SNo
int64
0
25.8k
text
stringlengths
39
23.5k
0
    సుశీలమ్మ కళ్ళలో భయం పారాడింది.     "అనాధ బిడ్డ అని చిన్నప్పుడే తెలిస్తే మన దగ్గిరవాడు అలా అరమరిక లేకుండా చనువుగా పెరిగేవాడా?" పుట్టెడు దిగులు సుశీలమ్మ కంఠంలో పలికింది.     "అది మనం పెంచేదాన్ని బట్టి వుంటుంది. అటువంటి బేధాలు మనలో లేనట్టు తెలుసుకొనేలా పెంచాలి."     "చాలామంది అలాగే పెంచుతారు గదండీ."     "ఏనాడో ఒకనాడు ఆ విషయం తెలియకపోదు. మనం పట్నంలో వుంటున్నాం గనక యింత కాలమయినా ఈ రహస్యాన్ని దాచగలిగాం.     సుశీలమ్మ వింటూ కూర్చుంది.     "ఒక వ్యక్తిత్వం అంటూ ఏర్పడ్డాక ఆ రహస్యం తెలిస్తే లోతుగా గాయపడతారు. అనేక ఆలోచనలు వస్తాయి. చిన్నప్పుడే తెలిస్తే అంతగా తలక్రిందులై పోరు" అన్నాడు.       "వాడు మనల్ని వదిలేసి వెళ్ళిపోతాడేమో!" అనలేక అంటున్న ఆమె గొంతులో ఏదో అడ్డుపడినట్టు ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది.     రామనాథానికి కూడా ఆ భయం లేకపోలేదు.     ఆ భయాన్ని దాచుకుంటూ వెళ్ళడు. ఎలా వెళతాడు? ఎక్కడికి వెళతాడు? అసలు ఎందుకు వెళ్ళాలి? వాడికి మనమేం తక్కువ చేశామని వెళ్తాడు?" అన్నాడు.     సుశీలమ్మకు ఎక్కడికో లోతు తెలియని అగాధంలోకి పడుతున్న వ్యక్తికి జారుడుమెట్లు చేతికి అందినట్టు అనిపించింది.        "వాడు వెళ్ళిపోడంటారా?" చేతికందిన జారుడుమెట్టును పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు అన్నది.     "పిచ్చిదానా! వాడెక్కడి కెల్తాడే? వాడు ఎప్పటికీ సుశీలమ్మ కొడుకే.     "నేను సుశీలమ్మ కొడుకునే!" అన్న శరత్  బాబు మాటల్ని గుర్తు చేసుకుంటూ అన్నాడు రామనాథం.     అగాధంలోకి పడిపోతున్న సుశీలమ్మ చేతికి మెట్టు ఒడుపుగా దొరికినట్టు అనిపించింది.     "నిజంగానా? వాడు వెళ్ళిపోతే నేను బతకనండీ" కంఠం రుద్దమయింది.     "ఛ! ఏం మాటలవి? నా వల్లనే ఈ అనర్థం ఏర్పడింది. నువ్వు వాడికి తల్లివి కాగలిగావు కాని నేను తండ్రిని కాలేకపోయాను" గద్గద కంఠంతో అన్నాడు రామనాథం.     "అలా అనకండి. మీకూ వాడి మీద ప్రేమ వుంది. అది నాకు తెలుసు. నిజం చెప్పండి. వాడు ఏం చేస్తాడోనని మీకు మాత్రం భయంగా లేదూ!"       రామనాథం కళ్ళలో నీరు తిరిగింది.     "నాకు తెలుసు. వాడంటే మీకూ ఇష్టమే. మీరూ బాధపడుతూనే వున్నారు."     "వాడు ఎక్కడికెళ్ళడూ?" మాట మార్చే ఉద్దేశంతో అన్నాడు రామనాథం.     "ఏమో తెలియదు. పిచ్చి సన్నాసి! వాడూ నా గురించి బాధపడుతున్నాడండీ పొద్దున్నే కలవరిస్తున్నాడు. "అమ్మా!" అంటూ పిచ్చికేక వేశాడు. నామీద ఏదో పీడకల వచ్చిందట!"     "నేను చెప్పలా? వాడు నిన్ను వదిలి ఎక్కడికీ వెళ్ళడు."     "ఆ మాటే  వాడూ అన్నాడండీ?"     "ఎప్పుడూ?"     "నిన్న సాయంకాలమే. నేను బాధపడుతుంటేనూ...."     "నువ్వు వాడి ముందు బాధపడకు. గుచ్చి గుచ్చి ఏమీ అడగకు ఎప్పటిలాగే ఉండు. రెండురోజుల్లో వాడు మళ్ళీ అన్నీ మర్చిపోతాడు.     అన్నాడే కాని శరత్ ఈ విషయాన్ని అంత త్వరగా మర్చిపోడు. రామనాథానికి అంతరాంతరాల్లో ఎక్కడో భయంగానే వుంది. అంత త్వరగా మర్చిపోవడానికి పసివాడు కాడని తెలుసు. అయినా భార్యకు ధైర్యం చెప్పడానికి అన్నాడు.          "నాకు ఆఫీసు టైం అయింది."     "టిఫెన్ చెయ్యండి" అంటూ టిఫెన్ ప్లేట్లో పెట్టింది.     "నువ్వు కూడా తిను."     "నేను తర్వాత తింటాను."     రామనాథం టిఫెన్ చేస్తూ వుంటే సుశీలమ్మ శరత్ చిన్ననాటి విషయాలు చెప్పసాగింది.     రామనాథం శ్రద్ధగా వింటూ టిఫెన్ చేస్తున్నాడు.     రామనాథం భార్యకు దిగులుగా కనిపించవద్దని మరోసారి హెచ్చరించి ఆఫీసుకు వెళ్ళిపోయాడు.     సుశీలమ్మ కూర్చున్న చోటునే దిగాలుపడి కూర్చుండిపోయింది.     భర్త వెళ్ళిపోగానే మళ్ళీ పుట్టెడు దిగులు ఆమె మనసును కుదిపింది.                                                                      9     శరత్ పిచ్చెక్కినట్లు ఊరంతా ఎక్కడెక్కడో తిరిగి అప్రయత్నంగానే అనేక బస్ స్టాపుల్లో నిన్నటి బిచ్చగత్తె కోసం చూచాడు.       ఆమె ఎక్కడా కన్పించలేదు.     తన పిచ్చికి తనే నవ్వుకున్నాడు.
1
                                                                                        8. దశరథుని మరణము         పశ్చాత్తాపముతో కుమిలిపోవుచున్న నేనప్పుడా ముని వాక్యమును పట్టించుకొనలేదు. అప్పటికింకనూ అవివాహితుడైన నాకు పుత్రులను గురించిన ఆలోచన లేవియూ రాలేదు. అనతి కాలముననే శాపము మాట మరచిపోయినాను.         రథముతో అయోధ్యకు తిరిగి వచ్చిన సుమంత్రుడు కౌసల్య అంతఃపురముననున్న దశరథునితో "ప్రభూ సీతారామ లక్ష్మణులను 'గంగ యొడ్డు'న దింపి వచ్చినాను. వారీపాటికి నదిని దాటి అరణ్యమున ప్రవేశించి యుందురు" అని చెప్పి వెడలినాడు. దశరథుడు 'పుత్రకామేష్టి ప్రసాదించిన పుత్రులలో ఇరువురును అడవుల పాలు చేసికొంటినని" దుఃఖించసాగినాడు. కౌసల్య నిష్ఠురముగ 'కైకకు వశ్యులై మీరు నాకునూ సుమిత్రకును శోకమును కలిగించినారు! ఏడ్వవలసినది మేము. మీకెందులకీ దుఃఖము?" అన్నది. దశరథుడు దైన్యముతో "కౌసల్యా, చచ్చిన పామును కొట్టెదవెందులకు? శాపగ్రస్తుడనగు నేనింక బ్రతుకను!" అన్నాడు. కౌసల్య పశ్చాత్తాప్తయై "ప్రభూ నన్ను క్షమించుడు. రామునితో ఎడబాటు నా వివేకమును నశింపజేసినది!.....'శాపగ్రస్తుడ'నన్నారేమిటి? ఇదివరకెన్నడునూ చెప్పలేదే" అని ఆందోళనను వ్యక్తము చేసినది.         "నేను యువరాజుగా ఉన్నప్పుడు జరిగినదది. నేనా విషయమును మరచియే పోతిని. ఇప్పుడెందు వల్లనో జ్ఞప్తికి వచ్చినది. వినుము: నేనానాడు సరయూనదీ తీరమందలి యడవికి వేట కొరకు పోయినాను. ధనుస్సును పట్టుకొని క్రూరమృగములకై నిరీక్షించుచూ ఒక చెట్టు మాటున నిలిచినాను. సూర్యుడస్తమించి చీకటి వ్యాపించినది కాని జంతువేదియూ అటు రాలేదు. నగరమునకు తిరిగిపోవుద మనుకొనుచుండగా సమీపమందలి సెలయేరు నుండి బుడ బుడయను శబ్దము వినవచ్చినది. జంతువేదియో వచ్చి నీరు త్రాగుచున్నదని తోచినది. శబ్దమును బట్టి జంతువెక్కడనున్నదో ఊహించుకొని దానికి తగులునట్లు బాణమును ప్రయోగించు నేర్పు నాకున్నది. నేను వదలిన వాడియమ్ము అత్యంత రయమున పోయి గుణిని గ్రుచ్చుకొన్నది మరుక్షణము నాకచ్చట నుండి మానవ కంఠమున నొక ఆర్తనాదము వినవచ్చినది: "అయ్యో! ఎన్నడునూ ఎవ్వరికినీ అపచారము చేయని నన్నీ బాణముతో కొట్టిన క్రూరుడెవడు? అంధులునూ వృద్దులునూ అగు నా తల్లిదండ్రుల దాహమును తీర్చుటకు ఈ జల కలశమును కొనిపోవుటకు ముందే ఇచ్చట మృత్యువువాత పడుచున్నాను".         ....నేను జరిగిన నా పొరబాటును తెలిసికొని ఆచోటునకు పరుగెత్తి పోయినాను. నా వాడియమ్ము రొమ్మున లోతుగా చొచ్చుకొని పోయి గిలగిల కొట్టుకొనుచున్న ముని కుమారుడొకడు సెలయేటి యొడ్డున కనపడినాడు. అతడు నన్ను చూచుటతోనే "ఈ శరమును నా వక్షము నుండి పెరికివైచి నా ప్రాణములు త్వరగా పోవుటకు తోడ్పడుము. మరణయాతనను భరించలేకపోవుచున్నాను...సమీపముననే ఉన్న మా పర్ణశాలకు పోయి నా తల్లిదండ్రులకు నా మరణవార్తను తెలియజేయుము" అని అర్ధించినాడు.         నేనాతడు కోరినట్లు చేసి అతడు అసువులను బాసిన పిమ్మట జలభాండమును తీసికొని కుటీరమునకు పోయినాను. అంధుడగు అతని తండ్రి నా అడుగుల సవ్వడిని విని తన తనయుడే యనుకొని "నాయనా శ్రవణ కుమారా నీరు దెచ్చెదనని పోయి ఆలసించితివేమి?" అని అడిగినాడు. నేను దైన్యముతో జరిగినదంతయూ విన్నవించినాను. ఏకైక సుతుని మరణవార్తను విని ఆ దంపతులు గుండెలు పగులునట్లు రోదించినారు. "ముదిమియందున్నాము; కన్నులు కనపడుటలేదు; ఇంక మాకు దిక్కెవరు? మేమునూ ప్రాణములను విడిచెదము" అని యేడ్చినారు. ఆ వృద్దుడు క్రుద్ధుడై "మమ్మీ దుస్థితికి తెచ్చిన నీవునూ పుత్రశోకమున మరణించెదవు గాక!" అని శపించినాడు.         పశ్చాత్తాపముతో కుమిలిపోవుచున్న నేనప్పుడా ముని వాక్యమును పట్టించుకొనలేదు. అప్పటికింకనూ అవివాహితుడనైన నాకు పుత్రులను గురించిన ఆలోచన లేవియూ రాలేదు. అనతి కాలముననే శాపము మాట మరచిపోయినాను.         ...కైకేయి ఆదేశానుసారము భరత శత్రుఘ్నులు అయోధ్యను చేరుకొనుటకు ఎనిమిది దినములు పట్టునని అనుకొనుచుండగా సుమంత్రుడు వచ్చి రామలక్ష్మణులీపాటికి అరణ్యమును ప్రవేశించి యుందురని చెప్పినాడు. నాకు తటాలున నా నల్వురు కుమారులలో ఎవరునూ నేడు నావద్ద లేడన్న సత్యము గోచరించినది. ఆ క్షణముననే ముని శాపమునూ స్పురించినది. ఇప్పుడు నా శరీరమున అణువణువునూ కంపించుచున్నది! అవయవములు శక్తిని కోల్పోవుచున్నవి! శాపము ప్రకారము నా ప్రాణములు నిష్క్రమించు సమయము సమీపించుచున్నదని తోచుచున్నది!"         కౌసల్యాదేవి ఆందోళనతో లేచి "నాథా మీకిప్పుడు విశ్రాంతి అవసరము" అని దశరథుని తల్పము వద్దకు తీసుకొనిపోయి పరుండ బెట్టినది. నిద్రకువశ్యుడైన దశరథుని కన్నులు మూయబడినవి. అవి మరల తెరువబడలేదు. మహారాజు ప్రాణములు సుషుప్తియందే ఎగిరిపోయినవి. తల్పమున తనువు మాత్రమే మిగిలినది.                                                                                          *
2
    "ఎలా వుంది ఫ్రెండ్..... "     "టప్ టపా టప్" దూరంగా ఎక్కణ్నుంచో వస్తున్నట్టూ వుంది ఆ స్వరం. సన్యాల్ సన్నగా నవ్వేడు.     టెలివిజన్ తెరమీద గ్రాఫ్ కనబడ్తుంది. కంప్యూటర్ చేరవలసిన పాయింట్ కన్నా ఎడమవైపుకి వెళుతున్నట్టు గమనించి చూపుడు వేల్తో కొద్దిగా పక్కకి జరిపేడు. అతడు దాన్ని తలలో కొద్దిగా కదుపుతూ వుంటే బయట టెలివిజన్ లో అది కనబడుతూంది.     రెండు నిమిషాల్లో అతను చేరవలసిన స్థానాన్ని చేరుకున్నాడు. గ్రాఫ్ లో వున్న పాయింట్ కి, మెదడులో వున్న కంప్యూటర్ పాయింట్ కి చేరుకోగానే -ఏడు టెలివిజన్ తెరల్లోనూ ఒకే పదం కనిపించింది.     CORRECT     సన్యాల్ సిమెంట్ తో తల రంధ్రాన్ని పూడ్చేసేడు. భూమిలోంచి కొత్తిమీర మొక్కలు పొడుచుకొచ్చినట్లు, రోగి తలలోంచి వైర్లు బయట కొచ్చి వున్నాయి.     సన్యాల్ సంతృప్తిగా నిలబడి ఊపిరి పీల్చుకోవటంతో ఆపరేషన్ స్టేజీ వన్ విజయవంతమైనట్టు పండిత్ గ్రహించేడు. గాఢంగా ఊపిరి వదులుతూ సన్యాల్ గుండె నిమురుకోవడం చూసి, "ఏమైంది" అని అడిగేడు పండిత్.     "సన్నటి నొప్పి -అప్పుడప్పుడొస్తూంది" నవ్వేడు సన్యాల్.     ఫర్లేదు గుండెకి బదులు బర్చర్ వాల్వ్ పెట్టొచ్చు. రేడియో ధార్మిక శక్తితో అది నడుస్తూంది. అప్పుడు గుండె నిరంతరం కొట్టుకునే అవసరం ఉండదు. ఆ ఎనర్జీ అంతా శరీరానికి మిగిలిపోతుంది. దాంతో మనిషికి విపరీతమైన శక్తి వస్తుంది. గంటకి యాభై మైళ్ళ వేగంతో పరిగెత్త గలిగే శక్తి వస్తుంది. అప్పుడు సిటీబస్ లు అక్కర్లేదు. ఈ లోపులో STAGE 5 COMPUTER system వస్తుంది. అనాసిస్ టాబ్లెట్ పరిమాణంలో మెదడు తయారు చేయబడుతుంది. ఇంగ్లండులో వున్న స్నేహితుడు అతడి మెదడులో ఈ టాబ్లెట్ ని చొప్పించుకుని పరిదోరుజపాటు లండన్ అంతా చూసి, దాన్ని భారతదేశం పంపిస్తే - ఆ టాబ్లెట్ ని ఇక్కడ మన మెదడులో చొప్పించుకుంటే ......పదిరోజుల పాటు లండన్ చూసిన అనుభూతి కల్గుతుంది. అంటే..... భౌతికమైన అనుభవానికీ, మానసిక అనుభూతికీ మధ్య తేడాని కంప్యూటర్ తగ్గించేస్తుంది. మనిషి ఇంట్లో కూర్చుని ఈ భావనా తరంగాల సాయంతో గాలిలో ప్రయాణం చెయ్యవచ్చు. (నారదుడిలా) తెలివైన వాళ్ళ మెదళ్లు తెలివి తక్కువ వాళ్ల మెదడుని ట్యూన్ చేస్తే బార్య హేమమాలినిలా కనబడ్తుంది. ఇంకా ముందుకెళితే - ఇంట్లో కూర్చునే మెదడుని సినిమా హాలుకి పంపిచవచ్చు. స్మశానంలో కూర్చుని ఎక్కడో హాయిగా పని చేసుకుంటున్న వాడిని క్షణాలమీద చంపవచ్చును........     అంతే చేతబడి...     .....................     ......................     "ఏమిటి ఆలోచిస్తున్నారు"     పండిత్ తడబడి "ఏం లేదు" అన్నాడు.     "ఇంకా చిన్న పని మిగిలివుంది......." అన్నాడు సన్యాల్. ఔను -మెదడులో అమర్చిన కంప్యూటర్ కు సరిపోయే శక్తినిచ్చే పని ఇంకా మిగిలివుంది. పండిత్ చిన్న పాకెట్ లాటికి డాక్టర్ కి అందించేడు. అందులో ముప్పైఏడు గ్రాముల రేడియో ఆక్టివ్ ఐసోటోపు ప్లూటోనియం -  239 వుంది. పైకి అది మామూలుగా కనబడుతోంది. కానీ, అది బహిర్గతం చేసే వేడితో పదిమందికి సరిపడా వంట చెయ్యవచ్చు.     సన్యాల్ రోగి భుజం దగ్గిర చర్మాన్ని కోసి, ఆ పాకెట్ ని శరీరంలో అమర్చేడు. తల దగ్గిర్నుంచి సన్నటి గీతలా చర్మాన్ని కోసి, వైర్లని భుజం దగ్గిర కలిపేడు.     పండిత్ కి తెలుసు -ఈ రోగి మరణించినపుడు జాగ్రత్తగా ఈ శరీరంలోంచి ఆ రేడియో ఆక్టివ్ పాకెట్ తీసెయ్యాలని..... లేకపోతే రోగి చచ్చిపోయిన తరువాత, ఆ పాకెట్ గానీ విడిపోతే ఆ శవాన్ని పాతిపెట్టిన ధార్మిక శక్తికి స్మశానంలో ప్రవేశించినవాళ్ళు కూడా శవాలుగా మారతారు -రేడియో.     మరో రెండు నిముషాల్లో సన్యాల్ రోగి భుజం దగ్గిర చర్మం కుట్టేశాడు. ఆ తరువాత పెద్ద కంప్యూటర్ దగ్గిరనుంచి రోగి మెదడుకి సూచన్లు యివ్వసాగాడు. ఒకటి రెండు -మూడు-     అలా ఒక్కో సూచనా పంపిస్తూంటే -రోగిలో చలనం లేదు. ఆపరేషన్ ఫెయిలయిందా అని అనుమానపడ్డాడు పండిత్. ముప్పైరెండు ఎలక్ట్రోడ్ నుంచి పంపిన సూచనకి రోగి కొద్దిగా కదిలేడు. సన్యాల్ పెదవులమీద విజయవంతమైన చిరునవ్వు వెలిసింది రోగి చెవి దగ్గరగా వంగి "నీ పేరు" అన్నాడు. రోగి పెదవులు అస్పష్టంగా కదిలినయ్ మాటరాలేదు! ముప్పైమూడో ఎలక్ట్రోడ్ ప్రయత్నించి - తిరిగి అడిగాడు "నీ పేరు"
