపాయి బంగారురంగులో ఉంటుంది...     "రామక్కా! మీ అమ్మాయికి వేవిళ్ళు కదూ! ఈమాదీఫలాలు చప్పరించమను...     "లక్షిందేవి! బాదంపప్పు నానబెట్టి బాగా నూరి నీ కోడలిచేత నాకించు బాలింతరాలుకదా! కావలసినన్ని పాలు పడతాయి..."     బుచ్చిలక్ష్మి, ఆ ఊరికి కొత్తగా వచ్చిన కోడళ్లు మాత్రం "ఎంతమంచిదానివత్తా?" అంటూ మెచ్చుకున్నారు.     "ఏమర్రా! మీ మాటలన్నీ మేము రావటానికి ముందే తిట్టుకోటంలో అయిపోయినట్టున్నాయే. ఒక్కమంచిమాట నోట్లోంచి రావటంలేదు" నాంచారమ్మ గట్టిగానే అడిగింది.     "అదేమిటత్తా. అట్లా అంటావు. నా కోడలు పిల్ల బంగారం. దానిది బహుదొడ్డబుద్ధి. వయసులో చిన్నది, మెచ్చుకుంటే ఆయుక్షీణంకదా అని...దాని మంచితనానికి అదృష్టం తోడయ్యింది.     "ఏమే మంగా! నువ్వంటే నాకెంత ఇష్టమో చెప్పవే!" సోమిదమ్మ మనస్ఫూర్తిగానే మెచ్చుకుంది.     ఇదొక్కటే మంగమాంబతో చనువు పెంచుకునే అవకాశం మరి!     భవిష్యత్తులో ఇటువంటి అవకాశాలు ఎక్కడ కోల్పోతామో అనే భయం మనస్సులోమెదిలి అందరూ తమకి తోచినట్టుగా వెంకమ్మని, మంగమ్మని వాళ్ళ అదృష్టాన్ని గొప్పతనాలని పొగడటం మొదలు పెట్టారు. మంగమాంబకి వాళ్ళ ప్రవర్తన విరక్తితో కూడిన నవ్వు తెప్పించింది.                                                            * * *     ఊహ తెలిసినప్పటినుండి ఎక్కువ కాలం నరసింహాస్వామి మందిరంలోనే గడిపినా, అదే తనకి ఇష్టమైనా, తన సాధనకి అనువైన స్థలంగా నిర్ణయించుకున్నది మాత్రం రాజుగారు ఆలయంలో కైంకర్యాల నిమిత్తం సొమ్మునిస్తానని అక్కడ యథేచ్చగా సాధన చేసుకోవచ్చని చెప్పిన తర్వాతనే. అది దైవాజ్ఞగా భావించింది. రాజుగారు మాట్లాడుతుంటే తన మిత్రుడు సంభాషించినట్లే ఉంది. అందుకే వారి మాట ఏదీ తను కాదనలేకపోయింది. మదనపల్లెలో ఉన్నప్పుడు పగలంతా సోమేశ్వరాలయంలో గడిపినట్లే, తరిగొండలో నృసింహాలయంలో గడపసాగింది. నృసింహాలయంలో ఒక పక్కగా ఆంజనేయస్వామి విగ్రహం ప్రతిష్ఠించబడి ఉంటుంది. అక్కడికి సాధారణంగా ఎవరూ రారు. ఏకాంతంగా ఉంటుంది. మందిరంలో ఉంటే తన స్వస్థలంలో ఉన్నట్టు ఎంతో సురక్షితంగా, భద్రంగా ఉన్నట్టు ఉంటుంది. ఆ భద్రతా భావం వల్ల మనస్సులో ఎటువంటి ఉద్రేకాలు, ఉద్వేగాలు ఉండక శాంతంగా ఉంటుంది. అది ధ్యానానికి, యోగసాధనకి అనువైనస్థితి. 
24,515
         త్వరత్వరగా నడిచి కాలేజిలోకి వెళ్ళిపోయారు.          అక్కా!          నా బ్రతుకు అంధకారమయ్యేటట్టు వుంది......నేను ప్రైవేటుగా యస్.యస్.యల్.సి.కి కూర్చుంటున్నాను. పిన్నికి తెలియకుండా నాన్నఫీజయితే కట్టారుగానీ నా చదువుకి దోహదంమాత్రం చేయలేకుండా ఉన్నారు. ఏమి చేయాలో తోచటం లేదు.....నాచదువు విషయం అంతా నీ మీదే ఆధారపడివుంది.....నా బ్రతుకు కూడా....                                                                                                                     నీ చెల్లి                                                                                                                సుశీల          మనస్సుకరిగేట్టుగా వ్రాసినజాబును చదివేసరికి సుభద్రకి కళ్ళనీళ్ళువచ్చాయి.          'పాపం ఎంత బాధపడుతోందో!'          చులకనకావటంలో విశేషం ఏముంది?          కన్నతల్లిలేకపోతే కరుణేహీనమయ్యే ఈ ప్రపంచం సుశీలలాంటి అమ్మాయిలకి ఇక ప్రపంచమేదుర్భరమవుతుంది.          అలా ఆలోచనలు సాగిపోయేవే...          అంతలో సారధి ప్రవేశించాడు.          'వదినా......'          మంచంమీద కూర్చోమని సైగచేస్తూ తనూ కాస్త జరిగింది.          అక్కడే కూర్చుని అన్నాడు.          'ఏమిటి వదినా అలా వున్నావు?'          మౌనంగా ఉత్తరం చేతికిచ్చింది.          'ఎక్కడనుంచి'          'చదువు'          ఒక్క క్షణం తటపటాయించాడు.          'చదువు'          '......'          'నీ మరదలే వ్రాసింది'          ఆలోచిస్తూ జాబు తెరిచి ఒక్క నిమిషంలో చదివేశాడు.          అతనికి ఆమె ఎవరో అర్ధం కాలేదు.          ప్రశ్నార్ధకంగా ఆమెవైపు చూశాడు.          'మావారి మేనమామ కూతురు....'          'ఓహో....'          'అవును.....అప్పుడోసారి వచ్చి పోయిన అమ్మాయే.......'          'మరి'          'ఏంచేద్దాం?'          'మీ ఇష్టం'          'రమ్మని వ్రాద్దామని'          లెటరుపేడ్ తెచ్చి కూర్చున్నాడు.          చెప్పింది          'చెల్లెలికి'          క్షేమం. నీ ఉత్తరం అందింది వెంటనే రా!          మీ అక్క          వ్రాశాక తీసుకుని సంతకం చేసింది.          మడిచికవర్లో పెట్టాడు.         'చూడు సారధీ! కాస్త ఆ అమ్మాయికి తెలియనివి ఏవైనా చెపుతూ వుండాలి'          'మీ మాట ఏనాడైనా తీసివేశానా వదినా? మీరు అడగాలేకాని కొండ మీది కోతినైనా తెచ్చిస్తాను మీ ఆజ్ఞ సుగ్రివాజ్ఞ అనుకో!'          'ఛీ! ఛీ!! ఆనాడు రాతినినాతి చేశావు. ఈనాడు నాతిని కమ్మంతావు. ఎప్పుడూ నీ పనులింతేనా?" నవ్వుతూ వదినగారన్నమాటలకి మురిసిపోయాడు. అతని దరహాసవదనారవిందాన్ని చూచి  ఆమె నిండుపైరుతో వున్న పొలాల్ని చూసి మురిసిపోయేరైతులా నిండు మనస్సుతో మనసునిండా సంతోషించింది. ఒక్క నిమిషం మౌనం వహించి అంది.          'నీకు ఓ కథ చెప్పాలి సారధీ'          'ఏమిటో!'          'మళ్ళీ చెపుతాలే'          'ఉహు ఇప్పుడే చెప్పాలి'          'కాదులే! ఇప్పుడు కాదు.....మళ్ళీ చెపుతా సరేనా'          'అయితేనేనూ మీతో ఓ కథ చెప్పుకోవాలి'          'ఏమిటది'          'ఇప్పుడు కాదు ఈ సారి వచ్చినప్పుడు చెపుతాగా'          'ఓహో.....మాటకి మాట వేస్తున్నావుకదూ'          'కాదొదినా......నిజం.....'          'మరైతే ఒక్క ముక్కలో చెప్పు'          'అలాకాదు'          'అవుతుందిలే......చెప్పు'          'మీ ఆజ్ఞ.....అది నా ప్రేమవిషయం వదినగారూ! తప్పక చెపుతాగా......వస్తాగుడ్ బై'          వేగంగా వెళ్ళిపోయాడు సిగ్గుపడుతూ.          సుభద్ర అతను వెళ్ళినవైపే అలాగే చూస్తూ నిలుచుంది.          ----------          చల్ల చల్లగా గాలి వీస్తోంది.          తుంగభద్ర ఈస్టు కెనాల్ నిండుగా ప్రవహిస్తోంది.          వరిమళ్ళమీదుగా అప్పుడప్పుడూ వీస్తోన్న గాలి ఆలమందలవాసన తెస్తోంది.          పశుపోషణలేక సహజమైన పశువుల ఎరువులు దొరకక కృత్రిమ రసాయనిక ఎరువులు వాడుతూ అత్యధికమైన పంట పండిస్తున్నామని విభ్రమ చెందుతోంది ప్రజానీకం.          సామాన్యమైన రైతుకి ఆనాడు తన ఇంట్లో తిరుగాడే పశువుఎరువు సులభంగా చేలకి వేసుకుని పంట పండించుకుని తిన్ననాటి సుఖం ఈనాడు దొంగ వ్యాపారులవద్ద బ్లాకులో అత్యధిక మైన ధరలకి కృత్రిమ ఎరువులని కొనలేక, చాలీచాలని ఎరువులతో, పండీ పండని పంటలతో శ్రమ ఎంతో అధికం చేసిపంట పండినా.....ఆనాటిరుచి నెరుగక సుఖం అనేది శూన్యం అనిపిస్తోంది.          కెనాలుగట్టుపై కూర్చుని నిబ్బరంగా నిర్మలంగా ప్రవహిస్తోన్న నీటిని చూస్తూ కూర్చున్నాడు సారధి.          అయిదుగంటలు కావస్తోంది.          హేమంతకాలం          అప్పుడే సూర్యుడు వ్రాలిపోయాడు.          'ఇంకాగీత రాలేదేమో?' అని ఎదురుచూస్తూ ఆలోచిస్తున్నాడు.          పశ్చిమాకాశంలో రంగురంగుల కుంచెలతో అగుపించని చిత్రకారుడు చిత్ర విచిత్రమైన దృశ్యాలని గీస్తున్నాడు క్షణక్షణానికీ ఒక్కో ఆకారం దాలుస్తున్న ఆ చిత్రాల విచిత్రానికి అబ్బురం కలుగుతోంది.          సహజమైన ప్రకృతిపై భగవానుడు గీచే ఆ రంగురంగుల చిత్రాలముందు ఎన్నెన్ని రంగులు, ఎన్నెన్ని విదాలో కలిపి ఎన్నెన్ని తిప్పలో పడి గీసిన చిత్రాలు ఎందుకూ పనికిరావు'          ఆలోచనల్లో మునిగి అలాగే అందచందాలని విమర్శించుకుంటూ ఆనందిస్తున్న సారధీ కళ్ళు మూశారు ఎవరు.           
24,516
    "ఇవాళ భోంచెయ్యడం కాదు ఆదయ్యా! కొన్నాళ్ళు నేనిక్కడుంటాను. నాకో గది చూసి పెడతావా? అలాగే భోజనానికి ఏర్పాట్లు."     ఒక్క క్షణం ఆలోచించాక చెప్పాడు ఆదయ్య తాత.     "లైబ్రరీ పక్కన ఓ గది ఖాళీగా వుంది బాబూ! పేరుకే లైబ్రరీ. పుస్తకాలూ లేవు... లైబ్రెరీయన్ రాడు. పద... తీసుకెళ్తాను" లేచి నిలబడ్డాడు ఆదయ్య తాత.     మొత్తం వూరు మూడు వరసల్లో వుంది. మూడో వరస మధ్యలో వుంది లైబ్రరీ. రెండు గదుల యిల్లు-దాదాపు కూలిపోయే దశలో వుంది.     "ఇదా లైబ్రెరీ?" నవ్వుతూ అడిగాడు ఆదిత్య.     "ఊరికి తగినట్లుగా ప్రజలు... ప్రజలకు తగినట్లుగా లైబ్రరీ."     లోనికి నడిచారిద్దరూ.     ఒక గది ఖాళీగా వుంది. రెండో గదిలో రెండు అల్మారాలు... ఒక రీడింగ్ టేబుల్... నాలుగు కుర్చీలున్నాయి.     "అవును ఆదయ్య తాతా... మీ వూళ్ళో రేడియో, టి.వి. న్యూస్ పేపర్ ఇలాంటివేవీ వుండవా?"     "అవ్వన్నీ వున్నవాళ్ళు ఒకప్పుడు వుండేవాళ్ళు బాబూ... వాళ్ళు ఇక్కడ బతకలేక పట్నాలు వెళ్ళిపోయారు. ప్రస్తుతం ధరణిబాబు ఇంట్లోనే రేడియో వుంది. న్యూస్ పేపరంటావా... ఎవరైనా పట్నం వెళ్తే తేవడమే తప్ప యిక్కడికి రాదు"     ఫర్వాలేదు! తననెవరూ గుర్తుపట్టడానికి అవకాశాలు లేవు. నిర్భయంగా మనసులోనే అనుకున్నాడు ఆదిత్య.     "రంగితో చెప్తాను... నీకు వంటా వార్పూ చేయమని" అన్నాడు ఆదయ్య తాత.     "సరుకులవీ ఏమీలేవు. అన్నిటికీ వెంకటాపురమేనా వెళ్ళాల్సింది?"     "నువ్వొచ్చింది పల్లెటూరు... పల్లెటూరు మనుషుల్లో ఇంకా ఆత్మీయతలు పోలేదు బాబూ. ఆ మాత్రం నీకు మా వూరు తిండి పెట్టలేదనుకున్నావా?" ఆదయ్యతాత ఆత్మీయంగా అన్నాడు. తమ వూరు పిల్లని నీళ్ళ నుంచి రక్షించిన కృతజ్ఞత అతని మాటల్లో ధ్వనించింది.     "నువ్వుండు బాబూ... నీక్కావల్సినవన్నీ పంపుతాను" అని ద్వారబంధం వరకూ వెళ్ళి తల తిప్పి-     "అవును బాబూ... నువ్వీ వూరు ఏ పనిమీదొచ్చావు?" అమాయకంగా అడిగాడు ఆదయ్య తాత.       ఆ ప్రశ్నకు ఆదిత్య దగ్గర జవాబులేదు.     ఆదిత్యకు వెంటనే స్ఫురించిందో జవాబు.     "పట్నంలో బతుక్కి విసిగిపోయాను ఆదయ్యా... కొన్నాళ్ళు ఏ కల్మషమూ లేని పల్లెటూర్లో... హాయిగా బతుకుదామని."     "నీకెవరూ లేరా?"     "ఎందుకు లేరు? అందరూ వున్నారు. నువ్వూ... యీ వూరి జనం అందరూ నా వాళ్ళేగా!"     "నాలాంటి వాడివేనన్న మాట నువ్వూనూ."     "ఏం? నీకెవరూ లేరా?"     "ఉన్నాడు... చెట్టంత ఎదిగిన కొడుకున్నాడు. ఉన్న అరెకరం దున్నుకొని... హాయిగా పెళ్ళి చేసుకుని బతకరా అంటే ఆడు వినడు. పట్నం మోజుతో చిల్లర దొంగగా తయారయ్యాడు. వారం రోజులు ఊళ్లో వుంటే... మూడు వారాలు జైల్లో వుంటాడు. మొదట్లో వాడ్ని యిడిపించడానికి నానా బాధలు పడేవాడ్ని... రాన్రానూ వెంకటాపురం పోలీసులకి, ఆడికి లింకు కుదిరింది. అవసరమైనప్పుడు వాళ్ళే పట్టుకుంటారు... లేనప్పుడు వదిలేస్తారు..." చెప్పుకుంటూ ముందుకెళ్ళిపోయాడు ఆదయ్య తాత.     మరో గంట తర్వాత...     ఏదో పాత్రలు, సామాన్లు పట్టుకొని వచ్చింది రంగి.     "ఏం రంగి... నా వెనక రాలేదేం?" అడిగాడు ఆదిత్య.     "సుమమ్మలో అంత కోపాన్ని నేనెప్పుడూ చూడలేదు బాబూ- నువ్వెళ్ళి పోయాక ఆయమ్మ నా మీద అంతెత్తున లేచింది. నువ్వెవరు... ఎందుకొచ్చావ్? నేను నిన్ను ఆళ్లింటికి తీసుకెళ్ళినందుకు నన్ను తిట్టింది. ఎవరో, ఏమిటో తెలుసుకోకుండా ఆళ్ళింటికి పంపినందుకు ఆదయ్య తాతనూ తిట్టింది. ఆదయ్య తాతతో ఏదో మాట్లాడాలట... తరువాత వస్తానంది. నువ్వు వూరొదిలి వెళ్ళిపోయాక తనతో చెప్పమంది సుమమ్మ" గబగబా ఏకరువు పెట్టింది రంగి.     వంట పని చేస్తూ ఊరి కబుర్లన్నీ చెప్తూనే వుంది రంగి.     "మొదట్లో ఊరిలోని పిల్లలందరికి రాత్రిపూట చదువు చెప్పేది సుమమ్మ. ఆ ముదనష్టపోడు వూళ్ళోకి తగలడడంతో మానేసింది" చెప్పింది రంగి.     "ఎవరా ముదనష్టపోడు?" అడిగాడు ఆదిత్య.     "ఇంకెవడు... ఆదయ్య తాత కొడుకు వెంకట్ గాడు... ఆదయ్య ఎంత మంచోడో... ఆడి కొడుకు అంత చెడ్డవాడు. ఆడపిల్లని చూస్తే వదిలిపెట్టడు... వరసకి నేను చెల్లెలవుతానని నా జోలికి రాడు. పాపం! ఆడి పాలిబడి సుందరి... సుబ్బమ్మ ప్రాణాలు తీసుకున్నారు."     "ఊళ్ళోవాళ్ళు వాడికి బుద్ధి చెప్పలేదా?"     "ఏం చెప్తారు బాబూ... ఆడు, రౌడీ గేంగూ రెండు, మూడుసార్లు సుమమ్మ జోలికెళ్ళారు. సుమమ్మ తుపాకీతో బెదిరించేసరికి పారిపోయాడు. నెల రోజుల్నించి వూరు చల్లగుంది... ఎప్పుడో వూడిపడతాడు పిడుగులాగ. ఈసారి నువ్వున్నావు గదా... ఈ వూరి ఆడపిల్లలకు ధైర్యం."     నవ్వుకున్నాడు ఆదిత్య.     "నువ్వెవరో, ఏంటో తెలీకపోయినా... నన్ను నువ్వు నీళ్ళల్లోంచి రక్షించేవు కదా... ఊరోళ్ళందరూ నిన్ను ఎంతగా మెచ్చుకుంటున్నారో తెలుసా?" కృతజ్ఞతగా అంది రంగి.     భోజనం చేస్తున్నప్పుడు అడిగింది-     "వంటిమీద బట్టలు తప్ప మరేం లేవు. ఎలాగ... ఇంటిలోంచి పారిపోయొచ్చినవాడిలా వున్నావు."     "బాగా కనిపెట్టావు. పారిపోయే వచ్చాను... ఇంటి నుంచి కాదులే."     "మా బావ బట్టలున్నాయి... రేపు తేనా? రెండు జతలు వదిలి వెళ్ళిపోయాడు ఆడు" ఇంటికెళ్ళేముందు అడిగింది రంగి.     "నీ యిష్టం" ఆ అభిమానానికి విస్మయపడుతూ అన్నాడు ఆదిత్య.     "ఉదయాన్నే వస్తాను" మెట్లు దిగి వెళ్ళిపోయింది రంగి.     వెళ్ళిపోయిన రంగి వైపే చూస్తూ చాలాసేపు కూర్చున్నాడు ఆదిత్య.     ఊరంతా ఎనిమిది గంటలకే నిద్రపోయింది.     చాలాసేపు నిద్రపట్టలేదు ఆదిత్యకు.     తనని సుమబాల నమ్మాలంటే ధరణికుమార్ మరణ వార్త చెప్పక తప్పదు. ఆమె తనని నమ్మగలిగితేనే తనేమైనా ఆమెకి సహాయం చేయగలిగేది. కారణాలు తనకు తెలీకపోయినా గుర్రం పెద్దబ్బాయి మనుషులు సుమబాలకోసం రాక మానరు. ఒంటరి సుమబాలను వాళ్ళేమైనా చేస్తే? జాలిగొలిపే ధరణి మొహం గుర్తుకొచ్చింది ఆదిత్యకు. చాలా సేపటికి ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చాడు ఆదిత్య.                                                  *    *    *    *    *
24,517
    ఓడ నెమ్మదిగా వెళ్తూంది. దాదాపు అరగంట పట్టిందతనికి పైకి చేరుకోటానికి. కార్గో షిప్ అది.     పూర్వంతో పోల్చుకుంటే సముద్రపు దొంగల తాకిడి దాదాపు లేనట్టే. అందువల్ల గార్డింగ్ ఎక్కువగా లేదు.     అతడు కారిడార్  లో దిగాడు. నిర్మానుష్యంగా వుంది. అతడు క్యాబిన్ వైపు వెళ్తూంటే ఇద్దరు వ్యక్తులు ఎదురుగా వచ్చారు. వెంటనే  దాక్కోటానికి ఏమీ  కనపడలేదు. కుడి పక్కనుంచి ఆరంగుళాల వ్యాసార్థంగల పైపు వెళుతూంది. నేత్ర చప్పున  దాన్ని రెండు చేతుల్తోనూ పట్టుకుని, గాలిలోకి డైవ్ చేసి పైకి ఎక్కి బోర్లా పడుకున్నాడు. అదృష్టవశాత్తు అది వంగిపోలేదు.     భూమికి ఏడడుగుల ఎత్తులో వుంది అది.     ఎదురుగా వస్తున్న ఇద్దరు  వ్యక్తులు అక్కడికి వచ్చాక ఆగి, అటు ఇటు చూసి, కుడివైపు నడిచారు. సరిగ్గా అతనున్న రాడ్ కిందికివచ్చి నిలుచున్నారు. నేత్ర వూపిరి బిగబట్టాడు.     వాళ్ళు చెయ్యి ఎత్తితే అతను తగుల్తాడు. ఇద్దరు  గార్డుల్లో ఒకడు రాసుకున్న నూనె తాలూకు వాసనకూడా అతడికి సోకుతూంది. అంత దగ్గరగా  వున్నారు ఇద్దరూ. ఇద్దర్లో ఒకడు జేబులోంచి బాటిల్ తీసి రెండోవాడికి ఇచ్చాడు.     ఆ బాటిల్  అలాగే ఎత్తి  తాగాలన్న కోర్కె రెండోవాడికి కలక్కూడదని, వెన్నెలాకాశాన్ని చూడాలన్న కోర్కె  మొదటివాడికి రాకూడదని మనసులోనే  ప్రార్థించాడు నేత్ర. ఆ రెంటిలో ఏది జరిగినా, పన్నెండు అంగుళాల ఎత్తులోవున్న తను కనపడటాన్ని ప్రపంచంలో ఏ శక్తీ ఆపలేదు.     వాళ్ళని చంపడంకాని, స్పృహ తప్పించడం కాని పెద్ద కష్టం కాదు. కాని, ఇంత కష్టపడిందీ ఫలితం లేకుండా పోతుంది. ఇన్ని రోజులు అనుమానం రాకుండా బోట్ లో వున్నది - ఇది కేవలం ప్రమాదవశాత్తు జరిగింది అనిపించేలా  చేయడం కోసమే  తప్ప, విద్రోహ చర్య అన్న అనుమానం వచ్చేలా చెయ్యడానికి కాదు.     గార్డ్  బాటిల్ గాలిలోకి ఎత్తాడు.     నేత్ర వాడిమీదకు దూకటానికి సిద్ధమయ్యాడు. కాని, చివరి క్షణంలో ఆ గార్డ్ అడుగు ముందుకు వేశాడు. అందువల్ల నేత్ర  వాడికి కనపడలేదు. ఇద్దరూ తాగడం పూర్తిచేసి, అక్కడనుంచి కదిలారు. నేత్ర తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. ఇక ఆలస్యం చెయ్యలేదు.     పైనుంచి దూకి, కారిడార్ లో పరుగెత్తి లోపలికి ప్రవేశించాడు. కిందికి మెట్లున్నాయి.     అండర్ గ్రౌండ్ తాళం తీయడానికి అతనికి ఎక్కువ సమయం  పట్టలేదు.     క్రింద  విశాలమయిన స్థలంలో వున్నాయి బారెల్స్. దాదాపు పన్నెండు బారెల్స్. అతడు జేబులోంచి కత్తి తీశాడు. బారెల్ నుంచి బారెల్ కి పైప్ కనెక్షన్ వుంది. ఒక బారెల్ కి  రంథ్రం చేస్తే  చాలు. అయితే, అది తరువాత విధ్వంసక చర్యలా కనపడకూడదు. యాక్సిడెంట్ లా వుండాలి.     అతడికీ పని పూర్తవడానికి దాదాపు అయిదు నిముషాలు పట్టింది. బారెల్స్ నుంచి ద్రవం కారి ఒక మూలగా ప్రవహిస్తూంది.     అతడు అక్కడనుంచి బయటకు వచ్చి నీటిలో దూకాడు.     బోట్ దగ్గర  ప్రతిమ ఎదురుచూస్తూ వుంది. అతడు  దగ్గరకురాగానే చెయ్యి అందించింది. అతడు పైకి వచ్చేసి మాస్క్ తీసేశాడు. "అయిదు నిమిషాల్లో అంతా ఖాళీ అవుతుంది" అన్నాడు బోట్ స్టార్ట్  చేస్తూ.     "అరె...... అటు చూడు......" అంది ప్రతిమ.     దూరంగా మంట కనపడింది. ముందు చిన్నమంట...... చూస్తూవుండగానే అది సముద్రంమీద ఫర్లాంగు దూరం వ్యాపించింది.     షిప్ లో 'క్రూ' అంతా  హడావుడి పడుతున్నారు. మంటల్నుంచి ఓడ దూరంగా వెళ్తూంది. ఓడకి ప్రమాదం లేదు. ఆ దృశ్యం మాత్రం అపురూపంగా వుంది. దాదాపు 20 లక్షల ఖరీదుచేసే ఆమ్లజలం మాత్రం నీటి పాలైంది. ఆకుపచ్చ, పసుపు రంగుల్లో వాయురూపంలోకి మార్పు చెందడం......     "నాకు సైన్సు సరిగ్గా  తెలీదు. కాని, ఇలా బర్న్  అవడం  ఒక రకంగా  అదృష్టమే. చేపలు చావవు" అన్నాడు నేత్ర.     బోటు ఒకవైపుకి, ఓడ ఒకవైపుకి మంటలనుంచి దూరంగా వెళ్తున్నాయి.     బోటు తీరాన్ని చేరుకోవటానికి మరో ఏడు రోజులు పట్టవచ్చు. వైర్ లెస్ ద్వారా ఓడనుంచి వార్త ప్రెస్ ని చేరుకోవటానికి ఏడు నిమిషాలు చాలు.                               ఇరవై లక్షలు నష్టం                                    ఆమ్లజలం సముద్రంపాలు     పెద్ద అక్షరాల్తో వార్త పడింది.     'కరాచీ నుంచి వస్తూన్న ఓడలో ఆమ్లజలం గతరాత్రి లీకై సముద్రంలో కలిసిపోయింది. ప్రముఖ పారిశ్రామికవేత్త సర్పభూషణరావు తాలూకు పరిశ్రమలకోసం దిగుమతి అవుతున్న ఈ ఆమ్లజలం దాదాపు ఇరవై లక్షలు ఖరీదు చేస్తుంది. కంటైనర్ లీకేజ్ కారణంగా ఈ ప్రమాదం  జరిగినట్టు భావిస్తున్నారు. ఓడకి ప్రమాదం జరగలేదు.'     సర్పభూషణరావు చేతిలో పేపరు వణకుతూంది. ఆవేశంతో కదిలి పోతున్నాడు.     నష్టం సామాన్యమైనది కాదు. కోట్లలో వుంటుంది.     అతడు మామూలు వ్యక్తికాదు. గొప్ప పారిశ్రామిక వేత్త. వ్యాపార విషయాల్లో ఆరితేరినవాడు. ఒకసారి ఫార్ములా శత్రుదేశానికి చేరితే ఇక తన విలువ గడ్డిపోచంత కూడా వుండదని అతడికి తెలుసు. అందుకే కాప్యూల్స్ తనే తయారు చేస్తానన్నాడు. చేసి అమ్ముతానన్నాడు. శత్రుదేశం చేయవలసిందల్లా తనకి దొంగతనంగా ప్లుటోనియం పంపటమే అని చెప్పాడు. పెట్టుబడి అంతా  తనే పెట్టాడు.     ఇప్పుడు మునిగిపోయాడు.     ఆ సాయంత్రమే అతడు ఏజెంట్ క్యూని కలుసుకున్నాడు. రోడ్డు కొకపక్క కారు పంక్చరై ఆగిపోయింది. డ్రైవరు టైరు మారుస్తున్నాడు.     "లైట్స్ కి నల్లరంగు వేస్తాన్సార్..... పోలీసులీ మధ్య బాగా పట్టుకుంటున్నారు" అంటూ ఒకవ్యక్తి తారురంగు డబ్బాతో వచ్చాడు. "వెయ్యి" అన్నాడు సర్పభూషణరావు అతడు రంగు వేస్తుండగా వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరిగింది.     "చాలా పెద్ద దెబ్బ తగిలింది. పేపరు చదివావా.....? దురదృష్టం వెంటాడు తున్నట్టుంది."     "వెంటాడేది దురదృష్టం కాదు. ఏజెంట్ నేత్ర. షిప్ లో ఆయిల్  లీకేజ్ కి కారణం నేత్ర.!"     భూషణరావు  స్తబ్దుడయ్యాడు. షాక్ గురించి నేత్ర  మాట్లాడిన  మాటలు గుర్తొచ్చాయి. అతడి మొహం ఆవేశంతో ఎర్రబడింది. "నేను  నమ్మలేక పోతున్నాను" అన్నాడు.     "నేత్ర రెండు నెలలుగా దేశంలో లేడు. ఇప్పుడర్థం అవుతూంది. సముద్రంలో కాపువేశాడన్నమాట! ఒకటికి ఒకటి కలిపిచూస్తే అదే కరెక్టనిపిస్తూంది."     "నేను చాలా నష్టపోయాను."
24,518
    క్రిప్టోగ్రాఫ్ మెషిన్ తన అనుభవానికి అందనంత దూరంలో వుందనే విషయం మొట్టమొదటిసారిగా బాగా అర్థమైపోయింది జైన్ కి.     అతనికిప్పుడు ఫణివర్మ సంస్కారరహితమైన ప్రవర్తనకు బాధపడటం లేదు. విశ్వాత్మ సృష్టించిన మెషిన్ ని చూడగలిగే అవకాశం కల్పించినందుకు ఫణివర్మను మనసులోనే మెచ్చుకున్నాడు.     అదే విషయం వ్యాన్లో కూర్చున్నాక చెప్పాడు ఫణివర్మతో- "ఈ విషయం ముందుగా చెబితే నా ఎరేంజ్ మెంట్స్ నేను చేసుకొనేవాడిని. ఇంత ఖర్చు పెట్టినవాడిని ఇంకో కోటిరూపాయలు ఖర్చు పెట్టలేనా?" అసహనంగా అన్నాడతను.     "సారీ!" గొణిగాడు అమర్ జైన్.     అతని ప్రతిభ ఎలాంటిదో తెలిసిపోయిన కామిని నిరాసక్తిగా అతనివైపు చూసింది.                                 *    *    *    *     ఆ బైక్ శబ్దం వినిపించగానే సెక్యూరిటీ ఆఫీసర్ సెక్యూరిటీ రూంలోంచి గబాగబా గేటు దగ్గరకొచ్చి గేటు తెరిచి అన్వేషికి సెల్యూట్ చేశాడు.     "ఇంత రాత్రి సమయంలో వచ్చారేమిటి సార్?" ఆశ్చర్యంగా ప్రశ్నించాడతను.     "సెక్యూరిటీ ఎరేంజ్ మెంట్స్ సరిగ్గా వున్నాయా?"     "ఎవ్విరిథింగ్ ఓ.కె.సార్!"     "ఎవరైనా కొత్త వ్యక్తులు ప్యాలెస్ దగ్గరకు వచ్చారా?" అడిగాడు అన్వేషి.     "కొత్త వ్యక్తులా ఈ సమయంలోనా... నో సర్. అలాంటిదేం లేదు".     అతను చెపుతుండగానే ప్యాలెస్ వైపు గబగబా అడుగులువేసి, మెయిన్ బిల్డింగ్ వైపు చూశాడు అన్వేషి. అతని వెనుకే పరిగెత్తాడు సెక్యూరిటీ ఆఫీసర్.     "మెయిన్ బిల్డింగ్ లోకి ఎవరూ ప్రవేశించలేదా?"     "మెయిన్ బిల్డింగ్ లోకా... ఈ సమయంలో మానవమాత్రులెవరైనా మెయిన్ బిల్డింగ్ లోకి ప్రవేశించగలరా?" ప్రశ్నించాడతను.     "నేను లోపలికి వెళుతున్నాను" అంటూ రెండడుగులు ముందు వేసి ఆగిపోయాడు అన్వేషి.     అర్థరాత్రిపూట మెయిన్ బిల్డింగ్ వైపు సెక్యూరిటీ గార్డ్స్ తప్ప మరెవరూ వెళ్ళకూడదనే ఫౌండేషన్ రూల్ అకస్మాత్తుగా అన్వేషికి గుర్తొచ్చింది.     వెంటనే వెనక్కి తగ్గాడు.     సెక్యూరిటీ ఆఫీసర్ ముఖంలోకి సీరియస్ గా చూస్తూ "బీ ఎలర్ట్. ఎక్కడ ఎలాంటి చిన్న అనుమానం వచ్చినా నాకు వెంటనే ఫోన్ చేయండి" అంటూ గబగబా గేటు బయటికి వచ్చి బైక్ స్టార్ట్ చేశాడు. బైక్ ముందుకు వెళ్ళిపోయింది.                                                   *    *    *    *     పార్కింగ్ ప్లేస్ లో బైక్ పార్క్ చేసి, ఫ్లాటు మెట్లు ఎక్కుతున్న అన్వేషి మెట్ల మీద కూర్చున్న బిల్హరిని చూసి "ఎప్పుడొచ్చావ్? ఇక్కడ కూర్చున్నావేమిటి?" అడిగాడు ఆశ్చర్యపోతూ.     "ఎక్కడకెళ్ళారు?" సీరియస్ గా ప్రశ్నించాడు బిల్హరి.     "ప్యాలెస్ కు"     "ఎందుకు?"     "సెక్యూరిటీ ఎరేంజ్ మెంట్స్..." అంటూ ఏదో చెప్పబోయాడు అన్వేషి.     "ఇప్పుడే శృతి కూడా వెళ్ళిపోయింది. ఇంతవరకూ మీరొస్తారని ఎదురు చూసిందావిడ. మీరీమధ్య ఇంత అయోమయంగా తయారవు తున్నారేమిటి?"     "నేనా... అయోమయంగానా?"     "ఎస్... ప్యాలెస్ ని రక్షించేది మీరొక్కరేనా? కొన్నివందలమంది నిరంతరం కళ్ళల్లో కాగడాలు వెలిగించుకుని మరీ కాపలా కాస్తుంటారు. గత నెలరోజులుగా మీ ఆలోచనలూ, చర్యలూ వింతగా అనిపిస్తున్నాయి. నాకేమీ అర్థం కావడంలేదు. ఇరవై నాలుగు గంటలూ అదే ఆలోచనా? డ్యూటీకి మించి ఆలోచిస్తున్నారు. అది మీ ఆరోగ్యానికి మంచిది కాదు" అన్నాడు బిల్హరి.     "ఎందుకలా కోప్పడిపోతున్నావ్? మనింట్లో దొంగలుపడి. మన ఆస్తిని ఎవరైనా ఎత్తుకుపోవడానికి ప్రయత్నిస్తుంటే మనం వూరుకుంటామా? నువ్వు కూడా తెలివితక్కువగా ఆలోచిస్తావేం?" అనేసి ముందుకెళ్లిపోయాడు అన్వేషి.     అతనివైపు ఆశ్చర్యంగా చూస్తూ చీకట్లో నిలబడిపోయాడు బిల్హరి. మన ఆస్తిని ఎవరైనా ఎత్తుకుపోయే ప్రయత్నమా? మన ఆస్తీ అంటాడేమిటి?     అది విశ్వాత్మ ఆస్థి కదా?!     "విజ్ఞానాన్ని ఎప్పుడూ వ్యక్తిగత లాభం కోసం మాత్రమే వినియోగించుకుంటూ అపవిత్రం చెయ్యకుండా వుండాలన్నది మన జాతీయ సంస్కృతి. అంత గొప్ప హిందూ సంస్కృతికి వారసుడయిన ది గ్రేట్ విశ్వాత్మ క్రిప్టోగ్రాఫ్ లాంటి మహాద్భుతమైన కంప్యూటర్ ని కనిపెట్టి, దాన్ని తన ఆస్తుల కాపలాకి వాడుకోవడం నాకెందుకో నచ్చలేదు.     అదే అమెరికన్ బిల్ గేట్స్ వ్యాపారపరంగా ఉత్పత్తి చేస్తుంటే, ఎన్నివేల లక్షల కోట్లు విదేశీ మారక ద్రవ్యం మనదేశానికి లభించి వుండేది. మనదేశంలో మేధావులు లేకకాదు. ఆ మేధావులు దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడకనే మనదేశం వెనకబడిపోయింది.     అయినా అవన్నీ ఇప్పుడనవసరం.     విశ్వాత్మ ఆస్తి మీకూ, నాకూ చెందదు. తిరిగి జన్మించి వచ్చే విశ్వాత్మకే చెందుతుంది. విశ్వాత్మ ఆస్తిని కాపాడటానికి మిత్రాలాంటి నమ్మకస్తులు, నిజాయితీపరులు చాలామందున్నారు. ఆపైన తపన తీరని విశ్వాత్మ ఆత్మ ఎప్పుడూ ఈ ప్యాలెస్ చుట్టూ పరిభ్రమిస్తూనే వుంటుంది. వస్తాను" అంటూ అక్కడి నుండి వేగంగా వెళ్ళిపోయాడు హరి.                               *    *    *    *     ఎ.సి.లోంచి గాలి చప్పుడు చెయ్యకుండా వీస్తోంది.     రాత్రి తొమ్మిది గంటల సమయం. ఫణివర్మ అప్పుడే సగం బాటిల్ ఖాళీ చేసేశాడు. గతరాత్రి అనుకున్న ప్లాన్ సక్రమంగా జరగకపోవడం దగ్గిర్నించి మౌనంగా వున్నాడు ఫణివర్మ.     కామినితో కూడా ఏమీ మాట్లాడలేదతను.     అతని మూడ్ ఎలా మారుతుందో కామినికి బాగా తెలుసు. అందుకే మసక చీకటి పడగానే, మందు బాటిల్ ని ముందుంచి అతనివైపే చూస్తూ కూర్చుంది.     "ఫోన్ అందుకో" అన్నాడతను వెంటనే.     వెంటనే ఫోనందుకుందామె.     "జపాన్ కి కాల్ చెయ్యి... అర్జంట్" అంటూ నెంబర్ చెప్పాడు ఫణివర్మ.     రెండు నిమిషాల తర్వాత- "నెంబర్ రింగవుతోంది" అంటూ రిసీవర్ని ఫణివర్మకిచ్చింది.     అరగంటసేపు మాట్లాడతాను. కాన్వర్ సేషన్ అంతా ఇంగ్లీషులోనే జరిగింది.     "ఇప్పుడు నేను మీకు చెప్పేది కొంతే. ఈ మిషన్ ని ఆపరేట్ చేయడానికి మిస్టర్ కుషుయోతోని మీరు ఒప్పించారంటే... మీకు కమీషన్ గానే కోటిరూపాయలు వస్తుంది. కుషుయోతో యోకోహామా సిటీలో బయలుదేరగానే ఇక్కడ నేను ఎమౌంట్ రడీ చేసేస్తాను. ఆయన టోక్యో చేరుకొని ఢిల్లీ వచ్చే ఫ్లయిట్ ఎక్కగానే మీరు కోరిన పేరుమీద, కోరిన దేశపు కరెన్సీ సిద్ధం చేస్తాను" కావాలనే మరింతగా టెమ్ట్ చేస్తున్నట్లుగా అన్నాడు ఫణివర్మ.
24,519
    మరుక్షణం ఆమె ప్రక్కకి లాక్కుపోబడుతున్నట్లు గ్రహించి పెనుగులాడటానికి ప్రయత్నిస్తోంది. ఆ రాక్షసబలం ముందు ఆమె శక్తిచాలక నిరుపయోగమైంది. ఇంకోక్షణం గడిచేసరికి ఆమె రోడ్డుప్రక్క ఏకాంత ప్రదేశంలోకి లాక్కుపోబడింది. ఆ పెనుగులాటలో ఆమె కాళ్ళచెప్పులు జారిపోయి నేలమీద వున్న రాళ్ళూ, ముళ్ళూ గ్రుచ్చుకొని రక్తాలు చిమ్ముతున్నాయి. మరికొంచెం దూరంగా ఆమె బలంగా క్రిందకు నెట్టివేయబడి, ఎంత ప్రతిఘటిద్దామన్నా వీలుగాక నిస్సహాయంగా నేలమీదకు వొరిగిపోయింది. పశు కామంతో మదమెక్కి వున్న అతను ఆమె మీదకు వ్రాలాడు. అతని శరీరంలోని ప్రతి అణువూ ఆమెను ఆక్రమించటానికి సిద్ధంగా వుంది.     హఠాత్తుగా అతని భుజంమీద ఓ బరువైన చెయ్యి పడింది. ఉలిక్కిపడి, తలత్రిప్పి చూసేటంతలో అతని మెడను పట్టుకుని ప్రక్కకి లాగేసింది. ఆమెను బలాత్కరించబోయిన వ్యక్తి రెండో వ్యక్తి చేతుల్లోంచి విడిపించుకునేందుకు ప్రయత్నించాడు. కాని అంత బలవంతుడూ రెండోవ్యక్తి శక్తిముందు కొరగాని వాడైపోయాడు. అతి తేలిగ్గా ఓ ప్రక్కకి విసిరివెయ్యబడ్డాడు. క్రిందనుంచి లేచే ప్రయత్నం చేసేలోపల మెడమీద, తలమీదా ఉక్కుపాదాలతో తన్నినట్లు ఎడాపెడా ఊపిరాడనివ్వలేదు. కళ్ళు చీకట్లు క్రమ్మి చివరకు తల ప్రక్కకు వాల్చేశాడు.     మనోజ్ఞకు ఏం జరుగుతున్నదో తెలుస్తోంది. కాని క్రిందపడటంతో వంటికి బాగా గాయాలు తగలటంవల్ల తను లేవలేనిస్థితిలో వుంది.     ఆ వ్యక్తి ఆమె దగ్గరకొచ్చి దిగాబెడతాను" అన్నాడతను.     ఈ సంఘటన జరిగాక ఆమెకి కూడా ఒంటరిగా ఇంటికి వెళ్ళే ధైర్యం లేదు. అతని చెయ్యి పట్టుకుని వెంట నడిచింది.     "ఇలా ఎప్పుడూ జరగలేదు" అన్నది దారిలో. ఆమె గొంతులో చాలా బాధ ధ్వనిస్తోంది.     అతనేమీ మాట్లాడలేదు.     "సమయానికి మీరు రాకపోతే..." అంది.     అప్పటికీ అతనేమీ మాట్లాడలేదు.     "నేనిక్కడ బ్రెయిలీ స్కూల్లో పనిచేస్తున్నాను."     "తెలుసు" అన్నాడు.     ఇద్దరూ ప్రక్కప్రక్కన నడుస్తున్నారు. కొంతదూరం నడిచాక అతనామె చెయ్యి వదిలేశాడు.     ఇంతకుముందు, తనను నేలమీద నుంచి లేవదీసినప్పుడూ, తన చెయ్యి పట్టుకుని నడిచినప్పుడూ, అతని మాట ఎంత ఎత్తునుంచి వెలువడుతున్నదీ- వీటన్నిటినీ క్రోడీకరించుకుని అతని రూపురేఖలు, హైట్ వగైరాలు ఊహించటానికి ప్రయత్నిస్తోంది.     "మీరెవరు?" అని అడిగింది- అతన్ని గురించి ఇంకేమడగాలో తెలీక.     "నేనెవరో తెలుసుకోవటమవసరమా?" అన్నాడు.     "అలా అనికాదు. నన్ను కాపాడిన మనిషి ఎవరో తెలుసుకోవటం సభ్యత అని అడిగాను!"     "చెప్పటానికిష్టం లేదు."     "ఇష్టం లేకపోతే అడగను."     పది నిమిషాల తర్వాత ఇద్దరూ ఆమె ఇంటి దగ్గరకు వచ్చారు. ఆమె తలుపు తాళం తీసింది.     "నే వెళతాను" అన్నాడు.     "కాఫీ తాగి వెళుదురుగాని రండి."     అతను కాదనలేక వూరుకున్నాడు. ఆమె తలుపులు తెరిచి లోపలకు నడిచింది. లోపలంతా చీకటిగా వుంది. కుడిచేత్తో గుమ్మం ప్రక్కనే వున్న స్విచ్ నొక్కింది. లైటు వెలిగింది.     "రండి" అన్నది.     అతను కూడా లోపలకు నడిచాడు. ఇల్లు చాలా చిన్నగా వున్నా నీటుగా, నిరాడంబరంగా, ఆకర్షణీయంగా వుంది. ముందువున్న చిన్నగదిలో నాలుగు ఫేము కుర్చీలు, మధ్యలో చిన్న టీపాయ్, ఓ ప్రక్కన స్టాండుమీద టూ-ఇన్-వన్, కార్నర్ లో ఫ్లవర్ వాజ్...     "కూర్చోండి" అంది.     "తర్వాత అయిదు నిమిషాల్లో వస్తాను" అంటూ లోపలకు వెళ్ళింది. కిచెన్ రూమ్ లో లైట్ వెలగటం, ఆమె స్టవ్ వెలిగించటం, పాలువున్న గిన్నె స్టవ్ మీద పెట్టడం, డికాక్షన్ కలిపి కాఫీ తయారుచెయ్యటం, షెల్ఫ్ లోంచి కప్పుతీసి అందులో పొయ్యటం తడుముకోకుండా చేసింది. కాఫీ కప్పు తీసుకొచ్చి అతనికందించింది.     "మీరో?" అన్నాడు.     "నేనిప్పుడు అన్నం తింటాను."     అతను కప్పు నోటిదగ్గర పెట్టుకోబోతున్నాడు.     "అరె. పంచదార వెయ్యటం మరచిపోయానుండండి" అంటూ ఆమె చెయ్యిజాచి అతని చేతిలోంచి కప్పు తీసుకుంది. తిరిగి కిచెన్ లోకి వెళ్ళి ఓ చిన్న ప్లాస్టిక్ జార్ తీసి అందులోంచి స్పూన్ తో పంచదారతీసి కప్పులో వేసి కలిపింది. మళ్ళీ అతని దగ్గరకు వచ్చింది. ఎక్కడా తడబాటుగానీ, వెదుక్కోవడంగానీ లేదు.     "ఇప్పుడు తీసుకోండి."     అతను కాఫీ త్రాగటం పూర్తిచేసి కప్పు టీపాయ్ మీద పెట్టాడు.     "ఇహ వస్తాను" అన్నాడు లేచి నిలబడి.     "మళ్ళీ ఎప్పుడొస్తారు?" అనడిగింది.     "మళ్ళీనా?"     "ఇష్టం లేకపోతే వద్దులెండి" అంది అతని భావం కనిపెట్టినట్లు.     "వీలు చూసుకుని వస్తాను."
24,520
ఆ వాతావరణంలో - తాను తన డ్యూటీ సక్రమంగా చేసుకుంటున్న తరుణంలో చిన్నస్వామి ఎదురయ్యేడు. చిన్నస్వామిని చూడగానే కైలాసానికి పెద్దగా ఏడవాలనిపించింది. అతని క్కనిపిస్తే ప్రాణాలు తీస్తాడు. కనిపించకుండా పారిపోతే డ్యూటీ పాడై పోతుంది. ద్వారా ఉద్యోగం పోతుంది. ఏం చేయాలి? ఏం చేయాలో నిర్ణయం జరక్క ముందే చిన్నస్వామి తనని చేరుకున్నాడు. భుజమ్మీద చెయ్యివేసి ఆపేడు. బాగున్నావాని పలకరించేడు. కనిపించండం లేదేమిటని మందలించేడు. నా బాకీ మాటేమిటని కటువుగా అడిగేడు. కైలాసం నీరసంగా అన్నాడు- "అదే ఆలోచిస్తున్నాను!" "ఏమిటి ఆలోచించేది" "పదండి చెప్తా! నడుస్తూ చెబుతా!" "నడుస్తూ వినడం నాకు చిరాకు! నిలబడే చెప్పు!" నిలబడిపోతే నా డ్యూటీ చెడిపోతుంది సార్! నాతోపాటు నడవండి! సమస్తం చెబుతాను!" "నేన్నడవను. నిన్ను ముందుకు కదలనివ్వను" అన్నాడు చిన్నస్వామి. "అంతేనంటారా?" అడిగేడు కైలాసం నీరసంగా. "ఏదో ఆలోచిస్తున్నావని అన్నావు!" అవును! అన్నాను! బుద్ధిలేక అన్నాను." "ఏమిటది?" అయ్యా - ఎల్లప్పుడూ నాకు ఓకే ఒక్క ఆలోచన! ఏకైక ఆలోచన వస్తుంది" "అదే చెప్పమంటున్నాను!" "మీ అప్పు ఎట్లా తీర్చాలి?" "దాన్ని ఆలోచన అనరు." "మారేమంటారు!" "కుట్ర అంటారు!" "పోనీ ఆ మాటే ఖాయం చేసుకోండి. నన్ను వెళ్లనివ్వండి!" "కదుల్తే కాలో చెయ్యో తీసేస్తా!" "కదలకపోతే నా ఉగ్యోగం వూడిపోతుంది!" "నా బాకీ తీర్చనప్పుడు - నీ బోడి ఉద్యోగం వున్నా ఒకటే - వూడిపోయినా ఒకటే!" కైలాసం కన్నీళ్లు పెట్టుకున్నాడు. శారద అప్పటికే కనుమరుగవడం వల్ల కైలాసానికి దుఃఖం వస్తోంది. వచ్చే దుఃఖాన్ని దిగమింగుకుని స్టడీగా అన్నాడు- "కానివ్వండి! మీ మాట ఎందుక్కాదనాలి? మీ  బాకీ తీర్చాలి! అంతేగా! మా నాన్న మీ దగ్గర చేసిన అప్పుకి నన్ను మీకు తాకట్టు పెట్టేడు. అంతేకదా? తప్పకుండా మీ అప్పు తీర్చుకుంటాను. ఎప్పుడూ ఎలాగ అని అడక్కండి తీర్చుంటానంతే! తర్వాత మీయిష్టం!" కైలాసం కాలర్ని చిన్నస్వామి పట్టుకుని - కోడిపెట్టని లాక్కు వెడుతున్నట్టు పక్క సందులోకి తీసుకెడుతున్నాడు.                                                          *    *    * చింతామణి శారీమందిర్లోకి అడుగుపెట్టింది శారద. ఆమెను చూడగానే షాపు యజమాని ప్రసన్నవదనంతో 'రామ్మా! రా!" అని ఆహ్వానించేడు. ఆమె షాపులోకిరాగానే అడిగేడు- "ఒంటరిగా వచ్చేవే?" ఆమె షాపంతా కళ్లతో వెతుకుతూ అన్నది - "ఏం? ఒంటరిగా రాకూడదా?" "రాకూడదని కాదనుకో! ఎప్పుడోచ్చినా నీ వెంట ఒకరో ఇద్దరో ఫ్రెండ్స్ వుంటారు కదా! అదన్నమాట!" "ఫర్లేదు లేండి! ముగ్గురమూ ఎంత బిల్లు చేస్తామో! ఒక్కదాన్నీ అంతే చేస్తాను!" అన్నది శారద. షాపు యజమాని మెలికలు తిరుగుతూ అన్నాడు - "ఎంతమాట? ఆ మాట నేనడిగేనా? అవునమ్మా - నాన్నగారు ఊళ్లో వున్నారా?" అని మాట కూడా మార్చేడు. "ఉన్నారు. అవునూ - మీ దగ్గర సత్యమూర్తి అనీ-" "మీ క్లాస్ మెట్ అన్నావు! అతనే గదూ? ఎందుక్కనిపిస్తాడమ్మా! అప్పుడే - మీరొచ్చిన రోజే పంపించేశా!" "పంపించేసేరా? ఎక్కడికి?" అని ఆత్రంగా అడిగింది. "పంపించేసేనంటే - నా ఉద్దేశం - ఏదో కేంపుకి పంపించేనని కాదమ్మా! ఉద్యోగంలోంచి తీసేసి దిక్కున్న చోటకి పొమ్మన్నా!" ఆ మాటకి శారద షాక్  తిన్నది. అయ్యో పాపమని కూడా అనుకుంది. అయితే తాన్ ఫీలింగ్స్ కనిపించకుండా జాగ్రత్తపడి అడిగింది. "అతను మామూలుగా మంచివాడే! కదా?" "ఏమి మంచి? వల్లకాడు మంచి! నిజాలు చెప్పుకుంటో ఆకల్తో అల్లాడిపోతూ రికార్డు స్థాపించమని ఆశీర్వదించి పంపించేను. ఎక్కడికి వెళ్లేడో -ఏం చేస్తున్నాడో తెలీదు. ఏమ్మా? అతన్తో పనేమైనా పడిందా?" ఊహూ....ఊరికే అడిగేను! అంతే!....ఇవాళ మా రేవతి బర్త్ డే ! రేవతి మీకు తెలుసు గదా?" షాపు యజమాని క్షణం ఆలోచించి అన్నాడు. "తెలుసు.... పొడుగ్గా.. బక్కగా.... ఎర్రగా...." "అవును ఆ అమ్మాయే! దానికి బాగా నప్పే  చీర! ఖరీదెంతైనా సరే!" "అల్లాగేనమ్మా! అల్లాగే!" అంటో అతను కౌంటరు మీంచి లేచేడు.                                                                   25 రేవతి ఇంటిముందు శారద ఆటో దిగింది. డబ్బులిచ్చి ఆతోవాడ్ని పంపించి చీర పాకెట్టుతో ఆ ఇంట్లోకి అడుగుపెట్టింది. సరిగ్గా అప్పుడే ఆ ఇంట్లో  నుంచి ఒక పురుషకంఠం శ్రావ్యంగా  గానం చేయడం వినిపిస్తోంది. పక్కవాద్యాల హంగు లేమీ లేకుండానే అతనెంతో రాగయుక్తంగా, భావయుక్తంగా  మనోహరంగా పాడుతున్నాడు. "కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు -" ఆ కీర్తిన వింటో ముగ్దురాలవుతున్న శారద అక్కడే నిలబడి వుంది. తన్మయత్వంతో పరిసరాలను మరిచి పోయింది. ఆ పారవశ్యంలో వెంకన్న దివ్య స్వరూపాన్ని తనివితీరా తిలకిస్తోంది. తిలకించి పులకరిస్తోంది. పాట పూర్తయింది! ఒకానొక  తియ్యటి అనుభూతి నుంచి బయట పడినట్టు శారద గాఢంగా నిట్టూర్చింది. వెంటనే మరో పురుషకంఠం అదే  కీర్తనను ప్రాక్టీసు చేస్తోంది! ఆ ప్రాక్టీసు భయంకరంగా వుంది. కర్ణకఠోరంగా వుంది.  గొంతు పిసుకుతున్నట్టుగా వుంది. ఆ కంఠంలోంచి వెలువడే శబ్దాలు తుపాకీ గుళ్లులాగా మారిపోవడం వల్ల - చెట్టుమీది పక్షులు గుంపులు గుంపులుగా ఎగిరి పోతున్నాయి. మొక్కలకి నీళ్లు పోస్తున్న తోటమాలికి మతి స్తిమితం తప్పింది. మొక్కలకి పోసే నీళ్లను తాన్ నెత్తి మీద పోసుకుంటో గంతులు  వేస్తున్నాడు. శారద కూడా తాను వచ్చిన పని మరిచి పోయింది కాబోలు- పోడానికి వెనక్కి తిరిగింది. ఆమె వెనక్కి తిరగ్గానే భయంకరమైన ఆ  పురుషకంఠం  నుంచే వచ్చే కీర్తన కూడా ఆగిపోయింది. శారద వెళ్లబోతుండగా- "హాయ్ శారూ!"  అని రేవతి పిలిచింది. శారద ఆగిపోయింది. రేవతి శారదను చేరుకొని ఆప్యాయంగా అడిగింది- "వచ్చి ఎంత సేపైంది?" శారద సమాధానం చెప్పలేదు. చీర పాకెట్టు రేవతి చేతిలో పెట్టి- "మెనీ హేపీ రిటర్న్స్ ఆఫ్ ది డే!" అంది. "థాంక్స్! మన  వాళ్లంతా వచ్చే వేళయింది. మొట్టమొదట వచ్చింది నువ్వు! నీకు నా ప్రేత్యేక కృతజ్ఞతలు! రా కూచో!" రేవతితో పాటు హాల్లోకి వచ్చి కూచుంటో అడిగింది శారద- "ఎవరే పాడుతున్నారు?" "ఓహొ! అందుకా  భయపడి పారిపోవాలనుకున్నావ్? వర్షాకాలంలో కుక్కలు ఏడ్చినట్టు పాడుతున్నాడు కదూ?" "ఇంచుమించు అట్లాగే వుంది. ఇంతకీ ఎవరాయన?" "మా ఫాదర్!" ఆ మాట వినగానే  శారద నొచ్చుకుంటూ అన్నది- "సారీ  రేవతీ! మీఫాదరని తెలీకుండా కామెంటు చేసేను.ఏమీ అనుకోవద్దు!" రేవతీ నవ్వేస్తూ అన్నది- "ఎందుకనుకొడం? పోలిక చేసింది నేను!" "మీ  నాన్న కంటే ముందు పాడేరు చూడు" "అతనా అతను సంగీతం మేష్టారు! చాలా శ్రావ్యంగా పాడగలరు." "అంతేకాదు ఆయన పాడుతుంటే స్వామి వారినిచూస్తున్న అనుభూతి కలిగింది. గోల్డెన్ వాయిస్!" "మనిషి కూడా బంగారమే! ఎంత అందంగా వుంటాదో  అంత మర్యాదగా ప్రవర్తిస్తాడు. మా నాన్నకి ప్రమోషన్ రావాలంటే అన్నమయ్య  కీర్తన నేర్చుకోవాలని షరతు పెట్టేరుట - వాళ్ల చైర్మన్! అంచేత ట్యూషన్ చెప్పించుకుంటూ కష్ట పడుతున్నాడు మా నాన్న! వుండు .... కాఫీ తెస్తాను!" అని అక్కడ్నించి రేవతి వెళ్లిపోయింది.
24,521
    రాజారావుకి కోపమూ, నవ్వూ కూడా వచ్చాయి.     "ఎం.ఎల్.సి. అవుతానంటే నేనెందుకు మధ్య అడ్డు చెబుతాను? అయి తీరాల్సిందేననుకుంటే అవు" అన్నాడు రాజారావు సుడులు తిరుగుతున్న సిగరెట్ పొగలోకి చూస్తూ.     అరుంధతి అభిమానం లోతుగా దెబ్బతిన్నది. రోషం, కోపం ముప్పిరిగొన్నాయి మనసులో.     "మీరు ఉంచుకున్న మనిషికి ఎవరో ఎందుకు సీటు ఇస్తారు?" కసిగా అంది అరుంధతి.     రాజారావు ఓ క్షణం ఆమెకేసి చూశాడు, ఆమె కోపంతో బుసకొడుతున్న నాగినిలా కనిపించింది. రాజారావుకూ చాలా కోపం వచ్చింది.     "నువ్వు కోపంలో అన్నా నిజమే అన్నావు. దీన్నిబట్టి నీకు సమాజంలో వున్న స్థానం ఏదో నీకు బాగా తెలుసుననే తెలుస్తూంది. నువ్వు చాలా తెలివైనదానివి. ఈ సంగతి కూడా నీకు తెలిసే వుంటుంది. నేను వుంచుకున్న మనిషిని ఎం.ఎల్.సి.ని చెయ్యమంటే నలుగురూ ముఖం మీదే వూస్తారు." చాలా కటువుగా వుంది రాజారావు కంఠం.     అరుంధతి మనస్సు రోషంతో, అవమానంతో విలవిలలాడిపోయింది.     "ఎందుకు వుయ్యాలి? మనిద్దరం ఒకే తప్పు చేస్తున్నాం. నీకు మాత్రం సమాజంలో తలెత్తుకొని తిరిగే అధికారం వుంది. నిన్ను పదిమంది గౌరవిస్తారు. పూలదండలు వేస్తారు. కాని నేను ఆడదాన్ని, అందుకే...కాదు...నువ్వు నాకు సరైన స్థానం ఇవ్వలేదు. నీ జీవితంలో, నీ ఇంట్లో, అంటే- నువ్వే నన్ను గౌరవించలేదు. అందుకే సమాజం కూడా గౌరవించటంలేదు." అరుంధతి కంఠంలో ఏ భావమూ ధ్వనించలేదు. నిర్లిప్తంగా అన్నది.     "నేను నీకు తగినంత గౌరవాన్ని ఇచ్చాను. నేను చాలా భరించాను, ఇంక భరించే ఓపిక లేదు నాలో. బయట తలెత్తుకోకుండా వున్నాను. ఢిల్లీ వరకూ నామీద రిపోర్టులు పోయాయి. ఈ ఎలక్షన్స్ లో గెలిచే నమ్మకం కూడా లేదు. నా ఆరోగ్యం కూడా బాగా దెబ్బతిన్నది."     అరుంధతికి రాజారావు మీద అసహ్యం వేసింది, లోకం మీద అసహ్యం వేసింది, తనమీద తనకే అసహ్యం వేసింది.     "మీరంత అనిష్టంగా ఇక్కడకు రానక్కరలేదు." కోపంలో అనేసింది అరుంధతి.     "అదే నీ కోరిక అయితే అలాగే జరుగుతుంది." రాజారావు చాలా కాలంగా ఆ మాట కోసమే ఎదురు చూస్తున్న వాడిలా చివుక్కున లేచి నిల్చున్నాడు. విసురుగా బయటకు వెళ్ళిపోయాడు. అరుంధతి కళ్ళప్పగించి చూస్తూ కూర్చుండిపోయింది. ఆమెకు మతి పోయినట్టయింది. అంతకు ముందు ఎన్నోసార్లు ఇంతకంటే ఎక్కువ మాటలు అన్న రోజులున్నాయి. అతను చిన్న పిల్లవాడిలా తన దగ్గర ఏడ్చిన రోజులు వున్నాయి. ఒకసారి చాలాకాలం క్రితం దాదాపు పది సంవత్సరాల క్రితం ఒకసారి కోపంలో ముఖం కూడా చూపించవద్దన్నది. దానికి అతను ఏడ్చాడు. బాధ పడ్డాడు. అతను అంత బాధపడడం తను సహించలేకపోయింది. పసివాణ్ణి లాలించినట్లు లాలించి బుజ్జగించింది. తనను చూడకుండా వుండలేను అనేవాడు. తను లేని జీవితానికి అర్ధమే లేదని ఎన్నిసార్లు అనలేదు? అవును! ఆ రోజులు వేరు. ఆ రోజుల్లో తను వయస్సులో వుండేది. శరీరంలో ఆకర్షణ వుండేది. అతనిలో చెలరేగిన కోర్కెలు, బలిసిన గుర్రాల్లా పరుగులు తీసే రోజులు అవి. ఈనాడు తనలో ఆ ఆకర్షణ లేదు. ఆయనలో ఆ కోర్కెలు లేవు. దీనికోసమేనా తను ఇంత సాహసం చేసింది? ఈ రోజుకోసమేనా తను భర్తనూ, కన్నబిడ్డనూ, వంశ గౌరవాన్నీ కాలదన్ని వచ్చింది? ఈ నిమిషం కోసమేనా జీవితం తనకిచ్చిన హాలాహలాన్నంతా నవ్వుతూ తాగింది? ఇందుకేనా? ఇందుకేనా?     అరుంధతికి ఆలోచించే శక్తి కూడా లేదు. అలాగే కూచుని వుండిపోయింది.     "నేను వెళ్ళొస్తా."     అరుంధతి త్రుళ్ళిపడి తలెత్తి చూసింది. ఎదురుగా విమలాదేవి నిల్చొని వుంది. అర్ధం కానట్లు చూసింది అరుంధతి. జవాబు కూడా ఎదురుచూడకుండానే బయటకు వెళ్ళిపోయింది విమలాదేవి. ఒక్కక్షణంలో తను ఎంత ఎత్తునుంచి కిందపడిపోయిందో అర్ధం అయింది. తను ఇంతకాలంగా ఒక మంచుకొండమీద నిల్చొని వుంది. అది క్రమంగా, ప్రతిక్షణం, తనకు తెలియకుండానే కరుగుతూ వచ్చింది. తనుమాత్రం ఆ మంచు కొండను నిజమైన కొండగానే భావించి గర్వించింది. ఈనాడు ఆ కొండ పూర్తిగా కరిగిపోయిది. తను ఒంటరిగా చీకటి లోయలో మిగిలిపోయింది.                                        30     అధికారపక్షంలో వున్న రాజారావు అనుచరులు, రాజారావు రాజకీయ జీవితాన్ని గురించి తమలోతాము చర్చించుకోసాగారు. అధికార పిపాస నెత్తికెక్కిన రాజారావుకు అరుంధతితో వున్న అనురాగ బంధాన్ని తెంచుకోవటానికి అట్టేకాలం పట్టలేదు. అంత బాధగానూ అనిపించలేదు.     రాజారావుకూ అరుంధతికీ చెడిందనే వార్త ఇట్టే గుప్పుమనిపోయింది. మరునాటినుంచే ఆ ఇంటి గేటుముందు కార్లు ఆగలేదు. మనుషులు రావటంలేదు, నాగేంద్రరావు మాత్రం రెండు రోజులపాటు వచ్చాడు. ఆ తరవాత అతనూ పత్తాలేడు. ఆ ఇంటి తలుపులు ఎప్పుడూ మూసుకొనే వుంటున్నాయి. వేసిన తలుపులు తెరవాల్సిన అవసరం కలగటంలేదు.     ఇప్పుడు జీతం ఇచ్చి పెట్టుకున్న వంటమనిషీ, తోటమాలీ మాత్రం వున్నారు. డ్రైవర్ కు పనిలేదు. కాని ప్రతినెలా మొదటి తారీఖున వచ్చి జీతం తీసుకెళుతున్నాడు. ఆ గేటుదగ్గర మనిషి లేడు. పనులు చేయించుకున్న వాళ్ళుకూడా ఒక్కసారైనా మర్యాద కోసమైనా రాలేదు. పదిరోజుల తరువాత ఓనాటి రాత్రి రాజారావు వచ్చాడు. కాని తలుపులు తెరవబడలేదు. ఓ పదినిముషాలు అలాగే నిలబడి గిర్రున తిరిగివెళ్ళిపోయాడు. మళ్ళీ అటుకేసి రాలేదు. ఆమె ఏమయిందో, ఎలా వుందో కనుక్కోవాలని తోచలేదు. ఎలక్షన్స్ హడావుడి వచ్చింది.     ఈసారి ఎలక్షన్ లో కాంగ్రెసుకు దేశంలో అనుకోనివిధంగా అపజయం ఎదురైంది. రాష్ట్రంలో రాజారావు పార్టీవాళ్ళు చాలా మంది గెలిచారు. కాని రాజారావు ఓడిపోయాడు. డిపాజిట్ కూడా రాలేదు. రాజారావు వ్యతిరేక పార్టీవాళ్ళు అధికారంలోకి వచ్చారు.     రాజారావు ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నది. రాజకీయ జీవితంపట్ల విరక్తి, జీవితంపట్ల నిర్లిప్తత వచ్చేసింది. అరుంధతికి అన్యాయం చేశానేమోననే బాధ హృదయంలో ఓమూల లేకపోలేదు. అయినా ఆమె దగ్గరకు మళ్ళీ వెళ్ళాలని లేదు. స్వంత ఊళ్ళో వ్యవసాయం చేయించుకోవాలంటే హైదరాబాదునుండి మకాం ఎత్తేశాడు.                                          31     అరుంధతి అంత పెద్ద ఇంట్లో వంటరిగా, శ్మశానవాటికలోని మోడువారి పొగబారిన చెట్టులా వుంది. గత స్మృతుల్ని నెమరువేసుకుంటూ గంటలకొద్దీ కూర్చున్నచోటే కూచుని పోయేది. మాట్లాట్టానికి ఎవరూ లేరు. ఉన్న పనివాళ్ళతో మాట్లాడాలనిపించేది కాదు. వాళ్ళు ఏం చేస్తున్నా, ఎలా పనులు చేసుకుపోతున్నా పట్టించుకొనేది కాదు. అప్పుడప్పుడు ఆమెకు ఆ ఇంటినుంచీ, ఆ వాతావరణంనుంచీ, ఆ వూరినుంచీ దూరంగా ఎక్కడికో పారిపోవాలనిపించేది. ఎక్కడికి వెళ్ళినా తనతోపాటు వచ్చేది తన బోలుజీవితమే. అది నిండదు. ఆ ఖాళీ తనను వెంటాడుతూనే ఉండిపోతుంది. ఎక్కడకు వెళ్ళినా తాను వంటరిమనిషే!     తోచనప్పుడల్లా, మనుషుల ముఖాలకు వాచిపోయినప్పుడల్లా వరండాలోకివచ్చి నిలబడేది. ఆనాడు సాయంత్రం ఏడు గంటలయినా ఈ చెవులో వడగాలి ఆ చెవిలోకి కొడుతూంది. తన జీవితం, తన హృదయం కూడా అలాగే మండిపోతున్నట్టు అనిపించింది. ఆకులు రాలిన చెట్లను చూసి తన జీవితంతో పోల్చుకొనేది. తోటంతా క్రమంగా ఎండిపోతూంది. మొక్కలకు నీళ్ళుకూడా సరిగాపోసేవాళ్ళులేరు.     తొలకరి వానలు ప్రారంభం అయాయి. భూమినుంచి ఆవిరి ఒక్కసారిగా పైకి వచ్చింది. తమాషా వాసన వస్తూంది. ఆ వాసన అంటే ఒకప్పుడు అరుంధతికి చాలా ఇష్టం. ఎండిపోయిన మొక్కలు జీవం పోసుకుంటున్నాయి. ప్రకృతి పచ్చని చీరలో పెళ్ళికూతురులా నిండుగా కలకలలాడుతూంది. కాని అరుంధతి జీవితంలో ఎటువంటి మార్పులేదు. వంటమనిషికి ఒకే కూతురు. ఆ పిల్ల వానలో ఆడుకుంటూ చిందులు తొక్కుతోంది. అరుంధతికి మాధవి కళ్ళకు కనిపించింది. వర్షం పడుతుంటే తప్పటడుగులు వేస్తూ వర్షంలోకి పరుగెత్తేది; ఇంటిముందు వున్న నీళ్ళలో కాగితం పడవల్ని నడిపిస్తూ తండ్రి పిల్లను ఆడించేవాడు; అరుంధతి గడపలో నిల్చొని కూతుర్ని చూసుకుంటూ మురిసిపోయేది. ఇక శాంతమ్మ విషయం చెప్పనే పనిలేదు.     అరుంధతికి ఇప్పుడు ఆలోచించటానికి మిగిలింది ఒకే ఒక వస్తువు. అది మాధవి. రాత్రింబవళ్ళు మాధవిని గురించే ఆలోచిస్తూ కాలం గడిపేది. వరండాలో నిల్చొని, రోడ్డుమీద నడుస్తున్న వయస్సులోవున్న అందమైన ఆడపిల్లల్లో తన కూతుర్ని చూసుకోవాలని తాపత్రయ పడేది. ఒక్కసారి తనకు మాధవిని చూపించమని భర్తకు నాలుగైదు ఉత్తరాలు రాసింది. ఆ ఆశా ఇప్పుడు ఆమెకు లేదు.     వారంరోజులుగా ఒకటే ముసురు. వరండాలో నిల్చొని అరుంధతి బయటకు చూస్తూంది. ఏదో వచ్చి అరుంధతి ముఖానికి గట్టిగా తగిలింది. త్రుళ్ళిపడి చూసింది. అప్పటికే మరికొన్ని వడగళ్ళు ఆమె నెత్తిమీదా, ముఖంమీదా టపటప పడ్డాయి. దెబ్బలు తగులుతున్నా, ఆమెకు అక్కడ నుంచి కదలాలని లేదు. వరండాలో పడ్డ రెండు వడగళ్ళను తీసి నోట్లో వేసుకుంది. నాలుక జివ్వుమన్నది. గతం కళ్ళముందుకొచ్చి నిలచింది. అవి తను కొత్తగా కాపరానికి వెళ్ళినరోజులు. పెద్ద వడగళ్ళ వర్షం వచ్చింది. తను సరదాకొద్దీ ముంగిలి ముందు వడగళ్ళను ఏరి గ్లాసులో వేస్తూంది. తాను తడిసిపోతున్నందుకు భర్తా, అత్తా లబలబలాడారు. తను వినిపించుకోలేదు. సీతాపతి కూడా వర్షంలోకి వచ్చి భార్య చేతిగ్లాసులో వడగళ్ళు ఏరి వెయ్యసాగాడు. శాంతమ్మ-కొడుకు వర్షంలో తడిస్తే జబ్బు పడతాడని మొత్తుకుంది.     అరుంధతి కిందకు చూసింది. వడగళ్ళు తెల్లగా కుప్పలు కుప్పలుగా పడివున్నాయి. చిన్నగా కళ్ళముందే కరిగిపోతున్న వడగళ్ళను చూస్తూ, తన జీవితాన్ని వాటి జీవితంతో పోల్చుకుంటూ నిట్టూర్చింది.     గణగణ ఫోను మోగింది. అరుంధతికి ఆశ్చర్యం వేసింది - ఆ సమయంలో తనకు ఫోనుచేసేవారు ఎవరా అని? బహుశా రాంగ్ నెంబరు అయివుంటుందనుకుంది. ఫోను ఆగిపోయింది. చేతి గడియారం చూసుకుంది. సరిగ్గా పది. సరిగా ఇదే సమయానికి రాజారావు రోజూ ఫోను చేసేవాడు. తాను వచ్చినా రాకపోయినా, తాను ఎక్కడవున్నా ఎన్ని పనుల్లో వున్నా పది గంటలకు తప్పక ఫోను చేసేవాడు.     ఫోను మళ్ళీ మోగింది. తనకే అయివుంటుంది. రాజారావే చేసి వుంటాడేమో! హైదరాబాదు వచ్చి వుంటాడేమో! ఉద్వేగంతో లోపలకు పరుగెత్తి, ఫోను రిసీవర్ మీద చెయ్యివేసింది. కాని ఎత్తుకోలేదు. కొంచెంసేపు నొక్కిపట్టి మళ్ళీ వరండాలోకి వచ్చింది. తప్పక రాజారావే అయివుంటాడు అంతకంటే తనకు ఫోను చేసేవాళ్ళు ఎవరూ లేరు. తీసి వుండాల్సింది. ఏమనేవాడో? ఎలా వున్నాడో? ఒకసారి అతన్ని చూడాలని కూడా వుంది.     మళ్ళీ ఫోన్ మోగింది. నిదానంగా వెళ్ళి రిసీవర్ తీసి చెవుదగ్గర పెట్టుకుంది. అది గుంటూరు పబ్లిక్ కాల్ ఆఫీసునుంచి. గుంటూరునుంచి తనకు ట్రంక్ ఫోనా? అయితే రాజారావే? ఎందుకు చేసివుంటాడు? మాట్లాడాలని హృదయం ఉద్రేకపడుతూంది. వద్దని మనసు పెనుగులాడుతూంది.     "అరుంధతి?" అటునుంచి.     "యస్ అంది." అరుంధతి.     "మాట్లాడండి పార్టీతో!" అంది ఎక్స్చేంజిలో గొంతు.     "ఎవరు?" అటునుంచి.     "మీ రెవరు?"     "నేనెవర్నయితే నీకేంలే? ఎవరు మాట్లాడుతుంది?" కంఠం కటువుగా వుంది. రాజారావు గొంతుకాదు. తనకు పొరపాటున ఎవరి కాళో కనెక్షన్ ఇచ్చి వుంటారు అనుకుంది.     "నా పేరు అరుంధతి."     "నీకు మాధవిని చూడాలని వుంది కదూ?"     అరుంధతికి అర్ధం కాలేదు. మాధవి! ఎవరు మాధవి అంటున్నారు? తను పొరపాటుగా వినలేదు కదా!     "ఎవరు నువ్వు?" అరుంధతి అరచినంత పనిచేసింది.     "అది నీకు అనవసరం. మాధవిని నీవు చూడాలనుకుంటే ఈ రాత్రికి ఇందుపల్లి రా. పన్నెండు తరువాత రావాలి. తెల్లవారుఝామున ఐదు లోపలే రావాలి. ఆ తరువాత వచ్చినా, ఈ రోజు నువ్వు రాకపోయినా మాధవి నీకు కనిపించదు." కొండలు బద్దలు చేసుకొని వచ్చిన శబ్దంలా ఆ మాటలు ఆ గొంతును బద్దలు చేసుకుంటూ వచ్చాయి.     "మాధవి కులాసాగా వుందా?" వణుకుతున్న కంఠంతో ప్రశ్నించింది అరుంధతి. జవాబుగా అవతల ఫోను పెట్టగా "ఖంగ్" మనే శబ్దం చెవుల్లో మోగింది. అరుంధతి ఆ రిసీవర్ ను అలాగే పట్టుకొని ఎంతసేపు నిలబడిందో ఆమెకే తెలియదు.     ఆమెకు బుర్ర పనిచెయ్యటంలేదు. మాధవి! మాధవికి ఏమయింది? తననెందుకు అంత అర్దరాత్రి రమ్మన్నట్టు? అలా జరగదు. జరగటానికి వీల్లేదు. మాధవి కులాసాగానే వుంది. తను ఎన్నో ఉత్తరాలు ప్రాధేయపడుతూ రాసింది. మాధవికి పెళ్ళి జరగబోతూందేమో? ఆ తరవాత తనకు చూసే అవకాశం వుండదని సీతాపతికి జాలివేసి ఈ అవకాశాన్ని కల్పించాడు - అంతే! కాని ఆ రాతి మనిషికి జాలా? ఆ కంఠంలో కసి కరుడుకట్టివున్నట్లు తనకు వినిపించింది. ఏమయినా తను వెంటనే వెళ్ళాలి.     తోటమాలిని పంపించి డ్రైవర్ని పిలిపించింది. డ్రైవరు రాగానే ఇంటికి తాళాలువేసి, వున్నపాటున వెళ్ళి కార్లో కూచుంది. పదకొండు దాటింది.     కారు శరవేగంతో విజయవాడ రోడ్డుమీద పోతూంది. అంతకంటే వేగంగా ఆమె మనసు పరిగిడుతూంది.     కారువేగం హెచ్చించమని డ్రైవర్ని హెచ్చరించింది. డ్రైవరు గొణుక్కున్నాడు, విని వూరుకుంది. ఒకప్పుడు తను ఎన్ని తిట్టినా పెదవి కదిపేవాడుకాదు. ఆరు నెలలుగా వాడికి జీతం దండగ్గా ఇస్తూంది. అయినా వాడు విసుక్కుంటున్నాడు. అరుంధతి విషాదంగా తనను చూసి తనే నవ్వుకున్నది.     ఆమె సీటుకు చేరబడింది. ఆలోచనలతో బుర్రంతా చెదలపుట్టలా వుంది.     తనను చూసి అత్తగారు ఏమంటుందో? బహుశా మాట్లాడదు. ముఖం తిప్పుకుంటుందేమో? తన బిడ్డ తనను గుర్తిస్తుందా? తన ఫలానా అని చెప్పుకోవాలా? తన బిడ్డ తనను అసహ్యించుకోకుండా తన గుండెలమీద వాలిపోతుందా? ఒక్కసారిగా లేచి లేగదూడలా పరుగెత్తుకొచ్చి తనను చుట్టుకుంటుందా?     మాధవిని తను తీసుకొని రాకపోవటమే మంచిదయింది. కాదు, అతను తన వెంట పంపించక పోవటమే మంచిదయింది. తనతో వస్తే ఈ వాతావరణంలో ఎలా పెరిగి వుండేదో? తను పెళ్ళి చెయ్యగలిగి వుండేదా? చెట్టంత తండ్రి చల్లని నీడలో, అమృత హృదయురాలైన నాయనమ్మ చేతికింద తన మాధవి పెరిగింది. ఆమెకు అంతకంటే ఇంకేం కావాలి? వయస్సులో వున్న మాధవి ఎలా వుందో? తను కౌగిలించుకుంటే తన తలకుపైనే ఆమె తల వుంటుందేమో!
24,522
    వీరయ్యగారి ఇంటికి సైతం అనేక గ్రామాల నుంచి జనం వచ్చేశారు. అక్కడ ఏవేవో చర్చలు జరుగుతున్నాయి. సమావేశాలు జరుగుతున్నాయి. చివరకు శిస్తులు కట్టాల్సిన అవసరం లేదన్నాడు రఘు, నాగేశ్ బలపర్చాడు. ఆకలితో చచ్చేవాని దగ్గర శిస్తులు అడగడం అన్యాయం అన్నది జానకి. జనం కుక్కల్లా చస్తుంటే కుక్కల పెళ్ళి చేస్తాడట నవాబు, వెక్కిరించాడు భీముడు. జనాన్ని చంపుతున్నారు. అందుకేం చేయాలి? ప్రశ్నించాడు రావఁడు.     "విప్లవం వర్థిల్లాలె" పిడికిలి బిగించి, గొంతు చించుకొని కేకవేశాడు నాగేశ్. అతని కళ్ళు ఎర్రబడ్డాయి. రక్తం కక్కుతున్నాయి. వళ్ళు వణకుతూంది.     వచ్చిన జనానికి ఏమి అర్థంకాలేదు. ఒకరి ముఖాలు ఒకరు చూచుకున్నారు. ఏవో గుసగుసలు బయలుదేరాయి. జనం గుంపులుగా విడిపోయారు. చర్చలు సాగాయి. ఏదో మార్గం కనిపెట్టాలి. జనం తాసిల్దారు ఇంటి ముందు చస్తున్నారు. వెంకయ్య ఇంట్లో గుల్ల అవుతున్నారు. వారి శిస్తులు ఎవరు కట్టాలి? అదీ రెండింతలు! తమ శిస్తులు. అసలు వీరయ్యగారు ఏమనుకుంటున్నారు? ఆయన్నే అడగాలనుకున్నారు. అంతా ముక్త కంఠంగా అడిగేశారు.     "నేను శిస్తు కట్టను. ఇది అన్యాయం...' అనేశారు వీరయ్యగారు. అంతా వారి ముఖం చూచారు. కళ్ళలో దృఢనిశ్చయం కనిపించింది. గంభీరంగా ఉన్నారు వారు. నిశ్చలంగా ఉన్నారు. అది వారి ప్రతిన! ప్రతిజ్ఞ!!     ఆ మాట ప్రజలతో పాటు శిస్తులు వసూలు చేయడానికి వచ్చిన మస్తాను బృందమూ విన్నది. తుపాకులతో పోలీసులు, దుడ్డుకర్రలతో దుర్మార్గులు, తలారులు గుమ్మందాటి లోనికి వచ్చేశారు.     "తాసిల్దారు శిస్తు కట్టమన్నడు" మస్తాన్ అధికార స్వరం.     "నేను కట్టను" వీరయ్యగారి దృఢనిశ్చయం.     జనాన్ని చూచి జంకాడు మస్తాన్. అయినా అన్నాడు "గొడ్లను పట్క పోతం."     "పట్కపోరి" వీరయ్యగారు అనుమతించారు. అంతా తెల్లబోయి చూచారు.     "ఎట్ల పట్టుకపోతారో చూస్త. ఇయ్యాళ తేలిపోవాలె" అని గొడ్లకొట్టానికి ఎదురుగా నుంచున్నాడు నాగేశ్.     జనం అంతా అతనని అనుసరించారు, జనకుడ్యం నిర్మించారు.     "ఈణ్ణించి కదిలెడెదిలేదు. మేము చావాలె గొడ్లుపోవాలె" అన్నాడు భీముడు-కాదు-అరచాడు భీముడు.     మస్తాన్ గుండె గుబ గుబలాడింది. అయినా ముందుకు అడుగు వేశాడు. నాగేశ్ ను లాగాడు. నాగేశ్ లాగి లెంపకాయ కొట్టాడు. తల గిర్రున తిరిగింది మస్తాన్ కు. తూలి పడబోయి నిలదొక్కుకున్నాడు. జనంలో ఉద్రేకం పెరిగింది. పోలీసులమీద పడ్డారు.     పరిస్థితి విషమిస్తూంది, చేయిజారిపోతూంది. పరిగెత్తారు రఘు, జానకి ప్రజలను శాంతింపచేయడానికి, వినేట్టులేరు. రఘును నెట్టేశారు. జానకి పడిపోయింది.     వీరయ్యగారు పరుగెత్తారు. గర్జించారు. "ఇది నా సొంత సంగతి. ఇందుల మీ జికర్ లేదు. జరుగుండి అడ్డం. పట్కపోనియ్యండి గొడ్లను" గర్జనతోపాటే రుద్రులై గుంపులో దూకాడు. జానకిని లేవదీసి పోలీసులను విడిపించారు.     జనం పక్కకు తిరిగి రాతిబొమ్మల్లా నుంచున్నారు. విచిత్రం జరిగింది. మాయ జరిగింది. గారడి జరిగింది. ఒక్కడు కదల్లేదు. ఒక్కడు మసల్లేదు. చిత్రకారుడు గీసిన చిత్రంలా నుంచున్నారు. నాటకంలోని సన్నివేశంలా నుంచున్నారు. కనీసం ఊపిరి పీలుస్తున్న జాడ కనిపించలేదు.     పోలీసులు కొట్టంలోకి దూరారు. పశువులను విప్పారు. ఒక్కొక్కదాన్నే లాక్కొనిపోతున్నారు. అంత జనం మధ్య నుంచి తీసికెళ్తున్నారు. వీరయ్యగారు గంభీరంగా నుంచున్నాడు. దుఃఖాన్ని గుండెలో దాచుకున్నాడు. అది ముఖంలో కనిపిస్తూనే వుంది. సావిత్రిని లాక్కోపోతున్నారు. తన భార్యపేరు పెట్టి పెంచుకున్న ఆవు అది. మోర ఎత్తి వీరయ్యగారిని చూచింది. అంబా అని అరిచింది. వారిముందు క్షణం నుంచుంది. దాన్ని లాక్కుపోయారు. వీరయ్యగారి కళ్ళనుంచి టపటపా కన్నీరు రాలింది. జనం యావత్తూ విలవిల్లాడారు. అమాంతంగా ఒక గాలితెర వచ్చింది. దుమ్మును గిరగిరా సుడితిప్పి ఆవు వెనుక వెళ్ళిపోయింది.     ఆఖరి పశువు గంగమ్మ. అది లేగదూడ. తన చేతితో పచ్చిక మేపి పెంచింది జానకి. అది సావిత్రి బిడ్డ. గజ్జ గల్లు గల్లు మంటూండగా లాక్కుపోతున్నాడు మస్తాన్. అది ఒక్క గంతు వేసింది. జానకి కాళ్ళ దగ్గర వాలిపోయింది. జానకి గుండెల్లో సముద్రం పొంగింది. గంగమ్మను కావలించుకొని హోరుమని ఏడ్చేసింది. దాన్ని విడువలేదు. ఒళ్ళు నిమిరింది. తల ముద్దాడింది. గంగమ్మను వదలనన్నది. వీరయ్యగారు ప్రతిమలా నుంచున్నారు. కళ్ళల్లో నీళ్ళు నిండివున్నాయి. కదల్లేదు. రఘు వచ్చి దూడను విడిపించాడు. రఘు భుజం మీద వాలిపోయింది జానకి. పెద్దగా ఏడ్చింది. కన్నీరు జల జల రాల్చింది. ఇంక రాయడం కష్టం. గంగమ్మ వెళ్ళిపోయింది. దాని గజ్జెల చప్పుడు ఇంకా వినిపిస్తూనే ఉంది. అందరి గుండెలలో గల గలలాడింది. ఎందరి గుండెలు అగ్గిపర్వతాలైనాయో, ఎందరి గుండెలు మహాసముద్రాలైనాయో ఎలా చెప్పడం?     సూర్యుడు మాత్రం సిగ్గుపడి క్రుంగిపోయాడు.     ఆ రాత్రి జరిగిన సమావేశంలో వీరయ్యగారు పెదవి కదపలేదు. నాగేశ్ చాలా తీవ్రంగా మాట్లాడాడు. ప్రజలను రెచ్చగొట్టే బదులు వారిలోని ఉద్రేకాన్ని అణచివేయడం జరుగుతూందన్నాడు. తాసిల్దారు ఆడిన ఆటకల్లా తాళం వేయడానికి ఇంత అట్టహాసం ఎందుకు? అని అడిగాడు. జనమంతా కంటికి ఏకధారగా ఏడుస్తున్నప్పుడు తామూ ఏడ్చేందానికంటె సన్యాసం పుచ్చుకోవడం మంచిదన్నాడు. ఇది భూస్వాములకున్న లక్షణమే అన్నాడు.     "నాగేశ్! మామయ్య మీద ఆరోపణ చెయ్యకు. ఒక హత్య జరిగి ఎంత గడగడ జరిగిందో చూచినవు. జనాన్ని బాధపెట్టిందానికంటే తానే బాధపడటం మంచిదనుకున్నారు. వారిని తప్పు పట్టటం మంచిదికాదు. ముందు మనం ఏమిచేయాలె అనే విషయం అలోచించాలె" అన్నాడు రఘు.     "తిరుగుబాటు. అంతకుమించిన మందులేదు. ఊరంతా తాసిల్దారు ఇంటి మీద పడాలె...గొడ్లను విడిపించుకోవాలె, తాసిల్దారును ఖాతం చేయాలె, అంతే."     "తెల్లవారి పోలీసుబలం దిగుతుంది. గొడ్లను మళ్ళ పట్టుకుంటది. ఊరంత తగలపెడ్తది. అప్పుడేం చేస్తం?"     "ఏం చేస్తమా? పోలీసుల్ను ఖతం చేస్తం."     "అది అంత తేలిక కాదు నాగేశ్! సరే నాకొక ఆలోచన వచ్చింది. జాగీర్దారుమీద కేసు పెడ్దాం...కరువు వచ్చినపుడు రకాలు వసూలు చేయరాదని. ఏమంటావ్?"     ఆ ఆలోచన నాగేశ్ కు తట్టలేదు. ఆలోచించాడు. అన్నాడు "నాకు కోర్టుల మీద విశ్వాసం లేదు. న్యాయం కలుగుతుందని నమ్మకం లేదు. అయినా ప్రయత్నించు."     కోర్టుకు పోవాలనే విషయం నిర్ణయం అయింది. వీరయ్యగారి పేర దావా వేయాలి. వకీలు రఘు.     సమావేశం నుంచి తిరిగివస్తున్నారు నాగేశ్, భీముడు. గస్తీ తిరుగుతున్న ఇద్దరు పోలీసులు కనిపించారు. ఇద్దరూ చీకట్లోకి నక్కారు పోలీసులు వారిని దాటి వెళ్ళిపోయారు మాట్లాడుకుంటూ. కాని వారికి ఏదో అలికిడి వినిపించింది. అక్కడే నిలిచి బీడీలు కాల్చుకున్నారు. అగ్గిపుల్ల వెలుగుకు ఏవో రూపాలు కనిపించాయి. అనుమానం కలిగింది. కరువుకు దొంగలు ఎక్కువైనారు. దొంగలే అనుకున్నారు. పట్టాలనుకున్నారు. తుపాకులు బుజాలకు ఉన్నదీ లేనిదీ చూచుకున్నారు. రెండడుగులు ముందుకు వేశారు. మళ్ళీ అడుగు వేయకుండానే "కౌన్ హై" అడిగారు ఇద్దరూ. మళ్ళీ ఏదో అలికిడి వినిపించింది. నాగేశ్, భీముడు కూర్చున్నారు. ఆ అలికిడికి జంకారు పోలీసులు. అయినా ముందుకు అడుగువేసి అగ్గిపుల్ల గీశారు. ఆ వెలుగుకు రెండు ఆకారాలు కనిపించాయి. "ఎవరు?" అని ఇంకా దగ్గరికి వచ్చారు. అప్పుడు గుర్తించారు "ఓహో లీడర్లా" అని మరీ దగ్గరికి వచ్చారు.     కూర్చున్నవారు లేవలేదు.     ఇద్దరూ ఇద్దరు పోలీసుల కాళ్ళమీద పడ్డారు. క్షమించమంటూ కాళ్ళు గట్టిగా పట్టుకున్నారు. పోలీసులు కదలలేకుండా అయిపోయారు. 'లేవండి-లేవండి. ఏమీ అనం' అంటూనే వున్నారు. ఇద్దరూ ఇద్దరు పోలీసుల కాళ్ళు పట్టుకొని లాగడమూ పోలీసులు కింద పడిపోవడమూ వారి రొమ్ములమీద కూర్చొని గొంతులు పిసకడమూ క్షణంలో జరిగిపోయాయి. ఇద్దరు పోలీసుల ప్రాణాలు ఆకాశంలో కలిసిపోయాయి. ఇద్దరి దగ్గరినుంచీ తుపాకులూ, తూటాలు తీసుకున్నారు. ఇద్దరూ తుపాకుల్లో తూటాలు దూర్చి రెండు కళేబరాల గుండెల్లో కాల్చారు. తుపాకులు తగిలించుకొని పారిపోయారు.     తుపాకులు పేలిన ధ్వనికి చుట్టుపట్ల వాళ్ళు లేచారు. చూస్తే పోలీసులు రక్తపు మడుగులో పడివున్నారు. హడలిపోయి కేకలు పెట్టారు. క్షణంలో ఊరంతా ఏకం అయింది. అంతా అక్కడ కూడింది. రెండు పోలీసు శవాలు రక్తంలో తేలుతున్నాయి. అందరూ సంతోషించారు. అందరూ హడలిపోయారు. వీరయ్యగారూ, రఘు, జానకి కూడా వచ్చారు. వారి హృదయాలు పరితపించాయి.     తెల్లవారింది. తాసిల్దారు గుండె గుబగుబ లాడింది. పోలీసుల శవాలను పూడ్పించాడు. పోలీసుల చావుకంటే పోయిన తుపాకులను గురించి ఆయనకు బెంగ పట్టుకుంది. తీసుకొని పోయిందెవరో అతనికే కాదు ఊరందరికీ తెలిసిపోయింది. కాని ఏం చేయాలో అర్థంకాలేదు. ఒకసారి ఊరంతటినీ హడలుకొట్టాలనుకున్నాడు. హడలుకొట్టాడు. పోయిన రెండు తుపాకుల ఖరీదు వూరిమీద వసూలు చేశాడు. తన ఇంటికి రోజూ పోలీసు కాపలా ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు మస్తాన్ కూడా పోలీసు అయిపోయాడు. అతనికీ తుపాకి వచ్చేసింది.
24,523
    తల్లి మాటలకు కొద్దిగా బాధపడినా, మళ్ళీ ఏదో గుర్తుకు వచ్చినట్లు నవ్వుకుంటూ దొడ్లోకి వెళ్ళిపోయింది రాధ.     కూతురు నవ్వుకోవటం చూచిన శారదాంబకు మరీ చిన్నతనంగా వుంది. కాని రాధని చూసి అప్పుడు కోపం రాలేదు. జాలి కలిగింది దాని జీవితం ఎట్లా వుంటుందో ఆని ఆమె నిరంతరం తలపోస్తూనే వుంటుంది. ఇంతవరకూ రాధకు పెళ్ళికాలేదు. ఇహ ముందు మాత్రం ఏ విధంగా జరుగుతుంది - ఎవరూ పూనుకోకుండా వుంటే? ఉదయం లేచింతర్వాత ఆమెకు ఎప్పుడైతే యిలాంటి ఊహలు కలిగాయో ఇహ ఆ రోజంతా చికాకుగానే వుంటుంది. ప్రతి చిన్న సమస్యా పెద్ద సమస్యలాగానే  కనిపిస్తుంది.     తరువాత నారయణకూడా లేచి వచ్చాడు. అతను తల్లితో ఏమీ మాట్లాడకుండానే పెరట్లోకి వెళ్ళిపోయాడు. ఛాయను కేకేసి వాసుగాడ్ని లేపు తల్లీ" అంది శారదాంబ.     "వరేయ్ అన్నాయ్!"     వాసుకు మెలకువ రాలేదు.     చాయ అతన్ని పట్టుకుని కుదుపుతూ "లేవరా అన్నాయ్ "అంది.     వాసు బద్దకంగా కళ్ళు విప్పి "అబ్బ, ఉండవే" అన్నాడు.     "అమ్మ రమ్మంటుందిరా?"     "అబ్బ ఇంకాస్సేపు పడుకుంటానే."     "సరే, యీ విషయం అమ్మతో చెబుతానుండు" అంటే, నెత్తిమీద ఒక మొట్టికాయ వేశాడు. "అమ్మా చూడవే!" అంటూ ఛాయ తల్లి దగ్గరకు వెళ్ళింది.     మధ్యాహ్నం పన్నెండయినా చిదంబరం ఆటలోంచి లేవలేదు. అప్పుడప్పుడూ భోజనం చేయకుండానే ఆటలో కూర్చోవటం ఆయన అలవాటు. ఇవాళ కూడా అంతే జరిగింది.     పన్నెండూ అయిదు నిమిషాలకి ఛాయ పరుగెత్తుకుంటూ వచ్చి "అమ్మ భోజనానికి రమ్మంది నాన్నా" అంది నాల్గోసారి.     చిదంబరం విసుక్కుంటూ "ఉండవే ఆట రసపట్టులో వుంది" అన్నాడు.     "తొందరగా రమ్మంది నాన్నా!"     ఈసారి చిదంబరానికి అంతులేని కోపం వచ్చింది, పేకముక్కల్ని గభాలున క్రిందపడేసి, చెబుతుంటే బుద్ధిలేదూ? అవతల పెద్దమనుషులున్నారని లేకుండా. వెయ్యి, గోడకుర్చీ వెయ్యి" అని గద్దించాడు.     చిన్న పిల్ల గజగజమని వణుకుతూ బిక్కమొహం వేసి నిల్చుంది.     "ఊఁ చూస్తావేం?"     ఈ గర్జనకు హడలిపోయి తడబడే కాళ్ళతో గోడ దగ్గరకు పోయి గోడకుర్చీ వేసింది. ఆ పిల్ల చిన్న పాదాలు వణుకుతున్నాయి. తెల్లని శరీరం నుండి స్వేద బిందువులు ముత్యాల్లా ప్రవహించసాగాయి.     అలా కొంచెంసేపు గడిచింది, కాళ్ళు నొప్పులు పెడుతున్నా తండ్రి అంటే భయంతో అలాగే కూర్చుని వుంది. ఆ దృశ్యాన్ని ఎవరూ చూడకుండా వుంటే అలా యెంతసేపు జరిగేదోగాని, ఎక్కడో పెత్తనాలు సాగించి యింట్లోకి వస్తున్న ముసలమ్మగారి కళ్ళు యీ చిన్నపిల్ల దుస్థితిని చూడనే చూశాయి. "అయ్యో తల్లీ, అయ్యోయ్యో ఏమిటి యిది?" అంటూ అక్కడ ఎవరెవరు వున్నారో చూడకుండా చప్పున గదిలోకి జొరబడి, రానని  ఆ పిల్ల యెంత మొత్తుకుంటున్నా బలవంతంగా యివతలకు లాక్కువచ్చింది, లాక్కువచ్చి అంతటితో ఊరుకోలేదు. పెద్ద  పెట్టున ప్రారంభించింది. " ఏళ్ళు రాగానే సరా? జ్ఞానం అనేది ఒకటుండాలి. ఇంతకీ అదేం తప్పు చేసిందని అంత శిక్ష? చిన్నపిల్ల యెలా వొణికిపోతూందో అయినా చూడక్కర్లేదూ? అసలు యివాళ దీనికి ఎంత గండం తప్పిందీ" అంటూ  "కృష్ణకి రానన్నదని చీవాట్లు వేశాను. కాని రాకపోవటం ఎంతమంచి పనయింది. దీని ఈడుపిల్ల నా ప్రక్కనే  స్నానం చేస్తూ , చూస్తూ చూస్తూండగానే బుడుంగుమని మునిగిపోయింది గదా! మళ్ళీ లేచిందా! ఉహూ! దీన్ని తీసుకెడితే అంత ప్రమాదమూ దీనికే సంబంవించేది గదా! మళ్ళీ లేచిందా! ఉహూ! దీన్ని తీసుకెడితే అంత ప్రమాదమూ దీనికే సంబంవించేది కదా! అదేమన్నా ఆలోచించేనా యింతటి శిక్ష విధించటం?" అని "నా చిట్టితల్లి! ఎంత పిచ్చిదానివే" అంటూ ఆ పిల్లను అక్కున జేర్చుకుంది.     ఇదంతా విని అన్యమనస్కంగా చిదంబరం కొంతసేపట్లో వస్తానని, అప్పటిదాకా వూరికే కూర్చోబెడుతున్నందుకు పెద్ద మనుషులకు క్షమాపణ చెప్పుకుని లోపలకు వచ్చాడు.     "అయితే మరి, పెద్దవాళ్ళ మాటకి ఎదురు చెప్పమని యెక్కడ వుంది?" అతను తల్లిని సూటిగా ప్రశ్నించాడు.     నిజానికి జరిగిందేమిటో ముసలమ్మగారికి కూడా తెలీదు. అయినా ఆవిడ తొణక్కుండా "పెద్దరికం, పెద్ద కబుర్లు చెప్పటం మటుకు వచ్చు. ఏ విషయంలో నీ పెద్దరికం నిలబెట్టుకుంటున్నావు నాయనా?" అని అడిగింది.     తల్లి యిలా అనేసరికి చిదంబరం మారు సమాధానం చెప్పకుండా లోపలి పోయి చేతులూ, కాళ్ళూ కడుక్కువచ్చి బుద్ధిమంతుడిలా పీటమీద కూర్చున్నాడు, శారదాంబ మాట్లాడకుండా వడ్డించింది.     చిదంబరం కొంచెంసేపు అయాక నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ "నా కిటువంటి విషయాలే నచ్చవనుకుంటాను. నేను భోజనానికి రాక కొంచెం ఆలస్యం చేస్తే యింతమంది కంగారుపడి నానా రగడా చేయటం ఎందుకో? ఆకలైతే బాధపడేది నేనేగా" అన్నాడు.     ఆయన వయసులో వున్న ఏ వ్యక్తికూడా ఆలోచిస్తే యింత తెలివితక్కువగా మాట్లాడి వుండడు. చిదంబరం ఏ కొంచెం ఆలోచించినా అవతలి వాళ్ళ మనస్సుకు యీ మాట ఎలా నాటుకుందో గ్రహించి వుండేవాడు.     మబ్బులు పట్టిన ఆకాశంలా వున్న ముఖంలోకి కళాకాంతులు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తూ "వేళ ప్రకారం భోజనం చెయ్యాలని డాక్టరుగారు చెప్పారు కదా" అంది శారదాంబ.     చిదంబరం విసుగ్గా "ఆ డాక్టరుకి మనం ఫీజు యిస్తేకదా నిజం చెప్పటానికి? పందెం వేస్తాను. ఇవాళ ఒక పదిరూపాయల ఫీజు యిచ్చి మళ్ళీ పరీక్ష చేయమంటాను. అప్పుడేమంటాడో తెలుసా? అసలు భోజనం చెయ్యవద్దంటాడు. నా మాట అబద్ధం అయితే చూసుకో" అంటూ తన చిన్న కళ్ళను పైకి ఎత్తి భార్య ముఖంలోకి చూశాడు.     దేనికి భార్య సమాధానంగా "అలా అయితే మీ ఇష్టం. మీకు తోచినట్టే చేయండి" అంది.     చిదంబరం కొంచెం బెదిరి "అంటే, నేను నాకు తోచినట్లే చేస్తాననా నీ ఉద్దేశ్యం? కాకపోతే ఇవాళ ఆట మరీ పసందుగా వుండటంవల్ల ఆలశ్యం అయింది" అన్నాడు.     "మీకు పేకాట ఏ రోజు పసందుగాలేదో కాస్త చెప్పండి" అందమనుకుంది శారదాంబ. కాని  వెంటనే ఆ సమయంలో ఈ మాట అనటం చాల అనుచితంగా భావించి వూరుకుంది.     తర్వాత ఎటువంటి సంభాషణా జరగలేదు. తల్లి గొణుక్కోవటం చిదంబరానికి చాలాసేపటి వరకూ వినిపిస్తూనే వుంది. చెయ్యి కడుక్కుని ఎవరితోనూ మాట్లాడకుండానే మళ్ళీ పేకగదిలోకి వెళ్ళిపోయాడు.     తరువాత శారదాంబ భోజనానికి కూర్చుంది. కాని ఏమీ తినలేకపోయింది. ఆమెకు ఏమీ సహించదు. నాలుగు మెతుకులు కొరికి, వంటిల్లు శుభ్రం చేశాక ఇవతలి గదిలో చాప వేసుకుని పడుకుంది.     రాత్రిదాకా శారదాంబకు చాలా మామూలు గడిచింది. కానీ ఆ రాత్రి భర్తను ఒక విషయం అడక్కుండా వుండలేకపోయింది. అతనిపాదాల దగ్గిర కూర్చొని, పాదాలు వొత్తుతూ "మీరు బొత్తిగా ఆ విషయం మర్చిపోయారు" అంది.     ఆయన ఆశ్చర్యంగా "ఏ విషయం?" అని అడిగాడు.     "రాధ పెళ్ళి విషయం" అంది శారదాంబ.     "పెళ్ళి విషయమేమిటి?" భర్త ఇలా తెలియనట్లు మాట్లాడేసరికి ఆమె కొంచెం గాయపడి "రాధకు పెండ్లి సంబంధాలు చూస్తానని కొన్ని రోజుల క్రితం మీరు చెప్పారు" అంది.     ఆయన ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవిచేసి "ఏమిటి? నేనా? నేనెప్పుడూ అటువంటి మాటలు చెప్పి వుండలేదు" అన్నాడు.     "కాదు........" అని ఆమె ఇంకా ఏదో అనబోయేసరికి "అయితే నీ ఉద్దేశ్యం నే నబద్ధం ఆడుతున్నాననేగా? ఇంత పెద్ద వయస్సులో అబద్ధం ఆడవలసిన అవసరం నాకేముంది? నువ్వే పొరబడి వుంటావు" అని కొంచెం ఆగి "నీ వెర్రికాకపోతే ఆడపిల్లలకు సంబంధాలు అవంతటమే రావాలిగాని మనం ప్రయత్నాలు చేస్తే ఫలిస్తాయి?" అన్నాడు.     భర్త మాటల్లోని నిజం స్త్రీ అయిన శారదాంబకు తెలుసు. కాని ఆవిడ ఆయనతో వాగ్వివాదాలు పెటుకొని ఎటువంటి లాభమూ లేదని తెలుసుకొని చాలా సంవత్సరాలైంది. మాట్లాడలేదు.     ఆ రాత్రి శారదాంబ పడుకోబోతూ" ఇవాళ ఏం రోజు? నా జీవితంలో ఇటువంటి ప్రత్యేకతలేని రోజులు ఎన్నివేలు గడిచాయి? ఇలా ముందు ఎన్ని గడవాలో" అనుకొని నిట్టూర్పు విడిచింది.                              6     ఏ రోజైతే శారదాంబకు స్వాభావికంగా గడిచిపోయిందో, ఏ రోజైతే ఏమీ ప్రత్యేకత లేకుండా ఆమెకు గడిచిపోయిందో అదే రోజు రాధకు చాలా విచిత్రమైనదిగా పరిణమించింది. ఉదయం ఇంచుమించు తల్లితోబాటు లేచింది. తల్లి ఏడుస్తుంటే చూసింది. ఒక మాటకూడా విసిరింది. చివాట్లుకూడా తింది.     భోజనం అయిపోయాక ఆమెకు ఇంట్లో వుండబుద్ధి కాలేదు. కాస్త కాలక్షేపం అవసరం అనిపించింది. చాలామంది స్త్రీలలాగ తోచినా తోచకపోయినా ఇంట్లోనే కూర్చొని వుండే స్వభావం ఆమెది కాదు. ఎవరింటికి పోదామా? అని ఓ క్షణంసేపు ఆలోచించి, తనకున్న  స్నేహితురాళ్ళలో ఎక్కువగా చనువుగా వుండేది ప్రమీల ఒక్కత్తే. ఆమె ఇంటికే పోదామని బయలుదేరింది ఇవాళకూడా.     మెట్లు ఎక్కి రెండడుగులు లోపలివేసి, మూడో అడుగు వేయబోతూ విద్యుచ్ఛక్తి తగిలినట్లుగా ఆగిపోయింది. ప్రమీలతో ఇన్నాళ్ళనుంచి స్నేహం చేస్తున్నా ఈ స్థితిలో ఆమెను ఎప్పుడూ చూడలేదు. భర్త విశాలమైన కౌగిలిలో ఒదిగిపోతూ అతని కళ్ళలోకి అమాయకంగా చూస్తూ నవ్వుతోంది. రాధకు శరీరమంతా సిగ్గుతెరలు క్రమ్మినాయి. ముఖమంతా ఎర్రబడిపోయింది. ఒక్కక్షణంపాటు ఏమి చెయ్యటానికి కూడా ఆమెకు పాలుపోలేదు. ఒక్కసారిగా ఆమె ఎంత ముగ్ధరాలయిపోయిందో, అంతే బాధతో కుమిలిపోయింది కూడా. ఈ మధ్య ప్రమీలగారింటికి రావటానికి, ఆమె భయపడటానికి కారణం ఇప్పుడు తనే ప్రత్యేక్షంగా తెలుసుకోగలిగింది. ఆ భార్యభర్తల మధ్య తను తరచురావడం అంతరాయంగా వుంటుందని కొన్ని రోజుల్నుంచీ అనుమానించసాగింది. అక్కడ నిలబడ్డ ఒక్క నిమిషం లోనూ ఇవన్నీ గిర్రుమని తలలో తిరగగా, మరునిమిషంలో తన తప్పు తెలుసుకుని మరింత సిగ్గుపడి వెళ్ళిపోదామని గిరుక్కున వెనక్కి తిరిగింది.     అదృష్టవశాత్తూ ప్రమీలగాని, ఆమె భర్తగాని ఈమె రావటం, వెళ్ళిపోవటం ఏదీ చూడలేదు. ఒకవేళ చూడటమే సంభవిస్తే అది రాధని తలవంచుకునేటట్లు చేసేది. మెల్లగా నడుస్తూ ఇందాక చూసిన దృశ్యాన్ని నెమరువేసుకొనసాగింది. ఆ దృశ్యం తాలూకు చిహ్నాలు మనసులో చిత్రించుకొనేటప్పుడల్లా ఆమె శరీరం పులకించసాగింది. పెదాలమీద చిన్న నవ్వు అవతరించింది. ముఖమంతా ప్రపుల్లమానమై మనసంతా సంపుల్లమానమైనట్లుగా తోచింది.     ఆమె ఇంకా ఇలాంటి ఏదో అనుభూతుల్లో వుండగానే, "వదినా" అన్న పిలుపు ఈ లోకంలోకి తీసుకు రాగలిగింది.     ఈ పిలుపు ఎవరిదో ఆమెకు తెలుసు. ఆవరించిన ఆలోచనలను పారద్రోలేపాటి చిన్న త్యాగం ఆమె చేయటానికి సిద్ధపడి, ఈ వేళ కృష్ణుడికి బాగా బుద్ధి చెప్పాలనిగూడా అనుకుంది. "ఏమిటి?" అనడిగింది.     "ఒకసారి మా ఇంటికి రాగూడదా?"     "సరే వస్తాను" అని, రాధ ఏ మాత్రం సంశయించకుండా లోపలకు నడిచింది. "మీ అమ్మగారు ఎక్కడున్నారు?" అనడిగింది కృష్ణుడ్ని చూసి.     "లోపల వుంది."
