SNo
int64 0
25.8k
| text
stringlengths 39
23.5k
⌀ |
---|---|
25,300 |
లేకపోతే అసహ్యకరమైన కీచులాటలు. జన్మంతా ఒక చూరుక్రింద కాపరం చెయ్యాల్సిన వాళ్ళు అనుక్షణం ఒక ర్నొకరు హింసించుకుంటూ వుంటారు.
ఇద్దరిమధ్యా భయంకరమైన గుట్టు. ప్రపంచంలోని అశాంతి అంతా యిద్దరి మధ్య కనిపించదు.
ఇంట్లోని వాతావరణం అతను భరించలేక పోతున్నాడు. ఎక్కడికైనా పారిపోయి ఒంటరిగా బ్రతకాలని వుంది? ఎక్కడకు పోతాడు? అతను ప్రశాంతంగా బ్రతకాలని వుంది? ఎక్కడకు పోతాడు? అతను ప్రశాంతంగా , ఏకాకిగా బ్రతికే చోటు ఎక్కడని వుంది?
* * * *
ఒక రోజు సాయంత్రం ఇంట్లో వుండలేక బయటకు బయల్దేరాడు.
కాలినడకనే ఎక్కడెక్కడో తిరిగాడు. చీకటిపడే వేళకు తిరిగివస్తోంటే ఓ ఇంటి ముంగిట్లో పాప నిలబడి వుండటం కనిపించింది.
నడుస్తూ ఆ ప్రయత్నంగా తలత్రిప్పి చూసేసరికి తనవంకే కళ్లార్పకుండా చూస్తోన్న పాప.
ఆగిపోయి "పాపా" అన్నాడు.
" బాబుగారూ?" అంది.
ఆమెవంక పరిశీలనగా చూశాడు. మునుపటికన్నా చిక్కిపోయి, చాలా దిగులుగా కనిపించింది.
" ఎలా వున్నావు పాపా?" అనడిగాడు.
నవ్వింది.ఆనవ్వులో ఎన్నో జీవిత సత్యాలు కనిపించాయి.
"లోపలకు రండి బాబుగారూ" అంది.
ఒక్క క్షణం తటపటాయించి ఆమె వెంట లోపల కెళ్లాడు. చాలా చిన్న యిల్లు. చిన్న యిల్లు. ఆ ఇల్లు , వాతావరణం చూస్తే ఆమె ఎలాంటి జీవితం గడుపుతూన్నదో బాధపడిపోతున్నది.
కూచోండి బాబుగారూ."
ఓ పాతకాలంనాటి కొయ్యి కుర్చీ అతనికి దగ్గరగా జరిపింది.
"పాపా! నీసంసారం బావుందా?"
పాపా తల ఊపింది.
"మి ఆయన ఏం చేస్తాడు?"
"కార్పెంటర్."
" నిన్ను బాగా చూసుకుంటాడా?"
" చాలా"
" అలా వున్నావేం పాపా."
"ఎలా వున్నాను?"
" దిగులుగా, విషాదంగా కనిపిస్తున్నావు?"
పాప నవ్వింది. "అసలు జీవితం అంటేనే దిగులూ, విషాదం అనుకుంటాను బాబూగూరూ! అదే నిజం. మనం సంతోషం అనుకుంటున్నది అబద్ధం అయి వుంటుంది."
సూర్యచంద్ర ఆమెవంక ఆశ్చర్యంగా చూశాడు.
" పాపా! నువ్వు బాగాలేవా?" అన్నాడు
" ఉన్నాను."
"మరి...."
" ఏమిలేదుబాబూగారూ!బాబుగారూ! ఎప్పుడయినా గుర్తొస్తున్నావా?"
" ఎక్కడైనా గులాబీపువ్వు కనబడితే నువ్వే జ్ఞాపకం వస్తూ వుంటావు పాపా."
" పోనిలెండి. అప్పుడయినా...." అని వూరుకుంది.
బయట అలికిడయింది సూర్యచంద్ర తలత్రిప్పి చూసే సరికి నల్లగా, పొడవుగా వున్న ఓ వ్యక్తి లోపల కొస్తున్నాడు.
పాప కొంచెం కంగారుపడి "బాబుగారు" అని భర్తకు పరిచయం చెయ్యటానికి ప్రయత్నించింది.
"అయితే...?" అన్నట్లు విముఖంగా చూశాడు.
"ఇలా పోతూంటే..."
నువ్వు కనిపించి ఆగిపోయాడు కాబోలు." "సూర్య చంద్ర ఉలికిపడి అతనివంక చూశాడు.
"చాల్చాలు గాని లోపలికి పద" అన్నాడు మళ్ళీ బంగార్రాజు.
పాప సూర్యచంద్ర వంక ఓ సారి చూసి లోపలకు వెళ్ళిపోయింది.
బంగార్రాజు సూర్య చంద్రవంక నిరసనగా " ఇహ నీవు వెళ్ళొచ్చు" అన్నట్లు చూశాడు.
సూర్యచంద్రకు అతని వైఖరి అర్థమయింది. వెంటనే లేచి బయటకు వచ్చేశాడు.
* * * *
" ఏమే యిటురా" అని పిల్చాడు బంగార్రాజు పెళ్లాన్ని. పాప బయటి కొచ్చింది.
" ఎవడు వాడు?"
ఆమె మాట్లాడలేదు.
"మాట్లాడవేం? నీ రంకుమొగుడా?"
"తెలిసిన మనిషి"
"తెలిసిన మనిషా? అంటే ఏ విధంగా తెలుసు? నీ కతను తెలుసా?నీ కతను తెలుసా? నీ శరీరంలో ఏయో భాగాలు అతనికి తెలుసు?"
"ఛీ" అంది పాప.
" ఇంట్లోకి పిలిచి కులుకుతూంటే లేదుగాని ఛీ ఏమిటే లం.... చెప్పు యిందాక నేను వచ్చేలోపల ఏమేం చేశాడు? ఎక్కడెక్క ముట్టుకున్నాడు?"
" అబ్బ! అలా అసహ్యంగా మాట్లాడకండి."
" అసహ్యమా? నువ్వు వాడితో కులుకుతూంటే లేదు గాని నేనంటే అసహ్యమా?చెప్పు. మి ఇద్దరికి యిదివరకు ఎన్నిసార్లు జరిగింది?" |
25,301 |
(అమల్ -విమల్ -కమల్ -ఇంద్రజిత్ వచ్చి పరీక్ష రాయటానికి వచ్చి కూర్చుంటారు. స్టూలు- టేబుల్ -ప్రశ్న పేపరు - కాపీ - రచయిత తీచరులా తిరిగి తిరిగి వాచ్ చేస్తుంటాడు.)
రచ : (కొంచెం ఆగి)
Time up stop writing please.
(వారు త్వరత్వరగా -రాస్తుంటారు. రచయిత ఒక్కొక్కరి దగ్గర పేపర్ల తీసుకొంటూ వుంటాడు. వాళ్ళు పరీక్షపేపర్ల గురించి మాట్లాడుకొంటూ నిరాశగా- భయంగా వెళతారు.)
రచ : స్కూలునుండి కాలేజికి-
కాలేజి-పరీక్ష -పరీక్షప్యాస్ - మళ్ళీ ప్రపంచం.
(అమల్ -విమల్ -కమల్ -ఇంద్రజిత్-ప్రవేశం)
అమల్ : ప్యాసయాక, ఏం చేస్తావ్?
విమల్ : ముందు ప్యాసవనీ.
కమల్ : ప్యాసయినా , ఫేలయినా, నేను ఉద్యోగం చెయ్యాల్సిందే. నాన్నగారు ఈ సంవత్సరం రిటైరు అవుతున్నారు.
విమల్ : నీకేమయ్యా! నేను ముగ్గురు చెల్లెళ్ళకు పెళ్ళిళ్ళు చేయాలి.
కమల్ : ఇంతవరకు నిశ్చింతగా తిరిగాను. పరీక్ష ఫలితాలు తెలిసే రోజులు దగ్గరపాడుతుంటే, నాకు ముద్ద మింగుడు పడటం లేదు.
రచ : అమల్ కుమార్ !
(అమల్ సంతోషంతో కెవ్వుమంటాడు. అందరూ వీపు తట్టి, అభినందిస్తారు.)
విమల్ కుమార్.
(పైలాగే జరుగుతుంది)
కమల్ - ఇంద్రజిత్.
(ఒకరినొకరు అభినందించుకోంటారు. పిన్ని వస్తుంది. అందరూ పాదాభివందనం చేస్తారు. ఆమె దీవిస్తుంది. వెళ్ళిపోతుంది. నలుగురూ వెళతారు.)
రచ : ఇది మరోప్రపంచం. ఈసారి విద్యాదికులు ఈకుర్చీలో కూర్చొని పరీక్ష ఇస్తారు. బయట వేసివున్న బల్లమీద అమల్ , విమల్, కమల్, ఇంద్రజిత కూర్చొని వుంటారు.
(అమల్ , విమల్, కమల్, లోపలకువచ్చి బెంచీమీద కూర్చోబోతారు.)
కొంచెం వుండండి. ఒక్కనిమిషం.
(ముగ్గురూ వెళ్ళిపోతారు)
రచ : మర్చి పోయారు చెప్పటం. ఆ కుర్చీలు అక్కడలేవు, బెంచీల సంగతికూడా మార్చిపోండి. ఇక్కడ పచ్చని గడ్డివుంది. ఇవన్నీ చెట్లు. ఆ చెట్టు పై భాగంలో సింధూరరేఖ కనిపిస్తుంది. రోజూ ఉదయించే సూర్యుడు ఇవ్వాళా ఉదయించాడు. ఇప్పుడస్తమిస్తున్నాడు.
అదిగో, అటు, ఎంత చిక్కని సింధూరరేఖ కనిపిస్తుందో చూడండి.
(అదే సమయంలో, మానసి, ఇంద్రజిత్ ప్రవేశిస్తారు ఇద్దరూ చెట్టుక్రింద నిలుచుంటారు. మానసి చేతిలో ఒక పుస్తకంవుంది. రచయిత సిందూరరేఖ చూట్టంలో నిమగ్నుడై వుంటాడు.)
మానసి : నువ్వునాకు ఈపుస్తకం ఎందుకిచ్చావ్? న్యాయంగా నేను నీకు యివ్వాలి.
ఇంద్ర : ఎందుకు?
మానసి : ఎందుకేమిటి? నువ్వు ప్యాసయినందుకు.
ఇంద్ర : నేను ప్యాసయితే నువ్వు పుస్తకం యివ్వాలని ఎక్కడయినా రాసిపెట్టివుందా? నేనే ఎందుకివ్వ కూడదు?
మానసి : రాసిపెట్టి వుండాలా? అది పద్ధతి.
ఇంద్ర :పద్దతులమీద నమ్మకం వుందా ?
మానసి : (నవ్వుతూ) వుందంటే నువ్వూరుకుంటావా ?
ఇంద్ర :నా నమ్మకాలను ఒప్పుకొంటావా?
మానసి : ఆడపిల్లలు ఒప్పుకొక చేసేదేముంది?
ఇంద్ర : ఆడపిల్లలు - ఈ మాట ఎన్నోసార్లు అన్నావు. ఆడపిల్లలు - నియమాలను పాటించాలి. మగవాళ్ళు పాటించకపోయినా, ఫర్వాలేదు. అవునా?
మానసి : నేను నిజమే అంటున్నాను.
ఇంద్ర : నేను కూడా నియమాన్ని పాటిస్తాను. చదవాలన్నారు. చదివాను. పరీక్ష ఇవ్వాలన్నారు - ఇచ్చాను, ఉద్యోగం చెయ్యాలంటున్నారు -చేస్తాను. మరి ఇదంతా నియమపాలన కాదూ? ఒకటి-నియమం లేక పోయినా ఉద్యోగం చేస్తాను.
మానసి : ఎందుకు?
ఇంద్ర : అనేక కారణాలు. నా కాళ్ళమీద నేను నిలబడాలి. ఇంటివాళ్ళ డబ్బుతో నేను చదువుకోవడం అంటే నాకు ఎలా వుంటుందో నీకు చెప్పాను.
మానసి : ఇంకా!
ఇంద్ర : చాలా వున్నాయి. నువ్వొక సంగతి చెప్పు?
మానసి : ఏమిటది!
ఇంద్ర : నియమాలను పాటించాలి అనే వాక్కునుకూడా పాటించాలా?
మానసి : పాటించక ఏం చేస్తావ్ ?
ఇంద్ర : నియమాలను అసహ్యించు కొంటాను, కనీసం, ఆ మాతం స్వంతంత్రత వుండొద్దు?
మానసీ : దానివల్ల ప్రయోజనం ?
ఇంద్ర : నన్ను కట్టేసిన తాడును పూజించటంలో ప్రయోజనం?
మానసీ : పూజించమని ఎవరంటున్నారు?
ఇంద్ర : తాడును, నియమంగా తీసుకొని స్వీకరించటానికీ, దాన్ని పూజించటానికీ భేదం ఏముంది?
మానసీ : ఇన్నిటికీ, నువ్వు చెయ్యదలచిందేదో చెప్పరాదు?
ఇంద్ర : నన్ను కట్టేసిన త్రాళ్ళను తేంపేస్తాను. నాచుట్టూ వున్న గోడల్ని పగలగోడతాను.
మా : కోపం, ఎవరిమీద ?
ఇం : ప్రపంచంమీద-మీరు గౌరవించే సంఘంమీద. నేను, నీతో ఒకసారి లీలను గురించి చెప్పాను. గుర్తుందా?
మా : ఆమె భర్తకు-టి.బి. అన్నావు కదూ?
ఇం : అతను చనిపోయి చాలారోజులయింది. ఆమెను - అత్తగారింటినుంచి తరిమేశారు.
మా : తర్వాత?
ఇం : ఎవరో దూరం బంధువట. అతనికి ఒక చిన్న దుకాణం వుంది. వాళ్ళంతా, దొంగతనాల కేసుల్లో చిక్కుకొని వున్నారట.
మా : ఆ - అమ్మాయి ఏమయింది?
ఇం : జరుగరానిదే జరిగింది. మూడు నెలలయిందట. నాకు నిన్ననే తెలిసింది.
(మానసి మౌనంగా వుండిపోయింది.)
ఇం : నేను రోజూ బస్సు ఎక్కే స్టాపులో ఒకరోజుఒక కుర్రాడు - బూట్ పాలిష్ చేస్తానని నన్ను పట్టుకోన్నాడు. వాడికేడెనిమిది యేళ్ళుంటాయి. వాడిచంకలో సంవత్సరం పిల్లవాడు పాలిష్ తో మునిగి వున్న గుడ్డపీలికతో ఆడుకుంటున్నాడు.
(మానసి మౌనంగానే వుండి వింటూంది.)
ఇం : నేను, పాలిష్ చేయించుకోలేదు. ఒక్క పైసగూడాయివ్వలేదు. విదిలింఛికొట్టాను. నన్ను వాడు విసిగించి వుంటే, బహుశా, కొట్టేవాణ్ని కూడా నేమో! |
25,302 | ఆ కాగితంలో పై విధంగా వ్రాసుంది....ఆఖరి వాక్యమే బాగా కదిలించింది మధును. శేట్ మరోసారి టోటల్ చెప్పబోతుండగా అనుకొని సమయంలో అర్ధాంతరంగా ఫోన్ మోగింది......ఎవరూ ఎత్తలేదు....అలాగే మ్రోగుతూ ఫోన్...లెక్కేస్తూ శేట్.....
ప్రదీప్ ముఠాను దెబ్బతీసే ప్లాన్స్ లో మధు, చందూ___వీటన్నింటికీ అతీతమైన స్థితిలో మనోహర్.....
ఎంతో విలువైన ఫోన్ తమకోసం నిరీక్షిస్తోందన్న ఆలోచనగానీ, ఆశగానీ అక్కడెవరికీ లేదు.
విసుగ్గా చూస్తున్నారు ఫోన్ వేపు ఫోన్ మోగడం ఆగిపోయింది.
కాస్తంత రిలీఫ్ ఫీలవుతుండగా మరలా మోగింది.
విసుగ్గా, విసురుగా మధు ఎత్తాడు ఫోన్-ఆ ఫోన్ పట్ల అక్కడున్న ఎవ్వరికీ ఆసక్తిలేదు.
* * *
ఫోన్ లో మాట్లాడుతున్న మధు ముఖంలో క్రమంగా మార్పు రానారంభించింది. మరికొద్ది క్షణాల్లోనే మధు ఆనందంతో ఎగిరి గంతేసి నంత పని చేస్తూ ఫోన్ మనోహర్ కి అందిస్తూ "తరంగణి సార్! కలకత్తా నుండి హైదరాబాద్ వచ్చేసింది..... మోడలింగ్ కి ఒప్పుకునేలా వుంది" అన్నాడు.
మధు ఏం, అన్నాడో ఒక్కక్షణం మనోహర్ కి, చందూకి అర్ధం కాలేదు. అర్ధమయ్యేసరికి ఓ ఆనంద తరంగం ఉప్పెనలా వూపేసింది మనోహర్ ని.
మనోహర్ విస్మయ పడుతూనే ఫోన్ అందుకున్నాడు.
"హలో మనోహర్ ని మాట్లాడుతున్నాను......"
"మిస్టర్ మనోహర్! తరంగిణిని మాట్లాడుతున్నాను......"
ఆమె గొంతు గుర్తుపట్టాడు మనోహర్......కాని షాకింగ్ గా ఉన్న ఆ స్థితిలో ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా వున్నాడు.
"మోడలింగ్ చేయనని మిమ్మల్ని అప్ సెట్ చేశాను గదా....సారీ నా చుట్టూ పన్నిన వల నన్ను అంతలా భయపెట్టింది....అందుకే భయపడి కాదన్నాను. కాని మిమ్మల్ని మీకు తెలియకుండానే ఢిల్లీ ఎయిర్ పోర్టులో చూసినప్పుడు మంచి ఇంప్రెషన్ కలిగింది.ఆ తరువాత నన్ను పట్టుకొనేందుకు మీరు పడుతున్న శ్రమ చూసి చాలా బాధపడ్డాను. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాంటి వాటిని నేను ఇంత కాలం నమ్మేధాన్నిగాదు......కాని...." ఆమె కంఠంలో బలవంతాన ఆనంధాన్ని, ఓ మధురమైన భావనను అదిమిపెడుతున్న శబ్దతరంగాల్లా సున్నితంగా టెలిఫోన్ డ్రయాఫ్రమ్ పై.....
అయినా మనోహర్ కి అనుమానంగానే వుంది. ఆమె ఒప్పుకుంటుందో లేదోనని.
"మీ గురించి నేను ఫ్యారిస్ లో కూడా విన్నాను. మీరెంత ఫెంటాస్టిక్ యాడ్ ఫోటో గ్రాఫరో ఇకక్డికి వచ్చాక నా ఫ్రెండ్ సరితాదేవి ద్వారా విన్నాను. మీ అంత మంచి ఫోటోగ్రాఫర్ కి మోడలింగ్ చేయటం నా అదృష్టం. అన్నిటికన్నా గొప్ప అదృష్టం, అనుభూతి ఏమిటో తెలుసా నా కోసం మీరు తిరగటం. దానిలో ఒక మొదల కోసం ఒక ఫోటోగ్రాఫర్ తిరుగున్నట్లు ఊహించుకోలేదు. ఓ అందమైన అమ్మాయి కోసం ఒక అందమైన అబ్బాయి తిరుగుతున్న మధుర భావం. ఈ భావం ఎన్నికోట్లు పెట్టినా రాదు. అందుకే మీరు పోలీస్ స్టేషన్ లో డబ్బులన్నప్పుడు కోపం వచ్చింది.
మీరు వేవరింగ్ లో వుండి గమనించలేదు గాని, మిమ్మల్ని తొలిసారి చూసినపుడు నా కళ్ళలో కదలాడిన సుమధుర దరహాసాన్ని గమనించలేదు. గమనిస్తే మీరిప్పుడు ఇంత అప్ సెట్ అయి వుండేవారుగాదు. నా పొజిషన్ లో మగవారుంటే నాలుగుతన్ని అయినా మోడలింగ్ కి ఒప్పించేవారు. కాని ఒక ఆడదానిపట్ల మీరు అలా అనుచితంగా ప్రవర్తించలేని మీ నిస్సహాయత నేను గమనించాను. మీరు స్త్రీపట్ల ప్రదర్శించే ఈ గౌరవమే నాకు నచ్చింది. నను మోడల్ గా ఊహించుకుంటూ నన్ను మీరు చూసిన చూపుల్లో వెకిలితనం లేదు. కాంక్షలేదు. ఒక అద్భుతమైన అందాన్ని చూసిన గౌరవప్రదమైన విస్మయానంధం కనిపించింది. నేనో అద్భుతమైన అందగత్తెనని నాకు తెలుసు. ఎంతోమంది నా వేపు, న అందం వేపు లాలనతో చూట్టం తెలుసు. కాని తొలిసారి నా అందానికి నీరాజనాలిస్తూ చూసింది మీరే. ఇవన్నీ ఎలా గమనించానని మీకు అనుమానం రావచ్చు. నా సబ్జెక్టు సైకాలజీ. ఇతరుల మనస్త్తత్వాన్ని కనిపెట్టటం నాకు మహా సరదా.
బుద్దూలా వున్న మిమ్మల్ని చూడగానే సరదాగా ఏడిపించాలని, ఉక్రోషం తెప్పించాలని తెగ ముచ్చటేసింది. కాని నేనున్న స్థితి అందుకు అంగీకరించదు.
ఐ లైక్ యూ...... ఐ లవ్యూ......
చిత్రంగా వుందికదూ....... ప్రేమ అనేది కొన్ని రోజులు చూసుకున్నాకే, కసి తిరిగాకే పుట్టాలని లేదు.
మీరు అందంగా వున్నారని, గుడ్ ఫోటోగ్రాఫర్ అని ప్రేమించలేదు. మీ ముఖంలో నేను పసిగట్టిన భావాలు మిమ్మల్ని ప్రేమించేలా చేశాయి. అది అప్పుడే చెప్పాలనుకున్నాను. కాని నేను మెడలో ఈ ప్రమాదంలో కూరుకుపోయివున్నాను. ఆప్రమాదం నన్నేదో చేస్తుందని గాదు మీకేమి కాకూడదని! మీకు దగ్గర్లోనే వుండి మిమ్మల్ని చాలాసార్లు గమనించాను. తనివితీరా చూసుకున్నాను. మీకు ఎదుటపడాలని, ఓ అద్భుత మైన అమ్మాయి జీవితపు తొలిముద్దు మీపై ముద్రించాలని ఎంతగానో అనుకునేదాన్ని.
కాని అనుక్షణం నా వెనుక నీడలా విక్రమ్ మనుషులు.
ప్రతిసారి నా అచూకీకి చేరువగా వచ్చి వెళుతుంటే తీవ్రమైన అసంతృప్తికి గురయ్యేదాన్ని. ఈ గేమ్ లో ఇరుక్కోకుండా ఇద్దరం ఫ్రీగా వుంటే నా చిలిపి అల్లరికి మీరు అదిరిపోయేలా చేసేదాన్ని మీరు నిజంగానే బుద్దు. లేకుంటే కలకత్తాలో నేను నిజంగానే బెంగుళూరు వెళ్ళేది కనుక్కోకుండానే బెంగుళూరు వెళ్ళారు. నేను కలకత్తాలోనే వున్న విషయం మీరు కనుక్కోగలరని నాకు తెలుసు. కాని అంత లేట్ గానా....? కలకత్తాలో అన్ని హోటల్స్ లో చెక్ చేసి మీరున్న హోటల్ ఎందుకు చెక్ చేయనట్లు.....?! నేనదే హోటల్ లో వుండగా ఇక్కడే ఎందుకుంటుందనా....? WBD 7777 ని మొదట్లోనే పట్టుకోవచ్చుగా......వీటిని బట్టి మీరు మీవృత్తిలోనే గొప్ప. మిగతావిషయాల్లో బుద్దు......బుద్దు అయిన వాళ్ళని నేను ఏమని వెక్కిరిస్తానో తెలుసా......వె.....వె.....వ్వె ..... వ్వె కోపం వచ్చిందా....?
మొన్నటివరకూ ఈ ప్రమాదంలో నేనేమైపోతానో అని భయంగా వుండేది, ఆ తరువాత ఏమైపోయినా ఫర్వాలేదనే వైరాగ్యం వచ్చింది.
కాని ఇప్పుడు నాకు నా చుట్టూ బిగిసిన ఉచ్చునుండి బయటకు రావాలని వుంది. నేను యవ్వన ఆరంభ దశనుంచి నా ప్రియుడు అలా వుండాలి అని కలలు కనేదాన్ని. నా ఊహలన్నీ మీ వలనే నిజమవుతాయి. కనుక నేను బయటపడాలి. ఆ పని మీరు చేయండి. మీ ఊహకు మించి నేను మీ మోడల్ గా సహకరిస్తాను. కాని ఇదంతా మీ కోసమే" మాట్లాడటం ఆపింది.
అందులో ఓ శబ్దం...... మధురమైన ధ్వని......నరాల్ని జివ్వునలాగే ఓ తరంగం. అంతా వింటున్న మనోహర్ కి అలౌకిక స్థితి ఎదురయింది.
ఆమె దొరకటం, ఆమె కోర్కె.....అన్నీ మనోహర్ కి ఆశ్చర్యంగా వున్నాయి.
"ఏమిటాలోచిస్తున్నారు? మీ పందెంలో మీరు ఓడిపోయే గడువు దగ్గరవటం లేదూ......కమాన్ హేండ్సమ్.....పట్టుదల రెట్టింపు చేసుకుంటూ లే.....దెబ్బకుదెబ్బ తీయి.....తెలివిగా..... దిమ్మ తిరిగేలా..... మరిక లేవకుండా.....అంత జరిగాక నీకిక మంచిచెడ్డల మీమాంస వద్దు.....మీకోసం ప్రాణాలివ్వటానికైనా సిద్దంగా వున్నాను. కమాన్.... నీ అస్త్రాన్ని సంధించు..... విజ్రుంభించు......అందర్నీ మట్టిగరిపించు. వృత్తిలోనేకాదు అన్నిటిలోనూ సమర్ధుడైన వాడ్నే ఏ అమ్మాయి అయినా నచ్చుతుంది......కమాన్ .... మూవ్..... మూవ్.....ఐ సే.....బుద్దూ...." జల తరంగణిలా మనోహర్ ని.... ఉసిగొల్పుతూ నవ్వింది తెరలు తెరలుగా.
క్షణాల్లో తేరుకున్నాడు మనోహర్..... యుద్దానికి సిద్దపడుతున్న సైనికుడిలా వీరావేశంతో లేచాడు. "చెప్పండి..... మీ చుట్టూ బిగుసుకున్న ఉచ్చు ఎలాంటిది......?" |
25,303 |
త్రినాధ్ అప్పటివరకూ జీవించిన మానవతావాది నిశ్శబ్దంలో జారుకున్నాడు. ఆ స్థానంలో ఇప్పుడు నరరూప రాక్షసుడు నిద్రలేచాడు.
పబ్లిక్ ఎఫైర్స్ మేనేజర్ ని పిలిపించాడు.
"చూడండి మేనేజర్- సుదర్శన్ రావు కంపెనీ ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో ఎంత సేల్స్ చేసింది, ఎంత సేల్స్ టాక్స్ కట్టిందనే వివరాలు మనకు తక్షణం కావాలి. అందుకెంత డబ్బు ఖర్చయినా ఫర్వాలేదు...
ఈ క్షణం నుంచే మీరా పనిమీద వుండండి. సరీగ్గా నాకు వివరాలు పన్నెండు గంటలకి అందాలి. ఈ క్షణం నుంచే మీకిచ్చిన గడువును లెక్కిస్తాను."
అతను వినయంగా తలూపి ఆ మరుక్షణమే అదృశ్యమైపోయాడు.
ఆ వెంటనే ఫైనాన్స్ మేనేజర్ ని పిలిపించాడు. "చూడండి. దేశంలో నెలకొన్న పవర్ షార్టేజీని తగ్గించేందుకు భారత ప్రభుత్వం ప్రయివేట్ పవర్ హౌస్ లకు లైసెన్స్ లు ఇవ్వొద్దని నాకు ఢిల్లీ నుంచి సమాచారం అందింది. అదే నిజమైతే 50 మెగావాట్ల పవర్ స్టేషన్స్ నిర్మించుకోవడానికి మనకు గల వనరుల గురించి రిపోర్ట్ తయారుచేయండి. ప్రభుత్వం దాన్ని మెటీరియలైజ్ చేస్తుందనే నమ్మకమైన సమాచారం అందగానే మన అప్లికేషన్ ముందుగా పోస్ట్ అవ్వాలి.
ఇకపోతే మనం ఒక జనరల్ హాస్పిటల్ నిర్మించాలనుకుంటున్నాం. ఆ సమయంలో గుప్తాజి మిమ్మల్ని అప్రోచ్ అవుతాడు. కావల్సిన ఫైనాన్స్ అందే ఏర్పాట్లు చేయండి" త్రినాధ్ చెప్పడం ఆపి ఫైనాన్స్ మేనేజర్ వేపు చూసి అతనేదో తనతో చెప్పడానికి ఇబ్బంది పడుతున్నట్టుగా గ్రహించాడు.
"ఫర్వాలేదు చెప్పండి" త్రినాధ్ ఒకింత సౌమ్యంగా అన్నాడు.
"మీ సూచనల మేరకు మనం నాలుగు కొత్త వ్యాపారాలకు శ్రీకారం చుట్టబోతున్నాం. మనకు ఇప్పటికే వున్న వనరులు వాటికి బొటాబొటిగా సరిపోతాయి. మరలా ఇప్పుడు జనరల్ హాస్పిటల్ అంటే వనరుల ఇబ్బంది తీవ్రమవుతుంది. అదీగాక ప్రొడక్టివ్ పర్ పస్ కి అయితే బ్యాంకులు లోన్ ఇస్తాయిగాని... ఫ్రీ సర్వీస్ ఆర్గనైజేషన్ కంటే అసలు ఇవ్వవు... అందుకే ఆలోచించాల్సి వస్తోంది..." తగ్గుస్థాయిలో భయపడుతూ చెప్పాడు ఆయన.
త్రినాధ్ మౌనంగా వున్నాడు.
"పోనీ- అపోలో- హాస్పిటల్స్ మాదిరి హెల్త్ సర్వీసెస్ మనం వ్యాపారపరంగా డీల్ చేస్తామని ప్రాజెక్ట్ రిపోర్టులో ఉటంకిస్తే లోన్ దొరుకుతుంది- అలా-"
"స్టాపిట్- ఐ- సే- కిడ్నీ ట్రబుల్ వస్తే విదేశాలకు, ఊపిరితిత్తులు దెబ్బతింటే విదేశాలకు, గుండెకు చిల్లుపడితే విదేశాలకు- సిగ్గు లేదా మనకు? జబ్బు వచ్చేది మనకు. తీరా అది బాగుచేయించుకునేందుకు అమెరికా వెళితే ఆపరేషన్ రూములో కత్తెర పుచ్చుకుని మన దగ్గరకు వచ్చేది ఏ శాస్త్రో, ఏ రెడ్డో, ఏ రావో, ఏ సింగో- రేపీ బ్యాంకుల మేనేజర్లకు రోగాలొస్తే బాగుచేసే హాస్పిటలే వుండదు. తిరిగిరాని అప్పులని తెలిసే రాజకీయ వత్తిడులకు లొంగి అప్పులిస్తారు. కాని మనల్ని మనం బాగుచేసుకుందామంటే అప్పులివ్వరు.
ఏదిఏమైనా హాస్పిటల్ నిర్మాణం ఆగదు. మన కంపెనీ ఆస్థుల్ని తనఖా పెట్టండి. అప్పు తీసుకురండి. మనం రాజకీయ నాయకులం కాదు ప్రజల మేలు మరచి సొంత జేబులే నింపుకుంటూ వెళ్ళడానికి. మనం పెరిగింది అసంఖ్యాక పేద, మధ్యతరగతి ప్రజల సొమ్ముతో. పెరుగుతున్నదీ వారి ద్వారానే.
సామాజిక బాధ్యతలేని వ్యాపారి రాజకీయవేత్తతో సమానం... అలాంటి హీనులతో మనం సమంకారాదు.
యూనో... ఎక్కడ ఫోర్ట్...? అమెరికా జాతీయుడు. అతను ఉత్పత్తి చేసే కార్లను మనదేశ ప్రజలు కొనలేరు. కాని ఫోర్డ్ ఫౌండేషన్ పేరిట ఎన్ని వందల కోట్లు ఆసియా దేశాల పేద ప్రజలకు ఖర్చు పెడుతున్నారు?
దేశభక్తి, దైవభక్తి, ప్రజలపట్ల బాధ్యతలేని వ్యాపారి జాతికి పుట్టిన కుక్క మూతి పిందెలాంటివాడు. ఇక దీనిలో వాద, ప్రతివాదనలు అనవసరం. డూ... వాట్... ఐసే... దట్సాల్..."
త్రినాధ్ కంఠంలోని తీవ్రతను గమనించిన ఎఫ్.ఎం. మౌనంగా వెళ్ళిపోయాడు.
అతను వెళ్ళిన ఐదు నిమిషాలకు సైంటిస్ట్ వచ్చాడు.
"గుడ్ మార్నింగ్ బాస్" సైంటిస్ట్ లోపలకు వస్తూ అన్నాడు.
అప్పటికప్పుడు త్రినాధ్ మొహంలొ చిర్నవ్వు... కొద్ది నిమిషాల క్రితం వరకు సీరియస్ గా వున్న త్రినాధ్, ఇప్పుడు తను కనిపించగానే చిర్నవ్వుతో...
ఎంతటి మానసిక సాధన వుంటే సాధ్యమవుతుందీ కంపార్టు మెంట్ లిజమ్? సైంటిస్ట్ ఆలోచనల్నుంచి చప్పున తేరుకున్నాడు.
"నో బాస్... ఇప్పుడు నువ్వు సెలవులో వున్నావ్. కనుక ఇద్దరం స్నేహితులం..." అంటూ కుర్చీలోంచి లేచి ఫ్రిజ్ దగ్గరకు వెళ్ళి ఓ కూల్ డ్రింక్ బాటిల్ తీసి మూత తెరిచి సైంటిస్ట్ కి అందించాడు.
"చాలా రోజుల్నించి చూస్తున్నాడు త్రినాధ్! నువ్వు ఇతరులకి కూల్ డ్రింక్ ఆఫర్ చేస్తూ నువ్వు మాత్రం నీ ఫ్లాస్క్ లో తెచ్చుకున్న టీ మాత్రమే త్రాగుతావు. అదైపోతే మంచినీళ్ళు త్రాగుతావు. ఎప్పుడూ కూల్ డ్రింక్స్ త్రాగడం చూడలేదు..." సైంటిస్ట్ ఆశ్చర్యంగా అన్నాడు.
"ఇది చైర్ మన్ రూమ్. ఈ రూమ్ లోకొచ్చిన ప్రతి వ్యక్తికి ఒక అర్హత వుంది. ఉండబట్టే ఈ రూమ్ లోకి అనుమతించబడతారు. వచ్చిన వారికి మర్యాద చేయడం నా విధి. నేను కూల్ డ్రింక్ త్రాగాలంటే నాకు వ్యక్తిగత స్తోమత వుండాలిగదా?"
త్రినాధ్ ఏమన్నాడో అర్ధంకాక కొద్దిక్షణాలు తికమకపడ్డాడు సైంటిస్ట్.
"నువ్వు మనిషిగా నాకర్ధం కావడంలేదో, లేక నీ మాటలే నాకు అర్ధం కావటంలేదో అంతుపట్టడం లేదు.
ప్రశాంతంగా నవ్వాడు త్రినాధ్.
సైంటిస్ట్ కి ఆసక్తి వుండి, అక్కడే ఆగి, మరింత లోతుగా త్రినాధ్ మాటల గురించి ఆలోచించి వుంటే కొన్ని అద్భుతమైన నిజాల్ని తెలుసుకున్న మొదటి వ్యక్తి అతడే అయ్యేవాడు.
"అదిసరే- నువ్వేదో హాస్పిటల్ కి ప్లాన్ చేస్తున్నావని తెలిసింది. నిజమేనా?" సైంటిస్ట్ కళ్ళలో లీలామాత్రంగా ఆందోళన. సైంటిస్ట్ క్కూడా ఆ విషయం తెలిసినందుకు త్రినాధ్ ఆశ్చర్యపోలేదు.
ఓసారి వేదాంతిలా నవ్వాడు త్రినాధ్.
"అదే... అదే మనిషిలోని స్వార్ధం. నేను కొత్త వ్యాపారాల్ని ఆరంభిస్తే ఆనందించారు. కొంగ్రొత్త ఎత్తులకు ఎదుగుతుంటే సంతోషించారు. కాని మనిషి అని అనిపించుకొనేందుకు ప్రయత్నిస్తుంటే ఆశ్చర్యపోతున్నారు- అవాక్కవుతున్నారు."
"సారీ త్రినాధ్! నేను అప్పుడూ ఇప్పుడూ... మరెప్పుడూ డబ్బు గురించి ఆలోచించలేదు, ఆదేశించలేదు. అలా అయితే నేను ఓ వ్యాపారవేత్తనై వుండేవాడిని. నీకు జరిగిన అవమానమే నాకిప్పుడు గుర్తుందిగాని, నాకు జరిగిన అవమానం గుర్తులేదు. నువ్వు పందెం కాసి సరిగ్గా ఈరోజుకు 3 సంవత్సరాల ఐదు నెలలు.
మరో ఏడు నెలల్లో అహంకారంపై, అన్యాయంపై, అవినీతిపై అరాచకంపై కమ్చీ దెబ్బ కొట్టనున్న సమయంలో నువ్వు ఆస్థుల్ని తాకట్టు పెట్టి హాస్పిటల్ కట్టిస్తున్నావని తెలిసింది. మరి గెలుపు విషయం గాలికి వదిలేసినట్టేనా?"
త్రినాధ్ సీట్లోంచి లేచాడు. మెత్తటి తివాచీపై మెల్లగా పచార్లు చేస్తూ అన్నాడు...
"ఎవరన్నారు నాకు జరిగిన అవమానాన్ని మర్చిపోయానని...? ఎవరన్నారు గెలుపు విషయాన్ని గాలికి వదిలేసినట్టు? ఎవరన్నారు నేను సుదర్శన్ రావు మీద గెలవనని?"
"మరి?" సైంటిస్ట్ కంతా అయోమయంగా వుంది.
"గెలుస్తాను" త్రినాధ్ స్థిరంగా అన్నాడు.
"నాకు నమ్మకం లేదు."
త్రినాధ్ నవ్వాడు. చిన్నగా మొదలైన నవ్వు తెరలు తెరలుగా పెద్దది...ఆ హాలు నాలుగు గోడల మధ్య పేరుకున్న నిశ్శబ్దాన్ని బద్దలు చేసింది. ఉన్నట్టుండి చటుక్కున నవ్వాపేశాడు.
"కేవలం ఆరువేల రూపాయలతో నేను వ్యాపార రంగప్రవేశం చేశాను. అదీ ప్రియాంకను రెచ్చగొట్టి, ఆమెకు అవసరం కల్పించి పెట్టుబడి సంపాదించాను. ఆరువేలతో ఆరుకోట్లు సంపాదించగలనని ఎవరన్నా ఊహించారా? అది అరవైకోట్లు కాగలదని కూడా ఎవరూ నమ్మడం లేదు. లీటరు పెట్రోలు వంద కిలోమీటర్లు వస్తుందంటే అభూత కల్పనన్నారు. మోడీ మోటార్స్, సికింద్రాబాద్ షాప్ లో కొన్న ఒక హోండా మోటార్ సైకిల్ లీటర్ కు 120 కిలోమీటర్లు యిచ్చింది. ఆ వాహనందారు షాక్ అయి వెళ్ళి షోరూమ్ లో చెబితే ఆ బండి వాపసు తీసుకొని రెండు హోండా బండ్లు యిచ్చారట. కొన్ని హోండా మోటార్ సైకిల్స్ లీటరుకు 80 కిలోమీటర్లు ఇస్తున్నాయట. మోటార్ సైకిలే అన్ని కిలోమీటర్లు ఇవ్వగా 50 సి.సి. మోపెడ్ ఇంకా ఎక్కువ ఇస్తుందనేది సింపుల్ లాజిక్. కామన్ సెన్స్ వున్న ప్రతివాడునమ్ముతాడు. మరి ఆ రోజు మనం 100 కి.మీ. ఇస్తుందని ప్రచారం చేస్తే నమ్మారా కొంతమంది స్పెసిమన్స్....?"
డీసెల్, పెట్రోల్ కు బదులు కంప్రెస్ట్ నేచురల్ గ్యాస్ తో వాహనాన్ని నడపొచ్చంటే మనల్ని చూసి కొంతమంది మానసిక రోగులు నవ్వలేదూ? బొంబాయి, రాజమండ్రి, గుజరాత్, త్రిపురలలో ఓ.ఎన్.జి.సి. కేంద్రాల వద్ద ప్రయోగాలు జరుగుతున్నాయి. అవి నిజమవుతున్నాయి. అంతెందుకు- ఇటీవలే టెలివిజన్ లో హోండా మోటార్ సైకిల్ కి గ్యాస్ సిలిండర్ బిగించి మోటర్ సైకిల్ ను నడిపి చూపించారు. అయినా అవి అభూతకల్పనలనే మానసిక నపుంసకులు చాలామంది వున్నారు. మనిషి చంద్రమండలం మీద కాలు బెడతాడంటే నమ్మలేదు. కాని పెట్టాడు.
స్పేస్ సిటీస్- అంతరిక్ష నగరాలు నిర్మిస్తారంటే నమ్మలేదు. కాని నిర్మిస్తున్నారు.
మానవ నిర్మిత అద్భుతాల్ని అంచనా వేసే డిస్కవరీ మేగ్ జైన్ గురించి ఎవరికన్నా తెలుసా? వీటన్నిటిని ఎప్పుడో వూహించిన ఆర్డర్ క్లార్క్ ని మనవాళ్ళెవరన్నా గుర్తించారా?
మానవ మేధస్సుకు ఏదీ అసాధ్యం కాదనే ఆశావాదుల మధ్య... అన్నీ అసాధ్యమే అని నీరుగార్చే నిర్భాగ్యపు చవటలూ వున్నారు.
ఒకడు మనల్ని నమ్మాడా లేదా అని ప్రతిక్షణం చూసుకునేవాడు ఎప్పుడూ ముందడుగు వేయలేడు. మనం నమ్మినదాన్ని నిజం చేసుకునే చివరి క్షణం వరకూ మనమీద మనకు నమ్మకం వుంటే చాలు.
పదివేలు మనం పెట్టుబడి పెడితే, లక్ష రూపాయల్ని బ్యాంకుల నుంచి వ్యాపారానికి ఋణంగా తెచ్చుకోవచ్చని చెప్పినా నమ్మరు. ఈనాడు ఎవరు ఏ వ్యాపారం చేసినా సొంత డబ్బు ఇన్వెస్ట్ చేయడు- చేయలేడని చెప్పినా నమ్మరు. ఏ నిర్మాతా సొంత డబ్బుతో సినిమా తీయడని చెప్పినా నమ్మరు. ఈ ప్రజలు ఏనాడూ దేన్నీ నమ్మకే అధోగతి పాలవుతున్నారు. అలాంటి నిరాశా నిర్భాగ్యుల లిస్ట్ లోకి నువ్వూ వెళ్ళినందుకు బాధగా వుంది.
సాఫ్ట్ డ్రింక్ తయారుచేసే ఒక కంపెనీలో బిల్ కలెక్టర్ గా పనిచేసిన 'టోపీవాలా' అనే వ్యక్తి కేవలం కుమ్ కుమ్, టిక్కాలాంటి ఆడవాళ్ళ అలంకరణ సామాగ్రిని అమ్మి కోట్లు గడించాడన్నా నమ్మరు.
సుదర్శన్ రావు మీద విజయాన్ని చాలా తేలిగ్గా చేజిక్కించుకుంటాను. సరీగ్గా మరో 23న్నర గంటల్లో సుదర్శన్ రావు సామ్రాజ్యంలో చీకటి రాజ్యమేలేలాగా చేయబోతున్నాను" అంటూ ఫోన్ ఎత్తాడు త్రినాధ్.
* * * *
చిన్నతరహా పారిశ్రామిక వేత్తలు నిర్మించుకున్న ఆడిటోరియం అది.
ఇప్పుడా ఆడిటోరియం అంతా నిండిపోయి వుంది.
ఎందుకంత హఠాత్తుగా ఆ సమావేశం ఏర్పాటు చేశారో ఎవరికీ అంతుచిక్కడం లేదు.
యోగేష్ స్టేజీ ఎక్కాడు.
గొంతు సవరించుకున్నాడు.
అప్పటికే అతని డబ్బులకి అమ్ముడుబోయిన కొందరు చిన్న పారిశ్రామికవేత్తలు ఆ సమావేశంలో అక్కడక్కడా వున్నారు.
"డియర్ ఫ్రెండ్స్... ఇంత అత్యవసరంగా ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేయవలసి వచ్చిందని ఇప్పటికే మీరంతా మధనపడుతుంటారు. అందుక్కారణం మనకు నిత్యమూ ఎదురవుతున్న మన సమస్యలే. ప్రభుత్వాన్ని అడగవల్సిన పద్ధతిలో అడిగితే మనలాంటి చిన్నతరహా పరిశ్రమల యజమానుల సమస్యలు కొన్నైనా తీరిపోవచ్చు." |
25,304 | "బోస్టిదానా..." అంటూ ఓ తిట్టు తిట్టాడు బుగ్గలు వూదుకోంటూ టాటా... ఆ తర్వాత ఎడిటింగ్ లో కట్ అయినట్టుంది.
మాడిపోయిన పెసరట్టు ఫేస్ పెట్టి యాంకరమ్మ... "ఇప్పుడు తాత మూడ్ పాడయింది. కాబట్టి తాతకు ఇష్టమైన పాటొకటి.." అంటూ పక్కకు తప్పుకొంది.
'రగులుతోంది మొగలి పోడ..' అన్నా పాత వచ్చింది. సగం పాత అయిపోగానే పాత కట్ అయి, ఓ తలనొప్పి మందు యాడ్ వచ్చింది.
"భయ్యా... ఏమిటీ శిక్ష... కట్టేయ్ భయ్యా... టీవీ కట్టెయ్" పిచ్చిగా అరిచాడు రాహుల్.
"చచ్చినట్టు ప్రోగ్రామ్ చూడు... వి.టి.వి లో పనిచేస్తూ వి.టి.వి ప్రోగ్రామ్స్ చూడకపోతే ఎలా... రేపట్నుంచీ...
నీకు పని లేనప్పుడల్లా మన ఈవీ ప్రోగ్రామ్స్ చూడు..."
"ఏంటి చూసేది... పాత హింది సిన్మాల్లో హెలెన్ డ్యాన్స్... నేను చస్తే చూడను... చూడకపోతే నా ఉద్యోగం పీకేస్తానని చైర్మెన్ చెబితే, ఈ ఉద్యోగానికి రిజైన్ చేసి, పల్లీ, బఠానీలు అమ్ముకొని బ్రతుకుతా" రాహుల్ తెగేసి చెప్పాడు.
"అదేంటి రాహుల్... అంత మాటనేసావ్..." చేతన్ నొచ్చుకుంటూ అన్నాడు.
"లేకపోతే... ఆ ప్రోగ్రామ్స్ చూడు... ఆ యమ్కరంమా నగలు చూడు... ఛీ... యాక్..." అన్నాడు రాహుల్.
అంకిత్ మాత్రం ఆ ప్రోగ్రామే కాదు, వి.టి.వి ఛానల్ లో వచ్చే అన్ని ప్రోగ్రామ్స్ 'గుడ్ నైట్' చెప్పేవరకూ చూస్తూనే ఉన్నాడు.
ఆ తర్వాత అతనో నిర్ణయానికి వచ్చాడు.
***
వి.టి.వి.
చైర్మెన్ ఛాంబర్ లో చైర్మెన్ పరమహంస, అంకిత్ ఇద్దరే ఉన్నారు.
"చెప్పు అంకిత్, నిన్న మన టీవీ ప్రోగ్రామ్స్ అన్నీ చూశావా?"
చూశానన్నట్టు తలూపాడు అంకిత్.
"వాటి మెడ నీ ఒపీనియేమిటి?"
అంకిత్ ఒక్క క్షణం మౌనంగా ఉంది అ తర్వాత నోరు విప్పాడు.
"మనం ఎవరి కోసం ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నామో... మన ప్రోగ్రాం ఎవరు చూస్తున్నారో అర్ధం కావడంలేదు సార్"
"అదేమిటి అంకిత్, ఒకేసారి అంతమాటనేసావ్... మనం కొత్తగా పెట్టిన 'తైత్తక్కలు' ప్రోగ్రాం బాగానే ఉందని కొందరున్నారు."
