SNo
int64
0
25.8k
text
stringlengths
39
23.5k
24,300
         మరునాడు ప్రతిమ నిద్ర లేచేసరికి బాగా పొద్దెక్కింది. రాత్రి అసలు నిద్ర సరిపోనేలేదు. తెల్లవారుఝామున మూడయింది పడుకునేసరికి.          రోజూ అయితే అయిదింటికే లేస్తుంది తను లేచినా చెయ్యవలసిన పనులేమీ పెద్దగా ఉండవు. వంట సుబ్రమణి చేస్తాడు. అంట్లు తోమడానికి పనిమనిషి ఉంది. బజారు పనులన్నీ మల్లయ్య చేస్తాడు. రెండ్రోజులకి ఒకసారి చాకలి వచ్చి బట్టలన్నీ ఇంట్లోనే ఉతికి వెళుతుంటాడు.          తన పని నతా ఒకటికి మూడుసార్లు కాఫీ తాగడమూ, రెండుసార్లు భోజనం చెయ్యడమూ, మధ్యాహ్నం టిఫిన్ తినడమూ అంతే! మిగతా సమయమంతా తీరిగ్గా చదువుకుంటూ కూర్చోవడమే!          ఒక్కోరోజు మాత్రం తను, అత్తగారూ కలిసి ఏదో కొత్త వంటకం ఎక్స్ పెరిమెంట్ చేసి చూస్తారు. తను పుస్తకాల్లో చదివి చెబుతుంటే ఆవిడ తయారు చేస్తుంది. పక్క ఇంటి బెంగాలీ వాళ్ళ, కన్నడం వాళ్ళ వంటలు కొన్ని తెలుసుకుంది ఆమె. అవి ప్రయత్నించి చూస్తారు.          ఒకరోజు కన్నడిగుల బిసిబేడహుళి, మరోరోజు తమిళుల అవియలు, ఇంకోరోజు బెంగాలీల శ్రీఖండ్, ఒకరోజు పుడ్డింగ్, ఒకరోజు వెనిల్లా ఐస్క్రీం-          అవి మారు వడ్డించుకుని తిని, తరవాత బాగులేవని జోక్ చేస్తాడు శ్రీరాం.          సరస్వతి వయసులో పెద్ద అయినా, కొత్త కొత్తవి నేర్చుకోవాలనే కుతూహలం చాలా ఉంది ఆమెలో.          ఎప్పుడూ నవ్వుతూ, కొంచెం హాస్యంగా, కొంచెం చమత్కారంగా మాట్లాడే అత్తగారిని చూస్తే చెప్పలేనంత అభిమానం ఏర్పడిపోయింది ప్రతిమకి.          కోడలికి, "పొద్దున్నే లేవద్దు. ఇంకాసేపు పడుకో!" అని సలహా ఇచ్చే అత్తగారు ఈ ప్రపంచంలో ఈవిడొక్కతే ఉంటుందేమో అనుకుని నవ్వుకునేది ప్రతిమ. "ఇంత పొద్దున్నే లేచి ఏం చేస్తావే? బద్దకంగా ఉంటే ఇంకాసేపు పడుకో!" అంటుందామె రోజూ.          ప్రతిమ ఆ ఇంటికొచ్చిన రెండో రోజునుంచే ఆమె తనని 'వే' అనెయ్యడం మొదలెట్టింది. అదేమి చిత్రమో! ఆమె తనని గురించి మాట్లాడుతూ "అది, దాన్ని" అని సంబోధించినా ఎబ్బెట్టుగా కనపడలేదు. పైగా ఆమె తనమీద చూపిస్తున్న అభిమానానికి ఇంకా చనువు తీసుకుంటే బావుండనిపిస్తుంది.          ఇంత ఆప్యాయంగా తనని అమ్మ కూడా ఎప్పుడూ పిలవలేదు.          అత్తగారు వద్దన్నా వినకుండా అయిదింటికే లేచేస్తుంది ప్రతిమ.          కానీ ఇవాళ ఒళ్ళు తెలియని నిద్ర పట్టేసింది. అయిదింటి కోసారి మగతగా కళ్ళు తెరిచి చూసి మళ్ళీ వెంటనే నిద్రలోకి జారిపోయింది.          నుదుటి మీద చల్లగా ఎవరిదో చెయ్యి తగిలినట్లనిపించి, భారంగా కళ్ళు తెరిచింది ప్రతిమ.     సరస్వతి కొద్దిగా వంగి, ప్రతిమ నుదుట మీద చెయ్యి పెట్టి చూస్తూంది. లేచి కూర్చోబోయి, తను చీరె కట్టుకోకుండా పరికిణీతోనే నిద్ర పోయిందన్న సంగతి హఠాత్తుగా గుర్తొచ్చి, దుప్పటి దగ్గరగా లాక్కుని పడుకుంది ప్రతిమ.          "ఏమ్మా! ఇంతసేపు పడుకుండి పోయావు? ఒంట్లో బాగుందా?" అంది ఆమె ఆప్యాయంగా.          "బాగానే ఉంది."          "లే! లేచి కాస్త కాఫీ తాగి మళ్ళీ పడుకో - పదవుతూంది టైమ్!"          "పదా?" అంది ప్రతిమ తెల్లబోతూ. "బాగా నిద్ర పట్టేసింది!"          "సుబ్రమణి మంచి ఇడ్లీ, కొబ్బరి చెట్నీ చేశాడు. రాత్రి అన్నం వూరికే కెలికి వదిలేస్తివి! రెండు ఇడ్లీలు తిని, కాఫీ తాగితే కానీ తేటబడవు! లే!"          "లేస్తాను" అంది ప్రతిమ లేవకుండానే! మంచం కింద ఉన్న తన బట్టలు చటుక్కున ఒంటిమీదకు వచ్చేసేలా ఏ దేవతన్నా అనుగ్రహిస్తే ఎంత బాగుండును!          "లే! నువ్వు లేచేలోపల బోర్డు చేయించుకొస్తానని వాడు బజార్లో కెళ్ళాడు."          "బోర్డా?" అంది ప్రతిమ ప్రశ్నార్ధకంగా.          "అదేనమ్మా! ప్రాక్టీసు పెడతానన్నావుట కదా? నేమ్ ప్లేటు చేయించుకు రావడానికి వెళ్ళాడు."          ఆయన నేమ్ ప్లేట్ చేయించుకు రావడానికెళ్ళారా! ఈ ఆలోచనే ఎంత మధురంగా ఉంది!          ఉత్సాహంగా లేచి కూర్చోబోయి, మళ్ళీ పడుకుంది ప్రతిమ. అప్పుడు అర్ధమయింది సరస్వతికి ఆమె ఇబ్బంది ఏమిటో! అయినా తనకేం అర్ధం కానట్లే మొహం పెట్టి, "లేమ్మా!" అంటూ తలుపు దగ్గరగా వేసి కిందికి వెళ్ళిపోయింది.          ప్రతిమ మనసు ఆర్ద్రంగా అయిపోయింది. అత్తగారు అసలెప్పుడూ మేడమెట్లు ఎక్కి పైకి రారు. ఇవాళ తను పొద్దెక్కే దాకా లేవకపోతే, తనకి ఒంట్లో బాగులేదన్న ఆదుర్దాతో పైకి వచ్చారన్నమాట!          సాటి మనిషి ఒకరు తనకోసం ఆదుర్దా పడుతున్నట్లు తెలిస్తే ఎందుకంత తృప్తి?          ఇలాంటి అనుభూతి తనకి పుట్టింట్లో కూడా ఎప్పుడూ కలగలేదు! నిజం!          రెండేళ్ళ క్రితం తనకి ఒళ్ళు మసలిపోయినంత జ్వరం వచ్చి పడుకుండిపోతే, ఆ సంగతి మరునాడు తను నోరు తెరిచి చెప్పినదాకా గ్రహించలేకపోయింది అమ్మ!          అమ్మ ఎలా ఉందో? తను లేకుండా పనులు ఎలా చేసుకుంటూందో!          వెంటనే తండ్రి పెట్టేసిన శ్రాద్ధం, కుండలు, పొగ గుర్తొచ్చాయి. పెదిమలు బిగుసుకున్నాయి.              లేచి కూర్చుని, వంగి మంచం కింది చీరె అందుకోబోయింది ప్రతిమ.          చటుక్కున తలుపు తెరుచుకుని లోపలికి వచ్చాడు శ్రీరాం.          "ఉర్సులా ఆన్ డ్రెస్ గనక ఇలా అన్ డ్రెస్డ్ గా ఉన్న నిన్ను చూస్తే జెలసీతో నల్లబడిపోతుంది." అన్నాడు.          ఉలిక్కిపడిన ప్రతిమ, "మీరొక్కసారి బయటికి వెళ్ళండి! ప్లీజ్!" అంది ప్రాధేయపూర్వకంగా.          "ఉహుఁ! ఇది నా గది! నన్ను వెళ్ళిపొమ్మని అనడానికి ఎవరికీ అధికారం లేదు. కావాలంటే నువ్వే వెళ్ళిపో!" అంటూ చేతిలో ఉన్న పొడుగాటి ప్యాకెట్ బల్లమీద పెట్టి, తను కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని కూర్చుని సిగరెట్ అంటించాడు.          "అబ్బ!" అంది ప్రతిమ అలకగా.          ఆమెకి ఆ నేమ్ ప్లేట్ ఎలా ఉందో చూడాలని ఉంది కానీ లేవడానికి సిగ్గుగా ఉంది. కనీసం తెల్లవారుఝామునైనా చీరె కట్టుకోనివ్వని అతని అల్లరికి కోపంగానూ ఉంది. చివరికి అతికష్టం మీద దుప్పటి జారిపోకుండా చుట్టుకుని, లేచి మంచం కింద ఉన్న బట్టలు అందుకుని, త్వరత్వరగా బాత్ రూమ్ లోకి వెళ్ళింది.          నవ్వుతూ లేచి ప్యాకెట్ విప్పి, అందులోనుంచి నేమ్ ప్లేట్ తీశాడు శ్రీరాం. నల్లటి ప్లాస్టిక్ బోర్డు అది. దానిమీద తెల్లటి ప్లాస్టిక్ అక్షరాలు అతికించి ఉన్నాయి.          గోడకి ఉన్న మేకుకి తగిలించాడు దాన్ని.
24,301
    "ఎక్కడికి వెళ్లాలో తెలియడంలేదు! కాని ఏదో ఒకటి నేను త్వరగా నిర్ణయించుకోవాలి. ఇక ఇక్కడ ఎన్నో రోజులు వుండలేరు!"     "మీరు..... మీరు వెళ్లిపోతే నేను ఇక్కడ ఒక్క క్షణంకూడా వుండలేను! నేనూ వెళ్ళిపోతాను! అమ్మ ఏమయినా బాధపడనీ, తిట్టనీ."     కిటికీలోంచి జయలక్ష్మి తొంగి తొంగి చూడ్డంకనిపించింది శంకరికి. "వెళ్ళు అచ్యుతా! ఇంటిలోకివెళ్లి చదువుకో ఫో"                      *    *    *    *         జయలక్ష్మి ప్రసవించింది మళ్లీ ఆడిపిల్లను.     చూడవచ్చిన చుట్టాలతో ఇల్లంతా నిండిపోయింది. కొందరుచూసి ఒకటి రెండు రోజులుండి పోయినా కొందరు బారసాలచేసి వెడతాం అంటూ వుండిపోయారు.     పురిటి మనిషి ఇంట్లోవుంటే పని తక్కువేమీ వుండదు. పైగా చుట్టాలకు మర్యాదలు, వంటా,  వడ్డనా, గిన్నెలు కడుక్కోవడం చేసి చేసి అలుపుజ్వరం వచ్చేసింది శంకరికి.  జ్వరం వచ్చినా అలాగే స్నానంచేసి వంట చేసేది. జయలక్ష్మి అమ్మమ్మకి చెప్పలేనంత ఆచారం! తడిబట్ట కట్టుకుచేస్తేగాని ఆవిడ భోజనం చేయదు.     జ్వరం, పైగా తడిబట్ట కట్టుకోవడం, జ్వరం విషమించినట్టుగా అయ్యి స్పృహతప్పిపోయింది.     అలా జ్వరంతో మంచంమీద వుండగానే రెండు రోజులు గడిచిపోయాయి. ఆమెగురించి పట్టించుకొనేందుకు ఎవరికీ తీరికలేదు. పైగా సణుగుడు. "సమయంచూసి రోగం తెచ్చుకొంటే ఎలా" అని! ఆమె రెండురోజులనుండి నోట్లో మంచినీళ్లుకూడా పొయ్యకుండా పడివుంటే అచ్యుతం విలవిల్లాడిపోయాడు. దగ్గరగా వెళ్లి పలుకరిద్దామంటే జయలక్ష్మి తన డేగకళ్లతో కనిపెడుతూ వుంటుందేమోనని భయం!     చివరికి ఆరోజు ధైర్యం చేసి గ్లాసులో పాలు తీసికెళ్లాడు "వదినా!"     "........."     "వదినా!"     శంకరి కళ్లు తెరిచిందేగాని మాట్లాడలేదు.       "కొంచెం ఈ పాలు తాగండి!"     "వద్దు! ఏం తాగాలని లేదు!"     "రెండు రోజుల నుంచి చూస్తున్నాను. మీరేం తీసుకోవడం లేదు! ఏం త్రాగకపోతే, తినకపోతే ఎలా?" అతడి గొంతు ఎందుకో వణికింది.     "బతకాలని లేదు, అచ్యుతా! ఎందుకోసం బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? ఏముందని బ్రతకాలి?"     "అలా అనుకొంటే  ఎలా? ఏమీ చేతకాని వాణ్ని. నేననుకోవాలి ఆ మాట!"     "పుట్టింట్లోనే వంట మనిషి, పని మనిషీ కావడం  ఎంత అవమానమో నీకు తెలియదు! నేనిక ఎన్నాళ్ళో ఇక్కడ వుండలేను! వెళ్లిపోవాలి. ఎక్కడికైనా వెళ్ళి పోవాలి!" ఉన్మత్తంగా అంది శంకరి.       "ఎక్కడికి వెడతారు?"     "ఈ విశాల ప్రపంచంలోకి! నాకు సాయం చేస్తావా, అచ్యుతం?"     "చేస్తాను! కాని, ఈ పాలు త్రాగాలి మీరు!"     "ఇవ్వు!" సగం త్రాగి "ఇక త్రాగలేను!" అంటూ ఇచ్చేసింది గ్లాసు.                                                       *    *    *    *             జయలక్ష్మి నిద్ర లేచేసరికి ఉదయం ఏడూ, ఏడున్నర  అవుతుంది. ఆవిడ లేచి తలకొంగు జాగ్రత్తగా కట్టుకొని, చెప్పులు వేసుకుని పెరట్లోకి వచ్చేసరికి ముఖం కడక్కోవడానికి రెడీగా వేణ్నీళ్లుంచుతుంది శంకరి. కాని, ఈరోజు నీళ్లకాగు క్రింద ఎవరూ మంట పెట్టినట్టులేదు! ఆవిడ కోపంగా "శంకరీ! శంకరీ!" అంటూ కేక పెట్టింది. సమాధానం రాలేదు.     ఆవిడ చరచరా ఇంట్లోకి వచ్చింది.     "ఏం చేస్తున్నావ్? వేణ్నీళ్లు కాచలేదు! ముఖం ఎలా కడుక్కుంటాననుకొన్నావు?"     "........."     అసలు వంటింట్లో ఏ అలికిడి లేదు!     శంకరి లేదా?ఎక్కడ చచ్చింది?     జయలక్ష్మి వంటింటి గుమ్మం దగ్గరికి వచ్చి తొంగి చూసింది.     తెల్లారేసరికి అలికి ముగ్గులు పెట్టి, గిన్నెలు తళతళ లాడేట్టు కడిగి బోర్లించి వుంచేది శంకరి. కాని, ఇవాళ పాచి ఇల్లు అలాగే వుంది! వంట పాత్రలు ఎక్కడివక్కడ పడివున్నాయి.     ఈ శంకరికి ఏమొచ్చింది? మళ్లీ జ్వరం అంటూ ముడుచుకు పడుకోలేదు కదా?     జయలక్ష్మి గాబరాగా శంకరి  పడుకొనే చోటికి వచ్చి చూసింది. శంకరి  పక్కచుట్టుగాని, శంకరిగాని లేరు! ఆవిడ చురుగ్గా అచ్యుతం పడుకొనే గదిలోకి పరిగెత్తింది. అతడూలేడు. గూట్లో అతడి  తాలూకు బట్టలసంచిగానీ, పక్కచుట్టగానీ లేవు.
24,302
    అతను అంటున్నదేమీ అర్థం కాకపోయినా పరాంజపే మౌనంగా వెళ్ళిపోయాడు.     సాయంత్రం అయిదుగంటలు-     తన బెడ్ రూమ్ కి ఎడమవైపు గోడకున్న స్విచ్ ను ప్రెస్ చేశాడు విశ్వాత్మ.     రహస్యంగా అమర్చిన చిన్న డోర్ తెరుచుకుంది.     లోపలికి ప్రవేశించి డోర్ క్లోజ్ చేయబోతూ బయటకు ఒకసారి తలపెట్టి ఆ బెడ్ రూమ్ లోని నలువైపులా చూసి, భారంగా నిట్టూర్చి డోర్ క్లోజ్ చేసేశాడు. ఆ ప్రదేశం ప్యాలెస్ కు సరిగ్గా మధ్య భాగంలో వుంది. దాదాపు 200 అడుగుల లోపలికి దారితీసే మెట్లు. త్వరత్వరగా దిగుతూ వెళ్లాడు కిందకి.     దాదాపు పదిహేను నిముషాల పైనే పట్టిందతనికి.     భూగర్భంలో అతి పటిష్టంగా నిర్మించిన ఆ రెండు గదుల్లో ఒక గది తలుపు తెరవగానే ఆ శబ్దం వింతగా ధ్వనించింది. మొదటి గది దాటి రెండో గదిలోకి ప్రవేశించాడు విశ్వాత్మ.     సరిగ్గా గది మధ్యలో అమర్చబడిందా పరికరం.     "క్రిప్టోగ్రాప్"     ప్రపంచానికి విచిత్రమయిన సవాలుని విసరబోయే కంప్యూటర్ మెషీన్.     దానివైపు తీక్షణంగా చూస్తూ దానిని వణుకుతున్న వేళ్ళతో స్పృశించాడు అతను. తన జీవితంలో సాధించిన అద్భుతాలన్నింటిలోకి తనకు పూర్తిగా సంతృప్తినిచ్చిన విజయం అదే అనుకున్నాడు.     సున్నితంగా కీ బోర్డ్ ఆపరేట్ చేశాడు.     అంతా తన అధీనంలో అనుకొన్నది అనుకోన్నట్టుగానే జరుగుతోంది.     కొన్ని క్షణాలు గడిచాక ఒక కోడ్ అందించాడు దానికి. అయిదు నిమిషాలు గడిచాక అతను సూచించిన కోడ్ ప్రింట్ క్యారేజీలోంచి బయటికొచ్చింది.     ఆత్రంగా అందుకొని తదేకదీక్షతో దాన్ని అపురూపంగా మననం చేసుకున్నాడు.     మనోఫలకంపై నిక్షిప్తం చేసుకున్నాక లైటర్ తో కోడ్ కాగితాన్ని బూడిద చేశాడు విశ్వాత్మ.     తరచుగా తనకొచ్చే కల... ఆ కలలో ఒక యుద్ధవీరుడిగా తను వుండటం.     ప్యాలెస్ ను ఏ సంవత్సరంలో తను నిర్మించడానికి పూనుకున్నాడో ఆనాటి విశేషాలు, వైదేహితో తన పెళ్ళి, క్యాన్సర్ వ్యాధితో ఆమె మరణించిన రోజు...     ఇండస్ట్రియలిస్టుగా తన ఎదుగుదలలో తను మర్చిపోలేని కొన్ని అరుదయిన రోజులు...     'పునర్జన్మ' అనే ఆలోచన మొదటిసారిగా తన మెదడులో మెదిలిన రోజు, అందుకోసం విస్తృతంగా తను జరిపిన పర్యటన, పరిశోధన, గ్రంథపఠనం.     వైదీశ్వరన్ కోయల్ కి వెళ్ళి శివస్వామిని కలవడం...     అరకులోయలో సిద్ధముని స్వామిని కలవడం....     అమర్ నాథ్ గుహలో హిమలింగస్వామిని కలవడం....     పారాసైకాలజీ ప్రొఫెసర్ రామకృష్ణారావు గురించి రామకృష్ణారావుకు పుట్టబోయే మనవడికి తను 'ధృతకుమార్' అని పేరు పెట్టడం-     అటార్ని సాత్యకి తయారుచేసిన వీలునామాలో నిక్షిప్తం చేసిన విశేషాలు....     మరీ ముఖ్యంగా-     గోల్కొండ కోట, రాజమహల్ గుహాంతర్భాంగంలో అరుదయిన నాణాలను భవిష్యత్ జ్ఞాపకాలుగా దాచడం-     అన్నిటినీ తను మాత్రమే అర్థమయ్యేటట్టుగా కోడ్స్ ద్వారా కంప్యూటర్ లోకి ఫీడ్ చేశాడు.     ప్రతి పాయింట్ కు ఒక ప్రత్యేకమైన కోడ్.     మొత్తం ఇరవై ప్రశ్నలు- వాటికి సమాధానాలు- ఆపైన మరోటి- మొత్తాన్ని ఆ మెషీన్ కి ఫీడ్ చేశాడు.     స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆ మ్యాటర్ వైపు, తను నిబద్ధం చేసిన కోడ్స్ వేపు తదేక దీక్షతో చూడసాగాడు.     విశ్వాత్మ బ్రెయిన్ లో కంప్యూటర్ లో ఫీడ్ చేసిన మ్యాటర్. ఆ కోడ్స్, ప్రశ్నలు, వాటి సమాధానాలు స్థిరనివాసం ఏర్పరచుకున్నాయి.     పది నిమిషాలు గడిచాక-     స్క్రీన్ మీద మ్యాటర్ ని మెమొరీలో వుంచి తన బ్రెయిన్ లో నిక్షిప్తమైన మ్యాటర్ని కోడ్స్ తో సహా ఎంట్రీ చేసి, మెమొరీలోని మాటర్ తో తను ఫీడ్ చేసిన మ్యాటర్ని టాలీచేసి చూసుకున్నాడు.     ఎక్కడా 'రాంగ్ బైట్' లేదు.     ఎవ్విరిథింగ్ పర్ ఫెక్ట్...     చిన్నగా నవ్వుకున్నాడు విశ్వాత్మ.     ఆ మ్యాటర్ని కూడా ప్రింట్ అవుట్ తీసి లైటర్ తో మొదట చేసినట్టుగానే ఆ కోడ్ కాగితాన్ని బూడిద చేసేశాడు.     ఎక్కడా ఏ రకమైన అనుమానం లేదు.     మరోసారి దీక్షగా కంప్యూటర్ కనెక్షన్లన్నీ పరిశీలించి చూశాడు. కంప్యూటర్ వెనుక రూమ్ లో ప్రత్యేకంగా అమర్చిన ఎక్స్ ప్లోజివ్ సిలిండర్ కనెక్షన్లు మరోమారు చెక్ చేశాడు. అంతా సవ్యంగా వుంది.     విశ్వాత్మ ముఖంలో సంతృప్తికరమైన ఫీలింగ్.     చివరిసారిగా తన క్రిప్టోగ్రాఫ్ వైపు చూస్తూ, సేఫ్ డోర్ లాక్ చేశాడు.     అతడు ప్యాలెస్ లోని తన బెడ్ రూంలోకి వచ్చేసరికి రాత్రి 10.35 నిమిషాలైంది.     దాహంగా వుంది అతనికి.     దాహంగా వున్నప్పుడు విశ్వాత్మ వైన్ తాగుతాడు. సరాసరి లిక్కర్ కాబినెట్ వైపు నడిచాడు.     ఎందుకో అతని కాళ్ళు ఒక్కసారిగా తడబడ్డాయి. చూపులో ఏదో అస్పష్టత.     అంటే- తనను మృత్యువు సమీపిస్తోందా? అతి సమీపానికొచ్చి హెచ్చరిస్తోందన్న మాట. అది తలుచుకుని నవ్వుకున్నాడు విశ్వాత్మ.     గబగబా లిక్కర్ కాబినెట్ లోంచి వైన్ బాటిల్ ని తీసి ఆ డ్రింకుని గ్లాసులో పోసుకుని నెమ్మదిగా చప్పరించడం ప్రారంభించాడు.     సరిగ్గా పదకొండు గంటలైంది.... చూస్తుండగానే వైన్ బాటిల్ ఖాళీ అయింది.     హిమలింగస్వామి చెప్పిన తన మృత్యురహస్యం గుర్తుకొచ్చింది.     తన సహజ మరణం జనవరి 27 రాత్రి అర్థరాత్రి పన్నెండుగంటల పది ఘడియలకు రాసి వుందన్నది గుర్తుకొచ్చింది విశ్వాత్మకు.     అంతకు ముందు తను చనిపోలేడా? ప్రస్తుతం తన మృత్యువు తన చేతిలోనే వుంది.     తను ఏ క్షణంలోనైనా మృత్యువుని ఆహ్వానించగలడు. ధీమాగా అనుకున్నాడతను.     ప్యాలెస్ చీకట్లో కొట్టుమిట్లాడుతోంది. కిటికీ తెరిచి... గార్డెన్ వైపు చూశాడు. తోటలోని చెట్లమీద వెన్నెల వెలుగు వెండిరజనులా మెరుస్తోంది. మరో పదినిమిషాలు గడిచాయి. ఆ సమయంలో విశ్వాత్మ మెదడులో చిన్న కోరిక తలెత్తింది.     ముహూర్తం ప్రకారం తను సరిగ్గా పన్నెండు గంటల పది ఘడియలకు చనిపోతాడు. కానీ... అంతకంటే ముందుగానే తను చనిపోయి, మృత్యువు నిర్ణయం కన్నా, తన నిర్ణయమే గొప్పదని నిరూపిస్తే?
24,303
    ధరణికుమార్ సూసైడ్ చేసుకుంటే ఎవరికి లాభం? ఏమిటి లాభం? ఇంతకీ ధరణికుమార్ ఎవరు?     మంచివాడిలా కనిపిస్తున్న ధరణికుమార్ కి, అహోబలపతికి మధ్య గొడవలున్నాయా?     "రియల్ ఎస్టేట్... బిజినెస్ గొడవలు" ధరణి చెప్పిన విషయం జ్ఞాపకాని కొచ్చింది ఆదిత్యకు.     అహోబలపతికి రియల్ ఎస్టేట్ బిజినెస్ వుందా? అందులో ధరణి కుమార్ పార్ట్ నరా?     పదిహేను రోజుల్లో ధరణికుమార్ సూసైడ్ చేసుకునేటట్లు తను చేయకపోతే హోంమినిస్టర్ చేసిన హెచ్చరిక గుర్తుకొచ్చింది ఆదిత్యకు. ఆవేశంతో పిడికిళ్ళు బిగుసుకున్నాయి.     "గుర్రం పెద్దబ్బాయి నిన్ను వదుల్తాడనుకున్నావా?" మళ్ళీ ధరణిమాట జ్ఞాపకానికొచ్చింది.     గుర్రం పెద్దబ్బాయి ప్రతిపక్ష నాయకుడిగానే తనకు తెలుసు... అతని గురించి ధరణికి ఎక్కువ వివరాలు తెల్సుంటాయి. అతని ద్వారా ఎక్కువ ఇన్ఫర్మేషన్ సంపాదించాలని నిర్ణయించుకున్నాడు ఆదిత్య.                             *    *    *    *    *     పదకొండు గంటలు గడిచాయి.     ప్రిజనర్స్ లంచ్ టైమ్... తమ కంచాల్ని తీసుకుని తిండి పెట్టించుకుని విశాలమయిన హాల్లోకొస్తున్నారు ఒక్కొక్కరూ.     ఒక చేత్తో ఏదో పేపర్, ఇంకో చేత్తో కంచాన్ని పట్టుకుని వస్తున్న ధరణి ఆదిత్యని విష్ చేశాడు.     ఆదిత్య కళ్ళు ఎర్రగా రక్తం చిమ్ముతున్నట్లుగా వున్నాయి.     "రాత్రంతా నిద్రపోలేదా?" ఆప్యాయంగా అడిగాడు ధరణి.     "నిద్రెలా పడుతుంది? పగ, ప్రతీకారం రగిలిపోతుంటే?" ఆదిత్య ఆగ్రహావేశాలతో అన్నాడు.     "అయితే ఏం చేస్తావ్?"     "తను సి.ఎమ్. కావటం కోసం నన్ను బలిపశువును చేసి మోసం చేసిన అహోబలపతిని చంపేవరకు నిద్రపోను.     చిన్నగా నవ్వాడు ధరణికుమార్.     "అదే తప్పు మిత్రమా! నీ అవసరం కోసం నువ్వు అహోబలపతిని చంపటానికి ఒప్పుకున్నావు అంటే నీ తప్పూ వుందిగా? ఎవడయినా తనను చంపమని తనే డబ్బిస్తాడా? కొద్దిగానయినా ఆలోచించావా? లేదు. నీ అవసరం నిన్ను ఆలోచింపనివ్వలేదు."     "కాని... మరీ ఇంత కుట్రా?"     "కుట్రలు, కుతంత్రాలూ చేయకపోతే రాజకీయ నాయకులు పదవుల్లోకెలా వస్తారు?"     "మీ ఉద్దేశ్యం ఇంత జరిగినా వూరుకొమ్మనా?"     "ఎంతమాత్రం కాదు. ఎత్తుకు పై ఎత్తు వేయాలి... దెబ్బకు దెబ్బ తీయాలి. అదును చూసుకుని నువ్వతన్ని ట్రాప్ లోకి లాగాలి."     "ఎలా?"     "ఆవేశాన్ని తగ్గించుకో... ఆలోచన పెంచుకో... టైమ్ వస్తుంది వుపయోగించుకో..."     "నన్నీ ట్రాప్ లో ఇరికించిన ప్రతి ఒక్కర్నీ నడిరోడ్డుమీద చంపుతాను. అహోబలపతి... హోంమినిస్టర్నీ..." అని ఆగిపోయాడతను.     అతనికి చటుక్కున గుర్రం పెద్దబ్బాయి గుర్తుకొచ్చాడు.     "గుర్రం పెద్దబ్బాయి గురించి మీకేమైనా ఇన్ఫర్మేషన్ తెలుసా?"     "ఏం? ఆయన్ని కూడా చంపుతావా?"     "లేదు."     "నన్నీ ట్రాప్ లో ఇరికించడంలో ఆయన పాత్ర ఏమాత్రం ఉందో తెల్సుకుందామని..."     "తెల్సుకుని?"     "సి.ఎమ్. మర్డర్ వెనక ఆయన హస్తంకూడా ఉంటే... పనిలో పనిగా లేపేస్తాను."     ఆదిత్య ఆవేశానికి నిట్టూర్చాడు ధరణి.     "నన్ను ఏ నేరం చేసి జైల్లోకొచ్చావని అడిగావు గుర్తుందా? నేనేం నేరం చెయ్యలేదు. నా మీద నేరం మోపారు. నాకు ఈ పాలిటిక్స్, ఈ మర్డర్స్, ఈ క్రిమినాలజీ, ఇదంతా అసహ్యం. హాయిగా నా భార్యతో... ఒక్కగానొక్క బేబీతో అమెరికాలో సెటిలవుదామనుకున్నాను ఇండియా వచ్చాను. హైదరాబాద్ వచ్చాను. నేను అనుకున్నదొకటి, జరిగిందొకటి... నువ్వు అహోబలపతి కుట్రలో యిరుక్కున్నావ్. నేను గుర్రం పెద్దబ్బాయి కుట్రలో యిరుక్కున్నాను అంతే తేడా... అయిపోయింది... మరో టెన్ డేస్ లో నేను బయటికొచ్చేస్తాను. వీళ్ళందరికీ దూరంగా... హాయిగా... నన్ను ప్రేమించిన భార్యతో, బేబీతో..." ఎక్కడో చూస్తూ చెప్పుకుపోతున్నాడు ధరణి.     ధరణి మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఆదిత్య. ఆ మాటల వెనక ధరణి మనసు మృదుత్వాన్ని అర్ధంచేసుకోడానికి ప్రయత్నిస్తున్నాడు.     "గుర్రం పెద్దబ్బాయి మీ బిజినెస్ పార్ట్ నరా...?" చేతులు కడుక్కుంటూ అడిగాడు ఆదిత్య.     "ఆ విషయం చెప్తే నువ్వు షాక్ తింటావ్..." చేతులు కడుక్కుంటూ అన్నాడు ధరణి.     "ఫరవాలేదు చెప్పండి."     "గుర్రం పెద్దబ్బాయి పెద్దకొడుకుని నేను."     ఆ మాటకు నిజంగా షాక్ తిన్నాడు ఆదిత్య. ఒక ప్రతిపక్ష నాయకుడి కొడుకు యిన్నిరోజులుగా జైల్లో ఎందుకున్నాడు?     "మరి?" ఆదిత్య మదిలో ఎన్నో ప్రశ్నలు. ఏ ఒక్క ప్రశ్నా బయటికి రావడం లేదు. ఏం మాట్లాడలేకపోతున్నాడు.     "చూశావా! నువ్వు షాక్ తింటావని చెప్పానా?" అంటూ ముందుకెళ్ళిపోయాడు ధరణి.     తల దించుకొని వరండాలో నడుస్తున్నాడు ఆదిత్య.     అతని మెదడును దొలిచేస్తున్న ఒకే ఒక ప్రశ్న....     ధరణి సూసైడ్ చేసుకునేటట్టుగా అహోబలపతి ఎందుకు ప్లాన్ చేస్తున్నాడు? స్వంత కొడుకునే, గుర్రం పెద్దబ్బాయి ఎందుకు జైల్లో పెట్టించాడు?     "దిసీజ్ ఏ విషస్ సర్కిల్!" గొణుక్కుంటూ సెల్ లోకి అడుగు పెట్టాడు ఆదిత్య.     ఎడారిలో ఇనప ముళ్ళమీనుంచి పరిగెడుతున్నట్టుగా వుంది అతడి పరిస్థితి!     ధరణి సూసైడ్ చేసుకునేటట్లు తను చెయ్యలేకపోతే?     చెవుల పక్కన బాంబులు పేలుతున్నట్లుగా వుంది ఆ ప్రశ్న.     ధరణి కుమార్ ని సూసైడ్ చేసుకునేటట్లు చేసి, తను మళ్ళీ ఇంకో ట్రాప్ లోకి యిరుక్కోలేడు.
24,304
    సంకేతిని శరీరం మరోసారి జలదరించింది.     "యాక్టివ్ లైఫ్ లీడ్ చెయ్యవలసిన అవసరం లేనివారికి, రిటైర్ అయిన వారికి మామూలు కేటరాక్ట్ ఆపరేషన్ ఫర్వాలేదు. కొన్ని సంవత్సరాలక్రితం ఐతే ఏ ఏజ్ లో ఉన్నవారికైనా మామూలు ఆపరేషన్ తప్పేదికాదు."     అతనా మాటలు చెబుతున్నప్పుడు వెనకనుంచి ఎవరో నడిచినట్లు అడుగుల చప్పుడైంది. ఇందాకటి అడుగుల సవ్వడి. చప్పున తల త్రిప్పి వెనక్కి చూసింది. సగం వరకూ మాత్రమే ఉన్న స్ప్రింగ్ డోర్ క్రింద నుంచి ఎవరివో పాదాలు కదిలి, అంతలోనే కనుమరుగైపోయాయి.     "ఏమిటి చూస్తున్నారు?" అనడిగాడు కృష్ణచైతన్య.     సంకేతిని తల మళ్ళీ ఇటుకేసి త్రిప్పి "ఏమీలేదు" అంది.     కృష్ణచైతన్య ఎటో చూస్తున్నట్లు ఓ నిమిషం మౌనంగా ఉండిపోయాడు. వాళ్ళిద్దరూ కూర్చున్నచోటుకు ప్రక్కగా ఓ దళసరి క్లాత్ తో చెయ్యబడిన గ్రీన్జ్ కర్టెన్ వుంది. పేషెంటును ఏకాంతంగా ఎగ్జామిన్ చెయ్యదలుచుకున్నపుడుగాని ప్రైవేట్ విషయాలు మాట్లాడదలచినప్పుడుగాని ఆ ప్రదేశాన్ని ఉపయోగించదలుచుకుంటారు. గ్రీన్ కర్టెన్ వెనుకనుంచి దానికున్న చిన్న కంతలద్వారా రెండు కళ్ళు తనని నిశితంగా పరిశీలిస్తున్న సంగతి సంకేతినికి తెలియదు.     "ఇంప్రూవ్ డ్ టెక్నిక్ గురించి చెప్పండి" అనడిగింది.     "ఐ.ఒ.ఎల్. అంటే ఇంట్రా ఆక్యులర్ లెన్స్ ఇన్ ప్లాన్ టేషన్. ఈ టెక్నిక్ లోలోపలవున్న లెన్స్ ని తొలగించి, దానిస్థానే ఆర్టిఫిషియల్ లెన్స్ ని అమర్చి మళ్ళీ స్యూచర్స్ వేసేస్తారు. అంటే చెడిపోయిన లెన్స్ స్థానే కొత్త లెన్స్ వుంటుందన్న మాట. ఇందులో లెన్స్ యాంటీరియల్ ఛాంబర్ ఓపెన్ చేసి వుంచటం. లేకపోతే పోస్టీరియల్ ఛాంబర్- అంటే లెన్స్ ఒరిజినల్ గా వున్న స్థానంలో వుంచటం రెండు టెక్నిక్ లు ఉన్నాయి. ఇందులోవున్న రిస్క్, కాంప్లికేషన్ అందులో వున్నాయి. వాళ్ళ వాళ్ళ నమ్మకాన్ని బట్టి, ఎఫిషియన్సీని బట్టి పేషెంట్ కండిషన్ నిబట్టి తనకు తోచిన టెక్నిక్ ఎన్నుకుంటారు."     "ఐ.ఒ.యల్. చేయించుకుంటే చూపు మామూలుగా వచ్చేస్తుందా?"     కృష్ణచైతన్య నవ్వాడు. ఆమె ప్రతిమాటలో లోపల పడుతున్న మానసిక సంక్షోభం, ఆందోళనా వ్యక్తమవుతున్నాయ్.     "ఐ.ఒ.యల్ చెయ్యటంలో ఉద్దేశ్యం పేషెంట్ చూపును సాధ్యమైనంత నార్మల్ పొజిషన్ కు తీసుకురావటమే."     "ఇలా చేసుకుంటే గ్లాసెస్ వాడవలసిన అవసరం లేదా?"     "గ్లాసెస్ తప్పదు. కేటరాక్ట్ తో బాధపడకపోయినా చత్వారం వల్ల గ్లాసెస్ వాడటం లేదా? అలాగే. కాకపోతే చాలా తక్కువ పవర్ లో వుంటుంది. ప్లస్ త్రీ ఫోర్ మధ్య సాధారణంగా వుంటుంది. ఒక్క చదువుకోవటానికి, రాసుకోవటానికి మినహాయించి మిగతా వేళ్ళల్లో గ్లాసెస్ లేకుండా హాయిగా తిరిగెయ్యవచ్చు. కారు డ్రైవింగ్ కూడా గ్లాసెస్ అంటే కళ్ళజోడు లేకుండా చేసెయ్యవచ్చు."     సంకేతిని కళ్ళముందు ఏవేవో దృశ్యాలు గోచరిస్తున్నాయి. ఇన్నాళ్ళు తాను పడ్డ మానసిక వేదన, దారుణమైన యాతన, వరుసగా జరుగుతోన్న అనుభవాలు... తను చాలా ప్రసిద్ధురాలైన పిడియాట్రిషియన్. ఎంతోపేరు ప్రఖ్యాతులున్న రచయిత్రి. ఇంకా మంచి వయసులో వుంది. జీవితం మీద ఎంతో ఆశవుంది, ప్రేమవుంది, తను అందమైన రంగు రంగుల జీవితం గడపాలి. వార్దక్యపు చిహ్నాలు ప్రవేశించినట్లుగా, ఓడిపోయినట్లుగా, నిస్తారంగా నిస్తేజంగా గడపకూడదు. తన యాక్టివ్ నెస్ కు ఏ మాత్రం విఘాతం కలక్కూడదు.     "నాకు ఐ.ఒ.యల్. చేసెయ్యండి. సాధ్యమైనంత తొందరగా చేసెయ్యండి" అంది ఆవేశంగా.     కృష్ణచైతన్య ఆమె కళ్ళలోకి చూశాడు. ఇద్దరి కళ్ళూ కలుసుకున్నాయి. "ఆపరేషన్ చేస్తాను" అన్నాడు. అతని గొంతులో వచ్చిన మార్పు ఆమె గమనించలేదు.     "ఎప్పుడు?"     "మొదట ఇన్ వెస్టిగేషన్స్ పూర్తికానివ్వండి, వారం పదిరోజుల్లో పూర్తిచేస్తాను" అంటూ ఏమేమి టెస్టులు చేయించుకోవాలో ప్రిస్క్రిప్షన్ రాసిచ్చాడు.       ఆమె లేచి నిలబడింది. "ఇన్ వెస్టిగేషన్స్ పూర్తిచేసుకుని రెండు రోజుల్లో కలుస్తాను డాక్టర్" అని బయటకు వచ్చింది.     అక్కడ్నుంచి బయటకు రావాలంటే పొడవాటి నడవాలోంచి నడవాల్సి వుంది. ఆ సమయంలో ఆ వరండా అంతా నిర్మానుష్యంగా వుంది. ఒ.పి. టైమ్ అయిపోవటంచేత లైట్లు ఆర్పివేయబడి, పగటి వేళయినా చీకటిగా వుంది.     సంకేతిని చకచక అడుగులువేస్తూ నడుస్తోంది. ఆ అడుగుల చప్పుడుతో జత కలుస్తూ వెనకనుంచి ఇంకెవరివో అడుగులు. సంకేతిని ఆ చప్పుడు గుర్తుచేసుకుంటోంది. అడుగులు వెంటవస్తూనే వున్నాయి.     సంకేతిని కావాలని ఆగింది.     వెనక వినిపించిన అడుగులు చప్పుడూ ఆగిపోయింది.     ఒక్కక్షణం- అలా నిలబడి మళ్ళీ ముందుకు సాగింది. తిరిగి వెనక నుంచి అడుగులచప్పుడు. సంకేతిని ఒక్క ఉదుటున వెనక్కి తిరిగింది. అంతకంటే ముందుగా ఎవరివో పాదాలు వెడల్పాటి పిల్లర్ చాటుకు తప్పుకున్నాయి.     ఇలా ఎందుకు...? మళ్ళీ అంతలోనే సర్దుకొని తేలిగ్గా తీసుకునేందుకు ప్రయత్నించింది. ఎవరో ఎందుకో నడుస్తుంటే తాను అనవసరంగా భ్రమపడుతున్నదేమో.     గబగబ నడచి వరండాదాటి బయటకు వచ్చేసింది. రెండు నిమిషాల తర్వాత కారులో స్టీరింగ్ ముందు కూర్చుని నుదుట నలుముకున్న చెమటలు తుడుచుకుంది.     ఆమె వెళ్ళిపోయిన తర్వాత కృష్ణచైతన్య జేబులోంచి సిగార్ తీసి వెలిగించుకున్నాడు. ఈ మధ్య హాస్పటల్ లో దుర్ఘటనలు జరిగినప్పట్నుంచీ అతను సిగార్ కాల్చట మెక్కువైంది.       సగానికి వున్న స్ప్రింగ్ డోర్ తెరుచుకుని ఒక వ్యక్తి లోపలకు వచ్చాడు.     "డాక్టర్ ప్రద్యుమ్నా! రేపు ఆపరేషన్ కు సిద్ధంగావున్న కేసులన్నీ జాగ్రత్తగా చూసుకున్నారా?" అన్నాడు కృష్ణచైతన్య, 'జాగ్రత్త' అన్నపదాన్ని వత్తిపలుకుతూ.                                                                  *  *  *
24,305
                                                            ఖడ్గసృష్టి                                                                                    _ శ్రీ.శ్రీ.                                             రెండురెళ్ళు నాలుగన్నందుకు     గూండాలు గండ్రాళ్ళు విసిరే సీమలో     క్షేమం అవిభాజ్యం అంటే     జైళ్ళు నోళ్ళు తెరిచే భూమిలో     అస్వంతంత్ర్యమని జయించడానికి     అహింసాయుధం ధరించామంటూ     రక్తపాతం లేకుండానే     రాజ్యం సంపాదించామంటూ     అవినీతి భారీ పరిశ్రమలో     అన్యాయాల ధరలు పెంచేసి     స్వాత్యంత్ర్యాన్ని బ్యాంకుల్లో వేసుకుని     చక్రవడ్డీ తిప్పే కామందులకు     క్షణ క్షణం మారుతూన్న లోకాన్ని     సరీగా అర్ధంజేసుకున్న వాళ్ళంతా     పేద ప్రజల పక్షం వహించడమే     పెద్ద అపరాధమై పోయింది.     అహింస ఒక ఆశయమే కాని     ఆయుధం ఎప్పుడూ కాదు     ఆశయం సాధించాలంటే     ఆయుధం అవసరమే మరి.     ఆశయం ఉండడం మంచిదే కాని     అన్ని ఆశయాలూ మంచివి కావు     ఆశయాలు సంఘర్షించే వేళ         ఆయుధం అలీనం కాదు     అందుకే అంటున్నాను నేను     అందుకో ఆయుధం అని     ఆచరణకి దారితీస్తేనే     ఆవేశం సార్ధకమవుతుంది.     అందుకే సృష్టిస్తున్నాను     అధర్మనిధనం చేసే ఈ ఖడ్గాన్ని     కలంతో సృష్టిస్తున్న ఖడ్గం ఇది     జనంతో నిర్మిస్తున్న స్వర్గం ఇది           ఈ కత్తి     బూజుపట్టిన భావాలకి     పునర్జయం ఇవ్వడానికి కాదు     కుళ్ళిపోతున్న సమాజవృక్షాన్ని     సమూలచ్ఛేదం చెయ్యడానికి     దీన్ని    నల్లబజారు గుండెల్లో దించు     దీనితో    కల్లకపటాలను వధించు     ఇది     సమానధర్మాన్ని స్థాపిస్తుంది         నవీన మార్గాన్ని చూపిస్తుంది     ఈ కత్తి     ఊహాసమూహాల వ్యూహాలు పన్ని     వీరవిహారం చేస్తూ     రణక్షోణిలో     జనాక్షౌహిణులు కదలడానికి          అందుకే రాస్తున్నా నొకగీతి     చేస్తున్నా నొక హేతి     రావోయి లోనికి     సందేహం దేనికి?     ఇది నిజం     నవధర్మ మానవధర్మం     ఆణవశక్తి కన్న     మానవశక్తి మిన్న     రావోయి రావోయి లోనికి     సంకోచం దేనికి     నను చూడగా ఇదేవేళ     నామనః కార్మికశాల         క్రక్కేది భావాగ్ని సెగలు         క్రమ్మేది దావాగ్ని పొగలు     రావోయి రావోయి లోనికి     రాసేది రవ్యుష్ణ గీతి     చేసేది పప్యుగ్ర హేతి                                                             _ జనశక్తి ద్వైవార పత్రిక - 30.3.1966
24,306
    "నాకేమొచ్చింది!" అనుకుంది వాసంతి.     వాసంతి వెనుకనే వున్న జానకి "గుమ్మంపట్టుకు వేలాడుతున్నావేమిటి పద." అంది నెమ్మదిగా.     సిగ్గనేది ఆడదాని సహజ లక్షణమని, అది పిలిచినా తెప్పించుకున్నా రాదని సమయాన్ని బట్టి సిగ్గనే మాయలమారి, ఆడదాని అణువణువునా ఆక్రమించి మొగ్గలా శరీరం ముడుచుకుపోయేటట్లు చేసి బుగ్గలు నిగ్గుతో ఎర్రబర్చి కనురెప్పలు బరువుగా వాలిపోగా తల వాల్చేటట్లు చేస్తుందని వాసంతి ఎరుగదు. సమయానుకూలంగా సిగ్గుపడటానికి నాటకంలో పాత్రా! నిజజీవితంలో ఓ అందమైన సన్నివేశంగాని.     వాసంతికి గుమ్మంలో నుంచోవాలన్నా ముందుకు కదిలి అడుగు వేయాలన్నా ఏది చేయలేక ఏదోగా వుంది. వాసంతికి మరికాసేపు శ్రమలేకుండా "రారా వాసూ! రామ్మా జానకీ!" అంటూ వెంకట్రామయ్యగారు పిలిచారు.     పెద్ద భారం దిగిందానిలా "అమ్మయ్య" అనుకుని వాసంతి తండ్రి దగ్గరకు నడిచింది.      తండ్రి పక్కనే సోఫామీద వాసంతి కూర్చుంది. జానకిని కూర్చోమంటే కూర్చోలేదు. సోఫాని పట్టుకు నుంచుంది.     సీలింగ్ ఫ్యాన్ ఫుల్ స్పీడ్ తో తిరుగుతున్నది. ఎవరికి వుక్కపోయటంలేదు. శ్యామ్ సుందర్ మాత్రం షర్ట్ కాలర్ సరిచేసుకుని చేతిలోవున్న పేపరుతో చిన్నగా విసురుకుంటూ వాసంతిని చూడటానికి ప్రయత్నిస్తు అందరెదుట ఎలా చూడాలో తెలియక నానా బాధపడిపోతున్నాడు. "ఎవరైనా మాట్లాడితే బాగుండును. తనతో పెద్దవాళ్ళని తీసుకురాకపోవడం వాళ్ళొచ్చినప్పుడు తను రాకపోవడం ఎంత బాధ! వాళ్ళేదయినా ప్రశ్నలడుగుతుంటే తను వాసంతిని చూసేవాడు. తనేమి అడుగుతాడు!" ఇలా ఆలోచిస్తున్నాడు శ్యామ్ సుందర్.     "శ్యామ్ అందంగా ఆకర్షనీయంగా వున్నాడు. ఓసారి చూస్తే ఏం తెలుస్తుంది! పోనీ తలెత్తి చూస్తే! అబ్బే బాగుండదు. అతను తనవైపు చూస్తుంటే ఎలా? చూడడని ఏముంది? తనని చూస్తూనే వుండొచ్చు. ఎలా? చూస్తున్నాడో లేదో ఎలాగో అలా వక్కసారి చటుక్కున చూస్తే. ఎలా? ఎలా? వాసంతి ఆలోచనలు అలాసాగుతున్నాయి.     కొద్దేసేపు తర్వాత ఏక సమయానికి శ్యామ్ వాసంతి ఓ నిర్ణయానికి సిగ్గుని వదిలేసి వచ్చారు. తల ఎత్తి ఒకరివైపు వకరు చూసుకున్నారు. సిగ్గు కంగారు వీటిని వాళ్ళయితే వదిలేశారుకాని అవి వీళ్ళని వదలలేదు. చటుక్కున రెండూ ఏకకాలంలో వచ్చి శ్యామ్ ని వాసంతిని ఆక్రమించుకున్నాయి. షరా మామూలే. శ్యాం కంగారు కంగారుగా వాసంతిపై నుంచి చూపులు మరల్చుకుని అంతకన్నా కంగారుగా మహా జోరుగా పేపరుతో విసురుకోటం మొదలుపెట్టాడు. వాసంతి అయితే ఠకీమని తలవంచుకుని అరచేతిలో రేఖలు పరిశీలించుకుంటూ మునిపంటితో పెదవినొక్కి సోఫామీద కూర్చున్నా ముళ్ళ కంచెమీద కూర్చున్నట్లు ఏమిటో తెలియని బాధతో కూర్చుండిపోయింది.     వాసంతి బజార్లల్లోను కాలేజీలోను పరిచయస్తులలోను ఎందరో అందమైన అబ్బాయిలను చూసింది. ఎలాంటి వారిని చూసినా ఎప్పుడు సిగ్గుపడి ఎరుగదు. ఇప్పుడెందుకు సిగ్గేస్తున్నదో కూడా ఎరగనిదయింది. ప్రకృతిలో ఆడది సిగ్గుపడేభాగాలు చాలా వున్నాయి. సమయము సందర్భముబట్టి సిగ్గు ఆడదాన్ని వరిస్తుంటుంది. సమయాను కూలంగానో లేక సందర్భానుసారంగానో మరేదో. ఏదయితేనేం, మొత్తానికి వాసంతికి సిగ్గు తెప్పించాయి.     వెంకట్రామయ్యగారు శ్యామ్ ని ఏదో ఓ మాటలెత్తి పలకరిస్తున్నారు. పెళ్ళిచూపులనే తతంగానికీ ఆమాటలకి ఎక్కడా పొత్తులేదు. వాసంతి గొంతు శ్యామ్ వినాలంటే వాసంతి కూడా మాట్లాడాలి కాబట్టి మధ్యమధ్య వాసంతినేదో అడుగుతున్నారు. అయితే ఆ మాటల్లో జవాబుగా చెప్పేవి ఏవి లేకపోవటంతో "ఊ." ఉహూ" తో వుండిపోయింది వాసంతీ.     అక్కడెవరికీ కూడా జరుగుతున్నది వుషారుగా లేదు. ముఖ్యంగా రాధాకృష్ణకీ అసలునచ్చలేదు. వాసంతి శ్యామ్ సుందర్ ఎదురెదురుగా సోఫాల్లో కూర్చున్నాగాని వాళ్లు తేరిపార చూసుకున్నదిగాని మాట్లాడుకున్నది గానిలేదు. తను శ్యామ్ పక్కనే కూర్చుని వాసంతిని పలకరిస్తే వాసంతి తలఎత్తి తనతో మాట్లాడుతుంది. ఆ మిషతో నయినా వాసంతి శ్యామ్ ని బాగా చూస్తుంది అనుకున్నాడు రాధాకృష్ణ. వెంటనే లేచి శ్యామ్ పక్కనే కూర్చున్నాడు.     రాధాకృష్ణ మధ్యలోలేచి శ్యామ్ సుందర్ పక్కనే ఎందుకు కూర్చున్నాడో ఎవరికీ అర్ధంకాలేదు.     రాధాకృష్ణ వుషారుగా మాట్లాడుతుంటే శ్యామ్ కి ఫ్రీగా వుంది. తనూ సరదాగా కబుర్లు చెపుతూ కూర్చున్నాడు. మామయ్య పలుకరింపువల్ల వాసంతికి బిడియం తగ్గింది. మాటల మధ్యలో నాలుగయిదు సార్లు శ్యామ్ ని చూసింది.     "పెద్దవాళ్ళం మేమే అన్నీమాట్లాడుతున్నాము. మా వాసూని ఏమయినా ప్రశ్నలడగవోయ్ శ్యామ్ సుందర్!" అన్నాడు రాధాకృష్ణ కొద్దిసేపు అయింతరువాత.     "ఊ. ఉహూహు." అన్నాడు శ్యామ్ సుందర్. మాట్లాడాలని వుందిగాని ఎలాగో తెలియక తికమకపడ్డాడు.     జోక్ చేస్తున్నట్టు నవ్వుతూ "అరె వాసూ! కాలంమారిపోయింది. నువ్వే అబ్బాయిని ప్రశ్నలేసి పరీక్షచేస్తావేమిటి!" అన్నాడు రాధాకృష్ణ.     వాసంతి చిరుకోపంతో రాధాకృష్ణవైపు చూసి ఆచూపుని అలాగే శ్యామ్ వైపుతిప్పి ఆపై కనురెప్పలు టపటపలాడించి మిన్నకుండిపోయింది.     "ఈపిల్ల కోపంలో చాలాచాలా బాగుంది." అనుకున్నాడు శ్యామ్ సుందర్.     "ఏదయినా మాట్లాడాలంటే మాట్లాడు బాబూ!" అన్నారు వెంకట్రామయ్యగారు.     శ్యామ్ సుందర్ సందిగ్ధావస్తలో పడిపోయాడు.     రాధాకృష్ణ మామూలు డాక్టరుగాక సైక్రియాటిస్ట్ గాబట్టి మనుషుల్నే గాక వారి మనసుల్ని కూడా చదవగలడు. శ్యామ్ సుందర్ వాసంతి మనసుల్ని అర్ధంచేసుకుని రంగంలోకి దిగాడు.     "మా ఎదుట బిడియం అయితే మా వాసంతితో వంటరిగా మాట్లాడే ఏర్పాటుచేస్తాను, పరస్పరం మాట్లాడుకుని అర్ధం చేసుకుని ఏసంగతి చెప్పు శ్యామ్ సుందర్! ఈవిషయంలో మేమేమీ అనుకోము." అన్నాడు రాధాకృష్ణ.     వాసంతితో వంటరిగా మాట్లాడాలని శ్యామ్ సుందర్ కి వుంది. అదెలా చెప్పాలో తెలియలేదు. ధైర్యం వహించి చెపితే వాళ్ళేమయినా అనుకోవచ్చని ఏమూలో రవంత భయం. ఏంచేయాలో తెలియనప్పుడే రాధాకృష్ణ ఈప్రసక్తి ఎత్తాడు.     శ్యామ్ సుందర్ కి చాలా సంతోషం కలిగింది," మీ అందరికీ యిష్టమయితే..." అంటూ వాసంతివైపు చూశాడు.     "నీ యిష్టమే మాయిష్టం అనుకో!" వెంటనే అనేశాడు రాధాకృష్ణ.
24,307
    నేను నవ్వాను. "చూడమ్మాయ్! నీకు పెళ్ళి అంటే ఇష్టం లేక కాదు. నీ ఆలోచన అంతా మీ ఇంటి గురించే అవునా! మీ ఇంటి పరిస్థితులు తెలియక కాదు. నా ఉద్దేశ్యం...     "దయచేసి నా మాట వింటారా!" నా మాటలకి అడ్డు తగిలి అంది.     "చెప్పు!"     "మనం రెండు వీధులు దాటితే పార్క్ వస్తుంది. అక్కడ కూర్చుని మాట్లాడుకుందాం. బజారులో ఇలా నుంచుని మాట్లాడితే బాగుండదు.     "అవును పార్క్ కెళదాం అదే మంచిది. కాదంటే హోటల్ కి వెళ్ళి ఫామిలీ రూమ్ లో కూర్చుని మాట్లాడుకోవచ్చు."     "నాకు అలా ఇష్టం లేదు."     "నీకెలా ఇష్టం అయితే అలా!"     దీప్తి నా వేపు గుర్రున చూసింది.     నేను ముఖం పక్కకు తిప్పుకున్నాను.     మరి కాసేపటిలో ఇరువురం పార్కుకి వచ్చాము.     ఈ సమయంలో పార్క్ లో ఎవరుంటారు! నిశ్శబ్దంగా వున్న పార్క్ లో గుబురుగా వున్న క్రోటన్స్ పక్కన కూర్చున్నాము.     "ఇంక చెప్పండి" అంది దీప్తి.     "ఏమిటి!"     "మీ విషయం. మీకెందుకు నా పెళ్ళి మీద ఇష్టం కలిగిందో అదీను!"     నేను పెళ్ళిళ్ళ పేరయ్యలాంటి వాడిని అంటూ కధ కల్పించి చెప్పాను.     "అయిందా చెప్పటం?" వ్యంగ్యంగా అడిగింది ఆమె.     "ఆ__"     "నేను పాలు తాగే పసిపాపను కాను. మీరెవరు నన్నెందుకు వెంటాడుతున్నారు చెప్పండి!"     "అబ్బెబ్బే అలాంటిదేమీ లేదు. కేవలం పెళ్ళి విషయం..."     "అబద్ధం."     "అబద్ధం అని ఎలా చెప్పగలుగుతున్నారు?" అడిగాను.     "ఒకసారి అమ్మాయ్ అంటూ మరోసారి అండీ అంటూ మాట్లాడుతున్నారే అది చాలు" అంది దీప్తి.     "నా నోట్లోంచి మాట రాలేదు."     "మీరెవరు! నన్నెందుకు వెంటాడుతున్నారు?"     "ఇప్పుడు చెప్పినా మీకు అర్ధం కాదు. వకటిమాత్రం నిజం. మీరు ఆపదలో ఉన్నారు. నేను మీ శ్రేయోభిలాషిని."     "నేను ఆపదలో వున్నానా! జోక్ బాగుంది" అంటూ నవ్వింది ఆమె.     "మీరు నవ్వితే అందంగా వున్నారు. అంతవరకూ నిజం. కానీ మీరు నవ్వక్కరలేదు. నాకు అంతా తెలుసు.     "అంతా అంటే?"     "అంతా అనే పోనీ మొత్తం అందాం!"     "మీరు ఎవరు?" దీప్తి అనుమానంగా చూస్తూ అడిగింది.     "చెప్పానుగా శ్రేయోభిలాషినని"     "శ్రేయోభిలాషికి ఓ వూరూ పేరూ వుండవా?"     "ఎందుకుండవు? వుంటాయి."     "అదే చెప్పండి."     "దానికి సమయం కావాలి."     "మంచిది! అందాకా మా ఇంటి వేపుకి రాకండి. వస్తే మర్యాదగా వుండదు. మీరెవరో నా కనవసరం. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి. మరోసారి మీరు నా విషయంలో జోక్యం కలిగించుకున్నారా. మీ..."చటుక్కున మాట ఆపుచేసి లేచింది దీప్తి.     "మీ...అదేదో పూర్తిచేసి పొండి" నేనూ లేస్తూ అన్నాను.           "సమయం వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది. బై"     దీప్తి వెళ్ళబోతుంటే చటుక్కున దీప్తి చెయ్యి పుచ్చుకున్నాను. దీప్తి గించుకుంది.     "ప్లీజ్! నేను చెప్పేది విను. నాకు తెలుసు నీవు ఎంత ప్రమాదంలో వున్నదీను. నాకు తెలిసినంతలో యీ విషయం నీకూ తెలుసునని పైకి బుకాయిస్తున్నావనీను...నేను మీ ఇంటికి వచ్చిపోవటం వల్ల నీకు నష్టం లేదు. కాదు కూడదంటే నా మార్గం నాకు వుంది."      "దీప్తి! కొందరు నేరం చేసి నేరస్తులవుతారు. మరికొందరు ఏ నేరం చేయకుండానే నేరస్తులవుతారు. మరో కొందరు నేరస్తుల బెదిరింపుల వల్ల బలవంతానా నేరస్తులు అవుతారు. నీవు మూడోరకం నేరస్తురాలివి."     "మీరెవరు?" అంది దీప్తి.     దీప్తి కళ్ళల్లో భయం రెపరెపలాడటం గమనించాను.     "అది ప్రస్తుతం అప్రస్తుతం. వకే వక్కరోజు టైము యిస్తున్నాను. రేపు సాయంత్రం నిన్ను కలుసుకుంటాను. అప్పుడు వివరంగా మాట్లాడుకుందాము. వక్కవిషయంలో నీవు నన్ను నమ్మితే చాలు."     "ఏమిటి?"     "నేను నీ శ్రేయోభిలాషివని."     దీప్తి మాట్లాడలేదు. ఏదో ఆలోచిస్తున్నట్లు అనిపించింది. నన్ను మాత్రం గుచ్చి గుచ్చి చూసింది.     "మరోసారి రేపు కలిసి మాట్లాడుకుందాం బై..." దీప్తి చెయ్యివదిలేసి చెప్పాడు.     దీప్తి కోపంగా లేచి నన్ను వదిలి వెళ్ళిపోదామనుకున్నది. స్థాణువులా యింకా అక్కడే నిలబడింది.     నేను చకచక అడుగులు వేస్తూ పార్క్ లోంచి బైటికి వచ్చాను.     ఇష్...ఇష్...     ఆ కోడ్ నాకు తెలుసు చటుక్కున ఆగిపోయాను.     ముష్టివాడు నా ఎదురుగుండా వచ్చి నిలబడ్డాడు. నా ముందు చెయ్యి చాచాడు.     దీప్తి కోసం నేను నియమించిన మా డిపార్టుమెంటులో అతను ఈ వేషంలో వున్నాడు. జేబులోంచి డబ్బులు తీస్తున్నట్లుగా చేయిపెట్టి "క్విక్" అన్నాను అది మా కోడ్.     "దీప్తి వెనుకనే యిరువురు వ్యక్తులు వెన్నంటి వచ్చారు. పార్క్ బయట ఆగిపోయారు. మీ యిరువురూ పార్క్ లోకి వెళ్ళటం చూశారు బహుశా వకతను మిమ్మల్ని వెంటాడవచ్చు."     "గుడ్, వాడి కళ్ళు నేను కప్పుతాను, నీవు దీప్తిని వెంటాడు అన్నాను.     యీ సంభాషణ మా యిరువురికి మాత్రమే వినపడేటంత నెమ్మదిగా చాలా క్విక్ గా చెప్పుకున్నాము.
24,308
    నరసింహం తడబడ్డాడు - తనకు అనుమానం వుందిగానీ అది తనొక్కడే ఆలోచించి తేల్సుకోవాల్సిన విషయం ! మురళీకి తెలీకూడదు.     "వాడు ఖచ్చితంగా నా రక్తం పంచుకు పుట్టినవాడేనని నాకు అనుమానంగా వుంది ! లేకపోతే ఇన్ని పోలికలుండవ్__"     "నేనూ అదే అనుకొంటున్నాను" అన్నాడు నరసింహం. అప్పటికప్పుడు ఏదో ఒక కథ అల్లి మురళికి చెప్పాలి. ఆ కథ ఎలాంటి దయ వుండాలంటే - ఆ కథ వినగానే మురళి తన సోదరుడి మీదా, తల్లి మీదా పగబట్టాలి. వాళ్ళిద్దరూ తన శత్రువులని భావించాలి ! అలాంటి కథలల్లి చెప్పటం మొదలుపెట్టాడు.     "అవున్రా ! ఇన్నాళ్ళూ ఈ విషయం చెప్పటం ఇష్టంలేక దాచాను. అసలు విషయం తెలిస్తే నీకు కన్నతల్లి మీదే ద్వేషం కలుగజేసినట్లవుతుందని చెప్పలేదు-"     "ఏమిటి అది ?"     "నీ చిన్నప్పుడు జరిగిన విషయం ఇది. నీ నాన్న పచ్చి తాగుబోతు. రోజూ తాగి అర్దరాత్రి ఇంటికి చేరుకుని మీ అమ్మను చావగొడుతుండేవాడు. పాపం మీ అమ్మ చాలా రోజులు ఆ నరకం నిశ్శబ్దంగా అనుభవించింది. ఓ రోజు రాత్రి నీ నాన్నకు ఎదురు తిరిగింది. తన వంటిమీద చేయిపడితే సహించేది లేదని హెచ్చరించింది. దాంతో మీ నాన్న మరింత రెచ్చిపోయి ఆమెను గొడ్డును బాదినట్లు కొట్టడం ప్రారంభించాడు. ఇదంతా తలుపు దగ్గర నిలబడి చూస్తున్న మీ అన్నయ్య రోకలిబండ తీసుకొని వెనుక నుంచి వచ్చి మీ నాన్న తలమీద కొట్టాడు. అంతే ! మీ నాన్న అక్కడికక్కడే మరణించాడు. మీ మ్మ కెవ్వుమని కేకవేసి స్పృహ తప్పింది. మీ అన్నయ్య ఆ రక్తంచూసి భయపడి ఇంట్లోనుంచి పారిపోయాడు. ఆ తరువాత ఏమయ్యాడో తెలీదు. ఆ నేరం తనమీద వేసుకుని మీ అమ్మ జైలు కెళ్ళింది. ఇప్పుడు నన్ను సాధించాలని ఈ విధంగా పధకం వేసినట్టున్నాడు."     "నువ్వు చెప్పినదంతా నాకు తెలిసిన కథే కానీ ఆ హరికృష్ణ నన్ను సాధించటం దేనికి ?"     "అతడి భార్యని నువ్వు చేసుకున్నందుకు ?"     మురళి మొహంలో ఆందోళన కనపడింది. "నన్ను నువ్వు కూడా నమ్మటంలేదా మావయ్యా ?" అన్నాడు దిగులుగా.     "నమ్ముతున్నాననుకో కానీ అనుమానం అనుమానమే కదా ?"     మురళి ఒక నిశ్చయానికి వచ్చిన వాడిలా, "సరే నీ దగ్గర కూడా నా స్థానాన్ని అనుమానాస్పదం చేసిన ఆ దుర్మార్గుడిని ఎలా ఎదుర్కోవాలో నాలో నేనే ఆలోచిస్తాను." అని అక్కణ్నుంచి వెళ్ళిపోయాడు.     నరసింహం మొహంలో ఆనందం తొంగిచూసింది.     తనక్కావలసింది సాధించిన ఆనందం. అతడికింకా ఒక అనుమానం మిగిలిపోయింది. నీళ్ళదగ్గిర ఒక కుర్రవాణ్ణి కాల్చేసి, మరొకడిని తనతోపాటు బయటకు తీసుకువచ్చి, వాడినే ఆయుధంగా శారదమ్మని బెదిరించాడు. అయితే తను తీసుకువచ్చింది ఆ చీకట్లో ఎవరిని ? హరికృష్ణనా ? మురళీకృష్ణనా ? తన కూతురి మెడలో చిన్నప్పుడు తాళి కట్టింది మురళీ అని తనకు తెలుసు ! అయితే ఇప్పుడు మురళి అన్న పేరుమీద తనకి అల్లుడు అయినవాడు నిజంగా మురళీయేనా? లేక హరికృష్ణే పేరు మార్చుకుని కేవలం రాధ ప్రేమ సంపాదించటానికి యీ అబద్దమడుతున్నాడా ? అదేగానీ నిజమైతే తన అల్లుడు తనకన్నా పెద్ద మోసగాడు. అటువంటప్పుడు ఈ హరికృష్ణ తన న్యాయబద్ధమైన స్థానం కోసం పోరాడటంలో తప్పులేదు.     అయినా కూడా తన ప్రస్తుత అల్లుడిని రక్షించాలి !     కూతురి మీద ప్రేమతోకాదు.     తన రహస్యం బయటపడకుండా  వుండటం కోసం.                         *    *    *     ఆ సాయంత్రం నరసింహం కారులో నగరానికి ఉత్తరం దిక్కుగా బయల్దేరాడు.     దాదాపు అయిదు కిలోమీటర్ల దూరం ప్రయాణం చేశాక ఒక ఫ్యాక్టరీ వచ్చింది.     'మోర్కా' బిస్కెట్స్ ఫ్యాక్టరీ అది.     గేటు దగ్గిర  ఆపి సెక్యూరిటీ గార్డుతో "నాకు రంగా అని, ప్యాకింగ్ సెక్షన్ లో వుంటాడు అతడు కావాలి" అని చెప్పాడు.     సెక్యూరిటీ గార్డు మామూలు సమయాల్లో అయితే ఇలాంటివి వప్పుకోడు. కానీ వచ్చింది కార్లో కనుక నమ్రతగా.     "మీ పేరేమని చెప్పమంటారు ?" అడిగాడు.     "సుబ్రహ్మణ్యం" అన్నాడు నరసింహం.     "రెండు నిమిషాల తర్వాత  అతి సామాన్యంగా ఉన్న ఓ వ్యక్తి ఫాక్టరీనుంచి గేటుదగ్గరకు వచ్చాడు. పైకి మాత్రమే అతడు సామాన్యంగా కనపడతాడు. నరసింహాన్ని కార్లో చూస్తూనే అతని మొఖంలో ఆశ్చర్యం కనిపించింది.     "నమస్కారం సార్ !" అన్నాడు చిరునవ్వుతో దగ్గరకొస్తూ. "సుబ్రహ్మణ్యం అంటే ఎవరో అనుకున్నాను."     "కారెక్కు-" అన్నాడు నరసింహం క్లుప్తంగా.     "ఇప్పుడా ?"     "అవును !"     "డ్యూటీ__"     "ముందు కారెక్కు"     "మా సూపర్ వైజర్ తో చెప్పి వస్తాన్సార్-"     "త్వరగా రా-"
24,309
    "ఎలా గయినా నా భర్త ప్రాణాలు కాపాడండి. లేదా నా ప్రాణాలు తీయండి!"     "నీకు ఆయుర్దాయముంది. అతనికి లేదు. విధిని నేనెలా మార్చగలను."     "మీరు విభూతిని ప్రసాదించకండి" అన్నదామె లేచి నిలబడి కొంగు చాచి.     "తదాస్తు దైవకృప ఉంటే నీ భర్త బ్రతకాలి" విభూతి పిడికెడు కొంగున రాల్చాడు.     యోగి అనుగ్రహాన్ని సంపాదించిన తరువాత ఆమెకు చాల తృప్తి కలిగింది.     సన్యాసులు కూడ ఆమెకు ఎంతో గౌరవాన్ని యిచ్చారు.     నగరం పొలిమేరల మీద వారు నిలిచిపోయారు సత్రంలో!     "అమ్మా! నగరంమీద నాగులు దాడి చేయటానికి వెళ్ళాయని యోగి చెప్పాడు. వాటి మీద జరిగినా దహన కాండలో పాల్గొన్న వారందరి మీద అది ప్రతీకారం తీర్చుకుంటాయి కాబోలు! నీ భర్తవారికి నాయకత్వం వహించాడు కదా!? వారి పరిస్థితి ఎలాగ వుందో వెళ్ళి కాపాడుకో!" అని తొందరించి ఆమెను పంపేశారు.     యువ అధికారి భార్య నగరం వైపుగా పరుగు తీసింది.     నగరంలోకి వెళ్ళేందుకు సిటీ బస్సులు యింకా బయలుదేరలేదు.     ఒక ఆటో వ్యక్తిని పిలిచి అడిగింది.     కాని అతడు నగరంలోకి వచ్చేందుకు విముఖత ప్రదర్శించాడు.     "ఆ వైపు నించి వచ్చేవారు చాల భయం కలిగేలా చెబుతున్నారు తల్లీ! నేనే కాదు, అందరూ ఆ వైపుకి రావటానికి భయపడి ఊరుకుంటున్నారు. నీ విలా ప్రయత్నించటం అనవసరం దారి తెలిస్తే కాలి నడకన పోవడం మంచిది.!"     "అంత భయం కలిగించే సంఘటనలు ఏం జరుగుతున్నాయి నగరంలో?"     చిత్ర విచిత్రమైన వార్తలు వస్తున్నాయి.     కొందరు దొంగలంటున్నారు. కొందరు విప్లవకారులంటున్నారు మరి కొందరు ఎక్కడ చూచినా పాములు కనబడుతున్నా యంటున్నారు. వివరంగా చెప్పేవారు లేరు. తెలుసుకుందామంటే టెలిఫోన్ లు లేవు.     పూర్తి వివరాలు తెల్లవారితే కాని తెలియవు" అన్నాడు.     ఇంకా మాటలతో కాలయాపన చేయటానికి మనస్కరించక నగరం వైపుగా నడవటం ప్రారంభించింది. ముందుకు పోయినకొద్దీ అదే వార్తలు వస్తున్నాయి.     నగరంలో కొన్ని ప్రాంతాలలో ఏదో అలజడి జరుగుతోంది.     అదేమిటన్న వివరాలు మాత్రం పూర్తిగా ఎవరికీ తెలియవు.     కొందరు వ్యక్తులు పరుగుతీస్తూ ఆమెకు ఎదురు రావటం కన్పించింది.     "ఎందుకలా పరుగెడుతున్నారు?" ప్రశ్నించిందామె.     "పోలీసు కాలనీ మీద పాములు దాడి చేశాయి."     ఇంక ప్రమాదం ముంచుకు వచ్చిందని పరుగుతీయటం ప్రారంభించింది.     ఎక్కడికక్కడే జనం గగ్గోలు పెడుతున్నారు. ఎక్కడేం జరుగుతున్నదో ఎవరికీ సరిగా తెలియదు. పరుగులెత్తేవారు తలకొక రకంగా చెప్తున్నారు.     ఆమె ఇంటికి చేరుకునే సరికి పెద్ద సంఖ్యలో జనం గుమికూడి ఉన్నారు.     భర్త శవం నేలమీద పడి ఉంది. పాము కాటుకి గురయి అతడు చాల భయంకరంగా చనిపోయాడు. కళ్ళు  విపరీతంగా తెరుచుకున్నాయి.     అలాంటివే అన్ని వంకలనించి వార్తలు వస్తున్నాయి.     ఆపరేషన్ లో పాల్గొని పాముల్ని తగులపెట్టే కార్యక్రమంలో పాలొన్న వారంతా ప్రమాదంలోని ఉన్నారని అందరికి వెల్లడి అయింది.     "ఆ దేవతలు కన్ను విప్పితే మన శక్తి ఏ పాటిది?" ఎవరో వ్యాఖ్యానించారు.     "ఆమె భర్త శవంమీద కుప్పలా కూలిపోయింది.     కొంగున కట్టి తెచ్చిన విభూతి అంతా నేలపాలు అయింది.     ప్రాణాలకు తెగించి ఆమె చేసిన సాహసం ఫలించలేదు.     వెంటనే అధికారులు వచ్చి విచారాన్ని వెలిబుచ్చారు. ఉజ్వలమయిన భవిష్యత్తులోకి అడుగు పెట్టిన కొద్ది సేపటికే అతడు అలాంటి దుర్మరణం పాలు కావటం అందరికీ బాధ కలిగించింది. కాని ఎవరేం చేయగలరు?     అధికారులు తమ ప్రప్రధమ కర్తవ్యంగా శవాన్ని పోస్ట్ మార్టం చేయించేందుకు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే అక్కడ మరికొందరి శవాలున్నాయి. వారంతా పాములపై దాడి చేసినవారే!     ఈ వార్తలు అప్పటికప్పుడే నగరమంతా వ్యాపించాయి.     పాములు దాడి ముగించి విజయవంతంగా తిరిగి అదృశ్యమయినాయి! ఆ తరువాత విద్యుత్ సరఫరా అయింది టెలిఫోన్ లు వైర్ లెస్ లు పనిచేయడం ప్రారంభించినాయి. అవి దాడి చేస్తూ ఉండిన అంతసేపు నగరం అంధకారంలో మునిగి పోయింది. వార్తలు అందించుకునేందుకు అవకాశం చాలక అల్లల్లాడి పోయింది అంత శక్తివంతమయిన రక్షణ వ్యవస్థలు మొత్తం కుప్పకూలి పోయినట్లు అనిపించాయి! వాటి దాడి ముగిసింది.     పరిస్థితి అంతా యధాతధం అయింది.     పోలీసు జీపులు అంబులెన్సులు వ్యాన్ లు నిర్విరామంగా పరుగులు తీశాయి. మొత్తం నగరమంతా అర్ధంతరంగా నిద్ర చాలించి జాగృతం అయింది.     మైకులు పెట్టుకుని పోలీసులు ప్రచారం చేస్తున్నారు.     "నగరంలో ఎక్కడా ఒక్క పాముకూడ కన్పించటల్లేదు. ప్రజలు భయపడవద్దు."     కాని ప్రజలలో కలిగిన భయోత్పాతం అంత తేలికగా సమసిపోయేది కాదు. వారు భయంతో బిగుసుకుపోయి బితుకుబితుకు మంటున్నారు.    
24,310
     "ఏదో కారణం వుంది." అంతవరకే గ్రహించింది సీత. ఆపై ఊహ కందలేదు.     పెళ్ళికాకముందు జీవితానికి, పెళ్ళయింతర్వాత గడుపుతున్న జీవితానికి తారతమ్యం ఆలోచిస్తూ నిద్రపట్టక చాలారాత్రి మంచం మీద అటూ ఇటూ పోర్లుతూనే వుంది సీత.     హాయిగా గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు సుందరమూర్తి.                                                31     ఉదయంనుంచి ముభావంగానే వున్నాడు సుందరమూర్తి. ఆఫీసుకి టైమయినా లేచి స్నానం చేసి తొందరపడటం లాంటిది చెయ్యలేదు, నిమ్మకి నిరెత్తి కుర్చీ కతుక్కుపోయి కూర్చున్నాడు.     భర్త ఈ పూటకి ఆఫీసు కెళ్ళాడని, బాధపడటం కన్నా ఏదో విషయంలో కోపంగా వుండి పైకి వెళ్ళడించకుండా నిబ్బరపడుతున్నాడనిసీత గ్రహించింది. "ఈ పూట ఆఫీసు లేదా?" అని మాత్రం అడిగింది. ఇంకేదయినా అడిగితే ఇలాంటప్పుడు సరిఅయిన సమాధానం రావటం అటుంచి ఏదయినా వ్యంగ్యంగా మాట్లాడవచ్చు.     "వుంది" ముక్తసరిగా అన్నాడు సుందరమూర్తి.         "ఈ పూట వెళ్ళరా?" అంది సీత.     "వెళ్ళను" అని జవాబు చెపితే బాగానే వుండేది. "నేను ఇంట్లో వుండటం నీకు భాధగా వుందా?" అంటూ సీత వేపు తీవ్రంగా చూశాడు సుందరమూర్తి.     తలొంచుకుని అవతలి కెళ్ళిపోయింది సీత.     "పొగరు, ఏదో ఒకటి అడగకూడదు? మిరట్లా మౌనంగా వుంటే నాకేదో భయంగా వుందండి! అనొచ్చుగా ఉహూ మూతి ముడుచుకుని మహరాణిలా అవతలి కెళ్లింది. ఆడదానికి యింత నిర్లక్ష్యం పనికిరాదు. భర్తంటే భయభక్తులు, గౌరవం ఉండి చస్తేగా, అడాళ్ళు తెగించారు. అందుకు కాదు ధరలిలా మండిపోవటం, హత్యలు, దొంగతనాలు, మానభంగాలు, తుఫానులు, వరదలు..." గొణుక్కుంటూ వుండిపోయాడు సుందరమూర్తి.     ఎప్పటికో స్నానం చేశాడు. ఎప్పటికో భోంచేశాడు, మధ్యాన్నమో నిద్ర తీశాడు. సీతతో మాత్రం పనికట్టుకు మాట్లాడలేదు.     కృష్ణవేణి వాళ్ళింటి కెళ్ళి వద్దామంటే సుందరమూర్తి ఇంట్లో వుండటమే కాక విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. ఓసారి అలా వెళ్లి వస్తానంటే తప్పు పట్టవచ్చు. సీతకేం చేయాలో తోచలేదు.     జమదగ్ని, కృష్ణవేణి మద్యాహ్నం వచ్చారు. అప్పుడు ముందు గదిలో సీత వుంది. వెనుక గదిలో సుందరమూర్తి వున్నాడు. "రండి రండి: అంటూ భార్యాభర్తల్ని ఆహ్వానించింది సీత.     "నీకో శుభవార్త" అంది కృష్ణవేణి.     సీత "ఏమిటది?" అని అడిగేలోగా జమదగ్ని చెప్పాడు. అదృష్టవంతులని సిరి వెతుక్కుంటూ వస్తుంది. ఉమాసుందరం అని గొప్ప నాట్యచార్యుడున్నాడు. వారి పేరు జగత్ విదితమే. నిన్న కల్సుకోవటం జరిగింది. తుఫాను బాధితుల సహాయార్ధం మనం మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేశాము కదా! అప్పుడు మిపాటా అయన విన్నారుట. వారికో డాన్స్ గ్రుపుంది. మీ పాట మీ తీరు ఉమాసుందరంగారికి ఎంతో నచ్చిందిట. ఒకటే పొగడటం...." వెంటనే కృష్ణవేణి అందుకుంది.     "ఊరికె పొగడటం కాదు వాళ్ళ డాన్సు గ్రూప్ ప్రదర్శన లిస్తున్నప్పుడు జానపదం పాటలోక్కటే పాడటానికి మిమ్మల్ని ఎన్నుకున్నారు. డబ్బు బాగా యిస్తారు. జానపదం పాటలకి పెద్దగా సంగీతం నేర్చుకుని వుండనక్కరలేదు. మెలుకువ, యాస, వణుకులాంటివి పలికించగల స్వరం వుంటే చాలు. అదేలాగు భగవంతుడిచ్చిన వరంగా నీకుంది, నీ విషయం నీతోను , మీ వారితోనూ సంప్రదించాలి కదా అన్నాను. నీవు మా మాట కాదనవని, మీ వారితో సంప్రదించక్కరలేదనే చెప్పాము....."సీత విషయంలో అన్ని చూసుకోవటానికి మీరున్నరుగా, నాదేముంది" అంటూ గదిలోంచి సుందరమూర్తి వచ్చాడు.     "అరె, నువ్వాఫీసు కెళ్ళలేదు?" అంటూ ఆశ్చర్యం వెళ్ళబుచ్చాడు జమదగ్ని.     "వారంరోజులు శెలవు పెట్టలేద్దు" అని సుందరమూర్తొచ్చి ఓ కుర్చీలో కూచున్నాడు.     ఆఫీసుకు వారం రోజులు శలవు పెట్టినట్లు అప్పుడు తెలిసింది సీతఃకి. ఆశ్చర్యమేసింది సీతతో పాటు వాళ్ళకి వేసింది. "వారంరోజులు శలవా! ఇప్పుడంత అవసరం ఏమొచ్చింది" అన్నాడు జమదగ్ని.     "ఏదో వచ్చిందిలే, అడక్కు" అన్నాడు సుందరమూర్తి.     ఇహ అడిగి ప్రయోజనం లేదని జమదగ్నికి తెలుసు. అలవాటయినవారికి ఒక మెతుకు పట్టుకుచుస్తే చాలు. అన్నం వుడికింది లేనిది తెలిసిపోతుంది. సుందరమూర్తితో స్నేహం వల్ల అతని గుణం తెలుసు. అందుకే తుంచే మాటలు తుంచేశాడు. ఆ విషయం వదిలేసి "నీ అదృష్టం, మీ ఆవిడ కెంత పేరో!" అన్నాడు జమదగ్ని.
24,311
    వసంతబాల యిప్పటికి కాస్త తట్టుకోగలిగింది. రామంవంక పరీక్షగా చూసింది. అతడు ధనికుడు. అందగాడు. తనని కోరివచ్చాడు.     "నన్ను పెళ్ళి చేసుకోగోరుతున్నారా రాంబాబూ?" అని ప్రశ్నించింది సన్నని కంఠంతో.     అతను తృళ్లి పడ్డాడు. తను నిజానికి ఆమెనుంచి కోరేదేమిటి? వివాహమేనా? "అర్ధంకాలేదా వసంతా?" అని అడిగాడు యింతకు ముందు, తనకి తాను అర్థమౌతున్నాడా? ఏమిటి వాంఛిస్తున్నాడు?     ఏ లక్షణాలయితే తను మనోరమలో సహించలేకపోయినాడో, అవి వసంతబాలలో హర్షించగలడా! ఈమె చిన్నప్పట్నుంచి స్వేచ్చావాయువులు పీలుస్తూ పెరిగింది. ఈమె కళాజీవి. ఎన్నో ప్రదర్శనాలిస్తూ బయట విహారం చేసింది. రేపు యిదే తన్ని తిరిగి వేధిస్తే తను మళ్ళీ ఓ పొరపాటు చేయబోతున్నాడా! కాని... యీమె మనస్తత్వం మనోరమ తత్వానికి పూర్తిగా భిన్నమైంది. ఆమె యింట్లోంచి బయటకు పోగోరింది. ఈమె బయటినుంచి యింట్లోకి రాగోరింది. తమ యిద్దరి అభిరుచులూ ఒకటయ్యే అవకాశం వుంది.     "అవును" అన్నాడు.     "మరి మీ వెళ్ళిపోయిన భార్య విషయం?" వసంతబాల చిలిపిగా అడిగింది.     "ఇవ్వాళే వచ్చింది. చోటు యివ్వమని అర్థించింది. కాని మనోరమ తన స్థానాన్ని తనే పోగొట్టుకుంది వసంతా! ఆమెకు విడాకులు యిస్తాను. నా జీవితం నీవల్లనే పునీతం కావాలి."     ఆమె శరీరం ఒక్కసారిగా వోణికిపోయింది. బలవంతంగా అతని చేతినుంచి తన చెయ్యి లాగేసుకుంది. "నిజంగానే మీకు పెళ్ళయిందా?" అనడిగింది. అప్పటికే ఆమె కంఠధ్వని మారిపోయింది.     "అవును అయింది. ఇందులో రహస్యమేముంది? మా యిద్దరకూ కొన్ని అభిప్రాయభేదాలు వచ్చాయి. ఆమె అంతులేని స్వేచ్చ కోరింది. నేను హర్షించలేకపోయాను. నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది" రామం నిర్వివాదంగా అన్నాడు.     "నేటికి పశ్చాత్తాప్తురాలయి తిరిగివచ్చింది" అని చేర్చింది వసంతబాల.     "అవును వచ్చింది. నేను స్వీకరించే స్థితిలో వుండవద్దా వసంతా? ఆమె యందు నా మనసు విరిగిపోయింది. నన్నామె దగాచేసింది. నా జీవితంలో సుఖశాంతులు లేకుండా చేసింది. నేనిప్పుడామెను పరమ ద్వేషిస్తున్నాను. అసహ్యించుకుంటున్నాను. విడాకులు పొందుతాను. నిన్ను..."     "రాంబాబూ..." ఆమె అతని ఆవేశానికి ఆటంకం వచ్చింది. అలా అయితే మీరు నన్ను భరించలేరు. నేను ఒంటరిగా ఎన్ని ప్రదేశాలలోనో తిరిగాను. భార్యగా చేసుకునేందుకు భయపడాల్సిన వ్యక్తిని నేను."     "కాని నాకు నీమీద నమ్మకం వుంది."     "మీ స్వార్థం ఆ నమ్మకాన్ని కలుగజేసింది. నిన్నగాక మొన్న పరిచయమైన నన్ను నమ్ముతున్న మీరు, పశ్చాత్తాప్తురాలై తిరిగి వచ్చిన మనోరమని ఎందుకు నమ్మలేకపోతున్నారో గ్రహించలేకపోతున్నాను. దయవుంచి వెళ్లి ఆమెను స్వీకరించండి రాంబాబూ"     "కాని నేనందుకు సిద్ధంగా లేను."     "ఒకసారి పెళ్లిచేసుకున్న వ్యక్తిని భర్తగా అంగీకరించటానికి నేను సిద్ధంగా లేను."     "వసంతా."     "ఎందుకంత గట్టిగా అరుస్తారు రాంబాబూ! అరుపులు, కేకలు మనస్సులని మరలించలేవు. నా ఓర్పుని పరీక్షించకండి."     "వసంతా, వసంతా!! నిన్ను ప్రేమించాను, ఆరాధించాను, దాసోహం అయినాను."     "వసంతా, వసంతా!! నిన్ను ప్రేమించాను, ఆరాధించాను, దాసోహం అయినాను. నా తపం... యీ మధుర వేదన..."     విశ్వనాథంగారు చివరిమెట్టుమీద నిలబడి స్తంభించిపోయారు. ఎవరిది యీ కంఠధ్వని? ఆయన కాళ్ళలో బలం నశించింది. కళ్లు చీకట్లు క్రమ్మినాయ్.     "రాంబాబూ, పెంకితనం చేయక యిక్కడ్నించి వెంటనే వెళ్లిపోండి."     "వసంత నన్ను..." మనిషి కదలిన అడుగుల చప్పుడు.     "ఏమిటిది రాంబాబూ? అమ్మని పిలుస్తాను" కలవరపడిన వసంతబాల కంఠం హీనంగా.     "ఐ యామ్ సారీ. వసంతా, నా కళ్ళు తెరిపించావు గుడ్ బై."     విశ్వనాథంగారు లేని సత్తువ తెచ్చుకుని చప్పున పైకి వెళ్లి ప్రక్కకు పోయి గోడకు ఆనుకుని నిలుచున్నాడు.     రాంబాబు గది బయటకి వచ్చాడు. అతనికెదురుగా వసంతబాల తల్లి మెట్లమీద నిలబడి వుంది. ఒక్కక్షణం స్థబ్దుడై, వెంటనే తేరుకుని ఆమెప్రక్కనుంచే విసురుగా క్రిందికి దిగి వెళ్ళిపోయాడు.     కనకవల్లి మెల్లిగా విశ్వనాథంగారి దగ్గరకు వచ్చింది. ఆయన ముఖమంతా నల్లగా మాడిపోయింది. గోడకి బలహీనంగా ఆనుకుని నిలబడ్డాడు. "అలా అయిపోయినారేం?" అని అడిగింది క్షీణస్వరాన.     "వల్లీ!" అన్నారు విశ్వనాథంగారు వణికేకంఠంతో. "వాడు నా కొడుకు. పెద్దకొడుకు."     "భగవంతుడా!" అని అరిచింది కనకవల్లి. ఒక్కసారి కళ్లముందు అంతా అంధకార బంధురమైపోయింది.     ఆమె క్రింద పడిపోతుందేమోనని ఆయన గట్టిగా పట్టుకున్నాడు. "వల్లీ!" అని పిలిచాడు భయపడుతూ.     తల్లి అరుపు విని వసంతబాల బయటికి పరిగెత్తుకు వచ్చింది. క్రింద పడబోతూన్న తల్లిని పట్టుకోబోతున్న నూతనాగంతకుడ్ని చూసింది. ఎర్రబడిన కళ్ళతో, అయోమయ దృక్కులతో నిలబడివున్న ఆ అమ్మాయిని చూశాడాయన. ఇద్దరూ అచేతనులై నిలబడిపోయారు.
24,312
       "అదెట్లా? నాకు చాతగాదే పోనీ మనిద్దరం లేచిపోదామా ఏం?"         అతను నవ్వి 'పద నాకు యిష్టమే' అన్నాడు.         "అమ్మో! ఎంత గడుసుతనమో" అంది గాని ఆమె ముఖం త్వరత్వరగా నల్లబడింది. 'నాకో మంచి మొగుడ్ని చూసిపెడుదూ'అంది  కొంచెం ఆగి.            ఓ క్షణమాగి శివనాథరావు భుజాలెగురేశాడు. 'భలే! ఆ పనికోసమే ఈ ఊరొచ్చాను. కానీ అంతా తారుమారయింది.'             విశదీకరించండి.             అప్పుడతను మోహన్ పెళ్ళిచూపుల వృత్తాంతం చెప్పి 'ఆ పెళ్ళికూతురు నువ్వేననుకున్నాను మొదట'అన్నాడు.         "అంత పెద్ద త్యాగమే! బాబో!" అన్నాది సరోజిని మళ్ళీ వెంటనే 'పెళ్ళికూతురి పేరు?'  అనడిగింది.         "విమల కాబోలు"         "నా స్నేహితురాలే చాలా మంచిది, కానీ గడుసుదని ఇప్పుడే తెలిసింది. తనని చూడడానికి వస్తున్నారని నాకు చెప్పలేదు చూశావా?"         తర్వాత యిద్దరూ ఏం మాట్లాడాలో తోచలేదు. కాసేపటికి శివనాథరావే సిగ్గుపడుతూ 'ఆరోజు మా యింట్లో నీకు బాగా అవమానం జరిగివుంటుంది. ఏం' అన్నాడు.         సరోజిని తల ఆడించింది 'అవును. నేను పుట్టాక అంత అవమానం ఎప్పుడూ జరగలేదు. కానీ నాకు దాని కారణం తెలుసు - వద్దులే అది నీకు చెప్పను. ఛీ ఏం సంగతి! కాని నీవు చాలా అదృష్టవంతుడివి - మీ పిన్నిని గురించి'     "నువ్వు నిజం ఎంత చక్కగా చెప్పగలవు సరోజినీ?"         "నువ్వు పెళ్ళి చేసుకోవా?" అంది ఆమె రెండు నిముషాలాగి.         "చేసుకుంటాను"         "ఎవర్ని?" అన్నదామె కుతూహలం వ్యక్తపరుస్తూ.         "ఉందిలే ఒకమ్మాయి! పసందుగా వుంటుంది. కాని తనని తప్ప యింకొకర్ని చేసుకోనని దానికి తెలియదు."         "ఓహో! అర్ధమయింది. 'దాన్ని' అని అన్నావు కాబట్టి అర్ధమయింది కానీ అది నీకు దక్కదుగా"         "ఏం"         "కొంచెం పార్వతిలాంటి పిల్ల"         "కాని నేను దేవదాసుని కాదుగా సరోజినీ"         ఆమె నిరుత్తరురాలయింది. ఎలాగో గొంతు పెగల్చుకుని ఖేదంగా "పిల్లల్ని అమ్ముకునే వంశంలో పుట్టటమే పార్వతి చేసిన అపార్ధం. మరి యీ సరోజిని అపరాధం విను. ఆస్థి పోగొట్టుకున్న మనిషి కూతురిగా పుట్టడం. అదీగాక మరో ముఖ్య విషయం వుందిలే. అది చెప్పను. పార్వతి చరిత్ర నిలిచింది. అందరూ ఆమెను తలుచుకుని కన్నీళ్ళు కారుస్తాం. కానీ సరోజినిని గురించి ఒక్క నిట్టూర్పుకూడా విడువదు ప్రపంచం. మరి యిది జీవితం కదా" అంటూంటే దుఃఖంతో ఆమె గొంతు పూడిపోయింది.         అతను ముందునుంచీ అనుమానిస్తూనే వున్నాడు ఈ సన్నివేశం సాఫీగా పూర్తికాదని. బరువెక్కిన గుండెతో 'దుఃఖపడటం నీ వ్యక్తిత్వానికే కళంకం. ఊరుకో నాకో విషయం చెప్పు...ఆ ముఖ్యమైన అవరోధాన్ని గురించి.'         సరోజిని తలెత్తి 'చెప్పను' అంది.         అతనికి ఏదో ఆవేదన కలిగింది. ఆమె వారిస్తున్నా వినకుండా కిటికీ తలుపులు తెరిచాడు.         "మనం యిలా తలుపులన్నీ బిడాయించుకుని కబుర్లు చెప్పుకుంటూంటే యీ కిటికీ చాటునుండి మావాళ్ళు, ఆ తలుపు అవతలనుంచి మీ వాళ్ళు ఆలకిస్తే ఎలా వుంటుంది?"         "అదంతా ఫరవాలేదు. కానీ తలుపులు మూసివుండి, కబుర్లు వినిపించకపోతే..." అంటూ సరోజిని పమిటచెంగు నోట్లో క్రుక్కుకుని నవ్వాపుకుంటోంది. అతనిక్కూడా నవ్వు వచ్చింది. హాయిగా నవ్వి 'మనం యింక విడిపోదాం' అన్నాడు హఠాత్తుగా.             "ఆఁ ఆఁ, నేనూ అదే అనుకుంటున్నాను. వీధి తలుపులు తెరవనా?" అంటూ ఆమె నిజంగానే పోతోంది.         "ఎందుకు?"         "వెళ్ళిపోదువు గాని"         "నీకేమన్నా పిచ్చెక్కిందా భలేదానివే? కావాలని ప్రమాదాలు కోరుకోకు. ఈ అర్దరాత్రివేళా యిల్లు విడిచిపోతే వాళ్ళంతా ఏమనుకుంటారు?"         "ఆ పూచీ నాది. అదంతా ప్రమాదకరమైన విషయం మాత్రంకాదు. నిన్ను వేడుకుంటాను. చప్పున ఇక్కడ్నుంచి వెళ్ళిపో" అని ప్రాధేయపడింది.         "నువ్వెందుకింత తొందరపెడుతున్నావో చెబితేగాని నేనిక్కడనించి కదలను" అన్నాడతను మొండిగా.         "అబ్బ! అది కూడా చెప్పాలా?" అని విసుగ్గా "అయితె విను. తెల్లారితే నీ మొహం చూడలేను" అంది.         "సరే తలుపులు తెరువు" అన్నాడు శివనాథరావు విషణ్ణవదనంతో.         సరోజిని చప్పుడు చేయకుండా వీధి తలుపులు తెరిచింది.         "ఆలస్యం చేయకు" అంది.         "ఆలస్యం చేయను" అంటూనే అతను కదలటం మానేశాడు.         "బావా" అంది కంపిత స్వరంతో ఆమె. గొంతెత్తి ఏదో చెప్పబోయింది. సాద్యం కాలా. మాటమార్చి 'చీకట్లో నువ్వు నడుస్తూంటే ఎలా ఉంటావో చూడాలని కోరిక. చూపించు' అని ముఖం అతనికి కనిపించకుండా ప్రక్కకి త్రిప్పుకుంది.         అతడు ద్వారాన్ని సమీపించాడు. దాన్ని దాటి వెనక్కి తిరిగి, "మనిద్దరి మధ్య ఈ తలుపులు..." తర్వాత పూర్తి చేయలేకపోయాడు. ఒక్క ఉరుకులో బయటకు పోదామనుకున్నాడు. అనుకున్నాడంతే కాని మరుక్షణంలోనే లోపలకు వచ్చి తలుపులు మూసి, వాటిని ఆనుకున్నాడు.         "అదేం పని?" అంది సరోజిని బలహీనంగా.         "సరోజినీ! నువ్వు నటించకు. నాకు నీ నిజరూపం కావాలి" అన్నాడతను దురపిల్లుతూ.         'వేరే ఏముందయ్యా! ఇదే... ఇదే... నా..... అసలు'         "ఒద్దు సరోజినీ! అంత క్రూరంగా మాట్లాడకు. ఈ కపటనాటకం చాలించుదాం యిహ."         "ఉష్!" అన్నది సరోజిని. 'ఎందుకు గొడవ? ఎంత తెలివిహీనుడివి అయిపోయావ్?'         అతని నిగ్రహం మరీ సడలిపోయింది. 'సరోజినీ! సరోజినీ!' అన్నాడు బాధగా. 'నన్ను కసిదీరా తిట్టు' అన్నాడు గట్టిగా అరుస్తూ  ఆవేశంతో.         ఆమె చప్పున తనచేత్తో అతని నోరుమూసి "వెర్రివాడవు కాబోకు" అంది. తనచేతిని మళ్ళీ లాక్కునే అంతలో అతను ఆమెను తన రెండు హస్తాల్లో బంధించి ఆమె ముఖాన్ని తన ముఖంమీదకు లాక్కోబోయాడు.         "విడు" అన్నది సరోజిని పెనుగులాడుతూ.         "అతని ఉచ్చ్వాస నిశ్చ్వాసాలు అధికమైనాయి. పెంకెతనం చేయబోయాడు" ఆ తామసానికి ఆమె అదిరిపడి కోపంతో....         "అబ్బ!" అని అతనామెను విడిచి తన చేతివైపు చూసుకున్నాడు బాధగా. అతని చేతిమీద ఆమె పళ్ళు గుంటలుపడ్డాయి.         ఆకస్మికంగా సరోజిని అతని పాదాలమీద ఒరిగింది. "ఛీ! ఇదేం పని!" అంటూ అతను అవతలకు జరిగి, నిర్ఘాంతపోయి చూడసాగాడు. ఆమె నిశ్శబ్దంగా నేలమీద అధోముఖియై వుండిపోయింది. తల ఎత్తేసరికి కళ్ళు నీళ్ళను వర్షిస్తున్నాయి.         "ఇది నీ నిజరూపమా?" అన్నాడతను చకితుడై.         ఆమె ప్రయత్నం మీద లేచి నిలబడి "బాగా నొప్పి పుడుతుందా?" అంది జాలిగా.         "ఈ అపరాధానికేనా క్షమాపణ అడగటానికి సిద్దపడ్డావు?"         అవునన్నట్లు తలవూపింది - నీరసంగా.         వీపుమీద ఛళ్ ఛళ్ మని ఎవరో కొరడాతో కొట్టినట్లయింది. "ఓ! యివాళ నాకు ఎంత సంతోషం? ఎన్ని అనుభూతులు?" అంటూ అక్కడ్నుంచి కదిలాడు.         కాని ఆమె అతని చేతులు రెండూ గట్టిగా పట్టుకుని "నిన్నిలా వెళ్ళనీయను" అంది.
24,313
    "కావేరి పాషన్ గా వుంటుంది. అలా వుండాలనుకోవటం తప్పు కాదుగా అమ్మా! కొంతమందికి కొన్ని అలవాట్లు వుంటాయి కొంతమందికి బద్దకంతో ఎడ్డిమడ్డిగా వుంటారు. మరికొందరు ఎంతో శుభ్రంగా వుంటారు. అలా శుభ్రంగా అందంగా వుండాలనుకోవటం కావేరి తప్పుకాదుగా అమ్మా? పుస్తకాలు పట్టుకుని నడుస్తుంటే అటుయిటు ఊగినట్లు అనిపించుతుందిగాని!"     "అంటే? నేనన్న మాటలు తప్పు అని ఆ కావేరీని సమర్ధించుకుని వస్తున్నావన్నమాట! కనీసం నేను ఎప్పుడయినా కావేరీని చేసుకుంటేనేగాని వీలులేదని అన్నానా?"     "లేదమ్మా!"     "మరెందుకలా అన్నావు మీ అత్తయ్య మామయ్యతో!"     "కావేరీని చేసుకోవాలని నాకే అనిపించింది. ఎంతో అందమయినది తెలివయినదేను. అన్నయ్య ఎటూ ఉద్యోగం చేస్తూ పట్నంలోనే వుంటాడు. నేను ఒక్కడిని యిక్కడ? మామయ్య అండలేకపోతే వంటరిగా ఎలా లాక్కురాగలను? అందునా మన పల్లెటూర్లు వెనుకటి లాగా లేవు. రాజకీయాలలో ముఠాతగాదాలు చోటుచేసుకుని అండలేనివాడిని అణగత్రొక్కుతుంది!"     ఆలస్యం చేసే తను చెప్పగలిగేమాట తెలీచెప్పలేదేమోనని గబగబా అనేశాడు. తల్లి ఇచ్చే సమాధానం ఏమిటోనని ఎదురుచూడలేకపోయాడు భయంతో! అనేటప్పుడు అల్న్తాడు గాని తీరా అన్న తరువతః తల్లి ఏమన్నా చివాట్లు వేస్తుందేమోనని వణికిపోతాడు వినాయకరావు. ఇప్పుడు అలాగే జరిగింది. మనిషిని చూస్తే ఏమీ తెలియదని అమాయకూడుగా వుంటాడు....మనసులో యిన్ని ఆలోచనలు; భవిష్యత్తుని గురించిన నిర్ణయాలు తీసుకున్న కొడుకుని చూసి ఆశ్చర్యపడింది కామాక్షమ్మ. అసలు కొడుకు ఎప్పుడూ యింతగా మాట్లాడి ఎరుగడు తన ముందు!...తన కంటే ఎక్కువగా ఎదిగిపోయాడనుకుంది కొడుకుని చూసి-     "నాకు కావేరీ అంటే ఎంతో యిష్టం అమ్మా!....ఆస్థులు అంతస్థులు లెక్కవేసుకోకు!....అన్నయ్య చదువుకుంటానంటే నువ్వు కాదనగలిగావా??....అలాగే నేను కావేరీని చేసుకుంటానంటే కూడా నువ్వు కాదనకూడదమ్మా!....కావేరీని తప్ప నేను యింకెవ్వరినీ చేసుకోను!....చేసుకుని సుఖపడలేను కూడాను!" గబగబా అనేసి చెయ్యి కడుక్కునిలేచి బైటికి వెళ్ళిపోయాడు వినాయకరావు తల్లి ముందు వుండలేక! వివర్ణమయిన ఆమె ముఖం చూడలేకనూ!     ఈసారి పూర్తిగా అవాక్కయి పోయింది కామాక్షమ్మ!...వాడన్నదీ నిజమే!....శంకరం తన మాట విన్నాడా? చదువుకుంటానని పేచీపెట్టాడు.....పట్నం వెళ్ళి కూర్చుని డబ్బు పంపమని ఉత్తరాల మీద ఉత్తరాలు వ్రాసేవాడు...అలా తన చదువుకి కనుక డబ్బు పంపకపోతే తనకి వచ్చే ఆస్థిలో వాటా యిచ్చేస్తే అమ్ముకుని చదువుతానని చేటభారతమంత ఉత్తరం వ్రాసేవాడు!...వున్న యిద్దరి కొడుకులనూ పెట్టుకుని భర్తపోయిన తరువాత ఎంత గుట్టుకు లాక్కువచ్చింది.....ఏ మాటికి ఆ మాటే చెప్పుకోవాలి! తన అన్న పరంధామయ్య కూడా ఎంతో సహాయం చేశాడు ....యివ్వాళ తన అన్న నీ కొడుకునీ కాదనుకుని తను చేయగలిగింది ఏముంటుంది? అంతా పట్టు పట్టబట్టేకదా పెద్దకొడుకు ఆస్తి పంపకాల వరకూ వచ్చాడు??....మగవాడి కళ్ళకి ఆడది ఎంత ఫాషన్ గా కనిపించితే అంతగా వ్యామోహపడతాడు! ఎంత అందమయినదయితే అంత కావాలనుకుంటాడు...తన కొడుకు కావేరీని కావాలనుకోవటంలో అది వాడి తప్పుకాదు! వాడి వయస్సుచేసే అల్లరిలో నిర్ణయించుకున్నది....కానయితే తన అన్న కట్నంగా ఏమీ తాను ఆశించినంతగా ఎక్కువ యిచ్చుకోలేడు!....పార్వతి పెళ్ళికి తొందరపడి మంచి సంబంధమని ఖాయం చేసుకుని లగ్నం పెట్టుకుని వచ్చాడు. తీరా వచ్చిన తరువాత డబ్బు సమకూర్చుకునేటందుకు ఎంతో యాతనపడ్డాడు....వున్న ధాన్యం అంతా అమ్మేశాడు. అప్పు దొరికినంత చేశాడు. అదీ చాలకపోతే తన దగ్గరకు వచ్చి అన్నాడు!     "నువ్వే ఆదుకోవాలి చెల్లెమ్మా!"     తాను యిస్తే తిరిగి రెండు మూడేళ్ళ వరకూ తీర్చలేదు తన అన్న! పోనీ ఏదో ఒక సాకుచెప్పి తప్పించుకుందామంటే ఆడపిల్ల పెళ్ళి! ముహూర్తం యింకా నాలుగు రోజులే వుంది....ఈ లగ్నం తప్పితే ఆడపిల్లకి యింక పెళ్ళికాదు!....పెళ్ళి ఎందుకు తప్పింది? అని కాకుల్లాగా పొడుస్తారు యిరుగు పొరుగు!....ఆరళ్ళు భరించలేక ఆత్మహత్య చేసుకోనూవచ్చును పార్వతి!....తాను మేనత్తయి కూడా ఆదుకోకపోతే లోకం తనను వెలివేసినట్టు చేస్తుంది. ఎంతయినా అన్నగారు! తన మేనకోడలూను!....అనుకుని అప్పుడు తాను యిచ్చింది ఆరువేలు!....అప్పుడు ఆ డబ్బుతో పెళ్ళిచేసి పార్వతిని అత్తవారింటికి పంపాడు తన అన్నగారు! యిచ్చిన ఆరువేలలో యిన్ని సంవత్సరాలకి యింకా తనకే రెండు వేలు బాకీ వున్నాడు. తను అడగలేక పోయింది...ఎలా అడుగుతుంది? రెండు సంవత్సరాల నుంచి వంట సరిగ్గా చేతికిరాక వ్యవసాయంలో నష్టంవస్తే!....     ఇపుడు కావేరీని చేసుకున్నా తనకి బాధ్యతలు పెరుగుతాయి గాని తగ్గవు! అందులో ఒకే ఊరిలోని వాళ్ళం!...అస్తమానూ పుట్టింటికి వెళ్ళి కూర్చుంటుంది....ఆ సినిమాకు వెళ్దాం! ఈ సినిమాకు వెళ్దామని వినాయకాన్ని కూడా వెంటవేసుకుని బయలుదేరుతుంది. దానికసలే సినిమా పిచ్చి! తన కొడుకు నోట్లో నాలిక లేనివాడు! వాడు ఎంత కష్టపడి వ్యవసాయంచేసి సంపాదించినా దీని ఫానన్సుకి సినిమాలకీ సరిపోతుందేమో??....     కామాక్షమ్మ ఆలోచనలు పరిపరివిధాల పరుగెడుతున్నవి. ఎటూ తేల్చుకోలేకపోతున్నది!....ఏ విధమయిన నిర్ణయం తీసుకోలేక పోయింది...     "కావేరీని యిప్పటినుంచే అదుపులో వుంచితే ఎలా వుంటుంది??" అని కూడా అనుకుంది.     ఎలా? అ యింటికి ఈ యింటికి దూరమయ్యే!....ఎక్కువగా యిక్కడికి రానేరాదు!....వచ్చినా నాలుగైదు ఘడియలుకూడా ఎక్కువ సేపు వుండదు!...అయినా తల్లిదండ్రులు శ్రద్దతీసుకుని ఆడపిల్లని అదుపులో వుంచుకోవాలిగాని యిలా సినిమా! సినిమా" అని అడుగగానే తీసుకువెళ్ళాలా??....ఈ సారి తనని రమ్మని కబురు చేసినపుడు రానని చెప్పాలి!...అప్పుదయినా వెళ్ళటం మానివేస్తారేమో చూడాలి!....ఈ సెలవలకి శంకరంవస్తే వాడితో కూడా మాట్లాడి ముందు వాడి పెళ్ళిచేసి ఆ తరువాత వినాయకం పెళ్ళి కూడా చేసేస్తే తన బాధ్యత తగ్గిపోతుంది. తను నిశ్చింతగా వుండటం కంటే కావలసినది ఏమున్నది??....     "కావేరీని చేసుకుంటానమ్మా!..."     అని నోరువిప్పి చెప్పిన వాడిమాట కాదనటం ఎలా? యిప్పుడింత నిండుగాను, ఎలాంటిలోటు లేకుండాను, పదివేలు వెనుక వేసుకో గలిగామంటే యిందంతా తన చిన్నకొడుకు కష్టపడటం వలననే కదా?....అలాంటివాడు నోరువిప్పి అడిగితే కాదనగాలదా??.....ఎలా కాదనగలిగేది? కట్నము ఇవ్వలేకపోయినా తన అన్న!....తన మేనకోడలు! ఒకళ్ళిద్దరు పిల్లలు పుడితే కావేరీకి కూడా సినిమాపిచ్చి ఫాషన్ ల పిచ్చీ పోతుంది!....అని తననుతాను సమర్ధించుకుని ఒక స్థిర నిశ్చయానికి వచ్చింది కామాక్షమ్మ. యింత తర్క వితర్కం తనలోతానే చేసుకుని!...                                                                              4     ఉదయంలేచి పేపర్ పూర్తిగా చదివిన తరువాత కావేరికి నెప్పి తగ్గిందో లేదో? తెలుసుకునేటందుకు మేనమామ గారింటికి వెళ్ళాడు వినాయకరావు.     అప్పటికే స్కూలుకి వెళ్ళేటందుకు తయారవుతున్న కావేరి వినాయకరావు వచ్చింది చూడలేదు.     పమిట జారిపోకుండా జాకెట్టుకి పమిటని కలిపి భుజంమీద పిన్నీసు పెట్టింది....స్నో తీసి ముఖానికి వ్రాసింది...ఆ తరువాత పౌడర్ వ్రాసింది ఒక్క ముఖానికే కాదు: చెవులకి; మెడమీద; కంఠం క్రింద కూడా వ్రాసింది. మిగిలింది పమిటికి తుడిచినట్టు రాసింది. ఆరురకాలు వున్న బొట్టు సీసాలను తిప్పితిప్పి చూసి ఓణీ రంగుకి సరిపడిన రంగుబొట్టు పెట్టుకున్నది తల రేగిందేమోనని దువ్వెనతో పైపైనే దువ్వుకుని వెనుదిరిగి పుస్తకాలు తీసుకుంటూ వుండగా వినాయకరావుని చూసి ముందు ఆశ్చర్యపోయి అంతలోనే నవ్వుని తెచ్చుకుని అంది-
24,314
        సరీగ్గా అప్పుడే అచ్యుత్ తన అనుచరులతో ఎక్కి వస్తున్న జీప్ ఆ వీధి మలుపు తిరిగింది.         ఆదిలక్ష్మి ఆ గది కిటికీ రెక్కను కొద్దిగా తెరచి తమ ఇంటికేసి వారగా చూడసాగింది.                            *    *    *    *    *         మేఖల, అభిరామ్ ఎక్కిన ఆటో రైల్వే స్టేషన్ ముందు ఆగింది.         మేఖల ఆటోలోంచి దిగి ఫేర్ చెల్లించి తమ్ముడితో సహా స్టేషన్ టిక్కెట్ కౌంటర్స్ కేసి నడిచింది.                           *    *    *    *    *         అచ్యుత్ జీప్ అరుణాచలం ఇంటి ముందు ఆగింది.         ఆదిలక్ష్మి ఆ ప్రమాదాన్ని ముందే ఊహించింది. గనుక అంతగా అప్ సెట్ అవ్వలేదు.         అచ్యుత్ జీప్ దిగగానే అతని పదిమంది అనుచరులు కూడా జీప్ దిగి తమ ఇంటి కేసి వెళ్ళటాన్ని ఆదిలక్ష్మి చూస్తూనే భర్త వేపు తిరిగి శబ్దం చేయవద్దన్నట్లు సైగచేస్తూ తనవేపు రమ్మన్నట్లుగా చూసింది.         అరుణాచలం ఆమె ఉద్దేశ్యాన్ని గ్రహించి నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ భార్య దగ్గరకు వచ్చి ఆమె చూస్తున్న వేపుకి చూసి ఉలిక్కిపడ్డాడు.         "ఇప్పుడర్ధమయించా...ఈ ఆదిలక్ష్మి ఏది ఎందుకు చేసిందో? ఈ పాటికి మన పిల్లలు ట్రెయిన్ ఎక్కేసి వుంటారు. వాళ్ళ చేతుల్లో వున్న చెయిన్, గండ్రగొడ్డళ్ళు, కర్రల్ని చూశారా? కన్నబిడ్డలు దూరమైనా క్షేమంగా వుంటే చాలని భావించే తల్లిని నేను. అచ్యుత్ మనుష్యులొస్తారు. మిమ్మల్ని ఏదో చేస్తారు వెళ్ళండి అంటే పౌరుషవంతులయిన మన పిల్లలు వినేవారా? వినకపోతే ఆ కిరాతకుల్ని ఎదుర్కొనే ప్రయత్నం చేసేవారు. అప్పుడేం జరుగుతుంది? మనకు కడుపు కోతేగా?"         తమ యింటిముందు అచ్యుత్ తన అనుచరులు తారట్లాడటాన్ని చూస్తూనే మాట్లాడసాగింది ఆదిలక్ష్మి.         భార్య తెలివితేటలకి అప్పుడు విస్మయపడ్డాడు అరుణాచలం.         అచ్యుత్ తన అనుచరులకు ఏదో చెప్పాడు. వాళ్ళు క్రమంగా తాము తల దాచుకున్న యింటికేసి రాసాగారు.         అరుణాచలానికి పై ప్రాణాలు పైనే పోయినట్లనిపించింది.         ఒక్కక్షణం ఆదిలక్ష్మి కూడా కలవరపడింది. భయపడింది. వాళ్ళు ఏ ఉద్దేశ్యంతో తాము తల దాచుకున్న ఇంటికేసి వస్తున్నారు? బహుశా విచారించటానికి వస్తున్నారేమో....         ఆ ఆలోచన వస్తూనే ఆమె వేగంగా మధ్య హాల్లోకి వెళ్ళి వాళ్ళకు ఏదో చెప్పి తిరిగి తన భర్త వున్న గదిలోకొచ్చి తలుపులు వేసి గడియపెట్టి భయం భయంగా ఏం జరగనున్నదని ఎదురు చూడసాగింది.         ఒకింత కర్కశంగా వ్యవహరించినా కన్నబిడ్డల్ని ఊరు దాటించ గలిగిన భార్య మీద అరుణాచలానికి ప్రేమాభిమానాలు రెట్టింపయ్యాయి.         ఆదిలక్ష్మి ఊహించినట్లుగానే అచ్యుత్ అనుచరులిద్దరూ ఆ యింటి ముందుకొచ్చి తలుపు తట్టారు.         వెంటనే తలుపులు తీసి రెస్పాన్స్ యివ్వకపోతే ఆమె గతేమవుతుందో తెలిసున్న ఆ యింటి యజమాని వెంటనే వెళ్ళి తలుపులు తీసి "ఎవరు కావాలి బాబు" అంటూ అయిష్టంగానే వాళ్ళపట్ల గౌరవ భావాన్ని వ్యక్తం చేశాడు.         "ఆ యింట్లో వున్నవాళ్ళు ఏమయ్యారు? ఎక్కడికెళ్ళి పోయారు" అరుణాచలం యింటివేపు చూపుడు వేలుతో చూపిస్తూ పొగరుగా అడిగాడో వ్యక్తి.         "వాళ్ళా...? ఇంతకు ముందే ఆటో ఎక్కి ఎక్కడికో హడావిడిగా వెళ్ళిపోయారు. కనీసం మాట మాత్రంగానయినా చెప్పలేదు" అన్నాడు లోలోన భయపడుతూ.         "ఇంటి కీసేమైనా ఇచ్చారా?         మరో వ్యక్తి జబర్ధస్తీగా అడిగాడు.         "మామూలుగా ఐతే యిచ్చేవారే. ఈ రోజేదో హడావుడిలోనో, ఆందోళన మూలంగానో యివ్వకుండానే వెళ్ళిపోయారు. ఇంతకీ మీరెవరు బాబు? మీరు వచ్చినట్లు వాళ్ళకేమన్నా చెప్పమంటారా?" మర్యాదను కనబరుస్తూ చెబుతున్న ఆయన దృష్టిలో దూరంగా రోడ్ మీద ఆగున్న జీప్ ప్రక్కనే వున్న అచ్యుత్, అతని అనుచరులు కంటపడ్డారు.         "మేం వచ్చినట్లు మేమే తెలియబరుస్తాం. అది నువ్వేం చెప్పక్కరలేదు. ఇంతకీ మేమెవరమో తెలుసా...." ఒక వ్యక్తి గర్వంగా భుజాలు ఎగురవేస్తూ ప్రశ్నించాడు.         "తెలీదు బాబు" అన్నాడా యింటి యజమాని చేతులు నలుపుకుంటూ.         "ఈ నగరంలో ఏం చేసినా ఎవరికయితే చెల్లుతుంది?" ఛాతీ విరుస్తు అడిగాడు.         "అచ్యుత్ గారికి, వారి మనుష్యులకు"         "శభాష్, ఎలా చేసినా ఎవరికి చెల్లుతుంది."         ""అచ్యుత్ గారికి, వారి అనుచరులకు"         "డబుల్ శెభాష్"         "ఈ నగర ప్రజలు ఎవరికి ఎదురు తిరగరు?"         "అచ్యుత్ గారికి"         "బ్రతకనేర్చిన వాడివి"         "మీరు అచ్యుత్ గారి అనుచరులే గదా....! ఇంట్లోకొచ్చి మా ఆతిధ్యం స్వీకరించి వెళ్ళండి బాబు"         అన్నాడు బాధను, అవమానాన్ని తనలోనే దిగమింగుకుంటూ.         "ఆతిధ్యం ఆ అరుణాచలం గాడింట్లో తీసుకుందామని వచ్చాం. పిరికి సన్నాసి పెళ్ళాం బిడ్డలతో పారిపోయాడు. మేం వచ్చి వెళ్లినట్టు వాళ్ళకు తెలిసేలా చేసెల్తాం....?" అంటూ వెనుతిరిగి రోడ్ మీదకు వెళ్ళి పోయారు.         అప్పటివరకు బిక్కు బిక్కుమంటూ ప్రాణభయంతో వణికిపోతున్న ఆదిలక్ష్మి, అరుణాచలం ఒక్కసారి వూపిరి తీసుకున్నారు.         ఈలోపు పెద్ద శబ్దం వినిపించి ఉలిక్కిపడి కిటికీలోంచి బయటకు చూసింది ఆదిలక్ష్మి.         ఆ శబ్దాన్ని యింటి యజమాని కూడా విని అసంకల్పితంగా ద్వార బంధంవేపు నాలుగడుగులు వేసి బయటకు చూశాడు.         అప్పుడక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి షాక్ తిన్నారు.         అచ్యుత్ జీప్ దగ్గరే డానికి ఆనుకొని విలాసంగా నిలబడి వుంటే అతని అనుచరులు అరుణాచలం ఇంటి ముందుకెళ్ళి తలుపుల్ని పగలగొడుతున్నారు.         శాంతిభద్రతల్ని పరిరక్షించటానికి మానవులచే, మానవతా వాదులచే వ్రాయబడిన చట్టం ఆ ప్రక్కనే వుండగా, దాన్ని అమలుజరిపే పోలీసు శాఖ ఆ నగరంలో శాఖలుగా విస్తరించుకొని వుండగానే దోషుల్ని నిర్భీతితి, నిజాయితీతో శిక్షించమని శాసించే న్యాయస్థానం ఆ నగర నడిబొడ్డున వుండగానే, దౌర్జన్యాన్ని, హింసను ఖండించే బాధ్యతాయుతమైన పౌరులు, మేధావులు వుండగానే జరుగుతున్న గూండాగిరి అది....         తనకై తాను తన రాక్షస ప్రవృత్తిద్వారా, బల నిరూపణ ద్వారా సొంతం చేసుకున్న అహంభావంతో, అధికారంతో పవిత్రమయిన భారత రాజ్యాంగాన్ని, చట్టాన్ని ప్రజా ప్రభుత్వాల్ని హేళన చేసే అమానుష కార్యక్రమం నిర్విఘ్నంగా సాగిపోతోంది.         బోనులోకెక్కి చెప్పలేని ప్రజలు దానికి సాక్ష్యం... సాక్షులులేనిదే శిక్షించలేని న్యాయస్థానం దానికో అస్థిరత్వపు ప్రశ్న...         రాత్రింబవళ్ళు శ్రమించి, రక్తం ధారబోసి, పైసా పైసా కూడబెట్టుకొని చిన్న గూడును తలదాచుకునేందుకు నిర్మించుకున్న అరుణాచలం దంపతులు కనీసం పెద్దగా ఏడ్చేందుకు బాధను వ్యక్తం చేసుకొనేందుకు కూడా ధైర్యం లేక అటుకేసి గుండెలు పగిలిపోయిన స్థితిలో చూస్తుండి పోయారు వాళ్ళు.         మూడో నిమిషానికి ఆ యింటి తలుపులు బ్రద్దలయిపోయాయి.         స్వయంకృషితో నిర్మించుకున్న చెక్క తలుపులు కన్నా, దౌర్జన్యంతో వాళ్ళు చేతబూనిన యినుప కడ్డీలే బలమైనవని ఋజువయింది.         అప్పుడు సమయం సరిగ్గా సాయంత్రం ఆరున్నర గంటలు అవుతోంది.         పొందికగా పేర్చి వున్న ఆ యింటిలోని వస్తువులన్నీ అచ్యుత్ అనుచరుల చేతుల్లో నాశనమైపోతున్నాయి. ఆ చర్యల తాలూకు శబ్దాలు ఎదురింటి వరకు వినిపిస్తున్నాయి. అది పిరికివాళ్ళు మాత్రమే చేసే పని అని అచ్యుత్ కి తెలుసు.         ఆ నగరంపై, నగర ప్రజలపై తను కాపాడుకుంటూ వస్తున్న పట్టు చేజారిపోతుందేమోనన్న భయం అచ్యుత్ అంతరాళంలో నిలిచి ప్రశ్నిస్తుండడంతో చేయిస్తున్న పిరికి పనినే తన ధైర్య సాహసాలకు ప్రతీకనుకొని మురిసిపోతున్నాడు. ఆత్మవంచన చేసుకుంటున్నాడు.         ఆ యింటికి చుట్టుప్రక్కల వున్న యిళ్ళలోని వ్యక్తులు భయంతో తలుపులేసుకుని క్షణాలు లెక్కిస్తూ, బిక్కు బిక్కుమంటూండగా, ఎదురింటిలో వున్న ఆదిలక్ష్మి, అరుణాచలం తమకు జరుగుతున్న నష్టాన్ని కనులారా చూస్తూ, చెవులారా వింటూ బోరుమని ఏడుస్తున్నారు.