3
    "అది ఊరుకున్నా  మీరు వుండలేరు. మీరిద్దరే  వుండండి. నేను వెళ్ళిపోతాను" అని కోపంతో  చేతినున్న  బంగారు గాజులన్నీ  తీసేసి విసిరేశారావిడ.     దీపాలు  పెట్టేవేళ అవుతోంది.     నేను గబగబా  వెళ్ళి ఆ గాజులన్నీ  తీసి ఆవిడ చేతికిచ్చి, "చూడండీ మరెప్పుడూ  ఇలాంటి పని చెయ్యకండి. నేను కూడా మీ మనసు నొప్పించే పని చెయ్యను. ముందు మీరీ గాజులు  తొడుక్కోండి. ఇప్పుడు  చెపుతున్నాను. నా మాట నమ్మండి. మీరే వచ్చి నన్ను పిలిచేవరకూ మళ్ళీ మీ గుమ్మంలో  అడుగుపెట్టన"ని చెప్పేసి చకచకా  నడుచుకుంటూ  వెళ్ళిపోయాను.                                                *    *    *    *     ఇంటికెళ్ళి  జరిగినదంతా  చెప్పాను.     "పెళ్ళి విషయం  చెప్పావా?" అని అడిగారు.     "మీకు  చెప్పద్దని చెప్పి నేనెలా  చెప్తాననుకున్నారు?" అన్నాను.     నాకు మాత్రం  మనసు మనసులోలేదు. పరిస్థితులు  చక్కబడి, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ  హాయిగా  వుంటామన్న ఆశ లేదనుకుంటూనే నిద్రపోయాను.                                                     *    *    *    *     మర్నాడు ఉదయం ఎనిమిది గంటలు  కూడా కాలేదు. శ్రీశ్రీగారు వచ్చేశారు. నాడు చెప్పలేనంత  ఆనందం, ఆశ్చర్యం కలిగాయి.     "అదేమిటి? మీరొచ్చేశారు?" అన్నాను.     "నువ్వెలాగూ  అక్కడికి రావని నిర్ధారణ అయిపోయింది. అందుకే నేనే వచ్చేశాను" అన్నారు.     "ఒంట్లో ఎలా వుంద"ని  మావాళ్ళందరూ  ప్రశ్నించారు.     "బాగుంది" అన్నారాయన.     "ఏవండీ! డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నారుగా! మీరిలా  తిరిగితే  ఎలా?" అని అడిగాను.     "మరేం ఫరవాలేదు సరోజా! వారం పైగా   అయింది. ఇంట్లోనే  వుండి, నాకూ బోరే" అన్నారు.     మా అమ్మ కాఫీ ఇచ్చింది.     "ఇక రెండు పూటలా  నేనే వచ్చి వెళుతూ  వుంటాను" అనీ, కొంతసేపు కూర్చొని ఇంటికి వెళ్ళిపోయారు.     అలా మరో పదిరోజులైపోయింది. పెళ్ళివారి దగ్గరి నుండి మాకు కూడా ఉత్తరాలు వస్తున్నాయి. మా ఇంట్లో 'శ్రీశ్రీగారితో  ఈ మాట ఎప్పుడు చెప్తామా?' అని కాచుకు కూర్చున్నారు.     శ్రీశ్రీగారు బాగా  కోలుకున్నారు. కంపెనీలకి  కూడా వెళ్ళి వస్తున్నాం.     ఓ రోజు సాయంకాలం ,అయిదు గంటలప్పుడు  శ్రీశ్రీగారు వచ్చారు. మా నాన్నగారు కూడా ఇంట్లోనే వున్నారు. అందరం కూర్చున్నాం.     "మా సరోజకి  పెళ్ళి చెయ్యాలనుకుంటున్నామండీ" అని మా నాన్నగారు శ్రీశ్రీగారితో అన్నారు.     ఆయన సిగరెట్ దమ్ము తీస్తూ  ఏదో ఆలోచనలో వున్నట్టున్నారు. ఈ మాట సరిగ్గా గమనించలేదు.     నేను వెంటనే "మిమ్మల్నేనండీ! నాన్నగారు ఏదో అంటున్నారు" అన్నాను.     'ఏమిటి' అన్నట్టు  మా నాన్నగారివైపు  చూశారు.     "మా సరోజకి  పెళ్ళి చెయ్యాలనుకుంటున్నాం. సంబంధం కూడా సెటిలయింది" అన్నారు.     "సంబంధం సెటిలయిందా? సరోజకి  పెళ్ళి చేస్తారా? అదెలా  చేస్తారండీ" అన్నారు శ్రీశ్రీగారు.     "ఎలా చెయ్యడం ఏమిటి? ఆడపిల్లని కన్నాక  ఎప్పుడైనా పెళ్ళి చేసి పంపాల్సిందేగా? తప్పుతుందా?" అన్నారు  మా నాన్నగారు.     "మీరు సరోజకి పెళ్ళి చెయ్యడానికి  వీల్లేదండి" అని శ్రీశ్రీగారన్నారు.     "మీరన్నది  మరీ బాగుంది. వీల్లేదంటే  ఎలా? అలాగనడంలో  మీ ఉద్దేశం ఏమిట"ని నాన్నగారు  అడిగారు.      "ఇందులో  ఉద్దేశానికేముంది? సరోజ  నాకు కావాలి. అది లేకుంటే నేను బతకలేను. సరోజ నాది_నా స్వంతం" అన్నారు శ్రీశ్రీగారు.     "అంటే  అది లేకుంటే  మీరు..." అని ఆశ్చర్యంతో ఏదో అడగబోయి ఆగిపోయారు నాన్నగారు.     "అవును. నేను చచ్చిపోతాను" అన్నారు శ్రీశ్రీగారు.     "ఇలాంటి మాటలాడకండి. అనడం తేలికే_ఒకరికోసం ఒకరు చనిపోవడమన్నది అనుకున్నంత, అన్నంత తేలిక కాదు" అన్నారు మా  నాన్నగారు.     "మీకు శ్రీశ్రీ సంగతింకా  తెలీదు. నేను  అనుకుంటే  తిరుగులేదు. మీరు సరోజని  ఇంకొకడికిచ్చి  పెళ్ళి చేస్తే నేను సముద్రంలో  పడిపోతాను" అంటూ చటుక్కున లేచి, సిగరెట్ దమ్ము లాగుతూ, చకచకా  గేటుదాటి వెళ్ళిపోయారు.                                          ఐ లవ్ యూ సరోజా!     "ఏవండీ_ఏవండీ" అని  పిలుస్తూ  ఆయనవెంట  పడ్డాను.     వెనక్కి తిరిగి చూడకుండా  వెళ్ళిపోతున్నారు. నేనూ  తొందరగా వెళ్ళి  "ఎక్కడికండీ వెళుతున్నారు" అని చటుక్కున  చెయ్యి  పట్టుకుని  ఆపాను.     ఆయన వెళుతున్నది  సముద్రంవైపే! ఆయన కళ్ళు ఎర్రగా  వున్నాయి. "చెయ్యి వదులు సరోజా!" అన్నారు.     అంతవరకూ  ఆయన ముఖాన్నే  చూస్తున్న  నేను ఆ మాటలతో  కోలుకొని చెయ్యి వదిలేశాను.     మళ్ళీ ఆయన నడవడం  ప్రారంభించారు. ఆయనతోపాటు  నేనూ నడుస్తున్నానని  చెప్పడం కన్నా, పరుగు పెడుతున్నానంటే  బాగుంటుంది.     "నీకీ పెళ్ళి  విషయం ముందే తెలుసా?" అని ప్రశ్నించారు.     "తెలుసు" అన్నాను.
4
    అయన అలా వెళ్ళిపోగానే గుమ్మం పక్కనుంచి  రాజు బయటకు వస్తూ "పడ నీళ్ళున్నాయి.... ఈ రోజు వేణ్ణీళ్ళులే.  స్పెషల్..... అంతేకాదు ప్రతిరోజూ లాగా అక్కడ రష్ గా వుండదు. వాళ్ళంతా లేచే సమయానికి నువ్వెళ్ళిపోతావ్ గా" అన్నాడు. అదే శాడిస్టు నవ్వుతో .         చిరంజీవి మాట్లాడలేదు. అతడి మనసంతా అదోలాటిస్థబ్ధత అపరించి వుంది. ఏదో లోకంలో వున్నట్టు తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. కొద్దిసేపట్లో, చాలా కొద్దిసేపట్లో  ఒకతాడు తన మెడకి బిగుసుకోబోతున్నదన్న ఆలోచనే నమ్మశక్యం కాకుండావుంది. కానీ అదంతా  మామూలుగా జరిగిపోతూంది.__ ఏడీ ఆగటంలేదు ప్రాణం కూడా అలానే పోతుంది.         నాలుగు గోడలమధ్య__ నెమ్మదిగా నాలుగు చెంబుల నీళ్ళు పోసుకొని,స్నానం అయిందనిపించాడు. జైలు  దుస్తులు కొత్తవి __ తెల్లవి ఉరికి ముందు తోడగబడేవి__ ఇవ్వబడ్డాయి.         వాటిని ధరించాడు.         వేడినీటి తాలూకు ప్రాభవం పోయి, కొద్దిగా చలి పెట్టసాగింది. చుట్టూ ఇద్దరు గార్డులు. అతడి కళ్ళు తడబడ్డాయి.కనీ బహుశా,అది చలివల్ల వచ్చింది అయి వుంటుంది.మెట్లెక్కి వరండా గుండా తన సెల్ కి వచ్చాడు. అక్కడో ఇద్దరు సెంట్రీలున్నారు. అందరూ వొక్కరొక్కరే చాలా నిశ్శబ్దంగా తమ పనులకి తాయారవాటం తెలుస్తూంది.         అతడు  సెల్ వైపుకి రాగానే, అక్కడివాళ్ళు కొద్దిగా దూరంగా వెళ్ళి నిలబడ్డారు.         దైవప్రార్ధనచేసుకోవటం కోసం ఏకాంతం కల్పించబడింది. మోకాళ్ళమీద వంగి కొద్దిసేపు, చాలా కొదిసేపు తన ఇష్టదైవాన్ని పార్ధించాడు. తరువాత కళ్ళు తెరిచాడు. అతడి చూపు కాగితాల మీద పడింది. సర్వోత్తమారావు ఇచ్చిన కాగితాలు అవి. ఉరి రద్దుకోసం ఏర్పాటుచేసిన ఉపన్యాసం కాగితాలు. అనుకున్నది అనుకోన్నట్టూ జరిగితే ఎత్తయిన ఉపన్యాస వేదికమీద చదవవలసినవి!         ప్రార్ధన ముగియగానే, అతను వాటిని చదవటం ప్రారంభించాడు. సర్వోత్తమరావు చేతి వ్రాతతో వున్న వ్యాసం అది.         "ప్రతీ సహజమైన చావు భయం, కరుణ, బాధ వుంటాయి. రక్షించటానికి డాక్టర్లు ప్రయత్నం చేస్తూ వుంటారు. బంధువులు ఆశతో ఆవేదనతోఎదురుచూస్తూ వుంటారు. ఎన్నోకన్నీటిచుక్కలు రాలటానికి సిద్ధంగా ఉంటాయి. ముందు కోమా వస్తుంది. ఆ నిద్రలో మరణం నెమ్మదిగా వచ్చి, తనతోపాటుహాయిగా తీసుకుపోతుంది. కానీ "ఉరి" వెనుక భయం తప్ప ఇంకేమి లేదు. ఆర్నెల్లముందే ప్రాణం ఎప్పుడు పోతుందో తెలుస్తుంది. అప్పట్నుంఛీ క్షణం క్షణమూ దిగులే. ఆశ ఉండదు. మన కోసం ఏడ్చే వాళ్ళుండరు. అనారోగ్యం ఉండదు. చాలా స్థబ్దంగా, అమనుషంగా తోటి మనిషి ప్రాణం మేడద్వారా బయటకి లాగి వేయబడుతుంది.         హత్య చేసిన వ్యక్తికీ మరణమే సరి అయిన శిక్ష అన్న భావం మనలోంచి పోవాలి. 1956 లో రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయం అడిగినప్పుడు చాలా ప్రభుత్వాలు ఉరిని " ఉంచుకుని" కోరటం దురదృష్టం. 1972 లో ఎర్పాటయిన"లా కమీషన్ " కూడా కొన్ని ప్రత్యెక సందర్భాలలో ఉరి అమలు జరపవచ్చునన్నది. అయితే ఏ ఏ  ప్రత్యెక సందర్భాల్లో వివరించలేదు. ఈ కమిటీ అడవాల్లాని కూడా ఉరి తీయవచ్చుని రికమెండు చేసింది.         ఉరిశిక్ష దేశంలో నేరాల్ని తగ్గిస్తుందనీ కానీ, ఉరి తీస్తారుమానాన్న భయంతో మనిషి హత్య చేయటం మానేస్తాడన్న వాదనగానీ నిలబడవు. భారతదేశంలో హత్యలు, సెక్సు సమస్యల వల్లగానీ గ్రామీణ  ప్రాంతాల్లో భూమి, రాజకీయ తగాదాళవల్ల కాని ఎక్కువగా జరుగుతాయి. వీటికీ, ఉరిశిక్షకీఏ సంబంధమూ లేదు.....         చాలామంది జడ్జీలు ఉరిశిక్షకు వ్యతిరేకులు. జస్టిస్ కారేగట్ తన జీవితంలో ఎవరికీ ఉరిశిక్ష విధించని, ప్రకటించాడు.  ప్రభుత్వం అతడిని రాజీనామా చేయమని కోరగానే, మాటమీద నిలబడి ఉద్యోగం వదులుకున్నాడు. ఇలాటి మానవతా వాదులు భారతదేశంలో యెక్కువమందిలేకపోవతండురద్రుష్టకరం. జవహర్ లాల్ నెహ్రూ తాను వ్యక్తిగతంగా ఉరికి వ్యతిరేకినని చెప్పేవారు. శ్రీమతి ఇందిరాగాంధీకూదాయిదే అభిప్రాయం పలుమార్లు వెల్లడించారు.         మన న్యాయశాస్రం  బ్రిటన్ నుంచి అరువు తెచ్చుకోబడింది. చిత్ర మేమిటంటే ప్రస్తుతం బ్రిటనే ఉరిని రద్దుచేసింది. మనం యింకా దాన్ని పట్టుకుని వేలాడుతున్నాం. పాకిస్తాను లో నేరస్తుణ్ణి ఇప్పటికీ బహిరంగంగా రాళ్ళతోకొట్టి చంపుతారట. ఒకప్పుడు కాళ్ళకి రాయికట్టి నీళ్ళలో పడవేసిచంపటం, గుర్రాలచేత తొక్కించిచంపడం అమల్లులో ఉండేవట. ఇవన్నీ మనకెంత అనాగరికంగా కనబడ్తూన్నాయో , మన 'ఉరి' మిగతా దేశవాసులకు అంత అనాగరికంగా కనబడ్తుంది. ఒక వందేళ్ళు పోయేక మన భావితరం వాళ్ళు మన గురించి కూడా "వాళ్ళు ఉరి తీసి మనుష్యుల్నిచంపేవారట" అని చిత్రంగా చెప్పుకుంటారు.         ఎటువంటి నేరస్తుల్ని ఉరికంబానికిపంపాలో మన న్యాయశాస్రం సరిగ్గా చెప్పలేదు. ఎటువంటి పరిస్థితుల్లో ఉరిశిక్ష విధించాలో మన జడ్జీలకుతెలీదు. ఒక నిర్దోషికివేసిన "ఉరి"  అది అమలు జరిగిన తర్వాత అతడి నిర్దోషిత్వం బయటపడితే, వెనక్కి తీసుకోలేని దారినమైనాశిక్ష. నిర్దోషిత్వం బయటపడింది.         దేశంలో మరణశిక్షని పూర్తిగా రద్దు చేయాలి. దారుణంగా హత్య చేసిన వ్యక్తిని అంతకన్నా దారుణంగా చిత్రహింస పెట్టండి!! మరణించే వరకూ జైల్లో బంధించండి! అంతేకాని మరణశిక్ష విధించకండి.!!         ఉరి అమానుషమైనది!         ఉరి క్రూరమైనది!         మనిషి బ్రతికే హక్కుని సాటిమనిషితీసేయయలేదు!!         ఉరి రద్దు చెయ్యండి! సెక్షన్ 302 మార్చండి!!         అదే మా "అభిలాష!!"       