24,524
    కాని ఆ ఘాతుకత్వం అంతటితో ఆగిపోయింది. ఎంత హఠాత్తుగా  ఆ చేతులామెను చుట్టుకున్నాయో అంత నాటకీయంగా విడిపోయాయి.     ఓ నిమిషం గడిచాక లైట్లు వెలిగే వరకూ ఆమె నిశ్చేష్టురాలయి నిలబడిపోయింది.     తెలివితెచ్చుకునేసరికి ఆ చిన్న సందులో తాను ఒక్కతే నిలబడి ఉన్నట్లు గ్రహించింది. ఏం జరిగింది? ఎందుకిలా జరిగింది?     అక్కడే వొంటరిగా నిలబడి, వెక్కి వెక్కి ఏడవాలనిపించింది. తర్వాత యింటికెలా చేరిందో ఆమెకే తెలీదు.                  *                   *                 *     రాత్రి చాపమీద పడుకుని ఏడుస్తూనే ఉంది. తన దార్న తను బ్రతుకుతూ ఉంటే యీ మనుషులు  ఎందుకలా  తనలోకి చొచ్చుకువస్తారు? ఆర్ధికంగా తమ కుటుంబం అన్ని విధాలా చితికిపోయి ఉంది. అన్ని విధాలా కూడా తమని నాశనం చెయ్యాలనుకుంటోందా ప్రపంచం? ఆ దుర్మార్గుడెవడో  తన వంటిమీద చెయ్యి వేశాడు. తలుచుకుంటూనే కంపరంగా ఉంది.తనని ...తనని...ముద్దు పెట్టుకున్నాడు.     అబ్బ ! ఛీ! ఎంత రోత !     తాను ...మలినపడిందా ?     తేజయితే ఏమంటుంది ?     "ప్రజ్ఞా ! ఈ నాలుగు గోడల మధ్యా కూచుని పురాణాలు, మంత్రాలూ వల్లెవేసుకుంటూ జీవితానికి వందమైళ్ళు  వెనుకన నడవడం జీవితమనిపించుకోదు. సిటీస్ లోకి పోయిచూడు. ఎంత ఫాస్ట్ గా, ఎడ్వంచరస్ గా వెళ్ళిపోతున్నారో జనం ! అలా ఉండటాన్ని నేను సమర్దిస్తున్నానని అర్ధం కాదు. కాని ప్రతిదీ తప్పనుకోవటం _ మైలపడిపోయానను కోవటం అవివేకం. ప్రజ్ఞా! నువ్వు నమ్మిన వేదాంతులేమన్నారు? ఈ శరీరం మిధ్య. ఆత్మ ఒక్కటే నిజం. ఒక వస్త్రం విప్పి యింకో వస్త్రాన్ని ధరించినట్లు అవసరాన్నిబట్టి యీ ఆత్మ అనేక శరీరాలను ధరిస్తూ వుంటుంది. వాటి బాగోగులతో శరీరానికి నిమిత్తం లేదు. వాళ్ళ సిద్ధాంతం ప్రకారం శరీరం అందంగా ఉండటం పైపై మెరుగులయితే మైలపడటం కూడా అలాంటి అబద్దమే.     ప్రజ్ఞ సమాధాన పడలేకపోతోంది. శరీరం వేరూ, ఆత్మ వేరూ అనేది కొన్ని సిద్దాంతాల ప్రకారం  నిజమయితే కావచ్చుగానీ _ శరీరం బాగోగులు అవసరం లేదనడం ఆమె భరించలేకపోతోంది.                                                  12     గోపీకృష్ణ అయిదారు రోజులనుంచీ పెచ్చెక్కినట్లుగా అయిపోతున్నాడు. అస్మిత పరీక్షలయినప్పట్నుంచీ అసలు కనబడటం మానేసింది. ఒకవైపు యింట్లో ఆర్ధిక పరిస్థితుల వత్తిడి ఎక్కువయిపోతోంది. తండ్రి రోజు రోజుకూ మూలపడిపోతున్నారు. అయిదూ పదీ కావాలంటే అక్కయ్య నడిగి తీసుకోవాల్సి వస్తుంది. కాని అవెందుకూ సరిపోవటం లేదు. తల్లి ప్రవర్తన రోజు రోజుకూ వింతగా మారుతోంది. ఒక రకంగా ఆమె సైకియేమో అనిపిస్తుంది.     ఈ చాలీ చాలని జీవితంలో తాను యిమడలేకపోతున్నాడు. మనిషై పుట్టాక జీవితాన్ని సాధించి తీరాలి. డబ్బు సంపాదించాలి. కాని యీ రకం కుటుంబాలలో పుట్టి అడ్డదార్లు లేకుండా డబ్బు సంపాదించటమసాధ్యమని అర్ధం చేసుకున్నాడు.     అందుకే ...అస్మితను పొంది తీరాలి.     ఆమె నెలాగైనా కలుసుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఆమె యింటిచుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు.     చివరకు ఓ రోజు అతని ప్రయత్నం ఫలించింది. ఓ సాయంత్రం ఆరుగంటలవేళ అస్మిత వాళ్ళ  అమ్మగారితో కలిసి బయటికొచ్చింది. ఇద్దరూ కలిసి రిక్షాలో బజారుకెళ్ళారు. గోపీకృష్ణ దగ్గర్లో వున్న ఓ అద్దెసైకిల్ అద్దెకు తీసుకుని వెనకాల వెళ్ళాడు.     అస్మితా, వాళ్ళమ్మగారు ఓ బట్టల కొట్లోకెళ్ళారు. గోపీకృష్ణ సిగరెట్ కాల్చుకుంటూ ఫుట్ పాత్ మీద నిలబడి ఓరకంట  వాళ్ళని గమనిస్తున్నాడు.     అస్మిత అతన్ని చూస్తోనే వుంది. సమయమొస్తే బయటికొచ్చి అతన్ని పలకరిద్దామని ఆమె మనసు ఉవ్విళ్ళూరుతోంది.     అస్మిత తల్లి షోకేస్ లోని చీరలన్నీ బయటకు తీయించి ప్రక్కన పెట్టిస్తోంది. అది నగరంలోని పెద్ద షాపుల్లో ఒకటి.     అక్కడ ఉన్నన్ని వెరయిటీస్  చాలా తక్కువ షాపుల్లో వుంటాయి" అన్నాడు సేల్స్ మన్.     ఆమె చీరల మైకంలోపడి అస్మిత వంక 'రా' అన్నట్లు చూసింది.     "నేనిక్కడ కూచుంటాను. నువ్వే వెళ్ళి చూసిరా మమ్మీ!" అంది అస్మిత.     చీరల పిచ్చిలో ఆమె కుమార్తె చుట్టూ విధించిన నిబంధనలు తాత్కాలికంగా మరిచిపోయింది. సేల్స్ మన్ వెంట లోపలికెళ్ళింది.     అస్మిత అలాంటి అదను కోసమే చూస్తోంది. తల్లి లోపలకు వెళ్ళగానే గభాల్న లేచి రోడ్డుమీదకు వచ్చింది.  
24,525
    "రాత్రి నువ్వు మాట్లాడింది నాకేమీ అర్ధం కాలేదు. హరిస్వామి ఎవరు?" అన్నదామె దగ్గరగా వచ్చి కూర్చుంటూ.     బృహస్పతి మొహం మ్లానమయింది. "ఏం మాట్లాడాను?" అన్నాడు.     "సి.బి.ఐ.చీఫ్ రహస్యంగా నీకేదో పని అప్పగించారు అన్నావ్!"     బృహస్పతి తత్తరపడి, వెంటనే సర్దుకుంటూ "అదేమీ లేదు, నువ్వు రాత్రి విషయం పూర్తిగా మర్చిపో" అన్నాడు. ఆమె ఏమీ మాట్లాడకుండా అక్కడినుంచి లేచిపోయింది. అంత సులభంగా మర్చిపోవడానికి కాదామె అక్కడి కొచ్చింది.                         23     ఆ మధ్యాహ్నం ఎవరూ లేనప్పుడు ఆమె దగ్గరికి రావు వచ్చాడు. తలుపు దగ్గరగా వేస్తున్న అతన్ని చూస్తూ ఆమె ఆశ్చర్యంగా, కాస్త భయంగా "ఏం కావాలి నీకు?" అనడిగింది.     "నీతో కాస్త మాట్లాడాలి."     ఆమె అనుమానంగా చూస్తూ "ఏం మాట్లాడతావ్?" అనడిగింది.     అతడు చనువుగా పక్కకొచ్చి కూచుంటూ ".... నువ్వు నాకో సహాయం చెయ్యాలి. నిజానికి నీలాంటి అమ్మాయి కోసమే చూస్తున్నాను. నీక్కూడా లాభం వుంటుంది" అన్నాడు.     "ఏమిటది?"     "బృహస్పతి దగ్గరనుంచి ఆ నిధి ఎక్కడుందో తెలుసుకోవాలి. అది నీ కొక్కదానికే సాధ్యం. ఆ విషయం నువ్వు తెలుసుకుంటే నీకు అందులో వాటా ఇస్తాను!"     "నువ్వు చెప్పేది ఒక్క ముక్కకూడా నా కర్ధం కావడంలేదు. మంగళ్ సింగ్ ఎలాగూ నన్ను పెళ్ళి చేసుకుంటాడు. ఆ నిధి ఆయనిది! మధ్యలో నువ్వు నాకు వాటా ఇవ్వటం ఏమిటి?"     రావు తల అడ్డంగా విదిలిస్తూ ".... బృహస్పతి గతజన్మలో మంగళ్ సింగ్ కాదు- మేమిద్దరం ప్రాణ స్నేహితులం! ఇద్దరం కలిసి నాటకమాడాం!! అతను నిన్ను పెళ్ళి చేసుకోవడమనేది కలలో మాట!!!" అన్నాడు.     "నువ్వు చెప్పింది నిజమే అయితే ఆ నిధి ఎక్కడుందో అతడికి కూడా తెలీదు కదా!" తెలివిగా ఎదురు ప్రశ్న వేసింది.     "నిజమే! మామూలు పరిస్థితుల్లో తెలిసి వుండేది కాదు. కానీ మంగళ్ సింగ్ భార్య రత్నాబాయి మా నాటకపు ఆఖరి రోజున మా దగ్గర కొచ్చింది. ఆమె మరణించిన కొద్ది క్షణాల తర్వాత ఒక సంఘటన జరిగింది. అది కేవలం నాకూ బృహస్పతికే తెలుసు. అయితే నాకు తెలుసన్న విషయం బృహస్పతికి తెలీదు."     "నువ్వు చెప్తున్నది నాకేం అర్ధంకావడంలేదు" మొహం చిట్లిస్తూ అన్నదామె.     "దావూద్ హర్షద్ తుప్పల వెనకనుంచి మిషన్ గన్ పేల్చి నప్పుడు రత్నాబాయి మరణించింది. కాలుకి గాయం అవడంతో నేను కుప్పకూలిపోయాను. నాకు స్పృహ తప్పింది. బృహస్పతి దావూద్ హర్షద్ ని వెంటాడుతూ పరుగెత్తాడు. అయితే ...." ఒక క్షణం ఆగి గాఢంగా శ్వాస తీసుకుంటూ అన్నాడు రావు. ".... ఆ పరిస్థితిలో కూడా నిధి విషయం అతడు మర్చిపోలేదు."     ఆమె ఆశ్చర్యంగా అతడివైపు చూస్తోంది.     అతడు కొనసాగించాడు. ".... పెట్టెలోంచి నిధి ప్లాన్ తీసి, చొక్కాలోకి దోపుకుని అప్పుడు పరిగెత్తాడు. నాకు స్పృహ తప్పింది అనుకుని భ్రమపడ్డాడు. నేనా దృశ్యం కళ్ళారా చూశాను. ఆ విషయం నా కతడు చెబుతాడనే ఇన్నాళ్ళూ వేచి వున్నాను. చెప్పలేదు. డబ్బుముందు మానవత్వం, స్నేహం - ఏదీ నిలబడదని అతడు నిరూపించాడు. వందకోట్లు ....తక్కువ డబ్బేమీ కాదు. ఎటువంటి బంధాన్నయినా తుంచేయ గలిగేటంత డబ్బు?"     ఆమె కొంచెం సేపు మాట్లాడలేదు. చివరికి తెప్పరిల్లి "అతడు నిజంగానే మంగళ్ సింగ్ కాదా?" అనడిగింది.     "కాదు. పైగా ఇంకో విషయం- అతడు హేమంత సంధ్య అనే ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఇంకో రెండు రోజుల్లో ఆ అమ్మాయి ఇక్కడికి వస్తోంది. రాగానే పెళ్ళికూడా చేసుకోబోతున్నారు."     ఆ అమ్మాయి సాలోచనగా ".... అతడు మంగళ్ సింగ్ కానప్పుడూ - నన్ను వివాహం చేసుకోనప్పుడూ - నాకు మాత్రం ఆ నిధి రహస్యం ఎందుకు చెప్తాడు?" అనడిగింది.     "దానికో పథకం ఆలోచించి పెట్టాను. నువ్వు సరేనంటే మిగతా విషయాలు చెప్తాను."     ఆమె ఏదో చెప్పబోతూండగా గుమ్మం దగ్గర ఏదో అలికిడయింది. ఇద్దరూ అటు చూశారు. గుమ్మం దగ్గర బృహస్పతి నిలబడి వున్నాడు.     అతడి మొహం వాడిపోయి వుంది. ".... నువ్వు.... నువ్వు.... నిజంగా నా ఫ్రెండ్ రావువేనా?" అన్నాడు అనుమానం, ఆందోళన మిళితమైన స్వరంతో.     రావు లేచి నిలబడ్డాడు. "అవును. నేనే! నిజానికి ఆ ప్రశ్న నేను నిన్ను అడగాలి. గుండెలమీద చెయ్యి వేసుకుని చెప్పు.... దావూద్ హర్షద్ కాల్పులు సాగిస్తున్నప్పుడు నువ్వు ఆ నిధి ప్లాన్ తీసుకుని పరుగెత్తలేదూ?"     "లేదు" గట్టిగా అరిచాడు బృహస్పతి. ".... నువ్వు చెప్పేది ఎక్కడయినా తర్కానికి అందుతోందా? ఆ రోజు రాత్రి ఒకవైపు రత్నాబాయి మరణించింది. ఒకవైపు నీ కాలిలో బుల్లెట్స్ గుచ్చుకుని అంతా రక్తసిక్తమై వుంది. మరోవైపు బుల్లెట్ల వర్షం కురుస్తోంది. ఆ స్థితిలో నా ప్రాణాలు రక్షించుకోకుండా పెట్టెతీసి నిధి ప్లాన్ వెతికి తీసుకుని అప్పుడు పరిగెడతానా? అలాంటి స్థితిలో ఏ మనిషికయినా ఇంత ఆలోచన వస్తుందా?" సామరస్యంగా అన్నాడు.     రావు అదోలా నవ్వాడు. ".... నువ్వు చాలా తెలివైన వాడివి బృహస్పతీ! ప్రధానమంత్రి అవుదామని ప్లాన్ వేశావు. పక్కన ఒక తోడుండాలి కాబట్టి నన్నొక బాబాగా తీర్చిదిద్దావు. అనుకోకుండా అదృష్టం నిధి రూపంలో కలిసొచ్చేసరికి వైరాగ్యం వచ్చినట్లు నాటకమాడుతున్నావ్."     "అబద్ధం!"     "కాదు. నిజం. ఆ నిధి గురించి నీ అంతట నువ్వే చెబుతావని ఇన్నాళ్ళూ వేచి వున్నాను. ఒక స్నేహితుడిగా ఇంతకాలం నీకు గౌరవమిచ్చాను. ఆ గౌరవాన్ని నువ్వు నిలుపుకోలేక పోయావు. అయామ్ సారీ!" అన్నాడు రావు.     "జరిగిన సంఘటనంతా నీకు కళ్ళకు కట్టినట్టు చెబుతున్నాకూడా నన్ను నమ్మవేం?" అన్నాడు బృహస్పతి.     ఆ అమ్మాయి ఇద్దరివైపూ చూస్తోంది.     రావు శుష్కంగా నవ్వాడు. "నువ్వు చాలా తెలివైనవాడివని ముందే చెప్పానుగా బృహస్పతీ! జరిగిన సంఘటనే కాస్త ఇటూ అటూ మార్చి ఎంత బాగా కళ్ళకి గంతలు కట్టి చెప్పినట్టు చెప్పావ్? రత్నాబాయి మరణించిన మాట నిజమే.... నా కాలిలో బుల్లెట్స్ గుచ్చుకున్న మాటా నిజమే. ఆ తర్వాత నువ్వు చెప్పింది మాత్రం అబద్ధం."     "ఏది?"     "నీ మీద బుల్లెట్ల వర్షం కురుస్తోందని నువ్వు చెప్పిన మాట!"     బృహస్పతి అవాక్కయి చూశాడు.     "అవును బృహస్పతీ! అప్పుడే నాకు స్పృహ తప్పుతోంది. అయినా ఆనాటి దృశ్యం నా కళ్ళలో ఒకప్రింట్ లా ముద్ర పడిపోయింది. దావూద్ హర్షద్ నిన్ను కాల్చబోతుండగా వెనకనించి ఆ ఇన్ స్పెక్టర్ సరళరేఖ కెవ్వున కేక పెట్టింది. వాడు ఆమెను తరుముకుంటూ అటు పరుగెత్తాడు. నువ్వుకూడా అటు వెళ్ళబోయి రెండడుగులు వేసి ఆగావు. అప్పటికే రత్నాబాయి మరణించింది. నేను స్పృహ తప్పుతున్న స్థితిలో ఉన్నాను. వెళ్ళబోయేవాడివల్లా వెనక్కొచ్చి పెట్టె తెరిచి డైరీలూ, నిధి ప్లాన్ తీసుకున్నావు. నా ప్రాణాపాయ స్థితిలోకూడా నీ తెలివితేటలకి నిబ్బరతకి సమయస్పూర్తికీ మనసులోనే జోహార్లర్పించాను. ఎందుకంటే.... అక్కడికి ఎలాగూ పోలీసులు వస్తారు. అప్పుడు ప్లాన్ ని వాళ్ళ కంటబడకుండా తీసుకోవడం కష్టం...." రావు చెప్పడం కొనసాగించాడు. బృహస్పతి మొహం రక్తం లేనట్లు పాలిపోయి వుంది.     ".... నా ప్రాణం పోతున్నా నీకు నిధి దొరికినందుకు సంతోషించాను. స్నేహమంటే ఆదిరా బృహస్పతీ! మనిద్దరం కలిశాక ఆ విషయం నువ్వు ప్రస్తావిస్తావని ఇన్నాళ్ళూ చూశాను. కానీ నీ నరనరాల్లోనూ స్వార్ధం పేరుకుపోయింది. ఎవరికీ అనుమానం రాకుండా ఉండడం కోసం నువ్వు మారిపోయినట్లు నటించావు. ఎవరో ప్రశాంత నివాళి మాటలకి ప్రభావితమయ్యానన్నావ్! కాలు పోయిన నేను కన్విన్స్ కాక మరేం చేయగలను? బ్రతుకు తెరువు కోసం నువ్విచ్చిన ఉద్యోగంలో చేరాను."     బృహస్పతి కొంచెంసేపు మాట్లాడకుండా మౌనంగా వుండి చివరకు నెమ్మదిగా ప్రశ్నించాడు. ".... యింతకాలం అనుమానం నీ గుండెల్లో పెట్టుకుని నన్నెందుకు అడగలేదురా?"     "మనిద్దరం కలిసి ఒక నాటకం ఆడినప్పుడు ఆ లాభంలో సగం వాటా నాకు రావాలనుకోవడంలో తప్పుందా?"     "లేదు."     "ఆ నిధి నిజంగా నీకు దొరికివుంటే అందులో సగం వాటా నాకూ యిచ్చి వుండేవాడివా?"     "తప్పకుండా యిచ్చి వుండేవాడిని."     "అదే కదా మన అగ్రిమెంట్"     "అవునదే మన అగ్రిమెంట్"     "ఆ నిధి ప్లాన్ నీ దగ్గర ఉందా?"     "లేదు."     రావు విసురుగా ఒంటికాలి మీద లేవబోయి పడిపోతూ కర్ర సాయం తీసుకున్నాడు. ఊహించని వేగంతో గాలిలా బృహస్పతి దగ్గరకొచ్చి అతడి మొహంలో గుచ్చి గుచ్చి చూస్తూ పళ్ళు బిగపట్టి కసిగా అన్నాడు- "ఇంత అనుమానం నా గుండెల్లో పెట్టుకుని నిన్నెందుకు అడగలేదో తెలుసా బృహస్పతీ? ఈ సమాధానమే నీ దగ్గర్నించి వస్తుందని! నేనడుగుతాను. నువ్వు తెలీదంటావ్! కానీ నీ మనసులో అనుమానం పీకుతూనే వుంటుంది. జరిగినదంతా నేను చూశానని నీకు నిర్ధారణ అవుతుంది. నన్ను అడ్డు తొలగించడానికి నువ్వు సిద్ధమైనా అందులో ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే డబ్బు నీలాంటి వాళ్ళని ఎంతలా మార్చేస్తుందో కళ్ళారా చూశాను కనక...."     బృహస్పతి మొహం జేగురు రంగులోకి మారింది. ఏదో చెప్పాలని చెప్పలేకపోతున్నాడు. అతడి ముఖ కవళికల్ని మరోలా అర్ధం చేసుకున్నట్టు రావు అన్నాడు.... "ఇక నీ రెండో ప్రశ్న- 'ఇంతకాలం' ఇంత అనుమానంతో రగిలిపోతూ నీతో కలిసి ఎలా వున్నానని! నీ నుంచి ఆ నిధి రహస్యం బయటికి వచ్చేలా చేయాలంటే నీతో కలిసి వుండక తప్పదు! ఈ అమ్మాయి సహాయంతో దాన్ని బయట పెట్టిద్దామనుకున్నాను. ఒక పథకం కూడా ఆలోచించి వుంచాను. దురదృష్టవశాత్తూ అది ఫెయిల్ అయింది" అతడు గుండెలనిండా గాలి పీల్చుకుని వదులుతూ అన్నాడు.... "బృహస్పతీ! నువ్వెంత తెలివయిన వాడివో, నేనూ అంతే తెలివైన వాడిని. డాకూ మంగళ్ సింగ్ గా నువ్వెలా నటించావో స్వామీజీగా నేనూ అంతే రక్తి కట్టించాను. ఈ క్షణం నుంచీ మనిద్దరికీ రమ్మీ మొదలయింది. ఎవరు షో తిప్పుతారో కాలమే నిర్ణయిస్తుంది. నీ తల తిరిగిపోయే ప్లానేసి నీ దగ్గరనుంచి ఆ ప్లాన్ సంపాదించకపోతే నా పేరు రావు కాదు" అంటూ బయటకు నడిచాడు.
24,526
         శంకర్రావు మాట్లాడుతూనే వున్నాడు.          "పిల్లలకోసం తహతహలాడి పోయాను నేను. ఇంతలో...జరగరానిది, లేదా బాబాగారు చెప్పినట్లు జరగాల్సింది జరిగిపోయింది. చెప్పు, శారదా! ఆ పరిస్థితుల్లో నేనేం చెయ్యాలి? అపర శ్రీరామచంద్రుడ్నయివుంటే నిన్ను మెడపట్టుకు బయటికి గెంటి ఉండేవాణ్ణి, లేదా గొప్ప మొగాడ్నయి వుంటే మెడ పిసికి చంపి వుండే వాణ్ణి. కాని....శ్రీరామచంద్రుడికి అన్నీ వున్నాయి. సీత లేక పోయినా ఫర్వాలేదేమో! నాకు....నాకు....నువ్వు తప్ప ఎవరున్నారు, శారదా? నువ్వు తప్ప ఏముంది నాకీ ప్రపంచంలో?"          శారద రెండు చేతుల్లో మొహం దాచుకుని ఏడవడం మొదలెట్టింది.          "నీకు జరిగింది నాకు తెలిసినట్లు నీకు తెలియకుండా ఉండాలని ఎంత ప్రయత్నించానో! నాకు తెలిసిపోయినట్లు నీకు తెలిస్తే, నువ్వు చిన్నబుచ్చు కుంటావేమో, నేను మారిపోయినట్లు భావించి నా ప్రవర్తనలో కొత్త ఆర్దాలు వెదుకుతావేమో అని భయపడ్డాను." ఆగి వూపిరి తీసుకున్నాడు శంకర్రావు.          "నేనెలాంటి మొహమాటస్తున్నో తెలుసా, శారదా! ఎదుటివాళ్ళ తప్పు నాకు తెలిసిపోయినట్లు ఎప్పుడూ బయటపెట్టను నేను - దానివల్ల నాకు మంచి జరిగినా, చెడు జరిగినా కూడా. మొన్న ఎవరో ఒక పేషెంటు, "గురూ! ఇదివరకు మీరు కాజీ పేటలో మా పక్కింట్లోనే అద్దెకుండే వాళ్ళు! గుర్తుందా?" అంటూ నేనెరగని ఎవరెవర్ని గురించో ఏవేవో సంగతులు చెప్పాడు. పుట్టినప్పటినుండీ కాజీపేట ఎప్పుడూ చూసి ఎరుగను నేను. అయినా ఆ సంగతి అతనితో చెప్పలేదు. బిక్కచచ్చిపోతూ, తల వూపుతూ అతని మాటలు అరగంట సేపు విని, అరకప్పు టీ తాగించి పంపేశానే గానీ, అతని పొరపాటు దిద్దలేదు నేను."          శారద ఏడుపు మానేసింది! కళ్ళార్పకుండా అతన్ని చూస్తూంది. చెవులు విప్పార్చి అతని మాటలు వింటూంది.          "అలాంటి మొహమాటస్థుడ్ని, శారదా, నేను! ఎదుటివాళ్ళను నొప్పించలేని పిరికివాణ్ణి. నేను, ఎవర్నీ ఒప్పించగల, మెప్పించగల సమర్ధత ఉన్నవాడ్ని కాను. కానీ నా వల్ల ఎవరికీ, ఏ విధమైన అపకారం, కష్టం, నష్టం, ఇబ్బందీ కలగకపోతే అదేచాలు! ఊర్లో వాళ్ళనే నొప్పించలేని నేను నిన్ను - నా శారదని, నా ప్రాణాన్ని నొప్పించగలనా? ఈ పిల్లాడు నాకొడుకు కాదని తెలిసి కూడా, వాడ్ని ముద్దు చేసింది నీ కోసం! వాడికోసం కొన్న బట్టలు, బిస్కెట్లు, చాక్లెట్లు - అన్నీ నీకోసం - నిన్ను సంతోషపెట్టడం కోసం - కొన్నానంటే నమ్ముతావా శారదా?"          దేవుడ్ని చూస్తున్న దానిలా నిశ్చేష్టురాలై చూస్తూంది శారద. మళ్ళీ శంకర్రావే అన్నాడు.          "శారదా! నేను నంగి నంగినా మాట్లాడుతానని అంటారు. ఎప్పుడూ లేనిది, ఇవాళ ప్రవాహంలా మాట్లేస్తున్నాను. ఇదంతా....ఇదంతా.....నువ్వంటే నాకు ఇష్టం, ఇష్టం, ఇష్టం అని చెప్పడానికే!"          శారద ఆరాధనగా, భక్తిగా శంకర్రావు కళ్ళలోకి చూసింది.      "ప్రేమ...దయ....అభిమానం....కరుణ, వాత్సల్యం, మంచితనం....గొప్పతనం..."కలవరిస్తున్నట్లు,కలలో మాట్లాడుతున్నట్లు అంటోంది శారద.          "శారదా!"          "ఈ మాటలన్నింటికీ అర్ధం డిక్షనరీ చూస్తే కాదు - మీతో కాపురం చేస్తే తెలుస్తుంది."          "శారదా!"          "నన్ను మాట్లాడనివ్వండి. మీరు దేవుడు. మీరే నా దేవుడు! నిజం!"         "నేను దేవుడ్ని కాను! ఆ నిజం దుర్గకి తెలుసు. కానీ మూగదీ, అమాయకురాలూ కాబట్టి బయటికి చెప్పలేదు."          శారద మొహంలో ఆశ్చర్యం కనబడింది.          "ఏమిటండీ?" అంది భయంగా.          "శంకర్రావు- ఏమీ కాలేదులే! భయపడకు" అన్నాడు.          శారద చూస్తూంది.         "సరిగ్గా ఆ రోజు.....నీకు అలా జరిగిన రోజు...నువ్వు హాస్పిటల్ లో ఉన్నావు. నేను ఇంటికొచ్చాను. 'బా! బే! బా!' అంటూ వచ్చింది దుర్గ. ఏం కావాలని అడిగాను. కారం డబ్బా వైపు చూపించి, 'అమ్మ తెమ్మంది' అన్నట్లు సైగ చేసింది. తీసుకోమనగానే చేతులు పైకెత్తి అటకమీద ఉన్న డబ్బా దించబోయింది. అప్పుడు...అప్పుడు నా కేమయిందో తెలియదు శారదా! వెనగ్గా వెళ్ళి తనని వాటేసుకుని ముద్దు పెట్టుకున్నాను. ఏమవుతుందో తెలియకుండానే చెయ్యి విదిలించింది దుర్గ. చేతిలో కారం డబ్బా దొర్లి, నా కళ్ళలో పడి, నేను నేలమీద చతికిలబడిపోతే, విరగబడి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది దుర్గ. ఆ రోజు ఆ కారం నా కళ్ళలో పడకుండా వుంటే ఏమయివుండేదో నాకే తెలీదు. దుర్గ మూగది. నువ్వ నోరున్న మూగదానివి! ఆడది నోరెత్తదని తెలుస్తే - శంకర్రావులు కూడా సుధీర్ బాబులై పోతారు శారదా! అందుకే ఆడదాని చేతిలో కారం అన్నా వుండాలి, అధికారం అన్నా ఉండాలి - మగాడి దౌర్జన్యాన్ని తట్టుకుని నిలబడాలంటే!" అన్నాడు శంకర్రావు ఉద్వేగంగా.          పిల్లవాడేడవడం మొదలెట్టాడు.          "శారదా! నేను తప్పు చెయ్యలేదు. చెయ్యబోయాను. కానీ, మానసికంగా చేసినట్లే లెక్క! నువ్వు చెయ్యని తప్పుకి విషం తగేశావు. అది నిజంగా విషం కాకపోయినా, తాగినతలే లెక్క! చెల్లుకి చెల్లు, ఇంక జరిగింది మర్చిపోదాం!"         పిల్లాడేడుస్తున్నాడు. శారద అటు చూసింది. కానీ, కదిలే ప్రయత్నం చెయ్యలేదు.
24,527
         అతని చేతులలో ఊలుబంతిలా, పూలచెండులా ఉన్న అందాల పాప.          "థాంక్యూ! అండ్ విష్ యూ ద సేమ్!" అని చెప్పింది ప్రతిమ నవ్వుతూ. "అప్పుడే పాపని ఎత్తేసుకున్నారే!"          "మరేమనుకున్నావ్! పాపనెత్తుకోవడం కోసమే త్వరగా లేచేశాను ప రాత్రంతా నిద్ర లేకపోయినా!"          పాప కేరింతలు కొట్టింది.          కుమార్ పాపను ముద్దుపెట్టుకుని, "చిచ్చీ! నువ్వు! నువ్వు! ఆఁ! అదీ! దట్స్ మై గాల్!" అన్నాడు.          పాప బోసి నోరంతా తెరిచి నవ్వింది.     "ఆఁ! అలా నవ్వాలి! ఎప్పుడూ ఏడవకూడదు! ఏడిపించ్బినా ఏడవకూడదు! వాళ్ళే ఏడిచేటట్లు నువ్వుమాత్రం నవ్వుతూనే ఉండాలి! అర్ధమయినట్లుందా!"          తనకంతా అర్ధమయినట్లే నవ్వింది పాప. నవ్వుతూనే ఏదో చేసేసింది. చల్లగా తగిలితే చూసుకున్నాడు కుమార్.          "ఏమిటిదీ? లాల్చీ తడిసిపోయిందే! ఇందాక మొహం కడుక్కుంటున్నప్పుడు తడిపేసుకున్నానేమో, చిన్నపిల్లాడిలాగా!" అన్నాడు.     ఇదంతా చూస్తున్న ప్రతిమ ఫక్కున నవ్వేసింది. ఆమె అంత హాయిగా నవ్వి చాలా రోజులయింది. "లాల్నీ మీరు తడుపుకోలేదు." అంది నవ్వాపుకుంటూ.          "మరి?" అని ప్రశ్నార్ధకంగా చూసి, అంతలోనే "ఛీ! యాక్! అల్లరి పాపా! నువ్వు ఆవిడ దగ్గరికే వెళ్ళిపో! నా దగ్గరొద్దు!" అని పాపని ప్రతిమకి అందించి, చేతులు దూరంగా పెట్టుకుని, హాస్యగాడిలా నడుస్తూ వెళ్ళిపోయాడు - ముక్కోపి అని పేరుబడ్డ డాక్టర్ కుమార్.          ప్రతిమ పాపని లోపలికి తీసుకెళ్ళి రోంపర్ మార్చి, ముద్దాడడం మొదలెట్టింది.          బట్టలు మార్చుకుని వచ్చిన కుమార్, గుమ్మం దగ్గరే ఆగిపోయి ప్రతిమని, పాపని గమనించాడు.          లేత ఆకుపచ్చ లతల ప్రింటు గార్డెన్ వాయిల్ చీరె కట్టుకుని ఉన్న ప్రతిమ, మల్లెతీగె లాగా ఉంది. తెల్ల రోంపర్ లో నాజూగ్గా ఉన్న పాప, ఆ తీగెకు పూసిన మల్లెమొగ్గలా ఉంది. చాలా మనోహరంగా ఉంది ఆ దృశ్యం!          ప్రతిమనీ, పాపనీ తదేకంగా చూస్తూ ఉండిపోయాడతను.                                                                         * * * * *          రెండేళ్ళు గడిచాయి. సంవత్సరానికోసారి ఇండియాకు వెళ్ళడానికి శ్రీరాంకి లీవు ఇస్తారు. అయినా కావాలనే క్రితం సంవత్సరం అతను వెళ్ళలేదు. కనీసం ఓ మూడు లక్షలన్నా లేకుండా ఇండియా వెళ్ళకూడదని అతని పట్టుదల. ఇప్పుడింక ఫర్వాలేదు. జీతమూ, బోనసూ అన్నీ కలిపి నాలుగు లక్షల పైనే క్యాష్ వుంది తన దగ్గర. హైదరాబాద్ వెళ్ళగానే ద్రాక్షతోటో, నిమ్మతోటో ఏదో ఒకటి కొనెయ్యాలి ముందు. ఇలా ఇంకొక్క అయిదారు సంవత్సరాలు ఎడారిలో గడిపితే - ఇంక ఆ తర్వాత అయిదారు తరాలపాటు తడుముకోకుండా తినడానికి వీలైనంత ఆస్తి కొనచ్చు!          అతనికి ప్రతిమ గుర్తొచ్చింది. ప్రతిమ గుర్తు రాకుండా ఉండాలని లక్షవిధాల ప్రయత్నిస్తుంటాడు అతను. లక్షవిధాల ఓడిపోతుంటాడు.          వెల్! కావలసినంత డబ్బు సంపాదించాడు కనుక, ఇప్పుడు మొగాడిలా, ప్రతిమకి ఒక్క ఛాన్సు ఇచ్చి చూస్తాడు -తన కాళ్ళదగ్గర పడి ఉండడానికి! ఇదివరకటిలా ఆమె సంపాదన తింటూ, "మ్మె మ్మె మ్మె' అంటూ, ఆడంగిలా వుంటూ కాకుండా - మొనగాడిలా అడుగుతాడు!          'రా! వచ్చి నా స్లీపింగ్ పార్ట్ నర్ గా జీవితాన్ని ఎన్ జాయ్ చెయ్యి!' అని.          ఎగిరి గంతేసి ఒప్పుకుంటుంది ప్రతిమ.          వెంటనే చకచక ఉత్తరం రాశాడు.          "ప్రతిమా!          ఐదు లక్షలు సంపాదించాను. అమెరికన్ డాలర్ అంత దర్జాగా చలామణి అవుతున్నాను. నేను మనిషినే అనిపిన్చుఇకుంటున్నాను ఇప్పుడు. ముఫ్ఫయ్యో తారీఖు ఫ్లయిట్ లో వస్తాను. నీ మొండితనం, పొగరూ ఈ పాటికి తగ్గి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి ఉంటావని ఆశిస్తున్నాను.                                                                                                                   - శ్రీరాం!"          ఆ ఉత్తరం పోస్టు చేసి, అతను ప్రయాణ సన్నాహాల్లో మునిగిపోయాడు.                                                                        * * * * *          పోస్ట్ మాన్ ఆ ఉత్తరం తీసుకుని ప్రతిమా వాళ్ళ యింటికి వచ్చేసరికి, వరండాలోనే కూర్చుని సిగరెట్ కాల్చుకుంటున్నాడు కేశవరావు. ఉత్తరం అందుకుని, అది తనకే వచ్చినంత నిస్సంకోచంగా తెరిచి, చదివాడు. వెంటనే అతని కళ్ళు బైర్లు కమ్మాయి. మెదడు మొద్దుబారిపోయింది. గుండె ఒక్క క్షణం ఆగి, మళ్ళీ కొట్టుకోవడం మొదలెట్టింది. ఏమిటీ? ఈ శనిగాడికి మళ్ళీ మహారాజయోగం పట్టిందా? లక్షలకి లక్షలు సంపాదించి తిరిగి వస్తున్నాడా! ప్రతిమ ఉద్యోగం మానేసి వీడి అధీనంలోకి వెళ్ళిపోతే తన గతేమిటి? పీటర్ స్కాట్ కి బదులు కల్తీ కల్లు తాగాల్సి వస్తుంది. అసలు అది కూడా దొరుకుతుందా అని?          ఈ శ్రీరాంగాడు తన కూతుర్ని వదిలి దేశాలు పట్టి పోయాడని ఎంత సంతోషించాడు తను! మళ్ళీ వీడు తిరిగొస్తే తన గతి వీధి కుక్క లాగా అయిపోతుంది.         అలా జరగనివ్వడు తను! అలా జరగకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి?          ఆయన గాభరాగా బార్ కెళ్ళిపోయి, పెగ్గు మీద పెగ్గు తాగుతూ మార్గాంతరం ఆలోచించడం మొదలెట్టాడు. కాలుతున్న సిగరెట్ ని శ్రీరాం రాసిన ఉత్తరం మీద ఉంచి తూట్లు పొడిచాడు. తన కూతురి కాపరానికి కూడా అలాగే తూట్లు పొడుస్తున్నానేమో అన్న శంక కలగలేదు ఆయనకి.         ఆ తర్వాత ఉత్తరాన్ని సాధ్యమైనంత చిన్న చిన్న ముక్కలుగా చింపి, యాష్ ట్రేలో పడేసి, దాన్లో కొద్దిగా విస్కీ పోసి అగ్గిపుల్లతో అంటించాడు. భగ్గున మండింది ఉత్తరం - విస్కీ ప్రభావంతో!          బేరర్ వచ్చి నిరసనగా చూస్తూ, యాష్ ట్రేని అక్కడనుంచి తొలిగించాడు.          కేశవరావు కుటుంబం ప్రతిమ ఇంట్లోనే పర్మనెంటు స్థావరం ఏర్పరచుకున్నాక, కావలసినవన్నీ యథేచ్చగా జరిగిపోతున్నాయి వాళ్ళకి. హాస్పిటల్ పనితో ఊపిరాడకుండా ఉండే ప్రతిమ, ఇంటి బాధ్యత అంతా తల్లిదండ్రులకే వదిలేసింది. ఇప్పుడు వంటింటి పెత్తనం సుందరమ్మదీ, బయట పెత్తనం కేశవరావుదీనూ!     ఇదే ఆయన కోరుకున్నది మొదట్లో! ఇందుకోసమే ప్రతిమ పెళ్ళి చెయ్యకుండా వుండాలని తాపత్రయపడింది. అల్లుడు అలిగి వెళ్ళిపోవడంతో ఆ కోరిక ఈ విధంగా తీరుతోంది. కానీ ఇప్పుడు శ్రీరాం తిరిగివస్తే తమ పరిస్థితి తిరగేసినట్లయి మళ్ళీ మొదటికే వస్తుంది. తూలుతూ లేచి, దిక్కు తోచనివాడిలా ఆగమ్యంగా నడిచిపోతున్నాడు కేశవరావు.
24,528
       నోరుమూసుకు చెప్పటం అసాధ్యం కాబట్టి నోరు విప్పి జరిగింది పొల్లుపోకుండా క్క్ష్హెపుతున్న కమల కి అడ్డుతగిలి "ఇదే మాట మరోసారి చెప్పు" అన్నాడు విజయ్.     "వీడికి గ్యారండీగా మతిబోయింది" అనుకుంటూ "నే కూర్చున్న చోట వున్న స్థూపం కదిలినట్లు వుంటే తిప్పి చూశాను" కమల్ అదేమాట రిపీట్ చేశాడు.     విజయ్ కళ్ళు తళతళ లడాయి.     "అరె పూల్. కృతి మాయం కావటం అన్నది ఎప్పుడు జరిగింది? మనం అంతా కలిపి ఈ స్థూపాలు తిప్పుకున్నప్పుడు అవునా?"     "అవును"      "ఇక్కడ స్థూపాలుకొన్ని మాత్రం తిరుగుతున్నాయి. కొన్ని అలాగే వున్నాయి. ఏ కారణం లేకుండా స్థూపాలు ఇలా వుండవు కదా?"     "చాలు . కొంతవరకూ అర్దమయింది"     "అయితే ఇంకేం లేవండి " విజయ్ లేస్తూ అన్నాడు.     ముగ్గురూ లేచారు. విజయ్ చెప్పిన ప్రకారం చకచక రంగంలోకి దిగారు. వాళ్ళు ముగ్గురూ పక్కో స్థూపాన్ని తిప్పటం చేస్తున్నారు. విజయ్ అంతా అప్రిశీలనగా చూస్తున్నాడు.     మమత్రాలకి చింతకాయలు రాలునట్లు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వున్నట్లు . ఆ ప్రదేశంలో ఏ మార్పూ రాలేదు. వాళ్ళ ముగ్గురిలో నిసత్తువ ప్రవేశించింది ఆశించింది జరగని ఆశాభంగం అది. విజయ్ మాత్రం చలించలేదు. అతని కళ్ళల్లో మొండి పట్టుదల అతని ముఖంలో దృఢ నిశ్చయం . అతనిలోని కార్యదీక్ష "ఏంటి అంతా అలా నిరాశపడి పోతున్నారు. నిరాశతో పనులు కావు ఆశతో పనులు చేయాలి. స్థూపాలు తిప్పి చూశాము. పని కాలేదు, ఇప్పుడు మరోపని చేద్దాం ఏకకాలంలో మీ ముగ్గురూ వకే డిజైన వున్న స్థూపాలని వకే వేపుకి తిప్పి చూడండి" అంటూ వుత్సాహం తెచ్చుకుని వాళ్ళని ప్రోత్సాహించాడు.     ఎవరూ తమ అభిప్రాయం బైట పెట్టలేదు మౌనంగా విజయ్ చెప్పినట్లు చేశారు. విజయ్ ముందుకు నడుస్తున్నాడు.     "సక్సెస్ , గ్రాండ్ సక్సెస్!" విజయ్ అరిచాడు.     ముగ్గురూ విజయ్ దగ్గరకు పరుగెత్తుకు వచ్చారు.     "చూడండిరా ఇటు చూడండిరా నా అంచనా లేశ మాత్రం కూడా తప్పలేదు ఆరోజు మనం ఒకరికొకరం తెలియకుండా ఒకే యాంగిల్లో ఈ స్థూపాలని తిప్పి వుంటాము కృతి సరీగ ఇక్కడ నిలబడి ఉంటుంది. ఆ తర్వాత ....... ఆ తర్వాత " విజయ్ ఆగిపోయాడు.     ఎటుచూసినా ఆరడుగుల నేల లోపలికిపోయి ఏర్పడిన ఆ గోతిని చూస్తూ వుండిపోయారు. అంతా.     మరోసారి సూపాలని తిప్పి చూశారు. చుట్టూ పట్టు కోవటానికి ఆధారం లేదు. కాని ఇక్కడ స్థూపాలని తిప్పితే అక్కడ నేలమీద కొండ భాగం బల్లచెక్కలా లోపలి దిగటం పైకి రావటం జరుగుతున్నది. ఓ రకం లిప్టు నుకోవచ్చు దానిని రావటం పోవటంకూడా క్విక్ గా జరుగుతున్నది.     లోపలి తొంగిచూశారు. లోపల గాడంధకారంగా వుంది. టార్చిలైటు వెలిగించి చూశారు పెద్ద తాటి చెట్టు అంత లోతు మాత్రమె వుంది లోపలినుంచి ఏ చిన్న శబ్దమూ లేదు. ఎవరూ పైకి రాలేదు.         "ఇప్పుడు మనం ఏం చేద్దాం?" నిశ్చల అడిగింది.     "నే లోపలి డిగి చూస్తాను" విజయ్ అన్నాడు.     "నేనూ వస్తాను" కమల్ అన్నాడు.     "వద్దు. నే చూసివస్తాను" నా మాటకి ఎదురు చేప్పోద్దు అనే విధంగా గట్టిగా చెప్పాడు విజయ్.     సుబ్బారావుకి చాలా పెద్ద అనుమానం వచ్చింది సమయంకాదని నోరుమూసుకున్నాడు.     పట్టుకోవటానికి ఏ ఆధారం లేనందున విజయ్ లిప్టు పై కూర్చుండి పోయాడు.     ముగ్గురూ మూడు స్థూపాలు మళ్ళీ మరోవేపుకి తిప్పారు.     ఖాళీ లిప్టు పైకి వచ్చింది.     ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఆగి ఆగి స్థూపాలని తిప్పుతున్నారులిప్టు లోపలి పోతున్నది పైకి వస్తున్నది.     విజయ్ జాడమాత్రం లేదు.     పది నిముషాలు గడచిపోయింది.     "నే లోపలికి వెళతాను" కమల్ అన్నాడు.     "వద్దు" అంది నిశ్చల .     "విజయ్ ని వదిలేసి మనం ఇక్కడ వుందామా?"     కమల్ స్వరంలోని వ్యగ్యం గుర్తించింది నిశ్చల. "నా వుద్దేశ్యం అదికాదు చావో బతుకో ముగ్గురం కలిసే చేద్దాం" అంది,     "గుడ్" అన్నాడు కమల్.     "ముగ్గురూ కల్సి వెళ్ళటం ఆసాథ్యం" అన్నాడు సుబ్బారావు.     "నిజమేనురోయ్ స్థూపాలు తిప్పందే లిప్టు కదలదు కదిలింతరువాత ఆగదు కనుక ......!" కమల్ ఆలోచించాడు, "ఓపని చేద్దాం. లిప్టు లోపలికి పంపిద్దాము, మన నడుంకి చుట్టుకున్న నైలాన్ తాడుని విప్పి ఇక్కడో స్థూపానికి కట్టి లోపలి వదులుదాము. ఆ తాడు ఆధారంతో లోపలి దిగుదాం"     "ఆపని చేద్దాం. నాదో చిన్న అనుమానం మనం లోపలి దిగంగానే ఎవరైనా వచ్చి ఇక్కడ తాడుకట్టి వుండటం చూస్తే?" నిశ్చల అడిగింది.     "రోట్లో తలదూర్చి రోకటిపోటుకి వేరవటం మంచి లక్షణం కాదమ్మాయ్?" కమల్ తాడు విప్పుతూ అన్నాడు.     "కమల్? లోపల బ్రహ్మారాక్షసడున్నాడేమోరా?"     "బ్రహ్మరాక్షసుడు కాదురా సుబ్బాయ్! నీకోసం ఓ శూర్పణఖ వుంది. నీ కంతగా భయంగావుంటే పైనవుండు మేము లోపలివెళ్ళి వస్తాము"     "ఇక్కడ వంటరిగా వుండాలన్నా భయంగా వుంది. మీతో లోపలి రావలనా భయంగా వుంది. అయినా మీతోనే వస్తాను. చావో బతుకో అందరం ఒకే మార్గాన పోవటం మంచిది నిశ్చల ప్దేమాట అంది. నేనూ ఇదేమాట అంటున్నాను"     ముగ్గురూ ఒకరి వెనుక ఒకరు తాడు పట్టుకుని చుట్టూ గోడకి కాళ్ళు నిగడతన్నుతూ లోపలి జారారు.     లోపలంతా చీకటి. అలా కొద్ది లోపలి మాత్రమే వెళ్ళారు.     అప్పుడే ఓ ప్రమాదం జరిగింది వూహించమని విధంగా .     పైన నైలన్ తాడు గట్టిగానే కట్టాడు కాని నైలాన్ తాడు ఏ మాత్రం సరీగ ముడివేయకపోయినా ముడి జారిపోతుంది. సరీగ ఆ దభేల్ మని పడ్డారు.     లోపలంతా చీకటి.     సుబ్బారావు కేక ఆ చీకటిని చీల్చుకుంటూ వెలివడింది.     నిశ్చల కీచుమని అరిచింది.     కమల్ అతి ప్రయత్నంమీద పెదవిదాటి ఏ శబ్దమూ రాకుండా ఆపుకున్నాడు.                                                                           45     కమల్ కి మెలుకువ వచ్చింది నెమ్మదిగా కళ్ళువిప్పాడు.     కళ్ళు మూసుకున్నా తెరిచినా ఒకటేరకంగా వుంది. భరించరాని చీకటి.     "నాకేమయింది? నే ఎక్కడ వున్నాను?' కమల్ అలోచించాడు జరిగింది గుర్తుకొచ్చింది . "నిచ్చూ! నిశ్చల్!" అంటూ చేతులతో తడుముతూ నెమ్మదిగా పిలిచాడు. చేతికి ఏదో తగిలింది. సరీగ అప్పుడే "కమల్?" అన్న విజయ్ పిలుపు వినవచ్చింది.     "విజయ్!" ఆనందంగా పిలిచాడు కమల్.     "ఆ ..... నేనే"     "నీ వెక్కడున్నావ్?"     "నీ వెక్కడున్నావో నేనూ అక్కడే వున్నాను" అలా మాట్లాడుతూ స్వరం వినవచ్చేవేపు జరుగుతూ విజయ్ వచ్చాడు. చేతులతో తడిమిచూసి "ఇదేమిటి?" అన్నాడు సరీగ అప్పుడే విజయ్ భుజం మీద చేయి వేయగలిగిన కమల్ "మేము ముగ్గురం కలసి వచ్చాము వీడు సుబ్బు" అంటూ వివరించాడు.     సుబ్బారావుని గట్టిగా కుదపటంతో సుబ్బారావులో కదలిక వచ్చింది. కళ్ళు తెరుస్తూనే "అమ్మా తలనొప్పి, బామ్మా! కమల్ కి నవ్వు వచ్చింది.     "ఒరేయ్ బామ్మా? ఇక్కడుంది మేమురా! లేచి కూర్చోరా నాన్నా!" అన్నాడు.     సుబ్బర్వుకి గుర్తుకొచ్చింది . తల తడిమిచూసుకున్నాడు. జిగటగా తడి తగిలింది. "తల పగిలిందిరా చాలా నొప్పిగావుంది" అన్నాడు.
24,529
    మేము మాట్లాడుతూండగానే మీనాభజన్ నుంచి లోపలకు రమ్మని మాకు ఆహ్వానం వచ్చింది-     అందరం లోపలికెళ్ళి సోఫాల్లో కూర్చున్నాం!     అప్పటికే ఆమె ఎవరో టీవీ ప్రొడ్యూసర్ తో ఫోన్ లో మాట్లాడుతోంది.     "మీకేమయినా కామన్ సెన్సుందా? ఇప్పటికి పాతిక ఎపిసోడ్స్ టెలికాస్ట్ అయ్యాయ్. అయినా కూడా ఒకే మొగుడు ఒకే పెళ్లాంతో ఈ పాతిక ఎపిసోడ్స్ నుంచీ వదలకుండా కాపురం చేస్తున్నాడు. హీరో తల్లి కారెక్టర్ కి పెళ్ళికి ముందు ఇంకెవడితోనో ప్రేమకలాపాలు జరిపి- ఒక పిల్లాడిని కని అనాధాశ్రమంలో ఇచ్చేసిన ఫ్లాష్ బాక్ లేదు.     హీరో తండ్రికి వేరే ఊళ్ళో సెకండ్ సెటప్ లేదు- హీరోయిన్ చెల్లెలు ఈ పాతిక ఎపిసోడ్స్ నుంచీ ఒకే బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతోంది. ఇలా లవ్ ట్రయాంగిల్స్ డబుల్ ట్రయాంగిల్స్- రివర్స్ ట్రయాంగిల్స్ లేకుండా అదెక్కడి సీరియలండీ? ఈ సీరియల్ ఇలాగే నడుస్తే ప్రేక్షకులు చెప్పు తీసుక్కొడతారు-"     "ఎవర్నండీ?"     "ఎవర్నేమిటి? మమ్మల్నే! ఈ రోజుల్లో వ్యూయర్స్ ఎంత ఫాస్ట్ గా ఉన్నారో గ్రహించకపోతే ఎట్లా?- ఏంటీ? ఏం చేయమంటారా? కథ కూడా క్రియేటివ్ హెడ్డే చెప్తే ఇంక ప్రొడ్యూసర్లెందుకండీ- అడుక్కుతినడానికి? పెట్టండి. వల్గర్ సినిమాలకు కథలు రాసే రచయితలుంటారు. అలాంటి వాళ్ళను పట్టుకుని డబ్బిచ్చి కథ మార్పించండి! మందు తాగిస్తే మర్డర్స్ చేసే బాచ్ ఒకటుంది. వాళ్ళను పట్టుకుని వాళ్ళతో క్రైమ్ యాంగిల్ రాయించండి- ఓకే?"     ఫోన్ పెట్టేసిందామె కోపంగా.     మా గుండెలు ఝల్లుమన్నాయ్.     అలాంటి నికృష్ఠమయిన కథలల్లి టీవీ సీరియల్ తీయాలన్న నాలెడ్జే మాకులేదు.     ఇప్పుడు మా స్టోరీ వింటే ఏమంటుందో ఏమో!     మీనాభజన్ మావేపు చూసింది.     "యస్- ఎవరు మీరు?"     "మాడి నిర్భయ్ నగర్ కాలనీ మేడమ్! మా గురించి రవి మీతో చెప్పానన్నాడు-"     "ఓ రవి చెప్పిన పార్టీయా?"     "అవును మేడమ్- మేము చాలామంచి ఫ్యామిలీ సీరియల్ తీశాం మేడం-"     "ఫ్యామిలీ సీరియలా?" గాబరాగా అడిగిందామె.     "అవును మేడమ్- అంటే ఫామిలీ అంతా- తల్లీ తండ్రీ, పిల్లలూ, అన్నవదినెలు, కొడుకూ కోడళ్ళూ, కూతురూ అల్లుళ్ళూ- అంతా కలిసి కూర్చుని హాపీగా చూసే ఫ్యామిలీ టైప్ స్టోరీతో తీసిన సీరియల్ మేడమ్-"     ఆమె తలకొట్టుకుంది.     "ఛఛఛ! ప్రొఫెషనల్స్ కానివాళ్ళు సీరియల్స్ తీస్తే ఇలాగే ఉంటుంది. ఫ్యామిలీ టైప్ సీరియల్స్ అంటారేంటి? అసలు కంబైన్డ్ ఫామిలీస్ ఎక్కడున్నయ్ మన దగ్గర? ఫాదర్ మందుకొడుతూంటాడు- తల్లి టీవీ ముందుంటుంది. కాలేజ్ గోయింగ్ పిల్లలుంటే వాళ్ళరూమ్ లో ఇంకో టీవీలో హిందీ చానెల్స్ లేదా ఇంగ్లీష్ చానెల్స్ చూస్తూంటారు- లేదా పిల్లలు అమెరికాలో ఉంటారు. ఇంకా ఫ్యామిలీ ఎక్కడుంది?" చిరాగ్గా అంది.     మాకు మాట రాలేదు కాసేపు.     ఆలోచిస్తే ఆమె చెప్పింది నిజమే అనిపించింది.     ఇప్పుడు కంబైన్డ్ ఫ్యామిలీస్ ఎక్కడున్నయ్?     ఉన్నా సెపరేట్ సెటప్ లు-     సిటీ బయట తల్లీదండ్రీ ఒక ఫ్లాట్ లో- హైటెక్ సిటీ దగ్గర ఫ్లాట్ లో కొడుకూ, కోడలూ, ఇంకెక్కడో కూతురూ అల్లుడూ- ఇంకో ఏరియాలో తమ్ముడూ- మరదలూ- మా కాలనీలో పరిస్థితే అలా ఉంది ప్రస్తుతం-     "ఆల్ రైట్! ఈ సీరియల్ కాన్సెప్ట్ ఏంటి?" ఆమె అడిగింది మళ్ళీ.     "రోజురోజుకీ కుటుంబ బంధాలు వ్యాపారాత్మకం అయిపోతున్నాయ్ కదండీ! దానివల్ల మనిషి జీవితంలో ఎన్ని సమస్యలొస్తోందీ--.."     "చాల్చాలు- అర్థమయింది- పాత చింతకాయ పచ్చడి సబ్జెక్ట్ అన్నమాట! ప్రొఫెషనల్స్ కానివాళ్ళతో ఇదే న్యూసెన్స్- మీరనే కాదు- మీలాంటివాళ్ళు చాలామంది ఇలాంటి చెత్త సబ్జెక్ట్స్ తో వస్తున్నారు. అవన్నీ అవుట్ డేటెడండీ! ఒకసారి మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడండి! ఎలాంటి వింతలు విడ్డూరాలు జరుగుతున్నాయో, ఎలాంటి ఆశ్చర్యకరమయిన సంఘటనలు జరుగుతున్నాయో- అలాంటి సబ్జెక్ట్స్ కావాలి! వివల్యూషనరీ థీమ్స్ కావాలి!- ఓకే! మీ స్టోరీలో క్రైమ్ ఎలిమెంట్ ఉందా?"     "క్రైమా? ఫామిలీ సీరియల్లో క్రైమ్ ఎందుకుంటుంది మేడమ్? ఫామిలీ అంటే సెంటిమెంట్ ముఖ్యం కదా?"     "మీకేమయినా మెంటలా? క్రైమ్ యాంగిల్ లేని ఫామిలీస్ ఎక్కడున్నాయ్ ఇప్పుడు? న్యూస్ పేపర్స్, టీవీ చానెల్స్ చూట్టంలా- మీరు? మొగుడూ, మరదలూ కలిసి పెళ్ళాన్ని మర్డర్ చేసేస్తున్నారు. మరిది వదినతో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమె భర్తను- అంటే తన స్వంత అన్నను లేపెస్తున్నాడు. ఒకడు ఫ్రెండ్ భార్యతో సంబంధం పెట్టుకుని అభ్యంతరం చెప్పిన ఆమె అత్తామామలను పైకి పంపించేస్తున్నాడు. తను పెళ్ళి చేసుకుందామనుకున్న అబ్బాయి ఇంకో అమ్మాయిని పెళ్ళి చేసుకుంటున్నాడన్న విషయం తెలిసి ఆ అమ్మాయి గూండాల గాంగ్ కి డబ్బిచ్చి ఆ అమ్మాయిని లేపేయమంటుంది. తీరా ఆ అమ్మాయిని ఆ గూండాగాంగ్ లీడర్ మర్డర్ చేయబోతూ ఆ అమ్మాయితోనే లవ్ లో పడతాడు. దాంతో కథ రివర్స్ అవుతుంది. ఇప్పుడా డాన్ తనకు డబ్బిచ్చిన అమ్మాయినే లేపేయడానికి ప్లాన్ చేస్తాడు.     అదీ ఫామిలీ సీరియలంటే-     "కానీ మీరు చెప్పిన సంఘటన లేమీ ఏ ఫామిలీలోనూ జరగ్గా మేము చూళ్ళేదు మేడమ్- ఒకవేళ ఎక్కడో చోట జరిగినా అది సాధారణం కాదు! చాలా రేర్ గా జరిగేది-"     "అందుకే- అందుకే- అందుకే- అలాంటి సంఘటనలే మన ఫామిలీస్ కి కావాలి. ఎందుకంటే అలాంటి తీరని కోరికలతో- ఫామిలీలో అందరూ రగిలిపోతూ ఉంటారన్న మాట. ఛాన్స్ దొరికితే అలాంటి నేరాలన్నీ చేయడానికి అందరి మనసులూ ఉవ్విళ్ళూరు తుంటాయన్నమాట! అలాంటి అక్రమ సంబంధాల కోసం వెర్రెత్తి పోతూంటారన్నమాట! అందుకే మన ఫామిలీ మెంబర్స్ లోపల అణగారిపోయి ఉన్న ఆ కోర్కెలను మనం సీరియల్స్ ద్వారా బయటపెట్టాలి- అప్పుడేవాళ్ళు సీరియల్స్ ని ఎంజాయ్ చేయటం మొదలుపెడతారు. వాళ్ళు చేయలేక పోయిన పనిని ఆ సీరియల్లో పాత్రలు అవలీలగా చేసేస్తూంటే ఆ పాత్రల్లో తమని ఊహించుకుని ఈ సీరియల్ కి బానిసలయి పోతారన్నమాట! అర్థమయిందా?"     "అయింది గాని మేడమ్- మీరు చెప్పిన లక్షణాలన్నీ మెంటల్ వాళ్ళకుంటాయ్. సాధారణంగా పెరీనార్మ్ అంటారనుకుంటాను ఆ వ్యాధి పేరు-" కొంచెం తిరుగుతూ అన్నాడు గోపాల్రావ్.
24,530
    రాహుల్ శని, ఆదివారాలొచ్చి తల్లిదగ్గిర వుంటున్నాడు.     డాక్టర్ రౌండ్స్ కి వచ్చారు. నీరదని పరీక్షించి, రిపోర్టులు, టెస్టులు అన్నీ మళ్ళీ పరీక్షించి "గుడ్ ఇంప్రూవ్ మెంట్. రక్తంలో మత్తు డెబ్భైశాతం తగ్గింది. ఫిజికల్ గా ఆమె కోలుకుంటోంది. ట్రీట్ మెంట్ కి మంచి రెస్పాన్స్ వుంది. ఎటొచ్చీ మానసికంగా ఇంకా కోలుకోవాలి. ఇంకో వారం పదిరోజుల్లో ఆ మార్పూ రావచ్చని ఆశిద్దాం... మీరు కొద్ది కొద్దిగా ఘనాహారం నోటిద్వారా తినిపించండి. తెలివిలో వున్నప్పుడు కొద్దికొద్దిగా ఆహారం ఎలాగైనా తినిపించడానికి ప్రయత్నిస్తూ వుండాలి."     అన్నీ శ్రద్ధగా విపులీకరించారు డాక్టరుగారు.     శారద థ్యాంక్స్ చెప్పింది సంతోషంగా.                                            * * *     "సునీతా! ఇవాళ రంజని ఆఫీసుకి వచ్చి చాలా గొడవ చేసింది. స్టాఫ్ అందరిముందూ చాలా అసహ్యంగా సీన్ క్రియేట్ చేసింది. ఆమెని ఎలా ఫేస్ చెయ్యాలో, ఎలా వదిలించుకోవాలో అర్థంకాలేదు. అందరిముందూ తల దించుకునే పరిస్థితి తెచ్చింది..." ఆఫీసునుంచి ఇంటికొచ్చి తలపట్టుకుని కూర్చుని అన్నాడు.     సునీత ఒక్కక్షణం ఆలోచించింది.     "రేపు ముందు ఆమెకి మూడు నెలల జీతం ఇచ్చి ఉద్యోగంలోంచి టెర్మినేట్ చేయండి. సజావుగా వినకపోతే ఆఫీసులో న్యూసెన్స్ క్రియేట్ చేస్తోందని పోలీసు కంప్లయింట్ ఇస్తానని బెదిరించండి... ముందామెని ఆఫీసుకి రాకుండా చూడండి. వీలయితే ఎవరైనా మధ్యవర్తి ద్వారా పరిష్కారం జరిగేట్టు చూడండి... సామరస్యంగా పని జరిగేట్టు చూడండి వీలైనంతవరకు. డిమాండ్ చేస్తే కొంత డబ్బు ముట్టచెప్పండి పరిహారంగా, చేసిన తప్పుకి... రంజనిలాంటి వాళ్ళు సాధారణంగా డబ్బు ఆశకి లొంగుతారు" అంది సునీత.     సాలోచనగా చూశాడు రవీంద్ర.                                            * * *     "ఏమిటి ప్రకాష్... ఈమధ్య ఇంత ఆలస్యం చేస్తున్నావు రావడం? టైమెంతయిందిప్పుడు? పదకొండు... ఇంత రాత్రివరకు ఆఫీసులో పనేమిటి... రాహుల్ కోసం అన్నా త్వరగా రా. శారద ఎలాగో లేదు... నీవన్నా కాస్త తొందరగా వచ్చి వాడితో కాసేపు గడపకపోతే ఎలా... సరే పదా, బట్టలు మార్చుకురా అన్నం తిందువుగాని" సత్యవతి అంది ఆవలిస్తూ.     "అన్నం తినే వచ్చాను... ఏవో ఇంపార్టెంట్ కేసులున్నాయి. కాగితాలు చూసుకుంటుంటే ఆలస్యం అయింది..." అన్నాడు ప్రకాష్ తల్లిముఖం చూడకుండా.     సుప్రియ జీవితంలో ప్రవేశించాక అతనికి పనిపట్ల శ్రద్ధ తగ్గింది. బలవంతంగా ఏడుగంటలవరకు ఆఫీసుపని చూసి సుప్రియ ఇంటికి చేరడం ఆమె ఇచ్చే విందుతోపాటు, అందాల విందులు చవిచూసి ఏ పదకొండింటికో ఇల్లు చేరడం... వారంలో కనీసం మూడురోజులు ఇదే దినచర్య అయింది.                                                                       * * *     బ్యాంక్ మొదటి విడత డిపాజిట్ కట్టడానికి కమిటీ, కోర్టు ఇచ్చిన ఆఖరి తేదీ నాటికి కోర్టు ఆర్డర్ ప్రకారం నలభైశాతం అప్పు చెల్లగొడుతూ చెక్కులు పంపారు పెద్ద మనుషులు. పేపర్లలో ఆ వార్త చూసిన డిపాజిటర్ల ఆనందానికి హద్దులు లేవు. ఇన్నాళ్ళకి మంచిరోజులు వచ్చాయి అని ఆనందపడ్డారు.     కనీసం డిపాజిట్ లో నలభయ్యో వంతు అయినా వచ్చి కొద్దిగానైనా వెసులుబాటు లభిస్తుందని సంబరపడ్డారు.     'ఉషోదయం' పత్రికకి లెక్కలేనన్ని ఫోన్ కాల్స్ చేసి వారి పుణ్యాన తమకి కాస్త పోయిన ప్రాణం వచ్చిందని అభినందించారు. తమకు అన్యాయం జరిగినా కనీసం తమవల్ల కొంతమందికైనా న్యాయం జరిగిందని నారాయణమూర్తిగారు సంతోషించారు.     "అంకుల్, నీరదకిది తెలిసిననాడు ఎంత సంబరపడుతుంది! ప్చ్, ఆమెకి తెలివివచ్చి ఇది తెలిస్తే ఎంత బాగుండును" ఉద్విగ్నంగా అన్నాడు శ్రీను.     "బి పేషన్స్ మై బాయ్... భగవంతుణ్ణి నమ్ముదాం. మంచిచేసినవారికి ఏదోరోజు న్యాయమే జరుగుతుందని అంటారు. అది నమ్ముదాం" అన్నారు.     బ్యాంక్ డిపాజిటర్లకి ఫలానా తేదీనించి నలభై శాతం డిపాజిట్టు చెల్లింపులు ఇస్తాం అన్న ప్రకటన నాలుగురోజుల తర్వాత వెలువడింది.                                                                      * * *     ఆ రోజు శారద ఆస్పత్రిలో వుండగా స్కూలు ప్రిన్సిపాల్ రాహుల్, ఇంకో అబ్బాయి కొట్టుకున్నారని, ఆ దెబ్బలాటలో రాహుల్ ని ఆ అబ్బాయి తోసిన తోపుకి రాహుల్ వెళ్లి ఒక రాయిమీద పడ్డాడని, అతని తల చిల్లుపడి బాగా రక్తం కారిందని, స్పృహ కోల్పోయాడని వెంటనే రమ్మని హడావిడిగా ఫోను చేసి చెప్పింది.     శారదకి ఖంగారు, భయంతో కాళ్ళూ, చేతులూ ఆడలేదు.     టైమింకా పది కాలేదు. ప్రకాష్ కోర్టుకెళ్ళి వుండడు. అతనికి ఫోను చేస్తే సెల్ ఆఫ్ లో వుంది. రెండుసార్లు ప్రయత్నించి దొరకక ఇంక ఫోన్ చేస్తూ కూర్చుంటే ఆలస్యం అవుతుందని నీరద దగ్గర ఒక నర్సుని బతిమాలి కూర్చోపెట్టి గబగబా ఆటోలో ఆఫీసుకెళ్ళింది. పరుగులాంటి నడకతో అతని రూమువైపు వెళ్ళి తలుపుతీసి "ఏమిటి సెల్ ఆఫ్ చేసి కూర్చున్నారు" అంటూ లోపలికి అడుగిడబోయిన శారద, గుమ్మంలోనే నిశ్చేష్టురాలై నిలబడిపోయింది.     ప్రకాష్ టేబుల్ ముందు కుర్చీలో కూర్చుండగా, సుప్రియ వెనకనించి అతని రెండు భుజాలమీదా చేతులువేసి తలకి తల దగ్గర చేర్చి చెవిలో ఏదో అంటోంది. ప్రకాష్ ఎడమ చెయ్యి వెనక్కి జాపి చాలా జాలీమూడ్ లో ఆమె మొహాన్ని తన మొహంవైపు లాక్కుంటున్నాడు. ఆ దృశ్యం చూసి శారద నిర్ఘాంతపోయి నిలబడిపోయింది.     శారదని చూసి ప్రకాష్, సుప్రియల మొహాలు తెల్లబడ్డాయి.     ఒక్క ఉదుటున లేచాడు ప్రకాష్... మాట కూడదీసుకుని ఏదో అనేలోపల శారద అతనివంకా, సుప్రియవంకా మార్చి మార్చి చూసి ఒక్కమాట మాట్లాడకుండా గిర్రున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది.     ప్రకాష్ మొహం మాడిపోయింది.     సుప్రియ గాభరాగా "శారద మనల్ని చూసింది. ఇప్పుడెలా..." భయంగా అంది.                           
24,531
         "ఎందుకు నవ్వుతున్నావు?"     అభినయ్ వణుకుతున్న చేతులతో సిగరెట్ వెలిగించాడు.     "నవ్వొచ్చిందీ - నవ్వాను తప్పు కాదే!"     "అజే ఎందుకు నవ్వావు?" బాపినీడు గొంతు కరకుగా పలికింది.     "మీరు చూపిస్తున్న ఆదరణకి నవ్వాలే తప్ప ఏడవకూడదు మిస్టర్ బాపినీడూ!"     "మానవత్వం ఘనీభవించిన ఓ మహా మనిషీ! ప్రజా ప్రతినిధి అయిన మీ ప్రాణం విలువ. నీ ప్రాణంతో ప్రాణమైన నీ కూతురి మాన, ప్రాణం విలువ వెరసి వందరూపాయలేనా అని నాకు జాలితో నవ్వొచ్చింది" అన్నాడు.     అతని మాటలకి బాపినీడులోని అహం దెబ్బతింది. కోపంతో పిడికిలి బిగుసుకుంది. ఆ పిడికిలిలో వందరూపాయల కాగితం గరగరమని శబ్దంచేస్తూ ప్రపంచంలో కృంగి కృశించిపోతున్న మానవత్వంలా నలిగిపోయి ముడుచుకుపోయింది.     అభినయ్ మొహంలోకి చూసిన జయశ్రీ తండ్రి చేతిపైన చేయి వేసింది.     "మీరు పదండి డాడీ!" అంది.     వాళ్ళిద్దరి మధ్య మాటకిమాట పెరిగిపోతుందని ఆమె గ్రహించింది.     తండ్రి కెదురు చెప్పలేకపోయినా, అభినయ్ ఎలాంటి ఉపకారం తనకి చేశాడో ఆమెకి తెలుసు. ఆమెలోని అణువణువూ కృతజ్ఞతా భావంతో నిండిపోయింది.     అప్పటికే అభినయ్ కిందపడిన సైకిల్ ని లేవనెత్తి దానిమీద ఎగిరి కూర్చుని, తూనీగలా చీకటిలో కలిసిపోయాడు.     "రాస్కెల్!" అని పెదాలు కొరుక్కున్నాడు బాపినీడు.     కళ్ళకేమీ కనపడని ఆ నిశీధిలో అతను వెళ్ళిన దిక్కు కేసి కొన్ని క్షణాలు అలాగే చూసి ఏదో తియ్యని బాధకి గురవుతూ జయశ్రీ కారు దగ్గరికి నడిచింది.                                          2     జువాలజీ లెక్చరర్ రమాదేవి అనర్గళంగా లెక్చర్ ఇస్తోంది.     జువాలజీ సబ్జెక్ట్ లో ఆమే ఎక్స్ పర్ట్. ఆమె క్లాసు సాధారణంగా ఎవరూ ఎగ్గొట్టరు.     రమాదేవి స్టూడెంట్స్ తో కలుపుగోలుగా వుంటుంది.     థియరీ క్లాసులో అయినా, ప్రాక్టికల్స్ లోనయినా సరే తను నవ్వుతూ విద్యార్ధులని నవ్విస్తూ తన సబ్జెక్టు వాళ్ళకి వంటబట్టేలా చేయడం ఆమె పద్దతి.     "మే ఐ కమిన్ మేడమ్!" అన్న పిలుపుకి చెపుతున్న పాఠాన్ని ఆపి గుమ్మంకేసి చూసిందామె.     గుమ్మం దగ్గర అభినయ్ నిలబడి వున్నాడు.     ఆమె చేతి వాచీలోకి చూసుకొని "యు ఆర్ లేట్ బై హాఫ్ ఎన్ అవర్" అంది.     "అయితే నేను వెళ్ళిపోతున్నాను" అని చటుక్కున వెనక్కి తిరిగాడు అభినయ్. అతనలా చేస్తాడని ఆమె అనుకోలేదేమో! వెంటనే "ఏయ్ ఆగు" అంది రమాదేవి.     అభినయ్ ఆగాడు.     "నువ్వు అరగంట లేటుగా వచ్చావని అన్నానుగానీ వెళ్ళిపొమ్మని అనలేదే?" అంది.     అభినయ్ చిరునవ్వుతో లోపలకొస్తుంటే అతని చేతికి కట్టివున్న కట్టు చూసి -     "అరే. ఏమయ్యింది? ఏమిటా బ్యాండేజీ. ఏక్సిడెంటా? లేక ఎక్కడన్నా యుద్దం చేసి వచ్చావా?" అతను నవ్వాడు.     "ఏక్సిడెంటల్ గా యుద్దం చేయించాల్సి వచ్చింది."     "ఒక్కరోజు కుదురుగా వుండి ఏడవడం తెలీదు ఛీ" అంది చిరుకోపంతో.     అభినయ ఆమెకేసి చూశాడు. తనకి దెబ్బ తగలడం ఇష్టం లేనట్టుగా ఆమె మొహంలో భావం స్పష్టంగా కదలాడుతోంది.     అదే సమయంలో ఆమె మెడలోంచి వేలాడుతోన్న బంగారు గొలుసుకి కట్టివున్న డాలర్ ఆమె గుండెల బిగువుల మధ్యగా వేలాడుతూ కనబడింది.     అభినయ్ ఆమెకి దగ్గరగా నడిచాడు. ఆమె కంగారుగా చూసింది. "ఏం కావాలి?" అంది.     అతని మొహంలో చిరునవ్వు అలాగే మెరుస్తోంది.     ఆమె మెడ గొలుసులోని డాలర్ ని చేత్తో పట్టుకున్నాడతను.     అతని చేతివేళ్ళు ఆమె బరువయిన మెత్తని గుండెలకి నొక్కుకుంటున్నాయి.     "ఇది ఎంత బాగుందో తెలుసా?" అన్నాడు.     "ఛీ ఏమిటీ పని? అందరూ చూస్తున్నారు" అంది మెల్లగా.     "అయితే ఎవరూ చూడకపోతే పరవాలేదా?" ఆమెకి మాత్రమే వినబడేలా అడిగాడు అభినయ్.     "ఆ" అని "వెళ్లి కూర్చో. ఇలాంటిది కావాలంటే నీ పెళ్లికి నీ పెళ్ళానికి బహుమతిగా ఇస్తాన్లే?" అంది రమాదేవి నవ్వుతూ.     క్లాసులో అందరూ ఆ మాటలకి గొల్లున నవ్వారు.     అభినయ్ వెళ్లి తన సీటులో కూర్చున్నాడు.     రమాదేవి తన ఉపన్యాసాన్ని కొనసాగించింది.     అతను కొంటె చూపులు చూస్తూ, చిలిపిగా నవ్వుతుంటే కొన్ని క్షణాల క్రితం డాలర్ పట్టుకొన్నట్టు నటిస్తూ అతను చేతి వేళ్ళతో గుండె అంచులని నొక్కిన అనుభూతివల్ల ఆమె వక్ష సంపదలో స్పందన ప్రారంభము అయ్యింది. ఆమె ఊపిరి బరువుగా తీసి వదులుతూ చాలా ఇబ్బందిగా లెసన్ చెబుతోంది.     కానీ మనసులో మాత్రం అన్నీ అతని గురించిన ఆలోచనలే.     చిలిపివాడు.     తననింతగా రెచ్చగొట్టగల చిలిపితనం అతనిలో వుందా?      తనకేదో అయిపోతోంది.     ఎందుకని?     తనింత బలహీనురాలా?     నో! కాదు. కానీ......మనసులో అలజడి మాట.     శరీరంలో వేడి సెగలు మొదలవుతున్నాయి. ఇది అభినయ్ ప్రభావమేనా?     చలి! అబ్బ! ఇంతలోనే చలి ఎక్కడినుంచి వచ్చింది?     తన గుండె తలుపుల్ని తట్టి తలపులని రేపి.. ఆమె కళ్ళు సిగ్గుతో వాలిపోతున్నాయి.     అది అభినయ్ గమనిస్తే పరవాలేదు. కానీ మిగిలిన విద్యార్ధులు పసిగడితే?     ఖర్మ......     తలెత్తి వాళ్ళకేసి చూడగలదా తను?     ఒళ్ళు విరుచుకోవాలనుంది.     కానీ అది క్లాస్ రూం.     వెంటనే ఇంటికెళ్ళి పోవాలనుంది.     లాభంలేదు. ఒక్కక్షణం నిలబడలేదు. క్లాసు విడిచిపెట్టేయాలి అనుకుంటున్న తరుణంలోనే గంట మోగింది.     కర్చీఫ్ తో మొహాన్ని అద్దుకుని ఊపిరి విడిచి క్లాసులోంచి బయటికి వచ్చింది లెక్చరర్ రమాదేవి.     ఏదో పెద్ద రిలీఫ్ కలిగినట్లుగా వుంది.     ఆమె వడివడిగా అడుగులు వేస్తోంది. వెనక ఎవరో వస్తున్నారు?     ఎవరు?     మెడ తిప్పి వెనక్కి చూసింది.     అభినయ్.     ఏమిటీరోజు ఇంత సాహసం చేస్తున్నాడు. అతన్ని కట్ చెయ్యాలి. లేకపోతే....... లేకపోతే చాలా దూరం వచ్చేసేలా వున్నాడనుకుంది.     ఆమె ఆగింది.
24,532
        "అలాగా! అయిదు నిమిషాల్లో వస్తాను." అంటూ కాలకృత్యాలు ముగించుకోటానికి అన్నట్టుగా బాత్ రూంలోకి వెళ్ళింది కిన్నెర.     అంతసేపూ రాణి వాసంలో యువరాణి సపర్యలు చేసే చెలికత్తెలా నిలబడి ఉన్న మంగ, కిన్నెర అలంకరణలో సహాయ పడింది ఆమె స్నానం చేసి రాగానే.     అయిదు నిమిషాల తర్వాత అమ్మాయిగారికి వెంట నడుస్తూ డైనింగ్ హాలు చేరుకుంది.     "నాన్నా! మిరేమిటి ఇంకా బ్రేక్ ఫాస్ట్ తీసుకోలేదు!"     అప్పటికి కింకా మీసాలకు సంపెంగ నూనె రాసుకోని వీర్రాజు మృదువుగా నవ్వాడు. చెట్నీ లాంటిది మీసాలకు అంటుకుంటుందని టిఫిన్ కార్యక్రమం పూర్తయితే తప్ప సంపెంగ నూనె రాసుకోవడం ఆయనకు అలవాటు లేదు. అసుర్యంపశ్యలా, అప్పుడే దివి నుంచి దిగి వచ్చిన దేవకన్యలా అనిపిస్తున్న కిన్నేరని చూస్తూ మంగతో అన్నారాయన...." అమ్మాయికి దిష్టి తీసెయ్, మంగా!"     నవ్వేసింది కొన్నేర. అదో మూడనమ్మకమని తెలిసినా తండ్రిని వారించడం ఆమె కిష్టం లేదు.     మంగ ఓ పక్క మిరపకాయలతో దిష్టి తీసే కార్యక్రమంలో నిమగ్నమై ఉండగానే అంది కిన్నెర.."మీ ఆరోగ్యం గురించి మీరు పట్టించుకోవడం లేదు నాన్నా!"     ఇది ప్రతిరోజూ చర్చలో భాగమే అయినా, కూతురు తన గురించి అలాంటి అపేక్ష ప్రదర్శించడం వీర్రాజుకు చాలా ఆనందదాయకమైన విషయం.     "బహుశా నా పెళ్ళి గురించి దిగులుతో మీరు అతిగా తగుతున్నట్టున్నారు."     'నిజమే' అనాలనిపించినా ధైర్యం చాలలేదు. ఒకసారేప్పుడో అలా అంటే 'మీకు తోచిన వరుడ్ని మీరే నిర్ణయించండి' అంది మోహంలో వ్యధను వ్యక్తం చేస్తూ. ఆ తర్వాత అలాంటి ప్రసక్తిని తేవడం మానేశాడు.     "అబ్బే.....అది కాదు కిన్నెరా!"     "కారణమేమన్నా కాని, మీరు అతిగా లిక్కర్ తీసుకుంటే రక్తంలో కొలస్ట్రాల్ పెరిగే అవకాశముంది. కొలస్ట్రరాల్ హెచ్ డిఎల్ నిష్పత్తి  సవ్యంగా లేనప్పుడు అది గుండెపోటుకు కారణమవుతుంది. మీకు తెలుసుగా నాన్నా! రెండు వందలు దాటకుడని కోలెస్టరాల్ మీకు రెండువందల డెబ్బై దాకా ఉన్నట్టు ఈమధ్య రిపోర్ట్స్ తెలియచేస్తున్నాయి.     ఇంతసేపూ ఆమె మాట్లాడిన వాక్యాల్లో ఒక్కటి వీర్రాజుకు అర్ధం కాలేదు. చిన్నతనం నుంచీ ఘోషా పద్దతిలో అమ్మాయిల బడిలోనూ, అమ్మాయిల కాలేజిలో మాత్రమే చదివిన కిన్నెర , బియ్యే పూర్తయ్యాక ఇక చదువు చాలించి జనరల్ నాలెడ్జిని పెంచుకునే ప్రయత్నంలో నిమగ్నమై పోయింది. తరచుగా తండ్రి దగ్గర తన తెలివిని అలా ప్రదర్శించాలని ఉబలాట పడుతూ ఉంటుంది.     అయితే అది కేవలం ఉత్సాహం, ఉబలాటం అంటే ఆమె కూడా అంగికరించదు.     "ఈ దేశం దౌర్భాగ్యం కిన్నెరా!" అన్నాడు చాలాసేపటి తర్వాత.     దేని విషయంలో  ఇలాంటి స్టేట్ మెంట్ ఇవ్వాల్సి వచ్చిందో ఆమెకి అర్ధం కానట్టు చూస్తుండగానే అన్నాడు--"అవునమ్మా! నీ తెలివికి నువ్వు కావాలనుకుంటే ఓ ఐయ్యేయెస్ చేసి ఉండేదానిని. కాని, మన వంశ చరిత్ర అడ్డం వచ్చింది." ఉద్యోగం చేస్తున్న కొడుకు గుర్తుకొచ్చాడెమో వెంటనే ఈ విషయాన్నీ ప్రస్తావించాడు.... "ఆడపిల్లలు ఉద్యోగం చేయడమన్నది మన వంశంలో నిషిద్దం."     "అవును నాన్నా! మనకేం తక్కువని?" అంది కిన్నెర టిఫిన్ చేస్తూ.     ఏం తక్కువో చెప్పాలనిపించినా నిభాయించుకున్నాడు వీర్రాజు. అసలు స్వర్గంలో పెళ్ళిళ్ళు నిర్ధారితం నిజమనే సైంటిఫిక్ రిజనింగ్ కోసం ఆమెను అడగలేక, నిన్న రాత్రి రాయుడు చెప్పిన విషయం మననం చేసుకుంటూ అన్నాడు--" మీ తాతగారు కాని, ముత్తాతగారు కాని, ఈ దేశం కోసం సర్వస్వం ఒడ్డిన మహానుభావులు.'     సర్వస్వం ఒడ్డితే ఇంత ఆస్తి ఎలా ఉందని ఆమె అడగలేదు. ఒకటి రెండుసార్లు ఇలాంటి అనుమానం కలిగినా తాత, ముత్తాతలకు ద్రోహం చేసినట్టవుతుందని భావిస్తూ, హాల్లోని తాతగారి తైలవర్ణ చిత్రాన్ని చూసింది తదేకంగా.     "అలాంటి మహానుభావులకు వారసుడిగా ఈ ప్రజలకు నేనూ సేవ చేయాలనుకుంటున్నాను కిన్నెరా! కాని, నా ప్రత్యర్ధి భోజరాజు ఈసారీ తనే ఎంపీగా పోటీ చెయ్యాలనుకుంటున్నాడని తెలిసింది."     కిన్నేరకు రాజకీయాలంటే జుగుప్సే కాని, తండ్రి మీద సానుభూతిగా చూసింది, "నిజమా!"     "అవునమ్మా! దానికోసమే బలంగా పోరాడాలనుకుంటున్నాను."     తండ్రిని సంతృప్తిపరిచేలా అణువంత క్రోధాన్ని వర్షింపచేసింది కళ్ళతోనే . "తప్పదు డాడీ! మన వంశ చరిత్రతో పోలిస్తే భోజరాజుగారిది అంత ఘనమైనదేమీ కాదు."     "పైగా తన కూతురికి నీకన్న ముందే పెళ్ళయిందని, అప్పుడే ఆమెకు నెల తప్పిందని తెగ విర్రవీగుతున్నాడు" కక్కేశాడు అది తనకు బాధ కలిగించే విషయాల్లో ఒకటి అన్నట్టుగా.     నిశ్చలంగా చూసింది కిన్నెర.     ఒక లోగిలిలో ఉండి పరిసరాల్ని, ప్రపంచాన్ని చదవాలనుకునే ఘోషా, స్త్రీ లాంటి కిన్నెర , ఇప్పుడు తండ్రి మాటల్లో ద్వనించిన వేదనను అర్ధం చేసుకోవాలని ప్రయత్నించలేదు.     ప్రయత్నించేదేమో కాని, అసలు కూతుర్ని అలా పెంచలేదు వీర్రాజు. ఆసాధారణమైన అందంతోపాటు, అవసరమైన మేధ కూడా ఉన్న తన కూతురు ఎప్పటికైనా కట్టుకోవాల్సింది ఈ శతాబ్దపు మగవాడినే తప్ప, స్వయవరంలోలా ఎన్నుకోటానికి ఇది రాచరిక వ్యవస్థ కాదని ఏనాడైనా చెప్పి ఉంటే, ఆమె కధల్లో చదివే రాజకుమారుల కోసం రహస్యంగానైనా కలలు కనడం మానేసి, వాస్తవికంగా ఆలోచించేదేమో.     భేషజమే తప్ప నిజానికి తనో అమాయకురాలినని తెలీని పిచ్చిపిల్లలా నవ్వి తండ్రిని సమిపించింది.         ఇందాక భోజరాజు కూతురు నెల తప్పడం అన్న వాక్యం గురించి తను స్పందించటం మాట అటుంచి, కడుపు, కావటానికి జీన్స్, క్రోమోజోమ్స్, అండాలు గట్రా మాట్లాడబోయింది.    మళ్ళీ అంతలోనే అసందర్భమనిపించిందేమో-- "నేను లైబ్రరికి వెళ్తున్నాను నాన్నా" అంది రోజులాగే.    మనసంతా మతిభ్రమించిన వాళ్ళమే అని ముందే మనం గ్రహిస్తే బ్రతుకులో బేషజాలు అదృశ్యమౌతాయి. జీవితానికి నిర్వచనం అర్ధమైపోతుంది అంటాడు మార్క్ ట్వైన్ ప్రేమనే మైకం గురించి వివరణలో"     ఇలాంటి గొప్ప సత్యానికి కిన్నెర సైతం అతితురాలు కాదు.                                      * *    * *    * *    * *     అయిదు వేల గడపల గల పల్లె.     పక్కన శారదా నది.     నదికి, పల్లెకూ మధ్య పచ్చని పొలాలు, మామిడి తోటలు, నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న అనకాపల్లి దాకా సిమెంట్ రోడ్డు, ఆ రోడ్డుకు అనుకుని ఈ మధ్యనే కట్టించిన హైస్కులు, ముప్పాతిక శాతం వ్యవసాయం పైనే ఆధారపడి బ్రతికే అమాయకులైన జనం. ఊరి మధ్యలో పోలేరమ్మ గుడి, గుడికి పడమట భోజరాజు లోగిలి, తూర్పున వీర్రాజు భవంతి, ఓ చిన్న లైబ్రరీ. ఆ లైబ్రరీలో ఈగలు తోలుకుంటూనో, దుమ్ము పట్టిన పాత పుస్తకాలు చూస్తూనో రోజంతా గడిపే లైబ్రేరియన్, పల్లెకి తప్పనిసరైన ఓ పంచాయితీ ఆఫీసు. ఆఫీసులో కాక పదవిలో ఉన్న ఎంపీ కొంపలోనే గడిపే పంచాయితీ బోర్డు సభ్యులు. ఇదీ తుంపాల వివరాలు.         అలాంటి పల్లెలో ఉదయం పది గంటల ప్రాంతాన ఓ కాంటేస్సా పోస్టాఫీసు సందు గుండా అనకాపల్లి రోడ్డును చేరుకోవాలని ఓ వీధిలో ప్రయాణం చేస్తూ టక్కున ఆగిపోయింది.    దానికి కారణం కాంటేస్సాకు అభిముఖంగా ఓ మారుతి అడ్డు పడడం.    పుట్టినరోజు కానుకగా తండ్రి బహుకరించిన కాంటేస్సా నడుపుతున్న కిన్నెర, మారుతిని దాటి వెళ్ళటానికి మార్గం ఇదుకుగా ఉండటంతో ముందు సీరియస్ గా చూసింది. మరుక్షణం ఎదురు మారుతిలో ఉన్నదేవరో అర్ధమైనట్టు ఆవేశంగా హరన్ నొక్కింది.
24,533
    వచ్చిన జట్టులో నుంచి, మంజు ఎయిర్ బ్యాగ్ ను మాయం చేసిన ఆగంతకుడు ముందుకు వచ్చాడు. బేగ్ ను అందించాడు నవ్వుతు. బేగ్ లోని సామాగ్రిని ఒకసారి చూస్తూ  సర్దుకుంది.     "గుడ్! నీ బాధ్యతను నువ్వు చక్కగా నిర్వర్తించావు. ఇహ, ఇక్కడ నుంచి నిరభ్యంతరంగా మన కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చు!" ఉత్సాహంగా అన్నది మంజు.     సరిగ్గా అదే సమయానికి అభిషేక్ ఆడుతున్న టెన్నిస్ కోర్టుకు చేరుకుంది అపర్ణ.     అభిషేక్ మరొకరితో హోరాహోరీ సింగిల్స్ ఆడుతున్నాడు. బనియను, నిక్కరు చెమటతో తడిసి ముద్దవుతున్నాయి. అతని ధ్యాసంతా బంతిమీదే వుంది. అపర్ణను అతను గమనించనేలేదు.     తృప్తిగా వెనుదిరిగింది అపర్ణ. ఇప్పుడు ఆ పిల్లలిద్దరి నడకమీద, నడత మీద, వర్తనమీద, ప్రవర్తనమీద ఆమె మనసులో ఎటువంటి అనుమానాలు లేవు, ఏ విధమయిన అభ్యంతరాలు లేవు!     ఆ నమ్మకమే ఆమె పట్టు నుంచి వాళ్లు జారిపోవడానికి నాంది అయింది...                        *    *    *     'అగర్ ఫిర్దౌస్ బర్ రూమే జమీన్ అన్త్     హమ్ ఆస్త్ ఓ హవా అస్త్ ఓ హవా అస్త్'     'భూమి మీద స్వర్గం అనేది ఏదైనా వుంటే     అది ఇదే అది ఇదే!'     పదిహేడవ శతాబ్దంలో మొఘలాయ చక్రవర్తి జహంగీరు చెప్పిన మాటలు.     కాశ్మీరు గడ్డమీద కాలు మోపిన వారందరికీ ఆ మాటలు  అక్షర సత్యమేనని అనిపించేవి - సుమారు దశాబ్ది క్రితం వరకు.     మరీ కడచిన దశాబ్ది కాలంగా అక్కడ 'కలికాలం' రాజ్యమేలుతున్నది! పరిస్థితులు క్షణక్షణానికీ దారుణాతి దారుణంగా మారిపోతున్నాయి.     ఇప్పుడు యావత్తు కాశ్మీరంలో ఏ వీధిలో ఎక్కడ ఎప్పుడు ఏ నలుగురు చేరినా వారి మధ్య భయం తాండవిస్తున్నది. ప్రాణభీతి తొంగిచూస్తున్నది.     బొమ్మ తుపాకులు ఉండవలసిన పిల్లల చేతులలో నేడు ఆటోమాటిక్ రైఫిళ్లు వ్రేలాడుతున్నాడు. బాంబులు చేతిబంతులు అయ్యాయి.     నీలి నీలి నీటి ప్రవాహాలలో మానవ కళేబరాలు కొట్టుకువస్తున్నాయి.     పులుకడిగిన ఆణి ముత్యాలుగా కొంగ్రొత్త సోయగాలతో మెరిసిపోయే యువతుల మాన- ప్రాణాలకు ముప్పు వాటిల్లుతున్నది.     ఒకనాటి భూతల స్వర్గమే ఈనాడు భూలోక నరకం అనిపిస్తున్నది.     భారతావనికి మకుటాయమానమైన రత్న కిరీటం వంటిది కాశ్మీరం. అటువంటి నేలతల్లి గుండెలమీదే నేడు నెత్తురుటేరులు పారుతున్నాయి.     భారత ప్రజ తీరని వ్యధ కాశ్మీరం. అనుమానాలు అపోహల గూడు కాశ్మీరం.     మంచుతో నిండిన హిమాలయ శిఖరాగ్రాలను చూస్తూ, ఆ శీతనగ సానువుల నుంచి జాలువారే సెలయేటి గలగలలలో విహారాలు చేస్తూ ఆహ్లాదాలను ఆస్వాదించడం ఒక తీయ తీయటి కల. ఆ కల ఇప్పుడు చెదిరిపోతున్నది.     కాశ్మీరు కల్లోలం నేడు యావత్ ప్రపంచాన్ని కలవరపరుస్తున్నది. కుదిపివేస్తున్నది.     కాశ్మీర్ లోయ విస్తీర్ణం సుమారు రెండు వేల అయిదు వందల చదరపు కిలోమీటర్లు. జనాభా సుమారు నలభై లక్షలకు పైమాట. కాని...కాని...     ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఇప్పుడు అక్కడ జరుగుతున్న సాయుధ పోరాటం ప్రభావాన్ని చవిచూడని కుటుంబం అంటూ ఒక్కటి కూడా లేదనడం అతిశయోక్తి కాదు!     కాశ్మీరీ మిలిటెంట్లలో చేరి 'ఆజాద్' కోసం 'షహిద్' కాదలచిన వారో, మిలిటెంట్ల బాధలకు బలయినవారో; భారత సైనిక దళాల అత్యుత్సాహపు చర్యలకు ఎరైనవారో ప్రతి ఇంటికి కనీసం ఒక్కరయినా ఉండవచ్చు.     కాశ్మీరు లోయలో ఒకప్పుడు 94శాతం మంది ముస్లిమ్ లు ఉండేవారు. ఇప్పుడు నూటికి నూరు శాతం వారే! అంటే...అంటే...     హిందూ కాశ్మీరీలంతా బ్రతుకు జీవుడా అనుకుంటూ కాశ్మీరును వదలి జమ్ముకు చేరిపోయారు. వలసపోయారు...     స్వదేశంలో, స్వరాష్ట్రంలో, సొంత నేలమీదే వాళ్ళు శరణార్దులై ప్రాణాలను ఉగ్గబెట్టుకు బ్రతుకుతున్నారు. చావలేక బ్రతుకుతున్నారు.     తీవ్రవాదులు 'మేం కోరేదేమీ లేదు' మమ్ము గుర్తించమని తప్ప మరేమీ అడగడం లేదు!' అంటున్నారు. ఆ గుర్తింపు' కోసం ఊచకొత్త.     మితవాదులు 'కాశ్మీర్ కు స్వాతంత్ర్యం వినా వేరేమీ అక్కరలేదు!' అని స్పష్టం చేస్తున్నారు. స్వతంత్ర కాశ్మీర్ కోసం ప్రాణాలయినా ధారపోస్తాం, దశాబ్దాల తరబడి పోరాటాన్ని కొనసాగిస్తాం!' అనేది వారి నినాదం.        
24,534
    "ఎవరిని?" అని కనకలత అడిగింది.     "నిశాపతిగారిని" అంటూ లోకం చిరునవ్వుతో ఉప్పొంగింది. కనకలతా నవ్వింది. "రేపువచ్చి నీ దగ్గరే ఉంటా" అన్ని చెప్పి లోకేశ్వరీ, త్యాగతీ, కల్పమూర్తీ వెళ్ళిపోయారు.     త్యాగతి తన ఇంటికి వెళ్ళాడు. అతనికి రాత్రంతా నిదురలేదు. ఏ స్టేషనులో హేమ దిగివచ్చింది? తిరువళ్ళూరు దగ్గిర అయి ఉంటుంది. సెంట్రల్ స్టేషనులో అయితే ఆ వరకే వచ్చి ఉండవలసింది. అటు తీర్ధమిత్రుని భార్య దేహం కాల్చుకుంది. ఉత్తమ యిల్లాలు, పండువంటి భార్యను ఆ రాక్షసుడు గంగలో కలిపివేయడుకదా? ఇదా ప్రపంచ ధర్మంకై జీవిత నటన? హేమ తిరిగి రావడానికి ఏమి జరిగింది? హేమకూ తీర్ధమిత్రునికీ ఎంతవరకూ వెళ్ళింది? హేమ తీర్ధమిత్రునికి తన దేహం అర్పించుకుందా?? ఆమె గతి ఏమిటి? ఎక్కడికి పోతోంది ఈ సంఘం? వారిద్దరూ మర్యాదలు అతిక్రమిస్తే వారిద్దరికీ వివాహం ఒక్కటే గత్యంతరం అవుతుంది. అప్పుడు కనకలత ఏమవుతుంది?     ఈ నాటకంలో తానే ప్రతినాయకుడు అయ్యాడు. తాను వచ్చి హేమను వివాహం చేసుకొనడానికి ప్రయత్నించకుండా ఉంటే? ఆ ప్రయత్నించడమూ ఏదో పిచ్చిరకంగానే! తనను తాను నాటకంలోలా తెలుపుకోకుండా ప్రయత్నం చేసినట్లు. దీనితో ముక్కుపచ్చలారని హేమకు ఒక విప్లవస్థితి వచ్చిపడింది. తా నసలు మదరాసే రాకుండా ఉంటే, ఏది ఎట్లా జరిగి ఉండునో? ఎదురుగుండా తను ఉంటే హేమ మనస్సును ఇంకా పాడుచేసిన వాడవుతాడు. ఏదో వంక పెట్టుకొని తానీ ఊరునుంచీ మకాం ఎత్తెయ్యాలి. చాలు! తా నింతవరకు ఇతర జీవితాలను దగ్ధం చేసింది చాలు! ఇక్కడనుంచైనా తా నితరుల జీవితాలతో సంబంధం కలుగజేసుకోకుండా మిగిలిన జీవితం గడిపినన్నాళ్ళు గడపవలసిందే!     ఇందులో ఎవ్వరికీ ఆవేశాలు ఉండకూడదు. హేమ ఎంత బాధ పడిందో? ఏదో ఆడుతూ, పాడుతూ, అల్లరిచేస్తూ బాలికాత్వం ఇంకా వీడని బాలకు ఏవేవో వెర్రిసమస్యలన్నీ పెట్టి అనవసరపు కలతలు తీసుకొని వచ్చాడు తాను....ఈ రోజు కనకలత జీవించకపోతే ఆ చావుకు తానే కారణం అవుతాడు. కావలిస్తే లోకేశ్వరి పెళ్ళికి ఒక్కసారి వచ్చి చూచి పోవచ్చును.     ఆ మర్నాడు త్యాగతి తల్లి హేమగారి ఇంటిదగ్గరనుంచి వచ్చీరాగానే ఆమెను చూచి, "అమ్మా! మనం కొల్లిపర వెళ్ళాలి. నేను పెట్టదలచుకున్న శకుంతలా లలితకళాశాల అలా వుండిపోయింది. ఇంక వెళ్ళిపని ప్రారంభిస్తాను."     రంగ : నాన్నా, ఈ ఇల్లూ అవీ?     త్యాగతి : ఇవి ఇలాగే వుంటాయి, నేను మధ్య మధ్యవస్తూ వుంటాను. ఆ కళాశాల బాగా పని ప్రారంభించగానే ఇక్కడి వచ్చేశాను. ఇకిక్కడ పురుషులకు లలిత కళాశాల ఏర్పాటు చేస్తాను. నువ్వు అత్తగారికి బాగా కులాసా కాగానే కొల్లిపర వచ్చేయి. లేదా యిక్కడే ఉండటం మంచిది.     రంగనాయకమ్మగారు ఏమీ మాట్లాడలేకపోయింది. సరేనని తల ఊపింది. తల్లి భావం త్యాగతి గ్రహించాడు. అయినా తన ధర్మం తాను నెరవేర్చాలి గదా! ఆ సాయంకాలం పెట్టే బేడా అన్నీ సర్దుకొని, తల్లిని హేమగా రింటిదగ్గర దిగవిడిచి, సెంట్రల్ స్టేషనుకు పోయి కలకత్తా మెయిలు ఎక్కాడు.                                          36     కనకలత ఒళ్ళు కాల్చుకున్న మర్నాడు ఉదయానికే తీర్ధమిత్రుడు చెన్నపట్నం వచ్చాడు. హేమసుందరి తిరువళ్ళూరు స్టేషను దగ్గర దిగిపోతుందని అతను కలలోనైనా అనుకోలేదు. అతడు మండిపోయాడు. అతి కోపంతో అతడు ఏడ్చాడు. రైలులోనుంచి ఉరుకుదా మనుకున్నాడు. అలా ఉరకడం చూసేవారెవరూలేక మానివేశాడు. మాట్లాడకుండా ఆ మెత్తటి సీటుమీద పడుకొన్నాడు. దొర్లాడు. చేతికి దొరికిన పండు దొర్లుకు పడిపోయింది. తన మగతనానికి ఎంత తీరని అవమానం! తన చరిత్రలో ఈలాంటిది ఎప్పుడూ జరుగలేదు. షడ్రసోపేతమైన భోజనం పెట్టి, ఆ విస్తరి మళ్ళా లాగివేసినట్లయింది!     హేమ వట్టి దద్దమ్మ; ధైర్యంలేని పిరికి చచ్చమ్మ. ఇలాంటివాళ్ళను కాళ్ళూ చేతులూ కట్టేసి, చీరలు, జంపర్లు, బాడీలు ఒలిచి, బలవంతంగా..నాశనం చేయాలి. కానీ, తాను ఇంతటితో వదులుతాడా ఆ కులుకురాక్షసిని? దానిలోని సౌందర్యరసం యావత్తు పీల్చి ఆ త్యాగతికి పిప్పి మాత్రం వదలాలి. ఏమో! హేమవంటి చదువుకున్న బాలిక తనకు లొంగుతుందా? పైగా ఉద్యోగానికి మొప్పం రావచ్చును. ఏ త్యాగతికో కోపం వచ్చిందంటే, ప్రాణంపోయిఊరుకుంటుంది. ఇప్పటికే వాళ్ళు మండిపోతూ ఉంటారు. రైలు ఆర్కోణం వచ్చింది.     ఎన్నో ఆనందాలు ఊహించుకొన్నాడు తాను. అసలు హేమ ఈ బొంబాయి ప్రయాణం ఏర్పాటుచేస్తే తానెందుకు ఒప్పుకోవాలి? ఈలాంటి బాలికలతో తెరచాటున__సంచరించాలిగాని, ఈ విధంగా బరిమీదపడితే ఎన్నో మొప్పాలు వస్తూ ఉంటాయి. హేమ దిగి వెళ్ళిపోవడమే మంచిదయింది.  తన మేనేజరుకు ఈలాంటి విషయం తెలిసిందా తన పని క్షవరం. తానూ చల్లగా తిరిగి మదరాసుకుపోతే, అటునుంచి నరుక్కు రావచ్చును. అన్నీ సర్దుకొని తీర్ధమిత్రుడు రేణిగుంటలో దిగాడు. బొంబాయి నుంచి వచ్చే మెయిల్ తెల్లవారగట్లకు వచ్చినది. అందులో ఎక్కి తెల్లవారగనే మదరాసు వచ్చాడు. మదరాసు సెంట్రల్ లో టాక్సీకారు చేసుకొని అతడు ఇంటికి చేరాడు.     ఇంటిలో అడుగు పెట్టగానే, క్రిందనున్న ఇంటి యజమాని ఇల్లు వదలి పెట్టి వెళ్ళిపోవలసిందని నెల నోటీసు చేతిలో పెట్టాడు. ఆలోచనకు తావులేక తీర్ధమిత్రుడు మేడపైకివెళ్ళగానే పిల్లలందరూ ఘొల్లుమన్నారు. తీర్ధమిత్రుని అయిదు ప్రాణాలూ పైకెగిరిపోయాయి. క్రిందటి రాత్రికిరాత్రే లోకేశ్వరి, కల్పమూర్తీ, త్యాగతీ పిల్లలకోసం, ఆ ఊళ్ళోనే ఉన్న తీర్ధ మిత్రుడుగారి దూరపుచుట్టాలలో ఒకాయననూ, అతని భార్యనూ, బిడ్డలనూ అతని అక్కగారినీ తీసుకువచ్చి తీర్ధమిత్రుడిగారి ఇంట్లో దిగబెట్టారు.
