SNo
int64 0
25.8k
| text
stringlengths 39
23.5k
⌀ |
---|---|
25,000 | గోతిలో ___ రాతిమేడ
___:వంగపండు __ ప్రసాదరావు
ఆ గోతిపక్కనే సుదర్శనంగారు, ఒంటిబెడ్డ గోడతో ఇల్లుకట్టి __ అందులో కాపురం పేట్టి పది __ పదిహేను సంవత్సరాలు కావస్తుంది.
అంతకమునుపే ఇప్పుదున్న ఇళ్ళు స్థలంతో పాటు అక్కడున్న గోతిని కూడా రాటకాయితమలో ఏర్పాటు చేయించి __ ఖరీదు చెల్లించి కొనుకున్నాడు.
అప్పుడే అనుఉంనాడు ఎప్పటికైనా, నా ప్రాణం __ నిలనబడితే __ ఆ గోతిని కప్పిమ్చి తనవంతూ వరసవారీగా మాడిల్లులు కట్టిస్తానని, అదే __ అంటే? ఒక డాబకింద __ మూడిల్లులనిమాట. ఆ తరువాత దానిమీద మేడ కట్టుకోవడానికి వీలుగా అనిమాట.
అందుకోసమే ఇప్పుడున్న ఒంటిబెడ్డగోడ కట్టుతో ఇంటికి బెడ్డలు. అప్పుడు తవ్వితీసుకోవడానికి వేలుగా __ తక్కువసున్నంలో ఎక్కువ ఇసుకవేసి కట్టుకున్నాడు. ఆ ఇంటిమీద తాటికమ్మలు వేయించుకున్నాడు __
"పెంకునేయించదేమండీ" అని ఎవరైనా అడిగితె __"ప్రాణం సల్లగా వుండాలంటే తాటికమ్మలకిందే వుందాలండీ __ ఎంతమంది పేదోలు తాటి గుడిశల్లో బతకడంలేదు?" అనేవాడు.
ఆనాడే అతడు పాతలోకంనుండీ __ కొత్తలోకాన్ని వూహించగలిగేడు.
విశాఖపట్నంలో పదిపదిహేను సంవత్సరాల క్రితం యూనివర్సిటీ లోవున్న కొండప్రాంతాలకాసి __ గజం నేల పది __ పదిహేను రూపాయలకు అమ్మేవారిని అప్పటి పిన్నలైన, ఇప్పటి పెద్దలు గర్వపడి చెప్తింటారు. అదేగజం, 'జాగా' ఇప్పుడు కొనాలంటే నూటాఏభై రూపాయల రేటుపడిందని ఆ పెద్దలే నోరు చప్పరిస్తుంటారు.
ఆవిధంగా వ్యాపారులతట్టున విశాఖపట్నం రోజుకొక రకమైన వైకుంఠపురంలా వర్ధిల్లుతుంది.
అపట్నంలోనే ముప్ఫై __ పాతిక సంవత్సరాలు క్రితం బి.కామ్ చదువుకుని సెల్ టేక్సు ఆఫీసులో పనిజేస్తున్న సుదర్శనం ఆ ఇంటి స్థలంతో పాటు రెండు మూడు గేదెలు కొన్నాడు. నాలుగురిక్షాలు సంపాదించేడు. ఆఫీసుపనీ, వీధివ్యవహారాలు అతగాడు చూసుకుంటే, పాళీవ్వనిగేదెలు అమ్మేసి పాలిచ్చిన గేదెలు కొనడం, రిక్షాబళ్ళ అద్దెను అందుకోవడం __ ఆ డబ్బును భర్తకు తెలీకుండా లోకంలోదృష్టిలో వున్నట్లు వడ్డీకి తిప్పడం, ఆడబ్బుతో ఇరుగు పొరుగు వీధుల్లో వాళ్ళు అప్పుడప్పుడు తిండికోసం అమ్ముకుంటున్న స్టీలు గున్నేలూ స్టీలు, కేరేజీలూ, గ్లాసులూ హెచ్, ఎం.టి. వచీలూ, చిన్నచిన్న రెడియోలూ పద్దులు పడుతుండడం, వడ్డీలు దుండతుండడం అతని భార్యాపిల్లలూ, ఆనవాయితీగా చేస్తుంటారు.
ఈబండెడు సంసారం పాడవ్వకుండా వుండడానికి, వీధిలో వ్యవహారం ఏదైనా పదిమందికీ తెలిసినట్టుజేసి, పనిజరిపించుకుంటాడు. తనసంపాదనంతా పిల్లలకోసమేగాని తనస్వార్ధంకోసం కాదంటాడు సుదర్శనం.
డబ్బుపిల్లలు పెట్టడంఅంటే వ్యాపారం పాపాలతో సంబంధంలేకుండా సాఫీగా సాగించడం అందుకే!
ఒక ఏభై, డబ్భైవేలు మనవికావని కాంట్రాక్టరు మేఖంమీద పారేస్తే ఆడే ఆ మూడిల్లులూ, మూడుమాసాలు తిరగకముందే కిచ్చిన్ రూంతో, డైనింగ్ హాల్తో, స్ప్రేర్ష్ పైపులతో ఎలాక్రానిక్స్ బల్సుతో అంతా అతడేచూసుకుంటాడు. నేనూ నాపెళ్ళం, పిల్లలు, బస్తాసున్నం ఎత్తడానికి కూడ బాధపడనక్కర్లేదు. అంతే!
ఆ తరువాత కనీసం ఒకఇంటికి మూడువందల రూపాయలు అద్దె మన కొస్తుంది. కరెంటు చార్జీలుకూడా మనం కట్టనక్కర్లేదు. అందుకే పట్నంలో ఇల్లులున్నవాడు భూములున్నవాడితో సమానంకన్నా ఎక్కువే __ రెండుఇళ్ళు లుంటేచాలు లక్షలున్నట్టే, భూములు వర్షాలు పడితేనే పండుతాయి. లేదంటే అప్పులూ, శేస్తులూ, అన్నీబాధలే, మహానగరాల్లో అద్దెఇల్లులకి ఆబాధలేదు. పైగా సంవంత్సరానికి, సంవత్సరం ఇళ్ళుగలవాళ్ళే అద్దెలు పెంచుకావచ్చును. పొలం పండాలంటే మదుపు పెట్టల, అద్దెఇల్లులుకి దమ్మీడీ మదువుండదు కూలీ నాలీ పనివాళ్ళూ అక్కర్లేదు వుడపూ, తడపూ గొప్పూ, గాబూలేదు ఒక సంతానం వాళ్ళు మదు పెడితేచాలు. అని సుదర్శనం ఆలోచించి __ రాత్రిపూట పన్నెండూ ఒంటిగంటకి పడుకోవడం ఈమధ్య మరీ ఎక్కువయింది.
"ఎందుకంటే?
ఇందిరమ్మ ఈమధ్యే విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ కి శంఖుస్థాపన చేసింది. ఇకమీద ఇంకా అదేల్లుకి రద్దీపెరుగుతుంది. అప్పటికల్లా ఈగోతిలో ఇల్లులు కట్టించేసి అద్దెలకిచ్చి అ అద్దెడబ్బులతో గాజువాక ఏరియాలో ఒక ఎకరం నెలకొని ఒక పదిషాపులు కట్టిస్తే దానితస్సాదియ్యా వేలు __ లక్షలు ఎందుకావు?
అందుకనీ!
బిల్డింగుల కాంట్రాక్టరు కోటేశ్వరరావుగారు ఒకవిధంగా అతనికి స్నేహితులు అతగానితో అగోయ్యిగురించీ __ తానుకట్టాలనుకున్న మూడిల్లులు గురించీ ఎన్నోమార్లు చెప్పేడు __ కాని డబ్బువిషయంలో వెనక్కీతగ్గుతుండేవాడు.
ఈమారు అలాకాకుండా ఎల్. ఐ.సి. బిల్డింగులు కట్టించే మేనేజరులాగ ఖర్చుకి కాతారులేనట్టు వ్యవహరించేడు.
కాంట్రాక్టరు కోటేశ్వరరావుగారు మిత్రుడి ఉబలాటానికి ముసిముసిగా నవ్వేసి "సరే ! ఒక మేస్త్రీకొంతమంది కూలోల్నీ అక్కడ పారేస్తే పెద్ద పెద్ద బిల్డింగులు కట్టగా మిగిలిన ముక్కాచెక్కతో వాళ్ళేపనిపూర్తీచేస్తారు. ఎలా చూద్దామన్నా పాతికముప్ఫై వేలైనా మిగుల్తాయి. మిత్రుడుకి ఉపకారం చేసినట్టూ అనిపిస్తోంది. పారీసిపరికరాలతో పనీ అయిపోతాది. అని సుదర్శనం రమ్మని కవురుచెయ్యగానే ఒకనాటి ఆదివారం ఉదయం 9గంటలకు బుల్లెట్ మోటారు బండిమీద మదించిన ఎనుగులాగా కూకున్నట్టుకూకొని గాలివేగంగా వచ్చి సుదర్శనంగారి ఇంటిముందు వాలెడు.
మోటారు బండి దిగీదిగగానే __ సుదర్శనంచూసి ఎదురుగావచ్చి నమస్కారంచేసి __ కాఫీ త్రాగమని వేడుకున్నాడు.
టైమ్ చాల్దని చెప్పి ఆ ఇంటిపక్కని కనిపిస్తున్న గితివైపు నడక సాగించేరు కోటేశ్వరరావుగారు. అతని వెనకాల వచ్చిన మేస్త్రీ టేపును పట్టు కొని కొల్తలు తియ్యడానికి రడీగా వున్నట్లు నడుస్తున్నాడు.
ఆ వెనకాల సుదర్శనం పొంగిపోతూనడుస్తున్నాడు. పిల్లలు గంతులేసి నడుస్తున్నారు. తాను సౌంజ్ఞ చేసి పిలవగా వచ్చిన పెద్దలు అ గోతిచుట్టూ చేరుతున్నారు.
పైగా రోడ్డుకు అనుకునీ దాని లోటు. కొండ దిగువున్న డోలలాగ ఏటవాలుగావుంది. లారీకొద్ది మట్టి పోస్తేగాని రోడ్డు మట్టానికి సరిపోదు" అన్నాడు మేస్త్రీ.
"ఎన్ని లారీలు పోస్తాం? ఎన్నాళ్ళు పోస్తాం?" అన్నాడు కోటేశ్వరరావుగారు.
"తలుచుకుంటే ఈ పని మీకేమాత్రం __ ఆఫీసు బిల్డింగులు, టి. పి. టి. కోలనీలూ , అలా టెండరు తీసుకుని ఇలా కట్టిపారేస్తాస్తున్నారు__ స్నేహితుడిగా ఈ మూడుగదుల మేడ కట్టమని మిమ్మల్ని కోరుతున్నానుగాని, ఇంత చిన్న కాంట్రాక్టరుపని మీచేత చేయించడానికి నేను సిగ్గుపడాల" అన్నాడు.
మిత్రుడంతే అవుసరం తీర్చేవాడు అన్నట్లుగా సుదర్శనం ప్రాధేయపడ్డాడు.
అంతలో మేస్త్రీ __ గొయ్యి లోటుపాతులూ, పొడవు _ వెడల్పూలూ కొల్తలు తీసి టేపును చుట్టూకుంటూ__
"ఎక్కడికేక్కడ౦డీ! రమారమి ముప్ఫై నలభై గజాల వెడల్పుతో ఎత్తూపల్లాలు ఏకంచేస్తేగాని నిలువు, నిలువున్నర లోతులో మట్టిపోస్తేగాని __ గట్టిపని చెయ్యడానికి అవకాశం వుండదు" అని మేస్త్రీనికూడ నువ్వు గౌరవించందే పనవ్వదన్నట్టు అనుమానం పెట్టెసెడు మేస్త్రీ.
బాబూ నీకు పుణ్యముంటాది గట్టిపనీ, మెత్తటిపనీ పేచీపెట్టకు నాయనా. కోటేశ్వరంగారు స్వయాన నా మిత్రులుకాబట్టి స్వయానా ఆయనే చూడ్డానికొచ్చేరు నేను మీకిచ్చిన డబ్బు అతగాడిబుల్లెట్ మోటారుబండి ఒక నెలరోజులు తగిన పెట్రోలు ఖర్చుకూడా వుండదు. మరోకలూ, మరోకలూ అయితే పని గట్టిగా చెయ్యలేరనే నామిత్రుని కాలుపట్టుకున్నాను. తరువాత మీదయ" అని తనకీ కోటేశ్వరంగారికీవున్న స్నేహసంబంధాన్ని మనవి జేసుకున్నాడు సుదర్శనం.
"సరే మిత్రమా! ఇల్లులే అయితే ఈ మూడిల్లులూ మూడు రోజుల్లో కట్టించగలను. ఈగొయ్యిని కప్పేపని ఆ బిల్డింగులుపనికన్నా ఎక్కువగా కనిపిస్తుంది. పైగా ఇనుముకీ, ఇటిక్కీ, సున్నానికీ, సిమెంటుకీ ఖరీదు కూడ విపరీతంగా పెరిగిపోయావి. ఎక్కువ అడగలేను. తక్కువకి పనిచెయ్యలేను. సరే ఒకలకారమవుతుంది ఏమంటావు" అని సుదర్శనం ఇంటివైపు నడకసాగించేడు కోటేశ్వరరావుగారు
సుదర్శనం అంతకన్నా ఎమకం చూపిస్తూ "అంతపెద్ద మొత్తం నావసెంకాదు. మిత్రమా నేను లక్షాధికారినికాదు. దయుంచి వేలులోనే బేరం వున్నట్టుచూడండి" అని ఆగి గడపలో మంచంవేసి కూకోబెట్టేడు సుదర్శనం.
సరే __ ఎనభైవేలకి తక్కువలేకుండా చూచుకో. అద్దేకిస్తే ఆ ఇల్లులు మీద అయిదు సంవత్సారాలలోపు ఆమాత్రం రాకపోదు. ఆలోచించుకో...." అని మనిషిని ఏటినీటి మద్దిలో వగ్గేసినట్టు వగ్గేసేడు బేరాన్ని.
"నా కేప్పుడోవస్తాది __ మీకిప్పుడేఇవ్వాలకదా. ఆ అరవైవేలు ఇచ్చుకుంటాను మరేంఅనుకోకండీ __ "అని అనగానే అంతలో తనభార్యతెచ్చినబోరన్ విటాతానే అందులోని మిత్రుడుకీ. మేస్త్రీకీ, తొలి తేనీరువిందుగా అందించేడు సుదర్శనం.
"ఆ అరవయ్యా కదూ, ఈ ఎనబయీకాదు __ వారికిమీరు మీకువారు మిత్రులు కాబట్టి బాబుగారిదగ్గర నాకు చనువుంది కాబట్టి __ నేనొక మాటంటాను__ అదే __ కాయం __ ఆడైబ్భైవేలు ఇచ్చుకొండీ __పని ప్రారంభిస్తాము అని __ గ్లాసును చప్పరిస్తూ కలుగజేసుకున్నాడు మేస్త్రీ.
"లాభంతెచ్చిన __ గ్రుహందగ్గర ఇన్నిబెరాలేమిటి __ సుదర్శనం __ నేనేం ఎక్కువ అడగడంలేదు లేబరు __ఖర్చులే ఇమ్మంటున్నను" అని తాగీతాగనట్లు బోరన్ వీటాగ్లాసు మాటిక౦టి౦ఛీ __ టేబుల్ మీద చేసి పెట్టేసేడు __ కోటేశ్వరరావుగారు. |
25,001 |
ఆవిష్కరణ
అది కొత్తగా కట్టిన కాలనీ.
ప్రభుత్వం తన ఉద్యోగులకు ఇళ్ళు కట్టుకోవడానికి అప్పులు ఇయ్యసాగింది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని అనేకమంది ప్రభుత్యోగులు అక్కడ స్థలాలు కొనుక్కుని ఇళ్ళుకట్టుకోసాగారు. చూస్తుండగానే కొత్త కాలనీ రూపురేఖలు దిద్దుకొని విస్తరించసాగింది.
ఇంతలో... సిమెంటుకీ, ఇనుముకీ కొరత ఏర్పడింది. దానిమూలంగా ఇళ్ళ నిర్మాణం బాగా మందగించింది. పునాదులతో ఆగిపోయిన ఇళ్లు, మొండిగోడలు మించి పైకి లేవని ఇళ్లతో ఆ కాలనీ పురాతత్వ శాఖవారు త్రవ్వి తీసిన ఏదో ప్రాచీన నగరపు అవశేషాలను పోలి వుంది. అయినప్పటికీ అప్పటివరకు ఆ కాలనీలో 60,70 ఇళ్లకు పైగా లేచాయి. ఆ కాలనీకి అటూఇటూ కూడా నగరం విస్తరించి వుండడంచేత ఈ కొత్త కాలనీ కూడా అచిరకాలంలోనే అభివృద్ది చెందే సూచనలు గోచరిస్తూనే వున్నాయి.
ఆరోజు ఆ కాలనీ సంక్షేమ సంఘం సర్వ సభ్య సమావేశం జరుగుతోంది.
సభ్యులంతా కాలనీకి కావలసిన అవసరాలను గురించి, వాటిని త్వరితంగా నెరవేర్చుకోగల పద్దతుల గురించీ సుదీర్ఘంగా చర్చలు జరిపారు.
సంఘ వార్షికోత్సవం కేవలం ఒక నెలరోజులలోనే వుంది కనుక ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఏ మంత్రిగారినో పిలిచి వారిని' 'ఖుషామత్' చేసి వారిముందు కాలనీకి కావలసిన అవసరాల గురించి వినతి పత్రం సమర్పిస్తే ఫలితం చిక్కుతుందని పలువురు సభ్యులు అభిప్రాయపడ్డారు.
సభ్యుల సూచన మేరకు చివరికి మంత్రిగారిని పిలవాలని నిర్ణయించడం జరిగింది.
ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఏ మంత్రిగారిని పిలవాలనే సమస్య వచ్చింది. అన్నిటికన్నా ముఖ్యమైనది త్రాగేనీరు కనుక తర్వగా పంపులు పడాలంటే పురపాలక శాఖామాత్యులను పిలవాలని సభ్యులలో ఒక వర్గం అభిప్రాయపడింది. కాలనీకి రోడ్డూ, డ్రయినేజి కూడా చాలా అవసరమని, అందువల్ల వారినే పిలిస్తే ఈ మూడింటి విషయం ఆయన చూడగలరని వారు బల్లగుద్ది వాదించారు.
అయితే... ఈ కాలనీ వున్న ప్రాంతం పంచాయితీలో వుంది కనుక పురపాలక శాఖామాత్యులను పిలిస్తే ఫలితం ఏమి వుంటుందని సభ్యులలో ప్రత్యర్దివర్గం వారు ఒక కుశంకను లేవదీశారు. ఈ కారణంచేత పంచాయితీ శాఖామంత్రిగారిని పిలవడం ఎంతైనా సబబని వారు గట్టిగా వాదించారు.
ఈ కాలనీ వున్న ప్రాంతానికి రెండు వైపులా మున్సిపల్ కార్పొరేషన్ వారికి చెందిన ప్రాంతాలు వున్నాయని, నగర బృహత్ విస్తరణ కార్యక్రమం క్రింద ఈ కాలనీ ప్రాంతాన్ని కార్పోరేషన్ వారు స్వాధీన పరచుకోవాలని ఏనాడో నిర్ణయం తీసుకోవడం జరిగిందనీ, ఆ నిర్ణయం ఏనాడైనా అమలు జరుపబడగలదనీ, అందువల్ల పంచాయతీ శాఖామంత్రిని పిలవడం దండగ అవుతుందని మొదటివర్గం వారు గట్టిగా వాదించారు.
ప్రభుత్వంతో వ్యవహారం - 'ఇదుగో ..' అంటే ఆరేళ్ళనీ... వారి నిర్ణయం ఇప్పట్లో అమలు జరిగేది కాదనీ, అందువల్ల మున్సిపాలిటీవారి మీద అనవసరపు ఆశలు పెట్టుకోవడం అర్దంలేనిదనీ, ప్రత్యర్దివర్గం వారు అంతకంటే గట్టిగా వాదించారు.
తర్జన భర్జనలతో ప్రారంభమైన వాద - ప్రతివాదాలు అంతకంతకు తీవ్రమైన సిగపట్ల వరకు రాబోయాయి. ఆ పరిస్థితి వచ్చేసరికి సభ్యులలో మూడో వర్గం ఒకటి బయలుదేరింది.
"అయ్యా....! త్రాగడానికి నీరు చాలా ముఖ్యమే. పంపులు వుండడం ఎంతైనా అవసరమే. అయినా ప్రస్తుతానికి ప్రతి ఇంట్లోనూ నూతులు వుండడంవల్ల కొంచెం కష్టమైనా నీటికి ఇబ్బంది లేదు. అలాగే ఇంచుమించు ప్రతివారూ సెప్టిక్ ట్యాంకులు కట్టుకోవడంతో డ్రెయినేజీ వెంటనే లేకపోయినా కలిగే ప్రమాదమూ లేదు. అలాగే రోడ్డు అంటారా.... ఇప్పటికైతే కచ్చారోడ్లు వుండనే వున్నాయి. సైకిళ్ల వరకు రావడానికి ఇబ్బంది లేదు. ఏ గతుకులు వున్నా - వానలు వస్తే బాధ కాని, ఇప్పటికైతే ఎలాగో గడిపేయవచ్చు. మనకి ముఖ్యంగా లేనిది.... వీధి దీపాలు. ఇవి లేకపోవడంతో రాత్రుళ్ళు కొంపకి చేరడమంటే ప్రాణాంతకంగా వుంటోంది. ఎదురుగుండా ఎవరు వచ్చేదీ, ఏమున్నదీ కూడా తెలియడం లేదు. సైకిల్ కి లైటు లేకపోతే ఇంక ఆ అవస్థ చెప్పనక్కరలేదు. కాబట్టి మనం విద్యుచ్చక్తి శాఖామాత్యులను పిలిచి వీధిదీపాల కోసం వినతి పత్రం సమర్పించడం మంచిది" అని వారు ఉద్ఘాటించారు.
ఈ వాదన అందరికీ నచ్చింది. పైగా... సిగపట్లని తప్పించింది. అందువల్ల సభ్యులందరూ విద్యుచ్చక్తి శాఖామాత్యులను పిలవాలని ఏకగ్రీవంగా నిశ్చయించారు.
ఈ విషయంలో కూడా సభ్యులలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. సభ్యులు సూచించిన పేర్లలో వారివారి శక్తి సామర్ద్యాల మీదా, పలుకుబడుల మీదా విభిన్న అభిప్రాయాలు వెల్లడి కావడంతో, ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆ విషయాన్ని మరొక వారంలో తిరిగి సమావేశం జరిపి ఆ లోటు నిర్ణయించాలనే సూచనను ఆమోదించారు.
తర్వాత మంత్రిగారిని పిలవడానికి అందుకుగాను పలుకుబడిగల వ్యక్తిని పట్టుకోవడానికి ఎవరిని నియమించాలి?.... అనే విషయమై చర్చ వచ్చింది. సభ్యులలో కొందరు అధ్యక్షులు, కార్యదర్శి వుండగా ఎవరిని నియమించాలనే ప్రసక్తి ఏమిటని ఆక్షేపించారు.
అధ్యక్ష, కార్యదర్శి పదవులకు వ్యక్తులున్నంతమాత్రాన అలాంటి ముఖ్యమైన కార్యాల్లో వారినే నియమించాల్సిన అవసరం లేదనీ, అలాంటి వారికి కార్యాలు సాధించుకు రాగల చాకచక్యం వుండాలని అంటూ పరోక్షంగా అధ్యక్ష, కార్యదర్శులు శక్తి సామర్ద్యాలపై సంశయాన్ని వెలిబుచ్చారు ఒక వర్గంవారు.
ఈ విషయంలో కూడా వాదోపవాదాలు తీవ్రస్థాయికి చేరబోయేసరికి సభ్యులలో ఒకరు 'ఎవరి ద్వారా మంత్రిగారిని పట్టుకోవాలా?....అనే విషయమే తేలనప్పుడు - అందుకోసం ఎవరిని పంపాలా?...అనే విషయం పై చర్చ అసంబద్దం' అంటూ పాయింట్ ఆఫ్ ఆర్డర్ ను లేవదీశారు. అంతటితో ఆ విషయంపై నిర్ణయం కూడా వచ్చే సమావేశానికి వాయిదా వేశారు.
అంతటితో ముఖ్యమైన నిర్ణయాలు ఏవీ తీసుకోకుండానే ఆనాటి సమావేశం మరుసటి ర వారానికి వాయిదా పడింది.
* * * * *
మరుసటి వారం మళ్ళీ సభ్యులు సమావేశం అయ్యారు.
అయితే ఈసారి క్రిందటి సమావేశంలో ఉత్సాహంగా మాట్లాడిన సభ్యులలో చాలామంది రానేలేదు. అసలు మీటింగ్ ని నడపడానికి కోరం కూడా లేకపోయింది. అయితే వాయిదా పడ్డ మీటింగ్ లో కోరం అవసరం లేనందువల్ల మీటింగ్ ని నడిపారు. సభ్యులు చాలా కొద్దిమందే రావడంతో ఆ వచ్చిన కొద్దిమందీ ఏ విషయంలోనూ ప్రత్యేకించి ఆసక్తి చూపించకపోవడంతోనూ మీటింగ్ సాఫీగా, నిర్విఘ్నంగా సాగిపోయింది. మంత్రిగారిని ఏ విధంగా, ఎవరి ద్వారా కలవాలనే విషయంలో అధ్యక్ష, కార్యదర్శులకు పూర్తి స్వేచ్చను ఇచ్చారు సభ్యులు. అలాగే మంత్రిగారిని కలవడానికి అధ్యక్ష, కార్యదర్శులనే నియమించారు. క్రిందటి మీటింగ్ లో మబ్బులాగా ముంచుకొచ్చిన ఆటంకాలు ఈసారి సమావేశంలో మంచువలె విడిపోయాయి.
* * * * * |
25,002 | విశిష్ట చెదరని ధైర్యంతో సెల్ వైపు నడుస్తుంటే అన్నాడు నాయక్. "నీ బిడ్డకు ధైర్యం బాగానే వుంది. కాని మా పోలీసు వాళ్ళ ముందు చూపడమే బాగా లేదు. ఏం చేస్తాం? ఆమెను ఆ దేవుడే రక్షించాలి"
"వద్దు బాబూ! దాన్ని జైల్లో పెట్టొద్దు"
అంతలో రామకృష్ణ రానే వచ్చాడు. వస్తూనే అరవడం మొదలుపెట్టాడు. "ఏం న్యాయమండీ ఇది? దీన్ని తీవ్రమైన వ్యధకు గురిచేసి ఆత్మ హత్యకు పురికొల్పినవాడు దొరబాబులా నిక్షేపంగా వున్నాడు. వాడికి ఏ విచారణలు, శిక్షలూ లేవు. దీన్ని ఆత్మహత్యకు పురికొల్పినవాడికి మీ చట్టంలో ఏ శిక్షలూ లేవా?"
నాయక్ నిర్లక్ష్యంగా "ఇంత వయసు వచ్చింది. పైగా పిల్లలకి జ్ఞానం, విజ్ఞానం బోధించే బడిపంతులువి. పెద్దవాళ్ళ జోలికి చట్టాలూ, కోర్టులూ వెళ్ళలేవని ఆ మాత్రం తెలియదా?" అన్నాడు.
"మనుషులందరికీ ఒకే చట్టం కదా! బడిపంతులు కూతురికి ఓ చట్టం, హోం మినిస్టరు కొడుకైతే ఇంకో చట్టమూనా? మీ అన్యాయాన్ని నేను సాగనివ్వను. నా కూతుర్ని ఎలా జైల్లో పెడతారో నేను చూస్తాను. చట్టం చట్టమని చెప్పి నా కూతుర్ని జైల్లో పెడితే అదే చట్టప్రకారం వాడిని జైల్లో పెట్టండి."
"ఏయ్ పంతులూ! ఇక్కడ అనవసరంగా గొడవ చెయ్యకు. ఎవరైనా పెద్దమనిషిని పట్టుకురా. జామీన్ మీద వదిలేస్తాం" చిరాకుగా అన్నాడు నాయక్.
"నేను మళ్ళీ అడుగుతున్నాను. నా కూతురు ఏం తప్పు చేసిందని అరెస్ట్ చేశారు? ఎవరినైనా హత్య చేసిందా? ఎక్కడైనా దోపిడీ చేసిందా? చేసిన వాళ్ళని విచ్చలవిడిగా బయట వదిలిపెట్టి ఏ తప్పూ చెయ్యని నా కూతుర్ని అరెస్ట్ చేస్తారా?
ఇదేం లా అండ్ ఆర్డర్? మర్యాదగా నా కూతుర్ని నా వెంట పంపండి. లేకపోతే మీ పోలీసు అరాచకాలను, మీ హోం మినిస్టరు దురాగతాలను అరిచి అరిచి పబ్లిక్ లో చెబుతాను. పత్రికలకు చెబుతాను. చెప్పి చెప్పి సి.ఎం నివాసం ముందు ఆత్మాహుతి చేసుకుంటాను.
నా కూతురుకి మీ వల్లగాని, ఆ హోం మినిస్టరు వల్లగాని ఏమైనా జరిగిందా నేను ఖచ్చితంగా హంతకుడినౌతాను" ఆయన గుండె పగిలిపోతుందేమో నన్నంత ఆవేశంతో అరుస్తుంటే అక్కడున్న వాళ్ళంతా స్తబ్దులై పోయారు. నాయక్ ముఖంలో చిన్నగా చెమటలు పట్టాయి.
కొద్ది క్షణాలు నిశ్శబ్దంగా వున్న ఆయన "నీ కూతుర్ని తీసికెళ్ళు పంతులూ! కానీ విచారణ కోసం మళ్ళీ ఎప్పుడైనా పిలువొచ్చు. సిటీ విడిచి ఎక్కడికీ వెళ్ళొద్దు" అన్నాడు. పోయే ఊపిరి వచ్చినట్టుగా అయింది అన్నపూర్ణకి.
"మీ మంచి కోరి మరోసారి చెబుతున్నాను. మీరిచ్చిన కంప్లయింట్ ని వెనక్కి తీసుకోండి"
రామకృష్ణకి మాట్లాడాలనిపించలేదు. నిర్లక్ష్యంగా ఒక చూపు విసిరి విశిష్ట చెయ్యి పట్టుకొని బయటికి నడిచాడు. బతుకు జీవుడా అన్నట్టు వాళ్ళని అనుసరించింది అన్నపూర్ణ. వాళ్ళు ఇలా బయటికి వెళ్ళారో లేదో పృధ్వీ నుంచి ఫోన్ వచ్చింది.
"దాన్ని అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకువచ్చారా లేదా?"
"తీసుకువచ్చాం సార్!"
"గొడవేమీ చెయ్యకుండా స్టేషన్ కి వచ్చిందా?"
"వచ్చింది సార్!"
"నేనొస్తున్నాను. దానితో కాస్సేపు సరదాగా ఆడుకోవాలి నేను" హుషారుగా అన్నాడు.
"సారీ సార్! ఇంతకుముందే ఆమె ఫాదర్ వచ్చి విడిపించి తీసుకెళ్ళాడు."
"అరే ఫూల్! ఎవరు విడిచిపెట్టమన్నారు నిన్ను?" అవతలినుంచి ఆగ్రహం వ్యక్తం చేశాడు పృధ్వీ.
నాయక్ కి చెంప ఛెళ్ళున చరిచినట్టుగా అయింది. తన వయసేమిటీ? వాడి వయసేమిటి? రిటైర్ మెంట్ కు దగ్గరలో వున్నాడు తను. వీడి అబ్బ హోం మినిస్టరైతే వీడి అబ్బ ఇంటి నుంచి జీతం వచ్చి తనని పెట్టుకొన్నాడా?
వచ్చిన కోపం పళ్ళబిగువున అణచిపెట్టి శాంతంగా జవాబిచ్చాడు నాయక్. విడిచిపెట్టకపోతే అతడు చాలా గొడవ చేసి పబ్లిక్ లో మన ఇమేజ్ ని దెబ్బతీసేలా కనిపించాడు సర్! అతడు సి.ఎం. నివాసం ముందు ఆత్మాహుతి చేసుకుంటానన్నాడు కూతుర్ని విడిచిపెట్టకపోతే. మళ్ళీ పట్టుకు రావడం ఎంతసేపు?
న్యాయం న్యాయమంటూ అరిచే ఇలాంటి ఉన్మాదుల్ని స్ట్రయిట్ గా కాకుండా దొంగ దెబ్బ తీయాలి. మీకెందుకు సార్? ఆమె బోను బయటున్నా బోను లోపల వున్నట్లే. ఎప్పుడో ఆమె మీకు ఫలహారం కాక తప్పదు."
"ఇప్పుడైతే వదిలిపెట్టి డిజపాయింట్ చేశావు కదా! రేపు రాత్రి వరకు అది జైల్లో వుండాలి. గుర్తు పెట్టుకో! రేపు దానికి ఫస్ట్ నైట్ అరేంజ్ చేయాలి.
"అలాగే సార్!" వినయంగా ఫోన్ పెట్టేసిన నాయక్ ముఖంలో వెంటనే భావాలు మారిపోయాయి. "ఈ క్షణం వుండి ఏ క్షణంలో ఊడుతుందో తెలియని పదవుల్లో వుండి ఏం దర్పం ఒలకబోస్తారు. తమాషా ఏమిటంటే పదవుల్లో వున్న వాళ్ళకంటే వాళ్ళ కొడుకులకూ, బంధువులకూ ఫోజులెక్కువ. ఆ పదవులున్నంత సేపు పట్టాపగ్గాలుండవు అయ్యగారి శృంగారలీలలకి పోలీస్ స్టేషన్ శోభనం గదిగా మార్చడానికి ఇక్కడ మరీ అంత గడ్డి మేస్తున్న మనుషులెవ్వరూ లేరు. ఎంత కాకీ బట్టలేసుకున్నా పై అధికారులకు అడుగులకి మడుగులొత్తినా కాస్తో కూస్తో మానవత్వం మిగిలి వుందండీ!"
నాయక్ తనలో తను గొణుక్కుంటుంటే అక్కడున్న కానిస్టేబుల్ ఆశ్చర్యంగా చూశాడు. ఏమిటి సార్! మీలో మీరే గొణుక్కుంటున్నారు?
"ఏం లేదు. ఏం లేదు మనసులో అనుకొనేది పైకి అనడం నాకలవాటు."
"నేను మీ మనిషినే! చెప్పండి సార్!"
"రేపు పూలు, పళ్ళు, పాలూ తెచ్చిపెట్టు. చిన్నయ్యగారు ఇక్కడ శోభనం చేసుకుంటారట. రేపది పత్రికలకి చెప్పి, పై అధికారులకి రిపోర్ట్ చేసిందంటే నా ఉద్యోగం ఊడిపోయి నా నోట్లోనే కదా మన్నుపడేది."
* * *
ఇదే మీకు చెబుతున్నాను. కేసు విత్ డ్రా చేసుకొని హోం మినిస్టరు గారి కాళ్ళు పట్టుకొని "ఇహ మా జోలికి రాకండి మహాప్రభో" అని వేడుకొని రండి. మీరీ పని చేసేవరకూ నేను నోట్లో పచ్చి మంచినీళ్ళు కూడా పోయను. సత్యాగ్రహానికి కూర్చొంటున్నట్టుగా చిరిచాప వేసుకొని కూర్చుంటూ అంది అన్నపూర్ణ.
"నీ మొహం నీకేం తెలియదు. ఊరుకో" రామకృష్ణ కసిరాడు. |
25,003 |
"అంటే... నిన్ను నువ్వు రక్షించుకోడానికి ప్లాన్ వేశావన్న మాట" కోపంగా అంది మోహిత. "అవును. నిన్ను చంపడంతో పాటు, నన్ను రక్షించుకోవడం కూడా నాకవసరం గదా..." "నా చేతుల్లో నువ్వు చస్తున్నప్పుడు..... నువ్వు తీసుకుంటున్న జాగ్రత్తల వలన ఉపయోగం లేదు." "నోర్ముయ్..... మర్యాదగా సంతకం పెట్టు" విసురుగా వచ్చి ఆమె జుట్టును పట్టుకుని, నిప్పులు కక్కుతున్న కళ్ళతో ఆమెవేపు చూశాడతను. ఆ జుట్టుని విదిలించుకుని, అతన్ని బలంగా వెనక్కి నెట్టేసి ముందుకు పరిగెత్తింది. "పట్టుకోండి...... పట్టుకోండి....." అరుస్తున్నాడు రాజేంద్రకుమార్. వరండా మీద పరుగెడుతున్న మొహితను, నలుగురు అనుచరులు చుట్టుముట్టి పట్టేశారు. రొప్పుతూ అక్కడకొచ్చాడు రాజేంద్ర. "ఒరేయ్..... దానిని కదలకుండా పట్టుకుని బట్టలిప్పేయండి" ఆజ్ఞాపించాడతను. ఆ అనుచరుల చేతుల్లో గింజుకుంటోంది మోహిత. ఒకడు చీరను పరపరమని లాగేశాడు. ఇంకొకడు జాకెట్ ని లాగేశాడు. బ్రా, లంగాతో నిస్సహాయంగా నిలబడిపోయిందామె. "నీ అందాల్ని అందరూ చూడాలి.... ఆ రెండూ ఎందుకు?" బ్రా, లంగాని లాగేశాడు రాజేంద్రకుమార్. చేతుల్ని రెండూ గుండెలకు కప్పుకుని నిల్చుండిపోయింది. ఒక్కసారిగా ఆమె ధైర్యం కోల్పోయింది. "ఒక్క సంతకం పెట్టేయ్..... నిన్నొదిలేస్తాను..... క్విక్....." సిగరెట్ ను తీసి వెలిగిస్తూ అన్నాడతను. ముగ్గురి అనుచరుల చూపులూ ఆమె నగ్నదేహంమీదే వున్నాయి. "అయిదే అయిదు నిముషాలు నీకు టైమిస్తున్నాను. నువ్వు సంతకం పెట్టకపోతే..... వాళ్ళు నీ నగ్నత్వాన్ని పరీక్ష చేస్తారు. నీ చేత బలవంతంగా సంతకం చేయిస్తారు" అంటూ చేతివాచీ వేపు చూచుకున్నాడతను. సరిగ్గా అయిదు నిముషాలు గడిచాయి. రాజేంద్రకుమార్ ఒక వ్యక్తివేపు చూశాడు. ఆ వ్యక్తి చేతిలోని డ్రింక్ బాటిల్ గడగడ తాగేసి, ఆమెకు ఎదురుగా వచ్చి నుంచుని ఆమె ఎత్తయిన గుండెలవేపు చూస్తున్నాడు కాంక్షగా. ఆమె నడుమ్మీద చెయ్యి కాంక్షగా. చీకట్లోంచి పరుగు పరుగున ప్రళయంలా వస్తున్న ఆ వ్యక్తిని చూసి నిశ్చేష్టుడయ్యాడు రాజేంద్రకుమార్. మైత్రేయ..... "ఒరేయ్.....వాడ్ని...." ఏదో చెప్పబోయాడు రాజేంద్రకుమార్. తనమీదకు దూసుకుని వస్తున్న వ్యక్తిని ఎడంచేత్తో పైకి లాగి కుడిచేయి బిగించి, ముఖమ్మీద గుద్దాడు. ఆ దెబ్బకు వాడు అరుస్తూ గోడను ఢీకోని కిందపడ్డాడు. మిగతా వ్యక్తులు ఒక్కసారిగా మైత్రేయమీద పడ్డారు. పక్కనే వున్న ఇనుపరాడ్ ని అందుకుని ఒక్కొక్కర్నీ తుక్కు తుక్కుగా చేసేశాడు. అతని ధాటికి తట్టుకోలేక ఆ వ్యక్తులు గెస్ట్ హౌస్ లోంచి బయటకు పారిపోయారు. సరిగ్గా ఆ సమయంలో రాజేంద్రకుమార్ రివాల్వర్ తీసి, మైత్రేయ గుండెలకు గురిపెట్టాడు. అదే సమయంలో దుస్తులు వేసుకుంటున్న మోహిత పక్కనే వున్న ఖాళీ డ్రింక్ బాటిల్ ను అందుకుని పిస్టల్ కేసి విసిరికొట్టింది. రాజేంద్రకుమార్ చేతిలోని పిస్టల్ ఎగిరి కిందపడిపోయింది. కిందపడిపోయిన పిస్టల్ ని, పరుగు పరుగున వెళ్ళి అందుకుని రాజేంద్రకుమార్ గుండెలకు గురిపెట్టింది మోహిత. "మిష్టర్ రాజేంద్రకుమార్..... ట్రిగ్గర్ నొక్కితే..... ఈ క్షణంలో నువ్వు ఛస్తావ్. కానీ...... నిన్ను అంత తేలికగా చంపను...." అంటూ మైత్రేయ వేపు చూసి- "మైత్రేయ.... వాడ్ని.... ఆ చెట్టుకేసి కట్టేయ్....." అని చెప్పగానే మైత్రేయ, రాజేంద్రకుమార్ ని లాక్కెళ్ళి.... గెస్ట్ హౌస్ ముందున్న చెట్టుకి కట్టేశాడు. "పైన మేడమీద గదిలో పెట్రోల్ టిన్ వుంటుంది తీసుకురా" అరిచిందామె. మైత్రేయ మేడమీదకు పరుగెత్తాడు. సరిగ్గా అదే సమయంలో- ఒగర్చుకుంటూ తనకెదురుగా వచ్చి నిలబడి తోకాడించుకుంటూ తన దగ్గరి కొచ్చిన 'నిక్కీ'ని చూసి ఆశ్చర్యపోయింది ఆమె. "నిక్కీ, వంగోని దాని తోకని నిమిరి- "రాజేంద్రకుమార్......దీనికున్న విశ్వాసం కూడా నీకు లేదు...... అందుకే కుక్కచావు ఛస్తున్నావ్" అంటూ పెట్రోల్ డబ్బాతో వచ్చిన మైత్రేయవేపు చూస్తూ- "పాపం..... పెద్ద మనిషిని పెట్రోల్ తో స్నానం చేయించు." మైత్రేయ పెట్రోల్ డబ్బా మూత తీసి, రాజేంద్రకుమార్ తలనుంచి కాళ్ళవరకూ పోశాడు. రాజేంద్రకుమార్ లో ఇప్పుడు భయం ప్రవేశించింది. వణికిపోతున్నాడతను. అతన్ని చూసి పిచ్చిగా నవ్వుతోందామె. "ఆఖరకు నువ్వేమవుతున్నావో..... నీ కళ్ళారా చూసుకో..... బతికుండగా మాడి మాసైపోతున్నావ్, ఆడదానిని తక్కువగా అంచనా వేసే, ప్రతి మగాడూ, ఈ ప్రపంచంలో నీలాగే చావాలి. ఛస్తాడు...." కసిగా అంటూ మైత్రేయ చేతిలో వున్న అగ్గిపెట్టను తీసుకుని, పుల్ల గీసి వెలిగించింది. సరిగ్గా అదే సమయంలో- రాజేంద్రకుమార్ అనుచరులు ఒక్కసారి మైత్రేయని, మొహితను చుట్టుముట్టేశారు. వాళ్ళు మళ్ళీ వెనక్కి వస్తారని ఊహించని మోహిత వెంటనే తేరుచుకుని పిస్టల్ ని వాళ్ళ నలుగురివేపూ గురిపెట్టి,, ట్రిగ్గర్ ను నొక్కింది. చూస్తుండగానే క్షణాల్లో- ఆ నలుగురు అరుస్తూ కిందపడిపోయారు. అదే సమయంలో- కట్టు విప్పుకుని గంధం చెట్ల మధ్యనుంచి నదివేపు పరుగుతీశాడు రాజేంద్రకుమార్. ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా, దూరంగా పడి వున్న ఇనుపరాడ్ ని అందుకుని, అతని వీపుకి గురిచూసి విసిరింది మోహిత. ఆ రాడ్ అతని వీపులో బలంగా గుచ్చుకుపోయింది రక్తం ధారలు, ధారలుగా కారుతోంది.ప్రాణభయంతో చీకట్లో తుప్పల మధ్యనుంచి పరుగెడుతున్నాడు రాజేంద్ర కుమార్. ముందుకు పరిగెత్తబోతున్న మైత్రేయని వారించింది ఆమె. "వాడ్ని...... మనం..... చంపక్కర్లేదు...... మైత్రేయ....." అంటూ పక్కనే వున్న నిక్కీవేపు చూస్తూ- "నిక్కీ.... గో..... క్యాచ్ హిమ్..... కిల్ హిమ్...." అంటూ రాజేంద్రకుమార్ శరీరంలోంచి కారి, నేలమీద ఇంకుతున్న రక్తం దగ్గరకు తీసికెళ్లింది 'నిక్కీ'ని ఆమె. 'నిక్కీ' అటూ, యిటూ తిరుగుతూ నేలను, రక్తాన్ని వాసన చూసింది. ఒక్కక్షణం వేడి రక్తం.... రక్తం గడ్డకడుతున్న వేడిమట్టిని, కాళ్ళతో కసిగా దువ్వుతూ అటు యిటూ చూస్తోంది నిక్కీ. దూరంగా చీకట్లో పరిగెడుతున్న మనిషి...... అతని శరీరంలోంచి కారుతున్న రక్తం వాసన- భౌ.....భౌ....భౌ.... ఒక్కసారి ఆవేశంగా భయంకరంగా అరుస్తూ ముందుకురికింది నిక్కీ. ఆ దృశ్యాన్ని చూస్తున్న మైత్రేయకి బ్లడ్ బ్యాంక్ నుంచి తెచ్చిన రక్తాన్ని మోహిత నిక్కీకి ఎందుకు ముందుచూపుతో తాగించిందో ఇప్పుడు స్పష్టంగా అర్థమయింది. రాజేంద్రకుమార్ ప్రాణభయంతో పరుగెడుతున్నాడు. తుప్పలమీద నుంచి, రాళ్లమీదనుంచి, ముళ్ళ కంపల మధ్యనుంచి. నల్లటి డేగలా, ఆవేశంతో లంఘిస్తున్న నిక్కీ ఒక్కసారిగా ఎగిరి, తన ముందుకాళ్ళను అతని వీపుమీద వేసి, వాడి అయిన పళ్ళతో మెడను కొరికింది. భయంకరంగా కేకపెట్టాడు రాజేంద్రకుమార్. వెల్లకిలా మట్టి దిబ్బలమీద పడిపోయాడు. బాధతో, భయంతో అరుస్తూ, మట్టిలో మోకాళ్ళతో ప్రాకుతున్నాడు. "నిక్కీ...... లీవ్...... మీ..... లీవ్ మీ" అరుస్తున్నాడు. ధారలు, ధారలుగా కారుతున్న రక్తం. శివమెత్తిపోతోంది నిక్కీ. ఒక్కసారి ఎగిరి, రాజేంద్రకుమార్ గుండెలమీద కూర్చుని, పంజాతో అతని ముఖమ్మీద కొట్టింది. సరిగ్గా అదే సమయంలో- కావేరి నడికి అనుకుని వున్న మట్టిరోడ్డుమీదకు వరుసగా అయిదు జీపులు దూసుకుని వచ్చాయి. ఏ.సి.పి రమేష్ బాబు.... ఒక్క వుదుటున జీపలోంచి కిందకు దూకాడు. నదివేపు పరిగెడుతున్నాడు ఇంకొంతమంది పోలీసులు...... గెస్ట్ హౌస్ దిశగా పరుగెడుతున్నారు. పోలీసుల్ని చూసిన మోహిత- "మైత్రేయ...... మనం ఇక్కడనుంచి తప్పించుకోవాలి...... పద....." గెస్ట్ హౌస్ వెనక్కి రాళ్ళల్లోకి పరుగెత్తింది. ఆమె వెనక మైత్రేయ పరుగెడుతున్నాడు. గంధం చెట్లమధ్య, రొప్పుతూ ఇద్దరూ కాసేపు దాగున్నారు. దూరంనుంచి కాల్పులు కాలుస్తూ, గంధంచెట్లవేపు దూసుకొస్తున్న పోలీసుల బృందాలు..... "మైత్రేయ.... మనం ఇక్కడినుంచి ఎలాగయినా తప్పించుకోవాలి" అంటూ అటూ,యిటూ చూసి 'కమాన్' అంటూ ఎర్రమట్టి దిబ్బలవేపు పరుగెత్తిందామె. ఆమె వెనక మైత్రేయ పరుగుతీశాడు.
* * * రెండే రెండు రౌండ్లు..... 'నిక్కీ' ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. "సేవ్..... మీ.... సేవ్ మీ......" అరుస్తున్నాడు రాజేంద్రకుమార్. ఏ.సి.పి. రమేష్ బాబు రాజేంద్రకుమార్ ని భుజాలమీద వేసుకుని వెనక్కొచ్చి జీపులో పడుకోబెట్టాడు. "వాళ్ళిద్దరూ తప్పించుకున్నారు సార్! ఒక సబ్ - ఇన్ స్పెక్టర్ వెనక్కి వచ్చి చెప్పాడు. "ఈయన్ని అర్జంటుగా మైసూరుకు తీసికెళ్లండి" అంటూ వైర్ లెస్ సెట్ ఆన్ చేసి- హైవేలోని చెక్ పోస్టు ఆఫీసర్లకు, పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఇన్ ఫాం చేశాం రమేష్ బాబు జీపులు ఒక్కసారిగా సిటీకి బయలుదేరాయి.
* * *
పెద్ద పెద్ద పొదలమధ్య దాగున్న మోహిత వెళ్ళిపోతున్న జీపులవేపు రమేష్ బాబు జీపులో రక్తసిక్తమయిపోయి వున్న రాజేంద్రకుమార్ ని చూసింది. ఆమె రక్తం సలసలమని మరిగిపోతోంది. "బాస్టర్డ్, బతికిపోయాడు" అందామె.
|
25,004 |
గౌతముడికి పట్టరాని వేదన కలిగింది. తన వారనుకున్నవారు వానరులయ్యారు. పరాయి వారయ్యారు! హతవిధీ! అనుకున్నాడు.
విధిని తలుచుకోగానే ఆయన మనస్సులో ప్రశాంతత వచ్చేసింది.
'అంతా విధి లిఖితం! విధి విలాసం! బ్రహ్మ ఎలా సంకల్పించాడో అలాగే సాగుతుంది. తను మాత్రం నిమిత్తమాత్రుడు'
అలా అనుకోగానే ఆయన మదిలో తన మామగారైన బ్రహ్మ మెదిలాడు. ఇదంతా ఆయన వింత చేష్ట అనుకుని ప్రసన్నం కమ్మని వేడుకున్నాడు.
సరస్వతి వీణా వాదనలో, వేద పఠనంలో సృష్టి కల్పనలో నిమగ్నుడైన బ్రహ్మకు గౌతముడి పిలుపు వినిపించింది.
'హే! చతురాననా! ఏమిది! కోరి కన్యాదానం చేశావు. కోరిక లీరిక లెత్తేలా దేవతలు దేవతా సార్వభౌముడు కోరివచ్చినా నన్నే ఎన్నుకుని కన్నెను ధారపోశావు. ఇప్పుడీ విచిత్ర సంఘటన ఏమిటి స్వామీ!'
బ్రహ్మ చప్పున కదిలివచ్చాడు.
దృశ్యా దృశ్యంగా భాసిస్తూ చెప్పాడు 'గౌతమమహర్షీ! ఇదొక విచిత్ర సన్నివేశం! నీ కుమారులిద్దరూ కారణ జనములు. వారి వలన జరగవలసిన కార్యాలెన్నో ఉన్నాయి! శ్రీమన్నారాయణుడు భూమిపై నడయాడబోతున్నాడు. అప్పుడు నీ సంతానం ఆయనకు సహాయకారులవుతారు!' చెప్పాడు.
గౌతముడు వింటున్నాడు.
'గౌతమా! అహల్య దోషి కాదు. ఆమె తప్పు చేయలేదు! ఒక వేళ నీ దృక్పథంలో ఆమె దోషి అనిపిస్తే ఆమెను మన్నించు. నీ శాపానికి గురి చేయకు. మీ ఆంధ్ర దేశంలో ఒక సామెత ఉన్నదే కదా! కుమ్మరికి ఒక ఏడు - గుండ్రాయికి ఒక వేటు అని కదా! ఏడాదిపాటు కులాలుడు శ్రమపడి నిర్మించిన కుండలన్నీ ఒక రాతి దెబ్బతో సర్వనాశనం చెయొచ్చు! కానీ అది విజ్ఞత. వివేకం కాదు. విధ్వంసం మంచిది కాదు.
గౌతమా! సృష్టిలో ఎక్కడా లేని అందాలు ఆమె స్వంతం చేసి అహల్యణు సృష్టించాను. దేవతలకిచ్చి ఆ లోకంలో వుంచే దానికన్నా నీకిచ్చి భూలోకవాసిని చేయడమే మేలని తలచాను. అలాంటి అహల్యను నువ్వు కోపంతోనో, శాపంతోనో శిక్షించడం నాకు సమ్మతమవుతుందా! ఆలోచించు! సహనం, శాంతి, సముద్రం కన్నా మిన్న అయినవి. సముద్రం విశాలమూ, అగాధమూ అయితే అంతకన్నా ఇవి విశాలం అగాధము ఆనందదాయకం'
గౌతముడు అహల్య గురించి బ్రహ్మ చెప్పిన మాటలు విన్నాడు.
ఆయన మనసులో శాంతం సముద్రంలా పొంగింది.
'పరమేష్టీ! కోపం మానవుడికి శత్రువు. మానవుడి శాంతమే అతడికి రక్షా. కోపంతో నా కుమారులను వానరులుగా శపించాను. మరింత ఆగ్రహంతో అహల్యనేమని శపించి ఉండేవాడినో నాకు తెలియడం లేదు. సరయిన సమయంలో శాంతి సందేశం వినిపించి నన్ను కాపాడారు!'
బ్రహ్మ ఆనందంతో అన్నాడు.
'గౌతమా! అన్నీ కార్య కారణ సంబంధాలేనయ్యా! ఋక్షవిరజుడనే వానర శ్రేష్టుడు సంతానం లేక తపిస్తున్నాడు. అతడికి నీ కుమారులను దత్తం చేయవయ్యా మహర్షీ! అతడు దండకారణ్యంల్ కిష్కింధ రాజ్యం నిర్మించ తలపెట్టాడు. అతడి వారసులుగా ఈ బాలురు కిష్కింధ ఏలుకుంటారు. చెప్పాను కదా! వీరు సైన్యం, వీరి సంతానం శ్రీమహావిష్ణువు ఈ లోకంలో అవతరించిన సమయంలో మిక్కిలి సహాయ పడతారు'
గౌతముడు ఆ మాటలకు సంతోషించాడు.
బ్రహ్మకు కృతజ్ఞతలు తెలుపుకున్నాడు 'పరమేష్టీ! ఈ సకల చరాచర సృష్టి మీ మూర్తిత్రయ పాలనకు లోబడి నడుస్తుంది. మీ ఆజ్ఞ - అనుజ్ఞ లేనిదే ఏమీ జరుగదు. తెలిసో తెలియకో మాన్యులు, సామాన్యులు కూడా అజ్ఞానంలో పడతారు!'
బ్రహ్మ సంతోషంగా అన్నాడు 'అదిగో ఋక్ష విరజుడు వారసులను అన్వేషిస్తూ వస్తున్నాడు. ఈ వానరులను వారసులుగా అతనికి అప్పగించు!'
దృశ్యా దృశ్యంగా కనిపిస్తోన్న బ్రహ్మకు గౌతముడు అంజలి ఘటించాడు.
బ్రహ్మ అదృశ్యమయ్యాడు.
వానర రూపంతో వున్న ఇద్దరు కుమారులనూ, అంజననూ చూసి నిట్టూర్చాడు గౌతముడు. అంతలో కొంత దూరంలో విష్ణు సంకీర్తనం చేస్తూ వస్తున్న వానర శ్రేష్టుడు కనిపించాడు. గౌతముడు అతని రాక కోసం నిరీక్షిస్తూ నిలబడ్డాడు.
ఋక్ష విరజుడు సమీపించాడు.
'మహానుబావా! తమరెవరో తెలుసుకోగోరుతున్నాను. నన్నందరూ ఋక్ష విరజుడని పిలుస్తారు. నేను వానర మూర్తిని. కిష్కింధలో వానర సామ్రాజ్యం నిర్మించాలని తలపోస్తున్నాను. పుత్రహీనుడినైన నేను పుత్రుల కోసం పరితపిస్తూ పరిభ్రమిస్తున్నాను' అన్నాడు.
'గౌతముడని నన్నంతా సంభావిస్తారు'
గౌతముడి మాటలు పూర్తయి కాకముందే అత్యంత సంభ్రమంతో అన్నాడు ఋక్షవిరజుడు 'మహానుభావా! మహనీయ తేజా! న్యాయసూత్ర నిర్మాతా! చతురానన జామతా! నమో నమః!'
గౌతముడు ఆశీర్వదించాడు 'సుపుత్రా ప్రాప్తిరస్తు! ఐశ్వర్యమస్తు! ఇష్టకామ్యార్ధ సిద్ధిరస్తు! పుత్ర పౌత్రాభివృద్ధి రస్తు! వంశాభివృద్ధిరస్తు! శాంతి రస్తు! పుష్టి రస్తు! తుష్టిరస్తు!' |
25,005 | "అలాగే పెంచుదురుగాని రెండు రోజులు పోనీండి."
"నీకు తెలియదు, రాజ్యం! నువ్వు అతిగారాబంచేసి దాన్ని పాడుచేస్తున్నావు! రెండురోజులు బలవంతంగా బడికి పంపిస్తే మూడోరోజు అదే అలవాటు అవుతుంది!" తల్లిని వాటేసుకొన్న ప్రేమీ చేతుల్ని విడదీసి భుజంమీద వేసుకొని, ఓ చేత పలకపట్టుకొని వెళ్ళిపోయాడు సుందరరయ్య.
దిగాలుగా కూర్చుండి పోయింది రాజ్యం. ఏడుస్తున్న పాపముఖం కళ్ళముందు కదులుతుంటే ఏడుపు పొరలి వచ్చేస్తున్నదామెకు!
పాపని బడిలో వదిలి వచ్చాడు సుందరయ్య. అతడి ముఖంలోనూ విచారమేఘాలు క్రమ్ముకొన్నాయి. "నాన్నా! నేను నీతోనే వస్తాను" అంటూ తనని పట్టుకువదలని ఆపిల్లని మాస్టారుబలవంతంగా ఇద్దరు పిల్లలసాయంతో బళ్ళోకి లాక్కువెళ్ళాడు చాలాదూరంవరకు ఆపిల్ల ఏడుపు చెవిని పడుతూనే ఉంది! 'వెళ్ళి పాపని తీసుకు వచ్చెయ్యనా?' అనిపించింది. 'రాజ్యాన్ని తిట్టి తను అదేపని చేస్తే ఎలా?' అనిపించింది. సుందరయ్య మనసు బిగబట్టి పాపని వదిలి వచ్చాడు.
రాజ్యం ఆత్రంగా అడిగింది. "పాప ఏడుస్తూందా?"
"ఏడుస్తూంది! ఏడుస్తూందని ఇంట్లో ఎలా కూర్చోబెట్టుకొంటాం?"
"వెళ్ళి తీసుకురండి. ఓనమాలు నేను నేర్పగలను. పెద్దబాలశిక్ష కూడా చెబుతాను. తరువాత బడికి పంపొచ్చు!"
"నువ్వు ఓనమాలు నేర్పుతావు! పెద్ద బాలశిక్ష నేర్పుతావు! కాని ఈ ప్రపంచంలో మనుషులెలాంటివాళ్ళో తెలుసుకొనే తెలివిని నేర్పలేవు కదా? నీతోడిదే నాతోడిదే ప్రపంచం కాకూడదు పాపకు! మన కవతలి ప్రపంచాన్ని కూడా బాగా తేరిపారజూడనీ. పాప అందరిలాంటి ఆడపిల్లకాదు! పెళ్ళికాని స్త్రీకి పుట్టిన పిల్లగా అది ముందు ముందు చాలా అవమానాల్ని ఎదుర్కోవాల్సివస్తుందేమో! ఈ లోకులు చేసే అవమానాల్ని తట్టుకు ఎదుర్కోవాల్సివస్తుందేమో! ఈ లోకులు చేసే అవమానాల్ని తట్టుకు నిలబడే శక్తిని అది ఇప్పటినుండే పుంజుకోనీ. 'నేను ఎలా పుడితేనేం? ఎవరికీ పుడితేనేం? నన్ను చూసి మీరు నేర్చుకోవాల్సింది చాలా ఉంది' అని చెప్పేట్టుగా దానివ్యక్తిత్వం దిద్దుకోనీ. 'ఎంతయినా నువ్వు ఆడపిల్లవి!' అని పిరికిపాలు పోయడానికి ఎప్పుడూ ప్రయత్నించకు."
"మనం అనుకొన్నట్టు అన్నీ జరిగితే బాగానే ఉండును!" ఆరోజు వంటసరిగా చేయలేకపోయింది రాజ్యం. మనస్సంతా పిల్లమీదే ఉంది! బడివదలడానికి అరగంటముందే "వెళ్ళి పాపని తీసుకురండి" అని చెప్పింది భర్తతో.
సుందరయ్య వెడదామని జోళ్ళేసుకొంటూంటే, ప్రక్కింటి అబ్బాయి పాపని తీసుకువచ్చాడు. "మాస్టారు అరగంటముందే బడి వదిలేశారు" అని చెప్పి వెళ్ళాడు.
పాప చెంపలమీద కన్నీటి చారికలు కట్టాయి. కాటుక కళ్ళ నిండా అల్లుకుపోయింది! రాజ్యం హృదయం కలిచినట్టుగా అయింది! "పాపా!" ఆత్రంగా చేతులు చాచింది.
పాప రాలేదు. ఆడపిల్లముఖం యమసీరియస్ గా ఉంది. పలక చాపమీదపడేసి తనూ పడింది!
"కోపం వచ్చిందా, తల్లీ?"
రాజ్యం చేతుల్ని విదిలించివేసింది ప్రేమీ. ఆడపిల్లకళ్ళు చెప్పలేనంత తిరస్కారంగా చూస్తున్నాయి! "నువ్వు నన్ను ముట్టుకోవద్దు!" కఠినంగా అంది.
"పాపా!" విలవిల్లాడి పోతున్నట్టుగా పిలిచింది రాజ్యం.
అపరాదిలా దూరంగా నిలబడిపోయాడు సుందరయ్య.
ఆరోజంతా ప్రేమీ కోపంగానేఉంది! తనలో తను ఏదో ఆలోచించుకొంటూన్నట్టుగా ఉంది! అయిదేళ్ళపిల్లలో ఆ పట్టుదలా, ఆ అభిమానం చూసి చకితులయ్యారు రాజ్యం, సుందరయ్య. మరురోజు తనే బడికి వెడతానంటూ తయారైంది ప్రేమీ.
"నాన్నా! భోజనానికి లే!"
ప్రేమీ పిలుపుతో గతస్మ్రుతులకు తెరపడ్డట్టుగా అయింది.
4
సువర్చల ఆరోజు మీటింగ్ లో మాట్లాడవలసింది వ్రాసుకొని, ఆ విషయాన్ని మననం చేసుకొంటున్నట్టుగా వ్రాసిన కాగితాల్ని చూస్తూంది.
"మీటింగ్ కి తయారవలేదా, ఆంటీ?"
"వచ్చావా? ఈరోజు రావేమో అనుకొన్నాను." ప్రేమీని చూచి సువర్చలకొ కొండంత బలం వచ్చినట్టుగా అయింది! ఎక్కడికి వెళ్ళినా ప్రేమీని వెంట తీసికెళ్ళడం అలవాటైంది ఆమెకు! బయటికి వెడితే ఆరోజు కట్టుకొనే చీర, పట్టుకొనే ఖర్చీఫ్ దగ్గరినుండి అన్నీ తీసిఉంచుతుంది ప్రేమీ. ముడి సరిగా కుదిరిందో లేదో, చీరకుచ్చిళ్ళు సరిగా వచ్చాయో లేదో అన్నీ జాగ్రత్తగా చూసి సర్దుతుంది. ఎవరైనావచ్చి మాటల్లోకి దించితే, 'ఆంటీ! టైమైంది" అని గుర్తు చేస్తుంది. కాస్త సుస్తీ చేస్తే 'ఎలా ఉంది, ఆంటీ?' అని హడావుడి చేస్తుంది! ఇంట్లో ఏం వండుకొంటుందో, ఏం తింటుందో తెలియదు! సుస్తీ తగ్గేవరకు తనని అంటిపెట్టుకొనే ఉంటుంది. ఒకరోజు ఆ పిల్లను చూడకపోతే ఏదో పోగొట్టుకొని వెదుక్కొన్నట్టుగా ఉంటుంది! తలుసుకొంటే, ఆపిల్ల తన జీవితంలోకి ఇంత బలంగా ఎలా చొచ్చుకు వచ్చిందా అని ఆశ్చర్యం వేస్తుంది!
"బి.ఎ. పరీక్ష ఫీజుకి లాస్ట్ డేట్ అనుకొంటాను. ఫీజు కట్టావా?"
"ఏంచదవలేదు. ఫీజుకట్టి ఏం చేయను?"
"మీ నాన్న నిన్ను ఎం.బి.బి.ఎస్. చదివించాలనుకొన్నాడు. నువ్వేమో ఇలా మొండికెత్తావు! చదువూలేక, పెళ్ళిలేక, ఏం చేయాలను కొన్నావు?"
"రెండో మాట, సంఘసంస్కర్తగా మీరు అనవలసిన మాటకాదు! ఆడదానికి పెళ్ళేముఖ్యం. భర్తేదైవం అని ఒకనాడు మగవాడూ, ఆడదీ! ఎలుగెత్తి చాటారేమోగాని ఇప్పటిపరిస్థితిలో అవి చాలా పరిహాసమైన నినాదాలు! చదవంటే అది మనిషికి అవసరమే. కాని, బళ్ళో చదివేదే చదువు కాదు! ప్రపంచమే ఒకబడి అనుకొంటే ఇక్కడ మనిషి నేర్చుకొనే చదువెంతో ఉంది!" |
25,006 | ఒకరోజు భోజనం చేస్తూండగా అతడికో అనుమానం వచ్చింది. అంతకుముందు అతడికోసం అయిదారు గరిటెల అన్నం వుండేది. ఇప్పుడు మరో గుప్పెడు పక్కన వుంటోంది. అయినా అదికాదు అతడి కొచ్చిన అనుమానం.
ప్రతిరోజూ అంతే ఎలా మిగిలి వుంటుందా అని!
ఒకరోజు ఒకరు ఎక్కువ తినవచ్చు ఒకరు తక్కువ తినవచ్చు ప్రతిరోజూ తనకోసం 'అంతే' అన్నం ఎలా మిగిలి వుంటుంది?
అదే అడిగాడు.
ఆమె నవ్వింది.
"ముందు నీ కోసం కాస్త తీసి వుంచి, మిగతాది నేను తింటున్నాను బాబూ" అంది. అతడి అనుమానం తీరలేదు. "ఒకరోజు కూరలు బావుండి అంతా కాస్త కాస్త ఎక్కువ తింటే....." అన్నాడు అమాయకంగా.
ఆమెనుంచి జవాబు రాకపోయేసరికి తలెత్తి చూసేడు. ఆమె మొహంలో నవ్వులేదు. జవాబు అర్ధమైంది. అతడి కంటిని సన్నటి నీటి పొర కమ్మేసింది. చేతిలో ముద్ద అలానే వుంచుకుని "ఎప్పటికైనా నీ ఋణం తీర్చుకుంటాను పిన్నీ. నువ్వు దయతో విసిరిన ఈ మెతుకులకు బదులుగా నేను పెద్దవాన్నయ్యాక బంగారు అతుకులు అద్దలేనేమోగానీ నిశ్చయంగా నువ్వు కాలు కదపకుండా అన్నీ అమరుస్తాను." అనుకున్నాడు.
కానీ అలా జరగలేదు.
ఆ రాత్రే ఆమె వెళ్ళిపోయింది.
వెళ్ళిపోవటం ఒక్క సోమయాజికే తెలుసు.
ఆ రాత్రి ఎందుకో అతడికి అకస్మాత్తుగా మెలకువ వచ్చింది. బైట అలికిడి వినిపించింది. తలుపు తీసి వుంది. అతడు అనుమానంగా బైటకి వెళ్ళాడు.
చిన్న చేతి సంచితో - తలనిండా ముసుగు కప్పుకొని ఆమె బైటకి వెళ్తూంది. వీధిలో రాఘవరావు నిలబడి వున్నాడు. అతడు రెన్నెల్ల క్రితం వరకూ అదే సందులో వుండేవాడు. నెమ్మదస్తుడు తాలూకా కచేరిలో పని చేస్తున్నాడు. రెన్నెల్ల క్రితం అక్కడినుంచి బదిలీ అయింది.
గుమ్మానికి ఆనుకుని నిలబడ్డాడు సోమయాజి. అతడేమీ మాట్లాడలేదు. కదల్లేదు. అతడి కిదంతా ఏదో కలలాగా వుంది. కనులని నమ్మలేక పోతున్నాడు. అన్నపూర్ణమ్మలాటి పిన్ని 'లేచిపోవటం.....'
వెనుక చప్పుడు వినిపించి ఆమె తల తిప్పి చూసింది. వెనుకనున్న సోమయాజిని చూసి ఆమె బెదర్లేదు. భయంతో వణకలేదు. చేతిసంచి పక్కన రాఘవరావుకి అందించి వెనుతిరిగింది. ఆమె బాధ్యత అప్పుడే తనది అయిపోయినట్టూ అతడు దాన్ని పట్టుకుని నిలబడ్డాడు. ఆమె నెమ్మదిగా సోమయాజి దగ్గరకు వచ్చింది. మౌనం సేనాధిపతిగా నిశ్శబ్దం రాజ్యమేలింది. దాన్ని చేదిస్తూ ఆమె అన్నది. "వెళ్తున్నాను బాబూ" అని.
అతడు సమాధానం చెప్పలేదు. అతడికేదో కసిగా, ఎవరిమీదో ఉక్రోషంగా వుంది.
"నామీద నీకు చాలా కోపంగా వుందికదూ. అసహ్యంగా కూడా వుండి వుండవచ్చు. అవునా!"
దానికి కూడా అతను మాట్లాడలేదు. ఆమె దగ్గిరగా వచ్చి అతడి చుబుకం పట్టుకుని మొహం పైకెత్తి, "నా వైపునుంచి ఆలోచించు నాయనా" అంది.
"సమాజమూ, కట్టుబాట్లూ లాంటి పెద్దమాటలు వాడను. నాకున్న ఆలోచనా పరిధిలో నేను ఆలోచించిన దేమిటంటే - ఎంతకాలం ఇలా వంటలు చేసుకుంటూ బ్రతకను? ఎంతకాలం పనిమనిషిగా పనిచెయ్యను? చిన్న సందు కనపడితేనే పంజరం నుంచి చిలుక ఎగిరిపోవటానికి ప్రయత్నిస్తుందే! అంతకన్నా నా స్థితి ఏ విధంగా గొప్పది? అతడు మంచివాడు. నన్ను మోసం చెయ్యడు. చేసేడే అనుకో, ణ అజీవిఒతం కుక్కలు చింపిన విస్తరి అవుతుంది. కానీ నా వంట్లో జవసత్వాలు పోయిన రోజు ఇక్కడా అదే అవుతుంది! ఇంతకన్నా అదే మంచిదికదా."
పర్వతపు అడుగున మంచు కరిగితే పైన శిఖరం కదిలినట్టూ అతడి మనసు కదుల్తూంది. ఆ అట్టడుగు పొరల్లోంచి తాతయ్య స్మృతి బైటపడింది. ఒక సంక్రాంతి రోజు, తన మాస్టారుకి దేవుడన్నా పండగలన్నా నమ్మకం లేదని తను అన్నప్పుడు ఆయన అన్న మాటలు గుర్తొచ్చినయ్! '....మనిషి తనమీద తాను నమ్మకం పెంచుకుని దేవుణ్ణి కాదంటే తప్పు లేదు బాబూ, కానీ హేతువు లేకుండా పిడివాదంతో వాదించే మనిషి మాత్రం మూర్ఖుడు.'
ఒక్కసారి అతడి ఆలోచన ఆ తర్కంలోకి వెళ్ళేసరికి, ఆమె తనకి అన్నం పెట్టిన పిన్నిలాగానే కనబడింది. 'లేచిపోవటం' అన్న పదానికి ప్రత్యామ్నాయంగా 'మరో గూడు కట్టుకోవటం' అన్న పదం వచ్చింది.
తేటపడిన మొహంతో "వెళ్ళిరా పిన్నీ" అన్నాడు నిర్మలంగా.
ఆమె విస్మయంగా అతడి మొహంలోకి చూసింది.
"నా.....నాకూ పే....పెద్ద పెద్ద మాటలురావు పిన్నీ. నాకు తెలిసిన ప్రపంచమల్లా తాతయ్య ఒక్కడే. ఇప్పుడే తా.....తా...తాతయ్య వుంటే ఏమి చేసేవాడు. అదే, అలాగే ఆలోచిస్తాను నేనెప్పుడూ! వేదవేదాంగాలూ చదివిన పండితుడాయన. షడ్విధ వేదాంతవాది! మతాల్ని పుక్కిట పట్టిన వాడు. ఆయన ఏమిచేసి వుండేవాడు? ఈ ఇం.....ఇంటిలోనే పెళ్లిచేసి వుండేవాడు. అంతేకానీ సాంప్రదాయమూ, నుదుటి గీతా అని గోలచేసి వుండేవాడు కాదు. ఆయన దగ్గర్నుంచి అంతా నేర్చుకోలేదు పిన్నీ నేను! 'అ ఆ' లు మాత్రం నేర్పి, ఏదో పనున్నట్టూ వెళ్ళిపోయాడాయన. నేను నేర్చుకున్న కొద్దిలో నాకు అర్ధమైనదేమిటంటే విద్యకంటే జ్ఞానం గొప్పది. సాంప్రదాయం మంచిదే కానీ హేతువుకన్నా గొప్పది కాదు..... వెళ్ళిరా పిన్నీ....."
ఆమె కదిలిపోయింది. పెద్దవాడయి వుంటే కాళ్ళకి నమస్కరించేదే, కన్నీళ్ళతో, తేలిక మనసుతో ఆమె వెనుదిరిగింది.
అతడలాగే నిలబడి వున్నాడు.
వాళ్ళు చీకటిలో కలిసిపోయారు.
* * * *
అతడన్న మాటలు నిజమే! లత పూర్తిగా అల్లుకోకముందే చెట్టు కొట్టేసినట్టు అతడికి పూర్తిగా వ్యక్తిత్వం రాకముందే తాతయ్య వెళ్ళిపోయాడు. కానీ వర్తమాన ప్రపంచంలో మిగతావారితో పోటీచేయటానికి ఆ 'అ ఆ' లు చాలు. ఇప్పటి వారందరూ కేవలం మిడిమిడి చదువుల్తో కృత్రిమంగా ప్రకాశిస్తున్నారు. అతడితో సరిరారు.
కానీ ప్రస్తుతం అతడు మసిపట్టిన నిప్పులా వున్నాడు. రోజులు గడుస్తున్న కొద్దీ ఆ మసి మరింత ఎక్కువ అవుతూందేకాని తగ్గటంలేదు. అతడి వయసు అలాటిది. పదహారేళ్ళ వయసు స్త్రీకి చెడ్డదంటారు. కానీ పురుషుడికి అంతకన్నా చెడ్డది. ఆ వయసులోనే వ్యక్తిత్వం ఒక రూపు దాల్చుకోవటం ప్రారంభమవుతుంది. కాలిన ఇనుము ఏ పోతలో పోస్తే ఆ రూపు దాల్చినట్టు, వ్యక్తిత్వం ఒక ఆకారం పొందటానికి ఆతృతపడుతూ వుంటుంది. వ్యసనం పాములా పక్కనే పొంచివుంటుంది. మిగతావారి కన్నా తను తక్కువ అన్న న్యూనతాభావాన్ని కుర్రవాడు పోగొట్టుకోవడానికీ వ్యసనాన్ని ఆహ్వానిస్తాడు. అది అలవాటు రూపంలో నంగనాచిలా వచ్చి తర్వాత అసలు రూపం చూపిస్తుంది.
దమయంతి వెళ్ళిపోయిన రాత్రి-మామూలుగానే తెల్లవారింది. చిన్నక్కకాస్త ఆలస్యంగా లేస్తుంది. లేచిన అయిదు నిమిషాలకి ఆమెకి ఏదో అనుమానం వచ్చింది. భర్తని లేపింది. ఇద్దరూ వెతికారు. అంతలో రెండు మూడు చీరెలు కూడా లేని సంగతి వెల్లడయింది. దాంతో అనుమానం దృఢమైంది.
పెద్దక్కరాగాలు పెట్టింది. ముసలాయన కాలు కాలిన పిల్లిలా ఈ ఇంటిలోంచి ఆ ఇంటిలోకి, అట్నుంచి ఇటూ తిరిగాడు. రంగారావు అన్న గారు కత్తి పుచ్చుకుని చంపేస్తానని బయల్దేరాడు.
వెతకటం మొదలు పెట్టారు. కానీ ఎక్కడని వెతుకుతారు? ఎవరికీ రాఘవరావు మీద అనుమానం రాలేదు. అతను రెన్నెల్ల క్రితమే వెళ్ళిపోయినవాడు. గంటలో ఈ వార్త వీధంతా పాకింది.
ఆ తర్వాత దమయంతి కథ రకరకాల నోళ్ళలో రకరకాలుగా రంగుకు దిద్దుకుంది. మెరక వీధిలో చూశామని ఒకరంటే, కాదు ఇసుక వీధిలో చూశామని మరొకరన్నారు. సమాజపు కట్టుబాట్లని దాటిన స్త్రీ భవిష్యత్తు ఎలా వుండాలని తాము మనసులో కోరుకుంటున్నారో - అన్ని రకాలుగా ఆమె హీనస్థితిని వూహించి సంతృప్తిపడ్డారు.
ఇంత జరుగుతున్నా సోమయాజి నోరు విప్పకుండా ఒక ప్రేక్షకుడిలా చూస్తూ వుండిపోయాడు. ఆమెకేమీ జరగదని అతడికి నమ్మకముంది. ఆమె అందించిన చేతి సంచిని రాఘవరావు ఎంత అపురూపంగా పట్టుకున్నాడో అతడు బాగా చూశాడు.
* * * *
దమయంతి వెళ్లిపోయిన ప్రభావం ఆ ఇంటిమీద చాలా కనపడింది. పని ఒత్తిడి అంతా చిన్నక్క మీద పడింది. అందులో సగం సోమయాజి మీదికి జారింది. ఒక రకంగా చెప్పాలంటే తనే మీద వేసుకున్నాడు. దాంతో చదవటానికి అసలు సమయముండేది కాదు. అప్పటి వరకూ అతడు ఇంకా పుస్తకాలు కొనలేదు. పెద్ద పరీక్షలు దగ్గిర పడుతున్నాయి.
దమయంతి వెళ్ళిపోయిన తర్వాత వైదేహి కూడా వీళ్ళ గదిలోనే పడుకునేది. అంతకుముందు రాజా, సోమయాజి బైట వసారాకున్న గదిలో పడుకుంటే, వైదేహి, దమయంతి పక్కగదిలో పడుకునేవారు. ఆమె లేక పోయేసరికి వైదేహి తనకి భయమంటూ అన్న గది వసారాలో పక్క వేసుకుంది. సోమయాజి లోపలి గదిలో చదువుకుని, పడుకోవటానికి వసారాలోకి వచ్చేవాడు. వేసవికాలం అప్పుడే ప్రతాపం చూపిస్తూంది. |
25,007 |
"మరేం చెయ్యను బాలూ?"
"ఏడిపించడం నేర్చుకో?"
"ఎవర్ని?"
"నిన్ను ఎవరు ఏడిపిస్తున్నారో వాళ్ళని!"
"ఏడిపించే వాళ్ళని ఏడిపిస్తే మారతారా బాలూ?"
"మరి?"
"ఏడిపించే వాళ్ళని నవ్వించాలి" అన్నాడు కాశీ.
"అబ్బో! అది పెద్ద ప్రొసీజరు గురూ!"
"మంచి పనులకెప్పుడూ అడ్డదారి ఉండదు బాలూ" సానుభూతిగా చూశాడు బాలూ.
"ఎందుకురా నీకు ఆ పిల్ల అంటే అంత ఇది?"
"చెప్పాను కదా! గత జన్మలో ఆమె నా భార్య"
"నీ గతజన్మ బద్దలు కానూ! పోనీ మాట వరసకి ఆమెని నువ్వు పెళ్ళి చేసుకున్నా వనుకో! ఆమె డామినేషన్ ని భరించగలవా? ఊరికే మాట వరసకి అంటున్నా!"
కాశీ ఏదో చెప్పేటంతలో బాలూనే మళ్ళీ అన్నాడు.
"అదీ ఇదీ అనకు" అన్నాడు కాశీ తిక్క కోపంతో.
"సరే... ఆమె ఒక మగరాయుడు. చెయిన్ స్మోకరు. రోజూ స్కాచ్ బాటిలు ఓపెన్ చెయ్యాల్సిందే! రోజుకొక...
రక్తం గడ్డకట్టినట్లయిపోయింది కాశీకి.
"రోజుకొక...ఏమిటి... మొగాడా?"
"అదే జరిగితే... ఇంక బంధం పూర్తిగా తెగిపోయినట్లేనా?"
"ఏమిటి.. రోజుకొక?" అన్నాడు కాశీ హీన స్వరంతో. నవ్వాడు బాలూ.
"ఊరికే అన్నా!"
"ఏమిటి నువ్వనేది?"
"పిల్లకి ఏదీ వ్యసనం కాదు. అన్నీ టేస్ట్ చేసి చూస్తుంది. డ్రగ్స్ తో సహా! కానీ లేనిది ఒక్కటే!"
"ఏమిటది?"
"మగాళ్ళంటే మోజు"
ఒక్కసారిగా రిలీఫ్ కలిగినట్లయింది కాశీకి.
"కానీ, అదంతా గతం" అన్నాడు బాలూ.
"అంటే?"
"ఇప్పుడు సీన్లోకి నవకుమార్ ఎంటరయ్యాడు"
"నవకుమార్? నవకుమార్ ఎవరు?"
"నవకుమార్! ప్రొఫెషనల్ లేడీ కిల్లర్! ఇప్పటికి కనీసం ఓ వెయ్యిమంది అమ్మాయిలతో రోమాన్స్ జరిపి ఉంటాడు. అతను ఐశ్వర్యకి దగ్గరవుతున్నాడు"
నెత్తిమీద పిడుగు పడినట్లుగా చూశాడు కాశీ.
"రేపు స్విట్జర్లాండ్ వెళుతున్నారు ఇద్దరూ!" అన్నాడు బాలూ మళ్ళీ.
"ఎందుకు?" అన్నాడు కాశీ జీర పోతున్న గొంతుతో.
"లొకేషన్లు చూడ్డానికి!"
"లొకేషన్లా?"
"అవును! చాలా అందమైన లొకేషన్లు" అన్నాడు బాలూ, రెండర్థాలు పలికిస్తూ.
ఒక్కసారిగా చెప్పలేనంత నిస్పృహ ఆవరించింది కాశీకి.
ఈ నవకుమార్ తన ప్రత్యర్థి? బాలూ చెప్పేదాన్నిబట్టి చూస్తే, ఇతను చాలా పవర్ ఫుల్ ఎనిమీ! ఇతన్ని ఎలా ఎదుర్కుంటాడు తను?
"బాలూ!" అన్నాడు కాశీ నిస్త్రాణగా.
"చెప్పు కాశీ!"
"నా గత జన్మ గురించి నేను చెప్పేది ఎవ్వరూ నమ్మట్లేదు కదూ!"
నిదానంగా అన్నాడు బాలూ.
"ఇక్కడ రెండు పాయింట్లు ఉన్నాయ్ గురువా!"
"ఏమిటవి?"
"ఒకటి. ఈ పవిత్ర భారతదేశంలో గతజన్మ గురించీ, పునర్జన్మ గురించీ నమ్మని వాళ్ళు అతి తక్కువ మంది. నమ్మే వాళ్ళు ఎక్కువ మంది"
"నువ్వు నమ్ముతావా?"
"ఆహా! లక్షణంగా! ఆఫ్టరాల్ నేను నమ్మడమేమిటీ? నా ఫేవరెట్ హీరో ఉన్నాడు గదా - హిందీ హీరో సంజయ్ దత్! అతనితో ఇంటర్వ్యూ మొన్న స్టార్ టీవీలో వచ్చింది. సంజయ్ దత్ తెలుసుగా - నర్గీస్, సునీల్ దత్ ల కొడుకు. కొన్నేళ్ళ క్రితం బాంబేలో బ్లాస్టులు జరిగి కొన్ని వందల మంది చనిపోయారు కదా! ఆ బ్లాస్ట్ లు చేసిన అండర్ వరల్డ్ గ్యాంగు మెంబర్లతో సంజయ్ దత్ కి సంబంధం ఉందనీ, బ్లాస్ట్ ల కుట్రలో అతనికీ భాగం ఉందనీ చెప్పి అరెస్టు చేశారు. జైల్లో పెట్టారు. బెయిల్ మీద విడుదల చేశారు. ఇంకా విచారణ జరుగుతూనే ఉంది. కానీ, సంజయ్ దత్ ప్రతి రోజూ కోర్టుకి వెళ్లి హాజరు వేయించుకోవలసిందే! ఊరు దాటాలంటే కోర్టువారి పర్మిషన్ ఉండి తీరవలసిందే!" |
25,008 |
ఆమె అతడి దగ్గిర్నుంచి కాగితాన్ని అందుకుని చూసి, "ఐ ఫౌండ్ ఇట్" అంటూ అక్షరాల్ని చదివింది. భార్గవకి వెంటనే నాల్గురోజుల క్రితం తమ మధ్య జరిగిన సంభాషణ గుర్తొచ్చింది. శేఖరం చంపాలాల్ యింటికి రహస్యంగా వెళ్ళిన తరువాత తాము కలుసుకోలేదన్న విషయం కూడా జ్ఞాపకం వచ్చింది. ఈ ఉత్తరం ఎవరిచేతిలోనైనా పడితే ప్రమాదమని యిలా వ్రాసేడా అనుకున్నాడు. అదే అడిగాడు. "ఉహు, కాదు, ఆయన కళ్ళకి దెబ్బ తగిలింది. అందుకే బ్రెయిలీ నేర్చుకున్నారు". భార్గవ అదిరిపడి, "కళ్ళకి దెబ్బ తగిలిందా" అన్నాడు. "అవును. తాత్కాలికంగా అంధత్వం వచ్చింది". "గాడ్ ... అతడు ఎక్కడ... ఎక్కడ వున్నాడు?" "ఆస్పత్రిలో ... కానీ ఒకటి రెండు రోజుల్లో వచ్చేస్తారు". అతడు ఆమె మాటలు వినిపించుకోలేదు. మెదడు నిండా హోరుమనే ఆలోచనలు. శేఖరం గుడ్డివాడయ్యాడంటే అతడు నమ్మలేకపోతున్నాడు. అసలా వూహే భయంకరంగా వుంది. మొన్న మొన్నటివరకూ నవ్వుతూ హాయిగా ఆడుతూ పాడుతూ తిరిగిన ఆ యువకుడు యిప్పుడు గోడల్నీ, తలుపుల్నీ తడుముకుంటూ తిరగడం అనే దృశ్యాన్ని ఊహించుకుంటూనే వళ్ళు గగుర్పొడుస్తూంది. "అసలు ఎలా ... ఎలా ... జరిగింది యిది" తడబడుతూ అడిగాడు. "చిన్న ఆక్సిడెంట్ జరిగింది. మీరేమీ కంగారు పడకండి. ఇప్పుడాయన బాగానే వున్నారు". "వెంటనే నాకు ఎందుకు చెప్పలేదు?" "ఎవరూ! ఆయనా?" "అవును తనే." "తను ఫోన్ లో చెప్పలేడు భార్గవగారూ!" "ఎవరితోనైనా చెప్పించవచ్చుగా" "అదీ చేయలేడు. అయన నాలిక తెగిపోయింది. మాట్లాడటం కష్టం". భార్గవ గొంతులో ఏదో అడ్డుపడ్డట్లయింది. "ఏమిటి-" అని అరవబోయాడు. మాట రాలేదు. కళ్ళప్పగించి ఆ అమ్మాయి వైపే శిలలా చూస్తూ వుండిపోయాడు. ఆ అమ్మాయి అతడిని మాట్లాడించలేదు. ఈ షాక్ ని తట్టుకోవటానికి అతడికి కొంత సమయం పడుతుందని తెలుసు. ఆమె అంచనా నిజమయింది. అతడు తేరుకుని "పద వెళ్దాం" అన్నాడు కదులుతూ.
పది నిముషాలు అయ్యేసరికి యిద్దరూ ఆస్పత్రిలో వున్నారు. శేఖరం గదిలోకి ప్రవేశిస్తూనే భార్గవ అతడి ఆకారాన్నీ, కళ్ళకి కట్టిన కట్టును చూస్తూ "మైగాడ్ ఇది ...ఇదంతా ఎలా జరిగింది?" అని అడిగాడు కంగారుగా. వెనుకనుంచి ప్రియ నెమ్మదిగా "మీరు మాట్లాడేది ఆయనకి వినిపించదు భార్గవగారూ! చెవి ఎముకలు విరిగిపోయాయి" అంది. అన్ని విషయాలు ఒక్కసారే కాకుండా, ఒక్కొక్కటే చెప్పమని వెళ్ళబోయేముందు శేఖరం ఆమెని హెచ్చరించాడు. ఒక్క బాధ్యతాయుతమయిన ఉద్యోగిగా యజమాని సూచనని అక్షరాలా అమలు జరిపిందామె. 9 మొత్తం జీవరాసు లన్నింటిలోకి అత్యంత అసమర్థమైన, బలహీనమైన ప్రాణి "మనిషి". అతడి ఆకారంతో సమానమైన ఆకారం వున్న చాలా జంతువులతో పోల్చుకుంటే బలంతో వాటి సమానవుజ్జీ కాదు. తన కన్నా చిన్న జంతువైన లేడితోగాని, పెద్ద జంతువైన జీబ్రాతోకానీ సమానంగా పరుగెత్తలేడు. గబ్బిలంలా శబ్దగ్రహణం చేయలేడు. గద్దలాగా దూరంనుంచి చూడలేడు. కప్పలాగా ఉభయచరం కాదు. పురుగులకుండే ఎడాప్టబులిటీ లేదు. చీమలా దూరంనుంచి వాసన పసిగట్టగలిగే నేర్పులేదు. అంతవరకూ ఎందుకు? ఎముకల పొందిక కూడా సరీగ్గా లేనిది ఒక్క మనిషికే. అందుకే రెండు కాళ్ళమీద నిలబడి ఎక్కువసేపు పనిచేస్తే నడుమునొప్పి వచ్చేది కనీసం మనిషికే. తన శతృవుల్ని చంపటంలో వైరస్ కున్న ప్రజ్ఞ కూడా కనీసం మనిషికి లేదు. ప్రొటోజోవా నుంచి వెర్టిబ్రేటా వరకూ ఏ ప్రాణితో పోల్చుకున్నా మనిషి అధముడే. అయినా ఈ సకల జలాచర ప్రపంచాన్నీ తన ఆధీనంలోకి తెచ్చుకుని ఏలుతున్నాడంటే దానిక్కారణం అతడి మెదడు. ఒక జంతువుకి వేగం, ఒక ప్రాణికి బలం, ఒక పక్షికి రెక్కలు, ఒక చేపకి మొప్పలు ఇచ్చిన దేవుడు, మనిషికి అతడి వంతుగా "మెదడు" ని ఇచ్చాడు. అదే చాలని నిరూపించాడు మనిషి. ఐజాక్ ఆసిమోవ్ ఇచ్చిన ఈ సిద్ధాంతం నా మీద గొప్ప ప్రభావాన్ని చూపించింది. మనిషికి కావల్సిన మూడు ఇంద్రియాల్నీ నేను కోల్పోయానని తెలిసిన మరుక్షణం నా ఆలోచన ఆత్మహత్యవైపు వెళ్లింది. కానీ కుదురుగా ఒక్కక్షణం ఆలోచిస్తే దానంత వెధవ ఆలోచన మరొకటి వుండదని అనిపించింది. తమ మానసిక బలహీనతల్ని అధిగమించలేని వారికి మాత్రమే ఆత్మహత్యల అవసరం కలుగుతూ వుంటుంది. అన్నీ పోయినా నాకు మెదడుంది చాలు అనుకున్నాను. ఎప్పుడో జరిగిన సంఘటన గుర్తువచ్చింది. అప్పుడే కాలేజీ చదువు పూర్తిచేసి పై చదువుల్లో అడుగుపెట్టాను. కాలేజీలో నాతోపాటూ ఒకతను చదివేవాడు. పెద్ద తెలివైనవాడు కూడా కాదు. బొటాబొటి మార్కులతో పాసయ్యాడు. మనిషే అదోలా వుండేవాడు. రోజుల తరబడి గడ్డం పెంచేవాడు. మునిగిపోతున్న పడవని సానుభూతి చూపేవాడిలా ఈ ప్రపంచాన్నీ, మనుష్యుల్నీ పరికించేవాడు. "నేనో బ్రద్దలవబోయే అగ్నిపర్వతాన్ని...." లాటి అర్థం పర్థంలేని వాక్యాల్ని పుస్తకాల్నిండా వ్రాసుకునేవాడు. చదువు పూర్తయ్యాక రెండు మూడు సంవత్సరాల వరకూ అతడికి ఉద్యోగం రాలేదు. తనకి ఉద్యోగం రాకపోవటానికి కారణం కంపూచియా అనీ, తన చెల్లెలికి పెళ్ళి కాకపోవటానికి కారణం రష్యా సామ్రాజ్యవాదం అనీ నమ్మేవాడు. తమలాటి ఎందరో నిర్భాగ్యుల జీవితాలు మారాలంటే మొత్తం వ్యవస్థే మారాలనీ, అసలు లొసుగు అంతా ఈ వ్యవస్థలోనే వుంది అనీ అనేవాడు. 'అంతంత పెద్ద పెద్ద పదాలెందుకు- నీ వరకూ నీ వేదైనా సమాజానికి మేలు చేయరాదా' అనేవాడిని. 'ఏం చెయ్యను' అని అడిగాడు. అమ్మయ్య- ఆ మాత్రం ఆసక్తి చూపించాడు కదా అని సంతోషించి ఓ సూచన ఇచ్చాను. మన వూరు మెయిన్ రోడ్డు మధ్యలో ఓ సమాధి వుంది. రెండు వందల సంవత్సరాల క్రితం ఎవడో అనామకుడయిన సన్యాసి శవం అది. మత సంబంధమైన గొడవ లొస్తాయని రోడ్డు మధ్యలో దాన్ని అలాగే వదిలేసింది ప్రభుత్వం. అక్కడి కొచ్చేసరికి రోడ్డు ఇరుకై ప్రతీ వాహనమూ వేగం తగ్గించాలి. అలా తగ్గించి తిరిగి వేగం పెంచటానికయ్యే ఆయిల్ ఖర్చు లీటర్ లో వందో వంతు - అంటే ఆరు పైసలు అవుతుందనుకుందాం. మెయిన్ రోడ్డు మీద సగటున రోజుకి అయిదువేల వాహనాలు వెళతాయి- అనుకుంటే, మన నేషనల్ ఇన్ కమ్ సంవత్సరానికి దాదాపు లక్షా పదివేలు ఆ రూపేణా వృధా అవుతుందన్నమాట. ఏ ప్రాముఖ్యతాలేని ఒక సమాధి గురించి ఇంత వేస్ట్ ఎందుకు? రాత్రికి వెళ్లి ఆ సమాధిని అక్కణ్నుంచి తవ్వెయ్యకూడదూ... పట్టుబడితే ప్రాణాలు పోతాయి. కానీ దేశం కోసం ఆ మాత్రం త్యాగం చెయ్యటంలో తప్పులేదుగా... అన్నాను. అతడు వెంటనే జవాబు చెప్పలేదు. గాఢంగా ఆలోచించి, 'అసలు వాహనాలే బూర్జువా వ్యవస్థకి నిదర్శనాలు. అవి ఎవరికీ వుండకూడదు' అన్నాడు. నా తల తిరిగిపోయింది. తిరిగి అతనే "అయినా మా ఆశయం చాలా పెద్దది. దానిముందు ఈ బ్రద్దలు కొట్టటాలూ అవీ చిన్న విషయాలు" అన్నాడు. మరి ఆ ఆశయం కోసం, ఈ వ్యవస్థని పూర్తిగా మార్చటంకోసం నువ్వేం చేస్తున్నావ్ అని అడిగాను. నన్నో పురుగును చూసినట్టూ చూశాడు. "నేను పేలి, ఆ విస్ఫోటనంలోంచి లక్ష నేనులు ఉద్భవిస్తాను" అన్నాడు. నిశ్చయంగా మా ఇద్దరిలో ఒకరికి మతిపోయి వుంటుందనుకున్నాను. "చూడు మిత్రమా! ఎందుకీ నినాదాలు. శ్రమ శక్తిని నమ్మేవాడివి కాబట్టి ఏదయినా పని చేసుకోకూడదూ" అన్నాను. |
25,009 |
పెళ్ళి ఫిక్సయిపోయింది. ఇవన్నీ ఆమె మీ నుంచి ఆశించింది. తనకు ఓ చక్కటి తోడుగా వుండాలని కోరుకుంది. కానీ మీరు ఆమెను అర్ధం చేసుకోలేకపోయారు. ఆమెకేం కావాలో తెలుసుకోలేకపోయారు"
డాక్టర్ క్షణంసేపు ఆగాడు.
జగదీష్ అలా స్థాణువై పోయి వింటున్నాడు. అతనికి తన తప్పులు తెలుస్తున్నాయి.
"మిమ్మల్ని తన కనుగుణంగా మార్చుకోవాలని చూసింది. కానీ మీరు మారలేదు. దాంతో మీమీద అసంతృప్తి కలిగింది. అదిగో ఈ క్షణం నుంచే ఆమె రుగ్మతకు లోనైంది.
మీకు కొమ్ములు మొలిచినట్లు ఆమె అనుకుంది. కోరలు వచ్చినట్లు ఫీలయ్యింది. ఈ జబ్బుకున్న ముఖ్య లక్షణం అదే. భ్రమల్ని నిజమని నమ్మి, ఫీలయ్యే ఒకానొక మానసిక అవస్థ.
దీంతో ఆమె ఓ కుర్రాడ్ని ఊహించుకుంది. అతనిలో తనకు కావాల్సిన లక్షణాలన్నీ ప్రవేశపెట్టుకుంది. కానీ వసంత్ అనే వాడెవడూ లేడు ఐఏఎస్ కోచింగ్ సెంటర్ లో అతని పేరుతో ఎవరూ లేరు. ఇదంతా సూర్యాదేవి భ్రమే. తనను ఎలా ప్రేమించాలని అనుకుందో అలా అతనిని ఊహించుకుంది.
అయితే ఇదంతా తన ఊహేనన్న విషయం ఆమెకి తెలియదు జబ్బు లక్షణం అదే.
ఇలా తనకు తానే ఓ యువకుడి ప్రాణప్రతిష్ట చేసుకున్నాక అతనితో కలిసి తిరగడం రెండవ స్టెప్పు. అయితే చాటుగా ఏవయినా అనుభవించే రకం కాదు ఆమె. అందుకే అతనికి ఎంత దగ్గరగా వీలయినా, శారీరకంగా దూరంగానే వుండిపోతూ వచ్చింది. ఊహల్లో కూడా అలాంటివి జరగక పోవడానికి అదే కారణం.
ఇక ఆమె మీద హత్యాయత్నం ఎప్పుడూ జరగలేదు. భర్తకు తెలియకుండా మానసికంగా నయినా ఒక యువకుడికి దగ్గరవుతున్న గిల్టీ కాన్షస్ నెస్ ఆమెమీద తిరగబడుతూ వచ్చింది.
ఈ గిల్టీ కాన్షస్ నెస్ తనను చంపేస్తోందని భయం అదే ఆమెను భయపెట్టిన ఆకారం.
ఆమె ఇంతకాలం తన తండ్రి ప్రభావంలో పెరిగింది. ఎంత లేదనుకున్నా ఇలాంటివి జరిగితే నలుగురూ ఏమయినా అనుకుంటారేమోనన్న జంకూ వుంది. తన తండ్రికి భర్తకీ తలవంపులు తెచ్చిపెడతానేమోనన్న భయమూ వుంది.
ఆరోజు తన గదిలోకి వచ్చిన ఆడామగా కాని వ్యక్తి ఎవరో కాదు. జనం తను పెళ్ళయ్యాక ఏ యువకుడినయినా ప్రేమిస్తే నలుగురూ ఏమనుకుంటారోనన్న భయం ఆ రూపం దాల్చిందన్న మాట. ఆ నలుగురూ తనని ఆడిపోసుకుంటున్నారన్న నమ్మకం అందుకే ఆ వ్యక్తి నాలుక కత్తిలా తనలో దిగబడిపోతున్నట్లు భావించింది"
డాక్టర్ ఎఫెక్ట్ కోసం అన్నట్లు ఓ క్షణంసేపు ఆగి తిరిగి ప్రారంభించాడు.
"తనని ఆడిపోసుకుంటున్న జనం మీద కోపం, వాళ్ళని చిత్రవధ చేయాలి. తనను తాను కాపాడుకోవాలి. అందుకే ఆ వ్యక్తి నాలుకను పెరికేసింది. నాలుక లేకపోతే ఎవరూ మాట్లాడలేరు కదా అందుకే ఆమె ఆ వ్యక్తి నాలుకను లాగి విసిరేసింది.
కానీ అందరి నోళ్ళూ ఎలా మూయించగలడు? అది సాధ్యం కాదని తెలుసు ఓ యువకుడితో లేచిపోతె ఈ జనం ఊరుకోరు. చుట్టూ చెరి తలో మాటతో హింసిస్తారు. అందుకే నాలుకలు మొక్కలయినట్లు భయపడిపోయింది.
వసంత్ తో ఇరవై నాలుగు గంటలు ప్రేయసిలా అనుకున్న క్షణం నాలుకలు మాట్లాడడమంటే జనం తనను, తన తల్లిదండ్రినీ నానా రకాలుగా అనుకుంటారన్న భయం అది.
తమ గురించి ఎదురుపడి ఏమీ అనరు. తన వెనక గుసగుసలు పోతారు.
ఇక చివరికొచ్చేసరికి ఈ రుగ్మత ఆమెలో తీవ్రతరమయింది. ఇక వసంత్ ను కలుసుకోకపోతే వుండలేని స్థితికి వచ్చేసింది. కానీ ఏదయినా సరే పూర్తిగా కావాలనుకునే మనస్తత్వం వల్ల ఇరవైనాలుగు గంటలే అంటే పోవడానికి జంకింది. కానీ పోవాలి. ఈ సంఘర్షణలో మరింత చలించిపోయింది.
వారం రోజుల క్రితం షూమేకర్ లెవీ-10 అనే తోకచుక్క గురించి చదివింది. దాన్ని భూప్రళయంగా భావించింది. ఆ తోకచుక్క కక్ష్యమారి మరో గ్రహాన్ని ఢీ కొన్న విషయం ఆమెకు తెలియదు. అప్పటికే ఆమె జబ్బు మరీ ముదిరిపోయింది. తోకచుక్క భూమిని ఢీ కొంటే ఈ సంఘర్షణ నుంచి విముక్తి లభిస్తుందన్నది ఆమె భావన.
అందుకే దానికి లెవీ-10గా తనే పేరు పెట్టుకుంది. భూమి బ్రద్దలై పోతుందని నమ్మింది.
కానీ ప్రాణం మీది తీపి పోలేదు. వసంత్ చచ్చిపోవడాన్ని భరించ లేకపోయింది. తనను కలుసుకోవాలి. యవ్వనంలో యీ పరిస్థితుల్లో అది వీలు కాదు. వృద్దాప్యంలో అయితే ఇబ్బంది లేదు. అందుకే చివరి క్షణంలో తోకచుక్క దిశను మార్చేసింది. అది రాసుకుని భూమి అమితమయిన వేగంతో తిరిగి ముఫ్ఫై నిముషాల్లో ముఫ్ఫై సంవత్సరాలు గడిచిపోయినట్లు భ్రమించింది.
వసంత్ కోసం పరుగెత్తింది. కానీ ఎవరయినా వుంటే కదా అక్కడ భ్రమ మనిషి కాదు కదా. ఆ చీకట్లో పట్టు తప్పి కింద పడిపోయింది. తలకు దెబ్బ తగలడంతో స్పృహ తప్పింది. ఆ తరువాత జరిగింది మీకు తెలుసు" అని చెప్పడం పూర్తి చేశాడు డాక్టర్.
జగదీష్ అలా శూన్యంలోకి చూస్తుండిపోయాడు.
"అయితే అదృష్టం ఏమిటంటే- మీరు ఆ నిముషానికి అక్కడికి వచ్చిన వెంటనే ఇక్కడికి తీసుకొచ్చారు. కనుక సరిపోయింది లేకపోతే పిచ్చి పట్టేది"
ఆ మాటలకు ఏడుపొచ్చింది జగదీష్ కి. కర్చీఫ్ ని తీసి కళ్ళు తుడుచుకున్నాడు.
"ప్రస్తుతం ఆమె గురించి ఆందోళన అవసరం నెలరోజులకి తిరిగి మామూలు మనిషై పోతుంది. నో ప్రాబ్లమ్ మీరు నిశ్చింతగా వుండవచ్చు"
"థాంక్యూ డాక్టర్"
జగదీష్ ఏదో నిర్ణయానికి వచ్చినట్లు కదిలాడు.
ఆరోజు సాయంకాలమే సెక్రటరీని పిలిచి ఏం చేయాలో చెప్పాడు.
* * * * *
నెల రోజుల తరువాత సూర్యాదేవి ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయి ఇంటికి వచ్చింది.
"ఏమైంది నాకు?" అనడిగితే, "కొద్దిగా నీరసపడిపోయి స్పృహ తప్పావ్. అంతే" అని చెప్పాడు జగదీష్.
ఆ రాత్రి ఇద్దరూ భోజనం చేస్తున్నారు.
జగదీష్ మరీ స్పీడుగా తింటున్నాడు.
"ఏమిటంత త్వరగా తింటున్నారు?"
"ఈరోజు పౌర్ణమి వెన్నెల- క్షణం మిస్ అయినా అయినట్లే కదా డాబా మీదకు వెళదాం. కమాన్ క్విక్"
"భలే మారారే మీరు? ఈ మార్పు యెప్పుడొచ్చింది?" అన్నది సూర్యాదేవి.
"నువ్వు హాస్పిటల్లో వున్నప్పుడు"
"ఎలా వచ్చిందేమిటి?"
"ఓ పుస్తకం చదివాను. జ్ఞానోదయమైంది"
"ఏం పుస్తకం?"
"ఇప్పుడు చెప్పను- వెన్నెల్లో మనిద్దరం ఏకాంతంగా కూర్చున్నాక" అన్నాడు జగదీష్. "ఈ నెలరోజుల్లో ఇంకా ఏం మార్పులొచ్చాయ్?" అనడిగింది. "చాలా నెంబర్ వన్ కాంట్రాక్టర్ లిస్ట్ నుంచి నాపేరు కొట్టేసుకున్నాను. ఇప్పుడు నేను రెండు లక్షల రూపాయలు కాంట్రాక్టు తప్ప ఎక్కువ చేయలేని కాంట్రాక్టర్ని ఆ లిస్టులో పేరు నమోదు చేసుకున్నాను అదీ పని చేయకుండా వుండకూడదని, మనిషి అన్నాక ఏదో ఒక పనిచేయాలని కమ్యూనిస్టు మానిఫెస్టో చదివి తెలుసుకున్నాను కనుక"
"తరువాత"
"ఇన్ని రోజులూ నేను సంపాదించైనా సొమ్మునంతా ఖర్చుపెట్టి నీ పేరుమీద ఈ టౌన్లో గొప్ప లైబ్రరీ కట్టిస్తున్నాను. అందులో ప్రపంచంలో గొప్ప పుస్తకాలు అనబడేవన్నీ వుంటాయి. ప్రతీ భాషలోనూ వచ్చే కొత్త పుస్తకాలని తెలుగులోకి అనువాదం చేసి,. ప్రచురించడానికి ఓ పబ్లిషింగ్ సంస్థ కూడా పెట్టమని, దానికీ కొంత డబ్బు కేటాయించాను. ఉదాహరణకు జర్మనీలో ఓ పుస్తకం వచ్చిందనుకుందాం. వెంటనే అది తెలుగులో తర్జుమా జరిగి, పబ్లిష్ అయిపోతుంది"
"నెక్స్ట్"
"ఇప్పుడు మనకు ఈ ఇల్లూ, కారూ తప్ప ఏమీ లేవు. ఇవి మరీ అవసరం గనుక వుంచుకున్నాం. నీకు జూనియర్ కాలేజీలో లెక్చరర్ గా ఉద్యోగం కూడా చూసి పెట్టాను" అన్నాడు జగదీష్. "ఓఁ బ్రహ్మాండం"
ఇద్దరూ భోజనం ముగించారు. డాబా మీదకి రెండు పరుపుల్ని తెచ్చుకుని వేసుకున్నారు.
అతను ఆమె పక్కన మోచేతి మీద వాలి-
"నిజంగానే యెంత బావుందో, ఇన్నిరోజులు నా కళ్ళకున్న పొరలు యీ అందాన్ని చూడనివ్వలేదు. ఇప్పుడు ఆ పొరలు పోయాయి. ఈ కొత్త జ్ఞానాన్ని ఇచ్చిన పుస్తకం పేరు చెబుతున్నాను కదా- అది చలం దైవ మిచ్చిన భార్య.
"ఓఁ...." అని ఓ క్షణం ఆగి, ఆ ఉద్వేగాన్ని, ఆ సంతోషాన్ని ఆపుకోలేక సూర్యాదేవి అతని ముఖాన్ని రెండు చేతుల్తో తీసుకుని తన వక్షోజాల కేసి బలంగా అదుముకుంది. అప్పటికి ఉద్వేగం ఆగక "ఐ లవ్ యూ రా" అంది గుండె లోతుల్లోంచి.
భార్య చేత "ఏరా" అనిపించుకోవడంలో వున్న ఆనందం, దక్కదనుకున్న కోటిరూపాయల టెండర్ ని కొట్టేసినప్పుడు కూడా కలగలేదని అతను అనుభవంలో తెలుసుకున్నాడు.
:- అయిపోయింది :- |
25,010 | 1. విషమా! నీవు కాటు వేసిన వానినుండి బయట పడుము. ఏలనన నీవు ఇతనికి శత్రువవు. అంతే కాదు నీవు అందరకు శత్రువవు. కావున నీవు విష సర్పమున చేరుము. విషమును విషమున చేర్చుము.
విషమా! నీవు ఏ సర్పమునకు చెందిన దానివో దానియందు చేరి ఆ సర్పమును చంపుము.(7)
--౦౦౦--
1. నేను ఆకాశమందలి జలమును పూజించుచున్నాను. ఆ జలముల శక్తి నా యందు చేరును గాక. దుగ్ధముల హవిస్సుతో అగ్ని ముందుకు వచ్చినాను. అగ్ని నా యందు తేజస్సును ప్రవేశపెట్టును గాక. (8)
2. అగ్నిదేవా! నన్ను బలసంపన్నుని చేయుము. పుత్ర పౌత్రాదులను కలిగించుము.