"ఏం బాగుండడం... యాంకర్ మరే అంత ఫస్టా... పిచ్చిపిచ్చిగా మాట్లాడం, అయినదానికి కానిదానికి చేతోలోపుతూ వుండటం, అతి చొరవ... పైగా అనవసరంగా జనం పర్సనల్ విషయాలు... మీ ఫస్ట్ నైట్ ఎలా జరిగింది? అని కన్నుగీటటం, వావ్! నిన్ను చూస్తావుంటే నాకే ముద్దోస్తూంది.తాతా.... అని కుళ్ళు జోకులు వేయడం... మన ప్రోగ్రాం కు, తైత్తక్కలు' అన్నా పేరు బాగా సరిపోయింది సార్."
"అంటే ఆ ప్రోగ్రాం అస్సలు బాగా లేదంటావా?" చైర్మెన్ అడిగాడు.
కాన్సెప్ట్ ని మనం అబ్బున్యుటీ 'వే' లో ప్రజంట్ చేయొద్దు అంటున్నాను.
ఒఇమ్తికి వెళ్ళాలి.... అక్కడ అమ్మా, నాన్న, చెల్లెలు, తమ్ముడు... వల్లా మధ్య సరదాలు పిక్చరైజ్ చేయాలి. ఉమ్మడి కుటుంబాలు వున్న ఏరియాలోకి వెళ్ళాలి. వాళ్ళంతా ఎలా కలసి ఉమ్తున్నారావు ఇంటర్వ్యూ చేయాలి. వాళ్ళకు నచ్చిన పాటలు వేయాలి. వాళ్ల అభిప్రాయలు తెలుసుకోవాలి... చాలా డిసెంట్ గా, పోలయిట్ ఉండాలి."
"కుర్రకారుకు హుఉశారు ఉమ్దావుద్దూ..." అన్నాడు చైర్మెన్.
"ఇలా అయితే హుఉశారు ఉండదా? మొన్న మా కాలనీలో ఏం జరిగిందో తెలుసా?" అడిగాడు అంకిత్.
ఏం జరిగిందేమీటి? మన ప్రోగ్రాం బావుందని ఎవరైనా సభ ఏర్పాటు చేశారా?" ఆసక్తిగా అడిగాడు చైర్మెన్.
"కాదు... తిత్తక్కల ప్రగ్రాం ఘాంటింగ్ జరిగింది. మా కాలనీలో వుండే గోపాలం, మన యమ్కరంమా చేతికి చిక్కాడు. ' చిక్కావు' చేతిలో చిన్నావాడా...' అంటూ ఏదో ప్రాస బావుందని పొడి, గోపాలాన్ని పట్టుకుంది. మీ ఆవిడా ఎక్కడ అని అడిగితె, సిగ్గు పడుతూ 'పుట్టింటికి వెళ్ళింద' ని చెప్పాడు.
'అయితే' నాకు చెప్పినట్టు పంపించవన్నామాట. వెరీగుడ్. అప్పుడప్పుడు ఇలా భార్యల్ని పుట్టింటికి పంపింస్తుంటే ఉండే హుఉశారే వేరు... ఏమంటావ్...' అని అడిగితె, ఆ జీవుడు కెమెరా చూసి రెచ్చిపోయాడు.
మన యాంకరమ్మ అతనితో స్టెప్పులేసి, పైగా 'చూశారా... భార్య పుట్టింటికి వెళ్తే ఎంత ఆనందంగా ఉన్నాడో...' అంటూ కన్నుగీటింది.
"అసలు ఇమ్త్రేస్తిమ్గ్ పాయింట్ వినండి. ఈ ప్రోగ్రామ్ పుట్టింట్లో వున్న గోపాలం భార్య చూసి, ఆ యమ్కరంమా గోపాలం కలిసే, తనను పుట్టింటి పంపారని, అందుకే అతగాడు హేపీగా ఉన్నాడని ఫీలయి, 'నేను ససేమిరా మొగుడితో కాపురం చేయమని' భీష్మించుకుంది."
"ఈజిట్.."
హండ్రెడ్ పర్సెంట్... ఇలాంటి ఓవర్ ప్రోగ్రామ్స్ ఎందుకు సార్.... పైగా ఆ ఓవర్ రియాక్షన్ ఒకటి.... ఆ యాంకర్ చిన్నప్పుడు స్ప్రింగ్ లు మింగి ఉంటుంది. ఒకటే ఊగుతూ ఉంటుంది.మగాళ్ళ భుజాల మీద వేస్తూ ఈలలు వేస్తూ... అంత ఓవర్ ఏం బావుంటుంది?"
చైర్మెన్ బుర్ర గోక్కున్నాడు.
అంకిత్ తమ ఛానల్ లో ప్రోగ్రామ్స్ గురించి విశ్లేషణాత్మకంగా చెప్పకు పోతూనే ఉన్నాడు.
సరిగ్గా గంటసేపు నాన్ స్టాప్ గా ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్స్ లో వున్న డిఫెక్ట్ ని చెప్పాడు.
"వెరీగుడ్ మై బోయ్... చాలా చక్కగా ఎనాలసిస్ చేశావు... ఒక్కో ప్రోగ్రాం ని మారుస్తూ పోదాం... అది సరే... మొన్న నువ్వు చేసిన ప్రోగ్రాం చాలా బావుంది. మన రాహుల్ పర్సు కొట్టేసి పారిపోతున్నా, పట్టించుకోని ఆ శాల్తీని చూసి నవ్వొచ్చింది. చక్కని అవేర్ నేస్ ప్రోగ్రాం కాకపోతే, మా ఆవిడే కాస్త చిర్రుబుర్రులాడింది" చెప్పాడు చైర్మెన్.
"ఎందుకు సార్ "
"ఆ శాల్తీ మా బావమరిదే... మా ఆవిడా కజిన్... వాళ్ల విడ టీవీలో మొగుడి నిర్వాకం చూసి, ఉతికి, ఆరేసి, మరీ ఇరాన్ చేసిందట మొగుణ్ణి" అని నవ్వాడు.
అంకిత్ ఇబ్బందిగా కదిలాడు.
"ఛ..ఛ...ఇందులో నువ్వు ఇబ్బంది పడాల్సిన పనేమీ లేదు గానే, నెక్స్ట్ ప్రోగ్రాం ఏమిటి?" అడిగాడు.
"పిబ్రవరి ఫోర్టీన్ వాలెంటైన్ డే కదా..."
"యస్... అయితే...'
"అ రోజు ఓ స్పెషల్ ప్రోగ్రాం చేయ బోతున్నాను." |
25,305 | "సర్లే సర్లే, తెలియక అన్నానా మాట" నవ్వింది. మళ్ళీ ఫోటోవేపు చూస్తూ, "అయినా ఇంతందంగా వున్నాడూ అంటే ఈపాటికే ఎవర్తోనో ప్రేమలో పడే ఉంటాడు" అంది.
"లంచ్ టైమ్ అయిపోయినట్టుంది?" శైలజ గుర్తుచేసింది.
రాణి నవ్వి, లేస్తూ "సర్లే సాయంత్రం కలుస్తాను" అని వెళ్ళిపోయింది.
ఆమె వెళ్ళేక శైలజ అప్లికేషన్ ఫైల్లో పెట్టేస్తూ ఫోటోవేపు చూసింది. రాణి అన్నట్టు అతడు చాలా అందంగా వున్నాడు. అమాయకంగా, తనకన్నా చిన్నగా.
పేరు చూసింది.
రమణ.
బి.ఏ. యూనివర్సిటీ ఫస్ట్.
ఫైల్లో అప్లికేషన్ పెట్టేసి, దాన్ని డ్రాయర్ లోకి తోసేసి, తన పనిలో మునిగిపోయింది.
* * *
సాయంత్రం అయిదింటివరకూ శైలజకి ఊపిరి సలపని పని తగిలింది. మేటర్ కంపోజింగ్ కి యివ్వటం, కంపోజ్ అయివచ్చిన మేటర్ ఫ్రూఫులు దిద్దటం, అడ్వర్టయిజ్ మెంట్ బ్లాకులకు ఫోన్ చెయ్యటం లాటివి. "పగవాడికైనా సబ్ ఎడిటర్ పని వద్దురా బాబూ!' అంటూ ఆమె వళ్ళు విరుచుకుంటుంటే రాణి వచ్చింది.
"పోదామా?"
"ఇదిగో అయిపోయింది."
మరొ అయిదు నిమిషాల్లో ఆమె టేబుల్ సర్దివేసింది.
ఇద్దరూ బయటకొస్తూంటే రాణి అడిగింది.
"ఆ కాగితంలో ఏం వుందో కనుక్కొన్నావా!"
"ఏ కాగితం?"
"అదే! గోరీల మధ్య దొరికిందన్నావే- అది."
"ఉహు.... ఎక్కడా తీరిక దొరకందే!"
వాళ్ళిద్దరూ కారిడార్లో నడుస్తూంటే ఎదురుగా అటెండర్ వస్తూ కనిపించేడు. వాడి పేరు ఇస్మాయిల్.
రాణి అతణ్ణి ఆపి, "ఇదిగో, ఈ కాగితంలో ఏం వ్రాసివుందో చెప్దూ" అంది.
అతడు కాగితం అందుకొన్నాడు. చదువుతూంటే అతడి మొహంలో భయం కొట్టొచ్చినట్టు కనబడింది.
"ఏముందందులో?" నిశ్శబ్ధాన్ని భరించలేక అడిగింది.
అతడు మాట్లడలేదు.
"ఏమిటది.....? ఉర్దూనా?"
అతడు కాగితంవైపు మళ్ళీ చూసేడు.
"కాదు..... అరబ్బీ!"
"నీ కొచ్చా?"
"వచ్చు."
అతడు చదివేడు. "యోమాయూస్ ఫిక్స్ ఫిసూరి పతుతూనా ఆఫ్ వాజా!"
"అంటే....?" ఇద్దరూ ఒకేసారి అడిగేరు.
అతడు తల పైకెత్తాడు. అతడి కళ్ళు నిస్తేజంగా ఉన్నాయి. మొహం భావరహితంగా వుంది. అనాసక్త కంఠంతో అతనన్నాడు-
"...ఒకరోజు శంఖం వూదబడుతుంది. ఆకాశం తెరవబడుతుంది. అప్పుడు శవాలన్నీ గుంపులు గుంపులుగా లేచి వస్తాయి."
అతనా మాటలంటూ వుంటే దూరంగా ఎక్కడో ఉరిమింది. ఆ రాత్రి కురవబోయే కుంభవృష్టికి సూచనగా మేఘాలు అలుముకుంటున్నాయి.
నాంది :
మినుకు మినుకుమని వెలుగుతూన్న దీపాన్ని గాలి సాయంతో టప్పున ఆర్పి చీకటి మరింత చేతనత్వాన్ని పొందింది. మనోసముద్రపు నిబంధనల చెలియలికట్టని కొద్దిగా తొలగిస్తే వెల్లువలా బయటకు దూకే పాపం. మనిషి మనసులో పాపంలాంటి చీకటి.
తలుపు సందుల్లోంచి బలంగా వీస్తున్న ఈదురుగాలి శబ్దం శరీరాన్ని గగుర్పొడుస్తూంది. మనిషిని అనుక్షణమూ బ్రతికిస్తూన్న గాలి కొద్దిగా చెలరేగితే మనిషి గడ్డిపోచలా ఎగరాలి.
బాబు జానకి ఒళ్ళో మరింత మునగదీసి పడుకున్నాడు. గదిలో దీపం ఆరిపోయినా ఆమె కదల్లేదు. మినుకు మినుకుమనే వెలుగుకన్నా చీకటే బావుంది. ప్రక్కగదిలో మరిది ఇంకా చదువుతూనే వున్నాడు. రేపు పత్రికాఫీసులో ఇంకో ఇంటర్వ్యూ ప్రకాశరావు ఇంకా రాలేదు. అప్పుడప్పుడు మామగారి దగ్గు వినిపిస్తూ వుంది. దూరంగా గడియారం ఒంటిగంట కొట్టింది.
గదిలో రమణ పుస్తకంలోకి చూస్తూ మాలతి గురించి ఆలోచిస్తున్నాడు. మరుసటిరోజు ఇంటర్వ్యూ అయినా ఆలోచనలు మాలతి చుట్టూనే.
.....జానకి బాబుని ఒళ్లోంచి లేపి, మంచంమీద పడుకోబెట్టింది. కిటికీ తలుపు తెరచి చూడబోతే ఫెడేలున వర్షపుజల్లు మొహం మీదకు కొట్టింది. చప్పున తలుపు మూసింది. గడియ విరిగిపోతుందేమో అన్నంత బలంగా గాలి వీస్తూంది.
శివుడి జటాజూటం నుంచి దభిల్లున గంగానది జారినట్టు శబ్దం ఏనుగు తొండాల్తో పోసినట్టు కుంభవృష్టి.
తలుపు దబదబా బాదిన చప్పుడు. వెళ్ళి తలుపు తీసింది. ప్రకాశరావు, ముద్దగా తడిసిపోయాడు. చలికి వణికిపోతున్నాడు. గాలితోపాటు లోపలికొచ్చేడు. తలుపు బలంగా వేసింది. "ఇక్కడ జల్లు పడుతోంది" అని ముసలాయన గొణుగుతున్నాడు. ఆయన్ని లేవమని చెప్పి మంచం మరిది గదిలో వేసింది. ముసలాయనకి లైటుంటే నిద్ర పట్టదు. రమణ లైట్ ఆర్పేసేడు. చీకట్లో వెల్లకిలా పడుకొని కళ్ళు మూసుకున్నాడు. మాలతి. మాలతి. మాలతి.
ప్రకాశరావు తల తుడుచుకొని బట్టలు మార్చుకొంటుంటే జానకి వంటింట్లోకి వెళ్ళి అన్నం, నీళ్ళూ పెట్టింది. అతడు రెండు మెతుకులు తిని లేచిపోయాడు. జానకి అన్నీ చూస్తూంది. మాట్లాడలేదు. పెళ్ళయి ఎనిమిదేళ్ళయింది. మాట్లాడటానికేమీ మిగల్లేదు. కంచం తీసింది.
ప్రకాశరావు గదిలోకి వచ్చేడు. బాబుని క్షణం చూసి పక్కనే పడుకున్నాడు. లోపల వంటగదిలో సామాను సర్ది జానకి కూడా వచ్చింది. మంచం పక్కనే చాప వేసుకొని పడుకొంది. తల దగ్గరే వున్న మాసిన బట్టల పెట్టెలోంచి తడిసిన బట్టల వాసన.
కుడిచేతి పక్కకి వత్తిగిల్లుతూ "ప్రళయం వచ్చేటట్టు వుంది పాడు వర్షం' అనుకొన్నది జానకి. తధాస్తన్నట్టు మిన్ను వెన్ను మీద మెరుపు మెరిసింది.
2
విరిగి పడటానికి సిద్దంగా వున్న పాక చూరుకింద రాజయ్య ఎడతెరపిలేకుండా పడుతున్న వర్షాన్ని చూస్తున్నాడు. అతడి మొహంమీద ముడతలు అతడి గత జీవితపు కష్టాల్లా లెక్క పెట్టలేనంతగా వున్నాయి. ఆనందాన్నీ విషాదాన్నీ ఒకేలా ప్రదర్శించటానికి అలవాటుపడ్డ గాజు కళ్ళు వర్షాన్ని నిర్లిప్తంగా చూస్తున్నాయి.
రాజయ్య ఎకనమిక్స్ చదువుకోలేదు. ఎనిమిదో క్లాసు కూడా చదువుకోలేదు. అయినా భూషణం చెప్పిన లెక్క సరిగ్గానే వున్నట్టు తోచింది. ఆ లెక్కఅర్ధమయ్యేటట్లు చెప్పటానికి భూషణమూ, పెదకామందూ చాలా కష్టపడవలసి వచ్చింది. మరి ఎనిమిదో క్లాసువరకూ అయినా చదువుకోని రాజయ్యకి, వ్యవస్థ చాలా కట్టుదిట్టంగా నిర్మించిన అర్ధశాస్త్రాన్ని బోధించటం అంటే సామాన్యంకాదు. అయినా వాళ్ళిద్దరూ చాలా కష్టపడ్డారు. చేతివేళ్ళు ఉపయోగించి లెక్కలు కట్టడం నేర్పారు. ఎలాగైతేనేం ఓ చిన్నలెక్కని అతని బుర్రలోకి ఎక్కించారు. అది అర్ధమయినా కాకపోయినా ఒక విషయం మాత్రం అతడికి బాగా అర్ధమైంది. ఇంకో నెలలో తన పాకా, పొలమూ ఖాళీచేసి అతడు భూషణానికి అర్పించాలి. పాక సంగతి సరే- దాంట్లో వున్నా బయట వర్షంలో వున్నా ఒక్కటే. అయితే తాతముత్తాతళ పొలం అది. దాన్ని వదులుకోవాలంటే బాధ. రాజయ్య వాళ్ళ తాత రాజయ్యకిచ్చిన అరెకరాన్నీ భూషయ్యవాళ్ళ తాత భూషయ్యకిచ్చిన వందెకరాల్తోనూ కలపకుండా ఎవరాపగలరు?
ప్రవాహంలా కదుల్తూన్న వాన నీటిలోకి తుపుక్కున ఉమ్మేసి, "ఎదవలోకం! ఎదవలోకమంట. థూ, భూకంపం వచ్చి కూలిపోకూడదూ" అన్నాడు చుట్ట కోసం తడువుకుంటూ. |
25,306 | "మీరా? ఇంత రాత్రప్పుడు వచ్చారేం?" అన్నాడు చలించిపోతూ.
"తలుపు తియ్యి బాబూ చెబుతాను" అన్నాడు వెంకట్రామయ్యగారు నీరసంగా.
గొళ్ళెం తీశాక "ముందు లోపలకు రండి" అన్నాడు సత్యమూర్తి. ఇద్దరూ గబగబా నడిచి క్రింద వసారాలోకి వచ్చారు.
వెంకట్రామయ్యగారు పంచ, చొక్కా, మనిషి ముద్దగా తడిసిపోయి, వున్నాడు. తల, శరీరం సమస్తం నీళ్ళు కారిపోతోంది. చలికి దేహం గజగజమని వొణికిపోతోంది అలిసిపోయినట్లుగా, అమిత బలహీనంగా వున్నట్లు కాంతిని కోల్పోయివున్న ముఖం, కనిపించే నిస్త్రాణ చాటుతున్నాయి.
ఆ స్థితిలో ఆయన్ని చూసేసరికి సత్యమూర్తికి ఏడుపొచ్చింది. "ఏమిటిది వెంకట్రామయ్యగారూ?" అని గొణిగాడు అస్పష్టకంఠంతో.
ఆయన గోడకి తన శరీరాన్ని ఆన్చి నిలబడి రెండు మూడుక్షణాలు విశ్రాంతికోసం అన్నట్లుగా కళ్ళు మూసుకున్నాడు. తర్వాత కళ్ళు తెరిచి చొక్కా లోపలినుంచి దళసరి గుడ్డతో చేయబడిన ఓ సంచీని బయటకు తీశాడు. వణికే చేతులతో దాని మూతికున్న తాడువిప్పి అందులోంచి కొన్ని రూపాయల నోట్లను బయటికి తీశాడు. అందులో పదిరూపాయలవీ అయిదు రూపాయలవీ, రెండూ, ఒకటి అన్నీ కలగా పులగంగా వున్నాయి. "ఇదిగో నాయనా మొత్తం రెండువందలు లెక్క చూసుకో.." అన్నాడు అందిస్తూ.
సత్యమూర్తికి ఏమి చేయటానికీ పాలుపోలేదు. గుండె ఎవరో నలుపుతున్నట్లుగా వుంది. ఏంజరిగిందో తెలీదు. అతని చేతులు యాంత్రికంగా ముందుకు సాగి ఆ నోట్లని అందుకున్నాయి.
"నాకు పైకం యివ్వటంకోసం అర్ధరాత్రివేళ మీ ఊరినుంచి ఎనిమిదిమైళ్ళ దూరం వర్షంలో నడిచి వచ్చారా?" అన్నాడు దడదడలాడి పోతూ, ఆయనవంక పరీక్షగా చూస్తూ.
ఆయన కాళ్ళకు చెప్పులు లేవు. మోకాళ్ళదాకా బురద, రొచ్చు అంటుకుని భీభత్సంగా వున్నాయి.
"ఏం చెయ్యను బాబూ మరి? ఒకప్పుడు నా అవసరంలో నన్నాదుకుని రక్షించావు. ఇప్పుడు నువ్వు ఎలాంటి యిబ్బందిలో వున్నావో, జీవితంలో అన్నిరకాల అనుభవాలూ అనుభవించినవాడ్ని కాబట్టి అవసరమన్నా ఆపద అన్నా నాకు బాగా తెలుసు. ఎప్పుడూ అడగనివాడివి నోరు విడిచి అడిగావు ఇక్కడ్నుంచి వెళ్ళినదగ్గర్నుంచి కాలూ చెయ్యీ ఆడలేదు. ఎలాగయినా నీ ఋణం తీర్చేయాలి. ఈ రాత్రే...!ప్రయత్నించాను. ఎలాగో సాధించగలిగాను" అన్నారాయన తృప్తిగా నిట్టూరుస్తూ.
ఆ ఉదయం వెళ్ళినాయన అప్పట్నుంచీ యింతవరకూ అదే ప్రయత్నంలో వున్నారన్నమాట. ఎందర్నో కలుసుకుని వుంటాడు. రూపాయి కాయితాల దగ్గర్నుంచీ పోగుచేసి వుంటాడు. ఇంట్లోని మిగిలిన సామానంతా తెగనమ్మివుంటాడు.
"ఎంతపని జరిగింది!" అని తనలో తాను గొణుక్కున్నాడు. ఇంకేదో చేయాలని, అయిపోవాలని వుంది.
"ఈ రాత్రికి యిక్కడ పడుకోండి. ఈ వర్షంలో మళ్ళీ వెళ్ళలేరు ప్రయాణం తట్టుకోలేరు" అన్నాడు.
ఆయన తల అడ్డంగా ఊపాడు. "కాదు నాయనా, వెళ్ళాలి. ఇంట్లో నా కూతురు ఒక్కతే వుంది. అసలే అది కాపురం చెడి యింటికివచ్చింది. ఇప్పుడు జబ్బుతో వుంది. నేను తప్ప ఎవరూ లేరు యింట్లో. వెళతాను బాబూ. అది భయపడిపోతూ వుంటుంది. వస్తాను"
ఉలికిపడినట్లు, అవతల భీభత్సం జరిగిపోతున్నట్లు తొట్రుపాటుతో ఆయన సత్యమూర్తి ఏమనటానికీ సందివ్వకుండా గబగబ వర్షంలోకి నడిచి, గేటుదాటి చీకట్లో కలిసిపోయాడు.
ఈ అంధకారంలో, డొంకల మధ్యనుండి, అలిసిపోయిన ముసలి శరీరాన్ని యీడ్చుకుంటూ..మళ్ళీ ఎనిమిది మైళ్ళు.
అతనికి వళ్ళు గగుర్పొడిచింది. అట్లాగే చూస్తూ నిలబడ్డాడు. హృదయ క్షేత్రంలో వెయ్యి కంఠాలు వెక్కిరిస్తున్నాయి, ఘోషిస్తున్నాయి, ఏడుస్తున్నాయి.
అతని కళ్ళు, ఆకాశం వర్షిస్తున్నాయి.
12
అనుకోకుండా చెలరేగిన అనేక కలతలవల్ల గృహ వాతావరణం మరీ అల్లకల్లోలితమైపోయింది. నిడమర్రులో ఏడెనిమిది ఎకరాల పొలం వుంది. దాన్ని అంతవరకూ కౌలుకు చేస్తున్న రైతులు తాము ఆ యేడు కట్టాల్సిన డబ్బు ఎగ్గొట్టటమే కాకుండా ఎన్ని ఉత్తరాలు రాసినా జవాబు ఇవ్వటం మానుకున్నారు. దరిమిలాను వాళ్ళంతా బాగా బరితెగించి వున్నారనీ, "అసలా వూళ్ళోకి ఎవరడుగు పెడతారో చూస్తాముగా" అని మీసాలు దువ్వుతున్నారని తెలిసింది. అసలు అక్కడి మనుషులు మొదటి నుంచీ అదే వరస. వాళ్ళతో జరగడానికి దిగి, నెగ్గుకు రాలేక అక్కడి పొలాలు అమ్మేసుకుని చేతులు దులుపుకున్నవాళ్ళు చాలా మంది వున్నారు. బలరామయ్యగారు మొండి ఘటం అవటంవాళ్ళా, అనుభవాలు బాగా తెలిసివుండి జాగ్రత్తగా మసలుకుని వుండటంచేతా చక్రం త్రిప్పుకురాగలిగారు. మళ్ళీ ఇప్పుడు వ్యవహారం మొదటికి వచ్చింది. పైగా అసలుకే ఎసరు |
25,307 |
"ఎలాగ! ఈ బస్సు దాటిపోతే కలెక్టరుగారింట్లో పెళ్ళికి ఎలాగ వెళ్ళడం. రిసెప్షన్ అంతా నేనే చూసుకుంటానని మాట యిచ్చాను" - అన్నాడు రామచంద్రం. పెద్ద సమస్య వచ్చిపడింది రామచంద్రానికి.
"అయినా మనం ఏమి చేయగలం?" భూషణం నిరీహుడై జాలిగా అన్నాడు.
నేను వెర్రిగా సూరీడు కేసి చూస్తున్నాను. "నే నొక్కతెను చూడలేను బాబూ. మీరుంటే ధైర్యం బాబూ రక్షించండి బాబూ!" ఏడుస్తోంది సూరీడు.
"అదిగో బస్సు వస్తోంది" అన్నాడు భూషణం. రామచంద్రం చెయ్యి ఎత్తి ఆపమని సంజ్ఞ చేశాడు.
బస్సు ఆగింది. "త్వరగా ఎక్కండి బాబూ" అంటూన్నాడు కండక్టరు. రామచంద్రం గబుక్కున రెండు పదిరూపాయల నోట్లు జేబులోంచి తీసి సూరీడు చేతిలో పెట్టి "మేం వుండి మాత్రం ఏం చెయ్యగలం సూరీడు, మంత్రం వచ్చునా తంత్రం వచ్చునా? అవతల కలక్టరు గారింట్లో పెళ్ళి. ఈ డబ్బుతో ఎక్కడికేనా తీసుకెళ్ళి చూపించు మీ బాబుని" అని కారు ఎక్కాడు. భూషణం నిశ్టేష్టుడై చూస్తూ వున్న నన్ను జబ్బపట్టుకుని కార్లోకి తోసి, తాను ఎక్కాడు. "సూరీడు! ఏమనుకోకు. కలెక్టరు గారింట్లో...." అంటున్నాడు. కారు బర్రున సాగింది. సూరీడు విచిత్రంగా నోరావలించి గుడ్లప్పగించి చూస్తూ నిలబడింది. పది రూపాయల నోట్లు రెండూ ఉదయపు చల్లని గాలిలో పావురాలులా పల్టీలు కొట్టుతున్నాయి.
కారు వేగంగా వెళ్ళిపోతోంది "పాపం మనం చెయ్యగలిగిందేముంది?" అన్నాడు భూషణం యింకా జాలితో.
"అందులో కలెక్టరుగారికి మాట యిచ్చామాయె!" అన్నాడు రామచంద్రం. -మాట ఇచ్చి తప్పడంలోని అమానుషత్వాన్ని వూహించుకుని భయపడుతూ.
"ఇది నల్లజర్ల అడవిలోని ఆనాటి రాత్రి సంఘటన-" అని అవధానిగారు ఆగి మాకేసి చూశారు.
"కొవ్వొత్తి అయిపోతోంది. ఎలాగ" అన్నాడాచారి భయంగా.
"డ్రైవరు వంటవాడూ సినిమానుంచి యీపాటికి వస్తూంటారు" అన్నాడు నారాయణ.
"ఈ తోటలో పాములున్నాయాండీ" అన్నాడాచారి.
అవధానిగారు మాట్లాడలేదు. పాతిక సంవత్సరాల క్రితం జరిగిన యీ సంఘటనదగ్గరే వుంది ఇంకా ఆయన మనస్సు.
"సిద్దయ్య చచ్చిపోయాడేమో" అన్నాను నేను.
"మనకేం తెలుస్తుంది?" అన్నారు అవధానిగారు. "సూరీడు ఏమయిందో కూడా తెలియదు" అన్నారు బరువుగా.
గబుక్కున లైట్లు వెలిగాయి. బంగళా అంతా వెలుగుతో నిండిపోయింది. ఆచారి ఆనందంతో నవ్వుతున్నాడు. అవధానిగారు ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారు. "డ్రైవరు రాగానే వెళ్ళిపోదాం" అంటున్నాడు నారాయణ. తోట అవతల నుంచి యింకా నక్కల కూతలు వినపడుతున్నాయి. కాని ఆచారి అంత భయపడలేదు.
(ఆంద్రపత్రిక, ఉగాది సంచిక -1964)
********** |
25,308 | ఫస్టు గేర్ లో వెళుతున్న ఎయిర్ బస్ ని సెకెండ్ గేర్లోకి మార్చాడు సవ్యసాచి. కొద్ది అడుగుల తర్వాత థర్డు గేర్, తర్వాత ఫోర్తు గేర్, ఫిఫ్తు గేర్.
ఫిఫ్తు గేర్ వేసీవెయ్యకముందే రన్ వే అంచు దగ్గరికి వచ్చేసింది.
త్రోటిల్ పూర్తిగా ఓపెన్ చేశాసు సవ్యసాచి. ఆ వేగానికి గాలి ఉధృతంగా విమానం రెక్కల మీదనుంచి "ద్రవంలా ప్రవహించడం" మొదలెట్టింది. ఏరో డైనమిక్సు సిద్దాంతాలని అనుసరించి నిర్మించిన రెక్కలు పై వైపున ఒంపు తిరిగి ఉంటాయి. కిందివైపున స్ట్రెయిట్ గా ఉంటాయి. అందువల్ల రెక్కలపైన కదులుతున్న గాలి వేగం రెక్కల కింది భాగంలోని గాలి వేగంకంటే ఎక్కువగా ఉంటుంది.
దాని ఫలితంగా "లిఫ్టు" దొరుకుతుంది విమానానికి. ఈ లిఫ్టు గాల్లో పయనించడానికి తోడ్పడుతుంది.
స్పీడు పెరగగానే "కంట్రోల్ కాలమ్"ని ఆపరేట్ చేశాడు సవ్యసాచి.
వెంటనే, తోక భాగంలో ఉండే ఎలివేటర్ పైకి లేవడం మొదలెట్టింది. రెక్కల మీదుగా వీస్తున్న గాలి, పైకి లేస్తున్న ఈ ఎలివేటర్ ని తాకి, తోకను బలంగా కిందికి నొక్కేసింది. తోక కిందికి పోగానే, విమానం ముక్కుపైకి లేచింది. పార్కులో పిల్లలు అటు ఒకళ్ళూ ఇటు ఒకళ్ళూ కూర్చుని, పైకి కిందికీ ఊగుతూ ఆడుకునే "సీ-సా" అనే చెక్కలాగా. రన్ వే అంచు ఇంకా కొద్ది అంగుళాలే ఉందనగా గాల్లోకి లేచింది ఎయిర్ బస్.
ప్రాణాలు ఉగ్గబట్టుకుని చూస్తున్నాడు సవ్యసాచి. కష్టపడి గాల్లోకి లేపగలిగాడు దీన్ని!
కానీ కంట్రోలులో ఉంచుకోగలడా?
ఏమో!
తాగిన వాడిలా ఒక్కసారి తూలింది. కుడివైపుకి ఒరిగిపోవడం మొదలెట్టింది.
పైలట్ అర్జెంటుగా కంట్రోల్ కాలమ్ ని ఎడమ వైపుకి కదిలించాడు.
రెక్కలకి అతుక్కున్నట్లు ఉండే ఏలెరాన్స్ కదిలాయి. ఎడమ ఏలెరాన్ పైకి వచ్చింది. కుడి ఏలెరాన్ కిందికి పోయింది. ప్లేన్ కొద్దిగా ఎడమవైపుకి తిరిగి మళ్ళీ అదుపులోకి వచ్చింది.
గాఢంగా నిట్టూర్చి, విమానాన్ని ఇంకా పైకి తీసుకెళ్ళడం మొదలెట్టాడు సవ్యసాచి.
వెయ్యి అడుగులు.
రెండువేలు.
పదివేల అడుగులు.
ఇరవై వేల అడుగులు.
అక్కడ లెవెల్ గా ఎగరడం మొదలెట్టింది విమానం.
"ఆల్ రైట్! ఆటోపైలట్ ఆన్ చెయ్!" అన్నాడు వినోద్ రవితో.
ఆన్ చేశాడు వినోద్ రవి.
మృదువుగా ముందుకు దూసుకుపోతోంది విమానం.
రేడియోలో మెడ్రాసు ఎయిరుపోర్టుని కాంటాక్టు చేశాడు సవ్యసాచి.
"ఎయిరు బస్ సక్సెస్ ఫుల్ గా టేకాఫ్ అయింది. కానీ బ్రేక్సు లూజయిపోయాయి. ఎమర్జెన్సీ లాండింగ్ అవసరమవుతుంది. ఎయిర్ పోర్టు అంతా ఖాళీ చేయించమని కోరుతున్నాను."
అవతలవైపు మనిషి గట్టిగా ఊపిరి లోపలికి తీసుకున్న శబ్దం.
"ఇప్పటికిప్పుడు ఖాళీ చేయించాలా? కనీసం గంట వ్యవధి కావాలి. అంతసేపూ ఆకాశంలో అక్కడక్కడే చక్కర్లు కొడుతూ ఉండవలసివస్తుంది మీరు."
"నథింగ్ డూయింగ్! నా ఎయిర్ క్రాఫ్ట్ లో వేస్ట్ చెయ్యడానికి తగినంత ఫ్యూయెల్ లేదు. మెడ్రాసు ఎయిర్ పోర్టు చేరగానే తక్షణం లాండ్ కావలసివస్తుంది."
"జస్ట్ ఏ మినిట్! అడిగి చెబుతాను."
మెడ్రాసు ఎయిర్ పోర్టులో అర్జెంటుగా చర్యలు మొదలయ్యాయి.
టేకాఫ్ కోసం, లాండింగ్ కోసం వెయిట్ చేస్తూ పది విమానాలు ఉన్నాయి ఆ సమయంలో.
ఇవన్నీ క్లియర్ చెయ్యాలి.
తగినంత ఫ్యూయెల్ లేకుండా, బ్రేకుల్లేకుండా, ఎయిర్ బస్ ఒకటి కొద్ది నిమిషాల్లో ఇక్కడ దిగబోతున్నది, దాదాపు రెండొందల డెబ్భయ్ మంది మనుషులతో!
ఎమర్జెన్సీ లాండింగ్!
ఎలా ఎదుర్కోవాలి?
ఎయిర్ పోర్టు అంతా తక్షణం ఖాళీ చెయ్యాలి.
సంభవమా అది?
ఒక ప్రమాదంలో నుంచి మరో ప్రమాదంలోకి పయనిస్తున్న ఆ ఎయిర్ బస్ గాలిని చీల్చుకుంటూ విపరీతమైన వేగంతో, మెడ్రాసుని సమీపిస్తోంది.
తగినంత ఇంధనం లేకుండా, బ్రేకులు సరైన స్థితిలో లేకుండా ముప్ఫయ్ రెండువేల అడుగుల ఎత్తున పయనిస్తున్న ఆ ఎయిర్ బస్ విమానం తాలూకు ఇన్ స్ట్రుమెంట్ పానెల్ వైపు బిగుసుకుపోయి చూస్తున్నాడు పైలట్ సవ్యసాచి.
ఇంకెంతసేపు సరిపోతుంది ఫ్యూయెల్? మెడ్రాసు ఎయిర్ పోర్టు చేరేదాకా సరిపోతుందా? మెడ్రాసు చేరినా వెంటనే లాండింగ్ కి పర్మిషనిస్తారా? అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో?
అక్కడ మెడ్రాసు ఎయిర్ పోర్టులో -
ఏ అడ్డంకులూ లేకుండా విమానాశ్రయాన్ని ఖాళీ చేయించడం ప్రారంభం అయింది. ఫైర్ ఇంజన్లు రెడీ పొజిషన్లో నిలబడి ఉన్నాయి దగ్గరలోనే. |
25,309 |
పదునాలుగవ సూక్తము
ఋషి - అసితదేవలుడు, దేవత పవమానసోమము, ఛందస్సు - గాయత్రి.
1. నదీ తరంగములను ఆశ్రయించిన కవిసోముడు అనేకుల అభిలషణీయ శబ్దము చేయుచు రాలుచున్నాడు.
2. అయిదు దేశముల పరస్పర మిత్రులగు మానవులు కర్మాభిలాషచే ధీరక సోమమును స్తుతులతో అలంకరించినప్పుడు.
3. అప్పుడు సోమమును ఆవుపాలలో కలిపినపుడు - అప్పుడు సమస్త దేవగణములు సోమరసపు మత్తులో పడిపోవుదురు.
4. దశాపవిత్రపు యజ్ఞద్వారము విడిచిన సోముడు నిన్ను ప్రదేశమునకు పరుగులిడును. మిత్రుడగు ఇంద్రుని కలసికొనును.
5. వయసు గుఱ్ఱమును చేతితో రుద్దుదురు. అట్లే సోమము గవ్యము కలుపుకోని పరిచర్యచేయు పౌత్రులగు అంగుళులతో మార్జించబడును.
6. అంగుళులతో అభిషుతమైన సోమము గవ్యముతో కలియుటకు శబ్దము చేయుచు సాగును. నేను సోమమును పొందగలను.
7. పరిమార్జనము చేయు అంగుళులు - అన్నపతి సోమునితో కలియును. అది బలిష్ఠసోముని వీపుపైన ఎక్కినవి.
8. సోమమా ! నీవు స్వర్గీయ, పార్థివ ధనములను అందుకొనుము. మమ్ము కోరి మా వైపురమ్ము.
పదునైదవ సూక్తము
ఋషి - అసిత దేవలుడు, దేవత - పవమానసోమము, ఛందస్సు - గాయత్రి.
1. ఈ సోముడు విక్రాంతుడు. అంగుళులచే అభిషుతుడు. కర్మబలమున వేగవంత రథమును ఎక్కినాడు. ఇంద్రుడు నిర్మించిన స్వర్గమునకు సాగినాడు.
2. ఏ విశాల యజ్ఞమున దేవతలుందురో ఆ యజ్ఞమున సోముడు అనేక కర్మములు ఆశించును.
3. ఈ సోమము హవిర్ధానమున స్థాపించబడును. తదుపరి ఆహవనీయ ప్రదేశమున హవ్యవర్తి సోమవంత మార్గమున అర్పించ బడినపుడు అధ్వర్యులకు సహితము ప్రాప్తించును.
4. ఈ సోమపు శృంగము - పైభాగము కంపించును. అతని శృంగము ఆబోతు శృంగము వంటిది. అతడు స్వబలమున మా కొరకు ధనము తెచ్చును.
5. ఈ సోమము వేగవంతము. శుభ్రఅంశ యుక్తము. అతడు ప్రవహించు సకల రసములకు స్వామియై సాగును.
6. కప్పివేయు వారును, పీడించు రాక్షసులను ఈ సోముడు తన అంశమున లంఘించి వారిని తెలిసి కొనును.
7. మానవులు మార్జనీయమగు సోమమును ద్రోణకలశమున వడకట్టు చున్నారు. సోమము ఎన్నోరసములను ఇచ్చునది.
8. పది అంగుళాలును, ఏడుగురు ఋత్విక్కులును శోభన ఆయుధమునువలె మాదక సోమమును పరిమార్జింతురు.
పదునారవ సూక్తము.
ఋషి - అసితదేవలుడు, దేవత - పవమాన సోమము, ఛందస్సు -గాయత్రి.
1. సోమమా! ద్యావాపృథ్వులు నిన్ను అభిషవించువారు. ఆరెంటిమధ్య నున్న శత్రువును ఓడించవలసి ఉన్నది. అందుకు నీవు ఉత్సాహము కలిగింతువు. అశ్వము వలె సాగుదువు.
2. సోమము బలములనేత, జలముల ఆచ్ఛాదకుడు. అన్న సహిత వర్తమానుడు. గోరక్షకుడు. మేము కర్మము ద్వారా వ్రేళ్ళతో సోమమును కలుపుదుము.
3. సోమము శత్రువులకు అందనిది. అంతరిక్షమున ఉండునది. అపరాజితము. సోమమును దశాపవిత్రమున ఉంచండి. ఇంద్రుని పానము కొరకు సిద్ధము చేయండి.
4. స్తుతులతో పవిత్రమగు పదార్థము సోమము. అతడు దశాపవిత్రమునకు వెళ్లును. పిదప కర్మబలమున ద్రోణ కలశమున ఆసీనుడగును.
5. ఇంద్రా! నమస్కారయుత స్తుతులకు సోమము బలము పెంచుకొనును. పిదప మహాయుద్ధము చేయ నీవద్దకు చేరును.
6. అవ్యయ రూపవస్త్రమున శోధితమై, సకల శోభాయుతమై సోమము గోప్రాప్తికొరకు వీరుడగును.
7. అంతరిక్షమందలి జలము క్రిందకు రాలినట్లు బలకారకము, అభిషుత సోమము ఆనందపరచు ధారతో దశాపవిత్రమున పడును.
8. సోమమా! మనుష్యులందు నీవు స్తోతలను రక్షింతువు. వస్త్రమున శోధితమై మేషలోమమువైపు సాగుదువు.
పదిహేడవ సూక్తము
ఋషి - అసితదేవలుడు, దేవత - పవమాన సోమము, ఛందస్సు - గాయత్రి.
1. నదులు పల్లపు నేలకు సాగును. శత్రువిఘాతక, శీఘ్రగామి, వ్యాప్తసోమము ద్రోణకలశము వైపుసాగును.
2. వర్షము నేలపై రాలును. అభిషుత సోమము ఇంద్ర ప్రాప్తికి రాలును.
3. సోమము అత్యంతప్రవృద్ధము. మదకరము. రాక్షసులను నాశము చేయును. దేవాభిలాషి అగును. దశాపవిత్రమునకు చేరును.
4. సోమము కలశమున చేరును. దశాపవిత్రమున సిక్తమగును. ఉక్థమంత్రములతో వర్థిల్లును.
5. సోమమా! నీవు మూడు లోకములను లంఘింతువు. పైకి ఆరోహింతువు. స్వర్గమును ప్రకాశవంతము చేయుదువు. సూర్యునకు ప్రేరణ కలిగింతువు.
6. విప్రస్తోతలు అభిషవదివసమున సేవకులు అగుదురు. సోమమును ప్రేమింతురు - స్తుతింతురు.
7. సోమమా! విప్రులు అన్నాభిలాషులు అగుదురు. కర్మద్వారా యజ్ఞము కొరకు అన్నవంతుడవగు నిన్ను సంస్కరిస్తారు.
8. సోమమా! నీవు మధురధారవై ప్రవహింపుము. తీవ్రత చెందుము. అభిషవస్థానమున కూర్చుండుము. యజ్ఞమందు పానయోగ్యుడవై నిలువుము.
పద్దెనిమిదవ సూక్తము
ఋషి - అసితదేవలుడు, దేవత - పవమాన సోమము, ఛందస్సు -గాయత్రి.
1. సోమమా! నీవు దశాపవిత్రమున పడుదువు. సవనమందు ప్రస్తరమున నిలుతువు. "మదేషు స్వధాఅసి" మాదకములందు సర్వశ్రేష్ఠుడవగుదువు.
2. సోమమా! నీవు విప్రుడవు. కవివి. అన్నమున పుట్టిన మధుర రసమవు. "మదేషు స్వధాఅసి"
3. దేవతలందరు నిన్ను ఒకే తీరుగ ప్రేమింతురు. నిన్ను పానము చేయుదురు. "మదేషు స్వధాఅసి"
4. సోమము - సకలవరణీయ ధనములను స్తోతల చేతికి అందించును. "మదేషు స్వధాఅసి"
5. ఒక బిడ్డకు ఇద్దరు తల్లులవలె - నీవు ద్యావాపృథ్వుల దోహనము చేతువు. "మదేషు స్వధాఅసి"
6. ఈసోమము అన్నముతో ద్యావా పృథ్వులను వ్యాప్తము చేయును. "మదేషు స్వధాఅసి"
7. సోమము బలవంతము. శోధించునపుడు - చిలుకునపుడు - కలశమున ధ్వనిచేయును. "మదేషు స్వధాఅసి"
పందొమ్మిదవ సూక్తము
ఋషి - అసితదేవలుడు, దేవత - పవమాన సోమము, ఛందస్సు -గాయత్రి.
1. స్తుత్యము, పార్థివము, స్వర్గీయము, విచిత్రమగు ధనమును ణీ శోధన సమయమున మాకు తెచ్చి ఇమ్ము.
2. సోమమా! నీవు, ఇంద్రుడు అందరకు స్వాములు. గోవులు పాలకులు - ఈశ్వరులు. మీరు మా కర్మలను వర్థిల్ల చేయండి.
3. సోమము అభిలాషప్రదాత. అతడు శోధించబడును. మానవులతో పలుకును. హరిత వర్ణుడగును. కుశలపై - తన స్థానమున - కూర్చుండును.
4. సోమము పుత్రుడు. తల్లి వసతీవరి జమము. బిడ్డ తల్లి పాలుత్రాగును. బిడ్డ వర్థిల్లుటకుగాను తల్లి తన పాలు మరిమరి త్రాగవలెనని ఆశించును.
5. మిశ్రమము చేయునపుడు - సోమపు శ్రేయోభిలాషి - జలము గర్భము ధరించును. సోమము ఈ మాతృరూప జలముల పాలు త్రావును.
(జలము గర్భము దాల్చుట సోమము వలన కాదు - సోమము కొరకు తల్లి మరిన్ని పాలు త్రావించదలచి మరల గర్భవతి అయినది)
6. పవమాన సోమమా ! మా అభిమత ఫలము దూరమునందున్నచో - దగ్గర చేయుము. శత్రువులతో బుగులు పుట్టించుము. వారి ధనమును తెలిసి కొనుము.
7. సోమమా !నీవు దూరమందున్నను దగ్గరలో ఉన్నను శత్రువుయొక్క వర్షణ బలమును నాశము చేయుము. శోషింప చేయగల శత్రువు తేజమును నాశము చేయుము.
ఇరువదవ సూక్తము
ఋషి - అసితదేవలుడు, దేవత - పవమాన సోమము, ఛందస్సు - గాయత్రి.
1. కవిసోముడు దేవతల పానమునకు మేషలోమము ద్వారా వెళ్లును. శత్రువులను పరాభవించు సోముడు హింసకులను వధించును.
2. పవమాన సోముడే స్తోతలకు గోయుక్తమగు సహస్ర సంఖ్యాల్ అన్నమును ప్రదానము చేయును.
3. సోముడా! నీవు మనసా సకల ధనములను దానము చేసెదవు. అట్టి నీవే మాకు అన్నమును అందించుము.
4. సోముడా! నీవు మహత్తర కీర్తి వైపుసాగుము. హవ్యదాతకు నిశ్చిత ధనము నిమ్ము. స్తోతలకు అన్నము ప్రసాదించుము.
5. సోముడా! నీవు సుకర్ముడవు. పవిత్రుడవగుము. మహారాజువలె మా స్తుతులను స్వీకరించుము. నీవు అద్భుతుడవు. మహామహుడవు.
6. అతడు సోమవాహకుడు. అంతరిక్షమున ఉన్నవాడు. అతనిని గట్టిగా చేతులతో రుద్దగా పాత్రలందు చేరును.
7. సోమా! నీవు క్రీడా పరాయణుడవు. ధనేచ్ఛ గలవాడవు. స్తోతకు మంచి బలమునిచ్చి దానసమయమగు దశాపవిత్రమునకు సాగుదువు.
ఇరువది ఒకటవ సూక్తము
ఋషి - అసితదేవలుడు, దేవత - పవమాన సోమము, ఛందస్సు - గాయత్రి.
1. దీప్తము, అభిభవ కారకము, మదకరము, లోకపాలకమగు సోమము ఇంద్రుని వైపు సాగును.
2. సోమము విశేషముగా అభిషమును ఆశ్రయించును. అందరితో కలియును. అభిభవకారులకు ధనము నిచ్చును. స్తోతలకు అన్నము ప్రసాదించును.
3. సరళముగా క్రీడించు సోమము నీటిలో పడి ఏకమాత్ర కలశమున క్షరితమగును.
4. సోమము సంశోధితమై - రథమునకు కట్టిన అశ్వములవలె సకల వరణీయ ధనములకు వ్యాప్తి కలిగించును.
5. ఈ యజమాని ఋత్విక్కులమగు మాకు పెదవి కదపక దానము చేయును. ఇతనికిగల వివిధకోరికలు తీరు నట్లు సోమమా! అతనికి ధనమునిమ్ము.
6. ఋభువు రథవాహకునకును, ప్రశస్య సారధికిని ప్రజ్ఞాదానము చేయును. సోమా! అట్లే ఈ యజమానికి ప్రజ్ఞాదానము చేయుము. జలములందు దీప్తుడవగుము.
7. ఈ సోమలు యజ్ఞము చేయవలెనను కొనుచున్నారు. అన్నవంత సోములు నివాస స్థానములు ఏర్పరచినారు. బలశాలులగు సోములు యజమాని బుద్ధుని చురుకు చేసినారు.