24,315
    సన్యాసి వేషముననున్న రావణుని సీత సత్కరించుట     3.    ఆ సన్యాసి - దశకంఠుడని         తెలియక సీత - సుస్వాగతమిడి             దర్భాసనమున I కూర్చుండజేసి             యధావిధిగ - పూజలు జేసి I         కందమూలములు - ఫలహారమిడి         చెంతన నిలిచె - ప్రణామములిడి I             అంత రావణుడు - సీతను జూచుచు             కాముకుడై ప I ల్కె ప్రశంసించుచు    ....  IIశ్రీII                 రావణుడు సీతతో :-     4.    ఓ లలనా నీ I వు ఎవ్వరవో         కారడవులకు - ఏల వచ్చితివో I             కీర్తిదేవివో - శ్రీదేవివో             లక్ష్మీదేవివో - భూదేవివో I         పార్వతివో గం I ధర్వాంగనవో         రతీదేవివో - కిన్నరాంగనవో I"             అని రావణుడు - సీతను జూచుచు             కాముకుడై ప I ల్కె ప్రశంసించుచు    ....  IIశ్రీII     5.    "నీ రూపము అపు I రూపమైనది         నీ వయసు ప I సందుగనున్నది I             నీ జఘనము వి I శాలమైనది             నీ నడుము కడు - సన్నమైనది I         నీ దేహము బం I గారము వంటిది         నీ తేజము అ I పారమైనది I"             అని రావణుడు - సీతను జూచుచు             కాముకుడై ప I ల్కె ప్రశంసించుచు    ....  IIశ్రీII     6.    "నీ నేత్రములు - నల్ల కలువలు         నీ కుచములు - తాళ ఫలములు I             నీ కేశములు - తుమ్మెద రెక్కలు             నీ ఊరువులు - కరి తొండములు I         నీ దంతములు - మల్లె మొగ్గలు         నీ మృదు పెదవులు - కెంపుల పలుకులు I"             అని రావణుడు - సీతను జూచుచు             కాముకుడై ప I ల్కె ప్రశంసించుచు    ....  IIశ్రీII     7.    "నీవు దాల్చుటచే - ఆభరణములు         దీప్యమానమై - వెలుగొందుచుండె I             నీవు కట్టుటచే - పట్టుపుట్టము             మనోహరమై I ఒప్పారుచుండె I         అటులే నిన్ను చే I పట్టిన పురుషుడు         నీ చెలిమిచే I రాణించగలడు I"             అని రావణుడు - సీతను జూచుచు             కాముకుడై ప I ల్కె ప్రశంసించుచు    ....  IIశ్రీII     8.    "ఓ సుందరీ - ఇంటికి పొమ్ము         క్షేమము కాదు ఈ - వనవాసము I             అసురులు తిరిగెడు - ఈ కారడవులు             కానే కావు - వాస యోగ్యములు I         నీ పేరేమి - నీ ఊరేమి         తోడెవ్వరు నీ I కు లేరా ఏమి ?"             అని రావణుడు - సీతను జూచుచు             కాముకుడై ప I ల్కె ప్రశంసించుచు    ....  IIశ్రీII                 47 వ. సర్గ             సీత మాయ సన్యాసితో :-     1.    "బ్రాహ్మణోత్తమా - ఆలకింపుము         వనవాసమునకు - గల కారణము I             దశరధరాజు కు I మారులు నల్వురు             రామ లక్ష్మణ భ I రత శత్రుఘ్నులు I         జనకరాజు సుత I ను సీతను నేను         రామునితో నా I కు పరిణయమాయెను I"             అని పల్కె సీత - లంకేశుని గని             అతడు నిజముగ - సన్యాసియని    .... IIశ్రీII     2.    "శ్రీరాముని ప I ట్టాభిషేకమును         తండ్రి దశరధుడు - చేయనెంచెను I             చిన్నభార్య కై I క కోరె దశరధుని             వెనుకటి వరములు - రెండు తీర్చుమని I         భరతునకు ప I ట్టాభిషేకము         పదునాల్గేండ్లు రా - మ వనవాసము I"             అని పల్కె సీత - లంకేశుని గని             అతడు నిజముగ - సన్యాసియని    .... IIశ్రీII
24,316
   ఇందాక హత్య జరిగితే నా జ్యూరిస్ డిక్షన్ లోకి రాదంటే నా జ్యూరిస్ డిక్షన్ లోకి రాదని ఇద్దరు ఇన్స్ పెక్టర్లు వాదించుకున్నారు.     ప్రణయ్ చటుక్కున మంచం మీద లేచి కూర్చున్నాడు.     'అవునూ....హిమాయత్ నగర్ పోస్టాఫీసు దగ్గర హత్య చేయబడింది కొంపదీసి అరుణ్ గానీ కాదు కదా?'     డిటెక్టివ్ మంచం మీదికి పారేసి హాల్లోకి పరుగుతీశాడు అతను.     హాల్లో టి.వి.ముందు కూర్చుని మారుతీరావు, కోమలి ఏదో సీరియల్ చూస్తున్నారు. కనకమహాలక్ష్మి తమపాకులకు సున్నం రాస్తూ వుంది.     ప్రణయ్ ఫోన్ తీసి హండ్రెడ్ డయల్ చేశాడు.     "హలో....పోలీస్ కంట్రోల్ రూం హియర్" అవతలినుండి ఆపరేటర్ కంఠం పలికింది.     "చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నెంబర్ కాస్త చెప్తారా?" అడిగాడు ప్రణయ్.     గదిలోని ముగ్గురి తలలూ అతని వైపుకు గిరుక్కున తిరిగాయి.     ఆపరేటర్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నెంబర్ చెప్పాడు.     ప్రణయ్ ఫోను డిస్కనెక్ట్  చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నంబర్ తిప్పాడు.     "హలో" అవతలినుండి పలికారు.     "హలో...చిక్కడపల్లి పోలీస్ స్టేషనేనా?" అడిగాడు ప్రణయ్.     "అవును" అంది అవతలి కంఠం.     "ఇన్స్ పెక్టర్ గారితో మాట్లాడాలి."     "ఇన్స్ పెక్టర్నే మాట్లాడుతున్నాను."     "ఇందాక హిమాయత్ నగర్ పోస్టాఫీసు దగ్గర హత్య జరిగింది కదా? హతుడి పేరు ఏంటి ఇన్స్ పెక్టర్?"     గదిలోని ముగ్గురూ ఉలిక్కిపడి ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు.     "మీరెవరు? ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఎందుక్కావాలి?" అవతలి నుండి ప్రశ్నించాడు ఇన్స్ పెక్టర్.     "మా బంధువులాయన కొద్దిరోజులుగా కనిపించడం లేదు. అతనేమో అనీ."     "మీ బంధులాయన పేరేమిటి?"     "విశ్వనాథం."     "అయితే హత్య చెయ్యబడింది మీ బంధువులాయన కాదు."     "క్లిక్" అవతలినుండి ఫోను డిస్కనెక్ట్ చేసేశాడు ఇన్స్ పెక్టర్.     "అబ్బా!" బాధగా తల పట్టుకుంటూ అన్నాడు ప్రణయ్.     మారుతీరావు ఏదో అడిగేంతలోనే అతను మళ్ళీ పోలీస్ స్టేషన్ నంబర్ డయల్ చేశాడు.     "హలో!" అదే కంఠం పలికింది అవతలినుండి.     "హలో....నేనే ఇన్స్ పెక్టర్! దయచేసి హతుడి పేరు చెప్పండి. ఎందుకంటే నా క్లోజ్ ఫ్రెండ్ కూడా గత నెలరోజులుగా కనిపించడం లేదు. ఒకవేళ వాడుగానీ ఏమోననీ...." నసుగుతూ అన్నాడు ప్రణయ్.     "నువ్వు భలేవాడివయ్యా! ఎవరు కనిపించకపోయినా వాళ్ళు  హత్య చెయ్యబడినట్టేనా? ఇందాక హత్య చెయ్యబడినాయన పేరు చింతాకుల సుబ్బారావ్" అన్నాడు ఇన్స్ పెక్టర్.     "ఓ...థాంక్యూ ఇన్స్ పెక్టర్! అయితే అతను నా ఫ్రెండ్ కాదు. నా ఫ్రెండ్ పేరు అరిటాకుల అప్పారావ్!"     ఫోన్ డిస్కనెక్ట్ చేసేసి గబగబా తన గదిలోకి వెళ్ళి మంచంమీద కూర్చుని కళ్ళు మూసుకుని ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చుకున్నాడు.     మూసినా కళ్ళు మెల్లగా తెరిచిన అతనికి ఎదురుగా తల్లీ, తండ్రీ, చెల్లెలూ ముగ్గురూ తనవంక ఆందోళనగా చూస్తూ కనిపించారు.     "ఏంటీ? ఏమైందీ?" అడిగాడు అతను ముగ్గుర్నీ మార్చి మార్చి చూస్తూ.     ముగ్గురూ ఏమీ సమాధానం చెప్పలేదు.     మారుతీరావు దృష్టి మంచం మీద వున్న డిటెక్టివ్ మీద పడింది.     ముందుకు వంగి దాన్ని చేతిలోకి తీసుకున్నాడు.     "అర్దరాత్రి అరుపులు!" నవల పేరు పైకి చదివాడు. "ఇలాంటి గన్నాయ్ పుస్తకాలు చదివీ చదివీ మైండు చెడినట్లుంది."     "ఓరి నాయనో! నా కొడుకు మ్యాడ్స్ అయిపోయాడు దేవుడో....వాడెలా రిపేర్ అవుతాడురో నాయనో" గుండెలు బాదుకుంటూ అంది కనకమహాలక్ష్మి.     "ఇకనుంచి ఇలాంటి గన్నాయ్ పుస్తకాలు చదవకు. నీకు పిచ్చి ఎక్కడం కాదు, నీ పిచ్చి చూసి మాకు పిచ్చేక్కేలా వుంది." అన్నాడు మారుతీరావు డిటెక్టివ్ పుస్తకాన్ని గది మూలకు విసిరికొడుతూ.     "ఏంటి? ఏమైంది? మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్ధంకావడం లేదు" వాళ్ళవంక అయోమయంగా చూస్తూ అన్నాడు ప్రణయ్.     "ఆ...! మా మాటలే అర్ధంకావడం లేదా? ఓరిగాడో...వీడు నిజంగానే మ్యాడ్ అయిపోయాడురా నాయనో" మళ్ళీ గుండెలు బాదుకుంది కనకమహాలక్ష్మి.     "ఛస్! నువ్వు కాస్సేపు నోరు మూస్తావా?"కసురుకుంటూ అన్నాడు మారుతీరావు.     కనకమహాలక్ష్మి సైలెంట్ అయిపోయింది.     మారుతీరావు కొడుకు వైపు చూశాడు.     "ఇందాక ఏంటీ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి హత్యా, గిత్యా అంటున్నావ్? అదంతా డిటెక్టివ్ ల పైత్యమేనా?"     ప్రణయ్ కి ఇంక అసలు విషయం చెప్పక తప్పలేదు. చెప్పకుండా దాస్తే తనకి పిచ్చి అనుకుంటారు.     అందుకనే అతను వాళ్ళకి చెప్పేశాడు. తను ఫోన్ లో క్రాస్ టాక్ వినడం, ఇద్దరు వ్యక్తులు హత్యకు ప్లాన్ చెయ్యడం, తను పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం....అంతా చెప్పేశాడు.     అతను చెప్పిన విషయాన్ని మారుతీరావు ఏ మాత్రం సీరియస్ గా తీసుకోలేదు.     "ఆ! నీదంతా ఒట్టి భ్రమ. ఆ వెధవ పుస్తకాలు చదువుతుంటావ్ కదా. ఏదో కల వచ్చి వుంటుంది. అదేమో నువ్వు నిజంగా జరిగిందని అనుకుంటున్నావు" అన్నాడు.     "అసలు నేను నిద్రపోతేకదా కల రావడానికి" అన్నాడతను అడ్డు తగులుతూ.     "సరే....సరే....నువ్వు నిద్రపోలేదు. నీకు కలా రాలేదు. అదంతా నిజంగా జరిగింది. సరేనా? ఇంక ఆ విషయం మర్చిపోయి హాయిగా వుండు. ఇకముందు ఆ గన్నాయ్ పుస్తకాలు యింట్లో కనిపిస్తే కిర్సనాయిల్ పోసి తగలబెట్టేస్తా" అన్నాడు మారుతీరావు వెనక్కి తిరుగుతూ.     "అవునండోయ్! కిర్సనాయలంటే గుర్తొచ్చింది. మనింట్లో కిరసనాయిలు అయిపోయింది. గ్యాస్ కూడా అయిపోవచ్చింది. ఎప్పుడు తెస్తారు?" అడిగింది కనకమహాలక్ష్మి.     "ఇంత రాత్రివేళ ఏ గన్నాయిగాడూ షాపులు తెరిచి పెట్టుకుని కూర్చోడు. రేపు గుర్తుచెయ్యి" అంటూ గది బయటికి వెళ్ళిపోయాడు.     "నువ్వింక ఆ బ్యాడ్ బుక్స్ రీడింగ్స్ చెయ్యకురా. నాకేదో వర్రీసుగా వుంది."     కొడుకుతో అని కనకమహాలక్ష్మి కూడా గదిలోంచి వెళ్ళిపోయింది.     'నేను చెప్తుంది నిజమే అయినా వీళ్ళెందుకు నమ్మరు?' అనుకుంటూ తల పట్టుకున్నాడు ప్రణయ్.     "అన్నయ్యా!"     ప్రణయ్ తల పైకెత్తి చూశాడు.     కోమలి! ఇంకా తన గదిలోంచి బయటికి వెళ్ళలేదు.     "ఏం నువ్వు కూడా డిటెక్టివ్ లు చదవొద్దని సలహా ఇవ్వడానికి రెడీగా వున్నావా?" విసుక్కుంటూ అన్నాడతను.     "కాదన్నయ్యా."     ఒక క్షణం ఆగింది.     "వాళ్ళు పెద్దవాళ్ళు కదా! అందుకనే కాస్త చాదస్తంగా వుంటారు. నాకెందుకో నువ్వు నిజమే చెబుతున్నావని అనిపిస్తోంది."     "నిజం చెప్పక మీతో అబద్దం చెబితే నాకేంటి లాభం?"     "అయితే ఆ అరుణ్ ని రక్షించే మార్గమే లేదా?"     "పోలీస్ స్టేషన్ కి వెళ్ళి చెప్పినా పట్టించుకోకపోతే ఏం చేస్తాం?"     ఇద్దరూ కొన్ని క్షణాలు మౌనంగా వున్నారు.     హఠాత్తుగా అంది కోమలి.     "ఓ పని చేస్తేనో?"
24,317
    హీ ఈజ్ ఎ పర్ఫెక్ట్ మేన్! ఆర్ధికంగా మా ఇద్దరి సంపాదనా కలిస్తే అతని కుటుంబంతో పాటు మా కుటుంబం కూడా హాయిగా ఉండగలదు. ఆముక్త బాధ్యత అతను ఎంతమాత్రం కాదనడు. ఇంత దూరం వెళ్ళాయి నా మనసులోని ఆలోచనలు!     "రేపు రాఖీ పండుగరోజు రాఖీకట్టి తోఫాగా వదినని అడిగేస్తాను. ఇవ్వక ఏం చేస్తాడు. తన మనసులో లేకపోతే కదా!" నవ్వుతూ అంది ఇంద్రాణి.     ఆ చివరి మాటకి నా గుండె ఝల్లుమంది.     ఎన్నిసార్లో ఈ పెదవులకి ఆ రుచి గుర్తొచ్చి కలవరంగా అనిపిస్తోంది. "ఆ అలజడి అతనికిలేదా?"     అంత మామూలుగా "మీ కర్చీఫ్ నేను ఒక్కసారి వాడుకుని ఇవ్వచ్చా?" అన్నట్లు నా పెదవులని ముద్దుపెట్టుకున్నాడా? ప్రేమలో కలిగే బాధ విరహం వల్ల వీస్తుంది. ఆ విరహాన్ని ఏ మాత్రం భరించలేని ప్రబంధనాయికలు నోటికొచ్చినట్లు తిట్టేవారుట!     నేను తిట్టలేను!     నేను ప్రేమించిన వ్యక్తి నేను ఇక్కడ అతని తాలూకూ విరహంలో వేగిపోతుంటే తను అక్కడ ఓ పసివాడి జీవితం నేలరాలిపోకుండా పందిరి వేస్తుంటాడు!     ఆ పందిరి క్రింద అందరితోపాటూ నేనూ సేదదీరాలి. పందిరంతా నాదే కావాలనుకోకూడదు!     రాఖీ పండుగ రోజు ఇంద్రాణి అతన్ని పెళ్ళి విషయం అడుగుతుందని నాకు తెలుసు. నేను ఆ రోజుకోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను.                                                         *  *  *     చిన్నక్క డైరీ చదువుతున్న నా గుండె దడదడా కొట్టుకుంది. డైరీలో పుల్లముక్క గుర్తుగా పెట్టి మూసి మనసులోనే దేవుడ్ని ప్రార్థించాను.     "ఒకవేళ అతను అక్కని రిజెక్టు చెయ్యలేదు కదా! ఇంతగా ప్రేమించిన సున్నిత మనస్కురాలు అలాంటిది జరిగితే అసలు భరించలేదు."     మళ్ళీ ఆత్రంగా డైరీ చదవసాగాను.     "రాఖీ పండుగ రోజు వెంకటేశ్వరస్వామి గుడికి వెళ్ళి భక్తిగా నమస్కరించి నా మనసులో కోరిక ఆయనకి తెలియబరిచాను. జీవితంలో నేను చంద్రని తప్ప, ఇంత గాఢంగా ఏదీ కావాలని కోరుకోలేదు!"     చేతుల్లో చెమటలు పడుతున్నాయి. చాలా టెన్షన్ గా వుంది. ఫోన్ చేద్దామనుకుని కూడా విరమించుకున్నాను. అతను ఎలా రియాక్టు అవుతాడో, నాతో ఎలా మాట్లాడతాడో మనసులో ఊహించుకుంటూ రూమ్ కి వచ్చేశాను.     ఆలోచనలతో నాకు నిద్రపట్టేసింది.     "ఆయా రూమ్ తలుపు తట్టి మీ కోసం విజిటర్ వచ్చాడు" అని చెప్పి వెళ్ళింది.     ఆమె అన్న మాటలతో నాకు ఎక్కడలేని హుషారూ వచ్చేసింది. తప్పకుండా అతనే అని తెలుసు!     బాత్ రూమ్ లోకెళ్ళి మొహం కడుక్కున్నాను. ఒంటికేసి చూసి చీర మార్చుకున్నాను.     జడేసుకుందామా అనుకుని మళ్ళీ ఆలస్యం అవుతుందేమోనని పైపైన దువ్వేసుకున్నాను. బొట్టుబిళ్ళనోసారి సరిచేసుకుని బయటకి వచ్చాను.     అతను వరండాలో జేబులో చేతులు పెట్టుకుని బయటికి చూస్తూ నిలబడి ఉన్నాడు.     అడుగులు వేగంగా పడలేదు! నెమ్మదిగా వెళ్ళాను.     అతను సీరియస్ గా బయట ఉన్న చెట్లకేసి చూస్తున్నాడు. అతని భుజం మీద చెయ్యివేసి నావైపుకి తిప్పుకోవాలని ఎంతగానో అనిపించింది. ధైర్యం చాలక "హలో" అన్నాను.     తను నావైపు తిరిగి "హలో...మీతో చాలా ముఖ్యమైన విషయం ఒకటి మాట్లాడాలి. నాతో బయటికి వస్తారా?" అని అడిగాడు.     ఏం మాట్లాడతాడో తెలిసి నా బుగ్గల్లో మంకెనలు వూశాయి. "వస్తాను" అన్నాను. మనసులో 'నీతో నరకానికైనా వస్తాను' అనుకున్నాను.     అతని వెనకాల అడుగులో అడుగు వేస్తుంటే నాకు కొత్తగా అనిపించింది.     ఇద్దరం గాంధీ పార్క్ కి వెళ్ళాం.     పక్షులన్నీ గూళ్ళకి చేరుతున్నాయి.     దూరంగా ఓ పిల్లవాడు నిలబడి గొంతెత్తి తనకి తెలియని రాగంతో అవ్యక్తమైనటువంటి భావంతో ఏదో పాడుకుంటూ పోతున్నాడు.     నేను అతనేం చెప్తాడా అన్నట్లు చూస్తూ కూర్చున్నాను.     అతను గంభీరంగా "నాకు రాబర్ట్ ఫ్రోస్ట్ పోయమ్ గుర్తొస్తోంది. ఐహేవ్...టూగో మెనీ మైల్స్...ఐ హేవ్ టూ కీప్ మెనీ ప్రామిసెస్...బిఫోర్ ఐస్లీప్! ఇప్పుడు నా పరిస్థితి అలాగే ఉంది" అన్నాడు.     నాకు అర్థంకాక "అంటే?" అన్నాను.     అతను నాకు దగ్గరగా జరిగి కూర్చుని చెయ్యిజాపి "నానమ్మకి చెప్పనని మాటివ్వండి" అన్నాడు.     అతని చేతిలో నా చెయ్యి వేశాను.     "నేను ఎక్కువ రోజులు బతకను" అన్నాడు.     నా చెయ్యి అతని చేతిలో ఒణికింది.     "ఏవిటీ?" భయంగా అడిగాను.     "ఔను! నా కిడ్నీలు రెండూ ఫెయిలయ్యాయిట." అన్నాడు చాలా మామూలుగా.     "ఒద్దు! హాస్యానికి కూడా అలాంటి మాటలు మాట్లాడొద్దు" ఏడుపు గొంతుతో అన్నాను.     "హాస్యాలాడడానికి నా దగ్గర టైంలేదు!" అన్నాడు.     "చంద్రా...ఏమిటిది?" అతని భుజం మీద ఏడుస్తూ వాలిపోయాను.
24,318
         సరిగ్గా ఆమె భర్త మరణించి సంవత్సరకాలం పూర్తయిన రోజే ఆమె సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. ఆ రాత్రి కాగితం మీద కలం కదిలింది.          ఆమె ఇంతింత నేత్రాలు చేసుకు చూస్తుండగా "నేను నీ భర్తను వచ్చాను" అని కాలం కదిలి కాగితం అడుగుభాగంలో విల్లీ బర్ధన్ అనే సంతకం చేసి అచేతనమైంది. ఆ సంత్ర్హకం అచ్చు గుద్దినట్టు తన భర్త సంతకానికి సరిపోయింది.          ఆమె ఎగిరి గంతేసినంత పనిచేసింది. ఆనాటి నుంచీ ఆమెకూ, ఆమె భర్తకూ ఈ ఆటో రైటింగ్ ద్వారా సంబంధం కుదిరింది. అతడనేక విశేషాలామెతో చెబుతూ వుండేవాడు. అతనిది సూక్ష్మ శరీరం కనుక ఎంత దూరాన జరుగుతున్న సంగతులనైనా క్షణంలో చూచివచ్చి చెబుతుండేవాడు.          అతని సహాయంతో ఆమె అనేక విషయాలు చెప్పగలుగుతూ, మానవాతీతమైన అంశాలతో సలహాలిస్తూ బాగా పేరు, డబ్బు సంపాదించు కుంది. ఆమె వల్ల ఎందరికో ఎన్నో కార్యాలు నెరవేరాయి.          అందులో ముఖ్యమైనది ఒక కోటీశ్వరుడి ఉదంతం- "క్రిచ్ టన్ బర్క్ లీ" అనే అహానికి అమెరికాలో ఒక విశాలమైన స్థలం ఉంది.          దానిలో ఒక పెద్ద బిల్డింగ్ కట్టిద్దామని ప్లాను గీయించి నిర్మాణం మొదలుపెట్టాడు. అప్పట్నుంచీ అతనికి ఎన్నో సమస్యలొచ్చి పడసాగాయి. పని ప్రారంభించైనా ప్రతిసారీ అతనికో, ఇంట్లోవాళ్ళకో, కూలీలకో అనారోగ్యం వచ్చి నిర్మాణం ఆగిపోయేది.          దాంతో వాళ్ళకి అనుమానం వచ్చి అతీతశక్తులతో సంబంధం కలిగిన వ్యక్తిగా ప్రసిద్ది పొందిన లూసీ బర్ధన్ ని కలుసుకొని సమస్య వివరించారు.          ఆమె రాత్రికి ఆ విషయం తన భర్త నడిగింది. అశరీరుడైన ఆమె భర్త ఆత్మ ఆ క్రిచ్ టన్ స్థలం దగ్గరకు వెళ్ళింది. అక్కడ అతనివంటి ప్రేతాత్మలే కొన్ని కనిపించాయి. వాటితో మాట్లాడాడతను.          ఆ స్థలం లోపల తమ సమాధులు వున్నాయని, అవి పూడిపోయి పైకి మామూలు నేలలానే కన్పిమ్చటంతో ఆ సంగతి ఎవరికీ తెలీలేదని, ఆ స్థల యజమాని జరప తలపెట్టిన నిర్మాణం వల్ల తమకీ, తమ సమాధులకీ యిబ్బంది కలుగుతుందని వివరించాయ్. తమ సమాధులు కదిలించటం గానీ, తామక్కడి నుంచి తరలిపోవటం గానీ వాటికిష్టం లేదన్నాయి.     అందుకే భవన నిర్మాణం  మొదలుపెట్టగానే ఆ ప్రేతాత్మలు ఏవో ఒక అడ్డంకులు సృష్టించేవి. దాంతో పనాగిపోయేది.          ఆ స్థల యజమానికీ, అతని కుటుంబ సభ్యులకూ, పనివాళ్ళకూ రోగాలూ, బాధలూ రాకుండా వుండాలంటే అక్కడ త్రవ్వటం, భవన నిర్మాణానికి పూనుకోవటం మానాలని ఆ ప్రేతాత్మలు విల్లీ ఆత్మతో చెప్పాయి. అతడు భార్యకి ఆటో రైటింగ్ ద్వారా ఈ విషయం మొత్తం తెలియపరిచాడు.          స్థల యజమానికి అసలు విషయాన్ని ఆమె చెప్పవలసిన రీతిలో చెప్పి బోధపడింది. ఆమె సూచన ప్రకారం ఆ రోజు రాత్రి స్థల యజమాని, అతనికి సంబంధించిన వ్యక్తులు ఆ స్థలం దగ్గరకు వెళ్ళి తాము అక్కడ ఇక మీదట ఎటువంటి త్రవ్వకాలు గానీ, భవన నిర్మాణ పనులు గానీ ప్ర్రారంభించమని" గట్టిగా అరుస్తూ ప్రమాణం చేశారు.          తరువాత వారికీ ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. ఆ ప్రదేశానికి కొంచెం దూరంలో వేరే భవనం నిర్మించుకున్నారు వాళ్ళు.          ఈ ఉదంతంతో అమెరికాలో లూసీ బర్ధన్ పేరు మారుమోగి పోయింది" అన్నాడు అభిరాం.          "పత్రికల వాళ్ళకేముంది... వాళ్ళు సేల్స్ పెంచుకోవటానికి ఏదో వ్రాస్తారు. ఇదీ అటువంటి కట్టుకధే అయుంటుంది" అన్నాడు మహదేవ్.          "అదే పొరపాటు... మనం నమ్మని విషయం తెలిసిన వైర్ని తప్పు పట్టటం మన అవివేకాన్ని తెలియజేస్తుంది. ఎక్కడో అమెరికాలో జరిగిన సంగతి కాబట్టి, అదీ పత్రికల్లో వచ్చింది కాబట్టి అవి నిజమై వుండ వంటున్నావు.          మనదేశంలో... అదీ మన ఆంద్రప్రదేశ్ లో మంత్రశక్తితో పచ్చకామెర్లు నయం చేయబడుతున్నాయన్న సంగతి తెలుసా నీకు?" కాస్త ఆవేశంగా అన్నాడు అభిరాం.          మహదేవ్ ఒకింత ఆశ్చర్యంగా చూశాడు.          "టంగుటూరు దగ్గరిలోని వెంకటాయపాలెంలో వెంకటరత్నం అనే వ్యక్తి, అతని సోదరులు తమ మంత్రశక్తితో పచ్చకామెర్లు నయం చేస్తున్నారు. ఈ వైద్యం తీసుకొనేవారు మూడువారాల పాటు స్నానం చేయకూడదు. ఆహారంలో ధనియాలపొడి, చింతకాయ పచ్చడి, మినప్పచ్చడి, కందిపప్పు, ఉప్పుతో నల్లపెసలు ఏవిధంగానైనా వాడుకోవచ్చు.          పొట్లకాయ, పెద్దచిక్కుడు, బత్తాయి, ఆపిల్, సపోటా తినవచ్చు. సాయంత్రం పూట తప్పకుండా మిరియాల చారు వాడాలి. మందు తీసుకొనే ప్రదేశంలోకి చెప్పులతో వెళ్ళకూడదు.          వంశ పారంపర్యంగా తొమ్మిది తరాల నుండి వారు కామెర్లకు వైద్యం చేస్తున్నారు. వారానికి రెండువందల నుండీ, మూడువందల మంది రోగులు మద్రాసు, గుంటూరు, కడప, బద్వేలు, మార్కాపురం, నెల్లూరు, విజయవాడ నుంచి వస్తూంటారు.          ఆ గ్రామానికి చేరుకోవాలంటే ఒంగోలుకు దగ్గరలో జి.టి. రోడ్డులో టంగుటూరు స్టేజీలో దిగి గుర్రబ్బండిలో కానీ, రిక్షాలో కానీ వెంకటాయపాలెం చేరుకోవచ్చు. ఒక వ్యక్తి నుంచి వైద్యం నిమిత్తం పదిరూపాయలు వసూలు చేస్తారు వాళ్ళు.          మందు తీసుకునే రోజు రోగి ఉదయాన ఏమీ తినకూడదు. కాళ్ళకు చెప్పులు ధరించకూడదు. వైద్యుడు తన చేతులు సబ్బునీటిలో ముంచి తదుపరి ఘాటయిన తెల్లసున్నం రుద్ది కళ్ళ ముందు మూడుసార్లు వుంచడంతో తొలి విడత వైద్యం పూర్తవుతుంది. ఇలా చేస్తున్నప్పుడు వైద్యుడు మంత్రోచ్చారణ చేస్తూనే వుంటాడు.          అదేరోజు మరికసారి ఇలానే చేయడం జరుగుతుంది. ఆ రోజు చికిత్స దాంతో పూర్తవుతుంది. రోగి మూడు వారాలు వరుసగా ఇలా చికిత్స చేయించుకోవలసి వుంటుంది. దాంతో పచ్చకామెర్లు మాయమై పోతాయి" అని చెప్పాడు అభిరాం.          "ఈ కామెర్ల చికిత్స సంగతి నీకెలా తెలుసు?" ప్రశ్నించాడు మహదేవ్.          "క్రితం సంవత్సరం నేను మా అమ్మమ్మకి పచ్చ కామెర్లొస్తే చేయించింది ఈ వైద్యమే"          "ఇది మంత్రశక్తి వల్లే నయమైందని నీవు నమ్ముతున్నావా?" అని అడిగాడు మహదేవ్.
24,319
    చుట్టూ ఎర్రరాళ్ళతో మధ్యలో ఒకే ఒక తెల్లరాయితో మిలమిలా మెరిసిపోతోంది లాకెట్. బహుశా సంధ్య మెడలోంచి కిందపడి వుంటుంది. చాలా ఖరీదు అని చూడగానే తెలుస్తోంది.          "వాట్ చాయా! క్లాస్ కి రావా?" ఓ అమ్మాయి అడిగింది.          చాయ గుప్పెట మూసేసి "వస్తున్నా.....పద" అంది నడుస్తూ లాకెట్ ని జాకెట్ లోకి తోసేసింది.          చాయ వెళ్లి సంధ్య ప్రక్కనే కూర్చుంది.          సంధ్య ఇంకా లాకెట్ సంగతి చూసుకున్నట్లులేదు! మామూలుగా మాట్లాడుతోంది.          "ఏమిటి చాయా! డల్ గా వున్నావు?" అంది సంధ్య.          "కాస్త టెంపరేచర్ వచ్చినట్లుంది" చాయ ముక్తసరిగా అంది.          సంధ్య వెంటనే ఆమె నుదుటిమీద చెయ్యివేసి చూస్తూ-          "ఇంత జ్వరంతో కాలేజ్ కి ఎందుకు వచ్చావు? రెస్ట్ తీసుకోవలసింది" అంది.          "రెస్టా?" చాయ నవ్వింది. ఆమెకి తన హాస్టల్ వాతావరణం, ఆ గంటలచప్పుడూ, అమ్మాయిల అరుపులూ, ఆ రణగణ ధ్వనులూ చెవిలో మార్మోగినట్లనిపించాయి.          "ఒద్దులే.....ఇక్కడే బావుంది" అంది.          "నాకు జ్వరం వస్తే అమ్మా, నాన్నలు చేసే హడావుడికి అంతే వుండదనుకో! అందుకే నేనూ చెప్పకుండా ఇలాగే పారిపోయి వచ్చేస్తాను" గలగలా నవ్వుతూ అంది సంధ్య.          ఆ మాటలు ఎత్తిపొడిచినట్లనిపించాయి సంధ్యకి.          సంధ్య నవ్వులో రాజసం, పలుకులో అతిశయం, నడకలో గర్వం కనిపించాయి.          లెక్చరర్ రావడంతో క్లాసు ప్రారంభమయింది.          చాయలో అసహనం పెరిగిపోతోంది. 'ఇంకా లాకెట్ పోయిందని చూసుకోదేం? గొల్లున ఏడవదేం?' అనిపించింది. తలంతా సూదులతో పొడుస్తున్నట్లు నెప్పిగా అనిపిస్తోంది.          "మేడమ్....!" సంధ్య అరుపుకి అందరూ ఉలిక్కిపడి ఆమె వైపు తిరిగారు.          సంధ్య ముఖంలో నవ్వు ఇరిగిపోయినట్లుగా పాలిపోయింది. "మేడమ్! నా లాకెట్ ఎక్కడో పడిపోయినట్లుంది. బహుశా గ్రౌండ్ లో పడిపోయిందేమో.....చూసొస్తాను" వణుకుతున్న గొంతుతో అంది.          క్లాసులో కలకలం రేగింది.          అందరూ ఒకరితో ఒకరు గుసగుసలాడుకుంటున్నారు.          క్లాసంతా వెదకమని లెక్చరర్ ఆర్డర్ జారీచేసింది అందరూ పడీపడీ వెదుకుతున్నారు. గ్రౌండ్ లో వెదకటానికి సంధ్యతోబాటు కొందఱు వెళ్ళారు. సంధ్య కారుతున్న కన్నీటిని తుడుచుకునే ప్రయత్నం కూడా చెయ్యలేదు. ఆమెని అలా చూస్తుంటే చాయకి తలనొప్పి కాస్త తగ్గినట్లు అన్పించింది.          "దొరకలేదు మేడమ్" సంధ్యతోబాటు క్లాసులోకి వచ్చిన అమ్మాయిలు చెప్పారు.          "సంధ్యా! చాలా ఖరీదు వుంటుందా?" లెక్చరర్ అడిగింది.          "ఖరీదు చెప్పలేము. అమూల్యమైనది. తరతరాలుగా మా వంశంలో వున్నది. దాని ఏంటిక్ వేల్యూ చాలా ఎక్కువ! నాన్నగారికి ఈ విషయం తెలిస్తే....మైగాడ్! చాలా బాధపడతారు...." వెక్కి వెక్కి ఏడ్చేస్తూ అంది సంధ్య.          "ఎలా వుంటుందీ?" ఎవరో ఆసక్తిగా అడిగారు.          సంధ్య కళ్ళు తుడుచుకుంటూ "చుట్టూ కెంపులు, మధ్యలో డైమండ్ వుంటుంది" అంది.          "డై.....మం....డ్....!" అందరూ ఆశ్చర్యంగా అన్నారు.          చాయ గుండె ఒక్కనిముషం ఆగిపోయి మళ్ళీ కొట్టుకోవడం ప్రారంభించింది.          "అంత విలువైనది కాలేజ్ కి ఎందుకు వేసుకొచ్చావు?" లెక్చరర్ గాభరాగా అడిగింది.          "ఆ లాకెట్ నా మెడలో వేస్తూ మా డాడీ ఎప్పుడూ తియ్యొద్దు అన్నారు. అది నా మెడలో వుంటే వాళ్ళ అమ్మని చూసినట్లే వుంటుందిట. పోయినట్లు తెలిస్తే డాడీ చాలా ఫీలవుతారు" మళ్ళీ ఏడ్చింది సంధ్య.          "లక్ష రూపాయలుంటుందా?" అడిగింది స్మిత.          "కోట్లు కూడా వుండచ్చు! కానీ దాని ఖరీదు గురించి కాదు, మా డాడీ సెంటిమెంట్ గురించి నేను బాధపడుతున్నాను" అంది వెక్కిళ్ళమధ్యే సంధ్య చాయకి జాకెట్ లో వున్న లాకెట్ మోయలేనంత భారంగా అన్పించింది.          ఈ వార్త కాలేజ్ అంతా గుప్పుమంది.          ప్రిన్సిపాల్ పరుగులు పెడ్తూవచ్చి-          "ఏమ్మా సంధ్యా! లాకెట్ పోయిందా? పోలీస్ కంప్లయింట్ ఇస్తాను. తప్పకుండా దొరుకుతుంది. నువ్వేం కంగారుపడకు" అంది తను బోలెడు కంగారుపడిపోతూ.          "డియర్ స్టూడెంట్స్! మీలో ఎవరికైనా సంధ్య లాకెట్ దొరికితే ఇచ్చెయ్యండి. వాళ్ళ నాన్నగారికి చెప్పి విలువైన బహుమానం ఇప్పిస్తాను" అంది ప్రిన్సిపాల్.          అమ్మాయిలు ఇంకా స్పీడుగా వెదకటం మొదలుపెట్టారు.          "సంధ్యా.....సంధ్యా...." ఆమెను కుదుపుతూ గాభరాగా అరిచింది అనూరాధ.          సంధ్య పక్కకి వాలిపోయింది.          సంధ్యకి స్పృహ తప్పింది.          "మీరంతా పక్కకి జరగండి. గాలి తగలనీయండి" అంటూ లెక్చరర్ అందర్నీ దూరంగా జరుపుతోంది.          ప్రిన్సిపాల్ కి ముచ్చెమటలు పోసాయి.          "వాళ్ళ రెసిడెన్స్ కి ఫోన్ చేస్తాను" అని హడావుడిగా ఆఫీస్ రూమ్ వైపు పరుగెత్తింది ఆవిడ.          అదంతా ఓ ఫిక్షన్ సినిమా చూస్తున్నట్లు చూడసాగింది చాయ.          ఓసారి కడుపులో తిండిలేక తను కళ్ళుతిరిగి పడిపోతే, లాస్ట్ బెంచ్ లో పడుకోబెట్టి, యధాప్రకారం పాఠం కొనసాగించింది ఈ లెక్చరరే!          ఇప్పుడు సంధ్యకి స్పృహ తప్పితే ప్రపంచం మునిగిపోయినట్లు తల్లక్రిందులైపోతున్నారు.          ఒకమ్మాయి పుస్తకంతో విసుర్తోంది. ఇంకొక అమ్మాయి కాళ్ళూ, చేతులూ రాస్తోంది. లెక్చరర్ నీళ్ళు మొహంమీద జల్లి లేపడానికి ప్రయత్నిస్తోంది. ప్రిన్సిపాల్ దొర్లిపోతూ వరండామీద పరుగులు పెడుతోంది. అందరూ సర్కస్ లో బఫూన్లలా యధాశక్తి ప్రయత్నిస్తున్నారు.....ఎవర్ని రంజింప చెయ్యడానికో!          "సంధ్యా....సంధ్యా!" చాయ ఆమె మీదకి ఒంగి పిలిచింది.
24,320
    "పాణీ! నీ జీవితం సుఖంగా ఉందా?"     "చెప్పలేనంత."     "పాణీ! నువ్వెందుకు తాగుతున్నావ్?"     "అదో లగ్జరీలే! భూమ్మీద చాలామందికి వాళ్లు ఎందుకు కొన్ని పనులు చేస్తుంటారో తెలియనే తెలియదు."     "నేను పరీక్ష తప్పాను పాణీ!"     "ఆఁ ?"     "ఆఁ. కష్టపడే చదివాను కానీ ఈ పరీక్షల చదువు నాకంటదు. నా చదువు వేరు."     "ఆయనేమన్నాడు?"     "పాసయ్యేదాకా నా ముఖం చూపించొద్దన్నాడు."     "మరి ఇప్పుడేం జరుగుతుంది?"     "అదే తెలియదు... నేను బాగుపడనని ఆమెను ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేసేద్దామని చూస్తున్నాడట! ఈ రెండో విషాదం బరువుని నేను మొయ్యలేను పాణీ! అందుకే ఇక్కడికి పారిపోయొచ్చాను చివరకు మనశ్శాంతి కోసం."     "దొరికిందా మనశ్శాంతి?"     "ఆఁ ఆ మైకంలో అంతా ఆనందమయమే!"     చక్రపాణి నిట్టూర్చాడు. దురదృష్టవంతుడు తను ఒక్కడే.     "మళ్ళీ పరీక్షకు కత్తి బాగా చదువు గిరీ! నీకు తప్పక శుభం కలుగుతుంది" అన్నాడు.     "గీతను దక్కించుకుని తీరతాను" అన్నాడు గిరి.     కారు ఒక వీధిగుండా పోతుంది. ఇంతలో ఒక స్త్రీ తన ఇంటి గుమ్మం ముందు నిలబడి చెయ్యెత్తి పిలిచింది.     అతనికి ఆగక తప్పలేదు. "ఇప్పుడే వస్తాను" అని చెప్పి కారు దిగి, ఆమెతో ఒక నిముషం మాట్లాడి మళ్ళీ వచ్చి కూర్చున్నాడు.     'ఇది ఏం వీధి?' అనడిగాడు.     "గోరింటాకు" అని చక్రపాణి అన్నాడు.                                                   13     రాజారావు బెజవాడ వచ్చేశాడు. ఈ ఏడాది కాలేజీ ఎలక్షన్ల గొడవలేమీ పెట్టుకోదలచుకోలేదు. ఆ వృద్ధ దంపతుల ఇంట్లోనే ఉండసాగాడు.     వృద్ధుడు చాలా మంచివాడు. సాయంత్రం కాగానే రాజారావుదగ్గరకు వచ్చి "అలా షికారుకు పోదాం రావోయ్!" అని పిలిచేవాడు. ఇద్దరూ కలిసి ఓ నాలుగైదు ఫర్లాంగులదూరం నడుస్తూ పోయేవారు.     ఆయన పచ్చగా, నిర్మలంగా వుండేవాడు. మాటల్లో ఆప్యాయత తొణికిసలాడుతుండేది. వేదాంతంగురించీ, భగవద్గీతగురించీ ఈ చిన్నవాడితో మాట్లాడుతూ వుండేవాడు. రాజారావుకు విసుగనిపించేది కాదు.       ఓసారి అతను సిగరెట్ కాలుస్తుంటే ఆయన హఠాత్తుగా వచ్చేసరికి చప్పున పారేశాడు. ఆయన నొచ్చుకుని "నేను నీ మిత్రుణ్ణి బాబూ! నీ ఇబ్బందిద్వారా నాకు గౌరవం ప్రదర్శించకూడదు. నా ముందు నువ్వు సిగరెట్లు యధేచ్చగా కాల్చుకోవచ్చు" అన్నాడు.     ఒక్కోసారి ఆయనకు ఒంటరిగా భోజనం చేస్తుంటే ఏమిటో దిగులుగా అనిపించేది. ఏదో ఒంటరితనం, ఆందోళన ఆవహించేది. గబగబ వచ్చి రాజారావును బలవంతం చేసి లాక్కుపోయేవాడు. ఇహ రాజారావు స్థితి అలానే వుండేది. క్యారియర్ లో వచ్చిన భోజనం ముందు పెట్టుకుని తింటుంటే చెప్పరాని తపనగా వుండి కళ్లలో నీళ్లు తిరిగేవి.     అతని కన్నీటికి కారణం వుందనుకో. అయినా అప్పుడప్పుడూ కారణం లేకుండానే శూన్యంలోకి చూస్తుండగా జలజలమని రాలిపోయేవి భాష్పాలు.     కారణంలేని కన్నీరే, కారణంగల దుఃఖంకన్నా వేదనాభరితంగా వుంటుందనిపిస్తుందెందుచేతో.     అసలు జీవితాన్ని ఎందుకు విషాదం ఆక్రమించుకుని వుంటుంది? దానినుండి తప్పించుకోలేడా మానవుడు?     అప్పుడప్పుడూ చక్రపాణిని గురించి ఆలోచిస్తూ కూర్చునేవాడు. తాము ఇద్దరూ ప్రాణ స్నేహితులు... అయినా ఒకరికొకరు దూరమైపోతున్నట్లుగా అనిపిస్తుంది. పాణిలో ఏదో మార్పు వచ్చి పడింది. అది ఏదో తాను తెలుసుకో లేకుండా వున్నాడు. ఒకసారి హైదరాబాద్ పోయివస్తే? ఎందుకో పోబుద్ధి కావడంలేదు. భయంగా, సంకోచంగా వుంది.     ఒకరోజు ఉదయం అతను బట్టలేసుకుని కాలేజీకి వెళ్దామని పుస్తకాలు తీసుకుంటున్నాడు. ఇంతలో "బాబుగారూ!" అన్న పిలుపు వినిపించింది. తలత్రిప్పి చూసేసరికి వాకిట్లో పాంచాలి నిలబడింది.     "నువ్వా?" అన్నాడు రాజారావు ఆశ్చర్యంగా.     "లోపలికి రానా బాబూ?" అంది పాంచాలి నవ్వి.     "రా! ఏమిటిలా వచ్చావు?"     పాంచాలి మళ్లీ నవ్వి "ఇదివరకు మీదగ్గర పనిచేస్తూ వుంటినయ్యె. మంచి పనిమనిషి లేకపోతే మీరు ఇబ్బందిపడరూ? అందుకని మీదగ్గర మళ్లీ చేరుదామని" అంది.     "ఈ టక్కరి వేషాలకేమిలే! అసలు నా ఇల్లు ఎలా తెలిసిందో చెప్పు?" అని రాజారావు కుర్చీలో కూర్చున్నాడు.     "చెప్పనా? కోప్పడరుకదా?"     "చెప్పు?"     "ఓసారి మిమ్మల్ని బజారులో చూశాను. మీకు తెలియకుండా వెంటబడి ఇల్లు కనుక్కున్నాను" అని పాంచాలి సిగ్గుభారంతో తలవంచుకుని చిన్నగా నవ్వింది.     ఆమెకు ఇరవై అయిదేళ్లకంటే ఎక్కువ వయసుండదు. అయినా రాజారావు 'ఓసిదెయ్యమా!' అన్నాడు. "ఏం పనిచేశావు? ఎందుకుపుట్టింది నీకీ పాడుబుద్ధి?"     "అమ్మగారి ఆజ్ఞ!"     "ఏ అమ్మగారు?" రాజారావు నాలిక కొరుక్కున్నాడు.     "ఆమెగారితో చెబుతానుండండి ఇలా అన్నారని. అప్పుడే మరచిపోయారా? అవున్లెండి మగవారు."     "ఈనాటికి నిష్ఠూరాలు పడవలసివచ్చింది.. ఏమిటా ఆజ్ఞ?"     "మీ గది కనిపెట్టి కబురు అందజెయ్యమని!"     "నే నా కబుర్లేమీ వినను."     "మీరు వినరని నాకు తెలుసు... అందుకని ఉత్తరం పట్టుకువచ్చాను" అంటూ తాంబూలంతో ఎర్రగా పండిన పెదాలను కొంచెంగాకదిలించి నవ్వుతూ జాకెట్లోంచి ఓ కవరుతీసి యిచ్చింది. అందిస్తూ "చదువుతారా? చింపేస్తారా?" అన్నది.                             
24,321
    రంగనాయకులు సమాధానం ఏమి చెప్పలేదు.     "మీరు చెప్పకపోయినా నాకు తెల్సు. ఆ శివరావుగాడి గురించే కాదూ?..."     "అవును... వాళ్ళ నాన్న వీరాస్వామి..." ఎదో చెప్పబోయాడు రంగనాయకులు  కాని చిట్టబ్బాయి మధ్యలోనే అడ్డు తగిలాడు.     శివరావు తండ్రి పేరు వీరాస్వామి కానే కాదు... అంతేకాదు. అతని తండ్రి ఏనాడో మరణించాడు... ఈ శివరావు మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు... అంతేనా?"     రంగనాయకులు తెల్లబోయి చిట్టబ్బాయి వంక చూశాడు.     "రజ్జూ...నాకు తల దిమ్ముగా ఉంది... కాస్త కాఫీ తీసుకురావా?" అడిగాడు చిట్టబ్బాయి చిన్నమ్మాయ్ వంక చూస్తూ.     చిన్నమ్మాయి లోపలికి వెళ్ళింది.     ఆమె  అలా లోపలికి  వెళ్ళగానే చిట్టబ్బాయి కన్నారావుకి స్తెగా చేశాడు. కన్నారావు    జేబులోంచి కవరు తిసి రంగానాయకులుకి అందించాడు. రంగనాయకులు ప్రశ్నార్ధకంగా ఇద్దరి వంకా చూశాడు.     "అందులో ఫోటోలు ఉన్నాయ్.. .చూడండి..." అన్నాడు చిట్టబ్బాయి.     రంగనాయకులు కవరులోని ఫోటోలు తిసి చూశాడు. అంతాని మొహంలో చుక్క రక్తం లేదు.     "ఈ ఫోటోలు మికెలా వచ్చాయి?"     అలా అడుగుతున్నప్పుడు అతని గొంతు వణికింది.     "మీ అమ్మాయే ఇచ్చింది..." జవాబు చెప్పాడు కన్నారావు.     "ఈ ఫోటోలు చూస్తుంటే తప్ప  నాకు నమ్మకం కలగడం లేదు...అసలు ఇలా  నేనేనా చెయ్యగలిగింది అని" బాధపడ్తూ అన్నాడు రంగనాయకులు.     "మీరు అనుకుంటున్నట్లు ఆ ఫోటోలోని అమ్మాయి చనిపోలేదు...ఆమె బ్రతికే ఉంది... ఆ శివరావు ఫోటోలు  అడ్డుపెట్టుకుని మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు..." అన్నాడు చిట్టబ్బాయి.     "నిజంగానా!...." కళ్ళు ఇంతింత చేస్కుని చూస్తూ అన్నాడు రంగనాయకులు.     "అవును సార్... ఆ అమ్మాయిని నేను రెండ్రోజుల క్రితం చూశాను..."చెప్పాడు కన్నారావు.     "అసలు నేననుకోవడం ఆ అమ్మాయి పక్కన పడుకోడం కూడా మీకు తెలీకుండానే ఉండాలి!" అన్నాడు చిట్టబ్బాయి.     "అవును! దరిద్రం సంత... నాకప్పుడు మ్తెకంగా ఉంది..." అన్నాడు రంగనాయకులు ఎదో గుర్తు చేస్కుంటున్నాట్టు.     "అసలు ఏం జరిగిందో వివరంగా చెప్తారా?... అసలు ఈ శివరావుకి మీకూ ఎలా పరిచయం?' కుతూహలంగా అడిగాడు చిట్టబ్బాయి.     రంగనాయకులు చటుక్కున ఫోటోలు చొక్కా జేబులో పెట్టేసుకున్నాడు. ఫోటోలు చూస్తుండగా రంగనాయకులు ఇబ్బందిగా ఫిలవకూడదనే చిట్టబ్బాయి కాఫీ పేర్తో చిన్నమ్మాయిని లోపలికి పంపించాడు.     అందరూ కాఫీ కప్పలు అందుకుని తాగారు.     "ఊ...ఇప్పుడు చెప్పండి... అసలేం జరిగింది" కప్పు పక్కన పెడ్తూ అడిగాడు చిట్టబ్బాయి.     రంగనాయకులు కూతురు వంక ఇబ్బందిగా చూశాడు.     "చెప్పనాన్నా..."     రంగనాయకులు గొంతు సవరించుకుని చెప్పడం ప్రారంభించాడు.     "మా కం స్ట్రక్షన్ కంపెనీలో శివరావు ఇదివరకు మేనేజర్ గా పనిచేసేవాడు. అతని ప్రవర్తన మీద నాకు చాలా కంప్ల్తేంట్స్  వచ్చేవి, అమ్మాయిలతో మిస్  బిహేవ్ చేసేవాడని. ఒకట్రెండుసార్లు అతన్ని పిలిచి వార్నింగ్ ఇచ్చాను. ఒకసారి కంపెని అక్కౌంట్స్  చెకింగ్ చేస్తుంటే నాకు అనుమానం వచ్చింది వాడు దొంగ లెక్కలు వేసి కంపెని సొమ్ము కాజేస్తున్నాడేమొ అని. ఇంక ఈ దిక్కుమాల్ని సంతని కంపెనీలో ఉంచుకుంటే లాభంలేదని వాడిని ఉద్యోగం  లోంచి తిసేశాను."     చెప్పడం ఆపి ముగ్గురి వంకా చూశాడు రంగనాయకులు.     "ఊ... తరువాత?" చిట్టబ్బాయి కుతూహలంగా ప్రశ్నించాడు.     "కొన్ని రోజులు తరువాత శివరావు నాకు ఫోన్ చేశాడు. తను కంపెని సామజము చాలా తక్కువ మొత్తం తిన్నాడని, నా కంపెని మరొకడు తిన్నాడని...     వాడు చాలా తినేస్తున్నాడని చెప్పాడు. ఎవరు వాడని అడిగాను నేను. ఫోన్లో కంటే పర్సనల్ గా వస్తే వివరాలన్నీ రుజువుల్తో సహా చూపిస్తానని చెప్పాడు... నేను చిక్కడపల్లిలోని వాళ్ళింటికి వెళ్లాను..."     చిన్నమ్మాయి, చిట్టబ్బాయి, కన్నరావులు చెవులు రిక్కించి రంగనాయకులు చెప్పేది వినసాగారు.                                                                         23     చిట్టబ్బాయి,కన్నారావుల్ని చూడగానే ప్రేమానందం చెవుల్దాకా నవ్వాడు.     "రండి... రండి... అప్పుడు నేను జెప్పిన సలహాలేమి క్లిక్ కాలేదా? జంటలుగా నా దగ్గరికి రాకుండా ఇద్దరే వచ్చారు?... మరేం ఫర్లేదు. నా దగ్గర ఇంకా చాలా చిట్కాలున్నాయి... ఈసారి తప్పకుండా ప్రేమలో పది పోతారు..." అన్నాడు హుషారుగా.     "ఆ ఏం పడడంలెండి గురూజీ..." నిర్సంగా అన్నాడు చిట్టబ్బాయి.     "ఏం నయానా అలా అంటున్నావ్?" కళ్ళు పెద్దవి చేసి అడిగాడు ప్రేమానందం.     "నిర్సం కాకుండా మరేంటి?... ఊర్లోని ఆడపిల్లల్ని మీరు మాదాకా రానిస్తారా అసలు?" అన్నాడు కన్నారావు నిఘ్టరంగా.     "ఏంటి నాయనా భలే గమ్మత్తుగా మాట్లాడుతున్నావ్?"     "గమ్మత్తేనండి మరి... యవ్వనంలో ఉన్న మమ్మల్ని కాకుండా అమ్మాయిలు మిమ్మల్నేందుకు ప్రేమిస్తారో..." అన్నాడు చిట్టబ్బాయి.     "నాకంతా గందరగోళంగా ఉంది నాయనా... మీరు మాట్లాడుతున్నాది ఒక్క ముక్క కూడా నాకు అర్ధంకావడం లేదు." అయోమయంగా ఇద్దరి వంక చూస్తూ అన్నాడు ప్రేమానందం.     "అదే గురూజీ... రాజీ అనే అమ్మాయి మీకు తెలుసు కదా..."     చల్లగా అన్నాడు కన్నారావు.      "ఆ అమ్మాయికి మేము ల్తెనేద్దమనుకుంటే ఆమేమో మిమ్మల్ని ప్రేమిస్తుంది..."     రాజీ పేరు వినగానే ప్రేమనందంలో కంగారు బయలుదేరింది.     "రోజియా?... రాజీ ఎవరు నాయనా?... ఆ పేరే నేనెప్పుడు వినలేదే...హిహి... నిజంగా నాయనా...హి.." నవ్వాలని ప్రయత్నిస్తూ అన్నాడు ప్రేమానందం. అతని మొహంలో టకటకా రంగులు మారిపోసాగాయి.     "ఎందుకు గురుజి అలా కంగారు పడ్తున్నారు?" ప్రేమనంధం మొహంలోకి సూటిగా చూస్తూ అడిగాడు చిట్టబ్బాయి.     "కంగారా?.. నాకా?.. ఎందుకూ?.. నేనేం కంగారు పడట్లేదుగా... నేను నవ్వుతున్నాగా...హిహి.."అన్నాడు ప్రేమానంధం మరింతగా కంగారు పడ్తూ.     "ఇంతకి మీకు  రాజీ తెలిదా గురూజీ?" కన్నారావు అడిగాడు.     "నాకు తెలీదని ఎన్నిసార్లు చెప్పాలి నాయనా..." నేత్తికొట్టుకుంటూ అన్నాడు ప్రేమనంధం.     "బుకాయించొద్దు గురూజీ, నేను మిమ్మల్ని రోజితో ఇందిరాపార్కులో చూశాను.     "ఏమో నాయనా! మీరు ఎవర్ని చూసి ఎవరని అనుకున్నారో... నాకు బయటికి వెళ్లే  పనుండి నాయనా" లేవబోతూ కంగారుగా అన్నాడు ప్రేమనంధం.     "మేం వెళ్తాంగాని ఓసారి ఈ పోటోచూడు గురూజీ" కన్నారావు జేబులోంచి ఫోటో తిసి ప్రేమనందానికి అందించాడు.     ఆ ఫోటో చూడగానే ప్రేమనంధం  అదిరిపడ్డాడు.     అది రోజీ రక్తపు మడుగులో పడివున్న ఫోటో.     "ఆ!!రోజీ చాచ్చిపోయిందా? ఎవరు చంపారు?" ఒణికిపోతూ అన్నాడు.     "రోజీ ఎవరో తెలీదని చెప్పి ఫోటో లోని  రోజిని ఎలా గుర్తుపట్టారు గురూజీ" చిట్టబ్బాయి నావ్వుతూ అడిగాడు.     "అదా అది, మిరిందాకట్నుండి రాజీ రాజీ అంటున్నారు కదా... అందుకనే ఫోతోలోనిది ఆ అమ్మాయేమోనని గెస్ చేశాను" తడబడ్తూ అన్నాడు ప్రేమనంధం.
24,322
                                 తొంబది మూడవ సూక్తము         ఋషి - వసిష్ఠుడు, దేవత - ఇంద్రాగ్నులు, ఛందస్సు - త్రిష్టుప్.     1. వృత్రఘ్న ఇంద్రా ! అగ్నీ ! ఈనాటి నాస్తోత్రము పరిశుద్ధము నవోత్పన్నము. దీనిని మీరు స్వీకరించండి. మీరు సుఖముగ పిలువ తగినవారు. నేను మిమ్ము మరల మరల పిలుస్తాను. యజమాని మిమ్ము అభిలషించును. అతనికి వెంటనే అన్నము ప్రదానము చేయండి.     2. ఇంద్రాగ్నులారా ! మీరు విధిపూర్వకముగ పూజనీయులు. మీరు బలిభూతము వంటి శత్రుభంజకులుకండి. మీరు ఒకేసారి పెంపొందువారు. విశేష ధనవంతులు. అన్నములకు ఈశ్వరులు. మీరు దృఢమును శత్రువినాశకమగు అన్నము మాకు ప్రసాదించండి.     3. హవివంతులు, క్రుపాభిలాషులగు విప్రులు అనుష్ఠానముతో యజ్ఞలబ్ది పొందుదురు, అట్టి నేతలగు జనులు అశ్వము యుద్ధభూమిని వ్యాప్తము చేసినట్లు ఇంద్రావరుణుల కర్మములకు వ్యాప్తికలిగింతురు. వారిని మాటిమాటికి పిలుతురు.     4. ఇంద్రాగ్నులారా ! విప్రులు మీ కృపార్థులు. యశోవంతులు. తొలుత అనుభవించదగిన ధనము కొఱకు స్తోత్రములతో మిమ్ము స్తుతిస్తారు. నూతనము, దానయోగ్యమగు ధనముతో మమ్ము వర్థిల్లచేయండి.     5. విశాలములు, పరస్పర యుద్ధము చేయునవి, యుద్ధమందు ప్రయత్నశీలములగు ఉభయ సేనలను మీ తేజస్సుతో ఎల్లప్పుడు నష్ట పరుస్తుండండి. సోమాభిషవకర్త, దేవాభిలాషి యజమాని సాయమున దేవాభిలాష లేనివారిని నాశనముచేయండి.     6. ఇంద్రావరుణులారా ! మంచి మనసునకుగాను మీరు మా సోమాభిషవ కర్మకు విచ్చేయండి. మీరు మమ్ము గాక ఇతరులను ఎరుగరు. అందువలన చాల అన్నముతో మిమ్ము ఆహ్వానించుచున్నాము.     7. అగ్నీ ! నీకు ఈ అన్నమున సమిద్దుడవగుము. ఇంద్రుడు, మిత్రుడు, వరుణునకు ఇది రక్షణీయమని చెప్పుము. మేము చేసిన అపరాధములనుండి మమ్ము రక్షింపుము. ఆర్యమ, అదితి సహితము అట్టి మా అపరాధమును తొలగించవలెను.     8. అగ్నీ ! శీఘ్రముగ ఈ యజ్ఞమును ఆశ్రయింపుము. మా అందరకు ఒకేసారి నీ అన్నము లభించవలెను. ఇంద్ర, విష్ణు, మరుద్గణములు మమ్ముకాక ఇతరులను చూడరాదు. "యూయంపాత స్వస్తిభిః సదానః"                                 తొంబది నాలుగవ సూక్తము         ఋషి - వసిష్ఠుడు, దేవత - ఇంద్రాగ్నులు, ఛందస్సు - జగతి, చివరిది అనుష్టుప్.     1. ఇంద్రాగ్నులారా ! మేఘము నుండి వర్షమగునకదా, అట్లే ఈ స్తోతనుండి ప్రధానమగు స్తుతి కలిగినది.     2. ఇంద్రాగ్నులారా ! మీరు ఈశ్వరులు. స్తోత పిలుపు వినండి. అతని స్తుతిని భోగించండి. అనుష్ఠిత కర్మను పూర్తిచేయండి.     3. నేతలగు ఇంద్రాగ్నులారా ! మమ్ము హీనభావము, పరాభవము అను నిందలలోనికి త్రోయకండి.     4. రక్షణలు కోఱిన మేము విశిష్ఠహవ్యము, సుందర స్తుతి, కర్మయుక్త వచనములను ఇంద్రాగ్నులవద్దకు పంపుదుము.     5. రక్షణల కొఱకు విప్రులు ఇంద్రాగ్నులను స్తుతింతురు. బాధలందు ఉన్నవారుకూడ అన్నప్రాప్తి కొఱకు స్తుతింతురు.     6. మేము స్తోత్రాభిమానులము. అన్నవంతులము. ధనాభిలాషులము. యజ్ఞప్రాప్తికొఱకు మిమ్ము స్తుతింతుము. ఆహ్వానింతుము.     7. ఇంద్రాగ్నులారా ! మీరు మానవులను సృష్టించువారు. మావద్దకు మీరు అన్నసహితులైరండి. కఠినవాక్కులాడువాడు మాకు ప్రభువుకారాదు.     8. ఇంద్రాగ్నులారా ! మాకు ఎటువంటి శత్రువుయొక్క హింస కలుగరాదు. మాకు సుఖములను ఇవ్వండి.     9. ఇంద్రాగ్నులారా ! మీవద్ద గోవులు, అశ్వములు, హిరణ్యయుక్త్ ధనమున్నది. మేము దానిని యాచించుచున్నాము. అది మా అనుభవమునకు రావలెను.     10. కర్మ నేతలు సోమము అభిషవింతురు. సేవాభిలాషులు అగుదురు. అశ్వములుగల ఇంద్రుని అగ్నిని తేప తేప పిలిచెదరు.     11. అందరిని మించిన వృత్రహంత, ఆనందమగ్నుడు ఇంద్రుని, అగ్నిని మేము ఉక్థము స్తోత్రము, అన్యస్తవములతో సేవింతుము.     12. ఇంద్రాగ్నులారా ! దురాలోచనపరులను దుష్టజ్ఞానవంతులను, దుష్టబలవంతులను చోరులను కుండలను బ్రద్దలు కొట్టినట్లు కొట్టండి.                                 తొంబది ఐదవ సూక్తము           ఋషి - వసిష్ఠుడు, దేవత - సరస్వతి, ఛందస్సు - త్రిష్టుప్.     1. సరస్వతి లోహనిర్మిత పురివలె ధారయిత్రి అగును. ఆమె జీవనదారక జలముతో ప్రవహించును. ఆమె తన మహిమతో సారథివలె ఇతర నదులను బాధించుచు సాగును.     2. ఒకే సరస్వతి నదులలో పవిత్ర. పర్వమునుండి సాగరమువరకు సాగునది. ఆమె నహుషుని ప్రార్థన విన్నది. నహుషునకు ఎంతో ధనము ఇచ్చినది. అతని కొఱకు ఘృత, దుగ్ధధారలు పారించినది.     3. సరస్వతి మానవ శ్రేయస్సు కొఱకు వర్షము కలిగించు సమర్థురాలు. ఆమె పుట్టుకతో శిశువు. యజ్ఞములందు యోషిత. జలముల మధ్య పెరిగినది. ఆమె హవిష్మంత యజమానికి బలశాలి అగు పుత్రుని ఇచ్చును. లాభము కలిగించి అనేకుల సంస్కరించును.     4. సరస్వతి శోభన ధనములు కలది. ఆమె ప్రసన్నురాలు కావలెను. యజ్ఞమునకు రావలెను. స్తుతులు వినవలెను. పూజనీయులగు దేవతలు తలలువంచి ఆమె దగ్గరకు వెళ్లుదురు. సరస్వతి నిత్యధనవంతురాలు. తన సఖుల విషయమున దయామయి.     5. దేవీ సరస్వతీ ! మేము ఈ హవ్యమును హవనము చేసి నమస్కరించి నీవద్దనుండి ధనము అందుకుందుము. మా స్తుతిని స్వీకరించుము. మేము నీకు అత్యంత ప్రియమగు గృహమున ఉందుము. ఆశ్రయించిన వృక్షమువలె నీవద్దనే నిలుతుము.     6. సుధన సరస్వతీ ! ఈ వసిష్ఠుడు యజ్ఞద్వారములు తెరుస్తాడు. శుభ్రవర్ణదేవీ ! సాగుము. స్తోతకు అన్నము అందించుము. "యూయం పాత స్వస్తిభిః సదానః"                                 తొంబది ఆరవ సూక్తము     ఋషి వసిష్ఠుడు, దేవత - సరస్వతి, ఛందస్సు - 1,2 బృహతి, 3 ప్రస్తారపంక్తి, మిగిలినవి గాయత్రి.     1. వసిష్ఠా ! సరస్వతి నదులలో బలవతి. ఆమె కొఱకు బృహత్ స్తోత్రములు పాడుము. ద్యావాపృథ్వులందు వర్తించు సరస్వతినే నిర్దోష స్తోత్రములతో పూజింపుము.     2. శుభ్రవర్ణ సరస్వతీ ! నీ మహిమ వలననే మానవుడు దివ్య పార్థివ అన్నములను పొందుచున్నాడు. నీవు మమ్ము గ్రహింపుము. రక్షింపుము. మరుత్తుల సఖివై హవిర్దాతలకు ధనమంపుము.     3. శుభంకరీ సరస్వతీ ! నీవు శుభములు మాత్రమే సమకూర్చుము. సుందర గమనవగుము. అన్నవతిని అగుము. మాకు ప్రజ్ఞ కలిగించుము. నేను జమదగ్నివలె నిన్ను స్తుతించుచున్నాను. నీవు వసిష్ఠ స్తూయమానవగుము.      4. మేము స్త్రీలను పుత్రులను కోరుకొను దాతలము స్తోతలము. మేము సరస్వతిని స్తుతించుచున్నాము.     5. సరస్వాన్ ! నీవద్ద రసవంతములగు జలసమూహములు వర్షజలములు ఉన్నవి. వానితో మమ్ము రక్షింపుము.     6. ప్రవృద్ధ సరస్వతి స్తవమువంటి మధుధారలు మాకు అందవలెను. ఆమె సర్వదర్శనీయ మేము ప్రజ్ఞయు అన్నమును పొందవలెను.                                       తొంబది ఏడవ సూక్తము    ఋషి - వసిష్ఠుడు, దేవత - బ్రహ్మణస్పతి, బృహస్పతి, ఛందస్సు - త్రిష్టుప్.     1. సేవాభిలాషి నేతలు ఉన్మత్తులయిన యజ్ఞమున భూలోకనేతలు సమస్త సోమము ఇంద్రుని కొఱకు అభిషవించు యజ్ఞమున ఆ యజ్ఞమునకే హృష్టుడగుటకుగాను ఇంద్రుడు తొలుతరావలెను. నడకలుగల అశ్వములుకూడ రావలెను.     2. మిత్రులారా ! మేము దేవతల రక్షకుగాను ప్రార్థించుచున్నాము. బృహస్పతి మా హవ్యములు స్వీకరించవలెను. దూరదేశమునుండి ధనముతెచ్చి తండ్రికొడుకుకు ఇచ్చును. అట్లే బృహస్పతి మాకు దానము చేయును. కోరికలు తీర్చు బృహస్పతివద్ద మేము అపరాధులము కారాదు. ఆరీతి చేయకుము.     3. బ్రహ్మణస్పతి జ్యేష్ఠుడు. సుందరుడు. సుఖవంతుడు. మేము అతనికి నమస్కరింతుము. హవ్యములిత్తుము. స్తుతింతుము. దేవకృత మంత్రములకు ప్రభువగు ఇంద్రుని బ్రహ్మణస్పతిని శ్లోకములతో స్తుతించండి.     4. ఈ ప్రియతమ బ్రహ్మణస్పతి మా ఈ వేదిమీద ఆసీనుడు కావలెను. అతడు అందఱకు వరణీయుడు. మేము ధనము శోభన వీర్యము కోరియున్నాము. బ్రహ్మణస్పతి వానిని తీర్చవలెను. మేము చిక్కులలో చిక్కుకున్నాము. అతడు మమ్ము అహింసితుడయి దాటించవలెను.     5. అమర దేవగణములు తొలుత ఆవిర్భవించినారు. వారికి ఇష్టమైనదియు పూజాసాధనమగు అన్నము మాకు అందవలెను. శుద్ధ స్తోత్రవంతుడు, గృహస్థుల యజ్ఞయోగ్యుడు, అప్రతిగత బృహస్పతిని మేము పిలుచుచున్నాము.     6. సుఖకర, రుచికర, వహనశీల, జ్యోతిష్మంత అశ్వగణములు బృహస్పతిని వహించవలెను. బృహస్పతికి బలము నివాసమునకు గృహము ఉన్నవి.     7. బృహస్పతి పవిత్రుడు. అతని వాహనములు అనేకములు. అతడు అందరిని శోధించువాడు. హితకరము. రమణీయమగు విద్యావంతుడు. అతడు గమనశీలుడు. స్వర్గభోక్త, దర్శనీయుడు. ఉత్తమ నివాసవంతుడు అతడు స్తోతలకు అందరికన్న మిన్నగా అన్నము ఇచ్చును.     8. బృహస్పతి జనని దేవి ద్యావాపృథ్వి తన మహిమల బలముతో బృహస్పతిని వర్థిల్లచేయవలెను. మిత్రులారా ! వర్ధనీయ బృహస్పతిని వర్థిల్లచేయండి. అతడు మరింత అన్నమునకుగాను జలరాశిని సులభముగా దాటునట్లును సుఖముగ స్నానము చేయునట్లు చేయగలడు.     9. బ్రహ్మణస్పతీ ! నీ కొఱకును వజ్రధారి ఇంద్రుని కొఱకును నేను మంత్రరూప సుందర స్తుతులు రచించినాను. మీరిద్దరు మా అనుష్ఠానములను రక్షించండి. అనేక స్తుతులు వినండి. మేము మీ భక్తులము. మమ్ము ఆక్రమించదలచిన శత్రు సేనను నష్టపరచండి.     10. బృహస్పతీ ! నీవు, ఇంద్రుడు దివ్య, పార్థివ ఉభయ ధనములకు ప్రభువులు, అందుకే స్తోతలకు ధనము ఇచ్చెదరు. "యూయం పాత స్వస్తిభిః సదానః"                                   తొంబది ఎనిమిదవ సూక్తము                    ఋషి - వసిష్ఠుడు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - త్రిష్టుప్.     1. అద్వర్యులారా ! ఇంద్రుడు మానవశ్రేష్ఠుడు. అతని కొఱకు రుచికరమగు అభిషుత సోమపు హవనము చేయండి. ఇంద్రుడు సోమము దూరముగా ఉన్నదని, అది పానయోగ్యమని తెలియును. గౌరమృగము కన్న వేగముగా అభిషవము చేయు యజమానిని వెదకుచు మరల మరల వచ్చును.     2. ఇంద్రా ! పూర్వకాలము నీవు శోభన సోమమును సేవించినావు. ఇప్పుడు కూడ ప్రతినిత్యము అట్టి సోమమునే సేవించవలెననుకొనుము. హృదయమునందును, మనమునను మమ్మే నిలిపి నీముందట సమర్పించిన సోమమును సేవించుము.     3. ఇంద్రా ! నీవు పుట్టుకతోనే బలము కలుగుటకుగాను సోమపానము చేసినావు. నీ తల్లి అదితి నీ మహిమలు తెలియపరచినది. నీవు విస్తృత అంతరిక్షమును నీ తేజస్సుతో నింపినావు. యుద్ధము చేసి దేవతల కొఱకు ధనము పుట్టించినావు.     4. ఇంద్రా ! నీవు మాననీయులు, అభిమానధనులగు శత్రువుతో యుద్ధము చేయించినపుడు మేము బాహుబలమున వారిని పరాజితులను చేసెదము. అట్లుకాక మరుత్తులతో కూడి నీవు స్వయముగా యుద్ధమున దిగినచో అన్నముకొఱకగు ఆ యుద్ధమున మేము గెలువగలము.     ("సాక్షామ జయేమ" అను రెండు పదములు ప్రయోగించినాడు. సాక్షామ అనగా సహించగలము. ఓడించగలమని అర్థము, ఎదుటివారి ఓటమి మాత్రము తనజయముకాదు. కావున జయేమ జయింతుము అన్నాడు.)
24,323
    ముక్కాలి పీటమీద ఉన్న దీపం పాక నలువైపులా కాంతి వ్యాపింపజేస్తోంది. మాసిన దుప్పటి పరిచిన మంచంమీద కూర్చుని శాయి మద్యం తాగుతున్నాడు. అతని కళ్ళు ఎర్రగా, చింతనిప్పుల్లా, ఉన్నాయి. జుట్టు చిందరవందరగా చెదిరి ఉంది. దుస్తులు నలిగి ఉన్నాయి. పాము కాటు తిన్నదానిలా అదిరిపడి, గభాలున లేచి నిల్చుంది వేదిత.     శాయి ఏమీ జరగనల్టు ఆమెవంక తన మండే కళ్ళతో చూస్తూ "ఏం చెయ్యను చెప్పు? చివరికీ పాడుపని చేయాల్సి వచ్చింది. ఈ రోజు యిలా జరగాల్సి ఉందని నీ దేవుడు మన జాతకాల్లో రాశాడు. ఇది వొట్టి అడవి. నేను అడవి మనిషిని" అన్నాడు.     వేదిత శరీరమంతా కోపంతో, అసహ్యంతో ఉడుకెత్తిపోయింది. ఆ సమయంలో ఆమెకు ఎందులోనన్నాపడి చావాలనిపించింది. "చివరకు నువ్వు యింత నీచానికి ఒడిగట్టావా శేషబాబూ!" అంది అసహ్యంగా అతనివంక చూస్తూ.     "శేషబాబూ! నువ్వలా పేరు పెట్టి పిలుస్తోంటే నాకెంత ఆనందంగా ఉంది" అని శాయి ఆమె ముఖంలోకి చూస్తూ, తాగుతున్న గ్లాసు క్రింద పెట్టి లేచి నిలబడ్డాడు. అతని వళ్ళు తూలి క్రిందపడబోయి సర్దుకున్నాడు. అతని శరీరం అతనికి చాలా భారంగా తోచింది. కష్టంమీద తనని తాను నిలద్రొక్కుకుంటూ "నిన్ను అంతా అమ్మా అని పిలుస్తారు. మా సీత అక్కా అంది. నేను వేదితా అని పిలుస్తాను. నువ్వు నా స్నేహితురాలివి. ప్రియురాలివి.నా...."     "ఛీ!" అని ఆమె అతన్ని విదిలించి వేసింది. "నువ్వు మూర్ఖుడివి, పాపివి, దుర్మార్గుడివి. రాక్షసుడివి ."     "అవును. అవన్నీ నేనే. నేనే అవన్నీ అని ఒప్పుకుంటున్నాను. కాని వేదితా! నీకు నిందించటం తెలుసుగాని, పనికిమాలిన ఆ దేవుడ్ని ప్రార్థించటం తెలుసుగాని, ఒక తోటి మానవుని గుండెను చదవటం తెలుసా? నా గుండెల్లో దూరి, నరాల్లోకి దూకి చూడు ఏమంటున్నాయని? వేదితా! వేదితా! అని అలమటిస్తున్నాయి. ఈ లోకంలోలేని అందాలు నీలో దాచుకున్నప్పుడు నిన్ను ప్రేమించటం నా తప్పు ఎలా అవుతుంది? నువ్వే చెప్పు."     వేదిత కష్టంమీద అతనిమీద కలిగిన కోపాన్నీ, అసహ్యాన్నీ దిగమ్రింగుకుంది. బలవంతంగా తనని తాను శాంతపరుచుకుని "శేషబాబూ! నువ్వు అజ్ఞానంలో ఉన్నావు. నీకు ఉన్నత విద్య ఉంది. గుణవతి అయిన భార్య వుంది. అయినా కూడా ప్రలోభంలోపడి కొట్టుకుపోతూ వళ్ళెరగకుండా ఉన్నావు. కామంతో నీ కళ్ళు మూసుకుపోయాయి. వ్యామోహం అనేది ఓ భ్రమ. ఆ భ్రమ అనే పొద నీ మనసు చుట్టూ క్రమ్మివేసింది. కోరిక కలిగింది కదాని ప్రతి వస్తువునూ ఆశించటం అవివేకం. మనం కోరిన ప్రతీదీ మనకు జీవితంలో లభించదు. ఆవ్యక్తపు కోరికను నిర్ధయంగా త్రుంచివేస్తూ ఉత్తమ లక్ష్యాన్ని చేపట్టి ముందుకు నడవటమే జీవిత ధ్యేయం" అన్నది ఆర్థ్రస్వరంతో.     "ఎంత తేలిగ్గా చెప్పావు?" అన్నాడు శేషుశాయి. నిట్టూర్చి. "మన అన్ని కోరికలనూ త్రుంచివేసుకోగలమా? ఇదేమన్నా సామాన్యమైన కోరికా? ఆనాడు దేవాలయంలో నిన్ను కౌగిట బంధించటమే నీకు తెలుసు. ఈనాడు నిద్రలోవున్న నిన్ను తట్టి బలవంతంగా తీసుకురావటమే  నీకు తెలుసు కాని ఈ కోరిక వెనుక ఎంత చిత్రవధకు ఈ జీవి గురి అయినదీ, ఎంత ఆవేదన దాగివుందీ, ఎంత విషాద మనస్తత్వం, సంఘర్షణ అణిగివుందీ నీకు తెలియదు.ఈ తీర్పు నేను తీసుకోవటానికి ఎన్ని రాత్రింబవళ్లు ఎంత  మధనపడి, హింసకు గురి అయానో నీకు తెలియదు. వేదిత! కళ్ళు మూసుకుంటే అంతా చీకటిగా ఉంటుంది. అలాగే ఏకాగ్రతగా ఉంటే ఆ కారు చీకటిలోంచి సన్నని కాంతిరేఖ ఆవిర్భవించి ,పెద్దదై మరింత పెద్దదై కనులముందు జ్యోతిలా వెలుగుతుంది. ఆ కాంతి రేఖలే నువ్వు! ఆ జ్యోతివే నీవు వేదితా! నా నరనరానా నీ పిచ్చి ఆవహించింది. నా రక్తంలోని ప్రతి అణువులోనూ నీ వ్యామోహం ఆక్రమించింది. నిండా నీ రూపమే ఆవరించింది. నిన్ను ఎలా మరిచిపోను? నీవు లేకుండా ఎలా బ్రతకను? నీ పొందుకోసం, ప్రేమకోసం విరహంతో, తాపంతో మగ్గి మగ్గి నా శరీరం పరవళ్ళు తొక్కుతోంది వేదితా. నీది విరగబూచిన యవ్వనం. నా కోసం పెరిగిన అందం ఈ శుష్క పూజలతో, వ్యర్థ ప్రార్థనలతో లోకుల మన్ననకోసం ఎందుకు వ్యర్థం చేసుకుంటావు? నీ యవ్వనం ఉడిగిపోయాక, నీ శరీరం ముడతలతో నిండిపోయాక పశ్చాత్తాపంతో నువ్వు కుమిలిపోతే నీ దేవుడు ఆరుస్తాడా తీరుస్తాడా? వేదితా! ఈ భగ్న హృదయుని అంతర్గత వేదన అర్థం చేసుకో. నన్ను కృతార్థుడ్ని చెయ్యి."     ఆమె ఊహించనంత వేగంతో, అతను ఆకస్మికంగా ముందుకు వచ్చి ఆమె పాదాలముందు మ్రోకరిల్లాడు. చేతుల్తో ఆమె సుందరమైన పాదాలను తాకాడు.     వేదిత గభాలున పాదాలను వెనక్కి లాక్కుంది. "ఏమిటీ ఉన్మాదం శేషుబాబు!" అంది కంపిత స్వరంతో.     శాయి ముందుకు జరిగి ఆమె మోకాళ్ళను తన చేతుల్తో చుట్టేశాడు. "వేదితా! నన్ను కరుణించు. నాకు నీ ప్రేమభిక్ష పెట్టు" అని అర్థించాడు.     వేదిత క్రిందికి వంగి బలవంతంగా అతని పట్టు విడిపించుకుని దూరంగా జరిగింది. ఆమెలో ధైర్యం, శాంతం, మనోనిబ్బరం అన్నీ అంతరించి పోయాయి. విహ్వల దృష్టితో అతనివంక చూస్తూ "ఛీ! ఎంత అసహ్యం? నువ్వు ప్రేమ అనుకుంటున్నది ప్రేమకాదు శేషుబాబూ! నీలోని మనోవికారం, నీలోని పైశాచిక ప్రవృత్తికి మారుపేరు పెట్టి నిన్ను నువ్వు ఆత్మవంచన చేసుకోకు శేషుబాబూ! ఈ స్థితిలో నా మనుగడే అత్యంత ప్రమాదంగా పరిణమించింది. స్వచ్ఛందంగా, నిష్కంటకంగా తిరిగే నా శరీరంమీద నీ మోహపు దృక్కులు ప్రసరించబడటం నా దురదృష్టం. నా ఉనికి ఇంత హేయంగా తయారైనప్పుడు నా ప్రాణాల్ని సంతోషంగా త్యజిస్తాను. అటువంటి కోరిక కోరే బదులు నా ప్రాణాలు తీసుకో శేషుబాబూ! ఈ భూమ్మీద నేను లేకుండా చెయ్యి" అన్నది.     శాయి నేలమీద కూర్చునివుండే ఆమెవంక దీనంగా చూస్తూ "అలా అనకు వేదితా! అలా అనకు. నువ్వు నీ గతాన్ని మరిచిపో, నీ సిద్థాంతాలను విడిచిపెట్టు నాతోరా, ఎక్కడికైనా వెళ్ళిపోదాం. మళ్లీ ఈ ఛాయలకు రావద్దు ఇప్పుడే.... ఇప్పుడే వెళ్ళిపోదాం రా" అన్నాడు.     "శేషుబాబూ!" అంది వేదిత ఓర్పు విడిచి. నేను చెప్పేది నీ తల కెక్కదు. నీ పీడనుంచి తప్పుకోవటానికైనా నేను మరో ప్రదేశానికి వెళ్ళిపోతాను. ఇహ ఇక్కడ నాకు జరగదు."     "నీ సమాధానం అదేనా?" అంటూ శాయి లేచి నిల్చున్నాడు. అతని కంఠస్వరంలో మార్పు వచ్చింది. ప్రవర్తనలో మార్పు వచ్చింది. "నేనెంత ప్రాధేయపడినా, సత్యాన్ని స్పష్టంగా చెప్పినా నీ మొండితనం మానటంలేదు వేదితా. నిజమే, నువ్వన్నట్లు నన్ను ఉన్మాదం ఆవహించింది. నువ్వు నన్ను ఎలాగు అర్థం చేసుకోవు. అందుకని ఆ అర్థాన్ని నేనే సృష్టిస్తాను". అన్నాడు.
24,324
    "ఊ! ఆయనైతే మాత్రం అంతమాట అంటే నేను వూరుకుంటానా ఏమిటి? నీ చేత 'ఊ' అనిపించుకోందే తిరిగి వెళ్ళి ఆయనగారి ముఖం చూడలేను" అని రవి ముఖంలోకి తీక్షణంగా పరికించి కొంచెం నవ్వి లాలనగా "మన హేమకు పధ్నాలుగు వెళ్లి పదిహేను వస్తున్నాయి" అంది.     "నీ ఉద్దేశం కొంచెం విడమరిచి చెప్పరాదూ?" అని రవి అన్నం తినటం మాని కనుబొమ్మలు ముడిచి స్తబ్దుగా కూర్చున్నాడు.     "అయ్యో రాత! నీ దగ్గర సిగ్గెందుకు నాయనా? హేమను "మామయ్య ఎలా వుంటాడే?" అని నేనడిగితే "పోమ్మా! నువ్వు మరీను" అని అవతలకు తుర్రుమంటుంది" అని సహేతుకంగా అతన్ని ఆసాంతం  వీక్షించి "మీరిద్దరూ ఒకరిప్రక్కన ఒకరు నిలబడితే చిలకాగోరింకల్లా వుంటారు. రేపు జ్యేష్ఠమాసంలో కావలసినన్ని ముహూర్తాలు......"     మాట ఇంకా పూర్తికాకుండానే రవి అసహ్యంతో 'ఛీ!' అని కంచం అవతలకు తోశాడు.     ఈ ఘాతము అగాధమైన హృదయంలో అన్నిమూలలూ తడిమి బలంగా తట్టగా ఆమెముఖం వెలవెలబోయింది. కానీ ఏ చాకచక్యాన్నో వినియోగించి కాస్త చిరునవ్వును అక్కడక్కడా ద్యోతకం చేసుకుని "అదికాదు తమ్ముడూ!" అని ఇంకేదో చెప్పబోయి, అది పూరించటంలో ఘోర పరాజయం పొంది, తేలిపోయి పాలిపోయిన వదనమండలాన్ని మరింత మలినపూరితం చేయగా, "అదేమిటి?" అని తడబడిన కంఠంతో గొణిగింది.     రవి "నీకు కోపం రాకపోతే చెబుతాను. ఇలా సంబంధాలు కలవాలని ఉబలాటపడతారే? హేమ పుట్టినప్పటినుంచీ నాదగ్గర ఎంతో చనువుగా పెరిగింది. అమ్మానాన్నా పోయినప్పటినుంచీ నువ్వూ చిన్నక్కే తల్లీతండ్రీ అయ్యారు. అక్కయ్య కూతుర్ని మరోదృష్టితో నేను చూడలేను."     ధైర్యం, స్థయిర్యం నశించి మ్రాన్పడి అలా చూపులు నిగుడించి వుండిపోయింది.     "అసలు ఇలాంటిమాటలు ఎలా వస్తాయో అర్ధంకాదు. నాకు చాలా బాధ కలుగుతుందని మీరెందుకు అనుకోరు?" అని విసుగుగా లేచి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు రవి.     ఆ రోజంతా సుభద్ర ఏడుస్తూ పడుకుంది. అస్పష్టంగా తనలో తాను గొణుక్కుంది.అది నిందించటమో, తూలనాడటమో, పరిహసించడమో రవి అర్ధం చేసుకునేందుకు ప్రయత్నించలేదు. కానీ ఆమె కుములుతూ, కుళ్ళుతూ పడుకోవడం అతనికేం బాగోలేదు. చీకటి పడుతూండగా ఆమె దగ్గరకువెళ్ళి "నువ్వెందుకేడుస్తున్నావో నాకర్ధంకావటంలేదు. నీ తమ్ముణ్ణి అల్లుడ్ని చేసుకోవాలనేనా?"     సాధారణంగా ఎవరికైనా సరే ఈమాట అశనిపాతమువలె తగలాలి మరి. ఆమె ఎటువంటి ఆవేదన చెందిందో, లేక ఓర్చుకుందో? మొత్తానికి పలకలేదు.     "హేమకు మంచి వరుడ్ని చూసి పెళ్ళిచేసే బాధ్యత నాది."     అప్పటికీ ఆమె పలకలేదు. చీరచెంగు ముఖంమీదకు లాక్కుని ఒక ప్రక్కన ఒత్తిగిలి పడుకొంది.     "నాతో మాట్లాడకూడదని పట్టుబట్టావా ఏం?"     ఇంకా ఆమె 'ఆ,ఊ' అనకపోయేసరికి "సరే! మా అక్కయ్య ఇట్లాంటిదని చెప్పుకుని సంతోషిస్తాను" అని నిరసనతో అక్కడినుంచి కదలబోయాడు.     అప్పుడు చప్పున ముసుగులోంచి తల ఇవతలకు పెట్టి ఆమె "తమ్ముడూ! నాకు మనస్సు ఏమీ బాగాలేదు. రేప్పొద్దున్నే వెళ్ళిపోయే సదుపాయం చూడు" అని, అతడు మెదలకుండా నిలబడేసరికి "నాకేం కోపంలేదు నాయనా! ఎవర్ని ఉద్ధరించేందుకు కనుక నా కినుక? నాకా ఈ నియమాలూ, విచిత్ర మనస్తత్వాలూ అర్ధంకావు. మీ బావగారిముందు మొహం చూపించో, చూపించకో నా అవస్థ నేను పడతాను నా ఖర్మం."     "అంత తొందరగా వెళ్ళిపోవాలా ఏం?"     పొంగి పొర్లివచ్చే దుఃఖాన్ని ఆపుకునేందుకు సతమతమవుతూ "ఇక్కడ వుండి ఈ వేదన భరించలేను. ఎన్నాళ్ళనుంచి పెంచుకున్నానో ఈ ఆశ. మరో అమాయకజీవిని కష్టపెట్టాను. నువ్వు చేసిన పని ఎన్నటికీ మరువరానిది. ఎవరిమీద వాళ్లకు అసహ్యం కలిగేటట్లు చేయటం సామాన్యమైన విషయమా?"     అతను సంకోచిస్తూ తటస్థంగా ఒక నిముషం నిలబడి తరువాత నిదానంగా వెళ్ళిపోయాడు.                                                                   6     కొన్నాళ్ళకు  రిజల్ట్సు తెలిశాయి. రవి పాస్ అయ్యాడు. శశి నెంబరుకూడా తనకు కొంచెం దూరంలో వుంది. మధ్యలోవున్న కొన్ని నెంబర్లు వికృతంగా తోచాయి. కానీ ఆ మధ్యగలవాటిలో, ఏదో స్ఫురించి ఆతృతగా చూసేసరికి అందులో చంద్రం నెంబరులేదు. చాలా విచారించాడు.     ఆగష్టు వచ్చింది. కాన్వొకేషన్ ని మద్రాసువెళ్ళాడు. ఇదివరలా ఇప్పుడతనికి గదిలేదు. సరాసరి చిన్న సూట్ కేసుతో సహా రాగిణి ఇంటికి దారితీశాడు.     ఆ సమయానికి రాగిణి కిటికీలో అద్దంపెట్టుకుని తల దువ్వుకుంటూ, తడవకు ఎంత జుట్టు రాలిపోతుందో తలుచుకుని విచారిస్తూ కూర్చుంది. వాకిట్లో బండి ఆగటంచూసి, చేస్తున్నపని ఆపి ఊచలలోంచి తొంగిచూసింది. ఆనందాతిరేకంతో ఆమె కళ్లు మెరిశాయి.     ఉసూరుమంటూ లోపలికి ప్రవేశించి మంచంమీద కూలబడ్డ రవిని "ఎప్పుడురాక?" అని సంభ్రమంతో పలకరించింది.     "ఇప్పుడే. నాకు కాఫీ కావాలి, అర్జంటుగా..."     "మీకు అర్ధరాత్రిపూట పాలు కావాలి. వేళకాని వేళల్లో కాఫీకావాలి. ఉండండి, మీ చిన్నక్కగారికి రిపోర్టుచేస్తాను."         అతను ఆశ్చర్యంతో "నేను ఇప్పుడే వచ్చానన్న సంగతి మరచిపోయావా ఏం? చాలాకాలంగా కలిసివుంటున్న దానిలా మాట్లాడుతున్నావు. భలే! మొత్తానికి అధిక్యత అంటే ఆడవాళ్ళదే."     "మొదలుపెట్టారూ సోది? మీరు ఇలానే నా ఆనందాన్నంతా పాడుచేస్తారు. ఇవాళ నా పుట్టినరోజు తెలుసా? రాత్రంతా ఏడుస్తూ కూర్చున్నాను. నా జన్మదినాన కూడా నా అన్నవాళ్ళెవరూ దగ్గరలేకుండా పోయారని. కానీ ఆ దయామయుడు నా మొర ఆలకించాడన్నమాట. అతిథి సత్కారంచేసే భాగ్యం లభించింది" అని ఆమె కాఫీ తెచ్చేందుకు లోపలకు పోబోయింది.     "అయితే నీకు నేను 'నా' అన్నవాడినే అన్నమాట!"     ఆమె సగం అల్లుకున్న జడ భుజంమీదుగా ముందుపడేటట్లు గిర్రున వెనుదిరిగి "కాదామరి?" అంది నవ్వుతూ.     అతని శరీరం ఆనందంతో రోమాంచితమైంది.
24,325
            "మీతో మాట్లాడుతూ కూర్చుంటే నాకేదో హాయిగా ఉంది" అందామె.     అతను దూరంగా చూస్తూ అంతకన్న దూరంగా ఆలోచిస్తూ "నిజానికి నేను లౌక్యుణ్ణి కాను. ఎప్పుడెలా ప్రవర్తించాలో నాకు తెలియదు. అందుకే జీవితంలో ఏమీ కూడబెట్టుకోలేకపోయాననుకుంటాను" అన్నాడు.     "అంటే" ఆసక్తిగా అడిగిందామె.     "జీవితంలో నేను పరాజయం మీద పరాజయం పొందాను. డబ్బుగాని, వసతిగాని, భార్యాపిల్లల్నిగాని ఏమీ సంపాయించుకోలేదు. అందుకే విసుగెత్తి సైన్యంలో చేరాను"     "సైన్యమా? విజయుడు కూడా సైన్యంలో చేరాడు!" అందామె సంభ్రమంగా కుర్చీనుండి లేచి.     అతను వినలేదు. తన ధోరణిలో చెప్పుకుపోతున్నాడు. "బర్మా సింగపూర్, ఇంఫాల్ రంగాలలో పనిచేశాను. కాని అక్కడ నాకు సుఖం లేదు. తుపాకిమందు వాసనా, చావులూ, యూనిఫారమూ అంతే. అసహ్యం కలిగింది. ఎలాగో అలాగ బయటపడి ఇదివరకు ఆపుచేసిన చదువుని మళ్ళీ మొదలుపెట్టాను. యం.యస్.సి చివరికంటా చదివి చదివి పరీక్షలకు కూర్చోలేదు."     "అరె! అలా చేశారెందుకు?"     "ఆ రోజున "      "ఆ రోజున పరీక్షలనగా నేనద్దెకున్న గది తాలూకా యింటావిడ అటకమీద నుంచి పడింది. తలమీద బలమైన గాయం తగిలి స్పృహతప్పి పడిపోయింది. ఆమెకు అయిదేళ్ళ పిల్ల ఒకర్తి వుంది. అస్తమానూ నా గదిలోకి వచ్చి కూర్చుని ఆడుకునేది. పాపం ఆ పిల్ల ఒకటే ఏడుపు. ఇంటావిడని ఆస్పత్రిలో చేర్చాను. డాక్టరు బతుకుతుందో బతకదో చెప్పలేమన్నారు. ఆ పిల్ల సంరక్షణ నామీద పడింది. రెండుపూటలా ఆస్పత్రికి వెళ్ళి ఆమె బాగోగులు విచారించడమూ, అమ్మ., అమ్మ అంటూ ఏడ్చే ఈ పిల్లని సముదాయించడంతో నాచదువూ, పరీక్షలూ కొండెక్కాయి."     "ఆవిడ బతికిందా?"     "బతికింది. నేనంటే ఆమెకి చాలా గురి కలిగింది. ఆమె విధవరాలు తమ్ముడిలా చూసుకుంటాననీ ఎన్నో విధాలా చెప్పింది. కాని నేను వినలేదు."     "ఇప్పుడు మీరేం చేస్తున్నారు?"     "నన్ను గురించి మీరడిగిన మొదటి ప్రశ్న యిది" అంటూ అతను నవ్వాడు. ఆమె కూడా నవ్వి "సరే చెప్పండి" అంది.     "ఒక మందులు తయారుచేసే కంపెనీలో ఉంటున్నాను. కాని ఆ ఉద్యోగమూ చెయ్యాలనిలేదు. ఒకచోటుకి వృత్తికి అంటిపెట్టుకుని ఉండడం నా స్వభావంలో లేదనుకుంటాను. జిప్సీలని ఉన్నారు చూడండి వాళ్ళుప ఊరూరా తిరుగుతుంటారు. అటువంటి ప్రవృత్తి ఏదో నాలో ఉందనుకుంటాను. ఏవిఁటో చెప్పలేను. ఈ దేశాన్నే విడిచి వెళ్ళిపోవాలని ఉంది -బర్మాకో , సింగపూర్ కో"     "వద్దు వెళ్ళకండి" అని ఆవేశంతో అందామె. చటుక్కున సిగ్గుపడిపోయింది. అతను తెల్లబోయి చూశాడు. ఆమె అర్ధంలేకుండా గబగబా వెళ్ళి కిటికీ తలుపులు తెరిచింది. చలిగాలి. కొరడా ఝళిపించినట్టుగా లోపలికివచ్చి తగిలింది.     "అబ్బ! చలి! తలుపులు వేసెయ్యండి" అన్నాడు జగన్నాథం.     "వాన చాలామటుకు తగ్గింది" అంటూ తలుపులువేసి ఆమె వచ్చి కుర్చీలో కూర్చుంది.     అతను నవ్వుతూ యిలా అన్నాడు. "ఇందాకట్నుంచీ మీరు నా ప్రశ్నకు జవాబు చెప్పకుండా దాటుకుపోతున్నారు. చెప్పండీ మీరు పెళ్ళిచేసుకోరా?"     "నన్నెవరు చేసుకుంటారు?" ఆమె నీరసంగా అంది.     "ఏం? మీకేం తక్కువ?" అన్నాడతను.     ఆమె పెదవులు వణుకుతున్నాయి. అతను గమనించలేదు. అతను మళ్ళీ రెట్టిస్తూ "ఇఁతకాలం మీరు అవివాహితులుగా ఉండడానికి ఏదేనా ప్రత్యేక కారణం ఉందంటారా! లేక మీరు అవివాహితులుగానే వుండదలచారా?" అన్నాడు.       ఆమె తన ముఖాన్ని రెండుచేతులతో కప్పుకుని "మీకు తెలియదు. మీకు .తెలియదు. మీకు తెలియకూడదు" అంటూ గబగబా గదిలోంచి వెళ్ళిపోయింది.     ఆమె వెళ్ళినవైపే నిశ్చేష్టుడై చూస్తూ వుండిపోయాడు జగన్నాథం. వెనకాలే వెళ్ళి క్షణించమని అడిగితే బావుంటుందనుకున్నాడు. కాని ఆమె వెంటపడడం కూడా పొరపాటేమో అని సందేహించాడు. ఏమీ తోచక కిటికీ తలుపులు తెరిచాడు. సన్నగా వాన పడుతోంది. దట్టంగా భయంకరంగా వుంది అవతల చీకటి. ఆకాశాన ఒక నక్షత్రం కూడా లేదు. కప్పల అరుపుల మాత్రం ఘోరంగా అసహ్యంగా వినిపిస్తున్నాయి.     తలుపులు వేసి మంచంమీద మేనువాల్చాడు. ఊరికి దూరంగా వున్న ఈకొంప దెయ్యాలకొంప కాదుకదా!అన్న ఆలోచన అతన్ని ఒక నిమేషమాత్రం భయావహుణ్ణి చేసింది. అతనికి చనిపోయిన మిత్రుడు జ్ఞాపకం వచ్చాడు. ఎందుకింత తొందరపడి, ఈ స్నేహాల్నీ అనుభవాన్ని వదులుకొని చచ్చిపోయాడు! అతని ఆత్మలాంటిది యింకా ఏదైనా భూమిమీద వుండి అతృప్తంగా తిరుగుతూంటుందా? ఇంత మిధ్యగా మోసంగా వున్న బ్రతుకులో నిజానికి ఎవరికెవరు? ఈ బాంధవ్యాల అనుబంధాల అర్ధం ఏమిటి? ఎందుకు తాను కష్టపడి ఆర్జించిన వెయ్యి రూపాయలూ చనిపోయే ఒక మిత్రునికి దాసం చేయాలని వర్షంలో, గాలిలో బయలుదేరి వచ్చాడు! విజయుడెవరు? అతని పోలికలు తనలో ఎందుకుండాలి? ప్రతి బ్రతుకునీ ఏదో రహస్యంలో చుట్టబెట్టి అగోచరమూ బలీయమూ అయిన విధి నిరంకుశంగా ఎక్కడికో తెలియని చోటికి నడిపిస్తోన్నట్టు అనిపించింది అతనికి.
24,326
    3. సంగీత జ్ఞానులకు నృత్యాంజలి         సాహిత్యవేత్తలకు  నాట్యాంజలి         సురభరత మునులకు దివ్యాంజలి             సర్వజనావళిక భక్త్యాంజలి   ||అం ||             (కూచిపూడి నృత్య సాంప్రదాయములో ప్రచారములోనుండి పలువురు నాట్యాచార్యులు నేర్పి ఆడించుచు, పదుగురు నర్తకీమణులు ప్రదర్శించుచున్న నాట్యంశములు.)                                                             ప్రార్ధన   --- శ్లోకములు          శ్లో  || అగజానన పద్మార్కమ్, గజానన మహర్నిశమ్            అనేకదంతం భక్తానాం, ఏకదంత ముపాస్మహే  ||             శ్లో  || అంఘికం  భువనం యస్యా               వాచికం సర్వవాజ్మయమ్            ఆహార్యం శ్చద్రతారాదితం            వందే సాత్వికం శివమ్             శ్లో  ||  కస్తూరి తిలకం లాలాటపలకే వక్షస్థలే కోస్తుభమ్             నాసాగ్రే నవమౌక్తికమ్, కరతలేవేణుం కారేకంకణమ్             సర్వంగే హరిచంద సంచలకమ్, కంఠేచముక్తావళి             గోపస్రీ పరివేష్టితో, విజయతే గోపాలచూడామణి  ||         శ్లో  || చతుర్భుజే చంద్రకలావాతంసే            కుచోన్నతే కుంకుమారాగశోణే            పుండ్రేక్షుపాశాంకుశ పుణ్పబాణ హస్తె            నమస్తే జగదేకమాతః ||         శ్లో  || వేణీమూలేవిరిచిత ఘనశ్యామ ఫించావచూడొ            విద్యుల్లేఖ వలయుతయుపస్నిగ్ధ పీతాంబరేణ            మామాలింగం మరకత మణి స్తంభ గంభీరబాహూ             స్వప్నేకృష్ణస్తరుణ తులసీభూషఱో నీలమేఘః ||         శ్లోక  || కాంతోయశ్యతి దూరదేశామితియే             చింతాపరం జాయతే             లోకానంద కరోహి చంవ్రదనే వైరాహితే చంద్ర                మాః | కించాయం వితనోతి కోకిల కలలాపోవి                 లాపోదయమ్  |  ప్రాణాన్నేవ హరతింహంత నితరాం             మారామమంచానిలా  "                                                  (అధ్యాత్మ రామాయణ  కీర్తనలు )                                               (రచన  :-- సుబ్రహ్మణ్య కవి)            ధన్యాసిరాగము,  అదితాళము         ప:--- నమశ్శివాయతే  -- నమోభవాయ     అ:--- నామానాధిక రహితాయ శాంతాయ స్వప్రకాశాయ             ప్రమోద పూర్ణయ భక్తోఘపాలనాయ |ఓం నమో  ||             గర్వితాడానావలోక ఖండనాయ శ్రీరాజితయ             పర్వతాగ్రనిలయామ పావనామ             సర్వలోక పాపపుంజ నిర్వాపణాయ శర్వాయ            దర్వీకర భూషణాయ సర్వోత్తమా .... య  || ఓం ||         2. అణ్ణజాదిపవాహానాయ, కాణ్ణాయమేరుశైలకో            దణ్ణయ శితకంఠాయ పందితాయ         మండిత త్రిభురాజయో --- ద్ధండ తాండవాయ         బ్రహ్మాండ నిలమాయ, మహామాయాతీతాయ  || ఓం నమో ||         3. మందహాస వదనారవింద సుందరాజయోగి         బృందానందాయ, శత్రుభీకరాయ         ఇందు సూర్యాగ్ని నేత్రాయ, వందిత ప్రధమగణాయ         నండివహనాయ పోషిత, బృందారాకయ  || ఓం నమో ||         4.నిరుపమనందఘన నిశ్చితాయ శాశ్వితాయ        వరదా భయంకరణాయ గిరీశాయ           తరుణేన్దు శేఖరాయ పరమ పురుషాయ        భావహరణాయ శ్రీకాళాహస్తిశ్వరాయ  || ఓం నమో ||         5. గజ్జాభజ్ఞ తరజ్గసజ్గతాయ జూటాజూటాయ         సంగీతలోల శుభసంగతయ         అజ్గజాం న్తరజ్గ మదభాజ్ఞాయ స్పటికోప         మజ్గూయ శేషలై లాధీశమిట్రాయ  ||ఓం నమొఅ  ||                                                                        ___ * ____                                           
24,327
     "అదేంటి జయంతి అలాగానంతున్నావు? రేపు నీకు పెళ్ళి చేసిన నువ్వు మాతోపాటేగా వుండేది?" అంది పార్వతి ఆశ్చర్యంగా.     "ఏమో! నేను ఇప్పుడప్పుడే పెళ్ళి చేసుకోదలచుకోలేదు, నేను చదువుకోవాలి. డిగ్రీ పూర్తిచేయాలి. అదే నా పట్టుదల" అంది జయంతి.     "చదివి ఏం సాధిద్దామనుకుంటున్నావ్?" అంది దాక్షాయణి.     "ఏముంటుంది మంచి ఉద్యోగం చూసుకుంటాను" అంది జయంతి.     "అమ్మో, ఉద్యోగమే! మన ఇంటావంటా లేదు. బావగారు తన్ని తగలేస్తారు" అంది పార్వతి.     "ఎందుకు? ఎంతమంది ఆడవాళ్లు చేయటంలేదు" మనకేమన్నా కొమ్ములున్నయా?" అంది జయంతి సీరియస్ గా.   "అందరి పరిస్థితి వేరు, మన పరిస్థితి వేరు" అంది దాక్షాయణి.     "ఏమో పిన్ని!~ మనకెంత ఆస్థిపాస్తులున్నా నాకు మాత్రం ఉద్యోగం చేయాలనిపిస్తోంది" అంది జయంతి.     "ఏమో తల్లీ! నీ ఆలోచనలు వింటుంటే నాకు భయమేస్తోంది అంది పార్వతి.     "భయమెందుకు పిన్ని! ఆడవాళ్ళు ఎప్పుడూ వంటింటికే పరిమితం కావాలని రూలులేదు" అంది జయంతి.     "అమ్మో జయంతి! ఏంటి ఈరోజు ఇన్ని పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నావ్?" అంది శివపార్వతి ఆశ్చర్యంగా.     "ఇవి నీకు పెద్ద మాటలేమో, నాకు చిన్న మాటలే" అంది జయంతి.     "ముందు పదవతరగతి పూర్తిచేయి తల్లీ . ఆతరువాత నీ మాటలు వింటాం" అంది దాక్షాయణి నవ్వుతూ.     "అంటే ఏంటి పిన్నీ! నేను పాసవననా నీ అనుమానం?" అంది సీరియస్ గా.     "ఛ! నా ఉద్దేశం అదికాదు. మన ఇళ్ళలో పదవతరగతి కూడా పాసవ్వని ఆడవాళ్లు వున్నారు కదా. నువే మొట్టమొదటిదానివి, మేము గర్వంగా చెప్పుకుంటాము అప్పుడు" అంది దాక్షాయణి.     "పదవతరగతికే పొంగిపోతే ఎలా? ఇంకా చదవాలసింది చాలా వుంది" అంది జయంతి.     "మాకు అదే గోప్పతల్లి! మేము అయిదో తరగతేగా" అంది శివపార్వతి దిగులుగా.     "అది మీ తప్పు. ఏం అంతటితో చదువెందుకు ఆపేశారు? ఇంకా చదవకపోయారా?" అంది జయంతి.     "ఆ రోజుల్లో అదే గొప్ప. మా ఉళ్ళో అమ్మో కస్తాల వల్ల అమ్మాయి అయిదో తరగతి పాసయిందట. అని గొప్పగా చెప్పుకున్నారు" అంది శివపార్వతి.     ఆ మాటలకు జయంతి, దాక్షాయణి పెద్దగా నవ్వారు.     "మా బాబాయ్ ని నువ్వు అసలు చూశావా పిన్ని పెళ్ళికి ముందు?" అడిగింది జయంతి.     "చూడటం కూడానా? ఫలానా అబ్బాయిని నీకు ఖాయం చేశామే ఫలానా రోజు నీ పెళ్ళి అన్నారంతే"అంది దిగిలుగా.     జయంతి పెద్దగా నవ్వింది.     "మరి చూడకుండానే ఎలా చేసుకున్నావు పిన్ని....మా బాబాయ్ బాగుంటాడు కనుక సరిపోయింది. అదే ఏ మెల్లకన్నువాడో అయితే ఏం చేసేదానివి?" అంది జయంతి.     "ఏం చేస్తాం నా ఖర్మ అనుకునేదానిని" అంది విచారంగా.     "మరి నిన్ను బాబాయ్ చూశాడటనా పెళ్ళికి ముందు?" అడిగింది కుతూహలంగా.     "చూశారట....మా ఉళ్ళో ఎవరి పెళ్ళికో వచ్చారట....పెళ్ళిలో నన్ను చూశారట....వెళ్ళి వాళ్ళ పెద్దవాళ్ళకు చెప్పారట. ఫలానా అమ్మాయిని చేసుకుంటానని" అంది నవ్వుతూ.     "ఓ...ఐసి? అయితే లవ్ మ్యారేజి అన్నమాట" అంది జయంతి సీరియస్ గా.     ఆ మాటలకు దాక్షాయణితో పాటు శివపార్వతి కూడా పెద్దగా నవ్వింది.      "నిన్ను చుసిన ఏ మగాడైనా అదే అనుకుంటాడులే! ఈ అమ్మాయి భలేగా వుందే పెళ్ళి చేసుకుందామని" అంది జయంతి కవ్విస్తూ.     "ఏయ్ రౌడిపిల్లా....నికంటేనా ?" అంది పార్వతి జయంతి చెవి మెలిపెడుతూ.     "అమ్మో పిన్నీ వదులు....వదులు ఉన్న మాటన్నాను. కావాలంటే పెద్ద పిన్నిని అడుగు" అంది జయంతి నవ్వుతూ.     "ఎందుకే పార్వతీ! జయంతి అన్నదాన్లో తప్పేముంది?' అంది దాక్షాయణినవ్వుతూ.                                                               18     "ఎంటండి అదోలా వున్నారు?భోంచేయమంటే ఆకలి లేదన్నారు. అసలేమయింది?" కంగారుగా అడిగింది దాక్షాయణి భర్తని.     "ఏంలేదులే దాక్షాయణి! నన్ను కాసేపు ఒంటరిగా వుండని అన్నాడు మాధవరావు సీరియస్ గా.     "తలనొప్పిగా వుందా, కాస్త టి పెట్టి ఇచ్చేదా?"అంది దాక్షాయణి.     ఆమె మనసెందుకో కీడు శంకిస్తుంది. భర్త ఎప్పుడూ ఇంతా ముభావంగా లేడు. పెళ్ళయిన ఈ పదేళ్ళ కాపురంలో భోజనంవద్దు,ఏమి లేదని చిరాకుపడటం ఇదే మొదటిసారి, అందుకే ఆమెకు క్షణ క్షణానికి కంగారేక్కువైంది.     "ఉండండి టి పెట్టుకోస్తాను"అంటూ వంటగదిలోకి వెళ్ళింది దాక్షాయణి కంగారుగా.     "ఏంటి దాక్షాయణి ఏం కావాలి? మాధవ భోంచేశాడా?" అడిగింది కస్తూరి ఉల్లిపాయలు తరుగుతూ.     "లేదక్కా! ఆయనకు తలనొప్పిగా వుందట, ఆకలిగా లేదట, టి పెట్టి ఇద్దామని వచ్చాను" చెప్పింది దాక్షాయణి కంగారుగా.     "ఓస్ ఇంతేగా! తలనోప్పికే అంత కంగారుపడిపోతేవే.....శొంటి కలిపి టి తయారు చేసి ఇస్తాను" అంది కస్తూరి. 