ఇంద్రుని సహితముగ దేవతలు, ఋషులు నన్ను పవిత్రునిగా భావింతురు గాక. (9)
3. జలమా! నా పాపములను కడిగివేయుము. నిందా రూప మలమును, దురితమును, ద్రోహమును, అసత్యమును, రుణము తీసికొని దూషించిన దోషమును తొలగించుము. (10)
4. అగ్నిదేవా! నీవు జ్వాలా రూపివి. నాకు సమృద్ది కలిగించుము. నీవు సమిధా జ్వలితుడవు. నాకు సమృద్ది కలిగించుము. నీవు తేజస్సువు. నన్ను తేజోవంతుని చేయుము. (11)
--౦౦౦--
1. అగ్నిదేవా! పురాతన శత్రువు వంటి ఈ జార రూప శత్రువును తీవలను వలె నరుకుము. శత్రువు యొక్క జార వీర్యమును నష్ట పరచుము. (12)
2. ఈ జార శత్రువు కూడబెట్టిన ధనమును ఇంద్రుని సాయమున లాగుచున్నాను. సంతానము కలిగించు శక్తి గల ఇంద్రియమును వరుణుని సాయమున నష్టపరచుచున్నాను. (13)
3. దేవతలారా! జారుని వీర్యము వారినుంచి దూరము చేయండి. అది స్త్రీని చేరకుండును గాక. స్త్రీ యోని యందు ప్రవేశించు అంగమును, దాని స్తంభమును నష్టపరచండి. (14)
తొమ్మిదవ అనువాకము
మొదటి సూక్తము - 24
వినియోగము :-
1) గ్రామార్ధి మొదటి ఋక్కుచే ఇంద్రుని యజించునది లేదా ఉపస్థానము చేయునది. ఆ కర్మమునందే ఊదుంబర, పలాశ, కర్కంధు సమిధలను సమిదాధాన సభోపస్తరణ హోమాదులు దీనిచే చేయునది. ఇంద్రమహ ఉత్సవమున దీనిచే ఘ్రుతాహుతులిచ్చునది.
2) 4వ మంత్రముచే పల్లకి మీది సోమరాజును అనుమంత్రించునది. అగ్నిష్టోమమున అగ్ని మారుత శస్త్రావ సానమున ఆహవనీయ ధృవ పాత్రయందున్న సోమమును బ్రహ్మ దీనిచే అనుమంత్రించునది.
3) అభిచార కర్మమున 5 - 8 మంత్రములచే ఘ్రుతాహుతులు ఇచ్చునది.
4) అభిచార కర్మమున రక్తశాలి తండులములచే క్షీరాన్నము వండి సంపాతిత, అభిమంత్రితములు చేసి ద్వేష్యునకు ఇచ్చునది.
5) దర్శ మరియు పూర్ణ మాసములందు 9, 10 మంత్రములచే అష్టర్చ సంస్థిత హోమము చేయునది.
6) ఉపనయన కర్మయందు 10వ మంత్రముచే అష్టర్చ అభిమంత్రిత జలపూర్ణ పాత్రను బ్రహ్మచారికి చూపునది.
1. ఇంద్రుడు రక్షకుడు. ధనపతి. అతడు మమ్ము రక్షించి సుఖములు కలిగించును గాక. మహా విద్వాంసుడగు ఇంద్రుడు మా శత్రువులను సంహరించును గాక. మాకు అభయ మిచ్చి మమ్ము శూరులకు దొరను చేయును గాక.
--౦౦౦--
1. రక్షకుడు, ధనశాలియగు ఇంద్రుడు మా శత్రువులను దూరముండగనే తరిమివేయును గాక. మేము యజ్ఞయుడగు ఇంద్రుని అనుగ్రహమున నిలుతుము గాక. మేము ఇంద్రుని సౌ మనస్యమున ఉందుము గాక. (2)
--౦౦౦--
1. ఇంద్రుడు ప్రదీప్తుడు. అతని అనుగ్రహమున మేము శత్రువును అణచి వేయుచున్నాము. శత్రువును నిశ్సేషముగా సమాప్తము చేయుచున్నాము. (3)
--౦౦౦--
1. స్థిరమగు సోమమును రాజుల పల్లకి మీద తెచ్చుచున్నాము. ఇంద్రుడు మా ప్రజను అసాధారణ సమాన మనస్కులను చేయును గాక. (4)
--౦౦౦--
1. మండూకపు నోరు చీరుట వలన దాని ప్రాణము గద్ద ఆకసమునకు ఎగిరినట్లు, ఎగిరిపోయిన రీతి శత్రువు ప్రాణములు ఎగిరి పోవును గాక. మండూకపు గుండె సంకోచ, వ్యాకోచములు కోల్పోయినట్లు - శత్రువు హృదయములు అగును గాక. (5)
2. పడకున్న ఎద్దును లేపినట్లు, మొరుగు కుక్కను తరిమినట్లు, దూడను అందుకున్న తోడేలును గెంటివేసినట్లు శత్రువుల ప్రాణములను బలవంతముగ వేరుచేయుచున్నాను. (6)
3. శత్రువు సకల అవయవములను బాధించి, సకల అవయవముల ఒకేసారి బాధపడునట్లు చేసి ప్రాణములు తీయుచున్నాను. మాధనమును హరించు స్త్రీని గాని పురుషుని గాని మర్మావయవములు కట్టివేయుచున్నాము. (7)
--౦౦౦--
1. గోవులు గోష్ఠమందు వలె, గూటికి చేరు పక్షుల వలె, చలనము లేక నిలుచు పర్వతము వలె నేను వృకమును శత్రువు ఇంట నిలుపుచున్నాను. (8)
(ఇక ఎన్నటికి లేవకుండ అని.)
--౦౦౦--
1. అగ్నిదేవా! నీవు జ్ఞానవంతుడవు. దేవతల ఆహ్వాతవి. ఇది అవిచ్చిన్న యజ్ఞము, దీనికి నిన్ను హోతగా వరించుచున్నాము. నిన్ను సర్వ హోతగా వరించుచున్నాము. కావున నీవు దేవతలను యజించుము. దోషములను నివారించుము. మాకు వరములిచ్చువాడవై మా హవిని స్వీకరింపుము. (9)
2. ఇంద్రదేవా! మమ్ము మనస్వినులను, గోమంతులను, విద్వాంసుల మిత్రులను, శుభములు గల వారిని చేయుము. మాకు వేదములను, దేవహితమును కూర్చుము. మేము యజ్ఞియులగు దేవతల సుమనస్సులందందుము గాక. (10)
రెండవ సూక్తము - 25
వినియోగము :-
1) దర్శ మరియు పూర్ణ మాస సంస్థితి హోమమందు 1 - 6 మంత్రముల వినియోగము. శ్రౌత దర్శపూర్ణ యాగమున షడ్రుచ సంస్థిత హోమము నందు వీనిచే ఆహుతులు ఇచ్చునది.
2) దర్శ మరియు పూర్ణమాస ప్రహ్లియమాణ ప్రస్తరమును 7వ మంత్రముచే అనుమంత్రించునది. ఇదే కర్మ స్మార్త ప్రకారమందు దీనిచే బర్హి ప్రహరణము చేయునది.
3) శ్రౌత దర్శపూర్ణ మాసమున వేది పరిస్తరణము చేయు అధ్వర్యును 8 వ మంత్రముచే బ్రహ్మ అనుమంత్రించునది.
4) దుస్స్వప్న దోషనివారణార్ధము 9వ మంత్రమును జపించుచు పర్యావర్తనము చేయునది. స్వప్నమున అన్నభక్షణ దోష నివారణార్ధము దీనిని జపించునది.
5) స్వస్త్యయనము కొరకు మంత్రమున పేర్కొన్న దేవతలకు నమస్కరించునది.
1. అగ్నిదేవా! నీవు ఆహ్వానించిన దేవతలను వారి వారి స్థానములందుండునట్లు చేయుము.
వసువులారా! మీరు హవి, మధురస సంపన్న ఘ్రుత భక్షకులు, ఈ యజమానికి ధనము ప్రసాదించండి.
2. హవికి ప్రసన్నమగు దేవతలారా! మీరు ఇచటికి వచ్చినారు. మాకు ధనములు ప్రసాదించండి. మీకు స్థానములు ఏర్పరచినాము. ఆదిత్యుని చేరి స్వర్గమునాకు చేరుకొనండి.
3. యజ్ఞము యజ్ఞమును చేరును గాక. యజ్ఞము యజ్ఞపతిని చేరుకొనును గాక. యజ్ఞము యజ్ఞయోనిని చేరును గాక. స్వాహా.
4. యజ్ఞపతీ! ఈ యజ్ఞముమంత్ర సహితమై కళ్యాణ ప్రదమై ఉన్నది. స్వాహా.
5. అర్చించిన దేవతలకు ఘ్రుతాహుతులు అర్చించని వారికి ఘ్రుతాహుతులు.
దేవతలారా! మీరుమార్గములు తెలిసినవారు. వచ్చిన మార్గముననే స్వస్థానములకు చేరుకొనండి.
6. మనస్పతీ! మా యజ్ఞమును దివి యందలి దేవతలకు చేర్చుము. స్వాహా. స్వాహా దివి. స్వాహా పృథివ్యాం. స్వాహా అన్తరిక్షే. స్వాహావాతే. ధాంస్వాహా.
--౦౦౦--
1. బర్హిఘ్రుత యుక్తము - ఇంద్ర, వసు, మరుత్, విశ్వదేవతా యుక్తమైనది. అది ఇంద్రుని చేరును గాక. స్వాహా. (7)
--౦౦౦--
1. బర్హిస్తంభనా! వేదిపై పరచుకొనుము. వేదిని కప్పివేయుము. వెదికి బిడ్డవంటి యజమానిని నష్టపరచకుము.
దర్భ హోతల ఆసనము. హరితవర్ణ హిరణ్మయము. ఈ దర్భ యజమాని గృహమును స్వర్ణముతో నింపును గాక. (8)
--౦౦౦-- |
25,011 |
"నీకు పెద్ద పెద్ద ఊహలుంటే ఉండొచ్చుగాని ఊహలు నిజాలు చేసుకొనే స్థోమత చూచుకోవద్దా? నీకు ఇంతకంటె మంచి సంబంధం వస్తుందనుకొంటే మా సింహాన్ని ఏం చేసుకోవద్దు. బాగా ఆలోచించుకోవే. నీకు ఇష్టమైతేనే చేసుకో. నేను ఎక్కువగా బలవంతపెట్టను. నీకంటూ ఓ ఇల్లు సంసారం ఏర్పడే మార్గం చెప్పానేగాని పూర్తిగా నా స్వార్థమే చూడకు నువ్వు. నాకు సింహం ఎంత కావలసినవాడో నువ్వూ అంతేకావాలి" బలవంతం చేసినట్టుకాకుండా మెత్తటి మాటలతోనే సంధ్యని ఒప్పించాలనుకొంది నర్సమ్మగారు.
సింహాన్ని భర్తగా ఊహించుకోడానికే అసహ్యం వేస్తూంది సంధ్యకు. అతడి ఊబశరీరం, వికారంగా ఉండే ముఖం క్రొత్తవాళ్ళు చూస్తే ఫక్కున నవ్వుతుంటారు, ఏదో హస్యచిత్రాన్ని చూసినట్టుగా. పిల్లలయితే అతనిని ఆట పట్టిస్తుంటారు. ఒక్కోసారి రాళ్ళుతీసుకొని వెంటపడుతుంటారు నర్సమ్మగారు చూసి, "మీ ముఖం మండా! వాడు మిమ్మల్నేం చేశాడని వాడిని సతాయిస్తారురా?" అని పిల్లల్ని తరిమేస్తుంటుంది. చిన్నప్పుడు తనూ అరుణ్ కూడా సింహాన్ని ఆటపట్టించి నర్సమ్మగారితో తిట్లు తిన్నవాళ్ళే.
అలాంటివాడితో తన జీవితం పంచుకోవడమా? బాబోయ్!
* * *
ఇంటిముందు పారుతున్న పంటకాలువదగ్గిర గిన్నెలు వేసుకొని తోముతూంది సంధ్య.
ఎక్కడినుండో ఒక కాగితంవడవ నీళ్ళలో కొట్టుకువస్తూంది. ఆ పడవని చూస్తుంటే సంధ్యకి తన చిన్నతనం జ్ఞాపకం వస్తూంది. తనూ, అరుణ్ ఇలాంటి కాగితం పడవలు చేసి ఈ కాలవలో వదిలి ఆడుకొనేవాళ్ళు. పడవలు నీళ్ళలో ప్రయాణం చేస్తుంటే, ఎంతదూరం వెళ్ళి మునుగుతాయోనని కాలువ పొడుగునా పరిగెత్తేవాళ్ళు! ఈకాలువ అప్పుడున్నట్టే ఇప్పుడూ ఉంది. సంధ్య కూడా ఉంది! ఏ చీకూ చింతా లేకుండా ఆడుకోడానికి ఆ బాల్యం, అరుణ్ మాత్రం లేరు.
అరుణ్!
ఎంత పెద్దయిపోయాడో! ఎంత అందంగా తయారయ్యాడో? ఒక్కసారి చూడాలని మనసులో తహతహ! కాని, ఎలా చూస్తుంది?
అతడు చాలా పెద్దవాడైపోయి, గొప్పవాడైపోయి ఒకరోజు హఠాత్తుగా వచ్చి తన కళ్ళు మూసినట్టుగా ఎన్నిసార్లు కలలుకందో! కలలు కలలుగానే మిగిలిపోయాయి.
సంధ్యకి కొంచెం దూరంగా బట్టలుతుక్కొనే బందమీద కూర్చొని నీళ్ళలో కాళ్ళాడిస్తున్నాడు సింహం.
నర్సమ్మత్త మళ్ళీ పెళ్ళి ప్రస్తావన తన దగ్గర తీసుకురాకపోయినా, ఇంటికి వచ్చినవాళ్ళతో అంటూనే ఉంటుంది. "తనకు మాత్రం ఇంతకంటే మంచి సంబంధం చూసి చేసేవాళ్ళు ఎవరున్నారు చెప్పు." అని.
"నిజమే! తల్లిపోయినప్పటినుండి నువ్వే తల్లివైనావు. నీ కష్టంలో పాలు పంచుకోవడం ఆ పిల్లకి కూడా ధర్మమే. తనకి ఓ ఇల్లు, సంసారం అంటూ ఏర్పడతాయికదా?" అని నర్సమ్మగారిని సమర్థించడమేకాదు, సంధ్యకి హితవుకూడా చెప్పిపోతున్నారు. "సింహం కాస్త వెర్రివెంగళప్ప అయితేనేం? సంసారానికి నిక్షేపంగా పనికివస్తాడు. నీ కడుపునో కాయ కాస్తే ఆడజన్నకి అంతకంటే సార్ధకమేముంది? కోరిన నగ, కోరిన చీరా కట్టుకోవచ్చు, పెట్టుకోవచ్చు! ఇంకేం కావాలి చెప్పు?"
కోరిన చీరా, కోరిన నగా కట్టుకోవడం, పెట్టుకోవడం, కడుపునో కాయ కాయడం ఇంతకంటె కోరవలసింది లేదా ఆడపిల్లకు? అందరాడపిల్లలకు కాదు! తనలాంటి దిక్కు మొక్కులేని నిస్సహాయురాలైన ఆడపిల్ల కోరకూడదన్నమాట!
సింహం ఎప్పుడు లేనివచ్చాడో, సంధ్య దగ్గరికి వచ్చాడు. నడుంమీద రెండు చేతులువేసి చిన్న పాపని లేపినట్టుగా లేపాడు సంధ్యని.
సంధ్య కెవ్వున కేక పెట్టింది! గింజుకొని, అతడి చేతులనుండి తప్పించుకొని, "అత్తమ్మా" అంటూ పరుగుపెట్టింది.
నర్సమ్మగారు కంగారుగా బయటికి వచ్చింది. "ఏమిటే? ఏమైంది?"
"సింహానికి మొన్నటిలా ఏదో వచ్చింది మీదికి! నన్ను పట్టుకొన్నాడు.
"వాడి అవస్థచూస్తూ కూడా నీ మనసు కరగడంలేదు." ఆవిడ సంధ్యవంక నిష్ఠూరంగా చూసింది. సింహాన్ని చేతులుపట్టి లాక్కువెళ్ళి గదిలోకినెట్టి తలుపులు ఇవతల గడియపెట్టింది.
రోజులు గడిచిపోతున్నకొద్దీ బయటినుండి ఒత్తిడి ఎక్కువగా వచ్చింది సంధ్యమీద. |
25,012 | "బ్రాహ్మలమని, ఆచార సంపన్నులమని, త్రికాల సంధ్యలూ, నిత్యాగ్నిహోమాలు చేస్తామనీ అహంకారం జీర్ణించుకుపోయిన ఇంట్లో పుట్టిన పిల్ల భ్రమరాంబిక. ఆ అహంభావం ఒక పాలు ఎక్కువే ఆమె తలకు ఎక్కిందని ఈ రోజు నాకర్ధమైంది. చినబాబూ! ఇకామె మాటలుగాని, చేతలుగాని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీ మనసు నుండి ఆ విషయం చెరిపివేయండి" ధర్మలింగం తిరిగి వచ్చి వికీతో అన్న మాటలివి.
ఆయన సలహా విన్నాక వికీ నుండి ఒక నిట్టూర్పు వెలువడింది. సున్నితమైన మనసులో ఏదైనా ఒకటి నాటితే చెరపడం అంత సులభం కాదని ఈయనకు తెలియదు. ఏమైనా ఇక బాధపడను. భ్రమర అపార్ధం తొలగించేందుకైనా తను కొన్నాళ్ళపాటు ఇక్కడే వుండిపోతాడు.
వికీ లేచి హుషారుగా కూని రాగం తీస్తూ డ్రెస్ మార్చుకోసాగాడు.
"ఎక్కడికో బయల్దేరుతున్నారు? మళ్ళీ గుడి దగ్గరికేనా"
"కాదు! అలా అలా తిరిగి వస్తాను"
"కారులో వెళ్ళండి! వాకింగ్ మాత్రం వద్దు"
మౌనంగా తలూగించాడు వికీ.
క్రిందికి దిగి కారులో కూర్చోబోతూ చూసేసరికి అప్పటికే రాంసింగ్ బాక్ సీటులో కూర్చొని కనిపించాడు.
వికీ ముఖంలో అసహనం ఒక్క క్షణం కదిలి మాయమైంది. బాడీగార్డ్స్ ని తన క్షేమం కోసమే కదా ధర్మలింగం పెట్టింది అని సరిపుచ్చుకొన్నాడు.
వికీ స్టీరింగ్ అందుకోగానే రివ్వున పరుగుతీసింది.
ప్యాలెస్ 'గంధర్వ' నుండి రెండు కిలోమీటర్ల దూరంలో గుట్టల మధ్య నిర్మింపబడిన గెస్ట్ హౌస్ కృష్ణమహల్ వరకు తారురోడ్డు వేయబడింది తారురోడ్డు మీద మెత్తగా దూసుకుపోతోంది నల్లటి ఫియట్ కారు.
చుట్టూ కొండలు, పెద్ద పెద్ద బండరాళ్ళు మధ్యన మొలిచిన వృక్షాలూ అల్లిబిల్లిగా అల్లుకొన్న అడవి లతలూ, చక్కటి ప్రకృతి మధ్యన ప్రకృతి సహజత్వం ఏమాత్రం దెబ్బతినకుండా కట్టబడింది ఆ బంగళా. అడుగడుగునా ముగ్ధపరిచేట్టుగా వుంటుంది పాలరాతితో కట్టబడిన ఆ బంగళా.
చాలా రోజులుగా ఆ బంగళాని ఎవరూ వాడుకోకపోయినా పనివాళ్ళ చేత నిత్యం శుభ్రపర్చబడుతూ వుంటుంది! బంగళా చుట్టూ వున్న తోటని కళకళలాడించడంలో తోటమాలి ఏమాత్రం అశ్రద్ధ చూపడం లేదని తెలిసిపోతుంది తోటని చూడగానే.
కారు అల్లంత దూరంలో వుండగానే చూశాడు గెస్ట్ హౌస్ వాచ్ మెన్య. కారు లోపలికి రావడానికి సిద్దంగా గేటు తెరిచి వుంచాడు.
కారు తిన్నగా లోపలికి దూసుకువచ్చి గెస్ట్ హౌస్ ముందు ఆగింది.
వాచ్ మెన్ కారు తలుపు తీయడానికి పరిగెత్తుకు వచ్చేలోగానే వికీ దిగాడు గెస్ట్ హౌస్, మెట్లమీద నిలబడి చుట్టూ పరిసరాలని, తోటనీ కొద్ది నిమిషాలపాటు వీక్షించిన వికీ, "ఇక్కడి నుండి కనిపించే దృశ్యం చాలా అద్భుతంగా వుంది" అన్నాడు.
అప్పటికే తలుపు తాళం తీసివచ్చిన వాచ్ మేన్ "దొరవారి చేత నియమింపబడిన ఇద్దరు ఇంజనీర్లు అహోరాత్రులు శ్రమించి రూపకల్పన గావించిన బంగళా ఇది. అద్భుతంగా వుండక ఏమౌతుంది? లోపలికి రండి. చినబాబుగారూ చూడండి." వినయంగా ఒక్కోగది తిప్పి చూపసాగాడు.
గోడలు పాలరాతి పలకలతో తళతళలాడిపోతున్నాయి. గది మూలలకు అపురూప కళాఖండాలనదగిన పాలరాతి, కంచువిగ్రాలు అలంకరించి వున్నాయి. అతి ఖరీదైన షాండియర్లు, గోడలకి అతివిలువైన తైలవర్ణ చిత్రాలు, బంగళా చుట్టు ప్రత్యేక శ్రద్ధతో పెంచబడిన తోట.... తండ్రి వుత్తమాభిరుచికి చక్కని నిదర్శనంగా ఓవైపు కనిపిస్తూంటే.....
ఆయన హయాంలో గానాబజానా జరిగే హాలు, ఎందరో అతివల జీవితాలు చిదిమివేయబడిన శయ్యామందిరం. వికీలో క్రోధావేశాన్ని రెచ్చగొట్టాయి. స్త్రీలపట్ల ఆయన కాముకతకు దర్పణం పడుతున్నట్టుగా శయనమందిరంలోనూ, సంగీత నృత్యాలు సలిపే హాలులోనూ, నగ్న, అర్ధనగ్న చిత్రాలు గోడల్ని అలంకరించి వున్నాయి. ఆయన గొప్ప సంగీత ప్రియుడని చెప్పడానికన్నట్టు వివిధ వాయిద్యాలు చక్కగా ముసుగులు కప్పుకొని వున్నాయి.
ఆ చిత్రాల్ని తీసి నేలకు కొట్టి, ఆ వాయిద్యాల్ని ధ్వంసం చేసి, శయ్యామందిరంలో హంసతూలికా తల్పాన్ని చింపి ప్రోగులుపెట్టి, అసలు ఈగెస్ట్ హౌస్ నే డైనమేట్లు పెట్టి ప్రేలిస్తే తప్ప తండ్రి రసిక చరిత్రకు తెరపడి తనని నీడలా వెన్నాడ్డం మానేస్తుందేమో అనిపించిందొక్క క్షణం వికీకి.
తన పిచ్చిగాని అవి నాశనం చేసినంతమాత్రాన భ్రమర తనని పవిత్రుడిగా ఒప్పుకొంటుందా? తండ్రి తాతల హీనచరిత్ర నీడై తనని వెంటాడ్డం మానేస్తుందా?
గెస్ట్ హౌస్ లో ఎక్కువసేపు ఉండలేనట్టుగా బయటికి వచ్చేశాడు వికీ.
తోటమాలి చక్కగా తయారుచేసిన పూలగుత్తిని వికీ చేతికందించి, నమస్కరించాడు వినయంగా.
"థాంక్యూ" స్నిగ్ధంగా నవ్వాడు వికీ. పూలగుత్తిలోని పువ్వుల్ని గాఢంగా వాసన చూసి, "ఓ! లవ్లీ!" అన్నాడు మురిసిపోతున్నట్టుగా.
కాస్సేపు తోటలో తిరిగి వచ్చి , గార్డెన్ చెయిర్ లో కాస్సేపు విశ్రాంతి తీసుకొని తిరిగి కారెక్కాడు వికీ.
అప్పటికి చీకట్లు బాగా ముసిరాయి
* * * |
25,013 | అంతా విన్న మిత్రా " ఓస్... ఇంతేనా... ప్యూజ్ వేయడం.... అదెంత పని... వుండు మమ్మీతో చెప్పివస్తా" అని చెప్పి వెళ్లి వచ్చాడు...
కాసేపు క్రొవ్వత్తి కోసము వేటాడారు.ఓ పది నిమిషాలు తరువాత దొరికింది. మిత్రా కాసేపు చెక్ చేసాడు.
చివరకు ఒక ఫ్లెగ్ లాగి దానికి వైరుచుట్టి పట్టుకోడానికి మృదులకి ఇచ్చాడు. మృదుల ఒక చేత్తో క్యాండిల్ మరోచేత్తో మెయిన్ స్విచ్ పట్టుకుంది. మిత్రా మృదుల నించి ఫ్లెగ్ అందుకోవటంలో అతనికి చేయి కుండా ఆమె చేయి తాకింది ఓ క్షణం. అలా టచ్యి అప్పటికి మూడుసార్లు అయివుండొచ్చు కాని,ఆరోజు ఎందుకో షాక్ కల్గి భ్రాంతి కలిగింది మృదులాకు. ఈసారి అతను పడిపోబొతున్న క్రౌవ్వత్తిని చేత్తో ఆపి ఆమె చేయిని పట్టుకున్నాడు:
అతను కావాలని చేసిన పనికాదు. ఆమెకి స్పందన మొదలయింది. ఎందుకు తనిలా ఎఫెక్టు అవుతుంది మిత్రాని చూసి? తనను చేసుకుంటాము అని ఎంతోమంది చుట్టూ తిరిగారు ప్రస్తుతము తిరుగుతున్నారు కూడా...
ఏమిటి ఇలా అయిపోతుంది... మిత్రా ఏమన్నా అనుకుంట డేమో... తనని ఒక గురువులా భావిస్తున్నాడు. ఆమె వెంటనే రియాట్ అయింది.
అతను వెళతానన్నట్లు సైగ చేశాడు...
ఆమెలో మళ్లి భయము ఆవరించుకుంది.
అతను వెళ్లిపోతున్నాడు.
" మిత్రా...?" పిలిచింది మృదుల.
" నీ కభ్యంతరము లేకపోతే ఈ రోజు మా ఇంటిలో ఉండు ఒంటరిగా వుండాలంటే బయమనికాడు...! బోరు కొడుతుందని..." నీకభ్యంతరము లేకపోతేనే...?"
" నాకా... అభ్యంతరమా... మమ్మీ పర్మిషనడగాలి... వెళ్ళమంటే వస్తాను."
" సరేనా...?
" సరే"... అతను వెళ్లినవైపే నిలబడిపోయింది మృదుల.
ఆమెకనిపించింది అనవసరముగా తొందర పడి అడగలేదు కదా..."
వాళ్ళమ్మగారు సరిగా అర్ధం చేసుకుంటే పర్వాలేదు... అయినా ఒక అమ్మాయి, అబ్బాయి కలిసి మాట్లాడుకుంటేనే ఏదోగా అర్ధం చేసుకుంటుంది ఈ లోకము. తనైతే అలాంటివి చచ్చినా పట్టించు కోదు...
ఇంతలో గేటు తీస్తున్న శబ్దము వచ్చింది. మిత్రా తనతో పాటు టెక్ట్స్ బుక్స్ కూడా తెచ్చుకున్నాడు...
" మమ్మీ, సరేనంది... ఎర్లీ మార్నింగ్ మాత్రము వచ్చేయ మంది. మార్నింగ్ మిల్క్ పాకెట్స్ తీసుకురావలట... అందుకు...?
" దాంక్సు, అడిగిన తరువాత భయమేసింది...? ఏవన్నా అనుకుంటారేమో యని లోపలికి పోదామా"
లోపలికి వచ్చిన తరువాత కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. తరువాత మృదుల వంటపనిలో పడిపోయింది. మిత్రా తెచ్చుకున్నా టెక్ట్స్ పుస్తకాలు చదవసాగాడు. తొమ్మిది ఆ ప్రాంతములో భోజనము ముగించి ముందు వచ్చారు. మృదుల లోపలికి వెళ్లి తనతోపాటు ఏదో తీసుకు వచ్చింది.
" అభి, నీకో ఫ్రెజెంటేషన్ ఇద్దామని అనుకుంటున్నాను చాలా కాలము నుంచి: ఎందుకో నాకీరోజు ఇవ్వాలనిపించింది. ఇదిగో" అంటూ తనతో పాటు తీసుకువచ్చిన డైరీని మిత్రాకి ఇచ్చింది.
మిత్రా ఒకింత ఆశ్చర్యంగా చూశాడు.
"ఇదేమిటి డైరి అనేది కొత్త సంవత్సరము మొదటి రోజున... మరి నువ్వు నారిప్పుడు ఇస్తే నేను దాన్నో రఫ్ పుస్తకంగా భావించా వస్తోంది...?
" భలేవాడివే: అలా ఇచ్చేది రెగ్యులర్గా డైరీ రాసేవాళ్ళకు నీకా అలవాటు లేదుగ. అదేదో ఈరోజు నుంచి మొదలు పెట్టు అయినా డైరీ రాయటము మంచి అలవాటు తెలుసా? నీకు తెలియదు నీలో వచ్చే మార్పుల్ని డైరీని చూసి గమనించవచ్చు అందుకే నీకు డైరీ అతని చేతిలో డైరి వుంచింది మృదుల. మిత్రా తెరిచాడు మొదటి పేజిలో ఒక మూల రాసివుంది. అందమైన గుండ్రని అక్షరాలతో ప్రియ మిత్రుడు అభీకి అబిమానంతో నీ ఫాసినేషన్ మృదుల.
ఎందుకో తెలియదు గాని ఆ క్షణంలో అంతకు ముందు మృదుల పరుచయము అయిన దగ్గర నుంచి వరుసగా అన్ని సంఘటనలు వచ్చాయి మిత్రాకి.
డైరీ మూసి మృదువుగా సృచించాడు.
" సరే అరా డైరీని చూస్తు ఆలోచనల్లో పడటమేనా... చదివేది ఉందా...? ప్రశ్నించింది.మృదుల.
మిత్రా ఆ మాటతో బైటరూమ్లోకి వచ్చి మళ్ళీ పుస్తకాల్లో దూర్చాడు. మృదుల కూడా రాస్సేపు ఏదో చదువు కుంది.
రాత్రి పదకొండు దాటటంతో మృదులకు నిద్ర ముంచుకొస్తుంది. ఇక చేసేది లేక చదవడం ఆపి మంచము మీద వాల్తూ అంది.
" అభి: నీవు చదవడము పూర్తయిన తరువాత లైటార్పి ఈ మంచము మీదే పడుకున్నా నాకభ్యంతరము లేదు" అని చెప్పి నిద్రలోకి జారుకుంది మృదుల.
|
25,014 | ఇది తథ్యం...అప్పుడు...మీ అందర్నీ ఆశీర్వదిస్తుంది. మనమంతా బిత్రోచి అనుచరులం. ప్రపంచమంతా బిత్రోచి వశమయ్యే సమయం ఎంతో దూరంలో లేదు."
మరోసారి తమ హర్షాన్ని తెలియజేశారు ఆ హాలులో ఉన్నవాళ్ళు.
రామయ్య పీటర్సన్ వైపు చూసి తర్వాత ఆ గదిలో వెలుగుతోన్న క్యాండిల్ వైపు చూసాడు.
ఆ హాలులో పెద్దక్యాండిల్ వెలుగుతోంది. హాలు తలుపులు మూసివేసి వున్నాయి.
పీటర్సన్, రామయ్య డయాస్ మీద వున్నారు.
డయాస్ ముందు ఓ టేబుల్ వుంది. దానిమీద పెద్ద క్యాండిల్ వుంది.
రామయ్య తీక్షణంగా ఆ క్యాండిల్ వైపు చూశాడు.
తన కుడిచేతి బొటనవేలితో ఎడమ చేతి మణికట్టు దగ్గర గట్టిగా గాయం చేసుకున్నాడు.
రక్తం చిమ్మింది.
ఆ రక్తాన్ని క్యాండిల్ వెలుతురు మీద ధారగా చిమ్మించాడు. క్షణక్షణానికి ఆ క్యాండిల్ వెలుతురులో మార్పు వస్తూ రంగులు మారుతోంది. ఒక్కక్షణం పసుపు రంగులోకి మారి, ఎరుపు రంగులోకి వచ్చింది.
అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.
డయాస్ మీద ఉన్న రామయ్య, పీటర్సన్ లు కనిపించలేదు. కానీ, ఎక్కడ్నుంచో మాటలు వినిపిస్తున్నాయి.
"ఫ్రెండ్స్...ఈ రోజునుంచి ప్రతిరోజూ అర్దరాత్రి పన్నెండు గంటలవేళ క్షుద్రోచిని ఆరాధిస్తూ క్షుద్ర పూజలు నిర్వర్తించండి. క్షుద్రోచీని ఆహ్వానిస్తూ ప్రతీరోజూ అర్ధరాత్రి మూడు చుక్కల రక్తాన్ని క్షుద్రోచికి సమర్పించండి"
మాటలు ఆగిపోయాయి.
ఆ హాలు నుంచి కదిలారు బిత్రోచి క్షుద్ర సంస్థ సభ్యులు... * * *
ఉలిక్కిపడి కళ్ళు తెరిచారు సూరజ్, సూర్యనారాయణ. నచికేత, విలియమ్స్, ప్రభు తమవైపు ఆందోళనగా చూస్తూ కనిపించారు.
"వాట్ హేపెండ్?" అడిగాడు నచికేత వాళ్లిద్దర్నీ...
"రామయ్య...రామయ్య..." ఏదో జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేస్తూ అన్నారు.
"రామయ్య...లాంగ్ కోట్..." సూర్యనారాయణ గొణిగాడు.
"తల గిర్రున తిరిగింది. నాలిక కిటికీ దగ్గరికి వచ్చింది." కలవరిస్తున్నట్టు అన్నాడు సూరజ్.
నచికేత ఆశ్చర్యంగా వాళ్లిద్దరివైపు చూస్తుండిపోయాడు.
"ఏదైనా పీడకల వచ్చిందా?" విలియమ్స్ అడిగాడు.
"పీడకల కాదు...పీడకల లాంటి...నిజమైన సంఘటన..." సూర్యనారాయణ చెప్పాడు.
"పీడకల లాంటి...పీడకల లాంటి సంఘటన ఏంటి?" ప్రభు అనుమానంగా అడిగాడు.
సూరజ్ రాత్రి జరిగింది గుర్తు చేసుకోసాగాడు.
"రాత్రి మీరంతా ఏమయ్యారు..." సూర్యనారాయణ అడిగాడు అనుమానంగా చూస్తూ...
"రాత్రి బాగా నిద్రపట్టింది. నిద్ర మాత్రలు వేసుకున్నంత నిద్ర" అన్నాడు విలియమ్స్...
"అవునవును...తెల్లవారేదాకా మెలుకువ రాలేదు..." ప్రభు అన్నాడు.
"నేను లేచే సరికి నువ్వూ...సూరజ్ భయంతో వణికిపోతూ కనిపించారు" చెప్పాడు నచికేత సూర్యనారాయణతో.
సూరజ్- సూర్యనారాయణలు మొహమొహాలు చూసుకున్నారు.
సూరజ్ రాత్రి తాము చూసిన సంఘటన చెప్పాడు.
"మీరు నమ్మినా, నమ్మకపోయినా ఇది నిజం. రామయ్య లాంగ్ కోట్ వేసుకొని వెళ్తున్నాడు. మమ్మల్ని చూసి, తలని శరీరాన్ని కదల్చకుండానే వెనక్కి తిప్పాడు. నాలిక కిటికీ వరకూ సాగింది. అది చూసి భయంతో అరిచాం...మిమ్మల్ని పిలిచాం కూడా..." సూర్యనారాయణ అన్నాడు.
"ఇన్నాళ్ళు మీరు చెప్పిన వాటిని మేము తీసి పారేసాం...రాత్రి అనుభవమయింది. నాకు భయంగా వుందిరా నచీ..." సూరజ్ అన్నాడు.
నచికేత ఒక్క క్షణం మౌనంగా ఉన్నాడు. అతనికీ ఈ మధ్య రామయ్య మీద అనుమానంగా వుంది.
ప్రభు, విలియమ్స్ లకు కూడా రామయ్య ద్వారా అనుభవాలు ఎదురయ్యాయి.
"ఫ్రెండ్స్...నిజమే...రామయ్యను మనం ఓ కంట కనిపెట్టాలి..." నచికేత అన్నాడు.
"కనిపెట్టడం కాదు, ఇక్కడ్నుంచి రామయ్యను పంపించేయడమే బెటర్..." ప్రభు చెప్పాడు.
"అర్దరాత్రి హాస్పిటల్ కు వెళ్తున్నప్పుడు నాకు డౌట్ వచ్చింది..." విలియమ్స్ అన్నాడు.
"సరే రామయ్య రానీ...తెల్సుకోవచ్చు..." నచికేత అన్నాడు.
కానీ వాళ్లకు రామయ్య ఇక రాడని తెలియదు. * * *
అర్దరాత్రి పన్నెండయ్యింది.
రోజంతా రామయ్య కోసం ఎదురుచూస్తూనే గడిపారు.
"రామయ్య ఇంకా రాలేదేమిటి?" అనుమానంగా అన్నాడు ప్రభు.
"నాకూ అదే అనుమానంగా వుంది..." నచికేత అన్నాడు.
అందరూ ఈ విషయం మీద డిస్కస్ చేసుకోసాగేరు.
సరిగ్గా అదే సమయంలో ఎవరో డోర్ బెల్ ప్రెస్ చేసారు.
"ఇంత అర్దరాత్రి వేళ వచ్చేదేవరు? రామయ్య కాదు కదా..." అనుకుంటూ నచికేత వెళ్లి తలుపు తీశాడు. ఎదురుగా ఓ వ్యక్తి...అపరిచిత వ్యక్తి.
"హలో...అయామ్ రాబర్ట్...రాబర్ట్ ఫ్రమ్ సింగపూర్...అక్కడ పోలీసాఫీసర్ ని" చెప్పాడు రాబర్ట్ తనని తాను పరిచయం చేసుకుంటూ...
నచికేత ఆశ్చర్యంగా చూస్తూ పక్కకు జరిగి అతనికి దారి ఇచ్చాడు.
రాబర్ట్ అక్కడ ఉన్న నచికేత ఫ్రెండ్స్ వైపు చూశాడు.
నచికేత తన ఫ్రెండ్స్ ని పరిచయం చేసాడు.
* * *
"వెల్...ఇదీ జరిగింది. నేను సింగపూర్ నుంచి ప్రత్యేకంగా రావడానికి కారణం పీటర్సన్. ఇండియా వచ్చాక, నేను పీటర్సన్ ని ఛేజ్ చేస్తూ వచ్చాను. అతను పత్రికలో ప్రకటన ఇవ్వడం చూసాను. ఆ ఇంటర్ వ్యూకు చాలామంది అటెండ్ అయ్యారు. ఆఫ్ కోర్స్ వాళ్లలో మీరూ వున్నారనుకోండి. మిమ్మల్ని ఇంటర్ వ్యూ చేసిన పీటర్సన్ తన వేషం, పేరు మార్చుకున్నాడు.
మీ మధ్య జరిగిన సంభాషణను కూడా టేప్ చేసాను. అయితే అతను ప్రత్యేకంగా మిమ్మల్ని చిత్రావతికి ఎందుకు పంపిస్తున్నాడో, భిత్రోచి గెస్ట్ హౌస్ కు పంపించడం వెనుక మర్మమేమిటో తెలియదు. అది తెలియాలంటే మీరు బిత్రోచి గెస్ట్ హౌస్ కు వెళ్లక తప్పదు. అయితే ఈ ప్రయత్నంలో మీకు కొన్ని ప్రమాదాలు ఎదురైనా అవ్వొచ్చు..." చెప్పాడు రాబర్ట్.
అప్పటివరకూ రాబర్ట్ చెప్పిందంతా విని, స్థాణువులయ్యారు...
"ఆఫీసర్...ఇప్పటి వరకూ ఓ థ్రిల్ ను సొంతం చేసుకోవడం కోసమే, మేము చిత్రావతి వెళ్లాలని అనుకున్నాం. దీని వెనుక పెద్ద బ్యాగ్రౌండ్ వుందని మీ మాటల్లో తెలిసింది. మా వల్ల మీకు ఉపయోగం వుందో, లేదో తెలియదు కానీ, మేము బిత్రోచి గెస్ట్ హౌస్ కు తప్పక వెళతాం...ఈ విషయంలో మీకు మరే సాయం కావాలన్నా మేము చేయడానికి సిద్దంగా వున్నాం" అన్నాడు నచికేత మనస్పూర్తిగా.
రాబర్ట్ పీటర్సన్ కు సంబంధించిన అన్ని విషయాలు చెప్పలేదు. ఎంత వరకూ చెప్పొచ్చో అంతవరకే చెప్పాడు.
పీటర్సన్ ఓ క్రిమినలని, అతను సింగపూర్ నుంచి తప్పించుకుని ఇక్కడికి వచ్చాడని మాత్రమే చెప్పాడు.
ఓ నేరస్థుడిని పట్టుకునే విషయంలో తనకు సహకరించమని చెప్పాడు.
వాళ్లకి పీటర్సన్ ఓ క్షుద్ర మాంత్రికుడని, అతని దగ్గర క్షుద్ర విద్యలు ఉన్నాయని చెబితే బెదిరిపోవచ్చు. అందుకే ఆ విషయాన్ని అప్పుడే చెప్పదల్చుకోలేదు.
అతను చెప్పని మరో విషయం...తరళ...ఆమెకు సంబధించిన విషయాలూ చెప్పలేదు.
సింగపూర్ నుంచి ఇండియా వచ్చిన రాబర్ట్ పీటర్సన్ ని వెన్నంటే ఉన్నాడు.
ఇప్పుడతని ధ్యేయం...పీటర్సన్ ని నిర్వీర్యుడ్ని చేసి బిత్రోచిని అతను నిద్రలేపకుండా చూడ్డమే. అతని క్షుద్ర శక్తులను సమూలంగా నాశనం చేయాలి.
సరిగ్గా అప్పుడే రాబర్ట్ సిక్స్ త్ సెన్స్ ఏదో ప్రమాదాన్ని వూహించింది. ఆ ప్రమాదం, స్టోర్ రూమ్ నుంచి అని అర్ధమైంది...అర్ధమైన మరుక్షణమే రివ్వున లేచాడు. 15
"ఇక్కడెవరైనా అర్ధరాత్రుళ్ళు పూజలు చేస్తారా?" ఉన్నట్టుండి అడిగాడు రాబర్ట్.
"లేదు...ఎందుకలా అడిగారు?" ఆశ్చర్యంగా అడిగాడు నచికేత.
"వన్ సెకన్..." అంటూ రాబర్ట్ కళ్ళు మూసుకున్నాడు. అతని అడుగులు స్టోర్ రూమ్ వైపు పడుతున్నాయి.
మిగతా ఐదుగురు రాబర్ట్ ని అనుసరించారు. స్టోర్ రూమ్ దగ్గరికి వచ్చి ఆగాడు రాబర్ట్.
లోపల్నుంచి ఏదో మూలుగులు.
"లోపల ఎవరో ఉన్నట్టున్నారు?" అంటూ నచికేత ఆ గది తలుపు దగ్గరికి వెళ్ళబోయాడు.
"స్టాప్...స్టాప్ దేర్...ఆ తలుపు మీద చేయి వేయవద్దు..." చెప్పాడు రాబర్ట్ ఆందోళనగా... |
25,015 |
మంత్రం
----కె. రవీంద్రప్రసాద్
"నమస్కారమండీ!" వినయంగా అన్నాడా యువకుడు చేతులెత్తి.
'నమస్కారం! రండి. కూర్చోండి. ఇంతకీ మీపేరేమన్నారూ!' అంటూ ఆ యువకుడ్ని లోపలకు ఆహ్వానించి, కుర్చీచూపెట్టి కూర్చోమన్నారాయన పేరు - ఎడిటర్ రంగారావు గారు.
ఆయువకుడు కూర్చుంటూ 'నాపేరు ప్రేమ - శేఖర మండీ. నేను రచయితనండీ. నేను కథ, నవల, నాటకం, చిన్నకధ, మినీకధ, కవితలు వ్రాస్తుంటానండి. అప్పుడప్పుడు బొమ్మలుగూడా వేస్తుంటానండి. నన్ను అంతా ప్రేమ - శేఖర్ కధ, నవల, నాటక రచయితగా ఎరుగుదురండీ.... 'అన్నాడు.
'మంచిది. మీ అన్ని ప్రక్రియ రచనలూ అన్ని పత్రికల్లో ప్రచురిత మయ్యాయా!'అని అడిగారు రంగారావుగారు.
'కాలేదండి. అందుకేనండి మీదర్శనభాగ్యం చేసుకొంటున్నది. నేరుగా ఇంటికే వద్దామనుకొన్నానండి. తీరా మీరు ఆఫీసులో ఉంటారని ఇక్కడకే వచ్చానండి....'
'మంచిపని చేశారు. ఇప్పుడు నేనేంచేయాలి మీకు?'అడిగారు రంగారావుగారు.
'అదేనండి. మీదయ మా మీద ఉండాలండి. నా అన్నిప్రక్రియలూ మీరు మీ పత్రికద్వారా ఆంధ్రప్రజానీకానికి అందజేయాలండీ.....'
'తప్పకుండా అందజేస్తాం, మీ రచనలు అన్నీ మా ఆపీసులో ఇచ్చి వెళ్లండి. ....'
'ఎవరికి ఇవ్వమంటారండి....'
"అక్కడ అసిస్టెంట్లు వుంటారు. ఏ విబాగానికి ఆ విభాగం వారుంటారు. మీ రకరకాల ప్రక్రియలన్నీ ఆయా విభాగాలకు ఇచ్చి వెళ్లండి....."
"అలా వెళ్తే ఎలాగండీ..... అవన్నీ చిత్తుబుట్టలకు ఎర వేస్తారండి వారు......'అని వాపోయాడు ప్రేమ - శేఖర్.
"అలా బుట్టదాఖలు కాకుండా వుండాలంటే స్టాంపు లుంచిన కవర్లుయిచ్చి మీ అడ్రసు వాటిపై వ్రాసి వెళ్లండి. ప్రింటుకాకపోతే నేరుగా మీకే చేరతాయి...." అన్నారు.
రంగారావుగారు ఆ వారం శ్రీమతి ఆలోచనాదేవి గారి సీరియల్ ఎక్కడ సశేషం వుంచాలా అని ఆలోచిస్తూ.
ప్రేమశేఖర్ నిరుత్సాహంతో లేచి, ఆయా విభాగాలకేసి నడిచాడు.
* * * * *
'అన్నీ తిరిగివచ్చాయి! ఇలా ఐతే ఎప్పటికి మహా రచయితను కాగలను?' అని ఆలోచించుకొంటున్నాడు ప్రేమశేఖర్.
'ఏమిటండీ! అంతగా ఆలోచిస్తున్నారు. మీర చనలన్నీ తిరిగి వచ్చాయనేనా?' అని ప్రశ్నించింది అతని బార్య ప్రేమ.
"మరే.... చూడు నీపేరు ముందుంచుకొని రచనలు పంపినాగూడా తిరిగివస్తున్నాయి ఈ ఆంధ్రదేశానికి ఏదో కీడు రాసిపెట్టినట్లున్నది. లేకపోతే నారచనలు ప్రింటుచేయక త్రిప్పిపంపుతారా?" అని మండిపడ్డాడు ఆవిడ మీద.
దానికి ప్రేమ నిరసనగా 'నా పేరు ముందుంచుకొని మీరే రచనలు చేస్తున్నారని చెప్పుకుంటే మీ రచనలు ఎలా ప్రింటు అవుతాయి...? నా బార్య రనచచేసింది, తనపేరు చివర భర్తగా నన్ను తగిలించుకొంది అని మీరు ఎడిటర్లకు చెప్తే, తప్పక అన్ని కథలు ప్రింటు అవుతాయి....' అంది.
'ఇది అందరూ చేసేపనే. పెళ్లాలపేర కధలు వ్రాసి, ప్రింటుచేయించి, పెళ్లాలే వ్రాశారని వాళ్లపేర్లు, వాళ్ల బొమ్మలు ప్రింటు చేయించుకోవటం, వాళ్లకు సమ్మానాలైతే వీళ్ళు మురిసిపోవటం...' అన్నాడు శేఖర్ ఉద్వేగంగా.
'అంటే మీఉద్దేశ్యం.....'
'నా ఉద్దేశ్యమా - నా పేరు శేఖర్. నీ ప్రేమ. మీవు నా జీవిత భాగస్వామివి అయ్యావు కాబట్టి - నిన్ను నా పేరులో ముందుంచాను. అసలు వెనకే వుంచుదును. వుంటే బావులేదని అదోకధ పేరు అవుతుందని తెలిసి ముందుంచాను. ఇక , రచనలు చేసేది నేను. నీవు రచనలు చేయవు, చేయలేవు. నీకు అస్సలు 'ఆ' అంటే 'నా' రాదు . నీవు రచనలు చేశావని ఆంధ్రులను ఎలా నమ్మించను.....?' అని గట్టిగా అన్నాడు.
"అందుకే కదా - అక్షరంముక్క రాకపోయినా, ఖరీదైన చీరలతో, స్లీవ్ లెస్ జాకెట్లతో , నాగరికతనంతా నేను నేర్చుకొంటున్నాను. నన్ను చూసిన వారెవరైనా చదువు లేని దద్దమ్మననుకొంటారా?" అంది ఇంకొంచెంగట్టిగా ప్రేమ.
"అనుకోరు. అదే ఆంధ్రుల గొప్పతనం. కాషాయి గుడ్డలు ధరిస్తే సాధువని నమ్మి దణ్ణాలు పెట్టె ఈ దేశంలో నీ లాంటివాళ్లు బ్రహ్మాండంగా చలామణీ అవుతారు.... "అని అరిచాడు ప్రేమ -శేఖర్.
"మీరు ఎక్కువగా మాట్లాడకండి. ఈనాడు పత్రికల్లో మేం వ్రాయబట్టికదా వాళ్లు పుస్తకాలు అమ్ముకొని సొమ్ము చేసుకొంటున్నారు. మేమే లేకపోతే.... పత్రికాఫీసు లన్నీ మూతపడేవి...." అంది ప్రేమ.
"నిజమే. ఆడమొగరచయితల రచనలవల్లె - నేటి పత్రికలన్నీ మూసపోసినట్లుగా తయారయినాయి...." అన్నాడు ఇంకాస్త అక్కసుగా శేఖర్.
"ఇంతకీ ఏమిటి మీరనేది?" ప్రశ్నవేసి కోపంగా చూసింది ప్రేమ.
"ఏమిటా? నీలాంటి వాళ్లను కట్టుకొన్న మహావీరులు ఆడే నాటకం ఆగిపోయేదాకా - నాలాంటి విజ్ఞానులు రచనలు ప్రింటుకావు. ....'
'అంటే.....'
"అంటే ఏముందే పిచ్చి మొఖమా! పెళ్లాలపేర కథలు వ్రాసి, వాళ్లబొమ్మలు ప్రింటుచేయించీ, వాళ్లకు సమ్మానాలు చేయించే మహామహులున్నంత కాలం దేశం - అదే మనదేశం బాగుపడదు. వాళ్లున్నంతకాలం నీలాంటిపప్పుసుద్దలంతా విజ్ఞానరాసులుగా, విజ్ఞానఖనులుగా వెల్గుతున్నంతకాలం - నాలాంటి పిచ్చిసన్నాసులు పైకిరాలేరు." ఖండితంగా చెప్పేశాడు శేఖర్.
'ఏం - మీరూ అలా చెయొచ్చుగా.' అని చురక వేసింది ప్రేమ.
'ఏం ... ఎందుకు పంపాలి! రచన నది. పేరు నీకూనా? శ్రమనాదీ.... సమ్మానాలు నీకూనా? ఇదే ఈ దేశంలో జరుగుతున్న ఘోర అన్యాయం....'
"అంటే మీ వుద్దేశ్యం - మాలో నిజంగా వ్రాసే రచయిత్రులు లేరంటారా?"
'అమ్మోమ్మో! లేరంటానా? వున్నారు... .వున్నారు.ఎందుకులేరూ.... ఏపత్రిక తీసినా వారు మనకు కన్పడుతూనే వున్నారు - వారూ వారికధలూ - నవల్లూ- పాతసినిమా కాఫీల్లా."
"ఛీ... ఛీ... మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. నేను ఈ విషయాన్ని మా మహిళా మండలిలో వుంచి మీచేత క్షమాపణలు చెప్పించాల్సి వస్తుంది...." అంది వచ్చేకన్నీళ్లు నాపుకొంటూ ప్రేమ.
"నీకా ప్రెసిడెంటు షిప్పు ఎట్లావచ్చిందీ? నీ తెలివి తేటలు చూశనుకొంటున్నావా? కాదు... నీవిచ్చిన విరాళాన్ని చూసి. నేను ఇంకాస్త ఎక్కువ విరాళమిస్తే - మీ మహిళా మండలికి ఈమగాడ్ని ఎడ్వయిజర్ గా వేస్తారు తెలుసా?"అని అవహేళన చేశాడు శేఖర్.
'అయితే నేను వాకౌట్ చేస్తాను...' అంది లేస్తూ ప్రేమ.
'అవును మంత్రుల నుండి పామరలవరకూ మనకు తెల్సింది అదొక్కటే.... శుభం.... వెళ్లిరా... 'అన్నాడు చిరాకుగా శేఖర్. |
25,016 | ఈ ప్రపంచంలో గాలి ఊపిరి ఆగేటంత వరకూ, చిరస్థాయిగా మనిద్దరం బతుకుతాం.
బతుకును, ప్రేమను వాస్తవాలతో బేరీజు వెయ్యని లోకంలోకి మనిద్దరం వెళ్లిపోతున్నాం__"
ఆ మాట అంటున్నప్పుడు అప్రయత్నంగా నారాయణరావు కళ్ళ వెంబడి నీళ్ళొచ్చాయి.
సరిగ్గా అదే సమయంలో-
కిందనుంచి విన్పించిన అరుపుకి ఇద్దరూ ఒక్కసారిగా చూసారు.
"నారాయణరావ్.....సంధ్యా......నేనూ వైస్ చాన్సలర్ భార్యను ప్రేమపట్ల మీ సిన్సియార్టీని తెలుపుకోవడానికి, మిమ్మల్ని శంకించాను తప్ప.....మిమ్మల్ని అవమానించలేదు. కిందకు దిగిపొండి. ప్లీజ్__"
అప్పుడు గమనించారు సంధ్య, నారాయణరావులు-
ఎప్పుడొచ్చారో, ఎక్కడనుంచి వచ్చారో, యూనివర్సిటీ స్టూడెంట్స్ తొ ఎల్.ఐ.సి. బిల్డింగ్ పరిసరాలన్నీ నిండిపోయాయి.
"బాసూ.....ఇదన్యాయం. సడన్ గా నువ్విలాంటి నిర్ణయం తీసుకుంటావని నాకు తెలీదు. ఎల్.ఐ.సి. బిల్డింగ్ లోకి మీరు వెళుతున్నారంటే, ఎవర్నో కలుసుకోడానికి వెళుతున్నారనుకున్నాను__ఆ పైకి వెళ్లి, మీరు ఆత్మహత్య చేసుకుంటారని ఊహిస్తే.....ఇక్కడేమిమ్మల్ని ఆపేసేవాడ్ని....."
మెయిన్ గేట్ దగ్గర, ఆటో ఎక్కి మరీ గొంతు చించుకుని అరుస్తున్నాడు హనుమాన్లు.
"సంధ్యా....మీ పెళ్ళి జరిపిస్తాం. కిందకు దిగండి.....ప్లీజ్.....సూసైడ్ చేసుకుని, మీరెవర్ని ఉద్దరిస్తారు....." ఆ అరుపు విన్పించిన వేపు చూసారిద్దరూ.
పోలీస్ స్టేషన్ పైకి ఎక్కి స్పీకర్లోంచి అరుస్తున్నారు మోతీలక్ష్మి, వాసుదేవ్.
ఆ వెంటనే పోలీస్ ఇన్ స్పెక్టర్ ఆ స్పీకర్ ని తన చేతిలోకి లాక్కుని-
"నారాయణరావ్.....సంధ్యా.....మీకొచ్చిన భయమేం లేదు. కిందకు దిగిపొండి. ణ ఆధ్వర్యంలో మీ పెళ్ళి జరిపిస్తాను.....ప్లీజ్.....ప్లీజ్....."
"సంధ్యా మా మాట విను-ఆత్మహత్య చేసుకోవద్దు__" కింద నుంచి జానకి, లీల, స్వయంప్రభ తదితర మిత్రురాళ్ళందరూ అరుస్తున్నారు.
కొంతమంది అప్పటికే ఎల్.ఐ.సి బిల్డింగ్ లోకి చొరబడ్డారు.
అప్పుడు నారాయణరావు పెదవి విప్పాడు.
"మైడియర్ ఫ్రెండ్స్___మేమొక నిర్ణయానికొచ్చేసాం. మమ్మల్ని మార్చడం ఏ ఒక్కరితరమూ కాదు. నేను సంధ్యను మనస్సూర్తిగా ప్రేమిస్తున్నాను-నన్ను సంధ్య మనస్ఫూర్తిగా ప్రేమిస్తోంది__మా ప్రేమను గుర్తించడం చాలు___ఎవరయినా మా ప్రయత్నానికి అడ్డు తగిలితే, మా ప్రేమను అనుమానించినట్టే లెక్క" అన్నాడు.
"మీరు మమ్మల్ని నిజంగా అభిమానించే వాళ్లయితే మా ప్రాణత్యాగాన్ని గౌరవించండి....." యెంతో ఉద్వేగంతో చెప్పింది సంధ్య.
ఆ మాటతో కింద గుమిగూడిన వేలాదిమందిలో ఒక్కసారిగా గగ్గోలు పుట్టింది.
క్షణాలు నిమిషాలుగా మారుతున్నాయి.
పోలీస్ స్టేషన్ లోంచి పోలీసులందరూ ఒక్కసారిగా బయటకు వచ్చారు.....వరుసగా, ఫైర్ యింజనులు నాలుగువేపుల నుంచీ వచ్చాయి.
కిందనుంచి జనం విజ్ఞప్తులు చేస్తూనే వున్నారు.
కొంతమంది కన్నీళ్ళతో వేడుకుంటూనే వున్నారు.
"సంధ్యా....ఏ జన్మలోనయినా మనం ఇలాగే వుండాలని__దేహాలు వేరయినా, మన ఆత్మలు కలుసుకోవాలని__ నిజమయిన ప్రేమకు గుర్తుగా, శాస్వతమయిన ప్రేమికులుగా మనం నిలిచి పోవాలని కోరుకుంటున్నాను."
ఆ మాట అంటూ-
ఏదో చప్పుడు వినిపిస్తే, తల తిప్పి చూసాడు నారాయణరావు.
"మిస్టర్ నారాయణరావ్__ మీ ప్రయత్నాన్ని ఆపండి__ప్లీజ్__మీ పెళ్లిని జరిపించడానికి అందరూ సుముఖంగా వున్నారు. నా మాట వినండి__" దూరంగా నుంచున్న ఇన్ స్పెక్టర్, ఆ వెనక వున్న కొంతమంది స్టూడెంట్స్ నెమ్మదిగా ముందుకు వస్తున్నారు.
"సంధ్యా!" వాళ్ళవేపు చూడకుండా సంధ్యను గాఢంగా పట్టుకున్నాడు.
సంధ్యకూడా నారాయణరావుని వాటేసుకుంది.
"ఎన్ని జన్మలకయినా మేం ప్రేమికులుగా నిలుస్తాం. ప్రేమ కోసం ఆత్మార్పణ చేస్తాం." గట్టిగా అరిచి, కుడి కాళ్ళను గాల్లోకి వేసారు ఇద్దరూ.
ఆ దృశ్యాన్ని కిందనుంచి చూస్తున్న జనం, భయంగా అరిచారు.
ఒక్కసారి నారాయణరావు, సంధ్యలు గాల్లోకి దూకారు.
అంతే.....
పదిహేను అంతస్తుల బిల్డింగు నుంచి వాళ్ళ రెండు దేహాలూ గాల్లో తేలిపోతున్నాయి.
కొంత దూరం వరకూ కల్సివున్న వాళ్ళదేహాలు, కాసేపయ్యాక విడిపోయాయి.....ఒకరి చేతుల్లోంచి యింకొకరి చేతులు విడిపోయాయి.
"సంధ్యా" నారాయణరావు గొంతులోంచి వచ్చిన కేక ప్రణవనాదంలా ఆ ప్రదేశంలో మార్మోగింది.
"నారాయణరావ్...." సంధ్య గొంతులోంచి వచ్చిన ఆ మాటలు గాల్లో సుడులు తిరుగుతున్నాయి.
* * * *
వారం రోజుల తర్వాత-
"కే.జి.హెచ్. హాస్పిటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో, బెడ్ మీద కళ్ళిప్పి చూసాడు నారాయణరావు.
కొంచెం దూరంలో తనవేపే చూస్తున్న సంధ్య కనిపించింది.
"ఏవిటిది?" అయోమయంగా అడిగాడతను. |
25,017 | వేద ముఖంలోకి తెల్లబోయి చూస్తూ కూర్చున్నాడు నీరద్. ఇక్కడికి రాకముందు అతడు వేదగురించీ వేద కుటుంబాన్ని గురించీ ఊహించుకుంది వేరు. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నది వేరు - ప్రతిమాటలోనూ ఏదో సంస్కారం ఉట్టిపడుతుంది. ఈ యువతిలో - ఈమె ముందు తనే కుంచించుకుపోతున్నాడు.
అంతవరకు వీళ్ళ సంభాషణ వింటూ అతి ప్రయత్నంమీద తనను తను నిగ్రహించుకుంటున్న గీత కోపంగా లేచింది.
"ఓహో! మీరు మా అక్కను తిట్టి బుద్ధిచెప్పటానికి వచ్చారన్నమాట! నన్ను చూసి అక్కనుకొని నేరుగా తిట్లు ప్రారంభించారన్నమాట! మీరెవరండీ, మా అక్కను తిట్టడానికి? మీకోపిక ఉంటే, మీ నాన్నను తిట్టుకోండి-ఎన్ని తిట్లు ఎలా తిట్టినా నాకు అభ్యంతరంలేదు. మీ నాన్నని-ఇంకా కావాలంటే, మిమ్మల్ని మీరు తిట్టుకోండి - అంతేకాని - అక్కను ఒక్కమాటన్నారంటే...."
ఉద్రేకంగా అంటున్న గీతను వారిస్తూ "గీతా! నువ్వు లోపలకి వెళ్ళు" అంది వేద.
"వెళ్ళనక్కా! ఏ తప్పూ చెయ్యని నిన్ను అడ్డమైన చవటలూ నోటికొచ్చినట్లు మాట్టాడుతూంటే విని సహించలేను. నా అక్కను ఎవరు ఏమీ అనటానికి వీల్లేదు."
గీత కళ్ళలో నీళ్ళు సుడులు తిరిగిపోతున్నాయి. మతిపోయినట్లు చూస్తున్నాడు నీరద్__
"గీతా! నువ్వు లోపలికి వెళ్ళు!" ఆజ్ఞాపిస్తున్నట్టుగా అంది వేద. కన్నీళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయింది గీత.
"నీరద్! నువ్వు ఇంటికి వెళ్ళు. మరొకసారి మీ నాన్నగారు లేనప్పుడు ఇక్కడికి రాకు. నన్ను మరింత చిక్కుల్లో పెట్టకు."
ఆ కంఠంలో పలికిన ఆజ్ఞాస్వరానికి, హుందాతనానికి, ఆశ్చర్యపోయాడు నీరద్.
ఇలాంటి వ్యక్తి__మరి?.... ....
సమాధానం దొరకని ప్రశ్న అతడకిది!
2
డైనింగ్ టేబిల్ దగ్గర కూచుని, ఆపిల్స్ కట్ చేసుకొని ఒక్కొక్క ముక్క తింటూ ప్రారంభించింది మీనాక్షి. "ఆ పాపిష్టిముండలకి చావైనా రాదు. ఇలా ఎంతమంది కొంపలు నాశనం చేస్తారో? నా ఉసురు ఆ దరిద్రపు ముఖాలకి కొట్టకపోతుందా?"
"ఈ రకమైన తల్లి మాటలు విని విని బాగా అలవాటైపోయింది నీరద్ కి. ఇదివరలో ఈ మాటలు విని తల్లికి జరిగిన అన్యాయానికి తెగ ఉద్రేక పడిపోయేవాడు. తల్లితోపాటు తనూ ఆ పాపిష్టి వాళ్ళను తిట్టిపోసేవాడు. కానీ, ఆనాడు మాత్రం అతనిలో ఎలాంటి ఉద్రేకము కలగలేదు. ఇరవైయేళ్ళు అప్పుడప్పుడే నిండుతోన్న నీరద్ కి లోకం వింతగా కనిపించసాగింది. అటు తల్లి కన్నీళ్ళు. ఇలా జాగ్రత్తగా తింటున్న ఆపిల్స్ ఈ రెంటికి సమన్వయమెలా అని కొత్తగా ఆలోచించసాగాడు. ఆ కన్నీరు అలవాటుగా వచ్చినవా, లేక ఆవేదనతో వచ్చినవా ఏమీ అర్ధంకాలేదు.
"అమ్మా! ఎంతసేపూ వాళ్ళనే తిడతావు కాని నాన్నని తిట్టవేం?" అని అడిగేశాడు.
ఆశించని ఈ ప్రశ్నకు తెల్లబోయింది మీనాక్షి.
"నాన్ననా? నాన్నని ఏం తిట్టమంటావురా?" కళ్ళు పెద్దవిచేసి చూస్తూ అడిగింది.
"మరి? వాళ్ళని తిట్టినట్టే తిట్టు, నాశనమయిపోవాలనీ, పాపాలకు ఫలితం అనుభవించాలనీ...."
"ఛీ! నోర్ముయ్!...." గట్టిగా అరిచింది మీనాక్షి.
అతినిర్లక్ష్యంగా నవ్వుతూ "ఏం! నాన్నచేసింది మాత్రం తప్పుకాదా? ఆయన చేసింది మాత్రం పాపం కాదా? ఆ మాటకొస్తే నాన్న పాపమే ఎక్కువ. డబ్బు, అధికారం ఎరగా చూసి, అమాయకుల జీవితాలు నాశనం చేస్తున్నాడు" అన్నాడు నీరద్.
కొడుకు అల్లరి మీనాక్షికి ఎప్పుడూ అలవాటేకాని. ఈనాడు అతని ధోరణి మరీ వింతగా, భరించరానిదిగా ఉంది ఆవిడకి.
"నీకు బుద్దుందా? నాన్నని నాశనమయిపో! అని తిట్టమంటావా? ఆయన నాశనమయితే, నాశనమయ్యేది ఎవరురా!"
"ఓహో! ఆయన నాశనమయితే మనమూ నాశనమవుతాము కనుక ఆయనని తిట్టవన్నమాట! ఆ అమ్మాయెవరో సర్వనాశనమయి పోయినా, మనకేం బాధలేదు గనుక ఆ అమ్మాయిని తిట్టిపోస్తావన్నమాట? లాభం లేదమ్మా! ఒకవేళ నీ తిట్ల ప్రభావానికి అమ్మాయి నాశనమయిపోయినా ఆయన క్షణాలలో మరో అమ్మాయిని సృష్టించుకోగలరు. అంచేత నిజంగా నీకు కన్నీళ్ళు రాకుండా వుండాలనుకొంటే నువ్వు కోరుకోవసింది ఆయన నాశనమయిపోవాలనే!"
"ఒరేయ్! నోరుముయ్యరా? ఛా! ఏం మాటలురా ఇవి? వినటానికే భయంగా ఉంది__"
టిఫిన్ ప్లేట్లో స్పూన్ పడేసి పకపక నవ్వసాగాడు నీరద్.
"అమ్మా! ఒక్కమాట చెప్పనా?"
"ఏమిటిరా అది?"
"నువ్వు టిఫిన్ మానేసి ఆపిల్స్ తిని డయట్ చేసినా, బ్యూటీక్లినిక్ కు వెళ్ళి ఎన్ని రకాల మేకప్ లు చేయించుకున్నా, 'మిరకిల్'కి వెళ్ళి ఎన్ని అత్యద్బుతమైన హెయిర్ స్టయిల్స్ చేయించుకున్నా, నువ్వు ఆయన మనసు మార్చలేవు. సుబ్బరంగా, పబ్లిగ్గా ఆయనకు డైవోర్స్ ఇచ్చేయ్ అప్పుడు ఆయన పరువు దెబ్బతింటుందికదా! అప్పుడు బుద్దొస్తుంది - లేకపోయినా ఈ కళ్ళనీళ్ళ బాధ నీకు తప్పుతుంది."
"నిన్నే దెయ్యం పట్టిందిరా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు?"
"నువ్వు అర్ధంపర్ధం లేకుండా ఏడుస్తోంటే, నేను కాస్త అర్ధమున్న మాటలు మాట్లాడుతున్నానమ్మా! ఆయన చేసే అన్యాయాలు సహించలేవు. ధైర్యంగా విడాకులివ్వలేవు - ఇక ఎటూగాని ఈ చేతకాని ఏడుపు లెందుకమ్మా? ఈ ఏడుపులు చూస్తే నాకు జాలి కలగటంలేదు__అసహ్యం వేస్తుంది.... ...."
"ఏమిటిరా. నీకు అసహ్యం వేసేది" అప్పుడే నిద్రలేచి వచ్చిన జయపాల్ సింహంలా గర్జించాడు. జయపాల్ ఏనాడూ ఒంటిగంటకి ముందు నిద్రపోడు. బయట ఎక్కడెక్కడ తిరిగినా రాత్రికి ఇంటికొస్తాడు. తన ఏ.సి. బెడ్ రూంలో తప్ప మరెక్కడా అతనికి నిద్రరాదు. అంచేత అతడు ఎనిమిది, తొమ్మిది గంటలకు ముందు ఏనాడు నిద్రలేవడు - రాత్రే అతనికి నీరద్ క్లబ్ లలో డాన్స్ చేస్తున్నట్లు తెలిసింది - అప్పటినుంచీ కొడుకుమీద మండిపడుతున్నాడు.
అప్రయత్నంగా గభాలున లేచి నిలబడ్డాడు నీరద్ - సాధారణంగా తండ్రిని తప్పుకు తిరుగుతాడు అతడు - తండ్రిదగ్గర అప్పటివరకు అతనికి ఎంతో భయముండేది.
"వాట్ నీరద్ బాబుగారూ! ఏమిటండీ మీరు అసహ్యించుకునేది?" వెటకారంగా అడిగాడు.
"చేతకాని ఏడుపులిని" నిర్భయంగా సమాధానం చెప్పాడు నీరద్ - ఈ ధోరణికి కొద్దిగా ఆశ్చర్యపోయాడు జయపాల్.
"చేతనయిన ఏడుపులేమిటి? చదువుకి పంగనామాలు పెట్టి క్లబ్ లో తైతక్కలాడటమా?"
"అది ఏడుపు కాదు__కళ!"
"నోర్ముయ్! రేపటినుంచీ నువ్వా క్లబ్బులకి వెళ్ళటానికి వీల్లేదు."
"నేను వెళ్ళితీరతాను."
నిర్ఘాంతపోయాడు జయపాల్. అంతకుమించి కొయ్యబొమ్మయి పోయింది మీనాక్షి.
ధైర్యంగా నిర్లక్ష్యంగా తండ్రి చూపులిని ఎదుర్కొన్నాడు నీరద్.
"ఎందుకురా, నీ జీవితం ఇలా నాశనం చేసుకుంటావు?" ప్రాధేయపడుతున్నట్లు అంది మీనాక్షి పరిస్థితికి భయపడుతూ-
"నేను ఏం నాశనం చేసుకుంటున్నానమ్మా! కాలేజీలో చదివి పుస్తకాలు రుబ్బి ఎలాగో ఒకలాగ డిగ్రీలు సంపాదిస్తేనే బాగుపడినట్లా! నాకు డాన్స్ లో అభిరుచి ఉంది. నేను డాన్స్ నేర్చుకున్నాను - డాన్స్ చేస్తున్నాను - డాన్సర్ గా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోగలను. రాణించగలను. మీ ఉద్దేశ్యంలో చదువుకోవటం మాత్రమే మంచి జీవితం అయితేకావచ్చు- అది నామీద రుద్దతారెందుకు?"
"నీరద్! బుద్ధిలేకుండా మాట్లాడకు-నువ్వు కాలేజీకి వెళ్ళు. చాలు! నేను డిగ్రీ తెప్పిస్తాను ఉద్యోగం చూపిస్తాను. రాజాలాగా బ్రతకవచ్చు."
నీరద్ పకపక నవ్వాడు - "ఇదా? రాజాలాగ బ్రతకటమంటే? కాలేజీలో చేరి చదవక్కరలేకుండా నేను ఉద్యోగం చూసుకున్నాను. నువ్వు చూపించిన ఉద్యోగంలోకంటే బాగానే సంపాదించగలను-"
"నీరద్! నువ్వు ఆ డాన్సులు మానవా?" చాలా తీక్షణంగా అడిగాడు జయపాల్.
"మానను!" శాంతంగా నవ్వుతూ చెప్పాడు నీరద్.
"నామాట వినకపోతే నిన్ను ...."
"ఇంట్లోంచి గెంటేస్తావా? హాయిగా పోతాను." నవ్వేసి మేడమెట్లు ఎక్కుతూ నాలుగు మెట్లెక్కి ఆగి కిందకు చూసి "జాగ్రత్తగా ఆలోచించుకో! జయపాల్ కొడుకుని ఇంట్లోంచి గెంటేశాడు- అని రేపు అందరూ వింతగా చెప్పుకుంటారు. అదొక పెద్ద న్యూస్ అవుతుంది." అని మరో నాలుగు మెట్లెక్కి మళ్ళీ క్రిందకు చూసి "మా తండ్రి నన్ను ఇంట్లోంచి గెంటేశాడు అని నలుగురికి చెప్పుకుంటే, నాకింకో నాలుగు క్లబ్బులు ఛాన్స్ ఇస్తాయి. ఆ రకంగా నాకు ఉపకారంచేసిన వాడవవుతావు" అని మళ్ళీ ఇంకో పది మెట్లెక్కి మళ్ళీ క్రిందకు చూసి "నీ శత్రువులు ఈ వార్తను బాగా ప్రచారం చేసి నీమీద దెబ్బతీయాలని చూస్తారు. పాపం!" అనేసి పైకి వెళ్ళిపోయాడు. |
25,018 |
"ఇది బార్ కావడంచేత నీకలా అనిపిస్తోంది. అది నోవాకోలా!" అని చెప్పాడు.
మరోసారి సిప్ చేసింది భారతి. అదిప్పుడు కాస్త రుచిగానే అనిపించింది.
నోవాకోలాలో 'రం' కలిపి తెప్పించాడని భారతికి తెలీదు.
ఆమెచేత తాగించాలన్నదే అతని ఉద్దేశ్యం. గ్లాసులోని ద్రవమంతా పూర్తిచేసింది భారతి.
బోసు తన మేథస్సుకి తనే పొంగిపోయాడు.
"డూ యు వాంట్ వన్ మోర్!" అడిగాడు.
"ఊ....." అంది. తనకేమిటో అయిపోతున్నట్టుగా వుంది. కడుపులోంచి సన్నని మంట వేస్తున్నట్టుగా, ఒళ్ళు తూలుతున్నట్టుగా.
"నేను తీసుకొంది నోవాకోలా, అంతేగా, అంతే!" అంటూ పకపకా నవ్వింది భారతి.
స్టివర్డ్ తెచ్చిన గ్లాసుని ఎత్తి గడగడా తాగేసింది భారతి.
బోసు నవ్వుకున్నాడు.
మందుకున్న శక్తి అదే!
అది రుచి చూడక ముందు అసహ్యం. ఒకే ఒక చుక్క నాలికపైన పడితే ఇక వెనక ముందు ఆలోచించడు మనిషి.
ఇంతకాలం తనను పిచ్చికుక్కలా చేసి ఆడించిన భారతి ఈనాడు తన చేతికి చిక్కింది.
ఈరోజు కరువుతీరా ఆమెను అనుభవించాలి. అదే అభిప్రాయంతో ప్రిపేర్ అవుతున్నాడు బోసుబాబు.
చేతి వాచిలోకి చూశాడు బోసుబాబు.
ఏడు దాటింది. అంటే చీకటి పడింది. బిల్లు చెల్లించి భారతికి ఆసరాగా చేతిని అందించాడు భారతి తూలిపోతూ లేచి నుంచుంది.
మనోహర్ పిచ్చిగా చూశాడు.
అతనికి పూర్తిగా అర్థం అయింది. తనని ఏడిపించడానికే భారతి అతనితో కలిసి ఇలా చేసింది. కానీ ఆ రాస్కెల్ మోసం చేసి ఏదో తాగించాడు.
అతను అచేతనంగా కూర్చుండిపోయాడు. అడ్డుపడటానికి ఆస్కారం లేదక్కడ. భారతి అతను కలిసి రావడం అందరూ చూశారు. సిగరెట్ తీసి వెలిగించాడు. వాళ్ళకేసి చూస్తూ కూర్చుండిపోయాడు.
భారతి నడుంచుట్టూ చేతిని వేసి బయటికి నడిపించుకొని వెళ్ళిపోయాడు బోసు.
ఆటోలో ఆమె అతని ఒడిలోకి వాలిపోయింది.
తన ఇంటిముందు ఆటో ఆగగానే ముందు బోసు దిగి ఆటోవాడికి డబ్బులిచ్చేశాడు.
ఓసారి అటూ ఇటూ చూసి భారతిని మెల్లగా దింపాడు. కొద్ది దూరంలో ఎవరో నడిచి వస్తున్నారు.
ఆమె ఓ చేతిని తన మెడమీద వేసుకొని, తన చేతిని ఆమె నడుంచుట్టూ వేసి గేటుకేసి నడిచాడు.
మరికొన్ని నిమిషాల్లో భారతి పూర్తిగా తనసొంతం అయిపోతుంది.
ఇన్నాళ్ళ తన కోరిక ఈనాడు నెరవేరబోతోంది.
మత్తెక్కిన వెర్రి ఆనందంతో గేటుమీద చెయ్యివేశాడు బోసుబాబు.
భారతి స్పృహలోలేదు. అచేతనంగా అతను నడిపిస్తుంటే నడుస్తోంది.
కాని బోసుబాబు అనుకున్నట్టుగా జరగలేదు. అతను ఊహించని రీతిలో మెరుపుకన్నా వేగంగా మనోహర్ ఫియట్ కారు సర్రుమని పెద్దగా చప్పుడు చేస్తూ గేటు దగ్గర ఆగింది.
కారు ఆగడం, డోర్ తీసుకొని మనోహర్ కారులోంచి కిందికి గెంతడం క్షణంలో వెయ్యోవంతు కాలంలో జరిగిపోయింది.
బోసుబాబు తేరుకొని చూసేలోగా మనోహర్ పిడికిలి బిగించి బోసు గెడ్డంపైన కొట్టాడు.
ఆ దెబ్బ సామాన్యమైంది కాదు ఉక్కు పిడికిలితో కొట్టినట్టుకాగా బోసుకి కళ్ళు బైర్లు కమ్మాయి. భారతిని కిందికి వదిలేశాడు.
అదే సమయంలో అక్కడికి సారధి వచ్చాడు. భారతిని గుర్తించాడు సారధి. మనోహర్ కొట్టడంతో భారతిని అతడు వదిలేయడం సారధి చూశాడు.
తూలి కింద పడబోయి నిలదొక్కుకొని మనోహర్ కేసి కసిగా చూసి ఓ అడుగు ముందుకు వేశాడు.
మనోహర్ ఎడం చేత్తో అతని పీకని పట్టుకొని కుడిచేత్తో ముక్కు విరిగిపోయేలా ఫట్ మని కొట్టాడు.
"అమ్మా" అంటూ నేలపైన కూలిపోయాడు బోసుబాబు.
అతని ముక్కు వెంట, నోటివెంట రక్తం కారుతోంది.
కింద పడ్డ అతన్ని కాలితో తొక్కిపట్టి చెప్పాడు మనోహర్.
"రోగ్. మరోసారి పిచ్చివేషాలేస్తే ఈసారి యమలోకానికి పంపిస్తాను. కబడ్దార్" బోసు కిక్కురుమనలేదు.
అప్పటికే భారతిని లేవదీసి పొదివి పట్టుకున్నాడు సారధి.
"థాంక్యూ సో మచ్. నేను అంతా చూశాను. మా భారతిని కాపాడినందుకు మీకు నా కృతజ్ఞతలు ఎలా తెలుపుకోవాలో అర్థం కావడం లేదు" అన్నాడు సారధి.
అతనెవరో తెలీక మనోహర్.....
"మీరూ?" అని అడిగాడు.
"నేను భారతి బావని. నా పేరు సారధి. సాధారణంగా భారతి టైంకి ఇంటికొచ్చేస్తుంది. ఇంత ఆలస్యం ఎందుకయిందోనని ఎదురుచూస్తూ నేను......"
"ఐసీ" అన్నాడు మనోహర్.
"నా పేరు మనోహర్" అంటూ బోసు భారతిని ఎలా ట్రాప్ చేయడానికి ప్రయత్నించిందీ వివరంగా చెప్పాడు.
"థాంక్యూ..... థాంక్యూ" అన్నాడు సారధి.
"మీరిలా ఆమెని రోడ్డుమీద తీసికెళితే బాగుండదు, రండి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను" అన్నాడు కారు డోర్ తీసి.
సారధి ఇంకేమీ ఆలోచించలేదు. అతను చెప్పింది నిజమే.
రోడ్డుమీద ఎవరూ లేకపోబట్టి సరిపోయింది. లేకపోతే భారతిక రోడ్డుమీద తలెత్తుకొని తిరగ్గలిగేది కాదు.
అత్తయ్య ఇంటి దగ్గర లేదు. అది కూడా మేలే అయింది.
భారతిని కారులో కూర్చోబెట్టి అతనూ ఎక్కాడు. భారతి మూలుగుతోంది. సారథి భుజంపైన తల వాల్చింది.
సారధి ఆపమన్నచోట కారు ఆపాడు. సారథి విండోలోంచి తల బయటపెట్టి బయటకి చూశాడు.
రోడ్డుమీద ఎవరూలేరు. చుట్టుపక్కల ఇళ్ళల్లో దీపాలు వెలుగుతున్నాయి.
సారథి మెల్లగా భారతిని దించి, "ప్లీజ్, కమాన్" అన్నాడు సారథి మనోహర్ని. |
25,019 |
"అబ్బాయ్ గారు అర్థరాత్రిలేచి మేడమీద గదిలోకి వెళ్ళిపోయేరండి" "అట్లాగా" అంటూ నిట్టూర్చి లోపలికొచ్చేసేడు వామనరావు. ఆ దిండూ దుప్పటిమీదే మేను వాల్చేడు.
50
ఉదయం! జగన్నాధమింట్లో సుభద్ర ముందు జయ కళ్ళొత్తుకుంటో చెబుతుంది. "విడాకులిస్తారుట. లేకపోతే సన్యాసం స్వీకరిస్తారుట! ఇవన్నీ చెప్పుకునేందుకు ఆ ఇంట్లో ఆడదిక్కే లేదుగత్తయ్యా!" ఆ మాటకి సుభద్ర ఆందోళన పడింది. సముదాయించే ధోరణిలో అన్నది. ఊరుకోమ్మా! ఊరుకో! ఆడవాళ్లు ఏంచేసినా చాదస్తమనుకుంటారే గాని, అది వాళ్ళ మంచికోసమేనని ఈ మగాళ్ళు ఎప్పుడూ అనుకోరమ్మా! ఆడవాళ్ళమైనందుకు మనమే నేర్పుతో ఓర్పుతో వ్యవహరించాలి!" జయ కన్నీరు తుడుచుకుని అన్నది. "నువ్వంటే మా వారికి ఎనలేని గౌరవం. నీ మాట వేదవాక్కు. కన్నతల్లికంటే ఎక్కువగా చూసుకుంటారు. కొన్నాళ్ళపాటు నువ్వు ఆ యింటికివస్తే మా సమస్యలు పరిష్కారమవుతాయి అత్తయ్యా! రాకూడదూ?" "జయా!" అన్నదామె ఆందోళనగా! "ఏం తప్పా? అదేమైనా పరాయి ఇల్లా! నాకు అమ్మవైనా, అత్తవైనా నువ్వేకదా! మా అమ్మేవుంటే అక్కడికి రాదూ! అట్లాగే నువ్వు కూడా రావచ్చు గదా!" సుభద్ర 'జయా' అంటూ ఆమెను కౌగిలించుకుని బరువుగా, భారంగా సమాధానం చెప్పింది. "రాలేనమ్మా! నేనక్కడికి రాకూడదు! ఆ పథకం కూడా ఫలించనందుకు-జయ కళ్ళతో ఫెయిలైనట్టు కిటికీకి సైగచేసింది. ఆ కిటికీ అవతల శేషు నిలబడి వున్నాడు. ఆ శేషు నిట్టూర్చేడు.
51
వామనరావు ఇల్లు. రాత్రి పదిగంటలైంది. జయ పాలుతెచ్చి వామనరావుకిచ్చింది. ఆ తర్వాత కొంగుతో కళ్ళద్దుకుంటో అక్కడ్నించి కదుల్తుండగా వామనరావు అడిగేడు. "అబ్బాయింకా రాలేదుగదమ్మా?" జయ సమాధానం చెప్పకుండానే వెళ్ళిపోయింది. వామనరావు నిట్టూర్చేడు. అంతలో 'నమస్కారం సార్!' అనే మాట వినిపించింది. ఉలికిపడి చూసేడు వామనరావు. వచ్చినవాడు సింహాచలం. చాలా గంభీరంగా అన్నాడు. "క్షమించాలి సార్! రాకూడదనుకుంటానే వచ్చేను." చాలా ఆత్రంగా అన్నాడు వామనరావు. "సమయానికి వచ్చేవ్ సింహాచలం! అయ్ టెల్యూ-ఇప్పుడు నీ సలహా కావాల్నాకు! ఇప్పుడేకాదు. ఎప్పుడూ కావాలి. రెట్టింపు జీతమిస్తాను. నా ఇంట్లోనే నాతో పాటే వుండు" సింహాచలం వినయంగా అన్నాడు. "థాంక్యూ సార్! ఉద్యోగం కోసం రాలేదు. ఇప్పుడుద్యోగంలో లేకపోయినా, మీ ఉప్పు తిన్నందుకు మీకో మాట చెప్పడానికి వచ్చేను. అబ్బాయ్ గారు గోల్కొండ కొండెక్కి తాగుతున్నారు సార్!" అంతమాట విన్నందుకు తట్టుకోలేక 'సింహాచలం' అని గట్టిగా కేక పెట్టేడు వామనరావు. సింహాచలం వీసమెత్తు చలించకుండా అన్నాడు. "నలుగురూ చూస్తే నవ్వులాటసార్! వెళ్ళి తెచ్చుకోండి!" అంటూ చకచకా వెళ్ళిపోయేడు సింహాచలం. జయ అక్కడికి వచ్చి వెళ్ళిపోతున్న సింహాచలాన్నీ, బొమ్మలా నిలబడ్డ మావగార్నీ చూసి ఆందోళనగా అడిగింది. "ఏం జరిగిందండీ" వామనరావు ఒక్కో అడుగువేస్తూ ఒక్కో మాట అంటున్నాడు- వాడు చెడిపోయేడు జయా! పూర్తిగా చెడిపోయేడు" వామనరావుని వెంబడిస్తోంది జయ.
52
గోల్కొండ కొండ...రాత్రి. శేషు మందుకొడుతూ పాడుతున్నాడు. వామనరావు కార్లో వస్తున్నాడు. అతన్తోపాటు జయకూడా వుంది. ఒక చరణం వుందనగానే కారు కొంద దగ్గిరకి చేరుకుంది. వామనరావూ, జయా కారు దిగేరు. శేషు పాడుతూవచ్చి తండ్రినీ, భార్యనీ చూసి పాట ముగించేడు. తండ్రినిచూసి చేతులు జోడించి అన్నాడు. "ఓల్డ్ మేన్! హవ్ ఆర్యూ?" వామనరావు బాధపడుతుండగా, అతని ఛాతిమీద కొడుతూ అన్నాడు. "నువ్వు తాగి ఇంటికొస్తే విసుక్కునే వాడ్ని! మనసు గాయపడితే మనిషి మందు కొడతాడనే సూత్రం-నేను తాగినప్పుడుగాని తెలీలేదు. నీ మనసూ గాయపడింది. నా మనసూ గాయపడింది. కమాన్-లెటజ్ హావ్ డ్రింక్స్! అంటూ వామనరావు చెయ్యి పుచ్చుకుని వెళ్ళబోతుండగా-శేషు చెంపలు ఛెళ్ ఛెళ్ మణి మోగించబడ్డాయి. ఆవేశంతో ఊగిపోతూ కొడుతోంది సుభద్ర. శేషు గట్టిగా అరిచేడు. "నన్ను కొట్టడానికి ఎవర్నువ్వు? ఆఫ్టరాల్ జయకు అత్తయ్యవి! అమ్మా అని పిలిచేనని అమ్మలాగా కొట్టేవుగదా-సంతోషం! చాలా సంతోషం!" అంటూ అతను ఊగిపోతుంటే జయ అతన్ని పొదివి పట్టుకుంది. మెల్లిగా తీసుకెళ్లి కారెక్కించింది. ఆ కారు కదిలింది. సుభద్ర కళ్ళు కప్పుకుని కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది. వామనరావు తటపటాయిస్తూ అన్నాడు- "వాడ్ని కొట్టి నువ్వేడుస్తావెందుకు? మంచిపనే చేసేవు సుభద్రా! నాచేత కాని పని నువ్వు చేసేవ్" సుభద్ర నిష్ఠూరంగా అన్నది- "అంతే తెలుసండీ! మీకంతే తెలుసు! తల్లి దూరమైపోతే బిడ్డ భవిష్యత్తు ఏమవుతుందో ఆనాడు మీరు ఊహించలేదు. ఇదంతా మీ పెంపకమండీ! తండ్రి పెంపకం మీ గుణాలే, మీ బుద్ధులే వాడికీ వచ్చేయి." వామనరావు గాద్గదికంగా అన్నాడు- "సుభద్రా!"
* * *
వామనరావు ఇల్లు. రాత్రి. గదిలో జయ శేషుతో వ్యంగ్యంగా అంటోంది- "దెబ్బలు బాగా తగిలాయా?" శేషు ఒక అనుభూతిలో సమాధాన మిచ్చేడు- "ఎంతో అందంగా ఆనందంగా తగిలేయి జయా! పసి గుడ్డుగా నాన్న చేతుల్లో పెరిగేను. తల్లి చల్లని చేయి నా చెంపలు తాకే అదృష్టం ఈ జన్మకు లేదనుకున్నాను. అమ్మ ఆ లోటు తీర్చేసింది. ఇది దెబ్బలు కావు జయా-అమ్మ అనురాగానికి తీపిగుర్తులు." |
25,020 | "చూడండి బాబులూ. జరిగిన ఘోరం ఎలాంటిదో మనకందరికీ తెలుసు. నేను ప్రజల మనిషిని. నా ప్రజలలో ఓ ఒక్క మనిషికి కష్టం కలిగినా నా మనసుకి చితిపెట్టినట్టుగా హృదయం భగ్గుమంటుంది!!" వాళ్ళని రెచ్చగొట్టడానికి అంకయ్య ప్రయత్నిస్తున్నాడు.
"ఛీ నోర్ముయ్! నిన్ను ప్రజానాయకుడని ఎవరన్నారు. అసలు నీ ఎన్నికే చెల్లదని కోర్టు తీర్చు చెప్పింది. దొంగ ఓట్లు వేయించుకొని గెలవడానికి చూసే నువ్వు ఎప్పటికీ ప్రజా ప్రతినిధివి కాలేవు. ప్రజా నాయకుడివి అంతకంటే కాలేవు." చలపతి అన్నాడు.
"నేను కోర్టు తీర్పుని శిరసావహించాను నాయనా!" అన్నాడు తెచ్చిపెట్టుకొంటున్న చిరునవ్వుతో అంకయ్య.
"లేకపోతే ఏం చేస్తావ్?" ముకుందం అరిచాడు.
అంకయ్య అతనికేసి తీక్షణంగా చూశాడు.
"అనుభవం లేని వయసు నీది. రాజకీయ నాయకుల జీవితం అంటే వైకుంఠపాళీలో పావులాంటిదబ్బాయ్. పదవి పోయినా రాజకీయ నాయకుడికి కత్తిలా పదును రెండు వైపులా ఉంటుంది. దీనికి బాధ్యుడైన ఈశ్వర్ని జైలుకి పంపందే నేను నిద్రపోను" ఆవేశంగా అన్నాడు.
"నటించకు. నీ తుచ్ఛ రాజకీయాలని మా విద్యార్థులపై రుద్దాలని చూడ్డం మంచిది కాదు అంకయ్యా. ఇది ఈశ్వర్ చేయలేదని ఖచ్చితంగా మాకు తెలుసు. ఎవరు చేశారో, ఎందుకు చేశారో తెలీని వాజమ్మలం కాదు మేము."
"అతను మీ స్నేహితుడైనంత మాత్రం చేత సమర్ధిస్తే సరిపోదు." జెన్నీ అన్నాడు.
"షటప్" అరిచాడు రాజు.
"ఈశ్వర్ని నేరస్థుడిగా చిత్రీకరించడానికి ఇది మీరు చేసిన కుట్రని మాకు తెలుసురా జెన్నీ!
ఇందులోని నిజానిజాలని బయటపెట్టి మీ తోలు తీసి ఎండేస్తాం" చలపతి అన్నాడు.
"దానికి మీకు ఋజువుందా?" అడిగాడు అంకయ్య.
"ఉంది."
అందరూ ఆశ్చర్యంగా చూశారు ఆ మాటన్న వ్యక్తివేపు
చిత్ర!
చిత్ర ముందుకొచ్చింది.
"ఏమిటిది?" అడిగాడు జెన్నీ.
"నిన్న ఈశ్వర్ని ప్రిన్సిపాల్ సస్పెండ్ చేసిన క్షణం దగ్గర్నించీ అతను నా దగ్గరే ఉన్నాడు."
"నీ దగ్గరా?" హేళన ధ్వనించింది అంకయ్య కంఠంలో.
"అవును. అతను ఏ విధంగానూ తొందరపడకుండా ఆపడానికి అతన్ని నిన్నటినుంచీ నా దగ్గరే ఉంచుకొన్నాను" అంది చిత్ర.
"ఉంచుకొన్నావా?" గొంతులో అవహేళన.
"ఒరేయ్ అంకయ్యా! ఇందాకే కదరా స్త్రీల ఆత్మగౌరవం గురించి మాట్లాడావు. ఇప్పుడో ఆడపిల్లని ఇంత మందెదుట చులకనగా మాట్లాడుతున్నావు నీది నాలికా, తాటిపట్టా!" అడిగాడు రాజు.
"ఇది మా సమస్య మేమే పరిష్కరించుకొంటాం. నీలాంటి వాళ్ళ ప్రమేయం అనవసరం." ఓ విద్యార్థి అరిచాడు.
"అవును...... అనవసరం. ఇది మా సమస్య మేమే పరిష్కరించుకొంటాం."
"అవును. అనవసరం."
విద్యార్థుల్లో తన పట్ల వ్యతిరేకభావం కలుగుతోందని అంకయ్య గ్రహించాడు.
అంతలో అక్కడికి పోలీస్ వ్యాన్ వచ్చింది.
అందులోంచి ఇన్ స్పెక్టర్, పోలీసులు బిలబిలమని దిగారు.
ఇన్ స్పెక్టర్ అందర్నీ అక్కడి నుంచి డిస్ బర్స్ అవమని హెచ్చరించాడు.
పోలీసులు లాఠీలతో విద్యార్ధులని చుట్టుముడుతున్నారు.
"ఈశ్వర్ గాడిని అరెస్ట్ చేసేవరకూ నేనిక్కడనించి కదలను!" అంకయ్య బింకంగా అన్నాడు ఇన్ స్పెక్టర్ తో.
"అతన్నెప్పుడో అరెస్ట్ చేశాం. ముందు మీరిక్కడి నుంచి వెళ్ళండి" అన్నాడు ఇన్ స్పెక్టర్. |
25,021 | "అంటే వేదకాలంలోనూ, ప్రళయానికి ముందు వుండిన ఆకాశయానం, అణువిచ్చిత్తి, అలాంటివన్నీ ఇప్పుడు మళ్ళీ మనం కొత్తగా నేర్చుకుంటున్నామంటావా?"
"ఎగ్జాక్ట్ లీ! పోతే ప్రళయం తరువాత మిగిలిన నాగరికత నశించడం కేవలం వ్యక్తులు మరణించడం వల్లనే కాదు. మత మౌఢ్యం, అజ్ఞానం ఇవికూడా కారణాలు అయి వుండవచ్చును."
"అదెలాగా?"
"ఉదాహరణకి చెప్పుకోవాలంటే ప్రాచీన అలెగ్జాండ్రియాలో ప్రపంచంలో ఎక్కడా లేనంత గొప్ప గ్రంథాలయం ఒకటి వుండేది. అందులో అపురూపమైన ప్రాచీన గ్రంథాలు అనేకం ఉండేవి. అలెగ్జాండ్రియా మీద దండయాత్రలు జరిగాయి. ఆ లైబ్రరీని ఆరునెలలపాటు ధ్వంసం చేసేశారు. అందులోంచి అపురూపమైన పుస్తకాలను ఎత్తుకెళ్ళిపోయి బాయిలర్ లలో వేసి వేడినీళ్ళు కాచుకోవడానికి ఉపయోగించారు."
"ఎంత ఘోరం!" అన్నాడు అంకుష్.
కొంచెంసేపు ఆగి అన్నాడు సాహస్.
"వేదకాలంలో టెక్నాలజీ వుండడం ఎలా సంభవం అయిందీ అన్నదానికి ఇదొక వివరణ! పోతే దీనికి ఇంకో యాంగిల్ కూడా వుంది"
"ఏమిటదీ?"
"ఒకవేళ వేదకాలంలో వుండిన విజ్ఞానం గత ప్రళయానికి ముందు వుండిన నాగరికత తాలూకుది కాదనుకుంటే ఆ విజ్ఞానం వేదకాల ప్రజలకు హఠాత్తుగా ఆకాశం నుంచి ఊడిపడినట్లుగా ఎలా అబ్బిందీ?"
"అవును! ఎలా అబ్బిందీ?" అన్నాడు అంకుష్.
"ఎలా వచ్చిందీ అంటే నిజంగా ఆకాశం నుంచి ఊడిపడడం వల్లే" అన్నాడు సాహస్ డ్రమెటిక్ గా.
"అంటే?" అన్నాడు అంకుష్.
"అంటే గ్రహాంతర వాసులయిన బుద్ధిజీవులు ఎవరో వచ్చి వాళ్ళ హైటెక్నాలజీ తాలూకు రహస్యాలు మన వేదకాలపు ప్రజలకు చెప్పి వుండాలి".
"దిసీజ్ ఫాంటాస్టిక్ నాన్సెన్స్" అన్నాడు అంకుష్.
"అలా కొట్టి పారేయడానికి వీల్లేదు! ఉదాహరణకు వేదాలే తీసుకో. మన నమ్మకం ప్రకారం వేదాలని ఎవరూ రాయలేదు. దేవుడు చెబితే వినబడినవి వేదాలు. దేవుళ్ళు, దేవతలూ అంటే వాళ్ళెవరో కాదు - అంతరిక్ష యాత్రికులయిన గ్రహాంతర వాసులనడానికి చాలా ఆధారాలు కనబడుతున్నాయి."
"ఏమిటా ఆధారాలు?" అని అంకుష్ ఆశ్చర్యంగా అడిగే లోపలే -పడమటి దిక్కున సూర్యోదయం అవుతున్నట్టు ఆకాశం లేత నారింజ రంగులోకి మారింది.
అదే క్షణంలో -
పైనుంచి ఇంకో బండ కదిలి వాళ్ళవైపు రావడం మొదలుపెట్టింది.
దాని వెనుక మరో బండ...
మరో బండ...
రెండో వైపు చూస్తే...
తూరుపు అప్పుడు తెలతెలవారుతోంది.
తూర్పూ, పడమర రెండు వైపులా వెలుగు...
"సాహస్! ఇది ఇంకో ప్రళయానికి ప్రారంభం కాదు కదా?" అన్నాడు అంకుష్.
"మేబీ! ఆర్ మే నాట్ బీ" అన్నాడు సాహస్.
అయితే ఇంక మనం దైవప్రార్థన మొదలుపెట్టడం మంచిది" అన్నాడు అంకుష్.
"ఏమని?"
"ప్రళయం రాకుండా వుండాలని"
చిన్నగా నవ్వాడు సాహస్.
"అంకుష్! ఒకటి గుర్తుంచుకో. దైవప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడూ కూడా ఫలానిది జరగాలి - ఫలానిది జరగకూడదు అని ప్రార్థించకూడదు. ఫలానిది కావాలి. ఫలానిది వద్దు అని కూడా ప్రార్థించకు. ఎప్పుడేమి జరగాలో ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలో ఆ దేవుడికి బాగా తెలుసు. ప్రార్థన చేసి లేచాక నువ్వు ఇంకాస్త మంచి మనిషిగా మారితే దేవుడు నీ ప్రార్థన ఆలకించినట్లే! అది చాలు" అన్నాడు.
సరిగ్గా అదే టైంలో
రాజధానిలో -
చాలాసేపటి నుంచి నిద్ర పట్టక పక్కమీద అశాంతిగా అటూ ఇటూ దొర్లుతోంది ప్రగతి.
ఫీల్డ్ మార్షల్ సర్వాధికారి అధికారం చేజిక్కించుకున్నప్పటి నుంచి తనకు ఊపిరి సలపని పని!
ఇవాళే కాస్త నడుం వాల్చడానికి తనకు వీలు చిక్కింది.
కానీ -
పడుకున్నప్పటి నుంచీ ఏవేవో ఆలోచనలు!
ఒక్క ఆలోచనకీ నిర్ధిష్ట రూపం లేదు.
సరిగ్గా ట్యూన్ కాని టీవీలో దృశ్యాలలాగా గజిబిజిగా దృశ్యాలు! |
25,022 | అయితే, ఇండియాలో కూడా ఒక ప్రాచీనకాలపు రాకుమారి తాలూకు మమ్మీ ఉందని వదంతి ఒకటి ప్రచారంలో ఉంది. ఈజిప్టు రాజవంశీయులలాగే ఆ మమ్మీని పోతపోసిన నిలువెత్తు బంగారు విగ్రహంలో ఉంచి సమాధి చేశారని చెప్పుకుంటారు. దీనికితోడు మరొక కథ కూడా వాడుకలో ఉంది."
కాసేపు తదేకంగా సందీప్ మొహంలోకి చూశాడు భూతాలరాజు. తర్వాత ఖాండ్రించి ఉమ్మేసి, ఎవరో వస్తున్నారన్నట్లు సైగ చేశాడు. బూట్ల చప్పుడు వినబడింది. సెంట్రీ వచ్చి, ఒకసారి సెల్ లోకి పరీక్షగా చూసి, వెళ్ళిపోయాడు.
"పొగాకు లేకపోతే మానె, సిగరెట్టూ పీకె అన్నా ఉందా?" అన్నాడు భూతాలరాజు.
"ఉండాలి. కానీ లాగేసుకున్నారు" అని మళ్ళీ చెప్పడం మొదలెట్టాడు సందీప్.
"హేలే తోకచుక్క ప్రతి డెబ్భయ్ అయిదు సంవత్సరాలకీ ఒకసారి దర్శనమిస్తుంది.
ఆ తోకచుక్క కనబడినప్పుడల్లా ఈ రాకుమారి మమ్మీ ప్రాణంతో లేచి తిరుగుతూ, కోరిన కోరికలు తీరుస్తుందనీ, తోకచుక్క మాయమైపోగానే నిశ్చలంగా అయిపోయి మళ్ళీ డెబ్భయ్ అయిదేళ్ళ వరకూ అలానే ఉండిపోతుందనీ, ఈలోగా ఆ మమ్మీని సమీపించిన వారుగానీ, ఆమె ప్రశాంతతకు భంగం కలిగించిన వారు ఘోరమైన చావు చస్తారని చెప్పుకుంటూ ఉంటారు ఆ అడవులలోని జనం.
చిత్రమేమిటంటే, సరిగ్గా ఇలాంటి నమ్మకమే ఈజిప్టు దేశంలో కూడా ఉండేది. ప్రాచీన కాలపు ఈజిప్షియన్ రాజులను 'ఫేరో' అనేవాళ్ళు. ఆ ఫేరోల సమాధులని తెరిచినవారూ, కొల్లగొట్టిన వారూ దారుణంగా మరణించి తీరతారనీ, అది ఫేరో శాపమనీ చెప్పుకుంటారు జనం. దానికి తగినట్లుగానే, టూట్ ఆంఖ్ అమున్ సమాధిని మొదటిసారిగా తెరిచిచూసిన లార్డ్ కార్నర్ వాన్ అనే ఆయన, ఆ తర్వాత కొద్దికాలానికే మరణించాడు. ఇది 'కర్స్ ఆఫ్ ద ఫేరో' - ఫేరో శాపం నిజంకావడం వల్ల - అని నమ్మే జనం ఉన్నారు. కాదు, ఇది కేవలం కాకతాళీయం అని వాదించేవారూ ఉన్నారు.
అలాంటి శాపమే ఈ రాకుమారి మమ్మీకి ఆపాదించబడటం చాలా ఆసక్తికరం.
మా నాన్నగారు ప్రొఫెసర్ శేషాద్రి ఆర్కియాలజిస్టు, హేతువాది. ఆయన ఈ శాపాలో, గీపాలూ ఇవన్నీ నమ్మకపోయినా, అసలు ఈ రాకుమారి మమ్మీ అనేది నిజంగా ఉందో లేదో, ఉంటే ఈజిప్షియన్ ఆచార వ్యవహారాలూ, నమ్మకాలూ మనదేశంలోకి ఎలా వచ్చాయో, పరిశోధించాలని తన యూనిట్ తో సహా బయలుదేరారు.
ప్రాచీనకాలపు ఈజిప్షియనులు ఇండియా నుంచ్ వలసవెళ్ళిన ద్రావిడులని ఒక వాదం బయలుదేరింది ఈ మధ్య. దీనికి దృష్టాంతరాలుగా రెండు విషయాలని చూపిస్తున్నారు. ఒకటి : చాలామంది ద్రావిడులలాగే ఈజిప్షియన్లు కూడా 'అడ్డపంచ' లాంటి దుస్తులే ఎక్కువగా ధరించేవారు. రెండు " ద్రావిడులకి ఏఏ పళ్ళ జబ్బులు ఎక్కువగా వస్తాయో, అలాంటి పళ్ళ జబ్బులే ఈజిప్షియన్ మమ్మీలలో కూడా కనబడ్డాయంటారు.
ఈ రెండు లక్షణాలే కాక, మరో విశేషం కూడా ఉంది. ద్రావిడుల పేర్లలాగే కొన్ని ఈజిప్షియన్ పేర్లు కూడా 'న్' తో అంతమవడం. కరుణాకరన్, రవీంద్రన్ లాగా అవినాటిన్, ఆన్ ఖ్ అమూన్ వంటి పేర్లు.
అడవిలో దారి చూపించడానికి ఒక గైడ్ ని నియమించుకుని తన యూనిట్ తో సహా బయలుదేరి వెళ్ళారు మా నాన్నగారు.
ఒక కీకారణ్యం మధ్యలో ఉన్నాయిట రాకుమారి మమ్మీ, బంగారు విగ్రహం. అష్టకష్టాలు పడి మమ్మీ చేరుకుంది ఆ బృందం. దాదాపు మూడొందల కిలోల బరువున్న ఆ మేలిమి బంగారపు విగ్రహాన్ని చూసేసరికి యూనిట్ లోని మిగతా సభ్యుల కళ్ళు చెదిరాయి. మమ్మీని అక్కడ వదిలేసి, విగ్రహాన్ని కరిగించి అందరం గుట్టుచప్పుడు కాకుండా పంచుకుందామని మా నాన్నగారికి చెప్పారు.
ఆ కుట్రకి మా నాన్నగారు ఒప్పుకోలేదు. అతనిని తొలగించుకోవడానికి వాళ్ళు మా నాన్నగారిని కిరాతకంగా చంపేశారు. నిగ్రహాన్ని పెకిలించబోతుండగా భయంకరమైన తుఫాను వచ్చింది. పిడుగులు పడ్డాయి. దగ్గరలోనే ఉన్న ఒక అగ్నిపర్వతం బ్రద్దలయింది. ఆ విశ్వాస ఘాతకులందరూ సలసల మరిగే లావాలో చిక్కుకొని మిడతల్లాగా మాడిపోయారు. |
25,023 | అలా కొన్ని క్షణాలు దొర్లుతున్నాయో తెలీదు.
హఠాత్తుగా ఆమె కళ్ళముందు మంటలు..... మంటలు....
ఆమె కళ్ళముందు మంటలు..... కళ్ళల్లో మంటలనీడలు..... మహార్ణవపు గర్భంలో అగ్నిపర్వతాల కగుల్లు.... భీకర బడణా నలపు హొరు..... దిగంబరంగా అమబరాన్ని చుంభించాలానే ఒంటరి పరుగు.... అగాధాల దిగంబరంగా అంబరాన్ని చుంభించాలానే ఒంటరి పరుగు.... అగాధాల నీడలు మేఘాల ఒరిపిళ్ళు ... అర్తనాదం మృత్యుగానంలా....
"అ...మ్మా"
రోషణీ పెదవులు అదురుతున్నాయి .
ఆమె గుండె గాడితప్పినట్టు ఆ స్తవ్యస్తంగా కొట్టుకుంటూ౦ది.
"అమ్మా...." రోషణీ పిలుపు గొంతులోనే సమాధి అయిపోయింది "నేను తల్లిని కకాబోతున్నానమ్మ ..... నిన్ను మమ్మని చేసేస్తున్నానమ్మా నిన్ను పసికండులా కావలించుకుని తప్ప నిదిణా పోలే నేను ఓడపికంతకు జన్మనివ్వాలని విఫలప్రయత్నం చేస్తున్నాను.... నిన్ను మొన్నతిడాకా ణీ ఒడిలో శ్రీమంతుల బిడ్డకపేరిగేదాన్నే.... నాకు సీమంతం ఎప్పుడు చేస్తావ్,... అప్పటిదాకా ఆగేలా లేడంమయూ జీవితం... అందాకా వచ్చి పోవూ ణీ రూసీనమ్మా...."
వెక్కివెక్కి పడుతూంది రోషణీ....
దుఃఖం ఉప్పెనేలా చుట్టూ ముడుతుంటే నిలువునా వణికిపోతూంది.
"రోషణీ" ఎప్పుడు కళ్ళు తెరిచాడో వైదేయ లలానగా ఆమె అల్లలోకి చూస్తూ పిలిచాడు.....
ఆమె బదిలివ్వలేదు ...
కాని అతడి కర్దమైంది.
అ సమయంలో ఏ అడపిల్లనయినా ముందు గుర్తుచేసుకునేది అమ్మనే....
అందులోనూ తల్లిచాటు బిడ్డగా పెరిగి రాక్షసంగా తనువుగాలించిన తల్లిని చూసిన రోషణీ తల్లినింకా ఎక్కువ గుర్తుచేసుకుంటుంది.
నెమ్మదిగా లేచాడు....
అర నిముషంలో సూట్ కేసు అడుగున దాచిన ఓ పెకేట్టును తీసుకువచ్చాడు....
నీలి రంగు రాయితో వున్న ఉంగరాన్ని తీసి "రోషణీ! యీ నీలిరంగు అందని ఆకాశాన్ని మాత్రమే కాదు. నీలాలా కళ్ళనూ గుర్తుచేస్తుంటాయి. ఇన్నాళ్ళూ అపురూపంగా దాచుకున్నాను..... యీ శుభసమయానయిన నా గుర్తుగా నీకు అందిస్తున్నాను" ఆమె వెలికి తొడిగాడు.
ఆమె నిర్లిప్తంగా వింటూంది.
"ఇన్నాళ్ళూ నేనెల పెరిగినా ఎలా ఆలోచించినా ణీ రాకతో నా జీవితం మారిపోయింది రోషణీ నన్ను అవకాశవాది అన్నారు కొందరు..... రాక్షసడన్నారు మరికొందరు ...సమాజానికి పట్టిన చీదని విసుక్కున్నా రెందరో.... అందుకే రోషణీ.... నిన్ను న్.... నిన్ను వెంటనేపెళ్ళిచేసుకోవలనుకుంటున్నాను...."
ఆమె విభ్రమంగా చూసింది.
"వీలైనంత త్వరగా...." అతడి అభ్యర్ధన అర్ధలోక్తిలోనే ఆగిపోయింది.