5
     "ఎందుకొచ్చావ్ లోపలికి?" అన్నాడు పరుషంగా.     తాపిగా కుర్చీ లాక్కుని కూర్చున్నాడు తేజస్వి. తన చేతిలో ఉన్న డిస్మిసల్ ఆర్డర్ ని నిర్లక్ష్యంగా టేబుల్ మీద పడేశాడు.     "వాటిజ్ దిస్!" అన్నాడు శశికాంత్ కోపంగా.     "అదే నేను అడుగుతున్నాను. ఏమిటది?" అన్నాడు తేజస్వి.     ఓరకంటితో ఆ పేపరు వైపు నిర్లక్ష్యంగా చూసి, "అది నీ డిస్మిసల్ ఆర్డర్! వుద్యోగం ఉడపీకేస్తున్నట్లు ఉత్తర్వు! ఇంగ్లిషు చదవడం రాదా నీకు?" అన్నాడు శశికాంత్.     "ఏ కారణం మీద నన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నారు?"     "అది అక్కడే రాసి ఉంది. పర్మిషన్ లేకుండా లీవులో వెళ్ళడం!"     "నేను ఉద్యోగంలో చేరాక ఇన్నేళ్ళ సర్వీసులో ఇదే మొదటిసారి లీవు పెట్టడం!"     "అయితే! నేను ఇన్నేళ్ళ వైవాహిక జీవితంలో ఇదే మొదటిసారి వ్యభిచరించడం - అని ఏడ్చిన పతివ్రత కధలా ఉంది నువ్వు చెప్పేది."     "నాకు కావలసినంత లీవు ఉంది" అన్నాడు తేజస్వి.     "కానీ లీవు తీసుకోవడానికి నా పర్మిషన్ లేదు."     సహనం కోల్పోయి అన్నాడు తేజస్వి-     "నాలుగు రోజుల క్రితం మనిషిగా చలామణి అయ్యే ఓ రెండు కాళ్ళ మృగం తన భార్యని బలవంతంగా బయటికి గేంటేస్తే ఆ నిస్సహాయురాలి బాగోగులు చూడడానికి నేను ఉండిపోవలసి వచ్చింది.     అది విని భగభగలాడుతూ అన్నాడు శశికాంత్.     "ఆ రోజు దాన్ని తరిమివేసినట్లే ఇవాళ నిన్ను వెళ్ళగొట్టేస్తాను."     "అది మీ తరంకాదు? ఒక పర్మినెంట్ ఉద్యోగిని ఉద్యోగంలో నుంచి తీసెయ్యడమంటే, భార్యని బయటికి గేంటేసినంత తేలిక కాదు. నేను నోరూ వాయీ లేని సౌమ్యని కాను. కిక్కురు మనకుండా వెళ్ళిపోవడానికి."     "నేను ఈ కంపెని యజమానిని. నా ఇష్టానుసారం చెయ్యగలను."     "యూ ఆర్ మిస్టేకెన్! ఈ కంపెని యజమాని మిసెస్ సౌమ్య.     "అని దురభిప్రాయపడుతున్నావు నువ్వు."     "అంటే! వాట్ డూ యూ మీన్!" అన్నాడు తేజస్వి అనుమానంగా.     చటుక్కున లేచి నిలబడ్డాడు శశికాంత్!     "నీతో ఎక్కువ మాటలు అనవసరం! ముందు బయటకు నడు!"     తేజస్వి కూడా లేచి నిలబడ్డాడు.     "మిస్టర్ శశికాంత్! ఈ విషయం ఇక్కడితో ఆగదు. చాలా దూరం పోతుంది. ప్లీజ్ టేక్ దిస్ యాజ్ ఏ ఫ్రెండ్లి వార్నింగ్!     షటప్ అండ్ గెట్ అవుట్!'     పెద్ద పెద్ద అంగలు వేస్తూ బయటకు నడిచాడు తేజస్వి.     కోపాన్ని ఆపుకోలేక, పళ్ళు కొరుకుతూ అటూ ఇటూ పచార్లు చెయ్యడం మొదలెట్టాడు శశికాంత్.     కానీ పావుగంట గడవకముందే,     తేజస్వి ఇచ్చిన వార్నింగ్ తాలూకు ఎఫెక్టు కనబడటం మొదలెట్టింది శశికాంత్ కి.     తేజస్వి శశికాంత్ చాంబర్ లో నుంచి బయటికి రాగానే, అతన్ని చుట్టుముట్టారు కొలీగ్స్.     "వాట్ బాస్! వాట్ హపెండ్?" అన్నాడు సిసిల్ ఆదుర్దాగా.     జరిగినదంతా చెప్పాడు తేజస్వి.     "ఎంత తల పొగరు వీడికి! యూనియన్ లీడరువి, నిన్నే డిస్మిస్ చేస్తానంటాడా? నువ్వు వెళ్ళిపోతే మేం మాత్రం ఇక్కడ ఉంటామా ఏమిటి? అని పేపరు ఒకటి తీసుకుని, బాల్ పాయింట్ పెన్నుతో చకచక రాస్తూ, తన రాజీనామా పత్రం తయారుచేశాడు సిసిల్.     ఆ తరువాత, అలా చెయ్యమని ఎవరూ ఆదేశించకుండానే, అక్కడా వున్న ఉద్యోగులందరూ, చివరికి శశికాంత్ పర్సనల్ కారు డ్రయివర్ , గేట్ కీపర్ , ఆఫీసు బాయ్స్ సహా అందరూ - తమ ఉద్యోగాలకు రాజీనామా ఇస్తూ లెటర్స్ తయారుచేశారు.     తన సహచరులతో తేజస్వికి ఉన్న ఫాలోయింగ్ అలాంటిది!     ఆ లెటర్స్ అన్నిటిని కట్టగా పట్టుకెళ్ళి శశికాంత్ టేబుల్ మీద గిరవాటు వేసి వచ్చాడు సిసిల్. ఈలోగా రెచ్చిపోయిన ఉద్యోగులు కొందరు కిటికీల అద్దాలు బద్దలుకొట్టారు. పైళ్ళు ఆఫీసు పేపర్సు, చిందరవందర చేసి పారేశారు. గందరగోళం చోటు చేసుకుంది అక్కడ.     అతి కష్టం మీద వాళ్ళని శాంతపరచగలిగాడు తేజస్వి.       తరువాత అందరూ కలిసి, తేజస్విని భుజాల మీద మోసుకుంటూ , గేటు దాకా వచ్చి, అక్కడ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వడం మొదలుపెట్టారు.     అదే సమయానికి ఉజ్వల కారు అక్కడికి వచ్చింది. గేటుకి అడ్డంగా ఉన్న మనుషులని చూసి, అసహనంగా హారన్ మోగించింది ఉజ్వల. దానితో రెచ్చిపోయి, వాళ్ళు ఆమె కారు లోపలికి వెళ్ళకుండా చుట్టుముట్టేశారు.     తేజస్వి గనక కలగ జేసుకోకపోయి ఉంటె అక్కడ రక్తపాతం జరిగి వుండేదే. కానీ వాళ్ళని అదుపులో పెట్టగాలిగాడు తేజస్వి. హింసకు తావు ఉండకూడదని శాంతంగానే పనులు సాధించుకోవాలని వాళ్ళకు హితభోద చేశాడు.     ఉజ్వల కారుని లోపలికి వెళ్ళనిచ్చారు ఎంప్లాయిస్. శశికాంత్ చాంబర్ లోనికి నడిచింది ఉజ్వల. ఆగ్రహంతో దహించుకుపోతున్న శశికాంత్ ని చూసి అంది.     "ఏమయింది శశీ?"     కోపాన్ని కంట్రోలు చేసుకోలేక వణుకుతూ చెప్పాడు శశికాంత్.     "బాస్టర్డ్ ని ఉద్యోగంలో నుంచి పీకేయ్యడం చాలా సులభమనుకున్నాను. కానీ అనుకోకుండా పెద్ద ప్లేరప్ అయిపొయింది కేసు! కుందేళ్ళకి కొమ్ములోచ్చాయి కుమ్మడానికి చూస్తున్నారు" వద్దనుకున్నా అతని గొంతులో కంగారు ధ్వనిస్తోంది.     "ఉజ్వలా! ఏం చేయ్యబోతున్నావ్?"     "చేసేది చెప్పను! చెప్పేది చెయ్యను!" అంది ఉజ్వల పరిహాసంగా.                                                            * * *     ఆరోజు ఆఫీసులో జరిగిన గొడవ సౌమ్యతో చెప్పలేదు తేజస్వి.     అతను ఇంటికి వెళ్ళేసరికి సింపుల్ గా వంటచేసి ఉంచింది సౌమ్య. అతను రాగానే కాఫీ పెట్టి ఇచ్చింది.     మరో గంట తరువాత భోజనం చేస్తూ అన్నాడు తేజస్వి.      "రేపు మనం పిక్నిక్ కి వెళుతున్నాం."     అది వినగానే ఎగిరి గంతేసినంత పనిచేశాడు చిన్నీ.     "నిజంగానా? అయితే జూకి వెళదాం!"     "జూకే వెళుతున్నాం. అక్కడ నీలాంటి కోతి కూడా ఉంది. " అన్నాడు తేజస్వి.
6
         నీకు మాటిచ్చాను. ఆమాట కోసం నా ఉద్యోగమే కాదు. ప్రాణం పోయినా లక్ష్యపెట్టను. ఆ నరేంద్ర సంగతి నేను చూసుకొంటాను, భయపడకు, భీముడు, కీచకుడ్ని చంపినట్లు చంపేస్తాను. వాడ్ని , సరేనా!     "ఒద్దు. అలాంటి పని చేసి నువ్వు వాకు దూరం కాకూడదు. నేను బతికినంతకాలం నీ స్నేహం నాకు కావాలి విజయ్" అంది నాగమణి.     అమె మాటల్లో స్ధిరత్వం.......     అమె కళ్ళల్లో కురుస్తున్న కన్నీటిని చూసి చలించిపోయాడు విజయ్.     నరేంద్రని అప్పటికప్పుడు చీల్చి చెండాడాలనుంది.     అమె మాటల్ని అతను విశ్వసించాడు.     "నేను నీకు నిజమే చెప్పాను" అంది.     "నాకు తెలుసు!"     "నువ్వు నమ్మితే చాలు!" అంది హాండ్ కర్చీప్ తో కళ్ళు తుడుచుకొంటూ నాగమణి.     "మా వారు చాలా దుర్మార్గుడు విజయ్. మనిషిని ఎలాంటి హింస పెట్టడానికి వెనుకాడడు. డబ్బుతో తను చేసిన పాపాలని కప్పెట్టేస్తాడు. ఈ మద్య లాయర్ని పిలిచి వీలునామా రాయించడానికి ప్రయత్నిస్తున్నారు".     "వీలునామా దేనికి? వుంది నీవేగా!"     " నేను మంచిదాన్ని కాదని, నన్ను వదిలించుకోడానికి ప్రయత్నిస్తున్నారు. నేను జి.కె.ని పెళ్ళిచేసుకొంది డబ్బుకోసమే!"      అతను ఆశ్చర్యంగా చూశాడు.     "ఆ డబ్బుతో నేను కొండెక్కి కూర్చోవాలని కాదు. అది బ్యాంకుల్లో ఇనప్పెట్టెల్లో మూలగకుండా సద్వినియోగం చేయాలని కోరిక. నాలాంటి పేదవాళ్ళని అదుకోవాలన్న తపన"     "ఆయన ఇండ్రస్ట్రీయలిస్టు కదా!"     " అలాని డబ్బంతా పెట్టుబడి పెట్టడు ఏ పారిశ్రామికవేత్త కూడా!"     "అది నిజమే!"     " ఏం చేయాలో నేను ఆలోచించి చెప్తాను. ఇప్పటికే అలస్యం అయింది. పద!"     " నిన్ను డ్రాప్ చేసి వెళతాను!" అంది.     అమెతోపాటు కారు దగ్గరికి నడిచాడు విజయ్.     అమె కారు స్టార్ట్ చేసింది. అతను అమె పక్కనే కూర్చున్నాడు.     "ఎక్కడ దింపాలి?" అడిగింది నాగమణి.     "దారిలో వదిలేస్తావా?" అడిగాడు నవ్వుతూ.     "మరి?"     " మీ ఇంటికి తీసుకెళ్ళవచ్చుగా" నవ్వుతున్నాడు విజయ్.     "చాల్లే!" నాకిప్పుడే విడాకులు ఇప్పించేలా వున్నావు!" అంది.     అతను సీటుమీదుగా అమె భుజంపైన చేయి వేశాడు.     "భుజంమీద చేయ్యి వేస్తేనే, స్నేహితుడనుకోనవసరం లేదు." చిరుకోపంతో అంది నాగమణి.     "కిరణ్ వేస్తే లేని అభ్యంతరం నేను వేస్తే వుందా?" అన్నాడు విజయ్ నవ్వుతూ.     చురుగ్గా చూసింది కారు గభాల్న అపేసింది.     "ప్లీజ్ , కారు దిగు" అంది కోపంతో నాగమణి.      అమె ముక్కుపుటాలు ఎగిరిపడుతున్నాయి.     "నేను దిగను" మొండిగా అన్నాడు.     అమె అయోమయంగా చూసింది.     అతను నవ్వుతున్నాడు.     "నువ్వు కోపంలో ఎంత అందంగా వున్నావో తెలుసా?" అన్నాడు విజయ్. వెనక్కి తల తిప్పి రోడ్డు కేసి చూస్తూ.
7
ఫీల్డ్ మార్షల్ సర్వాధికారి, అతని భార్య చతుర, కొడుకు మదన్, కూతురు కామిని, అల్లుడు, కోడలు, మిగతా కుటుంబ సభ్యులు, అతని బంధుమిత్ర పరివారం, అధికారులు, సేవకులు, ప్రొఫెసర్ అన్ వేషి. అందరూ ఆ స్పేస్ షిప్ లో ప్రత్యక్షం అయ్యారు. నిజానికి ఆ స్పేస్ షిప్ లో అంతమంది పట్టరు. కానీ మనం ముందే చెప్పుకున్నాం. ఆ అంతరిక్ష నౌక ఒక బతికివున్న యంత్రం. ఇరవయ్యో శతాబ్దపు మనిషి మస్తిష్కానికి అందని యంత్రం అది. నిజానికి ఆ అంతరిక్ష నౌక కనుక ఒరిజినల్ సైజులోనే వుండి వుంటే అంతమంది మనుషులు అందులో పట్టేవాళ్ళు కాదు. కానీ - ఎంతమంది ఎక్కినా కూడా ఇంకా ఒకళ్ళకి స్థలం వుంటూనే వుంటుంది అందులో! పుష్పక విమానంలాగా! తను ఎక్కడ వున్నాడో అర్థంకాలేదు సర్వాధికారికి. అయోమయంగా చుట్టూ చూశాడు. తన కుటుంబ సభ్యులూ, తనకి కావాల్సినవాళ్ళూ తన పక్కనే వుండడం చూసి అతని మనసు కాస్త కుదుటపడింది. ఏ నాయకుడికి అయినా అంతే కదా! తనూ తన కుటుంబం క్షేమంగా వుండాలి. చిన్ని నా పొట్టకి శ్రీరామరక్ష. తనూ తనవాళ్ళు బాగున్నంతవరకూ లోకమంతా ఏమైపోతేనేమి? బ్రహ్మప్రళయం వస్తేనేమి? అదే క్షణంలో - సైంటిస్టు అన్ వేషీ కనబడ్డాడు సర్వాధికారికి. "అన్ వేషీ" అన్నాడు ఎగ్జయిటెడ్ గా. స్టన్ అయిపోయి వున్నట్టు కనబడుతున్నాడు అన్ వేషి. "అన్ వేషీ! చెప్పు! ఏం జరిగింది? ఏం జరగబోతోంది?" అన్నాడు సర్వాధికారి. పాలిపోయిన మొహంతో వున్న అన్ వేషీ పెదిమలు తడి చేసుకుంటూ అతికష్టం మీద గొంతు పెగల్చుకుని అన్నాడు. "సర్వాధికారీ! ఏం జరుగుతోందో నాకూ అర్థం కావడంలేదు." "ఇదేదో రాక్షసమాయలాగా వుంది" అన్నాడు సర్వాధికారి భయంగా. అన్ వేషి అన్నాడు "లుక్! బడ్డీ! నాకు దేవుడూ, దయ్యాలు అంటే నమ్మకం లేదు. కానీ హిందూ పురాణాలలోని...ఒక్క హిందూ పురాణాలేమిటి...ఎన్నెన్నో మతాల తాలూకు పురాణ గాథల్లో వున్న దేవుళ్ళనీ, దేవతలనీ గురించి ఎంతో చదివాను నేను. దేవతలంటే ఎవరో కాదు. ఇంకేదో గ్రహంనుంచి వచ్చిన అంతరిక్ష యాత్రికులయి వుంటారని ఎరిక్ వాన్ డైనికన్ లాంటివాళ్లు ప్రతిపాదించిన సిద్ధాంతాలు నాకు తెలుసు! అయితే ఆ సిద్ధాంతాలని పూర్తిగా నమ్మలేం. అలాగని పూర్తిగా కొట్టిపారెయ్యలేం కూడా! సర్వాధికారీ! జరిగినవీ, జరుగుతున్నవీ, జరగబోయేవీ అన్నీ సైన్సు పరిధికిందే వస్తాయి. అయితే ఆ సైన్సు మనకి ప్రస్తుతం తెలిసిన సైన్సా, రేపు తెలియబోయే సైన్సా అన్నది వేరే సంగతి! సర్వాధికారీ! మొత్తానికి ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను" అన్నాడు అన్ వేషి. షాక్ లో వున్నట్లు ఏదో ధోరణిలో మాట్లాడేస్తున్నాడు అన్ వేషి. "ఏమిటి నువ్వు అంత ఖచ్చితంగా చెప్పగలిగినది?" "ఇదంతా చేస్తున్నది ఎవరోగానీ వాళ్ళది మనకంటే కొన్నివేల రెట్లు సుపీరియర్ టెక్నాలజీ" అన్నాడు అన్ వేషి. "ఏడ్చి మొత్తుకున్నట్లే ఉంది! ఆ సంగతి చెప్పడానికి ఇంత పెద్ద సైంటిస్టు కావాలా?" అన్నాడు సర్వాధికారి వ్యంగ్యంగా.                                                 *    *    *    *అదే క్షణంలో భూమిమీద- కేపిటల్ సిటీలో- హఠాత్తుగా 'ప్రత్యక్షం' అయ్యాడు సాహస్. సాహస్ కాదు - సాహస్ రూపంలో వున్న కెప్టెన్. "హలో ప్రగతీ!" అన్నాడు చిరునవ్వుతో. సాహస గొంతు వినబడగానే ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది ప్రగతి. వెంటనే ఆమె కళ్ళు ఆశ్చర్యంగా విప్పారాయి. "సాహస్! నువ్వా? ఇక్కడా?" అంది సంభ్రమంగా. "అవును! నేనే!" అన్నాడు సాహస్ రూపంలో వున్న స్పేస్ షిప్ కెప్టెన్. అతని అసలు పేరు టూటూ. ఒక్క అంగలో అతన్ని చేరుకుంది ప్రగతి. "టెలిపతీ ద్వారా భావాలు తెలుసుకోవడం, రూపాన్ని చూడగలగడం సాధ్యం అన్నావ్! మరి ఇప్పుడు మనిషే ఎదురుగా వున్నాడంటే...ఇదేం ప్రక్రియ?" అంది ఆనందాన్ని అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేస్తూ.