24,535
    "నేను తాతయ్య అవుతే నీవు మామ్మవి అయిపోతావు జాగ్రత్త" బెదిరిస్తున్నట్టు అని నవ్వారు. వచ్చిందగ్గిరనుంచి శ్రీనివాస్ ఇంటిని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. తను పుట్టి పెరిగిన ఇల్లా ఇది అని విస్తుపోయాడు.     "యేమిటి, ఇల్లంతా యిలా మారిపోయిందని అన్నీ చూస్తున్నావా. నమ్మశక్యంగా లేదు" అంటూ నవ్వి భుజం తట్టాడు.     "ఇప్పుడు చెప్పు నీ ప్లాన్స్ ఏమిటి. ఈ వూర్లో వుండి నాకు హెల్ప్ చేస్తావా. మొత్తం మనీ మేటర్స్ డీల్ చెయ్యాలి. లెక్కలు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఏడు ఆడిట్ చేయించాలి. అకౌంట్, బ్యాంక్ పనులు, అప్పులు, వడ్డీలు, బకాయిలు చెల్లించడం, ప్రతి రైతుకీ ఖాతా తెరవాలి. అవన్నీ సావకాశంగా వివరిస్తాం. మీ నాన్న హెల్ప్ చేస్తాడు. ఇదంతా చేయాలి. వూరికే కాదులే... నీకు జీతం ఇస్తాను. నా పర్సనల్ అసిస్టెంట్ పోస్టు అనుకో. నా కరస్పాన్ డెన్స్ అంతా చూడాలి. నా దగ్గర పోర్టబుల్ టైపు రైటర్ వుంది. మీనాన్న నీకు టైపు వచ్చాన్నాడు. ఏమిటి అలా చూస్తున్నావు. ముందు ఈ వూర్లో ఉండడానికి మెంటల్ గా ప్రిపేరవ్వాలి నీవు..."     శ్రీనివాస్ అక్కడికి వచ్చిన అరగంటలోనే డాక్టర్ కేశవరావుని అంత పెద్ద డాక్టరు, అమెరికా నుంచి వచ్చిన ఆయన్ని, అందంగా హుందాగా వున్న రాజేశ్వరిని, ఆ ఇంటిని, సామానుని చూసి సగం సరెండర్ అయిపోయాడు. ఈయన తమకి కూడా కొత్త యిల్లు కట్టించి ఇచ్చాడని తల్లి చెప్పింది. ఇంత డబ్బు సంపాదిస్తున్న ఈయన దగ్గిర ఉద్యోగం యిస్తానంటుంటే ఇంకేం కావాలి. తన ఉత్త బి.కాం.తో ఇంతకంటే మంచి ఉద్యోగం ఎవరిస్తారు. బ్యాంకు పరీక్ష అయితే అప్పుడే చూసుకోవచ్చు. ఆ మాటే పైకి అన్నాడు.     "తప్పకుండా వెల్దువుగాని బ్యాంకులో ఉద్యోగం వస్తే- నీ ప్యూచర్ పాడుచేసుకోనవసరం లేదు. పరీక్షకి ఇక్కడుండే ప్రిపేర్ అవ్వు. అంతవరకు ఇక్కడ ఆ పనిచూడు. తర్వాత సంగతి తరువాత చూసుకుందాం."     వాసు అంగీకారంగా తల ఆడించాడు. "మావాడిని నీకప్పగించాను మామయ్యా- ఇంక నీ ఇష్టం వాడ్ని ఎలా తీర్చిదిద్దుతావో. వాడి చేత ఏం చేయించుకుంటావో, ఏం ఇస్తావో వాడికి, నీవు చూసుకోండి-" గడుసుగా అన్నాడు.     కేశవరావు నవ్వారు. "అర్థమైందిలే నీ గడుసుతనం - నీ కొడుకు చేత వూరికే ఏం చేయించుకోనులే-" అన్నాడు.     "రంగా ముందు మీరిద్దరూ కల్సి ఈ వూర్లో రైతులు, భూసాములు అందరిపేర్లు ఎన్ని ఎకరాలుంది ఆ లిస్ట్ తయారుచేసి ప్రతివారికొక ఖాతా పుస్తకం తయారుచేసే కార్యక్రమం పూర్తిచేయండి. మునసబుగారి దగ్గర లిస్ట్ ఉంటుంది. ఆయన హెల్ప్ తీసుకోండి-" అని పురమాయించాడు.     "ఆ అన్నట్టు మనం నర్స్ ల కోసం పేపర్లో ప్రకటన ఇచ్చాం కదా. ఇదుగో ఆరు అప్లికేషన్ లు వచ్చాయి. ఇందులో ముగ్గురు నచ్చారు - ఒకామె గవర్నమెంటు ఆస్పత్రిలో పనిచేసి రిటైరయిన ఆవిడ కూడా ఉంది. పిల్లలు బాధ్యతలు లేవు. భర్త పోయాడట. అలాంటి ఎక్స్ పీరియన్స్ నర్సయితే మనకు సుఖం. ఆమెని రమ్మందామని ఆలోచిస్తున్నాను. ఇంకో పెళ్ళికాని అమ్మాయి వుందికాని "ఎక్స్ పీరియన్స్ అట్టే లేదు-" సాలోచనగా అన్నాడు.     "రిటైరయిన ఆమెనే పిలవండి - పురుళ్ళు అవీ చూసుకుంటుంది - మీకు ఆ విషయాల ఎక్స్ పీరియన్స్ లేదు గనక గైనిక్ ప్రాబ్లమ్స్ ఆమె కాస్త చూసుకోగల్గుతుంది" సలహా ఇచ్చింది రాజేశ్వరి.     "ఆ - వాసూ శుభస్య శీఘ్రం. పని ఈ ఉత్తరంతో ఆరంభించామే- ఇదిగో ఈ విమలమ్మ అనే ఆమెకి అపాయింట్ మెంట్ లెటర్, మిగతా వారికి రిగ్రెట్ లెటర్స్ టైపు చేసి సంతకం తీసుకుని పోస్టు చెయ్యి-" పని అప్పగించారు కేశవరావు.     "రాజేశ్వరీ ఆ టైపు రైటర్ అది వాసుకి చూపించు. ఆఫీసు గదిలోకి తీసుకెళ్ళు" అన్నారు. నాల్గు గదుల్లో ఒకటి ఆయన స్టడీ రూముగా ఏర్పాటు చేసుకున్నారు. ఆయనఅందించిన ఉత్తరాలు పట్టుకొని రాజేశ్వరి వెంట నడిచాడు వాసు.     "రంగా ఆస్పత్రి పని ఎంతవరకు వచ్చింది."     "సున్నాలు వేస్తున్నారు. ఇంకో రెండు రోజుల్లో తలుపులకి, కిటికీలకి పెయింటింగు పూర్తి అవుతుంది. మరో నాల్గు రోజుల్లో ఫర్నిచర్ రాగానే అన్ని సర్థించి మళ్ళీ వారానికల్లా మొదలుపెట్టొచ్చు. ఈలోగా నర్సు కూడా వస్తుంది గదా. ఒక ఆయాని కూడా కుదర్చాలి. ఆస్పత్రి శుభ్రం చేయడం, బల్లలు క్లీన్ చేయడం.     "ఆ సరే చూడు. ఆ పని అయ్యాక ఆ కూలీలని యిటు పంపించు. ఈ పాకేజీ పెట్టెలు అవి విప్పించాలి జాగ్రత్తగా. పోర్టబుల్ ఎక్స్ రే. ఇ.సి.జి.మిషను స్కానింగ్ మిషను థియేటర్ సామానులు అవి అన్నీ జాగ్రత్తగా దగ్గరుండి విప్పించాలి.     "అన్నీ నేను చూసుకుంటాలే మామయ్యా - అలా మనసబుగారి దగ్గరకెళ్ళి రైతుల లిస్ట్ తీసుకెడతా. రాత్రికి వాసు, నేను కూర్చుని పుస్తకాలు తయారుచేస్తాం..." రంగా లేచి వెళ్తూ అన్నాడు.     "నిజంగా వూర్లో రంగా వుండడం నాకు సగం బరువు తగ్గింది సుమా. లేకపోతే వంటరిగా నేనేం చెయ్యలేకపోయేవాడినేమో. తిరుగుడు పని అంతా తనే చూస్తున్నాడు. పాపం- ఇప్పుడు వాసు వచ్చాడు కనక కాస్త సుళువవుతుంది పని.     'ఆ - ఇంతకీ వాసుకేం జీతం ఇస్తే బాగుంటుంది' కాస్త గొంతు తగ్గించి అడిగారు.     "ఏడెనిమిది వందలన్నా ఇవ్వకపోతే బాగుంటుందా! రాజేశ్వరి నెమ్మదిగా అంది."     "అంతేనా. నేను పదిహేనువందలన్నా ఇవ్వాల్సి ఉంటుందనుకున్నాను. ఏడెనిమిది వందలంటే మరీ తక్కువ కదా-మరీ బొత్తిగా ముప్పైఐదు డాలర్లు..."     "మీకు అమెరికాలో ఉండి ఆ స్టాండర్డ్ లో ఆలోచించడం అలవాటయిపోయింది. డాలర్లలో ఆలోచించడం మానండి. రూపాయిలలో ఖర్చుపెడుతున్నారు ఇక్కడ... ఆ ప్రకారం జీతాలు ఉంటాయి. ఇండియాలో బి.కాం. చదివిన వాడికి ఏమీ పెద్ద ఉద్యోగాలు రావు.     ఏదన్నా ప్రైవేటు కంపెనీలలో పనిచేసినా మొదట్లో వెయ్యి రూపాయలుంటుందేమో. పోనీ నా మాట కాదు, మీ మాటా కాదు వెయ్యి యివ్వండి" అంది రాజేశ్వరి మధ్యస్థంగా.     "ఇప్పుడీ నర్సు, ఆయా, వాసు వాళ్ళందరికీ జీతాలు మీ స్వంత డబ్బులోంచేగా ఇవ్వాలి. డబ్బుంది గదా అని మరీ ఎక్కువ జీతాలిచ్చి వాళ్ళని పాడుచేయకండి" అని సలహా కూడా ఇచ్చింది. అంగీకారంగా తల ఆడించాడు కేశవరావు.     "ఇప్పటికి యిండియా వచ్చిందగ్గిరనుంచి ఏమాత్రం ఖర్చు అయిందో ఓ లెక్కా పత్రం ఏమన్నా రాస్తున్నారా లేదా. ఇంటికోసం ఖర్చు, ఆ తర్వాత రోడ్డు, ఆస్పత్రి, గుడి బాగుచేయించారు. యివన్నీ డిటైల్డ్ గా కాకపోయినా కనీసం మొత్తం ఖర్చు అయినా రాస్తున్నారా. కూర్చుని తింటే కొండలన్నా తరుగుతాయి అంటారు. కాస్త చూసి ఖర్చుపెట్టండి."     నా లిమిట్స్ నాకు తెల్సులేవోయ్. నేను అనుకున్న అంకె దాటకుండా జాగ్రత్తపడ్డానులే.     నా సంపాదనలో పావువంతు కంటే ఎక్కువేం అవదులే. నేను ఎంత ఖర్చుచేసినా, అయినా మనకింకేం కావాలి. అమెరికాలో వున్న రెండిళ్ళు పిల్లలిద్దరికి చెరోటి వుంది. హాస్పిటల్ విక్రమ్ కే వెళ్తుంది. మనవలందరిపేరా ఇన్ వెస్ట్ చేశాం. యింతో అంతో వాళ్ళ పెళ్ళిళ్ళకి పేరంటాలకి బంగారం, వెండి చేర్చావు. వాళ్ళూ బోలెడు సంపాదిస్తున్నారు. యింకా యింకా జాగ్రత్తగా కూడబెట్టి ఎవరికి పెట్టాలి. మన ఇద్దరికీ ఎక్కడున్నా ఈ స్టాండర్డు తగ్గకుండా ఉంటే చాలు. ఈ వూర్లో మన సంసారానికేం ఖర్చుంది.       అమెరికాలో తిండి చవకయినా అక్కడికంటే యిక్కడే ఇంకా చవకగా వుంది. పాలు, కూరలు, బియ్యం అవీ ఫ్రీ. కారు ఖర్చు ఎప్పుడో విజయవాడో, హైదరాబాదో వెళితేగాని వుండదు. ఇక్కడ నేనేం సంపాదించడం లేదు కనక టాక్స్ లేదు. అంచేత ఉన్న డబ్బు ఇంకేం చేస్తాం. ఏదో ఇలాంటి మంచిపనులు చేసి పుణ్యం మూటకట్టుకుందాం."
24,536
ఒక్కరోజు కూడా వాళ్ళిద్దరూ దేబ్బలాడుకుని రోజు వుండేది కాదు. చెల్లి వాళ్ళ దెబ్బలాట వినకూడదని నేను అస్తమానం  టీవి పెద్దగా పెట్టి వుంచేదాన్ని. అలా అలా చదువు మీద శ్రద్ద తగ్గి, టీవిమీద ధ్యాస పెరిగింది నాకు. నెమ్మదిగా టీవి ప్రభావం నామీద పడడం మొదలు పెట్టింది. రక రకాల సీరియల్స్ చూస్తూ నన్ను నేను హిరోయిన్ గా ఊహించుకుంటూ వుండేదాన్ని. అప్పుడు మాఅమ్మకి కొత్తగా పరిచయం అయ్యాడు. వామనమూర్తి. మాఇంటికి వస్తూ పోతూ వుండేవాడు. అమ్మ, వామనమూర్తి చాలా చనువుగా వుండేవాళ్ళు. అమ్మకి,  మాకూ మంచి మంచి  బహుమతులు, బట్టలు కొనిస్తుండేవాడు. నాన్నగారు మాత్రం వామనమూర్తితో మాట్లాడేవారు కాదు. ఆయన విషయంలో అమ్మ, నాన్న ఓసారి బాగా గొడవపడ్డారు. నాన్న అమ్మని కొట్టారు. తమ్ముడు, చెల్లాయి నిద్రపోయారు. కానీ నాకు నిద్రపట్టలేదు. అమ్మ బాగా ఏడ్చింది. వాళ్ళ గదిలోంచి చాలా సేపు ఏడుపు వినిపిస్తూనే వుంది. చాలా సేపటకి నేను నిద్రపోయాను. తెల్లవారి లేచేటప్పటికి అమ్మ ఇంట్లో లేదు. నాన్న, మేము ఇల్లంతా వెతికాం. వాళ్ళ ఫ్రెండ్స్ ఇళ్లన్నిటికి పోన్లు చేశాడు నాన్న. అమ్మ కనిపించలేదు. గంటలు, రోజులు గడిచాయి. అమ్మ తిరిగిరాలేదు. ఎక్కడికి వెళ్లిందో కూడా తెలియలేదు. నాన్న తమ్ముడ్ని, చెల్లాయిని మద్రాసు తీసికెళ్ళి, స్కూల్లో చేర్పించి, హాస్టల్లో వుంచేసి వచ్చారు. న్వ్నూ, నాన్నా వుండేవాళ్ళం. అమ్మని వామనము తీసికెళ్లాడని నాన్న అంటుండేవారు. నిజమే అనుకున్నాను. కానీ, ఓ రోజు వామనమూర్తి హటాత్తుగా మాఇంటికి వచ్చి మా అమ్మని హైదరాబాదులో చూశానని చెప్పాడు. నానా అతని మాటలు నమ్మలేదు, అమ్మ ఒకసారి తనని కాదని వెళ్ళిపోయాక మళ్ళీ ఇంటికి రానవసరం లేదని చెప్పారు. కానీ నాకు మాత్రం అమ్మని చూడాలని చాలా అనిపించింది. నాన్నకి తెలీకుండా ఒకసారి వామనమూర్తి ఇంటికి వెళ్ళి నన్ను హైదరాబాద్ తీసికెళ్ళమని అడిగాను.  ఆ క్షణంలో ఆయన కళ్ళలో కనిపించిన వెలుగు ఈ రోజూ మర్చిపోలేను. అంతగా ఆయన కళ్ళు వెలిగిపోవడానికి కారణం ఏమిటో నేను ఆయనతో కలిసి హైదరాబాద్ వచ్చాకకానీ తెలియలేదు. రైలు దిగగానే నన్ను తన స్నేహితురాలని చెప్పి, ఒకామె ఇంటికి తీసికెళ్ళాడు. ఒక అపార్ట్ మెంటులో నాలుగో అంతస్టులో వుండేది ఆమె. నేనక్కడ నాలుగు రోజులు వున్నాను. అమ్మ జాడ చెప్పేవాడు కాదు. రోజూ రాత్రిళ్ళు ఆమె ప్లాట్ కి ఇద్దరు మగవాళ్ళు, ఇద్దరు ఆడవాళ్ళు వస్తుండేవాళ్ళు. తెల్లవారాక వెళ్ళి పోయేవాళ్ళు. వెళ్ళేటప్పుడు అమేకి కొంత డబ్బిచ్చి వెళ్ళేవాళ్ళు. ఆ డబ్బు వామనమూర్తి, ఆమె పంచుకునేవాళ్ళు. నాలుగురోజులు గడిచాక ఒకరోజు నేను గాఢంగా నిద్రపోతున్నాను . చెప్పడం ఆపి, వెక్కి వెక్కి ఏడవడం మొదలు పెట్టింది నీరజ. వింటోన్న అందరి గుండెలు బరువెక్కాయి. అనూష ఓదార్పుగా ఆమె తల నిమిరింది. "ఎవరో ఒకతను వచ్చినా పక్కన పడుకున్నాడు. నా  వంటిమీద చేయివేయగానే నేను భయపడి లేచాను. అతను నన్ను లేవనీయకుండా పట్టుకున్నాడు. చేయి కొరికి మంచం దిగాను. తీరా చూస్తే  తలుపు బయట నుంచి వేసివుంది. ఆ తరువాత అతను నన్ను"కన్నీళ్లు తుడుచుకుంది నీరజ. "అప్పటినుంచి నన్ను రోజుకొక ప్లాట్ కి తీసికేళ్ళేవాళ్ళు ఆమె, వామనమూర్తి. కొన్నాళ్ళకి వామనమూర్తి వెళ్ళిపోయాడు. ఆమె నాతో బిజినెస్ చేయించింది. ఈలోగా నేను బలహీనంగా వున్నానని అబార్షన్ చేయించడానికి తీసికెళ్ళింది ఆమె. కానీ నేను బలహినంగా వున్నానని అబార్షన్ చేయమని చెప్పింది డాక్టరు. ఓ రోజు వామనమూర్తి వచ్చాడు. ఆమె వామనమూర్తి చాలా సేపు చర్చించుకున్నారు.ఏం అనుకన్నారో మళ్ళీ అబార్షన్ సంగతి ఎత్తలేదు. ఆ తరువాత ఓసారి తెలిసింది మా అమ్మని కూడా వామనమూర్తి  తీసుకెళ్ళాడని. అమ్మ కూడా వేరే ఊళ్లో ఈ మేలాగే ఇలా సంపాదించి పెడుతోంది వామనమూర్తికని.... ఓరోజు పారిపోవడానికి ప్రయత్నించి పట్టుపడ్డాను. ఆ రోజు నన్ను బాగా కొట్టారెవరో ఇద్దరు మగవాళ్ళు. ఆమె అది చూసి నాకు వార్నింగ్ ఇచ్చింది ఇంకెప్పుడూ పారిపోవద్దని. నెలలు నిండిన నన్ను తీసుకొచ్చి హాస్పిటల్ లో  అడ్మిట్ చేశాడు వామనమూర్తి.ఆ తరువాత ఏమయింది మీకు తెలుసు. డాక్టరుగారు! నేను బతికివుంటే వామనముర్తి నన్ను వదిలి పెట్టాడు. నాకు చచ్చిపోవాలని వుంది. నిన్నరాత్రి ఆయన వచ్చాడని  మీరంతా మాట్లాడుకుంటుంటే మెలకువ వచ్చింది. నన్ను ఆయనకి అప్పగిస్తారని భయం వేసింది. అందుకే ఎలాగయినా పారిపోవాలనుకున్నాను. కానీ నిర్మానుష్యంగా వుండడంతో ఎలా వెళ్ళాలో అర్దంకాలేదు. మీరంతా వెతుకుతోంటే గబుక్కున ఆ తొట్టిలో దిగిపోయి కూర్చుండీపోయాను. ఎప్పుడు నిద్రపట్టిందో తెలియదు." "ఎంత పని చేశావు?నీకిష్టం లేకుండా ఎలా పంపిస్తామనుకున్నావు? అసలు అతనెవరో తెలుస్తుందని నిన్ను పిలిపించాను. పైగా నువ్వతని మేనకోడలివి కావని నాకు ఎలా తెలుస్తుంది? రుజువులడిగితే ఎక్కడినుంచి తేను?అందుకే ముందు నేను కూడా అతనిలాగే మంచిగా వుండి అసలు విషయం రాబట్టాలనుకున్నాను. పోనీలే జరిగిందేదో జరిగింది ఇంకెప్పుడు నువ్వు పారిపోవడానికి ప్రయత్నించవద్దు. ఆ వామనమూర్తి సంగతి మేము చూసుకుంటాం" అంది అనూష. "యస్ కరక్ట్....వాడి సంగతి రేపిపాటికి చూస్తాను నువ్వేం భయపడకు"అంది వీణ. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. "అనూషా! వాడికి పోన్ చేసి, రేపు మీ ఇంటికి రమ్మని చెప్పు....నీరజని అప్పగిస్తామని చెప్పు" వీణ అంది. "మేము వాడి దగ్గరకే బయలుదేరామని చెప్పారు మనవాళ్ళు ఇందాకే." ఏం ఫరవాలేదు. కారు ట్రబుల్ ఇచ్చింది, అందుకే మా ఇంటికి వెళ్ళాం అని చెప్పు రేపు రమ్మను. 
24,537
     "అంతా మనం అనుకున్నట్లే తయారయిందా కారు?"          "యస్ బాస్! పర్ ఫెక్టుగా!"          "నువ్వు గొప్ప ఇంజనీరువి జానీ!" అన్నాడు దినకర్. మొహమాటంగా నవ్వాడు జానీ అనబడే జాన్సన్.          పల్లె ప్రజలంతా దినకర్ నీ, జానీని కారునీ మార్చి మార్చి ఆశ్చర్యంగా చూస్తున్నారు.          ఇంతలో డాక్టర్ నిశాంత దినకర్ దగ్గరికి వచ్చి అతనికి మాత్రమే వినబడేటట్లు తగ్గు స్వరంతో అంది.          "దినకర్! నిన్ను నా నర్సింగ్ హోమ్ కి తీసుకెళ్ళి మైనర్ సర్జరీ చేసి గాయాలకు కట్టు కడుతున్నప్పుడు నీ భుజంలో ఇరుక్కుపోయి వున్న బుల్లెట్ ఒకటి కనబడింది. భుజంలో బుల్లెట్ దిగపడినా కూడా పట్టించుకోకుండా ఎలా తిరుగుతున్నాడా ఇతను అని ఆశ్చర్యపోయాను. ఎందుకోగాని ఆ బులెట్ ని పారెయ్యలేదు నేను. దాన్ని ఒక బీకర్ లో వేసి వుంచాను. యధాలాపంగానే అనుకో! ఆ తర్వాత తర్వాత జరిగిపోతున్న చిత్రాలన్నీ చూస్తుంటే నాకు అనుమానం వచ్చింది నీలో మాకెవ్వరికీ అంతుబట్టని ప్రత్యేకత ఉందేమో అని! ఆ బుల్లెట్ ఏదో గన్ లో నుంచి రిలీజ్ అయి నీ భుజంలో గుచ్చుకుని వుంటుందని అనిపించలేదు నాకు! చర్మాన్ని చీల్చి బుల్లెట్ ని నీ చేతి కండరాలలోకి గుచ్చి తర్వాత కుట్టేసి వుంటారని అనుమానం వచ్చింది. యామ్ ఐ రైట్?"          ఆమె మాటలు తక్కిన వాళ్ళు వింటారేమోనన్నట్లు నిశాంత భుజం మీద చెయ్యి వేసి నడిపిస్తూ కారు దగ్గరికి తీసుకొచ్చాడు దినకర్.          "యూ ఆర్ రైట్ డాక్టర్!" అన్నాడు అభిమానంగా నిశాంతవైపు చూస్తూ.          తన మెడికల్ చెస్టులో నుంచి బుల్లెట్ ని బయటికి తీసింది నిశాంత.          "నా ఊహ కరెక్టే అయితే ఇది మామూలు బులెట్ అయి వుండదు! ఏదో రహస్యం.....ఏ మైక్రో ఫిల్ము లాంటిదో అనుకుందాం....ఉండి వుండాలి. యామ్ ఐ రైట్?" అంది నిశాంత.          "వన్స్ ఎగెయిన్, యూ ఆర్ ఆబ్సల్యూట్ లీ రైట్ డాక్టర్!"          "అందుకనే ఆ బుల్లెట్ ను నాతో తెచ్చాను. నీకు యివ్వడానికి" అంటూ దాన్ని దినకర్ కి అందించింది నిశాంత.          దాన్ని అందుకున్నాడు దినకర్. "కమాన్! కారెక్కు!" అన్నాడు.          కారు ఎక్కి కూర్చుంది నిశాంత. అది మామూలు కరులాగా లేదు. లోపల చిత్ర విచిత్రమయిన గాడ్జెట్స్ చాలా వున్నాయి. డాష్ బోర్డు మీద చిన్న చిన్న స్క్రీన్ లు అయిదారు వున్నాయి. ఎన్నో రకాల డయల్స్ వున్నాయి. కారు లోపలే ఫోను వుంది. వైర్ లెస్ వుంది.          కళ్ళు విప్పార్చి అవన్నీ పరికించింది నిశాంత.          చేతిలోని బులెట్ ని గట్టిగా ప్రెస్ చేశాడు దినకర్.          అది రెండుగా విడిపోయింది.          దానిలోపల ఉంది ఒక మైక్రో ఫిల్ము కాసేట్!          దాన్ని డాష్ బోర్డులో వున్న ఒక ఆపరేటస్ లో ఇన్ సర్ట్ చేశాడు. వెంటనే డాష్ బోర్డుమీద వున్న ఒక చిన్న స్క్రీన్ ప్రకాశవంతంగా మారింది. దానిమీద కనబడ్డాయి అక్షరాలు.          "కోడ్ నేమ్: యమదూత"          ఆశ్చర్యంగా చూస్తోంది నిశాంత.          అక్షరాలు గబగబా పరిగెడుతున్నాయి. న్యూస్ లాంటిది ఒకటి కనబడింది.          తీక్షణంగా స్క్రీన్ వైపు చూస్తున్నాడు దినకర్.          స్క్రీన్ మీద కనబడుతున్నవన్నీ అతని మెదడులో రిజిస్టర్ అయిపోతున్నాయి.          ఫిల్ము పూర్తిగా చూశాక, దాన్ని బయటికి తీశాడు దినకర్.          కారులోనే చిన్న ఇన్ సినిరేటర్ అనే సాధనం వుంది. దానిలో పడేశాడు మైక్రో ఫిల్ముని. క్షణాల్లో దాన్ని నామరూపాలు లేకుండా నాశనం చేసేసింది ఇన్ సినిరేటర్.          పెదిమలు తుడిచేసుకుని నెమ్మదిగా అంది నిశాంత.          "దినకర్! ఇదంతా చూస్తుంటే నువ్వు ఒక ఏజెంట్ వి అయివుండాలనిపిస్తోంది. యామ్ ఐ రైట్?"          "వన్స్ ఎగైన్ యూ ఆర్ రైట్ మైడియర్ యంగ్ డాక్టర్!" అన్నాడు దినకర్ నవ్వుతూ. కథ క్లైమాక్స్ కి వచ్చేస్తున్నప్పుడు ఇంక దాచటం ఎందుకు? అందులోనూ నీ దగ్గర అవునా? నీ ఊహ కరెక్టే! నేను ఇండియన్ ఏజెంట్ ని కౌంటర్ ఇంటిలిజెన్స్! ఈ మైక్రోఫిల్ము కోసమే నా మీద ఇన్ని హత్యా ప్రయత్నాలు జరిగాయి. అలాంటి ఒక ప్రయత్నంలో నాకు తీవ్రమయిన గాయాలు తగిలి జ్ఞాపక శక్తి నశించి పోయింది."          "టెంపరరీ అమ్నేసియా!" అంది నిశాంత.          "యా! మళ్ళీ అందులోనుంచి బయటపడి మామూలు మనిషినయ్యాను."          "ఎవరు నీమీద హత్యాప్రయత్నాలు చేసింది? ఆ మెకానిక్ గ్యాంగు వాళ్ళే కదా?"          "నన్ను చంపాలని చాలాసార్లు ప్రయత్నించింది మెకానిక్ మనుషులే! కానీ ఒకటి రెండుసార్లు మాత్రం అలాంటి ప్రయత్నాలు చేసింది మెకానిక్ మనుషులు కాదు. ఇంకెవరో!"          "ఎవరై వుంటారు? ఎందుకు" అంది నిశాంత.          "తెలుస్తుంది అతి త్వరలో" అని తర్వాత స్వగతంలా అన్నాడు దినకర్. "ఈ మైక్రోఫిల్మ్ కోసమే నేను మెకానిక్ మనిషి అయిన ఉత్తేజ్ ని చంపాను. అతికష్టంమీద ఈ మైక్రో ఫిల్ముని సాధించగలిగాడు ఉత్తేజ్. అతన్ని చంపి నేను ఫిల్ముని స్వాధీనం చేసుకున్నాను. దాన్ని మళ్ళీ నా దగ్గరనుండి వెనక్కి తీసుకోవడానికే ఇన్ని ఘోరాలు చేయించాడు మెకానిక్."          "నువ్వు మనుషుల్ని చంపుతావా?" అంది నిశాంత ఆశ్చర్యంగా.          "యస్! ఐ గాట్ లైసెన్స్ టు కిల్! అవసరమయినప్పుడు మనుషుల్ని చంపే అధికారం నాకు ఉంది."          "ఇంక కారు దిగు."          "నేను దిగను. నీతోనే వస్తాను." అంది నిశాంత.     "నేను వెళ్తోంది మృత్యుముఖంలోకి! నిన్ను కూడా నాతోపాటు రిస్కులో పడెయ్యడం నాకు ఇష్టం లేదు."          "నువ్వు నన్ను ఇక్కడ వదిలేసిపోతే నేను యింకా పెద్ద రిస్కులో పడిపోతాను."          "ఏమిటది?"          "అదేమిటంటే..." అని అతని భుజంమీద తలవాల్చి బేలగా అంది నిశాంత. "దినకర్! నిన్ను విడిచి ఒక్క క్షణం వుండాలన్నా నా ప్రాణాలు పోతాయేమో అన్నట్లు వుంది నాకు"          నవ్వి అన్నాడు దినకర్. "అలా అయితే కష్టమే! ప్రమాదాలను వెతుక్కుంటూ పోవడం నా వృత్తి! మనమేమో జీవితాంతం కలిసి ఉండబోతున్నాం! ప్రతిసారీ ఇలా నువ్వు నా వెంట వస్తానంటే ఎలా కుదుర్తుంది?"          "అప్పటిసంగతి అప్పుడు చూసుకోవచ్చులేగానీ, యిప్పటికి మాత్రం కాదనకు. దినకర్! నిజంగానే! నిన్ను వదిలేసి వుంటే పిచ్చెత్తి పోయేలా వుంది నాకు. నేను నీతో వస్తాను. నీ పక్కన వుంటే నాకు ఏ ప్రమాదం జరగదు. అది నాకు బాగా తెలుసు" అంది ఎంతో నమ్మకంగా.          ఇబ్బందిగా ఓసారి ఆమె వేపుచూసి "సరే" అన్నాడు దినకర్. తర్వాత జాన్సన్ వైపు తిరిగి "జానీ! కమాన్!" అన్నాడు.          వచ్చి కారెక్కాడు జాన్సన్!          "యిప్పుడెక్కడికి?" అన్నాడు జానీ.          "ఊరి అవతల వుందే! అనాధ శరణాలయం! అక్కడికి"          "అనాథ శరణాలయానికి ఎందుకు?" అన్నాడు జానీ.          "అనాథ శరణాలయం అన్నది ఊరికే నాటకం! అది శరణాలయంకాదు. అదే మెకానిక్ స్థావరం!" అన్నాడు దినకర్ "సో! బీ రెడీ ఫర్ ఫైనల్ కాన్ ఫ్లిక్ట్."          "యస్ బాస్!" అన్నాడు జానీ ఉత్సుకతతో.          అక్కడ-          టార్చర్ ఛాంబర్ లో వున్న జలీల్ వైపు చూసి అన్నాడు చైనీస్ క్రిస్టోఫర్.          "జలీల్! చాలా రోజులపాటు నీ ప్రాణాలతో చెలగాటం ఆడుకోవాలనే ఉందిగానీ ఆ సరదా తీరేటట్లు లేదు. నిన్ను వెంటనే చంపెయ్యక తప్పని పరిస్థితి వచ్చింది. ఆర్డర్స్ అతిక్రమించలేంగదా!          జలీల్! ఈ ఆపరేటస్ ఏమిటో చెబుతానన్నానుకదూ! ఇదే ప్రెజర్ ఛాంబర్ జలీల్! ఈ ప్రెజర్ చాంబర్ లోకి పంపిస్తాను ఇపుడు నిన్ను. ఆ తర్వాత హఠాత్తుగా మళ్ళీ ప్రెజర్ తగ్గించేస్తాను. పూర్తిగా తగ్గించేస్తాను! జలీల్! అప్పుడు నువ్వేమైపోతావో తెల్సా! బెలూన్ లా ఠాప్ మని పేలిపోతావు. హౌ డూ యూ లైక్ ఇట్ జలీల్! నీ దేశభక్తికి ఇది నా అంతిమ కానుక! రెడీనా జలీల్?"          అంటూ జలీల్ ని ప్రెజర్ చాంబర్ లోకి తోశాడు చైనీస్ క్రిస్టోఫర్.                                                                            * * *
24,538
    "అవును. అందుకే ఎవరు చేసే పని వాళ్ళు చెయ్యాలి".     "సారీ అన్నయ్యా. ఇంత దూరం ఆలోచించలేదు నేను" అంది అనూష.     ......     ఎంబసీ నుంచి ఆమె తన అన్నయ్యతో మాట్లాడిన మాటలతో సహా ప్రతీ వాక్యమూ వసంత్ దాదాకి చేరి పోయాయి.     దాని సారాంశం అంతా తెలుసుకుని దాదా సంతోషించాడు. ఇంతకాలం- సలీంశంకర్ బదులు మరొకర్ని జపాన్ పంపే కథకం గురించి విష్ణుశర్మ తన వుత్తరంలో వ్రాసి వుంటాడేమో, దానికి బదులుగా మరే ప్లాన్ వేయాలా అని ఆలోచిస్తూ వచ్చాడు. విష్ణుశర్మ తన వుత్తరంలో ఈ విషయం ప్రస్తావించలేదని అర్థమైంది. అందుకే అనూష సలీంశంకర్ ని జపాన్ ఎప్పుడు తీసుకుపోతారా అన్న తొందర్లో వుంది.     విష్ణుశర్మ శంకర్ కి బదులుగా తనని జపాన్ పంపటానికి ఎన్నుకున్నారన్న విషయం వ్రాయకపోవటంలో ఆశ్చర్యం లేదు. మనుష్యులు ఎన్నో వాస్తవాలను బయటపెట్తూ కూడా చనిపోబోయే ముందు కూడా తమ పేరుకి భంగం కలిగించే వాటిని దాచి వుంచటం మామూలే! డబ్బుకి కక్కుర్తిపడి తను దీనికి వప్పుకున్న విషయం ప్రపంచానికి తెలియటం బహుశా అతడికి ఇష్టం లేకపోయి వుండవచ్చు.     ఏది ఏమైనా ఈ సంగతి తెలియటం తనకి లాభించింది!     ఇక, ఇంకొక ప్లాన్ మళ్ళీ ఆలోచించకుండా, శంకర్ బదులు వెళ్ళగలిగే మరో వ్యక్తిని పట్టుకుంటే చాలు. ఇక్కడ పోలీసు కేసు పూర్తయ్యే లోపులో దానికోసం తొందరపడాలి!     వసంత్ దాదా మొహం మీద చిరునవ్వు వెలిసింది.                                 *    *    *     శ్రీకాంత్ లాగే వసంత్ దాదా కూడా అనూష గురించి తక్కువగా అంచనా వేసింది ఇక్కడే!     విష్ణుశర్మ తన వుత్తరంలో వ్రాసిన మొట్టమొదటి పాయింటే అది! జపాన్ కి శంకర్  బదులు ఇంకొకరు వెళ్ళబోతున్నారన్నది!! అయితే అనూష ఆలోచన వేరు- ఈ విషయం తనకు తెలిసినట్టు దాదాకు తెలియకూడదు. ఉత్తరంలో ఆ ప్రసక్తి లేనట్టు అతడు భావించాలి!- దీనికోసం అనూష చాలా పటిష్టమైన ప్లాన్ వేసింది. నిజానికి ఆమె జపాన్ రాయబారి కార్యాలయానికి వెళ్ళవలసిన అవసరం ఏమీ లేదు. అక్కణ్ణుంచి శ్రీకాంత్ కి ఫోన్  చేయవలసిన అవసరం కూడా ఏమీ లేదు. ఆమె శ్రీకాంత్ తో ఫోన్ లో మాట్లాడిన సంభాషణని పునఃపరిశీలిస్తే అది కేవలం నిరర్థకమైన ప్రేలాపనగా తేల్తుంది. ఆమె వుద్దేశ్యం తమ సంభాషణ వాళ్ళు వినాలనే. "ఎవరు చేసే  పని వాళ్ళు చేయాలి" అని శ్రీకాంత్ చెప్పినప్పుడు అందుకే ఆమె రాబోయే నవ్వుని బలవంతంగా ఆపుకుంది. సలీంశంకర్ కి బదులుగా వేరే మరో మనిషిని పంపటం అంటే ఎంతోమంది సహాయం లేకుండా అది జరిగే పని కాదు! జపాన్  ఎంబసీలో దాదా 'రూట్స్' కొన్ని వుంటాయని ఆమె ఎప్పుడో వూహించింది. తను ఇంటి నుంచి బయల్దేరిన క్షణంనుంచి తన ప్రతీచర్యా, ప్రతీ సంభాషణా నోటీసు చేయబడుతుందని ఆమెకు తెలుసు. ఏమీ తెలియని దాన్లా వెళ్ళి, ఫోన్ చేసి, తనకి కావల్సిన అభిప్రాయాన్ని దాదాలో కల్గించింది. ఆమె ఎక్కడైతే పడేయాలనుకుందే సరీగ్గా అక్కడే ట్రాప్ లో పడ్డాడు వసంత్ దాదా.                                 25     ఉత్పల వాళ్ళు చేసే పనివైపే కళ్ళప్పగించి చూస్తూ నిలబడింది. ఇంకో కొన్ని గంటల్లో తమ భవంతి మీద బాంబులు పడబోతున్నాయని తెలిసి కూడా వాళ్ళు అదేదో- వర్షం పడబోయే ముందు బయట ఆరేసిన వడియాలు తీసి లోపల పడేసినట్టు- సామాన్లు సర్దటం చూసి ఆమెకు మతిపోయింది.     ఈలోపులో మేడమీద ముందు గదిలో వాళ్ళు సర్దటం పూర్తయింది. జానీ ఆమె వైపు చూసి, "నువ్వు వెళ్ళి పడుకో. పెద్ద శబ్దమైనా కంగారుపడకు. నీ రూమ్ వరకూ ప్రమాదం రాదులే-" అన్నాడు.     'నీకసలు బుద్ధిలేదు జానీ! ఈ పరిస్థితుల్లో ఆ అమ్మాయికి నిద్రపడుతుందా?' అని మందలించాడు బిల్లూ. ఉత్పలవైపు తిరిగి, 'పద. నేనూ వస్తాను నీతో-' అన్నాడు.     .....రాత్రి పదకొండు దాటింది. స్కాచ్, మిగతా విలువైన అద్దాల సామాగ్రి లోపల గదుల్లో అప్పటికే సర్దేశారు. క్రింద పనిచేసే వెయిటర్లకీ- ఉన్న ఒకరిద్దరు కస్టమర్లకీ- మరి  కొంచెం సేపట్లో జరగబోయే విధ్వంసం గురించి కొంచెం కూడా తెలీదు.     మరో గంట గడిచింది. బారు ఖాళీ అయింది. పనిచేసే వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. షట్టర్లు క్రిందికి దింపేశారు.     అంతా నిర్మానుష్యంగా వుంది.     "అతిథులింకా రాలేదేమిటి? బహుశా అనూష మనకి తప్పు ఇన్ఫర్మేషన్  ఇచ్చిందేమో-" అన్నాడు బిల్లూ.     "కాదు. వెనుక క్లబ్ లో పేకాడే మనుష్యులు కూడా వెళ్ళిపోయాక గానీ అటాక్ ప్రారంభించకపోవచ్చువాళ్ళు" అన్నాడు జానీ. "మన ముగ్గురివీ తప్ప మరెవరి ప్రాణాలూ పోవడం వాళ్ళకిష్టం వుండి వుండదు" అతడి మాటలు నిజమయ్యాయి. తెల్లవారుఝామున్న రెండున్నర- మూడు ప్రాంతాల్లో వచ్చింది ఆ కారు..... తెల్ల అంబాసిడరు.     కారు హొటల్ ముందు నుంచి నెమ్మదిగా సాగిపోతూ వుండగా, ఒక చెయ్యి బయటికి వచ్చి గ్రెనేడ్ ని బలంగా విసిరేసింది. షట్టర్స్ పేలిపోయాయి. బ్రహ్మాండమైన విస్ఫోటనంతో అద్దాలు గాలిలోకి లేచాయి. పై గదిలోంచి, బ్రద్దలైన బ్రాందీ విస్కీ సీసాల్లోంచి ద్రవం ఒక్కసారిగా అంటుకుని భగ్గున మండింది.     కారులోంచి మరోసారి చెయ్యి బయటకు వచ్చింది. ఆ గ్రెనేడ్ కూడా వెళ్ళి గమ్యాన్ని చేరివుంటే మరో రెండు గదులు విధ్వంసము వుండేవేమో. కానీ అంతలోనే బిల్లూ తన కారుని ఆ సందులోకి తీసుకు వచ్చాడు.     సందులోకి మరో కారు రాగానే, గ్రెనేడ్ లు విసిరిన కారు స్టార్టయి వేగం అందుకుంది. మరొకటి విసరాలనే ఆలోచన మానుకున్నట్టు సాగిపోయింది.     తాము గ్రెనేడ్ లు విసిరినట్టు వెనుక వచ్చిన కారులో వాళ్ళు చూశారేమో, తమని అనుసరిస్తున్నారేమో అని, ముందు కారులో వాళ్ళు కొంతదూరం స్పీడ్ గా పోనిచ్చి, వెనుక కారు రాకపోవడంతో స్లో చేశారు. ఆ తరువాత తాపీగా పోనిచ్చి- జంక్షన్ చేరుకున్నారు.     వాళ్ళనుకున్నట్టు బిల్లూ కారు అక్కడే ఆగిపోయిన మాట నిజమే. కానీ వాళ్ళకీ తెలియని విషయమల్లా జానీ కారు లైట్లు లేకుండా తమని అనుసరిస్తుందని......     జంక్షన్ లో వాళ్ళు, తాము అప్పటివరకూ తిరిగిన (దొంగిలించిన) కారుని వదిలేసి, తమ కారు దగ్గరికి వెళ్ళసాగారు. అప్పుడు పట్టుకున్నాడు జానీ, వాళ్ళని! నడుస్తూ వుండగా, వెనుకనుంచి..... తాపీగా-     ఇద్దరున్నారు వాళ్ళు.     ఇంతకుముందెప్పుడూ జానీ వాళ్ళని చూడలేదు. (బహుశా గ్రెనెడ్ లు విసరటంలో నిపుణులై వుంటారు)     "చాలా ఆర్టిస్టిక్ గా విసిరారు. కేవలం ఒక్క గ్రెనేడ్ తో రెండు గదులు కూల్చేశారు" అన్నాడు జానీ. వాళ్ళింకా జానీ ఇంత హఠాత్తుగా కనపడిన షాక్ నుంచి తేరుకోలేదు.     "ఇంకా ఎన్నున్నాయ్?"     వాళ్ళు మాట్లాడలేదు.     చేతిలో పిస్టల్ అలాగే వుంచి, వాళ్ళ దగ్గరున్న చేతిసంచిలో వెతికాడు. ఆరు గ్రెనేడ్ లు దొరికాయి.     "మొత్తం నా హొటల్ సమూలంగా కూల్చెయ్యడానికే వచ్చారన్నమాట- గుడ్. ఎంత ఇస్తానన్నాడు శంకరు?"     వాళ్ళు జవాబు చెప్పలేదు. అతడు ఆశించలేదు కూడా. వాళ్ళ కార్లోనే కూర్చుని 'పోనివ్వు' అన్నాడు వాళ్ళలో ఒకరితో.     "ఎక్కడికి?" మొదటిసారి మాట్లాడాడు వాళ్ళలో ఒకడు.     "నింబోలీ అడ్డ-"     ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. నింబోలీఅడ్డ సలీంశంకర్ మాట్కా సెంటరు.     "ఎందుకు?"     "నీకు ప్రశ్నలడిగే హక్కు లేదు. పోనివ్వు".     కారు కదిలింది. అర్థరాత్రి దాటి చాలాసేపవడంతో వీధులన్నీ నిర్మానుష్యంగా వున్నాయి పదిహేను నిమిషాల్లో కారు అడ్డ చేరుకుంది.     "నా ఇంటిమీదకి ఎలా విసిరారో, అంతకన్నా జాగ్రత్తగా విసరాలి. తీసుకో గ్రెనేడ్ ని........" అన్నాడు జానీ.     అప్పుడర్థమయింది వాళ్ళకి- అతడు తమని అక్కడికెందుకు తీసుకొచ్చాడో..... ఇద్దరూ ఒకరి మొహాలొకరు చూసుకున్నారు.     "శంకర్ మమ్మల్ని బ్రతకనివ్వడు".     "అది రేపటి సంగతి. ఇప్పుడు విసరకపొతే- నేను బ్రతకనివ్వను-ఎంతిచ్చాడు ఈ పనికి?"     "వెయ్యి రూపాయిలు".     "గుడ్. తెల్లవారుఝాముకే ఇక్కణ్ణుంచి పారిపోవడానికి అది చాలు. ఏ వూరి నుంచి వచ్చారు?"     "నాగపూరు".     "ఈసారి కేరళ పారిపోండి. ఊ. ఇంకా ఎందుకు ఆలస్యం?"     వాళ్ళు ప్రొఫెషనల్సు...... ఒకడు కారు స్టార్ట్ చేశాడు. రెండోవాడు గ్రెనేడ్ విసిరాడు. విస్ఫోటనం జరిగే సమయానికి కారు వంద గజాల దూరం వెళ్ళి పోయింది.     "ఈసారి కారు చార్మినార్ దాటి షమ్ షోర్ గంజ్ ప్రవేశించింది. అక్కడ మరో ప్రేలుడు. మొత్తం పనంతా అయ్యేసరికి నాలుగయింది.     వాళ్ళని వదిలిపెట్టి జానీ తన ఇంటికి వెళ్ళేసరికి అక్కడ నేల ఈనినట్టు పోలీసులున్నారు. ఫైర్ ఇంజన్ వుంది. అతడి కారు చూసి బిల్లూ దగ్గరకొస్తూ "కొంపమునిగింది జానీ. రాత్రి ఎవరో మన హొటల్ మీద బాంబులు విసిరారు" అన్నాడు.     "నిజమా" అన్నాడు జానీ నమ్మలేనట్టు చూస్తూ. "మనమీద అంత శత్రుత్వం ఎవరికి?"     అక్కడే వున్న పోలీస్ అధికారి "మీరేనా జానీ అంటే-" అని అడిగాడు. అధికారి నుదుటిమీద నామాలున్నాయి. దైవచింతన, పాపభీతి వున్నవాడిలా వున్నాడు. అతడి ప్రశ్నకు "అవును" అని సమాధానం చెప్పాడు జానీ.     "పదింటికి పోలీస్ స్టేషన్ కి రాగలరా? స్టేట్ మెంట్ రికార్డు చేసుకోవాలి".     "ష్యూర్"                                                *    *    *     ఆ పోలీస్ అధికారి కొత్తవాడు. జానీ వెళ్ళేసరికి అక్కడ సలీంశంకర్ కూడా వున్నాడు. టేబిల్ ప్రక్కనే ఇన్ స్పెక్టర్ నిలబడి వున్నాడు.     జానీ శంకర్ ని చూసి "అదేమిటి మీరూ వచ్చారు స్టేషన్ కి" అని అడిగాడు మర్యాదగా.     "అతడి స్థావరాల మీద కూడా బాంబుల విసిరారు నిన్నరాత్రి. మొత్తం ఏడు ప్రదేశాల్లో ప్రేలుళ్ళు జరిగాయి. పేపరు చదవలేదా"     "చదవలేదు. లేవగానే ఇలా పొలీస్ స్టేషన్ కి అని అడిగాడు మర్యాదగా.     "మీ హొటల్ కాక మిగతా ఆరు ప్రదేశాలూ సలీంశంకర్ వే-"     "నిజమా? మైగాడ్.... శంకర్, మనిద్దరికీ కామన్ శత్రువులెవరబ్బా? నీకేమైనా ఐడియా వుందా?"     "లేదు". పెదాలు బిగపట్టి సలీంశంకర్ అన్నాడు. 
24,539
      సాయిబు సంపాదన... బూబు కుట్టుకూలికి సరిపోతే ఏం సాధించినట్లు?     సాయంత్రానికి ట్రిమ్ముగా తయారయి- సుష్టిగా తిని, మత్తుగా తాగి, అర్థరాత్రి ఇంటికొచ్చి ఆపసోపాలతో పడకలెక్కేస్తారు- తిరిగి సూర్యుడు క్రుంగే సమయానికి లేస్తారు.     పాపం వారి జీవితం ఏమిటో...?     వాళ్ళ ధ్యేయం ఏమిటో ఎవరికీ అర్థంకాదు.     ఎదిగే సమాజాన్ని, దేశాన్ని ఎదగకుండా చేసే చెదపురుగులు వాళ్ళు- వారిపై మానసిన క్రిమిసంహారక మందులు వాడక తప్పదు.     ఈదేశం బాగుపడదని ఎవరన్నారు? ఎవరంటారు?     సోమరిపోతులు...     మన ఖర్మంతే అని ఎవరు వాపోతారు? మెంటల్ ఇంపోటెంట్స్.      బాగుపడుతుంది... మనదేశం ఎంతయినా బాగుపడుతుంది. ఎప్పుడంటే, ఖాళీగా కూర్చునేవాళ్ళు కాళ్ళు ఇరగ్గొట్టినప్పుడు... పనీపాటా లేక ఊసుబోని కబుర్లు చెప్పే ఉత్త బడుద్దాయిల్ని ఉరితీసినప్పుడు.     రండి... కదలండి... కదనరంగానికి ఉరకండి...     తెలివితేటల్ని ఉపయోగించండి... రాత్రింబవళ్ళు శ్రమించండి.     ఎదుగుదల తల వంచక ఏం చేస్తుంది?     విజయం వరించక ఎక్కడ ఉరేసుకుంటుంది?     India...     The Great India...     Love it...     Do it...     Or Leave it...     Let's Make India Great Again.     Let's Get India Moving Again But.     Our Future is in indian politician Hands-     అది ఇక సంభవింపరాదు.     రాజకీయ నాయకులు నిలబడేది- గెలిచేది వారికోసం- వాళ్ళ వాళ్ళ కోసం- మన కోసం కాదు- వాళ్ళు మనకేమీ చేయరు-     మనకు మనమే ఏదో ఒకటి చేసుకోవాలి.     బ్రతికున్నవాడు ఏదో ఉద్ధరించినట్లు బర్త్ డేలు, చచ్చినవాడు ఏదో ఊడబొడిచి వెళ్ళినట్లు తద్దినాలు... పురుడ్లు పుణ్యకార్యాలు... పండుగలు... పబ్బాలు... ఫంక్షన్స్... చచ్చినా సంబరమే... బ్రతికినా పండుగలే... వాటిని భరించే స్థితి ఈ దేశానికి యిప్పుడు వుందా? లేదు.     ప్రతి సంవత్సరం వీటికి దేశవ్యాప్తంగా ఐదువేల కోట్లు ఖర్చు అవుతున్నాయట- సిగ్గుగా లేదు మనకు-     ఎన్నిసార్లని, ఎన్నిటికని మనం మాత్రం సిగ్గుపడతాం? మనం పడే సిగ్గుసే స్థితి-     మనమీద మనమే జాలిపడే స్థితి....     అందుకే Let's get Indian youth moving again....     ఇతరుల చేతుల్లో నలుగుతున్న మన జీవితాల్ని మనం లాగేసుకుందాం....     మన భవిష్యత్ పగ్గాలు మన చేతుల్తో లాక్కుందాం...     Let's Move...     Let's Drive...     Let's Dig...     For our fortune....                                                     *    *    *    *    *     బెంగుళూరు మహానగరం....     గార్డెన్ సిటీ... రహదారుల కిరువైపులా పెరిగిన మహావృక్షాలు, వాస్తు కళకే ఛాలెంజ్ గా నిలిచే పురాతన కట్టడాలు ... వాటి పరిసరాల్లో పుట్టుకొచ్చిన అధునాతనమైన బంగ్లాలు... ప్రతి రెండు కిలోమీటర్లకొక పార్క్... ప్రతి ఇంటి ముందు పూలపొదలు... ఖాళీ అనుకునే ప్రతిచోట పుట్టుకొచ్చిన వృక్షాలు... ఓహో... ఎక్కడ చూసినా పచ్చదనం... కనుల పండుగగా కన్పించే రంగు రంగుల గులాబీలు... రన్ అవుట్ అయ్యేవరకు కెమేరా గురించి పట్టించుకోకుండా అలా ఆ అందాలకేసి చూసేలా ఛాయాచిత్ర గ్రహకుల చూపుల్ని నిలవేసే అందాలు.     అప్పుడు ఉదయం ఆరుగంటలు...     చామరాజ్ పేటలోని ప్రకాష్ కేఫ్ కి దగ్గర్లో ఉన్న టిప్పుసుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ ముందు ఒక టూరిస్టు బస్ వచ్చి ఆగింది.     ఆ చుట్టుప్రక్కల వున్న హోటల్స్ లో ఆక్స్ ఫర్డ్ కాలేజీకి చెందిన డిగ్రీ స్టూడెంట్స్ సుమారు నలభైమంది దాకా బసచేసి వున్నారు.     వాళ్ళని అక్కడ నుండి కూర్గ్ జిల్లాకు తీసుకెళ్ళి కాఫీ తోటల్ని, తిరుగు ప్రయాణంలో నాగర్ హోలేఫారెస్ట్ గుండా తీసుకువస్తూ, ఆ దట్టమైన అడవిని, వేల సంఖ్యలో సంచరించే ఎలిఫెంట్స్ ని చూపించటమే ఆ బస్ డ్రైవర్ ప్రస్తుత బాధ్యత.     "ఏరా! ఈ పిల్లకాయలింకా రాలేదు?" డ్రైవర్ గేర్ ని,బ్రేక్స్ ని చెక్ చేసుకుంటూ అడిగాడు.     "ఈపాటికి బయలుదేరే వుంటారు" క్లీనర్ రేడియేటర్ లో వాటర్ పోస్తూ అన్నాడు.     రోడ్డంతా దాదాపు నిర్మానుష్యంగా వుంది.     వుండుండి ఒక్కో వెహికల్ ఫాగ్ లైట్స్ వెలుగులో వెళ్ళిపోతోంది.     పదడుగుల తరువాతేముందో కనిపించనంత దట్టమైన పొగ మంచు... ఒకింత చలిగా కూడా వుంది... పూర్ విజన్...      బెంగుళూరు మొదలు, పశ్చిమ పర్వత శ్రేణులను కలుపుకొని, ఆరేబియా సముద్రాన్ని తాకే మంగళూరు, ఉడిపి వరకు చిక్కటి పొగ మంచు.... అలలు అలలుగా, తెరలు తెరలుగా సాగిపోతూ హిమాలయాల మృదుత్వాన్ని స్మరింపజేస్తోంది.     సిమ్లా, ముస్సోరి, నైనిటాల్ ని మరిపించేలా వుంది బెంగుళూరు నగర ఉషోదయం.     టెంపరేచర్ బాగా దిగిపోయివుండటంతో ఉదయాన్నే జాగింక్ కు వెళుతున్న వాళ్ళు ఆ కోల్డ్ వేవ్ ని తట్టుకొనేందుకు హెవీటాడ్ సూట్స్, లెదర్ జాకెట్స్, ప్రలోవర్స్ వేసుకుని రోడ్డువారగా పరుగులు తీస్తున్నారు.     "ఇప్పుడు మనం వెళ్ళబోయేది ఎక్కడికో తెలుసా...?" సన్నగా, పొడుగ్గా, బంగారు గోధుమరంగు ఛాయతో, నల్లటి చిక్కటి పొడవాటి జుత్తుతో అందానికే వంక పెట్టేలా వున్న మహతి అంది. ఆమె కంఠం సితారని మీటినట్లుగా శ్రావ్యంగా వుంది.     "కూర్గ్ జిల్లాకి..." పెదాలకి లిప్ స్టిక్ రాసుకుంటున్న సుధారాణి అంది చాలా కేజువాల్ గా.     అద్భుతమైన ప్రదేశానికి వెళుతున్నామన్న ఎక్సైట్ మెంట్ ఆమె కంఠంలో తొంగిచూడకపోవటంతో మహతి ఆశ్చర్యపోయింది.     "అది అందరికీ తెలుసు... కూర్గ్ జిల్లాకి మరో పేరుంది- అదే కొడగు. పరుగుల రాణి అశ్వనీ నాచప్ప పుట్టింది అక్కడే. పరుగు పరుగున ప్రవహిస్తూ కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల బంజరు భూముల్ని సస్యశ్యామలం చేసే కావేరీ నది పుట్టింది ఆ కొడగులోనే... తెలుసా?" తన్మయంగా అంది మహతి.     సుధారాణి తను చేస్తున్న పనిని పూర్తిచేసి, తన రెండు పెదాల్ని ఒత్తిడికి గురి చేసుకుంటూ నోటి లోపలకు ఒంచుకొని, తిరిగి అద్దంలో చూసుకొని సంతృప్తిపడింది.
24,540
       "అదేదో అర్జంటుగా జరగడానికి ప్లాన్ వెయ్యండి బాబూ....లేకపోతే కుడితిలో పడ్డ ఎలాకల్లా అయిపోతున్నాడు. ఆవిడ శీలంపోవటం పోయినట్లు రుజువు చేయటం అన్నదిఇకయ్యేలా లేదు....ఆమె సుఖపడ్డా సాక్ష్యాలకు దొరక్కుండా సుఖపడుతుందికనుక ఆ విషయాన్ని వదిలేసి ముందుమనఉద్యోగాల్ని కాపాడుకోవటం చాలాబెటర్" అన్నాడు కుటుంబరావు దిగులుగా.         చప్పుడు చెయ్యకుండా ప్రవహిస్తోంది. ఏ.సీ నిశ్శబ్దంగా         భుజంగపతి వేళ్ళమధ్య సిగరెట్ పొగలు కక్కుతోంది.         "మూడో కంటివాడికి తెలీకుండా, ఆ నవనీత్ గాడి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసి పోవాలి....."         "ఎలా...." కుటుంబరావు ఆత్రంగా ప్రశ్నించాడు.         "అతి ముఖ్యమైన పనిని నీకే అప్పగిస్తున్నాను......ఆ నవనీత్ గాడి రేటు పది లక్షలు......పని పూర్తి చేసిన మరుక్షణం పదిలక్షలు నీ ఎకౌంట్ లోకి వస్తాయి....."         "పది లక్షలు....." కుటుంబరావు కళ్ళలో వింత కాంతిమెరిసింది.         "నన్నేం చేయమంటారో చెప్పండి....." ఉత్సాహంగా అన్నాడు కుటుంబరావు.         "ఎస్టేట్ మేనేజర్ గా నవనీత్ గురించి ఇప్పటికే బాగా తెల్సుంటుంది నీకు అవునా....."         అవునన్నట్టు తలూపాడు కుటుంబరావు.         "రోజూ పడుకునే ముందు అతనికి ప్లాస్కులోంచి పాలు తీసుకుని తాగి బెడ్ రూమ్ లోకి వెళ్ళడం అలవాటు."         "ప్రాబ్లమ్ సాల్వ్ డ్....." విజయ దరహాసం చేసాడు కుటుంబరావు.         "ఆ పాలల్లో విషం కలుపు.....అతని అవుట్ హవుస్ పక్కన నువ్వుంటావు కాబట్టి మూడో కంటివాడికి తెలీదు.....ఏవంటావ్.....ఆ ప్లాస్కులో పాలు రోజూ ఎవరు పోస్తారు" అడిగాడు భుజంగపతి.         "రాధమ్మ....."         "రాధమ్మ ప్లాస్కులో పాలుపోసి వెళ్ళిపోయిన వెంటనే నువ్వు అక్కడకు వెళ్ళాలి.....గప్ చిప్ గా నేనిచ్చే విషాన్ని ఆ ప్లాస్కులో వేసి వచ్చెయ్.....కాగలకార్యం గంధర్వులు చూసుకునేటట్టుగా చేసే పూచీ నాది....." వికృతంగా నవ్వాడు భుజంగపతి.         "అట్నించి ఏదయినా తిరగబడితే....." అనుమానంగా అడిగాడు కుటుంబరావు.         "గురువుగారి ప్లానెప్పుడయినా తిరగబడిందా? పది లక్షల లక్కీ నిన్ను వరించిందయ్యా ప్రొసీడ్__" రామానుజం హుషారుగా కుటుంబరావు జబ్బ చరుస్తూ అన్నాడు.                                                                                 *    *    *    *         మర్నాడు__         రాత్రి ఎనిమిది గంటల వేళ__         "మేడమ్ ఇంకా రాలేదా....." రాధమ్మను అడిగాడు కుటుంబరావు.         "ఆఫీసులో లేటవుతుందని చెప్పిందావిడ....."         "మరి నవనీత్."         "ఆవిడెక్కడుంటే ఈయన కూడా అక్కడే వుంటాడుకదా....." రాధమ్మ కావాలనే నవ్వుతూ చెప్పింది.         "నీక్కూడా వాళ్ళిద్దరి గురించీ తెల్సిపోయిందే....అవునుగానీ రాధమ్మ.....రాత్రికి చిన్న పనిమీద హైద్రాబాద్ వెళుతున్నాను__ఉదయాన్నే వస్తాను.....మేడమ్ అడిగితే చెప్పు."         "అలాగే...." అంటూ లోపలి వెళ్ళిపోయింది రాధమ్మ.         తన రూమ్ లోకి వెళ్ళిపోయి లైట్లన్నీ ఆర్పేసి, చీకట్లో కూర్చున్నాడు కుటుంబరావు.         తొమ్మిదిన్నర దాటింది.         కిచెన్ రూమ్ లోంచి పాలగ్లాసుతో బయటికొచ్చి నవనీత్ వుండే అవుట్ హౌస్ లో కెళ్ళి, ఐదు నిముషాల తర్వాత అక్కడ లైట్లన్నీ ఆర్పేసుకుని రోజులాగానే బయటికొచ్చేసి మెయిన్ బిల్డింగ్ లో కెళ్ళి పోయింది రాధమ్మ. చీకట్లో కూర్చుని చేతిలోని పాయిజన్ బాటిల్ వేపు, స్విమ్మింగ్ ఫూల్ దగ్గర కబుర్లాడుకుంటూ కూర్చున్న ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ వేపు చూస్తున్నాడు కుటుంబరావు.         వాళ్ళు లేచి అక్కడ నుంచి వెళ్ళిపోగానే__         తనెళ్ళి ప్లాస్కులోని పాలల్లో పాయిజన్ ని వేసి కామ్ గా బయటకు వెళ్ళిపోవాలన్నది కుటుంబరావు ప్లాన్.         పదిన్నర దాటింది.         ఇంకా సెక్యూరిటీగార్డ్స్ అక్కడనుంచి కదలడంలేదు. అసహనంగా వుంది కుటుంబరావుకి. మయూష, నవనీత్ ఏ సమయంలో వచ్చేస్తారోనని భయంగా వుంది. పదిలక్షల రూపాయలు కళ్ళముందు కదలాడుతున్నాయి.         మరో అరగంట గడిచింది....         సెక్యూరిటీ గార్డ్స్ లిద్దరూ స్విమ్మింగ్ ఫూల్ అరుగుమీదనుంచి లేచి, వాళ్ళ రూముల్లోకి వెళ్ళిపోయారు. వెళ్ళేముందు వాళ్ళు మిగతా లైట్స్ ఆపేసారు.         ఇప్పుడంతా చీకటి మయమై పోయింది.         మరేమాత్రం ఆలస్యం చేయలేదు కుటుంబరావు. చీకట్లో పిల్లిలా నడుచుకుంటూ నవనీత్ రూమ్ లోకి ప్రవేశించి, బెడ్ రూమ్ లో కెళ్ళి ప్లాస్కులోని పాలల్లో పాయిజన్ ని వేసి గబుక్కున వెనక్కి తిరిగాడు.         బిక్కుబిక్కుమంటూ తన రూమ్ వేపు వెళ్ళిపోయాడు.         సరిగ్గా అదే సమయంలో__         బయటనుంచి కారులోపలికి ప్రవేశించడం, మయూష నవనీత్ తో మాట్లాడే మాటలు మెల్లగా విన్పించడం.         మయూష బిల్డింగ్ లో కెళ్ళిపోవడం, తన అవుట్ హౌస్ వేపు నవనీత్ వెళ్లిపోవడం జరిగిపోయింది.         మరో పదినిముషాల్లో నవనీత్ నిద్ర కుపక్రమిస్తాడు__నిద్రపోయేముందుండే క్షణాలకోసం ఎదురుచూస్తున్నాడు కుటుంబరావు.         తన రూమ్ లో కూర్చుని నవనీత్ డ్రెస్ చేంజ్ చేసుకుని, రీడింగ్ టేబుల్ ముందు కూర్చుని-         మయూష ఇచ్చిన ఏదో ఫైల్స్ సీరియస్ గా చదువుతున్నాడు.         తన రూమ్ లోంచి బయటికొచ్చి, అతని బెడ్ రూమ్ పక్కనున్న కిటికీ సందులోంచి అంతా చూస్తున్నాడు కుటుంబరావు.         నలభై నిమిషాలు గడిచాయి__         దుస్సహంగా వుంది కుటుంబరావుకి.         ముళ్ళమీద నుంచున్నట్లుగా వుంది.         సరిగ్గా అదే సమయంలో నవనీత్ ఫైలుని మూసేసి బెడ్ ల్యాంప్ ని ఆర్పేసాడు.         కుటుంబరావు గుటకలు మింగుతున్నాడు.         నవనీత్ పాలుతాగి, బెడ్ మీద వాలిన మరుక్షణం.....బాధతో అతడు మెలికలు తిరుగుతాడు....అయిదు నిముషాల తర్వాత-         శాశ్వతంగా ఈ లోకానికి టాటా చెప్పేస్తాడు.         అడుగులో అడుగు వేసుకుంటూ తన రూమ్ లో కొచ్చాడు.....ఆ విషయాన్ని భుజంగపతికి ఫోన్ చేసి చెప్పేసి, వెనకున్న గోడదూకి తను బయటికి పోవాలి. నిశ్చయానికొచ్చి-         చీకట్లో తడువుకుంటూ ఫోన్ రిసీవర్ అందుకున్నాడు. భుజంగపతి నెంబర్ కి డయల్ చేసాడు. ఆ పాలు తాగటం నవనీత్ మర్చిపోయి బెడ్ ఎక్కేసాడనే విషయం కుటుంబరావుకు తెలీదు.         భుజంగపతి పర్సనల్ ఫోన్ ఎంగేజ్ రావడం ఆశ్చర్యంగా వుంది కుటుంబరావుకి.         మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తున్నాడు.
24,541
    ధన స్వామ్యపు మరొక ప్రధాన లక్షణం నిరుద్యోగం. ధనస్వామ్యపు ఉత్పత్తి ప్రధానంగా పట్టణాలలో జరుగుతుంది. భూస్వామ్యానికి మూలం గ్రామాలనుకుంటే, ధనస్వామ్యానికి మూలం పట్టణాలు. పరిశ్రమలు పట్టణాలలో వుండటం వల్ల ధనస్వామ్యులకు ప్రయోజనం చాలా వుంది. అందువల్ల పట్టణాలు కేంద్రాలుగా గలది ధనస్వామ్యం. పట్టణాలలోని పరిశ్రమలు, గ్రామ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసి నిరుద్యోగం కల్పించింది. అది ఎలా జరిగిందంటే మళ్ళీ నేతపనివాణ్నే ఉదాహరణగా తీసుకుంటే ఒకడు పరిశ్రమలో ఉత్పత్తి చేసే బట్ట, నేత మగ్గం మీద పదిమంది ఉత్పత్తి చేసిందానితో సమానం. అంటే ఒకనికి పని కల్పించిన పరిశ్రమ తొమ్మిది మందిని నిరుద్యోగులను  చేసింది. వస్తు వినిమయం ధనస్వామ్య సమాజంలో ఎక్కువ జరిగేది నిజం. అంటే భూస్వామ్య సమాజంలో తలసరి బట్ట వినియోగం రెండు గజాలనుకుంటే ధనస్వామ్య సమాజంలో అది రెండింతలు కావచ్చు! లేదా, మూడింతలు, నాలుగింతలు కావచ్చు. అలా జరిగినపుడు ఎక్కువమంది కార్మికులకు పని దొరుకుతుందనుకోవడం భ్రమ. ఎందుకంటే ఈ సమాజంలో శాస్త్రపరిశోధనకు ప్రాధాన్యత మెండు. వస్తు ఉత్పత్తి తక్కువ శ్రమతో ఎక్కువ ఉత్పత్తి జరగడానికి నిరంతరం కృషి జరుగుతుంది? ఈ కృషి వల్ల ఉద్యోగావకాశాలు పెరుగవు. కాని ధనస్వామ్యులకు లాభాలెక్కువ వస్తాయి.     మళ్లీ నేతకారుణ్నే ఉదాహరణ తీసుకుంటే ఒక నేతపరిశ్రమలో పదిమంది కార్మికులు వేయిగజాల గుడ్డ ఉత్పత్తి చేస్తున్నారనుకుందాం. శాస్త్ర పరిశోధనలవల్ల ఈ వేయిగజాల బట్ట ఐదుగురే ఉత్పత్తి చేయడం సాధ్యమయింది. అలాంటప్పుడు ఆ పరిశ్రమలో చేసే 5 గురు కార్మికులు నిరుద్యోగులవుతారు. ఈ విధంగా శాస్త్రపరిశ్రమ 'కంప్యూటరైజేషన్' పెరిగినకొద్దీ నిరుద్యోగం పెరుగుతుంది. ఈ వ్యవస్థలో కీలకమైనవాడు ధనస్వామి. అతనికి లాభాలతో తప్ప వేరే నిమిత్తంలేదు. ఈ వ్యవస్థ పెట్టుబడి పెట్టేవారిపైననే ఆధారపడి వుంటుంది. అతని శ్రేయస్సు కాపాడ్డమే సమాజపు ప్రధాన లక్షణం. నిరుద్యోగం పెరిగినా జనం తిండికి అల్లాడినా, ఆకలి చావులు ఎక్కువుగా ధనస్వామ్యానికి కనికరం లేదు. అతడు నిరుద్యోగాన్ని సృష్టిస్తూనే పోతాడు. ధనస్వామ్య వ్యవస్థలో అందరికి ఉద్యోగాలు దొరకడం పుక్కిటి పురాణాలు. నిరుద్యోగాన్ని, దారిద్ర్యాన్ని నిర్మూలించిన ధనస్వామ్య దేశాలులేవు. మనిషికి మనిషికి అంతరాలు పెంచడం, ధనస్వామ్య వ్యవస్థ లక్షణం.     ధనస్వామ్య వ్యవస్థ సృష్టించిన వ్యవస్థలలో మధ్యతరగతి ఒకటి. ఇది భూస్వామ్య సమాజంలో లేదు. ఇది ధనస్వామ్యపు సృష్టి మాత్రమే. భూస్వామ్య సమాజపు ఉత్పత్తి విధానానికి మధ్య తరగతి అక్కరలేదు. ఆ సమాజపు ఉత్పత్తి, విధానం సులభమైంది. అంత క్లిష్టంకాదు. ఆ సమాజపు ఉత్పత్తి దశలుగురించి ఇదివరకే చర్చించుకున్నాం. ధనస్వామ్యపు ఉత్పత్తికి అటు ధనస్వాములు, ఇటు శ్రామికులు మాత్రమే సరిపోరు. పరిశ్రమలో ఉత్పత్తి పనికి సమానంగా వ్రాతపని కూడా జరగాలి. పరిశ్రమలు స్థాపించడంలో నైతేనేమి, నిర్వహించడంలో నైతేనేమి, వ్రాయసగాళ్లు, ఇంజనీర్లు, శాస్త్రజ్ఞులు, డాక్టర్లు, టీచర్లు, ఈ విధంగా అనేకమంది 'కాయకష్టం కాని శ్రమ' అవసరమవుతుంది. వీళ్లు శ్రామికులు కారు. అంటే కాయకష్టం చేయరు. అలా అని ధనస్వాములు కారు. వీరికి తమశ్రమకు తగిన ఫలితం లభించదు. ఐన వీరి స్థితి శ్రామికులు కంటే మెరుగ్గా, ధనస్వాముల కంటే అధ్వాన్నంగా వుంటుంది. ఈ వర్గం తమను శ్రామికులు అనడానికి అంగీకరించరు. ధనస్వామ్యులు కాలేరు. అటు ఉట్టికి, ఇటు స్వర్గానికి ఎక్కలేని వర్గమిది. ఐతే ఇది మేధావి వర్గం. ఆలోచించగలవారు వీరిలో చాలామంది వుంటారు. కళలు, సాహిత్యం ఈ వర్గాన్నుంచే వస్తాయి. ఈ వర్గాన్ని గురించే వ్రాస్తాయి.     ధనస్వామ్యం మానవుని ఆలోచన విధానాల్లో అనంతమైన మార్పుని తెచ్చింది. రాజకీయంగా రాచరికాన్ని ఓడించి, ప్రజాస్వామాన్ని సృష్టించింది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. రాజరికాన్ని ఓడించి ప్రజాస్వామ్యాన్ని ప్రతిష్టించడానికి, జరిగిన పోరాటాల్లో ప్రధానపాత్ర వహించింది ధనస్వామ్యులు అనే విషయం గమనించడం అవసరం. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన స్వాతంత్ర్య సంగ్రామముల్లో ధనస్వాములు కీలకమైన పాత్ర వహించారనే విషయము అందరికి తెలిసిందే. ఈ ధన స్వాములు నిన్నటి భూస్వాములే. భూస్వామ్య వ్యవస్థను పూడ్చి పెట్టిన గౌరవం కూడా భూస్వాములకే దక్కాలి. ప్రపంచానికి ఒక ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పరచిన గౌరవంకూడా ధనస్వామ్యానికి దక్కాలి. బానిస విధానాన్ని అంతంచేసి మనిషి ఆలోచనా విధానంలో 'మానవులంతా ఒక్కటే' అనే సిద్ధాంతాన్ని నిర్వచించింది కూడా ధనస్వామ్యమే. ఈ సమాజం కులమతాల కట్టుగోడల్ని కూల్చివేసింది. ప్రపంచంలోని దేశాలను దగ్గర చేసింది. మనిషికి మనిషికుండే అంతరాలను ఆర్థికంగా తప్ప మిగతా విషయాల్లో చాలవరకు తగ్గించింది. ఇది పిడివాదాన్నీ మూఢనమ్మకాల్ని పారద్రోలడానికి ప్రయత్నించింది.     ధనస్వామ్యవర్గం మేధావివర్గపు ఆలోచనల్లో గొప్ప సంచలనాల్ని రేకెత్తించింది. యథాతథా వాదాన్ని(orthodoxy)కి స్వస్తిచెప్పించే ప్రగతి వాదానికి దారితీసింది. మేధావులు హేతువాద పద్ధతిలో ఆలోచించడం ప్రారంభించారు. ప్రతి పాత విలువను గురించి, మూఢ విశ్వాసాలను గురించి ప్రశ్నించారు, ధిక్కరించారు. లౌకికతను గురించి ఆలోచించడం ప్రారంభించారు. ధనస్వామ్యం ఆలోచనా స్వేచ్ఛను ప్రసాదించింది. ఆర్ధికరంగంలో అన్ని రంగాల్లో కొంతలో కొంత స్వేచ్ఛ నిచ్చింది.     పాత విలువలను ప్రశ్నించడం, హేతువాదంతో ఆలోచించడం, ధనస్వామ్యం ప్రసాదించిన ఒక గొప్పవరం. మేధావులు మూఢవాదాన్ని ధిక్కరించడంలో శాస్త్రప్రగతి మూడుపూలు ఆరుకాయలుగా కొనసాగింది. భూమి గుండ్రంగా వున్నందున గెలీలియొను ఉరితీసిన కాలంపోయింది. సర్వం దైవప్రసాదం అనే మూఢవిశ్వాసానికి భరతవాక్యం పలకడం జరిగింది. ప్రతిదీ మానవ మేధస్సుపైనే ఆధారపడి వుందని ప్రకృతిని లోబర్చుకోవడం చేయవచ్చునని మేధావులు కనుగొన్నారు. శాస్త్రజ్ఞులు, మేధావులు, పురోగామి దృక్పథంతో ఆలోచించడం ప్రారంభించారు. దానితో శస్త్రవిజ్ఞానం అనంతంగా పెరిగిన శాస్త్ర విజ్ఞానంతో మారిన జీవితం భూస్వామ్యదశ నుండి పోల్చుకోరానిదిగా పరిణమించింది.     మానవజీవితాన్ని మహిమాన్వితం చేయడానికి ధనస్వామ్యం సాధించిన ప్రగతికి అభినందించక తప్పదు. కాని ఈ ప్రగతి సాంతం ఎవరికి అందుతోంది? దీన్ని ఎవరు అనుభవిస్తున్నారు? అని ప్రశ్న వేసుకుంటే, ఇందువల్ల లాభం పొందుతున్నవారు ఏ కొద్దిమందో ధనాధిపతులు అని తేలుతుంది. అత్యంతమైన ఆధునిక దేశాల్లో సైతం, డబ్బులేని వారికి ఈ శాస్త్రవిజ్ఞానం ఎంతవరకు ఉపకరిస్తుందనే విషయం ఆలోచించాలి. ఈ సమాజంలో గల సౌకర్యాలన్నీ సంపన్నులకే చెందుతున్నాయేమో, సామాన్య మానవుడు ప్రగతి పథంలో పయనిస్తున్న శాస్త్రవిజ్ఞానాన్ని చూస్తు కూడా "అంగట్లో అన్నీ వున్నాయి. అల్లుని నోట్లో శనివుంది" అన్ని సామెతలో పరిణమించినట్లు కనిపిస్తుంది.     ధనస్వామ్య సమాజంలో మానవసంబంధాలకు ధనం ప్రధానమైన అడ్డుగోడ. ప్రతి మానవ సంబంధానికి డబ్బు, అంతస్తు అడ్డువస్తాయి. ఇచ్చట ప్రేమకు అనుబంధానికి, ఆత్మీయతకు, అనురాగానికి విలువలేదు. ఈ విలువలన్నీ డబ్బుచుట్టు పరిభ్రమిస్తుంటాయి. డబ్బు అంతస్థులను నిర్ణయిస్తుంది. ఆదాయాలను బట్టి వర్గీకరించబడిన సమాజంలో మనిషికీ, అతని విలువకు స్థానముండదు. తల్లికి, బిడ్డకు, భర్తకు, మిత్రునికి, ఉన్న ఘనిష్టమైన సంబంధాలు కూడా డబ్బునెపంతో చెడిపోవడం, చెదిరిపోవడం జరుగుతుంటాయి. మనిషిని మనిషిగా కాక మనిషికున్న ఆస్థినిబట్టి విలువలు నిర్ణయించడం జరుగుతుంటుంది. రచయితలు, కళాకారులు, శాస్త్రజ్ఞులు, వీరి విలువలను సైతం వారికున్న ప్రతిభను బట్టిగాక వారికి వచ్చే ఆదాయాన్ని బట్టి వారి అంతస్తును నిర్ణయించడం జరుగుతుంది. ఈ విధంగా సకల రంగాల్లో సంపద పెత్తనం చెలాయించడం జరుగుతుంది. ఈ విధంగా సకల రంగాల్లో సంపద పెత్తనం చెలాయించడం ఈ సమాజలక్షణం. భూస్వామ్యంలో అధికారం నుంచి సంపద ఉద్భవిస్తే - ధనస్వామ్యంలో సంపద నుంచి అధికారం ఉత్పన్నమవుతుంది. సకలానికి సాధనం కాబట్టి ఇది ధనస్వామ్యం అయింది.
24,542
    చంద్రున్ని చూసి వికసించిన తెల్లకలువలా ఆమె వదనం విప్పారింది.         "సుధా! మా బాస్ వచ్చాడు కాఫీ ఇస్తావా?"         కృష్ణ గొంతు నూతిలోనుంచి వస్తున్నట్టుగా వుంది.         "ఉదయంనుంచి ఏమీ తినలేదు మీరు."         "ఆ సంగతి తర్వాత. ముందాయనకు కాఫీ తీసుకురా" అని గది లోనుంచి సుధవెనకే బయటికొచ్చాడు.         అవును తను ఇవ్వాళ అన్నం తినలేదు. అంటే సుధకూడా తినలేదు, తను తింటేగాని తినదు. తనకోసం ఎదురుచూస్తూ కూర్చుంది. కనీసం తను ఆమెకు ఫోన్ కూడా చెయ్యలేదు, చాలా దారుణంగా ప్రవర్తించాడు తను.         ఆలోచిస్తూ కృష్ణ నీరుకారిపోయాడు.         ఆఫీసర్, కృష్ణ డ్రాయింగ్ రూమ్ లోకి వచ్చేసరికి రిసీవర్ పెట్టేసి లేవబోతున్నాడు.         "ఓ కె. థాంక్యూ! వెళతాను!!" అంటూ చెయ్యి ముందుకు చూచాడు.         "సర్ ఒక్క నిముషం!"         "ఓ! నో ఫార్మాలిటీస్. డోన్టు బాదర్!" అంటూ అడుగు ముందుకేశాడు,         ఎదురుగా ట్రేలో స్వీటూ, హాతూ ఉన్నప్లేట్లు, మంచినీళ్ళగ్లాస్ లూ పెట్టుకొనివస్తున్న సుధను చూసి ఆగిపోయాడు ఆఫీసర్.         "షి ఈజ్ మై వైఫ్ సుధ. వీరు మాబాస్...."పరిచయంచేస్తున్న కృష్ణ బాస్ ముఖం చూసి ఆగిపోయాడు.         సుధ ట్రే పట్టుకొని కన్నార్పకుండా బాస్ ముఖంలోకి చూస్తూంది.         "వాటె సర్ ప్రైజ్!" బిగ్గరగా, అరిచినట్టే అన్నాడు బాస్.         "అంకుల్!" సుధచేతిలో ఉన్న ట్రే కదిలి గ్లాసులోని నీళ్ళు తొణికినై.         కృష్ణకు చెమట్లు పట్టినై.         సుధ వంగి టీపాయ్ మీద ట్రే పెట్టింది.         "యూ బేబీ!" అంటూ బాస్ సుధ భుజం తట్టి ఆమెను సోఫాలో తనపక్కన కూర్చోబెట్టుకున్నాడు.         "సర్! సుధ మీకు ఇదివరకే...." నీళ్ళు నములుతూ అన్నాడు కృష్ణ.         "తెలియడమేమిటోయ్. షి ఈజ్ మై చైల్డు!" ఆప్యాయంగా సుధని చూస్తున్నాడు.         "సుధ మీకు బంధువులా సర్?"         "అంతకంటే ఎక్కువేనోయ్ కృష్ణా. సుధ ఫాదర్__ఐయామ్ సారీ! మీ ఫాదర్-ఇన్-లా, నా డియరెస్టు ఫ్రెండ్. ఉయ్ ఆర్ ఫామిలీ ఫ్రెండ్సు ఫర్ ఇయర్స్. మీ పెళ్ళికి నేను రావాలని ప్రయత్నించాను. కానీ వీలుకాలేదు. యు. యన్. ఓ. యసైన్ మెంట్ మీద నైజీరియాలో ఉన్నాను. నైజీరియానుంచి వచ్చాక ఇంకా మీ మామగార్ని కలుసుకోవడం పడలేదు.         "మూడునెలలేగా అయింది మీరొచ్చి" అన్నాడు కృష్ణ సాలోచనగా.         "చూడు బేబీ మంచి అల్లుడు దొరికాడు. సమర్ధుడు. మొన్న మద్రాస్ చాలా ముఖ్యమైన పనిమీద పంపించాను. ముందు నేనే వెళదామనుకున్నాను. కృష్ణ శక్తిసామర్ధ్యాలు తెలుసుకుందామని, జూనియర్ ఐనా పంపించాను. అల్లుడు అసాధ్యుడు. పని పూర్తిచేసికొని వచ్చాడు. త్వరలోనే కృష్ణ సీనియర్ గా గ్రేడ్ రికమెండ్ చేస్తాను. అల్లుడనికాదు సుమా! షి యర్ ఆన్ హిస్ మెరిట్."         "థాంక్యూ సర్!" కృష్ణ ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు.         "సర్ గిర్ ఏమిటేయ్! అదంతా ఆఫీస్ లో, ఆఫీస్ ఆవరణ దాటాక అంకుల్. అర్ధమైందా?" అతడి వీపుమీద చరుస్తూ బిగ్గరగా నవ్వాడు బాస్.         "అంకుల్ మీరా మద్రాస్ పంపించింది?" తనలో తనే అనుకుంటున్నట్టుగా అంది సుధ.         "యస్ బేబీ! నేనేను" అంటూ సుధ ముఖంలోకి చూస్తూ ఆగిపోయాడు.         "వాటీజ్ ద మేటర్? సుధా ఏమైంది?" మళ్ళీ అడిగాడు,         "ఏమీలేదు అంకుల్, ఏమీలేదు" ఆమె ముఖం పక్కకు తిప్పుకుంది.         "నో! నో! నువ్వేదో దాస్తున్నావమ్మాయ్!" అని గిర్రున కృష్ణవైపు తిరిగాడు.         "ఏమిటోయ్ కృష్ణా! ఏం జరిగింది?"         "నథింగ్ సర్! ఏమీలేదు సర్!"         "సే అంకుల్!"         "యస్ అంకుల్ ఏమీ జరగలేదు."         "నేను నమ్మను. సుధ హఠాత్తుగా ఎందుకలా ఐపోయింది?"         "మీ అమ్మాయినే అడగండి."         "ఏం సుధా? నాకు చెప్పడానికి సందేహమెందుకమ్మా? మీ ఫాదర్ కి ఫోన్ చేసి పిలిపించమంటావా?"         "నో! నో! ప్లీజ్ అంకుల్!"         "ఐతే చెప్పుమరి!"         "ఆయన మద్రాస్ వెళ్ళొచ్చినప్పటినుంచీ అదోలా వుంటున్నారు" బెరుకు బెరుగ్గా అంది.         "ఓ ఐసీ!"         "ఆఫీస్ పనిమీద వెళ్ళారు, అక్కడేమన్నా జరిగిందేమో? ఆఫీస్ లో తనకు ఏదైనా మాటవస్తుందని చిరాగ్గా వున్నారనుకున్నాను."         "నో! నో! అలాంటిదేమీ లేదు. హి హాజ్ డన్ ఏ వండరఫుల్ జాబ్!"         "మరెందుకలా ఉన్నారు?"         "ఏమైంది సుధా? వివరంగా చెప్పు" అనునయిస్తూ అడిగాడు అంకుల్.         సుధ కృష్ణకేసి ఓసారి చూసి తలదించుకొంది.         కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.         అంకుల్ కంగారుపడ్డాడు.         సుధను రెండు చేతులతో పట్టుకొని "ఏమైందమ్మా చెప్పు! కృష్ణ ఏమీ అనుకోడు, హి ఈజ్ ఏ నైస్ బాయ్ అన్నాడు.         "సుధా చెప్పరాదా! అక్కడికి నేను నిన్ను ఎన్నో రకాల కాల్చుకు తిన్నట్టు ఆ ఏడుపూ నువ్వూనూ__" కసిరినట్టు అన్నాడు కృష్ణ,         "ఉదయం రాగానే నాతో....మీరు రాగానే నాతో ఎందుకు మాట్లాడలేదు? భోజనంకూడా తినకుండా ఎందుకు వెళ్ళిపోయారూ?" నేరుగా కృష్ణ కళ్ళల్లోకి చూస్తూ అడిగింది సుధ.         బాస్ కు నవ్వాగిందికాదు, విరగబడి నవ్వసాగాడు.         "నవ్వుతారేం అంకుల్? ఆయనని చెప్పమనండి" చిన్నపిల్ల మారాం చేస్తున్నట్టు అనిపించింది అంకుల్ కు.         "యస్! యస్!" బలవంతంగా నవ్వు ఆపుకొని అతడివైపు తిరిగి "చెప్పవోయ్ నీ సంజాయిషీ ఏమిటో చెప్పు" అన్నాడు.         "ఫ్లయిట్ లో హెవీ బ్రేక్ ఫాస్ట్ ఇచ్చారు.  ఆకలిగాలేదు. త్వరగా ఆఫీస్ కొచ్చి మీకు రిపోర్ట్ ఇవ్వాలనే ఆదుర్దాలో వున్నానుసర్! మద్రాస్ లో మన ఇన్స్టిట్యూట్ తరపున నేను కమిట్ అయ్యాను. నా నిర్ణయాన్ని మీరు ఎలా తీసుకుంటారోనన్న వర్రీలో వున్నాను. అందువల్ల హడావుడిగా ఆఫీస్ కు వచ్చేశాను. అంతే జరిగింది."         అంకుల్ పగలబడి నవ్వాడు.         "ఓ పిచ్చమ్మాయీ! విన్నావా? ఇప్పుడేం చెబుతావ్? అంత కంగారైతే ఎలాగమ్మా? నువ్వు చాలా బోల్డు గరల్ వనుకున్నాను. పెళ్ళయాక ఇలా అయిపోయావేమిటి? అవునూ! మీ పెళ్ళయి సంవత్సరం అయింది కదూ?"         "ఐంది. మొన్న వారు మద్రాస్ కు వెళ్ళినరోజు సరిగ్గా సంవత్సరం పూర్తైంది."         "యూ మీన్ అది మీ పెళ్ళిరోజా?" బాస్ గుబురు కనుబొమలు ముడిపడ్డాయి.         "అంతేకాదు. నా పుట్టినరోజుకూడా" సాగదీస్తూ చెప్పిందామె.         "పుట్టినరోజు__పెళ్ళిరోజు! వాట ఏ కో ఇన్సి డెన్స్!"         "అయినా ఈయన నన్నిక్కడ వదిలేసి మద్రాస్ వెళ్ళిపోయారు అంకుల్!"         సుధా తన మనసులో వున్న బరువును దించేసుకుంది.         "నీ పుట్టినరోజూ__పెళ్ళిరోజూ ముఖ్యమా? నా ఆఫీస్ పని ముఖ్యమా? ఏదో కొంప మునిగిపోయినట్టు ఏడుపు ముఖం పెట్టుకొని కంప్లయింట్ చేస్తున్నావ్!" కృష్ణ గొంతు పరుషంగా వుంది.      "స్టాపిట్ కృష్ణా! ఏది ముఖ్యమో కాదో నీకు తెలియదు. యూ ఫూలిష్ బాయ్. ఆరోజే మద్రాస్ వెళ్ళకపోతే ఏమైంది? ఇలాంటి సందర్భం అని నాతో ఎందుకు చెప్పలేదు?"
24,543
     రాత్రి తొమ్మిదవుతున్నా గోపాలరావు ఇంటికి రాలేదు.     "ఏం-వీడింకా రాలేదు. ఎంతసేపు రాకుంటే అంత మంచిది" అంటూ కాంచనమాల టీవీ ముందు కూర్చుంది. ఆమె మనసులో భర్తను వాడూ వీడూ అనే అనుకుంటుంది. ఫ్యాన్ వేసుకోబోయి మళ్ళీ కరెంటు ఛార్జీ పెరగడం గుర్తొచ్చి ఆ పని మానుకుంది.     ప్రభుత్వమంటే మొగుడిలాగా మన కనీస సుఖాలను హరించేది అని మనసులో కసిగా అనుకుని కూర్చుంది. అప్పుడు వార్తల టైమ్ కాబట్టి ఏదీ ఇంట్రెస్టింగ్ గా అనిపించక టీవీ ఆఫ్ చేసింది.     మానసకోసం చూసింది. హాల్లోనూ లేదు. ముందు వరండాలోనూ లేదు. ఎక్కడికెళ్ళింది? బాత్ రూమ్ లో దూరి సురేష్ వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ, ఊహించుకుంటూ వుంటుంది కాబోలు.     మరి మనమిక డిస్ట్రబ్ చేయటం ఎందుకని తన గదిలోకి వచ్చింది. చేతికొచ్చిన మ్యాగజైన్ ఒకటి తీసుకుని చదవడం ప్రారంభించింది.     భర్త వచ్చేవరకూ అలా ఏదన్నా పుస్తకం చదవడమో, టీవీ చూడడమో ఆమెకి అలవాటు.     గోపాలరావు ఎప్పుడో తప్ప తొందరగా యింటికి రాడు. అతనికి డబ్బుయావ. అది కూడా అతను కేవలం పెళ్ళాం కోసమే సంపాదిస్తున్నాడు. ఇదివరకయితే ఇలా సంపాదన మీద పిచ్చిలేదు. కాంచనమాలను రెండో పెళ్ళి చేసుకున్నాక డబ్బుపిచ్చి పట్టుకుంది.     దీనికి కారణముంది. రెండో భార్యని గ్రిప్ లో వుంచుకోవాలంటే, డబ్బు ఒక్కటే మార్గం అనిపించింది. ఇక అప్పట్నుంచీ కష్టపడటం ప్రారంభించాడు.     అవును-కాంచనమాల గోపాలరావు రెండో భార్య. గోపాలరావుకు ఇరవై రెండేళ్ళు వచ్చేటప్పటికి శ్రీనివాసరావు పెళ్ళిచేశాడు. అప్పటికీ అతను ఇంటర్ పాసై ఆపైన చదవడం ఇష్టం లేక ఇంట్లో వుండిపోయాడు.     "మరిక చదువూలేదు చట్టుబండలూలేదు - పెళ్ళి చేసుకుని తగలడు" అని శ్రీనివాసరావు సంబంధాలు చూడటం మొదలుపెట్టాడు.     చివరికి నగరి పక్కనున్న పల్లెటూరిలో సంబంధం కుదిరింది. అమ్మాయి పేరు జయంతి. ఛాయ కాస్తంత తక్కువైన కళగలిగిన ముఖం గోపాల్ కి బాగా నచ్చింది.     ఆమెతో పెళ్ళయిపోయింది.     వ్యవసాయం చేసుకుంటూ కొత్తపెళ్ళాంతో హ్యాపీగా కాలక్షేపం చేస్తూ గడిపేస్తున్నాడు.     అతనికీ, మానసకీ మధ్య పదిహేనేళ్ళు తారతమ్యం వుంది. అప్పటికి అది చిన్నపిల్ల.     "చిన్నవయసు- ఇప్పుడే పిల్లలొద్దు" అని భార్యాభర్తలు ఇరువురూ నిర్ణయించుకోవటం వల్ల ఆ బాధలు కూడా అతనికి ఏమీ తగల్లేదు.     మరో అయిదేళ్ళు గడిచాయి. గోపాలరావుకు ఇరవై ఎనిమిదేళ్ళు వచ్చాయి. యిక సంతానం కలిగినా ఫరవాలేదనుకుని కుటుంబనియంత్రణ పద్ధతులన్నిటికీ స్వస్తిచెప్పాడు. కానీ అదేం ఖర్మో జయంతకి నెల తప్పలేదు. రెండేళ్ళు పూర్తికావడంతో ఆందోళన ప్రారంభమైంది.     గుడులూ గోపురాలూ తిరగటం ప్రారంభించారు. ఏళ్ళు గడుస్తున్నా జయంతి గర్భవతి కాలేదు.     అప్పుడు మందులూ మాకులూ తినడం ప్రారంభించారు. ఒకరోజు ఏదోపేరు చెప్పుకుంటూ ఓ స్వామి ఆ ఊరొచ్చాడు. పెద్దపార్టీ అని తెలియటంతో ఆయన సరాసరి గోపాలరావు ఇంట్లో దిగాడు.     భార్యాభర్తలిద్దర్నీ చూశాడు. ఏవేవో దోషాలపేర్లు చెప్పాడు. శాంతులు చేశాడు. వెళుతూ వెళుతూ ఏదో మందు జయంతికిచ్చాడు. పదిహేను రోజులపాటు తానిచ్చిన భస్మాన్ని తేనెలో రంగరించుకుని తినమన్నాడు. ఆమెకు సంతానం తప్పదన్నాడు.     ఆమె అలాగే తిన్నది. మరి ఆ మందువల్లో లేక సహజంగానే వచ్చిందో తెలియదుగాని ఆమెకు ఏదో తెలియని జబ్బుచేసింది. డాక్టర్లు జబ్బు ఇదీ అని తేల్చేలోపు ఆమె చనిపోయింది.    భార్య చనిపోవడం అష్టకష్టాలలో ఒకటిగా ఎందుకు చేర్చారో అర్ధమైంది గోపాలరావుకి.     ఆ విషాదంలోంచి బయటపడడానికి చాలాకాలమే పట్టింది తనకి. భార్యపోయిన ఆరు నెలలనుంచీ పోరుతున్నా రెండోపెళ్ళికి నాలుగేళ్ళ తరువాతగానీ ఒప్పుకోలేదు. తీరా ఒప్పుకున్నాక, కాంచనమాలను పెళ్ళిచూపుల్లో చూశాక కొత్తదిగులు పట్టుకుంది.     ఆమెకు ఇరవై రెండేళ్ళ వయసు. తనకేమో ముఫ్ఫై ఎనిమిది. పదిహేనేళ్ళ వయసు డిఫరెన్స్.     అదీగాక పొలంలో ఏపుగా పెరిగిన జొన్నమొక్కలా వున్న ఆమెను తన కంట్రోల్లో వుంచుకోగలనా అన్న సమస్య పట్టుకుంది. అయితే అంత వయసువల్ల, గడించిన అనుభవం చూపిన జీవితంవల్ల ఏదోవిధంగా మేనేజ్ చెయ్యొచ్చులే అని తనకుతనే సర్దిచెప్పుకున్నాడు. స్నేహితులు, బంధువులు చేసుకోమని ఒత్తిడి చేశారు.     మొదట అతను వేసుకున్న ప్లాన్ ఇద్దర్నో, ముగ్గుర్నో పిల్లల్ని కనడం. పిల్లలు పుట్టుకొచ్చేకొద్దీ అమ్మాయిలో మిగిలిన అనుభూతులు చచ్చిపోతాయనీ, లేని వయసు మీద పడుతుందని తెలుసు. అందుకే మొదటి పెళ్ళాం దగ్గర మొదట్లో పాటించినట్లు కుటుంబనియంత్రణ పద్ధతులేమీ పాటించలేదు.     సంవత్సరం తిరక్కమునుపే కాంచనమాల నెలతప్పింది. తను అనుకున్నట్టే జరగడం- ఇంత కాలానికి తండ్రి కాబోతున్న ఆనందం రెండూ అతన్ని ఊపేశాయి.     కాంచనమాల ఆడపిల్లను కన్నది.     ఆడపిల్ల కావడం కొంత నిరుత్సాహం కలిగించినా అదీ ఒకందుకు మంచిదనుకున్నాడు. మగపిల్లాడు పుట్టేవరకు పిల్లల్ని కంటూనే వుండచ్చు.     కానీ అతని అంచనా తప్పయింది.     "ఇక చాలు- ఆపరేషన్ చేయించుకుంటాను" అంది.     అతనూహించలేదు. షాక్ కొట్టినట్టు గిలగిల్లాడాడు.     "ఒక్కబిడ్డకే!" తేరుకున్నాక అన్నాడు.     "ఏం ఒక్కబిడ్డ చాలదా-దేశ జనాభా ఎంతనుకున్నారు? తొంభై దాటింది. ఎక్కడపడ్డా క్యూలు. మన దేశమంటే మనకే అసహ్యం కలగడంలేదూ? అందువల్లే వద్దు."     తను ఊహించినదానికంటేనూ - తనకు తెలిసిందానికంటేనూ ఆమె తెలివయినదన్న విషయం అర్ధమైంది. మరో మాట మాట్లాడటానికి చాలాసేపు ఆలోచించాల్సి వచ్చింది. "మగపిల్లాడైతే...." అంటూ గొణిగాడు.     "ఏం ఆడపిల్ల బిడ్డగాదూ- అలా అనుకుంటూ మగపిల్లల్నే కంటే నిన్ను కనడానికి మీ అమ్మ వుండివుండదు. నిన్ను చేసుకోవడానికి నేనూ ఉండను. మితిమీరిన అహంభావం వున్నవాళ్ళే మగపిల్లాడికోసం పిల్లల్ని కంటూ వుంటారని నా నమ్మకం."     తలతిరిగింది అతనికి. ఏమీ మాట్లాడలేకపోయాడు.