24,328
    తల్లితో పాటుగా బిగుసుకుపోయి కూర్చోవటం నోరు మెదపకుండా నడవటం లాంటి క్రమశిక్షణ ఉచ్చులోంచి స్వేచ్ఛ వచ్చింది కాబట్టి సరదాగా గడపవచ్చు. ఈ అవకాశం మంచిదే అనుకుంది ఆమని.     మెట్లమీదుగా దిగివస్తున్న ఆమెను చిత్రంగా చూస్తోంది వర్ధిని!     "ఈరోజు తిరునాళ్ళు ప్రారంభమవుతాయి కదా! ఏమేం జరుగుతాయి?" అని అడిగింది. వర్ధినికి అవన్నీ జ్ఞాపకం భలే హుషారయి పోయింది.     "మిమ్మల్ని అమ్మగారు వెళ్ళనివ్వరు కానివ్వండి అమ్మాయిగారూ" అని మొదలెట్టింది.     "ఈ రోజు అవకాశం దొరికిందిలే చెప్పు"     "అమ్మగారు మిమ్మల్ని గ్రామంలోకి వెళ్ళి చూచి రమ్మన్నారా?"     అరక్షణం ఆలోచించి 'అవును' అని అబద్ధం చెప్పింది ఆమని!     "భలే అదృష్టవంతులండీ మీరు! ముందు అందరూ యజ్ఞశాల దగ్గరకుపోతారు. హోమం పూర్తి అయిం తరువాత బ్రహ్మోత్సవాలు మొదలు అయినట్టు! అంతసేపూ మీ అమ్మగారు అక్కడే వుంటారు కాబట్టి అందరూ గంభీరంగా వుంటారు. ఇక అమ్మగారు ఇంటికి తిరిగి వచ్చేశాక మొదలవుతుంది చూడండి హుషారూ! కొంతమంది అయితే ఈ అయిదు రోజులూ ఇంటికి కూడా వెళ్లరు. పారువేట, వసంతోత్సవం, దొంగలదోపిడి, ఉట్ల పండుగ, ఊరేగింపులో త్రొక్కిసలాట వర్ణించలేం కదండి!     చూచేందుకు రెండు కళ్ళు చాలవు!"     "అవన్నీ సరేలే! ఈ రోజు ఏం జరుగుతుందో చెప్పు!     ఈ రోజా అండి! ఇవాళ మొదటి రోజు కదా! ఉజ్జీలవేట జరుగుతుంది!"     "ఉజ్జీలవేట అంటే ఏమిటి?"     "అదా అండి! హోమశాల నించి అమ్మగారు ఇంటికి తిరిగి వచ్చేయగానే చుట్టూ పక్కల గ్రామాలలోంచి వచ్చిన పెళ్ళికాని యువతీ యువకులు అందరూ చెరువు గట్టుమీద చేరుతారు.     పాల్గొనాలని సంబరపడిన అమ్మాయిలు చెరువులోకి ఏదయినా ఒక వస్తువును విసిరి వేస్తారు. యువకులు గుంపుగా ఈదుకుంటూ చెరువులో పడిపోతారు ఇక చూడండి ఆ సందడి.     చుట్టూ గట్టుమీద చేరిన వాళ్ళు హుషారు చేస్తారు.     అమ్మాయి చెరువులోకి విసిరేసిన వస్తువు ముందుగా అందరికి చూపుతుంది. అది తెచ్చి యిచ్చిన యువకుడు ఈ బ్రహ్మోత్సవాలు అయిదు రోజులూ ఆ అమ్మాయితో ఉజ్జీకట్టి తిరగవచ్చు!     పూర్వకాలంలో అయితే అసలు వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకునేవారట! ఈ రోజుల్లో అలాంటివి ఇష్టపడరు కదండి.     కేవలం అదొక సంబరంగా పండుగలాగా మిగిలిపోయిందన్న మాట. ఇప్పటికీ మిగిలివున్న ఆచారం ఏమిటి అంటే ఆ ఇద్దరూ జట్టుగా తిరుగుతారు ఈ అయిదురోజులూ!     ఎవరూ అభ్యంతరం చెప్పరు! తల్లిదండ్రులు కూడ!     అలా కలిసిన కొన్ని జంటలకు పెళ్ళిళ్ళు అవటం కూడ అప్పుడప్పుడు జరుగుతోంది. కట్నాల బెడద పడలేని ఆడపిల్లల తల్లిదండ్రులు కూడ ఈ పండుగ జరగాలని పట్టుబడుతున్నారిప్పుడు. భలే హుషారుగా వుంటుంది లెండి.     మీరు మాత్రం ఆ వైపుకి వెళ్ళకండి. అమ్మగారు చూస్తే కోప్పడతారు" అంది వర్ధిని. ఆమని ఆ పండుగ విశేషం అంతా శ్రద్ధగా వింది.     "ఛ! ఛ! నేనెందుకు పోతాను. మమ్మీ కోప్పడతారు" అంది హాలు దాటుతూ! దారిలో ఆమెకు ఆ పండుగ చూడాలని కోరిక తీవ్రతరం అయింది. ప్రజల కష్టసుఖాలలో పాలుపంచుకుంటుంది మమ్మీ కూడా. కాని వారితో కలసి ఇలా జాలీగా తిరిగితే మాత్రం ఒప్పుకోదు.     అందుకే ఎప్పుడూ ఆ పండుగ చూడనీయలేదు.     ఇంక వెళ్ళిపోతే పెద్ద చదువుల మధ్య కూరుకుపోతుంది తాను. అప్పుడు ఇలాంటి వాటిలో చేయి కలపటం కుదరకపోవచ్చు!     ఒకవేళ మమ్మీకి తెలిసినా చిన్నతనం అని సర్ది చెప్పుకుంటుంది.     ఎలాగయినా సరే ఉజ్జీల పండుగలో పాల్గొని జీవితమంతా జ్ఞాపకం ఉండే ఓ అందమైన జ్ఞాపకం సంపాదించుకోవాలని తీర్మానించుకుంది ఆమని. జనం మధ్యలోంచి పిల్లిలాగా నడిచి వెళ్ళి తల్లి ప్రక్కన కూర్చుంది.     అప్పటికే హోమ కుండాల ముందు అక్కసు కూర్చోబెట్టారు పండితులు.     వేద మంత్రాలు చదువుతూ హోమం చేస్తున్నారు.     ఘనమయిన ఆ సాంప్రదాయాలను, కాబోతున్న వారసురాల్ని చూచేందుకు జనం అధిక సంఖ్యలోనే వచ్చారు. ముత్తయిదువులు వందల సంఖ్యలో వచ్చి గాయత్రి వెనుక ఉన్న స్థలమంతా ఆక్రమించారు.     మగవారు పండితుల వెనుక దూరంగా చేరి చూస్తున్నారు.     ఆమని రాగానే కంఠస్వరాన్ని తగ్గించి ఆమెకు మాత్రమే వినిపించేలాగ అడిగింది రాణి సుమిత్ర "చెప్పినట్టు పూజచేసి వచ్చావా? చిన్నపిల్లలాటలా ఎంచి వచ్చేశావా?" అంది.     చాలా బుద్ధిమంతురాల్లాగ బదులు చెప్పింది ఆమని!     "జాగ్రత్తగా పూజ చేశాను. హారతి కూడ యిచ్చాను మమ్మీ! పూజ గది తలుపులు కూడ మూసేశాను" ఈ మాటలు విని తల్లి తృప్తిగా నిట్టూర్చింది. ఆలయంలో ఆడంబరంగా పూజలు జరుగుతున్నాయని ఇంటిలో దైవాన్ని వెనుక విడిచి రావటం తప్పు! అశుభం కూడ! అది గాయత్రి జీవితంమీద ఏదైనా గాయాన్ని చేస్తే తర్వాత ఏడ్చి ప్రయోజనం ఉండదు.     సకాలంలో తప్పుదిద్దుకున్నందుకు ఆమెకు తృప్తిగా వుంది. చిన్న కూతురు ఆ విధంగా మేలు చేసినందుకు మురిపెంగా చూచుకుంది.     "క్రాఫ్ చెదిరిపోయిందేమిటి?" అంది పాపిట సవరిస్తూ.     పాపిట గొలుసు తలమీద ఆనించుకున్న సంగతి తల్లి పసిగట్టేస్తుందేమో అని భయపడింది ఆమని!     "యాగశాలలోకి వస్తుంటే తోరణాలు పట్టుకున్నాయి" అంది ఆలోచించకుండా.     "పచ్చాకు తలకు తగిలితే సర్వ శుభాలు కలుగుతాయి. అందుకే తోరణాలు కడతారు. అదీ మంచిదే!" అంటూ చిన్నకూతురు పాపిటలోంచి చెదరిన వెంట్రుకల్ని సవరించింది తల్లి.     హోమం పూర్తి కావచ్చింది. "అక్క కూర్చున్న చోటునుంచి లేవకూడదు! పుణ్యస్త్రీలు అందరికీ పసుపు కుంకుమ పూలు గంధం అక్షితలు రవికల గుడ్డలు నీ చేతి మీదుగానే పంచాలి ఆమనీ!     వారి ఆశీస్సులే మనకి శ్రీరామ రక్ష!" అంది.     ఇంటిలోపని చేసేవారు ఆ వస్తువులు అన్నీ తీసుకుని మహిళలు కూర్చున్న వరుసల ముందుకు వచ్చారు. ప్రతి ఒక్కరినీ పలుకరిస్తూ పరాచికాలు ఆడుతూ గంధం వగైరాలు ఇచ్చింది ఆమని.     సంవత్సరానికి ఒకసారి ఆ కుటుంబం నేరుగా ప్రజలందరిని పలకరించే సమయం అది! వారికి వీరికి తీయని జ్ఞాపకంగా మిగిలే రోజు!     "చాల పెద్దదానివి అయిపోయావు చిన్నమ్మగారూ!"     "డాక్టరీ చదువుతారట కదా?"     "అక్కకు ఈ సంవత్సరమే పెళ్ళి చేస్తున్నారట కదా?"     "ఆ జగదీశ్వరస్వామి మిమ్మల్ని చల్లగా చూస్తాడమ్మా!" లాంటి మాటలు అంటూ ముత్తయిదువలు ఆమె అందించే పండు తాంబూలం రవికల గుడ్డ ముత్తయిదు గంధం అందుకున్నారు.     ఆ సమయం కోసం ఎదురు చూస్తూ అక్షతలు చేత్తో పుచ్చుకుని సిద్ధంగా కూర్చున్నారు. పుణ్యస్త్రీలను సమ్మానించటం పూర్తి అయింది. ఈలోగా హోమం కూడ పూర్తి అయింది.     వేద పఠనంతో పండితులు ముందుగా గాయత్రిని ఆశీర్వదించారు. వారందరికీ పేరు పేరునా పాదాభివందనం చేయించింది తల్లి.     తరువాత 'సభ్యం' అనే మంత్రం చదువుతూ సభకు నమస్కరించమని గాయత్రికి చెప్పారు పండితులు.     వారు సభ్యం చదువుతూ వుండగా పుణ్య స్త్రీల వైపు తిరిగి అందరికి చేతులు జోడించింది గాయత్రి.     వారంతా లేచి నిలబడి ఆ కుటుంబ క్షేమాన్ని ఆశిస్తూ అగ్ని దేవుడికి నమస్కారించారు. ఆ తరువాత పచ్చని జల్లులా గాయత్రి మీద అక్షతల వర్షం కురిపించారు.     కన్నతల్లి కన్నులు ఆ దృశ్యం చూచి చెమరించాయి.     "సుఖీభవ! సౌభాగ్యవతీ భవ!" అని మనసులో ఆమె మీద అక్షతలు చల్లే దృశ్యాన్ని ఊహించుకుంది సుమిత్ర! అక్షరాలే అక్షతలై ఆమె పెదవులు కూడ దాటి వచ్చాయి.     అందరితో పాటు తనూ అక్క మీద అక్షతలు గుప్పెడు వేసింది ఆమని! చిలిపీ అన్నట్టుగా చూసింది గాయత్రి!     అంతటితో హోమ కార్యక్రమం ముగిసి బ్రహ్మోత్సవ కార్యక్రమం ఆరంభమవుతున్నట్టు ప్రకటించాడు ప్రధాన పండితుడు. అందరూ ఒక్కసారి కోలాహలంగా లేచారు.     రాణి సుమిత్రతో ఒక్క మాట అయినా కలపాలని పుణ్య స్త్రీలు ముందుకు తోసుకు వచ్చారు. పనివారు సామాగ్రి అంతా సర్దుతున్నారు. ఈ సందడిలో పరాకున దూరం అయిపోకుండా పాదాలకు నమస్కరించిన గాయత్రిని పొదివి పట్టుకుంది తల్లి!     ఇరుగు పొరుగు గ్రామాలనించి వచ్చిన వారిని వీలయినంత ఎక్కువ మందిని పలకరించే ప్రయత్నంలో ఉన్నదామె!     అదే అదను అనుకుని చల్లగా బయటకు వెళ్ళిపోతున్న స్త్రీలతో కలిసి జారుకుంది ఆమని. ఆలయం వెలుపలకు వచ్చేవరకు తల్లి పిలుపు వినిపిస్తుందని భయపడుతూనే వుంది.     కాని వనితల మధ్య నిలిచి తన వారసురాలిని వారందరికీ పరిచయం చేసే కార్యక్రమంలో మునిగిపోయివున్న సుమిత్రాదేవి చిన్న కూతురు ఆమని చల్లగా జారుకోవటాన్ని గమనించలేదు.     అందరి మధ్య అక్కడే ఎక్కడో ఉంది అనుకుంది.   
24,329
    'దివిజాపగ- దివిజాపగ- సుర గంగ దివి నుండి భువికి దిగివస్తే- నగర పూర్వులు తరించినట్లు యీ గోవు తరిస్తుందన్న మాట!'     'గోవు కాదు - నీవు తరిస్తావు!'     'అవునవును! ఆవుకు పుణ్యలోకాలు- నాకు పాప విమోచనం' సాలోచనగా అన్నాడు గౌతముడు.     అవునన్నట్లు అందరూ తలలూపారు.     'మహాత్ములారా! నేనీ క్షణంలో యీ ఆశ్రమం విడిచి వెళుతున్నాను. దైవ కటాక్షంతో దివిజ గంగను తెప్పించి- ఆ గోవుపై ప్రవహించేలా చేసి ఆపై నా పాపాన్ని పోగొట్టుకుని తిరిగి యీ ఆశ్రమానికి వస్తాను. అంతవరకూ మీరు ఈ ఆశ్రమాన్ని రక్షిస్తూ కాలక్షేపం చేయండి! విద్యాభ్యాసాలు, వేద పాఠాలు, యజ్ఞయాగాదులు నిర్విఘ్నంగా కొనసాగించండి. సెలవనుగ్రహించండి!'     గౌతముడు వారికి ఆశ్రమ బాధ్యతలు అప్పగించి తపస్సుకు బయలుదేరాడు.                                       40     నాశికా త్ర్యంబకం- అక్కడ శివుడిని గూర్చి తపస్సు ప్రారంభించాడు గౌతముడు. జలాశయంలో స్నానం చేసి సంకల్పం చెప్పుకుని నిష్ఠగా తదేక చిత్తంతో ధ్యాన సమాధిలో మునిగిపోయాడు గౌతముడు. శివుడ్ని మదిలో నిలుపుకున్నాడు. ఆ శివుడు వెండి కొండ మీద గౌరీ సమేతుడై ప్రమధుల నృత్యం చూస్తున్నాడు.     ఉన్నట్టుండి ఉలిక్కిపడ్డట్టుగా కదిలాడు శివుడు.     'ఏమి నాధా?' అడిగింది గౌరి.     'దేవీ! గౌతమమహర్షి నన్ను గూర్చి తపస్సు ప్రారంభించాడు'     'భక్తజన సులభా! పరమేశా! మీరేం నారాయణులా! ఆ విష్ణుమూర్తి అయితే భక్తుల్ని నానా బాధలూ పెట్టి, వారి ఓరిమి నశించేదాకా పరీక్షలు పెట్టి 'అన్యధా శరణం నాస్తి!' అనేలా చేసేదాకా వారికి దర్శనం ఇవ్వడు! తమరలా కాదే! భక్త సులభుడని కదా తమ ప్రకాస్తి! భోలా శంకరులని కదా తమ ప్రసిద్ధి! విష్ణువుని జ్ఞాన మార్గంలో ప్రసన్నం చేసుకోలేనివారే కదా భక్తితో తమ పాదాలాశ్రయించేది!'     నవ్వాడు శివుడు.     'అంతే కాదు స్వామీ! మానవుల అవసరాల్లో అన్న పానీయాలని చెప్పినా మొట్ట మొదట అవసరం నీరే కదా! ప్రాణాధారం నీరు. అన్నం లేకపోయినా కొన్నాళ్ళు జీవించవచ్చు. కానీ జలం గుటికెడయినా పుచ్చుకోకపోతే జనం జీవించలేరు కదా! ఆ గంగ తమ అర్ధాంగి కదా! అందుకే జనం తమరిని ఆశ్రయిస్తూ ఉంటారు!'     'ఈ గౌతముడు ఆ గంగ కోసమే తపస్సు ప్రారంభించాడు'     'అయితే యింకేం! ఎవరి గురించి ఎవరు తపస్సు ప్రారంభించినా తన పదవి కోరేనేమో అని ఇంద్రుడు భయపడతాడు. తమరికా భయం లేదు కదా! ఏ వరం కోరినా అది ఇస్తే తమకేం ముప్పు ఉండదు కదా! గంగని వారికి ప్రసాదిస్తే భూమి ఆర్ధ్రమవుతుంది. తడిసిన నేల సశ్యానుకూలమై రసవంతమైన పంటనిస్తుంది. ప్రజలు సుఖిస్తారు. సంతోషిస్తారు. అది ప్రజోపయోగమే కదా స్వామీ!'     'అవునవును!'     'అవునవునంటూ తమరిక్కడ మీన మేషాలు లెక్కపెడుతూ కూర్చుండిపోకండీ! లేవండి! వెండి కొండ గట్టిగా ఉందని తిష్ట వెయ్యక కదలండి! కదిలి ఆ గౌతముడు కోరిన వరమిచ్చి రండి!' అని తొందర పెట్టింది.     పరమశివుడు పరమేశ్వరీ ప్రభోధం విని వెంటనే కదిలాడు.     గౌతముడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు.     గౌతముడు నిశ్చల చిత్తంతో ధ్యానిస్తున్నాడు.     'గౌతమ మహర్షీ!'     పిలుపు వినబడగానే చప్పున కనులు తెరిచి ఎదుట ఆకాశంలో ప్రత్యక్షంగా కనిపిస్తున్న పరమశివుడిని చూసి ఆనందంతో కైమోడ్చి స్తుతించాడు. పరమశివుడు మరింత ప్రసన్నుడైనాడు.     'గౌతమా! ఏం వరం కావాలో కోరుకో!'     'పరమేశ్వరా! పిలిస్తే పలికే దైవమా! నన్నేలిన నా స్వామీ! నిష్కారణంగా గో హత్యా పాపం అంటుకుంది. అది పోవాలంటే ఆ గోవు తిరిగి జీవించాలి! దేవా! మహాకాలా! సృష్టి స్థితి లయల్లో లయకు తమరే అధికారులు. నా పాపాన్ని లయింపజేయి స్వామీ! ఆ గోవును తిరిగి బ్రతికించి నన్ను తిరిగి పాపవిముక్తుడ్ని చేయి స్వామీ!' ఆర్తిగా అడిగాడు గౌతముడు.     పరమశివుడు చిద్విలాసంగా నవ్వాడు 'గౌతమమహర్షీ! నా యీ జటాఝూటం నుంచి నేను గంగను ధారగా వదులుతాను. అది ఇక్కడ పుడుతుంది. నీ వెంట నడుస్తుంది. ఎక్కడ ఆ గోవు మరణించిందో అక్కడికి నీ ఆశ్రమ సమీపానికి తీసుకు వెళ్ళు! ఈ గంగాజాలం ఆ మృత గోవుపై ప్రవహించగానే అమృతత్వం సిద్ధిస్తుంది. అది పునరుజ్జీవనం చెందుతుంది. నీ పాపం నశిస్తుంది'.     పరమ శివుడి మాట వినగానే గౌతముడు ఎంతో సంతోషించాడు 'ధన్యోస్మి దేవా! ధన్యోస్మి! నేను, నా జీవితమే కాదు! ఆ నదీ పరీవాహక ప్రాంతం అంతా తరిస్తుంది. తమరి జడల నుండి విడివడి వడివడిగా సుడులు తిరుగుతూ పరవళ్ళు తొక్కుతూ కడలి చేరేదాకా మార్గ మధ్యంలో అడుగడుగునా అమృత ధారలతో ఆంధ్ర దేశాన్ని తరింపజేస్తున్నది కదా! అదెంత పుణ్యం స్వామీ! పుణ్యానికి పోతే పాపం ఎదురైంది అని కదా సామెత! ఇక్కడ పాపం నశించి పుణ్యం లభించింది స్వామీ!'     శివుడు ప్రసన్నుడై జడ విదిలించాడు!
24,330
     ఆమెకు విషయం తెలుసు కాబట్టి ఏమీ ఎదురుమాట్లాడక చిరునవ్వు నవ్వింది ధాన్య.          అంత అజ్ఞానాన్ని చూసి భరించడం కష్టమైనట్లు వర్ష అటూ ఇటూ కదిలింది.          సరిగ్గా ఆ సమయంలో మోహన తనవైపు చూడడంతో ఇక ప్ర్రారంభించమన్నట్లు వెంకట్రామయ్య కన్నుగీటాడు. ఇందుకోసమే కాచుకుని వున్న ఆమె తన ఊపును మరింత ఎక్కువ చేసింది.              జనం చూపంతా ఆమెవైపు మళ్ళింది. నరుడు, గోపాలకృష్ణ కూడా కళ్ళను అటు నిలబెట్టారు.          మోహన అలా వూగుతూనే లేచి నిలుచుంది. జనమంతా టెన్షన్ తో అటే చూస్తున్నారు.          పులిరాజు  మరికొంత ముందుకొచ్చి గొంతు పెంచాడు. అతను ఆమెవైపు తీక్షణంగా చోసోతూ "ఎంత ధైర్యమే నీకు? ఇదిగో ఈరోజు నిన్ను వూరికే వదిలిపెట్టను. సప్తసముద్రాలకవతల నిన్ను బంధించి, నీ అంతు తేలుస్తాను" అని ఘీంకరించాడు.          ఈ హెచ్చరిక అంతా దెయ్యానికనీ మొహనకు కాదని, ఇక ఆ క్షణం నుంచి దెయ్యమే ఆమెను నడిపిస్తుందని జనానికంతా తెలుసు. అందుకే వాళ్ళు భయం భయంగా ఆమెవైపు గుడ్లప్పగించి చూస్తున్నారు.          ఆమె మెల్లగా పెదవులను కూడదీసుకున్నట్టు కలిపి "రేయ్ డింభకా! నీవల్ల ఏమోతుందిరా? నేనెవర్ని అనుకున్నావ్? కామినీ పిశాచిరా నిన్ను నిలువునా చీల్చి నీ రక్తం తాగడానికే వచ్చానురా" అని కసిగా అంది.          అతను కళ్ళు మూసుకుని, ఏదో స్మరించి ముక్తాయింపుగా వేపమండలను విదిలించాడు.          ఈసారి దెయ్యం ఆగ్రహం తెచ్చుకుంది. ముఖాన్ని చిటపటలాడించి, కళ్ళు మూసుకుని క్షణంలో తెరిచింది. అంతలోనే పగలబడి నవ్వింది.          ఇక సహించలేక తనో, దెయ్యమో ఎవరో ఒకరే మిగలాలన్నట్లు పులిరాజు ముందుకు ఉరికి ఆమెను వేపమండలతో శక్తి కొద్దీ కొట్టాడు.          వర్ష ఇక చూడలేనట్టు తల దించుకుంది. ఈ దారుణాన్ని ఆపమని గట్టిగా అరవాలనిపించింది. కానీ గొంతు పెగలడం లేదు.          పులిరాజు ఈసారి దెయ్యం వీపుమీద కొట్టాడు. జాకెట్టులేని భాగమంతా సన్నటి వాతలు తేలాయి. అక్కడక్కడా రక్తపు చుక్కలు ఎర్రగా మెరుస్తున్నాయి.          "రేయ్!" అంటూ అరిచింది దెయ్యం.          ఏం చెబుతుందోనని జనం చెవులను రిక్కించారు.          "రేయ్! నన్ను నువ్వు కొట్టి చంపచ్చురా కానీ నేను ఎక్కడికీ పోను ఈ వూరు దెయ్యాల దిబ్బరా ఇక్కడే మళ్ళీ పుడతానురా రేయ్! నీకు ఇంతవరకూ తెలియని నిజం ఒకటి చెబుతానురా?" మోహన గొంతు మారడం కూడా జనం కనిపెట్టారు. ఇదంతా దెయ్యం మాట్లాడుతోంది కాబట్టి గొంతు మారడం సహజమని అనిపించింది.          "ఏమిటా నిజం?" మంత్రగాడు సీరియస్ గా అడిగాడు. దెయ్యం ఏదో సందేహిస్తున్నట్లు ఆగి "రేయ్! ఆ నిజం చెబుతానురా ఈ ఊళ్ళో దేవుడు లేడురా అందుకే ఇక నుంచీ మా దెయ్యలమంతా ఇక్కడే కాపురాలు పెట్టేస్తాం రా మీ భూముల్లో ఇక పంటలు పండవురా వానలు కురవవురా మిమ్మల్ని పీక్కుతింటాంరా మీ పిల్లల్ని నంజుకు తింటాంరా. రేయ్! ఆరోజు ఇంక ఎంతో దూరం లేదురా జాగ్రత్తరా- జాగ్రత్త."          వింటున్న జనమంతా అవాక్కయి పోయారు. ఊళ్ళో దేవుడు లేడా? ఎక్కడికి వెళ్ళాడు? దెయ్యాలు వచ్చి కాపురం పెట్టేస్తాయా? భూములు పండవా? పిలల్ల్ని తినేస్తాయా? ఇప్పుడేం చెయ్యాలి? అసలు దేవుడెందుకు ఊరొదిలి వెళ్ళిపోయాడు? ఈ ప్రశ్నలన్నీ వాళ్ళ మనసుల్లో సుళ్ళు తిరుగుతున్నాయి.          "దేవుడు ఈ వూరొదిలి ఎందుకు వెళ్ళిపోయాడు?" జనం మనసంతా తెలుసుకున్నట్టు అడిగాడు పులిరాజు.          "అలిగి పోయాడురా" దెయ్యం ఠపీమని చెప్పింది.          "ఎందుకు?" అడిగాడు.          దెయ్యం మాట్లాడలేదు.          పులిరాజు మరో అడుగు ముందుకువేసి బలాన్నంతా చేతుల్లోకి తీసుకొని కొట్టాడు. ఆమె తూలి పడబోయి నిలదొక్కుకుంది.          "చెప్పు"          "చెబుతాను దేవుడికి మీరు చేస్తున్న అపచారం భరించలేక."          "అపచారమా? ఏమిటది?"          దెయ్యం మాట్లాడదాని తెలిసినట్లు అతను క్షణం ఆలస్యం చేయకుండా కొట్టాడు. ముఖం మీద పడ్డ దెబ్బతో ఆమె మెలికలు తిరిగింది.          "చెబుతానురా మూర్ఖుడా? తన బిడ్డ కానివాడ్ని తన బిడ్డ అని మీరంతా భావించడం వల్ల క్రుంగిపోయాడు. అందువల్లే వెళ్ళిపోయాడు."          "ఎవరతను?"          "గోపాలకృష్ణ" దెయ్యం జనం రియాక్షన్ చూడడం కోసం అన్నట్లు చెప్పడం ఆపింది.          గ్రామస్తులంతా తమ పక్కన బాంబులు పడ్డట్టు ఉలిక్కిపడ్డారు. ఆ షాక్ నుంచి తేరుకున్న వాళ్ళు పక్కనున్న వాళ్ళతో గుసగుసలు ప్ర్రారంభించారు.          "ఏమిటి నువ్వంటున్నది?"          నరుడు మోకాళ్ళమీద కూర్చున్నాడు. ఏదో జరగరానిది జరగబోతున్నట్లు అనిపించి, ఒళ్ళంతా భయంగా పాములా చుట్టుకుంది.          "గోపాలకృష్ణ మీరనుకున్నట్టు మదనకామరాజు వంశానికి చెందిన వాడు కాదురా."          జనమే అరిచారో, ఈ వార్తను భూమే కంపించిందో, ఆకాశమే ఊడిపడిందోగానీ ఒక్కసారి హాహాకారాలు ఆ ప్రాంతాన్నంతా కదిలించాయి.          నరుడు ఠక్కున లేచి వర్ష వైపు చూశాడు.          గోపాలకృష్ణకు దెయ్యం ఏం చెప్పిందో అర్ధం కాలేదు. ఆ క్షణంలో అన్ని అవయవాలు పని చేయనట్లు నిశ్చేష్టుడై వుండిపోయాడు.          "ఏమిటి నువ్వు పేలుతున్నది? నీ నాలుకను చీరేస్తాను" పులిరాజు మనిషంతా వూగిపోతూ మరోదెబ్బ కొట్టాడు.          "ఏం నువ్వు నన్ను ఏం చేసినా దాగని నిజం అది. అతను పరమ నికృష్టమైన వంశానికి చెందినవాడు. ఆసుపత్రిలో అతని తల్లి కని పారేయబోతే మీ జమీందారు తెచ్చుకున్నాడు. ఈ వ్యవహారమంతా నడిపింది ఎవరో తెలుసా? వెంకట్రామయ్య."          సూది పడితే వినిపించేంత నిశ్శబ్దం.          అందరి కళ్ళూ వెంకట్రామయ్య మీద నిలిచాయి. ఆయన కళ్ళల్లో సన్నటి నీటిపొర. ఘోరమైన తప్పు చేసినవాడిలా హల వంచుకున్నాడు.          దెయ్యం చెప్పింది నిజమా అన్నట్లు కొన్నివందల కంఠాలు ప్రశ్నిస్తున్నట్లు ఆయన చెవులు మూసుకున్నాడు.
24,331
    తెలిసినా తన ముందు ఎత్తే సాహసం ఎవరూ చేయరు.     అది ఈనాటికి కొడుకు చేశాడు. తన అహం మీద, ఆత్మాభిమానం మీద దెబ్బకొట్టాడు.     కాంతాన్ని తను లేవదీసుకు వచ్చినా ఆమెను గుళ్ళో పెళ్ళి చేసుకున్నాడు తన భార్యగా సమాజంలో గౌరవం కల్పించాడు.     కాంతంతో సంసారం మొదలు పెట్టాక తను పద్దతిగానే వున్నాడు.     కాంతం లేచివచ్చిన బాపతైనా గుణవంతురాలు. కట్టుకొన్న వాడికి సుఖసంతోషాలు కలుగజెయ్యడమే ధ్యేయంగా బ్రతుకుతోన్న మనిషి.                                                  *    *    *     అదేరోజు డిశ్చార్జి అయ్యి ఇంటికి వచ్చింది విశిష్ట.     డ్రామా కోసం మింగింది రెండు మూడు మాత్రలైనా ఇంకా మగత మగతగా, నీరసంగా వుంది.     కూతురి పక్కన మంచం మీద కూర్చొని కమలా పండు ఒలిచి పెడుతున్నాడు రామకృష్ణ.     రాత్రి అన్నం వండడానికి చేటలో బియ్యం పోసుకొని మట్టి పెల్లలు ఏరుతోన్న అన్నపూర్ణ ఒక నిట్టూర్పు విడిచి అంది.     "ఏమిటో నండీ ఇదంతా! నాకేమిటో భయంగా వుంది. ఏ క్షణంలో ఏ ఉప్పెన మీద విరుచుకుపడుతుందో అన్నట్లుగా వుంది. అవతల వున్నది పెద్దవాళ్ళన్న ఆలోచన లేకుండా మీరు పోలీసులకి కంప్లయింట్ చేయడం ఏమిటో, ఈ పిల్ల ఆత్మహత్యకి ప్రయత్నించడం ఏమిటో నాకంతా అగమ్యంగా వుంది.     పెద్దవాళ్ళతో పేచీ ఎటుతిరిగి వస్తుందో. ఇదంతా చూస్తుంటే గొర్రె కొండను ఢీకొట్టినట్టుగా వుంది. కొమ్ములు విరిగేది గొర్రెకే. కొండకేమీ కాదన్న సత్యం తెలిస్తే మీరింత సాహసం చేసేవారు కాదు!"     "మనం గొర్రెలం కాదు! వాళ్ళు కొండా కాదు. వాళ్ళూ మనలాంటి మనుష్యులే. హోం మినిస్టరంటే దేశంలో శాంతి భద్రతలు కాపాడవలసిన వాడని అర్ధం. అలాంటిది వాడి కొడుకే ఒక ఆడపిల్ల వెంటపడి రేప్ చేస్తానని, సర్వనాశనం చేస్తానని ఆంబోతులా వీరవిహారం చేస్తుంటే చీమూ రక్తమూ వున్న ఏ తండ్రీ ఊరుకోలేడు. దీనికి తండ్రే కానక్కరలేదు. మానవత్వం వున్న వాడెవడైనా చూస్తూ ఊరుకోడు. పెద్దవాళ్ళతో పేచీ ఎందుకని ఊరుకొంటే దీన్ని అలుసుగా తీసుకొని వాడు ఇంకెంతైనా రెచ్చిపోతాడు.     రేప్ కూడా చేస్తాడు. అప్పుడు........అప్పుడు దాన్ని కళ్ళముందు కూర్చోబెట్టుకుని కుళ్ళిపోవడం బాగుంటుందా?" ఆయన తీవ్ర స్వరంతో అన్నాడు.     "అదికాదండీ. ఊరికే కాలేజీ మానిపించి ఇంట్లో కూర్చోబెడితే పోయేదానికి........"     "కాలేజీ మానిపిస్తే పోయే పీడకాదే. దుష్టుడి చేతులు చాలాపొడవు. అవి మనం ఇంట్లో వుంటేనే కాదు. ఎంత దూరమైనా సాగుతాయి. తమ కసి తీర్చుకుంటాయి. వాడు మన ఇల్లు కూడా చూశాడట. ఆ చేతులను తెగనరికితే గాని మనమ్మాయి సేఫ్ కాదు. అయినా వాడి భయంతో పిల్లను కాలేజీ మానిపించి దాని చదువు పాడుచెయ్యడం ఏమిటి? ఆ కాలేజీలో చదివేది ఒక్క మనమ్మాయే కాదు. ఇంకా చాలామంది అమ్మాయిలున్నారు. వాడి కన్ను ఎప్పుడు ఎవరిమీద పడుతుందోనన్న భయంతో వాళ్ళంతా చదువులు మానేయాల్సిందేనంటావా?     ముల్లు గుచ్చుకొంటుందని ఆ దారిన అందరూ నడవడమే మానెయ్యడం కాదు. ముల్లుని దారి నుండి పెరికివేయడమే సరైన పరిష్కారం. కీచకులు ఎక్కడైనా వుండొచ్చునేమోగాని సరస్వతీ మందిరాల్లో చదువులు చెప్పే గురువుల రూపంలో వుండకూడదు. వాళ్ళున్న చోట చదువుల విలువే పోతుంది. ఆ మందిరం పవిత్రతే పోతుంది" రామకృష్ణ ఆవేశంగా అన్నాడు.     "పెళ్ళి కావలసిన పిల్ల. అంతా సక్రమంగా వున్నవాళ్ళకే సంబంధాలు కుదరడం కష్టంగా వుంది. ఇలా పబ్లిసిటీ తెచ్చుకొన్నాక దానికి సంబంధాలు వస్తాయన్న ఆలోచన వుందా?"     "నా బిడ్డ ఏం తప్పు చేసిందని సంబంధాలు రావు?"     "వాడు ఊరికే పాడు చేస్తానన్నాడో, చేశాడోనన్న ఆలోచన ఎవరికయినా వస్తే......."     "ఆ మాట ముందుగా నీ నోటి నుండి వచ్చింది కాబట్టి నిన్నుప తంతాను."     "నన్ను తన్ని నోరు మూయిస్తారేమోగాని లోకం నోరు మూయించలేరుగా? ఇదిగో తోక అంటే అదిగో పులి అనే లోకం ఇది."     "చాల్లే! లోకాన్ని కాచి వడబోశావు!"     "నాన్నా.......! మీ కోసం ఎవరోవచ్చారు కారులో.......!" శర్మిష్ట చెప్పింది.     ఆయన వలుస్తూన్న కమలాపండు టీపాయ్ మీద పెట్టి టవల్ భుజం మీద వేసుకొని వెళ్ళాడు.     కారు డ్రయివర్ కాక మరొకతను కూడా గేటు దగ్గరున్నాడు.     "హోం మినిస్టరు మాధవరావు గారు మిమ్మల్ని తీసుకురమ్మని పంపారు. నేనాయన పి.ఎ.ని"     "ఆయనకి నాతో ఏం పని?" అని అంటూ బెట్టుచేయదలుచుకోలేదాయన. సరేనని ఇంట్లోకి వచ్చి డ్రెస్ చేసుకొంటూ "హోం మినిస్టరుగారు పిలిచారట వెడుతున్నా" అన్నాడు.     "మీరొక్కరే వెడతారా.......?" అన్నపూర్ణ ముఖం భయంతో పాలిపోయింది.  "పక్కింటి రామనాధం అన్నయ్యని తోడుగా తీసికెళ్ళండి."     "నన్ను చంపుతారని భయమా?"     "ఎవరినైనా నమ్మొచ్చునేమోగాని రాజకీయనాయకులను నమ్మకూడదండీ. మనిషిని మాయం చేయడం వాళ్ళకో లెక్కకాదు. ఎందరినో మాయం చేసి ఆ పదవిలోకి వచ్చి వుంటారు కాబట్టి."     "చిన్న పిల్లాడికి అదిగో బూచి అని చెబుతున్నట్లు చెబుతున్నావే!" ఆయన నవ్వాడు.     "మీకేమో అంతా నవ్వులాట. నాకేమో గుండె దడగా వుంది. వెంట రామనాథం అన్నయ్యని తీసుకుపోతే మీదేం పోతుంది?"
24,332
    అతడి కన్నులలో నీరున్నది. ఆ నీరు సముద్రనిముందు చుక్కరీతిని కనబడవచ్చును. కానీ సముద్రమంతటి భాధతో నిండివున్న అతడి హయం ఈ విధంగా చుక్కలు చుక్కలుగా మాత్రమె అతడి బాధను బయటకు వేదనడపగ్గలుతున్నది.     ప్రసాద్ బాధ ఎప్పటికి తీరేను?     సుభద్ర నతడు ఎప్పటికి తీరేను?     సుభద్ర నతడు ప్రేమించి పెళ్ళిచేసుకున్నాడు.  సుభాద్రకోసం అతడు అయినవారందరిని వదులుకున్నాడు. కేవలం సుభద్రకారణంగా అతడు లోకంలో తను ఏకాకి అన్న భావన రాలేదు.     ఇప్పుడు సుభద్ర లేదు.......     ప్రసాద్ ఏకాకి!     మూడునెలలక్రితం శివరాత్రి జాగరణచేసి పుణ్యంవస్తుందని సమద్రస్నానానికి వచ్చారు ప్రసాద్, సుభద్ర, వారి గారాలపుత్రుడు.     ముందు ఇద్దరూ బాబుచేత స్నానంచేయించి ఒడ్డున కూర్చోబెట్టడం కాసేపు బుద్ధిగా కూర్చున్నావాడల్లాబాబు తనూ మళ్ళీ స్నానానికిసిద్దపడ్డారు.     ప్రసాద్ కు ఈత వచ్చును. అతడు కాస్త లోతున వున్నాడు.     సుభద్ర ఒడ్డునే స్నానం చేస్తున్నది.     బాబు ఉన్నట్లుండి సముద్రవైపుకు పరుగెత్తాడు.     "బాబూ __ రాకు!" గట్టిగా అరిచింది సుభద్ర.     బాబు వినలేదు.     బాబూ!" అని అత్రుతుగాలేచి నిలబడింది సుభద్ర.     అప్పుడక్కడున్న వారందరూశివరాత్రి జాగరణచేసి స్నానానికి వచ్చినవారే! ఉప్పునీటి స్నానం నిద్రలేని కనులలో మంటపుట్టిస్తోంది.     అయినా అయుకుడినీ, అతడికనులలోని పాపచింతనుచూసి అప్రయత్నంగా తనవంక చూసుకుంది. తనకు పైటజారివున్నది. రవిక వంటికి హత్తుకునిఉన్నది.     చటుక్కున ఆమె పైట సరిచేసుకోవాలనుకున్నది.     తడివళ్ళు, తడిబట్టలు.     అవతల్ పరుగున వస్తున్నబాబు.     ఎదురుగా యువకుడి చూపులు.     సరిగ్గాఅప్పుడే ఓ కెరటం ఉవ్వెత్తున లేచింది. అకేరటం తననూ ఆ యువకుడినీ మాత్రమెకాక బాబునుకూడా ముంచే౦త దూరంవెళ్ళగలదన్న అనుమానంతో సుభద్ర గట్టిగా "ఏమండీ __ బాబు!" అంది దూరంగా ఉన్నప్రసాద్ వరకూ ఆమాటలు చేరాయోలేదోనని __ ఏమండీ __ బాబుజాగ్రత్త!" అనిమళ్ళీ గట్టిగా అరిచింది మరోసారి అరవాలనుకుంది కానీ కెరటం ఆమెను ముంచింది.     దూరాన్నుంచి ప్రసాద్ వీలైనంత త్వరగానే వచ్చాడు.     అప్పటికే కెరటం సుభద్రను ఆరాయికేసి ఉతికింది.     ప్రసాద్ త్వరగా ఆమెను సమీపించాడు.     ఆమె తలనుండి రక్తంధారగా స్రవిస్తున్నది.     "సుభద్రా!" అతడు అరిచాడు.     సుభద్ర కళ్ళుతెరచి __"ఏమండీ బాబు జాగ్రత్త!" అన్నది.     అవే ఆమె ఆఖరుమాటలు. అవే అమే ఆఖరుచూపులు.     పెద్దకెరటాన్ని చూసిన బాబు భయంతో వేనకడుగువేసి తన్నుతాను రక్షించుకున్నాడు. సుభాద్రలో తత్తరపాటు కలిగించి ఆమె బ్యాలెన్సు తప్పడానికి కలసిపోయాయి.     ఇప్పుడు ప్రసాద్ కు బాబు ఒక్కడే మిగిలాడు.     సుభద్ర వున్నప్పుడు వారు ముగ్గురూ ఒకటిగా జీవించారు. ఆమె పోవడంలో ఇప్పుడు ప్రసాద్, బాబు ఎవరికీవారు ఏకాకిగా ఫీలవుతున్నారు.     బాబుకు చావంటే ఏమిటో తెలియదు కానీ తన తల్లీ చచ్చిపోయిందని తెలుసు. అందువల్ల అస్తమానూ ఏడుస్తూ ఉంటాడు.     బాబు అల్లరిపిల్లవాడు కాదు. బుద్దిమంతుడు. కానీ అమ్మకోసం అల్లరి చేస్తున్నాడు. ఎన్నిరోజులైనవాడు తల్లిని మరచిపోలేకపోతున్నాడు.     ఏడాది వయసులో బాబు చాలా అల్లరిచేసేవాడు. ఆ అల్లరి చూసి తల్లీ తండ్రీ ముచ్చటపడడంతో వాడి ఆగడాలకుఅంతంలేకుండాపోయింది. మూడేళ్ళ వయసు వచ్చేసరికి వాడు మహాదుకువడిలా తయరయ్యాడు.     పచ్చగా, దబ్బాపండులా ఆరోగ్యంతో మిసమిసలాడిపోతూండే బాబును చూసి ప్రసాద్, సుభద్ర అదృష్టం తమను అన్నివిధాలా కరుణించిందనుకున్నారు. కానీ బాబు ఆ వీధిలో చాలామందితల్లులులకు, పిల్లలుకు సింహస్వప్నంలా తయారయ్యాడు.     వాడిని ఎవరింటికి తీసుకునివెళ్ళినా కొత్త, పాటఅని లేకుండా ఇల్లంతా పరుగులుతీసి చేతికందిన వస్తువు తీసుకునేవాడు. వాడి వేగంఅందుకునెందుకు కష్టంగావుండేది. జాలిలేకుండా చిన్నపిల్లలూ జాలితలచిన పెద్దపిల్లలనుకూడా బాబు తన శక్తికొలదీ కొడుతూండేవాడు.     గూండా, రౌడీలాంటిపేర్లు వాడికి స్థిరపడ్డాయి. తల్లితండ్రులూ వాడిని ముద్దుగా ఆ పేర్లతో పిలిచినప్పటికీ __ మిగతావాళ్ళ పిలుపులతో ముద్దుకాక కసి, ద్వేషం, అసహాయత కలిపి వుండేవి.     క్రమంగా సుభద్ర ఈ విషయం కానిపెట్టగలిగింది. ఆమె బాబును మార్చాలని సంకల్పించింది ఆమె ప్రయత్నాలు చాలావరకూ విఫలంకాగా ప్రసాద్ సాయం కోరింది. ప్రసాద్ రంగంలోకిడిగి అదెంత కష్టమైనా పనో కనిపెట్టగలిగాడు.     బాబుకు ఒకపద్దతి అలవాటయ్యింది అదిమానుకునేందుకువాడూ సంసిద్దుడై లేడు.     తల్లి, తండ్రి కలసి ఎదురుతిరిగేసరికి వాడు టట్టుకోలేక ఆగకుండా ఏడ్చేవాడు అతుకసారడంకానీ, ఇటులాలించడంకానీ వాడిఏడ్పును ఆపలేక పోయేవి. అలసట వచ్చేదాకా ఏడ్చేవాడు బాబు. ఆరోగ్యకరమైన పిల్లాడేమో అలసట రావడానికి వాడికి చాలాసేపు పట్టేది.     ఇది గమనించి ప్రసాద్, సుభద్ర తమ పద్దతిని మార్చుకున్నారు.     తల్లిదండ్రులలో ఇద్దరూ తనకు శత్రువులైపొతే పసిమనసు తట్టుకోలేదు. తను చేస్తున్నా అర్ధంచేసుకోగల వయసుకాదువాడిది. తిట్టినా కొట్టిఒనా ఏడుస్తాడు.     అందుకని ఆఇంట్లో ప్రసాద్, సుభద్ర రెండు పార్టీలుగా, విదిపోయేవారు. బాబు ఏంతప్పుచేసినా "నాన్నగారు కొట్టేస్తారు__" అని సుభద్ర భేదిరించేది. సాయంత్రం ప్రసాద్ ఆఫీసునుంచి ఇంటికి రాగానే జరిగినతప్పుకు సుభాద్రనూ, బాబునూ కలిపి చెడామడా తిట్టేవాడు. సుభద్రను కొట్టినట్లు నటించి, బాబును కాస్త నెమ్మదిగా కొట్టేవాడు.     ఇలా కొన్నాళ్ళుజరిగేసరికి బాబుకు తండ్రిఅంటే క్రమంగా భయం బయలుదేరింది. తప్పుదనీ తానేకాకుండా తల్లీ చేయవచ్చునానీ__ తల్లిచేసినా తప్పుకు శిక్ష తప్పదనీ వాడిచిన్నబుర్రకు అర్ధంకసాగింది.     అయితే ఇందులో చిన్న ప్రమాదం కనబడింది.     బాబుక్రమంగా తల్లికి చేరికై _తండ్రిని శత్రువులచూడడం ప్రారంభీంచాడు.ఆ యింట్లో తల్లిమాత్రమే. తనదనీ __ తండ్రి పరాయివాడనీ ఒక రకమైనా భావం వాడిలో పాతుకుపోసాగింది.     తండ్రి ఊళ్ళోలేకపోతె వాడికి సంతోషంగావుండేది. ఊళ్ళోవున్నప్పుడు కూడా తండ్రి ఇంతలో వున్నంతసేపూ వాడికి ముళ్ళమీదున్నట్ట్లే వుండేది.     "అమ్మా _ నాన్నేప్పుడు నిద్రపోతారే? నాన్నేప్పుడు ఆఫీసుకు వేడతారే? నన్నెప్పుడు ఊరికి వెడతారే?"     తండ్రి గురించి బాబు ఎక్కువగా అడిగే ప్రశ్నలవి!     ప్రసాద్ కిది బాధ అనిపించేది.     "బాబును దారిలో పెట్టడం నాకిష్టమే! కానీ అందుకోసం నేను వాడిని రాయివాణ్ణి చేసుకోలేను..." అన్నాడతను భార్యవద్ద వాపోతూ.     కానీ __ వాడి బాగుకోసం తప్పదు!" అన్నది సుభద్ర.     "న బాధ అర్ధంచేసుకోవాలంటే నువ్వోసారి న స్థానంలోకిరా!" అన్నాడు ప్రసాద్ ఉక్రోషంగా.     అప్పుడే సుభద్ర బుర్రలో ఏదో మెరిసింది.     "కొంతకాలం మీరు, కొంతకాలం నేను.... ఇద్దరం వంతులవారీగా వాడినిభయపెడదా౦__" అన్నదామె.     ప్రసాద్ ది నచ్చింది.     ఆ తర్వాతనుంచి అంతా ఒక పథకం ప్రకారం నడిచిపోయింది.     ఒకోసారి సుభద్ర భద్రకాళీ అయ్యేది. అప్పుడు ప్రసాద్ బాబు లలిమ్చేవాడు ప్రసాద్ ప్రళయరుద్రుడై నప్పుడు సుభద్ర వాడిని లాలించే అందువల్ల ఆ యింట్లో తనకు ఫలానావారే శత్రువులన్న భావన బాబులోనశించి౦ది అ యింట్లో వాడెప్పుడూ ఏకాకిగా ఫేలవలేదు. వాడిలో క్రమంగా మంచి మార్పులూ రాసాగాయి.     అప్పుడు ప్రసాద్ ఒకరోజున భార్యతో __" బిడ్డలకు తల్లిదండ్రులిద్దరూ వుండడం ఎంత ముఖ్యమో నాకిప్పుడర్ధమవుతొంది. __" అన్నాడు.     "అవునండీ __ వయసులో వున్న స్త్రీ పురుశాలకు ఒకరినొకరు ఎంత అవసరమో  , ఒక వయసు వచ్చేవరకూ పిల్లలకు తల్లిదండ్రులిద్దరూ ఆ అవసరం ...." అంది సుభద్ర.     "అదీనిజమే __ కానీ పిల్లలకు తోడుగా పిల్లలు మరింతబాగుంటారేమో అన్నాడు ప్రసాద్.     సుభద్ర బుగ్గలు, ఎరుపెక్కాయి. __"ముందువీడినో దారినపడనివ్వండి తర్వాత వీడికి తోడుగురించి ఆలోచిద్దాం __"     బాబు దారిన పడ్డాడు. వాడికితోడు గురించి అలోచించగానే ఆమె ప్రసాద్ కు తోడు లేకుండా చేసి వెళ్ళిపోయింది.     ప్రసాద్ అలాగే సముద్రంవంక చూస్తూ __":సుభద్రా! నేనున్నాలేకుండా ఇంటివద్దబాబు ఒంటరివాడు. వాడి ఇమ్తరితనాన్నేలా పొగొట్టను?" అనుకున్నాడు.     అతడు రోజూ సాయంత్రం ఆఫీసునుంచి తిన్నగా భీచికివస్తాడు. అక్కడ సుభద్రను గుర్తుచేసుకుంటూ ఏడుస్తాడు.     టెలిక చేసుకుందామనుకున్న మనసు మరింత బరువెక్కుతుంది     ఇల్లు చేరతాడు.     అక్కడ బాబు వుంటాడు.     అతడికి మళ్ళీ ఏడుపు వస్తుంది. అతన్నిచూసి బాబుకూడా ఏడుస్తాడు.     వాళ్ళిద్దర్నీ చూసి పనివాడు శీనయ్య కళ్ళోత్తుకుంటాడు.
24,333
        బయట కారాగిన చప్పుడయింది.అతను  పట్టించుకోలేదు.     ఓ గంటపోయాక అలిసిపోయినట్లూ, ఫెటీగ్ వచ్చినట్లూ అనిపించింది. ఫైల్ ప్రక్కన పెట్టేసి లేచినిలబడ్డాడు.     అప్పుడు గుర్తొచ్చింది. తల్లీ, తండ్రీ యింకా యింటికి రాలేదని, ఇందాక కారాగినచప్పుడింది. ఇద్దర్లో ఎవపరో ఒకరు వచ్చి వుండవచ్చు.     గదిలోంచి బయటకు నడిచి హాల్లోకి  వచ్చాడు.     తల్లి గదిలో లైటు వెసుగుతోంది.ఆమె యీమధ్య  ఇంటికి చాలా ఆలశ్యంగా వస్తోంది. తండ్రి,ఆమె కలిసి వుడంటం,భార్యాభర్తల్లా సంచరిస్తూ వుడంటం- ఎప్పుడూ చూడలేదు. ఎవరిదార్న వాళ్లు జీవిస్తోన్నట్లుగా   అనిపిస్తోంది.     తల్లిని పలకరించాలనిపించింది ఆమె గదిముందు నిలబడి క్షణంపాటు సంకోచించి,   మెల్లగా తులపు తోశాడు.     డోర్ తెరుచుకుంది.  గదిలో రమాదేవి వొంటరిగా లేదు.     సోఫాలో ఆమె ప్రక్కనే ఎవరో వ్యక్తి కూర్చుని వున్నాడు. ఇంచుమించు   ఆనుకుని వున్నాడు.     అందులో  అన్యభావనంగానీ, అసభ్యతకానీ  ఏమి లేదు.  ఇద్దరూ ఏదోసీరియస్ సబ్జక్టు  గురించి చర్చించుకుంటున్నారు.     " రాచంద్రా" అన్నది కొడుకుని చూసి. " ఇతను..." అంటూ ఆ వ్యక్తిని పరిచయం చేసింది.     సూర్యచంద్ర వినిపించుకోలేదు.   " నువ్వొచ్చావో లేదో అని...." అంటూ బయటకు వచ్చేశాడు.     తల్లి అలా వేళగాని వేళ పరాయి పురుషుడితో.....     ఏమిటంత రాచకార్యం?     మనసంతా వ్యాకులపాటుతో ,ఆందోళనతో నిండిపోయింది.     తన గదిలోకి వెళ్ళి లైటుతీసిప్రక్క మిదకు చేరి  పడుకున్నాడు.     చాలా అసహనంగా వుండి, గుండె బరువెక్కిపోతోంది.     ఎప్పటికోగాని నిద్ర పట్టలేదు.                                      7     శకుంతలకి ఒక్కొక్క రోజూ ఒక్కో యుగంలా  గడుస్తోంది.     ఒంటిమిద వున్న కాస్తబంగారం హరించుకుపోయింది.     పిల్లల్ని స్కూల్లో చేర్పించాలి. చేతిలో చిల్లిగవ్వలేదు.     పిల్లలు వ్యాపకం లేకపోయేసరికి బడితెల్లా తయారవుతున్నారు. తల్లిని ఎంత పీడించినా డబ్బులు రాలేకపోయేసరికి పిల్లవాడు యింట్లో చిన్న చిన్న దొంగతనాలు మొదలుపెట్టారు. అది పట్టుకొని సినిమాలు కెళ్ళటం, చిరుతిళ్లు తినుక్కుతినటం  మొదలుపెట్టాడు. నరహరి జేబులో డబ్బులు మాయమవుతూ వుండటం మొదట్లో కనిపెట్టలేదు.తర్వాత తర్వాత గమనించి ఎవరు తీస్తున్నారా అని ఆలోచించటం మొదలుపెట్టాడు.అతని భార్యకి తెలీకుండా అతని జేబులోంచి డబ్బులు కాజేసి,తాను  విడిగా దాచుకొంటూ వుండేది.అవి కొంతవరకూ ప్రోగాయక వాటిని యిరుగు పొరుగువాళ్ళకి చిన్న చిన్న మొత్తాలు పెద్ద పెద్ద వడ్డీలకు త్రిప్పేది.     సమాజంలోని ఆర్థికస్థితి.  ఎంత భయంకరంగా వున్నదంటే అప్పు చెయ్యకుండా సామాన్య మానవుని మనుగడ అసాధ్యమైపోయింది . ఎంత సంపాదించినా, చెప్పుకోటానికి కనబడుతుందిగానీ,  అనవసరాలకు సరిపోదు. అందుకని చిన్న చిన్న మొత్తాలు, పెద్దపెద్ద వడ్డీలకు-నూటికి పదిరూపాయల వడ్డీకికూడా తెచ్చుకుంటూ వుంటారు. సాధారణంగా అలా వడ్డీలకిచ్చేవాళ్లు యిళ్ళల్లో ఆడవాళ్లు,ఆఫీసుల్లో కొంచెం జబర్దస్తీగా  వుండే గుమాస్తాలు. లేకపోతే అనేక  చిన్న చిన్న వృత్తి లకిచ్చేవాళ్లు  యిళ్ళల్లో ఆడవాళ్లు,ఆఫీసుల్లో కొంచెం జబర్దస్తీగావుండే గుమాస్తాలు. లేకపోతే అనేక చిన్న చిన్న వృత్తి వ్యాపారాల్లో వుండే- రౌడీలు- వాళ్లు యిచ్చిన డబ్బువసూలు చేసుకోవటంలో దయాదాక్షిణ్యం వుండదు. జీతాలిచ్చేరోజున ఆఫీసుల దగ్గర నిలబడి, అరిచీ, కేకలుపెట్టి, దౌర్జన్యంచేసి, చొక్కాలు పట్టుకు చింపీ, యాభయి రూపాయలు వసూలు చెయ్యటంకోసం నానా భీభత్సకరమైన దృశ్యలూ సృష్టిస్తారు. ఆ సమాయాల్లో వాళ్ళని చూస్తోంటే ప్రపంచంలో డబ్బు అనేది ఎంత విలయతాండవం చేస్తోందో భోధపడుతుంది.     నరహరి వారం పదిరోజులు కాపువేసి చివరకు దొంగను పట్టుకున్నాడు.     ఓ రోజు తెల్లవారుఝూమునే రఘు అతని జేబులో చెయ్యిపెట్టి తడుముతూ దొరికిపోయాడు.     " ఓర్ని! వేలెడు .ఇప్పట్నుంచీ  నీకివేం బుద్ధులురా" అంటూ జుట్టు పట్టుకున్నాడు.      రముగాడు తప్పించుకొని పారిపోయే ప్రయత్నంచేసి చేతగాక- గింజుకుంటున్నాడు.     " ముప్పొద్దులా కంచడుకంచడు తింటున్నారు.అది చాలక యీ దొంగతనలా" అంటూ ఇష్టమొచ్చినట్లు చితకబాదేశాడు. పిల్లవాడు శోషవచ్చి పడిపోయేదాకా బాదిపారేశాడు.     శకుంతల జరిగేదంతా చూస్తూనే   వుంది. అయినా అడ్డు పడలేదు. కన్నకడుపు తరుక్కుపోతూన్నా కొడుకుమిద వేసిన అసహ్యంవల్ల సహించి వూరుకొన్నది. ఆ రాత్రంతా ఆమె ఏ మి చెయ్యాలో తెలీని నిస్సహాయస్థితిలో వెక్కి వెక్కి ఏడుస్తూనే వుంది.     దానికితోడు తోడికోడలు సాధింపులు నిప్పుల వర్షం కురిసినట్లుగా శరీరాన్నీ, మనసునీ కాల్చి వేస్తూన్నాయి.                           *    *    *    *         ఇది జరిగిన కొన్నాళ్ళకు ప్రమిల తల్లికి సీరియస్ గా వుందని వైర్ వస్తే ఆమె అర్జంటుంగా బయల్దేరి వెళ్ళాల్సి వచ్చింది.     వయసులో వున్న తోడికోడల్ని యింట్లో వుంచి  వెడుతున్నానే అని  ఒక వంక మనసు  పీకుతునే వుంది. తన మొగుడు యింతకుముందెప్పుడూ  ఎలాంటి కోతి పనీ చేసినా దాఖలాలేమి  లేవుగాని-వయసులో వున్న ఆడది వొంటరిగా దొరికితే- అమ్మా! మొగముండా కొడుకుల్ని నమ్మటానికి వీల్లేదు.     తన అనుమాలన్నీ లోపలనే త్రోసిపుచ్చి  పైకి మాత్రం బింకంగా ' ఏమ్మో! నే ఊరెడుతున్నాగానీ, ఊరమ్మ పెత్తనాలు చెలాయించక ఇల్లు జాగ్రత్తగా చూసుకో. నా మొగుడు కూరల్లో. పచ్చళ్ళల్లో కారాలెక్కువ తింటాడు. మిరు తిన్నట్లు  చప్పిడిచేస్తే ఆయనకు సహించదు. ఆయన బిందెలో నీళ్లుముంచి ఎప్పుడూ తీసుకొని ఎరగడు. ఆయనకేం కావాలో కాస్తకనిపెట్టి చూస్తూవుండు. అని  ఆమె తో చెప్పవలసినవన్నీ చెప్పి నరహరినిచాటుకు పిలిచి " యిదిగో నేను వచ్చాక అలాంటిదేమన్నా జరిగినట్లు  తెలిసిందా? మిమ్మిల్ని పొడిచి తర్వాత నేను వురేసుకు ఛస్తాను అని బెదిరించి, హడలి కొట్టి వెళ్ళింది.     కష్టాలలోవున్న స్త్ర్రీకి మొగడికన్న ఆడదే అసలు  శత్రువు. మొగాడు కామంతో , వ్యామోహంతో , స్వార్థంతో వీరవిహారం చేస్తూ వుంటాడు.ఆడది అసూయతో , ద్వేషంతో భగ్గుమంటూ వుంటుంది.     శకుంతల కూడా చాలావరకూ ముభావంగా వుంటూ, అతని కాఫీ, టీఫిన్, భోజన సొకర్యాలు ఆ వేళల  ప్రకారం చేసి పెడుతోంది.
24,334
    దాంతో అపర బ్రహ్మగారికి ఆకలి కరకరలాడింది. అవకాశంకోసం ఎదురుచూస్తున్న ఆయనకు మంచి తరుణం వచ్చింది. రాజ్యంలో దుర్బిక్షం ఏర్పడింది. నాలుగు  సంవత్సరాలుగా పంటలకు తీవ్రనష్టం రావడంతో ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకోసాగారు.     "ఇదంతా అపరబ్రహ్మగారి పరిపాలనా నిర్వాకం!" అని కిట్టనివాళ్ళు  గట్టిగా అనడం మొదలుపెట్టారు.      ఈ విమర్శలను తిప్పికొట్టడానికి ఆయనకొక అధ్బుతమైన ఆలోచన వచ్చింది.      వెంటనే ఆదరాబాదరాగా రైతు సదస్సు ఏర్పాటుచేశాడు. దాంట్లో రైతులు "మహాప్రభో.. పంటలు పండక తిండికే గతిలేదు. ఈ పరిస్థితిలో బ్యాంకులూ, అప్పులిచ్చిన  వాళ్లూ బాకీలు తీర్చమని ఒత్తిడి చేస్తున్నారు. వడ్డీ కాదుకదా.... అసలు కూడా తీర్చే శక్తి  అసలు లేదు. మీరే తరుణోపాయం చూపించాలి" అంటూ మొత్తుకున్నారు.     వెంటనే  అపరబ్రహ్మగారు కళ్లు మూసుకుని ఆలోచించాడు. ఆయన మనోనేత్రానికి అధ్బుతమైన పరిష్కారం గోచరించింది. వెంటనే కళ్లు తెరిచాడు.     "నా ప్రియమైన రైతు బాంధవులారా... మీరే నా దేవుళ్ళు! నా దైవాలకు ఆపద వస్తే ఈ భక్తుడు ఊరుకుంటాడా?మీకు "నీకు బెబ్బే.... నీ యబ్బకు బెబ్బే' - కథ తెలుసుగా?"అని అడిగాడు.     "తెలుసు" అని అడిగాడు.     "ఇంకేం.... అదే తారకమంత్రం!మీరు తీసుకున్న ఋణాలను నిర్భయంగా ఎగవేయండి. అడిగితే 'అసలుకు బెబ్బే.... వడ్డీకి బెబ్బేబ్బే....!' అని చెప్పండి. ఇది మా ఆజ్ఞ!" అని సదస్సు చాలించాడు.      అపరబ్రహ్మగారి ఆజ్ఞానుసారం రైతులు ఋణాలు ఎగవేయడంతో ఇచ్చినవాళ్లూ, ఎగవేసినవాళ్లూ వీధుల్లోపడి కొట్టుకోసాగారు. దాంతో ఎవరు, ఎవరికి, ఎంత అవసరం వచ్చినా పైసా అప్పు కూడా ఇవ్వడం మానేశారు. బ్యాంకులు సరేసరి!     అపరబ్రహ్మగారి లీలలు భరించే శక్తి ప్రజలకు నశించింది.      'తమలో తమకు నిత్యమూ కొట్లాటలు పెట్టి ఆనందించడమే ఆయన ధ్యేయం!' అని వారు గ్రహించారు. వెంటనే రాసున్న ఎన్నికలలో అయ్యవార్ని గద్దె దించాలని ప్రయత్నాలు ప్రారంభించారు.     అపర బ్రహ్మగారికి దడ పట్టుకుంది. కలహభోజనం కరువైపోతోందన్న దిగులు ఎక్కువ కాసాగింది.     తరుణోపాయం కోసం జ్యోతిషులను సంప్రదించడం మొదలుపెట్టాడు, కాషాయం కట్టాడు, ఒంటి చెవికి కుండలం తగిలించాడు. తలపాగా చుట్టాడు. రాత్రుళ్ళు చీరకట్టి తిరగసాగాడు, మెడలో రుద్రాక్షలు ధరించాడు. ముఖానికి విభూతి - కుంకుమ దట్టించి భూతవైద్యుని వేషం వేశాడు, శవ పూజలు చేశాడు.      ఎన్ని చేసినా గతజన్మలోని పుణ్యశేషం హరించుకుపోతూండడంతో ఏమీ ప్రయోజనం లేకపోతోంది. ఎన్నికల ప్రకటన వెలువడింది. మరోసారి ప్రభంజనంలా రాష్ట్రాన్ని చుట్టసాగాడు అపరబ్రహ్మ.      "నా అనుంగు ప్రజలారా! నాకు మరోసారి పదవిని ఇవ్వండి. మీ సేవలోనే నా తనువు చాలింపనివ్వండి!" అంటూ వేడుకోసాగారు.     అయితే... ఎక్కడికి పోయినా - "నీకు బెబ్బే.. నీ పదివికి బెబ్బే. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష!"అంటూ ఆయన పాఠాలు ఆయనకే అప్పజెప్పసాగారు.      ఇంక అపరబ్రహ్మగారికి ప్రజల మద్దతు అంతకంతకీ అడుగంటిపోతోందన్న వాస్తవం ఆయన పార్టీవారికి అవగతం అయింది.     "మీరు మర్యాదగా పదవినుంచి తప్పుకుని, యువకుడు - సమర్దుడు అయిన చంద్రశేఖరం గారికి నాయకత్వ బాధ్యతను అప్పజెప్పండి" అని అంతేవాసులు అపర బ్రహ్మగారిని చెవినిల్లు కట్టుకుని పోరాడసాగారు.     "పదవి వదులుటయా? అది కల్ల! సింహాసనము పైననే నా పంచప్రాణములు పంచైక్యము చెందవలె!" అన్నాడు అపరబ్రహ్మ.     పార్టీపరువు బజారున పడి అధికారం పరహస్తగతం అయ్యో ప్రమాదం ప్రస్పుటంగా కానవచ్చింది. పత్రికలకి, కార్టూనిస్టులకి కరువు లేకుండా కావలసినంత సరుకు లభిస్తోంది. అపర బ్రహ్మగారి లీలావిశేషాలను, దేశమంతా కథలు - కథలుగా చెప్పుకోసాగారు. అవి  విన్నవారికి 'ప్రతాపరుద్రీయం' నాటకంలో 'పేరిగాని పాత్ర' గుర్తుకిరాసాగింది.      ఈ పరిస్థితులన్నీ గమనించిన చంద్రశేఖరం - అయ్యగారి అంతేవాసులలో అత్యధికులను తనవైపు తిప్పుకుని రక్తరహిత  విప్లవంతో అపరబ్రహ్మగారిని అధికార పీఠం నుంచి తప్పించి సింహాసనాన్ని  తాను అధిరోహించాడు.     అపరబ్రహ్మ "అహో.... విధి ఎంతటి వైచిత్రము? నేను పైకి తీసుకువచ్చిన నావారే నాకన్ను పొడిచిరిగా! నమ్మినందుకు నాపై వెన్నుపోటుకు పాల్పడితిరిగా! కానిండు..... నాకు  మరల మంచికాలము రాకుండునా!" అంటూ దిగులుగా రోజులు గడపసాగాడు. ఆ దిగులు మరీ బరువై పక్షవాతం వచ్చి, ఎక్కువ కాలం మంచాన పడకుండానే గుండెజబ్బు కూడా వచ్చి కన్నుమూశాడు.     చంద్రశేఖరం తప్పనిసరియై అపర బ్రహ్మను పదవీచ్యుతుని చేసినా,  సీతను అడవికి పంపిన శ్రీరాముడు - 'సీత స్వర్ణ ప్రతిమ' తో అశ్వమేధ యాగాన్ని నిర్వర్తించినట్లు అపరబ్రహ్మగారి కాంస్యవిగ్రహాన్ని ప్రక్కన, చిత్రపటాన్ని వెనుక పెట్టుకుని పరిపాలన సాగించసాగాడు.      ఆ విధంగా 'చంద్రగ్రహణం' కారణంగా కర్మశేషం పరిపూర్తి అయి అపరబ్రహ్మ అశువులు బాసి బ్రహ్మవాక్కు నిజమయ్యింది.     ఇంతకీ... చంద్రశేఖరం ఎవరో కాదు, అపరబ్రహ్మగారి అనుంగు అల్లుడు. ఈ 'దశమ గ్రహ'  గ్రహణంతో అపరబ్రహ్మగారి అవతారం పరిసమాప్తి చెందింది.                     - సోమేశ్వర సాహితీ సమితి కథల పోటీ..... '98
24,335
    "ఏయ్ మౌనా... ఏంటీ... ఎటో వెళ్ళిపోయింది మనసూ... అని పాత పాడుకుంటున్నావా?" సవిత అడిగేసరికి తేరుకుని "అదేం లేదు... అతనివాలకంగామనిస్తున్నాను... చాలా గమ్మత్తయిన మనిషిలా వున్నాడు..." అంది మౌన.     "ఓ సారీ వెళ్ళి మాట్లాడి రారాదూ...' అంది భామిని.     "ఏం అక్కరేడు..." అంది మౌన అలా అన్నదేకానీ, ఆమెకూ వెళ్ళి అతన్ని పలకరించాలని వుంది. అంతకన్నా, "... మహ్ను భావా... ఓ అమ్మాయి ' సారీ' చెబితే, ఓ చిరునవ్వు నవ్వి ఎక్స్ ప్రెషన్ ఇవ్వడం కూడా తెలియకపోతే ఎలాగయ్యా..." అని నిలదీయాలని వుంది.     సరిగ్గా అప్పుడే ఆ రెస్టారెంట్ ముందు ఓ జీపు ఆగింది. అందులో నుంచి బిలబిలమని ఓ పడి మంది ఆగంతుకులు దిగారు. వాళ్ళా చేతుల్లో రాడ్స్, సైకిల్ చేయిన్లు, హాకీ కర్రలు, క్రికెట్ బ్యాట్ లు వున్నాయి.     ఢిల్లీలో ఇలాంటి గ్యాంగ్ స్టర్స్ కు కొదవేమీ లేదు. అర్ధరాత్రి టైం కాబట్టి రెస్టారెంట్ లో పెద్ద రష్ వుండదని విద్వంసం సృష్టించి, భయత్సాతంతో వాళ్ళని హడల గొట్టి డబ్బు దోచుకోవాలని వాళ్ల ప్లాన్.     ఒకేసారి ఆ రెస్టారెంట్ లో రష్ తక్కువుగా వుంది.     డేంజర్ అలారం మోగించడానికి మేనేజర్ లేచాడు. అది గమనించిన ఓ అగంతుకుడుమేనేజర్ ని బయటకు లాగాడు. భస్మ కూచున్న సీటుకు అవతలివైపే డేంజర్ అలారమ్ ఉంది.     మేనేజర్ భస్మ కు సైగ చేశాడు.     అయినా భస్మ అదేం పట్టించుకోకుండా నూడుల్స్ తింటున్నాడు. రెస్టారెంట్ లో వున్న వాళ్ళంతా భయంతో వణికిపోతున్నారు. ఆకలి మాట మరచి, ప్రాణం మీద భయంతో బుగుసుకుపోయారు.     మౌన, వాళ్ల ప్రెండ్స్ ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారు. తలోదిక్కుకు పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు.     "ఎవరు కదిలినా ఛస్తారు" వార్నింగ్ ఇష్యూ చేశాడు ఆ అగంతుకుల్లో ఒకడు.     ఎక్కడి వల్లక్కడే స్తాత్యూల్లా వుండిపోయారు.     మౌన ఆశ్చర్యంగా భస్మ వైపు చూసింది.     అతను మాత్రం చాలా తాఫీగా నూదల్స్ తింటున్నాడు.     "ఏయ్ మౌనా... అతడెంటే... ఓ పక్క మనం భయంతో వణికి పోతూంటే, జేమ్స్ బాండ్ సినిమాలో సీన్ కానరీ టైపులో నిపాడిగా నూదల్స్ తింటున్నాడు" అంది మెల్లిగా మౌనకు మాత్రమె వినిపించేలా శర్మిష్ట.     ఆ ఆగంతుకులు దృష్టి భస్మ మీద పడింది. వాళ్ళు ఆశ్చర్యపోయారు.     ఇంతమంది భయంతో గిజగిజలాది పోతూంటే తనకు పట్టనట్టు వున్న అతడి మీద వాళ్లకు కోపం కూడా వచ్చింది.     "మనల్ని పూచికపుల్లలా చూస్తొన్న ఆ బద్మాష కు మన దెబ్బ రుచి చూపించి బుద్ధి చెప్పోంది..." ఓ ఆగంతుకుడు తన అనుచరుడికి చెప్పాడు.     సైకిల్ చెయిన్ గాలిలోకి లేపి అక్కడ్నుంచి భస్మ వీపుపైకి విసిరాడు. భయంతో కళ్ళు మూసుకుంది.మౌన.     అతను గట్టిగాకేక వేస్తాడని వూహించింది.     కానీ భస్మ అదేం పట్టించుకున్నట్టు లేదు. తాపీగా తింటూనే వున్నాడు.     "రేయ్  బద్మాష్..." అంటూ భస్మ జుట్టు వుంది. భస్మ తల మద్య భాగంలో వున్న కన్ను కొద్ది కొద్దిగా తెరుచుకోసాగింది.     చేయి చుర్రు మనడంతో భస్మ జుట్టు వదిలేసాడు ఆగంతుకుడు.     "క్యాహోగయా?" అడిగాడు వాళ్ళకు బస్ లా వున్న లావుపాటి వ్యక్తి.     "చేయి కాలింది సాబ్" అన్నాడతను.     "చేయి కాలదమేంటి బె... మండు తాగావా?" అంటూ భళ్ళున నవ్వి, భస్మ దగ్గరకి వెళ్ళి హాకే కర్రతో అని మూతిమీద బలంగా కొట్టాడు."     పెదవి చిట్లి రక్తం వచ్చింది.     అందరూ భయంతో కళ్ళు మూసుకున్నారు.                                                   ***     అగర్వాల్ రెస్టారెంట్ లో జరుగుతున్నదాన్ని... ఎదురుగా వున్న కంప్యూటర్ స్క్రీన్ లో చూస్తున్నాడు.     "భస్మా... పిడికిలి బిగించు... హిట్... కమాన్ హిట్ దెమ్..."అన్నాడు అగ్రవాల్ అతనికి సజెషన్స్ ఇస్తూ.                                                    ***     ఆగంతుకులు అందరూ కలసి భ్స్మను చూట్టుముట్టారు.     సరిగ్గా అప్పుడు రియాక్టయ్యాడు భస్మ.     అతనికి పిడికిళ్లు బిగుసుకున్నాయి.     ఫట్..ఫట్...ఫట్..     ఒక్కో ఆగంతుకుడు గాలిలోకి ఎవరో విసిరేసినట్టు ఎగురుతున్నారు. హాహాకారాలు రెస్టారెంట్స్ లో ప్రతిద్వనించాయి. అయితే నిముషాల్లో ఆ ఆగంతుకులు శవాల్లా పడిపోయారు. అతి నిర్దాక్షిణ్యంగా వాళ్ళని చవబాదుతున్నాడు భస్మ. అప్పటి వరకూ ఆ ఆగంతుకులను అసహ్యించుకున్న కస్టమర్లె, వాళ్ళమీద జాలి చూపించారు. క్షణాల్లో వాళ్ళు కుంటుతూ, మూలుగుతూ జీవుల్లో పారిపోయారు. భస్మ తాపీగా బిఉల్లు కౌతర్ లో చెల్లిచి బయటకు జీవుల్లో పారిపోయారు. భస్మ తాపీగా బిల్లు కౌత్ర్ లో చెల్లించి బయటకు నడిచాడు.                                                  ***     "ఏయ్...మౌన... ఏంటీ ఆలోచిస్తున్నావు? రెస్టారెంట్ నుంచి వచ్చిన ఎప్పట్నుంచి మంచం మీద బావుర్లాపడుకుని ఆలోచిస్తున్న మౌనాని అడిగింది భామిని. హొటల్ ల్లోంచి వచ్చాక అందరూ నైతీల్లోకి మారారు. మౌన మాత్రం డ్రెస్ కూడా చేంజ్ చేసుకోకుండా అలానే వుండిపోయింది.     "ఏయ్ మౌనా... నిన్నే... ఏమిటి పరధ్యానం... కొంపదీసి ఇందాకా రెస్టారెంట్ లో కనిపించిన రఫ్ అండ్ తఫ్ హీరో గురించి ఆలోచిస్తున్నావా? అయినా అతడేమిటే... టార్జాన్ సినిమాలో హీరోలా ఉలకడు. పలకడు... మొహంలో ఒక్క ఎక్స్ ప్రెషన్ కూడా లేదు. ఆ మానవుడు నవ్వి ఎన్నాళ్లయిందో?" అంది మౌనను ఉడికిస్తూ శర్మిష్ట.     "అది కాదే... ఆ మనిషిని చూస్తె రోబోలా అనిపించాడు. ఎంత తాపీగా నూడల్స్ తింటున్నాడు. మనమెంత టెన్షన్ గా వున్నామో... అతనంట రివర్స్ లో తాపీగా వున్నాడు. అతనిలో ఏదో సం థింగ్ స్పెషల్ వుందని ణా నమ్మకం" అంది లేచి కూచూంటూ మౌన.     "ఆ.. వుంది... మిద నైట్  మసాలా స్పెషల్... బహూశా ఏ అడవుల్లోనో తపస్సు చేసి, దేవుడు ప్రత్యక్షం కాకపోయేసరికి విసుగొచ్చి... గడ్డం తీసేసి, ప్యాంటూ షర్టు తగలించుకుని అరణ్యంలో నుంచి జనాణ్యంలో వచ్చి వుంటాడు. తపస్సు చేసి చేసి మాట్లాడం కూడా మరచిపోయుంటాడు జీవుడు" అంది సుచిత్రాశర్మ.
24,336
    బి.డి. గార్ వేర్- గార్ వేర్ పెయింట్స్ అధినేత ఒకప్పుడు రైల్వేలో నెలకు 35 రూపాయిల జీతానికి పనిచేశాడు.     ఒకప్పుడు గార్ వేర్ ఇంపీరియర్ బ్యాంక్ లో క్లర్క్ ఉద్యోగానికి వెళితే తిప్పి పంపేశారు. కాలగమనంలో అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారాక, అదే బ్యాంకుకి గార్ వేర్ వైస్ చైర్ మన్ గా చాలా సంవత్సరాలుగా వున్నాడు. ప్రీ మెట్రిక్యులేషన్ చదువుకునేందుకు కనీసం పుస్తకాలు కొనుక్కోలేని గార్ వేర్-తన కుటుంబాన్ని లాక్కురావడానికి చేయని పనిలేదు. ఆ తరువాత బ్యాంకులో గుమాస్తా ఉద్యోగం వచ్చినా వ్యాపారం మీద మక్కువతో సంవత్సరం తిరక్కుండానే వదిలేశాడు. ఆ తరువాత టాక్సీలను అద్దెకి తిప్పడం- అమ్మిపెట్టడం, కొనిపెట్టడం లాంటి కమీషన్ వ్యాపారం కూడా చేశాడు. అలాంటి గార్ వేర్ ఈనాడు భారతదేశపు ప్లాస్టిక్ పరిశ్రమకు మకుటంలేని మహారాజు 1980 నాటికే అతని టర్నోవర్ 70 కోట్లు. అంటే అతని ఒకప్పటి జీవితానికి ట్వంటీ మిలియన్ టైమ్స్ ఎక్కువ. ఇప్పుడు అతని టర్నోవర్ తేలిగ్గా వందకోట్లు దాటి వుంటుంది.     మోహన్ సింగ్ ఓబరాయ్...     సిమ్లాలోని సెపిల్ అనే హోటల్ లో నెలకు '45' రూపాయిలకు బిల్ క్లర్క్ ఉద్యోగం చేశాడు ఒకప్పుడు. అతనే కొన్నాళ్ళకు పట్టుదలతో ఆ హోటల్ ని కొనేసి దానికి యజమాని అయ్యాడు. అలాంటి 45 రూపాయిల జీతగాడైన ఓబరాయ్ కి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సొంత హోటల్స్ వున్నాయి. చెయిన్ ఆఫ్ హోటల్స్... ఆశ్చర్యంగా లేదూ? మూడు ఖండాలలో అతని పేరిప్పుడు వ్యాపార వీధులలో మారుమ్రోగుతుంటుంది. ఇప్పుడు సంవత్సరపు ఆదాయమెంతో తెలుసా? 15 మిలియన్ అమెరికన్ డాలర్స్. కేవలం తన శక్తి సామర్ధ్యాలతో, పట్టుదలతో, అకుంఠిత దీక్షా, దక్షతలతో హోటల్ తర్వాత హోటల్ నిర్మించుకుంటూ వెళ్ళాడు. పైగా అవన్నీ ఫైవ్ స్టార్ హోటల్సే. ఇప్పుడతని ఆస్థి అవలీలగా రెండొందల కోట్లుంటుంది. ఇలాంటివాళ్ళు ఎందరో... ఎందరెందరో మహానుభావులు. వారిముందు నేనెంత?"     సైంటిస్ట్ కి ఆశ్చర్యంతో నోరు పెగల్లేదు వెంటనే...     తెప్పరిల్లిన సైంటిస్ట్ ఆ మరుక్షణం పరిశోధనలోకి వెళ్ళి అహోరాత్రులు శ్రమించి సహజ వాయువుతో నడిచే వాహనానికి రూపకల్పన చేశాడు.                                         *    *    *    *     త్రినాధ్ కారు వెళ్ళి టెలిఫోన్ ఎక్చ్సేంజ్ బిల్డింగ్ ముందాగింది.     అప్పటికే వివిధ పత్రికల నుంచి వచ్చిన రిపోర్టర్స్ త్రినాధ్ ని చుట్టుముట్టారు ఏమిటి విశేషమంటూ.     చిరునవ్వుతో వారివేపు చూసి, తనతో రమ్మని తను చీఫ్ ఇంజనీర్ ఛాంబర్ వేపు సాగిపోయాడు.     మరో నిమిషానికి అందరూ చీఫ్ ఇంజనీర్ ముందున్నారు.     "సంఘంలోని అవినీతిని అరికట్టే సామాజిక బాధ్యత ప్రతి పౌరుడికి వుందని నా భావన" త్రినాధ్ సౌమ్యంగానే అన్నాడు.     ఇంజనీర్ త్రినాధ్ కేసి కోపంగా చూస్తూ "వాడ్డూ యూ మీన్?" అన్నాడు.     "మీరంటే మీరే అవినీతిపరులని నేననలేదు. మీ సంస్థలో అవినీతి పెద్ద ఎత్తున జరుగుతోందని నేను నిరూపిస్తాను. తగిన చర్య తీసుకుంటారా?" సీరియస్ గానే అడిగాడు.     చీఫ్ ఇంజనీర్ కి అరికాలిమంట నెత్తికెక్కింది. నిజానికి అతను నిజాయితీపరుడే. అందుకే త్రినాధ్ మీద అంత కోపం వచ్చింది.     "కూల్ డౌన్ మిస్టర్ ఇంజనీర్- మేం ప్రెస్ నుంచి వచ్చాం. మీరు నిజాయితీపరులైతే నిరూపించుకోండి. అప్పుడు మీ నిజాయితీ గురించే వ్రాస్తాం. గుమ్మడికాయల దొంగంటే భుజాలు తడుముకోవడమెందుకు?" ఓ రిపోర్టర్ సూటిగా అన్నాడు.     ప్రెస్ వాళ్ళతో పెట్టుకోవడం అంత మంచిదికాదని అతనికీ తెలుసు.     "ఓ.కె... నిరూపించండి" అన్నాడు చీఫ్ మొహాన్ని కందగడ్డలా చేసుకుని.     త్రినాధ్ లేచి "మిస్టర్ చీఫ్... ఇప్పుడు మనం టెలిఫోన్స్ మీటర్స్ వుండే రూమ్ కి వెళ్ళాలి" అన్నాడు కూల్ గా.     చీఫ్ కేమీ అర్ధంకాలేదు త్రినాధేం చేయబోతున్నాడన్నది.     చీఫ్ కోపంగా రీడింగ్ మీటర్స్ వుండే హాల్ కేసి సాగిపోయాడు.     అతని వెనకే త్రినాధ్, రిపోర్టర్స్ బయలుదేరారు.     మీటర్స్ రూమ్ ఇరవై అడుగుల దూరంలో వుండగానే "అదే మీరడిగిన రూమ్" అన్నాడు చీఫ్ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ. త్రినాధ్ చటుక్కున అందరికంటే ముందుకొచ్చాడు.     "మీరంతా దయచేసి నిశ్శబ్దంగా నన్ను ఫాలో అవ్వండి. డోర్ దగ్గర నాతోపాటే ఆగిపోయి లోపలకు తొంగిచూడండి చాలు అంతా మీకే అర్ధమవుతుంది" అన్నాడు త్రినాధ్ నడకలో వేగం తగ్గించి.     మరికొద్ది క్షణాలు అందరూ నిశ్శబ్దంగా హాలు డోర్ దగ్గరకు చేరుకుని లోపలకు తొంగిచూసి షాక్ తిన్నారు ఒక్కసారే.     లోపల ఇద్దరు వ్యక్తులున్నారు.     వాళ్ళు కొన్ని మీటర్స్ దగ్గరే నిలబడి ఏవో చక్రాల్ని వెనక్కు త్రిప్పుతున్నారు.     "లోపల ఏం జరుగుతుందో చూశారుగా ఫ్రెండ్స్! ప్రతి ఫోన్ ఎక్సేంజ్ లో ఒక మీటర్ ఫిక్స్ చేస్తారు. ఆ ఫోన్ సొంతదారుడికి ఎస్.టి.డి. ఏర్పాటు వుంటే అతను ఎన్ని నిమిషాలు ఫోన్ లో మాట్లాడితే అంతసేపు మీటర్ తిరుగుతూనే వుంటుంది. అలాగే లోకల్ కాల్స్ కి తిరుగుతుంటుంది. ఆ మీటర్ లో రికార్డ్ కానివి ట్రంకాల్స్ ఒక్కటే. ప్రతి నెలాఖరున ప్రతి నెంబర్ కి బిల్ ప్రిపేర్ చేస్తారు. ఆ మీటర్ లో చూపించిన రీడింగ్ ని బట్టే బిల్ ప్రిపేర్ చేస్తారు. సో... దీన్నిబట్టి లోపల జరిగే అవినీతి మీకీపాటికి అర్ధమై వుండాలి. ఫోన్ సొంతదారు దగ్గర లంచం తీసుకుని అతని నెంబర్ కి సంబంధించిన మీటర్స్ ని వెనక్కు త్రిప్పుతారు..."     చీఫ్ పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపడ్డాడు త్రినాధ్ ఆమాటలకు.     సరిగ్గా త్రినాధ్ విసిరినా ఛాలెంజ్ టైమ్ ఇరవైనాలుగు గంటలు పూర్తికావడానికి మరొక్క ఐదునిమిషాలే వుంది.     సుదర్శన్ రావు వేవరింగ్ గా వున్నాడక్కడ.     మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ "ఇరవైనాలుగు గంటలు పూర్తికావస్తున్నాయ్... ఎక్కడ అతని ఛాలెంజ్...? ఫోన్స్ పనిచేస్తూనే వున్నాయి. కాల్స్ వస్తూనే వున్నాయ్..." అన్నాడు సుదర్శన్ రావు కూతుర్ని ఉద్దేశించి.     ప్రియాంక ఓసారి వాల్ క్లాక్ వేపు చూసింది. మరో ఐదు క్షణాలే వుంది త్రినాధ్ పెట్టిన గడువు పూర్తికావటానికి.     ఛాలెంజ్ నెగ్గించుకోడా?     నెగ్గించుకొనేటట్లయితే మరో మూడు క్షణాలే మిగిలివుంది. అలా కాదే...?! త్రినాధ్ కా సామర్ధ్యం వుందని తనకెందుకో ఇంకా నమ్మకం వుంది.     మిగిలిన మూడు క్షణాలు ముగిసిపోయాయి.     క్రమంగా సుదర్శన్ రావు, యోగేష్ ల ముఖాల మీదకు చిరునవ్వు వచ్చేసింది.     మొత్తానికి ముగ్గురూ రిలాక్స్ అయ్యారు. కాని సుదర్శన్ రావులో సరికొత్త ఆలోచన తొంగిచూసింది. ఫోన్ కనెక్షన్స్ డిస్కనెక్ట్ చేయలేక పోయాడు త్రినాధ్. బానేవుంది పరువు దక్కింది. కాని తనింతవరకు ఛాలెంజ్ నెగ్గించుకుంటాడేమోనని పడిన ఆందోళనకు అర్ధం...? అంటే తను అంతర్గతంగా అతని స్థాయి పెరిగినట్లు ఒప్పుకున్నట్లేగా? అతను అన్న మాటను నెగ్గించుకునే సామర్ధ్యం కలవాడని తను పడిన ఆందోళన రుజువు చేస్తోంది. ఆశ్చర్యం-? నిజంగానే ఆశ్చర్యంగా వుంది.     ఏది ఎలావున్నా... ఎలా జరగనున్నా ఒకటి మాత్రం నిజం. అతను ఎదిగాడు. ఎదుగుతున్నాడు- ఎప్పటికీ ఎదుగుతూనే వుంటాడన్న దాన్ని అతను అడ్డుకోవాలి.     అప్పుడే అతనికి ఒకటి జ్ఞాపకానికొచ్చింది. ఒకప్పుడు త్రినాధ్ నిర్లక్ష్యంగా, పొగరుగా బొటనవేలి ముద్రవేసి తనవేపు విసిరేసిన తెల్లకాగితం... దాన్నిప్పుడు బయటకు తీయాలి. త్రినాధ్ ని ఒకే ఒక్క చావుదెబ్బ తీయటానికి మాత్రమే అది పనికివస్తుంది. ఎలా దాన్ని వుపయోగించాలి...?     త్రినాధ్ పై తొలిసారి అతనిలోని ప్రమాదకరమైన మనిషి నిద్రలేచే ప్రయత్నం చేస్తున్నాడు.     ఏమిటి త్రినాధ్ ఇలా చేశాడు...?     అతను ఆ పని చేయకపోతే బావుండనే ఆశాభావం ఓ ప్రక్క- అతను తప్పక ఆ పని చేయగలడనే నమ్మకం ఓ ప్రక్క ప్రియాంకలో అప్పటివరకు కదలాడాయి. పెట్టిన గడువు పూర్తయ్యేసరికి ఆమెలో ఒకింత ఆశాభంగం...     అంతలోనే ఉలికిపాటు.     ఏమిటి తను తన శత్రువు అన్నమాట నెగ్గించుకోలేదని బాధపడి పోవటం? ఇప్పటివరకూ ఎలాంటి హంగు, ఆర్భాటం, హడావిడి లేకుండా తన సత్రువుల్లో, మిత్రుల్లో వారికి తెలియకుండానే అనూహ్యమైన మార్పు తీసుకొచ్చాడు త్రినాధ్.     ఇప్పుడిక డైరెక్ట్ ఫైట్ కే దిగాడు.     కాని తొలి ప్రయత్నంలోనే దెబ్బతిన్నాడే పాపం...? సరీగ్గా ప్రియాంక ఇక్కడ అలా ఆలోచిస్తున్న సమయంలోనే అక్కడ త్రినాధ్ జర్నలిస్టులు, చీఫ్ ఇంజనీర్ ఎదురుగా కూర్చున్నారు.     తన హయాంలో ఎక్సేంజిలో అక్రమాలు జరగవని కొద్దినిమిషాల క్రితమే రెచ్చిపోయాడు అతను.     కానదెంతోసేపు నిలుపుకోలేకపోయాడు. తప్పు తన క్రింద ఉద్యోగులు చేసినా అది తనకే చుట్టుకుంటుంది. ఏక్షన్ తీసుకోక తప్పదు. పైగా తన డిపార్ట్ మెంట్ తప్పు జర్నలిస్ట్ ల ముందు బట్టబయలయింది.     కోపంతో ఇంజనీర్ ముఖం కొలిమిలా మారిపోయింది.     "మిస్టర్ ఆఫీసర్... ఇది మీకు తెలీకుండా జరిగినా పొరపాటే. కాని... దాన్నిప్పుడు సరిదిద్దుకోకపోతే మరింత పెద్ద తప్పవుతుంది. కోట్లలో వ్యాపార లావాదేవీలు నిర్వహించే సుదర్శన్ రావు ఫోన్ బిల్లులు మాత్రం వేలల్లోనే వుంటుంటాయి. దీన్నిబట్టి మీరిప్పుడు ఖచ్చితమైన నిర్ణయం తీసుకోలేదనుకోండి. మేము ఫోన్ బిల్లులు చెల్లించం- సరికదా కోర్టుకు వెళ్ళవలసి వస్తుంది..." త్రినాధ్ మాటలు సూటిగా వున్నాయి. అవి ఓ పక్క హెచ్చరిస్తూ, మరో పక్క సత్వర చర్యను సూచిస్తున్నాయి.     జర్నలిస్ట్ లు హుషారుగా వున్నారు.     సరికొత్త కరప్షన్...     ప్రపంచం దృష్టికి ఇంతవరకు రాని కరప్షన్...     దీనిమీద గొప్ప న్యూస్ స్టోరీని వెరీ ఇంట్రస్టింగ్ గా వ్రాయవచ్చు. ఫోన్ కాల్ ని నమ్మి వచ్చినందుకు నిజంగానే తమ పేపర్ కి మంచి న్యూస్ దొరకబోతోంది. ఈ లెక్క ప్రకారం సుదర్శన్ రావు లెంతమందో...?     ఆఫీసర్ బెల్ నొక్కాడు.     "సుదర్శన్ రావుకి సంబంధించిన ఫోన్స్ అన్నిటిని డిస్కనెక్ట్ చేయండి ఇమీడియట్ గా..." అన్నాడు ఆఫీసర్.     అసిస్టెంట్ ఇంజనీర్ ఒక్కసారి షాక్ అయ్యాడు. సుదర్శన్ రావు గురించి తెలిసే ఈ నిర్ణయం తీసుకుంటున్నాడా? నిజంగానే చెబుతున్నారా అన్నట్లుగా చూశాడు ఆఫీసర్ వేపు.     "మరో విషయం... ఇమీడియట్ గా అతనిమీద ఫైల్ పుటప్ చేయండి. క్విక్..." అన్నాడు మిలటరీ ఆర్డర్స్ పాస్ చేస్తున్న ధోరణిలో.     అసిస్టెంట్ ఇంజనీర్ కి నమ్మక తప్పలేదు. అతను భయపడుతూనే వెళ్ళిపోయాడు.     "ఓ ఫోన్ చేసుకోవచ్చా...?" త్రినాధ్ కూల్ గా అడిగాడు.     "ప్లీజ్" అన్నాడు ఆఫీసర్.     త్రినాధ్ నెంబర్ తిప్పి ఓ క్షణం కళ్ళు మూసుకున్నాడు.     "హలో... ఎవరూ?" ఆవేపున ప్రియాంక గొంతు వినిపించింది.     "తిమ్మడు... ది సేమోల్డ్ తిమ్మడు..." త్రినాధ్ చిరునవ్వు పెదాల మీద కదలాడుతుండగా అన్నాడు.
24,337
         "ఊరేగింపులూ, ఉత్సవాలూ మీలాంటివాళ్ళు చేస్తానంటే నేను పైసా ఇవ్వను. అనవసరంగా గొడవచెయ్యకుండా వెళ్ళండి. ఊ, వెడతారా? లేదా?" అని అరుస్తున్నారు రంగారావుగారు.         "వెళ్ళిపోతామండీ, చందా యిప్పించండి, వెళ్ళిపోతాం."         "చందాలేదు, గిందాలేదు, పొండి ఇక్కడ్నుంచి ప్రతివాడికీ తేలికగా సంపాదించి తగలెయ్యడానికి ఇదో ఆటయిపోయింది. చూస్తారేం ఇంకా? బయటకు నడుస్తారా లేదా?" అని రంగారావుగారు వాళ్ళకు దగ్గరగా వెళ్ళారు.         "అలా మీదిమీదికి వస్తారేమండీ? చందాలడిగితే వెళ్ళగొడతారేమిటి? మాకూ పరువుంది" అన్నాడు దృఢమైనవాడు.         "పరువు వున్నవాడివైతే ఇలాంటి పనులు చేయవు. నా ఇంట్లోంచి పో ముందు."         "నా పరువుగురించి నీకేం తెలుసయ్యా? పెద్ద బడాయిలు చెపుతున్నావు గానీ...."         "ఏడ్చావులే పో!"         "ఏమయ్యోవ్! మాటలు సరిగ్గా రానీ."         రంగారావుగారి శరీరం ఉద్రేకంతో వణికినట్లయింది. మాటలో జీర వచ్చినట్లయింది.         "నా ఇంట్లోకి వచ్చి నన్నే దబాయిస్తావురా రాస్కెల్! తాగివచ్చి అల్లరి చేస్తావా? చూడు నిన్నేం చేస్తానో?" అని ఇంకో అడుగు ముందుకు వేశాడు.         "ఏం చేస్తావేమిటి?"         "మెడబట్టి బయటకి గెంటుతాను."         "ఏదీ గెంటు చూద్దాం?"         కుమార్ ఇంకా ఆవేశం అణుచుకోలేకపోయాడు. మెరుపులా ముందుకు దూసుకువెళ్ళి ఆ వ్యక్తి మెడ పట్టుకున్నాడు. "దొంగరాస్కెల్! చూడు నిన్నేం చేస్తానో" అని రక్తం ఉడుకులెత్తుతుండగా ఒక్క గెంటు గెంటాడు.         ఆ మనిషి వెనక్కితూలి క్రింద పడబోయి, గోడను ఆధారం చేసుకుని నిలద్రొక్కుకుని కుమార్ నీ, తండ్రినీ ఇద్దర్నీ తిట్టసాగాడు. రెండవవాడు చూస్తూ నిలబడ్డాడు గానీ ఏమీ మాట్లాడటంలేదు.         కుమార్ వాడిని పిండిపిండిగా చితక్కొట్టేయాలన్నంత కోపంతో మళ్ళీ ముందుకు ఉరకబోయాడు.         రంగారావుగారి బలమైన హస్తం అతన్ని బలవంతంగా ఆపింది.         లోపలినుంచి ప్రభావతీ, విమలా, శారదమ్మగారూ చోద్యం చూస్తున్నట్లుగా నిలబడిపోయారు.         "ఒరేయ్, వాళ్ళు అలగావాళ్ళు వాళ్ళు ఏదో వాగారని మనం తొందరపడకూడదు. అసహ్యంగా నలుగురూ మూగుతారు. మనం ఓ దెబ్బ వేశామనుకో, తిరిగి వాడూ ఓ దెబ్బ వేస్తే మనకెంత అవమానం? మనం పెద్ద మనుషులం, పెద్ద మనుషుల్లా ప్రవర్తించాలి. పోలీసులకి ఫోన్ చేస్తానుండు" అంటూ ఆయన టెలిఫోన్ దగ్గరకు వెళ్ళాడు.         కుమార్ లో రగులుతున్న కోపాన్ని ఉప్పొంగుతున్న ఆవేశాన్ని ఎవరో నిర్ధయగా నడుం విరగ్గొట్టినట్లయింది. కానిసమయంలో పసలేని నీతులు బోధించినట్లయింది. నిగ్రహం అవలంబించకూడని సమయంలో నిగ్రహంతో బంధించినట్లయింది.         బయటినుంచి వాగుతున్న ఆ గూండాల్ని కసితీరా కొట్టాలని అతని అంతరంగం ఘోషిస్తున్నది. తండ్రి కిష్టంలేని  పని చేస్తున్నామన్న ఇంగితజ్ఞానం ఆ ఘోషని మూగక్షోభగా చేసింది.         తండ్రి బాల్యంగురించి అతనికి తెలుసు. ఎంతో విన్నాడు. పచ్చిగా తిరిగాడు. ఎన్నో దెబ్బలాటల్లో ఇరుక్కున్నాడు. ఎంతమందినో పిచ్చిగా తన్నాడు. కానీ కొడుకు ఆవేశం చూపించాల్సిన సరైన సమయంలో అక్కడి థ్రిల్ నీ, సంఘటనల్లోని థ్రిల్ కాదు జీవితంలోని థ్రిల్ ని చంపేస్తున్నాడు.         వాడు గేటుదగ్గర నిలబడి రోడ్డుమీద జనమంతా వినేటట్లుగా పెద్దగా కేకలు పెడుతున్నాడు. ఇలాంటి అదనుకోసమే పుట్టినట్లు కనిపించే జనం అప్పుడే గుమిగూడటం మొదలుపెట్టారు.         రంగారావుగారు కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేశారు. కంట్రోల్ రూం నెంబరు టెలిఫోన్ డైరెక్టరుమీద పెద్ద అంకెలతో వేసి ఎమర్జన్సీలో సహాయంకోసం ఫోన్ చెయ్యమని రాసివుంది.         అటునుంచి ఎవరో ఎత్తారు. రంగారావుగారు ఎవరో త్రాగుబోతు వచ్చి ఇంట్లో దూరి అల్లరి చేస్తున్నారనీ, వెంటనే సహాయం కావాలనీ అడిగారు. అటువైపునుంచి రైటర్ పలికాడు. ఊళ్లోకి మినిస్టర్ గారు వస్తే పోలీసు బలగమంతా బందోబస్తుకోసం వెళ్ళారట. అక్కడ తను తప్ప ఎవరూ లేరట. ఆ పేట పోలీస్ స్టేషన్ కి ఫోన్ చెయ్యమని సలహా ఇచ్చాడు.         రంగారావుగారు పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేశాడు.         అక్కడ్నుంచీ రైటర్ పలికాడు. మినిస్టర్ గారు వస్తే పోలీసులంతా ఏర్పాట్లకోసం వెళ్ళారట. తను ఒక్కడ్నే వున్నాననీ, కంట్రోల్ రూమ్ కి ఫోన్ చెయ్యమని సలహా ఇచ్చాడు.         రంగారావుగారు కోపాన్ని దిగమింగుకుంటూ ఫోన్ పెట్టేసి నిస్సహాయంగా నిలబడిపోయారు.         బయట త్రాగుబోతువాడి విజ్రుంభణ ఎక్కువయింది. చుట్టూరా గుమిగూడిన జనం ఎక్కువకాసాగారు. వాళ్ళకు వినోదంగా వుంది.         వాడు మధ్య మధ్య బూతులు కూడా కూస్తున్నాడు.         సుధాకర్ కి అప్పుడే మెలకువ వచ్చింది. బయట గలాభా ఏమిటా అని ముందు గదిలోకి వచ్చి చూసేసరికి పరిస్థితి అర్ధమయింది. అన్నగారి ముఖంలోకి, తండ్రి ముఖంలోకి చూశాడు. గేటులోంచి మాటలు కర్ణకఠోరంగా వినిపిస్తున్నాయి. అతని ఒళ్ళు వేడెక్కింది. రక్తం వేడెక్కింది. నరాలు ఇనుపతీగల్లా అయినాయి. ఒక్క ఉదుటున బయటకు దూకాడు.         త్రాగుబోతువాడి కంఠాన్ని రెండు చేతులతో పట్టుకున్నాడు. మెడ ఆధారంగా చేసుకుని గిరగిరమని త్రిప్పేశాడు.         వాడు హఠాత్తుగా వచ్చిపడిన ఈ పిడుగుపాటుకు త్రుళ్ళిపడి, సర్దుకోడానికి ప్రయత్నిస్తూ సుధాకర్ ని కొడదామని చేయెత్తబోతున్నాడు.         సుధాకర్ వాడికి అవకాశం ఇవ్వలేదు. వాడు చెయ్యిఎత్తేలోగా డొక్కలో బలంగా తన్నాడు. అతను పెద్ద స్పోర్ట్స్ మెన్. అతని కాళ్ళు ఉక్కుకడ్డీల్లా ఉంటాయి.         అంత బలమైనవాడూ దభీమని నేలకూలాడు.         వాడి మెడమీదా, మొహంమీద బండరాళ్ళతో మోదినట్లు తన్నులు పేలిపోతున్నాయి. కదలడానికి సందీయడంలేదు.         లేవడానికి ప్రయత్నించినప్పుడల్లా, రెండు చేతులతో పట్టుకుని విసిరి పారేస్తున్నాడు.         త్రాగుబోతువాడి పళ్ళు విరిగి, నోట్లోంచి రక్తంకారేదాకా తన్నాడు సుధాకర్.         చుట్టూ చూస్తున్న జనంలోంచి ఎవడూ ముందుకు రాలేదు.         ఆ రెండోవాడు ఎప్పుడు పలాయనం చిత్తగించాడో ఎవరికీ తెలియదు.                                       7         ఆ రోజు ఆదివారం ఆదివారం వచ్చినా, మరేదన్నా పండుగలు వచ్చినా ప్రభావతికి చచ్చే భయం. పిల్లలకు స్కూలు వుండదేమో ఇంట్లోనే వుండి ప్రాణాలు తినేస్తారు.         తమ చిన్నప్పుడు తాము ఇంత అల్లరిచేశారా? ప్రభావతికి తెలియదు. కానీ ఆ రోజులకు, ఈ రోజులకూ ఏదో తేడా వున్నట్లు కనిపిస్తుంది. ఈ తేడా ఎక్కడ ఎట్లా వచ్చిందో తెలియదు.         రంగారావుగారు, కుమార్ డిస్పెన్సరీకి వెళ్ళిపోయారు. హరి స్నేహితుల దగ్గరకు వెళ్ళాడు. సుధాకర్ ఇంట్లో లేడు.         కుమార్ మొగపిల్లలిద్దరూ డాబాఎక్కి గాలిపటం మొదలుపెట్టారు. ఐదు పైసలు పెట్టి ఎక్కడినుంచో గాలిపటం తీసుకువచ్చారు. దానికి సూత్రం కట్టారు. తోక అంటించారు. దారపు వుండ తీసుకొచ్చారు. గాల్లో ఎగరేస్తున్నారు. అది కాస్త పైకి ఆకాశంలో ఎగరగానే అనందాతిరేకంతో కేకలు పెడుతున్నారు. వాళ్ళు ఎగరేయడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళ ముఖాల్లో సీరియస్ నెస్, అది ఎగురుతున్నప్పుడు వెల్లివిరిసే తృప్తి, ఆనందం చూసితీరాలి.
24,338
       "మనం క్వీన్స్ ఏడ్స్ ఏజెన్సీకి బకాయి ఏమన్నా వున్నామా?"         మౌనిక చక్రధర్ని ప్రశ్నించింది సడన్ గా ఏదో గుర్తుకు రాగా.         "ఉంది మేడమ్."         "ఏమాత్రం?"         "పదిహేను లక్షలు దాకా."         "మీరో పనిచేయండి. పది లక్షలు ఆపి కేవలం ఐదు లక్షలు మాత్రం ఇవ్వండి. గంగాధరరావుగార్కి భరద్వాజ యివ్వవలసిన పది లక్షల బాకీని తీర్చకుండా ఆపేశాడు. మనం భరద్వాజకు యివ్వవలసిన పది లక్షల్ని డైవర్ట్ చేసి గంగాధరరావుగారి ఎకౌంట్ కి క్రెడిట్ చేయండి. అయితే ఈ విషయం ఇప్పుడే గంగాధరరావుగార్కి తెలియకూడదు...."         మౌనిక చెప్పింది విని చక్రధర్ ఆమెను మెచ్చుకోకుండా వుండలేక పోయాడు.         "గంగాధరరావుగార్కి భరద్వాజ పదిలక్షలు ఇవ్వాలి. మన గంగాధర రావుగారికి పది లక్షలు యివ్వాలి. అలా అని లీగల్ గా డాక్యుమెంట్స్ తయారు చేయించండి. మన లీగల్ ఎడ్వయిజర్ని పిలిపించి ఆ ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయించండి. మన ఫైనాన్స్ డైరెక్టర్ కి మీకు తెలీకుండా భరద్వాజకు బకాయి చెల్లించవద్దని ఇన్ స్ట్రక్షన్స్ యివ్వండి...." అంది మౌనిక ఏదో ఫైల్ తిరగవేస్తూ.         అప్పుడప్పుడు చక్రధర్ అనుకుంటుంటాడు. మరి కొన్నేళ్ళలోనే ఈమె ది గ్రేట్ జె.జె.ని డామినేట్ చేసితీరుతుందని. రైట్ టైమ్ లో రైట్ డిసిషన్ ని ఏ మాత్రం సంకోచం లేకుండా తీసుకుంటుంది. ఈమె ఆలోచనలు, అంచనాలు ఒక రూపాన్ని సంతరించుకోవటమే తరువాయి. ఇంకా తరువాత తనకు కావలసిన అన్ని పనుల్ని ఆర్డరు వేసి చేయించుకుంటుంది. కాన్ సీక్వెన్సెస్ ని తలుచుకుని, ఊహించుకుని భయపడటం ఆమె నిజానికే విరుద్దం. అందం, చందం, వివేకం, తెలివితేటలు, అపారసంపద, హై ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, సోషల్ గ్రేసెస్ వున్న మౌనిక ఎవరికి భార్య అవుతుందో...... అతను లక్ష జన్మలు తపస్సు చేస్తే ఆమెకు భర్త అయ్యేందుకు అర్హత పొందుతాడు. ఏడు పదుల వయసు దాటిన జె.జె. రెండున్నర పదులు మాత్రమే దాటబోతున్న ఈమెకే పట్టం కట్టబోతాడు? అప్పుడిక ఈ ఎంపైర్ జనరల్ మోటార్ కంపెనీ స్థాయికి వెళ్ళినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో...         "జె.జె. ఎంఫైర్ అస్థిత్వాన్ని, సోషల్ ప్రెస్టేజ్ ని లెక్కచేయని వాళ్ళకు తగిన గుణపాఠం నేర్పాలి. కోర్టుకి వెళతానని వీనస్ మనల్నే బెదిరించింది. అలుసిస్తే ఇవాళ ఆమె, రేపు మరొకరు. అందుకే ఈ పదిలక్షల ద్వారా ఒక గుణపాఠం నేర్పాలి" అంది పట్టుదలగా మౌనిక.         ఆమెకింకా వీనస్ అన్న మాటలు గుర్తుండటం చక్రధర్ కి ఆశ్చర్యమే వేసింది.                                   *    *    *    *    *         ఒకరోజు పని అని ఢిల్లీ వెళ్ళిన మాధుర్ మరో రెండు రోజులు అక్కడే వుండి తను చేయదలుచుకున్న అండర్ గ్రౌండ్ వర్క్ ను ఫినిష్ చేశాడు.         ఆ మరుసటిరోజే జాతీయ దిన పత్రికలో ఒక ప్రకటన వచ్చింది.         దాన్ని చూస్తూనే భరద్వాజ షాక్ తిన్నాడు.         వీనస్ మెంటల్ గా అప్ సెట్ అయింది.         మౌనిక మౌనంగా నవ్వుకుంది.                 ప్రకటన     వినియోగదారుల ప్రయోజనార్ధం ప్రచురిస్తున్నాం.         బి.పి.ఎల్. టి.వి. ఇచ్చిన ఎడ్వర్టయిజ్ మెంట్ లో తమ బ్రాండ్ ఇతర బ్రాండ్స్ అమ్మిన టి.వి. సెట్స్ వివరాలను యిచ్చింది. అది వినియోగదారులను తప్పుదారి పట్టించేదిగా వుంది.         1. టి.వి.న్యూస్ అనే పాపులర్ మేగజైన్ ఇండియాలో వున్నట్లు, అదే తమ సేల్స్ ను ధృవీకరించినట్లు ఇచ్చిన వార్త అసత్యం. అలాంటి పత్రిక ఇండియాలో లేదు. అదంతా తాము అల్లిన కథే!         2. తమ ప్రకటనలో బి.పి.ఎల్ ఇచ్చిన ఫిగర్స్ తప్పు. నిజానికి ఓనిడా, క్రౌన్, డయనోరా, వెస్టన్ బ్రాండ్స్ దానికంటే ఎక్కువ యూనిట్స్ అమ్ముడుబోతున్నాయి.         3. 1988-89 వీడియోకాన్ బ్రాండ్ ఒక్కటే 2,00,000 యూనిట్స్ అమ్ముడుపోయింది. వీడియోకన్ ఇండియాలో కలర్ టీవీలు ఉత్పత్తిచేసే అతి కొద్ది పెద్ద కంపెనీలలో ఒకటి. (వీడియోకాన్ గ్రూప్ ఆడిటర్ సర్టిఫికెట్ ను మేము అందుకున్నాం).         4. బి.పి.ఎల్.గుడ్ మార్కెట్ ను ఎంజాయ్ చేయలేక వీడియోకాన్ మరి ఇతర పెద్ద టీవీ కంపెనీలను డిఫేమ్ చేసేందుకు ప్రయత్నించింది.         అలాంటి తప్పుదారి పట్టించే ప్రకటనల్ని మీ ప్రయోజనార్ధమే ఈ వివరాలు మీకందిస్తున్నాం.         వినియోగదారుల ప్రయోజనార్ధం దీన్ని విడుదల చేసినవారు.         కన్స్యూమర్ రైట్స్, ప్రొటెక్షన్ సొసైటీ ప్రకటన ఇలా వుంది.            ఆ రోజంతా భరద్వాజ ఫైర్ అవుతూనే వున్నాడు. అదంతా చేసింది మాధురేనని తెలుసు. కాని ఏం చేయగలడు? అందుకే పిచ్చెక్కిపోయాడు.     ఈలోపు బి.పి.ఎల్. యజమానులు భరద్వాజపై మండిపడ్డారు.         పరువు ప్రతిష్టలుగల నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లయిడ్ ఎకనామిక్ రిసెర్చ్ సంస్థ ఇండియాలోని టీవీ వినియోగదారుల్ని శోధించిందని తిరిగి బి.పి.ఎల్. ఇచ్చినట్టు ప్రకటన ఇవాల్సి వుంది. కానప్పటికీ దెబ్బతిన్న భరధ్వాజ ప్లస్ పాయింట్స్ ని కేచ్ చేయలేకపోయాడు. దాంతో బి.పి.ఎల్. భరద్వాజ బి.పి.ఎల్. ఏడ్ ఏజెన్సీని రద్దుచేసింది. (ఈ బ్రాండ్ వార్ ఇటీవల కాలంలోనే వాస్తవంగా జరిగింది- రచయిత)                                  *    *    *    *    *         సాయంత్రానికి లీగల్ ఎడ్వైజర్ సహాయంతో ఓఅక నిర్ణయానికి వచ్చి, అందుకు తగ్గట్టుగా డాక్యుమెంట్స్ ని ప్రిపేర్ చేయించాడు చక్రధర్.         ఆ వెంటనే బయలుదేరి గంగాధరరావు ఇంటికి వెళ్ళిపోయాడు చక్రధర్.         గంగాధరరావు ఇంటికి పూర్వవైభవం తిరిగి వచ్చింది.         మేడిసన్ ఎవెన్యూ ప్రచారరంగంలో క్రమంగా ఒక్కోమెట్టుపై విజయం సాధిస్తూ దాదాపు ముఫ్ఫై కంపెనీలను తన క్లయింట్స్ గా చేసుకోగలిగింది. బిజినెస్ పెరిగింది. దాంతోపాటు ఆదాయమూ పెరిగింది. త్వరలోనే షేర్ మార్కెట్ లోకి వెళ్ళేందుకు సిద్దమవుతోంది.         చక్రధర్ మధ్యహాల్లోకి ఎంటర్ అయ్యేసరికి గంగాధరరావు తన భార్యతో కూర్చుని మరో వ్యక్తితో మాట్లాడుతూ కనిపించాడు.         వాళ్ళు మాట్లాడుతున్న మాటల్నిబట్టి గంగాధరరావు తన భార్యతో కూర్చుని మరో వ్యక్తితో మాట్లాడుతూ కనిపించాడు.         వాళ్ళు మాట్లాడుతున్న మాటల్నిబట్టి గంగాధరరావు కూతురికేదో పెళ్ళి సంబంధం మాట్లాడుతున్నారని చక్రధర్ గ్రహించాడు.         లక్ష్మీదేవి ఇంటి తలుపు తట్టడం అంటే ఇదేనేమో-? భరద్వాజ ఇక ఇవ్వడని వదిలేసిన పదిలక్షలు తను ఇవ్వాలని ఎందుకనుకుంటుంది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్? భరద్వాజ లాంటి డేంజరస్ బిజినెస్ మెన్ తో తలపడటం గంగాధరరావులాంటి సాధుస్వభావమున్న వ్యాపారస్తుడికి సాధ్యమేనా? పదిలక్షలు మిగిలిపోయాయని ఆనందించే భరద్వాజ ఎలా రియాక్ట్ అవుతాడు ఈ సంగతి తెలిస్తే?         చక్రధర్ ఆలోచనల్నుంచి తేరుకుంటూ "నమస్తే సార్.... నాపేరు చక్రధర్."         "నమస్తే... కూర్చోండి. నా కూతురు పెళ్ళి విషయం మాట్లాడేప్పుడు వచ్చారు అతిధిగా. నాకు చాలా సంతోషంగా వుంది..." అంటూ భార్యవేపు చూసి "అనుకోని అతిథి శుభప్రదం అంటారు. ఈ సంబంధం మనమ్మాయికి ఖాయమవుతుంది. నువ్వెళ్ళి స్వీట్స్ పట్టుకురా" అని తిరిగి చక్రధర్ వేపు చూశాడు.         చక్రధర్ ఏదో చెప్పేందుకు ప్రయత్నిస్తుండగా-         "మీరెవరో.... ఎందుకొచ్చారో ఇప్పుడు చెబుతారు అవునా? మీరెవరో తెలిశాక ఆతిథ్యమిస్తే అది మీ స్థాయిని చూసి ఇచ్చినట్లవుతుంది. దాని మూలంగా అతిథిఫలం మాకు దక్కదు. నాకు కొంచెం చాదస్తం బాబూ! పరమ ఆస్తికుడ్ని, ఖర్మసిద్దాంతాన్ని మనసా వాచా నమ్మే పాతకాలం మనిషిని మరోలా అనుకోవద్దు. ఇంట్లో ఒక శుభం జరిగేప్పుడు అతిధి వెతుక్కుంటూ రావటం గొప్ప అదృష్టమని మా కుటుంబ విశ్వాసం...." గంగాధరరావు అంటుండగానే ఆయన భార్య వెండిప్లేట్లో స్వీట్స్ తీసుకొచ్చింది.         చక్రధర్ గంగాధరరావు మంచితనానికి అప్రతిభుడవుతూ స్వీట్ తీసుకొని నోట్లో వుంచుకున్నాడు.         ఇంత మంచి మనిషికి ద్రోహం తలపెట్టిన భరద్వాజ అనుభవించక తప్పదు. మంచివాడు గనుకే తను పోగొట్టుకున్న పదిలక్షలు వెతుక్కుంటూ వచ్చాయి. ఇలాంటి మంచి పనిలో పాలుపంచుకునే అవకాశాన్ని మౌనికకు మనస్సులోనే కృతజ్ఞతలర్పించుకున్నాడు చక్రధర్.         అతను స్వీట్ తినటం పూర్తిచేయటం చూసి-         "ఇప్పుడు చెప్పు బాబూ! ఎవరు మీరు? ఏ పనిమీద వచ్చారు?" అన్నాడు గంగాధరరావు సౌమ్యంగా.         "మీకు భరద్వాజ పదిలక్షలు బకాయి యివ్వకుండా ఆపేసాడట" చక్రధర్ సూటిగా విషయంలోకి వస్తూ అన్నాడు.         గంగాధరరావు ఓ క్షణం మౌనంగా వుండి-         "అది నా కష్టార్జితమైతే వస్తుంది. లేదంటే పోతుంది ఏది వచ్చినా, ఏది పోయినా భగవంతుడనేవాడు ఒకడున్నాదుగా బాబూ....ఆయన చల్లగా చూస్తేచాలు. ఎవరికేం చేయాలో, ఏది ఇవ్వాలో, ఎంతివ్వాలో ఆ షిర్డిసాయి నిర్ణయిస్తాడు. మన చేతుల్లో ఏముంది?" అన్నాడు వేదాంతధోరణిలో.