"మనసులు కలసిన వాళ్ళం పెళ్ళితో పనేమిటి వైదీ నిర్వాకారంగా అడిగింది.
"నా తృప్తి కోసం రోషణీ! పెళ్ళికాకుండానే తల్లయినా అమ్మకు పుట్టిన వాడ్ని... అందుకే పెళ్ళికాకుండా నేనూ తండ్రిని కాదలచుకోలేదు....."
"కకాపోతేనేం ..... ఇప్పుడు పొందనిదేమిటి వైదీ పెళ్ళికోసం అలోచించడానికి...."
"పొందింది జారిపోకూడదనే రోషణీ! పెళ్ళిగాని అమ్మను నేను చేజర్చుకున్నాను...... పెళ్ళికానివాడు నిన్నేక్కడ. "చెప్పలేకపోయాడు. ఆమె చేజారిననాడు అతని బ్రతుక్కి అర్ధంలేదు.... "దీన్ని నువ్వు సెంటిమేమ్తను నా కభ్యంతరంలేదు.... కాని మనం పెళ్ళి చేసుకుందాం"
సాలోచనగా చూసింది కొంతసేపు
"అయితే... ముందు మిగిలిన ప్రత్యర్ధుల్ని వెటడాలి"
నిట్టూర్చుతూ చూసేడు ..."సరే __"
ఇన్నాళ్ళూ ఆగిన తనకు మరికొన్ని రోజులో వారాలో ఆగడం ఇబ్బంది కాదు.
మరోమారు.
మేధకు పని పెట్టాడు వైదేయ__
ఇప్పుడు ఎదుర్కోతున్నప్రత్యర్ధిని అందరికంటెబలవంతుడు.
రాస్తున్న కాగితాలల్లో నుంచి తలపైకెత్తి వైదేయ"మీ అమ్మగరిఉకి దొంగ నోట్లు పంపినవాడు ప్రద్యుమ్నరావు కదూ " అడిగాడు__
అవునన్నట్టు తల వూపింది.
"అంటే బహుశా ఆయనకున్న వ్యాపారాలలో డింగ నోట్లముద్రించే వ్యవహారం కూడా ఒకటయ్యే అవకాశముంది కదూ"
"అవకాశమేమిటి వైదీ! వాడికున్న ముఖ్య వ్యాపారం అదే" రోషణీ చెప్పింది.
అంతే__
మారణ హొమం సీరియల్ నవలలో మరో అధ్యాయం రాయబడిందా రాత్రి.....
* * * *
"డేమిట్"
ముందో అరుపు __ తర్వాత ఓ చప్పుడు వినిపించాయి షార్క్ రెస్టారెంటులో __
టేబుల్ ముందు కూర్చున్న కాస్తమర్సంతా ఉలికిపాతుగా తలతిప్పిచూసేరు..... |
25,024 | పోయించుకుని వస్తున్నది. డాక్టరు ఆమె మీద సానుభూతి చూపనారంభించాడు మెత్తని మాటలు చెబుతూ. నిన్న అవకాశంచూసుకుని ఆమె వంటి మీద చెయ్యి వెయ్యబోయాడు హడలిపోయి, అక్కడ్నుంచి ఎలాగో బయటపడి వగరుస్తూ ఇంటికి చేరింది. రాత్రంతా కుళ్ళి కుళ్ళి ఏడుస్తూనే వుంది.
"ఏమండీ! మనం ఈ ఇల్లు ఖాళీ చేసేద్దామండీ" అంది కాసేపాగి.
"ఏం?"
"ఇక్కడి మనుషుల ప్రవర్తన భరించలేకుండా వున్నానండీ. మీరు లేచి తిరుగుతూమ్తే మనజోలి కెవరూ వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడందరి కన్నూ మన యింటిమీదనే వుంది. వీధిలోకి అడుగుపెట్టటమంటేనే భయంగా వుంది. ప్రతివాళ్ళూ నన్ను అవమానం చెయ్యాలని చూసేవాళ్ళే" అంది ఆమె ఎంతో బాధగా.
"అలాగా?" అన్నాడు భర్త కొత్త విషయాన్ని విన్నట్లుగా, "కాని ఏం చేస్తాం చెప్పు? జాగ్రత్తగా వుండి ఎలాగో ఒకలా సర్దుకుపోవాలి. కొత్త ఇల్లు చూడాలంటే నేనా లేవలేను. నీకేమో సాధ్యంకాదు."
"అవును అవును..." అంటూ ఆమె నీళ్ళు నములుతూ నిల్చుంది.
ఉదయం పదిగంటలవేళ హైదరాబాద్ లో మలక్ పేట లోని ఓ మారుమూల సందులో, ఓ ముదనష్టపు కొంపలో నిస్సహాయస్థితిలో వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటున్నారు.
"ఆ రాంజీని మన ఇంటికి రానివ్వద్దండీ" అన్నదామె భయపడ్తూ.
"వాడేమిచేశాడే? ఆపత్సమయంలో చేతనైనంతవరకూ ఆడుకుంటూన్న మిత్రుడు."
"అందరూ మిత్రులే మీకు. మీరు ఇదంతా స్నేహమనే అనుకుంటున్నారు. అతనెలాంటి దుర్మార్గపుటాలోచనతో ఉన్నాడో మీకు తెలీదు. అదీ తెలిసివస్తుంది...సరే. మందుకోసం సాయంత్రం మేలాగో ప్రయత్నిస్తాను. వంటచేస్తూ చేస్తూ మధ్యలో వచ్చాను" అని ఆమె తిరిగి లోపలకు వెళ్ళిపోయింది.
నీరసంగా శల్యావశిష్టంగా వున్న అతను దుప్పటి కంఠంవరకూ కప్పుకుని తిరిగి ఆలోచిస్తూ పడుకున్నాడు. ఆలోచించటానికి కూడా కొంత ఓపిక కావాలి. తనమీద తనకే రోతపుడుతున్న ఈ స్థితిలో ఒక్కొక్క క్షణం ఎలా ముందుకునెట్టుకు పోవాలో అతనికి పాలుపోవటంలేదు. "మానవుడే శపియిస్తే..." అంటూ ఎప్పుడో ఓ గేయం చదివాడు. మానవుడు తలుచుకుంటే ఏదీ అడ్డు వుండదట శపిస్తే సకల చరాచర జగత్తూ బుగ్గో, బూడిదో, వల్లకాడో ఏదో అవుతుందట. మరి ఇప్పుడు రోజూ శాపనార్ధాలు పెడుతూనే వున్నాడు. అవి ఎందుకు కొరగాకుండా పోతున్నాయి. ఒకప్పుడు అతను తన అందమైన దేహాన్ని, నునుపు తేలిన కండల్నీ చూసుకుని తాను సర్వశక్తి సంపన్నుడినని గర్వించిన మాట నిజమే. ఇప్పుడు మరి లయంచిపోతున్న శరీరంతో గర్వం, ఆత్మవిశ్వాసం అన్నీ పటాపంచలౌతున్నాయి. దొరికినకాడికి మందులు మింగుతున్నాడు. నిజమే. బ్రతకాలన్న మమకారం వృద్ది అవుతోందిగాని ఫలితం మాత్రం శూన్యం.
ఓ పావుగంట గడిచాక దగ్గరగా వేసివున్న తలుపుల్ని తోసుకుని బలమైన యువకుడు లోనికి వచ్చాడు.
పైజమా, చారల చొక్కా వేసుకుని కత్తి మీసాలతో, పొగరుగా, నిర్లక్ష్యంగా కనపడుతూ, నల్లటి దేహంతో నిగనిగలాడ్తున్నాడు.
"వొచ్చావా రాంజీ?" అన్నాడు రోగి బలహీన స్వరంతో.
"ఆలశ్యమైపోయింది భాయి. అనుకోకుండా పని తగిలింది గాని లేకపోతే యింకా జల్దీగా వచ్చేవాడ్ని" అంటూ రాంజీ చేతిలోని సంచీ గోడకు ఆనించిపెట్టి అందులోంచి రొట్టె, పళ్ళు బయటకు తీసి "ఇదుగో భాయి, తీసుకో!" అంటూ మంచం దగ్గరకు వచ్చి, స్నేహితుడి ప్రక్కన కూర్చుని అతని చేతిలో వుంచాడు.
"నీ ఋణం తీర్చుకోలేను రాంజీ!" అన్నాడు రోగి బాధగా, సిగ్గుపడుతూ.
అసలే ఎర్రగా మిరమిరలాడే రాంజీ కళ్ళలోకి ఒక విచిత్రమైన జీర వచ్చింది. భుజా లెగురవేసి వక్రచాలనం ఒకటి చేశాడు. హైదరాబాద్ మారుమూల గొందుల్లోకి సహజ వాతావరణమైన నిషా, మజా, కృత్రిమమైన నిగారింపు అతన్లో అణువు అణువునా తీర్చిదిద్దినట్లున్నాయి.
"బలేవాడివి. దోస్త్ కు ఆపదలో సాయం చెయ్యలేని మృగాన్ననుకున్నావా నన్ను? నా పొజిషన్ కూడా సరిగ్గా బాగుండగ్గానీ లేకపోతే నిన్ను యింకా నెత్తిమీద పెట్టుకుని సేవలు చేసేవాడ్ని విచారపదకు భాయి. కొద్ది దినాలు ఓపిక పడితే మళ్ళీ మామూలు మనిషై కండలూ, దండలూ, పెంచుతావు" అని ఆప్యాయత ప్రదర్శిస్తూ స్నేహితుడి వీపుమీద చెయ్యివేసి నిమరసాగాడు.
"నువ్వుకూడా లేకపోతే ఏమయిపోయేవాడ్నో రాంజీ!" అంటూ అతను కళ్ళు మూసుకుని పడుకున్నాడు.
లోపల గదిలోంచి గిన్నెల చప్పుడూ, అన్నం ఉడుకుతూన్న వాసనా వస్తున్నాయి.
"అన్నట్లు కూరగాయలు తీసుకువచ్చాను. ఈ పూటకి అన్నంలోకి ఏదయినా వుందో లేదో, ఇచ్చి వస్తాను" అంటూ రాంజీ లేచి గోడకు ఆనించి వున్న సంచీ తీసుకుని చొరవగా లోపలకు పోయాడు. మంచం మీద పడుకుని వున్న కృష్ణమూర్తి కళ్ళు తెరవలేదు. కాని ఎంత వద్దనుకున్నా మనసులో అనిర్వచనీయమైన బాధ కలిగింది. ఆ సంచీ ఇవతలకు పిలిచి అందివ్వవచ్చు కదా, లోపలికే పోవల్సిన అగత్యమేమిటి అని చిరచిర లాడాడు.
|
25,025 | "ఐయాంసారీ! నేనేమన్నా తప్పుగా అన్నానా?" అతని ముఖంలో రంగులు మారటం గమనించి వరలక్ష్మి కంగారుగా అంది.
"కానిస్టేబుల్ నుంచి క్లర్క్ ఎప్పుడయ్యారు? ఎలా అయ్యారు?" అధికారి గొంతులో వ్యంగార్ధం ధ్వనిస్తోంది.
వరలక్ష్మి కళ్ళలో సుడులు తిరుగుతున్న కన్నీటిని పంటి బిగువున అవుకోవడానికి ప్రయత్నించింది.
"చెప్పాడానికి అభిమానం అడ్డువస్తే చేపొద్దులేండి."
చెళ్ళున చెంపమీద కొట్టినా భాదపడేదికాదు తను. అధికారి మాటలు ఆమె హృదయాన్ని గాయపరచాయి.
వెంటనే ఇంటర్ కమ్ లో కమీషనర్ చెప్పింది అధికారి వచ్చిన సంగతి.
"కమిషనర్ గారు మిమ్మల్ని లోపలకు రమన్నారు" తలవొంచుకునే సిరీయస్ గా అంది.
అధికారి హృదయం భారమయ్యింది. తను ఎంతగానో ఆరాధించే వరలక్ష్మి ప్రవర్తన తనకి అర్ధకాకుండా వుంది. కమిషనర్ మీద మొదటిసారిగా ఎదురు తిరిగిన వ్యక్తి వరలక్ష్మి, ఒకప్పుడు అతడంటే ఏ మాత్రం సాదాభిప్రాయంలేని ఈ రోజు అంతలోనే కమిషనర్ ని వెనకేసుకురావడాన్ని హర్షించలేకపోతున్నాడు. ఆమెలో ఆ మార్పుకి గల కారణం ఏమిటో ఆలోచిస్తున్నాడు.
"మిమ్మల్నే లోపలకు పిలిచి చాలా సేపయ్యింది."
అధికారి పరధ్యానంగా ఉండడం గమనించింది.
అధికారి స్ప్రింగ్ డోర్ తీసుకుని కమిషనర్ రూమ లోకి వెళ్ళాడు. అక్కడ ఎ.సి.పి. శ్రీకళ, ఎ.జి. చీఫ్ ఇన్స్ స్పెక్టర్ హరిశ్చంద్రుడు ఉన్నారు.
"ఇన్స్ స్పెక్టర్ యూకేన్ గో అవుట్...."| కమిషనర్ ఆనందంతోనో ఇన్స్ స్పెక్టర్ హరిశ్చంద్రుడు బయటకు వెళ్ళాడు.
ఎ.సి.పి. శ్రీకళ కూడా వెళ్ళడానికి ఉద్యుక్తరాలయ్యింది. ఫర్వాలేదు. ఆమెను కూర్చోమన్నట్టు సిగ్నల్ ఇచ్చాడు.
శ్రీకళ తిరిగికూర్చుంది.
"నీ కిచ్చిన పనేమిటి? నువ్వు చేస్తున్నా పని ఏమిటి?" కమిషనర్ గొంతు ఖంగుమంది.
"సార్..." అధికారి చెప్పబోయి సడన్ గా ఆగి ఎ.సి.పి. వైపు చూశాడు.
"నోప్రాబ్లం . మేడమ్ ఇక్కడే వుంటారు చెప్పు....."
"సార్ మీరు చెప్పిన ఇన్ ఫర్మేషన్ వర్క్ అవుట్ చేశాను. తొందరలోనే పని అవుతుంది....."
కమిషనర్ విసుక్కున్నాడు.
ఎ.సి.పి. శ్రీకళకు అర్ధం అయ్యింది. కమిషనర్ ఎందుకు అధికారి వెంట పడుతున్నాడో!
మనిషికి ధనకాంక్ష, స్రీ కాంక్ష, పదవీ కాక్షంలకన్నా అనారోగ్య కరమై౦ది కీర్తి కాంక్ష.
ఆర్ధిక శాస్రంలో ఒక సూత్రం వుంది. సగటు కాంక్షలకన్నా అనారోగ్యకరమైంది కీర్తి కాంక్ష.
ఆర్ధిక శాస్రంలో ఒక సూత్రం వుంది. సగటు మనిషికి తృప్తి అనేది వుంటుంది. అది అంచలంచెలుగా తగ్గుముఖం పడుతుంది. కొని క్తీర్తికాంక్షకి ఏ ఆర్ధిక సూత్రాలు అన్వయించడానికి వీలు పడదు. ఆ రేసులో ఓటమిని అంగీకరించడానికి ఎవ్వరికి అంత విశాల హృదయం లేదు. అందులో నక్కకీ, నాగలోకానికీ ఉన్నంత తేడా వ్యక్తుల మధ్య ఉన్నప్పుడు ఓటమిచోట సానుభూతి వుండదు. కానీ ప్రతీకారం వుంటుంది. మరిప్పుడు అదే తరహా రేసులో పోలీసు కమిషనర్, ఒక సాధారణ పోలీసు కానిస్టేబుల్ ఉన్నారు. పొట్టేలు వెళ్ళి కొండను డీకోంటే నష్టపోయేదిఎవరో పోట్టేలకు తెలియకపోవచ్చు. కానీ సారూప్యంలోను, అందులోనూ ఒక శాఖలో పనిచేస్తున్న వాళ్ళకి వాళ్ళా వాళ్ళా బలాబలాలు తెలియనివి కావు. కానీ అన్నీ తెలిసిన అధికారి ఎందుకలా ప్రవర్తిస్తున్నాడో ఆమె ఊహకే అందడంలేదు.
అధికారి తన నడుముకు ఉన్న బెల్టునుంచి పిస్టోల్ బయటకు తీశాడు.
ఎ.సి.పి. శ్రీకళ భిన్నురాలయ్యింది. ఒక కానిస్టేబుల్ సి.పి. మీదకి పిస్టల్ తీయడం నమ్మలేకపోయింది. అసలు కానిస్టేబుల్ కి పిస్టల్ ఎవరు ఇచ్చినట్టు? అది అతని చేతికి ఎలా వచ్చినట్టు?
ఎ.సి.పి. శ్రీకళ ఒకసారి అధికారివేపు, మరోసారి కమిషనర్ వేపు తన చూపు మరలించింది.
ఆ ఇద్దరి ముఖాలు భావార్ధలకి అతీతంగా ఉన్నాయి,
"మిస్ శ్రీకళ యూ కేన్ గో నౌ....." కమిషనర్ అక్కడ ఆమె అవసరం లేనట్టు సూచనప్రాయంగా తెలియజేశాడు.
శ్రీ కళ లేచి సెల్యూట్ చేసి బయటకు వెళ్ళిపోయింది.
అధికారి తన చేతిలోవున్న పిస్టోల్ కమిషనర్ టేబుల్ మీద పెట్టాడు. "వాట్ .... వాట్ హేపండ్ టుయూ...." ఇప్పుడు కమిషనర్ గొంతులో ఇదివరకటి కాఠిన్యతలేదు.
"వాట్ మెన్ ..... నువ్వు చెప్పనిదే నాకెలా తెలుస్తోంది......" ఈసారి కమిషనర్ అనునయంగా అన్నాడు.
"సారీ సార్..... మీరు నామీద ఎంతో నమ్మకంతో ఆ టాస్క్ నాకు అప్పజెప్పారు. కానీ మీరు ఈ రోజు నన్ను నా మాటల్సి విశ్వసించడం లేదు. ఇక నాకు ఒక్కటే మార్గం కనిపిస్తోంది......"
"ఏమిటిది....?" కమిషనర్ సూటిగా అడిగాడు.
"రాజీనామా..... నేను రాజీనామా చేస్తున్నాను...." అధికారి జేబులోంచి ఓ కాగితం తీసి కమిషనర్ టేబుల్ మీద ఉంచాడు.
"ఐసీ.... అంతా ముందే నిర్ణయించుకున్నవన్నమాట. అందకే నా సర్వీసు పిస్టల్ తిరిగి ఇచ్చింది...."
"ఇప్పుడు కాదు సార్, నేను ఈ ఉద్యోగంలో చేరి యూనిఫారం వేసి ప్రమాణం చేసిన రోజునే నిర్ణయం తీసుకున్నాను...."
అదే.... అదే ఎందుకట.... నీమీద, నీ తెలివి తేటలు మీద నీకు నమ్మకం లేకనా?"
"లేదు సార్, నా తెలివి తేటలుమీద నాకు ఎప్పుడూ అచంచల విశ్వాసం వుంది. ఎటొచ్చి....." |
25,026 |
ఇతన్ని తప్పక సత్యనారాయణే పంపించి వుంటాడు.
"తీసుకో తాతా! ఏమిటి అంత ఆలోచిస్తున్నావ్?"
"ఎవరు నువ్వు! ఇంత డబ్బు ఎందుకిస్తున్నావ్?" కోటయ్యకు కొంచెం కరుకుగా వినిపించింది.
శరత్ ఓ క్షణం మౌనంగా కోటయ్య ముఖంలోకి చూశాడు.
"నేనెవరో నాకే తెలియదు. అది తెలుసుకోవాలనే నేనిక్కడికి వచ్చాను" అనాలనుకున్నాడు శరత్.
"నేనెవర్నో రేపు చెబుతాను. ఇప్పుడు టైంలేదు."
"మళ్ళీ రేపు వస్తావా?" ఆశ్చర్యం సంతోషం. కోటయ్య కంఠంలో ఒకదాన్ని ఒకటి ఒరుచుకున్నాయి.
"వస్తావు. ఈ డబ్బు తీసుకో!"
"తీసుకోను ఎందుకు ఇస్తున్నావో తెలిస్తేగాని తీసుకోను" పంతంగా అన్నాడు కోటయ్య.
"ప్రత్యేక కారణం ఏమీలేదు తాతా! ఇవ్వాళ నువ్వు తిన్నసంకటం చూసాను. నా మనసు ఎలాగో అయింది. అందుకే...." ఆపైన ఏం మాట్లాడాలో తోచలేదు.
కోటయ్య నోరు తెరిచి నవ్వాడు. బోసినోటి నుంచి గాలి జివ్వుమన్నది.
"ఎందుకు తాతా నవ్వుతున్నావ్?"
"నీకెందుకు బాబూ నేనంటే ఇంత అభిమానం?"
శరత్ వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు.
"చెప్పు బాబూ! అసలు నువ్వు ఎవరు? ఎందుకింత అభిమానం చూపిస్తున్నావ్?"
"అది అడగాలనే వచ్చాను!"
"అంటే" బోసినోరు తెరిచి శరత్ ముఖంలోకి కళ్ళు చిట్లించి చూశాడు కోటయ్య.
"అదే.... నేనెవరో...." అంటూ గబుక్కున నాలుక కరుచుకున్నాడు.
"ఆ! ఆగిపోయావేం? చెప్పు!"
"ఇప్పుడు కాదు. రేపు చెబుతాను."
"రేపు మళ్ళీ వస్తావా?"
"వస్తాను. ఇది తీసుకో!"
"వద్దు బాబూ వద్దు. నాకు బిచ్చం తీసుకొనే అలవాటు లేదు." అభిమానంగా అన్నాడు కోటయ్య.
"ఇది బిచ్చంగా ఇవ్వడంలేదు తాతా!"
"మరి నన్ను చూసి.... నా దీనస్థితిని చూసి జాలిపడి ఇచ్చే డబ్బును ఏమనాలి?"
శరత్ వెంటనే సమాధానం ఇవ్వలేదు.
"బాబూ! ఈ చేతుల్తో భూమిని బద్దలు కొట్టాను. కండలు కరిగించి పంటలు పండించాను. ఏనాడూ ఎవరి ముందూ 'దేహి' అంటూ చెయ్యి చాపలేదు." కోటయ్య బాధగా అన్నాడు.
శరత్ ఏం సమాధానం ఇవ్వాలో తెలియక తికమక పడ్డాడు.
"ఈ ముసలితనం పంజాలో చిక్కాను బాబూ! ఎవరింత ముద్ద వేస్తారా అని ఎదురుచూసే స్థితికి వచ్చాను. అది మాత్రం బిచ్చం కాదా అని నువ్వు అడగొచ్చు...." మళ్ళీ కోటయ్యే అన్నాడు.
"అబ్బే లేదు. నేను అలా అనడంలేదు."
"ఆదెమ్మా, ఈ గూడెంలో వుండే ప్రతిమనిషి నా మనిషి బాబూ! అందుకే వాళ్ళు వేసిన ముద్ద తినడానికి నేను అభిమానపడను."
"నన్ను కూడా మీ మనిషి అనుకో తాతా!"
కోటయ్య బోసినోరు విప్పి అదోలా నవ్వాడు.
"అవును తాతా! నన్ను నీ మనవడిగా భావించు."
"అంత అదృష్టమా బాబూ!" తనకు తనే చెప్పుకుంటున్నట్టు గొణిగాడు కోటయ్య.
"తాతా!"
"ఏం బాబూ!"
"నాతో వస్తావా?"
"ఎక్కడికి? ఎందుకు? నా చేతుల్లో ఇప్పుడు సత్తువలేదు. నేను ఇప్పుడేం చెయ్యగల్ను బాబూ దొరల ఇళ్ళల్లో?"
"నువ్వేం చెయ్యక్కర్లేదు."
"ఏమిటో బాబూ! నువ్వెందుకు వచ్చావో! ఎవరివో! నన్నెందుకు పోషిస్తానంటున్నావో అర్థం కావడం లేదు. అంతా అయోమయంగా వుంది."
గూడెంలో రద్దీ ఎక్కువైంది. "ఈ డబ్బు తీసుకో తాతా రేపొచ్చినప్పుడు అన్నీ వివరంగా చెపుతాను" అంటూ శరత్ కోటయ్యకు చేతిలో వందరూపాయల నోటు వుంచి గబగబా బయటికి వెళ్ళిపోయాడు.
15
రెండో రోజు శరత్ వచ్చేసరికి కోటయ్య అన్నం తింటున్నాడు.
సొరకాయ పులుసు కలుపుకొని ఆవురావురుమంటూ లొట్టలు కొడుతూ తింటున్నాడు. మధ్య మధ్య గోంగూర పచ్చడి నాలుకకు రాసుకుంటున్నాడు. కోటయ్య ముఖంలోకి చూస్తూ నిల్చున్నాడు శరత్.
మంచినీళ్ళ గ్లాసు కోసం తడుముకుంటూ వున్న కోటయ్య చేతికి శరత్ గ్లాసు అందించాడు.
"వచ్చావా బాబూ! నూరేళ్ళు వర్థిల్లు బాబూ!"
"ఎందుకు తాతా?" |
25,027 |
"ఈ వాతావరణం అలాంటిది. డిన్నరు రెడీ అని చెప్పడానికి వచ్చాను" అన్నాడు రమణ.
"డిన్నరా? వీళ్ళేం చేస్తారో, ఏం పెడతారో!" అంది సుభద్ర దిగులుగా.
"ఆ భయం లేదండి. మనం చెబితే ఎలా కావాలంటే అలా వండి పెడతారు" అన్నాడు రమణ.
"మరి మన తిండి అందరికీ సహిస్తుందా?"
"ఎవరికెలా కావాలో అలాగే చేస్తారు."
"అందరికీ తలోరకంగా చేస్తారా, పాపం కష్టం కదూ!"
"కష్టమేముంది? వూరికే చేయరు కదా, డబ్బు తీసుకుంటారు."
"ఎంత తీసుకుంటారేమిటి?"
రమణ నవ్వి, "మీకు తెలుసుకోవాలనుంటే చెబుతాను. మెహర్బానీకి కాదు"
"మొహమాట పడకు. నేనేమీ అనుకోను. నువ్వు మాయింట్లో మనిషికిందే లెక్క." అంది సుభద్ర.
"ఈ బోట్ హౌసులో మనం వారం రోజులుంటాం. మనం మొత్తం నలుగురం. మన నలుగురికీ ఈ వారం రోజులూ కావలసిన భోజనం పెడతారు. కావలసిన చోటుకి తిరగడానికి టాక్సి యిస్తారు. కావాలనుకున్నప్పుడల్లా బోటు షికారు చేయొచ్చు. అందుకు మొత్తం పన్నెండు వేలు."
"పన్నెండు వేలా?" సుభద్ర గుండె ఆగినంతపనైంది.
"కాశ్మీర్లో మనుషులెలా బ్రతుకుతున్నారో?" అంది హాస.
"బోట్ హౌసులోనే ఖరీదెక్కువ. ఈ బోట్లో ఇలాంటి రూమ్స్ వో నాలుగున్నాయి. ఈ బోటును అయిదేళ్ళక్రితం పదహారు లక్షలు ఖర్చు పెట్టి తయారు చేయించార్ట. అదంతా రాబట్టు కోవద్దు! అదీ కాక సీజనులో రేటు కాస్త ఎక్కువ. అస్తమానూ వీటికి గిరాకీ ఉండదు."
"ఏమైనా పన్నెండు వేలు ఎక్కువే!" అంది హాస.
"ఈ సదుపాయాలకు నాకేం ఎక్కువనిపించడం లేదు...." రమణ అన్నాడు.
"నాకూ అనిపిస్తోంది"
"నీకూ అనిపించదు కొన్నాళ్ళలో"
"ఈ రోజుకూ కొన్నాళ్ళకూ తేడా ఏమిటి?"
"నీకూ నాకూ ఉన్న తేడాయే!" అన్నాడు రమణ.
హాస అతడికి బదులివ్వకుండా, "అమ్మా! డిన్నరుకి వెళ్ళేముందు ముఖం కడుక్కుంటావా?" అంది.
"ముందు నువ్వు కడుక్కునిరా!" అంది సుభద్ర.
హాస బాత్రూంలోకి వెళ్ళిపోయింది!
"నువ్వేమీ అనుకోకు బాబూ! అందర్నీ తిరస్కారంగా చూసే మనిషి కాదు మా అమ్మాయి" అంది సుభద్ర.
"తిరస్కారానికి బాధపడనని తెలిసే అలా మాట్లాడుతుంది. ఆమెకు నేనంటే యిష్టమేనని నాకు తెలుసు" అన్నాడు రమణ.
హాస బాత్రూంలోంచి వచ్చింది. సుభద్ర తను వెళ్ళింది ఆమె వచ్చేదాకా రమణ, హాస ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు.
* * * *
డైనింగు హాల్లో నాలుగు టేబుల్సున్నాయి. ఒకో టేబులు దగ్గర నాలుగు కుర్చీలున్నాయి. ఆ టేబుల్సూ, కుర్చీలూ అలనాటి రాజరికాన్ని గుర్తు చేస్తున్నాయి.
హాల్లో టీ.వీ. వుంది. అందులోంచి ఏవో ఢిల్లీ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి.
నడిచి వస్తూంటే సుభద్రకు కర్ర మీద నడుస్తున్న అనుభూతి కలుగుతోంది. తామొక పడవలో ఉంటున్నామన్న భావం ఆమెను విడవడంలేదు. కానీ లోపల ఏర్పాట్లన్నీ ఆమెకు వింతగా ఉన్నాయి. పడవలో అన్ని సౌకర్యాలు సాధ్యమా అని ఆశ్చర్య పడుతోందామె. యిలాగే అయితే మనుషులు నేలమీద మాని నీళ్ళలోనే వుండొచ్చు. అప్పుడే వూళ్ళో కావాలంటే ఆ వూళ్ళోనే యిల్లు మారిపోతుంది. ప్రయాణం కూడా మనింట్లోనే చేయొచ్చు.
నలుగురూ డైనింగ్ టేబులు చేరుకున్నారు. కుర్చీల్లో కూర్చున్నారు.
టేబుల్ మీద ఖరీదయిన అందమయిన పింగాణీ డిన్నరు సెట్టుంది.
బంగాళా దుంపలు, టమోటాలు కలపి వండిన కూర, సాంబారు పొడి వాసన వేసే ముక్కల పులుసు, నిమ్మకాయ, వూరగాయ, గడ్డ పెరుగు, ముత్యాల రాశుల్లా అన్నం.
వాళ్ళకు కాస్త దూరంగా నిలబడి వున్నాడో కాశ్మీరీ నడివయస్కుడు. వాడు రమణతో ఏదో మాట్లాడాడు.
"అతడు వంటవాడు. వడ్డించనా అనడుగుతున్నాడు." అన్నాడు రమణ.
సుభద్ర అతణ్ణి చూసింది. వాడు గంభీరంగా ఆమె వంక చూస్తున్నాడు.
"మనమే వడ్డించుకుందాం" అంది.
అందరికీ హాస, సుభద్ర వడ్డించారు.
"ఈ కూర బాగోలేదే!" అంది హాస.
"ఇది బాగానే వుందమ్మా, కొంచెం కారం తక్కువ అంతే" అంది సుభద్ర.
"ఏమిటో, చపాతీ కూరలా ఉంది" అందీ హాస.
వంటవాడు రమణ దగ్గరగా వచ్చి ఏదో చెప్పాడు.
"వేడివేడి చపాతీలున్నాయట కావాలా?" అన్నాడు రమణ.
హాస వంట వాడి వంక చూసింది. వాడు గంభీరంగా హాసనే చూస్తున్నాడు.
"అమ్మా! ఈ పులుసేమిటో వాడిని అడగవే?" అంది హాస.
వెంటనే రమణ వాడిని అడగబోతే, "అలాకాదు, మా అమ్మే అడగాలి" అంది.
"నాకు భాషరాదు కదే!"
"దీనికి భాషెందుకు? పులుసు చూపించి ఏమిటని అడుగు."
సుభద్ర అలాగే చేసి, "క్యా" అంది.
వంటవాడు జవాబు చెప్పకుండా నవ్వేశాడు.
"అలా నవ్వుతాడేమిటే?" అంది సుభద్ర.
"వాడి ముఖంలో నవ్వు చూడాలనే నిన్ను క్యా అనమంట" అంది హాస.
రమణ ముసిముసిగా తనలో నవ్వుకున్నాడు.
* * * *
భోజనాలయ్యాక బోటు మీదకు వెళ్ళారు.
ఇంటిముందు గార్డెన్లో కూర్చున్నట్లు అక్కడ విశాలమైన ఆవరణ వుంది. దాల్ సరస్సులో బోట్లన్నీ ప్రకాశవంతమై__సరస్సు వజ్రాల హారాలు వేసుకున్న దేవకన్యలా వుంది. దూరంగా రాత్రి కాంతులతో మెరిసిపోతున్న శ్రీనగర్.
"ఇది నిజంగా శ్రీనగరమే! ఇక్కడ పేదరికం కనబడ్డం లేదు." అంది హాస.
"అందుకే భాగ్యవంతులందరూ ఇక్కడికొస్తారు. పేదరికం వాసన తప్పించుకుందుకిలాంటి వూళ్ళే మంచి మార్గం" అన్నాడు రమణ.
"అలాగనుకుంటాం. ఇండియాలో కనపడినా కనపడకపోయినా ప్రతిచోటా పేదరికం ఉంటూనే వుంటుంది" అంది హాస.
"కానీ యిక్కడ లేదు" అన్నాడు రమణ.
"అందం రోగాన్ని దాచగలదు. కానీ ఏదో ఒకరోజున రోగం ఆ అందాన్ని కబళించగలదు. రోగాన్ని నిర్మూలించకుండా అదుపులో వుంచిన అందమయిన నగరమిది" అంది హాస.
"కనిపించని రోగం గురించి ఆలోచించకపోతే మన నవ్వులో జీవముండదు" అని నవ్వింది.
ఆమె ఎందుకు నవ్విందో అర్ధం కాలేదు రమణకి. కానీ ఎప్పుడు నవ్వినా, ఎందుకు నవ్వినా నవ్వామె ముఖానికి సహజంగానే వుంటుంది.
"బాగా చలిగా ఉంది, లోపలకు పోదాం!" అంది సుభద్ర.
అప్పుడే హాసకూ చలి వేసింది.
* * * *
రాత్రి పది గంటలు.
సాయంత్రం పడుకున్న మూలానో ఏమో హాసకు నిద్రపట్టటం లేదు. తల్లివేపు చూస్తే ఆమె తదేక దీక్షతో తననే చూస్తున్నట్లనిపించింది.
"అలా చూస్తున్నావేంటమ్మా?" అంది హాస.
"నిన్ను చూస్తుంటే నువ్వు నా కూతురివేనా అనిపిస్తోంది."
"ఎందుకు?"
"ఎలా వచ్చిందే నీకింత అందం?" అంది సుభద్ర. అంతే ఆమె గొంతులో తడి ప్రారంభమయింది.
"నీ అందమే నాకొచ్చింది" అందామె.
సుభద్ర తనను తాను తమాయించుకునేందుకు ప్రయత్నిస్తోంది. బదులిస్తే ఏడుపు గొంతు తెలిసిపోతుందని భయపడిందామె.
"అమ్మా! అమ్మలందరూ యింత అందంగా ఉంటారా? లేక నువ్వు మాత్రమే యింత అందంగా ఉన్నావా?"
"మంచం ప్రక్కనే స్విచ్ వుంది. సుభద్ర లైటార్పేసి, అతి కష్టమయిన గొంతు పెగిల్చి, "పడుకో, నాకు నిద్రొస్తోంది" అంది.
"బాత్ రూమ్ కెళ్ళి వచ్చి పడుకుంటాను" అందామె.
హాస లేచి బాత్రూంకి వెళ్ళిన కొద్ది క్షణాల్లో ఆగకుండా దగ్గొచ్చింది.
సుభద్ర కంగారుపడి లైటువేసి బాత్రూమ్ తలుపు తట్టింది.
దగ్గు ఆగింది. బాత్రూం తలుపు తెరుచుకుంది.
హాస ముఖం అదోలా వుంది. ఆమె చేతిలో రుమాలు.
"దగ్గాపుకోలేకపోయానమ్మా! రుమాలడ్డం పెట్టుకుంటే ఏమిటో ఇదిలా ఎర్రబడింది" అందామె.
సుభద్ర ఆత్రుతగా ఆ రుమాలందుకుని చూసింది.
ఆమె కళ్ళలో నీళ్ళు తిరగటం హాస గమనించింది.
"ఇలా ఇదివరకెప్పుడైనా జరిగిందా?" అంది సుభద్ర.
"లేదమ్మా_ఇదే మొదటిసారి...."
సుభద్ర తనలో తనే గొణుక్కుని_ "ఇప్పుడు తేలిగ్గా ఉందా?" అంది.
"ఊఁ" అని బుద్ధిగా, అమాయకంగా తలూపిందామె. |
25,028 | నేనూ సాధ్యమైనంత ఆలస్యంగా బయలుదేరి ఎంత త్వరగా వచ్చెయ్యడానికి వీలుంటే అంత త్వరగా వచ్చెయ్యడానికే ప్లాన్ చేస్తున్నాను. ఈ సంగతే డెలిగేషన్ వాళ్ళకి కూడా తెలియచేశాను. అందుకనే నన్ను వాళ్ళు ఒకటోతేదీన బయలుదేరమని తెలియచేశారు. ఇక నువ్వు ప్రతిదానికీ అడ్డు తగలకు" అన్నారు.
"మీకు వాళ్ళు పెడతారు నిజమేనండీ. నాకు డబ్బు ఎక్కడ్నుండి తెస్తార"ని అడిగాను.
"అదంతా నీకెందుకు సరోజా! చిన్నమొత్తంకానీ, పెద్ద మొత్తం కానీ అడిగినప్పుడల్లా లేదనకుండా విశ్వేశ్వరరావుగారు మనకి ఇస్తున్నారా, లేదా? అడగ్గానే డబ్బు ఇవ్వడమనేది చాలా గొప్పసంగతి. ఈసారి కూడా అతన్నే అడుగుతాను. తప్పకుండా ఇస్తారు" అన్నారు.
"చూడండి అంత అప్పుచేసి నన్ను చైనా తీసుకువెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ డబ్బుతో ఇక్కడ ఏమైనా చెయ్యొచ్చు. ఇద్దరం ఊర్లో లేక పోవడం అసలు మంచిదికాదు. మీరెంత చెప్పినా నేనుమాత్రం రానంటేరాను" అన్నాను.
"నీతో సాల్లేం సరోజా! జగమొండివి. అవునంటే ఔను. కాదంటే కాదే. ఇటువంటి అవకాశాన్ని ఎవరైనా కాలదన్నుకుంటారా? ఏం చేస్తాం" అని విసుక్కున్నారు.
పరిస్థితులైతే అనుకూలంగానే ఉన్నాయి. కానీ ఆర్ధికంగా మాకట్టే బాగులేదు. అందుకనే అన్నీ ఆలోచించి రానని మొండికేశాను.
పాస్ పోర్టుకి ప్రయత్నాలు చేస్తూనే వున్నారు. సీతా ట్రావెల్స్ వారి శాఖలో పనిచేస్తున్న శ్రీ శర్మగారు పాస్ పోర్టు విషయంలో చాలా సాయపడుతున్నారు. ఏరోజుకా రోజుకి పాస్ పోర్టు ఆఫీసరుకి టెలిఫోన్ చేస్తూనే వున్నారు.
ఒకరోజు ఆయనకు పాస్ పోర్టు ఆఫీసు నుండి ఫోన్ వచ్చింది.
"మీకేనండి ఫోను" అన్నాను. ఫోన్ లో మాట్లాడారు. గొంతు డల్ గా వినిపించింది.
"ఏమయింద"ని అడిగాను.
'మీ పాస్ పోర్టు సిద్ధంగానే వుంది. సంతకం పెట్టడానికి నేను సిద్ధంగా వున్నా డిల్లీ నుంచి క్లియరన్స్ రావడమే తరువాయి' అన్నారట వాళ్ళు. రోజులు గడిచిపోతున్నాయి. వారికి పాస్ పోర్టు రాలేదు. వారిని చూస్తుంటే నాకెంత జాలిగా వుండేదో చెప్పలేను.
"ఏవండీ పద్దెనిమిదవ తేదీ అయిపోయింది. మీ పాస్ పోర్టు ఇంకా రాలేదండీ" అనడిగాను.
"నాకూ అదే అర్ధంకాలేదు సరోజా! డెలిగేషన్ సభ్యులంతా వెళ్ళిపోయి వుంటారు. అయినా వాళ్ళందరికీ మంజూరుచేసి నాకుమాత్రమే పాస్ పోర్టు నిరాకరించడం జరుగుతుందని నేననుకోను. ఎందువల్లనంటే వాళ్ళలా చేశారనుకో. నా కీర్తి మరీ పెరిగిపోతుంది. కానీ ఏంచేస్తాం? వచ్చినా మాబాగే. రాకపోయినా మా బాగే" అన్నారు. అన్నారేకానీ వారి ఆందోళనా ఆలోచనా నాకుతెలీదా? తెలిసినా ఏం చెయ్యగలను?
దేనికీ ఆశపడరు. దేనిమీదా మోజులేదు. అటువంటి వ్యక్తి చైనా వెళ్ళడానికి అంత ఆశ పడుతున్నారంటే నిజంగానే అప్పుడు నేను పూజిస్తున్న దేవుడిమీద నాకు ఒళ్ళు మండిపోయింది. ఆయన కోరిక నెరవేరాలని మనస్సులోనే మొక్కుకున్నాను. పైకి ఆమాట అంటే చంపేస్తారు.
రాత్రి పదకొండు గంటలైంది. గదిలో మంచంమీద కాలుమీద కాలు వేసుకొని, అలవాటు ప్రకారం కుడిచేతి చూపుడువేలుతో గాలిలో ఏదో రాసేస్తున్నారు.
"ఏవండీ" అని పిలిచాను.
"నువ్వింకా నిద్రపోలేదా?" అని అడిగారు.
"అదే నేనూ మిమ్మల్ని అడుగుతున్నాను. రేపు మీకు పాస్ పోర్టు వచ్చేస్తుంది. అట్టే ఆలోచించకుండా నిద్రపోండి" అన్నాను.
"అంటే నువ్వు రావడంలేదుగా" అని అడిగారు.
నేను నవ్వాను.
"నేనడిగిన దానికి అదేనా సమాధానం?" అన్నారు.
"చూడండి ముఖ్యంగా వెళ్ళాల్సిన వారు మీరు. మీ సంగతి ఇంకా తేలలేదు మధ్యలో నాగొడవ వేరే ఎందుకండి. నేనొక్కసారి ఏదంటే అదే" అన్నాను.
"సరే. వెళ్ళిపడుకో నువ్వన్నదీ నిజమే" అన్నారు.
"సరేకానీ మీరు చైనా వెళితే నాకేం తెస్తారు?" అని అడిగాను.
"ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగడట. అలాగుంది. ముందు నన్ను వెళ్ళనియ్యి తర్వాత చూద్దాం" అన్నారు.
"మీరు తప్పకుండా వెళతారండి. నా మాట నమ్మండి. మీకూ నాకూ పందెం" అన్నాను.
"అబ్బ! విసిగించకు. అర్దరాత్రి ఇలా పట్టుకున్నావేమిటి?" అన్నారు. "సరేలెండి. ఆలోచనలతో మీ బుర్ర వేడెక్కిపోతుంది. ఆ కోపం నామీద చూపుతున్నారు" అంటూ లేచాను.
"ఎక్కడికి వెళ్ళిపోతున్నావు?" అన్నారు.
"ఎక్కడికి పోతాను? ఈ గదిలో మీదగ్గరుంటే ఏదో వొకటి వాగకుండా ఉండలేను. మీరు విసుక్కోకుండా ఉండరు. అందుకనే హాల్లోకిపోతాను" అన్నాను.
"పద_నేనూ హాల్లోకే వస్తాను" అన్నారు.
చుట్టూ పిల్లలు నిద్రపోతున్నారు. మధ్య మేమిద్దరం పిల్లల దగ్గర నడుం వాల్చాం.
"ఏవండీ. రేపు మీ పాస్ పోర్టు వచ్చేస్తే నాకేమిటిస్తారు?" అనడిగాను.
"నువ్వేది అడిగితే అదే ఇస్తాను" అన్నారు.
"పందెం కడతారా?" అన్నాను.
"ఎంత?" అని అడిగారు.
"నూరు రూపాయలు" అన్నాను. |
25,029 |
"అయితే - ఆ గది అటుపక్క నున్న మరో తలుపులోంచి ఎవరో అతని గదిలోకి వెళ్లుంటారు." మనసులో అనుకుందామని బయటికే అనేశాడు రాజారామ్.
ఆఫీసు బాయ్ అతన్నే చూస్తూ ఉండిపోయాడు. రాజారామ్ ముందుకు నడిచాడు. చీఫ్ సబ్ జనార్ధన్ గుంపులోంచి బయటికి వచ్చి రాజారామ్ ని పలకరించాడు.
"ఏం జరిగింది సార్?"
"అప్పారావుని ఎవరో చంపేశారు. బ్రాస్ ప్లవర్ వేజ్ తో అతని నెత్తిమీద కొట్టారు."
జనార్ధన్ నమ్మలేనట్టు చూశాడు.
"నిజమే...నీ పని కానీ..."అంటూ తన సీటు వేపు నడిచాడు. మధ్యలో రాజేశ్వరి సీటు దగ్గర ఆగాడు. అతని మొహంలోకి చూస్తూనే ఏదో జరగకూడనిది జరిగి ఉంటుందనిపించింది ఆమెకి. ఆమె అడగకుండానే జరిగిందంతా చెప్పాడు రాజారామ్. అంతలో రమణితో కబుర్లు చెప్తున్న భవానీ ఇటు చూసింది. రమ్మని సైగ చేసింది రాజేశ్వరి. సంగతి వినగానే భవానీ అప్పారావు గది వేపు చూసింది.
"సరే...మీరు రమణిని చూస్తూ ఉండండి. నేను మహావీర్ గారి దగ్గరికి వెళ్తాను." అంటూ చక చక అటు నడిచింది.
0 0 0
సాయంత్రం అయిదు గంటలయింది. లంచ్ రూంలో రాజారామ్, రాజేశ్వరి, రమణి కూర్చున్నారు.
అప్పుడే వచ్చిన మహావీర్, భవాని మౌనంగా వాళ్ళ ముందు కూర్చున్నారు.
"మా పోలీస్ ఫోర్సంతా మీ ఆఫీసులోనే ఉంది. ఈ కేసుని కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఇన్ స్పెక్టర్ దుర్గారావు చూస్తారట. విజయనగర్ కాలనీలో సుమిత్ర హత్యకీ దీనికీ సంబంధం లేదు పొమ్మంటున్నాడు....ఆయన!" అంటూ మహావీర్ నిట్టూర్చాడు.
"మరా చెవి రింగు సంగతేమిటి?"
"ఏం చెప్పినా వినడం లేదాయన ఇకపోతే మీ ఎం . డి, విరించిగారు- మీ గురించీ అప్పారావు గురించి ఏదేదో చెప్తూ దుర్గారావుని ఊదరగొట్టేస్తున్నాడు."
అంతలో భవాని లేచింది. "రమణి బాగా అలసిపోయింది. తనని తీసుకుని నేను మీ ఇంటికి వెళ్తా" అంటూ రమణిని చూసి చెయ్యి అందించింది.
లిఫ్టు వేపు వెళ్తున్న ఇద్దర్నీ చూస్తూ "రాజారామ్ గారు నేను మళ్ళీ అక్కడికి వెళ్తాను. దుర్గారావు ఆలోచన తప్పని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను" అన్నాడు మహావీర్.
"ఇంతకీ ఆయన ఆలోచన ఏమిటి?"
"ఆయన ఆలోచన ప్రకారం చూస్తే- మీరు రైలు పట్టాల మధ్య నిలబడి ఉన్నారు. ..మీకు ఫర్లాంగు దూరంలో గంటకి వెయ్యి మైళ్ళ వేగంతో వస్తున్న డీసెల్ ఇంజన్ ఉంది!" అంటూ నవ్వాడు.
"అంటే?" అంది రాజేశ్వరి.
"రాజారామ్, అప్పారావూ, ఘర్షణ పడ్డారు. ఈవేళ ఉదయం నుంచీ ఇప్పటి వరకూ అప్పారావు గదిలోకి వెళ్ళింది ఒక్క రాజారామ్ గారే! రాజారామ్ గారు తనకొస్తుందనుకున్న ప్రమోషన్ అప్పారావు కొట్టేశాడు. అప్పారావు తెలివి తేటలూ, చొరవా రాజారామ్ గారికి లేవు. ప్రమోషన్ సంపాదించనందుకు అతనంటే ఈయనకి జెలసీ!! అదీ దుర్గారావు కథ. అఫ్ కోర్స్ మీరేం వర్రీ కాకండి. ఆయన కథలో నేను మలుపులు ప్రవేశపెడ్తాను." అంటూ మహావీర్ లేచాడు. మేనేజింగ్ డైరెక్టర్ చాంబర్స్ వేపు నడిచాడు.
రాజారామ్, రాజేశ్వరి మౌనంగా ఉండిపోయారు.
అలా ఓ అయిదు నిమిషాలు.
"రమణిని నేను బేబీస్ యూనివర్స్ కి ఇవాళ తీసుకువెళ్ళకుండా ఉంటె బాగుండేదేమో....ఒక వేళ వెళ్ళినా జాగ్రత్తగా ఉంది ఉండాల్సింది...ఇదంతా నావల్లే జరిగింది." అంది రాజేశ్వరి.
"ఇందులో ఎవరి తప్పూ లేదు. జరగాల్సింది జరిగింది. అంతే!" అన్నాడు రాజారామ్. అంటూ ఆమెని చూశాడు.
రాజేశ్వరి కళ్ళలో నీళ్ళు.
దగ్గరికి వెళ్ళి ఆమె భుజంమీద చెయ్యివేశాడు. మరోచేత్తో ఆమె బుగ్గని మృదువుగా రాశాడు. ఆమెనలా చూస్తోంటే తన ఒంటరితనం పారిపోతునట్టు అన్పించింది. అండగా కొండంత శక్తి ఉన్నట్టు సంతృప్తి, ఆమెని గట్టిగా తన గుండెలకి అదుముకుని, బుగ్గమీద ముద్దు పెట్టుకున్నాడు.
రాజేశ్వరి నెమ్మదిగా అతని బంధం నుంచి బయటపడింది.
"దగ్గరగా వద్దామనుకుంటూ ఉంటె-దూరంగా అయిపోతున్నావేం?"
"ఎందుకనా? నేనో పెద్ద ఫూల్ ని. అందుకు 'ఆంధ్రా టైమ్స్' అసిస్టెంట్ ఎడిటర్ గారూ, మీ కోసం పెద్ద న్యూస్ స్టోరీ వెయిట్ చేస్తుంది. వెంటనే వెళ్ళి పాపం, దాని సంగతి చూడండి!" అంది రాజేశ్వరి నవ్వుతూ.
0 0 0
డెస్క్ రూంవేపు నడిచాడు రాజారామ్. అప్పారావు గది లోపల పోలీసులు, గది ముందు పోలీసులు, ఫోటో గ్రాఫర్లు, వేలి ముద్రల నిపుణులు బిలబిలలాడ్తూ తిరుగుతున్నారు.
డెస్క్ రూంకి వెళ్ళాడో లేదో, ఒక ఆఫీస్ బాయ్ వచ్చి 'ఎండీ' గారు రమ్మన్నారని కబురు చెప్పాడు. రాజారామ్ వెళ్ళేసరికి ఎండీ విరించి తన రివాల్వింగ్ చెయిర్లో వెనక్కివాలి ఏదో దీర్ఘాలోచనలో మునిగి ఉన్నాడు. అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో ఇన్ స్పెక్టలిద్దరూ కూర్చుని ఉన్నారు. వాళ్ళకి కొంత దూరంలో ఏర్ కండిషనర్ దగ్గరగా చైర్మన్ రాజభూషణరావు ఎటో చూస్తూ ఏదో ఆలోచిస్తున్నారు.
"మనం అంతా కూర్చుని మాట్లాడుకుంటే బాగుంటుందని ఇన్ స్పెక్టర్ దుర్గారావు గారూ సజెస్ట్ చేశారు. ఎందుకంటే మన పేపర్ ప్రతిష్ట ఒకటి చూసుకోవాలి!" అన్నాడు విరించి - రాజారామ్ వేపు చూడకుండా.
దుర్గారావు లేచి నిలబడ్డాడు. "ఆంధ్రా టైమ్స్ ఇమేజ్ దెబ్బతినే పని చేయడం మాకు ఇష్టంలేదు. కాని మీ పరిస్థితి....ఎన్నో అనుమానాలను ఆస్కారం కలిగించేదిగా ఉంది రాజారామ్ గారూ!" అన్నాడు రాజారామ్ కళ్ళలోకి సూటిగా చూస్తూ. "అప్పారావుని బతికి ఉండగా ఆఖరుసారి మీరే చూశారు. మీరతన్ని కొట్టారు. మీరేమంటారు?"
"అవును కొట్టాను."
"ఆయన్ని మీరు కొట్టి, బయటికి వచ్చిన తరువాత ఎవరూ ఆయన గదిలోకి వెళ్ళలేదు!"
"ఆ గదికి వెనకనుంచి మరొక తలుపు ఉంది. దానికి ఆటోమాటిక్ లాక్ ఉంది. బయటనుంచీ లోపలనుంచీ కూడా ఆ తలుపుని తెరవ్వొచ్చు...." అన్నాడు రాజారామ్.
"మీరు ఎక్స్ పెక్ట్ చేసిన ప్రమోషన్ ఆయనకీ వచ్చింది. ఈ విషయం ఒక్కటే కాక, ఎన్నో సందర్బాల్లో మీరాయనతో గొడవపడ్డారు. అవునా? కాదా?" |
25,030 | అప్పుడే మేమొక నిర్ణయం తీసుకున్నాం. ఎలాగైనా హోంమంత్రిని పదవినుంచి దించెయ్యాలని చీఫ్ మినిస్టర్ని కలిసాం. గవర్నర్ ని కలిసాం ప్రైంమినిస్టర్ కి రిపోర్ట్ చేసాం. ఏం లాభంలేదు - డబ్బు - గుండాగిరి ఈ రెండూ వున్న ప్రతివాడూ ఇవాళ రాజకీయ నాయకుడవుతున్నాడు.
ఆ రాజకీయ నాయకులు విద్యార్ధుల్ని కీలుబొమ్మల్ని చేసి ఆడిస్తున్నారు. నిరుద్యోగుల్ని బలిపశువుల్ని చేస్తున్నారు.
ఈ కూహనా రాజకీయమ్మీద మేం తిరుగుబాటు చేస్తున్నాం. మాకు నక్సలైట్ల సపోర్టు లేదు. మేం రాడికల్స్౦ కాదు. హింసావాదం మా సూత్రం కాదు విద్యావ్యవస్థని సర్వస్వతంత్రంగా మార్చమనే మా పోరాటం.
పదవిలో వున్న ఏ రాజకీయ నాయకుడూ ఇవాళ ప్రజల గురించి ఆలోచించడం లేదు. ఎలక్షన్ల ముందు ఏవో కల్లబొల్లి కబుర్లు చెప్పి ఓట్లు గుంజుకుని గెలిచిన ప్రతివాడూ అయిదేళ్ళపాటు ప్రజల్ని మరచిపోతాడు. ఎమ్.ఎల్.ఏ కాకముందు, ఎర్రని ఏగాణి కూడా లేనివాడు అయ్యాక లక్షలక్షలు సంపాదిస్తున్నాడు. మినిస్టర్ అయ్యాక కోట్లు సంపాదిస్తున్నాడు. చీఫ్ మినిస్టర్ అయ్యాక కోటానుకోట్లు సంపాదిస్తున్నాడు.
ఎలా సంపాదిస్తున్నాడో ఎవడికీ అక్కర్లేదు. ఎవరూ పట్టించుకోరు. మామూలు మనిషి పది రూపాయలు దొంగతనం చేస్తే పట్టుకొని జైల్లో పెడతారే, మరి ఈ పొలిటీషియన్లు జోలికి ఎవరూ ఎందుకు వెళ్ళడం లేదు?
ఎక్కడుంది లొసుగు?
అందుకే అక్రమంగా, అన్యాయంగా, దౌర్జన్యంగా ప్రజల్ని, అమాయకుల్ని పీడించే రాజకీయ నాయకులకు బుద్ది చెప్పడానికి మేం ఉద్యమించాం.
ఒక నెల రోజుల్లో ఎలక్షన్లు జరుగుతున్నాయి.
ఈ ఎలక్షన్లలో అక్రమంగా గెలవడానికి ప్రయత్నించే రాజకీయ నాయకుల మీద మేం కన్నేసి వుంచాం. ప్రజాబలం లేకుండా డబ్బు ద్వారా, సారాద్వారా, రిగ్గింగ్ ద్వారా గెలవాలనుకుంటున్న వాళ్ళ ప్రయత్నాలకు అడ్డుకట్ట వేస్తాం. అందులో భాగంగానే హోంమంత్రి నిన్నటి సభను ధ్వంసం చేసాం." చెప్పాడు అరవింద్.
నీలిమ కొద్ది క్షణాలు విచిత్రమైన ఆనందోద్వేగానికి గురయింది సరిగ్గా తను ఎన్నుకోవలసి ఉన్న వ్యక్తి - అంత త్వరగా తారసపడతాడనుకోలేదు. లక్ష్యం గొప్పదైనా దాన్ని సాధించేందుకు ఎన్నుకొనే మార్గం ఆవేశం, ఉద్రేకంతో కూడుకున్నది కాకూడదనేదే తన లక్ష్యం, ఇతను సరీగ్గా తనకు తగిన జోడీ....గొప్ప యాదృచ్చికం...
"లక్ష్యం లేకుండా ధ్వంసం చెయ్యడంలో అర్ధంలేదు" నీలిమ అంది.
అతనికేసే పరిశీలనగా చూస్తూ.
"ధ్వంసం చెయ్యడం మా లక్ష్యంకాదు. కానీ కుహవా రాజకీయ వాదుల నుంచి సమాజాన్ని రక్షించడం ఈనాటి యువత కనీస బాధ్యత. మేం సమాజానికి చేసే మంచి, కొంచమైనా చెడుని తొలిగించడమే."
"మీ ఆశయం గొప్పదే. కానీ ఇవాల్టి రాజకీయం రావణకాష్టం లాంటిది. అది మిమ్మల్ని వెంటాడి వెంటాడి చంపుతుంది. అందుకు మీరు సిద్దంగా వున్నారా?"
"మేం సిద్దంగావున్నాం అందుకు అన్ని విధాలుగా సన్నద్దులమౌతున్నాం కూడా. మమ్మల్ని చూసి మరో పదిమంది మా ఉద్యమానికి సపోర్టు ఇస్తారన్న నమ్మకం మాకుంది. ఎందుకంటే ఇవాల్టి యువత ఎంత నిరాశతోవుందో మీకు తెలుసు.
అష్టకష్టాలుపడి చదివిన వాళ్ళు ఇవాళ రోడ్లమీద తిరుగుతున్నారు. ప్రతిభ ఉన్నవారు పస్తులుంటున్నారు. డబ్బున్నవాడే ప్రతిభావంతుడిగా చెలామణి అవుతున్నాడు.
ఎంతమంది డాక్టర్లు, ఎంతమంది ఇంజనీర్లు, ఎంతమంది సైంటిస్టులు, ఎంతమంది విద్యావేత్తలు విదేశాలకు వలస వెళ్లిపోతున్నారో చూడండి.
ఈ దేశంలో వాళ్ళకు విలువలేదు కాబట్టి.
జపాన్, కొరియాలాంటి దేశాలు అహర్నిశలూ పారిశ్రామిక ప్రగతిని సాధిస్తుంటే మనం ఐ.ఎమ్.ఎఫ్. అప్పుకోసం తిరుగుతుంటాం. ఒకకొత్త యంత్రాన్ని కనిపెట్టడం కోసం జపాన్ లోని వ్యక్తి పరిశోధనలు చేస్తుంటే, ఇండియాలోని వ్యక్తి మరొకపిల్లాడ్ని కనడానికి ప్రయత్నం చేస్తుంటాడని ఒక అమెరికన్ మన ఇండియా గురించి ఆ మధ్య వ్యాఖ్యానించాడు. ఇందులో నిజంలేదా చెప్పండి.
దీనికి కారణం ఎవరు?
పవర్ లోవున్నా రాజకీయ నాయకులే కదా...? వారి స్వార్ధమేకదా...!
పొలిటీషియన్లే మా టార్గెట్ ఆవేశంగా చెప్పాడు అరవింద్.
ఆ సమయంలో ఒక్కసారి తన తండ్రి జ్ఞాపకం వచ్చాడు నీలిమకు.
తన తండ్రి దారుణహత్యకు కారణం రాజకీయం దుర్మార్గమైన రాజకీయానికి తన తండ్రి బలయిపోయాడు.
తను కక్ష తీర్చుకోవాల్సిన సమయం వచ్చింది.
అరవింద్ ను నఖశిఖ పర్యంతం పరిశీలిస్తోంది. అరవింద్ మాటల ద్వారా, చేతలద్వారా అతను వ్యక్తిత్వాన్ని అంచనా వెయ్యదానికి ప్రయత్నిస్తోంది నీలిమ.
అప్పటికి పోలీస్ ఇన్ స్పెక్టర చెప్పిన గడువు పూర్తికావడానికి ఇంకో పదినిముషాలుంది.
తర్వాతేం చెయ్యాలో ఆలోచిస్తున్నాడు అరవింద్.
* * * * *
"మధర్ థెరిస్సా లాగా హెల్ప్ చేయడానికెళ్ళింది. ఇరుకునపడింది ఇప్పుడెలాగే" కంగారుపడుతూ అంది సురభి.
"ఏం కంగారుపడద్దని చెప్పిందికదే చూస్తే ఇదేదో డ్రామాలా వుంది. వస్తుంది కదా" ముగ్ధ అంది.
"ఆ కుర్రాడు బాగుంటాడా?" అలక ఆసక్తిగా అడిగింది.
"ఎర్రగా, బుర్రగా బాగుంటాడు కానీ బ్లైండ్ మాన్" చెప్పింది ముగ్ధ.
"గుడ్డివాడా" వికారంగా మొహంపెట్టి అంది అలక.
"ఏదయినా ప్రమాదం జరిగితే?" అనుమానం వచ్చింది సురభికి.
"ప్రమాదమూ లేదు పాదూలేదు గాని వెయిట్ అండ్ సీ ఏవైనా జోకులు చెప్పు. ఈ టెన్షన్ తగ్గుతుంది" అలక అంది సురభితో.
"చిన్నపిల్లలా జోకులేమితే జోకులు. ఆ బాడీ లాంగ్వేజ్ గురించి చెప్పవే ప్రాక్టీస్ చేస్తాను నేనుకూడా" అంది సురభి.
"బాడీ లాంగ్వేజ్ గురించా అయితే చెప్పు" అలక అంది.
"ఎగ్జాంపూల్స్ చెప్పనా థీరీ చెప్పనా" అడిగింది ముగ్ధ.
"రెండూ చెప్పవే. ఫ్యూచర్ లో ఈ మగాళ్ళతో బాధలు పడకుండా వుండాలంటే దీని అవసరం బాగానే వుండేటట్టు వుంది" అంది అలక.
"ఓ.కే అయితే వినండి. మనిషి దేహంచుట్టూ ఓ కాంతి వుంటుంది తెల్సుకదూ మన పాతదేవుళ్ళ పటాలు చూసినా, పౌరాణిక సిన్మాలు చూసినా, చుట్టూ కాంతి తిరుగుతున్నట్టు వుంటుంటే... పురాణాల్లో చెప్పిందే శాస్త్రజ్ఞులు కూడా ధృవీకరించారు. అలాగే మనిషి చుట్టూ కూడా ఆ మనిషికి చెందిన పర్సనల్ స్పేస్ కొంత వుంటుంది. అలాగే జంతువులకు కూడా. |
25,031 | రూపుదిద్దుకుంటున్న పరిణామాలకి అందరికన్నా అమితంగా ఆనందించింది ఏకాంత "నీ శక్తికి నాజోహార్లు పిపీలికమనుకున్న నువ్వు ప్రపంచమంతగా విస్తరించి నీ మేధస్సుతో అనితరసాధ్యమైన సంఘటనలకి కారణమయ్యావే... ఇక మిగిలింది నా వంతు కర్తవ్యాన్ని నేను నిర్వహించడమేగా ఆ ప్రయత్నంలో నేనేమైనా కానియ్...నేను ఏ ఫలితాన్ని ఆశించి పతనానికి సిద్దపడ్డానో అది సాధించిన నీ కోసం నేను నా జీవితాన్ని పెట్టుబడిగా ఉపయోగిస్తేనేం..."
పైకి లేచింది ఏకాంత కొత్త ఊపిరిని నింపుకున్న ఉద్వేగంతో.
* * *
ఉదయం పదకొండు గంటల సమయం...
పాపం పేరుకున్న నేలపై సూర్యకిరణాలు, వజ్రాయుధాల్లా తాకుతున్న వేళ.
అసెంబ్లీకి అర్జెంటుగా వెళ్ళాల్సిన హోం మినిస్టర్ సూర్నారాయణ సీక్రెట్ రియాట్ లోని ఛాంబర్ నుంచి దూకుడుగా కారు దగ్గరికి వెళ్తుంటే పత్రికావిలేఖర్లు అడ్డం పడ్డారు...
రెండు రోజులుగా పత్రికల వాళ్ళకి మొహం చాటేసి దొంగలా దాక్కుంటున్న సూర్నారాయణ ఇక్కడ ఇలా దొరికిపోవడాన్ని తట్టుకోలేక "అవతల నాకు అర్జెంటు పనులున్నాయి" అన్నడు తప్పించుకోబోతూ.
"వ్యక్తిగతమైన పనులా?"
అడిగింది ఆశ్రితగా తెలీడంతో మరింత కంగారుపడ్డాడు.
"లేదు ప్రజాప్రతినిధినిగా ప్రజలకి సంబంధించిన పనుల్లోనే తలమునకలై వున్నాను."
"ఆ ప్రజలే తల బద్దలుకొట్టుకుంటున్నారు" ఠక్కున అంది.
"దేని విషయంలో?"
"రాష్ట్ర శాంతిభద్రతల గురించి."
"శాంతి భద్రతలకేమైంది? అంతా సుభిక్షంగానే వుందిగా?"
"ఉందని మీరంటే చాలదు మినిస్టరుగారూ... ఎలా ఉందో, ఉందని వాళ్ళెందుకు నమ్మాలో సోదాహరణంగా వివరించాలి?"
"ఆనక చెబుతాను."
"అలా పారిపోకండి."
ఆశ్రిత స్టేట్ మెంటుతో ఒళ్ళు మండిపోయింది... ఒంటరిగా దొరికితే చాచిచెంప పగలగొట్టేవాడే. అసలు తన కొంపని కూల్చటానికి నడుంకట్టిన ఈ ఆడపిల్లని ఎప్పుడో లేపేసివుంటే ఇంత రాద్దాంతం జరిగేది కాదు... వెర్రి వెంగళాయిలా చాలా తాత్సారం చేశాడు.
"ఏమిటి ఆలోచిస్తున్నారు?" అడిగింది ఆమె.
"నీ గురించే" నాలుక జారిన సూర్నారాయణ తొట్రుపడి "అదే నువ్వడిగిన ప్రశ్న గురించి" ఆనందు నీళ్ళు నమిలేస్తూ.
"చెప్పండి..." క్షణం ఆగి అంది ఆమె "అమర్ అనబడే విద్యార్ధి కిడ్నాప్ జరిగి ఇప్పటికి చాలా రోజులైంది. స్టూడెంటు కమ్యూనిటీ అంతా అతడికోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు...ఖచ్చితంగా ఏమయ్యాడో తెలియచేస్తే రేపు ఎలక్షనులో వాళ్ళ ఓటు మీకే దక్కే అవకాశముంది".
ఈ మధ్య పద్దెనిమిదేళ్ళకే ఓటు హక్కు ఇవ్వటం అన్నది ఈ క్షణంలో ఎంత అనర్ధానికి కారణమైందో గుర్తుచేసుకుని- "తప్పకుండా అమర్ ని రక్షిస్తాను" అన్నాడు.
"ఎలా?"
"నాకు వదిలేయండి".
"కాని అంతా మీరే కిడ్నాప్ చేయించారనుకుంటున్నారు."
సూర్నారాయణకి ఒళ్ళు మండిపోయింది. "నాకేం పట్టింది..."
"మీ అమ్మాయి శ్వేత ప్రేమించింది కాబట్టి. అమర్ మీకు అల్లుడు కావడం మీకిష్టం లేదు కాబట్టి."
"నేను నమ్మను".
"మీ అమ్మాయి రాసిన ప్రేమలేఖలు..."
"వద్దు" అరిచాడు తేలుకుట్టిన దొంగలా "ఆ డిటైల్స్ నాకు అవసరంలేదు."
"అవసరం లేదంటే చాలదు సూర్నారాయణగారూ! అప్పుడెప్పుడో రాజేష్ అనే స్టూడెంటుని మీరు కాలేజీ క్లాస్ లోనుంచి గూండాలసాయంతో బయటికి లాక్కురావడమూ, అతడ్ని హింసించడమూ, ఆనక ఆ విద్యార్ధి ఆత్మహత్య చేసుకోవడమూ ఇంకా ప్రపంచం మరిచిపోలేదు. ఆ రాజేష్ కూడా మీ శ్వేత ప్రేమించిన అబ్బాయేనని కాలేజీ స్టూడెంట్స్ అందరికీ తెలుసు. రేపు మీ మీద కూడా ఎంక్వైరీ మొదలైతే చెప్పటానికి వందలమంది స్టూడెంట్స్ సిద్దంగా వున్నారు."
అప్పటికే చెమటలు పట్టిన సూర్నారాయణ ఆశ్రిత ప్రక్కన వున్న మిగతా విలేఖర్లను చూస్తూ-
"ఖండిస్తున్నాను" అన్నాడు.
"ఏమిటి ఖండించేది?" మరో విలేఖరి అడిగాడు.
"పోలీసుల వైఫల్యాన్ని."
"పోలీసులూ అంటే సిటీ కమీషనర్ అని మీ ఉద్దేశ్యమా?"
తొట్రుపడ్డాడు సూర్నారాయణ "అబ్బే....ఆయనకింద చాలామంది ఉన్నారుగా..."
"ఉన్నారు సరే..." ఆశ్రిత ఇప్పుడు అసలు సిసలైన అస్త్రాన్ని సంధించాలని ప్రయత్నించింది. "కాని అందులోని ఓ ఎ.సి.పి తన తండ్రే మొన్న జరిగిన హత్యా ప్రయత్నం మొదలుకుని ఏకాంత అనబడే ఓ ఆడపిల్లని హంతకురాలని నిరూపించడం దాకా కారణమని స్టేట్ మెంటు ఇవ్వడం జరిగింది. పైగా బాంబు బ్లాస్ట్ లో చనిపోయిన మేఘనాథ్ అదే ఎ.సి.పి తో ఒకనాడు ఏకాంతను హంతకురాలిగా నిరూపించింది వివేక్ అనబడే స్టూడెంటు శవాన్ని ఆధారంగా తీసుకునే అని మరణవాంగ్మూలంలో తెలియచేశాడు. ఆ వివేక్ కూడా ఇప్పటి అమర్ లాగే ఒకనాడు మీ అమ్మాయి శ్వేతని ప్రేమించాకనే సవ్యసాచిగారిచేత చంపబడ్డాడని తండ్రిగా అప్పటి సంఘటనల్ని వివరించి..."
"ఆపేయ్" కంపించిపోతున్నాడు సూర్నారాయణ.
ఏ పత్రికలు తలచుకుంటే ప్రజా ప్రభుత్వాన్ని తలక్రిందులు చేయగలవో, తనకు చెందిన ఏ వివరాలు ప్రజలకి చెబితే తన ఉనిక్కే తిరుగులేని ప్రమాదం వాటిల్లుతుందో, ఏ విషయాలు వశిష్ట ద్వారా పత్రికలదాకా వెళ్ళకుండా ఈ క్షణందాకా గోప్యంగా వున్నాయో వాటిని ఇప్పుడు బహిర్గతం చేసింది ఆశ్రిత.
వశిష్ట ఆ నిజాల్ని మొన్నటి ఇంటర్వ్యూలో తెలియచేయనిది సరయిన ఆధారాలు దొరక్క అయితే, తను సాక్షిగా నిలబడి విన్న వాస్తవాలను యిప్పుడు జర్నలిస్టుగా బయటికి కక్కేసింది.
రాజకీయాల్లో అడుగుపెట్టడానికి ప్రజల ఓట్లు ఎంత అవసరమో, పదవిలో ఎదిగేవాడికి పోలీసుల అండ కూడా అంతే అవసరం. అయితే ఒక పోలీసు అధికారి మూలంగా పదవి కోల్పోయే పరిస్థితి వస్తే....ఆ నాయకుడికి అతడితో సఖ్యతకన్నా తనను తాను కాపాడుకోవడం ముఖ్యమయిపోతుంది.
"అదే నిజమయితే మేఘనాథ్ ఇంతకాలమూ నిశ్శబ్దంగా ఎందుకు వున్నాడు?"
"పిరికితనం..."
"ఇప్పుడు నువ్వింత దైర్యంగా అంటున్నావూ అంటే నీ దగ్గర ఆధారాలు వున్నాయా?" |
25,032 | "అంటే మనం లాయర్ నీలకంఠన్ ని మరే సందేహం లేకుండా కలుసుకోవచ్చాన్నమాట" యింకా భయపడుతూనే అన్నాడు అంకుష్.
"కలుసుకోవచ్చు. కానీ ఈలోపల మనం చెయ్యాల్సిన ఇంకో ఇంపార్టెంట్ పనుంది."
"ఏంటది?" ఆత్రంగా అడిగాడు అంకుష్.
చెప్పాడు రనదీఫ్.
"అయ్యాబాబోయ్ గొప్పప్లానే... ఒరేయ్ రణదీఫ్! నీది క్రిమనల్ బ్రైనూరా" మెచ్చుకోలుగా అన్నాడు.
మరో అరగంట తర్వాత వ్వారిద్దరూ బార్ లోంచి బయటికొచ్చారు. నేరుగా ఫోటో స్టూడియో కెళ్ళారు.
లోనికేళుతూనే కేష్ కౌంటర్ ముందు కూర్చున్న యిరవై ఏళ్ళ యువతివైపు చూశాడు రణదీఫ్.
ఆ అమ్మాయి పేరు అర్చన. మరాఠీ అమ్మాయి. రెండేళ్లుగా వాళ్ళ స్టూడియోలో పనిచేస్తుంది. చాలా సిన్సియర్ యువతి.
లోనికెళ్ళి ముఖం కడుక్కుని తన సీట్లో కూర్చున్నాడు రణదీఫ్. "అర్చనను పిలు" అని అంకుష్ తో చెప్పాడు. అంకుష్ ఆ రూమ్ లోంచి బయటకి వెళ్ళాడు. మరో మూడు నిమిషాల తర్వాత అర్చన లోపలి వచ్చింది.
ఇరవై ఏళ్ళ అర్చన ఎర్రగా, లక్కబొమ్మలా వుంటుంది. తండ్రి పోయాడు. ఇద్దరు తమ్ముళ్ళు. ఇద్దరు చెల్లెళ్ళును పోషించాల్సిన బాధ్యతా ఆమెపై వుంది.
"కూర్చో అర్చనా! ఆ మధ్యా నువ్వు మీ తమ్ముడికి డొనేషన్ కట్టాలని పాతికవేలు అప్పుగా అడిగావ్ కదా?" అన్నాడు రణదీఫ్
"అవున్సార్! మీరా విషయం మాట్లాడకపొతే డబ్బు లేదేమో అనుకున్నాను" అంది అర్చన.
"అర్చనా! నేని కొత్త బిజినెస్ లోకి ఎంటరవుతున్నాను. ఆ బిజినెస్ లో సహాయం నాకు కావాలి. అ బిజినెస్ నడిచినంతాకాలం నేలకు నీకు రెండు లక్షలిస్తాను" అన్నాడతను.
అది వింటూనే ఆమె ఒక్కసారిగా షాక్ తిన్నది.
"ఇంతకీ ఏంటా బిజినెస్ సార్?" అందామె ఆ షాక్ నుంచి అవకాశం. ఆ అవకాశాన్ని నేను ఎవరికయినా ఇవ్వొచ్చు. నీకే ఎందుకిచ్చానో తెలుసా? నీకు డబ్బు అవసరమని నాకు తెలుసు కాబట్టి."
"ఇంతకీ నేనేం చేయాలి సార్?" అడిగింది అర్చన.
"నేను చెప్పినట్లు చెయ్యాలి."
"చెప్పండి ఏమిటో?"
"ఏమీలేదు. తీరుబడిగా కూర్చుని ఓ పాతిక ప్రేమలేఖలు రాయాలి. అలేతర్స్ మీద పాతికతేదీలు వుండాలి. నీవు గ్రాఫాలజీ లో ఎక్స్ పార్ట్ వి కదా?" అని అడిగాడు.
"అవున్సార్? మా నాన్న బ్రతుకున్న రోజుల్లో డాక్యూమేంట్స్ రైటర్. దొంగ హేండ్ రైటింగ్స్ తో అయన చాలా డాక్యుంమెంట్స్ సృష్టించాడు. మైదటినుంచే రకరకాల హేండ్ రైటింగ్స్ ని ప్రాక్టీస్ సరదా. అందుకే ఎవరి హేండ్ రైటింగ్స్ అయినా యిట్టే నేను రాసేయగలను.
ఆ హేండ్ రైటింగ్ మా నాన్న ప్రాణాలు కూడా బలితీసుకుంది. అప్పటినుంచి ఆ గ్రాఫాలజీ జోలికి వెళ్ళడం మానేశాను" చెప్పింది అర్చన.
"మీ నాన్న విషయం నాకోసారి చెప్పావ్. మీ నాన్న లక్షలకోసం తెలివిగా ప్లాన్ చేసి తెలివితక్కువుగా దానిని ఆపరేట్ చేశాడు. ఈ సారి అలా జరగదు" నేమ్మదిగా అన్నాడు రణదీఫ్.
"అంటే" అడిగింది అర్చన లోలోనే భయపడుతూ.
"వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడంలోనే వుంది తెలివైన వాడి పనితనం. లో పూర్తిగా ఇన్ వాల్వ్ అయితే పార్టనర్ షిఫ్ యిస్తాను. లేదు కోపరేట్ చేస్తానంటే నేలకు రెండు లక్షలిస్తాను" కావాలనే అర్చనని బాగా టెస్ట్ చేస్తున్నాడు రణదీఫ్.
మనిషిలోని మానవత్వాన్ని నాశనం డబ్బు. రెండు ఒరలున్న కత్తిలాంటిది డబ్బు శ్రమపడితే డబ్బు ఆశను తీరుస్తుంది. డబ్బుకోసం అత్యాసపడితే అంతం చూస్తుంది. కానీ డబ్బు ఆకర్షణ, హై ఓల్టేజీ ఎలక్ట్రిక్ పవర్ కన్నా గొప్పది. అందుకే ఆలోచన పడి నిశ్చబ్దంగా వుండిపోయింది అర్చన.
మీ ఇష్టం మీతో చేతులు కలుపుతాను. డబ్బు అవసరం నాకు చాలా వుంది" నేమ్మదిగా అందామె.
"గుడ్! ఇదిగో అడ్వాన్స్" డ్రాయర్ సోరుగుల్లోంచి రెండు బండిల్స్ తీసి టేబుల్ మీద పెట్టాడు రణదీఫ్.
కొత్త కరెన్సీ నోట్లును సొరుగుల్లోంచి రెండు బండిల్స్ తీసి టేబుల్ మీద పెట్టాడు రణదీఫ్.
కొత్త కరెన్సీ నోట్లు. అ నోట్లను చూడగానే అర్చన కళ్ళు మిలమిల మెరిశాయి.
"గ్రాఫాలజీ నీకు తెలుసు కాబట్టి నేవ్వేలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేను నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. నువ్వేంచెయ్యాలో చెప్తాను చెయ్యి. మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటాను" అన్నాడు రణదీఫ్ తన పథకం పారినందుకు లోలోన సంతోషిస్తూ.
"చెప్పండి !" టేబుల్ మీదున్న ఇరవైవేల రూపాయల నోట్లను వ్యానీటి బ్యాగ్ లో పెట్టుకుంటూ అంది అర్చన.
చెప్పడం ప్రారంభించాడు రణదీఫ్.
"రైటింగ్ స్పెషలిస్టులు, ఫోరెన్సిక్ స్పెషలిస్టులు టెస్ట్ చేసినా నువ్వు రాసిన లెటర్స్ ఒరిజనల్ లెటర్స్ గానే వుండాలి. గుర్తుంచుకో" హెచ్చరిస్తూ అన్నాడు.
"నా హేండ్ రైటింగ్ మీద నాకు నమ్మకం వుంది. మహాత్మాగాంధీ హండ్ రైటింగ్ తో నేనిప్పుడో లెటర్ రాస్తే,1940లో ఆ లెటర్ గాంధీయే రాశాడని అనుకుంటారు. అందుకు ఎలాంటి పేపర్ వాడాలో, ఎలాంటి ఇంక్ వాడాలో, ఏ ఏ టెక్నిక్స్ పాటించాలో నాకు బాగా తెలుసు. డోన్ట్ వర్రీ సార్" అందామె.
|
25,033 | సమస్య పరిష్కరించబడ్డంతో నిద్రపట్టింది.
14
గంపనిండా తామరపూవులూ, అల్లిపూలూ తెచ్చి దింపా డొకడు. బుట్టనిండా చేమంతి పూలు తెచ్చి పెట్టాడొకడు.
తంగేడు, పైడి తంగేడు, గునుగు, నువ్వు, రుద్రాక్ష, కట్టా గట్లు గొరిమిడి, కాకర, బీర, గన్నేరు, పొట్ల, కట్లాయి, గుమ్మడిపూలు బస్తాలో తెచ్చి గుమ్మరించాడొకడు.
బంకుల్లో కూచున్న పాణి గుండె పూలను చూస్తే పొంగిపోయింది. ఒక తామర పూవును తీసి రెక్కలు విచ్చి చూచాడు. ఎంత చల్లగా ఉంది! వాసన చూచాడు. ఎంత లేత పరిమళం! ఎంత చల్లని పరిమళం! ఇంతలో వనజ వచ్చి, "ఈ ఏడాది దొరోరి బత్కమ్మను చూస్తే ఊళ్ళోల్లందరి కండ్లు మండాలే. మొదటివరుస తామరపూలు పెట్టి, రెండో వరస చేమంతి పూలు పెట్టి, ఆటేనక పోకబంతి, తెల్ల గునుగుపూలు పేర్చి, నెత్తిన తామరపూలు పెట్టి పేరిస్తే బాగుంటదన్న నేను. గట్ల కాదు. ముంగల తంగేడు పూలు పెట్టి, ఆటేనక తామరపూలు, చామంతిపూలు పేరు పెట్టిస్తనంటాంది చిందొరసాని. ఎట్లయితే బాగుంటుందో చెప్పు" అన్నది. పాణి కాస్త తికమక పడ్డాడు. వనజ చెప్పిన క్రమమే బాగుంది. తంగేడుపూల మీద తామరపూలు నిలవ్వు. కానీ, ఆ మాటంటే మంజరి చిన్నబుచ్చుకుంటుందని, నెత్తిన తామరపూలు కాక అల్లీపూలు పెడ్తే బాగుంటుందని చెప్పాడు. చేమంతిపూలతో, పోకబంతిపూలతో మంజరి పేరు వచ్చేట్లు పెర్చమని చెప్పి 'మంజరి' అనే ఇంగ్లీషు అక్షరాలు వ్రాసి యిచ్చాడు. తన పేరుకూడా రాసివ్వమంది, తన బతకమ్మ కోసరం వనజ. పేరు వ్రాసి ఇస్తూండగానే కరణం యింటినుంచి పిలుపొచ్చింది పాణికి.
కరణం ఇంటికివెళ్తే ఇంటి ముందు కరణం లేడు, పచ్చపచ్చగా తంగేడు పూవు పడివుంది, అరుగులమీద. పాలేరువచ్చి తాయారు రమ్మంటూందని పిలిచాడు. లోపలికి వెళ్ళాడు పాణి.
తలంటి పోసుకొని ముస్తాబయి కూచుని ఉంది తాయారు.
"ఎప్పుడొచ్చావు తాయారు?"
"రాత్రి వచ్చిన, పండుగని."
"కరణంగారు రాలేదా?"
"లేదు. కచీర్ల పనులున్నయట. నన్నుగూడుండమన్నడు, నా మనసు ఈడనే ఉన్నది. పోతనంటే కచ్చడం కట్టి తోలిండు."
"ఫిడేలు తెప్పించరాదూ?"
"ఎప్పుడూ సంగీతమే?" విసుగ్గా అంది.
"ఇంకేం పనుంది నాకిక్కడ?" ఆశ్చర్యంగా అడిగాడు.
"అంతేనంటారా?"
పాణి తాయారు ముఖంలోకి చూచాడు. కళ్ళు తళతళ మెరుస్తూన్నాయి. జవాబు ఏం చెప్పాలో తోచలేదతనికి.
"నే నంటే ఇష్టం లేదా?" తాయారడిగింది సూటిగా ముఖంలోకి చూస్తూ.
సంభాషణ వక్రగతి పడుతూందని గ్రహించాడు పాణి. ఇంట్లో కరణం సైతం లేడు. అంత ఇంట్లోను తాసూ, తాయారేనూ. ఏదో అవాంతరం రానునదనుకున్నాడు పాణి.
"అదేం ప్రశ్న తాయారూ?"
"నీకోసమే రెక్కలు కట్టుక వాలిన. చూడు కండ్లెట్ల ఎర్రపడ్డాయో నిద్రలేక" అని రెప్పలు చీల్చి చూపింది కళ్ళను.
వాస్తవంగానే ఎర్రగా ఉన్నాయి కళ్ళు. పెద్దగా గూడా కనిపించాయి. చలించాడు క్షణం పాణి మగవాడు కదా!
"నువ్వంటే నాకెంత మనసనుకున్నవ్? చూడు, గుండె ఎట్లకొట్టుకుంటున్నదో?" పాణి చెయ్యి పట్టుకొని గుండెమీద పెట్టి చూపబోయింది.
పాణి రక్తం విధ్యుద్వేగంతో ప్రవహించింది. "ఇచ్చోట భవన్నఖాంకురము సోకె" అన్న వరూధిని గుర్తుకు వచ్చింది. లిప్తలో సంబాళించుకొని చెయ్యిలాక్కున్నాడు. తాయారు తనను ప్రేమిస్తూంది. తనువు అర్పిస్తానంటూంది. అలాంటి తాయారు తన నెందుకు ఆకర్షించడం లేదో అర్ధం కాలేదు.
అందని దానికి అర్రులు చాచటం మానవ స్వభావం.
"నేనంటే ఇష్టంలేదా?" మళ్ళీ అదే ప్రశ్న. దుఃఖం గొంతుదాకా వచ్చిందని స్వరం చెపుతూంది. "ఇంట్లో ఎవరూ లేరు" అన్నది.
తప్పుకునే ఉపాయంకోసం తడుముకున్నాడు. చటుక్కుమని స్పురించింది.
"కరణంగారేమంటారు?"
"నాన్న కెరికె. నా ఇష్టానికి ఎతిరేకం చెయ్యడు."
ఆశ మొలకెత్తింది తాయారు హృదయంలో.
పాణి ఒళ్ళు మండింది. ఈ నాటకం చాలా కాలంనుంచి జరుగుతుందని గ్రహించాడు. తననేదో ఇరకాటంలో పెట్టడానికి, అడకత్తెరలో ఇరికించడానికి ఇది కరణం పన్నుతున్న ఉచ్చులా కనిపించిందతనికి. "తాయారు! నువ్వెక్కడ, నేనెక్కడ? నీకూ, నాకూ భూమికి ఆకాశానికి ఉన్నంత అంతరం వుంది."
"మా నాయ్నకు నేడొక్కతెనే బిడ్డను. ఈ ఆస్తి, కరణీకం అంత నీదే అయితది. నాయ్నే చెప్పిండు" అన్నది ఈ తడవ తలవంచి గోళ్ళు చూచుకుంటూ.
"ఆస్తికోసం గడ్డితినమంటావా..." కాస్త కురుకుగానే అడిగాడు. 'కాదు నాకోసరం. చూడు ఎంత వెతపడుతున్నానో' అని ముందుకు జరిగి మీద పడింది, పాణికి ఆలోచించే ఆవకాశం కూడా ఇవ్వకుండా.
పాణికి అసహ్యం అనిపించింది. వెనక్కుత్రోసి లేచినుంచున్నాడు.
తాయారు అహం దెబ్బతిన్నది. తోకతొక్కిన పాములా "కస్సు" మంది.
"కోరివస్తే తోసేస్తవులే. చూస్త ఈ ఊళ్లేట్లుంటవో? దాసీదాంతోటెల్ల కులుకుతవో? నువ్వొచ్చి నా కాళ్ళమీద పడేటట్లు చెయ్యకుంటే కరణం బిడ్డనే కాను..." అని జలజల కన్నీరు కారేసింది.
ఉగ్రుడై బాణంలా దూసుకొని వెళ్ళిపోయాడు పాణి.
గడీగేట్లో ప్రవేశించగానే బంకుల్లో ఒంటిగా కూర్చున్న రామిరెడ్డి గారు కనిపించారు. తన రౌద్రం రెడ్డిగారికి కనిపించనీయరాదని రెడ్డిగారిని గమనించనట్లు నటించి మెట్లవైపు సాగిపోయాడు. "పంతులూ" అని పిలిచారు రెడ్డిగారు. ముఖంలో భావం వ్యక్తీకరించకుండేందుకు ప్రయత్నించి అడుగులు లెక్క పెట్టుకుంటూ వెళ్ళి రెడ్డిగారికి నమస్కరించాడు.
"చూళ్ళేదండీ! క్షమించండి."
"సరే, నేనైతే చూసినగద. ఏంది కత?"
"ఏమీ లేదండీ!" తలవంచుకొని జవాబు చెప్పాడు.
'కారణం ఇంటినుంచే వస్తున్నావా?'
'అవునండీ!' - 'గ్రహించాడా ఏం! ఘటికుడు' అన్నట్లుగా ముఖంలోకి చూచాడు.
చిరునవ్వు నవ్వాడు రెడ్డిగారు.
"కరణం వచ్చిండా?"
"రాలేదండీ!"
'కుంటి దొక్కతే ఉన్నదా ఇంట్ల?' ధ్వనిలో కరుకుదనం కనిపించింది.
'అవునండీ!'
'ఎందుకు పోయినవ్, అది ఒంటరిగున్నపుడు?' గద్దించినట్లుగా అడిగారు రెడ్డిగారు. కథ అడ్డం తిరిగేట్లుంధనుకున్నాడు.
'కారణం పిలిపించాడంటే.....' అణుకువుగా జవాబు చెప్పాడు.
'ఐతే, అదే పిలిపించిందంటవ్? ఏమైందాడ?' ఉరిమారు.
పాణి వెనక్కు తిరిగి చూస్తే ఉత్సాహంగా వింటున్న ఎంకటి కనిపించాడు. వాడుండంమూలాన సంకోచిస్తున్నాడని గ్రహించారు రెడ్డిగారు.
'ఈడేమన్న బోగమోల్లాడ్తాన్రనుకున్నావా? పో - పనిచూసుకో!' ఉరిమారు రెడ్డిగారు ఎంకటిని ఉద్దేశించి.
ఉత్సాహమంతా చచ్చిపోగా సుమారు ఉరికినట్లు నడిచివెళ్ళాడు ఎంకటి.
'దొరవారూ! మీరు కూర్చోండి, నన్ను అపార్ధం చేసుకోకండి!' అన్నాడు బ్రతిమాలాడుతున్నట్లుగా పాణి.
'హు! ఆడ ఏమైందో చెప్పు! ఉన్నదున్నట్లు చెప్పాలే. లేకుంటే నెత్తి గొరిగించి, సున్నబ్బొట్లు పెట్టించి, గాడ్దిమీద ఊరేగించి ఎళ్ళగొడ్త ఊళ్ళ నుంచి - ఎరికేనా?' అదీ గర్జనే కాని, స్వరంలో కొంత సౌమ్యత ఏర్పడింది.
'కారణం ఇంటికి వెళ్ళా.....' అని జరిగిన సంగతి సాంతం పూసగుచ్చినట్లు చెప్పాడు.
'హు'! ఊళ్ళ ఉండనియ్యదులే! చూస్త. కరణానికి కాలం దగ్గర పడ్డది' అని మీసం మెలేసి, రేపటినుంచి పాఠానీకి పోకు' అంటూ లేచిపోయారు - పంతులు మంచివాడే అని మనసులో అనుకుంటూ.
పిడుగు పడుతుందనుకున్న ఉరుము చినుకుల్తో పోయినందుకు సంతోషించాడు పాణి.
x x x
మూడు బతకమ్మల్ను పేర్చారు గడీలో. వాటిని నోము గదిలో పీటలపై ఉంచారు. పసుపుకుంకుమల్తో పడతులంతా బతకమ్మను - గౌరమ్మను అర్పించారు. పెసర, గోధుమ, బియ్యము, కొబ్బరి, నువ్వులతో చేయబడిన చద్దులు గౌరమ్మకు నైవేద్యం పెట్టారు మధ్యాహ్నం.
మధ్యాహ్నపు భోజనాలైనాయి.
సాయంకాలం అవుతూంది. ఊరంతా పండుగ రంగులు అద్దుకొంది. కొత్త పరికిణీలు, కొత్త రవికెలు తొడుక్కొని, కురుల్లోపూలు తురుముకున్న బాలికలు, వెదురు లేక దుసేరు తీగల్తో అల్లిన సిబ్బుల్లో బతకమ్మలు పట్టుకొని నుంచున్నారు. కొత్తబట్టలు కట్టుకొని వీధిలో ఉరికే బాలురు పెట్లుగొట్టాలు కొడుతూ బాలికల్ని సతాయిస్తున్నారు. |
25,034 | "ఎవర్నో ప్రేమిస్తున్నావా? మంచి జోక్!"
"జోక్ కాదు. నిజమే!"
"ఎవర్నీ"
ఆమె సమాధానం ఇవ్వలేదు.
"ఇక్కడ ఎవరూ లేరని నాకు తెలుసు. మీ బాబాయి చెప్పాడు."
"ఏమని?"
"నువ్వు ఇంగ్లాండులో చాలా బుద్ధిగా ఉన్నాననీ ఎవరి ప్రలోభంలోనూ పడలేదని-"
"మా బాబాయిని నాగురించి అడగాల్సిన అవసరం మీకెందుకు వచ్చింది?"
"చాలా తెలివితక్కువ ప్రశ్న. నువ్వంటే నాకు ఇష్టం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ ప్రేమ క్షణక్షణం గాఢమౌతున్నది. ముందు నిమిషం కంటే ఈ నిముషం నిన్ను.....
"మిష్టర్ బ్లన్ట్! ఇక చాలు! ఆపండి. మీరు చాలామందిని ఇప్పటికి చాలా చాలా గాఢంగా ప్రేమించి వుంటారు. స్త్రీ ఒక పురుషుడ్ని గాఢంగా ప్రేమిస్తే మరో పురుషుడు ఎంత గొప్పవాడయినా ఆమె దృష్టిలో మాత్రం అల్పుడే!
ఆ మాటలు అంటున్నప్పుడు సీత కళ్ళముందు ఆమె అజ్ఞాత మిత్రుడి రూపం నిలిచింది.
అతను ఆమె ముఖంలోకి ఆశ్చర్యంగా చూశాడు.
"మిష్టర్ బ్లన్ట్! మీకు నమస్కరిస్తాను! నన్ను వదిలెయ్యండి. మీరు అలా మాట్లాడుతూ వుంటే నాకు జుగుప్స కలుగుతున్నది" అనేసి చివ్వున లేచి నిల్చుంది సీత.
గబగబా మిష్టర్ కార్డరీ (రెసిడెంట్) దగ్గరకి వెళ్ళింది. అతను ఓ అందమైన యువతితో నవ్వుతూ మాట్లాడుతున్నాడు.
"క్షమించండి. నాకు తలనొప్పి వుంది. అనుమతిస్తే నేను వెళ్ళి పడుకుంటాను" అన్నది సీత.
"అలాగే! మీవల్ల మా గౌరవం నిలబడింది. నువ్వు లేకపోతే ఇప్పుడు ఈ విధంగా వుండేవాళ్ళమా? ఎంత గందరగోళంలో పడిపోయేవాళ్ళం! కేవలం ఈ రాజ్యంలోనే కాదు - దేశమంతటా అలజడి రేగేది. మరోసారి నీకు నా కృతజ్ఞతలు" అన్నాడు రెసిడెంట్.
"మీ పొగడ్తలకు నేను అర్హురాలను కాదు, మీ మంచితనమే మీచేత అలా మాట్లాదిస్తోంది" గుడ్ నైట్ చెప్పకుండానే సీత చరచర నడుస్తూ వెళ్ళిపోయింది.
గది ముందు ఒక నౌకరు ఎదురై ఆమెకు ఒక కవరు అందించాడు. ఆమె అందుకున్నది. ఎవరో కృతజ్ఞతలు తెలిపి వుంటారు! అనుకొంటూ గదిలోకి వెళ్ళింది. కవరు విప్పింది. అందులో చిన్నకాగితం ముక్క వుంది. అది నలిగిపోయిన కాగితం ముక్క. ఆ కాయితాన్ని నిర్లక్ష్యంగా విప్పింది. వెంటనే...ఆమె మనసంతా మల్లెల గుబాళింపుతో నిండిపోయినట్టుగా అయింది. "నన్ను నమ్ము...నేను నిన్ను ప్రేమిస్తున్నాను" ఆ మాటల్ని మనసులోనే మననం చేసుకొంటూ నిద్రలోకి జారిపోయింది సీత. * * *మూడు రోజులు సీత ఫ్రెడ్ బ్లంట్ ను తప్పించుకొని తిరిగింది. ఈరోజు అనుకోకుండా లంచ్ టేబిల్ ముందు అతను ఆమె ప్రక్కన కూర్చున్నాడు.
ఒక రాజకీయనాయకుడు హైదరాబాద్ వచ్చిన సందర్భంగా లంచ్ ఏర్పాటు చేశారు. అనుకోకుండా విల్ ఫ్రెడ్ ఆమె ప్రక్కన కుర్చీలో కూర్చున్నాడు.
"ఈ మధ్యాహ్నం ఏం చెయ్యాలనుకొంటున్నావ్" ఆమె చెవిలో గుసగుసలాడినట్లుగా వంగి అడిగాడతను.
"రెస్టు తీసుకొంటాను."
అతని పెదవుల మీద చిరుదరహాసం మెదిలింది.
ఆమెకు అది నచ్చలేదు. అతను మధ్యాహ్నం తన గదికి వచ్చే ప్రయత్నంలో వున్నాడేమోననే అనుమానం కలిగింది.
మిష్టర్ హారే రెసిడెన్సీలో లేడు, నిజాం కోటలో వున్నాడు. ఏవో చర్చలు జరుగుతున్నాయని ఆమెకు చెప్పారు. ఆమెకు భయం వేసింది. ఆమె భావాన్ని చదివినట్టుగా "నువ్వు భయపడనక్కరలేదు. నీతో మాట్లాడాలి అంతే" అన్నాడు చిరునవ్వుతో అతను.
"నాకెందుకు భయం? నిన్ను చూస్తే నాకు చిరాకు వేస్తున్నది. కోపం వస్తుంది" అని అన్నది.
లంచ్ అయిపోయింది.
సీత తన గది తలుపు తెరిచింది. ఆమె గదికీ, హారే గదికీ మధ్యలో డ్రాయింగ్ రూం వున్నది. ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. పుస్తకం తీసుకొని తన బాబాయి గదిలోకి వెళ్ళింది. తలుపులు వేసుకొన్నది. బ్లంట్ ను మరోసారి తప్పించుకోగలిగినందుకు సంతోషంగా వుంది. అతను తనను కలుసుకోలేక ఎంత నిరాశ చెందుతాడో ఊహించుకొని తనలోతనే నవ్వుకొన్నది.
తన మిత్రుడ్ని గురించిన ఆలోచనలు ఆమెకు నోటు పంపించాక మళ్ళీ అతని జాడ లేదు. అతను రహస్యంగా చెయ్యాలనుకొన్న కార్యం పూర్తి అయిందని ఆమె నమ్మకం. మరి ఇంకా ఎందుకు అతను అజ్ఞాతంగానే వుండిపోయాడు? తనను కలుసుకోవడానికి ఎందుకు ప్రయత్నించడం లేదు... కిందటరోజు బర్నెస్ ను తను అడిగిన ప్రశ్నలూ... సమాధానాలూ గుర్తు చేసుకోసాగింది. ఆ రష్యన్ ఖైదీ ఏమయ్యాడు?" బర్నెస్ సీత ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూశాడు.
"క్షమించండి! కేవలం తెలుసుకోవాలనే కుతూహలంతో అడుగుతున్నాను. చెప్పకూడని రహస్యం అయితే అడగను."
ఓ క్షణం బర్నెస్ మౌనంగా వుండిపోయాడు. సీత అతని ముఖంలోకి కుతూహలంతో చూడసాగింది.
"అతను చచ్చిపోయాడు" బర్నెస్ చిన్నగా గంభీరంగా అన్నాడు.
"చచ్సిపోయాడా?" ఆశ్చర్యంగా అడిగింది సీత.
"కాదు, చంపబడ్డాడు."
ఆమె తృళ్ళిపడింది.
"ఖైదు నుంచి తప్పించుకొని పారిపోతుంటే వెనక నుంచి కాల్చేశారు" అన్నాడు బర్నెస్.
ఆమె ఆలోచనలో పడింది.
బర్నెస్ వెళ్ళిపోయాడు.
అదే నయమేమో? లేకపోతే అతని నుంచి రహస్యాలు లాగడానికి చిత్రహింసలకు గురిచేసి ఉండేవాళ్ళే. ఇలాంటి విషయాల్లో చాలా కౄరంగా ప్రవర్తిస్తారని తను యిక్కడకు వచ్చాకే విన్నది.
సీత మిష్టర్ హారే దగ్గరకు వెళ్ళింది.
అతను ఆమె ముఖంలోకి "ఏమిటి?" అన్నట్టుగా చూశాడు.
"నిజాంను చంపడానికి ప్రయత్నించిన అతను చనిపోయాడటగా?"
"ఆ సంగతి నీకెవరు చెప్పారు?" మిష్టర్ హారే తీవ్రంగా అడిగాడు. |
25,035 |
నీలిమ డైనింగ్ టేబుల్ ని ఆనుకుని నిలబడి అంతా చూస్తోందే తప్ప భర్త ఇన్నాళ్ళకు వచ్చాడని ఎదురు వెళ్ళడం కాని, మొహంలో సంతోషం గానీ కనబడలేదు. కాసేపట్లో ఇల్లంతా సందడిగా తయారయింది. పిల్లలిద్దరూ సూట్ కేసులు తెరిచి తమకు తెచ్చిన వస్తువులను చూసుకొని ఆడుకోవడం మొదలుపెట్టారు. కాస్త ఏకాంతం దొరకగానే భార్యతో అన్నాడు శరత్ - "నీలూ! మళ్ళీ ఏం జరిగింది? ఎందుకలా డల్ గా వున్నావు? నా మీద కోపం వస్తే ఎందుకొచ్చిందో చెప్పు. నా వల్ల పొరపాటేదైనా వుంటే సరిచేసుకుంటాను. అంతేకానీ నువ్విలా ఉంటే భరించలేను నీలూ!" అంటూ దగ్గరికెళ్లి భుజాల మీద చేయివేశాడు. ఆ చేతిని విసిరి కొట్టింది. అతని స్పర్శే అసహ్యాన్ని కలిగిస్తున్నట్లు చూసింది. "చెప్పు నీలూ! చెప్పు! మనసులో ఏదో పెట్టుకొని నలిగిపోవద్దు" బ్రతిమిలాడుతూ మళ్ళీ అన్నాడు. "నీతో ఏం మాట్లాడినా ప్రయోజనం వుండదు. మళ్ళీ మళ్ళీ నన్ను మభ్యపెట్టడానికే చూస్తావ్? నీతో ఒక్క ముక్క కూడా మాట్లాడే ఓపిక నాకు లేదు. ఇంక మనం కలిసి బ్రతకడం అసాధ్యం. నేనూ పిల్లలూ దూరంగా వుంటాం. నీక్కావాల్సిన వాళ్ళతో నువ్వు హాయిగా వుండు" తీవ్రంగా అంది నీలిమ. కాసేపు మాట్లాడలేకపోయాడు అతను, ఇంతలోనే అంత తీవ్ర మనస్తాపాన్ని కలిగించే విషయం ఏం జరిగిందో అర్ధం కావడం లేదు. మెల్లగా తేరుకుంటూ అన్నాడు శరత్ చంద్ర - "నీలూ.... నువ్విదంతా.... నిజంగా మాట్లాడుతున్నావా?" బాధను తన్నుకుంటూ వచ్చింది అతని ప్రశ్న. కలిసి బ్రతకటం అసాధ్యం అన్న నీలిమ మాట అతనికి జీర్ణం కావడం లేదు. "నిజంగానే మాట్లాడుతున్నాను. నా నిర్ణయాన్ని నీవు మార్చలేవు" అంది. ఏదో జరిగిందని ఊహించాడు గాని నీలిమ ఇంతదూరం ఆలోచిస్తుందని ఊహించలేకపోయాడుయ మిన్ను విరిగి మీద పడ్డట్లుగా వుంది అతనికి. ఏం చెబితే నమ్ముతుంది? అసలే ముందని చెప్పాలి? ఇదంతా ఎందుకు జరుగుతున్నట్లు? కాని అతనికి తెలియకుండా ఏదో జరిగిపోతోంది. రవళిని నీలిమతో మాట్లాడమంటే? ఛ! తనని తాను నీలిమ ముందు 'క్లాన్'గా నిరూపించు కోవడం కోసం తన జూనియర్ కి, చిన్నపిల్లకి కుటుంబ విషయాల్నీ చెప్పుకోవడమా? రోజంతా ఆ అమ్మాయితో కలిసి పనిచేయవలసిన వాడు! ఎందుకో ఆ పద్ధతి బాగుండదనిపించింది అతనికి. కాస్సేపు అలాగే ఆలోచిస్తూ తను కూర్చున్నాడు. ఏమిటలా మాట్లాడకుండా కూర్చుండిపోయాడు? విషయమంతా తెలిసిపోయింది. దీన్నుండి ఎలా బయటపడాలా అనుకుంటున్నట్లున్నాడు. ఏమి చెప్పినా ఇంతా తను నమ్ముతాననే? ఈ నరకం భరించడం కన్నీ దూరంగా బ్రతకడమే హాి! కప్ బోర్డు సర్జుతున్నట్లు నిలబడి అనుకుంటోంది నీలిమ. అతని చూపు ఆమె మీదకు మళ్ళింది. తదేకంగా చూస్తూ మంద్రంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. "నీలిమా! భార్యాభర్తల బంధం ఒక నమ్మకానికి సంబంధించినది. కారణాలు ఏవయితేనేం నా మీద నీకు నమ్మకం పోయింది. అయితే నీకూ, పిల్లలకూ దూరమవడానికి నేను మాత్రం సిద్ధంగా లేను. విడిపోదామనే ఆలోచన వచ్చేదాకా వెళ్ళిన నీ అపనమ్మకం రవళికీ, మువ్వకీ నా దృష్టిలో తేడా లేదని చెప్పినా నిన్ను నమ్మనివ్వదు. సరే నీ యిష్టప్రకారమే మనం బ్రతుకుదాం. బట్, అండర్ వన్ రూఫ్. కొంతకాలం ఒకే ఇంట్లో విడివిడిగా బ్రతకడం అసాధ్యం కాదు. నీకు నా మీద ఎప్పటికీ నమ్మకం కలగదని దృఢంగా నమ్మిననాడు మనం విడిపోవచ్చు! నీలూ! లేనిపోని అపోహలతో మనం ఇద్దరు పిల్లల్ని బలి తీసుకోకూడదు. మనది ప్రేమ పెళ్ళి. అంటే మామూలుగా బ్రతికేస్తున్న వాళ్ళకన్నా మనం ఒక అడుగు ముందున్నాం. ఈ ప్రోగ్రెస్ మీద సమాజానికి నమ్మకం మిగల్చాల్సిన సామాజిక బాధ్యత కూడా మనమీద ఉంది. మనం ఒక్కవేలు బయటికి కనబడనిస్తే పదివేళ్ళు మనవైపు గురిపెట్టి వుంటాయని మర్చిపోకు. వృత్తిమీదున్న పిచ్చి మోహంతో నేను నిన్ను నిర్లక్ష్యం చేసి వుండొచ్చు. కానీ నీ స్థానంలో మాత్రం మరెవరి చూపు కూడా పడనీయలేదు. నువ్వది నమ్మిననాడే మనం మళ్ళీ మామూలుగా కలిసుందాం! నన్ను పూర్తిగా నమ్మిన నీలిమ మళ్ళీ నాకు కావాలి!" అతని ఒక్కొక్కమాట వేదన నిండిన గుండెలోంచి జారిపడుతున్న ఒక్కొక్క చుక్కలా ఆ యిద్దరి మధ్య ఏర్పడిన అగాధాన్ని తడిపింది. కానీ ఆ వేదనలో వేగీవేగీ గడ్డకట్టిన ఆమె హృదయాన్ని మాత్రం చెమరించలేకపోయింది. ఇన్నాళ్ళూ ఆమె రీజనింగ్ ను ఎమోషన్ డామినేట్ చేసింది. ఇప్పుడు రీజనింగ్ నీ, ఎమోషన్ నీ సమన్వయ పరచాల్సిన పరిస్థితిలో స్తబ్దత ఆ రెంటినీ డామినేట్ చేస్తోంది. ఆమె మరేం మాట్లాడలేదు. ఆ మధ్యాహ్నమే గోపాలకృష్ణ గారిని చూడడానికి వెళ్లాడు శరత్ చంద్ర.
* * * *
శరత్ ని అంత దూరం నుండి చూసి ఎదురొచ్చి వాటేసుకున్నాడు వైద్య. "ఉదయమే ఎయిర్ పోర్ట్ కి రావాల్సినవాణ్ణి. క్లినిక్ కి ఫిట్స్ కేస్ ఒకటి వచ్చి హడావుడి అయిపోయింది. టైము దాటిపోయి రాలేకపోయాను" సిన్సియర్ గా చెప్పాడు వైద్య. శరత్ ని రిసీవ్ చేసుకోలేకపోయినందుకు ఇబ్బందిగా ఫీలవుతున్నాడతను. "ఫర్వాలేదులే. డాక్టర్ల యిబ్బందులు నాకు తెలియనివి కాదుగా? నాన్నగారికి ఎలా వుంది?" అతని చేతుల నుండి విడివడుతూ అడిగాడు శరత్. ఇప్పటికి బాగానే ఉన్నారు. నీ కోసమే ఎదురు చూస్తున్నారు. వెళదాం పద" అంటూ గోపాలకృష్ణగారి రూమ్ వైపు దారి తీశాడు. "తండ్రివి కాబోతున్నందుకు నా హార్టీ కంగ్రాచ్యులేషన్స్! విజయ ఆరోగ్యం బావుందా?" ప్రక్కనే నడుస్తున్న వైద్య చెయ్యి అంది పుచ్చుకొని ఆత్మీయంగా నొక్కుతూ అన్నాడు శరత్. "థాంక్యూ! విజయ ఫర్వాలేదులే - కడుపుకీ కక్కుకీ అవినాభావ సంబంధం కదా! రోజుకు రెండుసార్లు వాంతులు చేసుకుంటూనే వుంది. నాన్నగారికి బాగుంటే ఇంకా హ్యాపీగా వుండేది" దిగులుగా అన్నాడు వైద్య. |
25,036 |
వివాహం గురించి ఆమెకి కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలుండేవీ. వివాహమనేది స్త్రీకి ఎంత అవసరమో పురుషుడికి అంతే అవసరం అనీ కట్నం యిచ్చి వివాహముచేసుకోవడం స్త్రీ తననుతానే కించపరుచుకోవడమనీ ఆమె భావం. కనీసం చదువుకున్న స్త్రీలైనా ధైర్యంగా యీ దురాచారాన్ని యెదుర్కోవాలని అంటూ వుండేది.