24,544
       "ఇటు రండి" సౌదామిని గొంతు.          ఒక్కసారిగా సంతోషం ముంచుకొచ్చింది అతనికి.          "సౌదామినీ!" అన్నాడు ఆర్ద్రంగా అప్రయత్నంగా అతని చేతులు ఆమె భుజాల చుట్టూ బిగుసుకుపోయాయి.          "అందరూ చూస్తున్నారు" అంది సౌదామిని యిబ్బందిగా.          ఆమెను గాఢంగా ఊపిరాడనంత బిగువుగా కౌగిలించుకొని, "ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ" అని అంతులేనన్నిసార్లు కలవరిస్తున్నట్లు చెప్పాలని అన్పిస్తూన్నా అప్పుడప్పుడే చీకటికి అలవాటు పడుతున్న కళ్ళకు చుట్టూవున్న మనుషులు కనబడి, ఆ కోర్కెను బలవంతంగా ఆపుకున్నాడు.          సున్నితమైన చేతులు అతన్ని గ్రీన్ రూంలోకి నడిపించుకెళ్ళాయి. గ్రీన్ రూం తలుపు వేసేశాడు బాలు.          "సౌదామినీ!"          తన పక్కటెముకలు విరిగిపోతాయేమో ననిపించింది సౌదామినికి.          నెమ్మదిగా అతని కౌగిలి వదిలించుకుని అంది, "వీణకి మీరు పెట్టిన అరేంజ్ మెంట్ వల్ల షాక్ తగలదు. ప్రాణం పోయేంత షాక్ తగలాలంటే వేరే పద్దతి వుంది. వైర్లని..." తన పెదిమలతో ఆమె నోటిని మూసేశాడు బాలూ. "సౌదామినీ!" అతని పిలుపు ఆమె చెవులకు వినబడటంలేదు. పెదిమలకు మధురంగా తాకుతోంది. మళ్ళీ పట్టు వదిలించుకుంది సౌదామిని.          "మీకు సరిగా చేతకాలేదని ఈసారి ఏర్పాట్లు నేనే చేశాను నా ప్రాణాలు పోవడానికి".          "నన్ను క్షమించడానికి వీలవుతుందా సౌదామినీ!" అన్నాడు బాలూ బొంగురుపోతున్న గొంతుతో.          కళ్ళెత్తి అతని మొహంలోకి సూటిగా చూసింది సౌదామిని. "ఎందుకూ క్షమించండి ఎందుకంత పెద్ద పెద్ద మాటలు! మీరేం తప్పు చేశారనీ! అనుమానించి అవమానించడం మగవాళ్ళ జన్మహక్కు కదా!"          "నువ్వు చాలా కోపంగా వున్నావు సౌదామినీ! నేను రాక్షసుడిలా ప్రవర్తించాను. నిజమే! దానికి ప్రాయశ్చిత్తంగా నాకు నేనే ఘోరమైన శిక్ష విధించుకోనా!"          "వద్దు. మీకేమన్నా అయితే నాతోబాటు జానకి కూడా విలవిల్లాడి పోతుంది".          కప్పు విరిగి తన నెత్తిమీదే కూలిపోయినట్లు అనిపించింది బాలూకి. నేల చీలి తను అధఃపాతాళంలోకి కూరుకుపోతున్నట్లు అనిపించింది ఏమిటి? ఏమంటోంది సౌదామిని!          ఏదో అడగడానికి నోరు తెరిచాడు అతను. పెదిమలు అల్లల్లాడుతున్నాయి కానీ మాటలు బయటకు రావడం లేదు. స్వేదంతో షర్టు తడిసిపోతోంది.          "సౌ...దా....మి....నీ....!" అన్నాడు అతి ప్రయత్నం మీద సంతోషంలేని చిరునవ్వు నవ్వింది సౌదామిని.          "జానకితో మీ పరిచయం చనువుగా, చనువు అతి చనువుగా మారటం నాకెలా తెలిసిందని ఆశ్చర్యపడుతున్నారా! అతి రహస్యం ఎప్పుడూ బట్టబయలే అవుతుంది బాలూ! ఇలాంటి విషయాల్లో మరీ ముఖ్యంగా! నాకు బాగా తెలుసు".          "ఏం తెలుసు సౌదామినీ" అన్నాడు బాలూ హీనస్వరంతో.          "జరగవలసిన చెడు అంతా జరిగిపోయిందని నాకు తెలుసు బాలూ! మీరు తప్పుచేసి తప్పించుకు తిరగడమేకాక, అలాంటి తప్పే నేను చేశానని వూహించుకుని చంపుకు తిన్నారు! చంపి పారేద్దామని చూశారు. ప్రయత్నాలు చేశారు...."          తల వంచుకున్నాడు బాలు.          "జానకితో" మీకు వున్న సంబంధం నాకు ఎప్పుడు తెలిసింది-ఎలా తెలిసింది-అని మీరు అడగకండి. నేను నా నోటితో చెప్పలేను. అసహ్యకరమైన వివరాలు అవి, ఇకపొత౫హె ఆంజనేయులుతో నాకు వున్న సంబంధం ....ఏమిటంటే..." పెదిమలు కొరుక్కుంటూ దుఃఖాన్ని కంట్రోల్ లోకి తెచ్చుకుంది సౌదామిని. "వాడు నన్ను బ్లాక్ మెయిల్ చెయ్యడం మొదలెట్టాడు".          "బ్లాక్ మెయిలా! ఏమని?" విస్తుబోయి అడిగాడు.          "మీరు చేసిన తప్పుకి నాకు శిక్ష! మీరు జానకితో కలిసి ఉండగా ఫోటోలు తీశాడు ఆంజనేయులు. వేలకువేలు గుమ్మరించకపోతే ఆ ఫోటోలు బయట పెడతానని బెదిరించేవాడు" ఆమె ఆగి నెమ్మదిగా చెప్పింది. "బయటపడితే ఏమవుతుంది బాలూ! మీ భవిష్యత్తు బూడిదైపోతుంది. ఇంత కష్టపడి మీరు తెచ్చుకున్న పేరు ప్రఖ్యాతలు మంటగలిసి పోతాయి. మీకో చెడ్డపేరు వస్తే ఎవరికి బాధ! నాకే కదా! మీ మీద నాకు వున్న వెర్రి ప్రేమను అలా ఎక్స్ ప్లాయింట్ చేశాడు ఆంజనేయులు... అందుకే వాడు అడిగినప్పుడల్లా పదివేలు, పదివేలు చొప్పున యిచ్చాను. ఒక అబద్దాన్ని కవర్ చేసుకోవడానికి ఇంకో అబద్దం చెబుతూ నరకం అనుభవించాను బాలూ! ప్రత్యక్ష నరకం అనుభవించాను. మీకు జానకితో చనువు రోజు రోజుకీ పెరిగిపోతుంటే నా మనసు మసిలిపోయేది. ఆ రహస్యాన్ని ఆధారం చేసుకుని ఆంజనేయులు నన్ను బెదిరిస్తూంటే గుండె మండిపోయేది. వాడికి డబ్బు ఇవ్వడం కోసం అబద్దాలాడటం చిన్నప్పటినుండీ అలవాటులేదు బాలూ ఎప్పుడూ కూడా!" సౌదామిని గొంతు వణికింది. "అయినా మీతోనే అబద్దాలు చెప్పాను బాలూ! మీ కోసం రహస్యంగా ఆంజనేయులు వచ్చిపోతూ వుంటుంటే మీకు అనుమానం వచ్చేసింది. ఇంకేముంది! నన్ను చంపితే కానీ కసి తీరదనుకున్నారు. రకరకాల ప్లానులు వేశారు. కానీ, మీకు తెలుసా బాలూ! మీ ప్లాన్ లు విజయవంతం కావాలని మీకంటే ఎక్కువగా కోరుకున్నది నేనని. ప్రియుడే ప్రాణాలు తియ్యాలని నిశ్చయించుకున్న తర్వాత యింక నాకు బ్రతుకుమీద ఇంట్రెస్ట్ ఎందుకు వుంటుంది బాలూ!"          దుఃఖం ఆపుకోలేక సౌదామిని చేతులు తన చేతుల్లోకి తీసుకుని వాటిల్లో మొహం దాచుకున్నాడు బాలూ! గాద్గదికంగా అన్నాడు.          "అడగటానికి సిగ్గుగా వుంది సౌదామినీ! నన్ను క్షమించమని అడిగే అర్హతకూడా నాకు లేదని తెలుసు! అయినా అడుగుతున్నాను. కాదు చేతులు జోడించి ప్రార్ధిస్తున్నాను. నన్ను క్షమించగలవా సౌదామినీ!"          మరుక్షణం ఆమె అతని కౌగిలిలో వుంది.          "ఈ క్షణం మళ్ళీ రాదేమోనని ఎంత దిగులుపడ్డానో తెలుసా?" అంది సౌదామిని అస్పష్టంగా.          "నేను మరీ దారుణంగా ప్రవర్తించాను కదూ!"    "లేదు! లేదు!" అంది. కానీ సౌదామిని మొహంలో విచారం ఇంకా తొలిగిపోలేదు. కాసేపు ఆగి మళ్ళీ అన్నది తను.          "ఒక పనిచేద్దామా!"    "ఏమిటి?"          "జరిగినదంతా ఒక పీడకల అనుకుందాం. దాన్ని ఇప్పుడే యిక్కడే మర్చిపోదాం. ఇంకెప్పుడూ దాన్ని గుర్తుంచుకోకూడదు మనం. దాన్ని గురించి ఇంకెప్పుడూ మాట్లాడుకోవద్దు. ఇంకెప్పుడూ ఇలా జరగాకూడదు. ఇది మన అగ్రిమెంటే సరేనా?"          "థాంక్స్ మై డియరెస్ట్ సౌదామినీ!" అన్నాడు బాలూ.          ప్రక్షాళితమైన అతని మనసే ఒక మందిరంగా మారగా అందులో అధిష్టాన దేవతగా సౌదామినిని తిరిగి పునః ప్రతిష్ట చేసుకున్నాడు.          అప్పుడు చటుక్కున అడిగింది సౌదామిని "బాబు! బాబు ఏడీ?" మనసులో మరోసారి బాధ సుళ్ళు తిరిగింది. బాబు! ఎవరి బాబు?          సౌదామిని కడుపునా పుట్టిన బిడ్డ కళ్ళు తెరవకముందే కన్ను మూశాడని, ఇప్పుడు తన కొడుకుగా పెరుగుతున్నది ఏ తల్లి కన్న బిడ్డో తనకే తెలియదనీ సౌదామినికి చెప్పాలా వద్దా!          తన అనుమానంతో యిప్పటికే ఆమెకి గుండెకోత కలిగించాడు. ఇప్పుడీ విషయం కూడా చెప్పి కడుపుకోత కూడా కలిగించాలా! కానీ తప్పదు.          తను రాక్షసుడిలా ఎలా మారాడో ఎందుకు మారాడో సౌదామినికి తెలియాలంటే ఆంజనేయులూ, మృదులా, జానకీ తదితర బృందం అంతా కలిసి ఆడిన నాటకం అంతా వివరంగా చెప్పాలి. వివరంగా చెబితే బాబు తను కొడుకు కాదన్న విషయం కూడా బయటికి వస్తుంది.          అయినా చెప్పక తప్పదు. చెప్పడం తమ ధర్మం సౌదామినిని చీకట్లో ఉంచడం తనకు నచ్చదు.          అతను ఒక్కొక్క సంగతీ చెబుతుంటే స్థంభించిపోయి విన్నది సౌదామిని. చివరికి బాబు విషయం కూడా చెప్పి, "మృతశిశువు అని చెప్పింది ఆ రాక్షసి! కానీ నా ఉద్దేశ్యం, నీకు అబార్షన్ చేసి, ఏడు నెలల గర్భస్థ శిశువుని చంపేసి వుంటారు. అంతటి నరరూప రాక్షసులే వాళ్ళు తరువాత ఇంకొక బిడ్డని తెచ్చి పడుకోబెట్టారు".          బాబు తన కొడుకు కాదని తెలియగానే ఆమె షాకైపోతుందేమో అనుకున్నాడు బాలూ అందుకు విరుద్దంగా చిరునవ్వు నవ్వింది సౌదామిని. "చూశారా ఎంత చిత్రమో! అంతా ఊహలో ఉందన్నమాట అన్నాళ్ళనుంచి వాడు నా కొడుకనుకుంటే కొడుకయ్యాడు. ఇప్పుడు కాదనుకుంటే కొడుకు కాకుండా పోతాడు. కానీ ఎలా అనుకోగలను అలా! వాడు నేను కన్నకొడుకు కాకపోవచ్చు. కానీ ఈ చేతులతో పెంచిన కొడుకండీ! ఇప్పుడు మన అగ్రిమెంటులో యింకొక క్లాజు.... బాబు మన కొడుకు కాదని ఇంకెప్పుడూ తల్చుకోకూడదు. అలా అని చెయ్యండి ప్రామిస్.." అంది చెయ్యి జాస్తూ.          "ప్రామిస్!" అన్నాడు బాలూ ఆ చేతిని తన పెదవులకు రాసుకుంటూ ఆ రోజు ప్రోగ్రాం అద్భుతంగా జరిగింది.          ఆటోగ్రాఫులిచ్చి కారు దగ్గరికి వచ్చారు. డోర్ తెరవబోతూ ఇదేమిటి? అన్నట్టు ఆశ్చర్యంగా చూసింది.          కారు విండో స్క్రీన్ మీద, వైపర్ కింద పెట్టి ఉంది ఒక ఉత్తరం. తీసి చదవటం మొదలెట్టింది సౌదామిని.          "సౌదామినీ!          నేను ఆడించిన నాటకం చివరి అంకంలో రసాభాస అయిపోయిందని నీకు తెలుసా తల్లీ? సంతోషిస్తున్నావా అమ్మా?          వద్దమ్మా, అంత ఆనందం వద్దు.          ఇతరులు...ముఖ్యంగా తననుంచి దూరమైన వాళ్ళు- అంత ఆనందంగా వుండటాన్ని ఈ బ్రహ్మానంద కలలో కూడా ఊహించలేడన్న విషయం నీకు తెలుసుగా తల్లీ.          ఇప్పుడు నీతో ఇక కొత్తరకం కొరియన్ గేమ్ ఆడదల్చుకున్నాను. నీ కొడుకుని నాతోపాటు తీసుకెళ్తున్నాను. నేనాడేగేమ్ లో అతి మొదటి ఎత్తు నీ భర్త. నికృష్టుడు. కాల్ గ్యాస్ తో, కుక్కగొడుగులతో, వీణతీగెల్తో-ఇలా రకరకాలుగా నిన్ను చంపాలనుకున్నవాడు.          అటువంటి వాడితో కలిసివుంటావో- నా దగ్గరికి తిరిగి వచ్చేస్తావో నువ్వే ఆలోచించుకో. ఇదే నీ జీవితపు చివరి ఎత్తు అనుకో వచ్చేస్తే నా కోట తలుపులు నీకు స్వాగతం పలుకుతాయి. లేదూ, పతికి పతియే ప్రత్యక్షదైవం అనే మూఢాచారంలో వుండదల్చుకుంటే.....క్షమించు తల్లీ! నీ కొడుకు నా దగ్గరే వుంటాడు.          చిలుక చచ్చిపోయిందమ్మా! నాకూ ఏమీ తోచటంలేదు. పంజరం ఖాళీగా వుంది. నీ కొడుకును అందులో పెంచుతాను.          అదిష్టం లేదంటే నువ్వు నాతో నిజంగా కొరియన్ గేమ్ ఆడాలి. అటో ఇటో తేల్చుకుందాం- నీ ... నాన్న          ఉత్తరం చదివిన బాలూ మొహం వాడిపోయింది.          తన స్వరూపానికి అద్దంలా వుంది ఆ ఉత్తరం. అయినా ఇప్పుడు అదికాదు సమస్య. తమ కొడుకు ప్రాణాపాయంలో వున్నాడు.          "నేను వెళతాను" అంది సౌదామిని ఒక నిర్ణయానికి వచ్చినదాన్లా-
24,545
    ఎప్పుడో ఒకప్పుడు ప్రతివాడూ తను ఫూలిష్ గా ప్రవర్తించాననో తనొక ఫూల్ అనో అనుకుంటాడు. కాని పిచ్చిగా ప్రవర్తించాననిమాత్రం అనుకోడు. వాస్తవాన్ని ఎన్నోసార్లుపిచ్చిగా ప్రవర్తిస్తాడు. ఆ సంగతి తెలుసుకొన్నాబయటికి ఒప్పుకోడు. పిచ్చివాడికీ మంచివాడుగా కన్పించేవాడికీ ఉండేతేడా అతి స్వల్పం. పిచ్చివాడికి తనుపిచ్చిగా ప్రవర్తిస్తున్నాననే విచక్షణా జ్ఞానం ఉండదు. మామూలువాడికి ఆ ఉద్రేకం చల్లారగానే విచక్షణా జ్ఞానం ఉండదు. మామూలువాడికి ఆ ఉద్రేకం చల్లారగానే విచక్షణా జ్ఞానం ఏర్పడుతుంది. తనప్రవర్తన గురించి ఆలోచిస్తాడు. ఆ విచక్షణా జ్ఞానం, పిచ్చివాడిగా ముద్రవెయ్యబడినవాడిలో ఎందుకు పని చెయ్యడం లేదో శోధించి తెలుసుకోవలసిన బాధ్యత సైకియాట్రిస్టుకుంది. శరీరం గాయపడుతుంది. మనసూ గాయపడుతుంది. శరీరం మీద గాయం గురించి మనకు వివరాలు తెలుస్తాయి. మనసు గాయం కన్పించదు. మనసు ఎప్పుడు, ఎందుకు గాయపడిందో తెలుసుకోవడంచాలా కష్టం. అందుకే సైకియాట్రిస్టు చాలా జాగ్రత్తగా వ్యాధిగ్రస్తుని లక్షణాలను పరిశీలించాలి. ఈ అధ్యయనంవల్ల కొంతవరకే ఆ వ్యాధి అర్ధమవుతుంది. అందుకే వ్యాధి గ్రస్తుని గత చరిత్ర తెలుసుకోవాల్సినఅవసరం ఏర్పడుతుంది. అతడు గర్భస్థ శిశువుగా వున్నప్పటినుంచీ, ఆ ఇంటి పరిస్థితులనూ, ఆ తల్లి మానసికస్థితినీ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ వ్యాధిలక్షణాలు ఎ వయసులో, ఏ పరిస్థితుల్లో బయటపడిందీ అధ్యయనం చెయ్యాల్సి ఉంటుంది. అతని కుటుంబచరిత్రా, అతని జీవనవిధానం క్షున్నంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. మనసు గాయపడుతుంది. అది ఎప్పుడు గాయపడిందో ఒకోసారి ఆ మనసుకే తెలియదు. ఉన్మాదస్థాయికి చేరినఎన్నో కేసులు నయంకావడం లేదంటే ఆ లోపం డాక్టర్లదే. మందులు వాడటంలోచూపే శ్రద్ద పేషెంట్ చరిత్రమీద, అతడిచుట్టూ అల్లుకొన్నసాంఘిక, ఆర్ధిక, కుటుంబపరిస్థితులను అధ్యయనంచేయడం మీదలేకపోవటం వల్లనేవ్యాధి నయం కాదు. ఒక మానసిక రోగిని సంపూర్ణ మానసిక ఆరోగ్యవంతుడిగా చెయ్యాలంటే సైకియాట్రిస్టుకు ఎంతో ఓర్పూ, దీక్షా ఉండాలి" ఆగి మహాతిని చూశాడు ప్రొఫెసర్.     "ఇప్పుడర్ధమైంది అంకుల్, మీరెంత శ్రమపడ్డారో? నా మీదున్న ప్రేమాభిమానాలతో..." మహతి కళ్ళు చెమ్మగిల్లాయి. కంఠం గాద్గదికం అయింది. "నిజం చెప్పాలంటే ప్రతి కేసులో అంతశ్రమ అవసరమే. కానిఅంత టైం స్పేర్ చెయ్యలేకపోతున్నందుకు ఎంతోబాదపడుతుంటాను. అందువల్లనే తిరిగితిరిగి అవే కేసులు రిలాప్స్ అయి మళ్ళీ వస్తుంటాయి" ప్రొఫెసర్ బాధగా అన్నాడు. "అంకుల్, మీకు విసుగు కలిగిస్తున్నానేమో? రెండు సందేహాలు..." సందేహిస్తూ అంది. "ఊ( సందేహమెందుకు? అడుగు" ప్రొఫెసర్ పైపు వెలిగించడానికి అగ్గిపెట్టె వెతుక్కుంటూఅన్నాడు. "రవి చిన్నప్పుడు ఆయా పాలివగానే నిద్రవచ్చేదన్నాడు. ఇందులో విశేషమేముంది? పాలు తాగ్గానే పసిపిల్లలు మామూలుగానే నిద్రపోతారుగా?" "మరీ పసిబిడ్డలుగా ఉన్నప్పుడైతే పాలు తాగ్గానే పిల్లలు నిద్రపోతారు. కాని, రవికి అప్పుడుమూడు నాలుగేళ్ళుంటాయి. ఆ వయసులో పాలుతాగ్గానే పిల్లలునిద్రపోరు. ఉత్సాహంగా అడుకొంటారు. అలా ఆడుకోవాలని తనకుండేదనీ, కాని పాలు తాగ్గానే తనకు నిద్ర ముంచుకొచ్చేదనీ చెప్పాడు గుర్తుందా?" "అవును అంకుల్ అలాగే చెప్పాడు" మహతి గుర్తు చేసుకొంటూ అంది. "ఎందువల్లనో తెలుసా?" ఆమె తల అడ్డంగా తిప్పింది. "పాలల్లో నల్లమందు కలిపి ఇచ్చేది నాంచారమ్మ" "అదెవరు అంకుల్?" "ఆయా పేరు నాంచారమ్మ" "ఊ(! చెప్పండి అంకుల్!" "అనారోగ్యంగా ఉన్న తల్లి బిడ్డను పెంచలేక ఆయాకు అప్పగించింది. నాంచారమ్మ పాలల్లో నల్లమందు కలిపిచ్చిబిడ్డను నిద్రపుచ్చి, తనూ నిద్రపోయేది హాయిగా" "డాక్టర్ గౌతమ్ రాజ్యలక్ష్మికి మానసిక ఉల్లాసం కలిగించడంకోసం, క్లబ్బులకూ, సినిమాలకూ, పిక్ నిక్ లకూ తీసుకువెళ్ళేవాడు. అది ట్రీట్ మెంట్ లో ఒక భాగంగానే చేశాడు. వంటరిగా ఎక్కువసేపు గడిపినప్పుడు ఆమెలో ఆత్మహత్య చేసుకోవాలనే భావన(సూయిసైడల్ టెండెన్సీ) తల ఎత్తేది. అందుకే వీలయినంతసేపు ఆమెను తనతోటే తిప్పుకొనేవాడు. పైగా అతడి సమక్షంలో రాజ్యలక్ష్మి తనకుభద్రత ఉన్నట్లుగా భావించి నార్మల్ గా ఉండేది. చిన్నతనంలోనే నల్ల మందుకు అలవాటుపడిన రవికిరణ్ మస్తిష్కందెబ్బతిన్నది. గర్భస్థశిశువుగా ఉన్నప్పుడే తల్లిలో ప్రకోపించినమానసిక అలజడి వత్తిడికి గురి అయ్యాడు. తర్వాత నల్లమందు ప్రభావం, ఆ తర్వాత తల్లిదండ్రుల ఘర్షణ, ఇలా ఒకదాని తరువాత మరొకటి రావడంతో అతని మనోఫలకంనెర్రెలు వారింది. చిన్నారిమనసు చిందరవందరైంది. ఆ తర్వాత మాతామహుడైన తాతయ్యా, నాయనమ్మలు అతడి మనసు ఎలాచీల్చారో స్వయంగా విన్నావుగా?" రవికిరణ్ కు పదిపన్నెండేళ్ళు వచ్చేసరికి ఆ ముసలివాళ్ళ ఇన్ ఫ్లుయన్స్ నుంచి బయట పడటం జరిగిపోయింది. ఆ బాధామయ గాధల ప్రబావం అతని అవచేతన మనసులో, అట్టడుగు పొరల్లో చోటుచేసుకొని పదిలంగా ఉండిపోయింది. యవ్వనదశ ప్రారంభంఅయేసరికి, అతడి వ్యక్తిత్వం రెండుగా చీలిపోయి సహజీవనం చేస్తూ వచ్చింది. నీ పరిచయంతో అది బయటికొచ్చాయి. నీ ప్రేమలో ఆ వ్యక్తిత్వాలు ఉత్తేజితం అయ్యాయి. రవిగానూ, కిరణ్ గానూ, విభిన్న మానసిక ప్రవృత్తులతో, హావభావాలతో నీ ముందు సాక్షాత్కరించాయి. వాటి వాడీ వేడీ నువు కళ్ళారా చూశావు, అనుభవించావు. నేను చేసిందల్లా నిన్ను కేంద్రంగా పెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటిగా తిరుగుతున్న ఆ రవి-కిరణ్ వ్యక్తిత్వాలను ముఖాముఖిగా నిలబెట్టడంమాత్రమే. అలాసంఘర్షణకు ఆయత్తం చేశాను. పోరుకు ఉసికొల్పిచివరికి ఇద్దర్నీ నిరాయుధుల్ని చెయ్యడమే నా ధ్యేయం. నిరంతరం పోరాటంలో అలసిపోయిన ఆ వ్యక్తిత్వాలు రెండూ బలహీనమైన దశలో ఈ ఆఖరి ప్రయోగాన్ని చేశాను. దాని ఫలితమేమిటో నిముషాల్లోనో, క్షణాల్లోనో చూడబోతున్నావ్ మహతీ!"     ప్రొఫెసర్ ఆపి, అగ్గిపుల్ల వెలిగించి పైపులోని పొగాకు పొడి అంటించాడు. "అంకుల్, ఆ రాత్రి నన్ను నాగార్జునసాగర్ ఎందుకు తీసుకెళ్ళాడు! అప్పటి అతని ప్రవర్తన ఎంత ఆలోచించినా నాకు అర్ధం కావడం లేదు" మహతి అయోమయంగా చూస్తూ అడిగింది. "అతని సబ్ కాన్ షన్ లో అణిగి ఉన్న నిజాంసాగర్లో జరిగిన దుర్ఘటనలకు, అతడు అనుభావించిన మానసిక సంక్షోభాలకు బహిర్గాతమైన రూపాంతరాలే నాగార్జునసాగర్ వద్ద జరిగిన సంఘటనలు. అతడు వర్ణించి చెప్పిన సాగర్ సంఘటనను నాగార్జునసాగర్ లో జరిగిన సంఘటనతో పోల్చి చూడు. నీకే అర్ధం అవుతుంది". "అవునంకుల్----విజయపురిబంగళాలో ఉండగానే, రవి-కిరణ్-----ఒకరిమీద ఒకరు దూకారు. రవిని చంపుతానని వెర్రిగా తిరిగాడు. కిరణ్ . అతడికి చిక్కకుండా, అతడ్ని కవ్విస్తూ, ఉడికిస్తూ, కిరణ్ కు నిజంగానే వెర్రెక్కించాడు రవి. ఆ సంఘటనలు తల్చుకొంటే ఇప్పటికీ నా గుండెలో వణుకుపుట్టుకొస్తుంది అంకుల్. ఆ రాత్రి సాగర్ ఒడ్డున..." "ఒక్క నిముషం ఆగు. అతనులేచినట్టున్నాడు" అంటూ పరశురాం లేచినిలబడ్డాడు. మహతి అప్రయత్నంగానే చివ్వున లేచి నిలబడింది. తలతిప్పి చూసింది. మెల్లమెల్లగా తలుపుతెరుచుకొన్నాయి. అతఃడు అల్లనల్లన మెల్లగా వస్తున్నాడు. ఠీవిగా ఉన్నాడు. హుందాగా ఉన్నాడు. ముఖం ప్రశాంతంగా ఉంది. కళ్ళలో కాంతిరేఖలు కదిలిపోతున్నాయి. అతడ్ని అలా చూస్తూంటే ఆమెలో ఆనందం ఆర్ణవమైంది. హృదయం స్పందించింది. మధురమైన కోరికలెన్నో గుర్రాలై మనస్సులో పరుగులు తీశాయి. అమాంతంవెళ్ళి అతడ్ని ఆలింగనం చేసుకోవాలనిపిస్తోంది ఆమెకు. "రవికిరణ్! రా బాబూరా! ఇలా వచ్చి కూర్చో" ఆప్యాయంగా పలకరించాడు ప్రొఫెసర్. మహతి అతడ్ని చూస్తూ మంత్రముగ్ధలా నిలబడిపోయింది. ఆమెను ఆ స్థితిలో చూసి ముసిముసిగా నవ్వుకొన్నాడు పరశురాం. "మహతీ! రవికిరణ్ కు కాఫీ పట్టుకొస్తావా? నాక్కూడా ఓ కప్పు ఇఫ్ యూ డోన్ ట్ మైండ్..." "విత్ ప్లెజర్ అంకుల్" ఆమె కదిలింది. ఆరడుగులు వేసి ఏడో అడుగు వేస్తుండగా ఆమెకు వెనకనుంచి విన్పించింది---- "ఆమె ఎవరు?" ప్రొపెసర్ పరశురాం పెదవులమధ్యనుంచి పైపు కింద పడిపోయింది. "ఎక్కడో చూసిన గుర్తు!" మహతి ఏడో అడుగు భూమిలోకి కూరుకుపోయింది. వంగి కిందవున్న పైపును అందుకొని అగ్గిపెట్టెకోసం వెదుక్కున్నాడు ప్రొఫెసర్ పరశురాం.                ---సమాప్తం---   
24,546
                   జ్ఞాననందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం |                    ఆధారస్సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మమే ||                                              ఇరువది నాలుగవ అధ్యాయము 1.    అశ్వస్తూపరో గోమృగస్తే ప్రాజాపత్యాః కృష్ణగ్రీవ ఆగ్నేయా రరాటే పురస్తాత్సారాస్వతీ మేష్య దస్తాద్ధాన్వో రాశ్వినా వధో రామౌ బహ్వూఃసౌమా పౌష్ణః శ్యామో నాభ్యాం సౌర్య యామోశ్వేతశ్చ కృష్ణశ్చ పార్శ్వ యో స్త్వాష్ట్రౌ లోమసక్దౌ సక్థ్యోర్వాయవ్యః శ్వేతః పుచ్ఛఇన్ద్రాయ స్వపస్యాయ వేహ ద్వైష్ణవో వామనః||     (అశ్వమేధమున ఇరువది యొక్క యూపములుండును. మధ్య యూపమును 'అగిష్ఠము' అందురు.  దానికి పదిహేడు పశువులు కట్టబడును.)     అశ్వము, కొమ్ములు లేని మేక, గోవు ఇవి ప్రజాపతికి సంబంధించిన పశువులు. వానిని మధ్యయూపమునకు కట్టుచున్నాను. నలుపుగొంతు మేక అగ్ని సంబంధము. దానిని అశ్వపు ముఖము వద్ద కట్టుచున్నాను. మేక సరస్వతి సంబంధి దానిని ముందు కట్టుచున్నాను. తెలుపు, నలుపు, తెలుపు పశువులను గుర్రపు కుడి ఎడమ ప్రక్కల కట్టుచున్నాను. త్వష్ట యొక్క రెండు పశువులను గుర్రపు వెనుక కాళ్ళకు ఒక్కొక్కటి చొప్పున కట్టుచున్నాను. వాయుసంబంధి పశువును గుర్రపు తోకకు కట్టుచున్నాను. సుకర్మ ఇంద్రుని కొరకు కడుపుతోనున్న ఆవును - విష్ణువునకు పొట్టి పశువును గుర్రపు తోకకు కట్టుచున్నాను.     (ఇవి పదిహేను పశువులు. వీనిని 'పర్యంగ్య' అందురు. మిగత యూపములందు పదహారేసి పశువులు కట్టుదురు.)     2. లోహితము, ధూమ్ర లోహితము, రేగుపండు ఎరుపు ఇవి సోమదేవతా సంబంధములు. పసుపు పచ్చనిది, చిలక పచ్చనిది, అరుణ బభ్రు వరుణ దేవతాకములు. కృష్ణ ఛిద్రము - శితి ఛిద్రము, సర్వశితి ఛిద్రము, సవితా దేవతాకములు. నల్ల కాళ్ళది, శితి బాహువు, సర్వ శితి బాహువు బృహస్పతి దేవతాకము.     (వీనిని మధ్య యూపమున కట్టవలెను.)     విచిత్ర వర్ణ బిందు, లఘు బిందు, స్థూల బిందు గోవులు మిత్రా వరుణ దేవతాకములు.     (వీనిని రెండవ యూపమున కట్టవలెను.)     3. శుద్ధ వాలము, సర్వ శుద్ధ వాలము, మణి శుద్ధ వాల పశువుల అశ్వినీ దేవతాకములు శ్వేత, శ్వేత చక్షు అరుణ వర్ణ పశువులు పశుపతి రుద్ర దేవతాకములు. తెలుపు చెవులవి యమ సంబంధులు. గర్వయుక్త పశువులు రుద్ర సంబంధములు. నభోరూపలు పర్జన్య సంబంధులు.     (పశవః తృతీయ నియోజ్యాః)     4. విచిత్ర వర్ణలు, వంకర గీతలవి. ఎదురు గీతలు పశువులు మరుద్దేవతాకములు. చిక్కిన దేహములవి, రక్త రోమములవి, తెల్లని ఆడ పశువులు సరస్వతీ దేవతాకములు. ప్లీహ కర్ణలు, హ్రస్వ కర్ణలు, రక్త కర్ణ పశువులు త్వష్ట దేవతాకములు. నల్లని మెడ గల తెల్లని చంక గల, పుండ్ర జంఘ పశువులు, ఇంద్రాగ్ని దేవతాకములు. కృష్ణపుండ్ర, అల్పాపుండ్ర, అల్పాంజి, మహాంజి పశువులు ఉషా దేవతాకములు.     (చతుర్థే యూపే నియోజ్యాః)     5. విచిత్ర వర్ణలగు మూడు స్త్రీ పశువులు విశ్వే దేవతలవి. రెండున్నర ఏండ్ల ఎర్రని పశువులు వాగ్దేవతవి. విశేష చిహ్నములు లేని మూడు పశువులు అదితి దేవివి. సమాన వర్ణలగు మూడు పశువులు దాతా దేవతని. చిన్న మేకలు దేవ పత్నులవి.     (పంచమే)     6. నలుపు మెడ గల మూడు పశువులు అగ్ని దేవతవి. శ్వభ్రు వర్ణలు మూడు వసువులవి. ఎరుపు రంగు మూడు పశువులు రుద్రులవి. శ్వేత వర్ణ, అధోచ్ఛిద్రములు మూడు ఆదిత్యులవి. నభో రూపములు మూడు పర్జన్యునివి.     (షష్ఠే)     7. ఎత్తువియు, పొట్టివగు మూడు పశువులు ఇంద్ర, విష్ణువులవి. పూర్ణ శ్వేత బాహు, శ్వేత పుష్టములు ఇంద్ర - బృహస్పతులవి. చిలక పచ్చనివి మూడు అశ్వ దేవతవి. మట్టి రంగువి మూడు అగ్ని, మరుత్తులవి. నలుపు వర్ణపు మూడు పూష దేవతవి.     (సప్తమే)     8. కుర్వర వర్ణములగు మూడు పశువులు ఇంద్రాగ్నులవి. రెండు రంగుల మూడు అగ్ని - సోములవి. పొట్టి ఎద్దులు మూడు అగ్ని - విష్ణువులవి. వంధ్య మేషములు మూడు మిత్రా వరుణులవి. మట్టి రంగుని మూడు - వేరుగా- మిత్ర దేవతవి.     (అష్టమే)     9. నలుపు మెడల మూడు పశువులు అగ్ని సంబంధులు. పసుపు పచ్చని మూడు సోమ సంబంధులు. తెలుపు రంగువి మూడు వాయు సంబంధులు. చిహ్న రహితలు మూడు అదితి సంబంధులు. సమాన వర్ణలు మూడు ధాత సంబంధులు. మూడు చిన్న మేకలు దేవపత్ని సంబంధలు.     (తొమ్మిదవ యూపమున కట్టవలెను.)     10. మూడు నల్లని పశువులు భూమి దేవతాకములు. మూడు ధూమ్ర వర్ణలు అంతరిక్ష దేవతాకములు. మూడు పెద్ద పశువులు ద్యుదేవతాకములు. మూడు వివిధ వర్ణలు విద్యుద్దేవ తాకములు. మూడు సిధ్మరోగ పశువులు నక్షత్ర దేవతాకములు.     (పదవ యూపమునకు కట్టవలెను.)     11. ధూమ్ర మేషములు మూడింటిని వసంతమునకు బలిఇత్తుము. తెలుపు మేకలు మూడింటిణి గ్రీష్మ ఋతువునకు బలి ఇత్తుము. నలుపు మేకలు మూడింటిణి వర్ష ఋతువునకు బలి ఇత్తుము. ఎరుపు మేకలు మూడింటిని శరదృతువునకు బలి ఇత్తుము. మచ్చల మూడు మేకలను హేమంతమునకు బలి ఇత్తుము. పసుపు రంగు మూడు మేకలను శిశిరమునకు బలి సమర్పింతుము.     12. ఒకటిన్నర సంవత్సరముల మూడింటిని గాయత్రికి, రెండున్నర సంవత్సరముల మూడింటిని త్రిష్టుప్ నకు, రెండేళ్ళ మూడింటిని జగతికి, మూడేళ్ళ మూడింటిని అనుష్టుప్ నకు, మూడున్నర ఏండ్ల మూడింటిని ఉష్ణిక్ ఛందముల కొరకు బలి సమర్పింతుము.     13. నాలుగేండ్ల మూడింటిని  విరాట్ ఛందమునకు, మూడేండ్ల మూడు ఎద్దులను బృహతీ ఛందమునకు, మూడు వృషభములను కకుప్ ఛందమునకు, మూడు ఎద్దులను పంక్తి ఛందమునకు, మూడు గోవులను అతిచ్ఛందమునకు బలి అర్పింతుము.     14. మూడు నల్లని మెడ పశువులు అగ్ని దేవతాకములు. మూడు బభ్రు వర్ణలు సోమ దేవతాకములు. మూడు ధ్వస్త వర్ణలు సవితృ దేవతాకములు. మూడు వత్సతరములు సరస్వతీ దేవతాకములు. మూడు కృష్ణ వర్ణలు పూష దేవతాకములు. మూడు పృశ్ని వర్ణలు మరుద్దేవతాకములు. మూడు అనేక రూపాలు విశ్వే దేవతాకములు. మూడు గొడ్డు ఆవులు ద్యావాపృథ్వీ దేవతాకములు.     15. వరుణ ప్రఘాస పర్వపు పదిహేను పశువులు చెప్పబడినవి. మూడు కర్వర పశువులు ఇంద్రాగ్ని దేవతాకములు. మూడు కృష్ణ వర్ణ పశువులు వరుణ దేవతాకములు. మూడు చారల పశువులు మరుద్దేవతాకములు. మూడు కొమ్ములు లేని పశువులు ప్రజాపతి దేవతాకములు.     16.  (అథ సాకమేధ పశవః)         తొలి చూపు మూడు పశువులను సేనావాన్ అగ్ని కొరకు వధించవలెను. వాత్య పశువులను మూడింటిని సాంతపాన మరుత్తుల కొరకు, మూడు అప్పుడే పుట్టిన పశువులను గృహమేధి మరుత్తుల కొరకు, మూడు సంకల్పిత పశువులను క్రీడి మరుత్తుల కొరకు, మూడు విడి పశువులను స్తవవాన్ మరుత్తుల కొరకు వధించవలెను.     17.  పద్ధెనిమిదవ యూపపు హవియను పదిహేను పశువులు చెప్పబడినవి. పందొమ్మిదవ యూపమునకు మూడు కుర్వర వర్ణలు ఇంద్రాగ్నుల కొరకును, మూడు పెద్ద కొమ్మలవి మహేంద్ర దేవత కొరకును, అనేక వర్ణ పశువులు విశ్వ కర్మ కొరకును కట్టవలెను.     18. (పితరుల ఇష్టదేవతా పశువులు)     మూడు కృష్ణవర్ణ ధూమ్రములు సోమపాయి పితరులవి. మూడు పసుపు ధూమ్రములు దర్భాసన పితరులవి.     (ఇరువదవయూపమున)     కృష్ణ బభ్రువర్ణలు అగ్ని ష్వాత్త పితరులవి. మూడు నల్లని పృష్టము - చుక్కలు గలవి త్ర్యంబాకా దేవతాకములు.     19. (శునాసీరీయ పశవః)     అగ్ని మున్నగు వారికి సంబంధించిన పదిహేను పశువులు చెప్పబడినవి. మూడు కుర్వరపశువులు శునాసరీయములు.     (ఇరువది ఒకటవ యూపమున)     మూడు తెల్లని పశువులు వాయు దేవతాకములు. మూడు తెల్లనిచే సూర్యదేవతాకములు.     (ఏవం సమప్తాః యూపాః)     20.  (అథారణ్యాః పశవః ఉచ్యన్తే)     వసంతము కపింజలమును, గ్రీష్మమునకు కలర్వికమును, వర్షమునకు తిత్తిరులను, శరత్తుకు వర్తికమును, హేమంతమునకు కకరమును, శిశిరమునకు వికికిరములను బలి ఇవ్వవలెను.     21. సముద్రమునకు శింశుమారమును, పర్జన్యునకు మండూకమును, జలములకు  మత్స్యములను, మిత్రునకు కులీపయ మత్స్యములను, నాక్రాస్తజలచరములను వరుణునకు బలి ఇవ్వవలెను.     22. సోమమునకు హంసలను, వాయువునకు కొంగలను, ఇంద్రాగ్నులకు సారసములను, మిత్రునకు మద్గులను, వరుణునకు చక్రవాకములను బలి ఇవ్వవలెను.     23. అగ్నికి కుక్కుటములను, వనస్పతులకు ఉలూకమును, అగ్నిసోములకు చాషలను, అశ్వినులకు మయూరములను, మిత్రావరుణులకు కపోతములను బలి ఇవ్వవలెను.     24. సోమునకు లవపక్షులను, త్వష్టకు కులీకులను, గోపాదులను దేవపత్నులకు, దేవజాతులు మరియు గృహస్పతి అగ్నికి పారుష్ణములను బలి ఇవ్వవలెను.     25. దినములకు కపోతమును, రాత్రికి సీచాపును, రాత్రింబవళ్ల సంధులకు జతూపాత్రమును, మాసములకు జాత్యౌహమును, సంవత్సరమునకు గరుడమును బలి ఇవ్వవలెను.     26. భూమికి మూషికమును, అంతరిక్షమునకు పాంకమూషికములను, ద్యులోకమునకు కశమూషిములను, దిశలకు నేవలములను, అవాంతర దిశలకు బభ్రుకులను ఆలంబనము చేయవలెను.     27. వసువులకు బుశ్యలను, రుద్రులకు రురువులను, ఆదిత్యులకు న్యకువులను, విశ్వేదేవులకు పృషతులను, సంధ్యలకు కులుంకులను వధించవలెను.     28. ఈశానునకు పరస్వత మృగమును, మిత్రునకు గౌరమును, వరుణునకు మహిషమును బృహస్పతికి గవయులను బలి ఇవ్వవలెను.     29. ప్రజాపతికి మగ ఏనుగును, వాణికి వక్రతుండమును, నేత్రములకు మశకములను, కర్ణములకు భ్రమరములను బలి ఇవ్వవలెను.     30. ప్రజాపతి, వాయువులకు గౌరమృగమును, వరుణునకు అరణ్యమేషమును, యమునకు కృష్ణ మేషమును, మనుష్యరాజాయ మర్కటః సింహమునకు ఋష్యమును, ఋషభమునకు, గవయిని, క్షిప్రశ్యేనమునకు వర్తికను, నీలింగమునకు కీటమును, సముద్రమునకు శింశుమారమును, హిమాలయమునకు గజమును ఆలంబనము చేయవలెను.     31. ప్రజాపతికి తురంగవదన కిన్నరము, ఉవమృగము, హలక్షణ సింహములగును. వృషదేవతది బిడాలము, ధాతకు కొంగ, దిశలకు కాకి, అగ్నిదేవతకు చటకము, త్వష్టకు రక్తసర్పము. పుష్కర సాదము. వాక్కునకు సారసమగును.     32. కులంగ, అరణ్యఅజ, నేవలా మయూరి సోమదేవతవి. పూషదేవతది కోష్ఠము. మాయుది నక్క. ఇంద్రునిది గౌరమృగము. పిద్వునిది న్యంగుకము. అనుమతి కక్కటము. ప్రతిశ్రుతిది చక్రవాకము.     33. వలాహక, శార్గములు సూర్యదేవతాకములు. సృజయ, శాయండకములు మిత్రదేవతాకములు. పురుషవాక్కుశారిక సరస్వతీ దేవతాకము. శ్వావిత్ భూమి దేవతాకము. వ్యాఘ్ర, వృక, చిరుత, సర్పములు మన్యు దేవతాకములు - శ్వావిత్ భూమి దేవతాకము. వ్యాఘ్ర, వృక, చిరుత, సర్పములు మన్యు దేవతాకములు - చిలక సముద్ర దేవతాకము.     34. గరుడుడు పర్జన్య దేవతాకుడు. అతిర్వాహస, దర్వాదులు వాయుదేవతాకములు. పైంగరాజ పక్షి వాక్పాలక బృహస్పతి దేవతాకము. అలజము అంతరిక్షదేవతాకము. ప్లవ, మత్స్య, మద్గు నదీపతి సాగర దేవతాకము. కూర్మము ద్యావాపృథ్వీ దేవతాకము.     35. పురుష మృగము చంద్రదేవతాకము. దార్వాఘటములు వనస్పతి దేవతాకములు. తామ్రచూడము సవితృదేవతాకము. హంస వాయుదేవతాకము. నాక్ర, మకర, కులీప,మత్స్యములు సాగరదేవతాకములు. "హ్రియైశాల్యకః".     36. మృగి దిన దేవతాకము. మండూక, మూషక, తిత్తురులు సర్పదేవతాకములు. లోపాశ అశ్వినులది. కృష్ణమృగము రాత్రిదేవతది. ఎలుగు, జతు. సుషీలిక అన్య జనులవి. "జహకావైష్ణవీ".     37. కోకిల అర్ధమాసములది. ఋష్యమృగ, మయూర, సుపర్ణలు గంధర్వులవి. ఉద్రము జనులది. తాబేలు మాసములది. రోహిత్పుణ్ణ్రుణాచీ గోలత్తికా త్కేప్సరసాం మృత్యువే అసితః మృత్యువుది నల్లని మృగము.     38. భేకి ఋతుసంబంధి. మూషిక, కశ, మంధాలములు పితృసంబంధులు. అజగరము బలసంబంధి. కపింజలము వసుసంబంధి. కపోత, ఉలూక, శశికము నిరృతి సంబంధలు. "వరుణాయ అరణ్యో మేషః".     39. శ్వేత ఆదిత్యానాం - ఉష్ణో, ఘృణీవాన్, వాఘ్రీనస్, మత్యా - మతికొరకు, సృమరో అరణ్యాయ రురురౌద్రః - క్వయి, కుటరు, దాత్యైహ వాజినాం. కామాయ పికః.     40. ఖడ్గోమృగః వైశ్వదేవః శ్వాకృష్ణః, కర్ణోగర్దభః, అక్షుః రక్షసా. ఇంద్రాయ సూకరః. సింహోమారుతః కృకలాసః, పిప్పకా, శకునిస్తే శరవ్యాయై. విశ్వేషాం దేవానాం పృషతః.     ఆలోచనామృతము     1. ఇది వేదము. ఇందు విశ్వమంతయు ఇముడును. నేటివంటి వర్గీకృత శాస్త్రములు నాడులేవు. నేటి వర్గీకృతముల వలన శాస్త్రజ్ఞులు ఇబ్బంది పడుచున్నారు. కుడి కన్ను తెలిసినవానికి ఎడమకన్ను తెలియకున్నది. నేటి శాస్త్రజ్ఞులు WHOLISTIC సంపూర్ణ శాస్త్రమును గురించి ఆలోచించుచున్నారు. ఇది మనిషికి అక్కరకు వచ్చునది. వర్గీకరణ డబ్బుకు అక్కర వచ్చునది.     2. ఈ అధ్యాయమున పశు, పక్ష్యాదులను గురించి చెప్పబడినది. వీనిలో ఎన్ని నేడున్నవో, ఎన్ని మృగ్యమైనవో పరిశీలించవలసి ఉన్నది. దేవతల సంబంధ విషయము కూడ పరిశోధించవలెను.     నాకు తెలిసినంతలో భూమికి ఎలుకలను, కంటికి దోమలను, చెవులకు తుమ్మెదలను బలి ఇమ్మన్నాడు. ఇవి వాటి వాటికి నష్టము కలిగించునవి. ప్లవో మద్గుర్మత్స్యస్తే నదీపతమే. ప్లవ, మద్గుర, మత్స్యములు సాగరమునకు ఉపకరించునవి. పరిశీలనలో సర్వము విదితమగును.                                       దాశరథి రంగాచార్య విరచిత                   శ్రీమదాంధ్ర వచన శుక్ల యజుర్వేద సంహితయందలి         దేవతా పశువాచకమగు ఇరువది నాలువఅధ్యాయము ముగిసినది.                                     అధనాస్సధనాస్సంతు.
24,547
                           నీవు    "ఇన్ని నే బ్రతికిన దినాల పన్నిన వ్యూహాన నిన్నెక్కడ కలిసికొనినానొ స్మృతికి రాదు గాని నీవు లే వను నట్టి కాలమే నాకు లేదు; నా దారి నుండి నిన్ను విడదీయు వేరు మార్గమే లేదు; నీవు కలసి త్రాగని నేను త్రాగు మధుపాత్ర యన్నదియు లేదు; చలికి తాళక వచ్చు నీ కొరకు స్థానమీయని ఆస్థాన మొకటి నాకు లేదు; నా నిదురించు శయ్యాగృహమ్ము నీవు లేక నాకు పచ్చి శూన్యమ్ము"---"నా తలపు మొగలి పువ్వున గుచ్చి నిలిచినముల్లు నీవు; నా బ్రతుకు దైనందినపు భోజనాల నీవు రుచివి; నా .యదృష్టపు తాళ్ళకొనల వైచుకున్న ముడివి నీవు; నిన్ను ప్రేమించినాను, నిందించినాను, ద్వేషించినాను నీ కొరకు చేతులు చాచినాను, పొమ్మని తల్పులు మూసినాను కాని యిది యేమి? నీవు లేనిచోటున నాకు చోటులేదు, సుఖములేదు, లేదు ఉనికి." (ఎవరెస్ట్ లెనిన్ అనే కవయిత్రి పద్యానికి అనువాదం.)           *    *     *                        ---1957 ఒక శ్రుతి ఒక శ్రుతి ఒక గతి వినబడును దూర దూరముల దూర దూరముల రేఖగా పొలిమేరగా కరిగి నిల్చిన నాలోన ఒక శ్రుతి ఒక గతి
24,548
    అందరి కళ్ళు పత్తికాయల్లా మారిపోయాయి.     కన్నుమూస్తే ఆ క్షణంలోనే, ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది...     స్క్రీన్ మీద ఎన్ లార్జ్ అయిన 10 అంకె మాయం కావడం- బ్లూ కలర్ స్క్రీన్ మీద ప్రత్యక్షం కావడం- ఆ తరువాత వరుసగా ప్రశ్నలు....     ఆకుల అడుగునుంచి, ఇంకో ఆకు పుట్టినట్టుగా మొత్తం ఇరవై ప్రశ్నలు...     అన్నీ ఇంగ్లీషులోనే వున్నాయి.     ఆ ప్రశ్నలు స్క్రీన్ మీద ప్రత్యక్షం కావడంతో దర్శనలింగస్వామి, లలాటనేత్రస్వామి, శివస్వామి, రాయబారి నూరుద్దీన్ హసన్, చీఫ్ మినిస్టర్, డాక్టర్ రంగారావు, కుర్మాని- అందరిలోనూ అమితమయిన ఆసక్తి చోటు చేసుకుంది. డైరెక్టర్ మిత్రా స్కీన్ మీద ప్రత్యక్షమైన ప్రశ్నల్ని చదివేందుకు సిద్ధమయి పోయాడు.     "నిజమైన విజ్ఞానం కలవారికి- లేనిపోని విమర్శలకు వ్యవధి వుండదు" అన్నాడు కుషుయోతో- తన మనవడి తెలివితేటలకు సంతోషిస్తూ.     డైరెక్టర్ మిత్రా గొంతు సవరించుకొన్నాడు.     లేజర్ ప్రింటర్ లోంచి బయటకు వచ్చిన ప్రింటవుట్ ని తీసి, వాటి వైపు చూస్తూ- "మైడియర్ ఫ్రెండ్స్... తన మేథస్సుతో విశ్వాత్మ రూపకల్పన చేసిన క్రిప్టోగ్రాఫ్ ను సక్సెస్ ఫుల్ గా ఆపరేట్ చేసి తనే పునర్జన్మ పొందిన విశ్వాత్మనని నిరూపించుకొనే దశలో ముందుకెళ్ళిపోతున్న అకియోతోని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను" అన్నాడు మిత్రా ఎక్సైట్ అయిపోతూ.     "ఇప్పటికి జరిగింది ఒక అధ్యాయం మాత్రమే... ఇప్పుడు ఈ ప్రశ్నలకు కరెక్టుగా జవాబులు చెపితేనే... అకియోతోని విశ్వాత్మగా గుర్తించటం జరుగుతుంది... ఆర్యూ రెడీ... మిస్టర్ అకియోతో..." అన్నాడు ధృతకుమార్- పరోక్షంగా మిత్రాని తొందరపాటు తగదని హెచ్చరిస్తూ.     "కెన్ యూ ప్రొవైడ్ మి... గ్లాస్ ఆఫ్ వాటర్...." నుదుటున పట్టిన చెమటను తుడుచుకుంటూ అడిగాడు అకియోతో.     వెంటనే ఫణివర్మ అటూ ఇటూ చూశాడు- డైరెక్టర్ మిత్రా ఆదేశించగా శృతి బయటకు వెళ్ళి నీళ్లగ్లాసుతో వచ్చింది. ఆ గ్లాసుని ఫణివర్మ అందుకుని అకియోతోకి అందించాడు.     "ఎవ్వెరిథింగ్ విల్ బీ ఆల్ రైట్... డోన్ట్ వర్రీ.... గ్లాసుని అకియోతోకి అందిస్తూ అన్నాడు ఫణివర్మ.     "మిస్టర్ అకియోతో... యూ వాంట్ సమ్ రెస్ట్..." అడిగాడు మిత్రా.     "నో....నో... టెన్షన్ కావద్దని చెపుతున్నాను" చెపుతూ తన సీట్లో కూర్చున్నాడు ఫణివర్మ.     మిత్రా అడగడం ప్రారంభించాడు.     "ఫస్ట్ క్వశ్చన్....     "విశ్వాత్మ తాత, నాయనమ్మలెవరు?"     "తాత పేరు దివ్యాత్మ. నాయనమ్మ పేరు రుక్మిణి" చెప్పాడు అకియోతో.     "రెండు " విశ్వాత్మ ఎక్కడ పుట్టాడు...? ఏ రాష్ట్రంలో? ఏ గ్రామం?"     "ఆంద్రప్రదేశ్ లోని... కృష్ణాజిల్లాలోని కంచికచర్లలో...."     "మూడు : స్కూల్ చదువు ఎక్కడ జరిగింది?"     "నందిగామ హైస్కూల్లో."     "నాలుగు : అతనికి ఎప్పుడు పెళ్ళయింది? అతని భార్య పేరు?"     "1935 ఆగస్టు 12న, భార్య పేరు వైదేహి"     "ఐదు : అతని భార్య సహజంగా చనిపోయిందా?"     "కాదు. కేన్సర్ తో."     "ఆరు : విశ్వాత్మ మొట్టమొదట ఏ ఉద్యోగం చేశాడు?"     "బొంబాయి హార్బర్ లో కళాసీగా"     "ఏడు : అతను హైద్రాబాద్ కి ఏ సంవత్సరంలో వచ్చాడు?"     "1940లో."     "ఎనిమిది : హైద్రాబాద్ లో అతను చేసిన మొట్టమొదటి ఉద్యోగం ఏమిటి?"     ఆ ప్రశ్నకు వెంటనే జవాబు చెప్పలేకపోయాడు అకియోతో... నేల చూపులు చూడటం ప్రారంభించాడు.     ఫణివర్మ క్కూడా గుండెల్లో రాయి పడింది... అతని జీవిత చరిత్రలో ఈ విషయం వుందా? అదే పాయింటు గురించి ఆలోచిస్తున్నాడు అతను.     "కంగారేం లేదు... నెమ్మదిగా చెప్పు" అన్నాడు డైరెక్టర్ మిత్రా.     ఆ ప్రశ్నకు డైరెక్టర్ మిత్రాక్కూడా సమాధానం తెలీదు.     యజ్ఞవల్కి, ధృతకుమార్ లు తీవ్రంతా ఆలోచిస్తున్నారు.     చదరంగంలో ఎదుటి వ్యక్తి వేసిన పావును కదపడానికి రెండో వ్యక్తి కాలంతో పోటీపడుతూ శతవిధాలుగా మధనపడుతున్నట్లుగా వుంది- అకియోతో పరిస్థితి ఆ సమయంలో.     తల వంచుకొనే వేళ్ళతో నుదురు చిన్నగా కొట్టుకున్నాడతను. "ఈ ప్రశ్నకు ఇతను జవాబు చెప్పకపోతే..." అనే ఆలోచన రాగానే, చిగురుటాకులా వణికిపోయాడు అప్పటివరకూ ఉత్సామంగా వున్న ఫణివర్మ.                                                *    *    *    *     "మాటువేసి వున్న మార్టిన్ చూపులు వేగంగా తామున్న దిశకేసే వస్తున్న ఓ ఆటోమీద పడ్డాయి.     ఆ టైమ్ లో ఒంటరి ఆటో ప్యాలస్ కున్న ఒకే ఒక రోడ్ లో ఎందుకొస్తున్నది? మార్టిన్ ఆలోచిస్తూ దానికేసి చూస్తున్నాడు.     అంతకు ఒక గంట క్రితంనుంచే మబ్బులు పట్టిన ఆకాశం చిరుజల్లుల్ని కురిపిస్తోంది. ఉదయమే చీకటి పడినట్లుగా వుంది.     ఆకాశం నిండా నల్లటి కారుమబ్బులు.... నిశ్చలంగా నిలిచే వున్నాయి. భాగ్యనగరంపై గొడుగు పట్టినట్లుగా. రాత్రి తుఫాను తాలూకు ఛాయలు తొలగకపోగా, ఉధృతమవుతున్నట్లుగా వుంది వాతావరణం.     ఆటో మరింతగా దగ్గరయింది. అప్పుడు ఆదిరిపడ్డాడు మార్టిన్ పక్కలో బాంబు పడ్డట్టుగా- ఆటోలో తాను ట్యాంక్ బండ్ మీద దెబ్బతీసి, స్పృహ తప్పగా, నగరానికి దూరంగా బంధించిన అన్వేషి!     ఇది ఎలా సాధ్యం...?
24,549
     అప్పట్లో తనకే "పాలిటిక్స్" కి సరైన నిర్వచనం తెలియదు. పొజిషన్ లో ఉన్న పార్టీలోనే అపోజిషన్ వర్గానికి చెందిన ఆ పోలిటీషయన్ గారి మాటల భరోసా...........మీద తను డేరింగ్ గా గవర్నర్ గారి భవంతికి వెళ్ళిపోయాడు.          కానీ .............తను ఉహించినట్లు రెండువేల మంది కార్యకర్తలలో ఒక్కడూ రాలేదు. బహుశా అప్పటికే వాళ్ళు గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళిపోయి ఉంటారనే ఉహతో.     తను కూడా గబగబ అక్కడికెళ్ళాడు.........     ఆశ్చర్యంగా ........     ఒక్క పురుగు కూడా లేదక్కడ!     అయితే ..........      అక్కడికెళ్ళాక తనకి కనబడింది కళ్ళు బైర్లు కమ్మే దృశ్యం ఒకటి.     తను సెక్యురిటీ రూం దగ్గర నిలబడి ఉన్నాను.     ఇంతలోనే .........రాజభవన్ లో నుంచి ఇరవై కార్లు ఒకదాని వెంట ఒకటి బయటికి వచ్చాయి. పైలటూ, ఎస్కార్టు, వుండడం వలన, ఒక కారులో ముఖ్యమంత్రి ఉండి ఉంటాడని ఉహించాడు తను.     ఆవేనుక ఉన్న కార్లలో ఒకదానికి పూలహారాలు తగిలించి ఉన్నాయి.     ఆ కారు లోపల ఉన్నాడు పద్మనాభరావు. అతని పక్కనే ఉన్నాడు ........పద్మనాభరావుకి అంతకు ముందు రోజు దాకా ప్రబల విరోధి అయిన ఆ పొలిటిషియన్!     ఇద్దరూ ఏదో చెప్పుకుని నవ్వుకుంటున్నారు.     కాసేపు అక్కడే తచ్చాడిన తర్వాత జస్వంతరావుకి అర్ధం అయింది.     రాజకీయాలలో శాశ్వత శతృత్వం శాశ్వత మితృత్వం కూడా ఉండవని.......     నిన్నటి విరోధులు నేడు కలిసిపోయారు. పెద్ద ఎత్తున బేరాలు ఏవో సెటిలయి ఉంటాయి. అందుకే ఆ పొలిటిషియన్గారు తనకి ప్రామిస్ చేసినట్లు రెండువేల మంది కార్యకర్తలనీ పంపలేదు.     అందుకే పద్మనాభరావు అవినీతిని బట్టబయలు చేసే డాక్యుమెంట్లని పంపలేదు కూడా!     అనతవరకూ అర్ధం అయింది జస్వంతరావుకి.     కానీ అర్ధం కానిది ఏమిటంటే .........     ఆ పోలిటిషియన్ , తనని గురించి పద్మనాభరావుకి అంతా చెప్పేసి ఉంటాడని!     నిజానికి అది అతనికి తెలిసే అవకాశము కూడా లేదు.     ఎందుకంటె ..........     జస్వంతరావు చేయబోయిన పని గురించి తనకి, ఏ మాత్రం తెలిసినట్లు ఆచూకీ బయటపడనివ్వలేదు పద్మనాభరావు. అతను అసలైన పొలిటిషియన్.     అతను కార్లో రాజ్ భవన్ నుంచి బయటికి వస్తూ గేటు దగ్గర నిలబడి ఉన్న జస్వంతరావుని అలవోకగా చూశాడు.     అదే క్షణంలో ఒక నిర్ణయనికొచ్చేశాడు పద్మనాభరావు.     ఈ ఎదురింటి కుర్రాడు తన్నమీదే తిరగబడేటంత లేవెలుకు వచ్చేశాడు! వీడ్ని ఒక కంట కనిపెట్టి ఉండాలి (గిట్టని వాళ్ళని "లేపేసే" సంస్కృతీ అప్పటికింకా ఇంత ప్రబలం కాలేదు)     కనిపెట్టి ఉండడమే కాదు ..........వీడు ఎప్పుడూ తన కళ్ళముందే ఉండేటట్లు చూసుకోవాలి.     ఆ ఆలోచన ఆరోజే అమలులో పెట్టేశాడు పద్మనాభరావు.     ఆ రోజే జస్వంతరావుకి తన దగ్గర క్లార్క్ గా ఉండమని ఒక ఆఫర్ ఇచ్చాడు.     ఆశ్చర్యపోయినా, కూడా, ఆశ్చర్యంలో నుంచి తేరుకున్నాక, పద్మనాభరావు ఆఫర్ కి ముందు పద్మనాభరావుకి దగ్గరగా వుంటే, అతని గుట్టు తెలుసుకుని, మళ్ళీ ఇంకోసారి వీలు చూసుకుని అతని బతుకు బజారులో పడెయ్యవచ్చన్న ఉహలోంచి మారు మాట్లాడకుండా ఆ ఉద్యోగంలో చేరిపోయాడు జస్వంతరావు.     కొడుకు ప్రయోజకుడయ్యాడని అతని తల్లి సంతోషించింది.     జస్వంతరావు రెండు నెలల పాటు జీతం "మరిగాక" ఇంక ఓ రొటీన్ లో పడిపోతాడని , దాంతో అతని తిరుగుబాటు మనస్తత్వం చప్పబడిపోతుందనీ ఆశించాడు పద్మనాభరావు.     అయితే     అతను ఉహించని యాంగిల్ ఒకటి ఉంది .......     అదే ........     తన కూతురు వసుధ, జస్వంతరావు కోసం తపించి పోతోందన్న విషయం!     జస్వంతరావు, పద్మనాభరావు కొలువులో చేరడానికి రెండో కారణం ......వసుధ!     అతను పద్మనాభరావు ఇంటికి పొద్దున్నే వచ్చేవాడు. రాత్రి పొద్దుపోయేదాకా అక్కడే ఉండేవాడు.     తను జస్వంతరావు పోకడలని పగలస్తమానం కనిపెట్టే ఉంటున్నానని అనుకున్నాడు పద్మనాభరావు. కానీ కళ్ళముందే సైలెంటు మూవీలా జరిగిపోతున్న ప్రేమ పురాణాన్ని మాత్రం అతను పసిగట్టలేకపోయాడు.      వసుధా, జస్వంతరావు కలుసుకోవడానికి ఇదివరకంటే ఇప్పుడు పుష్కలంగా అవకాశాలు దొరుకుతున్నాయి.     అనతకుముందు మొత్తం సంవత్సరకాలంలో వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నది ఎంతా? ఓసారి ఏడున్నర నిమిషాలు!     ఒకసారి ఇరవై సేకెండ్లు! ఒకసారి ఒక్క నిముషం! ఒకసారి ఆరు నిమిషాలు!     ఇంకోసారి ఇరవై నాలుగు సెకండ్లు.......         అలా  చిన్న చిన్న బిట్స్ బిట్స్ గా నడిచింది వాళ్ళ ప్రేమ.     ఇప్పుడలా కాదు........     ఎప్పుడూ వాళ్ళకి అవకాశం దొరుకుతుందో వాళ్ళకి ముందే తెలుస్తుంది. ఎక్కడ కూర్చుని మాట్లాడుకోవాలో ముందే నిర్ణయించుకుంటారు.     కానీ........     వాళ్ళ మీటింగు ప్రతీసారి ఒకే రకంగా మొదలయ్యేది. ప్రతిసారి ఒకేరకంగా ముగిసేది.     వాళ్ళు కలుసుకున్న ప్రతిసారి కూడా.......     అతని రూపాన్ని కళ్ళతోనే తాగేస్తున్నట్లు కళ్ళార్పకుండా చాలా క్షణాల పాటు అలాగే చూస్తూ ఉండిపోయేది వసుధ.     తను చాలా గొప్ప అందగాడిని కానని జస్వంతరావుకి బాగా తెలుసు. ఆమె తనని అలా ఆరాధిస్తున్నట్లు ప్రత్యక్ష దైవాన్ని చూస్తున్నట్లు చూస్తుంటి అతనికి చాలా గొప్పగాను ఉండేది. చాలా ఇబ్బందికరంగాను కూడా వుండేది.     కలుసుకోగానే -     కాసేపు స్వీట్ నధింగ్స్ ............కొంతసేపు స్పెషల్ సమ్ థింగ్స్!     "నువ్వు మాట్లాడిన ప్రతిమాట ఆ తర్వాత నేను కనీసం ఓ రెండువేలసార్లు అయినా గుర్తు తెచ్చుకుంటాను తెలుసా?" అనేవాడు జస్వంతరావు.     అతనేం మాట్లాడినా, ఆ అక్షరాలనీ, ఆ పదాలనీకూడా , అదే తొలిసారిగా తన జీవితంలో వింటున్న చెవులప్పగించి, అత్యంత శ్రద్దాశక్తులతో వినేది వసుధ.     అలా కాసేపు -     ఆ తర్వాత హటాత్తుగా -     వినబడని అలారం ఏదో మోగినట్లు -     టాపిక్ మారిపోయేది -     "ఇదేమిటో తెలుసా?" అంది వసుధ ఓ రోజున - ఒక బంగారపు భరణిలాంటి దాన్ని చూపిస్తూ.     "ఏమిటది ?" అన్నాడు జస్వంతరావు.     "చూడు! నీకే తెలుస్తుంది!" అంది వసుధ - ఆమె గొంతులో సన్నటి గర్వం!     భరణి తీసి చూశాడు జస్వంతరావు.     అందులో ఇంకో చిన్న ముఖమల్ పెట్టి.     అది తెరిస్తే -     ఆ ముఖమల్ పెట్టెలో ఉంది -     భూతద్దం కింద నుంచి కనబడుతూ ఉన్న ఒక బియ్యపు గింజ!     ఆ బియ్యపు గింజమీద , అతి సూక్ష్మమైన అక్షరాలతో రాసి వుంది.     "రావు బహుద్దూర్ శ్రీ వీరవెంకట పద్మనాభరావు" అని.     "చూశావా! అది ఇది వరకు బ్రిటీష్ వాళ్ళు మా నాన్నకి ఇచ్చారు" అంది వసుధ సంతోషంగా.     ఒక్కసారిగా బ్లడ్ ప్రెజర్ పెరిగిపోయినట్లయిపోయింది జస్వంతరావుకి.     "ఇదేమన్నా పెద్ద గొప్ప?" అన్నాడు కోపంగా. అతని కోపం ఆమెకి ఆగ్రహం లెవల్లో కనబడింది.     "ఎందుకంత ఇదైపోతావు నాన్న పేరు చెప్పగానే? నేవ్వేప్పుడు ఇంతే! బ్రిటీష్ వాళ్ళు దృష్టిలో కూడా మా నాన్న గొప్పే! ఇప్పుడు కూడా పాలిటిక్స్ లో ఆయనకి మంచిపేరుంది! ఆయన్ని నువ్వెందుకు తక్కువచేసి మాట్లాదతావ్?"     ఆమె చెప్పిన దాన్లోనే తన వాదానికి గొప్ప పాయింటు దొరికినట్లు అన్నాడు జస్వంతరావు.     "అవునా! అప్పట్లో మీ నాన్న బ్రిటీష్ వాళ్ళకి ముద్దొచ్చాడు - అంటే ఏమిటి? అప్పట్లో దేశద్రోహి అన్నమాట! ఇప్పుడు తెలివిగా పవర్ లో ఉన్న పార్టీలో చేరిపోయాడు. అంటే ఏమిటి? రంగులు మార్చే ఉసరవెల్లి అన్నమాట! నీకు అర్ధంకావట్లేదూ?"     "నాకు అర్ధం కావట్లేదు" అంది వసుధ చాలా పదునుగా. కొంచెం కోపంతో ఆమె మొహం ఎర్రబడింది. త్వరత్వరగా వస్తున్నా ఉచ్వాసనిశ్వాసాలతో ఆమె ఛాతీ ఎగిరెగిరి పడుతున్నట్లు అనిపిస్తోంది.     అప్రయత్నంగానే ఆమె పక్షం]వైపు కాంక్షగా చూసాడు జస్వంతరావు.     చటుక్కున పమిట సవరించుకుంది వసుధ - తన కోపాన్ని ప్రదర్శిస్తూ.     ఆ టైంలో ఆమె అలా పమిట సవరించుకోవడం కన్నా, ఆమె తన చెంపమీద చెళ్ళున కొట్టి ఉన్నా తక్కువ బాధపడి ఉండేవాడు జస్వంతరావు. ఇద్దరూ అలా బిగుసుకుపోయి , మాట్లాడకుండా కాసేపు కూర్చున్నాడు. తర్వాత జస్వంతరావే అన్నాడు.     "మనకి అన్ని విషయాలలోనూ ఏకాభిప్రాయం కుదిరి, ఈ ఒక్క విషయంలో మాత్రం ఇలా డిఫరెన్స్ స్ రావడం నాకు చాలా విచారం కలిగిస్తోంది వసుధా!" అన్నాడు బాధగా.     "నీ తప్పే! నువ్వే చిన్న చిన్న విషయాలని కూడా అనవసరంగా అలోచించి పెద్ద ఇష్యులుగా చేసేస్తావు. మా నాన్న మీద నాకు అభిమానం ఉండడం తప్పా ఏం?"     "కానీ మీ నాన్న దేశద్రోహి!" జస్వంతరావు అలా అనగానే, కోపంతో సన్నగా కంపించడం మొదలు పెట్టింది వసుధ శరీరం. చటుక్కున మొహం తిప్పుకుంది.     ఆమెకి కోపం వచ్చిందని గ్రహించాడు జస్వంతరావు.     "సారీ!" అన్నాడు మెల్లిగా.     ఆమె మాట్లాడలేదు.     ఆమె కోపం తగ్గుతుందని కాసేపు వెయిట్ చేసి, ఆ తర్వాత అతను కూడా మౌనంగా , బింకంగా అలాగే చాలా సేపు కూర్చుని వుండిపోయాడు.     అతనికి తెలుసు .....     తాము ఇద్దరూ ఇంత సన్నిహితంగా , ఇంత భద్రతల స్థానంలో కలుసుకునే అవకాశం అపురూపంగా ఎప్పుడో గానీ రాదనీ.     అమూల్యమైన క్షణాలు కోపావేశాలలో కాలిపోతున్నాయనీ కూడా!     అయినా కూడా, అదుపులో లేని బింకం!     ఎక్కడన్నా బింకం చెల్లుతుంది గానీ ప్రేమలో కాదు..........     చేల్లినా కూడా .........     ఒకసారి చెల్లుతుంది ..........రెండుసార్లు చెల్లుతుంది. ఎల్లకాలం చెల్లదు.     ఇద్దరూ అలా కాసేపు బిగుసుకుపోయి కూర్చున్నారు. ఈ మధ్య అలాంటి సన్నివేశం చాలా తరచుగానే రిపీట్ అవుతుంది.     అలా బిగుసుకుపోయి, ఎదురి వాళ్ళు తగ్గి వస్తారని ఆశిస్తున్నంత సేపూ ప్రాణాలు కడబట్టినట్లే వుంటుంది. నరాలు తెగిపోయినట్లు ఉంటాయి. ఉపిరాడనట్లు ఉంటుంది.     కొద్దిక్షణాలు గడిచాక, ఇంక పెరిగిపోతున్న అలకని నిగ్రహించుకోలేక, కూర్చున్న కుర్చీని పెద్ద చప్పుడతో జరిపేసి, చటుక్కున లేచి పంతాన్ని ప్రదర్శిస్తూ , పెద్ద పెద్ద అడుగులు వేస్తూ బయటికి నడిచాడు జస్వంతరావు.                                                   * * *
24,550
    ఉలిక్కిపడి వెనుదిరిగాడు కోటి.     ఎదురుగావున్న అశోకుబాబును చూడగానే కోటి ముఖంలో విస్మయం...     అతని చేతిలోని సాంబ్రాణికడ్డీలు వాటంతట అవే జారి పడిపోయాయి.     అప్పటికే అతని చూపులు కోటి నుంచునివున్న గోడ వేపు చూశాయి...     "నో...నో...అలా జరగడానికి వీలులేదు..." అని దిక్కులు పిక్కటిలేలా కేక వేసి స్పృహ తప్పి పడిపోయాడు అతను.     కోటి బెదిరిపోతూ మంచినీళ్ళు తెచ్చి అతనిముఖంపై జల్లి సపర్యలు చేశాడు.     రెండు నిమిషాల తరువాత కళ్ళు విప్పాడతను.     అతని కంటికి ఎదురుగా గోడమీద వున్న రెండుచిత్రపటాలు తమ ఉనికిని తెలుపుతున్నాయి...     శ్రీ రాజా హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఫోటోలో కూడా తన గాంభీర్యాన్ని నిలబెట్టుకున్నారు...ఆయన ప్రక్కనే సతీమణి శ్యామలాదేవి ఫోటో.     రెండు ఫోటోలకూ చందనపు మాలలు వేలాడుతున్నాయి.     "కోటీ...నేను చూస్తున్నది పీడకల కదూ..."     అతను చిన్నపిల్లవాడిలా అడుగుతుంటే కోటిలో గాంభీర్యం సడలింది.     "మీరు చూస్తున్నది నిజమేబాబూ...మీ పరీక్షల సమయంలో జరిగిపోయింది ఈ ఘోరం__రాజశేఖరంగారితో ఫోన్ లో మాట్లాడాను. ఆ సమయంలో మీకు ఆ దుర్వార్త చెప్పి అన్ని సంవత్సరాల చదువును చెడగొట్టడం ఇష్టంలేక మీకు తెలియనివ్వద్దన్నారు...అందుకే ఆ ఇంటిలో వారెవ్వరూ మీవద్ద ఆ ప్రస్తావన తేలేదు..." గొంతు గాద్గదికం కావడంతో చెప్పడం ఆపాడు కోటి.     అతను చెప్పే మాటలను వినిపించుకునే స్థితిలో లేడు అశోకు...     "చినబాబూ...ఇంతఘోరం జరిగాక కూడా అది జరగలేదనీ...అది ఒక పీడకల అనీ ఎలా చెప్పమంటారు" వెక్కి వెక్కి ఏడుస్తూ అన్నాడు కోటి.     "కోటీ...జరగరానిది జరిగింది అని చెప్పకు...నేను వినలేను...నమ్మలేను..."     తను చూసింది వాస్తవం అని తెలియడంతో అశోక్ మరలా స్పృహతప్పి పడిపోయాడు.     తెలతెలవారుతుండగా అతను స్పృహలోకివచ్చాడు.     చుట్టూ వున్న ఫర్నిచర్ ను చూసి తన బెడ్ రూంలో తను ఉన్నట్టు అర్ధం చేసుకున్నాడు. తన కళ్ళవెంట ధారాపాతంగా కన్నీళ్ళు కారిపోతున్నాయి. తల్లిదండ్రులు తనను ఒంటరివాడిని చేసి వెళ్ళిపోయారనే విషయం అర్ధం అయ్యాక అతనిలోని గాంభీర్యం సడలిపోయి పిరికితనం చోటుచేసుకుంది.     గోడగడియారం ఐదుగంటలను చూపుతున్నది...     తను రాత్రి ఒంటిగంటకు వచ్చాడు. అంటే నాలుగు గంటలపాటు స్పృహలేకుండా పడివున్నానని అర్ధమయిందతనికి.     అప్పుడే కోటి వచ్చాడక్కడకు...     "కోటీ...అసలు ఎలా చనిపోయారు...ఆ విషయం నాకు ఎందుకు తెలియచేయలేదు...ఎప్పుడు జరిగింది ఆ ఘోరం..."     అశోక్ మాటలలో ఆవేదనకన్నా ఆవేశం ఎక్కువగా వుంది.     "ఆవేశపడకండి చినబాబూ...మీరు కాస్త స్థిమితపడ్డాక అంతా చెబుతాను..."     "ఫర్వాలేదు  కోటీ...ఇప్పుడు నేను బాగానే ఉన్నాను..."     "ముందు మీరు నాకొక మాట ఇవ్వాలి..."     "ఏమిటది..."     "ముందు ఇవ్వండి__"     "కారణం తెలిసిన తరువాత మీరు ఎలాంటి అఘాయిత్యం చేయకూడదు..." 
24,551
    కేసుకు సంబంధం లేని లాయర్లు, స్టాఫ్ కు కూడా ప్రవేశం నిరాకరించారు. జస్టిస్ మెహతా అడిగిన ప్రశ్నలకు డాక్టర్ శకుంతల జవాబులు చెప్పింది. తను ట్రీట్ మెంట్ సందర్భంగా కొన్న మెడిసిన్స్, టెస్టింగ్ రిపోర్టర్స్ ను కూడా కోర్టుకు సమర్పించిందామె.         "అంటే కరెక్ట్ గా మిస్ మాయాదేవి గర్భానికీ, నిన్నటితో పన్నెండు వారాలు పూర్తయ్యాయని అంటారు!" అని ప్రశ్నించారు జస్టిస్ ప్రమీలాదేవి.         "ఎస్. యువరానర్...." చెప్పింది శకుంతల.         "ఒక యువతి, మొదటిసారిగా సంపర్కంలో పాల్గొన్నప్పుడు....గర్భం దాల్చే అవకాశం ఉందా?" ప్రశ్నించింది ప్రమీలాదేవి.         "ఎస్. యువరానర్...."చెప్పింది శకుంతల.         "ఒక యువతి, మొదటిసారిగా సంపర్కంలో పాల్గొన్నప్పుడు....గర్భం దాల్చే అవకాశం ఉందా?" ప్రశ్నించింది ప్రమీలాదేవి.         "ఎస్. యువరానర్. ఆరోగ్యవంతులైన యువతులు తమ భర్త లేదా ప్రియుడుతో గానీ, లేదా మానభంగానికి గురైన సందర్భాల్లో గానీ గర్భధారణ పొందడానికి ఆస్కారముంది" చెప్పింది డాక్టర్ శకుంతల.         "ఈ కేసు ఎందుకు కోర్టుకొచ్చిందో తెలుసుకదా!" అడిగాడు జస్టిస్ మల్హోత్రా.         "తెలుసు."         "ఒక్కసారి చెప్పండి....మాయాదేవి, తనను రేప్ చేసిందని మనోహర్ కేసు పెట్టాడు గనుక...."         "రేప్ చేసిన వ్యక్తికి గర్భం వస్తుందా?" అడిగింది ప్రమీలాదేవి.         "ఎస్. యువరానర్. రేప్ చేసినా, చేయబడినా, ప్రకృతి సహజంగా గర్బాధారణ పొందే వ్యక్తి స్త్రీ మాత్రమే. అలాగే రతి సంపర్క సమయంలో భార్యా, భర్తలు లేదా ఆ పురుషుడు, ఆ స్త్రీ భావ తీవ్రతకు లోనయ్యే సమయంలో, అలసటకు, ఇంటాక్సిలేషన్ కు లోనవడం సహజం. వారి వారి స్థానాలు మారడం కూడా సహజం. అలాంటి సమయమ్లో ఏకకాలంలో విడుదలయ్యే అండాలు కలవడానికి ఆస్కారం వుంది.         అందువల్ల ప్రథమ సమాగమానికే గర్భాధారణ జరిగే అవకాశం వుంది" విశదంగా చెప్పింది డాక్టర్ శకుంతల.         "ఆమె గర్భవతి అయితే, కోర్టు కేసు కొట్టేస్తుందా?" అనుమానంగా అడిగాడు లాయర్ మాలవ్యను, చిన్నగా మనోహర్.         "కారణం గర్భమే అయి వుంటుందని నిన్ననే నాకనిపించింది కానీ కేసును కోర్టు కొట్టివేయడానికి ఆస్కారం లేదు. శిక్ష అనుభవించాల్సిందే. బిడ్డ పుట్టాక" చెప్పింది డాక్టర్ మాలవ్య.         మనోహర్ కి చాలా గిల్టీగా వుంది.         కేసు ఇలా మలుపు తిరుగుతుందని అసలు అతను ఊహించలేదు.         పావుగంట గడిచింది.         జస్టిస్ మల్హోత్రా సవరించిన తీర్పును ఇలా చదవడం ప్రారంభించాడు.         "మిస్ మాయాదేవి, మనోహర్ కేసుకు సంబంధించి, నిన్న ప్రకటించిన తీర్పుకు సంబంధించి, అవసరమైన డాక్యుమెంట్స్ పరిశీలించిన మీదట, సంబంధిత డాక్టర్ విశ్లేషణను నిర్వహించిన మీదట ఇందులో ముద్దాయి అయిన మాయాదేవి, ప్రస్తుతం గర్భవతిగా ఉందన్న విషయాన్ని కోర్టు విశ్వసిస్తోంది.         The medical termination of pregnancy act No.34 of 1971 ప్రకారం.         Subject to the provision of sub- section (4) a pregnacy may be terminated by a registered medical practitioner,         Where the length of the pregnancy does not exceed twelve weeks, నియమనికి సంబంధించి,         ఎక్స్ ప్లనేషన్ ఒకటి ప్రకారం__         where any pregnancy is alleged by the pregnant woman to have been caused by Rape, the anguish caused by such pregnancy shall de presumed to constitute grave injury to the mental heal of the pregnant woman, అని పేర్కొంటున్న చట్టం ప్రకారం ఈ కేసును పరిశీలించడం జరిగింది.         అలాగే, Criminal procedure code 1973 ప్రకారం, సెక్షన్ 416కు సంబంధించి postponement of capital sentence on pregnant women- If a women sentenced to death is found to be pregnant, The high court shall order the execution of the sentence to be post poned, and may, if it thinks fit ommute the sentence to Imprisonment life, అని నిర్దేశిస్తున్న చట్ట పరిధి ప్రకారం__         ఇందులో ముద్దాయి గర్భవతి అయిన కారణంగా ఆమెకు నెలలు నిండి, ప్రసవం జరిగేవరకూ జైలుశిక్ష విధింపు వర్తించదని కోర్టు పేర్కొంటూ...         ముద్దాయి తరపున దాఖలైన ప్రత్యేక పిటిషన్ ను పరిశీలించిన మీదట....         జీవిత ఖైదు పడిన మహిళా ముద్దాయిలు ఒకవేళ గర్భవతులైన పక్షంలో చట్టప్రకారం, ప్రత్యేక పరిధులకు లోబడి వారికి పోలీసుల పర్యవేక్షణలో గవర్నమెంట్ ఆస్పత్రుల్లో ప్రసవం వరకూ ఉంచడం జరుగుతోంది.         ఆ విధంగానే....         ఈ కేసులో ముద్దాయి మాయాదేవి దాఖలు చేసుకున్న ప్రత్యేక అభ్యర్ధన మేరకు ఇంతవరకూ ఆమెకు ట్రీట్ మెంట్ చేస్తున్న ప్రభుత్వ మెడికల్ ప్రాక్టీషనర్ ఆధ్వర్యంలోనే ఇకమీదట కూడా ఆమెకు ట్రీట్ మెంట్ జరగాలని ఆదేశిస్తోంది.         అలాగే ప్రతి నాలుగు వారాల కొకసారి సంబంధించిన వైద్యాధికారి ముద్దాయి ఆరోగ్యానికి సంబంధించిన నివేదిక జైలు అధికారులకు అందచేయాలని, ప్రతి పదిహేను రోజులకొకసారి జైలు వైద్యాధికారి ముద్దాయిని స్వయంగా పరిశీలించాలని కోర్టు ఆదేశిస్తోంది."         ఆ తీర్పును వినగానే బెనర్జీ హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు.         లాయర్ ఆదిత్య పెదవుల మీదకు మందహాసం వచ్చింది.         లాయర్ మాలవ్య సూటిగా మనోహర్ కళ్ళల్లోకి చూసింది.         ప్రెస్ రిపోర్టర్లు, చానల్ రిపోర్టర్లకు సెన్సేషనల్ ఫాయింట్ దొరికినందుకు చాలా ఆనందంగా వుంది.
24,552
    అప్పుడు విన్పించింది కృష్ణవర్మ ఆర్డర్.     "ఫైర్....."     అయిదు డబుల్ బేరల్ గన్స్ ఒక్కసారిగా బుల్లెట్లను వర్షించాయి.     తను పక్కకు దొర్లుతూ... శివరాణిని పక్కకు లాగపోయాడు.     శివరాణి శివశక్తిలా నిర్భయంగా నిలబడిపోయింది.     జీవశ్చవంలాంటి ఆమె వంటిలో అణువణువునా బుల్లెట్లు నిండిపోయాయి.     శాపగ్రస్త దేవకన్యలా నేలమీదకు ఒరిగిపోయింది శివరాణి.     ఊరంతా మండుతోంది...     ఆ మంటల వెలుగులో నేలమీద రక్తపు మడుగులో మందారంలా మెరుస్తున్న శివరాణివేపు చూశాడు.     అతని కళ్ళంట రెండు రక్తపు చుక్కలు చిమ్మాయి... ఆ మరుక్షణం అక్కడ్నించి అదృశ్యమైపోయాడు ఆదిత్య.                                                    *    *    *    *    *     ఇరవై నిమిషాలు గడిచాయి...     మట్టిరోడ్డు మీంచి... పొలాల గట్లమీంచి... కొండల అంచులమీంచి ఉప్పెనలా పరుగులు తీస్తూ వచ్చిన ఆదిత్య...          చెట్లచాటున వున్న జీపు వేపు చూసాడు.     ఆ జీపు డేవిడ్ ది!     జీపెక్కాడు...కీ బోర్డ్ కి తాళాలు.     ఇగ్నీషన్ కీ తిప్పాడు.     చెట్ల చాటునుంచి జీపు మట్టిరోడ్డుమీద కొచ్చింది. గేరుమార్చి ఒకేసారి స్పీడ్ పెంచాడు.     అరవై మైళ్ళ వేగంతో జీపు చెట్ల మధ్యలోంచి పరుగెడుతోంది.     పరుగులు తీస్తున్న జీపును చూసి చెట్ల చాటునుంచి బయటికొచ్చాడు డ్రైవర్ రాములు.     "సార్... సార్..." వెళ్ళిపోతున్నవాడు డేవిడ్ అనుకుని అరిచాడు.     ఆ అరుపు అందనంత దూరంలో వున్నాడు ఆదిత్య.     కృష్ణవర్మ వెంకటాపురానికి రావడానికి పట్టే టైమ్... అతను హైదరాబాద్ కి మెసేజ్ ఇచ్చే టైమ్ ను క్యాలిక్యులేట్ చేస్తున్నాడు ఆదిత్య.     నలభై నిమిషాలు గడిచాయి.     వెంకటాపురం రైల్వేస్టేషన్ పక్కన జీప్ మలుపుతిరిగి తారు రోడ్డుమీద కొచ్చింది.     మరింత వేగం పెంచాడు ఆదిత్య.     అదే సమయంలో వెంకటాపురం రైల్వేస్టేషన్లో పాసింజర్ ట్రైన్ కదిలింది.     ఆ ట్రైన్ లో సుమబాల, ఆమె ప్రక్కన ప్రెటీ, వాళ్ళకెదురుగా ఆదయ్య తాత కూర్చున్నారు.     విషాద మౌన ప్రతిమలా వుంది సుమబాల.                                                  *    *    *    *    *     విశాలమైన రోడ్డు మీద జీపు పరుగెడుతోంది.     అప్పుడు జీపు స్లో చేశాడు ఆదిత్య.     డేవిడ్ తో జరిగిన పెనుగులాటలో డేవిడ్ జేబులోంచి కింద పడిపోయిన డాక్యుమెంట్స్ ని తను తియ్యడం... బనీన్లో దాచుకోవడం గుర్తుకు వచ్చింది ఆదిత్యకు.     డాక్యుమెంట్స్ ను తీసి చూశాడు ఆదిత్య.     తన జీవితాన్ని అతలాకుతలం చేసిన డాక్యుమెంట్స్ అవి...     ఒక పొలిటికల్ క్రుకెట్ గేమ్ కి నాందిపలికిన డాక్యుమెంట్స్ అవి...     ధరణి, సుమబాల జీవితాల్లో నిప్పు కురిపించిన డాక్యుమెంట్స్ అవి...     డేవిడ్, శివరాణి బ్రతుకులు నాశనం కావడానికి పరోక్షంగా కారణమైన డాక్యుమెంట్స్ అవి...     రేపు తను ఎదుర్కొనబోతున్న మహాసంగ్రామానికి ఈ డాక్యుమెంట్స్ నే తను పాచికల్లా చేస్తాడు.     ఆ డాక్యుమెంట్స్ సృష్టించే వలయంలో-          దుర్మార్గ రాజకీయానికి తను అంతిమగీతం పాడతాడు.                              *    *    *    *    *     రాత్రి రెండు గంటలైంది.     రామంతపూర్ లోని దూరదర్శన్ నగర్ లోని పెద్ద బిల్డింగ్ ముందు జీపును ఆపుచేశాడు ఆదిత్య. నలువేపులా చూశాడు.     వీధంతా నిర్మానుష్యంగా వుంది.     బిల్డింగ్ గేటు తెరచుకొని లోనికి అడుగుపెట్టాడు... అంతటా చిక్కటి చీకటి.     నేమ్ ప్లేట్ చూసి, కాలింగ్ బెల్ నొక్కాడు.     అయిదు నిమిషాల నిశ్శబ్దం.     "కౌన్ హై?" లోన్నించి ప్రశ్న.     "మే... మాజిద్ సాబ్!"     మాజిద్ తలుపు తెరిచాడు. ఆదిత్యను వెంటనే గుర్తుపట్టలేకపోయాడు.     "మీరు...."     "నన్ను పోల్చుకోలేవా మాజిద్? ఆకారం మారినా, దుస్తులు మారినా గొంతును గుర్తుపట్టలేవా?"     "తూ... ఆదిత్యా... ఆవ్....ఆవ్ వ్" మనసారా ఆహ్వానించాడు.     డ్రాయింగ్ రూంలో కూర్చున్నారిద్దరూ.     మాజిద్ ఆదిత్య చిన్ననాటి స్నేహితుడు. ఇద్దరూ ఒకే స్కూల్లో చదువుకున్నారు. ప్రస్తుతం మాజిద్ టీ.వి. ట్రాన్స్ మిషన్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు.     "ఏంది భాయ్ ఆదిత్యా! నీ వార్తలు విన్నప్పుడల్లా నేనెలా బాధపడతానో తెలుసా? అసలేం జరిగింది?" ప్రశ్నించాడు మాజిద్.     "నువ్వు కూడా నన్ను క్రిమినల్ గా అనుకుంటున్నావా మాజిద్?"     "నో... నెవర్! నీ గురించి నాకు తెలుసు" చాలా ప్రేమగా అన్నాడు మాజిద్.     "నేనో మహాయజ్ఞాన్ని తలపెట్టాను. అందుకు నీ హెల్ప్ కావాలి."     "తెలుగు యజ్ఞానికి ముస్లింలేం యిస్తారయ్యా బాబు" నవ్వాడు మాజిద్.     "యజ్ఞమంటే... ఆ యజ్ఞం కాదు..." కథంతా చెప్పాడు ఆదిత్య.     "అవును... ఎలక్షన్ల సందర్భంగా చీఫ్ మినిస్టర్ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మావాళ్ళు ఎపాయింట్ మెంట్ తీసుకున్నారుగానీ ఇంకా డేట్ కన్ ఫర్మ్ కాలేదు. రేపో... ఎల్లుండో వుంటుందనుకుంటాను" ఆదిత్యకు కావలసిన ఇన్ ఫర్ మేషన్ ని చెప్పాడు మాజిద్.     "సి.ఎం. దూరదర్శన్ స్టూడియోకొచ్చి ప్రసంగిస్తాడా?" అడిగాడు ఆదిత్య.     "లేదు... ముందుగా రికార్డ్ చేస్తాం. కానీ ఈసారి కుదిరేటట్టు లేదు. సి.ఎం. చాలా బిజీగా వున్నారు. డైరెక్ట్ ట్రాన్స్ మిషన్ కి బహుశా ఏర్పాట్లు జరగొచ్చు."     "డైరెక్ట్ ట్రాన్స్ మిషన్ అంటే ఎక్కడ నుంచి మాట్లాడతారు?"
24,553
    "మాష్టారూ! నాకు సిగరెట్ తాగే అలవాటు వుంది. గుమ్మంలో నుంచుని పోగావడలి వస్తాను" అని చెప్పి సమాధానం ఆశించకుండా సీటులోంచి బయటికి వెళ్ళాడు.     మళ్ళీ కోదండరామయ్య, వెంకుమాంబ కళ్ళూకళ్ళూ మాట్లాడుకున్నాయి.     సాధారణంగా ఇరువురు వ్యక్తులు ఏ విషయం చర్చించుకుంటున్నా మూడోవ్యక్తి నోరు మూసుకుని వుండడు. మధ్యలో కల్పించుకుని వకమాట అన్నా వదులుతాడు. లేకపోతే అదేపనిగా చర్చ సల్పుతాడు. అలాంటిది తనంతట తానుగా మాట్లాడిన మనిషి దొంగాడి కధ వచ్చేసరికి తేలుకుట్టిన దొంగలా పెదవులు బిగించుకొని వుండిపోయిందేగాక సంభాషణలో ఎక్కడా కలుగజేసుకోవాల్సి వస్తుందోనని సిగరెట్ తాగే మిషతో అవతలికి వెళ్ళాడు ఏకపాదం.     దీనినిబట్టి ఏమనుకోవాలి?     ఏదో వుందనే అనుకోవాలి కదా?     ఏదో అంటే?     రహస్యం.     రహస్యమంటే రహస్యమే.     ఏకపాదం రహస్యం.     ఎర్రరంగు పెద్దపెట్టె     పెద్ద రహస్యం.     ఎర్రపెట్టె గురించి, ఏకపాదం గురించి మాట్లాడుకుందామా అంటే అతగాడు యిక్కడే వున్నాడు. పోనీ మనకెందుకొచ్చిన వెధవగోల అనుకుందామా అంటే పాడుమనసు వూరుకోవటం లేదు. పింజాం పింజాం అంటున్నది. ఎలా?     ఏకపాదం సిగరెట్టు త్రాగడం పూర్తిచేసినట్లున్నాడు. లోపలికొచ్చి కూర్చున్నాడు. అంతేకాదు. ఏవేవో కబుర్లు చెప్పటం మొదలుపెట్టాడు.     ఇందాక ఏమయింది ఈ నోరు?     అంటే ఏదో వుందనేగా.     కబుర్లు అలా సాగుతున్నాయి.     చూసి చూసి మనసు ఆగక "పెట్టె బాగుంది నాయనా!" అంది వెంకుమాంబ.     'పెట్టె సంగతి ఎత్తకూడదు. దీనికేమీ తెలియదు నా మీద గొణగడం తప్పించి' అనుకొన్నాడు కోదండరామయ్య.     "ఈ దిక్కుమాలిన పెట్టె గురించి ఎత్తకండి తలుచుకుంటే చాలు వళ్ళు మండిపోతుంది." ముఖం చిటపటలాడిస్తూ చెప్పాడు ఏకపాదం.     "అదేమీ...." దీర్ఘం తీస్తూ అడిగింది వెంకుమాంబ.     "నేను వూరు ప్రయాణం కావటం చూసి మా తాత గారు, వాళ్ళ స్నేహితుడికి ఈ పెట్టె ఇమ్మని నాకు తగిలించారు. సరదాగా నే వెళుతుంటే సైతాన్ లా ఈ పెట్టె ఒకటి ప్రాణానికి" విసురుగా జవాబిచ్చాడు ఏకపాదం.     "తాడూర సందులేదు మెడకో డోలుట" వెంకుమాంబ సామెత వదిలింది.     "మా ఆవిడకి సామెతలు బాగావచ్చు" ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడాడు కోదండరామయ్య.     మళ్ళీ స్టేషన్ రావటంతో బండి ఆగింది. బండి ఆగింది కాబట్టి ఏకపాదం బండి దిగాడు. బైట గాలిమేసి రావటానికీ.     బండి ఆగింది ఏ స్టేషనో చూడక ముఖముఖాలు చూసుకున్నారు కోదండరామయ్య, వెంకుమాంబలు.                                                              4     "గమనించావా?"     "ఆ......"     "ఆఁ అనంగానే సరికాదు. ఏం గమనించావు?"     "మీరు గమనించిందే."     "అదే ఏమిటంటున్నాను?"     "అదే అన్నాకదా!" 
24,554
    "అవును. చదివాను. చాలా గొప్ప సాహసం చేసింది. ఆడపిల్లలంటే అలా వుండాలి. కాలేజీముందు నిరాహారదీక్ష చేసిందట కదా, ఏమైంది చివరికి?" అనడిగింది సునీత.     "ఏమవుతుంది! ఆ ఎమ్మెల్లే తాలూకు వాళ్ళొచ్చి కాళ్ళు పట్టుకున్నారు- క్షమించమని అడిగారు. ఇంకెప్పుడూ యిలా ఆడపిల్లల్ని మోసం చేయొద్దని వార్నింగిచ్చి వదిలేశాం" అన్నాడు కృష్ణమూర్తి. ఇద్దరూ భోజనం పూర్తిచేసి ముందు హాల్లోకొచ్చారు. సునీత వీడియోలో క్యాసెట్ పెట్టింది. వచ్చి సోఫాలో కూర్చుంది. అతడు ఆమె దగ్గరగా లాక్కొని వళ్ళో కూర్చోబెట్టుకున్నాడు.         "మీ కాలనీలో ధాత్రి అనే అమ్మాయి వుంది కదూ" అంది సునీత.     "అవును, విష్ణు కూతురు. ఇప్పుడామె ప్రసక్తి ఎందుకు?" అడిగాడు కృష్ణమూర్తి.     "మొన్న మీ అబ్బాయినీ, ఆ అమ్మాయినీ ఎక్కడో కిళ్ళీకొట్ల దగ్గర చూశాను. ఈ ఆడపిల్లలతో జాగ్రత్తగా వుండాలి. మంచి మంచి అబ్బాయిల్ని చూసి వలలో వేసుకోవాలని ప్రయత్నిస్తారు".     "ప్రీతమ్ అలాంటివాడు కాదులే. అయినా ఆ ధాత్రి డాన్స్ లూ, మ్యూజిక్కూ అంటూ తిరుగుతూ వుంటుంది కదా, కిళ్ళీకొట్ల దగ్గరికి ఎందుకు వెళ్ళింది? ఏమిటో ఈ కాలం ఆడపిల్లలు పూర్తిగా పాడయిపోతున్నారు".     "అన్నట్లు వల్లో వేసుకోవటం అంటే గుర్తొచ్చింది. ఆ కౌసల్య కూతురు, ఆ అమ్మాయి పేరేమిటి?"     "నిఖిత".     "ఆ! నిఖిత......మీ కాలనీలోనే అవినాష్ అనే కుర్రోడు వున్నాడట కదా, వాణ్ని వల్లో వేసుకుందట. మీకు  తెలుసా విషయం."     "తెలుసు. అవినాష్ తండ్రి వెళ్ళి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడటలే".     "ఏమిటో ఈ ఆడపిల్లలు! చిన్న వయసులోనే అబ్బాయిలకి గాలం వేయటం, దానికోసం వాళ్ళతో కలిసి తిరగటం, తరువాత అబార్షన్ లని హాస్పిటల్స్ చుట్టూ తిరగటం......" అంటూ నిట్టూర్చింది సునీత.     "మగవాళ్ళూ అంత తెలివైన వాళ్ళేమీ కాదులే. ఆ అవినాష్ ఇంట్లో వాళ్ళని ఎదిరించైనా సరే ఆ నిఖితని చేసుకుంటానంటున్నాడట. పాపం శంకరం బాగా గొడవ పెడుతున్నాడు".     సునీత అతని ఛాతీమీద చెయ్యి వేసి వెంట్రుకల్ని వెలిచుట్టూ మెలితిప్పుతూ "ఏమిటో అసలు వాల్యూస్ అంటూ లేకుండా పోతున్నాయి" అంది. అతడు ఆమె  అనాచ్ఛాదితమైన వీపుమీద చెయ్యివేసి, మెడనుంచి వెన్నెముకమీదుగా చేతిని కిందివరకూ రాస్తూ ఆమెని రెచ్చగొట్టసాగాడు. మరో అయిదు నిమిషాల్లో వాళ్ళిద్దరూ ఈ ప్రపంచాన్ని మర్చిపోయారు.     ఆ గదిలో చీకటి దట్టంగా అలుముకుంది.     చీకటికి మాటలు రావు. నిశ్శబ్దంగా చూస్తోంది.     మనిషి మనస్తత్వం ఎంత గమ్మత్తయింది! అతడి కూతురు ఒక కుర్రవాడ్ని ప్రేమించి, కాలు జారి, నిరాహారదీక్షలు చేసి విఫలమైంది. దాన్ని అతడు తన విజయంగా చాటుకున్నాడు. తన కూతురిది ఏ తప్పూ లేనట్టు సమర్థించుకున్నాడు. అతని కొడుకు మరొక అమ్మాయితో కలిసి ఎక్కడో కనపడితే ఆ తప్పంతా ఆ అమ్మాయిదే అన్నట్లు మాట్లాడాడు. అదే పని అవినాష్, నిఖితలు చేసి వాళ్ళు వివాహం చేసుకోటానికి సిద్ధపడుతూ వుంటే, అది ఒక సామాజికపరమైన తప్పుగా చర్చించాడు. ఆమె కూడా మనస్ఫూర్తిగా తాను నైతిక విలువల్ని నమ్ముతున్నట్టే సంభాషణ జరిపింది. భర్త క్యాంపుకు వెళ్ళగానే  హైస్కూలు కుర్రవాళ్ళనుంచి అందుబాటులో వున్న దాదాపు ప్రతి  మగవాడితోనూ, సంపర్కం పెట్టుకుంటూ 'యువతరం నైతిక విలువలు  కోల్పోతుంది' అని ప్రియుడి దగ్గర వాపోతోంది. నిజంగా వీరందరూ తాము బయటికి మాట్లాడేమాటల్ని  మనసులో కూడా  నమ్ముతారో లేదో తెలియదు. భర్త వున్న సునీత, భార్యాపిల్లలూ వున్న కృష్ణమూర్తి రహస్యంగా కలుసుకొని, నగ్నంగా ఒక పక్కమీద పడుకొని నైతిక విలువల గురించి ఈ విధంగా మాట్లాడటంలో అసహజ మేమీలేదు. దీనికన్నా ఇంకా చిత్రమేమిటంటే వీటన్నిటికీ తాము అతీతులమని వాళ్ళిద్దరూ మనస్ఫూర్తిగా నమ్మటం! మనుష్యుల్లో చాలామంది ఈ కోవకి చెందినవారే కదా......!     చీకటికి మాటలు రావు వచ్చి వుంటే అది వెలుగుతో అని వుండేది" ఓ వెలుగా! మనుష్యులందరూ కళ్ళముందు నిన్ను కోరుకుంటూన్నారని మిడిసిపడకు. వాళ్ళ మనసుల్లో నేను నిరంతరం వుంటూనే వుంటాను కదా!"                                                   *    *    *     పోస్ట్ మాన్ కవర్ అందించి వెళ్ళాడు. చూడగానే అది తన ఆఫీసు నుంచి వచ్చిన నోటీసని నిఖితకి అర్థమైపోయింది.     దాదాపు నెలరోజులుగా ఆమె సెలవులోనే వుంది. రూలు ప్రకారం ఆమెకి అంత సెలవు లేదు. అయినా జీతం నష్టంమీద సెలవు. తీసుకుంది. ఇప్పుడీ నోటీసులో ఇంక సెలవు పొడిగింపబడదనీ, వచ్చి జాయినవమనీ వుంది.     నిఖితకి ఏం చేయాలో తోచలేదు.     రాము ఆమెరికా ప్రయాణం మూలంగా తల్లి ట్రీట్ మెంట్ వాయిదా వేయవలసి వచ్చింది. ఎటువంటి పరిస్థితులలోనూ తల్లిదండ్రుల స్థితి ఎంత దయనీయంగా వుందో, వాళ్ళు మరణానికి ఎంత చేరువలో  వున్నారో తెలియనివ్వకూడదని నిఖిత  నిశ్చయించుకుంది. అటువంటప్పుడు రాము విదేశాలకి వెళ్ళాకముందే ఆవిడకి మళ్ళీ తిరగబెడితే ఆ విషయం అతడికి తెలిసే ప్రమాదం వుంది...... అన్నిటికన్నా ముఖ్యంగా ఇల్లు అమ్మేసిన విషయం!     నిఖిత ఆలోచనల్లో ఒకరకమైన సంక్లిష్టత వుంది. ఆమె నిరంతరం ఆత్మవిమర్శన చేసుకుంటూ ఏది మంచో, ఏది చెడో ఒక నిర్ణయానికి వస్తూ వుంటుంది. కేవలం తనకి లాభం కాబట్టి ఒకే రకమైన వాదనలని పెంపొందించుకోలేదు. అవతలి కోణంలోంచి కూడా ఆలోచించి, రెండూ బేరీజు వేసుకొని అప్పుడు ఒక నిర్ణయానికి వచ్చి తాను సంతృప్తి పడుతుంది.     తల్లిదండ్రుల అనారోగ్యం గురించి అన్నయ్యకి తెలియకూడదని తమకంతా ఎందుకింత తాపత్రయం? అని తనను తాను ప్రశ్న వేసుకుంది ఆమె.     నిజం తెలిస్తే రాము ఏం చేస్తాడో? చదువూ గిదువూ ఏదీ వద్దని ఏ రెండువేల రూపాయలకో ఒక ఉద్యోగంలో చేరిపోతాడు. దానివల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? అది తన ఆర్ధిక ఇబ్బందుల్నీ, తల్లిదండ్రుల అనారోగ్యాల్నీ తుడిచిపెట్టగలుగుతుందా? లేదు. అయితే.....ఆ నిజాన్ని ఒప్పుకొని, వచ్చిన అవకాశాన్ని వదలిపెట్టకుండా రాము విదేశాలకి వెళ్ళిపోతే- అతడొక అవకాశవాదిగా, స్వలాభపేక్ష కలవాడిగా చిత్రీకరించబడతాడు. చావుబతుకుల్లో వున్న తల్లిదండ్రుల్ని బాధ్యతారహితంగా వదిలేసిన దుర్మార్గుడిగా  నిందింపబడతాడు.     దురదృష్టవశాత్తూ ఈ ప్రపంచంలో -ప్రతి మనిషికీ-తర్కానికీ, సెంటీమెంట్ కీ జరిగే సంఘర్షణలో  చివరి గెలుపు సెంటిమెంట్ దే అవుతుంది. బాధ, విషాదం, త్యాగాలతో వాస్తవం కప్పబడిపోయి, మనిషి ఆనందపు ముసుగు వేసుకొని, ఆ సెంటిమెంటే తన జీవిత పరమావధి అనుకుంటూ తృప్తిపడతాడు. అసలైన తృప్తి వాస్తవాన్ని గ్రహించటంలో వుందని, సెంటిమెంట్ లో లేదని అనుకోడు. ఎందుకంటే సెంటిమెంట్ కన్నా వాస్తవం జీర్ణం అవటం చాలా కష్టం.     దశరధ్ కూతురితో చెప్పాడు. "నిఖితా. రాము విదేశాలనుంచి తిరిగొచ్చేవరకూ మేముంటామో లేదో అన్నది అనుమానమే. ఈ కొద్ది రోజులూ మన ఆర్థిక బాధలు అనారోగ్యం అంతా మర్చిపోయి అందరం కలిసి ఆనందంగా గడుపుదాం. రాము ధైర్యంగా, సంతోషంగా ఇక్కడి నుంచి వెళ్ళటానికి తగిన పరిస్థితులు కలిగిద్దాం' అన్నాడు.     నిఖిత అది కరెక్టు అన్నట్టు తలూపింది.     రాము కోసం స్వీట్లు చేసింది నిఖిత. అతడి బట్టలన్నీ ఉతికి, ఇస్త్రీ చేసి సిద్ధం చేసింది. మార్వాడి దగ్గరికి వెళ్ళి సేల్ అగ్రిమెంట్ పూర్తిచేసింది. ఈ పనులన్నీ చేస్తున్నా ఆమెని ఆలోచనలు వదలలేదు. ఎందుకు తను రాముకి ఈ విషయాలన్నీ చెప్పలేకపోతోంది? రాము చదువుకోవాలి. పెద్ద ఉద్యోగం సంపాదించాలి. జీవితంలో స్థిరపడాలి. అందుకని చెప్పలేకపోతూంది. ఈ విషయం అతనికి తెలిస్తే "నీకీ విదేశీ చదువులు వద్దు. చివరి రోజుల్లో అమ్మా, నాన్నని కనిపెట్టుకొని శుశ్రూష చేసుకుంటాను. నా చెల్లెలిని ఉద్యోగం చేసి తల్లిదండ్రుల్ని పోషించే స్థితినుంచి తప్పిస్తాను" అని పై చదువులకి వెళ్ళకుండా ఆగిపోతాడు.     ఒకవేళ తన అన్నయ్య ఇప్పుడున్న పరిస్థితుల్లో తను వుండి, తనని విదేశాలకి పంపించవలసి వస్తే ఏం మాట్లాడతాడు?     "వెళ్ళు నిఖితా. ఇక్కడ వ్యవహారాలన్నీ నేను చేసుకుంటాను. రెండు సంవత్సరాలంటే ఎంతసేపు! నువ్వొక్కసారి బాగా చదువుకొనివస్తే మన పరిస్థితులన్నీ చక్కబడతాయి".     కానీ తను వెళుతుందా? వెళ్ళదు. "అమ్మా నాన్నలతో నేనిక్కడే వుండిపోతానన్నయ్యా. నా కోసం మీరందరూ ఇన్ని కష్టాలు పడుతూ వుంటే నేను విదేశాలకి వెళ్ళి చదువుకోలేను" అంటుంది.     అన్నయ్యని విదేశాలకి వెళ్ళమని ప్రోత్సహించిన తను, ఈ విషయం తెలిస్తే, తనా పరిస్థితిలో వుంటే..... వెళ్ళలేదు.     కానీ ఇప్పుడు అన్నయ్యకి ఈ విషయం తెలియనివ్వకుండా పంపిస్తోంది.     ఈ తర్కం ఏమిటో ఆమె లేత మనసుకి అందడంలేదు.     తార్కికంగా ఆలోచించేవాడెప్పుడూ మెటీరియలిస్ట్ గానే కనిపిస్తాడు. విమర్శలని ఎదుర్కొంటాడు.     కానీ కొలిమిలో కాలిన ఇనుమూ స్వచ్ఛమైనట్లు అతడు కూడా స్వచ్ఛంగా పరిణతి చెందుతాడు.     నిఖిత ఇప్పుడు ఆ ' ఎవల్యూషన్' లోనే వుంది.                          *    *    *     ఆఫీసువాళ్ళు యిచ్చిన నోటీసు పట్టుకొని మెట్లు దిగుతున్న నిఖితకి మహతి ఎదురైంది. కొత్త చీరలో బాగా ముస్తాబై అందంగా మెరిసిపోతోంది మహతి. "నీ కోసమే బయలుదేరాను" అంటూ కలిసి నడవసాగింది. ఆమె మొహంలో ఆనందం చూసి "మొత్తానికి మీ వాళ్ళు అడిగినవన్నీ ఇవ్వటానికి ఒప్పుకున్నారన్నమాట" అంది నిఖిత.     "చచ్చినట్లు ఒప్పుకున్నారు. ఎవరికోసం ఒప్పుకుంటారు! నేను బాగా దెబ్బలాడాన్లే. తమ్ముడి మెడిసన్ సీటుకోసం అయితే లక్షలు ఖర్చు పెట్టటానికి వెనకాడటం లేదు. కానీ నా కోసం అంత గొడవ చేస్తారేం అని డైరెక్టుగా అడిగేశాను" అంది గర్వంగా.     "అదేమిటి, మీ తమ్ముడు చదివేది బి.ఏ. కదా! అతడికోసం లక్షలు ఖర్చు పెట్టటం దేనికి?"     "వాడు వట్టి బి.ఏ. అయితే వచ్చే లాభమేముంది చెప్పు. కొంచెం ఖర్చుపెడ్తే డాక్టరీయో, ఇంజనీరింగో చదివిస్తే వాడి మామగారి దగ్గర నుంచి దానికి రెట్టింపు వసూలు చెయ్యొచ్చు".     ఏ డొనేషనో కట్టి సుకుమార్ ని మెడిసన్ చదివిస్తారేమో అనుకుంది నిఖిత మనసులో. ప్రస్తుతం మెడిసన్ చదవటానికి అంతకన్నా పెద్ద వ్యూహాలు వున్నాయని ఆ అమ్మాయికి తెలియదు.     నిఖితతో మహతి "ఇప్పుడో నాకో పెద్ద  సమస్య వచ్చిపడింది. అందుకే నీ దగ్గరికి వచ్చాను" అంది.     నిఖిత వస్తున్న నవ్వుని ఆపుకుంది. "నిజమైన సమస్యలంటే ఏమిటో ఈ పిల్లకి ఇంతవరకూ అనుభవంలోకి రాలేదసలు. పేరంటాని కెళ్ళటానికి ఏ చీర కట్టుకోవాలి అన్నది కూడా బహుశా మహతికి సమస్యగానే తోస్తుందేమో" అనుకుంది.     "ఏమిటో చెప్పు."     "నాతో బ్యాంక్ కి రాగలవా?"     "దేనికి? డబ్బులు వెయ్యాలా. తియ్యాలా?" అడిగింది నవ్వుతూ నిఖిత.