24,339
    "అందుకు నాకు మీ సహకారం కావాలి."     "మిస్టర్ కిరీటి! నా వలన మీ కెటువంటి సహకారం కావాలో వివరంగా చెప్పండి. ఎంత కష్టనష్టాలకు కారణమైందైనా ఫర్వాలేదు. మీతోగల స్నేహబంధానికి శిరస్సువంచి మరీ అనుసరిస్తాను!" దృఢంగా పలికాడు యోగేంద్ర.     "ఆ నమ్మకం నాకు కుదిరాకనే మిమ్మల్నిలా అడుగుతున్నాను మిస్టర్ యోగీ!" అనుకున్నాడు మనసులో.     "నాకీ రోజు చాలా ఆనందంగా వుంది యోగీ! ఎందుకో తెలుసా? నా గతాన్ని సైతం చెప్పుకోగల ఓ మంచి ఆత్మీయుడు దొరికినందుకు.... నాకు ఎటువంటి ఆసరానైనా ఇవ్వగల ప్రాణస్నేహితుడు లభించనందుకు. కన్య గురించి ఒకనాడు మీకు పూర్తిగా చెప్పాను కదూ..."     "అవును..."     "కాని నా గురించి మాత్రం ఇవాళ చెబుతున్నాను. కారణం... మీ సహకారాన్ని ఆశించేముందు నేనెవరన్నదీ ముందు చెప్పడం అవసరం కాబట్టి. మిస్టర్ యోగీ! నేనో అనాధని. నా బాల్యంలోనే తండ్రిపోయాడు. కాస్త ఎదిగాక నన్నో తాత చేతిలోపెట్టి అమ్మ పోయింది. ఆ తర్వాత కొన్ని విపత్కర పరిస్థితులలో నన్ను ఒంటరివాడ్ని చేసి తాత కూడా ప్రాణాలు వదిలాడు. అప్పటికి నేను కేవలం పదేళ్ళ వాడ్ని. చూసే దిక్కలేక బ్రతకటానికి మార్గం తెలియక ఆకలితో కొన్ని రోజులపాటు నలిగిపోయాను.     ఒకనాడు సింహాచలం దేవాలయ ప్రాంగణంలో శోషవచ్చి పడిపోయిన నన్ను దైవదర్శనానికి వచ్చిన చక్రవర్తిగారు చూశారు. నాలో ఏం కనిపించిందో మరి తన బంగళాకి తీసుకువచ్చి నాకు ఆశ్రయం ఇవ్వటమేగాక ట్యూషను పెట్టించి చదువుకూడా చెప్పించారు. అదృష్టవశాత్తూ నాకు తల్లిలేని కన్య ఆత్మీయత కూడా దొరికింది. ఫుట్ పాత్ పై ముష్టివాడిగా మిగిలిపోవాల్సిన నేను ఫోష్ బంగళాని చేరుకున్నాక చక్రవర్తి గారు చలువతో చదువుకోవటం మాత్రమే గాకుండా అనతికాలంలోనే ఆయన తలలోని నాల్కనైపోయాను. ఆ తర్వాత కన్య జైలుపాలు కావటం, చక్రవర్తిగారు ప్రాణాలు వదులుతూ యీ యావదాస్తి నా చేతుల్లో వుంచటమూ మీకు తెలిసిందే. ఇప్పుడు చెప్పండి మిస్టర్ యోగీ! అలాంటి దేవుడి దయను పొందిన అదృష్టానికి నా కన్ని అర్హతల్ని కల్పించిన ఆ మహానుభావుడి కన్న కూతురికి నేను ఏమీ చేయలేనినాడు నా బ్రతుక్కో అర్ధం లేనట్టేకదూ!"     కిరీటి ఒకనాటి తన పరిస్థితిని వివరిస్తున్నప్పుడు యోగేంద్ర ఆలోచనలకేదో ఆధారం దొరికినట్టయింది.     ఇన్నాళ్ళుగా మనసులో మెదులుతున్న అనుమానానికి జవాబు లభ్యమైనట్టనిపించింది. ముందుగా అది నివృత్తి చేసుకోవాలనుకున్నాడు. కాని మళ్ళీ ఏదో జంకు. అందుకే ఆగిపోయాడు. కాదు బలవంతంగా ఆరాటాన్ని అణుచుకున్నాడు.     "అయినా మీరిప్పుడు కన్యను ఏం అన్యాయం చేశారని...." అన్యమనస్కంగా అన్నాడు యోగేంద్ర.     "లేదు మిస్టర్ యోగీ.... నూరేళ్ళ సౌభాగ్యాన్ని అర్ధాంతరంగా పోగొట్టుకున్న అభాగ్యురాలు కన్య. కన్య ఎప్పుడూ నవ్వుతూనే వుండాలి. మోడువారిన కన్య బ్రతుకు మళ్ళీ చిగురించాలి. కన్యకు చెందాల్సిన యావదాస్తిని నేను ఆమెకు అప్పచెప్పాలి. అదే నా ఆకాంక్ష. అలాంటి యోగ్యుడు, సంస్కారవంతుడూ అయిన వ్యక్తికోసమే ఇన్నాళ్ళూ నేను ఎదురుచూసింది."     కిరీటి తననుంచి ఏం కోరుతున్నాడో యోగేంద్రకు అర్ధమైంది.     నిజానికి తన అభీష్టాన్ని కన్యకేనాడో చెప్పాడు.     కన్య ఆ అవకాశమిస్తే అది తన అదృష్టంగా భావిస్తానని ఆరోజే స్పష్టం చేశాడు కూడా.     కిరీటి అభిప్రాయం కూడా అదే అయితే తనకు ఆనందదాయకమే.     కాని తను కోరుతున్నది కన్యను మాత్రమే.     కన్య వెనుకున్న ఆస్థిపాస్తుల్ని కాదు.     కన్య వివాహంతో తన అధికారాన్ని వదులుకోవటమే కిరీటి లక్ష్యమైతే ఆ వివాహానికి తను సుముఖుడు కాలేడు.
24,340
    అక్కడ అతన్ని ట్రాప్ చేయటానికి ఏర్పాట్లు రెడీ అయ్యాయి. వీ విల్ కాచ్ హిమ్ డెడ్ ఆర్ అలైవ్" అని సెల్యూట్ చేసి వెళ్ళిపోయాడు శ్రీనివాస్.     నిస్త్రాణగా వెనక్కి జారగిలబడిపోయాడు కృష్ణాజీ.     కీర్తిని పట్టుకుంటాడట!     డెడ్ ఆర్ అలైవ్!                                                     *    *    *    *     సాయంత్రం అవుతుండగా కృష్ణాజీ ఫోను రింగయింది.     లైన్లో అవతలి వేపున హోం మినిస్టర్ విజయకుమారి.     "యస్ మేడమ్!" అన్నాడు కృష్ణాజీ అనీజీగా.     "నీ అంత ఎఫిషియంట్ ఆఫీసర్ ఈ భూమ్మీద వుండడు" అంది విజయకుమారి ఆగ్రహంగా.     "మేడమ్!"     "సిగ్గూ ఎగ్గూ వుండదా మీ ఆఫీసర్లకి. ఇంత ఘోరం జరిగిపోయినా రాయిలాగా చలనం లేకుండా ఎలా వుండగలుగుతున్నావ్?" అంది విజయకుమారి.         "మేడమ్? ఏమయింది?" అన్నాడు కృష్ణాజీ సాధ్యమైనంత మర్యాదగా.     "నీ సబార్డినేట్....శ్రీనివాసేనా....యంగ్ బాస్....పాపం ఫినిషైపోయాడు."     కుర్చీలో నిటారుగా కూర్చున్నాడతను.     "మేడమ్!" అన్నాడు షాక్ అయిపోయి.     "అవును! రెయిడ్ చెయ్యడానికి ఆ ఇన్ ఫార్మర్ తో కలిసి వెళ్ళింది శ్రీనివాస్ పార్టీ.     నర్సాపూర్ అడవుల్లోకి తీసుకెళ్ళాడు ఇన్ ఫార్మర్.     అక్కడ వీళ్ళకోసం కాచుకుని వున్నారు కీర్తి మనుషులు.     ఏ.కే. 56 రైఫిల్ తో పిట్టల్ని కాల్చినట్లు కాల్చిపారేశారు పోలీసు పార్టీని.     శ్రీనివాస్ శవానికి తల నరికేశారు.     నీ మనుషులు ఎలా మోసపోయారో అర్థమయ్యిందా?     ఇన్ ఫార్మర్ నంటూ వచ్చి లొంగిపోయిన మనిషి కీర్తిని వదిలేసి వచ్చినవాడు కాదు.     స్వయంగా కీర్తి పంపితే వచ్చిన మనిషే.     చాలా తెలివిగా మీ మనుషుల్ని నమ్మించి, కీర్తి స్థావరం చూపిస్తానని తీసికెళ్ళాడు. మీ వాళ్ళు తేలిగ్గా మోసపోయారు. మీ తెలివితక్కువతనం ఖరీదు ఏడు ప్రాణాలకి లెక్క తేలింది.     కృష్ణాజీ! యూ ఆర్ సింప్లీ యూస్ లెస్"     ఆ వార్త వినగానే ముందు సంతోషం, ఆ వెంటనే విచారం ఆవరించాయి కృష్ణాజీ మనసుని.     పోలీసు పార్టీ తన కొడుకుని చంపలేకపోయినందుకు సంతోషం!     తన కొడుకు పోలీసు పార్టీని చంపినందుకు విచారం!     "కృష్ణాజీ! గుర్తుంచుకో. ఇంకొక్క వారమే నీకు టైముంది. ఆ తర్వాత బహుశా నువ్వింక ఆఫీసుకి రావలసిన అవసరం వుండదు. అలా టాకిల్ చేస్తాను నీ కేసుని" అంది విజయకుమారి.     అని పెద్ద చప్పుడు వచ్చేటట్లు విసురుగా పెట్టేసింది రిసీవర్ ని.     స్థాణువైపోయినట్లు కదలకుండా కూర్చున్నాడు కృష్ణాజీ.     పదిహేను నిమిషాల తర్వాత అతనికొక వైర్లెస్ మెసేజ్ వచ్చింది.     హోం మినిస్టర్ చెప్పిన న్యూసే.     అప్పుడు స్ఫురించింది కృష్ణాజీకి.     తనకు వైర్ లెస్ మెసేజ్ రాకముందే విజయకుమారి దగ్గర్నుంచి ఫోన్ వచ్చింది.     నిజానికి ఆమెకంటే తనకే ముందు తెలిసి వుండాలి ఈ వార్త.     అంటే....కీర్తే స్వయంగా చెప్పి వుంటాడు విజయకుమారికి ఈ విషయం.     ఒక మహా నేరంలో తను కూడా భాగస్వామి అవుతున్నాడేమో అన్న భయంతో కృష్ణాజీకి ఒక్కసారిగా బీ.పి. పెరిగిపోయినట్లయింది.     ఆ తర్వాత మళ్ళీ అతని ఆలోచనలు శ్రీనివాస్ మీదికి మళ్ళాయి.     స్మార్ట్ గా వుండే కుర్రాడు.     అందగాడు కూడా.     వర్క్ అంటే చాలా కమిట్ మెంట్ వుంది అతనికి.     డ్యూటీ కోసం ఇంత యంగ్ ఏజ్ లోనే ప్రాణాలు అర్పించేశాడు.     పాపం! ఎవరు కన్న బిడ్డడో!     ఆ తల్లిదండ్రుల మనసులు ఎంతగా కోతకి గురవుతాయో!     కడుపు తీపి అందరికీ ఒక్కలాగే ఉంటుందా?     ఉండదేమో?     ఉంటే, ఆ దాసు అనే నికృష్టుడు రాజాని అంత ఘోరంగా ఎట్లా ట్రీట్ చేస్తాడు?     రాజా అసలు తన కొడుకే కానట్లు ఎట్లా ప్రవర్తిస్తాడు?     అయితే, ఈ లెక్కన తనకి పుత్రప్రేమ మరీ అతిగా వున్నట్టా?     ఏమో?     ఆ రాత్రి ఆరు స్లీపింగ్ టాబ్లెట్లు వేసుకుంటేగానీ కృష్ణాజీకి నిద్ర అనేది పట్టలేదు.     తెల్లవారుజామున కొద్దిగా కునుకు పడుతుండగా, ఉలికిపాటుతో గ్రహించాడు కృష్ణాజీ.     కీర్తి తిరిగి వచ్చాక -
24,341
    (కుత్సుడు ఇంద్రుని రథమున ఇంద్రసహితుడై సొగును తేనెటీగలే మధువునిచ్చును. కాని అశ్వినులు చేసిన మధువు తేనెటీగలనే మురిపించునంతటిది!)     7. అశ్వినులారా! మీరు "భుజ్యు"ని సముద్రము నుండి రక్షించినారు. మీరు రాజగు 'వశు'ని, 'అత్రి'ని, 'ఉశన'ను ఉద్ధరించినారు. దాత అయినవాడే మీతో బంధుత్వము చేయగలడు. నీ ఆశ్రయమున లభించు సుఖమునే నేను ఆశించుచున్నాను.     8. అశ్విద్వయమా! మీరు కృశుని కాపాడినారు శయుని కాపాడినారు. మీకు పరిచారిక అయిన విధవను కాపాడినారు. యజ్ఞకర్త కొరకు మీరే మేఘమును భిన్నము చేసినారు. భిన్నమైన దతిశీలమ్ ధారాత మేఘము గర్జించినది. వర్షించినది.     9. నేను ఘోషను మీ దయవలన నారీలక్షణములు గల సౌభాగ్యవతిని అయినాను. నా పెళ్లికి వరుడు విచ్చేసినాడు. మీరు వర్షము కురిపించినారు. సస్యాదులు ఫలించినవి. పల్లమునకు పారు నదులు పంటల వైపుసాగుచున్నవి. ఈ రోజు నేను భార్యను అయినాను. "అస్మాఅహ్నేభవతి తత్పతిత్వనమ్".     (ఘోషలో ఏదోనారీ లక్షణము లోపించినట్లున్నది. అశ్వినులు దానిని సరి చేసినట్లున్నారు. ఆలస్యముగా వరుడు లభించిన వధువు వలె  ఘోష పొంగిపోయినది.)     10. తమ భార్యల ప్రాణరక్షణ కొరకు ఏడ్చినంత చేసిన వారున్నారు. స్త్రీలను యజ్ఞమున నియమించిన వారున్నారు. స్త్రీలను తమ బాహుబంధములందు ఎంతోసేపుఉంచి సంతానము పొంది, పితృయజ్ఞమును నిర్వహించిన వారున్నారు. అట్టివారిని భార్యలు ఆనందముగ ఆలింగనము చేసికొందురు.     11. అశ్విద్వయమా! అటువంటి సుఖము నేను ఎరుగును. యువకుడైన భర్త యువతియైన భార్య వీరి సహవాస సుఖమును నాకు బోధించుడు. నాడి ఒకే కోరిక స్త్రీవిషయమున అనురక్తుడైన బలశాలి ఇంటికి చేరవలెను.     12. అన్నవంత ధనవంత అశ్వినులారా! మీరు నన్ను అనుగ్రహించండి. నా మనసులోని కోరికలు తీర్చండి. మీరు కళ్యాణ కారకులు, నాకు రక్షకులు కండి. నేను భర్త ఇంటికి చేరి అతనికి ఇష్టురాలను కావలెను!     13. నేను మిమ్ము స్తుతించుచున్నాను. అందుకు మీరు సంతుష్టులై నా పతి గృహమందు ధనము, సంతతి కలిగించండి. నేను నీరుత్రాగు తీరమును సౌకర్యవంతము చేయండి. నేను పతిగృహమునకేగు మార్గమున విఘ్నములున్న వానిని తొలగించుము.     14. ప్రియదర్శన, శుభంకర అశ్విద్వయమా! ఈ మధ్య మీరు ఎక్కడ, ఎవరింట ఆనందప్రమోదములందు ఉన్నారు? ఎవరు మిమ్ము కట్టి పడవేసినాడు? ఏ బుద్ధిమంతుడగు యజమాని ఇంటచేరినారు?                                     నలుబది ఒకటవ సూక్తము      ఋషి - ఘోష పుత్రుడు సుహస్తుడు. దేవత - అశ్వినులు. ఛందస్సు - జగతి.     1. అశ్విద్వయమా! మీ  ఉభయులది ఒకే రథము. దానిని అనేకులు ఆహ్వనింతురు. స్తుతింతురు. ఆ మూడు చక్రముల రథము యజ్ఞములకు వెళ్లును. అది నలువైపుల తిరుగును. యజ్ఞములను సుసంపన్నము చేయును. నిత్యము ప్రాతఃకాలములందు స్తుతులచే ఆరథమునే ఆహ్వానింతుము.     2. సత్యస్వరూప అశ్వినులారా! మీ రథము ప్రాతఃకాలమున సిద్ధమగును - సాగును. అది మధువును వహించును. ఆ రథము పైనే యజ్ఞకర్తల వద్దకు  వెళ్లండి. మిమ్ము స్తుతించువాని హోత్రయుక్త యజ్ఞమునకు కూడ వెళ్లండి.     3. అశ్విద్వయమా! నేను సుహస్త్యుడను. మధువు చేతబూని అధ్వర్యు కార్యము విర్వార్తింతును. నావద్దకుగాని బలవంతుడు, పురోహితుడు, దాతయగు అగ్నీధ్రుని వద్దకు గాని విచ్చేయండి. మీరు  విప్రుల యజ్ఞములకు పోవువారే కావచ్చును. మధుపానము కొరకు మా ఇంటికి విచ్చేయండి.     (ఘోషపుత్రుడు అన్నాడు ఘోషభర్తపేరు  చెప్పలేదు. ఘోష స్వతంత్ర వలె ఉన్నది. నేడు సహితము అట్టివారున్నారు.)                                నలుబది రెండవ సూక్తము        ఋషి - అంగిరస కృష్ణుడు. దేవత - ఇంద్రుడు. ఛందస్సు - త్రిష్టుప్.     1. ధనుర్ధారి గురిచూచి బాణము విడిచినట్లు - ఇంద్రుని గూర్చి స్తుతులు చేయండి. ప్రాంజలులై అలంకృత స్తుతులను సమర్పించండి. విప్రులారా! మిమ్ము స్పర్ధించువారు పరాజితులగు నట్టి స్తుతులు ప్రయోగించండి. స్తోతలారా! ఇంద్రుని సోమము వైపు ఆకర్షించండి.     2. స్తోతలారా! పాలు పితుకుకొని గోవు వలన ప్రయోజనము పొందినట్లు మిత్రస్వరూపుడగు ఇంద్రుని వలన ప్రయోజనము పొందండి. ఇంద్రుని స్తుతించండి. మేల్కొల్పండి. గింజలగిన్నెను బోర్లించిగింజలు తీసికొన్నట్లు ఇంద్రుని అను కూలుని చేసికొని మీ కోరికలు తీర్చుకొండి.     3. ఇంద్రా! జనులు నిన్ను భోజుడని ఎందుకు అందురో? అర్ధమైనది. నీవు దాతవు. అందుకే నీకా పేరు వచ్చినది. నీవు జనులను పదును పెట్టుదువని విన్నాను. నా బుద్ధికి పదును పెట్టుము నన్ను నిపుణుని చేయుము. నాకు సంపన్నుడగు నట్టి అదృష్టము కలిగించుము.     4. ఇంద్రా! జనులు యుద్ధములకు పోయినపుడునీ నామము తలచుకొందురు. నీవు యజమానికి సహాయకుడవు అగుదువు. నీకు సోమము సమర్పించని వానితో నీవు స్నేహము చేయవు.     5. అన్నవంతుడగు ఏవ్యక్తి ఇంద్రునకు ప్రథమ సొమము సమర్పించునో, గోవులు, అశ్వములు దానము చేయుధనవంతునివలె ఇంద్రునకు ఉదారముగ సోమరసము అందించునో, అట్టివానికి ఇంద్రుడు సహాయకుడగును. అతనికి బలిష్ఠులు అనేక సేనలున్న శత్రువులున్నను. ఇంద్రుడు వారిని శీఘ్రాతి శీఘ్రముగ పారద్రోలును.     6. మేము స్తుతించిన ఇంద్రుడు ధనవంతుడు. అతడు మా కోరికలు తీర్చిన్నాడు. ఇంద్రుని శత్రువులు పారిపోవలెను. శత్రుదేశ సంపద ఇంద్రుని చేతికిరావలెను.     7. ఇంద్రా! నిన్ను లెక్కకు మిక్కిలిమంది పిలిచెదరు. నీ వజ్రము భయంకరము. దానితో దగ్గరి శత్రువును దూరము చేయుము. నన్ను గోయుక్తుడను, యువయుక్తుడను చేయుము. నీ స్తోతల స్తుతులను అన్న, రత్న సంపన్నములను చేయుము.      8. సోమరసము అనేకధారలుగా మధురరసము కురింపించుచు ఇంద్రుని దేహమున చేరును. ఆ సమయమున ఇంద్రుడు సోమదాతను వారించడు. ఇకవలదు అనేమాట సహితము అన్నాడు. అంతేకాదు సోమదాతకు కోరినవన్నియు ఇచ్చుమ.     9. ఓడిన జూదరి ఓడించిన జూదరిని వెదికి వట్టి ఓడించును. ఇంద్రుడు అరిష్టకర్తను అట్లే ఓడించును. ఏ దేవభక్తుడు దేవపూజలో కృపణత్వము చూపడో అట్టివానిని ఇంద్రుడు మరింత ధనికుని చేయును.     10. గోవులవలన మేము దుఖఃదారిద్య్రమును దాటి పోవలెను. అనేకులచే ఆహూత ఇంద్రా! యవలతో మేము ఆకలి తీర్చుకొనగలుగ వలయు. మేము రాజుల వెంట వెంటనడిచి అగ్రసరులమై స్వబలప్రభావమున సంపదలను గెలువ గలుగవలెను.     11. పాపి శత్రువుబారినుండి మమ్ము బృహస్పతి పశ్చిమ, ఉత్తర, దక్షిణ దిశలందు కాపాడవలెను. తూర్పు దిశయందును మధ్యభాగమునను ఇంద్రుడు మమ్ము రక్షించవలెను. ఇంద్రుడు మా మిత్రుడు. మేము ఇంద్రుని మేము ఇంద్రుని మిత్రులము. అతడు మా కోరికలు తీర్చవలెను.     శ్రీమందాంధ్ర వచన ఋగ్వేద సంహిత ఏడవ అష్టకము పదవ మండలమున మూడవ అనువాకము సమాప్తము.                 నాలుగవ అనువాకము        నలుబది మూడవ సూక్తము                        ఋషిదేవతే పూర్వవత్. చంధస్సు - జగతి - 10,11 త్రిష్టుప్     1. నా స్తుతులన్ని కలిసి ఉద్దేశ పూర్వకముగ ఇంద్రుని గుణగానము చేసినవి. స్తుతులు సకల విధలాభములు కలిగించ గలవు. భార్యలు భర్తలను ఆలింగనము చేసికొన్నట్లు స్తుతులు శుద్ధస్వభావ ఇంద్రుని ఆశ్రయమునకుగాను అతనిని ఆలింగనము చేసికొనును.     2. ఇంద్రా! నిన్ను విడిచి నా మనసు అన్యత్ర సంచరించదు. నీ మీదనే నేను నా అభిలాషలు నిలిపినాను. రాజు తన భవనమున ఆసీనుడైనట్లు. మీరు కుశలపై ఆసీనులు కండి. ఈ  సురిచిర సోమపాన కార్యము సాగించండి.     3. దుర్గతి, అన్నరాహిత్యమునుంచి మమ్ము రక్షించుటకు ఇంద్రుడు మాకు నలువైపుల ఉండవలెను. ఇంద్రుడు ధనదాత సకల సంపదలకు ధనములకు అధిపతి. కోరికలు తీర్చువాడు తేజస్వి ఇంద్రుని ఆదేశముననుసరించియే గంగాది సప్తనదులు పల్లమునకు ప్రవహించుచున్నవి. వ్యవసాయమును వృద్ధిచేయుచున్నవి.     4. పచ్చని ఆకుల చెట్టును పిట్టలు ఆశ్రయించును. పాత్ర యందున్న ఆనందకర సోమము ఇంద్రుని ఆశ్రయించును. సోమరస తేజమున ఇంద్రుని ముఖము వెలిగినది. ఇంద్రుడు మానవులకు ఉత్కృష్ట జ్యోతి అగును. "మనవేజ్యోతిరార్యమ్."     5. జూదగృహమున తనను గెలిచిన వానిని వెదికి ఓడించినట్లు - ఇంద్రుడు వృష్టినిరోధక సూర్యుని ఓడించును. ఇంద్రా! నీవు ధనాధిపతివి. పాత, కొత్త వాడెవడును నీ పౌరుషమువలె పని చేయజాలడు.     6. ధనద ఇంద్రుడు ప్రత్యేక వ్యక్తిలో వసించును. కోరికలు తీర్చు ఇంద్రుడు స్తోత్రములన్నింటిని జాగ్రత్తగా వినును. ఇంద్రుని ప్రీతుని చేసిన సోమయజ్ఞకర్తలు సోమము వలన శత్రువులను పరాజితులను చేయుదురు.     7. జలము నదులవైపు. చిన్న చిన్న  కాలువలు చెరువు వైపునకు సాగునట్లు సోమరసము ఇంద్రునిలోనికి సాగును. యజ్ఞస్థలమున విప్రులు ఇంద్రుని వానకు పంటవలె వర్థిల్ల చేయుదురు.     8. ఆబోతు కోపమున మరొక ఆబోతు మీదకు పోవును. అట్లే  ఇంద్రుడు మేఘము మీదకు పోయి తను కోరిన జలమును వెలికి తీయును. సోమ యజ్ఞము చేసిన వానికి, ఉదారముగ దానములు చేసిన వానికి, హవి సంగ్రహించినవానికి ధనిక ఇంద్రుడు జ్యోతిని ప్రసాదించును.     9. ఇంద్రుని వజ్రము తేజోవంతమై ఉదయించవలెను. పూర్వము వలెనే ఇప్పుడును యజ్ఞక్రియలు జరుగవలెను ఇంద్రుడు ఉజ్వల తేజస్సుతో శోభిల్లవలెను. సాధుజనపాలక ఇంద్రుడు సూర్యునివంటి శుభ్రవర్ణదీప్తితో వెలుగొందవలెను.     10. గోవుల వలన మేము దుఃఖదారిద్య్రములను దాటిపోవలెను. అనేకులచే ఆహూత ఇంద్రా! యవలతో మేము ఆకలి ఆర్పుకొన గలుగవలెను. మేము రాజులవెంటనడచి, ఆశ్రసరులమై స్వబలమున సంపదలను గెలువవలెను.     11. పాపి శత్రువు బారినుండి మమ్ము బృహస్పతి పశ్చిమ ఉత్తర దక్షిణ దిశలందు కాపాడవలెను. తూర్పు దిశయందును, మధ్యభాగమునను ఇంద్రుడు రక్షించవలెను ఇంద్రుడు మామిత్రుడు. మేము మిత్రులము. అతడు మా కోరికలు తీర్చవలెను.                                     నలుబది నాలుగవ సూక్తము                   ఋషి - అంగిరస కృష్ణుడు. దేవత - ఇంద్రుడు. ఛందస్సు -                              1-3, 9,10 త్రిష్టుప్ 4-8 జగతి.     1. ఇంద్రుడు స్థూలకాయుడు అతడు తన విపుల, దుర్ధర్ష బలమున బలశాలురను సహితము బలహీనులను చేయును. అట్టి ధనిక ఇంద్రుడు రథమును ఎక్కినాడు అతడు  ప్రమోదించుటకు రావలెను.     2. నరపతి ఇంద్రా! నీ రథము చక్కగా అమర్చినది. నీ అశ్వములు సుశిక్షితములు నీ చేత వజ్రము ఉన్నది. ఆ రూపముగలవాడవై సులభమార్గమున కిందికి దిగిరమ్ము. నీ పానమునకు సోమము సిద్ధముగా ఉన్నది. సోమము త్రావించి మేము నీ బలమును మరింత పెంచుదుము.     3. ఇంద్రుడు నేతలకు నేత. వజ్రహస్తుడు శత్రుబలాపహారి. దుర్థర్షుడు. కోపము వృధాకానివ్వనివాడు. అతడు తనను వహించు బలిష్ఠ అశ్వయుక్తుడై మా వద్దకు రావలెను.     4. సోమరసము పుష్టి కలిగించును. కలశమున కలసిపోవును. బలమును కదలించును. ఇంద్రా! ఆసోమమును ఉదరమున ధరింపుము. మా బలమును పెంచుము. మమ్ము నీకు ఆత్మీయులను చేసికోనుము.     5. ఇంద్రా! నేను స్తోతను. నా వద్దకు సకల సంపదలు చేరవలెను. నాకు ఉత్తమ అభిలాషలు ఉన్నవి. వానిని తీర్చుకొనుటకు సోమ సంచయనము చేసినాను. యజ్ఞము తలపెట్టినాను.  అందుకు అధిపతివగు ఇంద్రా! విచ్చేయుము. కుశలపై కూర్చుండుము. నీ కొరకు సోమపాత్ర సిద్ధమైనది. అందు కొనుము. దానిని బలాత్కారముగా గుంజు కొనగల వాడు లేనేలేడు.     6. ప్రాచీన కాలమందే యజ్ఞములు చేసి దేవతలను ఆహ్వానించిన వారున్నారు. వారు మహా మహాకార్యములు చేసినారు. సద్గతిని చేరుకున్నారు. కాని యజ్ఞరూప నౌకను ఎక్కనివారు కుకర్ములు, రుణగ్రస్తులు నీచస్థితిలో అణగారి పోయినారు.     7. ఇప్పుడు కూడ అటువంటి దుర్భుద్ధులున్నారు. వారిది అధోగతి కావలెను. వారి దుర్గతి ఎట్టిదగునో చెప్పరాదు. ముందునుంచే యజ్ఞాదులందు దానము చేయువారు. చేరుస్థానము పవిత్రమగును. అచట చిత్రవిచిత్రములగు భోగపదార్థములు లభించును.     8. ఇంద్రుడు సోమపానము చేసి మత్తుడైనంత సర్వత్ర సంచరించును. కదలాడు మబ్బలను ఆకాశమునల్లకల్లోలము చేయును. అప్పుడు ఆకసము బెదిరిపోవును. పరస్పర సంయుక్తములైన ద్యావ, పృథ్వులను ఇంద్రుడు అట్లే ఉంచును. మంచి మాటలు చెప్పును.     9. ధనశాలి ఇంద్రా! నీ కొరకు నేను ఒక గట్టి అంకుశమును పట్టి ఉన్నాను. నీవు ఈ అంకుశరూప స్తోత్రమున గజములను దండిపుము. వానిని వశపరచు కొనుము ఈ సోమ యజ్ఞమునకు విచ్చేయుము. స్థానమును గ్రహించును. ఈ యజ్ఞమందు మమ్ము సౌభాగ్యవంతులను చేయుము.     గత సూక్తపు 10,11 మంత్రములు పునరావృతములు.                                      నలుబది అయిదవ సూక్తము         ఋషి - భాలందన వత్సప్రేరుడు. దేవత - అగ్ని. ఛందస్సు - త్రిష్టుప్.     1. అగ్ని తొలుత ఆకాశమున విద్యుద్రూపమున జన్మించినాడు. రెండవ జన్మము జాతవేది, పేర జనమధ్యమున జరిగినది. జలమధ్యమందు మూడవ జన్మకలిగినది. అగ్ని మానవ హితైషి. అతడు నిరంతర ప్రజ్వరిల్లుచుండును. ఉత్తమ ధ్యావమును  ఎరిగిన  వారు. అగ్నిని స్తుతింతురు.     2. అగ్నీ! మేము నీ మూడు రకముల మూర్తులను ఎరుగుదుము అనేక ప్రదేశములందు నీకు ఉన్న స్థానములను ఎరుగుదుము. నీ నిగూఢ నామములను ఎరుగుదుము. నీవు  ఆవిర్భవించిన ఉత్పత్తిస్థానములను సహితము ఎరుగుదుము.     3. ఇంద్రా! మానవ హితము కోరు వరుణుడు నిన్ను సముద్రమధ్యమున, జలములోతున దహించి ఉంచినాడు ఆకాశస్థానమున సూర్యుడు ఉన్నాడు. అతనిలో కూడా నీవు ప్రజ్వలించి ఉన్నావు. నీ మూడవస్థానము మేఘములందలి వర్షజలమగును. ప్రధాన దేవతలు నీ తేజస్సును పెంచుదురు.     4. అగ్ని  ఘోరముగా గర్జించినాడు. అది పిడుగు పాటు అనిపించినది. అగ్ని పృథ్విని నాకును. లతాదులను ఆలింగనము చేసికొనును. అగ్ని ఇదిగో ఇప్పుడే పుట్టినాడు అయినను ఎంతో ప్రజ్వలించినాడు. విస్తరించినాడు.     5. ప్రభాతపు ప్రథమ భాగమున అగ్ని ప్రజ్వలితుడగును. అప్పుడు అతని శోభ ఎట్లుండును? అతడు ఎన్నో శోభలు వెల్లడించును. అగ్ని అశేష సంపదలకు ఆధార భూతుడు స్తోత్రవచనములకు స్ఫూర్తిదాత. సోమరస రక్షకుడు. ధనస్వరూపుడు. బలపుత్రుడు. అగ్ని జలమధ్యమున వసించును.     6. అగ్ని సమస్త పదార్థములను ప్రకాశింప చేయును. అతడు జల మధ్యమున జన్మించును. అతడు జన్మించగానే ద్యావాపృథ్వులను పరిపూర్ణము చేసినాడు. జనులు అగ్ని కొరకు యజ్ఞము చేసినపుడు అతడు మబ్బులువైపు వెళ్లినాడు. వాటిని కొట్టినాడు నీరు తెచ్చినాడు.     7. అగ్ని హవిని కోరును. అతడు అందరిని పావనము చేయును. అతడు నలుదిశల  సంచరించును. అరణ్యమున ఉత్కృష్టుడగును. అతడు అమరుడే కాని దుర్త్యమనుష్యులలో ఉండును. సుందర  రూపము దాల్చి గతివిధులు ఆచరించును. శుక్లవర్ణ తేజము దాల్చి ఆకాశమును నింపును.     8. అగ్ని జ్యోతిర్మయుడు. అతని దీప్తి మహాత్తరము అతడు వెలుగులతో సాగుచు శోభా సంపన్నుడగును. అగ్ని వనస్పతులను ఆరగించినాడు. అమరుడైనాడు. దివ్యలోకము అగ్నికి జన్మనిచ్చినది దివ్యలోకపు జన్మదాన శక్తి ఎంతగొప్పది!     9. మంగళమయ జ్వాలల అభినవ అగ్నీ! నీకు నేడు ఘృతయుక్త పురోడాశము సమర్పించినవాడు విశిష్టవ్యక్తియగును. అతనిని నీవు సర్వోత్తమ ధనముల వైపు నడిపింపుము. ఆదేవ భక్తుని సుఖసంతోషముల వైపు నడిపించుము.     10. ఒకప్పుడు ఉత్తమోత్తమ అన్నములచే క్రియలు అనుష్ఠించబడును. అట్టితరి నీవు యజమానికి అనుకూలుడవు అగుము. అతడు  అగ్నికి ప్రియుడు, సూర్యునకు ప్రియుడు కావలెను. "ప్రియఃసూర్యం ప్రియోఅగ్నాభవ" ఉన్న  పుత్రులు, కలుగనున్న పుత్రులు, అతనితో కూడి శత్రు సంహారము చేయవలెను     11. అగ్నీ! నిత్యము యజమానులు నిన్ను పూజింతురు. వివిధములగు ఉత్తమ పదార్థములు సమర్పింతురు విద్వాంసులగు దేవతలు నీతో కలసినారు. తమ ధనపు కోరికలను పూర్తి చేయదలచినారు. గోవులునిండిని గోష్ఠముల ద్వారములు తెరచినారు.     12. మానవులందు అందగాడును. సోమమును రక్షించువాడును అగు అగ్నినే ఋషులు స్తుతింతురు. ద్వేషశూన్య ద్యావాపృథ్వులను ఆహ్వానించుచున్నాము. దేవతలారా! మాకు భౌతకబలమును. ధనబలమును ప్రసాదించండి.     దాశరథి లక్ష్మణాచార్య బుచ్చమాంబల పౌత్రుండును, విద్వాన్ వేంకటాచార్య వేంకటాంబల పుత్రుండును, ఆంధ్ర ప్రదేశ ఆస్థాన కవి దాశరథి కృష్ణమాచార్య అనుజుండును కమలానామ్ని ధర్మపత్నీ సమేతుండును 'పరిశీలన' మను సాహిత్య సమాలోచన గ్రంథకర్తయు, "ప్రేమ్ చంద్ జీవితము రచనలు" అనుహిందీ రచయిత సమీక్షా గ్రంథరచయితయునగు దాశరథి రంగాచార్య విరచిత శ్రీమదాంధ్ర వచన  ఋగ్వేదసంహితమున ఏడవ అష్టకము సమాప్తము.                                        సర్వే భద్రాణి పశ్యంతు.
24,342
    "ఇక్కడి కొచ్చేసరికి తొమ్మిటి దాటింది. కారు పెట్రోలు బంక్ దగ్గర ఆగింది. పెట్రోలు  కొట్టించాక వీరభద్రుడు  డబ్బా పట్టుకొని నీళ్ళ దగ్గర దిగాడు. బంక్ నుంచి అప్పుడు బయలుదేరుతున్న  ఖాళీ లారీలోకి ఎక్కి  నక్కి కూర్చున్నాను. లారీ ఓక హొటల్ దగ్గిరకొచ్చి ఆగింది. లారీదిగి ఆటో ఎక్కి  బస్ స్టాండుకు బయలుదేరుతుండగా, రాంబాబు కారు లారీ ఉన్న చోటికి  రావడం  కన్పించింది. బహుశవాళ్ళు  నాకోసం, ఊరంతా, గాలిస్తూ ఉండాలి. నా అదృష్టం బాగుంది. సమయానికి మీరు పోన్లో దొరికారు" మాధవి  నిట్టూర్చింది.     "ఓ.కె. జరిగిపోయిన దాన్నిగురించి నువ్వు భయపడాల్సింది గానీ బాధపడాల్సిందిగానీ ఇప్పుడేమీలేదు.నీకు  తెలిసినంతవరకు నిర్భయంగా చెప్పు. మాధవిని ప్రోత్సహించాడు ఉదయ్ చంద్ర.     "మూడు నెలల  క్రితం  ఓ రోజున శివరామయ్య కలకత్తావచ్చాడు. ఈ రోజు ఈ పథకానికి అంకురార్పణ మొదట్లో రాంబాబూ దగ్గర కలకత్తావచ్చాడు. ఆరోజే ఈ పతాకానికి అంకురార్పణ మొదట్లో  రాంబాబూ  శవరామయ్య నన్ను పూర్తిగా నమ్మారు. వీరభద్రుడు రాంబాబు దగ్గర కలకత్తాలోనే వుంటూండేవాడు. రాంబాబు చెప్పే  పనులన్నీ  చేస్తూ  అతడికి  నమ్మిన  బంటులా వుండేవాడు ఇరవైఏళ్ళ క్రితం శివరామయ్యకు ఈ తోటస్వాధీనం అయిందట,"     "ఎలా?"     "శివరామయ్య తండ్రి దగ్గిర డబ్బుతీసుకొని ఈ తోటకు సంబంధించైనా వారసుడివాడో తాకట్టు  పెట్టాడట. ఆ వారసుడి  మరణానతరం ఈ తోట  శివరామయ్య  పరం అయింది."     "అంటే, ఆ తోట,  ఆ బంగళా శివరామయ్య  పూర్వీకులదికాదన్న మాట!"     "కాదు, ఆ తోటలోనే పుట్టిపెరిగిన అడివయ్య అరవైఏళ్ళగా ఆ తోటలోనే కాపురం వుంటున్నాడు. భార్య చనిపోయాక వంటరిగా  ఆ తోటపని చూసుకుంటున్నాడు. తోటలో ఒకచోట లక్షలు విలువ చేసే నగలు నిక్షిప్తం  చెయ్యబడి  వున్నాయని  అడివయ్య శివరామయ్యకు చెప్పాడు. మొదట్లో  శివరామయ్య నమ్మలేదు వాళ్ళ వంశ చరిత్ర తెలుసుకొన్న  శివరామయ్యకు అడివయ్య మాటమీద నమ్మకం  ఏర్పడింది. అప్పట్నుంచి అనేకరకాలుగా ఆ గుప్త  ధనాన్ని వెలికి తోయ్యడానికి ప్రయత్నించాడు. కాని ఫలితం చిక్కలేదు. అయినా  ఆశ చావలేదు. అందుకే ఆ తోటనూ బంగళానూ అమ్మకుండా వుంచాడు. తోట మొత్తం  కౌలుకిచ్చి చేయించడంకూడా ఇష్టంలేదు. తోటలోకి  ఇతరులకు ప్రవేశం లేకుండా జాగ్రత్తపడ్డాడు." అని ఆగింది మాధవి.     "అందుకే  ఆ చుట్టుపట్ల వ్యవసాయం  అభివృద్ధిచెంది రైతువత్తిడి పెరగడం, బయటివాళ్ళు వ్యాపారరీత్యా వచ్చిపోవడం  ఇష్టంలేని శివరామయ్య ఆ తోటనూ, ఆ బంగళానూ శిధిళావస్థలోనేవుంచాడు.     "అది ఒకరకంగా రాంబాబు ఆడిన నాటకానికి బాగా ఉపయోగపడింది. డాక్టర్ గారూ! మీరేచూశారు. అనుభవించారు ఆ బంగళా, ఆ తోట మొత్తం  అవుడోర్  సెట్ ళా ఉపయోగపడింది. ఆ వాతావరణం అంతా  వాడాడించిన భీభత్సనాటకానికి  మంచి బ్యాక్ డ్రాప్ గా  ఉపయోగపడింది."     "నాకూ ఈ తోటకూ  సంబంధం వున్నట్టు ఎలా తెలుసుకున్నాడు శివరామయ్య?"     "అడివయ్య చెప్పిన కొన్ని  ఆధారాలను  పట్టుకొని సమాచారం సేకరించే ప్రయత్నంలో పడ్డారు. కొన్ని సంవత్సరాలగా మీ వంశానికి సంబంధించిన విషయాలను సేకరించారు. ఆ తోటా, ఆ బంగళా , ఆ దరిదాపుల్లో వున్న అరవై డెబ్బయ్ ఊళ్ళూ చంద్రశేఖర వీరప్రసాదు అనే జమీందారు అధీనంలో వుండేవి. ఆయనగారిని సంతానం లేనందువల్ల సూర్యచంద్ర వరప్రసాద్ గారిని  దత్తతకు తీసుకున్నారు. కాని ఆ జమీందారుకు ఓక తమ్ముడు వున్నాడు. అతడికి తన కొడుకుని దత్తతకు ఇవ్వాలని వుండేది. అతడి ప్రయత్నం నెరవేరలేదు."     "కారణం?"     "జమీందారుకు తన తమ్ముడిమీదగానీ, అతడి కొడుకుమీదగానీ సదభిప్రాయం  లేదట. పైగా రాణిగారు సూర్యచంద్రప్రసాద్ నే  దత్తతకు తీసుకోవాలని పట్టుపట్టింది. ఆమె  పట్టుదలే  నెగ్గింది. జమీందారుగారు బ్రతికున్నంత  వరకూ  వాళ్ళేమీ  చెయ్యలేకపోయారు. పెద్ద జమీందారుగారి మరణానంతరం సూర్యచంద్ర ప్రసాదుగారే వ్యవహారాలు చూసుకోసాగారు. శరభయ్య అనేవాడ్ని తన దివాన్ గా నియమించారు" ఓ క్షణం ఆగి మళ్ళీ చెప్పసాగింది.     అసలు  ఆ ఎస్టేట్ దివాస్ పెద్ద జమీందారుగారు చనిపోవడానికి ఆరు నెలల ముందే  హత్య చేయబడినారట. దివాన్  శరభయ్య జమీందారు దాయాదులతో చేతులు కలిపాడు. చంద్రకిరణ్ పుట్టిన ఎడాదికే జమీందారుగారు  పక్షవాతానికి గురి అయినారు అప్పట్నుంచి శరభయ్య  ఆడిందే ఆటగా పాడిందే  పాటగా  జమీందారి వ్యవహారాలలో  పెత్తనం  చెలాయించాడు. సూర్యచంద్రప్రసాదు  పక్షవాత రోగంనుంచి కోలుకోసాగారు. ఆయన కోలుకుంటారని శరభయ్య కలలోకూడా అనుకోలేదు. దాంతో శరభయ్య దాయాదులతో చేతులు కలిపి కుట్రపన్నాడు.     "ఆగిపోయావేం? ప్రొసీడ్."     "బంగళానంత భూతగృహం మార్చివేశాడు శరభయ్య మెట్ల మీద నుంచి త్రోసివేసి రాణిగారిని హత్యచేశారు. ఆ తర్వాత శరభయ్య దాయాదులతో కలిసి ఒకప్లానువేసి ఓక ఒడంబడికకు వచ్చాడు...."     "ఏమిటా ఒడంబడిక?"     "జమీందారుగారిని చంపాలి. అతడి వారసుడైన  చంద్రకిరణ్ ను కూడా మాయం చెయ్యాలి. జమీందారీకి సంబంధించిన నగలూ నట్రా తన వాటాగానూ, తోటా,బంగళా జమీందారు దాయాదుల వాటాగానూ పంచుకోవాలనే  ఒడంబడిక తీసుకొన్నారు. జమీందారుని హత్యచేసేందుకూ, అతడి కుమారుడు చంద్రకిరణ్ ను  కిడ్నాప్ చేసేందుకూ పథకం సిద్దం అయింది, వారి పథకాన్ని జమీందారుగారు పసిగట్టారు. వెంటనే నగలు ఆ తోటలో పాతిపెట్టారు. ఐదేళ్ళ కొడుకుని తీసుకొని పారిపోయారు! జమీందారుగార్ని శరభయ్య, అతడి మనుషులూ పట్టుకొనే  ప్రయత్నంలో తరుముకొచ్చారు చెరువు కట్టన గుడిసె లోవున్న  వెంకయ్యకు తన బిడ్డను అప్పగించి ఆ పసివాడ్ని అనసూయయమ్మగారి దగ్గరకు క్షేమంగా చేర్చమని కోరారా జమీందారు సూర్యచంద్ర ప్రసాదుగారు.     "అనసూయమ్మ గారెవరూ?" విచ్చిపోతున్న కారుమేఘాలు, మళ్ళీ ఒక్క సారిగా కమ్ముకున్నట్లూ, కారుచీకట్లు తనను  చుట్టేస్తున్నట్లూ అన్పించింది ఉదయ్ చంద్రకు.     "అనసూయమ్మగారు ఎవరోకాదు మీ అమ్మగారే...." ఆగింది.     "మాధవీ! పర్వాలేదు చెప్పు. అనసూయమ్మగారు నా కన్నతల్లి కాదని నాకు తెలుసు. అనసూయమ్మ జమీందారు సూర్యచంద్రప్రసాద్ కు ఏమౌతుందని నేను అడుగుతున్నాను.     "జమీందారుగారి స్నేహితురాలు."     "అంటే?"     "చట్టరీత్యా వివాహం కాకపోయినా, జమీందారుగారు ఆమెను భార్యగానే  చూసుకోనేవారట. ఆమె అంటే ఆయనకు  ఎంతో గౌరవమట వెంకయ్య  పిల్లవాడ్ని  తీసుకొని. అనసూయమ్మ దగ్గర కెళ్ళిన కొద్దిసేపటికే, శరభయ్య మనుషురొచ్చి జమీందారుగారిని చుట్టేశారట. వెంకయ్య చంద్రకిరణ్ ను సురక్షితంగా అనసూయమ్మగారి  దగ్గిరకు చేర్చాడు. ఆ తర్వాత శరభయ్య మనుషులు వెంకయ్యకోసం, చంద్రకిరణ్ కోసం  గాలింపు ప్రారంభించారు.     "ఆరు నెలల తర్వాత వెంకయ్యను వేరే ఊళ్ళో అతడి మేనత్త ఇంట్లో పట్టుకొన్నారు. వాళ్ళుపెట్టిన చిత్రహింసలకు తట్టుకోలేక వెంకయ్య ఆ రహస్యం బయటపెట్టేశాడు. కానీ అప్పటికే చంద్రకిరణ్ ఏడువేల మైళ్ళ దూరంలో శరభయ్యకూ, దాయాదులకూ అందనంత దూరంలోవున్నాడు అనసూయమ్మ తనకున్న ఆస్తిపాస్తులన్నీ అమ్మేసింది. అమెరికాలోవున్న ఓక బంధువు సహాయంతో చంద్రకిరణ్ ను తీసుకొని స్యూయర్క్ వెళ్ళి పోయిందని తెలిసింది.     తీగలాగితే డొంకంతా కదిలినట్టు, వెంకయ్య హత్యకేసులో పాలీసులు శరభయ్య  మనుషుల్లో ఒకడ్ని చేశారు. అతడే మొత్తం కథ బయటపెట్టాడు. జమీందారుని, వెంకయ్యనూ హత్యచేసినందుకు శరభయ్యకూ, కొందరు జమీందారుగారి దాయాదులకూ యావజ్జీవ ఖైదుపడింది కొద్దికాలానికే శరభయ్య జైల్లో చనిపోయాడు పెద్ద జమీందారు వీరవర ప్రసాదుగారి మిగిలిన దాయాదులు, తోట, బంగళా కుదువపెట్టి డబ్బు తీసుకొన్నారు. తండ్రి  మరణానంతరం శివరామయ్యకు ఆ తోటమీద హక్కు సంక్రమించింది.     "తర్వాత?"     "అడివయ్యద్వారా జమీందారుగారికి సంబంధించిన నగలు ఆ తోటలో  నిక్షిప్తం చెయ్యబడి వున్నాయని తెలుసుకోన్నాడని చెప్పానను కొంటా?"         "అవును."     "దానిని కనిపెట్టడానికి శివరామయ్యవల్ల కాలేదు. తమ్ముడికొడుకు మెజిషియన్ అయిన రాంబాబుని  ఆశ్రయించాడు. రాంబాబు  ఆదేశాల ప్రకారం గతచరిత్రంతా తెలుసుకోవడం జరిగింది. రాంబాబు అఖండుడు. మద్రాసులో అనసూయమ్మగారి బంధువులున్నట్టు తెలుసుకొన్నాడు. వారి ద్వారా అనసూయమ్మగారి గురించిన సమాచారం సేకరించి అమెరికా వెళ్ళాడు."     "రాంబాబు అమెరికా వెళ్ళాడా?"     "అవును అప్పటికే అనసూయమ్మగారు తన కొడుకుతో ఇండియాకు తిరిగి వెళ్ళారని తెలుసుకొన్నాడు. ఆమె కొడుకు సైకియాట్రిస్టు అనికూడా తెలుసుకొన్నాడు. అలా ఇరవైరెండేళ్ళ చరిత్ర వివరాలను  ఓక పథకం ప్రకారం తెలుసుకొన్నాడు. ఆ సైకియాట్రిస్టు పేరుకూడా తెలుసుకొన్నాడు. అతడ్ని ట్రాప్ చేసే పథకం వేశాడు. అందులో నేనొక పాత్రను. నా పాత్రపేరు 'మానసి' నా పాత్రను నేను విజయవంతంగా నిర్వహిస్తే లక్షరూపాయలూ, శివరామయ్య తియ్యబోయే సినిమాలో హీరోయిన్ వేషమూ ఇస్తామని ఆశ చూపించారు. మూడు నెలల  క్రితం రాంబాబుతో కలిసి తోటలోవున్న బంగళాకు వచ్చాను. రాంబాబు ఇచ్చిన సూచనల మేరకు నా శక్తికొలది అమోఘంగా నటించానో లేదో డాక్టర్ గారూ, మీకే తెలుసు. బాగా నటించానుగదూ."     డాక్టర్ జయంత్ వచ్చే నవ్వును ఆపుకోలేక పక్కున నవ్వేశాడు.     "అయితే! మాధవీ పీకలమీద కొచ్చినా నీకింకా సినిమా పిచ్చి వదల్లేదుకదూ?" అన్నాడు జయంత్.     "షి ఈజ్ ఎ బారన్ ఆర్టిస్టు జయంత్! ఏం చేస్తాం ఆవిడ దుర దృష్టం ఇది."     "నో!నో! డాక్టర్! ఇది నా అదృష్టంగానే భావిస్తున్నాను. మీరు ఆదుకోకపోతే నేను ఈ పాటికి ఏమైపోయి వుండేదాన్నో?" ఊహిస్తేనే గుండెలు చిక్కపడుతున్నాయి."     "ఇదీ  ఆ రాంబాబు రాసిచ్చిన డైలాగేనా?" జయంత్ కంఠం కంచు గంటలా ,మోగింది.     అది వింటూనే డాక్టర్  ఉదయ్ నిశ్చేష్టుడైపోయాడు.     మాధవి రెండుచేతులూ ముఖానికి అడ్డం పెట్టుకుని భోరున ఏడ్చేసింది.     "ప్లీజ్ నన్ను నమ్మండి. ఇది  నాటకంకాదు.డాక్టర్ మీరు నమ్మకపోతే మీ చేతులతోనే నా పీక నోక్కేయండి. ఆ దుర్మార్గులకు మాత్రం నన్ను అప్పగించకండి. మీకు పుణ్యముంటుంది డాక్టర్" వెక్కి వెక్కి ఏడుస్తూ అన్నది.     "మాధవీ  టేకిట్  ఈజీ! డాక్టర్ జయంత్ తమాషాకు అన్నాడు. ఊరుకో ఏడవకు." ఉదయ్ మాధవిని ఓదారుస్తూ అన్నాడు.     "కమాన్  గెటప్. బాగా అలసిపోయి వున్నావు. హాట్ వాటర్ బాత్ తీసుకొని భోజనం చెయ్యి. ఈ రాత్రికి ఇక్కడే విశ్రాంతి  తీసుకో. నిద్రపట్టకపోతే డాక్టర్  జయంత్  నిద్రమాత్రలిస్తాడు." ఉదయ్ మాధవి తల నిమురుతూ బుజ్జగించాడు.     మాధవి చిన్నపిల్లలా కళ్ళుతుడుచుకొని ఉదయ్ ను రెండుచేతులతో గట్టిగా పట్టుకుంది!     అదిచూసి ముసిముసిగా నవ్వుకొన్నాడు జయంత్.     "జయంత్ మాధవిని ఇక్కడ వుంచడం క్షేమంకాదు. ఆ దుర్మార్గులు ప్రశాంత నర్సింగ్ హొమ్, క్రాంతీ నర్సింగ్  హొమ్ లమీద ఒక కన్ను  వేసి  వుంచుతారు. మాధవిని మీ ఇంటికి  తీసుకెళ్ళు. డియస్పీ విల్సన్ రావుకు ఫోన్ చేసి ఇద్దరు కానిస్టేబుల్స్ ను పంపించమని చెప్పు. ఇంటికి కాపలాగా. ఈ రాత్రికి మాధవిని కాపాడుకుంటే చాలు. రేపు ఉదయం పోలీసురిపోర్టు ఇవ్వవచ్చు. పోలీసులు రంగంలో దిగారని తెలిస్తే వాళ్ళు రాత్రికిరాత్రే పరారయిపోతారు. వాళ్ళు  ఈ రాత్రంతా మాధవికోసం ఈ ఊళ్ళో వెదుకుతూనే వుంటారు. మాధవి రక్షణ విషయంలో జాగ్రత్తగా మెలగాలి. ఊఁ మీరు బయలుదేరండి" ఉదయ్  లేచి తలుపు తెరిచాడు.       
24,343
   శ్లో:     అర్ధోరు జఘనాంతంచ పురుషాణాంత్రశస్యతే !!     తా: మోకాలి పైకి  కలది ఒకటి, పిరుదుల క్రిందికి కలది ఒకటి ఈ రెండు లాగూలు పురుషులు ధరించి నాట్యమొనర్చుటకు యోగ్యమగును.    శ్లో:     ఆదౌదేవగురుం పంచభూతాన్న త్వోరుకంచుకం !!     నానాచిత్రపటైః క్లుప్తంధారయేన్నాట్యకర్మణి !!     తా: నాట్యమునకు మొదలు అభీష్టదైవముకు నాట్యవిద్యా గురువును పంచభూతములను నమస్కరించి అనేకములగు రంగుగుడ్డలతో తయారుచేయబడిన "కంచుకము" ను ధరింపవలయును.                                      ద్వాదశహస్త ప్రాణ లక్షణ వినియోగములు :   శ్లో:     ప్రసారణం కుంచితశ్చరేచితం పుంఖతం తధా !     అపవేష్టితకంచాపి, ప్రేరితోద్వేష్టి తేతధా !!     వ్యావృతః పరివృత్తశ్చ, సంకేత స్తదనంతరమ్ !     చిహ్నంపదార్ధటీకేతి, ప్రాణాద్వాదశహజాః స్త !!     తా: ప్రసారము, కుంచితము, రేచితము, పుంఖితము, అపవేష్టితము, ప్రేరితము, ఉద్వేష్టితము, వ్యావృత్తము, పరివృత్తము, సంకేతము, చిహ్నము, పదార్ధటీక యని హస్తప్రాణములు పన్నెండు విధములుగా చెప్పబడుచున్నవి.                                    1. ప్రసారణహస్త ప్రాణలక్షణము     వ్రేళ్ళను చాచుట "ప్రసారణ" హస్తమగును.                               2. కుంచితహస్త ప్రాణలక్షణము     వ్రేళ్ళను ముడుచుట "కుంచిత" హస్త ప్రాణమగును.                              3. రేచితహస్త ప్రాణలక్షణము     వ్రేళ్ళను కదుల్చుట "రేచిత" హస్త ప్రాణమగును.                            4. పుంఖిత హస్త లక్షణము     పతాకాది హస్తములయందు  వ్రేళ్ళు ముందుకు వచ్చుట, కదిలించుట, చాచుట "పుంఖిత" హస్త ప్రాణమగును.                            5. అపవేష్టిత హస్త ప్రాణ లక్షణము     వ్రేళ్ళను క్రిందుగా చాచుట "అపవేష్టిత" హస్త ప్రాణమగును.                            6. ప్రేరితహస్త ప్రాణలక్షణము     వ్రేళ్ళను వెనుక భాగమునకు ముడుచుట, కదలించుట, చాచుట "ప్రేరిత" హస్త ప్రాణమగుచున్నది.                             7. ఉద్వేష్టిత హస్త ప్రాణలక్షణము     నాట్యసమయమున చేతులు పై కెత్తుట "ఉద్వేష్టిత" హస్త ప్రాణమగును.                           8. వ్యావృత్తహస్త ప్రాణలక్షణము     పార్శ్వభాగములందు  పైకెత్తబడిన చేతులు "వ్యావృత్త" హస్త ప్రాణమగును.                               9. పరివృత్తహస్త లక్షణము     నాట్యమందు పార్శ్వముల నుండి ముందుభాగమునకు చేతులు తెచ్చుట "పరివృత్త" హస్త ప్రాణమగును.                           10. చిహ్నహస్త ప్రాణలక్షణము     నాట్యసమయమందు  ప్రత్యక్ష పరోక్ష వస్తువుల యొక్క స్తావర జంగమత్వములను తెల్పు చిహ్నములు అష్టవిధములుగా నున్నవి.     1. వాని ఆకారములు చూపుట     2. ముఖములను చూపుట     3. అవియుండు స్థలములను చూపుట     4. వాని టెక్కములను చూపుట     5. ఆయుధములను తెల్పుట     6. వానియందుగల ప్రయోజనములను తెల్పుట     7. అవివ్యాపించిన వానిని తెల్పుట     8. వాని చేష్టలు తెల్పుట. ఈ యెనిమిది విధములుగల హస్తప్రాణము చిహ్నమగును.                                       11. పదార్ధటీక హస్త ప్రాణలక్షణము        చెప్పబడిన పదముల యొక్క  అర్ధమిదియని  నిశ్చయపరచునట్టిది "పదార్ధటీక" హస్తప్రాణమగును.
24,344
                                       స్వతంత్ర భారతదేశంలో స్త్రీ     "మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ముప్పయ్ ఏళ్ళయింది. అనేక రంగాల్లో ప్రగతి సాధించాం. కాని చెప్పుకో తగిన మార్పు రాలేదు. ఒక ప్రముఖ పాత్రికేయునితో అన్నాను. 'ఎలాంటి మార్పూ రాలేదంటారా?' ఆశ్చర్యంగా నా ముఖంలోకి చూస్తూ ఎదురు ప్రశ్న వేశాడు ఆ మేధావి.        నేను కొంచెం తికమకపడ్డ మాట నిజమే. 'నాకేం కన్పించడం లేదు' అన్నాను.     "ముప్పయ్ సంవత్సరాల క్రితం నాతో ఏ స్త్రీ ఇలా వాదనకి దిగలేదు. మరి ఈనాడు మీలా ఎందరో స్త్రీలు ఉద్యోగాలు చేస్తున్నారు. అనేక విషయాల మీద పురుషులతో సమానంగా చర్చలు జరుపుతున్నారు కథలు రాస్తున్నారు. వేదికల మీద ఉపన్యాసాలు ఇస్తున్నారు. డాక్టర్సుగా, లాయర్స్ గా ప్రాక్టీసు చేస్తున్నారు. న్యాయవాదులు ఉన్నారు. మంత్రులుగా ఉన్నారు. కలెక్టర్లుగా ఉన్నారు. అత్యున్నత పదవుల్లో ఉన్నారు. మరి ముప్పయ్ సంవత్సరాల క్రితం ఎవరైనా ఒక స్త్రీని దేశ ప్రధానిగా వూహించగలిగారా?"       "అది నిజమే ననుకోండి. కాని అలాంటి వారి శాతం ఎంత? సాధారణ స్త్రీ జీవితంలో చెప్పుకోతగ్గ మార్పు వచ్చిందని నేను అనుకోవడం లేదు. స్వతంత్రంగా బయటికి వచ్చి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళందరికీ నిజమైన స్వతంత్రం ఉందా?"         "ఒక ఉదాహరణ చెప్పండి."     "ఒకటేమిటి? ఎన్నో చెప్పవచ్చును. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారనుకోండి. భర్త ఇంటికి వచ్చాక ఏ ఈజీ చెయిర్లోనో రెస్టు తీసుకుంటాడు. స్త్రీకి అలా కుదరదు. వస్తూనే ఇంటి పనిలో జొరబడి పోవాలి. ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నప్పుడు పురుషుడు కూడా ఇంటి పనుల్లో భార్యకు సహాయం చెయ్యొచ్చుగా? అలా ఎందుకు జరగదు?"     "దానికి కారణం మీ ఆడవాళ్ళే. విజ్ఞానవతి అయిన స్త్రీ కూడా మానసిక బానిసత్వం నుంచి బయటపడలేకుండా ఉన్నది. పురుషుడు అధికుడు అనే భావం అతనికంటె ఆమెలోనే ఎక్కువగా ఉంటున్నది. ఎంతో చదువుకున్న స్త్రీలు పాతవాసన నుంచి బయటపడలేకుండా ఉన్నారు. ఉదాహరణకు నా కుటుంబాన్నే తీసుకోండి. నా భార్య కూడా ఉద్యోగం చేస్తున్నది. నా కంటే ఎక్కువ సంపాదిస్తున్నది. పెద్ద ఆఫీసరే కావడానికి, నేను ఇంటికి వచ్చాక నా స్నేహితులు ఎవరైనా వస్తారనుకోండి. ఆమె విసుక్కోకుండా కాఫీలూ, టిఫినులూ చేస్తుంది. అందరికీ ఇస్తుంది. అదే ఆమె స్నేహితురాలు వచ్చారనుకోండి. ఆమె వాళ్ళతో మాట్లాడుతూ కూర్చున్నది కదా అని నేను కాఫీ పెట్టాలని ప్రయత్నిస్తే ఆమె అడ్డుపడుతుంది. ఆమెకే నేను కాఫీపెట్టి ఇవ్వడం చిన్నతనంగా అనిపిస్తుంది. తన స్నేహితుల ముందు నన్ను చిన్నతనం చేసినట్లు బాధపడుతుంది, ఎందుకంటారు?"       నేను ఒక క్షణం ఆలోచిస్తూ ఉండిపోయాను.     "ఆ వచ్చిన స్నేహితులే ఆమె భర్త చేత పనిచేయిస్తుందని నవ్వుకుంటారు. పదిమందితో చెప్పుతారు. అదే ఆమె భయం విజ్ఞానవంతురాలైన నా భార్యకు అలా చెయ్యడంలో తప్పులేదని తెలుసు. అయినా అందుకు ఆమె అంగీకరించదు."        "అందుకే స్త్రీకి పూర్తి స్వేచ్చరాలేదంటున్నాను."     "హక్కులూ, స్వాతంత్ర్యం ఒకరు ఇచ్చేవికావు. అవి సంపాదించవలసినవి. ఇప్పుడు మహిళా దశాబ్దంలో ఉన్నారు. రాక్షస నామ సంవత్సరాన్ని మహిళా సంవత్సరంగా డిక్లేర్ చేశారు" అన్నాడు ఆ పెద్దమనిషి.        "అవును అంతర్జాతీయ మహిళా సంవత్సరం జరుపుతున్నాం. ఇప్పుడు మహిళా దశాబ్దంలో ఉన్నాం. అందువల్ల ప్రత్యేకంగా లభించింది ఏమిటి? ఇప్పుడు ఆడపిల్లల పెళ్ళిళ్ళు కట్నం లేకుండా జరుగుతున్నాయా? కట్నం తేలేదని కోడల్ని కాల్చి చంపిన ఉదంతం ఆ మధ్య పేపర్లో చదవలేదా? ఇంకా భ్రూణహత్యలూ, శిశు హత్యలూ కోకొల్లలుగా ఉన్నాయి. భర్త చేత నిత్యం తన్నులు తింటూ సీతనూ, సావిత్రినీ తలచుకుంటూ ఎందరు స్త్రీలు ఇంకా బతకడం లేదు. సక్కుబాయి కష్టాలను తలచుకుంటూ ఎంతమంది కోడళ్ళు అత్తల ఆరళ్ళుపడటం లేదు? ఎన్నో సేవా సదనాలు ఉన్నాయి, ఆ సదనాలకు నిస్సహాయులైన ఆడవాళ్ళు రోజూ ఆశ్రయం కోసం వస్తూనే ఉన్నారు.     కట్నం ఇవ్వలేక కన్నబిడ్డల్నే శత్రువులుగా భావించే తల్లిదండ్రులు ఉన్నారు. అన్ని అనర్థాలకూ కారణం స్త్రీకి ఆర్ధిక స్వాతంత్ర్యం లేకపోవటమే. అంతర్జాతీయ మహిళా సంవత్సరంలోనైనా కూతురికి కూడా కొడుకుతో సమానంగా ఆస్తిలో హక్కు ఏర్పాటు చేస్తూ కాన్ స్టిట్యూషన్ లలో ఎమెండ్ మెంట్ ఎందుకు తీసుకురాలేదు? కట్నాల బెడద పోవాలంటే కూతురికి కూడా కొడుకుతో పాటు ఆస్తిలో హక్కు ఉండాలి" ఆవేశంగా అన్నారు.        "అందుకోసం విజ్ఞానవంతులైన స్త్రీలు ఏం కృషి చేస్తున్నారు? చదువుకుంటున్నారు. కొందరు ఉద్యోగాలు చేస్తున్నారు, కొందరు పెళ్ళికాగానే డాక్టరీ ముఖ్యంగా లా చదివిన స్త్రీలు కూడా ప్రాక్టీసు చెయ్యకుండా ఇళ్ళల్లో కూర్చుంటున్నారు. ఎం.బి.బి.యస్. చదువుతున్న అమ్మాయిని అదే క్లాసు చదువుతున్న అబ్బాయికి లక్ష కట్నం ఇచ్చి పెళ్ళి చేస్తే కిక్కురుమనకుండా , తలవంచుకొని, సిగ్గుపడుతూ, మెళ్ళో తాళి కట్టించుకుంటున్నది. అంత చదువుకున్న అమ్మాయి పెళ్ళి గురించి కూడా తల్లిదండ్రులు దిగులుపడిపోతారు. వారికి ఆ అమ్మాయి రొమ్ముల మీద కుంపటిగానే కనిపిస్తుంది. ఎందుచేత? ఆ అమ్మాయికి ఆత్మ విశ్వాసం లేదు.       తల్లిదండ్రులకు అంత పెద్ద చదువుకుంటున్న ఆ అమ్మాయి అబలగానే కనిపిస్తుంది. వివాహం అనేది స్త్రీకి ఎంత అవసరమో పురుషుడికి అంతే అవసరం అనీ ఎదురు డబ్బు ఇచ్చి వరుణ్ణి కొనుక్కోవటం తనకు ఇష్టం లేదనీ, తన చదువు పూర్తి అయాక తన కాళ్ళ మీద తాను నిలబడి, తనకు ఇష్టం అయిన వాడిని చేసుకుంటాననీ ఆ అమ్మాయి తల్లిదండ్రులతో చెప్పదు. చెప్పలేదు. చదువుకున్న యువతుల్లోనే మార్పు రావాలి. ఆత్మవిశ్వాసం పెంపొందాలి. అన్యాయాన్ని ఎదుర్కొనే సాహసం ఉండాలి. స్త్రీల సమస్యలకు పరిష్కారం స్త్రీలే ఆలోచించాలి." పాత్రికేయుని సమాధానం.        అతని ఆర్గ్యుమెంటులో బలం లేకపోలేదు. కాని స్త్రీ చదువుకున్న స్త్రీ కూడా ఆలోచించలేకపోవడానికి కారణం ఏమిటి? తరతరాలుగా స్త్రీలకోసం పురుషులే ఆలోచించారు." ఇది చెయ్యాలి. అది చెయ్యకూడదు" అంటూ నియమాలు ఏర్పరచారు.       సాంప్రదాయాల పేరుతో కట్టుబాట్లు నిర్ణయించారు.     పెద్దలు గీచిన గిరుల మధ్య నేతను గిరుల మధ్య ఉన్నదనే అవగాహన కూడాలేని స్థితిలో స్త్రీ యుగాలుగా జీవించింది. ఆమెకు కావలసిన భద్రత చిన్నతనంలో తండ్రి నుంచీ, యవ్వనంలో భర్తనుంచీ, వృద్ధాప్యంలో కొడుకు నుంచీ ఏర్పాటు చేశారు. ఆమెకు ఆలోచించాల్సిన అవసరం లేకపోయింది కాదు..... అవకాశం ఇవ్వబడలేదు.        ఉగ్గుపాలతో రంగరించి పోసిన మూఢనమ్మకాల తాలూకు సంస్కారం, ఈ జాతి అణువణువులో జీర్ణించుకుని ఉన్నది. అప్రభావం నుంచి పూర్తిగా బయట పడాలంటే సమయం పడుతుంది. ఎంతో సంఘర్షణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సమయాన్నే 'సంధియుగం' అంటారు.        ఈ సంధియుగంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలు ఎన్నో ఉండగా, వంటలూ-- పిండివంటలూ, గృహ అలంకరణలూ, పిల్లలతోపాటు కోళ్ళ పెంపకం, వూరగాయలు పెట్టడం మొదలైన విషయాల మీద చర్చలు జరపడం, వ్యాసాలు రాయడం విరివిగా జరుగుతోంది. అడపాదడపా, ఉద్యోగినుల సమస్యల మీద వ్యాసాలు వస్తుంటాయి అని అవి ఇంట్లో కూర్చున్న స్త్రీలు. ఆఫీసు వాతావరణం ఎలా ఉంటుందో కూడా తెలియనివారు వూహించి వాస్తున్నవే. పల్లెల్లో నివసించే స్త్రీలు ఈ సంధియుగపు ప్రభావానికి దూరంగా ఉన్నారనుకోవడం కేవలం భ్రమ మాత్రమే.     వారిలోనూ కొంతవరకు చైతన్యం వచ్చింది. వారూ ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. వారి సమస్యల గురించి వారే ఆలోచించగల జాగృతిని వారిలో కలిగించడం అవసరం.                           ఈ పవిత్ర భారతదేశంలో స్త్రీగా జన్మించడం....?     "ఈ పవిత్ర భారతదేశంలో స్త్రీగా జన్మించడం నా భాగ్యంగా భావిస్తున్నాను. ఈ పుణ్యభూమిలో స్త్రీగా జన్మించినందుకు గర్విస్తున్నాను. మాతృదేవతగా, గృహలక్ష్మిగా, కోడలిగా, కూతురిగా స్త్రీని గౌరవించిన దేశం మనదేశం."        అబ్బో ఎన్ని స్థానాలు లభించాయో ఈ పుణ్యభూమిలో స్త్రీకి?     "రెండు పిల్లుల ముందు ఒక పిల్లి, రెండు పిల్లుల వెనుక ఒకపిల్లి రెండు పిల్లుల మధ్య ఒకపిల్లి:" ఎన్ని పిల్లులో? (మూడు మాత్రమే)          "ఒక తల్లీ కూతురు. మరో తల్లీ కూతురు. ఒక అమ్మమ్మా ఒక మనవరాలు." ఎంత మందో చెప్పుకోండి చూద్దాం: (ముగ్గురు) చాలామంది (బాగా చదువుకున్న వారు కూడా) స్త్రీల గురించి వ్యాసం వ్రాసినా, ఉపన్యాసం ఇచ్చినా మొదట ఉదాహరించిన మాటలతో ప్రారంభిస్తున్నారు. ముప్పయి కోట్ల ఆడవాళ్ళలో ఒక ఆడదిగా జన్మించడమే గర్వ కారణమా? లేక మనం గర్వించదగిన పని ఏదైనా చేశామా? అని ఆలోచించడం లేదు.
24,345
    గ్లాస్ ఛాంబర్ అవతల తన స్థానంలో శైలజ కూర్చునివుంది. టేబుల్ మీద రసాయనాలు వున్న చైనా డిష్ లు అటూ ఇటూ కదిలిస్తున్నప్పుడూ, మైక్రోస్కోప్ లెన్స్ లు ఎడ్జెస్టు చేసుకుంటున్నప్పుడల్లా ఆమె తెల్లని వ్రేళ్ళు మెరుస్తూ అతని శరీరంలో, మనస్సులో స్పందనలు రేపుతున్నాయి. పనిమీద ఏకాగ్రత కుదరటం లేదు. ఇవతల చూడామణి. పని చేస్తున్నట్లు నటించాలి. నానా హైరానా పడుతూ యాక్షన్ చేస్తున్నాడు.     లంచ్ అవర్.     అదృష్టవశాత్తూ ఈవేళ చూడామణి బాత్ రూంకెళ్ళింది. ఫణి ఊపిరి పీల్చుకున్నాడు. "శైలూ! అలా ఉన్నావేమిటి?"     శైలజ మాట్లాడలేదు. తల త్రిప్పికూడా చూడలేదు.     "శైలూ!"     పలకలేదు.     "శైలూ! నిన్నే!"     ఇష్టంలేనట్లు తల త్రిప్పి చూసింది.     "మాట్లాడవేం?"     "నాతో ఏముంటాయి మాటలు?"     "అదేమిటి శైలూ! నీతోకాక ఇంక ఎవరితో వుంటాయి?"     "అది నీకే తెలుసు."     "అంటే?"     "ఆ చూడామణిని అడుగు, చెబుతుంది."     "శైలూ!"     "చేసేపని చల్లగా చేసి, ఏమీ తెలియనట్లు ఏక్షన్ చెయ్యకు."     "ఏమిటి నేను చేసిన పని?"     "చూడామణి నీ ఇంటికి వచ్చిందా లేదా?"     "నువ్వు వస్తావని కాలు చితగ్గొట్టుకుని కేకపెట్టాను. నీ బదులు ఆవిడ వచ్చింది. ఏం చెయ్యను?"     "ఇదివరకు దెయ్యం, గియ్యం అని తిట్టేవాడివి. ఇప్పుడు 'ఆవిడ' అని మర్యాదగా సంబోధిస్తున్నావు, ధోరణి మారిందే?"     "శైలూ! నీలో ఏదో దెయ్యం ప్రవేశించింది."     "ఇప్పుడు నేను దెయ్యంలా కనబడుతున్నానా? నిన్నటినుంచీ నా రూపం మారిపోయిందా? లేక నీ దృష్టి మారిపోయిందా?"     "శైలూ! నువ్విలా అనటం బాగాలేదు, బాధగా కూడావుంది. నా ప్రమేయం లేకుండా జరిగినదానికి నేనేం చెయ్యను?"     "అసలేం జరిగిందేం?"     "ఏం జరిగిందంటే...." అసలే ఆమె మండిపడుతూంది. చెప్పాలంటే భయంగా ఉంది.     "సంకోచిస్తున్నావేం? నిజం చెప్పటానికా?"     "సంకోచమేం లేదు. నేను కాలు చితక్కొట్టుకుని కేకేసాను. ఆమె వచ్చింది. రక్తమదీ చూసి కట్టుకట్టింది."     "ఇంకా?"     "భోజనం పంపించింది."     "ఇంకా?"     "అంతే, ఇంకా ఏం లేదు."     "ఆవిడ కడితేమటుకు, నువ్వెలా కట్టించుకున్నావు?"     "ఏం చెయ్యను? పడుకోమని కడుతోంటే........."     "ఆవిడ పడుకోమనగానే పడుకున్నావన్నమాట."     "బ్యాండేజి కోసం."     "బ్యాండేజి కోసం కాకపోతే బ్యాండేజ్ కోసమని అనుకోవట్లేదులే ఇప్పటికి."     "శైలూ! చాలా స్పీడుగా పోతున్నావు. నన్ను ఇరిటేట్ చేస్తున్నావు. ఆడదానిపించావు."     "నువ్వూ మొగవాడివనిపించావు."     "చూడామణి గురించి...."     "అదిగో వస్తోంది నీ చూడామణి."     ఇద్దరూ మాటలాపేశారు. చూడామణి తన సీట్లోకి వచ్చేసరికి, ఎవరి పనుల్లో వారు నిమగ్నమై వున్నట్టు నటిస్తున్నారు.     ఆ సాయంత్రం రామకృష్ణ వచ్చాడు. "ఏం బ్రదర్! ఇవేళకూడా డ్యూటీలోకి రాలేదా?" అంటూ.     "వచ్చాను" అన్నాడు ఫణి ముక్తసరిగా.     "క్యాంటీన్ కు రాలేదేం?"     "నీరసంగా ఉండి రాలేదు."     "అదేమిటి? కాలుకి కూడా కట్టుకట్టావు, దానికేముంది?"     "చిన్న దెబ్బ తగిలింది."     "రెండు రోజులు రెస్టు తీసుకోకపోయావా? ఈ చాకిరీ ఎప్పుడూ ఉండేదేగా" అంటూ ప్రక్కకివచ్చి కూర్చున్నాడు. ఫణి రాసిపెట్టుకున్న పద్యం వున్న కాగితం అతని కళ్ళపడింది. దాన్ని చేతుల్లోకి తీసుకుని మళ్ళీ చదివాడు.     "బ్రదర్! నేనో ప్రశ్న అడుగుతాను, చెబుతావా?"     "ఏమిటో చెప్పు?"     "గుండెలో ఏదో బాధ, వేదన లేనిదే ఇలాంటి కవిత్వం వెలికిరాదు. ఎవరు నీ గుండెని ఇలా పిండేసింది?"     "ఉన్నది, మా ఊళ్ళో."     "శైలజ కంటే బాగుంటుందా?"     అదిగో, అదిగో! మళ్ళీ శైలజ ఊసు తనదగ్గర ఎత్తుతున్నాడు.     "ఆమె అందంముందు ఈమె ఏపాటి? అబ్బో! ఆమె ఎక్కడ?"     "అందుకే, అనుక్షణం ప్రక్కనే వుంటున్నా, ఎదురెదురుగా ఉంటున్నా ఇతను కవ్వించబడటం లేదు" అనుకున్నాడు రామకృష్ణ.     "బ్రదర్! నాకో సహాయం చేసి పెట్టాలి" అన్నాడు ప్రాధేయపూర్వకంగా.     "ఏమిటో చెప్పు."     "ఓ ప్రేమలేఖ రాసిపెట్టాలి."     "ఎవరికి?"     "శైలజకి."     వళ్ళు మండిపోయింది. 'యూ రాస్కెల్' అనబోయి తమాయించుకున్నాడు.
24,346
                 55. చర్మం మీద వచ్చే పొలుసులు_ "సోరియాసిస్ వ్యాధి"           సోర చేపలంటే నారయ్యకి చాలా ఇష్టం.     సోరచేపలేనిదే నారయ్యకి ముద్దా మింగుపడదు. అటువంటి నారయ్యకి ఒంటిమీద అక్కడక్కడగుండ్రని మచ్చలు ప్రారంభం అయినాయి. ఆ మచ్చలమీదతెల్లతెల్లగా గుండ్రని మచ్చలు ప్రారంభం అయినాయి. మచ్చాలమీద ఏర్పడ్డ పావులుసులని చూసి నారయ్యకి భయంవేసింది. చేపలని తినబట్టి వాటి ఒంటిమీద ఉండే పొలుసులు తనకే వచ్చాయోమోనని అనుమాన పడ్డాడు. వెంటనే డాక్టరు దాహ్హరకి వెళ్ళాడు. డాక్టరు అతన్ని పరీక్షచేసి నారయ్యకి వచ్చిన చర్మవ్యాధిని "సారియాసిస్" అన్నాడు. సోరచేపలని తిన్న నారయ్యకి"సోరియాసిస్" అంటే అర్ధంగాక అదోలా నిలబడిపోయాడు. సారియసిస్ చాలా మొండిచర్మ వ్యాధి. ఈ చర్మవ్యాధి ఎక్కువ మందిలో కనబడుతుంది. కూడా. అయితే ఇది అంతువ్యాధి కాదు. ఈ చర్మవ్యాధి ఎక్కువ శీతాకాలంలోకనబడుతుంది కూడా. అయితే ఇది అంతువ్యాధి కాదు. ఈ చర్మవైది ఎక్కువ శీతాకాలంలో కనబడుతుంది. వాతావరణంలో చల్లదనం తగ్గి వేడి ఎక్కువ అవడంతో చాలా మందిలో ఈ వ్యాధి లక్షణాలు కనబడకుండా పోతాయి. వర్షాలు పడడంతో తిరిగి తల ఎత్తుతాయి.     "సోరియాసిస్" వచ్చిన వరిలో గూలాభీరంగులో గుండ్రని మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు నయాఫిస పరిమాణం నుంచి అరచేయి పరిమాణంవరకు వుంటాయిగానీసాధారణంగా ఇవి చిన్న పరిమాణంలోనే వుంటాయి. ఈ మచ్చలమీద మెరిసే వెండిని గుర్తుచేసే ఎండిన పొలుసులు ఒకదాని మీద ఒకటి దావుమ్తరులుగా ఉంటాయి. ఆ పొలుసులు చేప వంటి మీద ఉన్నట్లు ఉంటాయి. ఇలాంటి గుండ్రని మెరిసే మచ్చలు ఒంటిమీద అనేకం వస్తాయి. ముఖ్యంగా మోచేతుల వెనుక, మోకల్లా ముందు, నడుము వెనుక, తలమీద వుంటాయి. తరాలమీద వున్నప్పుడు నుదురు పైభాగం లోనూ తల చుట్టూతా పొలుసు, పావులుసులుగా కనబడతాయి. ఈ పావులుసులని ఒక్కొక్కటే పెకితే వాటికింద వుందే ఎర్రటి మచ్చాలుబయతపడతాయి. సాధారణంగా ఈ చర్మంవ్యాధిలో దురద వుండదు.     "సోరోయాసిస్" శరీరం మీదే కాకుండా అరచేతుల్లోనూ, పాదాలలోనూ వచ్చి అక్కడి చర్మం పొలుసుపోలుసులుగాతయారవుటుంది. అలాగే చేతి కాళ్ళగోళ్ళకిఈ వ్యాధి వస్తుంది. ఇన్నిచోట్లవచ్చే వ్యాధి ఎందుకు వస్తుందో ఇంతవరకు సరైన కారణం తెలియదు. అయితే, వంశపారపర్యంగా ఈ వ్యాధి రావడం కొందరిలో గుర్తించబడింది. మానసికంగా వ్యాధులకి లోనినవారిలోనూ ఆదుర్దా అందోళనలు ఎక్కువ ఉండేవారిలోనూ, జీర్ణకోష వ్యాధులు ఉండేవారిలోనూ ఈ వ్యాధి  ఎక్కువవస్తుంది. కొందరికి ఏదైనా జ్వరం వచ్చి తగ్గినా తరువాత ఈ వ్యాధి ఎక్కువ వస్తుంది. కొందరికి ఏదైనా జ్వరం వచ్చి తగ్గినా తరువాత ఈ వ్యాధి బయటపడుతుంది. మధుమోహం ఉండేవారిలోనూ, ప్యూరిన్ ఎక్కువ ఉండేఆహారం తీసుకునే వారిలోనూ సోరియాసిస్ రావడానికి అవకాశం ఉంది.     ఇంటినిండా పొలుసులతో వచ్చే ఈ వ్యాధి చాలామందికి చాలామందికి ఎటువంటి మందు వ్దకుమ్డనే తగ్గిపోయి తిరిగిమళ్ళీ తలఎత్తుతూ ఉంటుంది. అయితే మానసికంగా ఒత్తిడికీ అందోళన గురి అయినప్పుడు తిరిగి అకస్మాత్తుగా ఈ చర్మవ్యాధి కనబడటం సర్వసాధారణ వ్విషయం అందుకనే సోరియాసిస్ ఉన్నవాళ్ళు మానసిక అందోళనకిఇట్టిడులకిగురికాకుండా చూసుకోవాలి. సోరియాసిస్ చాలా మొండి వ్యాధి. ఈ వ్యాధికి ఇంతవరకు సరైన మందు కానిపెట్టలేదు. అందుకనే ఏదైనా మందు వాడితే తాత్కాలికంగా వెంటనే తగ్గినట్లు కనబడినా మళ్ళీ ఎప్పుడోకప్పుడు వ్యాధి లక్షణాలు బయతపడతుతూవుంటాయి. వీలైనంత వరకు మంచి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూఆహార నియామల్లో జాగ్రత్తగా వుంటే వ్యాధిని అదుపులో ఉంచవచ్చు. ఆహారంలో కొవ్వుపదాన్నీ, జంతు సంభంధమైన  మాంసకృత్తులనితక్కువుగా తీసుకోవాలి. మానసిక ఒత్తిడి అనవసరమైన అందోళన ఉండేవాళ్ళుట్రావ్క్విలైజర్సువాడుతూ వుండాలి. డాక్టరు సలహ్పై కార్డిక్ స్టిరాయిడ్స్ విటమిన్లు మొదలైనవి వాడాలి అంటేకాని "సోరియాసిస్" వచ్చిందని మానసిక వేదనకి మరింత గురి అయితే వ్యాధి తగ్గేబదులు రెట్టింపు అవుతుంది.                                                        *****    
24,347
    కనకారావు నవ్వాడు.     "నువ్వు దోచుకునేవాడివేగానీ అబద్దాలు చెప్పేవాడివి మాత్రం కాదులే! నాకా నమ్మకముంది" నవ్వుతూ అన్నాడు.     "రూపాయ్ రెడీగా పెట్టుకో! ఓడిపోతున్నావ్!"     "నువ్వు పదివేలు రెడీగా పెట్టుకోవటం బెటరనుకుంటాను."     ఇద్దరూ నవ్వేశారు.     "ఓ.కె. బెస్టాఫ్ లక్."     రాజశేఖరం బయటకు నడిచాడు.     కారు డ్రయివర్ సెల్యూట్ కొట్టి డోర్ తెరిచాడు.     "వద్దు! నడిచే వెళతాను"     డ్రయివర్ ఆశ్చర్యపోయాడు.     "నడిచా సార్?"     "అవును"     రోడ్డుమీద కొచ్చాడతను.     బాగా రద్దీగా వున్నాయి రోడ్లు.     బస్ స్టాఫ్ దగ్గరకెళ్ళి నిలబడ్డాడతను.     రోడ్డుమీద పోయే వాహనాల వల్ల దుమ్ము భయంకరంగా లేచి కళ్ళలోకి, ముక్కుల్లోకి జొరబడుతూంటే కళ్ళు మంటలు పుట్టటం, దగ్గు రావటం ప్రారంభమయ్యింది.     ఏ.సి. కార్లో వెళుతూంటే దుమ్ము ఎలా వుంటుందో తెలిసేది కాదు.     పాపం స్కూలుకెళ్ళే పిల్లలు, మిగతా జనం దీన్నెలా భరిస్తున్నారో---     జనానికి రకరకాల రోగాలు వస్తున్నాయంటే ఎందుకు రావు మరి?     స్లమ్ దగ్గరకెళ్ళే బస్ కోసం పావుగంట నిలబడ్డాక వేలాడుతున్న జనంతో వచ్చింది.     "నేను బస్ ఎక్కాలి! దారి ఇవ్వండి" అన్నాడు ఫుట్ పాత్ మీదున్న వాళ్ళతో.     అందరూ అతనిని చూసి నవ్వారు.     కండక్టర్ బెల్ కొట్టాడు.     కంగారుగా అందరినీ తోసుకుంటూ బస్ ఎక్కటానికి ప్రయత్నించసాగాడతను.     ఒక కాలు ఫుట్ బోర్డ్ మీద అనింది గానీ రెండోకాలు వెనుక ఎక్కిన జనంలో ఇరుక్కుపోయింది. చేతికి డోర్ పక్కనే వున్న రాడ్ దొరకలేదు. ఏ క్షణాన్నయినా వెనక్కు పడిపోవచ్చని అర్ధమయిపోయిందతనికి.     కానీ వెనుక ఎక్కిన జనం బలంగా నొక్కేయడంతో ఎటూ పడకుండా గాలిలో బ్యాలెన్స్ అయిపోయాడు.     భయంగానూ, తమాషాగానూ కూడా వుందా అనుభవం. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఎలా వుంటుందో తెలిసి వచ్చింది---     కానీ ఆ తరువాత బస్ స్టాఫ్ చేరుకుంటుండగానే కొంతమంది రన్నింగ్ లో బస్ దిగేయటంతో ప్రెజర్ తగ్గిపోయి తను వెనక్కుండి పోవాల్సి వచ్చింది.     నడుము విరిగినంత పనయింది.     ఆ పక్కనే నిలబడ్డావాళ్ళొచ్చి లేపి నిలబెట్టారు.     "నువ్వు కూడా రన్నింగ్ లో దిగటమేమిటి గురూ? ఆగాక దిగలేవూ?"     "షటప్" అన్నాడు రాజశేఖరం కోపంగా.     అతను చటుక్కున చొక్కా కాలర్ పట్టుకున్నాడు.     "పోనీలే గదాని లేపి నుంచోబెడితే నన్నే షటప్ అంటావా? నీయమ్మ! అందుకే వెధవలకు సహాయం చేయగూడదంటారు!" అన్నాడు కోపంగా.     "వాట్? నేను వెధవనా?"     "వెధవన్నర--అట్టే మాట్టాడితే-"     రాజశేఖరం బలంగా పిడికిలితో అతని డొక్కలో కొట్టాడు.     వాడు దానికి రడీగానే ఉండటం చేత తప్పుకుని మొఖం మీద అరచేత్తో కొట్టాడు. రాజశేఖరంకి కళ్ళు బైర్లు కమ్మినాయి.     ఈలోగా ఇంకో బస్ రావడంతో అందరూ పరుగెత్తుకెళ్ళిపోయారు. తనూ పరుగెత్తి ఠక్కున ఆగిపోయాడు.     అప్పుడు గుర్తుకొచ్చింది.     బస్ టికెట్ కి కూడా తన దగ్గర డబ్బు లేదు.     చేసేదిలేక నెమ్మదిగా నడక ప్రారంభించాడు.     కోటూ ప్యాంటూ దుమ్ము కొట్టుకుపోయి క్షణాల్లో షాబీగా అయిపోయాయి.     జీవితంలో ఎప్పుడూ ఇలాంటి బట్టలు వేసుకోలేదు.     కొద్దిదూరం నడిచేసరికి కాళ్ళు నొప్పులు పుట్టుకొచ్చాయి.     ఇంతదూరం నడవటం అలవాటు లేదు.     కార్లో వెళితే ఇంతదూరం అయిదు నిమిషాల్లో వెళ్ళిపోయేవాడు.     దూరంగా స్లమ్ కనబడుతూనే వుంది.     చిన్నప్పుడెప్పుడో అందులోకి వెళ్ళాడు తను అందులో అన్నీ చెట్లు వుండేవి! అంతే!     కానీ ఎవరూ పట్టించుకోకపోవడంతో దొంగతనంగా చెట్లన్నీ కొట్టేశారెవరో! వాటి స్థానంలో పాకలు వెలిసినాయి.     శక్తినంతా కూడదీసుకుని మళ్ళీ నడవడం మొదలు పెట్టాడతను.     మరో పావుగంట తర్వాత స్లమ్ దగ్గరికి చేరుకున్నాడు. సగం విరిగి పోయిన బోర్డ్ ఇంకా కనబడుతూనే ఉంది. 'రాజశేఖరం ఎస్టేట్' అన్న అక్షరాలతో.     ఆ బోర్డ్ ని లేపి సరిగ్గా పెట్టడానికి ప్రయత్నించేసరికి మొత్తం పడిపోయింది.     చేసేదిలేక స్లమ్ లోకి నడిచాడతను.     కార్పోరేషన్ వాళ్ళు పడేసే చెత్త ఓ పక్క, మధ్యగా ఓ నదిలా పారుతోన్న మురికి కాలువ ఓ పక్కా దానికి రెండువేపులా శిధిలావస్థలో వున్న గుడిశెలూ, కొన్ని పాతకాలం నాటి పగిలిపోయిన ఇళ్ళూ, చూస్తుంటేనే భయం కలిగించింది రాజశేఖరంకి.     అక్కడ వందరోజు లక్కర్లేదు---
24,348
     వెంటనే గుర్తొచ్చింది దినేష్ విషయం - అయ్యో - అదేమిటి - అలా ఎలా మరచిపోయిందీ. ఏమనుకుంటున్నాడో - అదేమిటో అలాగ, తను అతని విషయం మరచిపోవటం - పరిగెత్తి కారు దగ్గర కెళ్ళింది - కారుంది కానీ అందులో దినేష్ లేడు - ఎక్కడి కెళ్ళినట్టు - తనపై కోపగించుకుని ఎక్కడ ఎటైనా వెళ్ళాడా - ఊరుకొత్త - శారద మనసు ఉడికిపోయింది - ఎవర్నడిగితే ఏంబావుంటుంది - ఎవరితో చెప్తే ఏం బావుంటుంది - శారద అటూ ఇటు చోసాయింది ఖంగారుగా లోపల కొచ్చింది - ఆశ్చర్యానికి హద్దులులేవు - దినేష్ హాల్లో అందరితోకూచుని పేకాట ఆడుతున్నాడు నవ్వాలో ఏడ్వాలో తెలియలేదు శారదకి.         'ఇక్కడున్నావా అన్నయ్య, ఇతను' - శారద చెప్పబోయింది 'నా పేరు దినేష్, నేను శారద ఫ్రెండునని చెప్పేసానులే. "ఇక వెళ్ళు" దినేష్ పేకాటలో మునిగిపోయాడు. శారదకి చాలా ఆశ్చర్యమేసింది. ఎంత త్వరగా మనుషులతో కలసిపోతాడితను అనే విషయం తల్చుకుంటుంటే - జాతిమతకులభాషా భేదాలతో ఏ సంబంధమూ లేకుండా క్షణాల్లో స్నేహితుల్లా కలసిపోయే గొప్ప సుహృద్భావం పేకాటకే వుందంటే అతిశయోక్తి కాదు! దినేష్, భోజనం, నిద్రకు ఏర్పాటు మొదలైనవన్నీ అన్నలే చూసుకున్నారు ఆ రాత్రి శారదకు నిద్ర పట్టనేలేదు.         తెల్లవారింది అందరూ తలోపనిలోనూ హడావిడిగా వున్నారు. దినేష్ షేర్ మార్కెట్ గురించి, షేర్స్ గురించి, వాటిపై వచ్చే లాభాల గురించి అక్కడున్న వారందరితో చెప్తున్నాడు. పొలం దున్నే ఈరిగాడి దగ్గరనుంచి వంద ఎకరాల ఆసామి రాములయ్యవరకు అంతా ఆసక్తిగా దినేష్ మాటలు వింటున్నారు. శారదకి మాత్రం చాలా ఉక్కిరిబిక్కిరిగా వుంది.         శారద స్నానం చేసింది పిన్ని శారద దగ్గరగా కూచుంది. "అతగాడేనా" - అంది నెమ్మదిగా.         'ఏమిటీ' - శారద దువ్వెనకున్న జుట్టు తీస్తోంది.         "అదేలే మా పిన్నితోడికోడలి చెల్లెలు - అదే హైదరాబాదులో మీ ఇంటావిడ సుబ్బలక్ష్మి - చెప్పిందిలే ఇరవైరోజులనాడు విజయవాడలో ఓ పెళ్ళిలో కలసినపుడు"         "ఏమిటీ -" అర్ధంకాలేదు శారదకి.         'ఏమిటీ సిగ్గు - సుబ్బలక్ష్మి అంతా చెప్పింది - అవును కానీ కోర్టులు కేసు తేలిపోయినట్టేనా" - పిన్ని రహస్యంగా అంటున్నమాటలు వింటూంటే తలతిరిగిపోతోంది - ఈ పల్లెటూళ్ళో కూచున్న ఈవిడకి ఇన్ని వివరాలు తెలుసా. ఇన్ని ఆరాలు కావాలా శారదకి కోపం వచ్చింది "ఆవిడేం చెప్పిందో, నువ్వేం విన్నావో నాకేంతెలియదు. విసురుగా లోపలకెళ్ళి పోయింది శారద.         'అంతకోపం దేనికే - ఉన్నమాటంటేనూ - పైగా ఊరంతా అనుకుంటున్నదే నేనూ అన్నాను' - గొంతు హెచ్చించింది పిన్ని.         ఆ ఊరికరణం గారితో కలసి తోటలు దొడ్లు చూడటానికి వెళ్ళిపోయాడు దినేష్. తను అతన్ని ఈ ఊరుతీసుకొచ్చినట్టేలేదు అతని ప్రవర్తన. రెండురోజులయింది దినేష్ తోమాట్లాడితను - పైగా ఊరంతా అతనికోసం వస్తున్నారు షేర్ మార్కెట్ గురించి తెలుసుకోవాలి. ఎంత డబ్బు పెట్టచ్చు అని ఒకరడిగితే ఎంత లాభం వస్తుందని మరొకరు స్టాక్ బ్రోకరు అంటే ఎవరూ అని అడుగుతున్న చిన్నన్నయ్య శారదకి మతిపోతోంది- తను ఒక్కర్తీ వెళ్ళిపోయినా దినేష్ హాయిగా ఇక్కడవుండిపోగలడనిపించింది.         "ఏమమ్మా - శారదమ్మా - కులం, గోత్రం ఏవైనా చూసుకున్నావా - అదీ అక్కర్లేదా' పెద్దవదిన కాఫీ అందిస్తూ అడిగింది.         శారద సమాధానం చెప్పలేదు క్షణం కానీ వెంటనే అంది మీరంతా ఎందుకిలా మాట్లాడుతున్నారో తెలియటం లేదు- మన ఊరుచూస్తానంటే తీసుకొచ్చాను - నా స్నేహితుడంతే చిరాగ్గా అంది శారద "ఎవరయితే మాకేంలే" వదిన మూతి తిప్పింది.         ఈ ఊరు వచ్చిన తర్వాత దినేష్ లో చాలా మార్పుకనిపించింది శారదకి. వారంరోజులూ రెండుమూడు సార్లు కన్న ఎక్కువ మాట్లాడలేదు శారదతో. అతనికి కావలసినవన్నీ పాలేరు ఈరిగాడు చూస్తున్నాడు శారద అన్నగార్లు దినేష్ ను చాలా గౌరవంగా చూస్తున్నారు. వాళ్ళందరికీ తమపాలిట అదృష్టదేవత ఈరూపంలో వచ్చిందనే నమ్మకం కలిగింది దినేష్ మాటల వల్ల "ఒక ఊరా ఊరూరా తిరుగుతున్నా. దేనికి, మీ లాటి వాళ్ళంతా నాలుగు డబ్బులు సంపాదించుకుని బాగుపడాలని. మీరు డబ్బులు ఎంతసేపు దాచుకోటం తప్ప మరోకటి చేయరు. బాంక్ లోవేస్తారు- కాని డబ్బు వున్నదానికన్నా వందలవేల రెట్లు అధికలాభం రావాలి అంటే కంపెనీలో షేర్లు కొనుక్కోవాలి. ఇప్పుడునేనేకొన్ని కంపెనీలు పెట్టాను. మా హైదరాబాదులో అందరూ మాకివ్వండిషేర్సు, మాకివ్వండని నా వూపిరి సలపటంలేదు.....బొంబాయిలో మా పిన్నిగారి కంపెనీలలో ఎందరో షేర్ హోల్డర్స్ - ఎందుకు చేరతారూ - వాళ్ళకి లాభం వస్తుందని తెలియబట్టి - ఈ విషయాలన్నీ మీకెవరూ చెప్పరు - అందుకే నేను మీ అందరి బాగుకోరి, ఈ బాధ్యత నా నెత్తిన వేసుకున్నాను - లేకపోతే, దేశవిదేశాలు తిరిగిన నేను ఇక్కడకెందుకొచ్చానూ- నలుగుర్ని బాగుచేస్తే దేముడు మెచ్చుతాడని - దినేష్ మాటలు వింటూ అక్కడ చాలా మంది మంత్ర ముగ్ధులలా కూర్చున్నారు.         'బాబూ - తమరు ఇంకా ఊంటారా ఊళ్ళో" ఒక అరవైఏళ్ళు నిండిన బుగ్గమీసాల ఆసామి అడిగాడు. 'నేను నిన్ననే వెళ్ళిపోవాలసింది.....పక్క ఊరునించి కొందరు వస్తారని, వాళ్ళకి షేర్స్ కు సంబంధించిన వివరాలు కావాలని అంటే వున్నాను. నిజానికి ఇవాళ రాత్రి వెళ్ళాలనుకుంటున్నా. రేపు రాత్రి బొంబాయి ఫ్లైట్ " దినేష్ సిగరెట్టు ముట్టించాడు.         'ఒక్కమాట - నా భార్య దగ్గర చాలా నగలున్నాయండి - అవి ఎప్పుడు పెట్టుకోవాలన్నా భయమేనండీ - దొంగల ఊరు అయిపోయింది కదండీ - అవి అమ్మేసి తమరు చెప్పినట్లు షేర్స్ కొంటానండి - షేర్స్ మీద లాభాలొస్తాయి కానీ, నగలు దాచుకుంటే ఏమొస్తాయండి. తమరు సలహా చెప్పండి" ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాడు ముసలాడు దినేష్ చెప్పే సమాధానం వినాలని.         "చూడండి - నగలు అమ్మద్దండి - ఎందుకంటారా, నగలంటే ఆడవాళ్ళకి మహాయిష్టం - అవి అమ్మినదగ్గర నుంచీ, ఇంట్లోకలహాలు మొదలవుతాయండి. అందుకని దినేష్ ముసలాడి వంక చూసాడు.         'ఇంట్లో కలహాల గురించి ఆలోచించకండి. బాబూ - అది ఒట్టివెర్రి బాగుల్ధండీ. నగలన్నీ అమ్మీ నీపేర పొలం కొంటానంటాదండి - దాని విషయం మీరు ఆలోచించకండి - కానీ నేనేమిటంటే ఆ పనిచేసి డబ్బుతెచ్చి మీరు చెప్తున్నా కంపెనీలలో షేర్స్ కొనటానికి కొంత టైముపడుతుంది కదండీ మరి మీరేమో రేపే వెళ్ళతానంటే ఎలాగ అని చూస్తున్నాను.         దినేష్ చిరునవ్వునవ్వాడు.         'మీ సమస్య అర్ధమయింది - మీ పని అయేవరకు వుంటాను ఇక్కడే సరేనా - మీరంతా నన్ను అర్ధంచేసుకుని, కంపెనీ షేర్స్ కోసం ఎగబడుతుంటే నాలుగు రోజులువుండాలంటే వుంటాను.         ముసలాడికి చాలా ఆనందంకల్గింది - శారదకి దినేష్ పైన చాల కోపంగా వుంది.....ఊరుచూస్తానని వెంటపడి వచ్చిన అతను తీరా వచ్చాక షేర్ మార్కెట్, షేర్స్ ఇదే గొడవ - అసలు హైదరాబాదు వెళ్ళే మాటేలేదేమిటి - పైగా సరదాగా గడుపుదామనుకున్నటైము, ఇక్కడ అన్నయ్య కొడుకు వడుగు హడావిడితో మొదలై, ఇప్పటికి ఇంకా చుట్టాల గొడవ పూర్తిగా తగ్గలేదు. శారద తండ్రికి ఇంటినిండా చిన్న పెద్ద తిరుగుతూ సందడిగావుంటే ఎంతో బావుంది. దినేష్ కు ఎంత ఎక్కువమంది షేర్స్ కొంటామని వస్తుంటే అంత ఆనందంగా వుంది.
24,349
    "నేనే ఏదో వక ఉపాయం ఆలోచిస్తాను. ఈ తఫా ఈ ఆస్తీ చేజిక్కించుకోకుండా మన బిచాణా ఎత్తేస్తే మనగతి ఇంతే" అన్నాడు త్రయంబకరావు.     "త్రయం! నాకో ఉపాయం తట్టిందిరా దానికింక అప్పీలు లేదు."     "ఏమిటది మళ్ళి పనికిమాలినదేనా!"     "కొన్ని పనికిరాకుండా పోయాయని అన్నిటి గతీ అంతేననకు."     "సరే అదేదో చెప్పి అఘోరించు."     "పిచ్చిముండ వాగుడు. వెధవ తెలివి చచ్చుసలహా అని తిట్టకు."     "అలాగే కానియ్యి"     "ఈ దేశాచారము. ఈ దేశ సాంప్రదాయము. పరపురుషుల వల్ల పిల్లలని కనకూడదని కదా!"     "అని ఏ గాడ్దెకొడుకు కూశాడు! భారతకధ తీసుకుంటే అందరూ పరపురుషుల వల్లనే కదా పిల్లలని కంది?"     "అబ్బ, ఏం తెలివిరా నీది? ఏమాటన్నా చెప్పు దానికేదో కధ చెప్పేస్తావు. నీ తెలివే వేరు."     "కాలం కలిసి రాలేదుగాని నాకేమిటే అమ్మా! దేశాన్ని ఏరిపారేయనూ?" అన్నాడు మేలేద్దామంటే మీసాలులేని పేడిమూతి త్రయంబకరావు.     "ఓ తుగ్లక్ చచ్చాడు. మరో తుగ్లక్ దిగాడు ఇంక నువ్వే మిగిలావు" అనుకుంది అమల.     "మానాయనే మాతండ్రే" అని మెటికలు విరిచింది గంగారత్నం.     "ఇందాక ఏదో చెపుతానన్నావు అదేమిటో చెప్పు!"     "కోప్పడకూడదు."     "కోప్పడను సరేనా!"     "కదుపు చేస్తే....."     "కదుపు చేయటమా! ఏంటీ, ఆ చెప్పేదేదో సరీగ చెప్పి తగలడు."     "అదిగో కోప్పడుతున్నావు!"     లేదులే."     "ఎట్టాగో అట్టా ఆ పిచ్చిదాన్ని లొంగదీసుకుని కదుపు చేశావనుకో, అప్పుడు చచ్చినట్లు మీ మామయ్య  ఆ పిచ్చిముండని నీకే యిచ్చి పెళ్ళి చేస్తాడు." అంది గంగారత్నం.     ఆమాట విన్న అమల నిర్ఘాంతపోయింది.     త్రయంబకరావు ఆలోచనలో పడ్డాడు.     కొడుకు ఆలోచిస్తున్నాడంటే తనమాట నచ్చే వుంటుంది అనుకుంది గంగారత్నం. లేకపోతే పిచ్చిముండ పిచ్చి ఆలోచనలు అని విసుక్కుంటాడు ఆ విషయం బాగా తెలుసు.      "ఈ కొత్తాలోచన కొంతవరకూ బాగానే వుంది, కాని - "     "కాని ఏమిటిరా త్రయం?"     "ఎలా అని?"     "ఆడదానికి కడుపుచేయటం ఎలాగో మగాడికి చెప్పాలిటరా నాయనా!"     "అదికాదే" విసుక్కున్నాడు త్రయంబకరావు.     "మరి అదేదో చెప్పు!"     "అదసలే పిచ్చిది లొంగాలి కదా."     "ఇలాంటి చిన్న విషయాలే తెలియవురా త్రయం! పిచ్చివాళ్ళకి మదపిచ్చి కూడా ఎక్కువే వుంటుంది. ఈ రోజు నుంచీ దాన్ని కాస్త దువ్వు సమయం చూసి ఆచోట ఈ చోట చెయ్యివెయ్యి దానికి మోహం పుడుతుంది అంతే ఇంక నిన్ను వదలదు."     "కడుపు వస్తుందన్న గ్యారంటీ ఏమిటి?"     "నీ పని నీవు చేయి. అది రావటం ఎంతసేపు. అరక్షణం పట్టదు."     రోజా స్థానంలో తను వున్నది కాబట్టి సరిపోయింది. అదే మతి చలించిన రోజా ఇక్కడ వున్నట్లయితే ఓ ఓపక్క శంకరం మరో పక్క ఈ త్రయంగాడు. రోజాకి ఎంత అన్యాయం చేసేవాళ్ళో. ఎప్పుడో నిజం బయటపడితే, చూడరాని దృశ్యం కంటపడితే భుజంగరావుగారి గుండె పగిలి చెరువు అయేది. భగవాన్ గాడు తనని మంచికే చేర్చాడో చెడుకే చేర్చాడో ఈ ఇంట్లో రోజా స్థానంలో చేర్చాడు. ఒకందుకు ఇదీ మంచిదే అయింది. ఉపాయంగా ఎత్తుకు పై ఎత్తు వేస్తూ వీళ్ళ రోగం కుదర్చాలి." అనుకుంది అమల.
24,350
     "అయ్యయ్యో!" అంది పక్కింటావిడ ఆందోళనగా.     "నలుగురు తిరుగుతున్న చోట నగలు అంత అజాగ్రత్తగా ఎందుకు పెట్టావమ్మా? మధ్యాహ్నం పనిమనిషి వచ్చిందా? ఎంత ఖరీదు చేస్తాయేం?"     "వెధవ ఖరీదెవడికి కావాలి!" అంది జానకి వెక్కుతూ, "నా సృజన నాకు దక్కితేనిలువు దోపిడీ ఇస్తానని మొక్కుకుని తీసి ఉంచిననగలు అవి! అవి పోయాయంటేదేముడికి నా మీద దయలేదన్నమాట! ఆయనకీ నానగలుకూడా అక్కర్లేదన్నమాట; ఎవరండీ! ఆయన మనచిట్టి తల్లిని రక్షింపదలచుకోలేదండీ! ఇంక మనకు దిక్కెవ్వరండీ! ఆయన మన చిట్టితల్లిని రక్షింపదలచుకోలేదండీ! ఇంక మనకు దిక్కెవ్వరండీ!" అంది భర్త భుజం మీద వాలిపోతూ.     గేటుముందు ఒక పోలీసు జీపు ఆగింది. అందులోంచి దిగాడు ఒక యంగ్ సబ్ ఇన్ స్పెక్టర్.     జీపుదిగుతున్న ఎస్సైని చూడగానే అందరూ పరుగులాంటి నడకతో గేటు దగ్గరకు వెళ్ళిపోయారు.     "ఇన్స్ పెక్టర్ గారూ! జానకి ముడుపుకట్టిఉంచిన నగలమూట కూడాపోయింది." అన్నాడు పక్కింటిప్రసాదరావు త్వరత్వరగా.     "పోతేపోయాయి వెధవనగలు!" అంది జానకి బిగ్గరగా, "ఇన్స్ పెక్టర్ గారూ! నా కూతురు నాకు దక్కితేచాలు. నగలసంగతి మీరు పట్టించుకోకండి. నా కూతుర్ని నాకు తిరిగి ఇవ్వండి!" సాలోచనగా ఆమెవైపు చూస్తూ అన్నాడు ఎస్సై "మీకొక గుడ్ న్యూస్! మీ అమ్మాయిని గురించిన మొదటి క్లూ దొరికింది మాకు"     "ఏమిటీ?" అన్నాడు రమణమూర్తి అద్విగ్నంగా, "క్లూ దొరికిందా? ఏం క్లూ?"     "మీ అమ్మాయి జైహింద్ స్టోర్స్ పక్క సందులోకి మళ్ళగానే ఇద్దరు మనుషులు కలసి ఆమెని ఒక ఆటోలో ఎక్కించుకుని ఎత్తుకుపోయారు. ఆ ఆటో నంబరు ట్రేస్ చెయ్యగలిగాం"     ఎస్సై ఆటోనెంబరు చెప్పగానే విలవిల్లాడిపోయింది రమణమూర్తి మనసు.     ఆ ఆటోనే తను డాష్ కొట్టబోయింది నిన్న! డాష్ కొట్టి ఉంటే తమ సృజన అప్పుడే తమకు దొరికి ఉండేది! తనకాళ్ళూ చేతులూ విరిగినా సృజన మాత్రం స్వల్పమైన గాయాలతో బయటపడి ఉండేదేమో!     ఎంతకొద్దిలో అదృష్టం తప్పిపోయింది!     ఆసంగతే ఎస్సైతో చెప్పాడు రమణమూర్తి. విని తల పంకించాడు ఎస్సై. "డోంట్ వర్రీ! జరిగిందేదో జరిగిపోయింది! ఆ ఆటోడ్రైవర్ పేరు నవాబ్. ఇంకా మనకేసు సింపుల్ అయిపోయినట్లే! తెల్లారేసరికి మీ అమ్మాయిని మీ ఇంట్లో దింపేస్తాం చూడండి." అన్నాడు చాలా కాన్ఫిడెన్స్ తో. తేలిక పడింది రమణమూర్తి మనసు. "మీ సాయం ఈ జన్మలో మర్చిపోను" అన్నాడు ఎస్సై చేతులు పట్టుకుని గట్టిగా ఊపేస్తూ, తర్వాత తటపటాయిస్తూనే మెల్లిగా అన్నాడు. "దయచేసి మీరొకసారి ఇటు వస్తారా?"     "ఎందుకు?" అంటూనే అతనితో బాటు నడిచాడు సబ్ ఇన్స్ పెక్టర్!     మొహమాటంగా అన్నాడు రమణమూర్తి. "అడుగుతున్నందుకు తప్పుగా అనుకోకండి....... మీకు ఐమీన్....నేను.....చెయ్యవలసిన ఫార్మాలిటీస్ ఏమన్నాఉన్నాయా? చెప్పండి! సంతోషంగా పూర్తి చేస్తాను"     "మీరు లంచం తీసుకుంటారా?" అని ఇన్ డైరెక్ట్ గా అడుగుతున్న రమణమూర్తి వైపు నవ్వుతూ చూశాడు ఎస్సై "నోనో అలాంటి దేమీలేదు బైదిబై. అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ కెలా తెలుసు"     "మా ప్రక్కింటి ప్రసాదరావుగారికి ఆయన దూరపు బంధువు."     "ఐసీ! ప్లీజ్ టేకిట్ ఈజీ! రేపొద్దున్నే మీ అమ్మాయిని మీ ఇంటి దగ్గర దింపేస్తాను. బదులుగా మంచి కాఫీ ఇస్తే చాలు!" అన్నాడు ఎస్సై నవ్వుతూ.     "కాఫీదేముంది! గ్రాండ్ డిన్నర్ ఇస్తాను" అన్నాడు రమణమూర్తి కృతజ్ఞతతో.     నవ్వి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయాడు ఎస్సై.     క్షణాల్లో ఆ ఇంట్లో ఆనందం వరదలాపొంగింది. అందరూ ఒక్కసారిగా గలగల మాట్లాడడం మొదలెట్టారు.     ఎత్తుతక్కువగా ఉన్న కాంపౌండ్ వాల్ ని రెండు చేతులతో పట్టుకుని ఎగిరి దానిమీద కులాసాగా కూర్చున్నాడు రమణమూర్తి.     "మన పోలీసులు చాలా ఎఫిషియెంటు లెండి తలచుకుంటేవాళ్ళు సాధించలేనిది ఉండదు. అయితే వచ్చినచిక్కల్లా ఏమిటంటే వాళ్ళు తలచుకోరు. ఇప్పుడు కూడా మనం ప్రసాదరావుగారిచేత ఇన్ ఫ్లుయన్స్ చేయించకపోతే పని జరిగి ఉండేది కాదు. జరిగేదంటారా?" అన్నాడు రమణమూర్తి.     గోడమీద కూర్చున్న రమణమూర్తిని చిత్రంగా చూస్తూ తను కూడా సంభాషణ లోకి దొరబడ్డాడు పక్కింటి ప్రసాదరావు. "ఆ నాదేవుంది!" అన్నాడు మోడెస్ట్ గా.     ఉన్నట్లుండి గభాల్న గోడ దూకాడు రమణమూర్తి. గబగబ మైనా పిట్ట ఉన్న పంజరం దగ్గరకు వెళ్ళాడు.     ఒక మనిషి తనని సమీపిస్తూ ఉండడం చూసి కంగారుగా అరవడం మొదలెట్టింది మైనా,     "ఏమే తెగ అరుస్తున్నావ్?" అన్నాడు వేళాకోళంగా.     "ఇప్పుడు చెవికోసిన మేకలాగా అరవడం కాదు. తెల్లారి మీ ఫ్రెండ్ సృజన ఇంటికి రాగానే కోయిల్లా మాంచిపాటపాడి స్వాగతం చెప్పాలి నువ్వు! లేకపోతేనా తోకపీకేస్తాను సరేనా?" అన్నాడు తర్జనితో పిట్టని బెదిరిస్తూ.     అతనిమాటల్లో పెద్ద జోకేమీలేకపోయినా అక్కడున్న వాళ్ళందరూ విరగబడి నవ్వారు.     "సంజయ్! ఈ మైనాకి తినడానికేమన్నా పెట్టారా అసలు? ఏదన్నా తిండి దొరుకుతుందేమోచూడు! జానీ మా అందరికీ కాఫీ! హాట్ అండ్ స్ట్రాంగ్!" అన్నాడు రమణమూర్తి.     నవ్వుతూ తల ఊపి త్వరత్వరగా వంటింట్లోకి వెళ్ళింది జానకి.     సృజన తాలూకు క్లూ తెలిసిపోయిందన్న శుభవార్త కలిగించిన ఆనందం అలా కొద్దిసేపు పాలపొంగులా పొంగింది. ఆ ప్రథమోత్సాహంకొద్దిగా చల్లారాక అందరూ ఒకచోట చేరికొంచెం లెంల్ హెడెడ్ గా సృజనని గురించి మాట్లాడుకోవడం మొదలెట్టారు.     వ్వవ్వవ్వ     అమ్మ గనక తోడురాకపోతే రాత్రిపూట బాత్ రూం కి కూడా వెళ్ళలేని సృజన రక్తసిక్తమై పోతున్న తన బట్టలని చూచుకుని చిగురాకులా వణికిపోతుంది.     రాఘవులూ, జాన్ కలసి తనని ఆటోలో పడేసి ఎత్తుకొచ్చినప్పుడు కూడా ఇంత టెర్రర్ కలగలేదు తనకి!     తనకేం జరుగుతుందో తనకే తెలియని దురవస్థ అది! ఫలానా అని చెప్పలేని భయంతో ముచ్చెమటలు పోస్తున్నాయి.     అప్పుడు లీలగా ఒక విషయం గుర్తువచ్చింది.     తమ క్లాసులో అందరికన్నా పెద్దఅమ్మాయి రమ్య. ఒక్క రోజు కూడా స్కూలు మానడానికి ఇష్టపడదు తను.     అలాంటి రమ్య వరుసగా ఒక వరం పాటు స్కూలుకి రాలేదు. రమ్య సృజనకి బెస్టు ఫ్రెండు.     వచ్చాక, జ్వరంవల్ల తను కొన్నాళ్ళపాటు స్కూలుకు రాలేదని అందరికీ చెప్పింది రమ్య.     కానీ బెస్ట్ ఫ్రెండ్ సృజనకి మాత్రం నిజం చెప్పేసింది ఇబ్బంది పడుతూ!" నాట్ ఫీవర్ రే! ఐ బికేమ్ ఏ పెద్దమనిషి!" అంది మాటలు మింగేస్తూ.     "అంటే?" అంది సృజన అర్ధంగాక. వివరంగా చెప్పేటంతగా రమ్యకీ తెలియదు. ఆమెకి తెలిసింది చెప్పినా సృజనకి పూర్తిగా అర్ధంకానూలేదు.