మరో విషయంలో కూడా ఆమె వాదిస్తూ వుండేది. ముక్కూ మొహం తెలియని మనిషిచే మూడు ముళ్ళూ వేయించడం, అతడితో పాటు గదిలోకి పెద్దలు ఆడపిల్లను నెట్టడం... ఆ తరువాత ఆ పిల్ల ఆ కొత్త వ్యక్తి చేతులు చాచగానే... ఆ చేతుల్లోకి వాలిపోయి కరిగిపోవడం... దారుణమంటు లెక్చర్లు దంచేది.
"చూస్తాంగా నువ్వెలాంటివాడ్ని చేసుకుంటావో?" తోటి విద్యార్ధినులు అంటే...
"ఎలాంటివాడా? నాకు నచ్చినవాడు... నన్ను అర్ధం? చేసుకునే వాడు... నన్ను గౌరవించేవాడు... అర్ధమైందా ముక్కూ మొహం తెలియనివాణ్ణి చస్తే చేసుకోను. పరిచయమున్న మనిషినే చేసుకుంటాను."
"అంటే ప్రేమించి పెళ్ళి చేసుకుంటావన్నమాట?" అనేవాళ్ళు తోటి విద్యార్ధినులు.
"అది ప్రేమో కాదో నాకు తెలియదు. అతన్నీ అతని భావాలనూ అర్ధం చేసుకున్న తరువాతే వివాహము గురించి ఆలోచిస్తాను."
అలాంటి భావాలుగల ఆమె ముక్కూ మొహమూ తెలియని వాడనే చేసుకొంది.
తల్లీ, అన్న కుదిర్చిన సంబంధం కాదనలేకపోయింది. కారణం కుటుంబ పరిస్థితులు. అంతే కాదు ఒక భార్య చనిపోయిన వ్యక్తిని చేసుకుంది.
ఆమెకు ఏం.ఏ. చదవాలనీ, లెక్చరర్ గా పనిచెయ్యాలనీ వుండేది. చదువు పూర్తయ్యాక తనకు నచ్చినవాడు తటస్థపడితే పెళ్ళి చేసుకోవాలనుకునేది.
తల్లికి ఆమె పై చదువులకి వెళ్ళడం ఇష్టముండేది కాదు. కాని తండ్రి కూతుర్ని సమర్ధించేవాడు.
అనసూయ బి.ఏ. ఫైనల్ ఇయర్ లో ఉంది.
ఇంటికి వెంటనే రమ్మంటున్నారని కాలేజీకి కబురువచ్చింది. ఆ వచ్చిన మనిషి కారణం చెప్పలేదు.
అనసూయ హడావిడిగా ఇంటికొచ్చింది.
ఇంటి ముందు జనం ఉన్నారు.
అనసూయ అడుగు ముందుకు పడలేదు. కొయ్య బారిపోయి నిల్చుండిపోయింది.
అనసూయ మేనమామ ఆమె చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకెళ్ళాడు. అనసూయ తండ్రి శవం చాపమీద పడి వున్నది. తల్లి శవం మీద పడి భోరుభోరున ఏడుస్తున్నది.
అనసూయ స్థాణువులా నిలబడిపోయింది. ఏడుపు కూడా రావటం లేదు.
ఉదయం ఆమె కాలేజీకి బయలు దేరుతున్నప్పుడు రామశేషయ్య వరండాలో ఈజీ చెయిర్ లో కూర్చుని పేపరు తిరగేస్తున్నారు.
"మంచిది తల్లీ!" రామశేషయ్య కూడా అలవాటు ప్రకారము అన్నాడు.
"వెళ్ళొస్తాను నాన్నా!" అనసూయ అలవాటు ప్రకారము అన్నాడు.
రెండు గంటలముందు మాట్లాడిన తండ్రిని నిర్జీవంగా చూసిన ఆమె బుర్ర పనిచేయడం మానేసింది.
పేపరు చదువుతూ కూర్చున్న భర్త ఆఫీసు టైమ్ ఔతుందనీ, భోజనానికి రమ్మని చెప్పింది నాగరత్నమ్మ.
ఎంతసేపటికీ భర్త లోపలికి రాలేదు. విసుక్కొంటూ బయటికి వచ్చిన నాగరత్నమ్మ భర్త ఛెయిర్ లో కళ్ళుమూసుకుని పడుకొని వుండటాన్ని చూసింది.
"ఈ వేళప్పుడు నిద్రేమిటి? అన్నం పెట్టాను. ఆరిపోతుంది లేవండి" అంది.
రామశేషయ్య ఉలకలేదు. పలకలేదు.
నాగరత్నమ్మ దగ్గరికొచ్చి నొసటిమీద చెయ్యి వేసింది. షాక్ తగిలినట్టు కెవ్వున అరచింది. ఇరుగు పొరుగు పరిగెత్తుకొచ్చారు.
రామశేషయ్య మరణంతో ఆ ఇంటి పరిస్థితులు తారుమారైనయ్. తారు రోడ్డుమీద ఫారిన్ కారులా వెళుతోన్న సంసారం గతుకుల బాటలో పడిపోయినట్టయింది.
అనసూయ బి.ఏ. పరీక్షలు రాసింది.
ఆమె అన్న గోపాలం ఫైనల్ ఇంజనీరింగ్ లోకి వచ్చాడు.
ఆమెకి ఎం.ఏ చదవాలని వుంది. కాని పరిస్థితులు అర్ధం చేసుకొని ఆ ప్రయత్నం విరమించుకుంది.
పట్నంలో కాపరం ఎత్తెసి నాగరత్నమ్మ అన్న ఇంటికి చేరింది అనసూయతో సహా.
నాగరత్నం అన్నయ్య వ్యవసాయం చేస్తాడు. ఐదెకరాల భూమి ఉన్నది. అయిదుగురు పిల్లలు. వాళ్ళదే చాలీచాలని సంసారము. అనసూయ ఉద్యోగంకోసం ప్రయత్నాలు చెయ్యసాగింది.
నాగరత్నమ్మకు కూతురి పెళ్ళి చెయ్యాలని ఉంది.
ఆమె మేనమామ సంబంధాలు వెతకసాగాడు.
చివరకి రమణమూర్తి సంబంధం ఖాయమైంది.
"ఏమ్మా ఆ అబ్బాయి నీకు నచ్చాడా?" మేనమామ అడిగాడు.
ఆమె అదోలా నవ్వింది.
"చెప్పు తల్లీ! నీకు ఇష్టం లేకపోతే మరో సంబంధం చూస్తాం" అంది తల్లి.
"ఆఁ చూస్తారు. కానీ కట్నం ఇవ్వలేనివాళ్ళకు ఇంతకంటే మంచి సంబంధాలు వస్తాయ్" వ్యంగ్యంగా అన్నది ఆమె మేనమామ భార్య.
"మీ అందరికీ నచ్చితే నా కభ్యంతరము లేదు" అనేసి అక్కడ్నుంచి వెళ్ళిపోయిందామె.
గొడ్లసావిడి వెనక్కి వెళ్ళి తండ్రిని తల్చుకుని కుళ్ళికుళ్ళి ఏడ్చింది.
అనసూయ పెళ్ళిచూపుల్లో రమణమూర్తిని సరిగా చూడలేదు. నిర్లిప్తంగా వుండిపోయింది.
రమణమూర్తితో ఆమె వివాహం జరిగింది.
ఆయన హైదరాబాద్ లో ఒక బ్యాంక్ లో డెవలప్ మెంట్ ఆఫీసరుగా పనిచేస్తున్నాడు.
స్త్రీని ఎలా గౌరవించాలో ఆయనకు తెలుసు.
భార్య అభిప్రాయాలను మన్నించడం తెలుసు.
ఆమె తన అదృష్టానికి పొంగిపోయింది.
రమణ ఆఫీసు పనిమీద మద్రాసు వెళుతున్నాడు. |
25,037 |
"దీనినిబట్టి ఇల్లు సర్దటం ఇల్లాలే కాదు. ఇంటిగలాయన కూడా చేస్తాడు అని అర్థం. ఒక్కొక్క ఇంట్లో అట్లాంటి మంచి ఇంటాయన కూడా ఉన్నారు. ఇలా మంచి మగవాళ్ళు నూటికో కోటికో ఒక్కొరే ఉన్నట్టు... నూటికో కోటికో మంచి ఆడపిల్ల లేదు. అలాంటి పెళ్ళికావల్సిన ఆడపిల్ల మీద ఈ కవిత చదువుతాను వినండి."
"తల్లిని చూశాం కదా
పిల్లని చూడనక్కర లేదనుకోకండి
తల్లి తల్లే... పిల్ల పిల్లే
ఉల్లికి మల్లె పుట్టకపోవచ్చు
చల్లని తల్లికి చెల్లని పిల్ల పుట్టొచ్చు కదా!"
సుందర సుకుమారి కవిత చదివంగానే "ఇలాంటి కవితలు మా ముందు చదివావంటే తిండి తిననివ్వకుండా మాడబెట్టి చంపేస్తాం. ఇప్పుడే కదా మనలాంటి ఆడపిల్లల తరఫున ఉద్యమం లేవదీద్దామనుకొన్నాం. మగవాళ్ళు వంట జేస్తారు... ఇల్లు సర్దుతారు... అది మంచిది కాదు అని మనమే చెబితే మన ఉద్యమం మొదట్లోనే నీరుగారి పోవడమే కాకుండా నలుగురు ముఖాన నవ్వుతారు" అంటూ సన్నగా చీవాట్లు పెట్టింది వందనాదేవి.
"సరదా ఎక్కువయిపోయి నాలుగు గోడల మధ్యనే వున్నాం కదా... నలుగురికి వినిపించదు గదా అని ఏదో నోటికొచ్చింది చెప్పాను. ఇట్టాంటప్పుడు ఇంకఅట్టాంటివి చదవను లేవే" అంది సుందరి సుకుమారి.
"ఒకటి గుర్తుంచుకోవే సుందరీ! భగవంతుడు మనిషికి గొంతు ఇచ్చింది మాట్లాడటానికే గాని పోట్లాడటానికి కాదు. అలానే భగవంతుడు మనకి నోరు ఇచ్చింది..."
"నన్నడిగితే తినటానికని చెబుతాను" వెంటనే అంది సుందర సుకుమారి.
"నేను సీరియస్ గా చెబుతుంటే మధ్యలో నవ్విస్తా వేమిటి?" చిరుకోపంతో కోప్పడింది వందన.
రాణి, ప్రమద ఫక్కున నవ్వేశారు.
మళ్ళీ నలుగురు తేలికపడ్డ మనసులతో హస్తాలు కలుపుకొని ఒకే మాటమీద ఉంటామని భీషణ ప్రతిజ్ఞలు చేశారు.
"చేతులు కలిసిన శుభవేళ పాటలు పాడను పనిమాల" అంటూ సుందర సుకుమారి రాగయుక్తంగా ఆలపించింది.
ఆ మాటకి... ఆ పాటకి... రాగయుక్తంగా పాడిన ఆ తీరుకి ముగ్గురు పడి పడి నవ్వారు.
16
"సుందరీ! సుందరీ!"
బాత్ రూంలోంచి నీళ్ళ శబ్దం వినవస్తోందిగాని సుందర సుకుమారి మాత్రం పిలిచినా పలకలేదు.
"ఓ సుందర సుకుమారీ! తొందరగా స్నానంచేసి రావే తల్లీ! స్నానం చేయడం ఓ గంట... పాటలు పాడటం మరోగంట. అంతంతసేపు జలకాలాడకూడదే అమ్మా! సబ్బుతోపాటు నీ ఒళ్ళుకూడా అరిగిపోతుంది. ఊరెళ్ళిన తర్వాత మీ బామ్మేమో నన్ను తిడుతుంది."
వందనాదేవి బాత్ రూమ్ దగ్గర నుంచుని మాట్లాడుతుంటే రూంలో ఓ పక్కగా నుంచుని బట్టలు వేసుకుంటున్న సుందర సుకుమారి కిలకిల నవ్వుతూ-" నేను బాత్ రూములోంచి వచ్చేశానే! చూడలేదా? పాపం తలుపు దగ్గర నుంచొని అదేపనిగా గొణుగుతున్నావు" నవ్వాపి అడిగింది.
"బాత్ రూములోంచి ఊడిపడ్డావా తల్లీ! రూములోంచి బయటికి రావడం నేను చూడలేదులే! నీళ్ళ చప్పుడు వినిపిస్తుంటే ఇంకా నీవు లోపల్నుంచి రాలేదనుకున్నాను. నా ధ్యాసంతా తొందరగా స్నానం చేద్దామని బాత్ రూం మీదే ఉండటంతో నీవొచ్చింది చూసుకోలేదు" అంది వందన.
"ఇప్పుడు చూశావ్ కదా! వెళ్ళి స్నానంచెయ్" జాకెట్ హుక్స్ పెట్టుకుంటూ చెప్పింది సుందర సుకుమారి.
"స్నానం పూర్తయ్యింది కదా! పంపెందుకు తిప్పొచ్చావ్?" అడిగింది వందన.
"ఫ్రీగావస్తే ఫినాయిల్ తాగమన్నాడొక మహానుభావుడు. తేరగా వస్తే పారబొయ్యి నీళ్ళు... అనిపించి పంపు ఫుల్ గా తిప్పొచ్చాను" సుందర సుకుమారి చెప్పింది.
"నీ ముఖంలాగా వుంది. నీకప్పుడప్పుడు పైత్యం ప్రకోసిస్తూ ఉంటుంది. అర్థంలేని పనులు చేసి దానికో పేరు పెడతావ్"
"వేసిన అక్షింతలు చాలు. నల్లాలో నీళ్లు చల్లగా కారిపోతున్నాయ్ వెళ్ళు...వెళ్ళు... వెళ్ళి స్నానం చేసిరా" అంది సుందర సుకుమారి.
"టవలు...పెట్టికోట్...బ్రాసరీ తీసుకుని బాత్ రూములోకి వెళితే తలుపు బిగించుకుంది వందనాదేవి.
"వందన బాత్ రూమ్ లో దూరింది. రాణి, ప్రమద తలుపు దగ్గరకేసి ఎక్కడికో వెళ్ళారు. ఇప్పుడిక్కడ నేనొక్కదాన్నే వున్నాను. నాకు ఇష్టమొచ్చినన్ని పాటలు పాడుకుంటాను. ఈ అందం...ఈ మంచం... ఈ దిండు దుప్పట్లు ఏవీ వద్దనవుకదా! పాడేస్తావ్...అదేమిటబ్బా! ఏదో ఒక పాట పాడదాం అనుకుంటే సమయానికి ఒక్కపాటా రావడం లేదేమిటి? పాట రాకపోతే కూనిరాగమో, ఖూనీ రాగమో ఏదో ఒకటి తీస్తాను. ఇప్పుడు నన్నెవరు అడ్డుకుంటారు?" అలా అనుకున్న సుందర సుకుమారి అద్దంలో తన ప్రతిబింబాన్ని వివిధ కోణాలలోంచి చూసుకుంటూ... |
25,038 | "నేను నీకు దాసుణ్ణి. నీ ఆజ్ఞకు బద్దుణ్ణి" అన్నాడు రామారావు.
"అయితే ముందు లోపలకు రండి" అంది లత.
"మీ అక్క బాబు లేకపోతే ఇల్లు చిన్నబోయింది" అన్నాడు రామారావు లోపలకు వచ్చేక.
"అవును. అందుకే బయటకు పోవలనుంది. జనం లేని ఇల్లు ఇల్లు కాదు" అంది లత నిట్టూరుస్తూ.
ఆమె మెదడు డైవర్షన్ కోరుతోందని రామారావు గ్రహించాడు. అతనింక అట్టే వాదించకుండా వెంటనే అంగీకరించాడు. కాసేపట్లో ఇద్దరూ తెమిలి బయటకు వెళ్ళి హొటల్లో టిఫిన్ చేశారు. కాసేపు పార్కులో కూర్చున్నారు. తర్వాత ఓ సినిమాకు వెళ్ళారు. అదృష్టవశత్తూ సినిమా చాలా బాగుంది. హాల్లోంచి బయటకు వచ్చే సరికి ఇద్దరి మనసులూ తేలిగ్గా ఉన్నాయి. ఆ తర్వాత ఇద్దరూ ఓ హొటల్లో భోంచేసి రాత్రి పదిన్నరయఎసరికి ఇల్లు చేరుకున్నారు.
ఇల్లు చేరగానే లతకు మోహన్ గుర్తుకు వచ్చాడు కానీ, భర్తకు చెప్పలేదు.
మోహన్ ఏమయ్యాడోనన్న కుతుహాలం లత మనసులో ఉంది. దాన్ని తుడుచి పెట్టడానికి ఆమె చాలా తీవ్రంగా ప్రయత్నిస్తోంది కానీ, సాధ్యపడలేదు.
ఇద్దరూ పక్కమీదకు చేరాక ఆమె ఉల్లాసంగా లేదు. రామారవు కబుర్లతో ఆమె నుల్లస పరచడానికి ప్రయత్నించాడు. కానీ, ఆమె అన్యమనస్కంగా ఉన్నాడని గమనించి తర్వాత ఊరుకున్నాడు. ఆమె అన్యమస్కంగా ఉండడానికి కారణం లత నూహించగలడు. అయితే ఆ విషయం చర్చించడం అతని కిష్టం లేదని అతనికి తెలుసును.
ఇద్దరూ మౌనంగా ఉన్నారు. క్రమంగా రామారావు కళ్ళు మూతలు పడ్డాయి.
లతకు నిద్ర రావడం మంచం మీద ఆమె అసహనంగా అటూ ఇటూ కదులుతోంది. ఉన్నట్టుండి కాలింగ్ బెల్ మ్రోగింది.
లత ఉలిక్కిపడింది. టైంఫీసు రాత్రి పదకొండూ ఇరవై అయినట్లు చూపిస్తోంది.
'నిజంగా కాలింగ్ బెల్ మ్రోగింది.
లత రామారావును కుదిపింది.
అతనికి అప్పుడే బాగా నిద్ర పట్టినట్లుంది. ఉలిక్కిపడి __ "ఊం" అన్నాడు.
"ఎవరో కాలింగ్ బెల్ మ్రోగిస్తున్నారండీ!" అంది లత.
రామారావు కళ్ళు నలుమూకున్నాడు __ టైము చూసి బద్దకంగా వళ్ళు విరుచుకుని _ "అబ్బా! ఇప్పుడేవారు లతా?" అన్నాడు కానీ లేచే ప్రయత్నం చేయటంలేదు. అతని కళ్ళు మళ్ళీ మూతలుపడుతున్నాయి.
లత అతన్ని కుదపడమూ కాలింగ్ బెల్ మరోసారి మ్రోగదమూ ఒక్కసారే జరిగాయి.
రామారావు ఈసారి లేచి కూర్చున్నాడు. అతని నిద్ర మత్తు వదిలిపోయింది. విసుక్కుంటూ మంచం దిగాడు. తనూ అతన్న్తో పాటే వెళ్ళి ఆ వచ్చిన మనిషేవరో చూడాలని లత అనుకుంది.
రామారావు కళ్ళు నులుముకుంటూ బెడ్రూంలోంచి కదిలాడు. లత అక్కడే ఉండిపోయింది. 'ఆ వచ్చింది మోహనే అయితే తానెందుకు అతని కళ్ళబడాలి?
భర్త అతనితో కబుర్లలో పడితే, మోహనే వచ్చినట్లు తనకు తొందరగా ఎలా తెలుస్తుంది? తనకు అత్రుతుగా ఉన్నాడని తెలిస్తే భర్తే ఆ విషయం త్వరగా చెబుతాడు. కానీ ఆతృతను భర్తకు చెప్పదలచుకోలేదు. అతడి దృష్టిలో తన మనసును శిలాదృశంగానే ఉండనివ్వాలి.
రామారావు వెళ్ళాడు. లత అత్రుతుగా ఎదురు చూస్తోంది.
అతను త్వరగానే వెనక్కువచ్చినా, చాలాసేపు పట్టినట్లు ఆమెకు అనిపించింది.
"లతా! నువ్వనుకున్నంతా జరిగింది" అన్నాడు రామారావు.
"ఏం జరిగింది?" ఆమె ఊహా ఇంకా చాలా దూరం వెళ్ళింది.
"మోహన్ ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. ఎవరో అతన్ని రక్షించి ఓ ప్రవేయివేట్ నర్సింగ్ హొమ్ లో చేర్చారు. అతను నే పేరే కలవారిస్తున్నాట్ట. అతడి జేబులో మనింటి అడ్రస్ ఉన్నాడట. ఆ డాక్టరు మనింటికి కబురు పంపించాడు" అన్నాడు రామారావు.
"ఎలా ఉన్నాట్ట?" అంది ఆప్రయత్న్మగా లత.
"చావు బ్రతుకుల్లో ఉన్నాట్ట" అన్నాడు రామారావు.
"ఏం చెప్పరా మనిషికి?"
"నిన్నడక్కుండా ఏం చెప్పను?" అన్నాడు రామారావు.
"మీకు చూడాలనుందా?" అంది లత.
"నీకు లేదా?" అన్నాడు రామారావు.
"లేదు. చూడాలనుకుంటే మీరు చూసి రండి" అంది లత.
"నేను వెళ్ళి చూసి రావడానికి నీ కభ్యంతరం లేదా?" అనడిగాడు రామారావు.
"మోహన్ కీ మీకూ సంబంధించిన ఏ విషయంలోనూ నా ప్రసక్తి ఉండకూడదు. అది అభ్యంతరం కానీండి, అనుమతి కానీండి" అంది లత.
"అయితే నేను వెడుతున్నాను" అన్నాడు రామారావు.
"ఇప్పుడు వేడతారా?" అంది లత కంగారుగా.
"ఇప్పుడు కాకపోతే సావకాశంగా తెల్లరేక లేచి వెడతానా?" కాస్త విసుగ్గానే అన్నాడు రామారావు.
"వెళ్ళండి! వెళ్ళగానే అతడు మిమ్మల్ని చూసి లత రాలేదా అనడుగుతాడు. అది చూసి సంతోషించడం కోసం అక్కడకు వెళ్ళండి. ఆ తర్వాత దాకత్రు ఈలతెవ్వరండీ అనడుగుతాడు. న్క పెళ్ళాం అని చెప్పకండి. మోహన్ కూడా ఆమెను కోరుతున్నాడని తాపీగా చెప్పండి. అప్పుడా డాక్టరు నేను కూడా మీ భార్యను కోరితే అభ్యంతరమా అనడుగుతాడు. ఆ ప్రశ్నకు జావాబివ్వడంకోసమైనా అక్కడకు వెళ్ళండి" అంది లత.
"ఎందుకు లతా! అంత కోపంగా మాట్లడతావు. నిన్ను ఏ దివ్యభవనాలలో దాచి నాకా స్తోమత లేదు. నువ్వొక అందాల రాణివి, దేవతవు. నిన్నుచూడగానే ఆశ పడ్డది మోహన్ ఒక్కడేనని నేననుకొను. అతనికి మర్యాద తెలియదు కాబట్టి తన మనోభావాన్ని బాహాటం చేశాడు. అలా బాహాటం చేయనివాళ్ళు కొన్ని వందలుంటారు. నువ్వు నా దానివి కావడం నా అదృష్టం . అయితే ఇతరులు నిన్ను ప్రేమించారని నే నసూయాపడను" అన్నాడు రామారావు.
"మీరు చెప్పిందాన్నిబట్టే తెలుస్తోంది __ కొన్ని అలోచనలను నాగరిక ప్రపంచంలో బాహాటం తిట్టారనుకోండి _ ఆయన్ను చంపాలనిపిస్తోంది ఆవేశాన్నణచుకుని ఆయన్ను చంపకపోతే మనిషి అనిపించుకుంటారు. చంపినా, అందుకు ప్రయత్నాలు చేసినా హంతకులౌతారు. ఆడదాన్ని మగాడూ, మగాణ్ణి ఆడదీ చూసి లక్షరకాల అనుభూతలకు లోను కావచ్చు. కానీ వాటిని అదుపు చేసుకోకపోయినా, చేసుకోవాలనుకాకపోయినా, ఆ మనిషిమీద సానుభూతి అనవసరం" అంది లత.
"సరే __ నేను మొహాన్ని చూడ్డానికి వెళ్ళడం లేదు" అన్నాడు రామారావు.
ఆ నర్సింగ్ హొమ్ అడ్రస్ తీసుకొండి. రేపుదయం వెళ్ళిచూడొచ్చు" అంది లత.
రామారావు ఆ విషయం చెప్పడానికి వీధివైపు వెళ్ళాడు. తిరిగొచ్చిన పది నిముషాల్లో అతను నిద్రపోయాడు కానీ, ఆ రాత్రి తెల్లవార్లూ లతకు నిద్ర పట్టలేదు.
12
"డాక్టర్! లత రాలేదు కదూ?" అన్నాడు మోహన్ నీరసంగా.
డాక్టర్ మోహన్ ని చూసి నవ్వి, "నీ స్నేహితుడు వద్దా మనుకున్నాట్ట" అన్నాడు.
"ఆమెది పాపాణ హృదయం ......"గోణుక్కున్నాడు మోహన్.
"తప్పు ఆమెది కాదు. ఆమెకోసం ప్రయత్నిస్తున్న నీది" అన్నాడు డాక్టర్.
ఆత్మహత్యకోసం అతనీ డాక్టర్ని కలుసుకున్నాడు. డాక్టర్ అతనిదగ్గర కొంత డబ్బు తీసుకుని అతనాడే నాటకానికి సహకరించదల్చుకున్నాడు. ఆ ప్రకారం మోహన్ డాక్టర్ తోటలో కాంపౌండ్ వాల్ మీదనుంచీ, దూకి ఒంటికి కాసీనిగాయాలు చేసుకున్నాడు. ఒళ్ళు కూడా నెప్పులు చేశాయి. డాక్టర్ అతనికి గాయాలకు మించిన బ్యా౦డేజీలు వేశాడు. బాగా రాత్రి సమయంలో రామారావింటికి కబురంపించాడు. కానీ ఆ దంపతులు చూడ్డాన్నికి రాలేదు.
మోహన్ కు చాలా బాధగా వుంది. పెయిలౌతున్నకొద్దీ అతని పట్టుదల పెరుగుతోంది.
'తననీస్థితిలో చూస్తె కరుగిపోయి తీరాలి ! డాక్టర్ కూడా అలాగే అభిప్రాయపడుతున్నాడు. 'మోహన్ కు ఆలస్యంగా నిద్రపట్టింది.
మర్నాడుదయం తొమ్మిది గంటల ప్రాంతాన రామారావు మోహన్ ని చూడానికి వెళ్ళాడు. అతని కూడా లత రానందుకు చాలా నిరుత్సాహ పడ్డాడు మోహన్.
"ఒక్కడివే వచ్చావా?" అన్నాడు మోహన్ చాలా నీరసంగా.
"అనుబధం మనిద్దర్నీని కదా! అందుకే నేను వచ్చాను. లతను రామ్మతే రానుంది" అన్నాడు రామారావు. మిత్రుడి పరిస్థితి చూసి అతడి కడుపు కరుక్కుపోయింది. "చాల పెద్ద ప్రమాదమే తప్పినట్ట్లుంది" అన్నాడతను డాక్టర్ వంక చూసి. |
25,039 |
"అక్కా! రాతియుగంలో జీవించే వాళ్ళకున్న తెలివి కూడా నీకులేదు. అందుకే బావ నీ మెతకదనం కనిపెట్టి ఆటలాడిస్తున్నాడు. బెదిరిస్తున్నాడు. మీ బావకి నా మీద ఎంత ప్రేమో! క్షణం వదిలి వుండరు. అనే దానివే. ఇప్పుడిదేమిటి? పిల్లలు పుట్టరని వదిలేస్తున్నాడా? నీపై ప్రేమ ఎక్కువయి వదిలేస్తున్నాడా? నన్ను పెళ్ళాడాలని నాటకాలు పోతున్నాడా? నిజమైన ప్రేమ భార్యభర్తల మధ్య వుంటే, నిన్నిడిచి పోతానని భర్త, నిన్నిడిచి పోతానని భార్య బెదిరించుకుంటూ కాపురాలు చేయరు. రోగాలు బాధలు వచ్చాయని విడనాడరు. ఇదివరకు బావ నీపై చూపిందంతా కపట ప్రేమ. ఆ శ్రీ కృష్ణమూర్తికి ఊళ్ళో గోపికలు తక్కువయారు నామీద పడ్డాడు. నీవు గట్టిగా ఎదురు తిరుగు. ఈ సమస్యకు పరిష్కారం నే చూస్తాను." "నీకేం చాతనవునని ఏం చూస్తావే, ఆయనసలే మొండి మనిషి. ఇప్పటికిప్పుడు ఎవతినన్నా పెళ్ళాడి తీసుకు రాగలరు. ఆనక ఏమనుకుని ఏం ప్రయోజనం వుంది. నా గతేం కావాలి?" "బావ మొండి అయితే నువు జగమొండిగా మారు. అంతేగాని ఇలా శోకాలు పెట్టకు. బావ మొండవాడు. నీవు మెతకదానివి. అందుకే ఆటలు సాగుతున్నాయి, బావకన్నా మొండిదాన్ని నేను. నన్నేం చేయలేక నీమీద ఎగిరిపడుతున్నాడు. అన్ని విషయాలలోనూ ఆడది మన్ను తిన్న పాములా పడివుండటం, గంగిరెద్దులా బుర్ర ఊపటం, ఎప్పుడు మానేస్తుందో అప్పుడు గాని సంసారాలు సౌఖ్యప్రదం కావు. సందర్భాన్ని బట్టి తలవంచాలి. సమయం చూసి తల ఎత్తాలి. ముందది నువ్వు నేర్చుకో. బావకి గుణపాఠం నేర్పి నీ కాపురం నే చక్కబరుస్తా." "నువ్వం చేయగలవే!" "అదే వద్దన్నాను. ఏం చేయలేనో చెపితే, ఏం చేయగలనో చెపుతాను." లలిత అయోమయంగా తల్లి వేపు చూసింది. "దీప చెపుతున్నది కదా! నువ్వూరుకో. అంతా అది చూసుకుంటుంది. చిన్నదయినా దాని పాటి తెలివి దైర్యం మనకి లేకపోయె" అంది ఆదిలక్ష్మమ్మ. ఈ మధ్య దీప సంసారాన్ని చక్కదిద్దే తీరు తెన్నూ చూసి, దీప ఏమయినా చేయగలదనే ధైర్యం ఏర్పడింది. "నీ ఇష్టం ఏం చేస్తావో" అంది లలిత. "ఏం చేస్తానో చూస్తావుగా! తొందరెందుకు" అని ప్రయివేటుకి బైలుదేరింది దీప. వెళుతూ మధుసూదనం రాసిన లెటర్ దాచి వెళ్ళింది. దీప దోవ పొడుగూతా ఆలోచిస్తూనే వుంది. ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి పోతున్నాయి. "ఏం చేస్తానో చూస్తావుగా?" అనయితే అందిగాని ఏం చేయాలన్నది తెలియలేదు. పార్వతమ్మ ఇల్లు వచ్చిందాకా ఆలోచిస్తూనే నడిచింది. పార్వతమ్మ దీపని చూస్తూనే "మొహం అలా పీక్కుపోయిందేమే దీపా!" అంది. "సమస్యలు తగ్గాల్సింది పోయి, కొత్త సమస్య లొచ్చి పడుతున్నాయి" అంది దీప తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో. "మీ బావ ఊరు నుంచి ఊడిపడ్డాడేమిటి?" అక్కడే వున్న అనిల్ నవ్వుతూ అడిగాడు. "బావ ఊడి పడలేదు, ఆయనగారు రాసిన ఉత్తరం ఊడిపడింది" అంది దీప. దీప చెపుతుందని అనిల్ ఊరుకున్నాడు. తల్లి కొడుకు ఇరువురిలో ఎవరైనా అడిగితే చెప్పొచ్చని ఊరుకుంది దీప. "ఇంట్లో అన్నీ సక్రమంగా ఉన్నాయికదా" అంది పార్వతమ్మ. "ఇంటి విషయాలేం ఫరవవాలేదత్తయ్యా! నాకు తోడుగా మీ అబ్బాయి నిలబడి చాలాభాగం మా సమస్యలు పరిష్కారం చేశారు. నాలుగు గదుల్లో మేం సర్దుకున్నాము. తతిమ్మా ఆరు గదులు రెండు భాగాలుగా చేసి అద్దెకిచ్చాము. అమ్మ మొదట ఒప్పుకోలేదు తర్వాత ఊ అందనుకో. రెండు భాగాలుకి ఎనభై రూపాయలు అద్దెవస్తున్నది. గేదెని బేరం చేస్తున్నాము. రెండొందలు పోయినా మంచి గేదెనుకొంటే పాలు ఎక్కువగా ఇస్తుంది. పాలు హోటల్ కి గాని పాల వ్యాన్ కి గాని అమ్మొచ్చు. ఇటు ఇల్లు గడుస్తుంది. అటు డబ్బు వస్తుంది. సంసారం గడిచిపోతుంది. నాన్న చేసి పోయిన అప్పులు తీర్చటం ఎలా అన్నది అప్పుడప్పుడు కష్టంగా తోస్తుంది. నాన్న ఉండగా పొలం అమ్మలేదు. అదో అదృష్టం. తిండి గింజలకి లోటులేకుండా ఏడాదికేడాది గడిచిపోతుంది. ఇప్పుడు గేదెని కొనడానికి అప్పుచెయ్యాలా? అది తీర్చాలా?" పార్వతమ్మ మధ్యలో అడ్డు తగిలింది. "మేమేం పరాయివాళ్ళమంటే దీపా! డబ్బు సంగతి అనిల్ చూసుకుంటాడు కదా!" అంది. "అప్పుచేసి తీర్చేకన్నా ఆ డబ్బుంటే ఎంత బాగుండేది?" అంది దీప. "తొందరేం లేదు, నీ దగ్గర డబ్బు పోగయిం తరువాతే ఇద్దువుగాని దీప!" అన్నాడు అనిల్. మళ్ళీ వెంటనే "ఇవ్వకపోయినా ఫరవాలేదు. నేను, అమ్మ ఏమీ అనుకోము" అనేశాడు వెంటనే నాలుక కొరుక్కున్నాడు. "మీకు రుణపడమంటారా?" చివ్వున తలఎత్తి అనిల్ కళ్ళల్లోకి తీవ్రంగా చూస్తూ అంది దీప. "అంత భాగ్యం కూడానా! నీవు ఎవరికి రుణపడవు దీపా" అనిల్ సూటిగా దీపని చూడటంతో అనిల్ చూపుల్లో దీప చూపులు కలిశాయి. టక్కున కనురెప్పలు దించుకుంది దీప. "సుందరమ్మగారు పెద్దదయిపోయింది. ఆవిడకి వంట్లో బాగుండటం లేదని తెలిసింది. ఓసారి అలా వెళ్ళొస్తాను. ప్రయివేటు అయిన తరువాత అటువస్తేరా దీపా!" అని పార్వతమ్మ వెళ్ళిపోయింది. దీప పుస్తకాలు తెరచింది. అనిల్ నిన్న చెప్పిన పాఠాలు పరిశీలించి కొత్తపాఠం మొదలు పెట్టాడు. దీప మనస్సు పాఠం మీద లగ్నం కావటం లేదు. బావ రాసిన ఉత్తరం మీదే వుంది. "దీపా! ఏమిటా పరధ్యాన్నం! పరీక్షలు దగ్గరకొస్తున్నాయి. శ్రద్ధగా పాఠం వినటంలేదు." అన్నాడు అనిల్ చెపుతున్న పాఠం ఆపుజేసి. "పరధ్యాన్నమా! అబ్బే నాకేం లేదు. పాఠం వింటున్నాను." "ఆ కంగారు దేనికి?" దీప మాట్లాడలేక పోయింది. "దీపా! సమస్యలు ఎప్పుడూ ఉంటాయి. వాటినే పట్టుకుని బుర్ర వేడెక్కించుకుంటే చదువు ఎలా వంటపడుతుంది? మొహమాట పడకు దీపా! నన్నేమన్నా చేయమంటావా!" "ఇప్పటికే చాలా సహాయం చేశారు. నేనొంటరిగా ఏమిచేయగలను. మీరు తోడుగా నిలిచి ఎప్పటికప్పుడు నే అడిగిన వాటికి సలహాలిచ్చి నన్ను ప్రోత్సహించి మా సంసారాన్ని నిలబెట్టారు. అదే బావ కూకటివేళ్లతో చెట్టునే పడదొయ్యాలని చూస్తున్నాడు." "మీ బావ దగ్గరనుంచి ఉత్తరం ఊడి పడిందన్నావుగా, అదేమిటో చెప్పు దీపా!" వివరంగా చెపుదామా వద్దా అని సంశయంగా ఆలోచిస్తూ వుండిపోయింది దీప. "అడిగినా చెప్పవులే దీపా! నీదంతా గుట్టు. ఆప్తుడిగా అడుగుతున్నాగదా, చెప్పటానికేమిటి? లేక అంత చెప్పకూడని విషయమా? నావద్ద ఊరికే చదువు కుంటున్నానని ఇది ఏ జన్మ రుణమని పాతబాకీ వసూలు చేసుకుంటున్నానా! ఇలా అని అమ్మతో అంటుంటావు చాలాసార్లు విన్నాలే. రుణం, బాకీ, సహాయం ఇలాంటి మాటలు ఉపయోగిస్తుంటావు గాబట్టి ఇప్పుడు కూడా నీ సమస్య ఏదో చెప్పు...చెప్పి" ఆగిపోయాడు అనిల్. |
25,040 | మనలో మనలాంటి వాళ్ళేగాక చదువుకుంటున్న అమ్మాయిలు కూడా వచ్చారు. వాళ్ళయితే బాగా మాట్లాడుతారు. మనలో కొందరు బాగా మాట్లాడగల వారు లేచి ఆ పిల్లదాని వెర్రి మొర్రి రాతల గురించి మాట్లాడుకుందాము. ఈ రోజే అమీతుమీ తేల్చుకుందాము. ఇక్కడ సోదరులు లేకపోయినా యిందాక ఆ మాట వాడాను. ఓ అర్ధంతో ఆ మాట వాడటం జరిగింది.
ఆడవాళ్ళు ఎప్పుడూ పిరికివాళ్ళు కారు. మొదటి కాన్పుకి భయపడ్డ ఈ ఆడవాళ్ళు పిరికితనంతో బెదరకుండా చావుకి లెక్క చేయకుండా మళ్ళీ మళ్ళీ ధైర్యంగా పిల్లలని కంటున్నారు. భయము పిరికితనము మనకిలేదు కనుక..."
ఓ చదువుకున్న అమ్మాయి చప్పట్లు కొట్టింది. ఎవరైనా ఉపన్యాసం లాంటిది యిస్తుంటే చప్పట్లు కొట్టాలని కొడతారని అప్పుడు చాలామందికి అర్ధమైంది. ఆ మాట గుర్తు రాగానే టపటప చప్పట్లు కొట్టారు.
బలవర్ధనమ్మకి ఏనుగెక్కినంత సంతోషం అయింది. ఈ మాట అనాలో అనక్కరలేదో తెలియకపోయినా "సంతోషం చాలా సంతోషం." అంది. పైట చెంగుతో కళ్ళు వత్తుకుంది. మళ్ళీ విజృంభించింది ఆపై.
"... ... కనుక నేను చెప్పేదేమిటంటే చాలా వుంది. మన ఇందిరమ్మ తల్లి ఒక్కతీ వందమంది మగాళ్ళ పెట్టు. లక్షమంది మగాళ్ళు వున్న సభలో ఒక్క ఇందిరమ్మ తల్లి ధైర్యంగా మాట్లాడి అందరినోళ్ళు మూయించేది. ఇప్పుడు ఆ తల్లి సంగతి ఎందుకు చెపుతున్నానంటే వందలమందీ మగాళ్ళు చేయని సాహసమైన పని ఆడది ఆమె ఒక్కతీ ధైర్యంగా చేసేది. ఇందిరమ్మ తల్లి పుట్టిన ఈ గడ్డమీద మనం పుట్టాము. మగాడిని మించిన ఆమె వెయ్యిమంది మగాళ్ళకి సమానం. ఆమె అంత కాకపోయినా మనం కూడా కాస్తగట్టి వాళ్ళమే. మగాళ్ళు మన గోడు వినిపించుకోటం లేదు. కాబట్టి మనం మగాళ్ళు కాక తప్పదు. ఆ ఉద్దేశ్యంతో నేను సోదర సోదరీమణులన్నాను. అదన్న మాట విషయం...." యధా శక్తి మళ్ళీ అందరూ చప్పట్లు కొట్టారు.
".... మనం యిప్పుడు ఏం చేయాలన్నది మాట్టాడుకుందాము. అందరూ ఎవరికి తోచింది వారు నిర్భయంగా ఈ బల్ల ఎక్కి చెపితే ఏం చేయాలో ఆలోచిద్దాం. మనతోపాటు అమ్మాయిలు కూడా మాట్లాడాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే వాళ్ళు చదువుకున్నారు చాలా విషయాలు తెలుస్తాయి కనుక వాళ్ళూ మాట్లాడుతారు. తప్పులుంటే క్షమించండి. జైహింద్." అని బలవర్ధనమ్మ ఓ ఫోజు పెట్టి బల్ల దిగింది.
బలవర్ధనమ్మ తర్వాత ఎవరు మాట్లాడాలో తెలియలేదు. 'మీరు మాట్లాడండి పిన్నిగారూ!" అని వెంకాయమ్మ అంటే "పెద్దది వదినగారు మాట్లాడుతారు." అని మరొకామె అంది.
దూరంగా కూర్చున్న ఇద్దరు అమ్మాయిలు బలవర్ధనమ్మ గురించి చెవులు కొరుక్కున్నారు. వాళ్ళ మాటలు యిలా సాగాయి.
"బలవర్ధనమ్మ ఎన్నికలప్పుడు అన్నగారు ఇంద్రుడు, చంద్రుడు అతగాడికే ఓటు వేయమన్నది. వున్నట్లుండి ఇందిరాగాంధీ భక్తురాలు అయిందేమిటి?"
"ఎన్.టి.ఆర్. తెరమీద తైతక్కలాడుతున్న రోజుల్లో ఈవిడ ఇందిరమ్మ వంటిమీద ఈగని వాలనిచ్చేది కాదు. ఆయనగారు రాజకీయాల్లోకి దూరంగానే ఈవిడగారి చచ్చిన మొగుడు కలలో శ్రీకృష్ణ పరమాత్మగా కనిపించాడుట. దాంతో ఆ కృష్ణుడిని ఈ రాముడిలో చూసుకుని పచ్చచీర చుట్టేసుకుంది."
"ఉ... తర్వాత?"
"బీదవాళ్ళకి యిళ్ళ పట్టాలు ఫించను వగైరాలు యిస్తున్నారని తెలిసి క్యూలో ముందు నుంచుంది. నీ మొగుడు ఏ ఉద్యోగమూ చేయలేదు కాబట్టి నీకు ఫించను లేదు. నీవు కూలీ నాలీ చేసుకునే బీద దానివి కాదు కనుక నీకు ఇళ్ళస్థలం యిచ్చేది లేదని ఆవిడని లిస్టులోనుంచి తొలగించారు. దాంతో ఆమెకి కోపం వచ్చి ఆయన నాకేం అన్న మేమిద్దరం ఓ అమ్మ కడుపున పుట్టమా, చచ్చామా! అనుకుంది. ఏదో యిస్తాడని ఆశపడి ఓటేసి గెలిపించిన అన్న కన్నా ఏమాటా యివ్వని ఆ అమ్మ నయం అని పార్టీ ఫిరాయించేసింది. ఈ మధ్య ఆ అమ్మకి పుట్టిన బిడ్డ అని రాజీవ్ గాంధీకి జై అంటున్నది." |
25,041 | జయదేవుడు తోక తొక్కిన తాచులాగా అయిపోయి, ప్రతాపున్ని బంధించి, చెరసాలలో పెట్టించమని ఉత్తర్వునిచ్చాడు.
ఈ సంగతి తెలిసి చారుమతి ఎంతో దుఃఖించింది. ఆమె తన తండ్రి వద్దకు వెళ్ళి ప్రతాపుడు ద్రోహబుద్దితో వచ్చినవాడు కాదనీ, తనపై ప్రేమ ప్రకటించుకోవటానికి నానా అగచాట్లూ పడ్డాడనీ, అతన్ని వెంటనే చెర విడిపించి, తమ కిద్దరికీ వివాహం చెయ్యమనీ దీనంగా వేడుకున్నది.
"ఆ నీచుడి పక్షాన నా కర్తవ్యం బోధించకు. నిన్ను ఎలాటి వాడికిచ్చి పెళ్ళిచెయ్యాలో నాకు బాగా తెలుసు" అని జయదేవుడు తన కుమార్తెను విదిలించి పారేశాడు.
ఆ సాయంకాలమే ఆయన చెరసాలకు వెళ్ళి, ప్రతాపున్ని కలుసుకుని "బుద్దిహీనుడా, ఈ రాజ్యంలో అడుగు పెట్టటం అపాయమని తెలిసికూడా ఎందుకు అడుగుపెట్టావు? ఏ కారణం చేతనైనా రాగోరితే బాహాటంగా రాక పిరికిపందలాగా మారువేషంలో ఎందుకు వచ్చావు? ఇప్పుడు నేను నీ తల తీయిస్తే అడ్డేదెవరు?" అని అడిగాడు.
ప్రతాపుడి ముఖంలో భయలక్షణాలు కనబడతాయని ఆయన అనుకున్నాడు. కాని అలాటిదేమీ జరగలేదు. ప్రతాపుడు చిన్నగా నవ్వి, "నేను మీ రాజ్యంలోకి ప్రచ్ఛన్నంగా వచ్చినది నా క్షేమంకోసం కాదు, మీ రాజ్యం క్షేమంకోరి నేను బాహాటంగా రాదలిస్తే సైన్యాలతోనే రావాలి. అదే జరిగితే మీ రాజ్యం ఒక్కరోజులో స్మశానం మారిపోతుంది. నేను వచ్చినది మీ కుమార్తె చారుమతి హృదయం తెలుసుకోవటానికి, మీ రాజ్యాన్ని నేల మట్టం చెయ్యటానికి కాదు" అన్నాడు.
"నా కుమార్తె హృదయం తెలుసుకున్నావా?" అని జయదేవుడు అడిగాడు.
"తెలుసుకున్నాను. నన్ను పెళ్ళాడాలన్న వాంఛ ఆమెలో గాఢంగానే ఉన్నది" అన్నాడు ప్రతాపుడు.
"పిరికిపందవు! నన్ను జయించలేక నా కుమార్తెను పెళ్ళాడి, ఆ విధంగా నా రాజ్యం హరించుకుందామనుకున్నావు. నా రాజ్యం నేలమట్టం చేస్తానని ప్రగల్భాలెందుకు?" అన్నాడు జయదేవుడు.
"మీ కుమార్తెను పెళ్ళాడటంతోబాటు మన రాజ్యాలు రెండూ ఏకం కావాలన్నకోరిక కూడా నాకున్నది. అలా జరగాలంటే నేను మీ రాజ్యమైనా గెలవాలి. మీ చేత నా రాజ్యాన్ని గెలవనివ్వటమైనా చేయాలి. నా రాజ్యం గెలవటానికి మీకు సులభోపాయం చెప్పాను. అందులో ఏదో ద్రోహం ఉన్నట్టు మీరు నన్ను చెర పెట్టించారు" అన్నాడు ప్రతాపుడు.
"నువ్వు ఎంతో పిరికిపందవై వుంటే తప్ప నీ రాజ్యాన్ని నాకు కనుక పెట్టాలని పెట్టాలని చూడవు. నీకు శిరచ్చేదమే తగినశిక్ష" అన్నాడు జయదేవుడు.
ప్రతాపుడు ఆశ్చర్యంగా, "మీరు మహా పరాక్రమవంతులని దేశ దేశాలా చెప్పుకుంటున్నారు. శత్రువును నిరాయుధుడుగా పట్టి శిరచ్చేధం చేసేవాడికన్నా పిరికిపంద ఎక్కడుంటాడు?" అన్నాడు.
జయదేవుడి ఆగ్రహం నషాళం అంటింది. ఆయన ఆ కోపాన్ని నిగ్రహించుకొని "నేను ఉదారస్వభావంతో నిను విడిచిపుచ్చితే ఏం చేస్తావు?" అన్నాడు.
"మీరు అలాటి సాహసమే చేస్తే, నేను మా దేశానికి వెళ్ళి సేనలను తరలించుకు వచ్చి మీ దేశాన్ని నామరూపాలు లేకుండా చేసేస్తాను. వీలుపడితే ద్వంద్వ యుద్దంలో మీ ప్రాణాలు తీసేస్తాను" అన్నాడు ప్రతాపుడు.
జయదేవుడు కళ్ళు మెరిశాయి. ఆయన ప్రతాపుడితో "ఇప్పుడే నీకు వీలు కలుగజేస్తాను" నాతో ద్వంద్వ యుద్ధం చెయ్యి" అన్నాడు.
అప్పటికప్పుడే ప్రతాపున్ని చెరవిడిపించారు. జయదేవుడు శస్త్ర చికిత్సకులను రప్పించి, ప్రతాపుడికి ఒక కత్తి యిచ్చి, తనొక కత్తి తీసుకుని యుద్దానికి సిద్దంగా నిలబడ్డాడు.
యుద్దంలో చాలాసేపు జయదేవుడూ, ప్రతాపుడూ సమ ఉజ్జీలుగా కనబడ్డారు. జయదేవుడు ప్రదర్శించిన కళలన్నిటికీ ప్రతాపుడు ప్రతిక్రియలు చేశాడు. కాని ఆఖరులో జయదేవుడు ప్రతాపుడి చేతి కత్తిని ఎగర గొట్టాడు.
ప్రతాపుడు అమితాశ్చర్యంతో "ఈ కళ నేనెన్నడూ ఎరగనే!" అన్నాడు.
జయదేవుడు ప్రతాపుడి భుజం తట్టి, "అల్లుడూ! నువ్వు నేర్చుకోవలసిన కళలు ఇంకా ఒకటి రెండున్నాయి. వాటిని నీకు అల్లుడి కట్నంకింద ఇచ్చుకుంటాను. నీ వివాహానికి తరలిరమ్మని మీ దేశానికి కబురు పంపు" అన్నాడు.
మంచి ముహూర్తాన ప్రతాపుడికీ, చారుమతికీ వివాహం అయిపోయింది. కోసల, విదేహ రాజ్యాలు ఏకమయ్యాయి. కాలక్రమాన రెంటికీ ప్రతాపుడే రాజై, తన తండ్రి చివరి కోరికలు పూర్తిచేశాడు.
బేతాళుడీ కథ చెప్పి, "రాజా, నాకొక సందేహం. జయదేవుడు ప్రతాపున్ని ద్వంద్వ యుద్దంలో ఓడించికూడా, ఆకస్మికంగా అతన్ని తన అల్లుడుగా చేసుకోవటానికి ఎందుకు నిర్ణయించాడు? తన కుమార్తె అతన్ని ప్రేమించిందనా? లేక ఎప్పటికైనా అతను తన రాజ్యాన్ని మట్టు పెడతాడనా? ఒకవేళ ఇది ఆకస్మిక నిర్ణయం కాకపోతే, తన అల్లుణ్ణి చేసుకోదలచి కూడా ఆయన ప్రతాపుడితో ఎందుకు ద్వంద్వ యుద్దానికి తలపడ్డాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసికూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది" అన్నాడు.
దానికి విక్రమార్కుడు "జయదేవుడు ప్రతాపుడికి తన కూతురునిచ్చి చెయ్యాలని నిర్ణయించింది ద్వంద్వ యుద్ధం అయ్యాకనే.....! ప్రతాపుడి తండ్రి జగత్ప్రసిద్దుడైన భీరువు, ప్రతాపుడి ప్రవర్తన కూడా పిరికివాడి ప్రవర్తనలాగే జయదేవుడికి కనపడింది. అతను మహావీరుడో, పిరికివాడో తేల్చుకోవటానికే జయదేవుడు అతనితో ద్వంద్వ యుద్ధం సాగించాడు. ప్రతాపుడు ద్వంద్వ యుద్దంలో జయదేవుడికి సమానం కాకపోయినా, అతను గొప్ప వీరుడన్నది మటుకు రూఢీ అయిపోయింది. తను ఓడిపోయాక కూడా అతను ఓడినందుకు దుఃఖించక, కత్తి యుద్దంలో తాను ఎరుగని లాఘవాన్ని జయదేవుడిలో చూసి అబ్బురం చెందాడు. అధీ నిజమైన వీరుడి లక్షణం. అందుకే జయదేవుడు తన కుమార్తెను అతనికిచ్చి చెయ్యటానికి నిశ్చయించాడు" అన్నాడు.
రాజుకీ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.
(చందమామ- 69)
-- * * * -- |
25,042 |
దీన్ని అంతనితో తొడిగించుకో. మీ దాంపత్యం మూడు పూవులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది. దాంపత్య సౌరభాలు మీ కుటుంబానికి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి." ఎంతో దృఢ విశ్వాసంతో అన్నారాయన.
వారుణి మనస్సే కాదు కంఠం కూడా ఆర్ద్రమైపోయింది. చప్పున గొంతు పెగిలి రాలేదు.
"థాంక్యూ అంకుల్! థాంక్యూ మా జీవితంపై ఆయనకైనా లేని శ్రద్ధ మీకుంది" అనుకుంది. ఆ మాటలు పైకి అనలేకపోయింది. ఆమె కళ్ళు చెమ్మగిల్లినాయ్.
"అవి ఆనంద భాష్పాలు కావాలి వరూ!"
ఆశీర్వదించినట్టుగా అన్నారాయన.
చప్పున వంగి ఆయన పాదాలకి నమస్కరించిందామె.
"సుఖ శాంతులతో జీవించు తల్లీ!"
ఆయన వెళ్ళిపోయారు.
శంకర రామారావుగారు వెళ్ళిపోయినా యింకా ఆయన మాటలే వారుణి చెవుల్లో రింగు మంటున్నాయి.
వారుణి అలాగే కూర్చుండిపోయింది.
21
ఆశా తరంగాల వెంట పరిగెత్తే మనిషికి అవి నిజజీవితంలో ఎండమావులే అవుతాయి. మనిషి ఒక్కోసారి తాను ఆశించిందాని వెనకపడి పరిగెత్తుతూ వుంటే అది యింకా దూర దూరంగానే వెళుతూ వుంటుంది.
మనం ఒక్కోసారి దేన్నయితే పరిహరించాలని శతవిధాలా ప్రయత్నిస్తూ వుంటామో అదే మనపాలిటి శనిగ్రహంలాగా తప్పనిసరిగా మన పాల బడుతుంది.
ఆ రోజు సరిగ్గా అదే జరిగింది.
కోపాన్ని నిగ్రహించుకోవాలనుకున్న సారధికి ఆ రాత్రి మళ్ళీ కోపం ఉవ్వెత్తుగా వచ్చేసింది. అదీ నిగ్రహాన్ని సంపూర్ణంగా కోల్పోయేంత కోపం వచ్చింది.
పరిస్థితులు అలా తీసుకుని వచ్చాయి.
లైబ్రరీ నుంచి యింటికి రాగానే సుబ్బరత్నమ్మగారు కొడుకుని పెరట్లోకి లాక్కెళ్ళినంత పనిచేసి ఘాటుగా తిట్టిపోసింది. వడగళ్ళ వానలా కురుస్తోన్న ఆమె తిట్లని అతను అడ్డుకోలేకపోయాడు.
బలహీనత_తల్లిని అడ్డుకోలేని బలహీనత. అతని కోపాగ్నికి మరింత ఇంధనమైంది. అటూ యిటూ ఎటూ తేల్చి మాటాడి సమర్ధించలేని అతని నిస్సహాయత అతన్ని మరీ కృంగదీసింది. అతని అహాన్ని యింకా రెచ్చగొట్టింది. కోపం మూడు రెట్లయింది.
"నేను కొడుకుని కన్నాననుకున్నాను కానీ వాజమ్మని కన్నాననుకోలేదురా! అలా అయితే నిన్నూ ఓ ఆడపిల్లగా మార్పించేసేదాన్ని. నీ భార్యకి ఎంత పొగర్రా?
నన్నూ మీ వదిన్నీ నిర్లక్ష్యంగా చూస్తుందా? ఏం చూసుకుని దానికా గర్వం? కాపురాని కొచ్చి నెల తిరగలేదు అప్పుడే అధార్టీలా?
ఏనాడైనా మనం పదమని కాకా హోటల్ కి టీకి పంపేమా? ఎవరో వచ్చారు. చొరవగా వంటింట్లో చొరబడి టిఫిన్ తీసుకెళ్ళి పెట్టింది, ఎంత స్వతంత్రం?
ఏం? నేను అత్తముండని అక్కడే చచ్చానే? నాతో ఒక మాట అనకూడదా? ఎవరో ఏమో ! వరూ, వరూ అంటూ కేకలు వేసుకుంటూ లోపలికొచ్చాడు. ఓ మంచా? మర్యాదా? ఏదీ తెలిసినట్టు లేదు. అయినా మనకేం అయినా వాళ్ళు బంధువులా? ఎవరో! ఈ చదువుకున్న అమ్మాయిలని ఎక్కడకని విశ్వసించటం?
కాఫీ ఇద్దామంది. లేదు_నేను తాగేశాను మళ్ళీ కలుపుదామంటే పాలు విరిగిపోయాయి లేవు. అందుకని పద్మని బయటికి పంపిస్తుందా? అదీ కాకా హోటల్ కి.. ఎంత పొగరు!
తను ఓ మహారాణి!
నేనూ_మీ వదిన_నీ చెల్లెలు తనకి బానిసలు. అవునా? అంతే కదూ దాని వుద్దేశ్యం? |
25,043 | నీ గొంతుక ఎప్పుడూ ఇతరుల సక్సెస్ లను చెప్పడానికే పలుకుతుంటుంది. నీ మెదడంతా వాళ్ళ ఆలోచనలతోనే నిండిపోతుంది. చివరికి నీదికాని బతుకును నువ్వు బతకాల్సి వస్తుంది.
అతనిలో అథనికి తెలియకుండా చిన్న కదలిక. జీవితంలో తొలిసారిగా తను చేస్తున్న తప్పు లీలామాత్రంగా మెదడుకు అందింది.
"ఇంటికెళ్ళి ఆలోచించు. నే చెప్పిన విషయంలో తప్పులున్నాయో, ఒప్పులున్నాయో" అంది.
అతను మెల్లగా పైకి లేచాడు. కలలో నడిచిపోతున్నట్లు అడుగులు వేశాడు. ఈరోజుకి ఈ మాత్రం చాలు. అతనిలో మార్పు రావాలంటే ఒక్కరోజు సరిపోదు! ఇలాంటి రోజులు చాలానే కావాలి.వాటికి ఇదినాంది మాత్రమే అనుకుంది.
గంగాధరం బయటికి వెళ్ళాడో లేదో చిట్టి లోపలికి వచ్చాడు. "తెలుసా ఈ దారుణం?" అని అడిగాడు వచ్చీ రావడంతోనే.
"ఏమైందిరా?"
"అనుపమను దామాచారి వేపమండల్తో బాదేస్తున్నాడు పాపం" అన్నాడు.
"అనుపమా? ఎవరామె?"
"ఈ మద్యనే ఈ ఊరికి వచ్చిన కొత్తకోడలు నర్సమ్మ కొడుకు చంద్రయ్య భార్య"
"ఏమైంది?"
"ఏమో నాకేం తెలుసు? ఆ ఘోరం చూళ్ళేక అక్కడ ఒక్క క్షణం నిలువబుద్ది కాలేదు. వచ్చేశాను.
ఇక ఇంట్లో వుండలేకపోయింది చంద్రరేఖ. పరుగున చంద్రయ్య ఇంటికి చేరుకుంది.
ఆమె వెళ్ళేటప్పటికి ఆ ఇంటి వసారాలో జనం క్రిక్కిరిసి వున్నారు. ఇంట్లోపల జరుగుతున్న తతంగాన్ని అందరూ గుడ్లప్పగించి చూస్తున్నారు.
ఇంటి మధ్య ఎర్రటి ముగ్గువేసి వుంది. అది ఎర్రమట్టితో కాకుండా రక్తంతో వేసినట్టు భయంకరంగా వుంది. దానిచుట్టూ ఎనిమిది దిక్కుల్లో ఎనిమిది నిమ్మకాయలు మెరుస్తున్నాయి.
అప్పుడే కనుగుడ్లను తోడి, ఆ రక్తంతోపాటే అక్కడక్కడా వుంచినట్టు కుంకుమబొట్లు భయానకంగా కనిపిస్తున్నాయి. పసుపు ముద్దలు నిమ్మకాయలతో కలిసిపోయి ఏవి నిమ్మకాయలో, ఏవి పసుపు ముద్దలో తెలియకుండా వున్నాయి.
సాంబ్రాణి పొగ దట్టంగా పైకి లేస్తోంది ముగ్గు మధ్యలో అనుపమను కూర్చోబెట్టాడు దామాచారి. అతని చేతుల్లో వేపమండలు మంచి కొరడాల్లా వున్నాయి. అతనేదో చదువుతూ కర్పూరం వెలిగించాడు. కర్పూరం ఒక్కసారిగా భగ్గుమంది.
మండుతున్న దానిని తీసుకుని దామాచారి ఎదురుగావున్న గోడకేసి కొట్టాడు. అదీ అలా గోడకు అతుక్కుపోయి మండుతోంది.
దీన్నంతా చూస్తున్న చంద్రయ్యకు ఒక్కసారి వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి.
"దెయ్యం మహత్యం కాకపోతే కర్పూరం అలా గోడకు అతుక్కుంటుందా" అని మరోమారు మనసులో అనుకుని చేతులు రెండూ పైకెత్తాడు. ఇక చంద్రయ్య తల్లి నర్సమ్మ అయితే కళ్ళు ఆర్పకుండా కోడలువైపు, దామాచారివైపు చూస్తోంది.
దామాచారి ఏవేవో మంత్రాలు ఒక్కోసారి పైకి చదివి, ఇంకొన్ని సార్లు పెదవుల మధ్యనే చదివి చివరికి "నీ పెళ్ళాన్ని పట్టింది మామూలు దయ్యం కాదు. డబ్బు పిశాచి" అన్నాడు.
చంద్రయ్య, నర్సమ్మ ఒక్క క్షణంపాటు ఉలిక్కిపడి వెంటనే తేరుకున్నారు. "నువ్వే మంత్రంవేసో, తంత్రంవేసో ఆ పిల్లను బాగు చేయాలి" అన్నారు రెండు చేతులూ జోడించి
"అయితే వెంటనే ఓ నల్లటి కోడిపెట్టను బలి ఇవ్వాలి. వెళ్ళి పట్టుకురా" అన్నాడు దామాచారి.
"కోడినితిని ఎన్నిరోజులయిందో -ఏమైనా డబ్బులొస్తే మంచికోడిని పట్టుకురా" అని భార్య కోరిన కోరిక గుర్తు వచ్చింది అతనికి.
దాంతో చంద్రయ్య, నర్సమ్మ తలో దిక్కుకు పరుగెత్తారు కోడిని తేవడం కోసం.
వాళ్ళిద్దరూ వెళ్లిపోయాక తిరిగి మంత్రాలు చదవడం ప్రారంభించాడు దామాచారి.
ఎదురుగా కూర్చున్న అనుపమ తలవంచుకుని వుంది. తల స్నానం చేసి, జుట్టును అలా వదిలేయడంవల్ల వెంట్రుకంతా ముఖాన్ని కప్పేశాయి.
నుదుటున అర్ధరూపాయి సైజులో ఎర్రనికుంకుమబొట్టు సూర్యుడ్ని తెచ్చి అతికించుకున్నట్టుంది దానిపైనున్న తెల్లనివిభూదిపట్టీలు మేఘాల దొంతరల్లా వున్నాయి. మెడలోని వేపాకుదండ గాలికి చేదుతనాన్ని అద్దుతోంది.
|
25,044 |
ఇదిగో ఇన్నాళ్ళకు నేనున్నానూ అంటూ చెప్పకుండానే బ్రతుకుయానంలో తోడయ్యాడు. నీలి నింగి క్రింద రంగు తివాసీలా పరుచుకున్న తన మనసుపై పొగమంచి పొరలోనుంచి దూసుకొచ్చిన ప్రచండ భానుడిలా అనిపించినా ఆ తర్వాత అతి స్వల్పకాలంలో నీరెండగా మారేడు.
ఎప్పుడో ఆకులు రాలిన అరణ్యంలాంటి తన శూన్యంలోకి అణువులా ప్రవేశించి ఇప్పుడు అనంతమైపోయాడు.
అతడు తనకు కావాలి.
అతడి శ్రేయస్సూ తనదిగా మారాలి.
అందుకు ముందు అర్ధంకాని అతి సున్నితమైన పొరల్ని తను సుతిమెత్తగా స్పృశించి...
ఆమె ఆలోచనలు చెదిరి ఫోన్ శబ్దంతో...
ముందు ఉలిక్కిపడింది.
ఇంకా తెల్లవారని ఈ సమయంలో ఇది మరో అపశకునంలా అనిపిస్తూంది.
"హలో..."
"నేనే."
ఆమె వూహ తప్పుకాలేదు ఓడిపోయిన 'బ్లాక్ మాంబా' తనను హెచ్చరించాలని ఫోన్ చేస్తున్నాడు.
"తెలివితేటలు ప్రదర్శించావు శృతీ" కర్కశంగా వినిపిస్తూందతడి కంఠం, "ఇప్పుడు పూర్తిగా ఆపదలో చిక్కుకున్నావు."
నిజానికి ఆమె అదిరిపడింది. కాని ధైర్యాన్ని కూడగట్టుకుంది. "నువ్వూ మాట తప్పావు."
"నువ్వెంత నీ బ్రతుకెంత?"
"అణువంతే కావచ్చు మిస్టర్ బ్లాక్ మాంబా. కానీ ఇప్పుడు నీకు ఈ అణువుతోనూ అవసరం పడింది కదూ..."
"మిస్. శృతీ! నీకన్నా లక్షలరెట్లు బలాడ్యులైన పోలీస్ డిపార్ట్ మెంట్ ని గడగడలాడించినవాడ్ని నేను. జంటనగరాలలోని లక్షలమంది ప్రజల గుండెల్లో సింహస్వప్నాన్నై వణికించినవాడ్ని. నాతో పోరాటం సాధ్యమే అనుకుంటున్నావా!"
"నువ్వు కిరాతకుడివి బ్లాక్ మాంబా...నువ్వు సాగించిన నరమేధం చాలు. నువ్వేమిటో తెలుసుకోవడానికి కొత్తగా పరిచయం అనవసరం."
"ఇంత తెలిసినదానివి నాతో గొడవకెలా సిద్ధపడ్డావు."
"నాకెంత తెలిసో అటుంచి నువ్వూ ఓ విషయం తెలుసుకోవడం మంచిది బ్లాక్ మాంబా! నేను మొండిదాన్ని. అంటే తెగించినదాన్ని. కాబట్టే ప్రస్తుతానికి నీకంటే బలవంతురాల్ని. ఆశ్చర్యపోకు...నీ మూలంగా ఈ జంటనగరాలలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకంటే నేను గొప్పదాన్ని అనుకోవటం లేదు. సో...ఇప్పుడు నీ బెదిరింపులకి లొంగదలచుకోలేదు."
"గూడ్..."
"థేంక్స్...సో ఇప్పుడు చెప్పు. డాక్టర్ సంఘమిత్రని ఎందుకు అపహరించినట్టు..."
"అది నీకు అనవసరం. అప్రస్తుతం."
"అయితే ఇక మన మధ్య చర్చ అనవసరం..." ఖండితంగా చెప్పింది.
"దారికి రానంటావు" సహనాన్ని కోల్పోతున్నట్టు అరిచాడు.
"మిస్టర్ బ్లాక్ మాంబా. ఒక అవసరంతో నాకు ఫోన్ చేసిన నువ్వు కొన్ని కనీస నియమాల్ని పాటించనివాడు నీతో చర్చ అర్ధంలేదన్నది నా అభిప్రాయం...బలంతోనే అంతా సాధించలేవని తెలుసుకుంటే వెంటనే సంఘమిత్రగార్ని విడిచిపెట్టు."
"లేకపోతే..."
"ఆయన అపహరణ సంగతి పోలీసులకి తెలియచేస్తాను. పాపం నువ్వు అతి ప్రయాసతో సాధించిన 'డ్రగ్'ని పోలీసుల సొంతం చేస్తాను. అన్నట్టు చెప్పటం మరిచాను. నీ దగ్గరుండే నీ పేరుగల సర్పం అదే బ్లాక్ మాంబా. చాలా ప్రమాదకరమైంది. దానికి నీలా మనుషులంటే లక్ష్యంలేదు. కాటేసేముందు నీలా ఫోన్ చేయదు...కాటేసాక ఏ మందూ పనిచేయదు."
వ్యంగ్యంగా నవ్వు వినిపించింది. "తెలివైన దానివి."
"మరేం...నాకూ అనిపిస్తూంది."
"వెల్...దెన్ గెట్ రెడీ."
"దేనికి?"
"నీకు అత్యంత విలువైన ఓ మనిషిని నష్టపోవడానికి."
శృతి నిశ్శబ్దంగా వుండిపోయింది.
"చూడు శృతీ. నీవరకూ నేనేమిటో ముందు తెలియచేయబోతున్నాను. నువ్వు పోలీసులకి తెలియచేస్తావో లేక బలమైన రక్షణనే ఏర్పాటు చేసుకుంటావో సిద్ధంకా...సరిగ్గా ఇరవై నాలుగుగంటల్లో నీ జయేంద్ర ప్రాణాలుతీయబోతున్నాను చాలా దారుణంగా"
శృతి చేతులు కొద్దిగా కంపించాయి. "శతృత్వం మనిద్దరిమధ్య"
"కాని నా ప్రయత్నాన్ని తెలివిగా విఫలంచేసింది జయేంద్ర" తోడేలులాంటి నవ్వు వినిపించింది. "నాకు సమస్య ఏర్పడేది తెలివైన వాళ్ళదగ్గర్నుంచే కాబట్టి ముందు వాళ్ళనే కడతేర్చడం సాంప్రదాయంగా పెట్టుకున్నవాడ్ని. సో...దమ్ముంటే కాపాడుకో సరిగ్గా... ఇరవై నాలుగు గంటలు..."
అవతల ఫోన్ క్రెడిల్ చేసిన చప్పుడు వింటూ రిసీవర్ని హుక్ పై వుంచింది.
ప్రత్యర్ధి ఎంత బలవంతుడో ఆమెకు తెలీనిదికాదు. కానీ జయేంద్రని రక్షించాలనుకుంది. ఆ రక్షణకి ఏ బలగాన్నీ ఆశ్రయించాలని ఆమె అనుకోలేదు. చివరకి జయేంద్రకి సైతం ఈ విషయం తెలియపరచకూడదనుకుంది.
"శృతీ" అన్న పిలుపువిని గిరుక్కున వెనక్కి తిరిగింది.
అక్కడ జయేంద్ర నిలబడివున్నాడు. చాలా మామూలుగా వున్నాడు. రాత్రి ఏం జరిగిందీ ఆలోచించనంత సాధారణంగా.
"ఫోన్ చేసిందెవరు?"
"ఓ స్నేహితురాలు" ఠక్కున అబద్ధం చెప్పింది. మనం అర్జెంటుగా బయలుదేరాలి.
ఎక్కడికో చెప్పలేదు. హెరాయిన్ అతడెక్కడ దాచిందీ అడగలేదు. రాత్రిచూసిన అతడి నగ్నదేహం గుర్తుకొస్తుంటే లజ్జగా తల వంచుకుని తొందరచేసింది.
ఓ ట్రాన్స్ లో వున్నట్టు ఆమెను అనుసరించాడు మరో అరగంటలో.
సరిగ్గా ఇదే సమయంలో రాత్రి పాముకాటుతో చనిపోయిన డేవిడ్ మరో పసికందులకు అటాప్సీ చేసిన డాక్టర్ హరి శరీరంలో వున్న విషయం ఏ సర్పానికి చెందిందీ తెలీదని డి.సి.పి. ప్రసన్నకి తెలియచేస్తున్నాడు...
ఈ దేశంలోని డాక్టర్లకు పరిచయమైన విషాలు నాగుకాటుతో కక్కే 'కోబ్రడిన్' వైపర్స్ మూలంగా రక్తంలో ప్రవేశించే 'వైపరిన్' తప్ప బ్లాక్ మాంబా విషానికి సంబంధించిన అవగాహన లేదు.
ఆ సమయంలో డి.సి.పి. ప్రసన్నకి గుర్తుకొచ్చింది డాక్టర్ శృతి.
ఉదయం ఏడున్నరకల్లా దివ్యతేజ ఎపార్ట్ మెంట్స్ కి వచ్చిన ప్రసన్నకి శృతి ఇంటికి తాళంవేసి వుండడం కనిపించింది.
నిరాశగా వెనక్కి మరలబోతుంటే "ఎవరు కావాలంకుల్" అంటూ పలకరించాడు స్కూలుకి బయలుదేరుతున్న నానీ... "శృతి ఆంటీయా?"
"అవును" తల పంకిస్తూ చూసాడు.
"నా పేరు నానీ అన్నమాట. బడికి వెళుతున్నాను..."
"గడుగ్గాయి" నానీ సమీపంలో నిలబడ్డ విశ్వేశ్వరశాస్త్రి నెమ్మదిగా అన్నాడు. "పోలీస్ అంకుల్ వచ్చింది నువ్వు బడి కెళుతున్నావో లేదో చెక్ చేయాడానిక్కాదు. ఆంటీ గురించి."
"మీకు తెలీదా అంకుల్" సీరియస్ గా అడిగాడు.
"అహ...! నీకు తెలుసా" లేమాని చిగురుటాకులా కనిపిస్తున్న నానీని చూస్తూ ఉత్సుకతగా అడిగాడు.
"నాకూ తెలీదు...ఆంటీ నాకూ చెప్పలేదన్నమాట..." ఆంటీ ఓ దారుణమైన పొరపాటుచేసినట్టు తల పంకిస్తుంటే ఆ స్థితిలోనూ నవ్వకుండా ఉండలేకపోయాడు ప్రసన్న.
"డేవిడ్ అంకుల్ చచ్చిపోయాడని పొద్దుటే చెప్పారనుకుంటే ఆంటీ లేదన్నమాట...మరేమో నేను స్కూలుకి తాతయ్యతో వెళ్తున్నాను..."
"ఏ స్కూలు..." ప్రసన్నవాక్యం ఇంకా పూర్తికానేలేదు.
"డే ఫోడిల్స్...నన్ను తీసుకువెళతావా అంకుల్...మరేమో తాతయ్య ముసలాడన్నమాట. తోడువస్తాడుగాని బాగా అలసిపోతాడు"
"వీడో అల్లరివెధవ బాబూ...పట్టించుకోకండి"
"ఫర్వాలేదు. నేను వెళ్ళేది అటే. జీపులో తీసుకెళతాను" ప్రసన్న నచ్చచెప్పాడు విశ్వేశ్వరశాస్త్రిగారికి.
"అప్పుడే అంకుల్ ని కాకపట్టేశావురా గడుగ్గాయి..."
విశ్వేశ్వరశాస్త్రి అబ్బురంగా చూస్తుంటే పరిచయం చేశాడు నానీ. |
25,045 |
"మైడియర్ ఫ్రెండ్స్... నేను ఈ మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేసానో మీకు తెలుసు. మన ప్రోడక్ట్స్ సేల్స్ సడన్ గా మార్కెట్ లో ఎందుకు ఆగిపోయింది. ఫస్టాఫ్ లో రైజయిన సేల్స్ సెకండాఫ్ లో ఎందుకు డౌన్ ఫాల్ అయిపోయాయి. దీనికి మార్కెటింగ్ డైరెక్టర్ ఇచ్చిన జవాబు రైవల్ గ్రూప్ వాళ్ళు. మన బ్రాండ్ నేమ్స్ ని ఇమిటేట్ చేస్తూ, రేటు తగ్గిస్తూ, ఎడిషనల్ గా కస్టమర్ కి ఇతర సౌకర్యాలు కల్పించడమే అంటాడు. ఐ డోంట్ బిలీవ్ ఆల్ దిస్ నాన్సెన్స్. మన మార్కెటింగ్ డిపార్ట్ మెంట్ గానీ, మన సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ గానీ మన నెట్ వర్క్ గానీ ఏమయింది? ఏం చేస్తున్నారు మీరంతా? రైవల్ గ్రూప్, మన బ్రాండ్ నేమ్ ని, ఇమిటేట్ చేస్తున్నారని ఎందుకు తెల్సుకోలేకపోయారు. మన ఫెయిల్యూర్ అవతలవాడి సక్సెస్. వాట్ మిస్టర్ కూర్మనాధం." కూర్మనాధం అప్పటికే పాతాళానికి క్రుంగిపోయాడు. "నా ప్రొడక్ట్ మార్కెట్లో సక్సెస్ కాలేదంటే దానర్థం. నేను బిజినెస్ లో ఫెయిలయ్యానని అర్థం. ఈ వెంకటనారాయణ లైఫ్ లో ఫెయిల్యూర్ లేదు. ఫెయిల్యూర్ సంభవించే పక్షంలో వి.వి.ఎన్. ఎస్టేట్స్ ఉండదు" వెంకట నారాయణ ముఖం కోపంతో జేవురించుకు పోయింది. ఆ సమయంలో ఎవరైనా ఎదురు మాట్లాడితే పరిస్థితి ఎలా ఉంటుందో అందరికి తెలుసు. అందుకే అందరూ తలలు దించుకు కూర్చున్నారు. "మన టూత్ పేస్ట్ సేల్స్ కూడా కొద్దిగా తగ్గాయి. ఇండియా మొత్తం మీద ఏ కంపెనీ టూత్ పేస్ట్ అమ్ముడు పోనంతగా మన టూత్ పేస్ట్ అమ్ముడు పోతోంది. దీనికేమైనా జరిగితే? ఈ సమయంలో మన ప్రొడక్ట్స్ మార్కెట్లో దెబ్బతింటే నేను సహించలేను. మీకు చేత కాకపోతే చెప్పండి... మీకు చేతకాకపోతే రిజైన్ చేసి వెళ్ళిపొండి" గర్జించాడు వెంకటనారాయణ. మరో అరగంట జరిగింది మీటింగ్. "నౌ యు కెన్ గో" అనడంతో అఫీషియల్స్ అందరూ బతుకు జీవుడా అంటూ ఛైర్మన్ ఛాంబర్ లోంచి బయటకు రావడం ప్రారంభించారు. కూర్మనాధం కూడా బయటకు రాబోయాడు. "కూర్మనాధం కూడా బయటకు రాబోయాడు. "కూర్మనాధం మీరు కూర్చోండి" ఛైర్మన్ మాటలతో కూర్మనాధం పూర్తిగా చెమటతో తడిచిపోయాడు. కర్చీఫ్ తీసి ముఖాన్ని తుడుచుకుంటూ తనని తాను కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఛాంబర్ లో ఇద్దరే మిగిలారు. వెంకటనారాయణ సూటిగా కూర్మనాధం వేపు చూసాడు. "మిస్టర్ కూర్మనాధం లక్షా తొంభయ్ అబద్ధాల కన్నా, ఒక నిజం చాలా గొప్పది. ఆ విషయం మీకు తెలుసనుకుంటాను- మన ప్రొడక్ట్స్ ని మార్కెట్లో లాంచ్ చెయ్యడానికి ముందున్న మీ క్రియేటివ్ ఐడియాలు, సడన్ గా ఎందుకు ఆగిపోయాయి... ఎనీ ఫాల్ట్ విత్ యూ?" "నో సర్... అయామ్ ఆల్ రైట్... బట్ రైవల్ కంపెనీ స్ట్రాటజీలో ఏదో మార్పు వచ్చింది" తడారిపోయిన గొంతుకతో జవాబిచ్చాడు కూర్మనాధం. "ఐడోంట్ బిలీవ్ ఇట్. మీ సెక్షన్ లో మొన్నటివరకు పనిచేసిన శక్తిధర్ అన్న కుర్రవాడు సడన్ గ మానేసాడు కదూ?" "ఛైర్మన్ శక్తిధర్ పేరును జ్ఞాపకం చెయ్యడంతో కంగారుపడి పోయాడు కూర్మనాధం. "ఎస్... సర్... ట్రైనీక్లర్క్. సమ్ ఫ్యామిలీ ప్రోబ్లమ్స్ వల్ల జాబ్ కి రిజైన్ చేసాడు" టక్కున జవాబు చెప్పాడు కూర్మనాధం. "జాబ్ కి రిజైన్ చేసాడా- రిజైన్ చేసే పరిస్థితులు కల్పించారా?" శక్తి రిజైన్ చేస్తూ, తనకు పంపిన లెటర్ని, ఫైల్లోంచి తీసిస్తూ, "ఇది చూడండి" అని టేబిల్ మీద పెట్టాడు వెంకటనారాయణ. వణుకుతున్న చేతుల్తో ఆ లెటర్ని, అందులో శక్తి రాసిన విషయాన్ని చదివాడు కూర్మనాధం. "మనదగ్గర పనిచేసే వాళ్ళ క్రియేటిస్పాట్ ని చేసి, ఆ క్రియేటివిటీని ఎంకరేజ్ చేసి, మనకు అనుగుణంగా ఉపయోగించుకోవాల్సిన రెస్పాన్స్ బిలిటీ మీది... అవునా... కానీ... మీరేం చేసారు.. ఆ కుర్రవాడ్ని, మీ స్వార్థం కోసం ఉపయోగించుకున్నారు తప్ప, ఆఫీసు కోసం ఉపయోగించుకోలేదు. ఆ కుర్రాడు ఇచ్చిన క్రియేటివ్ అయిడియాలన్నీ మీ ఆలోచనలుగా, నా దగ్గర మీరు ప్రోజెక్టు చేసుకున్నారు." ఛైర్మన్ కి ఈ విషయాలన్నీ ఎలా తెలిసాయో కూర్మనాధంకి అర్థం కావడం లేదు. "ఎస్... సర్... మన ప్రోడక్ట్స్ మార్కెట్ స్ట్రేటజీ విషయంలో శక్తి కొన్ని క్రియేటివ్ అయిడియాలు ఇచ్చిన మాట వాస్తవం కానీ" కూర్మనాధం చెప్తున్న మాటల్ని విన్పించుకోలేదు వెంకటనారాయణ. "శక్తి ఇప్పుడెక్కడున్నాడు" సూటిగా అడిగాడు ఛైర్మన్. "తను స్వంతంగా బిజినెస్ కన్సల్ టెన్సీని స్టార్టు చేసుకున్నాడు సర్." తనచేత ఛైర్మన్ అన్ని విషయాలూ చెప్పిస్తున్నందుకు అసహనంగా ఉంది కూర్మనాధానికి. "శక్తి మళ్ళీ మన కంపెనీలోకి రావాలి. ఎందుకో తెలుసా... అతనిలాంటి వాళ్ళు, మరి కొంతమంది బైటకు వెళ్ళిపోకుండా ఉండడానికి." "బేసిగ్గా హి ఈజ్ గుడ్ సార్. కోపంతో బయటికెళ్ళిపోయాడు అంతే... అదెంత సార్" నీళ్ళు నములుతూ చెప్పాడు కూర్మనాధం. ఛైర్మన్ మరేం మాట్లాడలేదు. ఛాంబర్ లోంచి బయటికొచ్చేసాడు కూర్మనాధం. 'శక్తి మీ మేనల్లుడనేది నిజమేనా' అని అడగాలని ధైర్యం చాలక వూరుకున్నాడు. * * * * సాయంత్రం అయిదుగంటలైంది. తన ఎదురుగా కూర్చున్న కస్టమర్ వేపు చూసాడు శక్తి. అతనికో ముప్పయి ఏళ్ళుంటాయి. ఎంతో దిగులుగా, విచారాన్ని మోస్తున్న వాడిలా ఉన్నాడు. "ఏంటి మీ ప్రాబ్లమ్" అడిగాడు శక్తి. "మల్లేశ్వరంలో నాకో వీడియో పార్లర్ వుంది సార్... ఆ ఏరియాలో వున్న లే అవుట్స్ లో అందరూ ఆఫీసర్సే... సేల్స్ టాక్స్ కాలనీ ఇన్ కమ్ టాక్స్ కాలనీ... బెంగుళూరు అర్బన్ డెవలప్ మెంట్ అధారిటీ కాలనీ, మున్సిపల్ కాలనీలున్నాయి. అందరూ గవర్నమెంట్ ఉద్యోగులు... వ్యాపారం బాగానే వుంది కాని..." |
25,046 | చేదా మాడా తిట్టేశాడు. ఇద్దరికీ రంకు కట్టేడు. నన్ను మరచిపొమ్మన్నాడు. మళ్ళీ జన్మలో ముఖం చూపించవద్దన్నాడు. రాక్షసుడిలా ప్రవర్తించాడు. నన్ను నీటిజాతీలేని దాన్నిగా మాటాడేడు డబ్బుకోసం అతన్ని వలలో వేసుకున్నట్టుగా మాటాడి వెళ్ళిపోయాడు.
"నా బ్రతుకు మళ్ళీ పాడైంది. అయితే ఇప్పుడు ననకు కళ్యాన్ అండవుంది. అతని గురించి విచారించాను. అతన్ని మీరు ఆరాధించటం తెలుసు. అతనూ పెళ్ళికి మేగ్గుగా వుఇన్నట్టు తెలిసింది. అతను వుత్త అనుమానాల పుట్ట ఆ విషయం స్వానుభవం! అందుకే పాపని మీతో వదిలేశాము. తర్వాత ఏం జరిగిందో మీకే తెలుసు!"
కవిత నోటంట ఆమె కథ విన్న సుజాత కరిగిపోయింది. సుధాకర్ పేరు అయినా చెప్పకుండా తన ముందు అంతా చెప్పిందామె. అతనేలాంటివాడో తనకి తెలియదా! తనని ఎంతఘోరంగా అనుమానించి. అవమానించిందీ తనకు స్వానుభవమే కదా!
"కవితగారూ!" సుజాత గొంతు ఆర్ద్రంగా వుంది.
కవిత కళ్ళవెంట నీరు జలజల రాలింది.
"కవితా!" చప్పున ఇటుగా వచ్చింది జనికమ్మ. ఆమెని చూసి తెల్లబోయింది కవిత.
"అమ్మా!" కవిత గొంతు వణికింది.
"అంతా విన్నానమ్మా! నువ్వు నాతో చెప్పిందానికీ, ఈమెతో చెప్పిందానికీ ఎంత తేడా వుంది.? ఎన్ని బాధలనుభవించావు. నువ్వు ఎవడితోనో లేచిపోయావనుకున్నాం యిన్నేళ్ళూ! నీవు మాకు పుట్టనేలేదు అనేంత కఠినత్వం వచ్చేసింది మాలో. నిదానంగా కాలం గడిచేకొద్దీ నువ్వంటే సానుభూతి కలిగింది!"
కన్నీళ్ళు తుడుచింది కవితకి, కవిత కిప్పుడు చాల సంతోషంగా వుంది. తృప్తిగా వుంది.
"అతన్నే పెళ్ళి చేసుకున్నానీ, ఓ బిడ్డ తల్లివై నాపనీ చెప్పినప్పుడు తల్లిలేని ఆ పిల్లకి ఓ పూట తల్లిపాలు యిస్తాననటం, ఆ పిల్లని పదేపదే ముద్దాడినప్పుడూ నీ మాటలు నిజమనే నమ్మాను. నువ్వు నీ భర్త యింటికి వస్తాడంటే మీ నాన్నగారూ సంతోషించారు. నువ్వెక్కడవున్నావో కనుక్కోనందుకు నన్ను చివాట్లేశారు!"
కవిత పేలవంగా నవ్వింది.
"మల్లీశ్వరి నీ కూతురా! ఎంత చిత్రంగా వుంది. ఆ పిల్లపై నాకంత మమకారం పుట్టుకొచ్చింది.!"
అన్యాయం పిన్నిగారూ! మిమ్మల్ని మీరు అలా తక్కువ చేసుకోకండి . మీకు ఎవరి పిల్లలయినా ప్రేమే! నేను డగా పడిపోయాననీ, ఆ పిల్ల నా కూతురేననీ, నేను పిరికిగా పాడు పనులు చేయకుండా, ధైర్యంగా పెంచుకుంటున్నాననీ, మీరు నన్నూ నా కూతురనుకుని మల్లీశ్వరినీ ప్రేమించారు. అంతేకానీ మీలో స్వార్దం లేదు!"
కానికమ్మగారు నవ్వేశారు.
అప్పుడు వచ్చింది డాక్టర్ మృదుల. ఆవిడకి అంతా మిస్టరీగా వుండిపోయింది. ఇప్పుడు చిక్కువిడిపోయింది. తన బావ సుధాకర్ ఎంత మూర్ఖుడో తెలిసి పొయిందామెకి.
ఎన్ని సినిమాలు మసినా ఎన్ని పుస్తకాలు చదివినా ఆడది దగ పడ్డమే కనిపిస్తుంది. ఎన్ని జీవితాలు పరిశీలించినా స్త్రీకి అన్యాయం జరిగినట్టే కనిపిస్తుంది. ఇంత తెలసీ మనం లొంగిపోతాం, వాళ్ళు పరిపాలిస్తారు. అనుమానిస్టారు. వదిలేస్తారు. ప్రపంచం ఎంత చిత్రమైంది! కవితగారూ! మీకు సుధాకర్ నేను అప్పగిస్తాను!" అంది డాక్టర్ మృదుల.
కవిత నవ్వింది. అందులో అందంలేదు. అనందంలేదు ఆత్మ విశ్వాసం వుండి.
"సుజాతగారూ! మిమ్మల్ని అభినందిస్తున్నాను. మీరే ధైర్యంగా ప్రవర్తించి వుండకపోతే మల్లేశ్వరి చచ్చిపోయి వుండేది. కవిత కాలగర్భంలో కలసిపోయేది. లేదా మల్లీశ్వరి ఎ అనాధ శరణాలయంలోనో పడరాని పాట్లు పడేది!"
"డాక్టర్ గారూ! అదేమిటో నాలో మొండి ధైర్యం వచేసింది. ఆ పిల్లని విడిచేయలేకపోయాను. ఎప్పుడైతే సుధాకర్, మానాన్న నన్ను పూర్తిగా శకించి అనరాని మాటలన్నారో అప్పుడే నాకు ప్రపంచంపై నమ్మకం పోయింది. నా విశ్వాసమంతా ఆ పిల్లలో, ఆ పిల్ల భవిష్యత్తులో ఎ పాపమూ ఎరుగని ఆ పిల్లలో చూశాను!"
"సుజాతగారూ !" పిలిచాడు నాగరాజు." సుధాకర్ కి మీ గురించి చెప్పింది నేనే! నన్ను మన్నించండి!"
"మీరా!" ఫక్కున నవ్వేసింది. "మంచిపనే చేశారు! కవిత జీవితం బాగు పడింది!"
"అందంతా మాప్లాను ప్రకారం జరిగింది. కవిత నాకు అక్కయ్య కూతురు. కళ్యాన్ కి మరదలు మేమిద్దరం కలిశాం! సుధాకర్ అట కట్టించ్చా౦!"
"హీరో అయ్యరన్నమాట!"
నవ్వేశడతను__
"కవితా బాగా పొద్దు పోయిమ్డనుకుంటా! తొమ్మిదై౦దేమో? మీ నాన్నగారు ఎదురుచూస్తూ వుంటారు. అందోళన పడుతూ వుంటారు. పదమ్మా వెళదాం!"
అమ్మా నేను యింకా పూర్తిగా నిష్క్ర౦ళంకను కాలేదు. సుధాకర్ తో అంతా చెప్పాలి. అతన్ని నమ్మించాలి. అప్పుడే యింటికి వస్తాను. వీలయితే అతనితోపాటే వస్తాను లేదా ఒక్కత్తిని వస్తాను. ఇప్పుడు నాకేం భయంలేదు. నేను పాపం చేయలేదు.
"కవితా! నీ కూతురు కోసమైనా రామ్మా!"
"అమ్మా! ఇప్పుడు మల్లీశ్వరినాకు నింగిలోని సిరిమల్లీ! అది నేల మీది జాబిల్లి అయి నా ఒడిలో తూగాడినప్పుడే నా కూతురు. అంత దాకా అది సుజాత బిడ్డే!" నిశ్చలమైన కంఠంతో అంది.
"సరేనమ్మా నీ యిష్టం!" అందామె యిమ్కేమీ అన్లేక.
డాక్టర్ మృదుల, సుజాత జానికమ్మగారూ వెళ్ళిపోయారు. నాగరాజూ, కవిత, కళ్యాన్ మిగిలిపోయారు.
19
వెళదామా మనం కూడా.
"రాజూ! సుధాకర్ ఎలా దెబ్బకొట్టాలి!" |
25,047 | ఈ మాదిరి అభివందన వాఖ్యాలు ఏ సందర్భానికయినా వర్తిస్తాయి. ఎదుటమనిషి చెబుతున్నదేమిటో మనం వినిపించుకోనప్పుడూ ఆ విషయాన్ని గురించే మన అభిప్రాయాన్ని ఆ మనిషి అడిగినప్పుడూ ఈ తరహా అభివందన ఠక్కున సరిపోతుందని మంజరికి తెలుసు. అందుకే ఆ వాఖ్యాలు చక్కగా వల్లించి చలపతిని నిరుత్తరున్ని చేసేసింది మంజరి.
"అదిగో! ఆ మూలమీదుగా తోటకనిపిస్తున్నది చూశావా?"
"ఆఁ" అన్నాది మంజరి.
"అది రావుగారిల్లు ఇంకో రెండు మూడు నిమిషాలు - నేను కారు మెల్లగా నడుపుతాను గానీ, ఈ లోగా నువ్వోసారి మేకప్ చెరిగి పోయిందేమో చూసుకో!" అన్నాడు చలపతి.
మరో రెండు నిమిషాల కల్లా కారు ఓ పెద్ద తోటలోగుండా పరుగెత్తి పోర్టికోలో కొచ్చి ఆగింది.
ఆ క్షణాన మంజరి అనుభూతులెలా వున్నాయో మనం తెలుసుకొనేందుకు ఆ దరిమిలా ఆవిడ ఇచ్చిన ఇంటర్వ్యూ చూడటం అవసరం. అందులో మంజరి ఇలా వ్రాసింది -
"నాలుగు సంవత్సరాలనాటి సంగతిది. ఆప్పటికి నేనింకా చలన చిత్రరంగంలోకి అడుగు పెట్టలేదు. ఆ కళామతల్లి చల్లని దృక్కులు ణా మీద ప్రసరించలేదు. ఏదో పనిమీద మద్రాసు వచ్చాను. వచ్చాను గదాని ణా అభిమాన నటీనటులను వొకసారి చూడాలని నిశ్చయించుకొన్నాను. చాలా మంది షూటింగ్సు లో ఉండడంవల్ల ఎక్కువసేపు వారితో గడిపేందుకు అవకాశం కలుగలేదు. ముందుగా టెలిఫోన్ చేసి తేదీ, టైమూ నిర్ణయించుకొన్నాక రావుగారిని నేను కలుసుకొన్నాను. వారు ణా అభిమాన నటుడు నా చిన్నతనో శ్రీ రావుగారు నటించిన యెన్నో సినిమాలు చూశాను. సినిమాల్లో వారు చేసే సాహసకృత్యాలు నన్ను ముగ్దురాలిని చేశాయి. ఆ రోజుల్లోనూ, ఆ తరువాతనూ -నేను వారిప్రక్క హీరోయిన్ గా నటించవలసి వస్తుందని కలలో గూడా అనుకోలేదు. నేనింతదాన్నయ్యానంటే పరిశ్రమలోని పెద్దలు, నిర్మాతలు, దర్శకులు, సహనటులు, ముఖ్యంగా ప్రేక్షకులు నాపట్ల చూపించిన ఆదరాభిమానాలే కారణం. ఈ అభివృద్దికి పరోక్షంగా సాయం చేసినవారు శ్రీ రావుగారు, వారికి నేను ఆజన్మాంతరం కృతజ్ఞతా బద్దురాలిని" అని జవాబు చెప్పింది మంజరి.
"రావుగారిని చూసినపుడు మీరేం ఫీలయ్యారండీ?" అని అడిగాడు పత్రికా విలేఖరి.
"నా ఆరాధ్యదైవాన్ని ప్రత్యక్షంగా చూడబోతున్నానన్న ఉత్సాహం నాలో ఉరకలు వేసింది. అడుగులు తడబడ్డాయి మాట పెగిలిరాలేదు. గొంతుక పోడారిపోయింది. గుండెల్లో భయమూ, ఉద్వేగమూ పెనవేసుకుపోయాయి. ఆంధ్ర చలనచిత్ర రంగంలో ఒక ధృవతారగా వెలిగిపోతున్న ఒక కళామూర్తిని దర్సించనున్నాననే గాఢమైన సంతృప్తితోబాటు చెప్పరాని భయంకూడా నన్ను ఆవేశించింది. ఆనాటి నా అనుభూతులను నేను మాటల్లో వ్యక్తం చేయలేకపోతున్నాను. మన్నించాలి. నన్నడిగితే రావుగారొక కళాద్రష్ట. కళాస్రష్ట. చిత్రకాళామతల్లి దశాబ్దాలుగా నోచిననోములు ఫలించి శ్రీ రావుగారి లాగా మూర్తీభావించాయనుకొంటాను. వారు నన్ను ఆప్యాయంగా ఆహ్వానించారు. అంతకన్నా ఆప్యాయంగా ఆదరించారు. అరవిడిచి మాట్లాడారు. నా యోగక్షేమాలు అడిగి తెలుసుకొన్నారు. అంతక్రితమే నన్ను గురించి వారు విన్నారట. నా నాటకాలు మాత్రం ఏమీ చూడలేదట.
మీలాంటి విదుషీమణులు, కళాభిమానులు ఈ రంగంలోకి విరివిగా రావాలి. మాలాంటివారం తప్పుకోవాలి. మీ కళాకృషిని సినిమారంగానికి కూడా విస్తరింపచేయవలసిందిగా నేను కోరుకున్నాను అన్నారు రావుగారు.
"అంతవరకూ, సినిమాల్లోకి రావాలన్న ఆలోచనకూడా లేని నేను వారలా అవడంతో ఆలోచించుకోవాలనిపించింది. అందరూ అనుకొంటున్న మాటలను శ్రీ రావుగారితో చెప్పాను. వారు హృదయపూర్వకంగా నవ్వారు.
"ఈ పరిశ్రమ విషయం తెలియనివారు అలానే అంటుంటారు. మీవంటి సమర్ధులు ఈ రంగంలోకి రావాలేగానీ తప్పకుండా ప్రోత్సాహం లభిస్తుంది" అన్నారు శ్రీ రావుగారు.
"ఆ తరువాత వారన్నమాటలు అక్షరాలా నిజమయ్యాయి. వారి ద్వారా నేనుఎంతో అభివృద్దిని పొందాను. అభినయంలోని అతి సున్నితమైన విషయాలను వారు నాకు వోపికగా భోధించారు. సంభాషణలను ఉచ్చరించడంలోని సులువులు, భావాలను పలికించడంలోకి రీతులు - ఇవి వారే నాకు ప్రసాదించారు. దాదాపుగా వొకటిన్నరసంవత్సరాల కఠిన శిక్షణానంతరం శ్రీ రావుగారు నన్ను చలనచిత్ర కళామతల్లి పాదార విన్దాలకు అంకితం చేశాడు. ఆ నాటినుండి నేటిదాకా, నేనా దేవికి అర్పిస్తూనే ఉన్నాను. ఇంత వరకూ నేను నాలుగు చిత్రాల్లో శ్రీ రావుగారి ప్రక్కన హీరోయిన్ గా నటించాను. నేనెలా నటించిందీ చెప్పవలసినవారు సహృదయులైన పత్రికలవారూ, ప్రేక్షకులూను" అని వ్రాసింది మంజరి!
లోగుట్టు తెలిసినవారు ఇదంతా నిజమనుకోవచ్చు. జరిగిందేమిటంటే రావుగారు ఆమెను ఆహ్వానించడమైతే చేశారుగానీ తాము మాత్రం ఏ ముక్కా 'కమిట్' కాలేదు. మంజరి యోగక్షేమాలడగటం చలపతిని కుశల ప్రశ్నలు వేయడం నిజమే.
"మిమ్మల్ని గురించి చలపతిగారు నాతో చాలాసార్లు చెప్పారు నాకు బొత్తిగా టైం లేకుండా వుంది. ఇప్పుడయినా నాకు తీరుబడి లేదు. వొంట్లో బావుండలేదని సెక్రటరీతో చెప్పేశాను.....ణా సినిమాలు మీ రేం చూశారండీ?" అన్నాడు రావు.
ఆ ప్రశ్న వింటూనే మంజరి బిత్తరోయింది.
ఏం చెప్పాలో తోచక గిజగిజలాడింది.
చలపతి పరిస్థితిని అర్ధంచేసుకొని రంగంలోకి దూకాడు.
"అలా విడమరిచి చెప్పడం కష్టంలెండి బాబుగారూ! మీరు యాక్ట్ చేసిన అన్ని సినిమాలూ మంజరి చూసింది. చిన్నప్పట్నించీ దానికి సినిమాలంటే వల్లమాలిన పిచ్చి, ఒకసారి ఏం జరిగిందంటేనండి -మీరన్న పిక్చర్ గుంటూర్లో రిలీజయింది. నెలరోజులక్కూడా టిక్కెట్లు అందడం లేదు. ముఖ్యం మీరు తాగుబోతుగా చేసిన యాక్షన్ జనాన్ని పట్టేసింది. పనీపాటా లేని కుర్రకారంతా పెందరాడే బుకింగ్సు దగ్గర చేరి పాతికేసి టిక్కెట్లు కొనేసి, బ్లాక్ లో అమ్ముకొని వేలు సంపాదించాడు. మా కృష్ణుడూ అలా బాగుపడ్డవాడే ననుకోండి. ఆ సినిమా చూడాలని దీనికి పట్టుకొంది. టిక్కెట్లు దొరకడం లేదని చెప్పినా వినలేదు. ఆఖరుకు మాతో చెప్పకుండా గుంటూరు వచ్చేసింది. మా బావగారేమో లబ్బుమని గోల. ఆయన బావులూ చెరువులూ వెదుకుతుంటే, నేను ఓ యాభై పుచ్చుకొని గుంటూరొచ్చాను. అదెక్కడుండేదీ నాకు తెలుసుగదా! హాల్లో పట్టేసాను. వరసగా వారం రోజులనుండీ రోజూ రెండాతలూ చూశాక గానీ అది నిద్రపోయింది కాదు....మీ ఫోటో పత్రికల్లో కనపడితే చాలునండీ అంతమేరా కత్తిరించేసి దాచుకొంటూ ఉండేది. అనగూడదుగానీ రావుగారు మీకు పెళ్ళేకాకుండా వుంటే మా మంజరి తనను పెళ్ళాడమంటూ మీ వాకిటముందర సత్యాగ్రహం చేసేదనుకోండి. ఇదీ దాని వ్యవహారం.... మంజరీ! అలా సిగ్గుడతావేం? ఇది నిజమా కాదా?" అన్నాడు చలపతి.
ఇంతసేపూ ఏమనవలసిందీ తోచక కొట్టుమిట్టాడుతున్న మంజరి కాస్త తెరపి ఇచ్చినట్లయింది. తానిప్పుడు సిగ్గుపడాలని చలపతి భావం. పోనీ అలాగే చేద్దాం. తప్పోం?
"పోండి బాబూ! మీరిద్దరూ కలసి నన్ను వెర్రిబాగులదాన్ని చేసేస్తున్నారు" అన్నది మంజరి సిగ్గునభినయిస్తూ.
రావుగారు సంతృప్తిగా నవ్వినట్లు అభినయించారు.
"అంతేకాదండీ! మూడు నాలుగేళ్ల క్రిందట మీకు ఉత్తరాలు కూడా రాసిందండీ! మీరో ఫోటో మీద సంతకం చేసి ఈవిడకు పంపించారు. దాన్ని చక్కా తన ఫోటోలో ఇన్ సర్ట్ చేసి ఫ్రేం కట్టించేసుకొంది....ఇన్నితికి అసలు సంగతి మీకు చెప్పనేలేదు. మంజరి నాకు కాస్త దూరంగా బంధువు. మా పెదతాతగారి మనమరాలు, వరసకు మరదలవుతుంది. వీళ్ళ వంశం సాహిత్యంలోనూ, కళల్లోనూ బాగా పేరు పొందిన వంశం. వీళ్ళ నాన్నగారు బ్రహ్మాండంగా నాటకాలు ఆడించారు. ఆ లక్షణాలు దీనికి అబ్బాయి. చాలా సంవత్సరాలపాటు అనేక రకాల నాటకాలు వేసింది. చాలా కప్పులు సంపాదించింది. మా మంజరికి సినిమాల్లోకి రావాలని అట్టేలేదనుకోండి. నేనే బలవంతాన ఫీల్డులోకి లాక్కొచ్చాను. మీ లాంటివారు సాయపదతారన్న నమ్మకం నాకుంది గనకనే నేనూ ధైర్యం చేశాను. నా పనేదో అయిపోయింది. తెచ్చి మీకప్పగించాణు. ఇహ మీరూ మీరూ ఏమనుకొంటారో అనుకోండి. నాకేమీ సంబంధంలేదు" అని చేతులు దులుపుకొన్నాడు చలపతి.
"వెరీగుడ్ వెరీగుడ్, తప్పకుండా చూదాం, కానీ -పాపం - అనుకొన్నంతగా పాప స్టార్ కావడం కష్టం...."
చలపతి -లోగడ అనుకొన్న సంకేతం ప్రకారం, ఓ పొడిదగ్గు దగ్గి అగ్గి పెట్టె చప్పుడు చేశాడు. ఇహ తను ఎలర్ట్ గా ఉండాలనుకొంది మంజరి. చలపతి ఏదో పనున్నవాడిలా అవతలకు వెళ్ళిపోయాడు. గదిలో రామారావుగారు, మంజరి తప్ప మరో ప్రాణి లేదు. కిందినుంచి ప్రతి పదేసి నిమిషాలకూ ఫోన్ మోగడమూ సెక్రెటరీ ఏదో అస్పష్టంగా అనడమూ వినిపిస్తోంది.
"ఆఁ....ఇంకేమిటండీ సంగతులు....వచ్చాక ఎవర్నయినా చూశారా?....మూర్తిగారిని కలుసుకోవడం కూడా అవసరమే! వారూ లీడింగ్ యాక్టరే! చాలా మంచివారు చేతనయినంత సహాయం చెయ్యగలవారు. మరోమాట వారినిచూడ్డం అవసరమనుకొంటాను" అన్నాడు రావుగారు.
ఆయన మాట ఎందుకన్నదీ మంజరికి ఇట్టే తెలిసిపోయింది. వారిద్దరిమధ్యా పచ్చగడ్డికూడా భగ్గుమంటోందన్న విషయం ఆవిడకు ఎప్పుడో తెలుసు తన ఉద్దేశం గ్రహించేందుకే రావుగారీ ప్రస్తావన తెచ్చారన్న నిర్ణయానికి మంజరి తక్షణమే వచ్చేసింది.
"నాకా వుద్దేశం లేదండీ! సినిమా ఫీల్డన్నా వదిలేస్తానుగానీ, మూర్తిగారిని మాత్రం నే చూడను, అసలాయనంటేనే నాకు గిట్టదు. వెనక అండదంలున్నాయి గనక నెట్టుకొస్తున్నాడు గానీ, లేకపోతే ఆయనకు బుకింగ్స్ కూడా రావని నా నమ్మకం, ఆయనగారు సహాయం చేస్తాడో లేదో నాకు తెలీదనుకోండి, చేసినా పుచ్చుకొనేందుకు నాకిష్టం లేదు.....నాకయినా ఈ సినిమాల్లో చేరిపోవాలని లేనే లేదు. ముఖ్యంగా మిమ్మల్ని చూదామని పనిమాలా వచ్చాను మా చలపతిగారికి మీరంటే వల్లమాలిన గురి. మీరు పూనుకుంటే పది కంపెనీలతో మాట్లాడి, నాకు వేషాలిప్పించగలరని చెప్పారు. మీరు మహానటులనీ కళాప్రపూర్ణులనీ నాకు తెలుసుగానీ, పరిశ్రమలలో యింత పలుకుబడి ఉన్నదని తెలీదు....అదీగాక చాలామంది ఈ ఇండస్ట్రీలోని వారుకూడా మీ ఆశీర్వాదం పొందితే చాలునని చెప్పారు. ఆ ఉద్దేశంతోనే వచ్చాను. మరోసారి మూర్తిగారి ప్రస్తావన నా దగ్గర తీసుకురాకండి" అన్నది మంజరి.
రావుగారేమీ మాట్లాడలేదు.
"మీరు ఎవర్ని కలుసుకొన్నారో చెబితే, వారికి నేనూ ఓ మాట చెబుతాను...." అన్నాడు రావుగారు.
ఏం చెప్పవలసిందీ మంజరికి తోచలేదు. ఎవరెవర్నీ తను కలుసుకోలేదు. కనీసం వాళ్ళ పేర్లయినా తనకు సరిగ్గా రావు. కల్పించే చెప్పొచ్చు - కానీ రావుగారు ఫోనుచేసి కనుక్కొంటే తను అభాసుపాలు కావలిసొస్తుంది. ఆదిలోనే తనమీద బాడ్ ఇంప్రెషన్ కలిగించుకోవడం యే మాత్రం భావ్యంకాదు. ఇప్పు డేమిటి చేయడం?
"పోనీ ఆలోచించుకొని తరువాతనే చెప్పండి....మరో సంగతి .... ముందుగా మీకు పెద్ద వేషాలు దొరకవు, కాస్త పుటింగ్ దొరికిందాకా దొరికిన వేషాలేవో వేస్తుండాలి హీరోయిన్ గా మీరెంత వరకూ పనికొస్తారో నేను చెప్పలేను...."
మంజరి గుండె గతుక్కుమన్నది.
"అదంతా మీదయ. నేను మీదాన్ని, నన్నేం చెయ్యమంటే అదే చేస్తాను. ఏ క్షణాన రమ్మన్నా వస్తాను. మీలాంటి కళామూర్తుల పాదసేవచేసే భాగ్యం నాకింత లభిస్తే అదే పదివేలు....మీరు మనస్పూర్తిగా నన్ను దాసీవేషం వేయమన్నా వేస్తాను. మీకులేని అభ్యంతరం నాకూలేదు...మీకు యివ్వాళ తీరుబాటే గదా! ఏదన్నా హోటల్ కెడదాం పదండి. అక్కడ మనం ఇంకా స్వేచ్చగా మాట్లాడుకోవచ్చు.....నేనో విషయం చెప్పడం ఆలస్యమైంది, నవకళా చిత్రాలయావారు మా చలపతిగారికి తెలుసు. వారికీ, మా నాన్నగారికీ బాగా పరిచయం. ఆ కంపెనీవారు. నాకో వేషం యిస్తామన్నారు. కధ తయారవుతూ వుంది." అనికూడా వోముక్క కలిపింది మంజరి.
"అలాగా!" అన్నారు రావుగారు. ఆయనలోని సంచలనాన్ని మంజరి గమనించి "మందు పనిచేసింది" అనుకొన్నది.
"ఇంకా ఎవర్నీ బుక్ చేయలేదేమో! ఒకవేళ చేసినా మీకా సంగతి తెలిసే అవకాశం లేదనుకోండి-" అని మధ్యలోనే ఆపేశారు రావుగారు.
"కధ పూర్తికానిదే బుకింగ్స్ విషయం ఆలోచించమన్నారు వారు. వెంకటేశ్వర్లుగారు,. రామబ్రహ్మంగారు నాకు తెలిసినవారు గనక ఆ కంపెనీ విషయాలేవీ నా దగ్గర దాచుకోరు. మాంచి పోక్ లోర్ కధకోసం చూస్తున్నారు. ఇంకా కొంత కాలం పట్టేలా వుంది" అన్నది మంజరి.
రావుగారు ఓ నిముషంపాటు ఏదో ఆలోచించి ఆ తరువాత సన్నగా నవ్వి అంతకన్నా సన్నగా నిట్టూర్చాడు.