24,555
    భార్యా విధేయుడు ఎప్పుడూ బాగుపడడు.     పెళ్ళాం అన్నం పెట్టకపోతే పెనిమిటి వీధిన పడనక్కరలేదు.     మందు మగువ మగాడి జన్మహక్కు.     ఇలా వాళ్ళంతా ఇష్టం వచ్చినట్లు వాగటం మొదలుపెట్టారు. వాళ్ళంతా ఒకటి, నేఒక్కడినీ ఒకటి. విసురుగ యివతలికి రాబోయాను. శరీరం నా అధీనంలో లేకపోయింది. వాళ్ళు నా తిట్లని జోక్ గ తీసుకుని మరింత మందు బలవంతాన నా నోట్లో పోశారు. నాకు గుర్తు లేదు. గుటక వేశానో వాళ్ళ ముఖాన వుమ్మేశానో.     గంటో రెండు గంటలో సోఫాలో పది నిద్రపోయాను. లేచి చూద్దును కదా, సగం మంది కక్కుకుని దానిలోనే పొర్లాడుతున్నారు. కొంతమంది పక్క గదిలో చేరి అద్దెకి తెచ్చిన ఆడదానితో అవసరం తీర్చుకుంటున్నారు. వాళ్ళంతా పసువుల్లాగా ప్రవర్తిస్తున్నారు. నా వూసు ఎవరూ పట్టించుకోలేదు. నేను బైటికి వచ్చేశాను.     రోడ్లన్నీ గంటసేపు షైర్ కొట్టి చాలా తీవ్రంగ ఆలోచించి యింటికి వచ్చాను.     ఈ విషయం నీతో చెప్పాలా వద్దా! యిదే ఆలోచన. చెప్పటం మంచిది కాని నీవు అపార్ధం చేసుకుంటే కష్టం. అందుకే చెప్పలేదు. యింటికి వచ్చిం తరువాత యింతవరకు ఏం జరిగింది నీకు తెలుసు. ఇప్పుడు చెప్పు సీతా! నాది తప్పో వప్పో!" అంటూ రామకృష్ణ మొత్తం వివరించి హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు.     సీత వింది భర్త చెప్పిందంతా.     సీత దీన్ని గురించే ఆలోచించింది.     లీలగ..... ఎక్కడో..... రాంగ్....     "సీతూ!" సీత మాట్లాడకపోయినా ప్రేమగా పిలిచాడు రామకృష్ణ.     సీత అతని ప్రేమకి కరిగి నీరయి అమాంతం పైకి లేచి అతని విశాల వక్షస్థలం మీద తలవాల్చుకోలేదు. క్షమించండి మిమ్మల్ని అపార్ధం చేసుకున్నాను. మీ పాదాలకింద (చెంత) యింత చోటు ఇవ్వండి అనలేదు.     సీత చాలా దీర్ఘంగ ఆలోచిస్తున్నది.     రామకృష్ణ మరో రకంగా అర్ధం చేసుకున్నాడు.     సీత సిగ్గు పడుతున్నది.     సీత సిగ్గు పడుతున్నది.     సీత పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నది.     అని -     భర్త ఎప్పుడూ భార్య విషయంలో ఓ అడుగు ముందుకు వేస్తుండాలి. సిగ్గు బిడియం స్త్రీకి ఎక్కువ. అందుకని భర్త చనువుగ ఆమెకి చేరువ అవుతుండాలి. తప్పుచేసిన స్త్రీ గాని పశ్చాత్తాపంతో కుమిలే స్త్రీగాని నిజం గ్రహించిన తర్వాత కూడా ఏమీ చేయలేక నత్తగుల్లల్లా ముడుచుకుని వుంటుంది. అప్పుడు భర్త ఆమెని దగ్గరకు తీసుకోవాలి. అలా చనువుగ దగ్గరకు తీసుకున్నా ఆమె సిగ్గుతో తోసి వేస్తుంది. అలా అని అప్పుడు ఆ భర్త మిన్నకుండకూడదు. మగతనం ప్రదర్శిస్తూ కాస్త బలవంతానైనా సరే ఆమెని లొంగదీసుకోవాలి.....     ఇలా అని బజారులో రూపాయి పావలాకి దొరికే "భర్త విధులు- కర్తవ్యం" అనే బుల్లి పుస్తకంలో రాసి ఉంది. ఆ పుస్తకాన్ని ఓసారి రామకృష్ణ చదివాడు.     అదిప్పుడు గుర్తుకొచ్చింది రామకృష్ణకి.     అలా యిప్పుడు చేద్దామనుకున్నాడు రామకృష్ణ.     ఆ ప్రయోగం సీతమీద చేస్తే అసలుకే ఎసరు. వ్యవహారం బెడిసికొట్టోచ్చు అని రామకృష్ణకి బొత్తిగా తట్టలేదు.     "ప్రేయసీ! మనొహరీ! నా సీతామనోహరి!" కూని రాగం తీస్తూ రామకృష్ణ సీత భుజంమీద చేయివేశాడు.     సీత కోపంతో గుర్రుమంటూ పైకి లేచింది.     చటుక్కున రామకృష్ణ సీతని కౌగిలిలోకి తీసుకున్నాడు.                                             17     సీతని గాడంగా చుంబించి వదిలేస్తూ "రతీదేవిలాగా వున్నావు సీతూ!" అన్నాడు రామకృష్ణ.     "వదలండి!" అంది సీత భర్త కౌగిలిలోంచి పెనుగులాడుతూ.     భార్య కోపంగా వుంటే ఆమె మాట వినకూడదు. ఆమె ఏమీ మాట్లాడుతున్నా పెడచెవిన పెడుతూ, మీ పని మీరు కానిస్తూ ప్రసన్నురాలిని చేసుకోవాలి - " అని ఆ దిక్కుమాలిన పుస్తకం "భర్త విధులు - కర్తవ్యం" లో రాసి వుంది.
24,556
    నాలోని కళావిషయకరమైన  ప్రశ్నలకు  శిల్పాచార్యులైన  ఆ త్రివిష్టప బుద్థ  భిక్షాచార్యులే  సంశయం తీర్చాలి.  పెట్టిన శుభముహూర్తమునుంచీ  శిల్ప, చిత్రలేఖనాలు నేర్చుకోవడం  ప్రారంభించాను.  నేను జూను, జులై, ఆగస్టు  నెలలు ద్యూపాంగు  సంఘారామంలో ఉన్నాను. దారుఫలకంమీద  సన్నని ఉల్లిపొరగుడ్డ  అంటించి,  అది  చిత్రలేఖనానికి అనువుచేసి ,  దానిమీద చిత్రించడం ఒక విధానం. గుడ్డమీదనే  చిత్రించడం  రెండవ విధానం. నేపాలునుండి వచ్చిన  చేతి తయారు కాగితాలమీద  చిత్రించడం మూడవ రకం.  ఈ విధానాలన్నీ నేర్చుకున్నాను. మా గురువుగారు  శిల్ప గ్రంథాలు  రెండు నాకు విపులంగా  వ్యాఖ్యానంతో  చెప్పారు.  మా గురువు గారికి  హిందీ రాదు.  స్వామీజీ శిష్యులయిన  ఒక స్వాములవారు  మా ఇరువురి  మధ్యా  ద్విభాషి అయ్యారు.''     దారుశిల్పం, లోహశిల్పం  తిబెత్తు వాసులకు  ఎక్కువ  ఇష్టం. నేపాలులోనూ అంతే. స్వదేశంలోనే  శిలాశిల్పం  నేర్చుకోవాలి అని సంకల్పం చేశాను. మా గురువుగారు  ఒక దినం  నన్ను ముఖ్యాచార్యులైన కులపతి కడకు  తీసుకొని  వెళ్ళారు. వారు నాకు  లలితకళలను  గూర్చి  ఉపదేశించారు!     '' నాయనా! నువ్వా  రోజున చెప్పినట్లుగా  లలిత కళలు ఆనందం కోసం  కదా  మనుష్యునిలో ఉద్భవించాయి!  సరే, ఆ ఆనందం  కూడా  మనుష్యునిలో  ఊరికే ఉద్భవించలేదు అతని  పురోభివృద్దికే  అతనిలోవున్న  సమస్త ఉత్తమ  గుణాలూ తేజరిల్లుతున్నాయి. అట్టి అనందం  అనేది పిచ్చివానికి మాత్రం  వుంటుందేమో! తన జీవితంలో  భాగమైన ఉత్తమ విషయాలు  కళా స్వరూపంతో  దర్శన  మిచ్చినప్పుడు మనుష్యునికి  నిజమైన ఆనందం  కలుగుతుంది.     '' ఆకలివేసి, ఆ ఆకలి  తీర్చుకొనుటకు  భోజనంచేస్తే, ఆనందం కలుగుతుంది. ఆ ఆనందం  తుచ్ఛమే అగుగాక. కాని, ఆకలి తీరడం భౌతికాభివృద్ది కొరకేకదా! ఆనందమూ, భౌతికాభివృద్దీ రెండూ కలసి వున్నాయి  ఆకలి తీరడంలో!  అలాగే  ఆనందం  ప్రయోజనంలో  పరమార్ధం కూడా  వుండి తీరుతుంది.       '' కాబట్టి కళను  ఉత్తమ  ప్రయోజన  స్వరూపంచేస్తే   మానవ  పురోభివృద్దికి  ఎంతో  మహోత్తమ  కళ అవుతుంది.''     '' స్వామీ! కళాస్రష్ట  సర్వస్వతంత్రుడుకదా, అలాంటప్పుడు అతన్ని ఈ రకంగా  కళ  వుండాలి అని   ఎవరైనా  నిర్భంధింపగలరా?  అన్న ప్రశ్న  నన్ను  బాధిస్తోంది'' అని  అ లామాను  ప్రశ్నించాను.     అ వృద్ద  సన్యాసి  చిరునవ్వు  నవ్వాడు. ఆ మందిరం  అ నవ్వులతో వెలిగిపోయింది.                                                                                            2         '' నాయనా! నిజంగా  మనుష్యునికి  సర్వ  స్వాతంత్ర్యం వుందా? పుట్టిన దేశం, కుటుంబం, కాలం అతని  స్వతంత్రాన్ని చాలా వరకూ  అరికట్టలేదా? భారతీయుడైతే బానిసగానే పుట్టుతున్నాడుగదా, అప్పుడాతనికి స్వతంత్రం వుందా?  మనుష్యుడు తన  గుణగణాలకి తానే ఆనకట్ట కట్టుకోవాలి గదా? తన  స్వాతంత్ర్యం  ఇతరుల  స్వాతంత్ర్యం దగ్గర ఆగాలి కదా?  మానవ ధర్మం, ప్రేమ,  దయ, సత్యమూ, శీలమూ  తన  స్వాతంత్ర్యాన్ని అరికట్టుతాయిగదా!  మనుష్యుడు  పిచ్చివాడయితే విషం పుచ్చుకుంటాడెమో?  కట్టిపెట్టి నరుక్కుంటాడా మంచివాడు? కఱ్ఱ పెట్టి కొట్టుకుంటాడా? అల్లాగే తన కుటుంబానికి, తనకు, తన దేశానికి, సర్వధర్మాలకు వ్యతిరేకమయిన పనులు  చేస్తాడా? అలాంటి కవిత్వం, చిత్రలేఖనం  సృష్టించగలడా? ''     '' స్వామీ! కేవల  సౌందర్యారాధన రూపమయిన  కవిత్వం  ఎందుకు రాయకూడదు?  సంపూర్ణ  సౌందర్యారాధన  మనుష్యునికి  హాని  కలిగిస్తుందా? ''     '' సౌందర్యారాధన లేనిదే  కళలు పుట్టనే  పుట్టవుకదా బాబూజీ! కళాత్మకు  సౌందర్యారాధనే మూలశక్తి. ఆ  ఆరాధన ప్రకృతి సౌందర్యారాధనగా, మానవ సౌందర్యారాధనగా, మానవ సృష్టి సౌందర్యారాధనగా,  మానవ చిత్త, గుణ, ఆత్మ సౌందర్యారాధనగా, మానస చరిత్ర  సౌందర్యారాధనగా  వుంటుందిగదా!''     '' చిత్తం. నా  వుద్దేశంలో,  మానవుడు తన్నే నాయకుణ్నిగా చేసుకొని, తన  ప్రేమ విధానాన్ని నాయికనుచేసి  కావ్యం  సృష్టించవచ్చునా? ''     '' తప్పకుండా! తన మనస్సు  లేనిది, లలితకళలే లేవుకదా! వస్తువు, దర్శనము చేయువాడు__ఈ ఇరువురి  సంబంధంలో  నుంచి  కదా లలిత కళలు వచ్చేది. ఆ కళలు  రెండు  రకాలుగా సృష్టిస్తాడు. ఒక  దానిలో  వస్తువు  వెనక  తాను  దాక్కొంటాడు.  ఇంకొకదానిలో తానే ప్రత్యక్షమౌతాడు. వస్తుగుణ, మానవ భావ ప్రదర్శనాలు సంపూర్ణంగా  శిల్పి  హృదయ  ప్రదర్శనాలే కదా!''     ''శృంగారరసానికి స్థానం ఏదండీ? ''     '' శృంగారరసం కళలో ప్రథమస్థానం వహిస్తుంది. సౌందర్యారాధనే శృంగారరసం. ఉత్తమ శృంగారం  భక్తి. భగవంతుని  అర్చించే భావము మనుష్యునిలో  స్త్రీ  భావము, భగవంతునిలో పురుషభావము  ఆరోపించుకొని గదా భక్తియొక్క శిఖరిత భావం  సృష్టించుకొన్నాడు  మనుష్యుడు! ''     ద్యూపాంగు ఆంధ్రసంప్రదాయ  పరంపరాను గతస్వరూపం  తాల్చింది. ఆంధ్రుణ్ణయిన నేను  అక్కడి  విద్యార్ది నయ్యాను. నా  ఆంధ్రదేశంలో ఇప్పుడు  శిల్ప  చిత్రకళలు  అధోగతిలోవున్నాయి. అవి  పునరుద్దరించడం నా  ధర్మము. దామెర్ల  రామరాయుని  చిత్రలేఖనాలు అనేకం  చూచాను. ఆ ఉత్తమ  పురుషుడు  ఆంధ్రసంప్రదాయం  పునరుద్దరింప  ప్రయత్నం  చేశాడు. ఆ ప్రయత్నంలో  కొంతవరకూ  జయంపొందినాడు. కాని  సిద్ది  లంభింపకుండా అవతారం  చాలించాడు. అందుకనే  అతని  చిత్రాలలో పరిపూర్ణత వచ్చే  స్థితి ద్యోతకం అవుతుంది. వర్ణాలు  ప్రాథమిక  స్థితి  దాటుతున్నాయి. రేఖలలో కర్కశత్వం వీడుతూవుంది. అంగవిక్షేపాలు  లాలిత్యం తాల్చబోతున్నాయి. భావమేళనము పూర్ణత  వహించబోతున్నది. చిత్రాలకు  వ్యక్తిత్వం  వస్తూ ఉన్నది. ఎంత  రసవత్తరమైనా  చిత్రానికీ, చిత్రంలోని పాత్రలకూ వ్యక్తిత్వం ఉండాలి. రామావతారం, కృష్ణావతారం  ఎంత సంపూర్ణ వ్యక్తిత్వ చిత్రాలు! కాళిదాసుని  మేఘసందేశం  వేరు, రఘువంశం  వేరు. అలాగే మనుచరిత్ర వ్యక్తిత్వం వేరు, పారిజాతాపహరణ వ్యక్తిత్వం  వేరు.  ప్రవరాఖ్యుడు, మాయాప్రవరాఖ్యుడు, సర్వోచి ముగ్గురూ  మూడు వ్యక్తులు  అలాంటి  వ్యక్తిత్వం  రామారాయుని  చిత్రాలలో  తేర వెనకనుంచి అవతరిస్తున్నది. అతనికి కృష్ణలీలచిత్రము, సిద్దార్థ యశోధర  చిత్రము  రెండూ ఒకటే. కృష్ణుడికీ, సిద్దార్థుడికీ ఏమీ  తేడాలేదు. యశోధరకూ  ఆమె చెలి కత్తెలకూ ఏమీ తేడాలేదు.  ఆ దోషం  అతని  చిత్రాలన్నింటిలోనూ  మాయం కావడం  ప్రారభించిన  మహోత్తమ  క్షణాల్లో  ఆంధ్రుల  దురదృష్టం వల్ల  ఆతడావతారం చాలించాడు. రవివర్మలో ఇంకా ఎన్నో  దోషాలున్నాయి. రామారాయుని  చిత్రకళ అంతా  కలిపితే  ఒక వ్యక్తిత్వం ఉంది. ఒక మహాతపస్సు  అతని  కళ.  
24,557
    చేతులు  వాష్ చేసుకుంటూ  అన్నాను ,రాజేశ్వరితో__"ఈ రోజు మరో గుణపాఠం నేర్చుకున్నాను డాక్టర్ ! ఒక రోగి తన బాధను  వ్యక్తపరచినప్పుడు, ఆఁ ఏదో చాదస్తంగా  చెబుతున్నాడులే !" అని తేలిగ్గా తీసుకోవటానికి  వీల్లేదు. ఆ తప్పటడుగే  మహా  ప్రమాదానికి  దారి తీయవచ్చు."     ఆమె అంగీకరిస్తున్నట్లు  తల ఊపింది.     ఈ వార్త  బయటకు  ప్రాకగానే  హాస్పిటల్లో  మరోసారి  పెద్ద  సంచలనం చెలరేగింది "హల్లో గ్రేట్ సర్జన్ ! మళ్ళీ  ఏదో  ఘనకార్యం  చేశావుటగా" అంటూ  మృదుల  వచ్చింది. ఆ సాయంత్రం  రెండు గంటలసేపు నా దగ్గరే  కూర్చుండిపోయింది. నా డ్యూటీటైము  అయిపోయేవరకూ  కదలలేదు. చివరకు  నాతోనే  బయటకు వచ్చింది.     నేనెంత శాంతమూర్తిని  అనుకున్నా, శాంతంగా  ప్రవర్తించాలని  ప్రయత్నించినా  మానవ సహజమైన  బలహీనత్వం  ఒక్కోసారి  ఆక్రమించి  జయిస్తూ  వుండేది.     ఒక ఉదయం  టేబిల్  ముందు  కూర్చుని  వున్నాను. ఒక స్త్రీ  ఆసరాతో  ఒక వ్యక్తి  కుంటుకుంటూ  నడిచి  వచ్చాడు లోపలకు  బహుశా ఆ స్త్రీ అతని భార్య అయివుండాలి.     "సైకిలు మీద  పోతూంటే  ఏక్సిడెంట్  అయింది. కాలు విరిగినట్లుగా  వుంది చూడండి" అన్నాడు, దుడుకుగా.     చదువుకున్న  వాడిలాగానే  వున్నాడుగాని  అతని  ప్రవర్తనలో  సభ్యతెక్కడా  కనిపించలేదు.     నేను రిస్ట్ వాచి  చూసుకుని, "యిప్పుడు తొమ్మిదే  అయింది. మీ కాలిమీద  బయటకు  దెబ్బేమీ కనబడటం లేదు. మీరు ఆర్దోపిడిక్ వార్డుకు  వెళ్ళి  చూపించుకోవాలి" అన్నాను.     అతను  విసుగ్గా  చూస్తూ "యింత  బాధతో  వస్తే, అక్కడకూ  యిక్కడకూ వెళ్ళమంటా రేమిటండీ! మీరు డాక్టర్లు కాదా ! పరీక్ష చెయ్యండి" అన్నాడు.     నేను ఓర్పుగానే  "చూడండీ, హాస్పిటల్ కు కొన్ని  నిబంధనలున్నాయి. ఈ టైములో  వచ్చేవారు  ఆ బాధలకు  సంబంధించిన  డిపార్టుమెంట్ లకు  వెళ్ళి  చూపించుకోవాలి" అని  చెప్పాను.     "అహ ! అలాగా ! ఆ రూల్సన్నీ  మాకు  తెలియవు  లెండీ....అయినా  నేనిప్పుడు  నడిచివెళ్ళే స్థితిలో  లేను. ఎలా  పంపిస్తారో  మీరే  పంపించండి నన్ను" అన్నాడు మొండిగా.     అతని  మొండితనం  చూస్తుంటే  కోపం వచ్చింది  నాకు. "అంత కదల్లేని  స్థితిలో  వున్నవారు  యిక్కడిదాకా  ఎలా  నడుస్తూ  వచ్చారు ?" అనడిగాను.     "అవన్నీ  మీకు  అనవసరం .హాస్పిటల్  లోపలికి  ప్రవేశించాక  రోగి  తాలూకు  బాధ్యత  మీరే వహించాలి. మీ కందరకు జీతాలిస్తున్నది ఎందుకు ?" భార్య "అబ్బ, ఊరుకోండి. ఘర్షణ ఎందుకూ?" అని వారించటానికి  ప్రయత్నిస్తూన్నా, దూకుడుగా  అన్నాడు.     "మాకు జీతాలిస్తున్నది  మీ అందర్నీ  మోసుకెళ్ళటానికి  కాదు ఇహ వెళ్ళండి" అన్నాను, కుర్చీలోంచి  లేచి నిలబడి గట్టిగా  అరుస్తూ.     "ఏమిటలా  మీదమీదకు  వస్తున్నారు కొడతారా ?"     ఆ మనిషి  అంటే  పరమ  అసహ్యమేసింది. నా సంస్కారాన్ని, ఆత్మవిశ్వాసాన్నీ  చంపేస్తున్నాడతను.     "ఛ ! నిన్ను కొడతానా ?" అన్నా నప్రయత్నంగా.     అతను ఉలికిపడినట్లు  చూశాడు.     బెల్ కొట్టి  వార్డు బాయ్ ని  పిలిచాను. అతను  రాగానే  "వీరిని  జాగ్రత్తగా బయటకు పంపేయి" అన్నాను.     ఆ వ్యక్తి మాటలు  తడబడుతూండగా  అస్పష్టంగా ఏదో అంటున్నాడు. వార్డుబాయ్ పరిస్థితి  అర్ధంచేసుకుని "పదండి మేష్టారూ ! ఇక్కడ  గొడవ  చెయ్యకూడదు" అని భుజంమీద  చెయ్యివేసి  మృదువుగానే  బయటకు తీసుకువెళ్ళాడు.     ఆ సంఘటన తల్చుకుంటే  కాసేపున్నాక  విచారమూ వేసింది, నవ్వూ వచ్చింది.     క్యాజుయాలిటీ  పోస్టింగు  అయిపోవస్తోంది. ఇంకా ఒకటి  రెండు రోజుల్లో   ఒకనాటి  ఉదయం  నళిని  వచ్చింది. "కనిపించటం  లేదేం  డాక్టర్ ?" అంటూ.     ఆ మాట నిజమే. అప్పటికామెను  కలుసుకొని  పదిహేను రోజులకు పైగా  అయింది.     "ఇవాళ నా డ్యూటీ  రెండుగంటలకు  అయిపోతుంది. సాయంత్రం  వస్తాను సిస్టర్!" అన్నాను, నవ్వి.         "నన్ను  సిస్టర్ అని పిలవ్వొద్దన్నాను. నాకిష్టం లేదని ఎన్నిసార్లు చెప్పాను ?"     నేను మెదలకుండా  ఊరుకోవటం చూసి "ఊఁ సరే, దాన్ని  గురించి గంటలు గంటలు ఆలోచించి వర్రీ అవకండి....సాయంత్రం  తప్పకుండా వస్తారుగా ! ఒట్టు సుమా !" అంది.     "వస్తానంటే  మాట  తప్పను" అన్నాను.     అన్న ప్రకారమే  ఆ సాయంత్రం  ఆరుగంటలకు  నళిని  పనిచేస్తున్న సెంట్రల్ స్టెరిలైజేషన్ డిపార్టుమెంటుకు  వెళ్ళాను. హాస్పిటల్ కు కావలసిన  సకల సామగ్రీ, యింజక్షన్  సిరంజిలూ, బేండేజీ క్లాత్ లూ __ అన్నీ యిక్కడ స్టెరిలైజ్ చేసి  ఆయా డిపార్టుమెంటులకు  పంపిస్తారు.     నళిని  నన్ను చూసి  కుర్చీలోంచి  నవ్వుతూ  లేచి నిలబడి, "రండి డాక్టర్!" అంటూ ఆహ్వానించి నన్ను కూర్చోపెట్టింది.     బల్లమీద  బేండేజి క్లాత్ లు   గుట్టలు గుట్టలుగా  పడివున్నాయి. నేను వెళ్ళేసరికి  ఆమె కత్తిరిస్తూ  కూర్చుందన్నమాట.     "ఒక్కరే ఉన్నారే, మీ స్టాఫ్ లేదా ?"     "లేదు. రెండు రోజులు సెలవు పెట్టింది. ఆమె స్థానంలో  మరెవరినీ నియోగించక పనంతా  నన్ను ఒక్కదాన్నే  చూసుకోమన్నారు."     "మీకు పరీక్ష లెప్పుడు ?" అనడిగాను.     "దగ్గరకొస్తున్నాయి. మరో పదిరోజులు."     "బాగా చదువుతున్నారా ?"     "ఏం చదువులెండి ? నా మొహం.ఇవతల పనే చూసుకోవాలా, మధ్య మధ్య వాళ్ళు  వేసే క్లాసులు ఎటెండ్ అవ్వాలా ? రాత్రుళ్ళు  పుస్తకం తీసేసరికి  నిద్ర వస్తుందాయె. ఇహ ఎప్పుడు చదివేది ?" అని నవ్వింది.     "ప్యాసు కాకపోతే మీ పని చెబుతాను" అన్నాను.     "ఏం చేస్తారేం ? అవును, ఏం చేస్తారు ? చెప్పండి. వినాలని  చాలా యింటరెస్టు గా వుంది" అంది, ముఖంలో కుతూహలం  కనబరుస్తూ.     "అమ్మా ఆశ ! ఇప్పుడు చెబుతానేమిటి ?"     "చెప్పకపోతే  దాచుకోండి  పోనీ. నాకేమన్నా  భయమనుకున్నార ? అసలు నేను తప్పితే  కదా ! తప్పటం యీ జీవితానికి  అలవాటు లేదు."     "నేనేం వద్దన్నానా ? పోనీ, ప్యాసవ్వండి. అప్పుడు శిక్ష కాదు, ప్రెజెంటు."     "ఓహో ! ప్రెజెంటా ?" అని కళ్ళెగురవేసింది. "ఏమిటిది ? మిమ్మల్నడగకూడదు లెండి. చెప్పరుగా."     నళిని గోడ దగ్గరకు  వెళ్ళి బీరువా తెరిచి, అందులోంచి  ఎర్రటి ఏపిల్ పండు ఒకటి తీసుకువచ్చింది. వాష్ బేసిన్ దగ్గర  దాన్ని  శుభ్రంగా కడిగింది. తర్వాత  చాకుతో  దాన్ని  రెండు  ముక్కలు కోసి  ఒకటి నాకు అందిస్తూ  "తీసుకోండి" అంది.     ఆమె దగ్గర  ఒక మంచిగుణం  చూశాను. ఎప్పుడు కలుసుకున్నా  చాకలెట్టో, పిప్పరమెంటో, స్వీటో, పండో ఏదో ఒకటి  యిస్తూ  వుంటుంది. ఒట్టి  చేతుల్తో  ఎప్పుడో  వుండేది కాదు.     యాపిల్ ముక్క  మెరిసే  తన పళ్ళ  మధ్య  వుంచుకుని  కొరుకుతూ ఏదో అనుమానం తోచినట్లు  గబగబ  గుమ్మందాకా  వెళ్ళి  తొంగిచూసి, తొట్రుపాటుపడుతూ  తిరిగి  వచ్చి  చప్పున  నా చెయ్యి  పుచ్చుకొని  లాగుతూ  "రండి, మేట్రన్ వస్తోంది. మిమ్మల్ని  దాచేస్తాను" అంది ఆదుర్దాగా.     "దాచెయ్యట  మేమిటి ? నాన్సెన్స్ ! వస్తే  రానివ్వండి."     "అలాక్కాదు. వాదులాడకుండా  చప్పున  రండి. మీకు పుణ్యముంటుంది" అని నేను తిరిగి  మాట్లాడటానికి  సందులేకుండా  చెయ్యిపట్టుకుని  లాక్కుపోయి, ఒక ప్రక్కకి  తీసుకువెళ్ళి, తలుపు తెరిచి, ఓ గదిలోకి  త్రోసి, మళ్ళీ  బయట  గొళ్ళెం  పెట్టింది.     జరిగింది నాకేం  అర్ధం  కాలేదు .నళిని  మీద  వెర్రికోపం  వచ్చింది. గదిలో  చీకటిగా  వుంది. బహుశా  స్టోర్ రూమ్ అనుకుంటాను. చెడ్డ ఉక్కగా  వుంది. స్విచ్ ఎక్కడ వుందో తడిమి లైటు వేద్దామనుకున్నాను. ఒక్క క్షణమాలోచించి  ఆ ప్రయత్నం  విరమించి, గట్టిగా తలుపు తడదామనుకున్నాను. ఇంతలో  బయట ఎవరివో మాటలు వినిపించి, ఆ ప్రయత్నమూ  విరమించి మెదలకుండా నిలబడ్డాను.     "స్టాఫ్ లేదా ? నువ్వొక్కదానివీ  పనంతా  చూసుకుంటున్నావా ? వెరీ నైస్" అంటూ మేట్రన్ గొంతు వినబడుతోంది.     నళిని  సన్నని  స్వరంతో  ఏదో అందిగానీ, సరిగ్గా  వినబడలేదు.     "స్టెరిలైజేషన్  జరుగుతోందా ? జాగ్రత్తగా  వుండాలి సుమా ! హాస్పిటల్ కి చెడ్డ పేరు రాకూడదు .స్టోర్ రూమ్ లాక్ చెయ్యకుండా  వదిలేశావేం ? అప్రమత్తతతో  వుండాలి. చాలా సామాగ్రి పోతోంది ,హాస్పిటల్ నుండి."     "అలాగేనండీ !" నళిని  వినయంగా  సమాధాన మిచ్చింది.     తర్వాత  వాళ్ళు  వెళ్ళిపోతూన్న  సవ్వడి  వినిపించింది. నా గుండె గబగబ కొట్టుకుంటోంది. మేట్రన్, తదితరులూ  వెళ్ళిపోయారని  దృడపర్చుకున్నాక  ఓ నిట్టూర్పు  విడిచాను. ఎంత గండం తప్పింది ! నా అదృష్టం బాగుండి, వాళ్ళి గది తలుపులు  తెరవలేదు గాని ,లేకపోతే  ఎంత రసాభాస అయేది ! నా పని ఎంత  నగుబాటు కావల్సివచ్చేది ! హాస్పిటలంతా  ఎంత  చిలవల పలవలుగా  చెప్పుకునేవారు !     నళిని  తలుపు  తీసింది. దీపం వెలుగు  గదిలో  పడింది. నా చెయ్యి పట్టుకుని  యివతలకు  లాగి ఆమె అంది. "ఇప్పుడు మీరు తల వాచేటట్లు  చీవాట్లు  పెడతారని  తెలుసు. చేసిన తప్పిదానికి  చెంపలు  వేసుకుంటున్నాను. క్షమించండి" అంటూ నా చెయ్యి  వదిలిపెట్టి  రెండు చెంపలూ  గట్టిగా  వాయించుకుంది.     ఎంతో ఉద్రిక్తతతో  ఆమెను  కడిగి పారెయ్యాలనుకుంటూన్న  నా నోటికి తాళం  వేసినట్లయింది.     "చాలా  గొప్పదానివేలే. ఇంకెప్పుడూ  నీ దగ్గరకు  రాను" అన్నాను ఉక్రోషంగా.
24,558
    ఆ తరువాత నేను నా తరఫు సాక్షుల్ని ప్రవేశపెట్టాను.     "మీ పేరు?"     "మార్గరెట్".     "వివాహం జరిగిందా?"     "జరిగింది. నా ఇరవయ్యవ ఏట. ఆ తరువాత మూడు సంవత్సరాలకి విడాకులు తీసుకున్నాను. అప్పటినుంచి ఇప్పటివరకూ- అంటే దాదాపు ముప్పై అయిదు సంవత్సరాలుగా ఒంటరిగా బతుకుతున్నాను".     "మీరు సంతోషంగా వున్నారా?"     "ఉన్నానని నిశ్చయంగా చెప్పగలను".     "ఏ విధంగా?"     "నా వైవాహిక జీవితంలో ఆ మూడు సంవత్సరాలూ నేననుభవించినంత నరకం ఎవరూ అనుభవించి వుండరు. నా భర్త ఒక పెద్ద శాడిస్టు. ఆ గతపు రోజులు తల్చుకుంటేనే ఇప్పటికీ నా శరీరం భయంతోనూ, జుగుప్సతోనూ జలదరిస్తుంది. భర్త నుంచి విడిపోయిన తర్వాత రెండు సంవత్సరాలపాటు ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం కొంత కష్టపడిన మాట నిజమే. కానీ ఇప్పుడు నేననుభవిస్తున్న సంతోషానికి దాన్నొక పెట్టుబడిగా భావిస్తున్నాను" అంటూ మార్గరెట్ ముగించగానే కోర్టు హాలంతా చప్పట్లతో దద్దరిల్లింది. ఇంగ్లండ్ లోని ఒక మిలియన్ ఇళ్ళలో ఈ సంఘటనని కొన్ని లక్షలమంది చూస్తున్నారని నాకు తెలుసు. జడ్జి కూడా ఈ పాయింట్ ని ఏకాగ్రతతో రాసుకోవడం నాకు సంతృప్తిని కలిగించింది.     క్రాస్ ఎగ్జామినేషన్ కోసం సూర్యమ్ లేచాడు. "మిస్ మార్గరెట్, మీ ఒంటరి జీవితంలో ఎంతమంది మగవాళ్ళు ఇప్పటివరకూ ప్రవేశించారు?" అని ప్రశ్నించాడు.     నేను చివుక్కున లేచి, "అబ్జెక్షన్ మిలార్డ్!" అని గట్టిగా అరిచాను. నా గొంతు నాకే కీచుగా ధ్వనించింది.     "అబ్జక్షన్ సస్టెయిన్డ్!" జడ్జి అంది.     సూర్యమ్ ఓడిపోయినట్టు తలదించుకుని ఒక క్షణం తర్వాత, మరో ప్రశ్న వేశాడు. "మీ ఒంటరి జీవితంలో, మీకెప్పుడూ తోడు కావాలనిపించలేదా?"     "లేదు". మార్గరెట్ ఖచ్చితంగా చెప్పింది.     "మీ ఇంట్లో ఎన్ని కుక్కపిల్లలున్నాయి?"     ఆమె తటపటాయించి, "ఆరు" అంది.     "దట్సాల్ మిలార్డ్!" అని కూర్చున్నాడు సూర్యమ్.           వెనుక వరుసలోకూర్చున్న కొంతమంది స్త్రీవాదులు కూడా ముసిముసిగా నవ్వుకోవడం నాకు చిరాకును కలుగజేసింది. నా రెండో సాక్షి వనజాక్షి. బ్రిటీష్ రెసిడెంట్. యాభై ఏళ్ళ అవివాహితురాలు.     "ది వుమన్ అన్న పుస్తకంపై మీ అభిప్రాయాన్ని ఒక్క వాక్యంలో చెప్పగలరా?" అని అడిగాను.     "ఆ పుస్తకాన్ని చింపి, ప్రతి కాగితాన్నీ కాల్చి ఆ మసిని కాఫీ పొడిలో కలిపి ఫిల్టర్ చేయకుండా తాగాలని నాకు అమితమైన కోరిక కలిగింది".     "మీ గురించి కొంచెం చెప్తారా?"     "పుట్టిందీ, పెరిగిందీ ఇంగ్లండ్ లోనైనా చదివింది భారతీయ ఫిలాసఫీ. నాకు వివాహం కాలేదు. చాలా హాయిగా వున్నాను. గౌరవనీయులైన న్యాయవాది గారన్నట్టు మా ఇంట్లో కుక్కలు కూడా ఏమీలేవు" అంది సూర్యమ్ వైపు చూస్తూ.     "ఈ పుస్తకం మీద మీకు ఇంత ద్వేషం ఎందుకు కలిగింది?"     "జీవితంలో వివాహం చేసుకోని స్త్రీ అంత దురదృష్టవంతురాలు ఇంకొకరు లేరు అని రచయిత తన అమూల్య అభిప్రాయాన్ని పాఠకుల మనసులపై ముద్రించడానికి ప్రయత్నం చేశాడు. గర్భం దాల్చే సమయంలో ఎక్కువకాలం సెలవు తీసుకునే హక్కు న్యాయబద్ధంగా వుంది కాబట్టి అవివాహితలకు, కొత్తగా వివాహం జరిగిన స్త్రీలకు ఉద్యోగం ఇవ్వడానికి అమెరికన్ కంపెనీలు వెనుకాడుతున్నాయని రాస్తూ, ఆ విధంగా మరొక కొత్తసమస్యను సృష్టించడానికి ప్రయత్నం చేశాడు. అమెరికాలోని ప్రతి వెయ్యిమంది పెళ్ళికాని అమ్మాయిల్లోనూ తొంభై ఆరుమంది గర్భవతులవడానికి కారణం వారి తల్లిదండ్రులనుంచి సరియైన ప్రేమ లభ్యమవకపోవడమేననీ, దీని వెనకవున్న అసలు కారణం తల్లి కూడా ఉద్యోగస్తురాలవడమనీ వాదించాడు. ఇంతకన్నా స్టుపిడ్ వాదం మరొకటుండదు". ఒక్కక్షణం ఆగి, ఊపిరి పీల్చుకుని వనజాక్షి తిరిగి చెప్పడం ప్రారంభించింది.     "భారతీయ సుప్రీమ్ కోర్టు షాబానో కేసులో ఇచ్చిన జడ్జిమెంట్ ని కూడా ఈ రచయిత తన పుస్తకంలో తప్పు పట్టాడు. ఇంగ్లండ్ లో దేశాధ్యక్షుడుగా స్త్రీకన్నా ఒక నీగ్రోని ప్రిఫర్ చేస్తామని దేశంలో 72 శాతం మందికి పైగా భావిస్తున్నారని రాసి ఇటు స్త్రీలనూ, అటు నీగ్రోలనూ అవమానపరిచాడు. పురుషుడి జ్ఞాపక శక్తిలో స్త్రీ జ్ఞాపకశక్తి కేవలం సగం మాత్రమే వుంటుందని అవాకులూ చవాకులూ రాశాడు. అంతేకాదు, ఒకే పరిస్థితిని పదిమంది స్త్రీలకీ, పదిమంది పురుషులకీ కలిగిస్తే అందులో ఇద్దరు పురుషులు, ఎనిమిది మంది స్త్రీలు రోదించడం కానీ, భయపడటం కానీ చేస్తారని ఒక సూడో సైంటిఫిక్ విశ్లేషణ పాఠకుల ముందుంచాడు. ఒక స్త్రీని ఏదైనా ఒక పెద్ద సంస్థకి సర్వాధికారిణిని చేసినా ఆమె ఆ సంస్థబాగోగులకన్నా కుటుంబానికే ఎక్కువ ప్రాముఖ్యాన్నిస్తుందని, భర్త ఆరోగ్యం నుంచి, మనవరాళ్ళ పెళ్ళివరకూ రకరకాల కారణాలు ఆమెకు ముఖ్యమవుతాయనీ ఈ రచయిత అన్నాడు. అందుకే నేనీ పుస్తకాన్ని ఒక పురుగుని చూసినదానికన్నా హీనంగా చూడాలనుకుంటున్నాను" అంటూ చెప్పడం ముగించింది వనజాక్షి.     నేను గుండెలనిండా ఊపిరి పీల్చుకున్నాను. వనజాక్షి చెప్పిన అభిప్రాయాలు జడ్జిలోనూ, జ్యూరీ సభ్యుల గుండెల్లోనూ గాఢంగా నాటుకున్నాయని వారి హావభావాలు చూస్తూంటే అర్థమైంది. నా పని సులువు చేసినందుకు వనజాక్షివైపు అభినందనగా చూశాను. సూర్యమ్ ఏదో ఫైల్ చదువుకుంటున్నాడు. వనజాక్షిని ప్రశ్నించడానికి అతడి దగ్గర ఏ వాదమూ లేదని నాకు తెలుసు. వనజాక్షిని మాటలతో కదిపితే తను మరింత ఓడిపోతానని అతడి అభిప్రాయం అయుండవచ్చు. నేననుకున్నట్టే అతడు క్రాస్ ఎగ్జామినేషన్ చేయలేదు. సాక్షి కుర్చీలోంచి లేచి వెళ్ళిపోయింది.     నేను నా అంతిమవాదం కోర్టుకు సమర్పించడం కోసం ఆయత్తమయ్యాను. "మిలార్డ్! వుమన్ లిబరేషన్ మూవ్ మెంట్ అనేది దాదాపు 250 సంవత్సరాల క్రితం 1772లో ప్రారంభమైనది. 1772లో 'స్త్రీ హక్కుల పరిరక్షణ' అన్న పుస్తకాన్ని ఊల్ స్టోన్ క్రాఫ్ట్ అనే రచయిత్రి రాయడంతో స్త్రీజాతి మేల్కొన్నదని ఉద్యమకారులు చెప్తారు. ఈ 250 సంవత్సరాల్లోనూ అదృష్టవశాత్తూ పురుషాహంకారాన్ని ఎదుర్కొంటూనే స్త్రీలు ఎంతో అభివృద్ధి సాధించారు. చాలా హక్కుల్ని సాధించుకున్నారు. ఇటువంటి సమయంలో ఈ పుస్తకం రాయడం స్త్రీకే కాదు. మానవజాతికే అవమానకరం. స్త్రీ పురుషుడితో ఎప్పుడూ సమానం కాదనీ, వారిని ఎక్కడ వుంచాలో అక్కడే వుంచాలి అనీ రచయిత తన ప్రారంభవాక్యంలోనే పేర్కొనడం అతడి సంకుచిత దృష్టిని తెలియజేస్తోంది. ఇతడు మరింత లోతుకువెళ్ళి మతాల్ని కూడా తన వాదానికి అనుగుణంగా తిప్పుకున్నాడు. ఈవ్ వల్లే ఆడమ్ నాశన మయ్యాడని ఆరోపించాడు. పురుషుడి వంగిన రొమ్ము ఎముకనుంచి స్త్రీ సృష్టింపబడిందనీ కాబట్టి అటువంటి స్త్రీని సరిచెయ్యాలనుకుంటే అది విరిగిపోతుందనీ మహమ్మద్ ప్రవక్త అన్నట్టు రాసి ఈ సమాజంలో స్త్రీ స్థానాన్ని నిర్దేశించడానికి ప్రయత్నం చేశాడు. విడాకుల చట్టం ఆధారంగా స్త్రీలు తమ మాజీ భర్తల ఆదాయాల్ని కొల్లగొట్టుకునే అవకాశాన్ని పొందుతున్నారని దారుణమైన ఆరోపణ  ఒకటి చేశాడు. ఇటువంటి పుస్తకం రాయడంలోనే రచయిత అపరిపక్వత, దృష్టిరాహిత్యం, పురుషాహంకారం, స్త్రీలపై కోపం, ఈర్ష్య, అసూయ గోచర మవుతున్నాయి. ఒక స్త్రీలో తల్లినీ, చెల్లినీ, భార్యనీ చూడవలసిన ఈ రచయిత కేవలం ఒక బానిసని మాత్రమే చూడడం విచారకరం! జనారణ్యంలో కూడా ఆటవిక న్యాయమే చెల్లుతుందనీ, పురుషుడు స్త్రీకన్నా బలవంతుడు కాబట్టి, ఎలాగూ అతడినుంచి ఆ అల్పప్రాణి దూరంగా పారిపోలేదు కాబట్టి, పురుషుణ్ణి బ్రతిమాలో, భంగపడో అతడితోనే కలిసి వుండాలని రాశాడు. దీనికోసం తన ఆయుధాలుగా తన సహనాన్నీ, ఓర్పునీ వాడుకోవాలన్నట్టు సూచించాడు. కోపము, చిరాకు, ద్వేషము మొదలైనవన్నీ పురుషుడి సహజ లక్షణాలైతే, శాంతము, సౌశీల్యము మొదలైన గుణాలతో అతడిని ఓదార్చి లాలించకపోతే స్త్రీకి మనుగడే వుండదని కొత్త సూత్రాన్ని సభ్యసమాజానికి తెలియజెప్పాడు. ఇటువంటి పుస్తకాన్ని వెంటనే నిషేధించకపోతే స్త్రీ విముక్తిని నాశనం చేయడం కోసం మరెన్నో చీడపురుగులు ఇటువంటి పుస్తకాలరూపంలో వెలువడే ప్రమాదం వుంది. కాబట్టి మిలార్డ్. నేను ప్రవేశ పెట్టిన సాక్షుల అభిప్రాయాల ఆధారంగా... ఈ పుస్తకం చదివి మీరు ఏర్పరచుకున్న అభిప్రాయాల ఆధారంగా సరియైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ నా వాదాన్ని ముగిస్తున్నాను".     కూర్చుంటూ ప్రేక్షకుల గ్యాలరీవైపు చూశాను. సర్వత్రా హర్షం ప్రకటిత మవుతోంది. ప్రకాష్ బొటనవేలు పైకెత్తి "గెల్చావు సుమా?" అన్నట్టు అభినందించాడు. వాడు నాకన్నా రెండేళ్ళు చిన్నవాడు. ఎక్కడో దూరపు బంధుత్వం కూడా వుంది. నన్ను 'అక్కా' అని పిలిస్తూంటాడు.     నేను ఓరగా సూర్యమ్ వైపు చూశాను. నుదుటిమీద చెయ్యిపెట్టుకుని కళ్ళు మూసుకుని దీర్ఘాలోచనలో వున్నట్టున్నాడు. ప్రతివాదం సమర్పించడం కోసం కుర్చీలోంచి లేచే ప్రయత్నం కూడా చేయలేదు. వాదించడానికి కూడా అతని దగ్గర ఏమీలేదని నాకు తెలుసు. నిజానికి పుస్తకం అంత దారుణంగానూ వుంది. వనజాక్షి చెప్పినట్టు కాల్చి కాఫీలో కలపాల్సిన పుస్తకమే!     జడ్జి సూర్యమ్ వైపు తిరిగి 'ఇక మీ వంతు' అన్నట్టు చూసింది. సూర్యమ్ ఇంకా అదే భంగిమలో నిరాసక్తంగా కూర్చుని వున్నాడు.     అప్పుడొక చిన్న సంఘటన జరిగింది.     సూర్యమ్ తాలూకు జూనియర్ లాయరు కొన్ని కాగితాలు, పుస్తకాలు తీసుకొచ్చి అతడికందజేశాడు. వాటిని చూడగానే సూర్యమ్ మొహం విప్పారటం గమనించాను. జడ్జి అనుమతితో అతడు వనజాక్షిని తిరిగి బోనులోకి పిల్చి క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం ప్రారంభించాడు.     "మీరు చదివింది భారతీయ ఫిలాసఫీ అన్నారుకదా!"     "అవును".     "మనుధర్మ శాస్త్రం చదివారా?"     "చదివాను".     " 'న స్త్రీ స్వాత్రంత్య మర్హతి' అంటే అర్థమేమిటి?"     వనజాక్షి సమాధానం చెప్పడానికి ఒక క్షణం తటపటాయించింది.     సూర్యమ్ రెట్టించాడు. "మీకు సంస్కృతం తెలుసు. దయచేసి సమాధానం చెప్పండి".     "స్త్రీకి స్వతంత్ర అర్హతలేదు అని" అంది.     "అంటే స్త్రీ ఎప్పటికైనా పురుషుడిమీదే ఆధారపడి వుండాలి అనేగా?"     "అబ్జెక్షన్ మిలార్డ్!" అంటూ లేచాను... "మనం ఇక్కడ చర్చిస్తున్నది 'వుమన్' అన్న పుస్తకాన్ని నిషేధించడం గురించి తప్ప మనుధర్మ శాస్త్రం గురించి కాదు".
24,559
      "కాని మన టుబాకో కంపెనీ సేల్స్ వివరాలు రికార్డ్స్ లో స్పష్టంగా ఉన్నాయి." సత్యానంద్ గొంతు వణికింది.     "అవన్నీ ఫిక్షనల్ సేల్స్ అంకుల్. గుంటూరులో ఉన్న మన సిగరెట ఫ్యాక్టరీ వ్యవహారాలు చూసే బాధ్యత డాడీ మీకు అప్ప చెప్పారు. దాన్ని మీరు అవకాశంగా తీసుకున్నారు. ఒకపక్క సిగరెట్ల ఉత్పత్తి వాస్తవంగా అయినదానికన్నా తక్కువగా రికార్డ్ చేశారు. నెలకి పది మిలియన్ల సిగరెట్లు ఉత్పత్తి అయి పన్నెండు ట్రక్స్ పైన డీలర్స్ కి పంపుతుండగా, ప్యాక్టరీ ఇన్ వాయిస్ నీ, లారీ నెంబర్లనీ తారుమారు చేయించారు నాణ్యత లేదని లక్షలకొద్దీ సిగరేట్లు స్క్రేఫ్ గా మార్చినట్టు రికార్డ్ చేయించి, దానికి తగ్గట్టు ముడిసరుకుగా వాడిన పొగాకు ఎకౌంటులోనూ జాగ్రత్త తీసుకున్నారు. నిలువ చేయడంలో పాడైనట్లు 'స్టోరేజ్ లాసేస్' అన్న టర్మ్ తో అద్భుతంగా మోసానికి పాల్పడ్డారు. మీరు టుబాకో కంపెనీలో ఎ ఎగ్జిక్యూటివ్స్  తో చేతులు కలసిందీ, ఏయే రాష్ట్రానికి ఎంత అనకౌంటేడ్ గా పంపి విడిగా డబ్బు చేరుకున్నదీ ఆ ఫైల్లో వుంది.     హనిత మేధ ఏయే మూలదాకా విస్తరించి పోతున్నదీ ఎప్పుడో తెలుసుకున్న సత్యానంద్ ఏర్ ఈరోజు ఒక పథకం ప్రకారం తన అవినీతిని సాక్ష్యాదారాలతో ఆమె నిరూపిస్తుంటే దారుణంగా కుంచించుకు పోతున్నాడు.     "మీ అవినీతి నెలకి ఎన్ని లక్షల్లో ఉందన్నదీ అంకెలతో సహాఉంది. మిస్టర్ సత్యానంద్ . అది చాలు మిమ్మల్ని మీ స్థానం నుంచి పక్కకి నెట్టడానికి . మీ షేర్సు మాట ఎలా ఉన్నా మీరు జైలుగోడల మధ్య తక్కిన మామూలు ఖైదీలతో కొన్నాళ్ళు శిక్షని షేర్ చేసుకోవదానికీని. మీ షేర్స్ తో ఈ సంస్థ నష్టాన్ని పూడ్చుకోగలదు. కాని మీరు ఫిక్టనల్ గా __ ఇంకా స్పష్టంగా చెప్పాలంటే దొంగతనంతో _ ఎకౌంట్ లేకుండా అమ్మిన మిలియన్ల సిగరెట్లు గురించి ప్రభుత్వానికి తెలియపరిచే  ఎగవేసిన ఎక్సైజ్ డ్యూటీ విషయంలో మీరు శిక్ష్యార్హ్లు లౌతారు."     సత్యానంద్ నేలచూపులు చూస్తూ ఉండిపోయాడు.     "షేమ్ షేమాన్ పార్ట్ మిస్టర్ సత్యానంద్ ! ఇలాంటి దౌర్భాగ్యులని తెలసీ బహుశా డాడీ మిమ్మల్నందర్నీ క్షమిస్తూ మానసిక మైనా శ్రమనిఉ తాను భరించారు. అనారోగ్యానికి గురయ్యారు. కానీ నేను అయన కూతుర్నే అయినా ఆయనంట క్షమాగుణం ఉన్నదాన్ని కాను. కాబట్టే సమస్యల్ని చాలా త్వరలో సింప్లీఫై చేయబోతున్నాను" పైకి లేచింది. "ఇన్నాళ్ళూ మిమ్మల్నందర్నీ ఎదిగిన పెద్దమనుషులు అనుకుంటూ 'అంకుల్' అని పిలిచి పొరపాటు చేసిన నేను చివరగా హెచ్చరించేదోక్కటే. ఈ చేతుల్నీ హత్యలతో దాచేయగలరనుకోకండి. మీ ముందుంచిన ఫైలు లోనివి ఒరిజినల్స్ కావు. కాఫీలు మాత్రమె. సో, చీఫ్ జిమిక్స్ మానేసి కొన్నాళ్ళపాటు బుద్దిగా ఉండండి. కొన్నాళ్ళు అంటే రాబోయే బోర్డు మీటింగ్ లో మీ జాతకాలు డాడీముందు నేను బయటపెట్టె వరకుబై."     కేవలం సంస్థ ప్రతిష్ట దిగజారకూడదని హనిత ఇక్కడా కొంత సహనాన్ని ప్రదర్శి౦చింది. సత్యానంద్ మౌనాన్ని గిల్టీ నేస్ తో తలవంచుకోవడంగా భావించింది. తప్ప ఆ బోర్డు మీటింగ్ కి ముందే ఆమె కథని మరింత సింప్లీఫై చేయాలనకుంటున్నాడని ఊహించలేక పోయింది.                                         *    *    *    *        హఠాత్తుగా గదిలోకి వచ్చిన హనితని చూసిన ప్రభంజనరావు ఎంత కంగారుపడ్డాడూ అంటే, అప్పటికే ఫోన్ లో ఎవరితోనో మాట్లాడుతున్న వాడల్లా అర్జెంటుగా రిసీవర్ పెట్టెయబోయాడు.     "నో ప్రాబ్లమ్ .... మాట్లాకండి"     "ఇట్సాల్ రైట్"     "తప్పు చేస్తున్నట్టు ఎందుకలా త్రోటుపడతారు? సాకేత ఫోన్ చేసిందా?"     పక్కలో బాంబు పేలినట్టు అదిరిపడ్డ ప్రభంజనరావు వెంటనే ఫోన్ క్రేడిల్ చేశాడు. నిజంగా అ సమయంలో ప్రభంజనరావు మాట్లాడుతున్నది సాకేతతోనో. తనను వెంటాడుతున్న గేంగు విషయం చెబుతూ హాస్పిటల్ లో అడ్మిట్ అయిన తన తల్లి బెడ్ పక్కన బిక్కుబిక్కుమంటూ ఎలా గడుపుతున్నదీ వివరిస్తూంది. ఇంతలో హనిత రావడం జరిగింది.         అదికాదు ప్రభంజనరావు అందోళన పరిచింది. నిన్న సాయంకాలం సాకేతను తను రక్షిస్తుండగా చూసిన గేంగు అంతా తెలియపరిచారు. కాబట్టే సర్కాస్టిక్ గా హనిత అలా అంది.     హనిత మాత్రమే కాదు ఇప్పుడామె నీడ చూసినా బెదిరే స్థితిలోకి జారిన ప్రభంజనరావు నీళ్ళు నమిలేస్తూ "అబ్బే ఎవరో ఫ్రెండు మాట్లాడుతుంటేనూ .... అసలు .... సాకేత ఎవరు?" చెబుతూ హనిత సూటిగా చూస్తుంటే టక్కున ఆగిపోయాడు.     "మీరు ఎవరు ఎవరికి సహకరించినా నాకు అభ్యంతరం లేదు మిస్టర్ ప్రభంజరావ్ ! ఎలాగూ నీడలా మిమ్మల్ని నేనూ వెంటాడుతున్నాను. కాబట్టి ఏం జరుగుతున్నదీ తెలుసుకోవడం నాకూ కష్టం కాదు. ఇకపోతే ఇంతదాకా వచ్చింది కాబట్టి ఒక విషయం నేనూ స్పష్టం చేయాలి. సాకేత ఎవరన్నా కాని ఎంతైనా సాటి ఆడపిల్ల కాబట్టి బెదిరించి  నోరు మూయించాలని అనుకుంటున్నాను తప్ప, అంతకుమించిహాని చేయాలన్న అలోచన నాకు లేదు. ఒకవేళ నా తండ్రికి పుట్టిన కూతురే అయితే నా తోబుట్టువుగా అంగీకరించడానికి నాకూ ఎలాంటి అభ్యంతరం లేదు. ఆ విషయం స్పష్టంగా చెప్పాను కూడా. కానే ప్రస్తుతం డాడీ ఆరోగ్యం సవ్యంగా లేదు. కాబట్టి కొంతగడుపు కావాలన్నాను. విననుంది. పైగా రణధీర్ ని హత్య చేయించింది కూడా నేనే అంటూంది . పిచ్చిపిల్ల అనుకున్నాను. పదిమంది ముందూ పిచ్చిగా వాగకుండా కొన్ని రోజులపాటు నోరు మూయించుకున్నాను. ఇదీ నా ఉద్హేశ్యం " ఓ క్షణం ఆగింది. "ఇకపోతే దీన్ని అవకాశంగా తీసుకోవాలని ఎవరన్నా _ అదే మీలాంటివాళ్ళు ప్రయత్నిస్తే మాత్రం నేను సహానాన్ని కోల్పోతాను. ఈ విషయం గుర్తుపెట్టుకొండి. వీలైతే ఆ పిచ్చిపిల్లకి నచ్చచెప్పండి బై!"     హనిత బయటికి నడిచింది.     ప్రభంజనరావు అవాక్కయి తన గదిలో తెల్లమోహం వేసుకుని కూర్చున్న సమయంలో తన ఛాంబర్ కి వచ్చిన హనిత ఆలస్యం చేయలేదు. కిరీటికి ఫోన్ చేసింది.     వెంటనే లైన్ లోకి వచ్చాడు కిరీటి .     "మీతో అర్జెంటుగా కొన్ని విషయాలు మాట్లాడాలి కిరీటి . చాలా అవసరం ... ఇప్పుడు కాదు. రాత్రికి నేను మీ బంగళాకి వస్తాను. ప్రాబ్లంలేదు. తప్పదు ..... రాత్రి పది గంటలకి .... అంటే డాడీ నిద్రపోయాక .... ఎస్."     హనిత ఫోన్ క్రేడిల్ చేసింది.     ఆమె ఛాంబర్ లోకి రాబోతూ స్ప్రింగ్ డోర్ దగ్గరే ఆగిన ఓ వ్యక్తి ఆమాటలు విన్నాడు . ఉక్రోషంగా పిడికిళ్ళు బిగించుకుని ఆ రాత్రి వ్యవహారాన్నిఆటో ఇటో తేల్చేయాలనుకున్నాడు.     హనిత గదిలోకి అడుగు పెట్టకుండా వెనక్కి మరలిజ్న ఆ వ్యక్తి శివరావు.                                                                *    *    *    *     సాయంకాలం అయిదు కావస్తూంది.     డ్యూటీ టైమ్ ముగిసిపోవడంతో ఇంటికి బయలుదేరాలనుకున్న మొనీ బాత్ రూమ్ లోకి నడిచి బాబ్ద్ హెయిర్ సవరించుకుంది. వాలెట్ లోని లైఫ్ స్టిక్ తీసి పెదవులకు అద్దుకుని అద్దంలో ఓమారు చూసుకుని టేబుల్ దగ్గరకు నడిచింది.     సరిగ్గా అప్పుడు ఇంటర్ కమ్ బజర్ మోగింది.     రిసీవర్ అందుకొని "హలో" అంది కిరీటి పిలుస్తూన్నాడేమో అనుకుంటూ.     "నేను .... రాజేంద్రని" ఖంగుమంది కంఠం.     "ఎన్సర్" ఎవరో అవసరం ఉంటే తప్ప సామాన్యంగా మాట్లాడని వ్యక్తి రాజేంద్ర. పైగా అతని గొంతులో సహజంగా వినిపించే కాఠిన్యం ఆమెను చాలా కంగారుపడుతూ వుంటుంది.     "ఇందాక కొత్త జి.ఎమ్ . తో చాలా మాట్లాడినట్టున్నావు?"     "వ్వాట్?" ఇదంతా రాజేంద్రకి ఎలా తెలిసిందీ అన్న విస్మయం ఆమె గొంతులో . "నో ... నో సర్!"     "తెలివితేటలు ప్రదర్శించకు."     "సర్!"     "అతను నీకు ముందే పరిచయమా?"     చెప్పాలా వద్దా అన్న సందిగ్ధంలో ఓ క్షణం ఆగి "య .... ఎస్సర్ " అంది.     "అందుకని నా గురించి నోటికొచ్చినట్టు కూసేవన్నమాట!"     మోనీలో సన్నగా కంపనం మొదలయింది. ఇందాక కిరిటీ తను బాస్ మంటూ హెచ్చరించినప్పుడే సగం మూడ పాడయింది. ఇదంతా ఏమిటో అర్ధంకానట్టు ఆమెకు కళ్ళనీళ్ళ పర్యంతమౌతుంటే ముందు రాజేంద్ర గురించి తను ఎం చూసిందీ గుర్తు చేసుకోవాలనుకుంది. కానీ అప్పటికే మెదడు మొద్దుబారిపోవడంతో వ్యక్తి జ్ఞప్తికి రాలేదు.     "సారీ సర్" ఏడుస్తూ౦ది.     "నేనెవర్ని ?"     "రాజేంద్రసర్!"     "నాన్సెన్స్ .... నా పొజిషన్ మిటి?"     "యూ ఆర్ చీఫాఫ్ డిజైన్స్ డిపార్ట్ మెంట్ !"     "నాన్సెన్స్ ... నాకున్న పరపతేమిటి?"     "మీరు మీ ఫ్యాక్టరీలో చాలా పలుకుబడి ఉన వ్యక్తి. బోర్డు డైరెక్టర్స్ కి మీరెంత చెబితే అంత."     "ఇంకా?"     "మీ మాటకి ఎదురు చెప్పిన వాళ్ళని వెంటనే బయటకి పంపేయగలరు"     '"ఇంకా?"
24,560
    "అమ్మ బాబోయ్" అని పరుగు లంకించుకున్నాడు ప్రొఫెసర్, మెడమీద కోతితో సహా.     ఈ మనిషి సవారి బాగా నచ్చింది ఉరాంగ్ ఉటాన్ కి. ఈ సౌఖ్యాన్ని వదులుకుని ఇంక జీవితంలో వచ్చినా నడవకూడదని నిశ్చయించుకుంది.     అందుకని ముందు జాగ్రత్తగా, అతని మెడచుట్టూ, తన కాళ్ళని మరింత గట్టిగా బిగించింది.                                    *    *    *     తడి బట్టతో వణుకుతూ, చెట్ల దగ్గరికి వచ్చింది స్వరూపరాణి.     చలితో, దుఃఖంతో, భయంతో వణికిపోతోంది ఆమె.     రక్తం గడ్డ కట్టేలా తోడేళ్ళ అరుపులు వినబడ్డాయి.     తోడేళ్ళు అతి భయంకరమైన జంతువులని విని వున్నది స్వరూప. వేటాడిన ప్రాణులని పూర్తిగా చంపకుండానే, అవి ఇంకా ప్రాణంతో వుండి ఊపిరి పీలుస్తూ వుండగానే  పీక్కుతినే కౄర జంతువులు తోడేళ్ళని  విన్నది.     నిశ్చేష్టురాలయి నిలబడిపోయింది.     ఎండు ఆకులు గలగల శబ్దం చేశాయి.     చిన్న పొదలు పక్కకు కదిలాయి.     అప్పుడు కనబడిన దృశ్యాన్ని చూసి, కళ్ళను తనే నమ్మలేక పోయింది స్వరూపరాణి.     పధ్నాలుగు, పదిహేను సంవత్సరాల వయసులో నగ్నంగా వున్న ఒక అమ్మాయీ, ఒక అబ్బాయీ తోడేళ్ళలా పళ్ళు బయటపెట్టి, తోడేళ్ళ లాగే అరుస్తూ, రెండు చేతులూ నేలకు ఆనించి, నాలుగుకాళ్ళ జంతువుల్లా పరిగెడుతూ ఆమె మీదుకు వస్తున్నారు!                                                                           12     ఉప్పెన ద్వారా ఒడ్డుకు కొట్టుకు వచ్చిన ఫకర్, ఇబూకా తడిబట్టలతో వణుకుతూ అడవిలో నడవడం మొదలెట్టారు.     "చిత్రంగా ఉంది! చాలా చిత్రంగా ఉంది! ఇది బహు విచిత్రంగా వుంది!" అన్నాడు ఇబూకా జరిగినవన్నీ తలుచుకుని తలుచుకుని ఆశ్చర్యపోతూ. "చూడు ఫకర్! దేవుడనే ఓ శాల్తీ ఉందంటే నమ్మని జగమొండి ఘటం కూడా ఇదంతా చూస్తే దేవుడికి దణ్ణం పెట్టి తీరవలసిందే! గండం గడిచి పిండం బయటపడ్డట్లు పడ్డాం! అవునా?"     "అవునవును!" అన్నాడు ఫకర్.     "ఫకర్ భాయ్! ఇంతకీ మన కేప్టెన్ సాబ్, మేడమ్ సాబ్ ఏమయి ఉంటారంటావ్?"     "ఏమీ అయిఉండరు! నువ్వు దేముడు, దేముడు అంటున్నావు చూడు, ఆయనే ఉంటే, వాళ్ళు కూడా ఒడ్డుకి కొట్టుకొచ్చి ఇక్కడే ఎక్కడో తిరుగుతుంటారు ఇంకోగంట లోపల వాళ్ళు మనకి తగుల్తారు చూడు!" అన్నాడు ఉత్సాహంగా. అతను నిరంతర ఆకాజీవి.     "చూడు ఇబూకా! కడుపులో ఆత్మారాముడు రంకెలెయ్యడంలేదూ?" అన్నాడు పొట్ట నిమురుకుంటూ.     ఇబూకా సమాధానం చెప్పకుండా అటూ ఇటూ చూశాడు. ఎదురుగా పెద్ద బండ ఒకటి కనబడింది. దాని మధ్య పెద్ద పగులులాంటి చీలిక ఉంది ఆ చీలికలో అర డజను పక్షి గూళ్ళు వున్నాయి. తమాషాగా, కాఫీ కప్పు ఆకారంలో కనబడుతున్నాయి అవి.     ఇబూకా మొహం వికసించింది. "కేప్ స్విప్టు లెట్" అనే పిచ్చుకను పోలిన పిట్ట గూళ్ళు అవి. పిల్లలని పెట్టే సమయంలో దాని లాలాజల గ్రంధులు పెద్దవయి, ధారాళంగా లాలాజలాన్ని స్రవిస్తాయి. అది గాలి తగలగానే వైరులా గట్టిపడి పోతుంది. దానితో గూడు అల్లుతుంది అది. ఆ  గూడు రాతికి అతుక్కు పోతుంది. తూర్పు దేశాల వాళ్ళు దానితో అతి రుచుకరమైన సూప్ చేసుకుని ఇష్టంగా తింటారు. ఒక విధంగా, అవి ప్రపంచంలోని అతి ఖరీదైన గూళ్ళు అని చెప్పొచ్చు.     ఒక కర్రతో నాలుగు గూళ్ళు కింద పడేసి, ఎండుపుల్లలతో నిమిషాల్లో అగ్గి రగిల్చి, సూప్ ని గుర్తు తెచ్చే వంటకం ఒకటి తయారుచేశాడు ఇబూకా.     ఇద్దరూ ఆవురావురుమని తినడం మొదలెట్టారు.                                                              *    *    *     దిగ్ర్భమ చెందిన స్వరూప, మనుషులో, జంతువులో అర్ధంకాకుండా వున్న ఆ పిల్లలవైపు చూస్తూ ఉండిపోయింది.     వాళ్ళు శరవేగంతో ఉరుకుతూ వచ్చి, స్వరూపకి అతి సమీపంలో ఆగి సందేహంగా ఆమె వంటిని వాసన చూశారు. ఆ తర్వాత పెద్దగా అరవడం మొదలెట్టారు.     అచ్చం తోడేళ్ళలాగే.     ఊపిరాగిపోయినట్లయింది స్వరూపరాణికి.     వీళ్ళు మనిషి పిల్లలే అయితే, తోడేళ్ళలాగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు.     చటుక్కున ఆమెకు తను చూసిన "జంగిల్ బుక్" సినిమా గుర్తొచ్చింది. రుడ్ మార్డ్ కిప్లింగ్ రాసిన నవల ఆధారంగా తీశారు ఆ సినిమా అందులో మౌగ్లీ అనే కుర్రాడ్ని అకేలా అనే తోడేలు పెంచి పెద్ద చేస్తుంది.     అది కేవలం ఫాంటసీ అనుకుంది తను. అలా నిజజీవితంలో జరగడం సాధ్యమేనా అసలు?     కానీ ప్రత్యక్షంగా తన కళ్ళతో చూస్తున్న దానిని నమ్మకపోవడం ఎలా?     ఆ పిల్లలు ఇద్దరూ కూడా సంకోచిస్తూ ఆగి, ఆసక్తిగా ఆమెని చూడడం మొదలెట్టారు.     వాళ్ళవల్ల తనకి తక్షణ ప్రమాదం లేదని గ్రహించిన తర్వాత కొంచెం దైర్యం తిరిగి వచ్చింది స్వరూపకి. వాళ్ళని పరిశీలనగా చూసింది.     చాలా అందమైన మొహాలు వాళ్ళిద్దరివీ. నీలిరంగు కళ్ళు, బంగారపు రంగు జుట్టు. ప్రకృతిమాత ఒడిలో పెరగడంవల్ల పరిపూర్ణ ఆరోగ్యంతో మిసమిసలాడుతూ పుష్టిగా ఉన్నారు. నగ్నంగా ఉన్న వాళ్ళ  శరీరాలలో యవ్వనం అప్పుడే తొంగిచూస్తోంది.     చిత్రమైన, విపరీతమైన మనస్తత్వం కల స్వరూపరాణికి వాళ్ళని చూస్తే వింత అనుభూతి కలిగి ఒళ్ళు గగుర్పొడిచింది.     దాదాపు ఒకే పోలికలతో ఉన్నారు ఆ అమ్మాయీ, ఆ అబ్బాయీ కూడా. అక్కా తమ్ముళ్ళు అయి ఉండవచ్చు. లేదా అన్నా చెల్లెళ్ళు అయిఉండవచ్చు.     వీళ్ళిద్దరిని పెంపుడు జంతువులులాగా తనుమచ్చిక చేసుకోగలిగితే...     ఆ ఊహల్లో ఉండిపోయి, తను వున్న ప్రమాదకరమైన పరిస్థితిని తాత్కాలికంగా మర్చిపోయింది స్వరూప.     మళ్ళీ తోడేళ్ళ అరుపులు వినబడేదాకా!     ఈసారి నిజంగా తోడేళ్ళే ఉరికి వస్తున్నాయి.     అవి ఆ పిల్లల సహచరులు!                                                                 *    *    *     అర్ధ నిమిలిత నేత్రాలతో ప్రొఫెసర్ ఆనందరావు భుజాల మీద కూర్చుని, సౌఖ్యంగా స్వారీ  చేసున్నా ఒరాంగ్ ఉటాన్ కోతి ఒక కొమ్మని విరిచి, దాన్ని పేము బెత్తంలా ఉపయోగిస్తూ ప్రొఫెసర్ ని త్వరగా నడవమని అదిలిస్తోంది.     తన విధిని నానా విధాలుగా తిట్టుకుంటూ అతి ప్రయాసమీద అడుగులు వేస్తున్నాడు ప్రొఫెసర్.     పళ్ళున్న ప్రతి చెట్టు దగ్గరా అతన్ని ఆపి, ఒక పండు తెంపి, కొరికి చూసి అతన్ని మళ్ళీ ముందుకు తోలుతోంది అది.     "ఈ కోతి మహా సూకిరాలు పోతోందే! ఓ పట్టాన ఏ పండూ వచ్చేటట్టులేదు దీనికి!" అనుకున్నాడు ప్రొఫెసర్ మంటగా.     మెల్లిగా ఒక చెట్టు కిందకి వచ్చాడు ప్రొఫెసర్. బాగా కిందికి వున్నాయి దాని కొమ్మలు. అసంఖ్యాకంగా పళ్ళు వేలాడుతున్నాయి. బాగా మగ్గిన వాసన వస్తోంది వాటిలోనుంచీ.     అతని జుట్టు గట్టిగా గుంజి ఆపింది కోతి. ఒకటి తర్వాత ఒకటి రెండు డజన్ల పళ్ళు తెంపి, భోంచేసింది.     మళ్ళీ అదిలించింది ప్రొఫెసర్.     మెల్లిగా తేలకళ్ళు పడ్డాయి దానికి.     ప్రొఫెసర్ నడుస్తుంటే ఉయ్యాలలో ఊగుతున్నాట్లనిపించి మగతకమ్మింది. ప్రొఫెసర్ భుజం చుట్టూ బిగంచిన కాళ్ళు పట్టు తప్పాయి.     దభేలుమని వెనక్కి విరుచుకు పడింది అది.     తన అదృష్టాన్ని తనే నమ్మలేనట్లు కళ్ళప్పగించి కాసేపు చూశాడు ప్రొఫెసర్.     తర్వాత తక్షణం కర్తవ్యం గుర్తొచ్చి, వెనక్కి తిరిగి చూడకుండా కాళ్ళకు బుద్ది చెప్పాడు.                               *    *    *     ఆలోచిస్తూ, పరిసరాలని జాగ్రత్తగా పరిశీలిస్తూ, ముందుకి సాగుతున్నాడు సాగర్.     అంత పవర్ పుల్ సబ్ మెరైన్ ఈ ప్రాంతాలలో ఎందుకు తిరుగుతోంది? అది ఏ దేశం తాలూకుది?     వాళ్ళంతట వాళ్ళే దాన్ని ఎందుకు నాశనం చేసేసుకున్నారు?     వాళ్ళ రహస్యాలు బయటపడతాయని ధయమా?     అంత దారుణమైన రహస్యాలు ఏమిటి? అవి సాగర గర్భంలోనే ఇంకిపోయాయా? తను వాటిని కనుక్కునే అవకాశం లేదా?     తక్కిన వాళ్ళందరూ ఏమయిపోయారు? ముఖ్యంగా అనూహ్య?     ఎక్కడుంది ఆమె? క్షేమంగా ఉందా? లేక.....     అంతకంటే ముందుకి ఆలోచించడానికి అతనికి సాహనం చాలలేదు.     కాలికి ఏదో మెత్తగా తగలగానే ఆగాడు అతను.     తోకలేని పెద్దజాతి కోతి ఉరాంగ్ ఉటాన్. విరుచుకు పడిపోయినట్లు పడివుంది.     అసహజమైన భంగిమలో ఎందుకిలా పది ఉంది ఇది? ఏమయింది దీనికి?     సహజంగానే భూతదయ ఎక్కువ అతనికి. నిస్సహాయంగా పడి ఉన్న ఆ కోతిని అలా వదిలేసి వెళ్ళిపోవడానికి మనస్కరించలేదు.     వంగి, పరీక్షగా చూశాడు. చెట్టుమీద మాగిన పళ్ళు కనబడ్డాయి.     పరిస్ధితి అర్ధమై, నవ్వు వచ్చిందతనికి.     బాగా మగ్గి, పులిసిన పళ్ళు తినగానే మత్తెక్కిందన్నమాట దీనికి!     అతని నవ్వు వినబడి, కళ్ళు సగం తెరిచి చూసింది ఒరాంగ్ ఉటాన్ - అప్పటిదాకా తన సవారీగా  ఉండిన ప్రొఫెసర్ కనబడలేదు డానికి. స్నేహంగా, దయగా చూస్తున్న సాగర్ మొహం కనబడింది.     భావతరంగాలూ, సిక్స్ త్ సెన్సూ, ఇన్ స్టింక్టూ - వీటిలో దేనివల్లో గానీ, ఆ క్షణంలోనే అర్ధమైపోయింది డానికి. ఈ మనిషి తనకు అపకారం చేసే రకం కాడనీ, ఉపకారం చేసే ఉద్దేశ్యంతోనే తనను సమీపించాడనీ.     సందేహంగా చెయ్యి ముందుకి జాపాడు సాగర్. దాని ఒళ్ళు నిమిరాడు.     ఆ స్నేహ హస్తాన్ని అందుకుంది ఒరాంగ్ ఉటాన్.     మెల్లిగా దాన్ని లేవదీశాడు సాగర్.     తడబడుతూ లేచి నిలుచుంది కోతి.     చెయ్యి నెమ్మదిగా విదిలించుకొబోయాడు అతను.     అది గ్రహించి వదలకుండా చేతిని గట్టిగా పట్టేసుకుంది ఒరాంగ్ ఉంటాన్.     నవ్వుతూ భుజాలు ఎగరేసి మెల్లిగా నడవడం మొదలెట్టాడు సాగర్. కిచకిచలాడుతూ మధ్య మధ్యతో అతని చేతిని పట్టుకు వేలాడుతూ, అతనితో బాటే నడుస్తోంది కోతి.     అతని ఆలోచనలు మళ్ళీ అనూహ్య మీదికి పోయాయి.     ఎక్కడుంది అనూహ్య?     క్షేమంగానే వుందా?                                                                    *    *    *     మెరుపులా ఉరికి తన ముందుకి వచ్చిన పెద్దపులిని చూసి ఆగిపోయింది అనూహ్య.     కానీ భయం వెయ్యలేదు అనూహ్యకి. జరగబోయేది ఏమిటో గ్రహించింది తను ఈ పులి ఇంకో క్షణంలో తన మీదకు దూకుతుంది. తను ఆ ఫోర్సుకి నేలమీద పడుతుంది. ఒక పంజాతో తన తలని పిన్నుతో గుచ్చేసినట్లు కదలకుండా పట్టుకుంటుంది పులి. తర్వాత దాని కోరలు తన మెడలో ఖస్సున దిగాబడతాయి. వెన్నుముక విరిచేస్తుంది. ఒకేసారిగా రక్తనాళాలనూ, ఈ  సోఫాగస్ నీ మరికొన్ని అవయవాలనీ తెంచి పారేస్తుంది.     పులి తన ఎరను చంపే పద్దతి అది!     చావుకి భయపడటంలేదు తను! బాధకి కూడా వెరవడంలేదు!     ప్రాణానికి ప్రాణమైన సాగర్ కి దూరమైపోయాక ఇంక బ్రతుకంటే ఇష్టం ఎందుకుంటుంది తనకి?     చావంటే భయం ఎందుకుంటుంది?     గుండెలు ముక్కలయిపోయేలా వున్న ఈ బాధ కంటే ఈ పులి కలిగించబోయే బాధ ఎక్కువగా ఏమీ వుండదు  ష్యూర్!     నిర్నిమేషంగా ఆ పులిచే చూస్తోంది అనూహ్య.     నోరు తెరచి కోరలు బయటపెట్టి గాండ్రించింది పులి.     ఆ గాండ్రింపుకి ప్రతిధ్వనిలా మరో గాండ్రింపు వినబడింది సర్కసు రింగులోకి దూకినట్లు ఇంకో పులి దూకి వచ్చింది.     వెంటనే____     భూకంపం, తుఫానూ, ఒకేసారి వచ్చి దానికి తోడు అగ్నిపర్వతం ఒకటి బద్దలయి, దావానలం వ్యాపిస్తే ఎంత అల్లకల్లోలమయిపోతుందో, అంత అల్లకల్లోలమయిపోయింది ఆ ప్రదేశం. అంతా ఆ పులుల ఆగడంతో.     విలయతాండవం చెయ్యడం మొదలెట్టాయి ఆ రెండు పులులూ, ఒకదాన్ని ఒకటి కవ్వించుకుంటూ, ఒకదాని మీద ఒకటి పడ్డాయి. దొర్లాయి. నోటితో ఒకదాన్ని ఒకటి అందుకోవాలని ఆరాటపడుతున్నాయి.     ఎర్రటి దుమ్ము లేచింది. ఎండుటాకులు ఆకాశంలోకి లేచాయి. చిన్న చిన్న చెట్లు కూలిపోయాయి.     అవి దొర్లుతూ అనూహ్యకి రెండు అడుగుల దూరంలోకి వచ్చాయి.     ఆ పులులు తనని పట్టించుకోవడం లేదని అర్ధం అయింది ఆమెకి.     అప్పుడు చెవిలో గుసగుసగా  వినబడింది ఒక గొంతు.     "చెట్టెక్కెయ్ త్వరగా."     ఉలిక్కిపడి తిరిగి చూసింది.     సాగర్ తన సాగర్!     "సాగర్!" అని కేక వెయబోయింది పట్టరాని సంతోషంతో. ఆమె కళ్ళలో ఆనందబాష్పాలు.     చటుక్కున ఆమె నోరు మూసేసి, చిన్నపిల్లను ఎత్తుకున్నట్లు ఎత్తేసి, పక్కనే ఉన్న చిన్న చెట్టు తాలూకు కొమ్మమీద కూర్చోబెట్టేశాడు సాగర్.     కోతిని చేతితో చరిచి, చెట్టేక్కమని సైగ చేశాడు. అది చెంగున చిటారు కొమ్మకు ఎక్కేసింది.     "మీరు కూడా రండి" అంది అనూహ్య కంగారుగా. ఆమెకు హఠాత్తుగా బ్రతుకుమీద ఆశ తిరిగివచ్చింది.
24,561
    "ఈ మగాళ్ళకి  ఇంకేం  పని."     "అవును మరదళ్ళను పెళ్ళాడుతూ పోవడమే పని!" తెచ్చి పెట్టుకొన్న  కోపంతో  అన్నాడు అజిత్.     యశోదమ్మ ఊరుకోలేకపోతున్నట్టుగా,  "ప్రపంచంలో నువ్వొక్క దానివే  ఉన్నావేమిటి? కో అంటే   కోటిమంది నా మనుమడికి ఏం తక్కువమ్మా?  అందంలేదా? అంతస్తులేదా?  ఆస్తిలేదా"  అడిగింది అభిమానంగా,  దర్పంగా.     "లేనిదీ ఒక్కటే! అమ్మాయిల మనసుకు తగినట్టుగా నడుచుకోలేక పోవడం."     "వ్యక్తిత్వం,  ఆత్మగౌరవం అని మీ  ఆడవాళ్ళందరూ గోలపెడుతూంటే  అది మాకేనా  ఉండకూడనిది?"  అడిగాడు అజిత్,  నవ్వులాటగా.     "చూడడానికి చాలా సౌమ్యులుగా కనిపిస్తూనే చురకలు బాగానే తగిలించగలరే,  అజిత్ బాబూ!" నవ్వాడు  ప్రభాకరం. "స్త్రి హక్కులు, స్త్రి స్వేచ్చ అని వీళ్ళు  పోరాడుతున్నారు.   నెగ్గుతున్నారు. కొన్నాళ్ళకి వీళ్ళు మనమీద  ఆదిత్యం సంపాదించుకొని మనల్ని  అణగద్రొక్కేసినా మనం ఆశ్చర్య  పోనక్కరలేదు.   అప్పుడు మన హక్కుల కోసం మనం పోరాటం మొదలు పెట్టాల్ని వస్తుందేమో!" అని గొల్లున నవ్వాడు. మనసు నిర్మలమ్తెతే    తప్ప అలా నిండుగా, హృదయం  ఊగిపోయేట్టుగా  నవ్వలేరేమో!     సాధన వాచీ  చూచుకోంది.  "నేనిక వెళ్ళాలి.   పిలువాల్సిన ఇళ్ళు  చాలాఉన్నాయి....రేపు   సాయంత్రం  ఆరుగంతలకి  నా బర్త్ డే  ఫంక్షన్  ఉంది.  మీరిద్దరు కూడా రేపు రావాలి.  మీరు  వచ్చేట్టయితే బావ మిమ్మల్ని తీసుకువస్తాడు."     "మంచిది" మర్యాద కోసం  అన్నట్టుగా అంది నీరజ.     "ఊరికే  మంచిదంటే కాధు! తప్పకుండా రావాలి మీరిద్దరు..... వాళ్ళని తీసుకువచ్చే  బాధ్యత  నిధే,  బావా!  నేనికవస్తాను"  జోళ్ళు టకటక చప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోయింది  సాధన.     "కాలం  ఎంత  తమాషాగా  మారిపోయిందో!  దోమ్మల పేరంటాలు,  తులసి  పేరంటాలు,  నోములు వ్రతాలు మొరటు, అనాగరికం అయ్యాయి. వాటిస్ధానంలోకి  పుట్టిరోజు పండగలు,  పెళ్ళిరోజు  పండుగలు వచ్చేశాయి. ఏమిటో సంప్రదాయలన్ని కళ్ళముందే అడుగంటిపోతున్నాయి"  యశోదమ్మ బాధగా అంది.     "మీ ఇంట్లో  పాతికేళ్ళ క్రిందటే సంప్రదాయాలకు   మంగళం  పాడేశాడు కదా మీ అబ్బాయి?"  అన్నాడు ప్రభాకరం.     "నిజమే, బాబూ! పాతికేళ్ళనాడే  ఈ చిచ్చు మా ఇంట్లోనే  రగిలింది నా కొడుకు వల్ల! ఇంగ్లిష్  వాళ్ళని  చూసి ఇంగ్లీష్  వాళ్ళలాచేస్తే  మనం  ఇంగ్లీష్ వాళ్ళం ఏం  అయిపోము. నక్క పులిలా కనిపించాలని వాతలు పెట్టుకోన్నట్టుగా  కనిపించడం తప్పితే!"     "నిరజకి రేపు పెళ్ళిచూపులు!  మా పిన్ని వాళ్ళింట్లోనే! పెళ్ళి  చూపులు  చాలా నిరాడంబరంగా  జరగాలన్నాడు పెళ్ళి కొడుకు. పెళ్ళి  చూపుల  పేరుతో  అట్టహాసం ఏం  చేయొద్ధన్నాడు. మరి అలా రోడ్డుమీద చూసి,  జీవిత  భాగస్వాములుగా  నిర్ణయిచడం ఏమిటి, మా పిఉంనివాళ్ళింట్లో  పెళ్ళి చూపులకు ఏర్పాటు చేస్తానన్నాను.  టి  తప్ప ఇంకేం ఇవ్వం అని చెప్పాను!"     "పెళ్ళి చూపులు ఒక్కటేనా  నిరాడంబరం?   పెళ్ళి కూడానా?" అడిగాడు అజిత్.     "ఆ అబ్బాయి కట్న  కానుకలు తీసుకోవడానికి  విరుద్ధమాట!  పిల్ల  నచ్చి పెద్ధలదాకా  వెడితే వాళ్ళేమంటరో మరి?"     "కట్నం ఏం ఇవ్వలేదుకదాని కానుకలు, లాంచనాలు అంటూ దండిగానే  గుంజుతారులే,  నాయనా ఊరికే వస్తూంటే ఎవరూ పోనివ్వరు? ఇంతకి అబ్బాయి ఏం చేస్తున్నాడు?"  యశోదమ్మ అడిగింది.     "ఇక్కడే  రెడ్డికాలేజిలో లెక్చరర్ గా  పని చేస్తున్నాడు!   కట్నం లేదని కానుకల రూపంలో  గుంజలనుకొన్నా,   పెళ్ళి భారీగా చేయమన్నా,   నిర్జకోసం మేం కేటాయించిన ఎబ్తేవేల నుండే ఏం ఖర్చు పెట్టినా!  అంతకు మించి వెళ్ళడానీకి మాకు తాహతులేదు! ఎందుకంటే నాకు నలుగురు కూతుళ్ళు! నా తమ్ముడికి  ముగ్గురు కూతుళ్ళు!  మరో రెండేళ్ళు పోతే నా కూతురికి పెళ్ళి చేయాల్సిందే!   నీరజ  చదువుతూందిగాని,    అది టెంత్ ఫేయిలయ్యి ఇంట్లోనే కూర్చొంది! వాళ్ళ పెళ్ళిళ్ళగురించి  కూడా  ఆలోచించాలి కదా?"     "పిల్ల  అందంగా ఉన్నా,  చదువుకొన్నా ఈ కట్నం బాధ తప్పటం లేదంటే మనం  ముందుకు వెడుతున్నామా,   వెనుకకు వేడుతున్నమా అని పిస్తూంది!" అన్నాడు అజిత్.     "మీ  పెద్దవాళ్ళు కొంచెం  కులం, వంశ గౌరవం, సంప్రదాయం అని మరిచిపో గలిగితే  మేం  మికి కట్న బాధ తప్పించే వాళ్ళం!  ఎవరో నచ్చివాడిని పెళ్ళి చేసుకొని, రెండు పూలదండలతో  పెళ్ళి చేసుకొని సింపుల్ కాపురం పెట్టేసేవాళ్ళం!  ఈ వరకట్న సమస్య అస్సలుండేది కాదు!"  అంది నీరజ.     "కాటన్ బాధ ఒకటి  పెద్దవాళ్ళకి తప్పిస్తారేమోగాని మీరు  ఎంత  ప్రమాదంలో  పడిపోతారో  ఆలోచించావా?   ఈ మగవాళ్ళలో  నమ్మించి మోసగించే వాళ్లెంత మందిలేరు?"   అంది యశోదమ్మ.     "ప్రేమించడం మొదలు పెట్టినప్పడే అవతలి మనిషి మంచి వాడో కాదో తెలుసుకోలేమా?"     "ప్రేమే  గుడ్డిది! ఇంకేం కనిపిస్తుంది?"  అన్నాడు ప్రభాకరం. "రేపు మధ్యాహ్నం మూడుగంటలకి మీరు మా పిన్ని  వాళ్లింటికి  రావాలి,  అజిత్ బాబూ! పిల్ల  తరపున నాకు  తోడుగా! మీరు  కూడా పెద్ద తోడుగా  రండి, యశోధత్తా!"     "నేనూ అజిత్ రావడానికి బదులు,  ఇక్కడే అమ్మాయికి పెళ్లి  చూపులకు ఏర్పాటుచేయరాదూ?  ఈ ఇంత శుభకార్యం జరుగక ఎన్ని రోజుల్తే పోయిందో!"     మంచి  మనసుతో నువ్విచ్చే ఈ అవకాశాన్ని నేను కాదనలేనత్తా! అలాగే జరుగని. అబ్బాయిని ఇక్కడికే తీసుకువస్తాను!  నీరజ, అఖిల రేపు మధ్యాహ్నానికి ఇక్కడ వచ్చి ఉంటారు" కార్య క్రమం  ఫిక్స్ చేసుకొని చెల్లెలితో,  అఖిలతో వెళ్లిపోయాడు ప్రభాకరం.
24,562
    కాటూరు - ఎలమర్రులలో మలబారు పోలీసులు చేయని ఘాతుకం లేదు. ప్రజలను దిగంబరులను చేసి ఊరేగించారు.     ప్రజలను గాంధీ విగ్రహం ముందు దిగంబరంగా నిలిపారు!     అది నిరంకుశత్వం కరాళ నృత్యం చేసిన వేళ!          అహింసారాజ్యంలో హింస పురివిప్పి ఆడిన వేళ!!     ఓ మహాత్మా! ఓ మహర్షీ!     "I see a day when gandhians will be hanged in India" అన్నాడు బట్రెండ్ రస్సెల్.     "భారత దేశంలో గాంధీ వాదులను ఉరితీసేరోజు వస్తుంది."     ఈ సంఘటనను నేను 'జనపదం' నవలలో చేర్చాను.                               ఇరవయి మూడు     సమరశంఖం:     మార్పు వ్యక్తి జీవితంలోనూ, జన జీవితంలోనూ, సమాజ జీవితంలోనూ సమస్యలు సృష్టిస్తుంది. 'మార్పు' మంచిదయినా సమస్యలుంటాయి. మంచిదికాకున్నా సమస్యలు ఉంటాయి.     భారతదేశ చరిత్రలో మనకు వచ్చిన స్వాతంత్ర్య చరిత్రలో ఇలాంటి పరిణామాలు చాలా, చాలా అరుదుగా వస్తాయి.     ఆంగ్లేయులు భారతదేశాన్ని బలవంతంగా వదిలారు. వెళ్లేప్పుడు అనేక సమస్యలు సృష్టించిపోయారు. భారత జాతికి ఎన్నడూ ఎరగని మతకలహాలు ఆంగ్లేయుల సృష్టి. వారు పాకిస్తాన్ సృష్టించారు. సంస్థానాధీశులకు స్వాయంత్ర్యం ఇచ్చారు. అదొక సమస్య.     హైదరాబాదు సంస్థానం ఒక సమస్య. నిజాం రాజు పెద్ద బెడద. అతడు కొంప కాలేప్పుడు వారం పీక్కోవాలనుకున్నాడు. మరిన్ని సమస్యలు సృష్టించాడు. భారత ప్రభుత్వం మత్తమాతంగం. అది నిజం. నిజాము మశకం. దోమ ఏనుగు చెవిలో దూరి బాధించింది.     ఒకటిన్నర శతాబ్దంగా భారత్ సైన్యాలు సికిందరాబాదులో ఉంటున్నాయి. స్వాతంత్ర్యం వచ్చిం తరువాత ఉన్నాయి. అప్పటికి సుమారు 1400 సైన్యం ఉంది. వీటిని మించి మందుగుండు గిడ్డంగులున్నాయి. వాటిమీద దాడికి రజ్వీ అనేకసార్లు ప్రయత్నించి విఫలుడయినాడు. యధాతథ ఒప్పందం ప్రకారం సేనలను ఉపసంహరించడానికి భారత ప్రభుత్వం అంగీకరించింది. 1948 జనవరినుంచి ఏప్రెల్ వరకు ఉపసంహరించింది.     నిజాం నవాబు సైన్యాలు పెరుగుతున్నాయని - బలం పెంచుకుంటున్నాయని పుకార్లు బయలుదేరాయి. పాకిస్తాన్ లో అయిదు లక్షల మందిని నిజాం రిక్రూట్ చేశాడని మద్రాసు ప్రధాని రెడ్డియార్ ప్రకటించాడు. నిజాంసేన దాడి చేస్తే తన రాష్ట్రానికే ప్రమాదం వాటిల్లవచ్చునని భయపడ్డాడు.     దొంగచాటుగా సిడ్నీ కాటన్ ఆయుధాలు చేరవేస్తున్నాడు. విదేశాల్లో ఆయుధాలు కొనడానికి నిజాం ప్రయత్నిస్తున్నాడు.     వీటన్నింటితో దేశంలో భీతావహ వాతావరణం ఏర్పడింది. వీటిని అన్నింటిని దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం 1948 జనవరిలో సైన్యాన్ని హెచ్చరించింది. 1948 జనవరి 20 వ తేదీన సైనిక ప్రధాన కార్యాలయం "హైదరాబాదు సైన్యాలు భారతదేశం మీద దండెత్తే వీలులేకుండా చూడాల్సిందని" అందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని సదరన్ కమాండును ఆదేశించింది.     1948 ఫిబ్రవరిలో ఈ ప్రణాళికకు POLO అని నామకరణం చేశారు. సైనికులు తమ వ్యూహాలకు పేర్లు పెడ్తారు. హైదరాబాదు "పోలో" అనే ఒక క్రీడకు ప్రసిద్ధం. అందువల్ల దానికి "పోలో" అని పేరు పెట్టారు. "పోలో" ఆటలా సైనిక చర్య జరుపుతామని ఆ పేరు పెట్టారు.     సదరన్ కమాండువారు "హైదరాబాదు సైన్యానికి దాడి చేస్తే శక్తి లేదని" నివేదిక అందించారు. ఆనాటి నుంచి భారతదేశంలో అనుకూలంగానూ హైద్రాబాదులో వ్యతిరేకంగానూ పరిణామాలు సంభవించాయి.     భారతదేశానికి అనుకూల పరిణామాలు:     1. విభజన వల్ల కలిగిన రక్తపాతం అంతం అయింది. పరిస్థితులు అదుపులోకి వచ్చాయి.     2. కాశ్మీర్ పరిస్థితి కూడా అల్లకల్లోలంగా లేదు. పాకిస్తాన్ ప్రణాలికలను భగ్నం చేయడం జరిగింది.     3. సుమారుగా సంస్థానాలన్నీ భారతదేశంలో లీనం అయిపోయాయి.     4. జునాగఢ్ పాకిస్తాన్ సరిహద్దు సంస్థానం. జుల్ఫిఖాన్ అలీ భుట్టో జన్మస్థానం. అక్కడ భారతదేశంలో విలీనాన్ని గురించి రెఫరండం జరిగింది. భారతదేశంలో విలీనానికి అనుకూలంగా 2,22,304 ఓట్లురాగా, వ్యతిరేకంగా 150 మాత్రం వచ్చాయి.     5. స్వాతంత్ర్యం లభించిన ఆరు నెలలకు ప్రభుత్వం స్థిరపడింది. అంతర్జాతీయ సముదాయం భారత స్థిరతను గుర్తించింది.     6. మిగిలిన ఒక్క హైదరాబాదు సమస్యను పరిష్కరించగలిగే శక్తిస్తోమతలను సమకూర్చుకుంది.     నిజాం రాజ్యానికి ప్రతికూల పరిస్థితులు:-     1. నిజాం బడ్జెటు 2.25కోట్లకు చేరుకుంది. ఇది బడ్జెటులో కనబరచిన సంఖ్య పరిస్థితి ఇంతకంటె అధ్వాన్నంగా ఉంది. ఇది భారత ప్రభుత్వం విధించిన దిగ్బంధ ఫలితం.     i) గ్రామాధికారులు గ్రామాలు వదిలారు. ఇందుకు కారణం ప్రజా ఉద్యమం. కొందరు అభిమానంతో వదిలారు. ఇందుకు కారణం ప్రజా ఉద్యమం. కొందరు గ్రామాల్లో నిలువలేక వదిలారు. ఫలితంగా రెవెన్యూ వసూళ్లు నిలిచిపోయాయి..     ii) వర్తకులు రజాకార్ల భయానికి రాజ్యం వదిలి వెళ్లారు. వ్యాపారం సుమారు నిలిచిపోయింది. వ్యాపారం నిలిచిపోవడంవల్ల ప్రభుత్వానికి రాబడి తగ్గింది. ప్రజలకు బాధలు హెచ్చినాయి. అందువల్ల మరింత వలసపోయారు.     iii) దిగ్భంధం వల్ల సరుకుల రాకడ తగ్గింది. అందువల్ల కరోడ్గిరీ - కస్టమ్స్ ఆదాయం తగ్గింది.     iv) పనాహ్ గజీర్ - శరణార్థులను స్వాగతం పలికి తీసుకొని వచ్చారు. వారికిగాను ఖర్చు పెరిగింది.     v) సుమారు లక్షమండి రజాకార్లను పోషించాల్సి వచ్చింది.     vi) ప్రజా ఉద్యమాలను అణచడానికి పోలీసు - మిలిటరీ ఖర్చు ఎక్కువయింది.     2. ఇది ఆర్థికం. శాంతి భద్రతలు మృగ్యం అయినాయి. ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేకుండాపోయింది.     i) ప్రభుత్వం నిజాం నవాబుదో - కాసిం రజ్వీదో అర్థం కాని దశ వచ్చింది. కీలక నిర్ణయాలలో సహితం రజ్వీ పెత్తనం కనిపించింది. ప్రధాని లాయకలీ గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్ తో ఒక అంగీకారానికి వచ్చాడు. ధ్రువీకరణకు మాత్రం హైదరాబాదు వచ్చారు. రజ్వీ కాదన్నాడు. నిజాం మిన్నకున్నాడు.     ii) అధికారులకు తమ విధులు నిర్వర్తించడం అసాధ్యమైంది. ప్రభుత్వ యంత్రాంగం సాంతం నిలిచిపోయింది. ప్రభుత్వం లేకుండా అయింది.     iii) తెలంగాణా గ్రామాలను కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో ప్రజలు వశపరచుకున్నారు. పాలించుకున్నారు. ప్రజలను దోచుకోవడానికి అప్పుడప్పుడు వచ్చిన రజాకార్ల ముఠాలే ప్రభుత్వం అనిపించింది.     iv) కాంగ్రెసువారు సరిహద్దులలో సాయుధ క్యాంపులు నెలకొల్పారు. హైదరాబాదు శాసన సభలో పోలీసు మంత్రి ప్రకటనను అనుసరించి బొంబాయి సరిహద్దులలో 23 కేంద్రాలు - మద్రాసులో 21 - మధ్య పరగణాల్లో 4 ఉన్నాయి. వారు సుమారు 400 దాడులు చేశారు.     v) 1948 ఫిబ్రవరిలో ఉమ్రీ పట్టణంలోని హైదరాబాదు స్టేట్ బ్యాంక్ లూటీ జరిగింది. 22 లక్షల 60 వేల రూపాయిల దోపిడీ జరిగింది. ఈ చర్యలో 17 మంది ప్రాణాలు పోయాయి.     ఈ చర్య సోషలిస్టు పార్టీ అభిమానంగల కాంగ్రెసువారు చేశారని చెప్పుకుంటారు. ఈనాటి వృద్ధ కాంగ్రెసు నాయకుడు గోవింద్ దాస్ ష్రాఫ్ అందుకు కారణం అని ప్రవాదు. అందులో చాల వరకు ప్రజాపోరాటానికి కర్చు చేశారు. మిగతా ధనంతో గాంధీ భవనం నిర్మించారని చెప్పుకున్నారు.     vi) 1948 మే 23వ తేదీన 'గంగాపూర్' రైల్వే స్టేషను దగ్గర మద్రాసు దోచుకున్నారు. ఇద్దరిని హత్య చేశారు. అనేకమందిని గాయపరచారు. పోలీసులు ఏమీ చేయలేకపోయారు.     vii) కాంగ్రెసులో వ్యక్తులు మాత్రమే ఉంటారు. వారిది ఇష్టారాజ్యం. వారు దేనికీ కట్టుబడరు.
24,563
      "నువ్వు నన్ను ప్రేమించలేదా కాశ్మీరా" అతను అనుకోకుండా అడిగాడు.     అతనలా అడిగేసరికి కాశ్మీర బావురుమంది. కట్టుకున్న భర్తని  పోగొట్టుకోలేదు.     ప్రేమించిన ప్రియుడ్ని కాదనలేదు.     ఈ చిత్రమ్తెన పరిస్ధితిలో చిక్కుకొని ఆమె నలిగిపోతూ విలపిస్తుంటే రాబర్టు ఆమె భుజాలను పట్టుకుని లేవదీసి గుండెల్లోకి చేర్చుకున్నాడు.     "కాశ్మీరా!"     మెల్లగా ఆమె కన్నీటిని  తుడిచి పెదవులపైన ముద్దు పెట్టుకున్నాడు.     "కాశ్మీరా!"     ఆమె మెల్లగా కన్నీటి  కళ్ళతో తలెత్తి అతన్ని  చూసింది.     "ఆడదానికి ప్రేమించిన ప్రియుడికంటే భర్తే ముఖ్యమని ఋజువు చేశావు. నాకోసం  అతన్ని దూరం చేసుకోమని  చెప్పేంత నిచుడ్ని కాదు నేను. బతకడం చేతకాని మనిషిని నేను ఒక విధంగా నా చేతికానీతనమే నాకు అందర్నీ దూరం  చేసింది నీ భర్తని క్షేమంగా తీసుకొస్తాను. చేసిన పాపాని కి విధంగాన్తేనా పరిహారం చెల్లించు కొంటాను కాశ్మీరా!" అన్నాడు రాబర్టు.     "రాబర్టు"     అతను ఆమె దగ్గరగా  వచ్చాడు.     "నిన్ను మనసారా విజయ్  అని పిలవాలనుంది" అంది కాశ్మీర.     రాబర్టు  ఆమెని గభాల్న కౌగలించుకున్నాడు.     "విజయ్?" అంది కాశ్మీర.     "కాశ్మీరా నిన్ను నేను ప్రేమిస్తున్నాను" అన్నాడు రాబర్టు.     అతని మాటల్ని నమ్మలేనట్టు చూసింది కాశ్మీర.     అతని మాటల్ని నమ్మలేనట్టు చూసింది కాశ్మీర.     అతను ఆమెని వదిలిపెట్టి.     "బై బై " అంటూ బయటికి నడిచాడు.     కాశ్మీర అతనేళుతున్న  వేపు దిగులుగా చూస్తూ నిలబడిపోయింది.                                                    *    *    *        చీకటి చిక్కగా వుంది. ఆ రోడ్డు నిర్మానుప్యంగా వుంది.     చుట్టూ కొండరాళ్ళు, చెట్లు, తుప్పలు మినహాయించి ఏమీ కనబడటంలేదు. దూరంగా  అక్కడో ఇల్లు అక్కడో ఇల్లు తప్పు.     రాబర్ట్ దూరంగా  నించిని చూశాడు.     బంగాళాగేటు వేసివుంది. ప్రక్కనే వాచ్ మాన్ కూర్చుని వున్నాడు.     మెల్లగా ఓ సారి బంగాళా  ముందునుంచి నడిచాడు.     కాంపౌండ్ ప్రహరీగోడ  ఎత్తుగా వుంది. గోడపైన సీసం పెంకులు వున్నాయి. ఆ గోడ ఎక్కి లోపలికి దూకాలి.     చేతి గడియారంలోకి చూసుకున్నాడు రాబర్ట్ పదకొండు దాటింది.     మేడమీద గదిలో ల్తెటు వెలుగుతోంది. కింద పోర్టికో భాగమంతా కటిక చీకటి గా వుంది.     వాచ్ మాన్ కళ్ళుకప్పి లోపలికేళ్ళాలి వాడిని మచ్చిక  చేసుకోవాలి.     గోడ దూకడమా?     వాచ్ మాన్  ని  మంచి చేసుకోవడమా?     కొన్ని క్షణాలు ఆలోచించాడు.     తెగింపుతో గేటుదగ్గరకు నడిచాడు రాబర్టు.     "కౌన్ హై?" వాచ్ మాన్ అరిచాడు.     రాబర్టు తొణకకుండా అడిగాడు.     "అగ్గిపెట్టె వుందా సాబ్!"     గేటు దగ్గరకు వచ్చి "హై" అంటా  అగ్గిపెట్టె  అందించ బోయాడు వాచ్ మాన్.     "మర్యాదగా గేటు తెరువు లేకపోతే కాల్చి పారేస్తాను" అన్నాడు రాబర్టు చేతిలో పిస్తోలుని చూపిస్తూ.     వాచ్ మాన్ అనుకొని పరిస్ధితి తేరుకోలేక నించుండిపోయాడు.     "ఊ తెరు" అన్నాడు  రాబర్టు.     వాచ్ మాన్ మారు మాట లేకుండా తలుపు  తెరిచాడు రాబర్టు మెరుపులా  లోపలకొచ్చి "వెనక్కి తిప్పి అతని తలపైన బలంగా కొట్టాడు.    వాచ్ మెన్ వెనక్కీతిరగ్గానే  పిస్తోలు వెనక్కి తిప్పి అతని తల పైన  బలంగా కొట్టాడు.     అంతే వాచ్ మాన్ నేలపైన కూలిపోయాడు. అతని శరీరాన్ని గేటు పక్కకి ఈడ్చేసి మఫ్ లర్ తో రెండు చేతులూ కట్టేశాడు గ్యారం టిగా అతనిప్పడప్పడే లేవడు.     తోటలో ఎక్కడా ఆలికిడిలేదు.     కుక్కలు.     అవి ఎక్కడో వుండివుంటాయి. విటినేలా తప్పించుకోవాలి?     రాబర్టు చెట్లచాటుగా ప్రాకుతున్నాడు.     కుక్క అరిచింది. వెనకే మరికొన్ని  కుక్కలు అరుస్తూ పరుగెత్తు కోస్తున్నాయి.     రాబర్టు లేచినించున్నాడు.     కుక్కలు దగ్గరగా వచ్చేసినాయి.     రాబర్టు సన్నగా ఈలవెస్తూ వాటిని పిలిచాడు. జేబులోంచి బిస్కట్ పాకెట్  తీసి వాటి ముందుకు విసిరాడు.     కుక్కలు నాలుగు  రాబర్టు నిదివరో చూసి  వుండడంతో అతన్ని మిత్రుడిగా  భావించినయి. తోకలు  ఊపుతూ అతని దగ్గరగా వచ్చినాయి.     రాబర్టుకి సమస్య తేలిగ్గా తిరిపోవడంతో ఊపిరి తీసుకుని ఆప్యాయంగా  వాటి నీ చేత్తో  సవందీసాడు.     రాబర్టు జేబులోంచి మరో  బిస్కట్ పొట్లా౦ తీసి అక్కడపడేసి ముందుకు కదిలాడు.     కుక్కలు అతన్ని అడ్డుపెట్టలేదు. 