ఇరువది రెండవ సూక్తము
ఋషి - అసిత దేవలుడు, దేవత - పవమాన సోమము, ఛందస్సు -గాయత్రి
1. యుద్ధమున కంపు రథము, అశ్వమువలె అధ్వర్యులు సోమమును అమర్చి దశాపవిత్రమునకు చేర్చెదరు.
2. మహావాయువు, మేఘము, అగ్నిశిఖవలె సోమము సర్వత్ర వ్యాపించును.
3. ఈ సోమము శుద్ధము, దధియుక్తమై ప్రాజ్ఞబలమున మాకు వ్యాప్తి కలిగించును. |
25,310 |
ఇంక అప్పుడు అక్కడ ఆ మినిస్టర్ గారి పుత్రరత్నం చేసిన ఆగం, అల్లరీ వర్ణనాతీతం! సబ్ ఇన్ స్పెక్టర్ ని అడ్డూ ఆపూ లేకుండా బూతులు తిట్టాడు. ఇంతలో అతని ఫ్రెండ్స్ యింకో యిద్దరు యువ కార్యకర్తలు అతనికి సపోర్టుగా వచ్చారు.
"కారు అక్కడ పార్క్ చెయ్యమని చెప్పింది నేనే! మొగాడివైతే నన్ను అరెస్ట్ చెయ్యరా నా కొడకా!" అన్నాడు సంజీవ్ సబ్ ఇన్ స్పెక్టర్ బాబూరావుతో తనే వెళ్ళి ఒక లాకప్ సెల్ లో బైఠాయించాడు. ఈ లోపల సర్కిల్ ఇన్ స్పెక్టర్ వచ్చాడు.
ఎగిరి లంఘించి, సర్కిల్ ఇన్ స్పెక్టర్ కాలర్ పట్టుకున్నాడు. "లంజా కొడకా! ఏం ట్రైనింగ్ ఇస్తున్నావ్ రా నీ సబార్డినేట్స్ కి! నా కారుకి ట్రాఫిక్ రూల్సు పెడతారట్రా! నా డ్రైవర్ నే అరెస్ట్ చేస్తారుట్రా! నీ..." అంటూ చెయ్యెత్తి, సర్కిల్ ఇన్ స్పెక్టర్ చెంప పగల గొట్టబోయాడు సంజీవ్.
తను జోక్యం కలగజేసుకోక తప్పదనిపించింది రాజాకి.
అతను కదలబోయాడు.
కానీ అంతలోనే -
ఆ జనంలో వున్న అమ్మాయి హఠాత్తుగా ముందుకు వచ్చింది.
మరుక్షణంలో సంజీవ్ చెంప ఛెళ్ళు మనేటట్లు బలంగా కొట్టింది.
ఊహాతీతమైన ఆ సంఘటనకి అదిరిపడ్డాడు మినిస్టర్ విజయకుమారి కొడుకు సంజీవ్.
ఇన్ స్పెక్టర్ ని వదిలేసి, చెంప తడుముకుంటూ ఆ అమ్మాయి వైపు చూశాడు.
అతని కళ్ళలో కసి కనబడుతోంది.
"ఓహో! హోం మినిస్టర్ గారి కూతురు గారా! ఏం! మీ నాన్న దమ్ము చూసుకుని మిడిసిపడుతున్నట్లున్నావే?" అన్నాడు.
"అమ్మ చాటునా, అబ్బ చాటునా దాక్కుని ఆ ధైర్యంతో పిచ్చి పనులు చెయ్యడం నీకే తగింది. నాకేం అవసరం. నేను రెస్పాన్సిబుల్ సిటిజెన్ ని. ఒక పోలీసాఫీసర్ని నువ్వు కొట్టబోతుంటే చూస్తూ ఊర్కోవాలా?" అంది ఆ అమ్మాయి.
చెంప తడుముకుంటూ అన్నాడు సంజీవ్.
"ఇది ఇంతటితో పోదు! హైకమాండ్ దాకా పోతుంది.
"నీకు దిక్కున్నచోట చెప్పుకో!" అంది ఆ అమ్మాయి.
అతను ఇంకేదో అనబోయి, తమాయించుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.
"థాంక్స్ అమ్మా!" అన్నాడు ఇన్ స్పెక్టర్ కృతజ్ఞతగా చూస్తూ.
చిన్నగా నవ్వి, పోలీసు స్టేషన్ లో నుంచి బయటికి వచ్చింది ఆ అమ్మాయి.
వచ్చి ఆటో కోసం చూస్తూ నిలబడింది.
ఆమె పక్కకి వెళ్ళి నిలబడ్డాడు రాజా.
"వెల్ డన్ అర్పితా!"
చటుక్కున అతనివైపు తిరిగింది అర్పిత. అనుమానంగా చూసింది అతన్ని.
"మీరు....?"
"నేన్నీకు తెలుసు! కానీ గుర్తుపట్టలేవు"
అతన్ని పరిశీలనగా చూస్తూనే ఉంది అర్పిత.
"చిన్నప్పుడు నీ చెవి రింగులు ఒకడు లాక్కోబోతే...."
"ఓహ్! రాజా!" అంది అర్పిత. 'రాజానా? నువ్వు రాజావేనా?"
నవ్వాడు రాజా.
"యస్! ఇన్ ఫ్లెష్ అండ్ బ్లడ్!"
"చాలా తమాషాగా ఉంది!" అంది అర్పిత సంతోషంగా. "హఠాత్తుగా మాయమైపోయావు నువ్వు! 'ఏమైపోయావా?' అనుకున్నాను నేను."
"నేను మాత్రం నీ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నా. మీ నాన్నగారు పూర్తిగా ప్రజాసేవలో మునిగిపోవడం, ఏ పదవీ ఆశించకుండా ప్రజల కోసమే తన జీవితం అంకితం అన్నట్లు నడుచుకోవడం, ఒక రోజున ఊళ్ళో జనమంతా మీ ఇంటికి రావడం, మీ నాన్నగారు ఎలెక్షన్ కి నిలబడి తీరాలని ప్రజలే బలవంతం చెయ్యడం...అంతే!"
చిరునవ్వుతో వింటోంది అర్పిత.
ఆ రోజు బాగా గుర్తే తనకి.
ఓ రోజు
తెల్లవారుజామున తను వీధి వాకిలి ముందు చిమ్ముతోంది.
అప్పుడు హఠాత్తుగా సందు తిరిగి ప్రత్యక్షమయ్యింది ఒక గుంపు. దాదాపు వందమంది ఉంటారు అందులో.
వాళ్ళంతా వచ్చి తమ ఇంటిముందు ఆగారు.
అంతమంది జనం ఒక్కసారిగా ఇంటిముందు వచ్చి నిలబడటంతో తనకు ఆందోళన కలిగింది.
ఏమయ్యింది? ఏం జరిగింది?
వీళ్ళు వచ్చిన పని తమకి వ్యతిరేకంగా ఏదీ అయి ఉండదని మనసులో అనిపిస్తూనే ఉన్నా, మళ్ళీ అంతలోనే ఏదో తెలియని జంకు.
వచ్చినవాళ్ళలో సూర్యారావు అందరికంటే ముందు ఉన్నాడు.
కలకలం విని వచ్చారు నాన్నగారు.
ప్రశ్నార్థకంగా అమరినీ పరికించి చూస్తూ, సూర్యారావుని అడిగారు.
"సూర్యారావూ? ఏమిటి విశేషం?"
"మీతో మాట్లాడాలని వచ్చాం!" అన్నాడతను.
సావధానంగా విని అన్నారు నాన్నగారు -
"చెప్పండి!"
"ఎలెక్షన్లు వస్తున్నాయి." |
25,311 |
"నాలో ఇప్పుడిప్పుడే స్వార్ధం చోటు చేసుకుంటున్నది సునందా!" ఆమె కళ్ళలోకి చూసే ధైర్యం లేనట్టు శూన్యంలోకి చూస్తూ నిదానంగా అన్నాడు నవీన్.
"మిస్టర్ నవీన్! ప్లీజ్....చెప్పండి, ఏమిటి?"
మార్ధవమైన ఆమె అనునయానికి క్షణకాలం పులకించాడు.
మరు క్షణం వాస్తవంలోకి వచ్చి మ్రాన్పడిపోయాడు.
"సారీ, డాక్టరు సునందా! ఇక్కడ కూడా మిమ్ము ఇబ్బందిపెడుతున్నాను. నా ఆరోగ్యం బాగానే వుంది, మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి...."
"నా విశ్రాంతికోసం నేను ఇంత దూరం రానవసరం లేదు. మిష్టర్ నవీన్! మీలో మార్పు తీసుకురావాలనే ఇక్కడకు వచ్చాను. నా మీద మీకు ఏమాత్రం గౌరవం వున్నా వెంటనే లోనికి వచ్చి విశ్రాంతి తీసుకోండి!" అంటూనే ఆమె తన గదిలోకి వెళ్ళిపోయింది.
ఆమెలోని ఆవేశం ఆదేశం రెండూ తెలిసినవాడిలా తనూ లోనికి నడిచాడు నవీన్.
బెడ్ మీద నవీన్ కు నిద్ర పట్టడం లేదు. అతని కనులు చింతనిప్పుల్లా వున్నాయి.
డాక్టరు సునంద వచ్చి అతని నుదుటి మీద చేయి వేసి చూసింది. శగలు పొగలు కక్కుతున్నది శరీరం.
అది మామూలు జ్వరంలా అనిపించలేదు ఆమెకు.
నవీన్ హఠాత్తుగా లేచి మంచం మధ్య బాచీపెట్టి వేసుకు కూర్చున్నాడు.
"డాక్టర్! నేనొక నిర్ణయానికి వచ్చాను. మళ్ళీ పెళ్ళి చేసుకుంటాను!"
ఆమె పగలబడి నవ్వింది.
అతను చిన్నబుచ్చుకున్నాడు.
"సారీ! ఈ విషయం గురించేనా ఇందాకటి నుంచి తర్జన భర్జనలు పడుతూ కిండుమీదు లవుతున్నారు?" సాదాసీదాగా అంటూ కదిలింది డాక్టరు సునంద.
"నేను మిమ్మల్నే పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను!"
డాక్టరు సునంద నెత్తిమీద పిడుగు పడినట్టయింది. అదిరిపడింది.
"నెవ్వర్!" గట్టిగా అరచింది. ఖంగుమన్నది ఆ కంఠం.
నవీన్ నిశ్చేష్టుడయ్యాడు. ఆమె నుంచి అటువంటి సమాధానం వస్తుందని అతను ఊహించుకోలేదు. తట్టుకోలేకపోయాడు.
"సారీ....నా నిర్ణయం తప్పనుకుంటాను...." అన్నాడు నిదానంగ.
నిట్టూర్చింది డాక్టరు సునంద. "నా చొరవను, నా ధ్యేయాన్ని మీరు అపార్ధం చేసుకున్నారు!" అన్నది.
జీవితంలో జరిగిన నష్టాన్ని పదేపదే తలచుకుంటూ, తన ధ్యేయాన్ని విస్మరిస్తున్నాడు నవీన్. తానొక పోలీస్ ఆఫీసరు ననే మాటనే మరచిపోయినట్టున్నాడు. సగటు మనిషిలా తన వ్యక్తిగత జీవితంలోకి కొత్త ఆనందాన్ని వెతుక్కుంటున్నాడు. కేవలం ఇంత సాధారణ లక్షణాలే అతనిలో వున్నాయని మొదటే ఊహించ గలిగితే, అసలు ఇంత దూరం వచ్చే దాన్నే కాదేమో!' అనుకున్నది డాక్టరు సునంద.
ఆ క్షణమే ఆమె ఒక స్థిర నిర్ణయానికి వచ్చింది. అసలు తనేమిటో, తన మనోగతం ఏమిటో _ తెలియపరచాలనుకున్నది.
ధీర గంభీర అయింది.
"మిష్టర్ నవీన్! కన్నబిడ్డకు, కట్టుకున్న భార్యకు సంబంధించిన జ్ఞాపకాలన్నింటినీ మీ మనోఫలకం నుంచి పూర్తిగా తుడిచివేయండి. మీ అంతరంగంలో నాకు మాత్రమే చోటివ్వండి. అప్పుడు మిమ్ము పెళ్ళి చేసుకోవడానికి నాకు అభ్యంతరం లేదు!"
"డాక్టరు సునందా!" పిచ్చిగా అరిచాడు నవీన్. అతని కనులు కెంపెక్కాయి.
"నా పుత్రుని, భార్యను టెర్రరిస్టులు చంపితే, వాళ్ళ జ్ఞాపకాలను శాశ్వతంగా సమాధి చేయటానికి ప్రయత్నిస్తున్నారు మీరు టెర్రరిస్టులు చేసినదానికంటే ఇది అమానుషం!" అన్నాడు ఆవేశంగ.
"భార్య పోయి నెల రోజులైనా కాక ముందే మరొక ఆడదాన్ని జీవితంలోకి ఆహ్వానించడం అమానుషం కాదా? అది మానవత్వమా? చెప్పండి _ అది ప్రేమో, కామమా? బాధ్యతలను విస్మరించి విషయలపటంలోకి కూరుకుపోవటమేనా మగతనం అంటే?"
కొలిమిలో కర్రు కాల్చి మాడుమీద పెట్టినట్టున్నది నవీన్ కు.
ఆలోజించిన కొలదీ తనమీద తనకే అసహ్యం వేసింది నవీన్ కు.
తనేమిటో తన పరిస్థితి ఏమిటో అర్ధమయింది,
ఒక పేషెంటును ట్రీట్ చేయడానికి ఒంటరిగా ఇంతదూరం వచ్చిన ఒక లేడీ డాక్టరును తను అవమానించాడు..
అతను సిగ్గుతో కుంచించుకుపోయాడు
'ఒక ఫోలీస్ ఆఫీసరు తన కర్తవ్యాన్ని విస్మరించి, భవబంధాలకోసం తపనపడడమా? చీఛీ....తను పిరికిపంద కాదు, తన ధ్యేయం వేరే వుంది.'
ఆలస్యం అయినా, వాస్తవంలోకి వచ్చేశాడు నవీన్.
"డాక్టరు సునందా! గెట్ రడి_మనం మన వూరు వెళ్ళిపోదాం. నా సెలవును కేన్సిల్ చేసుకుంటున్నాను" ధీరోదాత్తంగా చెప్పాడు నవీన్.
* * *
|
25,312 |
"విజయ్ ఇంకా లేవలేదా?"
నరేంద్ర కంఠం విని సునందను వదిలేసి, చివ్వున లేచి మంచం మీద కూర్చొన్నాడు.
"నువ్వు తయారయ్యావని బావను లేపడానికే వచ్చాను" గదిలోకి ప్రవేశించిన నరేంద్రతో అని సునంద బయటికి వెళ్ళిపోయింది.
"ఇంత పొద్దున్నే ఎక్కడకు తయారయావ్? రాత్రంతా సరిగా నిద్ర కూడా లేదు." విజయ్ ఆవలిస్తూ అన్నాడు.
"నేర పరిశోధన చేసే వాళ్లకు, హంతుకుడ్ని కటకటాల వెనక్కు పంపించాకే నిద్రపట్టేది. ఊ! కానీయ్! త్వరగా!"
"త్వరగా!"
విజయ్ మంచం దిగుతూ నరేంద్ర ముఖంలోకి చూశాడు.
"అరే!అదేమిటి కళ్ళంతా ఎర్రగా ఉన్నాయ్? రాత్రంతా నిద్రేపోలేదా?" విజయ్ విస్మయంగా అడిగాడు.
"అవును! విజయ్! రాధారాణి, రామకృష్ణల హత్యల గురించే ఆలోచిస్తున్నాను. పాపం! రెండు నిండుప్రాణాలను పొట్టన పెట్టుకొన్నాడు దుర్మార్గుడు.
"అంటే నీ ఉద్దేశ్యంలో హంతకుడు ఒక్కడనిగా?"
"నీ ఉద్దేశ్యం?"
"ఒక్కడు కాడు"
"ఎలా చెప్పగలవు?"
"చెప్పడానికి నాకు మరికొంత టైం కావాలి"
"అలాగే తీసుకో. సరే త్వరగా తయారవు." అంటూ నరేంద్ర గదిలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు.
"హంతకుడు అందుబాటులోనే ఉన్నాడు ఇంకా నీ అనుమానం ఏమిటో....?"
బయటికి వెళుతున్న నరేఅద్ర ఆగి వెనక్కు తిరిగి"నేరపరిశోధకులు పోలీసువాళ్ళలా తొందరపడి తీసుకోకూడదని నీకు చాలాసార్లు చెప్పాను: అన్నాడు.
విజయ్ స్నానం చేసి టిఫెన్ చేసి తయారయి బయటికివచ్చాడు.
అప్పటికే నరేంద్ర కార్లో స్టీరింగ్ ముందు కూర్చుని ఉన్నాడు. విజయ్ కొరకు ఎదురుచూస్తూ.
"ఊ! కమాన్!ఎక్కు" అంటూండగానే గేటు లోపలకు దూసుకొని వచ్చిన పోలీసు జీపు చూసి స్టార్టు చేసిన ఇంజన్ ఆపుచేశాడు.
జీపు ఆగింది. ముందు సీట్లో నుంచి అద్వయితం దూకాడు. వెనక హెడ్డు యాదగిరి కూర్చుని ఉన్నాడు.
"నరేంద్రా ఎక్కడకు ఇంత పొద్దుటే బయలుదేరావ్ ఇన్ స్పెక్టర్ అడిగాడు.
"తమరు ఇంత పొద్దుటే ఊడిపడటానికి కారణం?" విజయ్ అడిగాడు.
"నరేంద్రతో అర్జెంటుగా మాట్లాడాలని...." నీళ్ళు నమిలాడు ఇన్ స్పెక్టర్.
"కారెక్కు నేను నీ దగ్గరకే బయలుదేరాను?"
"ఎక్కడికీ? మరో హత్యకాని జరగలేదు కదా," ఇన్ స్పెక్టర్ గాభరాగా అన్నాడు.
"అదేం లేదులే. కారెక్కు" అన్నాడు నరేంద్ర.
అద్వయితం కారెక్కి వెనక సీట్లో కూర్చుని "ఎక్కడికో చెప్పలేదు?" అన్నాడు.
"నల్లకుంట"
"ఓ కమలాంబ ఇంటికా?" ఇన్ స్పెక్టర్ సాలోచనగా గొణిగినట్లు అన్నాడు.
"రాత్రి వెళ్ళావటగా? ఏమైనా క్లూ దొరికిందా?" విజయ్ వ్యంగ్యంగా అన్నాడు.
"అక్కడేం దొరుకుంది? పాపం. తమ్ముడు పోయాడని ఒకటే ఏడుస్తోంది. అక్కడ మనకు దొరికే అదనపు ఇన్ పర్ మేషన్ ఏదైనా ఉంటుందని నేను అనుకోను. బాధలో కుమిలిపోతున్న ఆమెను విసిగించడం అవసరమేమో?"
"అదనపు ఇన్ ఫర్ మేషన్ అంటే కొంత దొరికిందననేగా?" విజయ్ రెట్టించాడు.
"అక్కడ నాకేమీ ఇన్ ఫర్ మేషన్ దొరకలేదు" అన్నాడు ఇన్ స్పెక్టర్.
నరేంద్ర మౌనంగా కారు స్పీడు పెంచాడు.
నల్లకుంట రైల్వేట్రాక్ కు ఎదురుగా ఉన్న ఓ బంగాళా ముందు కారు ఆపాడు ఆ భవంతి ఆధునాతనంగా ఉంది, మరీ పెద్దది కాకపోయినా కనీసం ఐదు లక్షల ఖరీదైనా చేస్తుంది.
పోర్టికోలోవైట్ ఫియట్ ఆగి ఉంది.
కారు గేటు బయటే గోడవారగా ఆపి నరేంద్ర దిగాడు.
"లోపలకు వెళ్లొచ్చుగా?" అన్నాడు ఇన్ స్పెక్టర్.
ఇన్ స్పెక్టర్ మాట వినిపించుకానట్లే నరేంద్ర కారు దిగాడు. ఇన్ స్పెక్టర్ కారు దిగి గేటు తీసుకొని నరేంద్రకంటే ముందులోపలకు వచ్చాడు. కాలింగ్ బెల్ నొక్కాడు.
కొద్దిక్షణాల్లో తలుపులు తెరుచుకున్నాయి.
తలుపులు తీసిన పనిపిల్ల ఖాకీ డ్రెస్ లో ఉన్న ఇన్ స్పెక్టర్ నివ్వెరపోయి చూసి లోపలకు పరుగుతీసింది.
ముగ్గురూ డ్రాయింగ్ రూంలోకి వెళ్ళి కూర్చున్నారు.
ఐదు నిముషాల్లో నలభయి, నలభైఐదు ఏళ్ళవయసులో ఒక స్త్రీ డ్రాయింగ్ వచ్చింది.
పాతికేళ్ళ యువతి ముస్తాబు చేసుకొని ఉన్నవి.
ముగ్గుర్నీ చూసి ఓ క్షణం తట్టరపోయింది. అంతలోనే తేరుకొని "ఏమిటండి ఇన్ స్పెక్టర్ గారూ? మళ్ళీ వచ్చారు. తెల్లారేసరికి హంతకుడి ఆచూకి ఏమైనా తెలిసిందా? వీరెవరూ? అన్నది. అన్నది ఎదురుగాఉన్న కుర్చీలో కూర్చుంది.
"వీరు డిటెక్టివ్ నరేంద్ర. వారు ఆయన అసిస్టెంటు. పేరు విజయ్" అని ఇద్దర్నీ పరిచయం చేసి "ఈమె కమలాంబ. రామకృష్ణ అక్కగారు" అని నరేంద్రకు పరిచయం చేశాడు ఇన్ స్పెక్టర్.
కమలాంబ ముఖం క్షణంలో విషాదంతో మబ్బులు కమ్మిన ఆకాశంలా అయింది.
"నమస్కారం" ఉబికి వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకొంటూ నరేంద్రకు చేతులు జోడించింది కమలాంబ.
"నమస్తే" అన్నాడు నరేంద్ర ఆమెను నిశితంగా చూస్తూ.
అంతలో "కమలా! కమలా" అని పిలుస్తూ ఓ ఏభయి ఏళ్ళ మగవాడు నైట్ డ్రెస్ లో పైభాగంలో నుంచి మెట్లమీదుగా డ్రాయింగ్ రూంలోకి వచ్చాడు. ఇన్ స్పెక్టర్ చూసి ఓ క్షణం నివ్వెరపోయాడు.
"నమస్కారం ఇన్ స్పెక్టర్! ఏమిటిలా దయచేశారు? రాత్రి వచ్చి వెళ్ళారటగా?" ఆన్నాడు కమలాంబ పక్కన ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ.
నరేంద్ర అతడ్ని తేరిపార చూశాడు.
ఆజానుబాహుడు- బలమైనశరీరం- గుబురుగాఉన్న కనుబొమలు వయసు ఏభయ్ దాకా ఉన్నా అవలీలగా ఇద్దరు మనుషుల్ని ఒకేసారి అవతలకు విసిరెయ్యగలడు అని అనిపించింది నరేంద్రకు అతడ్ని చూస్తుంటే.
"వీరెవరూ?" అడిగాడు విజయ్.
"వీరు లాయర్ శంకర్రావుగారు" అన్నాడు ఇన్ స్పెక్టర్.
"వారి పరిచయం?" శంకర్రావు గుబురు కనుబొమల్నిముడివేస్తూ అడిగాడు.
"వీరు నరేంద్ర. ప్రఖ్యాత డిటెక్టివ్. వారు విజయ్ . వీరి అసిస్టెంట్" అన్నాడు ఇన్ స్పెక్టర్.
"శంకర్రావుగారు మీకేమౌతారు?" ప్రశ్నించాడు నరేంద్ర కమలాంబని చూస్తూ.
"ఏమీ కారు" అని ఓ క్షణం ఆగి "మా కుటుంబానికిఆప్తమిత్రులు. మా తమ్ముడు రైలుప్రమాదంలో పోయినప్పట్నుంచీ వీరే మా ఆస్తికి సంబంధించిన వ్యవహారాలన్నీ చూసుకొంటున్నారు" అన్నది కమల ముక్తిసరిగా.
శంకర్రావు కుర్చీలో వారి నివాసం?" అడిగాడు నరేంద్ర.
"అప్పుడప్పుడు మరీ పొద్దుపోతే ఇక్కడే ఉండిపోతారు.ముఖ్యంగా తమ్ముడు చనిపోయిన రోజు నుంచి అంటే మూడురోజులుగా ఇక్కడే ఉంటున్నారు" కమలాంబ నేలచూపులు చూస్తూ అన్నది.
"శంకర్రావుగారూ! మీరు రామకృష్ణగారి ఆస్తి వ్యవహారాలన్నీ చూస్తున్నారటగా? అతడి ఆస్తిని అనుభవించే హక్కు అతడి భార్య అనసూయాదే కదూ?" నరేంద్ర అడిగాడు
అద్వయితం నరేంద్రకేసి ప్రశంసాపూర్వకంగా చూశాడు. రాత్రి తనకు ఆ ఆలోచన రానందుకు తనను తనే మనసులో విసుక్కున్నాడు.
"ఇంతకు ముందు ఆ హక్కు ఆమెకున్న మాట వాస్తవమే ఇప్పుడు మాత్రం ఆమెకు ఆ హక్కులేదు" అన్నాడు శంకర్రావు నిస్సహాయంగా.
"ఎందువల్లా?" ఇన్ స్పెక్టర్ అద్వయితం అడిగాడు శంకర్రావు కేసి అనుమానంగా చూస్తూ.
"రామకృష్ణ రైలు ప్రమాదంలో నిజంగా మరణించి ఉంటే, ఆ ఆస్తిమీద హక్కులన్నీ ఆమెకే చెందేవి?"
"ఇప్పుడు మరణించాడుగా? మరి ఇప్పుడు అతడి ఆస్తిమీద ఆమెకు హక్కులేదా?"
"లేదు." దృఢంగా పలికింది అతడి కంఠం.
"ఎందుకు లేదో చెప్పండి" గట్టిగా అడిగాడు ఇన్ స్పెక్టర్.
"రామకృష్ణ చనిపోలేదు."
"చనిపోలేదా?" ఇన్ స్పెక్టర్ నోరు తెరిచాడు.
"పూర్తిగా వినండి. అతడు మేము అనుకున్నట్లుగా మూడేళ్ల క్రితం చనిపోలేదు. మొన్నటివరకు బతికే ఉన్నాడు. అంటే అనసూయ భర్త బ్రతికి ఉండగానే మరోకడ్ని చేసుకొన్నది. అందువల్ల ఆమెకు తన మొదటి భర్త ఆస్తిమీద ఎలాంటి హక్కూ లేదు. ఉండదు. ఒక వేళ కోర్టుకు వెళితే ఆమె దోపిగా నిరూపించబడుతుంది" గుబురు కనుబొమ్మలు దగ్గరగా చేర్చి, ఇన్ స్పెక్టర్ కేసి తీవ్రంగా చూస్తూ అన్నాడు శంకర్రావు.
"మీరు చెప్పింది నిజమే కావచ్చు. అంత మాత్రంచేత కమలాంబగారికి తమ్ముడి ఆస్తిమీద హక్కు వచ్చినట్టు ఎలా చెప్పగలరు! ఆయన ఒకవేళ వీలునామా రాశారేమో? రాస్తే తన ఆస్తి ఎవరెవరికీ రాశారో ఎలా తెలియడం ?" శంకర్రావు కళ్ళల్లోకి లోతుగా చూస్తూ అన్నాడు నరేంద్ర.
విజయ్ మౌనంగా కూర్చుని అందర్నీ గమనిస్తున్నాడు.
"అవునండీ! మీరు చెప్పింది నిజమే. మా తమ్ముడు వీలునామాలో ఆస్తి అంతా నా పేరనే రాశాడు. వాడికి మాత్రం ఇంకెవరున్నాండీ? నా కూతురంటే బాడికి మాత్రం ఇంకెవారున్నారండి? నాకూతురంటే వాడికి ప్రాణం. తల్లిలా చూశానుగాని వాడ్ని అక్కల చూడలేదు. వాడికీ నేనంటే ఎంతో ఇష్టం" అన్నది కమలాంబ.
"ఆ!రామకృష్ణ వీలునామా రాశాడా?" ఏదో చూద్దామనివిసరిన వాలతాకాలేదు. అందులో ఏనో చిక్కుకుంది. లాగుతుంటే బరువుగానే ఉంది అని ఆలోచిస్తూ కమలాంబ! కేసి చూశాడు నరేంద్ర,
"రక్తసంబందం. నాకు రాయకపోతే ఇంకెవరికి రాస్తాడు?" ధీమాగా అన్నది కమలాంబ.
"అయితే మొన్న రామకృష్ణను మీరు కలిశారన్నమాట నరేంద్రఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు.
"లేదు" ఆమె చూపులు కిందకు వాలాయి. పైటకొంగుతోకళ్ళు తుడుచుకుంది.
"ఆ అదృష్టం కూడా కలగలేదు మూడేళ్ళనాడుచూసిన తమ్ముడ్ని మళ్ళీ శవంగా చూడాల్సి వచ్చింది" ఆమె కంఠంలో దుఃఖం గరగరలాడింది.
"ఊరుకో కమలా! ఏడిస్తే పోయినవాడు తిరిగొస్తాడా" ఓదారుస్తూ అన్నాడు శంకర్రావు.
"అయితే శంకర్రావుగారు రామకృష్ణను కలిశారా?"
"నేనా? అబ్బే! నేను కూడా ఇన్ సెక్టర్ గారు కబురు చేస్తే వెళ్ళి మార్చురీలో శవాన్ని పోల్చుకున్నాను" అన్నాడు శంకర్రావు.
"మరి! ఆయన తన ఆస్తిఅంతా మీ పేరున రాసినట్టు మీకెలా తెలిసింది?" నరేంద్ర కమలాంబను ప్రశ్నించాడు.
"లాయర్ రమణారావుగారిచేత తమ్ముడు వీలునామా రాయించాడట. నిన్న ఉదయం రమణారావుగారు తెచ్చి ఇచ్చారు."
"మరి ఆ సంగతి నాకు చెప్పలేదేం?" తీవ్రంగా చూస్తూ అడిగాడు అద్వయితం.
"మీరు అడగలేదుగదా?" అన్నది కమలాంబ.
అద్వయితం గతుక్కుమన్నాడు.
"ఉండండి చూపిస్తాను" అంటూ కమలాంబ లేచి లోపలకు వెళ్ళింది.
ఐదు నిముషాల్లో కమలాంబ వీలునామా కాగితాలు తెచ్చి నరేంద్ర చూసి ఆ కాగితాలు అటూ ఇటూ తిప్పుతూ"రమణారావంటే రావూస్ టెక్ స్టెల్స్ లీగల్ అద్వాయిజరేనా?" అని అడిగాడు.
అతడి ప్రశ్నకు కమలాంబ అమాధానం ఇవ్వలేదు వినిపించుకొనట్టే ఉండి పోయింది.
"అవును ఆయనే!" అన్నాడు శంకర్రావు తల ఊపుతూ.
అంతలో ఒక యువతి కిలకిలా నవ్వుతూ హల్లో నుంచి డ్రాయింగ్ రూంలోకి వచ్చింది.
ఆమె వెనకే ఈల వేసుకొంటూ ఒక యువకుడు వచ్చాడు.
డ్రాయింగ్ రూంలో ఉన్న కొత్త వ్యక్తుల్ని చూడగానే ఇద్దరూ బిత్తరపోయారు.
"మా అమ్మాయి లావణ్య " అని నరేంద్రకు ఆ యువతిని పరిచయం చేసింది కమలాంబ.
"అతడెవరూ?" అడిగాడు ఇన్ స్పెక్టర్ ఆ యువకుడ్ని కన్నార్పకుండా చూస్తూ.
"అతని పేరు కృష్ణమూర్తి మా ఫామిలీ ఫ్రెండు."
ఆ పరిచయం వినగానే కృష్ణమూర్తి ముఖం ముడుచుకుపోయింది.
"మాకు దూరవుబంధువు కూడా" అన్నది కృష్ణమూర్తి ముఖం చూసి కమలాంబ. |
25,313 | నెమ్మదిగా లేచివచ్చి అతని పెదాల మీద ముద్దు పెట్టుకుంది ప్రేమగా.
ఒక్కసారిగా రాజశేఖరంలో ఆమె స్పర్శ కోరిక కలిగించింది.
అలవాటయిన ఆకర్షణ ఆమెని అతని కౌగిలిలోకి చేర్చింది.
ముద్దులతో శరీరమంతా ముంచెత్తుతోంటే సున్నితంగా అతని చేతుల్నుంచి తప్పించుకుని దూరంగా జరిగింది.
"వీటన్నిటికీ నేనిప్పుడు అతీతం రాజా! ఐ డోన్ట్ గెట్ ఎగ్జయిటెడ్!"
"ఎలా మానేజ్ చేస్తావది?"
"భగవాన్ స్వామి స్మరణతో కళ్ళు మూసుకుంటాను.... అంతే! శరీరంతో సంబంధం లేనట్లయిపోతుంది."
రాజశేఖరం నిట్టూర్చాడు.
"ఐ డోంట్ నో .... వెదర్ యూ ఆర్ లక్కీ ఆర్ అన్ లక్కీ!"
"ఏదయినా ఫరవాలేదు"
"ఇంకెంత దూరం ప్రయాణం?"
"తెలీదు"
"ఇంతవరకూ నీకు తెలిసిందేమిటి?"
"నేనెవరు? అనే ప్రశ్న రమణమహర్షి ఆశ్రమంలో వేసుకున్నాను. అంతవరకూ ఈ శరీరం, ఆత్మ, మనసు అన్నీ కలిపి 'నేను' అని అనుకునేదానిని. కానీ నేనెవరు అన్న ప్రశ్న సంవత్సరంపాటు వేసుకునేసరికి నేను వేరు, ఈ శరీరం వేరు అన్న విషయం అర్ధమయ్యింది. 'నేను' అనే దానికి చావులేదని తెలిసింది. కానీ శరీరం తాత్కాలికం! ఆ తరువాత నేనెక్కడ వుంటాను?' అనే ప్రశ్న! ఈ శరీరంలోని ఓ పవిత్ర ప్రదేశములో' ఈ అన్న విషయం అర్ధమయ్యేసరికి మరి కొంతకాలం పట్టింది. శరీరంలో దాక్కుని వున్న యీ 'నేను' చుట్టూ ముసిరిన యీగల్లా ఆలోచనలు, ఊహలు! ఈ రెండింటి సంగమంతో సరికొత్త జ్ఞానం కలుగుతుంది. అదే దివ్యమయిన అనుభూతి. అప్పుడు ఆశ్రమాలన్నీ తిరిగి ఆ జ్ఞాన మార్గంలో యింకా ముందుకి వెళ్ళాలనే కోరిక కలిగింది. ఇప్పటికి ఎనిమిది ఆశ్రమాలు తిరిగాను. ఇది తొమ్మిదోదీ"
"ఇక్కడ ఈ భగవాన్ స్వామి ఏం బోధిస్తున్నారు?"
"తను భగవంతుని అంశ గనుక తనను ధ్యానిస్తే భగవత్ సాక్షాత్కారం అవుతుందని అంటారు."
"మరి అయ్యిందా?"
"ఇంతవరకూ ఆ అనుభవం కలగలేదు కానీ ఆయన పేరు ఉచ్చరించినప్పుడల్లా ఏదో శక్తి ఆవహించినట్లవుతుంది! బహుశా అదే భగవత్ సాక్షాత్కారానికి మార్గమేమో."
చాలాసేపు అతని బిజినెస్ విషయాలు, ప్రమీల గురించి అడిగి తెలుసుకుంది జూలియా.
అతను తిరిగొచ్చేస్తుంటే అతనితోపాటు ఎయిర్ పోర్ట్ వరకూ వచ్చిందామె.
"రాజా! నువ్వు త్వరగా పెళ్ళి చేసుకో! డోంట్ వేస్ట్ యువర్ టైమ్! నీకు కంపానియన్ చాలా అవసరం."
"అఫ్ కోర్స్! కానీ ఎక్కడో ఏదో ఆశ!"
ఆమె నవ్వేసింది.
"ఇంక ఆ ఆశలన్నీ మరిచిపో! నేను తిరిగిరావటం కల్ల! ఒకవేళ వచ్చినా ఇదివరకటి జూలియాని కాలేను. ఓ.కె."
"ఓ.కె."
రాజశేఖరం హైద్రాబాద్ చేరుకునేసరికి రాత్రి పదవుతోంది.
భవనమంతా ఇంకా లైట్లు వెలుగుతూనే వుండటం ఆశ్చర్యం కలిగించిందతనికి.
మేనేజర్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ తన కోసమే ఎదురు చూస్తున్నారు.
"వాట్ హాపెన్డ్?" అనుమానంగా అడిగాడు రాజశేఖరం.
మన స్టాఫ్ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టే విషయంలో మన ఎస్టేట్స్ స్లమ్ ఏరియాకి వెళ్ళి కొలతలు తీసుకుంటుంటే మల్లేష్ అనే గూండా ఒకడు ఎటాక్ చేశాడు. అక్కడున్న వాళ్ళందరికీ ఇళ్ళ పట్టాలు ప్రభుత్వం యిచ్చేసిందనీ అంచేత మనం ఆ ఏరియాలో అడుగు పెట్టానిక్కూడా వీల్లేదని అన్నాడు. పోలీస్ హెల్ప్ తీసుకోవాలా వద్దా అనే విషయంలో మీ సలహా కోసం వెయిట్ చేస్తున్నాం. ఒకవేళ మీరు 'ఎస్' అంటే కమీషనర్ గారితో మాట్లాడి పొద్దున్న బుల్ డోజర్స్ తో అక్కడి గుడిశెలన్నీ నేలమట్టం చేసి టేకోవర్ చేసేయవచ్చు."
రాజశేఖరానికి ఆ గుడిశెల వాళ్ళమీద కోపం ముందుకొచ్చింది.
"రాస్కెల్స్! ఇండియా అంతా ఇలాంటి మెంటాలిటీయే కనబడుతోంది. ఎవడోకడి సొమ్ము దోచుకోవడమే నేర్పింది ప్రభుత్వం వీళ్ళకు! ఓ.కె.... నేను రేపు మాణింగ్ కమీషనర్ గారితో మాట్లాడతాను. మీరీలోగా బుల్ డోజర్స్ ఓ అరడజను రెడీగా వుంచండి"
వాళ్ళు వెళ్ళిపోయారు.
మర్నాడు తెల్లారుజామున అయిదుగంటలకే ఫోన్ మోగింది.
ఏడింటివరకూ నిద్రపోవటం అలవాటున్న రాజశేఖరానికి చాలా చిరాకు కలిగింది. కానీ తప్పదు. ఎంతో అవసరం, అర్జెన్సీ వుంటేనే తప్ప యీ టైమ్ లో తనను డిస్టర్బ్ చేయరు.
"ఎస్!" అన్నాడు రిసీవర్ అందుకుని.
"గుడ్ మాణింగ్ సర్! నేను లక్ష్మణరావును మాట్లాడుతున్నాను"
"లక్ష్మణరావా?"
"అవున్సార్!"
"ఏ లక్ష్మణరావ్?"
"ఆర్. కె. లక్ష్మణరావ్ ని సార్!"
"ఏ ఆర్.కె. లక్ష్మణరావ్? అలాంటి పేరుగల వాళ్ళెవరూ నాకు తేలేదు. కీప్ ది ఫోన్ డౌన్" అనేసి మళ్ళీ నిద్రలోకి జారిపోయాడు.
రెండు నిమిషాలయినా కాకముందే మళ్ళీ ఫోన్ మోగింది.
రాజశేఖరానికి వళ్ళు మండిపోయింది.
"హూ ఈజ్ దట్?" అన్నాడు కోపంగా ఫోనందుకుని.
"నేనే సార్ ఆర్. కె. లక్ష్మణరావ్ ని." |
25,314 |
8. అగ్నీ! నేను మంచి సంతానము కలదానను. మంచి భర్త కలదానను. నీవు శత్రునాశకుడవు. ఇతరులు నిన్ను తిరస్కరించ జాలరు. అట్టి నిన్ను నేను సేవించుచున్నాను.
9. సుజ్ఞానియగు సవిత బంధించిన వరుణ పాశమును విప్పుచున్నాను. ధాతకు స్థానమును పుణ్యఫలమును అగు ఉత్తమ లోకమునందు భర్తృసహితముగా సుఖములను ఆర్జించినాను.
(త్రాటిని విప్పివేయును.)
10. అగ్నీ! నాకు ఆయువు, సంతానము, వర్చస్సు కలిగినవి. నేను నాభర్తను మరల మరల కలసి కొనుచున్నాను. నా శరీరమునందు జీవము చిరకాలము నిలిచి ఉండును గాత.
(యాజమాన పత్ని నడుమునుండి విప్పిన త్రాడుగల తనదోసిలియందు పూర్ణకుంభమును ధరించవలెను.)
11. ఆజ్యమా! నీవు ఆవు పాలనుండి వెడలిన దానవు. ఓషధరస స్వరూపవు. నాశరహితవు. యాగము కొరకు నిన్ను పాత్రయందు ఉంచుచున్నాను.
(అధ్వర్యుడు పాత్రలో నేయిపోయవలెను.)
12. ఆజ్యమా! నీవు ఆవుపాలనుండి వెడలినావు. ఓషధరస స్వరూపవు. సంతానము కొరకు నిన్ను సౌమ్య దృష్టితో చూచుచున్నాను.
(యజమాని భార్య ఆజ్యమును చూడవలెను.)
13. తేజోసి - నీవు తేజస్సువు.
14. తేజోను ప్రేహి - తేజమును పొందుము.
15. నీ తేజస్సును అగ్ని అధిగమించకుండును గాత.
16. ఘృతమా! నీవు అగ్నికి జిహ్వవు. దేవతల సుఖకారణమవు. కావున దేవతల ప్రతి స్థానమందును, ప్రతి మంత్రము నందును ఉపయోగపడుము.
(స్ఫ్యచే గీతగీసి అందు నేతి గిన్నెనుంచవలెను.)
17. శుక్రమసి - దీప్తి కలదానవు.
18. జ్యోతిరసి - జ్యోతివై ఉన్నావు.
19. తేజోసి - తేజస్సువై ఉన్నావు.
20. "దేవో వస్సవితో త్ఫునా త్వచ్చిద్రేణ పవిత్రేణవసోసూర్యస్య రశ్మిభిః"
(అర్థమునకు 5.1. చూడగలరు. ప్రోక్షణీపాత్ర యందలి ఉదకమును పవిత్రముచేత శుద్ధిచేయవలెను.)
21. ఘృతమా! నీవు ప్రకాశించుదానవు.నిన్ను దేవతల నిమిత్తము - స్థానస్థానమునకును, మంత్ర మంత్రమునకు గ్రహించుచున్నాను.
(జుహువును నేతి యందుంచవలెను.)
22. ఆజ్యమా! నీవు జ్యోతిస్స్వరూపవు. ఉపభృతమను పాత్ర జ్యోతిస్స్వరూప. నిన్ను స్థానస్థానమునకు మంత్ర మంత్రమునకు సరిపడునట్లు తీసికొనుచున్నాను.
(ఆజ్యమును ఉపభృతము పోయవలెను.)
23. కాంతి స్వరూపమగు ఆజ్యమా! నిన్ను దేవతల నిమిత్తము స్థాన స్థానమునకు - మంత్ర మంత్రమునకు సరిపడునట్లు కాంతి స్వరూపయగు ధ్రువపాత్ర యందు తీసికొనుచున్నాను.
(ఆజ్యమును ధ్రువ పాత్ర యందు పోయవలెను.)
పదకొండవ అనువాకము
(ఇధ్మబర్హి పూర్వక హవిరాసాదనము చెప్పబడుచున్నది.)
1. ఇధ్మమా! నీవు నల్లనిదానవు. వనస్పతి రూపమవు. నిన్ను అగ్ని కొరకు ప్రోక్షించుచున్నాను.
(ఇధ్మము మీద మూడు మారులు నీరు చల్లవలెను.)
2. వేదిప్రదేశమా! నీవు దర్భమున్నగునవి ఉంచుటకు ఆధార ప్రదేశమవు. నిన్ను ప్రోక్షించుచున్నాను.
(వేదిని మూడుమారులు ప్రోక్షించవలెను.)
3. దర్భా! నీవు వేదియందు పరచబడిన దానవు. స్రుక్కు మున్నగు హోమ సాధనములు ఉంచుటకు నిన్ను ప్రోక్షించుచున్నాను.
(ప్రోక్షించవలెను.)
4. దర్భలారా! మిమ్ము స్వర్గలోక, అంతరిక్షలోక, భూలోకము కొరకు ప్రోక్షించుచున్నాను.
(ప్రోక్షించవలెను.)
5. ఉదరమా! నీవు పితృదేవతల అన్నమవు. దర్భల మీద చల్లబడినావు. దర్భయందు పితృదేవతల కొరకు రసరూపమవగుము.
(ప్రోక్షించగా మిగిలిన నీటిని నేలమీద పోయవలెను.)
6. ప్రప్తరమా! నీవు విష్ణువునకు స్తూపమవు.
7. దర్భలారా! మీరు ఉన్నివలె మెత్తనివారు. దేవతలకు సుఖము కలిగించువారు. మిమ్ము వేదిమీద పరచుచున్నాను.
(పరచవలెను.)
8. మధ్యమపరిధీ! నీవు విశ్వావసు గంధర్వ రూపమవు. యజమానిని సర్వహింసలనుండి రక్షించుదానవు. అన్నరూపవు. స్తుతించవలసినదానవు.
(మోదుగు పుల్లను అగ్నికి తూర్పున వేయవలెను.)
9. దక్షిణపరిధీ! నీవు ఇంద్రుని బాహువు వంటి దానవు. యజమానిని దక్షిణ దిక్కున రక్షింపుము. అన్నరూపవు. స్తుత్యవు.
(మోదుగు పుల్లను దక్షిణమున వేయవలెను.)
10. ఉత్తరపరిధీ! మిత్రావరుణులు నిన్ను ఉత్తరమున ఉంచుదురు గాత. నీవు నిత్యధర్మమును యజమానిని రక్షింపుము. నీవు అన్నరూపవు. స్తుత్యవు.
(సమిధను ఉత్తర దిక్కున ఉంచవలెను.)
11. ఆహవనీయాగ్నీ! తూర్పున సూర్యుడు నిన్ను సమస్త హింసల నుండి రక్షించును గాత.
(అగ్నిని అభిమంత్రించవలెను.)
12. అగ్నీ! నీవు విద్వాంసుడవు. సమృద్ధహోమవంతుడవు. ప్రకాశించువాడవు. ఘనుడవు. నిన్ను యాగము కొరకు మండించుచున్నాను.
(సమిధను పై నుంచి వేయవలెను.)
13. విధృతులారా! మీరు ప్రజలకు నియంతలు.
(1. వేదియందు పరచు దర్భలజత విధృతి. 2. వేది మీద విధృతిని పరచవలెను.)
14. ప్రస్తరమా! విధృతి వసు, రుద్ర, ఆదిత్యులకు స్థానమగును. నీవు విధృతి యందు నిలువుము.
15. నీ పేరు జుహువు అగును. ప్రియనామమున ఘృతాచి, నేయి నిండినదానవు అగుచున్నావు. నీకు ప్రియమగు విధృతి యందు నిలువుము.
నీ పేరు ఉపభృతము అగును. ప్రియనామమున ఘృతాచివి అగుచున్నావు. నీకు ప్రియమగు విధృతి యందు నిలువుము.
నీ పేరు ధ్రువ పాత్రము. ప్రియనామమున ఘృతాచివి అగుచున్నావు. నీకు ప్రియమగు విధృతి యందుండుము.
16. విష్ణువా! జుహువు మున్నగునవి పుణ్యస్థానమగు ప్రస్తరము నందు ఉంచబడినవి. నీవు యజ్ఞమును, యజమానిని, అధ్వర్యుడనగు నన్ను రక్షింపుము.
(పాత్రలను అభిమంత్రించవలెను.)
పన్నెండవ అనువాకము
(అఘోర హోమము చెప్పబడు చున్నది.)
1. అగ్నీ! నీవు యాగ నిర్వాహకుడవు. భువన కారణమవు. వర్థిల్లుము. ఇదిగో నీకు నమస్కారము.
2. జుహువా! దేవయాగము జరుగుచున్నది. అగ్ని నిన్ను పిలుచుచున్నాడు. ఏహి - రమ్ము.
(జుహు పాత్రను అందుకొనవలెను.)
3. ఉపభృతమా! సవితా దేవత నిన్ను దేవయజనమునకు పిలుచుచున్నాడు. ఏహి.
(ఉపభృత్తును అందుకొనవలెను.)
4. అగ్ని, విష్ణు దేవతలారా! నేను ఆఘోర హోమము చేయుటకు సాగినాను. కాలు తా కనీయక మీ ఉభయుల మధ్య నుండి వెళ్లుదును. మీరు విడిగా ఉండండి. నాకు వెళ్లుచోటు ఇవ్వండి.
(కుడి పాదమున ప్రస్తరమును దాటవలెను.)
5. భూమీ! నీవు యజ్ఞమునకు స్థానమవు. నీ స్థాన బలముననే ఇంద్రుడు అసురవధాది వీర కృత్యములను చేయ కలిగినాడు.