8
    "నేనంతకాలం ఇల్లు పట్టకుండా తిరిగినా, బాధ్యత లేకుండా ప్రవర్తించినా ఎందుకు ప్రేమతో ఆదరించింది?"     "కొడుకువి కాబట్టి..."     "చివరి ప్రశ్న - స్వామికీ మీకూ ఏమిటి సంబంధం?"     "ఆయన నా గాడ్ ఫాదర్. నేను బికారిగా వున్న రోజుల్లో నా తెలివితేటలు గుర్తించిన మొదటి వ్యక్తి. పరమపద సోపానంలో నన్ను పై అంతస్థుకి తీసుకువెళ్ళాడు. చట్టంతో తనకి నేను కల్పిస్తూన్న రక్షణకి ప్రతిగా సమాజంలో నాకు స్థానం కల్గించాడు. ఒక స్వంత తమ్ముడిలా నన్ను చూసుకుంటూ వచ్చాడు."     "కానీ నీలాంటి స్వంత తమ్ముడే ఒకడు అక్కడ ఆస్పత్రిలో తన రహస్యాలు బయట పెడతాడేమో అన్న అనుమానం రాగానే, మరో తమ్ముడిచేత అతడిని చంపించడం ఎలా- అని ఆలోచిస్తున్నాడు.... చూశావా నాన్నా మన ఇంటికీ ఆ ఇంటికీ వున్న తేడా! ఈ యిల్లు ప్రేమా ఆప్యాయతలు పదిలంగా అల్లుకున్న పొదరిల్లు. ఆ ఇల్లు ఏ క్షణం కూలిపోతుందో తెలియని లక్క ఇల్లు. ఇక్కడ బంధాలకు పునాది ప్రేమ. అక్కడ మీ మధ్య బంధాలకి పునాది డబ్బు. ఇక్కడ తప్పుచేస్తే ప్రేమగా తిడతాం. అక్కడ తప్పుచేస్తే అడ్డు తొలగిస్తారు. ఈ ప్రేమ, మమత, ఆప్యాయత మనిషికి నైతిక ధర్మాన్ని, కట్టుబాట్లని బోధిస్తూ వుంటాయి. అవే లేకపోతే ఈ పాటికి ప్రతివాడూ ఒక తుపాకో, కత్తో తీసుకుని డబ్బు సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకునేవాడు."      "భేష్" వెనుక నుంచి వినిపించింది. స్వామి చప్పట్లు కొడుతూ మరోసారి "భేష్" అన్నాడు. అతడు తమ ఇంట్లో వున్నాడని వూహించని విహారి క్షణం బిత్తరపోయినా, వెంటనే తేరుకున్నాడు. అతడి కోపం ద్విగుణీకృతమైంది. ఈ లోపులో స్వామి అన్నాడు.     "పరమేశ్వరం! ఇన్ని తెలివితేటలున్న కొడుకుని కన్నందుకు చాలా సంతోషంగా వుంది. పోతే మీ వాడు ఇంకా చిన్నపిల్లాడిలా, చిన్న మెదడుతో, యువరక్తపు ఆవేశంతో ఆలోచిస్తున్నాడు. కొంచెం పాఠాలు చెప్పాలి" అని విహారివైపు తిరిగి, "నువ్వు నాది లక్క యిల్లు అన్నావు కదూ... చాలా అజ్ఞానంతో కూడుకున్న మాట అది. నాది నాలుగు స్థంభాల మీద నిర్మింపబడిన పటిష్టమైన భవనం... ఈ దేశపు రాజ్యంగమంత పటిష్టమైన భవనం అది."     "ఎంత గట్టి భవనమైనా, తెలివితేటలనే గునపంతో తవ్వి, పట్టుదల అనే డైనమేట్ తో పేలిస్తే కూలిపోక తప్పదు."     "అదే జరిగిన మరుక్షణం నీ తల్లి నుదుటున కొత్తగా చేరిన బొట్టు చెరిగిపోతుంది. పట్టుచీరలా చుట్టుకున్న ఆనందం తొలగిపోయి వైధవ్యం మళ్ళీ మిగులుతుంది" అంటూ నవ్వేడు. "నువ్వు నీ ప్రయత్నాలు ప్రారంభించిన రోజున- అలా తెలిసిన మరుక్షణం నీ తల్లికి తన భర్త ఎటువంటివాడో తెలుస్తుంది. ఏం చేస్తుంది ఆవిడ? న్యాయం కోసం, ధర్మం కోసం భర్తని వదిలేస్తుందా? కొడుకు పక్షాన నిలబడుతుందా? అసలావిడ గుండె ఆ షాక్ కి తట్టుకోగలుగుతుందా? అయినా భర్త పోవడం వేరు. భర్త వదిలేయడం వేరు. సమాజంలో నీ తల్లి స్థానం దిగజారిపోతుంది కలిసి నెలరోజులయినా కాకముందే భర్త ఎందుకు వదిలేశాడో అని అందరూ చెవులు కొరుక్కుంటారు. చూశావా విహారీ నిన్నెంత ఇరుకున పెట్టానో.... నన్ను లోయలోకి తోసినందుకు ఇదీ ప్రతిఫలం. ఇకనుంచీ అనుక్షణం నిన్ను నరకయాతన పెడతాడు నీ తండ్రి. ఇదంతా భరించలేక ఏ క్షణమైతే నువ్వు నీ తండ్రిమీద తిరగబడి విజయం సాదిస్తావో, ఆ క్షణం నీ తల్లి విధవరాలవుతుంది. నీ తల్లి బొట్టుని నువ్వే చెరిపేసినవాడివి అవుతావు. భర్త చిన్నప్పుడే పోవడం వేరు. పోయాడనుకున్న భర్త తిరిగి దొరికాక నిజంగా ఇంకొకసారి పోవడం వేరు. చెప్పు... ఆవిడని నీ చేతుల్తో విధవరాల్ని చేస్తావా? ఏ పురాణాల్లోనూ, ఏ శాస్త్రాల్లోనూ ఏ తల్లికీ ఏ కొడుకూ యివ్వని "బొట్టు చెరపడం" అనే బహుమతిని నువ్విస్తావా?"     "అనంతానంతస్వామి అని పేరు పెట్టుకున్నందుకు శాస్త్రాల్నీ పురాణాల్నీ బాగా విశదీకరించావు. నేను చెప్పేది కూడా విను. ణా తండ్రిని నీ భవంతి పై అంతస్తులో బంధించావు. కాళ్ళను 'హోదా' అనే అడ్రసులోనూ, చేతుల్ని 'డబ్బు' అనే సంకెళ్ళలోనూ బిగించావు. ణా తండ్రిని ఆ శృంఖలాల్నుంచి తప్పించి, ఆ అంతస్థులన్నీ దింపి, ఒక మామూలు మనిషిగా ణా తల్లికి అప్పగిస్తాను. ఏ పురాణాల్లోనూ, ఏ శాస్త్రాల్లోనూ ఏ కొడుకూ ఏ తల్లికీ ఇవ్వని 'భర్త' అనే బహుమతి నేనిస్తాను..."     స్వామి బిగ్గరగా నవ్వాడు. "విహారీ...! నా నాలుగో స్థంభం ఏదో ప్రవల్లికకి మాత్రమే చెప్పాను. ఇప్పుడు నీకూ చెప్తాను విను. నా నాలుగో స్థంభం నువ్వు."     "నేనా?"     "అవును- నీలాంటి సామాన్యుడు. తన వీపుమీద మమ్మల్ని పెట్టుకుని మోస్తున్నాడు. మా తెలివికి లొంగిపోయి పన్నుల రూపంలో డబ్బులు ఇస్తూ మా సౌభాగ్యానికి సోపానాలు కడుతూన్న అమాయకుడు. మా రాజకీయానికి పొంగిపోయి, అదే స్వర్గమనుకుని ఓట్లు వేస్తూ మాకు అధికారం కట్టబెడుతున్న దౌర్భాగ్యుడు. మేము చేస్తున్నదంతా న్యాయం అని నమ్మినవాడు. వాడు పిరికివాడు, వాడు అజ్ఞాని, వాడు భయస్తుడు. అలాంటి ఆలోచనా రహితుల నుంచి విడివడి కావాలంటే నువ్వూ రా. ఈ భవంతిలో కావలసినన్ని సుఖాలున్నాయి. కోరినంత డబ్బు వుంది."     "మనిషికి డబ్బొక్కటే కాదు. చాలా కావాలి."     "ఆ చాలా కావాలంటే డబ్బు కావాలి."     "ఆ డబ్బుతో పాటు నైతిక విలువలు కూడా కావాలి."     "తాతలు సంపాదించిన ఆస్థి ఖర్చు పెడుతూ రోడ్డుమీద డాన్సులు, స్టేజీమీద నాటకాలు ఆడేవాడివి నువ్వు మాట్లాడుతున్నావా 'విలువల' గురించి... తప్పో ఒప్పో... ప్రాణాలు పణంగా పెట్టి మేం కష్టపడతాం- కష్టానికి ఫలితం అనుభవిస్తాం.... అంతేకానీ తిని కూర్చుని కబుర్లు చెప్పం..."     విహారి తెల్లబోయాడు. స్వామి మాటలు బాణాల్లా గుండెల్లో తగిలాయి. ఇంతవరకూ తనీ కోణంలో ఆలోచించలేదు. డ్రింకు కలుపుతూ విప్లవం గురించి మాట్లాడేవారికన్నా హీనుడతను. అది తట్టలేదు.     "విహారీ! నువ్వు అసలు విషయం మర్చిపోతున్నట్టున్నావు. వర్ధని ఆస్థికి "కొడుగ్గా" నీ కన్నా- "భర్త"గా నేను మొదటి హక్కుదారుడ్ని! నువ్వు నాకు ఏమాత్రం వ్యతిరేకంగా పనిచేసినా ఈ ఆస్థిలో ఒక్కపైసా అయినా ఖర్చుపెట్టే హక్కు నీకుండదు."     విహారి వినడంలేదు. అతడు అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశాడు. పరమేశ్వరం చెప్పదల్చుకున్నది అర్ధమైంది.     అతడు తన తండ్రివైపూ, స్వామివైపూ చూసి స్థిరంగా అన్నాడు "నేనీక్షణమే ఇంటినుంచి వెళ్ళిపోతున్నాను."     అతడి గొంతులో ఒక నిశ్చయం తొంగిచూసింది.     "కోట లోపలుండి తిరగబడితే నమ్మకద్రోహం అవుతుంది. కోట బయట నుంచి తిరగబడితే అది యుద్ధం అవుతుంది. మీరన్నట్టు నేను చాలా సామాన్యుడిని, ఈ దేశపు శక్తివంతమైన దుర్మార్గుడిని ఎదుర్కొనే శక్తి కేవలం సామాన్యుడికే వుంది తప్ప మరే అధికార్లకీ.... బ్యూరోక్రాట్లకీ లేదు."     వెళ్ళబోతూ ఆగి అతనన్నాడు- "చూశావా స్వామీ... నాలుగు స్థంభాల పటిష్టమైన భవంతి అన్నావు. స్వార్ధాన్ని, భద్రతపట్ల భయాన్నీ ,సుఖాన్నీ వదులుకుని సామాన్యుడు తిరగబడితే, ఎంత సులభంగా నీ మొదటి స్థంభం కూలిపోయిందో చూడు. యిక మూడు స్థంభాలే వున్నాయి. నీ "బలాన్నీ", "రాజకీయాన్నీ" పడగొట్టి, "తెలివిని" నా తల్లికి బహుమతిగా ఎలా అర్పిస్తానో చూస్తూ వుండు- నీకే తెలుస్తుంది."                                16     "గోల్డెన్ ఐలెండ్" లో స్వామి తాలూకూ స్వంత హెలికాఫ్టర్ దిగింది. హెలిపాడ్ నుంచి కారు వరకూ ఎర్ర తివాచీ, చుట్టూ పూలమొక్కలు, క్రమశిక్షణతో నిష్ణాతులయిన సైనికులు వందనం చేస్తుండగా స్వామి దిగి కారులో ఎక్కి కూర్చున్నాడు.     రోడ్డు కిరువైపులా కొబ్బతిచెట్లు, మధ్యలో చక్కటిదారి. దాదాపు పదినిమిషాలు ప్రయాణం చేసిన తరువాత అతడికారు పెద్ద కాంపౌండ్ లో ప్రవేశించింది. చుట్టూ బార్బ్ డ్ వైరు ఫెన్సింగ్- గార్డులు, సుశిక్షితమైన ఆల్సేషన్ కుక్కలు- అదో కొత్తరకం ప్రపంచంలా వుంది.     అశేషమైన ప్రజల అజ్ఞానాన్ని ధనంగా మర్చి కట్టినట్టు- ఆ దీవి మధ్యలో విశాలమైన భవంతి- ఎత్తయిన చెట్లు- మొత్తం పాలరాయి.     స్వామి ఠీవిగా ఎక్కుతూ వుంటే- బారులు తీర్చిన సైనికులు సెల్యూట్ చేశారు.     అతడు దీవికి చేరుకున్న గంటలోపులో మరో రెండు హెలికాప్టర్లు, మూడు ఫ్రెండ్స్ ఫోకర్స్ వచ్చి దిగాయి. మొరాకో, ఈక్విడార్ మొదలైన దేశాల్నుంచీ, కేప్ టౌన్, ప్రిటోరియా, బ్లూమ్ ఫీల్డు మొదలయిన నగరాల్నుంచీ ప్రతినిధులు వచ్చారు. భారతదేశపు పక్క శత్రుదేశాలు, ఒక అగ్రరాజ్యపు రహస్య ప్రతినిధుల సంగతి సరేసరి. దక్షిణాఫ్రికా సంగతి తెలియనిదేముంది? రెండు కోట్లకు పైగా జనసంఖ్య వున్న దేశంలో కేవలం 37 లక్షల మందికే ఓటుహక్కు వున్న దౌర్భాగ్యదేశం. అటువంటి దేశ ప్రతినిధులు స్వామిలాటివారికి సాయపడడంలో విచిత్రం లేదు. ఆసియా ఖండంలో భారతదేశపు ప్రాబల్యం తగ్గిస్తే కొన్ని దేశాలకు మంచిది. వారూ పాల్గొన్నారు.     కొంతమంది స్వార్ధపూరిత వ్యక్తులు, తమ లాభం కోసం పన్నే "వ్యూహా"నికి మరోపేరు "రాజనీతి!!" ఫిలిఫ్ఫైన్స్ లో అయినా, ఫీజీ ద్వీపంలో అయినా, దక్షిణాఫ్రికాలో అయినా వీరు ఉపయోగించేది ఆ పేరే. మొట్టమొదటిసారి భారతదేశంలో ఆ రకమైన తిరుగుబాటు జరగడానికి పునాదులు తవ్వబడుతున్నాయి.     స్వామి అండతో కేంద్ర మంత్రివర్గంలో నెంబర్ టూ అయిన సూర్యారావు చాపక్రింద నీరులా విజృంభిస్తున్నాడు. ఇప్పటికే రకరకాల "తలనొప్పు"లతో సతమతమౌతూన్న ప్రధానమంత్రి ,అతడిని తొలగిస్తే ఏ పరిణామాలు సంభవిస్తాయా అన్న సందిగ్ధంలో ఉన్నారు. సూర్యారావు ఎంత ప్రమాదకరమైన వ్యక్తో ఇంకా పూర్తిగా బయటపడలేదు. దేశంలో స్వామికి కావలసిన పరిస్థితులు క్రమంగా అలుముకుంటున్న సమయంలో-     ఇక్కడ దీనిలో.... ఆ హాలులో సమావేశం మొదలైంది.     అదేమీ రహస్య సమావేశం కాదు. రోమన్ సాంప్రదాయపు పద్ధతిలో అందమైన ఆడవాళ్ళు వైన్ నింపుతున్నారు. ఒక మూల ఒక స్త్రీ తీగెలతో చేయబడిన సంగాతి (సితారు లాంటి వాద్య విశేషం) వాయిస్తున్నది. కొందరు పరిచారికలు తినుబండారాలు సర్దుతున్నారు. అతిధుల మాటలన్నీ వింటున్నారు.     అదే అనుమానం ఎవరికో వచ్చినట్టుంది. "మనం ఏదైనా మందిరం లోపల కూర్చుంటే బావుంటుందేమో" అని అడిగాడు.     స్వామి నవ్వేడు. "ఈ దీవే ఒక మందిరం. ఇక్కడ పురుగుకూడా అనుమతి లేకుండా బయటకు పోలేదు."     నిజమే అయివుండవచ్చు. మామూలుగా అయితే ఇటువంటి మీటింగ్స్ అండర్ గ్రౌండ్స్ లోనో, చీకటి కప్పిన గదుల్లోనో జరగాలి. ఏది ఏమైనా అక్కడ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా వుంది. చెట్ల నీడలు అద్దాల అవతల్నుంచి అందంగా కదుల్తున్నాయి. షాండ్లీయర్ల కాంతి కెరటాలు ఆ హాల్లో పరుచుకుంటూంది. బాలీసులు కాసుకుని కూర్చుని వున్నారు వాళ్ళు. అగరొత్తు పరిమళం ఆ హాలంతా పరుచుకుని వుంది. ఆ వాతావరణంలో వాళ్ళ భవిష్యత్ కార్యక్రమం గురించి చర్చించసాగారు.     జపాన్ నుంచి వచ్చే షిప్ లో మారణాయుధాలు ఎలా మార్పిడి జరగాలి. దేశంలోకి అవి ఎలా సరఫరా జరగాలి. ఈపాటికే దేశంలో వివిధ ప్రాంతాల్లో సర్దుకున్న సుశిక్షితులైన సైనికులు వివిధ పుణ్యక్షేత్రాలలో ఎలా అలజడి సృష్టించి, హిందూ దేశపు మెజారిటీ మతస్తులని ఎలా రెచ్చగొట్టాలి. ఎన్ని రోజుల తరువాత ప్రధానమంత్రి మీద సూర్యారావు తిరగబడాలి. ఎప్పుడు అనంతానంతస్వామి సర్వసైనికాధికారిగా, మత సంరక్షకుడిగా, దేశపు రక్షణ బాధ్యత స్వీకరించాలి. వెంటనే ఎప్పుడు ఈ రాజ్యాలన్నీ అతడిని రాజుగా గుర్తించాలి- అన్న విషయంమీద చర్చలు జరిగి, ప్రామాణికలు ఏర్పాటు చేయబడ్డాయి.     దాదాపు అరగంట సమావేశం అయ్యాక వారు లంచ్ కి లేచారు.