24,564
        ఆరాత్రి స్నేహితుడి గదిలో గడిపి, మర్నాడు ఐ.జి.పి. ఇంటికి వెళ్ళాడు. అక్కడ హాలునిండా జనం కిట, కిట లాడుతున్నారు. యెక్కడో దొమ్మి జరిగిందట. సబ్ ఇన్ స్పెక్టర్, సర్కిల్ ఇన్ స్పెక్టరు శ్రద్ధ తీసుకోవటం లేదు. జనం వెళ్ళేవరకు కూర్చుని, అతనితో విషయం చెప్పాడు.     "అతని విషయాలలో నీకేం ఇంటరెస్ట్!" ఠీవిగా అడిగాడు.     సిద్దార్ధ గబ, గబా విషయాలన్నీ విపులంగా చెప్పాడు.     "మా అన్నగారని కాదు సర్. అతను దేశానికి చీడ పురుగు మీరు త్వరగా యాక్షన్ తీసుకోకపోతే ఇంకా కొన్ని హత్యలు జరుగుతాయి" అన్నాడు ప్రాధేయ పూర్వకంగా.        అతను అంతా శ్రద్దగా విని, యెవరికో ఫోన్ చేశాడు.     "ఖాదర్ సాబ్ ను పిలవు" అన్నాడు.     అటునుండి ఏం రెస్పాన్స్ వచ్చిందోగాని, అతను ఆశ్చర్యంగా విన్నాడు.     "ఒహో! అంత గ్రంధం నడుస్తుందా! తెలియదే........" అన్నాడు.       "మీరు వెళ్ళండి. నేను చూచుకుంటాను" అని సిద్దార్ధ వైపు చూచాడు.     సిద్దార్ధ లేచి బయటికి వచ్చాడు. ఈ మధ్యకాలంలో మనుషుల్లో యెందుకింత తపన పెరిగింది. సంపాదించాలన్న తాపత్రయం పెరిగిందో అర్ధం కాదు.     సిద్దార్ధ బయటికి వచ్చాడు రాధిక కోసం రెండు, మూడు మంచి పుస్తకాలు కొని ఇంటికి వచ్చాడు.     పురుషోత్తమరావు చిందులు వేస్తున్నాడు.     "ఏమిట్రా.........ఏమిటి నీ ఉద్దేశం! పెళ్ళి నా కనుకున్నావా! ఏం చూచుకుని మీకీ నిర్లక్ష్యం!"       "నాకు ఉద్యోగం దొరికిన తరువాత పెళ్ళి చేసుకుంటాను నాన్నా అది నాకు నచ్చిన అమ్మాయిని, మీ కిష్టమైన సంబంధం చూచి నాకు అంటకట్టవద్దు" అన్నాడు.     "ఒహో! చాలా వరకు వచ్చిందే చూచావా! భార్యామణి. నా కొడుకు, నా బంగారు అంటావు. మధుకు పెళ్ళి అయి బయటికి వెళ్ళిపోయినా ఈ నాటికి ఎదురు మాట్లాడి ఎరుగునా!"     "సిద్ధూ! ఏమిట్రా ఇది!"     "అది కాదమ్మా! మారుతున్న కాలాన్ని ఎందుకు అర్ధం చేసుకోరు. మీకంటే చిన్నప్పుడే పెళ్ళి అయింది. మీ ఇష్టా అయిష్టాలు లేవు. మా ఇష్టం ప్రకారం పెళ్ళి చేసుకుంటామంటే ఆ పెళ్ళికొడుకును చంపించటమో పెళ్ళి కూతుర్ని వంచించటమో చేస్తారు."     "నోరుముయ్యి........" సిద్దార్ధ చెంపలు పగిలిపోయేవే. అంతగట్టిగా కొట్టాడు.     "ఏమిటండీ ఆవేశం!"     "ఆవేశం! ఉహు! ఈ నాటికి వీడిచేత మాటలు పడాల్సిన ఖర్మ పట్టింది. నాకు......" అన్నాడాయన ఆవేశంగా.     "అయితే అంతా మీకు తెలిసే జరుగుతుందన్నమాట...."       "ఏమిట్రా..... ఏం కూసావ్!"     "శ్రీనివాస్ ఏమయ్యాడు!"     "శ్రీనివాస్ దగ్గర నన్ను కాపలా ఉంచావా పళ్ళురాలగొడతాను" ఆయన ఆవేశంతో ఊగిపోతున్నాడు.     సిద్దార్ధకు విషయం అర్ధం అయింది. తండ్రిని నిలదీసినా లాభం లేదు. ఇంకా వివరంగా మాట్లాడితే రాధిక వింటుంది. మౌనంగా వెళ్ళి పోయాడు బుగ్గలు తడుముకుంటూ అతనికేం కోపంగాలేదు. తన తండ్రికి కొట్టేహక్కు ఉంది.                                     7     మర్నాడు అతను లేచి కాఫీ త్రాగుతుంటే యశోదమ్మ అనునయంగా పిలిచింది.     "సిద్దూ! ఊరి విషయాలు నీకెందుకురా! ఉండి ఉద్దరిస్తావా బాగుచేస్తావా! వుద్యోగం రాగానే వెళ్ళిపోతావు. అంతకాడికి ఈ గొడవలు దేనికి నాయనా!"     "చేతులు ముడుచుకుని కూర్చోవాలా!"     "అయితే మన పొలాలు చూచుకో" అన్నది.      "ఏం చూడాలి!"     "మనకు ఊరవతల ఉన్న పొలంలో బావి త్రవ్విస్తున్నాము. వెళ్ళి చూడు." అన్నది.       "అలాగే........" అన్నాడు
24,565
"రాగా! కొంచెం రోజులు నాతో మా బడికి రామ్మా! ప్లీజ్" "రానంటే రాను. నా లేస్సన్సు పోతాయి. స్కూలు డే వస్తోంది. డాన్సు డ్రామాలో నేనున్నాను రిహార్సల్స్ చేయిస్తున్నారు మా మిసెస్. ఇప్పుడు నేను మానేస్తే నా ప్లేస్ లో మరొకళ్ళని తీసేసుకుంటారు. "ఏడుపు గొంతుతో మొండిగా అంది రాగమాల. ఆ పాప స్కూలు మాననని మారాం చెయ్యడంలో అణువేదకి తెలియని రహస్యమొకటుంది. పంతాలతో అణువేదకి దూరమైనా రాగమాలకి దూరం కాలేని జీవన్ నెలకొకసారైనా కాన్వెంట్ కి వచ్చి రాగని తనతో బయటకి తీసుకెళ్ళి ఐస్ క్రీం వగైరాలు యిప్పించి కొంతసేపు ఆమెతో గడిపి హైదరాబాద్ వచ్చేస్తుంటాడు ఇది ఆ తండ్రి కూతుళ్ళ మధ్య రహస్యం. ఏడేళ్ళ నిండిన రాగకి లోకం పూర్తిగా తెలియక పోయినా అమ్మా నాన్నా దేబ్బలాడుకుని విడివిడిగా వున్నారని యిదరికి తనంటే ఇష్టమేనని తెలుసు ఒకసారి తల్లిని, "మమ్మీ! మనం డాడీ దగ్గరికి యెందుకు వెళ్ళం?" అని అడిగింది అణు వెంటనే కోపంతో "నోర్ముయి" అని కసిరింది. అంతేకాదు అరాత్రంతా ఏడుస్తూనే గడిపింది. ఉదయం లేచి తల్లి మొహం చూసిన రాగ హడలిపోయింది. తరువాత మరెప్పుడు తల్లి దగ్గర తండ్రి ప్రస్తావన తెచ్చే సాహసం చెయ్యలేదు. ఎదుగుతున్న పిల్లలకి ఏదైనా నచ్చచెప్పేధోరణిలో బోధపరచాలి కాని అజ్ఞాపిస్తున్నట్లు, నిర్భందిన్నట్లు చెప్పకూడదని అణుకి తెలుసు. అయినా ఎదురుగా వున్న సమస్య ఆమెని స్థిమితంగా నిలవనియడం లేదు. "పిచ్చి వేషాలు వెయ్యకు ఇవాళ నువు స్కూలుకి వెళ్ళడం లేదు. నాతో వస్తున్నావు" అనేసింది అజ్ఞాపిస్తూన్నట్లు రాగ వయసుకు చిన్నదైనా ఆత్మాభిమానంలో పూర్తిగా తల్లి పోలిక మూతి ముడుచుకుని మాట్లాడకుండా మొహం తిప్పుకుని రోషంగా స్నానాలగదిలోకి వెళ్ళిపోయింది. మూడేళ్ళు నిండకుండానే తనంతట తాను స్నానం చేస్తానని పోట్లాడేది అణువేద పాప. రూపంలో తండ్రి పోలికలున్నా వ్యక్తిత్వంలో తల్లి పోలికలు చాలా వచ్చాయి ఆ పాపకి. అణువేదకి అర్ధమౌతుంది. పాప మనసు గాయపడ్డా ఫరవాలేదు. చాక్లెట్లు, ఐస్ క్రిమ్ లు వగైరా లంచాలు పెట్టి మరిపించుకోవచ్చు. మొదట ప్రధానంగా పాపని కాపాడుకోవాలి. ఎంత అనాలోచిత పనిచేశాడు జేవన్. విధి లేక తల్లితో డాన్సు స్కూలుకి వెళ్ళింది రాగ, తల్లి కటినంగా ఆజ్ఞాపించినప్పుడు తను లొంగిపోక తప్పదని రాగకి తెలుసు. డాన్సు స్కూల్ లో ఆ పిల్లకి బాగా బోరు కొట్టింది. అక్కడైనా అణురాగని స్వేచ్చగా తిరగనియకుండా స్టాఫ్ తో డిస్కషన్స్ పెట్టుకున్నప్పుడు రాగకి ఏం చెయ్యాలో తోచక స్టాఫ్ రూమ్ లో స్టూల్ మీద వున్న కుజాని క్రిందకి తోసేసి పగలకొట్టి తన కసి తీర్చుకుంది. చుటుక్కున మందలించబోయి వెనక్కి తగ్గింది అణు. రాగని అపుడున్న మూడ్ లో మందలించి ప్రయోజనం లేదు. చాక్లెట్ ఐస్క్రీం కప్ తెప్పించి యిచ్చింది. దాన్ని టేబిల్ మీద నుంచి క్రిందకి తోసేసింది. ఐస్ క్రీం చింది స్టాఫ్ మెంబర్ల చీరల మీద పడింది. వాళ్ళు వెనక్కి గెంతి రాగని మందలించబోయి ప్రిన్సిపాల్ కూతురని రాగతో ఐస్క్రీం ఎందుకు తోసేశావు? నీకేం కావాలి?" అడిగింది అణువేద. "నేను స్కూలుకి పోతాను." "వీల్లేదు నేను మళ్ళీ పంపించేవరకు నువు స్కూలుకి వెళ్ళవు. అన్నీ సబ్జెక్ట్స్ లోను నీకు ట్యుషన్ ఎరేంజ్ చేస్తాను. "నాకు ట్యుషన్ అక్కర్లేదు నేనే చదువుకోగలను" "సరే అయితే సాయంత్రం తాతగారింటికి వెళ్ళి ఆలోచించుకుందాం" "నేను తాతగారింటికి రాను" "ఏం? ఎందుకు రావు? తాత నీకు స్వీట్లు, బొమ్మలు ఇస్తారుగా!" "బామ్మ దాడి గురించి అడుగుతుంది. "చటుక్కున తలదించేసుకుంది అణువేద. రాగకి తండ్రి దగ్గర బాగా చనువని తెలుసు ఇప్పటి తండ్రిని ఎవరైనా ఏమన్నా అంటే ఆ పిల్ల భరించలేకపోవటం ఆమెకు ఆనందాన్ని బాధని కూడా కలిగిస్తుంది. చూస్తుండగా జీవితం రెండు పాయలుగా ఛిలి ఎంత ముందుకు సాగిపోయింది? కాస్సేపు రాగ మాట మర్చిపోయి తరువాతి రెండు మూడు నెలల్లో డాన్స్ స్కూల్ పిల్లల చేత యిప్పించవలసిన ప్రోగ్రాం గురించి ఆలోచించసాగింది అణువేద. పక్క క్లాసు రూమ్ లో ఏదో కలకలం వినిపించేసరికి ఆ గదిలోకి వెళ్ళింది. డాన్స్ చేస్తున్న పిల్లలంతా ఒకరి మీద మరొకరు పడి భయంగా అరుస్తున్నారు. డాన్స్ టీచర్లు నిస్సహాయంగా చూస్తుండగా గెడ్డం కింద వేలు పెట్టుకుని నవుతూ చూస్తోంది రాగ. "ఏం జరిగింది ?' అడిగింది అణువేద. "పిల్లలు డాన్స్ చేస్తోంటే మీ అమ్మాయి నేల మీద కార్పెట్ లాగేసింది." చెప్పింది డాన్స్ టిచర్. కూతురు తిక్క అర్ధమౌతుంది "తప్పుకదూ!" మందలించింది. "సారీ మమ్మీ! సారీ టిచర్! సారీ ఫ్రెండ్స్" అల్లరిగా నవుతూనే ముద్దు ముద్దుగా చెప్పింది. అ సాయంత్రం డాన్స్ కాలేజి నుంచి తిన్నగా మేనమామ సుందరేశ్వరరావు యింటికి వెళ్లింది అణువేద. భార్యాభర్తలు హల్లో కూర్చుని టి.వి చూస్తున్నారు. "రా! రా!" ఆప్యాయంగా ఆహ్వానించాడు సుందరేశ్వరరావు. కూర్చోగానే" మీ అయన కబుర్లేమైనా తెలుస్తున్నాయా?" అడిగింది మేనత్త. ఈ కుశల ప్రశ్న యెప్పుడు ఆనవాయితీ అడుగుతుంది ఆవిడ. ఉక్రోషంగా చూస్తుంది రాగ. ఆ చూపుల్లో వేదన అర్ధం కాదు ఆ పెద్దావిడకి. "రాగా! నువు కాస్సేపు లోపలికి వెళ్ళి వోదినతో ఆడుకో" రాగని లోపలి గదిలోకి పంపించి ఫోన్ కాల్ విషయం చెప్పింది అణువేద. మొదట దంపతులిద్దరూ "ఆ!" అని నివ్వెరపోయారు. తరువాత సుందరేశ్వరరావు "ఛ!ఛ! జీవన్ యిలాంటి పని చేస్తాడని ఎప్పుడూ అనుకోలేదు. ఎంతో సాతికుడిగా కనిపించేవాడు" అన్నాడు. "అదిసరే! ఇంతకీ ఇప్పుడేం చెయ్యాలి? ఎన్నాళ్ళని స్కూలు మానిపించను? ఎంతవరకని కాపలా కాయగలను? ఈ డాన్సు స్కూలు యిదంతా వొదిలి పెట్టి ఎక్కడికి పోగలను?" "పోలీసు కంప్లయింట్ యిస్తే!"  కోపంగా కల్పించుకుంది మేనత్త. "పోలీసు కంప్లయింటు ఇస్తారా? ఏమని ఇస్తారు? ఏం ఆధారముంది మీకు? తిని కూచుని భర్త మీద పోలీసు రిపోర్టు యిస్తే యిహ యీ జన్మలో భార్యాభర్తలు కలుసుకుంటారా?అది గాక ఆ గిరీశం ఎవడో నిజాయితీ పరుడని నమ్మకమేమిటి? మీరు పోలీసు రిపోర్టు యిస్తే తన మీద లేనిపోని అభాండాలు వేస్తున్నారని జీవన్ ఎదురు కేసు పెడితే ఏం చేస్తారు?" ఏం సమాధానం చెప్పాలో తోచలేదు సుందరేశ్వరరావుకి. అంతలో సుందరేశ్వరరావు కూతురు వందన పరిగెత్తుకుంటూ వచ్చి, "నేను పిలుస్తున్నా వినిపించుకోకుండా రాగ వీధిలోకి పారిపోయింది" అని చెప్పింది. మారుతీకారు పక్కన పోలిసుల్ని చూసి చేతిలో పెట్రోల్ టిన్ కింద పడేసి వెనక్కి పారిపోబోయాడు జాన్ గోవింద్. గోవింద్ సింగ్ సుబ్బయ్య అతని చెయ్యి పట్టుకుని అపు చేశాడు. "ఇప్పుడిలా వెనక్కి పరిగెడితే ఎవరికైనా అంతకు ముందు లేని అనుమానాలు కల్గుతాయి.
24,566
    "బర్ద్ర్స్ గురించి ఇంత ఇంటరెస్టు చూపిస్తున్నారు. సైన్సెస్ చదివారా మీరు లేకపోతే భావుకత్వం...." అంది అలేఖ్య.     నవ్వాడు సంజయ్. "కాదు కాదు భావుకత్వం కాదు. ఐయామ్ ఏ డిన్ టూ ఎర్త్ మాన్! చాలా ప్రాక్టికల్ మనిషిని నేను. ఆపదలో ఉన్నవాళ్ళని ఆదుకోవడం నా ఆశయం. పక్షులైనా, పసువులైనా, మనుషులైనా సరే! బట్ యాజ్ ఏ మేటర్ ఆఫ్ ఫ్యాక్ట్ మీరన్నట్లే నేను సైన్సెన్ చదివాను డాక్టర్ కావాలన్న ఆశతో కానీ డాక్టర్ ని కాలేదనుకోండి!" అతని కళ్ళలో ఒక్క క్షణంపాటు బాధమెదిలింది.     "మరి?"     అతను ఆ సంభాషణ ఇంక పొడిగించడం ఇష్టంలేనట్లు  "మీరు హైదరబాద్ కేనా?" అన్నాడు.     "అవును ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళివస్తున్నాను" అంది అలేఖ్య.     "ఎక్కడ?"     చెప్పింది అలేఖ్య "శోభనా బెస్ట్ ఫ్రెండ్. చాలా మంచిది కానీ ఆమె పెళ్ళి శోభాయమానంగా చెయ్యాలన్న తపనతో వాళ్ళవాళ్ళు చేసిన ఆడంబరాలేనాకు నచ్చలేదు" అంది స్వగతంలా ఉన్నాయి ఆమె మాటలు.     "ఎలక్షన్ లో ఇంత డబ్బుకి మించి ఖర్చు పెట్టకూడదానిరూలు ఉన్నట్లు పెళ్ళిళ్ళలో కూడా ఒక లిమిట్ కి మించి ఖర్చు పెట్టకూడదని శాసనంచేస్తే బాగుండు. ఒక మంగళసూత్రం, ఒక కొత్తచీరె, ఒక కొత్త సూటు, రెండు పూలదండలు, ఒకపూట విందూ బస్! అంతే! అంతకుమించి ఖర్చుచేస్తే ఆ పెళ్ళిచెల్లదని రద్దుచెయ్యాలి ఏమంటారు?" అన్నాడు సంజయ్.     నవ్వింది అలేఖ్య "చెప్పడం సులువే! మీ మటుకుమీరు అలా అంటే జనతారకం పెళ్ళి చేసుకోగలరా? ఏమిటి?"     "నామటుకు నేను చేసుకుని చూపిస్తాను చూస్తూ ఉండండి. మీకు తప్పకుండా కార్డు వస్తుంది. మీరు లేకుండానా పెళ్ళి జరగదు సరేనా?"     "కట్నాలూ, లాంఛనాలూ కూడా ఏమీ తీసుకోరా?"     "చంపేస్తానని బలవంతం చేసినా తీసుకోను! లాంఛనాలు అంటే నిజంగా జరిగిన సంఘటన ఒకటి గుర్తొచ్చింది చెప్పనా?"     "చెప్పండి?"     "నా ఫ్రెండు చెల్లెలు ఒక్మమ్మాయి ఉంది. బాగా చదువుకుంది. పెద్ద కట్నంతో గొప్ప లాంఛనాలతో ఒక సంబంధం సెటిల్ చేశారు. తీరా పీటలమీద కూర్చున్న తర్వాత స్కూటరు కూడా ఇస్తేగానీ తాళికట్టనన్నాడు వరుడు.     అమ్మాయి తరపువాళ్ళు తల్లడిల్లిపోయి అప్పటికప్పుడు డబ్బు ఆప్పుతెచ్చి బ్లాక్ లో స్కూటర్ కొని అరగంటలో పెళ్ళిపందిట్లో నిలిపారు. అప్పుడు ప్రసన్నవదనంతో పెళ్ళికూతురు మెడలో తాళి కట్టడానికి లేచాడు వరుడు.     అప్పటిదాకా మెదలకుండా కూర్చుని జరుగుతున్నదంతా చూస్తున్న ఆ అమ్మాయితోక తొక్కిన తాచులాబుస కొడుతూ లేచి 'తాళి నాకు కాదు. ఆ స్కూటర్ కి కట్టు!' అని విదిలించి కొట్టి విసవిసా నడిచివెళ్ళిపోయింది. ఆ అమ్మాయిలా అందరు అమ్మాయిలూ ధైర్యంగా ఎదురు తిరిగే రోజువస్తే నేను పర్సనల్ గా చాలా సంతోషిస్తాను."     అతని మొహంలోకి చూసింది అలేఖ్య. అతని పెదిమలు పట్టుదలని సూచిస్తూ వంపు తిరిగివున్నాయి. అతని చూపులు అప్రయత్నంగానే ఆమె చూపులతో కలిశాయి.     అయినా వెంటనే కళ్ళు తిప్పుకోలేదు అలేఖ్య. కొద్ది క్షణాలపాటు అతనివైపు చూస్తూ ఉండిపోయింది. అతనూతదేకంగా ఆమెవైపు చూస్తున్నాడు. "హైదరాబాద్ వచ్చేస్తోంది" అన్నాడు అతను నెమ్మదిగా ట్రైన్ అప్పటికే గంట లేటు.     కానీ ఇంకో గంట లేటయితే బావుండనిపిస్తోంది ఇద్దరికీ. అయితే ఎవరూ ఆ  మాట పైకి అనలేదు.     రైలు స్టేషన్ లో ఆగింది.     వెంటనే ఫ్లాట్ ఫారం మీద రెడీగా నిలబడ్డ పోలీసులు కనబడ్డారు అలేఖ్యకి. ఎవరినో వెదుకుతున్నట్లు ఉన్నారు వాళ్ళు.     "పోలీసులు!" అన్నాడు సంజయ్ నిర్లిప్తంగా "ఎదురు చూస్తున్నారు నాకోసం!"     అదిరిపడింది అలేఖ్య. "ఎందుకు?" అంది గాభరాగా.     "పోలీసులు ఎందుకు వస్తారు? పోలీసు స్టేషన్ కి తీసుకెళ్ళడానికి. వీళ్ళను తప్పించుకునే ప్రయత్నంచెయ్యడం ఇంక నిష్పలం అనుకుంటాను ఓకే. ఇదినా విజిటింగ్ కార్డ్! ఉంచండి!" అని కార్డు ఇచ్చాడు.     ఆకార్డువైపు చూడలేదు అలేఖ్య. ఫ్లాట్ ఫారం మీద ఉన్న పోలీసులనే చూస్తుంది. ఆమె కళ్ళు పెద్దవయ్యాయి భయంతో.     సూట్ కేస్ పట్టుకుని ఫ్లాట్ ఫారం మీదికి దిగాడు సంజయ్.     వెంటనే ఇద్దరు సర్కిల్ ఇన్ స్పెక్టర్లూ, ఆరుమంది సబ్ ఇన్ స్పెక్టర్లూ, పదిమంది కానిస్టేబుళ్ళూ అటెన్షన్ లో నిలబడి సెల్యూట్ చేశారు. ఆశ్చర్యంతో నోటమాట రాలేదు అలేఖ్యకి. అప్పుడు చూసింది చేతిలో ఉన్న విజిటింగ్ కార్డుని.     "ఆర్. సంజయ్ కుమార్.     ఓ అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్     హైదరాబాద్" అని ఉంది దానిమీద.     బయటనుంచి చూడటానికి చాలాసాదాగా కనబడుతోంది ఆ పోలీసు స్టేషను బిల్డింగు. దానిలోకి అడుగుపెట్టి ఒక గంట గడిపిన వాళ్ళకి గానీ దాని పవర్ ఏమిటో పూర్తిగా అర్ధం కాదు. దానిలోకి అడుగుపెట్టవలసిన అవసరం తమ జీవితంలో రాకూడదని జనాభాలో ఎక్కువశాతం మంది అనుకుంటూ ఉంటారు. ఆ పోలీసు స్టేషనులో ఉండే మనుషులు తమ జీవితంలోకి తొంగి చూడకూడదని కూడా చాలామందికి కోరిక ఉంటుంది.     పోలీసు స్టేషను ముందు ఆగింది జీపు. అందులోనుంచి దిగుతున్న అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ సంజయ్ కుమార్ ని చూడగానే అక్కడ తుపాకి పట్టుకుని యమభటుడిలా నిలబడి ఉన్న కానిస్టేబుల్ అటెన్షన్ లోకి వచ్చాడు. తలపంకించిలోపలికి నడిచాడు సంజయ్. సబ్ ఇన్స్ పెక్టర్లూ, అసిస్టెంట్ సబ్ ఇన్స్ పెక్టర్లూ సీట్లలో నుంచి లేచి నిలబడ్డారు. సర్కిల్ ఇన్స్ పెక్టరు నాగరాజ్ గౌరవ పురస్కారంగా ఎదురొచ్చి సంజయ్ కి స్వాగతం చెప్పాడు.     "బంగళావసతిగా ఉందా సర్?" అన్నాడు నాగరాజ్ వినయంగా.     "యస్! యస్! ఎవిరిథింగ్ ఈజ్ జస్ట్ ఫైన్!" అంటూ చుట్టూతా చూశాడు సంజయ్ కొద్దిగా డిమ్ గా, చిరుచీకటిగా ఉంది అక్కడి వాతావరణం. ఒకవైపు వైర్ లెస్ లో నుంచి రేడియో వార్తలలాగా మెసేజెస్ వస్తున్నాయి. లాకప్ రూంలో నుంచి కటకటాలను ఆనుకుని ఇద్దరి మనుషులు బోనులోపడ్డ జంతువులలాగా నిలబడి చూస్తున్నారు.     కర్టెన్ తొలగించుకుని లోపలికి వచ్చాడు సంజయ్. అక్కడ అసిస్టెంట్ కమీషనర్స్ ఆఫీస్ ఉంది.     పోలీస్ స్టేషనూ, అసిస్టెంట్ కమీషనర్స్ ఆఫీసూ ఒకే బిల్డింగులో ఉండడంతప్పనిసరి కాదు. కానీ అక్కడ అలా కుదిరిపోయింది.     వెళ్ళి తన సీట్లో కూర్చున్నాడు సంజయ్.     అతను సీటు ఆఫర్ చేసిన తర్వాత తను కూర్చున్నాడు నాగరాజ్. ఆ సీటు ఆఫర్ చెయ్యడానికి పట్టిన కొద్ది సెకండ్ల వ్యవధిలో కొంచెం ఇబ్బందిగా ఫీలయ్యాడు అతను. రెండు దశాబ్దాల సర్వీసు తర్వాత తను ఈ సర్కిల్ ఇన్స్ పెక్టర్ పోస్టులోకి వచ్చాడు. తన వయసులో సగం ఉన్నట్లు కనబడే ఈ యంగ్ ఏసీపీ ఇండియన్ పోలీసు సర్వీసుకి సెలెక్ట్ అయి డైరెక్టుగా పెద్ద పోస్టుకి వచ్చినవాడు.
24,567
    ఫోన్ రింగయిన  కాస్సేపటికి  రిసీవరు తీసింది రాధ.     "హలో!"     "రాధా, నేను సాగర్ని. హిమజ  ఉందా....?" తన కంఠములో  ఆత్రుత  తెలియకుండా జాగ్రత్తపడుతూ  అడిగాడు.     "లేదు సాగర్! మేమంతా  తన గురించే వర్రీ  అవుతున్నాం. ఇప్పుడే వస్తానని సాయంత్రంగా  అనగా వెళ్ళింది. ఇంతవరకు  రాలేదు. ఏమైందో తెలియడం లేదు."     సాగర్ చెయ్యి రిసీవర్ మీద బిగుసుకుంది.     "నాన్నగారున్నారా?" అడిగాడు ఆశగా.     "ఉన్నారు. పార్టీ జరుగుతోంది. చాలామంది  మంత్రులు, ఎం.పి.లు వచ్చారు. ఆయనా ఎంతో దిగులుపడుతున్నారు. వాళ్ళను  వదిలి వెళ్ళడం  బాగుండదని  ఆగిపోయారు. హిమజ ఫ్రెండ్స్ కు ఫోన్ చేస్తానన్నా వద్దన్నారు. ఒక్కపూట  రాకపోయేసరికి అందరికీ తెలిపేలా  చెయ్యొద్దని."     "నిజమే, ఎవరింట్లోనో  మాటలలో  పడుంటుంది. పొద్దుటే  వచ్చేస్తుందేమో!"     "ఏమయినా చెప్పాలా వస్తే?" అడిగింది రాధ.     "వద్దు. నేనే వచ్చేస్తున్నాను"     ఫోన్ డిస్కనెక్ట్ చేసి హిమజ ఇంటికి ఫోన్ చేశాడు సాగర్.     ట్రింగ్.........ట్రింగ్.........ఫోన్ మోగుతూనే  వుంది జవాబు లేకుండా.     సాగర్ కు తెలుసు. ఉంటే హిమజ అక్కడే వుంటుందని.     "హిమా. నేను. ఒక్కసారి  ఫోన్ తియ్యి" అతని మనసు  ఆక్రోశించింది. అయిదు నిమిషాలయింది. ఒకవేళ  అక్కడ లేకపోతే....     అక్కడే  ప్రమాదంలో పడిందా?     టైం  చూసుకున్నాడు. పదిన్నర  అయింది. మరో అరగంటలో  బాంబే  ఎయిర్ పోర్టులో  వున్నాడు సాగర్.     హైదరాబాద్ విమానాశ్రయం  ఇంటర్నేషనల్  ఎయిర్ పోర్టుగా  మారిన పుణ్యమా అని అర్దరాత్రికూడా విమాన సర్వీస్ వుంది. జెడ్డా నుంచి వచ్చిన జంబోజెట్ బొంబాయిలో ఆగింది. అక్కడ  ప్రయాణీకులు  దిగుతున్నారు. సాగర్ కు టికెట్ దొరకడం కష్టం కాలేదు. పన్నెండుకి పది నిమిషాల ముందుగా  విమానం  గాలిలోకి  లేచింది.                          *    *    *     'భయం' అన్నది  ప్రతి మనిషిలోనూ  అంతర్లీనంగా  ఉండి తీరుతుంది. 'నేనే విషయంలోనూ భయపడను' అనీ రొమ్ము విరుచుకునే  మొనగాడు కూడా  భార్య ఆపరేషన్ థియేటర్ లో వుంటే  బయటికొచ్చేవరకూ కాలుగాలిన పిల్లిలా  తిరుగుతూనే వుంటాడు, భయానికి  గంభీరత అనే ముసుగు వేసుకుని.     భయం కలగ్గానే  కొందరు పెద్దగా అరుస్తారు, కేకలేస్తారు. మరి కొందరికి నోటమాటరాదు. మరికొందరైతే  స్పృహతప్పి పడిపోతారు. కాని ఇంత భయపడినా  అది లోపలే  దాచుకుని పైకి  కనిపించేవాళ్ళు  అరుదు అనే చెప్పాలి.     ఇంటిలో  తను ఒంటరిగా  లేనని, మరెవరో వున్నారని, వాళ్ళు వేసిన తలుపులు  తెరుచుకుని వచ్చారనీ తలచుకోగానే  హిమజ  ముందు భయపడింది. కానీ అంతలోనే ధైర్యం  తెచ్చుకుంది. స్వతహాగా  ఆమె ధైర్యవంతురాలే. కాని అంత పెద్ద ఇంటిలో  తను ఒంటరిగా  వున్నానన్న  భయం  అంతర్లీనంగా  వుండడమే  కాకుండా, ఆ రోజే  ప్రాణాలను తియ్యడానికి కూడా  వెనుకాడని  నరరూపరాక్షసులను  ప్రత్యక్షంగా  చూసిన కారణంగా  కాస్త జడిసింది.     ఒక్కక్షణం  ఆలోచించి  ముందుగా  గదిలో లైటు ఆర్పేసింది.     చుట్టూతా అంతా  వెలుతురు  పరుచుకున్నప్పుడు  చీకటిలో వున్నా వ్యక్తి  భయపడడు. ఎదుట కనిపించే వెలుతురు  ధైర్యాన్నిస్తుంది. కాని చుట్టూ చీకటిగా  వున్నప్పుడు  వెలుతురులో వుంటే  అది డిజెడ్వాంటేజ్. ఫోకస్ అంతా తనమీదే  ఫీలింగ్.     హిమజ గది ఒక మూలనుంటే  సరిగ్గా  అవతలి  మూల నుండి పద్మజ గది మధ్యలో గెస్టురూం, లైబ్రరి గదీ, ఆఫీసురూం వున్నాయి. పద్మజ గదిలో వుంది ఫోన్. చీకటికి కళ్ళు అలవాటు పడేంతవరకు  హిమజ తన గదిలోనే వుంది. ఆ తర్వాత చప్పుడు చెయ్యకుండా  పక్కగదిలోకి వెళ్ళింది. అదే ఆమె చేసిన తెలివయిన పని - ఆమెకు తెలియకుండానే.     అతి నిశ్శబ్దంగా  పద్మజ గది చేరుకుంది. అలవాటుపడిన  ప్రదేశం కాబట్టి  సులువుగానే  ఫోన్ అందుకుంది. 'ముందుగా ప్రకాశరావుగారికి ఫోన్ చెయ్యాలా లేక పోలీసులకు చేస్తే మంచిదా' అనుకుంటూ__     ఫోన్ డెడ్ గా వుంది.     అప్పుడు వేసింది హిమజకు అసలయిన భయం. తను ఎవరికీ  కనిపించకుండా  ఉండాలని  ఈ ఇంటికి రావడం కోరి అపాయాన్ని  తెచ్చుకున్నట్లయింది. తన ఇంట్లోనే  తను బందీ అయింది. దురదృష్టవశాత్తూ  తనున్నవైపు  అవతలవైపంతా  మైదానం  గట్టిగా కేకలు పెట్టినా ఎవరికీ వినిపించదు. అందులోనూ  ఆ ప్రాంతంలో  ఇళ్ళు ఎక్కడెక్కడో  విసిరేసినట్లుంటాయి దూరదూరంగా.     చేతిలో  ఏదయినా  ఆయుధం  లాంటిది వుంటే మంచిదనిపించింది. 'ఏమయితే అవనీ' అనుకుంటూ  లైటు స్విచ్ నొక్కింది. లైటు వెలగలేదు. గాభరాగా వరుసగా అన్ని స్విచ్ లూ నొక్కింది.     అప్పుడర్ధం అయిందామెకు కరెంటు లేదు. ఎవరో మెయిన్ ఆఫ్ చేసేశారు.     ఏం చెయ్యాలో తోచక బొమ్మలా నిలబడిపోయింది.     మెట్లమీద నుంచి  ఎవరో పై కెక్కుతున్న శబ్దం  వినిపించసాగింది.                         *    *    *     విమానం బయలుదేరేముందు  ఆఫీస్ కి  ఫోన్ చేసినప్పుడు  తెల్సిన విషయాల గురించి ఆలోచిస్తున్నాడు సాగర్. అప్పుడే తెలిసిందతనికి ప్రసాద్ మీదా, శివయ్య మీదా జరిగిన హత్యాప్రయత్నాల గురించి! ప్రసాద్ షాక్ లో వున్నాడు! డాక్టర్ రామకృష్ణ ట్రీట్ చేస్తున్నాడు తన ఇంట్లోనే. శివయ్య గవర్నమెంట్ హాస్పిటల్ లో వున్నాడు. 'కండీషన్ అవుట్ ఆఫ్ డేంజర్' అని తెలిసింది.   
24,568
    ఈ పిల్లకి మతి లేదు.     ఓ ఆరు నెలల క్రితం మేము ప్రయాణం చేస్తున్న రైలులో ఎక్కింది. ఆడపిల్ల అందమైనది, మతిలేనిది. ఇలా వదిలేస్తే లోకం బతకనివ్వదని తలచి మా ఆశ్రమానికి తీసుకువచ్చాము. మా ఆశ్రమంలో వైద్యం చేస్తాము. అది మూలికల వైద్యం. బాగు కావటానికి దీర్ఘకాలం పడుతుంది. బాగయిన తర్వాత తిరిగి రోగం రాదు. మందు ఇచ్చి ప్రాతఃకాల ఎండలో మేమే ఇక్కడ వుంచాము" అని వివరించారు.     ఆయన అనుమతితో మేమూ అక్కడే వున్నాము.     అమల పోలికలు వున్నాయి కాని అమల కాదని గ్రహించాము.     ఈ అమ్మాయిని వదిలి రానంది రాజేశ్వరి.     ఆ ఆశ్రమవాసులు అంతా మంచివాళ్ళు. మంచిమందులు తయారు చేయటానికి డబ్బు అంతగా లేదు. నా శక్తానుసారం డబ్బు యిచ్చి అక్కడే వున్నాను. రాజేశ్వరికి బాగా మాలిమి అయింది రోజా.     కొద్ది కొద్దిగా మారుతూ మామూలు మనిషవుతున్న సమయంలో రోజా ఫోటో వున్న పాత పేపరు వెచ్చాలపొట్లం రూపంతో వచ్చి మా కళ్ళపడింది.     దానిని భద్రపరిచాము.     రోజా మధ్య మధ్య తన ఇల్లు తండ్రిని గుర్తుకు తెచ్చుకుంటూ మళ్ళీ అంతలోనే గతం మర్చిపోతూ చివరికి పూర్తిగా బాగు అయింది. వాళ్ళకి చెప్పి ఇక్కడికి వచ్చాము.     మా అమల కూడా మాకు దక్కింది... అంటూ చెప్పుకు వచ్చాడు పరంధామయ్య.     "వింతలు జరుగుతుంటాయి అంటారు. ఇది అపూర్వమైన వింత. మీ దగ్గర రోజా మా దగ్గర అమల దైవం ఉన్నాడన్న నిదర్శనం ఇది!" భుజంగరావు అన్నాడు.     "ఒక్క మాటతో సరిపోదు మామయ్యా నీవిచ్చే లక్షా ఆశ్రమానికి ఇస్తే..." అన్నాడు.     "లక్ష ఏమిటిరా కృష్ణా! నా తల్లిని మామూలు మనిషి చేసిన ఆ ఆశ్రమాన్ని బంగారు నిలయంగా చేస్తాను. అందరం రేపే వెళ్లి దయానంద ప్రభువుని దర్శించుకుందాము. అన్నాడు భుజంగరావు.     ఆ తర్వాత ఆ ఇంట్లో కోటికాంతులు వంద పండగలు ఒక్కసారిగా చేసుకున్న ఆనందం తాండవమాడింది.     "రేపు అమలని తీసుకుని మేము మా ఇంటికి వెళతాము." పరంధామయ్య నమ్రతగా అన్నాడు.     "అంతా కలిసి వుందాం. అదే నా కోరిక. అమల నా రెండో బిడ్డ." భుజంగరావు అన్నాడు.     "ఇక్కడ నుంచి ఎవరూ వెళ్ళటానికి వీలులేదు. అమలని వదిలి తల్లీ తండ్రీ వుండలేరు. అమల కృష్ణని వదిలి ఉండలేదు కనుక...!" రోజా అంది.     "రోజా! నీకు... నీకు కృష్ణ వచ్చాడు.     ఈ సంగతి ఎలా తెలుసా అని ఆశ్చర్యంగా వుందా బావా! ఈ రోజా పిచ్చిది కాదు. మీ యిద్దరి ఫార్సూ చూస్తూనే వున్నాను. మీ ఇరువురూ దంపతులు కావాలి. మీరు ఇక్కడ వుంటారు కాబట్టి... ఆపై డాడీ చెపుతారు. అంది రోజా.     "నా మాట విని కొన్నాళ్ళయినా మీరు వుండాల్సిందే ఇహపై మనం ఫామిలీ. కాదంటే రోజాని కూడా తీసుకు వెళ్ళండి" అన్నాడు భుజంగరావు.     "లాభంలేదు. ఈ ఇంట్లో మీ మాట మాకందరికీ వేదవాక్కు" అన్నాడు పరంధామయ్య.     "అమ్మయ్య! ఇప్పటికి నా మనసు శాంతించింది" అంది రోజా.     "రోజా! నా మనసు ఇంకా శాంతించలేదు." కృష్ణ ఏదో అనబోయాడు.   
24,569
    "ఎక్కడికి?"     "షంషాబాద్..."     "పక్కన వున్న షంషాబాద్ కి ఇంత హడావుడంటయ్యా?"     "పోనీ, ఔరంగాబాద్ కివ్వు..."     "ఔరంగా...బాద్...కా...?" గుడ్లు తేలవేస్తూ అన్నాడు స్టేషన్ మాస్టర్.     సీట్లోంచి లేచి, కిటికీ పక్కనున్న టికెట్స్ సెల్ వేపు వెళ్ళి, మూడు టిక్కెట్లను తీసి వెనక్కొచ్చి__     "డబ్బులివ్వండ"న్నాడు స్టేషన్ మాస్టర్ - సేతురాజు, వీర్రాజు ఇద్దరూ గుడ్లు తేలేసారు.     కిచ కిచమని నవ్వుతూ అరచేయి గుప్పిట తెరిచాడు పోతురాజు.     అయిదు వందల రూపాయల నోటు అందులో ప్రత్యక్షమైంది.     ఫైవ్ హండ్రెడ్ రుపీస్...ఎక్కడిదని కప్పలా నోరు తెరిచి అడగబోతుండగా, ఒక చేత్తో వాడి నోరు మూసేసాడు పోతురాజు.     స్టేషన్ మాస్టర్ ఆ నోటుని తీసుకొని, పరకాయించి చూసి "నో చేంజ్.." అన్నాడు.     "ఏం ఫర్వాలేదు...బ్యాలెన్స్ నువ్వు తీసుకో...ఇలా బ్యాలెన్స్ దానాలు చేయడం మా హాబీ..." ఆ టిక్కెట్లను అందుకొని ముందుకు నడిచాడు పోతురాజు.     సంభ్రమాశ్చర్య వదనులై మిగతా ముగ్గురూ పోతురాజుని పక్కకులాగి__     "ఒక్కసారి ఫైవ్ హండ్రెడ్స్ ఎక్కడివిరా...?" కంగారుగా అడిగారు.     "ఒరే పిచ్చి నాన్నలూ...మనీ సంపాదించడం ఒక ఆర్ట్...ఒక ఫైవ్ హండ్రెడ్స్ ఏంటి....ఇప్పుడు మన దగ్గర చాలా ఫైవ్ హండ్రెడ్స్ వున్నాయి" అంటూ బ్యాక్ పాకెట్ లోంచి అయిదు వందల రూపాయలట్టను తీసి, వాళ్ళ కళ్ళముందు ఆడించాడు.     సరిగ్గా అదే సమయంలో__     "ముగ్గుర్లో ఆ టిక్కెట్లు తీసుకొన్నవారు మరీ పిచ్చివాడు...లేకపోతే బ్యాలెన్స్ ఎందుకు వదిలేస్తాడూ... ఒరే రామప్పా...నీకీ టైం లో ధనయోగాన్ని నుదుట మీద రాశాడు ఆ గాడ్!" అని స్వగతానంద లఃరిలో అనుకొంటూ డ్రాయర్ సొరుగు కొంచెం ముందుకు లాగి, తేలుకుట్టిన వాడిలా "అమ్మో!" అన్నాడు.     ఆ అమ్మోకి కారణం- అంతకు పూర్వమే అతగాడు అక్కడ అయిదు వందల రూపాయల నోట్ల కట్టాను ఉంచడమే!     కిందా మీదా పడుతూ వెతకడం ప్రారంభించాడు.     అయిదు నిమిషాలసేపు వెతికేసరికి, వాషింగ్ మిషన్లో పడేసిన బట్టలా అయిపోయాడు స్టేషన్ మాస్టర్.     "చోర్...చోర్...పకడో...పకడో..." అంటూ బయటకు పరుగు దీయబోయి, ఎదురుగా యూనిఫారమ్ లో వున్న మనిషిని ఢీకొన్నాడు.     "ఏమైంది రామప్పా?" అడిగాడు ఆ యూనిఫారమ్ లో ఉన్న రైల్వే పోలీస్ సబ్ ఇన్ స్పెక్టరు.     "దొంగలబండీ బాబూ....అర్జంటుగా పట్టుకోండి! అదిగో....వాళ్ళే!" దూరంగా బెంచీ మీద తీరుబడిగా కూర్చుని, బీడీలు కాల్చుకుంటున్న ముగ్గుర్నీ చూపిస్తూ అన్నాడు రామప్ప.     "ఆర్యూ షూర్...ఎంత ఎమౌంట్....ఎలా పోయింది?" ఆ ఇన్ స్పెక్టర్ చేతిని పట్టుకుని ముందుకు పరిగెడుతూ కధంతా చెప్పాడు స్టేషన్ మాస్టర్.     మూడు నిమిషాల తర్వాత__     తమ ఎదురుగా నిలబడిన ఆ ఇన్ స్పెక్టర్ వేపు చూస్తూ పోతురాజు     "ఉయార్ అండర్ అరెస్ట్- అవునా?" అని అన్నాడు - ఆ ఇన్ స్పెక్టర్ కి మతిపోయినంత పనైంది ఆ డైలాగ్ కి.     "అరెస్టా...తోలు వలిచేస్తాను. మర్యాదగా చెప్పండి- స్టేషన్ రూమ్ టేబుల్లోని యాభై వేల రూపాయల్ని తీసింది మీరేనా?"     "చెప్పకపోతే ఏం చేస్తారో?" ఠీవీగా పొగ వదుల్తూ అన్నాడు వీర్రాజు.     "స్టేషన్ లో పడేస్తా. లాఠీల్తో కుళ్ళబొడుస్తా. కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తా. ఆరు వారాలు జైలు ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుంది. జాగ్రత్త!" అగ్గిరాముడి టైపులో అన్నాడు ఇన్ స్పెక్టర్.     "ఇంతేనా__ఆరు వారాలేనా? అదికాదు ఇన్స్ ఫెట్రూ- ఇప్పుడు నిన్ను మేం కొట్టేసి పారిపోయామే అనుకో - శిక్ష ఎంత?"     "అయిదు నెలలు!"     "ఆరు వారాల కంటే, అయిదు నెలలు ఎక్కువే కదరా! ఒరేయ్, మరెందుకూ- లాగించెయ్!" కన్నుకొట్టి వీర్రాజు, సేతురాజుకు సలహా ఇవ్వడంతో - సేతురాజు రెప్పపాటు టైం లో ఫట్ మని ఇన్ స్పెక్టర్ చెంప మీద కొట్టి, ముందుకు పరుగెత్తాడు.     ఇన్ స్పెక్టర్ టోపీ కింద పడిపోయింది. ఆతోపీని అందుకొని, ముందుకురికాదు.     స్టేషన్ బయటికి పరుగెత్తి, అటూ ఇటూ చూసి, ముందుకు పరుగెత్తాడు.     రైల్వే పోలీసుల విజిల్స్ కి, ఆ పక్కనే ఉన్న స్టేషన్ లోంచి కానిస్టేబుల్స్ బయటికొచ్చారు.     తమకి దొరక్కుండా తప్పించుకొంటూ, డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ లోకి పరిగెత్తుతున్న ఆ ముగ్గురి వేపూ వింతగా చూడసాగారు పోలీసులు.     డైరెక్ట్ గా లోనికెళ్ళిపోయి, ఖాళీ సెల్ లోకి దూరిపోయి, ఇనప చువ్వల డోర్ ని గట్టిగా బిగించుకున్నారు ఆ ముగ్గురూ.                                                                       ౦    ౦    ౦
24,570
    "గజల్స్ విందామా? తింటే గారెలు తినాలి_వింటే భారతం వినాలీ అన్నారుగానీ, వర్షం రాత్రి తింటే పకోడీలు తినాలి. వింటే గులామ్ ఆలీ గజల్స్ వినాలి__"     "విందాం. కానీ కాస్త టీ తాగితే బావుంటుందేమో!"     "ష్యూర్."     "నౌఖరొద్దు మనమే పెట్టుకుందాం-"     ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవిచేసి, అంతలో నవ్వేస్తూ, "సరే" అంది. టీ కలుపుతూంటే అతడు గుమ్మానికి ఆనుకుని నిలబడ్డాడు. నడుమువరకు వేలాడే జడ, మెడని వెనుకనుంచి పూర్తిగా కప్పేసిన జుట్టు, ఒకవైపు నుంచి పడుతున్న వెలుతురులో అందమయిన ప్రొఫైలు....     "ఏమిటి అలా చూస్తున్నావు?" టీ అందిస్తూ అడిగింది.      "ఏమీలేదు. ఇప్పుడు మీ నాన్నగారు అకస్మాత్తుగా వచ్చి ఇలా మనల్ని చూస్తే ఎలా వుంటుందా- అని ఆలోచిస్తున్నాను."     "ఏం? ఎలా వుంటుంది? నాకెప్పుడయినా నిద్ర పట్టకపోతే ఇలా అర్దరాత్రిపూట నాన్నని లేపి వేధించడం అలవాటే. ఏమీ అనుకోరు."     అతడు ఏదో అనబోయి వూరుకున్నాడు.     "పద పద! టీ చల్లారిపోతుంది."     ఇద్దరూ బెడ్ రూమ్ లోకి వెళ్ళటంకోసం మెట్లు ఎక్కసాగారు. మేడ మెట్ల వంపులో నిలువటద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుని వేణు ఉలిక్కిపడ్డాడు. అద్దంలో వేణు లేడు. ఇంకెవరో వున్నారు.     ఇద్దరూ గదిలో ప్రవేశించారు. కప్పు పట్టుకుని కూర్చుంటూ టేప్ నొక్కింది ప్రేమ.     కిటికీ తెరల్ని కదుపుతూ ఒక పిల్ల తెమ్మెర లోపలికి వచ్చి వాళ్ళని పరామర్శించింది. తెమ్మెరతోపాటే తరంగాలు తరంగాలుగా గులామ్ ఆలీ పాట కూడా.     बहारें चमन थाद आजया है     मुझे वो गुल बदन याद आगया है     అతడు టీ పూర్తిచేసి కప్పు బల్లమీద పెడుతూండగా కరెంటు పోయింది. ఒక్క క్షణం ఉలిక్కిపడ్డాడు. ప్రసాదరావు తన పని తాను చేసుకుంటూ పోతున్నాడన్నమాట.     "కొవ్వొత్తి వెలిగించనా?"     "ఉహుఁ ఇలాగే బావుంది."     "టేప్ లో పాట ఇంకా వస్తూనే వుంది."     అతడు లేచి కిటికీ దగ్గరికి వెళ్ళాడు. క్రింది నించి పెరిగిన చెట్టు తాలూకు కొబ్బరాకు నీడ గోడమీద కదుల్తూంది.     ఆమె వెనుక నుంచి దగ్గిరగా రావటం తెలుస్తూంది. నిద్రలో మంద్రమైన సెంటు పరిమళం, చీకటిలో స్పష్టమయిన అస్పష్టం.     అతడు వెనుదిరిగాడు. అలా తిరగటంలో ఆమె మరింత దగ్గరగా వచ్చింది. అతడు అప్రయత్నంగా ఆమె భుజంచుట్టూ చేయి వేశాడు. ఆమె కదల్లేదు. భుజంమీద నుంచి అతడి చెయ్యి కదిలి జుట్టు వెనగ్గా మెడ మీదకు పాకి, ఆమెని దగ్గిరకి తీసుకుంది. ఆమె కాదనలేదు.     అతడు తల వంచి ఆమె పెదవుల మధ్య రహస్యాన్ని శోధించబోయాడు. ఘనీభవించిన హిమకణం కొండ అంచున కదిలి శిఖరాల చివర్నుంచి లోయలోకి జారబోయిన క్షణం....     ఆకాశం అంటుకున్నట్టూ- రెండు మేఘాలు ఢీకొని మెరిసిన మెరుపు విశ్వమంతా వ్యాపించి కిటికీలోంచి ఆమె మొహం మీద ప్రతిబింబించింది. ఆ వెలుగులో ఏ భావమూ ప్రస్పుటించమని ఆ మొహంకేసి చూసి అతడు విస్మయంతో, "ఏమిటి ఆలోచిస్తున్నావ్ ప్రేమా?" అని అడిగాడు.     ఆమె కన్నులు విప్పకుండా అంది. "స్నేహానికి పరమార్ధం ఏమిటా అని."     ఒక శీతల పవనం ఆ గదిని ఒక్కసారిగా చల్లబర్చినట్టూ- ఒక కవోష్ణ రుధిరం శరీరంలో ఎగజిమ్మినట్టూ అయి ఆమెని వదిలేసాడు.     టేప్ లో చివరి పాట వస్తూ ఆగిపోయింది.     किसको सुनाये हाले दिल     दिल आखिर दिल है         (మనసు....ఎంతైనా మనస్సుకదా)                                                                         7     "నేను చెయ్యలేను. ఉహు....నేను పాడు చెయ్యలేను" అన్నాడు వేణు తల విదిలిస్తూ. అతడు స్టూల్ మీద కూర్చొని, చేతుల్లో మొహం దాచుకుని వున్నాడు.     ఎదురుగా వున్న ప్రసాదరావు ఏమీ మాట్లాడలేదు. చాలా సేపట్నుంచి అతడలాగే మౌనంగా వేణు చెప్పేది వింటున్నాడు.     వేణూయే మాట్లాడుతున్నాడు. అతడి కంఠం నూతిలోంచి వస్తున్నట్టూ వుంది. ఏదో మైకంలో వున్నట్టు- పశ్చాత్తాపం చెందుతున్నట్టూ ఓటమి వొప్పుకుంటున్నట్టూ అన్నాడు. "మనిద్దరం మొదటిసారి కలిసినప్పుడు, మీరు నాకీపని వప్పజెప్పినప్పుడు, ఇదంతా చాలా సులభం అనుకున్నాను. అనుకున్నట్టే పరిచయం పెంచుకోవడం కష్టంకాలేదు కూడా. కలలో కూడా ఎవరూ వూహించలేనంత గొప్పగా ప్లాన్ మీద ప్లాన్ వేస్తూ మా ఇద్దర్నీ దగ్గిర చేర్చారు. మీరు కష్టం అనుకున్నవన్నీ సులభం అయ్యాయి. కానీ ఎంతో సులభం అనుకున్నది చివరికి కష్టమైంది. ఇంతవరకూ వచ్చాక ఇంకేముందీ- అనుకున్నాను. అసలు కష్టం ఇక్కడే ప్రారంభమయింది. ఆమెతో పరిచయం పెరిగేకొద్దీ నాలోనూ ఘర్షణ ఎక్కువ అవసాగింది. యీ ఘర్షణ విషయం మీకు చెప్పలేక నాలో నేనే ఇంతకాలం మధనపడుతూ వచ్చాను. అనుకున్నట్టు కన్నుమూసి తెరిచేలోగా అయిపోతే ఎలా వుండేదో చెప్పలేను కానీ- ఆమె నెమ్మది నెమ్మదిగా కొద్ది కొద్దిగా దగ్గిరవుతూ రావటంతో యీ చిక్కు వచ్చి పడింది. ఈ దగ్గిరవటం భౌతికం కాదు- మానసికం. ఆమె ఇలా దగ్గిరగా వస్తుంటే దాన్ని నేను మన స్వార్ధం కోసం ఉపయోగించుకోలేకపోయాను. ఇది ఈ రోజునాటి సమస్య కాదు ప్రసాదరావుగారూ! ఈ అవకాశం నాకు యీ వర్షం కురిసిన రోజూ, కరెంటుపోయిన ఈ రాత్రే రాలేదు. ఇలాంటి అవకాశాలు మామధ్య ఎన్నో వచ్చినయ్. నాకు కాలు విరిగిన యీ మూడు నెలల్లో ఎన్నోసార్లు మన పథకం పూర్తిచేసి చివరి తెర వేయాలనుకుంటూ వచ్చాను. హఠాత్తుగా ఈ వార్త చెప్పి మిమ్మల్ని ఆనందంతో ముంచెత్తాలని వువ్విళ్ళూరేను. కానీ ప్రతీసారీ దీనికి వ్యతిరేకత నా మనసులోంచి ఒక కెరటంలా తోసుకొచ్చేది. ఇప్పుడింత జరిగాక నేనొక్కటే చెప్పగలను ప్రసాదరావుగారూ! మీరు నాలాటి చేతకానివాణ్ణి ఈ పనికి ఎన్నుకుని చాలా తప్పుచేసారు. నేనా అమ్మాయిని పాడు చెయ్యలేను. చెడుకి కూడా ధైర్యం కావాలి. నాలాటి పిరికివాడు ఆ పనిచేయలేడు. మూడునెలల నా మనసులో ఘర్షణపడి, ఓడిపోయి మీకీ వార్త చెపుతున్నాను. మీకీ వార్త విద్యుద్ఘాతం అవుతుందని నాకు తెలుసు. నన్ను క్షమించండి! కానీ ఒక్కటి మాత్రం నా చెల్లెలిమీద ఒట్టేసి చెపుతున్నాను. నమ్మండి. ఈ కార్యం ఎలాగైనా పూర్తి చెయ్యాలి అని నా శాయశక్తులా ప్రయత్నించాను. చివరికి నన్న రాత్రి ఆఖరి రోజు అనుకున్నాను. ఈ పరీక్షలో ఎలాగైనా సరే నెగ్గాలీ- అన్న దృడ నిశ్చయంతో వెళ్ళాను. ఆమె దీన్ని స్నేహమే అనుకుంటుందో- ప్రేమే అనుకుంటూందో- పెళ్ళే అనుకుంటూందో- నాకైతే తెలీదు కానీ ఆమె ఎదురు చెప్పలేదు. కానీ అక్కడ కూడా నాకు ఓటమే ఎదురైంది. మనసు ఎదురుతిరిగింది. నా చేతుల మధ్యనున్న ఆ మొహంలో అమాయకత్వమే నన్ను నిలదీసి ప్రశ్నిస్తున్నట్టు తోచింది. ఇక నేను గెలవనేనన్నది రూఢీ అయిపోయింది. మీరు నా మీద వుంచిన నమ్మకానికి నేను న్యాయం చేకూర్చలేకపోయాను. నన్ను క్షమించండి ప్రసాదరావుగారూ! మీరు నా మీద పెట్టిన పెట్టుబడి అంతా వృధా అయింది. దీనికి మీరు ఏ శిక్ష విధించినా సిద్ధంగా వున్నాను. నాకూ, నా చెల్లికీ మీరు చేసిన సాయానికి యావజ్జీవం మీకు ఊడిగం చెయ్యమన్నా చేస్తాను.... చెప్పండి."     అతడు మాటలు పూర్తి చెయ్యగానే, ఆ గదిలో గాఢమైన నిశ్శబ్దం పేరుకుంది.     ఎంతసేపటికీ ప్రసాదరావు మాట్లాడకపోవటంతో అతడు తలెత్తాడు. ప్రసాదరావు మొహం నిర్మలంగా వుండటం చూసి ఆశ్చర్యపోయాడు. పేలుతుందనుకున్న అగ్నిపర్వతం మామూలుగా వుంది.     "నువ్వెళ్ళు వేణూ!" అన్నాడు తాపీగా.     వేణు ఆశ్చర్యం అధికమైంది. లేస్తూ- "....నేనూ" అన్నాడు.     "నేను వాదించటం వల్లా, నిన్ను బలవంతాన తిరిగి వప్పించటం వల్లా ఈ పని పూర్తవుతుందా?" అవదు. ఇది మనసుకు సంబంధించింది. నువ్విక ఈ పని చెయ్యలేవు. ఎందుకు వృధా వాదనలు- చర్చలు.... నువ్వెళ్ళు. గుడ్ బై" అన్నాడు.     వేణు ఇబ్బందిగా "మీరు నన్ను...." అనబోయాడు.     "నేను నిన్ను శిక్షించాలని- లేకపోతే క్షమించాలని అంటావ్. అంతేగా. దానివల్ల లాభం ఏముంది? నేనెంత ప్రాక్టికల్ మనిషినో తెలుసుగా. టైమ్ వేస్ట్ వద్దు. వెళ్ళు వేణూ! నన్ను ఒంటరిగా వదిలిపెట్టు...." తల తిప్పుకొని అన్నాడు. వేణు ఏదో అనబోయి, ఆ అభిప్రాయం మార్చుకుని అక్కడ్నుంచి కదిలాడు. ఇప్పుడిక ఏం చెప్పినా లాభంలేదు. కొంచెం స్థిమితపడ్డాక చెప్పాలి.     అతడు బైటకొచ్చాడేగానీ ఏదో గిల్టీకాన్షస్ నెస్ అతడిని వెంటాడసాగింది. ఇన్నాళ్ళుగా తన సహచరుడిగా, మిత్రుడిగా వుంటూ వచ్చిన ఆ వృద్ధుడితో పూర్తిగా తెగతెంపులు అయిపోయాయని నమ్మబుద్ధిగావటంలేదు. తను అతడిని నమ్మించి ద్రోహం చేసాడు.     అయినా అతడు యెందుకంత "కామ్"గా వున్నాడు?     తను యీ వార్త చెప్పినప్పుడు ఏమీ చెదర్లేదేం?     వేణు కళ్ళముందు అతడి మొహం కదలాడింది. నడుస్తూ ఆలోచించసాగాడు.     ప్రసాదరావు సంగతి అతడికి బాగా తెలుసు. ఏ నిర్ణయాన్నైనా అతడు క్షణాలమీద తీసుకుంటాడు. మొహంలో యెక్కడా దాన్ని బైట పడనివ్వడు.     అతడంత కామ్ గా వున్నాడంటే అంత దారుణమైన నిర్ణయం ఏదో తీసుకునే వుంటాడు?.... ఏమిటది?     చప్పున ఏదో స్పురించి ఉలిక్కిపడ్డాడు.     అప్పటికే అతడు చాలాదూరం వచ్చేసేడు.     వెనుదిరిగి పరుగెత్తడం మొదలుపెట్టాడు.     చెక్కమెట్లు అతడి కాళ్ళ క్రింద కిర్రుమని శబ్దం చేస్తున్నాయి. గాలికన్నా వేగంగా మేడ ఎక్కాడు.     అతడి వూహ నిజమైంది.     తలుపు సందుల్లోంచి ఆ దృశ్యం స్పష్టంగా కనబడుతూంది.     ప్రసాదరావు నుదుటికిపిస్టల్ ఆన్చుకొని కాల్చుకోబోతున్నాడు.     ఇంకొక్క క్షణం ఆలశ్యమై వుంటే అంతా అయిపోయేదే.     తలుపులు ధడాలున తెరుచుకుని వేణు లోపలికి ప్రవేశించి అతడి చేతుల్లోంచి పిస్తోలు లాక్కున్నాడు.     "ఇచ్చెయ్ వేణూ! ఇచ్చెయి" తిరిగి లాక్కుంటూ అన్నాడు ప్రసాదరావు.     "మీకేమైనా మతిపోయిందా?"        ఆ మాటలకి ప్రసాదరావు ఘర్షణ మానేసి, వేణు కళ్ళలోకి సూటిగా చూసేడు. తరువాత బిగ్గరగా నవ్వేడు.     "అవును. నాకు మతిపోయింది. ఈ పనికి ఒక వ్యక్తిని నియమించినప్పుడే నాకు మతిపోయింది. నేను విలన్ కదూ? చూసేవాళ్ళందరికీ నువ్వు హీరోవి. ఒక అమ్మాయి శీలం అపహరించటం అనే దారుణ కృత్యానికి నిన్ను నియమించిన నేను విలన్ని!! అలాటి పని చేయలేక మానసిక వ్యధతో కొట్టుమిట్టులాడుతున్న నువ్వు హీరోవి. ప్రతివాళ్ళకీ అదే కనపడుతుంది. ఎన్ని సంవత్సరాలు నేను యీ డబ్బు సంపాదించటానికి కష్టపడ్డానో ఎవరికీ తెలీదు. నా చెల్లెలికి జరిగిన అన్యాయానికి ఇన్నాళ్ళూ నేనెంత రగిలిపోయానో ఎవరికీ తెలీదు!! ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు ఇంత పగడ్భందీగా ప్లాన్ వేసి నిన్ను నియమిస్తే నేను చెమటోడ్చి కష్టపడిన డబ్బంతా ఖర్చయ్యాక, ఇప్పుడు నువ్వొచ్చి తాపీగా- "నేనీ పని చెయ్యలేను" అని చెప్పి వెళ్ళిపోతే దానికి నేను ఆత్మహత్య చేసుకోబోవటం కూడా నా తప్పే! నాకే మతిపోయింది, నువ్వు మాత్రం మంచోడివి. అయినా నేనేమీ నీ దగ్గర దాచలేదే? ఉన్నదున్నట్టు వివరించాను. కాంట్రాక్టు కుదుర్చుకున్నాను. నేనన్నమాట ప్రకారం నీ చెల్లెలికి ఆపరేషన్ చేయించాను. ఇప్పుడు సడెన్ గా నువ్వొచ్చి యీ మాట చెప్తే, ఇక నేనేం చెయ్యను! పోయిన డబ్బు అంతా తిరిగి కూడగట్టుకోనా? దానికి నువ్వూ, నీ చెల్లీ చెమటోడ్చి సాయం చేస్తారా?.... భలే అప్పుడు మళ్ళీ ఇంకొక కుర్రవాడిని పట్టుకుని దీనికి నియమించాలి అన్నమాట. ఆ అమ్మాయేమన్నా మిషనా? ఒకరి తరువాత మరొకరిని ప్రేమించటానికి? లాభం లేదు వేణూ! నేను సర్వనాశనమైపోయాను. ఇంకే విధంగానూ జగపతిరావుని దెబ్బతీయలేను. అతడు నాకూ, నా చెల్లెలికీ చేసిన అన్యాయానికి కుమిలి కుమిలి పోవటం తప్ప మరేమీ చేయలేను."
24,571
    పాలు సగమే ఉన్నాయేమిటి? ఏదో జరుగుతోంది.     ఎవరో తనని ఆటలు పట్టిస్తున్నారు. శత్రువులు ఎవరయినా వచ్చారా? తమరాకని ముందుగా గమనించి ఎవరయినా ఫాలో చేశారా? అహ్మద్ రాకపోవటంలో అర్ధమేమిటి చెప్మా! గ్లాసుని పరిశీలించాడు.     పాలు సగానికి తరిగిపోవటమే కాదు దానిమీద ముద్రలు కన్పించాయి, బహుశా అవి చేతివ్రేళ్ళు ముద్రలు అయి వుంటాయా?     పోలీసు ఆలోచనతో చప్పున దాన్ని క్రింద దింపేసి చేతి రుమాలతో అడుగున సుతారంగా పట్టుకుని నెమ్మదిగా పైకెత్తి చూశాడు.     గ్లాసు మీద ముద్రతమయింది చేతి వ్రేలి ముద్రలు కావు.     పెదవులానించిన గుర్తులు తాను ఎంగిలిచేసి అక్కడపెట్టిన పాలు ఎవరో త్రాగటం మాత్రమే కాకుండా గ్లాసుమీధ ఆప్యాయంగా ముద్దుపెట్టినట్లు గుర్తులు స్పష్టంగా కన్పించాయి.     ఈ కాలం ప్రియురాళ్ళు అయితే మందు గ్లాసులమీద ముద్దులు పెట్టి యిస్తారు. ప్రియుణ్ణి రెచ్చగొట్టటానికి! తృప్తికాని తృప్తి కలిగించటానికి!     అర్ధాంగి అయితే అర్దరాత్రి శయ్యమీద శరీరాన్ని జీవితాన్ని పంచుకున్న విధంగానే పాలగ్లాసు పంచుకుంటుంది.     ఇక్కడ ఈ పనిచేయటానికి ఎవరున్నారు? ఏ లోకంనించి దిగివచ్చారు?     శివరాజ్ మరింత సంభ్రమంలో మునిగిపోయినాడు. మళ్ళీ చూచాడు. గ్లాసుమీద సుందర తరమయిన అధరాలను అద్దిన గుర్తులు.     తాను ఉన్నత స్థాయి పోలీసు అధికారి ననే విషయాన్ని క్షణం మర్చి అయోమయంగా నిలిచిపోయినాడు.     ఆ క్షణంలో గాలి అలలమీద తేలి వచ్చిందొక మధుర స్వరం! మందాకినీ తరంగాల మీద రాయంచలరాణి ప్రియునికి రాయబారం పంపినట్లు అనిపించింది.     వీణానాదంలో వేణువుని కలబోసి వేదపనలు ఆలపించినట్లుంది.     తన చెవులను నమ్మలేకపోయాడు. మళ్ళీ చెవులు రిక్కించివిన్నాడు.     "నాగరాజా! నన్ను గుర్తించవోయీ!" అక్షరనాదాలు అమృత బిందువులై కురిశాయి ఆ సుస్వరాల కంఠ మాధుర్యానికి నిలువెల్లా పులకించాడు.     కాని ఎప్పుడయితే మనిషి కంఠస్వరం వినిపించిందో వెంటనే అతనిలో పోలీసు అధికారి స్పీడప్ అయిపోయి ప్రశ్నించడం ప్రారంభించాడు.     "ఎవరు? ఎవరు? మాట్లాడుతున్నవారు ఎవరు?? నా ఎదుటకు రావాలి! ఈ దోబూచులెందుకు? దొంగాటలెందుకు? నా పేరు నాగరాజు కాదు. శివరాజ్! ఎదుటకువస్తే నా విలాసమేమిటో వివరిస్తాను. కమాన్! కం టూ మీ!" అన్నాడు.     "ఎందుకంత వేగిరపాటు!? నీ పేరు నాకు తెలియనిదికాదు. నీ విలాసం నేను చవిచూడనిదికాదు. అందుకోవాలని తొందరగా ఉందా? అలరింపులకు వేగిరపాటు కలిగిందా? మూడు దశాబ్ధాలనాడు నన్ను విడిచి పోయినప్పుడులేని తొందర తోసుకువచ్చిందా ఇప్పుడు?     విధి ఎంత విడ్డూరమోయి నా ప్రాణమా! మూడు దశాబ్దాల అనంతరం నిన్నూ నన్నూ ఈ వెన్నెల విరిసిన ఏకాంతంతో కలిపింది?     ఆనాడు కౌగిలిలో విడిపోయినావు! అంత నిర్దయగా వెళ్ళిపోయావు! ప్రియురాలి గుండె బుస బుసలాడించి పొంగు చల్లారగనే కాలమనేతెరల చాటుకు వెళ్ళిపోయావు. ఇప్పుడు కాలపు ఉక్కు తెరలను పిడికిళ్ళతో బ్రద్దలుకొట్టుకుని మళ్ళీ ప్రపంచ దృశ్యంలో ప్రాణివయి అవతరించావు."     "నువ్వెవరు?? నువ్వెవరు?? అని ప్రశ్నిస్తావా నన్ను?"     నీ మనసు అద్దంలో కనిపించే ప్రతిబింబం ఎవరిది? ఏకాంతంలో అంతర్లోకాల వాకిళ్ళు తెరిచినప్పుడు నీముందు ప్రత్యక్షమయ్యే రూపం ఎవరిది? యుగ యుగాంతరాల విశ్వయానంలో ఆత్మలు స్త్రీ సంయోగంతో పెనవేసుకొని ప్రాణి రూపాలయినప్పుడు ఒకటి నీవు! మరొకటి యెవరనుకున్నావు? నేనే!!     నీ యెదుటకు రమ్మని అడుగుతున్నావా? నన్ను గుర్తించాలంటున్నావా? మగవాడి మనసులో యెంత మరపు యెంత దగ ఉంటుందో నిరూపించావు.     మూడు దశాబ్దాల వియోగంలో కూడ నా యెదుట నీవున్నావు. నా లోపల నీవున్నావు. నా లోకమంతా నీవుగానే వున్నావు!     కాని నన్ను మాత్రం నీవు మరచిపోయావన్నమాట? ఈ కంఠ స్వరాన్ని గుర్తించలేని పరాయి వాడివయ్యావన్నమాట!     అతని ఆత్మ లోకాన్ని నాగలోకపు నీడలు పట్టియుగాల వెనక్కు ఈడ్చుకు పోతున్నట్లుగా అనిపించింది. ఏవో జ్ఞాపకాలు దోబూచులాడినట్లు అనిపించాయి.     మాటాడుతూ పోటాడుతూ మనసుని వేటాడిన ఆ మగువ మాటలు క్రొత్తవిగా అతనికి అనిపించలేదు. మరపు లోయలలోకి దొర్లి పడిపోయిన మధుర జ్ఞాపకాల మనసు తెరల మీదకి తేలి వచ్చినట్లు అనిపించింది.     క్రమ శిక్షణలో, కఠిన పరిశ్రమలో రాటుతేలిన అతని శరీరం అణువు అణువూ అగ్ని సంయోగంలో కరిగిన వెన్నపూసలా జారిపోయింది.     "నిన్ను చూడాలనుంది! నా ముందుకు రావెందుకని?" అన్నాడు అప్రయత్నంగా అర్ధింపుగా అన్నాడు.     తళుక్కుమని తటిల్లతలు మెరిశాయి!     సహస్ర వర్షోపజీవులయిన శ్వేత ఫణీంద్రాల శరీర కాంతిలా... అల్లన అల్లన అతనిముందు మురిపించే ముత్యాల పేరులా ప్రత్యక్షమయింది ఓ రూపం!     ఆ సౌందర్య జిగీషకు అతడు విభ్రాంతుడయినాడు.     రెప్పలు వేయటం మరచి అమృతపాయి అబునాడు!     అచేతనుడయి, మంత్రముగ్దుడై జన్మాంతరాలకు తరలి వెళుతున్న ఆత్మ శకలాల కాంతి కిరణంలా అలా నిలిచిపోయినాడు.    
24,572
    "గ్రాండ్ పా! ఇంకేమీ అడగను! మా డాడీ పేరు చెప్పండి" అంది.    "పేరు చెప్పాక ఇంకేమీ అడక్కుండా బుద్ధిగా పడుకుంటావా?" బద్దలయిపోతున్న గుండెని చేతులతో పట్టుకుంటున్నట్లు రాసుకుంటూ అడిగారు.     "ప్రామిస్! అడగను! గ్రాండ్ పా!" అంది.     "రాజేష్!"        "రాజేషా!" తన క్లాసులో రుక్మిణీ రాజేష్ జ్ఞాపకం వచ్చింది శిల్పా రాజేష్ అనుకుంటూ నవ్వుకుంటోంది.     "ఊ..... " అంటూ ఆలోచనలో పడిపోయిన రామానుజంగారి భుజం పట్టుకుని, పెద్ద ఆరిందాలా "గ్రాండ్ పా! ఇక పడుకుందాం పదండి" అంది.     ఆశ్చర్యం, ఆనందం, దుఃఖం గుండెను పీల్చేస్తుంటే శిల్పని ఎత్తుకుని మంచంమీద వాలిపోయారు రామానుజంగారు! శిల్పకి ఇన్ని తెలివితేటలున్నాయని గానీ, ఇంత చక్కగా మాట్లాడగలదని గానీ, ఆమె పుట్టిన ఈ పదేళ్లలోనూ అనుకోలేదు. రాగిణి దురదృష్టానికి బాధపడుతూ ఏ తెల్లవారుఝామునో నిద్రలోకి జారుకున్నారు రామానుజంగారు.     అతన్ని గట్టిగా కావలించుకొని నిద్రపోయింది శిల్ప తృప్తితో!     ఆనాటి నుంచి శిల్ప వీరిని 'గ్రాండ్ పా',  'గ్రాండ్ మా' అని పిలవడం మొదలుపెట్టింది.     దాంతో ఇన్నాళ్ళూ ప్రశ్నార్థకంగా వున్న ఈ పిల్ల రాగిణి బిడ్డేనని, అందరికీ వెల్లడయింది. దాంతో అయినవాళ్ళూ, కానివాళ్ళూ నానా రకాలుగా మాట్లాడారు. దాదాపు అందరూ కూడా సరోజినినే దూషించారు. రాగిణి బతుకు బండలు కావడానికి కారణం ఈవిడేనన్నారు. "వయసు వచ్చిన పిల్లని సినిమాలకని పంపించిందట! ఆ ప్రొడ్యూసర్ ఆ అమ్మాయిని ఉంచుకున్నాట్ట! ఈ తల్లికి సిగ్గులేదూ?"     "డబ్బుకోసం భార్యాభర్తల్ని విడదీసింది! తల్లీ బిడ్డల్ని వేరుచేసింది! ఇది కన్నతల్లేనా?"     సరోజినికి శిల్పని చూసి సగం కడుపు తరుక్కుపోయి గతుక్కుమంటుంటే, వీరిమాటలు వింటుంటే మరీ మతిపోయింది. డాక్టరొచ్చి ఏవో మందులు రాసిచ్చి వెళ్లారు. మనోవ్యాధికి మందేముంది? ఎన్ని మందులు వాడినా ఏ మాత్రం తగ్గలేదు సరోజినికి!     శిల్ప సెలవులు పూర్తయిపోయాయి. అవినాష్ తోటే పంపాలనుకున్నారు శిల్పని. కోటయ్యగారూ, రామానుజంగారు తరచు కలుసుకుంటూనే వున్నారు. హైదరాబాదు నుంచి శిల్పా, అవినాష్ లు ఫ్లయిట్ లోనే వెళ్ళిపోయారు.     "బై..... బై..... గ్రాండ్ పా...... బై.... బై గ్రాండ్ మా!" అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్న శిల్పని చూస్తుంటే, ప్రాణాలు పోతాయేమోనని అనిపించింది రామానుజం దంపతులకి! సరోజిని పసిపిల్లలా ఏడుస్తుంటే ఆమెని ఓదార్చే శక్తి అక్కడ ఎవరికీ లేకపోయింది.     శిల్ప వెళ్ళిపోయాక ఆమె మరీ పిచ్చిదైపోయింది! దానికి తోడు రాగిణి దగ్గరి నుంచొచ్చిన ఉత్తరంలో సినిమా ఎప్పుడయిపోతోందో, తనెప్పుడొస్తుందో రాయలేదు! శిల్ప గురించి ఒక్క మాటైనా రాయలేదు. భరణి గురించి గానీ, వాళ్లబ్బాయి గురించి గానీ ఏమీ లేదు. తనూ భార్గవ పెళ్ళి చేసుకుందామని నిశ్చయించుకున్నట్టు రాసింది. ఉత్తరం చదివి కుప్పగా కూలిపోయింది సరోజిని. "భార్గవ భార్య ఊరుకుంటుందా? జుట్టుపట్టి రచ్చకీడ్చదూ? రాజేష్ తో పెళ్ళి ఛిన్నాభిన్నమైపోయింది. ఇప్పుడు పెళ్ళయి భార్య వుండగా భార్గవతో పెళ్ళా? ఇది ఎందుకిలా తయారైంది?" తల బాదుకుంది సరోజిని.     "ఊరుకో సరోజినీ! దాని తలరాత అలావుంది" ఓదార్చారు రామానుజంగారు.     "కాదండీ! దీనికంతటికీ కారణం నేనే! ధనదాహం నన్ను రాక్షసిని చేశాయి. నేను మహాపాపిని! నాకు ప్రాయశ్చిత్తం లేదు" అంటూ గుండెలవిసేలా ఏడ్చి ఏడ్చి పడుకుంది.     రామానుజంగారికి చెప్పుకోవడానికి కూడా ఎవ్వరూ లేరు. సానుభూతి చూపడానికి కూడా ఎవ్వరూ లేరు..... ఒక్క కోటయ్య తప్ప.     "రామూ! నేనొక్క మాట చెబుతా, అలా చేస్తావా?" అడిగారు కోటయ్యగారు!     "చెప్పరా! అలాగే చేస్తాను" పసిపిల్లాడిలా కంటతడి పెట్టుకున్నారు రామానుజంగారు.     "ఇక్కడ జరిగిన విషయాలన్నీ భరణికి రాశాను. కొంతకాలం మీ ఇద్దరినీ అక్కడికి పిలిపించుకోమని రాశాను."     "అలా రాశావా?" కంగారుగా అడిగారు రామానుజంగారు.     "అవును! ఏమీ?"     "ఒరేయ్! అల్లుడి ముందర పరువుపోదూ? అమ్మాయంటే మన పిల్లగానీ, అల్లుడు మనవాడౌతాడా?"     "రామూ! కాశ్యప్ కి నీ మీద ఎంత గౌరవముందో నీకు తెలుసు. అతను నీకు కొడుకులాంటివాడు. అల్లుడయినా, కొడుకయినా అతడే కదా! నీకు ఇంకెవ్వరున్నారు?"     రామానుజంగారు మరి ఆ విషయం మాట్లాడలేదు.     ఒక వారం రోజులు గడిచిపోయాయి. సరోజిని మంచం దిగడం లేదు. భోజనం కోటయ్యగారింటి నుంచి క్యారేజీ వస్తోంది. ప్రతిరోజు ఏదో ఒక టైములో కోటయ్యగారొచ్చి, కాస్సేపు కూర్చునిపోతున్నారు.     'పోస్ట్' అన్న కేక విని రామానుజంగారు పరుగెత్తుకొచ్చారు. అమెరికా నుంచొచ్చిన ఉత్తరం, ఆత్రంగా చించి చదివారు. ఉత్తరంతో పాటు ముప్పయి వేల రూపాయలకి డ్రాఫ్ట్!!     "వెంటనే మీరు అత్తయ్యగారు టిక్కెట్లు కొనుక్కొని బయలుదేరండి. అత్తయ్య ట్రీట్ మెంటు కోసం వెళుతున్నామంటే, పాస్ పోర్టు, వీసా తొందరగా ఇస్తారు, మిమ్మల్ని స్పాన్సర్ చేస్తూ ప్రభుత్వం వారికి నేను ఉత్తరం కాపీ ఒకటి జత పరుస్తాను. భరణి మీకు మళ్ళీ రాస్తుంది. ప్రస్తుతం కోటయ్యగారి ఉత్తరానికి సమాధానం రాస్తోంది. అయినా మాస్టార్ గారూ! మీకు నా దగ్గర మొహమాటమేమిటి? నన్ను ఆజ్ఞాపించే హక్కు మీకుంది. వెంటనే అన్ని ఏర్పాట్లూ చేసుకుని బయలుదేరి రండి.                                                                                                                         మీ అల్లుడు కాశ్యప్!"     ఉత్తరం చదువుతుంటే ఆనంద భాష్పాలు, చెంపలమీదుగా జారి గుండెలమీదికి రాలాయి.     "ఏమిటండీ ఉత్తరం?" మంచం మీంచే అడిగింది సరోజిని.     "సరోజినీ మనం అమెరికా వెళుతున్నాం. నీకు అమెరికా వెళ్లే ఛాన్సు పోయిందనుకున్నావు కదూ?"     సరోజిని రామానుజంగారి గుండెలకి తల ఆన్చి, చంటిపిల్లలా వెక్కి వెక్కి ఏడ్చింది.     ఇరువురి హృదయాలు సముద్రంలా ఘోషించాయి!     ఈ సంగతి చెప్పాలని కోటయ్యగారి దగ్గరికి ప్రయాణమవుతూంటే, ఆయన గడప దగ్గరే ఎదురయ్యాడు. "కంగ్రాచ్యులేషన్స్ రామూ!" అన్నారు నవ్వుతూ రామానుజంగారి చేతులందుకుని కరచాలనం చేస్తూ.     "నీకూ వచ్చిందా ఉత్తరం?"     "ఇదిగో" చేతికిచ్చాడు.     భరణి ఉత్తరంలోని ప్రతిఅక్షరం. ఆమె అద్భుత హృదయాన్ని ప్రతిబింబిస్తోంది.     "కోటయ్యగారూ!     ఎలాగైనా వీలైనంతత్వరలో మా అమ్మనీ, నాన్ననీ ఇక్కడికి పంపించెయ్యండి. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. అవినాశ్, శిల్పా ఒకే స్కూల్లో చదువుతున్నారు కాబట్టి, కాస్త శిల్పని కనిపెట్టుకుని వుండండి. కన్న తల్లిదండ్రుల ప్రేమకి నోచుకోని, ఆ పిల్లకి అమ్మా నాన్నల ప్రేమ కూడా కరువైపోతుంది. శిల్పకి కావలసిన డబ్బు నేను పంపిస్తాను. మీ ఉత్తరం పట్టి చూస్తే అక్క లోకంలో లేదనిపిస్తుంది. చిత్ర జగత్తు మాయలో పడి, బాధ్యతలూ, బంధాలూ అన్నీ మరిచిపోయినట్టుంది. మొదటినుంచీ అక్కవేసిన ప్రతి అడుగూ అడుసులోనే పడింది. ఆలోచనా రహితంగా, ఆవేశంతో తీసుకున్న ప్రతి నిర్ణయం ఇలా వుంటుంది. అలా కాకపోతే, అక్క కాపురం రాజేషుతో హాయిగా సాగిపోయేది. అప్పుడు నాకు సలహా ఇచ్చే వయస్సు లేదు. నాన్న మాటలని ఎవ్వరూ లెక్క చెయ్యలేదు. ఆయన సలహా అప్పుడు ఎవ్వరికీ నచ్చలేదు. ఇంతకీ దాని రాతలా వున్నప్పుడు, మంచి మాటలెలా రుచిస్తాయి? మంచి ఎలా జరుగుతుంది. పోన్లెండి! ఇప్పుడవన్నీ రాస్తే ఉత్తరం కాదు, నవలవుతుంది. అమ్మనీ, నాన్ననీ, జాగ్రత్తగా వీలైనంత త్వరలో పంపే ఏర్పాట్లు చెయ్యండి. కాశ్యప్ నాన్నగారి పేరు మీద ముప్పయి వేలకి డ్రాఫ్టు పంపారు. ఉంటా మరి! మీ సమాధానం కోసం ఎదురు చూస్తుంటాను. మీకూ! మీ ఆవిడకి నా నమస్కారాలు. మీ ఇంట్లో అందరినీ అడిగానని చెప్పండి. అవినాష్ కి నా ఆశీస్సులు.
24,573
    పిల్లిలా లేచాడు - లైట్ వెయ్యకుండానే చప్పుడు కాకుండా తలుపు తెరిచాడు. దడదడలాడుతున్న గుండెలతో చకచక మెట్లెక్కి జ్యోత్స్న ఉంటున్న వాటా తలుపు నెట్టాడు. తలుపులు దగ్గిరగా జేరవేసి ఉన్నాయి. తొయ్యగానే తెరుచుకున్నాయి. లోపల చీకటి....     లైట్ వేస్తూ "జ్యోత్స్నా!" అని పిలిచిన భాస్కర్ ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి కొయ్యబారి పోయాడు.       జ్యోత్స్న మంచం మీద వెంకట్రావు పడుకుని ఉన్నాడు. జ్యోత్స్న మంచం పక్కనే అతని మీదకు వంగి నిలబడి ఉంది.... లైట్ వేసిన అలికిడికి, 'జ్యోత్స్నా!' అన్న పిలుపుకి ఉలిక్కిపడి నిటారుగా నిలబడింది జ్యోత్స్న.       ఇద్దరూ నిశ్శబ్దంగా ఒకరినొకరు చూసుకున్నారు. ఏదో చెప్పాలని జ్యోత్స్న పెదవులు కదిలాయి. కానీ, ఆ పరిస్థితుల్లో వెంటనే మాట్లాడలేకపోయింది. "ఛీ!" అని గిర్రున తిరిగి క్రిందకు దిగి వచ్చేశాడు భాస్కర్.     అతనితో పాటు క్రిందకు దిగబోయిన జ్యోత్స్న భాస్కర్ ఇంటి గుమ్మం ముందు నిలబడిన సుశీలని చూసి మెట్లు దగ్గిరే ఆగిపోయింది. సుశీలని చూసి భాస్కర్ గతుక్కుమని ఆగిపోయాడు.        "ఆగిపోయారేం? గుడ్డిముండ - ఏమీ కనిపెట్టలేదు అనుకున్నారు కదూ? ఈ గుడ్డిదానికి కళ్ళు కనపడకపోయినా మనసుందండీ? ఈ మనసుతో అన్నీ చూడగలదు - అందరినీ అర్థం చేసుకోగలదు - నన్ను మోసం చెయ్యగలనని అనుకోకండి - మీరు మంచం మీద నుంచి లేచినప్పుడే నాకు తెలిసింది. ఇంత తొందరగా వచ్చేశారేం? ఏదైనా మరిచిపోయారా?"        సుశీల గొంతు చిన్నది కాదు - సుశీల అరుపులకి అప్పుడే ఎదురింట్లోంచి రేవతి, పార్వతమ్మ బయటికి వచ్చి వింత చూడసాగారు. అది చూసి భాస్కర్ శరీరం జలదరించి "ముందు లోపలికి పద! ఆ తరువాత మాట్లాడుకోవచ్చు" అన్నాడు.     "సుశీల కదలకుండా అక్కడే నిలబడి కసిగా "మాట్లాడుకోవచ్చునా? నాతో ఏం మాటలున్నాయి మీకు? నా డబ్బుతో చదువు పూర్తిచేసుకోగానే నాతో మాటలూ పూర్తయిపోయాయి. వెళ్ళండి. వెళ్ళండి. పైకి వెళ్ళండి. కళ్ళ పండువుగా చూస్తాను. ఈ వైభోగం చూడటానికయినా దేవుడు నాకు కళ్ళిస్తే బాగుండును!" అంది.     భాస్కర్ భరించలేక సుశీలను భుజంపట్టి లోపలకు బలవంతాన తీసుకుపోబోయాడు. సుశీల విదిలించుకుని "నన్ను లోపలకు నెడతారెందుకు? కళ్ళు లేనిదాన్ని. మీ విలాసాలకు నేనేం అడ్డు.... నన్ను దగ్గిర పెట్టుకునే మీ రాసక్రీడలు సాగించుకోవచ్చు" అంది.        అనేక విధాల విసిగిపోయి ఉన్న భాస్కర్ భరించలేక.... "ముందు లోపలికి నడు!" అని లోపలికి తోశాడు. తూలి పడింది సుశీల.         పట్టరాని అక్కసుతో "ఓయ్ దేవుడా! నా కళ్ళముందే దానితో కులుకుతూ, నన్ను చావ బాదుతున్నాడు నాయనోయ్!" అని ఏడుపు ప్రారంభించింది.     అంత రాత్రివేళ ఇంట్లోంచి పారిపోయాడు భాస్కర్. అతడు కాంపౌండ్ దాటేవరకూ మెట్ల దగ్గిరే నిలబడిన జ్యోత్స్న అప్పుడు నెమ్మదిగా లోపలకు వచ్చింది.         వెంకట్రావు మంచం మీద అలాగే పడుకుని ఉన్నాడు జ్యోత్స్నకు ఏమీ అర్థం కావటం లేదు.     రాత్రి పదిగంటల ప్రాంతంలో వచ్చాడు వెంకట్రావు జ్యోత్స్న ఇంటికి. తెల్లబోయి చూస్తోన్న జ్యోత్స్నతో "నన్ను అపార్థం చేసుకోకండి. ఇప్పుడు తప్ప మీతో మాట్లాడగలిగే అవకాశం లేదు. మిమ్మల్ని క్షమాపణ కోరుకోకుండా స్తిమిత పడలేకపోతున్నాను అన్నాడు. జ్యోత్స్న సమాధానం చెప్పలేదు.     "మిమ్మల్ని అవమానపరచాలనీ, చిన్నబుచ్చాలనీ ఆ విషయం చెప్పలేదు నేను. అందరి మధ్య ఉంటూనే, ఏ ఒక్కరితో సంబంధం లేనట్లుగా ఎక్కడకో పారిపోగలిగిన వ్యక్తిని మిమ్మల్ని మాత్రమే చూశాను, ఆనాడు హోటల్లో.... మళ్ళా మీలో అలాంటి మూర్తినే ఇవాళ చూడగానే, మిమ్మల్ని ఇదివరలో ఎక్కడ చూశానా అని ఎప్పటినుండో మధనపడుతోన్న నాకు గభాలున స్ఫురించింది. అనాలోచితంగా పైకి అనేశాను. దయచేసి క్షమించండి...."        వెంకట్రావు మాటల్లో నిజాయితీ కనిపించింది జ్యోత్స్నకి.... అతని ముఖంలో తనపట్ల సానుభూతి ఉంది. ఆ కళ్ళు తనను ఎంతో ఆర్ద్రంగా, అభిమానంగా చూస్తున్నాయి.     "మీరు ఆ హోటల్ కి ఎందుకొచ్చారు? అలా ఎప్పుడూ వస్తూ ఉంటారా?" కుతూహలంతో అడిగింది జ్యోత్స్న.     ఆ ప్రశ్నకు సమాధానం చెప్పటానికి కొంచెం తటపటాయించాడు వెంకట్రావు. "నేను...." అంటూ ఏదో చెప్పబోయినవాడు హఠాత్తుగా ఆగిపోయి, ఎవరో తరుముకొస్తున్నట్లు తలుపులు దగ్గిరగా జేరవేశాడు. లైట్ ఆర్పేశాడు. మంచం మీద పడిపోయాడు. అదంతా కన్ను మూసి కన్ను తెరిచేటంతలో జరిగిపోయింది.     జ్యోత్స్న కంగారుపడి "ఏమిటండీ. లైట్ ఎందు కార్పేశారు? ఇదంతా ఏమిటి?" అంది. వెంకట్రావు దగ్గిరనుండి సమాధానం రాలేదు. సరికదా ఒక విధమయిన వగర్పు వినిపించింది. జ్యోత్స్నకు మతిపోయినట్లయి ఏమిటో చూద్దామని ముందుకు వంగింది. అంతలో లైట్ వెలిగింది. భాస్కర్ రావటమూ, పోవటమూ కూడా జరిగిపోయాయి.           మంచం మీద స్పృహ లేకుండా పడివున్న వెంకట్రావుని చూస్తే ఏం చెయ్యాలో తోచలేదు జ్యోత్స్నకి. అంతకు కొన్ని క్షణాలకు ముందే జరిగిన గొడవ తర్వాత క్రిందకు వెళ్లాలనిపించలేదు. మచ్చల డాక్టర్ ఇంట్లో లేడు. పాపం తనను జాగ్రత్తగా తన వాటాలో దింపి ఏ సినిమాకో వెళ్ళిపోయినట్లున్నాడు.
24,574
    8. నా మహిమ స్వర్గమును, విశాల, పృథ్విని లంఘిస్తుంది. 'కువిత్సోమస్యాపామితి.'     9. నా శక్తి ఎంతటిదనిన, తలచుకొనిన, ఈ ధరిత్రిని లేపి ఒకచోటు నుంచి మరొక చోటునకు మర్చగలను. 'కువిత్సో మస్యాపామితి.'     10. నేను ఈ  పృథ్విని దహించగలను. ఏ చోటునైనను ధ్వంసము చేయగలను. 'కువిత్సోమస్యాపామితి'.     11. నా యొక్క ఒక పార్శ్వము ఆకాశమందున్నది. మరొక భాగము పృథ్వి మీద ఉన్నది. 'కువిత్సోమస్యాపామితి'.     12. నేను మహిమను మించిన మహిమాన్వితుడను. 'కువిత్సోమస్యాపామితి.'     13. నేను స్తుతించబడుచున్నాను. నేను దేవతలకు హవ్యము చేరవేయుదును. స్వయమున హవ్యము గ్రహించి సాగిపోతాను. 'కువిత్సోమస్యాపామితి.'                                 నూట ఇరువదవ సూక్తము     ఋషి -  అథర్వణపుత్ర బృహద్ధివుడు, దేవత - ఇంద్రుడు , ఛందస్సు త్రిష్టుప్         1. ఎవని నుండి జ్యోతిర్మయ సూర్యుడు ఆవిర్భవించినాడో అతడు సర్వశ్రేష్ఠుడు. అతనికి ముందు ఏదీయు లేకుండెను. అతడు జన్మించగనే శత్రు వినాశము చేసినాడు. దేవత లందరు అతనిని అభినందింతురు.     2. ఇంద్రుడు అత్యంత తేజోవంతుడు. విశిష్ట బలశాలి. అతడు దస్యుల గుండెలందు బుగులు  పుట్టించును. ఇంద్రా! నీవు  సోమము సేవింతువు. దాని ఆనందమున సకల ప్రాణులకు  సుఖములు ప్రసాదింతువు. వారిని సంస్కరింతువు. అపుడు వారు నిన్ను స్తుతింతురు.     3. యజమాని దేవతలను సంతృప్తులను చేయును. తనికి వివాహము జరిగినపుడు, సంతానము కలిగినపుడు ఇంద్రునకు సంబంధించిన యుజ్ఞ కార్యములు పూర్తి చేయును. ఇంద్రా ! ఏది సుస్వాదు అగుచున్నదో - అందు అధిక సుస్వాద పదార్థమును చేర్చుము. ఈ అద్భుత మధువునందు మరింత అద్భుత మధువును చేర్చుము.     4. ఇంద్రా! నీవు సోమపానము చేయుదువు. మత్తుడవు అగుదువు. ధనమును జయింతువు. అపుడు జనులు సహితము సోమపానము చేయదురు. ఉన్మత్తులు అగుదురు. అజేయ ఇంద్రా ! స్థిర తేజమును దర్శింప చేయుము. దుస్సాహస రాక్షసుల నిన్ను పరాజితుని చేయకుందురుగాత.     5. ఇంద్రదేవా ! నీవు సాయపడుము. మేము యుద్ధభూమికేగుము. శత్రుంజయులము అగుదుము. స్తుతులతో నీ అస్త్ర - శస్త్రములను ఉత్సాహ పరుస్తాము. మంత్రములతో నీ  తేజస్సును తీక్షము చేయుదుము.     6. ఇంద్రుడు స్తుత్యుడు, బహురూపి,  విలక్షణ దీప్తియుక్తుడు. అనుపమ ప్రభువు. ఎంతో ఆత్మీయుడు. అట్టివానిని స్తుతించుచున్నాను. ఇంద్రుడు స్వశక్తిచే  వృత్రుని, నముచి, కవయ మున్నగు ఏడుగురు దానవులను ధ్వంసము చేసినాడు. అనేక మంది అసురులను హతమార్చినాడు.     7. ఇంద్రా! నీవు ఏ ఇంట హవ్యము అందుకొని తృప్తి చెందుచున్నావో, 'ఆ ఇంట దివ్య పార్థివ' దానములను చేర్చుచున్నావు. ఎపుడు సమస్త భూత స్రష్టులను ద్యావాపృథ్వులు చంచలములు అగుచున్నవో అపుడు నీవు దానికి స్థిరత్వము కలిగించుచున్నావు. ఆ సమయమున నీవు బహుకార్య నిర్వాహకుడవు కావలసి ఉండును.     8. ఋషి శ్రేష్ఠుడును, స్వర్గాభిలాషియగు 'బృహద్ధివుడు', ఇంద్రునకు తన స్తుతులు వినిపించినాడు. భూమి మీది నిర్మల నదుల జలము ప్రవహించుచుండునుగాత.     9. అతర్వపుత్రుడు, బుద్ధిశాలి 'బృహద్ధివుడు', ఇంద్రునకు తన స్తుతులు వినిపించినాడు. భూమి మీది నిర్మల నదుల జలము ప్రవహించుచుండునుగాత.     అన్నము జనులకు సుబుద్ధి కలిగించునుగాత.     బృహద్ధివుడు లోక కళ్యాణము కోరినాడు. తన కొరకు ఏదియు ఆశించలేదు.                                  నూట ఇరువది ఒకటవ సూక్తము  ఋషి - ప్రజాపతి పుత్ర హిరణ్యగర్భుడు - దేవత - ప్రజాపతి ఛందస్సు - త్రష్టుప్     1. తొలుత హిరణ్యగర్భుడు మాత్రము ఉండెను. తదుపరి ప్రాణులు అవతరించినవి. వానికి అతడు ఒక్కడే స్వామి అయినాడు. అతడు ద్యావాపృథుల నిలిపినాడు. 'కస్మైదేవాయ హవిషా విధేయ', అట్టి ఏ దేవతకు హవిస్సు అర్పింతుము?     2. ఎవడు ఆత్మను ఇచ్చినాడు. బలమును ఇచ్చినాడు. ఎవని ఆదేశమును సమస్త దేవతలు పాటింతురు. ఎవని  ఛాయ అమృతమో, ఎవని వశమున మృత్యువు మసలునో అట్టి ;కస్మైదేవాయ హవిషా విధేమ'.     3. ఎవడు తన మహిమ వలన ప్రాణులకు. అనిమిషులకు అద్వితీయ ప్రభువో - ఎవడు ద్విపద, చతుష్పాదులకు స్వామియో అట్టి 'కస్మైదేవాయ హవిషా విధేమ.'     4. ఎవని మహిమ వలన హిమచ్చన్న నగములు ఏర్పడినవో  - ఎవని సృష్టి సాగర సమేత ధరిత్రి అగుచున్నదో ఎవని భుజములు దిశలు అగుచున్నవో అట్టి 'కస్మైదేవాయ హవిషా విధేమ',     5. ఎవడు ఉన్నత ఆకాశమును, విశాల పృథ్విని తమ తమ స్థానములందు స్థిరపరచినాడో - ఎవడు స్వర్గమును ఆదిత్యుని నిలిపిఉంచినాడో - ఎవడు అంతరిక్షముణ జలము ఏర్పరచినాడో అట్టి 'కస్మైదేవాయ హవిషా విధేమ',     6. ఎవని వలన ధ్యావాపృథ్వులు శబ్దాయమానములై, స్తంభితములై, ఉల్లసితములు అయినవో ఎవనిని దీప్తిశాలి ద్యావా పృథ్వులు మహిమాన్వితునిగ భావించినవో - ఎవని ఆదేశమున సూర్యుడు ఉదయించి ప్రకాశించునో అట్టి 'కస్మైదేవాయ హవిషా విధేమ.'     7. భువనములను 'జలము ఆచ్ఛాదించి ఉండెను. జలము గర్భము దాల్చి అగ్ని, ఆకాశాదు లను సృష్టించెను.' అపుడు దేవతలకు ఒక్కడే ప్రాణాత్మకుడైనట్టి 'కస్మైదేవాయ హవిషా విధేమ'.     8. జలము స్వబలమున అగ్నిని సృష్టించినపుడు ఎవడు అట్టి సమస్త జలముల నలు దిశలను వీక్షించినాడో, ఎవడు సమస్త దేవతలకు ఒక్కడే ప్రాణాత్మకుడు అగుచున్నాడో అట్టి 'కస్మైదేవాయ హవిషా విధేయ.'     9. ఎవడు పృథివికి 'ఆ'కాశమునకు జన్మదాతయో -ఎవని శక్తి సత్యమగునో - ఎవడు ఆనందవర్థక విశాలజలమును కలిగించినాడో - ఎవడు మమ్ము బాధించుచున్నాడో అట్టి 'కస్మైదేవాయ హవిషా విధేమ.'     10. ప్రజాపతి ! ఈ సమస్త ఉత్పన్నములను నీవు వినా అన్యుడు అధీనమున ఉంచుకొన జాలడు. ఏది కోరి మేము నీ హవనము చేయుదుమో అది మాకు లభించునుగాత. మేము ధనపతులము అగుదుము గాక.                                    నూట ఇరువది రెండవ సూక్తము                            ఋషి -  వసిష్ఠపుత్ర చిత్ర మహనుడు దేవత -                             అగ్ని ఛందస్సు 1,5 త్రిష్టుప్ 6,8, జగతి     1. అగ్ని తేజము సూర్యసమము - విచిత్రము. అతడు  రమణీయ, సుఖకర, ప్రేమపాత్ర, అతిథి వంటివాడు. అట్టి అగ్నిని మేము స్తుతిస్తున్నాము. అగ్ని దుగ్ధములిచ్చును. భువనము లను పోషించును. బాధలు దూరము చేయును. అతడు గోవులను, బలమును, ప్రసాదించును. అగ్ని హోతయు, గృహపతియు అగుచున్నాడు.     2. అగ్నీ! నీవు  సంతృప్తుడవు ఆగుము. నా స్తుతులందు ఆసక్తుడవు అగుము. నీవు కుశల కార్యశాలివి. తెలియవలసినది అంతయు తెలిసినవాడవు. ఘృతాహుతి అందుకొనుము. స్తోతలను సామగానము చేయమనుము. నీ కార్యములు గాంచియే దేవతలు తమ తమ పనులకు ఉఅపక్రమింతురు.     3. అగ్నీ! నీవు  అమరుడవు. సర్వత్ర గామివి. ఉత్తమ కార్యకర్తయగు దాతకు దానము చేయుము. పూజలు గ్రహించుము. సమిధలచే ఎవడు నిన్ను వర్ధిల్లచేయునో, అట్టి వానికి ఉత్తమ సంపద, సంతానము ప్రసాదించుము.     4. అగ్ని సప్తాశ్వముల స్వామి. యజమాని యజ్ఞసామగ్రి సహితా, అగ్నిని స్తుతించును. అగ్ని యజ్ఞకేతనము - విశిష్ఠ పురోహితుడు. అగ్ని ఘృతాహుతులు లందుకొనును. అభీష్టములు ఆలకించుము. నెరవేర్చుము. అగ్ని దాతలకు ఉత్తమ బలము ప్రసాదించును.     5. అగ్నీ! నీవు సర్వశ్రేష్ఠుడవు. దూతలందు అగ్రగణ్యుడవు. అమరత్వము కోరి నిన్ను ఆహ్వానింతురు. నీవు ఆనందప్రదాతవు. దాతల గృహములందు మరుత్తులు నిన్ను అలంకరించుచున్నారు. భార్గవులు నిన్ను స్తుతిస్తారు. నీ ఉజ్వలత వర్ధిల్ల చేస్తారు.     6. అగ్నీ! నీ కార్యములు అద్భుతములు. యజమాని యజ్ఞానుష్ఠానమున నిమగ్నుడు అగును. అతనికి యజ్ఞఫలముగ యజ్ఞరూపిణియు, దుగ్ధదాయినియు, విశ్వపాలికయునగు గోమము ప్రసాదించుము. నీవు ఘృతాహుతులో అందుకుంటావు. ముల్లోకములను ప్రకాశ వంతము చేయుదువు. నీవు యజ్ఞ గృహమున సర్వత్ర  వర్తింతువు. నీవు సర్వత్రగామివి. సుకృతి ఆవరణము నీలో దర్శనము ఇచ్చును.     7. ఉష ఉదయిస్తుంది. యజమానులు నిన్ను దూతగా భావిస్తారు. యజ్ఞము చేయుదురు. అగ్నీ! దేవతలు సహితము నీకు ఘృతము అర్పింతురు. ప్రదీప్తుని చేయుదురు. వర్థిల్లచేతురు.     8. అగ్నీ! వసిష్ఠ పుత్రులు యజ్ఞమున అనుష్టానము ప్రారంభించి, అన్న యుక్తునిచేసి ఆహ్వానించుచున్నారు. యజమానుల ఇళ్లలో మరింత ధనము ఉంచుము. మీరు మాకు శుభములు కలిగించండి పాలించండి.                                 నూట ఇరువది మూడవ సూక్తము               ఋషి - భార్గవ వేనుడు - దేవత - వేనుడు. ఛందస్సు, త్రిష్టుప్     1. వేనుడు దేవత. అతడు జ్యోతి పరివేష్ఠితుడు. ఆకాశమున జలనిర్మాత. ఆకాశ మధ్యమున సూర్య కిరణ సంతానమగు జలము ఉన్నది. వేనుడు దానిని నేల మీద  కురిపించును. సూర్యునితో జలము కలియును. అపుడు యజమానులు వేనుని బాలకుని వలె  ముద్దుమాటలతో సంతృప్తుని చేయుదురు.     2. వేనుడు అంతరిక్ష జలమాలకు ప్రేరణ కలిగించును. ఆకాశమున ఉజ్వలమూర్తియైన వేనుని వెన్న కాన్పించును. జలముల ఉన్నత స్థానమగు ఆకాశమును వేనుడు దీప్తిమంతము చేయుదు. అతని పారిషదులు - అన్నింటి ఉత్పత్తి స్థానమగు - ఆకసమును ప్రతిధ్వనింప చేసినారు.     3. వేనునితో బాటు జలము నభమున నిలుచును. విద్యుత్తవత్సము. ఆకాశము మాత. తన సహవాసి వేనునితో విద్యుత్తు నర్జించ సాగినది. జలమునకు ఉత్పత్తి స్థానము ఆకాశము. అది ధ్వనించి వేనుని వర్థిల్ల చేసినది.     4. స్తోతలు బుద్ధి కుశలురు. వారు మహిష గర్జన వంటి - వేనుని ధ్వని విన్నారు. వారు వేనుని రూపపు కల్పన చేసినారు. వారు  వేనుని పూజించినారు. నది వంటి నిరంతర జలము పొందినారు. వేనుడు గంధర్వుడు. జలములకు ప్రభువు.     5. విద్యుత్తు అప్సరస. వేనుడు ఆమె ప్రేమికుడు. విద్యుత్తు వేనుని చూచినది. చిరు నవ్వినది. అతడు ఆమెను కౌగిలించుకున్నాడు. ప్రేమికుడు వేనుడు ప్రేయసి విద్యుత్తు. రతి కోర్కెను తీర్చినాడు, బంగారు. రంగు మబ్బులందు శయనించినాడు.     6. వేనుడా! నీవు స్వర్గమున ఎగురు పక్షి వంటివాడవు. నీ రెండు రెక్కలు బంగారు మయములు. లోకమును శాసించు వరుణునకు నీవు దూతవు. నీవు లోకములను పోషించు పక్షి సముడవు. అందరు. నిన్ను దర్శింతురు. మనసున నిలుపుకొందురు.     7. అతడు గంధర్వుడు, స్వర్గపు ఉన్నత ప్రదేశమున ఉన్నత భావములతో వసించును. అతడు నలుదిశల చిత్రవిచిత్ర అస్త్ర, శస్త్రములు ధరించి ఉండును. అతడు తన సుందర రూపమును దాచిపెట్టినాడు. అంతర్హితుడై జలవర్షము కలిగించును.     8. వేనుడు జలమూర్తి. అతనిది గద్దకన్ను. ఆకాశమున ఉండి సర్వసాక్షి అగును. అతడు శుభ్రవర్ష ప్రదీప్తుడు. అతడు మూడవ లోకమగు ఆకసమున నిలిచి ఎల్లరు కోరునట్టి జలమును సృష్టించుచున్నాడు.                                    నూట ఇరువది నాలుగవ సూక్తము     ఋషి - అగ్ని దేవత - అగ్న్యాదులు ఛందస్సు - 7. జగతి - మిగిలినవి త్రిష్టుప్         1. అగ్ని ఈ యజ్ఞమునకు ఋత్విగాది పంచవ్యక్తులను నియమించు అధ్యక్షుడు. మా యజ్ఞము సవన త్రయమగును. వాటిని సప్తహోతలు అనుష్ఠింతురు.     అగ్నీ! ఈ యజ్ఞమునకు విచ్చేయుము. మాకు దూతవు ఆగుము. నేతవు ఆగుము!     అగ్ని అనుచున్నాడు:-     2. దేవతలు నన్ను ప్రార్థించుచున్నారు. అందువలన నేను దీప్తిహీన, అవ్యక్త దశ నుంచి దీప్తివంత దశకు చేరుకున్నాను. నేను నలుదిశలు వీక్షించి అమరత్వము పొందినాను. యజ్ఞము నిరాటంకముగ పూర్తి అయినంత అదృశ్యుడను అవుతాను. యజ్ఞమును విడుతును. అరణి యందు ప్రవేశింతును.     3. పృథివి, ఆకాశమార్గము, ఆవలి సూర్యుని వార్షిక గమనమును, అనుసరించి, ఆ యా ఋతువు లందలి యజ్ఞానుష్ఠానము చేయుదును. బలిదేవతలు పితృరూపులు అగుచున్నారు. వారి సుఖమునకు స్తుతులు చేయుదును. యజ్ఞపు అయోగ్య, అపవిత్ర స్థానము నుండి యజ్ఞపు పవిత్ర, ఉపయుక్త స్థానములకు చేరుదును.     4. ఈ యజ్ఞమునందు నేను అనేక వత్సరములు గడిపినాను. ఇచటనే ఇంద్రుని యజించినాను. పితృరూప అరణినుండి ఆవిర్భవించినాను. నా దర్శనము కాకున్న సోమ, వరుణాదులకు పతనము కలుగును. దేశము అల్లకల్లోలమగును. అపుడు నేను అవతరింతును. రక్షింతును.     5. నేను వెడలినంత అసురులు బలహీనులు అగుదురు. వరుణరాజా! నన్ను ప్రార్థించుము. నా రాజ్యమున  సత్యము నుంచి అసత్యమును విడదీయుము. దానికి అధిపతివి అగుము.     6. సోమమా ! ఇటు చూడుము - ఇది స్వర్గము - అత్యంత రమణీయము. దీని ప్రకాశము చూడుము. ఇది విశాల ఆకాశము. ఇచట నీవు వెలువడుము.     వృత్రవధ జరుగునుగాత.     సోమమా! నీవు హోమ ద్రవ్యమవు. అన్యహోమ ద్రవ్యములచే నిన్ను పూజింతుము.     7. మిత్ర దేవత క్రాంతిదర్శి. అతడు తన తేజస్సుతో ద్యులోకమును తేజోవంతము చేసినాడు. వరుణరాజు ఆకాశజలమును వర్షింపచేసినాడు. ఆ జలము నదులై లోక కళ్యాణ కారకములగుచున్నది. నదులు - వరుణపత్నులవలె - శుభ్రవరుణ కాంతిని వహించుచున్నవి.     8. జలదేవతలందరు వరుణుని సర్వశ్రేష్ఠ తేజోసంపన్నులు అగుదురు. వరుణనివలెనే వారును హవిస్సులు అందుకుందురు. ఆనందింతురు. భార్యవద్దకు వలే వరుణుడు వారలను చేరును. ప్రజకు భయము కలిగినపుడు రాజును ఆశ్రయింతురు. జల దేవతలకు భయము కలిగినపుడు వరుణుని ఆశ్రయింతురు - వృత్రుని నుంచి ముక్తి పొందుదురు.     9. సమస్త జల దేవతల భయభీతులగునపుడు వారికి సాయపడి వారి హితముకోరు వానిని ఇంద్రుడని, సూర్యుడని అనుచున్నారు. వారు స్తుత్యులు - జలదేవతల వెంట సాగువారు అగుచున్నారు. విద్వాంసులు అతనిని ఇంద్రుని పేర స్థిరపరచినారు. 