24,351
    "గజీతగాడు గాడు...గజదొంగ__ కిడ్నీగాడు...కిడ్..." సవరణ చేశాడు సేతురాజు.     "మాకు తెల్సులేవోయ్....వర్రీస్ లో ఉన్నాం కదా....అందుకని వర్ద్సు మారిపోయాయంతే. ఇంతకీ ఆ గుంటడు ఎటెళ్ళిపోయాడంటావ్?" అడిగాడు వీర్రాజు సాలోచనగా.     అదే సమయంలో పోతురాజు పల్లీల బండిమీద పల్లీలు బేరమాడుతున్నాడు. వాడిని ఏదో సీరియస్ డిస్ కషన్ లో దించి, దొంగచాటుగా పల్లీల్ని తీసుకొని నవుల్తున్నాడు.     అదే సమయంలో ఓ పోలీస్ జీప్ అటుపక్కగా వెళ్ళింది. ఆ పోలీస్ జీప్ ను చూసిన వీర్రాజు గబుక్కున ముందుకెళ్ళి పోతురాజును వెనక్కిలాగి__     "పోలీస్...జీప్...పోలీస్ జీప్" అని గుడగుడలాడాడు.     "అయితే ఏంటట?"     "వాళ్ళు మనకోసమే వెతుకుతున్నట్టున్నార్రా__ ఆ జీప్ యెంత స్పీడుగా వెళుతుందో చూడు" భయంగా అన్నాడు వీర్రాజు.     "ఇలా పోలీసులకు. లాఠీలకు భయపడిపోతున్నాం కాబట్టే, మనం కేడీగాల్ల పోస్టుల్లోనే వుందిపోయాం. లేదంటే ఎప్పుడో యం.ఎల్.ఏ, యం.పి.లం, మంత్రులం అయిపోయేవాళ్ళం. అసలు మనం యెలాగుంటామో వాళ్ళకు తెలీదుగదా. యెలా పట్టుకుంటార్రా" జ్ఞానిలా ప్రశ్నించాడు పోతురాజు.     "అవున్నిజమే గదా. పోలీస్ జీప్ ను చూడగానే జ్ఞాపకం వచ్చింది. మనం రెండోసారి ఆ కాళేశ్వర ప్రసాద్ కి ఫోను చెయ్యాలేమో"     అవును. సినిమాల్లో కిడ్నాపర్లు, ప్రతి రెండుగంటలకొకసారి ఫోను చేసి టెన్షన్ క్రియేట్ చేస్తారుగదా"     "కరెక్టు ఐడియా__మనం రెండవసారి ఫోను చేస్తేనే__మరింత టెన్షన్, క్రియేట్ చేసిన వాళ్ళమవుతాం."     అదిగో పబ్లిక్ ఫోను. జల్దీగా ఆ పని చేసేసి, ఆ గుంటడి వేటలో పడదాం" అనుకుంటూ ముందుకు నడిచారు ముగ్గురూ.                                    ౦    ౦    ౦     పబ్లిక్ టెలిఫోన్ బూత్ వ్యక్తి ముగ్గురి వేపూ ఎగాదిగా చూసి__     "నెంబర్ చెప్పండి_" అన్నాడు.     నెంబరు చెప్పకుండా, రిసీవర్ని అందుకొని, తనే డయల్ చేయడం ప్రారంభించాడు వీర్రాజు.                                    ౦    ౦    ౦     కాళేశ్వర ప్రసాద్ బిల్డింగ్ పూలు పూయని తోటలా, నిస్తేజంగా వుంది.     అప్పటికే రకరకాల ప్రయత్నాలు చేసి, అలిసిపోయారు సెక్యూరిటీ స్టాఫ్. అందరి కళ్ళూ టెలిఫోన్ల మీదే ఉన్నాయి.     పారిశ్రామిక సామ్రాజ్యాన్ని పులిలా శాసించే కాళేశ్వర ప్రసాద్ ముఖంలో చిరునవ్వు ఎప్పుడో మాయమై పోయింది.     అంగబలం, అర్ధబలం ఉన్నా- ఆ రెండూ తన చిన్నారి తేజకోసం ఎందుకు ఉపయోగ పడడం లేదో అర్ధం కావడంలేదతనికి.     భార్య సుదేష్ణ ముఖంలోకి చూడాలంటేనే భయంగా ఉంది అతనికి.     నిద్ర లేక, తిండి లేక, సగానికి సగమై పోయింది సుదేష్ణ. తన చిన్నారి తేజ ఏ సమయంలోనైనా తన కళ్ళముందుకి వస్తాడని, నలభై ఎనిమిది గంటలసేపు దైర్యంగా ఎదురుచూసిన ఆమెలో ఆ నమ్మకం సడలిపోయింది.     ఏ తెల్లవారు ఝాములోనో పట్టే రెండు నిమిషాల మగత నిద్రలో ఏవో పాడు కలలు.     తన మాతృత్వం తనకు దక్కదు.     తన చిన్నారి తనకు కన్పించడు.     కన్ను మూసినా, తెరిచినా ఒకటే దృశ్యం- తనని చూసి, పరిగెడుతున్న తేజ!     అదేపనిగా తను కంట తడిపెట్టి బాధపడుతుంటే, భర్త మనస్సెక్కడ బాధపడుతుందోనని, చాటుమాటుగా కూర్చుని ఏడుస్తోంది సుదేష్ణ.     భార్యను సముదాయించదానికి వచ్చి, బయటకు విన్పించకుండా  ఏడుస్తున్న ఆమె దుఃఖాన్ని చూసి, తడి నిండిన కళ్ళను వేళ్ళతో అదుముకుని కాళేశ్వరప్రసాద్ వెళ్ళిపోయే సన్నివేశాలెన్నో!     గుండెలు పగిలిపోకుండా ఉండాలంటే, ఒక్కొక్కప్పుడు దుఃఖానికి కూడా గుంభనం కావాలేమో!     -ఒడిలో తేజ ఫోటో పెట్టుకుని, శూన్యంలోకి నిస్తేజంగా చూస్తున్న సుదేష్ణాదేవి తన భుజమ్మీద భర్త చేయి పడగానే-     తెప్పరిల్లి అతని కళ్ళల్లోకి చూసింది. ఆమె కళ్ళలో మంచు బిందువుల్లా కన్నీళ్లు!     "సుదేష్ణా, పాలైనా తీసుకో!" ఆర్ద్రంతో బొంగురుపోయింది అతని గొంతు.     "తేజ....తేజ....తేజ గురించి ఏమైనా తెల్సిందా?" ఓకే ఒక ప్రశ్న వేసిందామె.     తను ఈ సమయంలో కోటి రూపాయలైనా ఖర్చుపెట్టగలడు గానీ, ఆ ప్రశ్నకు మాత్రం జవాబు చెప్పలేదు.     "కొన్ని గంటల బాధ, ఒక్క నిమిషంలో తొలగిపోతుంది- అన్ని ఏర్పాట్లూ చేశాను. ఏ నిమిషంలోనైనా, మనకు మంచి కబురు చేరుతుంది. నాకు మాత్రం బాధ లేదా సుదేష్ణా!" అంతర్లీనంగా ఎంతో మధన ఉంటేనే తప్ప, కాళేశ్వర ప్రసాద్ నోటి వెంట అలాంటి మాట రాదు.     పైటచెంగుతో కళ్ళను అడ్డుకుని, భర్తవేపు చూసిందామె.     సరిగ్గా అదే సమయంలో పి.ఎ. రమాకాంత్ అక్కడకు వచ్చాడు.     "సర్! ఎస్.ఐ. వచ్చారు!" ఆ మాటతో, డాబామీంచి కిందకు దిగాడు కాళేశ్వర ప్రసాద్.                                     ౦    ౦    ౦         "ఆ ముగ్గురూ చిన్న చిన్న దొంగతనాలు చేసే పాత కేడీలుగా అనుమానిస్తున్నాం. చిన్న చిన్న నేరాల మీద వాళ్ళు తరచూ జైలుకి వెళ్ళి వస్తుంటారని తెల్సింది వాళ్ళ పేర్లు వీర్రాజు, సేతురాజు, పోతురాజు అని తెలుస్తోంది."     "వాళ్ళే మా తేజను కిడ్నాప్ చేశారని కేవలం మీరనుమానిస్తున్నారా? నమ్ముతున్నారా?"
24,352
                                                                                                                                       తిరుపతి                                                                                                                                        02-02-02     రఘుగారికి,     టి.వి.లో వొక సినిమా ప్రకటన చూసి రాస్తున్నాను.     "Aap  mujhe acche      lagne lage"     vikram Bhatt direction.     సినిమా యెలా తయారవుతుందో తెలియదు.     ఆ ప్రకటనలో Hrithik Roshan Amisha patel ల  ముఖాలు కనిపిస్తాయి.  కేవలం నిలకడగా మౌనంగా  మొఖాలు కనిపిస్తాయి. చిన్న అధ్బుత కవితలా  అనిపించింది. హిందీ మ్యూజిక్  చానల్స్ లో  చూపెడుతున్నారు. చూడండి.     కూచిపూడి వయ్యారం యిష్టం. చాలా యిష్టం. చాలా చాలా యిష్టం. పచ్చని చిలకలిష్టం. వాటిక్కూడా అబ్బో యేం వోయ్యరమో!     సరిహద్దు ప్రాంతమ్తెనా  కాదు, మలయాళంలో  అచ్చతెలుగు పదాలున్నాయి. వుదాహరణకి వుప్పను  వుప్ప అంటారు వాళ్ళు.     sony, star plus లలో 5.P.M. కి చూడొచ్చు.     మీ నలుగురికి శుభాకాంక్షలు.                                                                                                            -వడ్డెర చండీదాస్.                                                                                                                తిరుపతి                                                                                                                4-2-02                                                                                                                                                                                                                                              రఘుగారికి     నేను రాసిన సినిమా ప్రకటన మానేసి మరొకటి (చెత్త) వేస్తున్నారు. అరుదుగా కొన్ని చోట్ల వేస్తున్నారు.                                                                                                              -వడ్డెర చండీదాస్.                                                                                                                                  తిరుపతి                                                                                                                    11-3-02     రఘుగారికి నమస్తే,     మీ వుత్తరం వొచ్చినప్పుడు వివిధ భారతి వింటున్నాను. ఆకాశవాణి దూరదర్శన్  లలో  మంచి కార్యక్రమాలు వుండవు. మధ్యాన్నం వివిధ భారతిలో రెండు  గంటలు  చాలా మంచి పాటలు  వింటాను.  అది వాళ్ళ ఘనత కాదు.  శ్రోతలు కోరిన పాటాలవి. శ్రోతల మంచి సంగీతాభిరుచివల్ల (యెక్కువ పాటలు 1940 -1970కాలంలోవి). ఆకాశవాణిలో శాస్త్రీయ సంగీతం మాత్రం మంచిది వొస్తుంది. (దూరదర్శన్  లో రామాయణ్ మహాభారత్ లు తప్ప నేనేమి చూడలేదు.) ETVలో అప్పడప్పడు మంచి పాటలు చూస్తాను. (సిరియల్లూ సినిమాలూ చూడను). వార్తలు టి.వి. చానల్స్ లో  చూస్తాను.     ఆకాశవాణి  వుదయం ప్రారంభ ప్రసార  సంగీతం,దూరదర్శన్ లో వుదయం ప్రారంభ ప్రసార ద్రుశ్యం యిష్టం, యెవరు సృష్టిచారో తెలియదు.     మీ నలుగురికి శుభాకాంక్షలు.                                                                                                     -వడ్డెర చండీదాస్                                                                                               సాలిళ్ళ తిరుపతి                                                                                             [తేది లేదు 15-5-02 చేరింది]     రఘుగారికి, నమస్తే.     యిప్పడే గాయత్రి వీణ  విన్నాను. మనసు మహత్తరంగా వుంది.రోజంతా సంగీతంతో గడిచిపోతుంది. నాదస్వరం కంటే షహ్ నాయ్  యిష్టం. షహ్ నాయ్ లో పలికినట్లు సంగితస్వరాలు బాగా పలకవు, నాదస్వరంలో. నాదస్వరం శుభకార్యా సందర్భాలకే పరిమితం కావాలి. దక్షిణాది వేణువు కంటే వుత్తరాది బాసురి యిష్టం.     ప్రస్తుతం చికట్లోంచి చీకట్లోకి అచ్చు పుస్తకం ప్రూఫ్రీడింగ్ చేస్తున్నాను.   యువతీయువకుల పెళ్ళి నిర్ణయానికి అడ్డుతగిలే తల్లిదండ్రులకు కోర్టు వురిశిక్ష  విదించాలి. నాకు ఫిలాసఫి సాగిత్య సంస్ధల అనుభవాలు లేవు. మీ unpleasant అనుభవాలు మీ వుత్తరంలో చదివి తెలుసుకున్నాను.     వుత్తరం యిక్కడ ఆగిపోయింది.     మీ నలుగురికి శుభాకాంక్షలు.                                                                                          -వడ్డెర చండీదాస్.                                                                                                       తిరుపతి                                                                                                      29-05-02     రఘుగారికి,నమస్తే.     యీ సెలవులక్కూడా వూరు రావటం లేదని రాశారు. మిమ్మల్ని చూసి చాలా కాలం  ఐనట్లుగా అనిపిస్తుంది.     యిరవ్తేయెళ్ళ తరవాత అనుక్షణికం చదివాను. దాన్లో వుదహరించిన పుస్తకాలన్నీ చదివినవె - యికనమిక్స్ వి తప్ప.     మీ నలుగురికీ శుభాకాంక్షలు.                                                                                            -వడ్డెర చండీదాస్.                                                                                                                   తిరుపతి                                                                                                                           20-6-02     రఘుగారికి,      నమస్తే,       ఆగస్టులో  మీరిక్కడికి వొస్తున్నందుకు సంతోషంగా అనిపించింది.     నా పుస్తకాలు యెవరూ అచ్చుకి అడగలేదండి.     నేను చదువుతూ చికట్లోంచి వూరికే ప్రూఫ్ రీడింగ్ చెశాను.  అంతే.     యిటివాలి వాళ్ళలో సునీత మంచిగోంతు. అందుకే యెక్కువ పాటలు లేవు.     యిక్కడ, జల్లులు మబ్బులు మొదలయ్యాయి. హాయిగా అనిపిస్తోంది  వాతావరణం.     మీ నలుగురికి శుభాకాంక్షలు.                                                                                       -వడ్డెర చండీదాస్.                                                                                             తిరుపతి                                                                               [తేది లేదు 15-7-2002న చేరింది]         రఘుగారికి,     నమస్తే,     రెండేళ్ళ  క్రితం నా అమెరికా ప్రయాణం వొ గొప్ప అనుభవం: విమానం మధ్యాహ్నం  వేళకి  లండన్ చేరింది. ఆ వేళకి కిటికిలోంచి చూస్తే భూమి కనిపించలేదు.     తెల్లవి మేఘాల దొంతరలు, విమానానికి బాగా దిగువగా మెరుస్తూ కడులుతూన్నవి. మేఘాలు  అలాగే వున్నాయి. వక అరగంటకి విమానం  లండన్ లో దిగింది. దిగాక భూమి కనిపించింది.     తమిళనాడును.  సంగితనాడు అనొచ్చు. MGR లాగా సౌందరరాజన్ గొంతు గోరం.     తెలుగులో సావిత్ర,రమ్యకృష్ణ యిష్టం.     తెలుగుభాష యిష్టం. చాలా యిష్టం. చాలా చాలా యిష్టం. తెలుగు తరవాత యింగ్లిషు,  మలయాళం యిష్టం.     మీ నలుగురికి శుభాకాంక్షలు.                                                                                                                                                                                                                                         -వడ్డెర చండీదాస్.
24,353
       "రాయన్న అరెస్టయ్యాడట విన్నావా?" అని అడిగాడు.         "ఆఁ. నిన్నే తెలిసింది."         "నిన్నే తెలిసిందా? ఎలా?"         "సాయంత్రం రమణి ఫోన్ చేసింది. లక్ష్మి మరణం గురించి హాస్టల్లో అంతా నానా కంగాళీ అయిపోయిందట. ఫాన్ కి ఉరి వేసుకుంది కాబట్టి అందరూ ఆత్మహత్య అనుకున్నారట. కానీ అంతలో ఇన్ స్పెక్టర్ వచ్చి 'తలుపు గడియ లోపల వేసుకోకుండా ఎందుకు ఉరేసుకుంటుంది?' అని అడిగేసరికి ఒకమ్మాయి' అవును నిజమే. నేను చూశాను' అందట."         "ఏం చూసిందట ఆ అమ్మాయి?" విజయ్ కుమార్ ఎగ్జయిటింగ్గా అడిగాడు.                                   *    *    *         "మీరు ఆ గదిలోంచి బయటకు రావడం తన కళ్ళతో తాను స్వయంగా చూసిన అమ్మాయి ఆ విషయాన్ని రేపు కోర్టులో సాక్ష్యమివ్వబోతూ వుంది. దీనికి మరేం చెపుతారు?" ఇన్ స్పెక్టర్ అడిగాడు.         "నేను హాస్టల్ కి వెళ్ళినమాట నిజమే" రాయన్న అన్నాడు. "కాని అప్పుడు లక్ష్మి బ్రతికేవుంది."         "మరింతకు ముందు ఆ రోజు అసలు కలుసుకోలేదన్నారు?"         "నేను నిజమే చెబుతున్నాను."         "ఏమిటి నువ్వు చెప్పే నిజం? లక్ష్మి చచ్చిపోయిన రోజు అసలు కలుసుకోలేదన్నావు ముందు. ఇప్పుడేమో కలుసుకున్నానంటున్నావు. ఆ అమ్మాయితో రాత్రిళ్ళు గడపలేదన్నావు ముందు. ఇప్పుడేమో హోటల్లో రూమ్ తీసుకున్నానని వప్పుకున్నావు."         "లక్ష్మి చచ్చిపోయిన రోజేదో నాకు తెలీదు. ఇప్పుడే మీరు చెపుతున్న దాన్నిబట్టి ఏ రోజు చనిపోయిందో తెలిసింది."         "అమోఘం! అద్భుతం" అన్నాడు ఇన్ స్పెక్టరు. "ఇంతటి నటన నేనెప్పుడూ చూడలేదు."         వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్న సమయానికి యస్సై సత్యనారాయణ బయట వరండాలోకి వచ్చి నిలబడ్డాడు. ఎప్పుడెప్పుడు రాయన్నతో నిజం చెప్పిద్దామా అని అతని మనసు ఉవ్విళ్ళూరుతుంది.         సరిగ్గా ఆ సమయానికి ఒక స్కూటర్ వచ్చి పోలీస్ స్టేషన్ ముందు ఆగింది. ఒక వ్యక్తి దిగి స్టేషన్ మెట్లెక్కి యస్సై ముందు చేయిసాచుతూ, "నా పేరు వెంకటరత్నం, లాయర్ని" అన్నాడు.         అయితే ఏమిటట అన్నట్లు చూశాడు ఇన్ స్పెక్టరు.         "నేను అర్జెంటుగా రాయన్నని చూడాలి."         సత్యనారాయణ అతడివైపు కోపంగా చూశాడు. లాయర్లంటే అతడికి తగని మంట. "వీళ్ళకి నైతిక విలువలు ఉండవు. అడ్డమయిన వెధవలనీ, వెధవ పనులు చేసే కిరాతకులనీ రక్షిస్తూ అబద్దపు బ్రతుకులు బ్రతుకుతుంటారు" అనుకున్నాడు.         సత్యనారాయణ మాట్లాడకపోవడంతో వెంకటరత్నం అనుమానంగా లోపలకు తొంగిచూశాడు. పోలీసు కస్టడీలో జరిగే దురాగతాలు బాగా తెలిసిన వాడతడు.         "అలా కూర్చోండి, సర్కిల్ లోపలున్నారు పిలుస్తాను" అని మరి గత్యంతరం లేదన్నట్లుగా లోపలకు వెళ్ళాడు.         లోపల ఇన్ స్పెక్టర్ అంటున్నాడు - "నువ్వెంత బుకాయించినా లాభంలేదు రాయన్నా. అన్ని విధాలుగా నువ్వే హంతకుడివని నిరూపించే సాక్ష్యాలు నా దగ్గరున్నాయి. అవన్నీ నిజమైన ఆధారాలనే నీ చేత వప్పిస్తూ వచ్చానుకూడా. ఇప్పటికయినా మించిపోయింది లేదు. నిజం వప్పుకో, జరిగింది చెప్పు. శిక్షయినా తగ్గుతుంది" అంటున్నాడు ఇన్ స్పెక్టర్.         "నేను హత్య చెయ్యలేదు. చెయ్యలేదు. చెయ్యలేదు. మీకు దొరికిన ఆ రుజువులు, సాక్ష్యాలు నాకేమీ అర్ధంకావడంలేదు" అరిచాడు రాయన్న అతడిలో ఓపిక నశిస్తోంది.         ఇన్ స్పెక్టర్ కి కావలసిందదే. రాయన్న అలా డెస్పరేట్ గా అయిపోవడం అప్పుడు కాస్త రెచ్చగొడితే చాలు నిజం బయటపడిపోతుంది. 'అవును హత్యచేశాను తప్పలేదు. ఏం చెయ్యమంటారు?' అనే స్థితిలోకి వచ్చేస్తాడు.         "చూడు రాయన్నా, నీకు పెళ్ళయి మూడురోజులయినా కాలేదు. అభం శుభం తెలియని మరొ అమాయకురాలిని కూడా చిత్రహింస పెడుతున్నావు. ముక్కుపచ్చలారని ఓ పిల్లని నమ్మించి గొంతుకు ఉరివేసి ఒక్కసారిగా చంపావు. పెళ్ళిచేసుకుని మరొ స్త్రీని నమ్మకద్రోహంతో క్షణక్షణం చంపబోతున్నావు. నీకెలాంటి శిక్ష విధిస్తే సరిపోతుందో నాకు అర్ధంకావడంలేదు" ఇన్ స్పెక్టర్ ఆగాడు. సత్యనారాయణని చూడగానే అతడి మొహంలో ఓడిపోయినా భావం కనిపించింది. "రా, సత్యనారాయణా, నేను ఓడిపోయాను. చదువుకున్న సంస్కారిగా ఇతడు నా మాట నిలబెడతాడని నమ్మాను. ఇక లాభంలేదు. నువ్వే చూడు" అని చిరాగ్గా అన్నాడు.         "మీరొకసారి బయటకు రండి సార్" అన్నాడు సత్యనారాయణ.                                          *    *    *         "దాదాపు పెళ్ళిదుస్తుల్లోనే మనవాడు హాస్టల్ కొచ్చాడట. లక్ష్మితో వాడేదో ఆవేశంగా మాట్లాడటం ఓ అమ్మాయి  చూసిందట. అరగంట తర్వాత వాడు హాస్టల్ లోంచి భయంభయంగా వెళ్ళటంకూడా ఆ అమ్మాయే చూసిందట. అప్పుడే అనుమానంతో లక్ష్మి గదిలోకి వెళ్ళిచూస్తే ఆమెను రక్షించగలిగి వుండేది కాని పట్టించుకోలేదు. తర్వాతెప్పుడో రెండు మూడు గంటల తర్వాత ఎందుకో వెళ్ళిచూస్తే అప్పటికే అంతా అయిపోయింది. అందరూ ఆత్మహత్య అనుకునేలా చాలా పకడ్బందీగా చేశాడట. అయినా బయటపడిపోయాడు."         "పాపం లక్ష్మి ఎంత అమాయకప్పిల్లరా. అట్లాంటి పిల్లని హత్య చెయ్యడానికి వీడికి చేతులెలా వచ్చాయసలు?" విజయకుమార్ బాధ నటిస్తూ అన్నాడు.         "వాడసలు మనిషయితేగా, వట్టి పశువు" రాజారావు కోపంగా అన్నాడు. విజయకుమార్ కి కావలసిందదే.         "నమ్మించి వశపరుచుకుని, గట్టిగా అడిగితే హత్య కూడా చేసేశాడు. అలాంటి నీచుడికి ఉరిశిక్షపడాల్సిందే. తల్చుకుంటుంటే నా గుండె మండిపోతోంది. వాడసలు జైల్లోంచి బయటకు రాకుండా చూడాలి" అన్నాడు ఆవేశంగా.         "బెయిల్ కూడా దొరకదు వాడికి. పోలీసుల దగ్గిర అంతా క్లియర్ కట్ ఎవిడెన్స్ ఉందట" అన్నాడు రాజారావు.         "అలా అని వూరుకోకూడదు. మనం మరోవిధంగా వత్తిడితేవాలి. వాడికి బెయిక్ ఇవ్వడం జరిగితే హాస్టల్ అమ్మాయిలంతా సమ్మె చేసేలా ప్రయత్నించాలి. నువ్వు తల్చుకుంటే అది కష్టంకాదు. రమణితో మాట్లాడు అనవసరంగా మనం అల్లరి పడకుండా, ఇన్నాళ్ళూ వాడి స్నేహితులుగా అందరికీ తెలుసు కాబట్టి మనిద్దరి పేర్లూ బయటకు రాకుండా మాత్రం చూడు. డబ్బుకోసం జంకకు."         "మంచి అయిడియా! అన్నట్టు మా అంకుల్ డి. సి. పి. కదా ఆయనకి ఫోన్ చేసి చెప్తాను. కాలేజీ స్టూడెంట్స్ స్ట్రయిక్ అంటే భయపడక తప్పదు" హుషారుగా అన్నాడు రాజారావు.         "సరే ఏం జరిగిందో నాక్కూడా ఫోన్ చెయ్యి" ఫోన్ డిస్కనెక్ట్ చేశాక మళ్ళీ ఆలోచనలో పడ్డాడు విజయకుమార్. ఈ రాజారావు ఎంత దగుల్భాజీయో వాళ్ళ అంకుల్ కి తెలుసు. అలాగే రమణి మాటకు హాస్టల్ పిల్లలు ఎంత విలువ నిస్తారో కూడా అతడికి బాగా తెలుసు. విజయకుమార్ మరి ఆలస్యం చెయ్యకుండా ఫోనెత్తి మరో నెంబర్ డయల్ చేశాడు. ఓ మంత్రిగారికి కుడిభుజం అయిన గూండా నాయకుడిదా నంబర్. అతడితో అగ్రిమెంట్ కుదుర్చుకున్నాక విజయకుమార్ మనసు శాంతించింది.                                        *    *    *         అదే సమయానికి లాయర్ వెంకటరత్నం ముద్దాయి రాయన్నతో మాట్లాడుతున్నాడు.         "చూడండి రాయన్నా మీతో మాట్లాడడానికి నాకు కేవలం పదిహేను నిమిషాలే వ్యవధి ఇచ్చాడు ఇన్ స్పెక్టరు. మీ శ్రీమతి వచ్చి ఈ కేసు గురించి చెప్పినప్పుడు మీరు 'నిరపరాధి' అని పూర్తిగా నమ్మితేనే గాని ఈ కేసు టేకప్ చెయ్యనని స్పష్టం చేశాను. నాకు జరిగిన విషయం ఏమిటో నిజం చెప్పండి."         "నిజం నమ్మేటట్లుగా ఉండదు లాయరుగారూ. ఉదయం నించి ఇన్ స్పెక్టర్ నన్ను రకరకాలుగా ప్రశ్నిస్తున్నాడు. సాక్ష్యాలు, రుజువులు చూపిస్తున్నాడు. అవన్నీ వింటుంటే నిజం ఏమిటో నాకే అనుమానం వచ్చి అయోమయ స్థితిలో పడిపోయేన్నేను. నాకు తెలియకుండానే నేను వెళ్ళి ఆ హత్యచేసి వచ్చానేమో అనే అనుమానం కలుగుతోంది. ఇక మీకు ఏం చెప్పను? ఏం చెప్పి నా నిజాయితీని మీ ముందు నిరూపించుకోను?"         వెంకటరత్నం రాయన్న ముఖంలోకి పరీక్షగా చూశాడు. ఆయన ఉద్దేశ్యం గ్రహించినవాడిలా రాయన్న తలెత్తి ఆయన కళ్ళలోకి చూశాడు. ఆ చూపులో భయంలేదు, బాధ ఉంది. నటనలేదు, నిజాయితీ వుంది. రక్షించమన్న అర్ధింపులేదు, అర్ధం చేసుకొమ్మన్న అభ్యర్ధన వుంది. ఆ ఒక్కచూపు చాలు వెంకటరత్నం అతడిని నిరపరాధిగా నిర్ణయించుకోవడానికి.
24,354
    "అబ్బే అదేం కాదు. ఎందుకో నా మనసు మనసులో వుండటంలేదు. మన కర్తవ్యం ప్రతిక్షణం నన్ను కలవరపెడుతోంది. ఇలాంటి ప్రలోభాలన్నింటికీ దూరంగా వుండమని హెచ్చరిస్తున్నట్లనిపిస్తోంది."     "అనూ, ఏదీ నా కళ్ళలోకి చూస్తూ ఆ మాట మరోసారి చెప్పు అన్నాడు." ఆమె  ధైర్యంగా తలెత్తి చూసింది. మనసు చేసుకుని కళ్ళల్లో ఏ భావం కనిపించకూడదనే నిర్ణయంతో చూసింది.     "అనూహ్యా" అతడి చేతులు ఆమెచుట్టూ బిగుసుకున్నాయి. "ఎంత మధనపడ్డానో నీకెట్లా తెలియచెప్పను? ఏ కారణంతో నిన్ను ఈ టీమ్ లో పంపుతున్నారో  తెలియనంత అమాయకుడిని కాను. వీళ్ళలో ఎవరికి నువ్వు  భాగస్వామివి అవుతావో అన్న ఆలోచన నన్ను పిచ్చివాడిగా చేస్తూంటే భరించలేకపోయాను. నేను గాక మరో మగవాడి చెయ్యి నీ మీద ఊహు ఇందాక యశ్వంత్ చేతులు నీ భుజాల్ని పట్టుకుంటే, నా వంటిమీద తేళ్లు, జెర్రులు ప్రాకుతున్నట్లు బాధ. అతడంటే నాకెంతో గౌరవం. అతడిముందు సరసాలాడటానికి సందేహిస్తాను. కానీ, నీ విషయంలో అతడి ఉనికిని భరించలేను. నన్ను అర్థం చేసుకోగలవు కదూ. నేను తెలివితేటల్లో అతడి కాలిగోటికి గూడా సరిపోను. కానీ  నువ్వు నన్ను వదలి పెట్టటానికి అది కారణం కాకూడదు-"     యశ్వంత్  ప్రసక్తి రాగానే అనూహ్య మెల్లిగా తన  చేతుల్లోంచి బయటపడటం గమనించలేదతడు. ఆ క్షణంలో ఆమె ముఖం చూస్తుంటే బహుశా ఆమెలో  ఘర్షణ అతడికి కొంతయినా అర్థం అయ్యేది.     "నీకు యశ్వంత్ అంటే చాలా  గౌరవం అనుకుంటాను." ఆమె స్వరం  నూతిలోంచి వచ్చినట్టు వుంది.     "అవును, ఒట్టి గౌరవం మాత్రమేకాదు. భక్తికూడా. ఆ మృత్యువు చివరి అంచువరకు వెళ్ళి కాపాడుకున్నది అందుకోసమే. అతడు లేకపోతే మన ఈ  ప్రయాణమే లేదు. అంటే మానవజాతికి మనుగడ లేకుండా పోతుందన్నమాట. ఆ విజ్ఞాన ఖని నాకు దేవుడిలా కనిసిస్తాడు."     చెప్పెయ్యాలి. చెప్పెయ్యాలి, అనుకుంది ఆమె. ఇక ఈ ముసుగులో గుద్దులాట తను భరించలేదు. "నా పరిస్థితి....." అంటూ అనూహ్య అనబోయేంతలో ఇంటర్ కమ్ మోగింది.     "అందరూ డైనింగ్ హాల్లోకి రండి, భోజనం టైమైంది" నిఖిల్ స్వరం వినిపించింది.     "పద పద. అంతరిక్షంలో 'కూర్చుని' తినే మొదటి డిన్నర్. సారీ ఇక్కడ లంచ్ డిన్నర్ అనే భేదాలుండవనుకుంటాను. మొదటి పార్టీ చేసుకుందాం పద.' హుషారుగా కదిలాడు వాయుపుత్ర. నిస్తేజంగా వెంట నడిచింది అనూహ్య.     మిగతా ముగ్గురూ వీళ్ళకోసమే ఎదురు చూస్తున్నారు. యశ్వంత్ చూపులో రవ్వంత బాధ తొంగి చూస్తున్నట్లనింపించిదామెకు. వెళ్ళి యశ్వంత్ ప్రక్కన ఖాళీగా వున్న కుర్చీలో కూర్చుంది. "అనూహ్యా......భోజనం తర్వాత  నా గదిలోకి వస్తే మా బ్రహ్మవిద్యను పరిచయం చేస్తాను. నీకు మంచి కంపెనీ."     అనూహ్య మాట్లాడలేదు. రెండువైపులా  వాయుపుత్ర, యశ్వంత్ మాట్లాడుతుంటే తనలో చెలరేగుతున్న సంఘర్షణవాళ్ళకు తెలియకుండా వుండేందుకు శతవిధాల ప్రయత్నిస్తోంది. ఆమె ముఖంలో భావాన్ని గమంనించింది ఒక్కడే. డాక్టర్ ఫిలిప్స్!.                                *    *    *     ఆ తరువాత అరగంటకి అనూహ్య వాయుపుత్ర గదివైపు నడిచింది. ఆమె అడుగు పెట్టగానే ఒక తియ్యటిస్వరం. "రండి. స్వాగతం సుస్వాగతం" అని  వినిపించింది. అనూహ్య అదిరిపడింది. వాయుపుత్ర నిజంగానే ఎవర్నయినా పట్టుకొచ్చాడా? అని ఆమె గదంతా కలయచూసింది. ఎవరూ కనిపించలేదు.     "హలో" స్లీపింగ్ బ్యాగ్ లోంచి తల బైటపెట్టి అల్లరిగా పలకరించాడు వాయుపుత్ర.     "పరిచయం చెయ్యండి, ఆవిడ అయోమయంగా చూస్తున్నారు"-మళ్ళీ వినిపించిందా స్వరం. అనూహ్య అటువైపు తిరిగి చూసింది.     ఎదురుగా ఓ కంప్యూటర్ వుంది.     "హలో నా పేరే బ్రహ్మవిద్య. మీ అందరి సేవకూ సిద్దంగా వుంటాను" అంది స్త్రీ స్వరంలో.     "మానవ మాత్రులెవరూ చెయ్యలేని పనులు అన్నీ చేయగలదు. నీతో ఆటలాడుతుంది. పోట్లాడుతుంది. కథలు చెబుతుంది. పాటలు పాడుతుంది. ఇకపోతే ఓ విజ్ఞాన సర్వస్వం. నీ పరిశోధనలో కూడా ఉపయోగించుకోవచ్చు."     "బావుంది. చాలా పెద్ద బుర్రేనన్నమాట"     "ఆ, చాలా పెద్దది. బరువు అయిదువందల కిలోలు!" జవాబిచ్చింది బ్రహ్మవిద్య. "అది కేవలం మెదడు బరువు మాత్రమే. మొత్తం రెండువేల కిలోలు బరువు."     "నమ్మలేను. నాకంటె చిన్నగా కనిపిస్తున్నావు."     "చూడ్డానికి అయిదడుగుల ఎత్తు, రెండడుగుల వెడల్పేగాని ఈ వాయుపుత్ర ఎంత ఫీడ్ చేశాడో చెప్పలేను. రాత్రీ పలుగు విశ్రాంతి తీసుకోకుండా ఒకటే ఫీడింగ్ చచ్చాననుకో."     "అయితే మీరు సృష్టించిన దానికి మీరు తండ్రి అవుతారు గాని భర్త ఎలా అవుతారు?" వాయుపుత్రని అడిగింది అనూహ్య.     "నేను సృష్టించానని ఎవరన్నారు? కంప్యూటర్ ఇరవయ్యోశతాబ్దంలోనే పుట్టింది. నేను మెరుగులు దిద్ది విద్యలు నేర్పించానంతే. మాట్లాడటం-అనేది ఈ మధ్య నేర్చిన విద్యన్నమాట"     "అవును. ముదితల్ నేర్వగలేని విద్యగలదే ముద్దారనేర్పించినన్ అన్నారు గదండీ" అంది బ్రహ్మవిద్య.     "నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా? మేము మాట్లాడుకోవలసింది చాలా వుంది" వాయుపుత్ర కసురుకున్నాడు.     "నువ్వు నా నోరు ముయ్యడం తప్ప నా అంతట నేను మూసుకునే అవకాశం లేకుండా చేశావు గదా."     "తప్పయిపోయింది. తర్వాత కార్యక్రమంగా అదే చేస్తాలే" పక్కమీదనుంచి లేచి, బటన్ ఆఫ్ చేశాడు వాయుపుత్ర.     "హమ్మయ్య ఇక మనం మాట్లాడుకోవచ్చు" అంటూ వచ్చి అనూహ్య ఎదురుగా కూర్చున్నాడు.     తలుపుమీద  టక్ టక్ మన్న శబ్దం.     "ఎవరది?"     "నేను డాక్టర్ ఫిలిప్స్ ని"     "కమిన్" అన్నాడు ముఖం గంటు పెట్టుకుని.     "ఎవరిదో కొత్త స్వరం వినిపించింది. ఎవరిది?" అటూ యిటూ చూస్తూ అడిగాడు ఫిలిప్స్.     "ఊ.....ఊ.....ఊ శబ్దం చేసింది బ్రహ్మవిద్య" వాయుపుత్ర మళ్ళీ బటన్ నొక్కాడు.     "హల్లో డాక్టర్ ఫిలిప్స్. నేను బ్రహ్మవిద్యను. రండి, రండి. సుస్వాగతం."     ఫిలిప్స్ ఆశ్చర్యంతో నోరు తెరిచాడు.     "ఇంత స్పష్టంగా  మాట్లాడే కంప్యూటర్ని అందులోనూ స్త్రీ స్వరంతో యింత స్పష్టంగా మాట్లాడే కంప్యూటర్ని చూడడం యిదే మొదలు. చాలా బావుంది."     "ఇప్పుడు చూస్తున్నారుగా! ఈ సృష్టి మీ వాయుపుత్రది."     "పేరు బ్రహ్మవిద్య. నీకు తెలిసిన విద్యలేమిటి?"     "అన్నీ తెలుసు. మీ గురించి చెప్పనా? 2054 జనవరి పదవతేదిన ఉదయం గ్రీన్ విచ్ టైం పదిగంటల యిరవై నిముషాల పదిహేను సెకండ్లకు ఫ్రాంక్ ఫర్ట్ లో పుట్టారు. పుట్టినప్పుడు మీ బరువు కేవలం నాలుగు పౌండ్లు. పదిరోజులపాటు ఆక్సిజన్ లో పెట్టాల్సిన అవసరం వచ్చింది........"     "చాలా  బావుంది. కంప్యూటర్ వివరాలిస్తుందని తెలుసుగాని మాట్లాడుతుందని   నాకు తెలియదు."     "చెప్పానుగా వాయుపుత్ర క్రియేషన్ అని! ఎదుటి వాళ్ళ స్వరాన్ని వినగానే, దాన్ని అర్థం చేసుకుని సమాధానాన్ని తిరిగి మాటల రూపంలో చెప్పగలిగే విధానం కనిపెట్టిందీయనే."     అనూహ్య చప్పున "కానీ నేను మాట్లాడాకుండానే స్వాగతం పలికావు" అంది.     "వాయుపుత్రకి సంబంధించినంత వరకూ నువ్వు ప్రత్యేకం అనూహ్యా" అంది కంప్యూటర్. ఆ గదిలో చప్పునచాలా ఇబ్బందికరమైన నిశ్శబ్దం ఏర్పడింది.     దాన్ని ఛేదిస్తూ "చాలా  గొప్ప విశేషం యిది. కంగ్రాచ్యులేషన్స్ వాయుపుత్రా! కాని డాక్టర్ గా  మీకు సలహా యివ్వాలి. కనీసం ఆరుగంటలపాటు విశ్రాంతి తీసుకొమ్మని చెప్పాను. ప్రస్తుతం ఆ పని చెయ్యండి ఇద్దరూ" అన్నాడు ఫిలిప్స్.     అనూహ్య లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆమె కెందుకో సిగ్గుగా అనిపించింది.                                        2     పదిరోజులు గడిచాయి. అంతరిక్షంలోకి వాళ్ళు పంపిన సంకేతాలకు ఎలాంటి ప్రత్యుత్తరం రాలేదు. సౌరకుటుంబం అంచుకి వాళ్ళ ప్రయాణం ప్రారంభమైంది. బైలుదేరినప్పటికంటే వాహనం స్పీడ్ ఆరు రెట్లయింది. త్వరలో కాంతివేగాన్ని చేరుకుంటుంది.     నా     'శ్రీజా,     దిగంతాలకు మా యాత్ర ప్రారంభం కాబోతోంది. 'ఇక మా గురించి ఎలాంటి వివరమూ నీకు తెలిసే అవకాశం లేదు' అనుకునేదానికన్నా 'నీ గురించి ఏ విషయమూ తెలుసుకునే అవకాశం లేదు' అనుకోవడం చాలా బాధ కలిగిస్తోంది. "ఓ చిరునవ్వుకోసం రక్తాన్నంతా పిండి యివ్వగల" నన్నావు. నీ గురించి ఓ వార్తకోసం ప్రాణం అయినా యివ్వగలను. కాని అది కూడా అసంభవమిక.     అందుకే శ్రీజా,     పెళ్ళయి పట్టుమని పదిహేనురోజులు కాకుండానే ఏ భర్తా అడగనిదీ అడగకూడనీదీ నిన్నడుగుతున్నాను. ఇప్పటికయినా మించిపోయింది లేదు. అయిదో నెలలో అబార్షన్ ఈ రోజుల్లో సమస్య కాదు. ఆ తర్వాత నీకు నచ్చినవాడు దొరికితే పెళ్ళి చేసుకో. తిరిగివస్తానో రానో తెలియని నా కోసం నీ నిండు జీవితాన్ని వ్యర్థం చేసుకోకు. నీకు చేసిన అన్యాయానికి ప్రతిక్షణం కుములుతూ వుంటాను. నన్నీ మనస్తాపం నించి విముక్తిడిని చెయ్యి. నీ నుంచి వార్త అందుకోలేనంత దూరం నేను వెళ్ళక ముందే నీ జవాబు యివ్వగలిగితే నాకు మనశ్శాంతి. నీకు అయిన వాడినో కాదో కూడా తెలియని దౌర్భాగ్యస్థితిలో వున్న - నీ నిఖిల్.'     శ్రీజ కన్నీళ్ళతో ఉత్తరాన్ని తడిపేసింది. కంప్యూటర్ ద్వారా రిలే చేయబడ్డ ఆ ఉత్తరం ఆమెకు అందడానికి నాలుగు గంటలు పట్టింది.     "అతడు చెప్పినదాంట్లో నిజం వుందమ్మా. ఇప్పటికయినా మించిపోయింది లేదు. అలా చెయ్యి. "తల్లి వేడుకుంది. ఒక్కగానొక్క కూతురి జీవితం యిలా వృధా అయిపోవడం భరించలేని వ్యధ అయిపోయిందావిడాకు.     "క్షమించమ్మా ఆ విషయం ఇక నా దగ్గర ప్రస్తావించకు. నేను వెళుతున్నాను. సమాధానం వెంటనే ఇవ్వాలి" లేచి వెళ్ళిపోయింది శ్రీజ.                                                           *    *    *     "బ్రహ్మవిద్యా నా ఉత్తరానికి జవాబు లేదా?" నిఖిల్ బేలగా అడిగాడు.     "ఇది నూట ఒకటోసారి, నువ్వా ప్రశ్న అడగటం. జవాబు వస్తే నా నోరు ఊరుకుంటుందా. నువ్వు వద్దన్నా వినకుండా అరుస్తాను."     "మనం కాంతి వేగం చేరుకోవడానికి యింకా ఎంత సమయం వుంది?"     "సరిగ్గా నాలుగ్గంటల పదిహేడు నిముషాల యాభై సెకండ్లు"     "అంతసేపు నీ దగ్గరే కూర్చుంటాను."     "అలాగే! టైము తెలియకుండా వుండేందుకు బేతాళ కథలో, అరేబియన్ కథలో చెప్పనా!"     "వద్దు. వినే మూడ్ లో లేను. మనిషికీ కంప్యూటర్ కీ తేడా ఏమిటో ఇప్పుడు నాకు అర్థమయింది,"     "ఏమిటది?"     "మనిషే ప్రేమించగలడు, కంప్యూటర్ ఆ పని చేయలేదు........" కసిగా అన్నాడు.     బ్రహ్మవిద్య మాట్లాడలేదు. అది నిజం కాదని కాలం నిరూపించింది త్వరలోనే...                               *    *    *     కళ్ళు తెరవగానే అతడు అడిగిన మొదటి ప్రశ్న.     "బ్రహ్మవిద్యా-సమయం ఇంకా ఎంతుంది?"     "పన్నెండు నిమిషాల పది సెకండ్లు వుంది. వాళ్ళ వాహనం కాంతి వేగాన్ని అందుకుంటే మరిక వార్తలు అందవు."     "నా ఉత్తరం శ్రీజకి అందలేదా? జవాబు దొరకదా నాకిక?" చిన్నపిల్లాడిలా అడిగాడు.     "అవన్నీ నాకు తెలియదు. నా డ్యూటీ నేను సరిగ్గా చేస్తున్నాను."     సమయం అతివేగంగా పరిగెడుతోంది. నిఖిల్ చేతుల్లో చెమటలు పడుతున్నాయి. అక్కడే కూర్చున్నాడు. పది నిముషాలు దాటింది. సెకండ్లలో కౌంట్ డౌన్ మొదలుపెట్టింది బ్రహ్మవిద్య.     పది.....తొమ్మిది......ఎనిమిది.....ఆఖరి సెకండ్ అవగానే నిఖిల్ అణచుకున్న దుఃఖాన్ని ఆపుకోలేక ఒక్కసారిగా రోదించాడు. మరో అయిదు నిముషాలు గడిచాయి.     "మెసేజ్ ఫర్ నిఖిల్" బ్రహ్మవిద్య స్వరానికి ఉలిక్కిపడ్డాడు ఎర్రబడ్డ కళ్ళని తుడుచుకుంటూ.     "టైం అయిపోయిందన్నావుగా, జోక్ చేసే సమయం కాదిది."     "బావుంది. మన టైముకీ, భూమి టైముకీ తేడా పెరిగి పోయింది. ఆ విషయం గురించి నువ్వు నన్నడిగితే అప్పుడే చెప్పేదాన్ని. అవేమీ ఆలోచించకుండా ఏడూస్తూ కూర్చున్నావు. నేనేం చెయ్యను?"
24,355
ఆమె వెంట మనోహర్ అసిస్టెంట్స్ మఫ్టిలో వున్నారు. నవుతూ నవిస్తూ మాట్లాడే ఆ అందమైన అమ్మాయి వెంట తిరిగే ఉద్యోగం అసిస్టెంట్స్ కి ఎంతో నచ్చింది. కోణార్క్ సూర్యదేవాలయంలో శిల్పాలు చూశాక ఇంక అక్కడ చూడడానికి పెద్దగా ఏం లేదు. ఏవేవో రకరకాల దేవాలయాలు చిన్న చిన్నవి ఉన్నాయి. కాని అన్నీ శిధిలావస్థలోనే వున్నాయి. గైడ్ చెప్పినదాన్ని బట్టి అక్కడి విశేషాలు ఉహించుకోవలసిందే కాని ఏ శిల్పము స్పష్టంగా లేదు. అయినా ఆ శిధిలాల మధ్యే అటూ యిటూ తిరిగే జలజను చూసి విసుగొచ్చింది మనోహర్  అసిస్టెంట్స్ కి.  జలజ వెంట వుండమని మాత్రమే బాస్ ఇన్ స్ట్రక్షన్స్ ఈ శిధిలాల మధ్య తిరుగుతూ ఆ అమ్మాయి ఏం సాధించబోతుందో వాళ్ళకి అంతుబట్టలేదు. జలజ నవ్వుతూ నవ్విస్తూన్నట్టు కనపడుతోన్నా మనసు ఎక్కడో వున్నట్టు తెలిసిపోతున్నది. కాస్సేపు శిధిలాల మధ్య తిరిగి "లవర్స్ పారాడైజ్ బీచ్" కి వెళ్ళి ఇసకలో కూర్చుంది. ఆమె వెంట వెళ్ళిన ఇద్దరికీ ఏం చెయ్యాలో తోచలేదు. ఆమె కూర్చుంటే బాడీ గార్డ్సులా నిలబడ్డమా! బీచ్ రకరకాల జంటలతో టూరిస్టులతో- పెద్దలతో- పిన్నలతో సందడిగానే వుంది. పల్లీలు, జీడిపప్పులు- ఐస్ క్రీమ్ లు మొదలైనవి అమ్మేవాళ్ళ కేకలు జనం మాటల సందడిలో కలిసి పోయి వినిపిస్తున్నాయి.  పావుగంట సేపు నిలబడి జలజ కదిలే సూచనలు కనపడక పోవడంతో ఆమెకు కొద్ది దూరంలో కూర్చున్నారు ఇద్దరూ. సముద్రపు కెరటాలతో, ఆడుకుంటున్న ఒకావిడ జలజ దగ్గిర కొచ్చి కూర్చుంది. చెవులకు రింగులు, నైలాన్ చీర- జుట్టుకి స్టయిల్ గా క్లిప్పు ప్లాస్టిక్ బొట్టు- చీఫ్ టెస్ట్ ను తెలియపరిచే అలంకరణ. జలజ ఆమెని పరిశీలనగా చూడసాగింది. ఆమె ఎంతో చనువున్నట్లు జలజ భుజం మీద చెయ్యి వేసి, "చెల్లి! బాగున్నావా?" అంది. జలజ కనుబొమ్మలు పెద్దవి చేసి "నువేలాంటి అక్కవి?" అంది. "మీ నాన్న మూడో పెళ్ళాం రెండో మొగుడి ఐదో పెళ్ళాం ఆరో మొగుడికి నేను స్వయానా కూతుర్ని. అలా నువు నాకు చేల్లిలివి.'  విరగబడి నవింది జలజ. "మా నాన్నకి ఒక్కర్తే భార్య. పాపం అయన యిద్దర్నో ముగ్గుర్నో చేసుకోకుండానే చచ్చిపోయారు. మా నాన్న బతికుంటే నువు చెప్పిన చుట్టరికం నిజమయ్యేదేమో కాని, ఇప్పుడు మాత్రం పచ్చి అబద్దం. అంచేత"చెల్లి" అని పిలవకుండా "జలజా!" అని పిలు. నిన్నెలా పిలవాలో చెప్పు" ఉస్సురని నిట్టూర్చింది ఆమె. "నీకు కనీసం పదిమందైనా బోయ్ ఫ్రెండ్స్ వున్నారు కదా! మీ నాన్నకి ఓ నలుగురైనా భార్యల్లాంటి వాళ్ళు వుండక పోతారా అనుకున్నాను. పాపం చిన్నప్పుడే పోయాడా? "ఇదేమిటి? నా బోయ్ ఫ్రెండ్స్ ని లెక్కపెట్టావా!" "సరిగ్గా లెక్కపెట్టలేదు. ఇంచుమించుగా అంచనా వేశాను. ఏదో ఒకరిద్దరు అటూ యిటూ....." నవింది జలజ. "నిన్నే మని పిలవాలో చెప్పలేదు. "సోదేమ్మా!" అని పిలవచ్చా!" ఉలిక్కిపడింది ఆమె లేవబోయింది. భుజం మీద చెయ్యి వేసి లేవకుండా ఆపింది జలజ. "నేను సోదెమ్మనే కాని నువు మా చుట్టాలతో వస్తే నేను నీతో ఏం మాట్లాడను. అంతే కాదు నన్నే రకంగా బలవంతం చేసినా తరువాత నువే భాదపడవలసి వస్తుంది." "నీ చుట్టాలా! అమ్మ వేపు చుట్టాలా! నాన్న వేపు చుట్టాలా!" "నాకే చుట్టాలు మా చుట్టాలకి నా మీద చాలా ప్రేమ నే కనిపిస్తే వాళ్ళింటికి తీసుకెళ్ళి కదలనివరు. అలా నే కదలక పొతే అక్కడ మన చిన్న పాప చిక్కుల్లో పడిపోతుంది" మాప్టిలో వున్న అసిస్టెంట్ వైపు ఒక్కసారి కూడా తలెత్తి చూడకుండా అతి నెమ్మదిగా జలజతో మాట్లాడుతోంది. వెంటనే అర్ధమైపోయింది జలజకి. సోదెమ్మ తెలివి తేటలకి ముగ్దురాలైంది. కొంచెం దూరంలో పోలీసు ఉద్యోగులను పెట్టుకుని వాళ్ళు పోలీసులని గ్రహించి ఏంతో నిబ్బరంగా మాట్లాడుతోంది. ఆమె భుజం మీద నించి చెయ్యి తీసేసింది. "నిన్ను నిర్భందించను. కాని వెళ్ళిపోకు. నీతో మాట్లాడాలి" "నేనూ నీతో మాట్లాడుదామనే వచ్చాను. నువిక్కడకి వస్తున్నావని నాకు తెలుసు. అయినా వచ్చాను" "ఏం చెప్పాలనుకుంటున్నావు నాతో?" "నువు అడగాలనుకున్నదే పాప సంగతి. పాపని ఒకచోట జాగ్రత్తగా వుంచాను. మా చుట్టాలు లేకుండా మీరెవరైనా వస్తే పాపని అప్పగిస్తాను." "నువేవరు? పాపని ఎవరు తీసుకెళ్ళారు? నువా పాపని అప్పగించాలని ఎందుకనుకున్నట్లు?" "ఈ ప్రశ్నలకి నేను సమాధానం చెప్పక్కరలేదు  కాని నీ బోయ్ ఫ్రెండ్స్ ని చూసి నీ మీద గౌరవం కలిగి చెప్తున్నాను. "dossier" డోసియర్ అనే మాట ఎప్పుడైనా విన్నావా? అంటే  ఇంటర్ స్టేట్ క్రిమినల్" అని అర్ధం అంటే దేశంలో ఏదో ఒక రాష్ట్రంలో గాక, అన్నీ రాష్ట్రాలలోను నేరాలు చేస్తూ, అన్ని ప్రాంతాల్లోను అసోసియేట్ వున్నవాళ్ళు నేను అలాంటి దాన్ని డబ్బులు గిట్టుబాటు అవుతాయంటే ఏ గాంగ్ తోనైనా కలిసి పనిచేస్తాను చాలా గాంగ్స్ తో పరిచయాలున్నాయి నాకు. కొత్త పరిచయాలు కలుపుకుంటాను. అలా జాన్, సుబ్బయ్యలతో చెయ్యి కలిపాను. పాపని తీసుకొచ్చాను. కానీ ఆడదాన్ని కాబట్తో , నా జీవితం తల్చుకాబట్టి , ఏ కారణమో తెలియదు కాని, పాప మీద జాలి కలిగింది. పాపని కిడ్నాప్ చెయ్యమని జాన్ కి డబ్బిచ్చి జీవన్ గారు మధ్యలో మనసు మార్చేసుకుని జాన్ ని, పోలీసులకి అప్పగించబోయారట. అక్కడితో వ్యవహారం చెడింది. తల్లి దగ్గర డబ్బు సంపాదించుకోవచ్చని నేనే జాన్ కి ఆశ పెడ్తూ వచ్చాను. కాని మీ యింటి పరిసరాల్లో మా చుట్టాలు తిరుగుతుండడంతో  రాన్ సమ్ కోసం పాప తల్లిని సంప్రదించే అవకాశం లేకుండా పోయింది మావాళ్ళకి. జాన్ కి ఆ పసిపాప మీద మరో దృష్టి ఉన్నట్లు నాకు తెలిసిపోయింది. ఇంక పాపని అక్కడుంచితే ప్రమాదమని గ్రహించి రాత్రికి రాత్రే నాకు తెలిసిన మరో చోట అప్పగించాను. వాళ్లిద్దరూ ఒకరి మీద ఒకరు అనుమానపడుతున్నారు. నా మీద అనుమానం వుంది. ముగ్గురం మూడు దారులైపోయాము." "ఇదంతా కేవలం మంచితనంతోనేనా? పాపని మాకు ఆప్పగిస్తే మీకేం ప్రయోజనం?" "పాప క్షేమంగా దక్కిందన్న సంతోషంతో తల్లి యేమైనా ప్రతిఫలం ముట్ట జెప్తే సంతోషమే. మాబోటి వాళ్ళకి డబ్బు అవసరం కదా! కాని ముందే చెప్తున్నాను. మా చుట్టాలతో వస్తే మాత్రం మొదటికే మోసం వస్తుంది." "ఇప్పుడే నిన్ను మీ చుట్టాలకప్పగించి నీ ద్వారానే నిజం తెలుసుకుంటే ఏం చేయగలవు?" "మా చుట్టాల చేతుల్లోంచి నేను ఎలాగైనా బయటపడగలను. అక్కడ నాక్కొందరు బావలున్నారు. నిజం చెప్తూన్నట్టు ఫోజు పెట్టి ఏదో అబద్దం చెప్తాను. తరువాత పాపని ఏ బ్రోతల్ కో అమ్మేసి ఆ డబ్బుతో నా దారి నేను చూసుకుంటాను. మీకు మా చుట్టాలు చేసే గందర గోళం మాత్రమే మిగుల్తుంది." "సరే అయితే! రేపు నేనొక్కదాన్ని పాప తల్లితో ఇక్కడికి రానా?" "ఇక్కడికి రావొద్దు గోప్ దాటాక కొంచెం దూరంలో చండికమ్మ గుడి వుంది. అక్కడికి రండి. మా చుట్టాలు లేకుండా మిరోచ్చారనే నమ్మకం నాకు కుదిర్తే మిమ్మల్ని పాప దగ్గరికి తీసుకెళ్తాను." లేచి వయ్యారంగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది యమ్మాయమ్మ.
24,356
    "నిజమే కాని...."     "కాని అర్దణా ఏం లేదు,ఈ విషయంలో మధుమూర్తి జాలి చూపి, మీరు దోషులు కాకండి."అన్నది.        సిద్దార్థ మాట్లాడలేదు.     "ఈ రోజు ఇద జరిగింది. రేపు ఇంకొకటి చెయ్యవచ్చు.అదీకాక అందరూ అతను చేసిన, శిక్ష తప్పించుకున్నాడని తామూ చేయబోతే ప్రమాదం కదా!"     "అవన్నీ ఆలోచించాను. నా కళ్ళముందు బేబి బబ్లు తిరుగుతున్నారు. ఒకరికి న్యాయం చేయబోయి ఆ పసివారికి అన్యాయం చేస్తానేమోనని భయంగా ఉంది.     " అంత జాలి ఉంటే నీ పర్యవేక్షణలో ఆ పసివాడిని తీర్చి దిద్దు."     "అంతే నంటావా!"     "బి బోల్డ్ సిద్దార్థా!ఇప్పజడు నువ్వు బెసికిపోతే అందరం చేసిన ప్రయత్నం వృధా అవుతుంది."అన్నది.,     అతను ఆమెను చూచాడు. ఆ కళ్ళల్లో దీక్ష, పట్టుదలా కనిపించాయి.     "ఓ....కే...." చేయి చాచాడు.        ఆమె చేయి అందించింది , చేయి  అందించింది.చేయి నొక్కి వదిలాడు.     ఆమెకు తన గుర్తుగా ఏదన్నా ఇవ్వాలనుకుని మరిచిపోయాడు-     "నేను  వెళ్తాను శ్వేతా!"     "మీ సహృదయతకు నా ధన్యవాదాలు."     "మళ్ళీ మీ అని నన్ను దూరం చేయవద్దు."     " తప్పదు శ్వేతా!"  జీపు వచ్చింది.ఖాదర్ పిలిచాడు. నవ్వుతూ ఆమె ఎక్కింది.అప్పటికే సామాన్లు పెట్టారు.     జీపు కనుమరుగు అయ్యేవరకు చెయ్యూపాడు. శ్వేత పమిటతో కళ్ళు ఒత్తుకోవటం చూచాడు.      తన జన్మదినం అనేకంటే పునర్జన్మ దినం అంటే నయం అనుకున్నాడు. ఆశాభంగం , దాని తరువాత నిశ్చింత మొదటిసారి చవిచూశాడు. భారంగా ఇంటికి వచ్చాడు.                                     18     యెవరెన్ని విధాలుగా చెప్పినా, తను అనుకున్న విధంగానే సాక్ష్యం చెప్పాడు సిద్దార్థ.     "ఇదంతా దాయాదులన్న ద్వేషంతో చేసిన కుట్ర. అన్నగారూ అంటూ  ఆప్యాయంగా అడిగి తీసుకున్న ఉంగరం ఈ రోజు తన స్వార్థప్రయెజనాల కోసం ఉపయోగించుకున్నాడు ఈ సిద్దార్థ" అన్నాడు  అతని లాయరు.     దాన్ని పురుషోత్తమరావు ,సులక్షణ బలపరిచారు. వారు జడ్జీగారికి  లంచం పెట్టాలని ఎన్నో విధాలుగా ప్రయత్నించారు. వారి ఆశయం నెరవేరలేదు. దురశాపరుడు, తిమ్మిని బమ్మి చేసే న్యాయమూర్తి రిటైర్డ్ అయికొత్త అతను వచ్చాడు.      అతను లంచాల జోలికి పోడు, ఆదర్శాలు వల్లించడు. గంభీరంగా ఉండి తను అనుకున్నది చేసి వేస్తాడు.      అతని ముందు వీరి అటలు సాగలేదు.      అదీకాక శ్రీనివాస్ ను హత్యచేసి న కేసు ఒక్కటే కాదు.ఇంకా ఎన్నో ఉన్నాయి.         శంకరి ఉరఫ్ అంబాబాయి చరిత్ర బయటికి వచ్చింది. దాంతో అతను ఉరిశిక్ష తప్పించుకున్నాడు ,  గానిశిక్ష తప్పుంచుకోలేక పోయాడు. అంబాబాయికి, మధుమూర్తి ఒక్కొక్కరికి ఇరవై ఒక్క సంవత్సరం కారాగార శిక్షపడింది.     వీరప్పకు,బసప్పకు,ఇంకా ఇద్దరు అక్కడవుండే స్త్ర్రీలకు ఒక్కొక్కరికి ఏడు సంవత్సరావ కారాగార శిక్ష విధించారు.అదివిన్న సులక్షణ అదిరిపోయింది. మా మగార్ని తిట్టింది. శపించింది.         "వెనక ఉండి అన్నీ అవక తవకలు చేయిస్తూ, సిగ్గులేదా? మళ్ళీ వచ్చావ్!ఈ నాడు నా పిల్లలు వీధిన పడ్డారు. నేను అనాధను అయ్యాను" అన్నదికోర్టు బయటికి రాగానే.     " సులక్షణా! ఈ కోర్టు తీర్పు ఇవ్వగానే సరా? హైకోర్టుకు వెళ్తాను. సుప్రీమ్ కోర్టుకు వెళ్తాను" అన్నాడు రోషంగా ఆవేశంగా.     ఆమెకు ఈ కేసు నడచిన ఎనిమిది  నెలల్లో చెంపలు దగ్గర జుట్టు నెరిసింది.     కోర్టులో భర్త గురించి వెల్లడయిన ఒక్కొక్కని నిజం వింటుంటే ఆమెకు మతి పోసాగింది.     ఒక్క నేరమేనా!     ఊర్లో జరిగే ప్రతీ దొమ్మీలో మధుమూర్తి భాగం వుంది.
24,357
ముసలాడు ఏ వూరు వెళ్ళేదీ తెలుసుకున్న నేను మరో బస్సులో ఈ వూరు వచ్చాను. అలవాటు పడ్డ చేతులు జిల పుట్టటంతో ఎవరి జేబో కొట్టేయ బోవటం, పోలీసులకి చిక్కి ఇక్కడికి రావటం జరిగింది. సార్! జరిగిందంతా మీకు అక్షరం పొల్లు పోకుండా చెప్పాను. ఆ బ్యాగ్ ఈయన నుంచి కొట్టేసింది నేనే కాని ఆ తర్వాత ఆ ముసలాడి చేతిలోకి అలా అలా వెళ్ళింది. ఆ ముసలాడిని పట్టుకుంటే బ్యాగ్ దొరుకుతుంది...." అంటూ రాజులుగాడు కథ పూర్తి చేశాడు. అంతా విని "చెప్పటం పూర్తి అయిందా?" అంటూ వాడిని ఉరిమి చూసి పులిలా గయ్యిన వాడి మీదకి దూకి పీక పట్టుకున్నాడు ఇన్ స్పెక్టర్. "నేను నిజమే చెప్పాను సార్!" రాజులుగాడు గజగజ వణుకుతూ చెప్పాడు. "నువ్వు చెప్పింది నిజం. అది నన్ను నమ్మమంటావు? చాలా చక్కగా కథ అల్లి వినిపించావు. నా సర్వీసులో నీ బోటివాళ్ళని ఇలాంటి కట్టుకథలని సవాలక్ష చూశాను, విన్నాను." "అది కాదు సార్! నా మాట నమ్మండి సార్!" "నమ్ముతానురా నమ్ముతాను. ఫుండాకోర్ వెధవల మాటలు నమ్మితేగాని నాకు పైకెళ్ళటానికి ప్రమోషన్ రాదు. బ్యాగ్ ని కొట్టేయటం వరకూ నిజమే చెప్పావు. ఎందుకంటే సాంబమూర్తిగారు చెప్పింది నీవు చెప్పింది టాలీ చేసి చూస్తే చక్కగా సరిపోయింది.... "మరింకేమి సార్!" ఆశగా అన్నాడు యతిరాజులు పేరుగల రాజులుగాడు. "మరింకేమిటా! ఆ బ్యాగ్ ని ఆ తర్వాత ఎక్కడో దాచి కాకమ్మ కథ సృష్టించి చెపుతున్నావ్. నేను నమ్మటానికి చెవులో పువ్వు పెట్టుకుని లేను. ఆ బ్యాగ్ ఎక్కడ దాచావ్ చెప్పరా గాడ్దె కొడకా!" అంటూ ఇన్ స్పెక్టర్ కాలు ఎత్తి పోలీసు బూటు కాలితో రాజులుగాడిని యీడ్చి తన్నాడు. "వామ్మో!" అంటూ బాధతో ఓ గావుకేక పెట్టాడు రాజులుగాడు. "ఒక తన్నుకి ఒక గుద్దుకి వీడు దారికి వచ్చేరకం కాదు. ఎడాపెడా పెళ్ళి భోజనం తినిపించండి వీడిచేత" అంటూ ఇన్ స్పెక్టర్ యివతలకి వచ్చాడు. రాజులుగాడు లబోదిబో మంటున్నా వినిపించుకోకుండా ఇద్దరు పోలీసులు వాడిని ఉతుకుడు కార్యక్రమంలో నిమగ్నులయ్యారు. సరిగ్గా అప్పుడే ఓ వింత అక్కడ జరిగింది.                                                                34 పచ్చబ్యాగ్ తో పుండరీకాక్షయ్య చంకలో గొడుగుతో పక్కనే చంద్రంతో అక్కడికి వచ్చాడు. పుండరీకాక్షయ్యని చూడంగానే "ఈ వ్యక్తిని ఎక్కడో చూసినట్లు వుందే!" అనిపించింది ఇన్ స్పెక్టర్ కి. పుండరీకాక్షయ్యని ఇన్ స్పెక్టర్ ఎప్పుడూ చూడలేదు. అంతకు క్రితం రాజులుగాడు ముసలాడిని [పుండరీకాక్షయ్య] వర్ణిస్తూ చెప్పాడు సరీగ్గా అదే వ్యక్తి యిప్పుడు యిక్కడికి వచ్చాడు. పుండరీకాక్షయ్య చేతిలో పచ్చ బ్యాగ్ చూస్తూనే "ఇది నా బ్యాగ్ పోయిన బ్యాగ్ యిదే." అంటూ సాంబమూర్తి అరిచినంత పని చేశాడు. "మీరు మాట్లాడకండి." సాంబమూర్తిని హెచ్చరించి "ఎవరు మీరు ఎందుకు వచ్చారు?" అంటూ ఇన్ స్పెక్టర్ వాళ్ళని ప్రశ్నించాడు. పచ్చ బ్యాగ్ ని ఇన్ స్పెక్టర్ ముందున్న టేబుల్ మీద పెట్టి ఓ నమస్కారం పెట్టి వూరుకున్నాడు పుండరీకాక్షయ్య. "నా పేరు చంద్రశేఖర్ ఆజాద్ సార్! వీరు పుండరీకాక్షయ్య గారు మావూరే. నాకు తాతగారు లాంటి వారనుకోండి. నేను యిక్కడ ఫ్రెండ్ రూమ్ లో వుండి చదువుకుంటున్నాను. మాది పల్లెటూరు.
24,358
     క్రమంగా  ఎక్కడికో  ఎగిరిపోతున్న  ఫీలింగ్  మొదలయ్యింది.     తూలుకుంటూ  నడుస్తూ  బెడ్ రూంలోకి వెళ్ళాడు. మంచంమీద శ్రావణి  పడుకుని  ఆదమరచి  నిద్రపోతోంది. ముఖాన  వున్న పెద్ద బొట్టు కాస్త చెరిగి  అటూ ఇటూ జరిగింది. పమిట  పూర్తిగా  ప్రక్కకి తొలగి వుంది.     "ఏదో కాస్త అందమైతే  ఏడిసింది  గాని  అవయవాల్లో  ఒంపుసొంపుల్లేవు. ఏదో ఈ పూటకి  కాంప్రమైజ్  అవుదాం" అంటూ  ప్రక్కన చేరి గుండెలమీద  చెయ్యి  వేశాడు.     శ్రావణి  ఉలికిపడి  కళ్ళు తెరిచింది.     "కొంచెం  జరుగు" అంటూ  మీదకు  వ్రాలబోతున్నాడు.     "అయ్యో! ఈవేళ  శనివారమండీ. ఆంజనేయస్వామికి  కోపం  వస్తుంది" అంటూ అతన్ని  విసురుగా త్రోసేసింది.     "నీ బొంద" అని  కోపంతో  లాగి ఒక్క తన్ను తన్ని, అంతకన్నా  ఏం చేసినా  ప్రయోజనం  వుండదని  తెలుసుకాబట్టి  తిట్టుకుంటూ  ప్రక్కకి  తిరిగి పడుకున్నాడు.                           *    *    *     గంగాధర్  డ్రైవ్ చేస్తున్న కారు ఇంచుమించు  మైలు దూరం ప్రయాణం చేసి  మొగల్రాజపురం  కొండల దగ్గర  వున్న గుడిసెల ప్రాంతంలో  ఆగింది.     కారు  దిగి  చీకట్లో  కొంత దూరం  నడిచి  ఓ పాక  దగ్గర ఆగాడు. అంతా  నిద్రలో  మునిగివున్నట్లు  ఎక్కడా  మనుషుల సందడి  లేదు.     "రెడ్డీ!" అని పిలిచాడు  మెల్లిగా.     జవాబు లేదు.     మళ్ళీ పిలిచాడు గొంతు కొంచెం  పెద్దది  చేసి.     "ఎవరూ?" అంది  లోపల్నుంచి  ఓ స్త్రీ  గొంతు.     "నేను గంగాధరాన్ని"     ఒక్క క్షణం  నిశ్శబ్దం. చెక్క తలుపు  తీసుకుని ఆ స్త్రీ బయటకు  వచ్చింది.     "ఏంది  బాబుగారూ  ఈ రాత్తిరివేళ్ళొచ్చారు" అంది  బద్దకంగా  వొళ్ళు  విరుచుకుంటూ.     "మునిరెడ్డి  కోసం"     "ఆడు బాగా మందు  కొట్టి, గుర్రు పెట్టి  నిద్రపోతున్నాడు. ఏం సంగతి ?"     గంగాధర్  అటూ ఇటూ  చూశాడు. ఎవరూ  కనబడలేదు. రెండడుగులు  ముందుకు వేసి  ఆమె భుజాలమీద  చెయ్యివేసి  దగ్గరకు  లాక్కుంటూ  "పని వుందిలే" అన్నాడు  చెవిలో  మెల్లిగా.     "అబ్బ! చచ్చినోడు  చూస్తే  కొంపమునుగుతుంది" అన్నది విడిపించుకుంటూ.     "ఎన్నాళ్ళయింది"     "ఒస్తాలెండి  వీలు చూసుకుని. చెప్పండి ఏంది సంగతి ?"     "రెడ్డితో  మాట్లాడాలి"     "చచ్చినోడు  లేస్తాడంటారా ?"     "తప్పదు"     "ఉండండయితే" అని ఆమె లోపలకెళ్ళింది. లోపల మనిషిని  తట్టి లేపుతున్న  సవ్వడి. "అబ్బా... ఏమిటే లం..."బూతులు.     "అయ్యగారొచ్చారు"     అయిదు నిమిషాలు  గడిచాక  మునిరెడ్డి  తూలుకుంటూ  బయటకు కొచ్చాడు. లుంగీ, బనీను వేసుకుని  ఆరడుగులపైన  ఎత్తుగా చాలా బలంగా  వున్నాడు.     "ఏంటయ్యగారూ ?" అన్నాడు  వినయంగానే.     "రెడ్డీ, నీతో  కొంచెం మాట్లాడాలి"     "చెప్పండి"     "అలా కారు దగ్గరకు పోదాం రా"     ఇద్దరూ కారు దగ్గరకు  నడిచి వెళ్ళారు. గంగాధర్  డోర్ తీశాడు. లోపల కూచున్నాడు.     అతను జరిగిందంతా  చెప్పాడు. తాను  కోరుతున్న  సహాయాన్ని  వివరించాడు.     "ఈ రెడ్డి వుండగా మీ వంటి మీద ఈగ  కూడా  వాలదయ్యగారూ! ఈ క్షణం  నుంచీ  మిమ్మల్ని  కంటికి రెప్పలా  కాపాడుకుంటాను. మీ యింటి చుట్టూ మనుషుల్ని  కాపలా  పెడతాను. మిమ్మల్ని  ఛాలెంజి  చేసిందెవరయినా  సరే _ వాడి అంతం  చూస్తాను"     మునిరెడ్డి  మాటలతో  గంగాధర్ కి  కొండంత  ధైర్య మొచ్చింది. జేబులోంచి  ఓ నోట్ల కట్ట తీసి అతనికందిస్తూ  "ఇవి  వుంచు" అన్నాడు.                            *    *    *     "ఈ అవంతి  ఎవరు" అన్నాడు యోగి చేతిలో వున్న పేపర్ ను ప్రక్కకి వుంచుతూ.     "తెలీదు, ఈ ఊరు కొత్తగా  వచ్చింది. వచ్చిన  కొద్ది రోజుల్లోనే  అన్ని  వర్గాల్లోనూ  విపరీతమైన  పలుకుబడి  సంపాదించింది" అన్నాడు ప్రతాప్.     "ప్రస్తుతం మన కోపరేటివ్  బ్యాంక్  చైర్మన్  కూడా  ఆమే"     "ఆమెతో  ఒకసారి  మాట్లాడాలి ?"     "డబ్బు కోసమా ?"     యోగి నవ్వాడు. "మన పరిశ్రమకు  ఎన్ని  లక్షలైనా  సరిపోదు. అప్పు తీసుకుంటే  తప్పేముంది?"     "సరే  పోదాం"     "ఎప్పుడు. ఎపాయింట్ మెంట్  తీసుకోనక్కర్లేదా ?"      "అవసరం  లేదని విన్నాను. ఆమె  కోసం  ఎంతమంది  వచ్చినా  వరుసక్రమంలో  చూసేసి  సమస్యలు పరిష్కరించి  పంపించేస్తూ  వుంటారు"     "సరే, ఇవ్వాళే   పోదాం  పద"     పది నిమిషాల్లో యిద్దరూ  కారులో  కూర్చున్నారు, యోగి డ్రైవ్  చేస్తున్నాడు.     "ప్రతాప్!" అన్నాడు యోగి  దారిలో  "గంగాధర్  నిన్ను  కలిశాడా ?"     "కలిశాడు, అతనికొచ్చిన  వార్నింగ్  గురించి  కూడా  చెప్పాడు"     "ఏమయి  వుంటుందంటావు ?"     "దట్సాల్ నాన్సెన్స్. ఈ సొసైటీలో  బ్లాక్ మెయిలింగ్  ఓ భాగమై పోయింది"     "తేలిగ్గా  తీసుకోవచ్చునంటావా ?"         "అంతకన్నా  విలువ  యివ్వడం  అనవసరం"     మరో  పావుగంటలో  కారు అవంతి  వుంటున్న  భవనం ముందు ఆగింది.                            *    *    *     భవనానికి ముందున్న  ప్రాంగణంలో వారికి యిరువైపులా  రకరకాల  మొక్కలున్నాయి. ఓ యిరవై ఏళ్ళ  యువకుడు  చేతిలో రబ్బర్  ట్యూబ్ పట్టుకుని  మొక్కలకు నీళ్ళు పోస్తున్నాడు  టైట్  ప్యాంట్, ఒంటికి  చొక్కా లేదు. కారుదిగి  లోపలికి  వెళ్ళబోతూ  యోగి  ఆ యువకుడి  వంక  విస్మయంగా  చూశాడు. నిగా నిగలాడే  తెల్లనిశరీరం. మాంచిపొడవు, ఛాతీ  ఉక్కుకవచంతో, చేతులు  యినప కడ్డీలతో  తయారు చెయ్యబడినట్టు...అంత అందంతోనూ  ఒళ్ళు గగుర్పొడిచే  మహాశక్తి  కలిగివున్నట్లు  కనిపించాడు.     "ఏమిటతని  వంక  అలా చూస్తున్నావు?" అన్నాడు  ప్రతాప్.     "ఏమీ లేదు" అన్నాడు యోగి  తల త్రిప్పుకుంటూ. ఆ యిద్దరూ  తనని  దాటి వెళ్ళిపోయాక  అతను చేస్తున్న  పనిని ఆపి వారివంక చూస్తూ నిలబడ్డాడు.
24,359
    సర్వీసు చేసాను. బంతి తీర్థమిత్రునికి కనబడలేదు. ''ఫాల్టు'' అనడానికి కూడా వీలులేదు. తీర్థమిత్రుడు తెల్లమొగము వేసినాడు. కోర్టుమార్చినాను. రెక్కలు చాచుకొని విచిత్రగతిలోవచ్చి భూమినివాలే హంసలా నా బంతి హేమకుసుమకు వెళ్ళింది. ఆమె ఆ బంతిని నాకే తిరిగి పంపించింది. ఆమె పంపిన సంగతే  ఎరుగును  గాని తిరిగి  నా వల్ల పంపబడి అతని కుడికాలి జోడుయొక్క ముందుభాగాన్ని ముక్కలు చేసిన తీవ్ర సంఘాతము తీర్థమిత్రునికి తెలియదు.     ఎవ్వరీతడు! ఈ ఆట యెక్కడిది! అని ఆశ్చర్యపడుతున్నట్లు కల్పమూర్తి తాను ప్రేక్షకుడై  పోయినాడు. వారలకు మళ్ళీ గేము లేకుండా అరగంటలో సెట్టయిపోయినది. తమ్మలమిన ఆశ్చర్య విభ్రమాలలో మినిగిపోతూ చైతన్య రహితుల్లా వచ్చి  కుర్చీమీద చతికిలబడ్డారు, కల్పమూర్తీ తీర్థమిత్రుడూ హేమకుసుమదేవీ. నేను కోర్టులోనే బ్యాటు పుచ్చుకొని  సైంధవ వధనాటి  అర్జునుడులా తల పైకెత్తి  ఆకాశం చూస్తూ త్రివిష్ట పధాన్ని ధ్యానిస్తూ నిలుచుండిపోయినాను.                                                o           o          o                             అలాంటి టెన్నిస్ ఆట నాది. ఆ ఆటలో  పేరు సంపాదిస్తూ  మా రాజధాని కళాశాలకు ఎన్నో, కప్పులు, వెండిడాళ్ళు  బహుమతులు తెచ్చాను ఆ రోజుల్లో మా హృదయాల్లో ఏమి భావాలు ఉద్భవిస్తాయి? చదువు, పెద్దవాళ్ళని గూర్చి అపవాదులు మాట్లాడుకోవటం, స్నేహితులతో తిరగటం, సినిమాలకు వెళ్ళడం, సాయంకాలం బీచివాహ్యాళీ- ఇవీ మా పనులు. పెద్దకవులూ విమర్శకులూ కాళిదాసుని, షేక్స్  పియిరును చీల్చి చండాడే వాళ్ళం.     నేను : ఒరే! షేక్స్ పియరు ముందర  కాళిదాసు  దివిటీ ముందర దీపం వంటి వాడురా.     అచ్యుతరావు : నక్కపుట్టి   నాలుగువారాలు  కాలేదు. తుఫాను  గిపాను  దానికేం తెలుసురా. నువ్వు కాళిదాసును చదివావూ?     నేను : ఆ! వీరేశలింగంగారి తర్జుమాలు  చదివాగా?     అచ్యు: ఏడిశావుగా!     విశ్వ : ఒరే శ్రీనాథం! నీకా అభిప్రాయం ఎలా వచ్చిందో  కాని,షా ముందరా. ఇబ్సెను ముందురా, వీళ్ళిద్దరూ పనికిరారురా.     ఈలా  వెళ్ళేవి, మా వాదనలు. అంతే! లోతుల్లేవు. పిచ్చిభావాలు, గట్టిగా పట్టవస్తే  ఒక్క విషయం తెలియదు.                                        10     ఈ రోజులలో మదరాసు పట్టణము  ఎరుగాని   వాళ్ళెవరున్నారు! ఆంధ్రదేశంలోని రెండు కోట్లన్నర  జనాభాలోను ఏడాదికి  ఏ  ఏభై వేల మందో మదరాసు చూస్తూనే వుంటారు. వ్యాజ్యాలకు  హైకోర్టు  అప్పీలు ఉంటుంది గదా! వైద్యానికి చెన్నపట్నం  పెద్దచెయ్యి. విశాఖపట్నంలో ఒక్క  పాశ్చాత్య   వైద్యవిధానమే వుందిగాని  చెన్నపట్నంలో గొప్ప ఆయుర్వేద వైద్యులూ, మళయాళ వైద్యులూ, యూనానీ వైద్యులూ, దేవీ సిద్దభస్మమూ, ఒకటేమిటీ, అన్ని వైద్యాలూ  అక్కడ వున్నవి. రామేశ్వరాది యాత్రలకు, తిరుపతి యాత్రకు, చెన్నపట్నం  వచ్చి తీరాలి గదా!     ఈ రోజులలో సినిమాలు  కూడా వచ్చాయి. ముఖ్యపట్న మే  కాకుండా తెలుగు అరవ టాకీలకు హాలీవుడ్ కూడాను చెన్నపట్నం. కంపెనీ మేనేజర్లు, మెంబర్లు, డై రెక్టర్లు, అర్టు  డై  రెక్టర్లు, మ్యూజిక్   డై  రెక్టర్లు, యాక్టర్లు, తారలు, తారలతో, వుండే పక్షీంద్రాది హంగుజనం! వీరేమిటి, వారేమిటి, అదో  మహాప్రపంచం. అదీ కాకుండా రేడియో ఒకటి వచ్చింది. ఇవి ఇల్లా వుంటోంటే  పులిమీద  పుట్ర అన్నట్లు  బై రాగి టిక్కెట్లు వచ్చి పడ్డాయి. జేబులో పదిరూపాయలు వున్నవారు  ఎలాగో చెన్నపట్నం వచ్చి పడాల్సిందే. కిస్టమస్ లో జరిగే కాన్ఫరెన్సులకు  లెఖ్కేమిటి? ఆంధ్రదేశంలో  ఏ కాన్ఫరెన్సు ఎక్కడ నెగ్గకపోయినా చెన్నపట్నంలో నెగ్గి  తీరుతుంది. సంగీతసభలు, ప్రదర్శనాలు, స్వదేశవస్తు ప్రదర్శనాలూ! ఇవన్నీ  యిలా వుంచి సర్వకాల సర్వావస్థలయందు  వర్తకం వుండితీరింది  గదా!     చదువుల కోసం తక్కువ వస్తున్నారా చెన్నపట్నం! చెన్నపట్నం చదువు చెన్నపట్నం చదువే! మెడికల్ కాలేజీలు, ఇంజనీరిగ్ కాలేజి, లా కాలేజీ లున్నాయి. రాయలసీమవారంతా  చెన్నపట్నం రావలసిందేగదా.     కాని నేను చదువుకొనే రోజులకున్నూ ఇప్పటికిన్నీ చెన్నపట్నం చాలా మారిపోయింది. 1915లో పిచ్చి పిచ్చి హోటళ్ళు  వుండేవి చెన్నపట్నం  నిండాను. సత్యరాజాచార్యులవారు  దేశయాత్రకు  వెళ్ళినప్పుడు  చూచిన ''దుడ్డు పుచ్చుకుని  భోజనం  వేయబడును '' అనే రకం హోటళ్ళు, ఎండిపోయిన పచ్చిపప్పు, చెండాలపు వాసనకొట్టే నెయ్యి, ఏవో  కూరముక్కలు  నాలుగు ఉడకబెట్టి  ఇంత ఉప్పూ, కారం చల్లిన శాకాలూ, నిన్నటి పప్పు ఇవ్వాళ వేసిన సంబారూ, వీటన్నిటికన్న సిరోమాణిక్యంలా కన్నడ తైరు! అందుకనే, విక్టోరియా  హాష్టల్లో సీట్లకోసం  పొట్టుపొట్టయి పోయే వారట.     కాఫీ హోటళ్ళు లో  ఇడ్డేన్లమీద నెయ్యి వేసేవారు కాదట. కావలిస్తే పుష్కరం రోజుల్నించి పకోడీలు వేయిస్తున్న నువ్వులనూనె (లేకపోతే ఆముదం అనుకోండి) అలాంటిది ఇడ్దేన్ మీద  వేసుకునేవారు. కాఫీ తప్పకుండా జిడ్డు ఆముదం. ఆ పరమ  దౌర్భాగ్యపు కాఫీని  ఎత్తి తాగాలని  దేబ్బలాడేవారు అయ్యరు. అక్కణ్ణించి  తెలుగు విద్యార్థులు'' గ్రేట్ వార్''డిక్లేరు చేశారట. అన్నంలో వేసిన నెయ్యిని  వాసనచూట్టం, అయ్యర్ పళ్ళు మైలు దూరంలో పడేటట్లు  పెఠేల్మని  కొట్టడం, మంచి నెయ్యి వెయ్యకపోతే  ఇడ్డెన్లు వాడి ముఖాన వేసి రుద్దడం, శుభ్రంగా కడుపునిండేటట్టు  కాఫీ కరచీ త్రాగడం. అయ్యరు ఆ అన్నాడా, ఆ కాఫీకప్పు  అతని నోట్లోవేసి  కడుపు లోపలికి దూర్చడమే.  
24,360
    "చిన్న పొరపాటా? ఒకే ఇంట్లో వుంటూ తండ్రిలాంటి బావగారితో సంబంధం ఏర్పరచుకోవడం..." నా మాటలు పూర్తికాకుండానే అతడు బల్లమీద బలంగా పిడికిలితో గుద్దాడు-     "ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అదే... అదే నేను చెప్పే ద్వంద్వ ప్రవృత్తి. ఏమన్నావ్? తండ్రి లాంటి బావగారితోటా అన్నావు కదూ? అంటే తండ్రిలాంటి బావగారు కాకుండా, వరసైన బావ అయితే ఫరవాలేదన్నమాట".       నేను స్తబ్దురాలినై - "మీరు లాయర్ అయితే బాగుండేది" అన్నాను ఏం మాట్లాడాలో తెలియక.     "ఒక విషయం తార్కికంగా మాట్లాడడానికి లాయరే అవక్కర్లేదు. రక్షణకోసం భర్తతో సంసారం చేస్తూ, ఆనందం కోసం చాటుగా సంబంధాలు పెట్టుకోవడం తప్పే. కానీ అప్పటి నీ తల్లి మానసికస్థాయి గురించి ఆలోచించు. ఆ స్థితిలో వున్న మిగతా స్త్రీలు ఏం చేస్తున్నారు? నిర్లిప్తత అలవాటు చేసుకుంటున్నారు. లేదా, భగవంతుడు, పూజలు అంటూ మరో ప్రపంచాన్ని సృష్టించుకుంటున్నారు. ఆ వలయం నుంచి బయటపడ్డాక నీ తల్లి అంతకన్నా మంచి వ్యాపకానే కల్పించుకుందిగా! జీవితంలో స్వంతంగా కష్టపడి పైకొచ్చి నిన్ను చదివించింది. ఒంటరిగా బతికింది. అది చాలదా? అదే తప్పు నీ తండ్రి కూడా చేశాడు. పురుషుడికో న్యాయం, స్త్రీకో న్యాయం వుండకూడదని మీరేగా వాదించేది? దీనికి నువ్వేం సమాధానం చెప్తావ్?"     అతడి చివరి వాక్యాలు నేను వినలేదు. తలమునకలయ్యేటంత ఆశ్చర్యంతో- "నా తండ్రి తప్పు చేయడమేమిటి?" అనడిగాను. అప్పుడు చెప్పాడు నా తల్లి తాలూకు జరిగిన కథ.     చాలా క్లుప్తంగా....కానీ స్పష్టంగా.     చాలాసేపటివరకు నేను మాట్లాడలేకపోయాను. మనసంతా అస్పష్టమైన గజిబిజి ఆలోచనలు కలచివేయసాగాయి. నా మనఃస్థితిని అర్థం చేసుకున్నట్లు అతడు కూడా మౌనం వహించాడు. కొంతసేపటికి నేను తేరుకుని అన్నాను- "నా కిదంతా చాలా అయోమయంగా వుంది. మానవ సంబంధాల పట్ల...ముఖ్యంగా భార్యాభర్తల సంబంధంపట్లే అనుమానం వేస్తోంది. మరోలా చెప్పాలంటే అసహ్యం వేస్తోంది".     "రోగాన్ని నయం చేయాలంటే కొన్ని సార్లు శస్త్ర చికిత్స తప్పదు. మనల్ని మనం విశ్లేషించుకోవడం మొదలు పెడితే ఎన్నో లొసుగులు కనపడతాయి. అందుకే భయపడి ఆ పని చెయ్యం. సాహిత్యంలో కూడా అంతే. హీరోలు, హీరోయిన్లు అందరూ మంచివాళ్ళు. విలన్లందరూ విడిగా వేరే వుంటారు. వారితో మనల్ని మనం ఎప్పుడూ పోల్చుకోం. ఆ రెండు కోణాలూ మనలోనే వున్నాయన్న విషయాన్ని ఒప్పుకోలేం. నిజజీవితంలో హీరో, హీరోయిన్, విలన్ అని విడి విడిగా వుండరు. చలంలాంటి ఏ రచయితో అన్ని గాథలూ ఒకర్లోనే వున్న అలాటి పాత్రలను ప్రవేశపెడితే దాన్ని జీర్ణించుకోలేని పాఠకులు విరుచుకుపడతారు. ఈ కథలో నీ తల్లి హీరోయిన్ కాదు, ఒక పాత్ర మాత్రమే. ఒకప్పటి మానసిక బలహీనత, ఆ తర్వాత దాన్ని అధిగమించగలిగే మానసిక స్థాయి వున్న ఒక స్త్రీ". "సంసార జీవితంలో అసంతృప్తి వున్న ఏ స్త్రీ అయినా ఇటువంటి అనైతికమైన దారి ఎన్నుకుంటే అందులో తప్పు లేదని మీరు వాదిస్తున్నారా?"     "ప్రస్తుతం సమాజంలో ఇలాంటివి జరుగుతున్నాయని వివరిస్తున్నాను. తర్వాతి పరిణామాల్ని ముందే ఊహించకపోతే జరిగే ప్రమాదాల్ని సూచిస్తున్నాను. అసంతృప్తికి పరిష్కారం ఇదికాదని విన్నవిస్తున్నాను. నువ్వొక చేదు నిజాన్ని ఒప్పుకోగలవా శ్యామలా? సైన్స్ అభివృద్ధి చెందాక, మెట్రోపాలిటన్ సంస్కృతికి అలవాటుపడ్డాక, టెలిఫోన్ నెట్ వర్క్ పెరిగాక 'నైతికం' అన్న పదానికి అర్థం మారిపోయిందనీ, స్త్రీ పురుషుల మధ్య 'అక్రమ మానసిక సంబంధాలు' పెరుగుతున్నాయనీ, దాన్ని గుర్తించలేకపోతే మనం 'కళ్ళు మూసుకుని పాలు తాగుతున్న పిల్లుల' మవుతామనీ ఒప్పుకోగలవా?"     "ఒకప్పుడు స్త్రీ చదువు, దానివల్ల వచ్చే జ్ఞానమూ వుండేది కాదు. పురుషాహంకారాన్ని భరించడం కూడా తనజీవితంలో ఒక భాగమని మనస్పూర్తిగా నమ్మేది. జ్ఞానం పెరిగేకొద్దీ అసంతృప్తి పెరగడం సహజం. మరి దీనికి మీరేం సమాధానం చెప్తారు? అసంతృప్తికి పరిష్కారం స్త్రీ వాదం కాదా?"       అతడు నవ్వి, "నువ్వు తిరిగి వెళ్ళిపోవడానికి రెండు రోజులు టైము ఎలాగూ వుంది. ఈ హోటల్ లో ఎందుకు? నీ విదేశీ సంస్కృతిని కాసేపు మరిచిపోయి మా ఇంటికి వచ్చి వుండు. ఆఫ్టరాల్ మీ మావయ్య ఇల్లేగా!" అన్నాడు.                                        *    *    *     శ్రీకాంత్ మావయ్య ఇల్లు నాకు బాగా నచ్చింది. ఇల్లంటే 'హౌస్' కాదు 'హోమ్' ...ఇద్దరు పిల్లలు. అమ్మాయి ఇంజనీరింగ్ చదువుతోంది. అబ్బాయి ఫాషన్ డిజైనింగ్ చేస్తున్నాడు. తాతగారికి భగవంతుడూ, పూజలూ లోకం. అమ్మమ్మ ఆరోగ్యం అంత బాగా లేదు. కానీ సాయంత్రాలు ఇద్దరూ కలిసి పురాణకాలక్షేపాలకి వెళ్ళడం నాకు చాలా ఆనందంగానూ, ఆహ్లాదంగానూ అనిపించింది. పిల్లలిద్దరూ 'వదినా' అంటూ నన్ను వదలకుండా తిరిగారు. లండన్ గురించీ, పేపర్లలో వచ్చిన కోర్టు వార్తల గురించీ ఎన్నో ప్రశ్నలు అడిగారు.     మావయ్య కన్నా అత్తయ్య జీతం ఐదారువేలు ఎక్కువ. అయితే అటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మావయ్యలో నాకేమీ కనపడలేదు. ఇండియా నుంచి మా స్నేహితులు తీసుకొచ్చిన పుస్తకాలన్నీ చదివి నాకో అభిప్రాయం ఏర్పడిపోయింది. ముఖ్యంగా స్త్రీ వాదులు రాసిన తెలుగు రచనలు.     ఇక్కడి మగాళ్ళందరూ రెండు మూడు వివాహాలు చేసుకుంటారనీ, అసలు వంటింట్లోకి అడుగుపెట్టడమే నామోషీగా ఫీలవుతారనీ, స్త్రీ శ్రమ దోపిడియే వారి జీవితాశయమనీ, రకరకాల రచనలు చదివిన నాకు, ఆ ఇల్లు చాలా రిలీఫ్ గా తోచింది. ఈ ఇల్లూ, నా తండ్రి ఇల్లూ రెండు వ్యతిరేక సిద్ధాంతాలకి ప్రతీకలుగా తోచాయి. భర్త బయటి గదిలో స్నేహితులతో కూర్చుని 'కాఫీ తీసుకురా' అంటే ఆఫీసునుంచి అలసిపోయిన వచ్చిన అత్తయ్య విసుక్కోవడం నేను చూడలేదు. ఆదివారంనాడు తండ్రీకూతుళ్ళు బట్టలు వాషింగ్ మిషన్ లో వేసి, వాక్యూమ్ క్లీనర్ తో ఇల్లు శుభ్రం చేస్తుంటే, తల్లీ కొడుకులు నాకోసం వంటింట్లో చేరి లంచ్ తయారుచేయడం కోసం ఉపక్రమించారు. శ్రీకాంత్ కూతురికి ఇరవై రెండేళ్ళు. వివాహం పట్ల ఆ అమ్మాయి అభిప్రాయం తెలుసుకుని ఆశ్చర్యపోయాను- "నేను ఉద్యోగం చెయ్యను. పదినుంచీ అయిదువరకూ ఎవరి కిందో పనిచేయడం పెద్ద బోర్!" అంది.
24,361
    "కుర్రవాడు చాలా బుద్ధిమంతుడు!" అన్నాడు కేశవరావు, తనను సత్యం ఇంకా జ్ఞాపకం వుంచుకున్నందుకు సంతోషపడుతూ.     "అయితే, మీ గురించి ఎప్పుడూ పొరపాటునకూడా అనలేదండీ!" అన్నాడు విమల కళ్ళల్లోకి లోతుగా చూస్తూ మాధవరావు.     విమల ముఖం చిన్నబుచ్చుకుంది. మాధవరావు చిరునవ్వు నవ్వాడు. అతని కొంటెతనానికి కేశవరావుకు కూడా నవ్వు వచ్చింది.     "సత్యానికి సిగ్గు ఎక్కువ. చిన్నప్పుడే మాట్లాడేవాడుకాదు. అమ్మాయి చొరవగా మాట్లాడించినా, నావంక చూస్తూ, నాకు ఇస్తున్నట్లు జవాబిచ్చేవాడు" అన్నాడు కేశవరావు గతాన్ని నెమరువేసుకొంటూ.     "వెళదాం నాన్నా!"     "వస్తాం బాబూ!" అన్నాడు కేశవరావు.     "రేపు ఉదయం మీకోసం ఎదురు చూస్తుంటాం, నమస్కారం!"     "నమస్కారం" అంటూ కేశవరావు ముందుకు నడిచాడు.     విమల ఓ క్షణం అతని దగ్గర శెలవు తీసుకోవాలా లేదా అన్నట్లు నిలబడిపోయింది తటపటాయిస్తూ. ఏమీ అనకుండానే ముందుకు ఒక అడుగు వేసింది. అప్పటికే కేశవరావు మెట్లుదిగి కొంతదూరం వెళ్ళాడు.     "విష్ యు హాపీ డ్రీమ్స్!"     విమల ఠక్కున ఆగిపోయింది. గిర్రున వెనక్కుతిరిగి చూసింది. ఆమె నిల్చొనివున్న మెట్టుకు నాలుగడుగులకు పైగా నిల్చిని ఉన్నాడు మాధవరావు. అసలే చాలా పొడవుగా వున్న అతని ముఖం ఎంతో ఎత్తుగా కనిపించింది. అతను తలవంచి విమల ముఖంలోకి చిరునవ్వుతో చూశాడు. అదే కొంటెనవ్వు! అవే లోతైన చూపులు! విమలకు కోపం రాలేదు. అసహ్యం వేసింది. కొత్తవాళ్ళ దగ్గర, జొరబడి మరీ చనువు తీసుకునే వాళ్ళంటే విమలకు మహా అసహ్యం! ఏదో అనబోయి ఆగిపోయింది. విసురుగా మెట్లుదిగి వెళ్ళిపోయింది.     మాధవరావు మెట్లమీదే నిలబడిపోయాడు! విమల వెళ్ళిపోతూ చూసిన తిరస్కారంతోకూడినచూపులు చెళ్ళున చెంప పగులగొట్టినట్లయింది మాధవరావుకు.     తనేమిటి ఇలా ప్రవర్తించాడు! ఇంతకంటె అందమైన యువతులు ఎందరు తనను ఆకర్షించటానికి నానాపాట్లు పడలేదు! ఏనాడూ ఎవ్వరినీ లక్ష్యం చెయ్యలేదే! తనను ఆకర్షించగల యువతి ఇంకా పుట్టలేదేమో ననుకొంటూ ఉండేవాడు.     ఈమెలో ఏమిటి వింత ఆకర్షణ! పెద్ద సౌందర్యవతి కాదు. పెద్ద ఏమిటి- అసలు కాదు. అతిసాదారణమైన రూపం. చామనచాయ. అయినా ఆ ముఖంమీద వాలిన చూపుల్ని మరల్చుకోవటం కష్ట సాధ్యం. మళ్ళీ మళ్ళీ ఆ చూపులు అటే పరిగెడతాయి. తనకు జీవితంలో మొదటిసారిగా, చాలా చిత్రమైన అనుభూతి కలిగింది.     ఆమెలోని ప్రత్యేకమయిన ఆకర్షణ ఏమిటి? ఆ చిన్న చిన్న సోగ కళ్ళా! బయట ప్రపంచంకంటే తనలోని ప్రపంచాన్నే ఎక్కువగా చూసుకొంటున్నట్టుండే ఆ కళ్ళేనా? లేక ఆ కళ్ళలోని ఏదో భావం- అదే, చిరకాలంగా దేనికోసమో వ్యగ్రతతో అన్వేషిస్తున్నట్టుండే ఆ కళ్ళలోని భావమేనా, ఆ ముఖానికి ఆకర్షణ! లేక ఆమె వ్యక్తిత్వంలో స్పష్టంగా కనిపించే ఆత్మ విశ్వాసమా! అదీ కావచ్చును! కాదు- ప్రపంచమంటే తనకు లక్ష్యం లేదన్నట్టు కనుపించే ఆ ముఖంలోని గాంభీర్యమా! లేక- తను యువతిననే భావనను ప్రతి నిముషం గుర్తుచేసుకుంటున్నట్లుండే ఆమె ప్రవర్తనా- లేక యవ్వనం అనే పదానికి తనకు అర్ధం తెలియనట్లు కనిపించే ముఖంలోని గాంభీర్యమా? ఆ చురుకుచూపుల అడుగనుండి తొంగిచూసే అమాయకత్వమా? అవును! ఇవన్నీ ఆమెలోని ఆకర్షణకు కారణాలే.     ఏమిటి తను ఇలా ఆలోచిస్తున్నాడు! ఎప్పుడూ ఏ ఆడపిల్లను గురించి అంతసేపు ఒంటరిగా కూర్చొని ఆలోచించలేదే! ఆ అమ్మాయి సత్యం ప్రేమించిన పిల్ల! మర్చిపోవాలి! ఆ ఆకర్షణనుంచి దూరంగా ఉండాలి.     మరొకసారి 'సత్యం అదృష్టవంతుడు' అనుకుంటూ ప్రదర్శనశాలలోకి వెళ్ళాడు మాధవరావు.     ఎప్పుడూ ఉత్సాహంగా, ప్రతి విషయాన్నీ చాలా తేలిగ్గా తీసుకుంటూ, హాయిగా నడిచే మాధవరావుకు, తన నడకలో ఏదో మార్పు వచ్చినట్లనిపించింది.                                           17     ఉదయం ఏడుగంటలకల్లా ముస్తాబై తండ్రికి ఎదురుగా వచ్చినిల్చిన విమలను చూసి ఆశ్చర్యపోయాడు కేశవరావు. విమల సాధారణంగా నిద్ర లేవటం ఏడు గంటలకు. రాత్రి ఎంతవరకైనా మేలుకొనగలదు కాని ఉదయం మాత్రం త్వరగా లేవదు. కేశవరావు తేలిగ్గా- ఎంతో కాలంగా గుండెలమీద వున్న బరువును దించేసినట్లు తేలిగ్గా నిట్టూర్చాడు.     విమల అదేమీ గమనించే స్థితిలో లేదు. ముఖంలో ఉత్సాహం దాచినా దాగకుండా ఉన్నది. ఆమెను ఎంతో కాలంగా చుట్టివేసిన జడత్వం ఒక్కసారిగా కరిగి చైతన్యంగా మారినట్లు అనిపించసాగింది.     "బయలుదేరండి నాన్నా!" అంది విమల. ఆమె కంఠం లీలగా వణికినట్లు తోచింది కేశవరావుకు. ఆనందం ఎక్కువయినప్పుడు కంఠం వణుకుతుందేమో!     కేశవరావు ఏవేవో ఆలోచనల్లోకి జారిపోయాడు. యాంత్రికంగా లేచి బయటకు నడిచాడు. విమల తాళంవేసి తండ్రి దగ్గరకు వచ్చింది.     రోడ్డు ఎక్కగానే ఎదురుగా కనిపించిన టాక్సీని ఆపి ఎక్కారు.     "ఏమ్మా, కళ్ళు ఎర్రగా వున్నాయి? రాత్రి సరిగా నిద్రపోలేదా?" కేశవరావు ప్రశ్నకు విమల కొంచెం తడబాటు చెందింది.     "ఒకటే దోమలు, సరిగా నిద్ర పట్టలేదు!" అనేసింది విమల, తన మంచానికి దోమతెర కట్టి వుందనే విషయాన్ని మర్చిపోయి.     కేశవరావు విస్తుబోయి కూతురు మొహంలోకి చూశాడు. తన తప్పు తెలుసుకున్న విమల టాక్సీ అద్దాన్ని కిందకు దింపుతూ బయటకు చూస్తున్నట్లు నటించసాగింది. కేశవరావుకు ఏదో తోచి ముసిముసిగా నవ్వుకున్నాడు.     టాక్సీ ఆగిందో లేదో మాధవరావు ముందుకొచ్చి టాక్సీ డోర్ తెరిచాడు. అది చూసి తండ్రీ కూతుళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు. సత్యం లేకుండా మాధవరావు ఒక్కడే నిలబడ్డాడేం? విమలకు సత్యంమీద కోపం వచ్చింది.     "మా కోసమే చూస్తున్నారా?" కేశవరావు టాక్సీవాడికి డబ్బులిస్తూ అన్నాడు.     "అవునండీ!"     "ఇంత పొద్దుటే వస్తామని ఎలా అనుకున్నారు?" లోపలకు వస్తూ అన్నాడు కేశవరావు.     "నాకు తెలుసు, ఇంతకంటే ముందే వస్తారని!" అర్ధయుక్తంగా చూశాడు మాధవరావు విమలవైపు. విమలకు అతని మాటల్లోని వ్యంగ్యం అర్ధమయింది. సిగ్గుతో తల వంచేసుకుంది.     'మిల్కీ వైట్' ఎత్తైన భవనం వాళ్ళను ఆహ్వానించింది. వాళ్ళను ఆహ్వానించింది. వాళ్ళు నడుస్తున్న కాలిబాటకు రెండువైపులా చక్కగా పెంచిన పూల మొక్కలు, మధ్యలో పద్మం ఆకారంలోవున్న ఫౌంటెన్ కనిపించాయి. విమలకూ, కేశవరావుకూ అంత పెద్ద బంగళాలో అడుగు పెట్టాలంటే ఏదోగా వుంది. తమకుకాని స్థలంలోకి ఎక్కడికో వెళుతున్నట్లుంది. మాధవరావు ఇంత శ్రీమంతుల బిడ్డా! అయినా గర్వం ఏ కోశానా వున్నట్లు కనిపించదు. ఎంత నవ్వుతూ సరదాగా మాట్లాడుతాడు! రాత్రి కలిగిన ఏవగింపు ఇట్టే గౌరవంగా మారిపోయింది విమలకు మనసులో. కేశవరావు ఆలోచనలుకూడా దాదాపు అలాగే వున్నాయి. సత్యం ఈ బంగళాలో వుంటున్నాడా? బహుశా ఈ ప్రదర్శన సందర్భంగా వచ్చి ఉంటాడు అనుకున్నాడు.     మంచుతో తడిసివున్న రకరకాల గులాబీలు కాలిబాట కిరువైపులా ఆహ్వానిస్తున్నాయి. విమల తన కళ్ళను ఆ గులాబీపుష్పాలనుండి తిప్పుకోలేకపోతుంది. అప్రయత్నంగా నడుస్తున్న విమల ఓ తెల్లగులాబీ మొక్క ముందు ఆగిపోయింది. మొక్క విరగపూసి వుంది. తెల్లగులాబీలమీద మంచుబిందువులు ముత్యాల్లా మెరిసిపోతున్నాయి. విమల ఒక పుష్పం తుంచబోయి అంతలోనే ఆగిపోయి ముందుకు నడిచింది.     "తీసుకోండి!" మాధవరావు తెల్ల గులాబీల గుత్తి అందించాడు.     "ఎందుకండీ ఇన్ని కోశారు?" నొచ్చుకుంది విమల.     "ఫర్వాలేదండీ! చెట్టున ఎండి రాలిపోవటంకంటే ఆడపిల్లలు పెట్టుకోవటంలోనే అందం చందం వుంది-" మాధవరావు కంఠం జీరపోయింది.     విమల పూలు అందుకొంటూ తలెత్తి మాధవరావుకేసి చూసింది. ముఖంలో విషాదఛాయలు లీలగా కన్పించాయి.     "ఏమండీ, మీ ఇంట్లో ఆడపిల్ల లెవరూ లేరా? పూలు ఎవరూ కోస్తున్నట్లు లేదు."     విమల ప్రశ్నకు మాధవరావు వెంటనే జవాబివ్వలేకపోయాడు.     "ఇప్పుడు లేరు-" మాధవరావు కంఠం కొంచెంగా వణికింది.     తన ప్రశ్న మాధవరావును బాధ పెట్టిందని గ్రహించుకొన్న విమలమనస్సు చివుక్కుమంది.     ఇంత పెద్ద ఇంట్లో మనుషులే వున్నట్టు లేదు. వాతావరణం చాలా ప్రశాంతంగా వుంది. ఈ ఇంట్లో ఆడపిల్లలు లేరా? మాధవరావుకు చెల్లెళ్ళు లేరేమో? అత్తవారింటికి వెళ్ళారేమో? అతనికి వివాహం కాలేదా? అయివుండదు.     ఆలోచిస్తూ మాధవరావు వెనకే నడిచి విమల ఒక పెద్ద హాల్లో ప్రవేశించింది.     కేశవరావుకు ఇదేమీ పట్టలేదు. అతనికళ్ళు సత్యంకోసం వెతుకుతున్నాయి.     "సత్యం ఎక్కడ బాబూ?" కేశవరావు కుతూహలంగా ప్రశ్నించాడు.     "తన గదిలోనే వున్నాడు. మీరు వస్తున్నట్లు చెప్పలేదు. ఆత్మీయుల్ని చాలాకాలం తర్వాత అనుకోనివిధంగా కలుసుకోవటంలో కలిగే ఆనందం అద్భుతంగా వుంటుంది. అతనికి అకస్మాత్తుగా విస్మయకరమైన బహుమతి ఇద్దామనికోరిక."     మాధవరావు చిరునవ్వుతో భావయుక్తంగా విమలకేసి చూశాడు.     అతని చొరవ విమలకు కొంచెం చిరాకు కలిగించింది. ఏమిటి అలా చూస్తాడు? బహుశా సత్యమూ, తనూ ప్రేమికులనుకుంటున్నాడేమో?     విమల గుండెలు దడదడలాడాయి.     హాల్లోవున్న ఖరీదైన ఫర్నిచరూ, దాన్ని అమర్చినతీరూ చూస్తూ నిలబడిన విమల్ని ఉద్దేశించి "కూర్చోండి, నిలబడిపోయారేం?" అన్నాడు మాధవరావు.     "మీ మనస్సు ఇక్కడ లేదు. ఎక్కడవుందోకూడా నాకు తెలుసు" అన్నట్టు ధ్వనించింది మాధవరావు కంఠం.     విమల లోలోపలే సిగ్గుపడిపోయింది. గబుక్కున కూర్చుంది.     "సత్యం........"     కేశవరావు మాటను మధ్యలోనే తుంచేస్తూ "ఇప్పుడే వస్తాడు" అన్నాడు మాధవరావు.     మాధవరావు డ్రాయింగ్ టేబుల్ కు వున్న బెల్ నొక్కాడు. ఓ పదిహేను సంవత్సరాల కుర్రాడు పరుగెత్తుకొచ్చాడు.     "బాబుగార్ని త్వరగా రమ్మను" అన్నాడు మాధవరావు.     కుర్రాడు పరుగెత్తుకెళ్ళాడు.     సత్యం ఎలా వుంటాడో? తనను గుర్తిస్తాడా?     విమల గుండె వేగంగా కొట్టుకుంటూంది. తనలో కలుగుతున్న సంచలనాన్ని మాధవరావు చురుకైన కళ్ళనుంచి దాచే ప్రయత్నంలో విమల గదిలోని వస్తువులను పరికించసాగింది.     ఎదురుగా గోడమీదవున్న నిలువెత్తు తైలవర్ణ చిత్రంమీద విమల కళ్ళు నిల్చాయి. ఆ చిత్రంలోవున్న వ్యక్తి జమీందారులా కనిపిస్తున్నాడు. నడివయస్సులో వున్నాడు.     "ఆ చిత్రం మా నాన్నగారిది" అన్నాడు మాధవరావు.     "ఎంత ఠీవిగా వున్నారో?" అంది విమల అప్రయత్నంగానే.     "ఆ తైలవర్ణ చిత్రం......."     "సత్యం వేశాడు" అని సమాధానం ఇచ్చాడు మాధవరావు.     "చాలా బాగుంది. సాక్షాత్తూ మీ నాన్నగారు నిల్చొని చిరునవ్వుతో పలకరిస్తున్నట్లే ఉన్నారు. చిత్రంలో జీవకళ ఉట్టిపడుతోంది. మీ నాన్నగారు ఇట్లానే వున్నారా?" ప్రశ్నించాడు కేశవరావు.     మాధవరావు వెంటనే జవాబివ్వలేదు.     "మా నాన్నగారు పోయి ఆరునెలలయింది-" అతని కంఠం జీరపోయింది.     "అమ్మగారూ?" విమల కంఠంలో ఆర్ద్రత నిండివుంది.     "అమ్మగారు ఉన్నారు. మేడమీదే ఉంటారు. ఆమె జీవితంలో చాలా చేదును రుచి చూశారు. ఆమె ఎప్పుడు తన గది వదిలిపెట్టి ఇవతలకు రాదు. సత్యం వచ్చాక కొంచెం ఆమెను బయటప్రపంచంలోకి తీసుకురావటం జరుగుతోంది."     ఆ గదిలో వాతావరణం బరువుగా ఉంది.     ఇంత ఐశ్వర్యంతో తులతూగుతున్న ఈ ఇంట్లో ఇంత విషాదమా? కేవలం మాధవరావు తండ్రి పోవటమేకాదు- ఇంకా ఏదయినా విషాద సంఘటన జరిగి ఉండాలి. ఇంత బాధను మనస్సులో దాచుకుని ఈ మాధవరావు పైకెంత ఉత్సాహంగా ఉంటాడూ? తను నవ్వుతూ తన చుట్టూ ఉన్నవాళ్ళను నవ్వించగల వ్యక్తిత్వం అతనిది. అందుకే అంటారు- 'సంతోషాన్ని పదిమందితో పంచుకో-దుఃఖాన్ని వంటరిగా అనుభవించు' అని!     విమలకు మాధవరావంటే గౌరవం ఏర్పడసాగింది.     మెట్లమీద అలికిడయింది. విమల, కేశవరావు మెట్లకేసి చూశారు. మాధవరావు కుతూహలంగా విమల్ని పరిశీలిస్తున్నాడు.     మెట్లమీద పల్చటి ఆకు చెప్పుల్లో, పచ్చటి పాదాలమీద జీరాడుతున్న సన్న జరీ అంచుగల కోరా నేత ధోవతి కుచ్చెళ్ళు కన్పించాయి.     విమల గుండెల వేగం హెచ్చింది. అప్రయత్నంగానే కుడిచెయ్యి గుండెలమీద పెట్టుకొంది. మాధవరావు చూస్తున్నట్టు గ్రహించి ఒక్కసారిగా సర్దుకు కూర్చుంది. సిగ్గుపడిపోయింది. మాధవరావుకళ్ళు ఆమె మనస్సులోని మూలమూలను స్పష్టంగా చూస్తున్నట్లనిపించి ఇబ్బందిగా కదిలింది కుర్చీలో.     మరుక్షణంలో అదే కోరారంగు జరీ కండువాను వల్లెవాటు వేసుకొన్న ఓ ఆజానుబాహువు తాపీగా మెట్లుదిగుతూ కన్పించాడు. ఒక మహాశిల్పి, తన నైపుణ్యాన్నంతా వినియోగించి చెక్కిన గ్రీకు విగ్రహం ప్రాణం పోసుకొని నడిచి వస్తున్నట్లనిపించింది విమలకు.     ఇతను సత్యమా! బక్కగా, పీలగా, సిగ్గుగా, మొహమాటంగా కన్పించే తను ఎరిగిన సత్యమేనా ఇతను? ఎంత గాంభీర్యంగా ఉన్నాడు!     కేశవరావుకు సత్యాన్ని గుర్తించడానికి ఓ క్షణం పట్టింది. గబగబా ముందుకెళ్ళి "సత్యం!" అన్నాడు.     "మాష్టరుగారూ! మీరా?" ఆశ్చర్యంగా అన్నాడు. వెంటనే వంగి పాదాలకు నమస్కరించబోతున్న సత్యాన్ని పట్టుకొని కౌగలించుకొన్నాడు కేశవరావు.     ఇద్దరి కళ్ళలోనూ ఆనంద బాష్పాలు తిరిగాయి. హృదయాలు పులకరించాయి.