"ఏదో లెండి, ఆ రోజులే వేరు, ఏడెనిమిదేళ్ళ కిందటిదాకా నాకు అచ్చంగా పొక్ లోర్ పిక్చర్సే వచ్చేవి. ఇప్పుడన్నీ సాంఘికాలే, మళ్ళా మన కంపెనీవారి ప్రవేశంతో రధం ఫోక్ లోర్ వేలో పోతుందనుకొంటాను. ఇప్పుడేవరన్నా మాంచి జానపద చిత్రం బావున్ననీ, అందులో హీరోగా వేదామనీ, చాలాసార్లు అనుకొన్నాను ...కానీ, - నిజంగా నాకు క్షణం తీరుబాటు లేదు. ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నా ప్రాణాలు తోడేస్తున్నారు. అయినాసరే - జానపద చిత్రమంటే నాకు ప్రాణం లేచొచ్చినట్లుగా ఉంటుంది. నన్ను నటున్నిగా నిలబెట్టినవి ఆ సినిమాలే! అసలీదిక్కుమాలిన సాంగికాల కన్నా ఆ కధలే హాయిగా ఉంటాయి. మనవాళ్ళు మళ్ళా జానపదం తీస్తున్నారని మీరనేప్పటికి -ఈ సంగతులన్నీ గుర్తుకొచ్చాయి. నేను ఏదోలాగా కాల్ షీట్సు ఎడ్జెస్టు చేసుకొంటాను. మరి త్వరగా కధ తెమల్చుకోమనండి" అన్నారు రావుగారు.
రావుగారి అభిప్రాయం మంజరికి అవగాహనయింది. తన భావాలను ఎంత జాగ్రత్తగా ఆయన బయటబెట్టాడో చూస్తే ఆవిడకు ఆశ్చర్యం వేసింది.
"అలాగేనండీ! వారికింకా బుకింగ్సు ణు గురించి ఆలోచించే తీరికలేదు. నేను తప్పకుండా చెబుతాను...."
రావుగారు లేచి నుంచున్నారు.
మంజరి లేవక తప్పలేదు.
"లోపలికెళ్ళి కాఫీ పంపిస్తాను. ఈ లోగా డ్రైవరొస్తాడు, మిమ్మల్ని ఇంటిదగ్గర దిగబెట్టిరమ్మని చెబుతాను. మీరు సరాసరి ఇంటికేవెడతారా?" అన్నాడు రావుగారు.
"ఇలా?" అని ఓ క్షణం ఆగిపోయింది మంజరి, నేనడిగిన దానికి మీరు సమాధానం చెప్పనేలేదు. అలా ఏదన్నా హోటల్ కెళ్ళి ఓ గంట కులాసాగా గడిపేద్దాం. మళ్ళా మిమ్మల్ని పువ్వుల్లో బెట్టి తీసుకొచ్చి ఇక్కడ దించేస్తాను... ప్లీజ్.... నేనిలాలేకిగా అగుగుతున్నానని మీ రానుకొన్నా మాబాగై! నాకు మీరు ముఖ్యంగానీ, ఇతరులేమనుకొంటున్నారన్నది ముఖ్యం కాదు" అన్నది మంజరి.
"ఎక్స్ క్యూజ్ మీ మంజరీ! మరోసారి మనం తప్పకుండా వెడదాం. ఓ గంటేం ఖర్మ! ఓ రాత్రల్లా ఉండిపోదాం కూడానూ..... ఇంతకుముందు మనం కొత్తవాళ్ళం, ఈ క్షణంనుండి సహనతులం. ఇలాంటి సమావేశాలు కొన్నివేలు జరగవలసి ఉంది....వన్ సెకెండ్, నేను కాఫీని,. డ్రైవర్నీ పంపుతాను....నేనే
వద్దునుగానీ, అవతల అర్జంటుగా చూసుకోవలసిన పనులుండి పోయాయి"
"నేను కారు తీసుకొచ్చాను మరి నాకు సెలవు" అన్నది మంజరి రెండు చేతులూ జోడించి.
"అయ్యయ్యో! అదేమిటమ్మా! ఇక్కడకొస్తే నేను కారివ్వననుకున్నావా, అసలు నాకే కారులేదనుకొన్నావా? ఇహ ముందెప్పుడూ అలా చెయ్యకండి."
ఇద్దరూ పోర్టికోలో కొచ్చారు.
చలపతి మంజరి కార్లో ఎక్కిందాకా ఉండి, తలిపు జాగ్రత్తగా వేసి, రావుగారితో షేక్ హాండ్ చేసి కారును స్టార్ట్ చేశాడు. మంజరి రావు వొకరినొకరు చూసుకొన్నారు. హాయిగా నవ్వుకొన్నారు. కానీ ఆ నవ్వులో ఏదో లోపించి, అదేమిటో వారిద్దరిలో ఏ ఒక్కరికి తెలీదు.
అనుకొన్న రోజు తారకంగారు కధను తీసుకురాలేదు. ఆయనొస్తాడని కధ వినిపిస్తాడనీ, అందులో తనవేషం ఎలా ఉంటుందో, విని ఆనందించామనీ మంజరి మురిసిపోయింది అప్పటికి ఉండబట్టలేక చలపతిని పాతిక్కి పదిసార్లు కదిలించి చూసింది కూడాను.
చలపతి చాలా వోపిగా, "అలాగే చూద్దాం -" "వెళ్ళి కనుక్కొంటాను" - "రెండు మూడు రోజుల్లో వచ్చేస్తాను" లాంటి సమాధానాలు చెప్పుకొంటూ వచ్చాడు గానీ, ఇవేవీ మంజరికి నచ్చలేదు.
"అనుకొన్నపని అనుకొన్న వేళకు జరగాలిగానీ, ఇంతలేసి ఆలస్యాలయితే ఎలానండీ?" అన్నది మంజరి.
చలపతి పూర్తిగా సహనాన్ని కోల్పోయాడు.
"అమ్మాయీ! వెనకటికో సామెతది - నీకు తెలుసుననుకొంటాను. "నక్క పుట్టి నాలుగురోజులు కాలేదట- ఇంతగొప్ప గాలివాన నా జన్మలో ఎరుగనన్నదట, నీ కెన్నోసార్లు చెప్పాను, నీ కామెంట్స్ దేన్నీ గురించయినాసరే పాస్ చెయ్యొద్దని నా మాటంటే నీరు లక్ష్యం లేదా? అప్పుడే అన్న విషయాలూ తెలిసిపోయాయనుకొంటున్నావా నీకు తెలియనందుకు నాకు బాధలేదు. కనీసం చెబితేనన్నా గ్రహింపు లేకపోతే ఎలా?" అని మండిపడ్డాడు చలపతి.
మంజరి ఖిన్నురాలయింది.
"నేను మాత్రం కానిమాటలేమన్నానండీ?" అన్నది మంజరి. భితుకు భితుగ్గా.
రెండుమూడు నిముషాలు ఏమీ అనలేదుగానీ, తరవాత ఫక్కున నవ్వుతూ మంజరి భుజమ్మీద చెయ్యివేసి "కోపం వచ్చిందా?" అన్నాడు.
మంజరి పలకలేదు.
"ఇక్కడ వ్యవహారాలన్నీ ఇలాగే ఉంటాయి మంజరీ! ముష్టి కధను రాయడానికి ఇన్నిరోజులు అవసరం లేనేలేదు. పట్టుమని కూచుంటే నాలుగైదు రోజులే చాలు. కానీ, అంత తొందరగా ఏ కవి రాయడు, అధవా రాశాడో వాడి పుఠమారిందన్నమాటే!" అన్నాడు చలపతి.
మంజరి కళ్ళింత చేసుకొని చూసింది.
"ఇక్కడున్నచిత్రమేదీ! సినిమాకధంటే - అదమ పక్షం అయిదారు మాసాలపాటు నలగాలి. కవిగారు రాసింది రాసినట్టుగానే తీయడం ఎప్పుడూ జరగదు. డైరెక్టరూ, ప్రొడ్యూసరూ, ఒక్కోసారి హీరో, హీరోయిన్లు కూడా కధను మారుస్తూ ఉంటారు. సెన్సార్ వెళ్ళబోయేనాటికి, కవిరాసిందానికి, తయారయిందానికీ ఎక్కడా పోలికలుండవు."
మంజరికి ఎందుకనో నవ్వొచ్చింది.
"అయితే నేనుకూడా కధను మార్చమంటూ అడగోచ్చునన్నమాట" అన్నదావిడ ఈ విషయం నమ్మనట్లుగా.
"ఆఁ" అన్నాడు చలపతి "కానీ, నువ్వు హీరోయిన్ వి కావాలిగా ముందు, నీకోసం జనం విరగబడతారన్న నమ్మకం ప్రొడ్యూసర్ కు కలగాలి. నువ్వంటే బాక్సా ఫీస్ బ్రేక్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్ అనుకోవాలి. ఆ రోజున నువ్వేం చెప్పు అది వేద వాక్యమయిపోతుంది. అదో ఫార్ములా కింద ఫారమయిపోతుంది. సాధారణంగా ఇలాంటి విషయాలు పత్రికల కెక్కవనుకో కంపెనీ మనదే అయితే మనం న్యూస్ గా కూడా వేయించొచ్చు, అయితే ఆ స్థాయికి నువ్వు రావాలంటే అందిన వేషాలేస్తూ, అందరకీ అనుకువగా "ఉండాల్సిందే!" నన్నాడు చలపతి.
ఇంకా అడుకువేమిటి నా బొంద అనుకొంది మంజరి.
పదిహేనురోజుల తరువాత తారకం గారు కధను పట్టుకొచ్చారు. కధంటే ఎంత ఉంటుందో ననుకొంది మంజరి, ఆయన చేతులలో అయిదారు అరఠావులకన్నా ఎక్కువలేవు.
"ఓ చిన్న రహస్యం" అన్నాడు తారకం తాపీగా కుర్చీలో కూచుంటూ.
చలపతి ముందుకు వంగాడు.
"ఈ కధనింకా వెంకటేశ్వర్లుగారికి చూపించలేదు. ముందుగా మనలో మనం ఓ నిర్ణయానికి కొచ్చాక మార్పులూ, చేర్పులూ చేసుకొన్నాక, ఫైనల్ గా వారికి చూపిద్దాం. నేనిలా ముందు మీకు వినిపించానని అనకండి" అన్నాడు తారకం.
హఠాత్తుగా చలపతి లేచి, తారకంగారి రెండు చేతులు పుచ్చుకొని గుండెలకు హత్తుకొన్నాడు.
"మీ మీద మీలో ఎంత అభిమానం ఉందో, ఇప్పటికి నేను తెలుసుకోలేకపోయాను తారకం గారూ! ఈ రణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియడంలేదు" అన్నాడు చలపతి సన్నగా నిట్టూరుస్తూ. "నవ్విన నాపచేనే పండిందన్నట్లుగా, మాకు కాస్త కాలూనడానికి అవకాశం దొరకనివ్వండి. మీరు మన కంపెనీకే వచ్చేద్దురు గానీ....ఏం మంజరీ! తారకంగారంటున్న మాట విన్నావా? వెంకటేశ్వర్లు మనకు తెలిసినవాడు. తారకం గారు మనకు పరమాప్తులు. కనకనే కంపెనీకన్న ముందుగా మనకు కధ చెప్పేస్తున్నారు. నీక్కావలసినవిధంగా కారెక్టర్ని మార్పించుకోవచ్చు. ....ఈ వెంకటేశ్వర్లు అడుగుతాడేమో వొక వేళ - నీకేమీ తెలీనట్టేవుండు సరేనా"
"ఎంత మాటండీ! ఇంత అభిమానంతో మీరు సాయం నాకు చేస్తుంటే నేను మరోలా అనుకోగలనా?"
నాక్కావలసిందదే అమ్మాయిగారూ! అన్నాడు తారకం.
తాయారు అందరికీ కాఫీలిచ్చింది.
తారకంగారు కధను చదవడం ప్రారంభించారు. ఉపోద్ఘాతంగా -
"ఇదే ఫైనల్ కాదు. ముందు మనం రఫ్ గా అనుకొంటున్నాం, తోటల ఫ్లాట్ మనకు నచ్చితే సినేరియో రాసేస్తాను. కొసకు దైలాగ్సు చూచుకోవచ్చు" అన్నాడు తారకం.
"అలాగే బాబుగారూ!" అన్నది మంజరి.
తారకం గొంతు సవరించుకొని, కాగితాల వోసారి విదిలించి, కళ్ళజోడు పైపంచతో తుడుచుకొన్నాడు. |
25,048 | ఆమె అదిరిపడింది. ముందసలు అతడు జోక్ చేస్తున్నాడేమో అనుకుంది. కానీ కొంతసేపటికి అతడు నిజంగా ఇదంతా చెపుతున్నాడని అర్ధమైంది. ఆమె తన మనసులో కల్లోలాన్ని బయటపడనివ్వకుండా సంభాషణ కొనసాగించింది. వినాయక నిమజ్జనంలో మత వైషమ్యాల్ని ఎలా రెచ్చగొట్టాలో-అక్కడనుంచి అంచె లంచెలుగా ఎలా గొడవలు పెద్దవి చెయ్యవచ్చో దీనికి ముఖ్యమంత్రే తెరచాటున వుండి నాటకం నడిపిస్తే, రాష్ట్రం విడిపోయాక వచ్చే లాభాలేమిటో వివరించాడు. అతడు మాట్లాడుతున్నంతసేపూ ఆమె ఆలోచిస్తూనే వుంది. అతడికి ఈ పథకం తాలూకు యోచన ఆకస్మాత్తుగా వచ్చినదా లేక ఎప్పట్నుంచో వున్నదా అని ఆమె ఆలోచన. ఎప్పట్నుంచో వున్నదయితే తనతో ఒక్కసారయినా చర్చించే వాడే ఇంత భయంకరమైన ఆలోచన అతడికి ఎలా వచ్చిందా అని ఆమె మధనపడుతూనే వుంది.
టేప్ లో మాటలు విన్నాక ఆమె అనుమానం నివృత్తి అయింది. అయితే దీనివల్ల ఆమె మానసిక వ్యధ మరింత ఎక్కువైంది. ఇంతవరకూ చౌరసియాకీ తనకీ మధ్య మామూలు ఆకర్షణలకి అతీతమైన సంబంధం ఏదో వుమ్దనుకుంటూ వచ్చింది. కానీ ఎవరో వచ్చి ఏవో ఫోటోలు బయటపెడతామనేసరికి అతడు దానికి భయపడి తనకు అసలు విషయం చెప్పకుండా ఈ విధంగా ప్రలోభ పెట్టే ప్రయత్నం చేయడం ఆమె మనసుని కమ్చీతో కొట్టినట్టయింది. అతడు తనతో అన్ని విషయాలూ చర్చించి, 'ఈ ఫోటోలు బయటపడితే ఎలా' అని అడిగి వుంటే అది వేరే సంగతి. నిజానికి ఆ ఫోటోలు బయటపడితే పోయే అతడి పరువుకన్నా తనది ఎక్కువ. అతడు కోటేశ్వరుడూ, పెద్ద మాఫియా లీడరూ అయివుండవచ్చు. కానీ తాను రాజకీయాల్లోనూ, వెండితెరమీదా పబ్లిక్ ఫిగర్. ఆమెకు అకస్మాత్తుగా పెద్ద పెట్టున దుఃఖం అది. తనని ప్రేమించేవాళ్ళు లేక, తాను కష్టంలో వున్నప్పుడు మాట సాయంచేసేవాళ్ళు ఒక్కరన్నా లేరని తెలుసుకున్నప్పుడు కలిగే దుఃఖం అది. మనిషికి డబ్బూ, పదవి, హోదా- ఏదీ ఇవ్వలేనిది అది.
టేప్ రికార్డర్ లో సత్తార్ అన్న మాటలు ఆమెకు వాస్తవంగా అనిపించాయి. భర్తని బెదిరించడం కోసం మర్డర్ చేయించింది. మర్డర్ ని మాఫీ చేయించటం కోసం అరవింద్ చౌరసియాకి తనని అర్పించుకుంది. అతని సాయంతో రాజకీయపు టెత్తులు వేసింది. ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీతో పరిచయం పెంచుకుంది. దాన్ని చూపించి ముఖ్యమంత్రిని బెదిరించింది. ముఖ్యమంత్రిని తొలగించడం కోసం అలజడులు సృష్టించాలనుకుంటూంది. అలా మరో మెట్టుపైకి ఎదగాలనుకుంటూంది. తన పతనానికి మనసు ఇక్కడివరకూ అంగీకరిస్తోంది. సత్తార్ మరో మెట్టు క్రిందికి జారమంటున్నాడు. బస్సుని తగలబెట్టే ఆందోళనకారుడికీ, సరిహద్దు దాగి ఇవతల కొచ్చే టెర్రరిస్టుకీ తేడా లేదనుకుంటున్నాడు. నిజమే అయివుండవచ్చు.
పతనం ఎక్కడ ప్రారంభమైంది? ఎక్కడకు వెళ్తోంది?
మనిషికి మనసుతో సత్సంబంధాలు లేవు. అలాగే మనిషికి మరో మనిషితో, ప్రభుత్వంతో, దేశంలో సత్సంబంధాలు లేవు. ఇదంతా ఎందువల్ల జరుగుతోంది? కేవలం నిజాయితీ లోపించడం వల్లేనా? తన జీవితానికి అనువుగా వుండేట్టు మొదట సిద్దాంతాలు నిర్మించుకుని, ఆ తరువాత ఆ సిద్దాంతాలే తమని మానసికంగా అనుక్షణం బాధపెడుతూ వుంటే నిరంతరం కుమిలిపోయే మనుష్యులకి దారేది? తన ప్రియుడి గదిలోనే టేప్ రికార్డర్ పెట్టగలిగిన అవినీతిపరురాలు తను. ప్రియుడు ఇలా చేస్తాడని బాధపడటం దేనికి? మానవ సంబంధాలు పాడయిపోతున్నాయని వాపోవడం దేనికి??
ఈ వలయం నుంచి బయట పడటం ఎలాగో ఆమెకి అర్ధం కాలేదు. చౌరసియా ఎలాగైనా వత్తిడి తెస్తాడు. తన భర్త దానికి వప్పుకోకపోవచ్చు. దేశం మీద ప్రేమ వుండికాదు. ప్రభుత్వం ఉరి వేస్తుందేమో అన్న భయంతో! అతడికి టెర్రరిస్టు లతో చేతులు కలిపేటంత ధైర్యం లేదు.
ఆమె తప్పంతా భర్తమీదకు తోసెయ్యడానికి నిర్ణయించుకుంది. తను అడుగుతుంది. భర్త కాదంటాడు. ఆ విషయం వెళ్ళి చౌరసియాకు చెపుతుంది. మిగతా విషయాలు వాళ్ళు చూసుకుంటారు. తను మాత్రం ఈ సమస్య నుంచి బయటపడుతుంది.
ఇలా ఆలోచించి ఆమె బయల్దేరింది. భర్త దగ్గరకు వెళ్తూవుండగా ఆమె మనసంతా అదోలా అయిపోయింది. ప్రియుడి సందేశాన్ని భర్తకి అందించడం....బహుశ ఏ స్త్రీకీ ఇప్పటివరకూ ఈ స్థితి సంభవించి వుండదు.
ఆమె రెడ్డి దగ్గిర ఈ విషయాన్ని జాగ్రత్తగా కదిపింది. అరవింద్ చౌరసియా ప్రసక్తిరాలేదు. 'బయట శక్తులు కొన్ని సాయం చేయడానికి సిద్దంగా వున్నాయి. రాష్ట్రాన్ని కల్లోలం చేసి విడగొట్ట కల్గితే కొన్ని కోట్లు లాభం....' అన్నట్టు చెప్పింది.
రెడ్డి మొహం ఉద్వేగంతోనూ, ఆనందంతోనూ నిండిపోయింది. "నిజమా?" అన్నాడు ఎగ్జయిటెడ్ గా అతడు అప్పుడే ఆంద్రదేశాధినేత అయినట్టు వూహించుకున్నట్టు మొహం చూస్తుంటేనే తెలుస్తూంది.
కామిని మొహం రక్తం చుక్కలేనట్టు పాలిపోయింది.
ఆమె దీన్ని వూహించలేదు. తన భర్త భయాన్ని అతడి స్వార్ధం డామినేట్ చేసిన క్షణాలివి. రెండు చోట్లా తను ఓడిపోయినట్టు ఆమె గ్రహించింది. ఆమెలో ఒక కసి బయల్దేరింది. ఆ రకమైన సాడిజంతోనే, "ఇదంతా నీకు ఎవరు సాయపడతారని అడగవేం?" అంది.
"అవును అడగడం మర్చిపోయాను. ఎవరు?"
"అరవింద్ చౌరసియా."
అతడి మొహం ఒక్కసారిగా వెలిగిపోయింది. "చౌరసియా మనకి సాయపడతాడా?" అని అరిచాడు ఉద్వేగంగా.
ఆమెలో కసి తారాస్థాయికి చేరుకుంది. ఈ ప్రజలమీద, నిర్లిప్తతమీద, మానవ సంబంధాలమీదా, నిజాయితీ ముసుగులో ఆడే నాటకాల మీదా- అన్నీ కలిపి- ఎదురుగా వున్న అతడిమీద.
"అవును నీకు ఎందుకు సాయపడడు? నువ్వు తన ప్రియురాలి భర్తవి కదా" అంది ఆఖరి అణ్వాస్త్రం వదులుతున్నట్టు! ఆమె ఆ క్షణం అంతా చెప్పెయ్యడానికే నిశ్చయించుకుంది. యుద్ధం అయిన తరువాత కన్నా ముందే ఎవరు శత్రువులో, మిత్రులో తెలుసుకోవడం మంచిది కదా!
అతడు ఆ మాటలకి తలెత్తి చూశాడు. అతడి మొహంలో రకరకాల భావాలు చోటుచేసుకున్నాయి. కామిని అతడివైపే చూస్తోంది. ఆనకట్ట తెగితే, ఒక్కసారిగా నదీజలం ప్రవహించినట్టు అతడిలో ఆవేశం కట్టలు తెంచుకుని, తనని అక్కడికక్కడే మర్డర్ చేస్తాడని ఆమె భావించింది. అయితే అతడి మొహంలో వస్తూన్న మార్పులు 'ఆవేశం' తాలూకువి కావు. 'సంభ్రమం' తాలూకువి.
"నిజమా? నీకూ చౌరసియాకు అంత దగ్గిర సంబంధం వున్నదా?" అన్నాడు సంభ్రమంగా.
ఒక గ్రీష్మ పవనం ఒంటిని మండించినట్టు ఆమె కదిలి పోయింది. అతడు ఆవేశంలో తనని తగలబెట్టినా ఆమె అంత ఆశ్చర్యపోయేది కాదేమో తనని నిలువునా సమాధి చేస్తానని రెచ్చిపోయినా అంత బాధపడేది కాదేమో ఈ విషయం తాను చెప్పగానే అతడు 'ఆనందించటం' ఆమెకు గొడ్డలిపెట్టులా తగిలింది.
జేవురించిన మొహంతో, "మీ భార్యకు ఇంకొక వ్యక్తితో సంబంధం వుందని చెపుతున్నాను. అయినా మీకు ఆవేశం కలగటం లేదా?" అంది.
అతడు సింపుల్ గా "నేను రాజకీయ నాయకుడిని కదా" అన్నాడు- "రాజకీయ నాయకుడు ఎవరూ అనవసరమయిన విషయాలకు ఆవేశం తెచ్చుకోడు."
ఆ మాటలకూ ఆమె మరింత ఇరిటేట్ అయి, "నువ్వసలు మగాడివేనా? నీలో నెత్తురు ప్రవహిస్తోందా? నీ భార్యకు ఇంకొక వ్యక్తితో సంబంధం ఉందంటే-అది అనవసరమయిన విషయమా?" అని అరిచింది.
"ఆవేశపడకు కామినీ. అసలు విషయం చెప్పు చౌరసియా నీతో ఏం చెప్పాడు? నా ప్రసక్తి ఎందుకొచ్చింది? ఈ రాష్ట్రపు కాబోయే ముఖ్యమంత్రితో చౌరసియాకు ఏం పని?" అన్నాడు ఆత్రంగా.
"అతడితో కలిసి నువ్వు ఈ రాష్ట్రాన్ని విడగొట్టెయ్యాలని ఫీలర్స్ పంపాడు.....నాతో!"
"అతడిని నమ్మవచ్చంటావా? లేక నన్ను ట్రాప్ చేసి కటకటాల వెనక్కి తొయ్యటానికి ముఖ్యమంత్రితో కలిసి అతను వేసిన ట్రిక్కా అది?"
"అతడితో కలిసి నేను ఒకే పక్కమీద గడిపిన ఎన్నో రాత్రుల సాక్షిగా అతడిని నమ్మవచ్చు" అంది.
"నువ్వు చెపుతే ఇక అందులో డౌటు లేదులే నువ్వు కలుపుతావా మా ఇద్దర్నీ- లేక నువ్వు చెప్పావని నేనే అతడిని కలుసుకుని ఈ ప్రపోజల్ పెట్టనా?" అన్నాడు.
"అంటే....అంటే....అతడితో కలిసి రాష్ట్రంలో టెర్రరిజాన్ని వ్యాపింపజెయ్యటం నీ కిష్టమే నన్నమాట."
"అందులో తప్పేం వుంది? స్వతంత్ర ఆంద్రదేశానికి నేను రాజునవుతాను."
ఆమె ఇంకా ఆగలేకపోయింది. ఛివాలున లేచి అతడి కాలర్ పట్టుకుని దగ్గిరకి లాగుతూ, "నీ మొహంమీద ఉమ్మెయ్యాలని పిస్తూంది నాకు. ఎంత దిగజారిపోయావు నువ్వు? నా భర్త ఒకచేతకాని దద్దమ్మ అనుకున్నప్పుడు బాధ కలగలేదు. అటువంటి వాడిని హోం మినిష్టర్ ని చేయటం కోసం ఢిల్లీలో అడ్డమైన వాళ్ళ కాళ్ళు పట్టుకున్నప్పుడు బాధ కలగలేదు. 'నీలో వయసు బాగా తెలుస్తూంది. నీకు మేకప్ చేసే అమ్మాయిని నాకు పరిచయం చెయ్యి' అని చౌరసియా అన్నప్పుడూ బాధ కలగలేదు. కాని ఇప్పుడు....ఇప్పుడు ఒక చిన్న దేశానికి రాజు కావాలన్న ఆశతో, దేశంనుంచి రాష్ట్రాన్ని విడగొట్టటం కోసం, తన భార్య ప్రియుడితో చేతులు కలిపేవాడు నా భర్త అనుకుంటే నాకు బాధ కలుగుతోంది-" అంది.
అతడు తాపీగా, "ఇంతేనా? నువ్వు చెప్పవలసింది ఇంకేమైనా వున్నదా?" అని అడిగాడు. తరువాత లేచి ఆమెవైపు చూస్తూ అన్నాడు. "నువ్వు చాలా గొప్ప దానివని నీ అభిప్రాయం. నువ్వేకాదు నీలాటి స్త్రీలు చాలామంది అలానే అనుకుంటూ వుంటారు. తాము ప్రపంచాన్నీ, అందులోని చాలామంది మొగవాళ్ళనీ చూశామని అనుకుంటారు. నీలాటి స్త్రీలు రాజకీయాల్లో ఎక్కువగా వున్నా, బయట ప్రపంచంలో కూడా చాలా మంది వుంటారు. వీళ్ళు ఎక్కడా ఇమడలేరు. ఒక్క స్నేహితుడితో ప్రారంభమైన మీలాటి వాళ్ళ జీవితం ఎన్నో మజిలీల్లో ఆగుతుంది. ఒక్కొక్క మజిలీ మీరు ఒక్కొక్క అనుభవంగా భావించి, ఎదిగిపోయామని అనుకుంటారు. ఒక మొగవాడు తనకి ఒక స్త్రీ దొరకటం గొప్ప వరంగా భావిస్తాడు. అలాటి తొట్టిగ్యాంగు, నీచమైన గ్యాంగు అంతా మీ చుట్టూ చేరి మీకు లేని గొప్పదనాన్ని కలిగిస్తారు. వీళ్ళంతా మీ శరీరం మీది వ్యామోహంతో మీ చుట్టూ చేరతారు. కొంతమంది మిమ్మల్ని ప్రేమిస్తారు కూడా. కానీ ఆ ప్రేమంతా వాళ్ళు తమ బాధలు మీతో చెప్పుకోవటానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అలాటి మొగవాళ్ళు మీకు నచ్చరు. అప్పటికే మీ గురించి నలుగురికీ తెలుస్తుంది. నలుగురికీ తెలిసిందని మీకూ తెలుస్తుంది. మీ మనసుతో మీకు మంచి సంబంధాలు వుండవు. విసుగూ, చిరాకూ ఎక్కువ అవుతుంది. మొగవాడికి ఒక అనుభవం అతడి అకౌంట్ లో ఒక నెంబరుగా చేరుతుంది. ఆడదానికి ఒక అనుభవం మొహంమీద ఒక ముదతను ఎక్కువ చేస్తుంది. ఇంత చిన్న విషయం తెలుసుకునేసరికి మీ చుట్టూ వున్నవాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. మనసుతో ఇక నాటకాలు ఆడలేక, 'నన్ను నన్నుగా ప్రేమించే.....'అన్న కొత్త స్లోగను మొదలుపెడతారు. మిమ్మల్ని మీరుగా ప్రేమించటానికి మీలో ఏమీ లేదని, మిగిలింది వట్టి చెరుకుపిప్పి అనీ గ్రహించరు. అప్పటికీ మీక్కాస్త హోదా వస్తుంది. దాన్ని మీ ఫ్రస్టేషన్ కోసం ఉపయోగించుకుంటారు. మీరు ఉద్యోగినులైతే క్రింది ఉద్యోగస్తులను చంపుతారు. రచయిత్రులైతే రచనల్లో చూపిస్తారు. రాజకీయాల్లో అయితే మంత్రుల మధ్య తెంపులు పెట్టడానికి ప్రయత్నిస్తారు. రోజుకి పది గంటలు ఫోన్ దగ్గిరే గడపటం మీ జబ్బుకి మొదటి లక్షణం మీ మొహంమీద ఆనందకరమైన, శుభప్రదమైన నవ్వు వచ్చి చాలా కాలమవటం రెండో లక్షణం. ఈ రెండు లక్షణాలూ నీ కున్నాయని నీకూ నాకూ తెలుసు. ఇప్పుడు చెప్పు ఇదంతా విన్నాక కూడా నీ కింకా కడుపులో తిప్పుతున్నట్టు వుందా?" |
25,049 |
స్టేడియంలో లయబద్ధంగా పరుగెడుతున్న అన్వితవైపే చూస్తున్నాడు మధు. ఒకర్ని ఒకరు గుర్తుపట్టలేని దూరం..... ఒక్కొక్కప్పుడు దూరం, మనసుకు భారంగా వుంటుంది. ఆ భారాన్ని భరించడం చాలా కష్టం. మధుకి విష్ చేయాలని ఉంది. ఆమె ఎదురుగా వెళ్ళాలని వుంది, గబగబా మెట్లు దిగాడు. ఆమెవైపు నడుస్తున్నాడు. సరిగ్గా ఆమె కూడా అతనివైపే పరిగెత్తుకుని వస్తోంది. పాద ధ్వనులలో మట్టి లయ..... ఆ సమయంలో అక్కడ మధుని చూడగానే ఆశ్చర్యపడింది అన్విత. "హలో! మీరు ఇక్కడ...." చిరుచెమట పట్టిన ఆమె ముఖాన్ని, సన్నని చిరుగాలికి ఎగురుతున్న జుత్తును, తెల్లటి డ్రస్ లో మిలమిల మెరుస్తున్న ఆమె వంటివైపు చూస్తున్నాడతను. "అవును...... నేను ఇక్కడ....." టెలిగ్రామ్ భాషలో అన్నాడు మధు. "జాగింగ్ ఇక్కడికే వస్తారా?" "అవును..... వాకింగ్ కు వస్తాను....." మళ్ళీ టెలిగ్రామ్ భాష. "రోజూ కాలేజీలో కల్సుకోవడం.... ఇక్కడ కూడా కల్సుకోవడం.... బావుంటుంది కదూ.... సీయూ" అనేసి తెల్లపావురంలా ముందుకెళ్ళిపోతున్న ఆమెవైపే అరవిరిసిన కళ్ళతో చూస్తుండిపోయాడు మధు. లవ్ ఒక స్వీట్ పాయిజన్ లాంటిది. ఒకసారి ఆ ప్రేమ భావన మనసులో విత్తనంలా నాటితే, ఆ లేతమొక్క మహావృక్షమవుతున్న ప్రతిక్షణం, దుస్సహమైన అసహనం, తీపి, బాధ..... అలాంటి బాధావస్థలోనే వున్నాడు మధు. జాగింగ్ చేస్తూ ముందుకెళ్ళిపోతున్న అన్వితను చూస్తూ, వెనక్కి మరలాడతను. అతనికిప్పుడు ఆనందంగా వుంది. కిటికీ తెరవగానే ఇంద్రధనుస్సు కన్పిస్తే ఎలా వుంటుందో లా వుంది అతని మానసిక పరిస్థితి. రోడ్డు పక్కన టీబడ్డీ దగ్గర టీ తాగి, హాయిగా సిగరెట్ కాల్చుకోవాలని పించింది. అటూ ఇటూ చూసి ఒక బడ్డీవైపు నడిచి సిగరెట్ తీసుకుని, టీ ఆర్డర్ చేసి కూర్చున్నాడు. అతని ఎదురుగా ఒక వ్యక్తి అదేపనిగా మధువైపు చూస్తున్నాడు. చిన్న పిల్లిగడ్డం - మనిషి సన్నగా, పోడవుగా వున్నాడు. అప్రయత్నంగా మధు చూపులు అతనిమీద పడ్డాయి. అవునా? కాదా? సంశయం. "భయ్యా! మీరు..... మీరు...... మధు కదూ....." దగ్గరగా వస్తూ అడిగాడతను. ఆ గొంతు వినగానే గుర్తుకొచ్చింది మధుకి, ఆ వ్యక్తి ఎవరో. సరసాగా ఫడేల్మని అతని చెంపమీద ఒక దెబ్బ కొట్టాడు మధు. "మీరు....మధూయే.... యాద్ ఆగయా....." అన్నాడతను ఆనందంగా. "మధూ! బాగున్నారా? ఎన్నాళ్ళకెన్నాళ్ళకు...." ఏదో అనబోయాడతను. "మళ్ళీ కొట్టనా..... లేకపోతే...." "నేనేం చేశాను! ఆ కొట్టడం అలవాటు నీకు పోలేదా?" అన్నాడు అతను. "మీరేంట్రా..... మీరు- నువ్వు, నువ్వు అనుకున్న స్నేహం మనిది. కొన్నాళ్ళపాటు కల్సుకోకపొతే, మీరు.... మీరూ అయిపోతుందా..... ఏం చేస్తున్నావ్? ఎలా వున్నావ్?" గబగబా ప్రశ్నలు వేశాడు మధు. అతని పేరు సుల్తాన్. మధు డిగ్రీ రోజుల్లో అతని రూమ్మేట్. పరిస్థితుల కారణంగా చదువుకు పుల్ స్టాప్ పెట్టేసి బిజినెస్ లోకి దిగాడు సుల్తాన్. "ఆ సమయంలో నువ్వు గనుక, నాకు హెల్ప్ చేసి ఉండకపొతే ఏమైపోయే వాణ్ణి? నీ గోల్డెన్ చెయిన్ అమ్మి - నా బిజినెస్సుకు పెట్టుబడి పెట్టావు గుర్తుందా?" జ్ఞాపకం చేశాడు సుల్తాన్ కృతజ్ఞతగా. "ఆ విషయాలన్నీ ఇప్పుడెందుకు చెప్పు? ఎలా వున్నావ్? ఏం చేస్తున్నావ్? అడిగాడు మధు ఆప్యాయంగా. "చెప్పడం ఎందుకు? చూద్దుగాని రా!" అంటూ టీ షాపువాడికి డబ్బులిచ్చేసి మధు చేతిని పట్టుకుని ముందుకు తీసికెళ్లాడు సుల్తాన్. రెండు సందుల తర్వాత కార్నర్ దగ్గర ఆగి "మధూ- తలెత్తి ఆ బోర్డువైపు ఒకసారి చూడు-" అన్నాడు సుల్తాన్. మధు తలెత్తి చూశాడు. అతనికి ఒక్కక్షణం నోటిమాట రాలేదు. నిశ్చేష్టుడైపోయాడు. "మధు మోటార్ రిపేరింగ్ షాపు" "నీ గుర్తుగానే నీ పేరుమీద పెట్టుకున్నాను. అవునుగానీ- నువ్విక్కడ ఏంటీ?" చెప్పాడు మధు. అప్పట్లో మధు, సుల్తాన్ కి వ్యాపారంలోనే కాదు, జీవితంలో కూడా చాలా సహాయం చేశాడు. సుల్తాన్ పక్కింటి అమ్మాయిని ప్రేమిస్తే వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి ఆ పెళ్ళికి పెద్దగా వ్యవహరించాడు కూడా. "పెళ్ళయిందా?" "లేదు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను" చెప్పాడు మధు." "ఎవర్నయినా ప్రేమించావా? అదీ లేదా!" నవ్వుతూ అడిగాడు సుల్తాన్. నవ్వాడు మధు. "దారిలో పడ్డావన్న మాట. ఎవరా అమ్మాయి?" అడిగాడు ఉత్సాహంగా సుల్తాన్. "టైమింగ్స్ ఏమిటి?" "మార్నింగ్ పది నుంచి అర్థరాత్రి వరకు." "ఇవాళ నువ్వు కాలేజీకి సెలవిచ్చెయ్ - వచ్చెయ్- నీ ప్రేమకథ వినాలని వుంది" అన్నాడు సుల్తాన్. "లేదు. మధ్యాహ్నం వస్తాను. కాలేజీకి వెళ్ళక తప్పదు" అన్వితను గుర్తుకు తెచ్చుకుంటూ అన్నాడు మధు. "నీకోసం ఎదురు చూస్తుంటాను" అన్నాడు సుల్తాన్. సుల్తాన్ అనుకోకుండా కలవడం మధు మనసుకు ఆనందాన్ని ఇచ్చింది. కాలేజీలో కెళ్ళగానే పార్కింగ్ వేపు చూశాడు మధు. అన్విత కారు కనబడలేదు. రవి, రమణ, బుచ్చిబాబు ఎవరూ కనబడలేదు. క్యాంటిన్ లో కాసేపు కాలక్షేపం చేసి క్లాస్ రూమ్ లో కెళ్ళాడు. రెండు క్లాసులు గడిచాయి. లెక్చరర్లు చెప్తున్నది తలకెక్కడం లేదు. డోర్ వేపు చూస్తూ అసహనంగా గడుపుతున్నాడతను. మైదానం నారాయణ మధ్యాహ్నం ఫస్ట్ పిరియడ్ కొచ్చాడు. "డియర్ స్టూడెంట్స్..... నోట్ డవున్ ద కొటేషన్Management must have a purpose, a dedication and that dedication must have an emotional commitment. It must be built in as a vitalpart of the personality of any one who truly is a manager. ఆ కొటేషన్ ఎందుకో నచ్చింది మధుకి. Management బదులు Love అని, Manager దగ్గర Lover అని రాసుకున్నాడు. ఆ కొటేషన్ ని ఒకసారి చదువుకున్నాడు. సంతృప్తిగా వుందతనికి. అన్విత ఇక ఆరోజు కాలేజీకి రాదనీ తెలిసిపోగానే సడన్ గా లేచి నిలబడ్డాడు. "ఇంకా టెన్ మినిట్స్ వుంది. కొటేషన్ తో క్లాస్ అయిపోయిందనుకున్నావా?" సీరియసై పోయాడు మైదానం నారాయణ. "లేద్సార్..... తలనొప్పిగా వుంది." "నా క్లాస్ అంటే అందరికీ తలనొప్పే. ఆ కెమిస్ట్రీ మేడమ్ క్లాస్ కి అందరూ ఎగబడి వెళతారు..... వెళ్లిపో...." అని నారాయణ అనగానే పరుగు, పరుగున బయటికి వచ్చేశాడు మధు. ఆటోని పిలిచి కూర్చుని, ఎక్కడికి వెళ్ళాలో చెప్పాడు. ఆటో సర్రుమని ముందుకు కదిలింది. ఊరు చివర చిన్న రెస్టారెంట్- దూరంగా చిన్న ఏరు. అక్కడికి తీసుకెళ్ళాడు మధుని సుల్తాన్. "పూర్వకాలంలో ఇక్కడో చిన్నకోట వుండేదిలే. మిగిలిన భాగంలో ఎవరో ఈ హొటల్ పెట్టారు. నీకిలాంటి వన్నీ ఇష్టం గదా- అందుకే తీసుకొచ్చాను" ఉపోద్ఘాతంలా చెప్పి, రెండు కూల్ డ్రింక్స్ ఆర్డర్ చేసి "ముందు నీ ప్రేమకథ చెప్పు" అని అడిగాడు ఉత్సాహంగా సుల్తాన్. మనిషి తన ముఖాన్ని చూసుకోవడానికి అద్దం ఎలా అవసరమో, మనసుని తట్టి లేపడానికి ఇంకో మనసు కూడా అవసరమే. ఆ అవసరాన్ని చాలామంది గుర్తించరు. మధుకి, సుల్తాన్ అద్దంలా కనిపించాడు. అన్వితను చూసిన తోలిక్షణం నుంచి, తన మనసులో కదిలే, అస్పష్ట భావప్రకటనల గురించి తన భాషలో చెప్పాడు మధు. అర్థమైపోయింది సుల్తాన్ కి. "ప్రేమలో టీనేజ్ లవర్స్, జంపింగ్ లవర్స్, శాడిస్ట్ లవర్స్, ప్యూర్ లవర్స్ , డివైడెడ్ లవర్స్, టైమ్ పాస్ లవర్స్ , సెక్స్ వల్ లవర్స్, ఎటర్నల్ లవర్స్ ఇలా రకరకాల లవర్స్ వుంటారు. నువ్వు ఏ రకమైన లవర్ వో ఆలోచించావా.....?" సీరియస్ గా అడిగాడు సుల్తాన్. "అన్ని రకాలుగా ఆలోచించేది, ప్రేమంటావా!" సిగరెట్ పొగ వదులుతూ అన్నాడు మధు. "ఆ అమ్మాయిని నువ్వు ప్రేమిస్తున్నావన్న విషయం ఆ అమ్మాయ్ కి తెలుసా?" "తెలీదు." "నీ ప్రాబ్లమ్ నాకర్థమైపోయింది. ప్రస్తుతం నీ ప్రేమ, ఆరాధనలో వుందన్న మాట. నువ్వు అర్జంటుగా చెయ్యాల్సిన పని "నేను నిన్ను ప్రేమిస్తున్నాను" అని నువ్వు ఆ అమ్మాయికి చెప్పెయ్యాలి. నువ్వు, ఎవర్ని ప్రేమిస్తున్నావో వాళ్ళ దగ్గరకి వెళ్ళి నీతో పర్సనల్ గా మాట్లాడాలని చెప్పి నీ మనసులో మాట ఏ మాత్రం సందేహం లేకుండా చెప్పి వాళ్ళ అభిప్రాయం ఏమిటో అడగాలి. వాళ్ళు వెంటనే సమాధానం చెప్పలేకపొతే- ఆలోచించుకుని చెప్పమని చెప్పాలి. ఇంత డైరెక్టుగా చెపితే అవతలి వాళ్ళు ఏమనుకుంటారోనన్న సందేహం ఏమాత్రం ప్రేమించే వారిలో వుండకూడదు. నీ నిజాయితీ, నీ ధైర్యం ఆమెకి నచ్చవచ్చు. అంతకు ముందుగా నువ్వు చెయ్యాల్సిన పని ఏమిటో తెలుసా? ఆ అన్విత నువ్వంటే ఇష్టపడుతోందో లేదో పరోక్షంగా తెలుసుకోవాలి" ప్రేమ పెళ్ళి చేసుకున్న స్వీయానుభవంతో చెప్పాడు సుల్తాన్. "నేనంటే అన్వితకు ఇష్టమో లేదో తెలుసుకోవడం అవసరమా?" "ఒరే పిచ్చికన్నా- నీ దగ్గర బాలే వుంది. ఆడాలంటే గ్రౌండ్ కావాలా లేదా. ఆ అమ్మాయికి నీ మీద ఇంట్రస్ట్ వుంటేనే కథ నడుస్తుంది. లేకపోతే నువ్వు కంచికి- నేను నా రిపేర్ షాపుకు వెళ్ళిపోవాల్సిందే." "అయితే ఏం చెయ్యమంటావో కంగారు పెట్టేయ్యకుండా వన్ బై వన్ చెప్పు-" అడిగాడు మధు. చెప్పడం ప్రారంభించాడు సుల్తాన్. |
25,050 |
" కోడ్ని ఏమిటేఖర్మ ఏకంగా మేకపోతే నే ఇచ్చేస్తా" అన్నాడతను.
" అయితే ఒక్క క్షణం"
జాకెట్ కున్న, హుక్ లు వూడిన శబ్దం.
" ఈ మధ్య బాడీ వేస్తున్నావే. స్టయిల్ ముదిరిందా?" అయినా ఇదెం దుకే ఇప్పుడు ? నీ శరీరం అమృతం అయితే ఈ బాడీ విషపు చుక్కలాగా అనిపిస్తోందే"
" ఈ మధ్య మా మేనమామ వచ్చాడ్లే. వాడే రహస్యంగా ఈ బాడీ, మైసూర్ శాండిల్ సోపులు రెండు తెచ్చి ఇచ్చాడ్లే. వద్దంటే బావోదనితీసుకున్నా"
" అదెంతో నయం పూర్వం ఆడవాళ్ళకి కచ్చడాలు వేసేవారట. మీ మేనమామ అవి కొనుక్కొచ్చి వేయలేదు. సంతోషించాం. ఇంతకీ ఏం చేస్తాడు మీ మేనమామ?"
" జీప్ డ్రైవర్"
" మనువాడతావా?"
" ఆ నువ్వు సరేనంటే"
" పెళ్ళయినా నువ్వలా చాటుమాటుగా వస్తానంటే నాకభ్యతరం లేదు"
ఆరెండు గొంతులూ బాగా విన్నటువుంటివే. స్పష్టంగా వినపడక పోవలడంవల్ల గొంతులు గుర్తుపట్టలేకపోతున్నాను. మరో రెండు అడుగులు వేశాను.
గడ్డివాముకు తూర్పువైపున రెండు ఆకారాలు కదులుతున్నాయి.మసకచీకట్లో రెండు శరీరాల సుఖం కోసం పెనుగులాడుతున్నట్టు అని పించింది నాకు. ఇక అక్కడ వుండలేకపోయాను.
వెనక్కి తిరగబోతుండగా అతను గొంతు విప్పాడు.
"ప్రతి సారీ ఇదే తొలిసారన్నట్టుగా చేతికి ఒక పట్టాన చిక్కవ్. ఎందుకే అంత సిగ్గు?"
గొంతు గుర్తుపట్టాను. ఒక్కసారిగా రక్తమంతా మెదడులోకి చిమ్మినట్టు మొద్దుబారిపోయింది. కాళ్ళ కింద భూమి తొలుచుకుపోయి
|
25,051 | నైట్ షిప్ట్ ఇన్ ఛార్జినుండి అందిన వర్తమానమది.
కిరీటి షాక్ తిన్నట్టుగా ఉండిపోయాడు.
మరుక్షణం కర్తవ్యం గుర్తుకొచ్చినట్టుగా శిల్పనుండి దూరంగా ఒరిగి డ్రెస్ చేసుకోవటం మొదలుపెట్టాడు.
కాంక్షకు బానిసైన శిల్ప కిరీటి వింత ప్రవర్తనను క్షమించలేకపోయింది.
కోరివచ్చిన తనను కావాలని అవహేళన చేస్తున్నట్టు అనుకుంది.
క్రోధారుణ నేత్రాలతో పైకి లేచింది.
"ఎక్కడికి...... మీ జయశ్రీ అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసిందా?"
జరిగిందేమిటో తెలుసుకునే విచక్షణ లేకుండా ఆమె చేసిన అభియోగానికి అతనిలోని సహనం చావుదెబ్బతిన్నట్టుగా చివాలున ఆమెవేపు తిరిగాడు.
"లేకపోతే అర్థరాత్రి అర్జెంటుగా కలవమని కన్యగాని......"
"శిల్పా....."
ఉరిమినట్టుగా చూశాడు.
"డోంట్ బి ఫూలిష్....." ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవడానికి విశ్వప్రయత్నం చేయాల్సి వచ్చింది.
"లేకపోతే ఎన్నడూ లేనిది మీకీ అర్థరాత్రి ఫోనేమిటి....." నిలదీస్తున్నట్టుగా అడిగింది.
"అది నీకు అనవసరం....."
"అనే నేను కూడా ఇన్నాళ్ళూ ఉపేక్షించాను."
"కాదు..... నన్ను అడగ్గలిగే అర్హతను పోగొట్టుకున్నావు...... అసలు నిన్ను నేను ఎందుకు గౌరవించాలి? భార్యగా నువ్వు నాకు ఏమిచ్చావు.....? డబ్బులో పెరిగిన అహంకారం తప్ప అనురాగం అంటే నీకేం తెలుసని......?"
దూకుడుగా బయటకు వెళ్ళిపోయాడు కిరీటి.....
తల తీసేసినట్టయింది శిల్పకు.
ఉబికివస్తున్న కన్నీటిని ఆపటం చేతకాక బావురుమంటూ కుప్పలా కూలిపోయింది.
చెప్పాచెయ్యకుండా హఠాత్తుగా వచ్చిన శిల్పను చూసి ఆశ్చర్యపోయారు రంగనాధంగారు.
అలా అర్థాంతరంగా రావటానికి కారణం కనుక్కోవాలని మనసులో వున్నా అడిగే ధైర్యం లేకపోయింది.
ఆ మధ్య రెండుసార్లు కూతురి సంసారం చూద్దామని చుట్టం చూపుగా వెళ్ళి అక్కడి పరిస్థితుల్ని చూచాయగా అర్థం చేసుకోవడమే కాకుండా భర్తదగ్గర కాస్త ఒద్దిగ్గా ఉండాలమ్మా' అని నచ్చచెప్పబోతూ శిల్ప అన్న చీదరింపు మాటలింకా ఆయన మరిచిపోలేదు.
"ఒక వ్యసనానికి నన్ను కన్నారు....... మరెన్నో దుర్వ్యసనాలకు అప్పులపాలై మిమ్మల్ని కాపాడుకోడానికి నా బ్రతుకును బలిచేశారు" అంది మనసు మొద్దుబారిపోయేట్టు.
12)
శిల్ప అన్న మాటలు ఇంకా అతని మస్తిష్కంలో ప్రతి ధ్వనిస్తూనే వున్నాయి.
అందుకే ఏదో రాద్ధాంతం జరిగి ఉంటుందని అనిపించినా గుట్టుచప్పుడు కాకుండా ఉండిపోయారు.
అంతేకాకుండా శిల్పకు భయపడి హైద్రాబాద్ రేసులకు బయలుదేరాల్సిన ఆరోజు ప్రోగ్రాంకూడా విరమించుకున్నారు.
శిల్ప ఉన్నన్నాళ్ళు అలవాటుగా ప్రతి సాయంకాలం వెళ్ళే అనకాపల్లి జార్జి క్లబ్బు ఛాయలక్కూడా పోగూడదనుకున్నారు.
వచ్చి వారం రోజులైనా శిల్ప వెళ్ళాలన్న ప్రయత్నం ఏమీ చేయకపోయేసరికి, అల్లుడినుండి కబురూ కాకరకాయ ఏమీ లేకపోయేసరికి రంగనాధంగారిలో అలజడి ఎక్కువైంది.
పోనీ ఫోన్ ద్వారా ఇద్దరూ మాట్లాడుకున్నా స్పర్థలేమీ లేవని సరిపెట్టుకునేవారు.
పగలంతా ఏదో ఆలోచిస్తూ ఫోను దగ్గరే కూర్చునే కూతురి ఆంతర్యమేమిటో ఆయనకు ఒక పట్టాన అర్థం కాలేదు.
శిల్ప అందరిలాంటి ఆడపిల్ల అయితే అన్నపూర్ణమ్మయినా జోక్యం చేసుకుని ఆరాతీసేది.....
కిరీటి స్వయంగా వచ్చి క్షమార్పణలు చెప్పుకుంటాడని కనీసం ఫోనైనా చేసి తిరిగి వచ్చేయమని ప్రాధేయపడతాడని ఎదురుచూసిన శిల్ప ఆశ నిరాశే అయింది. |
25,052 | అకుపచ్చాం ఎరుపు రంగుల్తో ట్రాఫిక్ లైట్లలా మెరుస్తున్న ఒక పురుగు వచ్చి లావణ్య భుజం మీద వాలింది. ఆ అమ్మాయి దాన్ని చూసుకోలేదు.
"మిస్ లావణ్యా! ఆకుపచ్చా, ఎరుపూ రంగుల్తో ఉండి, పదికాళ్ళతో పెద్ద పెద్ద రెక్కల్తో ఉండే పురుగుని ఏమంటారు?"
"ఏమో! నాకు తెలియదు. నేను జువాలజీ స్టుడెంటుని కాను. అయినా ఎందుకా విషయం ఇప్పుడు?"
"అబ్బే! ఏమి లేదు. అలాంటి పురుగోకటి మీ భుజం మీద హెలికాప్టర్ లా వాలింది"
"బాబోయ్!" అని పెద్దగా గావుకేక పెట్టేసింది లావణ్య. "తీసెయ్యండి! తీసెయ్యండి!"
శ్రీహర్ష నవ్వుతూ వేళ్ళతో ఆ పురుగుని కిందికి తోసేశాడు. సగం దాకా చచ్చిపోయిన దాన్లాగా కొందపడి అంతలో గుర్తొచ్చినట్లు రెక్కలు విదిల్చి ఎగిరెళ్ళి పోయింది ఆ పురుగు.
కోపంతో మింగేసేలా చూసింది లావణ్య శ్రీహర్షని.
"ఒక్క క్షణంలో దుకించేస్తాను మనుషులుంటే......" అని ఏదో చెప్పబోయాడు శ్రీహర్ష.
".......ఊ! మనుషులుంటే బరువుకి ముణుగుతుందా?" అంది లావణ్య జానెడు లోతున్న నీళ్ళను చూస్తూ.
జీపు రివర్సు చేసుకుని వెనక్కి వెళ్ళి మళ్ళీ స్పీడుగా వచ్చేసి వాగు దాటాలని చూశాడు శ్రీహర్ష. హాఠాత్తుగా కాలు బెణికినట్లు వాగు మధ్యలో ఆగింది జీపు.
"తోయ్యాలేమో" అంది లావణ్య నిరసనగా. తనకింకా శ్రీహర్ష మీద కాస్త కోపంగానే ఉంది.
"ప్లీజ్!" అన్నాడు శ్రీహర్ష.
అందరూ తొయ్యక తప్పలేదు.
లావణ్య ఆపసోపాలు పడుతూ తోస్తోంది.
"లావణ్యగారూ మరీ గట్టిగా తోసేస్తున్నారు. అలా చేస్తే ఆగకుండా పరిగెత్తి వెళ్ళిపోతుంది. మనం ఎక్కే సావకాశం కూడా ఉండదు."
"వెక్కిరించనక్కర్లేదు" అంది లావణ్య.
రెండు ఫర్లాంగులు తోసినా జీపు స్టార్టవలేదు.
"నాన్నా! ఈయన జీపులో లిప్టు ఇవ్వకపోతే హాయిగా దేముడా అని నెత్తిన చేతులు పెట్టుకుని నడిచి వెళ్ళి పోయిండేవాళ్ళం. ఈ తోసే శ్రమ ఉండేది కాదు" అంది లావణ్య తలపట్టుకుని కూర్చుండిపోతూ.
శ్రీహర్ష కూడా జీపు దిగి బోనేట్ ఎత్తి చూశాడు చాలాసేపు. తర్వాత పెట్రోలు టాంకు చూశాడు. అప్పుడు చెప్పాడు అసలు కారణం పెట్రోలు అయిపొయిందిట- పెట్రోలు టాంకు లికవుతుంది.
"మరి ఆ సంగతి ముందరే కనిపెట్టలేక పోయారూ! రెండు ఫర్లాంగులు పాటు తోయించారే మహా!" అని ఉడుకుమోత్తనంగా , "నన్నా ఈ జీపు మీద నా తల బద్దలు కొట్టేసుకుందామనిపిస్తోంది" అంది.
"ష్! ఏమిటా మాటలు? అతనేమన్నా అనుకుంటాడు." అన్నారు కుటుంబరావుగారు.
"ఐయాం సో సారీ!" అన్నాడు శ్రీహర్ష.
అరయిపోయింది. అడవిలో త్వరగా చీకటి పడుతుంది. కీచురాళ్ళ రోద ఎక్కువవుతోంది.
"ఇంకో మైలు నడిస్తే డాక్ బంగాళా ఉంది. రాత్రికి అక్కడ పడుకోవాల్సిందే. మరి చీకటి పడకముందే నడిచివెళ్ళి పోవాలి సార్" అన్నాడు డ్రైవరు.
"నా వాళ్ళ కాదు బాబోయ్! నేనడవలేను. ఇక్కడే పడుకుంటా" అంది లావణ్య. నాన్నగారి దగ్గర గారం పోతూ.
"ఏ నక్కలో, కుందేల్లో వచ్చి మీద పడ్డాయంటే భయపడిపోతావు" అన్నారు కుటుంబరావుగారు.
"ఆ భయమేం లేదు సార్! నక్కలు కుందేళ్ళు ఇక్కడ చాలా తక్కువ కట్లపాములు, ఎర్రతేళ్ళు మాత్రం ధారాళంగా ఉంటాయ్" అన్నాడు శ్రీహర్ష.
ఇందాక పురుగు వాలడంతోనే హడలిపోయి ఉన్న లావణ్య కెవ్వున అరవబోయినంత పనిచేసి, కాళ్ళ వైపు చూసుకుని, భయం తీరక ఒక్కొక్కో కాలూ ఎత్తి పాదాల కింద కూడా చూసుకుంది.
భయం తగ్గాక "మిమ్మల్ని......"అని పళ్ళు కోరుకుతున్నట్లు శ్రీహర్ష వైపు చూసింది.
ఒక మైలు నడిచి డాక్ బంగాళా చేరుకున్నారు. లావణ్య చకచక నడిచేది. శ్రీహర్ష సమానంగా నడిచాడు. అంత అందమైన అమ్మాయి పక్కన అడుగులో అడుగు నడవడమే మహాభాగ్యంలా ఉంది అతనికి. కుటుంబరావుగారు వెనకబడిపోయేవారు. అంతలోనే మళ్ళీ అయన కోసం ఆగిపోయేవాడు శ్రీహర్ష. ఇంకో యాబై గజాలు ముందుకి వెళ్ళిపోయిన లావణ్య శ్రీహర్ష పక్కన రాకపోవడం చూసి తనూ ఆగిపోయేది. డ్రైవర్ మరి వెనగ్గా ఏదో ఆలోచించుకుంటూ నడుచుకుంటూ వస్తున్నాడు. తనకోసం మాటిమాటికి శ్రీహర్ష ఆగిపోవడం కుటుంబరావుగారు గమనించారు. మనిషి మంచితనం చిన్నచిన్న విషయాల్లో బయట పడుతుంటుంది. జీవితపు పరుగు పందెంలో పక్కవాడి కోసం ఆగే అవకాశం ఎక్కడా?
అది చిన్న బంగాళా. చుట్టూ తోట. మూడు గదులూ , వాచ్ మాన్ ఆ ఇంట్లోనే అవుట్ హౌస్ లాంటి రూమ్ లో ఉంటుంటాడు. అతనికి పరిస్థితి వివరించాడు శ్రీహర్ష. నవ్వుతూ, ఓపిగ్గా వివరిస్తూ చెప్పే అతని ధోరణికి లొంగని వాళ్ళుండరు.
వాచ్ మెన్ ని బతిమాలితే అతనే పక్కనే ఉన్న చిన్న పల్లె నుంచి పళ్ళు, పాలు తెచ్చిచ్చాడు.
నడిచి నడిచి ఆకలిమీద ఉన్న లావణ్య ఆరు అరటిపళ్ళు, తిని రెండు గ్లాసుల పాలు తాగేసింది. |
25,053 |
మాస్టర్ స్థానంలోకి మరో వ్యక్తి రాబోతున్న విషయం కేవలం ఐదుగురికే తెలుసు. ఒకరు ప్రణవ- త్రిమూర్తులు ముగ్గురు- రింగ్ లీడర్ అలాంటప్పుడు మాస్టర్ మాస్టరేనా అనే అనుమానంగాని, మీమాంసగాని జోహ్రాకి వచ్చే అవకాశం లేదు. మాస్టర్ స్థానంలో ఉండేది ప్రణవయినా జోహ్రా మాస్టరే అనుకొని అసాసినేషన్ ఎటెంమ్ చేస్తాడు.
ముంచుకు రానున్న మృత్యువు గురించి ఈ నలుగురికి సూచాయగా తెలిసినా...
త్రిమూర్తుల మాటెలా ఉన్నా, ప్రణవ మాత్రం షరీఫ్ పార్టీ తరువాతే మాస్టర్ స్థానంలోకి వెళతానని పట్టుపట్టి ఉండేవాడు.
మాస్టర్ స్థానంలోకి వెళ్ళిన కొద్ది సమయంలోనే ప్రణవను మృత్యువు కబళిస్తుందని తెలిస్తే త్రిమూర్తులు సయితం ముహూర్తాన్ని ముందుకు జరిపేందుకు ప్రయత్నిస్తారు.
ఈ విషయం రింగ్ లీడర్ కైనా తెలుసా...?
అసలు రింగ్ లీడర్ ఎవరు?
త్రిమూర్తుల ద్వారా ప్రణవను ట్రాప్ చేసి డబుల్ డ్రామా ఆడిస్తున్నదెవరు...?
* * * * *
పద్దెనిమిదవ తారీకు అర్ధరాత్రి జీరో అవర్ తో పరిసమాప్తమయి పోయింది.
జూన్ 19 :
ప్రారంభమయింది సెకండ్ల ముల్లుతో....సరిగ్గా రాత్రి ఒంటిగంటకు...
త్రిమూర్తులు, ప్రణవ ఉంటున్న సీ ప్రిన్సెస్ హోటల్ రూమ్ లో వాతావరణం వేడివేడిగా ఉంది. జూన్ 19, జూన్ 20 తారీకుల్లో మాస్టర్ మూమెంట్స్ ఏమిటన్నది ఈ నలుగురికి ఇంకా తెలీదు. 20 సాయంత్రం షరీఫ్ పార్టీకి వెళతాడని మాత్రమే తెలుసు.
మాస్టర్ స్థానంలో ప్రణవను ప్రవేశపెట్టడం అన్న ప్రమాదకరమయిన పధకం విక్రోలి బంగ్లాలో జరిగే అవకాశం లేదు.
మాస్టర్ బయటకు వస్తే ఆ వీలుంటుంది.... ఎప్పుడు బయటకొస్తాడు ఎక్కడికి వెళ్లేందుకు వస్తాడు...
బ్రహ్మకి ఈ ఆలోచనలతో మెదడు వేడెక్కిపోయింది. ఓ ప్రక్క రింగ్ లీడర్ నుంచి ఫోన్ ఎక్స్ పెక్ట్ చేస్తూనే మరోప్రక్క ఆలోచిస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ షరీఫ్ పార్టీకి ముందే ఈ ఆపరేషన్ పూర్తయి పోవాలని మాత్రమే తనకు రింగ్ లీడర్ నుంచి ఆదేశాలు అందాయి.
క్షణాలు నిమిషాలవుతున్నాయి.
నిమిషాలు గంటలవుతుండగా...
సరిగ్గా రాత్రి 1.30కి ఆ గదిలోని ఫోన్ రింగయింది.
బ్రహ్మ శివంగిలా ఫోన్ కేసి దూకగా మిగతా ముగ్గురూ టెన్షన్ గా ఆటే చూసారు.
ఒణుకుతున్న చేతులతో ఫోన్ ని అందుకొని చెవికి ఆనించుకున్నాడు బ్రహ్మ.
"హలో... బ్రహ్మ స్పీకింగ్" అన్నాడు వినయంగా బ్రహ్మ.
"...."
"చెప్పండి సార్- నోట్ చేసుకుంటాను."
"..."
"అలాగే.... ఆర్యూ ష్యూర్ సార్?"
"...."
"ఓకేసార్.... రిస్క్ అని మా అందరికి తెలుసు సార్. సిద్దపడే వున్నాం సార్..."
"నో సార్.... ఎక్కడా, ఎప్పుడు పొరపాటు రాదు. రానివ్వం సార్."
"..."
"ఓకేసార్... అలాగే ఉంటాను మరి" బ్రహ్మ ఫోన్ పెట్టేసి మిగతా ముగ్గురికేసి చూసాడు.
బ్రహ్మ మొఖం పెద్ద చిక్కుముడి విడిపోయినట్లు తేటగా వుంది.
వాళ్ళు ఏం జరిగిందని, రింగ్ లీడర్ ఏం చెప్పారని అడిగేలోపు బ్రహ్మ చెప్పటం ప్రారంభించాడు.
* * * * *
మిల్లర్ నిశ్శబ్దం కన్నా గంభీరంగా ఉన్నాడు.
మెల్లగా పర్షివాన్ కార్పెట్ పై పచార్లు చేస్తున్నాడు.
రూమ్ లో ఓ మూలగా ఎయిర్ ఇండియా మహారాజులా వినయంగా నించుని ఉన్నాడు ఎఫ్.
కొద్దిక్షణాల నిశ్శబ్దం తరువాత...
"నా స్థాయికి పెద్ద కోరికే కాని మాస్టర్ ని తీసుకు వస్తానని గొప్పగా చెప్పుకున్నాను. అఫ్ కోర్స్ మీకిష్టమయితేనే... జస్ట్ టీ కోసమే.... అరగంట మాత్రమే" నసుగుతున్నట్లుగా అన్నాడు ఎఫ్.
"వివరాలు చెప్పు" గంభీరంగా అన్నాడు మిల్లర్.
"సాయంత్రం ఐదున్నర గంటలకు మీరు మాస్టర్ ని పంపించటానికి అంగీకరిస్తే విక్రోలి నుంచి ఆ ప్రాంతానికి వెళ్ళటానికి నలభై ఐదు నిముషాలు పడుతుంది. మలబార్ హిల్స్ కి దగ్గర్లో కమలా నెహ్రూ పార్క్ వుంది. రోడ్డుకు ఆ వేపున హేంగింగ్ గార్డెన్స్ ఉన్నాయి. అవి దాటి కొంచెం ముందుకి వెళితే కుడివేపున లిటిల్ గిబ్స్ రోడ్ వుంది. ఆ రోడ్ లోనే మా ఫ్రెండ్ ఇల్లు వుంది. అక్కడ జస్ట్ అరగంట ఉంటే చాలు. వాళ్ళు మాస్టర్ ని చూడగలిగామని చాలా ఆనందిస్తారు. జస్ట్ బిస్కట్స్, టీ అంతే మీకు చెప్పకుండా, మీ అంగీకారం లేకుండా మాస్టర్ ని తీసుకు వస్తానని మా ఫ్రెండ్ వాళ్ళ కుటుంబానికి మాటివ్వడం తప్పే కాని నేనింత వరకు మిమ్మల్ని ఏమీ అడగలేదు. అందుకని..." ఆపిన మాటల్ని మ్రింగేసాడు ఎఫ్.
"ఇంకెప్పుడూ నా అంగీకారం తీసుకోకుండా ఇలాంటి ప్రోగ్రామ్స్ ని ఫిక్స్ చేయకు. నువ్వే కాదు కమెండోస్ లో మరెవరూ ఇలా చేయకూడదు. ఆ ఇంటి అడ్రస్, నీ ఫ్రెండ్ వివరాలు నా సెక్రటరీకి అందించు. ముందుగా వాళ్ళు వెళ్ళి చెకప్ చేసుకొని వస్తారు" అన్నాడు మిల్లర్ అయిష్టంగానే ఒప్పుకుంటూ.
మరుసటి రోజు షరీఫ్ పార్టీ వుంది. కొద్దిరోజుల క్రితమే పోలీసులు మిల్లర్ శక్తిసామర్ధ్యాల్ని శంకించారు. |
25,054 | ఇద్దరూ గుడి వెనుకున్న తోటలోకి ప్రవేశించారు.
అప్పటి ప్రొద్దుగ్రుంకింది. కానీ పున్నమి ముందు రోజులు కాబట్టి మరీ చీకటి కాలేదు.
అయిదారు గన్నేరు చెట్లు, ఓ పారిజాతం, ఓ పంచముఖి మందారం, మధ్యాహ్నం మల్లెలూ, తులసిమొక్కలూ వున్నాయి.
వెళ్ళి గుబురుగా వున్న తులసి మొక్కల ప్రక్కన కూర్చున్నారు. అక్కడ కాస్త మెట్టులాగా చూసుకొని. ఎవరైనా తోటలోకి వచ్చినా బాగా దగ్గరగా వస్తే తప్ప వాళ్లెవరికీ కనిపించరు.
"లవర్స్ కి ఇంత చక్కని ఏకాంత స్థలముందని తెలియదు నాకు" అన్నాడు అమర్.
"కొత్త వాళ్ళకి తెలియడం కష్టమే. చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ తో కలిసి ఈ తోటలో ఆడుకొనేవాళ్ళం. కోతికొమ్మచ్చి ఆటలు, వెన్నెల కుప్ప ఆటలూ_"
"ఇప్పుడు ప్రేమ సయ్యాటలూ."
అతని చిలిపి మాటకు పులకించినట్టుగా నవ్వింది జీవిత. "నేనంటే మీకిష్టమేనా?" ఆమె స్వరంలో ఎప్పుడూ లేని మాధుర్యం.
"అందమైన పువ్వన్నా, అందమైన అమ్మాయి అన్నా ఇష్టపడని వాళ్ళెవరు చెప్పు?"
"ఊరికే ఇష్టపడడమేనా? నేనంటే ప్రేమ లేదా?" బుంగమూతి పెట్టి అడిగింది.
"పిచ్చిపిల్లవి! ప్రేమించకపోతే ఇక్కడికి రమ్మని ఎందుకు చెబుతాను? కానీ మనం ఇంత దూరం వచ్చాక నువ్వు నన్ను 'సార్' అనడం బాగా లేదు. అమర్ అని పిలువు. నీ పిలుపుతో ఆ పిలుపుకే అందం వస్తుంది."
"అదిగో! సూటిగా సమాధానం చెప్పడంలేదు."
"ప్రేమిస్తున్నానని నా నోటితో వినాలని వుంటే చెప్పు! భూమి, ఆకాశం వినేలా గొంతు చించుకుని మరీ చెబుతాను! నేను నిన్ను ప్రేమిస్తున్నానని!"
మనసు పారేసుకున్న అమ్మాయికి ప్రియుడినుండి అలాంటి మాట వినడంకంటే అమృతతుల్యమైన మాట ఇంకేం వుంటుంది?
"నన్ను పెళ్ళి చేసుకుంటారా సార్?"
అమర్ తల పట్టుకున్నాడు. "అప్పుడే పెళ్ళి దగ్గరికి వాచ్చేశావా? మీ ఆడవాళ్ళకి పెళ్ళి తప్ప ఇంకే ధ్యాస వుండదా?" కొంచెం సీరియస్ గానే అన్నాడు.
"ప్రేమించానన్నారు! పెళ్ళి చేసుకుంటారా అని అడిగితే కోప్పడతారెందుకు? నేనంటే ప్రేమునప్పుడు పెళ్ళెందుకు చేసుకోరు?" ఉక్రోషంగా అడిగింది.
"నీకు కావలసింది పెళ్ళే అయితే గాంధర్వ వివాహానికైతే నా కేమీ అభ్యంతరం లేదు!"
"గాంధర్వ వివాహం అంటే?"
"శకుంతలా దుష్యంతుల కథ వినలేదా?"
"ఎందుకు వినలేదు? పొదలచాటున చెయ్యి పట్టుకుని ఇదే పెళ్ళంటే ఒప్పుకొనేంత వెర్రిదాన్ని ఏం కాదులెండి! మీరు నన్ను ప్రేమించడమే నిజమైతే అందరికీ చెప్పి చేసుకోవాలి! మీరు నన్ను చేసుకుంటానని మాటిస్తే ఇంట్లో వాళ్ళకి చెప్పి ఒప్పిస్తాను. వాళ్ళు ఒప్పుకోకపోతే నేను బయటికి వచ్చేసి మిమ్మల్ని పెళ్ళాడతతాను. ముచ్చటైన కాపురం, ముత్యాల్లాంటి పిల్లలు....నాకెన్నో అందమైన కలలున్నాయి, అమర్!" అంటూ అతడి ఒళ్ళో తల పెట్టుకుంది.
"ఒకవేళ నేను పెళ్ళి చేసుకోకపోతే?"
"మీరు పెళ్ళి చేసుకోకపోతే ఇంకెవరినీ చేసుకోను! మిమ్మల్నే ఆరాధిస్తూ కన్నెగా మిగిలిపోతాను, అమర్!" విషాదంగా అంది. అప్పటికే ఆమె కళ్ళలోకి నీళ్ళొచ్చేశాయి.
"పిచ్చీ! అప్పుడే పెళ్ళి తొందరా? ఒకరినొకరం తెలుసుకోలేదు. నేనెవరో ఏమిటో తెలుసుకోలేదు. నువ్వెవరో నాకూ అంతే!"
"నన్ను మీరు ఏడాది పైగా చూస్తున్నారు. మీరు నా ఊహల్లో ఏడాది పైగా కాపురం చేస్తున్నారు. మీరు ఏ కులమైనా సరే. మీరే నా భర్త. ఇంకెవరినీ నా భర్తగా ఊహించుకోలేను."
"అలాగేలే! ఆ విషయాలు మరోసారి మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి లే! రాత్రి చాలా అయితే మీ ఇంట్లో అనుమానం కలగవచ్చు! ఇంకా మనం మాట్లాడుకోడానికి మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉంటాంగా?" అన్నాడు ఆమెను తననుండి దూరం జరిపి లేస్తూ.
మేఘాలు తొలగిన చంద్రుడు వెన్నెల కురిపిస్తున్నాడు. వెన్నెల్లో తడిసిన చెట్లు ఇనుమడించిన సౌందర్యంతో కనిపిస్తున్నాయి. దానికి తోడు సుమ సౌరభాలు! ప్రేమకులకెంతో రమణీయ ప్రదేశం! |
25,055 |
అసహనంగా రోడ్డంట చూశాడు నరేష్. చచ్చిపోయిన నల్లత్రాచుపాములా రోడ్డు కనిపిస్తోంది. టైమ్ ఎంతైందో తెలుసుకోవాలని పక్కకు చూశాడు. ఇందాకట్నుంచి టైమ్ చెప్పిన వ్యక్తి తనను తప్పించుకోవాలనే దూరంగా వెళ్లి నిలబడి వుండడంతో ఆ ప్రయత్నం మానుకున్నాడు. మొదటి జీతం రాగానే గడియారం కొనుక్కోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. వాచ్ కట్టుకున్న వాళ్ళని చూస్తే అతనికి ఈర్ష్య. ఎంచక్కా కాలాన్ని అలా ముంచేతి మీద కట్టేసుకోవడం థ్రిల్లింగ్ గా వుంటుందనుకున్నాడు. అంతలో ఓ అమ్మాయి అవతలి నుంచి రోడ్డు దాటి బస్టాప్ లోకి వచ్చింది. అక్కడున్న మగపురుషుల చూపులన్నీ ఓ క్షణంపాటు ఆమె మీద ప్రాకి చెదిరాయి. అయితే ఆమెనుంచి చూపు మరల్చంది ఒక్క నరేషే. అమ్మాయిల్ని పరిశీలించి చూడడం అతనికి ఇష్టం. అమ్మాయిల్నే కాదు స్త్రీ కనిపిస్తేనే అతను చూపు మరల్చుకోలేడు. వాళ్ళ లావణ్యం, వాళ్ళ సోయగం, వాళ్ళ ఒంటి అమరిక, వాళ్ళ అవయవాల్లోంచి తొంగిచూసే సౌందర్యం ఇవన్నీ అతనికి ఎంతో మత్తునిస్తాయి. పక్కన రంభలాంటి భార్య నడుస్తున్నా ఎదురుపడ్డ అనాకారినైనా ఓ క్షణంపాటు చూడాలనుకోవడం మగబుద్ధి. ఆ బుద్ధి కాస్తంత ఎక్కువయింది నరేష్ కి. ఎంత అనాకారి అయినా ఎక్కడో ఒక దగ్గర ఆమె అందం నిక్షిప్తమై వుంటుందనేది అతని ఫిలాసఫీ. అందుకే ఎదురుపడ్డ ఆడదాన్ని ఏ మగాడయినా ఓ క్షణంపాటు చూస్తే నరేష్ రెండు క్షణాలు చూస్తాడు. అది బలహీనతే అనుకుంటే ఆ బలహీనతపాళ్ళు ఎక్కువ అతనికి. ఆ ఒక్క వీక్ నెస్ తప్ప అతనికి మరో బలహీనత లేదు. ఆ బలహీనతే అతన్ని ముందు ముందు చాలా కష్టాల్లో పడేసింది. బస్టాప్ లోకి వచ్చిన ఆ అమ్మాయి నరేష్ ముందు నిలుచుంది. "అంతా బావుంది ఆ ముక్కుపుడక తప్ప" అనుకున్నాడు నరేష్ ఆమెను నిశితంగా పరిశీలించాక. చుడీదార్ వేసుకుంది గనుక స్టయిల్ గా వుంది. అయితే ఆ ముక్కుపుడక వల్ల ఏదో పాతదనం కనిపిస్తోంది. అతి తీసేస్తే ఇంకా అందంగా వుంటుందనుకున్నాడు. తనకు ఆవేళ ఇంటర్వ్యూ అనీ, ఖచ్చితంగా పదిగంటలకల్లా స్మిత ఎక్స్ పోర్టింగ్ కంపెనీలో వుండాలన్న విషయం కూడా తాత్కాలికంగా మరిచి ఆమె అందాన్ని వీక్షించడంలో మునిగిపోయాడు. అంతలో హార్న్ మ్రోగించుకుంటూ వచ్చి ఆగిన బస్సు అతని కళ్ళల్లో పడడంతో ఇంటర్వ్యూ గుర్తుకొచ్చి జనంలో కలిసిపోయాడు. బస్సు అంత రష్ గా లేదు. నింపాదిగా ఎక్కి ఖాళీగావున్న సీట్లో కూర్చున్నాడు. దాదాపు పదిమంది ఎక్కారు. ఎక్కిన వాళ్ళవేపు విసుగ్గా చూసి టికెట్లు చించడం ప్రారంభించాడు కండక్టర్. ప్యాసెంజర్లను చూస్తూనే ఒంటికి కారం రాసుకున్నట్టు ఇబ్బంది పడిపోయే ఆ కండక్టర్ ను చూసి చిరునవ్వు నవ్వాడు నరేష్. విసుగ్గా చూస్తూ టికెట్లు కోస్తున్న కండక్టర్ కాసేపయ్యాక నరేష్ దగ్గరికి వచ్చాడు. "టికెట్." "గాంధీబజార్" రూపాయి బిళ్ళను చేతిలో పెట్టాడు నరేష్. "ఇంకా పదిపైసలివ్వు" మరింత విసుగ్గా అడిగాడు కండక్టర్. ఆ మాట వినగానే పై ప్రాణాలు పైనే పోయాయి నరేష్ కి. "టికెట్ రూపాయే కదా" బలహీనంగా అన్నాడు. "ఈరోజు నుంచి మినమమ్ టికెట్ రూపాయి పదిపైసలు చేశారు. ముందు పదిపైసలివ్వండి." "నిన్నటివరకూ రూపాయే కదా మినమమ్ టికెట్టు ధర." "అది నిన్నటి సంగతి. ఈరోజు సంగతి ఇది." "నా దగ్గరున్నది అంతే" ఎవరికీ వినపడకూడదని చిన్నగా చెప్పాడు నరేష్. మరో మాటకు అవకాశం ఇవ్వకుండా పైనున్న దారం లాగాడు కండక్టర్. బస్సు ఠక్కున ఆగింది. "రేపు ఇదే రూట్ లో వస్తారు కదా అప్పుడిస్తాను. ప్లీజ్ టికెట్ ఇవ్వండి" దీనంగా ముఖం పెట్టాడు అతను. "లాభం లేదు సార్. ముందు దిగండి." అతని పైకిలేస్తూ మరోమారు అర్థిస్తున్నట్టు చూశాడు. "ముందు దిగండి" అని కాస్తంత గట్టిగా కసిరాడు కండక్టర్. మరో నిముషం అలానే నిలబడి వుంటే పరువు పోతుందని అక్కడ్నుంచి కదిలాడు అతను. వెనక సీట్లో కూర్చున్న ఓ అమ్మాయిని నిశితంగా చూస్తూ కిందకు దిగాడు. బస్సు వెళ్ళిపోయింది. నిస్తేజంగా అలా నిలబడిపోయాడు. ఎడారిలో నడుస్తూ దాహంతో ఆగిపోయిన మనిషిలా అయిపోయాడు. ఇక టైమ్ లో ఇంటర్వ్యూకి హాజరు కాలేనేమోనన్న భయం ప్రారంభమైంది. ఆ ప్రాంతంలో బస్టాప్ లేదు. బస్టాప్ కి వెళ్ళాలంటే పైకైనా, కిందకైనా రెండు ఫర్లాంగులు నడవాలి. సరిగ్గా అలాంటి సమయాల్లోనే అతనికి తనంటే అసహ్యమేస్తుంది. తన జీవితంపట్ల కసి పెరుగుతుంది. తన నిస్సహాయతకు బాధేస్తుంది. తను బాల్యం నుంచి అనాధగా పెరిగిన విషయం గుర్తుకొస్తుంది. తన పేదరికం కంబళి పురుగులా అతి జుగుప్సాకరంగా కనిపిస్తుంది. ఆ ఇబ్బంది నుంచి బయటపడితే మళ్ళీ మామూలుగా అయిపోతాడు. చలాకీగా వుంటాడు. ప్రపంచంలోని అందాలన్నింటినీ అప్పుడే చూస్తున్నట్లు అద్భుతంగా ఫీలవుతాడు. ప్రతి అనుభవంలోనూ ఆనందాన్ని జుర్రుకుంటాడు. అయితే ప్రస్తుతం మాత్రం అతను మానసికంగా కుంగిపోతున్నాడు. క్షణాలు గడుస్తున్నకొద్దీ టెన్షన్ ఎక్కువైపోతోంది. అప్పుడప్పుడూ ఆటోలు దొర్లుకుంటూ పోతున్నాయి అయిదు రూపాయలుంటే ఆటోలో వెళ్ళుండవచ్చని మదనపడిపోయాడు. మరొక్క పదిపైసలుంటే హాయిగా బస్సులోనే వెళ్ళుండవచ్చన్న ఆలోచన రాలేదతనికి. స్కూటరో, కారో ఎవరైనా దయతలచి నిలిపితే తప్ప తన ఇంటర్వ్యూకి వెళ్ళలేడనిపించి చేయి అడ్డం పెట్టడం మొదలెట్టాడు. ఎవరూ ఆపడం లేదు. |
25,056 | తిరిగి అతను నామీద చేయి వేశాడు. ఇంతకు ముందున్నంత వ్యతిరేకత నాలో కలగలేదు.
క్షమించేశానా? ఏమో నాకు తెలియదు.
నేను విసిరికొట్టకపోయేసరికి- అతను కొంత ధైర్యం పుంజుకున్నాడు.
భుజం మీద వేసిన చేత్తోనే నొక్కాడు.
నా చిన్నతనంలో దేవుళ్ళ సినిమాలు చాలానే చూశాను. పాల సముద్రంలో పడుకున్న విష్ణువును చూపిస్తూ అంతకుముందు గుడిద్వారాల్లా వుండేవి వాతంటవే తెరుచుకునేవి. ఇప్పుడు గుండె తలుపులు కూడా అంతే నిశ్శబ్దంతో ఎవరి ప్రమేయం లేకుండా తెరుచుకున్నట్టు అనిపించింది.
ఈసారి మరింత గట్టిగా నొక్కాడు. శరీరం అతని స్పర్శకు అనుగుణంగా ట్యూన్ కావడం ప్రారంభమైంది. అతను నన్ను తనవైపుకు తిప్పుకున్నాడు.
ఎలా జరగాల్సి శోభనం ఎలా జరుగుతున్నది?
పోనీ ఇప్పటికైనా జరుగుతోంది. అదే చాలు- సరిపెట్టుకోమని మనసు చెబుతోంది.
నా కళ్ళల్లోకి అతను తన చూపును కాదు కోరికను తోసినట్టు చూస్తున్నాడు.
నాలో రక్తం కదలడం ప్రారంభించింది.
అతను కాస్తంత ముందుకు వంగి నా పెదవులమీద పెదవులను తోశాడు. చిత్రం పనసపండు వాసన నన్నావరించినట్టు ఫీలయ్యాను. ఎప్పుడో చాలాకాలం క్రితం అనుభవించిన ఆ తీపి ముద్దు ఇప్పుడు మనసు పొర్లలోంచి బయటపడ్డట్టు తోచింది.
అతను పెదవుల్ని వదలకుండానే చేతుల్తో ముఖాన్నంతా తడిమాడు ఆ తరువాత మెల్లగా భుజాలమీదకు తెచ్చి, ఆ తర్వాత మరింత కిందకి దిగాడు.
నా ఒక్కదానిలోనే వెన్నెలంతా విరిసినట్టు ఒళ్ళు జలదరించింది. అతని చేతులు బ్లౌజును తడుముతున్నాయి ఆ తడుములాట ఎందుకో నాకు తెలుసు. నాకు అనుభవం వుందిగా.
చివరికి అతనికి బ్లౌజ్ హుక్ లు తగిలాయి.
వాటితో అతను కుస్తీపడడం బావుంది. సరిగ్గా తగిలీ తగలని అతని చేతుల స్పర్శకు నా ఎద పొంగింది. అప్పుడు నేనే మొత్తంగా ఓ పులకరింతల చెట్టయి, జలదరింపుల పూలను పూయిస్తున్నట్టు అయిపోయాను. ప్రాణవాయువు ప్రాణవాయువులా లేదు. అతన్నుంచి వీస్తున్న గాలి కూడా వేడిగా తగుల్తూ నాలో కోరికను రెచ్చగొడుతోంది. అతను సక్సెస్ అయ్యాడు.
ఈసారి అతనివైపు చూడలేక అతని ఛాతిమీద ముఖం వాల్చేశాను. మల్లెపూల చెట్టు తనమీదకు వాలిపోయినట్టు అతను మత్తుగా ఫీలయ్యాడు.
మరో క్షణంలో నన్ను అతను ఖాళీ లెడ్జర్ బుక్ లా చేశాడు. అందులో ఏం రాసుకుంటాడో అతనిష్టం.
పైన వేలాడుతోంది జీరో క్యాండిల్సే అయినా నీ ఒళ్ళు మాత్రం వేయి క్యాండిల్స్ ను లోపల దాచుకున్నట్టు వెలిగిపోతోంది" అతను మెచ్చుకుంటూ అని అరక్షణం సేపుకూడా భరించలేనట్టు నా నగ్నదేహాన్ని గట్టిగా కౌగలించుకున్నాడు.
ఎముకలు విరిగిపోతాయేమోనన్నంత గట్టిగా వుంది పట్టు. అతను నన్ను ఆక్రమించుకున్నాడు.
నేను ఆ మాధుర్యాన్నంతా అనుభవించడానికి కళ్ళు మూసుకున్నాను టైమ్ ఎంతయిందో తెలియదు. అతను నన్ను వదిలేటప్పటికి కోరికతో గట్టిపడిన శరీరం మాధుర్యం కింద ఒదిరిపోయినట్టు తోచింది నాకు.
'సులోచన బాగానే తయారు చేసిందే' అన్నాను. ముఖాన్ని జిడ్డుగా తేలుస్తున్న చెమటను తుడుచుకుంటూ.
అలా అతను మరో నాలుగు నెలలపాటు ప్రతి శనివారం వచ్చి సోమవారం వెళ్ళిపోయేవాడు.
అయినా ఆ రెండు రోజులు తప్ప మిగిలిన రోజుల్లో అక్కడ ఉండడం నరకంగా అనిపించేది. నా భర్త, నా సంసారం కాకుండా నేను వుంచుకున్న దానిలా పడివుండడం భరించలేకపోయాను.
ఏం చేయాలా అన్న ఆలోచనలో పడ్డాను. "ఆలోచన ఒక కొలిక్కి రాలేదుగానీ నేను నెల తప్పాను." అని ఆ రోజుకు చాలన్నట్టు అక్కడికి ఆపింది శతరూప.
* * * *
మరుసటి రోజు రాత్రి భోజనాలు చేశాక తన కథ చెప్పడం ప్రారంభించింది శతరూప.
"కొన్ని రోజులు గడిచాక నా భర్త వచ్చే ఆ రెంజు రోజులూ రావడం మానేశాడు. మరి నేను గర్భవతి కావడం వల్ల దాంపత్య సుఖం దొరకదని మానేశాడో, లేక సులోచన అంతవరకే పర్మిషన్ ఇచ్చిందేమో తెలియదు. |
25,057 |
స్త్రీలకు ఏ మాత్రం రక్షణ లేని ఈ సమాజంలో ఒక స్త్రీ నెగ్గుకు రావాలంటే అలాగే చేయాలేమో...? అంత స్థయిర్యాన్ని, ధైర్యాన్ని ప్రదర్శించిన ఆ అమ్మాయికి ఏ ట్రైనింగ్ వుంది? ఏ శిక్షణలో ఆమె రాటు దేలింది? అదేమీ లేదు. మరి? ఎందుకో సిద్ధార్ధకు తెలీకుండానే నిశాంత అతని ఆలోచనల్లో చోటు చేసుకుంది. సరిగ్గా దాన్నే ఆశించి, అంత గొడవ చేసింది నిశాంత. అతని దృష్టిలో పడాలనే అంత హంగామా కావాలని క్రియేట్ చేసింది.
* * * *
ముస్సోరీలోని హోటల్ రోనోక్, స్పెషల్ సూట్లో సోఫామీద కూర్చుంది నిశాంత. ఎదురుగా నుంచున్నాడు స్వరూప్. "వారం రోజులపాటు మీరీ స్పెషల్ సూట్లో వుంటారు మేడమ్! తర్వాత కుర్లీ ఏరియాలో, సెపరేట్ బంగళాను ఏర్పాటు చేస్తున్నాం కద్దుఖ్ లో బాస ఆర్డర్స్ మేరకు, ఒక రెస్టారెంటును కొనడం జరిగింది ఆ రెస్టారెంటు పేరు... నిశాంత రెస్టారెంటు." "నిశాంత రెస్టారెంటా...?" ఆశ్చర్యంతో కనుబొమలెగరేసింది నిశాంత. "ఈ పథకంలో ఎప్పుడు, ఎక్కడ, ఏం చేయాలో నేను చెప్పను నీకేం చెయ్యాలో, నీకు తెలియకుండానే అన్నీ జరిగిపోతాయి. నువ్వేం చెయ్యాలో నిర్ణయించుకోవాల్సింది నువ్వే" దేశ్ ముఖ్ మాటలు గుర్తుకొచ్చాయి ఆమెకు. దేశ్ ముఖ్ పర్ ఫెక్టు ఫ్లానింగ్ ని మనసులోనే మెచ్చుకుంది నిశాంత. "సాయంత్రం సరిగ్గా నాలుగు గంటలకు మీ కోసం వ్యాన్ వస్తుంది మేడమ్" మరమనిషిలా చెప్పేసి, వెనక్కి తిరిగాడు స్వరూప్. "మిస్టర్ స్వరూప్! ముస్సోరీలో యంగ్ ప్యాలెస్ మీకు తెలుసా?" "సారీ మేడమ్! తెలీదు" ముందుకు అడుగేసినవాడల్లా ఒక్కసారి వెనక్కి తలతిప్పి, ఆమె ముఖంలోకి చూస్తూ చెప్పాడు స్వరూప్. "మీరు రెస్టారెంటులో పనిచేస్తుంటారా?" మళ్ళీ అడిగింది నిశాంత. "నాకొచ్చిన ఇన్ స్ట్రక్షన్స్ ప్రకారం, మిమ్మల్ని ముస్సోరీలో రిసీవ్ చేసుకోవడం మీకు వసతి సౌకర్యం చూడడం, రెస్టారెంటును మీకప్పగించడం అదే నా రెస్పాన్స్ బిలిటీ..." "తర్వాత మీరెక్కడుంటారు?" "సారీ మేడమ్! చెప్పకూడదు" టక్కున చెప్పేసి ఆ రూమ్ లోంచి బయటకెళ్ళిపోయాడు స్వరూప్. దేశ్ ముఖ్ సిస్టమేటిక్ ప్లానింగ్ కి, స్వరూప ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. స్వరూప్ గా తనను తాను పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి అసలు పేరు స్వరూప్ కాదు. ఆ విషయం నిశాంతకు తెలీదు. సరిగ్గా మధ్యాహ్నం నాలుగు గంటలు. హోటల్ సూట్లోంచి బయటకొచ్చి మారుతీ వ్యాన్ ఎక్కింది నిశాంత. కుల్రీబజార్ దగ్గర బయలుదేరిన వ్యాను, తేహ్రీ బస్టాండ్ దగ్గర మలుపు తిరిగి సువాఖోలీ ఏరియాలో వెళుతోంది. కొత్త ప్రాంతం, కొత్త పరిసరాలు, కొత్త మనుషులు, తన పరిస్థితి తనకే విచిత్రంగా వుంది నిశాంతకు. అకస్మాత్తుగా సిద్దార్ధ జ్ఞాపకానికొచ్చాడు. అతని ముఖం కళ్ళముందు కదలాడింది. జైలులాంటి ప్రదేశంలో, పెంచబడుతున్న అతను, అమాయకంగా బఫూన్ లా వుంటాడనుకుంది. అందుకు విరుద్ధంగా వున్నాడతను. ముఖంలో చురుకుదనం, కళ్ళల్లో వాడిదనం, పెదిమల మెరుపుదనం, నల్లటి మీసకట్టు, విశాలమైన నుదురు. వాంటెడ్ గానే తను లిఫ్ట్ అడిగింది. అతని మనస్తత్వాన్ని తెలుసుకోడానికి. నిశాంత వేసిన మొదటి ఎత్తుగడ అది. అతని కళ్ళు, తనని చూడగానే మెరిశాయి. అంటే, అతనిని తను ఆకర్షించిందా? టాక్సీ డ్రైవర్ తో, ఆ జంక్షన్ లో అంత తగువు పడినట్టుగా, డ్రామాను క్రియేట్ చేసింది. అతన్ని అక్కడ అయిదు నిమిషాలసేపు ఆపడానికే... పూర్ టాక్సీ డ్రైవర్ అదంతా నిజమేననుకున్నాడు. తనలో తను నవ్వుకుంది నిశాంత. అతను, తనకి కారులో లిఫ్టు యిచ్చి వుంటే, ఈపాటికి అతను తన రూమ్ లో వుండేవాడు. చాలా కాన్ఫిడెంట్ గా అనుకుంది. చేతి వాచీవైపు చూసుకుంది నిశాంత. సరిగ్గా నాలుగు పదిహేను నిమిషాలైంది. మారుతీ వ్యాన్, ఖద్దుకల్ ఏరియాలో, మెయిన్ రోడ్ మీద పరుగెడుతోంది.
* * * *
సరిగ్గా అదే సమయంలో- ఢిల్లీ రైల్వేస్టేషన్ సమీపంలో వున్న ఓ ఎస్.టి.డి. బూత్ దగ్గర టాక్సీ ఆగింది. ఆ టాక్సీ నిశాంతను ముస్సోరీలో డ్రాప్ చేసి వచ్చిన టాక్సీ. ఆ టాక్సీలోంచి దిగాడు డ్రైవర్. ఎస్.టి.డి. బూత్ లోకి ప్రవేశించి, టెలిఫోన్ రిసీవర్ అందుకుని, బొంబాయికి ఫోన్ చేశాడు. రెండు క్షణాల్లో దేశ్ ముఖ్ లైన్లోకొచ్చాడు. "గుడ్ ఈవెనింగ్ సర్..." అని జరిగిందంతా చెప్పాడు డ్రైవర్ రమేష్.
* * * *
అప్పటికి అరగంట గడిచింది. తారు రోడ్ మీంచి మారుతీ వ్యాన్ మట్టిరోడ్డు మీదకొచ్చింది. ముస్సోరీకి నలభై అయిదు కిలోమీటర్ల దూరంలో, వెయ్యి అడుగుల ఎత్తులో వున్న కొండమీద వుంది శూర్ కండా దేవి దేవాలయం. ఆ ప్రాంతాన్ని ఖద్దుకల్ ప్రాంతం అంటారు. ఆ దేవాలయానికి వెళ్ళాలంటే మూడు కిలోమీటర్లు నడిచివెళ్ళాలి. ముస్సోరీలో అతి ఎత్తయిన ఆ కొండ మీద దేవాలయ ప్రాంగణంలోనుంచుంటే, రెండువందల మైళ్ళ పొడవున్న హిమాలయాల సౌందర్యం అద్భుతంగా కన్పిస్తుంది. ఎండలోనూ, వెన్నెల్లోనూ, వెండి వడ్డాణంలా మెరిసే హిమాలయాల్ని చూడడానికి, ప్రత్యేకంగా ఆ కొండెక్కుతారు. అదే కాకుండా అక్కడ శివుని విగ్రహం పూర్తిగా వుండదు. శివుని శిరస్సుని మాత్రమే భక్తులు పూజించడం అక్కడి విశేషం. అక్కడికెళ్ళి పూజలు జరిపించి, రెస్టారెంటు కొచ్చింది. గన్ హిల్ ప్రదేశంలో వుంది నిశాంత రెస్టారెంట్. వ్యాన్ లోంచి దిగిన నిశాంత, ఆ రెస్టారెంటుకున్న బోర్డ్ వైపు చూస్తూ, క్షణకాలం నోట మాట రాకుండా నిల్చుండిపోయింది. |
25,058 |
5. ఇంద్రాగ్నులు ఘనులు, సభాపాలకులు. వారు రాక్షసుల తామసమును హరించవలెను. రాక్షసులు సంతానములేనివారు కావలెను. అప్రజాః సంత్వత్రిణః
6. ఇంద్రాగ్నులారా ! మీరు ప్రకాశ స్థానమున ఉన్నారు. సత్యమును జాగృతము చేతురు. మాకు ధనములను ప్రసాదించుడు.
ఇరువది రెండవ సూక్తము-ఋషి-కణ్వపుత్రుడు మేధాతిథి, దేవతలు1-4 అశ్వినులు,
5-8 సూర్యుడు, 9-10 అగ్ని, 11 దేవతలు, 12 ఇంద్రాణి, వరుణాని, అగ్నాయీ,
13-14 భూమ్యంతరిక్షములు, 16-21 విష్ణువు, ఛందస్సు - గాయత్రి.
1. ప్రాతస్సవనమునకు విచ్చేయుటకుగాను అశ్వినీదేవతలను మేల్కొలుపుచున్నాము. వారు సోమపానమునకు విచ్చేయవలెను. గచ్ఛతామ్ అస్య సోమస్య పీతయే
2. అశ్వినులు సురథులు, ద్యులోకమున నివసించువారు. ఉజ్వలముగా ప్రకాశించువారు. వారిని ఆహ్వానించుచున్నాము. అశ్వినా తాహవామహే
3. అశ్వినుల చేతి కశము, కొరడా సత్యమయినది. తడిసి ఉండునది. వారు అట్టి కశమున యజ్ఞము నిర్వహించవలెను. తయా యజ్ఞం మిమిక్షితమ్
4. అశ్వినులారా ! సోమయాగము చేయు యజమాని గృహము దూరముకాదు. అతని ఇంటికి మీరు రథముపై చేరగలరు. గచ్ఛథః అశ్వినా సోమినోగృహమ్
5. యజమానిని రక్షించుటకు హిరణ్యపాణి అయిన సూర్యదేవుని ఆహ్వానించుచున్నాము. సూర్యుడు యజమానికి అతని స్థానమును తెలుపగలడు. పచేత్తా దేవతాపదమ్
6. సూర్యుడు నీటిని ఇగిరించును. అతనిని రక్షణకుగాను నుతింపుము. సూర్యవ్రతములను ఆచరించుము.
7. సూర్యుడు నివాసమునకు కావలసిన ధనమును ఇచ్చును. సవితారం నృచక్షుషం నరులను వెలిగింపచేయు సూర్యుని ఆహ్వానించుచున్నాము.
8. మిత్రులారా ! ఋత్విజులారా ! రండు. ఆసీనులు కండు. సూర్యుడు స్తవనేయుడు. ధనప్రదాత. అతడు వెలుగులు పరచుచు విచ్చేయుచున్నాడు.
(ఉదయ సంధ్య అందములను ఆస్వాదించుటకు ఆహ్వానించుచున్నాడు.)
9. అగ్నీ ! దేవతల పత్నులను తీసికొని రమ్ము. త్వష్టను కూడ సోమపానమునకు తీసికొనిరమ్ము.
10. అగ్నీ ! మమ్ము రక్షించుటకు దేవపత్నులను, నీపత్ని భారతిని, పూజ్యురాలు సరస్వతిని తీసికొని రమ్ము.
11. నరులను పాలించువారు, అక్షయ సంపదలుగల దేవపత్నులు మాకు సుఖమును, భద్రతను ప్రసాదించవలెను.
12. మా యజ్ఞములకు శుభములు కలిగించుటకు ఇంద్రపత్నిని, వరుణపత్నిని, అగ్నిపత్నిని సోమపానమునకు ఆహ్వానించుచున్నాము.
13. మహద్యౌలోకము, పృథివి తమ దయారసమున ఈ యజ్ఞమును తడుపవలెను. మమ్ములను వారు పోషించవలెను.
14. భూమి, అంతరిక్షము, స్థిరముగా ఉన్నవి. గంధర్వ స్థానమున ఉన్నవి. అవి ప్రసాదించు ఉదకములు ఘృతమువంటివి. విప్రులు ఆఘృతములనే ఆస్వాదింతురు.
15. పృథివీ ! విస్తారమవు అగుము. నిష్కంటకమవు అగుము. అవినాశ్యమవు అగుము. విశాలగుణపతివి కమ్ము. సుఖములను ప్రసాదించుము యచ్చావః శర్మ సప్రథాః
16. విష్ణువు గాయత్ర్యాది సప్త ఛందములతో పృథ్విపై పదవిన్యాసము చేసినాడు. ఆ పృథ్విమీద మానవులు ఉన్నారు. వారిని సకల దేవతలు రక్షించవలెను.
17. విష్ణువు ఈ జగమున సంచరించినాడు. త్రేధా నిదధే పదమ్ మూడు విధములుగా అడుగిడినాడు. విష్ణువు పాదధూళితో సమస్తవిశ్వము నిండి ఉన్నది.
18. విష్ణువు అజేయుడు, సకల విశ్వమును పాలించువాడు అగును. అతడు ధర్మరక్షణకుగాను మూడు లోకములందు మూడు అడుగులిడినాడు.
19. విష్ణుని కర్మలను చూడుడు. అతడు ఇంద్రునకు సఖుడు. విష్ణుని గూర్చి కర్మలు చేయుచున్నాము.
20. ఆససమున నిలిచి సమస్తము చూడవచ్చును. ఆవిధముగనే విద్వాంసులు విష్ణుని మహత్తును సదా చూడగలరు. సదా పశ్యంతి సూరయః
21. లోపరహితులు, జాగరూకులు అయిన స్తుతి కర్తలగు విప్రులు విష్ణుని పరమపదమును ప్రకాశింపచేతురు. సమింధతే విష్ణోర్యత్పరమం పదమ్
ఆలోచనామృతము :
1. కక్షీవంతుడు చేతిపనులవాడు, హస్తకళాకారుడు కావచ్చును. అతడు తన స్వయం ప్రతిభ వలన దేవతల స్థానమునకు చేరినాడు.
ఋభువులు ఒక రకముగా హస్తకళలవారు, నిర్మాతలు. వారు తమ స్వశక్తితో దేవతలలో చేరినారు.
ఇప్పుడు దేవతల పత్నులకు దేవతలతో సరి సమానస్థానము లభించినది. ఇంతకుముందు దేవతలను పత్నుల సమేతముగా ఆహ్వానించినాడు. ఇప్పుడు పత్నులకు, స్త్రీలకు, స్వయంప్రతిపత్తి కలిగినది. పత్నులను మాత్రమే సోమపానమునకు ఆహ్వానించినాడు. ఇది స్త్రీకి పురుషునితో సమానత్వ చిహ్నము. స్త్రీ స్వేచ్చకు, స్త్రీకి సమానస్థాయికి గుర్తింపు.
భార్యలుగా మాత్రము కాక ఇళ-మహి-భారతి స్వతంత్ర దేవేరులు అయి ఉన్నారు.
ఈ స్త్రీ సమానత్వము వేనవేల సంవత్సరములకు పూర్వము ఋగ్వేదమునాడు ఉన్నది.
అత్యంత నాగరకములు అని చాటుకొనుచున్న కొన్ని యూరొపు సమాజములలో నేటికిని స్త్రీకి సమానత్వము లేదు. స్విట్జర్లాండులో స్త్రీకి ఓటుహక్కు లేదు.
2. భరతుడు అగ్ని అగును. అతని భార్య భారతి.
3. విష్ణువు తొలిసారిగా సర్వశక్తిమంతునిగా దర్శనము ఇచ్చినాడు.
విష్ణువు సప్తధాముడు.పృథ్వి, జలము, ఆకాశము, తేజస్సు, వాయువు, తన్మాత్రలు ఏడు విష్ణుని నెలవులు.
పృథ్వి అంతరిక్షము, ద్యులోకముల విష్ణువు తన పాదము ఉంచినాడు. పురాణ కథలందు వామనుడు తన మూడు అడుగులువేసి మూడులోకములు కొలచినాడు.
4. పరమం పదమ్ అను పదము తొలిసారిగా దర్శనమిచ్చినది. విష్ణునిది అన్నిపదములకన్న పరమైన పదము, పరమ పదము.
ఇరువది మూడవ సూక్తము-ఋషి-కణ్వపుత్రుడు మేధాతిథి,
దేవతలు 1వాయువు, 2-3 ఇంద్రవాయువులు, 4-6 మిత్రావరుణులు,
7-9 మరుద్గణ వశిష్టుడు, ఇంద్రుడు, 10-12 విశ్వేదేవతలు,
13-15 పౌష్ణుడు, 16-22 ఉదక దేవత, 24 అగ్ని, ఛందస్సు-అనుష్టుప్.
1. సోమము అభిషవించబడినది. ఇది తీవ్రమయినది. తృప్తికలిగించును. ఆశీర్వంతమయినది. పాలు, పెరుగు మున్నగు వానితో చేయబడినది. ఉత్తరవేదిక సిద్ధముగ ఉన్నది. వాయువా ! ఆ సోమమును పానము చేయుము.
2. ద్యులోకమందున్న ఇంద్రవాయువులను సోమపానమునకు ఆహ్వానించుచున్నాము.
3. ఇంద్రవాయువులు మనోవేగము గలవారు. వేయి కన్నులవారు. బుద్ధికి అధిపతులు. ఋత్విజులారా ! అట్టి ఇంద్రవాయువులను మా రక్షణకుగాను ఆహ్వానించుడు.
4. మిత్రావరుణులు పవిత్ర బలము గలవారు. యజ్ఞమునకు అవతరించువారు. వారిని సోమపానమునకు ఆహ్వానించుచున్నాము.
5. మిత్రావరుణులు సత్యప్రకాశకులు. ప్రశస్త తేజోవంతులు. వారిని ఆహ్వానించుచున్నాము.
6. వరుణుడు రక్షకుడు. మిత్రుడు సర్వరక్షకుడు. వారు ధనములను ప్రసాదించవలెను.
7. మరుత్తులతో కూడిన ఇంద్రుని ఆహ్వానించుచున్నాము. వారు సోమపానము చేయవలెను. సంతృప్తులు కావలెను.
8. ఇంద్రుడు ముఖ్యముగా గలవారు, ధనములను ప్రసాదించువారు పూష దేవతలు. ఇంద్ర, పూష సమన్వితులయిన మరుద్గణములను ఆహ్వానించుచున్నాము.
9. మరుత్తులు భూరిదాతలు. ఇంద్ర సహితులయి శత్రునాశనము చేయగలరు. మరుద్గణములు మమ్ము దుష్టుడయిన వ్రుత్తుని బారినుండి రక్షించవలెను.
10. మరుత్తులు ఉగ్రులు. పృథ్విపుత్రులు, వారిని సోమపానమునకు ఆహ్వానించుచున్నాము.
11. మరుత్తుల ధ్వని శూరులవలె గంభీరముగా ఉండును. వారు నాయకులు. వారిని సదా శుభకరమయిన దేవయజన స్థానమునకు ఆహ్వానించుచున్నాము.
12. మరుత్తులు కాంతిమంతులు. ప్రకాశమానులు. దివి నుండి దిగివత్తురు. అట్టి మరుత్తులు మాకు సుఖమును ప్రసాదించవలెను. మరుతో మృళయంతునః
13. కాంతి కలిగి గమనశీలుడవయిన పూషా ! తప్పిపోయిన పశువును పట్టి తెచ్చినట్లు, విచిత్రదర్భలు కలిగి యాగమును పోషించునట్టి సోమమును అంతరిక్షము నుండి తెమ్ము.
14. సోమము గుహలో ఉన్నది. గూఢమయినది. విచిత్ర దర్భలు కలది. అట్టిసోమమును కాంతివంతుడయి పూష - సూర్యుడు సంపాదించినాడు.
15. మేము ప్రతి సంవత్సరము ధాన్యము పండించుటకు ఎద్దులతో పొలము దున్నుదుము. అట్లే పూష ఆరు ఋతువులందును మా కొఱకు సోమము తెచ్చును.
16. మేము యజ్ఞము చేయగోరినాము. కావున జలములు, తల్లిపాలవలె మధురములు, హితకరములు అయి దేవ, యజన స్థానముల ప్రవహించవలెను.
17. జలములందు సూర్యుడు, సూర్యునియందు జలము ఉన్నది. అట్టి జలము మా యజ్ఞమును తృప్తి పరచవలెను.
18. మా గోవులు త్రావు ఉదక దేవతలను ఆహ్వానించుచున్నాము. ప్రవహించు స్వభావముగల అట్టి జలములతో హవిస్సులు సిద్ధము చేయవలసి ఉన్నది.
19. జలముల మధ్య అమృతము ఉన్నది. జలముల మధ్య ఔషధములు ఉన్నవి. ఋత్విజులారా! జలము ప్రాశస్త్యము చాటుడు.
20. జలములందు సమస్త ఔషధములు ఉన్నవి. జలములందు లోకములకు సుఖము కలిగించు అగ్ని ఉన్నదని సోముడు చెప్పినాడు. ఉదకములు విశ్వభేషజములు అగును. ఆపశ్చవిశ్వభేషజీః
21. జలములు మా శరీరములందలి రోగములను నివారించు ఔషధములు కావలెను. చిరకాలము మేము సూర్యుని దర్శించునట్లు చేయవలెను.
22. నేను పాపము చేసి ఉండవచ్చును. ఇతరులను తిట్టి ఉండవచ్చును. అసత్యము పలికి ఉండవచ్చును. జలములారా ! అట్టిపాపములను మీరు కడిగివేయుడు.
23. నేడు నేను స్నానము చేసినాము. జలములందలి రసములు నాలోనిండినవి. గ్నీ ! నీవు జలములతో కలిసిరమ్ము. నాకు తేజస్సును ఇమ్ము.
24. అగ్నీ ! నాకు వర్చస్సును యిమ్ము. స్మ్తానమును యిమ్ము. ఆయువును యిమ్ము. ఈ నా కోరికను సకల దేవతలు ఎరుగవలెను. ఋషులు సహితముగ ఇంద్రుడు ఎరుగవలెను.
(ప్రథమ మండలమున అయిదవ అనువాకము సమాప్తము.)
ఆలోచనామృతము :
1. ఈ సూత్రమునందలి సోమమునకు ప్రత్యేకత, విశిష్టత ఉన్నట్లున్నది. ఇది పశువును పట్టి తెచ్చినట్లు అంతరిక్షమునుండి తేవలసినది. గుహ్యప్రదేశమునుండి తేవలసినది. సంవత్సరమునందలి ఆరు ఋతువులందు లభించవలసినది.