24,575
    "చూశారుగా-మీరే అన్నారు_పౌర ధర్మమని! మైక్రో ఫిల్మ్ ను పోలీస్ హేండోవరు చేసినంత మాత్రాన మీ బాధ్యత తీరిపోయినట్టు కాదు! నిజానికి, అసలు సమస్య ఇప్పుడే మొదలవుతుంది! టెర్రరిస్టుల బారి నుంచి ఇకపై మిమ్ము మీరు రక్షించుకోవాలి. కనుక, ఆత్మ రక్షణార్ధం ఒక రివాల్వరు కోసం అప్లికేషన్ పెట్టుకోండి!"     "మై గాడ్! మీతో పరిచయమే నన్నీ స్థితికి తెచ్చింది. ఇక, 'గయోపాఖ్యానము' నాటకంలో గయునిగా నేనూ భయంతో చస్తూ బ్రతుకుతుండవలసిందేనా? మొత్తానికి మీ పోలీసు శాఖ నన్ను సుఖంగా బతకనిచ్చేట్టులేదు!" ఆందోళనగా అంటూ దీర్ఘంగా నిశ్వసించింది డాక్టరు సునంద.     ఆమె ఆలోచనలు పరిపరి విధాలపోతున్నాయి. భూత, భవిష్య, వర్తమానాలను అవలోడిస్తున్నది.                            *    *    *            పురాతన భవనం. పూర్తిగా శిథిలమయిన దాని కిందే జమ.     తలుపులు కిటికీలు అన్నీ లోపల వైపు నుంచి గడియపెట్టి వున్నాయి.     అంటే, నివాసయోగ్యం కాని ఆ పురాతన భవనంలో నర సంచారం వున్నదన్న మాట!     భవనం చుట్టూ కాంపౌండ్ వాల్ కాని వైర్ ఫెన్సింగ్ కాని లేవు. కాపలా లేదు.     అలా అనుకుని ఎవరైనా ఆ ప్రాంగణంలోకి అడుగిడితే వారి ఆయువు మూడినట్టే....     భవనం చుట్టూ అడుగడుగునా "లేండ్ మైన్స్" అమర్చి వున్నాయి!     భవనం లోపలి నుంచీ నిశబ్దాన్ని భగ్నం చేస్తూ మనిషి మూలుగు వినిపిస్తున్నది.     ఆగి ఆగి, క్షణం క్షణం పెరుగుతున్నది ఆ మూలుగు శబ్దం. అది మృత్యుహేల....     ఒకానొక గదిలో బంధితురాలై వున్న  ఆషాకు అప్పుడప్పుడే స్పృహ వస్తున్నది.     అడవిలో కళ్ళకు గంతలుకట్టి, తీసుకు వచ్చి జీప్ లో కూర్చోపెట్టడం వరకే ఆషాకు తెలుసు. ఆ పైన ముక్కు దగ్గర ఏదో వాసన చూపడంతో స్పృహ కోల్పోయింది.     పక్క గది నుంచి మూలుగు మరింత హెచ్చుగా వినిపించడంతో పరిస్థితి అర్ధమయింది ఆషాకు. తను, కిరణ్ కుమార్ బందీలై  వున్నట్టు గ్రహించింది.     కిరణ్ కుమార్ ను ఇంటరాగేట్ చేస్తూ హింసిస్తున్నట్టు అర్ధమయింది ఆషాకు.     "ఆయన్ని హింసించవద్దు, ప్లీజ్...." ఆషా ఆక్రోశించింది.     గది తలుపులు భళ్ళున తెరచుకున్నాయి. కమాండరు ప్రత్యక్ష మయాడు. అతని కనులు అగ్ని గోళాలు.ఆకృతి భయానకం.     గొలుసులతో వ్రేలాడుతున్న కిరణ్ కుమార్ శరీరం నజ్జునజ్జుఅవుతున్నది. సాయుధుడు కొరడాను ఇంకా ఝళిపిస్తూనే వున్నాడు.     "ప్లీజ్....ఆయన్ని కొట్టవద్దు...." ప్రాధేయపూర్వకంగా మరల అరచింది ఆషా.     కమాండరు క్రోధంగా చూశాడు. సాయుధులకు సంజ్ఞ చేశాడు.     వెంటనే కిరణ్ కుమార్ కట్లను వూడదీసి ఆ శరీరాన్ని ఆషా గదిలోకి దాదాపు విసిరివేశారు. అక్కడి ఆషాను ఇక్కడికి బరబరా ఈడ్చుకు వచ్చి గొలుసులతో కట్టేశా.     సాయుధుడు కొరడాను అందుకున్నాడు.     ఊహించని ఈ విపరిణామానికి మ్రాన్పడిపోయింది ఆషా.     ఇంటరాగేషన్ పేర ఏమి జరగనున్నదో ఊహించుకుని, వణికి పోయింది. ఆకులా అల్లల్లాడిపోయింది.     ఊహాగానాలు వేరు వాస్తవం వేరు అని ఆమె ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నది.     వీళ్ళ స్థావరానికి పరిశోధనా దృష్టితో అనాలోచితంగా వచ్చి చేజేతులా చిక్కులు తెచ్చిపెట్టుకున్నది తనే! ఇప్పుడు భయంకరమైన స్థితిలో చిక్కుకుపోవలసివచ్చింది.     నిజాన్ని కక్కించాలానే పేర తన శీలాన్ని దోచుకోవడానికి ప్రయత్నిస్తే....     వంటి మీద వున్న చీర రవిక చీలికలై  తన శరీరాన్ని దాచలేక పోతున్నాయి....     కమాండరు దృష్టి ఆమె ఒంపు సొంపుల మీద పడనే పడింది....     అతని చూపుల నుంచి తప్పించుకునే ఉద్దేశంతో తల వాల్చేసుకుంది ఆషా.     చేతిలోని రైఫిల్ ను సహచరునకు ఇచ్చి, ముందుకు కదిలాడు కమాండరు.     పిచ్చిపిచ్చిగా అరుస్తున్నది ఆషా. అదేదో పీడకలలాగా భ్రమిస్తున్నది.     పక్కగదిలో జరుగుతున్న పైశాచికం గురించి లీలామాత్రంగా ఊహించుకోగలుగుతున్నాడు కిరణ్ కుమార్. లేవడానికి శక్తిని కూడగట్టుకుంటున్నాడు. స్వాధీనంలో లేని శరీరం....  
24,576
    "మరి మా అమ్మా?"     మీ అమ్మకాదు అనికైలాసగణపతి అనబోయే లోపలే ఆ కుర్రాడు నోరంతా తెరిచి "అమ్మాయ్! నీకోసం ఎవరో వచ్చారేవ్!" అన్నాడు.     ఆమె లోపలనుంచి ఆదరాబాదరాగా వచ్చి "నాకోసం ఎవరొస్తారా?" అని అంతలోనే కైలాసగణపతిని చూసి మీరు..... మీరు నాకోసం రావటం ఏమిటి? మీరెవరు?" అంది నొసలు చిట్లిస్తూ.     "అమ్మా! నాపేరు కైలాసగణపతి. నేను ఉరుముకొండ రావడం యిదే ప్రధమ పర్యాయం. సూరీడు ఇంటికి వచ్చాను. ఎవరిని అడిగినా సరీగా అడ్రస్ చెప్పటంలేదు."     "సూరీడు యింటికా ఇలా తూర్పు దిక్కుగా వెళ్లండి.....     "తూర్పుకెళితే సూర్యుడు పడమట కెళితే చంద్రుడు వస్తాడు. నాకు కావాల్సింది ఆ సూరీడు కాదు."     "నేను చెప్పేది అదేనండి. సూర్యుడుకాదు సూరీడు యింటికి తూర్పు దిక్కు వీధిలో అయిదో యిల్లు సూరీడుదే. వాకిట్లో పక్కపక్కనే రెండు వేపచెట్లు వుంటాయి. అదే వాళ్ళిల్లు" ఆమె వివరించింది.     "థాంక్స్." అని చెప్పి కైలాసగణపతి బైలుదేరాడు.     "థాంక్స్" అంటే ఏమిటి! మంచిదమ్మా, చాలా సంతోషం అడగంగానే చెప్పారు అనాలా, థాంక్స్ భోంక్స్ అంటూ పోవాలా ఏం మనిషీ చాలా తమాషా గానే వున్నాడు అనుకుంది ఆమె.     కైలాసగణపతి కాస్తంత దూరం నడిచి రెండు వేపచెట్లు వున్న ఇంట్లోకి సరాసరి వెళ్ళి "సూరీడు, సూరీడు" అన్నాడు.     "ఏమిటి?" అంటూ పంచ ఎగగట్టిన వకాయన పక్కగదిలోంచి బైటకి వచ్చాడు. కండలు పెంచి చిన్నసైజు పహిల్వాన్ లాగా వున్నాడు.     వీడెవడు సూరీడింట్లో పనిచేసే బండోడా! అని కైలాసగణపతి అనుకుంటుంటే ఇంతలో అతనే "ఎవరితో ఎప్పుడు ఎక్కడ?" అన్నాడు రవంత ఉత్సాహంతో.     "ఏమిటి?" అన్నాడు కైలాసగణపతి.     "కుస్తీ."     "కుస్తీయా!"     "కుస్తీయే, ఎవరితో, ఎప్పుడు ఎక్కడ?" కండలు చూసుకుంటే అడిగాడు.     వీడి పిచ్చి బాగానే అర్థమయింది కైలాసగణపతికి. సూరీడుని కేకేస్తే వీడిగోల తప్పుతుందనుకుని "సూరీడూ!" అని పిలిచాడు.     "ఏంటీ! సూరీడు నాతో కుస్తీ! నీయవ్వ సూరీడు అయేడి వాడి తాతయ్యేది దట్టిబిగించి దిగానంటే హాంఫట్" అన్నాడు.     "సూరీడు ఇంట్లో లేడా?" కైలాసగణపతి నుదురు చిట్లిస్తూ అడిగాడు.     సూరీడు ఇంటో వుండడు ఆకాశంలో ఉంటాడు. ఆడి దగ్గరకు నీవు పోవాల్సిందే కోడిరెక్కలు కట్టుకుని టపటపలాడిస్తూ పైకెగిరి....     అప్పుడొచ్చింది అనుమానం కైలాసగణపతికి     "సూరీడు పేరుగలవాళ్ళు ఈ ఇంట్లో ఎవరూ లేరా?" అని అడిగాడు.     "లేరు."     "అయితే సరే వెళతాను."     "వెళ్ళేవాడివి ఎందుకు వచ్చావ్? కుస్తీల సూరిబాబు ఇంటికి వచ్చేముందు -     "ఆగాగు మళ్ళీ నీపేరు చెప్పు!"     "కుస్తీల సూరిబాబు. అసలు మా యింటిపేరు కోళ్ళవారు."     "అదీ విషయం."     "ఏది?"     "నేను సూరీడు యింటికి రాబోయి, కుస్తీల సూరి బాబు యింటికి వచ్చాను అదీ విషయం.     "ఎందుకు వచ్చావ్?"     "నా ఖర్మకాలి" అని కైలాసగణపతి లోపల అనుకుని తనకి ఎవరో తప్పు అడ్రస్ యిచ్చారని అందుమూలాన ఇందులోకి రావాల్సివచ్చిందని..... వివరించాడు.     "అదన్నమాట విషయం?"     "సరీగ అదే. వెయ్యి కుస్తీలుపట్టి లక్షలాది అభిమానులమధ్య అభిమన్యుడిలాగా, చిరంజీవిలాగా వర్ధిల్లు నాయనా!" అన్నాడు.     అభిమన్యుడు ఎవడు?" కుస్తీల సూరిబాబు అడిగాడు.     "ఇప్పుడు లేడులే. గతంలో నీలాగా కుస్తీలుపట్టి దేశదేశాల్లో చాలా పేరు ప్రఖ్యాతలు గడించినవాడు."     కైలాసగణపతి నోటికివచ్చిన అబద్ధం అవలీలగా ఆడాడు.     కుస్తీల సూరిబాబుకి దారాసింగుకింగ్ కాంగ్ గురించి ఆ నోట ఆనోట  వినివుండటం వల్ల తెలుసు? మధ్యలో ఈ అభిమన్యుడు ఎవరో తెలియదు. తెలియకపోయినా అభిమన్యుడు అనేవాడు కేవలం కుస్తీలు మాత్రమే పట్టిదేశదేశాలలో పేరు ప్రఖ్యాతలు పొందాడు కాబట్టి చాలా గొప్పవాడే అయివుంటాడు. అంతడివాడితో తననికొంచెమయినా పోల్చినందుకు చాలా సంతోషించి కైలాసగణపతితో మర్యాదగా మాట్లాడాడు. ఎప్పుడైనా అవసరం అయితే కుస్తీకి పిలవండి అనికూడా చెప్పాడు.     కుస్తీల సూరిబాబు దగ్గర సెలవుతీసుకుని మళ్ళీ రోడ్డు ఎక్కాడు కైలాసగణపతి.
24,577
    అసలర్ధంకానిది మనసు.     లొంగదీస్తే లొంగిపోయేది మనసు.     విశ్వప్రయత్నం చేసినా లొంగనిది మనసు.     కౄరమైనది మనసు.     జాలి అయినది మనసు.     వికృతమైనది మనసు.     అందమైనది మనసు.     మనసులోని అనుక్షణం మెదిలే ఆలోచనలను రికార్డు చేయగలిగితే మనిషి ఎంత ద్వంద్వజీవో అర్ధమవుతోంది. ఆ మాటకొస్తే ద్వంద్వ జీవికాని మనిషి ప్రపంచంలో లేడు.     ఆమె మనసు మైక్రోస్కోపు స్లయిడ్ మీద లగ్నంకాలేదు. ఎక్కడెక్కడో విహరిస్తోంది. చివరకు యాంత్రికంగా కూడా చూడలేక, కుర్చీలో వెనక్కి ఆనుకుని నిట్టూరుస్తూ కూర్చున్నది.     సాయంత్రం ఇంటికెళ్ళాక స్నానంచేసి, చేతిలో పుస్తకం పట్టుకు కూర్చుంటే ధ్యాస దానిమీదకి పోవటంలేదు. లేచి కాసేపు ఆ గదిలోంచి ఈ గదిలోకి, ఈ గదిలోంచి ఆ గదిలోకి కాలుగాలిన పిల్లిలా తిరిగింది. ఆమె ఇదివరకెప్పుడూ వంటరితనంలో మాధుర్యమనుభవిస్తూ వుండేది. మనుషులతో మాట్లాడాలన్నా మనుషులమధ్య ఎక్కువగా మసలాలన్నా చికాకుగా వుండేది. ఇప్పుడు వంటరి తనమంటే ద్వేషంగా ఉంది. భయంగా ఉంది.     జీవితంలో ముప్పైఅయిదు వసంతాలు గడిచిపోయినాయి. ఏం పొందిందో, ఏం పోగొట్టుకుందో ఇప్పుడు తెలుస్తుంది. తిరిగిరానిది అవివేకంతో పరిత్యజిస్తే చివరకు ఏం మిగులుతుందో ఇపుడిపుడే బోధపడుతున్నది.     అద్దందగ్గరకు వెళ్ళి ఎదురుగా నిల్చుని ముఖం చూసుకున్నది.     సంవత్సరాలుగా రోజూ చూసుకుంటున్నా విసుగు అనిపించనిదీ, ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించేదీ, ఆత్మవిశ్వాసం కలిగిస్తూ ఉండేదీ మనిషి ముఖం.     కానీ తానుమాత్రం ఎప్పుడూ శ్రద్ధగా చూసుకోలేదు. ఇవేళ పరీక్షగా కళ్ళు, చెంపలు, మెడ - అన్నీ అవలోకించింది.     వీటిలో ఏమయినా మార్పులు వచ్చాయా? సంవత్సరాల క్రితం ఉన్నట్లున్నాయా? లేకపోతే ఏమిటా మార్పు?     తన కళ్ళలో కాంతి తగ్గలేదు, కానీ ఆ కాంతిలో శోభలేదు.     తన చెంపలలో నునుపు తగ్గలేదు, కానీ ఆ నునుపులో సొగసులేదు. తన శరీరంలో బింకం తగ్గలేదు కానీ ఆ బింకం లావణ్యంలేదు.     ఏడుపొచ్చింది. గుండె బరువెక్కినట్లనిపించింది. అవయవాలు వెలతెలా పోయినట్లయింది.     రోజూ అయితే ఈసరికి వంట ప్రయత్నంలో వుండేది.     ఎవరికోసం ఈ తిండి? ఒంటరిగా దిక్కులేనిదానిలా కంచంముందు కూర్చుని ఏమిటి ఈ అర్ధంలేకుండా కడుపు నింపుకోవటం?     ఇవతలకి వచ్చి బాల్కనీలో నిల్చున్నది. కల్నల్ మనసులో మెదుల్తున్నాడు. ఇహ నిగ్రహించుకోలేకపోయింది. తలుపు దగ్గరగావేసి బయల్దేరింది. అప్పటికి చీకటిపడింది.     వెళ్ళేసరికి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. బయట రాముడుగానీ నాయర్ గానీ కనబడలేదు. హాల్లో లైటు వెలుగుతోంది. కానీ కల్నల్ లేడు.     ప్రక్కనే అతని బెడ్ రూం ఉంది. లోపలకు వెళ్ళవచ్చా? గుమ్మందాకా వెళ్ళి సంకోచంగా ఆగిపోయింది.     "సార్!..." అని పిలవబోయింది. కానీ ఏదో మొహమాటం ఆపింది.     మెల్లగా తలుపు తోసింది.     లోపల కల్నల్ చాపమీద సుఖాసనంలో కళ్లు మూసుకుకూర్చుని మెడిటేషన్ లో వున్నాడు. పంచ కట్టుకుని వున్నాడు. పైన షర్టులేదు. చిన్న చిన్న బ్యాండేజెస్.     దగ్గరకు వెళ్ళి నిలబడింది.     ఎంత బలిష్టంగా ఉన్నాడు! ఎంత ప్రశాంతంగా ఉన్నాడు! ఎంత.....ఎంత.....ఎం....త......అం....అందంగా వున్నాడు!     ఈ దృశ్యం అపురూపమనిపించింది.     అప్రయత్నంగా అతనికెదురుగా కూర్చున్నది. అతను కూర్చున్నట్లే కూర్చున్నది. చేతులు ఒళ్ళో పెట్టుకున్నది. ఒక్కనిముషం తదేకంగా అతని ముఖంలోకి చూసి తర్వాత కళ్ళు మూసుకున్నది.     ఆమె నరనరాలా ఏదో శబ్దం వినిపించసాగింది.     అలా చాలా నిముషాలు గడిచిపోయాయి.     కల్నల్ కళ్ళువిప్పాడు. ఎదురుగా కనిపించిన దృశ్యం మనోజ్ఞంగా వుంది.     పులకితుడయాడు. ఈమె ఇక్కడికి ఎప్పుడు వచ్చింది? ధ్యానంలో ఎప్పుడు కూర్చుంది? ఎంత దగ్గరగా వుంది తనకు! ఎంత అందంగా వుంది! ఈ అనుభూతి ఎంత హాయిగా వుంది!     అతనికి అక్కడ్నుంచి లేవాలనిపించలేదు. ఆమెవంక తన్మయంగా చూస్తూ అలాగే కూర్చున్నాడు.     చివరకు చూడామణి కళ్ళు విప్పింది. ఎదురుగా చెదరకుండా కూర్చుని తనవంక తదేకంగా చూస్తోన్న కల్నల్.     అనుకోకుండా చిరునవ్వు నవ్వింది.     "ఎంతసేపయింది?"     "ఏమిటి?"     "మీరు ధ్యానంనుండి లేచి."     "చాలాసేపు. అవునూ మీరు ధ్యానం ఎప్పుడు నేర్చుకున్నారు?"     "నేర్చుకోలేదు."     "మరి అంత నిర్మలంగా ఎలా చేయగలిగారు?"     "ఆ నిర్మలత్వం ఈ వాతావరణం కలిగించి ఉంటుంది. నేను ప్రయత్నించి ఏమీ చేయలేదు."     "మరి మంత్రం ఎవరు చెప్పారు?"     చూడామణి నవ్వింది. "ఈ మంత్రం ఓ నిశ్శబ్ద శబ్దంకోసమే అని ఒకసారి మీరు చెప్పారు. రామకృష్ణ పరమహంసో, వివేకానందుడో సరిగ్గా గుర్తులేదు. ఒకసారి చెప్పారు. ధ్యానానికి ఎవరికి ఏ శబ్దం, పోనీ పదం నచ్చితే దానిమీద చెయ్యవచ్చునని. నాలోని శబ్దాన్ని నేనే నిర్మించుకున్నాను."     "ఏమిటది?" అని కల్నల్ అడగలేదు. అది రహస్యంగా వుంచాలని అతనికి తెలుసు.     "రండి బయటకు వెళ్ళి కూర్చుందాం."     ఇద్దరూ లేచి బయటిగదిలోకి వచ్చారు. కల్నల్ తాను ఓ సోఫాలో కూర్చున్నాక ఎదురుగా వున్న సోఫాలో చూడామణి కూర్చుంది.
24,578
                                                                -: సంకర హస్తములు :-    శ్లో!!    లంగోల్కోదోముఖోయశ్చ గోస్తసేగ్రాక్షకేభవేత్ !     ఊర్ధ్వాననోసతుఖ్యాత స్తధాశాంతాభిదెరశే !!     తా: లాంగూల నామక హస్తమును, అధోముఖముగబట్టినచో  ఆవుస్తనములందు, ద్రాక్షపండ్ల యందును, ఊర్ధ్వముఖముగబట్టినచో శాంతరసము నందు వర్తించును.    శ్లో!!    పద్మకోశశ్చోర్ధ్వ భాగగామి చంద్రార్ధభావనే !!     తా: పద్మకోశ  హస్తము  ఊర్ధ్వభాగమున  బట్టినచో  చంద్రునికి వినియోగింపబడును.    శ్లో!!    పశ్చాత్ప్రసారితో సూచీయచ్చబ్ధేపురతోయది !     వీక్షణేపిచతచ్చబ్దేరవ్యర్ధేచోర్ధ్వచాలితా !     ఏతే వక్రత్వభావేనయు క్తేచేన్తు నిరోధకే !     ఏతే మోలసమాశ్లిష్టేయుజ్యదే సంధిభావనే !     శూచీకరో నిశ్చలశ్చే  దూర్ధ్వముత్ధాపితే భవేత్ !!     తా: సూచీహస్తము పశ్చాద్భాగమునందు ప్రసరింపచేసినబో "వాడు" యని చూపుటయందును. పురోగభాగమందు  ప్రసరింపచేసినచో "వీడు" యని చూపుటయందును. వీక్షిణమందును. ఊర్ధ్వభాగమున చలింప  చేసినచో సూర్యునియందును  రెండు సూచీ హస్తములు వక్రముగ  కలిపిపట్టినచో. విరోధముసందును. మూలభాగములందు. సంశ్లిష్టములుగా  చేసినచో సంధీని చెప్పుటయందు  వర్తించును. సూచీహస్తము  నిశ్చలముగా  చూపినచో. పైకెత్తబడినవానికి  వర్తించును.   శ్లో!!    అరాళోళికగామీచేద్ర్బూవల్యాంచనియుజ్యతే !     అననాభిముఖశ్చై వహ్యధరార్దేనియుజ్యతే !!     తా: అరాళహస్తము లలాట ప్రదేశమున  ఘంచినచో  కనుబొమ్మలయందును, ముఖమున కభిముఖముగనుంచినచో అధరమునందు వర్తించును.    శ్లో!!    మధ్యమాకేవలావక్రాశేషాశ్చైవ ప్రసారితః !     రేఖాభిధానోహస్తస్యాత్తత్స్వరూపమిహోచ్యతే !!     తా: మధ్యమాంగుళివి పక్రముగబట్టి ఇతరాంగుళులను  చాచిపట్టినచో రేఖాహస్తమనబడును. దీనిని పురోభాగమునందు  బట్టినచో  గజముఖము సందు రెండు రేఖాహస్తములు  భుజములందుబట్టినచో  సూర్యోపస్థానము నందు  వర్తించుచున్నది.    శ్లో!!    ముష్టిశ్చుబుకగామీచేచ్చుబుకేశ్శళ్రుభావనే !     యుజ్యతే కవిస్స్కోయంకరకర్మ విశారదైః !!     తా" ముష్టిహస్తము  చుబుకమునందు బట్టినచో గడ్డమునందు, గడ్డము పెంచుట యందు వర్తించును.        శ్లో!!    పతాకో విశ్చలాకారః సవిధేచేత్తదర్ధకే !     జ్యోతిశ్శాస్త్రవిచారేపియుజ్యతేహ్యుచితార్ధతె !!     తా: పతాక హస్తము సమీపమునందు  బట్టినిచో  "అది" యని చూపుటయందు, జ్యోతిషశాస్త్ర విచారమునందు, ఉచితార్ధమునందు వర్తించును.    శ్లో!!    సర్పశీర్ష కరౌభులేసీమంతార్దే నియుజ్యతే !
24,579
        "వెళ్ళు - రామానికి చెప్పు - షేర్ మార్కెట్ లోకెళ్ళి కోటీశ్వరురాలు కాబోతోంది ఈ శారద అని చెప్పు అందరు ఆడవాళ్ళలాంటిది కాదు ఈ శారద అభిమాని కొత్త బతుకులో ప్రవేశిస్తున్న ధైర్యశాలి అని చెప్పు వెళ్ళు చెప్పు. శారద ఆవేశంతో అరుస్తోంది. లలిత నోటమాట రాలేదు. అలాకూచుంది.         ఓ లలితా ఆ జేబులో వున్న ఫోటో జేబులోనేకాకుండా, ఆ రామం చేత మెళ్ళో తాళికట్టించుకో - "శారద గొంతుగాద్గదికమైంది. లలితకి శారదనిచూస్తే జాలేసింది. ఇదేనేమో హిస్టరియా అంటే. లేకపోతే ఈ అరుపులేమిటీ -         'శారదా - ఎందుకావేశపడతావ్ - రామంతో కలసి జీవించ లేననుకున్నావ్ - విడిపోయావ్ రామం ఎవర్ని పెళ్ళి చేసుకుంటే నీకెందుకూ - మనసు స్థిమితపరచుకో. లలిత మాటలువింటూ శారద బల్లమీద తలాన్చింది.         'శారదా - ఈ రాత్రికి ఇక్కడే వుండనా నీకు తోడుగా - ఒక్కర్తివీ - అసలే చిరాగ్గా వున్నావుకదా - నీకు అన్నంవండిపెడతానుండు - పోనీ నీరజని కాని దినేష్ ని కానీ రమ్మనిఫోను చేయి - ఆ నెంబరియ్యి నేను చేస్తాను - నిజంగా లలితకి శారదని చూస్తే బాధనిపించింది....శారద మనసు ఎందుకంత బాధ పడుతుందో అర్ధంకాలేదు - అంత ధైర్యంగా, అహంకారంగావున్న శారద, తను రామాన్ని చేసుకుంటుందేమోనని కోపమెందుకూ.         శారదలోపలకెళ్ళి ముఖం కడుక్కువచ్చింది. ఓ నిముషం సిగ్గేసింది లలిత ముందు అలా అరిచినందుకు.         'లలితా ఏమీ అనుకోకు - నాన్నగారి దగ్గర నుంచీ ఈరోజు ఉత్తరం వచ్చింది. పిన్ని అమెరికా వెళ్ళిపోతోందిట. ఈవయసులో నన్ను చూసేందుకు ఎవరూ లేరు - వృద్దాశ్రమంలో చేరాలనుకుంటున్నానని రాశారు. నా మనసు చాలా ఆవేదనపుడుతోంది. ఏం చేయనూ - ఏమనుకోకు - నువ్వు వెళ్ళు - పొద్దుపోతోంది - శారద నవ్వుతూ మాట్లాడింది. లలితని గేటు దాకా వచ్చిసాగనంపింది.         లలితకి శారద మాటలు చాలా అర్ధంకాలేదు. రామం జేబులో తన ఫోటోవుండటమేమిటీ - రామనాథం వకీలు తన పెళ్ళి విషయం రామంతో మాట్లాడటమేమిటీ - తనకివేమీ తెలియకపోవటమేమిటీ - రోడ్డుననడుస్తున్న లలితకి ఇరవైరోజుల నాటి విషయం గుర్తొచ్చింది.         ఆ రోజు తను, నాన్న శంకరు అన్నయ్య ఇంటికెళ్ళటం, మీ ఇంట్లో అద్దెకుంటున్న రామాన్ని చూడకూడదా అని అన్నయ్య అనటం, తన ఫోటో జాతకం అన్నయ్యకి యిచ్చి, ఎవరికైనాముందు ఫోటోనచ్చితే, జాతకం కుదిరితే పిల్లని చూపిద్దామని నాన్న అనటం ఒకటొకటీ గుర్తొచ్చాయి - ఓహో, ఇదంతా శంకరం అన్నయ్య తన మేలుకోరి చేస్తున్నాడన్నమాట. ఫోటోనచ్చిందని రామం చెప్పాక అందరినీ ఆశ్చర్యపరిచేట్టుగా విషయం చెప్పాలనుకున్నాడన్నమాట - అందుకేనేమో రామం తల్లి వచ్చింది. తనని నఖశిఖపర్యంతం చూసింది. "మా అబ్బాయి మీ అందరికీ చెప్పలేదా" అన్న సంగతి ఇదే అయివుంటుంది - ఆఖరి నిముషం వరకు రహస్యంగా వుంచాలనుకున్నాడా అందుకే తల్లి వచ్చింది. నన్ను చూసింది వెళ్ళిపోయిందీ - అందుకే 'నీకు పెళ్ళయిందా అంది' చమత్కారంగా రామం తల్లి - అంటే ఆవిడ ఉద్దేశం రామం ఆవిడకి చెప్పకుండా తనని పెళ్ళిచేసేసుకున్నాడా అనే విషయం తెలుసుకుందుకేమో - ఏమో - లలిత మనసు ఆనందంతో నిండిపోయింది. అందుకే రామం తన ముఖం చూసి చూడనట్టు తప్పించుకు తిరిగుతున్నాడు. ఎన్నిరోజులు తిరుగుతాడూ - శంకరు అన్నయ్య పెళ్ళిముహూర్తాలు పెట్టే వరకూను.         లలిత ఇంటికెళ్ళగానే తండ్రితో అంది శంకరు అన్నయ్యని ఒకసారి కలుస్తే బాగుంటుంది కదూ అని.         'ఊళ్ళోలేడు - పదిహేనురోజులవరకు రాడట' -         లలిత మాట్లాడలేదు. రామాన్నే అడిగితే "నీ జేబులోదాచుకున్న ఫోటో ఎవరిదీ, అని - ఛీ, బాగుండదు - అన్నీ అవే తెలుస్తాయినెమ్మదిగా - లలిత ఆ రాత్రి  గాఢ నిద్రపోయింది.         ఆఫీసునించి సినిమాకెళ్ళి చాలాపొద్దుపోయివచ్చాడు రామం. తెల్లారాక' నీకో ఉత్తరం వచ్చిందోయ్ అని వెంకట్రామయ్య ఉత్తరం చేతికిచ్చాడు.         మేష్టారి దగ్గర నుంచి గాయత్రి తనతో మాట్లాడాలనుకుంటోందిట - ఒక్కసారి వచ్చివెడితే బాగుంటుందని - ముహూర్తం పదిహేనురోజుల్లో వుందికనక మాట్లాడుకోవలసిన మాటలు మాట్లాడుకోవటం మంచిదని రాశారు. గాయత్రి తనతో ఏం మాట్లాడుతుందీ !! రామం గుండెలు దడదడాకొట్టుతున్నాయి - తను డైవోర్సీ - ఆమె విడో - మాటలేమున్నాయి - ఇద్దరం కలవటం విధి తప్ప !! - రామం ఆ రాత్రే ఊరెళ్ళిపోయాడు.         రామం ఇంట్లో అడుగుపెట్టగానే యశోదమ్మకి అర్ధమయిపోయింది కృష్ణమూర్తి మేష్టారింటి కెళ్ళడానికే వచ్చాడని రామం స్నానం చేసి డ్రస్ చేసుకున్నాడు. బూట్లు నిగనిగలాడేట్టు పాలిష్ చేసుకున్నాడు. మళ్ళీ మళ్ళీ అద్దంలో చూసుకున్నాడు. హడావిడిగా వెళ్ళి పోయాడు.         రామం కోసం గాయత్రి ఎదురుచూస్తోంది. రామాన్ని మేడ మీద గదికి తీసుకెళ్ళింది. ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో రామానికి తెలియటం లేదు.         'నాన్నగారు అన్నీ చెప్పారు కదూ' అంది గాయత్రి.         'ఆ' - రామం అన్నాడు.         'పిల్లవాని గురించి కూడా'         "ఆ"         గాయత్రి నవ్వింది. తెల్లని పలువరుసమల్లెలు విచ్చుకున్నట్టే అనిపించి ఆనవ్వు.         "గాయత్రీ - నువ్వెక్కడుంటే ఈ పసివాడు అక్కడేవుంటాడు - నీకా బెంగవద్దు, అంతేకాదు - నామొదటి భార్య, అదే విడాకులు తీసుకున్న శారద ఉద్యోగస్థురాలు కనక నేను ఆమెకేమీ డబ్బు పంపక్కర్లేదు. పిల్లలు లేరు కనక ఏ సమస్యలూ రావు. ఇంక "ఏమైనా వున్నాయా చెప్పు' అన్నాడు రామం.         "నువ్వేమీ అనుకోకపోతే మన పెళ్ళి చాలా సింపుల్ గా గుడిలో చేసుకుందాం"         'ఓ.కే' - ఇంకా' -         'మరి - పెళ్ళి అయ్యాక నేను ఈ ఊర్లో ఒక్కరోజుకూడా వుండను. ఈ ఊరు నాకు చేదుజ్ఞాపకాలు మిగిల్చింది. అందుకే పెళ్ళయిన తెల్లారి నీతో అక్కడికి వచ్చేస్తాను - నేనీమాట ఎందుకంటున్నానో అర్ధం చేసుకుంటావు కదూ. 'గాయత్రి రామం చొక్కామీద కదులుతున్నా చీమను చేత్తోతీస్తూ అంది ఆ చేయి గట్టిగా పట్టుకున్నాడు రామం. 'ఇది నేనున్నంతవరకూ వదలను' గాయత్రి అప్రయత్నంగా రామంకౌగిలిలో ఒదిగిపోయింది.         మనిద్దరం ఇలా కలవాలని దేవుని నిర్ణయం. కాకపోతే నీకు ఆ పెళ్ళేమిటి - నాకు ఆ పెళ్ళేమిటి -
24,580
    కనకారావుకి వళ్ళంతా కంపరం పుట్టుకొచ్చేసింది.     తన చెప్పుతోనే తనను చెంపదెబ్బ కొట్టినంత పనిచేశాడు మోహనరావు.     అతని కోరికను కాదంటే తను యాంటీ వర్కింగ్ క్లాస్ అన్న విషయం ఋజువయిపోతుంది. ఇప్పుడింక అతని ఛాలెంజ్ ని వప్పుకోవటం తప్ప గత్యంతరం లేదు.     ఒప్పుకోవాలి గానీ మర్నాడు ఆ కార్యక్రమం జరుగకుండా ఏదేనా అడ్డుపుల్ల వేయాలి. అది ఎలా చేయాలీ అన్నది తరువాత ఆలోచించుకోవచ్చు.     "ఆల్ రైట్! మోహన్రావ్ కోరిక మేరకు ఇండస్ట్రీలన్నీ రేపే వర్కర్స్ పేరున టాన్స్ ఫర్ చేయటానికి వప్పుకుంటున్నాను" అన్నాడు లేచి నిలబడి.     అందరూ బిగ్గరగా తప్పట్లు కొట్టారు.     మోహన్రావ్ ఆనందంగా కనకారావుని కౌగిలించుకున్నాడు.     "సారీ అన్నా! నువ్వు ఎప్పటికీ కామ్రేడ్ కనకారావువే! మా అందరికన్నా గొప్పవాడివన్నా నువ్వు! ప్రపంచ చరిత్రలో ఇంతవరకూ ఎవరూ చేయలేకపోయిన వుదాత్తమయిన పనిని నువ్వు చేస్తున్నావు."     లీడర్లు బయటకు పరుగెత్తి వర్కర్స్ కి ఆ విషయం చెప్పి నినాదాలు ప్రారంభించారు.     "కామ్రేడ్ కనకారావు జిందాబాద్ - లాంగ్ విల్ కామ్రేడ్ కనకారావు."     అతను కార్లో యింటికి వచ్చేశాడు.     మీటింగ్ లో మోహన్రావ్ తో మాట్లాడుతున్నప్పుడే తను నిర్ణయం తీసుకున్నాడు.     అతనిని తెల్లారేసరికి అంతం చేయాలి.     లేకపోతే తన ఫ్యాక్టరీలన్నీ తన చెయ్యి జారిపోయాయి.     తను రాజశేఖరాన్ని మోసం చేసింది ఆస్తినంతా అడ్డమయినోడికి దానధర్మాలు చేయటానికి కాదు. తను అనుభవించడానికి.        ఫోన్ చేతిలోకి తీసుకున్నాడతను.     "హలో" అంది అవతలి గొంతు.     "మల్లేష్!"     "ఔ భాయ్! నువ్వెవరు?"     "కనకారావుని!"     "అరె! నువ్వన్నా! ఏమన్నా ఇంత రాత్రేళ యాద్ జేసినావ్?"     "నీతో పని పడింది మల్లేష్."     "చెప్పన్నా! నిమిషాల్లో జేస్తా."     "నీకు మోహనరావు తెలుసా?"     "తెలియకుండెట్లుండాడన్నా? వర్కర్స్ లీడర్ గదా! దోస్తానా వుండనే వుంటుంది."     "తెల్లారే లోపల వాడిని ఖతమ్ చేయాలి."     "కాషా, క్రెడిటా అన్నా?"     "కాషే! ఎంతివ్వాలి?"     "మామూలోడికయితే రెండు లక్షలు ఛార్జీ చేస్తున్నానన్నా! కానీ ఈడు యూనియన్ లీడర్ గదా! జర రిస్క్ ఎక్కువుంటుందన్నట్లు! దాన్ది క్కుకెళ్ళి అయిదు లక్షలవుతది."     "సరే! ఇప్పుడు కొంతేమయినా అడ్వాన్స్ యివ్వాలా?"     "అవ్వన్నా! బిజినెస్ గురించి నీకు తెలీందేమున్నది?"     "సరే! ఎవరినయినా పంపు! సగం యిస్తా. మిగతాది రేపు సాయంకాలం."     "మంచిదన్నా! నా అసిస్టెంట్ ఈశ్వరయ్య వస్తాడు."     "ఎట్టి పరిస్థితిలోనూ ఇవాళ రాత్రికి పూర్తి చేయాల్సిందే."     "ఇంక మర్చిపో అన్నా! ఇయళ్రేపు ఈ బాంబ్ ల దిక్కుకెళ్ళి మా పని చాలా ఈజీ అయిందన్నట్లు ఘరానా జమానాలయితే కత్తులు, గొడ్డళ్ళు, తల్వార్ లు తీస్కపోయి చంపాల్సొస్తుండే! ఇప్పుడేమున్నది? ఎయిర్ బ్యాగ్ ల తీస్కపోవాల! ఆడి ఇంటిమీద యిసరాలి! కార్లో వురికి రావాలె!"     కనకారావు ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు.     ఉదయం న్యూస్ పేపర్లో మెయిన్ హెడ్ వేశారా వార్త.     ప్రముఖ కార్మిక నాయకుడు మోహన్రావ్ దారుణ హత్య. గుర్తు తెలియని వ్యక్తుల బాంబ్ దాడి.     మోహన్రావ్ తోపాటు అతని కుడిభుజం రంగారావ్, దారినపోయే మరో యిద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలు.     కార్మిక యూనియన్ల మధ్య శత్రుత్వమే ఈ హత్యకు కారణమని పోలీస్ అధికారుల అనుమానం కనకారావు సంతృప్తిపడ్డాడు.
24,581
    సత్యానందంగారు గట్టిగా విరగబడి నవ్వారు. "బావగారికి పైప్ మీదకు మనసు మళ్ళిందేమిటి? పోనీ ఒకసారి రుచి చూడండి. మీకే తెలుస్తుంది" అన్నాడు.     "బావగారు" అని మనసులో పునశ్చరణ చేసుకుని "ఏదో వుందే" అనుకుని "అబ్బెబ్బే ఊరికినే తెలీక అడిగాను సుమండీ. అసలు నాకు చుట్టతప్ప ఇంకోటి పడదు" అన్నాడు.     కిటికీలోనుండి దూసుకువస్తోన్న చిరుగాలికి ఇద్దరి బట్ట తలల మీది కాసిని వెంట్రుకలూ రెపరెప కదుల్తూన్నాయ్.     "ఎప్పుడూ లేనిదీ నాతో మాట్లాడాలని ప్రత్యేకంగా పని పెట్టుకుని వచ్చారు" అన్నాడు రామకృష్ణయ్యగారు మెల్లిగా కదుపుతూ.     "అవునండీ. అసలెప్పట్నుంచో ఈ ప్రస్తావన తీసుకువద్దా మనుకుంటున్నాను. కాని మీ గృహ పరిస్థితులు బాగులేవని ఇన్నాళ్ళూ వూరుకున్నాను....బలరామయ్యగారు ఇంకా కొద్ది రోజులకు చనిపోతారనగా నాతో ఒకసారి ఆంతరంగికంగా మాట్లాడుతూనే మే మిద్దరం వియ్యం పొందుతే బాగుండునన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. నేను సరేనన్నాను. తర్వాత అనుకోకుండా ఆయన కాలం చెయ్యటం, పరిస్థితులు అంత అనుకూలంగా వుండకపోవటం జరిగాయి...మా అమ్మాయిని మీరు చూశారు. ఏమంటారు?" అన్నారు సత్యానందంగారు డొంక తిరుగుడు లేకుండా.     "సుధని నేను చూడకేం? లక్షణమైన పిల్ల. పైగా కాలేజిలో చదువుకుంటూ వుందనుకుంటాను కూడాను" అన్నాడు రామకృష్ణయ్యగారు.     "ఆఁ ఏం చదువులెండి? ఉబుసుపోకకి చదివిస్తున్నాను"     "అబ్బెబ్బెబ్బే! ఎంతమాటా? ఆ మాట నే నన్నానా? చదువుకుంటే తప్పా ఏమిటి? అన్నగారు ఈ సంబంధాన్ని అభిలషించి పోయారంటే మనం ఆవశ్యం తప్పక జరిపించవల్సిందే కాని చూశారూ? మా వాడిప్పుడు నాలుగయిదు లక్షల స్థితి పరుడైనా, వ్యవహారాలన్నీ కోర్టుల్లో మునిగి తేలుతూవుండటం వల్ల పాపం ఆర్ధికమైన ఇబ్బందులు నెన్నింటినో ఎదుర్కుంటున్నాడు వెధవది ప్రతివాడూ మోసం చెయ్యాలని చూసేవాడే. అందుకని ఎన్నో సంబంధాలు వస్తున్నా, బాగా భారీ సంబంధం చూసి చెయ్యాలని సంకల్పం. యాభయివేలన్నా ఇవ్వగలిగిన వాళ్ళు వుంటే చిక్కులన్నీ యిట్టే తీరిపోతాయి. ఆహా! మనసులో వుంచుకోండి చెబుతున్నా, వెధవది యాక్టులూ పాడూ అఘోరించాయి కదా!     "దానికేం అలానే కానివ్వండి. నాకు మాత్రం ఎవరున్నారు? ఒక్కగా నొక్క కూతురు. దానికోసం పెట్టకపోతే ఇంకెవరికోసము పెడతాను" అన్నారు సత్యానందంగారు మారు ఆలోచించకుండా.     ఒకవేళ తొందరపడి, స్వల్పంలో పోనిచ్చానా అని రామకృష్ణయ్య గారు వెంటనే విచారించటము మొదలు పెట్టాడు. "ఆఁఆయనకు మాత్రం ఇంకెవరున్నారు? ఉత్తరోత్రా వాళ్ళ ఆస్తి అంతా తమకే దక్కక తప్పదు గదా" అది మళ్ళీ తనకుతాను సమాధానము చెప్పుకుని సంతృప్తి పడ్డాడు.     మీరు పెద్దవారు. అందుకని ఈ విషయము సత్యమూర్త్య్తో సరాసరి చెప్పకుండా మీతో సంప్రదించాను. అతనికి కూడా అంగీకారమైతే వెంట ముహూర్తాలున్నాయి కూడానూ. ఇలాంటి కార్యాలు ఎంత త్వరగా ముగించుకుంటే అంత మంచిది కదా. అతనుకూడా అంగీకారము వెలిబుచ్చాక తాంబూలాలు పుచ్చుకుందాము. ఏమంటారు?"     "అయ్యో! కాదుమరీ తప్పకుండానూ. అయినా వాడు ఒప్పుకోక ఏం చేస్తాడు లెండి? వాడి మనసు నాకు తెలుసుగా."     "అయితే వెళ్ళి వస్తాను బావగారూ సుధ నాకు ఒక్కగా నొక్క కూతురు ఎంతో గారాబంగా పెంచుకున్నాను. ఇలాంటి ఇంట్లో పడటము నా అదృష్టం క్రింద భావిస్తున్నాను" అంటూంటే సత్యానందంగారి కంఠం గద్గదమైంది. కళ్ళు తుడుచుకుని లేచి నిల్చున్నాడు. రామకృష్ణయ్యగారు కూడా లేచి నిలబడి మరేం భయంలేదన్నట్లు సాభిప్రాయంగా చూశాడు. "వస్తాను" అని మరోమారు చెప్పి, బయటకు నడిచి గబగబ క్రిందకు వెళ్ళిపోయాడు.     అంతవరకూ ఎక్కడ వున్నాడో రామ్మూర్తి చల్లగా లోపలకు ప్రవేశించి "ఏమిటంటాడు నాన్నా?" అని అడిగాడు.     "మనతో వియ్యమందాలని వచ్చాడోయి. గొప్ప ఉత్సాహపడుతున్నాడు. యాభయివేలు కట్నమిస్తాట్ట."     మన సత్యానికి ఎటునుంచి చూసినా మంచి మంచి చాన్సులే తగుల్తున్నాయి నాన్నా" అన్నాడు రామ్మూర్తి అదో రకంగా. "నన్నన్నా ఎందుకు దత్తు ఇచ్చావుకాదు?" అన్న బాధ కనబడింది అతనిగొంతులో. "కాని వాడు వొట్టి ఫూల్. లైఫ్ ఎంజాయ్ చెయ్యటము చేతకాదు. మిజర బుల్ గా తయారవుతున్నాడు."     "ఏడిశావులే, నీ వేషాలన్నీ నాకు తెలీవనుకుంటున్నావా? ఇక్కడ్నుంచి ఎందుకు కదల్లేకపోతున్నావో నాకు తెలుసు. అక్కడ నీ భార్య నెత్తీ నోరూ కొట్టుకుని ఒకటే ఏడుస్తోంది. దానిగోడేమైనా ఆలకిస్తున్నావా?"     "మరి ఏం చేయమంటావు నాన్నా? ఇక్కడ యీ పనులూ గినులూ..."     "ఉద్దరించావు లేవోయి. నాకుగాని సత్యానికిగాని ఒక్క పిసరంతైనా సహాయంగా వున్నావా? ఇలా దారీ డొంకాలేకుండా ఎన్నాళ్ళు జీవిస్తావురా? నిన్నిక్కడ వుండమన్నది నీ జీవితాన్ని పాడు చేసుకొమ్మని కాదు. అర్ధం చేసుకుని మసలుకో, పో!" అన్నాడు రామకృష్ణయ్యగారు విసురుగా.    
24,582
                             గీతం     అన్నీ చెయ్యగలిగాను     ఏమీ చెయ్యలేకపోయాను     అందర్నీ ప్రేమించగల శక్తి నాకుండింది     అయినా అది చాలదు     ఆకాశం సముద్రం భూమి     అన్నీ నన్ను మింగివేశాయి     మళ్ళీ కన్నాడు నన్ను మానవుడు     తెల్లవారుజామే అన్నియుగాలకీ మంచిదన్నమాట     సందేహించకుండా బతికిన వాడొక డీ     సమాధిలో ఉన్నాడు     అతను చచ్చిపోయినప్పుడు     మళ్ళీ బతుకుతానని అనుకున్నాడు         సూర్యుడు మళ్ళీ ఉదయించినట్లు     నాకోసం ఇతరులకోసం బాధగా బతికాను     ఈ భుజాల భారం దించుకోవాలని ఎంతో వాంఛిం నెప్పుడూ     దీనాతిదీనులైన నాసోదరుల భారం కూడా     శ్మశానికి మోసుకుపోయే ఈ పిశాచపు భారం     నా ఆశపేరిట చీకటి కెదురుగా     నా పేరు నిలబెట్టాను     ఆగి జ్ఞాపకం చేసుకో అరణ్యాన్ని     బతికున్న సూర్యుడి కింద     పచ్చగా వెలిగే పంటపొలాన్ని     జ్ఞాపకం చేసుకో     నీడల్లేని పీడల్లేని మైదానాన్ని     దాని చోటు తీసుకుంది నీ బతుకు     జీవించడం వల్ల     వసంతకాలాన్ని అనుభవించడం వల్ల     మనం ముందుకి సాగిపోతాం     జీవిత వాంఛకీ సహనానికీ కిరీటం తొడుగుతాం.                                                             మూలం : Paul Eluard                                                         విశాలాంధ్ర దినపత్రిక - 3.4.1955
24,583
    "నర్స్ ఉద్యోగం కాకుండా డాక్టర్ ఉద్యోగమైతే చేయనిచ్చేదానివా?"     "డాక్టరైతే నీకు సరిపోతుంది కాబట్టి చేయమనేదాన్ని."     "నర్స్ గా ఆమె తన అభిరుచిని బట్టి చేసింది. నాకోసం ఆమెను ఆ పని మానెయ్యమంటే ఆమె ఆత్మగౌరవం దెబ్బతినదూ? ఆమె తనకు తాను మానేస్తే నాకభ్యంతరం లేదు."     "ఇంగితమున్న పిల్లయితే ఇప్పుడు తన ఆత్మగౌరవం చూసుకోదు. నీ గౌరవ మర్యాదలను తనవిగా చూస్తుంది. ఏ పని చేయాలన్నా మిసెస్ అరవింద్ గా ఆలోచిస్తుంది."     "కానీ నర్స్ గా మానేసి ఏం చేస్తుంది? తను చేయగలిగింది అదొక్కటే కదా?"     "ఏం? ఆ పిల్ల ఉద్యోగం చేయకపోతే నీకు జరుగదా? నీది చిన్నజీతం కాదు కదా? ఆమె సంపాదిస్తే సాయంగా వుంటుందనుకోడానికి. అసలు ఆ పిల్ల డాక్టరుగారి భార్య హోదా పొందాక ఇంకా నర్స్ గా చేయడమేమిటి?"     "సంపాదన సరిపోదని కాదు. ఆడవాళ్ళైకైనా, మగవాళ్ళకైనా తనకంటూ ఒక పని వుండాలి. అంతో-ఇంతో సంపాదన వుండాలి."     "పని లేకపోవడం ఏమిటి? పెళ్లయ్యాక ఇల్లు దిద్దుకునే పని వుండదూ?"     "ఇల్లును ఎంతసేపని దిద్దుతూ కూర్చుంటారు? వంటకి గ్యాస్ పొయ్యి, ప్రెషర్ కుక్కర్లు, రుబ్బడానికి మిక్సీలు, ఊడవడానికి-తుడవడానికి మిషన్లు వచ్చేశాయి. అంతా క్షణాలలో అయిపోయి గృహిణికిప్పుడు కావలసినంత టైం మిగులుతోంది. ఆ టైం వృధా చేయకుండా ఏదైనా వ్యాపకమో, ఉద్యోగమో వుండాలి."     చాలా అరుదుగా మాట్లాడే తండ్రి కల్పించుకుంటూ అన్నాడు_ "అన్నీ వచ్చేసి మనవాళ్ళ ఆరోగ్యాలు కూడా చెడిపోతున్నాయిరా! సరైన శారీరక శ్రమ లేక ఊబ శరీరాలు, బానపొట్టలూ వచ్చేస్తున్నాయి. స్లిమ్ అండ్ ట్రిమ్ చేస్తామని బ్యూటీపార్లర్లు, బాడీకేర్ సెంటర్లు వెలుస్తున్నాయి."     "ఎంతో ప్రతిభ వుండీ ఇంటి చాకిరీతో మ్రగ్గిపోయే ఆడవాళ్ళనెందరినో చూశానమ్మా! వాళ్ళ తెలివీ, వాళ్ళ ప్రతిభ వంటింటి పొగలలో, సెగలలో ఆవిరైపోతుంది. అరుణోదయను వంటిటికి పరిమితం చేయడం నాకిష్టం లేదు. ఆమె నేర్చుకున్న విద్య నలుగురికీ ఉపయోగపడకుండా అడ్డుపడడం అన్యాయం కదూ?"     "ఎంతసేపూ నీ ధోరణి నీదే! నువ్వు మన చుట్టూ వున్నవాళ్ళ గురించి ఆలోచించవెందుకు? సమాజంలో గౌరవ ప్రతిష్టలున్న ఒక డాక్టరువి. నీ భార్య నర్స్ ఉద్యోగం చేస్తుంటే నలుగురూ ఏమనుకుంటారోనన్న ఆలోచన లేకపోతే ఎలా?"     "మనం నలుగురి కోసం బ్రతకడం లేదు. వాళ్ళకోసం బ్రతకక్కరలేదు కూడా. మన కోసం మనం బ్రతకాలి. నలుగురూ ఏమనుకుంటారో అని ప్రతి పనికి ముందు అనుకుంటూ కూర్చుంటే మనం ఇంకే పనీ చేయలేం. ప్రతీ క్షణం ఆ నలుగురూ దెయ్యాల్లా మన కళ్ళముందు కదిలిమనల్ని ఏ పనీ చేయనివ్వరు. కనీసం మంచినీళ్ళు త్రాగాలన్నా వాళ్ళు ఎర్రటి కళ్ళతో మనల్ని భయపెడతారు."     "నీదంతా వితండవాదంరా! సమాజంలో వున్నాక...."     "ఇంకేం మాట్లాడకమ్మా! మనకు నచ్చిన చాలా పనులు సమాజానికి నచ్చవు. అలా అని మానేస్తామా? నర్స్ గా చేయడం చేయకపోవడం అరుణోదయ ఇష్టం. మనం జోక్యం చేసుకోవద్దు. వ్యక్తిత్వం వున్న ఆడపిల్ల ఏది మంచో ఏది చెడో ఆమె గ్రహించుకుంటుందనే నా నమ్మకం."     తను నర్స్ గా చేయడం అరవింద్ తల్లికి ఇష్టంలేదన్న విషయం అర్చన వల్ల తెలిసింది అరుణోదయకి.     "ఉద్యోగం మానేసి ఏం చేయాలి నేను? ఆడపిల్లకి వంటపని, ఇంటి పని చాలుననుకునే రకం కాదు నేను. నా వ్యక్తిత్వాన్ని నిలుపుకునే పని ఏదైనా నాకు కావాలి. నర్స్ కాక ఇంకేం చేయగలను నేను? ఈ ఉద్యోగం వదిలేస్తే ఇంకేం ఉద్యోగం దొరుకుతుంది నాకు?"     "నీకింక ఉద్యోగం దేనికి అరుణోదయా? అదృష్టవశాత్తూ ఉన్నతమైన సంస్కారుల ఇంట్లో పడుతున్నావు. అరవింద్ వంటి గొప్ప వ్యక్తికి భార్యవి అవుతున్నావు. అది చాలు ఈ జన్మకి అనుకోక. ఇంకా నర్స్ గా చేస్తానంటావేమిటి? నువ్వే ఆలోచించుకో. పెళ్ళయ్యాక కూడా నువ్వు ఎ.ఎన్.ఎమ్.గా ఊళ్లు పట్టుకు తిరగడం బాగుంటుందా?"     "ఇంకా మూడు నెలలు టైం వుంది కదా? ఆలోచిస్తాను."     "అంత ఆలోచించడానికి ఏముంది చెప్పు? నర్స్ గా నువ్వు చేసేది రోగులకు సేవే అనుకుంటే, ఆ సేవ మరో రూపంలో ఈ సమాజానికి అందించవచ్చు. ఎందరో అభాగినులు, ఇంకెందరో దుర్భలురు. వాళ్ళకి ఆసరాగా ఒక బలమైన చెయ్యి కావాలి. నువ్వు సోషల్ సర్వీస్ చేయాలేగానీ నీకు అరవింద్ సహకారం తప్పక లభిస్తుంది."     "ఆ విషయంలో డౌట్ లేదు. కానీ నేను ఉద్యోగం మానేసి కేవలం డాక్టర్ అరవింద్ భార్యగానే మిగిలిపోతానేమో అని భయం."     ఈ టాపిక్ అంతా అక్కడే కూర్చుని పేపరు చదువుకుంటున్న రామకృష్ణ విని కల్పించుకుంటూ అన్నాడు "నిజమే! ఈ దేశంలో అభాగినులకు కొరతేమీలేదు. వాళ్ళ కథ విన్నప్పుడు వాళ్ళకి ఎలా న్యాయం చేయాలో పాలుపోదు. ఈ సమాజంలో ప్రతి పదిమందిలో ఒక మహిళ బ్రతుకు భారమై, ఇల్లు నరకమై బయటికి వచ్చేసేందుకు తహ తహలాడుతుంటారు. కొన్ని చాలా విచిత్రమైన కథలు__తెలిసి తెలిసి జీవితం నాశనం చేసుకున్న కథలు విన్నప్పుడు వీళ్ళ చదువు, వీళ్ళ తెలివి ఏమైపోయిందాని ఆశ్చర్యం కలుగుతుంది. నిన్న ఒక ఆత్మహత్య కేసు హాస్పిటల్ కి వచ్చింది. సీసా నిద్రమాత్రలు మింగేసి మృత్యుదేవతకు స్వాగతం చెప్పి హాయిగా కళ్ళుమూసుకు పడుకుందావిడ. చివరి క్షణాల్లో తీసుకువచ్చారు ఆమెను. మృత్యు కోరల మధ్య చిక్కిన ఆమెను బయటికి తీసుకురాడానికి నేనూ, అరవింద్ హోరాహోరీ పోరాటం సలిపాం. ప్రస్తుతానికి మృత్యు నీడ తొలిగిపోయినట్టే."   
24,584
    ఆ లేవటంలో ఆమె జుట్టు అతని మొహాన్ని కప్పేసింది. తన చుట్టూ చీకటి అలుముకున్నట్టు ఫీలయ్యాడు. ఆ చీకటిలో ఒక కాంతిపుంజం దగ్గరగా__కళ్ళు మిరుమిట్లు గోలిపేటంతగా- ఏదో తెలీని అస్పష్టమ్తెన మేరుపు- హెల "సితా" అంటూ గోనిగేడు. వెనక్కి అడుగు వేయబోయింది. చటుక్కున  ఆమె నడుంచుట్టూ చేయివేసి దగ్గరకు  లాక్కుని ఏం జరుగుతుందో ఊహించే లోపునే ఆమె పెదవుల మీద గట్టిగా ముద్దుపెట్టుకున్నాడు. ఒక క్షణం  ఆమె బిత్తరపోయింది. వెంటనే ఆమె సిగ్గు  ముంచుకొచ్చింది. అతన్ని వెనక్కి తోసేసి చేతుల్తో మొహం కప్పుకొని బయటకు పరుగెత్తింది.     ఆ గదినిండా నిశ్శబ్దం పెరుకోంది. గడియారం టిక్ టిక్ మంటూ చేసే ధ్వనితప్పు యింకేమి వినిపించటం లేదు. ప్రకాశం  కళ్ళు గట్టిగా మూసుకొన్నాడు. ఏం చేశాడు తను? కళ్ళు విప్పాడు. ఆమె మొహం దగ్గరగా వుంది ఏదో తెలియని ఉద్వేగం తనని  ఆవరించింది. ఆమెని దగ్గిరగా లాక్కొని.....     పక్కకి తిరిగి పడుకొన్నాడు.     __ఏం చేశాడు తను?- ఆమె మొహం దగ్గరగా వుంది. ఏదో తెలియని ఉద్వేగం  అతన్ని ఆవరించింది. ఆమెని దగ్గరగా లాక్కొని-     తలగడలో  మొహం దాచుకొన్నాడు.     ఏంచేశాడు తను? ఏదో తెలియని ఉద్వేగం తనని ఆవరించింది-ఆమెని దగ్గరగా లాక్కొని.     తల విదిలించాడు.     ఎందులో ఎక్కువ ఆనందం వుంది? దోసిలిని హారతిగా పట్టి తనని ప్రేమించే  స్త్రినీ పవిత్రంగా హృదయం ఆర్పించటంలోనా? అర్దరాత్రి పెరటిగోడ దూకి పక్కింటి కొత్తకోడల్ని ముద్దు పెట్టుకోవడంలోనా? చెప్పు "హ్తేడ్" చెప్పు! ఈ అనంతమ్తెన విశ్వంలో ప్రచండమ్తెన వేగంతో పరిభ్రమించే కోటాను కోట్ల గోళాలమధ్య__పిపిలక ప్రమాణంలో తన వునికిని నిలుపుకొనే  ఈ   భూగోళం మీద_ఒక చిన్న జీవం -మనిషి -మనిషిలో సూక్ష్మమ్తెన ఆత్మ_ ఆ చిన్న పరిధిలో ఇన్ని కంట్రడిక్షన్ల ముళ్ళేందుకు?     తప్పు చెయ్యటంలో వుండే ఆనందం ప్రకాశానికి  మొట్టమెదటిసారి తెలిసింది.     అగ్నిపర్వతం బ్రద్దలవలేదు. కడలి  ఉప్పొంగలేదు. అంతా మామూలే. గుండెల్లో దాచుకొన్న రహస్యం . పెదవుల మీద చిరునవ్వు.     బాల్యం ఆటపాటల్లోనూ యవ్వనం మత్తులోనూ గడిచిపోతే వార్ధక్యం చూసి  ఏడుపోస్తుంది. సంఘాన్ని మనిషి మార్చలేడు సాటి మనిషిని  న్తేతికంగా బాగుచెయ్యలేడు. మారాలి! అమ్మా కడుపులో వున్నప్పటికీ నిశ్చింతని, బయటికి రాగానే  మంత్రసాని-ఏడిపించి పోగొడుతుంది. ఎక్కడుంది ప్రశాంతత? కాలే నరాలూ, ఉప్పూ కారం  పట్టించిన శరీరం, రహస్యాన్ని శోదించటమే పనిగా పెట్టుకొన్న కళ్ళూ.... పవిత్రంగా ఊగే గడ్డిపోచని, మూగభక్తితో ప్రశాంతత పొందినప్రకృతినీ పరిశీలించి ద్తేవత్వాన్ని పొందటానికి మనిషికి తెరికేది?                                                                 15     ఆఫీసుకు ఆలస్యం అవటంవల్ల గబగబ  తయారు అయ్యాడు. సిత దాదాపు అతన్ని తప్పుకునే  తిరిగింది. ప్రోద్దున్నుంచి అది అతను గమనించేడు అయినా దాని గురించి ఆలోచించలేదు. అతని మనసంతా క్రితంరోజు పోయిన నూట ఇరవ్తే రూపాయల గురించే ఆలోచిస్తూ వుంది.     ఎలా తీరుస్తాడు ఆ అప్ప?     ఎక్కడ సంపాదించగలడు?     ఒకటి మాత్రం సంతోషించదగ్గ విషయం. మిగతా  అందర్లా "మళ్ళి ఈ రోజు వెళ్ళిపోయినదంతా గెల్చుకువస్తే సరి" అనుకోవటం లేదు అతను.     ఇక ఎటువంటి పరిస్దితుల్లోను అటువ్తెపు వెళ్ళకూడదనే నిర్ణయం చాలా  గట్టిగా చేసుకున్నాడు. పోతే ఈ నిర్ణయం ఎంతకాలం  ఉంటుందనేది వేరే విషయం. బ్రోతల్ హౌస్ లోంచి, బార్లలోంచి , బ్తేటకోస్తూ ప్రతి వాడు ఈ నిర్ణయం  తీసుకుంటూనే వుంటాడు.     ఆలోచనలతో స్నానం బాగా ఆలస్యం చేసేడు. ఆఫీసుకి వచ్చే  సరికి కొంచెం  ఆలస్యం  అయింది.     అతనిలో ఒక మంచి గుణంవుంది. సీట్లో కూర్చొని  పనిచేయడము మొదలు పెట్టగానే  మిగతా విషయాలు మర్చిపోతాడు. ఆఫీసులో చేరిన కొత్తలో ప్రతివ్యక్తి ఇలానే సిన్సియర్  గా పని చేస్తాడు. తరువాతే  రెడ్  తెపిజయ్ అతనిలోనూ జీర్ణించుకుపోతుంది. దిన్ని మార్చాలంటే సంవత్సరానికో, రెండేళ్ళకో అతని పని మారుస్తూ వుండాలి. కాణి ప్రభుత్వానికి అంత  తిరికేది?     పదకొండయింది. బయట బాగా ఎండగా వుంది. ప్రకాశం తన సీట్లోనే  కూర్చొని పని చేసుకొంటున్నాడు. ఆఫీసంతా హడావుడిగా  వుంది. వరండాలో నిల్చొని  మాట్లాడుకొంటున్న  ఆడిటర్ల నవ్వులు  అప్పడప్పడు బిగ్గరగా  వినిపిస్తున్నాయ్ వాళ్ళకి విడిగా గది లేకపోవటం వల్ల యెవరు ఆడిటరో, ఎవరు క్లయింటో తెలియటంలేదు-ప్రాక్టీసు పెట్టుకొన్న  చార్తెర్టు అకౌంటెంట్స్ మీద ఇన్ కంటాక్స్ వాళ్ళకున్న  తేలిక భావానికి నిదర్శనంగా ఆ వరండా ఒక సత్రంలా వుంది.     ప్రకాశానికి ఈ గొడవేమి పట్టలేదు. అతనికిది అలవాటయి పోయింది. ఏకాగ్రతతో పనిచేసుకొంటున్నాడు ఫ్తేలుమీద నోటు వ్రాసి మూస్తూ ఎందుకో తలెత్తిచూస్తే  ఎదురుగా రాఘవరావు కనిపించేడు. అతను ఎదురింట్లో వుంటాడు. ప్రకాశానికి ముఖపరిచయం వుంది. కాణి యిలా  పనిగట్టుకొని తన ఆఫీసుకు  ఎందుకు వచ్చాడో అర్ధంకాలేదు ఆశ్చర్యాన్ని కప్పిపుచ్చుకొంటూ "కూర్చోండి" అన్నాడు.
24,585
భోగలాలసత్వంతో కూలిపోయిన రోమన్ సామ్రాజ్యము గుర్తువచ్చింది అజిత్ కి. సొడొమ్ లాంటి దుష్ట నగరాలు గుర్తువచ్చాయి. ఆ నగరాలని దేముడేం చేశాడు? స్వయంగా పూనుకుని నాశనం చేశాడు. అలాగే ఇప్పుడు ఈ భూమి రెండుగా చీలిపోయి వీళ్ళందరినీ పొట్టన పెట్టుకుని, ఈ భయంకరమైన నాగరికతని అంతం చేసెయ్యకూడదూ? అది కాకతాళీయమే కావచ్చు. కానీ అతను అలా అనుకున్నదే తడవుగా- ఆకాశం పగిలినట్లు శబ్దం. బ్రహ్మాండమైన ఉరుములు, లక్ష విమానాలు సూపర్ సోనిక్ వేగంతో వస్తున్నట్లు హోరున రొద. దానికి జవాబుగా భూమి గర్జించింది. శతకోటి రోడ్డు రోలర్లు భూగర్భంలో నడుస్తున్నట్లు చిత్రమైన ధ్వని. భూమి గజగజ వణికింది. అందరూ అటూ ఇటూ వూగారు. ఫెళఫెళమంటూ భూమి పగిలి విచ్చుకుంది. దాన్లో పడిపోయారు - పాపా, పాపని సృష్టించిన మనిషీ, ఆ పాపతో పాపం చెయ్యబోయిన మనిషిని పోలిన మృగం - ముగ్గురూ! ఆకాశం అంటుకున్నట్లు మహోజ్వలమైన వెలుగు వచ్చింది. కళ్ళకు చెయ్యి అడ్డం పెట్టుకుని, తలెత్తి చూశాడు అజిత్. ఆకాశం అంచున కనబడుతోంది ఫ్లయింగ్ సాసరు. అంతలోనే హఠాత్తుగా కారుమేఘాలు కమ్ముకొచ్చాయి. అప్పటికే భయభ్రాంతులైపోయి ఉన్న జనం మేఘాలను చూడగానే "వాన! వాన!" అని దిక్కుతోచనట్లు పరిగెత్తారు. అక్కడ వాతావరణం ఎంత కలుషితమై పోయిందంటే, వాన చినుకులు యాసిడ్ లా కాల్చేస్తాయి మనుషులని. భూమి పగులు అజిత్ పాదాలకీ, అపురూప పాదాలకీ మధ్యనుంచి వెళ్ళింది. పగిలిన భూమికి అటువైపు అజిత్, ఇటువైపు అపురూపా ఉండిపోయారు. "అజిత్!" అంది అపురూప విహ్వలంగా కేక పెడుతూ, అజిత్! అజిత్! అజిత్." మధ్యలో ఉన్న అగాధం పెద్దదవుతోంది. ఆ అగాధం మీదగా ఒరిగి చెయ్యి అందిస్తూ, "అపూ! నీ చెయ్యి అందివ్వు!" అన్నాడు అజిత్. "అమ్మో!" "అపూ! భయంలేదు. ఊరికే చెయ్యి అందించు చాలు! నేను లాగేసుకుంటాను. త్వరగా!" భయంగానే ముందుకు వంగి, చెయ్యి అందించబోయింది అపురూప. అజిత్ ఇంకొంచెం ముందుకి వంగాడు. అంతలోనే ఒక్క కెరటంలా జనం తోసుకొచ్చేశారు. బాలెన్సు తప్పి, ఆ జనం మధ్యలో ఇరుక్కుపోయింది అపురూప. మరుక్షణంలో అతని దృష్టి పథంలో నుంచి తొలిగిపోయింది.                                                            * * * *పావుగంట సేపటిదాకా ఆ కల్లోలం సర్దుమణగలేదు. జన ప్రవాహంలో పడిపోయి తను ఎటు వచ్చేసిందో అర్ధంకాలేదు అపురూపకి. అందరూ తలో దిక్కుకీ పారిపోయారు. తను వంటరిగా మిగిలిపోయింది. పెదిమలు కొరికి పట్టుకుని, దుఃఖాన్ని ఆపుకోవడానికి ప్రయత్నిస్తోంది అపురూప. "అపూ! అపూ!" అని కీచుగొంతు వినిపించింది. ఛివాలున తిరిగి చూసింది. పొట్టి రాబొట్ కేటూ! సోలార్ కారుతో సహా ఉంది అక్కడ. "ఎక్కు! వానవస్తే కష్టం!" అంది కేటూ! కారు ఎక్కింది అపురూప. ఆమె కారు ఎక్కగానే కుంభవృష్టి ప్రారంభమయింది. కారు తలుపులు వేసుకుని చాలాసేపు అలానే కూర్చున్నారు. అజిత్ జాడ లేదు. "కేటూ? ఎలాగ ఇప్పుడు?" అంది అపురూప ఆదుర్దాగా. "ఏం ఫర్వాలేదు. కారులో వెళుతూ వెదుకుదాం. వాన తగ్గగానే ఎక్కడో అక్కడ కనబడతాడు" అంది కేటు చాలా ఆత్మవిశ్వాసంతో. అది విని ధైర్యం తెచ్చుకోబోయేటంతలోనే. ఫ్లయింగ్ సాసరు మళ్ళీ కనబడింది. ఒక కిరణం దాన్లో నుంచి విడుదలయి వచ్చి వాళ్ళ కారుని తాకింది. ఆ తర్వాత కారు స్టార్ట్ చెయ్యకుండానే, ఎవరో ముక్కుకి తాడేసి లాక్కెళ్ళిపోతున్నట్లు, వర్ణించనలవికాని వేగంతో ముందుకి సాగిపోయింది గాలిలో. అలా కొంతదూరం పయనించాక, వెలుగు కిరణం కట్ అయిపోయింది. ఫ్లయింగ్ సాసరు కనబడటంలేదు ఇప్పుడు. గాలిపోయిన బెలూన్లా, కారు నెమ్మదిగా కిందికి దిగింది. అసలేం జరిగింది? ఎక్కడికి వచ్చారు తాము? అపురూపకి అంతా అగమ్యగోచరంగా ఉంది. కారు దిగీదిగగానే రాబొట్ కేటూ తలని ఒకసారి గిర్రున తిప్పింది. 'క్లిక్ క్లిక్ క్లిక్" అని శబ్దం చేసింది అలజడిగా. "ఏమిటి కేటూ?" అంది అపురూప దడదడలాడుతున్న గుండెతో. "చూడు! చూడు!" అంది కేటూ గాభరాగా. చివుక్కున తలెత్తి చూసింది అపురూప. ఎదురుగుండా విండ్ స్క్రీన్ లో నుంచి కనబడుతోంది ఒక భయానక రూపం! నరహరి !! తప్పించుకుపోయిన రాబొట్!!!                                     * * * *"ఎవరు మీరు?" అంది నరహరి. తుప్పుపట్టిన గొలుసులు లాగితే, కర్ణకఠోరంగా శబ్దం వచ్చినట్లుంది దాని గొంతు. అదోరకమైన నవ్వుతో దాని పెదాలు వంకరగా సాగాయి. గుండె ఆగిపోయినట్లయింది అపురూపకి. 'అజిత్!' అని ఆర్తనాదం చేసింది ఆమె మనసులోనే. 'ఎక్కడున్నావు అజిత్! ఈ పిశాచం నన్ను దారుణంగా చంపేస్తుంది అజిత్! ఎక్కడున్నావు నువ్వు!' చిన్న బొచ్చుకుక్కపిల్ల, దున్నపోతుని చూసి కలవరపడుతూ అరుస్తున్నట్లు అరుస్తోంది కేటూ. నరహరి ఇంకా దగ్గరకు వచ్చి, విండోలో నుంచి తల లోపలకు పెట్టింది. ఏదుపంది ముళ్ళలా ఉంది దాని జుట్టు. పెద్ద బొర్ర ముక్కు. శ్వాస పీల్చి వదలడం ప్రయత్నపూర్వకంగా చేస్తున్నట్లు రొప్పు వినబడుతోంది. విండోలోనుంచి చెయ్యి చాచింది నరహరి. ఆ చెయ్యి నల్లటి ఇనుపదూలంలా ఉంది. దానిమీద ఉన్న ఉక్కు స్ప్రింగులలాంటి దట్టమైన రోమాలు అపురూప బుగ్గలకి రాసుకుని వికారం కలిగించాయి. అరుస్తున్న రాబొట్ కేటూని నరహరి తీక్షణంగా చూస్తూ చేతితో తాకింది. వెంటనే ఆత్మరక్షణకోసం కాస్త కరెంట్ రిలీజ్ చేసింది కేటూ. ఆ షాక్ కి చెయ్యి వెనక్కి తీసేసుకుని, "ఉహు హుహు" అని నవ్వింది నరహరి. 'హనుమంతుడి ముందు కుప్పిగంతులా?' అన్నట్లు పరిహాసం ధ్వనించింది ఆ నవ్వులో. నరహరి కాస్త వెనక్కి తగ్గడం చూసి, కారులోనుంచి కిందకి దూకి, మళ్ళీ రెట్టింపు పవర్ తో షాక్ ఇచ్చింది కేటూ. ఈసారి నవ్వలేదు నరహరి. ముక్కుతో ఒకసారి బుసకొట్టినట్లు శబ్దంచేసి, తర్వాత వినేవాళ్ళు దడుచుకునేటట్లు, రక్తం గడ్డకట్టి పోయేటట్లు కేకపెట్టింది. సింహగర్జనా, ఆంబోతు రంకె, మదపుటేనుగు ఘీంకారం, నక్క ఊళ, అన్నీ కలిసినట్లు ఉంది ఆ అరుపు. "కేటూ!కే కారు స్టార్ట్ చెయ్! వెళ్ళిపోదాం" అంది అపురూప విహ్వలంగా. "అపూ! దీన్ని పట్టుకోవడం కోసం మొత్తం ప్రపంచమంతా వెదుకుతోంది. మనకి దొరికిన తర్వాత కూడా చేతులారా వదిలేస్తే ఎలా? భయపడకు! నేను దీని పని పడతాను" అంటూ భూమికి రెండడుగుల ఎత్తున వామనావతారంలో ఉన్న ఆ చిన్న రాబొట్, చెడు తాలూకు విశ్వరూపంలా ఉన్న నరహరి మీదకి గునగున పరుగెడుతూ వెళ్ళింది. "ఆగు!" అంది నరహరి, వార్నింగ్ ఇస్తున్నట్లు. కేటూ ఆగకుండా నరహరి మీదికి పరిగెత్తి కెళ్ళింది. ఒడుపుగా పక్కకి తప్పుకుంది నరహరి. వేగంగా పరిగెడుతున్న కేటూ బాలన్స్ తప్పి బోర్లా పడింది. వెంటనే దాని కళ్ళకి ఉన్న లెన్సులు పగిలిపోయాయి. కష్టంమీద మళ్ళీ లేని నిలుచుంది. కళ్ళు కనబడటంలేదు దానికి. గాల్లోనే తడుముకుంటూ తన చుట్టూ తనే ఒకసారి తిరిగి, అలికిడిని గ్రహించి మళ్ళీ నరహరివైపు వెళ్ళసాగింది. తనను మించిన ప్రత్యర్థితో తలపడుతున్నానని తెలుసు దానికి. అయినా సాహసంగా ముందుకి వెళ్ళింది. ఈలోగా పక్కనే ఉన్న పెద్ద బండని ఒకదాన్ని సునాయాసంగా ఎత్తి, చేతుల్లో పట్టుకుంది నరహరి. అది మీద పడేస్తే, కేటూ నుగ్గునుగ్గయిపోవడం ఖాయం. కళ్ళు లేని కేటూ అది గమనించలేదు. నరహరి తన చేతిలోని బండను గురిచూసి, కేటూ మీద వెయ్యబోతుండగా -   "కేటూ!" అని అరిచింది అపురూప. తప్పించుకోమని హెచ్చరికగా.
24,586
        తంబూరా మీటుతున్న సాధువొకడు అక్కడికి వచ్చి ఇలా అన్నాడు.  "బాబూ, ఈ ప్రపంచం మిద్దె! ఓ పెద్ద మిద్దె. రత్తమాంసాలతోటి కళ్ళుగుంట ఆడది. ఎందుకు నీకు బ్రెమ! మాయలో పడిపోకే మనసా!ఓ మనసా!"     "ఈమె నా తల్లి! మరెవ్వరూ కాదూ!" అన్నాడొక మనిషి పరుగెత్తుకొని వచ్చి. అందరూ ఆశ్చర్యంగా చూశారు.       "అలాగా, పాపం విచిత్రం" అంటూ అందరూ అతని చుట్టూ మూగారు.     "ఈమె నా మాత! పరాయి స్త్రీ ఎవరేనా నాకు తల్లి! భాగవతం చదువు కావలిస్తే జీసస్, బుద్దుడు, గాంధీ - స్త్రీని మాతృ రూపంలోనే చూశారు. ఈమె మాతృదేవత, సత్యదేవత -అంత ఎందుకూ చరఖా దేవతా!" అన్నాడు ఆ మనిషి గాంధీటోపీ సవరిస్తూ.     "ఆ బల్లమీది వస్తువు ఏమిటో నేను చెపుతాను ఆగండి" అంటూ బైనాక్యులర్సు తగిలించిన ఒక సన్నని పెదవుల నడివయస్కుడు. అందరూ అతని చుట్టూ మూగారు ఆతృతతో. అతను ఆమెని నిదానంగా టెలిస్కోపుతో ఓ పావుగంట చూసి ఇలా అన్నాడు.     "ఈ వస్తువు అందమైనది అన్న అభిప్రాయం సబ్జక్టివ్ -అంటే మీ మనస్సులోనిది. ఈమెని ప్రేమిస్తున్నాననే కవిగారిది ఓ సెంటిమెంట్. మానసిక చాంచల్యానికి ఆయన మందు పుచ్చుకోవాలి. ఈ వస్తువు అసలు ఏమిటో తెలుసునా, జీవశాస్త్ర ప్రకారం ఈమెకి ఆడదాని లక్షణాలే కనబడుతున్నాయి. కావలిస్తే చదవండి డార్విన్ పుస్తకాలు. ఈమె సృష్టి ప్రయోజనానికి పనికివస్తుంది. సృష్టి ఎలా జరుగుతుందో తెలుసునా, మనలో గ్లాండ్స్....."     "ఓస్, ఏం సెప్పావయ్యా, అరగంట సేపు చూసి ఆడమనిషి అని. ఎవడవు బాబు నువ్వు" అన్నాడు కూలివాడు చుట్ట నముల్తూ.     "నేనా! నేను సైంటిస్టుని. బైయాలజీ ప్రకారం ఈమె ఆడది. అయినా యింతదూరం నుంచి నేను ఋజువు చెయ్యలేను. ఇంకా కొన్ని పరీక్షలు చెయ్యాలి." అంటు అతను అంగలు వేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు.     "హా నా ప్రేయసీ!" అంటున్నాడు కవి.     "ప్రేయసీలేదు గేయసీలేదు ఊరుకోవయ్యా! మన షాపులో యీమెని నిలబెడితే కావలసినంత లాభం! లాభాలకి లాభాలు! ఏమంటావ్ చెంచయ్యా?" అంటున్నాడు ఒక  మార్వాడీ.     ఇంతలోనే -యింతవరకూ బల్ల దగ్గర కిందగా కూర్చున్న ఒక సన్నపాటి వ్యక్తి బల్లమీదకెక్కి నుంచున్నాడు. ఆమెమీద ఒక పల్చని బట్ట కప్పివేసి సులువుగా ఎత్తుకుని నెత్తిమీద పెట్టుకుని ఇలా గంభీరంగా అన్నాడు "సోదరులారా! ఈ బొమ్మని నేనే చేసాను. ఇది నా శిల్పం. మీలో ఒక్కరూ ఈ బొమ్మని కొనలేదు. ఇంతకీ నాకు ప్రాప్తిలేదు. నేను మరో వూరు వెళ్ళిపోతా" నంటూ ఆ బల్లదిగి అతను చకచక వెళ్ళిపోయాడు.     "ఆ కళకి ప్రయోజనం లేదు" అన్నాడొకడు.     "కళకోసం కళ! దానికి ప్రయోజనం ఏమిటి?" అన్నాడు మరొకడు.     "అసలు కళ లేదు సైన్సు తప్ప" అన్నాడు ఇంకొకడు.     "అసలు ఏమీలేదు బాబు! ప్రెపంచం ఒక మిద్దె! ఇదంతా బ్రెమ!" అన్నాడు సాధు.     "నాకు మూర్చవస్తోంది. నా ప్రేయసికి నేను కనపడక శిలగా, శిల్పంగా మారిపోయింది. ఇప్పుడేం చెయ్యను. ఏం చెయ్యను? అబ్బా బాధ, మిస్టర్! ఓ బెడవుంటే ఇయ్యి. కాఫీ తాగితే కాని...." అంటున్నాడు కవి.       ఇంతవరకూ చూస్తోన్న పోలీసు ఉద్యోగి విజిల్ వేశాడు. ట్రాఫిక్ ఆపుదలకి పోలీసుల్ని లాఠీ చెయ్యమని ఆజ్ఞాపించాడు. జనం చెల్లాచెదరై పోయారు.     తర్వాత రోజున న్యూయార్కు లో ఓ పేపర్లో ఇలా వుంది "నగరంలో ప్రజావిప్లవం పోలీసులు తుపాకీలు కాల్చారు - నగరంలో మతకలహాలు నూర్గురి మరణం."                                            (ఆనందవాణి దీపావళి సంచిక, 1948)                                                 *****************
24,587
    ప్రతి అర ఘడియకూ ఎవరో ఒకరు వేగం వచ్చి ప్రధాన వేగుకు సమాచారం అందించి వెళుతున్నారు. అతడు సహాయ మంత్రికి విషయం విన్నవించుకుంటున్నాడు. అతడు మంత్రికి ఆ మంత్రి శిరః ప్రధానికీ వర్తమానం తెలియజేస్తున్నారు. ఆయన ఘడియ ఘడియకూ మహారాజుకు నివేదిస్తున్నాడు.     రాజర్షి అయిన జనకుడు వ్యగ్రత చెందకుండా స్థిర చిత్తంతో శాంత భావంతో వింటూ తలూపి తిరిగి నిరీక్షిస్తున్నాడు.     మిథిలా నగర పొలిమేరకు రానే వచ్చాడు. యింతటి నిరీక్షణకూ కారణభూతుడైన ఆ మహర్షి. ఆయన రాక అంచెలంచెలుగా జనకుడికి క్షణాలమీద నివేదించబడింది. వెంటనే కదిలాడు జనకుడు.     ఆయన వెంట మంత్రి, పురోహిత, సేనానాయక, దండనాధ, పుర ప్రముఖులు, మహా రాణీ, దాస దాసీ జనం అంతా కదిలారు. నగరికి నగరే కదిలి వచ్చినట్లయింది.     మహా రాజోచితమైన ఆ స్వాగతానికి ఆ మహర్షి ఎంతో సంతోషించాడు. పాద్యం సమర్పించాడు.         జనక రాజర్షి అర్ఘ్యం అందించాడు. ఆ పైన తడిసిన ఆ మహర్షి పాదాలను తన ఉత్తరీయంతో అద్దాడు జనక రాజర్షి. ఈ సేవలతో ఆ మహర్షి మరీ సంతోషించాడు.     'బ్రహ్మర్షీ! తమరు వస్తున్నట్లుగా తమ శిష్యులు నివేదించిన క్షణం నుంచీ తమ రాక కోసం తనవంతు కనులు చేసుకుని నిరీక్షిస్తున్నాము. తమరు మా పొలిమేరలోకి రాగానే యదార్ధమైన స్వాగతం సమర్పించుకోవాలన్నది నా కోరిక! అలాగే తమరిని యధావిధిగా ఆర్చించి ఆహ్వానం పలుకుతున్నాం. తమరి రాకతో మా మిధిలా నగరమే తరించింది. మా జన్మ తమ పాదదర్శనం తోనే ధన్యమైంది' అన్నాడు జనకుడు.     'రాజర్షి సత్తమా!' నిండు గుండెతో పిలిచాడు ఆ మహర్షి. 'ఇది వినయానికే వినయం నేర్పించే తమ వినమ్ర వచనం. అంతేగానీ ఈ అజనాభదేశంలో, రాజ లోకంలో నీ వంటి నిర్మల జీవనుడు లేడు. మహర్షి లోకంలో నీవంటి మహిమాన్వితులు అరుదు! అందుకే నీవు రాజర్షివయ్యావు! ప్రజా పాలన కేవలం ప్రజాసేవకే తప్ప, ప్రజల చేత సేవలందడానికి కాదు. రాజరికంతో వచ్చే అట్టహాసాలతో- ఆడంబరాలతో, డాంబికాలతో, మిధ్యా గౌరవాలతో జీవించడమూ కాదు అని విశ్వసించే ప్రజా పాలకుడివి నువ్వు! నువ్వు ఆదర్శమూర్తివి! నీ ఆతిథ్యం పొందడం మా అదృష్టం' అన్నాడు.       జనకుడు అంజలి ఘంటించాడు.     'మౌని కులాలంకారా! మహానుభావా! గాధినందనా! తమ వచనం తమకు మాపై గల అవ్యాజాను రాగాలకు గుర్తు! తమ చిత్తం మా భాగ్యోదయం. అర్ధించినా ఎవరి అంతఃపురంలోనూ అడుగిడని తమరు తమకై తాము దయచేయడం, ఈ జనకుడి జీవితంలో ఏదో మహత్తర శుభ సూచకంగా భావిస్తున్నాను. తమరు మా అంతఃపురానికి దయచేయవలసిందిగా, మేం యధావిధిగా చేసే సేవలు స్వీకరించవలసిందిగా అభ్యర్ధిస్తున్నాం'.     విశ్వామిత్రుడు ఎంతో సంతోషించాడు. జనకుడు దారితీయగా ఆయన వెంట విశ్వామిత్రుడు కదిలాడు. వారిని అనుసరించి మంత్రులూ, పురోహితులూ, దండనాధులూ నడిచారు.     విశ్వామిత్రుడు అంతఃపురం ప్రవేశించాడు. జనకుడు విశ్వామిత్రుడు ఇద్దరే నిలిచారు. అందరూ వెలుపలికి వెళ్ళిపోయారు.     'జనక రాజర్షీ! లోక కంటకుడైన రావణాసురుడి బాధల నుండి సమస్త మానవాళిని, దేవతలనూ రక్షించడానికి దశ కంఠుడిని శిక్షించడానికి శ్రీమన్నారాయణుడు అయోధ్యా నగరిలో అవతరించనున్న విషయం అన్ని లోకాల్లోనూ తెలిసిన విషయమే!         దశరధుడితో ఋష్యశృంగమహర్షి త్వరలోనే పుత్రకామేష్టి చేయిస్తున్నాడు. ఆ యాగంతో తృప్తి చెందిన దేవతలు స్వాహవధూవల్లభుడి ద్వారా యాగ ఫలాన్ని అందించనున్నారు. తత్ఫలితంగా శ్రీమన్నారాయణమూర్తి అయోధ్యలో నరుడిగా జన్మిస్తాడు'.     విశ్వామిత్రుడి మాటలు విని, మంత్రం విన్నవాడిలా తలూపాడు జనకుడు. ఈ విషయం తనకూ తెలిసిందన్న సూచనగా ఆయన తలూపగానే విశ్వామిత్రమహర్షి మళ్ళీ అన్నాడు.     గత యుగాల్లో, కాలాల్లో శ్రీమహావిష్ణువు ఎన్నో అవతారాలు ధరించాడు. వాటికీ, ఈనాటి అవతారానికీ ఎంతో వ్యత్యాసం ఉంది. శ్రీమన్నారాయణుడు నరుడిగా జన్మించి ఒక ఆదర్శ మానవుడిగా జీవించనున్నాడు.     మరి అన్ని సంవత్సరాలు శ్రీమహాలక్ష్మి స్వామివారి వియోగాన్ని భరిస్తూ వైకుంఠంలో ఉండగలదా. ఊహూ! అందుకే ఆమె భూలోకంలో మానవ కాంతగా జన్మించనున్నది. కానీ ఆ తల్లి గర్భావాస క్లేశం అనుభవించరాదు. అందుకే అయోనిజగా అవతరించనున్నది!     జనకుడు ఉత్కంఠతో వినసాగాడు.     అయోధ్యాధీశుడితో వియ్యమందదగిన రాజ వంశంలో ఆ తల్లి వెలుస్తుంది. వియ్యానికయినా, కయ్యానికయినా సమాన స్థాయి కావాలి కదా!'     శిరస్సు ఊపాడు జనకుడు.     బ్రహ్మర్షి విశ్వామిత్రుడంతటి వాడు విషయాన్ని వివరిస్తూ ఉంటే మధ్యలో మాటలు కలపడం జనకుడి లాంటి రాజర్షికైనా తగదు కదా!    'రఘువంశం పునీతం కాబోతున్నది. పుత్రులు లేరు లేరని వగచిన దశరధుడికి కోరిక కూడా తీరబోతున్నది. మానవజన్మ ఎత్తనున్న శ్రీమహావిష్ణువు అందరు మానవుల లాగానే పెళ్ళి, సంసారం, సంతానం అనే అనేక బాంధవ్యాలకు బందీ కానున్నాడు. ఆయన కాళ్ళు కడిగి కన్యాదానం చేయతగిన భాగ్యశాలి ఎవరా అన్నది సమస్త లోకాల్లోనూ చర్చనీయాంశమయింది'.     విశ్వామిత్రుడు చెపుతున్న మాటలు వింటున్నాడు జనకుడు.     'నేను గాయత్రిని దర్శించిన ఋషిననీ మీకు తెలుసు. ఆ తల్లి దయవలన నాకు ఆ వంశమేదో! ఆ పునీత రాజ్యమేదో తెలిసింది!' అన్నాడు విశ్వామిత్రుడు చిరునవ్వుతో.
24,588
    నెమ్మదిగా కనులమీద కలలతో నిద్రపట్టేసిందనికి.                                                          *    *    *     మర్నాడు ఉదయం, సరిగ్గా, పదకొండు గంటలకు దేవరాజ్ అడ్స్ రోడ్ లోని షోరూంలోంచి బయటికొచ్చాడు మైత్రేయ.     గత వారంరోజుల్లో మూడు కొత్త  కార్లు సేల్ అయ్యాయి అందులో రెండు కార్లు బ్లూ కలర్ వి. ఆ రెండు అడ్రసుల్లో ఒకటి సిద్ధార్థ లే అవుట్  ఏరియాలో వుంది. రాజేంద్రకుమార్ ఎవరు? మోహిత భర్తా? వెంటనే ఉత్సాహంగా ఆటో ఎక్కాడు మైత్రేయ. ఇరవై నిమిషాల తర్వాత ఆటో కంఠీరవ  అపార్టుమెంట్స్ ముందు ఆగింది.     లిప్ట్ లో సెకండ్ ఫ్లోర్లో కెళ్ళాడు మైత్రేయ.     ఫ్లాట్ నెం : 204 వరండా నిశ్శబ్దంగా  వుంది. మరికొద్ది నిమిషాల్లో తను మొహితను చూడబోతున్నాననే సంతోషంలో వున్నాడతను.     ఇంత సులభంగా మోహిత తనకు కన్పిస్తుందనుకోలేదతను.     ప్లాట్ డోర్ ముందు నిలబడి, కాలింగ్ బెల్ నొక్కాడు. బెల్ మోగలేదు.     నెమ్మదిగా తలుపు తట్టి, డోర్ ని ముందుకు తోసాడు. నెమ్మదిగా తెరుచుకుంది.     "మోహితగారూ....." పిలుస్తూ డ్రాయింగ్ రూంలోకి అడుగుపెట్టాడు మైత్రేయ.     డ్రాయింగ్ రూంలో పల్చటి వెల్తురులో విశాలమయిన కేన్ చైర్స్ ఒక సోఫా.... మరొక పక్క నిలువెత్తు కేన్ హేంగింగ్ బల్బ్ స్టాండ్.... ఆ వెనుక గోడమీద మహావర్ణ శిల్పి వడ్డాది పాపయ్య, 'గోపికా  స్వాంతనం' మందహాసాలు చిందిస్తున్న నీలిమేఘ కృష్టుడు..... మరొకవేపు డెకరేటివ్ పీసెస్..... ఒక్క పక్క టీపాయ్ మీద ఫోన్.....     నెమ్మదిగా ముందుకు అడుగు వేసాడతను.     ఎదురెదురుగా రెండు బెడ్ రూమ్స్. తలుపులు దగ్గరగా వేస్తున్నాయి.     కుడివేపు బెడ్ రూమ్ వేపు నడిచి, డోర్ ని ముందుకు నెట్టాడు.     లోపలికి చూశాడు....     డబుల్ బెడ్, ఆ బెడ్ మీద చిందర వందరగా కొన్ని పుస్తకాలు.     ఒకవేపు గోద్రెజ్ బీరువా.....     మనిషిగానీ, చప్పుడుగానీ లేదు. ఎడమవేపు నున్న బెడ్ రూమ్ వేపు నడిచాడు.     నెమ్మదిగా డోర్ తెరిచిన మైత్రేయ, ఎందురుగా కన్పించిన దృశ్యానికి నిశ్చేష్టుడైపోయాడు. అతని వంటి మీద రోమాలు నిటారుగా ఒక్కసారిగా నిలబడిపోయాయి. వళ్ళంతా చెమటలు పట్టేశాయి. గుండెలనిండా ఒక్కసారిగా ఆక్రమించిన భయం.....     మైత్రేయ ఒక్కసారి భయంతో కెవ్వున కేకవేశాడు.     ఎదురుగా బెడ్ మీద, అరవై ఏళ్ళ మగవ్యక్తి, నగ్నంగా, వళ్ళంతా కత్తిపోట్లు, తల మొండెం తెగిపోయి వుంది. తోడభాగం గాట్లుగా వుంది.     రక్తం.... బెడ్ షీట్ నిండా రక్తం.... గదినిండా రక్తం....     ఊహించని దృశ్యానికి మైత్రేయకి అయోమయంగా వుంది. మరొక్క నిముషం ఆలస్యం చెయ్యకుండా, పరుగు పరుగున డ్రాయింగ్ రూమ్ లో కొచ్చాడు.     మెయిన్ డోర్ దగ్గరికొచ్చి తలుపు లాగాడు.     అది వెనక్కి రాలేదు.     వంటినిండా ముచ్చెమటలు పట్టాయి.     ఎవరో డోర్ బయటినుండి లాక్ చేశారన్న విషయం అతనికి అర్థమయి పోయింది.     అంటే.... ట్రాప్.... ట్రాప్.... ట్రాప్....     తనని మోహిత మర్డర్ ట్రాప్ లో చాలా జాగ్రత్తగా ఇరికించిందన్న మాట.     ఇప్పుడేం చెయ్యాలి....?     కిటికీలు తెరవడానికి ప్రయత్నించాడు.     ఐరన్ గ్రిల్స్, వెనకనుంచి దూకడానికి ప్రయత్నించాడు. దూకలేక పోయాడు.     ఇన్నేళ్ళ జీవితంలో ఎప్పుడూ మర్డర్ ని గానీ, శవాన్నిగానీ చూడలేదు మైత్రేయ.     అంతా అయోమయంగా వుంది.     సిగరెట్ తీసి, అగ్గిపెట్టె కోసం జేబుల్ని వెతుక్కున్నాడు. అగ్గిపెట్టె కోసం కిచెన్ రూంలోకెళ్ళాడు. అక్కడా అగ్గిపెట్టె లేదు. కుడివేపు బెడ్ రూమ్ లో కెళ్లాడు.     గాడ్రేజ్ బీరువా  పక్కన, విండో గోడమీద అగ్గిపెట్టె, పక్కన ఖాళీ గ్రీన్ లేబిల్ బాటిల్ వున్నాయి.     గబగబా అగ్గిపెట్టెలోంచి పుల్లను తీసి, సిగరెట్ వెలిగించుకుని రెండు దమ్ములు పీల్చి, బెడ్ మీద  పుస్తకాలు పక్కన కన్పించిన బ్లాక్ కలర్ బ్రా వేపు, ఆ పక్కన పడివున్న విజిటింగ్ కార్డువేపు చూశాడు. వెంటనే విజిటింగ్ కార్డును అందుకొని, దానిమీదున్న పేరు వేపు చూశాడు.     రాజేంద్రకుమార్.... ఫారెస్ట్ కాంట్రాక్టర్...... ముదుమలై....     పక్కన ఫోన్ నెంబర్ వుంది.     చనిపోయిన వ్యక్తిపేరు రాజేంద్రకుమారేనా?     ఆ బ్రాని, విజిటింగ్ కార్డుని జేబులో పెట్టుకుని, డ్రాయింగ్ రూంలో కొచ్చాడు మైత్రేయ.     అప్పుడే టెలీఫోన్ మోగింది. రిసీవర్ అందుకోబోయి, మెయిన్ డోర్ చప్పుడు విన్పించడంతో ఆగిపోయాడు. రెండు సెకండ్లలో మెయిన్ డోర్ తలుపు తెరచుకుంది. ఎదురుగా ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్. ఆ పక్కన నలుగురు పోలీసులు. వాళ్ళను చూడగానే బిత్తరపోయిన మైత్రేయ కళ్ళు చెమ్మగిల్లాయి.          మైత్రేయను పోలీసులు అరెస్ట్ చేశారు.                                                *    *    *     లక్ష్మీ ప్యాలెస్ పరిధిలోని పోలీస్ స్టేషన్....     మైత్రేయ చెప్పినదంతా విన్నాడు సర్కిల్ ఇన్ స్పెక్టర్ చంద్రప్ప.     "అయితే నువ్వు మర్డర్ చెయ్యలేదంటావ్...." సాలోచనగా అడిగాడాయన.     "రెస్టారెంట్లో బేరర్ నీ, మారుతీ షోరూమ్ మేనేజర్నీ అడగండి."     "మెడికల్ కాన్ఫరెన్స్ కు వచ్చి, ఆ కాన్ఫరెన్స్ కు ఎందుకు వెళ్లలేదు.....?"     ఆ ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయాడు మైత్రేయ.     "మోహితతో ఎన్నాళ్ళనుంచి నీకు పరిచయం.....?" అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ప్రశ్నించాడు చంద్రప్ప.     "ఆ మోహిత అనే ఆవిడతో నాకసలు పరిచయం లేదు.... ఆవిడ ఎలా వుంటుందో నాకు తెలీదు.... నన్నొక ట్రాప్ లో ఇరికించారు.     "ఎవరు... "     "ఆ మోహిత...."     "మరి ఆవిడతో పరిచయం అసలు లేదంటున్నావ్...."     "లేదు సార్ .... నన్ను నమ్మండి...."     "ప్రతి నేరస్తుడూ అనే మొదటిమాట ఇదే..."     "నేను నేరస్తుడ్ని కాదు...."     "ఆ చనిపోయిన వ్యక్తి ఎవరో తెలుసా..."     "తెలీదు..."     "అధికార పార్టీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్" ఆ మాటకు విస్తుపోయాడు మైత్రేయ.     "ఆ మోహితను పట్టుకుంటే, నిందితులు మీకు దొరుకుతారు...."     "స్పాట్ లో నువ్వు దొరికావ్, నిన్ను రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. నువ్వు చెప్పుకోవాల్సింది కోర్టులో చెప్పుకో....." అంటూ లేవబోయిన సర్కిల్ ఇన్ స్పెక్టర్ తో ఇలా అన్నాడు మైత్రేయ.     "ఇక్కడ మర్డర్  అయిందని మీకెవరు చెప్పారు?"     "బయటినుంచి పోనొచ్చింది."     "అలాగే నేను ఆ ప్లాట్లోంచి బయటకు రాకుండా ఎవరో బయట గొళ్ళెం పెట్టారు..... ఆ విషయం మీరు గమనించారా....."     ఆ మాటకు ఇన్ స్పెక్టర్ సూటిగా మైత్రేయ ముఖంలోనికి చూశాడు.     "ఈ మర్డర్లో మూడోవ్యక్తి ప్రమేయం వుందని మీరు భావించడం లేదా....?"     "భావించడాలు, అనుమానించడాలు అన్నీ తర్వాత...... యివాళ హాయిగా లాకప్ లో రెస్ట్  తీసుకో. రేపు కోర్టులో నువ్వు చెప్పాల్సింది చెప్పు.....తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం....." కానిస్టేబుల్స్ ని పిల్చి, చెప్పాల్సింది చెప్పి, బయటకు వెళ్ళిపోయాడు ఇన్ స్పెక్టర్.                                               *    *    *          గట్టి గరిచాడు మైత్రేయ.     అసహనంగా.... కోపం... క్రోథం.... కనిపిస్తే మొహితను మర్డర్  చేసేయాలన్న కసితో వున్నాడతను.     కానిస్టేబుల్  తెచ్చిన భోజనాన్ని గోడలకేసి విసిరికొట్టాడు.     రేపు కోర్టు తనని నమ్ముతుందా?     నమ్మదు. అయితే ఏం చెయ్యాలి?     ఎక్కడున్నా, మోహితను పట్టుకోవాలి. తనని మర్డర్ ట్రాప్ లోకి ఎందుకు ఇరికించిందో తెల్సుకోవాలి.     అవసరమైతే, ఆ మోహితను చంపి, తను జైలుకి వెళ్తాడు.          రాత్రి రెండు గంటలు దాటింది.     సిగరెట్ తీసి వెలిగిస్తూ ఆలోచిస్తున్నాడు.     ఒకటే ఆలోచన....     తను తప్పించుకోవాలి. మోహితను పట్టుకోవాలి.     ఆ ఆలోచన రాగానే అటూ యిటూ చూశాడతను. దూరంగా కానిస్టేబుల్ కాళ్లు జాపుకుని నిద్రపోతున్నాడు.     గట్టిగా చప్పుడు చేశాడు మైత్రేయ.     గబుక్కున మేల్కొన్న కానిస్టేబుల్ కంగారుగా సెల్ వైపు చూసి-     "ఏం కావాలి?" మత్తుగా అడిగాడు.     "టాయ్ లెట్ వెళ్లాలి....." చెప్పాడతను.     "ఇప్పుడు నిన్ను బయటకు ఎవడు తీసికెళతాడు కానీ.... ఆ మూలని కానిచ్చేయ్...." చికాగ్గా చెప్పాడు కానిస్టేబుల్.     లావెట్రీ కి వెళ్ళాలి...." గట్టిగా చెప్పాడు మైత్రేయ     "లావెట్రీకి టైమూ, సందర్భం వుండవా? యోగా చెయ్..... ఒక టైముకి అన్నీ జరుగుతాయి. చూడు ,రెండు మూడు నిమిషాల్లో వచ్చేయాలి" అంటూ సెల్ డోర్  ఓపెన్ చేశాడు కానిస్టేబుల్.     మైత్రేయ లావెట్రీలో కెళ్ళాక, గోడ కానుకుని గురక తీయడం ప్రారంభించాడు కానిస్టేబుల్.     స్టేషన్ లో ఒకే ఒక కానిస్టేబుల్ వున్నాడని మైత్రేయకి తెల్సు.     లావెట్రీలో కెళ్ళిన మైత్రేయ మూడునిమిషాల్లో బయటికొచ్చి అటూ, యిటూ చూసి గబగబా బయటికి వచ్చేసి, జేబులోంచి సిగరెట్ తీసుకుని, తాపీగా వెలిగించుకుని ఆటో ఎక్కాడు.     "రైల్వేస్టేషన్...." ఆటోడ్రైవర్ తో చెప్పాడు.     పది నిమిషాల తర్వాత ఆటో రైల్వేస్టేషన్ ముందు ఆగింది.     డబ్బులిచ్చి స్టేషన్లోంకి నడిచాడు మైత్రేయ.                                                                 *    *    *     ఎంక్వయిరీ కౌంటర్....     "మైసూర్ నుంచి ఊటీ వెళ్ళటానికి, వయా నంజెన్ గడ్ బస్సులే.... అటువైపు ట్రైన్స్ లేవు...." కౌంటర్ లోని వ్యక్తి చెప్పాడు మైత్రేయతో. చేతి వాచీవైపు చూసుకున్నాడతను.     రెండూ....నలభై నిమిషాలు.....     వెంటనే లక్ష్మీ ప్యాలెస్ హొటల్ కెళ్ళి, రూమ్ ఖాళీ చేసేసి తిరిగి రైల్వేస్టేషన్ కు వచ్చి, మాండ్యా వెళ్ళే ప్యాసింజర్ రైలు ఎక్కాడు.