24,362
    "నేను ఫలానా అని నిర్మల చెప్పి ఉంటుంది-" అనుకుంది ముక్త. అయితే నిర్మల ముక్తను పలకరించలేదు. ఆమె వంక చూడలేదు. అక్కడ పెత్తనం చెలాయిస్తూ హడావిడి పడి పోతోంది. తనకు లభించిన కొత్తపధవిని నిర్వహించడంలో ఉన్న ఆనందం-ఎరిగున్న వారిని పలకరించడంలో ఆమెకున్నట్లు లేదు.        సంధ్య ఆమెను కాస్త లోపలకూ తీసుకెళ్ళి ఓ కుర్చీలో కూర్చోమని చూపించింది.        ముక్త కుర్చీలో కూర్చుంది.        కొత్త మోడల్ ఫైబర్ గ్లాసు కుర్చీ అది.        రంగు రంగుల చీరల్లో ఆడవాళ్ళున్నట్లే-ఆ కుర్చీలు కూడా వివిధ రంగుల్లో ఉన్నాయి.        కుర్చీలో కూర్చుంటే మెత్తగా సోఫాలో కూర్చున్నట్లుంది.        "చాలా ఉన్నాయి. కొన్నారో - అద్దెకు తెచ్చారో-" అనుకుంది ముక్త.        సంధ్య అక్కణ్ణించి వెళ్ళిపోయింది.        ముక్తకు పక్కనే కూర్చున్న ఒకామె ఆమెను పలకరించి- "మిమ్మల్నెప్పుడూ చూడలేదు-" అంది.        "నేనూ అంతే!" అంది ముక్త.        పక్కనున్నావిడ దెబ్బతిని- "నా పేరు సరళ. మావారు రావ్ అండ్ రావ్ కంపెనీలో మానేజింగ్ డైరెక్టర్" అంది.        ముక్త ఏదో అనే లోగానే ఆమె తన భర్త గురించి చాలా వివరాలు చెప్పుకుని ముక్త గురించేమీ అడగ లేదని గుర్తించిందో ఏమో-"మీ వారేం చేస్తున్నారు?" అనడిగింది.        తటపటాయిస్తూనే చెప్పింది ముక్త.        "ఓహో_" అంది సరళ. తర్వాతామె తన కాటు పక్కనున్న మరోస్త్రీతో కబుర్లు ప్రారంభించింది.        తన హోదా తెలియగానే సరళకు తనపై ఆసక్తి నశించిందని గ్రహించిన ముక్తకు మనసు చివుక్కుమంది.        అప్పుడామె అక్కడున్న వారొక్కరినే పరిశీలిస్తోంది.        ప్రతివారి ముఖంలోనూ డబ్బుకళ స్పష్టంగా కనబడుతోంది. కానీ వారందరి లోకీ తనే అందంగా ఉంది. ఇంకా చెప్పాలంటే తను హీరోయిన్లా ఉంది.        అక్కడ చాలా మంది స్త్రీలు గుంపులు గుంపులుగా చేరి మాట్లాడుకుంటున్నారు. ముక్తకు తోడెవ్వరూ లేరు.        ఎవరైనా కొత్తవారు రాగానే చాలామంది ఆమె చుట్టుచేరుతున్నారు.        సరళ తన హోదా గురించి చెప్పేసిందేమో-ఎవరు తన పక్కకు రావడంలేదని ముక్త అనుకుంది.        ఆసమయంలో అక్కడకో యువతి ప్రవేశించింది. ఆమెకు సుమారు ముప్పై ఏళ్లుంటాయి.        సుమారైన అందగత్తె ఆమె. మనిషి హుందాగా, గంభీరంగా ఉంది.        ఆమెలోపలకు రాగానే సంధ్య ఆమెను రిసీవ్ చేసుకుందుకు వెళ్ళింది. "రా పావనీ!" అందామె.        ఆమాటలు హాల్లో అందరికీ వినిపించాయి.        సంధ్య పావనిని హాల్లో కుర్చీలో కూర్చోపెట్టకుండా లోపల గదిలోకి తీసుకొని వెళ్ళింది.        హాల్లో ఒక్కసారి నిశ్శబ్దం.        ముక్త ఆశ్చర్య పడింది.        ఎవరీ పావని? వస్తూనే ఇక్కడింత నిశ్శబ్దాన్నెలా సృష్టించగలిగింది? సంధ్య ఆమెను ప్రత్యేకంగా లోపలకెందుకు తీసుకెళ్ళింది?        పక్కనున్న సరళ మరో ఆమెతో అంటోంది- "పావనిట....పావని! కనీసం పేరు మార్చుకోవాలనైనా తోచలేదు...."       "బాగ చెప్పారు. మనమైతే జరిగిందానికేనుయ్యో గుయ్యో చూసుకునే వాళ్ళం...." అంది సరళ పక్కనున్నామె.        ముక్త కుతూహలం చంపుకోలేక- "ఎవరండీ ఆపావని?" అని సరళ నడిగింది.       ఆ ప్రశ్నకు సరళ ముందుగా చలించలేదు. అయితే తనకోగొప్ప అవకాశం పోనున్నదని వెంటనే ఆమె గ్రహించి ఉండాలి....ముక్తవైపు తిరిగింది.        స్నేహభావంతో పలకరించడానికి మనిషి తనచుట్టూ ఎన్నైనా అడ్డుగోడలు నిర్మించుకుంటాడు. కానీ సత్య మనిషిని కించపర్చడానికదే మనిషి ఎన్ని మెట్లయినా దిగిరావడానికి సంకోచించడు.        సరళ నోట ముక్త పావని కధ వింది.        పావనికో ప్రియుడున్నాడు. పెళ్ళికి ముందే వాళ్ళిద్దరికీ సంబంధమేర్పడింది. ప్రియుడామెను మోసం చేశాడు. పావని అబార్షన్ చేయించుకుంది. అబార్షన్ చేసిన డాక్టరే ఆమె అంటే యిష్టపడి పెళ్ళి చేసుకున్నాడు. అలా కొన్నేళ్ళు గడిచాయి. ఎక్కడికో పోయిన పాపని ప్రియుడూరికి తిరిగొచ్చాడు. పావనిని బ్లాక్ మెయిల్ చేయాలనుకున్నాడు. ఫలించలేదు. పావని కథ భర్తకు తెలుసునని తెలిశాక - అతడామెను రేప్ చేశాడు. పావని పోలీసు రిపోర్టిచ్చింది- పావని ప్రియుడికి యావజ్జీవ కారాగారశిక్ష పడింది.        జరిగిందానికి పావని సిగ్గుపడలేదు. పైగా ధైర్యంగా తలెత్తుకుని తిరుగుతోంది. పావని భర్తకామెఅంటే ప్రాణం. అతడు బహుశా నపుంసకుడై ఉండాలి.        లేకుంటే చెడిన ఆడదాన్నెందుకు పెళ్ళి చేసుకుంటాడు? ఆ తర్వాత ఆమె అత్యాచారానికి గురైతే ఎందుకు మన్నిస్తాడు?        "అనాదిగా మగాడి వంచనకు, అత్యాచారానికి గురవుతోంది ఆడది. నా ధైర్యం, నా భర్త, సహనం- ఆ వంచకుల కెదురుదెబ్బ! మహిళామణులకు కొత్త ఊపిరి-" అంటుంది పావని.        పావని భర్త హస్తవాసి మంచిది. కాబట్టి సమాజంలో ఆయన్నెవరూ చిన్న చూపు చూడ్డంలేదు. కానీ- సంప్రదాయానికి విలువనిచ్చే సమాజంలో పావని పతిత గానే గుర్తించబడుతోంది. ఎందరో ఆమెను వెలివేశారు.        ఎక్కువ పార్టీలకు పావని రాదు. సాటివారు వేసే ప్రశ్నలామె భరించలేదు. ప్రశ్నలు వేయనిచోట  వారి చూపులనుకూడా ఆమె భరించలేదు.        "నేనేమీ తప్పు చేయలేదు. ఓ పురుషుణ్ణి నమ్మి ప్రేమించి నా తనువు నర్పించాను. అతడు నన్ను మోసం చేశాడు. తర్వాత నాకు పెళ్లయింది. నిండు మనసుతో నా భర్తను ప్రేమించాను. నన్ను మోసగించినవాడు నాపై అత్యాచారం చేశాడు. అందులో నా తప్పేముంది? నా దురదృష్టం. వాడు మళ్ళీ మరొకరిపై అత్యాచారం చేయకూడదని పోలీసులకప్పగించాను. సమాజం నా ధైర్యాన్నభినందించాలి అంటుందామె.        ఆమె ధైర్యం సాటి ఆడవారిలో ఆమెకు సానుభూతి లేకుండా చేసింది.        ఎవరి విషయమెలాగున్నా సంధ్య పావనిని ప్రతి పేరంటానికీ, పార్టీకీ పిల్చి తీరుతుంది.        పార్టీలో యితరులెవ్వరికీ పావనిరాక గిట్టదని ఆమెకు తెలుసు. అందుకే ఆమెను ప్రత్యేకంగా లోనికి పిలిచి వాయనాలిచ్చి ముందుగా పంపేస్తుంది. ఆమె వెళ్ళి పోయాకనే అసలు ఫంక్షన్ ప్రారంభమవుతుంది.        పావనికి సిగ్గులేదు. తన్నుచూసి నవ్వుకుంటారని తెలిసికూడా పిల్చిన ప్రతిచోటకూ వెడుతూంది.        పావనికి అహంకారం. నలుగుర్ని పిలిచి పలకరించి స్నేహం పెంచుకోవాలని చూడదు. తనతో స్నేహం కోరేవారు తననే పలకరించాలంటుంది.        సంధ్యకు పావనితో స్నేహమెందుకో తెలియదు.        పావని భర్త సంధ్యకు ఫామిలీ డాక్టరుకూడా కాదు.        సరళ అభిప్రాయంలో సంధ్య అమాయకురాలు. మాయ, మర్మం తెలియని మనిషి. పావనికెక్కడా స్నేహితురాండ్రు లేరు. సంధ్యనామె బుట్టలో వేసుకుని స్నేహితురాలిని చేసుకుంది.        పావని గురించింకా రకరకాలుగా చెప్పాలనుకుంది సరళ. కాని యింతలోనే వాయనం తీసుకుని వెళ్ళిపోతోందామె.        ఆమె వెళ్ళిపోయేదాకా హాల్లో నిశ్శబ్దం.        పావని నిష్క్రమించాకనే అక్కడ కార్యక్రమం ప్రారంభమయింది. కార్యక్రమం నడుస్తూండగా ఎందుకో భానుప్రకాష్ వచ్చాడు.        సంధ్య అతడికెదురై- "ఈ సమయంలో వచ్చారేమిటి?" అంది.        అతడు నవ్వాడు.        అతడి రూపం అతడి హోదాకు తగ్గట్లే వుంది.        ఎందరో కన్నెపిల్లలు కలలుగనే సినీ హీరోలా ఉన్నాడతడు.        అతడి నవ్వుమాత్రం సినీ హీరోల నవ్వుకంటే మనోహరంగా ఉంది.        "ఉండండి. వీరందర్నీ మీకు పరిచయం చేస్తాను-" అంది సంధ్య.        ఆమె ఒక్కొక్కరినే పేరు పేరునా భర్తకు పరిచయం చేసింది. వారిలో చాలామంది భానుప్రకాష్ కు తెలుసు. తనకు తెలియని వారివంక అతడు కుతూహలంగా చూస్తున్నాడు.        తనను పరిచయంగానే-"నమస్తే!" అన్నాడతడు.        "నమస్తే!" అంది ముక్త.        క్షణకాలం ఇద్దరి చూపులూ కలిశాయి.        అతడి చూపుల్లో అయస్కాంతంవంటి ఆకర్షణ చూసింది ముక్త.        భానుప్రకాష్ లోపలకు వెళ్ళిపోయాడు.        "పావని అయితే- నమస్తే చెప్పి ఊరుకోదు. షేక్ హ్యాండిస్తుంది..." అంది సరళ.        నలుగురైదుగురు నవ్వారు.        "మన సంప్రదాయమంతా ఆడదాని పవిత్రతలో ఉంది. అది నిలుపుకోనినాడు మనం మనంకాదు-" అందింకొకామె.        ముక్తకూడా ఆ సంభాషణలో ఆసక్తిగా పాల్గొంది.        డబ్బున్నవారికి లేనివారు చులకన. అధికారమున్న వారికి లేనివారు చులకన. నీత్య్పరులకు అవినీతి పరులు చులకన...కానీ...        లేనివాళ్ళ శ్రమతో ఉన్నవాడి దగ్గర డబ్బు చేరుతోంది. ఊరూ పేరూలేని సామాన్యుడు ఓటు- మరో సామాన్యుడి నధికారిగా మార్చుతోంది. ఫలితంగా అవినీతిపరులు నీతిపరులను శాసిస్తున్నారన్న విషయం తెలిసికూడా గ్రహించరెవ్వరూ...        మనను పాలించే వాడిలో అవినీతి ఉంది. మనకు పాఠం చెప్పేవాడిలో అవినీతి ఉంది. మనం బ్రతికే బ్రతుకులో క్షణం క్షణం అవినీతి ఉంది.      కానీ ప్రతివాడూ తను నీతిపరున్ననే అనుకుంటాడు.        ముక్త ఈ ఫక్కీలో ఆలోచించడం లేదు.        ఆమె పావని గురించి ఏహ్య భావాన్ని పెంచుకుంటోంది.        ఎంత నమ్మిస్తేమాత్రం - పెళ్ళికి ముందే పరాయి మగాడితో ఎందుకు సంబంధం పెట్టుకోవాలి? అందులో ఆమె మానసిక బలహీనత ఉంది. ఆ బలహీనతనే సమాజం తప్పు పడుతోంది.        ఒకసారి మోసగించబడిన ప్రియుడు-తిరిగి ఆమెను బలాత్కరించగల ఏకాంతాన్నెలా పొందాడు? ఆమెకతడికలాంటి అవకాశమెలా యిచ్చింది?        పావనిలో ఏదో బలహీనత ఉంది.        పాత ప్రియుడినామె మరచిపోలేకపోతోంది.        లేక నలుగురూ అనుకుంటున్నట్లామె భర్త నపుంసకుడే కావచ్చు.        తన కోర్కెలను చంపుకోలేక, మనసు నదుపులో పెట్టుకోలేక-ఆమె పాత ప్రియుడితో తిరిగి సంబంధం పెట్టుకుని- పట్టుబడితే దాన్ని బలవంతంగా మార్చిఉంటుంది.        చీ...ఎలాంటి ఆడది?        క్రమంగా పేరంటం కార్యక్రమం ముగిసింది.       వచ్చిన వారిలో చాలామందిని వెనక్కు తీసుకుని వెళ్ళడానికి కార్లు వచ్చాయి.       తనూ లేచింది ముక్త.        "మొదటిసారి వచ్చారు. కాసేపు కూర్చోండి-" అంది సంధ్య.        ముక్త ఆమె బలవంతం చేయగా కాదనలేక పోయింది.       అంతా వెళ్ళిపోయాక సంధ్య, ముక్త మిగిలారు.       అప్పుడు సంధ్య ముక్తను ఆమె గురించిన వ్యక్తిగత వివరాలడిగింది.     మొదట్లో తటపటాయించినా క్రమంగా సంధ్యతో మంచి స్నేహితురాలిగా భావించి - ఒక్కొక్కటిగా కుటుంబ విశేషాలు చెప్పిందామెకు ముక్త.     తన కుటుంబం గురించి చెబుతున్నప్పుడు ముక్త కళ్ళలో కనబడ్డ మెరుపును చూసింది సంధ్య.     "మధ్యతరగతి కుటుంబాల్లో ఆర్ధిక సమస్యలున్నప్పటికీ అభిమానాలూ, ఆత్మీయతా వాటిని కమ్మేస్తాయి_" అంది సంధ్య.     "అవును-అమ్మన్నా, నాన్నన్నా, అన్నయ్యలన్నా నాకెంతో యిష్టం" అంది ముక్త.     "నాకూ అంతే! నేనూ మధ్యతరగతి నుంచే వచ్చాను. మావారుకూడా మధ్యతరగతిలోనే పుట్టి పెరిగారు. ఇప్పుడైశ్వర్యం పేరుకున్నప్పటికీ మేము వీలైనంత సింపుల్ గా ఉంటాం. మా కిద్దరు పిల్లలు. ఇద్దరూ స్కూలుకు వెడుతున్నారు. వాళ్ళనికూడా మధ్యతరగతి వాతావరణంలోనే పెంచాలన్నది మా కోరిక. అందుకే తరచు మేము బంధువులిళ్ళకు వెడుతూంటాం. స్నేహం కూడా ఎక్కువగా మధ్యతరగతి వారితోనే...." అంది సంధ్య.     ఆమె మాటిమాటికీ మధ్యతరగతి అంటూంటే ముక్తకది తననే ఉద్దేశించి అన్నట్లనిపిస్తోంది. సంధ్య తనకంటే చాలా ఎత్తులో ఉన్నదనిపిస్తోంది. ఈ తరహా సంభాషణ ఆమెకు నచ్చలేదు.
24,363
     "ఎక్కడ చచ్చావే? ఎవరితో కులుకుతున్నావ్? ఏమిటా శబ్దాలు?" అని రంగస్వామి అంత బాధలోనూ పెళ్ళాం మీద ఎగిరిపడ్డాడు.              జరిగిందేమిటో ఆ పిల్లకి సగం సగం అర్ధమైంది.          ఏదో సర్ది చెప్పింది. సాక్ష్యాలు లేవు కాబట్టి రంగస్వామి అంతకంటే ఏమీ అనలేకపోయాడు.          పొట్టమీద కాలిన పుండ్లు తగ్గడానికి నెలకు పైగానే పట్టింది. శరీరం బాగైంది కానీ మనసు మాత్రం అలా కుతకుతలాడుతూనే వుంది.          అదిగో అప్పుడు రంగస్వామి నా దగ్గరికి వచ్చాడు.          "ఎలాగైనా దాన్ని పట్టుకోవాలి. నేను వున్నప్పుడు జాగ్రత్తగా వుంటుంది. కాబట్టి నువ్వు డిటెక్టివ్ పనిచేసి దాన్ని పట్టుకోవాలి. ఈ పని చేసి పెడితే నీకేం కావాలంటే అదిస్తాను" అన్నాడు.          "ఏమడిగితే అదివ్వాలి"          "ఒట్టు" అంటూ చేతిలో చేయి వేశాడు.          "వారం రోజుల్లో పని ముగించేస్తాను" అన్నాను.          మాట ప్రకారం వారం రోజుల్లో ఆ పిల్లను రెడ్ హాండెడ్ గా పట్టుకున్నాను.          "ఎలా?"          "చెబుతాను మంచి కాఫీ తెప్పించు" అంది రంగనాయకి.          "రంగస్వామితో కేసు పట్టిస్తానని ఒప్పుకున్నానుగానీ ఎలా పట్టుకోవాలో నాకర్ధమైంది కాదు" అంటూ తన మొదటి కేసు గురించి చెప్పడం ప్రారంభించింది రంగనాయకి.     రెండోరోజు నుంచి రంగస్వామి భార్య మధుమతి మీద ఇరవై నాలుగు గంటలూ ఓ కన్నేసి వుంచాను.          రోజూ సాయంకాలం అలా పొలాల దగ్గరికి వెళుతోంది తప్ప మిగిలిన టైమంతా ఇంట్లోనే గడుపుతోంది. రమేష్ ఎప్పుడూ ఆమె ఇంట్లోకి వెళ్ళడం లేదు. అంటే ఇంట్లో దుకాణం పెట్టేటట్టు లేదు.          మరి వీళ్ళిద్దరూ ఎక్కడ కలుసుకుంటున్నట్టు?          కలుసుకోకుండా వుండరు. ఒకసారి కొత్త సంబంధం ప్రారంభమయ్యాక ఏదో బలమైన కారణం వుంటే తప్ప ఫుల్ స్టాప్ పెట్టలేం మధుమతి తన భర్తకు అనుమానం వచ్చిందని తెలుసుగానీ దాంతోనే భయపడిపోయే రకం కాదు. మరి వీళ్ళు ఎలా, ఎక్కడ కలుసుకుంటున్నారు?          నాలుగురోజులు గడిచిపోయాయి.          అయిదోరోజు సాయంకాలం నేను చల్లగాలి కోసం పొలాల మీద పడ్డాను          అలా నడుచుకుంటూ వస్తున్నాను. ఉత్తరపువేపు గాలి చల్లగా శరీరాన్ని తగులుతోంది. బాగా పండిన జొన్నచేలు బంగారు తునకల్ని దేవతలు భూమి మీద ఆరబెట్టినట్టున్నాయి.          నా ముందున్న చేలో జొన్నకంకులు కదలడంతో నేను ఆగిపోయాను.          ఉత్తరపు దిక్కుగాలి వీస్తుండడంతో జొన్నకంకులన్నీ దక్షిణం వేపుకి వంగుతున్నాయి. ఓ దగ్గర మాత్రం అందుకు విరుద్దంగా కొన్ని కంకులు ఉత్తరం వైపుకు వంగుతున్నాయి.          కారణం ఏమిటి?          నా బుర్రలో ఏదో తళుక్కున మెరిసింది.          ఉత్తరం వేపుకు కంకులు వంగడం గాలివల్ల కాదు, మనుషులో, సక్కలో అక్కడుండడం వల్లే అలా జరుగుతోందని నాకు తట్టింది.          అందుకే నేనూ జొన్న చేలో చొరబడ్డాను.          వాళ్ళు  చేసిన తప్పు నేను చేయలేదు. దక్షిణం వేపుకే నడవడం మొదలుపెట్టాను.          కొంతదూరం అలా నడిచానో లేదో ఎవరో చిన్నగా మాట్లాడుకుంటున్నట్టు గుసగుసలు విన్పించాయి.          అంటే నక్కలు కాదు- మనుషులే.          ఓ దగ్గర కూర్చుండిపోయాను.          వాళ్ళెవరో నాకు తెలియడం లేదు.          గొంతులు బట్టి పోల్చుకోవాలి.          "ఇప్పుడు మనిద్దరికీ ఓ పందెం. మనం ముద్దులు - ముచ్చట్లు ప్రారంభిద్దాం. ఎవరైతే తట్టుకోలేక ముందు ఎదుటి వ్యక్తిని మీదికి లాక్కుంటారో వాళ్ళకి నిగ్రహశక్తి తక్కువన్న మాట. ఆ వ్యక్తి ఓడిపోయాడన్న మాట చలించకుండా వుంటే గెలిచినట్టు లెక్క సరేనా?"       ఆ గొంతు రమేష్ ది.          సరసుడే అనుకున్నాను.          ఆమె తలూపినట్టుందే తప్ప మాట్లాడలేదు.          ఆమె ఎవరు? మధుమతా?          నేను ఇంకాస్త ముందుకి జరిగాను.          ఇప్పుడు వాళ్ళిద్దరూ స్పష్టంగా కనిపిస్తున్నారు.          సందేహం లేదు- ఆమె మధుమతే.          అతని మాటలకు సిగ్గుపడి మూతి ముడుచుకున్నట్టు, చీరమడతలు పైకెగబాకి ఆమె పదాలు బంగారు రంగు జొన్నచేలో కలిసిపోయినట్టు కనిపిస్తున్నాయి. పైట ఆమె ఎద మధ్యలో ఇరుక్కుపోయి రెండుకొండల మధ్య ప్రవహిస్తున్న సెలయేరులా వుంది. సాయం సంధ్య ఎరుపంతా ఆమె బొడ్డులో చిక్కుకుపోవడంతో అది కనకాంబరప్పూవులా అనిపిస్తోంది.          అతను తన నాలుకతో ఆమె నాలుక పొడవు ఎంతో చూస్తుంటే ఆమె అతని ఎంగిలి ఎంత రుచిగా వుందో చూస్తోంది. అతని వవేళ్ళు ఏదో రహస్యాల్ని వెతుక్కున్నట్టు కదులుతున్నాయి. అతని వేళ్ళు కదిలినప్పుడంతా ఆమె శరీరం ప్రకంపనాలతో వూగిపోతోంది. అతని చూపులు ఆమె కళ్ళల్లో కోరికను చల్లుతున్నాయి.          అతని చేతులు ఆమె వంపు సొంపుల్లో వంపెంతో సొంపెంతో చూస్తున్నట్టు రిథమిక్ గా కదులుతున్నాయి.          ఆమె అప్పుడప్పుడూ తమకాన్ని తట్టుకోలేక కాబోలు అరడుగు పైకెగురుతోంది.          అతను ఆమె మీదికి పూర్తిగా వంగి రెక్కలు లేని తుమ్మెదై పోయాడు.          పందెం గుర్తొచ్చినట్టు ఠక్కున పైకి లేచాడు.          కోరిక శరీరాన్ని మండిస్తుంటే, ఆ మంటల్ని ఆర్పుకోవడానికన్నట్టు ఆమె అతని నోట్లోకి తన పెదవుల్ని తోసి, వూపిరాడక గింజుకుంటోంది.          అతను మరింతగా ఆమెను రెచ్చగొడుతున్నాడు.          కామం బరువుకి శరీరం చిట్టినట్లు ఆమె తన చేతుల్ని పైకి లేపి అతన్ని మీదికి లాక్కుంది.          "ఓడిపోయావ్" అతను తన చిలిపితనాన్ని అక్షరాలను అంచులుగా కుట్టినట్లు అన్నాడు.          ఆమె దాన్ని పట్టించుకోనట్టు అతన్ని మరింతగా లాక్కుంది.          సూర్యుడు సెన్సారాఫీసర్ అయినట్టు కట్ చెప్పాడేమో మిగిలిన సంధ్య కాంతి కూడా మాయమైపోయింది.
24,364
    "నేనేం చెప్పగలనురా...... మీరు మీరు ఆలోచించుకోవాల్సిన విషయం ఇది. నన్నడిగితే మీ అమ్మ బతికినన్నాళ్ళు ఈ ఆస్తులు ఉమ్మడిగా ఉండటమే మంచిదేమో! ఆవిడకి మీరందరూ సమమే. ఆవిడ కళ్ళ ముందే మీరంతా ఎవరిది వారు పంచుకు విడిపోవడం ఆవిడకి బాధాకరమే. నన్నడిగితే ఇప్పుడీ ఆస్తులమీద మీరు బతకడం లేదు. ఇప్పటికిలా వుండనీయండి. ఇంకా మోహన్ పెళ్ళి అదీ వుంది. మీ అమ్మ తదనంతరం చూసుకోవచ్చు."     నాన్నగారి ఉద్దేశం అదే అయితే ఈ ఇల్లు నిర్మలకివ్వడం, అమ్మని అక్కడ వుండమనడం అదీ ఎందుకు రాస్తారు? నా చావు తదనంతరం పంచుకోండి అని రాసేవారు."     "మీకు తెలియదు మావయ్యగారూ! మేము ఇక్కడ వుండడం మామగారికి ఇష్టం లేదు. కూతురిని బాధపెడ్తామని ఆయన ఉద్దేశం అయి వుంటుంది. అంచేత ఇన్ డైరెక్ట్ గా మమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళమనడానికి అలా రాశారు" అంది దివ్య కటువుగా.         దివ్య అనడం కటువుగా అన్నా ఆ మాటల్లో నిజం వుందని అందరికీ తట్టింది. "మేం అంత పనికిరానప్పుడు మాకేనా అందరి గొడవా కావాలి. నేనీ ఇంట్లో చచ్చినా వుండనింక. ఇన్నాళ్ళు మంచికో చెడుకో వున్నాం. మొదటిరోజే వేరింటి కాపురానికి వెళ్ళితే ఈ రోజు మామగారు పోగానే ఆడవాళ్ళని వదిలేసి పెద్దకొడుకు వెళ్ళిపోయాడన్న అపవాదుండేది కాదు - మా మరిదిగారు అదృష్టవంతులు. ఈ బాదరబందీలు, ఈ అపనిందలు అన్నింటికి దూరంగా ఉన్నారు. మామయ్యగారూ! మీరుండగానే ఎవరిదివారికిచ్చేసి పంపకాలు చేసేయ్యండి" అంది దివ్య గట్టిగా.       "దివ్యా! ఆయన పోయి పట్టుమని పదిరోజులయినా అవలేదు. ఇప్పుడు ఇంట్లోంచి మీరు వెళ్ళవలసిన అవసరం ఏమీలేదు. నే బతికినన్నాళ్ళు ఇక్కడే వుందాం. తరువాత ఎలాగో ఎవరిదారి వారిది. నా మాట వినమ్మా"...... అంది శారదాంబ.       రఘు దివ్య వంక చూశాడు - దివ్య కఠినంగా  "చూడండీ..... ఇంత జరుగుతున్నా మనం ఇంత చర్చించుకుంటున్నా ఆవిడగారు ఒక్కమాటయినా అందా! అన్నయ్యా, మీరు వెళ్ళొద్దు, మనం అందరం కల్సి ఉందామన్న మాటయినా ఆవిడ అనలేదు. ఇల్లు తన పేర వుంది. వీళ్ళంతా పోవల్సిందేనన్నట్టు మాట్లాడకుండా వుంటే మమ్మల్ని ఇంకా ఈ కొంప పట్టుకుని వేలాడమంటారా?"     రాధాకృష్ణ నిర్మలవంక జవాబు ఏమన్నా చెప్తుందేమోనన్నట్టు చూశాడు. అప్పటికి నిర్మల ఏమీ మాట్లాడలేదు- "ఏమ్మా! నీరూ...... మాట్లాడవేం..... నీ వుద్దేశం చెప్పమ్మా?"     నిర్మల తనని కాదన్నట్టు చూస్తూ వూరుకుంది." ఇంక ఇంతకంటే ఏం చెప్పాలి? ఆవిడ మౌనం అర్థం కావడం లేదూ! చూడండి..... ఏం తెలీనట్టు ఎలా చూస్తుందో..... మామగారిచేత ఈవిడ కల్లబొల్లి ఏడ్పు ఏడ్చి రాయించుకునుంటుంది" కసిగా అంది దివ్య.        "దివ్యా..... దాని మొహం చూడు - ఆదసలు ఈ మాటలు వింటున్నట్టు లేదు - ఈ పదిరోజులుగా అది అసలు మనలో లేదు..... మనం అనుకుంటున్నది విన్నట్టు లేదు" దివ్య కూతురి మీద నింద వేస్తూంటే శారదాంబ అంది.     లత నిర్మల దగ్గరికెళ్ళి భుజంమీద చెయ్యి వేసి "నిర్మలా..... నీ ఉద్దేశం చెప్పు" అని అడిగింది.     "ఏం ఉద్దేశం?" అంది కలలోంచి మేల్కొన్నట్టు, ఆశ్చర్యంగా చూస్తూ. 'చూడండి ఆ నటన' అన్నట్టు దివ్య రఘు వంక చూసింది.     శారదాంబ అన్నట్టు నిర్మల ఈ విషయాలు ఏమీ వినలేదని రాధాకృష్ణకి అర్థం అయింది. ఆయన శివశంకరంగారి విల్లు గురించి అందరి అభిప్రాయాలూ విడమర్చి చెప్పాడు. మధ్యలోనే నిర్మల ఆవేశంగా అడ్డు వచ్చింది. "వద్దు - నాకేం వద్దు - నాకేం అక్కరలేదు, ఇప్పటికే ఇంటినపడి తినిపోతున్నానని అందరికీ బాధగా వుంది, నాకీ విల్లు వద్దు, ఆస్తి వద్దు, నేను బతకడానికి నాకేదో ఉద్యోగం ఉంది. ఇదంతా నాకేం వద్దు..... ఎవరికి కావాలో వాళ్ళకిచ్చేయండి" విరక్తిగా అంటూ లేచిపోబోయింది.     "కూర్చోమ్మా నిర్మలా..... మీ నాన్నరాశాక ఆయన కోరినట్టు జరపాలిగాని, నీవు వద్దన్నంత మాత్రాన వాళ్ళది అవుతుందా? మీ నాన్న ఆడపిల్లవి, నీకేదో ఆధారం వుండాలని ఆలోచించి రాసి వుంటారీ ఆస్తి, ఇప్పుడు పంచుకోవడమా, మీ అమ్మ తదనంతరం పంచుకోడమా అన్నది ఇప్పటి ప్రశ్న. నీ ఉద్దేశం చెప్పు."         "అదంతా నాకు తెలియదు. నాకేం ఆస్తిలో భాగం అక్కరలేదని కాగితం రాసిమ్మంటే ఇచ్చేస్తాను. నాకేం వద్దు...... వద్దు" అంటూ వడివడిగా అక్కడినుంచి వెళ్ళిపోయింది నిర్మల. అంతా మొహాలు చూసుకున్నారు.     "దాని మొహం..... ఏదో దుఃఖంలో, బాధలో అంటోంది. చిన్నది, దానికేం తెలుసు. రఘూ! నాయనా! నా మాట వినండి. ఇప్పటికి ఆస్థి పంపకాలు మానండి. అంతగా అవసరమైతే సంవత్సరీకాలనాడు చూద్దాం. మీరెవరూ ఇల్లు వదిలి వెళ్లడానికి వీలులేదు. కన్నతల్లిని చెపుతున్నా..... నా మాట వినండి. రాధాకృష్ణా! ఇప్పటికి వూరుకో, సంవత్సరీకాలకి ఆలోచిద్దాం" అంది శారదాంబ నిర్ణయం చేసి అక్కడినించి లేచిపోయింది.        తరువాత అన్నదమ్ములు ముగ్గురూ చాలాసేపు మాట్లాడుకున్నారు.     ఆ రాత్రి కృష్ణ తల్లితో "అమ్మా..... నాన్నగారు ఇల్లంతా నీరూ పేర రాసేయడం బాగులేదమ్మా. అన్నయ్య చాలా బాధపడుతున్నాడు. ఇంత పెద్ద ఇల్లు. ఆరు ఏడు లక్షలు చేస్తుంది. అంతా దానికే రాశారు. అన్నయ్య ఈ ఊర్లో ఉండేవాడు, వాడి గురించన్నా ఆలోచించలేదు. ఇంత ఇల్లుంచుకుని అద్దె ఇంట్లో వుండే గతి పట్టిందని బాధపడుతున్నాడు. నీరూ అంటే అభిమానం ఉండొచ్చు. కాని న్యాయాన్యాయాలు వద్దా? మీ పెద్దవాళ్ళే అసలు అన్నదమ్ములలో, అక్కచెల్లెళ్ళలో కలతలకి కారణం అవుతారు, ఇలాంటి అవకతవక రాతలు రాసి. ఇప్పుడు చూడు, నీరూ అంటే ఎవరికీ సానుభూతి వుండదు. ఆస్తంతా రాయించుకుందని అనుకుంటారు. పైకి అనకపోయినా మనసులో ఆ భావం ఉండిపోయి దానిపట్ల అసూయాద్వేషాలు పెరుగుతాయి. ఏమిటో నాన్నగారు ఇలా చేశారు. పోనీ, ఆస్తి అంతా నాలుగు భాగాలు సరిగా చెయ్యాల్సింది" అని అసంతృప్తి వెల్లడించాడు.
24,365
      "అలాంటి అపోహపడకు శివరావ్! రాత్రి నీ యింటి దగ్గర ప్రభంజనరావ్ విస్కీలో సైనైడ్ తో ప్రాణాలు వదిలాడు. ఇప్పుడు నువ్విలా అదృశ్యం కావడాన్ని పరారీగా భావిస్తున్నారు ..... ఓ.కే....."   పార్ధసారధి అన్నాడు.     శివరావు నిర్విణ్ణుడై చూస్తుండగానే చతుర్వేది చేతిలోని బుల్లెట్ట్స్ ఉన్న రెండు రివాల్వర్స్ నీ అందుకుంది హానిత.     "నిన్ను విడిచిపెట్టాను శివరావ్ ..... ఒకనాటి చిత్రబాధ గుర్తుకోస్తున్నట్టు ఆమె కళ్ళనుంచి ఉక్రోషంగా నీళ్ళు రాలుతున్నాయి. "కనీసం నరభక్షుకులనిమ్చి తప్పుమ్చుకోలేని స్టేజ్ లో తప్ప నిన్ను విడిచి పెట్టను."     ఆమె చేతిలోని రివాల్వర్స్ నిప్పులు కక్కాయి.     శివరావుతోబాటు అతనికి అనుక్షణం సహకరించే నలుగురి అనుచరుల మోకళ్ళలోనించి రక్తం ఫాంట్ న్ లా చిమ్మింది.     బాధతో మెలికలు తిరిగిపోతుంటే చూడలేనట్టు తల తిప్పుకుంది.     "ఎంత చిత్రమో చూశావ్ శివరావ్? నువ్వు దుర్మార్గుడివి టెలిసినా, నువ్వు బ్రతకకూడదని అనిపిస్తున్నా .... ఎందుకో న ఆకళ్లు నీ విషయమలో చెమ్మగిల్లుతూనే ఉన్నాయి. బహుశా ఇంకా నాలో చావని మానవత్వం నీమీద ఈమాత్రం సాను భూతిని వర్షిస్తుందేమో! చావు!" బాధను నిభాయించుకుంటూ అంది __ "ఒకనాడు నా చావుని నావేల్టీగా కోరుకున్నా నన్నావ్! నీ పురుష సామ్రారాజ్యంలో నాలాంటి ఆడది అడుగు పెట్టాకూడదని చాలా అహంకారాన్ని ప్రదర్శించావే, ఆ ఆడపిల్లే నీ నికృష్టమైన చావుకి కారణమవుతూంది. గెట్ లాస్ట్ యూ బాస్టర్డ్ ! మరో జన్మంటూ ఉంటే యిలా కాదు, నలుగురికోసం బ్రతకడం నేర్చుకో. అంతవరకూ ఈ నలుగురితోపాటు నువ్వూ హీనంగా చావు!"     అప్పటికే హానిత కిరీటీని చేరుకుంది. నేలపైన పెనుగులాడుతున్న వ్యక్తుల్ని చూడలేనట్టు అతని గుండెలో తల దాచుకుంది.     మరో అయిదు నిమిషాలలో మోటార్ బోట్ పైన హానిత, కిరీటీ లతోబాటు చతుర్వేది పార్ధసారధి లంగరువేసి వున్న ఓడ దగ్గరకు బయలుదేరుతుండగా........     దిక్కులు పిక్కటిల్లెలా ఆర్తనాదాలు వినిపించాయి.     వెనక్కీ చూశారు.     "యా .... కో ... నా ...."     హానిత కోరిన ఆటవిక న్యాయాన్ని అమలుచేస్తున్నట్టు విశ్వా౦తరాళం ప్రతిధ్వనించేలా నరభక్షుకులు శివరావునీ , అతని పెదవుల్నీ పోదల్లోకి ఈడ్చుకుపోతున్నారు.     ఆకాశంలో సూర్యుడు ఎర్రగా నవ్వుతున్నాడు __ విర్రవీగిన నిన్నటి చీకటి విభ్రాంతి చెందేలా అసురవేద సారాన్ని ఆ దుర్గమారణ్యన విస్తరింపచేసేలా.                                           *    *    *    *        అపరాత్రి .... ఉలికిపడి నిద్రలేచాడు కిరీటి.     ముందు అర్ధంకాలేదు జరుగుతున్నా దేమిటో ....     కలేమో అనుకున్నాడు.     కానీ అప్పటికే హనిట్ పెదవులు బలంగా అతడి నుదుటిని తాకాయి.     ఓడ సాగుతూంది మెత్తగా మత్తుగా దరిచేరుతున్న జీవన నౌకలా!     ఇతిహాసాల విదివిని లిలుస్తున్నట్టు క్రమంగా హానిత ఆధారాలు అతడి నాసుకని చేరుకున్నాయి .....     కాలం గడ్డకట్టుకుపోయింది . కాని అతడిలోని తమకం గండిపడిన గంగగా మారింది.     "తూర్పు బాలిక రెప్పలల్లార్చగానే     కదలే కాంతులు దిశల నా కళలుకరిగే     వెగమే లెమ్ముసఖా బ్రతుకు మధువు నిగిరిపోనీక"     ఇద్దరి పెదవులు మధుపాత్రలయ్యాయి.     గొంతులు మధుశాలలుగా మారాయి.     అది నాదమో పూరివిప్పిన ఉన్మదమావు అదీ కానివాడు తెగిన సభ్యత సంకెళ్ళు చెప్పిన వేదమావు "కిట్టూ! ఐ లవ్ యు" అరమోడ్పులైన నేత్రాలతో పెనవేసుకుంటూ౦ది.     "హనీ .... మై స్వీటీ ...."     "....."     "ఊపిరందడ౦లేదు" గొణిగాడు నెమ్మదిగా.     "ఏం....."     "చాలా బరువున్నావు."     "మోయాలిగా!"     "ఎంతసేపు!"         "జీవితకాలం."     "ఈ పొజిషన్ లోనా?" రోప్పుతున్నాడు.     "కష్టమా...."     "కదా ..."     "ఇష్టమన్నావుగా " పట్టు మరింత బిగించింది. "కాబోయే భార్యను......"     "ప్రస్తుతం నా పైన బాస్ విగా."     "అందుకే పైనే వున్నాను."     "కంపెనీలో ఉద్యోగినే అనుకుంటున్నాగాని యింత త్వరగా యిలాంటి కంపెనీ వూహించలేదు." ఎంత సంస్కారం గల ఆడపిల్లయినా, ఎంతటి సువిశాల సామ్రాజ్యాన్నికి అధికారిణి అయినా కోరుకున్న వ్యక్తి గుండెలపైన ఇలా గువ్వలా ఒదిగిపోతుందని అతడికి తెలిసిన తొలి క్షణం అది.     "కిట్టూ" మృదువుగా అంది.     "once the game is over the king and pawns go back into the same box."     "ఇటాలియన్ సామెత కదూ."     అమాంతం ఆమెను పైకెత్తాడు.     తెరలు తెరలుగా నవ్వుతున్న హనితని యిప్పుడు బెడ్ పైన పడుకోబెట్టాడు అనూహ్యమైన ఉత్సాహంతో .     "అలసిపోయాను కిరీటీ! ఐ వంతూ రిలాక్స్ ....." చేతులతో అతడి మేడని చేట్టేసింది.     పట్టు విడిపించుకుని పైకి లేచాడు.     "ఏమైంది?"     "మా అమ్మ గుర్తుకొచ్చింది" అన్నాడు.     "అదేం ...."     "మరేంలేదు ..... మా వూళ్ళో పుష్పవతైన మరో ఆడపిల్ల వేట మొదలేట్టిందేమో అని ....."     నవ్వుతూ లాగే రెప్పలు వాల్చింది.     అది స్వప్నమో జాగ్రదావస్థో ......     ఎప్పటిలాంటి కలే ......     నట్టనడిసంద్రాన ఓడ పగిలిపోతూంది.     డెక్ పై తను ఒంటరిగా నిలబడింది....     కెరటాలు భూతాల్లా పైకి చొచ్చుకోస్తున్నాయి.     ఓ చేయి దూరంనుంచి కాదు చాలా సమీపంలోనుంచి ఆసరాగా వచ్చింది. అలవిమాలిన తమకంతో పొదివి పట్టుకుంది.......     హఠాత్తుగా సముద్ర అదృశ్యమైంది.     కల చెదిరింది.     ఓడపై కాదు .... ఈసారి కిరీటీ గుండెలపై వుంది. ప్రాణ మొచ్చిన శిల్పంలా పచ్చిక బయలుపై పరుగెత్తే పసిజింకలా.                                                                  ___: సమాప్తం : ___
24,366
    "చూడు మిస్టర్! ముందు ప్రేమకు డెఫినెషన్ తెలుసుకో! తరువాత నన్ను ప్రేమించు" అన్నదట ఇందిర.         ఆ కుర్రాడు నిరాశగా వెళ్ళిపోయాడు చెప్పాడు మనోహర్.         "తరువాతేం జరిగింది?" ఆసక్తిగా అడిగాడు రెహమాన్.         మిగతా వాళ్ళలో కూడా అదే ఉత్సుకత.         "ఇందిరా, ఫిరోజ్ ల పెళ్ళప్పుడు అతగాడు ఓ 'గిఫ్ట్' ను తెచ్చి ఇందిరాగాంధి చేతిలో పెట్టాడు. అప్పుడు ఇందిరాగాంధీ-         "ప్రేమంటే ఏమిటో ఇన్నేళ్ళకయినా తెలిసిందా?" అని మళ్ళీ అడిగింది నవ్వుతూ.         "తెలిసింది" అన్నాడతను.         "ఏమిటి తెలుసుకున్నావ్?" అడిగింది ఇందిర.         "ప్రేమంటే....ఆకర్షణ...వ్యామోహం కాదని...." జవాబిచ్చాడతను.         అప్పుడు ఇందిరా నవ్వేసి వూరుకుందట" చెప్పి కూల్ డ్రింక్ బాటిల్ ని అందుకున్నాడు మనోహర్.         "మరి ప్రేమంటే ఏమిటట?" అడిగాడు పీటర్.         అలనాటి కాళిదాసు దగ్గరనుంచీ, నేటి ఆధునిక కవి వరకూ ప్రేమగురించి అందంగా వర్ణించి చెప్పారు తప్ప, దానిని శాస్త్రీయంగా చెప్పటానికి వాళ్ళు ప్రయత్నం చెయ్యలేదు.         ఎందుకంటే వూహలతోను, ఊహాగానాలతోను మన సాహిత్యం నిండి వుంది కనుక. ఏ సాహిత్యానికయినా, సైంటిఫిక్ అవుట్ లుక్ వుండాలి. సీరియస్ లిటరేచర్ కు గానీ, కమర్షియల్ లిటరేచర్ కు గానీ శాస్త్రీయ అవగాహనే పునాది.         ఎన్నో పరిశోధనల అనంతరం విదేశీ సైంటిస్టులుగానీ, సైకాలజిస్టులు చెప్పిన విషయం ఏంటంటే-         'లవ్ ఈజ్ ఎ కెమికల్ రియాక్షన్' అని.         వయోభేదం దృష్ట్యా ఆ కెమికల్ రియాక్షన్ మారే స్థాయి బట్టి బాల్యప్రేమ, యవ్వన ప్రేమ, వృద్దాప్యపు ప్రేమ, దంపతుల ప్రేమ, ప్రేమికుల ప్రేమ....ఇలా రకరకాలుగా ప్రేమలుంటాయి" సైంటిఫిక్ గా లవ్ ని నిర్వచించాడు మనోహర్.         "ఒరేయ్....మనోహర్! నువ్వు సైంటిఫిక్ గా చెప్పినా, ఫిలాసఫి కల్ గా చెప్పినా, కామన్ మెన్ దృష్టిలో ప్రేమంటే సెక్సే! మేటర్ ఆఫ్ సెవెన్ మినిట్స్....అయిపోయిందేదో అయిపోయింది. తప్పు ఎవరిదో ఒకరిది.....వదిలెయ్....ఇద్దరూ కాంప్రమైజ్ అయిపోండి.         ఆ మాయాదేవిని పెళ్ళి చేసుకో! ఏ అమెరికానో వెళ్ళిపోయి, హాయిగా వుండు....ఇదీ నా సలహా" శాస్త్రులు అభిమానంగా అన్నాడు.         "ఈ విషయంలో నేనెవరి మాటా వినదలుచుకోలేదు. బాటిల్ పూర్తయింది. పదండి పోదాం" అన్నాడు మనోహర్.         'ఆడదాని విషయంలో మగవాడికింత పట్టుదల ఏమిటి?         మూర్ఖత్వమా? లేక తెలియనితనమా?         రెండూ కాదు....రెండూ కాదు' హీరో హోండా ఎక్కేముందు, తనలో తనే గొణుక్కున్నాడు మనోహర్.                                                                       *    *    *    *         సాయంత్రం నాలుగున్నర దాటింది.         కాలేజీలోంచి బయటికొచ్చింది సరోజ.         ఆమె రాకకోసం అప్పటికి గంటనుంచి ఎదురుచూస్తున్నాడు మనోహర్. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా, ఆమెను కలవడం కోసమే, రెండున్నర గంటల బస్సు ప్రయాణం చేసి ఆ వూరొచ్చాడతను.         ఏ పండగకో, పబ్బానికో అలావచ్చి, ఇలా వెళ్ళిపోయే బావ, తన కోసం కాలీజీకి రావడం చాలా ఆశ్చర్యంగా వుంది సరోజకు.         పక్కనున్న స్నేహితురాలితో పాటు మనోహర్ కు ఎదురుగా వచ్చి నిల్చుంది సరోజ.         "మా బావ" అని స్నేహితురాలికి పరిచయం చేసింది సరోజ మనోహర్ ని.         "అంటే....ఆ మాయాదేవి కేసు...." నవ్వుతూ అందామె.         ఆ నవ్వులో వ్యంగ్యం వుంది. ఆ వ్యంగ్యానికి అసహనంగా వుంది మనోహర్ కి.         "నీతో మాట్లాడటానికి వచ్చాను" సీరియస్ గా అన్నాడతను.         "సీ.యూ...." పక్కనున్న ఫ్రెండ్ కి చెప్పేసి "ఇంటికి వెళ్దాం" అందామె. అక్కడ నుంచి మేనమామ ఇంటికెళ్ళాలంటే అరగంట బస్సుప్రయాణం. అంత ఓపిక లేదు మనోహర్ కి         దూరంగా గుడి కనిపిస్తోంది.         "ఆ గుడికెళ్ళి మాట్లాడుకుందాం....పావుగంట తరువాత నేను హైదరాబాద్ వెళ్ళిపోతాను" అన్నాడతను.         "నీ ఇష్టం" అందామె.                                             *    *    *    *         ఊరి శివార్ల లోనున్న గుడి అది. ప్రతి సోమవారంనాడు మాత్రమే అక్కడ సందడిగా వుంటుంది.         గర్భ గుడిలోంచి పూజారి చదువుతున్న మంత్రాలు వినిపిస్తున్నాయి. వాటికి దూరంగా, పెద్ద మర్రిచెట్టు కింద కూర్చున్నారిద్దరూ.         చాలామందికి చిన్నప్పుడు, బాల్యంలో జరిగే చిన్న విషయాలపట్ల ఆసక్తి వుండదు. జ్ఞాపకమూ వుండదు. ఆ చిన్న విషయాలే, ఈనాటి పెద్ద విషయాలకు, జీవితంలోని కొన్ని ముఖ్యమయిన సంఘటనలకు దారి తీస్తాయన్న స్పృహ కూడా వుండదు.         బాల్యాన్ని మరచిపోతే, మన జీవితాన్ని మనం మరిచిపోయినట్లే!         మనోహర్ బాల్యంలో తీపిగుర్తులేం లేవు.         అతనికి ఏడేళ్ళ వయసులో పెద్ద తుఫాను రావడం....ఊళ్ళోని జనంలో ఎక్కువమంది బంధువులు, సన్నిహితులు దారుణంగా చనిపోవడము...పంట చేలగట్ల మీద, చెరువుల్లోనూ, బావుల్లోనూ వాళ్ళ శవాలను దయనీయంగా చూడటం- చనిపోయిన వాళ్ళని తలుచుకుని బతికున్న వాళ్ళు ఏడవటం....ఎందుకో తెలియని ఆ ఏడుపు వెనుక ఆర్ద్రత గురించి కొంచెం తెలిసి అతని కళ్ళు కూడా చెమ్మగిల్లడం....         పండిన పంట, పంట పొలాలు మొత్తం తుఫాను తాకిడికి మాయమైపోతే, ఉన్న ఒక్క ఇల్లూ సగం కూలిపోతే, ఇంట్లో నగలూ, నగదు వరదలో కొట్టుకుపోతే....   
24,367
     మర్నాడు రాత్రి -     ఎవరో తలుపు తడుతున్న శబ్దం అయింది.     విధి తన జీవితాన్ని గొప్ప మలుపు తిప్పబోతుందని తలుపు తిసేముందు రాజా గ్రహించలేకపోయాడు!     నిజానికి ఎవరూ కూడా తన తలుపు తట్టనవసరం లేదు!     అది రాత్రింబవళ్ళు తెరిచే ఉంటుంది. ఇప్పుడు పొరపాటున గాలికి మూసుకుపోయి ఉంటుందేమో! అంతే!     అయినా ఇది రహదారి సత్రం లాంటిది గదా! ఇక్కడకొచ్చేవాళ్ళెవరు తలుపు తట్టి మరి లోపలికి రారే!     అంటే, వచ్చింది ఎవరో కొత్త మనిషి అయి వుండాలి. ష్యూర్! అనుకొంటూ బద్దకంగా ఒళ్ళు విరుచుకుని లేచి, తలుపు తెరచి చూశాడు రాజా.     బయట ఒకాయన నిలబడి ఉన్నాడు. బాగా పొడుగ్గా, బక్కపలచగా ఉన్నాడు. అప్పుడే డ్రైక్లీనింగ్ చేసినట్లు ఫ్రెష్ గా ఉన్న సూటు వేసుకుని ఉన్నాడు. సన్నటి నిలువు గీతలున్న పిన్ స్ట్రయిప్ డ్ సూటు, టై కట్టుకోలేదు. మెడదాకా పూర్తిగా గుండీలు పెట్టి ఉన్న షర్టు మెడకి పోల్కాడాట్స్ అనే చుక్కలు ఉన్న స్కార్ఫ్ కట్టుకుని ఉన్నాడు. కాళ్ళకి ఆక్స్ ఫర్డ్ మోడల్ ఖరీదైన బూట్లు, గంభీరంగా ఉంది మొహం. సరళరేఖలా బిగుసుకుని ఉన్న పెదిమల మీద సన్నటి మీసం.     ఆరోగ్యంగా ఉన్న అతని శరీరం, చాలా ఖడక్ గా నిలబడి అతని తీరు అతను మిలటరీ మనిషి అని చెబుతున్నాయి.     "ఎవరూ?" అన్నాడు డైమండ్ రాజా ఆయన్ని పరిశీలనగా చూస్తూ.     "నేను కెప్టెన్........." అనబోయాడు అయన.     అయన మాట పూర్తీ చేసేలోగా, మరో మనిషి అర్జెంటుగా ఆయన్ని తోసుకుంటూ లోపలికి వచ్చేశాడు.     ఆ మనిషి తనని తగిలినచోట సుతారంగా దులుపుకున్నాడు అయన.     దులుపుకుని, "నేను కెప్టెన్....." అని మళ్ళీ అనబోతుండగా లోపలికి వచ్చిన ఆ మనిషి సుడిగాలిగా మళ్ళీ బయటికి వెళ్ళిపోయాడు.     "ఇది గ్రాండ్ ట్రంక్ రోడ్డు లాంటిది. ట్రాఫిక్ ఎక్కువ! మీరు ఇక్కడ నిలబడితే లాభం లేదు. లోపలికి రండి!" అన్నాడు రాజా.     పీత బొక్కలాంటి ఆ ఇంట్లోకి తనలాంటివాడు ప్రవేశించడం తగునా అని ఒక్కక్షణం తటపటాయించి, తర్వాత లోపలికి వచ్చాడు అయన.     వస్తూనే చెప్పాడు.     "నాపేరు కెప్టెన్ జస్వంతరావు!"         "కూర్చోండి" అన్నాడు రాజా.     చుట్టూ చూశాడు కెప్టెన్ జస్వంతరావు. అక్కడ కూర్చోవడానికి ఏమి కనబడలేదు.     అక్కడ ఒక కుక్కి మంచం ఉంది. దాని మ్,మీద తల వైపున ఒక పిల్లి కాళ్ళ వైపున ఒక ఉరకుక్క పడుకుని ఉన్నాయి.     ఆ కుక్కని తట్టి లేపాడు రాజా.     "బాబాయ్! లే!" అన్నాడు.         "బాబాయా?" అన్నాడాయన ఆశ్చర్యంగా.     "అవును! కుక్కలకి ఆరేళ్ళ వయసంటే మనుషుల వయసు లెక్క ప్రకారం నలభై ఏళ్ళని లెక్క! అందుకే బాబాయ్ అని పిలుస్తుంటా!" అన్నాడు రాజా.     "పిచ్చిగోల!" అనుకున్నాడు కెప్టెన్ జస్వంతరావు మనసులోనే. అనుకుంటూనే గది అంతా పరికించి చూశాడు. గోడల మీదా ఎక్కడ అంగుళం కూడా ఖాళిలేకుండా పోస్టర్స్ అతికించి ఉన్నాయి.     మైకేల్ జాక్సన్ , బాబా సహగల్, సామంతా ఫాక్స్, మడోన్నా.........ఎట్ సెట్ రా..........ఎట్ సెట్ రా.     అవన్నీ చూసిన కెప్టన్ జస్వంతరావు మొహం అప్రసన్నంగా అయిపొయింది. మరింత బిగుసుకుపోయి, నిటారుగ్గా కూర్చున్నాడు.     ఆలోగా, అదర గండంలా కనబడుతున్న ఓ అయిదేళ్ళ పిల్లాడు వచ్చాడు. వాడివైపు పరుగుని చూసినట్లు చూశాడు జస్వంతరావు.     ఆ తర్వాత డైమండ్ రాజాని మైక్రోస్కోపు క్రింద క్రిమిని పరిశిలించినట్లు చూడడం మొదలెట్టాడు.     విశ్రుంఖలంగా పెరిగిన జుట్టు, నాలుగు రోజులుగా షేవ్ చెయ్యని గడ్డం ఒక వంద రంగులు కలిసి ఉంటాయేమో అనిపించే టీ షర్టు. పాతగా ఉన్న బ్లూడెనిమ్ జీన్సు. కాళ్ళకి తెల్ల సాక్సు- లోఫర్లు.     "ఈ ప్యాంటు వారానికోసారాన్నా ఉతుకుతావా!" అన్నాడు జస్వంతరావు.     "అబ్బే! ప్రతినెల తప్పకుండా ఉతుకుతూనే ఉంటా!" అన్నాడు డైమండ్ రాజా, మాటకి మాట అంటిస్తూ.     తిరుగుబాటుదారుడిలా ఉన్న రాజా వైపు కెప్టెన్ జస్వంతరావు అంతరాత్రివేళ కూడా మడతనలగని సూటుతో, యుడీకో లోన్ సువాసలని వెదజల్లుతూ వున్న జస్వంతరావు వైపు రాజా కొద్ది క్షణాలపాటు అలా చూసుకుంటూ ఉండిపోయాడు.     వాతావరణం కొంచెం వేదేక్కుతున్నట్లు అనిపించింది జస్వంతరావుకి.     ఈ రాజా తన జీన్సుని నెలకోసారి ఉతుక్కుంటే తనకేమిటి? ఆర్నెల్లకోసారి ఉతుక్కుంటే తనకేమిటి?     ఇతన్ని జెంటిల్ మాన్ గా మార్చడానికి ముందు ముందు చాలా టైం ఉంది!     ప్రస్తుతం తను చెప్పినదానికి అతన్ని ఒప్పించాలి! అంతేచాలు!     వాతావరణాన్ని తేలిక చెయ్యదలచుకుని , లోపలికి వచ్చిరాగానే అకారణంగా విద్వంసకాండ మొదలెట్టిన ఆ అయిదేళ్ళ పిల్లాడిని పలకరిచాడు కెప్టెన్ జస్వంతరావు.     "నీ పేరేమిటి బాబూ?" అన్నాడు గంభీరంగా.     "బాడ్ ఖోవ్!" అన్నాడు పిల్లాడు తక్షణం.     షాకయిపోయాడు జస్వంతరావు.         "ఏమిటి?" అన్నాడు ఆప్రయత్నంగా.     "బాడ్ ఖోవ్!" అన్నాడు పిల్లాడు మళ్ళీ.     రాజా కల్పించుకుని చెప్పాడు "వాడి పేరు భార్గవ్! వాడికి మాటలు సరిగ్గారావు. వాణ్ణి మాట్లాడించకండి! ఇంకా చాలా వినాల్సివస్తుంది.     తక్షణం కట్టెబొమ్మలా బిగుసుకుపోయాడు జస్వంతరావు.     అంతలోనే.     ఒక బిచ్చగాడు గుమ్మదగ్గర కనబడ్డాడు. కనబడిన మరుక్షణంలోనే చనువుగా లోపలికి వచ్చేశాడు. ఒక మూల నిలబడి, తన బిచ్చగాడి డ్రెస్సుని విప్పేశాడు. వంకేన తగిలించి ఉన్న రాజా ప్యాంటు షర్టు అర్జెంటుగా తగిలించుకుని "అన్నా! ఇవాళ కలెక్షన్ బాగుంది నాకు! సరదాగా సెకెండ్ షోకి వెళ్ళొస్తా!" అని గబగబ బయటికి వెళ్ళిపోయాడు.     అతను వెళ్ళి వెళ్ళకముందే ఒక పదహారేళ్ళ పిల్ల వచ్చింది. "అన్నా! మిరప్పళ్ళ ఖారం నీకు ఇష్టం కదా! అమ్మ ఇచ్చి రమ్మంది" అని చిన్న గిన్నె అక్కడ పెట్టి " రొట్టెలు కాల్చుకున్నవా?" అంది.     "ఏసుపాదం వాళ్ళ అమ్మ చపాతీలు పంపిందిలే!" అన్నాడు రాజా.     తర్వాత జస్వంతరావు వైపు తిరిగాడు రాజా.     చెక్కబోమ్మలా కూర్చుని ఇదంతా చూస్తున్నాడు జస్వంతరావు.     "చెప్పండి! మీరెవరు? నాతొ ఏమిటి పని? అని అడిగాడు రాజా.     గొంతు సవరించుకున్నాడు జస్వంతరావు.     "నేను లేట్ రాజా ఆఫ్ రాణీపూర్ శ్రీ విక్రమదేవరావుగారికి ఎస్టేట్ మేనేజర్ని. రిసెర్చి స్కాలర్ ని కూడా!"     చిత్రంగా చూశాడు రాజా.         "లేట్ రాజ ఆఫ్ రాణీపూర్ శ్రీ విక్రమదేవరావుగారు నిన్న బంధుమిత్ర సపరివారసమేతంగా పరమపదించారు" అన్నాడు కెప్టెన్ జస్వంతరావు.     "పాపం!"         "వారి ప్లేన్ క్రాష్ అవుతున్నప్పుడు నువ్వే హోటల్ లో ఉన్న వాళ్ళని అందరిని హెచ్చరించి ప్రాణాలు కాపాడావు."     "ఏదో సమయానికి అక్కడ ఉండబట్టి........" అన్నాడు రాజా.     "లేట్ రాజా ఆఫ్ రానీపూర్ శ్రీ విక్రమదేవరావుగారు వారసులు లేకుండా పరమపదించారు." అన్నాడు జస్వంతరావు.     జస్వంతరావు అలా అనగానే, రాజా మొహం ఆర్క్ లైట్ లా వెలిగిపోయింది!     "అంతా అర్ధం అయింది! ఇప్పుడు నేను వచ్చి రాజాగారి వరసుడిలా నటించలంటారు! ఆస్తిలో మీకు మేజర్ వాటా..........నాకు కొంచెం క్యాషు....మీ పని అయిపోగానే నేను మళ్ళీ నాదారిన నేను వెళ్ళిపోవాలి. అవునా? ఇది చాలా సినిమాల్లో చూశాం! కానీ సార్! లాభం లేదు.....ఇలాంటివి సినిమాల్లో నడుస్తాయి గానీ, రియల్ లైఫ్ లో బెడిసికొడతాయి" అన్నాడు రాజా ఏకధాటిగా.     గంభీరంగా అన్నాడు కెప్టెన్ జస్వంతరావు.     "నేను నిన్ను వారసుడిగా నటించమని అడగటానికి రాలేదు."     "మరి?"     "నువ్వే నిజంగా వారసుడివని చెప్పడానికి వచ్చాను."     "ఏమిటి?" అన్నాడు డైమెండ్ రాజా కొయ్యబారిపోయి.     "అవును! లేట్ ఆఫ్ రాణీపూర్ శ్రీ విక్రమదేవరావుగారి వారసుల్లో నీ నెంబరు రెండు వందల నలభై తొమ్మిది. రెండు వందల నలభై ఎనిమిది వారసులు ఒకేసారి ప్లేన్ క్రాష్ లో పోయారు. మిగిలింది నువ్వే! ఇకనుంచి నువ్వు ఉత్త డైమండ్ రాజావి కాదు.     నిజంగా నువ్వు రాజా ఆఫ్ రాణీపూర్ , శ్రీ రాజశేఖరసింహ!"     "శ్రీశ్రీశ్రీ రాజశేఖర సింహ!" అన్నాడు రాజా సీరియస్ గా. తర్వాత నవ్వేసి, "భలే కదా కమామీషు! నిజం చెప్పండి! నాకు టోకరా వెయ్యాలని మీరు గనక వచ్చి వుంటే మీకు శ్రమదండగ! నా దగ్గర మొత్తం నూట అయిదు రూపాయలున్నాయి! దానికోసం మీరు ఇన్ని తిప్పలు పడడం అనవసరం!" అన్నాడు.     రాజా మాటలు విని సహనంగా అన్నాడు కెప్టెన్ జస్వంతరావు "ఒక్క ఐదునిమిషాలు ఓపికపడతావా? అన్ని వివరాలు వివరించి చెప్పేస్తాను."
24,368
    తన పదవికి ఎసరుపెట్టాలని తన పార్టీకి చెందిన అసమ్మతి వర్గం ఓ పక్క బలంగా ప్రయత్నిస్తుంటే, రాయ్ ఇలా మాట్లాడ్డం చాలా ఆనందంగా వుంది. పైగా ప్రధానమంత్రితో అతడెంత చనువుగా ఉండేదీ వాసుదేవరావుకీ తెలీని విషయం కాదు.          ఏ క్షణంలో అయినా మనసు మార్చుకుంటాడేమో అని రాయ్ గురించి అనుకుంటుంటే, ఇప్పుడు మరోమారు మనం కాబోయే వియ్యంకులము' అనడం మంత్రంలా పనిచేసి కృతజ్ఞతగా రాయ్ చేతుల్ని పట్టుకున్నాడు.          "ఈ సమస్య నుంచి మీరే గట్టెక్కించాలి."          పగలబడి నవ్వాడు రాయ్. "ఈ గొడవలో పడి మీరు పెళ్ళి ఏర్పాట్లు మరిచిపోకండి."          "ఇంత దూరం వచ్చాక ఇక ఆగుతుందా రాయ్ గారూ! ఈ నెలాఖరుకి ముహూర్తాలు ఖాయం చేసేశాంగా."          ఖాయం చేసినా ఇంకా కార్ద్సు అచ్చు వేయించకపోవటానికి కారణం వాసుదేవరావు మనసులో అలజడిగా ఉంది. పదవి గురించి కాదు, ప్రబంధ గురించే. ప్రబంధ అంగీకరించిందనే వార్త కోసం చాలా ఆందోళనగా ఎదురుచూస్తున్నాడతను.          మొండిగా దూసుకుపోయేవాడే - కానీ ప్రబంధ కూడా దేనికీ వెనకాడని మొండిపిల్ల అని తెలీడంతో, రోజుల్ని కాదు నిముషాల్నీ, సెకండ్లనీ లెక్కపెట్టుకుంటూ గడుపుతున్నాడు.          రాత్రి తొమ్మిదిన్నర దాకా ఆయనతోబాటే ఉన్న కెపి. రాయ్ వెళ్ళిపోయాక ఇక అదుర్ధాని భరించలేని ముఖ్యమంత్రి వైజాగ్ ఫోన్ చేశాడు. కాని ఎంగేజ్ డ్ శబ్దం వినిపించింది.          ఒకటి రెండు సార్లు కాదు, వరసగా పదిసార్లు ప్రయత్నించాడు. నిజానికి ఫోన్ ఎంగేజై లేదు. రిసీవర్ ని పక్కన పెట్టింది సౌదామిని.          తను రాయని నాటకంలో ప్రబంధని కీలకమైన పాత్రగా మార్చి అప్పటికే ఆదిత్య దగ్గరకు పంపించింది. ఏం చేయాలో మరోమారు వివరంగా తెలియచెప్పి.                                                                    * * *          మొదలైన తుఫానుకి తార్కాణంగా ఆకాశంలో ఫెళ ఫెళార్భాటాలు.          చీకటిని ఖడ్గాల్లా చీల్చుతున్న మెరుపులు.          అనిత గురించి ఆందోళనగా ఆలోచిస్తూ కూర్చున్నాడు ఆదిత్య.          సౌదామిని మాటలు ప్రతిధ్వనుల్లా వినిపిస్తున్నాయి ఇంకా.          "నీ కోసం ప్రబంధ తపించిపోతూంది."          "నీ ప్రేమకోసం తన సర్వస్వాన్ని కాలదన్నుకుని ర్వతానికి సిద్దంగా వుంది."          "అనిత ఇప్పటికే కాదు మరెప్పటికైనా క్షేమంగా ఉండాలీ అంటే ప్రబంధ నీ మనిషి కావాలి. ప్రబంధ నిన్ను వదులుకోలేనంత చేరువైన ఆడపిల్లని తెలిస్తే తప్ప ఈ దాడి ఆగదు."          ప్రణయ గుర్తుకొచ్చింది. వెనువెంటనే రూపమూ స్ఫురించింది.          పాలరాతి చెక్కడాల్లో, ఇంద్రనీలాల కట్టడాల్లో అనర్ఘవర్ణ శిల్పంలా బ్రతకాల్సిన ప్రబంధ తనలో ఏం చూసి అంతగా ఇష్టపడుతూంది?          కలలా సాగాల్సిన బ్రతుకునుంచి కల్లోలం వైపు కావాలని ఎందుకు పరుగులు పెట్టాలనుకుంటూంది? అసలిప్పుడేం జరగబోతూంది?          సౌదామిని చెప్పింది మననం చేసుకుంటుంటే మనసు అడకత్తెరలో ఆలోచనలు ముక్కలవుతున్నాయి. అణువంత భయమూ చోటు చేసుకుంటుంది.          ఏది ఏమైనా ప్రబంధ ద్వారా తప్ప తను సమస్య నుంచి బయటపడలేడేమో!          దూరంగా ఉరిమినచప్పుడు.          మరుక్షణం నేలని తాకిన ఓ మెరుపు.          ఆ మెరుపు కాంతిలో అప్పుడు చూశాడు ఆదిత్య. వర్షంలో తడిసిన పారిజాతంలా, ప్రకృతి తెరిచిన తొలిపుటలా ప్రబంధ నిలబడి వుంది ద్వారం దగ్గర.          ముందు కలేమో అనుకున్నాడు.          సన్నగా వణుకుతున్న ప్రబంధ నిజంగానే వచ్చిందని అరక్షణంలో అర్ధం చేసుకున్నాడు.          "ప్రబంధా!"          గర్జనలా కాదు. అణువంత ఆర్తిగా పలకరించాడు ఆదిత్య. అదోలాంటి ఊరట.          అప్రతిభురాలై చూసింది. ఎందుకో చాలా ప్రతిఘటన్ని ఊహించింది కాని ఆదిత్య మరోలా ప్రవర్తిస్తున్నాడు.          "వర్షంలో తడిసిపోయినట్టున్నారు!" టవల్ అందించబోతుంటే, అవసరం లేదంది తల వంచుకునే.          ఆదిత్యకీ బిడియంగా వుంది. అంతకుమించి ప్రబంధ కూడా లజ్జగా నిలబడిపోయింది.          "చీర విప్పేయరాదూ!"          చివాలున తల పైకెత్తింది ఆ వాక్యంలో అనుకోని భావమేదో ధ్వనించగానే.          "ఆహా... తడిసిపోయారు కదా అని" గొంతు పెగలడంలేదు ఎందుకో.          సౌదామిని ఉద్బోధే గుర్తుకొచ్చి అలా ముకుళించుకుపోయిందో, లేక తను ఎందుకింత సాహసం చేస్తున్నానూ అన్న భావమే మనసులో మెదిలిందో కంపించిపోతూంది.          "జలుబు చేస్తుంది" చీర మార్చుకోమన్నట్టు మరోసారి గుర్తు చేశాడు.          తల వంచుకునే ఆలోచిస్తూంది.          తనతోనే ఇలా మాట్లాడుతున్నాడా, ప్రణయతో కూడా యిలానే వుంటాడా?          అయినా తనను చూడగానే రోషంగా కలయబడతాడనుకుంటే ఇంత సాదరంగా ఆహ్వానిస్తున్నాడేం? తన తప్పేమీ లేదని తెలుసుకున్నాడా?
24,369
    "కొన్ని సందర్భాల్లో పక్షం రోజుల వ్యవధిలో గ్రహణాలు పట్టినా ఎలాంటి విపత్తులు సంభవించకపోయినా, వాటికి అనుకూలంగా ఇతర గ్రహాల స్థితిగతులు తోడై యుద్ధవాతావరణం అలుముకొనే అవకాశాన్ని త్రోసిపుచ్చలేరు. 1991 జనవరి 15వ తేదీన అమెరికా భారీ ఎత్తున బాగ్దాద్ మీద దాడి జరిపింది. ఆరోజు సూర్యగ్రహణం సంభవించింది. శని, రాహువు...ముస్లిమ్ లకు ప్రాతినిధ్యం వహిస్తారు. అయితే, రవి, శని, రాహువులతో కలిసి వున్నాడు. రవికి ఈ ఇద్దరు బద్ధ శత్రువులు.     "1991 జులై 11న సూర్యగ్రహణం సంభవించిన ఫలితంగానే అదే సంవత్సరం ఆగస్టు 19న సోవియట్ మహాసామ్రాజ్యం అంతమై వివిధ రిపబ్లిక్ లుగా విడిపోయింది. 1193 ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన కుజుడి ఆధిపత్యంలోని ధనిష్టా నక్షత్రంలో, మకరరాశిలో రవి, శని వుండడం వల్లనే యూగొస్లోవేకియా ముక్క చెక్కలైపోయింది.     "భారత జాతక చక్రంలో మకర రాశిది పదవ స్థానం. భారతదేశలగ్నమైన కన్యాలగ్నానిది ఐదవ స్థానం. ఫలితంగా పాలక పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తాయి. దేశంలో టెర్రరిస్టు కార్యకలాపాలు చెలరేగాయి. ఈ సంవత్సరం మార్చి 12న కుజుడు... శనికి కేంద్రం. కుజుడి కేంద్రం గురువు. ఫలితంగా పాకిస్తాన్ ప్రోద్భలంతో బొంబాయిలో బాంబు ప్రేలుళ్ళు  సంభవించాయి.     "1993 మే నెల 21 వ తేదీన సూర్యగ్రహణం ఏర్పడింది. శని...రవికి, కుజునికి కేంద్రస్థానంలో వున్నాడు. ఆ తరువాత 14 రోజుల వ్యవధిలో-, అంటే జూన్ నాలుగవ తేదీన-చంద్రగ్రహణం. ఇది అసాధారణమైనది కూడా. గత 54 సంవత్సరాలలో ఇటువంటి గ్రహణం ఒకే ఒక్కసారి సంభవించింది. 1939 మే నెల మూడవ తేదీన జరిగింది. ఇలా గ్రహణాల ఉనికి వలన కలిగే గడ్డుపరిస్థితిని గుర్తించి, దేశానికి, దేశాధినేతలకు గల అరిష్ఠకాలాన్ని తెలుసుకొని గుణించుకొని ఒక పథకం ప్రకారం 'ది బ్లడ్' నవలను వ్రాశాను.     "అంతేకాదు! భారతీయులకు సెంటిమెంట్స్ ఎక్కువ గనుక...దేవుని ప్రసాదాన్నే మృత్యువుకు కారణంగా వ్రాశాను. జబ్బార్ తన తెలివితేటలతో రాజకీయంగా ప్రధానమంత్రి పదివికి ఎదగాలనుకున్న ఒక ప్రముఖ పారిశ్రామికవేత్తను ప్రలోభపెట్టి...అతని వద్ద నుంచి భారీ ఎత్తున నిధులను రాబట్టి, ప్రధానిని హత్యచేయించాడు. కాని, ఆ పారిశ్రామికవేత్త జాతకం కలసిరాకపోవడంవల్ల అతను కనీసం పార్లమెంటు సభ్యునిగా కూడా ఎన్నిక కాలేకపోయాడు.     "ఈ విషయాన్ని అతడెక్కడ బయటపెడతాడోనని పాకిస్తాన్ టెర్రరిస్టులతో చేతులు కలిపి, అతన్ని గుట్టుచప్పుడు కాకుండా చంపించి వేశాడు జబ్బార్. ఇన్ని ఘనకార్యాలు చేసినందువల్ల జబ్బార్ ఇప్పుడు పాకిస్తాన్ ఇంటలిజన్స్ సర్వీసెస్ (ఐ.ఎస్.ఐ) కి ముఖ్య ఏజంటుగా నియమితుడయ్యాడు. ప్రస్తుత భారత ప్రధాని చక్రవర్తిని లొంగదీసుకోవడానికని, ఆయన కుమారుడిని తన కూతురు హసీనాచేత వలలో వేయించుకున్నాడు. కాని, అదృష్టం కలిసిరాక కూతురూ అల్లుడూ...టూరిస్టు బస్సు ప్రేలిపోయిన దుర్ఘటనలో చనిపోయారు.     "ఆఖరి అస్త్రంగా ఇప్పుడు ప్రధానిమీదకు నిన్ను వదలడానికి నీకు తర్ఫీదు నిస్తున్నాడు. ఈ రాజకీయ చదరంగంలో నీ మానప్రాణాలకే ముప్పువాటిల్లే ప్రమాదం వున్నదనే నేనింత హడావుడిగా వచ్చాను. ఎలాగైనా నిన్ను ఈ నరకం నుంచి తప్పిస్తాను."     తన సుదీర్ఘమైన ఉపన్యాసం అయిపోవడంతో తన హృదయంలోని భారమంతా దిగిపోయినట్టు తృప్తిగా నిశ్వసించాడు అధికారి ఉరఫ్ ఆనంద్.     "మరి, పి.ఎస్. ఓ రాణాను విమానంలో చంపిందెవరు...?"     "అదా... అదీ జబ్బార్ పనే... జ్యూస్ లో సైనైడ్ కలిపి, ఎయిర్ హోస్టెస్ చేత ఇప్పించాడు."     అప్పుడు మారాయి ధీరజ ముఖంలోని రంగులు. ఆమె కళ్ళల్లో ఎర్రజీర ఏర్పడింది. పళ్ళు పటపట మనే శబ్దం చేశాయి.      "థాంక్యూ ఆనంద్...ఇప్పటికైనా నాకు నిజం చెప్పావు. నిన్నిప్పుడు మనస్పూర్తిగా అభినందిస్తున్నాను కాని, ఏ రచయితా చేయకూడని పని చేశావు నువ్వు. నీ నవల 'ది బ్లడ్' లోని పధకాన్నే ప్రయోగించి ప్రధాని అమరేంద్రను, పి.ఎస్.ఓ. రాణాను పొట్టనపెట్టుకున్నాయి విచ్చిన్నకర శక్తులు. నీ రచన పరిణామం ఎంత విషాదంగా మారిందో చూశావా! నేరం చేసిన వారికన్నా నేరాన్ని ప్రోత్సహించినవారే మరింత శిక్షార్హులు."     ధీరజ మాట్టాడిన తీరుకు ఆనంద్ కు ముచ్చెమట్లుపట్టాయి.     తొలిసారిగా ఆమెను ఆసాంతం పరిశీలనగా చూసిన మరుక్షణం ఆమె మాటలలోని హెచ్చరికను గుర్తించాడు. అతనిలో అనుమాన బీజాలు అంకురించి ఖంగారుపడిపోయాడు ఆనంద్.     అసలు ధీరజ ఎవరు...? ఆమె గురించి పూర్తిగా తనకు తెలియదు. కేవలం తను ఆమెమీద మనసుపడడం వల్ల ఆమెను నమ్మి తనకు తెలిసిన రహస్యాలన్నీ చెప్పివేశాడు కొంపదీసి ధీరజ పోలీసుల ఏజంటు కాదు కదా అనుకుంటున్నంతలో జరిగిపోయిందొక సంఘటన.     సరిగ్గా అదే సమయంలో మినీవ్యాన్ ఒకటి లోనికి వచ్చి ఆగింది. ముందు జబ్బార్...అతని వెంట మరి కొందరు క్రిందకు దిగారు. వేన్ నుంచి అతి జాగ్రత్తగా కొన్ని చెక్క పెట్టెలను దింపించి, ఒక గదిలోపల పెట్టించాడతడు.     అప్పటికే జబ్బార్ కంటపడకుండా ఒక చెట్టు చాటుకు తప్పుకున్నాడు ఆనంద్.     బయట లాన్ లో నిలుచొని వున్న ధీరజని చూసి జబ్బార్ భృకుటి ముడిపడింది.     "నీకు కేటాయించిన గది దాటి బయటకు రావొద్దని చెప్పాను కదా...ఎందుకొచ్చావు?"     మౌనంగా వుండిపోయింది ధీరజ.     "అడిగేది నిన్నే... నా ప్రశ్నకు జవాబు చెప్పలేదు!"     "బోర్ కొట్టి, తోట చూద్దామని బయటకొచ్చాను... ఈ మాత్రానికే అనుమానపడాలా?"
24,370
    కాళిచరణ్ చెప్పిందంతా విని అతను నాకు తెలుసు ముక్తసరిగా అంది రూపమతి.     "వాట్ అతను నీకు ముందే  తెలుసా?"     "తెలుసు"     "అయితే నేను అతని గురించి...."     "డోంట్ వర్రి ఇందర్ ఇక్కడ వుండటం నాకూ ఇష్టంలేదు"     "అదేమీ?"     "ఆ విషయం అడగద్దు. చాతయితే ఇందర్ నీ ఇక్కడ నుంచి పంపించు"     అంది రూపమతి.         కాళిచరణ్ కి చాలా సంతోషం వేసింది.     కాళిచరణ్ కి కావాల్సిందికూడా ఇదే ఇందర్ తో మాట్లాడకుండా  వుండటానికి అతను ఎదురు పడంగానే ముఖం తిప్పుకుని అక్కడ నుంచివెళ్ళిపోయాడు షికారుకి వెళ్ళేటప్పుడు పిలిచేవాడుకాదు.     కాళిచరణ్ షికారుగా అల డొంకదారిన వెళుతుంటే ఇందర్ ప్రత్యక్షమ్తెనట్లుగా వచ్చాడు.     "నన్ను పిలిస్తే  నేనూ వచ్చేవాడిని కదా?" ఇందర్ అన్నాడు.     "ఏమో నాకు గుర్తులేదు. నేను పిలిచేదేముంది. చేలమ్మట డొంకలమ్మట తిరగటమె కదా! అతడు అన్నాడు.     "తోడుగా  కబుర్లు చెప్పకుంటూ నడుస్తూంటే బాగుంటుంది"     "నాకు ఒంటరిగా వెళితేనే బాగుంటుంది."     ఆఫ్ కోర్స్ ఎవరి ఇష్టం వారిది ప్రతి వాళ్ళకి ఓ ఇష్టం అంటూ వుంటుంది కాదనను రేపటి నుంచి మీ ఇష్టం  మీది. ఈరోజుకి వ్రత భంగం చేయండి. మీతో ముఖ్యమ్తెన విషయం ఒంటరిగా మాట్లాడాలి.     ఇందర్ అంటూంటే కాళిచరణ్ హృదయ గుండె స్పందన హెచ్చింది.     "అలా  వెళ్ళికూర్చుందాము మీకు ఇష్టమున్న లేకున్న కొంత టైమ్ నాతో గడపాల్సిందే." ఇందర్  అన్నాడు.     ఈ బలవంతం ఏమిటి? కాళిచరణ్ విసుక్కుంటూ అన్నాడు.     "ఐండులో బలవంతం ఏమిలేదు" నీ వెవరో ఏమిటో నీ రహస్యం తెలిసిపోయింది. అది మాట్లాడుదామనే అంతే" ఇందర్ ఏక వచనంలోకి దిగుతూ అన్నాడు.     వేగంగా ముందుకు అడుగులు వేస్తున్న అతడు  సడన్ బ్రేకు వేసినట్లు ఆగిపోయాడు. ఇందర్ అలా అనంగానే పెద్ద షాక్ తిన్నట్లు నుంచుండిపోయాడు.     కాళిచరణ్ శిలలా మారిపోవటం చూసి  ఇందర్ నవ్వుకున్నాడు.     "ఈ  చుట్టూపట్ల ఎవ్వరూ  లేరు. అలా వెళ్ళికూర్చుని తీరుబడిగా మాట్లాడుకుందాం" అతని భుజం మీద చేయివెస్తూ ఇందర్ అన్నాడు.     "నేనురాను" చలనం తెచ్చుకుని కాళిచరణ్ అన్నాడు.     "వస్తావు"     "ఏమిటా బలవంతం!"     "ఇక్కడ బలవంతాలు కుస్తిపట్లు ఏమీలేవు ఇద్దరం కూర్చుని మాట్లాడుకుందా మన్నాను వస్తేరా లేకపోతేలేదు. మనం మాట్లాడుకుందాము కాదంటే నీఇష్టం చాలా మంచి విషయం మిస్  అవుతావు. ఓ  విషయం మాత్రం గుర్తుంచుకో నివు క్షేమంగా వుండాలంటే....     కాళిచరణ్ ఒకనిర్ధారణకి వచ్చాడు సరే అన్నాడు.     ఇరువురూ వెళ్ళి కొద్ది దూరాన చేనుగట్టు మీద కూర్చున్నారు. అతడి ముఖం గంటు పెట్టుకుని కూర్చున్నాడు.     "నేను తెలుసుకున్న రహస్యం చెప్పనా" ఇందర్ అడిగాడు.     కాళిచరణ్ ఊ అనికూడా  అనలేదు.     "నివు రూపమతి యీ మధ్యాహ్నం మాట్లాడుకున్నమాటలు విన్నాను. రూపమతినీ చాలా మోసం చేశావు."     "మా భార్యభర్తలం సవాలక్ష మాట్లాడుకుంటాము చాటుగా వినటం ఏమిటి? మోసం కాకపోతే "అతనికి విషయం అర్ధమయికోపంగా అన్నాడు.     "నాకుకావాల్సిన వాడికోసం నేను చూసు కుంటాను. మోసగాడిని మోసగాడిలా  భావించి మాట్లాడుతున్నానంటే నా గురించి అర్ధం చేసుకో"     "ఎందుకు అర్ధం చేసుకోవాలి! నువ్వు పెద్దమోనగాడివి నాకు బాగా తెలుసు. వేషాలు వేస్తావు రకరకాల మోసాలు చేస్తావు. డబ్బు కోసం ఎంతక్తేనా తెగించేరకానివి. దొంగనీ మోసగాడివి స్మగ్లర్  నీ మళ్ళి మాట్లాడితే  హంతకుడివి."     "గుడ్ గుడ్  నా గురించి బాగానే తెలుసుకున్నావ్ పాపం కాపోతే నిన్ను నివే మరిచిపోయావు."     "ఏమిటి మరిచిపోయేది?"     "గురువింద గింజ గురించి తెలుసా."     "గోడమీద పిల్లివాటంలా మాట్లాడితే నాకు భలే మంట."     "సరే మృగరాజులా  ఎదురుకుంటాను ముందు వివరించనా వద్దా?"     "వద్దంటే మానేసే పని నీ రక్తంలోనే లేదు" కాళిచరణ్ కోపంగా అన్నాడు     "నన్ను  నా గుణాన్ని నా రక్తాన్ని బాగానే స్టడి చేశావు. నిన్ను నేను గుర్తించలేదు నన్ను మాత్రం  బాగా గుర్తించావు. నేనెలా తెలుసు నీకు?" ఇందర్ ఆశ్చర్యం దాచుకుంటూ అడిగాడు.     "ఆ పరమ రహస్యం నీకు చెప్పాలంటే  నివు ఒక్క అబద్దం కూడా ఆడకుండా మొదటినుంచి ఈ ఊరు  ఎందుకు వచ్చింది చెప్పు నివు చెప్పే  నిజాలను బట్టి నేనాపరమ రహస్యాన్ని  బ్తేట పెడతాను."     "నేను లాయర్ నని....     "నని..... కాదు లాయర్ నీ కాదు అని  తెలుసు. నీ గురించి అంతా తెలుసు చూపరులకి అందంగా కానవచ్చే నరాంతక చక్రవర్తిని కాకపోతే ఈ ఊరు ఎందుకు వచ్చవన్నదే తెలియదు."
24,371
     "వూళ్ళోని అయిదుగురు మిత్రులు పక్క వూళ్ళలోని ఐదుగురు మిత్రులు వచ్చారు. వచ్చిన వాళ్ళు డబ్బు గలవాళ్ళే.     వాళ్ళలో కొందరికి కార్లు వున్నాయి. కార్లు వేసుకుని వాళ్ళే నడుపుకుని వంటరిగా వచ్చారు.     శంకర్రావుకి లాటరీలో పాతికవేలు వచ్చినందుకు అతన్ని అభినందిస్తూ తాగారు. తాగుతూ అభినందించారు.     శంకర్రావు ఫుల్ సూట్ లో జానీవాకర్ వళ్ళో పెట్టుకుని తాగుతూ కూర్చున్నాడు.     "పక్కడివీ ఫుల్ బాటిల్ పట్టిస్తున్నావు. చస్తావ్ రోయ్!" అన్నాడు ఓ మిత్రుడు.     "చస్తే చావనీ, నరకానికెళతాను. అక్కడా జయమాలిని లాంటి రంభ-జ్యోతిలక్ష్మి ఊర్వశి-అనూరాధ లాంటి తిలోత్తమ-సిల్కు స్మితలాంటి సిల్కు వుంటారు."     "వాళ్ళ మధ్యలో నేను దొర్లి పొర్లి...." ఆ తర్వాత శంకర్రావు మాట్లాడకుండా తాగుతూ కూర్చున్నాడు.     మిత్రులు నవ్వారు ఖుషీగా.     శంకర్రావు ఆ పూట తాగదల్చుకోలేదు. ఖాళీ జానీవాకర్ బాటిల్లో థమ్సప్ నింపాడు. అది తాగుతున్నాడు అంతే.     తాగితాగి అలసిసొలసి రెండు గంటల తర్వాత అందరూ శరీరంమీద సరిగా బట్టలు లేకుండానే ఎక్కడివాళ్ళు అక్కడపడి వచ్చిన (తెచ్చిన) ఆడవాళ్ళూ అలాగేపడి నిద్రపోతున్నారు.     ఇంటి మొత్తంమీద పక్క శంకర్రావు మాత్రమే మేలుకొని వున్నాడు.     పార్టీలో పాల్గొని నోట్లో వేలువేసుకున్న సందర్భాలు ఇంతవరకూ శంకర్రావుకి ఒక్కసారి కూడా రాలేదు. మందులాంటి విందులో మగువ పొందులో 'నేనే నెంబర్ వన్ నే, నేనే'  అనే శంకర్రావు నిగ్రహంగా చుక్క పుచ్చుకోకుండా వున్నాడంటే ముఖ్యంగా తన యింట్లో పార్టీ యిస్తూ-నిజంగా గ్రేట్!     ఇప్పుడు శంకర్రావు చేయవలసిన పని చాలా వుంది.     వక్కో మిత్రుడి దగ్గరకువెళ్ళి పేరుపెట్టి గట్టిగా పిలిచాడు. తట్టిలేపాడు.     ఎవడూ 'ఊ' అన్న పాపాన పోలేదు. ఆ తర్వాత నెమ్మదిగా బయటికి నడిచి ఇంటి తలుపులు బయట గడియపెట్టాడు.     పార్టీకి వచ్చిన మిత్రులలో నలుగురు కార్లు వేసుకొని వచ్చారు. నాలుగు కార్లు శంకర్రావు కళ్ళకి ముచ్చటగా కనుపించాయి.     ఒకదాన్ని మించి మరొకటి అందంగా వున్నాయి.     శంకర్రావు వకకారుని ఎన్నుకున్నాడు.     ఆ కారు బాబూరావుది.     శంకర్రావు పెరట్లోకి నడిచాడు. మూల దాచిన చెక్క పెట్టెని ఎత్తుకొచ్చాడు.     అది శవం తలకాయ వున్న చెక్కపెట్టె.     బాబూరావు కారు డిక్కీలాక్ చేసిలేదు. శంకర్రావు డిక్కీ తలుపు పైకి ఎత్తి చూశాడు.     డిక్కీ ఖాళీగా వుంది.     శంకర్రావు డిక్కీలో పెట్టెని పెట్టి డిక్కీ మూత వేసి అక్కడే ఆగి కాస్త ఆలోచించాడు.     అప్పుడు అతనికో అయిడియా అద్భుతమైనది వచ్చింది.     శంకర్రావు యింట్లోకి వెళ్ళి బాబూరావు పాంటు జేబులు వెతికాడు.     కారు తాలూక కీస్ కనిపించాయి. తాళం చెవి ఏదో చూసి, తాళం వేశాడు. అక్కడితో వూరుకోక ఆ వక్కతాళం చెవి తాళం చెవుల గుత్తినుంచి వేరుచేసి ఆ చెవిని దూరంగా ఎవరింట్లోనో పడేలా విసిరేశాడు.     ఆ తర్వాత__     శంకర్రావు పిల్లిలా యింట్లోకి వచ్చి బాబూరావు పాంటు జేబులో కీస్ పడేశాడు.     తేలికపడ్డ మనసుతో వాళ్ళమధ్య పడుకొని నిద్రపోయాడు.     తెల్లవారింది.     అందరూ లేచారు. పార్టీ గ్రాండ్ గా యిచ్చినందుకు శంకర్రావుని అభినందించి యింతకన్నా పెద్ద ప్రెయిజుతో లాటరీ రావాలని దీవించి వారివారి యిళ్ళకి బయలుదేరారు.     అందరూ వెళ్ళిపోయారు.    
24,372
                              అరణ్యకాండ     విరాధవధ:     రాముడు దండకారణ్యంలో ప్రవేశించాడు. అక్కడ చక్కని మునిపల్లెలు కనిపించాయి. ప్రతిపర్ణశాలముందు చక్కగా అలికారు. ముగ్గులు పెట్టారు. అక్కడక్కడా కుశలు ఆరపెట్టిఉన్నాయి. ఉతికిన నారబట్టలు ఆరేసి ఉన్నాయి. జంతువులు, పక్షులు ఉల్లాసంగా ఉన్నాయి.     మునిపల్లెలవారు రాముని చూశారు. ఎదురేగారు. తీసుకొనివచ్చారు. పర్ణశాలలో ప్రవేశపెట్టారు. ఆర్ఘ్యపాద్యములు ఇచ్చారు. సత్కరించారు. "రామా! మేము హింస వదిలాం. ఇంద్రియాలను జయించాం. మేము నీకు బిడ్డల్లాంటివాళ్లం. మమ్ము సదారక్షించు" అని ప్రార్థించారు.     రాముడు ఆ రాత్రి అక్కడే గడిపారు. తెల్లవారి లేచాడు. మునులు వద్ద శెలవు తీసుకున్నాడు. బయలుదేరాడు. అలా బయలుదేరినవారు ఒక అరణ్యంలో ప్రవేశించారు. అక్కడ వారికి ఒక రాక్షసుడు కనిపించాడు. అతని పేరు విరాధుడు. అతడు భయంకరాకారుడు - అతడు పులిచర్మం కప్పుకున్నాడు. దానినుంచి రక్తం కారుతూంది. అతని బుజాన శూలం ఉంది. దానికి మూడు సింహాలు, నాలుగు పులులు, రెండు తోడేళ్లు, పది జింకలు, ఒక ఏనుగు గుచ్చి ఉన్నాయి. ఇవన్నీ అతనికి ఫలహారం పైగా ఏ ఆయుధంతోనూ చావకుండా అతనికి వరం ఉంది.     విరాధుడు రామలక్ష్మణులను చూచాడు. గర్జించాడు. అతని గర్జనకు దిక్కులు పిక్కటిల్లాయి. చెట్లమీంచి పిట్టలు లేచిపోయాయి. రొదపెట్టాయి. విరాధుడు సీతను చూచాడు. అందంగా ఉంది. చక్కనిచుక్క. ఆమెను పిట్టను పట్టుకున్నట్లు పట్టుకున్నాడు. అనుభవిస్తానన్నాడు.     రాముడు అది చూచాడు. ప్రళయాగ్నిలా విజృంభించాడు. ఏడు బాణాలు వదిలాడు. అవి విరాధుని శరీరంలోకి దూసుకుపోయాయి. రక్తంలో మునిగి నేలకూలాయి. అవి అగ్నిజ్వాలల్లా ఉన్నాయి. విరాధునికి దెబ్బ తగిలింది. సీతను వదిలాడు. శూలం అందుకున్నాడు. రామలక్ష్మణుల మీదికి వదిలాడు. రామలక్ష్మణులు అనేకబాణాలు ప్రయోగించారు. అవి విరాధునిమీద పనిచేయలేకపోయాయి. అప్పుడు రాముడు వాడి శూలాన్ని కొట్టాడు. అది మేరుపర్వత శిఖరంలా కూలింది. విరాధుడు ఉగ్రుడయ్యాడు. ముందుకు ఉరికి వచ్చాడు. రామలక్ష్మణులను రెండుచేతులతో పట్టుకున్నాడు. బుజాలమీద వేసుకున్నాడు. అడవిలోకి ఉరికాడు. రామలక్ష్మణులు అదను కనిపెట్టారు. విరాధుని రెండుచేతులూ విరిచారు. విరాధుడు కొండకోన కూలినట్లు కూలాడు. అడవి అదిరేట్టు బొబ్బలు పెట్టాడు. అలాపడిపోయినవాణ్ని రామలక్ష్మణులు పొడిచారు. గుద్దారు. నరికారు. అయినా వాడు చావలేదు.      "రామా! నేను తుంబురుణ్ణి. అధికార వర్గంలోవాణ్ణి. రంభను విడిచి వెళ్లలేక నా విధులలో అశ్రద్ధ చేశాను. కుబేరుడు నన్ను శపించాడు. రాక్షసుణ్ణి చేశాడు. 'రాముడు నిన్ను యుద్ధంలో గెలిచినపుడు విముక్తి పొందుతావు' అన్నాడు. నాకు శాపవిముక్తి కలిగింది. నేను స్వర్గానికి వెళ్లిపోతున్నాను. దగ్గరిలోనే శరభంగ ఆశ్రమం ఉంది. అక్కడికి వెళ్లు నీకు శుభం కలుగుతుంది" అని  "గొయ్యి తీసి పూడ్చి పెట్టడం రాక్షసులు ధర్మం. కాబట్టి నన్ను గోతిలో పూడ్చి వెళ్లు" అన్నాడు.     లక్ష్మణుడు పెద్ద గొయ్యి తీశాడు. విరాధుని గోతిలో వేశారు. రాళ్లతో పూడ్చారు. అక్కణ్ణుంచి బయలుదేరారు. ఉత్సాహంగా ముందుకు సాగారు.     మనిషికి చావును మించిన భయంలేదేమో! అతడు దేన్నయినా వదులుకుంటాడు - తనవరకు వస్తే ప్రియాతి ప్రియుల్నూ వదులుకుంటాడు. ముందు తాను తన తరువాతే ఏదయినా.     ఈ మృత్యువును జయించడానికి మనిషి చేస్తున్న ప్రయత్నం ఇంతా అంతాకాదు. ఈ ప్రయత్నం నిరంతరంగా కొనసాగుతున్నది. కొనసాగుతూంది. మానవుడు ఉన్నంతకాలం ఈ ప్రయత్నం సాగుతుంది. అతడు కొంతలో కొంత విజయాన్ని సాధిస్తున్నాడు. మొన్నటిదాకా భయంకరాలు అనుకున్న వ్యాధులు నేడు వైద్యశాస్త్రం చేతిలో కీలుబొమ్మలు అయిపోయాయి. ఆ విధంగా కొంతలో కొంత మృత్యువును జయించాం. మానవుని ఆయుర్ధాయం పెరిగింది. అందులో ఎలాటి సందేహమూ లేదు.     కాని జననమరణ రహస్యాలను అతడు కనుక్కోలేకపోయాడు. పుట్టుటకు క్షణం ముందు మనకు తెలియదు. చావుకు క్షణం తరువాత మనకు తెలియదు. క్షయం ప్రకృతి ధర్మం. కాబట్టి పుట్టినవాడు చావాల్సిందే. చావుకంటే నిశ్చయం అయింది మరొకటి లేదు.     కాలం గడిచిపోతుంది. కాలం బలీయం అయింది. దానిశక్తి మరొకదానికి లేదు. కాలచక్రం పరిభ్రమిస్తుంది. దానికిందపడి సకలం నశిస్తోంది. దానికి అడ్డులేదు. దానిని అడ్డుకున్నవాడూ లేడు.     ప్రకృతి సాంతం పుడ్తుంది. పెరుగుతుంది. నశిస్తుంది. ఇది ప్రకృతి ధర్మం. దీనికి లొంగని శక్తి అంటూ లేదు. ప్రపంచాధిపత్యం సాధించాలనుకున్న వారున్నారు. హిరణ్యాక్ష, హిరణ్యకశిపుల్ను వదిలేయండి. హిట్లరున్నాడు. అతడు సకల ప్రపంచాన్ని తన కాలిబొటన వేలుక్రింద అణచి ఉంచాలనుకున్నాడు. అతడూ చచ్చాడు.     మానవాళి శ్రేయస్సుకోసం తమ జీవితాలను కర్పూరంలా అర్పించిన మహాత్ములున్నారు. బుద్ధుడు, జీసస్ వారికీ మరణం తప్పలేదు. వారందరినీ చూచిన సూర్యుడే మనము చూస్తున్నాము. వారందరూ నివసించిన భూమిమీదనే మనం నివసిస్తున్నాం.     క్షయం ప్రాణులకే కాదు. కొండలు, చెట్లు కోనలకు కూడా వుంది. అవీ మార్పు చెందుతాయి. నశిస్తాయి. దాన్ని మన జీవితకాలంలో చూడలేం.     సూర్యచంద్రాదులూ శాశ్వితులు కారు. వారి శక్తి క్షీణిస్తుందని శాస్త్రజ్ఞులు చెపుతున్నారు. వారు చాలకాలం ఉండగలరు. అంతే వారూ నశించాల్సినవారే. అందుకే "ఇక్బాల్" అంటాడు.     "ప్రకృతి ధర్మమ్మె పరిణామమ్ము సుమ్ము     నశ్వరమ్మగు అందమ్మె వాస్తవమ్ము నమ్ము"     విరాధుడు మనిషి ఆశకు సంకేతం. అతడు ఏ ఆయుధముతోనూ చావకుండా వరం సంపాదించాడు. వరం పుక్కిటి పురాణం కావచ్చు. కాని అది మనిషి ఆశకు సంకేతం. అతని ప్రయత్నం ఫలించలేదు. అతడు బలీయం అయిన కాలానికి లొంగాడు. కాలం అతణ్ణి కబళించింది.     అగ్నిలాంటిది ఆయుధం:     రాముడు శరభంగుని ఆశ్రమానికి చేరాడు. అక్కడికి ఇంద్రుడు వచ్చాడు. ఇంద్రుడు నేలను తాకకుండా నిలిచి ఉన్నాడు. అతడు శరభంగునితో మాట్లాడుతున్నాడు. రాముడు వస్తున్నాడని అతనికి తెలిసింది. రావణ సంహారం తరవాతనే రాముని చూస్తానన్నాడు. ఇంద్రుడు వెళ్లిపోయాడు.     సీతా, రామ, లక్ష్మణులు శరభంగుని దర్శించుకున్నాడు. నమస్కరించారు. మహర్షి వారిని సత్కరించాడు. "రామా! నా తపస్సుకు మెచ్చి నన్ను బ్రహ్మలోకానికి తీసికెళ్లడానికి ఇంద్రుడు వచ్చాడు. అయినా నిన్ను దర్శించుకోవాలని నిలిచిపోయాను. ఇహ నేను శరీరాన్ని విడిచివేస్తాను. ఈ అడవిలోనే సుతీక్షుడు అనే రుషి ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్లు. నీకు ఉండటానికి తగిన ప్రదేశం చూపిస్తాడు" అని సుతీక్షుణ్ణి ఆశ్రమానికి దారి చూపించాడు.
24,373
        ఆ మాటలకు ఆశ్చర్యపోవడం మయూష వంతయింది. రెండు క్షణాలు సేపు బాధగా నిలబడిపోయింది.         "కనీసం కుక్కకయినా నేను అన్నం పెట్టొచ్చా?"         ఆ ప్రశ్నకు రాధమ్మ బదులివ్వడంలేదు. చైన్ తో కుక్కను లాగుతూ కిందకు వెళ్ళిపోయింది. మెట్టు దిగుతూ జిమ్మీ తల తిప్పి మయూష వేపు చూసింది.                                                *    *    *    *         రాత్రి ఎనిమిది గంటలు దాటింది.         ట్రింగ్ ట్రింగ్ మని ఫోన్ మోగుతుంటే ఆశ్చర్యంగా రూమ్ లో ఒక మూలనున్న ఫోన్ వేపు చూసింది మయూష.         ఆ ఫోన్ చచ్చినా పనిచేయదని జ్వాలాముఖిరావు చెప్పాడే......ఇప్పుడెలా మోగుతోంది?         రెండు నిమిషాల తర్వాత రిసీవర్ అందుకుని "హలో" అంది మయూష.         చిన్న నవ్వు వినిపించింది ఫోన్ లో మయూషకు.         "మొగదని చెప్పిన ఫోన్ ఎలా మోగుతోందనుకుంటున్నావ్ ఈ ఫోన్ నీకు పనిచెయ్యదు నాకు మాత్రమే పనిచేస్తుంది. బైదిబై బోరు కొడుతోందా సహజమే గదా. పెళ్ళయిన వయసులో వున్న నీలాంటి బ్యూటీఫుల్ యంగ్ లేడీ ఈ టైమ్ లో ఒంటరిగా ఉండడం చాలా బాధాకరం కదూ."         ఆ మాటలకు భారంగా నిట్టూర్చింది మయూష. ఫోన్ రిసీవర్ని పక్కన పెట్టేద్దామనుకుంది.         "రిసీవర్ పెట్టేద్దామానుకుంటున్నావ్ గదూ. నువ్వు రిసీవర్ ని పక్కన పెట్టేసి నా నా మాటలు నీకు వినబడే ఏర్పాటు ఆ ఫోన్ లో వుంది. అంచేత నేను చెప్పేది విను.         ఒక పది నిమిషాల్లో నువ్వు అందంగా తయారై కిందికొస్తావు నీ కోసం అక్కడ బ్రౌన్ కలర్ కంటెస్సా కారు ఆగి ఉంటుంది. ఆ కారులో కూర్చో తర్వాత కారు డ్రయివర్ నిన్ను ఎక్కడకు తీసికెళ్ళాలో అక్కడకు తీసికెళతాడు."         "ఎక్కడికి?" విసురుగా అడిగింది మయూష.     "వచ్చాక నువ్వే చూస్తావుగా"         "రాకపోతే"         "భర్త పిలిచాక ఏ భార్యా రాకుండా ఉండదు. ఎందుకంటే ఆడా మగా కలయికలో వున్న సుఖం కోసమే గదా పెళ్ళిళ్ళు జరిగేవి. నీ కోసం ఎదురు చూస్తుంటాను. ఇంకో విషయం. నువ్వు కారులోంచి తప్పించుకుని వెళ్ళిపోవాలనుకున్నావనుకో నిర్దాక్షిణ్యంగా డ్రయివర్ నిన్ను చంపేస్తాడు గుర్తుంచుకో ఒకే" ఫోన్ కట్ అయింది.         వీడు మనిషా రాక్షసుడా? ఆలోచిస్తూనే రెండు నిమిషాలు గడిపేసింది మయూష.         ఆడా, మగా కలయికలో సుఖం కోసమే గదా పెళ్ళిళ్ళు జరిగేవి జ్వాలాముఖిరావు మాటలే గుర్తుకొస్తున్నాయి ఆమెకు. అంటే త్ననతో ఏకాంతంగా ఎంజాయ్ చేస్తాడా? తను ఒప్పుకోదుగా అయినా అలాంటప్పుడు ఇక్కడికి రాకుండా ఎక్కడికో తనని రమ్మనడం ఎందుకు?         పది నిమిషాలు గడిచిపోయాయి.         వెళ్ళాలా? వెళ్ళకూడదా? సందిగ్ధావస్థలో కొట్టు మిట్టాడిన మయూష జ్వాలాముఖిరావు మనస్తత్వాన్ని అన్ని యాంగిల్స్ లోంచీ పరిశీలించాక ఆలోచనతో గబగబా తయారయిపోయి మెట్లు దిగింది.         ఈ నెపంతోనయినా కన్పించినంత మేరకు ఊరు చూడొచ్చునని అనుకుందామె.                                                   *    *    *    *         కారు డోర్ తెరచుకుని కూర్చుంది మయూష.         డ్రయివర్ మర మనిషిలా కారుని స్టార్ట్ చేసాడు.         అయిదు నిమిషాలు గడిచాక, కారు శ్రీనగర్ కాలనీ పార్కు దగ్గర మలుపు తిరిగింది.         "ఎక్కడకు వెళుతున్నాం మనం?" మయూష ప్రశ్నకు జవాబు రాలేదు. కారు మరో ఇరవై అయిదు నిమిషాల తర్వాత కోఠీ మార్కెట్ రోడ్డు దగ్గర స్లో అయింది. దానిక్కారణం ట్రాఫిక్ రద్దీగా ఉండడమే! తల పక్కకు తిప్పి రోడ్డు మీద పోతున్న మనుషుల్ని చూస్తోందామె. సరిగ్గా అప్పుడు పోలీస్ ఐలాండ్ కు కొంచెం దూరంలో స్కూటర్ మీద అన్నయ్య శర్మ కనబడడంతో ఒక్కసారి సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయిందామె.         "అన్నయ్యా....." గట్టిగా కేకేసింది. ఆ పిలుపుకి డ్రయివర్ ఆశ్చర్యంగా తల తిప్పి వెనక్కి చూసి చటుక్కున గేరు మార్చాడు. మార్కెట్ దాటి కారు ముందుకెళ్ళిపోతుండగా అప్పుడు గుర్తుకొచ్చింది మయూషకు కారు డోర్స్ క్లోజ్ చేసి వున్న విషయం.         ఆ గ్లాస్ డోర్ ని ఓపెన్ చేయడానికి ప్రయత్నించి విఫలమై పోయింది కనురెప్పల్ని కన్నీళ్ళు చుట్టూ ముడుతుండగా__         డ్రయివర్ ఒక్కసారి కారాపగలవా మా అన్నయ్య....మా అన్నయ్య...." బొంగురుపోతున్న గొంతుతో అడిగింది.         డ్రయివర్ మాట్లాడలేదు.         మయూషకు ఉప్పెనలా దుఃఖం పొంగుకొచ్చింది భోరుమని ఏడ్చేసింది. అయినా డ్రయివర్ తల తిప్పయినా చూడలేదు.                                                   *    *    *    *         దిల్ షుక్ నగర్ ఏరియాలోకి కారు ప్రవేశించింది. ఎమ్.ఐ.జి. క్వార్టర్స్ దాటి సంపూర్ణథియేటర్ దాటాక సిమ్మెంట్ రోడ్డుకి ఎడమ ప్రక్కన ఉన్న విశాలమైన బిల్డింగు పోర్టికోలో కారాగింది.         తన సీట్లోంచి లేచి కిందకు దిగి బ్యాక్ డోర్ ని తీసి పట్టుకున్నాడు డ్రయివర్ దిగమన్నట్టుగా-         కారు దిగి అటూ ఇటూ చూసింది మయూష.         నిశ్శబ్దంలో, ఏకాంతంలో పుచ్చపువ్వుల్లా మెరుస్తున్న నియాస్ లైట్ల వెలుగులో తాజ్ మహల్లా మెరిసిపోతున్న ఆ బిల్డింగులోకి అడుగు పెట్టిందామె. ఇక్కడేదో బిజినెస్ పీపుల్ పార్టీ జరుగుతుందేమో. ఆ పార్టీలోని బిజినెస్ ఫ్రెండ్స్ కు తనని జ్వాలాముఖిరావు పరిచయం చేస్తాడేమో! తను సాధించిన ఘన విజయాన్ని అందరి ముందూ ప్రదర్శించుకోవాలనే తాపత్రయమేమో!         రకరకాలుగా ఆలోచిస్తూ దగ్గరగా వేసున్న డోర్ తెరచుకుని హాల్ దాటి లోనికి పోబోయిన మయూష ఎడమ వేపు కనిపించిన దృశ్యానికి బిక్కచచ్చిపోయి సిగ్గిల్లిపోయి, మ్రాన్పడిపోయి నిలబడి పోయింది.         ఎడమవేపున ఓ గ్లాస్ రూమ్ మధ్యన అతి ఖరీదైన డబుల్ కాట్ బెడ్ ఆ బెడ్ మీద వంటి మీద కనీసం నూలుపోగైనా లేకుండా ఆడా, మగ - ఆ మగవ్యక్తిని చప్పున గుర్తుపట్టిందామె అతను జ్వాలాముఖిరావు.         ఇద్దరూ ఈ ప్రపంచాన్ని పట్టించుకోని దశలో ప్రణాయవస్థలో ఉన్నారు. చప్పున కళ్ళు మూసుకుంది మయూష.         ఇంత పశువా జ్వాలాముఖిరావు? నడిరోడ్డు మీద జంతువులా? మనసులో అనుకుంటూ వెనుతిరగడానికి ఉద్యుక్తురాలై ఒక్కడుగు వెనక్కి వేసింది.         "హలో....వెయిట్ ఏ మినిట్......బేబీ.....ఇంత దూరం నిన్నెందుకు రప్పించానో తెలుసా....ఇందుకే....ఈ జ్వాలాముఖిరావుకి మగతనం లేదని, నువ్వూహించుకొని ఉండొచ్చు గదా.....ణా మగతనం పదును నువ్వు ప్రత్యక్షంగా చూడాలన్నదే నా కోరిక.....భాష, దృశ్యం....ఈ నా ప్రపంచం.....అంతా పచ్చిగా ఉంది కదూ.....తప్పదు బేబీ.....             నీకివ్వాల్సిన సెక్స్ సుఖాన్ని డబ్బిచ్చి మరీ ఇంకొకరి కిస్తున్నాను. "ఎందుకో తెలుసా?" ఆయాసంతో రెండు నిమిషాలు మాట్లాడలేదు జ్వాలాముఖిరావు.         "నౌ యు కెన్ గో" అని ఆ అమ్మాయితో చెప్పి నైట్ డ్రస్ వేసుకుని ఆ గ్లాస్ రూమ్ లోంచి బయటికొచ్చి మయూష ఎదురుగా నుంచున్నాడు.
24,374
             నవ్వింది. దాసు అయితే నిన్న, ఈరోజు ట్రాక్టర్ కి రాలేదు. పని అపడం ఇష్టంలేక- అరవా కొరవా వచ్చిన వెంకటేశుని డ్రైవర్ గా ఎక్కించాడు.     దాసూవల్ల తనకేమైనా అపాయం వస్తుందన్న భయం అతనికి లేదు. దాసు ఏమయినా చెప్తే ఉమని చెయ్యెచ్చు. అమె బెంబేలుపడి తనను ఇంటికి రావద్దనవచ్చు. తనతో ఏర్పడిన సంబంధాన్ని తెంచుకోవచ్చు. అలా జరిగితే తనకు ఉమ దూరమైపోతుంది. ఇది తను భరించలేడు. అందుకే దాసు భార్యని ఏమైనా అంటాడేమోనని గోపాల్రావు కంగారుపడిపోతున్నాడు. మొదట ఆ విషయం వూరంతా తెలిసిపోయిందని అనిపించినప్పుడు గోపాల్రావు కాంచనమాలను తలచుకుని భయపడ్డాడు. అమె ఉగ్రరూపం ఎత్తుతుందేమోనని కంగారుపడ్డాడు.     కానీ విచిత్రంగా అమె ఏమీ అనలేదు. ఇదంతా తనకు తెలియనట్టు నటించలేదు. తనకు  అంతా తెలుసునని, అయితే దీనికి తను ఏమీ ఫీల్ అవడంలేదని తన ప్రవర్తనతో చెప్పింది. ఇన్ డైరెక్టుగా తెలిసేటట్టు మాట్లాడింది.     రేయ్- నీలాంటివాడు ఎలాపోతే నాకేమిట్రా- ప్రేమిస్తూ వుంటే నావాడు నాకు కాకుండా పోయాడన్న బాదా బెంగా వుంటుంది. కానీ నీమీద నాకలాంటి ప్రేమలూ, అభిమానాలూ లేవు. కాబట్టి నీ ఇష్టం వచ్చిన ఇంటికి వెళ్ళు. నాకు ఏ భాధాలేదు. పైపెచ్చు ఏ రాత్రో నా దగ్గరికి ఆ అవసరం తీర్చుకోవడానకి రానందుకు ఆనందంగా వుంది"అన్నట్టు ప్రవర్తించేది కాంచన.     దీంతో గోపాల్రావు మరింత దూరమయ్యాడు అమెకి.     దీన్ని కూడా అవమానం కిందే ఫీలయ్యాడు   అతను. భార్యని ఉడికించటానికి, కసి తీర్చుకోవడానికి మరింత ఇంట్రెస్టింగ్ గా ఉమ దగ్గరికి వెళ్ళేవాడు గోపాల్రావు. దీంతో ఉమ అతనికి వ్యసనం కిందమారి పోయింది. అందుకే రెండు రోజులుగా ఉమ దగ్గరకెళ్ళికపోవడం ఏదో వెలితిగా వుంది.     గోపాలరావు స్కూటర్ మెయిన్ రోడ్డుమీద నుంచి వూర్లోకి మలుపు తిరిగింది. అతని మనసు కూడా ఉమవేపు తిరిగింది. దాసుకి విషయం తెలిసిపోయిందనిపించగానే అతను  ఉమను ఏమన్నాడో తెలుసుకోవాలని వుంది. ఈ సమయంలో  తను వెళ్ళకూడదని నిన్నరాత్రి వెళ్ళలేదు. ఉదయం ఏమీ తెలియనట్టు వెళ్ళాలనుకున్నాడుగాని వెంకటేశువచ్చి దాసు రావడంలేదని చెప్పాడు. విషయం తెలిసి వెళ్ళడం బావోలేదని మానేశాడు.     మొన్న రాత్రి ఇలాంటి ఇబ్బందులు ఏమీ లేవుగాని మరీ అలస్యం కావడంతో వెళ్ళలేదు.     వూరు సమీపిస్తున్న కొద్ది  అతని మనసు ఉమవేపు లాగుతోంది. ఇలాంటి సమయంలో వెళ్ళకపోవడం పిరికితనంగా , మోసంగా అనిపించింది. వెళ్ళడానికే నిర్ణయించుకున్నాడు. అలా అనుకోగానే స్కూటర్ పక్కగా అపాడు. ముందున్న డిక్కి తెరిచాడు.     కోక్ కలిపిన మందు బాటిల్ వుంది చెక్ పోస్ట్ లో తాగేంత తీరిబడి నిదానం మనసుకి లేకుండా పోయింది. ఏదో రెండు గుక్కల్లో పూర్తిచేయాలనిపించింది అందుకే బాటిల్ లో కలుపుకొచ్చాడు.     బాటిల్లో ఉన్నదంతా కొట్టేయడంతో కాస్తంత ఉత్సాహం వచ్చింది. సిగరెట్ వెలిగించాడు. సిగరెట్ అయిపోయేటప్పటికి కిక్కు కూడా ఎక్కింది. కొత్త ధైర్యం వచ్చింది. మెల్లగా స్కూటర్ పోనిచ్చాడు.     ఇల్లు దగ్గరపడుతున్న కొద్ది టెన్షన్ ఎక్కువైంది. ఉమ  ఇంట్లో పరిస్ధితులు ఎలా వున్నాయో. తెలియడంలేదు. అంతా తనకు అనుకూలంగా వుండాలని అతను వేయి దేవుళ్ళకు మొక్కుకున్నాడు. ఉమ సాన్నిహిత్యానికి అంతగా అలవాటుపడ్డాడు అతను.     ఇల్లు సమీపించింది. ఓ క్షణం మనసు మారింది. నేరుగా వెళ్లిపోదామనుకున్నాడు. ఇల్లు కనపడగానే తిరిగి మనసు పీకింది. ఏదో మొండి ధైర్యం వచ్చింది. దాసు వుంటే ఏదో అబద్దం చెప్పాలని , ఏం చెబితే కరెక్టుగా  అతికినట్టు వుంటుందో అలోచించాడు.     ఇల్లు వచ్చేటప్పటికి స్కూటర్  కూడా దానిష్టంగానే అగిపోయింది. ఓ పక్కగా నిలిపాడు.     వీధి అప్పుడే నిర్మానుష్యంగా వుంది. టైమ్ పదిగంటలపైనే అయినట్టుంది. అంగట్లో కూడా దీపాలు లేవు. ఏదో కుంటికుక్క మాత్రం వాచ్ మేన్ కింద కుదిరిపోయినట్టు అటూ ఇటూ తిరుగుతోంది.     ఆకాశం నిర్మలంగా నీలం గాజుముక్కలా వుంది. మబ్బులసంత జరుగుతున్నట్టు ఓ మూలగా మబ్బులు క్రిక్కిరిసి వున్నాయి. కూజాను వంచినట్టు చంద్రవంక ఓ పక్కకి వాలిపోయింది.     ఇదంతా గమనించే స్థితిలో లేడు గోపాల్రావు.     మెల్లగా లోపలికి అడుగులేశాడు. ఎప్పుడైతే స్కూటర్ ఆగిందో, వచ్చింది ఎవరో తెలిసిపోయింది ఉమకి. గోపాల్రావు వస్తున్నాడని అనుకోగానే తెలియకుండానే ఒళ్ళంతా చెమటలు పట్టేశాయామెకి.     ఇప్పుడేం చేయాలి? దాసు మనసు ఏమిటో తెలియదు. నిన్న వెళ్ళిన వ్యక్తి యింకా తిరిగిరాలేదు. ఎక్కడికెళ్ళాడో తెలియడంలేదు. అయితే ఇవన్నీ ముందు ముందు వస్తాయని ఊహించడంవల్ల ఆమె అదనంగా ఏ టెన్షనూ పడడంలేదు. ఒకవేళ దాసు ఒప్పుకోకపోతే, విడిపోయి గోపాల్రావు ఉంపుడుకత్తెలా వుండటానికి ఆమె ఎప్పుడో సిద్ధపడిపోయింది.     మహాపతివ్రత అనిపించుకుంటూ దరిద్రంలో బతకడం కన్నా గోపాల్రావుకి ఉంపుడుకత్తెగా వుంటూ సదుపాయంగా బతకడమే మంచిదని ఆమెకి తెలుసు. ఈ సంబంధానికి ఒప్పుకోకపోతే దాసుతో క్షణమైనా కలిసి వుండడం ఆమెకి ఇష్టంలేదు. అయితే దాసు రాజీపడిపోతే కుటుంబపు నీడలోనే వుంటూ, తనూ, తన భర్తా, తమ బిడ్డా హాయిగా వుండొచ్చు, పేచీలేదప్పుడు.     కానీ దాసు నిర్ణయం ఏమిటో తెలియదు. తను చెప్పదలుచుకున్న దంతా చెప్పింది. నిన్న రాత్రనగా వెళ్ళాడు. ఇంతవరకూ రాలేదు. ఏమైపోయాడో? కొంపదీసి తనను వదిలేశాడా? ఏ విషయమూ తెలియదు.     ఉమ అప్పటికప్పుడే సర్దుకుంది. తను భయపడుతున్నట్టు గోపాల్రావుకి తెలియకూడదు. తనకోసం ఎన్ని కష్టాలకయినా సిద్ధపడ్డట్టు అభిప్రాయం కలిగించాలి.     అలా అనుకోవడంతోనే ఆమె టెన్షన్ తగ్గింది. ఆందోళన పోయింది. మనసును అదుపులో పెట్టుకుని ముఖానికంతా నవ్వును పూసుకుంది.     గోపాల్రావు బయటే ఆగిపోయాడు. ఒక్కక్షణం ఎవర్ని పిలవాలో ఆయనకి అర్ధంకాలేదు. లోపల పరిస్థితులేమిటో తెలియడంలేదు.     ఆరుబయట నిలబడ్డా చెమటలు పట్టేశాయి. గొంతు తడారిపోయినట్టు అనిపించింది.     నాలుక గడ్డకట్టుకుపోయినట్టు మాట పెగలటం లేదు. చివరికి ధైర్యం తెచ్చుకున్నాడు.     "దాసూ....దాసూ!" అని నెమ్మదిగా పిలిచాడు.     గోపాల్రావు వచ్చాడని తెలిసీ అతను అలా పిలిచేటప్పటికి ఉమ ఉలిక్కిపడింది.     "ఆఁ వస్తున్నా" అంటూ వచ్చింది.     అతన్ని చూడగానే తలుపు దగ్గర ఆగిపోయింది. జీవితంలో ఎప్పుడో తప్పిపోయి, ఇప్పుడే కలుసుకున్నట్టు ఒకరికొకరు పరిసరాలు మరిచి చూసుకున్నారు.     "రండి" ఉమ మొదట తేరుకుని లోపలికి ఆహ్వానించింది.     ఆమె ఎదురుగా నిలబడి పిలుస్తుంటే ఎలాంటి భయాలూ, సందేహాలూ కలగలేదు గోపాల్రావుకి. అంతగా కదిలిపోయాడు అతను.