2. జలములను గురించిన వివరములు అద్భుతము, ఆశ్చర్యకరములుగ ఉన్నది. జలములందు అమృతము, ఔషధము, అగ్ని ఉన్నదని చెప్పి ఆపశ్చవిశ్వభేషజీః అన్నాడు.
జలములను గొప్పగా వర్గీకరించినాడు.
ఈ మధ్య (WATER THERAPY) జలచికిత్సను కనుగొన్నట్లు ఎంతో ప్రచారము జరిగినది. అది ఋగ్వేదమునందే ఉన్నది. వైద్యశాస్త్రము ఋగ్వేద జలచికిత్సను గురించి అధ్యయనము చేయవలసి ఉన్నది. పరిశోధించవలసి ఉన్నది. |
25,059 |
"తప్పదు రామసూరిగారూ... నానీని వెంటాడుతున్న గేంగ్స్ కి డి.ఎస్పీ. సుందర్ అండవుందని ఎస్టాబ్లిష్ చేస్తే తప్ప అతని వేగం తగ్గదు. నానీకి నిజంగా రక్షణ వుండదు" సాలోచనగా అన్నాడు "ఇప్పుడు ఇది పత్రికలదాకా వెళితే ఆనక అది ప్రజలదాకా, ప్రభుత్వందాకా ప్రాకుతుంది. అప్పుడు నేను బలికావచ్చేమో కాని అంతకన్నా ముందు సుందర్ కంగారుపడతాడు. దానితో డిపార్టుమెంట్ లో వచ్చే ఒత్తిడిలో నానీని వెంటాడే వ్యక్తులతో తనకు సంబంధం లేదని నిరూపించుకోవల్సిన బాధ్యత అతడిదవుతుంది. ముఖ్యంగా అనసూయ హత్య జరిగింది అతడి సమక్షంలోనే అన్న పాయింట్ ని జాగ్రత్తగా కవర్ చేస్తే ఇప్పుడు నానీని సురక్షితంగా పట్టుకుని తన నిర్దోషిత్వాన్ని పై అధికారులకీ, పత్రికలకీ చెప్పాల్సిన అవసరం ఏర్పడుతుంది." "బ్రేవో" ఉద్వేగంగా అన్నాడు రామసూరి "కాని ఒకవేళ నానీని కాపాడి ఇదంతా అదే సుందర్ తాలూకా ఇన్వాల్వ్ మెంటు కాదని నిరూపిస్తే." "నేను ఇచ్చిన స్టేట్ మెంట్ అబద్ధమని తేలుతుంది. కానీ ఆ అబద్ధమే నానీ అనే ఓ నిజాన్ని రక్షించిందీ అవుతుంది" స్థిరంగా అన్నాడు యశస్వి. ఈ ప్రపంచంలో ఇంకా చెక్కుచెదరని నిజాయితీ నిండిన ఆత్మస్థైర్యం అక్కడక్కడైనా యశస్వి రూపంలో మిగిలే వున్నందుకు సంతృప్తి చెందుతున్నాడు. తనవాడు కాని 'నానీ' అనే ఓ పసికందు ప్రహ్లాదుడిలా నిజమనే అదృశ్య శక్తిని ఆరాధిస్తూ హిరణ్యకశిపుడిలాంటి తండ్రిచేత సైతం నిరసింపబడుతుంటే అడుగడుగునా ఆ పసివాడిపాలిట దేవుడై రక్షించే ప్రయత్నం చేస్తూ తను ఆనందంగా ఆపదల్లోకి చొచ్చుకుపోతున్న ఓ యువకుడిని గర్వంతో చూస్తున్నాడు. "ఓటమిని జీర్ణించుకోలేక అస్త్రసన్యాసం చేసిన నన్ను రెచ్చగొట్టి రంగంలోకి దింపిన ఓ మిత్రుడా... ఇదిగో నీముందు రథసారధిలా నిలబడిన ఈ వ్యక్తి నీ అభీష్టాన్ని అనుసరించి పత్రికద్వారా ప్రత్యర్థులపై చివరి అస్త్రాన్ని సంధిస్తున్నాడు" ఉద్వేగంగా అని "కానీ నానీని కలవని నువ్వు ఈ వాస్తవాన్ని ఎలా తెలుసుకున్నావని నిన్ను నీ యంత్రాంగమే నిలదీస్తే ఏం జవాబు చెబుతావు" అడిగాడు చివరిగా. "అలాంటి ప్రశ్న ఉత్పన్నం కాకుండా జాగ్రత్తగా మరోపథకం వేస్తాను, నా ఇంటర్వ్యూతో డి.ఎస్పీ. సుందర్ ఇరుక్కుంటే అప్పుడు వేయబోయే పథకంలో సరాసరి హోంమినిష్టర్ అప్పారావు చిక్కుకుంటాడు. ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టుగా అపారమైన అనుభవంగల రామసూరికి ఆ మరో పథకమేమిటో మింగుడు పడలేదు. "వెల్... నీ ఇంటర్వ్యూ నానీని హతమార్చే ప్రయత్నంలో అనసూయ హత్య చేయబడిందా... అందులో డి.ఎస్పీ. సుందర్ పాత్ర ఎంత" అన్న మకుటంతో ఈరోజు సాయంకాలం పత్రికలో మార్కెట్ కి వస్తుంది. వాతావరణం వేడెక్కి నానీకి పరోక్షంగా ప్రత్యర్థులైన అందర్నీ ఉలిక్కిపడేటట్టు చేస్తూంది. నువ్వుమాత్రం జాగ్రత్తగా వుండాలి" "నాగురించి దిగులు పడకండి. ఇప్పుడు రిస్కు తీసుకుంటున్న మీరు జాగ్రత్తగా వుండాలి" నిర్వికారంగా నవ్వాడు యశస్వి. "ఈ ఆధారంతో నన్ను నేను కాపాడుకోగలను యశస్వీ" జేబులోని చిన్న లైటర్ లాంటి పాకెట్ రికార్డర్ ను తీసి చూపించాడు రామసూరి "ఆశ్చర్యపోకు... ఇందాక నీ ప్రశ్నలూ, సాగర్, సుందర్ ల జవాబులు. నిన్ను నిలదీయడాలు అన్నీ రికార్డయ్యాయి." అప్పుడు బోధపడింది యశస్వికి. "ప్రతిదీ రికార్డయ్యింది సుందర్ జీ" అని రామసూరి ఇందాక డి.ఎస్పీ.తో ఎందుకన్నదీ. వాళ్ళలా మాట్లాడుకుంటూండగానే హోటల్ ముందునుంచి ఓ పోలీస్ జీప్ సాగిపోతూంది. జీపులో సుందర్, సాగర్ లతో పాటు వెనక కాటికాపరి తవిటయ్య కూర్చుని వుండటం స్పష్టంగా కనిపించింది. "గుడ్" నవ్వాడు రామసూరి. "విషయం మనదాకా రావడంతో చేసేదేమీ లేక సుందర్ శవాన్ని కలెక్ట్ చేసుకోవడానికి వెళుతున్నాడు యశస్వి. నువ్వెళ్ళి రెస్టు తీసుకో... ఈలోగా మహాయజ్ఞాన్ని రగల్చడానికి మరో ఆజ్యాన్ని సమకూర్చే ప్రయత్నం నేను చేస్తాను." "మరో ఆజ్యం అంటే?" యశస్వికి అర్థంకాలేదు. "సాయంకాలం పత్రికలో చూడు. చాలా పెద్ద అక్షరాలతో పబ్లిష్ అవుతుంది" రామసూరి వెళ్ళాడు. నానీ అనబడే ఓ పసికందును రక్షించే ప్రయత్నంలో ఇంతటి కీలకమైన పాత్ర నిర్వహిస్తున్న మరో సహృదయుడైన రామసూరిని చూస్తూ నిలబడ్డాడు యశస్వి. "నువ్విలా అవిశ్రాంతిగా పోరాడుతుంటే నేనెలా విశ్రమించను నేస్తం! నీ అనుభవం ముందు నా జ్ఞానం అతి స్వల్పమని అంగీకరిస్తూ నేనూ నిద్రలేచి ఈ తొలిరాత్రిని స్ఫూర్తిగా తీసుకుని నా జాతితోనే నేనూ యుద్ధానికి సిద్ధపడతాను." యశస్వి ఇలా అనుకుంటున్న సమయంలో... జీప్ స్మశానంవైపు వెడుతూంది. మన మార్బలంతో సమాధుల మధ్యకు వచ్చిన సుందర్ కట్టెలపై వున్న అనసూయ శవాన్ని చూశాడోమారు. విచ్చుకుంటున్న వెలుగురేఖల నడుమ ఆరిపోయిన ఓ కాంతిరేఖలాంటి ఆమెను చూస్తూ సుందర్ స్పందించిపోలేదు. దీన్ని పోస్ట్ మార్టంకి పంపండి" అతడి వాక్యం పూర్తి కాకముందే నలుగురు కానిస్టేబుల్స్ శవాన్ని జీపులోకి ఎక్కించారు. "బాస్టర్డ్" డి.ఎస్పీ.సుందర్ అప్పుడలా తిట్టింది హత్యచేసిన హరిని అనుకున్నాడు తవిటయ్య. కాదని గుర్తించడానికి పట్టింది అరక్షణమే! డొక్కలో తగిలిన పిడికిలి దెబ్బకి నేలకొరిగిన తవిటయ్యను చూస్తూ "పెద్ద హరిశ్చంద్రుడననుకుంటున్నావా?" అన్నాడు తోడేలులా నవ్వుతూ "పైగా అర్థరాత్రి వచ్చి నిద్ర పాడుచేస్తావా?" మరో దెబ్బ... "హరి చంపి తీసుకొచ్చాడని అబద్ధం చెబుతావా?" తను చెప్పింది నిజమని తనకు తెలిసిన తవిటయ్య అతను చూడనిది నిజంకాదని ఎందుకనుకుంటున్నాడో అర్థంకాక బాధతో విలవిల్లాడుతూనే ఏదో చెప్పాలని పెదవి విప్పబోయాడు. డి.ఎస్పీ. బూటుకాలు పొట్టలో తాకింది వేగంగా. ఆ మూలుగుతో ఉలికిపడి నిద్రలేచిన నానీ గుడిసెలోనుంచే భయంగా చూశాడు. |
25,060 |
లేదంటే? లేదంటే..... మిల్లర్ బుల్లెట్స్ కో, మాస్టర్ పాయిజన్స్ కో బలి కావాలి.
"హాయ్ స్వీట్ హార్టు" అంటూ మాటలు వినిపించటంతో ప్రణవ ఉలిక్కిపడి తేరుకొని మాటలు వినిపించిన వైపుకు చూసాడు.
అక్కడ మాన్వి నించుని తనకేసే చిలిపిగా చూస్తోంది.
ఇద్దరి మధ్య కొద్దిక్షణాలు నిశ్శబ్దం అలుముకుంది.
ముందుగా మాన్వి తేరుకుంది.
"ఇన్నాళ్ళు ఏమైపోయావ్....? ఎక్కడికెళ్ళావ్...? మాతుంగా షాపింగ్ ఆర్కేడ్ కి తీసుకువెళతానని ప్రామిస్ చేశావ్.... అంతే....ఆ తరువాత కనిపించటం మానేసావ్.... ఇలా అయితే ఎలా...? రేపు పెళ్ళయితే కూడా ఇలాగే చేస్తావా....? నువ్వు పనిచేసే బ్యాంక్ కి వెళ్ళాను. ఒన్ మంత్ శెలవు పెట్టావని తెలిసింది. ఎందుకని....?" ఊపిరి తీసుకోకుండా అడుగుతున్న మాన్వీ మోములోకి చూస్తుండి పోయాడు ప్రణవ.
ఆమెకోసమే కేవలం ఆమె తోటి ప్రేమ కోసమే తాను ఉద్యోగం లోంచి సస్పెండ్ చేయబడ్డానని.... స్టాఫ్ ని బ్రతిమిలాడి వారితో తన సస్పెన్షన్ ని శెలవుగా చెప్పించుకుంటున్నానని, తనకోసం చేసిన అప్పుల్ని దొంగతనాన్ని మాఫీ చేసుకునేందుకు మిల్లర్ లాంటి అతి ప్రమాదకరమైన వలయంలోకి ఎంటర్ కాబోతున్నానని చెప్పలేక పోయాడు.
ఆమె అతనికో ఎనిగ్నా... ఒక సైకలాజికల్ ఏంకర్... ఒక అబ్సెసన్.....అందుకే లైఫ్ రిస్క్ తీసుకోబోతున్నాడు. "నాకోసం ప్రాణమైనా ఇస్తానన్నావ్. కనీసం పదివేలు ఖర్చు పెట్టలేక పోతున్నావ్? మీ మగవాళ్ళంతా ఇంతే. అసలు విషయం దగ్గరకు వచ్చేసరికి నీరుగారిపోతారు" అంది అతని ప్రక్కనే కూర్చొంటూ.
అదే.... ఆ స్పర్శ కోసమే. ఆమె ముగ్ధమోహన రూపం కోసమే. ఆమె కడగంటి చూపులకోసమే. ఆమె తీసే బుడిబుడి రాగాలకోసమే. మయిమరిపింప చేసే ఆమె కంఠంలోని మత్తుదనం కోసమే అతను పరితపించి పోయాడు. రంజీ ట్రోఫీ క్రికెట్ ప్లేయర్ తన ఆటను మరచి ఆమె ఆడించినట్లల్లా ఆడుతున్నాడు. తానింకా ఎదగవలసిన ఎత్తుల్ని మరచి పల్లాల్లోకి దిగిపోతున్నాడు.
ప్రియుడ్ని ఒక బ్యాంక్ లా భావించటం....
ప్రియుడ్ని ఒక షాపింగ్ సెంటర్ లా భావించటం....
తను ఏదడిగితే అది క్షణాల్లో తెచ్చిపెట్టగల క్రెడిట్ కార్డులా భావించటం నిజానికి ప్రేమకాదేమోనని అతనికి అప్పుడప్పుడూ అనిపిస్తుంటుంది. అయినా ఆత్మవంచన ఆ ముసుగుతీసేస్తే మాన్విత తనకెక్కడ దూరమైపోతుందోనన్న భయం.... ఆ భయాన్ని వెన్నంటి ఉంటే దుర్భలత్వం.... పిరికితనం.
"అర్జంట్ పనుండి శెలవు పెట్టాను. ఆ పనిని పూర్తి చేస్తే ఒక ఐదు లక్షలు వస్తుంది. అవి నీకోసమేగా? అందుకే ఆ పనిమీద తిరుగుతున్నాను. ఒక్క నెలరోజులు ఓపికపడితే నీకు ఏది కావాలంటే అది కొనివ్వగల స్థితికి ఎదుగుతాను. ఏదీ ఒక్కటివ్వు..." అన్నాడు.
ఆమె వైపుకు జరుగుతూ...
* * * * *
మహాలక్ష్మి టెంపుల్....
ది టెంపుల్ ఆఫ్ ది గాడెస్ ఆఫ్ వెల్త్...
బొంబాయి నగరపు అతిముఖ్యమైన గుడి.
కొన్నివేలమంది రోజూ ఆ గుడిని సందర్శిస్తుంటారు.
మృదుల కారు గుడికి కొద్దిదూరంలో ఆగింది.
ఉదయం పదకొండు గంటల సమయం.
భక్తులు పల్చగా వున్నారు.
మృదుల కారు దిగింది.
మోము నిండా ముసుగు కప్పుకుని వడివడిగా గుదికేసి బయలుదేరింది వెనుక ఆమె బాడీగార్డు అనుసరిస్తున్నాడు. మామూలుగా అయితే ఆ పాటికి ఆమెని గుర్తించి జనాలు ఆమెచుట్టూ మూగిపోయేవారు.
ఆమెకంతటి క్రేజ్ వుంది.
ఆమె ఆస్తికురాలు.
ప్రతివారం ఏదో ఒక గుడిని సందర్శిస్తుంది. తన స్వేచ్చను అరికట్టే తన పాపులారిటీ, ఇమేజ్, క్రేజ్ అంటే ఆమె అసహనాన్ని ప్రదర్శిస్తుంది.
స్వేచ్చగా అందరిలా తనకు కావల్సిన మార్కెట్ కి వెళ్ళి షాపింగ్ చేసుకోవాలని, తాను ఇష్టపడే హోటల్ కి వెళ్ళి భోంచేయాలని, బొంబాయి నగరపు వీధులెంట సరదాగా తిరగాలనే ఆమె సాధారణమైన కోర్కె నీరు గారిపోతోంది.
అభిమానుల అభిమానం దురభిమానమై ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఊపిరి సలపనివ్వదు. అందుకే ఆమె ఘోషా స్త్రీలా గుడిలోకి ప్రవేశించింది.
ఆమె బాడీగార్డు గుడి ముందునించుని ఆమెవేపు చుట్టుప్రక్కలకు అప్రమత్తంగా చూస్తున్నాడు.
ఐదు నిమిషాలకు ఆమె పూజ చేయటం పూర్తి చేసుకుని ఎప్పటి మాదిరిగానే గుడిచుట్టూ ప్రదక్షిణాలు చేయసాగింది.
అలా ఆమె రెండుసార్లు ప్రదక్షిణం పూర్తి చేసుకుని మూడోసారి కోసం గుడి వెనుకవేపుకు వెళ్ళింది. బాడీగార్డు ఆమెకోసం చూస్తున్నాడు.
ప్రదక్షిణం పూర్తి చేసుకొని రావాల్సిన టైమ్ అయిపోయింది. అయినా ఆమె రాలేదు.
బాడీ గార్డుకి అనుమానం వచ్చింది. |
25,061 |
"అయ్యో! నీకర్థంకాదేం? వాడికి నష్టం లేకపోవచ్చు కానీ నాకుంది." "మీకా? అదేమిటి?" "అదంతేలెండి, మీకర్థంకాదు." "అర్థం కాకుండానే వుండనివ్వు" అనుకుంది మనసులో. "ఆ! అవసరమొస్తే కబురు చెయ్యండి. రెక్కలు కట్టుకుని వచ్చి వాల్తాను" "సరే."
* * *
కొన్నాళ్ళ తరువాత..... ఓ ఆదివారం మాధవి విజయవాడ వచ్చింది. సాయంత్రం ఓ ఫ్రెండింటికి వెళ్ళి కాసేపు మాట్లాడి తిరిగి ఇంటికి వెళుతుంది. మనిషిని తప్పించుకుపోవటం అసాధ్యమన్నంత రద్దీగా వున్నాయి విజయవాడ రోడ్లు. ఫస్ట్ షోలకు వెళ్ళేవాళ్ళు, మ్యాట్నీలు చూసి ఏదో ఘనకార్యం చేసినట్లు అలసటగా వచ్చేవాళ్ళు, ఏదో పని వున్నట్లు హడావుడిగా నడిచిపోయేవాళ్ళు, మనుషుల్ని తప్పించుకుంటూ అవస్థపడుతూ వెళ్ళే చిన్నకార్లు, ప్రాణాలుపోతే ఎంత ఆఫ్ట్రాల్ అన్నంత నిర్లక్ష్యంగా మీద మీదకు వచ్చే రిక్షావాళ్ళు, రోడ్డంతా సొంత సొమ్మయినట్లు ట్రాఫికంతా జామ్ అయినా చీమ పాకినట్లు కూడా లేకుండా చలించకుండా రోడ్డుమధ్య ఆపుకు కూర్చునే సిటీబస్సులవాళ్ళు..... ప్రక్కనే ఏదో ఆగినట్లయింది. తల త్రిప్పి చూసేసరికి స్కూటర్ మీద కూర్చుని, ఒక కాలు నేలకు ఆనించి... రాజా. "హలో! ఎంత విచిత్రంగా కలిశారు?" "నాకూ విచిత్రంగానే వుంది." "సంతోషంగా లేదా?" "నిజం చెప్పమన్నారా? అబద్ధం చెప్పమన్నారా?" వెనుకనుంచి విజిల్ వినిపించింది. "అదిగో ట్రాఫిక్ పోలీసు కోప్పడుతున్నాడు మనం రూల్సు అతిక్రమిస్తున్నామని. ముందు స్కూటరెక్కండి. ఈ రష్ లోంచి బయటపడదాం." "సరే" అంటూ ఆమె వెనుక ఎక్కికూర్చుని, జాగ్రత్తకోసం అతని భుజం పట్టుకుంది. "ఎటుపోదాం?" "ముందీ జనంలోంచి బయట పడండి." "ఈ ఊళ్ళో రద్దీలేని చోటు ఎక్కడన్నా వుందా అని?" అంటూ స్కూటర్ ముందుకు పోనిచ్చాడు. "ఎప్పుడొచ్చారు?" అనడిగింది మాధవి. "ఇప్పుడే...గుంటూరునుండి తిన్నగా వస్తున్నాను" "దేనికొచ్చారు?" "నిజం చెప్పమన్నారా? అబద్ధం చెప్పమన్నారా?" "అబద్ధమెప్పుడో ఎమర్జెన్సీలో వాడుకుందాం లెండి. నిజమే చెప్పండి." "మిమ్మల్ని చూడటంకోసం రావాలనిపించింది. వెంటనే స్కూటరెక్కి వచ్చేశాను." "మా ఇల్లు తెలీదుగా." "మీరెలాగైనా హఠాత్తుగా కనిపిస్తారని నా సిక్త్ సెన్స్ చెప్పింది. "అంతరాత్మ ప్రభోదించిదన్నమాట. ఎలా వున్నారు?" "చక్కగా వున్నాను. క్రాఫింగ్ మళ్లీ వచ్చేసిందిగా. నాతల గట్టిదిలెండి. ఇలాంటి చిన్నచిన్న ప్రమాదాలేమీ చెయ్యవు." "ఆపండాపండి." "స్వోత్కర్షా?" "కాదు, స్కూటర్." స్కూటర్ బ్రేక్ వేశాడు. రోడ్డుప్రక్క 'స్టాలియన్' అనే అందమైన అక్షరాలతో పెయింట్ చేయబడి వుంది ఓ స్టాల్. ఖరీదైన అద్దాల తలుపులు. ఆ అద్దాల వెనుకనుంచి రంగురంగుల క్రోటన్స్. వాటిమధ్య ఆర్టిస్టిక్ గ్గా మలచబడ్డ శిలాకృతి కలిగిన ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహం- నీటిలో తడిసిన స్త్రీ మూర్తి. "ఇక్కడికెందుకు?" అనడిగాడు రాజా. "వీడియో సెంటర్! ఇక్కడ వీడియోగేమ్స్ వుంటాయి. లోపలికి వెళ్ళి చూద్దాం." ఆమె క్రిందకుదిగింది. అతనుకూడా దిగి స్కూటర్ ఒకప్రక్కన పార్క్ చేశాడు. అద్దాల తలుపులు త్రోసుకుని లోపలకు వెళ్ళారు. అవి సౌండ్ ప్రూఫ్స్ డోర్స్ ఏమో బయటినుంచి చూస్తే లోపల నిశ్శబ్దంగా వున్నట్లుంది. లోపలకు అడుగుపెట్టేసరికి ఓ ప్రక్కనుండి ధన్ ధన్ మన్న చప్పుళ్ళు, ఇంకోవైపు నుంచి డజన్లకొద్దీ కార్లు పరుగెడుతున్నట్లు, అవి దబ్ దబ్ మని డ్యాష్ చేసుకుంటున్నట్లు శబ్దాలు- వాటి చుట్టూ గుమికూడి డజన్లకొద్దీ మనుషులు- ఎక్కువగా స్కూల్ బాయ్స్, కాలేజీ స్టూడెంట్స్. ఒక వీడియో సెట్ లో రయ్ రయ్ మని కార్లు పరుగెడుతున్నాయి. రోడ్డుకు రెండు దిశలనుంచీ, ఎటుపడితే అటు ఓ డైరెక్షన్ అంటూ లేకుండా పరిగెడుతున్నాయి. వాటిమధ్యనుంచి ఓ రేసుకారు దూసుకుపోతుంది. ఆకృతిలో గుర్తు పట్టడానికి వీలుగా మిగతా కార్లకన్నా కొద్దిగా భిన్నంగా వుంది. వీడియో సెట్ కు ఓ స్టీరింగ్ అమర్చి వుంది. క్రింద యాక్సిలేటర్ వుంది. ఓ కుర్రాడు సెట్ ముందు నిలబడి ఆపరేట్ చేస్తున్నాడు. చేత్తో స్టీరింగ్ కంట్రోల్ చేస్తున్నాడు. కుడికాలితో యాక్సిలేతర్ నొక్కుతున్నాడు. రేసుకారు అతని కంట్రోల్ లో వుంటుంది. వెనుకనుంచి, ఎదురుగా వస్తున్న మిగతా కార్లు దానిమీదకు దూసుకువస్తున్నాయి. అతను స్టీరింగ్ కంట్రోల్ చేస్తూ ఆ కార్లను తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. డ్యాష్ ఇచ్చినప్పుడల్లా పెద్ద చప్పుడవుతోంది. ఎదురుగా బోర్డుమీద నెంబర్లు గిరగిర మారుతున్నాయి. ఈ స్పీడ్ రేస్ తడవకి ఒకటిన్నర నిముషం వుంటుంది. రెండు అర్థరూపాయల కాయిన్స్ కంప్యూటర్ సిస్టంలో పడవేస్తే సెట్ ఆన్ అవుతుంది. తొంభై నిముషాల్లో నాలుగొందలపాయింట్లు సాధిస్తే మళ్లీ కాయిన్స్ వెయ్యనవసరం లేకుండా గేమ్ కంటిన్యూ అవుతూ వుంటుంది. నాలుగొందల పాయింట్లు సాధించలేకపోతే ఆటోమేటిక్ గా సెట్ ఆఫ్ అయిపోతుంది. కుర్రాళ్ళు ఉత్సాహంగా ఒకరితర్వాత ఒకరు పోటీపడి గేమ్ ఆడుతున్నారు. రెండో వీడియోసెట్ స్పేస్ యిన్ వేషర్స్. ఆకాశమండలంలో ఓ గ్లోబ్ పరిభ్రమిస్తూ వుంటుంది. దానిమీదకు రివ్వురివ్వుమని ఎగురుతూ ఫ్లయింగ్ సాసర్స్ దూసుకువస్తున్నాయి. ఒకటి కాదు, రెండుకాదు...ఎన్నో...అమాంతం అంతరిక్షంలో ఉద్భవిస్తూ గోళంమీదకు రాకెట్ వేగంతో విరుచుకుపడుతున్నాయి. ఆపరేటర్ కు ఒక చేతిలో గ్లోబ్ ని అటూఇటూ కదిలించే చిన్న మీటర్లాంటిది, ఒకచేత్తో ఫ్లయింగ్ గన్ వున్నాయి. సాసర్స్ మీదకు వచ్చినప్పుడల్లా గ్లోబ్ ని మీటర్ ఆపరేట్ చేస్తూ తప్పిస్తూ వుండటం, మరోచేత్తో గన్ తో గురిచూసి ఫ్లయింగ్ సాసర్స్ ని షూట్ చేస్తూ వుండటం...షూట్ చేయబడినప్పుడల్లా ఫ్లయింగ్ సాసర్స్ పేలిపోతున్నాయి. ఎంత జాగ్రత్తగా షూట్ చేసినా ఎటువైపునుంచో వచ్చి గ్లోబ్ ని గుద్దుకుంటూనే వున్నాయి. అవి గుద్దుకున్నప్పుడల్లా పాయింట్లు మైనస్ అవుతున్నాయి. సెట్ కు ఒకవైపుకు సెకన్లు, ఒకవైపు పాయింట్లు జరజర పరిగెత్తుతున్నాయి. |
25,062 |
"చాల్లే! ఊరుకో! అక్కయ్య మీద నీకు అంత అభిమానమే ఉంటే నువ్వు ఇలాంటి పనులు చెయ్యవు. అది పెళ్ళి పెటాకులూ లేకుండా..."
"అమ్మా" గట్టిగా అరిచింది రేణుక.
మరుక్షణంలో అక్కడినుంచి వెళ్ళిపోయింది.
రాధ కూడా రేణుక వెనకే వెళ్ళింది.
"నన్ను క్షమించు అక్కా! నా వల్ల అమ్మ నిన్ను బాధపెట్టింది"
రేణుక అదోలా నవ్వింది.
"అయితే రాధా! నిజంగా నీకు బస్ అందలేదా?"
రాధ తలవంచుకుంది.
"నిజం చెప్పు! నువ్వు సినిమాకు వెళ్ళావు గదూ?"
"ఎవరు చెప్పారు?"
"వెళ్ళావా? లేదా?"
"ఎవరు చెప్పారో ముందు చెప్పు!"
"నేనే చూశాను"
రాధ తృళ్ళిపడింది!
"ఎందుకంత తప్పు చేసిన దానిలా బాధపడ్తావ్? అతనెవరు?"
"సుధీర్!"
"ఏ వూరు? ఏ కులం? ఎవరి అబ్బాయి?"
"నాకు తెలియదు"
"ఏమీ తెలుసుకోకుండానే అతనితో తిరుగుతున్నావా"
రాధ మాట్లాడలేదు.
"అతన్ని గురించి పూర్తిగా తెలుసుకోకుండానే...."
"అతను చాలా మంచివాడు! మేమిద్దరం...."
"ప్రేమించుకొంటున్నారు" రేణుక అందుకుని అన్నది.
"అవును!"
"పెళ్ళి చేసుకుంటానన్నాడా?"
"అనలేదు. కాని చేసుకుంటాం!"
"రాధా! పిచ్చిగా మాట్లాడకు. ఇది సినిమా కథ కాదు. ప్రేమిస్తున్నాను అన్న ప్రతివాడు వెంటబడి పెళ్ళి చేసుకోవడానికి"
"అతను చాలా మంచివాడు!"
"ప్రేమించే ప్రతి ఆడదీ తన ప్రియుడ్ని గురించి అనేమాట ఇదే!"
రాధకు వళ్ళు మండింది.
"ప్రేమ గురించి నీకేం తెలుసు?" అన్నది దురుసుగా రాధ.
రేణుక చెల్లెలి ముఖంలోకి చూసింది. చూస్తూనే ఉండిపోయింది.
"అవును! నిజమేనమ్మా! నాకు ప్రేమ గురించి ఏమీ తెలియదు" రేణుక తనకు తానే చెప్పుకుంటున్నట్టు బరువుగా, చిన్నగా అన్నది.
రాధ ముఖం వెలవెలా బోయింది. తను అన్నదేమిటో అప్పటికి బోధపడలేదు.
"సారీ అక్కా! ఏదో వాగేశాను"
"లేదమ్మా, ఉన్నమాటే అన్నావ్!"
"నన్ను క్షమించలేవా అక్కా?" గద్గద కంఠంతో అన్నది రాధ.
"పిచ్చి పిల్లా, నువ్వు ఎందుకు అంతగా బాధపడ్తావ్? నువ్వన్నదాంట్లో తప్పేమీ లేదు. వెళ్ళు అన్నం తిను" గొంతులో ఉబికి వస్తున్న దుఃఖాన్ని అణుచుకుంటూ చరచరా తన గదిలోకి వెళ్ళిపోయింది.
మంచానికి అడ్డంగా పడి వెక్కివెక్కి ఏడ్చింది. మనసులోని బాధ కరిగి కన్నీరై ప్రవహించింది. మనసు తేలికపడినట్లనిపించింది.
రాధ ఏమన్నది?
తనకు ప్రేమంటే ఏమిటో తెలియదా?
ప్రేమించడం చేతకానందువల్లనే తనకు పెళ్ళికాలేదు అని రాధ అనుకుంటుందా? అందుకే ఆమెను చూసి తను ఈర్ష్య పడుతున్నదనే భావం రాధకు కలిగిందా? రాధను చూసి తను ఈర్ష్య పడటమా?
రామం తెలివైనవాడు.
రాధ కూడా తెలివైనదే.
తనే వట్టి పిచ్చి మొద్దు.
తన స్వార్థం తను చూసుకోలేకపోయింది.
తనలాంటి వాళ్ళు బ్రతకడం చేతగాని వాళ్ళు!
ఈ ప్రపంచంలో ఎవరికి వారే మరొకరి కొరకు త్యాగం చెయ్యడమంత తెలివితక్కువ తనం మరోటి లేదు. తను ఎవరికోసం, తన ప్రేమను త్యాగం చేసిందో వాళ్ళ దృష్టిలోనే తను చులకన అయింది.
తను పెంచినవాళ్ళు, తనకు ఏంకావాలో తెలుసుకొని తమ భవిష్యత్తుకు బాట వేసుకుంటున్నారు. కాని...ఏ ఒక్కళ్ళు తనకు ఏం కావాలో అడగడంలేదు. తను ఎవరికీ అక్కర్లేదు.
చివరికి ఎవరిదారి వారు నిర్ణయించుకొని వెళ్ళిపోతారు. తను ఒక్కతి మాత్రం మిగిలిపోతుంది.
రేణుక లేచింది.
యాంత్రికంగా అద్దం ముందుకెళ్ళి నిలబడింది.
కళ్ళచుట్టూ నల్లటి వలయాలు కన్పించాయి.
పాపిట్లోనూ, చంపల దగ్గిరా తెల్లజుట్టు నల్లజుట్టు మధ్యనుంచి స్పష్టంగా కన్పిస్తోంది.
కళ్ళలో అలసట కన్పిస్తోంది. తన ప్రతిబింబాన్ని చూస్తూ అదోలా నవ్వుకుంది.
తన అసిస్టెంటు సుమతి రోజూ జుట్టుకు రంగు వేసుకోమని గోల పెడుతుంది.
తను జుట్టుకు రంగు వేసుకుంటే ఇంత పెద్దదిగా కన్పించదు. నిజమే. కాని తను అలా కన్పించి ఎవర్ని ఆకర్షించాలి?
గౌతమ్ రూపం కళ్ళముందు మెదిలింది. కళ్ళలో నీరు ఉబికింది.
"అక్కా, అక్కా" రాధ తలుపు కొడుతున్నది. |
25,063 |
"రాధీ.... ఎటువంటి పరిస్థితుల్లోనూ, ఏ తల్లీ తండ్రీ కూడా, తమ బిడ్డల్ని అసహ్యించుకోరు. లోకం అంతా కాదన్నా సరే, వారు తమ బిడ్డలకి రక్షణ కల్పించుకుంటారు. ఈ సంగతి నీకు నువ్వు తల్లివైనప్పుడే అర్థమవుతుంది."
"మధన్...."
"అవును రాధీ.... పుత్రవాత్సల్యం తెంచుకోవటం సులభం కాదులే..... ఏడవకు..... వారం రోజుల్లో వస్తారుగా అమ్మా నాన్నా..... అంతదాకా ఓపిక పట్టు" కళ్ళు తుడుస్తూ లాలించాడు మధన్.
"మధన్ రేణుక పెళ్ళికి మీతోపాటు నేనూ వస్తాను. నా చెల్లెలి పెళ్ళి కళ్లారా చూసి ఆశీర్వదించే హక్కు నాకుంది. అమ్మా నాన్నల అనురాగానికి నోచుకుని. పెళ్ళి చేసుకుంటూన్న దాని అదృష్టాన్ని కళ్ళారా చూసి, మనసారా ఆశీర్వదించాలి. అదే నా కోరిక."
"అలాగేలే కళ్ళు తుడుచుకో..... నవ్వాలి మరి..... ఏదీ...." రాధిక నవ్వుకుంది.
"గుడ్ గరల్."
"మధన్ ఏదయినా మంచి బొమ్మగీయకూడదూ" "ఓ.... యస్.... నవ్వు కంటతడి పెట్టకుండా, నా దగ్గిర కూర్చుని కబుర్లు చెబుతూ వుంటే, ఎన్నైనా గీస్తాను బొమ్మలు పద...." అంటూ తనగదిలోకి తీసికెళ్లాడు.
"ఏం చెయ్యమంటావ్?"
"మీకు తోచినది."
"సరే....."
ఓ రెండు నిమిషాలు ఆలోచించి, కుంచె తీసుకుని, రంగులు కలిపి వెయ్యటం మొదలెట్టాడు. పదిహేను నిమిషాలకల్లా చక్కని చిత్రం తయారయింది. పల్లెసీమ దృశ్యం.
సూర్యాస్తమయసమయం. ఎఱ్ఱని సాయంసంధ్య పలుకరిస్తున్నట్టుంది. మరోవైపు కొండలు, కోనలు, చిన్నతటకం, ఉదయించే సంధ్య సింధూరంలా మెరిసిపోతూ ప్రశాంతతని సృష్టిస్తుంది. రెండూ ఒకే పటంలో వుండటంవల్ల రాధికకి అయోమయంగా తోచి" మధన్ ఉభయ సంధ్యలని ఒకే పటంలో చిత్రించావు నీ ఉద్దేశం" అంది.
"జీవన్మరణాలకి ప్రతీకలు, ఉభయసంధ్యలు పటం, మనిషి జీవితం," అన్నాడు, వాటికేసి చూస్తూ మధన్.
"మధన్.... ఏమిటో అనుకున్నాను. నీలో ఇంత ఫిలాసఫీ దాగివుందే?" అంది రాధిక ఆశ్చర్యపోతూ.
"రాధీ.... ఫిలాసఫీ జీవితానికి వెన్నెముకలాంటిది. అయితే, దీని ప్రాముఖ్యత జీవితంలో కొందరు ముందుగా తెలుసుకుంటారు, కొందరు ఆలస్యంగా తెలుసుకుంటారు. అంతేతేడా," అన్నాడు నవ్వుతూ.
అంతలో భోజనానికి రమ్మని పిలవటానికి అక్కడికొచ్చింది రాజేశ్వరమ్మ.
ఇరువురూ లేచి ఆమె వెనకాలే వెళ్లారు.
రాజేశ్వరమ్మ వడ్డిస్తోంది. నలుగురూ టేబిల్ దగ్గర కూర్చున్నారు భోజనానికి.
"శ్రీహరిగారు పెళ్ళికి తప్పకుండా రమ్మనమని రాశారు. వెళ్ళకపోతే ఏమనుకుంటారో, నాకు బొత్తిగా ఓపిక లేదు వెళ్ళడానికి. నువ్వెళ్ళు రాజా, అబ్బాయిని తీసుకుని" అన్నారు సాంబశివరావుగారు.
"మీరులేనిదే నేనెందుకూ? నేవెళ్ళిపోతే మీకు వండి పెట్టేదెవరు? హోటలు భోజనం పడదాయె. అబ్బాయిని పంపిస్తేసరి. వెళ్ళి చక్కావొస్తాడు. అంది రాజేశ్వరమ్మ.
"నాకు సెలవెక్కడుందే" అన్నాడు మధన్.
"బాగుంది ఒక్కరమయినా వెళ్ళిరాకపోతే బాగుండదు. ఎవరమూ వెళ్ళకపోతే ఏమనుకుంటారు" అంది.
"సరేలే" అన్నాడు మధన్.
"రేణుక చిన్నప్పుడు బొద్దుగా, చామన చాయగా వుండేది వాళ్ళమ్మలాగే రాధికంతా తండ్రిపోలిక. ఆ సన్నం, తెలుపు అంతా అచ్చం వాళ్ళ నాన్నే" అంటూ రాజేశ్వరమ్మగారు చిన్నతనం గురించి చెబుతూవుంటే సంతోషంతో ఎంతో ఆసక్తిగా వింటూ భోజనం పూర్తి చేసింది రాధిక!
సాంబశివరావుగారు తన గదిలోకి వెళ్ళిపోయారు.
రాజేశ్వరమ్మ టేబిల్ సర్దుతోంది.
"అత్తయ్యా చెల్లాయి పెళ్ళికి నేనూ వెళతాను" అంది రాధిక.
ఏం జవాబు చెప్పాలో తెలీక ఆమె రాధిక మొహంలోకి చూస్తూ వుండిపోయింది.
ఈ సంగతి గ్రహించిన మధన్ "పోనీలే, రానీ అమ్మా, చెల్లెలి పెళ్ళి చూడాలన్న కోరిక వుంది కాబోలు రాధికకి అన్నాడు.
"అదికాదురా, శ్రీహరిగారు అలా రాశారు కదా..... మరి......"
'ఫరవాలేదులే అమ్మా! ఏదో అలా భయపడిరాశారుగానీ రాధిక రావాలని వాళ్ళకి మాత్రం వుండదేమిటి?"
"సరే తీసికెళ్ళు. మనుషులు దూరమయినంత మాత్రాన మమతలు మాసిపోతాయా?" రక్తసంబంధం అలాంటిది" అంది రాజేశ్వరమ్మ చేతులు తుడుచుకుంటూ.
"అత్తయ్యా, ఏనాటి ఋణానుబంధమోకానీ, మీ కుటుంబంతో నా అనుబంధం అన్నింటికీ అతీతమయినది. లేకపోతే ఏమిటిదంతా? నావల్ల మీకింతశ్రమ" నేల చూపులు చూస్తూ తలుపు కానుకునుంచుంది రాధిక. |
25,064 |
నీడలుచూడు, చూడు, నీడలు!
నీడలు, పొగ మేడలు!
యుగ యుగాల దోపిడిలో,
నరనరాల రాపిడిలో -
వగదూరిన,
పొగచూరిన
శాసనాల జాడలు!
జాలిజార్చు గోడలు!చూడు, చూడు, నీడలు!
నీడలు, పొగ మేడలు! * * *చూడు, చూడు నీడలు
పేదవాళ్ళ వాడలు!నరనరాల వేదనలో
తరతరాల రోదనలో -
బక్క చిక్కి!
బక్క చచ్చి
పడిన బతుకు గోడలు!
పాడుపడ్డ వాడలు!
చూడు, చూడు, నీడలు!
పేదవాళ్ళ వాడలు! * * *చూడు, చూడు, నీడలు!
పూలు లేని కాడలు!
తరతరాల చెరసాలల
రకరకాల తెరచాటుల
పొదిగిటిలో
ఒదిగిలిపడు
నిర్భాగ్యపు నీడలు!
ఎడారిలో ఓడలు!చూడు, చూడు, నీడలు!
పూలులేని కాడలు! * * *చూడు, చూడు, వ్రీడలు!
పీడలతో క్రీడలు!
చూడు, చూడు, నీడలు!
సూర్యునితో క్రీడలు!
సూర్యునిలో సూదులతో
క్రీడలాడు నీడలు! 19-6-1947 * * * |
25,065 | ఇద్దరు పరువంలో వున్న అందమయిన అమ్మాయిలు సూట్ నెంబర్ నైన్ లో నైటీలతో సిద్దంగా వున్నారు.
రెండు గదుల్లో సంబాషణ జరుగుతుండటంతో రెండు కెమేరాలు ఏక్టి వేట్ అయి పనిచేయటం ప్రారంభించాయి.
సూట్ నెంబర్ నైన్ : "ఈ ముసలాళ్ళు మనల్నేం చేసుకుంటారంటావ్......?" ఒక అమ్మాయి మరొక అమ్మాయిని ప్రశ్నించింది.
ఆ అమ్మాయి ఒళ్ళు విరుచుకుంటూ నవ్వింది. ఆ పైన అంది..... "మనకెందుకు ... చెరొక ఐదువేలు ముట్టాయి చాలు......."
"మన రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి బ్రోకరన్నమాట ! హితోస్మీ ...."
"రాష్ట్రాభివృద్ధిని గాలికొదిలేసి. ముడుపుల కోసం, పదవులకోసం వేంపార్లాడే రాజకీయనాయుకుల్నీ చూసి కడుపుమండిన రాష్ట్ర గవర్నర్ ఏమన్నారో తెలుసా? బ్రోకర్స్ అని. ఈ పరీశీలికులు మన శరీరాలకేం కష్టం కలిగించలేరు. వార్ని మంచి చేసుకుని ఎమ్.ఎల్ ఏ. సీట్లడిగితే పోతుందేమో....?"
"మనమూ...?"
"మనమే. వాళ్ళకంటే మనమేం తీసిపోయాం? మనం మన శరీరాల్ని మాత్రమె అమ్ముకుంటున్నాం. మనల్ని కొనుక్కున్న వాళ్ళకు నిజాయితీగ సుఖాల్ని అందిస్తున్నాం. మరి వాళ్ళో .... రాష్ట్రాన్ని, దేశాన్ని అమ్ముతున్నారు..... ఓట్లేసి గెలిపించిన ప్రజల కళ్ళలో దుమ్ము కొడుతున్నారు....."
"నిజమే...."
సూట్ నెంబర్ టెన్ : "డైమెండ్స్ చెక్ చేయించారా?"
"ఒకటికి రెండుసార్లు .... నిఖార్చయిన , అతి విలువైన వజ్రాలివి. ట్వంటీ ఫోర్ కెరట్స్ గోల్డ్ బిస్కట్స్ ...."
"మారా కాకినాడా ....?"
"ఎంతమాట .... మీరడగాలా? మేం ప్రమాణస్వీకారం చేసిన మరుక్షణం సెక్రటేరియేట్ నుంచి కదిలే మొదటి ఫిల్ కాకినాడ పొలం ఎకరం రూ .116 _00 లకు ఐదొందల ఎకరాలు తమరి అల్లుడిగారి కంపెనేకి ధారాదత్తం ...రెండో ఫైల్ రాయలసీమ రాళ్ళ గనులు లీజ్ కిచ్చేది...... మూడో ఫైల్ ఎస్.ఎఫ్.సి. నుంచి ఋణం మంజూరు ఫైల్...... మరి మా సంగతి....?"
"మరికొన్ని వజ్రాలు కూడా మీరెళ్ళే నాటికి సిద్దమవుతాయి. సార్!"
"నందకిషోర్ మైనస్ పాయింట్స్ గురించి పేపర్స్ బాగా దుమ్మెత్తి పోసేలా చూసుకోండి."
"అన్నీ జరుగిపోతున్నాయి సార్!"
"మరీ .... కంపెనియన్ షిఫ్......"
"మీ ప్రక్క రూమ్ లో సిద్దం చేసాం సార్..... గుడ్ నైట్ ...."
"గుడ్ నైట్ ...."
సూట్ నెంబర్ ఐదులోని కెమెరామెన్ మానిటర్ లో చూస్తూ విస్తుపోయాడు..
ఇవా రాజకీయాలంటే....?
వీళ్ళా రాజకీయ నాయుకులంటే ....?
ఎంత దిగజారిపోయారు? దేశాన్ని ఎంతగా దిగజార్చారు __?
ఈ కేసేట్స్ ని ప్రజలకు చూపిస్తే __
తరిమి తరిమి కొడతారేమో __?
జేబులు నింపుకునేవాళ్ళు __ దేశాన్ని అమ్ముకునే వాళ్ళు .... ఎన్ని మంచిపనులు చేసామని అనుకోకుండా , ఎన్నిసార్లు అసెంబ్లీకిపార్ల మెంట్ కి ఎన్నికయ్యాం, మన పేరు గిన్నిస్ బుక్ లోకి ఎక్కుతుందా అని చూసుకునే గుమ్తనక్కలు ప్రజా ప్రతినిధులు ..... ఛా.... ఛా.... అని ఈసడించుకున్నాడా కెమెరా మెన్ .
* * * * *
రాత్రి పదిగంటల సమయం __
కరీమ్లాలా ఎక్కినా కారు బొంబాయి హైవేలో హైదరాబాద్ కేసి దూసుకువస్తోంది.
"కరీంలాలా చాలా ప్రమాదకరమైన వాడు.... బొంబాయి అండర్ వరల్డ్ లో సీనియర్ హిట్ మెన్. దావూద్ ఇబ్రహీం హిట్ మెన్ అంటే తమాషా కాదు. వాడు నగరంలో అడుగుపెట్టాడంటే ఒప్పుకున్నా వాళ్ళని చంపందే వెళ్ళడు. ఎంత పోర్స్ కావాలంటే అంత తీసుకో ... ఎన్ని ఆయుధాలు కావాలంటే అన్ని తీసుకో ... కానీ వాడ్ని ప్రాణాలతో బంధించాలి...... జాగ్రత్త .... నీ శక్తి సామర్ధ్యాల మీద, నీటి నిజాయితీల మీద నమ్మకంతో ఈ పనిని నీకే అప్పగిస్తున్నాను. నా నమ్మకాన్ని ఓడించకు " అని కమీషనర్ అన్న మాటలు గుర్తుకొచ్చి అప్పటివరకు కునికిపాట్లు పడుతున్న రిషి ఉలిక్కిపడి లేచి అలర్టయిపోయాడు.
"ఎయిర్ పోర్ట్ ... బ్యాచ్ నెంబర్ ఒన్... ఓవర్ " వైర్ లేస్ అన్ చేసి అన్నాడు రిషి.
"ఎస్...... ఓవర్"
"ఎనీథి౦గ్ ...పాజిటివ్ ....? ఓవర్!"
"నో..... మిస్టర్ రిషీ ... ప్లయిట్ అరగంట డిలే... ఓవర్ "
"బీ అలర్ట్ .... ఓవర్"
"ఓ.కే మిస్టర్ రిషీ..... ఓవర్"
"రిషి మరోసారి వైర్ లేస అన్ చేశాడు.
రైల్వేస్టేషన్ ... బ్యాచ్ నెంబర్ టూ ...ఓవర్ ...."
"ఎస్..... రిషి..... ఓవర్....."
"ఎనీథి౦గ్ పాజిటివ్ .... ఓవర్"
"బాబాయి ఎక్స్ ప్రెస్ పదిగంటలు లేట్, మరో గంటలో వస్తుందట. .... ఓవర్ "
"బీ అలర్ట్ .... ఓవర్"
"ఓ.కే. రిషీ..... ఓవర్"
రిషిలో క్షణ క్షణానికి టెన్షన్ తో పాటు అసంతృప్తి పెరిగ్తిపోతోంది.
మరలా వైర్ లేస సెట్ ని అన్ చేసాడు.
"బాంబే హైవే.... భ్యాచ్ నెంబర్ త్రీ.....ఓవర్"
"ఎస్! రిషి .... ఓవర్"
"ఎనీథి౦గ్ పాజిటివ్ .... ఓవర్ "
"నో రిషీ.... ప్రతి వెహికల్ చెక్ చేయందే వదలటంలేదు...... ఓవర్ __"
"బీ అలర్ట్ ... ఎట్టి పరిస్థితులల్లోనూఈ రాత్రికే కరీమ్లాలా నగరం లోకి ప్రవేశించబోతున్నాడు."
"డోంట్ వర్రీ రిషీ .... ఓవర్"
"అనుమానం వున్న ఎవర్నీ వలదవద్దు . కమీషనర్ గారు మనం చెప్పబోయే శుభవార్త కోసం ఎదురు చూస్తూ మేల్కొనే సంకెళ్ళతోవున్న అలక్ నిరంజన్ వేపు చూసి పెదవి విరిచాడు రిషి.
"నేను చెబుతున్నది నిజమే సార్! యిన్ని నిజాలు చెప్పినవాడ్ని ఒక్క అబద్దం ఎందుకు చెబుతాను ? కరీంలాలా మాటకు కట్టుబడే మనిషి __ షెడ్యూల్స్ కి విలువనిచ్చే మనిషి. వస్తానంటే వస్తాడు .... అయితే ఎలా వస్తాడో చెప్పలేను. అతనేవర్నీ నమ్మడు.
ఒక్కోసారి తనను త్క్యానే నమ్మడు. ఎత్తి పరిస్థితుల్లోనూ ఈ రాత్రికే అతను నగరప్రవేశం చేస్తాడు తప్పదు ......" అన్నాడు అలక్ నిరంజన్ వినయంగా.
"అతను మా చేతికి దొరికితే నీకు శిక్ష పడకుండా నేను చేస్తాను మరి నీ అదృష్టం ... నా రాత ... ఆపైన మైఖేల్ రాజు చావు ఏమవుతాయో " అన్నాడు రిషి ప్లాస్క్ లోని టీని వొంపుకుంటూ
ఆ వ్యాన్ లో వున్న మిగతా పోలీసులు, పోలీస్ ఆఫీసర్స్ మౌనంగా వున్నారు.
రిషి ఆజ్ఞల కోసం అప్రమత్తంగా వున్నారు.
కరీంలాలా కారు ఇస్నాపూర్ కి దగ్గరగా వచ్చాక ఆగింది. ఇంజన్ బాగా హిటేక్కేడంతో డ్రైవర్ కారుని రోడ్డువారగా అపాడు.
కరీంలాలా కారు దిగి చీకట్లో కారుని అనుకుని నించుని ఆలోచిస్తున్నాడు.
డ్రైవర్ బాయ్ నెట్ ని ఓపెన్ చేసాడు.
* * * *
|
25,066 |
అతడామె జవాబు వినిపించుకున్నట్లు లేదు. మరింత దగ్గరగా జరిగి గబుక్కున వీపుమీదుగా చేతులువేసి, తనవైపు లాక్కుంటూ 'బేబీ' అన్నాడు వివశుడౌతున్నట్లుగా.
జారిపోతున్న పమిటను పైకి లాక్కుని "ఏం పని బాబూ! విడిచిపెట్టు" అంది విదిలించుకునే ప్రయత్నంలో.
"బేబీ! నువ్వంటే నాకు చాలా ఇష్టం" అన్నాడు చెవిలో రహస్యం చెబుతూన్నట్లుగా.
"మంచికే, నన్ను వదులు బాబూ!" అంది గిరిజ ఏడుపుగొంతుకతో.
"ఎంత ఇష్టమో తెలుసా?" అంటూ చప్పున ఆమె ముఖంమీదికి ఒంగాడు.
అతని పెదవులు ఆమె పెదవులకి తగిలేటంతలో చురుగ్గా ముఖంప్రక్కకి త్రిప్పుకుని "ఎవరో వస్తున్నారు" అంది చిన్నగా.
అతను చటుక్కున ఆమెను ఒదిలేసి గుమ్మందాకా వెళ్ళి బయటకు చూసి నవ్వుతూ "భలే అబద్దమాడి తప్పించుకున్నావే! ఎవరూ లేరు" అన్నాడు.
"మరి ఏం చేస్తాను చంపుతూంటే?" అని, "యింక వెళ్ళు బాగుండదు" అంది.
"సాయంత్రం నాతో సినిమాకొస్తే యిప్పుడెళ్ళిపోతాను."
"అలాగే వస్తాన్లే వెళ్ళు" అంది గత్యంతరంలేక.
"మాట తప్పకూడదు సుమా" అని ఒక్కసారి వెక్కిరించి అక్కడనుంచి వెళ్ళిపోయాడు.
"పెళ్ళయిందిగా, ఇహ మొదలు పీడ" అనుకుంది గిరిజ.
గబగబ తలుపు గడియ పెట్టేసుకుంది. అంతే తొందరగా చీరె కట్టుకోవటం పూర్తిచేసి, మంచంమీద కూర్చుండిపోయింది ఆలోచిస్తూ. జరిగిన అనుభవం తలపుకు వస్తూంటే వళ్ళు కంపరంగా వుంది. అనుభూతి ఏమీ కలగకపోగా వికారంగా వుంది. మొదట్లోనే యిలా వుంది. ఇహ ముందు ముందు ఎలా వుంటుందో అన్న ఆలోచన రాగానే గుండె గుభేలుమంది. అలాగే మంచంమీద మోకాళ్ళలో తలదూర్చుకుని ఎంతసేపో వుండిపోయింది.
ఆ సాయంత్రం బలవంతంగా ముస్తాబు చేసుకుని అతనితో సినిమాకి బయల్దేరక తప్పలేదు.
ఇద్దరూ రోడ్డుమీద ప్రక్క ప్రక్కన నడుస్తున్నారు. ఆమె కొంచెం దూరంగా వుందామని ఎడంగా పోతున్నకొద్దీ అతను భుజం భుజం తగిలేటంత సమీపంగా వస్తున్నాడు.
"రిక్షాలో పోదామా?" అన్నాడు కొంతదూరం పోయాక.
"ఎందుకు? యిలా నడుస్తుంటే బాగానే వుందిగా" అంది వళ్ళుమండి.
"పాపం! ఎక్కువ దూరం నడిస్తే నీ పాదాలు కందిపోవూ."
"ఫర్వాలేదు నేనేమంత సుకుమారిని కాను."
బహుశా ఆమెతో కలిసి రిక్షాలో కూర్చుని ప్రయాణం చేయాలని అతను ఉవ్విళ్ళూరి వుంటాడు. అతని ముఖంలో ఏ మాత్రమో ఆశాభంగం కనిపించింది. అయినా బలవంతం చెయ్యకుండా నడవటానికి నిశ్చయించుకున్నాడు.
కొత్తపెళ్ళికూతురూ, పెళ్ళికొడుకూ వాళ్ళెంత పెళ్ళిబట్టల్లో లేకపోయినా, ఎంత మామూలుగా అలంకరించుకున్నా పెళ్ళికళ కనిపిస్తూనే వుంటుంది. వాళ్ళిద్దరూ రోడ్డుమీద అలా ప్రక్క ప్రక్కనే నడుస్తూంటే జనం కుతూహలంగా చూశారు. అందులో కొంతమంది కాలేజీ స్టూడెంట్లుకూడా వున్నారు. ఒకరిద్దరు ఈలలు వేశారు.
అయినా యిద్దరూ లక్ష్యపెట్టలేదు. గిరిజ నిర్లిప్తంగా వుండి లక్ష్యపెట్టలేదు. సుందరం గర్వంగా వుండి లక్ష్యపెట్టలేదు.
సినిమాహాలుకు చేరి, టిక్కెట్లు తీసుకున్నాక లోపలికి వెళ్ళి కూర్చున్నారు. కొత్త తెలుగు సినిమా, అందువల్ల జనం బాగానే వున్నారు. వాళ్ళు వెళ్ళి కూర్చున్న అయిదునిముషాలకు హౌస్ ఫుల్ అయింది.
సినిమా మొదలయాక గిరిజ అనుభవించిన అవస్థ అంతా యింతా కాదు.
అవసరం వున్నా లేకపోయినా మీదకి ఒరుగుతాడు. చెంపకు చెంప అనేటంత పని చేస్తాడు. చేతివ్రేళ్ళు సవరిస్తాడు. మోచేతిమీద గిచ్చినంత పనిచేస్తాడు. అర్ధంలేకుండా ఏదో పలకరిస్తాడు. జవాబు చెప్పేదాకా వేధిస్తాడు.
కొత్త పెళ్ళికొడుక్కి, పెళ్ళికూతురికి ఈ తతంగమంతా తప్పదేమో అనిపించింది.
ఆమె ప్రాణానికి రిలీఫ్ యిస్తున్నట్లు యింటర్వెల్ అయి లైట్లు వెలిగాయి.
వాళ్ళకు ముందువరసలో కూర్చున్న అమ్మాయి తల వెనక్కిత్రిప్పి చూసింది. ఆ అమ్మాయిపేరు గిరిజకు గుర్తులేదుగాని, తమ కాలేజీలో చదువుతోందని తెలుసు. ఒకటి రెండు సందర్భాలలో మాట్లాడుకుని వుంటారుకూడా ఆ అమ్మాయి గిరిజను చూసి నవ్వింది. గిరిజకూడా నవ్వింది. ఆ అమ్మాయి తల ముందుకు తిప్పేసుకుంది.
"బయటికెళ్ళి కూల్ డ్రింక్స్ తీసుకుందాం రా" అన్నాడు సుందరం.
"నేను రాను" అంది.
ఏమనుకున్నాడో ఏమిటో నాకు దాహమేస్తోంది. ఇప్పుడే వస్తాను' అని లేచి వెళ్ళిపోయాడు.
గిరిజ ప్రక్కన కూర్చున్న మగవాడు బయటికి వెళ్ళడం కనిపెట్టి ముందు కూర్చున్న అమ్మాయి తల మళ్ళీ వెనక్కి తిప్పింది.
"ఏమండీ బాగున్నారా?" అని పలకరించింది.
గిరిజ బాగానే వున్నానన్నట్లుగా తలవూపింది. ఇద్దరిమధ్యా పరిచయమంతగా లేదు. అంచేత ఒకరి విషయాలు ఒకరికి తెలియవు.
"ఎవరతను? మీ అన్నయ్యా?"
గిరిజ విద్యుద్ఘాతం తగిలినట్లుగా ఒణికింది. ఎవరిగురించి ఆమె అడుగుతోంది? సుందరం బావని ఉద్దేశించేనా?
"ఎందుకలా అనిపించింది?" అనడిగింది అర్ధంలేకుండా వెలాతెలా పోతూ.
"మీ ఇద్దరూ ఒకే పోలికతో వున్నారు. కళ్ళు, ముక్కు అన్నీ పోతపోసినట్లు ఒకేలా వున్నాయి అన్నయ్య కదూ?"
ఏం జవాబు చెప్పాలో తోచలేదు గిరిజకు. తన భర్తని అన్నయ్య అనుకుంటోంది. పైగా పోలికలు కూడా ఒకేలా వున్నాయంటోంది. తామిద్దరూలోకంకళ్ళకు అన్నాచెల్లెళ్ళలా కనిపిస్తున్నారా? భార్యభర్తల అంశలు తమలో ఏమీలేవా? |
25,067 | "ఆయన తరువాత నేను పనిచేసిన ఆసుపత్రిలో బాస్ గా వచ్చిన విషయం ఇంతవరకూ నీకు చెప్పలేదు. నూటికి నూరుపాళ్లూ ఔన్నత్యం మూర్తీభవించిన డాక్టరు అతను"
ఈ విషయం ఎక్కడకు పోతూందో అర్ధంగాక మల్లిక శ్రద్ధగా ఆలకిస్తూంది చెవులప్పగించి.
"మేమిద్దరం కలిసి ఆసుపత్రిని అభివృద్ధి చేసేందుకని ఎంతో శ్రమించి పనిచేశాం. వృత్తిరీత్యా ఎంతో చేరువకు వచ్చాము."
"ఒకనాడు....ఒకనాడు ఏకాంతంగా వుండటం తటస్థించి తనని పెళ్ళి చేసుకోమని కోరాడు.
నేను మొదట దిగ్బ్రాంతి చెంది, తరువాత తిరస్కరించాను. అతని కోరిక అసమంజసం అనుకోలేదుగాని, అప్పుడు నేను నా స్వంత ప్రపంచంలో ఉన్నాను.
అందుకని నా జీవితకథ చెప్పి తిరస్కరించాను. ఆ మరునాడే కుంతల వచ్చింది.
మల్లికా! ఇక్కడకు వచ్చినప్పటి నుంచీ ఈ విషయం గురించే నేను తీవ్రంగా ఆలోచిస్తున్నాను. నీ చల్లని సమక్షం నా ఆలోచనా మందిరంగా చేసుకున్నాను. ఈ ఆలోచనల్లో ఒక్కొక్క మెట్టూ పై పైకి ఎక్కి వెళ్ళిపోయాను. ఆశ్చర్యం, మల్లికా! నువ్వు ఎప్పటికీ అలాగే ఉన్నావు. నేను అనేక రూపాలు ధరిస్తున్నాను. ఇప్పుడు నా మనస్సంతా అతనిపట్ల ప్రసన్నతతో నిండిపోయింది. నువ్వు సలహా ఇయ్యి. ఒకే వృత్తికి చెందినవాళ్ళం. ఒకే ఆశయాలు గలవాళ్ళం. సముద్రంలో తుఫాన్ లో చిక్కుకుని, ఈది ఈది ఎలాగో ఓ నావ మీదికి చేరుకున్నాం ఇలా జరగవచ్చునా? ఆ నావలో ప్రయాణం చేయవచ్చునా? మాట్లాడు మల్లికా! మాట్లాడు."
మల్లిక చెమ్మగిల్లిన నేత్రాలతో స్నేహితురాలివైపు చూసింది. ఆమె చూపులో అభినందన వుంది. ఆనందోద్రేకాలు ఉన్నాయి.
"ఇప్పుడు నువ్వు నాకు హిమాలయమంత ఎత్తున కనిపిస్తున్నావే! ఆ గొప్పతనం ఏ ప్రక్క నుంచి నిన్ను కాపాడుతున్నదోగాని, నీలో కించిత్ స్వార్ధరేఖ కూడా నాకు కనబడటంలేదు. ఇప్పుడు నాకు తృప్తిగా ఉందే. ఇప్పుడు నాకు గొప్పగా వుంది. నువ్వు సుఖపడాలని యిదివరకూ కాంక్షించాను. ఇప్పుడూ కాంక్షిస్తున్నాను. కాని, ఇది వరకు మసక మసగ్గా అగమ్యగోచరంగా వుండేది. ఇప్పుడు పరిపక్వంగా, పరిపూర్ణంగా ఉంది. ఐ.... ఐ....గ్రీట్ యు, భారతీ....!"
* * *
ఈసారి నాగరాజుకు తెలియకుండా అక్కడి నుంచి కదలటం భారతికి ఇష్టంలేదు. అతనికి కబురు చేసింది.
"చెల్లెమ్మా! వెళ్ళిపోతున్నావా?" అంటూ వచ్చాడు నాగరాజు కబురందగానే.
"కూర్చో నాగరాజూ" అంది భారతి.
ఆమె కెదురుగా కుర్చీలో కూర్చున్నాడు.
భారతి సిగ్గు పడలేదు. అభిమాన పడలేదు. ఆమె ముఖంలో ఓ నిశ్చల. గంభీర, ప్రశాంతత ద్యోతకమౌతూంది. ఆమె అనుకున్న ఈ నిర్ణయానికి కాల పరిమితి ఎక్కువ లేకపోవచ్చు. కాని, ఆ నిర్ణయంలోని దృఢత్వం సాటిలేనిది.
తొణకని కంఠంతో, వివరంగా అంతా చెప్పేసింది.
అంతా విని నాగరాజు,"బయల్దేరు, చెల్లెమ్మా!" అన్నాడు.
భారతి ప్రశ్నార్ధకంగా చూసింది.
"నువ్వింత చక్కగా స్థిరపడే రోజు వస్తుందంటే నాకింట్లో కూర్చుంటే కాలాడుతుందనుకున్నావా? నువ్వు బయటికెంత గంభీరంగా కనిపిస్తున్నా నీ మనసెంత సున్నితమో నాకు తెలుసు. అతని దగ్గర నిన్ను దింపి, నిన్నతనికి అప్పగించాక తిరిగి వస్తాను."
భారతి నేత్రాలు చెమర్చాయి. "ఇంతమంది ఆప్తులున్న ఈ భూమిమీద నివసిస్తూ నీకెవరూ లేరని పోతావేం?' అని తనని తాను పరామర్శించుకుంది.
నాగరాజు టాక్సీ తీసుకువచ్చాడు, భారతి, మల్లికతో బయటకు వచ్చి తను కారు ఎక్కి కూర్చుంది.
ఒకరి ముఖంలోకి ఒకరు చూసుకుంటూ చాలాసేపు మౌనంగా వుండిపోయారు. ఒకరి కళ్ళలో ఒకరికి ఏవేవో లోకాలు కనిపిస్తున్నాయి.
భారతి స్నేహితురాల్ని ఒక విషయం అడగాలనుకుంది. కాని అంత చనువులో కూడా ధైర్యం చాలలేదు. ఆ విషయం గురించి వద్దని ప్రాధేయపడింది మల్లిక, మునుపొకసారి.
ఇద్దరి మృదు హస్తాలూ కలుసుకుని కరస్పర్శ చేసుకున్నారు.
కారు కదలబోతూండగా మల్లిక అంది: "అతనితో కలిసి నువ్వు త్వరలో మా యింటికి మళ్ళీ రావాలి. అలా వచ్చినట్లయితే, నీకో శుభవార్త చెబుతాను."
అదేమిటో తెలుసుకోవాలని భారతికి కుతూహలం కలిగింది. కాని, మల్లిక మొండిది. ఇప్పుడెంత గింజుకున్నా చెప్పదు.
కారు కదిలి, ముందుకు సాగి, క్రమంగా ఆమె దృష్టిపథం నుండి తప్పుకుపోయింది.
ఆ రాత్రికి మల్లిక టేబిల్ లైట్ వేసుకుని ఉరకలువేసే మనసుతో రాస్తూంది.
"వినయ్!"
కంగ్రాచ్యులేషన్స్. నువ్వే గెలిచావు. అండ్ థాంక్స్__ఇన్నాళ్ళూ నాకు ఉత్తరాలు రాయటం మానేసినా, నాకే నీలో జాగా వుంచినందుకు....నేను విముక్తురాలి నయ్యానిప్పుడు. నీకోసం హాయిగా, వెయ్యికళ్ళతో. ఆ కనులనిండా కలలు నింపుకుని ఎదురు చూస్తున్నాను. నామీద కోపం వచ్చి అలిగి కూర్చున్నావు కదూ! ఇంకా ఎందుకోయి నీ కోపం? వచ్చేసెయ్యి నా దగ్గరకు. నీకోసం ఒంటరిగా, నిన్ను గురించే ఆలోచిస్తూ మగ్గిపోతూ, మసిలిపోతూ, ఇక్కడ నిశీధంలా నిరీక్షిస్తున్నాను. మాటల్లో చెప్పలేనివి ఉత్తరాల్లోనే రాయగలం. ఉత్తరాల్లో రాయలేనిది, కళ్ళల్లోనే చూపించగలం. నాకేమీ తెలియటం లేదు. ఇక నేను రాయలేను, బాబూ! వచ్చేయి, వచ్చెయి.
నా అనుకునే
__నీ మల్లిక"
ఉత్తరం పూర్తిచేసి, కాగితం మడిచి కవర్లో పెట్టి అడ్రస్ రాయాలా ఏదో సందేహం తోచి ఆగిపోయింది.
ఒక్కక్షణం ఆమె ముఖం కాంతి నశించినట్లు నల్లగా మారిపోయింది.
సంఘర్షణలో గుండె నలిగిపోతూంది.
చివరకు మనసు దృఢం చేసుకుంది. పెదవుల మీదికి ఎప్పటి చిరునవ్వు వచ్చింది.
"ఇంకా ఆ టైము రాలేదు. భారతి నోటివెంట ఆ శుభవార్త పూర్తిగా వినాలి. వాళ్ళిద్దర్నీ కలిసి ఆ కొత్త అధ్యాయంలో చూడాలి. అప్పుడే....అప్పుడే...."
అడ్రస్ రాయని కవరు, డ్రాయర్ సొరుగులో పెట్టేసింది. లైటుతీసేసి, తను మంచంమీదకు వెళ్ళి పడుకుంది.
0 0 0
లెప్రసీ కాలనీ ముందు నాగరాజుతోపాటు కారు దిగి, గేటుదాటి లోపలకు వెడుతూంటే భారతి రక్తం ఉరకలు వేసినట్లయింది.
గేటు జవాను ఆమెకు నమస్కారం పెట్టి "అమ్మగారూ, బాగున్నారా?" అని పలకరించాడు.
|
25,068 |
మెట్లెక్కి తన ఫ్లాట్ ముందుకొచ్చేసరికి అప్పటి వరకున్న నీరసం రెట్టింపయింది. ఫ్లాట్ తాళం తీయబోతుండగా కాళ్ళకేదో తగలటంతో సడన్ గా క్రిందికి చూశాడు. క్రింద హాట్ కేరియర్... దాన్ని చూస్తూనే అమితమైన ఆశ్చర్యానికి గురయ్యాడు. చుట్టుపక్కల ఫ్లాట్స్ లో వున్న వాళ్ళెవరో తన పరిస్థితి గమనించి అది ఏర్పాటు చేసుంటారని అనుకుంటూ, దాన్ని తీసుకుని లోపలకెళ్ళి... తలుపేసుకుని డ్రాయింగ్ హాల్లోకొచ్చి, హాట్ కేరియన్ ని టీపాయ్ మీద పెట్టి, విండో దగ్గరకెళ్ళి, కర్టెన్ తొలగించి వచ్చి, కేరియర్ మీద పడి పోయాడు. ములక్కాయలతో చేసిన బిర్యాని.... ములక్కాయల కూర.... ములక్కాయల పులుసు.... అన్నీ ములక్కాయలతోనేనా? అని ఆశ్చర్యపడేంత ఓపిక కూడా లేక గబగబా తినటం మొదలెట్టాడు. ఐదు నిమిషాల్లో తినటం పూర్తిచేసి చెయ్యి కడుక్కొని వచ్చి, సోఫాలో కూర్చుని సిగరెట్ వెలిగించుకున్నాడు. సరిగ్గా అప్పుడే ఫోన్ రింగయింది. అది వింటూనే ఎలర్ట్ అయి, వేగంగా రిసీవర్ ని అందుకున్నాడు శ్రీధర్. "వాటీజ్ దిస్ అపర్ణా! ఏమైపోయావు?" కసురుకుంటూ అన్నాడు శ్రీధర్. నిశ్శబ్దం.... "నీ ఫోన్ కోసం ఆకలి కూడా మర్చిపోయి ఎదురుచూశాను." అయినా ఫోన్ లో నిశ్శబ్దమే సమాధానమైంది. "మాట్లాడవా?" కోపంగా అన్నాడు శ్రీధర్. "ప్రతిచిన్న విషయానికి అబద్దాలాడటం మంచిది కాదబ్బాయి.... ఆకలెప్పుడు మర్చిపోయావు? ఇప్పుడేకదా పీకలదాకా మెక్కావు?" అదే కంఠం.... ఫోన్ తీగె వెంట తేనెని ప్రవహింపచేసే మృదుమధురమయిన కంఠం. ఛ... ఛ... తిరిగి అపర్ణే అనుకుని ఫూలిష్ గా మాట్లాడేశాడు. అవును... ఈ అమ్మాయికి తను యిప్పుడే భోంచేసినట్టు ఎలా తెలిసింది? "చూడు మిసెస్ జయారెడ్డి ... ఈ పద్ధతేం బాగాలేదు. గొంతు మార్చి మాట్లాడితే గుర్తుపట్టలేననుకున్నావా? ఎనీవే.... మంచి భోజనం, హాట్ కేరియర్ లో పెట్టి నా ఫ్లాట్ ముందుంచినందుకు థ్యాంక్స్" అన్నాడు శ్రీధర్ మృదువుగానే. "దిసీజ్ టూ మచ్" అందామె ఫోన్ లో ఆ వైపునుంచి. "ఏదీ?" "నా పేరు మార్చటం." "పేరు మార్చానా? నేనా?" "దిసీజ్ త్రీమచ్." "ఏది?" కన్ ఫ్యూజవుతూ అడిగాడు శ్రీధర్. "నీ ఆకలి తీర్చింది ఒకరయితే... థ్యాంక్స్ మరొకరికి చెప్పటం." "అంటే మీరు జయారెడ్డి కాదా? భోజనం పంపింది జయారెడ్డి కాదా?" "చాలా గొప్ప అందగాడివనుకుంటున్నావా?" "నేనా? ఎందుకలా అడిగారు?" "ఒకసారి అపర్ణ అని మరోసారి జయారెడ్డి అని పదేపదే ఆడపేర్లు ఉచ్ఛరిస్తుంటేను..." అంటూ ఆమె చిన్నగా నవ్వింది. పిచ్చిపట్టినట్టయిపోయింది శ్రీధర్ కి. ఈమె ఎట్టి పరిస్థితుల్లోనూ జయారెడ్డి కాదు. మరెవరు ? "ఇంతకీ 12155 అర్థం తెలుసుకున్నావా?" తిరిగి అదే పజిల్ కవ్వింపుగా. "ట్రైచేశా...ఇంకా... చేస్తున్నా...నో...నో...చేయలేదు..." టక్కున చెప్పిన శ్రీధర్ నాలిక్కరుచుకున్నాడు. తనకు తెలీకుండానే యీ అమ్మాయి తనమీద కమాండ్ సాధిస్తుందేమోనన్న ఉక్రోషం ఒకింత తొంగిచూసింది అతనిలో. "అంటే... దారిలోకొచ్చేస్తున్నావన్నమాట." "ఎందుకలా అనుకుంటున్నావ్...?" తెచ్చిపెట్టుకున్న కోపంతో అన్నాడు. "మాటల్లో తడబడ్డావంటే బుట్టలో పడ్డట్టే." "ఏంటి అంతా నీ యిష్టమేనా? ముక్కూ మొహం తెలియని నీ బుట్టలో పడ్డానికి నేనేమంత అమాయకుడ్ని కాను." "అమాయకుడివి కాదనేగా పజిల్ విసిరాను. అమేయ అపార మేధావివే అయితే '12155' ని పరిష్కరించు చూద్దాం?" ఈసారి శ్రీధర్ అహం దెబ్బతింది. అతని ఉనికినే ప్రశ్నించేట్టుందా మాట. ఎవరీ అపరిచితురాలు? 12155తో తననెందుకలా పరాజితుడ్ని చేస్తోంది? రెణ్నిమిషాలు మాట్లాడలేదు శ్రీధర్. అప్పటికే ఆలోచనలతో అతని బుర్ర వేడెక్కిపోయింది. దాహమనిపించి పక్కనే వున్న వాటర్ బాటిల్ అందుకుని గటగటా తాగేశాడు. "నీళ్ళు తాగావా? పాపం జీవుడికి గుండె హీటెక్కినట్టుంది..." అందామె కిలకిలా నవ్వుతూ. ముందొక్క క్షణం షాక్ తిన్నాడు శ్రీధర్. అంతా ఎదురుగా వుండి చూస్తున్నట్టే చెబుతున్న ఆ అపరిచితురాలు ఒక పెద్ద పజిలయిపోయింది. చుట్టపక్కల ఎక్కడన్నా నక్కి తనని గమనిస్తుందోమోనన్న అనుమానం వచ్చింది. వెంటనే లేచి సిటౌట్ లోకొచ్చి నలువేపులా చూశాడు. అంతా నీరవ నిశ్శబ్దం... ఎక్కడా ఒక మనిషి అలికిడి కూడా లేదు. క్రిందికి చూశాడు- సుమారు రెండెకరాల వైశాల్యం వున్న గ్రౌండ్ నిర్మానుష్యంగా వుంది. ఏ ఒక్క అపార్ట్ మెంట్ విండో ఓపెన్ చేసి లేదు. ఏ అపార్ట్ మెంట్ లోను లైట్ వెలుగుతున్నట్టు లేదు. మరెలా చూసినట్టే చెప్పగలుగుతోంది? "ఏంటోయ్ ఆలోచిస్తున్నావ్...?" అడిగిందామె ఫోన్ కి ఆ వేపునుంచి. "ఏం లేదు" అన్నాడు శ్రీధర్ తడబాటును కప్పిపుచ్చుకుంటూ. |
25,069 |
"చాలా కరెక్టుగా చెప్పానుసార్! ముందు ఎనిమిది వస్తుంది. చివర ఎనిమిది వస్తుంది. కావాలంటే ఎవరినన్నా అడిగి చూడండి" అన్నాను.
"ఎవర్నో అడగడం ఎందుకోయ్! ఆ మాత్రం నాకు తెలీదా! కాకపోతే మిమ్మల్ని పరీక్ష చెయ్యటానికి అడిగాను అంతే" అని అంతలోనే సీరియస్ గా ముఖంపెట్టి "అంటే మా అమ్మ ఎనిమిదివేల తొమ్మిది వందల ఇరవైఎనిమిది అబద్ధాలు ఆడిందన్నమాట! అంతేకదా నీ మాటలకి అర్థం."
వాళ్ళమ్మ అన్ని అబద్ధాలు ఆడటానికి నేను చెప్పిన దానికీ సంబంధం ఏమిటో నాకు పూర్తిగా అర్థమయ్యేలోపలే_
"మా అమ్మకి ఎనిమిదిమంది ఆడపిల్లలు, వోన్లీవన్ మగ నలుసు. వాడెవడో తెలుసా? ది గ్రేట్ ఇన్ స్పెక్టర్ వర్ధనరావు. అంటే నేనే. నీవు చెప్పిన మాటలను బట్టి మా అమ్మ అన్ని అబద్ధాలు ఆడిందని అనుకోవాలా? అసలు నీ ఉద్దేశ్యం ఏమిటి? మహా-చూసొచ్చినట్లుగా అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారని చెబుతావా? పైగా ఒక అబద్ధం కాదు, రెండు అబద్ధాలు కాదు, ఒక్కొక్క ఆడపిల్లకి వెయ్యినూటపదహారు అబద్ధాలా? మా అమ్మని అబద్ధాల కోరు చెయ్యటంలో నీ ఉద్దేశ్యం ఏమిటి?" నన్నే తీక్షణంగా చూస్తూ అడిగాడు వర్ధనరావు.
విషయం అర్థమయ్యేసరికి నా బుర్ర గిర్రున తిరగటం ఆవెంటనే పాదరసంలా పని చెయ్యటమూ జరిగింది.
'మీ అమ్మగారు పూర్వ జన్మలో దేవతసార్!' వినయంగా అన్నాను.
"ఇందాకేమో మా అమ్మని అబద్ధాలకోరు అన్నావు! ఇప్పుడేమో దేవత అంటున్నావు! తింగిరి మాటలు మాట్లాడావూ అంటే నా చేతిలో మక్కెలు విరిగిపోతాయి. ఆ తరువాత మక్కు పెట్టినా అతుక్కోవు జాగ్రత్త!"
"అదికాదు సార్! నేను చెప్పేది జాగ్రత్తగా వినండి! అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారు అంతవరకూ కరెక్టు సార్! అయితే ఆ మాట ఒకళ్ళో ఇద్దరో పుట్టిన ఆడపిల్లల తల్లులికి, పదిమంది ఆడపిల్లలు పుట్టిన తల్లులకీ వర్తిస్తుంది గానీ, మీ అమ్మగారికి వర్తించదు. దీంట్లో కూడా ఒక పాయింటు వుంది. ఎనిమిదిమంది ఆడపిల్లలు పుడితే ఈ మాట వర్తించదు. ఎనిమిది ఆడపిల్లల్ని కనటం పూర్వజన్మ సుకృతం సార్! ఆ మహాతల్లి క్రితం జన్మలో నియమ నిష్టగా అష్టలక్ష్మీపూజ అతి పవిత్రంగా చేయటంవల్ల ఈ జన్మలో అష్టలక్ష్ములు ఆవిడ కడుపున పుట్టారన్న మాట మీ అమ్మగారు దేవతసార్! దేవత!'
'అయితే దీంట్లో ఇంత కథుందన్నమాట! ముందే ఆ సంగతి చెప్పొచ్చుకదా!' సంతోష పడిపోయి అన్నాడు వర్ధనరావు.
'ఎలా చెబుతాను సార్! మీ అమ్మగారు అష్టలక్ష్ములకి జన్మ ఇచ్చారని. నాకేమన్నా తెలుసా పాడా? అదయినా మీరు ఇప్పుడు చెప్పబట్టి తెలిసింది. అష్టలక్ష్ములనేగాక మీలాంటి తెలివిగలవారిని కన్న ఆమె నిజంగా దేవతే సార్! నా మాటలో ఏమన్నా సందేహం వుందాసార్!'
నా మాటల్లో సందేహం వుందని ఒప్పుకున్నట్లయితే ఆయన ఇరకాటంలో పడ్డట్లవుతుంది. ఆ మాత్రం ఆలోచనా శక్తి వుండబట్టే 'ఎబ్బే ఎంతమాత్రం సందేహంలేదు. నాకొక కొత్త సత్యాన్ని వినిపించావు! ఎప్పుడో నా పసితనంలో విన్నట్లే గుర్తు. కాకపోతే ఇప్పుడు నువ్వు అన్న తరువాత గుర్తుకు వచ్చింది. అవునూ! అష్టలక్ష్ముల తరువాత నేను పుట్టాను. ఇక్కడ పుడితే వాడిని ఏమంటారోయ్?'
ఈ ప్రశ్నకి సమాధానం చెప్పు చూద్దాం! అన్నట్లుగా కిసుక్కున నవ్వాడు అహోబిలం.
'ఏమొచ్చిందని నవ్వావ్? ఎందుకు నవ్వావ్?' అతని వేపు కోపంగా చూస్తూ అడిగాడు వర్ధనరావు.
'నవ్వు వచ్చిందిసార్' తల వంచుకుని చెప్పాడు అహోబిలం.
'వస్తుందయ్యా వస్తుంది! ఇది పోలీస్ స్టేషన్. నవ్వువస్తే నవ్వటానికి, ఏడుపు వస్తే ఏడవడానికి కాదు. స్ట్రిక్ట్ గా ఉండాలి. వచ్చిందికదా అని నవ్వేయటమే వూ...నీతో మాట్లాడటం టైమ్ వేస్టు' అని ఆ తరువాత నా వేపుకి తిరిగి 'వూ...నా ప్రశ్నకి సమాధానం చెప్పు!' అన్నాడు గాంభీర్యంగా వర్ధనరావు.
'ఇద్దరు అయితే లవకుశులు సార్! ముగ్గురయితే త్రిమూర్తులు సార్! నలుగురు అయితే రామ, లక్ష్మణ, భరత శత్రుఘ్నులు సార్! ఐదుగురు అయితే పంచపాండవులూనూ, నూరుగురు ఐతే కౌరవులు సార్!'
నా మాటలకి అడ్డువచ్చి 'నేను అడిగింది ఒక్కడిని గురించి, ఇంతమంది గురించి చెబుతావేమిటి? ఆన్సర్ టు ది పాయింట్!' అన్నాడు.
"తప్పయిపోయింది సార్! ఒక్కడ్ని కనుక అయితే, ఏకో నారాయణా అంటారు. అష్టలక్ష్ముల తరువాత పుట్టారు కదా సార్! అష్టా అంటే ఏమిటి? ఎనిమిది. ఎనిమిది తర్వాత ఏమిటి? తొమ్మిది. ఎనిమిది తరువాత పుట్టిన మీరు నవనారాయణుడు సార్! నవనారాయణుడికి మరో పేరు కూడా నరనారాయణ అని పురాణాలు చెప్పే ఒకాయన చెప్పాడు సార్!" చాలా వినయంగా పలికాను.
నేను చెప్పింది వినంగానే ఇన్ స్పెక్టర్ వర్ధనరావు ముఖం అప్పుడే విచ్చుకున్న అరటాకంతయింది. చాలా ప్రసన్న వదనంతో "ఈ రోజు చాలా మంచి విషయాలు చెప్పావోయ్!" అని అహోబిలం వేపుకి తిరిగి,
"వీళ్ళిద్దరినీ తీసుకువెళ్ళి తిరిగి సెల్ లో పడేయ్!" అంటూ ఆర్డర్ వేశాడు. |
25,070 | నల్లపాప!
కదిలి వెళ్ళిపోతున్న రైలులో ఉన్నది నల్లపాప!
అంటే పాండ్యముత్తుకూడా ఆమె ప్రక్కనే ఉంటాడు,
కంగారుగా ఆ రైలు ఎక్కడకు వెళుతుందో చూశాడు.....
అది నారాయణాద్రి ఎక్స్ ప్రెస్!
ప్లాట్ ఫారమ్ పైనుండి కదిలి వెళ్ళిపోతున్న నారాయణాద్రి ఎక్స్ ప్రెస్ లో నుంచి సరిగ్గా నల్లపాప ముఖం విండోలోనుంచి కనిపించింది.
ఎంత స్పీడ్ గా కదిలి ఆ రైలును క్యాచ్ చేద్దామనుకున్నా అప్పటికే రైలు వేగాన్ని పుంజుకుంది.
ఒకవేళ పని పూర్తి అయిందనుకుంటే వాళ్ళను తను కాంటాక్ట్ చేసేవరకూ ఇక్కడే ఉండాలి. లేదా మద్రాసు బయలుదేరాలి.... కానీ తిరుమల వెళ్ళే ఎక్స్ ప్రెస్ లో బయలుదేరి ఉండవలసింది కాదు.....అంటే సంథింగ్ ఈజ్ రాంగ్!
ఆ పంచలోహ విగ్రహాలు, బుద్దుని దంతాలున్న పెట్టెతో సహా ఎక్కడికో ఉడాయిస్తున్నారన్నమాట.
రైల్వేస్టేషన్ బయటకు వచ్చి ఎదురుగావున్న ఎస్ టిడి బూత్ లోకి వెళ్ళి ఒక నెంబర్ కు రింగ్ చేశాడు.
పావుగంట తరువాత....
ఒక ఆటోలో ఎక్కి తను దిగిన లాడ్జి దగ్గరకు బయలుదేరాడతను.
కిట్టూ మనసంతా గందరగోళంగా తయారయింది.
మ్యూజియంలో విగ్రహాలు దొంగిలించబడ్డాయి.
ఇవ్వాళో, రేపో విగ్రహాలు దొంగిలించబడ్డాయన్న విషయం తెలుసుకున్న సులేమాన్ దుబాయ్ నుంచి దిగుతాడు.
'ఏవి విగ్రహాలు?' అని అడిగితే తనేం చెప్పాలి?"
కిట్టూ మెదడు పనిచేయడంలేదు....
గదిలోకి వెళ్ళి బెడ్ కు అడ్డంగాపడి అదే విషయాన్ని గురించి సీరియస్ గా ఆలోచిస్తుండిపోయాడతను.
ట్రైన్ బయలుదేరిన రెండు గంటల తరువాత వచ్చాడు టిటిఇ.
క్రింద బెర్తుల్లో ఉన్నవాళ్ళ దగ్గర నుంచి అతనికి బాగానే డబ్బు ముట్టినట్టయింది. నవ్వుతూ వెళ్ళిపోయాడతను.
ఉదయం నుండీ....ఏమీ తినలేదు..... ఆకలి దంచేస్తున్నది.
అందుకే మీల్స్ ఆర్డర్ చేశాడు రాంగో....
కుర్రాడు మీల్స్ ప్లేట్స్ పట్టుకొచ్చాడు.
అప్పటికే క్రింద కూర్చున్న మూడు శాల్తీలు కూడా మీల్స్ తినడం పూర్తిచేసి ప్లేట్స్ ప్రక్కన పడేశారు.
రైల్వే భోజనం తినడానికే కానీ తృప్తిగా త్రేన్చడానికి కాదు. ఆ విషయం రాంగోకు తెలుసు. అందుకే జాలిగా చూశాడు జాజిబాల వైపు.....
'ఏం ఫరవాలేదు....' అన్నట్టు కళ్ళతోనే సమాధానం ఇచ్చిందామె.
రాంగో మనస్సులో కొన్ని క్షణాలపాటు ఏదో తెలినీ అలజడి!
ఇప్పటికే పోలీసులు హైదరాబాద్ నగరమంతా తమకోసం గాలిస్తుంటారు. సిటీ కేబుల్ కు ఇచ్చినవాళ్ళు, పేపర్లకు మాత్రం ఇవ్వరని ఎందుకనుకోవాలి....
ఈ సమయంలో తామిద్దరమూ పోలీసులకు చిక్కడమంటూ జరిగితే ఇక తమ జీవితాలు తమ చేతుల్లో లేనట్టే!
తామిద్దరూ హోటల్ బిల్లు కట్టకుండా పారిపోయిన విషయం ఎప్పుడు బయటపడి ఉంటుంది. డబ్బు చెల్లించకుండా ఎగ్గొట్టాలనే ఉద్దేశ్యం తమకు లేకపోయిన బిల్ పే చేయడానికి వెళ్తే తమను గుర్తించే ప్రమాదం ఉంది....
అందుకే దొంగచాటుగా పారిపోయి రావాల్సి వచ్చింది.
ఇంతవరకూ గుర్తుకు రాని విషయం ఇప్పుడు తప్పనిసరిగా తెలిసివస్తుంది. టీవీలో చూపించిన ముఖాలు తమవే అనే అనుమానం రావడంతోటే తాము ఎస్కేప్ అయినా విషయం చాదర్ ఘాట్ పోలీస్ ఇన్స్ పెక్టర్ కు తెలియజేసి ఉంటారు.
అప్పటినుంచీ తమ కోసం వేట మొదలై వుంటుంది.
రైల్వేస్టేషనులో అంతకుముందే రిజర్వేషన్ చేయించుకున్న చార్టులో తమ పేర్లు ఉండటం....తాము నారాయణాద్రి ఎక్స్ ప్రెస్ లో ప్రయాణం చేసే విషయమూ పోలీసులు తెలుసుకుని ఉంటారు.
సో..... ఇలాంటి పరిస్థితుల్లో తిరుపతిలో చేరసం క్షేమం కాదు.
మధ్యలోనే దిగిపోవాలి.
పోలీసులు మాత్రం తమకోసం తిరుపతిలో కాపు కాస్తారు.
అందుకనే ఇకనైనా తమ గురించి ఎలాంటి ఆచూకీ తెలియకుండా జాగ్రత్త పడితే సరిపోయింది. అప్పటికి ట్రెయిన్ గుంటూరు ఫ్లాట్ ఫారం వదిలింది. ఇక రాబోయే స్టేషన్ తెనాలిలో దిగిపోతే!
అక్కడ దిగి వేరే రూట్ లో ఇంకో ఊరు వెళ్ళిపోతే సరి..... తిరిగి విజయవాడ వెళ్ళిపోతే!
తాము హైదరాబాద్ లోనే ఉన్నామనే ఉద్దేశ్యంతో అక్కడా వెదుకుతుంటారు తప్ప విజయవాడలో ఎవరూ తమకోసం కాచుకుని ఉండకపోవచ్చు.
ఆ ఆలోచన రావడంతో జాజిబాలను దగ్గరకు రమ్మని సైగచేశాడు.
పై బెర్త్ నుంచి తల ముందుకు వంచిందామె!
మెల్లగా తన ఆలోచనను ఆమె చెవిలో చెప్పాడు.
పూర్తిగా విన్న జాజిబాల కళ్ళలో బెదురు ప్రత్యక్షమయింది.
ఇంకొక గంట తరువాత తెనాలి స్టేషన్ లో ఆగింది రైలు.
ఆగీ ఆగడంతోనే తమ సూట్ కేసును తీసుకుని క్రిందకు దిగాడు రాంగో. అతని వెంటే అడుగులు వేసింది జాజిబాల.
అప్పుడే ఎనౌన్సర్ కంఠం వినిపించింది.
'జమ్మూ-తావి ఎక్స్ ప్రెస్ బయలుదేరడానికి రెండవ నెంబర్ ఫ్లాట్ ఫారంలో సిద్దంగా ఉన్నది.....'
జాజిబాలవైపు చురుగ్గా చూశాడు రాంగో.
అతని ఉద్దేశ్యం ఆమెకు అర్ధమయింది. వాళ్ళ అదృష్టం బావుండి రావాల్సిన టైమ్ దాటి చాలా గంటలు లేటుగా వచ్చిందా ట్రెయిన్. |
25,071 | ఈ ఎక్స్ ప్రెస్ కూడా ఆగింది.
"కొత్తవాళ్ళు ఎక్కారు. పడుకున్న ఆమెని చూశారు. ఆమెని లేపితే సీటులో కూర్చోవచ్చుకదా అని ఆశపడ్డారు. అందులో ఒకడు "ఏయ్ అమ్మీ లేలే..." అన్నాడు.
ఆమె కాస్త కదిలింది. "రామాపురం వస్తే కాస్త లేపండి బాబూ!" అంది.
"బయలు దేరుతున్నాను సుమా" అన్నట్లు కూతవేసింది.
"లే, లే, ఇది రామాపురమే. రైలు ఆగటము బైలు దేరటమూ అయింది." ఎక్కినతను అన్నాడు.
పోయేప్రాణం లేచొచ్చినట్లయింది. "ఇది రామా పురమా అయ్యో!" అంటూ కంగారుగా లేచింది. పిల్లని చంకలోకి తీసుకుంది. సంచీ అందుకుంది. తూలుతూ తలుపు దగ్గరకొచ్చింది.
రైలు బిగ్గరగా గర్జించి బయలుదేరింది.
"ఇప్పుడు దిగావంటే రైలుకిందపడి చస్తావ్!" ఎవరో అరిచారు. ఆమె వినిపించుకోలేదు. కదుల్తున్న రైలులోంచి దూకినట్లే దిగింది. ఆ విసురుకి వెళ్ళినుంచున్న పోర్టర్ మీద పడింది.
"వళ్ళు పొగరెక్కి చస్తున్నావా, రైలు బయలుదేరిందాకా ఏం రాచకార్యం పెట్టెలో వెలగబెట్టావ్. జారి నట్లయితే చక్రాలకిందకి సరాసరి పోయేదానివి..." అంటూ బండ బూతులు లంకించుకున్నాడు పోర్టర్.
"డోన్ టాక్ రబ్బిష్!" ఆమె గొణుక్కుంది. అంత దూరాన స్టేషన్ మాస్టరు నుంచుని వుంటే వడివడిగా ఆయన దగ్గర కెళ్ళింది.
"నాకోసం ఎవరయినా వచ్చారా?"
ఆమె అడిగినమాట ఆయన కర్ధంకాలేదు. రోగిష్టి మారి పిచ్చిదానిలా వున్న ఆమెని గుచ్చి చూస్తూ "ఏమిటి" అనడిగాడు.
"నాకోసం ఎవరూ రాలేదా?" ఆమె అడిగింది.
ఆ ప్రశ్న ఆయనకి పట్టరానంత నవ్వొచ్చింది.
"ఆ...వచ్చాడు మైసూర్ మహారాజాగారు" అని అవతలికి వెళుతూ, పాపం "పిచ్చిది" అనుకున్నాడు.
ఆమె కుంగిపోయింది...అడుగులు తడబడుతుండగా లోతుకుపోయిన కళ్ళతో చికిలించి చూస్తూ స్టేషనంతా కలయ తిరిగింది.
ఆమెకి కావాల్సినవారు ఎవరూ రాలేదు.
అణువణువూ నిరాశ పేరుకోగా "భగవాన్, నేనేం చేయాలి. నా ఆశ....నా ప్రాణం...నేను__నేను..." పై కే గొణిగింది. అక్కడే చెట్టుకిందవున్న బెంచీమీద కూర్చుండి పోయింది.
ఆమె కళ్ళముందు నల్లని వలయాలు తిరుగుతున్నాయి. ఎదుటిదృశ్యం బూజురు బూజురుగా కాన వచ్చింది. సంచీ తలకింద పెట్టుకొని పిల్లని మరో చేత్తో గట్టిగా పట్టుకుంది. "భగవాన్! భగవాన్?" కళ గట్టిగా మూసుకుని భగవన్నామ స్మరణలో పడింది.
కొద్దిసేపు తర్వాత ఆమె పెదవులు "దాహం దాహం" అని కదిలాయి.
టపటప రెక్కలు కొట్టుకొని ఓ పక్షి ఏకాకిగా ఎగిరి పోయింది ఆమె చెట్టుమీదనుంచి.
2
మంచికి గాని చెడుకుగాని జనం గుమికూడటం మామూలు.
ఆ బెంచీకి కాస్తదూరంగా కొద్దిమంది గుమికూడారు. చావు సహజం అయినా అది మనిషికి మహా వింతైన విషయం. చనిపోయిన ఆమెని చూస్తూ తలో రకంగా వ్యాఖ్యానం చేస్తున్నారు.
క్రమశిక్షణగల సైనికులులా బయలుదేరిన చీమలు ఒకదాని వెనుక ఒకటి ఆమెముక్కులోంచి వెళ్ళి తెరుచుకునివున్న నోట్లోంచి బయటికి వస్తున్నాయి. ఈగలు ముఖం మీద శరీరం మీద ఎగురుతున్నాయి. ఆమె చెయ్యి వొకటి బెంచీ కిందకు వాలివుంది. మరో చెయ్యి పిల్లని కింద పడకుండా పుచ్చుకుంది. |
25,072 | "మాటవరసకన్నాను. ఆ యిద్దరిలో దబ్బపండులా వున్న అమ్మాయిపేరు వైజయంతిమాల. జాంపండులా వున్న అమ్మాయిపేరు త్రిలోకసుందరి."
"నీ ముఖంలాగావుంది. దబ్బపండు, జాంపండు, వెలగపండు, ఎండుగడ్డి, పచ్చరిటి. ఈగోలంతా ఏమిటిరా తెల్లచీర కట్టుకున్న పిల్ల పచ్చపూలచీర కట్టుకున్న పిల్ల ఫలానా ఫలానా అని చెపితే ఒక్కమాటలో పోయేదానికి" విసుక్కుంటూ అన్నాడు చక్రవర్తి.
"చూడమ్మా చక్రీ! నీ గురించి నీ పేరు గురించి చెప్పాలంటే జంతికల గొట్టం గుర్తుచేస్తేచాలు. సరిఅయిన పండ్లతో పోల్చినా అర్ధం చేసుకోకపోతివి. నీ ఖర్మ." చక్రవర్తిని మరింత ఏడ్పిస్తూ అన్నాడు మదన్ గోపాల్.
చక్రవర్తి నిజంగానే ఏడ్పుముఖం పెట్టాడు.
చక్రవర్తి మదన్ గోపాల్ మంచి స్నేహితులు. బయట కల్సుకోటంతప్ప ఇళ్ళల్లో పెద్దగా కల్సుకోరు. ఓరోజు చక్రవర్తి అవసరంపడి మదన్ గోపాల్ ని ఇంట్లో కల్సుకున్నాడు. అప్పుడు వైజయంతిని, త్రిలోకసుందరిని చూశాడు. అప్పటి నుంచి ఏదో ఓ వంకతో మదన్ గోపాల్ దగ్గరకొచ్చి గంటల తరబడి ఊకదంపుడు కబుర్లు చెప్పి వెళుతున్నాడు.
తరుచు చక్రవర్తి రాకలో ఏదో గూడార్ధం వుందని తలచి నిఘా వేశాడు మదన్ గోపాల్. సమయం చూసి పట్టుకున్నాడు.
"పరాయి ఆడపిల్లలగురించి నీకెందుకోయ్?" దబాయించాడు మదన్ గోపాల్.
"నా కెందుకంటే ఏం చెపుతానురా! అమ్మాయిలు అందంగా వున్నారు ఆరా తియ్యబుద్దేసింది. మనం మగాళ్ళం కదా!"
"నన్ను కలపకు" అంటూ విసుక్కున్నాడు మదన్ గోపాల్.
"ఏం నువ్వు మగాడివి కాదురా?"
"నేను అచ్చమైన మగాడినేరా ఆరాలు తీసే విషయంలో నీతో నన్ను కలపకు అన్నాను." "సారీరా బ్రదర్!"
"ఊ..."
"వాళ్ళ వివరం చెప్పనేలేదు..." అంటూ నసిగాడు చక్రవర్తి.
"అంత ప్రాణంమీదకేం వచ్చిందిరా!" "ప్లీజ్!"
"అఘోరించు. చెప్పకపోతే ఇప్పుడే హరీ అనేటట్లు న్నావ్. అదుగో ఆ తెల్లచీరకట్టిన అమ్మడే వైజయంతి. పచ్చపూల చీర తాలూకాపిల్ల త్రిలోకసుందరి. వాళ్ళిద్దరూ ప్రాణా స్నేహితురాళ్ళు. వైజయంతి ఇంటిగల వారమ్మాయి. ఇంటి ఓనరుకి పక్షవాతం పుస్తకాలు పేపర్లు చదువుతూ మంచాన పడివుంటాడు. ఆయన భార్య సౌభాగ్యమ్మ పురాణాల్లో పతివ్రత లతా ఉత్తమురాలు. వాళ్ళపెద్దమ్మాయికి పెళ్ళయి అత్తారింట్లో వుంది. ఈ వైజయంతికి పెళ్ళి కావాలి. బి.ఏ చదువుతున్నది. ఈ యింటద్దిలే వాళ్ళకాధారం. ఇల్లంతా ముక్కలుచేసి అద్దెల కిచ్చారు. చూడటానికి దబ్బపండు పేరుకి వైజయంతి మాలయినా చుప్పనాతి శూర్పణక. అగ్గిపిడుగు, పిల్ల రాక్షసి, ఆడకోతి, నిప్పుకోడి...
"ఓరొరేయ్ మధన గోపాలా! దండకం ఆపరా! ఆ పిల్లే మయినా ఎప్పుడయినా నీమీద చేయి చేసుకుందేమిటిరా?"
"నామీద చెయ్యి చేసుకోవటమా! ఛ....ఛ....ఛ....నన్నసలు కన్నెత్తే చూడదు. ఓవేళ చూసిందే అనుకో ఆకళ్ళల్లోంచి నిప్పులు కురుస్తుంటాయి."
"నువ్వేం పాపం చేశావురా?"
"నేనే పాపం చేయలేదు చక్కినాధం! ఆ పిల్లకి మగాళ్ళంటే ఎలర్జీ!"
"మగాణ్ణి పెళ్ళి చేసుకోదా ఏం ఖర్మ?"
"నే అడగలేదురా అబ్బాయ్! అడిగానే అనుకో ముందు నా పెళ్ళి చేసేస్తుంది. నా మానాన నన్ను బతకనియ్యి."
"ఉత్త గడుసుపిండమన్న మాట."
"గడుసుపిండమయితే ఫర్వాలేదు గయ్యాళిగంప."
"ఆ రెండో పిల్లో?"
"త్రిలోకసుందరి సంగతా? ఉత్తమాయకురాలు. ఆ పిల్లకి తండ్రిలేడు. తల్లి ఇద్దరు చెల్లెళ్ళు, ఇద్దరు తమ్ముళ్ళు వున్నారు. ఈపిల్ల ఓ కంపెనీలో జాబ్ చేస్తున్నది. ఈ పిల్లమీదనే వాళ్ళింట్లో అందరూ ఆధారపడి బతుకుతున్నారు మగాడిలా ఇల్లంతా గడుపుతున్నదా, అదేం బాధగా అనుకోదు. సినిమా పాటలు పాడుకుంటూ నిమ్మదిగ వుంటుంది ఆ గయ్యాళిగంప ఈ అమాయకురాలు ప్రేమపక్షుల్లా కలిసిపోయారు. తెల్లచీర చిన్నది పూలచీర చిన్న దానికి తనింట్లో ఓ వాటా అద్దెకిచ్చింది. చాలా వివరాలు ఇంకా కధ ముందునడపనా?" |
25,073 |
అతడు తిని వెళ్ళిన ఎంగిలి పళ్ళెం తీసివేసి శుద్ధిపెట్టింది దేవదాసి. అత్తయ్య రాత్రీ తినలేదు ఇప్పడూ తినలేదు దేవదాసికీ తినాలనిపించలేదు.
కృష్ణవేణి నిరాహార దీక్ష ఇంట్లో నౌకర్లందరికీ తెలిసిపోయింది. భార్గవరామ్ కు తప్ప! అందరి మనసులూ కలతబారాయి. "తల్లిని ఉసురు పెడుతున్న కొడుకు.!" అని భార్గవరామ్ నే నిరసించారు చాటుగా నౌకర్లు.
కృష్ణవేణిని భోజనానికి లెమ్మని బ్రతిమాలబోయాడు సుబ్బయ్య. ఆవిడతో రెండు కసిరింపులు తిని, చేసేదేమీలేక చేతులునలుపుకొంటూ వంటగదిలోకి వచ్చి వేశాడు సుబ్బయ్య.
"నాకూ ఇప్పుడే పెట్టకు ఆకలిగా లేదు" అని చెప్పేసి పైకి వెళ్ళింది దేవదాసి.
ఈజీ చెయిర్ లో కూర్చొని అప్పుడే ఏదో గ్రంధం విప్పబోతున్నాడు భార్గవరామ్. "వచ్చావేం దేవదాసీ?
అత్తగారు కంటబడితే చెడిపోతున్నావని గోలెడ్తుంది!" నవ్వబోయి, దేవదాసి వివర్ణ వదనం చూచి చటుక్కున ఆగిపోయాడు.
"అత్త రాత్రినుండి అన్నం తినలేదు, బావా!"
"ఉఁ. ఎందుకు?" నిదానంగా అడిగాడు.
"తెలియకే అడుగుతున్నావా?"
"నాకేం తెలుసు?"
"రాత్రి అత్తయ్యతో నువ్వేమన్నావ్?"
"ఒహో! అదా?" హఠాత్తుగా గాంభీర్యం దాల్చాడు.
"బండ అని అమ్మ ఏనాడో నామకరణం చేసింది. ఇలా తను ప్రాణాచారంబడితే బండలో చలనం కలుగుతుందా నాకు మనశ్శాంతి లేకుండా చేసి ఈ ఇంట్లో నిలువలేకుండా చెయ్యడానికి ఈచర్యలు!"
"అత్తయ్య కోరికలో అన్యాయామేముంది బావా?" తల్లికోరిక తీర్చడం తనయుని ధర్మమేకదా?" జాలిగా, ప్రార్థనా పూర్వకంగా అడిగింది.
"నీకు తెలియదు దేవదాసీ! అదంత సులభంకాదు. నాలో ఒక నిశ్చయమంటూ జరుగలేదు. ఒకరికోరిక తీర్చడం కోసం గృహస్థాశ్రమం స్వీకరించానంటే ఒక క్షుద్రకీటకం శరీరంలోకి పరకాయప్రవేశం చేసినట్లు నా మనసు రగిలిపోతుంది. ఆ జీవితమంత జుగుప్సాకరమో, బాధావహమో ఊహించు!"
"చాలు ఇటువంటి వాదప్రతివాదాలెన్నో ఇదివరకే జరిగాయి. ఇంకా వాదన కొనసాగిస్తే ఇంతకు ముందు వచ్చిన సమాధానాలే ఇప్పుడూ వస్తాయి. మానవత్వానికి విలువ నివ్వడానికి మాతృ మమకారం గురించి, మానవ ధర్మం గురించి బోధించడమేమిటి! కంఠశోష" నిశ్శబ్దంగా లేచి క్రిందికి వచ్చేసింది దేవదాసి.
ఇంట్లో ఇద్దరాడకూతుళ్ళు అ భోజనముండగా తను ఆకు వేసుకుకూర్చోవడ మెలాగో పాలుపోలేదు సుబ్బయ్యకు అపరాహ్ణం దాటిపోయింది.
"దేవతమ్మా తమరికి వడ్డించనా?"
"అత్త రాత్రినుండి తినలేదు నాకు ఎలా తినబుద్ధి అవుతుంది సుబ్బయ్యగారూ" కన్నీళ్ళను బలవంతాన ఆపుకొన్నది దేవదాసి.
కాలుగాలిన పిల్లిలా తిరిగి కృష్ణవేణి గదిలోకి వచ్చాడు సుబ్బయ్య.
"దేవతమ్మ కూడా మీకోసం తినకుండా కూర్చొన్నదమ్మా మీరు...."
మాటిమాటికీ వచ్చి ఊరికే విసిగించకండి సుబ్బయ్యగారూ! నా మనసు బాగుండలేదు. నాకేతిండి మీదాలేదు."
"పాపం, అమ్మాయి....."
"దాన్నిలా పిలవండి."
వచ్చింది దేవదాసి. "నువ్వెందుకు తినలేదే?"
"నువ్వు రా, అత్తా?"
"నేను తిననని చెప్పలేదూ? నువ్వొక దానివి నా ప్రాణానికి పడ్డావా?..... సుబ్బయ్యగారూ, దేవతకు వడ్డించండి..... వెళ్ళు! మధ్యాహ్నం దాటింది ఆ కళ్ళు చూడు ఎలా ఎర్రబడ్డాయో?"
"ఉహూఁ నువ్వు రా!"
"నాకక్కర్లేదని చెబుతుంటే "
"అయితే నాకక్కర్లేదు" వెళ్ళబోయింది దేవదాసి.
"సుబ్బయ్యగారూ, గోవిందస్వామికి చెప్పండి, బండి కట్టించి ఆమెను వాళ్ళ ఊరుపంపి రమ్మని..... నువ్వు నాకు పోటీగా తిండీతిప్పలు మానేసి నువ్వు నాయింట ఉండకు మీ ఊరికి వెళ్ళు!" |
25,074 | null |
25,075 | అనుపమకి జరిగిన అన్యాయం తెలుసుకుంది. అనుపమ అమాయకత్వం. అర్థం చేసుకుంది. ప్రేమ, సానుభూతి, చల్లని మాటలు చెప్పి తనపై సదభిప్రాయం అనుపమకి కలిగేటట్లు చేసింది రంగాజమ్మ.
"ఈ విడెవరో మంచివాడ! కోప్పడకుండా అన్నీ వింది! నేను మంచిదాన్నట! ఏ తప్పూ చేయలేదట!" అనుకుంది అనుపమ.
"మీ ఆయన నీ మీద కోపం వచ్చి ఒంటరిగా రైలు ఎక్కించాడు. నీవస్తున్నట్లు మీ అమ్మకు కూడా కబురు చెయ్యలేదు. నాతో స్టేషనులో దిగుదువుగాని , తరువాత నిన్ను తీసుకుని మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మతో చెపుతాను. నువ్వేమి తప్పుచేయలేదని, అత్తవారింటికి పంపించవద్దని!" అంది రంగాజమ్మ.
అన్ని మాటలకు బుద్ధిమంతురాలిలా తల వూపింది అనుపమ.
రంగాజమ్మ మొహం వికసిచింది.