24,589
    ప్రపంచంలోని అందమైన నగరాల్లో పారిస్ మొదటిది. విశాలమైన రహదారులు, వాటికిరుప్రక్కల పచ్చని లాన్స్, ప్రతి కిలోమీటరుకి ఒక  పార్క్ రోడ్డెంట నడిచేవారు (తక్కువ) సేదతీరేందుకు పెద్ద పెద్ద వృక్షాలు......ఒక్కసారి పారిస్ లో అడుగు పెడితే మరలా వదలబుద్ధి కానటువంటి సుందర నగరం.నగరం మధ్యగా ప్రవహించే సెయిన్ నదికి దగ్గర్లో1823 నాటి అతి పురాతన కట్టడం 'అండా ల్యూసియన్' కోట......ఫ్రాన్స్ దేశపు సాంస్కృతిక, సాంప్రదాయాలకు ప్రతీకగా తన అస్తిత్వాన్ని నిలుపుకుంటూ కనిపిస్తుంది. కోటకు వెనుకవేపు మరికొన్ని పురాతన కట్టడాలు, వాటి చుట్టూ మనుష్య సంచారం లేక చెట్లు  గడ్డి, పిచ్చిగా పెరిగి పగలే భయం కల్గించేట్లుగా వుంటుంది.     ఆ కట్టడాల్లో ఓ మూల వున్న దర్భారులాంటి హాల్లో వందమంది యువకులు మరో వందమంది యువతులు చేతుల్లో సిగరెట్లతో, పైపులతో ఒకరిమీద ఒకరు పడిపోతూ, పిచ్చిగా కేకలేస్తూ, నేలమీద  పడి పొర్లుతున్నారు. ఫ్రాన్స్ దేశపు భావిపౌరులు గంజాయిదమ్ము మత్తులో, మార్ఫిన్, మాండ్రెక్స్ మత్తుపదార్థాల కౌగిలిలో తమ అస్తిత్వాన్ని కోల్పోయి, సభ్య ప్రపంచానికి దూరంగా రంగులు పులిమిన నూతన ప్రపంచంలో విహరిస్తూన్నారు.     వారి గుండెల్లో సూర్యుడు బ్రద్ధలైనట్లు, వారి శరీరంలో కాంతులీసుతున్నట్లు భ్రమిస్తూ అదోరకమైన ట్రాన్స్ లో వున్నారు.     మితిమీరిన డబ్బు, సౌకర్యాలు అందుబాటులోకి వస్తే యువతకి పట్టే అధోగతికి వీరే నిదర్శనం. పాడుబడిన ఆ కోటగోడల మధ్య పెరిగిన కలుపు మొక్కల్లా వున్నారు పెడదారిన పట్టిన ఆ యువత.     తెల్ల వారటానికి మరోగంటే వుంది ఒక్కొక్కరు క్రమంగా మత్తు నుండి బయట పడుతూ ఇంటిదారిపట్టే ప్రయత్నాలు మొదలెట్టారు.     అందులో ముందుగా జేరుకుంది ఓ యువతి. చేతిలో వున్న  ఇంజక్షన్ సిరెంజ్ విసిరికొట్టింది దూరంగా. ఆమెపేరే తరంగిణి. తూలుతూనే లేచి నిలబడి టైమ్ చూసుకుంది. ఓ సారి కళ్ళు నలుముకుంది తరంగిణి.     అడ్డంగా పడివున్న వారి మీదగానే అంగలేస్తూ బయటకు నడవసాగింది.     వంటిమీద వున్న షర్ట్ బటన్స్ విడిపోయి ఆమె బిగ్ బస్ట్ గాలికి వదిలేసినట్లుగా వుంది. కళ్ళముందు మెరుస్తున్న కాంతులు ఆమెను, ఆమె గురించి ఆలోచించుకోనట్లు చేస్తున్నాయి. ఐదడుగుల తొమ్మిదంగుళాళ ఎత్తున్న తరంగిణి అంత మత్తులో నడుస్తున్నా అజంతా శిల్పంలా, అపరంజి బొమ్మలా, అందాల హంసలా వుంది. పాడుబడ్డ కోట గోడల్ని దాటుకుంటూ వచ్చి పార్క్ చేసి వున్న కారెక్కింది. మరుక్షణం కారు రివ్వున నేషనల్ పార్క్ వేపుకు దూసుకుపోతోంది.     నగరం అప్పుడే మేల్కొంటోంది. ఆమెలో క్రమంగా మత్తు దిగిపోయి, ఆ స్థానంలో ఆలోచనలు ముసురుకుంటున్నాయి.     తనివ్వాళ పదకొండు గంటల ఫ్లయిట్ లో ఇండియా వెళ్ళిపోవాలి.     టిక్కెట్, వీసా అన్నీ నాలుగురోజుల క్రితమే సిద్దంఅయ్యాయి.     పాతికేండ్ల క్రితం భారతదేశం నుంచి వచ్చి ఫ్రాన్స్ లో స్థిరపడిన వాతావరణం పరిశోధనా శాస్త్రవేత్త ప్రొఫెసర్ జగన్నాథ్ ఏకైక సంతానం తరంగిణి.     చదువు, అందం, సంస్కారం అన్నీ సమపాళ్ళలో వున్న తరంగిణి అనుకొని పరిస్థితుల్లో మత్తు పదార్థాల ప్రపంచంలోకి విసిరివేయ బడింది. తండ్రి ఎంతగా ప్రయత్నించినా, తాపత్రయపడ్డా తరంగిణి ఏమాత్రం మారలేదు. ప్రొఫెసర్ జగన్నాథ్ ఆ క్షోభతోనే మంచం పట్టాడు.     అప్పటినుండి మరీ పెడదారులు తొక్కింది తరంగిణి.     ఫ్యాషన్స్ డిప్లోమా తీసుకున్న తరంగిణి అప్పుడప్పడు ఫ్యాషన్ షోలలో పాల్గొని ప్రశంసలు కూడా పొందింది.     జగన్నాథ్, తన భార్యతో ఫ్రాన్స్ వచ్చిన తొలిరోజుల్లో పిల్లల కోసం చాలా  బాధపడేవారు. ఆ బాధనుండి క్రమంగా కోలుకుంటున్న టైమ్ లో తరంగిణి కడుపున పడటం జరగింది. లేక లేక కల్గబోతున్న తమ సంతానంపట్ల జగన్నాథ్ దంపతులు పడిన ఆరాటం, తపన____అనూహ్యం. తరంగిణికి ఇరవై సంవత్సరాలు వచ్చేవరకూ ఎంతో క్రమశిక్షణతో పెరిగింది. అనుకోకుండా ఓ ఫ్రెండ్ సర్కిల్ లో పడటంతో ఆమె జీవితగమనమే మారిపోయింది.     ఎప్పుడూ, నవ్వుతూ, త్రుళ్ళుతూ, చలాకీగా వుండే తరంగిణి తెలివి తేటలన్నా, అందం అన్నా ఆమె చుట్టూ వుండే ప్రతి ఒక్కరికి ఓ ఆరాధన. కారు ఇంటిముందు ఆగింది. అప్పటికి తరంగిణిలో మత్తు పూర్తిగా దిగిపోయింది. హడావుడిగా ఇంట్లోకి నడిచింది. స్నానం త్వరగా పూర్తిచేసి బట్టలు సర్దుకొని వీసా, ఫ్లయిట్ టిక్కెట్, పాస్ పోర్టు తీసి హేండ్ బేగ్ లో పెట్టుకుంది.     ఆమెలో హడావుడి క్షణక్షణానికి పెరిగిపోతోంది. ఎంత త్వరగా ఫ్లయిట్ ఎక్కేస్తే అంత క్షేమమన్న ఆలోచన ఆమెను నిలువనివ్వటం లేదు. లంకంత ఇంటిలో, ఓ మూల గదిలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న తండ్రిని పలకరించాలనిపించింది ఆమెకు ఓ క్షణం.     తను చేస్తున్నది, చేయబోతున్నది, తప్పు అని తెలిసినా తనను తాను నిగ్రహించుకోలేని మానసిక అస్థిరత్వంలో వుంది. సర్దిన లగేజ్ అంతా  ఓ ప్రక్క పెట్టుకొని తండ్రి గదివైపు నడిచింది.     గదిముందు ఆగింది. ఓ క్షణం. తండ్రికి ఎదురుగా నిలబడాలంటే, తన అంతరంగంలో సుళ్ళు తిరుగుతున్న న్యూనతాభావం వలన సాధ్యం కావటంలేదు. మనస్సు మార్చుకొని గిరుక్కున వెనక్కు తిరిగింది.     వడివడిగా అడుగుల వేస్తూ ఫోన్ వైపు నడిచింది.                                 *    *    *     మనోహర్ అతి కష్టంమీద సంపాదించుకున్న వీసాతో ఎయిర్ ఇండియా ప్లయిట్ ఎక్కి ఆరు గంటలయింది. ఆ ఫ్లయిట్ ఢిల్లీనుండి సరాసరి పారిన్ వెళుతుంది. మనోహర్ లో ఆలోచనలు జెట్ స్పీడ్ లో పరుగులెడుతున్నాయి.     తరంగిణి ఎక్కడుంటుందో తెలియదు. పారిన్ లాంటి మహా నగరంలో ఆమె అడ్రస్సు కనుక్కోవడం అంత తేలికైన పనికాదు. కనుక్కున్నా ఆమె తనతో ఇండియా వస్తుందా? మోడలింగ్ కి ఒప్పుకుంటుందా మనోహర్ మానసికస్థితి అల్లకల్లోలంగా వుంది.     ముక్కూ, మొహం తెలీని ఓ యువతితో మోడలింగ్ చేయించాల్సిన పరిస్థితి ఏ యాడ్ ఫోటో గ్రాఫర్ కి వచ్చి వుండదు. అంత ఆందోళనలోనూ, క్లిష్ట పరిస్థితిలోనూ ప్రదీప్ గురుకొచ్చాడు మనోహర్ కు.     పరమ కర్కోటకుడైనా, తనకెంతో  శత్రువైనా ప్రదీప్ మాస్టర్ బ్రెయిన్ మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు మనోహర్.     ఈ ఫీల్డ్ లో నిలదొక్కుకోవాలంటే సృజనాత్మకత ఒకటే చాలదు. ప్రతి మెట్టుపైనా నెగ్గి, నెట్టుకురాగల చాకచక్యం కావాలి మంగళ, కమలిని మధు చక్రవర్తి, చందూ, రోమాకౌర్. రూపాచక్రవర్తి, రాంభూపాల్, కిరణ్, గిరీష్___అందరూ ఒక్కసారి మనోహర్ స్మృతిపథంలో మెదిలారు. ప్రతి ఒక్కరి గుండెల్లోనూ ఆందోళన గూడుకట్టుకుంది.     ఈ పందెం ఎక్కడికి దారితీస్తుంది? ఎందర్ని బలితీసుకుంటుంది. ఎవర్ని ఏ ఒడ్డుకు విసుర్తుంది?                               *    *    *        "కైలాష్.......మనోహర్ వేట మొదలైంది. అతని ప్రతి పని రాకెట్ స్పీడ్ లో వుంటుంది. అతన సక్సెస్ అయ్యాడా  నా పరువు ప్రతిష్టలు మంటగలిసిపోతాయి. ఒకప్పుడు వర్క్ కోసం నా వెంట తిరిగిన మనోహర్ ఈనాడు నన్నే చాలెంజ్ చేసి బరిలోకి దూకాడు అతను గెలిస్తే మనమీ ఫీల్డ్ వదిలేసి వెళ్ళిపోవలసిందే.     ఈ విషయం అప్పుడే వైల్డ్ ఫైర్ ళా యాడ్ వరల్డ్ అంతా పాకిపోయింది. ఇవ్వాళ ఇతను, రేపు మరొకడు మనమీదకు కాలు దువ్వుతారు. చివరకు మన ఉనికికే ముప్పు వస్తుంది.     కనుక మనం అన్నిటికి సిద్ధపడాలి. ప్రపంచానికి తెలియకుండా మనోహర్ ని మనం అడుగడుగునా చావుదెబ్బ తీయాలి. కాని ఆ దెబ్బలు పోలీసు దెబ్బల్లా పైకి కనబడకూడదు. వాటికి ఆధారాలు దొరక్కూడదు.     ఆ చావు దెబ్బలతో మనోహర్ లో ఆత్మవిశ్వాసం  సడలిపోవాలి. అతన్ని వెన్నంటి వున్నవారికి గుండెల్లో రైళ్ళు పరిగెత్తించాలి. ఎంత డబ్బయినా ఖర్చుపెట్టు....." చెబుతూ, చెబుతూ, ఓ క్షణం ఆగి ఆరిన తన చేతిలోని పైప్ వంక చూసుకున్నాడు.     కైలాష్ గోల్డెన్ లైటర్ తో ప్రదీప్ పైవ్ వెలిగించాడు.     ఓసారి పైప్ నోట్లో పెట్టుకొని ఓ దమ్ము లాగి స్టయిల్ గా పొగ వదులుతూ "మనం చేసే పనులు ఏ మాత్రం బయటపడ్డా, యాడ్ వరల్డ్ లో మనమంటే భయం స్థానంలో అసహ్యం, మనోహర్ మీద సానుభూతి ఏర్పడే ప్రమాదం వుంది."     "ఓకే.....సార్.....మీరు చెప్పదల్చుకున్నది అర్ధమయింది....."భుజాలెగురవేస్తూ అన్నాడు కైలాష్.     మనోహర్ వేట నిష్ప్రయోజనం ఆ అమ్మాయి దొరకదు అతని టైమ్ అంతా తరంగిణిని వెతుకులాడటంతోనే వృధా అయిపోతుంది.     ఏప్రిల్ రెండవ వారంలో కోరమాండల్ కంపెనీ సోప్స్ వరల్డ్ మార్కెట్ లో లాంచింగ్ ప్రోగ్రామ్ ఫిక్సయిందని వ్యాస్ ఇంతకుముందే చెప్పాడు. ఆపాటికి......అంటే మార్చి ఆఖరుకు మనోహర్ యాడ్ ఫిల్మ్స్ అందించలేడు. దాన్నే మనం తెలివిగా ఉపయోగించుకోవాలి.     మన కోరమాండల్ సోప్స్ మీద నాలుగు యాడ్ ఫిల్మ్స్ తీయాలి. అనుకున్న టైంకి మనోహర్ ఫిల్మ్స్ అందించలేడు. దాంతో ఇంటర్నేషనల్ లెవెల్ లో లాంచింగ్ కి ఏర్పాట్లు చేసుకుంటున్న కోరమాండల్ కంపెనీ ఖంగుతింతుంది.     పబ్లిసిటీ మెటీరియల్ తయారుకాలేదని లాంచింగ్ ఆపితే అది వారి కంపెనీకే  అప్రదిష్ట. దాంతో వాళ్ళు క్రిటికల్ పొజిషన్ లో పడిపోతారు.     ప్రోడక్టు లాంచింగ్ ఆపితే ఒక నష్టం......ఆపకపోతే, ఏమాత్రం పబ్లిసిటీ జరగకపోవటం మూలాన ప్రోడక్టు పోయే అవకాశం వుండక, మరో రకంగా నష్టం ఎదుర్కోవాలి ఆ కంపెనీ.     అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో మనం షూట్ చేసిన ఫిల్మ్స్, తయారుచేసిన పబ్లిసిటీ మెటీరియల్ చూపిస్తాం.     గత్యంతరం లేని పరిస్థితిలో మన వర్క్ ని అంగీకరిస్తారు.     ఫార్మాలిటీస్ లేకుండా మన ఏజన్సీకి అపాయింట్ మెంట్ లేకుండానే  మనకు కోరమాండల్  కంపెనీ క్లెయింట్ అయిపోతుంది.     దాంతో  అటు మనోహర్ కి సమాధి, ఇటు మల్టీ నేషనల్ కంపెనీ, మన గుప్పెట్లోకి వస్తాయి. అర్ధమయిందా........." కైలాష్ శ్రద్ధగా వింటున్నాడో, లేదో గమనించి మరలా మొదలెట్టాడు ప్రదీప్.....     "వెంటనే నాలుగు  యాడ్ ఫిల్మ్స్ కి ఏర్పాట్లు ప్రారంభించు. మన మోడల్ కోఆర్టినేటర్స్ ని పిలిపించు. వేటకుక్కల్లా దేశంమీద పడమను ఫెంటాస్టిక్ ఫీచర్స్ వున్న అమ్మాయిల్ని పట్టుకోమను. వారికితోడు నలుగురు పాతవారిని కూడా సిద్ధం చేయమని చెప్పు.     కెమేరామన్ సిద్దిక్ ని కాంటాక్టు చేయి.     కాపీరైటర్ ని, విజువలైజర్ ని, మేకప్ మాన్ అందర్ని అప్రమత్తం చేయ్. లోకేషన్ సెలక్షన్ కోసం ఇద్దర్ని పంపించు, లోకేషన్ సెలెక్షన్ లో రాంభూపాల్ ఎక్స్ పర్ట్ అతన్ని పిలిపించు......."     "సార్.......అన్నీ సిద్ధం చేయగలను. కాని రాంభూపాల్ ని పట్టుకోవటం కష్టం. వారం రోజులుగా  అతను కనిపించటంలేదు......." నసుకుతూనే అన్నాడు కైలాష్.     ప్రదీప్ కి కోపం వచ్చింది ఆ మాటకు. కళ్ళద్దాలుతీసి కైలాష్ వైపు తీక్షణంగా చూసాడు.     కైలాష్ గజగజ వణికిపోయాడు.     "యూ.....ఇడియాట్......పదేండ్లనుంచి నా దగ్గర వర్క్ చేస్తున్నావ్ ఆ మాత్రం బుర్ర పనిచేయదా? సిటీలో ఎంతమంది మోడల్స్ వున్నారో చెక్ చేయ్. వాళ్ళు ఎక్కడెక్కడ వున్నారో తెలుసుకో. రాత్రుళ్ళు వాళ్ళతో ఎవరిదగ్గరో ఒకరి దగ్గర రాంభూపాల్ దొరుకుతాడు. ఏమాత్రం  ఆలస్యంచేయవద్దు" అంటూ ప్రదీప్ లేచాడు.     అర్ధమయినట్లుగా కైలాష్ ప్రదీప్ వెనుకే బయలుదేరాడు.     ప్రదీప్ దుర్మార్గాలన్నీ విజయవంతం అవుతున్నాయంటే అది కైలాష్ వల్లనే. కైలాష్ మహా క్రూరుడు.     ఏ మోడల్ ని ఎలా గుప్పెట్లోకి తెచ్చుకోవాలో, వార్ని ఎలా వాడుకోవాలో____వార్ని అడ్డం పెట్టుకొని బిజినెస్ ఎలా తెచ్చుకోవాలో బాగా తెలుసు. కైలాష్ పగ పాము పగ.     మనస్సు చంపుకొని, ఆత్మాభిమానాన్ని సమాధి చేసుకొని అతను చెప్పినట్టల్లా ఆడతారు అతని దుర్మార్గం తెలిసిన చాలామంది మోడల్స్.     చట్టానికి దొరక్కుండా మోడల్స్ ని చిత్రహింసలు పెట్టడంలో సుశిక్షితమైన అనుభవాన్ని పొందాడు ప్రదీప్ దగ్గర కైలాష్.     యాడ్ ఫిల్మ్స్ లో తమ అందాల్ని నగ్నంగా కెమేరా ముందుంచటానికి మనస్సును చంపుకొనే కొందరు మోడల్స్, ప్రదీప్ ఏజెన్సీకి బిజినెస్ తెచ్చిపెట్టడానికి పెద్ద పెద్ద  కంపెనీ డైరెక్టర్స్ పడకలపై కర్కశంగా నలిగిపోవాల్సిరావటం తీవ్రమైనా వేదనకు గురిచేస్తుంది.     అలా అని ఫీల్డ్ ని వదిలేద్దామన్నా ప్రదీప్ ఊరుకోడు. వెంటాడి. వెంటాడి వేధిస్తాడు, మోడల్స్ కుటుంబాలపై అతని విషపుచూపు పడుతుంది.     వీటికి తోడు మెరుపులా మరకల యాడ్ ప్రపంచాన్ని వదులుకో లేని బలహీనత ఒకప్రక్క సాలెగూడులాంటి యాడ్ వరల్డ్ లో సరుకుల్ని అమ్మిపెట్టే సరుకులు మోడల్స్! సమ్మోహితుల్ని చేసే సరుకులు మోడల్స్!! అసందర్భంగా అందాల్ని పరవాల్సిన సరుకులు మోడల్స్!!     అనుక్షణం ఛస్తూ, బ్రతుకుతూ-బ్రతుకుతూ ఛస్తూ, ఆ చావు బ్రతుకుల సందిలో సుఖాన్ని, భోగలాలసను, కీర్తిప్రతిష్టలను, ధనాన్ని చూసి ఆశగా పరిగెత్తే మోడల్స్-అందమైన మోడల్స్ మరీ మరీ అందంగా దోచుకోబడుతుంటారు.     మెట్లు దిగుతూ ఓ క్షణం ఆగి వెనుతిరిగి కైలాష్ వైపు చూస్తూ "మధుర కంపెనీ యాడ్ ఫిల్మ్ వర్క్ ఈ రోజు పూర్తిచేయాలి. మోడల్ మాయాడిసౌజా ఈపాటికి వచ్చేవుంటుంది. ఆమెతో జాగ్రత్తగా మసులుకొండి. పనిలోపని సాయంత్రం నాలుగు గంటలకి రోమాకౌర్ వర్క్ ఫినిష్ చేయాలి.....అర్ధమైందా.....?" అంటూ కారెక్కాడు ప్రదీప్.     కారు డోర్ మూస్తూ చిరునవ్వు నవ్వాడు కైలాష్. ఆ నవ్వులో చిందిన విషం ఎవర్నో ఒకర్ని కాటేయక మానదు.                                                                          *    *    *     మార్చి ఐదున ఉదయం ఏడుగంటలకు ఫ్యారిస్ ఎయిర్ పోర్ట్ లో దిగాడు మనోహర్.     కస్టమ్స్ ఫార్మాలిటీస్ పూర్తిచేసుకొని బయటపడేసరికి ఎనిమిదయి పోయింది. వెంటనే ఎయిర్ పోర్టు బయటకొచ్చి టాక్సీ ఎక్కి లారెంట్ అడ్రస్సు చెప్పాడు. టాక్సీ టారెంట్ ఇంటివైపు రివ్వున దూసుకు పోతోంది. గడిచిపోతున్న ఒక్కొక్క క్షణం మనోహర్ లో అసహనాన్ని పెంచుతూ పోతోంది.     కారు లారెంట్ కాంప్లెక్స్ ముందు ఆగగానే బుల్లెట్ లా లోపలికి వెళ్ళిపోయాడు. సమయానికి లారెంట్ ఆఫీసులోనే వున్నాడు.     "ఏమిటి హడావుడి మనోహర్.......?" పైప్ పీలుస్తూ ప్రశ్నించాడు టారెంట్.     టూకీగా జరిగినదంతా చెప్పాడు మనోహర్.     "చాలా థ్రిల్లింగ్ గా వుంది నీ ప్రాజెక్టు. ఇందులో నువ్వు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. కాస్ట్యూమ్స్ నన్ను తయారుచేయమన్నావ్! చార్జీ......ఎంత వుద్దనుకుంటున్నావ్......?" తమాషాగా అడుగుతూ ప్రక్కనే వున్న బాయ్ కి సైగ చేశాడు.     "నేను చేస్తూన్న కేంపైన్ ఓ మల్టీ నేషనల్ కంపెనీ తయారు చేస్తూన్న సోప్స్ మీద. మీ చార్జీ భరించగలను ఎందుకంటే వా క్లయింట్ నాకు ఆఫర్ చేస్తున్నా ఎమౌంట్ వెరీ ఎట్రాక్టివ్....."టారెంట్ తో మాట్లాడుతూనే ఆ మహానగరంలో తరంగిణిని పట్టుకొనే దారులకోసం తీవ్రంగా ఆలోచిస్తున్నారు.     "ఓ.కె......నువ్వు వెళ్ళేలోపే తయారుచేసి ఇస్తాను. బైదిబై నీ పేరుమీద, తరంగిణి పేరుమీద ఈ రోజు సాయంత్రమే స్విస్ ఎయిర్ లో టిక్కెట్స్ రిజర్వ్ చేయించాను....."     "థాంక్యూసర్....నాకు ఒకర్ని తోడిస్తే ఆమె అడ్రస్సు కనుక్కొనే ప్రయత్నం ప్రారంభిస్తాను" మనోహర్ లో ఆతృత, ఆరాటం క్షణక్షణానికి పెరిగిపోతున్నాయి.
24,590
    "మతి లేకుండా మాట్లాడకు. పడుకో చాలా రాత్రయింది".     "అవును మతిలేదు. చిన్నప్పుడు కూడా ఇంతే. స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఇల్లంతా నిశ్శబ్దంగా వుండేది. మతిపోయేది".     అతడా పిల్ల దగ్గరగా వెళ్ళి తల మీద చెయ్యి వేసి, "నిద్రపో" అన్నాడు బుజ్జగిస్తున్నట్టు. అతడి చెయ్యి మొహానికి దగ్గిరగా తీసుకుని ఆ అమ్మాయి కళ్ళు మూసుకుంది. చేతికి తడి తగిలింది. అతడామె తలనిమురుతూ వుండిపోయాడు. అతడికి అకస్మాత్తుగా ఒక వెలుగురేఖ చీకట్లోంచి బయల్వెడలినట్టు అనిపించింది. విశ్లేషిస్తే యీ ప్రపంచంలో ఎవరూ చెడ్డవారుకారు. విశ్లేషిస్తే యీ ప్రపంచంలో బాధలు లేనివారెవరూలేరు. విశ్లేషిస్తే యీ మనుషులంతా ఆప్యాయతకోసం అలమటిస్తున్నవారే. విశ్లేషించే దెవరు? వివరించి చెప్ప గలిగేదెవరు? అందరికన్నా పెద్ద రచయిత భగవంతుడే...     జీవితంలో నిజమైన విషాదం ద్వేషించడంకూడా కాదు. నిజమైన విషాదం ప్రేమించలేకపోవటం! ద్వేషించటంలో కూడా కొంత పట్టుదల, కార్యసాధన కూడా వుండొచ్చు. కానీ ప్రేమించలేకపోవటంలో అట్లాసమాధాన పడేందుకేమీ లేదు. "నా కొరకు చెమ్మగిలిన నయనమ్ములేదు...." కంటే విషాదకరమైన గీతం ఏముంది?     ...ష్యామా నిద్రపోయింది. ఆమెతో యీ కథ ప్రారంభమైంది. ఆమెతో ఆఖరవబోతూంది అవుతుందా? ఏమో.. అతడు బయటకు వచ్చాడు. జి.కె. అతడి కోసం హాల్లో ఎదురు చూస్తున్నాడు. మనిషి భయపడుతున్నాడు. కానీ బింకంగా వున్నాడు.     "..జి.కె.. చాలా సంవత్సరాల తరువాత నిన్ను పేరుపెట్టి పిలుస్తున్నాను. మన గడువు కాలం పూర్తయింది కాబట్టి నువ్వు నన్ను చంపాలని చూసేవు. వంకచెక్కారామ్మూర్తితో చివరిరోజుల్లో చేతులు కలిపావు. అయినా నిన్ను క్షమిస్తాను. ఎందుకంటే- నా తల్లిని నువ్వు చూపించబోతున్నావు కనుక..."     జి.కె. దానికి వెంటనే జవాబు చెప్పలేదు.     "ఏది నా తల్లి?"     జి.కె. వేళ్ళు వణుకుతున్నాయి. అతడు భయస్తుడుకాడు. కానీ ఆ పరిస్థితిలో ఎదుటి వ్యక్తి ఆకారం ఎవర్నయినా భయపెట్టేట్టువుంది. "నా తల్లెవరో నీకు తెలీదని నువ్వీ క్షణం నాకు చెప్పబోవటం లేదు... అవునా! అలా చెప్పిన మరుక్షణం..."     "లేదు, లేదు అలా చెప్పటంలేదు" అతడి మాటలని కట్ చేస్తూ అన్నాడు.     "మరి?"     జి.కె. ధైర్యాన్ని కూడగట్టేసుకుని అన్నాడు... "తల్లిని నీకు వప్పచెప్పటానికి మన మధ్య కొన్ని సంవత్సరాల అగ్రిమెంటుంది".     "ఔను. వుంది, నిన్నటితో అది తీరిపోయింది"     "కానీ చివరిరోజుల్లో నువ్వు నన్ను విడిచి వెళ్ళిపోయావు".     అతడు అనుమానంగా చూశాడు.     "అలా... అలా విడిచి వున్నన్ని రోజులు నువ్వు నా దగ్గిర ఇంకా పని చెయ్యాలి".     జి.కె. మాటలు పూర్తికాలేదు. అతడు జి.కె. కాలరు పుచ్చుకుని విసురుగా లాగాడు. "నేను విడిచి వున్నానా? చివరి రోజుల్లో నన్ను చంపించటానికి నువ్వు వేసిన ప్లాన్ కదూ ఇది! నీ నుంచి విడిపోయాక నీకు నేను బలమైన శత్రువుని అవుతానని కదూ నువ్వెళ్ళి రామ్మూర్తితో చేతులు కలిపింది! ఇప్పుడిదంతా నా తప్పుగా, నా మీదకు తోసేస్తావా? నిన్నింకా బ్రతకనివ్వటం నాదే తప్పు. కేవలం నా తల్లి రహస్యం నీకు తప్ప ఇంకెవరికీ తెలియదనే ఉద్దేశ్యంతో నిన్ను ఇన్నాళ్ళూ వదిలిపెడుతూవచ్చాను. ఇప్పుడిక బ్రతకనివ్వను. నా తల్లి గురించి నాకు శాశ్వతంగా తెలియకపోయినా సరే- నిన్ను చంపేస్తాను".     "ఆగు" గింజుకుంటూ అన్నాడు జి.కె. "పోనీ ఇంకొక మార్గం చెపుతాను".     "నీ కిక 'మార్గాలు' చెప్పే హక్కు లేదు జి.కె. ఆ అవకాశాలన్నీ ఎప్పుడో పోగొట్టుకున్నావు."     "ఇది నా ఆలోచన కాదు. దీని వెనుక వున్నది నేను కాదు".     అతడు చెయ్యి వదిలేసి "మరి?" అన్నాడు.     "వంకచెక్కా రామ్మూర్తి"     "అతడూ, నువ్వూ ఇద్దరూ ఒకటే! చెప్పు మీకేం కావాలి?" ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుంటూ అడిగాడు.     "జానకిరాముడు నీ మనిషి. నువ్వేంచెపితే అది చేస్తున్నాడు. మారిన పార్లమెంటరీ సిస్టమ్ లో దేశానికి అత్యున్నతాధికారి ప్రెసిడెంటు! అతడిని మాకు పరిచయం చేయాలి".     "ఏ విధమైన పరిచయం?" అనుమానంగా చూసేడు.     "నీ ద్వారా వెళితే ఏ విధమైన పరిచయమైనా ఫరవాలేదు"     ""నేనేం చెప్పినా జానకిరాముడు వింటాడు. ఇంకో రకంగా చెప్పాలంటే నా ద్వారా వెళ్ళిన మీకు జానకిరాముడి దగ్గిర అంతులేని పలుకుబడి లభిస్తుంది. మారిన యీ రాజకీయ సిస్టమ్ లో ప్రెసిడెంట్ తల్చుకుంటే చేయలేనిదేమీలేదు. అతడి ప్రాపకం మీకుంటే, దేశంలో మీ పలుకుబడి అంతులేనంతగా పెరిగిపోతుంది. నా తల్లిని నాకు వప్పచెప్పటానికి మీరుకోరే ఆఖరికోరిక- యీ దేశాన్ని మీకు వప్పచెప్పమని. ఔనా?"     "అంతంత పెద్దమాట లెందుకు?"     "పెద్దవయినా, చిన్నవయినా ఆ మాటల కర్థం అదే" అతడు లేచాడు. "సారీ. నేనాపని చేయలేను. నా స్వార్థంకోసం మీకు జానకిరాముడిని అప్పగించలేను. పోతే నన్నుమోసం చేసి ఇన్నాళ్ళు నాతో పనిచేయించుకున్నందుకు గానూ నేన్నిన్ను చంపబోతున్నాను. మామూలుగా కాదు- చిత్రహింసచేసి..." అని, జి.కె. ఏదో అనబోతూవుండగా కాలరువదిలేసి అక్కడ్నుంచి విసురుగా బయటకు నడిచాడు.     అతడి మనసంతా వికలమయింది.     ఒక అద్దాల మేడని అయిదంతస్తులు కట్టి- అంతా పూర్తయ్యాక రాయి విసిరి బ్రద్దలుకొట్టినట్టు వుంది. విరిగిన గాజుముక్కల్లా చెల్లాచెదురయిన ఊహల భవిష్యత్తు... మనసుకు సేదతీర్చే చోటు కోసం తపన...     అతడు సుమతి దగ్గిరకి వెళ్ళి జరిగినదంతా చెప్పాడు. అయితే, ఆమె విస్మయాన్ని ప్రకటించలేదు. "ఇలాటి దేదో జరుగుతుందని నేను అనుకుంటూనే వున్నాను" అంది క్లుప్తంగా.     "అంటే నా తల్లి గురించి అతడికి తెలీదా?"     "తెలిసి వుండవచ్చు కానీ అంత సులభంగా చెపుతాడనుకోలేదు. ఇప్పుడదే జరిగింది చూడు".     "నాది అత్యాశ అంటావా? ఇదంతా మూర్ఖత్వంలా కనబడుతోందా?"     "ప్రతీ మనిషికీ, ఏదో ఒకరకమైన అబ్సెషన్ వుంటుందని నువ్వేగా ఎప్పుడూ అంటూ వుంటావ్".
24,591
     'రిజర్వేషన్ లు' అనబడే ఈ కేటాయింపులు పది సంవత్సరాలపాటుంటే చాలు - అట్టడుగు  వర్గాలన్నీ పాలమీద మీగడలాగా అభివృద్ది పథంలో పైకి వచ్చేస్తాయని, అందరూ ఒకే స్థాయిలో వుండి సమసమాజ స్థాపన జరుగుతుందని గాఢంగా విశ్వసించారు. అగ్రవర్ణాలుగా చక్రాంతికాలు, ముద్రాంకితాలు పడ్డవారు కూడా  "అయ్యో..... మన తాత,  ముత్తాతలు ఈ వర్గాలను నానా బాధలు పెట్టారు. ఈ చర్యతో ఆ పాపానికి పరిహారం అవుతోంది. నవసమాజం ఏర్పడుతోంది" అని భావించి మనస్పూర్తిగా  ఒప్పుకున్నారు.     పది సంవత్సరాలు గడిచిపోయాయి.     బడుగు వర్గాల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడేనన్నట్లుగా వుండిపోయింది. ఈ పరిస్థితిలో ప్రత్యేక కేటాయింపులు మరో పది సంవత్సరాలు పొడిగించారు.     'మేధావులు' అని అనిపించుకునే కొందరు "ఇలా  పొడిగించుకుంటూ పోవడం వల్ల ప్రయోజనం లేదు. వారు పైకి రావాలంటే ముఖ్యంగా చేయవలసింది.... వారిని విద్యావంతులుగా చేయడం!" అని చెవికింద ఒకటే రొద పెట్టసాగారు.      పాలకులలో పెద్దలు, ప్రముఖులు రహస్య సమావేశాలు, మంతనాలు జరపసాగారు. "నిజంగా ఈ అట్టడుగు వర్గాలవారిని  విద్యావంతులుగా చేస్తే కొంపలు అంటకుపోతాయి.  ఇప్పుడైతే తాము చెప్పినట్లు చేస్తున్నారు. తమకే ఓట్లు వేస్తున్నారు. తమ అధికారం ఢోకా లేకుండా సాగిపోతోంది. వాళ్లు విద్యావంతులైతే సొంతంగా ఆలోచిస్తారు. సక్రమ పరిపాలనను అందించగలదనుకున్న పార్టీకే ఓట్లు వేస్తారు. అదే జరిగితే తమ అధికార పీఠం దద్దరిల్లుతుంది!"...ఈ ఆలోచన రాగానే వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి.      మరి... మేధావులు గోల చేయకుండా వారిని జోలపాడి పడుకోపెట్టడం ఎలా?     "పీడిత, తాడిత, బడుగువర్గాల వారినందర్నీ అక్షరాస్యులను చేసేస్తాం!" అని ప్రకటించారు.      "అక్షరాస్యతా ఉద్యమాన్ని ముమ్మరం చేస్తాం...!" అన్నారు.      "విద్యయే వెలుగు. అక్షరాలు నేర్వండి.. సంతకాలు చేయండి!' వంటి నినాదాలను గోడల మీద రాయించారు.     పత్రికల్లో ప్రకటనలు గుప్పించారు.     "అందరికీ చదువు" అంటూ ఊరేగింపులూ, ర్యాలీలూ, జాతరలూ నిర్వహించారు. వేషాలు వేయించి నాటకాలు వేయించారు.      నటవరులు, కళాకారులు తమ బత్తేలు పుచ్చుకొని వెళ్ళిపోయారు. బడుగు గొంగళి మాత్రం వేసిన చోటనే వుంది.     రాత్రి పాఠశాలలు తెరిచారు..., 'వయోజన విద్య' అన్నారు. నానా హడావుడీ చేశారు. వీటి ధర్మమా.. .అని ఎందరో బాగుపడ్డారు. నాలుగు రాళ్లు వెనకేసుకున్నారు.     పథకాలన్నీ పేపర్లకే పరిమితం అయ్యేట్లు, ఆచరణలో అతి తక్కువగా వుండేటట్లు జాగ్రత్త పడ్డారు పాలకులు.  అర్ద గణాంక శాఖ వారిని అర్దించీ, ఆదేశించీ ఆక్షరాస్యుల సంఖ్యను వామన రూపంగా విస్తరింపజేస్తూ అంకెల వర్షాన్ని కురిపించసాగారు.      ఇంతచేసినా  నిరక్షరాస్యత మాత్రం.... 'నేను సమేమిరా కదలను' అంటూ భీష్మించుకుని బైఠాయింపు సమ్మె చేయసాగింది. కాకపోతే.... అట్టడుగు వర్గాలలో కొందరు పైకి, మరికొందరు మరీ పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేయలేదు. పైగా... వారితో కలిసి తిరిగితే తామేదో మైలపడిపోతామన్నట్లు తప్పించుకు  తిరిగి ధన్యులయ్యారు.      ఇంకా అన్యాయమేమిటంటే తాము ఎంత వున్నతంగా వున్నా తమ సంతానానికి  కూడా అట్టడుగు వర్గాలవారికి  లభిస్తున్న రాయితీలు వుండి తీరాల్సిందేనని పట్టుపట్టారు. వీరందరినీ సంతృప్తి పరచేందుకు కేటాయింపులు, సౌకర్యాలు, రాయితీలు మరో పదేళ్లు,  ఇంకో పదేళ్లు కాకుండా  శాశ్వతం చేసేస్తామని హామీలు పోటీలుపడి  గుప్పించసాగారు నాయకులు.      అదివిని, "ఇదేమిటయ్యా... వారిని శాశ్వతంగా వెనుకబడే వుండేటట్లు చేస్తారా?" అని అడిగితే -  వారిని 'జాతీయ వ్యతిరేకులు, విదేశీ హస్త గ్రహకులూ' అని నిందించసాగారు.      ఇదిలా వుండగా... ఒకసారి అధికారంలో వున్న  ప్రభుత్వానికి  అంతర్గత తగాదాలవల్ల పతనమయ్యే ప్రమాదం ఏర్పడింది.     ఈ గండం గడవడానికి  ప్రధాని 'వీరకేసరి' - దేశంలో వెనుకబడ్డ కులాలు, జాతులు కాకుండా వెనుకబడ్డ వర్గాలు కూడా వున్నాయని, వీరికి ముప్పయిశాతం కేటాయింపులు ఇస్తున్నానని మబ్బులేని  పిడుగులాగా  జనం మీద ఒక బాంబుని వదిలారు.     దాంతో దేశంలో కొన్నివారాలపాటు ఆగని  హింస చెలరేగింది. ఎందరో ఆత్మాహుతి చేసుకున్నారు.      ఈలోగా వ్యవహారం న్యాయస్థానానికి వెళ్లింది.       సర్వోన్నత న్యాయస్థానం  - కేటాయింపులు వివిధ వర్గాలకు వుండవచ్చుననీ, అయితే ఇవి అన్నీ కలిసి యాభై శాతం మించకూడదని తీర్పు ఇచ్చింది. అధికారంలో వున్న ప్రభుత్వలం బ్రతుకుజీవుడా .. అని ఊపిరి పీల్చుకుని, ఈ నిర్ణయాన్ని దేశమంతటా చకచకా అమలు చేయసాగింది.     కొన్ని రాష్ట్రాలవారు - తమ రాష్ట్రంలో వెనుకబడ్డవారు మరీ ఎక్కువగా వున్నారని, అందువల్ల  కేటాయింపులు యాభై శాతం మించే వుండాలని డిమాండ్ చేయసాగారు.      కొందరు డెబ్బై, ఇంకొందరు ఎనబై శాతం... ఇలా పెంచేస్తూ రాజ్యాంగాన్ని మార్పించుకోసాగారు.     ఇవన్నీ ఓట్లకోసం పడే పాట్లని కిట్టనివాళ్లు చెవులు కొరుక్కోసాగారు.                                *    *    *    *    *         శాపగ్రస్తులైన పరమానందయ్యగారి శిష్యులు వివిధ వెనుకబడ్డ వర్గాలలో జన్మించారు.      ఎప్పుడైతే కమండలంగారు దారి చూపించారో వివిధ చిల్లర మల్లర ఉపవర్గాలవారు తమకి కూడా వెనుకబడ్డ వర్గాలవారి హోదా ఇయ్యాలని..., ఆ విధంగా రాజ్యాంగపరమైన చక్రాంకితాలు వేయాలని పట్టు పట్టసాగారు.     అదను చూసి ఆర్యావర్తం నుంచి ముని భీముడు ఊడిపడ్డాడు.     "నేను దళిత జనోద్దరణకు వచ్చిన అవతార పరుషుడిని - కారణజన్ముడిని!" అంటూ దేశం అంతటినీ ప్రభంజనంలాగా చుట్టి రాసాగాడు.     'పాత రోత - కొత్త వింత' అన్నట్లు ముని భీముని వైపు ఎగబడసాగారు జనం.      ఇది చూసేసరికి అధికార పీఠాన్ని ముని భీముని వైపు ఎగబడసాగారు జనం.      ఇది చూసేసరికి అధికార  పీఠాన్ని అధిష్టించిన పాలకుల గుండెలు బేజారెత్తాయి. స్వజనంలో కొందరు మండూక నృత్యం నేర్చుకుని అటువైపు కప్పగంతులు వేయసాగారు.అధికార పీఠం క్రింద భూకంపం వస్తున్నట్లు, పీఠం బీటలు వారుతున్నట్లు సంకేతాలు రాసాగాయి. వెంటనే వెనుకబడ్డ వారి మీద ప్రేమామృత వర్షాన్ని జడివానలా కురిపించడ మొక్కటే మార్గం అనిపించింది.
24,592
    మరో నాలుగు నెలలకి కాబోలు రూపకు మాత్రం సులోచన లెటర్ రాసింది తను నెల తప్పినట్లు.          రూపకే ఎందుకు ఉత్తరం రాసిందో ఊహించు" అంటూ ముగించింది అర్చన.          సూర్యాదేవికి కూడా నవ్వాగలేదు.    "ఇతరుల తెలివితో బాగుపడడమంటే అదే మరి" అర్చన నవ్వును ఆపుకుంటూ అంది.          "మరి నువ్వూ చాలా తెలివైన పిల్లవిగదా, ఇలాంటి పరిస్థితులు ఎదురైతే నువ్వేం చేస్తావో చెప్పు. ఇలాంటి క్రిటికల్ పొజిషన్ లో నువ్వెప్పుడైనా చిక్కుకున్నావా?"          "నిజానికి నేను యెదుర్కొన్న కష్టాలు అతి భయంకరమైనవి. ఇప్పుడంటే ఏదో సర్దుకున్నాం గానీ మూడేళ్ళ ముందు అన్నీ ఒక్కసారి చుట్టుముట్టేశాయి. ఒంటరిగా అన్నిటినీ ఎదుర్కొన్నాను. సునీల్ ఒక్కడే నాకు అప్పుడు చేదోడు వాదోడుగా వున్నాడు" అని శూన్యంలోకి చూస్తోంది అర్చన.          "సునీల్ ఎవరే? నీ భర్త పేరు మహేష్ కదా"          "సునీల్ ఎవరని అడక్కు? అది నా శీలానికి సంబంధించిన విషయం" అని నవ్విందామె.          "ఫరవాలేదులేవే చెప్పు"          "అయితే చెప్పాల్సిందేనా! కాఫీ చెప్పు. కాఫీ తాగాక చెబుతాను. తరువాత నువ్వు ఎవరికీ చెప్పనని ప్రామిస్ చేయాలి- చివరికి నీ భర్తకి కూడా"          "అలానేలేవే" అని సూర్యాదేవి ఆమె చేతిలో చెయ్యివెసిఉ ఒట్టు పెడుతున్నట్లు గిల్లింది.          కాఫీ తాగుతూ అర్చన ప్రారంభించింది.          "ఫ్రీ స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసి స్వంతంగా స్కూలు పెట్టుకోవాలనే గట్టి ఆశయంతో యూనివర్శిటీలో చేరాను. అప్పటికింకా యూనివర్శిటీ పూర్తి స్థాయిలో డెవలప్ కాలేదు. తుప్పలు, చెట్లతో నిండిపోయి వుండేది. వెన్నెల రోజు భోజనాలు చేశాక అలా బయట కొచ్చి గేటు దగ్గరికి నడిచేవాళ్ళం.          నిజం చెప్పద్దూ- ఆ వెన్నెల్లో అవయవాలన్నీ ఏదో కావాలని ఆరాటపడేవి పదేళ్ళుగా జోకొడుతున్న యవ్వనం ఒక్కసారిగా పడగ విప్పేది.          'అబ్బా చలి' అనే మిషతో కప్పుకున్న శాలువను మరింతగా నొక్కుకున్నా ఎద మరింతగా పొంగి, తీయగా సలిపేది తప్ప ఊరుకునేది కాదు.          ఎప్పుడైనా హాలిడే రోజు షాపింగ్ కి బయల్దేరే వాళ్ళం. బస్టాండులో నిలుచుండే అబ్బాయిలు ఏవేవో కామెంట్లు చేసేవాళ్ళు. 'అదిగో మధ్యలో నిలుచున్న అమ్మాయే' అని మాట వినిపించేట్లు అనేవాళ్ళు. విషయం ఏమీ వుండేది కాదు. అలా అంటే మేం కంగారుపడిపోతామని ఏడిపించేవాళ్ళు.          అసలు విషయం తెలిసిపోయాక మేమూ 'అదిగో - ఆ నల్ల షర్టు అబ్బాయే' అని బిగ్గరగా అని, మిగిలినదంతా ఏదో వినకూడదన్నట్లు గుసగుసలు పోయేవాళ్ళం. పాపం నల్లషర్టు అబ్బాయి విషయం ఏమిటో అడగలేక గింజుకు పోయేవాడు. మేమూ ఇలా రిటార్డ్ ప్రారంభించాక అబబయిలు తోక ముడిచే వాళ్ళు.          ఊర్లో కూడా ఇంతే. బావికి నీళ్ళకు వెళ్ళినప్పుడో, సాయంకాలం ఇంటి ముందు నీళ్ళు చల్లి, ముగ్గు పెడుతున్నప్పుడో అబ్బాయిలు తమ చూపుల్ని జాకెట్ల లోయలోకి గాలంలా దించేవాళ్ళు. కళ్ళల్లోకి హూస్తూ చూపులతో ప్రేమలేఖలు రాసేవాళ్ళు.          ఇలా ఒక్కసారిగా మగతోడు కోసం మనసు వెంపర్లాడడం ప్రారంభించింది.          అదిగో ఇలాంటి సమయంలోనే మహేష్ సంబంధం వచ్చింది.          మహేష్ ది చిత్తూరు దగ్గర పల్లెటూరు, ఒక్కడే కొడుకు వ్యవసాయం బాగానే వుంది. బి.ఏ. వరకూ చదువుకున్నాడు. అన్ని విధాలా మంచి సంబంధం అని మధ్యవర్తులు చెప్పడంతో నాన్న, అన్నయ్యలు సరేనన్నారు. మా పెళ్ళి వైభవంగా జరిగిపోయింది. మూడు రాత్రులు ముచ్చట్లు అయ్యాక నేను అత్తవారింటికి కాపురానికి వెళ్ళాను.          ఏ బలహీనతా లేని మనిషంటూ ఎవరూ వుండరనుకుంటా. ఈ బలహీనత మనిషిని ఏ స్థాయికి దిగజారుస్తుందో మహేష్ మంచి ఉదాహరణ.          ఆయనకీ టాక్సీ పిచ్చి స్వంతంగా కారుకొని, టాక్సీగా తిప్పాలని ఆయన ఆరాటం.          నాతో పెళ్ళయ్యేటప్పటికే రెండు మూడు కార్లుకొని అమ్మేశాడు. ఆ అమ్మకాల్లో చాలా నష్టం వచ్చింది. అదంతా తెలిసి వార్న్ చేశాను.          "ఎందుకండీ ఈ టాక్సీల గొడవ? ఎంచక్కా వ్యవసాయం చేసుకుందాము నేనూ చిన్న స్కూలు ప్రారంభిస్తాను బ్రహ్మాండంగా బతికేయొచ్చు" అన్నాను.              "అలా అనకు స్వంతంగా కారుంటే ఎంత బావుంటుందను కున్నావు. ఎంచక్కా టాక్సీగా టౌన్లో తిప్పచ్చు. ఎన్ని ఖర్చులు పోయినా నెలకు అయిదారువేల దాకా మిగులుతుంది. పండగలకీ, పబ్బాలకీ మీ ఊరికి కార్లో పోవచ్చు. కారులో వెళితే నేత దర్జాగా వుంటుందో ఊహించు" అన్నాడు మహేష్.          ఈపిచ్చి అంతత్వరగా తగ్గదని నాకు తెలిసిపోయింది. నేను గర్భవతిని కావడంతో స్కూలు అటకెక్కేసింది. ఆయన పదెకరాల పొలం అమ్మేశాడు. పాత అప్పులు తీర్చి కొత్త కారొకటి కొని టౌన్లో టాక్సీ కింద తిప్పటం మొదలుపెట్టాడు.          నేను మగపిల్లాడ్ని కన్నాను. ఏమైందో ఏమోగానీ ఆయన కారులో ఏం సంపాదించకపోగా చాలా నష్టపోయారు. కారు అమ్మేశారు. పొలము కూడా లేకపోవడంతో మాకు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఇల్లు గడవడానికే ఎంతో ఇబ్బందులు పడాల్సి వచ్చేది.          మహేష్ కి దగ్గర బంధువర్గమంతా తిరుపతికి దగ్గర్లోని ఓ పల్లెటూరులో వుంది. అతని చిన్నాన్నలు, మామలూ చాలా మందే వున్నారు ఆ ఊర్లో.              ఓసారి అక్కడికి వెళ్ళివచ్చి "మనం ఫ్యామిలీని ఆ వూరికి మార్చేద్దాము. చక్కటి వూరు. టౌన్ కి చాలా దగ్గర. మా మామ ఓ అయిదెకరాల పొలాన్ని కూడా లీజుకు చూశాడు ఇప్పుడు కొత్తగా వరిరకం వచ్చిందట. ఆ వూరి క్లయిమేట్ కి ఆ పంట బాగా పడుతుందట. అదీ కాక మెకానిక్ ల షెడ్లు కూడా చాలా దగ్గర. అక్కడ మెకానిక్ షెడ్లు కూడా చాలా వున్నాయి. ఎప్పుడో ఒకప్పుడు చీప్ గా కారు కూడా దొరకకపోదు. ఆ కారు కొని టాక్సీగా..." అని అంటూ వుండగా నాకు కోపం తన్నుకొచ్చింది.          "టాక్సీల గొడవ ఇంతటితోనయినా ఆపండి. ఇక్కడంతా లాన్ అయిపోయి, పరాయి ఊరికి పోతున్నా టాక్సీ పిచ్చి మీకు వదలనట్లుంది. ఏదో హాయిగా వ్యవసాయం చేసుకుందాం" అన్నాను.          అలా ఆ వూరికి షిఫ్ట్ అయిపోయాం. నిజంగా ఆ వూరు చాలా బావుంది. ఇరవై ఇళ్ళదాకా బంధువుల ఇళ్ళున్నాయి. టౌన్ దగ్గర, మా బంధువుల్లో ఒకాయన లెక్చరర్ గా వెళ్ళిపోతే ఆ ఇల్లు మేం తీసుకున్నాం.          చిన్న గుడిసె, దాని కెదురుగ్గా, ఓ పెద్ద అడ్డాపిల్లు చిన్న గుడిసెను బెడ్ రూమ్ కింద అరేంజ్ చేసుకున్నాను. ఇక వంటంతా అడ్డాపింట్లో ప్రారంభించాను.          లీజుకు తీసుకున్న అయిదెకరాల్లో వరి వేశాం. దీనికంతా పెట్టుబడి పెట్టింది మహేష్ మావయ్య.          మేం ఊరెళ్ళిన రెండోరోజుకో మూడోరోజుకో సునీల్ పరిచయమయ్యాడు.          అప్పుడే అతను ఎం.ఏ. పూర్తి చేశాడు. స్వంతంగా వ్యవసాయం చూసుకుంటున్నాడు. ఓరోజు మధ్యాహ్నం మా ఇంటికి వచ్చాడు.   
24,593
    ప్రజ్ఞ అతని వంక  అసహ్యంగా  చూసింది. వయసుతో  నిమిత్తం లేకుండా  అతని  దృఢత్వము, బుద్ధి, నీచత్వం  భరించలేనంత  జుగుప్సని  కలిగిస్తున్నాయి.     బాటిల్ లోకి  ఎక్కే  రక్తం  క్రమక్రమంగా  పెరుగుతోంది. ఫిఫ్టీ సి.సి., సెవెంటీ ఫైవ్, హండ్రెడ్...     జగదీష్  గది తలుపులు  తెరిచి  ఉపజ్ఞను  చెయ్యి  పట్టుకుని  ఇవతలకు  లాగాడు.     "అమ్మా! అమ్మా!" అని అరుస్తూ  ఉపజ్ఞ  తలవైపు  రాబోయింది. కాని  అతని ఉక్కు  చేతులనుంచి  కొంచెమైనా  విడిపించుకోలేక పోయింది.     వికటంగా  నవ్వుతూ  జగదీష్  ఆమెను తనవైపు  లాక్కుంటున్నాడు.     ఎన్నో ఏళ్ళ అనుభవంతో  బలిసి, పులిసివున్న  అతని శరీరంలోని  సర్వాయవాలూ  ఆమెను  పీల్చి పిప్పి  చెయ్యటానికి  సమాయుత్తమవుతున్నాయి.     "అమ్మా ! అమ్మా !" అని అరుస్తోంది ఉపజ్ఞ.     హండ్రెడ్ సి.సి., వన్ ఫిఫ్టీ, టూ హండ్రెడ్ ...     ప్రజ్ఞ శరీరంలో  బయటకు  రాకుండా  వుండిపోయిన  రక్తం  సలసల మరుగుతోంది. ఆమె కాళ్ళూ, చేతులూ  విదిలించుకోటానికి  విశ్వప్రయత్నం చేసింది. ఎక్కడికక్కడ  ప్లాస్టర్స్  బలంగా  అంటించి వున్నాయి. ఎంత శక్తి  నుపయోగించినా  అంగుళమైనా  కదల్చలేకపోయింది.     ఇంతలో  ఆమె దృష్టి  స్టూల్  మీద రక్తం  ఎక్కుతోన్న  బాటిల్ ప్రక్కనే ఉన్న  వెడల్పాటి  సీసా  మీద  పడింది.     అందులో  వున్న  పౌడర్ ని  అతి తేలిగ్గా  గుర్తుపట్టగలిగింది.     నికోటిన్.     సో జగదీష్  సర్వసన్నాహాలతో  వున్నాడు.     ఆమె సర్వశక్తులూ  వినియోగించి  బంధనాలనుంచి  బయటపడాలని  ప్రయత్నం చేస్తోంది.     ప్రయోజనం  లేదు.     టూ  హండ్రెడ్  అండ్  ఫిఫ్టి.     కళ్ళు  చీకట్లు  క్రమ్ముతున్నాయి.     "అమ్మా ! అమ్మా !" అని ఉపజ్ఞ  ఆర్తనాదాలు  చేస్తోంది.     అలుముకు వస్తోన్న  ఆ చీకట్లలో  ఏవేవో  దృశ్యాలు.     ఉపజ్ఞ  నేలమీద  పడిపోయినట్లు, జగదీష్  ఆమె మీద వాలిపోతున్నట్లు ...     అయ్యో ! ఏమిటిది ? అనుకున్నవన్నీ  ఒకటొకటిగా  సాధించి, జీవిత లక్ష్యాన్ని  ఛేదించాక  ఈ దశలో  ఈ భయంకరమైన  మలుపేమిటి ?     "జగదీష్ ! నా శరీరంలో  ఒక్క ...ఒక్క ...చేతిని ...విడిపించుకోగలిగినా ... నిన్ను  నాశనం  చేసిపారేస్తాను ..."     కళ్ళు మూతలు  పడుతున్నాయి.                   ఉన్నట్టుండి పెద్ద చప్పుడయింది. ప్రజ్ఞ కళ్ళు  బలవంతాన  తెరిచి చూసింది. తలుపు విరిగి పడివుంది. తేజ చేతిలోని రివాల్వర్ తో  ఎదురుగా లోపలకు వచ్చింది.     జగదీష్ తలత్రిప్పి అటుకేసి చూసి తృళ్ళిపడ్డాడు. అప్రయత్నంగా అతని చేతులు ఉపజ్ఞను వదిలేశాయి.     "అమ్మా!" అని అరుస్తూ  ఉపజ్ఞ ప్రజ్ఞకేసి  పరిగెత్తింది. మొదట చెయ్యిలో వున్న  నీడిల్ ని  లాగిపారేసింది. నీడిల్  తీసిన  ప్రదేశం నుంచి రక్తం బొటబొట కారసాగింది. ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా  మోచేతి పైన వున్న  కట్టు మొదట  ఊడదీసింది. తర్వాత  శరీరానికి  బిగించివున్న  ఒక్కొక్క  ప్లాస్టర్  ఊడదియ్యసాగింది.     జగదీష్  ప్రక్కకి  తిరగబోయాడు.     "జగదీష్!" తేజ కంఠం  ఖంగుమంది. "ఉన్న చోటు నుంచి ఒక్క అంగుళం కూడా కదలకు. నా రివాల్వర్  నిన్ను  నిలువునా  ఛేదించిపారేస్తుంది"     అయినా జగదీష్  లెక్కచెయ్యకుండా  ప్రక్కనున్న టేబుల్ దగ్గరకు  కదలబోయాడు. ఆ టేబుల్ అతనికి కొన్ని అడుగుల దూరంలో వుంది. దాన్ని  అందుకుంటే ...     తేజ చేతిలోని  రివాల్వర్ ధన్ మని మ్రోగింది. బులెట్ జగదీష్ మోకాలి  క్రింద  భాగంలోకి చొచ్చుకుపోయి  రక్తం కారసాగింది. జగదీష్ బాధను తట్టుకోలేక  కుప్పకూలిపోతూ, ముందుకు  జరిగి  పడిపోకుండా  నిలద్రొక్కుకునేందుకన్నట్లుగా  టేబుల్  మీద చేతులువేసి  అదిమిపట్టాడు.     తేజ అతని  ప్రతి  మూవ్ మెంట్ నూ  చాలా నిశితంగా గమనిస్తోంది.     "జగదీష్! ఆ చేతుల్ని  కదిల్చావా  ఈసారి  బులెట్  నీ గుండెల్లోంచి  దూసుకుపోతుంది"     "తేజా !" అన్నాడు జగదీష్. "నేను నీ తండ్రిని."     "ఏడిశావ్ !" అంది తేజ. "తండ్రి  అనే పదాన్ని  కలుషితం చేసిన పరమ నీచుడివి నువ్వు. గతించిన  ప్రతి అనుభవం నాకు గుర్తుంది. కూతురిని తెలిసి  నా సర్వస్వాన్నీ  దోచుకోబోయిన  నీకు ఆ పదాన్ని  వాడటానికి  సిగ్గులేదూ? ప్రపంచాన్ని  నీ హేయమైన, దుర్భరమైన సిద్ధాంతాలతో  అమంగళం  చేసిననువ్వు  మానవజాతికి  చెదపురుగు లాంటివాడివి. నువ్వు స్మగ్లర్ వి, హంతకుడివి, సంఘ  విద్రోహ శక్తులతో శతృదేశాలతో  చేతులు కలిపిన  దేశ ద్రోహివి. నీలాంటి విషకీటకం  నుంచి  ఈ లోకానికి  విముక్తి కలగజేస్తాను."     రివాల్వర్ మరోసారి  వర్షించడానికి సన్నద్ధమౌతోంది. జగదీష్  చేతులు మెరుపు వేగంతో కదిలి, సరిగ్గా  రివాల్వర్  మ్రోగే సరికి  అతి లాఘవంగా  ప్రక్కకి  తప్పుకున్నాడు.     తేజ మెడమీద  సున్నితమైన చర్మంలో  ఏదో గ్రుచ్చుకున్నట్లయింది.     మరుక్షణంలో  ఆమె నేలమీదకు  వొరిగిపోయింది.     జగదీష్  గర్వంగా  నవ్వుతూ  ప్రజ్ఞను  బంధించిన వైపు  హిరుగుతూ కొయ్యబారిపోయాడు.  
24,594
     "అప్పుడే......"          "అదికాదు సర్...... ప్రాక్టికల్ మనిషిని యింకా ఏం చేయబోతున్నదీ చెప్పమంటున్నాం"          "అలాగడిగారు బాగుంది" ఆశ్చర్యంగా చూస్తున్న విలేఖర్ల ముందు మరో అస్త్రాన్ని సంధించారు" వెంటనే మంత్రిమండల్ని విస్తరిస్తున్నాను."          "అదేమిటి? ఇప్పటికే డెబ్బైమంది మంత్రులున్న ప్రభుత్వంలో యింకా మంత్రుల్ని పెంచడంలో ఆలోచన తోచలేదు. ఇప్పటికే మీపార్టీకే మీ పార్టీ ఎమ్మెల్యేల్లో డెబ్బై మందికి పదవుల్ని యివ్వడంతోపాటు మరో డెబ్బైమందికి కార్పోరేషన్ చైర్మన్లుగా పట్టం కట్టారు ......."          "అలానూత నలభైమందికి అవకాశం యిచ్చినా యింకా నాపార్టీలో ఏభైమంది ఖాళీగా వున్నారు. అతడ్ని నాయకుడ్ని చేసిందినూటతొంభైమంది ఎమ్మెల్యేలు.......          "అందుకని......"          "రేపే మరో నలభై మందిని మంత్రివర్గంలో చేర్చుకుంటున్నాను."          నిశ్చేష్టగా చూస్తూ అడిగాడు విలేఖరి" అంటే మొత్తంనూట పది మంది మంత్రులా ......"          "అవును...... నన్ను నాయకుడిగా ఎన్నుకున్న ఆ సభ్యుల్ని సంతృప్తి పరచలేనినాడు యిక ప్రజల్నేం తృప్తిపరచగలనని యిలాంటి నిర్ణయంతీసుకున్నాను ......."          రాష్ట్రమంత్రివర్గంలో ఇంతమంది మంత్రులుండడం ఇది తొలిసారి.          "అలా మంత్రివర్గ విస్తరణచేయటానికి యింకా పోర్ట్ ఫోలియయోలు ఏం చేయాలని" ఓ విలేఖరి అడిగాడు నిశ్చేష్టుడిలా చూస్తూ......          ఫకాల్ననవ్వేడు రాజారాం ......అంతేకాదు ......ఏమిటీపిచ్చి ప్రశ్న అన్నట్టుగా చూసేడుకూడా......          "అసలు మనుషుల్లో కులాలుగట్రా వున్నట్టేచేపల్లోనూ చాలారాకాలున్నాయి"          హటాత్తుగా చేపల ప్రసక్తి ఎందుకో అర్ధం కాలేదెవరికీ.......          "అవును సోదరుల్లారా ....... ఆ మాటకొస్తే దేవుల్లోనూ చాలా తెగలున్నాయని మీరు గ్రహించితీరాలి"          "వివరంగా చెప్పండి"          "ఇంకా వివరంగా చెప్పాలీ అంటే పశువుల్లోనూ చాలా జాతులున్నాయి."          "మీరుపాయింట్ కి వస్తే సంతోషిస్తాం"          "అద్గదీ అలా అడిగారు బాగుంది. అసలు మీ ప్రశ్నేమిటీ" క్షణం పాటు విలేఖర్ల వైపు తదేకంగా చూశారు ముఖ్యమంత్రి" ఇప్పుడు మంత్రి వర్గ విస్తరణలో నలభైమందికి ఏ పోర్డుఫోలియోలు యిస్తారూ అని...... అవునా...... అప్పుడు నేను చేపలసంగతి, దేవుళ్ళ సంగతి, పశువుల సంగతి చెప్పాను కదా...... అంటే ఏమిటి..... చేపల్లో జంజరాలు, మట్టగిడసలు, రొయ్యలు, సొరలూ గట్రారకరకాలున్నాయిగా కాబట్టి ఇప్పటి మత్స్యశాఖమంత్రిత్వ శాఖలో పోర్టు ఫోలియోల్ని పెంచుతాను...... దేవాదాయశాఖని మన దేవుళ్ళు ఆడ దేవతలకి సంబందించిన ఆలయాలకి అనుకూలంగా విడగొట్టి మంత్రుల్ని ఏర్పాటు చేస్తాను...... అలాగే పశువులకి సంబందించిన పశువర్ధక శాఖని ఆవులశాఖ, గేదెలశాఖ, ఎద్దుల శాఖలుగా విడదీసి......"          "అర్ధమైంది" ఆయన చెబుతున్నదింకా పూర్తికానేలేదు.                                                                           * * *          అప్పుడు కదిలిందో ఆకారం......          కాదు....... మేరువులా నిలబడిచూస్తున్నాడా యువకుడు....... వయసుపాతికలోపే..... మాసిన గెడ్డంతో మకిలిపట్టినకంచు విగ్రహంలా కనిపించడమే          కాదు          "ఎవరితను......"          అతడెవరా అని క్షణం సందేహంగా చూశారు చీఫ్ మినిష్టర్......          "ఎప్పుడూ చూసినట్టు లేదు"          "అవును....." కంచు నగారాలా వినిపించింది అతడి కంఠం "నేనువచ్చింది తొలిసారి"          "అవునవును తెలుస్తూనే వుంది" ఎందుకో అతడి చూపుల్తో చూపులని కలపడం.          కష్టమనిపించిందేమో- దృష్టి మరల్చుకుంటూ అన్నారు" ఇందాకటి నుంచి చెతురులు విసిరిందీ నువ్వే అనుకుంటాను!"          "బాగానే గుర్తించారు ముఖ్యమంత్రిగారూ.....అందుకు నా అభినందనలు......"          "ఏ పత్రికకి చెందిన జర్నలిస్టుమీద?"          "ఇంగ్లీష్ డైలీ అబ్జర్వర్"          ముఖ్యమంత్రేకాదు అక్కడున్న విలేఖర్లు కూడా ఆసక్తిగా చూశారతడ్ని.....          "శభాష్....... ఇప్పుడు నా గురించి ఏంరాయబోతున్నారు"          ఈ ప్రశ్న అడిగి తానెంత పొరపాటుచేసిందీ తెలుసుకోలేకపోయారు ముఖ్యమంత్రిగారు.          "శాతవాహనుల చరిత్ర పునరావృతం కాబోతూందని ......"          "గుప్తుల యుగంలా స్వర్ణయుగం తిరిగి రాబోతుందని....... రాయల రాజ్యంలోలా అంగళ్ళలో మళ్ళీ రతనాలను అమ్మబోతున్నారని...... అలనాటి రామరాజ్యాన్నే తలదన్నే అసలు సిసలైన పాలనేప్రజలు కళ్ళచూడబోతున్నారని...... "క్షణం ఆగేడు" రాసి ఆత్మద్రోహంచేసుకోలేను......."          హఠాత్తుగా అక్కడ గాలి గడ్డకట్టుకుపోయింది.          "ఓటుహక్కుని సవ్యంగా సజావుగా వినియోగించుకోవడం తెలీని అమాయకప్రజల అండతో ఇక్కడోవ్యక్తి పదవిని చేపట్టాడని.....          భారతదేశంలోని అతి ముఖ్యమైన అవయవమైన ఆంద్ర రాష్ట్రాన్ని అనాగరిక ఆటంక వ్యవస్థవేపునడిపించడానికి కంకణంకట్టుకున్నాడని......ప్రజల నమ్మకాన్ని కుదువబెట్టి వీధిగూండాలకి, బందిపోట్లకి నాయకుడిగా యీ నేలనుదోచుకుపోతున్నడని రాస్తాను......"          "షటప్" ఆవేశంగా లేచాడు ముఖ్యమంత్రి.          వెనువెంటనే అతడి సెక్యూరిటీ సిబ్బంది ఆ యువకుడివైపు నడవబోయారు......
24,595
    "అవుట్ !" అంత నిర్మొహమాటంగా తనను తూర్పార బెట్టిన తొలి వ్యక్తి ఆమె. పైగా తనకన్నా చాలా చిన్నస్థాయిలో వున్న   ఓ ఆడది. " గెటవుట్!"     "ఐ విల్ డెఫినెట్లీ గో అవుట్ మిస్టర్ ఎస్పీ. కాని మనం మళ్ళీ మళ్ళీ కలుసుకునే  అవకాశం వుండదు కాబట్టి మీ కేర్ క్టర్ ని నన్ను కాస్త  అప్రయిజ్ చేయనివ్వండి. నేను ఓ మొండి ఆడపిల్లని మీరు గౌరవించే హంగూ, ఆర్భాటాల్ని అస్సలు కేర్ చేసే అలవాటు లేనిదాన్ని. కాబట్టి నన్ను మీ ట్రాక్ లో నడవమని ఆదేశించండి. దీనికి పర్యవస్థానమేమిటో తెలుసా అని మీరు నన్ను అడగొచ్చు. అయితే  దానికి నాజవాబొక్కటే. ప్రతి బాస్ తన సబార్డినేట్ ని బెదిరించడానికి  వాడే రొటీన్ డైలాగిది. అంతేకాదు, మీరు  తలుచుకున్నా నేనీ  ప్రాంతం వదిలివెళ్ళను. వెళ్ళినా అక్కడా ఇలాగే ప్రవర్తిస్తాను. అలా రోషంగా ఎక్స్ ప్రెషన్స్ మార్చకండి. ఇకముందు ప్రిజుడీస్ తో మాట్లాడాలని ప్రయత్నించకండి.  మరేం  లేదు, నేను దేనికన్నా తెగించిన అమ్మాయిని . మీ గుట్టు బయటపడుతుంది. ఆ తరువాత మీ పొజిషను చాలా అసహ్యంగా తయారౌతుంది."      ఆ తరువాత నిశ్శబ్దంగా నిలబడిపోయింది.     అధికారం ,అహంకారం రెండు కాళ్ళుగా భేషజాన్ని ప్రదర్శించడమే అలవాటయిన  ఎస్పీ శ్యాంసుందర్ స్థబ్ధుడైపోయాడు. మూడు దశాబ్దాల చరిత్రలో ఒక  'పిల్లకాకి' చాలా భీకరంగా అతన్ని ఛాలెంజ్ చేసింది తొలిసారి.       అదికూడా కాదు, వట్టి తెగువని ప్రదర్శించడం మాత్రమేగాక బాహాటంగా యుద్ధాన్నీ ప్రకటిస్తానంటూంది. ఇది క్రమశిక్షణా రాహిత్యం మాత్రమేకాదు, క్షమించరాని నేరం.     "కాశీనాథ్ ని ఇరవైనాలుగు గంటల్లో అతన్ని నిర్భంధించిన  వ్యక్తులతో సహా నా ముందుంచాలి. ఇట్స్ మై ఆర్డర్!"     "కాని...."     " నాకు సంజాయిషీలు  అక్కర్లేదు."     సబార్డినేట్ ఆఫీసర్సుని నిద్రలేకుండా 'పెరాస్' చేయగల వ్యక్తిగా చివరి అస్త్ర్ర్రాన్ని సంధిస్తూ అన్నాడు. " ఈ క్షణం  నుంచీ నువ్వేంచేస్తావో నాకు తెలీదు.  ముందు కాశీనాథ్ని గాలించాలి."     "ఎస్సర్!"     " గెట్ లాస్ట్!" హుంకరిస్తున్నట్టు చూశాడు.     నుదుట పట్టిన స్వేదాన్ని తుడుచుకుంటూ బయటికి నడిచిన మేనక ఎంత తొందరపడిందీ అప్పటికి తెలుసుకోలేకపోయింది.      ఏమయ్యాడు కాశీనాథ్? జవాబు లేని ప్రశ్న.                           *    *    *    *              "ఎందుకదోలా వున్నావు?" నిశ్సబ్దం ఈజీఛెయిర్ లో కూర్చున్న మేనకని చూస్తూ అడిగింది అన్నపూర్ణ.      వినిపించలేదామెకి.      ఎస్పీని అలా ఎదిరించి రావడం ఆమెకీ తృప్తిగాలేదు. తప్పనిసరి పరిస్థితిలో నిబాయించుకోలేక రోషంగా తన ఉక్రోషాన్ని వ్యక్తంచేసేసింది.      ఆ తరువాత మూడుగంటల వ్యవధిలో డిపార్టమెంట ల్ గా చాలా  ఒత్తిడికి గురిచేశాడు హఠాత్తుగా మేనక జూరిస్ డిక్షనులో వున్న పోలీస్ స్టేషన్సుని సందర్శించాడు. కేసు ఫైల్స్ నీ, లాగ్ బుక్స్ నీ  వెరి ఫైచేసి ఆమెకు ప్రతికూలంగా కామెంట్స్ రాసాడు.      ఆమెకు బోధపడిపోయింది. జిల్లా పోలీసు అధికారిగా  తన అధికారాన్ని వినియోగించుకుంటూ ఇప్పుడు తన అసమర్థురాలైన పోలీస్ ఆఫీసరుగా నిరూపించే ప్రయత్నంలో నిమగ్నమవుతున్నాడు.      కాశీనాథ్ విషయంలో అడిషనల్ ఎస్పీ సురేందర్ ఆందోళన చెందుడు. ఎస్సైమురారికి అంతుపట్టడంలేదు.          " మాట్లాడవే?" రెట్టించింది అన్నపూర్ణ ప్రతిక్షణమూ ఏ విషయం గురించో మథనపడుతున్నట్టు కనిపిస్తున్న కూతురి విషంయలో చాలా ఆందోళన చెందుతూందామె. "నిన్నే!"     " ఏం కాకపోతే భోజనమెందుకు మానేశావ్?"     "ఆకలిగా లేదు."     అదీ ఆమెకు అర్థంకాని జవాబే. తల్లిని పసిపిల్లగా మార్చి డైనింగ్ టేబుల్ దగ్గర గోరుముద్దలు తినిపంచే  మేనక యిప్పుడు అలాంటి అలవాటు కే స్వస్తిచెప్పింది.     " మిత్రా కనిపించడంలేదేం?"  టక్కున అడిగింది   అన్నపూర్ణ.... " ఈ ఊళ్ళోనే వున్నాడుగా?"     " మిత్రా కనిపించడంలేదేం?" టక్కున అడిగింది అన్నపూర్ణ.... "ఈ  ఊళ్ళోనే వున్నాడుగా?"     "మమ్మీ!" విసుగ్గా చూసింది. "వాళ్ళకీ ఏవో పనులుంటాయి బిజీగా వుంటారు పూర్వంలా తరచూ కలవడం సాధ్యంకాదు."     " నిజమేనే సాధ్యంకాదు.కానిప్రతిక్షణమూ వాళ్ళ గురించి ఆలోచించే మనిషివే. మిత్ర తల్లికి బాగోలేనప్పుడు నన్ను తీసువెళ్ళాలని ఒక్కసారి ఆ కుటుంబాన్ని  పరామర్శించి వద్దామని  నువ్వనడంలేదేం?" చాలా రోజులుగా మనసులో గూడుకట్టుకున్న బాదని వెళ్ళగక్కేసింది. " ఇది చాలమ్మా... ఈ మార్పు చాలు ఏం  జరిగిందో అర్థం కావడానికి."     నిర్విణ్ణారాలైపోయింది మేనక. ఏమీ  పట్టనట్టు ఇంట్రావర్ట్ లా ఉండే అమ్మ చాలా దూరం ఆలోచించగలిగింది.     నిజమే, ఏదీ? అతని సమక్షంలో నవ్వుల మావగా మారి బ్రతులులో తుల్నీ, సమస్యల పర్వతాలనా అధిరోహించే ఆనాటి కలవలేవీ?     తుఫానులో తొలకరి చినుకుగా మారి తొలి పొద్దులూ,  మలిసందెలూ కబుర్లతో కాలక్షేపం చేసిన ఆ మధురస్మృతులెక్కడ?     ఆనందాన్ని కుత్తుక చెరసాలలో నొక్కిపట్టి ఏ నవ్వుల గవ్వల్ని ఏరుకోవాలని ఎదురుచూస్తున్నట్టు..... " మమ్మీ!" తేరుకుంటూ అంది " నువ్వన్నది నిజమేనే.... బాధ్యతల్లో  మునిగిపోయి ఆవిషయే మరిచిపోయాను ఓ రెండ్రోజుల్లో మిత్రా వాళ్ళమ్మని చూసొద్దాం."     అదీ ముక్తసరిగా అన్నట్లు బోధపడిపోయింది. ఇంతదాకా వచ్చేక ఇక మనసులో ఆలోచన బయటపెట్టడంలో తప్పు  లేదనుకుంటూ అంది-- " రేపు మిత్రని పిలువ్."     "ఎందుకు?"     " మాట్లాడటానికి."     " ఏ విషయం ?" మేనక కలవరపాటుని అణచుకుంటూ అడిగింది.
24,596
    రాత్రి రాకకోసం పరిచిన ఎర్రటి తివాచీలా వుంది సాయంసంధ్య.     బ్యారెక్కులోకి వెళ్ళమని వార్డర్లు ఖైదీలను తరుముతున్నారు.     యధాప్రకారం మొదటి బ్యారెక్కులోకి వెళ్ళబోతున్న ఉత్తరుడ్ని ఓ వార్డర్ నిలిపాడు. "నీ బ్యారెక్కు మారింది. నెంబరు నాలుగు" అన్నాడు.     తనను బ్యారెక్కు ఎందుకు మార్చారో అర్థం కాలేదు ఉత్తరుడికి. ఇప్పుడు ఏం చేసినా బ్యారెక్కు మారదు. రేపు డిప్యూటి జైలర్ తో మాట్లాడితేగాని తిరిగి తనను మొదటి బ్యారెక్కుకు వేయరు. అందుకే ఏమీ మాట్లాడకుండా ఆగిపోయాడు.     అయితే ఈ విషయం తిలక్ కి చెబుదామని చూశాడుగానీ వీలుపడలేదు. అప్పటికే తిలక్ బ్యారెక్కులోపలికి వెళ్ళిపోయాడు.     "నువు నాలుగో నెంబర్ బ్యారెక్కుకిరా" అని వార్డరు అతని చేతిని పట్టుకుని తీసుకెళ్ళాడు.     అతను వెళ్ళేసరికి ఆ బ్యారెక్కు బయట నలుగురు ఖైదీలున్నారు. వాళ్ళలో నైఫ్ వుండడం చూసి అతను ఓ క్షణం భయపడ్డాడు. ఈ రాత్రి తనమీదున్న ప్రేమనంతా చెప్పి బోర్ కొట్టిస్తాడని అనుకున్నాడు.     అంతకు మించిన ప్రమాదాన్ని అతను వూహించలేకపోయాడు.     అమాయకంగా వాళ్ళతోపాటు బ్యారెక్కులోకి వెళ్ళాడు.     వార్డర్ తలుపు తాళంపెట్టి వెళ్ళిపోయాడు.     ఉత్తరుడ్ని చూసి నైఫ్ మత్తుగా నవ్వి కన్నుగొట్టాడు.     "డియర్! ఇలారా! వచ్చి పక్కన కూర్చో. కబుర్లు చెప్పుకుందాం" మరింత మత్తుగా పిలిచాడు.     "నీతో నాకు మాటలేమిటి?" ఉత్తరుడు విసుక్కున్నాడు.     "నాతో కాకుండా ఇంకెవరితో మాట్లాడతావు? నేను నీకు ప్రియుడ్ని" నైఫ్ క్రూరంగా నవ్వుతూ అన్నాడు.     "బుద్దుంటే నాతో మాట్లాడవు"     "అలా కోప్పడకు ప్రియా! నువు ఎంత అందంగా వుంటావో తెలుసా!" మిగిలిన ముగ్గురు ఖైదీలూ ఉత్తరుడ్ని చాలా కాంక్షతో చూస్తున్నారు. ఆడపిల్ల ఫీచర్స్ తో అతి నాజూగ్గా కనిపిస్తున్న అతడ్ని చూస్తూ వాళ్ళు ఉద్రేకపడుతున్నారు.     ఉత్తరుడు సిమెంట్ దిమ్మమీద పడుకుని ఇటు తల తప్పుకున్నాడు.     వాళ్ళు నలుగురూ అతనిమీద ఏవేవో జోక్ లేసుకుంటూ నవ్వుతున్నారు.     ఎనిమిది గంటల ప్రాంతాన భోజనం వచ్చింది.     ఏదో తిన్నాననిపించి ప్లేటు కడిగి పెట్టేసి తిరిగి పడుకుండిపోయాడు. అయినా నిద్ర రావడంలేదు.     మిగిలిన నలుగురూ మాట్లాడుకుంటున్నారు.     నైఫ్ అంటున్నాడు. "ఈ సెక్స్ బలహీనతవల్లే నేను జైలుకొచ్చాను."     "ఏం చేశావు గురువా?" ఓ ఖైదీ అడిగాడు.     "అదో పెద్ద కథలే" నైఫ్ నిట్టూర్చాడు.     "చెప్పు గురూ! మన కార్యక్రమానికి ఇంకా టైముంది"     "అయితే వినండి" అని నైఫ్ గొంతుసవరించుకున్నాడు.     మిగిలిన ముగ్గురూ ఖైదీలు తమ చెవులకి నైఫ్ కి తగలేశారు.     అతను చెప్పడం ప్రారంభించాడు.     "మా వూరు అడవి. అడవంటే అడవే. మా వూరు సముద్రానికి దగ్గరగా మరో ప్రపంచంలా వుండేది. టౌన్ కు రావాలంటే ఏడెనిమిది మైళ్ళు నడిచి రావాలి. మా వూరికి బస్సుగానీ, రోడ్డుగానీ వుండేవికావు. ఎప్పుడో ఆరునెలలకో, సంవత్సరానికో టౌన్ కొచ్చి ఓ సినిమా చూసి వెళ్ళేవాళ్ళం. మిగిలిన రోజుల్లో అంతా మాకు నరసింహులు టీ కొట్టే కాలక్షేపం"     నైఫ్ ఆగి మళ్ళీ ప్రారంభించాడు. "నాకు అప్పుడు పద్ధెనిమిది ఏళ్లు. నూనూగు మీసాలతో మంచి వేడి మీదున్నాను. మా వూర్లో సెక్స్ ఒక్కటే కాలక్షేపం. సినిమాలు, షికార్లు ఏమీ లేకపోవడంతో ఆడవాళ్ళను గురించి మాట్లాడుకోవడమే నాలాంటి వాళ్ళకు ఇష్టంగా వుండేది.     అలా నరసింహులు టీ అంగట్లో కూర్చుని కబుర్లాడుకుంటూ కాలక్షేపం చేసేవాళ్ళం. ఏడుస్తున్న పిల్లాడికి పాలబుడ్డీ ఇచ్చీనట్టు మా వూరికి సత్యభామ వచ్చింది. సత్యభామ ఎవరో కాదు - నరసింహులు భార్య.     ఆమె నరసింహులు టీ అంగడికి ఎక్ స్ట్రా ఆకర్షణ అయింది.     ఆమె అందం అలాంటిది. ఒంటిమీదున్న పదితులాల బంగారమూ ఆమె పరువం ముందు వెలవెలపోయేది. ఎప్పుడూ దొంగ పైర్లు మేసి బలిసిన గేదెలా వుండే ఆమె గుండెలు మతి పోగొట్టేవి. ఒడ్డూ పొడుగుతో ఎనిమిదో సంవత్సరంలోనే రజస్వల అయినట్టు వుండేది. ఎందుకో తెలియదుగానీ ఆమెను చూస్తే మంచం తప్ప మరేం గుర్తురాదు.     దీంతో టీ అంగడికి వచ్చే జనం పెరిగారు. బలిసిన కోడిపుంజు కూతలాగా బిజినెస్ వూపందుకుంది.     అయితే నరసింహులు మాత్రం తగ్గిపోవడం ప్రారంభించాడు. రోజు రోజుకీ అతను క్షీణించడం మొదలుపెట్టాడు. సత్యభామలాంటి ఆడది ఇంట్లో వుంటే నిజమైన మగాడు తగ్గిపోకుండా వుంటాడా అని అర్థం వచ్చేటట్టు రకరకాలుగా వూర్లో వాళ్ళు అనుకోవడం ప్రారంభించారు.     జబ్బు ఏమో తెలియదుగానీ ఓరోజు నరసింహులు చచ్చిపోయాడు. సత్యభామ ఒంటరిదైపోయింది. గొలుసు తెంపుకున్న ఆవు ఎవరి చేలో పడుతుందోనన్న బెంగ వూర్లోని స్త్రీలందరికీ పట్టుకుంది.     కానీ సత్యభామ పడింది మా చేలోనే. మా నాన్నకు, ఆమెకూ జత కుదిరింది. మా నాన్న చిన్నప్పుడు పెళ్ళి చేసుకుని నన్ను కనడంతో ఆయన నాకు అన్నలా వుండేవాడు. అప్పటికి ఆయన వయస్సు ముప్ఫై ఆరేళ్ళే.     రంకు మొగలిపువ్వు లాంటిది. అది ఎక్కడన్నా గుప్పుమంటుంది. ఈ విషయం నా చేవిలోనూ పడింది.     అప్పటికే సత్యభామ మీది మొహంతో నేను పిచ్చివాడ్ని అయిపోయాను. ఆమె మీదున్న కోరిక రోజు రోజుకూ ఎక్కువవుతోంది. మా నాన్నంటే ఈర్ష్య మొదలైంది. ఆయన పడుకుని నిద్రపోతున్నప్పుడు చంపెయ్యాలని కూడా చాలాసార్లు అనుకున్నాను. రాత్రయితే సత్యభామ దగ్గరకు బయల్దేరే నాన్నను చూస్తుంటే కోపంతో నరాలు పగిలిపోయేవి.     ఏదో పనిమీద ఆరోజు మానాన్న టౌన్ కెళ్ళాడు. ఇక ఆరాత్రికి రాడని తెలుసు. ఒంటరిగా ఇంటి బయట తిన్నెమీద పడుకున్నాను. నిద్ర రావడం లేదు. సత్యభామను అనుభవించాలన్న కోరిక శరీరాన్నంతా కొండ చిలువలా చుట్టేసుకుంది. ఏదో ఒకటి ఒకటి చేయాలని మనసు తొందర పెడుతోంది.     అప్పుడు తట్టింది నాకు ఓ ఉపాయం. ఇక ఆగలేకపోయాను. సత్యభామే కళ్ళముందు మెదులుతోంది. లేచి ఆమె ఇంటికి బయల్దేరాను.     బయట మసగ్గా వెన్నెల - దారంట నడుస్తున్నాను. దెయ్యం జడల్లా తాటిచెట్లు. ఆ జడల్లోని జడబిళ్ళల్లా కల్లుకుండలు. రెండు చెట్లు ఎక్కి కల్లు తాగాను. సత్యభామ కళ్ళముందు నిలిచి కవ్విస్తోంది. ఏదో తెలియని మత్తు ఒళ్లంతా పాకుతోంది.     ఆమె ఇంటికి నడిచాను.     రాత్రి పది దాటిపోవడంతో వూరంతా నిద్రలో జోగుతోంది.     మెల్లగా తలుపు తట్టాను.
24,597
    "ఏ మొక్కాలేని చోట, ఆముదం మొక్కే మహావృక్షంగా చెలా మణి ఔతుంది. అక్కడ గ్రౌండ్ లో ఆడుతున్న వాళ్ళంతా లఫంగీ మొహాలు! వాళ్ళల్లో కాస్త బెటర్ గా ఆడగలిగితే చాలు..... పెద్ద కిలాడీలా ఫోజు!     ప్రముఖ ఫుట్ బాల్ ఛాంపియన్... ఆట ఎప్పుడైనా చూసావా? అలాంటిది చూస్తే..... వీళ్లంతా నీ కళ్లకి పిపీలకల్లా కనిపిస్తారు!" అంది మాధురి.      రుక్మిణి మాట్లాడలేదు.      మాధురితో వాదనకి దిగటం అనవసరం అని ఆమె భావన .      కానీ... ఆమె వూరుకోలేదు.      "రుక్కూ! ఆ అబ్బాయిది ఎంత ఇడియాటిక్ స్ట్రేచరో ఇప్పుడే నిరూపిస్తాను చూడు!"అంది మాధురి.     "ఎందుకులే... ఊర్కో....." అంది రుక్మిణి కంగారుగా.     ఆమెకు తెలుసు మాధురి మనస్తత్వం ఎటువంటిదో. ఆమె దృష్టిలో మగాళ్లు కేవలం ఆడవాళ్లని వలలో వేసుకుని, కేవలం సెక్స్ కోసం వాళ్లని వినియోగించుకోవాలని అనుకునే 'క్లీచర్లు!'     అది నిజమే కావచ్చు.      కానీ అందులో తప్పేముంది?     ఈ సృష్టిలో రెండేరెండు జాతులు.      స్త్రీ... పురుషులు!     ఒకరిపట్ల ఒకరికి ఆకర్షణ, ఒకరంటే ఒకరికి కూతూహలం ఒకరినుంచి ఒకరు ఏదో పొందాలనే కోరిక, సెక్స్ ద్వారా సుఖాన్ని స్వంతం చేసుకోవాలను కోవటంలో తప్పేముంది?      ఇష్టం వుంటే ఓ. కే!     లేకపోతే నో...      అంతేగానీ, ఆకాంక్ష వుండటం తప్పని అనుకోవటం ఒక రకమైన ఫోబియా!!      "షటప్, అది ఫోబియా కాదు!" అంది మాధురి.      "నీకు తెలీదు. ఈ మగాళ్ళు ఎంత హిపోక్రాట్సో తెలిసా?....డైరెక్టుగా అసలు సంగతికి రారు!నానుస్తారు! ప్రేమంటారు! ఇష్టం అంటారు! అభిమానం అంటారు! ఇంకేదో 'ఇది'  అంటారు! డొంకతిరుగుడు మార్గంలో వచ్చి... .చివరికీ అందరూ అడిగేది 'అదే' అంది మాధురి.      "ఔను మాధురీ! దుకాణంలో సరుకులు అడిగినట్లు, అది కావాలి ఇది కావాలి అని అడగటం ఎంతో హాస్యాస్పదం. ముందు లైనులో పెట్టాలి. తర్వాత మనసు మీటాలి. ఆ తర్వాత... .మెల్లిగా చేరువ కావాలి. అప్పుడు కావలసింది అడిగేయాలి! అప్పుడే థ్రిల్!" అంది  రుక్మిణి.     "డోంట్ బీ సిల్లీ. నిన్ను నువ్వు మోసం చేసుకోవడం లాంటిదే ఇది! మగాడి చీప్ నేచర్ ని సపోర్ట్ చెయ్యటానికి నీకు సిగ్గు లేదూ? అసలు నువ్వు ఆడదానివేనా?" అంది మాధురి.      కానీ రుక్మిణి లాజిక్ వేరు.      ఎప్పుడూ 'మగాడు' అనే పదార్దాన్ని అనుమానంగా చూడటం అలవాటైతే... ఇక భూప్రపంచంలో తనకి తగిన పదార్దం' దొరకదు.      అది ఫోబియా. నో డౌట్.      కానీ ఆ విషయం ఆమెకు చెప్పటం అనవసరం అని మౌనం వహించేది.      ఇప్పుడూ అంతే.      అతన్ని ఏం చేస్తుందో!....     కుతూహలంగా చూడసాగింది రుక్మిణి.     ప్లే గ్రౌండ్ ఆట అయిపోయింది.     ప్రశాంత్ కారిడార్ వైపు నడుస్తున్నాడు చెమట్లు కక్కుకుంటూ.     కిసుక్కున నవ్వింది మాధురి....     అంతే ఠక్కున ఆగిపోయాడు ప్రశాంత్.     "అరగంట ఆడేసరికి అంత ముద్దముద్ద అయిపోయావ్! స్టామినా ఇంప్రూవ్ చేసుకోకుండా స్పోర్ట్స్ జోలికి రావడం దేనికి?"  అంది మాధురి వ్యంగ్యంగా.      వికాస్, రాజేష్ ప్రశాంత్ ని కలుసుకుని, ఆమె మాటల గురించి చెప్పాలని అనుకుంటూ వుండగానే, మాధురి రంగంలోకి దిగటంతో నిశ్శబ్దంగా వుండిపోయారు.     "ఒకసారి ఆడి చూపెట్టండి. అరగంట అక్కర్లేదు.... ఐదు నిముషాలు చాలు. మీరు చెమట్లు క్కకుకోకుండా ఉల్లాసంగా ఎలా వుంటారో  చూసి.... నేర్చుకుంటాను!" అన్నాడు ప్రశాంత్.      పకపక నవ్వారు వికాస్, రాజేష్.     మరో ఇద్దరమ్మాయిలు కిసుక్కున నవ్వటం వినిపించింది ఆమెకి.     "నేను మీలాంటి కిలాడీతో ఆడగలనా?" అంది మాధురి.     "నా కిలాడీతనం ఏం చూశారు?రంగంలోకి దిగితే కదా అర్దమవుతుంది!" అన్నాడు ప్రశాంత్.      "ఛీ..... పోండి! అంది మాధురి చిలిపిగా.      రుక్మిణికి ఏమీ అర్దంకాలేదు."     ఎందుకంత 'గివ్ అప్' స్టయిల్ లో ప్రవర్తిస్తోందో తేల్చుకోలేకపోయింది.     కుతూహలంగా చూస్తోంది.      "మీలో ఇంతటి చిలిపితనం కూడా వుందని ఇప్పుడే అర్దమయ్యింది. నాకు.... కాలేజ్ అయిపోయాక కలుసుకుందాం...." అన్నాడు ప్రశాంత్.    
24,598
    "ఆశ్రితా!" రిషి వినలేనట్టు అరిచాడు.     "ఏం అబద్ధమా? ఇలా కాకుండా మరోలా జరిగే ఆస్కారం వుందా? తాడూ, బొంగరం లేనివాడ్ని ప్రేమించి, లక్షల ఆస్తిని వదులుకుని ఎందుకు పోతున్నావు? అని నా తండ్రి అడిగితే ఏం సమాధానం చెప్పమంటావు? అడవిలో చెక్కలతో ఇల్లు కట్టుకుని, ఇంటి ముందు నుండి పారే సెలయేర్లో కడవతో నీళ్ళు ముంచుకుంటూ పాటలు పాడడానికి 'లవ్ స్టోరీ' సినిమా కాదిది- జీవితం! ఉండడానికి ఇల్లూ, తినడానికి తిండీ, కట్టుకోవడానికి బట్టా ఇంకా చాలా అవసరాలుంటాయి. అవన్నీ ప్రేమతో సరిపెట్టుకోలేము. నేను మా నాన్నకి ఒక్కగానొక్క కూతుర్ని. ఆయన ఆస్తంతా నాకే వస్తుంది. ప్రేమ కోసం ఆయన్నీ, ఆయన ఆస్తినీ వదిలేసుకుని నీ దగ్గరకి వచ్చేస్తే ఒక్క పైసా కూడా ఇవ్వడు. ఆయన మనస్తత్వం నాకు తెలుసు. ఒక్క ఆయన మనస్తత్వమే ఏమిటీ- సైకాలజీ స్టూడెంట్ గా నేను అందరి మనస్తత్వాల గురించీ అంతో ఇంతో అంచనా వెయ్యగలను. మనమూ ఈ ప్రేమ వేడి తగ్గాకా అంత ఆస్తిని వదిలేసుకున్నందుకు బాధపడచ్చు! మన కోసం కాకపోయినా, రేపు మనకి పుట్టబోయే పిల్లల కోసమైనా ఆలోచించాలిగా. నన్నో కోటీశ్వరుడి కోడల్ని చెయ్యాలని నా తండ్రి ఆశ పడ్తున్నట్లు!"     "అయితే ఇప్పుడేమంటావు?" రిషి ఆత్రంగా అడిగాడు.     "ఆయన్ని ఒప్పించాలి. నన్ను నిజంగా ప్రేమిస్తే నాకోసం ఏమైనా చెయ్యాలి. నా కోసం అన్నీ వదులుకుని రా! అన్న పంధాలో కాకుండా, నువ్వు సుఖంగా వుండడానికి నేను ఈ ఏర్పాట్లు చేసాను అనేదే నా దృష్టిలో ప్రేమ. నన్ను ప్రేమించినందుకు నువ్వూ, నిన్ను ప్రేమించినందుకు నేనూ ఒక్కసారి కూడా విచారించకూడదు. ఇద్దరం సుఖపడాలి. సుఖపడాలంటే ప్రేమతోబాటు డబ్బు కూడా వుండాలి. నేను స్వార్ధంగా మాట్లాడ్తున్నాననుకోకు. మెటీరియలిస్ట్ గా మాట్లాడుతున్నాను. ఆలోచించు. ఏం చేస్తావో, ఎలా చేస్తావో- నిర్ణయాన్ని నీకే వదిలిపెడ్తున్నాను" అంది ఆశ్రిత.     ఆశ్రిత లేచి వెళ్ళిపోతూ వుంటే, ఆపడానికి కూడా శక్తిలేనివాడిలా అలాగే పడుకుని నిస్సహాయంగా చూస్తుండిపోయాడు రిషి.                                           *    *    *    *     లోకనాధం పొగాకు కాడలు జేబులోకి తోసి, డన్ హిల్స్ పెట్టె చేత పట్టుకుని విలాసంగా లిఫ్ట్ లోంచి క్రిందికి దిగి, హోటల్ రిసెప్షన్ కౌంటర్ ఎదురుగా వున్న సోఫాలో చతికిలపడ్డాడు.     "ఐ వాంట్ రూమ్. పైసా కీ పర్వానియ్యే, ముజే రూం చాహియే" అన్న మాటలు గట్టిగా వినిపించి లోకనాధం తల తిప్పి చూసాడు.     బట్టతలతో తెల్లగా, పొట్టిగా వుండి, ఖరీదైన సూటు వేసుకున్న వ్యక్తి రిసెప్షనిస్టు మీద అరుస్తున్నాడు.     రిసెప్షనిస్టు చిలకలా అవే మాటలు 'రూం లేదు' అన్న భావం వచ్చేలా ఇంగ్లీషులో, హిందీలో పలుకుతోంది. ఆ తర్వాత 'కూర్చోండి ఎవరయినా ఖాళీ చేస్తారేమో ట్రై చేస్తాను' అంది.     అతను సణుగుతూనే వచ్చి లోకనాధం ఎదురుగా కూర్చుని పేపర్ చదవసాగాడు.     లోకనాధం సగటు భారతీయుడి లక్షణాలన్నీ పుణికి పుచ్చుకున్నవాడే కావటం చేత అతని చేతిలోని పేపర్ లో సగభాగం నిర్మొహమాటంగా అడిగి పుచ్చుకుని "థాంక్యూ.... భాయిసాబ్" అంటూ తన హిందీ పాండిత్యంకూడా చూపించాడు.     అతను లోకనాధంవైపు చూసి "మీకు హిందీ వచ్చునా?" అని హిందీలో అడిగాడు. లోకనాధం నవ్వి "నేను హైద్రాబాద్ నుండి వచ్చాను. "నాకు హిందీ బాగా వచ్చు" అని ఉర్దూ కలిపి చెప్పాడు.     అతను వెంటనే తన గోడు వెళ్ళబోసుకుంటూ "వ్యాపారం పనిమీద విజయవాడ వచ్చాను. ముందుగా రూమ్ బుక్ చేసుకునే వ్యవధి లేకపోయింది. ఈ వూరంతటికీ ఇదే పెద్ద హోటల్ అనుకుంటాను. నేను అసలు ఫైవ్ స్టార్ హోటల్స్ లో తప్ప దిగను. అన్ని ముఖ్య పట్టణాల్లోనూ ఫైవ్ స్టార్ హోటల్స్ వున్న నేను ఓ దరిద్రుడిలా యిక్కడ రూం దేబిరించడం కర్మ కాకపోతే ఏమిటి చెప్పండి?" అన్నాడు.     లోకనాధం ఆశ్చర్యంగా "మీకు అంత పెద్ద స్టార్ హోటల్సు వున్నాయా? మీ పేరేమిటీ?" అని అడిగాడు.     అతను చిరాగ్గా "కుందన్ షా నా పేరు. ఎవరెస్ట్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ అన్నీ మావే" అన్నాడు.     లోకనాధానికి తను మాట్లాడుతున్నది సామాన్యుడితో కాదని వెంటనే తెలిసిపోయింది, మరింత నమ్రతగా ముందుకి వంగి "మిమ్మల్ని కలవడం నా అదృష్టంగా భావిస్తున్నాను" అన్నాడు.     అతడు నిర్లిప్తంగా నవ్వి "భారీగా టాక్స్ పేచేసే అతి కొద్దిమంది భారతీయుల్లో నేనూ ఒకడ్ని! నగల ఎగుమతి, దిగుమతి వ్యాపారం చేస్తుంటాను. నేను నా స్వంత ప్లేన్ లోనే గన్నవరం వచ్చాను. ఈ రాత్రికి విజయవాడలో గడిపి రేపు ఉదయం హైద్రాబాద్ వెళదాం అనుకున్నాను. అన్నట్లు మీదీ హైద్రాబాదే కదూ! ఫలక్ నామా ప్యాలెస్ అమ్మకం విషయం మీకేమైనా తెలుసా? ముక్రంజా నాకు మిత్రుడే అనుకోండి...." అన్నాడు.     లోకనాధం నోరు అతనికి తెలియకుండానే విశాలంగా తెరుచుకోబోయింది.     "220 గదులున్న ఆ నిజాం ప్యాలెస్ కొని అందులో స్టార్ హోటల్ పెట్టాలనుకుంటున్నాను. ఎలా వుంటుందంటారు?" అని అడిగాడు.     లోకనాధానికి చూస్తున్నదీ, వింటున్నదీ నిజమో లేక కలో? అర్ధం కాలేదు. అంతటి భాగ్యవంతుడు తనతో మాట్లాడటం అతనికే విచిత్రం అనిపించింది. అమాంతం లేచి కాళ్ళమీద పడిపోవాలనిపించింది.     ఇంతలోనే కుందన్ షా లేచి "ఎక్స్యూజ్ మీ" అంటూ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళాడు.     లోకనాధం వెంటనే మనసులో నిశ్చయించేసుకున్నాడు. ఇతనితో స్నేహం గట్టిపడే ప్రయత్నం చెయ్యాలని.     కుందన్ షా కోపంగా వచ్చి "అందుకే ఈ సౌత్ వాళ్ళంటే నాకు వళ్ళుమంట. మంచీ మర్యాదా లేదు. నేను నా ప్లేన్ తీసుకుని హైద్రాబాద్ పోతాను" అన్నాడు.
24,599
     పెళ్ళి వారు దూరం వూరునుంచి వస్తారు. పెళ్ళి ఉదయం పదిగంటలకి అయినా ఆ వూరునుంచి వచ్చే రైలు రాత్రి బయలుదేరి తెల్లవారుజముకి తప్ప లేదు. స్నేహుతుడికి సాయపడదామని రాత్రి భోజనానికి తప్పక వెళ్ళాలి కాబట్టి ఏడుగంటలకి వెళ్ళటానికి తయారయారు. ధైర్యని రమ్మంటే రానంది.     నిరంజనరావుది లంకంత కొంప. పక్క వాటాలో అద్దెకున్న వాళ్ళు యాత్రలకి వెళ్ళారు. ప్రస్తుతం ఇంటి మొత్తంమీద వీళ్ళ ముగ్గురే వున్నారు. దొంగల భయం అనేది వాళ్ళకి లేదు. రాత్రిళ్ళు దొంగతనాలు ఆ వీధిలో జరగలేదు.     "ఇంటి మొత్తంమీద ఒంటరిగా ఏం వుంటావు? నీవు కూడా రా" అన్నాడు నిరంజనరావు.     "ఆడపిల్ల ఒంటరిగా వుండటం మంచిదికాదు" అంది సావిత్రి.     "పరిక్ష రోజులు చదువుకోవాలి. పైగా పెళ్ళివారి ఇంట్లో నాకెవరు తెలియదు. నేను రాను. రేపు ఉదయం పదకొండు గంటలకి పెళ్ళి అయితే ఇప్పటినుంచి వాళ్ళింట్లో వుండటం మహా బోర్. రేపు మాత్రం పెళ్ళి టైంకి వచ్చి పెళ్ళి చూసి భోం చేసి వస్తాను. ఒంటరిగా వుంటే భయం అని నేననుకోవాలి. నాకు లేని భయం మీ కెందుకు?" అంది ధైర్య.     నిరంజనరావుకి అంత భయం లేదు. సావిత్రి అలా కాదు చాలా భయస్తురాలు. ధైర్యని ఒంటరిగా వదిలి వెళ్ళటం యిష్టం లేదు. పెళ్ళికి వెళదాం రమ్మని అడిగింది రానంది ధైర్య అందుకని "మీ అలుసు చూసుకుని అదలా తయారయింది. మీరు రమ్మని గట్టిగా చెప్పండి. "అని భర్తని పోరింది." మీ అమ్మ అడగమందిరా ధైర్యా!" అంటూ అయన నాన్చుతూ అడిగాడు.    అసలు విషయం     ధైర్యకి పెళ్ళి కెళ్ళటం ఎలర్జీ ఏమి కాదు. పరిక్షలు యింకా పదిరోజులు వున్నాయి. ఒక్కరోజు చదవకపోతే వెస్ట్ అవుతుందని కాదు. కారణం వేరే వుంది. చదువుకోవాలి అని వంక బెట్టింది.     ధైర్య రానని మొండికేయ్యటంతో జాగ్రత్త అని ఒకటికి రెండుసార్లు చెప్పి నిరంజనరావు సావిత్రి ఎడున్నరకల్లా ఇంట్లోంచి బయలుదేరి వెళ్ళారు.     "ఇల్లు మొత్తం మీద తను ఒక్కతే. తన కోరిక తిరనుంది. ఎన్నాళ్ళ కెన్నాళ్ళకి ఈ ఛాన్స్!" అనుకుంది ధైర్య.     అవకాశాలు అన్నివేళలా రావు. ఇలాంటి రోజు కోసమే చూస్తున్నది ధైర్య. అది యిప్పుడు వచ్చింది.     ఆ రోజు పరిశోధన మాసపత్రికలో భయంకరముర్తి రాసిన క్రైం రచన "ఆ చీకటి రాత్రి" చదివిన ధైర్య స్నేహితురాళ్ళు మహానంద శ్రివిద్యలతో బెట్ కాసింది. ఆ చీకటి రాత్రి రచనలో అభయ చేసినట్లు ప్రాక్టికల్ గా తనూ చేసి చూస్తానని... అలా చేయోడ్డాన్నారు వాళ్ళు, చేస్తానంది ధైర్య.     సరిగా మూడువారాల క్రితం పరిశోధన మసపత్రికని పుచ్చుకుని ముగ్గురూ ఆ చీకటి రాత్రి గురించి చర్చించుకున్నారు. అక్కడితో వాళ్ళు ఆగలేదు. "ఎప్పుడు చేస్తావ్ పరిశోధన?" అంటూ ధైర్యని నవ్వుతూ ఏడిపించటం మొదలుపెట్టారు మహానంద శ్రీవిద్య.     "ఈ రాత్రికి చేయటానికి రెడీగా వున్నాను. ఖాళి కొంప మీరు చూసిపెట్టండి మా యింట్లో చూడబోతే అమ్మా నాన్న పక్కనే అద్దెకున్న వాళ్ళు ఎలా పరిశోదన చేయను?" అంది ధైర్య.     ధైర్య చెప్పింది నిజమే కాబట్టి స్నేహితురాళ్ళు యిద్దరూ నవ్వుతాలుకి ఏడిపించే మాటలు అనటం తప్ప వాళ్ళు ఏమి చేయలేక వూరుకున్నారు.     ఏనాటికైనా ప్రాక్టికల్ గా పరిశోధన చేయటం తనకు కుదురుతుందో లేదో అని ధైర్య నిరాశ చెందింది. ఓ పక్క యింట్లో తల్లి తండ్రి మరో పక్క అద్దెకున్న వాళ్ళు . పోనీ తన గదిలో వంటరిగా వుండి చేద్దామా అంటే ఆ త్రిల్లింగ్ రాదు. భయపడటం మాట అటుంచి నవ్వు రావటం ఖాయం.