(అధ్వర్యుడు ఆహవనీయాగ్నికి దక్షిణ భాగమున నిలువవలెను.)
6. ఆఘోర హోమము నైరుతిన మొదలగును. ఈశాన్యమున సమాప్తమగును. ఇది ఎడతెగనిది. వంకర ఎరుగనిది. ఇంద్రుడు దేవతగా గలది. యజ్ఞపతి యజ్ఞమునకు స్వాహా.
7. అగ్ని, ఆఘోర హోమమున తేజోవంతుడై వెలుగొందుచున్నాడు.
(జుహువును పైకి తీసికొనవలెను.)
8. పాహిమాగ్నే దుశ్చరితా దామా సుచరితే భజ. అగ్నీ! నన్ను దుశ్చరితము నుండి కాపాడుము. సుచరితునిగా చేయుము.
(జుహువు, ఉపభృత్తులను తాకకుండ వెళ్లుచు జపించవలెను.)
9. ఆఘోర హవిశ్శేషమా! నీవు యజ్ఞమునకు శీర్షమవు. ధ్రువపాత్రయందలి ఆజ్యరూప తేజస్సుతో కలిసికొనుము. జ్యోతిషాజ్యోతిరజ్తామ్.
పదమూడవ అనువాకము
(స్రుగ్ వ్యూహనాది మంత్రములు చెప్పబడుచున్నవి.)
1. జుహువు అన్నహేతువు. నేను దానిని ఎత్తిపట్టుకొనుచున్నాను. అందువలన ఇంద్రుడు నన్ను పైకి కొనిపోవును.
(జుహువును ఎత్తిపట్టవలెను.)
ఉపభృత్తును క్రిందుగ ఉంచినాను. ఇంద్రుడు నా శత్రువులను నికృష్టులను చేసినాడు.
(ఉపభృత్తును క్రిందుగ ఉంచవలెను.)
నేను జుహువును పైకెత్తియు, ఉపభృత్తమున క్రిందుగ ఉంచినాను. అప్పుడు బ్రహ్మాది దేవతలు నాకు ఉత్కర్ష కలిగించినారు. నా శత్రువులకు అపకర్ష కలిగించినారు.
(జుహువును తూర్పునకు కదిలించవలెను.)
ఇంద్రాగ్నులు నా శత్రువులను స్థాన భ్రష్టులను చేయుదురు గాత.
(ఉపభృత్తును ఎడమచేత వెలుపల ఉంచవలెను.)
2. మధ్యమ పరిధీ! నిన్ను వసువుల కొరకు తుడుచుచున్నాను.
దక్షిణ పరిధీ! నిన్ను రుద్రుల కొరకు తుడుచుచున్నాను.
ఉత్తర పరిధీ! నిన్ను ఆదిత్యుల కొరకు తుడుచుచున్నాను.
3. ఘృతమున తడిసిన దక్షిణాగ్రమును పక్షులు నాకి పైకి ఎగురును గాక. భార్యను, సంతానమును రక్షింతురు గాత.
(జుహువును దర్భలతో తుడవవలెను.)
4. జలములు ఓషధులు వర్థిల్లును గాత. దర్భలారా! మీరు వాయు ప్రేరిత వర్ష బిందువులు వలన పుట్టినవారు. మీరు స్వర్గమునకు చేరండి. మాకు వర్షము కలిగించండి.
(పలాశ శాఖను, ప్రస్తరమును అగ్నియందు వేయవలెను.)
5. అగ్నీ! నీవు ఆయువును రక్షించువాడవు. నా ఆయువును రక్షించుము. నేత్రములను రక్షించువాడవు. నా నేత్రములను రక్షించుము.
(ఆహవనీయాగ్నిని అభిమంత్రించవలెను.) |
25,315 |
ప్రెజెంటేషన్స్...
పార్కులో ...
"ఇక్కడ కూర్చుందాం మోహన్..." అంది రాధ నడుస్తున్నదల్లా ఆగి.
"వద్దు రాధా...ఇంకాస్త ముందుకెళ్ళి కూర్చుందాం..." అన్నాడు మోహన్.
"వద్దు... ఇక్కడే బాగుంది! మనం ఇక్కడే కూర్చుందాం ..." మోహన్ కాళ్ళ మధ్య తన కాలుబెట్టి మెలిపెడ్తూ అంది రాధ.
ఆ దెబ్బకి మోహన్ కింద ధనేల్ మని పడ్డాడు. రాధ అతని పక్కన కూర్చుంది.
"ఛీ... నువ్వు చాల చిలిపిరాధా ... కదూ?" అన్నాడు బిక్కమొహం వేసి మోహన్.
"లేకపోతే ఏంటి?... నేను చెప్పింది కాదంటే నాకు చిర్రెత్తుకొస్తుంది... తెల్సా?" అంది రాధ.
"మా యింట్లో కూడా అంతే ... ఎవరైనా నాకెదురుచేప్తే నాకు చిర్రెత్తుకొస్తుంది... హిహి..." హుషారుగా అన్నాడు మోహన్.
రాధ చురుకుగా మోహన్ వంక చూసింది.
"మోహన్... ఓసారి లేచి నిలబడవా?" అడిగింది.
"ఎందుకూ?" ఆశ్చర్యంగా అడిగాడు మోహన్ "లేచి నిలబడు... నీకే తెలుస్తుంది..."
మోహన్ లేచి నిలబడ్డాడు.
రాధ చటుక్కున అతని రెండు కాళ్ల మధ్య తనకాలు పెట్టి మెలితిప్పింది.
మోహన్ బ్యాలెన్స్ తప్పి మళ్ళీ ఢమాల్ అని పడిపోయాడు.
"ఏంటి రాధా!... మరీ నిముషానికోసారి ఇలా నీ చిలిపితనం ప్రదర్శిస్తే కష్టమే రాధా..."
నవ్వలేక నవ్వుతూ అన్నాడు.
"లేకపోతే ఏంటి?... మీ ఇంటి సంగతులు నాకెందుకు?... నా దగ్గర మాత్రం నాకెదురు చెప్తే చిర్రెత్తుకొస్తుంది... తెల్సా?" అంది రాధ మొహం చిట్లిస్తూ.
మోహన్ నవ్వాడు.
"మనం రెండేళ్ల క్రితం మొదటిసారి పార్కుకి వచ్చినప్పుడు నువ్వు అస్సలు మాట్లాడ్లేదు...నేను పది మాటలు మాట్లాడ్తే నువ్వు ఒక్క మాట మాట్లాడావ్... అప్పుడు ఎంత సిగ్గుపడ్డావనీ... ఆ... హిహి... ఇప్పుడు మాత్రం నీకు నా దగ్గర భలే చనువొచ్చిందిలే... హిహి... కదూ?"
రాధ మోహన్ వంక చురుకుగా చూసింది.
"అంటే నేను ఇప్పుడు కూడా అప్పట్లా ఉండాలనా నీ ఉద్దేశం?... ఏదీ... ఓసారి లేచి నిలబడు..."
"హబ్బే... ఇప్పుడేందుకులే రాధా... నేనేదో అప్పుడు అలా ఉండేదానివి కదా అని ఊర్కె తల్చుకున్నా... అంతేగానీ ఇప్పుడు అలా ఉండమని కాదు... నాకు నువ్వు ఇప్పుడున్నట్టుంటేనే యిష్టం... హి!" అన్నాడు మోహన్ చేతులు నలుపుకుంటూ.
"ఊ... అట్టారా దారికి".
మోహన్ ఓసారి కళ్లు పెద్దవి చేసి పార్కు గేటువైపు చూసి ఠక్కున కప్పలా గెంతాడు పక్కన ఉన్న పొదవెనక్కి.
"ఏంటలా గెంతావ్?... కొంపతీసి ఇక్కడికొచ్చేముందు ఏదైనా ఛైనీస్ రెస్టారెంటుకెళ్లి కప్పలకూర తిన్నావా ఏంటి?" పొదవైపు ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది రాధ.
"అదేం కాదుగానీ... నువ్వట్టా పొదవైపు చూడకు రాధా... ప్లీజ్. అటెటో చూస్తూ కూర్చో..." పొదవెనక నుండి మోహన్ రిక్వెస్టు చేశాడు.
"ఏం?... ఎందుకని?..." అడిగింది రాధ.
"పార్కులోకి మా చుట్టాలాయన ఒకతను ఫామిలీతో రావడం చూశా... అతను నన్ను చూస్తే ఇంకేమైనా ఉందా?..." పొదవెనక నుండి జవాబు చెప్పాడు మోహన్.
రాధ బాధగా నెత్తికొట్టుకుంది.
"నీ మొహం.. మనం వచ్చేవారంపెళ్లి చేస్కోబోతున్నాం... అయినా ఈ భయం నీకెందుకూ?..."
మోహన్ నాలుక కర్చుకుని పొద వెనకనుండి బయటికి వచ్చి రాధ ప్రక్కన కూర్చున్నాడు.
"అలవాటు ప్రకారం ఎవరైనా తెల్సిన వాళ్లు కనిపిస్తే ఇదివరకట్లా దాక్కున్నా... హి..." అన్నాడు మోహన్ రాధతో.
"అఘోరించలేక పోయావ్ గానీ మన పెళ్లి తర్వాతకొత్తగా కాపురం పెడతాం కదా... మరీ మన కొత్త సంసారానికి కావాల్సిన వస్తువులు కొసడం గురించి ఏమైనా ఆలోచించావా హిహి హిహి అంటూ ఇకిలించడమేవా?"
"అదేంటి... పెళ్లయిన తర్వాత మీ వాళ్లు చీరా, సారె పెట్టి పంపించరా?..."
ఆశ్చర్యంగా మొహం పెట్టాడు మోహన్.
"ఆ... ఆ... అన్నీ పెట్టి పంపిస్తారు నీ మొహానికి" అంటూ రాధ మోహన్ బుగ్గమీద ఓ పోటు పొడిచింది.
మోహన్ బిక్క మొహం వేశాడు.
"లవ్ మ్యారేజ్ వల్ల కట్నం లేదూ పాడూ లేదు... కనీసం సంసారానికి పనికొచ్చే సామాన్లు కూడా పెట్టి పంపరా?..." నీర్సంగా అన్నాడు.
"ఏంటీ?... నీ మొహానికి కట్నం కావాలా?... అసలు ఎవరైనా నిన్ను పెళ్లి చేస్కోడమే గొప్ప... ఇంకా కట్నం కూడానా? నువ్వే నాకు ఎదురు కట్నం ఇచ్చినా తక్కువే!!..."
రాధ బాధగా నెత్తికొట్టుకుంది.
"ఈ పెళ్లి ఖర్చులకోసమే బోల్డు అప్పులు చేశాను... ఇంక ఇంటికి కావాల్సిన సామాన్లు కొనడానికి ఇంకెంత అప్పు చెయ్యాలిరా భగవంతుడా... వా... వహ్హా..." ఏడుపు లంకించుకున్నాడు మోహన్.
"చాల్లే ఊర్కో... ఎవరైనా చూస్తే బాగుండదు" అంటూ మోహన్ నెత్తిన ఒక జల్లకాయ్ కొట్టింది రాధ.
"హిహి..." అన్నాడు మోహన్.
"హర్రే!... జల్లకాయ్ కొట్టగానే భలేగా నవ్వావే!!... ఏదీ మరోసారి!"
పఠాళ్ అని రాధ మోహన్ కి జల్లుకాయ్ కొట్టింది.
"హిహ్హి... హిహిహి... హ్హిహ్హిహ్హి" మళ్ళీ నవ్వాడు.
"హర్రే!... గమ్మత్తుగా ఉందే... ఏదీ మరోసారి..." సడేల్ మని కొట్టింది ఈసారి.
మోహన్ ఈసారి నవ్వలేదు... ఆమె వంక చిరుకోపంగా చూశాడు.
"నేనేం నువ్వు జల్లకాయలు కొడ్తుంటే నవ్వడంలేదు... ఇంక జల్లకాయలు కొట్టమాకు" అన్నాడు.
"మరెందుకు నవ్వుతున్నావ్?" అడిగింది రాధ.
"సడ్డెన్న్ గా నాకో విషయం గుర్తుకు వచ్చింది... నేనేం ఇంటికి కావాల్సిన సామాన్లు మొత్తం కొనక్కర్లేదుగా!..." సంబరంగా అన్నాడు మోహన్.
"ఏం?... ఎందుకు కొనక్కర్లేదు... కొంపదీసి నన్ను పెళ్లి చేస్కోకూడదని నిర్ణయించుకున్నావా ఏంటి?... ఏదీ...ఓసారి లే... లేచి నిలబడు..." సీరియస్ గా అంది రాధ.
మోహన్ కిసుక్కున నవ్వాడు.
"నన్నలా అపార్థం చేస్కోకు రాధా... మరేమో నేనలా ఎందుకన్నానంటే... మన పెళ్ళికి చాలా మంది ప్రజంటేషన్లు తెచ్చిస్తారుగా!!... వాటిల్లో మన ఇంటికి పనికివచ్చేవి చాలా ఉంటాయి... లేనివి కొన్ని మాత్రం మనం కొనుక్కుంటాం... హిహి... కదూ?
"నీకు భలే తెలివితేటలున్నాయే!..." అంటూ రాధ మోహన్ డిప్పమీద సంబరంగా ఠపేల్ మని వాయించింది.
వారం రోజుల తర్వాత రాధ, మోహన్ ల పెళ్లి జరిగిపోయింది.
పెళ్లికి వచ్చిన చాలామంది చేతిలో ప్రజంటేషన్ల ప్యాకెట్లతో వచ్చారు... పెళ్లి కాగానే అందరూ వధూవరులకు బెస్ట్ విషెస్ చెప్పి, వాళ్ల చేతిలో ప్యాకెట్లు పెట్టి భోంచేసి వెళ్ళిపోయారు.
పెళ్ళి హడావిడి తగ్గి వచ్చిన స్నేహితులూ, బంధువులూ వెళ్లిపోయేసరికి రాత్రి పదకొండు గంటలైంది.
రాధ, మోహన్ ఇద్దరూ గదిలోకి చేరారు.
మోహన్ క్రాపు రివ్వున ఎగిరి మళ్లీ నొసలు మీద పడింది.
"హబ్బా!... గాలి చాలా ఎక్కువగా వీస్తున్నట్టుంది ...కిటికీ తలుపులు వేసేద్దామా?..." రాధని అడిగాడు మోహన్.
"నీ మొహం... అది బయటినుండి వచ్చిన గాలికాదు... నిద్దరొస్తుంటే నేను ఆవులించా... హిహి! మనం ఇహ నిద్దరోదామా?" అంది రాధ కళ్లు మిటకరిస్తూ.
"అప్పుడేనా?... మనకి ఏమేం ప్రజంటేషన్లు వచ్చాయో చూస్కోవద్దూ?" అన్నాడు మోహన్ గది మూల కుప్పగా పడివున్న ప్రజంటేషన్లు ప్యాకెట్ల వంకచూపిస్తూ.
"హవును కదూ?... ఆ విషయమే మర్చిపోయా" హుషారుగా అంది రాధ.
ఇద్దరూ ప్రజంటేషన్ల మీద ఎగబడ్డారు.
మొట్టమొదటి పాకెట్ మోహన్ విప్పాడు. అందులోంచి ఒక టేబుల్ లైట్ బయటపడింది. |
25,316 | చిన్న నాఁట నుండియు భవభూతి యుత్తర రామచరిత్ర మన్న నాకు పరమానందము. అందులో పలుకులు 'జగజ్జిర్ణరణ్యమ్ . . . కూకులానాం రాశౌ తదను హృదయం పచ్యత ఇవ' అన్నవి సదా నా తలఁపులో మెదలుచుండెడివి. ' జగజ్జిర్ణరణ్యమ్' అనుటకు గొప్ప వివరము కాన వచ్చెడిది. అరణ్యమేని, అందు ఛాయా ఫల పుష్ప వృక్షములు, లతా గుల్మములు, జలాశయములు, పక్షికలకలములు, దృశ్యజ్మతు విహారములు, మనుష్య సంచారము నుండును ముండ్ల పొదలు, వ్యాఘ్రు దు ఘుతక జంతువు, సర్ప, వృశ్చిక, వృక్షాదులునున్నాను నుండును గాని పుష్పఫలాదులకై యందు ప్రవేశించువారు- కంట కాద్యపాకరణ సాధనములఁ గొని నిరపాయముగా కార్యము నిర్వర్తించుకొని రాఁ గలరు. జిర్ణారణ్యమున ఛాయా ఫలపుపుష్ప వృక్షము లుండవు. జలా శయము లుండవు. లతాగుల్మము లుండవు. ఎండు టడవి. రక్కెస మట్టలు, చీకి రేను పొదలు, పాములు, తేళ్లు, తోడేళ్లు మొదలగునవి మాత్రమే ఉండును. కర్మవశమున త్రోవ తప్పి యెవఁడే నందుఁ జేరానా వాఁ డక్కడ కడతేర వలసిన వాఁడే యగును. జగ త్తొక జిర్ణారణ్యముగా, దుర్విధిచే నే నందు చేరినట్టుగా భావించెడివాఁ డను.
౨౧
వెలుఁ గు నీడలు
భవభూతిపునరుక్త మయిన యీశావస్యోపనిషద్వాక్యము " అసుర్యానామ తేలోకా అంధేన తమసావృతాః, తాం స్తే ప్రేత్యాభిగచ్చన్తి యేకే చాత్మహనో జనాః" అన్నది యాత్మహత్య సంకల్పజ్వాలలను జలార్చి వేయు చుండెడిది. కడుపసిప్రాయమున కనులు మూసికొని బోరగిల పడుకొని చూచుచుండినపుడు నేను "నే నని" నాలో గోచరించిన మినుకు గ్రుడ్డి వెలుఁ గే దూరమున గోచరించి జీవితాశోచ్చ్వాస మాడించుచుండెడిది.
మందులు మానితిని గనుక మావారు మంత్రముల కేసి దృష్టి సారించిరి. వారిని వీరిని పిలిపించి మంత్రజపము చేయింప నుద్దేశింపఁగా నేను వారింపఁ జొచ్చితిని. యా మంత్ర ప్రయో క్తల యోగ్యతలు నే నేఱిఁగినవే. కనుక వారిని బిలిపింప నొల్లనయితిని. నా యనారోగ్యమును నన్నడిగి విద్వాంసుఁడు గదా యని నేను చెప్పఁగా విని వేద శ్రౌత విద్వావిశారదుఁ డొకఁ డు ' ఏఁ బడి రూపాయలు తెచ్చుకొని నా కిచ్చితి వేని నీకు మోహిని పట్టినది. దానిని తొలఁగింప గలను ' ఇత్యాదిగా నేదో చెప్పెను. ధిక్కని తెగడితిని. అనుదినము సహస్రగాయత్రి మంత్ర జపము చేయుచు నమాయ కుఁడుగా నందు వృద్ధ బ్రాహ్మణు నొకని- ఆయన కుమారుఁదు మాయూర స్కూలు మేష్టరుగా కొన్నాళ్ళుండెను - బిలిపింప నుద్దేశింపఁ గా నేను వెళ్ళే యంటిని. వానిని గ్రామాంతర మున నుండి పిలిపించిరి. నలువది దినములు మంత్రజపమాయన జరపెను. ఆయన వల్ల నా కేమాత్రము మేలు జరుగ బోదని నేను బిగ్గ పలుకుచుండెది వాఁడను. వీనికిఁ పట్టిన గ్రహ చారమో, గ్రహమో ఉపకారకము లయిన పద్ధతుల పై వీనికి విశ్వాసము కుదురు నీయ కున్నదని మా వారు తెగడఁ జొచ్చిరి." నిజమే! నా కిట్టివారి ప్రజ్ఞ మిఁ ద విస్వాసను లేదు.అదే నా జబ్బు అనుచున్న వారు మిరో వారో కొల్పుఁడు' అనువాఁ డను. నలువది నాళ్ళయిన తర్వాత జల ఫలము నాకు ధారాద త్తము చేయుటకు గొప్ప బ్రాహ్మణ సంతర్పణము జరపిరివృధా ధనవ్యయ మని నేను వగవఁ జొచ్చితిని. ఇట్టి చీకాకు లెన్నో పడితిని. వేనివల్ల గాని నాకు మేలు జరగా లేదు. తొట్టె స్నానము, ఉప్పుకారములు లెనిఒ భుక్తి ఒక మాదిరిగా చేయుచునే యుంటిని.
మద్రాసులో నా స్థానమున నియుక్తులైన విద్వాంసులు హఠాత్తుగా అంతరించి. చలి జ్వరము నూట యాఱుడిగ్రీల పై చిలుకు వచ్చి ఆ తర్వాత ఔషధము నిరుప యోగము కాఁగా పుణ్యలోకముల కరిగిరఁ ట!మా ఆఫీసు క్యురేటారు శ్రీ కుప్పు స్వామి శాస్త్రిగారు నాకు డి. ఓ. వ్రాసిన .' నీవు వచ్చి డ్యూటిలో చేరుట మంచిది. నీకు తొందర కలుగకుండ దేశాటనము చేయ నేర్పాటు చేయుదును. రావలసినది' అని. ఆవత్సరమున పరిషత్తు సంవత్సరోత్సవము గుంటూర జరగెను. నేను చాల గౌరవించు వేదము వెంకటరాయ శాస్త్రిగారి యాద్యక్షము మిత్రులు శ్రీ రామకృష్టకవిగారు నన్ను మద్రాసు రాఁ గోరి జాబు వ్రాసిరి. గుంటూరఁ గలసికొందు నని బదులు వ్రాసి యట్లె గుంటూరు వెళ్ళితిని.నేను మాటాడినది, చేసినది ఏమియు లేదు. అయినను ఆయుపన్యాసము వినికిడికి, ఎండలకు తాళఁ జాలక పోయితిని. మిత్రులు కనుపర్తి మార్కుండేయశర్మ గారి యింట విడిసి, తొట్టె సాన్నము చేసి కొంత స్వస్ధ్యము కూర్చు కొంటిని.
|
25,317 | 59.కడుపులో నొప్పి, గ్యాస్ చేరడం, కడుపు ఉబ్బరం, త్రేపులు రావడం పొగొట్టట్టం ఎలా?
"బాబాయిగారూ, చాల కాలానికి మాయింటికి వచ్చారు మీకు ఇష్టం అని బంగాళాదుంపవేపుడు చేశాను" అంటూ ఆప్యాయతతోకూర వడ్డించబోయింది వనజ.
"బంగాళదుంపకూరే! వద్దమ్మాయ్ నాకు అరగదు" అంటూ చెయ్యి అడ్డం పెట్టారు. బాబాయిగారు. "పోనీ కండిపప్పు పచ్చడి చేశాను. వేసుకోండి" అంది వనజ "అది కూడా వద్దమ్మా. ఆ పచ్చడి తింటే జీర్ణం కాదు, పైగా కడుపులోనొప్పి వసతుమ్ది" అంటూ అప్పుడు కూడా అభ్యంతరం చెప్పడయాయన.
పోనీలేండి, మీ అబ్బాయికి పరమాన్నం అంటే మహాఇష్టం. మీరు కాస్త రుచిచూడండి" అంటూ పరమాన్నం గురించీ, ఆ రోజు వండిన కూరల గురించీ ఒక్కొక్కటి చెప్పసాగింది వనజ.
"అమ్మాయ్! నీవు ప్రేమతో ఇన్నిరకాలు వండావుగాని నీటిలో ఏవి తిన్నా నాకు సరిపదవంమా. కేనీసం స్ఖీరాన్నం తిందామన్న నాకుపాలు పడటంలేదు చెంచాడు క్షీరాన్నం తిన్నాసరే, నాకు విరోచనాలు అచుతాయి" అని ఆమెకు నచ్చచెప్పి చివరికి రసంతోను, మజ్జిగతోను భైజనం పూర్తీ చేశాడాయన.
`వనజ బాబాయి ఒక్కడేకాదు, చాలామండి తమకు చాలా ఆహార పదార్ధాలు సరపదనీ, ఒకవేళ జిహ్వాచాపల్యంతోఏమైనా తిన్నా అవి జీర్ణమవక బాధపడవలసివస్తుందనీ చెబుతూ ఉంటారు.
కొన్ని ఆహారపదార్ధాలు కొందరిలో జీర్ణం కాకాపోవడానికి జీర్ణకోశ సంభంధమైన వ్యాధులు కారణం. మరి కొందరిలో అది మానసిక భయం జీర్ణం కాకపోవడమనేది రోగులక్షణమా, మనసికనూ అనేది తగిన పరీక్షలు నిర్ధారణ చేయవలసి ఉంటుంది. ఏది ఏమైనా కొన్ని ఆహార పదార్ధాలు సరిపడవు అని చెప్పేవారిలో కడుపులో నొప్పి రావడం గ్యాస్ చేరడం, కడుపు ఉబ్బడం, త్రేపులు రావడం వగైరా లక్షణాలు ఉంటాయి.
కొందరు తమకి పాలు సరిపదనీ అవి తాకితే కడుపుఉబ్బి నొప్పి వస్తుందనీ, విరోచనాలు అవుతాయని చెప్పే వ్యక్తుల్లో లాక్టోజ్ ఏజిం ఏదైనా కారణంవల్ల లోపించి పాలు అరగావు. కొందరికి నెయ్యి, మీగడ పెరుగు, కొబ్బరి తింటే కడుపులో నొప్పిగా ఉంటుంది. గ్యాస్ చేరుతుంది. అంటే వారిలో పాన్ క్రియాన్ గ్రంధి సరిగ్గా పనిచేయటంలేదనో, లివరు వ్యాధి గ్రస్తమయిందనో గ్రహించాలి. మరికొందరికి కొన్ని ఆహార పదార్ధాలవల్ల ఎలర్జీ జీర్ణకోశంలోగందరగోళం సృష్టించబడుతుంది. అప్పుడు జీర్ణగ్రంధులు సరిగ్గా పనిచేయకపోవచ్చు. ఇలాంటివారే తమకు టొమాటోనడదు, క్యాబేజీ పడదు, గోంగూర పడదు అంటూ ఉంటారు.
ఫలానా పదార్ధం సరిపడదు అనుకునేవరు రోజూ ఆహారం తీసుకుని తమకి జీర్ణశక్తి సరిగ్గాలేదని వాపోతూ ఉంటారు. దానికి కారణం వరు ఏ ఆహారం తీసుకున్నా తరువాత కడుపు నిండుగా ఉన్నట్టు, అనిపించడం, తిన్నది కొద్దిగానే అయినా పొట్ట మాత్రం మరింత ఉబ్బుకుని ఎత్తుగా పైకి కనబడటం అందుకు కారణం. దాంటో ఆయాసం వచ్చి అపసోఅఫలు పడతారు. చివరికి నాలుగైదుసార్లు త్రేన్పులు రావడానికి వారు తీసుకున్న ఆహారం కారణం కానేరదు. వీరు భోజనం చేస్తున్నప్పుడు ఆహరంతో పాటు దానికి రెట్టింపు గాలినికూడా తెలియకుండా మింగుటారు. అలా కడుపులోకి చేరిన గాలివల్ల కరువు ఉబ్బునట్లు అవుతుంది. త్రేన్పులు రావడంవల్ల గాని ఇతరట్రాగాని ఆ మింగిన గాలి బయటకు వచ్చేస్తుంది. ఇంతవరకూ ఇబ్బంది తప్పదు. న్యూరాసిస్ ఉన్నవారిలో ఇలా గాలి మింగడం ఎక్కువ.
కొన్నిరకాల బాక్టీరియా క్రిములు, మోల్ద్సు, ఈస్టులాంటివి జీర్ణకోశంలో ఉండి మనం తీసుకునే అన్నం, పిమ్దిఉవంటలకు, పప్పు పదార్ధాలను జీర్ణమయ్యేలా చేస్తాయి కొందరిలో ఈ బాక్టీరియా, ఈస్టుక్రిములు తగినన్ని జీర్ణకోశంలో ఉండకబావువటంలో ఎక్కువ పిండిపదార్ధాలు తిన్నా, పప్పుపదార్ధాలు తిన్నా అవి జీర్ణమవడానికి ఆలస్యమవుతుంది. ఈలోగా సగం జీర్ణమైనా పదార్ధాలద్వారా, గ్యాస్ ని కలిగించే బాక్టీరియా క్రిములు కడుపులో చేరడంవల్ల గ్యాస్ తయారవుతుంది టెట్రాసైకిలిన్స్, క్లోరో మైసిటిన్స్ లాంటి యాంటిబయాటిక్స్ తరుచుగా వాడినా ఎక్కువ రోజులు వదినా జీర్ణశక్తికి ఉపయోగపడే మంచి బాక్తెరియా, ఈస్ట్ వంటివి నాశనమై పోతాయి. తద్వారా జీర్ణశక్తి చేడిపోయి, కడుపు ఉబ్బినట్లు అనిపిస్తుంది.
కొందరికి ఏమాత్రంవేరుసెనగకాయలు తిన్నా, చిక్కుడుకాయకూరతిన్నా, అరగనట్లు అనిపించి కడుపులో నొప్పి వస్తుంది. గ్యాస్ కూడా చేరుతుంది. వీటిలో జీర్ణం కాకుండా పెగుల్లోనే ఉండిపోయే చక్కర పదార్ధాలు కొన్ని ఉండటమే దానికి కారణం. జీర్ణకోశంలో తగినంత ఈస్ట్, మంచిచేసే బాక్టీరియా క్రిములు లేనప్పుడు జీర్ణకాకుండా ఉండిపోయి ఈ చక్కర పదార్ధాలు మరింత బాధపడతాయి.
జీర్ణకోశంలో యాసిడ్ ఎక్కువ తయారవడం, పుండ్లు ఏర్పడడం లేన్సర్, టి.బి లాంటి వ్యాధులు ఉండటం, ఇతర శారీరిక అనారోగ్యపరిస్థితులవల్ల కూడా ఆకలి సరిగ్గా ఉండదు ఒకవేళ ఆకలి ఉన్నా అరుగుదల ఉండదు. అందువల్ల అరగకపోవడానికి అసలైన ల్కారణం ఏమిటో వైద్య పరీక్షిల ద్వారా నిర్ధారణ చేసుకుని దానికి తగిన విధంగా చికిత్స పొందడం అవసరం.
*****
|
25,318 | 'నర్సమ్మ, నాయర్ నమ్మకస్తురాలయిన నౌకర్లు అనుకుంది. కాని తను పిచ్చిది అని తెలిసి కూడా వాళ్లిరువురు తను రాంగానే చటుక్కున మాటలెందుకు ఆపేయాలి, నాయర్ కనుసైగ చేయాలి? అది గ్రహించి నర్సమ్మ ఎందుకెళ్ళిపోవాలి? ఈ యింట్లో వీరిరువురి గూడుపుఠాణీ ఏమిటి? ఇంట్లో సామానులు చాటుగా చేరవేసే యింటి దొంగలా? భగవాన్ గాడి మోచేతి నీళ్ళు తాగి పడున్న మోసగాళ్ళా?"
తను రాసిన లెటర్ నాయర్ కి గాని, నర్సమ్మకి గాని యిచ్చే ప్రయత్నం మానేసి, ఆలోచనలో పడిపోయింది అమల.
"ఏంటమ్మాయిగారూ! ఏం కావాలి?" అన్నాడు నాయర్ కుక్కర్ మీద వెయిట్ పెడుతూ.
అమల మాట్లాడలేదు. గోళ్ళు కొరుక్కుంటూ వుండిపోయింది.
"ఇదో పిచ్చిమాలోకం. గొప్పోళ్ళింట్లో కుక్కలకి రాజభోగమే, పిచ్చిముండలకి స్వర్గసౌఖ్యాలే." నాయర్ గొణిగాడు.
'తిన్న యింటి వాసాలు లెక్కపెట్టే వెధవ. ఈ ఆస్థికి కాబోయే యజమానురాలు, యజమాని కూతురు, ఈచవటకి పిచ్చిముండ అయింది. లక్షాధికారి కూతురుగా పుట్టికూడా ఏమి సౌఖ్యం అనుభవించావు సరోజా?" అనుకుంది అమల.
"ప్రభాకర్ గారు..... గారు..... వచ్చారా?" కనుగుడ్లు మిటకరించి అడిగింది అమల.
"ఆ......ఆ..... వచ్చాడు, వచ్చారు. సరాసరి కళ్ళు మూసుకుపోండి, కనపడతారు. ప్రభాకరుడు" నాయర్ వ్యంగ్యంగా అన్నాడు.
"ఇదిగో కళ్ళు మూసుకుని నీవు చెప్పినట్లే వెళుతున్నా. ప్రభా కనపడకపోయాడో, జాగ్రత్త నీ ముక్కు చెవులు కోసి కుక్కలకు వేస్తా" అని అమల కళ్ళు తెరుచుకునే రెప్పలయినా ఆర్పకుండా గదిలోంచి బైటకు వచ్చింది.
'నాయర్ ని, నర్సమ్మని, తనని ఈ ఇంట్లో ప్రవేశపెట్టిన నౌకర్ ని, శంకరంని, ఎవరిని నమ్మటానికి లేదు. మరి ఎవరిని నమ్మితే పనవుతుంది?" ఆలోచిస్తూ అమల ముందు గదిలోకి వచ్చింది.
ముఖ్యమైన వాళ్ళతో అతి ముఖ్యమైన పనులు మాట్లాడటానికి వరండా ముందు గది వుపయోగిస్తుంటాడు భుజంగరావు.
గది లోపలికి అడుగుపెట్టి ఆగిపోయింది అమల. గిరుక్కున వెనుతిరిగి పోదామనుకుంది. కాని ఆ ప్రయత్నం విరమించి, అక్కడే నుంచుంది.
"రోజా తల్లీ! రామ్మా! ఇంతకుముందే మన కృష్ణ వచ్చాడు. నీ బావమ్మా!" భుజంగరావు సోఫాలోంచి లేచి అమలవద్దకు వస్తూ అన్నాడు.
"రోజీ!" అన్నాడు కృష్ణ సోఫాలోంచి లేచినుంచుని.
అమల పిచ్చివాలకంతో కృష్ణని ఎగాదిగా చూస్తూ నుంచుంది.
సీమ దొరలా వున్నాడు కృష్ణ. ఖరీదైన సూటు, మంచి పర్సనాలిటీ. నల్లని నొక్కుల దుబ్బు క్రాఫు, గుబురుగా వున్న సైడ్ లాక్స్, ఉండిలేనట్లు సన్నని మీసకట్టు. ఎర్రటి పెదవులు విశాలమైన నుదురు, చురుకైన కళ్ళు. సూటిగా వున్న ముక్కు, అందము, హుందాతనం అతని సోత్తయినట్లున్నది.
"సరోజ ఈ కృష్ణను కాదని ప్రభాకర్ అందమైనవాడా?" అమల ఆలోచిస్తున్నది. |
25,319 | "ఆ మానసికమైన వత్తిడిలో ముద్దాయికి తనేం చేస్తున్నదీ తెలిసే అవకాశం వున్నదా ?"
"లేదు"
"థాంక్స్ డాక్టర్ ! దట్సాల్" డిఫెన్స్ లాయర్ తన వాదన వినిపించటం ప్రారంభించాడు.
* * *
ఆరోజే జడ్జి తీర్పునిచ్చేది.
క్రింద కోర్టులో జడ్జి ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా తీర్పు వుండదని కొందరూ, కాని ఈసారి డిఫెన్స్ లాయరు వాదన బలంగా వుంది కాబట్టి జడ్జిమెంటు వేరుగా వుంటుందని కొందరూ వాదించుకున్నారు. అసలు ఫలితం తెలుసుకోవటం కోసం జనం కోర్టులో నిండిపోయారు.
జడ్జి తన సుదీర్ఘమైన తీర్పు చదివాడు.
హైకోర్టు జ్యూరిస్ డిక్షన్
ఆంద్రప్రదేశ్ _ హైద్రాబాద్
ప్రజెంట్ : ది ఆనరబుల్ జస్టిస్ : థర్మదాస్
గిరి అప్సలెంట్ (అక్యూజ్ డ్)
వర్సెస్
ది స్టేట్ రెస్పాండెంట్ (కాంప్లెయిట్)
జడ్జిమెంట్
1. గిరిధర్ పద్మజను కోరి వివాహం చేసుకున్నాడు. పెళ్ళికి ఆతనే ముందుగా ప్రతిపాదించినట్టు రుజువయింది. వారి దాంపత్య జీవితంలో ఎలాంటి మనస్పర్ధలూ లేవనీ, వారిద్దరూ చాలా అన్యోన్యంగా వుండేవారనీ తెలిసింది. వివాహం అయిన రాత్రి గిరిధర్ ప్రవర్తన కాస్త వింతగా వుందని పద్మజ, స్నేహితుడయిన డాక్టర్ రామకృష్ణకు తెలియజేసింది. వారి వివాహం అయిన కొద్దిరోజుల తర్వాత ఒక పార్టీలో గిరిధర్ అందరి ఎదుట ఏదో విదేశంలో జరుగుతున్న విషయం గురించి ముందుగానే చెప్పగలిగాడు. ఆ తర్వాత అలాంటి విషయాలెన్నో అతనీ విధంగానే చెప్పేవాడు. అవన్నీ నిజంగా జరిగేవని తెలిసింది. అతనికీ శక్తి ఎలా వచ్చింది ? ఇది జవాబులేని ప్రశ్న. దీనినే ఆత్మ ఆవహించడం, దెయ్యంపట్టటం అన్నారంతా. అయితే కోర్టు వీటిని ఆ పేరుతో కాకుండా స్కిజోఫ్రెనియా అని వ్యవహరిస్తుంది.
2. పద్మజ పుట్టినరోజున గిరిధర్ డిన్నరు ఏర్పాటు చేయించాడు. అందరూ భోజనాలుచేసి కూర్చున్నాక గిరిధర్ ఎందుకో పైన గదిలోకి వెళ్ళాడు. హతురాలు కూడా కాస్సేపయ్యాక వెళ్ళింది. వారి మధ్య చిన్న వాగ్వివాదం జరిగింది. గిరిధర్ ఆవేశంతో పద్మజను మెట్లమీద హత్య చేయడం అందరూ చూశారు. గిరిధర్ స్పృహతప్పి పడిపోయాడు. తెలివి రాగానే ఇనస్పెక్టరుకు అతను తను చేసిందేదీ గుర్తులేదని చెప్పాడు.
3. తెలిసే చేజేతులా భార్యను హత్యచేశాడని క్రింద కోర్టు అతనికి సెక్షన్ 302 ఐ.పి.సి. ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష, సెక్షన్ 324 ఐ.పి.సి. ప్రకారం రెండున్నర సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది....రెండూ ఏకకాలంలో అమల్లో పెట్టేటట్లుగా.... అందువల్లనే ముద్దాయి హైకోర్టుకు అప్పీలు చేసుకోవటం జరిగింది.
4. హత్య జరిగిన సమయంలో అక్కడే వున్న డాక్టర్ రామకృష్ణ మెంటల్ హాస్పటల్ డిప్యూటీ సూపరింటెండెంట్. ఆయన వెంటనే ముద్దాయిని పరీక్షచేసి అతను పారనాయిడ్ స్కిజో ఫ్రెనియాతో బాధపడుతున్నాడని చెప్పారు. ఆ జబ్బుతో బాధపడే వ్యక్తికి ఏవేవో స్వరాలు వినిపించడం. ఎవరో తననేదో చేయబోతున్నారనే భావన కలగటం సహజం అని డాక్టర్లు చెప్పారు.
5. ఇన్ సేవిటీ లేదా తెలుగులో చెప్పాలంటే పిచ్చి అనే పదానికి సరయిన నిర్వచనం లేదు. ఇది ఒక మానసిక రుగ్మత అన్న విషయం అందరూ ఒప్పుకున్నదే. ముద్దాయిని కొద్దికాలం మెంటల్ హాస్పిటల్ లో వుంచటం జరిగింది. అక్కడ కూడా అతని ప్రవర్తన అప్పుడప్పుడు కాస్త అసాధారణంగా వుండేదని, అతను సరిగా భోజనం చేసేవాడు కాదనీ, చాలా నిర్లిప్తంగా వుండేవాడనీ, అక్కడ అతనికి వైద్యం చేసి డాక్టర్లు చెప్పారు. వారు కూడా అతని జబ్బును పారనాయిడ్ స్కిజోఫ్రెనియాగా గుర్తించారు.
ఈ ఆధారాల్నిబట్టి ముద్దాయి మానసిక రోగంతో బాధపడుతున్నాడని రూడిగా తెలుస్తోంది. అయితే ఈ ఇన్ సేనిటీ అన్న పదానికి వైద్యశాస్త్రంలోగాని, న్యాయశాస్త్రములోగాని సరైన నిర్వచనం లేదు. మన దేశంలోనే కాదు, ఇతర దేశాల్లో కూడా లేదు. అందువలన ఈ మానసిక రోగగ్రస్తులైన నేరస్తుల విషయంలో విదేశాల్లో న్యాయస్థానాల్లోని కేసులను ఉదహరిస్తాను.
6 (ఎ) క్రీ.శ. పదమూడవ శతాబ్దిలో జూరిస్టుగా పనిచేసిన హెన్రీ బ్రాక్టన్ అనే వ్యక్తి తను చూసిన కేసులన్నింటినీ ఒక సంపుటంగా వెలువరించాడు. మహారాజు అయినా సరే చట్టానికి అతీతుడుకాదని వాదించిన మొదటివ్యక్తి అతను. మానసిక రుగ్మతలు న్యాయవిచారణలో ఎలాంటి అవరోధాలను కల్పిస్తున్నదీ అతను వివరించాడు.
6 (బి) 17వ శతాబ్దంలో లార్డ్ హేట్ అనే న్యాయాధికారి మానసిక జాడ్యంతో బాధపడే వ్యక్తి తను చేసిన నేరాలకు బాధ్యుడు కాదని మొదటిసారిగా తీర్పునిచ్చాడు. 1724లో జస్టిస్ ట్రేసీ, ఆర్నాల్డ్ అనే వ్యక్తి కేసులో 'పిచ్చి' అనేది మనిషి వివేకాన్ని లోపింపజేస్తుందనీ, అతను ఏం చేస్తున్నదీ, ఎందుకు చేస్తున్నదీ ఆలోచించే శక్తిని కోల్పోయి ఒక పశువులా ప్రవర్తిస్తాడనీ అన్నాడు. దీన్ని 'వైల్డ్ బీస్ట్ టెస్ట్' అన్నారు. 1800లో జార్జి చక్రవర్తిమీద అఘాయిత్యం జరిగినపుడు అప్పటి ముద్దాయి తరపున వాదించింది అప్పట్లో ప్రఖ్యాతి పొందిన లాయరు థామస్ ఎరిస్కిన్. మానసిక జాడ్యం ఉన్న మనుషులు అందరూ జంతువుల్లా ప్రవర్తిస్తారనే నమ్మకాల్ని ఎదిరించాడు. ఒక రకమైన భ్రమలో వున్న మనుషులూ మానసికరోగులే అని అతని వాదన. దాంతో 'వైల్డ్ బీస్ట్ టెస్ట్' అధ్యాయం ముగిసింది. ఈ భ్రమ అన్నది కూడా ఒక భ్రమగా కొద్దికాలం మాత్రమే గుర్తించబడింది. తర్వాత 1843లో మెక్ నాటెన్ రూల్స్ అమలులోకి వచ్చాయి. ఈనాటికి ఈ సూత్రాలమీదే న్యాయం పరిశీలించబడుతోంది. |
25,320 | సీత ఇనుప ఊచ వేపు చూసింది. కుంపట్లో నిప్పికన్నా ఎర్రగా కాలివుంది. ఆ ఊచ సరిగా బొటనవేలంతా సైజూ మూరెడు పొడుగు వున్న ఆ ఊచ కిటికీకి పెట్టేది. అవసరానికి సంపాదించాడు సుందరమూర్తి. "మీరు చాలామంది అడళ్ళతో పోయారు" ఉన్నట్టుండి అంది సీత. "....ఎంత మాటన్నావ్" చిత్కారం చేస్తున్నాడు సుందరమూర్తి. "ఉన్నమాటే, ఓదాంతో పొతే రోగం కూడా అంటుకుంది కదూ?" రోగం అంటుకుంది అన్న అపనిందకి సుందరమూర్తి వణికిపోయాడు. "ఏమన్నావ్? ఏమన్నావ్? ఏకపత్నివ్రతుడ్ని నన్నింత మాటలంటావా?" కళ్ళనీళ్ళు పెట్టుకుని కోపంతో మరోపక్క ఊగిపోతూ అన్నాడు. "ఒక్కసారి కాదు వందసార్లంటాను మీరు చెడిపోయారు. మీరు పాడయిపోయ్యారు. మీరు తిరుగుబోతని నాకు అనుమానం. నా అనుమానం పొతే గాని మీతో కల్సి కాపురం చెయ్యను. మీకు నా మీద అనుమానం. మన అనుమానాలు తీరి హాయిగా సంసారం చెయ్యాలంటే ఒకటే మార్గం. ముందుగా మీరు చేతులు చాచండి. ఈ కాలిన ఊచని ముమ్మారు మి చేతిలో ఉంచి చూస్తాను. మి చేతులు కాలకపోతే మీరు నిజంగా ఏకపత్నివ్రతులు. పుణ్యపురుషులు. ఆ తర్వాత మీకు ఆ ఊచని నా చేతిలో ముమ్మారు వుంచండి. నా చేతులు కాలకపోతే నేను పతివ్రతని. ఈ ఇనుప ఊచ ప్రభావంతో ఇద్దరు చేతులూ కాలాయనుకోండి చిక్కే లేదు. ఒకరి చేతి కొకరం బర్నాల్ రాసుకుంటూ చక్కగా కబుర్లు చెప్పుకుంటూ కుచుందాం" అంది సీత. సుందరమూర్తి పళ్ళుడిపోయేంతా గట్టిగా పళ్ళు పటపట లాడించాడు. "నన్ను పరిక్ష చేస్తావుటే, పాపిష్టిదానా?" అన్నాడు కోపంతో గట్టిగా అరిచి. ఇది కలికాలం, సమాన హక్కులు ఉన్నాయి. నన్ను పరిక్ష చేయదల్చారు. నేను మిమ్మల్ని పరిక్ష చేయ దల్చాను. పరిక్షకి మగేమిటి అడేమిటి మీ చేతులు కాలేకే నా చేతులు కాల్చుకుంటాను." అంది సీత ఏమాత్రం తొణక్కుండా.
"తప్పించుకోవటానికి ఇదో సాకు. చెడిపోయిన దానివి ఆ జమదగ్నిగాడితో తిరిగిన దానివి, పరిక్ష చేస్తానంటే ఎలా ఆమోదిస్తావ్! చేడినదానికి చెయ్యికాలుతుందే? అది నీ భయం. నీ మాటవినే అవసరం నాకిక లేదు. అమ్మవుంది అన్నింటికి, అమ్మా! మాతా మహేశ్వరీ! నా పెళ్ళానికి పిచ్చేక్కిందో, నిజంగా చెడిపోయి నాటకం అడుతున్నదో నువ్వే తేల్చి నన్ను రక్షించు తల్లి! నీ అజ్ఞగా ఈ పరిక్ష చేస్తున్నాను." గట్టిగా అని కుంపట్లొంచి కాలిన ఇనుప ఊచ తీశాడు సుందరమూర్తి. భయంతో లేచి కూచుంది సీత. "ఊ....చేతులు చాచు. ఇది అమ్మ అజ్ఞ. చెప్పినట్లు వినకపోతే మూడు వాతలు కాదు వళ్ళంతా ముప్పయి వాతలు పెడతాను." అంటూ సుందరమూర్తి ఊచని పైకెత్తాడు. సీత కెవ్వున కేకపెట్టి వాకిలి కేసి పరుగు తీయబోయి టకీమని ఆగిపోయింది. వాకిలి గుమ్మానికి అటో చెయ్యి ఇటో చెయ్యి వేసి గుమ్మానికి నిండుగా అడ్డంగా నుంచుని వున్నాడు శ్రీపతి. ఎక్కడికి పోతావ్! కానిరా సుందరం" అన్నాడు. సుందరం చేతిలోని ఇనుపఊచ సీత వీపు మీద అనింది. గదంతా ప్రతిధ్వనించేలా హృదయ విదారకంగా అరిచింది సీత. వెంటనే శ్రీపతిని తోసి బైటికి పారిపోయెందుకు ప్రయత్నించింది. శ్రీపతి పడగ విప్పాడు. చటుక్కున సీతని పట్టుకున్నాడు. ఆ భల్లూకం పట్టు విదిపించుకోవటం సీత తరంకాదు. పెనుగులాడుతున్న సీతని గట్టిగా పట్టుకున్నాడు శ్రీపతి. ఒక వాతతో శ్రీపతి పగచల్లారలేదు. పిచ్చికోపంతో ఫలానా చోటని లేక సీత శరీరమంతా ఇనుపఊచని అంటిస్తూ "నన్నే పరిక్ష పెడతావుటే కులటా! నీ ఒక్కో పాపం ఒక్కో వాతతో పండాలె " అంటూ సుందరమూర్తి ఆఖరున సీత ముఖం మీద ఇనుప ఊచ అలానే ఉంచాడు. కాలిన బాధకి అంతవరకూ వెర్రి కేకలు పెట్టిన సీత ఈసారి ఆ గదేకాదు. ఆ వీధంతా ప్రతిద్వ్హనించేలా "అమ్మా" అని ఒకే ఒక పెడక బొబ్బ పెట్టింది. శ్రీపతి భయపడిపోయి చటుక్కున వదిలేశాడు సీతని. చేయిజారి సుందరమూర్తి చేతిలోని ఊచ ఠంగుమని శబ్దంతో కిందపడింది. "సీతా! సీతా అమ్మా సీతా!" "అక్కా! అక్కా!" "తల్లి! సీతా!" "రామచంద్రం, జయా, రాజు సీతని గట్టిగా పిలుస్తూ తట్టిలేపారు. సీతకి మెలుకువచ్చిందిగానీ, తనెక్కడ ఏస్టితిలో వుందో గమనించెంత మెలుకువలోలేదు. భయంతో వణికిపోతూ, పిచ్చిగా చూస్తూ "నేను పతివ్రతని, నేను పతివ్రతని నన్ను కాల్చి చంపొద్దు. అమ్మో! అంటూ ఆగకుండా అరుస్తుంది. |
25,321 | "వెంటపడి పట్టుకుంటాను. మనుషులుగా దొరికితే చెట్టుకి కట్టి పడేస్తా! పాములుగా మారితే ఉత్తరీయంలో మూటకట్టేస్తా!"