24,375
    అది వింటూనే డాక్టర్ అదోలా నవ్వాడు.         ఆ నవ్వు చూడగానే విమల ముఖం వివర్ణమైంది.         "కృష్ణ అంత తెలివితక్కువవాడు కాదేమో? నువ్వు మోనా తల్లివి అన్నంతమాత్రాన నమ్ముతాడా? ఇది సుధకోసం నువ్వాడుతున్న నాటకం అని అర్ధంచేసుకోడా?"         "అయితే మరెందుకు నన్ను మోనా తల్లిగా....?"         "తల్లివిగనుక!"         "డాక్టర్!"         సూటిగా తుపాకి గుండు ఆమె గుండెల్లోకి దూసుకొనిపోయినట్టు ఐంది.         అతడిముందునుంచి లేవాలని ప్రయత్నించింది.         కానీ లేవలేకపోయింది.         "నువ్వు డాక్టర్ వు కావు. పిచ్చాసుపత్రినుంచి పారిపోయి వచ్చిన పిచ్చివాడివి. ఇక్కడి అసలు డాక్టర్ ని చంపేసి డాక్టర్లా నాటకమాడుతున్నావు. కమీషనరుగార్కి ఇప్పుడే ఫోన్ చేస్తాను."         "ఓ.కె. గో ఎహెడ్!"         ఫోన్ పైనుంచి రిసీవరెత్తి విమల చేతిలోకి అందించాడు హేమచంద్ర.         విమల చేతులు వణికాయి.         ఆమె ఒళ్ళంతా ముచ్చెమటలు పోశాయి.         "ఊఁ ఆగావేం? ఫోన్ చెయ్యి మరి?" ఆమె ముఖంలోకి తీవ్రంగా చూస్తూ అన్నాడు డాక్టర్.         రిసీవరు అలాగే పట్టుకొని అతడికేసి చూస్తూ కొయ్యబొమ్మలా ఉండిపోయింది విమల.         "పెళ్ళికాకుండా బిడ్డను కనడం సంఘం దృష్టిలో నేరమైనా చట్టం దృష్టిలో నేరంకాదు. కానీ మంచివాడిని పిచ్చివాడని రుజువు చెయ్యడానికి ప్రయత్నించడం, ఒక నిర్దోషిపై హత్యానేరం మోపడం చట్టం దృష్టిలో నేరమౌతుందని నీకు తెలుసునా మిస్ విమలాచౌదరీ?"         డాక్టర్ కంఠం స్పుటంగా, కంచుగంటలా మోగింది.         తడిసిన గువ్వలా ఐపోయింది విమల.         కొద్దిక్షణాలు ఊపిరాడలేదు.         గుండె కొట్టుకోవడం ఆగిపోయిందేమో అన్నట్టుగా ఉంది.         ఆమె ముఖం చూస్తున్న హేమచంద్రకు మరుక్షణంలో ఆమె ఏమైపోతుందోనన్న భయం కలిగింది.         "మిస్ విమలా! కంగారుపడకు. ప్రశాంతంగా ఆలోచించు. ఇదంతా మీ సుధక్కకోసమే! ఆమె భర్తలోనున్న ద్వంద్వ వ్యక్తిత్వాలను సరిచెయ్యాలి. జగన్మోహన్ రావును శాశ్వతంగా రూపుమాపాలి. కృష్ణను మాత్రమే మిగిల్చి సుధదగ్గిరకు చేర్చాలి. ఆ ప్రయత్నంలోనే నీ సహాయాన్ని కోరాను. కానీ నువ్వు సహకరించడానికి పైకి అంగీకరించినట్టు కన్పించినా అంతరాంతరాల్లో వ్యతిరేకిస్తున్నావు, అవునా?"         విమల తల పైకీ కిందకూ ఆడించింది.         మౌనంగా అతడికేసి చూసింది.         "నీ మానసిక అంగీకారాన్ని పొందడానికే నేను ఇదంతా చెయ్యాల్సివస్తోంది."         ముసురుపట్టిన ఆకాశం తెరిచినట్టుగా ఐంది ఆమెకు మనసులో.         తెప్పరించుకొని, తలెత్తి డాక్టర్ ముఖంలోకి చూసింది.         "డాక్టర్ మీరు నన్ను హిప్నటైజ్ చేశారుగదూ?"         "నిన్నా? ఇంపాజిబుల్! నీలాంటి మనస్తత్వంగలవాళ్ళను హిప్నటైజ్ చెయ్యడం అసంభవం? అందుకే ఈ మార్గాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది. అది నీకే ఒకందుకు మంచిదయింది. హిప్నటైజ్ చేస్తే నీతో ఎన్నో చెప్పించాల్సి ఉండేది."         "డాక్టర్ దయాసాగరు నిజంగా మద్రాసునుంచి ఫోన్ చేశాడా?" ఆమె కంఠం కంపించింది.         "అంతేకాదు. మీ పాప మోనాను స్వయంగా చూశాడు. కన్నతల్లివి నువ్వెన్నిసార్లు చూశావో మరి!"         ఆమాట వింటూనే రెండుచేతులతో ముఖం దాచుకొని బోరుమంది విమల.         వెక్కి వెక్కి ఏడ్చింది మిస్ విమలాచౌదరి.         కుమిలి కుమిలి ఏడ్చింది ఎయిరుహోస్టెస్ విమలాచౌదరి.         ఐదునిముషాలపాటు ఆమెకేసి మౌనంగా చూస్తూ కూర్చున్నాడు డాక్టర్.         ఆమెలోని మొండితనం మంచుముక్కలా కరిగిపోవడం కళ్ళారా చూశాడు.         ఆమె మనసులోని లోహపుకవాటాలు తెరుచుకొన్న చప్పుళ్ళ చెవులారా వినగలిగాడు.         మెల్లగా లేచి ఆమె పక్కగా వచ్చి నిలబడ్డాడు.         ఆమె తలపై చేయివేసి మృదువుగా నిమిరాడు.         అతని స్పర్శకు ఆమె కరిగిపోయింది.         "విమలా ఊరుకో! నువ్వింతగా బాధపడాల్సిందేమీ లేదు."         "లేదు డాక్టర్? లేదు! నాకింత విషమిచ్చి చంపెయ్యండి. నేను ఇహ ఎవరి ముఖం చూడలేను తలెత్తి."         "నువ్వింత పిరికిదానివని నేననుకోలేదు."         "పెళ్ళికాకముందే బిడ్డను కన్నతల్లికి ఈ సమాజంలో లభించే స్థానమేమిటో మీకు తెలియదా డాక్టరు? ఎవరిదాకో ఎందుకూ, మా నాన్నే నన్ను కన్నెత్తి చూడడు. డాక్టర్ నేనిక బ్రతకడం వ్యర్ధం, నాకు నిజంగానే ఏదోఒకటి ఇవ్వండి." ఆమె కంఠం దుఃఖంతో పూడిపోయింది.         "పిచ్చిపిల్లా! పాపకోసమైనా నువ్వు బతకాలి!"         "తల్లిగా నా కర్తవ్యాన్ని ఎప్పుడో మర్చిపోయాను. మాతృత్వానికే తీరని కళంకం నావల్ల కలిగింది."         "అది నీ తప్పుకాదు. ఏ తల్లయినా ఆ పరిస్థితుల్లో అంతకంటే చెయ్యగలిగిందేమీ లేదు. మన సమాజపు విలువలు ఇలా ఉన్నంతకాలం ఏ ఆడపిల్లకయినా ఈ దుస్థితి తప్పదు. అవును! ఒకటి అడగటం మరిచాను-జాన్సన్ ఇంకా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడా?"         విమల చివాలున తలెత్తి చూసింది.         కొరడాతో వీపుపైన కొట్టినట్టుగా చూసింది.         "ఆ అనుమానం ఎందుకొచ్చింది డాక్టర్?"         "నా ప్రశ్నలో అనుమానంలేదు."         "మరి?"         "విషయం తెలుసుకుందామనే కోతూహలం-అంతే!"         "ప్రేమిస్తూనే వున్నాడు. వాస్తవానికి పెళ్ళిచేసుకుందామని అతనే తొందరపెడుతున్నాడు."         "ఇదింకా బాగుంది! మరి నువ్వెందుకు అంగీకరించడంలేదో నాకు అర్ధంకావడంలేదు" అంటూ జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి తలగోక్కున్నాడు.         "జాన్సన్ పై నీకు మోజుతీరిపోయిందా?" సూటిగా చూస్తూ మళ్ళీ అడిగాడు.         "చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు డాక్టర్! నేను జాన్సన్ ను మనసారా ప్రేమిస్తున్నాను. క్రిస్టియన్ తో వివాహం మా అమ్మా, నాన్న అంగీకరించరనే భయంకొద్దీ పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతున్నాం డాక్టర్. అంతేగాని...."         "ఐ డోంట్ బిలీవిట్! అదొక్కటే కారణమంటే నేను నమ్మను."         విమల ముఖం వెల వెలా పోయింది.         "చెప్పు విమలా! మీ అన్నలాంటివాడిగా భావించు. మీ నాన్నగారితో నేను మాట్లాడి వివాహ్జం జరిపిస్తాను."         విమల కళ్ళు ఆర్ద్రమైనాయి.         కృతజ్ఞతా భారంతో కనురెప్పలు వాలిపోయాయి.         తలెత్తి అతడికేసి చూసింది.         "ఎయిర్ హోస్టెస్ గా నాకు ఇంకా కొంతకాలం ఉద్యోగం చెయ్యాలని వుంది. మీకు తెలుసుగా డాక్టర్ ఎయిర్ హోస్టెస్ గా పెళ్ళిచేసుకుంటే ఉద్యోగం మానెయ్యాల్సి ఉంటుంది. ఇండియన్ ఎయిర్ లైన్సునుంచి ఎయిరు ఇండియాకు వెళ్ళాలనుంది. ఎయిర్ ఇండియా సర్వీస్ లో చేరి దేశాలు తిరగాలనుంది. ఒకటి రెండేళ్ళు ఎయిర్ ఇండియాలో పనిచేసి, ఆ తర్వాత ఉద్యోగం మానేసి పెళ్ళిచేసుకుందామనుకుంటున్నాను."         "ఓ! ఐసీ! నీ సమస్యేమిటో నాకిప్పుడు అర్ధమైంది." నిట్టూర్చాడు డాక్టర్.         తలమీదినుంచి పెద్ద బరువు దిగిపోయినట్టుగా ఉందతనికి.         "డాక్టర్! మోనా తల్లిని నేనేనని మీకెలా తెలిసింది! కృష్ణ చెప్పాడా?"         "కృష్ణా? అతనికీ సంగతి తెలుసా?" డాక్టర్ ఆశ్చర్యంగా అడిగాడు.         "తెలియదు. జాన్సన్ ఎవరో కృష్ణకు తెలియదు. వీళ్ళిద్దరూ మొదటిసారి హైదరాబాద్ ఎయిర్ పోర్టులోనే కలుసుకొనే అవకాశం కలిగింది. ఆరోజు జాన్సన్ విమానం నడిపాడు. వాళ్ళిద్దరినీ పరిచయంచేసినట్టు కూడా నాకు గుర్తులేదు. అప్పటికి కృష్ణను నేనే చూడలేదు. అతను మా సుధ భర్తని నాకు తెలియదు. విమానంలో నన్నుచూసి అతడే ఏదో మాట్లాడాడు అంతే!"
24,376
    అతనికి  వొగర్పు  వొస్తోంది. కసి, ఉన్మాదం, ఉక్రోషం. వీటి సమ్మేళనంతో  మనిషి  ఉడికి పోతున్నాడు.     విశ్రాంతి  తీసుకోవడం  అనట్టుగా  ఒక్క క్షణం  ఆగాడు.     ఉన్నట్టుండి  తలుపు  కదిలినట్లయింది. యోగి  షాక్ తిన్నట్లయి  కొంచెం  వెనక్కి  జరిగాడు.     గభాల్న  తలుపు  తెరుచుకుంది.     యోగి నిశ్చేష్టుడై  చూస్తున్నాడు.     గదిలో  అతనికి కొన్ని అడుగుల  దూరంలో  ప్రజ్ఞ  నిలబడి వుంది.     ఆమె ఇప్పుడంధురాలిలా  లేదు.     కసిగా, క్రోధంగా, ఉద్రేకంగా  అతని వంక  చూస్తోంది. ఆమె కళ్ళు నిప్పులు  కురుస్తున్నాయి.     ఆమె ఎడమచేతి  బొటన వ్రేలునుంచి  చిన్న నెత్తుటి బొట్టు  చిమ్ముతున్న  విషయమతను  గమనించలేదు.     "యోగీ" అంది. ఆమె కంఠం ఖంగుమని  మ్రోగింది.     "నువ్విప్పుడు  చావుకు  కొన్ని క్షణాల దూరంలో  వున్నావు. ప్రపంచంలోని  ఏ శక్తీ  ఇప్పుడు నిన్ను నా నుంచి  ర ...క్షించలేదు. నిన్ను తరమటం  ఇపుడు ఇహ నా వంతు."     యోగి అలాగే  నిర్ఘాంతపోయి  చూస్తున్నాడు. ఆ కళ్ళు ...ఆ చూపు ...     "ఏమిటలా  చూస్తున్నావు ? మీరందరూ  అనుకున్నట్టు  నేనంధురాల్ని  కాదు యోగీ! మీ అందరి కంటె  చక్కగా  చూడగలను."     అతని వైపు  ఓ అడుగు  వేసింది.     "గంగాధరాన్ని. ప్రతాప్ ని చంపినట్లు  నిన్నెలా  చంపుతానో చూడు."     చేతులు  రెండూ  నిటారుగా  ముందుకు  సాచింది. పదునుగా  ఉన్న  పది గోళ్ళమీద  ఒక్కొక్క  వ్రేలికి  ఒక్కొక్కటి  చొప్పున  నెత్తుటి బొట్లు మెరుస్తున్నాయి.                                               38     యోగి భయంతో  విచలితుడై  ఒక అడుగు వెనక్కి  వేశాడు. అతని చేతిలోని  యినప కుర్చీ  అప్రయత్నంగా  జారి క్రింద  పడింది.     బయట వర్షం  హోరు  ఉధృతమైంది.     ప్రజ్ఞ  గదిలోంచి  బయటకు  కాలు పెట్టింది. అతనికి  రెండడుగుల  దూరంలో  నిలబడి  ఉంది.     "ఇరవై సంవత్సరాల  క్రితం  లాంటి  కాళరాత్రే  నిర్దాక్షిణ్యంగా, నిరంతకుశంగా  ప్రవర్తించి  అమాయకురాలైన  నా బ్రతుకు బండలు చేశావు. వొరేయ్! కామంతో, పురుషాహంకారంతో  నన్ను వెంటాడి వెంటాడి నానా హింసలపాలు  చేశావు. తర్వాత  వదినగా  మీ యింట్లో  కాలు పెట్టాకయినా  మనసు మార్చుకోక  తల్లిగా, పూజనీయురాలిగా  చూసుకోవలసిన  నన్ను  నీ కోరిక తీర్చుకోవటం  కోసం  పశువులా, రాక్షసుడిలా  నిండు  చూలాలినైన  మనిషినని  కూడా  కనికరించకుండా  నీ దారి  కడ్డువస్తాడని  నా భర్తని  అమానుషంగా  హత్యచేసి  పచ్చని  నా కాపురాన్ని, బంగారం వంటి మా జీవితాలని  భగ్నం  చేశావు. గంగాజలం  వంటి మా జీవితంలో  నెత్తుటి పూత  పోశావు."              ఇలాంటి  కాళరాత్రే ...     ఆ మాటలు  ఉచ్ఛరిస్తున్నప్పుడు  ఆ రోజు  జరిగిన  సంఘటనలన్నీ  ఆమె కళ్ళముందు  మెదుల్తున్నాయి. నిండు చూలాలైన  తాను  పొరుగూరు  వెళ్ళిన  దయాకర్  కోసం ఆతృతగా  ఎదురుచూస్తూ  ఉండటం, యింతలో  కిరాతుడిలా, రాక్షసుడిలా  యోగి వచ్చి  తనమీద  అత్యాచారం  జరపబోవటం, అతనుతన్ను  ఆక్రమించుకాబోయే  ఆఖరి క్షణంలో  తప్పించుకుని  బయటపడటం, ఆ సమయంలోనే  తన కడుపును  చీల్చివేస్తోన్నట్లుగా  పురిటి నొప్పులు, ఆ సమయంలోనే  కత్తిపోట్లకుగురయి, ఆ శరీరం నుండి  రక్తం కాల్వలు  కడుతూండగా  భర్త  లోపలికడుగు  పెట్టటం, ఆ అంతిమ  క్షణాల్లో  ఒక ప్రక్క  తన ప్రాణం  క్రమ  క్రమంగా  హరించుకుపోతున్నా, తనకు పురుడు పొయ్యడం, చివరకు  చేతికందిన  నెత్తురుని  తన నుదుట అద్ది తమ జీవితాలను, సర్వనాశనం  చేసిన  వారిమీద పగ  తీర్చుకొమ్మని  చెప్పి  నేలమీద  వాలిపోయి  అంతిమ శ్వాస  విడవటం.     ఆమె హృదయంలో  భగభగమని  మంటలు  రేగుతున్నాయి. అపారమైన  దుఃఖంలోంచి  అగ్ని చెలరేగినట్టుగా  కళ్ళల్లోంచి  నిప్పుకణాలు  రాలుతున్నాయి.     "వొరేయ్! ఇది నీ అంతిమ ..."     ఆమె చేతులు  రెండు  చురకత్తుల్లా  ముందుకు  దూసుకెళ్ళాయి.     అదే సమయానికి  దారుణమైన  శబ్దంతో  ఎక్కడో  పిడుగు పడింది.     ఉన్నట్లుండి  కరెంటుపోయి, సర్వత్రా  గాడాంధకారం  అలుముకుంది.     యోగి  వెనక్కి  పరిగెత్తాడు. అతని  కర్దమైంది. ఆమె గదిలో  తలుపులు  వేసుకున్న  తర్వాత  ఏదో చేసింది. ఆమె గోళ్ళల్లోవున్న  నెత్తుటి బొట్లలో  తన కర్ధం కాని రహస్య మేదో  వుంది. గంగాధర్ కు జరిగినట్టు, ప్రతాప్ కు జరిగినట్టు తనని  కన్నుమూసి  తెరిచేలోపల  చంపే  శక్తి  వాటికుంది. ఆమె మీదకు దాడిచేసి  లాభం లేదు. ఎలాగైనా  తప్పించుకుని  పారిపోవాలి.     కొన్ని నిమిషాలు  క్రితం  ఆమెను  చంపాలని  డెస్పరేట్  వున్న యోగి  యిప్పుడు ప్రాణ భయంతో  వొణికిపోతున్నాడు.     తప్పించుకోవాలి. తప్పించుకుని  పారిపోవాలి. చీకట్లో  కన్ను పొడుచుకున్నా  ఏమీ కానరావటం  లేదు. ఇందాక  మెట్టెక్కడున్నాయో  గుర్తుతెచ్చుకుంటూ  దారి  ఎటువైపున్నదో  ఊహించుకుంటూ  పరిగెత్తుతున్నాడు.     వెనుక  నుంచి  ఎటువంటి  సవ్వడీ  లేదు.     మెట్ల చుట్టూ  అమర్చిన  రెయిలింగ్  అతని తడిమే  చేతులకి  తగిలింది. హడావుడిగా  గబగబ  క్రిందకు  దిగబోయాడు. కాలు మెలిక  పడింది. పట్టు తప్పి  క్రిందకు దొర్లిపోయాడు.  
24,377
    "ఎలా వుంది?" అన్నాడు శేఖరం.     "ఏమిటి?" బుస్సున లేచింది రాణి.     "పల్లెటూళ్ళంటే నీకు ఎగతాళిగా? రోడ్డుకు రెండువైపులా పంటచేలూ, ఆ చేలల్లో మోటబావులూ వాతావరణం ఎలా వుంది?"     రాణి జవాబివ్వలేదు.     కారు ఆపి "అదిగో అటుచూడు" అన్నాడు శేఖరం జొన్న చేలోకి చోపిస్తూ.     జొన్న చేలో మంచెమీద నిలబడి ఒక యువతి ఒడిసెలతో పిట్టలు తోల్తూ వుంది.     రాణి కళ్ళు పెద్దవి చేసుకొని చూసింది.     మోకాళ్ళ పైకి మడిచి కట్టిన ఎర్రటి చీర, ముదురు ఆకుపచ్చ రవిక, నల్లగా నిగనిగలాడుతున్న శరీరం....ఏదో వింత ఆకర్షణ.     కారు ఆగటం చూసి ఆ యువతి మంచెమీద నుంచి దూకింది.     అంత ఎత్తునుంచి అంతతేలిగ్గా దూకిన ఆ యువతిని ఆశ్చర్యంగా చూసింది రాణి.     జొన్న కంకులు పిడికెళ్లు నిండుగా కోసుకొని చేసుకు అడ్డంపడి పరిగెత్తుకుంటూ కారు దగ్గరికొచ్చింది ఆ యువతి.     "దండాలండీ బాబుగోరూ! ఈ బుల్లెమ్మగోరూ....?" అంటూ నల్లటి ముఖంలో తెల్లటి కళ్ళనూ, పళ్ళనూ మెరిపిస్తూ నవ్వింది.     "బుల్లెమ్మ గోరినే అడుగు!" రాణికేసి కొంటెగా చూస్తూ అన్నాడు శేఖరం.     రాణి చెక్కిళ్లు జేవురించాయి.     తెలిసిందిలే అన్నట్టు నవ్వింది ఆ యువతి.     "ఆగో! తీసుకోండి బుల్లెమ్మగోరూ!" జొన్నకంకులు రాణికి అందించింది.     రాణి అందుకొని "ఎందుకు?" అన్నట్టు చూసింది.     "పాలకంకులు! నలుపుకుతింటే బలే గుంటయ్ అమ్మాయిగోరూ!"       మళ్ళీ నవ్వింది. బుగ్గలు చొట్టలు పడ్డాయి. రాణికి, ఆమెలో తను ఎన్నడూ పట్నంలో చూడని అందం ఏదో కన్పించింది. కళ్ళార్పకుండా ఆమె ముఖంలోకి వింతగా చూడసాగింది.     "వస్తాం మాణిక్యం! రాముడు ఊళ్ళోనే వున్నాడా?" అడిగాడు శేఖరం.     "ఆఁ ఉన్నాడు దొరా! తమరికోసమే సూత్తున్నాడు!" అన్నది మాణిక్యం కొంచెం సిగ్గుపడుతూ.     శేఖరం కారు స్టార్టు చేశాడు.     "నల్లగా, మొరటుగావున్నా ఆమె అందంగానే వుంది బావా!" అన్నది రాణి.     శేఖరం సమాధానంగా చిరునవ్వు నవ్వాడు.                                          14     సునంద సూట్ కేసు పట్టుకొని రైలు దిగింది. ప్లాట్ ఫారంమీద తండ్రి కోసం వెదికింది. తండ్రి కన్పించలేదు. బయటికి వచ్చి రోడ్డుమీద పక్కగా నిల్చుంది.     నాన్న ఎందుకురాలేదో! ఆరోగ్యం బాగాలేదేమో? తను రాకపోయినా చంద్రయ్యనో, ఏసోబునో పంపిస్తాడే? ఏమయి వుంటుంది? ఒకవేళ తను రాసిన ఉత్తరం నాన్నకు అందలేదేమో?     "సునందమ్మగోరా? ఈడ నిలబడ్డారేందమ్మా! రండి! ఊళ్ళోకే ఎల్తంది బండి!" అన్నాడు వెంకడు సునందను గుర్తించి.     ఆలోచిస్తూ నిలబడ్డ సునంద తలెత్తి చూసింది. ఎదురుగా రెండెడ్లబండి నిల్చుని వుంది. బండి తొట్టిలో, ఎర్రకుచ్చుల చరణాకోల పట్టుకొని వెంకడు కూర్చుని వున్నాడు.     "నువ్వా వెంకా? బండి ఊళ్ళోకి వెళ్తుందా?" ఆశ్చర్యంగా అడిగింది సునంద.     "తవరికి తెలవదేంది! శేఖరం బాబుగోరు పెసిడెంటు అయినాక ఊళ్లోకి రోడ్డు ఏయించారుగా? మన ఊరే మారిపోనాది అమ్మాయిగోరూ!"     "అట్లాగా?" ఆలోచిస్తూ అన్నది సునంద.     "ఎక్కండి అమ్మాయిగోరూ!" అన్నాడు వెంకడు.     సునంద బండి ఎక్కి కూర్చుంది. వెంకడు ఎడ్లను అదిలించాడు. ఎడ్లు పరుగు లంకించుకున్నాయి. మెళ్ళో మువ్వలు గలగల మోగుతున్నాయి.     సునంద పొలాలను చూస్తూ "ఈ సంవత్సరం పంటలు బాగానే పండినట్టున్నాయి కదూ వెంకన్నా?" అడిగింది.     వెంకడు ఆయేటి పంటల గురించీ, ఊళ్ళో వచ్చిన మార్పులు గురించీ, శేఖరం మంచితనాన్ని గురించీ చెబుతూవుంటే వింటూ కూర్చుంది సునంద, గత గత మంటూ పోతూన్న బండిలో.     పరుగులు తీస్తున్న ఎడ్ల వెనక కారు హారన్ మ్రోగింది. తోకలు పై కెత్తి ఎడ్లు ఉరకలు పరుగులు లంకించుకున్నాయ్. వెంకడు ఆపటానికి ప్రయత్నించినా ఆగటంలేదు.     "ఎడ్లు బెదిరినట్లున్నయ్!" భయపడుతూ, బండిలో ఎగిరెగిరిపడుతూ అన్నది సునంద.     "మాలావు కోడెలు! ఈటికేం అదురూ బెదురూ లేదమ్మాయ్ గోరూ! రోసం! మాలావు రోసం!" అన్నాడు వెంకదు పరుగులు తీస్తున్న కోడెల్ని గోముగా నిమురుతూ.     బండి ధర్మయ్య ఇంటిముందు ఆగింది. బండి దాటుకెళ్ళే అవకాశం లేక కారు కూడా ఆగిపోయింది. బండి ఆగిన శబ్దం విని ధర్మయ్య బయటికి వచ్చాడు.     సునంద బండిదిగి కారులోకి చూసి ఆశ్చర్యంగా నిలబడిపోయింది.     శేఖరం, రాణీ కూడా ఆశ్చర్యంగా సునందను చూశారు.     "అరే! సునందా! మీది ఈ ఊరా?" అంటూ రాణి కారుదిగింది.     శేఖరం కూడా దిగి సునంద దగ్గరకు వచ్చి నిలబడ్డాడు.     చెప్పా పెట్టకుండా అకస్మాత్తుగా వచ్చిన కూతుర్ని చూసి తెల్లబోయాడు ధర్మయ్య.     "ఏమిటమ్మా ఉత్తరమన్నా రాయకుండా వచ్చావ్?" అన్నాడు ధర్మయ్య కూతురి దగ్గరకు వస్తూ.     "నమస్కారమండీ!" ధర్మయ్యకు శేఖరం నమస్కారం చేశాడు.     "నువ్వా బాబూ? మా అమ్మాయి సునంద"! అంటూ ధర్మయ్య కూతుర్ని పరిచయం చేశాడు.     "సునంద మీ అమ్మాయా అండీ?"-శేఖరం కళ్ళలో ఇంద్రధనుస్సులు విరిశాయి. కంఠంలో ఆనందాశ్చర్యాలు దోబూచులాడాయి.     "అయితే మీరేనన్నమాట ఈ ఊరి ప్రెసిడెంటు?" అన్నది సునంద నవ్వుతూ.     "శేఖరం నీకు తెలుసా తల్లీ!" ధర్మయ్య అడిగాడు.     "తెలుసు నాన్నా! ఆ అమ్మాయి రాణి, నా క్లాసుమేట్! శేఖరం గారు రాణీకి బావ!" అన్నది సునంద.     "అంటే, ఆ అమ్మాయి పరమేశంగారి కూతురు గదూ?"     "అవునండీ!" అన్నాడు శేఖరం.     రాణి విసుగ్గా ముఖం పెట్టింది. "వెళ్ళొస్తాం సునందా!" అంటూ కారుకేసి నడవబోతున్న రాణి చెయ్యి పట్టుకుంది సునంద.     "అదేమిటి రాణీ మా యింట్లోకి రాకుండానే వెళ్తారా?" సునంద శేఖరం ముఖంలోకి చూసింది.     శేఖరం సునందనే ఆరాధనా పూర్వకంగా చూస్తున్నాడు. సునంద కళ్ళు మరల్చుకుంది.     "ఇప్పుడా? తర్వాత వస్తాంలే!" అన్నది రాణి తన నలిగిపోయిన చీరెను చూసుకుంటూ.       "ఐదు నిముషాలు వుండి వెళ్దాం పద!" అన్నాడు శేఖరం.     రాణీ నొసలు చిట్లించింది.     "దూరాబారం నుంచి వచ్చారు, తీరిక చూసుకొని వస్తార్లే" అని, ధర్మయ్య శేఖరంతో "చూడుబాబూ! అమ్మాయిని తీసుకొని ఒకసారి తీరిగ్గా రా!" అన్నాడు ధర్మయ్య.     "అలాగేనండీ!" ధర్మయ్యతో అని "వస్తాను!" అంటూ సునంద ముఖంలోకి చూసి కారుదగ్గిరకు నడిచాడు శేఖరం.     "వెంకడూ! అట్లా చూస్తూ నిలబడ్డావేం! బండి పక్కకుతియ్!" అన్నాడు ధర్మయ్య.     కారు సాగిపోయాక "రామ్మా!" అంటూ కూతురిచేతిలో పెట్టె అందుకొని ఇంట్లోకి నడిచాడు ధర్మయ్య.     "అదేమిటే అమ్మాయ్! చెప్పాపెట్టకుండా ఊడిపడ్డావ్?" వసారాలో ఎదురొచ్చి సరస్వతమ్మ కూతుర్ని అడిగింది.     "ఉత్తరం రాశాగదమ్మా!"     "ఉత్తరం రాశావా? అందలేదే?" అన్నాడు తండ్రి.     "నేనూ అదే అనుకున్నాలే నాన్నా నువ్వు స్టేషన్ కు రాకపోతే!"     "పరీక్షలు ఎట్లా రాశావు తల్లీ?" ధర్మయ్య అడిగాడు.     "బాగానే రాశాను నాన్నా! క్లాసు వస్తుందనే అనుకుంటున్నాను. అన్నది సునంద.     "అవన్నీ తరవాత మాట్లాడుకోవచ్చులే! లేతల్లీ! స్నానం చెయ్యి ముందు. బాగా ఎండెక్కింది, అన్నం తిందువుగాని_" సరస్వతమ్మ అంటూ సునంద చెంపలు నిమిరింది.     "పదమ్మా! లే! లే!" అంటూ ఏదో గుర్తొచ్చినవాడిలా ధర్మయ్య త్వరత్వరగా బయటికి వెళ్ళిపోయాడు.     సునంద స్నానానికి లేచింది.
24,378
      నవ్వింది. "కాదు పిల్లలకి."          "ఏ పిల్లలకి?"          "అదే ఎంక్వయిరీ చెయ్యాలి."          "ఈ అయిడియా మరీ నాసిరకంగా వున్నట్లు లేదే" అన్నాడు బాలూ ఉత్సాహంగా.          ఆ రోజు సాయంత్రం చల్లబడ్డాక ఆ వీధిలో వున్న అయిదారు ఇళ్ళలో విచారించింది సౌదామిని.          అందరిళ్ళలో దాదాపు ఒకేరకం ప్రశ్నలూ, సమాధానాలు.          "ఎంత తీసుకుంటారు?"          "మీకు తోచినంత ఇవ్వచ్చు."          "ఇక్కడికి వచ్చి చెబుతారా? మీ ఇంటికి రావాలా? మీ ఇల్లెక్కడ?"          "మీకు ఎలా సౌకర్యంగా వుంటే అలా చేస్తాను. మా యిల్లు ఈ వీధి లోనే."          "వీణ మీ దగ్గర వుందా?"          "లేదు మీరే కొనాలి."          వాళ్ళ మొహాల్లో ఆశ్చర్యం కనబడేది. "మరెలా నేర్చుకున్నారు? ఇంకోళ్ళకి చెప్పేటంతగా నేర్చుకున్న వాళ్ళ దగ్గర వీణ లేకపోవడమేమిటీ?"          దానికి జవాబు తన దగ్గరవున్నా చెప్పేది కాదు సౌదామిని. చిరునవ్వు నవ్వి ఊరుకునేది.          ఒక్క ఇంట్లో మాత్రం సంభాషణ వేరే విధంగా నడిచింది. అసలు ఆ ఇల్లే వేరే రకంగా వుంది. ఆ మనుషులు వేరే తరహాగా వున్నారు. ఆయన ఎక్కడో ఆఫీసరుట. మధ్యతరగతిలో నుంచి గబగబా బయటపడిపోయి సొసైటీలో పైపైకి ఎగబాకి పోవాలనే దుగ్ధతో వున్నట్లు కనబడుతున్నారు. కొత్తగా కాస్త డబ్బు వెనకేసుకున్న నియోరిచ్ కుటుంబంలా వుంది అది. దానితోబాటు కాస్తో కూస్తో కళని కూడా సొంతం చేసుకోవాలన్న ఆరాటంతో వున్న కల్చర్ వల్చర్ లా ఆత్రంగా కనబడుతున్నారు వాళ్ళు.          "వీణ కొనటం నో ప్రాబ్లెం సాయంత్రానికి తంజావూరు వీణ తెప్పించెయ్యగలను. ఎన్నాళ్ళలో ట్రెయిన్ అప్ చెయ్యగలరు మా డాలీని? ఎంత త్వరలో ప్రోగ్రామ్స్ ఇప్పించగలరు? టీవీలో, రేడియోలో ప్రోగ్రాములు మేనేజ్ చేయగలరా? ప్రెస్ కవరేజీ మీరు చూసుకుంటారా?" ప్రశ్నల వర్షం కురిపించింది పట్టుచీర సర్దుకొంటూ.          సంగీతం నేర్పించడం తప్ప మిగతావన్నీ తను చెయ్యలేనన్నది సౌదామిని. వింటున్న ఇంటాయన మొహం అప్రసన్నంగా పెట్టాడు.          "మా రోటరీ క్లబ్ మెంబరొకాయన కూతురికి ఒకే ఒక సంవత్సరంలో వీణ నేర్పించేసి, టీవీలో - రేడియోలో అధరగొట్టించేస్తున్నాడు. ఆ టీచరే ఇవన్నీ చూసుకుంటుందిట. ఇవన్నీ చెయ్యని కాడికి మీరెందుకూ? మా అమ్మాయిని ఆ టీచర్ దగ్గరికే పంపుతాం" అన్నాడు.          మనుష్యుల తత్వాలు చూస్తుంటే వికారం కలుగుతోంది. తనకి కడుపులో తిప్పుతున్నట్లు అనిపిస్తోంది. ఒక్కతే కూర్చొని ఆలోచిస్తూంది. అంతలో అలవాటైన కూరల అమ్మాయి కేక వినబడింది. చాలా చిన్నపిల్ల పన్నెండేళ్ళు వుంటాయి. పెద్ద బుట్టనెత్తిన పెట్టుకుని పెరటి గుమ్మంవేపు వచ్చి రోజూ కేకవేస్తుంది. పక్కింటి బేబీ జాన్ కుటుంబం ఆ అమ్మాయి దగ్గరే వాడుగ్గా కొంటారు కూరలు.          సౌదామిని వాళ్ళ వాడుక కూడా తన దగ్గరే వుంటే బాగుంటుందని ఆ అమ్మాయి తాపత్రయం. రోజూ జాలిగా అడుగుతుంది. "కూరలు తీసుకోవా అమ్మా" అని.          "ఇవాళ కాదు" అనేది సౌదామిని ఏరోజు కారోజు.          ఇవాళ ఆ పిల్ల గట్టి ప్రయత్నమే చేయదలచుకుంది. ఈ అమ్మ తన దగ్గర ఎందుకు కొనదు కూరలు? తను తాజావి తేనని అనుకుంటోందా ఏమిటి?          "లేత లేత సొరకాయలమ్మా బొల్లారం నుంచీ తెల్లారక ముందే తెచ్చి నానమ్మా తీసుకోవా?" అంది జాలిగా చూస్తూ.          "వద్దు పాపా ఇంట్లో కూరలున్నాయ్" అంది సొరకాయ కోస్తున్నట్టు - సౌదామిని.          "ఎక్కడనుండి తెచ్చుకుంటారమ్మా మీరు? మోండా మార్కెట్ కెళ్ళి తెస్తారా? నేను మార్కెట్ ధరకే అమ్ముతానమ్మా నిజమో కాదో ఆ దొరసానమ్మను అరుసుకో . చెప్తుంది. నాకు పది పైసలు కూడా మిగలదమ్మా" అంది ఆత్రంగా.          గుండె కరిగి నీరైపోయింది సౌదామినికి.          "ఇవాళ కాదు, ఇంకోరోజు తప్పకుండా తీసుకుంటాను" అంది తప్పించుకోవడానికి కాని ఆమె చూపులు అప్రయత్నంగానే బుట్టలో వున్న మామిడికాయలవైపు పోతున్నాయి. నిజంగానే బాగున్నాయి అవి. నవనవలాడుతూ, నిగనిగ మెరుస్తూ అతి ప్రయత్నం మీద కళ్ళు పక్కకి తిప్పుకుంది సౌదామిని.          ఆ చూపులు కని పెట్టేసింది కూరలమ్మాయి.          "మామిడికాయలు కొబ్బెర లెక్క ఉన్నాయమ్మా. తినిచూస్తే నీకే తెలుస్తుంది" అని, సౌదామిని వద్దనేలోగానే చాకు తీసి చిన్న ముక్కకోసి ఆమె చేతిలో పెట్టింది. నోట్లోనూ, కళ్ళలోనూ నీళ్ళూరాయి సౌదామినికి.          ఎటూ తేల్చుకోకుండా ఆ మామిడికాయ ముక్కవైపు చూసింది. తను ఎలాగూ ఈ అమ్మాయి దగ్గర కూరలు కొనబోవడంలేదు. మరి ఊరికే తిని ఆశపెట్టడం కరక్టేనా?          "తినక్కా" అంది కూరలమ్మాయి. ఇంక ఆలోచించకుండా ఆ ముక్కనోట్లో పెట్టేసుకుంది సౌదామిని.          పుల్లపుల్లగా దివ్యాతిదివ్యంగా తోచింది నోటికి. తొంభై రోజుల తొలివలపు - తీయబోతూన్న తలుపు-తిరగబోయే మలుపు-తీయ తీయని పులుపు....          "పది కాయలు ఇవ్వనా అమ్మా, పచ్చడి పెడితే మంచిగా వుంటుంది...."          గుండెలు పిండేసినట్లయింది సౌదామినికి. చప్పున ఆ అమ్మాయి గెడ్డాన్ని పట్టుకుని, "చాలా థాంక్స్ పాపా! ఇవాళ నా దగ్గర డబ్బుల్లేవు. నా దగ్గర డబ్బులున్న రోజున, నా అంతట నేనే పిలిచి, నీ బుట్టలో వున్న కూరలు మొత్తం కొనేస్తాను. అప్పటిదాకా మళ్ళీ నన్ను అడక్కు ఏం?" అంది గబగబా.          అనూహ్యమైన ఈ చర్యకి బిత్తరపోయి ఆశ్చర్యంగా చూస్తూ, తలఊపి వెళ్ళిపోయింది కూరలమ్మాయి.          ఇంట్లోకి వచ్చేసరికి బాలూ అప్పుడే పక్కింటి వాళ్ళ దగ్గర నుంచి తెచ్చిన పేపరు చదువుతూ కనబడ్డాడు. అతని వెనకే కూర్చుని, అతని భుజంమీద గెడ్డం ఆనించి, తనుకూడా హెడ్ లైన్స్ చదవడం మొదలుపెట్టింది సౌదామిని.          నీలంగేకర్ పదవీచ్యుతిలో వసంతదాదా హస్తం, ఆందోళన.          లెక్చరర్ల మరో మూడు కోర్కెలకు ఆమోదం.          పంతుళ్ళ సమ్మెకు అన్ని పార్టీల మద్దతు. ప్రాక్టికల్స్ జరగలేదు.          "ఇదేమిటి" అంది సౌదామిని ఉన్నట్లుండి.          "ఏది?"          చూపుడు వేలితో ఒక వార్తని చూపించింది సౌదామిని.          "టెలీఫోన్స్ డిపార్ట్ మెంట్ లో పనిచేసే ఉద్యోగి సస్పెన్షన్-సిబ్బంది ఆందోళన."          గబగబా చదివాడు బాలూ.          "టెలీఫోన్స్ డిపార్ట్ మెంట్ లో పనిచేసే ఒక ఉద్యోగి కుటుంబ సమేతంగా కాశ్మీరు వెళ్ళడానికి లీప్ ట్రావల్ కన్సెషన్ కింద డబ్బు తీసుకుని, కాశ్మీరు వెళ్ళకుండానే దొంగ టిక్కెట్లతో అడ్జస్ట్ మెంట్ బిల్సు పెట్టి ప్రభుత్వం ఏర్పరచిన సదుపాయాన్ని దుర్వినియోగం చేసినందుకుగానూ సస్పెండ్ చేయబడ్డాడు. ఆయన మీద ఎంక్వయిరీ జరుగుతున్నది. ఇది యాజమాన్యపు కక్ష తప్ప మరేమీ కాదని ఆ ఉద్యోగిపై సస్పెన్షన్ తొలగించాలనీ డిమాండ్ చేస్తూ సిబ్బంది మెరుపు సమ్మె ప్రారంభించారు...          ....చట్ట విరుద్దమైన సమ్మె కారణంగా పని ఆగబోదనీ కస్టమర్లకు అసౌకర్యం కలగనివ్వమనీ, ట్రైనింగ్ పొందిన వ్యక్తులను తాత్కాలికంగా ఉద్యోగాలలోకి తీసుకుంటామణీ అధికార్లు తెలియజేశారు. టెలీ ఎక్స్చేంజికార్డుతో సహా ఆఫీసర్ ను కలుసుకోవచ్చు."          "-ట్రైనింగ్ పొందిన వ్యక్తులంటే నీలాంటి వాళ్ళే! అంటే మనకి ఉద్యోగం!!!కనీసం టెంపరరీగా!" అన్నాడు బాలు హర్షాతిరేకంతో. "బయల్దేరు! యెర్లీ బర్డ్ గెట్స్ దవర్మ్! అనగా మొదట వెళ్ళిన పిట్టకు పురుగు దొరుకును పద! పద!!" అరిచాడు బాలు.          నవ్వింది సౌదామిని. ఆ కొద్దిరోజుల టెంపరరీ వేకెన్సీకి కూడా ఎంత కాంపిటీషన్ ఉంటుందో, ఎంత పెద్ద రికమెండేషన్లు ఉంటాయో తెలియదు. ఈ ఉద్యోగం తనకి వస్తుందో రాదో తెలియదు. అయినా వెళ్ళింది.          ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. చాలాసేపటికి వచ్చింది సౌదామిని టర్న్.          ఇంటర్వ్యూ చేసే ఆయన చాలా సౌమ్యుడు. ఆమె సర్టిఫికెట్లు చూసి తల పంకించి "ఎక్కడ ఉంటారు!" అన్నాడు.          చెప్పింది.          వెంటనే ఆయన మొహంలో ఆసక్తి కనబడింది. "కరెక్ట్ లొకేషన్ ఎక్కడ?"          చెప్పింది సౌదామినీ.          "అంటే బేబీ జాన్ వాళ్ళ ఇంట్లోనే అన్నమాట. అవునా?"          "అవును పక్కపోర్షనే ఎందుకు?" అంది.          "అయితే మీరు మాకు హెల్ప్ చెయ్యండి. మేము మీకు హెల్ప్ చేస్తాం" అన్నాడా ఆఫీసర్.          అనుమానంగా చూసింది సౌదామిని.          "అంటే?"          "మీ పక్క పోర్షన్ లో వుండే బేబీ జాన్ కాశ్మీర్ వెళ్ళకుండా ఈ ఊళ్ళోనే వుండి దొంగ టిక్కెట్లతో బిల్లు సబ్మిట్ చేశాడు. అతను కాశ్మీర్ వెళ్ళలేదని మీకు తెలుసు. అలా అని స్టేట్ మెంట్ రాసి సంతకం పెట్టి ఇవ్వాలి మీరు. మీకు ఈ ఉద్యోగం గ్యారంటీ. స్ట్రయిక్ ముగిసిన తర్వాత మిమ్మల్ని రెగ్యులర్ గా తీసుకోవడానికి కూడా ప్రయత్నిస్తాము."          కొద్దిగా ఆలోచించి, తల వూపింది సౌదామిని.          అతని మొహం వికసించింది బెల్లుకొట్టి స్టెనోని పిలిచాడు.          కొద్దిసేపట్లోనే కాయితాలు టైపు అయి వచ్చాయి.          చదివింది సౌదామిని. సంతకం పెట్టింది.          "థాంక్స్ ఏలాట్? ఇది మాకు చాలా పనికి వస్తుంది. లేకపోతే యూనియన్ తో ఇంకా పెద్ద గొడవ అయి వుండేది. ఇది మీ అప్పాయింట్ మెంట్ ఆర్డర్ తీసుకోండి."          తల అడ్డంగా వూపింది సౌదామిని. "నో థాంక్స్! నాకు తెలిసిన నిజాలు నేను చెప్పినందుకుగానూ ఇలా లంచం తీసుకోవడం బాగుండదనుకుంటాను."          పట్టశక్యంగాని ఆశ్చర్యంతో చూశాడు ఆయన. "లంచం కాదిది! మ్యూచువల్ హెల్ప్!"          లేచి నిలబడింది సౌదామిని. నెమ్మదిగా, కానీ స్థిరంగా చెప్పింది- "నీతి నిజాయితీ, ధర్మం నైతికం లాటి పెద్ద మాటలు నేను చెప్పను సార్! కానీ ప్రతి మనిషికీ కొన్ని విలువల్ని కాపాడవలసిన నైతికధర్మం వుంటుందని నేననుకుంటున్నాను. బేబీ జాన్ మా ప్రక్క ఇంట్లో వున్న మనిషి శలవుకాలంలో అతడు ఎక్కడికీ వెళ్ళలేదనటానికి నేను సాక్షిని, అది ప్రభుత్వానికి చెప్పటం కోసం ఏ విధమైన లంచమూ అవసరం లేదు. ఒక సాధారణ పౌరురాలిగా అది నా కర్తవ్యం. ఒక లంచగొండిని రక్షించటం కోసం యూనియన్స్ ప్రయత్నించటం దురదృష్టకరం. ఈ టెంపరరీ ఉద్యోగం ఆశ పెట్టకపోయినా నేనీ కర్తవ్యం నిర్వర్తించాలి. నా స్వార్ధంకోసం అతడి ఉద్యోగం పోగొట్టి ఆ స్థానంలో నేను చేరటం నాకెందుకో అంత బాగా అనిపించడంలేదు! క్షమించండి" అంటూ పూర్తిచేసింది.
24,379
    తురుముకుందా మనుకున్న నా భార్య     నఖక్షతాలైన ఎరక్క రాత్రిళ్ళు     మేల్కొన్న నిట్టూర్పుల గాధలు     ఔనౌను పోగొట్టుకున్న వజ్రంకోసం     ఎక్కడని వెదుకుతావు     ఏ నేల పగుళ్ళలో ఏ గుండె లోయలలో     ఏ కారడవులలో ఎందుకో బెంగ నీలో నాలో     దేనికోసమో తెలీని అన్వేషణ     అదృశ్య జీవితశాఖలపైన పువ్వు లవలేని మొగ్గల సంభాషణ     అయినా నడుస్తున్నాను     దట్టమయిన మంచుపడిన చీకట్లో అలాగే వెతుక్కుంటున్నాను     నన్ను నేను నాలో నీలో గతంలో     మనని మనం పోగొట్టుకున్న దినం మహాలయ అమవాస్య     ప్రతి ఉగాదికీ మెరుస్తూ పిలుస్తుంది ఆశావేశ్య.     *    *    *                        ---1964         నెహ్రూ     ఈ వేళ పువ్వులన్నీ వాడిపోయిన రోజు     ఏకాంతంలో భూమి ధ్రువగళాలెత్తి ఏడ్చిన రోజు     తెల్లని పావురం ఎండలో సొమ్మసిలిపోయింది     తల్లి లేని పిల్లల్ని నీడలోకి పిలిచేవాళ్ళు లేరు     సముద్రమధ్యంలో ఓడలో దిక్సూచి పనిచెయ్యడం లేదు     సర్వజనావళికి యాత్రాపధంలో సైన్ పోస్ట్ కూలిపోయింది     చరిత్ర మిట్టమధ్యాహ్నంలో చలివేందిర కనబడటం లేదు     నాగరికత నగరం మధ్య నడిరోడ్డుమీద మూర్ఛపోయింది     అన్ని విధాలా చెడ్డరోజని అన్ని పంచాంగాలూ ఒప్పుకున్నాయి     స్విన్ననయనం ఛిన్న హృదయం నేటి చిహ్నంగా నిలిచిపోయాయి     అయిదు ఖండాల జిజ్ఞాసువులు ఆలోచనాంధకారంలో చిక్కుకున్నారు     అఖండ కాలనీల కూలంకష పొంగి అందమైన పట్టణాన్ని ముంచివేసింది     ఆకాశ ద్వారంలో అతనికి స్వాగత తోరణం కట్టారు     రణంలో మరణంలో అజేయుడైన యీ వ్యక్తి అమరుడన్నారు     అవనత మస్తకాలతో అశేష ప్రజానీకం అశ్రుతర్పణం చేశారు     అజరామరమైన అతని వాణి తరతరాలు వింటారు కలలు కంటారు                 *    *    *
24,380
    ఏమిటిరా ఇదంతా?"     "ఆ దేవదాసుగాడు__నన్ను నెట్టి__ఆఁ__ఆఁ__వాడి లెక్క _"     "మళ్ళీ మూర్ఖుడా?"     కాని క్షణంలో జరిగిన వ్యవహారమంతా తెలిసికొని, చాపమీద కూర్చొని అడిగాడు_దేవదాసు నిన్ను నెట్టి, పడగొట్టి వెళ్ళిపోయాడా?"     భూలో అన్నాడు__"ఆఁ__ఆఁ__ఆఁ__ఆఁ" తరువాత కొన్ని క్షణాలు సున్నం దులుపుకొన్నాడు. అయితే శ్వేతవర్ణం, శ్యామ వర్ణం కలిసిపోయిన కారణంగా విద్యార్ధి నాయకుడు భూతంలాగా కన్పిస్తూ వున్నాడు. అప్పుడు కూడా అతడి ఏడ్పు ఆగలేదు.     "దేవా నిన్ను నెట్టి సున్నంలోకి పడగొట్టి వెళ్ళిపోయాడా, సరే!" అన్నాడు     "ఆఁ__ఆఁ__ఆ__" అన్నాడు భూలో.     "పిల్లలెక్కడున్నారు?" అడిగాడు పంతులవారు.     ఆ తరువాత పిల్లల సమూహం కందిపోయిన వదనాలతో రొప్పుకుంటూ రోజుకుంటూ తిరిగివచ్చి "దేవాను మేము పట్టుకోలేకపోయామండీ! అబ్బా! ఎంతో గురిగా రాయి విసురుతాడు!" అని చెప్పారు.     "పట్టుకోలేకపోయారా?"     మరో పిల్లవాడు మొదట చెప్పిన విషయాన్నే రిపీట్ చేస్తూ "అబ్బా! ఎంతో గురిగా....!"     "కొంచెం ఆగండి!"     అతడు నోరుమూసుకుని ప్రక్కనే కూర్చుండిపోయాడు. నిష్ఫలమయిన క్రోధంతో మొదట పండితులవారు పార్వతిని బాగా బెదిరించారు. తరువాత భోలానాద్ చేయి పట్టుకొని "పద, ఒకసారి జమీందారుగా కచేరీలో చెప్పివద్దాం!" అన్నారు.     జమీందారయిన ముఖోపాధ్యాయగారి దగ్గర వారి పుత్రరత్నం యొక్క ప్రవర్తనను గురించి ఫిర్యాదు చేద్దామని దాని తాత్పర్యం.     అప్పుడు దాదాపు మూడు గంటల అవుతూ వుంది. నారాయణ ముఖోపాధ్యాయగారు బయట కూర్చొని హుక్కా త్రాగుతూ వున్నారు. ఒక నౌకరు పంఖా చేతబట్టుకొని విసురుతూ వున్నాడు. విద్యార్ధితోపాటు ఆ కాలంలో పండితులవారి రాకతో విస్మితుడై  "ఎవరూ, గోవిందా?" అన్నాడాయన.     గోవింద్ పండితుడు కాయస్థుడు. అంచేత వంగి నమస్కారం చేసాడు. భూలోను చూపించి విషయమంతా వివరంగా వర్ణించాడు. ముఖోపాధ్యాయగారు విరక్తి చెంది "అయితే దేవదాసు అదుపు తప్పిపోతున్నాడన్న మాట!" అన్నారు.     "ఏం చేసేది? ఇక మీరే సెలవియ్యండి!"     జమీందారు బాబు హుక్కా పైపు ప్రక్కనబెట్టి  "వాడు ఎటువెళ్ళాడు?" అన్నాడు.     "ఏం తెలుసు? పట్టుకొనడానికి వెళ్ళిన వాళ్ళను, రాళ్ళు విసిరి తరిమేశాడు."     వాళ్ళిద్దరూ కొంచెం సేపు మౌనంగా వున్నారు. "ఇంటికి వచ్చినపుడు వాడి సంగతి చూస్తాలెండి." అన్నాడు నారాయణబాబు.     గోవింద్ పండితుడు విద్యార్ధి చేయి పట్టుకొని పాఠశాలకు మామూలు వేళకన్నా కొంచెం ముందుగానే సెలవిచ్చేశారు. వెళుతూ, వెళుతూ పిల్లలు అనేక విమర్శలూ, ప్రతి విమర్శలూ చేసుకుంటూ వున్నారు.     "అబ్బా! దేవా ఎంత బలం గలవాడు!" అన్నాడు ఒకడు.     "భూలోను బెదరగొట్టి ఆశ్చర్యపరిచాడు" అన్నాడు మరొకడు.     "అబ్బా! ఎంత గురిగా రాయి విసురుతాడు!"     ఒకడు భూలో పక్షం వహిస్తూ "భూలో దీనికి బదులు తీర్చుకుంటాడు, చూసుకో" అన్నాడు.     "హిశ్! బదులు తీర్చుకొనడానికి అతడు ఇక పాఠశాలకు వస్తే గదా?"     ఈ చిన్న సమూహానికి ఓ ప్రక్కగా పార్వతి కూడా తన పుస్తకమూ, స్లేటూ తీసికొని ఇంటికొస్తూ వుంది. దగ్గరలోని ఒక బాలుడి చేయి పట్టుకొని "మణీ! దేవదాసును పండితులవారు నిజంగానే పాఠశాలకు రానివ్వరా?" అని అడిగింది.     రానివ్వరు, ఏ విధంగానూ రానివ్వరు" అన్నాడు మణి.     పార్వతి తప్పుకొని ముందుకు పోయింది. ఆమెకు యీ సంభాషణ బొత్తిగా నచ్చలేదు. పార్వతి తండ్రి పేరు నీలకంఠ చక్రవర్తి. చక్రవర్తి మహాశయుడు జమీందారుగారి పొరుగువాడు. ముఖోపాధ్యాయగారి భవంతి ప్రక్కనే ఆయన ఇల్లు వుంది. అది చాలా చిన్నది. పురాతన పద్దతిలో కట్టిన కట్టడం. ఆయనకు పన్నెండు బీఘాల వ్యవసాయం వుంది. నాలుగిళ్ళ పౌరోహిత్యం వుంది. జమీందారుగారి ఇంటి నుంచి కూడా కొద్దీ గొప్పా లభిస్తూనే వుంటుంది. ఆయన కుటుంబం సుఖంగా వుంది. హాయిగా కాలం గడిచిపోతూ వుంది.     మొదట పార్వతికి ధర్మదాసు ఎదురయ్యాడు. అతడు దేవదాసు ఇంట్లో వుండే నౌకరు. సంవత్సరం వయసు దగ్గర నుంచి యెనిమిది సంవత్సరాల వయస్సు వచ్చేవరకూ ఆమె అతడి వెంట వస్తూ, పోతూ వుండేది. పాఠశాలకు పంపించి పోతాడు. సెలవియ్యగానే ఇంటికి తీసుకుపోతాడు. అతడు యీ పని నియమ పూర్వకంగా ప్రతిరోజూ చేస్తాడు. ఈరోజు కూడా ఆ పని మీదే పాఠశాలకు వెళ్ళాడు. పార్వతిని చూసి అతడు "పత్తో, దేవదాదా ఎక్కడున్నాడు?" అన్నాడు.     "పారిపోయాడు."     "పారిపోయాడా? ఎందుకూ?" అన్నాడు ధర్మదాసు చాలా ఆశ్చర్యంగా.     తర్వాత పార్వతి భోలానాథ్ కు పట్టిన దుస్థితికి సంబంధించిన వృత్తాంతం కొత్త పద్దతిలో జ్ఞప్తికి తెచ్చుకొని నవ్వుతూ వుంది__"చూడు ధర్మా, దేవదాదా యెక్కడున్నాడు?" అన్నాడు.     "పారిపోయాడు."     "పారిపోయాడా? ఎందుకూ?" అన్నాడు ధర్మదాసు చాలా ఆశ్చర్యంగా.     తర్వాత పార్వతి భోలానాథ్ కు పట్టిన దుస్థితికి సంబంధించిన వృత్తాంతం కొత్త పద్దతిలో జ్ఞప్తికి తెచ్చుకొని  నవ్వుతూ వుంది__"చూడు ధర్మా, దేవదాదా__హి__హి__హి__అమాంతంగా ఆ సున్నం గుట్టలో__హి__హి__ హూ__హూ__అమాంతంగా ధర్మా, వెల్లికిలగా పడవేశాడు.     ధర్మాదాసుకు ఆ మాటలన్నీ అర్ధం కాకపోయినా, ఆ నవ్వు చూసి కొద్దిగా నవ్వాడు. తరువాత నవ్వు ఆపుకొని "ఏం జరిగింది పత్తో? చెప్పవేమిటీ?" అన్నాడు.     "దేవదాసు, భూలోను నెట్టి పొడి సున్నంలో పడ....హి_హి_హి_."     "ధర్మదాసు ఈసారి అంతా అర్ధం చేసుకున్నాడు. చాలా విచారిస్తూ "పత్తో, అతడు ఇప్పుడు యెక్కడున్నాడో నీకు తెలుసా?" అన్నాడు.     "నాకేం తెలుసు?"     "నీకు తెలుసు, చెప్పు. అమ్మో! అమ్మో! అతడికి ఆకలయి వుంటుంది."     "ఆకలయ్యే వుంటుంది. అయినా నేను చెప్పను."     "ఎందుకు చెప్పనూ?"     "చెపితే నన్ను చితకబాదుతాడు. నేను అన్నం ఇచ్చి వస్తాను."     ధర్మదాసు కొంచెం అసంతృప్తిగా__"అయితే ఇచ్చిరా. చీకటి పడకముందే మరపించి ఇంటికి తీసుకొని రా."     "తీసుకొస్తాను."     పార్వతి ఇంటికి వచ్చి చూసింది. ఆమె తల్లీ, దేవదాసు తల్లీ కథ అంతా వినే వున్నారు. ఆమెను కూడా విషయాలన్నీ అడిగారు. నవ్వుతూనూ, గంభీర్యంగానూ ఆమెకు చేతనయిన విధంగా చెప్పింది. తరువాత మొర్మొరాలు చిన్న గుడ్డలో మూటగా కట్టుకొని జమీందారుగారి తోటలోకి జొరబడిపోయింది. తోట వారి ఇళ్ళకు దగ్గరగానే వుంది. అందులోనే ఓ వైపు వెదుళ్ళ తోపు వుంది. దాగి వుండి పొగ త్రాగడానికి దేవదాసు యీ వెదుళ్ళ తోపు మధ్యలో ఒక చోటు శుభ్రం చేసికొని వుంచినట్లు ఆమెకు తెలుసు. పారిపోయి వచ్చినప్పుడల్లా దాగి వుండటానికి అదే అతడి రహస్య స్థావరం. పార్వతి లోపలికి వెళ్ళి చూసింది. వెదురు తోపు మధ్యలో దేవదాసు ఓ చిన్న హుక్కా పట్టుకొని కూర్చున్నాడు. పెద్దవాళ్ళలాగా ధూమపానం చేస్తూ వున్నాడు. ముఖం చాలా గాంభీర్యముగా వుంది. అతడి ముఖంలో ఎన్నో దుర్భావనల చిహ్నాలు వ్యక్తమవుతూ వున్నాయి. అతడు పార్వతి రావడం చూసి చాలా సంతోషించాడు. కాని ఆ సంతోషాన్ని బయట పడనివ్వలేదు. పొగ త్రాగుతూనే 'రా' అన్నాడు.     పార్వతి దగ్గరకు వచ్చి కూర్చున్నది. ఆమె తెచ్చిన ఆ చిన్ని మూటమీద అతని దృష్టి పడింది. ఇంకేమీ అడగకుండా అతడు ముందు దానిని విప్పుకొని నములుతూ "పత్తో, పండితులవారు ఏం చేశారు?" అన్నాడు.     "పెదనాన్న గారితో చెప్పారు."     దేవదాసు కోపంతో "నాన్నగారితో చెప్పారా?" అన్నాడు.     "అవును."     "ఆ తరువాత?"     "నిన్ను ఇక నుంచి పాఠశాలకు రానివ్వరు."     "నేను కూడా చదవదలచుకోలేదు."     అదే సమయంలో ఆ తింటున్న మొర్మొరాలు అయిపోవచ్చాయి. దేవదాసు పార్వతి ముఖం వైపు చూస్తూ "ఏదయినా చిరుతిండి పెట్టు."     "చిరుతిండి ఏమీ తీసుకొని రాలేదు."     "అయితే మంచినీళ్ళు తీసుకొని రా!"     "మంచినీళ్ళు యెక్కడ తెచ్చేదీ?"     దేవదాసు విసుగుకొని "ఏమీ చేయలేకపోతే వచ్చింది యెందుకూ? వెళ్ళు, మంచినీళ్ళు తీసికొని రా."     కఠోరంగా వున్న అతడి స్వరం పార్వతికి నచ్చలేదు. "నేను వెళ్ళలేను. నీవు వెళ్ళి త్రాగిరా" అన్నది.     "నేను ఇప్పుడే వెళ్ళగలనా?"     "అయితే ఇక్కడే వుంటావా?"     "ఇక్కడే వుంటాను. తరువాత యెక్కడికైనా వెళ్ళిపోతాను."     ఇదంతా విని పార్వతికి చాలా దుఃఖం కలిగింది. దేవదాసు యొక్క యీ వైరాగ్యం చూసి, అతడి మాటలు విని ఆమె కళ్ళు చెమర్చాయి. "అయితే నేను కూడా వస్తాను" అన్నది.
24,381
    23. (ఔదుంబర పాత్రలోని పాలు, యవలు మున్నగువానిని స్రువముతో ఆహవనీయగ్నిలో హొమము చేయవలెను)     అన్నములను కల్పించిన వాడు ప్రజాపతి. అతడు సృష్టి ఆదిన సోమమును జలమునుండి, ఓషధులనుండి- సృజించినాడు. ఆ జలములు, ఓషధులు మాకు మధురములు కావలెను. మేము పురోహితుల సహితులమై స్వరాజ్యమున అప్రమత్తులము కావలెను స్వాహా.     24. అన్నములను కల్పించినవాడు ప్రజాపతి. ఈలోకములను - సమస్త భూతములను అతడే కల్పించినాడు. హవి ఇవ్వని నావంటివానితో సహితము హవి ఇప్పించును. అతడు మాకు సమస్త వీరుల సహితమగు ధనము ప్రసాదించవలెను -స్వాహా.     25. అన్నములను కల్పించినవాడు ప్రజాపతి. అతడు సమస్త భూతమాత్రలను సృష్టించినాడు. అతడు నిత్య సామ్రాట్టు. తన అధికారమును ఎరిగినవాడు. స్వేచ్ఛగా సర్వత్ర సంచరించువాడు. అతడు మాకు సంతానపుష్టి - ధనపుష్టి కలిగించుచు సర్వత్ర వ్యాపించవలెను- స్వాహా.     26. మమ్ము రక్షించుమని రాజగు సోమమును- ద్వాదశ ఆదిత్యులను- సూర్యుని- బ్రహ్మను- బృహస్పతిని ఆహ్వానించుచున్నాము. స్వాహా.     27. అగ్నీ! ఇది మా యజ్ఞము. ఇందు మా హితము పలుకుము - శుభములు సంకల్పించుము. వేలధనముల విజేతా! అగ్నీ! మాకు ధనాదులు ప్రసాదించుము - స్వాహా.     27. ఆర్యమ,  ఇంద్ర, బృహస్పతి, ఈశ్వరులారా! మీరు దానములను ప్రోత్సహించండి. వాగ్దేవి సరస్వతి, విష్ణు, సవిత, అన్నవంత ప్రజాపతికి స్వాహా.     28. అగ్నీ! ఇది మా యజ్ఞము. ఇందు మాహితము పలుకుము. మాకు శుభములు సంకల్పించుము. వేల ధనముల విజేతా! అగ్నీ! మాకు ధనాదులు ప్రదానము చేయుము. నీవే కదా ధనస్వామివి స్వాహా.     29. ఆర్యమ, పూష, బృహస్పతి, వాగధిదేవత సరస్వతి మాకు ధనము ప్రసాదించవలెను స్వాహా.     30. (హుతశేషము యజమాని మీద చల్లవలెను)     నేను సవిత అధీనపువాడిని, అశ్వినుల బాహువులతోను, పూషహస్తములతోను, వాక్కును నియంత్రించు సరస్వతి అనుగ్రహముతోను, యజమానివగు నిన్ను ధనములందు. ప్రతిష్ఠంచుచున్నాను. నిన్ను బృహస్పతి సామ్రాజ్యమునకు పట్టాభిషిక్తుని చేయుచున్నాను.     31. (ఇవి 'ఉజ్జితి' మంత్రములు వీనిచే ఘృతాహుతి ఇవ్వవలెను)     అగ్ని ఏకాక్షర ఛందమున పంచప్రాణములను గెలిచినాడు. యజమానినగు నేను నా పంచప్రాణములను గెలిచెదను. అశ్వినులు రెండక్షరముల ఛందమున రెండు కాళ్లుగల మానవులను జయించినారు. నేను కూడా ఆ మానవులను గెలువవలెను. విష్ణువు మూడక్షరముల ఛందమున ముల్లోకములను గెలిచినాడు. నేను కూడ ఆ మూడు లోకములను గెలువవలెను. సోమము నాలుగక్షరముల ఛందమున చతుష్పాత్త పశువులను గెలిచినది. నేను సహితము చతుష్పాద జంతువులను గెలువవలెను.     32. పూషదేవత అయిదక్షరముల ఛందములచే 4 దిక్కులను + 1అవాంతరదిశ = అయిదింటిని గెలిచినాడు. నేను సహితము ఆ అయిదింటిని గెలువవలెను. సవితా దేవత ఆరక్షరముల ఛందమున ఆరు ఋతువులను గెలిచినాడు. నేను సహితము ఆరు ఋతువులను గెలువవలెను. మరుత్తులు ఏడక్షరముల ఛందమున ఏడుగ్రామ్య జంతువులను గెలిచినాడు. నేను సహితము ఆ ఏడింటిని గెలువ వలెను. బృహస్పతి అష్టాక్షర ఛందమున గాయత్రిని గెలిచినాడు. నేను సహితము గాయత్రిని గెలువవలెను.     33. మిత్రుడు నవాక్షర ఛందమున త్రివృత్తమును గెలిచినాడు. నేను కూడ దానిని గెలువవలెను. వరుణుడు దశాక్షరఛందమున "విరాజము"ను గెలిచినాడు. నేను కూడ దానిని గెలువవలెను. ఇంద్రుడు ఏకదశాక్షర ఛందమున "త్రిష్టుప్". ను గెలిచినాడు. నేను కూడ దానిని గెలువవలెను. విశ్వేదేవతలు ద్వాదశాక్షర ఛందమున "జగతి"ని గెలిచినారు. నేను కూడ దానిని గెలువవలెను.     34. వసువులు పదమూడు అక్షరముల ఛందమున త్రయోదశస్తోమమును గెలిచినారు. నేను సహితము వానిని గెలువవలెను. రుద్రులు పదునాలుగు అక్షరముల ఛందమున చతుర్దశస్తోమమును గెలిచినారు. నేను  సహితము వానిని గెలువవలెను. ఆదిత్యులు పదిహేను అక్షరముల ఛందమున పంచదశ స్తోమమును గెలిచినారు. నేను సహితము దానిని గెలువవలెను. అదితి పదహారు అక్షరముల ఛందమున షోడశస్తోమమును గెలిచినది. నేను సహితము దానిని గెలువవలెను. ప్రజాపతి పదిహేడు అక్షరముల ఛందమున సప్తదశస్తోమమును గెలిచినాడు. నేను సహితము దానిని గెలువవలెను.                 వాజపేయ యజ్ఞము సమాప్తము.         ఆలోచనామృతము     వేదము సనాతనము. పురాతనము. మహత్తమము. పవిత్రము. విశాలము. గహనము. ఉపమానమునకు అందనది.     వేదము అను పదము ఒక్కటి. కాని వేదము అనంతము. ఈ అనంత వేదమును ఆరాధించిన ఆరాధించుచున్న - ఆరాధించనున్న వారు అనేకానేకులు. ఒకసూర్యుదే ఒక్కొక్క పరిశోధకుని ఒక్కొక్క రీతిగా కనిపించును. ఒక్కవేదమనునది లెక్కకు మించిన పరిశోధకులకు లెక్కకు మించినరీతిగా అగుపించును.     వేదమును పరిశీలించిన  - వ్యాఖ్యానించిన విమర్శించినవారు అనేకులు. వీరిలో వేదమును అధ్యయనము చేసి సద్విమర్శలు - దుర్విమర్శాలు చేసినవారున్నారు. అధ్యయనము చేసి దుర్విమర్శించిన వారిని అధ్యయనము ఖండించవచ్చును.     కాని వేదమును అధ్యయనము చేయకయే వేదమును గురించి ఒక అభిప్రాయమును ప్రచారము చేసిన వారిని ఖండించుట అసంభవము. ఏలనన వారు ఎవరో తెలియదు. వారు ఏ ఆధారమున అపోహలు కలిగించినారో తెలియదు.     వేదమును గురించి అవ్యాఖ్య కువ్యాఖ్య చేసిన వారు రెండురకములు. ఒకరు సనాతనులము అనిపించుకొనవలెనను కొను స్వప్రయోజనపరులు. వీరు వాస్తవముగ సనాతనులు కారు. సనాతనపు ముసుగు వేసుకున్నవారు. వేదము వారిస్వంత ఆస్తిఅని భావించువారు. వీరికి ఏమియు తెలియదు. సర్వము వేదములందే ఉన్నది అనువారు రెండవరకము. పాశ్చాత్యుల మెప్పుపొందదలచి ఆదునికులము అనిపించు కొనవలెనను ఉబలాటము గలవారు. వీరిలో వామపక్షాల వారలమనిపించు కొనవలెనని జబ్బలు చరచువారు. మీరు వేదమును పనికిరాణి దానిగను- అందులో ఏదో  ఒకవర్గానికి ఉపయోగపడేది ఉందని ఒకప్రమాదకర అభిప్రాయాన్ని - వారికి తెలియకుండగనే - కనిపించినారు.     వేదము పాతకాలపు బొంత అని చెప్పడం విప్లవముగా భావించుచున్నారు.     ఇది ఒక వస్తువును చూడకయే దానిని గురించి వ్యాఖ్యనించుట. వీరు. తమను తాము Rationalists అనుకుంటారు! ఇదొక వింత!!     వేదమందంతట వైరాగ్యమున్నదని - ఈ లోకమునకు సంబంధించినది లేదని, సమస్తము పరలోకము గురించియే ఉన్నదని ఒకభ్రమ భారతదేశమున బహుళ ప్రచారమున ఉన్నది. ఇది వట్టిభ్రమ మాత్రమే! వైరాగ్యము మాత్రమే ఉపదేశించునది భారత సాహిత్యమున లేదనునది నా దృఢవిశ్వాసము.     భారతసాహిత్యము, తాత్త్వికము సాంతము మానవుని ఇహలోక జీవితమును సుఖశాంతులతో గడుపు ఉపాయములనే బోధించుచున్నవి. వేదమునందు ఇహలోకమును గురించియే వివరించి ఉన్నది. ఇది వాస్తవసత్యము.     వేదము మానవుని మహిమాన్వితునిగ దర్శించినది. మానవుని ఒక్కొక్కసారి దేవతలను మించిన వారిని చేసినది. వాస్తవమేమన్న దేవతలందరు మానవుని సుఖజీవనమునకు ఉపయోగ పడువారే!     సత్రస్య ఋద్విరస్యగన్మ జ్యోతిరమృతా అభూమ     దినం పృథివ్యా అధ్యారుహామావిదామ దేవాన్స్వర్జోతిః 8-52     సోమమా! నీవు సాక్షాత్తు యజ్ఞసమృద్ధివి. నీ వలన మేము ఆదిత్య రూపజ్యోతిని అందుకున్నాము. ఇక మేము మరణాంతము ధర్మపరులము అయినాము. మేము భూమి నుంచి లేచినాము. స్వర్గమును ఆరోహించినాము. ఇంద్రాది దేవతలను పరంజ్యోతిని తెలిసికున్నాము.     మానవుడు ఇన్ని సాధించగలడు! అందుకు ఒకటే షరతు - అతడు లోకమునకు కళ్యాణమును కూర్చుధర్మమును ఆజీవ పర్యంతము అవలంబించవలెను.     ఇది దైవత్వము సాధించు ఉపాయము. దైవత్వము ఆకాశమున కాదు. మానవుని యందున్నది, దానిని గుర్తించవలసి ఉన్నది. అది దుస్సాధ్యము కావచ్చును. అసాధ్యము మాత్రముకాదు.     ఈ అధ్యాయమున 31  నుండి 34 వరకు మంత్రములందు సమస్త దేవతలు గెలిచినా వాటిని మానవుడు తాను ఒక్కడే గెలువవలెనని సంకల్పించుచున్నాడు. మానవుని ఇంతకన్న మహామహునిగా కల్పించుటసాధ్యమా!     35. (రాజసూయమంత్రములు ప్రారంభము)     ఫాల్గుణశుక్ల దశమినాడు - అనుమతికిగాను - ఎనిమిది పాత్రలందు వండిన బియ్యపు హవిస్సు అర్పించబడును. అందుకు బియ్యమును రాతిమీదనూరవలెను. పడిపోయిన బియ్యమును స్రువమున నింపి దక్షిణాగ్నికి ఆహుతి ఇవ్వవలెను.     పృథివీ! ఈ పిష్టచరు నీభాగపుది. దీనిని స్వీకరించుము -స్వాహా.     (పంచవతీయ కర్మచేయుటకు దిశలందు ఆహవనీయాగ్నిని స్థాపించి ఆహుతులు అర్పించవలెను)     పూర్వదిశన ఆసీనులైన అగ్నినేతృక దేవతలకు స్వాహా.     దక్షిణదిశన ఆసీనులైన యమనేతృక దేవతలకు స్వాహా.     పశ్చిమదిశన ఆసీనులైన విశ్వేదేవతనేతృక దేవతలకు స్వాహా.     ఉత్తరదిశన ఆసీనులైన మిత్రావరుణ నేతృక దేవతలకు స్వాహా.     పైన ఉండి, పరిచర్యలందు కొను సోమనేతృక దేవతలకు స్వాహా.         36. (అయిదు చోట్ల ఏర్పరచిన ఆహవనీయాగ్నిని ఒక చోటచేర్చి ఆహుతులు ఇవ్వవలెను)     పూర్వదిశన ఆసీనులైన అగ్నినేతృక దేవతలకు స్వాహా.     దక్షిణదిశన ఆసీనులైన యమనేతృక దేవతలకు స్వాహా.     పశ్చిమదిశన ఆసీనులైన విశ్వేదేవతనేతృక దేవతలకు స్వాహా.     ఉత్తరదిశన ఆసీనులైన మిత్రావరుణ నేతృక దేవతలకు స్వాహా.     పైన ఉండి, పరిచర్యలందు కొను సోమనేతృక దేవతలకు స్వాహా.     37. (తండుల హొమము దక్షిణాగ్నిలో చేయవలెను)     అగ్నీ! నీవు శత్రుసేనను పరాభవించుట కాదు. దూరదూరములకు పారద్రోలుము. శత్రువులను దూరము చేసిన నీవు యజ్ఞమును నిర్వహించు యజమానికి బ్రహ్మవర్చస్సు ప్రసాదించుము.     38. నేను సవిత అనుశాసనమున ఉన్నవాడను. అశ్వినుల బాహువులతోనూ, పూషహస్తములతోను తండులములారా! ఉపాంశుగ్రహపుబలమున సోమముచే హొమము చేయుచున్నాను. స్వాహా.     (హొమము చేసిన దిశకు స్రువము త్రిప్పవలెను)     స్రువమా! నిన్ను రాక్షసుల వధకు త్రిప్పుచున్నాను. నేను ఈ రాక్షసవర్గమును హతమార్తును. ఇప్పుడు సమస్త రాక్షస వర్గము హతమారినది.     39. (ఎనిమిది దేవస్ హవిస్సులు ఇవ్వవలెను)     యజమానీ! సవితా దేవత నిన్ను అనుశాసనములకు అధిపతిని చేయవలెను. అగ్ని నిన్ను గృహస్థులకు అధిపతిని చేయవలెను. సోమసామ్రాట్టు నిన్ను వనవృక్షాదులకు అధిపతిని చేయవలెను. బృహస్పతి నిన్ను వాణికి అధిపతిని చేయవలెను. ఇంద్రుడు నిన్ను జ్యేష్ఠత్వమునకు అధిపతిని చేయవలెను. రుద్రుడు నిన్ను పశువులకు అధిపతిని చేయవలెను. సత్యానుశాసన మిత్రా వరుణులు నిన్ను ధర్మాధికారుల అధిపతిని చేయవలెను.     యజమానీ! ఈఅష్టదేవస్ హవిస్సుల దేవతలు నిన్ను సకల పదార్థముల అధిపతులను చేయవలెను.     (యజమాని వద్దకు వెళ్లి- స్రువమును కుడిచేత, యజమాని బాహువులను ఎడమ చేతపట్టుకొనవలెను. మంత్రము చెప్పునపుడు యజమాని తల్లిదండ్రులు, దేశకాలములను పెర్కొనవలెను.)     40. దేవసహవిర్భాగ దేవతలారా! మీరు ఈ యజమానిని శత్రురహితువి చేయండి. మహారాజ్య కార్యమున నిలుపండి. మహాజనరాజ్య కార్యమున నిలుపండి. ఇంద్రుడు పరమోత్కృష్ట బలమును ప్రసాదించును గాత. యజమాని పుత్రుని దేశవాసుల ఆధిపత్యమున నిలుపండి. కాని 'సోమ్కోస్మాకం బ్రహ్మణానాం రాజా' మా బ్రాహ్మణులకు మాత్రము సోమసామ్రాట్టే ప్రభువు అగును.     ఆలోచనామృతము     ఈమంత్రమున రాజకీయశాస్త్రజ్ఞులు ఆలోచించవలసినవి ఉన్నవి.     1. మహతేక్షత్రాయ, మహతేజ్యేష్ఠ్యాయ అన్నది ఇప్పటి రాష్ట్రపతి-గవర్నరు పదవుల వంటివలె ఉన్నది.     2. "జనరాజ్యాయ" అనిన ప్రజారాజ్యమునకు అని అర్థము. ఇదినేటి ప్రజాస్వామ్యము వంటిది కావచ్చును.     3. రాజు కొడుకును రాజును చేయుటకు దేశవాసుల అనుమతి అక్కర అయినట్లున్నది. ఇది నేటి ఎన్నికల వంటిది కాకున్నను ప్రజామోదము అవసరమైనట్లున్నది.     రామాయణమున రాముని యౌవరాజ్య పట్టాభిషేకమునకు దశరథుడు ప్రజల అనుమతి కోరినాడు. ప్రజలు ఆమోదించినారు:-     "రామమిన్దీవరశ్యామం సర్వశత్రు నిబర్హణమ్|     పశ్యామో యౌవరాజ్యస్థం తవ రాజోత్తమాత్మజమ్ ||     రాజు నిరంకుశుడు కాకుండుటకు ఈ నియమములు విధించినట్లున్నారు.     4. "సోమ్కోస్మాకం బ్రహ్మణానాం రాజా" అని మంత్రము ఎవరికి ఎవడు రాజయినాను బ్రాహ్మణులకు మాత్రము రాజు కాడని అర్థము.     నేను శ్రీ మహాభారతము రచించినపుడు బ్రాహ్మణుడనగా మేధావి అని అర్థము చెప్పినాడు.     మేధావులు రాజకీయశాసనమునకు లొంగక స్వతంత్రులైనపుడే తమ ఆలోచనలు అన్వేషణల వలన సమాజమునకు మేలుచేయగలరు.     నేడు సహితము రాజ్యసభకు జరుగు నిష్ణాతుల, మేధావుల ఎన్నికలందు ప్రజలు పాల్గొనరు.     శ్రీమహాభారతమున పాండవులు లక్క ఇంటినుంచి తప్పించుకోని ఏకచక్రపురమను అగ్రహారమునాకు చేరుకున్నారు. అక్కడ దుర్యోధనుని రాజ్యము సాగదు. ఏలనన బ్రాహ్మణ అగ్రహారములు రాజశాసనములోనివి కావు. ఈవిషయములు తెలిసియే పాండవులు భద్రతకొరకు అగ్రహారమునకు చేరినారు.     రాజులకు జరుగు సంధులు మున్నగు వాని నుండి దేవాలయభూములు, బ్రాహ్మణ అగ్రహారములకు మినహాయింపు ఉండెడిది.     బ్రహ్మణులను ఒకజాతిగా కాక మేధావులనుగా చెప్పుకున్నపుడు వేదము మేధావులగు వారికి ఎంతో స్వాతంత్ర్యము ప్రసాదించినది.     "బ్రహ్మణోవై సర్వేదేవతాః" మేధావులే కదా అందరు దేవతలు - అందరి దేవతలు.                                దాశరథి రంగాచార్య విరచిత            శ్రీమదాంధ్ర వచన శుక్ల యజుర్వేద సంహితయందలి                    వాజపేయో రాజసూయరంభాన్తమను                   తొమ్మిదవ అధ్యాయము ముగిసినది.         
24,382
        "అవును, చినబాబూ!" సగర్వంగా అన్నాడు రాజు.     "ఆ పుస్తకాలన్నీ తీసి తగలబెట్టు! కారులో ఎంత తుడిచినా పోని రక్తపు మరకలకి ఆన్సర్ దొరుకుతుంది!" డోరు గట్టిగా లాగివేసి కారుని పోనిచ్చాడు.     తన కారులో చెవి కమ్మ పడిందనగానే అందరూ అనుమానించేవాళ్ళే! రసవత్తరమైన కథలల్లుకొనే వారే! ఛీ! ఏం మనుషులు? చిరాకుగా అనుకొన్నాడు.     ఆఫీసులో కూర్చొన్నాడేగాని పనిమీద మనసు లగ్నం కాలేదు.       అర్జంట్ అని వ్రాసి ఉన్న ఫైళ్ళని ముందుకు తీసుకొన్నాడేగాని ఒక్క పేజీకూడా త్రిప్పి చూడలేదు.     జేబులో వేసుకొచ్చిన నక్షత్రపు చెవికమ్మని మాటిమాటికి తీసి చూస్తున్నాడు. ఆకమ్మకే అందాన్ని తెచ్చే ముద్దమందారంలాంటి ఆమె ముఖాన్ని గుర్తు తెచ్చుకొంటున్నాడు. గుర్తు తెచ్చుకొంటున్న కొద్దీ అతడి పెదవులమీద ఒక మధురమైన మందహాసం విరుస్తూంది!     అందమైన పిల్లేకాదు!     విధి నిర్వహణలో మానం ప్రాణం చూసుకోని సాహసవంతురాలు!     అటువంటి సాహసం సుప్రసన్నాచారి కూతురైన అపురూపకి మాత్రమే ఉండాలి! ఇదెలా సాధ్యం? తన అపురూపను గుర్తుతెచ్చే ఆ కళ్ళు. ....ఆ రూపం.....     ఆ రోజు జమీందారుగారి తోటబావిలో ఈతపడి వచ్చేస్తున్నారు, నలుగురైదుగురు ఒక జట్టుగా.     "ఓరి దేవుడోయ్! నా మనమడు బావిలోపడి మునిగిపోయాడు, దేవుడోయ్! నా కొడుకు కోడలికి ఏం చెప్పను దేవుడోయ్!" అంటూ ఆక్రందనలు వినబడ్డాయి.     అందరూ బావి దగ్గరికి పరుగెత్తుకు వచ్చేశారు.     బావిలో మెట్లమీద బట్టలమీద బట్టలుతకడానికి వచ్చిన నాగమ్మ గుండెలుబాదుకొని ఏడుస్తూంది! "పిల్లాడు నా కళ్ళముందే మునిగిపోయాడు, దేవుడోయ్! నాకు ఈత రాదు, దేవుడోయ్!"       "ఎక్కడ మునిగిపోయాడు?" అపురూప అడిగింది.     "ఈడనే, తల్లీ! ఈ మెట్ల అంచున్నే స్నానం చెయ్యరా అంటే వాడు వినకుండా లోపలికిపోయి మునిగిపోయిండు! వాడికి ఈతరాదు!"       అపురూప కొద్దిసేపు తదేకంగా నీళ్ళవైపు చూసింది.     నిశ్చలంగా ఉన్న నీళ్ళలో ఒకచోట గాలి బుడగలు వస్తున్నాయి.     ఇక ఆలస్యం చేయలేదు! వెంటనే నీళ్ళలోకి దూకేసి మరునిమిషంలో కుర్రాడి జుట్టుపట్టుకొని ఈడ్చుకువచ్చి మెట్లమీద బోర్లాపడుకోబెట్టి, వాడిచేత త్రాగిన నీళ్ళన్నీ కక్కించేసి, కాళ్ళు చేతులురాచి వాడు కళ్ళుతెరిచేలా చేసింది అపురూప.     ఆ చిన్న వయసులో.......అన్నీ తెలిసినదానిలా......     "మునిగిన వాళ్లని తీయాలంటే నాకు భయం వేసింది. వాళ్ళని మం పట్టుకొంటే వాళ్ళు మనగొంతు పట్టేసి పైకిరానివ్వరట!" అన్నాడు ప్రభు.     "ఆ మధ్య చెర్లో మునిగిపోతున్న తిప్పడినివాళ్ళన్న రక్షించబోతే అలాగే అయింది!" అన్నాడు మురళి.     అపురూప ఆ ముసలావిడ కి దేవతే అయింది. ఆ సాయంత్రం తోటలోకాసిన జామపండ్లు బుట్టనిండా తెచ్చి సమర్పించుకొంది సుప్రసన్నాచారికి.     "పిల్లకాదు! రత్నమయ్యా మీ బిడ్డ! అటువంటి బిడ్డనుకన్నందుకు మీరు గర్వపడాలయ్యా! నా ఇంటి దీపం ఆరిపోకుండా చేసింది ఈ చిన్నారి తల్లి!" అంటూ ఒకటే పొగిడింది.       "పసిపిల్లను అంతగా పొగడకు. ఆయుక్షీణం కాగలదు. అసలిదంతా దొరగారి బావి చలువ! ఆగంగది మంచి మనసు! పిల్లలు అల్లరిగా ఊగిసలాడినా, అల్లకల్లోలం చేసినా ఆ తల్లి చిరునవ్వుతో పిల్లల్ని చల్లగా స్పర్శిస్తుందేగాని ఎన్నడూ ఆగ్రహించి ఎరుగదు! వెళ్ళి ఆగంగకు సమర్పించుకో జోడు కొబ్బరికాయలు! నీ కృతజ్ఞతలు ఆ తల్లికే చెప్పుకో"     అంత ఉన్నతమైన సంస్కారం ఆ తండ్రిదీ!     ప్రాణాలకు సైతం వెనుదీయని సాహసం ఆ కూతురిదీ!     మళ్ళీ ఇన్నాళ్ళకు అలాంటి వ్యక్తిని చూస్తున్నాడు     అపురూప పెద్దయితే ఇలాగే ఉంటుందనిపించే రూపం! వింత సోయగాల్ని వెదజల్లే అవే పెద్ద పెద్ద కళ్ళు!     ఒకసారి వాళ్లింటికి వెళ్ళాలి! కుటుంబాన్ని చూడాలన్న ఆరాటం!       ఫైళ్ళని ప్రక్కకి నెట్టేసిలేచాడు శిశిర్.
24,383
                                         11     చి|| ల|| సౌ|| శకుంతలకు,     మీ అమ్మ దీవించి వ్రాయునది .కార్డుతప్ప వ్రాయని నేను కవరు దానిలో వ్రాసిన అరడజను కాగితాలు చూచి, ఇది వ్రాసింది అమ్మేనా! అని ఆశ్చర్యపోతున్నావా? మరి__ఇక్కడ జరిగిన సంఘటనలు చూచినట్లయితే నీకూ ఆశ్చర్యం కలగక తప్పదు.     ఈ వూళ్ళోనే పాండురంగంగారని హెడ్ మాష్టరు వున్నారు. బహు కుటుంబీకుడు. వారి పెద్ద అమ్మాయి సుధారాణి వీణ డిప్లమో పాస్ అయింది. చక్కని కంఠము. యీ వూళ్లోనే అక్కడక్కడ పాటకచ్చేరీలు చేసిందట. కృష్ణ చాలాసార్లు సుధాగానం విన్నాడట. అప్పుడు వారిరువురికీ పరిచయం అయింది. సుధ వాళ్ళ వాళ్ళతో చెప్పి వివాహం చేసుకుందామనుకున్నారట. ఓ రోజు కృష్ణ సుధ మాట్లాడుకోవటం సుధ నాన్నగారి దృష్టిలో పడింది. చివాట్టుపెట్టి సుధను యింటికి తీసుకెళ్ళారట.     వాళ్ళ వాళ్ళు పెళ్ళికి అభ్యంతరం చెప్పాల్సిందేకాని అమ్మ దేనికీ అడ్డుచెప్పదు, నీతిమాలిన పనిచేస్తే తప్ప తెలిసిన అమ్మాయిని పెద్దల అనుమతితో పెళ్ళిచేసుకోటం నేరంకాదని తెలిసి సరాసరి కృష్ణ వాళ్ళింటికి వెళ్ళాడుట. వెళ్ళి......"మా అన్న కట్నం తీసుకోకుండా పెళ్ళి చేసుకున్నాడు. నేనూ కట్నం తీసుకోను. నమ్మించి మోసగించే రకాన్ని కాదు. వొండొరులం యిష్టపడ్డాము. మీరు ఊ అంటే మా అమ్మగారిని తీసుకువస్తాను." అని చెప్పాడుట.     అప్పుడు వాళ్ళేమన్నారో తెలుసా శకూ! బహుశా నీ వూహకు అందదేమో? నేను వాళ్ళకు తెలుసట. వాళ్ళేమన్నదీ వివరం రాసేబదులు రెండు ముక్కల్లో రాస్తాను. "ఓహో! ఆతల్లి కన్నబిడ్డవా? అలా చెప్పు. పోలికలెక్కడికి పోతాయి. మా యింటావంటా లేదు. ప్రేమలు పెళ్ళిళ్ళు" అంటూ నాలుగు దులిపారట. కృష్ణది వూరుకొనే తత్వంకాదు తననవలసింది అని వచ్చేశాడట. నాలుగురోజుల తరువాత ఎలా పోష్టు చేయగలిగిందోగాని సుధ వద్ద నుంచి కృష్ణకు లెటర్ వచ్చింది.....తనని మేనమామకిచ్చి పెళ్లి చేయటానికి ముహూర్తాలు పెట్టబోతున్నారట. నా పెళ్లి చేసుకోటానికి నాకు హక్కు వుంది. మైనరు తీరింది. ఫలానారోజు నీకోసం ఎదురుచూస్తుంటాను నన్ను తీసుకెళ్ళు. లేకపోతే యీ లోకం నుంచే శలవుతీసుకుంటాను" అని.     మధ్యాహ్నం షాపుకి లెటర్ వచ్చిందిట. రెండు రోజులక్రితం అందవలసింది, ఆరోజు అందింది. షాపునుంచి అటే వెళ్ళి సుధను వెంటబెట్టుకొచ్చాడు కృష్ణ.     కృష్ణ చెప్పింది విన్నతరువాత మందలించలేకపోయాను. అలా అని వూరుకోలేదు. "ప్రేమ గుడ్డిది. మగవాడిని నమ్మి ఆడది వంటరిగా బైటకు రాకూడదు." అని సుధతో అంటే ఏమందో తెలుసా? "ఆయన వ్యక్తిత్వం అవగాహన చేసుకునే బైట కాలుపెట్టాను" అంది.     "రుక్మిణి రాయబారం పంపితేనే కదమ్మా శ్రీకృష్ణుడు కదిలి వెళ్ళింది." అన్నాడు కృష్ణ.     కృష్ణ, సుధలలాంటి ప్రేమికులు ఎందరోవుండవచ్చు. కాని......కార్యాచరణకు వస్తే అందరూ వెనకడుగు వేసేవారే, యిరువురిలో ఒకరు మోసకారులయితే రెండోవారి భవిష్యత్తు అంధకారమేకదా?     సుధ నాన్నగారు మరికొందరువచ్చి పోట్లాడారు. రిజిష్టర్ మేరేజీ చేసుకున్నామని కృష్ణ దభాయించాడు. అక్కడితో కాస్త తగ్గారు. యీమధ్య ఆడవాళ్ళుమాత్రం చాటుగావచ్చి చూచివెళ్ళారు.     ఎవరెట్లాంటివారయినా సుధ చాలా మంచిపిల్ల. కృష్ణ ఎన్నిక సరి అయినది. పరిస్థితులు చక్కబడింతరువాత నలుగురి ఎదుట కృష్ణ, సుధల వివాహం జరుగుతుంది. ఆరోజు వరకు ఆగుతామన్నారు. సుధ మనింట్లోనే వుంది. రఘు, రాధ కూడ సుధంటే యిష్టం చూపుతున్నారు. "మామగారిచేత కాళ్ళు తరువాత కడిగించుకోవచ్చు. రిజిష్టర్ మేరేజి ముందు చేసుకోటం మంచిది" అని రఘు అన్నాడు. ఇదే విషయం కృష్ణ ఆలోచిస్తున్నాడు.     పరిస్థితులు చక్కబడుతున్నాయి, అనుకుంటూవుండగా కనీ వినీ ఎరుగని సంఘటన జరిగింది. అది మీ నాన్నగారి రాక__     ఆశ్చర్యపోతున్నావా శకూ? ఏది మంచిది జరుగుతున్నదో! ఏది చెడుకి జరగనున్నదో! ముందు యింకేం జరగనున్నదో! విధికి తలవంచాల్సిందేతప్ప కాలానికి ఎదురీది నిలిచే శక్తి నాలో నశించింది.     ఇంతకాలమూ యీ సంసారం నడిపింది నేనా? అనుకుంటే, నిజమా అనిపిస్తున్నది.     "పార్వతికి నోట్లో నాలుకలేదు. పార్వతి చాలా మంచిపిల్ల. ఓమాట అన్నా తనను కాదన్నట్టు పోతుంది. పార్వతి యీ కాలం పిల్లకాదు భయస్తురాలు. తెలిసిన వారందరూ నాగురించి ఓనాడు యివేమాటలన్నారు. పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని నా కాళ్ళమీద నేనిలబడితే, లోకందృష్టిలో గడుసుదాన్ని, అన్నింటికీ తెగించిన మొగరాయుణ్ని అయ్యాను.     మగవాడి అండలేని ఆడది సచ్చరితురాలయినా అపవాదులకులోటువుండదు. అంతేకాదు, అణగతొక్కటానికి చూస్తారు. లొంగనప్పుడే ఎన్నిపేర్లయినా వచ్చేది. అనుభవంలో గ్రహించిన సత్యం యిది.       జీవిత పోరాటంలో గెలుపు నాదే అయినా అలసిపోయాను శకూ! దేహమూ, మనసు విశ్రాంతి కోరుతున్నాయి. ఇదే సమయంలో నాన్నగారు వచ్చారు. పిన్ని వద్దకు వెళ్ళి ఎడ్రస్ కనుక్కొని వెతుక్కుంటూ నాకోసం వచ్చారు.     "పార్వతీ! నీకు తీరని అన్యాయం చేశాను, పిల్లల పట్ల తండ్రిగా నాధర్మం నిర్వర్తించకుండా ముఖం తప్పించాను. గాలికి తిరగటం అలవాటు అయి నాటక సమాజమే నా ఊపిరి, ప్రాణం, అందుకే జన్మ ఎత్తానని మురిసిపోయాను. సంసారము, బరువు బాధ్యతలు కొద్దిగానన్నా గుర్తెరిగినవాడినయితే నా జీవితం మరోవిధంగా వుండేది.     నాటకాల్లో నాయకుడిగా వేషంవేస్తున్న రోజుల్లో నిజజీవితంలో కూడా రాజకుమారుడిలా బ్రతికాను. అఖండ కీర్తిగౌరవాలు, వాటితో అంధుడిని అయ్యాను.     క్రొత్తనాటక సమాజాలు వెలిశాయి. క్రొత్త పద్ధతులు ప్రవేశించాయి. సరిక్రొత్త నటులు పెరిగిపోయారు. మేమేస్తున్న ప్రతినాటకం ఘోరంగా దెబ్బతిన్నాయి. మాలో మాకు చీలికలు ఏర్పడ్డాయి. ఎవరిదోవవారు చూచుకున్నారు. ఒంటరిగా మిగిలిపోయాను. ఇంటికి రావటానికి ముఖం చెల్లలేదు. దేశంమీద పడ్డాను. నాటకసమాజంలో తప్ప నిజ సమాజంలో జీవించటమే చేతకాని నేను పిడికెడు మెతుకుల కోసం నరకం చవిచూచాను. ఏమీచేయలేక నీవున్నావనుకుంటూ వచ్చాను పార్వతీ! దేహీ అంటూ నీపంచ చేరాను. నీ నిర్ణయం ఏదయినా సంతోషంగా స్వీకరిస్తాను." అంటూ మీ నాన్నగారు అతిదీనంగా అంటుంటే ఆ సమయంలో ఏం చేయాలి? నీవే చెప్పు శకూ!
24,384
                               సెక్స్ ఎడ్యుకేషన్                                 పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ ఉండాలని కొందరూ, ఉండకూడదని మరికొందరూ గొడవ పడటం మాకాలనీ వాళ్ళందరం న్యూస్ పేపర్స్ లో చూస్తూనే ఉన్నాం. కానీ ఎవ్వరం దానిని గురించి పట్టించుకోలేదు. ఆ టాపిక్ కంటే పిల్లలకు సరయిన తిండీ బత్తా, విద్యా ఉండాలా అక్కర్లేదా అనే టాపిక్ గురించి గొడవ చేస్తే సమంజసంగా ఉంటుందని మా అభిప్రాయం. అయితే అనవసరమయిన టాపిక్ గురించి గొడవ పడటం మనదేశం ప్రత్యేకత కాబట్టి మాకిష్టం లేకపోయినా ఆ టాపిక్ మా నెత్తిమీద కొచ్చి పడింది.     సెక్స్ ఎడ్యుకేషన్ పిల్లల పాఠ్యాంశాలలో చేర్చాలా వద్దా అనే విషయం స్టడీ చేయటానికి ప్రభుత్వం ఓ కమిటీని వేసింది. మామూలుగా ఏ కమిటీ అయినా ముందు విదేశాలకెళ్ళి పోతుంది. గనుక ఆ కమిటీ కూడా అమెరికా, డెన్మార్క్ దేశాలు పర్యటించి ఆ తర్వాత హైద్రాబాద్ చేరుకుంది. హైద్రాబాద్ లో స్టడీ చేయటం కోసం వాళ్ళు మా కాలనీని కూడా ఎన్నుకున్నారు.     ఆదివారం నాడు ఆ కమిటీ వాళ్ళు మా కాలనీ కొస్తారు కాబట్టి- మేమంతా ఎక్కడికీ వెళ్ళకుండా పిల్లలందరితోనూ సిద్ధంగా ఉండాలని మా కాలనీ సెక్రటరీ రంగారెడ్డి నోటీస్ పంపించాడు.     దొరికిన అవకాశాన్ని ఏమాత్రం వదలని ఆర్గనైజింగ్ సెక్రటరీ శాయిరామ్- మామూలుగానే- తెల్లారకుండానే వచ్చి మమ్మల్నందరినీ నిద్ర లేపేశాడు. ఇంక చేసేదిలేక అందరం ఎనిమిది గంటలకల్లా రడీ అయి పిల్లలందరినీ తీసుకుని కాలనీ మధ్య షామియానాలోకి చేరుకున్నాము.     మరికాసేపట్లో కమిటీ వాళ్ళు వచ్చేశారు కార్లో.     ఆ కమిటీ అధ్యక్షుడు లేచి మైక్ లో మాట్లాడాడు.       "లేడీస్ అండ్ జెంటిల్మన్! మేము ఇక్కడికెందుకొచ్చామో మీ అందరికీ తెలుసు! మానవుని జీవితంలో ఆహారం తర్వాత ముఖ్యమయిన విషయం సెక్స్! అంత ప్రాముఖ్యత ఉన్న సెక్స్ ని మనందరం నిర్లక్ష్యం చేస్తున్నాం. దాన్ని గురించి బేసిక్ గా ఏమీ తెలీని పరిస్థితిలో మనమున్నాం! ఇందువల్ల నష్టం ఎవరికి? మనకీ, మన దేశానికీ! మనకీ, మన దేశానికి! కనీస సెక్స్ విద్య లేకపోవటం మూలాన ఎంతోమంది పిల్లలు పెరిగి పెద్దవారయి ఆరోగ్యానికి హాని తెచ్చుకుంటున్నారు. మేము అమెరికాలోనూ, డెన్మార్క్ లోనూ చేసిన స్టడీ ప్రకారం అక్కడ పెద్ద క్లాసులో ఉన్న పిల్లలందరూ సెక్స్ ఎడ్యుకేషన్ నేర్చుకుంటున్నారు. దానివల్ల వారు డాక్టర్లను సంప్రదించే అవసరం లేకుండానే ఎన్నో విషయాలను తెలుసుకుంటున్నారు. అదొక గొప్ప రివల్యూషన్. కనుక మనదేశంలో కూడా సెక్స్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టాలనే అభిప్రాయానికి మేము వచ్చాం. అయితే అసలు ముందు మన తెలుగు బాలబాలికలకు- ఆ విజ్ఞానం ఎంతవరకుందో- ఏ క్లాస్ నుంచీ వారికా పాఠాలు ప్రవేశపెట్టాలో నిర్ణయించడం కోసం స్టడీ చేయడానికి మీ కాలనీ కొచ్చాం."     అందరం తప్పట్లు కొట్టాము.     ఆ తరువాత శాయిరామ్ మాట్లాడాడు.     "సోదర సోదరీమణులారా! ఇది నిజంగా ఒక అపూర్వ అవకాశం! కమిటీ అధ్యక్షులవారు చెప్పినట్లు మన బాలబాలికలందరికీ సెక్స్ ఎడ్యుకేషన్ ఎంతో అవసరమని నా అభిప్రాయం. మన బాలబాలికలు కూడా అమెరికాలోని బాలబాలికల స్థాయి కెదగాలని నా కోరిక-"     మళ్ళీ తప్పట్లు కొట్టామందరం.     ఆ తరువాత గోపాల్రావ్, జనార్ధన్ కూడా మాట్లాడతామన్నారు గానీ బలవంతం చేసి ఆపేశాము. కమిటీ వాళ్ళ స్టడీ మొదలయిపోయింది.     మా కాలనీ పిల్లలు కొంతమందిని స్టేజి మీదకు పిలిచారు వాళ్ళు. పిల్లలంతా హుషారుగా స్టేజ్ ఎక్కి నిలబడ్డారు.     కమిటీ అధ్యక్షుడు మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాడు మళ్ళీ.     "లేడీస్ అండ్ జెంటిల్మన్! ఈ పిల్లల్లో అయిదేళ్ళ వయసుగల వాళ్ళ నుంచీ పదిహేనేళ్ళ వయసున్న వాళ్ళ వరకూ ఉన్నారు. వీరందరికీ పాఠ్య పుస్తకాల్లో హిస్టరీ, సైన్స్ లెఖ్ఖలు లాంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి వాటిల్లో ఏ ప్రశ్నలడిగినా వీళ్లు సమాధానాలు చెప్పగలుగుతారు. అదే సెక్స్ విజ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలడగండి. ఒక్క ముక్క కూడా చెప్పలేరు ఎందుకని? మనం వీరికి సెక్స్ ఎడ్యుకేషన్ ఇవ్వటం లేదు కాబట్టి- ఇది నిజంగా మనందరం సిగ్గుపడాల్సిన విషయం. ఈ 20వ శతాబ్దంలో కూడా- మన పిల్లలకు అన్నీ తెలుసుగానీ తామెలా పుట్టిందీ వారికి తెలీకపోవడం దారుణం!"     అందరికీ ఆమాట నిజమేననిపించి సిగ్గుతో తలలు వంచుకున్నాం.     "ఆయన్జెప్పింది నిజమేరా భాయ్! మన పోరగాళ్ళ గురించి మనం సోంచాయించనేలేదు-" అన్నాడు యాదగిరి.     "అవును! పాపం వాళ్ళు పెద్దాళ్ళయ్యాక మనలాగానే సెక్స్ గురించి ఏమీ తెలీని అమాయకులయిపోతారు" అన్నాడు గోపాల్రావ్.     "నిజంగా వాళ్ళను చూస్తే జాలేస్తోంది" అన్నాడు చంద్రకాంత్.     కమిటీ అధ్యక్షుడు పిల్లల వేపు తిరిగాడు.     "చూడండి పిల్లలూ! మనకు స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చిందో చెప్తారా?"     పిల్లలంతా మొఖాలు చూసుకున్నారు.     "ఫిబ్రవరి పదిహేనో తారీఖు-" అన్నాడొకడు కొద్దిక్షణాలయాక.     ఓ ఆడపిల్ల కిసుక్కున నవ్వింది.     "ఛీ తప్పు! జనవరి ఇరవై ఆరు" అంటూ సరిచేసింది వాడిని.     "ఛీ కాదు! ఆగస్ట్ ఇరవై ఆరు" అంది మరోపిల్ల. ఆ తరువాత అందరూ ఎవరికిష్టమొచ్చిన తారీఖు వాళ్ళు చెప్పటం ప్రారంభించారు.     "మార్చి పదకొండు 1978, అక్టోబర్ రెండో తారీఖు, జనవరి ముప్పైరెండు" ఇలా సాగిపోయింది.     మా అందరికీ వాళ్ళమీద కోపం ముంచుకొచ్చింది. ఇంచుమించుగా ప్రతి క్లాసు పుస్తకంలోనూ, ఆ తారీఖు స్పష్టంగా ఉంటుంది. అయినా పదోక్లాసు పిల్లలవరకూ ఎవరికీ తెలీలేదంటే-     యాదగిరి కోపంగా వాళ్ళ కుర్రాడిని చావగొడతానని బయలుదేరాడు గానీ మేమంతా వెనక్కు లాగేశాం.
24,385
    "ఏమైంది మా వాడికి?"అని వినిపించగానే ఇద్దరూ మెట్లవైపు చూశారు.     సాక్షాత్తూ ఆ శ్రీమన్నారాయణుడు శంఖు, చక్రాలతో దర్శనమిచ్చినట్టు ఎడమచేతిలో విస్కీగ్లాసు, కుడిచేతిలో సిగరెట్ తో కనిపించాడు పూర్ణానందం.     ఆయన నరేష్ దగ్గరకొచ్చి "బాబూ, నా జేబులో వక్కపొడి పొట్లం వుంది. దాన్ని కాస్తంత తీసి న నోట్లో రెండు పలుకులు వేయి. వక్కపొడి తిని, సిగరెట్ దమ్ము పీలిస్తే తప్ప మజా తెలియదు" అన్నాడు.     ఆయనను ఏడుపు ముఖంతో చూస్తున్నాడు ప్రసాద్.     నరేష్ వక్కపొడి తీసి ఆయనచేతిలో పెట్టాడు. వక్కపొడిని నోట్లో వేసుకుని సిగరెట్ వెలిగించుకున్నాడు పూర్ణానందం.     "బాబూ నరేష్. ఈ రోజు నువ్వు ఆఫీస్ కి లీవ్ పెట్టావని తెలిసింది. మా పాలవాడు ఇంకా రాలేదు. కాసేపు నువ్వు అలా చేయి కలిపితే పేకాడుకోవచ్చు. పేకలు ఎడమ జేబులో వున్నాయి. వాటిని కూడా తీసుకో నాయనా" అన్నాడు ఆయన.     "లేదండీ! నాకు పేక రాదు. మీ పాలవాడు మరి కాసేపట్లో వచ్చేస్తాడు. వాడితో ఆడుకోండి" రెండు చేతులూ జోడించి తనను వదిలేయమన్నట్టు చెప్పాడు నరేష్.     "పుడుతూనే ఎవరికీ పేకరాదు బాబూ! మా పాలవాడిక్కూడా రాదు. హ్యాండ్ లేకపోతే నేర్పించాను. వాడిప్పుడు అద్భుతంగా ఆడతాడు. ఒక్క పాలవాడేమిటి! మా ఇంటికి వచ్చే ప్రతి ఒక్కరికి ఈ ఆట నేర్పించాను. ఆఖరుకి మా ఇంటికొచ్చే దోబీ దానికి కూడా. అదిప్పుడు క్లబ్ లో ఆడుతోందట. నిన్న రమ్మంటే రాలేదు. నాతో ఆడడం నామోషీ అట. క్లబ్బులో తప్ప ఆడనని వెళ్ళింది."       "లేదండీ! నాకు పేక చచ్చినారాదు"        "చచ్చిపోయాక వచ్చేదేముంది? బతికున్నప్పుడే జీవితాన్ని అనుభవించాలి."     "లేదు సార్! ఈరోజు నాకు అర్జెంట్ పనుంది."     నరేష్ తో ఇక లాభం లేదని కొడుకువైపుకు తిరిగి "నువ్వు ఆఫీసుకు లీవ్ పెట్టి నాతో కూర్చోరాదట్రా" అని అడిగాడు.     ఆ మాటలకు వళ్ళు మండిపోయింది ప్రసాద్ కు "నేను కూర్చుంటే మీతో పేక ఆడను. చెడుగుడు ఆడతాను. అప్పుడు మీ చేయీ, కాళ్ళూ విరిచేస్తాను. దాంతో పీడ విరగడైపోయింది" అని కాసేపాగి "అయినా చిరంజీవి ఏ సినిమాలో అయినా పేక ఆడాడా?" అని అడిగాడు.         "ఏమో సుపుత్రా! చిరంజీవి చిట్టా అంతా నీ శ్రీమతి దగ్గరుంటుంది. పోయి అడుగు . నిన్న రాక్షసుడిలో ఒక పాటకు చిరంజీవి ఎన్ని డ్రస్ లు మార్చాడని ఈ వీధిలోని ఇద్దరు ఆడవాళ్ళూ పేచీపడి, కరెక్టు ఆన్సర్ కోసం కోడలు పిల్ల దగ్గిరకొచ్చారు. వాళ్ళిద్దరూ చెప్పింది తప్పని, ఆ పాటలో చిరంజీవి మొత్తం ఆరు డ్రస్ లు వేసుకున్నాడని , ఆ డ్రస్ ల కాంబినేషన్ కూడా కోడలు పిల్ల చెప్పింది. అలా వుండాలి మనిషంటే, నువ్వూ వున్నావు ఎందుకు! ఒట్టి అసమర్ధుడివి" అన్నాడాయన.     "అవును నేను అసమర్ధుడను కాబట్టి నీ ఆటలూ, దాని ఆటలూ ఈ ఇంట్లో చెల్లుబాటవుతున్నాయి" అని ఘీంకరించాడు ప్రసాద్.     "నరేష్! నేను వెళుతున్నానయ్యా! చేతులు పీకుతున్నాయి. పేకముక్కల్ని పట్టుకుంటే తప్ప చేతుల వణుకు ఆగదు" అని పూర్ణానందం వెళ్ళిపోయాడు.     "చూశావా!" ప్రసాద్ ఆయన వెళ్ళిన వైపే చూస్తూ అన్నాడు.     "చూశాను సార్."     "ఏం చేయాలో అర్థం కావడంలేదు. నీ సలహాలు విని ఆయనకు వక్కపొడి దగ్గర్నుంచీ అన్నీ అందించాను. ఇప్పుడు ఆయన సకల గుణాభిరాముడు అంటారు చూశావా అలా ఆయన సకల దుర్గుణాభి రాముడయ్యాడు మరి నన్ను ఇప్పుడు ఏం చెయ్యమంటావ్?"     "సలహా చెప్పమంటారా?" సందేహంగా అడిగాడు నరేష్.     ఆఁ సలహా చెప్పమనే కదా నేను నీకు నా సమస్యల్ని చెప్పడం."     "అయితే ఈసారి ఆయన విస్కీ బాటిల్, సిగరెట్, వక్కపొడి, పేకలు ఎత్తుకున్నప్పుడు వాటినన్నింటినీ చేతుల్లోకి తీసుకుని రేస్ లకు వెళ్ళమనండి. ఆ రేస్ లను చూస్తూ మిగిలిన అలవాట్లను మానేస్తాడు ఆ రేస్ ల పిచ్చిని నిదానంగా కంట్రోల్ చేయవచ్చు ."     "ఇదీ బాగానే వుంది ట్రై చేసి చూస్తాను."     ఏదో ఆలోచిస్తూ ప్రసాద్ వెళ్ళిపోయాడు.     ఇక బయటికి వెళ్ళడానికి బద్ధకంగా అనిపించి తలుపుతీసి లోపలికెళ్ళి మంచం మీద కూలిపోయాడు నరేష్.     రజనీని మనసులో తల్చుకుంటూ వుండిపోయాడు.     కాసేపయ్యాక ఆకలిగా అనిపిస్తే రాజా చేత టిఫిన్, తెప్పించుకుందామని పైకి లేచాడు.        పిట్టగోడ దగ్గరికి వచ్చి రాళ్ళపల్లి ఇంటివేపు చూశాడు.     వరండాలో మంచం మీద స్వప్న, రాజా కూర్చుని వున్నారు.     "రాజా" పిలిచాడు.     వాడు తలపైకెత్తి చూడలేదు.     స్వప్న వాడి చేతిలో ఐదుపైసల నాణెం వుంచి "నరేష్ పిలుస్తున్నాడు. చేయి తడిచింది గదా తల పైకెత్తు" అంది.     వాడు నరేష్ వైపు తిరిగి "ఏం మామయ్య?" అని గట్టిగా అరిచాడు.     "టిఫిన్ కావాలి."     "వస్తానుండు."     వాడు మంచం పైనుంచి లేచి, గేటు తీసుకుని పైకి వచ్చాడు.     నరేష్ వాడి చేతిలో అయిదు రూపాయల నోటుపెట్టి "పూరీలు నాలుగు తీసుకురా. మిగిలిన చిల్లరలో నువ్వో పది పైసలు తీసుకో" అని చెప్పాడు.        "రెండు పూరీలు తేవడానికి పదిపైసలు. నాలుగు పూరీలైతే ఇరవై పైసలు ఇవ్వాల్సి వుంటుంది."     నరేష్ ఏం చెబుతాడోనని వాడు చూస్తూనే వున్నాడు.
24,386
    "ముగ్గుర్ని కన్నాను. ఇవేం నొప్పులో నాకా మాత్రం తెలీదా! ఇవి ఆ నొప్పులే. కడుపులో ఉన్నవాళ్ళు వీక్ గా ఉంటే ముందే నెప్పులొస్తాయని 'భ్రాంతి' వారపత్రికలో సెక్స్ డాక్టర్ అమరంగారు ఒకాయన ఇలాంటి ప్రశ్నే వేస్తే ఇలాంటి జవాబే ఇచ్చారు. న అకేందుకో అనుమానంగా ఉంది. ఆస్పత్రికి వెళదాం" బిక్కమొహం వేసుకోని చెప్పాడు పర్వతేశ్వరరావు.         "ఎంత చచ్చినా నా మొగుడు ఏడవక తప్పుతుందా" అందిట అనకటికొకామె. ఏం చేస్తాం మీరు చెపితే వినరు. అవస్థా నాకు తప్పదు. నేస్పత్రికి వెళదాం పదండి." అని భర్తతో చెప్పి పెద్ద వాణ్ని రిక్షా తీసుకు రమ్మని పంపించి తను గుడ్డలు సర్దడం మొదలెట్టింది.         మరో పది నిమిషాల తర్వాత ఆ భార్య భర్త ఎక్కినా రిక్షా ఆస్పటల్ వేపు బయలుదేరింది.                                                 *    *    *    *         ఆ ఇంట్లో-         గుర్నాధం, వనజాక్షి చిలకా గోరింకల్లాంటి దంపతులు. వాళ్ళకి ఒకబబాయి ఒకమ్మాయి అబ్బాయి పండుకి పదిహేనేళ్ళు అమ్మాయి పద్మినీకి పదేళ్ళు ఇద్దరి కిద్దరన్నట్టు ఆనందంగా గడుపుతున్న ఆ సంసారంలో చిన్న అపశ్రుతి ఏర్పడింది.         ఆ ఇంట్లో వనజాక్షి ఆఫీసులో టైపిస్ట్ ఉద్యోగం చేస్తోంది. భర్త గుర్నాధం ఒ కంపెనీలో గుమాస్తా, అతను పనిచేసే కంపెనీ మేనేజర్ చనిపోవడం వల్ల మూడ్రోజుల పాటు అతను పనిచేసే కంపెనీకి శెలవిచ్చారు.         ఆ పూట వనజాక్షి ఇంట్లోంచి తొందరగా బయల్దేరి తన ఆఫీసుకి వెళ్ళిపోయింది. కంపెనీకి శెలవు కావడం వల్ల గుర్నాధం ఇంటిపట్టునే ఉన్నాడు. పద్మిని స్కూల్ కెళ్ళి పోయింది. ఒంట్లో బాగుండని పాండు ఆ పూట ఇంటి పట్టునే ఉన్నాడు.         భార్య, కూతురు అటు వెళ్ళంగానే ఇటు పాండు దగ్గిర కొచ్చాడు గుర్నాథం.         "ఒంట్లో ఎందుకు బావుండలేదు? ఏమైనా కాని పని చేశావా?" కొడుకుని నిలదీసి అడిగాడు గుర్నాథం.         "కాని పని చేస్తే ఒంట్లో బాగుండదా?" ఎదురు ప్రశ్నించాడు పాండు.         "కాని పనంటే నీ కర్ధం కాదు. ఎలా చెప్పాలి? ఆ....నీ వెన్నాల్ల బట్టి మెన్సెస్ కావడంలేదు?" సూటిగా రంగంలోకి దిగుతూ అడిగాడు గుర్నాథం.         "ఏమో! ఎన్నాళ్ళయిందో! నేనెప్పుడూ రోజులు లెక్కబెట్టను. అయితే అయ్యాననుకుంటాను. కాకపోతే కాలేదను కుంటాను. అయినా ఈ ప్రశ్నలేమిటి నాన్నా?" చిరాకు పడుతూ అన్నాడు పాండు.         "ముందు నా ప్రశ్నలకి జవాబులు చెప్పు. ఆ తర్వాత అసలు విషయం చెబుతాను."         అయిష్టంగానే "ఊ" అన్నాడు పాండు.         "నీకు అన్నం సయించడం లేదు. అవునా?"         "అవును."         "పుల్లగా ఏమైనా తినాలని ఉందా?"         "నాకు పుల్లటి పదార్ధాలు ఎప్పుడూ ఇష్టమే. నీకూ తెలుసుగా. చింతపండు కనబడితే చాలు తినేస్తానని అమ్మకోప్పడుతూ ఉంటుందిగా"         "అయ్యో! నీకెలా చెప్పాలో నా కర్ధం కావడంలేదురా!" వాపోయాడు గుర్నాథం.         తండ్రి ఎందుకు కంగారు పడుతున్నాడో అడ్డదిడ్డమైన ఈ ప్రశ్న లేమిటో పాండుకి అర్ధం కాలేదు. తండ్రి వైపు అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు.         పాండు అందంగా ఉంటాడు. ముద్దుగా అప్పుడప్పుడు వాడ్ని స్నేహితులు "పాండ్స్" అనికూడా పిలుస్తూంటారు. ఆడ, మగ బోలెడు మంది స్నేహితులు వాడికి స్నేహితులతో కబుర్లేసుకుని కూర్చున్నాడంటే అన్నం నీళ్ళు అక్కరలేదు వాడికి.         ఈ రోజు తండ్రి తనని బయటికి పోనీయక తల్లి, చెల్లీ అటెళ్ళంగానే తన్నిపట్టుకొని గుచ్చి గుచ్చి చూస్తూ యక్షప్రశ్నలు సవాలక్ష వేస్తూంటే ఏమి అర్ధం కాలేదు పాండుకి.         "నువ్వేమో అడుగుతున్నావ్. నాకేమీ అర్ధం కావడంలేదు. ఆ అడిగేదేదో అర్ధమయ్యేలా అడుగు నాన్నా" అన్నాడు పాండు.         "అర్ధమయ్యేలాగానే అడుగుతానురా! నీకెవరయినా అమ్మాయి లతో స్నేహం ఉందా! వాళ్ళతో ఆడడం, పడటం చేస్తున్నావా?" గుర్నాతం సూటిగా అడిగాడు.         "అదేమిటి నాన్నా! నా స్నేహితుల్లో సగం మంది అమ్మాయిలు సగంమంది అబ్బాయిలు. అందరూ నాతో చాలా క్లోజ్ గా ఉంటారు! నేనంటే ప్రాణం ఇస్తారు నేనంటే పడి చస్తారు" గర్వంగా చెప్పాడు పాండు.         "ఏ అమ్మాయయినా, ఎప్పుడయినా నిన్ను ముద్దుపెట్టుకుందా?"         పాండు కాస్త సిగ్గుపడ్డాడు. "నేను అందంగా ఉంటానట. ఆ మాట నాతో అంటమే కాదు నా ఫ్రెండ్స్ లో కొందరమ్మాయిలు ముద్దుకూడా పెట్టుకున్నారు" నాన్చుతూ చెప్పాడు.         "నీ దుంపతెగ. నువ్వండంగా ఉన్నంతమాత్రాన వాళ్ళు ముద్దుపెట్టుకుంటే ముద్దు పెట్టించుకోవడమేనా! ఆడపిల్లలు మరీ బరితెగించి పోయారు ఆడపిల్లలకన్నా మగపిల్లలు నయం-ఇంతకి ఆ ఆడపిల్లలు నిన్ను ముద్దుమాత్రమే పెట్టుకున్నారా ఇంకేమైనా చేశారా?"         "ఇంకేమైనా అంటే?"         "నా శ్రార్ధం" విసుక్కున్నాడు గుర్నాథం.         "నువ్విలా అర్ధంలేని ప్రశ్నలు వేసి ఊరికినే నామీద విసుక్కుంన్నావంటే సాయంత్రం అమ్మ ఆఫీసునుంచి వచ్చింతర్వాత చెప్తాను. ఆ తర్వాత నీ ఇష్టం" బెదిరింపుగా అన్నాడు పాండు.         ఆ ఇంట్లో పెత్తనం వనజాక్షిది. ప్రతిదీ డిసిప్లేన్ గా ఉండాలంటుంది ఎక్కడ వస్తువు అక్కడ ఉండాలి వస్తువు స్థానం మారితే భరించలేని మనిషి. కొడుకు కాలు జారాడంటే భరిస్తుందా? "నువ్వేం తండ్రివి! నీ పెంపకం తగలబడినట్టే ఉంది- ఈ ఇంటి పరువు, మర్యాద మీ తండ్రీ కొడుకులవల్ల బజారున పడేటట్లు ఉంది మా పుట్టింటివాళ్ళను చూడండి-నా పెంపకాన్ని చూడండి. ఎంత పరువు, ఎంత మర్యాద...." అంటూ తూర్పార పడుతుంది. ఆ బాధ భరించటం చాలా కష్టం. కొడుకు కానిపని చేసి కాలు జారాడేమోనని గుర్నాథం భయం. గత వారంరోజుల బట్టి కొడుకుమీద అనుమానం వచ్చింది. నిజం నిలదీసి అడుగుదామంటే టైంచిక్కడంలేదు ఇదిగో ఇప్పుడు సమయం వచ్చింది నిలదీసి అడుగుతుంటే అడ్డంగా సమాధానాలు చెబుతున్నాడు.         "నిన్ను ఆ ఆడపిల్లలు ఇంకేమయినా చేశారా అంటే అదన్నమాట" అన్నాడు గుర్నాథం.         "ఇంకేమన్నా అంటావ్. అదంటావ్-ఇదంటావ్ అసలేంటి నీ గోల? ఇవాళ నీకేదో అయింది. పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నావ్" అంటూ పాండు తండ్రిని అనుమానంగా చూస్తూ అన్నాడు.