బోగీలో కునికిపాట్లు పడుతూ కూర్చున్న ముసలాయన అవులించి మళ్ళీ కునికిపాట్లు పడుతూ కూర్చున్నాడు. ముడుచుకుని పడుకున్నతను లేచికూర్చుని నోరు తెరుచుకుని అనుపమని చూస్తున్నాడు. అతనిముఖం చూస్తూంటే పల్లెటూరి గబ్బిలాయి గుర్తుకొస్తున్నాడు.
ఎవరితో నిమిత్తం లేకుండా ట్రైన్ శరవేగంతో ముందుకు పోతూనేవుంది.
రంగాజమ్మ ముందు కార్యక్రమం గురించి తీవ్రంగా ఆలోచిస్తూతనలోతాను తర్జన భర్జన పడుతున్నది.
అనుపమ మాత్రం నిశ్చితంగా కూర్చుంది.
20
రాత్రి పది గంటలయింది.
రాజు చదువుతున్న టెక్ట్స్ బుక్ మసి కుర్చీలోంచి లేచాడు. బద్ధకంగా ఒళ్లు విరుచుకున్నాడు.
రాజు లేవటం చూశాడు. సీతాపతి. అంతకుక్రితం నుంచి రాజుని గమనిస్తూనే వున్నాడు. కాసేపు చదవటం, మరి కాసేపు శూన్యంలోకి చూస్తూ ఆలోచించటం. " ఏమిటి రాజూ, ఆలోచిస్తూన్నావ్?" అంటే, ముందు "ఆ...." అని ఆ తరువాత "అబ్బే ఏంలేదు!" అంటూ పుస్తకంలో తల దూరుస్తాడు.అందుకే సీతాపతి అడగటం మానేశాడు.
" ఇంకా చదువుతావురా పతీ?" అన్నాడు.పతీ?" అన్నాడు రాజు కూజాలో నీళ్లు గ్లాసు లోకి వంచుకుంటూ.
"టైమెంతయింది?"
" అబ్బో, పదయింది!"
"పడుకుంటావా ఇహ?"
"ఆ.... పదియింది కదా?"
రాజు గ్లాసు తొలిచి కూజామీద బోర్లించి , మంచం మీద దుప్పటి విదిలిస్తూ సీతాపతివైపు చూచాడు. సీతాపతి కళ్లార్పకుండ తననే చూడటం గమనించి "ఏం రా.... నా ముఖాన కోతులాడుతున్నాయా?" అన్నాడు.
సీతాపతి జబివ్వలేదు. "రాజూ!" అన్నాడు.
ఏమిటన్నట్లు చూచాడు రాజు.
"నువ్వు పూర్వం రాజువేనా, కాదా అని అనుమానం వస్తున్నది!"
రాజు దిండు సవరించుకుని మంచం మీద పడుకున్నాడు. సీతాపతి కుర్చీలోంచి లేచొచ్చి రాజు మంచం మీద కూర్చున్నాడు.
"అడిగిందానికి జవాబివ్వలవేమిటోయ్?"
"అర్థంలేని ప్రశ్నలకు ఎవరూ జవాబివ్వరు. తాటిచెట్టులా ఎదురుగా నన్ను చూస్తూ- నువ్వు రాజవా?కాదా?అంటే నేనేం చెప్పనురా పతీ?అయినా మధ్య మధ్య వెధవనుమానాలు,చచ్చుప్రశ్నలు! అసలు నువ్వు సీతాపతి వేనా అని! నా పతివేనా అని? నాకూ వచ్చేస్తున్నదో అనుమానం!"
సీతాపతి నవ్వలేదు. సీరియస్ గా ముఖం పెట్టాడు.
"రాత్రి పన్నెండు ,వంటిగంట దాగా నన్ను నిద్రపోనీయకుండా చదవాల్సిందే!అని ప్రాణం తీసేవాడనివి! ఇప్పుడు చదవుమీద శ్రద్ధ కలిగి నే చదువుతున్నాను! నీవేమో రాత్రి పది కాకుండానే పుస్తకం మూసేసి పడకేస్తున్నావు! సినిమాకెళదామా? షికారుచేద్దామా? బజారులో తిరిగొద్దామా?అంటూ వేధిస్తున్నావు కాలేజీనుంచి రూమ్ కి వస్తూనే. నేను సీతాపతినే! నువ్వు ఆ... రాజు భయ్యవి అవునా? కాదా? నా రాజు భయ్యా మంచిబాలుడు!"
" అబ్బ! చదవనంతమాత్రాన రాజుని కాదన్నమాట.....? సరే..... ఉన్నట్లుండి నీకెందుకు కలిగింది చదువంటే శ్రద్ధ?"
"ఇంటర్ ప్రతిఏడూ కొండెక్కించేవాడిని! నీ పోరు పడలేక చదివిన ఫలితం పాసయ్యాను.! పాస్ కాగానే ఉత్సాహం వచ్చింది! బాగా చదివి పరిక్ష ప్రతిసారి పాస్ కావాలని పట్టుదల పెరిగింది!మరి నీ సంగతి?"
"వెరీ సింపుల్- ఇంటర్ ఫస్ట్ క్లాసులో పాస్ కావాలని పట్టుదలతో చదివాను! సెకండ్ క్లాస్ అదీ బొటాబొటి మార్కులతో పాసయ్యాను చదువుమీద ఇంట్రస్ట్ తగ్గింది! నేననుకున్న దొకటి,అయింది మరొకటి,! |
25,076 | "అవును! ఇవ్వాల్నుంచి నా పేరు జంగయ్య" అన్నాడు శేషు ఆరాధనగా నిమ్మీవైపు చూస్తూ.
నిమ్మీ కూడా తమకంగా శేషు వైపు చూస్తోంది.
ఆశ్చర్యాన్ని దిగమింగింది సితార.
సరే! జెయ్ చంద్ర నిన్ను కల్సుకోవడానికి రాకపోవచ్చు. కానీ ఇతగాడు ఆ రోజున, అదే టైంకి ఓ అమ్మాయిని చూడ్డానికి పెళ్ళిచూపులకి వెళ్ళాడు" అంది ఉక్రోషంగా జెయ్ చంద్ర వైపు చురచుర చూస్తూ.
మళ్ళీ గంభీరంగా గొంతు సవరించుకొంది డాక్టర్ సునీతా సుందరి.
"ఆ ఎక్స్ ప్లనేషన్ నేనిస్తాను. మీరిద్దరూ ప్రేమలో పడ్డానికి ముందే మా జెయ్ చంద్ర ఒకమ్మాయిని చూస్తాడని నేను ఒకళ్ళకి ప్రామిస్ చేశాను. నామాట దక్కించడానికే ఆ ఉత్తుత్త పెళ్ళి చూపులకెళ్ళాడు జెయ్ చంద్ర. అంతేగానీ నిజంగా ఆ పిల్లని చూడ్డానికి కాదు" అంది.
దాంతో స్టన్ అయిపోయింది సితార.
ఆ తర్వాత నెమ్మదిగా తేరుకుని "అద్సరే! మరి షీలానాయర్ తో పెళ్ళి ముహూర్తం పెట్టించమని ఎందుకడిగాడు?" అంది రుసరుసలాడుతూ.
షీలానాయర్ చకితురాలై చూసింది.
"ఆరోజు జరిగిందంతా నీకు ఆ రోజే పూసగుచ్చినట్లు చెబితినిగదే అతను ముహూర్తం పెట్టించమనడం అదంతా ఉత్త జోక్ అని నేను అప్పుడే చెప్పలా?" అంది కసురుతున్నట్లు.
"ఏమో జెయ్ చంద్ర నీతో పెళ్ళికి ముహూర్తం పెట్టించమన్నాడని నువ్వు చెప్పగానే విన్న నాకు ఏడుపొచ్చేసింది. వెంటనే తొట్టిదగ్గరకెళ్ళి కళ్ళూ, మొహమూ కడిగేసుకొచ్చా" అంది సితార.
"ఆలోగా అసలు డైలాగు మిస్సయిపోయి వుంటావు. దారుణంగా అపోహ పడిపోయుంటావు. అవునా? అన్నీ తొందరే నీకు" అంది షీలానాయర్.
"అది సర్లే! మరి ఈయనగారు రచనతో శోభనం పెళ్ళికొడుకులా ప్రవర్తించటం మాటేమిటి?" అంది సితార.
కానీ ఈసారి ఆమె గొంతు అంత ధృడంగా లేదు.
రచన గిల్టీగా తల వంచుకుంది.
తర్వాత మెల్లిగా అంది - "ఆ అపరాధం నాదే! జెయ్ చంద్ర నన్ను కాకుండా నిన్ను చేసేసుకుంటాడేమో అన్న జెలసీతో అతను నన్ను రేప్ చేయబోయాడని నీతో చెప్పాను.
ఆ తర్వాత అతని దగ్గరికెళ్ళిపోయి పెళ్ళిమాట చెప్పగానే నువ్వు నా మీదపడి రక్కావని అతనితో చెప్పాను.
నిజంగా ఆ రోజు నా వళ్ళంతా రక్కి, పీకిపెట్టింది జెయ్ చంద్ర వాళ్ళ కుక్క" అంది మిస్టరీ విప్పేస్తూ.
తనని కుక్క అన్నందుకు నిరసన తెలియబరుస్తున్నట్లు పెద్దగా మొరిగాడు ఆదినారాయణ.
సితారతో సహా అందరూ అటు చూశారు.
అక్కడ ఆదినారాయణ పక్కనే జూలీ నూతన వధువులా సిగ్గుపడుతూ నిలబడుంది.
అది చూస్తున్న అందరి మొహాల్లోనూ నవ్వు కనబడింది.
నవ్వులు తగ్గాక....
రచన మళ్ళీ చెప్పడం మొదలెట్టింది-
"నా దుఃఖం చూసి భరించలేని మా నాన్నేమో అతన్ని చంపేస్తే గానీ నా దిగులు తగ్గి యింకో మగాడి మీదకి నా మనసు పోదని భ్రమపడి అతన్ని చంపేయమని ఓ హంతకుడిని పంపాడు" అంది కోపంగా.
ఆ హంతకుడిని నేనే" అన్నాడు మడ్డు కత్తి పట్టుకుని వున్న కసాయిరాం కత్తిని కింద పారేస్తూ.
"కానీ నేను మాజీ హంతకుడిని. ప్రస్తుతం పరివర్తన చెంది ప్రక్షాళనమయి, పశ్చాత్తాపపడి, జాతీయ జీవనస్రవంతిలో కలసిపోదలుచుకున్నాను.
ఇంతకుముందు వందమంది పీకలు కోసినా కూడా, ఇకముందు ఇంకెవర్నీ చంపనని ప్రామిస్ చేసినందుగ్గానూ గవర్నమెంటు నా నేరాలన్నీ మాఫ్ చేసేసి నాకో బంగ్లా, కారూ, ఇండస్ట్రీ పెట్టుకోవడానికి లోను యిస్తుందిట" అన్నాడు కసాయిరాం ఆనందంగా.
తర్వాత మళ్ళీ తనే అన్నాడు -
"అందుకే ఈ కుర్రాడిని మడ్డి కత్తితో అడ్డంగా నరికేయకుండా, సైతాన్ బాబుగారు చెప్పినట్లు కొండమీద అమ్మోరి గుడికి తెచ్చి అప్పగించా.
సైతాన్ బాబుగారు దేవుళ్ళాంటోడు.
తను ఇష్టపడిన పిల్లని తను చేసుకోకుండా, ఆ పిల్ల ఇష్టపడిన కుర్రాడికిచ్చి పెళ్ళి చేయాలనుకోవడం మాటలా ఏంటి?
ఆయన ఇన్ ఫ్లుయెన్స్ తోనే నేను మారిపోయి నా పేరు కాస్తా కసాయిరాం కాకుండా శాయిరాం అని మార్చేసుకున్నా" అన్నాడు.
వింటున్న సైతాన్ దారుణంగా సిగ్గుపడ్డాడు.
"నాదేవుంది! ఏదో ఉడతాభక్తిగా....." అని గొణిగాడు.
సితార తన చెవులని తఃనే నమ్మలేనట్లు వింటూ అభిమానంగా వీరభద్రం వేపు చూసింది.
వీరభద్రం మళ్ళీ అన్నాడు-
"మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారుగా! మిమ్మల్ని కలపాలనే కాస్త నాటకం ఆడా.
నేను జెయ్ చంద్రని లాకప్ లో పెట్టింది అందుకే!
అతను గనక బయట దొరికితే మంత్రి వెంకట్రావుగారు చంపేయిస్తాడని భయపడి అతన్ని జైల్లో పెట్టా" అన్నాడు.
"థాంక్స్ బావా!" అంది సితార కృతజ్ఞతా భారంతో కృంగిపోతూ.
"చాలా థాంక్స్! అయితే నా మీద నీకు గనక నిజంగా అంత అభిమానముంటే నేను చెప్పినట్లు వినాలి. అవునా?"
"అవును" అన్నాడు సైతాన్ సందేహంగానే.
"అయితే నీకు తగిన పిల్లని నేనే చూసి నీకు పెళ్ళి చేస్తా! కాదనకూడదు! ఏం?"
సైతాన్ ఏదో అనబోయేలోపల....
"సైతాన్ గారికి అభ్యంతరం లేకపోతే ఆయన్ని నేనే పెళ్ళి చేసేసుకుంటా. |
25,077 |
ఇందు వారసత్వ సూత్రము సహితము ఇమిడి ఉన్నది. భర్త గతించిన భార్య పునర్వివాహము చేసికొనకున్న భర్త ఆస్తి ఆమెకే చెందవలసిఉన్నది.
ఈ మంత్రము సతీసహగమనము సూచించుచున్నదని భ్రమ పడరాదు. ఇది స్త్రీకి ఆస్తిహక్కు కలిగించుచున్నదని గ్రహించవలెను.)
వినియోగము : భార్య సతి కాదలచనిచో ఈ మాత్రముచే ఆమెను పతి వద్ద నుంచి లేపునది.
2. నారీ! నీ భర్త యందు ప్రాణములు లేకున్నవి. లెమ్ము జీవలోకమున చేరుము. నీ భర్త బంధువులు ఇచట ఉన్నారు. వారిలో చేరుము.
(ఇచట సహితము చితి మాట లేదు. భర్త శవము వద్ద దుఃఖించుచున్న స్త్రీని ఓదార్చుటయే ఉన్నది.)
వినియోగము : 3-4 ఋక్కులచే చితి పక్కనుండి తీసికొనిపోవు గోవును అనుమంత్రించునది.
3. మరణించిన యువతి శవము వద్దకు తేబడుచున్న జీవిని చూచుచున్నాను. ఇది అంధకారము. అజ్ఞానముచే ఆవృతమై ఉన్నది. కావున దానిని శవమునకు అపాఙ్ముఖముగ చేసి నాకు అభిముఖముగ తెచ్చుచున్నాను.
4. గోమాతా! నీవు భూలోకమును తెలియుచున్నావు. దేవలోక మార్గములను తెలియుచున్నావు. ఇతడు నీకు స్వామి. సేవించుము. ఇతనిని స్వర్గ లోకమునకు చేర్చుము.
వినియోగము : పితృ మేధమున నాల్గవ నాటి సంచయన కర్మమున 5-6లచే ఓషధులను మంత్రించి వానిని పాలతో చేర్చి బ్రాహ్మణుని అస్థికలను అవసించయనము చేయునది. తాశ్చ ఓషధయః వేత సాశ్చ కర్ణీచ నదీఫేనంచ అవకాచ బృహద్ దూర్వాచ మండూక పర్జీచే త్యేవమాద్యాః
5. అగ్నీ! నీవు జలములందలి పిత్త ధాతువవు. నిన్ను నది నురగ, వేతసము బృహ దూర్వ చే శాంతింపచేయుచున్నాము.
6. అగ్నిదేవా! నీవు భస్మము చేసిన వానికి మరల సుఖములు కలిగించుము. ఈ దహన ప్రదేశమున క్యాంబు మొక్కలు మొలుచునుగాక. బృహద్ దూర్వా వ్యాపించునుగాక.
వినియోగము : ఆహితాగ్ని ప్రేతము ముందు మూడు అగ్నులను చేర్చి దీనిచే అనుమంత్రించునది.
7. ప్రేతమా! నీకు గార్హపత్యాగ్ని ఒక జ్యోతి, అన్వహార్య పచనాగ్ని రెండవ జ్యోతి, ఆహవనీయాగ్ని మూడవ జ్యోతి యగుచున్నది. నీవు ఈ మూడింటి సమ్మేళనమున చేరుము. అట్టి మూడు జ్యోతుల దేహివై వర్ధిల్లుము. దేవతలకు ఇష్టుడవై ఉండుము.
వినియోగము : 8,9 మంత్రములచే శ్మశానమునకు తీసికొని పోవుటకు శవమును ఎత్తునది.
8. లెమ్ము - కదులుము - సాగుము. అంతరిక్షమున వసతి ఏర్పరచుకొనుము. అచట నీవు పితరులతో చేరి సోమము, స్వధలు సేవించి ఆనందించుము.
9. ప్రేతమా! నీ తనువును సరిచేసికొనుము. అవయవములను దేహమునువిడువకుము. నీ మనసుకు నచ్చిన చోట ప్రవేశించుము. భూమిని చేరి సుఖించుము.
వినియోగము : పిండ పితృ యజ్ఞమున దీనిచేతను మరుసటి సూక్తపు మొదటి మంత్రము చేతను ఆచమనము చేయునది.
10. సోమపాయులగు పితరులు నాకు వర్చస్సును, దేవతలు మధు ఘృతములను కలిగింతురుగాక. మంచి చూపు కలిగించి వార్ధక్యము వరకు మంచి ఆకలి కలిగించి వర్ధిల్ల చేయుదురుగాక.
రెండవ సూక్తము - 14
వినియోగము : 1. మొదటి సూక్తము పూర్వ సూక్తమున చెప్పబడినది.
2. పిండ పితృ యజ్ఞమున కర్త హస్త ప్రక్షాళనము చేయునది.
3. పితృ విసర్జనము చేయునది.
7. శవదహనము నాటి రాత్రి కుండను పగులుకొట్టువాడు జపించునది.
8. పిండ పితృ యజ్ఞమున పిండముల ఘృతాభిఘారము చేయునది.
9. పితృ దేవతా భూత సోమాంజన లింగముచే పిండాభిఘారమున.
1. అగ్ని నాకు వర్చస్సు కలిగించునుగాక. విష్ణువు మేధస్సును ప్రసాదించునుగాక. విశ్వే దేవతలు నన్ను ధనమునందు స్థాపింతురుగాక. జలము, వాయువు శుభములు కలిగింతురుగాక.
2. మిత్రావరుణులు మాకు వస్త్రాదులు ప్రసాదింతురుగాక. ఆదిత్యులు స్వరములను వర్ధిల్ల చేయుదురుగాక. ఇంద్రుడు కాంతిని, సవిత జీర్ణ శక్తి గల దీర్ఘాయువును ప్రసాదింతురుగాక.
3. యముడు మర్త్యులను తొలుత చంపినవాడు. తొలుత ఈ లోకములను దర్శించినవాడు. అతడు వివస్వత పుత్రుడు. ప్రాణుల అంతిమగమ్యము. అట్టి యమరాజునకు హవిస్సులు అర్పించండి.
4. పితరులారా ! మేము అర్పించు మధుర యజ్ఞమును స్వీకరించండి. తృప్తులు కండి. మరలండి. మరల పిలిచినపుడు విచ్చేయండి. మాకు శుభప్రద ధనమును, పుత్ర పౌత్రాదులను ప్రసాదించండి.
5. కణ్వుడు, కక్షీవంతుడు, పురుమీఢుడు, అగస్త్యుడు, శ్యావాశ్వుడు, సోభరి, అర్చనానుడు, విశ్వామిత్రుడు, జమదగ్ని, అత్రి, కశ్యపుడు, వామదేవుడు మమ్ము రక్షించెదరు గాక.
6. విశ్వామిత్ర, జమదగ్ని, వసిష్ఠ, భరద్వాజ, గోతమ, వామదేవులు, మాకు సుఖములను ఇత్తురుగాక. అత్రి మా గృహమును రక్షించుచున్నాడు. పితరులకు నమస్కారము. వారు మమ్ము రక్షింతురుగాక.
7. శ్మశానమున కలిగిన బంధు మరణదుఃఖమును శవస్పర్శ పాపమును ఇచటనే విడిచి వెళ్లుచున్నాము. మాకు దీర్ఘాయువు కలుగునుగాక. మేము పుత్ర, పౌత్రా, ధనాదులతో వర్ధిల్లుదుముగాక. మా గృహములు సురభిళములు అగునుగాక.
8. క్రతువును చేసినపుడు అంజన, వ్యంజన, సమంజన, నవనీత అభ్యంజనలు చేయండి. చంద్రుడు ఉఅదయించుచున్నాడు. సముద్రము ఉచ్ఛ్వసించుచున్నది. కిరణములు జగమును చూచుచున్నది. అవి స్వర్ణపాద పశువులను కలిగించుచున్నవి.
9. పితరులారా! మీ వద్ద మోదము కలిగించు సోమము ఉన్న మమ్ము దానితో కూర్చుండి. మీరు యశోధనులు కదా!
మీరు గతించిన వారు. విద్వాంసులు. సుదాతలు. శోభన జ్ఞాన సంపన్నులు. యజ్ఞములందు మా ఆహ్వానములను ఆలకించండి.
10. పితరులారా! మీరు అత్రి, అంగిరస, నవగ్వ, ఇష్టావంత, రాతిషాచగోత్రజులు. మీరు దక్షిణలిచ్చువారు. పుణ్యాత్ములు. కుశాసనముల మీద ఆసీనులు కండి. మా హవిస్సులను ఆనందించండి.
మూడవ సూక్తము - 15
వినియోగము : 1- 4 ప్రేతోపస్థానమున.
5 మొదలు 10 మంత్రములచే ప్రేత దేహమునకు అగ్ని దానానంతరము ఆజ్యముతో సారస్వత హోమములు చేయునది.
5 మొదలు కొని 11 మంత్రములచే శ్మశాన చయన కర్మమున ఘృతాహుతులు ఇచ్చునది.
1. అగ్నిదేవా! మా ప్రాచీన పితరులు యజ్ఞములు చేసి మహామహులు అయినారు. వారిని నీవు ప్రకాశమాన స్వర్గమునకు చేర్చినావు. ఉక్థములు గానము చేయు పితరులు రాత్రి అంధకారమును వారి తేజస్సుచే తొలగించి అరుణ ఉషస్సులను ప్రకాశింపచేయుచున్నారు.
2. పితరులు పుణ్యాత్ములు దీప్తివంతులు. దేవయంతులు. కమ్మరి ఇనుమును శుద్ధి చేసినట్లు తపముచే కాంతిమంతులయినవారు. అగ్నిని, ఇంద్రుని వర్ధిల్లచేయువారు. వారు మా ఇంటి నిండ గోసమూహములను కలిగింతురుగాక.
3. పశువుల మందయందు వలె దేవతలందు చేరిన ఈతడు దేవతల ప్రాదుర్భావమును దర్శించునుగాక. ఈతడు మర్త్యుడుయ్యు ఊర్వశ్యాది స్వర్గసుఖములు అనుభవించుచున్నాడు. మరల మానవగర్భమున వర్ధిల్లుచున్నాడు.
4. అగ్నిదేవా! మేము నిన్ను సేవించుచున్నందున యజ్ఞవంతులము అగుదుముగాక. ఉషస్సులు మమ్ము ప్రకాశింపచేయునుగాక. విశ్వేదేవతలు రక్షించిన కర్మలే భద్రములు అగుచున్నవి. మేము పుత్రవంతులమై మహాస్తుతులు చేయుదుముగాక.
5. క్రింద భూదానము చేసినవానికి పైన ఉన్న స్వర్గమున రక్షణ కలిగినట్లు మరుత్ సహిత ఇంద్రుడు తూర్పు దిశన మమ్ము రక్షించునుగాక.
"లోకకృతః పథికృతో యజామహే యేదేవానాం హుతభాగా ఇహస్థ ||"
లోకములను సృష్టించిన వారిని, మార్గములు ఏర్పరచినవారిని యజించుచున్నాము. దేవతల హుత భాగములు ఈ పితృ మేధమున చేరునుగాక.
6. క్రింద భూదానము చేసిన వారికి పై స్వర్గమున రక్షణ కలిగినట్లు ధాత నిరృతి యుక్తుడై దక్షిణ దిశన మమ్ము రక్షించునుగాక.
"లోకకృతః......."
7. క్రింద భూదానము చేసినవానికి పైన స్వర్గమున రక్షణ కలిగినట్లు ఆదిత్యుల సహితయై అదితి మమ్ము పడమటి దిశన రక్షించునుగాక
"లోకకృతః......."
8. క్రింద భూదానము చేసిన వానికి పైన స్వర్గమున రక్షణ కలిగినట్లు విశ్వేదేవ సహిత సోముడు మమ్ము ఉత్తర దిశన రక్షించునుగాక.
"లోకకృతః........"
9. పైన ఉన్న ద్యులోకము భానుడగు సవితను ధరించిన రీతి ధర్త ధరుణి సహితుడై నిన్ను పోషించునుగాక.
"లోకకృతః......"
10. దిగువన భూదానము చేసిన వానికి పైన స్వర్గము అందినట్లు ప్రాగ్దిశన నీకు పూర్వ సంచిత స్వధ అందుచున్నది.
"లోకకృతః........."
నాలుగవ సూక్తము - 16
వినియోగము : 1 - 5 ఘృత హోమమున - అభిమంత్రణమున
1. భూదానము పైన స్వర్గమును కలిగించినట్టు దక్షిణ దిక్కున నీకు పూర్వ సంచిత స్వధ అందించుచున్నాను.
"లోకకృతః........"
2. భూదానము పైన స్వర్గము కలిగించినట్లు పశ్చిమ దిశన నీకు పూర్వ సంచిత స్వధ అందించుచున్నాను.
"లోకకృతః.........."
3. భూదానము పైన స్వర్గము కలిగించినట్లు ఉత్తర దిశన నీకు పూర్వ సంచిత స్వధ అందించుచున్నాను.
"లోకకృతః............."
4.భూదానము పైన స్వర్గము కలిగించినట్లు ధ్రువ దిశన నీకు పూర్వ సంచిత స్వధ అందించుచున్నాను.
"లోకకృతః........."
5. భూదానము పైన స్వర్గము కలిగించినట్లు ఊర్థ్వ దిశన నీకు పూర్వ సంచిత స్వధ అందించుచున్నాను.
వినియోగము : సోమయాగమున హవిర్ధాన శకటము చేరినంత 6-7 మంత్రములచే అభిమంత్రణ చేయునది.
6. అగ్నీ! నీవు ధర్తవు. ధరుణవు. వంసగవు.
7. ఉదకమును పూరింపుము. మధువును పూరింపుము. వాయువును పూరింపుము.
8. మమ్ము ఇచట రక్షించండి. అచట రక్షించండి. కవలల వలె కలసిసాగండి. దేవతల అనుగ్రహము ఆశించు నరులు మీకు హవి అర్పించినపుడు మీ స్థానములను తెలిసి ఆసీనులుకండి.
|
25,078 |
ఉన్నవాళ్ళను చెప్తేచాలదూ? చచ్చినవాళ్ళ గురించి చెప్పడం ఎందుకూ? మనసులోనే విసుక్కుంది ప్రతిభ. "కామ్రేడ్ మరోసారి చెప్పండి" ముడిచిన వేళ్ళను వదిలి మళ్ళీ ముడవడానికి సిద్ధం అయి అన్నది ప్రతిభ. సత్యం గుడ్డి వెలుగులో ప్రతిభ ముఖంలోకి చూశాడు. అది గమనించనట్టే కొరియర్ కేసి చూడసాగింది ప్రతిభ. కొరియర్ మళ్ళీ చెప్పాడు. "రాయుడి చావడి ఇంటికి ఏ వైపున వున్నది?" సత్యం అడిగాడు. "దక్షిణ పక్కన ప్రహరీగోడకు ఆనుకొని చావిడి వున్నది." "చావిడికి ఇంటికీ మధ్య వున్న గోడ ఎంత ఎత్తున ఉంటుంది?" ప్రతిభ. ఈసారి ప్రతిభ సత్యంకేసి చూసి నీళ్ళు మింగినట్టు చేసింది. "చెప్పానుగా నిలువున్నర వుంటుందనీ!" ప్రతిభ ముఖం వెలవెలా బోయింది. ఎప్పుడు చెప్పాడు? నిలువున్నర అంటే? సత్యం ప్రతిభ అవస్థను అర్ధం చేసుకున్నాడు. "అంటే దాదాపు తొమ్మిది అడుగులు వుంటుంది" అన్నాడు. "అవును! అంతే వుంటుంది" అన్నాడు కొరియర్. "జీతగాడు ఎక్కడ పడుకుంటాడూ?" సత్యం కొరియర్ని ప్రశ్నించాడు. "డాబాముందు వరండాలో పడుకుంటాడు." "చావిడి వెనక వుంటే అతను ముందు పడుకుంటాడా? గొడ్లకు మేతవెయ్యడం, చావిడికి కాపలా కాయడం జీతగాడి పనేకదా?" "అవును అదంతా జీతగాడే చూసుకుంటాడు." "అయితే ముందు వరండాలో ఎందుకు పడుకుంటున్నట్టు?" సత్యం సాలోచనగానే అన్నాడు. కొరియర్ ఆలోచనలో పడ్డాడు. "మామూలుగా జీతగాడు చావిట్లోనే పడుకుంటాడు." "వరండాలో పడుకుంటాడని ముందు చెప్పావుగా?" ప్రతిభ పెద్ద పాయింట్ లేవదీసింది. "అక్కడా ఇక్కడా కూడా పడుకుంటాడు." కొరియర్ అయోమయంలో పడిపోయాడు. "కామ్రేడ్ ఇది నువ్వు సరిగ్గా గమనించినట్టు లేదు. మీరు చెప్పినదాన్ని బట్టి నాకు తోచింది ఇది. లోగడ చావిట్లో పడుకునే జీతగాడు, ఇప్పుడు వరండాలోకి మారాడంటే, రాయుడు ఇంటికి కాపలాపెట్టుకున్నాడు కాబోలును. ఆ పరిస్థితుల్లో జీతగాడు తలుపు తియ్యడు. ముందు రాయుడికి తెలియచేస్తాడు. మొదట్నుంచీ జీతగాడు వరండాలోనే పడుకుంటూ వుంటే, అతనే తలుపు తెరిచే అవకాశం వున్నది." సత్యం ఆగి కొరియర్ ముఖంలోకి చూసి "ఏమిటి కామ్రేడ్? మీరేదో చెప్పాలనుకుంటున్నట్టున్నారు?" అన్నాడు. "జీతగాడి తండ్రి లోగడ చావిట్లో పడుకునేవాడు." "మరి ఇప్పుడు అతడేమయ్యాడూ?" దళ సభ్యుడు పాండురంగం అన్నాడు. అంతగా మాట్లాడని పాండురంగం మాట్లాడేసరికి, ప్రతిభ చివ్వున తలతిప్పి చూసింది. పాండురంగంలో ఓర్పు సన్నగిల్లిపోతున్నట్టు గ్రహించింది. "కోడెదూడ రొమ్ములో పొడిచింది." "అంటే?" ప్రతిభ ఆదుర్దాగా అడిగింది. "రాయుడి దగ్గర మొనగాడైన కోడెదూడ వుంది. అర్రుచేయడానికి కంప కట్తుంటే కుమ్మేసింది. దూడ చాలా పొగరుబోతుది." "ఊ అయితే?" అసహనంగా అడిగింది ప్రతిభ. "ఇంకా అయితే గియతే ఏంటమ్మా? నెత్తురు కక్కి మూడోనాటికి చచ్చాడు ముసలాడు!" "ఘోరం! రాయుడు మరి కాంపన్ సేషన్ ఇచ్చాడా?" ప్రతిభ సీరియస్ గా ముఖంపెట్టి అడిగింది. "ఏమీ ఇవ్వలా!" "మనవాళ్ళు ఈ సమస్యమీద ఉద్యమం లేవదీసి వుండాల్సింది." "రాయుడు మనుషుల్ని చంపి పాతేస్తే అడిగే దిక్కులేదు. ఎద్దు పొడిచి చస్తే అడిగేదెవరమ్మా?" "రాయుడు తన పాపాలకు ఈ రాత్రి శిక్ష అనుభవించబోతున్నాడు. వాడి దౌర్జన్యానికి గురైన ప్రజలకు విముక్తి ప్రసాదించబోతున్నాం. ఈ ఊళ్ళో రేపు పొడిచే సూర్యుడు-" "ప్రతిభా! ఇది ఉపన్యాసాలిచ్చే సమయం కాదు!" సత్యం కేసి చూసి సిగ్గుపడింది ప్రతిభ. సత్యం కొరియర్ కేసి తిరిగి అడిగాడు -"చావిడికీ ఇంటికీ మధ్య గుమ్మం వుందా లేకా పెణ్ణెం వుందా?" "గుమ్మమే వుంది. కాని తలుపులు సరిగాలేవు. ఒకటే రెక్క వుంది. రెండోది విరిగిపోయి వుంది." "గుడ్! చావిట్లోకి మార్గం?" "తేలిగ్గా వెళ్ళొచ్చు. రేకు తలుపులపైనుంచి దూకి వెళ్ళొచ్చు!" "ఓ.కే.! కామ్రేడ్స్!" సత్యం దళసభ్యుల్ని వుద్దేశించి చెప్పసాగాడు. అందరూ శ్రద్ధగా వింటున్నారు. దాడి, ఎత్తుగడ, ఎవరెవరు ఏ యేస్థానాల్లో వుండాలో ఏమేమి చెయ్యాలో సత్యం వివరించాడు. గుడ్డి దీపం వెలుగులో సత్యం చేతివాచీ చూసుకున్నాడు. పదకొండు గంటల ఐదు నిముషాలు అయింది. సత్యం లేచి నిలబడ్డాడు. అతనితోపాటు దళ సభ్యులూ, కొరియర్ లేచారు. "కామ్రేడ్స్! మహత్తరమైన విప్లవ కర్తవ్యాన్ని నెరవేర్చబోతున్నాం. సందేహాలకూ, సంశయాలకూ తావులేదు. బలవంతుడూ, కసాయివాడూ, పరమదుర్మార్గుడైన శత్రువును ఎదుర్కోబోతున్నాం. ఏరియాకమిటీ మనకిచ్చిన కార్యక్రమాన్ని అమలు జరిపి మన విప్లవచైతన్యాన్ని సమరశీలతను, మనం దళం మరోసారి రుజువు చేసుకో బోతున్నది. మహనీయుడు, యుగపురుషుడూనైన చైర్ మన్ మావో సిద్ధాంతాలనూ, సూక్తులనూ మరోసారి మననం చేసుకొని విప్లవ కార్యక్రమంలో ముందుకు సాగిపోదాం. మార్చ్!" సత్యం ముందుకు నడిచాడు. దళసభ్యులు అతన్ని అనుసరించారు. కొరియర్ సత్యం పక్కన నడుస్తున్నాడు. కాలవ దగ్గిర కొచ్చారు. కాలవమీదున్న తాటిబోదెలమీదుగా కాలవ దాటారు. తాటి బోదెల మీద నడుస్తూ పక్కకు ఒరిగిన ప్రతిభ చటుక్కున ముందు నడుస్తున్న సత్యాన్ని పట్టుకొని నిలదొక్కుకున్నది. కాలవ పక్క డొంకలో నడుస్తున్న ప్రతిభ క్షణక్షణం ఉద్విగ్నురాలై పోతున్నది. మరో అర్థగంటలో ఊరు వస్తూంది. మరో పది నిముషాల్లో రాయుడి చావిడి - మరో ఐదు నిముషాల్లో - రాయుడు తుపాకితో ఎదురుగా నిలబడ్డాడు. తుపాకీకి ఎదురుగా తను నిలబడింది. రాయుడు తుపాకి కింద పారేసి పారిపోతున్నాడు. పిరికిపంద! నిరాయుధుల్ని నిర్దాక్షిణ్యంగా చంపే రాయుడు తనముందు గజగజ లాడిపోతున్నాడేం? సాయుధుడైన విప్లవకారుడి ముందు శత్రువు ఆయుధం పని చెయ్యదు. వాడికి కాళ్ళు వణుకుతై. పారిపోతున్న రాయుణ్ణి వెన్నంటి తరిమింది. గుండెలమీద తుపాకి ఎక్కుపెట్టి రాయుడి ముఖంలోకి చూసింది. చంద్ర నిప్పులు చెరిగే వాడి కళ్ళు వడగళ్ళలా అయిపోయినయ్. నేలకు వంగి తన కాళ్ళు పట్టుకున్నాడు. మెలి తిరిగిన మీసాల వెనక వున్న అహంకారం ఏమైంది? రాయుడి మీసాలు రొయ్య మీసాల్లా జారిపోయినయ్. ప్రాధేయపడుతున్నాడు. ప్రాణభీతితో అల్లాడిపోతున్నాడు. పెడరెక్కలు విరిచి రాయుడు కొడుకుని రాయుడి పక్కన నిలబెట్టాడు పాండురంగం. రాయుడి మనవడ్ని రెక్కలు పట్టుకొని తెచ్చాడు. మరో కామ్రేడ్. "పిరికిపంద! లేచి నిలబడు" తను అరిచింది. అదిరిపడి లేచి నిలబడ్డాడు రాయుడు. తనచేతిలో తుపాకి పేలింది. కుంభకర్ణుని కాయంలా రాయుడు కిందపడ్డాడు. తుపాకీ మళ్ళీ పేల్చింది. రాయుడి కొడుకు రావణాసురుడి కొడుకు మేఘనాథుడిలా ఎగిరి నేలకూలాడు. ఇంకొకడు వున్నాడు! ఋణశేషం! శత్రుశేషం! వాడు వుండకూడదు. ఏడీవాడు? ఎక్కడ ఆ బుడ్డోడు? శత్రుసంహారంలో దయాదాక్షిణ్యాలుండకూడదు. ఎదురుగా పసివాడు తన కళ్ళలోకే చూస్తున్నాడు. వాడి కళ్ళలో భయంలేదు. ఏదోతమాషా ఆట చూస్తున్నట్టు చూస్తున్నాడు. |
25,079 |
"స్టేషన్ కి నువ్వు వస్తావో రావోనని తెగ భయపడిపోయేను మావయ్యా. అసలే ఊరు కొత్తగదా!" వామనరావు సులోచన కళ్ళజోడు తీసుకుని, గబగబావచ్చి, ఆ కళ్ళజోడు సులోచనకు తగిలించేడు. అప్పటిగ్గాని సులోచన పరిస్థితి అదుపులోకి రాలేదు. కళ్ళజోడు సర్దుకుంటో అన్నది. "థాంక్స్ మావయ్యా, కళ్ళజోడు లేకపోతే ఏ స్థంభానికో డేష్ కొట్టేసేదాన్ని. ఒకనాడేమైందో తెలుసా." సులోచన చెయ్యి పట్టుకుని అన్నాడు వామనరావు. "ఒకనాడేమైందో వదిలేయ్ ఇకముందు కావల్సిందే ఇంపార్టెంట్. అయ్ టెల్యూ. నీకు కళ్ళజోడు లేకపోతే కళ్ళు కనిపించవని శేషుకి తెలీకూడదు. అంచేత వాడు ఇంట్లో వున్నప్పుడు కళ్ళజోడు పారేసుకోవద్దు." జోడు సర్దుకుంటూనే అనేసింది. "అట్లాగట్టాగే"
27
వామనరావు ఇల్లు, లేడి పిల్లలా ఛెంగుఛెంగున దూకుకుంటో 'బావా' 'బావా' అంటూ వస్తోంది సులోచన. బావా అంటూనే మేడ మెట్లెక్కుతుండగా సింహాచలం కిందికి దిగుతున్నాడు. అనుకోకుండా ఇద్దరూ డేష్ ఇచ్చేసుకున్నారు. ఆ డేష్ యిచ్చుకున్న ప్రేమ ప్రీజైపోయింది. ఇప్పుడు ఇంకో బొమ్మ. ఈ బొమ్మలో కూడా సులోచనా సింహాచలంలు చేహ్తిలో పుస్తకాల్తో డేష్ కొట్టుకున్న దృశ్యమే కనుపిస్తోంది. దొక కాలేజి అని తెలీజేసే బోర్డు కూడా కనిపిస్తోంది. ఇప్పుడు మేడమెట్లమీద ఫ్రీజు రిలీజయ్యింది. కళ్ళజోడు చాలా ఉత్సాహంగా సర్దుకుంటో అనేసింది. సులోచన. 'అబ్బ! మళ్ళా ఎన్నాళ్ళక్కలుసుకున్నాం?" సింహాచలం గంభీరంగా అన్నాడు. "ఇంకా గుర్తున్నానా సులోచనా?" చాలా ఉత్సాహంగానే చెప్పేసింది. "అయ్యయ్యో! క్లాసుమేట్స్ మి గదా. అంత చప్పున మరిచిపోతే పాపంకాదూ? పైగా, నా కళ్ళజోడు లాగి అల్లరి పెట్టినందుకు ఆ వంకాయ బజ్జిగాడ్ని-వాడి పేరేమిటమ్మా!" "విక్టర్!" "అవునవును. విక్టరే! ఆ దొంగ సచ్చినోడ్ని మంగినిపూడి సముద్రంలో ముంచి ముప్పైమూడు చెరువుల నీళ్ళు తాగించేవు." "ఆ తర్వాత నన్ను అరవైఆరు చెరువుల నీళ్ళు తాగించేడు." "అది నేను చూళ్లేదులే! నా కోసం రౌడి వెధవతో ఫైట్ చేసిన వాడివి-నిన్నెట్లా మర్చిపోతాను? అవునూ-నువ్విక్కడున్నా వేమిటి!" సింహాచలం ఏదో సమాధానం చెప్పబోతుండగా మేడ మీదనించి శేషు "హాయ్ సులోచనా!" అని పిలిచేడు. అతని పిలుపుకి 'హాయ్ బావా!' అంటూ మేడ ఎక్కబోతుండగా కళ్ళజోడు పడిపోయింది. ఆ సమయానికి లావుపాటి పని మనిషొకడు మెట్లు దిగుతున్నాడు. సులోచన గంభీరంగా అతని దగ్గరికి వెళ్లి-అతని చేతిని పుచ్చుకుని అంటోంది. "పూచిక పుల్లలాగ వుండేవాడివి. పూరీలాగా ఉబ్బిపోయావు బావా!" పనిమనిషి తెల్లమొహం వేసేడు. ఆ వేళకి సింహాచలం కళ్ళజోడు తెచ్చి సులోచన కళ్ళకి తగిలించేడు. సులోచన పరిస్థితి గమనించి సింహాచలానికి కళ్ళతోనే థాంక్స్ చెప్పింది. పనిమనిషి, సింహాచలం మేడ దిగేసేరు. శేషు సులోచన దగ్గిరకొచ్చి, ఆమెను మేడమీదికి తీసుకెడుతూ అన్నాడు. "నువ్వెందుకు కిక్కడికి వొచ్చేవో తెలుసా?" కళ్ళజోడు గట్టిగా పట్టుకుని తెలీదన్నట్టు తలూపింది. సులోచనను ఒకచోట నిలబెట్టి అన్నాడు శేషు. "చాలా అర్జంటుగా మనిద్దరికీ పెళ్ళి చేయాలనుకుంటున్నారు పెద్దవాళ్ళు!" ఆశ్చర్యపోతూ కోపంగా అనేసింది. "ఏవిటీ? మనిద్దరికీ పెళ్ళా? ఛీ ఛీ!" కుతూహలంగా అడిగేడు శేషు? "ఏవన్నావ్?" "ఛీ...ఛీ...అన్నాను!" "థాంక్యూ! కీపిటప్! మనిద్దరం సుఖపడిపోతాం!" అన్నాడు శేషు.
28
ఆఫీసు గదిలో శేషు తలదువ్వుకోడం పూర్తి చేసుకుని కారు తాళంచెవులు విష్ణు చక్రమల్లె తిప్పుకుంటో ఈల వేసుకుంటో గదినుంచి బయటకు రాబోతుండగా. వామనరావు సులోచనతో ఆ గదిలోకి వచ్చేడు. కొడుకు అవతారాన్ని పరీక్షించి అన్నాడు. "ఎక్కడికో వెళ్ళబోతున్నట్టున్నావ్?" శేషు తత్తరపడుతూ అన్నాడు. "కలకత్తా నుంచి ఒక పార్టీ వచ్చింది!" "అర్జంటుగా వెళ్ళాలా?" ఇప్పటికే ఆలస్యమైపోయింది నాన్నా! అసలే జయ చిరాకు మనిషి!" "జయ-జయ ఎవరు!" "అదేనాన్నా! కలకత్తా పార్టీ! జయసింహ!" "ఏ సింహమయినా సరే కేన్సిల్ దట్ ప్రోగ్రాం!" "నాన్నా!" వామనరావు సీరియస్ గా అన్నాడు. "అయ్ టెల్యూ-నీకోసమే సులోచన ఈ ఊరొచ్చింది. వచ్చి మూడు రోజులైనా, మూడంటే మూడు. కనీసం మూడు నిమిషాలైనా సులోచన్తో మాట్లాడేవా? (ఆగి అన్నాడు) రాత్రిళ్లు బావా బావా అని కలవరిస్తోంది కూడాను." సులోచన ఖంగారుగా అనేసింది. "నేనెప్పుడు కలవరించేను?" వామనరావు సులోచనవేపు హెచ్చరికగా చూస్తూ అన్నాడు. "కలవరించేవాళ్ళకి కలవరింతలు వినిపించవు. వదిలేయ్. (శేషుతో) హైదరాబాదుకి రావడమిదే మొదటిసారిట. (సులోచనతో) చెప్పమ్మా! ఏం చూడాలనుకుంటున్నావో అవన్నీ చెప్పెయ్!" సులోచన కళ్ళజోడు గట్టిగా పట్టుకుని గబగబా చెప్పేసింది. "తాజ్ మహల్, కుతుబ్ మినార్, బీచి" "హైదరాబాదులో అల్లాంటివేమీ వుండవు" వామనరావు సర్ది చెప్పేడు. "ఆ మాత్రం తెలీకుండానే అడిగిందనుకుంటున్నావా? అదంతా నీ మీద కోపంరా! నథింగ్ బట్ ఆంగ్రీ! వెళ్ళెళ్ళు. అమ్మాయికి ఊరంతా చూపించి తీసుకురా! ఊ..." శేషు సులోచన వేపు కసిగా చూసి కదిలేడు. సులోచన అతన్ని అనుసరించింది. రోడ్డు మీద కారు జోరుగా పోతోంది. |
25,080 | "నీకేమైనా మతిపోయిందా? మా కంపెనీ కోటిరూపాయల్ది."
"అయ్యుండచ్చు. కానీ, గత పది సంవత్సరాలుగా ఒక రూపాయి కూడా సభ్యులకి లాభం పంచలేదు. షేరు ధర పదోవంతు కూడా లేదు మార్కెట్ లో-"
శర్మ ఆలోచనలో పడ్డాడు. ఇందులో ఏదైనా తిరకాసు వుందా అని రవి అన్నాడు- "చూడండి నిజానికి నెలకి పదివేలు అంటే నేను ఎగిరి గంతేసి వప్పుకోవాలి. కానీ మీ షేర్లు ఎందుకు అడుగుతున్నాను? మీలో ఒకడిగా కలిసిపోవటానికి! అప్పుడే నాకూ పనిచేయాలన్న తపన వుంటుంది. అయిదు శాతం షేర్లవల్ల నాకు తిండికి సరిపోయే డబ్బుకూడా వస్తుందని నేను అనుకోను." రవి తన కంపెనీ గురించి ఇంత స్టడీ ఎప్పుడు చేశాడో అర్ధంకాలేదు. అతడు అన్ని కంపెనీలనీ అలాగే స్టడీ చేస్తున్నాడని మాత్రం తెలీదు. ఏమైతేనేం, వర్మ కొంచెం ఆలోచించి, వప్పుకున్నాడు మొత్తానికి.
అలా రవి తేజా టెక్స్ టైల్స్ లో షేర్ హోల్డర్ అయ్యాడు.
ఆ రోజునుంచీ తేక కంపెనీ పరుగు మొదలు పెట్టింది. మొత్తం కంపెనీ అంతా కాదు. కేవలం ఆప్లిక్ విభాగం దానికి అధిపతి రవి. ఆ ఒక్క విభాగం లాభాలే మొత్తం కంపెనీ పోషించవలసిన స్టేజి వచ్చింది. ముందెక్కడో చెప్పినట్టు 1978-79 లో ఈ ఆప్లిక్ వర్క్ ఆంద్రదేశాన్ని వూపేసింది.
తేజా టెక్స్ టైల్స్ కంపెనీలో అరవై శాతం పైగా షేర్లు శర్మవే. ఆయనకీ వున్న గుర్రప్పందేల పిచ్చి మిగతా డైరెక్టర్లకి తలనొప్పిగా వుండేది. కంపెనీ మూలధనాన్ని ముట్టుకునేవాడు కాదు. కానీ లాభాలన్నీ గుర్రాలమీద పెట్టేవాడు. అందువల్ల అభివృద్ధి కుంటుపడింది. ఎన్నో సంవత్సరాల్నుంచీ ఇది జరుగుతూ వుంది. రవి, తన బాధ్యతని ఒక యజ్ఞంలా నిర్వహిస్తూ వచ్చాడు. ఆర్నెల్లలో అతడు మొత్తం మార్కెట్టు చదివాడు. బోంబేడైయింగ్, విమల్ లాంటి కంపెనీల షేర్లు రోజురోజుకీ ధర పెరుగుతున్నాయి. కేవలం తమ కంపెనీదే పెరగటం లేదు. దీనికి కారణం అందరికీ తెలుసు. కానీ ఎవరూ ఏమీ చెయ్యలేరు. సంవత్సరం గడిచింది. ఈ లోపులో అతడు తేజా టెక్స్ టైల్స్ వెనుక ఒక బలమైన శక్తిగా రూపొందాడు.
ఇలా వుండగా ఒకరోజు చిత్రమైన సంఘటన జరిగింది.
'ప్రేమ మంజరి' అనే గుర్రం గెలుస్తుందని శర్మకి నిశ్చయంగా తెలిసింది. దానిమీద ఇరవై లక్షలు కాద్దామని దృఢనిశ్చయంతో వున్నాడు. కానీ డబ్బులేదు. ఎన్ని విధాలో ట్రై చేశాడు. షేర్లు కుదువపెడదామనుకున్నాడు కూడా. కానీ మార్కెట్ లో ఆ షేర్లని తనఖా పెట్టుకోవటానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. కాలు గాలిన పిల్లిలా తిరగసాగాడు.
సరీగ్గా అప్పుడు మిగతా డైరెక్టర్లతో కలిసి రవి అతడికో పరిష్కారం సూచించాడు.
తేజా టెక్స్ టైల్స్ 'ఒక్కరోజు' కోసం శర్మకి ఇరవై లక్షలు అనధికారంగా అప్పు ఇచ్చేటట్టూ, ఆ గుర్రం ఓడిపోయిన పక్షంలో శర్మ తన షేర్లన్నీ వదిలేసుకొనేట్టూ, గెల్చిన పక్షంలో ఇరవైశాతం కంపెనీకి దానంగా ఇచ్చేటట్టూ....
శర్మకి ఈ ప్రపోజల్ అర్ధంకాలేదు. డైరెక్టర్లందరూ కూర్చున్నారు. వాళ్ళ ఇంటిలో, క్రిందహాల్లో ఈ సమావేశం జరిగింది. "మీరేం చెపుతున్నారో నాకు అర్ధంకావడంలేదు. ఇరవై లక్షలకి నా అరవై శాతం వదులుకుని, మొత్తం తేజా టెక్స్ టైల్స్... నేను స్థాపించింది దాంతో సంబంధాలు తెగతెంపులు చేసుకోవాలా?"
"గుర్రం ఓడిపోతే అంతే" అన్నాడు రవి. "....అసలు గుర్రం ఓడిపోతే 'తేజ' అన్న కంపెనీయే వుండదు, ఇక తెగతెంపులు ప్రసక్తి ఏముంది?"
"అదేమిటి?"
"అవును బట్టల తయారీకి స్థాపించిన ఫ్యాక్టరీ తాలూకు డబ్బుని ఈ విధంగా గుర్రప్పందాల్లో పోగొట్టుకున్నామని ఏ ఒక్క సభ్యుడు పోలీసు కంప్లెయింటు యిచ్చినా అంతా జైల్లో వుంటాం. ఎవరికీ ఏడు సంవత్సరాలకి తక్కువ శిక్ష పడదు. ఇక తేజా కంపెనీ ఏముంటుంది?"
శర్మకి అతడు చెపుతున్నది అర్ధం అయింది.
"ఒకవేళ గెలిస్తే?"
"గెలిస్తే ఆ ఇరవై లక్షల మీదా మీకో ముఫ్ఫై లక్షలు లాభం వస్తుంది. లాభం మీరుంచుకోండి. మీకీ సాయం చేసినందుకు మాకు ఇరవై శాతం షేరు 'దానం' 'చేస్తున్నారు. అంతే!"
"అంటే 60% నుంచి నా షేరు 40% తగ్గిపోతుంది. కంపెనీ వ్యవహారాల్లో నాకే మాత్రం పలుకుబడి వుండదు. అంతేగా." ఎవరూ మాట్లాడలేదు. తన గుర్రాల బలహీనతని అవతలివాళ్ళు ఉపయోగించుకుంటున్నారేమో అన్న అనుమానం కలిగింది శర్మకి దాన్ని ఖండిస్తూ రవి అన్నాడు -
"మీరు మాకిచ్చిన షేర్ల ని కూడా మేము మీ పేర ట్రస్ట్ లోనే వుంచుతాం. అంటే దానిమీద వచ్చే లాభాలు కూడా మీకే చెందుతాయి."
"అంటే కేవలం ఒక్కరోజు మీరు నాకు ఇరవై లక్షలు చేబదులు ఇచ్చినందుకు - నేను నా కంపెనీ మీద అధికారాలు మీకు వప్పగించి, లాభాలు మాత్రం తీసుకోవాలి..... అవునా."
"కేవలం ఒక్కరోజు అప్పు ఇచ్చినందుకు కాదు. మా ఆరుగురు డైరెక్టర్ల భవిష్యత్తు జైల్లో గడపడం - అనే రిస్కు తీసుకున్నందుకు..."
శర్మ ఆలోచించాడు. "సరే, మీరు చెప్పినట్టే చేద్దాం. ఇరవై లక్షలు యివ్వండి. కానీ ఈ డబ్బు నా కిచ్చినట్టు ఏ రికార్డులోనూ వుండకూడదు. అదీ నా తరపునుంచి షరతు."
అతడు చెపుతున్న దేమిటో అక్కడున్న వారందరికీ అర్ధమయింది. గుర్రం ఓడిపోతే ఇరవై లక్షలూ పోతాయి. తేజా టెక్స్ టైల్స్ డైరెక్టర్లందరూ అరెస్టవుతారు. శర్మ మాత్రం అవడు (కంపెనీ డబ్బులేక మూతపడుతుంది. అది వేరే సంగతి) తుమ్ముతే వూడే ముక్కు వున్నా ఒకటే లేకున్నా ఒకటే.
గుర్రం గెలిస్తే, మరుసటిరోజు డబ్బు జమ అవుతుంది. శర్మ షేర్లు శర్మకే వుంటాయి. అధికారం మాత్రం వుండదు. అతడికేమీ నష్టంలేదు.....డైరెక్టర్లు ఆలోచనలో పడ్డారు. అందరూ దాన్ని రవి మీదకు తోసేశారు. శర్మ లేకుండా ఈ రిస్కు తీసుకోవటం వారికి ఇష్టంలేదు. చివరికి ఆ బాధ్యత తానొక్కడూ తీసుకోవటానికి రవి ఒప్పుకున్నాడు. అంటే - ఒకవేళ ఈ విషయం బయటపడితే రవే, ఆ డబ్బు కంపెనీ నుంచి తీసి ఇచ్చినట్టు పోలీసుల ముందు వప్పుకోవాలి. అలా అగ్రిమెంటు కుదిరింది.
ఒకరికి జీవితంలో ఆనందం ఇచ్చే వ్యసనం-
మరొకరికి నిచ్చెన మెట్లమీద జీవస్మరణ సమస్య
ఆ రాత్రి రవికి నిద్ర పట్టలేదు - టెన్షన్ తో-
పై గదిలోంచి ఇదంతా విన్న మరొకామెకి కూడా!
6
ఆ మరుసటిరోజు మూడింటికి, శర్మ తప్ప - మిగతా వాళ్ళంతా తేజ టెక్స్ టైల్స్ బోర్డ్ రూమ్ లో కూర్చుని వున్నారు. అందరి మొహాల్లోనూ టెన్షన్ కనపడుతూంది.
"మనం ఈ ఏర్పాటువల్ల శర్మగారితో శాశ్వతంగా మనస్పర్ధలు కొని తెచ్చుకుంటున్నామేమో" అన్నాడు డైరెక్టరు. "ఇప్పటివరకూ ఈ కంపెనీలో ఆయన చెప్పింది వేదం."
"అది గుర్రం గెలిస్తే సంగతి, ఓడిపోతే ఏమవుతుందో ఆలోచించండి. కంపెనీ శాశ్వతంగా మూతపడుతుంది."
"రవి జైలుకి వెళతాడు" పూర్తిచేశారు మరొకరు. సమయం మూడుగంటలా పది నిముషాలు అయి వుంటుంది.
ఇంతలో ఒక డైరెక్టర్ అన్నాడు. "శర్మ... మనిషి మంచివారే కానీ ఆయనకీ గుర్రాల పిచ్చి పోకపోతే ఆ కంపెనీ బాగుపడదు. ఇంకొంతకాలం ఇలాగే సాగుతే మనలో మనమాట-నేనింతవరకూ ఎవరికీ చెప్పలేదు. ఈ షేర్లన్నీ అమ్మేసి కంపెనీ నుంచి తప్పించుకుందామనుకున్నాను."
"నేనూ అంతే కేవలం ఆయనమీద గౌరవంతో ఆయనేం చేసినా వప్పుకుంటూ వచ్చాను. కానీ ఎంతకాలం? కానీ దానికీ ఒక హద్దు వుందిగా కంపెనీ ముఖ్యం".
రవి మాట్లాడకుండా వాళ్ళ సంభాషణ వింటున్నాడు. నిజానికి సమస్య వాళ్ళెవరిదీ కాదు, తనది. మనసులో మాత్రం అనుకున్నాడు- ఈపాటికి గుర్రం పరుగెత్తటం ప్రారంభించి వుంటుంది.
అందరూ తమ తమ ఆలోచనల్లో వుండగా 3.20కి ఫోన్ మ్రోగింది. ఒక డైరెక్టర్ రిసీవర్ ఎత్తాడు.
రవి గుండె వేగంగా కొట్టుకోసాగింది.
అవతలి వైపు నుంచి ఫోన్ పది సెకన్లు విని- పెట్టేస్తూ "డియర్ ఫ్రెండ్స్! "ప్రేమమంజరి" గుర్రం నాలుగు లెంగ్తుల్లో గెలిచిందట" అని ప్రకటించాడు చిరునవ్వుతో. |
25,081 | వేదికమీద అధ్యక్షాసనంలో కూర్చునివున్న మిసెస్ వైకుంఠం చప్పట్లు కొట్టింది. సభలో కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయ్. మిసెస్ కైలాసం బొడ్లో దోపుకున్న కర్చీఫుతీసి ముఖం తుడుచుకొని ఓసారి గర్వంగా సభను కలియచూసింది. ఆమెకు ఒత్తుల్లేని కొన్ని శబ్దాలకు ఒత్తులు పెట్టి పలకటం అలవాటు.
"ఈ మధ్య మన పార్టీకి ఎవరో మహారాజులూ, జమీందార్లూ, విదేశీయులూ లక్షలిచ్చారని చిల్లర పార్టీల వాళ్ళు పుకార్లు లేవదీశారు. అవన్నీ ఒట్టి పుకార్లే. పోనియ్! ఒక్కవేళ ఇచ్చారే అనుకుందాం?"
సభలో కలకలం 'వినండి! వినండి!' అనే కేకలు మిసెస్ కైలాసం ఒకసారి దగ్గి, ఎదురుగా వున్న గ్లాసులోని నీరు సిప్ చేసి సున్నితంగా పెదవులు కర్చీఫుతో అద్దుకొని మళ్లీ ప్రారంభించింది.
"ఇలా ఇచ్చారే అనుకుందాం. దీనినిబట్టి, మన పార్టీకి విదేశాల్లోనూ, జమీందార్లలోనూ వున్న పలుకుబడి స్పష్టంగా తెలుస్తుంది. మన పార్టీ అధికారంలోకి రాగానే తల వొక్కింటికి పదెకరాల పంచి పెడుతుంది."
"మరి రెండు తలకాయలుంటే?" ఎవరో లేచి ప్రశ్నించారు.
"రెండు పదులు ఇరవై." తడుముకోకుండా సభాధ్యక్షురాలు మిసెస్ వైకుంఠం కంఠం దేవుడి గుడిలోని గంటలా ఖంగ్ న మ్రోగింది. మళ్ళీ సభలో కరతాళ ధ్వనులు!
"ప్రజాసేవ చెయ్యాలనే భావం నన్ను నిద్రపోనిచ్చింది కాదు. అందుకే గెజిటెడ్ ఉద్యోగం వదులుకొని, మీ మధ్యకు వచ్చి నిలబడ్డాను. మీరు కూడా కేవలం మాబ్, అదే మందలా ప్రవర్తించకుండా విచక్షణా జ్ఞానంతో ఓట్లువేసి నన్ను గెలిపించి, నాకు మీ అందరి సేవ చేసే అదృష్టాన్ని కలిగిస్తారని ఆశిస్తున్నాను." అంటూ మిసెస్ కైలాసం సభకు ఓ పెద్ద నమస్కారం పెట్టి కూర్చుంది.
ఈ విధంగా సభల్లోనూ, ఇళ్లకు వెళ్ళీ తమపార్టీ అధికారంలోకి రాగానే, తమ పార్టీ చెట్టునీడ క్రింద వున్న వాళ్ళందరికీ తలో మేడా కట్టించి ఇస్తామన్నారు. అందాకా తాము నిర్మించిన గాలిమేడల్లోనే వుండిపొమ్మన్నారు.
తాటస్థ్యంలో పాక్షికత్వాన్ని, పక్షపాతంలో తాటస్థ్యాన్ని, ఏకత్వంలో బిన్నత్త్వాన్ని ప్రజాస్వామ్యంలో వియంత్రుత్వాన్నీ, పెట్టుబడిదారీ వర్గ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యాన్ని అయోమయంలో స్పష్టతనూ చూప గలిగింది తమ పార్టీ ఒక్కటే నన్నారు. అన్నింటికంటే వ్యక్తి స్వాతంత్ర్యానికి తమ పార్టీ ప్రాధాన్యం ఇస్తుందట. తమ పార్టీలో ప్రతి సభ్యుడికి, నాయకుడికీ తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడే స్వాతంత్య్రం వుంటుందట.
ఎన్నికల తేదీ దగ్గిర పడుతున్నకొద్దీ ప్రచారం ముమ్మరంగా సాగిపోతూంది. శ్రీమతి శిఖండమ్మ వెళ్ళిన చోటల్లా మరో పార్టీ వాళ్ళకు మంచినీళ్ళు కూడా పుట్టవనే నమ్మకం వుంది ఆ పార్టీ వాళ్ళకు. ఆఖరి క్షణాల్లో రామలింగంగారు అమాంతం ఓటర్లను కావలించుకొని ఆవురుమన్నారు. తమ పార్టీని, అభ్యర్దినీ కాకపోయినా తనను చూసైనా ఓటు వెయ్యమని వేడుకున్నాడు. ప్రేమ లేకపోయినా జాలివల్లనైనా వెయ్యమన్నాడు. వేస్తానని వాగ్దానం చేసిందాకా పట్టుకున్న కాళ్ళు విడిస్తే వొట్టు.
ఆఖరి క్షణంలో భుజంగంగారికి ఆవేశం పెరిగి పోయింది. భూమ్మీద కాళ్ళానలేదు. ఎదుటి పార్టీవాళ్ళను నోటికొచ్చిన బండబూతులూ తిట్టారు.
శ్రీమతి శిఖండమ్మ నాయకత్వాన పాతికమంది మహిళలదాకా ఇంటింటికీ వెళ్ళి ఆడంగులకు పళ్ళూ పువ్వులూ, పసుపూ కుంకుమా ఇచ్చి ఓట్లు అడిగారు. ఆడవాళ్ళ ఓట్లన్నీ తమకే పడిపోతాయనే నమ్మకం కలిగింది. మిసెస్ కైలాసం "ఏం చేసినా ఆడవాళ్ళే చెయ్యాలి. వాళ్ళకున్న తెగింపు మొగవాళ్ళలో ఎక్కడుంది." అంటూ మురిసిపోయింది.
మహిళామణుల ప్రచార ధాటికి వోటర్ల తలలు ఊగిసలాడిపోయినై బాలెట్ పెట్టెలు నిండిపోయినై, మిసెస్ కైలాసానికి విజయం తధ్యం అన్నారు. కనీసం పదివేలన్నా మెజారిటీ వుంటుందన్నారు లాబీ వర్గాలవారు.
ఆ రాత్రి అలసిపోయి మంచంమీద వాలిపోయిన మిసెస్ కైలాసానికి మనస్సు మాత్రం ఎంతో తేలిగ్గా ఆకాశంలో ఎగురుతున్నట్టనిపించింది. అలసటతో మూతలుపడ్డ కళ్ళల్లో అసెంబ్లీహాలు కనిపించసాగింది.
తన గొప్పతనాన్ని గుడ్డి ప్రభుత్వం గుర్తించలేక పోయింది. కాని ప్రజలు గుడ్డివాళ్ళు కారు! అందుకే వాళ్ళు గుర్తించారు. ఒకసారి తను బడ్జెట్ సెషన్ కు డైరెక్టర్ తో వెళ్ళి గాలరీలో కూర్చుంది! కిందకు చూస్తూ. ఒక బెంచీనుంచి మరో బెంచీకి వెళుతూ, వాళ్ళతో వీళ్ళతో కబుర్లు చెబుతూ తిరిగే ఆడ ఎం.ఎల్.ఏ.లు పైన కూర్చున్న తనకు మానస సరోవరంలో విహరించే హంసల్లా కన్పించారు. కొందరు బాతుల్లా నడుస్తున్నట్టనిపించింది. ఆనాడే తనకు అనిపించింది తను కూర్చోవలసింది గ్యాలరీలో కాదనీ, కింద హాలులోననీ. తన గొప్పతనాన్ని తను ఏనాడో గ్రహించింది. కాని ప్రజలే ఆలస్యంగా గుర్తించారు.
తన డైరెక్టరు తనను వింత మృగంలా చూసేవాడు. ఆ జానకి తలపొగరు అంతా ఇంతా కాదు. రేపు తను ఎం. ఎల్.ఏ. అవుతుంది. మినిష్టర్ కూడా అవుతుంది. సి.యం.ను అడిగి తను ప్రత్యేకంగా ఆ శాఖనే తనకు కేటాయించామని అడిగితే పోలా? అప్పుడు చూపిస్తుంది తన తడాఖా. లేకపోతే తనకు రివర్షన్ ఇప్పించి ఎన్.జి.ఓ.ని చేస్తాడు? టెస్టు పాసు కాలేదట తను. వెధవ టెస్టులు. అసలు తనలాంటి వాళ్ళకు ఎగ్జెంప్షన్ ఇప్పించాలి ఆ జానక్కి ప్రమోషన్ ఇచ్చి తన సీట్లో కూర్చో పెడతాడా? |
25,082 | పద్మిని లేచి లోపలికి వెళుతుండగా లచ్చి అనటం వినిపించింది. "పెద్ద చిన్న అని ఏముంటుంది లేమ్మా! ఏదైనా గుణాన్నిబట్టే నేను పదిళ్ళల్లో పనిచేస్తున్నాను కందా! మీలాంటి మంచి అమ్మగారు ఏ యింట్లోనులేదు. నాకష్టం వాళ్ళకి అక్కరలేదు. ఒకటే నసుగుడు గొణుగుడు. పక్కీదిలో వుండే మా లచ్చమ్మచేసిన పనే మళ్ళీ మళ్ళీ చేయమని చంపుకుతింటాది. వక్కమెతుకు విదిలించదు. రవంత పచ్చడి పెట్టమంటే పాణం గిలగిలలాడిపోతాది. కూరలుధరలు మండిపోతున్నాయని కూరే చేసుకోటం లేదని చెపుతుంది. గిన్నెలు మాత్రం బోలెడు వేస్తుంది..."
లచ్చి అలా మాట్లాడుతూనేవుంది. పార్వతమ్మ వూ ఆ...అనకుండా కాసేపు విని లేచి ఇంట్లోకి వచ్చేసింది.
లచ్చి పనిముగించుకొని వెళుతూ నెలజీతంలో కట్ చేసుకొండని చెప్పి అయిదు రూపాయలు తీసుకుని వెళ్ళింది.
లచ్చి వెళ్ళింతరువాత__
"ఆంటీ! నేను తొందరపడి అనవసరంగా మాట్లాడానా?" అడిగింది ఆమె.
"మాట్లాడావు" పార్వతమ్మ అంది.
పద్మిని ప్రాణం బిక్కచచ్చిపోయింది. ఆమాట వినంగానే.
"కానీ నీవు మాట్లాడిన ప్రతిమాటా అక్షరనిజం. నేను పెద్దదాన్ని అయిపోయాను. పనిమనిషి అవసరం! తన అవసరం నాకుందని దానికి తెలుసు. అలాగే ప్రతి యింట్లోను భర్త ఆఫీసు టైముకి వంటచేయాలి ఒ ఇల్లాలు!
వంటచేసి పిల్లలకి పెట్టి తను తిని ఆఫీసుకి పరుగెత్తాలి మరో ఉగ్యోగిని! వీళ్ళందరికి పనిమనిషి రాకపోతే చేయి విరిగినట్లు వుంటుంది. ఈ లూజు తెలిసి వాళ్ళ అవసరాలు గడుపుకుంటారు. ఈ పనిమనిషి కాకపోతే మరో పనిమనిషి అనుకోటానికి లేదు. వాళ్ళకి సంఘాలు అందరూ కలిసి సమ్మెలాంటిది చేయటం యెందుకొచ్చిన గోల అని యెవరికివారు నోరుమూసుకోవటం జరుగుతున్నది. అనుభవంమీద చెపుతున్నాను పద్మిని! కొందరికి దూరంగా వుండటం, కొందరి నోట్లో నోరు పెట్టకుండా వుండటం మంచిది."
పార్వతమ్మ అలా చెపుతుంటే పద్మిని ప్రియదర్శినికి పోయిన ప్రాణం లేచివచ్చినట్లు అయింది.
"మనలోమాట! పని మనుషుల విషయమే చూద్దాం. ఈ నిమిషాన వాళ్ళు పంచభక్ష్య పరవాణ్ణాల్లు చేసుకుతినాలన్నా కోరికవున్నా తినలేరు. వాళ్ళ దగ్గర వేలుకాదు కదా వందలుకూడా వుండవు. నోరు పెట్టుకుని బతుకుతుంటారు అంతే. ఎవరో ఒక్కళ్ళు మాత్రం చీట్లు కట్టుకుని ఎన్నో విధాల కష్టపడి కాస్త కూడబెట్టుకుని బతుకుతుంటారు. పనిమనిషి కాస్త పచ్చడి లేక కాసిని కాఫీ నీళ్ళు అడిగిందే అనుకో యిస్తే ఏం పోయింది? ఇన్నాళ్ళు వీళ్ళ దగ్గర ఎక్కడలేని పొదుపు చూపిస్తుంటారు. కాస్త పెద్దవాళ్ళుగాని ఫ్రెండ్సుగాని వస్తే వాళ్ళు వద్దంటున్నా బలవంతానా కాఫీ యిస్తారు. టిఫెన్లు పెడతారు ఎందుకని?" పార్వతమ్మ అడిగింది.
"అవును యెందుకని?" పద్మిని యెదురు ప్రశ్నించింది.
"ఆలోచించు" చిరునవ్వుతో చెప్పి అవతలికి వెళ్ళిపోయింది పార్వతమ్మ.
పద్మిని ప్రియదర్శిని ఆలోచనలో పడింది.
16
ఓ రోజు...
శంకర్రావు యింటికి రెండిళ్ళవతల వున్న వెంకటరత్నం ఒకతన్ని వెంట బెట్టుకొని శంకర్రావు యింటికి వచ్చాడు.
"మా దూరపు బంధువు పేరు నాగేంద్ర. గాలిమార్పు కోసం నాలుగు రోజులు వుందామని వచ్చాడు" అంటు పరిచయం చేశాడు.
నాగేంద్ర వుండేది కలకత్తాలో అని, చిన్న బిజినెస్ అని వెంకటరత్నం చెప్పాడు.
"నేను పగలంతా ఆఫీసుకి వెళతాను! మధ్య మధ్య టూర్లు మీరెలాగూ ఖాళీగా వున్నారు. తోచినప్పుడు వచ్చి మాట్లాడుతుంటాడని మీకు నాగేంద్రకి కూడా కాలక్షేపంగా వుంటుందని పరిచయం చేస్తున్నాను."
అని వెంకటరత్నం అంటుంటే "దానికేం భాగ్యం తోచనప్పుడు వస్తుండు" అన్నాడు శంకర్రావు.
నాగేంద్రకి ముప్పై అయిదు నలభై మధ్యలో వయసు వుంటుంది. తల పెద్దది, శరీరం సన్నన. చూడంగానే ఆ విషయం కొట్టిచ్చినట్లు కనపడుతుంటుంది. ఎందుకనో యింకా పెళ్ళి చేసుకోలేదట ఆ పెద్దమనిషి. చైన్ స్మోకర్, నల్లటి బండ పెదవులు, తెల్లటి గ్లాస్కోలాచ్చీ పైజమా మెడలో సన్నటి బంగారు చైను, వేళ్ళకి వుంగరాలు. చూడంగానే ఎందుకనో గౌరవం కలగదు. యెదుటివాళ్ళు ఎక్కువ మాట్లాడేటట్లు చేసి తను వింటూ సిగరెట్ కి పనికల్పిస్తూ తూచి_తూచి మాట్లాడుతుంటాడు. ఎక్కువ ఆటోలతోనే గడుపుతాడు.
మొదటి చూపులోనే నాగేంద్ర నచ్చలేదు. పద్మినిప్రియదర్శినికి.
అలా అని అతని రాకని పద్మిని నిరోధించలేదుకదా!
ఒక్కొక్కళ్ళని చూస్తే అనురాగం, స్నేహం పుట్టుకువస్తాయి. అదే ఒక్కొక్కరిని చూస్తే ఎలర్జీ పట్టుకుంటుంది. చచ్చినా సదభిప్రాయం కలగదు. వీడు సాక్షాత్తూ దైవాంత సంభూతుడు అని చెప్పినాసరే దెయ్యవాంతకుడిగా కనిపిస్తాడు. వాళ్ళే చేయకపోయినా సరే ఆ ముఖాల తీరు అలాంటిది.
నాగేంద్ర వస్తేచాలు ఎలర్జీ వస్తున్నది పద్మినికి.
పాపం నాగేంద్రం యింట్లోకి కూడా రాడు.వరండాలో కూర్చుని శంకర్రావుతో కబుర్లు చెప్పి కాఫీ తాగి వెళుతుంటాడు. పార్వతమ్మతో కూడా మాటలేమి లేవు.
పద్మిని ప్రియదర్శిని ఎదురైతే కాజ్ వల్ గా చూడటం తప్పించి ఏమీ మాట్లాడడు. ముఖం తిప్పేసుకుంటాడు. ఒక అందమైన ఆడపిల్లని చూశానే అన్న భావం ఆ కళ్ళల్లో వుండదు, చూపుల్లో మెరుపు వుండదు.
అయినా...
నాగేంద్రంమీద మంచి అభిప్రాయంమటుకు కలగలేదు పద్మిని ప్రియదర్శినికి.
ఆరోజు నాగేంద్ర వచ్చాడు. సాయంత్రం నాలుగు అయింది టైము.
శంకర్రావు నాగేంద్రం వరండాలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు.
పార్వతమ్మ యిద్దరికీ కాఫీ కలిపి తీసుకెళ్ళి యిచ్చి వచ్చింది.
"నేను వక్కసారి వెనకింటికెళ్ళివస్తాను" పద్మినితో చెప్పి పార్వతమ్మ వెళ్ళిపోయింది.
వంటరిగా ఇంట్లో వున్న పద్మిని జాగ్రత్తగా వాళ్ళ మాటలు వింటూ కూర్చుంది.
వక మనిషి మాట్లాడే విధానాన్నిబట్టి ప్రవర్తననిబట్టి వాళ్ళ మనసుని వాళ్ళ గుణాన్ని అంచనా వేయవచ్చు.
ప్రస్తుతం పద్మిని అదే పనిమీద వాళ్ళమాటలు వింటూ లోపల కూర్చుంది.
శంకర్రావు, నాగేంద్రం మధ్య సంభాషణ ఈవిధంగ జరుగుతున్నది. ఈ లోపల చౌకరకం సిగరెట్ పొగ తాలూకా వాసన మాత్రం లోపలికి చొచ్చుకుని వస్తున్నది. |
25,083 | కృష్ణమూర్తిగారు ఆఫీసు నుండి రాగానే మమ్మల్ని రోజూ ఒక్కోచోటుకి తీసుకెళ్ళేవారు. శని, ఆదివారాలైతే అండర్ గ్రౌండ్ ట్రెయిన్లలో ముప్పై, నలభై కిలోమీటర్ల దూరంలో వున్న షాపులకి తీసుకెళ్ళి ఇంటికి కావాల్సిన సామానులు కొనేవారు.
లండన్ నరకాసురుడు
రాత్రిపూట డ్రింక్ లోకి జి.కె.గారు వేరుశనగ పప్పు, జీడిపలుకులూ ప్లేటులో పెట్టి శ్రీశ్రీ గారి ముందు పెట్టేవారు. నేను తప్ప అక్కడందరూ తీసుకునేవాళ్ళే. లేకుంటే ఆ చలికి చస్తారేమోనన్న అనుమానం కలిగేది. అదే మాట శ్రీశ్రీ గారితో అంటే_
"చావడం మాట ఎలాగున్నా వీళ్ళు తాగకుండా వుండలేరు. మంచినీళ్ళు తాగినట్టే వీళ్ళు డ్రింక్స్ తాగుతారు. వాళ్ళకది అలవాటైపోయింది. లేకుంటే ఈ వాతావరణానికి తట్టుకోవడం కష్టం" అని మా వారు నాతో అన్నారు.
జి.కె.గారు పెట్టిన ఆరేడు జీడిపప్పు పలుకులతో నా చెయ్యి నిండిపోయింది. ఏలక్కాయలు, ద్రాక్ష కూడా ఫ్రెష్ గా, పెద్దవిగా ఎంత బాగున్నాయో వాటి ధరలు కూడా అంత ఎక్కువగానే వున్నాయి.
"ఏమండీ ఇంత ఎక్కువ ధరలు కదా, ఇక్కడి వాళ్ళకి మాత్రం కష్టం కాదా?" అని అడిగాను.
"సరోజా! ఇక్కడ పనులు చేసేవాళ్ళకి జీతాలు కూడా బాగా వుంటాయి. ఓవర్ టైమ్ పనిచేస్తే వేలమీద కళ్ళచూస్తారు. మనకి చాకిరీ లెక్కువ, ఫలితం తక్కువ. శ్రమకి తగ్గ ఫలితం మనకెక్కడుంది" అన్నారు.
"అందుకనే డాక్టర్లూ, ఇంజనీర్లూ, సైంటిస్టులూ ఇంకా ముఖ్యమైన పనులు చేసే వాళ్ళందరూ, సరుకులులాగే ఈ దేశాలకి దిగుమతి అయిపోతున్నారు" అన్నారు.
రోజూ రాత్రి 12 గంటలయ్యేది, మేం పాడుకొనే సరికి.
5_10_80వ తేదీ ఆదివారం నాడు రవిగారు వాళ్ళింటికి డిన్నర్ కి మమ్మల్ని తీసికెళ్ళారు.
రవిగారి ఇల్లు లండన్ కి ఇరవైమైళ్ళ దూరంలో క్రోడన్ (croydon) అనే విలేజిలో వుంది. అక్కడి ఇళ్ళు చాలా బాగుంటాయి. ఇక్కడ మన సినిమావాళ్ళు వేలమీద, లక్షలమీద ఖర్చు పెట్టితీసే బ్రహ్మాండమైన పేలస్ లాంటి సెట్టింగ్స్ వాటిముందు ఎందుకూ పనికిరావు.
రవి గారిల్లు గూడా పేలెస్ లాగే వుంది.
పంచభక్ష్య పరమాన్నాలతో విందు పెట్టేరు. అన్నీ వారు స్వయంగా తయారుచేసినవే. రాత్రి 11 గంటలవరకూ అక్కడే వుండి, ఆ తర్వాత ఇంటికి బయల్దేరాం.
ఆరవతేదీ రెస్ట్. 7_10_80 మమ్మల్ని ఆరుమైళ్ళ దూరంలో వున్న మరొక షాపుకి అండర్ గ్రవుండ్ ట్రయిన్ వెళుతోంది. అయ్యబాబోయ్ మన నెత్తిమీద నది అన్నమాట" అన్నాను.
నాకు అంతా ఆశ్చర్యంగా వుంది.
11_10_80వ తేదీ మధ్యాహ్నం డాక్టర్ జనార్ధనరావుగారు వచ్చి మా నలుగుర్నీ బెడ్ ఫోర్ట్ తీసుకెళ్ళారు. అది లండన్ కి 50 మైళ్ళ దూరంలో వుంది. అక్కడి వాళ్ళకది దూరంకాదు.
జాన్ బనియన్ మహాకవి (1628_88) మ్యూజియమ్ చూశాం. ఆ రాత్రి జనార్ధనరావుగారి ఇంట్లోనే మా బస. మర్నాడు మధ్యాహ్నం ఆ ఊరిలోనే వున్న డాక్టర్ ప్రసాద్ గారింట్లో భోంచేశాం.
18_10_80 నుండి వరుసగా ఒక్కొక్కటీ చూడటం ప్రారంభించాం. హేమ్ సెండ్ లో వున్న జాన్ కీట్స్ భవనం చూశాం. 26_10_80న హోమ్ స్లోలో వున్న మోసాన్ దాస్ గారు తన ఇంట్లో మాకువిందు ఏర్పాటు చేశారు. అక్కడ నవంబర్ 5వ తేదీకి ఒక ప్రత్యేకత వుంది. ఆ రోజును వాళ్ళు గైఫాక్స్ డే (Guy Fowkes) అంటారు.
గైఫాక్స్ అనే వ్యక్తి లండన్ పార్లమెంట్ ని కాల్చేద్దామనుకున్నాడట. అప్పుడతన్ని అందరూ చంపేశారట. అతను చనిపోయిన రోజు నవంబర్ 5 కావటంతో ప్రతీ సంవత్సరం ఆ రోజున అక్కడి వాళ్ళందరూ దీపావళి చేసుకుంటారు.
"మనలాగే వీళ్ళకి కూడా దీపావళి వుందన్నమాట" అన్నాను.
"అవును. మనకి నరకాసురుడెలాగో, వీళ్ళకి గైఫాక్స్ అలాగ"అన్నారు.
తర్వాత బ్రిటీష్ మ్యూజియమ్ కి వెళ్ళాం. చాలా బాగుంది.
మమ్మల్ని జి.కె.గారు డరామ్ కి తీసుకువెళ్ళారు.
కెన్నింగ్ టన్, ఎలిఫెంట్ గేట్, లండన్ బ్రిడ్జి, బేంక్ మోర్ కెన్నిస్_ఇంకా చాలా స్టేషన్స్ మద్రాస్ సెంట్రల్ కంటే చాలా బాగున్నాయి. ఇవన్నీ అండర్ గ్రవుండ్ స్టేషన్స్.
వీటిన్నిటినీ దాటి తర్వాత కెన్నిసల్ బ్రిటీష్ ట్రెయిన్ లో మేం ఎక్కినా థర్డ్ క్లాస్ కంపార్ట్ మెంట్ లో స్కూలు పిల్లలందరూ లండన్ ఎక్స్ కర్షన్ కి వచ్చి రిటర్న్ అవుతుండడం వల్ల, వాళ్ళకి సీట్లు చాలవని మమ్మల్ని ఫస్ట్ క్లాస్ లోకి పొమ్మన్నారు. హాయిగా పోయి కూర్చున్నాం.
ఈ విధంగా బ్రిటీష్ వారి ట్రెయిన్ లలో ఫస్ట్, సెకండ్ క్లాసుల విధానాలు కూడా చూడటం జరిగింది. ఆ ట్రెయిన్స్ లో ప్రయాణిస్తుంటే విమానంలో ప్రయాణిస్తున్నట్లనిపించింది.
మూడే మూడు స్టాపింగ్స్ తో డార్లింగ్ చేరుకున్నాం. అక్కడి డాక్టర్ శ్రీనాదన్ గారు కారు తీసుకుని వచ్చారు. శ్రీశ్రీగారు మీటింగ్ ఏర్పాటు చేసి శ్రీనాదన్ గారే మమ్మల్ని అక్కడికి రప్పించారు.
ఆ రోజే ష్టేండ్లీలో మీటింగ్. మీటింగ్ జరిగిన హాల్ చూసి మన ఇండియాలో మచ్చుకయినా ఇలాంటిదొకటి చూడాలనిపించింది. దగ్గర దగ్గర 500 మందికి పైగా తెలుగువాళ్ళు అక్కడికి వచ్చారు. |
25,084 |
"నేను ఇవ్వగలిగింది ఏదైనాసరే" ఆమె ఆ విషయంలో డబ్బు గురించే ఆలోచించి అలా అంది.
"సరే...! నువ్వు ఓడిపోయినప్పుడే, నువ్వు ఇవ్వగలిగింది నేను అడుగుతాను. ఒకవేళ నేను...." ఆయన ఆ మాట పూర్తిచేయలేనట్లు కాస్సేపు ఆగి "నా ఆస్తి మొత్తం నీకు రాసి యిచ్చేస్తాను...." అని పూర్తి చేశాడు.
మిన్ను విరిగి మీద పడినంత ఆశ్చర్యంగా చూసిందామె. ఈ ముసలాయనకి మతిస్థిమితంగా వుందా? లేదా? అన్న అనుమానం కూడా కలిగింది.
"ఈ క్షణంనుండే మన పోటీ ప్రారంభం అయిందనుకో! రేపే వచ్చి నీ కుటుంబ సభ్యులేమన్నారో నాతో చెప్పు" అంటూ ఇక నువ్వు వెళ్ళవచ్చు అన్నట్లు చూశాడు.
ధృతి లేచి నమస్కరించి వెనుతిరిగింది.
"నా ఆస్తి, ఐశ్వర్యం గురించి తెలుసుకుని కలలు కనకు.....! ఈ ధర్మానందరావుకి ఓటమి అంటే ఏమిటో తెలియదు" అని గర్వంగా వినిపించింది.
ఆమె సన్నగా నవ్వుకుంటూ బైటకి నడిచింది.
* * *
"కొంప ముంచేశావ్! ధర్మానందరావుగారి గురించి అసలు తెలుసా నీకు?" అన్నాడు నవీన్.
"ఇప్పుడే తెలిసింది" అంది ధృతి నెమ్మదిగా.
"నీ మొహం తెలిసింది ఆయనకి ఎంత పవర్ వుందో ఏమిటో తెలుసుకోకుండానే పొట్టేలు కొండని ఢీకొన్నట్లు ఆయనతో పోటీపెట్టుకున్నావా? ఆయన చాలా గొప్పవాడు. కొన్ని కోట్లకు యజమాని...." అన్నాడు చిరాగ్గా నవీన్.
"ఆయనే నన్ను రెచ్చగొట్టాడు. నీకు తెలుసుకదా నేను అనవసరంగా ఒకరి జోలికి వెళ్ళననీ" అని తాపీగా అతన్ని చూసి నవ్వేసింది.
జీన్స్ ప్యాంట్, టీ షర్ట్ వేసుకుని నిర్లక్ష్యంగా పెంచిన గడ్డంతో మోటుగా కనిపిస్తాడు నవీన్. కాని అతని మనసు నవనీతం.
"ఏమిటా ఆలోచన?" అడిగాడు నవీన్.
"నీ గురించే."
"ఏమని?"
"ధర్మానందరావుగారు అన్ని రకాల బంధాలనీ విశ్లేషించారు కానీ 'స్నేహం' గురించి ఏ అభిప్రాయం వ్యక్తం చెయ్యలేదు. ఎందుకని?"
"అటువంటి స్నేహమే ఆయనకి దొరికివుంటే గనుక అసలిలాంటి పిచ్చిపిచ్చి ఆలోచనలతో టైంవేస్ట్ చేసేవారు కాదు....." ధృతిని అపురూపంగా చూసుకుంటూ అన్నాడు నవీన్.
గట్టిగా జడ అల్లుకున్నా ముంగురులు చిలిపిగా ఆమెని అల్లరిపెడుతూనే వున్నాయి. కనుబొమల మధ్య పెట్టుకున్న చిన్న బొట్టు తప్ప ఆమె ముఖంలో మరే ఇతర అలంకరణా వుండదు. ఆమెని అలా చూస్తుంటే ఎవరికైనా ఒకే భావం వస్తుందేమో! ఎవరో రాజకుమార్తె మారువేషంలో సాదా సీదా బట్టలతో మామూలుగా తిరుగుతున్న్తలు ఆ కళ్ళల్లో, పెదవి విరుపులో అంతటి రాజసం!
"నవీన్....." నిశ్శబ్ధాన్ని భంగం చేస్తూ ఆమె మంద్రంగా పిలిచింది.
యూనివర్శిటీ రోడ్డు పగలంతా అల్లరిచేసి, చేసి అలసినట్లు ప్రశాంతంగా వుంది. అక్కడక్కడ జంటలు తప్ప పెద్దగా రద్దీలేదు.
నవీన్ తలతిప్పి ఆమెవైపు చూశాడు.
"అమ్మకెలా వుందీ?" బాధ ఆమె గొంతులో ధ్వనిస్తోంది.
అతను నిర్లిప్తంగా "ఆపరేషన్ అవసరం లేకుండా మందులు వాడమన్నారు. చూద్దాం ఏమౌతుందో" అన్నాడు.
ఆ తరువాత ఇద్దరూ మౌనంగా నడవసాగారు. చాలా జంటలు చిలిపిగా మాట్లాడుకుంటూ, గట్టిగా నవ్వుకుంటూ వాళ్ళకి ఎదురొచ్చారు.
సమస్యలు ఎప్పుడూ మనిషిని వయసుకి మించి ఎదిగేటట్లు చేస్తాయి.
ధృతిని ఇంటిదాకా వచ్చి దింపాడు నవీన్.
"రేపు కలుస్తావా?" అడిగింది ధృతి.
"రేపు అమ్మని చర్చికి తీసుకెళ్ళాలి. సాయంత్రం కలుస్తాను" చెప్పాడు నవీన్.
"ఓ....ఆదివారంకదూ?" అప్పుడే గుర్తుకొచ్చినట్లు అందామె.
ధృతి చెల్లెలు కృతి పుస్తకాలు చేతిలో పట్టుకుని వస్తున్నదల్లా అక్కని చూసి "అమ్మా! అక్క వచ్చింది" అంటూ ఆ వార్తని చెప్పడానికి మళ్ళీ లోపలికి వెళ్ళింది.
ఈ మాటవిని లోపలి నుంచి వచ్చిన ధృతి తండ్రి సీతారామయ్య "అమ్మా! ఇంటర్వ్యూ బాగా చేశావా...? అరే...నవీన్! లోపలికి రాకుండా నిలబడిపోయావేం?" అంటూ ప్రశ్నలు వేశాడు.
"గుడీవినింగ్ అంకుల్" అంటూ నవీన్ వరండా మెట్లెక్కి "మీ అమ్మాయి ఇంటర్వ్యూలో అదరగొట్టేసిందట" అన్నాడు నవ్వుతూ.
ధృతి ఏం చెప్పవద్దన్నట్లు కళ్ళతో సైగ చేసింది.
కృతి గ్లాసులతో మంచినీళ్ళు తెచ్చి ఇద్దరికీ అందించింది.
"థాంక్యూ" అంటూ అందుకుని ట్యూషన్ కి వెళుతున్నావా?" అడిగాడు నవీన్.
"అవును అక్కా! ట్యూషన్ ఫీజు..." అంది కృతి వెంటనే.
ధృతి చెల్లెలు భుజంమీద చెయ్యివేసి "రేపు ఇచ్చేద్దాంలే ఇంకా ఆ డాక్టర్ గారి పిల్లలకి ట్యూషన్ చెప్పిన తాలూకు డబ్బు నాకు ఇవ్వలేదు. అంది.
నవీన్ అప్పటికే జేబులోంచి డబ్బు తీసి "ఈ రోజు ఫీజు ఇచ్చేసేయ్ మీ అక్క దగ్గర తరువాత నేను వసూలు చేసుకుంటానులే" అంటూ కృతి చేతిలో పెట్టాడు.
"ఎందుకు బాబూ! అలా మాటిమాటికీ మమ్మల్ని రుణపడేట్లు చేస్తున్నావ్?" అన్నాడు సీతారామయ్య.
నవీన్ తేలిగ్గా "అందులో రుణపడే ప్రసక్తేలేదు. ధృతికి ఉద్యోగం రాగానే మొత్తం ముక్కుపిండి వసూలు చేస్తాను" అన్నాడు.
"ధృతీ!" అని ఆమె తల్లి లోపల్నుంచి పిలిచింది.
"నే వెళ్ళొస్తాను ధృతీ!" అంటూ నవీన్ వెళ్ళిపోయాడు.
ధృతి లోపలికి వెళ్ళగానే "అతను కూడా ఇంటర్వ్యూకి వచ్చాడా?" ఆరాగా అడిగింది సుభద్ర.
"లేదమ్మా! నన్ను తీసుకురావడానికి వచ్చాడు" అంది ధృతి కాళ్ళు కడుక్కుంటూ. |
25,085 | "ఓ పక్క తాటికాయంత అక్షరాలు కనపడుతూ వుంటే, నిజమేనంటారా ఏమిటండీ?" అంది కళ్యాణమ్మ.
"వాడు నా తమ్ముడే!" గర్వంగా అన్నాడు లక్ష్మణమూర్తి.
"సరేలెండి మీకన్నా ముందు నాకుతెలుసు. మరిదిగారికి వున్న తెలివితేటలు ఎవరికీలేవు. ఏ పనిచేసినా గప్ చిప్ గా చేస్తాడు. చేసేపనికూడా గొప్పగా వుంటుంది. మగవాడనం తరువాత అలాంటి గోప్పపనులే చేయాలి."
"అమ్మా! ఇప్పుడందరూ మెచ్చుకుంటున్నారుగానీ, ఈ ఇంట్లో అన్నయ్యని వెక్కిరించనిది ఎవరు? వాడు తలుపులు వేసుకున్నా తప్పే, ఒక వందరూపాయలు అడిగితే వెయ్యి ఆరాలు, మరొక వెయ్యిసార్లు ఎత్తిపొడుపులు.
ఫలానాది అని తెలియదుకానీ, చిన్నన్నయ్య ఎప్పటికైనా ఏదో పెద్దదే సాధిస్తాడని నాకు నమ్మకం. అందుకనే నేను ఎప్పుడూ ఏమీ అనేదాన్ని కాదు. ఇప్పుడు నేను కలెక్టర్ గారి చెల్లెల్ని హ్హహ్హహ్హా!" అంది సుమిత్ర తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.
"వాడు నిజం చెబితే ఎవరం ఏమీ అనేవాళ్ళంకాదు కాదే! అన్నింటికీ రెటమతం సమాధానాలూ, ఎదురుతిరిగిమాట్లాడటాలూ, పైగా వాడి మాటలు విని హడలిచచ్చేలాగా, తుపాకీపెట్టి కాల్చేయాలీ, కత్తితో పొడవాలి, నరికిప్రోగులు పెట్టాలి అంటూంటే ఎవరికి మాత్రం భయంవెయ్యదు?"
కళ్యాణమ్మ మాట పూర్తిచెయ్యక ముందే "అమ్మా!" అని పిలుస్తూ వాళ్ళముందుకి వచ్చాడు బోసుబాబు.
మితిమీరిన ఆనందం వస్తే, ఎవరు ఎలా ప్రవర్తిస్తారో వారికే తెలియదు. అందరూ ఒక్కసారిగా లేచి నుంచెని బోసుబాబుని పొగిడేశారు.
బోసుబాబు మాత్రం మామూలుగా వున్నాడు. అతని పెదవులు మాత్రం చిరునవ్వు చిందిస్తున్నాయి. "కూర్చోండి! కూర్చోండి! ఈ యింట్లోవాళ్లు ఏదొచ్చినా పట్టలేరు. నేనేమీ ఘనకార్యం చేశాననుకోవటంలేదు. పేపర్ ఫ్రంట్ పేజీలో ఎక్కాలనుకున్నాను, ఎక్కాను.
నా యీ కోరిక తీరటానికి ఎంతో పట్టుదలగా, రాత్రింబవాళ్లూ కృషిచేశాను. మీ తిట్లే నాకు దీవెనలయ్యాయి. మీరు రెచ్చగొట్టిన కొద్దీ నాలో పంతం, పౌరుషం, పట్టుదలా పెరిగాయి...." అంటూ శాంతంగా చెప్పుకొచ్చాడు బోసుబాబు.
"నిజమేరా! నీ తెలివి గుర్తించక ఏదోకటి అనేవాళ్ళం. ఇంతకీ నీవలా తలుపులువేసుకునే లోపల ఏం చేసేవాడివి? ఇప్పటివరకూ అది ఎవరికీ అర్ధం కాలేదు?" కళ్యాణమ్మ అడిగింది.
"నేను మొదటినుంచీ ఫస్ట్ క్లాసులతో పాసవుతూ వచ్చాను. ఆటల్లో ఫస్ట్ వచ్చేవాడివి, చదువులో ఫస్ట్ వచ్చేవాడిని. ఏం లాభం నాకంటూ చిన్న ఉద్యోగం రాలేదు. ఎక్కడచూసినా అన్యాయాలూ, మోసాలూ, అప్లికేషన్లకి డబ్బుతగలేయటం తప్ప, జాబ్ వచ్చింది అంటూ ఏమీ లేదు. వెయ్యిరూపాయల ఉద్యోగానికి లక్షరూపాయల లంచం. ఈ వ్యవస్థ ఇలా అఘోరిస్తూ ఉంటే, మండిపోక ఏంచేస్తుందమ్మా!
ఓ పక్క నేను బాధపడుతూవుంటే, ఉద్యోగం రాకపోవట నా తప్పన్నట్లు ఇంట్లో మీరందరూ వెక్కిరించేవాళ్ళు. హేళనచేస్తూ మాట్లాడేవారు. ఈ వ్యవస్థమీద మీ అందరిమీదా, చదువుమీదా అంతులేని కసి ఏర్పడింది. ఇంకా చదువుతానూ అని చెబితే మీరు నన్ను ప్రోత్సహించకపోగా, వెక్కిరించే అవకాశమే ఎక్కువ వుంది.
రాత్రింబవళ్ళూ చదువుమీద మనస్సు లగ్నం చేయాలనుకున్నాను. కార్యసాధనకు పట్టుదల ముఖ్యం. అందుకనే పట్టుదల నాకు నేనే ఛాలెంజు చేసుకున్నాను. నా శ్రమని ధారపోసి క్షణం వేస్టు చేయకుండా చదువుతాను. ఈ దెబ్బతో కొట్టానా ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి. లేదా, అధికార దుర్వినియోగుల్ని నలుగురిని చంపి, నేను చద్దామనుకున్నాను.
నా ఆలోచనలు అంతదూరం పోయాయి. బహుశా ఈ రకమైన పట్టుదలే నాకీ విజయం సంపాదించి పెట్టి వుంటుంది. మీరు రెచ్చగొడుతూ వుంటే నాకు పిచ్చికోపం వచ్చేది. ఇప్పుడు అనుకుంటున్నాను. మీరు రెచ్చగొట్టబట్టే నేనిలా అద్భుతంగా ఫలితం సాధించగలనూ అని. ఈ విషయం నాకు నిన్ననే తెలుసు. పేపర్లో నా ఫొటో చూసి మీరందరూ పేపర్ చదివాకనే ఈ విషయం చెబుదామని ఆగాను" అంటూ బోసుబాబు విషయాన్ని వివరంగా వారికి చెప్పాడు.
"అనవసరంగా బోసుబాబుని తిట్టామే" అన్న పశ్చాత్తాపం వాళ్ళ ముఖాలమీద ఆవరించింది.
అందరినీ ఒక్కసారిగా కలయజూసి, "ఈ విషయం మీరు సీరియస్ గా తీసుకోవద్దు. వైద్యుడు చేదుమందు ఇచ్చినా రోగి బ్రతకటం ముఖ్యం. మనింట్లో అదే జరిగింది టేకిట్ ఈజీ!" చాలా తేలికగా అన్నాడు బోసుబాబు.
కొద్దిసేపు గలగలా ఆనందంగా మాట్లాడుకున్నారు అందరూ.
పట్టపగ్గాలు లేని ఆనందం, వాళ్ళందరినీ పరవశించేస్తోంది.
తెలిసినవాళ్ళకి ఈ శుభవార్త చెప్పటానికి అప్పటికప్పుడే జగన్నాధం, లక్ష్మణమూర్తి బయటకి వెళ్ళారు.
మాట్నీ సినిమాకి తీసుకెళ్ళి పార్టీ ఇస్తానని చెప్పటానికి సుమిత్ర ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళింది.
కల్యాణమ్మ పక్కింటికి వెళ్ళింది. పక్కింటావిడ చెవిలో ఈ వార్త వేద్దామని.
ఇంట్లో వదినా, మరిదీ మిగిలారు.
బోసుబాబు దగ్గరికి వచ్చింది సామ్రాజ్యలక్ష్మి.
"నిన్ను చాలాసార్లు హేళన చేసాను. మరిదీ! అదేమీ మనస్సులో పెట్టుకోకు!" సామ్రాజ్యలక్ష్మి భయపడుతూ అంది. ఇప్పుడు మరిది అంటే మామూలు మరిదికాదు కలెక్టరాయె.
"వదినా! అమ్మ తరువాత నువ్వే అమ్మవి నిన్నే ఒకసారి నేను ఏడిపించాను. పరీక్ష పాసయినందుకు ఒక పట్టుచీరా, నిన్ను ఏడిపించినందుకు మరో పట్టుచీరా. వదినగారికి రెండు పట్టుచీరలు కొనిస్తాను గిఫ్ట్ గా!" అన్నాడు నవ్వుతూ బోసుబాబు.
"రెండు పట్టుచీరలు!" సామ్రాజ్యలక్ష్మికి మూర్చ వచ్చినంతపనయింది.
బోసుబాబు నవ్వుకుంటూ బయటకి వెళ్ళాడు.
28
"డాక్టర్ సుఖదేవ్ పాండే"
"ఎమ్ డి. పైకో.డి.పి.యం.ఎఫ్.ఐ.పి.యస్"
మానసా నర్సింగ్ హోమ్ స్థాపించిన, డాక్టర్ సుఖదేవ్ పాండేకి, వున్న ఊరిలోనే కాక, దూరతీరాలలో కూడా మానసిక రోగుల విషయంలో వ్యాధులు నయం చేయడంలో ఆయన పేరు మారుమ్రోగిపోతూంది. ఎక్కడెక్కడి నుంచో రోగులు ఈయన నర్సింగ్ హోమ్ కి వస్తూంటారు. ఏ రకమైన మానసిక వ్యాధి అయినా చేయిపడితే వెంటనే తగ్గుతుంది.
ఈ మధ్య, ఇన్ స్పెక్టర్ మనోజు, తన మామయ్య మీదే పరిశోధన మొదలుపెట్టాడు. ఆయన ఒంట్లో బాగోలేదని చెప్పటం అదే పనిగా దీర్ఘాలోచన చేయడం, విపరీతమైన మతిమరుపు. మాట్లాడితే ఏదో మాట్లాడటం, లేకపోతే పూర్తిగా మౌనం వహించటం. ఇదంతా చూసి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లాడు మనోజు. |
25,086 |
"మీరు ఏదో సమయంలో వస్తారని నాకు తెలుసు... మీ కోసం పోలీసులు తిరుగుతున్నారు..." డేవిడ్ గురించి చెప్పింది శివరాణి. "నేను నిన్ను ఇబ్బందులపాటు చేశానన్నమాట..." ఒకింత గిల్టీగా ఫీలవుతూ అన్నాడు ఆదిత్య. "ఆ ఇన్స్ పెక్టర్ డేవిడ్ ఎప్పుడొస్తాడో తెలియక భయంతో చచ్చిపోతున్నాను..." అంది శివరాణి భయంగా. అదే సమయంలో రెడ్డిపాలెం బస్టాపు దగ్గర జీపు ఆగింది. ఆ జీప్ డ్రైవర్ రాములు జేబులోంచి సిగరెట్ తీసుకొని వెలిగించి జీపు దిగాడు. డేవిడ్ ను హైద్రాబాద్ లో క్వార్టర్స్ దగ్గర దింపేసి, ఒకసారి రెడ్డిపాలెం వెళ్ళి పరిస్థితి గమనించిరా! ఏదైనా అనుమానం వస్తే ఫోన్ చెయ్యమని డేవిడ్ యిచ్చిన ఆర్డర్స్ మేరకు అక్కడికొచ్చాడు రాములు. "నా ఖైదీ డ్రెస్ ను హాస్పిటల్లో స్టోర్ రూమ్ లో పడేశాను. ఆ డ్రెస్ కావాలి. సంపాదించగలవా." "మీరెళ్ళాక ఆ డ్రెస్ ను తీసి మా ఇంట్లో వుంచాను" లోనగదిలో కెళ్ళి ఆ డ్రెస్ ను తెచ్చిచ్చింది శివరాణి. గబుక్కున పాంటును అందుకున్నాడు. జేబులో చెయ్యి పెట్టి ఆ ఉత్తరాన్ని బయటకు తీశాడు. దాన్ని చూడగానే రిలాక్స్ డ్ గా ఫీలయ్యాడు. "థాంక్యూ శివరాణీ! నీ హెల్ప్ మరిచిపోలేను. నేను వెళ్తాను" లేచి నిలబడ్డాడు ఆదిత్య. "ఈ రాత్రి మీకొచ్చిన భయమేం లేదు. ఉండండి" చేతులు పట్టుకుంటూ అంది శివరాణి. ఆ చేతుల్లోని వెచ్చదనాన్ని గమనించాడు ఆదిత్య. అదే సమయంలో- ఫ్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి శివరాణి డాబా ఇంటి దగ్గరకు వచ్చిన డ్రైవర్ రాములు, నెమ్మదిగా వినిపిస్తున్న మాటల శబ్దానికి పిల్లిలా అడుగులు వేస్తూ ముందుకొచ్చాడు. మెట్లమీద కూర్చుని తలుపు సందులోంచి లోనికి చూడటం ప్రారంభించాడు. "నేను వెళ్ళాలి శివరాణీ... నన్ను ఆపకు" ఆమె చేతుల్నుంచి తన చేతుల్ని తప్పించుకుంటూ అన్నాడు ఆదిత్య. ఆ మాటలు స్పష్టంగా విన్పించాయి డ్రైవర్ రాములుకు. అంతే! ఏమాత్రం ఆలస్యం చెయ్యలేదు. పరిగెట్టుకుంటూ జీపు దగ్గరకొచ్చి జీపెక్కాడు. వెనక్కి మూడు కిలోమీటర్లు వస్తేగానీ ఫోన్ దొరకదు. పంజాబీ దాబాలో మాత్రమే ఫోనుంది. జీపు వంద కిలోమీటర్ల వేగంతో పరిగెడుతోంది. "పోనీ మీరెక్కడున్నారో చెప్పండి... నేనొస్తాను." "ఎందుకు?" వెంటనే అడిగాడు ఆదిత్య. "మీరంటే ఇష్టపడుతున్నాను కాబట్టి" నెమ్మదిగా తలొంచుకుని అంది శివరాణి. "అంటే నన్ను ప్రేమిస్తున్నావా?" ఆ మాటలు జవాబు చెప్పలేదు శివరాణి. "హంతకుల్ని ప్రేమించడం మంచిదికాదు. మంచివాళ్ళని ప్రేమించి పెళ్ళి చేసుకో. నాకు హెల్ప్ చేసిన ఒక స్నేహితురాలిగా నిన్నెప్పుడూ నేను గుర్తుంచుకుంటాను... వస్తాను." శివరాణి కళ్ళంట నీళ్ళు కొవ్వొత్తి వెలుగులో ఆ కన్నీటి తడి కనిపించడం లేదు. తలుపు తీసుకొని బయటికెళ్ళాడు ఆదిత్య. అదే సమయంలో.... పంజాబీ డాబా దగ్గర్నించి సిటీలోని డేవిడ్ యింటికి ఫోన్ చేస్తున్నాడు డ్రైవర్ రాములు... "సార్... ఆదిత్య ఇప్పుడు రెడ్డిపాలెం నర్స్ ఇంట్లోనే వున్నాడు" చెప్తున్నాడు రాములు ఎక్సైటింగా.
* * * * *
మైడియర్ సుమా! జైలు నుంచి నేను నీకు ఉత్తరం రాస్తున్నానంటే నువ్వు నమ్మవు, నమ్మలేవు కదూ! నమ్మక తప్పదు. మనం పెళ్ళి చేసుకున్న దగ్గర్నుంచీ నా చుట్టూ దుస్సహమైన పరిస్థితులున్నప్పటికీ, తట్టుకోలేని బాధలున్నప్పటికీ వాటి నీడ నీ మీద పడకుండా నేను చర్యలు తీసుకున్నాను. ఎప్పటికప్పుడు ఈ దేశం వదిలి వెళ్ళిపోడానికి నేను చేసిన ప్రయత్నాలన్నీ నీకు తెలుసు. ఆ ప్రయత్నాలు ఫలించక పోవడానికి కారణం గుర్రం పెద్దబ్బాయి అనే మా డాడి. గుర్రం పెద్దబ్బాయిగారికి, నాకూ మొదటినుంచీ సత్సంబంధాలు లేవు. దానిక్కారణం ఆయన మొదటి భార్య... నా తల్లి చనిపోవడమే. నా తల్లి లక్ష్మీదేవి తనని తాను కాల్చుకుని చనిపోయింది. నాకు పదిహేనేళ్ళ వయసులో జరిగిన సంఘటన అది. గుర్రం పెద్దబ్బాయి రెండవ భార్య రాక్షసి. పచ్చి స్వార్ధపరురాలు. ఆవిడ మూలంగానే గుర్రం పెద్దబ్బాయి నన్ను ద్వేషించేవాడు. దాంతో మా మధ్య తండ్రీ కొడుకుల బంధం తెగిపోయి శతృవులమయ్యాం. గుర్రం పెద్దబ్బాయి అక్రమమైన భూముల్ని ఆక్రమించుకుని తన పేరు మీద వాటిని మార్పించుకోవడం అనే బిజినెస్ లో ఘటికుడు. ఈ బిజినెస్ లో ఆయనకో పార్టనర్ కూడా వున్నాడు. ఈ పార్ట్ నర్ ఎవరో నేను చెప్తే నువ్వు ఆశ్చర్యపోతావ్. దాదాపు పదిహేనేళ్ళపాటు ఆ పార్ట్ నర్లిద్దరూ ఈ బిజినెస్ చేశారు. వాళ్ళిద్దరూ బాగా కలిసుండి బిజినెస్ చేస్తున్న రోజుల్లో నాలుగు కోట్ల రూపాయల విలువైన ఒక లాండ్ ను డీల్ చేశారు. ఆ లాండ్ ను మా అమ్మపేరున పెట్టాడు గుర్రం పెద్దబ్బాయి ముందు జాగ్రత్త చర్యగా. అందులో సగం సొమ్ము-అంటే రెండుకోట్ల రూపాయల్ని తను ఇచ్చేస్తానని ఆ పార్ట్ నర్ని ఒప్పించాడు. ఆ పార్టనర్ నమ్మాడు కానీ- ఆ తర్వాత గుర్రం పెద్దబ్బాయి ఆ పార్ట్ నర్ కి ఆ సొమ్ము యివ్వలేదు. ఆ లాండ్ తన భార్య లక్ష్మీదేవిదని వాదించాడు. అప్పట్నించీ ఆ పార్ట్ నర్ లిద్దరి మధ్యా యుద్ధం ప్రారంభమైంది. రెండు గ్రూపుల మధ్యా తగువులు ప్రారంభమయ్యాయి. ఒకరి మీద ఒకరు ఎత్తులు, పై ఎత్తులు. ఇద్దరూ రాజకీయాల్లోకి వచ్చారు. ఆ పార్టనర్ ఎవరో తెల్సా? అహోబలపతి! అసలు ఏం జరిగిందో తెలీదు. కానీ నా తల్లి తన పేరు మీదున్న నాలుగు కోట్ల రూపాయల లాండ్ ను నా పేరుమీద రాసేసి సూసైడ్ చేసుకుని చనిపోయారు.