9
                                                                                                                     18-6-88     శ్రీ రఘుగారికి ,     నమస్తే,         మీరు ప్రేమతో పంపిన 'బొద్ లేయర్' ఫోటో స్టాట్ కాపి - సెలవుల తరవాత యిప్పడే. అందుకు  యీ ఆలస్యం.         చదువుతాను నాకు  అర్ధమవుతుందో లేదో, యింగ్లిషు ఆ ప్తెన కవిత్వం.         మీ కవితలు బావున్నాయి. 'జానపద మాండలిక భాష' literary main - stream కాజాలదు.         సంగితాస్వాదనతో  జీవితం సాగుతూ వుంది                      తాత్విక సాహిత్య వ్యాసంగం సాగించండి. వుంటానూ,                                                                                                                     -వడ్డెర చండీదాస్.                                                                                                                             Nuzvid                                                                                                                         15 - 6- 90     రఘుగారికి,     నమస్తే,         యీ మధ్య వూళ్ళు తిరుగుతూ యిక్కడికి వొచ్చాను. అక్కడ గోవాలో నాకు బస వీలవుతుందా! ముఖ్యంగా స్తేకలాజికల్ గా యేంతకాలమో  సరిగా తెలియదుగాని ఆరు నెలలకో, యేడాదికో తగ్గకుండా అరేబియా సముద్రప్రాంతాన  వుందాలనుకుంటున్నాను.         ప్రస్తుతం economically  constrained. వుండటానికి  'shelter' గానీ 'paying  guest ' గాని moderate rates లో - యేంతలో  విలుపడుతుందా? అసలు విలు పడుతుందా? కింది నుంచి ప్తె స్ధాయికి వరకూ యెలా ఐనా పరవాలేదు. I  do not  mind ' status '.     వెంటనే  యే సంగతి రాస్తారని యెదురుచూస్తూ,             ప్రేమతో,                                                                                                                              -వడ్డెర చండీదాస్.     C/o.  sri kakani  vikram kumar     vidyanagar     Nuzvid - 521 201     krishna district,  A.P.,     Phone :295                                                                                                                              తిరుపతి                                                                                                                             15- 7- 90     ప్రియమిత్రులు రఘుగారికి     నమస్తే,         మీ వుత్తరం. very many thanks  for the  concern  you have for me.         వో పది రోజుల్తెంది యిక్కడికి వొచ్చి. కాస్త స్వస్ధతగానే వుంది.         అవసరం వున్నప్పుడు ముందుగా రాస్తాను.         రావటం సింపుల్ గా వొచ్చి నాలుగ్తేదు రోజుల్లో నివాసం చూసుకుంటాను మీ సహాయంతో.         మీ శ్రీ మతికి శుభాకాంక్షలు. చిరంజీవికి దీవెనలు.         విడిగా కూడా, వోసారి గోవా సముద్రతీరంలో కొన్నాళ్ళు  గడపాలన్న ఆలోచన వుంది. Tourist spots లో కాదు simple sea shore areas.                                                             శుభాకాంక్షలతో,                                                                                                                        -వడ్డెర చండీదాస్ .                                                                                                                   తిరుపతి                                                                                                                 11- 11-90     మిత్రులు శ్రీ. యే.రఘుగారికి ,     నమస్తే ,     రహస్యోద్యమం మీద నేను రాసిన అచ్చుకాగితం యింకా కనిపించలేదు. కనిపించగానే జిరాక్స్ తీయించి పంపుతాను.     గితాదేవి గురించి జలంధర వ్యాసం పంపుతున్నాను.     మీ యిరువురికి శుభాకాంక్షలు. చిన్నారికి దీవనలు.     మళ్ళి వుత్తరం దాకా,                                                                                                                     - వడ్డెర చండీదాస్.                                                                                                                 20 - 01 - 91     ప్రియమిత్రులు రఘుగారికి     నమస్తే,     మీ వుత్తరం ఆనందంగా అనిపించింది నిరిహంగా వున్న నాకు.     తత్వశాస్త్రి సంబంధంగా వో మంచి పరిశీలన రచన గురించి ఆలోచించండి. అందుకు కావాల్సిన సామర్ధ్యం వుంది మీకు.     సెలవులకి వొచ్చినప్పుడు కలుస్తారు కదూ?! నేను విలుబట్టి గోవా ప్రయాణం పెట్టుకుంటాను. యెప్పడో తెలియదు. మీ సెలవులు మీరు అక్కడ వుండని  రోజులు తెలియజేస్తూండండి. ఐనా ముందుగా రాసి జవాబు చూసుకునే ప్రయాణం ఖాయపరుచుకుంటాను.     మీ ముగ్గురికి శుభాకాంక్షలు.     ప్రేమతో,                                                                                                                     -వడ్డెర చండీదాస్ .                                                                                                                      8- 2- 91     ప్రియమ్తెన రాఘుగారికి,     గురిచూసిపాడేపాట - స్త్రీవాద కవితలు - అంటూ వో పుస్తకం వొచ్చింది. యివాళే శ్రీ త్రిపురనేని శ్రీనివాస్ గారికి రాస్తున్నాను వాళ్ళ ప్రచురణలు యిక నుంచి వో ప్రతి మీకు పంపిస్తూడమని. ప్రతిదానికి చిల్లరచిల్లరగా కాక వోకసారిగా DD పంపిస్తుంటారని. నేను పుస్తకాల వేలకి రెట్టింపు చెల్లించ దళిచాను. యత్నం నచ్చి ప్రోత్సాహంగా తోడ్పాటుగా వుంటుందని.     నేను యెప్పడో తప్పక వొస్తాను అక్కడికి. యీ వేసవిలోగానో - వచ్చే దసరాలోగానో.     వుంటాను.     మీ ముగ్గురికి శుభాకాంక్షలు.                                                                                                            -వడ్డెర చండీదాస్.
10
    బ్రతకాలి, నాకు మిగిలిందింకా ఒకటి వుంది.     "పగ!"     అవును. "పగ!"     పగ తీర్చుకోవాలి! పగ తీర్చుకోవాలి! లేచేను. నాలో ఏదో  ఉన్మాదం ప్రవేశించింది. పగ! ప-గ- గట్టిగా అరుస్తున్నానేమో- నాకే తెలియదు. పిచ్చెక్కిపోతోంది. నాకు- అదొక్కటేతెలుసు నాకు. తల విదిలించేను. గట్టిగా  అరవాలనిపిస్తోంది. బట్టలు చింపుకొని వికృతంగా నవ్వుతూ రోడ్డుమీద పరుగెత్తాలనిపిస్తోంది. అరుస్తున్నాను-"లక్ష్మీనారాయణా-నిన్ను బ్రతకనివ్వను, నిన్ను బ్రతక...."     భుజం మీద  ఎవరిదో చల్లగా చెయ్యిపడింది. వెనక్కి తిరిగి చూసేను.     రాజా నరేంద్రవర్మ.                                                      9     ప్రహరీ గోడ గేటు దగ్గర నిలబడ్డాను. పదిహేనుమంది దాకా  దాదాపు పనిలో వున్నారు. ఇద్దరు రోడ్డు మీద మట్టిపోసి, గట్టిగా  చదునుచేస్తున్నారు. ఒకడు తెల్లసున్నం పోసిన ఇటుకరాళ్ళు వరుసగా సర్దుతున్నాడు. ఇద్దరు గులాబీ మొక్కలకి నీటి కాలువలు తవ్వుతున్నారు. కొందరు గదమంచె లెక్కిరంగులు వేస్తున్నారు. ఆ రంగులు స్పెషల్ గా రాయపూర్ నుంచి తెప్పించినవి. రంగులు కలిపి ప్రయోగాలు చేయటంలో శంకర్ దాదాకి  మంచి అనుభవం వుంది.     రోడ్డుమీద వెళ్ళేవాళ్ళు క్షణం ఆగి, ఇంటిని పరకాయించి చూస్తూ సాగిపోతున్నారు.     "అద్భుతం" అంటున్నారెవరో. పక్కవాడితో కష్టపడి పనిచేసిన కూలివాడికి రోజుకు దొరికేది నా చేతిలోవున్న సిగరెట్ పెట్టె ఖరీదులో సగం. ఉహూఁ నేను అలా ఆలోచించకూడదు.     దృష్టి ఇంటిమీదకు మరల్చేను.     ఇంటిముందు చిన్న స్విమ్మింగ్ పూల్ తయారయింది. పోర్టికో వెడల్పుగా అందంగా.....హుందాగా వుంది. మెయిన్ గేట్ నుంచి పోర్టికో వరకూ వేసిన ఎర్రరోడ్డుకి ఇరువైపులా పెంచిన గడ్డి పచ్చగా మెరుస్తోంది.     శంకర్ దాదా వచ్చి నా పక్కన నిల్చున్నాడు. పనివాళ్ళు చేస్తున్న దానిని తిలకిస్తూ- చాలా తొందరగా జరిగిపోయింది పని" అన్నాను.     "అవును" తలూపేడు. "ఇంత పెద్ద ఇల్లు రెండు నెలల్లో తయారవటం అంటే సామాన్యమైన విషయం కాదు" అన్నాడు.     అంతకుముందు అమెరికన్ మాగజైన్ తో చదివిన "పెర్టు" సి.పి.ఎం' మీద ఆర్టికల్ జ్ఞాపకం వచ్చింది. "ఎవరన్నా  పందెం కడితే ఇంతకన్నా పెద్ద యింటిని ఇంకా తక్కువ టైమ్ లో కట్టించగలను" అన్నాను.     "దగ్గిరుండి కట్టించటం సులభమే కాని, అక్కడెక్కడో వుండి ఉత్తరాలమీద పని జరిపించటం అంటే మాటలు కాదు".     "తొందరగా వచ్చేసేవాణ్ని. కానీ తాతయ్య బలవంతం చేసేడు" చెప్పాను.     "మీరు లేని లోపం ఏదైనా కనపడుతోందా?' అనుమానంగా అడిగేడు.     "అహఁ అటువంటిదేమీ లేదు. నాకు చాలా తృప్తిగా వుంది. నీలాంటివాడు  చేతిక్రింద వుంటే, కుర్చీలోంచి లేవకుండానే ఎంత పనైనా చేయించుకోవచ్చు".     "నాలాంటివాళ్ళు ఎక్కడయినా దొరుకుతారు బాబూ, కానీ కుర్చీలో కూర్చునే అన్ని విషయాలు గమనిస్తూ కావాల్సిన పన్లు చేయించుకోవటం అంటే మాటలు కాదు. ఆ శక్తి మీ తాతగారిలోనే చూసేను, యిప్పుడు మీలో చూస్తున్నాను-"     మాట మర్చి, "నాదో చిన్న అనుమానం" అన్నాను.     "చెప్పండి బాబూ-"     "ఆ రోజు లాడ్జిలో నన్ను గది మర్పించాడు మేనేజరు" ఆగేను. "ఆ రెండో  గదిలో  మైక్రోఫోను ఆరేంజి చేసింది నువ్వే కదూ!"     శంకర్ దాదా  ముడతలుపడ్డ చెక్కిళ్ళమీద  నవ్వు వెలిసింది.     "పెదబాబుగారు కూడా  అప్పుడు ఈ ఊళ్ళోనే వున్నారు బాబూ! జరిగినదంతా వారికి ఎప్పటికప్పుడు వినవించటమే నేను చేసిన పని-"     ఇంతలో ఎదురింటిముందు కారు ఆగింది. ఇంటి ఓనరు దిగి, లోపలికి వెళ్ళబోయి, మమ్మల్ని గమనించి, మావైపుగా వచ్చాడు. శంకర్ దాదా అతన్ని చూసి "నమస్తే సాబ్, రండి - రండి" అన్నాడు ఆహ్వానిస్తూ. అతడు నావైపు చూస్తూ. ఈయన.....అన్నాడు ప్రశ్నార్థకంగా.     "మా యజమాని, ఈ రోజే వచ్చారు" అన్నాడు దాదా.     అతను నాకు చెయ్యి అందిస్తూ, "మిమ్మల్ని కలుసుకొంటున్నందుకు చాలా సంతోషంగా వుంది" అన్నాడు.     నేనూ చెయ్యి అందించేను. "నాకూ....." అన్నాను. బాగా కండపట్టిన అతడి చేయి మెత్తగా అసహ్యంగా తగిలింది.     "ఇంత తొందర్లో పూర్తి చేయగలిగారంటే - చాలా పకడ్బందీగా ప్లాన్ వేసి వుండాలి మీరు."     "ఇంత చిన్న చిన్న ప్లాన్ లు కూడా మనం వేయటం మొదలుపెడితే మన టైము అంతా దీనికే వేస్టు అవుతుంది. దీనికి ప్లాన్ వేసింది నా గుమస్తా" అని శంకర్ దాదాని చూపించేను.     "నిజవేఁ....... నిజవేఁ......." అన్నాడు అతడు తలూపుతూ. "పెద్ద పెద్ద డిసిషన్ లు మనం తీసుకోవాలి" అర్థంతరంగా గొప్పవాడై పోయి, స్టేటస్ నిలుపుకునే తాపత్రయం అతడు వాడే ఇంగ్లీషు పదాల్లో కనిపించింది.     "ఇంతవరకూ నా ఇల్లు ఈ ఊళ్ళోకల్లా పెద్దది, ఇక నుంచి మీది" నవ్వేడు. "అందులోనూ ఎదురెదురు".         "నాలుగు రోజుల్లో మంచి ముహూర్తం వుందట. ఊళ్ళో పెద్ద పెద్ద వాళ్ళందరికీ పార్టీ ఇద్దామనుకొంటున్నాను. గృహప్రవేశం సందర్భంలో" అన్నాను మాటమారుస్తూ. "ఎలాగూ ఈ ఊళ్ళోనే సెటిల్ అవుదామనుకొంటున్నాను కాబట్టి అందర్నీ పరిచయం చేసుకోవాలి కదా!"     "అవునవును. అందరూ మిమ్మల్ని కలుసుకోవాలకొంటున్నారు....."     "మీరు ఆ రోజు నాతో తప్పకుండా రావాలి. నాకెవరూ తెలీదుకదా" అభ్యర్థిస్తున్నట్లు అడిగేను. అతడి మొహంలో ఆనందం స్పష్టంగా కనిపించింది. "అలాగే అలాగే...." అన్నాడు ఉబ్బితబ్బిబ్బవుతూ.     "సాయంత్రం తీరిగ్గా మాట్లాడుకొందాం" అన్నాను షేక్ హేండిస్తూ.     "మంచిది-" అని కదలబోతూ "మీ పేరు?" అని అడిగేడు.     "మోహన్, కృష్ణమోహన్" అన్నాను.     "అలాగా, బావుంది.....బావుంది.....నా పేరు లక్ష్మీనారాయణ " అన్నాడు     "ఎంత ఖర్చయింది ఇప్పటికి?"     "లక్ష. ఇంకో ఇరవై వేలదాకా ఖర్చ వుంటుంది" పుస్తకం చూడకుండానే చెప్పేడు.     "రేపు పార్టీకి ఓ పదివేలు ఖర్చు పెట్టవలసి వుంటుంది".     తలూపేడు.     "బైదిబై- ఆ అడవి పాడటం ఏమయింది?"     "మనకే వచ్చింది".     "గుడ్. పీచు?"     "స్టాకు రెడీగా వుంది. షిప్ కుదర్లేదు. అదే ఆలస్యం".     "ఆ క్వారీలో' పని ఎలా జరుగుతూంది?"     "అన్నిటికన్నా అందులోనే ఎక్కువలాభం వచ్చేట్టు వుంది.     పనిచురుగ్గా సాగుతోంది. ఆ రంపపుపొడి కాంట్రాక్టురు మొత్తం అంతా తనే కొనుక్కుంటా నంటున్నాడు".     "వెంటనే అమ్మేయండి. మనం తొందరగా డబ్బు 'రొటేట్' చెయ్యాలి. ఎక్కువ సమయంలేదు. ఖర్చు పెట్టిందికాక పదిహేను పర్సెంట్ లాభం చూపిస్తానని తాతయ్యతో పందెం కాసేను. ఇప్పటికి రెండులక్షలు ఖర్చయింది".     ........ఆరు లక్షలకి- సంవత్సరంన్నరకి పదిహేను పర్సెంట్- అంటే లక్షా ముప్ఫె అయిదువేలు సంపాదించాలి. సంవత్సరంన్నరలోనూ మూడు లక్షల ముప్ఫె అయిదువేలు.     చాలా కష్టమైన ఆట.     ఆలోచనల్లో వుండగానే పక్కన ఏదో గొడవ జరుగుతూ వుండటం చూసి అటు తిరిగేను.     శంకర్ దాదా ఎవరి మీదో అరుస్తున్నాడు. ఎవరో ముసలివాణ్ని కసిరి వెళ్ళిపొమ్మంటున్నాడు.     "ఏమిటి విషయం?" అడిగేను.     'మన క్వారీలో పనిచేసే కూలీ బాబూ! ఇంట్లో చిన్నపిల్లకి బావోలేదట. వారం రోజుల కూలీ ఈవేళ కావాల్ట' అన్నాడు. అతడివైపు చూసేను. అరవై ఏళ్ళుంటాయి. అస్థిపంజరానికి చర్మపు బట్టలు తొడిగినట్లున్నాడు.     "మేనేజర్ని అడక్కుండా ఇక్కడికెందుకు వచ్చేడు?"     "అలా ఇవ్వరు బాబూ" అన్నాడా వృద్ధుడు.     అవును ఒకసారి వారం రోజుల కూలి ఇచ్చేస్తే మళ్ళీ కనబడరు. అలాగే ఉడాయించేస్తారు" అన్నాడు దాదా.     శంకర్ దాదా వైపు తదేకంగా చూసేను. "మనిషి మంచితనంమీద అంత తక్కువ నమ్మకం పెంచుకోవటం సాటి మనిషిగా అవమానం గాదా" -అన్నట్టు.     "మా పిల్లకి అస్సలు బావోలేదు బాబూ" దీనంగా చేతులు జోడించాడు అతడు. అతడికి బావోలేనట్టుంది- జోడించిన చేతులు సన్నగా వణుకుతున్నాయి వృద్ధాప్యంతో ముడతలుపడ్డ చెక్కిళ్ళమీద నీటిచుక్క తళుక్కుమంది- గాజుకళ్ళు ఆర్తిగా చూస్తున్నాయి- జేబులోంచి ఇరవై రూపాయలు తీసేను, "ఇదిగో వారం రోజులకి కూలీ! ఎగ్గొట్టకుండా రా-" అన్నాను.     వణుకుతున్న చేతుల్తో అందుకొని, నావైపు నీళ్ళు నిండిన కళ్ళతో చూసేడు. నేను వూహించినంత తొందరగా వంగి, నా కాళ్ళుస్పృశించి, "తప్పక వస్తాను బాబూ- తప్పకుండా" అని గొణుక్కుంటూ వడివడిగా వెళ్ళిపోయేడు నిశ్చేష్టత నుంచి తేరుకొని దాదావైపే తిరిగి నవ్వేను, అతడు నవ్వలేదు.     నెమ్మదిగా అన్నాడు. "అనుభవం లేనప్పుడు ఈ కష్టాలు వింటూంటే రక్తం పరుగెత్తి ఏదో చెయ్యాలనిపిస్తుంది బాబూ! అలా చేసేస్తూపోతే, అనుభవం వచ్చేసరికి ఏవీఁ మిగల్దు" కొరడాతో కొట్టినట్టు నిలబడిపోయేను.     నిజమే! పచ్చి నిజం! నాక్రింద దాదాపు వెయ్యిమంది దాకా పన్జేస్తున్నారు. అందరికీ తలో కథా వుండొచ్చు. ఇలా సహాయం చేసుకుంటూపోతే ఏవీ - మిగల్దు. నాలో పెట్టుబడిదారుణ్ని ఇంకా బలంగా నిర్మించుకోవాలి.     ........అంతకు ముందు రాత్రి పదివేల రూపాయల్ని చాలా సులభంగా వదిలేసుకోగలిగిన నేను - ఈ ఇరవై రూపాయల కోసం ఇంత ఆలోచిస్తున్నాను-     ఆలోచిస్తూనే డబ్బు సంపాదించడానికి వీలైన మార్గాలన్నీ వెతికేను దొరికింది! "మీ పేరుమీద  కార్నావాల్ ఒకటి ప్రారంభిద్దాంమనుకొంటున్నాను దాదా" అన్నాను. శంకర్ దాదా, మామూలు బిజినెస్సుల్లో మనం అనుకున్నంత డబ్బురాదు మనుష్యుల బలహీనతమీద ఆడుకోవాలి, తప్పదు."     శంకర్ దాదా వెళ్ళిపోయేడు. ఎంతో అసంతృప్తిగా వుంది. ఇదో ఏగోనీ.....     వికలమయిన మనస్సుని అదుపులో పెట్టుకోవటానికి చాలా శ్రమపడవలసి వచ్చింది.
11
    "శివశివా..." అన్నారు రాంపండూ, బ్రహ్మాజీ.     ఇన్స్ సెక్టార్ అయోమయం ఉలిక్కిపడి నిటారుగా కూర్చున్నాడు.     "కొంపదీసి మీరు శివసేన పార్టీవాళ్ళా?" అని అడిగాడు.     "అబ్బా!"...." ఏడుకొండలు టోపి మీద గుద్దుకున్నాడు. "వాళ్ళు అవేమీ కాద్సార్... మన స్టేషన్ ఆవరణంలో అనుమానస్పద స్థితిలో తచ్చాడుతుంటే పట్టుకుని మీ దగ్గరకి తెచ్చాను."     అయోమయం హాఠాత్తుగా లేచి నిలబడి బెల్టుకున్న కేసులోంచి రివాల్వర్ తీసి ఇద్దరకీ గురిపెట్టి "చెప్పండి...ఎవరు మీరు? అక్కడేం చేస్తున్నారు? బాంబులు పెట్టి మా స్టేషన్ని పేల్చి పారేయ్యాలని చూస్తున్నారా? అంతకంటే ముందే నేను కాల్చి పారేస్తా" అన్నాడు.     "ఏమండీ... మేము సాధారణ పౌరులం... అంతేకానీ టెర్రరిస్టులమో, నక్సలైట్లమో కాదు" అన్నాడు రాంపండు బాధగా.     "ఓహొ... కంప్లైంట్ యివ్వాలని వచ్చారా? కూర్చోండి" అన్నాడు ఇన్స్ సెక్టార్ అయోమయం తను కూర్చుంటూ.     రాంపండు, బ్రహ్మాజీ తాని ముందు కూర్చ్గున్నారు.     "ఊ... ఇప్పుడు చెప్పండి ఏంటి మీ కంప్లైంట్? మీ ఇంట్లో చోరీ జరిగిందా? బంగారం ఏమైనా పోయిందా?" అడిగాడు ఇన్స్ సెక్టార్ అయోమయం.     బంగారం ఏంటండీ బాబూ! బంగారంలాంటి అమ్మాయ్ పోయింది. వీళ్ళా విడ తప్పిపోయింది" అన్నాడు బ్రహ్మాజీ.     "తప్పిపోవడం కాదండీ! మా ఆవిడా కనిపించటంలేదు" బ్రహ్మాజీ వాక్యాన్ని సరిదిద్దుతూ అన్నాడు రాంపండు.     "కనిపించకపోతే కళ్ళద్దాలు పెట్టుకుని చూడండి. హహహ" నవ్వాడు ఇన్స్ సెక్టార్ అయోమయం       "చూశావా! కనిపించటం లేదని అంటే అలా అంటాడని నేను చేపానా లేదా?" రాంపండు చెవిలో అంటూ డొక్కలో మోచేత్తో పొడిచాడు బ్రహ్మాజీ.     "సార్! మా ఆవిడ కనిపించక నేను బాధ పడుతుంటే మీరిలా అనడం అన్యాయం సార్" అన్నాడు రాంపండు.     "ఒక్కే..ఒక్కే...నేనిక సీరియస్! చెప్పండి మీ ఆవిడా ఎప్పుడు నుండి కనిపించడంలేదు?" నవ్వాపుకుంటూ అన్నాడు ఇన్స్ సెక్టార్ అయోమయం.     "ఈ వేళ ఉదయం లేచినప్పటినుండీ కనపడ్డంలేదండీ" చెప్పాడు రాంపండు.     అది వినగానే కాని స్టేబుల్ ఏడుకొండలూ, ఇన్స్ సెక్టార్ అయోమయం మోహమోహాలు చూసుకుని భళ్ళున నవ్వారు.     "చంపేవ్ కదయ్యా బాబూ! ఈ వేళ ఉదయం నుండి కనిపించటంలేదా? ఇంకానయం. ఓ గంట క్రితం నుండి అన్నావ్ కాదు. ఉదయం నుండీ కనిపించడం లేదని అంటే ఏ చూట్టాలింటికో, ప్రెండ్స్ యింటికో వెళ్ళి వుంటుంది. మరో రెండురోజులు కనబడకపోతే అప్పుడు కంప్లైంటు యివ్వడానికి రా" అన్నాడు అయోమయం.     "లేద్సార్! మా ఆవిడ ఎప్పుడు ఎక్కడికీ వెళ్ళకపోవచ్చేమోగానీ ఈ వేళ వెళ్ళాలని అనిపించిందేమో. అందుకే రెండు రోజుల తర్వాత రా."     "ప్లీజ్! న మాట వినండి సార్! ఆమెకి తెలిసిన వాళ్ళందరి ఇళ్ళకి వెళ్ళి అడిగాను. రాలేదని చెప్పారు. విజయవాడలో వాళ్ళింటికి కూడా ఫోన్ చేశాను. అక్కడకీ రాలేదని తెల్సింది. ప్లీజ్! మీరు కేస్ రిజిస్టర్ చేసుకోండి సార్" దీనంగా అన్నాడు రాంపండు.     "సరే! కంప్లెయింట్ రాసివ్వు చూద్దాం"అన్నాడు ఇన్స్ సెక్టార్ అయోమయం.     రాంపండు కంప్లైంట్ రాసి సంతకం పెట్టి ఇంటి ఆడ్రస్ రాసి ఇన్ స్పెక్టర్ కి యిచ్చాడు.     ఆమెది రీ సెంట్ ఫోటోగ్రాఫ్ ఏదైనా వుందా?" అడిగాడు అయోమయం.     అతను చొక్కా జేబులోంచి ఓ కవరు తీసి అందులోంచి రాజీ ఫోటోతీసి యిచ్చాడు.     ఇన్స్ సెక్టార్ అయోమయం ఫోటోవంక దీక్షగా చూడసాగాడు. కాని స్టేబుల్ ఏడుకొండలు కూడా ముందుకి వంగి ఫోటో వంక చూశాడు.     ఇన్స్ సెక్టార్ ఫోటో ని చూస్తూ పెదవి విరిచాడు.     రాంపండు గుండెల్లో పీచుపీచుమంది.     "ఏం సార్ అలా పెదవి విరుస్తున్నారు? కొంపదీసి మా ఆవిడగానీ మీకు కనిపించిందా? ఆమెకేమీ ప్రమాదం జరగలేదు కదా?" అడిగాడు కంగారుగా.     "నేను పెదవి విరించింది అందుక్కాదు. ఈ ఫోటో ఎవడు తీశాడో గానే అంత బాగా తియ్యలేదు" అన్నాడు అయోమయం. తర్వాత కానిస్టేబుల్ ఏడుకొండలు  వైపుకి తిరిగి "ఈ ఫేసు చూశావా? కాస్త యిటు టర్నింగ్ ఇచ్చుకుంటే బాగుంటుంది కదూ?" అన్నాడు.     "అవున్సార్! కేమెరా యాంగిల్ కూడా సరిగ్గా లేదు. క్రింద నుండి తీశాడు పైనుండి తీస్తే బాగుండేది" అన్నాడు ఏడుకొండలు కూడా ఫోటో వంక దీక్షగా చూస్తూ.     "లైటింగో? ఛండాలంగా వుంది. ఆ బ్యాక్ గ్రౌండ్ లో కర్టెన్ చూశావా? పువ్వుల పువ్వుల కర్టెన్ వేశాడు దానికంటే ప్లెయిన్ ది వేసి వుంటే బాగుండేది. ఇలాంటి ఫోటో స్టూడియో వాళ్ళని కాల్చి పారెయ్యాలి."     "సార్!" దీనంగా పిలిచాడు రాంపండు.     ఇన్స్ పెక్టర్, కాని స్టేబుల్ ఇద్దరి తలలూ అతని వైపుకి తిరిగాయ్.     "ఇంతకీ ఆ ఫోటో మా ఆవిడ్ని వెతకడానికి పనికోస్తుందా లేదా సార్?"     "పని కొస్తుందనుకో. అయినా  యింకోసారి ఆ ఫోటో స్టూడియోకి వెళ్ళకు" అని ఫోటో టేబుల్ సొరుగులో పడేశాడు ఇన్స్ స్పెక్టర్ అయోమయం.     "మేమింక వెళ్ళొచ్చాండీ?" అడిగాడు బ్రహ్మాజీ.     "ఒయ్యాస్! మీ ఆవిడని ఎక్కడున్నా వెతికి పట్టుకుని కాల్చిపారేస్తాం."     "అదేమీటండీ?" అయోమయంగా అడిగాడు రాంపండు.     "మరి అమ్తెనయ్యా! మొగుడికి చెప్పకుండా యిల్లు వదలిపెట్టి వెళ్ళిపోతే యిమ్కేం చెయ్యాలి?"     "అలా కాల్చి పారేయ్యాడాలూ, పేల్చి పారెయ్యడాలూ వద్దుగానీ నకు అప్పగించండి చాలు!"     "సరేలే... మీ రెళ్ళండి!"ఇద్దరూ లేచి గుమ్మం వైపు అడుగులు వేశారు.     "చూడు జాంపండూ!" పిలిచాడు ఇన్స్ పెక్టర్.     "జాపండు కాదండీ! రాంపండు" చెప్పాడు పండు.     "ఏదో ఒక పండులేవయ్యా! ఓ నిమిషం అడగడం మర్చిపోయాం మీరిద్దరూ ఏమయినా దెబ్బలాడుకున్నారా?"     "మేమిద్దరమా? అబ్బే లేదే- ఏరా బ్రహ్మాజీ! మనిద్దరం దెబ్బలాడుకున్నామాఎప్పుడయినా?" అడిగాడు రాంపండు.     "అబ్బే! మేమిద్దరం ఎప్పుడూ దేబ్బలాడుకోలేదు ఇన్స్ స్పెక్టర్ ఏమనుకుంటున్నారో ఏమో_ నేనడుగుతుమ్దినువ్వూ, నీ పెళ్ళాం అన్నాడు ఇన్స్ స్ప్ర్క్తర్ అయోమయం.     "లేదు ఇన్స్ స్పెక్టర్ ! మేమిద్దరం కూడా ఎప్పుడూ దేబ్బలాడుకోలేదు" అబద్దం చెప్పాడు రాంపండు.