"వాటికి దైవశక్తులుంటాయి. మరీ అంత మూర్ఖంగా ప్రవర్తించకు"
"నేలమీద సాష్టాంగం పడి మ్రొక్కులు చెల్లించుకోవాలా?"
"ముందు వాటిని చూడాలి. అవి ఎలాప్రవర్తిస్తాయో కనిపెట్టాలి! ఆ తరువాతనే ఏంచెయ్యాలో నిర్ణయించాలి. తొందరపడకూడదు"
"అదంతా నాకు తెలియదు. నేను నిద్రపోతాను. ఎప్పుడేం చెయ్యాలో నిద్రలేపి మీరే చెప్పండి" అంటూ మళ్ళా తలవాల్చేశాడు.
రెండు నిముషాల అనంతరం యధావిధిగా గుర్రుకొట్టటం విన్పించింది.
తిరిగి ఎదురుచూడడం ప్రారంభించాను.
చంద్రుడు సరిగా ఆకాశమధ్యమంలోకి వచ్చాడు.
అర్దరాత్రి పన్నెండు గంటలయింది. దూరంగా గుడ్ల గూబ అరిచింది. ఎక్కడో కుక్కలు ఏడుస్తున్నాయి. చెట్టు కొమ్మలమధ్య మాలాగే వ్రేలాడుతున్న గబ్బిలాయిలు రెండు రెక్కలు పటపటలాడించుకుంటూ లేచి వెళ్ళిపోతున్నాయి. బెగ్గురు పక్షుల మూలుగు వినిపించింది.
ఝనక్....ఝనక్ మని పాదమంజీరాల సవ్వడి వినిపించింది.
తల ఎత్తి చూచాను. పొదలమాటున నీడలు కన్పించినాయి.
గాలి వీచే సవ్వడి ప్రకృతి చేస్తున్న ఫూత్కారంలా వినిపిస్తోంది. చప్పుడు కాకుండా కొమ్మల మధ్యలేచి కూర్చున్నాను. తలనిక్కించి చూచాను.
ఇతఃపూర్వం నాకు కనిపించిన నాగదంపతులే!
పొదలమధ్య తిరుగుతూ కన్పించారు. మైమరాపులో ఉన్నారు.
వారిమధ్యకు వెళ్ళాలంటే భయమనిపించింది. ఒకసారి వారి ముందుకుపోయాక తిరిగి పారిపోవడంకూడా అసాధ్యమే! నేను ఆ రోజు దూరంగా పరుగెత్తాలని ప్రయత్నించి తిరిగితిరిగి వారి ముందుకే వచ్చాను.
ఆ సంఘటన జ్ఞాపకంవచ్చి ఒళ్ళు జలదరించింది.
నాకు కన్పించిన రెండు ఆకృతులు పొడలోకి దూరాయి. దానిలోంచి కిలకిలలు విన్పించాయి. ప్రేమ మొర్మొరాలు గాలి అలల మీద తేలివచ్చాయి. వారిని చూడగానే కలిగిన భయంవల్ల చెమటలు క్రమ్మిన శరీరం చల్లగాలికి రవంత సేదదీర్చుకుంది. కాస్తంత ధైర్యం వచ్చింది.
చంటిని పట్టి కుదిపాను. ఉలిక్కిపడి లేచికూర్చున్నాడు.
"ఏమయింది పంతులుగారూ! వాళ్ళొచ్చారా?" అన్నాడు.
"ష్ ష్ అరవకు. పెద్దగా మాట్లాడకు_వచ్చారు" అన్నాను.
"ఎక్కడున్నారు? మీరు చూచారా? కలగన్నారా?"
చూశాను. ఆ పొడలోకి వెళ్ళిపోయారు.
"అయితే నేను వెళ్ళి చూస్తాను" ఉత్సాహంతో క్రిందికి ఉరకాలని ప్రయత్నించాడు.
"చాలా ప్రమాదం. తొందరపడకు" అంటూ వారించాను.
చంటి రెండు క్షణాలు మాత్రమే మౌనంగా ఉన్నాడు.
"పొదలోపలికి వెళ్ళింది పాములా? మనుషులా?" అని ప్రశ్నించాడు.
"మనుషులే! కాని వాళ్ళు నాగాదేవతలు చంటీ!" అన్నాను.
"ఎవరైతే మనకి భయమేంటి? రండి పంతులుగారూ! ఆలస్యం చేస్తే వాళ్ళువెళ్ళిపోతారు. ఆ తరువాత తెల్లముఖాలు వేసుకుని చూడాల్సిందే కాని మనం చేయగలిందేమీ ఉండదు. ఆలస్యం చేయకండి!" అంటూ నాకన్నా ముందుగా వాడు కొమ్మ మీదినించి దిగ నారంభించాడు.
ఇంక తప్పనిసరి కనుక నేను కూడా వాడిని అనుసరించాను.
రవంత జంకుకొంకులులేవు. భయంలేదు. కలికి పాదరక్షలు కూడా లేవు. నుదురుబెదురు లేకుండా ముందుకు నడిచాడు.
పొదదగ్గరకు వెళ్ళాడు. వాడు ఆలోచించలేదు. ఏదయినా ప్రమాదం ముంచుకురాగలదని ఆలోచించనయినాలేదు. పొదదగ్గరకు వెళ్ళి ఒకరితో ఒకరై పెనుగులాడుతున్న జంటను చూచేందుకు ఒక గచ్చకొమ్మను ప్రక్కకు ఒత్తిగించాడు. లోపలివారిమీద వెన్నెల కిరణాలు పడుతున్నాయి.
వారు పెనవేసుకుపోయి ఉన్నారు. పొడలోకి రెండు మానవాకారాలు వెళ్ళటం నేను ప్రత్యక్షంగా చూచాను. కాని ఇప్పుడు మాకు కన్పించింది మనుషులు కాదు. పెనవేసుకుని ఉన్న రెండు సర్పాలు!
ఎప్పుడైతే అలికిడి అయిందో అవి రెండు విడివడ్డాయి. భయంకరమైన పూత్కారాలతో పడగలఎత్తి నాల్కలసాచాయి.
నా కయితే శరీరం వణుకుతోంది. కాని చంటి భయపడ లేదు.
అతడు తలపాగా చుట్టుకున్న వస్త్రాన్ని విప్పి వాటిమీదికి విసిరాదు. ఒక పాము వస్త్రం క్రింద కప్పుపడిపోయింది. రెండవది పొదలమధ్య దూరి పారిపోవటానికి ప్రయత్నించింది.
చంటి చేతిలోకర్రపుల్ల అయినా లేకుండా దాన్ని వెంబడించాడు.
అతనివెంట నేను పరుగెట్టాను. అది రాతి చట్టులమధ్య చెట్టుకొమ్మల క్రిందనించి పరుగులు తీస్తూ చాలాదూరం వెళ్ళింది.
అమిత వేగంతో దాన్ని వెంబడించినా చివరకు అందుకోలేకపోయాడు.
అది ఒక పుట్టలోకి దూరి ప్రాణాలను దక్కించుకుంది.
"బాబుగారూ! ఒకటి తప్పించుకొని పారిపోయింది" అన్నాడు.
"రెండోది కూడ తప్పించుకుని పారిపోయిందేమో" అన్నాను అనుమానంగా.
"అసాధ్యం పంతులుగారూ! అసాధ్యం! బట్టమీదపడిన తరువాత దానిలోంచి పాములు బయటపడి తప్పించుకు పోలేవు దాన్ని కాటువేయాలని ప్రయత్నిస్తే కోరలు చిక్కుపడి బట్టలు దాని తలకు చుట్టుకుంటాయి. దానితో చుట్టలు తిరిగి పోతుందేకాని తప్పించుకు పోవటం సాధ్యపడదు. కావాలంటే చూడండి" అంటూ పొద దగ్గిరకు తీసుకువచ్చాడు అతడు ఏమి చెప్పాడో అదే జరిగింది.
పొదలోకి అతడు విసిరిన వస్త్రంలో తలదూరిపోయి ఉంది. దానిని కాటు వేయాలని ప్రయత్నించినప్పుడు పాము కోరలు దారపు పోగుల మధ్య చిక్కుపడిపోయాయి. వాటిని వదిలించుకోవాలనే ప్రయత్నంలో బట్ట మొత్తందాని పడగచుట్టూ చుట్టుకుపోయింది.
|
25,322 | అనుమానాలతోనే మన టైమ్ అయిపోయేటట్టుంది కదా ఇన్స్ పెక్టర్" వ్యంగ్యంగా అన్నాడు కాళేశ్వరప్రసాద్.
"లేదు. సార్. మీరున్న పరిస్థితుల్లో మీరిలా మాట్లాడటం సహజమే కానీ..."
"ఏం కానీ...మనం అనుమానించడానిక్కూడా ఒక ఎలిబీ వుండాలి....వాళ్ళు నన్ను యాభై లక్షలు డిమాండ్ చేసారంటే, దానర్ధం ఏంటి.... తేజ వాళ్ళ దగ్గరే వున్నాడని కదా....మరి అలాంటప్పుడు.....ఆ తేజ రైల్వే స్టేషన్లో ప్రత్యక్షం అవడం ఏమిటి.....రైలుని, ప్రయాణీకుల్నీ రక్షించడం ఏమిటి! షీట్ నాన్సెన్స్... తేజ కన్పించినపుడు మళ్ళీ నాకు ఫోను చెయ్యండి... డోంట్ డిస్ట్రబ్ మీ ఆన్ నెససర్లీ" కోపంగా ఫోను పెట్టేశాడు కాళేశ్వర ప్రసాద్.
అతని మాటల్లోకూడా నిజముందనిపించింది ఇన్స్ పెక్టర్ కి
కిడ్నాపర్స్ చేతుల్లోంచి తేజ తప్పించుకున్నాడు?
తప్పించుకుని నగర శివార్ల వరకూ వెళ్ళాడు?
కాదు... ఆ కుర్రాడు తేజ కాడు. మరి ఆ ముగ్గురూ ఎవరు?
ఆ ప్రశ్నకు అతనికి జవాబు దొరకలేదు.
౦ ౦ ౦
సికింద్రాబాదు ఎస్. పి. రోడ్ మీదుగా జింఖానా గ్రౌండ్స్ వేపు వెళ్తుంది వాను. ఆ వ్యానుని వీర్రాజు డ్రైవ్ చేస్తున్నాడు.
"ఊరంతా వదులుకొని ఎవరో ఒకడు, నీలాంటోడు స్మశానంలో రన్నింగ్ చేసాట్ట. ఈ దార్లో ఎక్కడ చూస్తే అక్కడ పోలీసులున్నారు. మనం పిట్టల్లా దొరికిపోవడం ఖాయం" భయంగా అన్నాడు పోతురాజు.
"పెద్దభయ్యా... టెన్షన్ తో చచ్చిపోతున్నాం. ఈ దారంట ఎందుకొస్తున్నామో చెప్పి తగలడొచ్చుకదా" చికాగ్గా అన్నాడు సేతురాజు.
వాళ్ళ కాళ్ళదగ్గరున్న వైర్ బ్యాగ్ లో, తొట్టెలో నిలబదినట్టుగా నిలబడి సీటు అంచును పట్టుకొని ఆడుకుంటున్నాడు తేజ.
"అయిదు నిమిషాలాగు నీకే తెలుస్తుంది" చెప్పాడు వీర్రాజు. నేరుగా వ్యాను వెళ్ళి, ఓ డిపార్టుమెంటల్ స్టోర్సుముందు ఆగింది.
వ్యాను దిగి, డిపార్టుమెంటల్ స్టోర్సు లోకి నడిచాడు వీర్రాజు.
అతన్ని అనుసరించాడు పోతురాజు.
౦ ౦ ౦
గ్లాస్ దొరు తెరచుకుని లోనికి అడుగు పెట్టారిద్దరు.
"ఇపుడు డిపార్ట్ మెంటల్ స్టోరు కేందుకూ అప్పడాలు కొంటావా" వేళాకాలంగా అడిగాడు పోతురాజు.
"నోర్ముయ్- ఎవ్వరూ మనల్ని అనుమానించకుండా జాగ్రత్తగా ప్రవర్తించు. మనం ఇప్పుడు మన బాస్ ని కలవబోతున్నాం" గొంతు తగ్గించి అన్నాడు వీర్రాజు.
"మనకో బాసుననడా....నాకు తెలియదు- ఎవడాడు" గట్టిగా అనబోయి గొంతు తగ్గించాడు పోతురాజు.
లోనికెళ్ళగానే మూడువరుస లున్నాయి. జనరల్ డిపార్టుమెంటు, స్టేషనరీ డిపార్టుమెంటు దాటి కాస్మొటిక్ డిపార్టుమెంట్ వేపువచ్చి, నలువైపులా దృష్టి సారించాడు వీర్రాజు.
అక్కడ ఇద్దరు లేడీస్, సేల్సుబాయ్ తో మాట్లాడుతున్నారు. సేల్స్ బాయ్ ళా కనిపించే ఆ వ్యక్తి, చెవికి పెద్ద రింగులు, బండమీసాలూ.....భుజాలవరకూ వేలాడే జుత్తు, పేడమరక డిజైన్ షర్టు, లూజుఫాంటు, పెద్ద కళ్ళద్దాలు.
"మన బాసు ఇక్కడే ఉండాలే!" అటూ ఇటూ చూస్తూ లోపలికి వెళ్ళబోతున్నాడు వీర్రాజు.
"ఏయ్ వీర్రాజు" ఆ పిలుపు వినబడగానే తల చటుక్కున తిప్పి, సేల్స్ బాయ్ వేపు చూసాడతను.
లేడీ కస్టమర్లు ముందుకు వెళ్ళిపోవడంతో ఆ సేల్స్ మాన్ ముఖంలోకి నిశితంగా చూసి__
ఎవడబ్బా నన్ను పేరుపెట్టి పిల్చాడు అని నలువేపులా చూస్తున్నంతలో__
"ఏయ్....నేనే...ఏమిటా వెర్రిమొర్రి చూపులు" ఆ సేల్స్ మాన్ వీర్రాజు దగ్గరగా వచ్చాడు.
అప్పుడు గుర్తుపట్టాడు ఆ సేల్స్ మాన్ ఎవరో? సత్తిపండు.....అతను.
"ఏమిటి సార్ ఈ వేషం?"
"నేను నిన్ననగా కబురుపంపితే ఇప్పుడా రావడం. నిన్నట్నించీ ఇక్కడ సేల్సుమాన్ జాబు చెయ్యలేక చస్తున్నాను" విసుక్కున్నాడు సత్తిపండు.
"ఇన్ స్ట్రక్షన్స్ లేక, మీ వేర్ ఎబౌట్స్ తెలియక- చచ్చిపోతున్నామంటే నమ్మండి మధ్యలో ఆ తేజా పితలాటం ఒకటి. మా దగ్గర్నించి వాడు తప్పించుకొని పారిపోయాడు."
"మీ దగ్గర్నుండి తప్పించుకున్నాడా- ఇడియట్స్- నాకు తెలుసు_ ఇలాంటిదేదో జరిగి ఉంటుందని"
"ఎందుకలా ఆవేశపడిపోతారు. తప్పించుకున్నవాడ్ని వదుల్తామా- మళ్ళీ వెతికి పట్టేసాం. ప్రస్తుతం మాదగ్గరే మన వ్యానులోనే వున్నాడు."
"ఆ విషయం ముందు చెప్పవేం- నాకు హార్ట్ ఎటాక్ వచ్చినంత పనయింది." ముఖమ్మీదకు నవ్వును పులుముకుంటూ అన్నాడు సత్తిపండు.
"ఇంతకూ ఎందుకిక్కడ కలవమన్నారు" అడిగాడు వీర్రాజు.
"అసలు నేను చెప్పిందేమిటి? మీరు చేస్తున్నదేమిటి? మళ్ళీ కాళేశ్వరప్రసాద్ కి మీరు ఫోను చేశారా?" ఆవేశంగా ప్రశ్నించాడతను.
"లేదు...చెయ్యలేదు" చెప్పాడు పోతురాజు.
"ఎందుకు చెయ్యలేదు?"
"ఆ యాభయిలక్షలూ రెడీ చేసి ఉంచుతానన్నాడు. ఎక్కడకు రావాలో చెప్పమన్నాడు. మిమ్మల్ని కాంటాక్టు చేస్తే మీరు దొరకలేదు. ఆ యాభయి లక్షలూ తీసేసుకుని తేజను ఇచ్చెయ్యమంటారా?" అడిగాడు వీర్రాజు. |
25,323 |
ఓ రోజు మధ్యాహ్నం విరామసమయంలో ఆమె చెట్టుకు చేరగిలబడి కూర్చుండగా వచ్చి "నీకు డబ్బు యిస్తాను. ఇల్లు అమరుసతాను, సమస్త సౌకర్యాలూ సమకూర్చుతాను. నాతో వచ్చేస్తావా?" అని అడిగాడు.
ఆమెలేచి నిల్చుని తన పెద్ద పెద్ద కళ్లను ఎత్తి ఆయనవంక సాలోచనగా చూసింది. ఒక్క నిముషంలో అంతా నిర్ణయించుకుంది. "వస్తాను" అంది నెమ్మదిగా.
అంతే. రాజయ్యగారు ఓ పెంకుటిల్లు తీసుకుని ఆమెను అందులో వుంచాడు. కావలసిన సామాగ్రి అంతా కొన్నాడు. నెలకు యింత అని పైకం యిస్తూ వుండేవాడు. రజని అనేపేరు ఆయన ప్రేమతో పెట్టిందే కావచ్చు.
యువకుల కల్లోలం ఏమీ తగ్గలేదు.
రాజయ్యగారు మంచి నిఘా వుంచారు.
ఈ వంటరితనంలో యీ అక్కా తమ్ముళ్ళు తోడునీడ అయినారు రజనికి. రోజూ యింటికి పోయేటప్పుడు అరగంట కాలక్షేపం యిక్కడ. బిస్కట్లూ, కాఫీ ఇస్తుండేది. వాళ్ళతో ఆ కబుర్లూ యీ కబుర్లూ చెబుతూండేది. ఆమెకు చదువురాదు. నేర్చుకోవాలన్న జిజ్ఞాస లేదు. "చినబాబూ!" అని పిలుస్తూండేది మధుబాబును. ఎంతో ఆప్యాయంగా చూసేది యిద్దర్నీ.
కొన్నాళ్ళకు సరస్వతి వెళ్లిపోయింది.
మధుబాబు వంటరిగా మిగిలాడు. మరుసటి సంవత్సరం స్కూలుకి వంటరిగా పోతుంటే ఏడుపు వచ్చేది. ఈ స్థితిలో రజని అతనికి మరింత దగ్గరగా వచ్చింది. ఊరట కలిగేది అతనికి ఆమె సాన్నిధ్యంలో వాళ్ళు ఆప్తమిత్రులయిపోయేవారు. సరస్వతి అప్పుడప్పుడూ యిక్కడకు వచ్చినప్పుడు వెళ్లి రజనిని చూచి వస్తూండేది. నానీ జన్మించినప్పుడు రజని బహుమతులు పంపించింది. ఇప్పుడు నాని మరి లేడు.
ఆ మరునాడు ఈ విషయం చెప్పటానికి మధుబాబు ఆమెఇంటికి వెళ్ళాడు.
ఇంటి తాళం పెట్టివుంది.
ఎక్కడికైనా వెళ్ళిందేమో అనుకున్నాడు. కాసేపు ఎదురుచూశాడు.
ఎంతకూ రాలేదు రజని.
ఎదురుగా వున్న కిళ్లీషాపువాడు చెయ్యెత్తి రమ్మని సౌంజ్ఞ చేశాడు మధుబాబు వంక.
మధుబాబు వెళ్లాడు. "రజని కోసమా?" అన్నాడు షాపువాడు.
"అవును" అన్నాడు.
"లేదు. మరి రాదు."
"ఎక్కడకు వెళ్ళింది?"
షాపువాడు వక్రంగా నవ్వాడు. "లేచిపోయింది."
చిన్నపిల్లవాడుకాదు మధుబాబు. అతనికి అర్థమైంది. చికాగ్గా, ఆవేసనగా యింటిదారి పట్టాడు.
3
తన మొదటి కథను అతడే పత్రికకీ పంపించలేదు. అంటే దీని అర్థం ఆ కథగురించి పూర్తిగా మరిచిపోయాడని కాదు. తర్వాత చదువుకుంటే అందులో ఎన్నో తప్పులు కనిపించాయి. ఏదో తెలియని గొప్పతనం అందులో వున్నట్లు తోచేదిగాని.....అదేమిటో మనసుకి తట్టేదికాదు. అదీగాక అతనికి చిన్నప్పటి నుంచీ పద్యాలంటే తలనొప్పి. వేమన పద్యాలూ, సుమతీ శతకమూ చదవకుండానే అతని ఎలిమెంటరీ స్కూలు చదువు పూర్తయింది. పద్యాలు వంట పట్టక పోవటంవలన భాష స్వాధీనం అయ్యేదికాదు.
ఎప్పటికప్పుడు కొత్తగా, తడుముకున్నట్లుగా వుండేది. అయితే అతడు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల వయసులో వున్నప్పటి నుంచీ కథలూ, నవలలూ విరివిగా చదివేవాడు. తోపుడుబళ్ళతో అరణాలకొచ్చే నవలలూ, ఇంటింటికి వెళ్లి అమ్ముతూ, అద్దెకిస్తూ వుండేవాళ్ళు. మధుబాబు తల్లిసుందరమ్మగారికి యీ నవలల పిచ్చి జాస్తీగా వుండేది. అప్పట్లో ఎక్కువగా కొవ్వలి జంపన నవలలు వచ్చేవి. మధుబాబు అవి ఆసక్తిగా చదివేవాడు. కర్మంకాలి విశ్వనాథంగారు ఎప్పుడైనా చూడటం తటస్థిస్తే తలవాచేట్లు చివాట్లు పెట్టేవాడు. ఆయనకు తన బిజినెస్ గొడవ, ఊళ్లు తిరగటం యిదితప్ప యీ సాహిత్యం, పుస్తకాలు ఏమీ పట్టేవికావు. కొడుకు యీ పుస్తకాలు చదివితే పాఠాల్లో వెనకపడిపోతాడని భయం. అందుకని ఆయన కంటబడినప్పుడు కోప్పడడమేవాడు. అతనికీ పుస్తకాలు నచ్చుతున్నాయి. గొప్పగా వున్నాయి. అవి చదువుతోంటే ఊహాలోకంలో, ఓ తన్మయత్వంలో తేలిపోయేవాడు. ఈ అనుభూతిని చూస్తూ వదులుకోలేడు, సాయంత్రాలు డాబామీద చేరి, క్రిష్టఒడ్డున కూర్చుని చదువుతూ వుండేవాడు. సుందరమ్మగారు అతన్ని ఎప్పుడూ మందలించలేదు. మధుబాబు చదవటమే గాకుండా పెద్దయి సంపాదనాపరుడయాక యీ పుస్తకాలన్నీ మళ్ళీ తెప్పించి బైండు చేయించి యింటిలో అలంకరించాలని ఉవ్విళ్ళూరుతూ వుండేవాడు.
ఆ రాత్రి రాసిన కాయితాలు జాగ్రత్తగా డ్రాయరు సొరుగులో దాచుకున్నాడు. స్నేహితులైతే చాలామంది వున్నారుగానీ...... నవ్వుతారనీ, ఎగతాళి చేస్తారనీ ఈ విషయం చెప్పలా. క్లాసులో ఎప్పుడూ పరధ్యానంగా వుండటం, నోట్సులనిండా ఏదో వ్రాస్తూ వుండటం, ఓ మిత్రుడు చూసి "వీడు ఎప్పటికైనా గొప్ప కథకుడు అవుతాడ్రా" అని నిజాయితీగా పలికేసరికి ప్రక్కవాళ్ళంతా "వీడి మొహం, వీడా?" అని ఎద్దేవ చేసేవారు. అందుకని ఎవరికీ చూపించలేదు.
ఓ రోజున విశ్వనాథంగారు కొడుకు ఇంట్లో లేనప్పుడు పెన్సిల్ కావాల్సి వచ్చి డ్రాయరు సొరుగు వెదుకుతుండగా ఆ కాయితాలు కనిపించాయి. అవేమిటో తెలుసుకొని నిర్ఘాంతపోయి నిలబడ్డాడు. కాస్త చదివాడు. కోపంతో మండిపడి గబగబ భార్య దగ్గరకొచ్చాడు. "చూడు, నీ కొడుకు చేస్తున్నా ఘనకార్యం. వీడు కథలుకూడా అఘోరిస్తున్నాడు. ఇలా అయితే బాగుపడ్డట్లే! ఇదంతా నీ ట్రయినింగ్. నువ్వే వాడిని పాడుచేస్తున్నావు" అని కేకలు పెట్టాడు.
వంటచేస్తున్నా సుందరమ్మగారు తెల్లబోతూ ఇటుతిరిగి "మధ్య నేనేం చేశానండీ" అంది లేచి నిలబడుతూ.
"ఏడిశావ్! ఇదంతా చేసింది నువ్వుకాదూ! అడ్డమైన పుస్తకాలూ తెప్పించి నీ పిచ్చి వాడికికూడా అంటగట్టావు. ఏడిశాడు! ఎక్కడున్నాడు? ఇదిగో చెపుతున్నా, ఈసారి ఆ వెధవపుస్తకాలు చదువుతూ కనిపించారంటే వాటిని చించిపారేస్తాను. ఏమనుకుంటున్నారో" అని పెద్దపెద్ద అడుగులు వేసుకుంటూ అక్కడ్నించి వెళ్లిపోయాడు.
ఆ తరువాత మధుబాబును శిక్షించడం జరిగింది. అలసట చెందాడు మధుబాబు.
నానీ చావు తెచ్చిన విషణ్ణ వాతావరణం క్రమంగా అంతరించింది. దేశంలో హిందూ -ముస్లిం తగాదాలు కూడా సర్దుకున్నాయి. కులాసాగా వున్నట్లు సరస్వతి ఢిల్లీనుంచి ఉత్తరం రాసింది.
మధుబాబు స్కూలుఫైనల్ పరీక్షలకు శ్రద్ధగా చదవసాగాడు.
4
మధుబాబు కాలేజీలో చేరాడు. ఆ వాతావరణం మొదట్లో చాలా కొత్తగా కనిపించింది. కాలేజీలైఫ్ చాలా మధురంగా వుంటుందని ఇదివరకు చాలా మంది అంటుంటే విన్నాడు. మొదటి రెండుమూడు నెలలూ అదేమిటో అతనికి అంతుపట్టలేదు. అదీగాకుండా అతడు తీసుకున్నది సైన్సుగ్రూప్ కాబట్టి బొత్తిగా తీరికలేకుండా, చికాగ్గా వుండేది. మిగతా గ్రూపులవాళ్ళు ఉషారుగా, నిర్లక్ష్యంగా తిరుగుతూ వుండేవాళ్ళు. క్యాంటిన్ లోనూ, చెట్లక్రింద గుంపులుగా కూర్చుని అల్లరి చేస్తూండేవాళ్లు. వాళ్లని చూస్తే అసూయగా వుండేది మధుబాబుకు.
ఇంతలో కాలేజీ ఎలక్షన్లొచ్చాయి. కాలేజీ అంతా హడావుడిగా నిండి పోయింది. విద్యార్థుల హక్కుల్ని కాపాడటానికంటూ కొంతమంది ప్రతినిధులు బయల్దేరారు. క్లాసుల్లోకి పోవటం, కాళ్ళు ఒణుకుతుండగా ఉపన్యాసాల లాంటివి యివ్వటం, కూర్చున్న వారిలోంచి అవతలి వర్గంవారు లేచి అల్లరి చేయటం, ఉభయపక్షాలవారూ ఒకరికొకరు వార్నింగులిచ్చు కోవటం, తన్నులాటలు, రాజీలు యిట్లావుండేది వాతావరణం.
మధుబాబుకు యీ తతంగమంతా చికాకు కలిగించింది. ఉభయపక్షాల లోనూ ఎవరుకూడా అతనికి అయినవారు కారు. అందుకని పట్టించుకోకుండా ముభావంగా చూస్తూ ఊరుకున్నాడు.
అన్నికలు ముగిశాక కాలేజి మేగజైన్ కి విద్యార్థుల్నుంచి సంపాదకుల్ని ఎన్నుకొనే నిమిత్తం పోటీ జరిగింది. మధుబాబుకు వున్న వ్యాపకం తెలిసిన వాళ్లెవరో యీ సంగతి అతనిచెవిలో ఊది "ప్రయత్నించు. పోయినదేముంది?" అని సలహా ఇచ్చారు. అతన్లో ఆశ మొలకెత్తింది. "నిజమే! మంచిసంగతి"
అతను పోటీలో పాల్గొన్నాడు. అంశం ఏమిటంటే "ప్రజాకవిత్వమంటే ఏమిటి?"
అతని ఉత్సాహం చచ్చిపోయింది. ఈ కవిత్వంగురించి తనకు బొత్తిగా తెలియదు. ప్రజా కవిత్వమట. బహుశా ప్రజాసమస్యలకు చేరువగా వున్న కవిత్వమయి వుంటుంది. మరి దాని లక్షణాలమాటో? అతనికి అంతుపట్టలేదు. ఇష్టంవచ్చినట్టు రెండుపేజీలు వ్రాసి బయటికొచ్చేశాడు. ఫలితం ఏమంటే అతను సెలక్టు కాలేదు.
అతనికి కోపంవచ్చిన మాట నిజమేగాని - వీళ్ళమొహం వీళ్లు నా అర్హతని కొలిచేవాళ్ళా? అన్నట్టు ఫోజుపెట్టి సంతృప్తిపడటం వగైరాలు ఏమీ చేయలేదు. మంచి అవకాశం చేయిజారిపోయినట్లు బాధపడ్డాడు. కాలేజీలో తాను షైన్ అయ్యే ఛాన్స్ చేయి జారిపోయింది.
ఆ ఛాన్స్ అతనికి వేదికమీద ఎక్కి ఉపన్యాసాలు దంచినా, నాటకాలలో నటించినా వచ్చివుండేది. కాలేజీ వాతావరణంలో నిర్భయంగా స్టేజిమీదకు ఎక్కి నాలుగుముక్కలు చెప్పగలిగిన వాడే స్పీకర్ క్రింద చలామణి అవుతాడు. చెప్పేదాంట్లో పెద్ద స్టఫ్ వుండనక్కరలేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే స్టేజిఫియర్ లేకపోతే అతను స్పీకర్ అయిపోయాడన్నమాట. మధుబాబుకు ఈ సమాచారం ఏమీ నచ్చలేదు. ఈ మాట్లాడే వారందరికంటే తనకు చాలా ఎక్కువ విషయాలు తెలుసు. కాని వాటికో స్వరూపం ఇవ్వలేనిస్థితిలో నలుగురి ముందూ బడబడ లాడటం వాచాలత అనిపించుకుంటుందని తన ఉద్దేశం. |
25,324 | "మీ అఖిలని చూస్తే నాకు భయం వేస్తుంది."
"అదేం పెద్ధపులా భయపడ్డానికి?"
"తనకి నేనంటే ఎందుకు కోపం? మా ఇంటికి రావడానికి ఎందుకిష్టం లేదా మెకు?"
అతడి మాటల వల్ల అతడి మనసుకు తగిలిన గాయం స్పష్టంగా కనిపించినట్టుగా అయింది నిరజకు, "మీరంటే ఎందుకు కోపం? కోపం మీమీద కాదని నా అభిప్రాయం! పాతికేళ్ళుగా ఈ ఇంటికి పెద్దవాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళకి తెలియకుండా రావడం- తనకి బాగా అనిపించలేదేమో? ముఖ్యంగా మీ నాన్నగారి వల్ల తన మేనత్తకి జరిగిన అన్యాయనికి మీ పట్ల కొంచెం నిరసనలాంటి భావం వుంటే ఉండవచ్చు."
"అన్యోన్యంగా ఉందే రెండు ఇళ్ళ మధ్య ముఖ్యంగా దగ్గరి బంధువుల మాధ్య ఏ కారణం చేతో సంబంధాలు తెగిపోతే, పిల్లలు సరిచేయడానికి ప్రయత్నించాలిగాని పెద్ద వాళ్ళ సంతాన్నే వారసత్వంగా స్వీకరించ కూడదనుకుంటాను."
"అన్యాయం జరిగినవాళ్ళు ఈ మాట అంటే బాగుంటుంది."
"ఎవరూ ఎవరికీ అన్యాయం చేయలేదు. ఎవరిదారివాళ్ళు నడిచారు అంతే! పోతే నాన్నమళ్ళి పెళ్ళిచేసుకొని తన జీవితం శూన్యంకావడం నుంచి తప్పించుకొన్నారు! పిన్ని కూడా ఆ పని చేస్తే ఆనిడకూ అన్యాయం జరిగినట్టు కనిపించేది కాదనుకుంటాను."
"వాళ్ళ గురించి ఇప్పుడు మనం చర్చించడం అనవసరమ్తెన పని అనుకొంటాను. ఈ పెట్టెలో ఏముంది?"
"గిటార్"
"వాయించడం వచ్చా?"
"వచ్చు!"
"ఒకసారి నాయించరూ?"
"ఇప్పడేందుకో ఉత్నాహంగా లేదు! మరోసారి వచ్చినప్పుడు వాయించి మీకోరిక తీరుస్తాను."
"మేం ఇక్కడికిరావడం ఇదే మొదటిసారి, ఆఖరిసారి అనుకొంటున్నాను! ఇప్పడంటే వర్షం వచ్చి, వాహనం ఏది దొరకక, సమయానికి మీరు వచ్చి పిలవడంవల్ల వచ్చాంగాని, మళ్ళి ఎందుకువస్తాం?"
"నిరజగారూ! మీక్కూడ మేమంటే అయిష్టమేనా?" అజిత్ దెబ్బ తిన్నాట్టుగా అడిగాడు.
"అయిష్టం కాదండి! మళ్ళి వచ్చే అవసరమేమిటని."
"అవసరం పడితే తప్ప రాకోడాద?"
"మీరలా బాధపడితే ఓసారి తప్పకుండా వచ్చి వెడతానుగాని ఇప్పుడు పాడండి! ఇప్పుడు పాత వినిపిస్తేనే మరోసారి వస్తాను"
అజిత్ పెట్టెలోంచి గిటార్ తీశాడు.
"ఉండండి! అఖిలని తీసుకువస్తాను" నీరజ గబగబ క్రిందికి పరిగెత్తింది.
ఊరికే పిలిస్తే రాకపోయేదేమోగాని అఖిలకి సహజంగా సంగీత మంటే ఉండే ఆసక్తివల్ల నీరజతో పైకి వచ్చింది.
అజిత్ తన బెడ్ మీద బాసింపట్టు వేసుకు కూర్చొని గిటార్ మిటాడు.
తీగలు మీటుతూ ఏదో ఇంగ్లీష్ పాట పాడాడు.
"మనపాటలేమి రావా? అంటే సరిగమలు? కీర్తనలు?"
కర్ణాటక సంగీతం వేర్చుకోవడం మొదలు పెట్టి నెలరోజుల్తెంది. వీణ ప్రాక్టిస్, గాత్ర సాధన చేస్తున్నాను. గిటార్ మీద మన కీర్తనలు పలికించడం కొంచెం కష్టమే"
"గిటార్ పాశ్చాత్య వాయిద్యం కదూ? మనకు సరిగమలతో ప్రారంభమౌతుంది? సంగీతం, గిటార్ మీద ఏం మొదలు పెడతారు?"
"ఎ. బి. సి. డి. లతో"
"మీ చేతిలో ఉన్నదీ ఏమిటి?"
"స్ట్రయికర్. మిటడానికి గోరు లేనప్పుడు ఇది వాడతాం."
"ఇంకో పాట పాడండి."
అజిత్ వాచీ చూసుకొన్నాడు. ఎనిమిదిన్నర అవుతోంది, భోజనం సంగతి మరిచిపోయినట్టుగా ఉన్నారు."
"వెధవ భోజనం రోజూ ఉండేదే! పాడండి!"
"పాటంటే ఇంత ఇష్టం. మీకు ఏమ్తేనా పాడడం వచ్చా?"
"అందరూ పల్లకి ఎక్కితే మోసేదేవరన్నట్టు అందరూ పాడితే వినేదెవరు? పాడటం, ఆడటం, గీయటం, రాయటం- అందరికి కావాలన్నా రాదూ. అవి కొందరికే అబ్బుతాయి కాబట్టే వాటికంత అపురూపత! కొందరికే పరిమితం కాబట్టే అవి భగవంతుడి వరంగా భావించబడతాయి."
"ఇష్టం ఉండి సాధన చేస్తే రానిది అంటూ ఉండదని నా అభిప్రాయం! ఏ విద్య అయినా, ఏ కళ అయినా"
యశోదమ్మ క్రింది నుండి కేకవేసింది. "ఎనిమిదిన్నర అయింది! భోజనానికి క్రిందికి రాండర్రా! ఆ పాటలేవో క్రిందకివచ్చి పాడితే నేనూ విననా?"
అందరూ క్రిందకి వచ్చారు.
అతిధులతో పాటు అజిత్ కూడా క్రిందే పిటల మీద కూర్చున్నాడు.
మొదటి వడ్డన వంటతడు చేశాడు. మారు వడ్డింపు యశోదమ్మ చేసింది, ఆవిడ కొసరి కొసరి తినిపించడంతో అఖిలకూ, నిరజకూ భుక్తాయాసం వచ్చింది.
తనగదిలోనే వాళ్ళకి పక్కల ఏర్పాటు చేసింది యశోదమ్మ.
"నీకూ సంగీతం వచ్చునని చెప్పాడు అజిత్, ఒక పాట పాడమ్మ త్రిపుర పాటని, త్రిపురని గుర్తుచేసుకొని రోజుండదు నాకు! ఇరవ్తే అయిదు సంవత్సరాల్తెనా, ఇరవ్తే అయిదు రోజుల్తెనట్లు ఉంటుంది: త్రిపుర నాకు దూరమ్తే? మల్లిక్ విషయంలో త్రిపుర కొంచెం సహనం చూపి ఉంటే మా జీవితాలలో ఇంత వంటరితనం చేటుచేసుకు ఉండేది కాదనుకొంటాను, మల్లిక్ మాకు కూకుండా, అలా దూరదేశాలు పట్టుకుపోకుండా త్రిపుర వాడికి కళ్లెం వేసేదనుకొంటాను. గత జలసేతుబంధనం. ఇప్పుడు అనుకొని ఏం లాభం కానీ, ఒక పాట పాడమ్మా." |
25,325 | పావుగంట తరువాత కిరణ్మయి ట్రేతో ముందుగదిలోకి వెళ్ళింది. రాయన్న కూర్చున్న స్థితిలో ఎలాంటి మార్పూలేదు. "నేను ఓడిపోయానా?" అనుకుంది. మనసంతా బాధ. ఏం చెయ్యాలి? ఏం చేసి తన భర్తని తిరిగి ఈ పనికి ఉద్యుక్తున్ని చేయాలి. గెడ్డం పెరిగి, కళ్ళు పీక్కుపోయి, మూర్తీభవించిన నైరాశ్యంలా వున్న అతడిని ఎలా మార్చాలి?
ఆమె అతడివైపే చూస్తోంది. అతడు నెమ్మదిగా తలతిప్పాడు. ఆమెవైపు చూసి నవ్వేడు. ఆ నవ్వు - పువ్వు రేకులు విచ్చుకుంటున్నట్టు వుంది. బాక్సింగ్ బరిలో ప్రత్యర్ధి కొట్టిన దెబ్బకి కుప్పకూలిన మనిషి సర్వశక్తులూ కూడగట్టుకుని లేస్తున్నప్పుడు ప్రేక్షకులిచ్చే స్ఫూర్తిలా ఆమె కూడా నవ్వింది.
* * *
తనలో తానే చాలాసేపు ఏదో ఆలోచించుకుంటున్నట్టు అతడు మౌనంగా వుండి, ఒక నిర్ణయానికి వచ్చినట్టు హఠాత్తుగా తలెత్తి "అపురూపలక్ష్మి గురించి నీకు చెప్పాలి" అన్నాడు. అంతసేపు అతడు దేనిగురించి ఆలోచిస్తూ సందిగ్దావస్థలో వున్నాడో ఆమెకి అర్ధమైంది. ఉత్సాహంగా ముందుకు వంగి, "గుడ్ ఐడియా! నాకూ ఆమె గురించి తెలుసుకోవాలని వుంది. చెప్పండి" అంది. మనిషి బాధలో వున్నప్పుడు ఆ విధంగా "ఎక్కువగా మాట్లాడి" మనసులో వున్నదంతా వెలిగక్కటం ఎప్పుడూ మంచిదే. ముఖ్యంగా ఇంట్రావర్ట్స్ కి.
రాయన్న చెప్పటం ప్రారంభించాడు.
"అపురూపలక్ష్మితో నా పరిచయం సంవత్సరం క్రితం జరిగింది."
కళాకారులూ, క్రీడాకారులూ సాధారణంగా మధ్యతరగతిలోంచే ఎక్కువ వస్తూ వుంటారు. కృషి, పట్టుదల, ఏదో సాధించాలన్న తపన- కాలే కడుపుకే ఎక్కువ వుంటుంది. తమ రంగంలో కొద్దికొద్దిగా పైకివచ్చే కొద్దీ పరిధి విస్తృతమవుతూ వుంటుంది. కొత్త పరిచయాలూ, సమాజంలో పేరు, పెరుగుతున్న కీర్తి-అన్నింటికన్నా ముఖ్యంగా ఆపోజిట్ సెక్స్, వ్యక్తుల కళ్ళలో మెచ్చుకోలు..... అదంతా కేవలం, అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ఈ ఆనందం వ్యాపారవేత్తలకూ, రాజకీయ నాయకులకూ దొరకదు. అదొక ట్రాన్స్ అదే కళాకారుడికీ, క్రీడాకారుడికీ కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. మరింత సాధించాలన్న తపననిస్తుంది. ఆ పిరియడ్ లో తను ఎవరెస్ట్ శిఖరం మీదున్నంత గొప్పగా ఫీలవుతాడు.
కిరణ్మయికి ఇదంతా తెలుసు. దీనికి సైకాలజీ చదవక్కర్లేదు.
అతడు చెప్పేది వింటూ ఆమె అదే ఆలోచిస్తూంది.
"ఆ రోజు మొట్టమొదటి సెంచరీ చేశాను." అన్నాడు రాయన్న. "......మేము డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్తూండగా కొంతమంది అమ్మాయిలొచ్చి ఆటోగ్రాఫు లడిగారు. చాలా కొత్త అనుభవం అది. ఒకపక్క ఆనందం, మరోపక్క ఏదో తెలియని ఉద్వేగం! అందరికీ గబగబా సంతకాలు పెట్టి ఇచ్చాను. కొంత అనుభవం వున్న నాతోటి ప్లేయర్సు నవ్వుతూ, జోకులు వేస్తూ మాట్లాడుతున్నారు. నాకంతా కొత్తగా వుంది. గబగబా అన్ని పుస్తకాల్లోనూ సంతకాలు పెట్టి ఇచ్చాను. అందరూ వెళ్ళిపోయినా ఒక అమ్మాయి మాత్రం అక్కడే వుండిపోయింది. నాకేం మాట్లాడాలో తెలియలేదు."
"మీ పేరు?" అన్నాను.
"అపురూపలక్ష్మి."
"ఏం చదవుతున్నారు?"
చెప్పింది ఆ తరువాత ఏం మాట్లాడాలో తెలియలేదు. చుట్టూ అందరూ నాకేసే చూస్తున్నారేమో అన్న భయం. "లోపలికి వెళ్ళాలి" అన్నాను.
"నా పెన్ను" అంది.
నాలిక్కర్చుకున్నాను. పొరపాటున సంతకాలు చేసి జేబులో పెట్టేసుకున్నాను తీసి ఇచ్చేను. ఇచ్చేస్తూ ఆ పెన్ వైపు చూశాను. చాలా సాధారణమైన పెన్ను. నా చూపుని మరోలా అర్ధం చేసుకున్నట్టు - "అది మా తాతగారు ప్రెజెంట్ చేసిన పెన్ను. ఆయన ఈ మధ్యనే పోయారు" అంది.
నేను నొచ్చుకుంటున్నట్టు "ఐ యామ్ సారీ" అన్నాను. అప్పుడే మొదటిసారి ఆ అమ్మాయి మొహంలోకి పరికించి చూశాను. పద్దెనిమిదేళ్లుంటాయేమో....."అమాయకమైన కళ్ళు, గుండ్రటి మొహం.... ఆ అమ్మాయిలో ఏదో తెలియని ఆకర్షణ వుంది. ఉహూ - కాదు. అది ఆకర్షణ కాదు- ఏదో బేలతనంతో కూడిన అందం" రాయన్న కొంచంసేపు ఆగాడు.
కిరణ్మయి తలవంచుకుని వింటూంది. మనసులో ఏమూలో కాస్త విషాదం మొహంలో కనపడదు. భర్త స్నేహితురాలి గురించి భార్య వినవలసి వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలో ఏ సైకాలజీ పుస్తకంలోనూ వ్రాయబడలేదు.
అతను తిరిగి చెప్పసాగాడు.
"ఆమె పెన్ తీసుకుని 'థాంక్స్' చెప్పి వెళ్ళిపోయింది. తలవంచుకుని ఆమె అల అనడిచి వెళ్ళిపోవటం ఎందుకొ బాగా గుర్తుండిపోయింది. చిన్నప్పటినుంచీ నేనుకూడా ఇలాంటి ఆత్మీయతకి దూరంగా పెరగటం దానికి కారణం కాబోలు. అయిదు రూపాయల పెన్నుని కూడా అంతగా అబిమానించే అపురూపలక్ష్మి సెంటిమెంటు నన్ను చాలాకాలం వెంటాడింది. కొన్ని భావాలకి తర్కాలు వుండవు.
వారంరోజుల తరువాత రాజారావు ఓ పార్టీ ఇచ్చాడు. అతడి స్నేహితురాలు రమణితో పాటే మరో నలుగురు స్నేహితురాళ్ళు వచ్చారు. అందులో అపురూపలక్ష్మి కూడా వుంది. అదే రెండోసారి ఆ అమ్మాయిని చూడటం మాటల్లో ఆమె వివరాలు మరిన్ని తెలిశాయి. ఆమె తండ్రి బి.డి.వో రాయలసీమలో పనిచేస్తున్నారు. లక్ష్మికి ఒక అన్నయ్య, ఒక తమ్ముడు, చెల్లి వున్నారు. వాళ్ళింట్లో కుటుంబ సభ్యులమధ్య చాలా సన్నిహిత సంబంధాలు వున్నాయి. కొన్ని కుటుంబాల్లో అంతే. ఇంటిలో భోజణం దగ్గర్నించీ అందరూ కలిసేచేస్తారు. తమలో తామే మిత్రుల్లాగా ఆప్తుల్లాగ కలిసిమెలసి వుంటారు.
అంత చక్కటి కుటంబం నుంచి వచ్చిన అపురూపలక్ష్మి ఒక్కసారిగా తనవాళ్ళనంధర్నీ వదిలి బయట ప్రపంచంలో వుండవలసి వచ్చేసరికి నీటినుంచి బయటపడ్డ చేపలా విలవిల లాడిపోయింది. బెంగతో చాలా రాత్రిళ్ళు ఏడ్చేదట.
అప్పుడే పరిచయం అయింది ఆ అమ్మాయికి రమణితో.
సాధారణంగా మనం ఒక క్లాసులోగానీ, హాస్టల్ లోగానీ చేరగానే ముందు ఒకరిద్దరు పరిచయం అవుతారు. మొదటిరోజే "గొప్ప స్నేహం" అయిపోతుందది. తరువాత నెమ్మదిగా వాళ్ళు రాలిపోయి, తమ అభిరుచులతో సరిపోయే అసలు స్నేహితులు ఏర్పడతారు.