24,387
    ఇక మిగిలింది అతనితో పరిచయమే. పరమేశుదాసు సరైన వ్యక్తి అని నిర్ణయించుకున్న తరువాత నెల రోజులకి ఆయన అ టౌన్ కి వస్తున్నాడని తెలిసింది.     ఆయన ప్రోగ్రామ్ ఏమిటో తెలుసుకుంది. సాయంకాలం ఆరుగంటలకి గెస్ట్ హౌస్ లో కలుసుకోవడం మంచిదనిపించింది. మిగిలిన సమయాల్లో ఆయన చాలా బిజీగా వుంటాడు.     ఖచ్చితంగా ఆరుగంటలకి వెళ్ళింది. ఓ అమ్మాయి తనను కలుసుకోవడానికి వచ్చిందంటే వద్దనే మగవాడు ఈ భూ ప్రపంచంలో వుండడని ఆమె నమ్మకం. అందుకే ఎవరి ద్వారానో పరిచయం చేసుకోవడం కన్నా డైరెక్టుగా వెళ్లడమే మంచిదనుకుని వెళ్ళింది.     కాసేపటికి లోపలికి రమ్మని పిలుపొచ్చింది. దాసుకి ఏభై ఏళ్ళుంటాయి. ఆయన్ను చూస్తూనే సరస్వతీదేవికి శత్రువని, లక్ష్మీదేవికి మిత్రుడని తెలిసిపోతుంది. ఆయన మాట్లాడే భాష అంత దరిద్రంగా వుంటుంది. ఆయన వాడే  సెంటునుంచి కారువరకు అంత విలాసంగా వుంటాయి.     అమాయకంగా, అంతకంటే అందంగా తన ఎదురుగ్గా నిలబడ్డ ఆమెను అదోలా చూసి కూర్చోమన్నట్లు సైగ చేశాడు ఆయన.     ఆమె ఎందుకొచ్చిందని రకరకాలుగా ఆలోచించాడు గానీ ఖచ్చితంగా ఆమె ఈ పనిమీద వచ్చుంటుందని ఆయన వూహించలేకపోయాడు. అలా మాట్లాడింది సరిత. చివరికి "నేనేదో రాచకార్యం కోసం ఇక్కడికి రాలేదు. మీరంటే గౌరవం. అందుకే చూసిపోదామని వచ్చాను" అంది.     ఈసారి వచ్చినప్పుడు మాత్రం మా ఇంటికి రండి అని చెప్పి వచ్చేసింది.     ఆమె వెళ్ళిపోయినా ఆమె వున్నట్లే దాసు ఫీలవడం ఆమె సాధించిన మొదటి విజయం.     మరి ఆమెకోసమే వచ్చాడో, నిజంగా ప్రభుత్వ పనులమీద వచ్చాడో గానీ మరో నెల తరువాత దాసు టౌన్ లో అడుగుపెట్టాడు.     పోయిన అవతారంలో ఇచ్చిన వరాన్ని ఈ అవతారంలో తీరుస్తున్న దేవదేవుడిలా చిరునవ్వు నవ్వి "మీ ఇంటికొస్తున్నాను రాత్రికి" అన్నాడు ఆయన సరితను చూస్తూనే.     రాత్రి తొమ్మిదిగంటలకి ఆమె ఇంటికి రహస్యంగా వెళ్ళాడు. అప్పటికి వున్నంతలో తన ఇంటిని శుభ్రంగా సర్దిపెట్టింది ఆమె.     చాలాసేపటి వరకూ మాటలు జరిగాయి గానీ అంతకుమించి ప్రొసీడ్ కావడానికి దాసుకే భయం వేసింది. ఆమె అంత గౌరవప్రదంగా మాట్లాడుతోంది మరి.     చివరికి వుండబట్టలేకపోయాడు.     డొంకతిరుగుడుగా అడిగాడు.     అయితే ఆమె మాత్రం డైరెక్టుగానే చెప్పింది "అన్నీ వున్నాయి నాకు. మంచి ఇల్లుంది. నెలకింత రాబడి వుంది. నన్ను అపురూపంగా చూసుకునే భర్త వున్నాడు. మరి నేనెందుకు ఒప్పుకుంటున్నానో తెలుసా? కేవలం మీ మీదున్న గౌరవంవల్లే"     "మంత్రి పదవి పొందడం కన్నా ఓ స్త్రీ మనసును గెలుచుకోవడంలోనే గొప్ప థ్రిల్ వుందని నాకిప్పుడు తెలిసింది" అన్నాడు దాసు.     నిజంగానే అలా ఫీలయ్యాడు.     ఆ రాత్రి ఆయన్ని సరిత మంచి మైదానాల్లో తిప్పింది. అగ్నిపర్వతాల లావాసెగ చూపించింది. నందివర్ధనాల చెట్టుకింద నిలబెట్టి పూలు పూయించింది. సముద్ర కెరటాల్లో ఉక్కిరిబిక్కిరి చేసింది. సంధ్యా సమయంలో పచ్చిక బయళ్ళలో విహారానికి తీసుకెళ్ళింది. ఇదంతా ఆమె పడకమీద నుంచే చూసిందంటే ఆమె ఎంతగా ఆయన్ని సుఖపెట్టిందో తెలుస్తుంది.     ఆ టెక్నిక్ కీ, ఆ హొయలకీ, ఆ సంభాషణా చాతుర్యానికీ, ఆ విలాసభరిత వీక్షణాలకీ ఆయన తన వయసునీ, తన అధికారాన్నీ - అన్నిటినీ మరిచిపోయాడు. తెల్లవారుజామున వెళుతూ "పదహారేళ్ళ కన్నెపిల్లతో ఓ రాత్రి గడపాలన్న కోరిక ఇన్నేళ్ళకి తీరింది" అన్నాడు. పాతిక సంవత్సరాల వయస్సున్న తనతో గడిపి ఆయన అలా అనడం అద్భుతమైన కామెంట్ గా ఆమె భావించింది.       మరో వారానికి ఆమెని హైదరాబాద్ రమ్మని దాసునుంచి కబురొచ్చింది.     "నీకేదో చేయాలని వుంది. అందుకే పిలిపించాను. ఇదిగో ఈ కాగితాల్లో సంతకం పెట్టు. స్వచ్ఛంద సేవాసంస్థను నీ పేరు మీద స్టార్ట్ చేయిస్తున్నాను. రిజిస్ట్రేషన్ వగైరాలు అన్నీ అయిపోయాయి. జర్మనీలో వున్న ఓ సంస్థ దీనికి ఫండ్స్ యిస్తుంది"     ఆమె సంతకాలు చేసింది.     "అన్నీ ఆలోచించే దీన్ని నీకు అప్పగిస్తున్నాను. అన్నిట్లోకి ఇది మంచిది. డబ్బుకి డబ్బూ, పేరుకి పేరూ వస్తుంది. ఎవరూ నిన్ను పట్టించుకోరు. తిన్నంత తిని, సేవ చేయగలిగినంత చెయ్" అని స్వచ్ఛంధ సేవాసంస్థను ఎలా నిర్వహించాలో, ఏమేం చేయాలో, ఏవిధంగా డబ్బు వస్తుందో, దానిని ఎలా ఖర్చు చేయాలో, ఎలా మిగుల్చుకోవాలో చెప్పాడు దాసు.       "మీరు సముద్రంలో దూకమన్నా దూకుతాను" అంది అంతా విన్నాక సరిత.     అలా సరిత స్వచ్ఛంధ సేవాసంస్థ ఒకదాన్ని ఏర్పాటుచేసింది. శిశువిహారాలను ఒకదాన్ని ఏర్పాటు చేసింది. జర్మనీ నుంచి రెండు జీపులొచ్చాయి. చాలా దేశాల నుంచి నిధులొచ్చాయి. సంవత్సరానికొకసారి -     "రూరల్ పూర్" మీదో, "అప్ గ్రేడ్ ఆఫ్ ది ఉమెన్" మీదో, "పిల్లల పోషణమీదో" సెమినార్ లు నిర్వహించేది. వాటికి తప్పనిసరిగా దాసు అధ్యక్షత వహించేవాడు.     వచ్చిన ప్రతిసారీ వెళ్ళేముందు ఆయన "పదహారేళ్ళ అమ్మాయితో..." అని చెబుతుంటే ఆమె చిర్నవ్వును పెదవులపై పూయించి వీడ్కోలు చెప్పేది. ఇలా అంచెలంచెలుగా ఆమె ఎదగసాగింది.     పిల్లల్ని కనడం సుతారమూ యిష్టంలేదామెకి. అందుకే యిప్పటికీ ఆమెకి పిల్లలు లేరు.     ఆమె సేవల్ని గుర్తించి ఇటీవల ఆమెకి ప్రభుత్వం "విశిష్ట సేవా అవార్డు"ను ప్రకటించింది. ఈ అవార్డును ప్రకటించనున్నట్లు ముందుగానే తరుణ్ పనిచేసే దినపత్రికవారికి తెలిసింది.     వెంటనే న్యూస్ ఎడిటర్ తరుణ్ కి కబురుచేసి పిలిచాడు.     "సరితాదేవి అవార్డు ప్రకటిస్తున్నారు. మన ఢిల్లీ రిపోర్టర్ ఫోన్ చేసి చెప్పారు. అవార్డు వచ్చింది గనుక ఆమె ఇంటర్వ్యూ వేద్దాం. అలాగే ఆమె సాధించిన అభివృద్ధిని కూడా రాద్దాం" అని చెప్పి ఆ పనిని తరుణ్ కి అప్పగించాడు న్యూస్ ఎడిటర్.     సరేనన్నాడు తరుణ్.     అతను ఏ పనైనా ఒప్పుకుంటే చాలా సిన్సియర్ గా చేస్తాడు. సరితాదేవి సంస్థ ఈ పదేళ్ళలో ఏ ఏ కార్యక్రమాలు నిర్వహించిందీ, ఎంత ఖర్చు చేసిందీ, వచ్చిన నిధుల వివరాలన్నింటినీ సేకరించాడు.       శాంపుల్ గా గత సంవత్సరం ఈ సంస్థ అధ్వర్యంలో ఏం జరిగాయో, ఎంత ఖర్చు చేశారో కూడా సంపాదించాడు.     మొత్తం సమాచారం సేకరించుకున్నాక ఆమె ఏ స్థాయి నుండి ఎలా వచ్చిందీ వివరిస్తూ ఓ వార్త రాశాడు. అయితే ఆ వార్త కూడా ఆమె ప్రైవేట్ లైఫ్ కి సంబంధించింది కాదు. కేవలం ఆస్తుల వరకే పరిమితం అయ్యాయి.
24,388
    అతని రాక్షస చేతుల్నించి విడిపించుకోడానికి గౌతమి తీవ్రంగా ప్రయత్నిస్తోంది.     కానీ కుదరడం లేదు.     "హెల్ప్..." వంట్లోని శక్తినంతా కూడదీసుకుని అతని చేతుల్ని పక్కకు తోసేసింది.     పరుగెత్తి మంచం వెనక్కి వెళ్ళిపోయింది.     అవినాష్ ఒగరుస్తున్నాడు...     "ఇప్పుడిక్కడ నిన్ను రక్షించడానికి ఎవరూ రారు... పాపం... ఆ ఫోటోగ్రాఫర్ గాడు కూడాలేడు... తెల్సా-" అంటూ ముందుకొచ్చాడు.     ఆమెకు ఏం చేయాలో తోచడం లేదు...     "హెల్ప్... హెల్ప్..." గట్టిగా, ఆ నర్సింగ్ హోమంతా ప్రతిధ్వనించేటట్లు అరిచింది.     ఆ అరుపుకి అవినాష్ పిచ్చెత్తిపోయాడు. వెంటనే వెనక్కి తిరిగి, ఆ తలుపులోన గెడపెట్టి, మంచమ్మీద కెగిరి గెంతి, గౌతమిని ఒడుపుగా పట్టుకున్నాడు...     ఆమె అరుస్తోంది. కరుస్తోంది... ఏడుస్తోంది... ఆమె కంఠమ్మీద ఇనుప చేతులు...     అవినాష్ తన జేబులోంచి 'బెల్టు' తీసి, ఆమె మెడచుట్టూ వేసి రెండు వేపులా గట్టిగా లాగాడు.     గౌతమికి ఊపిరాడడం లేదు.     ప్రాణం పోతున్నట్టుగా ఉంది...     "ప్లీ...జ్... అవినాష్... నన్ను చంపొద్దు... నా బిడ్డని క...ని..క...రిం...చు..." గొంతు పెగుల్చుకుని అంది...     "బిడ్డ..." వికటంగా నవ్వాడు అవినాష్.     "నువ్వూ... నీ బిడ్డ పోతే... నేను హాయిగా ఉంటాను-" అని కుడికాలెత్తి ఆమెను మోకాలితో తన్నాడు.     "అమ్మా...మ్మ..." కెవ్వున అరిచింది గౌతమి.     ఉన్నట్లుండి ఆమెకు మొండిధైర్యం ఆవహించింది.        అంతే... తన సర్వశక్తుల్ని కూడ దీసుకొని అవినాష్ ని బలంగా తన్నింది. దాంతో ఆమె కంఠానికి చుట్టుకున్న బెల్టునుంచి తప్పించుకుని ఒక్క ఉదుటున పక్కకు ఒరిగింది. ఆ వెంటనే మంచం కింద నుంచి దూరి ఇటు పక్కకు వచ్చి చటుక్కున తలుపు వేపు దూసుకొచ్చి గడితీసి బయట వరండాలోకి పరుగెత్తింది.     గౌతమి తన్నిన తాపుకి అవినాష్ పక్కకు పడిపోయాడు. అతని తల మంచానికి బలంగా కొట్టుకుంది. అతని మెదడులోని నరాలన్నీ జివ్వుమన్నాయి...     "రక్షించండి... ప్లీజ్ హెల్ప్... మి..." ఎలుగెత్తి అరిచింది గౌతమి ప్రాణ భయంతో.     ఆ వరండాలో ఉన్న ప్రతిగదిలోనూ అంతకు పూర్వమే లైట్లు వెలిగాయి. కానీ ప్రతి తలుపుకూ గొళ్ళెం వేసి ఉండడంవల్ల- తలుపులు దబదబ బాదుతున్న చప్పుడు తప్ప, అరుపులు తప్ప ఎవరు బయటకు రాలేకపోతున్నారు.     కానీ అప్పటికే క్రింద పోర్షన్లోని నర్సులు, డ్యూటీలో డాక్టర్ మెట్లెక్కి గాభరాగా బైటకొస్తున్నారు-     "డాక్టర్-" అంటూ ఆ డాక్టర్ ని గట్టిగా పట్టేసుకుంది గౌతమి.     "వాట్ హేపెండ్..." అంటూ గౌతమిని పొదవి పట్టుకుని ఎదురుగా చూసింది.     రివ్వున బెల్టుని తిప్పుకొంటూ, యమపాశంతో వస్తున్న యముడిలా అవినాష్.     ఆ డాక్టర్ ని పక్కకుతోసేసి గౌతమి భుజాల్ని పట్టుకుని ముందుకు లాగాడు.     అదే క్షణంలో ఇద్దరు నర్సులు ఏం చేయాలో తోచక, అవినాష్ ని పట్టుకున్నారు.     అవినాష్ ఆ నర్సులిద్దర్నీ బలంగా తోసేసి గౌతమిని ముందుకి లాగి మళ్ళీ ఆమె కంఠాన్ని పట్టుకున్నాడు.     ఇంకో క్షణం ఆలస్యమైతే ఆమె చనిపోయేది.     కాని అంతలో ఇద్దరు నేపాలీ సెక్యూరిటీ గార్డులు, చేతుల్లోని తుపాకుల్తో అవినాష్ కి గురిచేసి నిలబడడంతో, గౌతమి భుజాలు మీంచి అతని చేతులు కిందకు వచ్చేశాయి.     అవినాష్ భుజాల్ని వదలగానే కిందకు పరుగెత్తి పారిపోయింది గౌతమి.     ఒక్కక్షణంలో అవినాష్ ముందు నిలబడ్డ గార్డునిడొక్కలో తన్ని, వెనకనున్న వాడి కాలికి మెలిక వేసి కింద పడదోసాడు.     కానీ కిందపడ్డ గార్డు వెంటనే పైకి లేచి... తుపాకీని అవినాష్ వేపు సూటిగా గురిచూసి కాల్చేంతలో... తనవేపు గురిచూస్తున్న తుపాకీ తూటాను తప్పించుకోడానికి పైకి పరుగెత్తి ఖాళీగా ఉన్న ఓ రూంలోకెళ్ళి లోన గడియపెట్టేసి... లోనున్న కిటికీ దగ్గరగా వెళ్ళాడు. కిటికీ లోంచి కిందకు చూశాడు.     అంతా చీకటి-     వెనక తలుపు పగల గొడుతున్న చప్పుడు.     లాభం లేదు- రెండో ఫ్లోర్లో ఉన్న ఆ కిటికీలోంచి మరో ఆలోచనా లేకుండా కిందకు దూకేశాడు అవినాష్.     అతను కింద ఎక్కడ పడ్డాడో తెలీదు-                                  *    *    *    *     మరో పావుగంటలో అవినాష్, నెత్తురు బట్టలతో విఫల యత్నంతో, విశాఖపట్నం రోడ్డుమీద, చీకట్లో, రోడ్డువార, ఆయాసాన్ని అదుపు చేసుకుంటూ పరిగెడుతున్నాడు-     నర్సింగ్ హోం వాళ్ళు పోలీసులకి ఫోన్ చేసుకుంటారు. తనీ సమయంలో, తనరూంకి వెళ్లడం ప్రమాదం... కనీ- ఎక్కడకెళ్తాడు? ఎక్కడకెళ్ళాలి?     రోష్ణి ఇంటికెళ్తే-     అవును-     ఆటో కోసం అటూ ఇటూ చూశాడు ఆటోలు లేవు. దూరంనుంచి ఏదో రిక్షా వస్తోంది-     అర్దరాత్రి- రిక్షా ఛార్జి రెట్టింపు అడిగాడు.     ఎక్కి కూర్చున్నాడు.                                                     *    *    *    *
24,389
    ఇంట్లో పనిమనిషిలా వుంది. ట్రేలో కూల్ డ్రింక్ తో ప్రత్యక్షమైంది.     "మీరొస్తే కూర్చోమని చెప్పమన్నారు. ఈ కూల్ డ్రింకిమ్మన్నారు" అంది పనిమనిషి.     "ఎవరు?"     "సశ్యమ్మగోరు"     అంటే...     ఇది గెస్ట్ హౌస్ అన్నమాట.     కేవలం తనను ఉడికించాలని ఓటమి ఎవరిదో సోదాహరణంగా నిరూపించాలని యిలా తనను ఆహ్వానించిందన్నమాట.     సశ్యమీద కసో లేక తన నిస్సహాయ స్థితిపై జాలో ఆమెకే తెలియదు.       విజూష కళ్ళు తడయ్యాయి.     చూపులు మానసి పారిజాత సుమదశం మాటున నక్కిన చురకత్తులై  మస్తిష్కాన్ని మండిస్తుంటే పనిమనిషి ముందు పనిలేని మనిషిలా వుండలేకపోయింది.     రెక్కలు తెగుతున్న కోకిల్లా కోపంగా బయటికి నడిచింది.                                                        *    *    *    *     "సారీ డాడ్"     మొండిగా అరిచింది విజూష.      బహుశా ఆమె పుట్టి బుద్దెరిగాక తండ్రిపై విరుచుకుపడింది యిప్పుడే.     "నాకు ఆ కెనడా సంబంధం యిష్టంలేదు" తండ్రి కళ్లలోకి చూడలేనట్టు తలవంచుకుంది.     ప్రసాదభూపతి నిర్విణ్ణుడవుతూ కూడా కోపాన్ని నిగ్రహించుకున్నాడు.     కొన్ని సిద్దాంతాల విద్యుత్కవచంతో నిర్మించుకున్న అతడి సామ్రాజ్యంలో అతడు ప్రశ్నగా చాలాసార్లు అవతారమెత్తాడే తప్ప ఎవరికీ  తప్ప ఎవరికీ జవాబు కాలేదు. జవాబు చెప్పలేదు.     అతడు తన వ్యాపార ప్రపంచంలో అయినా 'నిజం' గా నిలిచాడే  తప్ప 'నీడ' గా మారి మరెవరి  మార్గ దర్శకత్వం కోసమో అర్రులు చాచి ప్రతిబింబమనిపించుకోలేదు బింబంగా మిగిలాడే తప్ప.     అహం దెబ్బతింది విజూష మాటలతో.     అయినా తమాయించుకున్నాడు.     రెండు శబ్దాల మధ్య అనివార్య విరామంలా ఓ రెండు నిముషాలు సాలోచనగా చూసి అన్నాడు విజూషతో.       "ఎందుకని?"     శాసించడమే తప్ప అర్దించడం తెలీని తండ్రి తనను విడిచిపెట్టేట్టు లేడు. "అంతే డాడ్.. నేను పెళ్లిచేసుకోను."     "పెళ్లే చేసుకోవా, ఈ పెళ్లి మాత్రమే చేసుకోనా?"     నిశ్చలంగా అడిగాడు కాని ఆ గొంతులో అతి ప్రమాదకరమయిన కాఠిన్యం ధ్వనించింది.     "అడుగుతున్నది నిన్నే?"     పగులుతున్న స్వప్న జ్వాలా శిఖరంపై నిలబడి అందని ఏ నక్షత్రాల అంచుల్నో పట్టుకోవాలని ఆరాటపడుతున్నట్టు నిస్తారణంగా తలవంచుకుంది.     "ఎవరినయినా ప్రేమించావా?"     నిశ్శబ్దం.     "నీ మౌనం నువ్వు చెప్పని నిజాన్ని నిర్దారించడమే  అయితే ఈ మహల్లో ప్రేమనే పదం వినడాన్ని కూడా నేనిష్టపడనని నీకు తెలుసు."     "కానీ డాడ్....."     నచ్చచెబుతున్నట్టు ఏదో అనబోయింది.     "నువ్వు దాచలేవు నాకు తెలుసు నువ్వు ప్రేమిస్తున్నది ఎవర్నో."     విజూష గుండె ఝల్లుమంది.     పాషాణాల  మధ్య దాక్కున్న  పూలతీవెలా తల పైకెత్తలేక పోయింది.     "నేను ఓ పెద్ద పారిశ్రామిక సామ్రాజ్యానికి అధిపతిని మాత్రమే కాదు విజూషా......... ఓ ఆడపిల్లకి తండ్రిని. అంతమాత్రం చేత నీ గురించి నేను ఆరా తీయాలా అనకు.... నువ్వు మామూలు ఇంటిదానివి కాదు. కోట్ల ఆస్తికి వారసురాలివి. ఇదొక్కటి  చాలు ఏ మగాడయినా నిన్ను  ట్రాప్ చేయటానికి..... రుత్వి దీనికి అతీతుడు కాడు."     చివాల్న పైకెత్తి చూసింది.     "పేరుతోసహా వివరాలు ఎలా సేకరించానా అని ఆశ్చర్యపోతున్నావా విజూషా..... అంతకు మించిన ముఖ్యమయిన  ఆధారాలు నా దగ్గర వున్నాయి."     ప్రసాదభూపతి ఓ కవరు అందించాడు.     కవరు అందుకున్న విజూష అందులోని ఫోటోల్ని చూసి ముందు అవాక్కయింది.     కవరు అందుకున్న విజూష  అందులోని ఫోటోల్ని చూసి ముందు అవాక్కయింది.     అదికాదు.     బెడ్ మీద ఒకరినొకరు పెనవేసుకుని పడుకున్న సశ్య రుత్విల ఫోటోలు కొన్ని రోజులుగా తాను కన్న కాలం ఘటిస్తున్న శ్రద్దాంజలిగా అనిపిస్తుంటే.....     ఉద్విగ్నంగా కవరులో వున్న ఆరు ఫోటోలు చూసింది.     అదే....     ఆ రోజు తాను గెస్ట్ హౌస్ లో చూసిన బెడ్ రూం.     గుండె పరీక్ష నాళిక ముక్కలై రక్తం సంక్షోభిత సాగరంలా వుబుకుతుంటే...... గళం కలమైంది కాలం కలం కంఠంలో గడ్డకట్టిన శబ్దమయింది.     "ఎలా....... ఈ ఫోటోలు మీకెలా వచ్చాయి?" తలవంచుకుని అడిగింది విజూష.       "నువ్వు తెలుసుకోవాల్సింది రుత్వికి చెందిన నిజం మాత్రమే తప్ప ఈ వివరాలు  నేను ఎలా సేకరించానా  అన్ననిజం కాదు విజూషా."     "కాని నాకు ఆ వివరాలు కావాలి."     "చెప్పటానికి నేను సిద్దంగా లేను" కంచులా మొగింది ప్రసాద  భూపతి కంఠం.
24,390
    మరో పావుగంటకు సూటూ-బూటూ వేసుకున్న ఓ వ్యక్తి ప్యూన్ సూట్ కేసు పట్టుకొని వెంటరాగా, మార్కెటింగ్ సెక్షన్ లో కెళ్ళాడు.     రెండు నిమిషాల తర్వాత ప్యూన్ బయటకొస్తున్నప్పుడు "మార్కెటింగ్ మేనేజర్ వచ్చారా?" అని అడిగాడు శక్తి.     ఆ ప్యూన్ శక్తివైపు ఎగాదిగా చూసి మార్కెటింగ్ మేనేజర్తో ఏం పనో... నన్నొడగొచ్చుకదా..." అని బ్రహ్మానందం లెవెల్లో అడిగాడు.     "ఇప్పుడు... అడుగుతున్నది నిన్నే... మీ బాబుని కాదుగదా..." చిర్రెత్తుకొచ్చింది శక్తికి.     "మ బాబు ఈ సెక్షన్లో వుండడు. పై సెక్షన్లో వుంటాడు మా కుటుంబమంతా... ఇదే ఆఫీసులో పన్జేస్తుంటాం గానీ... ఆ గదిలో... ఆ చివరగా కనిపిస్తోంది గదా... అదే బాసు ఛాంబర్. జాగ్రత్త. ఆయనసలు మూడీమేన్..."     చేతిలోని ఫ్లాస్కును ఊపుకుంటూ వెళ్ళిపోయాడు ప్యూన్.     ఆ గదిలోకి అడుగుపెట్టాడు శక్తి.     ఛాంబర్ డోర్ దగ్గర నిలబడిన శక్తిని చూసి...     "రావయ్యా... రా" అలా పిలుస్తున్న మార్కెటింగ్ మేనేజర్ని చూసి కంగుతిన్నాడు శక్తి.     వీడెవడండీ బాబూ.... తెలిసినట్టు మాట్లాడేస్తున్నాడు... ఛైర్మన్ మేనల్లుడినని తెలిసినట్టుంది.     గంభీరంగా వెళ్ళి సీట్లో కూర్చున్న శక్తివేపు, అంత గంభీరంగా చూసి...     "రాగానే, సీట్లో కూర్చున్నానో లేదో- చూడు- ఛైర్మన్ అక్షింతలు వేసాడు. కర్నాటక స్టేట్ లో మన సేల్స్ బాగానే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాల్లోనూ, మన సబ్బు సేల్స్, అరవయ్ పర్సంట్ దాటగా, ఒక్క శ్రీకాకుళం జిల్లాలో, పాతిక పర్సెంట్ కూడా లేదు. ఎందువల్ల- నువ్వూ, మీ మనుషులు ఏం చేస్తున్నట్టు- ఆ జిల్లా సేల్స్ రిపోర్ట్ పంపవలసిందని- తాఖీదు చూసావయ్యా- అక్కడ సేల్స్ లేకపోతే. ఇక్కడ నేనేం చేస్తాను. నేవెళ్ళి కొనలేను గదా-" ఫైలులోని లెటర్ ని మరోసారి చదువుతూ అన్నాడు మార్కెటింగ్ మేనేజర్. ఆయన పేరు కూర్మనాధం.     ఎవరితోనూ చెప్పాల్సిన విషయం తనతో చెప్తున్నాడని అర్థమైపోయింది శక్తికి. ఈయనకు షార్టు సైటో, లాంగ్ సైటో ఉండాలి.     "సార్... నా పేరు..." ఏదో చెప్పబోయాడు శక్తి.     "దీనికి ఛైర్మన్ కి ఏం రిప్లయి రాయమంటావో చెప్పు" అలా గడుగుతున్న ఎం.ఎం. మొఖంవేపు శక్తి దీనంగా చూస్తున్న సమయంలో అసిస్టెంట్ మార్కెటింగ్ మేనేజర్ వచ్చి, శక్తి పక్కనే కూర్చున్నాడు. అదే సరయిన సమయమనిపించి, తన జేబులోని కాగితాన్ని తీసి ఆయనకిచ్చాడు. ఆయన దాన్ని చదివి "నువ్వేనా కొత్త క్లర్క్ వి..." అని, ఆ ఎపాయింట్ మెంట్ ఆర్డర్ ని కూర్మనాధానికిచ్చాడు.     "నేను గడగడా మాట్లాడేస్తుంటే అస్సలు నువ్వేం చెప్పవేమయ్యా. శక్తి అంటే నువ్వేనన్నమాట. సెక్షన్ లో నీలాంటి కుర్రాళ్ళు చాలామందున్నారు... వాళ్ళల్లో ఒకడనుకున్నాను." అని అసిస్టెంట్ మార్కెటింగ్ మేనేజర్ వేపు తిరిగి.     "చూడు- మధుసూదన్ గావు... ఈ కుర్రాడికి తగిన వర్క్ అప్పజెప్పు." అని చెప్పి.     "కొత్త స్టాప్ మెంబర్ ఇంకోడు చేరాడన్న మాట..." అని నవ్వుతూ అని "చూడు శక్తి నీకిప్పుడే ఏం రిప్లయి ఇస్తావోయ్... జి.కె. టెస్టు చెప్పు"     ఎక్కణ్నించి వచ్చేసిందో తటాలున ముఖమ్మీద చెమట పట్టేసింది. ఒక్కక్షణం ఆలోచనలో పడ్డాడు శక్తి. కొన్ని నిమిషాలు నిశ్శబ్దంలో కలిసిపోయాయి.     "సర్... మిగతా జిల్లాల మాట ఎలా వున్నా... ప్రత్యేకంగా శ్రీకాకుళం జిల్లాను గమనిస్తే- అక్కడకు ఒరిస్సా బోర్డర్ లో తయారవుతున్న నాసిరకం సబ్బుల దిగుమతి ఎక్కువ. సైకిలు బళ్లమీద పెట్టుకుని కేవలం రెండు రూపాయలకిచ్చే మూడు సబ్బుల్ని కొనడానికే అక్కడ ప్రజలు ఇష్టపడరు. అదే కాకుండా గత రెండేళ్ళుగా ఆ ప్రాంతానికి వర్షాలు లేవు. కాబట్టి పంటలు కూడా లేవు. అందుచేత ఖరీదయిన సబ్బుల్ని వాళ్ళు కొనడానికి సిద్ధంగా లేరు. ఇదే పరిస్థితి రాయలసీమలోని అనంతపురం జిల్లాలో, తెలంగాణాలోని మహబూబ్ నగర్ జిల్లాలో కూడా ఉంటుంది. అక్కడ సేల్స్ తగ్గడానికి ఇదే కారణమని నా అభిప్రాయం." చెప్పి, ఆగాడు శక్తి.       రెండు క్షణాలసేపు ఎం.ఎం. కూర్మనాధం మాట్లాడలేకపోయాడు. అసిస్టెంట్ ఎం.ఎం. మధుసూదనరావు కూడా మెచ్చుకోలుగా చూసాడు శక్తివేపు.     నువ్వింతకు పూర్వం... ఎక్కడయినా పని చేసావా." ఆసక్తిగా అడిగాడు ఎం.ఎం.     "లేద్సార్."     "బావుంది. కొంతలో కొంత ఎనలైజ్ చెయ్యగలిగావ్ వెరీగుడ్. చూడు.... వెళ్ళి రిజిష్టర్లో సంతకం పెట్టి, అ చివర సీట్లో కూర్చో... ఏ.ఎం.ఎం.గారు... నీకు వర్క్ ఎలాట్ చేస్తారు."     శక్తి బయటకొచ్చేసాడు. అటూ ఇటూ చూస్తూ బాస్ చెప్పిన సీట్లో కూర్చున్నాడు.                           *    *    *    *     ఛైర్మన్ ఉత్తరానికి, రిప్లయి ఇవ్వడం మొదలెట్టాడు మార్కెటింగ్ మేనేజర్.     ఆఫీసు అవర్స్ లో మహితగానీ, భగవాన్ కానీ కన్పిస్తారేమోనని చూసాడు శక్తి.     లంచ్ అవర్ క్యాంటీన్ లో కూడా ఎవరూ కనిపించలేదు. వీళ్ళ గురించి ఒక పక్క ఆలోచిస్తూనే, రెండో పక్క ఉదయం కనిపించిన చాకులాంటి పిల్ల గురించి ఆలోచించడం మొదలెట్టాడు.     సాయంత్రం అయిదున్నరకి ఆఫీసు నుంచి బయటపడ్డాడు శక్తి.     అప్పుడు కనిపించింది మహిత.     "మార్నింగ్ నుంచి స్టూడియోలోనే అయిపోయింది. ఒక్కసారి, మిమ్మల్ని పలకరించాలన్నా కుదరలేదు ఎలా వుంది. ఫస్ట్ డే జాబ్ ఎక్స్ పీరియన్స్" ఇద్దరూ ఆఫీసు గేటుదాటి బయటికొచ్చారు.     "వాయిదాల పద్ధతిలో అసిస్టెంట్ మార్కెటింగ్ మేనేజర్, మెదడు సరాసరి నాలుగ్గంటలు తినేసాడు."     "ఆయనకు పనెక్కు వుండదు. అందుకే బ్రెయిన్ ఈటింగ్ మొదలెట్టాడు. డోంట్ వర్రీ... మనిషి చాలా మంచోడు..." నవ్వుతూ అంది మహిత.     చటుక్కున చాకులాంటి అమ్మాయి గుర్తుకొచ్చింది శక్తికి.     "మహితగారు... ఎర్లీ మార్నింగ్... మనాఫీసులో ఓ అమ్మాయిని చూసాను. బేబీ షీ ఈజ్ బేబీ... బ్రౌన్ కలర్ మారుతీ వ్యాన్... కొంచెం మీరు ఎంక్వైరీ చేసి పెట్టాలి. ఏ సెక్షనో ఏంటో చెప్తే... మిగతా విషయాలు నేన్చూసుకుంటాను."
24,391
    "ఎస్ సర్!"     ఒకే ఒక్క క్షణం సిద్ధార్ధ బ్రెయిన్ లో ఏదో ఆలోచన మెరుపులా మెరిసింది. ఇంజన్ వేపు చూశాయి అతని కళ్ళు.     "ఓపెన్ ద ఫూయాల్ డోర్."     మరో మాట మాట్లాడకుండా పైలెట్ ఫూయల్ ట్యాంక్ డోర్ ని ఓపెన్ చేశాడు.     లోనికి తొంగి చూశాడు సిద్ధార్ధ. కొద్దిగా మాత్రమే వుంది పెట్రోల్.     తలెత్తి పక్కకు చూశాడు. నిశాంత అతని ముఖంలోకి ఆశ్చర్యంగా చూస్తోంది.     "నిశా! నువ్వు కొంచెం దూరంగా వెళ్ళి, వెనక్కి తిరుగు" మరే ప్రశ్నావెయ్యకుండా చివరి సీటు దగ్గరకెళ్ళి నిలబడింది.     ఏం చెయ్యబోతున్నాడు అతను.     సముద్రానికి, విమానానికి మధ్య పదిమీటర్ల దూరం మాత్రమే వుంది.     విమానం పక్కకు ఒరిగిపోకుండా బ్యాలెన్స్ చెయ్యడానికి పైలట్ నానా తంటాలు పడుతున్నాడు.     మరే మాత్రం ఆలస్యం చెయ్యలేదు సిద్ధార్ధ.     అతని కుడిచేయి ఫ్యాంట్ జిప్ మీదకు వెళ్ళింది.     ట్యాంక్ లో యూరిన్ పాస్ చేస్తున్న అతనివేపు విచిత్రంగా చూస్తున్నాడు పైలెట్.     అయిదు నిమిషాలు గడిచాయి.     "యూ డూ ఇట్ సేమ్ వే..." జిప్ పెట్టుకుంటూ అన్నాడు అతను.     పైలట్ కూడా యూరిన్ పాస్ చేశాడు.     "ఇంజన్ ని రైజ్ చెయ్యి..." సిద్ధార్ధ చెప్పినట్లుగానే చేశాడు.     సముద్రం అలల్ని తాకడానికి సిద్ధంగా వున్న విమానం, అకస్మాత్తుగా పైకి లేవడంతో...     సంతోషం పట్టలేక వెర్రిగా కేక పెట్టాడు పైలెట్.     ఉద్వేగంతో చప్పట్లు చరిచింది నిశాంత.     నెమ్మదిగా, నెమ్మదిగా పైకి లేచి ఆకాశంలోకెళుతున్న విమానాన్ని చూసి సంతృప్తిగా నిట్టూర్చాడు సిద్ధార్ధ.     "హౌ కెన్ ఇట్ పాజిబుల్..." నిశాంత మనసులోని ప్రశ్నను పైలెట్ వేశాడు.     నవ్వాడు సిద్ధార్ధ.     "యుద్ధ సమయాల్లో ఇలాంటి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు విస్కీని, రమ్ ని ఫ్యూయల్ గా వెయ్యడం విన్నాన్నేను. సేమ్ హైడ్రాలిక్ సిస్టమ్ ఇక్కడ కూడా ఆలోచిస్తూ విచారంగా కూర్చోవడం కన్నా, నిన్ను ప్రమాదానికి వదిలేసి, మా ప్రాణాల్ని రక్షించుకోవడం కన్నా, వచ్చిన ఐడియాని ఆచరణలో పెట్టాను దట్సాల్..." వెనక్కి నడుస్తూ అన్నాడు సిద్ధార్ధ.     "యూ ఆర్ జీనియస్ సర్..." పొగడ్తగా అన్నాడు పైలెట్.     అతని మనసు ఉత్సాహంతో ఉరకలు వేస్తోంది. నిశ్చేష్టురాలైపోయి సిద్ధార్ధవేపు గుడ్లప్పగించి చూస్తోంది నిశాంత.     "మ్,మనం బ్రతుకుతామని అనుకోలేదు."     "నువ్వసలు భయపడలేదా..." అతని చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అంది నిశాంత.     "భయం... భయపడే వాడికెప్పుడూ జీవితం అందదు. భయస్తుడికి, పిరికివాడికి జీవితం గాల్లో విమానంలాగే వుంటుంది..." దగ్గరౌతున్న ఎయిర్ పోర్టువేపు చూస్తూ అన్నాడు సిద్ధార్ధ.     సముద్రంలో మునిగిపోయిందనుకున్న మహంత ఎయిర్ క్రాఫ్ట్ పైకి లేవడం, ఎయిర్ పోర్టుకి రావడం వింతగా వుంది ఎయిర్ పోర్టు సిబ్బందికి.     అప్పటికే ఫైర్ యింజన్లూ, నిచ్చెన్లు, మెడికల్ వ్యాన్ అంతా సిద్ధంగా వున్నాయి రన్ వే మీద.     చిరునవ్వుతో విమానంలోంచి దిగిన సిద్ధార్ధను, పైలెట్ ను చుట్టుముట్టేసారు సిబ్బంది.     పైలెట్ జరిగిన గమ్మత్తుని ఏకరువు పెడుతున్నాడు.     "ఇండియన్ ఏలియేషన్ హిస్టరీలో దిసీజ్ ఎ లాండ్ మార్క్" స్టేషన్ ఆఫీసర్ అతడ్ని పొగిడి, కరచాలనం చేసాడు.     ఎక్కడ నుంచొచ్చారో ప్రెస్ రిపోర్టర్స్, ఫోటోగ్రాఫర్స్, దిగ్రేట్ మహంత ఏకైక కొడుకు సిద్ధార్ధని చూడడానికి ఎటుచూస్తే అటు జనం...     సినిమా యాక్టర్ని చూస్తున్నట్టుగా చూస్తున్నారు.     "మనం పేపర్స్ ని నమ్మకూడదు..." అతడ్ని చూసి ఒకడు వ్యాఖ్యానించాడు.     "ఏం?" ఇంకోకాయన అడిగాడు.     "అతను ఉమనైజర్ అయిపోయాడని, డ్రగ్స్ కి బానిసయ్యాడని, మహంత ఎంపైర్ కి పనికిరాడని, పేపర్స్ న్యూస్ చూసి నిజమేననుకున్నాను. హి ఈజ్ గ్రేట్ ఇంటలెక్చ్యువల్..." నలభై ఏళ్ళు పైలెట్ గా పనిచేసిన ఆ వ్యక్తి అన్నాడు.     "ఇంటలెక్చ్యువల్ కి వీక్ నెస్ లుండవా? చూడు... ఆ వెనక ఎలాంటి అమ్మాయిని వేసుకుని తిరుగుతున్నాడో..." చామన చాయలో, నిగనిగ మెరిసిపోతున్న నిశాంతను చూస్తూ అన్నాడు.     కారెక్కబోతున్న అతనికి ఆ కామెంట్ వినిపించింది. మౌనంగా నిశాంత వేపు చూశాడు. నిశాంత ఎక్కిన టాక్సీ జుహూవేపు కదిలింది.     సిద్ధార్ధ కారు నారీమన్ పాయింట్ లోని ఓబ్రాయ్ టవర్స్ వేపు పరుగులు తీసింది.                             *    *    *    *     సరిగ్గా పది నిమిషాల తర్వాత, మడ్ ఐలాండ్ లోని రహీజా సూట్ లో ఫోన్ మోగింది.     దేశ్ ముఖ్ రిసీవర్ అందుకున్నాడు.     "ప్రమాదం నుంచి చాకచక్యంగా సిద్ధార్ధ తప్పించుకున్నాడు" ఆ వార్త విని దేశ్ ముఖ్ డీప్ షాక్ కి లోనయ్యాడు. అయినా వెంటనే తేరుకున్నాడు.     "నేను ద్వేషించేది మహంత వ్యక్తిత్వాన్ని. కానీ మహంత తెలివితేటల్ని కాదు... సిద్ధార్ధ మహంత కొడుకు. ఆపద సమయంలో యూరిన్ పాస్ చేస్తే ఎయిర్ క్రాఫ్టు కొద్ది మైళ్లు అయినా ఎగురుతుందని నాకు అరవై అయిదేళ్ళకు తెలిసింది. అతనికి పాతికేళ్ళకే తెలిసింది. మహంత పెంపకానికి యిదో నిదర్శనం."       "విమాన ప్రమాదం పరీక్షలో మీరు నెగ్గారా? అతను నెగ్గాడా." అడిగాడు అవతలి వ్యక్తి.     నవ్వాడు దేశ్ ముఖ్.     "అతనిని బిజినెస్ డెలిగేట్స్ మీటింగుకి హాజరు కాకుండా చేయటంలో నేను విఫలమయ్యాను" ఒప్పుకున్నాడు దేశ్ ముఖ్.                              *    *    *    *     ఓబ్రాయ్ టవర్స్ లోని ఏ.సి. కాన్ఫరెన్స్ హాలు విదేశీ ప్రతినిధుల్తో నిండిపోయింది.
24,392
    ఆ పిలుపులోని మార్దవానికి పులకించినట్టు "ప్లీజ్" మత్తుగా గొణిగింది చేతులు సాచి.     'కొన్ని క్షణాలపాటు నీ అందాన్నిలాగే చూడనియ్ సోఫియా... నిన్నటిదాకా ప్రపంచపు పరిధిలో నుంచి ఇప్పుడే నీ లోకపు సరిహద్దుల్లో అడుగుపెడుతున్నవాడ్ని. శరీరాన్ని తాకే ముందు నీ మనో నిగ్రహపు లోతుల్ని కొలవనియ్..." అతడెందుకిలా మాటాడుతున్నదీ గ్రహించే స్థితిలో లేదామె.     "ఎంతటి అసాధారణమైన సౌందర్యం నీది! రాసిపోసిన సంపంగి పూల గంధాన్ని మేను కద్దుకుని ఎదపై పెంచుకున్న అందాలు పూల బంతుల్లా! పిలుపు మాత్రానికే సుఖాతి రేకంతో అరమోడ్పులౌతున్న నీ నేత్రాలు తెలి మబ్బుల మాటున నిదురపోయే వేగుచుక్కలా లేక తెలవారని కోర్కెల సంద్రంలో అల్లనల్లన సాగే కాంక్షల కెరటాలా... అంగలార్చుకుపోతున్న నీ ఆర్తిని చూస్తుంటే అనిపిస్తూంది నువ్వు పద్మినివని!"     సోఫియా గొంతు నుంచి సన్నని మూలుగు... ఇప్పుడామె మదనుడి వింటినుంచి జారిపడిన పూల బాణమై కంపిస్తూంది.     "మూడు రేఖల శంఖాన్ని గొంతుగా మార్చుకుని రేయి మొదటి జామున చకోరంలా వలపు తళుకుల వానలో ఊర్పుల్ని కలగలిపి పురుష సంగమం కోసం ఉలికిపడుతున్నావు కులుకుల కిన్నెరసానిలా కోర్కెల ఉయ్యాలలో ప్రియుడ్ని పెట్టి పరవశించాలనుకునే నువ్వు చిత్రిణివా?"     "ఉహు" అరమోడ్పులైన నేత్రాలతో ఎగిరెగిరి పడుతూంది.     "కోర్కె తీరని తాపంతో ఉద్విగ్నపడతావు. కొలిమిగా మారి వేడి సెగలతో ఒంటికి చలి కాచుకుంటావు. అది తాపమో లేక ప్రకోపమో తెలియక సందిగ్ధపడతావు. ఇన్ని తెలిసిన నువ్వు వీణని కాదంటావు. జాణనైతే చాలంటావు. అంకుశాన్ని గుర్తించే మదపుటేనుగువా లేక శంకతో శశాంకుడ్ని చేపట్టాలనుకునే శంఖిణివా"     "అదీకాని నాడు మృదుస్వరాల రాపిడికే మెత్తబడి గాఢ సంగమాన్ని ప్రగాఢంగా వాంఛిస్తూ మోహపు కంఠాన్ని కంచు గంటగా మార్చి క్రూర కాంక్షకి లొంగే హస్తినివా... ఈ కళలో ఇంతటి నిష్ణాతురాలినని మురిసే సోఫియా నువ్వు ఏ ఒక్కదానివీ కాదు అన్నీ కలిసిన ఆడదానివి. నన్ను ఓడించాలని అనుక్షణమూ ఆలోచిస్తున్నదానివి.."     అరక్షణంపాటు రొప్పుతూ చూసిన సోఫియాలో కదలిక ఆగిపోయింది. గాటుపడకుండానే గట్టుకూలిన గండిలా నిస్త్రాణగా పైకి లేచి బాత్ రూం వేపు నడిచింది. షవర్ కింద నిలబడింది అయిదు నిమిషాలపాటు. టవల్ తో తలను రుద్దుకుంటూ బయటికొచ్చి "మగాడివే" అంది లాలనగా. నీరసంగా నవ్వుతూ అతడి పక్కన చేరుతూంటే ఫోన్ రింగవడం మొదలుపెట్టింది.     అది బెడ్ కి ఎడంవేపు వుండడంతో సోఫియా అందుకుంది అసహనంగా "యస్"     "గుడ్...నువ్వక్కడే వున్నావన్నమాట"     "ఎవర్నువ్వు?" ఆ వేళలో ఫోన్ రావడం ఆమెకు నచ్చలేదు.     "వినీల"     "ఐసీ... ఇక్కడుంటానని ఎలా అనుకున్నావు?" సోఫియా పిడికిలి బిగుసుకుంది.     "నీ విజయాన్ని చెప్పుకోవడానికి అక్కడికే ముందు వెళతావనిపించింది. ఆ ఉత్సాహంతో నీ ఆడతనాన్ని మొత్తం అక్కడే పరిచేస్తావనీ అనిపించింది. తెలిసిందిప్పుడు."     "ఏమని?"     "నా అంచనా తప్పు కాలేదని"     "నాకు ఇందాకే తెలిసింది"     "ఏమని" వినీల అడిగింది.     "నువ్వు జయచంద్ర మనిషివని"     "మనిషినే కాదు సోఫియా... జయచంద్ర కూతుర్ని."     "ఓహ్" సోఫియా కళ్ళలో అణువంత విస్మయం. "చెప్పు ఎలా వున్నాడు నీ తండ్రి?"     "నువ్వనుకున్నట్టుగా మాత్రం కాదు. అవును సోఫియా... నువ్వూహించి వుండవు. నీ రాకను నేను గమనించానని... అందుకే నీ ప్రయత్నమంతా చూశాను. నువ్వు సెలైన్ బాటిల్ పాయిజన్ ఇంజెక్ట్ చేసిన మరుక్షణం నాన్నగారి చేతికున్న నీడిల్ ని లాగేశానని..."     "ఐసీ" ఇప్పుడు సోఫియా గొంతు పూడుకు పోయింది. "అలాంటప్పుడు నన్నెందుకు అడ్డుకోలేకపోయావు?"     "మన పోరాటానికి అది వేదిక కాకూడదనిపించింది. నీకు కొన్ని గంటలపాటైనా ఈ పాశవికమైన ఆనందాన్ని మిగల్చాలనిపించింది. అంతకుమించి మన హడావుడి, అల్లరి నాన్నగారి ఆరోగ్యానికి మంచిది కాదనిపించింది"     "ఇది చెప్పడానికే ఫోన్ చేశావా?"     "ఇదొక్కడే కాదు సోఫియా... చాలా తెగువున్న ఆడదానిగా మురిసిపోతున్న నీతో కొన్ని పర్సనల్ గా మాటాడాలని వుంది"     "ఏమిటది?"     "పోరాటాన్ని కొనసాగించాలనుకుంటున్న నీకు కొన్ని యుద్ధ నిబంధనల గురించి ముందు తెలియ చేద్దామని"     "పిల్లకాకివి" సోఫియా గొంతులో కర్కశత్వం.     "అయినా నీలాంటి ఆడ రాబందును ఎదుర్కోవాలనుకుంటున్నాను."     "అంటే తండ్రి మంచం పట్టగానే క్షీణించిపోతున్న నీ సామ్రాజ్యానికి యువరాణివి అయ్యావా?"     "ఇంతవరకు కాలేదు సోఫియా... కాని నీ ప్రియుడి మూలంగా మంచం పట్టిన నా తండ్రి స్థితిని చూసి ఆ స్థితిని అవకాశంగా మార్చుకుంటున్న నీ ఉత్సాహాన్ని గమనించి ఇప్పుడు రాజ్యాధికారానికి నేను వారసురాలిని కావాలనుకుంటున్నాను."
24,393
ఇంద్రమిత్ర క్షణం ఆగాడు. అతడకి నిజమేననిపించింది వెయ్యి రూపాయిలు ఊర్కినే ముక్కు, ముఖం తెలియని వ్యక్తికి ఇచ్చేసి వెళ్ళిపోవడం కంటే కనీసం ఎంతో కొంత పని పూర్తీచేసుకునిపోతే మంచిదనిపించింది. ఇంద్రమిత్ర వెనక్కి తిరిగాడు. ఇస్మాయిల్ ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుని అడిగాడు_ "అసలు నేనో ద్క్తర్ నని మీకెలా తెల్సు?" ఇస్మాయిల్ నవ్వుతూ చెప్పాడు._ "మీరు వృత్తి గురించి మాత్రంనే కాదు_ మీ పేరు ఇంద్రమిత్ర అని తెల్సు. ఏదో మ్యాగజైన్ లో మీ ఫోటో చోశాను. మీరు పాఠకుల ప్రశ్నలకు సమాధానలు ఇస్తారనుకుంటా?! నాకు రోజూ పేపర్ చదివే అలవాటుంది మీ పర్సనల్ సేక్రటరీ ఐరిస్ మీ దగ్గరే ట్రీట్ మెంట్ పుచ్చుకున్న ఓ పేషెంట్ ఇద్దరూ హత్యకు గురయ్యారని కూడా నకు తెల్సు." ఇస్మాయిల్ చెప్పడం ఆపి ఇంద్రమిత్రవేపు చూశాడు. ఇంద్రమిత్ర అన్నాడు_ "అవును_నిజానికి ఆ రెండు హత్యలూ నన్ను చంపలనుకుని చేసినవి పొరపాటున వేరేవాళ్ళు మరణించారు. ఎవరో నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు." ఇస్మాయిల్ అన్నాడు_ "మీకేవరైనా శత్రువులు వున్నారా?" ఇంద్రమిత్ర తల అడ్డంగా వూపాడు.              "పోనీ మీ పేషెంట్లలో పికోపాత్ లు కానే, కిల్లింగ్ ఇన్ స్టింక్ వున్నారుకానీ వున్నారా?" ఇంద్రమిత్ర లేరన్నట్టు తల వూపాడు. "పోనీహొషన్స్ కి లోనవుతున్నవాళ్ళు..." "హొమిసైడల్ పారనాయిడ్స్....." ఇంద్రమిత్రకు ఒక విషయం అర్దమయింది. పైకి వెర్రివాడిలా కనిపించే ఇస్మాయిల్ చాలా తెలివిగలవాడు. అప్పటిలాగా పరదాగా వున్న ఇస్మాయిల్ ముఖం తనను ప్రశ్నలు అడుగుతున్నపుడు ఒక్కసారిగా సీరియస్ గా మరిపోయింది. ఇప్పుడు అతని ముఖంలోంచి కందియన్ మాయమయి ప్రవైట్ ఇన్ వెస్టిగేటర్ ప్రత్యక్షమయ్యాదు. ఇంద్ర మిత్ర చెప్పాడు_ "డేనియల్ అని ఓక పేషెంట్ వున్నాడు.అతడు తరచూ హేలూషియేషన్స్  కి గురవుతూ వుంటాడు. కని అతడు కిల్లర్ గా యింకా మారలేదు" ఇస్మాయిల్ అడిగాడు_ "ఫోనీ మీకు పర్సనల్ గా కాకపోయినా, మీకుటుంబానికి చెందిన వాళ్ళకి... అంటే మీ ఫ్దర్ కి గానీ, బ్రదర్ కి గానీ శత్రువులు ఎవరన్నా వున్నారా? వాళ్ళవలన కూడా మీకు ప్రమాదం జరిగేఅవకాశముందా? నేల రోజుల క్రితం మీరు పేపర్లో చదివే వుంటారు. ఇరుగు_ పరుగున వుండే రెండు కుటుంబాలవాళ్ళు పోట్లాడుకున్నారు. అందులో ఓ కుటుంబం తాలూకు మనిషి రెండో కుటుంబానికి చెందిన పెద్దవాళ్ళని ఏం చేయలేం వాళ్ళ పిల్లలు యిద్దర్నీ మెడ పిసికి చంపేశాడు. మీ ప్యామిలేలో మెంబర్ల మీద వున్న కోపం మీ మీదకి మల్లె అవకాశం వుంది." ఇంద్రమిత్ర చెప్పాడు_ "నాకు తెలిసినంతవరకూ పుట్టిబుద్దేరిగిన తర్వాత మా ప్యామిలీకి ఎలాంటి శత్రువులూ లేరు. మా నాన్నకి మంచి ,మనిషి అనీ, అజాతశత్రువనీ పేరుంది." "సరే! ఇక మీ పర్సనల్ విషయానికి వద్దాం. ప్రేమించే మనిషి తాలుకూ బంధువులు మీమీద ఎటాక్ చేసే అవకాశముంది. ఇప్పుడు జరిగే హత్యల్లో చాలావరకు లైంగికపరమైనవీ, డబ్బుపరమైననీ, పావులీతికల్ ఎసాఫికేషన్స్  ఎప్పుడూ మూడో స్థానంలోనే వుంటాయి పై రెంటి కరణాలవలన జరిగే హత్యలే ఎక్కువ." ఇంద్రమిత్ర తనకేలాంటి లవ్ ఎపైర్స్ లేవని చెప్పాడు.తర్వాత ఇస్మాయిల్ ఇంద్రమిత్రకు అనేక కోణల్లో ప్రశ్నించాడు. అనుమానించితగ్గ ఆధారం ఒక్కటి కూడా లభించలేదు. చివరిగా అన్నాడు ఇస్మాయిల్_ "మీకు నా ఎద్వాయిజ్ ఒక్కటే. మీరు నాలుగు రోజులు సెలవు తెసుకావుమ్ది అన్నట్టు మీకు స్వంతకారుందా?" ఇంద్రమిత్ర తలూపి చెప్పాడు_ "ఉంది. కాని డ్రైవింగ్ సీట్ పక్కడోర్ ప్రాబ్లంగా వుంది. సర్వీసింగ్ కి యివ్వాలి. కొద్దిరోజుల్నుంచి స్కూటర్  మీద తిరుగుతున్నాను." "మీ కారు వెంటనే ఇవ్వాళే సర్వీసింగ్ కి యివ్వండి. సాయంత్రానికి కల్లా డేలవరీ కావాలని చెప్పండి. సిటీకి అరవై కిలోమీటర్ల దూరంలో గోల్డెన్ వ్యాలీ రిపర్ట్వున్నాయి అవి మీలాంటి పోష్ పెపుల్స్ కోసం కట్టారు. హెల్త్ క్లబ్, స్విమింగ్ పూల్, పకృతి అశ్రమం, ఎంటర్ టైన్ మెంట్ పార్క్, పిల్లలకు డిస్కిలాండ్  అనేక సౌకర్యాలు అక్కడ వున్నాయి. అవన్నీ ఇండివిడ్యువల్ కాటేజేస్. కావాలంటే అందమయిన అమ్మాయిలు కూడ అక్కడ దొరుకుతారు. కాసేపు టైం పాస్ చేసినట్టు వుంటుంది" అని చెప్పి నవ్వాడు ఇస్మాయిల్. ఇంద్రమిత్ర అన్నాడు_ "వరం రోజులు అంటే సెవెన్ డేస్. అన్ని రోజులు పేషెంట్స్ కి దూరంగా వుండటం అసంభవం. ప్రతిరోజూ నా అపాయింట్ మెంట్ బుక్స్ పుల్ గా నిండిపోయింది." "పోనీ కనిసం రెండు రోజులు రెస్ట్ తీసుకోండి. ణ మనసులో ఓ పతకం రూపుదిద్దుకుంటోంది. మీరు అక్కడికెళ్ళక తప్పదు. ఈ లోపు మీ కారు రిపేరు చేయించుకోండి. రెండు రోజులకు సరిపడా బట్టలు సర్దుకోండి. మీక్కూడా ఈ బిజీ లైఫ్ నుంచి దూరంగా వెళ్ళినట్టు వుంటుంది." ఇంద్రమిత్ర అంగీకార సూచనంగా తల వూపాడు. "అన్నట్టు మర్చిపోయాను_ మీ కేస్ డీల్ చేస్తున్న పోలీసు అఫేసర్స్ ఎవరు?" "సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ ఫెర్నాండెజ్, ఇన్స్ స్పెక్టర్ చిదంబరం. కాని మొదట్నుంచీ చిదంబరం నా పట్ల పూర్తీ వ్యతిరేకంగా వున్నాడు. ఓ సందర్బంలో నా పేషేంట్ నీ, పర్సనల్ సెక్రటరీ ఐరిస్ నీ యిద్దర్నీ నేనే చంపి వుండవచ్చని కూడా ఆరోపించాడు."
24,394
         డ్రయివర్ ఓ క్షణం భయపడ్డాడు.          జోహ్రా అంతసేపు మాట్లాడటం ఎప్పుడూ చూడని ఖలీల్ చకితుడయ్యాడు.                                                      *    *    *    *    *          ఎఫ్.బి.ఐ. కేంద్ర కార్యాలయంలోని హెయిర్ ఎగ్జామిన్ లాబ్ లో సిద్దేశ్వర్ ఓబరాయ్ పంపించిన హెయిర్ ని అనాలసిస్ చేయటం పూర్తయింది.          బొంబాయి ఫోరెన్ సిక్ అనాలసిస్ లోని పాయింట్స్ ని తన అనాలసిస్ లోని పాయింట్స్ ని తన అనాలసిస్ లోని పాయింట్స్ తో పోల్చి చూసుకున్నాడు ఎక్స్ పర్ట్.          "ఇండియన్ పోలీసు శాఖలో కూడా బ్రెయిన్ ఉన్నవాళ్ళున్నారు. వాళ్ళ అనాలసిస్- మన అనాలసిస్ సరిపోయింది" అన్నాడు ఎక్స్ పర్ట్ తన అసిస్టెంట్ తో.          ఆ తరువాత ఇద్దరు లేచి కంపేరిజన్ కంప్యూటర్ కాంప్లెక్స్ లోకి వెళ్ళారు.          ఒక్కో వరుసలో ఒక్కో క్రిమినల్ ఐడెంటిఫికేషన్ మీద వివరాలు స్టోర్ చేసిన కంప్యూటర్స్ వున్నాయి.          ఇద్దరూ హెయిర్ వింగ్ ఇన్ చార్జ్ ని కలిసి తాము వచ్చినపని చెప్పి, రిపోర్టుని అందించారు.          ఆ ఇన్ ఛార్జి రిపోర్టర్ ని తీసుకొని కంపేరిజన్ కంప్యూటర్ ముందు కూర్చొని ఆ రిపోర్టర్ లోని వివరాలను కంప్యూటర్ కి ఫీడ్ చేసి ఐడెంటికల్ హెయిర్ అనాలసిస్ ఫీడ్ అయి వుందా? ఉంటే ఆ హెయిర్ ఎవరిదనే రెండు ప్రశ్నలను వేసాడు.          కంప్యూటర్ నిశ్శబ్దంగా కొద్ది క్షణాలు పనిచేసాక స్క్రీన్ మీద మొదటి ప్రశ్నకు సమాధానం వచ్చింది 'ఎస్' అని.          ఆ వెంటనే రెండో ప్రశ్నకు కూడా సమాధానం వచ్చింది.          పేరు        : అమానుల్లా ఖాన్     ఎలియాస్ (మారుపేర్లు)    : (ఈ కాలమ్ ఎదురుగా సుమారు ఓ వంద పేర్లు వున్నాయి)     పోలీస్ ఏజెన్సీ ఫైల్స్    : డ్రగ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీ, న్యూయార్క్ ఎస్  9791 NYPD B 6917271 FBI 548970     పోలీసుశాఖకు తెల్సిన    :7201, కప్పోక్ స్ట్రీట్, యాంకర్స్,     అతని లాస్టు అడ్రస్    : న్యూయార్క్ NY APT_4C     పాత అడ్రస్        :101, హోవెల్, న్యూజెర్సీ         ఫిజికల్ డిస్క్రిప్షన్        : ఎత్తు ఏడడుగుల పదంగుళాలు, డార్క్ హెయిర్, బ్రౌన్ ఐస్,  ఛామనచాయ రామ్న్గు, గుబురైన మీసాలు, ఒత్తయిన కనుబొమలు, కళ్ళలో ఎరుపు జీర     ప్రత్యేకమైన గుర్తులు    : కుడిచేతి మణికట్టుమీద కాలిన మచ్చ     పుట్టిన తేదీ        :14-2-1959, సెయింట్ పాల్ హాస్పిటల్, పీల్ ఖానా,   హైదరాబాద్, ఇండియా     రెలిటివ్స్, ఫ్రెండ్స్        : తెలియరాలేదు     అతని గురించి తెల్సినవాళ్ళు    : చాలామంది ఉన్నా పోలీసు ఎంక్వైరీలకు భయపడి చెప్పలేదు.     క్రిమినల్ రికార్డ్        :1979 అరెస్టెడ్ అస్సాల్ట్, డబ్ల్యూ డెడ్లీ వెపన్, చార్జెస్ డ్రాప్టు 1981, అరెస్టెడ్, బుక్ మేకింగ్ చార్జెస్ డ్రాఫ్ట్ ఐవరీకోస్ట్  సముద్రతీరాన 120 మంది ఆర్మీ కమెండోస్ మధ్యనున్న ఆ   దేశపు అధ్యక్షుడ్ని అసాసినేట్ చేసి తప్పించుకున్నాడు.  సరయిన సాక్ష్యాలు పోలీసులకు దొరకలేదు.     స్పెషల్ ఎబిలిటీస్        : హండ్రెడ్ పర్సెంట్ ప్రొఫెషనల్ కిల్లర్. పాకిస్తాన్ టెర్రెరిస్టు క్యాంప్స్  లో ట్రైనింగ్ అయ్యాడు.                            : ఇంటర్ నేషనల్ రేంజ్ హిట్ మెన్.     మనస్తత్వం        : తన గురి తప్పితే మరింత పగబట్టే క్రూరత్వం, అహంభావి, ఆత్మ విశ్వాసి     నేరంచేసే విధానాలు    : ఇతనికి ప్రతిదేశంలో మిత్రులున్నారు. ఏ దేశం వెళితే ఆ దేశంలోని  తన మిత్రుడి సహకారం తీసుకుని పని పూర్తి చేసి భారీగా డబ్బు ముట్టజెపుతాడు. ప్రతి అసాసినేషన్ ని తనదైన ప్రత్యేక శైలిలో  పూర్తి చేస్తాడు. ఇలా హత్యా చేస్తాడని ప్రత్యేకించి చెప్పలేని డాజిలింగ్ పర్సనాలిటీ ప్రతి అసాసినేషన్ కీ ఒక కొత్త పథకాన్నితయారు చేసుకుంటాడు.          అతని దగ్గర యాభై పైగా దేశాల పాస్ పోర్టులున్నాయి. ప్రపంచంలో ఏమూల తయారయ్యే ఫెయిర్ ఆర్మ్స్ నైనా ఉపయోగించగలడు. సొంతంగా మేకప్ చేసుకోగలడు. ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉన్న ఆయుధాల్ని ఉపయోగించడు. తన అవసరాన్ని, పరిమితుల్ని చెప్పి ఆయుధాన్ని తయారుచేయించుకుంటాడు. ఆపరేషన్ లో ఇతరుల సహాయాన్ని సాధ్యమైనంత వరకు తీసుకోడు. సాధారణంగా మూడు, మూడున్నర లక్షల డాలర్లకు తక్కువిచ్చే కేసుల్ని ఒప్పుకోడు. కంప్యూటర్ స్క్రీన్ మీద విజువలైజ్ అవుతున్న వివరాలే బ్రొమైడ్ మీద ప్రింట్ అవుతున్నాయి. మరికొద్ది క్షణాలకి కంప్యూటర్ ఆటోమేటిగ్గా ఆఫ్ అయింది. మరో అరగంటకు ఒక ఫైబర్ జాకెట్ సీల్డ్ కవర్ ఎఫ్.బి.ఐ. డైరెక్టర్ అంగీకారముతో సిద్దేశ్వర్ కి పంపబడింది.                                                               *    *    *    *    *
24,395
    ఇది ఇట్లుండగా వృత్రుని సంహరించుటకు ఆయుధము కావలసి వచ్చినది. దధీచి ఎముకలతో చేసిన ఆయుధమున వృత్రుడు హతుడు అగునని నారాయణుడు చెప్పినాడు. ఇంద్రుడు దధీచిని అతని ఎముకలు ఇవ్వవలసినదని అర్థించినాడు. లోకోపకారకార్యముగాన దధీచి అందుకు అంగీకరించినాడు. యోగము అవలంబించినాడు. ప్రాణములు విడిచినాడు. విశ్వకర్మ దధీచి ఎముకతో వజ్రాయుధము నిర్మించినాడు. ఇంద్రుడు వజ్రాయుధముతో వృత్రుని వధించినాడు.      2. గోవులకు ఇంద్రునితో సమాన ప్రతిపత్తి కలిగించినాడు. పాలు జీవనాధారములు అని గురించినారు. పాలు ప్రాణిజాలమునకు సంపూర్ణ ఆహారము అగును. నేటికిని ఇది నిత్య సత్యము.     3. సూర్యుని నుండియే చంద్రుడు వెలుగు పొందుచున్నాడు అని గ్రహించినారు.            పదునాలుగవ అనువాకము - ఎనుబది అయిదవ సూక్తము          ఋషి - రహోగణ పుత్రుడు గౌతముడు, దేవత - మరుత్తులు                      ఛందస్సు - 5,12 త్రిష్టుప్, తక్కినవి జగతి.     1. మరుత్తులు వ్యాపించువారు. శుభప్రదులు. రుద్రపుత్రులు. ప్రయాణములకు స్త్రీలవలె చక్కగా అలంకరించుకొందురు. ద్యావా పృథ్వులను వారే వృద్ధి చేసినారు. వీరులను, శత్రువులను తిరస్కరించువారు. అట్టి మరుత్తులు యజ్ఞములందు సోమపానము చేతురు. మదింతురు.     2. మరుత్తులను దేవతలు అభిషేకించుచున్నారు. మహత్తుగల రుద్రుని పుత్రులు ద్యులోకమును నివాసము చేసికొన్నారు. పూజ్యలయినారు. ఇంద్రుని పూజింతురు. బలము పెంచుదురు. మరుత్తులు భూమి పుత్రులు. సంపన్నులయి వర్థిల్లుచున్నారు.     3. భూమి గోరూపమయినది. ఆమె మరుత్తులకు మాతృమూర్తి మరుత్తులు ఆభరణములతో అలంకరించుకుందురు. అప్పుడు వారు ఎంతో శోభింతురు. వారు లోకములను బాధించు దుష్టులను శిక్షింతురు. మరుత్తులు పోవు మార్గమున నీరు ప్రవహించును.     4. మరుత్తులు యజ్ఞవంతులు. ఆయుధధారులు. ప్రకాశకులు. మనోవేగవంతులు. వర్షించువారు. వారు రథమునకు ఆడలేళ్లను పూన్చుదురు. ఆ రథము కదిలినప్పుడు అశక్యములను సహితము కదిలింతురు.     5. మరుత్తులు ఆడలేళ్లను కట్టిన రథమున సూర్యునివలె ప్రకాశింతురు. జనులకు అన్నము అందించుటకు మబ్బులను కురిపింతురు. ఆ వర్షధారలు, నీరు చర్మమును తడిపినట్లు భూమిని తడుపుచున్నవి.     6. మరుత్తులారా ! మీ కొఱకు వేగముగా ఎగిరిపోవు గుఱ్ఱములు కట్టిన రథము సిద్ధము చేసినాము. మీ దోసిళ్ల నిండ ధనములతో తరలిరండు. దర్భలు పరచి ఉంచినాము. ఆసీనులుకండు. సోమము సిద్ధముగా ఉన్నది. సేవించుడు. మదించుడు.     7. మరుత్తులు స్వంతబలమున వృద్ధిచెందినారు. మహిమలు ఆర్జించినారు. స్వర్గము చేరినారు. దానిని విస్తారము చేసినారు. విష్ణువు వర్షము కురిపించువాడు. మదము కలిగించువాడు. ఆ విష్ణువు ఈ మరుత్తులను రక్షించును. మరుత్తులు పక్షులవలె ఎగిరి వత్తురు. యజ్ఞములందు ఆసీనులు అగుదురు.     8. మరుత్తులు శూరులవలె, వీరులవలె శీఘ్రగమనులు. యుద్ధములందు అన్నార్తులవలె అటునిటు తిరుగుదురు. వారు రాజులువలె దీప్తదర్శనులు. కనుకనే సమస్త భూతములు వారిముందు గడగడలాడును.     9. త్వష్ట నిపుణుడయిన కార్యవంతుడు. అతడు ఇంద్రునకు వజ్రాయుధము నిర్మించి ఇచ్చినాడు. అది స్వర్ణమయము. వేయి అంచులు గలది. ఇంద్రుడు వజ్రాయుధమున వృత్రుని వధించినాడు. జలమును వర్షించినాడు.     10. మరుత్తులు తమ బలమున జలమును మీదికి ఎత్తినారు. పర్వతము అడ్డము వచ్చినది. దానిని బద్దలుకొట్టినారు. నూరు తీవల వీణ 'వాణము'ను వాయించినారు. సోమపానము చేసినారు. ఉన్మత్తులు అయినారు. స్తుతికర్తలకు ధనములను ప్రసాదించినారు.     11. మరుత్తులు బావిని ఎత్తుకొని వచ్చినారు. తమ కాంతులతో సర్వరక్షణలు కల్పించి బావిని గౌతముని వద్దకు తెచ్చినారు. దాహముతో ఉన్న గౌతమునకు నీరు పోసినారు. ఆ ఋషిని సంతృప్తుని చేసినారు.     12. మరుత్తులారా ! మీరు ముల్లోకములందు ఉన్నారు. వర్షించుచున్నారు. మేము మిమ్ము స్తుతించుచున్నాము. హవిస్సులు అర్పించుచున్నాము. మాకు గృహములు, పుత్ర పౌత్ర ధనములను ప్రసాదించుడు.     ఆలోచనామృతము :     1. 10,11 మంత్రముల గౌతముని వృత్తాంతము వచ్చినది. గౌతమునకు దాహము అయినది. అతడు మరుత్తులను ప్రార్ధించినాడు. మరుత్తులు ఒక బావిని ఎత్తుకొని వచ్చినారు. మార్గమధ్యమున పర్వతము అడ్డువచ్చినది. మరుత్తులు దానిని బద్దలుకొట్టినారు. బావిని గౌతముని వద్దకు చేర్చినారు. అతని దాహము తీర్చినారు.     ఇంతవరకు వర్షజలము, ప్రవాహ జలమును మాత్రమే పేర్కొనుట జరిగినది. ఇది భూగర్భజలములను బయటకి తెచ్చుట కావచ్చును. అడ్డువచ్చిన పర్వతము భూమిలోని రాయి కావచ్చును.     ఇది రాతిని బద్దలు కొట్టి భూగర్భజలమును బయటకి తెచ్చుట. ఇది అసామాన్య కార్యము.         ఎనుబది ఆరవ సూక్తము, ఋషి - రహోగణపుత్రుడు గౌతముడు,                       దేవత - మరుత్తులు, ఛందస్సు - గాయత్రి.     1. మరుత్తులు ద్యులోకము నుండి దిగివత్తురు. యజమాని ఇంట సోమపానము చేయుదురు. అట్టి యజమానికి రక్షణ కొదువ ఉండదు.     2. మరుత్తులారా ! మీరు యజ్ఞమును జరిపింతురు. యజమానులు, స్తుతికర్తలు మిమ్ము ఆహ్వానించుచున్నారు. ఆలకించుడు.     3. ఋత్విజులతో మరుత్తులను ఉత్సాహ పరిపించిన యజమానికి ఆలమందలు అనేకములు కలుగును.     4. మరుత్తులు వీరులు. వారికొఱకు యజ్ఞమున సోమము సిద్ధముగా ఉన్నది. స్తోత్రములు జరుగుచున్నవి. మరుత్తులు వానిని మెచ్చవలెను.     5. మరుద్గణములు శత్రువులను తిరస్కరింతురు. వారు యజమానుల స్తుతివాక్కులు వినవలెను. వారికి అన్నములు ప్రసాదించవలెను.     6. మరుద్గణములారా ! మీరు సర్వదర్శనులు. కలకాలముగా మాకు రక్షణ కల్పించుచున్నారు. మేము మీకు హవిస్సులు అర్పించుచున్నాము.     7. మరుత్తులారా ! మీరు హవిస్సులు స్వీకరించిన యజమాని ధనవంతుడు కావలెను.     8. మరుత్తులారా ! మీరు బలవంతులగు నాయకులు. స్తోత్రపాఠకులు మిమ్ము స్తుతించి అలసి చెమర్చినారు. వారి కోర్కెలను తీర్చుడు.     9. సత్యబలముగల మరుత్తులారా ! మీ మాహాత్మ్యమును ప్రకటించుడు. రాక్షసులను అణచుడు.     10. మరుత్తులారా ! గుహలోని చీకటిని దాచిపెట్టుడు. రాక్షసులను పారద్రోలుడు. మేము కోరిన తేజస్సును మాకు ప్రసాదించుడు.         ఎనుబది ఏడవ సూక్తము ఋషి - రహోగణపుత్రుడు గౌతముడు,                   దేవత - మరుత్తులు, ఛందస్సు - జగతి.     1. మరుత్తులు శత్రుంజయులు. బలయుతులు. ధ్వనివంతులు. ఇతరులకు లొంగనివారు. ఒకరిని ఒకరు విడువనివారు. రసములను కూర్చువారు. స్తవనీయులు. మబ్బులను కదలించువారు. అట్టి మరుత్తులు అలంకరించుకున్నపుడు సూర్యునివలె ప్రకాశింతురు.     2. మరుత్తులారా ! ఆకాశ మార్గమున మీరు పక్షులవలె విహరింతురు. మీరు ఆకసమున మబ్బులను కూర్చుచున్నారు. అవి మీ రథములందు చిక్కుచున్నవి. వర్షము కలుగుజేయుచున్నవి. మిమ్ము పూజించు యజమానులకు తేనెవంటి నీటిని ప్రసాదించుడు.     3. వర్షము శుభంకరము. మరుత్తులు మేఘములను వర్శమునకు ఆయత్తపరుచుచున్నారు. మరుత్తులు మబ్బులను ఎగురుకొట్టునపుడు భూమి విధవవలె గడగడలాడుచున్నది. విహారశీలూరు, చలన స్వభావులు, కాంతిమంతములగు ఆయుధములవారు అయిన మరుత్తులు సర్వమును కదలించుచున్నారు. తమ మహిమను ప్రకటించుచున్నారు.     4. మరుత్తులు ప్రసార స్వభావులు. లేళ్లవాహనపువారు. నిత్యయవ్వనులు. ఎంతో బలవంతులు. జగములకు ఈశ్వరులు అగుచున్నారు. వారు సత్కర్మలకు అర్హులు. భక్తుల ఋణములు తీర్చువారు. అట్టి మరుత్తులు మా ఈ కర్మను రక్షించవలెను.     5. మరుత్తులు ఇంద్రుని వదలకున్నారు. ఇంద్రుని హెచ్చరించుచున్నారు. యజ్ఞార్హమగు నామములు ధరించినారు. ఇది మా తండ్రులు చెప్పగా తెలుసుకున్నాము. అట్టి మరుత్తులకు సోమము సమర్పించుచున్నాము. స్తుతించుచున్నాము.     6. మరుత్తులు ప్రకాశకులు. గమనశీలురు. స్తోత్రవ్యులు. వారు సూర్యకిరణములతో కూడి మేఘములను వహించుచున్నారు. ఋత్విక్కులతో కలిసి హవిస్సులు స్వీకరించుచున్నారు. భయరహితులయిన మరుత్తులు హర్షదమగు తమ స్థానమున నిలిచినారు.         ఎనుబది ఎనిమిదవ సూక్తము, ఋషి - రహోగణ పుత్రుడు గౌతముడు         దేవత - మరుత్తులు, ఛందస్సు - త్రిష్టుప్ 1,6 ప్రస్తార పంక్తి 2 విరాట్టు.     1. మరుత్తులారా ! మీ రథములు కాంతివంతములు. వేగవంతములు. అశ్వవంతములు. ఆయుధవంతములు. వానిమీద పక్షులవలె ఎగిరి త్వరత్వరగా విచ్చేయుడు. అన్నములతో మా వద్దకు రండు.     2. మరుత్తుల రథపు గుఱ్ఱములు పసుపు, ఎరుపు రంగువి. వారు బంగారమువలె మెరయు వజ్రాయుధముగలవారు. మరుత్తులు తమ రథము మీద భూమిని నలుగగొట్టుచు వత్తురు. దేవతలను స్తుతించు యజమానులకు శుభములు కూర్చవత్తురు.     3. మరుత్తుల భుజములందు ఆయుధములు ఉన్నవి. వారు అడవులను పెంచినట్లు యజ్ఞములను వృద్ధిపరచుచున్నారు. ధనవంతులగు యజమానులు వారికొఱకు సోమము సిద్ధపరచినారు.     4. గౌతములు జలములకయి మరుత్తులను స్తుతించినారు. వారికి బావి లభించినది. ఇప్పుడు గౌతములకు మంచి రోజులు వచ్చినవి. వారు జలముతో చేయవలసిన కర్మలను చక్కగా నిర్వహించినారు.     5. మరుత్తులారా ! బంగారు రథమును ఎక్కి, ఇనుప చక్రధారలు కలిగి, బహుధా ఇటునటు తిరుగుచు శత్రువులను సంహరించి వర్షోదకము తెచ్చు మిమ్ము కీర్తించుచు గౌతముడు ఈ సూత్రమును ఉచ్చరించినాడు. ఇది ప్రశస్తమయిన సూత్రమని ఎల్లరు ఎరుగుదురు.     6. మరుత్తులారా ! మేము మీ గుణగణములను విశేషముగా నుతించుచున్నాము. ఋత్విక్కులు కూడ మిమ్ము ఈ ఋక్కులతో నుతించుదురు. మాకు అన్నములు ప్రసాదించుడు.         ఎనుబది తొమ్మిదవ సూక్తము, ఋషి - రహోగణపుత్రుడు గౌతముడు       దేవత - విశ్వేదేవతలు, ఛందస్సు - 1-5,7 జగతి, 6 విరాట్టు, 8-10 త్రిష్టుప్.     1. హింసింపబడనివి, నిరోధింపబడనివి, శత్రుసంహారకములు, కళ్యాణప్రదములు అయిన కర్మలు మమ్ము ఆశ్రయించవలెను. ఆశ్రయించిన వారిని విడువనట్టి, నిత్యము రక్షించునట్టి దేవతలందరు మా అభ్యుదయమును ఆశించవలెను.     2. శుభప్రదులగు యజమానులందు అనురాగముగల దేవతలెల్లరు మమ్ము అనుగ్రహించవలెను. దేవతలు మాకు సంపదలు ప్రసాదించవలెను. మేము దేవతల మైత్రిని పొందవలెను. దేవతలు మాకు ఆయువును ప్రసాదించవలెను. దేవాన ఆయుః ప్రతిరస్తు జీవసే     3. సనాతన కాలము నుంచి వచ్చుచున్న నిత్యమైన వేదవాక్కున భగుని, మిత్రుని, అదితిని, మరుత్తులను, అర్యముని, వరుణుని, సోముని, అశ్వినులను ఇంకను దేవతలను అందరిని ఆహ్వానించుచున్నాము. శోభన ధనములుగల సరస్వతి మాకు సుఖములు కలిగించవలెను. సరస్వతీనః సుభగామయస్కత్
24,396
    "నీవే చెప్పావుగా ఆమె నా జన్మజన్మల చెలి అని! రాజరాజ నరేంద్రుని కాలం నుంచి దాంపత్యం అవిచ్చిన్నంగా సాగివస్తున్నదన్నావూ ! మా దాంపత్య ధర్మాన్ని నీవు ఆశీర్వదించాలి!'     ఫక్కున నవ్వింది.     'ఎందుకా నవ్వు?'     'మరి సరళ...'     'అదే నిన్ను అడిగాను? సంద్యా ? సరళా?'     "ఆదిత్యా 'స్' తో మొదలయ్యే పేర్లు ఎన్నివుంటాయో తెలుసా? సత్య. సమత,సమయ.సరిత,సంపంగి,సవిత,సమీర... ఇలా చెబుతూ వెళ్ళితే కొని డజన్ల పేర్లు వున్నాయి 'స్' తో ప్రారంభమయ్యే పేరున్న యువతీ నే 'గతజన్మ' భార్య అనుకుంటే నీకు యీ జన్మంతా చేదికెందుకే చాలదు."     "అలానే కాదులే_"     "మరెలా?"     "ఆ పేరున్న అమ్మాయిలు కాదు ముక్యం. నాకు పరిచయం, నాపై ప్రేమ, నా కామేపై పరమ..."     "నిన్న సరళ హఠత్తుగా ప్రవేశించింది కదా! అలా యింకెందరో రావచ్చు. రోజుకో యువతి... 'స' తో ప్రారంభమయ్యే పేరున్న యువతి వచ్చేస్తే... వస్తే... అప్పుడు నే ప్రేమ క్రాస్ వర్డ్ ఫాజిల్  ని సాధించేది ఎవరు?     నువ్వే? చప్పున అన్నాడు ఆదిత్య.     'నేనా?' ఆశ్చర్యపోయింది ఉలూచి. ఆ ఆశ్చర్యం ఓ పన్నాగం గాలి పీల్చుకున్నట్టుగా వినిపించింది అడిత్యకి.     'మరి? ఇంకెవరు నువ్వుకాక? ఈ జన్మల రహస్యం చెప్పింది నువ్వు కాదా? ఆ ముడి విప్పే బాధ్యత నీదే...'     అఁపోదురూ! మరీ ముడి విప్పుకోలేనంత అమయుకుడివా నువ్వు. ఆమె  కంఠంలోకొంటితనం సెలయేరు యిసుక తిన్నెల మీద మేల్లిగా సాగినంత మెత్తగా ప్రతిద్వనించింది.     క్షణకాలం నివ్వెర పోయాడు ఆదిత్య. ఆమె చమత్కారానికి నవ్వొచ్చింది. అయితే  బలవంతాన ఆపుకున్నాడు.     'నవ్వు! నవ్విస్తే నవ్వక పోతే ఎలా? ఎందుకంత బలబంతాన నవ్వుని నిగ్రహించాలి... ఆదిత్య నువ్వెంత అందంగా నవ్వుతావో తెలుసా? పెదాలు సగం విచ్చుకుంటాయి దొంద పండ్ల లాగా ఆ మధ్యన తెల్లని పలువరస ముత్యాల సరంలా మెరుస్తుంది. ఆ ఎర్రని పెదవికి పైగా సన్నని మీసం_ యీ తెల్లని నవ్వులు చిట్లపై బడితే మిలమిలా మెరుస్తుంది ఎంత మనో మహానంగా వుమ్తావావు తెలుసా?     అసలు దారుల్లో వేణువు సూదే రాదా మనోహరుడిలా వుంటావు నీ నొక్కుల జుట్టు చూస్తే అది వలపు ప్రవాహంలా అనిపిస్తుంది. ఆ జుట్టుతో ఆదుకోవాలని ఎంత ముచ్చటగా వుమ్తుమ్దావు మాగాదవైన నీ కేం తెలుస్తుంది?     నిన్ను అలాగే నా గుండెల కేసి హత్తుకావువాలని ఎంత ఆత్రంగా వుమ్తుమ్దావు తెలుసా? నీ కోఎగిలిలో కరిగిపోవాలని ఎంత ఆత్రంగా వుంటుందో తెలుసా? నీ కౌగిలిలో కరిగిపావువాలని ఎంతగా తపిస్తున్నానో నీ కేలా చెప్పేది.     బలమైన ఆ బహు పంజరంలో ప్రేమ బందీని కావాలని ఎంత ఆర్తితో వున్నవో నీ వేళా తెలుసుకుంటావు? ఎంత ప్రేమ లేనిది నీ బాహువులు ఎంత బలిష్టిగా వుంటాయి.     చందన పీఠంలాటి నీ వీపుపై అలావాలి పోవాలని ఎన్ని సార్లు కలగన్నానో! వజ్ర కవాతం లాటి నీ వక్షస్థలంపై విశ్రాంతి తీసుకోవాలని, అలసి సేద దీరాలని_     చప్పున ఫోన్ పెట్టేశాడు ఆదిత్య     ఉలూచి ముఖంపై కోపం, అనుమానం సర్పనృత్యం చేశాయి. 'కాలనాగు' కాలకన్యలా కరలా నృత్యం చేసింది. ఫోన్ పెట్టేసింది.     ఫోన్ పెట్టేసి తన గది వైపు నడిచాడు ఆదిత్య.     అతని మనస్సునిండా ఆలోచనలు పాము పిల్లలా చెలరేగుతూన్నాయి అతను తన గదిలో ప్రవేసించి, తలుపు వేసుకుని బెడ్ వైపు నడిచాడు.     అక్కడ...     ఆమెని చూసి విబ్రాంతుడయ్యాడు.     భయపడ్డాడు.     కోరలు చాచే తెల్ల తాచులా నవ్వింది ఆమె.                                                                                    20     'ఎలా వచ్చావు'     ఆందోళనగా అడిగాడు ఆదిత్య. అతనికి అమెరాక గుండెలపై కుంపటిలా అనిపించసాగింది.     'భగవాన్! ఏమిటిది? నా తల్లితండ్రులు సుఖంగా అనారోగ్యంగా జీవించాడు. వృద్యప్యంలో యిలా యిమ్తిపత్తున విశ్రాంతిగా సుఖంగా వుండాలని ఆశించారు. నా చదువైంది. ఉద్యోగం త్వరలో వస్తుంది. ప్రేమించిన అమ్మాయిని పెళ్ళిచేసుకుని చాలా సుఖవంతమైన జీవితం గడపాలని ఆశించాను.     నేనేం తప్పు చేశాను? నేనే దోషం చేశాను? ఎందుకిలా విధి సర్ప రూపంలో వేన్నాడుతున్నది?     సంద్యకి ఆ అడ్డేమిటి ఏమిటి ఆ కట్టుబాటు.     పాములు పగబదతాయని విన్నాను. అదంతా ఆ బద్దామని నాస్తికులు శాస్రజ్ఞలు అంటారు. అది నిజమా? ఇది నిజమా? ఏది నిజమా? ఏది నిజం? ఏది సత్యం! ఏదసత్యం! ఓ మహాత్మా! ఓ మహర్షి!!     పాములున్నాయి. వాటిని పడగపై కొడితే- గాయపరిస్తే అవి దొరక్కపోతే వేదికి వేదికి కాటేస్తాయేమో! కాదని ఎందుకనాలి? ఆ సర్పాల్ని ఎందుకు హింసించాలి.     దేవతా సర్పాల మాటేమిటి?     నిజంగా దివ్య సర్పాలున్నయో?     ఈమేతను'కాలనాగు' నంటుంది శక్తులున్నా యుంటుంది. నిజమే! లేకపోతే ఎక్కడి నుంచో ఫోన్ చేసి, ఆ మరుక్షణం గదిలో ఎలా 'ప్రత్యక్ష' మౌతుంది.     పాములకి పడగలుంటాయి. ఆ పడగలపై పాదముద్రలుంటాయి. అది కాళీయుడిపై శ్రీ కృష్ణుడు కృష్ణతాండవం చేసిన చిహ్నమట! కావచ్చేమో! అవి మనుషులకి ముక్కు, కన్ను, చేవిలాగా బండ గుర్తులు కాదు కదా!
24,397
        "నువ్వు బట్టలు కొనుక్కో.... నేను మళ్ళీ శుక్రవారం వస్తాను.... అప్పుడు నువ్వు కొత్తబట్టల్తో కనపడాలి, తెల్సిందా."         అప్పుడే స్టేషన్ లోకి బస్సొచ్చి ఆగింది.         "నేనీ బస్సెక్కి వెళ్ళిపోతాను- అలాగేనా...." ముందుకి నడిచాడు చయనులు.             ఏం మాట్లాడాలో వికాస్ కి తెలీలేదు.         బస్సెక్కాడు చయనులు మలుపు తిరిగేవరకూ ఆయన వికాస్ ని చూస్తూనే ఉన్నాడు.         కానీ-         ఆముదాలవలస వెళ్ళిన చయనులు, అక్కడ ఘోరమైన వార్త విన్నాడని చిన్నారి వికాస్ కి తెలీదు.         ఆ వార్త-         "వికాస్ తల్లి కామేశ్వరి చచ్చిపోయింది. ఆరు రోజులు అన్నం లేక చచ్చిపోయింది, చచ్చిపోతూ కొనవూపిరితో బాబీ... బాబీ.... అని చచ్చిపోయింది."         ఆ విషయం చయనులు, వికాస్ తో చెప్పలేకపోతున్నాడు.         ఇంకో విషయం-         ఆముదాలవలసలో పాతబాకీ వందరూఅపాయలు వసూలు అయిందని వికాస్ కి అబద్దం చెప్పాడు చయనులు.         హోటల్లో టిఫిన్ ఖర్చులుపోగా ఆ సమయంలో బస్ టిక్కెట్ కు కూడా వున్న డబ్బులు సరిపోవు.         తనని బస్ కండక్టర్ మధ్యలో బస్ నుంచి దించేస్తాడని చయనులుకి తెల్సి కూడా బస్సెక్కాడు.         నిజంగా అలాగే జరిగింది.         అర్దరాత్రి పదిమైళ్ళ దూరాన ఉన్న వూరు బస్సునుంచి తోసివేయబడ్డాడు చయనులు.         నడక సాగించాడు.         ఆ నడకకు ఇన్ స్పిరేషన్ చిన్నారి వికాస్!         ఆ విషయం చయనులు మనసుకు మాత్రమే తెలుసు!         ఒక్కసారి నిరాశా-నిరాశా కలిస్తే సామెతల్లా వృద్దాతరం ఉబుసులోని కబుర్లలా బూడిద రాలదు-         ఉత్తేజం ఉద్బవిస్తుంది.                                       *    *    *    *    *         చదువుతున్న పుస్తకాన్ని పక్కన పెట్టింది లిఖిత.         గుండెల్లో ఏదో చిన్న అలజడి, ఆ అలజడి పేరే 'ప్రేమ'.         ఊహ తెల్సిన దగ్గర్నించి ఎంతోమంది అబ్బాయిల మధ్య గడిపింది. లండన్లో థియేటర్ హౌసుల్లో, రిపార్టీల్లో ఎంతోమంది అబబయిలు.... స్నేహితులు....         వేలాదిమంది స్నేహితులున్న లిఖిత దగ్గరకు రావాలని, లిఖితతో పరిచయం పెంచుకోవాలని, లిఖిత కన్నెత్తి చూస్తే చాలు, జన్మ ధన్యమౌతుందని ఆరాధించే కుర్రాళ్ళ వేపు ఏనాడూ ప్రేమగా చూడలేదు లిఖిత.         కాలేజీలో లిఖిత ఎప్పుడూ నిప్పులు చెరిగే పువ్వు.         పువ్వు అందమైందే కానీ దగ్గరకు వెళ్తే జ్వాలలు.         కానీ....         వికాస్ ని చూసినప్పటి నుంచి, అతని కళ్ళని, అతని మాటల్ని, అతని దీక్షని, అనుకోకుండా తన ద్వారా వచ్చిన అతని దురదృష్టాన్ని తలచుకున్నప్పుడల్లా, ఆలోచనలో మునిగిపోతోంది లిఖిత.         వికాస్ ని ఒప్పించి, మళ్ళీ జింఖానా కంపెనీలో చేర్పించాలా? అతను చేరతాడా?         చేరకపోతే....         లక్ష్యాన్ని సాధించే ప్రయత్నంలో అతనికి సహకరిస్తే....         ప్రతి పురుషుడి వెనకా ఒక స్త్రీ.         రకరకాలుగా ఆలోచిస్తున్న లిఖిత, తన గురించి తను ఆలోచించుకుంది. తను తండ్రివేపు కాకుండా, వికాస్ వేపు మొగ్గు చూపుతోంది.         అంటే...         తను వికాస్ ని ఇష్టపడుతోందా?         ఆ ప్రశ్నను ఎన్నోసార్లు తన మనసును అడిగింది లిఖిత.         ఆ వయసులోని ఆడపిల్ల మనసు మూగది.... అందుకే ఆ మనసు ఆశ్చర్యంగా చూసింది తప్ప జవాబు చెప్పలేదు.                                                      *    *    *    *    *         భానోజీరావు తన ఆత్మాభిమానాన్ని, ఆత్మ స్థయిర్యాన్ని కలిసి బంతిగా చేసి దురదృష్టానికి గురిచేసి విసిరాడు.         అంతకంటే రెట్టింపు పట్టుదలతో తను వెనక్కి వచ్చి అదృష్టాన్ని అందుకోవాలి.... తప్పదు.... కాని ఎలా?         చేతిలో చిల్లిగవ్వ లేదు. చెయ్యటానికి  పని లేదు. తనిప్పుడు క్రాస్ రోడ్స్ మధ్య ట్రాపిక్ ఐలాండ్ లో నిలబడి తన భవిష్యథ్ ఏ బాటలోకి వెళ్తే బావుంటుందో ఆలోచించుకోవాల్సిన క్లిష్టమైన స్థితిలో ఉన్నాడు.         ఒకదారి: తిరిగి ఏదో ఒక ఆటోమోబైల్ కంపెనీలో అతి సాధారణ ఉద్యోగాన్ని సంపాదించుకొని గానుగెద్దుల బ్రతుకును ఈడ్చటం.         రెండో దారి : అవమాన భారాన్ని భరించలేక తాగుబోతు కావటమో....జులాయిగా మారటమో.... ఆత్మహత్య చేసుకోవటమో, అంటే బ్రతుకును చాలించటం.         మూడో దారి : ఆదరణ కందని, అర్ధం లేని.... ఆక్రోశం, ఉక్రోశం కలగలిపిన నినాదాలతో వ్యవస్థని, దేశాన్ని తిడుతూ విప్లవకారుడిగా మారటం, బ్రతుకును తెల్లార్చుకోవటం.         నాలుగో దారి : అవమానంలోంచి ఆత్మ విశ్వాసాన్ని, పరాభవం లోంచి పట్టుదలను, ప్రోది చేసుకొని తన జీవితాన్ని తనే శాసించుకుంటూ, రేపటి ప్రపంచాన్ని శాసించే స్థితికి ఎదగటం, బ్రతుకును శాసించుకోవటం.         బ్రతుకును ఈడ్చటం-అసమర్ధత...     బ్రతుకును చాలించటం-పిరికితనం....     బ్రతుకును తెల్లార్చుకోవటం-వ్యర్ధం....     బ్రతుకును శాసించుకోవటం-అర్ధవంతం....         ఆలోచిస్తున్నాడు తనలో మిగిలి ఉన్న సర్వశక్తుల్ని కేంద్రీకరించుకొని ఆలోచిస్తున్నాడు. జవసత్వాల్ని ప్రోది చేసుకొని ఆలోచిస్తున్నాడు...నడుస్తున్నాడు....ఆలోచిస్తున్నాడు... ఆలోచిస్తున్నాడు.... నడుస్తున్నాడు.         పోనీ ఏడన్నా వేరే వ్యాపారం చేద్దామా? అది తన నిజానికి పడదు. తనకు మరో రంగం గురించి, మరో వ్యాపారం గురించి ఓనమాలు కూడా రావు. సో... తనకు అవకాశాలున్నా, లేకున్నా, రాకున్నా తన మనః ప్రవృత్తికి నచ్చిన ఏకైక రంగం ఆటోమోబైల్ పరిశ్రమే.         ఏ మనిషి అయినా ఆలోచించవలసిన విధానం ఇదే.         తనకేం తెలుసు....? తను ఏ పనిని ఇష్టంగా చేయగలడు...? తనకు నచ్చి, తను మెచ్చి, ఇతరుల మెప్పు ఏ పని ద్వారా తను సాధించుకోగలడు? అనేది తొలుత నిర్ణయించుకోగలిగితే జీవితంలో సగం దూరాన్నిఅధిగమించినట్లే.         తను తన జీవితంలో కనీసం ఒక అడుగైనా ముందుకు వేయగలిగాడో లేదో తెలీదు కాని, నాలుగడుగులు వెనక్కి మాత్రం నెట్టబడ్డాడు.         తన జీవితానికి రెట్టింపు వేగాన్ని జోడించుకుంటే తప్ప తనేది సాధించలేడు.         కేవలం ఒక ఉద్యోగిగా తన జీవితాన్ని నెట్టుకెళ్ళగలడే తప్ప....సాధించేదేమీ లేదు... సాధించగలిగేది ఉండదు.         సో... తను ఆటోమోబైల్ పరిశ్రమకి సంబంధించిన వ్యాపారాన్నే చేపట్టాలి.         Are should aim high.         నిర్దేశించుకునే లక్ష్యం మొదటి మైలురాయి దగ్గరే నిర్ణయించుకోవాలి. అది పెద్దదై, గొప్పదై ఉండాలి.         కానుక తనేదైన మాన్యుఫాక్చరింగ్ నే ఎన్నుకోవాలి.         తనకు తెలిసినది కారు.... తెలీనది మిగతా ప్రపంచం. కారు తయారు చెయ్యాలి....?!! సాధ్యమా?         ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ ఆస్తులు కలిగి, ఎక్కువ టర్నోవర్ ని కలిగి ఉన్న వ్యాపార సంస్థ అమెరికాకి చెందినది జనరల్ మోటార్స్ దాని గురించి ఏషియన్ న్యూస్ ఇంటర్నేషనల్ మేగజైన్ లో ఇటీవల వచ్చిన వార్త సంగతేమిటి?                                         జనరల్ మోటార్స్ మూసివేత                                             (ఏషియన్ న్యూస్ ఇంటర్నేషనల్)         వాషింగ్ టన్, డిసెంబరు 19 : కార్ల తయారీలో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ అయిన జనరల్ మోటార్స్ కంపెనీ అమెరికాలో ఉత్పత్తి కార్యకలాపాలను నిలిపివేసింది. కంపెనీకి విపరీతమైన నష్టాలు రావడంతో యూనిట్ లను మూసివేసి 74వేళా మంది కార్మికుల్ని, ఉద్యోగులను తొలగించింది. అమెరికా కార్ల పరిశ్రమకే వెన్నెముకలాంటి జనరల్ మోటార్స్ కంపెనీకి రోజుకు 15 మిలియన్ డాలర్ల నష్టం వస్తోంది. అమెరికాలో వున్న 21 ఫ్యాక్టరీలను మూసివేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. అమెరికా ఇంకా తీవ్ర మాంద్యంలో ఉందని వైట్ హౌస్ నుంచి ప్రకటన వెలువడిన వెంటనే జనరల్ మోటార్స్ ఈ చర్య తీసుకుంది. జనరల్ మోటార్స్ నిర్ణయంపట్ల అమెరికన్ పారిశ్రామిక వర్గాలు విస్మయం వ్యక్తం చేశాయి. జపాన్ కార్ల ప్రభావం అమెరికాలో ఏవిధంగా ఉందో ఈ చర్యవల్ల బహిర్గతమయింది. అమెరికన్ ఆటోమోబైల్స్ పరిశ్రమ మొత్తం జపాన్ చేతికి పోతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. అమెరికన్ కార్ల తయారీదారులు చాలామంది జపాన్ తో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు తహతహలాడుతున్నారు. హెచ్చు ఇంధన సామర్ధ్యంతో నడిచే తక్కువ ఖరీదు గల కార్ల తయారీ కోసం అమెరికన్ కంపెనీలు జపాన్ ను ఆశ్రయించక తప్పని పరిస్థితి ఏర్పడింది.
24,398
    "క్షమించండి. నేను ఎప్పుడూ ఎవర్నీ ఇలా హర్ట్ చెయ్యలేదు. మీరే నాచేత ఇన్ని మాటలు అనిపించారు. మీరు హనుమంతరావును పెళ్ళి చేసుకోండి సుఖపడ్తారు."     "మీరు నన్ను అవమానిస్తున్నారు" సుధ నాగినిలా చర్రునలేచింది.     "మిమ్మల్ని అవమానించాలని నా భావంకాదు"     "మరేమిటి?"     "హనుమంతరావుకు మీరంటే చాలా ఇష్టం"     "వాడంటే నాకు అసహ్యం!"     "అతను మీరు అనుకున్నంత చెడ్డవాడు కాడు. మనసు చాలామంచిది. కొన్ని బలహీనతలు ఉన్నమాట నిజమే. అది అతని తప్పుకాదు. ధనంతోపాటే ఉంటే బలహీనతలు అందరిలో ఉన్నట్టే. అతనిలోనూ ఉన్నాయ్.     "అంటే మీ ఉద్దేశ్యం ధనవంతులందరిలోనూ దుర్గుణాలుంటాయనేగా?"     "అవును! అది నా ఉద్దేశ్యం కాదు. అది వాస్తవం. స్త్రీని వాడు డబ్బుతో బజార్లో కొనే వస్తువుగా భావిస్తాడు. అది ధనంతో వచ్చిన అహంకారం. మీరు చేస్తున్నది ఏమిటి? మీ ధనం ఆశ చూపించి నా మనసు కొనాలని ఆశించలేదూ? మీకు డబ్బుంది మీరు కోరిన ఏ యువకుడైన తోక ఆడిస్తూ కుక్కలా మీ పాదాలు నాకుతాడని మీ అభిప్రాయం"     "నీకు డబ్బు లేదు. అందుకే డబ్బు ఉన్నవాళ్ళంటే కసి!" కావాలని ఏకవచన ప్రయోగం చేసింది.     "నాకు డబ్బులేదు, నిజమే! డబ్బున్న వాళ్ళంటే నాకు కసి. అది కూడా నిజమే! కాని ఆ కసి నాకు డబ్బులేదు కనక ఏర్పడింది కాదు"     "మరెందుచేతనో?" వ్యంగ్యంగా అన్నది సుధ.     "డబ్బున్న వాళ్ళంతా పరాన్న భుక్కులు. పేరాసైట్స్, కొన్ని వందల మానవుల శ్రమశక్తిని దోచుకుంటే గాని ఒక్కడు శ్రీమంతుడు...అదే మీ నాన్నలాంటి శ్రీమంతుడు కాలేడు. అందుకే మీరంటే నాకు కసి."     "మా అదృష్టం చూసి మీకు ఈర్ష్య"     "సుధారాణిగారూ! ఇకవస్తాను!"     "గౌతమ్! నా దగ్గిర వెండి బంగారాలు ఖజానాలున్నాయ్. వాటితో నీలాంటి వాళ్ళను ఎందరినైనా కొనగలను"     గౌతమ్ ఆగాడు.     వెనక్కు తిరిగాడు.     "పాపం! మిమ్మల్ని చూస్తుంటే జాలివేస్తుంది"     "నన్ను చూసి నీకు జాలా?" పకపక నవ్వింది సుధారాణి.     "పాపం! మీ నవ్వు ఎలా ఉందో మీకు తెలియడంలేదు. ఏడవలేక నవ్వుతున్నారు. నిజంగా మిమ్మల్ని చూస్తుంటే నాకు జాలి వేస్తుంది. వాస్తవంగా బీదవాణ్ణి నేను కాదు, మీరు"     కోపంతో సుధారాణి పెదవులు వణుకుతున్నాయ్.     "నీకు కావాల్సింది డబ్బుతో కొనుక్కోలేనప్పుడు నువ్వు బీదదానివే"     "యూ రోగ్! షట్ అప్!" అరుస్తూ వెళ్ళి కార్లో కూర్చుని డోర్ గట్టిగా వేసింది.     గౌతమ్ చూస్తుండగానే కారు స్పీడుగా వెళ్ళిపోయింది.     గౌతమ్ చూస్తూ నిల్చున్నాడు.     సుధను తల్చుకుంటే నిజంగానే అతనికి బాధగా ఉన్నది. అవసరం అయినదానికంటే కటువుగా ప్రవర్తించానేమోనని బాధపడ్డాడు.                                * * *     గౌతమ్ హాస్టల్ కు చేరేసరికి ప్రొద్దుపోయింది. హాస్టల్ టేబుల్ మీదపెట్టి ఉన్న భోజనం వడ్డించుకున్నాడు. తినబుద్ధి కాలేదు. మజ్జిగమాత్రం తాగి లేచాడు.     గదికి రాగానే "ఎరా ఇంత ఆలస్యం అయింది! మీ హీరోయిన్ ఊళ్ళోలేదుగా?" రూంమేట్ శంకర్ అడిగాడు.     గౌతమ్ మాట్లాడలేదు. అసలే విసుగ్గా ఉన్నది. పైగా అలాంటి జోక్స్ అంటే అతనికి బొత్తిగా గిట్టదు.     "మనవాడికేంరా అండ కాకపోతే మరో అండ" అన్నాడు వేణు.     "ఛ! గౌతమ్ అలాంటివాడు కాదు. వాడినంటే కళ్ళుపోతాయ్. చెంపలేసుకోమ్మా!" అన్నాడు శంకర్ వేణుతో.     గౌతమ్ వినిపించుకోనట్టే బట్టలు మార్చుకున్నాడు.     "బుద్ధిమంతుడిలా చాలారోజులు ఫోజులు కొట్టాడు. కాని ఈమధ్య బలే జల్సారాయుడిలా తయారయ్యాడులే"     "నిజంగానా? మనవాణ్ణి ఇంతకాలం శ్రీరామచంద్రుడి అవతారం అనుకున్నానే?"     "నీ మొహం! మధ్యాహ్నం ఒక హీరోయిన్ ను బండి ఎక్కించాడు అవునా?"     "అవును!"     "సాయంత్రం మరో బంగారు బాతుతో మెరీనా బీచి రోడ్డులో...."     "నోరు ముయ్యండిరా!" అన్నాడు గౌతమ్.     "అలాగే మూస్తాంగాని...ఒక సందేహం తీర్చరా బాబు!" అన్నాడు వేణు.     "ఏమిటి?" అడిగాడు కుతూహలంగా శంకర్.     "ఆ ప్రశ్న వెయ్యాల్సింది నువ్వు కాదురా చిట్టి నాయనా! గౌతమ్" చక్కగా బీచ్ లో ఇసుక తిన్నెల మీద కూర్చుని కలల్లో తేలిపోవాల్సినవాళ్ళు రోడ్డు పక్కగా, కారును ఆనుకొని నిల్చున్నారేంరా?"     "అది మాఇష్టం! నువ్వెవడివి అడగటానికి?" అన్నాడు గౌతమ్.     "అదేం ప్రశ్నరా? నేను నీ క్లాస్ మేటునూ, రూంమేటునూ కూడా!"     "మరో సంవత్సరంలో డాక్టర్ పట్టా పుచ్చుకోబోతున్నారు. ఏం లాభం? జూనీయర్ కాలేజీ స్టూడెంట్స్ లా ప్రవర్తిస్తున్నారు" విసుక్కున్నాడు గౌతమ్.     "అసలు ఇప్పటికీ ఆ కారులో షికారుకొచ్చిన 'ఆ పసిడి చాన' ఎవర్రా?"     "ఇంకెవరు? మన కాలేజీ క్వీన్!"     "కాలేజీక్వీనా! రేణుకాదేవి..."     "కాలేజీక్వీన్ అన్నాను బ్యూటిక్వీన్ అనలేదు"     శంకర్ ఆలోచనలో పడ్డాడు.     గౌతమ్ మంచంమీద పడుకొని గోడవైపు తిరిగాడు.     "ఒరేయ్ నీది వట్టి మట్టి బుర్రరా బ్రదర్! క్వీన్-అంటే అర్థం రాణి. రాణి అంటే ఎవరో తెలుసుకోలేవా?"
24,399
    కల్చరల్ అసోసియేషన్ కి సంబంధించిన ఆఫీసులో ఏ అలికిడి లేదు. ద్వారాలు దాటుకుంటూ లోపలికెళ్ళాడు. చివరిగదిలో ఓ అబ్బాయి ఏదో దీక్షగా రాసుకుంటూ కనిపించాడు.     చంద్రహాస్ ను చూడగానే అతనెందుకనో కంగారుపడుతూ తను అప్పటివరకూ రాస్తున్న పేపర్ ను దాచిపెట్టడానికి ప్రయత్నించాడు.     "ఎవరూ?" అంతే కంగారుగా ప్రశ్నించాడు.     "నా పేరు చంద్రహాస్" అంటూ ఎదురుగా వున్న కుర్చీలో కూర్చున్నాడు.     "ఏం కావాలి?" అతను కంగారును కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ అడిగాడు.     "అనూహ్య"     ఈసారి అతని కంగారు మరింత ఎక్కువైంది. ఏదో మాట్లాడాలని ప్రయత్నించి ఆ తరువాత వీలుకాక మానేశాడు. మనిషంతా వణుకుతున్నాడు.     "మీరు అనూహ్యకు ఏం కావాలి? బంధువా?"     చంద్రహాస్ ఏం మాట్లాడలేదు.     ఈ అబ్బాయికి అనూహ్య ఎవరో తెలుసు. మరి ఆమె పేరు చెప్పగానే ఎందుకంత కంగారు పడుతున్నాడో అర్థం కావటం లేదు. దీనివెనుక నున్న రహస్యం ఏమిటో తెలుసుకోవడానికే బంధువా అని కుర్రాడు అడిగితే ఏం చెప్పలేదు.     "ఇంతకీ ఏమిటి రాస్తున్నావ్?" కఠినంగా ప్రశ్నించాడు. ఆ కుర్రాడు ఆ ప్రశ్నకు జడుసుకున్నాడు. డ్రాయర్ లో తోసిన కాగితాన్ని లోపలే నలుపుతూ వుండిపోయాడు. ఒక్కసారిగా భాషంతా మరిచిపోయినట్టు మాట్లాడటానికి మాటలే దొరకటం లేదు.     "ఇదీ... ఇదీ.... కవిత్వం" చివరికెలాగో మాటల్ని ఒకటొకటిగా కూడబలుక్కుని చెప్పాడు.     "కవిత్వమా!     "ఆఁ అనూహ్యకి ఇష్టమని"     అదన్న మాట సంగతి. ఆమెకోసం ఏదో రాస్తున్నానన్న గిల్టీ ఫీలింగ్ వల్ల వచ్చిన కంగారు అది.     "అనూహ్యంటే ఇష్టమా?"     "ఇష్టమని మెల్లగా అడుగుతారేమిటి సార్. చచ్చేంత ఇష్టం" చంద్రహాస్ సౌమ్యంగా నవ్వుముఖంతో అడగడంతో ఆ కుర్రాడు రెచ్చిపోయి నిజం చెప్పేశాడు.     "అంటే ప్రేమిస్తున్నావన్న మాట"     "ఎస్ సార్" కంగారు స్థానాన్ని సిగ్గు ఆక్రమించుకోవడంతో ఆ కుర్రాడు తల దించుకున్నాడు.     "ఆమె కూడా నిన్ను ప్రేమిస్తోందా?"     ఈసారి అతని ముఖాన్ని విషాదపు మేఘాలు పూర్తిగా కప్పేశాయి.     "లేద్సార్. ఎంత ట్రై చేస్తున్నా కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదు" అన్నాడతను.     ఇక ఆ సంభాషణను పొడిగించడం అనవసరం అనుకున్నాడు చంద్రహాస్.     "నీ పేరు?"     "హేమంత్"     "ఏం చేస్తుంటావ్?"     "ఎం.ఎ. ఇంగ్లీష్"     "అనూహ్యను అంత గాఢంగా ప్రేమిస్తున్నావ్ కదా ఆమె వివరాలన్నీ నీకు పూర్తిగా తెలుసా? ఉదాహరణకు ఆమె ఇల్లెక్కడో తెలుసా?"     "తెలుసు సార్. లవ్లీ హిల్స్ థర్డ్ క్రాస్ లో నాలుగో ఇల్లుసార్" ప్రేమ పరీక్షలో వేసిన ప్రశ్నలాగా ఫీలైపోయి గబగబ చెప్పాడు హేమంత్.     "వస్తా" అంటూ లేచాడు చంద్రహాస్.     "ఇంతకీ మీరెవరు సార్?"     "అది నీకనవసరం" అన్నాడు.     ఆ తర్వాత చంద్రహాస్ అక్కణ్నుంచి బయటపడి థర్డ్ క్రాస్ లోకి వచ్చాడు.     ఆ వీధిలోని నాలుగో ఇల్లు ఓ చిన్న కొండమీద దేవాలయ శిఖరం మీది బంగారు కలశంలా వుంది. రంగురంగుల దీపాల వెలుగుల్లో ఆ భవనం తెప్పతిరణాలలోని దేవుని పూలపల్లకిలా వుంది.       ఆ ఇంటిముందు నిలబడ్డ చంద్రహాస్ కి మాత్రం ఆ ఇల్లును చూస్తుంటే కసితో ఒళ్ళంతా వణికింది.     అతను భయపడే స్థితిని ఎప్పుడో దాటేశాడు. అందుకే నిర్భయంగా గేటు తీసుకుని సరాసరి లోపలికి వెళ్ళబోయాడు.     అంతలో గూర్ఖా అడ్డు తగిలాడు.     "కౌన్ హౌ?" అంటూ ఎదురుగా నిలబడ్డాడు.     "ఈ ఇంటి ఓనర్ కారు అమ్మేస్తానని మెకానిక్ కి చెప్పాడట. చూద్దామని వచ్చాను."     గూర్ఖా అతన్ని నిశితంగా గమనించిన తరువాత "సాబ్ కి చెబుతాను" అని వెళ్ళబోయాడు.     "వద్దు- నువ్వు నాతోనే వుండు. కారుని చూసి వెళ్ళిపోతాను. రాత్రిపూట ఎందుకు డిస్టర్బ్ చేయడం?"     గూర్ఖా అందుకు ఒప్పుకున్నాడు.     గూర్ఖా ముందు వెళుతుంటే చంద్రహాస్ అతన్ని అనుసరిస్తూ లోపలికి వెళ్ళాడు.     ఇంటి ఎడమవైపున కార్లు ఆపేందుకు విశాలమైన స్థలం వుంది. అందులో రెండు కార్లున్నాయి. ఒకటి కాంటెస్సా. మరొకటి మారుతీకారు అప్పుడే వచ్చినట్టు కాంటెస్సా వెనక వుంది.     చంద్రహాస్ కి కాంటెస్సాతో పనిలేదు. అందుకే మారుతీకారును అలా పరీక్షిస్తూ వుండిపోయాడు.     అలా చూస్తున్న అతను ఓ దగ్గర ఆగిపోయాడు.     కారు ఎడమభాగంలో డోర్ దగ్గర ఎర్రటి స్టిక్కర్ రక్తపు చుక్కలా మెరుస్తోంది.     అది తన భార్య మధుమతి పెట్టుకున్న బొట్టు.     దానిని చూస్తుంటే జరిగినదంతా ఒక్కసారి గుర్తొచ్చి గుండెను ఎవరో పకోడి పొట్లాన్ని నలిపేసినట్టు అతను విలవిల్లాడిపోయాడు.     ఆ కారే తన భార్యనీ, ముద్దుల కూతుర్నీ గుద్దిందనడానికి అంతకు మించిన రుజువు మరి అక్కర్లేదు. అంత స్పీడ్ గా ఢీకొన్నప్పుడు మధుమతి నుదుటన పెట్టుకున్న స్టిక్కర్ బొట్టు అలా కారుకు అంటుకోడం విచిత్రమే మరి. దేవుడు అంత నిర్దయంగా తన రెండు ప్రాణాల్ని తీసుకుపోయినా ఏదో కొంత ఓదార్పు చూపిస్తున్నట్లు ఇంత సాక్ష్యాన్ని మిగిల్చినట్టు అనిపించింది ఆ స్టిక్కర్ ని చూస్తుంటే.     కారును అలా ఇలా తడుముతూ అతను గూర్ఖాకి తెలియకుండా ఎంతో లాఘవంగా ఆ స్టిక్కర్ ను తీసుకుని తన ప్యాంట్ జేబులో వేసుకున్నాడు.     అలా అయిదు నిముషాలు గడిచాక "ఓకే- రేపు మీ సాబ్ తో మాట్లాడతాను. గాడీ అచ్చాహై" అంటూ తిరిగి నడవడం మొదలుపెట్టాడు.     ఈసారి చంద్రహాస్ ముందు, ఆ తరువాత గూర్ఖా.     "ఈ ఇంట్లో ఎవరెవరుంటారు?" పోర్టికో దాటాక అడిగాడు చంద్రహాస్.     "ప్రకాష్ సాబ్, ఆయన బీబీ, చెల్లెలు"     "అంతేనా?"     "ముగ్గురికి డ్రైవింగ్ తెలుసా?"     "ఇద్దరికి- ప్రకాష్ సాబ్, ఆయన చెల్లెలికి"     "ఆమె పేరు?"     "అనూహ్య మేడమ్" గూర్ఖా ఆ పేరు చెప్పడానికి ఎంతో కొంత ఇబ్బంది పడ్డాడు.     యాక్సిడెంట్ చేసింది అనూహ్య అని ఖచ్చితంగా తెలియడంతో అతను తన భార్యా, పసిపాప కోసం అక్కణ్నుంచి ఆత్రుతతో బయల్దేరాడు.     ఆ తరువాత ఏం జరిగిందో గుర్తుకు తెచ్చుకోవడానిక్కూడా చంద్రహాస్ కి ఇష్టంలేదు. అదంతా గుర్తుకు రాకుండా వుండడానికే సీసాలోని మందంతా ఒక్క గుక్కలో ఖాళీ చేశాడు.