12
      "మధ్యాహ్నం భోజనానికి ఇంటికొస్తావా" అడిగిందావిడ.          మాట్లాడలేదు త్రిభువనేశ్వరి.          "పిన్నీ... నువ్వు నన్ను అడగాలనుకొంటున్నది... ఇదేనా" ఖాళీ పాలగ్లాసుని ఆమె చేతికిస్తూ ఆమె ముఖంలోని భావాలను పసికట్టడానికి ప్రయత్నిస్తూ అంది త్రిభువనేశ్వరి.          "అది కాదమ్మా! మీ చిన్నాన్న...." ఏదో చెప్పబోయిందావిడ.          అంతవరకూ ప్రసన్నంగా ఉన్న త్రిభువనేశ్వరి ముఖంలో కోపం ప్రవేశించింది.          "చూడు- పిన్నీ....బాధ్యత మరిహ్చిపోయిన వాళ్ళకోసం భయపడి పారిపోయిన వాళ్ళ కోసం... బాధ పడడం మన తెలివి తక్కువ.....అయినా కాశీ, రామేశ్వరాలు నా జ్యూరిస్ డిక్షన్ లో లేవు....వెతికించడానికీ" లేచి తన గదిలోకి విసురుగా వెళ్ళిపోయింది త్రిభువనేశ్వరి.          అవాక్కయిపోయి అల అచూస్తూ నిల్చుండిపోయింది సుందరమ్మ.          మరో అరగంట గడిచింది.          అడుగుల శబ్దం....వినబడగానే లేచి నించున్నాడు హేమాద్రి శర్మ...          కర్టెన్ తీసుకొని హాల్లో కొచ్చింది త్రిభువనేశ్వరి దేవి.          "గుడ్ మార్నింగ్ మేడమ్" హేమాద్రిశర్మ విష్ చేశాడు.          త్రిభువనేశ్వరి దేవి...          ముఫ్ఫై ఏళ్ల త్రిభువనేశ్వరి దేవి....అయిదడుగుల, ఆరంగుళాల ఎత్తు...బలమైన, దృఢమైన శరీరం మేరీలో స్ట్రీప్ లాంటి పొడవైన ముక్కు, విశాలమైన నుదురు- ఆమె మెరిసే కళ్ళలో ఎప్పుడూ చిరునవ్వు- ఆమె అందం ఇతరుల్ని తక్కువగా ఆలోచింపజేసేదికాదు.... ఈమె తన జీవిత భాగస్వామి అయితే బాగుండన్న హుందాతనంతో కూడుకున్న కోరిక....అదో అద్భుతమైన ఆకర్షణ-వీటన్నిటింనీ మించిన గ్రేస్....ఎంతటి వారినయినా, తన వాగ్ధాటి ద్వారా శాసించగలిగే నేర్పు-          తండ్రి సుభాష్ చంద్ర గాంధేయవాది....స్వాతంత్రోద్యమంలో, ముఖ్యంగా క్విట్ ఇండియా ఉద్యమంలో జైలుశిక్ష అనుభవించి, అనేక రకాలయిన చిత్రహింసలకు గురైన వ్యక్తి.          ఆంద్రరాష్ట్రం ఏర్పడ్డాక నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా 1955లో ఏర్పడ్డ తొలిమంత్రి వర్గంలో సాంఘిక సంక్షేమశాఖ మంత్రిగా చేసిన వ్యక్తి ఆ తర్వాతః చాలాకాలం పార్టీ అధ్యక్షుడుగా సేవలు అందించిన వ్యక్తి. ప్రస్తుతం ఆయనకు ఎనభై ఏళ్ళు - ప్రస్తుతం స్వంత వూళ్ళో కృష్ణాజిలా నందిగామలో వుంటున్నారు.          త్రిభువనేశ్వరి రాజకీయాల్లోకి రావడానికి ప్రధాన కారణం తండ్రి సుభాష్ చంద్రే.          ఎనిమిదేళ్ళపాటు పార్టీలో సాధారణ కార్యకర్తగా, కార్పొరేటర్ గా ఎమ్మెల్యేగా అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తిత్వం త్రిభునేశ్వరిదేవిది.          పార్టీలో ఒక్కసారిగా అధికారం కోసం చెలరేగిన కుమ్ములాటల్లో ఇద్దరు ప్రధనమైన నాయకుల మధ్య ఏర్పడిన స్పర్ధ, అసమ్మతి రాజుకోవడంతో నాటకీయ పరిణామాల్లో త్రిభువనేశ్వరీ దేవిని అదృష్టం వరించింది.          హైకమాండ్ త్రిభువనేశ్వరి దేవికి చీఫ్ మినిస్టర్ పట్టం కట్టింది.          ఆరునెలల కాలంలో తనను తాను రుజూవు చేసుకోవడానికి అనుక్షణం ప్రయత్నిస్తోంది త్రిభువనేశ్వరీ దేవి.          జలపాతంలాంటి జుత్తు, విశాలమైన నుదురు- ఆ నుదుటిమీద సూర్యబింబంలాంటి బొట్టు, బెనారస్ పట్టుచీర....ఎడంచేతికి వాచీ, కుడిచేతికి రెండు బంగారు గాజులు....ఎంతో సాదాసీదాగా ఉంటుంది. ప్రస్తుతం విశాలమైన సోఫామీద కూర్చుంది త్రిభువనేశ్వరీదేవి! లోన్నించి పనిమనిషి కొన్ని ఫైల్స్ ని తెచ్చి టీపాయ్ మీద పెట్టి వెళ్ళిపోయింది.          వాటిలోంచి ఓ ఫైల్ ను అందుకుంది సి. ఎమ్. త్రిభువనేశ్వరీ దేవి.          "ఫైల్స్ అన్నీ వెరిఫై చేశాను.....మద్యాన్ని నిషేధించడానికి నిర్ణయించుకొన్నాను" సీరియస్ గా అంది త్రిభువనేశ్వరీ దేవి.          "మరోసారి ఆలోచించండి.... పాత గవర్నమెంట్స్ తెచ్చిన జి.వోలు, ప్రాక్టికల్ ఫెయిల్యూర్స్.... అన్నీ మీకు విపులంగా తెల్సే ఉంటాయి.          ఇంకా కొన్నాళ్ళాగితే....బాగుంటుందని నా సలహా" హేమాద్రి శర్మ చెప్పాడు.          "నిన్న రాత్రి కూడా...మీరిదే చెప్పారు....ఒక కార్యకర్తగా నేను పార్టీలో పని చేస్తున్నప్పటి నుంచి....మీకు తెలుసు....మా డాడీ ఆశయం మీకు తెల్సు...మా డాడీలాంటి ఫ్రీడమ్ ఫైటర్స్, నా నుంచి, నా ప్రభుత్వం నుంచి ఏవాశిస్తున్నారో మీకు తెలుసు- జి.వో తేవడంతో నేను చేతులు దులుపుకుని ఊరుకోను. "ప్రాక్టికల్'గా ఇంప్లిమెంట్ చేసేవరకూ నిద్రపోను... నా పదవి పోయినా ఫర్వాలేదు- మద్యాన్ని నిషేధిస్తాను. పేద ప్రజల్ని కాపాడతాను."          "ఒక ఐ.ఎ.ఎస్...ఆఫీసర్ గా, ఒక సి.ఎమ్ తో స్పష్టంగా ఒపీనియన్ని చెప్పుకోలేక పోవచ్చు- కానీ....చిన్నప్పట్నించీ మిమ్మల్ని ఎరిగిన, ఒక వెల్ విషర్ గా...నా అభిప్రాయాన్ని చెప్పడంలో తప్పు లేదనుకుంటాను.          ఇవాళ మనదేశంలోని ప్రతి రాష్ట్ర ప్రభుత్వం... కేవలం ఎక్సయిజ్ రెవిన్యూ ఆదాయం మీదే ఆధారపడుతున్నాయి. సారా కంట్రాక్టర్లు ఇవాళ పార్టీలకు గానీ, ప్రభుత్వాలకు గానీ అనఫీషియల్ బ్యాంకులుగా తయారు కావడానికి ఎవరు కారణం... సారా వాళ్ళకు తెస్తున్న ఆదాయమే. ప్రతీ ఏటా పెరుగుతున్న మద్యం వినియోగం.... రెవెన్యూ పెరుగుదలల్ని ఒక్కసారి గమనించండి.          1960-61లో కేవలం ఏడుకోట్ల మూడులక్షలున్న ఎక్సైజ్ రెవెన్యూ ఈ ఎక్సైజ్ సంవత్సరం నాటికి 950 కోట్ల రూపాయలకు పెరిగింది. 1970-71లో రు. 29 కోట్ల 79 లక్షలు. 1980-81లో 152 కోట్ల 40 లక్షలు, 1990-91లో 780 కోట్లు, 1991-92 లో రు. 850 కోట్లు ఎక్సయిజ్ శాఖ ద్వారా ప్రభుత్వ ఖజానాకు చేరాయి. సారా ఐ.ఎం.ఎల్. షాపుల సంఖ్య కూడా ఈ మూడు దశాబ్ధాలలోనే అధికంగా పెరిగాయి. 1970లో 8669 సారా షాపులు, 2305 బ్రాందీ షాపులుండగా, 1980లో సారా షాపులు 14,274, బ్రాందీ షాపులు 4566కు పెరిగాయి. 1990 నాటికి 16,436 సారా షాపులు 6503 బ్రాందీ షాపుల స్థాయికి ఈ సంఖ్య చేరింది.          మనం సారాని నిషేధిస్తాం....కాని కల్తీ సారాను నిషేధించలేం. మద్యాన్ని నిషేధిస్తాం....కానీ బార్లను, వైన్ శాపుల్నీ నిషేధించలేము" వినయంగా చెప్పాడు హేమాద్రిశర్మ.          ఆలోచనలో పడింది త్రిభువనేశ్వరీ దేవి.          "మొత్తం మత్తును నిషేధించడం కేంద్ర ప్రభుత్వం పని... భారత రాజ్యాంగంలోని 21వ అధికరణం ప్రకారం.... దేశంలోని ప్రతి పౌరునికీ, ఆరోగ్యవంతమైన జీవితాన్ని అధికారంలో కొచ్చే ప్రభుత్వం ఇవ్వాలి. కానీ కేంద్ర ప్రభుత్వం చెపుతున్న దేవిటి? మద్యపాన నిషేధము, రాష్ట్రాల పరిధికి చెందిందని.... కేంద్ర ప్రభుత్వం... ఏ చర్యా తీసుకోలేదని అంటోంది- రాజ్యాంగ పరంగా, మద్యపాన నిషేధాన్ని దేశమంతా అమలు చేయాల్సిన నైతిక బాధ్యత ఉన్న కారణంగా, కేంద్ర ప్రభుత్వం 12 సూత్రాల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాల పరిశీలనకు పంపి, చేతులు దులుపుకుంది. ఆ పథకంలో మద్యపాన నిషేధం గురించి మహాత్మాగాంధీ జరిపిన పోరాటాల స్ఫూర్తిగా, దేశంలోని మద్యపాన నిషేధాన్ని అమలు చెయ్యాల్సి వుంది. అంచెలంచెలుగా ఈ లక్ష్యాన్ని సాధించాల్సి వుంది. మద్యం గురించి ప్రకటనలు నిషేధించడం, విద్యా సంస్థలు, మత పరమైన పవిత్ర ఆలయాలు, పారిశ్రామిక కర్మాగారాలు వంటి వాటి దగ్గర మద్యం అమ్మే దుకాణాలను బంద్ చేయడం, ఆల్కహాల్ డ్రింకుల తయారీకి కొత్త లైసెన్స్ లు జారీ చేయకపోవడం వంటి చర్యలు తీసుకోవాలని 1975 గాంధీ జయన్తి నుండీ ఈ కార్యక్రమం ప్రారంభించాలని 1978 నుంచి ఏడాదికి రెండువారాల పాటు మద్యంలేని వారాలుగా అమలుచేసి క్రమంగా ఆ సంఖ్యను పెంచుతూ 1981 నాటికి దేశమంతా మద్యపానాన్ని నిషేధించి అమలు చేయాలని కేంద్రం ఆశించింది.          కానీ ఆచరణలో ఏం జరుగుతోంది? ఒక్కసారి ఆలోచించండి.          ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడ, ఎప్పుడు, ఏ కల్తీ సారాయి, నకిలీ మద్యంవంటివి తాగి వందల్లో ప్రజలు మృతులయితే చాలు- ఒకసారి ఆ పాత ఆదేశాలను మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలకు పంపి, తన బాధ్యత పూర్తయిందని భావిస్తోంది. చట్టాలు చేసే ప్రభుత్వాలకు వాటిని అమలుచేసే అధికారులకు చిత్తశుద్ధి లేకపోతే జరిగేది ఇదే కాదంటారా..."
13
    లక్కతో బొట్లు పెట్టివున్న పెద్ద మండిగం దాటి మెల్లాలో అడుగు పెట్టింది. మెల్లా ఇంట్లో ఉయ్యాల బల్ల వున్నది. దాని మీద ఒక ఆరేళ్ళ పిల్ల కూర్చుని వున్నది. ఆమెను చూస్తూనే బల్లమీద నుంచి దూకి లోపలకు పరిగెత్తింది. అమూల్య దిక్కులు చూస్తూ నిల్చుంది.     అంతలో నడివయసులో వున్న ఒక స్త్రీ బయటికి వచ్చింది. గుంటూరు నేత చీర అక్కడక్కడ రంగు పోయింది. ఆమెను చూసి ఆ ఇంటి పనిమనిషి అనుకుంది.     "కూర్చోమ్మా" అన్నది అమూల్యను ఎగాదిగా చూస్తూ.     అమూల్యకు ఎక్కడ కూర్చోవాలో తెలియలేదు. అక్కడ ఉయ్యాల బల్ల తప్ప కూర్చోవడానికి ఇంకేమీ లేదు.     "లక్ష్మీ ఆ చాప ఇలా తీసుకురా" లోపలికి కేక పెట్టింది.     లోపల నుంచి ఓ ఇరవై సంవత్సరాల యువతి బయటికి వచ్చింది. వెంకటగిరి జరీ చీర కట్టింది. ఖరీదైందే- కాని బాగా నలిగి వున్నది. ఎన్నోసార్లు కట్టుకొని మళ్ళీ మళ్ళీ మడతలు పెట్టి దాచుకొని కట్టుకున్న చీర అది.     ఆ యువతీ చాప పర్చింది.     అమూల్య చాప మీద కూర్చుంది.     పని అయిపోయిందిగా? నువ్వు అమ్మాయి దగ్గర కూర్చో. మిగతా పని నేను చూసుకుంటాను." అంటూ నడి వయస్సు స్త్రీ లోపలకు వెళ్ళిపోయింది.     ఆ యువతికి అమూల్యతో ఏం మాట్లాడాలో బోధపడటం లేదు. తనలోకి తను ముడుచుకుపోతున్నట్టు కూర్చుంది. అమూల్యకు ఆమె మీద జాలి వేసింది. కోపం కూడా వచ్చింది.     "మీ పేరు?" అమూల్య చొరవతీసుకొని అడిగింది.     "సరోజిని" కొంచెం బిడియ పడుతూ చెప్పింది.     అమూల్య ఆ హాలు కలియజూసింది. ఒక మూల భోషాణం వున్నది. దానిపైన కొన్ని గోతాలూ, ఇంకా ఏవేవో పాత సామాను వేసి వుంది. మరోవైపు కంది బస్తాలు ఉన్నాయ్. ఆ బస్తాల చుట్టూ అక్కడక్కడ కంది గింజలు ఉన్నాయ్.     సరోజని గోళ్ళు చూసుకుంటూ కూర్చుంది. అమూల్య ఆ చేతులకేసి చూసింది. ఎంతో మొరటుగా అక్కడక్కడ పగుళ్ళు వున్నాయి.     తమ ఇంటి పనిమనిషి పోచమ్మ చేతులు గుర్తొచ్చాయి. చిన్నప్పుడు ఎత్తుకుంటే చేతులు గుచ్చుకుంటున్నాయ్ అని ఏడ్చేది. పెద్దయ్యాక ఒకసారి ఆ చేతులు అరచేతులు తాకి చూసింది. గరుగ్గా మొరటుగా తగిలాయి.     "పనిచేసుకొనేటోళ్ళం. మీ చేతుల్లా ఎట్టా మెత్తగా ఉంటాయ్" అంటూ నవ్వింది పోచమ్మ.     అంటే ఇంటి పనులన్నీ సరోజ, వాళ్ళ అత్తగారే చేసుకుంటారన్నమాట.     తన ఆడబిడ్డల చేతులు అలా ఉండవ్. వంటలో తల్లికి సహాయం చేసినా వాళ్ళు అంట్లు తోమరు. పిండి రుబ్బరు.     వీళ్ళు చాలా ధనవంతులట. మరి వంటమనిషినీ, పనిమనిషినీ పెట్టుకోరా? ఇల్లు చాలా పెద్దదిగానే వున్నది. కాని ఒక తీరూ తెన్నూ లేకుండా వున్నది. గోడలనిండా పాతకాలపు నాయకుల ఫోటోలు, దేవుళ్ళ ఫోటోలు, కాలెండర్లూ.     "మీ పేరు" సరోజిని అడిగింది జంకుగా.     "అమూల్య."        "చాలా బాగుంది. మీ చీర కూడా బాగుంది. మీరూ బాగున్నారు."     అమూల్య నవ్వింది చిన్నగా.     "మీరు బాగున్నారు."     "పల్లెటూరివాళ్ళం."     "ఏం చదువుకున్నారు."     "ఎనిమిది వరకు"     అమూల్య ఆశ్చర్యంగా చూసింది.     "మీరూ."     "ఏం.ఏ."     సరోజిని కళ్ళు పెద్దవి చేసి చూసింది.     "మీరు పుస్తకాలు చదువుతారా."     "తెలుగు నవలలు చదువుతుంటాను."     "ఒసే పిల్లా ఇలారా!"     "ఇప్పుడే వస్తాను" అంటూ సరోజని లోపలకు వెళ్ళింది.     అలా వెళ్ళిన సరోజిని అర్థగంట దాకా బయటికి రాలేదు.     "పక్కగదిలో మగవారు భోజనం చేస్తున్నారు. పదినిమిషాల్లో అయిపోతుంది. మీకు బాగా ఆలస్యం అయింది. వాళ్ళు తినగానే మీకు వడ్డిస్తాను" అన్నది సరోజిని.     అమూల్య సరోజినిని చిత్రంగా చూసింది. అంటే తనకు శ్రీధర్ తో రఘుతో భోజనం పెట్టలేదన్న మాట. ఇదేం లంచ్.     "వస్తాను వాళ్ళకు ఏం కావాలో...."     "మీరు వడ్డిస్తున్నారా?"     "కాదు అత్తయ్య వడ్డిస్తున్నది. నేను వంటింట్లో అన్నీ తయారుగా ఉంచి ఆమెకు అందిస్తున్నాను" అంటూ లోపలకు వెళ్ళింది.     మరో పదిహేను నిమిషాలకు సరోజిని అత్తగారు వచ్చింది.     "లే తల్లీ. చాలా ఆలస్యం అయింది. కాళ్ళు కడుక్కో"     దొడ్డి వాకిలి గడప మీద సబ్బు. చెంబుతో నీళ్ళు అందించింది. అమూల్య చెయ్యి మాత్రం కడుక్కుంది. సబ్బు అందివబోతే వద్దు అంది.     గదిలోకి తీసుకెళ్ళారు. డైనింగ్ టేబుల్ పర్వాలేదు. బాగానే వుంది అనుకుంది.     ఆమె ముందు వెండి పళ్ళెం పెట్టారు.     "మరి మీరు కూర్చోరూ?"     "మేం తర్వాత తింటాం"