అపురూపలక్ష్మి తన బెంగా మర్చిపోవటానికి రమణివెంట తిరిగేది. ఈ రమణి అనే అమ్మాయి డేర్ డెవిల్. తెలివిగలదే, కానీ ఆమెది ఒక నాయకురాలి ప్రవృత్తి, పర్ వెర్డెడ్. పాప్ కారిన్ తింటూ పదిమందిని వెంటేసుకుని మోర్నింగ్ షోలకి వెళ్ళటం....బోయ్ ఫ్రెండ్స్-రకరకాల అనుభవాలనే పేకముక్కల్తో కట్టిన మేడలాంటి జీవితం....
'అప్పట్లో' రమణి నాకు గొప్ప వ్యక్తిగా కనిపించేది. కానీ తొందర్లోనే ఆమెంటే విసుగూ, అసహ్యం కలిగింది. మరోవైపు అపురూపలక్ష్మి అంటే జాలి.....ఏదో తెలియని అభిమానం! మన స్వంత మనిషి చెడిపోతూంటే మనకి కలిగే ఫీలింగ్. బహుశ లక్ష్మిని రమణినుంచి దూరంగా లాగటంకోసమే లక్ష్మితో పరిచయం పెంచుకొన్నట్టున్నాను."
- అది ఆత్మవంచన అని కిరణ్మయికి తెలుసు. కానీ మొగవాడిలో ఆ మాత్రం ఈగో, స్త్రీని ఆకర్షించటానికి చేసే ప్రయత్నం క్షమార్హం! రాయన్న చెప్పసాగాడు.
"లక్ష్మి నాకు దగ్గిరైంది. నెమ్మదిగా తన తల్లిదండ్రులమీద బెంగ కూడా తగ్గినట్టు కనిపించేది. కానీ నాకు రోజురోజుకీ 'సమయం' విలువ తెలియసాగింది. మునుపటిలాగా కుదిరేదికాదు. క్రికెట్ కోసం ఎక్కువ టైమ్ వెచ్చించవలసి వచ్చేది. ఈ లోపులో మన పెళ్ళి సెటిల్ అయింది. హాస్టల్ కి వెళ్ళి స్వీట్సు ఇచ్చి వచ్చాను. ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కూడా సంతోషంగానే వుంది. పెళ్ళికి తప్పకుండా వస్తానంది కాని రాలేదు. నేనూ అంతగా పట్టించుకోలేదు. మన పెళ్ళయిన మర్నాడు ఒకసారి కలవమని చీటీరాసి పంపింది. అప్పుడు వీలుకాక మర్నాడు వెళ్ళాను. వారం రోజులకే మనిషి అదోలా అయిపోయింది. నీరసంగా వుంది. బాగా ఏడ్చినట్లు కళ్ళు ఉబ్బిపోయున్నాయి. కారణం అడిగితే చెప్పలేదు. ఇంటినించి ఏమైనా దుర్వార్త తెలిసిందా అంటే అలాంటిదేమీ లేదంది. 'చాలా విరక్తిగా ఉంది. కారణం మాత్రం ఏమీలేదు' అనేసింది. నేను కాస్త ధైర్యం చెప్పాక నవ్వుతూనే మాట్లాడింది. ఓ పది నిముషాలు మాత్రం ఉండి వచ్చేశాను అంతే. అదే నేనామెను చివరిసారిగా చూడడం. ఆ రాత్రి పోలీసులు వచ్చేవరకు లక్ష్మిని ఇక చూడలేననే చేదునిజం నాకు తెలియదు. ఇంత ఘోరం జరుగుతుందని కలలోకూడా అనుకోలేదు." రాయన్న స్వరం వణికింది. అపురూపలక్ష్మి మరణంవల్ల తన మీదపడ్డ అబాండానికి కలిగిన బాధ మాత్రం కాదది. కిరణ్మయి మాట్లాడలేదు. అతడిని ఓదార్చే ప్రయత్నమూ చేయలేదు. కొన్ని బాధల్ని సమయమే తగ్గించాలి.
"లక్ష్మి మిమ్మల్ని ప్రేమించిందా? మీతో తనపట్ల ప్రేమలేనందుకు బాధపడి వుంటుందా?.... అంటే మన పెళ్ళి ఆమెకు మనఃక్లేశాన్ని కలిగించే అవకాశం వుందా?" అడిగింది కిరణ్మయి అతడు కాస్త తేరుకున్నాక.
"ఛ, అలాంటిదేమీలేదు. నా పెళ్ళి గురించి వస్తున్న సంబంధాలు వివరాలన్నీ చెప్పేవాడిని. ఆమెలో అలాంటి ఉద్దేశ్యం వుంటే అప్పుడే తెలిసి పోయేది."
"అంటే మన పెళ్ళికిముందు వారం, పదిరోజుల్లోనే ఏదో జరిగి వుండాలన్న మాట" అడిగింది కిరణ్మయి సాలోచనగా.
"నిజమే. ఆ రోజు కాస్త రెట్టించి అడిగితే, కాస్సేపు అక్కడే వుంటే జరిగిందేమిటో చెప్పేసేదనుకుంటాను. నా దగ్గిర ఏదీ దాచదు" అన్నాడు.
కిరణ్మయి మాట్లాడలేదు. ఆమెకు బాధగా అనిపించింది. ఆత్మహత్య అనేది ఒక రకమైన తాత్కాలిక ఉన్మాదవస్థలో మనుష్యులు అమలు జరిపేది. ఆ "ఫిట్" మూడ్ పోగానే మళ్ళీ అంత ఆవేశం వుండదు. తన ఆత్మహత్య రాయన్న కెరీర్ ని అంతలా దెబ్బ తీస్తుందనిగానీ ఆ అమ్మాయికి తెలుసుంటే ఈ ప్రయత్నానికి పాల్పడి వుండేది కాదేమో!
కిరణ్మయికి అతడిమీద అనంతమైన జాలిపొంగింది. అప్రయత్నంగానే చేతులు సాచింది. అతడు చిన్న కుర్రవాడిలా ఒదిగిపోయాడు.
ఆమె కిదంతా తమ మంచికి వచ్చిందో, చెడుకి వచ్చిందో అర్ధం కాలేదు.
ఒక సాయంత్రం నుంచి మరొక సాయంత్రానికి చేరుకోవాలంటే చీకటి వాకిటి తలుపులు తెరిచి ఓ ఉదయాన్నీ ఓ మధ్యాహ్నాన్నీ దాటాలట. ఒక కోయిలపాట వినాలంటే అయిదు ఋతువుల్ని దాగాలట.
నిజమైన ఒక ప్రేమని నెగ్గాలంటే ఎన్ని పరీక్షలు దాటాలో! ఇది నిజంగా అదృష్టమేనేమో! ఎందరో దంపతుల్ని ఏళ్ళ తరబడి కలపలేని సహచర్యం, ఒక 'కష్టం' రూపంలో వచ్చి తమని రెండురోజుల్లో దగ్గిర చేసింది.
When you sleep, with your head upon my Breast,
with a smile on your lips.....
A melting, aching tenderness encircles me.
For then, you are my child,
you clasp my unworthy feet
And emotion over-powered,
With tears in my eyes, its God that you become
Father, Son, Lover God
My beloved, what are you?
----* * * *---- |
25,326 | శూర్పనక్కా_మేమడిగేది...." ఎరక్కపోయి వచ్చారాం దేవుడా అనుకుంటూ కోపంగానే అన్నాడు నిఖిల్.
"చెప్తున్నా...చెప్తున్నా అంటూనే__స్రౌజర్ ఎక్సేంజ్స్, క్రాస్ బార్ ఎక్సేంజెస్, ఎలక్ట్రానిక్ ఎక్సేంజెస్ అని రకరకాలుగా మా డిపార్ట్ మెంటు ఎదిగింది. క్రాస్ బార్ ఎక్సేంజ్ లో సెలెక్టర్ లుండవు. ఈ సిస్టమ్ ఒక్క గుంటూరులో వుంది. బొంబాయి, కలకత్తాల్లాంటి మహానగరాల్లో మెయిన్ ఎక్సేంజెస్, శాట్ లైట్ ఎక్సేంజెస్ వున్నాయి.
పెద్దగా ఏమీ అర్ధం కాకపోయినా మౌనంగా తలలూపారిద్దరూ....మరో అరగంటయినా ఈ సుత్తి తప్పుతుందా అన్నట్లు నిఖిల్ దిక్కులు చూస్తున్నాడు తెలిసిన వాళ్ళెవరైనా తొందరగా కన్పిస్తే హలో అని విష్ చేసి అటే వెళ్ళిపోదామని. కానీ ఎవరూ కనబడలేదు.
"ఇలాంటి రకరకాల ఎక్సేంజ్ లు వున్నాయి. ఆటోమాటిక్ ఎక్సేంజీలలోనైతే ఒక పద్దతి ద్వారా అంటే....ఓ జి.ఎన్.ఎల్.ఓ.డి ద్వారా ప్రసారాలు జరుగుతాయి. 'ఓ.జి.ఎన్.ఎల్.ఓ.డి' అంటే తెల్సా?" అనడిగింది శూర్పణఖ.
"తెలీదు" దీనంగా అన్నాడు భార్గవ.
"అంటే...ఔట్ గోయింగ్ సింగిల్ లింక్ ఆపరేటర్ డయలింగ్ సర్క్యూట్ అనే పద్దతి ద్వారా ప్రసారాలు జరుగుతున్నాయన్నమాట....అన్నిటికంటే సులభమైన పద్దతేమంటే..."
"డయల్ లో వేలుపెట్టి త్రిప్పటం" అన్నాడు నిఖిల్ కోపాన్ని అణచుకోలేక. ఆ మాటకు శూర్పణఖ నవ్వటం చూసి, భార్గవ కూడా నవ్వాడు నిర్జీవంగా.
"చాలు శూర్పణఖా నీ సమ్మెట దెబ్బలు మాక్కావల్సిన వివరాలు వేరు. అవి చెబితే వెళ్ళిపోతాం" అన్నాడు నిఖిల్ దీనంగా. అప్పుడు ఏమిటీ అంది నిదానంగా. భార్గవకూడా హమ్మయ్య అనుకొని-
"మేడమ్....మొన్నటి నుండి నాకు కొన్ని 'అబ్నాక్షియస్ కాల్స్' వస్తున్నాయి. మీరేమైనా ట్రేసవుట్ చేయగలుగుతారేమోనని...." అన్నాడు భార్గవ.
"అదీ మాక్కావల్సింది" అన్నాడు నిఖిల్.
"తప్పకుండా చేస్తాం! ఎందుకంటే ఏ ఫోన్ ఎక్కడినుండి వస్తుందో ఏం నంబర్ పోతుందో మేం పట్టించుకోం గాని....మీ ఫోన్ అబ్జర్వేషన్ లో పెడితే...అబ్నాక్షియస్ కాల్స్ వచ్చే నంబర్ ని మేం గుర్తించగలం" అంది శూర్పణఖ నిఖిల్ ను కళ్ళతోనే త్రాగేస్తూ.
"ఆ విషయాలే వివరంగా చెప్పింకా" అన్నాడు నిఖిల్.
"ఈ విషయంలో మనం మా జె ఇ గారిని సంప్రదించటం బెటర్. ఆయనయితే మీకు మరే వివరాలైనా అందించగలరు" అంది జూనియర్ ఇంజనీర్ గదివైపు నడుస్తూ.
అయితే పద అంటూ జె.ఇ. గారిని కలిసి విష్ చేసి పరిచయాలయ్యాక అసలు విషయం తెలిపాడు భార్గవ. ఆయన కొంచెం ఏజ్ డ్ పర్సన్. "సిట్ డౌన్ ప్లీజ్" అనేసి ఓసారి బట్టతల నిమురుకొని "భార్గవ గారూ! మీ ఫోన్ నంబర్ చెప్పండి" అన్నాడు.
"559" భార్గవ చెప్పాక అతను నోట్ చేసుకున్నాడు.
"ఇప్పటి నుంచి మేమీ నంబర్ ని అబ్జర్వేషన్ లో పెడతాం! మీకెవరు ఫోన్ చేసినా ఆ ఫోన్ నంబర్ నోటవుతుంది."
"థాంక్యూ సర్"
"మెన్షన్ నాట్....! కానీ ఇక్కడో సమస్య.... దాదాపుగా మేం సర్క్యూట్ చేస్తాం కానీ...ఇల్లీగల్ గా అబ్నాక్షియస్ కాల్స్ వస్తే మేం కూడా మీకు ఏ నంబర్ నుండి చేస్తుందీ కనుక్కోలేకపోతాం" అన్నాడు జె.ఇ. నిరుత్సాహంగా.
వాళ్ళిద్దరూ క్షణం పాటు ఆశ్చర్యపోయారు.
"మీకు తెలీకుండా ఇల్లీగల్ గా ఎవరు ఎవరికీ చేస్తారు చెప్పండి? నంబర్ లేని టెలిఫోన్ లు ఎక్కడైనా ఉంటాయా సార్" అన్నాడు భార్గవ.
"ఎవరు క్రెడిలెత్తినా నంబర్ ప్లీజ్ అనో, లేక డయల్ తిప్పో ముందు మీకే సూచిస్తారు గదా! అలాంటిది..." అడిగాడు నిఖిల్.
మీరనేది నిజమే! నంబర్ లేని టెలిఫోన్ లు కూడా వుంటాయి."
ఈసారి మరింత నోరు తెరిచారు ఇద్దరూ. శూర్పణఖ తన స్లీవ్ లెస్ జబ్బల్ని పక్కనున్న నిఖిల్ కి అద్దుతోంది.
"నంబర్ లేని టెలిఫోన్ లు కేవలం స్టాఫ్ కి వుండొచ్చు. బయటివారికి వుండవు. వాళ్ళు అబ్నాక్షియస్ కాల్స్ పంపే స్థితికి దిగజారలేదనే అనుకుంటాను. ఇకపోతే ముఖ్యంగా ఇలాంటి బెదిరింపులు చేసే వాళ్ళంటూ ఇల్లీగల్ గా ఎలా చేస్తారంటే....అవుట్ డోర్ లోంచి టెలిఫోన్ స్తంభాలెక్కి లేదా బిల్డింగ్ లకు అతి దగ్గరగా వున్న ఫోన్ తీగెల ద్వారా టెలిఫోన్ సాయంతో డయల్ చేసి బెదిరిస్తుంటారు" చెప్పాడు జె.ఇ. బట్టతల మీద కుడిచేతి వ్రేళ్ళు టపటపలాడిస్తూ.
"కాని నాకు చేస్తున్నది ఆడపిల్ల.... ఆడపిల్ల స్థంభాలెక్కి అబ్నాక్షియస్ కాల్స్ పంపటం అసాధ్యం.... హాస్యాస్పదం కూడా" అన్నాడు భార్గవ.
"అవునవును.... నిజమే" అంది శూర్పణఖ. జబ్బును నిఖిర్ కేసి మరింత హత్తుతూ. నిఖిల్ ఓసారి నిగనిగా మెరిసిపోతున్న ఆ నల్లటి స్లీవ్ లెస్ జబ్బను నిశితంగా చూసి ఆ జబ్బమీద ఎలాంటి మచ్చలు లేకపోవటంతో "చిన్నప్పుడు బి సి జి వాక్సిన్స్, శిల్ పాక్స్ వాక్సిన్స్, మీజిల్స్ వాక్సిన్స్ ఇవ్వనట్టున్నారు. ఏనుగుతొండం లాగే వుంది" అనుకున్నాడు మనసులో.
"ఒకవేళ డైరెక్టుగా అయితే మేమే అబ్జర్వ్ చేస్తాం రైటర్ గారూ....ఆ వెంటనే మీకు తెలుపుతాం కూడా."
థాంక్యూ సర్! చాలా విషయాలు తెలిపారు. వెళ్ళొస్తాం అన్నాడు నిఖిల్.
"ఒన్ మినిట్...కాఫీత్రాగి వెళ్ళండి" అన్నాడాయన వేళ్ళు మళ్ళీ బట్టతల మీద టకటకలాడిస్తూ. వాళ్ళమధ్య మాటలేం లేనట్లు నిమిషం పాటు మౌనం. ఆ మౌనాన్ని చీలుస్తూ జె.ఇ. గారి ఫోను రింగయ్యింది.
ఆయన హలో అని మీకే సార్ అంటూ అందించాడు. భార్గవ ఫోనందుకుని చెవి దగ్గర పెట్టుకోగానే.... ముచ్చెమటలు పోసి వేడి సెగలు తాకుతున్నయింది భార్గవకు- తప్పక అదే వ్యక్తయి వుంటుందని. |
25,327 |
"మన జ్ఞానం పదిమందికి ఉపయోగపడకపోతే ఆ జ్ఞానం ఎందుకు?మనం విద్యావంతులమై పదిమందిని విద్యావంతుల్ని చేయకపోతే మన విద్య ఎందుకు? ప్రతి చదువుకొన్న అమ్మాయి, ప్రతి చదువుకొన్న అబ్బాయి మరో పదుగురు నిరక్షరాస్యుల్ని అక్షరాస్యుల్ని చేయగలిగితే దేశంలో ఈ నిరక్షరాశ్యత్వం వుండదు! నిరక్షరాస్యత తొలగడంతోపాటు అజ్ఞానమూ పటాపంచలైపోతుందని నా నమ్మకం"
15
రోజూ అయిదున్నర, ఆరింటికల్లా ఇంటికి వచ్చేసే చంద్రకాంత్, పని ఎక్కువగా వుండడంవల్ల రాత్రి ఎనిమిదింటికి ఇంటికి వచ్చాడు.
స్తబ్దంగా తన మంచంమీద పడుకొనో, వీల్ ఛెయిర్ లో కూర్చొనో కనిపించే సుగుణ ఈరోజు డ్రాయింగ్ రూంలో సోఫాలో పత్రిక చూస్తూ కూర్చొంది. క్రొత్తచీర కట్టుకొని, జడలో మల్లెచెండు తురిమింది సుగుణ జడలో ఎన్నాళ్లకి చూస్తున్నాడు మల్లెలను! అసలు ఈరోజు సుగుణ రూపమే మారిపోయినట్టుగా వుంది.
"ఇవాళ ఏమిటి విశేషం సుగుణా?కొత్తచీరా, మల్లెపూలు......"
"నేను రోగిష్టిదాన్ని, ఎందుకూ పనికిరానిదాన్ని అన్న విషయం ఇక మరిచిపోవాలనుకొంటున్నాను! రోగిష్టిదాన్ని అనుకొంటూంటే జన్మంతా రోగిష్టిగానే వుండిపోతాననిపించింది"
"గుడ్! శరీరానికి ఎక్కువ శ్రమ ఇవ్వకు."
చంద్రకాంత్ బట్టలు మార్చుకొని వంటకి లేటయిపోయిందన్న తొందరలో వంటగదిలోకి వెళలాడు. కాని, వంటంతా చేసి రెడీగా కనిపించింది.
"వంటెవరు చేశారు?"
"నేనే చేశాను."
"నువ్వా?! నీకివాళ ఏమైంది? ఇంత సత్తువ ఎక్కడినుండి వచ్చింది? కొంచెం ఎక్కువసేపు కూర్చొంటే నడుం నొప్పి అని గిలగిల్లాడిపోయే దానివి!"
"సత్తువ మనసులోంచి వచ్చింది. మనోబలంతో ఈ అనారోగ్యాన్ని జయించాలనుకొంటున్నాను! "నాకేం రోగంలేదు. నేను చాలా ఆరోగ్యంగా వున్నాను. అని నన్ను నేను హిప్నటైజ్ చేసుకోవాలనుకొన్నాను!"
"నీమొహం డాక్టర్లు చెప్పినన్ని రోజులు వాళ్లు చెప్పిన విధంగా జాగ్రత్తగా వుండాలి!"
"వాళ్లు జీవితాంతం బెడ్ మీద శవంలా పడుండమంటారు నావల్ల కాదిక. చస్తే చస్తాను! బ్రతికితే అందరిలా బ్రతుకుతాను" అంటూంటే సుగుణ కళ్లలో నీళ్లు తిరిగాయి.
"నీకివాళ నడుం నొప్పి రాలేదూ?"
"నా మనోశక్తితో దాన్ని తమిరేయడానికి ప్రయత్నిస్తున్నాను."
కాని, ఎక్కువ శ్రమతో సుగుణకు నొప్పి రానే వచ్చింది. పళ్లు బిగువున ఓర్చుకొంటూ పైకి మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూంది. చావో బ్రతుకో ఏదో ఒకటి తేలాలన్న ఆలోచనతో తన నొప్పిన ప్రక్కకు నెట్టేస్తూంది.
16
రాత్రి పదకొండు గంటల వరకూ పుస్తకం చదువుతూనో, మాగజైన్ చదువుతూనో, మెలుకువగావుండడం అలవాటు చంద్రకాంతుకు. ఆ రోజూ మంచంమీద పడుకొని మాగజైన్ చదువుతున్నాడు.
పది గంటలవుతూంటే సుగుణ నెమ్మదిగా గదిలోకి వచ్చింది.
"అబ్బ! ఏం చదువు?" అంటూ అతడి చేతిలోంచి మాగజైన్ తీసివేసింది. వెళ్లి లైట్ తీసివచ్చి, మంచంమీద అతడి ప్రక్కన కూర్చొంది.
"సుగుణా! నీకేమైనా మతిపోయిందా? ఏమిటిది?" చంద్రాకంత్ కంగారుగా లేవబోయాడు.
సుగుణ లతల్లా తన చేతుల్ని అతడిని చుట్టేసింది. "ఈ రాత్రి మన మధ్య దూరం చెరిగిపోవాలి! ఇక నేను దూరంగా వుండలేను."
"ఇంకొద్దిరోజులు జాగ్ర్తత్తగా వుంటే డాక్టర్లే అనుమతి ఇస్తారు కదా?" |
25,328 | "మామయ్య కులాసాగా వున్నాడు. మనం బస్సులో వెనుక సీటులో వుండటం వల్ల పెద్దగా దెబ్బలేమీ తగలకుండా క్షేమంగా బయటపడ్డాము, నా చేతికి దెబ్బ తగిలింది. మామూలుగా బెణికిందేమో అనుకున్నాను. ఉత్త బెణుకు కాదని లైట్ గా బొమిక ఫ్రాక్చర్ అయిందని, ఈ చేతిని ఇలా మెడకు వేసి కట్టారు. మరేం ఫరవాలేదు. అవసరానికి చేతిని బయటకి తీసుకోవచ్చు. ఈ పొజిషన్ లో ఇలా చెయ్యి ఉంచితే మాత్రం నెప్పిలేదు. అత్తయ్యా నీకు బాగా జ్వరం ఎక్కువ కావటంతో బస్సు ప్రమాదానికి లోను అయింది కూడా నీకు తెలియలేదు. వచ్చి డాక్టరు చేతిలో పడ్డాము కదా! ఇంక నీ జ్వరం కూడా తగ్గిపోతుంది... ..."
మోహనరావు చెప్పుకు పోతూంటే మధ్యలో అడ్డు తగిలి, 'మీ మామయ్య ఏరి?' అంది పార్వతి.
"మామయ్యని వెంటనే చంద్రం దగ్గరకి పంపించాను. నా చెయ్యికి దెబ్బ తగలకుండా వుంటే నేనే వెళ్ళి వుండేవాడిని." మోహనరావు పార్వతి నమ్మే విధంగా అబద్ధం ఆడాడు.
పార్వతి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. "బాబాయ్ చంద్రం దగ్గరకి వెళ్ళివుంటాడు" దగ్గుత్తితో అంది పార్వతి.
"పుండరీకాక్షయ్య బాబాయ్ సంగతి ఎవరికీ తెలియదు. ఆయన అన్నిచోట్లా ఆగుతూ తీరుబడిగా వెళతాడు. మామయ్యని ఏమాత్రం ఆలశ్యం చెయ్యకుండా ఏదేనా టాక్సీ చేసుకుని తొందరగా వెళ్ళమని చెప్పాను. టాక్సీ అంటే ఎక్కడా ఆగకుండా వెడుతుంది. మన చంద్రానికి ఏమీ పరవాలేదు. మామయ్య, చంద్రం ఇద్దరూ కలిసి వస్తారు చూడు." పార్వతికి వుత్సాహమూ, ధైర్యమూ కల్పిస్తూ అన్నాడు మోహనరావు.
"అలా జరుగుతుందంటావా?" ఆశగా అడిగింది పార్వతి.
"తప్పకుండా, నువ్వే చూస్తావుగా అత్తయ్యా!"
అవతల ఏం జరిగిందో తెలియని పార్వతి మోహనరావు మాటలకి కాస్త తృప్తిపడి బాగా నీరసంగా వుండటంతో నిసత్తువుగా కళ్ళు మూసుకుంది.
"ఆడవాళ్ళ వార్డులో మగవాళ్ళు వుండకూడదు. నేను ఇక్కడే తిరుగుతూ వుంటాను అత్తయ్యా! మళ్ళీ కాసేపట్లో వస్తాను. అని పార్వతితో చెప్పి మోహనరావు ఇవతలకి వచ్చేశాడు.
అటు వార్డులోకి వెళ్ళి మామయ్యని చూసి, వచ్చి ఆస్పత్రి వరండాలో బెంచీమీద కూర్చున్నాడు.
మోహనరావు ఆలోచనలు పరి పరివిధాల పోతున్నాయి.
"అత్తయ్యతో తను చాలా పెద్ద అబద్ధం ఆడాడు. ఒకేసారి భర్తా, కొడుకూ, ప్రాణాపాయ స్థితిలో వున్నారని తెలిస్తే ముందు అత్తయ్య బ్రతకదు. పోనీ, వీళ్ళిద్దరినీ విడిచి, ఉరుకుల పరుగుల మీద చంద్రం దగ్గరకి వెళదామంటే ఇప్పటికే ఆలశ్యం అయింది. అయినా కూడా టాక్సీ చేసుకుని ఆఘమేఘాల మీద వెళ్ళవచ్చు. ఇక్కడ ఆస్పత్రిలో వున్న మామయ్యనీ, అత్తయ్యనీ చూసేదెవరు? ఉన్న విషయం అత్తయ్యకి చెప్పి చంద్రం దగ్గరకి తాను వెళ్ళవచ్చు. కానీ, అత్తయ్య ధైర్యం తెచ్చుకోవలసినది పోయి, అధైర్యంతో పూర్తిగా దిగజారి పోతుంది. ఈ వార్త షాక్ లాగా తగిలి స్పృహ కోల్పోయినా కోల్పోవచ్చు. మళ్ళీ జ్వరం ముంచుకు రావచ్చు. భగవంతుడా! నన్నెంత ఇరకాట పరిస్థితిలో పడవేశా వయ్యా! ఇక్కడ ఉండలేను, అక్కడకి వెళ్ళలేను. చూస్తూ చూస్తూ పెద్ద అబద్ధం కూడా ఆడేశాను__ __"
ఏ దిక్కూ తోచక మోహనరావు తనలో తాను బాధపడుతూ ఆలోచిస్తూ వుంటే,
"ఏమయ్యా! మోహనరావూ!" అన్న పిలుపు వినబడింది.
ముందు మోహనరావు వినిపించుకోలేదు. మరోసారి తన పేరు దగ్గరగా వినరావడంతో మోహనరావు తలెత్తి చూశాడు.
ఎదురుకుండా రామానుజాచారి ప్రత్యక్షమయ్యాడు.
రామానుజాచారి ఎవరో కాదు, వాళ్ళ వూళ్ళో గుళ్ళో పూజారి, బాగా తెలిసిన వాడు. మోహనరావు గుడికి వెళ్ళినప్పుడల్లా రామానుజాచారితో గంటసేపు కబుర్లు వేసుకుని గాని ఇవతలకి రాడు. |
25,329 | "ఆత్మహత్య చేసుకోనని నాకు మాటిచ్చికూడా ఇంత దారుణాని కోడిగట్టావా? నిన్ను నా గుండెల్లో దాచుకోవాలని మరీ వచ్చాను కాశ్మీరా" వణుకుతున్న చేతులో ప్రేమతో, అప్యాయంగా ఒక్క సారి ఆమె తల పైన చెయ్యివేసి నిమిరాడు.
రాబర్టు మెల్లగా బయటకొచ్చాడు.
అతని కళ్ళు శశిభూషణ్ కోసం వెదికినయ్
"రాస్కెల్" పళ్ళు పటపటమని కొరికాడు రాబర్టు.
భార్య చనిపోతే ఎక్కడున్నట్టు వీడు?
కాశ్మీర ఎందుకు చచ్చిపోయింది.
ఇది ఆత్మహత్యా?
హత్యా?
ఇది ఏక్సిడెంట్ కాదు. ఇంట్లో వంటమనిషి వుండగా కాశ్మీరకి వంటగదిలో కెళ్ళేపని అవసరం లేదు.
ఆత్మహత్య చేసుకోనని తనకి మాటిచ్చింది. ఆరుగంటలకి తనని రమ్మని మరి చెప్పింది.
అయితే హత్యా....?
రాబర్టు వార్డ్ కేసి నడిచాడు.
కాశ్మీరా డెత్ స్టేట్ మెంటు ఏమని ఇచ్చింది.?
కాశ్మీర కేసులో అటెండ్ అయిన డాక్టర్ జాలిగా అన్నాడు.
"సారి ఆమె ఏమీ చెప్పలేదు తీసుకోచ్చిన కొన్ని గంటల్లో పోయింది"
కాశ్మీర శరీరాన్ని ఇంటికి తీసుకెళ్ళలుండా శశిభూషణ్ ఎక్కడి కెళ్ళినట్టు?
కొద్ది దూరంగా వస్తున్న మనుషుల్ని పోల్చుకున్నాడు రాబర్టు
కాశ్మీర తండ్రి తల్లి. శశిభూషణ్ రామదాసు చెయ్యి పట్టుకుని నడిపించుకోస్తున్నాడతను.
రాబర్టు పక్కకి తప్పుకున్నాడు. ఆమె తల్లి తండ్రి గుండెపగిలేలా ఏడుస్తున్నారు. శశిభూషణ్ చేతికి కట్లు కట్టివున్నాయి. అతని చేతులేందుకు కాలాయి?
కాశ్మీర కాలిపోతుంటే మంటలు ఆర్పడానికి గాని ప్రయత్నం చేశాడా?
ఓ వ్యానులో కాశ్మీర శరీరాన్ని ఎక్కించారు.
ఆ రాత్రే కాశ్మీరకి అంత్యక్రియలు జరిగాయి.
ఆ చీకటిలో స్మశానంలోకి కాలుతోన్న ఆ చితి దగ్గరగా నడిచాడు రాబర్టు.
అతని కన్నీళ్ళు ఆమె ఆత్మకి శాంతిని చేకూరుస్తాయని రాబర్ట్ కి తెలుసు.
కాలుతోన్న శవం తాలూకు కపాలం పగిలినట్టుగా 'టాప్' మన్న శబ్దం.... ఆ శబ్దం విన్న రాబర్ట్ మోకాళ్ళపైన కూలబడిపోయాడు. సడే చితిలో పది అతనికీ చచ్చిపోవాలనిపించింది
మండుతోన్న ఓ కట్టేని చేతిలోకి తీసుకున్నాడతను.
ఇప్పడతను స్మశానంలో ఓ కోరిని దెయ్యంలా వున్నాడు. అతను ఏం చేయబోతున్నాడో అన్న భయం తో స్మశానంలోని ప్రేతాత్మలన్నీ గడగడ వణికిపోయినాయి.
కాలుతోన్న కాశ్మీర చితికేసి ఆఖరిసారి చూసాడు రాబర్ట్.
అతని కళ్ళలోనుంచి కారుతోన్న కన్నీటి రక్తం కాశ్మీరని బతికించలేదన్న సంగతి అతనికి తెలుసు.
మెల్లగా చేతిలో మండుతోన్న కట్టేని కాష్టంపైకి పడేశాడు.
లేచినుంచున్నాడు రాబర్టు. ఇప్పడతనిలో జాలి. దయ అనే పదాలు పూర్తిగా కాలిపోయినయి.
ఓ కఠినమయిన రాయిగా అతని గుండె మారిపోయింది.
జేబులోంచి సిగరెట్ పెట్టెతిసి సిగరెట్ వెలిగించి ఒక్కక్షణం కళ్ళు మూసుకున్నాడు.
రాత్రిపూట అందునా అర్దరాత్రి సమయంలో ఒంటరిగా స్మశానంలో అడుగు పెట్టటం తప్పని అతనికి తెలుసు.
భూతాలూ, దెయ్యాలు ప్త్వేరవిహారంచేసే ఆ సమయంలో అతను కూడా ఓ దెయ్యంలా వుందిప్పుడు.
కడఊపిరిలో వుండగానన్నా ఒక్కసారి ఆమెని చూడలేక పోయానే అనే దుగ్ధ అతన్ని పీడిస్తోంది.
అందాలబొమ్మ అపారంజిబొమ్మ కాశ్మీర. ఆ చిలిపితనం చిలిపిచేష్టలు. ఆ కళ్ళలో కదిలే ప్రేమ, అనురాగం అతని మనసుని తొలిచేస్తున్నాయి.
ఎందుకిలా అయింది?
శశిభూషణ్ కాశ్మీరని చంపాడన్నా నమ్మకం రాబర్టులో బలంగా కలిగింది. తనకీ కాశ్మీరకి వున్న సంబంధం గురించి అతనికి తెలీటమే ఈ హత్యకి కారణమని అతనికిప్పుడు బాగా తెలుసు.
కాశ్మీర శశిభూషణ్ నీ కాపాడమని ఎంత విలవిల్లాడిపోయింతా రోజు. అతని ఎన్ని హింసలు పెట్టినా సహించిన సహనశీలి కాశ్మీర.
ఆ దుర్మార్గుడికి చేతులెలావచ్చాయి ఓ నిండు జీవితాన్ని కాల్చేయడానికి?
పళ్ళు పటపటమని కొరికాడు రాబర్టు.
మోహినీకి సహరించి ఆనాడే శశిభూషణ్ చంపినట్టయితే ఈ నాడిలా కాశ్మీర చనిపోయేది కాదు.
మంటల్లో కాలిపోతూ ఎలా అల్లాడిపోయిందో అమాయకురాలు
దేవుడా నువ్వున్నావా?
వుంటే ఎక్కడున్నావ్? ఏంచేస్తున్నావ్? ఇంతదారుణం నీకళ్ళ ముందు జరుగుతూవుంటే కళ్ళుమూసుకున్నావా? ఇది నీకు న్యాయమా? ధర్మమా? |
25,330 | అతని భుజం మీద చిలకని అభిమానంతో అందుకుని ఇష్టంగా తన గుండెలకి పోదువుకుంది సుదీర. అంతలోనే ఇదివరకు అది తనని కొరకడం గుర్తు వచ్చి చటుక్కున దాన్ని దూరంగా వుంచింది. "ఖస్ ఉమ్మాక్!" అంది చిలక. కళ్ళు పెద్దవి చేసి, దాని వైపు ఉరిమి చూసింది సుదీర. కానీ, ఆమె కళ్ళలో కోపంలేదు. మురిపెం ఉంది. సుదీర వైపు సాలోచనగా చూశాడు భరత్. --------------- కారు దిగి త్వరత్వరగా లోపలికి వచ్చేస్తున్న సుదీర వైపు తేరిపార చూశారు రత్నాకరరావు , సీతా. "డాడ్!" అని రత్నాకరరావు మెడ చుట్టూ చేతులేసింది సుదీర. ఆమె కళ్ళలో నీళ్ళు. "సుదీ!" అన్నాడు అతను ఆశ్చర్యంగా. "నన్ను కిడ్నాప్ చేసుకెళ్ళిపోయారు డాడ్ వాళ్ళు! బలవంతంగా నాచేత మీకు ఫోన్ చేయించారు. తెల్లారేలోగా నన్ను చిత్ర హింసలు పెట్టె ప్లాన్ లో ఉన్నారు. దేవుడి దయ వాళ్ళ తప్పించుకు బయట పడగలిగాను. ఓహ్ మమ్మీ!" అంటూ సీత దగ్గర కెళ్ళింది సుదీర. "ఎంత గట్టిగా కట్టి పడేశారో చూడు మమ్! చేతులు ఒరుసుకు పోయాయి!" అంటూ చేతులు ముందుకు జాచింది. చూసింది సీత. నిజంగానే సుదీర చేతులు కమిలిపోయి ఉన్నాయి. "నీ చేతులని కట్టేసిన వాళ్ళ చేతులు కట్ చేయించేస్తాను." అంది నెమ్మదిగా ప్రతిన పూనుతున్నట్లు. "ఇంకా గుండె దడ తగ్గనే లేదు. మమ్మీ!" అంటూ చుట్టూ చూసింది సుదీర. "ఏమిటి మమ్! ఈ హడావుడి అంతా?" "డాడీ స్విట్జర్లాండ్ వెళుతున్నారు." "ఓహ్ మైమై! మరి నేనో?" అంది సుదీర గారంగా. "ఇది ప్లెజర్ ట్రిప్ కాదు సుదీ! ఎమర్జన్సీ! ఇప్పుడు అల్లరి చెయ్యకు." "నువ్వెప్పుడు ఇంతే మమ్మీ! డాడీనే అడుగుతాను" అని ఉత్తుత్తి కోపం తెచ్చుకుంటూ రత్నాకరరావు దగ్గరికి నడిచింది. "డాడ్! డాడ్! ప్లీజ్! డాడ్! నేనూ రావచ్చా?" కూతురి గొంతు వింటేనే కరిగిపోతాడు రత్నాకరరావు. సీత వైపు చూశాడు. ఆమె తల అడ్డంగా ఆడించింది. "పోనీ ఎయిర్ పోర్టుదాకా అన్నా రానిస్తారా నన్ను? అది లేదా?" అంది అలకని ప్రదర్శిస్తూ. "ఎయిర్ పోర్టు వరకే అయితే, వెళ్ళొచ్చు." అంది సీత. "థాంక్స్ ఎలాట్ మమ్మీ!" సూట్ కేసులు కార్లో సర్దడం పూర్తి అయింది. అందరికంటే తనే ముందు కార్లో కూర్చుంది సుదీర, డ్రయివింగ్ సీట్లో. కారు కదిలింది. ఇంట్లోనే వుండిపోయింది సీత. మర్నాటి ప్రమాణ స్వికారాన్ని గురించిన ప్రణాళికలు పూర్తి చేసుకుంటూ. సుదీర పక్కన కూర్చుని వున్న రత్నాకరరావు స్వగతంలో ఏదేదో మాట్లాదేస్తున్నాడు వినరాని పదాలతో తిడుతున్నాడు భరత్ ని. మౌనంగా వింటూ డ్రయివ్ చేస్తుంది సుదీర. హటాత్తుగా నిద్రలో నుంచి మేల్కొన్న వాడిలా చూశాడు రత్నాకరరావు. "అమ్మడూ, ఇటేక్కడికి?" వెంటనే అతని మొహం మీద ఎవరిదో చేయ్యిపడింది. ఆ చేతిలోని హాంకి అతని ముక్కుని అదిమేస్తుంది. కొద్ది క్షణాల సేపు ఏదో తియ్యటి వాసన వచ్చినట్లనిపించింది రాత్నాకరరావుకి. అరవడానికి ప్రయత్నించాడు. మాట బయటికి రాలేదు. మెల్లిగా తల వెనక్కి వాల్చేశాడతను. స్పృహ తప్పిపోతోందతనికి. భుజాల మీదుగా వెనక్కి చూసింది సుదీర. "ఒకే?" "ఒకే" అంటూ పిడికిలి మూసి, బొటనవేలు పైకెత్తి "ధంప్స్ అప్' సైన్ చూపించాడు వెనక సీట్లో కూర్చుని ఉన్న భరత్. "ఇప్పుడు ఎక్కడికి?" అంది సుదీర. "మీ తోటకి పోనీ. అక్కడ మీ నాన్నగారూ రెస్టు తీసుకుంటూ ఉంటారు. ఈలోగా మనం చింతకాయల బాబా దగ్గరికి వెళ్ళి రావాలి." "చింతకాయల బాబానా? ఎందుకు?" "కధని క్లయిమాక్స్ కి తీసుకురావడానికి." నవ్వింది సుదీర.
------------ బాగా పొద్దెక్కాక కళ్ళు తెరిచాడు రత్నాకరరావు. కిటికిలోనుంచి బయటికి చూస్తున్న సుదీర వెనక్కి తిరిగింది. "లేచారా డాడీ?" తల విదిలించి, అనుమానంగా చూస్తూ, రాత్రి జరిగింది గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు రత్నాకరరావు. "ఏం జరిగింది? ఇక్కడెందుకున్నాం మనం?" అతని ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, "అక్కడ చూశారా డాడీ?" అంది కిటికీలో నుంచి బయటికి చూస్తూ. లేని శక్తిని తెచ్చుకుని నిలబడ్డాడు రత్నాకరరావు. అతని కాళ్ళు వణుకుతున్నాయి. కీడు శంకిస్తుంది మనసు. కిటికిలో నుంచి బయటికి చూడగానే కొయ్యబారిపోయాడు. అక్కడా- మనుషులు..........మనుషులు.......మనుషులు! అసంఖ్యంగా చీమల బారులా క్యూలో నిలబడి ఉన్నారు! అల్లరి లేదు. గడబిడ లేదు. సుషిక్షతులయిన శాంతి సైనికుల్లా నిలబడి ఉన్నారు వాళ్ళు. రత్నాకరరావు కాళ్ళు వణకడం ఎక్కువయింది. "ఎవరు వాళ్ళు? ఎండుకున్నం మనం ఇక్కడ? ఎయిర్ పోర్టుకెందు కెళ్ళలేదు! అమ్మ ఏది? అసలేం జరుగుతోంది?" అన్నాడు వెర్రిగా. జరగరానిది ఏమి జరగట్లేదు, రత్నాకరరావుగారూ! జరుగుతున్న అన్యాయాల మీద తిరుగుబాటు జరుగుతోంది. అంతే!" అన్నాడు భరత్ ముందు కోస్తూ. అతన్ని కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయాడు రత్నాకరరావు. "ఎవరు నువ్వు?" "మీ అమ్మాయికి మొగుణ్ణి." కమ్మితో కొట్టినట్లు ఉలికిపడ్డాడు రత్నాకరరావు. "ఎందుకు తిసుకోచ్చావ్ ఈ మనుషులందరినీ? నా సంగతి నీకు తెలియదు. దౌర్జన్యానికి లొంగే మనిషిని కాను నేను." నవ్వాడు భరత్. "దౌర్జన్యం ఎవరు చేస్తున్నారు రత్నాకరరావుగారూ! సౌమ్యంగానే అడుగుతున్నారు వాళ్ళు." "ఏమని?" "ఎండమావిలాంటి ఆ మైక్రో కారు కోసం తాము కట్టిన డబ్బు రిటర్న్ చెయ్యమని." "ఎండమావా? ఎవరు చెప్పారు?" అన్నాడు రత్నాకరరావు, పిచ్చేత్టినవాడిలా అరుస్తూ. మాట్లాడకుండా జేబులోంచి కాగితాలు తీశాడు భరత్. అది సారధి తన స్టేట్ మెంట్ ని రాసి ఉంచిన కాగితాలు. అవి చూడగానే రత్నాకరరావు మొహం పాలిపోయింది. వాటిని లంకించుకోవాలని చూశాడు. |
25,331 |
మనసు విప్పి మాట్లాడలేకపోతోంది. ఆమెకెలాగైనా కళ్ళు తెప్పించాలి. తనని చూడగలిగేలా చెయ్యాలి. పిచ్చిగా, వెర్రిగా బొమ్మలు తయారు చేస్తున్నాడు. ఆ బొమ్మలలో...
39
రంజితకు తెలివొచ్చింది. తలంతా భరించలేనంత బరువు. తానెక్కడ వుంది? బలవంతాన కళ్ళువిప్పి పరిసరాలు తెలుసుకోవటానికి ప్రయత్నించింది. ఏమిటిది? ఆపరేషన్ థియేటర్ లా వుంది. ఆమెకు క్రమక్రమంగా అర్థమవుతోంది. కానీ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు చూసిన ఆపరేషన్ థియేటర్! తను-? కాళ్ళూ,చేతులూ కదిలించటానికి ప్రయత్నించింది. గట్టిగా కట్టివేసి వున్నాయి. విదిలించుకోటానికి ప్రయత్నం చేసింది. ఒక్క మిల్లీమీటరు కూడా కదల్లేదు. తల ప్రక్కనుంచి చిన్న నవ్వు వినిపించింది. తల కదల్చటానికి ప్రయత్నించినా లాభం లేకపోయింది. కళ్ళు పైకెత్తి చూసింది. అతను పూర్తిగా కనబడటంలేదు. తల దగ్గర ఏదో కదిలినట్లయింది. ఆమె కర్థమవుతోంది. ఎడమకంటికి కొంచెం దూరంలో టెంపరోమేస్ దిబ్యులర్ రీజియన్ నీడిల్ దిగబడుతూన్నట్లు చురుక్కుమంది. తర్వాత లోపలికేదో జరజర ప్రాకుతూన్నట్లు అనుభూతి.
* * *
ప్రఫుల్లకుమార్ మెదడులో ఇంకా ఆలోచనలు మెదులుతూనే వున్నాయి. డాక్టర్ కృష్ణచైతన్యకు ఈ కిరాతకాలాన్నీ చేసేది తన కుమారుడేనని అనుమానముంది. కాని బయటకు చెప్పలేకపోతున్నాడు. డాక్టర్ వసంతకుమార్ మొదట్నుంచీ పెద్ద సైకోపాత్. అతని ప్రవర్తనలో విపరీతమైన పర్ వర్షనుండేది. అతని బిహేవియర్ లోని దుడుకుతనం వల్ల మొదట్నుంచీ అతనికి అతని భార్యకూ పడేదికాదు. అతని భార్య దగ్గర సుఖం లేకపోవటంవల్ల మరో స్త్రీతో పొందుపెట్టుకున్నాడు. దాంతో భార్యకూ అతనికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటూ ఉండేది. ఆమె మానసికంగా అతన్ని హింసించినప్పుడల్లా భార్య మీద అతనికి వైముఖం, అతనిలోవున్న ఉద్రేకం పెరిగిపోతూ వుండేది. డాక్టర్ ప్రద్యుమ్న మొదటినుంచీ వసంతకుమార్ ని అనుమానిస్తూ ఉండేవాడు. సంకేతిని మీద ప్రేమ అతని అనుమానం మరింత పెంపొందించేటట్లుగా చేసింది. ప్రద్యుమ్నా, వసంతకుమార్ ఒకర్నొకరు ద్వేషించుకొని దారుణంగా హింసించుకున్నారు. ఈ దశలో వసంతకుమార్ ని అతని భార్య రెచ్చగొట్టింది. మానసిక ఉద్రిక్తతకు గురయి అతనామెను చంపేశాడు. తర్వాత తాను చేసిన తప్పును తెలుసుకుని అక్కడ్నుంచి పరారయిపోయాడు. అతను జరిగిందంతా వివరించటానికి, మొదట్నుంచీ జరిగే కిరాతకాలకు తాను కారణం కానని చెప్పటానికి వసంతకుమార్ ప్రద్యుమ్నని కలుసుకున్నాడు. ప్రద్యుమ్న అతను చెప్పేది వినిపించుకోకుండా అతనే హంతకుడని వాదిస్తూ కలియబడ్డాడు. ఇద్దరూ ఘోరంగా పోరాడుకున్నారు. ఆ పోరాటంలో తన ప్రాణాల్ని రక్షించుకోవటానికి వసంతకుమార్ ప్రద్యుమ్నని చంపక తప్పలేదు. రెండు హత్యలు చేసిన వసంతకుమార్- పరారీలో వుండక తప్పలేదు. ఆశాదీప్తి నేరస్థుడ్ని చూసినప్పుడు అతని చిత్రాన్ని తన రక్తంతో గీసి, ఆ బొమ్మని జాకెట్టులో భద్రపరిచింది. నేరస్థుడు అది గమనించాడు. ఆమె ఇంజక్షన్ వల్ల మత్తులో వున్నప్పుడు జాకెట్లోంచి ఆమె గీసిన బొమ్మని తీసేసి మరోగుడ్డ ముక్కమీద తన రక్తంతో వసంతకుమార్ బొమ్మగీసి ఆమె జాకెట్ లో వుంచాడు. వసంతకుమార్ నేరస్థుడనుకోవటానికి అది దోహదపడింది. ఈలోగా రసజ్ఞవల్ల కంటికి గాయమైన నేరస్థుడు కృష్ణచైతన్య దగ్గరకు మారువేషంలో రావటం, అతనే మొదట్నుంచీ కిరాతకులు చేస్తోన్న వ్యక్తిగా కృష్ణచైతన్య తెలుసుకోవటం జరిగింది. కాని డాక్టరుగా మొదట తన బాధ్యత నెరవేర్చాడు. రంజిత అతన్ని బంధించటానికి రాకపోయినా ఆపరేషనయ్యాక తానే పోలీసులకు తెలియజేసే ఉద్దేశంతో ఉన్నాడు. ఈ లోపలే రంజిత రావటం, నేరస్థుడు పారిపోవటం జరిగింది. పరారీలో ఉన్న వసంతకుమార్ అరుణ్ చైతన్య స్థావరాన్ని తెలుసుకున్నాడు. ఈ సంగతి గురించి చర్చించటానికే కృష్ణచైతన్యను ఒక ఇంటి అడ్రస్ చెప్పి అక్కడికి రమ్మన్నాడు. ఈ లోపలే జరిగేది తెలుసుకుని అరుణ్ చైతన్య వసంతకుమార్ ని చంపేశాడు. కృష్ణచైతన్య కుమారుడిమీద మమకారాన్ని చంపుకున్నాడు. అందుకే మొదట రంజితకు చూపుపోకపోయినా, ఆమె అంధురాలయినట్లు ప్రకటించాడు. తరువాత జరిగిందంతా ప్రఫుల్లకుమార్ కు చెప్పేశాడు.