నా మైనార్టీ తీరిన వరకూ నన్ను కంటికి రెప్పలా కాపాడాడు నా తండ్రి. |
25,087 | గదిలో అన్ని మూలలకి విచక్షణారహితంగా బుల్లెట్స్ పంప్ చేస్తున్నాడు కమాండో.
రెండు క్షణాల తరువాత తిరిగి నిశ్శబ్దం.
చంద్రకాంత్ నోటిమీద బలంగా నొక్కి వుంచిన కౌశిక్ చేయి కొంచెం తొలగించి "సీతారాం హెల్ప్ మీ" ఆ అవకాశం తీసుకుని అరిచాడు చంద్రకాంత్.
అతని అరుపు వచ్చినదిశగా గర్జించింది సీతారాం చేతిలోని రివాల్వరు.
కెవ్వున అరిచి పక్కకి పడిపోయాడు కౌశిక్.
కుడి భుజంలో నిప్పు కణిక దిగినట్టు అయింది.
సరిగ్గా అదే సమయంలో లైట్లు వెలిగాయి.
అదే క్షణంలో రివాల్వరుతో పైకి లేవబోతున్న చంద్రకాంత్, ప్రక్కకి పడిపోయిన కౌశిక్, అతనివైపు రివాల్వరు తిప్పి ట్రిగ్గర్ లాగబోతున్న సీతారాం కనిపించారు ప్రభుకి.
ఇంక ఆలస్యం చెయ్యలేదు ప్రభు.
సెకన్లో వెయ్యోవంతు కాలంలో రియాక్టయి సబ్ మెషిన్ గన్ ట్రిగ్గర్ లాగాడు.
నిప్పులు కక్కింది ఆ గన్.
తూట్లు తూట్లుగా అయిపోయారు సీతారాం, చంద్రకాంత్ లు. వాళ్ళ శరీరాల నుండి చిందిన రక్తం ఆ గదంతా స్ప్రే చేసినట్లుగా చిందింది.
మాంసం చిన్న చిన్న ముక్కలుగా రూమ్ నిండా చిందింది.
అదే క్షణంలో మిగతా గదుల్లోకి పరుగెత్తారు కమాండోలు.
ఒక గదిలో మూలగా కూర్చుని గజగజ వణికిపోతున్నాడు ఒక సిక్కు జాతి కుర్రాడు.
మరో గదిలో అయోమయంగా దిక్కులు చూస్తోంది ఓ అరవై ఏళ్ళ పని మనిషి. ఇంకో గదిలో మూలగా కూర్చుని జరుగుతున్నదేమిటో అర్ధంకాక వణికిపోతున్నారు సంజన, అర్చన, పవన్ లు.
"రండి మీకు భయంలేదు. మిమ్మల్ని రక్షించడానికే వచ్చాం" అన్నాడు ఒక కమాండో.
* * * *
"అరే ఇదేం పని. చంద్రకాంత్ ని ఎందుకు చంపేశావు?" తన ఊహకు భిన్నంగా లిప్తపాటు కాలంలో జరిగిన సంఘటనని ఆకళింపుచేసుకునే ప్రయత్నం చేస్తూ అన్నాడు కౌశిక్.
"నో ఫ్రెండ్! వాడి ప్రాణం కంటే నీ ప్రాణం మన డిపార్ట్ మెంట్ కి చాలా ముఖ్యం" గన్ ప్రక్కన పడవేసి అతన్ని సమీపించి భుజం నుంచి కారుతున్న రక్తం కర్చీఫ్ తో అదిమిపెట్టాడు ప్రభు.
"మన వాళ్ళలో ఎవరికో బుల్లెట్ తొడలో దిగింది. నథింగ్ టు వర్రీ. హి ఈజ్ సేఫ్" చెప్పాడు ప్రభు.
"కౌశిక్!" అన్న స్త్రీ కంఠం విని తల తిప్పాడు అతను.
ప్రక్క గదిలోనుండి బయటికి వస్తున్నారు అర్చన, సంజన, పవన్ లు.
చిన్నాభిన్నంగా పడి వున్న చంద్రకాంత్ శవం చూడలేక తల తిప్పుకుంది అర్చన.
నీళ్ళు నిండిన కళ్ళతో కృతజ్ఞతాపూర్వకంగా చేతులు జోడించింది సంజన.
భుజానికి తగిలిన దెబ్బ బాధ పెడుతున్నా చిరునవ్వు నవ్వాడు కౌశిక్.
"థాంక్ గాడ్! మీరు మీ అబ్బాయిని కలుసుకోగలిగారు" అన్నాడు అర్చనని ఉద్దేశించి.
ఆనందాశృవులతో కృతజ్ఞత తెలిపింది అర్చన.
అదే సమయంలో ఆ ఇంట్లోకి ప్రవేశించారు కమాండో ఇన్ ఛార్జ్ శర్మ, డి జి పి, ఐ జి, ఇంటెలిజెన్స్ టాస్క్ ఫోర్స్ అధికారి, తదితరులు.
* * * *
కోలాహలంగా వుంది బేగం పేట ఎయిర్ పోర్ట్.
టేకాఫ్ కి సిద్ధంగా వుంది బొంబాయి ఫ్లైట్.
"సంజనా! నువ్వు త్వరగా బయలుదేరాలి. అదిగో నీ గురించి ఇప్పటికి నాలుగుసార్లు అనౌన్స్ చేశారు" తొందర చేశాడు కౌశిక్. బొంబాయి నుండి ఇంగ్లండ్ ఫ్లైట్ కి వెళ్ళాలి ఆమె.
"అలాగే" అని చైర్లో లో వున్న వ్యానిటీబ్యాగ్ అందుకుంది సంజన.
"ఈసారి మీరు వచ్చినప్పుడు హైదరాబాద్ లో మీ ప్రోగ్రాం ఇవ్వాలి. మేము మీ పాటలు వినాలి" అంది అర్చన.
"ఆంటీ! మీరు బాగా పాడతారు. మీ కేసెట్ విన్నాను" అన్నాడు పవన్.
పవన్ బుగ్గమీద సున్నితంగా చుంబించింది సంజన.
"నెక్ట్స్ టైమ్ మీరు వచ్చినప్పుడు మీ చేత ఫస్ట్ ప్రోగ్రాం వైజాగ్ లోనే ఏర్పాటు చేయిస్తాను. ఆ తరువాతే హైదరాబాద్ లో ప్రోగ్రాం సరేనా!" అన్నాడు కౌశిక్.
"కాదు. నా ప్రోగ్రాం ఫస్ట్ ది హైదరాబాద్ లోనే!" స్థిరంగా అందామె.
"అదేమిటి?" అర్ధంకాక అంది అర్చన.
"అవును. నాకు జన్మనిచ్చిన ఊరు వైజాగ్ అయితే, పునర్జన్మనిచ్చినది హైదరాబాద్. అందుకే ఇక్కడే నా ఫస్ట్ ప్రోగ్రాం యివ్వాలి. మరో ఆరు నెలల్లో మళ్ళీ ప్లాన్ చేసుకుని వస్తాను."
ఆమె మాట చిత్రంగా అనిపించింది అతనికి.
"వస్తాను బై" సున్నితంగా కౌశిక్ చేయి నొక్కి వదిలేసింది సంజన.
ఆమె అడుగులు లోపలికి వడిగా పడ్డాయి.
ఆమె వెళ్ళిన వైపు చూస్తూ వుండిపోయారు కౌశిక్, అర్చన, పవన్ లు.
ఐదు నిమిషాల తరువాత....
చెవులు చిల్లులు పడేలా రొద చేస్తూ గాలిపొరలు చీల్చుతూ టేకాఫ్ అయింది ఫ్లైట్.
A NOVEL BY
Vempalli Niramjan Reddy.
|
25,088 |
హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్ళే నేషనల్ హైవే మీద హీరో హోండా పరుగులు తీస్తోంది.
లేత ఎండలో తార్రోడ్డు తాచుపాములా మెరుస్తోంది.
హీరో హోండా బ్యాక్ సీట్లో కూర్చున్న బేరర్ యాదగిరి దాదాపు వంద కిలోమీటర్ల స్పీడ్ తో డ్రైవ్ చేస్తున్న సూర్యవంశీని భయం భయంగా చూస్తున్నాడు.
"సార్....కొంచెం...స్పీడ్ తగ్గించండి సార్....ఎక్కడో నేను బోల్తాపడితే....మీకే నష్టం సార్..." అరుస్తున్నాడు యాదగిరి.
ఆ అరుపుల్ని రెండంగుళాల పొడవు.....విశాలమైన నుదురు....కండలుదీరిన శరీరం.... సూదిముక్కు.... తీర్చిదిద్దినట్టుండే కనుబొమలు....డేగకళ్ళు...సిమెంట్ కలర్ బ్యాగీ పేంటూ, లూజ్ బ్రౌన్ చెక్స్ షర్ట్....కాళ్ళకు స్పోర్ట్స్ స్టార్ షూస్.
నుదుటమీద పడుతున్న జుత్తుని ఎడంచేత్తో పక్కకు తోసుకుంటూ-
మరింత స్పీడు పెంచాడు.
స్పీడో మీటర్ లోని ముళ్ళు నూరు దాటింది.
అటునుంచి అదే స్పీడులో వస్తున్న లారీల్ని చూస్తుంటే యాదగిరి గుండె గుబగుబలాడిపోయింది.
"ఎక్కడో యాక్సిడెంట్ ఖాయం." గోనుక్కుని బ్యాక్ సీట్ హేండిల్ ని మరింత గట్టిగా పట్టుకున్నాడు యాదగిరి.
మధ్యాహ్నం మూడుగంటలు దాటింది.
సరిగ్గా నలభై అయిదు నిమిషాలు గడిచాయి.
హీరో హోండా స్పీడు నెమ్మదిగా తగ్గడంతో, యాదగిరి గుండెల్లోని గాభరా తగ్గుముఖం పట్టింది.
తార్రోడ్డు మీద నుంచి కుడిపక్క మలుపు తిరిగి, పది నిమిషాల సేపు కంకర రోడ్డుమీద ప్రయాణం చేసి, రోడ్డు పక్కన ఆగింది హీరో హోండా "దిగు" అన్నాడు సూర్యవంశీ.
వెంటనే కిందకు దూకాడు యాదగిరి. అప్పుడు చూసాడతను....రోడ్డుకి ఎడం పక్కన, గుడ్డల చాటున, అందంగా కన్పిస్తోందో పాతకాలపు బిల్డింగ్.
"ఈ బిల్డింగ్ లోపలికి తీసికెళ్ళి తంతాడేమో...." అసలే యాదగిరిది పిరికి గుండె. మరింత పిరికిగా కొట్టుకుంది.
"ఏంటి బాసు ఇది..." సూర్యవంశీ, వెనకే నడుస్తూ అడిగాడు.
జవాబు చెప్పలేదు సూర్యవంశీ. ఆ బిల్డింగ్ కి కొంచెం దూరంలో చెట్టుకింద, హీరో హోండాని పార్కుచేసి, ఆ బిల్డింగ్ లోకి నడవ సాగాడతను.
అతన్ని నిశ్శబ్దంగా అనుసరించాడు యాదగిరి.
* * * * *
కొండల మధ్యనున్న, నిజాం కాలం నాటి ఆ పాతకాలపు బిల్డింగ్ లోనికి వెళ్ళాకగానీ, అసలు సంగతి తెలీలేదు యాదగిరికి.
అదొక బార్ అంద్ రెస్టారెంట్.
బార్ వెనక, పార్క్ చేస్తున్న మారుతీకార్లను, లోనున్న వ్యక్తుల్ని చూడగానే అర్ధమైపోయింది....అదెలాంటి బారో.
ఎక్కువ మంది, టీనేజీ కుర్రాళ్ళే ఉన్నారందరూ.
హాల్లో అందమైన కీన్ ఫర్నిచర్.... ఆ పక్కన ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్స్.... టేబుల్స్ మధ్య, ఏర్పాటు చేసిన వైల్డ్ ట్రీస్.... గమ్మత్తుగా ఉంది వాతావరణం... "పట్టపగలే.... ఇక్కడ కేబెరేలు.... జరిగేటట్టుంది కదా బాసూ!" జోగ్గా అన్నాడు యాదగిరి.
సూర్యవంశీ నాలుగు వేపులా చూస్తూ, ఓ టేబుల్ ముందు కూర్చున్నాడు. ఆర్డర్ తీసుకున్న అయిదు నిమిషాల్లో సరంజామాను టేబిల్ మీద సర్దేసి, డ్రింక్ ను గ్లాసుల్లో పోసి, షోడా కలిపి వెళ్ళిపోయాడు బేరర్.
చప్పున చెయ్యి అడ్డుగా పెట్టాడు సూర్యవంశీ.
"నువ్వెన్ని పెగ్గులు తాగుతావు" సీరియస్ గా అడిగాడతను.
"మూడు... కంపెనీ వుంటే....ఆరు" టకామని జవాబు చెప్పాడు యాదగిరి.
"అంటే నువ్వు ఆరో పెగ్గు తర్వాత....నిజం చెప్తావన్నమాట" ఆ మాటకి యాదగిరి ముఖం వెలవెలబోయింది.
"సార్... ఇప్పటికి మూడుసార్లు చెప్పాను. నాకేం తెలీదు సార్..."
"అసలు స్పెషల్ పర్మిషన్ మీద ఎందుకు తీసుకొచ్చానో తెల్సా?"
"తెల్సుసార్! అక్కడుంటే నన్ను పోలీసులు చంపేస్తారని సార్ అసలు నాకు..."
"ముందు డ్రింక్ తీస్కో"
గ్లాసందుకుని, డ్రింక్ ని సిప్ చేస్తూ అన్నాడు సూర్యవంశీ.
భయంతోనో, గత నాలుగు రోజులు పోలీసుల ఇంటరాగేషన్ బాధ వల్లో, గ్లాసులోని డ్రింకుని, పూర్తిగా తాగేసాడు యాదగిరి.
"జగన్నాయకులు, ప్రెస్ క్లబ్ బార్ లోకి వచ్చిన దగ్గర్నించి.... ఆయన బైటకి వెళ్ళిన వరకూ.....ఏం జరిగిందో....డిటైల్డ్ గా చెప్పు పోలీసులకు చెప్పినట్టుగా కాదు....అండర్ స్టాండ్."
"చెప్తాను....సార్.... డిటైల్ గా చెప్తాను సార్.... అస్సలు.... ఆ రోజు డ్యూటీలో ఉండడం.... నా బుద్ది పొరపాటు సర్..... వినండి సర్" యాదగిరి నెమ్మదిగా చెప్పడం ప్రారంభించాడు.
సరిగ్గా అరగంట గడిచింది. యాదగిరి చెప్పడం ముగించాడు.
"మంకీ టోపీగాడు, ఆ కుర్తా పైజమా గాడు....బార్ కి అదే మొదటిసారి రావడం- అంతేనా"
"అవున్సార్..."
"వాళ్ళని బైట చూస్తే గుర్తు పట్టగలవా..."
"ఎస్... సర్..."
"ఎలా గుర్తు పడతావ్..." సూర్యవంశీ ప్రశ్నకు వెంటనే జవాబు చెప్పలేక పోయాడు.
రెండు నిమిషాలు గడిచాయి.
"ఆ మంకీ టోపీ గాడ్ని.... ఎక్కడ చూసినా గుర్తుపడతాను సర్"
యాదగిరి కళ్ళల్లో ఏదో ఉత్సాహం తొంగి చూసింది.
"ఎలా...." ఆత్రంగా ప్రశ్నించాడు సూర్యవంశీ.
"ఆ మంకీ టోపీగాడి, పైవరస, పళ్ళల్లో, పెద్దపన్ను కట్టుడుపన్ను సార్..."
"అంటే.... బంరారప్పన్నా"
"కాద్సార్....ప్లాస్టిక్ పన్ను సార్.... ఆపన్నుకి, పక్క పన్నుకీ మధ్య సన్నటి స్టీల్ రాడ్ మెరుస్తూ... కన్పిస్తుంది సార్..."
"ఈ విషయం....పోలీసులకు చెప్పావా...."
"లేద్సార్"
"ఏం" |
25,089 |
"మీరు పూర్ణదగ్గిర ఉండండి" అంటూ భర్తతో చెప్పి తను పూజ గదిలోకి పరుగుపెట్టింది మీనాక్షి. దేవుడి ముందు దీపం పెట్టి సాగిలబడింది.
"తండ్రీ! నా పూర్ణని కాపాడు. కావాలంటే నా ప్రాణం తీసుకో. పూర్ణ నా అర్ధం, నా ప్రాణం, నా జీవితం. అది లేందే నేను బ్రతకలేను."
"ముక్కుపచ్చలారని నా కూతురు నీకేం అపకారం చేసింది. దాని తల్లిగా నేనేం అపరాధం చేసేను? తెలియక ఏదైనా చేస్తే మన్నించు, తండ్రీ! నా కింత శిక్ష వెయ్యకు. నాకింత ద్రోహం చెయ్యకు" అంటూ మొరపెట్టుకొంది.
దీపశిఖలోంచి పూర్ణముఖం నవ్వుతూ కనిపించింది. "నేను పట్నం వెళ్ళిపోతానమ్మా! పిన్నిలా చదువుకొంటాను. చిన్నాన్న దగ్గిరే ఉండిపోతాను. నాకు పట్నం ఎంతో బాగుంటుంది. నేను వెళ్ళిపోతున్నాను. నన్ను పట్టుకోకు, నేను వెళ్ళిపోతున్నాను."
రాత్రినుంచి పూర్ణ నోట వింటున్న కలవరింతలే మీనాక్షి చెవుల్లో ప్రతిధ్వనించేయి.
"నా చిట్టి తల్లీ, నీకు అడ్డు చెప్పనమ్మా! ఈసారి పిన్నితో నిన్ను తప్పక పంపుతానమ్మా! నామీద అలిగి పారిపోకు, కన్నతల్లీ!" అంటూ కళ్ళనీళ్లు పెట్టుకొంది మీనాక్షి.
పూర్ణ ముఖం క్రమంగా మారిపోయి అన్నపూర్ణ ముఖంలా కనిపించింది. "అన్నపూర్ణా! అన్నపూర్ణా! ఈ సమయంలో నువ్వెందుకు వచ్చేవు? నా పిల్లని, నా ఒక్కగా ఒక్క కూతుర్ని ఏం చెయ్యాలని వచ్చేవు? మేము నీకేం అపకారం చేసేము? నీ పిల్లడిని కన్నకొడుకు కన్న మిన్నగా పెంచి పెద్దచేసేము. నాపిల్లని నువ్వు తాకకు. నేను ఊరివాళ్ళ మాటలు నమ్మలేదు. నువ్వు నా శుభకాంక్షిణివి అనుకొన్నాను. అన్నపూర్ణా, వెళ్ళిపో. దగ్గిరికి వచ్చేవో చంపేస్తాను. నా పిల్ల జోలికి రాకు....రాకు...." గట్టిగా అరుస్తూ తెలివితప్పి పడిపోయింది మీనాక్షి.
ఆమెకి తెలివి వచ్చేసరికి వరదరాజు తలదగ్గిర కూర్చుని ఉన్నాడు.
"వరదం, నువ్వెప్పుడు వచ్చేవు, నాయనా! అంతలా ఏడుస్తున్నావు, నాకోసమే? నాకేంలేదు, బాబూ! ఎందువల్లనో కాస్త తల తిరిగింది. మీ అన్నయ్య ఏరీ? పూర్ణ గదిలో ఉన్నారా? పిచ్చిపిల్ల, నిన్నటినించి నీ కోసం ఒక్కలా కలవరిస్తున్నది. పద....పద....చూద్దువుగాని. నీ పిలుపుతోనైనా కన్నువిప్పి చూస్తుందేమో?" అంటూ లేచి కూర్చుంది మీనాక్షి.
"వదినా! పూర్ణ...."అంటూ ఆమెను పట్టుకొని చిన్న పిల్లడిలా ఏడ్చేడు రాజు.
"ఏమయింది వరదం? పూర్ణ కేమయింది? ఎందుకంతలా ఏడుస్తున్నావు?" ముందు గదిలోకి పరుగుతీస్తూనే అరిచింది మీనాక్షి.
తలనిండుగా దుప్పటి కప్పిఉన్న పూర్ణ మంచం కోడుకి బుర్ర ఆన్చుకొని కూర్చున్నాడు శివయ్య.
"పూర్ణా....నా పూర్ణా....నా తల్లీ....నా కన్ను కప్పి ఎక్కడికి వెళ్ళిపోయేవు, అమ్మా?" కూతురి కట్టెమీదపడి రోదించింది మీనాక్షి.
అక్కడ చేరిన ఇరుగు పొరుగుల వారికి ఆమెను ఓదార్చేందుకు మాటలే కరువయ్యేయి. ఒకరిద్దరు మగాళ్లు శివయ్యకి ధైర్యం చెప్పబోయేరు. అతడు వారిని చూస్తూ "నాకెవరి ఓదార్పూ అవసరం లేదు. నన్నిలా వదిలిపెట్టండి" అన్నాడు.
అతని కళ్ళు అగ్నిగోళాల్లా ఉన్నాయి. మంచంకోడుకి కొట్టుకున్న నుదురుపై తగిలిన దెబ్బ రక్తం చిమ్మి మూడో కన్నులా వుంది. తిరిగి ఎవరూ అతని దగ్గిరికివెళ్లి ఊరడించే ప్రయత్నం చెయ్యలేదు.
రాజు వెనకనే వచ్చిన కారుడ్రయివరు పరిస్థితి తెలుసుకొని తిరిగి వెనక్కి వెళ్లి ఆ వార్త రాఘవయ్యగారికి అందించేడు.
మరునాటి ఉదయం రాఘవయ్య, రాజమ్మ, అనూరాధా వచ్చేరు. పూర్ణకి చెయ్యవలసిన పనులన్నీ రాజు స్వయంగా చేసేడు.
"చిన్న పిల్లడు. అతడు ఇవన్నీ చేయడ మేమిటి? ఇంకెవరినైనా పంపితేపోదూ. పక్కకి పిలిచి చెప్పండి" అంది రాజమ్మ భర్తతో.
"నేకేం తెలియదు, నువ్వూరుకో" అన్నాడు విసుగుదలతో రాఘవయ్య.
సాయంకాలంవరకూ ఉండి రాఘవయ్యా, రాజమ్మా తిరిగి వెళ్లిపోయేరు. తను పదిరోజులపాటు ఉండి వస్తానంది అనూరాధ. రాజమ్మకి అది ఇష్టంగా లేకపోయినా ఆ సమయంలో ఏమన్నా బాగుండదని ఊరుకొంది.
రాత్రీ, పగలూ నీడలా ఉండి మీనాక్షికి ఓదార్పుకలిగే మాటలు చెబుతూ, ఎంతో పెద్ద దానిలా అనునయిస్తూ ఆమె దుఃఖాన్ని, కడుపుమంటని తగ్గించ ప్రయత్నించేది రాధ. ఇంటలో రాజూ, శివయ్యా ఉన్నదీ లేనిదీ తెలియనంత నిశ్శబ్దంగా ఉండిపోయేరు. ఉండి ఉండి మీనాక్షి రోదనలు ఇంటిని గిలగిలలాడించేవి. ఆ తల్లి ఏడుపు చుట్టుపక్కలవారికి కంట నీరు తెప్పించేది. ఇంట్లో ఎవరికీ తిండీ, నిద్రా అన్న దృష్టి లేకుండా పోయింది. పొరుగింటి అన్నమయ్య భార్య వచ్చి ఆ నాలుగు రోజులు ఇంత వండిపెట్టింది. అనూరాధ అందరినీ బ్రతిమాలి, బామాలి ఇంతో అంతో గొంతులో పోసుకొనేలా చూసేది.
అలవాటులేని పనులమూలంగా వారంరోజుల నాటికే అనూరాధకి రొంపచేసి కొంచెం జ్వరం వచ్చింది. ఇంటిలో అందరి మగతా దానితో సడలిపోయింది.
"నువ్వు ఇక్కడ ఉండకు, తల్లీ! ఇది పాపిష్టి ఇల్లు, పండులా తిరుగుతున్న పిల్లని పొట్టపెట్టుకొంది. మీ ఇంటికి వెళ్లిపో. నిన్ను కంటికి రెప్పలా కాచుకొంటున్న నీ తలిదండ్రుల దగ్గిరికి వెళ్లిపో, అమ్మా!" అంది మీనాక్షి.
రాజు మామగారికి అనూరాధ అనారోగ్యం గురించి కబురు పెట్టేడు. కారు పంపిస్తే అక్కడికి వెంటనే తీసుకువస్తానని తెలియజేసేడు.
కారు ఒక్కటే రాలేదు _ అందులో రాజమ్మ, రాఘవయ్య కూడా వచ్చేరు.
|
25,090 | అతని ముఖం నా ముఖం దగ్గరగా వస్తుంటే గోధూళి ఆకాశాన్ని ముద్దాడినట్లుంది.
అతను నాకు దూరంగా జరుగుతుంటే, గోదారి తీరాన్ని వదిలి దూరం అవుతున్నట్లుంది.
ఎన్ని క్షణాలయినా సరే ఈ భారాన్ని మోస్తూ నిశ్శబ్దంగా ఈ కాల వాహినిలో కలిసిపోయి, ఎవరికీ తెలియకుండా జలసమాధయిపోవాలని వుంది.
శుద్ద సావేరి రిషభంలో కలిసి సాగిపోతుండగా ఏదో అపశృతి.... తంత్రి తెగి పడిన చప్పుడు.
శరీరం బాధతో మూల్గింది. కళ్ళు విప్పి చూశాను. నా తీరం.....వెన్నెలా....శుద్దసావేరీ....మురళీనాదం ఏవీ లేవు!
ఆనంద్ మాత్రం వున్నాడు. నన్ను తనవైపు బలవంతంగా తిప్పుకున్నాడు.
"ప్రియ లేనట్లుంది వూళ్ళో!' ఆ భావన రాగానే అందమైన ఉద్యానవనంలో నుండి ఒక్కసారిగా బురద కాలవలోకి విసిరివేయబడినట్లు అనిపించింది. నా కలలని సైతం చిన్నాభిన్నం చేసే హక్కు ఇతడికెవరిచ్చారూ!
అప్పటిదాకా స్వర్గారోహణ చేసిన శరీరం అతనికి సహకరించలేదు. ఫలితంగా అతని చేతిలో ప్రాణం పోయిన కట్టెలా మిగిలాను.
ఆనంద్ పక్కమీద నుండి లేస్తూ "ఈడియట్.... చీర కట్టుకోగానే ఆడదానివై పోవు! ప్రియంవద దగ్గర నేర్చుకో!" అన్నాడు.
'మీద పడగానే మగాడివైపోవు! ప్రదీప్ ని చూసి మనసుని శృతి చేయడం తెలుసుకో" అని నేను అంటే అతని మొహం ఎలా మారేదో కదా!
పట్టుచీర కట్టుకుని 'పేరంటానికెళుతూ బురదలో కాలెయ్యడం అంటే ఇదే! నా మనసంతా చిరాగ్గా మారింది. ఆనంద్ ముట్టుకున్న శరీరాన్ని మసిలే నీళ్ళతో...వీలైతే డెట్టాల్ వేసి కడుక్కోవాలనిపించింది! ఇలా ఏ భర్తవల్ల అయినా భార్యకి అనిపిస్తే ఇంక వాడు చావడం నయం! నేను లేచి బాత్ రూంలోకి వెళ్ళిపోయాను.
సాయంత్రం ఎప్పుడౌతుందా, కంప్యూటర్ సెంటర్ కి ఎప్పుడెళ్దామా అనుకుంటూ కాలు ఒకచోట నిలవకుండా పగలంతా ఎదురుచూస్తూ గడిపాను. సాయంత్రం గులాబీరంగు షిఫాన్ చీర కట్టుకున్నాను. శాండల్ వుడ్ పెర్ ఫ్యూమ్ స్ప్రే చేసుకుంటుంటే పెదవి మీదకి మల్లె తీగలా నవ్వుపాకింది. జుట్టుని బ్రష్ చేసి జడ అల్లకుండా వదిలేసి చెవి పక్కగా గులాబీ పువ్వు పెట్టుకున్నాను. నా కళ్ళు ఎప్పటికన్నా ఎక్కువ ప్రకాశవంతంగానూ పెదవులు మామూలుకన్నా ఎక్కువ ఎరుపుగానూ అనిపించాయి. గుండెలెందుకో భారంగా వూపిరి తీస్తున్నట్లు ఫీలయ్యాను.
కారు ఎక్కగానే ఆలోచనలకి రెక్కలొచ్చినట్లు ఫీలయ్యాను.
క్లాసు అయిపోయింది. న్నెఉ చెట్టుక్రింద నిలబడ్డాను.
డ్రైవర్ దగ్గరగా వచ్చి "రండి మేడం.....పోదాం" అన్నాడు.
"నేను ఫ్రెండ్ ఇంటికెళ్ళాలి. నువ్వెళ్ళిపో!" అన్నాను ధైర్యంగా.
అతను ఏదో అనబోయి నా చూపులోని తీక్షణతకి జడిసి వెళ్ళిపోయాడు.
చాలాసేపు గడిచిపోయింది. అందరూ ఒక్కొక్కరిగానూ....జంటలుగానూ వెళ్ళిపోయారు.
ప్రదీప్ రాలేదు!
దీపం పెట్టని ఇల్లులా తయారయ్యింది నా మనసు! కాళ్ళని బలవంతంగా ఈడవాల్సి వచ్చింది. నడుస్తూ వస్తుంటే ఎవడో పక్కనుండి వెళ్తూ-
"హాయ్ బ్యూటీ...వస్తావా..." అంటూ స్కూటర్ మీద దూసుకుపోయాడు. వెధవ, నన్ను బ్యూటీ అని నిజంగా అన్నాడో....అంతే ఇంగ్లీషు వచ్చో తెలియలేదు. అయినా 'వస్తావా?' అన్నవాడు ఆగకుండా పోతే ఎలా? నోటితో తీర్చుకునే ఆబా వెధవలు! నిలబెట్టి వరసగా షూట్ చేసి పారెయ్యాలనిపించింది.
కళ్ళు మసక మసకగా అయ్యాయి. కన్నీళ్ళా! ఎంత విచిత్రం అవి ఇంకా ఇంకిపోలేదు. ఈ మధ్యన ఆనంద్ ఎంత పొడిచినట్లు మాట్లాడినా, అత్తయ్యా, మావయ్యా నా ముందే ప్రియ గురించి పొగిడినా, జయంతి తేలిగ్గా తీసిపారేసినా ఏం చేసినా రాని కన్నీళ్ళు ఎందుకింత తియ్యగా వస్తున్నాయి.
ఇంటికొచ్చేటప్పటికి కళ్ళు పీకేస్తున్నట్లు ఒకటే నెప్పి! కాస్తా కూస్తా దూరం లేదు మరి! ప్రదీప్ ని తలుచుకుంటే చాలా కోపంగా వుంది. నిశ్శబ్దంగా వున్న తటాకంలో రాయి విసిరి అలజడి సృష్టించి ఏవీ ఎరగనట్లు చక్కాపోయాడు! ఇదో రకమైన శాడిజం అనిపించింది. డాబామీద కెళ్ళి మల్లెమొగ్గలు కోద్దామన్నా, చెట్లకి నీళ్ళు పోద్దామన్నా....ఏ పనీ చేయబుద్దికాలేదు. వంట కూడా చెయ్యలేదు. టీవీ చూసినా, పుస్తకం తిరగేసినా విసుగుపుడ్తోంది. ఫోన్ వైపే చూస్తూ రాని మనిషి కోసం తలుపు వైపే చూస్తూ దుర్బరంగా గడిచింది కాలం!
రాత్రి ఆనంద్ తలుపు తోసుకుని నా గదిలోకి రాగానే ఎలర్ట్ అయి "నాకు అస్సలు ఓపికలేదు! మీ గదిలోకి వెళ్ళండి" అన్నాను.
"ఎవడితో తిరిగొచ్చావు?" చాలా సూటిగా అడిగేసాడు.
నేను భయపడినంతా అయింది. రాక్షసుడికి అనుమానం వచ్చేసింది. ఇంక ఆరాలు తీయడం ప్రారంభిస్తాడు. వీడు వుంచుకున్న దాని ఇంట్లో పడుకుని కట్టుకున్న దానిమీద నిఘా పెడ్తాడు. వీడుట్టి వెధవ! తెలుగు భాషలో అతన్ని తిట్టడానికి ఏ తిట్టూ మిగలలేదు ఇంక.
"కారు వద్దన్నావట?" అడిగాడు.
"నడవాలనిపించింది..." అన్నాను.
"ఆనంద్ గాడి భార్య బజార్న పడిందిరోయ్! అని అందరూ అనుకోవడానికా?" కోపంగా అడిగాడు.
అందరూ అనుకుంటారనేగానీ వీడికేం లేదా! రహస్యంగా ఏవైనా చెయ్యొచ్చన్నమాట అనుకున్నాను.
"తిక్క వేషాలెయ్యకు. నా సంగతి తెలుసుగా!" అన్నాడు.
నాకు మాధవి గుర్తొచ్చింది. ఆ రోజున ఆ రౌడీగాడి చేత దాన్ని కొట్టించిన వీడ్ని నేను వదిలిపెట్టకూడదు! మొహం పగిలేట్లు కొట్టించాలి. కాదు....కాదు. వీడు పడి చచ్చిపోతున్న ఆ పరువుమీద కొట్టించాలి. ఆ దెబ్బకి వీడూ, వీడి నాన్నా, అమ్మా, చెల్లీ అందరికీ దిమ్మ తిరిగిపోవాలి!
"రేపటినుండీ క్లాసు అయిపోగానే ఇంటికి రా! లేకపోతే మానిపించెయ్యాల్సొస్తుంది" అనేసి వెళ్ళిపోయాడు.
తోలు బొమ్మలాడించేవాడిని అనుకుంటున్నాడా? వీడు ఆడిస్తేనే నేను ఆడాలా? దారం కాస్త పుటుక్కున తెంపుకున్నానంటే వదిలిపోతుంది అనుకున్నాను. |
25,091 |
ఓ రోజు మధ్యాహ్నం ఇంట్లో ఒంటరిగా ఉన్నాను. మంచం మీద పడుకుని ఆలోచనలో మునిగి ఉన్నాను.
ఎప్పుడొచ్చారో తెలీదు. మా బావగారు పిల్లిలా గదిలో కడుగుపెడుతూ ఉండటం చూసి, ఉలిక్కిపడి లేచి కూర్చున్నాను.
"ఫర్వాలేదు పడుకో. ఈ ఫార్మాలిటీస్ మనిద్దరి మధ్యా ఏం వద్దులే" అంటూ ప్రక్కనే ఉన్న కుర్చీలో కూచున్నాడు.
ఆయన మాటలు పట్టించుకోకుండా మంచం అంచున కూచుని ఉన్నాను.
"నేనంతా గమనిస్తూనే ఉన్నాను" అన్నారు.
తలెత్తి ఆయన ముఖంలోకి చూసి, అంతలోనే కళ్ళు వాల్చేశాను.
"ఆ చవట గురించి నాకు మొదట్నుంచి తెలుసు. ఒట్టి అప్రయోజకుడని, నపుంసక వెధవనీ...."
నా రక్తనాళాల్లో రక్తం జివ్వుమని ప్రవహించినట్లయింది. కోపంగా అతని ముఖంలోకి మళ్ళీ చూశాను.
"చవట వెధవని తెలిసినప్పుడు పెళ్ళెందుకు చేశారు? నా జీవితం నాశనం చెయ్యటానికా?"
"వద్దని చెప్పాను. మా అమ్మ మొండిఘటం. ఇలాంటి విషయాల్లో తల్లితండ్రులు మూర్ఖంగా, మొండిగా ప్రవర్తిస్తుంటారు. ప్రపంచమంతా ఆ సత్యాన్ని గుర్తించడానికి నిరాకరిస్తూ ఉంటారు. పుత్ర ప్రేమ వాళ్ళ కళ్ళని మూయించేస్తూ ఉంటుంది.
ఈ పాయింటు బాగానే ఉందనిపించింది. కొంత అనుభవజ్ఞుడిలానే మాట్లాడుతున్నాడు.
"మరిప్పుడేం చేయాలంటారు?" అన్నాను.
"డాక్టర్లకి చూపించి ప్రయోజనం లేదు. ఇలాంటి కేసులు డాక్టర్ల చుట్టూ తిరగటమేగాని ఉపయోగముండదు. ఈ సెక్స్ వీక్ నెస్ అనేది కేవలం సైకలాజికల్ అని కొట్టి పారేస్తారు. సమస్య సమస్యగానే వుండి పోతుంది. నే చెబుతున్నాగా ఇలాంటి కేసులెన్నో చూశాను."
"మరయితే...."
"సొల్యూషనేమిటని అడుగుతున్నావు" అంటూ చిద్విలాసంగా నవ్వాడు. "పిచ్చిదానా, నేనుండగా నీ జీవితం పాడు కానిస్తానా? ఆ చవట వెధవ విషయం వదిలేయ్. వాణ్ణి పేరుకు మాత్రం మొగుడిగా ఉండనీయ్. ఒక రకంగా అలా ఉండటం మంచిదే. మిగతా విషయాలు నేను చూసుకుంటాను."
కుర్చీలోంచి లేచి నా దగ్గరకొచ్చి నిల్చుని తలమీద చెయ్యివేసి నిమురుతున్నాడు.
మగాడు ఆడదాన్ని అలా తలమీద చెయ్యి వేసి ఆప్యాయంగా నిమిరాడంటే.... అది వాత్సల్యమనుకోవాలా? ట్రాప్ చేస్తున్నాడనుకోవచ్చా? ఏదయినా జీవితంలో నిజంకన్నా నటనకే ఎక్కువ ప్రాముఖ్యత ఉంది కాబట్టి అలాంటి సమయాల్లో ఆడది కరిగిపోతూ వుంటుంది. కాని మొదట్నుంచి నాది ఆలోచనాత్మక స్వభావం కాబట్టి నిగ్రహించుకున్నాను.
ఆడదాన్ని పడగొట్టటానికి మగాడు చేసే ప్రయత్నాలన్నిట్లో సానుభూతి ఫస్ట్ మార్క్ సంపాదించుకుంటుంది.
"మిగతా విషయాలంటే?"
"నీ కోరికలు తీర్చటం, అమోఘమైన ఆనందాలు అందించటం...."
"కోరికలు తీర్చుకుంటూ ఉంటే జీవితంలో సంపూర్ణత్వం సిద్ధిస్తుందా?"
"సంపూర్ణత్వమంటే?
"మీరూ మీ ఆవిడలాగా...."
"అందరి జీవితాలూ ఒకేలా ఉంటాయేమిటి? ఒక్కొక్కరిలో ఒక్కో లోపం ఏర్పడుతున్నప్పుడు, వాటిని ఏదో రూపంలో భర్తీ చేసుకుంటూ వుండాలి."
"అయితే నాకోసం మీరేం చేస్తానంటారు?"
"నువ్వు ఆ చవట వెధవ దగ్గర కోల్పోయినదాన్ని అందిస్తూ వుంటాను."
"మీ ఆవిడగారికి తెలిస్తే?"
"దానికి నాకూ అండర్ స్టాండింగ్ వుందిలే. చూసి చూడనట్టు ఊరుకుంటూ వుంటుంది."
"ఆవిడ విషయంలో కూడా మీరు చూసీ చూడనట్లు ఊరుకుంటూ వుంటారా?"
"తనకంత అవసరం లేదు. ఎందుకంటే నేను సమర్థుణ్ణి కాబట్టి."
"మగాడు సమర్థుడయినా బయట తిరిగే ఆడవాళ్ళను చూశానే."
చిత్రమేమంటే ఆదర్శవంతమైన దాంపత్యంలో వున్న స్త్రీ కూడా ఏదో ఓ సందర్భంలో ఇష్టంగానో, అయిష్టంగానో, మధ్యస్థంగానో పరాయి మగాడితో ఇలాంటి సంభాషణలతో చిక్కుకుంటూ వుంటుంది. బయటపడి భగ్గుమనిపించే గుట్లు జీవన ప్రవాహంలో సైలెంటుగా సాగిపోతూ వుంటాయి.
అతని ముఖంలో విసుగుదల కనిపించింది. "ఇప్పుడవన్నీ ఎందుకు మన సంగతి చూసుకోకుండా..." అంటూ చేయి తల మీద నుంచి భుజం మీదకు, ఆ తర్వాత ఇంకా క్రిందకు జారుస్తున్నాడు.
చేతిని విసురుగా తోసేశాను.
"ఏం"? అన్నాడు.
"నాకిష్టం లేదు. మీరిక్కణ్ణించి వెళ్లిపోండి" అన్నాను కటువుగా.
"నేను వెళ్ళటానికి రాలేదు."
అతని వంక అసహనంగా చూశాను.
"నిన్ను సొంతం చేసుకోటానికొచ్చాను"
"నాకిష్టం లేకుండా..."
నవ్వాడు, "ఇష్టం, అయిష్టం అనే పదాలు. కొంతవరకే వర్తిస్తాయి. నీది అద్భుతమైన అందం. మహాద్భుతమైన శరీరలావణ్యం. నీ సొగసులు నన్ను రెచ్చగొడుతున్నాయి. నిన్ను బలవంతానైనా సరే అనుభవిస్తాను. ఎందుకంటే అనుభవించకుండా ఉండలేకపోతున్నాను గనుక." అంటూ చప్పున వెళ్ళి గది తలుపులు గడియవేసి వచ్చాడు.
అందమైన ఆడదాన్ని చూసి చలించటంలో, కోరికలతో రగలటంలో ఆశ్చర్యం లేదు. కాని తనకున్న అర్హతల్ని గురించి ఆలోచించకుండా ప్రతి బేవార్సుగాడూ ఆమె మీద తనకేదో హక్కు ఉందనుకుంటాడు. |
25,092 | బహుశా తన అలికిడి విని ఏ మూల నుంచో తననే గమనిస్తూందా....
ఎంతటి అనుభవమున్న వేటగాదినైనా అతిగా కలవర పరిచేది ఇదే.....
తనుఅడుగు పెట్టింది ప్రత్యర్ధి స్థావరంలోకి అని తెలిసిన వేటగాడు తన ఉనికిని ప్రత్యర్ధి ముందు తెలుసుకో గలిగితే ఎంత ప్రమాదకరమో ఆ స్థితిలో నిలబడ్డ వ్యక్తికీ తప్ప అర్ధంకానిది.
క్షణాలు టెన్షన్ గా గడుస్తున్నాయి.
ఎదురుగా వున్న చీకటి పొదల్లోకి టార్చి వేశాడు.
సుమారు వంద అడుగుల దాక విస్తరించిన కాంతితో చెట్లవూడలు అస్తవ్యస్తంగా పెరిగిన పొదలు....
నెమ్మదిగా కదులుతూ టార్చివెలుగును పరిసరాలలో పంచుతున్నాడు.
కేవలం అభిముఖంగావున్న తోటలోకి చూడడమేగాకఏ చిన్నచప్పుడైన వెంటనే గుర్తించేటట్టు చెవులకు పని కల్పించాడు.
అతడి పాదాల క్రింద ఎండుటాకులు నలుగుతూ చిత్రంగా శబ్దం చేస్తున్నాయి.
ఇప్పుడు అవకాశం ప్రత్యర్దిదన్న విషయం అతడు మరచిపోలేదు.
అరవై అడుగులు దాకా నడిచాడు.
అదిగో....
హఠాత్తుగా అప్పుడు ఓ మర్రివూడ కదిలిందివేగంగా.
"మొ......వ్వా"
మరుక్షణం గుండెలార్చే ఓ ఆర్తనాదం
చైతన్య చూస్తుండగానే ఆక్రందన మరో చెట్టునుంచి వినిపించింది.
వేమ్గంగా తార్చిని మళ్లిస్తూ అటుగా అనుసరిస్తున్నాడు.
ఓ చిన్న ఆకారం చెట్ల వూడలపై వెళ్ళాడుతూ టార్చి కాంతికి భయపడుతున్నట్లుగా ఒకచోట దుముకుతూ పరుగెత్తుతోంది.
ఆ జంతువేమిటిఅన్న ప్రశ్నచైతన్యని ఎంత ఉద్విగ్నపరిచిందీ అంటే తాను ఇప్పుడు మేనీటర్ జొన్ లో వున్నానన్న విషయాన్ని పూర్తిగా మరచిపోయాడు.
మరో నలభైఅడుగులు పరుగేత్తాడో లేదో.....
సమీపంలోని వెదురు పొదల్లోఅలికిడి వినిపించింది.
గిరుక్కున పక్కకి తిరిగాడు.
ఓ బారీ మృగంకదులుతున్న సూచనగా శంతోబ్దపాటుపొదలూ తలలూపుతూన్నాయి.
మెనీటర్స్ వేటలో అసాధరమైన అనుభవంగల చైతన్యకి బోధపడిపోయింది.
ఇప్పుడు చాలా దట్టంగా విస్తరించిన వెదురు పొదల్లో నిలబడ్డ పులి తనపై అవకాశం తీసుకునే ప్రయత్నంగా 'స్టాకింగ్' ప్రారంభీంచింది.
మామూలుపులిలా కాక మనిషి రక్తంతో అనూహ్యమైన అనుభవాన్ని సంపాదించుకున్న నరమాంస భక్షుకి. ఎంతటి యుక్తిని ప్రదర్శింస్తుందీ అంటే పత్యర్ది కనిపించిన వెంటనే చార్జ్ చేయదు.
పంజా దెబ్బని ఒడుపుగా ఉపయోగించగలిగే దాకా నెమ్మదిగా ప్రాకుతుంది. అది కూడా కాదు...... పాదాల అడుగున వున్న 'కుషన్' లాంటి మెత్తని భాగాన్ని చప్పుడు చేయకుండా ఇసుకలో గుచ్చి రెప్పలార్చని దీక్షతో ముందుకు కదులుతుంది.
హఠాత్తుగా నిశ్శబ్దం ఆవరించిందక్కడ.
ఇప్పుడు చెట్ల వూడలపై ఇందాక వినిపించిన ఆర్తనాదం మాత్రమె కాదు, వెదురు పొదల కదలిక సైతం ఆగిపోయింది.
చైతన్య ఫాలభాగంపై స్వేదం పేరుకుపోయింది.
ప్రమాదంలో చివరి దశ అది......
ఏ క్షణంలో అయినా పైకి లఘించాలనుకునే మేనీటర్ ఇప్పుడు సద్దు చేయకుండా తనకు చాల అనుకూలమైనా స్థితిలో మాత్రమే అని తెలిసిన చైతన్య 'రీఫిల్ స్తేఫ్టీ క్యాచ్ ' ని అన్ చేసి చూస్తున్నాడు.
అక్కడ లిప్తులు భారంగా గడుస్తున్నాయి.
ఊపిరి బిగపెట్టిన చైతన్య నెమ్మదిగా, చాలా నెమ్మదిగా వెనక్కీ నడుస్తున్నాడు. అడుగులో అడుగు వేస్తూ....
చాలా సమీపంలో మరో చప్పుడు వినిపించగానే అసకంల్పిటంగా తల తిప్పాడు.
అలా ఆ ప్రయత్నంలో ఆగ్నేయంగా దృష్టి సారించడం యదృచ్చకమే.....
అంతే.... ఆ ప్రతిభుడైపోయాడు.
అక్కడ గుట్టపైనుంచి జారుతున్న సెలయేరులో పుచ్చపూలవెన్నెల లాంటి ఓ ఆకారం.....
కదలిక కిన్నెరాసానిలా వుంది.....
నగ్నంగా వున్న దేహం దన కిన్నెరాని గుర్తుచేస్తోంది.
ఇది కళ కాదు, కధా కాదని తెలుసు....
ఎవరీమే......
చూస్తుండగానే రసధారలా కదిలింది!
వెండి వెన్నెల వెలుగులో ఆమె స్థనాలు మెరుపుల్లా, ఊరువులు స్వర్గ ద్వారాల్లా అనిపిస్తుంటే విభ్రంతుగా చూస్తున్నాడు.
అదే....
ఆ కొద్ది ఆజాగ్రత్తే చైతన్యని ప్రమాదంలోకి నెట్టింది....
ముందో గాండ్రింపు కర్మేంద్రియాలు చచ్చుబడేటట్టుగా.
వెంటనే వేగంగా కదలిన బండరాయిలా చైతన్య పైకి చార్జిచేసింది పులి.
తృటిలో ప్రమాదాన్ని పసిగట్టిన చైతన్య సమస్పూర్తిగా నేలకి ఒరగకపొతే పులిపంజా వెతుకి శరీరం నుండి వేరయ్యేదే!
అదృష్టమో, దురదృష్టమో ఓరగడంలో బేలెన్స్ తప్పినా చైతన్య కొద్దిగా వెనక్కీ కదలడం వల్ల సుమారు అడుగుల లోతున్న గోర్జిలోకి జారిపోయాడు. |
25,093 |
"ఊ"
"ఏమిటి మాట్లాడవు?"
"ఇందులోని నిజానిజాల గురించి ఆలోచిస్తున్నాను"
"నీకేమనిపిస్తోంది?
"ఈ సమస్యని మనం రెండువైపుల గురించీ చూడగలగాలి"
"అంటే?"
"ఆర్ధిక పరిస్థితి చాలీ చాలని స్థితిలో వున్న కుటుంబాలు, అంటే ఉదాహరణకి మధ్యతరగతి కుటుంబాలనుకుందాం. ఈ కుటుంబాల్లో పరిస్థితులకి తగ్గట్లుగా ఎవరు నడుచుకుంటున్నారు? ఈ రోజుల్లో ప్రతివారూ తాహతును, నిజం చెప్పాలంటే అర్హతకు మించిన జీవితం కోరుకుంటున్నారు. చిన్నపిల్లలా చదువు దగ్గర్నుంచీ, వ్యక్తిగతంగా పిల్లల చదువుల మీద శ్రద్ధ తీసుకోలేక, పెద్దపెద్ద కాన్వెంటులలో చేర్పించటం, వాటికి ఫీజులు కట్టటానికి చేతగాక నానా యిబ్బందులూ పడటం, పిల్లలకు మొదట్నించీ పనికిరాని ఖర్చులు అలవాటు చెయ్యటం, అంటే క్రమశిక్షణ నేర్పించలేక పోవటం, అర్థంలేని ప్రయాణాలు, ఇంకొకరితో పోటీపడి లేనిపోని ఆడంబరాలు, ఆర్ధిక పరిస్థితులతో రాజీ పడలేక పోవటం, సినిమాలకీ, విలాసాలకూ, తిళ్ళకూ, డ్రస్సులకీ, భేషజాలకీ, అర్థంలేకుండా తగలెయ్యటం, ఈ కుటుంబాల్లో విద్యార్థులగానో, విద్యార్థినులగానో వున్నవారు తమ పరిస్థితుల్ని గురించి పట్టించుకోకుండా వున్న వాళ్ళతో పోటీపడి చదువుమీద కాకుండా, ఆషామాషీ వ్యవహారాల్లో దూసుకెళ్ళిపోతూ ఉండటం, పిచ్చి పిచ్చి డ్రెస్సులు, సైకిళ్ళతో సరిపెట్టుకునే దానికి లూనాలు, టి.వి.ఎస్ లు, స్కూటర్లు, వేళాపాళా లేకుండా తిరగటాలు, పెద్దవాళ్ళు మందలించక పోగా తటస్థంగా చూస్తూ వూరుకోవటం. లేకపోతే ఎంకరేజ్ చెయ్యటం, దేవుళ్ళ పేరుతో, తీర్థయాత్రల పేరుతో, సంప్రదాయాల పేరుతో, పెళ్ళిళ్ళకూ, చావులకూ, షోషల్ కాంటాక్టులకూ శక్తికి మించి ఖర్చు చెయ్యటం, దాంతో అప్పుల పాలయిపోవటం, ఆ అప్పులు తీర్చలేక నానా యాతనా పడుతూ ఉండటం, పాత అప్పులు తీర్చటానికి కొత్త అప్పులు చివరకు అదో ఛాయిస్ లా తయారవుతుంది. ఉన్న ఆస్తులు అమ్ముకోవాలంటే సెంట్ మెంట్, అవసరానికి పనికొస్తుందని చేయించుకున్న బంగారం అమ్ముకోవాలంటే సెంట్ మెంట్, దానికితోడు ఈ ఆస్తులని అవసరార్థం ఉపయోగించుకోకుండా పెద్దవాళ్ళు వీలునామాలు తయారు చెయ్యటం. మనిషి జీవితంలో యీ వీలునామా రాయటమనేది మహా అసహ్యమైన ఘట్టం. ఎన్నో అలజడులు, ప్రభావాలు, దుష్ప్రభావాలు ఆ సమయంలో మనిషి మీద పనిచేస్తూ ఉంటాయి. ఎన్నో సంవత్సరాలనుంచీ కూడబెట్టిన ఆస్తి మీద ప్రలోభం, దానిమీద హక్కు వొదులుకోలేని వ్యామోహం, ఇవన్నీ కలసి తదనంతరాలుగా రూపొందుతాయి. ఆశ్చర్యమేమిటంటే పిల్లల్లో మంచివాళ్ళూ వుంటారు. చెడ్డవాళ్ళూ ఉంటారు. ఆస్తులని దుర్వినియోగం చేసేవాళ్ళూ వుంటారు. మంచి మంచి ఆలోచనలూ, సమర్థతా, ట్యాలెంటూ వున్నవాళ్లూ వుంటారు. చాలీచాలని ఉద్యోగాల వచ్చే జీతాల వల్ల జీవితాల్లో ఎదుగూ బొదుగూ కనబడక, మంచి మంచి ప్రయోగాలు చేసి పైకి రావాలన్న కలలుగనేవాళ్ళూ వుంటారు. స్థిరాస్థుల్ని క్యాష్ రూపంలో మార్చకుండా, దాన్ని ఇంప్రూవ్ చెయ్యలేక, కళ్ళాలను పిల్లల చేతుల్లోకి యివ్వగా చివరిదాకా ఎదుగూ బొదుగూ లేకుండా, ఇబ్బందుల వలయం నుంచీ బయటపడలేకా ఒక రకంగా చెప్పాలంటే జీవచ్చవాల్లా గడిపేస్తూ వుంటారు. అన్నిటికన్నా మనిషినీ పీల్చుకు తినేస్తోంది అహంభావం. లెవల్ తెలుసుకోకుండా ఇతరులతో పోటీపడుతూ అర్థంలేని ఆడంబరాలకి పోతూ ఉండటం క్లాస్ ఫోర్ అంటారే...వాళ్ళిప్పుడు యితరులు సానుభూతి చూపించే స్థితిలో లేరు. ఇంట్లో ఫ్యాన్ చెడిపోతే కరెంటుకు సంబంధించిన ఏ ఇతర వస్తువైనా చెడిపోతే ఏ ఎలక్ట్రిషియన్ కోసం పిచ్చికుక్కలా తిరగాల్సి వస్తుంది. వస్తువిచ్చే సుఖానికి అలవాటు పడ్డ మనం అతన్ని బ్రతిమలుతూ, అతని కోసం పడిగాపులు కాస్తూ, డబ్బులు శక్తికి మించి ఖర్చుపెడుతూ కొనసాగిస్తూ వుండాలి. గ్యాస్ సిలెండర్లకు అలవాటు పడ్డ మనం సకాలంలో బుక్ చేసుకుని కూడా, అది సరియైన టైములో పొందే అర్హత వుండికూడా, ఆ గ్యాస్ సిలెండర్లు తెచ్చేవాడికి టిప్స్ యిచ్చుకుంటూ నిత్యం బ్రతిమిలాడుకుంటూ వుండాలి. కష్టపడి సంపాదించుకున్న డబ్బుతో ఓ ఇల్లు కట్టించుకోటానికి ముచ్చటపడి, అది పూర్తయే లోపల తాపీమేస్త్రీ వల్ల కట్టే కూలీలవల్ల, కార్పెంటర్ వల్ల ఎలక్ట్రిషియన్ వల్ల ఎంతో వ్యధకు గురయి, ఖర్చు ఎస్టిమేషన్ కి మించిపోయి, అప్పులపాలయిపోయి ఇల్లెందుకు కట్టానా అన్న మానసిక హింసకి గురవుతూ వుంటారు. అప్పుల పాలయినప్పట్నుంచీ, అందులోనుంచి బయటపడలేక అనుక్షణము టెన్షన్ బయట నిల్చుని వ్యాఖ్యానించేవాళ్ళు "వాళ్ళు పొగరెక్కికాక పోతే ఎవరు చెయ్యమన్నారు? అని హేళన చేసి నిరసనగా మాట్లాడతారు. ఎవరూ రంగూ రుచీ లేని వాడికి తప్ప జీవితంలో ఏదో సాధించాలన్న తపన చాలామందికి వుంటుంది. అందుకని ధైర్యంచేసి కొన్ని ప్రయోగాలు చేస్తారు. ఆ ప్రయోగాలు కొన్నిసార్లు ఫెయిలవుతాయి. ఫెయిలయినప్పుడు ఆ మానసిక వ్యధలో నుండి, ఆర్ధిక దుస్థితి వల్ల కృంగిపోతున్నప్పుడు...యింకా చీదరించుకునేవారేగాని, దానికి పబ్లిసిటీ ఇచ్చేవారేగాని చేయూతనిచ్చేవారే కనబడరు. ఆశ్చర్యమేమంటే ఎంతో అయిన వాళ్ళయివుండి, చేయూతనివ్వగలిగిన సమర్థత వుంటే సాయం చెయ్యటానికి ముందుకు రారు. బహుశా యీ ప్రపంచంలో ప్రతిమనిషిలోనూ శాడిజం ఎంతో కొంత, ఎంతో కొంతమంది ఎక్కువ పాళ్ళలోనే ఉండి ఉంటుంది. ఇతరులు, మనచుట్టూ వున్నవాళ్ళు, అయినవాళ్ళు, ఆప్తులు, బంధువులు కష్టాల వూబిలో యిరుక్కొని వున్నప్పుడు లోలోపల సంతోషిస్తారేగాని, అసహ్యంగా వ్యాఖ్యానిస్తారేగానీ, ఎవరూ జాలిపడరు. అసలు జాలి అనేది ప్రపంచంలోనుండి అంతరించిపోయిందేమోననిపిస్తుంది. ఈ రాజకీయనాయకులు, వివిధ సేవా సంస్థలవాళ్ళు...వీళ్ళందరూ చేసే ఏ ప్రకర్షకోసమో, ఆత్మవంచన కోసమే తప్ప అసలు కష్టాల ఊబిలో యిరుక్కుని ఉన్నవాడికి, అర్హత ఉన్నవాడికి ఎటువైపునుంచీ సాయం లభించటంలేదు. ఎగువ తరగతులవాళ్ళు దిగువ తరగతులవాళ్ళని దోపిడీ చేస్తున్నారన్న మాట. పనిలేని వాళ్ళకి పనికిమాలిన నినాదమైపోయింది. ఈ హృదయ విదారకమైన స్థితిలో మధ్య తరగతి మానవుడు దిన దినం దిగజారిపోతున్నాడు. అటుపైకి ఎదగలేక యింకా పేదరికంతో రాకీపడలేక అయోమయస్థితిలో పడిపోయాడు. ఎటొచ్చీ కొన్ని సంవత్సరాల క్రితం వాళ్ళ గురించి ఆలోచించేవాళ్ళుండేవారు. ఇప్పుడు బాధ నామోషీపడి గుప్తంగా వుండిపోయి, ప్రెస్టేజ్ కోసం లోలోపల మగ్గిపోతూ బయటకు ఏమీ జరగనట్లు ప్రవర్తిస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా ఇళ్ళూ వాకిళ్ళూ హరించుకుపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆడపిల్లలు ఉద్యోగం చేస్తే తప్పేమిటి? ఏమీ చెయ్యకుండా, ముందుకు సాగకుండా కుటుంబ వ్యవస్థ ఎలా బలపడుతుంది?" |
25,094 |
అవి నీకు లేకపోతే నీదో ప్రత్యేకమైన జాతిగా భావిస్తాను.
నన్నెక్కడనించి తీసుకొచ్చావో అక్కడ విడిచిపెట్టు.
లేకపోతే ఈ రాయితో నీ కారు అద్దాలన్నీ పగలకొడతాను.
అవసరం అనుకొంటే నీ బుర్ర కూడా పగల కొట్టడానికి వెనుకాడను."
ఆమె ఉద్రేకంతో అంటుంటే ప్రశాంత్ కి అనుమానం వచ్చింది.
ఆమె పిచ్చిదేమోననే అనుమానం కలిగింది.
ఆమె మొహంలోకి చూస్తుంటే ఆమె నిజంగానే అన్నంత పని చేస్తుందేమో ననిపిస్తుంది.
అతనిలో ఏదో గగుర్పాటు.
"ఓ. కే. కారెక్కు." అన్నాడు.
విజయ కారెక్కి కూర్చుంది.
"ఓ.కే. మిస్టర్ ప్రశాంత్. నన్నింకేం మాట్లాడించకు.
నన్ను ఎర్రమంజిల్ దగ్గర దించేయ్ చాలు" అంది. ప్రశాంత్ కోపంగా చూసి కారుని ముందుకి ఉరికించాడు.
21
"యూ ఆర్ కరెక్ట్ అంకుల్.
ప్రశాంత్ నేను అనుకొన్నట్టు అభిమానించదగిన వ్యక్తి కాదు."అంది విజయ.
డి. డి. ఆర్. చిన్నగా మందహాసం చేశాడు.
"నువ్వు కొంచెం తొందరపడ్డావు బేబీ!
మరి కాస్త ముందుకి వెళితే ఆ రాస్కెల్ బోగట్టా మొత్తం మనకి తెలిసేది!" అన్నాడు డి. డి. ఆర్.
"ఆ మిగిలిన విషయాలని నేను తెలుసుకొంటచాను బావగారు" అన్నాడు రంగారావు. అతని గొంతులో ఓ విధమైన పట్టుదల.
"వాడు ఇంటికి తీసుకెళ్తాడనుకొన్నాను. కానీ నేషనల్ హైవే దారి పట్టాడు. దాంతో నేను భయపడ్డాను" అంది విజయ.
"భయం దేనికమ్మా! నీ వెనక నేను లేనా? వందగజాలదూరంలో మోటార్ సైకిల్ పైన కారుని ఫాలో చేస్తూనే వున్నాను కదా!" అన్నాడు రంగారావు.
"నిజమే మామయ్య, కానీ పొరపాటున 'మిస్' అయితే" అంది సందేహంగా విజయ.
"అవ్వను. నీడలా వాడిని వెంటాడడమే ధ్యేయంగా పెట్టుకొన్నాను.
వాడికి మనశ్సాంతి లేకుండా చేయడం ఎలా అనే ఆలోచిస్తున్నాను."
కఠినంగా అన్నాడు రంగారావు.
"ఇంతకీ ఆ అమ్మాయి ఎలా వుంది?" అడిగాడు. డి. డి. ఆర్.
"కోలుకొంటోంది. నేను కొంచెం ఆలస్యం చేస్తే భారతి రైలు చక్రాలకింద తునాతునకలై పోయేది పూర్ గర్ల్.
మై గాడ్స్ గ్రేస్ ఐ సేవ్ డ్ హర్" ఆ రోజు భారతిని తను ఎలా కాపాడగలిగింది గుర్తుకొచ్చింది.
22
రంగారావు అనుమానంతో బారతిని ఫాలో చేశాడు.
ఆమె ప్రశాంత్ వుంటున్న అపార్ట్ మెంట్స్ కాంప్లెక్స్ లోకి వెళ్లగానే సందు చివర నిలబడ్డాడు.
తిరిగి భారతి రాకకోసం ఎదురు చూడసాగాడు.
గంటన్నర తర్వాత భారతి ఏడుస్తూ రోడ్డుమీద పరుగులాంటి నడకతో వెళ్లడం చూశాడు. ఆమె వెనకే రెండు నిమిషాలకి కంగారుగా మరో అమ్మాయి రోడ్డుమీదకి వచ్చింది.
ఆ అమ్మాయి అటు ఇటూ చూస్తూ రంగారావుని పలకరించింది.
"ఇప్పుడే ఓ అమ్మాయి బయటికి వచ్చింది. ఎటువేపు వెళ్లిందో చూశారా?" అడిగింది.
"చూశాను భారతి గురించేనా నువ్వు అడుగుతోంది?" అన్నాడు రంగారావు.
ఆమె కళ్లు పెద్దవి చేసి చూసిందతని వైపు.
"అవును. భారతి మీకెలా తెలుసు!"
"ఆమె నాకు కావాల్సిన మనిషి. "
"ఐసీ. అయితే ఆమెని మనం కాపాడాలి. లేకపోతే ఆమె ఆత్మ హత్య చేసుకొనే ప్రమాదం వుంది" అంది కంగారుగా.
రంగారావు బాంబుపడినట్లు ఉలిక్కిపడ్డాడు.
"అని మీకెలా తెలుసు?"
"ప్లీజ్. అవన్నీ తర్వాత చెపుతాను. ముందు పదండి" ఆమె అతని చేయిపట్టి లాగింది.
ఆమె దగ్గర విస్కీవాసన వస్తోంది.
అడగు వేయలేకపోతోంది.
తూలిపోతోంది. |
25,095 |
"నీ ఇష్టం వచ్చినట్లు చేస్తేనే నువ్వు సుఖంగా వుండేది. ఆ సంగతి తెల్సుకో! ఇంక నువ్వు నోర్మూసుకో. నే మాట్లాడ్తా" అంది మనస్సు.
"అంటే నేను...." రిషి సణిగాడు.
"ఇంక తర్వాత కథ నా ఇష్టం వచ్చినట్లు నడిపిస్తా చూడు ఎంత బావుంటుందో! ముందు పద బయటకెళ్దాం" అంటూ తొందరపెట్టింది.
రిషి నోర్మూసుకున్నాడు. మనసే మాట్లాడటం ప్రారంభించింది.
"తలుపు వేసుకోండి. అర్ధగంటలో వస్తా!"
అమ్మాయి తల వూపింది.
అతను వెళ్ళిపోయాడు.
* * * *
రిషి పాలప్యాకెట్ తో బాటు బిస్కెట్స్, బ్రెడ్ కూడా కొనుక్కొని ఇంటికి వస్తుంటే మనసు మొదలెట్టింది.
'ఇప్పడు ఆ అమ్మాయి స్నానం చేస్తుంటుంది తెలుసా?'
రిషి ఆ దృశ్యాన్ని వూహించుకో ప్రయత్నించాడు.
గులాబిరంగు ఒంటిమీద వున్న బట్టలన్ని ఒక్కొటొక్కటిగా తీసి చలికి కొద్దిగా వణుకుతూ భుజాలు దగ్గరికి వేసి మొదటిసారిగా నీళ్ళు మీద పడగానే కళ్ళు మూసుకుని, పెదవులతో ఆ నీటి బిందువులని స్పృశించి, నెమ్మదిగా కళ్ళు తెరిచి.... ఆకాశాన్ని చూసి అమాంతం సిగ్గుపడి చేతులతో వక్షాన్ని కప్పుకుని, కొబ్బరాకులు చంద్రుడ్ని చాటు చెయ్యలేనట్లు ఆమె దాగనంటూ బయటపడిపోతుంటే....
ఆ సమయంలో దడి తీసుకుని వడివడిగా దూసికెళ్ళి స్థాణువై నిలబడిపోయాడు రిషేంద్ర.
లేచి నిలబడాలో, అలాగే వుండిపోవాలో తెలీని స్థితిలో ఆమె సగం వంగిన భంగిమలో నిలచిపోయింది!
రిషి ఉద్విగ్నంగా ముందుకి వెళ్ళాడు!
తలుపు నుదిటికి కొట్టుకొని బొప్పి కట్టింది. భ్రాంతి కరిగిపోయింది.
'అబ్బా' అటు నుదురు పట్టుకుని నెమ్మదిగా తలుపుతోసి ఆ దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు.
ప్రక్క ఇంటి హైమా ఆంటీ, ఆవిడ కూతురు శ్రీజా అక్కడ నేలమీద కూర్చుని అమ్మాయితో కబుర్లు చెప్తున్నారు.
ఆ అమ్మాయి తలంటుకున్న కురులు ఆరబెట్టుకుంటూ వారి కబుర్లు చిరునవ్వుతో వింటోంది. ఆమె వంటిమీద గులాబీరంగు నైటీ వుంది.
రిషిని చూస్తూనే శ్రీజ విజిల్ వేసి "వచ్చాడు హీరో!" అంది.
అందరూ అతని కేసి చూసారు.
శ్రీజ లేచి కన్నుకొడ్తూ "అమ్మాయి కనపడగానే తీసుకొచ్చెయ్యడమేనా? వాళ్ళ వాళ్ళు ఎవరైనా వచ్చి వెతుక్కుంటారేమో ఎదురుచూడద్దూ!" అంది.
రిషికి నిజమే అనిపించింది. "ఏమో! అర్ధరాత్రి అలా వదిలేసి రాలేకపోయాను. కాస్త టీ పెట్టు. నేనింకా మొహం కూడా కడుక్కోలేదు." అన్నాడు చేతిలో పాలప్యాకెట్లు బల్లమీద పెడుతూ.
హైమ గంభీరంగా "ఇప్పుడెలా రిషీ? అమ్మాయికి ఏమీ గుర్తు లేదంటోంది. ఎవరి పిల్లో ఏమిటో ఎలా తెలుసుకోవడం?" అంది.
రిషి ఆ అమ్మాయి వైపు చూశాడు.
ఆమె కళ్ళ నిండా నీళ్ళు చేరాయి. బాధని మునిపంట బిగపెట్టి తలవంచుకుని కూర్చుంది.
"నాలుగు రోజులుపోతే అదే గుర్తుకొస్తుందిలే అప్పటిదాకా నా బట్టలేసుకుంటుంది. ఏం రిషి? అంతేనా! తేలిగ్గా అనేసింది శ్రీజ.
డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు వ్రాసిన శ్రీజ ఏదీ సమస్యగా అనిపించదు. అన్నీ తేలిగ్గానే తీసుకుంటుంది. వయసుకి తగ్గట్టు ఎదగకపోవడమో లేక వయసుకి మించి ఎదిగిపోవడమో అర్ధంకాదు రిషికి.
హైమ మాత్రం ఆలోచనగా "అదిసరే.... నువ్వా ఒంటరివాడివి. ఆ అమ్మాయిని నీ ఇంట ఎలా పెట్టుకుంటావు? పోనీ మా యింట్లో పెట్టుకుందామా అంటే నీకు తెలియనిదేముంది? అయితే రోజూ తాగి వచ్చి నానా న్యూసెన్స్ చేస్తుంటాడు" అంది.
"ఫరవాలేదు ఆంటీ. ఇక్కడే ఉంటుంది ఈలోగా వాళ్ళ వాళ్ళగురించి వాకబు చేస్తాను" అన్నాడు రిషి.
"ఏమ్మా? వుంటావా?" అడిగింది హైమ.
ఆ అమ్మాయి అంగీకారంగా తల వూపింది.
రిషి మొహం కడుక్కోడానికి పెరట్లో వెళ్ళగానే వెనకాలే వచ్చింది శ్రీజ.
"రిషి.... నా దగ్గర దాచాలని చూడకు. కథ?" అంది.
"కథేం లేదు" చెప్పాడు రిషి.
"ఇప్పుడు మొదలెడ్తావా?" కొంటెగా అడిగింది.
"అరె. రైల్లో కలిసింది, దిక్కులేని స్థితిలో ఒక్కదాన్ని విడిచి పెట్టి రాలేక తీసుకొచ్చాను అంతే!" రిషి చిరాగ్గా అన్నాడు.
"ఆ సంగతులన్నీ ఆ అమ్మాయి చెప్పిందిలే నాకు కావల్సింది అసలు సంగతి!" అదోరకంగా చూస్తూ అంది శ్రీజ.
రిషి సీరియస్ గా జామచెట్టు నుంచి ఓ పుల్ల విరిచాడు. "ముందిక్కడ్నుంచి పోతావా పోవా?" అని అడిగాడు.
"ఎప్పుడు మొదలెడ్తావో చెప్పు" శ్రీజ అంటూ వుండగానే ఆమె నడుంమీద మొదటిదెబ్బ పడింది.
"అమ్మా.... మాటలతో చెప్పచ్చుగా" శ్రీజ అరిచింది.
"మనిషికో మాట...." రిషి పూర్తి చెయ్యకముందే శ్రీజ విసవిసా నడుచుకుంటూ వెళ్ళిపోయింది.
రిషి మొహం కడుక్కుని లోపలికి రాగానే టీ కప్పు అందిస్తూ అంది శ్రీజ "రిషీ! ఈ అమ్మాయిపేరు మనకి తెలీదు కానీ మన వీలు కోసం ఓ చక్కని పేరు పెట్టాను చెప్పనా?"
"చెప్పు" అన్నాడు రిషి,
"ఎవరో ఏమిటో తెలీకపోయినా ఆశ్రయం ఇచ్చావుగా ఆశ్రిత అని పెడదాం!" అంది.
ఆ అమ్మాయి మెరిసే కళ్ళతో చూసింది. |
25,096 | విరించ సవరించ వాణి సిగలోంచి జారిన మల్లె ఒకటి ఆమె పెదవి అంచున సంతుష్టితో కూడిన చిరునగవై వెలిసింది.
పెళ్లితంతు పూర్తవగానే కొత్త దంపతులచేత బిందెలో మట్టెలూ, ఉంగరం వేసి ఇద్దరూ ఒకేసారి చేతులుపెట్టి వాటిని బైటికి తీయించే ఆట ఆడిస్తారు.
మొదట పెళ్ళికూతురు భయంగా బిందెని తాకుతుంది. రెండవసారి అడుగువరకూ గాలిస్తుంది. మూడోసారి అతని చెయ్యి లోపల తాకగానే గుప్పెటని విడదీసి అందులోని వస్తువులని సొంతం చేసుకుంటుంది. పైకి మాత్రం చుట్టూ వున్నవారికీ అమాయకమైన ఆమె ముఖమే కనిపిస్తుంటుంది. ఆటలో ఆత్రం అతనిదైనా.....ప్రతిసారీ గెలుపు ఆమెదే! ఊరికే పెట్టలేదు పెద్దలా ముచ్చట్లు అవన్నీ చెప్పక చెప్పే శృంగారపు తొలిపాఠాలు.
* * *
శక్తి పెదవుల మీదకి ఆపుకోవాలన్నా ఆగని చిరునవ్వు దూసుకువస్తోంది. తెల్లవారాక ఇంద్రనీల్ వైపు చూడాలంటేనే చాలా సిగ్గేసింది. అతని చెయ్యి తాకినా, భుజం తగిలినా ఇంతకుముందు లేని తియ్యని జలదరింపు ఆఫీస్ కి లీవ్ పెట్టి ఇంట్లో వుండాలనే అనిపించింది. కానీ తను మూడేరోజులు లీవ్ పెట్టి ఆ తరువాత ఎక్స్ టెండ్ చేయడం అందరూ గమనిస్తారేమోనని సిగ్గుతో బయల్దేరి వచ్చేసింది.
తనేదో ఒక్కరోజులో మారిపోయినట్లూ, ఆ మార్పేదో తనలో ఇతరులకి కొట్టవచ్చినట్లుగా ఇబ్బందైన భావన.
చెంపలమీదకి జారుతున్న ముంగురులని సవరించుకునే నెపంతో బుగ్గలమీద ముద్రించుకుపోయిన అతని నఖక్షతాలని స్పర్శిస్తోంది. గుండెలమీద సడి చేస్తూ తనలో అలజడి కలిగిస్తున్న మంగళసూత్రాల్ని మాటిమాటికీ తొంగి చూసుకుంటోంది. చేతికి పచ్చగా మెరుస్తున్న గాజులు, కాలివేళ్ళకి కొత్తగా తొడిగిన మట్టెలూ.... అన్నీ ఆమెకు అతడిని పదేపదే గుర్తుచేస్తున్నాయి. పక్కకి తిరగబోతుంటే నడుంనెప్పిగా అనిపించింది. 'అబ్బా... ఎంత మొరటు.... అస్సలు నిదానమే లేదు' మురిపెంగా విసుక్కుంది. చేతిమీద ఎర్రని గాటు.... రాత్రి చిట్లిన గాజు తాలూకుది.
కాంపౌండ్ బయట బాదంచెట్టుమీద కూర్చున్న కోకిల ఒకటి ఏదో ముంచుకుపోతున్నట్టు ఒకటే కూత! ప్రాణం తీసేస్తుంది బాబూ! శక్తి కొంగుతో విసురుకుంటూ చుట్టూ చూసింది.
అందరూ ఎవరి పనుల్లో వారున్నారు. వీళ్ళెవరికీ నాకున్నలాంటి బాధలేదా? తన ఆలోచనకి తనకే నవ్వొచ్చింది. ఏమిటో.... ఫోన్ మోగినప్పుడల్లా ఉలికిపాటు! ఇంద్రనీల్ తనకి ఫోన్ చేసి వుండలేకపోతున్నాను. వచ్చెయ్యమంటే ఎంత బావుణ్ణు!' అనుకొంది.
లంచ్ టైంలో తార వహ్చి "దేవిగారికి ఆకలిదప్పులులాంటివి గుర్తొస్తున్నాయా..... లేక అతని ధ్యాసేనా?" అంది.
శక్తి మౌనంగా లంచ్ బాక్స్ బైటికి తీసి ఆమెతో నడిచింది.
"ఏమిటే ఆ మౌనం? అసలు ఎంత హుషారుగా వుండాలీ..... ఔనూ ఈ రోజేం తెచ్చావు?" అడిగింది తార.
"తెలీదు" నిర్లిప్తంగా జవాబిచ్చింది.
"అదేం? వంట నువ్వు చెయ్యలేదా?"
"నేనెందుకు చేస్తాను?" విసుగ్గా అడిగింది.
తార వెటకారంగా "శక్తిమతీదేవి వంటచెయ్యదు కదూ! సరే మీ శ్రీవారి శాకపాకలేమిటో కాస్త రుచి చూపించు" అంది.
శక్తి పరమ విసుగ్గా బాక్స్ మూత తెరిచింది.
వెంటనే ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. చటుక్కున ఆ రెండు వస్తువుల్నీ దాచేసి చీటీమాత్రం తీసి చదివింది.
"వీటిని చూశాకైనా నేను గుర్తుకురాలేదా? వస్తే.... హాఫ్ డే లీవ్ పెట్టి వచ్చెయ్యి లేదా.... ఇవి పక్కకి జరిపేసి దిబ్బరొట్టె, ఆవకాయ నంజుకొని తినెయ్ నీ నీల్!"
కోయిల కూతలో మార్పొచ్చింది. ఇంతసేపటికి తాళం కుదిరినట్లు లయగా ఆగి ఆగి కూస్తోంది. శక్తి ఎర్రబడిన ముఖంతో తారవైపు చూసి "అర్జెంటుగా ఇంటికెళ్ళాలి" అంది.
"ఏమైందీ? ప్రాబ్లమా?" తార ఆదుర్దాగా అడిగింది.
"వెళ్ళకపోతే ప్రాబ్లెమ్" చెప్పి మేనేజర్ క్యాబిన్ లోకి వెళ్ళింది శక్తి.
ఈ తెగిన హుక్కూ.... చిట్లిన గాజు ముక్కా.... లంచ్ బాక్స్ లో పెట్టి పంపించి పెద్ద రొమాంటిక్ హీరోవయిపోయాననుకుంటున్నావా?" చిరుకోపంగా అడిగింది శక్తి.
ఇంద్రనీల్ ఆమె నడుంఒంపుని సవరిస్తూ "నువ్వు వస్తావని నాకు తెలుసు" అన్నాడు.
"ఎలా?" ఆపుకోలేక అడిగింది.
"ఇంతకుముందు అమ్మాయిలకి ఈత నేర్పించేవాడిని మొదటిరోజు స్విమ్మింగ్ డ్రెస్ వేసుకోవడానికి తెగ ఇబ్బంది పడేవారు. రెండోరోజునుంచీ నేనేం నేర్పాల్సినది వుండేది కాదు" అన్నాడు.
"ఛీ.... ఫో!" శక్తి అతని బుగ్గమీద గట్టిగా గిల్లింది.
"అక్కడొద్దు.... దేవుడు వీపులూ.... గుండెలు పెట్టింది ఇలా ఎవరికీ కనిపించకుండా గిల్లుకోవడానికే!" సీరియస్ గా చెప్పాడు.
శక్తి ఇంక మాట్లాడలేదు. అతడిని మాట్లాడనీయలేదు.
మీనాక్షి వాళ్ళ వాటాలోనుంచి ఆపకుండా సదానందం పిల్లలని తిడుతున్న తిట్లు వినిపిస్తున్నాయి. ట్రాన్ సిస్టర్ లో చాయాగీత్ వింటున్న శక్తికి ఈ గొడవకి చాలా చిరాగ్గా వుంది.
మీనాక్షి సన్నగా ఏడుస్తున్న ధ్వని వినిపిస్తోంది.
పేపర్ చదువుతున్న ఇంద్రనీల్ లేచి బకెట్లో బట్టలు వేసుకుని "నేను బావిదగ్గర బట్టలుతుక్కుని వస్తాను" అని బయల్దేరాడు.
శక్తి విసుగ్గా "ఇంత రాత్రి ఉతక్కపోతే ఏం కొంపలు ముంచుకు పోవులే!" అంది.
"ఇంకా ఇప్పుడు చేసే పనేముంది కనుక...." అంటూ వెళ్ళిపోయాడు.
శక్తికి అతను బండకేసి బట్టలు బాదడం వినిపించసాగింది. అది ఎందుకో అర్ధంఅయి ఆమె పెదవుల మీద సన్నని హాసరేఖ పరుచుకుంది. అతను ఆ గొడవ విని భరించలేకపోతున్నాడు.
"అగ్రహారం సంబంధం చేసుకుని వుంటే పౌరోహిత్యం చేసైనా ఆ పేరిశాస్త్రి నన్ను పోషించేవాడు" మీనాక్షి అరిచింది. |
25,097 | మామూలుగా అయితే అక్కగొంతులోని ఆర్ద్రత బావురుమంటూ గుండెలవిసేలా ఏడ్చేవాడే కాని కన్నీళ్ళు సైతం ఆవిరైన అంతిమ క్షణాలాయె.....నెమ్మదిగా అమ్మ దగ్గరికి వెళ్ళాడు. ఆమె లోతు కళ్ళలో సుడులు తిరుగుతున్న కన్నీళ్లు.....ఏ భాష్యాన్ని చెప్పలేక పెదవులు అదురుతున్నా గాని ఈ రెండురోజులూ అమ్మెంత కలవరపడింది అర్ధమైపోయింది. ప్రశ్నలు కావు.....చితికిపోతున్న్ శరీరం ఇంకెంత కాలం నేనుండేది అంటూ చెబుతున్న కోట్ల జవాబుల్లా అమ్మ కంపించిపోయింది. అమ్మా......అమ్మా...... ఎందుకే......
రెండురోజుల నా దూరాన్ని భరించలేని నువ్వు రేపు శాశ్వతంగా కనుమరుగైతే ఎలా తట్టుకోగలవమ్మా.....చావుపోయివుంటే ఇప్పుడు నీకు కనిపించేవాడు కాదమ్మా చెరిగిపోతున్న ఈ నుదుటి గీతలు నువ్వు వెదుక్కోవాల్సింది కడుపుకోతను కాదే. ఉరికొయ్యకు వేలాడుతున్న వానచుక్క లాంటినన్ను మన్నించిమరచిపోవే పిచ్చితల్లి.
"న్నా.....న్నా....."పిలిచింది ఆర్తిగా-ఆర్ద్రంగా.....మళ్ళీ వినిపించని పిలుపు అనిపించిందేమో కృష్ణ కంటినుంచి ఓ నీటి బొట్టురాలిపడింది. "మీ....అక్క.....తప్పుచేసినా" అమ్మరొప్పుతోంది గుండె లోయలతుఫానుని గొంతుదాకామరల్చలేనట్టు. "నాకోసం......నీకోసం...... నాన్నా.....ఏతల్లి అంగీకరించనిదే. కాని ఏం చేస్తాం! కన్నానేకాని మీకు కడుపు నిండా అన్నమయినా పెట్టగలిగానా.....బ్రతికివున్నానే కాని ఎంతకాలం బ్రతుకుతానో చెప్పగలనా....నా ముద్దుల తండ్రీ...నేను కాలేక నా ఒంట్లో రక్తాన్ని పాలుగామార్చుకోగలిగే శక్తి వున్నా మీ కడుపునింపుతూ రాలిపోయేదాన్నికదమ్మా...."
మంచుపొరలావున్న మగతచెరిగి ఇప్పుడే రూపుదిద్దుకున్న కొత్త వ్యక్తిగా పైకిలేచాడు. తనుతీసుకొచ్చిన పాకెట్స్ సంగతి అప్పుడే గుర్తుకొచ్చినట్టు ఉత్సాహంగా విప్పాడు. రెండు పేకెట్స్ నిండా అన్నం అదే అక్కని వ్యభిచారిగా మార్చింది. తనని ప్రపంచానికి దూరంగా నెడుతున్నది కూడా.
"అక్కా తీసుకో ఇది..కాదు తినెయ్.....కావాలంటే ఇంకా తెస్తాను.....తేగలను.....మరేం....." ఉద్విగ్నంగా చెబుతుంటే నిర్విన్నురాలై అక్క పార్వతి ఆ స్థితిలో కూడా. "నేను దొంగతనం చేయలేదక్కా!" తనను అనుమానిస్తున్నట్టు చూస్తోంది అక్క అలా చూడడం నచ్చలేదు.
"బ్రతుకోడ్చి..అలా అనరేమో కదూ.....చెమటోడ్చి సంపాదించిన డబ్బుతోకొన్నది.....అవును....అమ్మా నువ్వు కూడా.... "నిన్నకాకమొన్నటి దాకా పసిపిల్లాడు.....మగాడైపోయాడు. మొనగాడిలాగా ధైర్యం చెబుతున్నాడు.
కాదంటే అలిగిపోతాడేమో..అందుకుంది పార్వతి. ఆర్తిగా తింటూ అమ్మకి నాన్నలా గోరుముద్దలు తినిపిస్తున్న కృష్ణని ఆశ్చర్యంగా చూస్తోంది.
"చాలు నాన్నా" తల్లి వారిస్తున్నా వినడంలేదు కృష్ణ ఇంతకుమించి ఒక అవకాశంరాదన్నట్టు బ్రతిమాలి తినిపించాలనుకున్నాడు. "అలా అనకూడదమ్మా.....ఇది నా తొలి సంపాదనతోతెచ్చిన అన్నం...." కళ్ళనుంచి నీళ్ళు రాలుతున్నాయన్న విషయం మరిచి ఉన్మాదిలా నవ్వేస్తున్నాడు "అయినా మీ కెవరున్నారే....నేనేగా మగదిక్కుని కదమ్మా....మరి మీ మంచి చెడులుచూడాల్సింది నేనేకదే...."
"అంటే....." తల్లి అబ్బురంగా అడిగింది "ఈ రెండు రోజులు-"
"చావాలని....." అసంకల్పితంగా నోరుజారేడు...."వెళ్ళలేదమ్మా.....చావులాంటిజీవితం మీద గెలవాలని వెళ్ళాను. అంతే. గెలిచేసానే.....మనకిక ఏ లోటూ వుండదు.....ముఖ్యంగా మీ యిద్దరికీ అలాంటి ఏర్పాట్లు చేసాను....."
"అంటే......నువ్వు చదువు మాని ఉద్యోగంలో చేరావా నాన్నా" విస్మయంగా అడిగింది.
"అదేమిట్రా..."
"అసలు చదువెందుకే...." టక్కున ప్రశ్నించాడు.
"బ్రతకటానికేగా....అసలు బ్రతుకెందుకు.......మిమ్మల్ని బ్రతికించుకోవటానికేగా అదే-అదే నేనుచేస్తున్నది కూడా....."
కృష్ణ చెబుతున్నది స్పష్టంగా అర్ధంకావడంలేదు. అయినా శోకంలోనుంచి తేరుకుని తత్తరపాటుతో అడిగింది సీతమ్మ "ఎక్కడ..రెండు రోజుల క్రిందట వెళ్ళినవాడివి.....యికరావేమో అనుకున్నవాడివి.....యింతలోనే యిదంతా ఎలా సాధించావురా....."
"నీబిడ్డనమ్మా...." తల్లిని పొదివిపట్టుకున్నాడు కృష్ణ "ఆలస్యంగా ఈ యింటిగురించి అర్ధం చేసుకున్నవాడ్ని అందుకే.. .."
"అందుకే....."
గొంతుదాటని పెనుగులాట కృష్ణని ఎంత కలవరపరుస్తూందని అయినా ఉత్సాహాన్నే అభినయించాడు "చాలాదూరం వెళ్ళిపోతున్నాను, "అవాక్కయినట్టు చూసింది సీతమ్మ.... "దూరం అంటే" పార్వతి అడిగింది కూడా "మీరు రాకూడనంత దూరం....అయినా నేను వెళ్ళుతున్నది మీ కోసమే అయితే మీరక్కడి కెందుకురావడం...." "ఎంతదూరం నాన్నా....." ఫకాల్న నవ్వాడు "సూర్యుడి కిరణాలు చొచ్చుకు రానంత దూరం అమ్మ గొంతు, అక్క పిలుపు వినిపించత దూరం."
ఏ అపశృతి ధ్వనించిందో తమ్ముడి భుజాన్ని పట్టుకుని నిలదీసింది పార్వతి. "నువ్వు మాని సరిగా చెప్పు."
విసురుగా విదిలించుకున్నాడు "మగాడన్నాక లక్ష వ్యవహారాలుంటాయక్కా అవన్నీ ఆడవాళ్ళకి చెప్పాలా-సంపాదించింది తిని వూరికే వుండలేక మీ యక్ష ప్రశ్నలేమిటి-" ఆవేశంగా లోపలి గదిలోకివెళ్ళిపోయాడు.
నిజానికి అది కోపం కాదు. అక్క ప్రశ్నలని జవాబు చెప్పలేని పిరికితనం. గుండె నిండా పాతుకుని వున్న దుఖానికి గండిపడినట్టు కళ్ళనుంచి నీళ్ళుధారగా వర్షిస్తున్నాయి. అరగంటగడిచింది. గంటన్నరయ్యింది. ప్రపంచాన్ని చుట్టిన చీకటి ఆ యింటిలో రెట్టింపుగా మారింది. వచ్చింది ఒంటరిగాగడపడానికి కాదనుకున్నాడో లేక తను అంతసేపూ పిచ్చిగా ప్రవర్తించినట్టు నిర్ధారణ చేసుకున్నాడు-గది దాటి బయటికొచ్చాడు. మంచంపై అమ్మ నిద్రపోవడంలేదు. మగతగాకళ్ళు మూసుకుని వుంది. అక్క కూర్చునే వుంది చీకటిలోకి చూస్తూ.
రేపు....రేపు.....కాదు.....ఎల్లుండి ఈ సమయానికి తనకథ ముగిసి పోతుంది. అమ్మ,అక్క యిద్దరూ తనకోసం గుండె అవిసేలా ఏడుస్తారు. గంట....... రెండు గంటలు.......వారంరోజులు.....ఓసంవత్సరం.....ఆ తర్వాత మరిచిపోతారు..... మర్చిపోయిన వాళ్ళ కోసం జీవితాంతం కుమిలిపోతుంటారా.....అలా అయితే అమ్మానాన్న కోసం యిప్పటిదాకా ఏడవాలిగా.
"పడుకో అక్కా....." రహస్యంలా అన్నాడు అక్క చెవిలో.....క్షణం చూసింది రెప్పలార్పకుండా.... మరుక్షణం అతడి రెక్కపట్టుకుని లోపలిగదిలోకి లాక్కుపోయింది. వెంటనే అడగలేదు.....అడిగేదేమోకాని దుఃఖం ఆమె గొంతుకడ్డం పడుతున్నట్టు పెనుగులాడింది రెండు క్షణాలపాటు. "ఒరేయ్....నేను కులటనే అలా మారింది అన్ని మార్గాలూ మూసుకుపోయాకనేరా.....నిన్ను దక్కించుకోటానికి..నేను చేసింది తప్పే అయితే ఆ తప్పుకి నిన్ను నువ్వు శిక్షించుకోకు కిట్టూ!" |
25,098 |
మరో తిరుగులేని అధికారాన్ని ఉపయోగించుకుంది. క్రిమినల్ ప్రొసీజరు కోడ్ సెక్షను 57 ప్రకారం ఇరవైనాలుగు గంటలకి మించి నేరస్తుల్ని పోలీసు కస్టడీలో ఉంచకూడదు. అయితే సెక్షన్ 167 ప్రకారం, ఇంటరాగేషన్ ఇంకా కొనసాగించడానికి అవసరం. నేరానికి సంబంధించిన తిరుగులేని సమాచారం ఉన్నాయనిపించినప్పుడు మేజిస్ట్ర్రేట్ ని మరికొన్ని రోజులు కస్టడీలో ఉంచడానికి అనుమతి కోరవచ్చు . అదే చేసిందామె. పదిహేను రోజులదాకా అలా ఉంచే ఆమె అధికారానికి అనుకూలంగా మేజిస్ట్ర్రేట్ నుంచి ఉత్తర్వుని పొంది లాయర్ల సంఘానికి మరో షాక్ ఇచ్చిందామె.
ఈ నిర్ణయంతో ఆమె ఏ స్థాయి వ్యక్తులదాకా ప్రశ్నగా మారిందో ఆమె సైతం ఊహించలేదు. మరో బలమైన గెలుపుతో ఇద్దర్నీ పోలీస్ కస్టడీకి మళ్లించిన మిస్. మేనక సంతృప్తికన్నా ఎక్కువ అశాంతికే గురయ్యింది.
ఆ క్షణంలో ముందు గుర్తుకొచ్చింది. మిత్ర.అతనేదో గైడ్ చేస్తాడని కాదు, అతని చేరువలో కొద్ది సేపైనా ప్రశాంతంగా గాడపాలని మనసు అర్థంకాని విషయం. ఆమె తన చేంబర్ కి తిరిగివస్తూ ఓ మూల కూర్చున్న స్త్ర్రీ ని చూసి ఎంత నిశ్చేష్టురాలైంది అంటే... ముందు నమ్మశక్యం కాలేదు! " రాజీ!" ఆత్మీయంగా పలకరిస్తూ ఇంచుమించు కావలించుకున్నంత పని చేసింది "ఏమిటే? నామీద కోపం దగ్గిందా? నువ్వూ ఈ ఊళ్ళోనే ఉన్నావా?" అరమరికలు లేని ఆప్యాయతని ప్రదర్శిస్తూ చేంబర్ కి నడిపించింది. " కూర్చో" రాజీ కూర్చోలేదు. తలవంచుకునే అడిగింది- " నిన్ను సహాయం అడగాలని వచ్చాను." "ఏమిటబ్బా?" రాజీ ముఖకవళికల్ని ఆమె గమనించలేదు. "నేను నీకు సహాయం చేసే స్థితిలో ఉన్నానంటే ఎంత అ దృష్టవంతురాలినే! చెప్పు" "రణధీర్ ని విడిచిపెట్టాలి." షాక్ తగిలినట్టు చూసింది మేనక." వ్యాట్? రణధీర్ మీద నీకు ఇంట్రస్టేమిటే?" "రణధీర్ నా భర్త!" ఓ మిస్సై ల్ మనసు పొరల్లోనుంచి దూసుకుపోయినట్టు అదిరిపడింది మేనక. " నువ్వు..... నువ్వు రణధీర్ కి భార్యవెలా అయ్యావు?" మేనక గొంతు కంపించింది. రాజీ పుట్టుంది ఎలాంటి సాంప్రదాయకరమైన వంశంలోనో తెలిసిన మేనక యిలాంటి బంధాన్ని ఊహించలేకపోయింది. ఇదేమిటి?మెత్తని పుత్తడివెన్నెల్లా, దేవతల దరస్మితంలా, బ్రతుకొక లలితలతాంతమాలలా, అందమైన ఉదయంలా, స్పందించే హృదయంలా, ఆశల గగనంపైన ఆనందంగా విరిసిన హరివిల్లులా ఉంటే రాజీ బ్రతుకులో ఇలాంటి నికృష్టుడెలా అడుగు పెట్టాడు? రాజీని కలుసుకోవాలని మనసారా కోరుకుంది కాని యిలాంటి కలయికని ఆమె ఊహించలేదు. "ఎలా... ఎలా విడిచిపెట్టనే? ఆడదంటే విలువలేని ఓ దుర్మార్గుణ్ణి, ఉన్న పరపతితో ఎలాంటి పాడుపనికైనా సిద్దపడగల క్రిమినల్ ని...నీ భర్త అయనాకానీ నేనెలా విడిచిపెట్టను?" "అస్సలు వీలుకాదా?" అమాయకంగా అడిగింది రాజీ. రాజీ కళ్ళలో ఆ క్షణాన కూడా మేనకమీద కోపంలేదు. నిస్సహాయత లాంటచి కన్నీళ్ళు. అవికూడా భయంతో రాలుతున్నాయి తప్ప ఆర్తిగా వెలికిరావడంలేదు. కళ్ళకింద నల్లటి చారలు, కొడిగట్టుతున్న దీపంలాంటి పాలిపోయిన ముఖం. బోధపడిపోయింది రాజీ సుఖంగా లేదని. ఇప్పడు రాజీని సూటిగా చూడలేకపోయింది మేనక.
" రాజీ!" కిటికీ దగ్గరకు నడిచి బయటికి చూస్తూ అందామె. చిత్రంగా ఆమె గొంతూ గాద్దదికమైపోతూంది. " నేను మరిచిపోలేదే.... ఒకనాడు ఆప్యాయతకోసం, సానుభూతికోసం అలమటించిపోతున్న రోజుల్లో.... నువ్వు నాకు అందించిన ప్రేమని నేనెలా మరచిపోగలనే? నన్ను నేను అసహ్యించుకుంటూ అమ్మమీద అలిగి అన్నం తినకపోతే నువ్వు ఆరిందెలా తినిపించేదానివి. అప్పుడేమనుకునేద్నో తెలుసా! నాకే శక్తుంటే , దేవుడు అలాంటి శక్తి నాకిస్తే నీకు ఏమన్నా చేయాలనుకునేదాన్ని.ఇప్పుడు ఆ శక్తుంది కాని అది నాదికాదు. అందుకే నాది కాని దాన్ని నీకు పంచలేక... "వెనక్కి తిరిగింది. రాజీ లేదక్కడ. ఇలాంటి నిస్సహాయ పరిస్థితుల్ని ఎదుర్కొవాల్సి వస్తుందనిపించిన తొలిక్షణమైనందుకేమో ఓ నీటి బొట్టు నిస్సహాయంగా ఆమె కనుకొలకుల్లో నిలిచింది. ఆఫీసులో ఉండలేకపోయింది. మనసు ఓదార్పుకోసం అలమటించిపోతుంటే క్వార్టర్సుకి వెళ్ళిపోయిన మేనక మధ్యాహ్నం భోంచేయలేదు. "ఏమైందమ్మా?" అడిగింది అన్నపూర్ణ తల్లి ముందు ఏనాడూ నిబ్బరాన్ని కోల్పోయినట్టు కనిపించని మేనక యిప్పుడూ అలాగే ధైర్యాన్ని నటించేసింది " ఆకలిగా లేదే!" "దిగులుగా ఉన్నావెందుకు?" "ఛ ఛ!కాస్త అలసటగా ఉంది మమ్మీ." "పిచ్చితల్లీ!" ఆప్యాయంగా ఆమె తల నిమిరింది. " నేను నీకు అమ్మనే.... దిగులుకీ, అలసటకీ తేడా తెలుసుకోలేనా?" "మమ్మీ!" ఇక నిగ్రహించుకోలేకపోయింది. "నాకు మిత్ర కనిపించాడు. రాజీకూడా వచ్చింది.ఏమిటో... ఆ కుటుంబం... మమ్మీ! ఏమైందో తెలీదు కాని.... వాళ్ళు పూర్వంలా ఉంటున్నట్టు లేదు" అంతకన్న వివరంగా చెప్పలేకపోయింది. " నీకు తెలుసా మమ్మీ? మిత్రా వాళ్ళ నాన్నగారు ఈ మధ్యనే పోయారట. మనకు తెలీనే తెలీదుకదూ?" చాలా ఒడిదుడుకుల్నీ , కష్టాల్నీ, కన్నీళ్ళనీ ఎదుర్కుంటూ బ్రతికిన ఆమెకు, మేనక మిత్రుల బంధం గురించి తెలీనిదికాదు. ఆ కుటుంబమే ఆదుకోకపోతే-ముఖ్యంగా మిత్ర అండలేకపోతే మేనక ఈ స్థితికి ఎదిగేదాకాదు. తన ముందున్నది ఎదిగిన కూతురు. ఏనాడూ తన మనసులో ఉన్నది స్పష్టంగా చెప్పని మేనక ఈ మాత్రమైనా దిగులు వ్యక్తం చేసిందిప్పుడే. జీవితంలో ఇంతదాకా ప్రేక్షకురాలిలానే గడిపేసిన ఆమె ఇప్పుడూ మాట్లాడలేకపోయింది. సరిగ్గా అప్పుడు ఎస్సై మురారి వచ్చినట్టు మేసేజ్ తీసుకొచ్చాడు ఆర్డర్లీ. మామూలుగా అయితే ప్రస్తుత స్థితిలో ఆమె తిరస్కరించేదే కాని డిపార్టుమెంట్ లో ఆమెకు ఆత్మీయుడిలా అనిపించేది మురారి ఒక్కడే. కాదనలేకపోయింది. |
25,099 | "అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవ్.... నీ దగ్గర వాఛీ ఉందా?"
"అదే సమయంలో లకడీకాఫూల్లో సిన్మాహాల్స్ ని వదులుతారు సర్...."
"రెండోసారి ఎన్నిగంటలకు మెలుకువ వచ్చింది..."
"ప్పుడు టైము తెలీదు సర్... రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి సర్... నేను లేచి గోడ దగ్గరకెళ్ళి వెనక్కి వస్తున్నాను సర్! ఆఫీసు హాల్లో లైటు వెలుగుతూ కన్పించింది సర్.... కూర్మారావ్ బాబు పేపర్ ఏదో చదువుతున్నాడను కున్నాను సర్."
"మళ్ళీ మూడోసారి లేచావా..."
"లేచాను సర్... లేచి గోడ దగ్గరకెళ్ళి వెనక్కొస్తూ ఆఫీస్ రూమ్ వేపు చూసాను సర్... లైటింకా వెలుగుతూనే ఉంది సర్... భయమేస్తుందని, లైటు ఆర్పకుండా పడుకున్నాడనుకున్నాను సర్."
అప్పటికి గంటసేపట్నించి రాముల్ని ఇంటరాగేట్ చేస్తున్నాడు శుభ్రవర్మ.
"ఒకసారి బాత్ రూమ్ కి వెళ్లొస్తాను సర్"
ఆ ప్రశ్న కోసమే చూస్తున్నాడు శుభ్రవర్మ. తన చేతిలో ఉన్న ఫాస్కుని తీసి ఫ్యూన్ రాములుకిస్తూ-
"నీ యూరిన్ ని దీంట్లో నింపి పట్టుకురా...." ఆ మాటకు విస్తుపోయాడు రాములు.
శతృఘ్న పరిస్థితి కూడా అలాగే ఉంది.
"అతను ఫ్లాస్కులో తెచ్చే యూరినే కూర్మారావ్ మర్డర్ ఎన్నిగంటలకు జరిగిందో కరెక్టుగా చెపుతుంది..." నవ్వుతూ అన్నాడు శుభవర్మ.
"ఈజిట్ ట్రూ..." నమ్మలేనట్లుగా చూసాడు శతృఘ్న.
మరో పదినిముషాల తరువాత ఫ్లాస్కుతో లోనికి వచ్చాడు రాములు.
రాములు తెచ్చిన ఫ్లాస్కులోని యూరిన్ ని గ్లాసులో పోసి స్కేల్తో కొలిచాడు శుభ్రవర్మ. ఆ యూరిన్ 220 మిల్లీలీటర్లు ఉంది.
చెప్పటం ప్రారంభించాడు శుభ్రవర్మ.
"ప్రతి మనిషి శరీరంలోని కిడ్నీ ఒక నిముషంలో ఒక మిల్లి లీటరు యూరిన్ ని ఉత్పత్తి చేస్తుంది. అంటే ఒక రోజు మనిషి శరీరంలో 1440 మిల్లీలీటర్ల యూరిన్ తయారౌతుంది. మనిషి బ్లాడర్ లో 300-400 మిల్లిలీటర్ల పరిధిలో యూరిన్ నిండగానే అతనికి బాత్ రూమ్ కి వెళ్ళాలనిపిస్తుంది
దీన్నిబట్టి మనం చూస్తే- రాములు మొట్టమొదట లేచి గోడ దగ్గరికి వెళ్ళి తన బ్లాడర్ ని మొత్తం ఖాళీ చేసుకొని వచ్చాడు. అప్పుడు అతను చెప్పిన దాని ప్రకారం సినిమాలు వదిలే టైము పదకొండున్నర దాటింది. రెండోసారి లేచి బయటికెళ్ళి వచ్చాడు..... అంటే మరో 3 గంటల 40 నిముషాలు తరువాత బయటికెళ్ళాడన్న మాట..... క్యాలిక్యులేట్.... చేస్తే.... సరిగ్గా 3-10 నిమిషాలకు కూర్మారావు హత్య జరిగింది..." చెప్పాడు శుభ్రవర్మ.
"అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగారు" అడిగాడు శతృఘ్న.
"దిసీజ్ సైన్స్.... మీరే స్వయంగా తెల్సుకుందురుగాని చూడండి"
"రాములూ... ఇక్కడకు వచ్చేముందు ఎన్ని గంటల క్రితం నువ్వు బాత్ రూమ్ కి వెళ్ళావో, అదే గోడ దగ్గరికి వెళ్ళావో చెప్పగలవా" అడిగాడు శుభ్రవర్మ.
"ఇక్కడికి పదిగంటలకి వచ్చాను సర్.... ఎనిమిది గంటల ప్రాంతంలో వెళ్ళాను సర్"
చేతి గడియారంవేపు చూశాడు శుభ్రవర్మ.
"మీ గడియారం ఒకసారి చూసుకోండి" చెప్పాడు శతృఘ్న.
తన వాచీని చూసుకున్నాడు.
పదకొండు ఏభై అవుతోంది.
"పది నిమిషాల క్రితం రాములు బాత్ రూమ్ కి వెళ్ళాడు. అంటే సరిగ్గా మూడు నలభై నిమిశాల తరువాత వెళ్ళాడన్న మాట" చెప్పాడు వర్మ.
రాములు వెళ్ళిపోయాడు.
"3-10 నిమిషాలు....
రెడ్ హిల్స్ ఆఫీసులోంచి ఆ టైములో ఎవరు బయటికి వెళ్ళినా రోడ్ మీంచే వెళ్ళాలి అంటే పెట్రోలింగ్ పోలీసులు ఆ సమయంలో ఎవరో ఒక వ్యక్తిని చూసుండాలి" చెప్పాడు వర్మ.
ఏమాత్రం ఆలస్యం చేయకుండా సైఫాబాద్ పోలీస్ స్టేషన్ కెళ్ళాడు శతృఘ్న.
రాత్రి పెట్రోలింగ్ లో వున్న నలుగురు పోలీసుల్నీ ప్రశ్నించాడు శతృఘ్న.
"లేదు సర్.... ఆ టైములో రోడ్ మీద ఎవర్నీ చూడలేదు సర్!" ఒక పోలీసు చెప్పాడు.
"ఒక్కసారి బాగా గుర్తుకు తెచ్చుకోండి..." ఆశగా అడిగాడు శతృఘ్న.
"అవున్సార్... ఆ టైమ్ లో మేం... హోటల్ వెంకటేశ్వరా.... ట్రాఫిక్ ఐలాండ్ దగ్గరున్నాం సర్....అయోధ్యా లాడ్జి పక్క నుంచి.... ఏదో కెనటిక్ హోండా వెళుతున్నట్టు గుర్తు సర్!"
"కెనటిక్ హోండా... ఆ సౌండ్ నాకు బాగా జ్ఞాపకం సార్" మళ్ళీ చెప్పాడు ఆ కానిస్టేబుల్.
కెనటిక్ హోండా!!
ఆఫీసుకొచ్చి తన సీట్లో కూర్చున్నాడు శతృఘ్న.
కూర్మారావు లేని లోటు అనుక్షణం ఒంటరితనాన్ని గుర్తుకు తెస్తోంది. ఏదో రాక్షసహస్తం రెండు చేతుల మధ్య తనని నలిపేస్తున్నట్టుగా ఉంది.
అబ్బయ్యనాయుడి వికృతశక్తిని అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్నాడు శతృఘ్న.
* * * * *
సరిగ్గా ఉదయం పదకొండు గంటలు...
టేబిల్ మీద ఫోన్ మోగింది. ముకుంద్ రిసీవర్ అందుకున్నాడు.
"సార్....ఫోన్"
"ఎవరు..." తలవంచుకుని దీర్ఘంగా ఆలోచిస్తున్న శతృఘ్న తలెత్తి చూసాడు.
"మీకే ఇవ్వమంటున్నాడు"
నిరాసక్తంగా ఆ ఫోన్ ని అందుకున్నాడు శతృఘ్న.
మొదట నవ్వు ఆ తర్వాత మాట వినిపించింది.
"నన్ను చూడలేదు... న ఆమాట వినలేదు కదూ.... ఒక్కసారయినా మాట్లాడకపోతే బాగోదని.... నేనే.... అబ్బయ్యనాయుడ్ని..."
ఆ గొంతు చాలా మృదువుగా వుంది.
"వింటున్నావా.... ఈ రాష్ట్రంలో నన్ను ఎదుర్కొని నిలవడం చాలా కష్టం... పాము చిన్నదైనా పెద్ద కర్రతో కొట్టాలన్నారు పెద్దలు. కొట్టాను. కూర్మారావు పాపం.... నీ చొక్కా లాంటివాడటగదా... చచ్చాడు. అర్ధమయింది గదా బీదర్ లో లిక్కర్ ని ధ్వంసం చేశానని! విర్రవీగుతున్నావేమో.....రేపట్నించి ప్రతిరోజూ కొన్ని వందల లారీల లిక్కర్ ఈ రాష్ట్రానికి వస్తుంది. దమ్ముంటే రా. కావలిస్తే రూట్ మ్యాప్ పంపమంటే పంపుతాను అర్ధమైందా?"
అబ్బయ్యనాయుడు చాలా సాఫ్ట్ గా మెత్తగా చెపుతున్నాడు.
"అంచేత బ్రదర్.... ఆ జర్నలిస్టు పిల్ల.... అదెవత్తది.... మధూలో.... మంచాలో నిన్ను ప్రేమించినట్టుంది. పెళ్ళి చేసుకో.... టిక్కట్లు తీసి నా ఖర్చుతో ఫారిన్ పంపిస్తా సుఖంగా వెళ్ళు అక్కడ సెటిలవుతానంటావా గ్రీన్ కార్డు ఇప్పిస్తా. ఆలోచించుకో.
ఈ సి.ఎమ్.ని నమ్ముకోకు.... అది రేపో ఎల్లుండో దిగిపోతుంది. అది దిగిపోయాక నీ డిపార్టుమెంట్ లోని వాళ్ళచేత నిన్ను చంపే ఏర్పాటు చేస్తా నువ్వు నా మాట వినకపోతే నీ ఫ్రెండ్ కూర్మారావ్ ఎలా చచ్చాడనుకున్నావ్ ఆలోచించు నీకే తెలుస్తుంది.
సాయంత్రం లోపల బేహార్ వెళుతున్న వార్త నాకు తెలియాలి. లేకపోతే... నేను చెప్పను-నువ్వాలోచించుకో..."
కూల్ గా ఫోన్ పెట్టేసాడు అబ్బయ్యనాయుడు.
* * * * * |