14
    మార్వాడీ అలంకరణలోనే వున్నాయా ఇంటి గదులు. డైనింగు రూముకీ, డ్రాయింగ్ రూమ్ కీ మధ్య తెర వుంది. అతడు ముందు ఆఫీసు గది వెతకటం మొదలుపెట్టాడు. అన్నీ సైన్సు పుస్తకాలూ, జర్నల్సూ వున్నాయి. డ్రాయరు తాళాలు గోడకి తగిలించి వున్నాయి. వాటి సాయంతో డ్రాయరుతీసి వెతికేడు. నాలుగైదు ఫైల్స్ దొరికాయి.     గోడలకు గానీ, తివాసీ క్రిందగానీ రహస్యపు అరలు ఏవైనా వున్నాయేమో అని తడిమి చూసేడు. అలాంటిదేమీ కనబడలేదు.     అతడు ఫీజు రూమ్ లోంచి డ్రాయింగ్ రూమ్ లోకి వచ్చాడు. మార్వాడీల ఇల్లు అది. గది గోడలకి రకరకాల ఫోటోలు వంశంలో అందరివీ తగిలించటం అలవాటు. ఆ ఫోటో వరుసల మధ్యలో ఒక దంపతుల ఫోటో వుంది. ఇరవై సంవత్సరాల క్రితందయినా అందులో పోలికల్ని అతడి చురుకయిన కళ్ళు వెంటనే పసిగట్టినయ్. అతడు అచేతనుడయ్యాడు. తన కళ్ళనే నమ్మలేనట్టుగా అలా వుండిపోయాడు.     అందులో వున్నది ఎస్. కె. నాయుడు.     అతను ఒక్కగెంతులో దాని దగ్గిరకి వెళ్ళి దాన్నీ, దాని పక్క గ్రూపు ఫోటోనీ పరిశీలించి చూసేడు. చంపాలాల్ తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళ గ్రూప్ ఫోటో అది. నాయుడు భార్య, చంపాలాల్ అక్క అని నిశ్చయమై పోయింది.     ఎస్.కె. నాయుడు ఎవరో మార్వాడీల అమ్మాయిని చేసుకున్నాడని తెలుసు కానీ, అది చంపాలాల్ అక్కయ్యనే అని తెలీదు. ఇంకెవరికయినా తెలిస్తే తెలుసేమోగానీ, కనీసం తన సర్కిల్ లో తెలీదు.     ఈ వాస్తవాన్ని జీర్ణించుకోవడానికి అతడికి కొంత సమయం పట్టింది. ఈ విషవృక్షపు వేళ్ళు ఎంత లోతుగా పాతుకుపోయాయో అర్థం కావటానికి ఆలస్యమైంది.     ఆ ఆలోచనలో అతడు బయట అలికిడి గమనించలేదు.     "ఎవరది?" అని వినిపించేసరికి ఉలిక్కిపడ్డాడు.     తను వెతకటానికి ఇంట్లోకి వస్తూ లోపల తలుపు గడియ వేసుకున్నాడు. బయట తాళం లేదు. కానీ వచ్చినవాళ్ళు ఎవరు? వాళ్ళకి తెలుసా చంపాలాల్ ఊర్లో లేడని? వాళ్ళకి అనుమానం వస్తుందా? అతడు తలుపు దగ్గిరకి వెళ్ళి సందుల్లోంచి చూసేడు. అటువైపు చుట్టతో నిలబడి వున్నాడు.     ఆ నిలువెత్తు విగ్రహం నాయుడిది.     కో-ఇన్సిడెన్స్ గురించి ఆలోచించేంత టైమ్ లేదు. ఒక్క గెంతులో వెనుక గదిలోకి వచ్చాడు.     బయట అతడికి అనుమానం వచ్చినట్టుంది. తలుపు దబదబా బాదుతున్నాడు. శేఖరానికి ఏం చెయ్యాలో తోచలేదు. వెనుక వరండాలోకి వచ్చాడు. అక్కడ బాల్కనీకి నాలుగు అడుగుల ఎత్తున గోడ వుంది.     అతడు మూడో అంతస్తులో వున్నాడు.     గోడపక్కనుంచి నీళ్ళ గొట్టం వుంది. కానీ అది బాల్కనీకి ఎనిమిది అడుగుల దూరంలో ఉంది.     శేఖరం చూపు బాత్ రూము పక్కనున్న వెదురుకర్ర మీద పడింది. దాని ఆధారంతో నీళ్ళ గొట్టం చేరుకోగలిగితే, అక్కణ్నించి నెమ్మదిగా క్రిందికి పాకవచ్చు, ఎవరూ చూడకపోతే అదృష్టమే.     అతడు దాన్ని తీసుకుని బాల్కనీవైపు వస్తుంటే- బయట తలుపు గడియ వూడిపోయిన శబ్దమయింది. నాయుడు లోపలికి వస్తున్నాడు. లోపల ఎవరో వున్నట్టు అతడు పసికట్టినట్టున్నాడు.     శేఖరం బాల్కనీ గోడమీద నుంచి నీళ్ళ గొట్టానికి కర్ర ఆన్చి దాన్ని పట్టుకుని, క్రిందికి దిగే సమయానికి నాయుడు అక్కడికి చేరుకున్నాడు. శేఖరం గాలిలో వుండే తలపైకెత్తి చూసేడు. అదే సమయానికి నాయుడు క్రిందికి చూసేడు. ఇద్దరి కళ్ళూ కలుసుకున్నాయి.     నాయుడు బాల్కనీ గోడమీదకు వంగి, సన్ షేడ్ ని ఆనుకుని వున్న కర్రని కాస్త కదిలించాడు.     దాంతోపాటూ శేఖరమూ గాలిలో వూగేడు.     నీళ్ళగొట్టం ఇంకా ఆరడుగుల దూరంలో వుంది. బాతులూ, తాబేలు కథలో లాగా అతడు మధ్యలో కర్రని పట్టుకుని అటు వెళ్ళటానికి ప్రయత్నిస్తున్నాడు. నీళ్ళ గొట్టపు సందుల్లో ఇరికించిన కర్ర ఏ క్షణమైనా బయటకు జారిపోయేలా వుంది. ఈ లోపులో నాయుడు కర్రని మళ్ళీ కదిలించాడు. శేఖరం వళ్ళు జలదరించింది. అక్కణ్నుంచి జారితే....     ఆ ఆలోచన భయంకరంగా తోచింది. మరికొద్దిగా నీళ్ళ గొట్టంవైపు వెళ్ళబోయాడు. నాయుడు వంగి కర్రని తన వైపుకి లాక్కున్నాడు. ఒక క్షణం ఆలస్యమయితే కర్రతోసహా తను నేలమీదకు పడిపోతానని శేఖరం గ్రహించాడు. ఇక నీళ్ళ గొట్టాన్ని చేరటానికి టైము లేదు. తప్పనిసరిగా నాయుడు వున్నవైపే రావల్సి వచ్చింది. కర్రని పట్టుకుని కాస్త ఇటుగా వచ్చేసరికి నాయుడు దాన్ని పూర్తిగా లాగెయ్యటమూ- శేఖరం దాన్ని వదిలేసి సన్-షేడ్ ని పట్టుకోవటమూ రెప్పపాటులో జరిగిపోయాయి. కర్ర క్రిందికి జారి ఎక్కడో అఘాతంలో పడిన చప్పుడు వినిపించింది.     సన్ షేడ్ ని పట్టుకుని శేఖరం గాలిలో వేలాడసాగేడు. మూడో అంతస్తు అది. నాయుడు తనకి చెయ్యి అందిస్తాడేమో అని తలపైకెత్తి చూసేడు. బాల్కనీలో వున్న నాయుడు అటువంటి ప్రయత్నమేదీ చెయ్యకుండా "చెప్పు, ఎవరు నువ్వు? నువ్వు దొంగతనానికి రాలేదు. ఎందుకొచ్చావ్? చెప్పు" అని అడిగాడు. శేఖరం మట్లాడలేదు.     నాయుడు అక్కణ్నించి కదిలి లోపలికి వెళ్ళి ఫ్రిజ్ తెరిచి ఒక బీరుసీసా తీసుకుని వచ్చి బాల్కనీలో కుర్చీ వేసుకుని కూర్చుని తాపీగా తాగటం మొదలుపెట్టాడు.     నవ్వుతూ ప్రాణాలుతీసే హంతకుల్నీ, రక్తపాతం జరుగుతూ వుంటే ఆనందించే వాళ్ళనీ చూసేడు గానీ ఇంత శాడిస్టుని ఎక్కడా చూడలేదు. అతడికి అసలు నాయుడు ఉద్దేశ్యం ఏమిటో అర్థం కాలేదు.     ఒకవిపు విసిరేసినట్టున్న ప్లాట్ అది. అవతలి ప్రక్క అంతా బహిర్ ప్రదేశం. ఎవడూ చూడటానికి కూడా అవకాశం లేదు. సన్- షేడ్ పైకి రావటానికి బలం సరిపోవటం లేదు. కానీ ఎంతసేపలా?     చేతులమీద శరీరపు బరువు ఆన్చి, గాలిలో నిలబడి వుండడం క్షణక్షణానికి కష్టం అవుతూంది. చేతులు తిమ్మిర్లు ఎక్కుతున్నాయి. పాము కప్పని మింగుతూంటే దూరం నుంచి చూసేవాడిలా బాల్కనీలో కూర్చుని నాయుడు చిత్రంగా చూస్తూ బీరు తాగుతున్నాడు- చాలా కామ్ గా.     అంతలో చేతులమీద ఏదో పాకినట్టయి తలెత్తి చూసేడు. చేతులు పైన వుండటం వల్ల ఏం పాకుతున్నదో తెలియలేదు. అతడి వెన్ను ఒక్కసారిగా జలదరించింది. అంతలో ఏదో కుట్టినట్టు చురుక్కుమంది.     చేతులు వదిలేసాడు.     దాంతో గాలి విపరీతమైన వేగంతో రివ్వున చెవుల్లోకి కొడ్తూవుండగా అతడు భూమివైపు జారిపోయాడు.     మోహన్ లాల్ కపాడియా ఇన్ స్టిట్యూట్ విశాలమైన ఆవరణలో విసిరేసినట్టున్న ఇళ్ళ వెనుక పనికిరాని చెత్తనంతా పారవేసే ఆ ప్రదేశంలో ప్రహరీకి కాస్త ఇవతల చిన్న సిమెంట్ కుండీపక్కన, చరిత్రలో ఏ ప్రాముఖ్యత లేకుండా కొన్ని వందల సంవత్సరాలనుంచీ పడివున్న ఒక రాయికి అకస్మాత్తుగా విశిష్టత లభించింది. దాంతోపాటూ అ కుండీకి కూడా. ఆ రెండూ అక్కడ లేకపోతే ఏమై వుండేదో తెలీదుగానీ, ముందు ఆ కుండీ అంచు అతని గెడ్డానికి కొట్టుకుంది.
15
    "ఎవరదీ?" అంది, ద్వారం దగ్గర నిలబడిన సంధ్యని చూపు ఆననట్టుగా చూస్తూ.     "అత్తమ్మా! నేను ..... సంధ్యని!" డగ్గుత్తికతో అంది సంధ్య.     "సంధ్యవా! ఇన్నాళ్ళకి ఈ అభాగ్యురాలిని చూడాలనిపించిందా?" ఆవిడ గొంతు గాద్గదికమైంది. "రావే! ఎలా అయిపోయానో చూద్దువు రా!"     "అత్తమ్మా!" సంధ్య పరుగున వచ్చి నర్సమ్మని అల్లుకుపోయి ఆవిడ గుండెలో తలదాచుకొంది.     హృదయంలో మమకారం అంతా వెల్లువలైనట్టుగా సంధ్యని గుండెల్లో పొదువుకొంది నర్సమ్మగారు. "సింహం నన్ను అన్యాయం చేసి పోయాడే! నీ కుంకుమ గట్టిది కాబట్టి ఆ జానకమ్మ కొడుకు వచ్చి ఆ పెళ్ళితప్పించి తీసుకుపోయాడు!" సంధ్యని తననుండి ఎడంచేసి మంచంమీద కూర్చోబెట్టింది. "నిన్నుచూడగానే నాకు వెయ్యేనుగుల బలం వచ్చినట్టుగా ఉందే! ఏమిటో పిచ్చిమనసు! నర్సమ్మత్త చచ్చిందో, బ్రతికిందో ఒకసారి చూచిపోదామని వచ్చి ఉంటావు! రేపో, మాపో వెళ్లిపోతావు! అవునా?"     "వెళ్ళిపోనత్తా! ఇహ ఎప్పటికీ నీ దగ్గరే ఉండిపోడానికి వచ్చాను!"     "నిజమా? ఎంత చల్లనిమాట విన్నానే? అయితే, ఆ అబ్బాయి, అదే ఆ జానకమ్మ కొడుకు నిన్ను పెళ్ళి చేసుకోలేదా?"     "ఉహుఁ ఆ కధంతా తరువాత చెబుతానుగాని, ముందు వేడివేడిగా ఒక కప్పు కాఫీ కావలత్తమ్మా!..... కాని, ఏడాదిలో ఎన్ని అనుభవాలు? తలుచుకొంటే గుండె జల్లుమంటూంది! ఎన్నిరకాల మనుషులు! ఎంత తమాషా ప్రపంచం! ఎంత స్వార్ధం! ఎంత కుశ్చితం!" అని ఒక నిట్టూర్పు విడిచింది సంధ్య.     "అయ్యో! ప్రయాణంచేసి వచ్చిన పిల్లని అలా ఉంచేసి మాట్లాడుతున్నాను! కూర్చోవే! క్షణంలో చేసుకువస్తాను!"     "నేను చేసుకొంటానత్తమ్మా! నువ్వే చాతకాకుండా ఉన్నావు!"     "నిన్ను చూశాక నాకు వెయ్యేనుగుల బలం వచ్చినట్టుగా ఉందే! ప్రయాణంచేసి అలసివచ్చావు! కాస్సేపు విశ్రాంతి తీసుకో! తరువాత ఈ సంసారమంతా నీకు అప్పగించి నేను విశ్రాంతి తీసుకొంటాను! సంధ్యే ఉంటే నాకిన్ని కష్టాలు ఉండేవి కాదని ఎన్నిసార్లు అనుకొన్నానో!"                           *        *        *     గదిలో సంధ్యకి బదులు సంధ్య వ్రాసిన ఉత్తరం దొరికింది అరుణ్ కు.     "అరుణ్!         నేను వెళ్ళిపోతున్నాను! నీతో పెళ్ళికి నా మనసు అంగీకరించడం లేదు! అత్త మనసు కష్టపెట్టి, ఆమె ఆశీర్వాదం లేకుండా నిన్ను చేసుకొని నేను సుఖపడలేనని నా మనసు దృఢంగా నమ్ముతూంది! అందుకే వెళ్ళిపోతున్నాను! నాకోసం వెదకొద్దు! మనసు రాయి చేసుకొంటే కొన్నాళ్ళకి అత్తమాట వింటావు! దయచేసి మీ తల్లీ కొడుకుల్ని విడదీసిన పాపం నాకు చుట్టుకొనేలా చెయొద్దు!                                                                                                                      ఇట్లు,                                                                                                        ___నీదికాలేని సంధ్య."     గదిలో ఎక్కడి సామాను అక్కడ వదిలేసి పోయింది! సంధ్యకి తను కొనిచ్చిన చీరలు, ఇతర వస్తువులు ఏవీ తీసికెళ్ళలేదు!     సంధ్యకి ఏమొచ్చింది? వట్టి క్రాక్ లా ప్రవర్తించింది! ఎంతసేపు, అత్త ఒప్పుకోలేదన్న గొడవ తప్పితే తన గొడవ పట్టలేదు! అమ్మ కోపం కొద్దిరోజులే ఉండేది! నాన్న తాతయ్యని కలుసుకొన్నట్టే తనూ అమ్మని కలుసుకొనేవాడు! నాన్నకు పట్టినన్ని రోజులుకూడా పట్టేవికాదు, తను అమ్మ కోపం పోగొట్టి దగ్గరకావడానికి!     'సంధ్య ఎక్కడికో ఎందుకు వెళ్ళి ఉంటుంది? రాజానగరమే వెళ్ళి ఉంటుంది!' అనుకొన్న తక్షణం తను మద్రాస్ నుండి వస్తూ సంధ్యకని తెచ్చిన పట్టుచీర, ఎర్రరాళ్ళ నెక్లెస్ - అవికూడా తీసుకొని బయల్దేరాడు!                                                  *        *        *     ఇంటిముందు కాలవలో బట్టలుతుకుదామని వస్తూన్న సంధ్య దూరం నుండి అరుణ్ కారురావడం చూసి లోపలికి పరిగెత్తింది!     "అత్తమ్మా! అరుణ్ వస్తున్నాడు! నేనిక్కడికి రాలేదని చెప్పు!"

No dataset card yet

New: Create and edit this dataset card directly on the website!

Contribute a Dataset Card
Downloads last month
3
Add dataset card