* * * |
25,332 |
"అమ్మ....అమ్మ....జీవించే ఉందా ఇందర్!" డగ్గుత్తికతో అడిగింది అవంతి.
"గాడ్ ప్రామిస్. మదర్ ప్రామిస్." ఇందర్ గాంబిర్యంగా అన్నాడు.
"ఇందర్! నీవు చెప్పింది నమ్ముతూన్నను" ఆనందంగా అంది అవంతి.
"థాంక్స్ ."
"అమ్మని చూడాలని ఉంది."
"తప్పక చూస్తావు."
అవంతి అడుగులో అడుగులేస్తూ ఇందర్ దగ్గరగా వచ్చి ఆగింది. అతని కళ్ళల్లో కళ్ళుపెట్టి చూస్తూ "నీ మాట నమ్మాను ఇందర్! జీవితంలో ఏ అమృతమూర్తిని చూడలేనని అన్ని వదులు కున్నానో ఆ అమృతమూర్తి నా మాతృమూర్తినీ నాకు ఇస్తున్నావు. అందుకే నీవేలాంటివాడివ్తెనా ఫరవాలేదు. నీవు మోసగాడివ్తెనా హంతకుడివ్తెనా డోంట్ కేర్ నీవు నా కిచ్చిన కానుక ఎవరూ ఎప్పటికి ఇవ్వలేదు ప్రతి ఫలంగా నేనేమి ఇవ్వగలను.
అందుకే.... అందుకే నా శరీరాన్ని నీకు అర్పించుకుంటు న్నాను ఇంక నీ యిష్టం...." అంటూ అవంతి ఇందర్ చేతిని అందుకుని " ఈ అమృత హస్తాలేకదూ నా తల్లిని రక్షించాయి...." అని ముద్దు పెట్టుకుంది.
"నా మాటకు ఎదురాడవు కదూ?"
"ఊహూ"
"నీ శరీరం నా యిష్టం వచ్చినట్లు....!"
"ఊ....."
ఇందర్ నవ్వుతూ అవంతిని రెండు చేతులు మధ్యకి తీసుకుని దగ్గరకు హత్తుకున్నాడు. శిరస్సు మీద మృదువుగా ముద్దు పెట్టుకున్నాడు. అవంతి అభ్యంతరం చెప్పలేదు.
"అవంతి!"
"ఊ"
"నా చర్య నీకు అసహ్యంగా వుందా!"
"ఊహూ ."
"అవంతి! మనం పరస్పరం యిష్టపడి కూడా మన వృత్తులు వేరు కావటంతో అసహ్యించుకుని దూరం జరిగాము. అయినా అదేమిటో నా మనసులోంచి నీరూపంగాని నీ మనసులోంచి నా రూపం గాని చెదిరి పోలేదు నీవనుకున్నట్లు నేను దొంగను మోసగాడిని హంతకుడిని కాను. సి.ఐ.డి.నీ...."
"వాట్?" అంటూ ఇందర్ కౌగిలిలో వున్న అవుంతి అదిరి పడింది.
"ఎస్ నేను సి.ఐ.డి.ని అందుకే నా మారు వేషాలు రహస్యాలు. నీవు పెద్ద మోసగాత్తిని అని కనిపెట్టాను. పెళ్ళికూతురు వేషంలో అపర్ణ పేరుతో అమయకంగా వుండి నా మనసును దోచేశావు. అలా నిలిచి పోయావు. తర్వాత నీవు పారిపోవటం నీ వేషాలు చర్యలు చూసి నిదిచాలా పెద్ద హ్యండ్ అని సామాన్యరాలివి కాదని గ్రహించి నా మనసులోంచి నిన్ను పారదోలుదంటే చేతగాక నన్ను నేనే దూషించుకునేవాడిని.
ఇదిలా వుండగా మీ అమ్మగారు కనపడం ఆమె ద్వారా నీ కథ మొత్తం తెలియటంతో నీ మీద జాలి ప్రేమ అభిమానం మళ్ళి పొంగి పోరిలాయి నీ విషయం మొత్తం తెలిసి ఎంత ఆనందించానో మాటలతో చెప్పలేను. నీవు జీవించి వుంటేచాలు ముల్లోకాల్లో ఎక్కడున్నా సరే గాలించి నీ అంత నీవుగా నా దగ్గరకు వచ్చేలా ఆనందంగా చేసుకోవాలనుకున్నాను.
కానీ....అదేమీమాయో అవంతి! నీవు కాళిచరణ్ వేషంలోవున్న అవంతి అన్న నిజం తెలుసుకున్న మరుక్షణం నా శరీరము మనసు నా మాట వినలేదు ఆనందం పట్టలేక నిన్ను చుట్టేసుకున్నాను. అది జరిగింది నేను ఈ వూరు ఎందుకు వచ్చానో ఆ కథ తర్వాత చెపుతాను. నీ కథ మీ అమ్మగారి ద్వారా విన్నాను నీ నోటివెంట వినాలని వుంది చెప్పు. మీ అమ్మగారిని నీకు చూసి నిన్ను దొంగలాగా దౌర్జన్యంగాను పొందాలని లేదు. నీకు నీవుగా నా సొంతమ్తెతే...."
అంతవరకూ ఇందర్ చెపుతున్నది జాగ్రత్తగా వింటున్న అవంతి వతని నోటిమీద చేయి వుంచింది.
"ఇందర్! ఇంకచాలు నా మాటలు విశ్వశించలేదా? మనసా వాచా ఇష్టపడే నా శరీరం నీకు అర్పించాలాను కున్నాను. నీవెలా నన్ను ప్రేమించావో నేను అలానే నిన్ను ప్రేమించాను నీవెలా నా రూపం నీ మనసులోంచి తొలగించుకోవాలనకున్నావో నేనూ అలాగే తోలిగించు కోవాలనకున్నాను, కన్నతల్లి శాశ్వితంగా దూరంఅయింది. ప్రేమించినవాడూ మోసగాడు నాకోసం కొందరు వలపన్ని ప్రాణం తీయటానికి రెడిగా వున్నారు. ఈ స్ధితిలో విసిగి వేసారి ఇక్కడికి పారిపోయి వచ్చాను. నీవు వచ్చావు పాత గాయాన్ని రేపావు. అసలే నీ మీద సదభిప్రాయం లేదు. నన్ను కాళిచరణ్ అనుకుని మోసగాడిలా మాట్లాడేసరికి మరింతగా కుంగిపోయాను. ఇప్పడేమో కొదమసింగంలా వచ్చి అమాంతం మిదపడితే ఈ మహాను బావుడు మంచి పిల్లగాడని ఎలా అనుకుంటాను?"
"నిజమే అమ్మని రక్షించానని చెప్పటం నా తల్లి జీవించి వున్నదన్న సత్యం వినిపించటంతో నీవు ఎలాంటి వాడివ్తేనా సరే. నా శరీరాన్ని ఆనందంగా ఇష్టపూర్వకంగా త్యజించ దల్చుకున్నాను. కానీ.....నీవు సి.ఐ.డి వని తెలిసి ఇప్పుడు....ఎంతో సంతోషంగా మారేంతో ఇష్టంగా నీ బానిసగా నీ పాద దాసిగా ఇలా వుండి పోవాలనిపిస్తుంది. ఈ మాట అవటానికి నేను సిగ్గుపడటంలేదు ఇందర్!"
కొద్ది క్షణాలు ప్రకృతి పురుషుడు పరవశించిన వేళ నింగినెల నిర్మలత్వం చెందాయి చల్లని పిల్లతెమ్మరలు బ్తెలుదేరాయి. |
25,333 | నువ్వన్నట్టే జరిగివుంటే అంతంతే కావలసిందే వుంది? నాకంటే అదృష్టవంతులుంటారా? అయినా నాకంత అదృష్టమా?
అంతలోనే చప్పున చల్లారిపోయినట్టుగా నిరాశగా అన్న సత్య మాటలకి అతనులిక్కిపడ్డాడు. మార్గంలో పడ్డ తనుకున్న బండి మళ్ళీ గతి తప్పిందే అనుకున్నాడు.
"ఇదిగో సత్యా! నిర్ధారణగా తెలిసేవరకూ నీలో తప్పులేదు నువ్వు దోషివి కావు. హంతకివి కావు. అది గుర్తుంచుకో!" అని కొన్ని క్షణాలాగి "నేను అలా పనిమీద బయటికి వెళ్ళివస్తాను. అంతదాకా పిచ్చిపిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా హాయిగా విశ్రాంతి తీసుకో...." అని వెళ్ళి పోయేడు.
నిట్టూర్చింది సత్య. ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతూ.
* * *
సతీష్ ఫాక్టరీవద్దకు వెళ్ళేసరికి అక్కడ పరిస్థితి చాలా ఘోరంగా వుంది. వర్కర్లంతా గేటుముందు బైఠాయించారు. ఘెరావో చేస్తున్నారు. "మేనేజర్ నశించాలి!" "మేనేజర్ దౌర్జన్యం నశించాలి" "కార్మికులపై పెత్తనం చలాయించే మేనేజర్లు నశించాలి" "మా శక్తీపై బ్రతుకుతూ మమ్మల్నే నీచంగా చూసే తత్వం నశించాలి."
బోర్డులు చేతుల్లో పట్టుక్కూచున్నారు.
ఫోర్ మెన్ అరుస్తూవుంటే మిగతా కార్మికులంతా గట్టిగా కేకలు పెడుతున్నారు.
సతీష్ కారుని చూడగానే అరుపు లెక్కువయ్యాయ్.
"యజమాని డౌన్! డౌన్!"
ఓ కార్మిక యువకుడు అరిచేడు. కానీ మిగతావాళ్ళు ఆ నినాదాన్ని ప్రతిధ్వనించలేదు.
"ఛ! నోర్ముయ్!" కసురుకున్నాడు ఫోర్ మెన్.
నవ్వుకున్నారు సతీష్. "చాలు! వీళ్ళకి ఈ మాత్రం తనపై అభిమానం వుంటే అంతేచాలు! నిమిషాల్లో సమ్మె ఆపు చేయించవచ్చు" ఆనుకుని కారుని అక్కడే ఆపేసి దిగేడు.
"నమస్కారం అయ్యగారూ!" ఫోర్మెన్ ముందుకువచ్చి నమస్కరించేడు. అతడే కార్మికనాయకుడు.
"ఏం నాగరాజూ! యేమిటి సంగతి?" వర్కర్లందర్నీ కలియజూస్తూ అడిగేడు సతీష్.
"ఏం లేదండి! మేనేజర్ ఫణి ఇతన్ని అనవసరంగా కొట్టేడు. తిట్టేడు. గెటౌట్! అన్నాడు" జవాబిచ్చాడో వ్యక్తి.
ఎందుకన్నాడు?"
"మరేండి! జయశీలమ్మ భర్తకి జబ్బుగా వుంది. అతను సెలవు పెట్టేడు. ఆస్పత్రిలో చేరేడు. నెలరోజులైంది. మొగుడి జీతంలేదు. తన జీత మొక్కటే అయింది. ఖర్చు లెక్కువయ్యాయి. మరో పదిరోజుల్లో డ్యూటీకి వస్తాడు. అడ్వాన్స్ యిమ్మంది. వస్తాడో చస్తాడో ఎడ్వాన్స్ యివ్వను పొమ్మన్నాడు. అలా అయితే తన జీతంలో నయినా అడ్వాన్స్ ఇమ్మంది. దానికి వెకిలిగా మాటాడి తిరస్కరించి పంపేడు. జయశీలమ్మ నాగరాజుతో చెప్పింది. ఇతను వెళ్ళి అడ్వాన్స్ ఇవ్వమని అడిగేడు. అతను సరియైన జవాబు ఇవ్వకుండా కొట్టి తిట్టి పంపేడు."
అంతలో బొంయ్ మని శబ్దం చేసుకుంటూ పోలీస్ జీబ్ వచ్చి ఆగింది.
అదే సమయంలో మేనేజర్ శేషఫణికూడా వచ్చేడు.
పోలీసుల్ని, అయ్యగార్ని, కార్మికులని సకాలంలో చూసి ఖంగుతిన్నాడు. నోట మాటరాక చూస్తూ వుండిపోయాడు.
కార్మికులు-పోలీసుల్ని ఫణిని చూడగానే తిరిగి కేకలు వేశారు.
"పోలీస్ జులుం నశించాలి."
"మేనేజర్ ముర్దాబాద్"
"మేనేజర్ డౌన్ డౌన్!"
సతీష్ వాళ్ళవైపు చూసేడు. అప్రయత్నంగా నోళ్ళు మూసుకున్నారు వాళ్ళు.
దగ్గరగా వచ్చిన సబ్ ఇన్స్ పెక్టరుతో "ఏం గొడవ. లేదు. సింపుల్ ఏదో మాలో మా తగాదా! యజమాని కార్మికుడూ అన్న తర్వాత ఏవో గొడవలు రాకుండా వుంటాయా? అన్నదమ్ముల పేచీల్లాంటివే యివి. ఇవి మేం సరిచేసుకుంటాం. దీనికి పోలీసులు లాఠీఛార్జీలు ఎందుకు? సారీ. మా మేనేజర్ త్వరపడి ఫోన్ చేశాడు" అన్నాడు సతీష్.
"మాకు ఫోన్ మీ పేరుతోనే చేశారు."
మేనేజరు ముఖంవైపు చూశాడు సతీష్.
"ఐ యాం సారీ, గొడవ ఏం లేదంటున్నాగా. వెళ్ళి రండి."
"ఆల్ రైట్ వెళ్ళొస్తాను. ఏదయినా గొడవలుంటే చెప్పండి. ఒక్కో వెధవని రెక్కలు విరగ్గొట్టి బొక్కలో తోస్తాను! మీకు తెలీదు సార్! మీరు చాలా మంచివాళ్ళు పైగా ఈ వెధవలతో టచ్ వుండదుగా ఎక్కువగా. అందుకని వీళ్ళ గుణగణాలు మీకు తెలీవు. రాస్కేల్స్ తిన్న ఇళ్ళకే వాసాలు లెక్కపెట్టి ఎసరు పెడతారు. తగినంత కూలీ యిస్తున్నామా? తృప్తిపడి ఊరుకోరు.
ఎవడో నాయకుడో-మనల్ని చూసి వోర్చలేనివాడో ఏదో అంటాడు. లంచాలు తింటునాడ్రా కొడుకుల్లారా, కూలీ పెంచమని అడగండ్రా అంటూ వత్తి ఎగదోస్తాడు. తలకాయ మాత్రమే వుండి మొదళ్ళులేని యీ గాడిదలు పొలోమంటూ స్ట్రెయిక్ మొదలుపెడతారు.
దానివల్ల ఎవరికి నష్టం? ఎంత నష్టం అని ఆలోచిస్తారా-ఊహూ వాళ్ళ నోటిదగ్గర తిండిపోతుంది. ఆసామికి ఆదాయం మాత్రమేపోతుంది. గొడవై అల్లరయి మేం చేయి చేసుకుంటే లాఠీచార్జీలోనో, ఫైరింగ్ లోనో చచ్చేదెవరు? ఈ అడ్డగాడ్దెలే. |
25,334 | "మా వలస ప్రయోజనంలేదు సాకేతా! ఈ సంస్థపైన ముఖ్యంగా హనితపై ఉన్న గౌరవం కొద్దీ కిరీటి తెలివిగా మేనేజ్ చేయగలడన్న నమ్మకం మా అందరిదీ . సో ..... కిరీటి అండతో ఈ సమస్య నుంచి మా అందర్నీ నువ్వే గట్టేక్కించాలి."
"ఇది మామూలు సమస్యేగా."
"లేదు సాకేతా" ప్రభంజనరావు సాలోచనగా అన్నాడు "కార్మిక సంఘం స్ట్రెయిక్ నోటీస్ ఉపసంహరించుకోకపోతే సమ్మె సరిగ్గా మొదలయ్యేది స్వీడన్ డెలిగేషన్ ఇండియాలో అడుగు పెట్టిన రోజున. దానివలన మన సంస్థ ప్రతిష్ట దెబ్బ తింటుంది. స్వీడన్ ప్రభత్వం కోలాబరేషన్ కి అంగీకరించకపొతే నష్టం కోట్లలో వుంటుంది!" అసలు విషయం చెప్పాడు.
* * * *
"లాభంలేదు ..... మా డిమాండ్స్ అంగీకరించని నాడు సమ్మె జరిపితీరుదాం." గది ప్రతిధ్వనించేట్టు అరిచాడు యూనియన్ జనరల్ సెక్రెటరీ.
హానిత స్థానంలో కూర్చున్న సాకేత ఇబ్బందిగా కదిలింది.
అణుమాత్రం బాలెన్స్ తప్పినా సమస్య మరింత జటిలం కావడము తప్ప ప్రయోజనం లేదు. కాబట్టే కిరీటి సైతం నిశ్సబ్దంగా ఉన్నాడు. సుమారు నలభై నిముశాలాపాటు తమ కోర్కెల గురించి యూనియన్ ఆఫీస్ బెరర్స్ ఏకరువు పెడుతుంటే జైక్యం చేసుకునే సరైన అదనుకోసం కిరీటి కూడా ఎదురుచూస్తున్నాడు.
ఇక్కడ ఈ క్షణంలో అతడు ఆలోచిస్తున్నది తన సమీపంలో కూర్చున్న వ్యక్తి హానిత కదాని కాదు .... తన కతువంటి స్థానం కల్పించిన హానిత ఆశయాన్ని ఎలా కపడాలా అని.
"రెండేళ్ళయింది ..... మా కార్ముకులకి సరైన ప్రమోషన్స్ లేవు. ఎంప్లాయీస్ కోసం ప్రేత్యేకంగా ఓ హాస్పిటల్ కట్టించి ఉచిత వైద్య సౌకర్యం కల్పిస్తామని పూర్వం జనరల్ మేనేజర్ మాటిచ్చాడు. దానికింత వరకూ దిక్కులేదు. సుమారు ఏడాది క్రితం కార్మికులకోసం భూమి కొనుగోలు చేసి రుణాలను మీరే సమకూర్చి ఇలోలను కట్టిస్తామన్నారు .... అచరణలో అరంగుళం ముందుకు సాగలేదు. జీతాలని ప్రైస్ ఇండెక్స్ని బట్టి రివైంజ్ చేస్తామన్నారు. అదీ మూలాన పడింది రేయనకా పగలనకా మా కష్టాన్ని దోచుకోవటం మినహా మీ యాజమాన్యం మాకేం చేస్తున్నట్టు. ఎప్పుడూ ఉత్పత్తి సంగతి తప్ప మా కార్మిక సంక్షేమం కోసం మీరేమన్నా ఆలోచిస్తున్నారా అని నిలదీసి అడుగుతున్నా దీనికి జవాబు చెప్పాల్సిన బాధ్యతా మీదే అని కార్మిక నాయుకులుగా నిగ్గదీస్తున్నాం. ప్రపంచ కార్మికులారా ఏకంకండీ అంటూ రేపు మా సమ్మెతో నిద్రాణమైనా మా వర్గాన్ని జాగృతం చేయబోతున్నాం." యూనియన్ ప్రెసిడెంట్ అలావాటైన పడికట్టు పదాలతో ఉద్వేగంగా మాట్లాడుతుండగా అప్పుడు జోక్యం చేసుకున్నాడు కిరీటి.
"నిజమే .... మీరు దారుణంగా దోపిడీ అయ్యారు."
ఆ గదిలో హఠాత్తుగా నిశ్శబ్దం చోటు చేసుకుంది.
"నేను అంగీకరిస్తున్నాను ప్రెండ్స్ .... మీరు గొంతులు చించుకుంటే తప్ప మీ కనీస కోర్కెలు తీరని స్థితిలో బ్రతుకున్నారని చెప్పడానికి నేనూ బాధపడుతున్నాను....... ఎస్ అప్పటి తాజ్ మహల్ సౌందర్యం చూసి అదో కళాఖండ౦గా అభివర్ణించే వ్యవస్థ దానికి రాళ్ళేత్తిన కూలీల సంగతి అరక్షణం పాటైనా ఆలోచించకపోవడం శోచనీయం, సిగ్గుపడే విషయం కూడా ...... కాబట్టే మీ ఆవేశాన్ని అపార్ధము చేసుకోవడం లేదు ..... సమర్ధిస్తున్నాను."
సాకేత క్షణం పాటు కిరీటివేపు నిశితంగా చోదతాన్ని అక్కడ యూనియన్ లీడర్సంతా గమనించారు.
"కొన్ని వాస్తవాలని ఒప్పుకోవడంలో నేనెందరికి చెడు అయినా పట్టించుకొను ఫ్రెండ్స్ .... కారణం యిదో సమిష్టి కుటుంబం ..... సమన్వయ లోపం అనే చిన్న నిప్పురవ్వ ఏ మూల రగిలినా అది క్రమంగా మంటవుతుంది. ఇంటినే భస్మం చేస్తుంది. ఆ విషయాన్నీ గ్రహించి తెలియచెప్పటం నా బాధ్యతయితే, కుటుంబ యజమానిగా తక్షణ కర్తవ్యాన్ని ఆలోచించడం మేడమ్ బాధ్యత." సాకేతవేపు చూశాడు అరక్షణం.
ఇక్కడ యూనియన్ లీడర్స్ పై కిరీటి తార్కికంగానే కాదు సైకలాజికల్ గా అణువంతై నా గెలుపు సాధించడూఅనడానికి కారణం వారి ముఖకవళికలే......
హనితకి అండగా నిలబడే ప్రయత్నంలో కిరీటినుంచి చాలా బలమైన ప్రతి ఘటల్ని ఊహించిన వారంతా ఇప్పుడు తమను సమర్ధిస్తూ హనితని 'కార్నర్' చేయడం సునిశితంగా గమనిస్తున్నారు.
సాకేత నిశ్సబ్దంగా చూస్తుంటే కిరీటి చెప్పాడు ఓ ఉదాహరణలా.
"హఠాత్తుగా వున్నవాడైన ఒక వ్యక్తిని ఇంత స్వల్ప వ్యవధిలో కోటీశ్వరుడు ఎలా కగాలిగారూ అని ఎవరో అడిగితె నేనో కొటీశ్వరుడికి భాగస్వామిని కావడమే అన్నాడట. అది మీకెలా సహకరించిందీ అంటే నవ్వేస్తూ చెప్పాడట. ముందు నా భాగస్వామికి డబ్బుంది, నాకు అనుభవంమాత్రమె మిగిలిందీ అని. అలా లౌక్యంతో కూడిన వ్యాపార బంధం గురించి ఒక్క ముక్కలో చెప్పాగలిగాడు. అలాంటిది కాకూడదు మన మధ్య సంబంధం. ఈ సంస్థకు పురిగతికి అవసరమైన అనుభవాన్ని వినియోగిస్తున్నది యాజమాన్యం కాదు. మీరే కాబట్టి మీరూ సంపూర్ణంగా భాగస్వాములు కావాలి ....."
సాకేత చర్చ మరో ఊహించని మలుపు తిరిగితున్నట్లు గ్రహించింది. సమావేశానికి ముందు కిరీటికి, తనకూ ప్రభంజనరావు చెప్పిన విషయాలు ఆమె మరచిపోలేదు. "ప్రస్తుతం కంపెనీ నష్టాల్లో నడుస్తుందని మీ కందరికీ తెలీని విషయం కాదు."
యూనియన్ వై స్ ప్రెసిడెంట్ ఆవేశంగా ఏదో అనబోతుంటే కిరీటి కళ్ళతోనే వారించాడు బాధ్యత తనకి వదలమన్నట్టుగా.
"ఎస్ మేడమ్! దానికి బాధ్యులెవరు? మూడు సంవత్సరాల క్రితం దాకా లాభాల్లో నడిచిన సంస్థ హఠాత్తుగా నష్టాల్లో అడుగు పెట్టిందీ అమర్ ఆర్గనైజేషన్ మూలస్థంభాలైన వ్యక్తుల ఆలోచనల లోపం. లోపభూయిష్ట మైనా ఆచరణలో కోరి తెచ్చుకున్న నష్టం. ఎస్ మేడమ్ .... ఉన్న మాన పవర్, మెషిన్ పవర్ ని, పెట్టిన పెట్టుబడిని, ఉత్పత్తిని , మార్కెట్ చేసే విధానాలని సరిగ్గా వినియోగించుకుని వుంటే ప్రోడక్ట్ విటీ పెరిగేదీ ఇక్కడ సంస్థ యాజమాన్యం ఉప్తట్టి గురించే శర్మ పడింది తప్ప ఉన్న వనరులతో పెంచుకోవాల్సిన ఉత్పాదిక శక్తి గురించి కాదు. దీనికి కార్మికులు బాధ్యులేవరూ అవుతారు?"
"అది కాదు ......" సాకేత మరేదో చెప్పబోతుంటే అర్ధోక్తిలో వారించాడు కిరీటి.
"విత్ డ్యూ అపాలిజీస్ ..... ఒక వ్యాపారవేత్త ఆలోచనా సరళి ఎలా వుండాలీ అన్నదానికి చిన్న ఉదాహరణ ......" క్షణంపాటు అందరి వేపూ చూశాడు. "ఒక సినిమా తియేటరుని నిర్మించే యజమాని ఎక్కువ సంపాదన కోసం ఆలోచిస్తూ ఒక భాగస్వామితో అన్నాడట ..... థియేటర్ లో సీట్సుని ఫైబర్ తో చేస్తే అయిదు రూపాయల టికెట్టుకి ఆరు రూపాయలు పెట్టొచ్చు అన్నాడట. ఈ ఇద్దరి ఆర్గ్యూ మెంట్స్ విన్న తెలివైన భాగస్వామి సీట్సుని ఏ పెటీరియల్ తో చేసేది ఆలోచించేకన్నా అన్ని సీట్సూ ప్రేక్షకులతో నిండే రేటేదైనా పెడితే బాగుంటుంది అన్నాడట..... హి ఈజ్ ది బ్రిలియంట్ బిజినెస్ మెన్ ...."
"సో ఇప్పుడు నన్నేం చేయమంటారు?" కొద్దిపాటి అసహనంగా అంది.
ఇప్పటికే కిరీటిపై అసాదారణమైనా గురి ఏర్పడిపోయిన యూనియన్ ఆఫీస్ బేరర్స్ ఈ ప్రశ్నకీ జవాబు కిరీటికే వదిలిపెడుతున్నట్లు అటు చూశారు.
"సింపుల్ మేడమ్!" కష్టపడి పనిచేసే ఏ కార్మికుడైనా ఆశించేది తన కష్టానికి ఫలితం" రెండు లిప్తల నిశ్శబ్దం తరువాత గొంతు సవరించుకుంటూ అన్నాడు _ " ఈ దేశంలో ఏ కార్మికుడైనా తను దోపిడీ అవుతున్నారని ఆలోచించడానికిగాని, అసంతృప్తిలో పనిచేస్తూ నేను ఒక బానిసనే తప్ప ఈ పెరుగుదలకు భాగస్వామిని కానని త్రికరణ శుద్ధిగా ఆలోచించడానికి గాని కారణం ఈ సంస్థ నాదీ అన్న భావం ఏర్పడకా పోవటం ....."
"అలాంటి భావం ఏర్పడాలీ అంటే ....." నొసలు చిట్లిస్తూ అడిగింది.
"వారూ సంస్థలో భాగస్థులమే అన్న ఓనర్ షిఫ్ కాన్ సేప్ట్ కలిగించడం తప్పు కాదనుకుంటాను...." ఇప్పుడు సాకేత ముఖ కవళికల్ని జాగ్రత్తగా గమనిస్తూ అన్నాడు.
"సంపదనాకన్నా ముప్పయ్యేళ్ళ చరిత్రగల ఈ సంస్థలో ముడిపడిన వేలకుటు౦బలాశ్రేయస్సు మీకు ముఖ్యమన్నారు ..... అలాంటప్పుడు సొంతలాభం కొంతమానుకోవడం, ఇది మీ సొంతసంస్థేఅన్న భావాన్ని వారికి కలిగిస్తూ వారినీ షేర్ హొల్దర్స్ గా మార్చడం మన కనీస విధి అన్నది నా నమ్మకం ......"
ఊహించని ఈ ప్రపోజల్ కార్మిక నాయుకుల్ని ఉలికిపడేట్టు చేసింది.
"దీనికి అందమయిన ఉదాహరణ మన దేశంలోని ఎస్కార్డ్ ఎంప్లాయిస్ లిమిటెడ్ కంపెనీ _ అది సాధిస్తున్న ప్రగతి. ఎస్ మేడమ్. అందులో కార్మికులంతా భాగస్వాములే. కాబట్టే ఇది నాదీ అంటూ అహొ రాత్రులూ శ్రమిస్తున్నారు. ఆర్ధికంగా ఎదిగిపోతున్నారు......"
కొన్ని క్షణాలుపాటు ఆ గదిలో చీముచిటుక్కుమంటే వినిపించేటంత నిశ్శబ్దం.....
"ఇలాంటి ప్రపోజల్ కి అంగీకరిస్తే నా సోదర కార్మిక సంఘనాయుకులు సమ్మె నోటీస్ ని ఉపసంహరించుకుంటారని నేను భావిస్తూ న్నాను."
కోరిన డిమేండ్స్ కన్నా యిలా పొందగలిగే లాభమే అసాధారణ౦గా ఉంటుడన్న భావంతో, పైగా యిదే దేశంలో ఏ కార్మిక శక్తి అయినా సాధించగలిగే ఘనవిజయం అనిపించడంతో నిర్విణ్ణులైపోయిన యూనియన్ లీడర్స్ చాలా కృతజ్ఞతగా కిరీటి వేపు చూశారు. |
25,335 | ఇద్దరూ ముసల్దాని ఇంటికి చేరుకున్నారు.
ఆ ముసల్దాని పేరు నరసమ్మ.
ఆమె వేరుశనక్కాయల్ని స్కూళ్ళ దగ్గర పెట్టుకుని అమ్ముకుంటుంది. ఒక కొడుకు వున్నాడు గానీ వాడెక్కడో దూరంగా బతుకుతున్నాడు. డెబ్బై ఏళ్ల వయసులో కూడా ఆమె తన పొట్టను తానే పోషించుకుంటుంది.
ఎవరైనా విడి జంటలు ఆ ఇంటికి వచ్చి రాత్రి అక్కడ పడుకుని వెళుతుంటారు పోతూ పోతూ పదో, పదిహేనో రూపాయలు ఆమె చేతుల్లో పెడుతుంటారు.
ఆ ముసల్ది అలా తన ఇల్లు ఓ రాత్రికి అద్దెకిస్తుందని మొదటిసారి చిన్ని తన వూరి వసంతతో వచ్చినప్పుడు తెలుసుకుంది. వసంతది ఊర్లో అవతలి పక్కవీధి.
ఆమెకీ, చిన్నికీ స్నేహం.
ఓరోజు ఇంటికి కావాల్సిన పాత్రలు కొనుక్కోడానికి ఇద్దరూ టౌన్ కి వచ్చారు. పాత్రలు కొనుక్కున్నాక ఇంటికి వెళదామంది చిన్ని.
"ఎప్పుడో రాకరాక టౌన్ కి వస్తాం. ఓ సినిమా చూసి వెళదాం. ఫస్ట్ షో చూశాక నాకు తెలిసిన ఇల్లు ఒకటుంది. అక్కడికెళ్ళి పడుకుని ఉదయాన్నే ఫస్ట్ బస్ కి వెళదాం" అంది వసంత.
ఇబ్బందిగానే ఒప్పుకుంది చిన్ని.
థియేటర్ దగ్గరకు వెళ్ళేటప్పటికి ఓ వ్యక్తి వచ్చి వసంతతో మాట్లాడడం మొదలుపెట్టాడు. అప్పటికే అతను టికెట్లు కొని రెడీగా వున్నాడు.
అతను ముందు పోతుంటే "ఎవరే" అని అడిగింది భయంగా చిన్ని.
"మా పుట్టిల్లు వెంకటాపురంలో పక్కింటి కుర్రాడు మొదట్లో నన్ను అతనికే ఇచ్చి చేయాలనుకున్నారు మావాళ్ళు. కానీ చాలా కారణాల వల్ల కుదరలేదు" అంది వసంత.
సినిమా వదిలాక ముగ్గురూ ముసల్దాని ఇంటికి వచ్చారు.
ఇల్లంటే అది ఇల్లుకాదు. చిన్నగది రేకుల కప్పు.
ఎండాకాలం కాబట్టి ముసిల్ది చిన్ని బయట తిన్నెలమీద పడుకున్నారు. అంత ఉక్కలోనూ వసంత, ఆ కుర్రాడు ఎందుకు లోపల పడుకున్నారో తెలియనంత అమాయకురాలేం కాదు చిన్ని.
ఉదయం అతన్ని వదిలేశాక "ఆ ముసల్ది ఎవరే? మనల్ని పడుకోనిచ్చింది" అని అడిగింది చిన్ని.
"టౌన్ లో పెద్ద పెద్ద లాడ్జీలకు వెళ్ళలేని మనలాంటి వాళ్ళకు ఇలా కొందరు తమ ఇళ్ళల్లో చోటిస్తుంటారు. వచ్చినప్పుడు పది రూపాయలిస్తే చాలు. హోటళ్ళకన్నా ఇలాంటి చోటే బెస్ట్ ఎవరికీ అనుమానం రాదు. నీకు ఎప్పుడైనా అవసరం వస్తే వాడుకో. ముసిల్ది మహా మంచిది" అని వివరంగా చెప్పింది వసంత.
"నాకేం ఖర్మ - శుభ్రంగా మొగుడుంటే" అని అసహ్యించుకుంది చిన్ని.
"నాకు మాత్రం లేడేమిటి" అని సాగదీసింది వసంత.
అలా ఆ ఇంటి విషయం తెలుసు చిన్నికి. ఇంతకాలానికి ముసిల్దాని అవసరం వచ్చింది.
కానీ- ఇది చలికాలం ముసల్ది ఎక్కడ పడుకుంటుందో తెలియడం లేదు.
నరసమ్మతో అవీ ఇవీ మాట్లాడుతూ రాత్రి తొమ్మిది చేసేసింది చిన్ని.
ఆ తరువాత పద్మనాభం తో "ఇప్పుడు ఎలా వెళతాంలే అల్లుడూ ఉదయాన్నే వెళదాం" అంది.
అతనూ ఒప్పుకున్నాడు. అతనికి రకరకాల ఆలోచనలు వస్తున్నాయి మొత్తం మీద ఏదో కొత్తగా, గమ్మత్తుగా వుంది అతనికి.
ఇలాంటి ఊహలు వచ్చినప్పటి నుంచీ చిన్ని మరింత అందంతో కనిపిస్తుంది.
ముసల్దే ఇద్దరికీ వండి పెట్టింది.
వాళ్ళు భోజనం చేస్తుండగా పక్కింటామె కాబోలు వచ్చింది, "ఎవరమ్మా కొత్త గెస్ట్ లు" అని అడిగింది వాళ్ళని చూస్తూనే.
"నా కూతురు అల్లుడూ అమ్మా" అంది ముసల్ది ఏమాత్రం తొణక్కుండా
పొట్టకూటి కోసం ఎన్ని పాట్లో అని క్షణంపాటు జాలేసింది చిన్నికి.
భోజనాలైపోయాక ముసల్ది తన చింకి చాపనూ, దుప్పట్నీ చంక నేసుకుని "నేనలా వెళ్ళి భజన మందిరంలో పడుకుంటాను ఇక్కడ చలి" అని బయల్దేరింది. హమ్మయ్య అనుకుంది చిన్ని.
ఇక అల్లుడ్ని ముగ్గులోకి దింపడమే మిగిలింది అనుకుంటూ ఒళ్ళు విరుచుకుంది.
అలా విరుచుకోవడంతో పైట కిందికి జారి ఆమె ఎత్తయిన ఎద అతని కళ్ళల్లో అటు మెత్తగానూ కాకుండా, ఇటు గట్టిగానూ కాకుండా తగులుతోంది.
తామిద్దర్నే ఇంట్లో వదిలి ముసల్ది దేవాలయానికి వెళ్ళిపోవడంతో ఎందుకనో ఒక్కసారిగా గుండె వేగం హెచ్చింది. అయితే చిన్ని మాత్రం లోపల ఏం వున్నా బయటికి తెలియనివ్వడం లేదు. పైపెచ్చు చాలా క్యాజువల్ గా వుంది. 'రా- భోజనం చేద్దాం' అంది చిన్ని పీటవేస్తూ.
భోజనం ఎప్పుడు ఎవరు ప్రిపేర్ చేశారో తెలియదు. అందుకే ఒక్కక్షణం తటపటాయించి పీట మీద కూర్చున్నాడు.
చిన్న అల్యూమినియం పాత్రలో అన్నం. అంతకంటే చిన్నగా వున్న మరో పాత్రలో పప్పుపులుసు వుంది. ఆకలి బాగా వుందో, కూరలు రుచిగా వున్నాయో తెలియదుగానీ అతను తృప్తిగా తిన్నాడు.
బయటికి వచ్చి సిగరెట్ కాల్చుకున్నాడు.
ఆకాశం నల్లగా బారుకు ఒంటినిండా పూసుకున్నట్టుంది.
'వర్షం వచ్చేటట్టుంది' అని తనకు తనే చెప్పుకుంటూ వుండగా వర్షం చినుకు అతని ముక్కుమీద పడి చిట్లింది.
లోకం మీద కోపం వచ్చినట్లు గాలి రివ్వున వీస్తోంది. తుఫాను సూచనలు కనిపిస్తున్నాయి. దూరంగా వున్న కొబ్బరి చెట్లు తమ మెడలను పట్టుకుని ఎవరో వంచుతున్నట్లు వంగి, మళ్ళీ పైకి లేస్తున్నాయి. రోడ్డుమీది దుమ్ము గాలి చిటికెన వేలు పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు పైకి లేస్తోంది.
చినుకులు ఎక్కువయ్యాయి.
ఇక బయట వుండడం కష్టమనిపించి లోపలికెళ్ళాడు.
చిన్ని అప్పటికి భోజనం చేసి గుంజకు ఆనుకుని రిలాక్స్ అవుతోంది.
"బయట ఏమిటా చప్పుడు?" అని అడిగింది అతను లోపలికి రాగానే.
"వర్షం"
"అమ్మో" అని లేచి బయటికి వెళ్ళింది. "వర్షం బాగానే కురుస్తోంది. తుఫానేమో" అంటూ వెంటనే లోపలికి వచ్చింది.
"ముసలామె ఎక్కడికి వెళ్ళింది? మరికరాదా?" అని అడిగాడు.
"రాదు తుఫాను కాదు గదా, ప్రళయం వచ్చినా ఇక రాదు. బాధ ఎక్కువై చలితో చావనైనా చస్తుంది గానీ లోపలికి తొంగిచూడదు" |
25,336 |
ఆశ్చర్యంగా చూశాడు రవి.
"అందరూ ఉద్యోగాలకి పరిగెడితే ఎలా రవీ. మనలాంటివాళ్ళు కొందరుండాలి. జై కొట్టటానికి జనం వుంటేనే కాదా రధం కదిలేది?" నవ్వుతూ అన్నాడు సమద్. అతనలాగా ఎప్పుడూ నవ్వుతూనే వుంటాడు. ఒక్కరోజూ దేనికీ విచారంగా వున్నట్టు కనిపించడు. ఆఖరికి తండ్రి అకస్మాత్తుగా పోయి, చదువు ఆగిపోయి, రాబడిలేక తండ్రిలాగా బడ్డీకొట్టు పెట్టుకోవలసి వచ్చిన రోజున కూడా అతను చిరునవ్వే నవ్వాడు.
"హలో!"
జామూన్ రిక్షా ఆపి పిలిచాడు రవిని.
"హలో!" ఫ్రెండ్స్ యిద్దరూ బదులు పలికేరు.
"మా యింటిదాకా వస్తావా? ఓ చిన్న పని తగిలింది."
"ఏమిటి?"
"వస్తే చెబుతాగా రిక్షా ఎక్కు. మీ యింటినుంచే వస్తున్నా."
రవి రిక్షా ఎక్కాడు. రిక్షా కదిలింది. సమద్ టాటా చెపుతున్నట్టుగా చెయ్యి ఊపాడు. రిక్షా నాలుగు గజాలు సాగగానే "ఏమిటి మన కాలేజీ అమ్మాయి రాజ్యలక్ష్మి కారి మన ఇళ్ళ ప్రాంతం నుంచి వస్తోంది. ఇప్పుడు వచ్చానులే" అన్నాడు జామూన్.
రవికి చప్పున సమద్ చెప్పిన న్యూస్ గుర్తుకొచ్చింది.
"ఏమో!" అప్రయత్నంగా అనేశాడు రవి.
జామూన్ రెట్టించలేదు. రిక్షా వెళుతోంది.
6
"నువ్వు కవిత్వం బాగా రాస్తావని అందరూ అనుకుంటారు. నేనూ అనుకుంటాను. నాకు నమ్మకం కూడా వుంది."
జామూన్ మాటలకి అడ్డొస్తూ "ఎందుకు పొగడుతున్నావు?" అన్నాడు రవి నవ్వుతూ.
జామూన్ ముఖం ఎర్రబడింది. "సారీ! నన్నిలా అపార్ధం చేసుకుంటావనుకోలేదు."
"సినిమా డైలాగ్. ఇంతకీ విషయం ఏమిటి?"
"మనవూళ్ళో మాజీ ఛైర్మన్ గారికి షష్టిపూర్తి అవుతోందట. ఈ సందర్భంలో మునిసిపల్ ఉద్యోగులు, ఊళ్ళో అభిమానులూ దురభిమానులూ కలసి సన్మానసభ ఏర్పాటుచేస్తున్నారు ఖర్చంతా ఆయనదే! ఆ సందర్భంగా ఆయన ఏదయినా పుస్తకాన్ని అంకితం తీసుకోవాలని అనుకున్నారట."
"శుభ సూచకమే!"
"గండపెండేర, గజారోహణ. కనకాభిషేక సమ్మానితులు వెళ్ళి అడిగేరట. కుక్కలు వాసనపట్టినట్టు కుకవులూ వాసన పడతారేమో! అయితే ఆయనకి అంత డబ్బు ఖర్చుచేయటం ఇష్టంలేదు."
రవి సమాధాన చెప్పలేదు.
"నీ గేయాలు కొన్ని కూర్చి ఓ కవితా సంపుటి వేయిస్తాడట. ముద్రణ ఖర్చులు అన్నీ సన్మాన సంఘానివి-అంటే ఆయనవే"
"నా కవితలే ఎందుకు వేయాలి?"
"నేను మా నాన్నతో చెప్పించాను. ప్రిన్సిపాలుగారూ చెప్పారట."
"థాంక్యూ!"
"ఓ ముప్పై కవితలు ఇస్తే ప్రెస్సుకిస్తారట."
"అలాగే."
"ఏదో శాలువా కప్పి, పర్స్ బహూకరిస్తారట."
రవి మనస్సులో ఆశ రేకెత్తింది. ఎంతయినా కానీ అది గౌరవమే! తృణమో పణమో యిచ్చినా అది కొన్నాళ్ళకి సరిపోతుంది. మరి కొన్నాళ్ళు తిండికి వెతుక్కోనవసరం లేదు.
"నకి వెళ్ళిరానా!" లేచాడు రవి.
"ఒరిజనల్స్ యిస్తే, కాపీ రాయిస్తాను."
"ఎందుకు? నేనే రాస్తాలే."
"ఫర్లేదులే! కొంచెం శ్రమ తప్పుతుంది. ప్రూఫులలో తప్పుల్రాకుండా నే చూస్తాను. ఫైనల్ ప్రూఫ్ నీకు పంపిస్తాను."
ఏమిటి ఇంత ప్రత్యేకత అన్నట్లుగా చూశాడు రవి.
"అదంతేలే! కవిని గౌరవించాలి కనీసం."
నవ్వి అక్కడినుంచి వచ్చాడు రవి.
బజారులో కొన్ని పేపర్లు కొనాలనుకున్నాడు. జేబులు ఖాళీ. లక్ష్మీ బుక్ స్టోర్సు వద్దకి వెళ్ళి అడిగాడు. అతనిలో కొంత కవితాభిమానం వుంది. దస్తాపేపర్లు ఊరికే యిచ్చాడు. "ఇదిగోనండి కవిగారూ! మంచి పెన్. మా తమ్ముడు న్యూయార్క్ నుంచి పంపించాడు. లెక్కలు రాసుకునేవాడికి నాకెందుకు, ఏ రూపాయి కలమయినా సరిపోతుంది. మీరు రాసుకోండి" అని మంచి పెన్ అందించాడు.
రవి మనస్సు పొంగిపోయింది ఆ మాత్రానికే. "ఫరవాలేదు. ఆంధ్రదేశంలో యింకా రసజ్ఞత చావలేదు."
అటునుంచి నేరుగా యింటికి వచ్చాడు. మసక చీకట్లు కమ్ముకున్నాయి ఆ సరికే. ధియేటర్ లోనుంచి రికార్డులు వినిపిస్తున్నాయి.
ఆ రాత్రి కొంత శాంతితో నిద్రపోయాడు రవి.
* * *
వీటిలో స్నానంచేసి యింటికి వస్తోంటే ఎవరో అమ్మాయి తమ ఇంటిలోకి వెళ్ళటం చూశాడు. ఎప్పుడు చూసిన గుర్తు రాలేదు. ఆలోచిస్తూ ఇంట్లో అడుగుపెట్టాడు రవి.
గల గలా మాటాడుతోంది ఆ అమ్మాయి. వంటింటినుంచి గేటుదాగా తగు స్థాయిలో వినిపిస్తోంది కంఠం.
టవల్, డ్రాయిర్, అరపంచా తాటిపై ఆరవేసి పైజామా చొక్కా వేసుకున్నాడు. అది ఆరోజు జామూన్ యిచ్చినవి! తనకోసమే కుట్టించి యిచ్చినవి. ఎంత మొండికేసినా తిరిగి తీసుకోలేదు.
"అదిగో వచ్చినట్టున్నాడు" అంటోంది ఆ అమ్మాయి.
తల దువ్వుకుని అద్దం, దువ్వెన గూట్లో పెట్టాడు రవి.
"నమస్తే బావా!"
కలకందలాంటి తలత్రిప్పిచూశాడు రవి. నేత్రపర్వంగా వుంది ఆ అమ్మాయి.
"మా అన్న కూతుర్రా! అన్న అంటే చిన్నాన్న కొడుకులే! ఎప్పుడూ మన యింటికి రాలేదు. మానాన్న పోయాక అమ్మతో సరిపడక మా యింటికి వచ్చేవాడు కాదు. అయినా మనం గుర్తుస్తున్నామట వాళ్ళకి!"
"నా పేరు సవిత బావా! మానాన్న సంగారెడ్డిలో మునిసిపల్ మేనేజర్! మా ఓ అన్నయ్య గుంటూరు మునిసిపాలిటీలో వర్క్స్ సూపర్ వైజర్! ఇంకో అన్నయ్య, బావ తిరుపతి మునిసిపాలిటీలో పని చేస్తున్నారు. మా ఆఖరి అన్నయ్యని యిక్కడి వాటర్ వర్క్స్ సూపర్ వైజర్ గా వేశారు!"
"అంతా మునిసిపాలిటీ వాళ్ళేనే!" అనుకున్నాడు రవి.
"ఈ అమ్మాయి --- అదే సవిత --- ఇంటర్ పూర్తిచేసిందట. ఎక్కడా జాబ్ దొరక్క లాటరీ టికెట్లు అమ్ముకుంటుందట!"
"ఇదిగో బావా ఓ టికెట్!"
"నా కెందుకు?" తెల్లబోయాడు రవి. పైగా ఆ అమ్మాయి మాటిమాటికి బావా బావా అంటుంటే అతని మనస్సుకి గిలిగింతలు పెట్టినట్టుగా వున్నా ఏదో ఎబ్బెట్టుగా అనిపిస్తోంది.
"కొనొద్దులే! ఊరకే యిస్తోన్నా!"
"అయినా సరే! నాకు లాటరీలపై నమ్మకం లేదు --- ఆశాలేదు!" |
25,337 |
ఇన్నాళ్ళూ నాకెందుకీ విషయం చెప్పలేదు" అని అడగలేదు రాఘవేంద్రనాయుడు. అదే నాయుడుగారి సంయమనశక్తి. ఆ మాట విన్నప్పుడే ఆయనేం చెయ్యాలో నిర్ణయించుకున్నాడు. * * * * * ఆఫీసు రూంలో కూర్చుని అప్పుడే వచ్చిన ఇండియా టుడేని తిరగేస్తున్నాడు మధుకర్. ఆ పేజీ దగ్గర చటుక్కున ఆగిపోయాడు. When a woman can discuss politics, With as much flair as can discuss art... chauces are- She's a Jenny Woman - Mahathi. అరుదైన హెడ్డింగ్ తో, అరుదైన వ్యాసం. గబగబా చదివాడు మధుకర్. జెన్నీ ఫాబ్రిక్స్ వెనక వుంది మహతా... అతని అంతులేని ఆశ్చర్యానికి అవధి లేదు. ఒకే సమయంలో అతని ముఖంలో ఆనందం, గర్వం, ఆ రెండూ కలగలిసిన సంతృప్తి కన్పించాయి. ఎన్నాళ్ళ నుంచో వెతుకుతున్న మహతి ఎడ్రస్ దొరికింది. వెంటనే మధుకర్ చేయి ఫోనువేపు వెళ్ళింది. 292929 ఒక్కొక్క అంకెలమీద మధుకర్ చేయి మెత్తగా పడుతోంది. అవతలి పక్క ఫోను మోగుతున్న సవ్వడి. ఎవరో రిసీవర్ తీసుకున్న శబ్ధం. "హలో... జెన్నీ ఫాబ్రిక్స్-" "కెన్ ఐ స్పీక్ టు మహతి?" "షీ ఈజ్ నాట్ ఎ వైలబుల్ నౌ సర్" తియ్యని కంఠం. మహతి స్వయంగా మాట్లాడుతుందని వూహించిన మధుకర్ మూడ్ అప్ సెట్ అయింది. "ఇమ్మీడియట్ గా కాంటాక్ట్ చేయాలి, ఏ నెంబర్లో వుంటారో చెప్పగలరా?" "ఒన్ మినిట్ సర్!" సరిగ్గా ఒక నిమిషం తర్వాత- నెంబరు చెప్పింది ఆపరేటర్. మరో రెండు నిమిషాల తర్వాత ఆపరేటర్ ఇచ్చిన నెంబరుకి డయల్ చేయడం ప్రారంభించాడు మధుకర్. * * * * * "నీ ప్రసవం రోజులు దగ్గర పడుతున్న సమయంలో ఎక్కువ శ్రమపడకు మహీ.రెగ్యులర్ గా మెడిసిన్స్ వాడు" ప్రిస్కిప్షన్ చేతికి అందిస్తూ అంది డా|| హేమ మహతితో. "నువ్వెప్పుడూ చెప్పలేదే" "అలాగని నెగ్లెక్ట్ చెయ్యకు. పని వత్తిడిలో పడి నువ్వు సరిగ్గా తినడం లేదు. నువ్వు బాగా తినాలి. నీకోసం కాదు, బిడ్డ ఆరోగ్యం కోసం తప్పదు. ఇక నుంచి వారానికొకసారి టెస్టింగ్ కురా." "నేను రాలేని సమయంలో ఫోను చేస్తాను. నువ్వే రావాలి." "ఏం?" "హయత్ నగర్ ఏరియాలో ఫ్యాక్టరీ కన్ స్ట్రక్షన్లో వున్నా, నీకు తెలుసుగా అన్నీ నేనేనని." "ఎట్ లాస్ట్ యూ గాటిట్..." ప్రశంసాపూర్వకంగా అంది హేమలత. "కాదు హేమా... ఆశ, ఆశయం, అనంతం. ఇప్పుడేదయితే నేను సాధించానని అందరూ అంటున్నారో, ఇది నా అవిశ్రాంత ప్రయాణంలో ఒక మజిలీ మాత్రమే." లేచి నిలబడింది మహతి. అదే సమయంలో ఫోన్ రింగవుతోంది. మహతి ఆ గదిలోంచి బయటి కొచ్చింది. "హలో... డాక్టర్ హేమా హియర్" ఆ గొంతుని గుర్తుపట్టాడు మధుకర్. "హేమగారూ... నేనూ మధుకర్ ని... మహతి వుందా అక్కడ?" ఇప్పటికీ మధుకర్ మీద కోపం తగ్గలేదు హేమకు. బంగారం లాంటి మహతి బతుకును రోడ్డుపాలు చేసిన వ్యక్తిగా, అతన్ని క్షమించలేకపోతుంది హేమలత. అతనితో చాలా మాట్లాడదామన్న ఆవేశాన్ని అణుచుకుని- "ఇప్పుడే వెళ్ళిపోయింది..." అంది నిర్లక్ష్యంగా. "వెళ్ళిపోయిందా... ఎక్కడికెళ్ళింది? ఆఫీస్ కా, రెసిడెన్స్ కా?" అడిగాడు మధుకర్ ఆతృతను అణుచుకుంటూ. "రెసిడెన్స్ కనుకుంటా..." "రెసిడెన్స్ ఎడ్రస్ తెలుసా మేడమ్?" "జూబ్లీహిల్స్... ఎమ్మెల్యే కాలనీ రోడ్ లో ననుకుంటాను..." ఇంకేదో ప్రశ్నకు, ఇంకేదో జవాబు చెప్పబోయి, ఎదురుగా కర్టెన్ తెరుచుకుని వస్తున్న వ్యక్తిని చూసి అప్రతిభురాలైంది డాక్టర్ హేమ. అది కలా... నిజమా... గబుక్కున సీటులోంచి లేచి నిలబడింది. "వెల్ కమ్ సర్..." మాటలు తడబడుతున్నాయి. "మీతో రెండు నిమిషాలు మాట్లాడాలి..." ఠీవిగా, గంభీరంగా వుంది ఆ గొంతు. "టేక్ యువర్ సీట్... సర్..." హేమ నుదుటిమీద చిరు చెమటలు పట్టాయి. ఎదురుగా నిల్చున్న వ్యక్తి కుర్చీలో కూర్చున్నారు. ఆ వ్యక్తి రాఘవేంద్రనాయుడు. * * * * * మహతిని కలవడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తూనే వున్నాడు మధుకర్. కొన్ని వేలసార్లు ఆఫీసుకు ఫోన్ చేసాడు. కారు తీసుకుని జూబ్లీహిల్స్ , ఎమ్మెల్యే కాలనీ ఏరియా అంతా చుట్టివచ్చాడు. ఎక్కడా మహతి ఎడ్రస్ దొరకలేదు. ఆఖరికి ఎలాగయినా ఆ రోజు మహతిని చూడాలన్న పట్టుదలతో తనే స్వయంగా జెన్నీ ఫాబ్రిక్స్ ఆఫీసులోకి అడుగుపెట్టాడు. తనవైపు హుందాగా అడుగులేసుకుంటూ వస్తున్న మధుకర్ వైపు చిరునవ్వుతూ చూస్తూ- "వాట్ కెన్ ఐడూ ఫర్ యూ సర్..." అంది రిసెప్షనిస్ట్. "కెన్ ఐ హేవ్ ఏ టాక్ విత్ మిస్ మహతి..." "సారీ సర్... టుడే మేడమ్ ఈజ్ వెరీ బిజీ... టుఓ క్లాక్ కి ఎన్.టి.సి. అఫీషియల్స్ తో మీటింగ్... ఫోర్ టూ సిక్స్ డీలర్సు మీటింగ్... హయత్ నగర్ బిల్డింగ్ విటిజ్ లెవెన్ థర్టీ..." అందమైన ఎర్రటి పెదవులతో మరింత అందంగా నవ్వుతూ- "రేపు మధ్యాహ్నం ఒకసారి ఫోన్ చేస్తారా... ఎమ్.డి.గారి నడిగి ఎపాయింట్ మెంట్ ఫిక్స్ చేస్తాను." తన చిత్రమైన పరిస్థితికి నవ్వొచ్చింది. తను ఎలాగయినా మహతిని చూడాలి- అదే సమయంలో విజిటర్సుకి సెండాఫ్ ఇవ్వడానికి బయటకొచ్చిన మహతి- దూరంగా నిలబడిన మధుకర్ ని చూసి- ఒక్కక్షణం చకితురాలయింది. తన దగ్గరకొచ్చి మాట్లాడుతుందని అనుకున్నాడు మధుకర్. కానీ అనుకున్న దానికి వ్యతిరేకంగా జరగడంతో, అవమానభారంతో అతని హృదయం బరువెక్కింది. తలొంచుకుని గబగబా వెళ్ళిపోతుండగా- "సర్..."ఆపరేటర్ పిలుపుతో ఒక్కసారి వెనక్కి చూశాడు. "మేడమ్... ఫోన్..." పరుగు పరుగున వచ్చాడు. రిసీవర్ అందుకున్నాడు. |
25,338 | అది ప్రతిరోజూ జరిగే కార్యక్రమమే....ఆ విషయం అక్కడ పనిచేసే సిబ్బందికి తెలిసినా, దాని పర్యవసానమేమిటన్నదే వారి మెదళ్ళలో సస్పెన్స్ గా గూడు కట్టుకుని వుంటుంది.
అయినా చైర్ పర్సన్ మేటర్స్ లో తల దూర్చటం, ఆసక్తి చూపించటం ఉద్యోగానికే ఎసరు తెస్తుందని ఎవరికీ వారే ఏమీ తెలీనట్లు పని ముగించుకుని వెళ్ళిపోయారు.
* * * *
"ప్లీజ్ కమ్....మిస్టర్ మనోహర్" అంది మాయ హస్కీగా.
ఆమె కంఠం సహజంగానే మత్తుగా మరెంతో గమ్మత్తుగా వుంటుంది. భావావేశం ప్రతి మాటలోనూ, అలవోకగా, అవశ్యంగా తొంగి చూస్తుంటుంది. అంతటి భావోద్వేగం గుండె లోతుల్లోంచి వచ్చే మాటలకిగాని వుండదు.
ఎందుకిలా ఆమె నా వెంట పడుతోంది? తన నుంచి ఏం ఆశిస్తోంది?
మాయ కోట్లకు అధిపతి.
తనీమె దగ్గర బతుకుదెరువుకోసం వచ్చినవాడు.
తనకు ఈమె ఎప్పుడూ అర్ధంకాలేదు....ఇకపై కాదేమో కూడా.
"ఏం ఆలోచించావ్.....?" అడిగిందామె.
"దేని గురించి...." ఏమీ తెలీనట్లే, అంతకుముందేమీ జరగనట్లే అడిగాడు మనోహర్.
ముగ్ధమనోహారంగా నవ్విందామె.
తెరలు.....తెరలుగా...అలలు....అలలుగా....
"ఎవరికయినా బెటర్ చాయిస్ లభించే అవకాశం వున్నప్పుడు, మనసుకి నచ్చని మనిషితో ఎందుకు జీవితాన్ని ముడి వేసుకోవాలి?"
సూటిగా మనోహర్ ముఖంలోకి చూస్తూ అడిగింది మాయ.
ఆమె వేసే ఏ ప్రశ్నకీ తన దగ్గర సమాధానం లేదు.
అంతర్లీనంగా వుందేమో.....ఉన్నా, దానికి సరిపడ భాష-అది వ్యక్తీకరించే నేర్పు తనకి లేదు.
"హలో..." అంది మాయ చిలిపిగా.
ఒకసారి తలెత్తి చూశాడు మనోహర్.
మాయ ఎప్పుడు చూసినా ఫ్రిజ్ లోంచి తీసిన ఏపిల్ పండులా ఫ్రెష్ గా వుంటుంది. ఎన్నిగంటలు వర్క్ చేసినా, మరెంతో శ్రమకు లోనైనా, దాని తాలూకూ అలసట ఆమె మొహంలో కనిపించదు.
మనసు అలసటకు లోనుకాకపోతే, మనిషి కూడా అలసటకు లోనుకారనే ఆరోగ్య సూత్రం ఈమెపట్ల అక్షరాలా నిజమనిపిస్తుంది.
భాస్వరం లాంటి ఆడపిల్ల.....ప్రేమ తడిలో వున్నంతవరకే ప్రశాంతంగా వుండి, దానిలోంచి బయటకు పడగానే భగ్గున మండే ఉద్వేగపు లక్షణాలు మన బాస్ లో పుష్కలంగా వున్నాయనే తన కొలీగ్ దుర్గా ప్రసాద్ మాటలు నిజమేననిపిస్తుంటాయి.
చక్కని విశాలమైన నుదురు.
ఆ నుదురు మీదకు పిల్లగాలికి జలపాతంలా ముందుకు దూకే పొడవాటి కురులు.
నెలవంకల్లాంటి కనులు.
సంపెంగ మొగ్గలాంటి నాసిక.
ఉషోదయపు మంచులో తడిసిన గులాబీ రేకుల్లా మెరిసే బుల్లి పెదవులు.
నవ్వితే సొట్టలుపడే చెక్కిళ్ళు.
కొండ నాలుకని మరపించే సొట్టపడిన చుబుకం.
ఇండియన్ ఉమెన్ ఏవరేజ్ హైట్ ని క్రాస్ చేసి పైకెదిగిన ఈమెలో గొప్ప గొప్ప ఆకర్షణలు, అందాలు అంతర్లీనంగా దాగివున్నాయనిపిస్తుంది.
పల్చటి మంచి గంథం రంగులో చూడగానే సినిమా స్టారా?
హెలీపెయిడ్ మోడలా? మిస్ వరల్డ్ పోటీలకెళ్ళే స్టన్నింగ్ బ్యూటీనా? అనిపించేలా చూచరుల్ని స్వాప్నికుల్ని చేసే అపురూప సౌందర్యవతి.
చాలా ఏవరేజ్ గా ఏ ప్రత్యేకతలు లేకుండా కనిపించే తన మీద ఈమెకు దృష్టి ఏమిటి?
స్త్రీ మనసేకాదు, అభిరుచులు కూడా సప్త మహాసముద్రాలంత లోతుగా వుంటాయేమో....?
"ప్రేమ వివాహాలు, ఆదర్శ వివాహాలు, ఆర్ధిక వివాహాలు, అవసర వివాహాలు, అనవసర వివాహాలు, గ్లామర్ వివాహాలు, కాంటాక్ట్ వివాహాలు వీటిలో ఏదిష్టం నీకు....?" అడిగింది మాయ అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ.
ఆమె కళ్ళలోకి సూటిగా చూడలేని మనోహర్ ఒక్కక్షణం తలదించుకున్నాడు.
"ప్లీజ్.....సమాధానం చెప్పవా?" మార్దవంగా అడిగింది మాయ.
"మీ వేవ్ లెంగ్త్ తో సరిపోయే వ్యక్తిని చూసుకొని అతనితో జీవితము కొనసాగించడం మంచిదేమొ ఆలోచించగూడడూ...?" నసుగుతున్నట్లుగా అన్నాడు మనోహర్.
ఒక్కక్షణం విస్మయంగా చూసింది మాయ.
"ప్రపంచంలో కెల్లా మొట్ట మొదట నేను అసహ్యించుకునేది ఆత్మవంచనని, బ్లడీ హిపోక్రటిక్ సొసైటీ. ఐ హేట్ ఇట్. మేరేజెస్ ఆర్ మేడిన్ హెవెన్....లాంటి ఊహాజనితాలను మాగ్నిఫైయింగ్ గ్లాస్ తో చూడటం నాకిష్టంలేదు. ఎంతచెడ్డవాడికయినా, మరెంత దుర్మార్గుడికయినా, అతనికంటూ ఒక వ్యక్తిత్వం వుండాలి. అలాగే వ్యక్తిగతం మీద నాకు విపరీతమైన విశ్వాసం, గౌరవం వున్నాయి.
ఇంకొకరి ఇష్టానికీ, వేరెవరో మెచ్చుకోలుకీ, మనమెందుకు బతకాలి అన్నదే నా సిద్ధాంతం. స్క్రిప్ట్ లో లేని సీనిక్ ఆర్డర్ లా ఒక మనిషి జీవితం వుండకూడదు" ఒక్కక్షణం ఆగింది మాయ.
"భావాలు, భావుకత, ఉద్వేగాలు, ఉద్రేకం ఎంతమందికైనా వుండవచ్చు. వ్యక్తం చేయడం మాత్రం అతికొద్దిమందికే సాధ్యమేమోననిపిస్తుంది.
నువ్వంటే నాకిష్టం. నువ్వంటే ప్రాణం. నువ్వేనా సర్వస్వం. నువ్వు నాకు కావాలి. నిన్ను సొంతం చేసుకోవడం కోసం నేనేమైనా చేస్తాను. ఎంతకయినా తెగిస్తాను. ఈ నా అభిప్రాయంలో ఎప్పటికీ మార్పు రాదు, రాబోదు. నన్ను ప్రేమించటానికి, పెళ్ళి చేసుకోవటానికి నీకున్న అభ్యంతరం ఏమిటి? నేనందంగా లేనా? ఎగ్జోటిక్ గా కనిపించనా? నా శరీర సౌష్టవం బాగాలేదా? నా ఒంపుసొంపులో వంకరేమయినా వుందా? కనుముక్కు తీరులో తేడా వుందా?" గుక్క తిప్పుకోకుండా అడిగింది మాయాదేవి. |
25,339 | ఆశ్చర్యంగా ఆమెవైపే చూస్తూ ఉండిపోయాడతను.
* * *
ఫోను రింగయింది నిశాంత ఇంట్లో.
హలో! అంది నిశాంత.
నిశా!
దినకర్ గొంతు వినబడుతూనే ఫోను పెట్టేసింది నిశాంత.
మళ్ళీ మోగింది ఫోను.
దినకర్ గొంతు వినీ వినబడగానే ఫోను పెట్టేసింది.
అలా నాలుగుసార్లు జరిగింది.
* * *
హైదరాబాద్-
పాత నగరంలో
దివాన్ దేవిడీ-
అది ఒకప్పటి నిజాం రాష్ట్ర ప్రధాన మంత్రి సాలార్ జంగ్ భవంతి. అందులోనే చాలాకాలం పాటు సాలార్ జంగ్ మ్యూజియం వుండేది. ఇప్పుడు మ్యూజియం కొత్తగా కట్టిన బిల్డింగులోకి మారిపోయింది.
దివాన్ దేవిడీలో కోర్టుల సముదాయం వుంది.
అందులో-
మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో -
బయట బెంచీమీద కూర్చొని వుంది నిశాంత.
దినకర్ ని చూడగానే ఆమె మొహంలో ఆశ్చర్యం కనబడింది. లేచి వచ్చింది. ఆమె మొహంలో నిన్నటి అలుక లేదు. ఒకపక్కకి నడిచారు ఇద్దరూ.
"దినకర్! ఇక్కడికెందుకొచ్చావ్?"
"నీకు కోపం వచ్చిందేమో, సారీ చెప్పాలని వచ్చాను."
"మంచివాడివే! అదంతా ఉత్తుత్తి కోపం అని నీకు తెలీదా ఏమిటి?"
"ఉత్తుత్తి కోపం అయినా సరే, నా మనసుని పిండేస్తుందని నీకు తెలియదా?"
తదేకంగా అతని కళ్ళలోకి చూసింది నిశాంత. క్రమంగా ఆమె పెదవులు గులాబీ రేకుల్లా విచ్చుకున్నాయి. అరవిరిసిన నంది వర్ధనం లాంటి చిరునవ్వు కనబడింది.
"ఎందుకు తెలియదు? బాగా తెలుసు!"
"థాంక్స్ నిశా! నేను నిన్నింక డిస్టర్బ్ చెయ్యను. వస్తానేం!"
ఆదుర్దాగా చూసింది నిశాంత.
"ఉండు! ఆ కుర్రాడిని విచారించడం కాగానే నేనే సాక్ష్యం చెప్పాలనుకుంటాను. తర్వాత ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం."
విజిటర్స్ గాలరీలో కూర్చుని బోను వైపు చూశాడు దినకర్.
బోన్లో నిలబడి వున్నాడు ఒక చిన్న కుర్రాడు. అతనికి పట్టుమని పదేళ్ళు కూడా ఉండవు. అతన్ని ప్రశ్నిస్తున్నాడు. పబ్లిక్ ప్రాసిక్యూటర్.
"నీ పేరేమిటి బాబూ?"
"విక్కీ"
"పూర్తి పేరు చెప్పు"
"వెంకటకృష్ణ"
నీ కెన్నేళ్ళు?"
"ఎనిమిది"
"ఎన్నో క్లాసు చదువుతున్నావ్?"
"నాలుగు"
"ఏ స్కూలు"
"గ్రామర్ స్కూలు"
"చూసినది చూసినట్లు చెప్పగలవా నువ్వు"
"చెప్పగలను"
"అబద్దాలు చెబితే ఏమవుతుందో తెలుసా!"
"అబద్దాలు చెప్పిన వాళ్ళకి కళ్ళు పోతాయి"
జడ్జివైపు సాభిప్రాయంగా చూశాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్.
"ఫర్వాలేదు. పిల్లాడు తెలివైనవాడే! ఇతని సాక్ష్యం మనం లెక్కలోకి తీసుకోవచ్చు." అని తలాడించాడు జడ్జి.
చిన్న పిల్లలచేత కోర్టులో ప్రమాణం చేయించరు. కానీ వాళ్ళు ఎంతవరకూ విషయాలు సరిగ్గా చెప్పగలరూ అన్నది తేల్చుకోవడానికిగానూ, ముందుగా కొన్ని ప్రశ్నలు వేసి పరీక్ష చేస్తారు.
మళ్ళీ ప్రశ్నలు వేయడం మొదలెట్టాడు ప్రాసిక్యూటర్.
"విక్కీ! చనిపోయిన వైదేహిగారు నీకేమవుతారు?"
"ఆమె మా అమ్మ" అన్నాడు విక్కీ అతని గొంతులో దుఃఖం ధ్వనించింది.
"మీ అమ్మను చంపిన హంతకుడిని నువ్వు చూశావా?"
"చూశాను."
"మళ్ళీ చూస్తే గుర్తుపడతావా?"
"గుర్తుపడతాను."
"ఎక్కడ చూసినా గుర్తుపడతావా?"
ఉన్నట్లుండి ఏడవడం మొదలెట్టాడు విక్కీ.
"విక్కీ! ఎందుకు ఏడుస్తున్నావ్?" అన్నాడు ప్రాసిక్యూటర్ ఆదుర్దాగా.
సమాధానం చెప్పలేదు విక్కీ మరింత బిగ్గరగా ఏడవడం మొదలెట్టాడు. కోర్టులో కలకలం మొదలయింది.
చొక్కా పైకెత్తి కళ్ళు తుడుచుకుంటూ, మళ్ళీ జరిగినదంతా ఒక్కసారిగా గుర్తొచ్చినట్లు పెద్దగా ఏడ్చాడు విక్కీ.
బుజ్జగిస్తున్నట్లు అన్నాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్.
"విక్కీ! ఏడవకు చెప్పు! ఏమయింది? ఎందుకు ఏడుస్తున్నావ్? భయపడ్డావా?"
ఎక్కిళ్ళు తగ్గాక తడుముకుంటున్నట్లు అన్నాడు విక్కీ.
"మా అమ్మని చంపిన మనిషి ఇక్కడే వున్నాడు సార్!" కోర్టులో వున్న అందరూ ఒక్కసారిగా శ్వాస లోపలికి తీసుకున్న శబ్దం.
విస్తుబోతూ అడిగాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్.
"మీ అమ్మను చంపిన మనిషి ఇక్కడే ఉన్నాడా? ఎవరతను?"
"అడుగో అతనే అమ్మను చంపేసింది" అని చెయ్యి చూపించాడు విక్కీ, సూటిగా దినకర్ ని చూపిస్తూ.
అందహ్రి తలలూ అప్రయత్నంగానే దినకర్ వైపు తిరిగాయి. అందరి చూపుల్లో ఆరోపణ!
"నేనా! నేను మీ అమ్మను చంపానా?" ఆనందు దినకర్ దిగ్భ్రాంతి చెందుతూ.
సరదాగా సర్కస్ చూస్తున్న ప్రేక్షకుల మధ్యకి హఠాత్తుగా పెద్ద పులి దూకేస్తే ఎంత కల్లోలం చెలరేగుతుందో, అంత కల్లోలం చెలరేగింది కోర్టులోని ప్రేక్షకుల గ్యాలరీలో - హంతకుడు తమ మధ్యలోనే వున్నాడని తెలియగానే!
పొట్టిగా, అర్భకంగా కనబడుతున్న ఒక మనిషి తన గొంతునెవరో నులిమేస్తున్నట్లు గుడ్లు తేలేసి భయంగా దినకర్ వైపు చూశాడు.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా ఆశ్చర్యంగా చూశాడు దినకర్ వైపు.
అప్పటిదాకా షాక్ లో వున్న దినకర్, అప్పుడే స్పృహ వచ్చినవాడిలా అన్నాడు. "దిసీజ్ నాన్సెన్స్! నాకీ కుర్రాడెవరో తెలియదు! నన్ను అనవసరంగా ఈ కేసులో ఇరికిస్తున్నాడు. నేనెవరినీ చంపలేదు! నన్ను నమ్మండి!"
అతనికి తెలియకుండానే, కేకలు పెడుతున్నంత పెద్దగా వస్తోంది అతని గొంతు.
"ఆర్డర్! ఆర్డర్!" అన్నాడు జడ్జి.
అతి ప్రయత్నంమీద తనని తాను కంట్రోలు చేసుకోగలిగాడు దినకర్. కానీ, ఎవరో ఒక బకెట్ తో నీళ్ళు అతనిమీద గుమ్మరించేసినట్లు ఒకక్సరిగా వళ్ళంతా చెమటలు పట్టేశాయి అతనికి. తల వెంట్రుకల మధ్యనుంచి స్వేదం సన్నటి సెలయేళ్ళలా నుదుటిమీదకు జారింది. క్షణాల్లో షర్టు తడితడిగా అయిపోయి ఒంటి కతుక్కుపోయింది.
బోనులో ఉన్న కుర్రాడు విక్కీవైపు తిరిగాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్.
"విక్కీ! ఇతనేనా మీ అమ్మను చంపింది?" అన్నాడు దినకర్ వైపు చూపిస్తూ.
"ఆ ఎర్ర కోటేసుకున్నాయనే మా అమ్మని చంపాడు!" అన్నాడు విక్కీ ధారాపతంగా కారిపోతున్న కన్నీళ్ళని ఎడం చేత్తో తుడుచుకుంటూ. "ముందుగా అమ్మ గొంతు పిసికాడు. అమ్మ తప్పించుకుని పక్కకు దొర్లింది. అయినా వదలకుండా దిండుని అమ్మ మొహంమీద నొక్కి పట్టేసుకున్నాడు. చాలాసేపు గిలగిలా కొట్టుకుంది అమ్మ! తర్వాత చచ్చిపోయింది!" అని మళ్ళీ వెక్కిళ్ళు పెడుతూ ఏడవడం మొదలెట్టాడు విక్కీ.
అప్పటిదాకా ఒక పక్కన నిలబడి కేసు ప్రొసీడింగ్స్ ని శ్రద్దగా గమనిస్తున్న పోలీస్ ఇన్స్ పెక్టరు జలీల్ అలర్టుగా అయిపోయి, దినకర్ వెనకవచ్చి నిలబడ్డాడు. ఆ మర్డర్ కేసు డీల్ చేస్తోంది అతనే.
విక్కీని ఓదార్చడం మొదలెట్టాడు పబ్లిక్ ప్రాసిక్యూటరు. "ఏడవకు విక్కీ! మీ అమ్మని చంపేసిన వాడికి పెద్ద శిక్ష పడేటట్లు చూస్తాం మేము! జైల్లో పెట్టించేస్తాం? నీకేం భయం లేదు! కానీ నువ్వు జరిగింది జరిగినట్లు, చూసింది చూసినట్లు చెప్పాలి! సరేనా? ఇప్పుడు చెప్పు! ఇతనే మీ అమ్మని చంపాడని ఎలా అనుకుంటున్నావు?"
"ఆ ఎర్రకోటు బాగా గుర్తు!" అన్నాడు విక్కీ.
"ఎర్రకోటు వేసుకున్నాడు కాబట్టే ఇతను మీ అమ్మను చంపిన వాడనుకుంటున్నావా?"
"కాదు అంకుల్! నాకు బాగా గుర్తు! ఈయనే ఆ రోజున మా అమ్మని..." ఏడుపు ముంచుకొచ్చేసింది విక్కీకి.
అరుస్తున్నట్లు పెద్దగా అన్నాడు దినకర్. "నేను నిజం చెబుతున్నాను. నన్ను నమ్మండి. ఈ కుర్రాడు నన్ను చూసి ఇంకెవరో అనుకుని పొరబాటుపడుతున్నాడు. ఎవరినీ చంపవలసిన అవసరం నాకు లేదు."
ఇన్ స్పెక్టర్ చెయ్యి గదమాయిస్తున్నట్లు దినకర్ భుజం మీద పడింది. కొద్ది క్షణాల తర్వాత ఆ చెయ్యి కొంచెం కిందకి జారి, దినకర్ మోచేతిపైన గట్టిగా బిగిసింది. తాను అప్పటికే అనధికారికంగా అరెస్టు అయిపోయినట్లు అనిపించింది దినకర్ కి. |
25,340 |
టింకూకు ఎలా వుందో ఏమో...!
ఆపరేషన్ ధియేటర్ తలుపులు తెరుచుకున్నాయి.
బయటకు వచ్చిన వ్యక్తిని చూసిన కృష్ణప్రియ తెల్లముఖం వేసింది.
ఎప్పుడూ ఆలోచనలలో తనను వెంటాడే ఫైజమా వ్యక్తి...అతను తన టింకూకు ఆపరేషన్ చేసిన న్యూరో సర్జనా?
కృష్ణప్రియ షాక్ నుంచి కోలుకోకముందే ఆమె కేసిసీరియస్ గా చూసి వెళ్ళిపోయాడు అతను. గేటువరకూ సాగనంపి వచ్చిన ఇన్ స్పెక్టర్ నవీన్ వచ్చి ఆమెను తట్టి పిలిచేంత వరకు ఈ లోకంలోకి రాలేకపోయింది.
పరుగులాంటి నడకతో ఆపరేషన్ ధియేటర్ లోకి నడిచిందామె.
ఎలాంటి కల్మషాలు తనకు తెలియవన్నట్లు నిశ్చలంగా మత్తులో మునిగివున్నాడు టింకూ. నిర్మలమయిన ఆ పసివాడి ముఖంవైపే చూస్తూండిపోయింది కృష్ణప్రియ. కళ్ళవెంట ఆమెకు తెలియకుండానే కన్నీళ్ళు జారిపోతున్నాయి.
* * *
డాక్టర్ కృష్ణప్రియ మనస్సంతా అదోలా అయిపోయింది.
కన్న మమకారం కన్నా పెంచిన మమకారం గొప్పది అనడమే తప్ప తనకు ఎప్పుడూ బంధం యెలా వుంటుందో తెలియదు.
ఇంతకాలం తన స్వంతబిడ్డలా సాకిన టింకూను మరొకరికి అప్పగించాలంటే మనసు రావడం లేదు.
కానీ, ఎప్పటికయినా తల్లిదండ్రుల వద్దకే చేరవలసిన ఆ చిన్నారిపై మమతాను రాగాలను పెంచుకోవడం తను చేసిన తప్పే...!
కృష్ణప్రియకు ఆరోజు ఉదయం నుంచి టింకూను వదలడం లేదు.
ఆంటీ ఎందుకు అలా వుందో ఆ పసివాడికి అర్ధం కాలేదు.
మొన్నటివరకు తను హాస్పిటల్ లో వుండడం...తనకు యేదో ఆపరేషన్ చేయడం...అప్పటినుంచి ఎవరెవరో వచ్చి తనను పలకరించిపోవడం...అన్నీ ఒకదాని వంట ఒకటిగా టింకూకు గుర్తుకువచ్చాయి.
"ఏరా బాబూ బాగున్నావా?" అని ఒకళ్ళు పరామర్శిస్తుంటే__
"టింకూ...ఎలా వుంది...?" మరొకరు ప్రశ్నిస్తూంటే__
"ప్రియగారూ! టింకూను ఎప్పుడు తీసుకువెళ్ళమంటారు?" ఏడుస్తూ అన్నది ఒకామె.
ఇన్నిరకాల మాటలలో చివర మాటమాత్రం అతనికి అర్ధం అయింది. అసలు తన ఆంటీకి అంతమంది బంధువులు ఉన్నారంటేనే ఆశ్చర్యం వేస్తుంది. ఇంతవరకూ ఎప్పుడూ రానివాళ్లు...యిప్పుడు తను హాస్పిటల్ లో ఉన్నప్పుడే రావడం ఏమిటి?
అందరూ ఏదో అనుబంధంతో పిలిచేవాళ్ళే.
టింకూ చిన్న హృదయానికి కూడా ఒక చిన్న సందేహం వచ్చింది.
తనని పంపించమని ఆంటీని యింకో ఆంటీ అడగడం విన్నాడు. ఆమె ఎందుకు తనను పంపమంటుందో...ఎక్కడకు తీసుకొనిపోతుందో ... అసలు ఆ మాట అడిగిన ఆమెతో ఆంటీ చిన్న గొంతుతో ఏదో మాట్లాడుతుంది.
వాళ్ళ మాటలు తను వినకూడదని కాబోలు__
హాలులోనే కూర్చునివున్న డాక్టర్ కృష్ణప్రియ వొడిలో వున్న టింకూ ఆమె ముఖంవైపే పరిశీలనగా చూస్తున్నాడు.... ఇంతవరకూ ఆంటీ అలావుండడం తను ఎప్పుడూ చూడలేదు.
ఏదో అడగాలని ఆ చిన్నారి ఆరాటపడుతున్నాడు.
కానీ అడగలేకపోతున్నాడు.
బయట ఆటో ఆగిన చప్పుడు.
పరధ్యానంగా వున్న కృష్ణప్రియ తలతిప్పి చూడకపోయినా టింకూ మాత్రం లోపలకు వస్తున్న ఆమెను చూశాడు. |
25,341 | సీతా మనోహరికి సావిత్రి మొగుడు పుల్లారావు అని తెలుసు గాని సూరిపెద్దివారి పుల్లారావో బుచ్చక్కగారి పుల్లారావో తెలియదు. అందుకే తనూ ఓ కొత్త గుర్తు చెప్పింది.
"సావిత్రి మొగుడు పుల్లారావు" అంది సీత.
"సరి సరి ఆ పుల్లారావా! సావిత్రి పేరుని బట్టి తెలుసుకున్నాను. అతన్ని అందరం మమూలుగ పుల్లారావనే అంటాము" అని "పుల్లారావు ఏమవుతాడు?" అడిగాడు ముసలాయన.
"సావిత్రి మా పిన్నికూతురు. వాళ్లిద్దరూ అక్కా బావ అవుతారు" సీత ఆ చేతిలోంచి ఈ చేతిలోకి పెట్టె మార్చుకుంటూ చెప్పింది.
"అలానా!" అని వాళ్ళింటికి ఎలా వెళ్ళాలో దారి చెప్పాడు ముసలాయన.
"వస్తాను తాతగారూ!" సీత నవ్వుతూ చెప్పి ముందుకు సాగింది.
అదసలే చిన్న పల్లెటూరు. రెండు వీధుల అవతలే సావిత్రీ వాళ్ళ యిల్లు. సీత అటూ యిటూ ఇళ్ళు చూసుకుంటూ తనని వింతగ చూస్తున్న మనుషులని చూస్తూ ఇద్దరు పలకరిస్తే వాళ్ళకి జవాబు చెప్పి ముందుకు సాగింది.
సావిత్రి వాళ్ళ యిల్లు ఎలా వుంటుంది అన్నది సీతకి తెలియదు. పెంకుటిల్లు అని మాత్రం తెలుసు. అక్కడ వున్నవన్నీ పెంకుటిల్లు. తనకి ఎదురైన పదేళ్ళ అమ్మాయిని కనుక్కుంది. ఆ పిల్ల యిల్లు చూపించి తుర్రుమంది.
సావిత్రి యింటి ముందుకొచ్చి నిలిచింది సీత.
"అక్కా!" అని పిలుద్దామనుకుంది సీత. తలుపులు వేసి వుండటం వల్ల చిలిపి ఆలోచన పిలుపు మానేసి గొళ్ళెం మీద చేయి వేసింది.
24
టక్ టక్.
గొళ్ళెం తలుపుకేసి కొడుతూ చప్పుడు చేసింది సీత.
ఇంట్లోంచి అలికిడి కాలేదు.
"టక్, టక్" ఈ తఫా కాస్త గట్టిగ చప్పుడు చేసింది సీత.
"ఎవరది? ఎవరెహే" అన్నాడు పుల్లారావు ఇంట్లోంచి విసుగ్గా.
సీతకి నవ్వొచ్చింది మాట్లాడకుండా నుంచోటమేగాక మళ్ళి చప్పుడు చేసింది గొళ్ళెం.
"తర్వాత వాళ్ళని తిడుదురుగాని, వెళ్ళి ముందు తలుపు తీయండి" ఆ స్వరం సావిత్రిది.
పుల్లారావు తిట్టినట్లున్నాడు. సావిత్రి ఆ మాట అంది.
తనకి వూరు పేరు రాస్తా తెలుసుగాని ఈ ఇల్లు తెలియదు. తను వాళ్ళ వూరు ఇలా చెప్పాపెట్టకుండా వస్తానని వూహించి వుండరు. అకస్ మాత్ గ దర్శనం యిచ్చిన తనని చూసి వాళ్ళు ముందు తెల్లబోతారు తర్వాత ఎంతో ఆనందిస్తారు.....
సీత తలుపు దగ్గర నుంచుని ఆలోచిస్తుంటే భళ్ళున తలుపు తెరుచుకుంది.
కొట్టటానికి చేయి పైకి ఎత్తిపెట్టి వుగ్ర నరసింహ అవతారంతో "నీ...." అంటూ ఓ బూతు మాటతో రుస రుసలాడుతూ తలుపు తీసి విసురుగ బైటికి రాబోయిన పుల్లారావు తెల్లబోయి ఓ అడుగు వెనక్కి వేసి "ఏంటి నువ్వా!" అన్నాడు అత్యద్భుతమైన ఆశ్చర్యం అప్పుడే చూస్తున్నట్లు.
సీత ముందు తెల్లబోయి అంతలోనే తెప్పరిల్లి నవ్వుతూ తల పంకించింది.
"ఏమేవ్! ఎవరొచ్చారో యిలా వచ్చి చూడు." ఇంట్లోకి తిరిగి ఓ గావుకేక వేసి ఆ తర్వాత సీత భుజంమీద చేయివేసి "దా మరదలు పిల్లా! లోపలికి, గుమ్మందగ్గర పేర్లు చెప్పాలా ఏటి?" ఓ వెకిలి నవ్వు నవ్వుతూ అన్నాడు పుల్లారావు.
పుల్లారావు చనువుగ భుజంమీద చేయివేయటం సీతకి నచ్చలేదు. "ఈ పల్లెటూరి వాళ్ళ తీరే అంత." అనుకుందో లేదో పైట చెంగుకి చేయి తుడుచుకుంటూ లోపలినుంచి సావిత్రి వచ్చింది.
సీతని చూస్తూనే "అమ్మో అమ్మో నీవేనా! నిజంగ వచ్చావా! ఇవాళ ఎంత మంచిరోజు" అంటూ సావిత్రి పరుగున వచ్చి సీతని కౌగలించుకుంది. "ఎవరెవరు వచ్చారని అడిగింది గబగబా. సావిత్రి ప్రేమ ఆప్యాయత సీతకి ఆనందింపచేశాయి. |
25,342 | 'ఇది' అనుకుంటూ సంగమేస్వరరావు చెక్కపెట్టెని ఎత్తుకొని యింట్లోకి వెళ్ళాడు.
"ఈ చెక్కపెట్టెలో ఏముండి వుంటాయి? ఏవో ఖరీదయినవే వుండివుంటాయి. లేకపోతే వాడు పారిపోవటం జరిగివుండదు. వాడి వెనుక మనుషులూ పడరు."
వీడు వాళ్ళకి దొరికాడా సరే, దొరక్కుండా తప్పించుకున్నాడా కొంప మునిగిందన్నమాటే. పెట్టేకోసం తిరిగివస్తాడు. అరుగుమీద పెట్టె కనబడకపోతే వాడు తనని అనుమానిస్తాడు. తలుపుతీసి బయటికి వచ్చింది తనేకదా?
కనుక ఇప్పుడు తను చేయాల్సింది....?
సంగమేస్వరరావుకి మంచి ఆలోచన వచ్చింది.
పెట్టెని మంచంకిందికి తోశాడు.
లుంగీ విప్పి పైజమా__లాల్చీ వేసుకున్నాడు.
తాళం తీసుకొని ఇంట్లోంచి బయటికి వచ్చి వీధి తలుపు తాళం వేశాడు.
'తెల్లారిందాకా యింటికి రాకూడదు' అనుకుంటూ సంగమేస్వరరావు వీధి దారి పట్టాడు.
అప్పుడు సమయం మూడున్నర.
34
తెల్లారింది.
ఆరూ పది నిమిషాలు.
ఏదన్నా వార్త తెలిస్తే చాలు ప్రజలు చెవులు కొరుక్కుంటారు.
ఏదన్నా విన్తజరిగితే చూడటానికి వస్తారు. ఏదన్నా ఘోరంజరిగితే అంతా అక్కడే వుంటారు.
నడిబజారులో కన్నిగాడిని ఎవరో పొడిచి పొడిచి చంపారు. కత్తిపోట్లు శరీరం మీద పాతికచోట్ల వున్నాయి.
కన్నిగాడిని ఎవరు హత్య చేసినట్లు?
హత్య చేసింది ఒకరా యిద్దరా ముగ్గురా?
ఇదేమీ ఎవరికీ తెలియదు. కన్నిగాడి శవాన్ని చూస్తూ చాలామంది గుమిగూడారు. ఎవరికీ తోచింది వారు చెప్పుకుంటున్నారు. శవాన్ని ఎప్పుడూ చూడనట్లు చూస్తున్నారు.
ఈ వార్త యింకా పోలీసులదాకా వెళ్ళినట్లు లేదు.
సంగమేస్వరరావు యింటికి తిరిగి వస్తున్నాడు. పక్కవీధిలోనే ఈ హత్య జరిగింది. అటుగానే వస్తున్న సంగమేస్వరరావు గుమిగూడి వున్న జనాన్ని చూసి ఆ గుంపులో దూరాడు.
కట్టిపోట్లకి గురి అయి దారుణంగా హత్య చేయబడిన కన్నిగాడి శవం.
కన్నిగాడు గుండు చేయించుకుని వున్నాడు. నిక్కరు వేసుకున్నాడు.
బ్రూస్ లీ బోమ వున్న బనీను చేతులున్నది ధరించాడు. సన్నగా రివటలా వున్నాడు.
శవాన్ని చూడగానే సంగమేస్వరరావు గుర్తించాడు.
'వీడే రాత్రి తన అరుగుమీదనుంచి దూకింది. వీడినే కొందరు తరిమింది. చీకట్లో ముఖం గుర్తుపట్టలేకపోయినా గుండు ఆఫ్ నిక్కరు, చేతులున్న బనీను, సన్నగా పొడుగ్గా వున్న రూపం వీడే....వీడే....వీడే...."
"మాష్టారూ! మీరూ వచ్చారా?" సంగమేస్వరరావు ఇంటి పక్కవున్న యింతిగల నాగభూషణం పలకరించాడు.
"అరె మీరా? మిమల్ని నేను చూడనేలేదు. మార్నింగ్ వాక్ కి బయలుదేరాను. ఇటుగా వస్తుంటే గుమిగూడిన వీళ్ళు కనపడ్డారు. ఏమిటో అని గుంపులో దూరాను. తీరా చూద్దును గదా దొంగాడి శవం సంగమేస్వరరావు నోటికొచ్చింది చెప్పాడు.
"దొంగాడా?" నాగభూషణం తెల్లబోయి అడిగాడు.
అప్పుడు గ్రహించాడు సంగమేస్వరరావు తన పొరపాటు.
"దొంగ వెధవ కాబట్టే ఎవరో చంపి పారేసి వుంటారని నేననుకుంటున్నాను. కాదంటారా?" అమాయకంగా ముఖంపెట్టి అడిగాడు.
"మీరెంత పిచ్చివారండీ!" అని నాగభూషణం నవ్వాడు.
లోకులు తనని పిచ్చివాడు, వెర్రివాడు, అమాయకుడు, జీవితంలో దెబ్బతిన్న మనిషి అనుకోవడం ముఖ్యం అని భావించే మనిషి సంగమేస్వరరావు.
అతను చేపట్టిన వృత్తిని అనుమానించకుండా వుండాలి అనుకుంటే అలా ప్రజలు భావించడం మంచిదే కదా!
ఎవరు కబురు అందించారో తెలియదు. పోలీసులు వచ్చారు సాక్ష్యం యివ్వాల్సి వస్తుందేమోనని ఒక్కొక్కళ్ళు అక్కడ నుంచి జారుకోవడం మొదలుపెట్టారు.
"మాష్టారూ! మనంకూడా ముఖం చాటేయడం మంచిది" నాగభూషణం అక్కడనుంచి కదులుతూ అన్నాడు. |
25,343 |
సరళ చివాలున లేచి తలుపు దగ్గరగా లాగి సరోజ గదికేసి పరుగెత్తింది. "హల్లో సరళా! వంట్లో బాగాలేదా! ఏమిటి విశేషం?" స్కార్ఫ్ విప్పుకుంటూ తలతిప్పి ఓరగా చూస్తూ అడిగింది మిస్ రోజా. మిస్ రోజా ధోరణికి సరళకు వళ్ళు మండిపోయింది. ఆవిడతో మాట్లాడ్డానికే అసహ్యం వేసింది. "సరోజ వెళ్ళిపోయిందా?" "సరోజమాత్రం నేను చేయలేనా? కూర్చో!" సరళ గిర్రున వెనక్కు తిరిగింది. డైనింగ్ హాల్లో భోజనం ముందు కూర్చున్న సరళకు ముద్ద మింగుడుపడటంలేదు. అవతల వరసలో కూర్చుని పకపకలాడుతూ పక్కవాళ్ళమీద విరగబడి మాట్లాడుతున్న మిస్ రోజాను చూస్తుంటే సరళకు కంపరం పుట్టిపోయింది. డిన్నర్ మధ్యలోనే వదిలేసి గదికి వచ్చేసింది. పక్కమీద పడుకుంది. పడక కుదిరినట్టుగా లేదు. అటూ ఇటూ దొర్లింది. నిద్ర రావటం లేదు. తలంతా వేడెక్కిపోయింది. ఎందుకొచ్చిన పీడ తనకు యిది? అయినవాళ్ళందర్నీ వదులుకొని వచ్చేసింది. నీళ్ళులేక యెండిపోయిన మొక్కను పీకి చిత్తడినెలలో మళ్ళీ పాతడం ఎందుకు? ఇదంతా తన భ్రమేనేమో? తనెవరు? రాజమణిదేవి యెవరు? ఆమెగారు ఈ పాటికి తనను మరచిపోయే ఉంటుంది. కొత్త నర్సు సరోజతో ఈపాటికి ఆప్యాయత వలకబోస్తూ ఉంటుంది. ముక్కూ- మొహం తెలియని తనతో ఆమె మొదటిరోజే ఎట్లా మాట్లాడింది? అలాగే సరోజతో కూడా మాట్లాడి వుంటుంది. ఆమెగారి మానసిక స్థితి అలాంటిదే. తనను పూర్తిగా మరిచిపోయే వుంటుంది. తనే లేనిపోని ఆలోచనలతో మమకారాన్ని పెంచుకొంటూ, గుండెల్ని పిండుకొంటూంది... అంతే- "సరళా!" ఎవరది? సత్యం బావా? సూర్యం బావలా వున్నాడు! సూర్యం కంఠం ఇంత కర్కశంగా మారిపోయిందేం? అరే అంతలోనే గొంతు మారిపోయిందే? సందేహం లేదు - యిది సత్యం బావ పిలుపే. ఆ పిలుపే వేరు. ఆ పిలుపే వేరు. ఆ పిలుపులో ఎంత మాధుర్యం? ఎంత ఆత్మీయత? ఎంత సౌమ్యత? ఎన్నాళ్ళకు వచ్చాడు బావ? ఇంతకాలం నన్నొదిలి ఎలా ఉండగలిగావు బావా? నీకోసం నా హృదయం ఎంత పరితపించి పోతుందో నీకు తెలియదా? కళ్ళల్లో వత్తులు వేసుకొని నీకోసం ఎదురు తెన్నులు చూస్తున్నానే? నీకు తెలియదా బావా? ప్రకృతిలోని అంతఃసౌందర్యాన్ని వెలికి తీసి రంగులు వేసే కళాకారుడివిగదా బావా? నీ సరళ మనసును అర్ధం చేసుకోలేకపోయావేం? అయ్యో! నేనంటుందేమిటి? నిన్ను వాకిట్లోనే నిలబెట్టి ఏమేమో మాట్లాడుతున్నాను. అలా మాట్లాడేగదూ నిన్ను దూరం చేసుకున్నాను. వస్తున్నా బావా! ఇదిగో తీస్తున్నా నా గుండె తలుపులు! నేరుగా లోపలకు వచ్చేయ్. అక్కడ ప్రతి అణువులోను నీ రూపమే నిండి ఉన్నది. నువ్వే చూసుకో! "సరళా! ఓ సరళా!" - - తలుపు కొడ్తున్న సవ్వడి. సరళ గాబరాగా పక్కమీదనుంచి లేచింది. "అబ్బ! ఎంతనిద్ర పోతున్నావో?" అంది సరోజ లోపలికొస్తూ. "ఎంతసేపట్నుంచి పిలుస్తున్నావు?" "ఐదు నిముషాలుగా అరుస్తూనే ఉన్నా!" కుర్చీలో కూలబడుతూ అన్నది సరోజ. కణతలు నొక్కి పట్టుకొని సరళకేసి నిస్సహాయంగా చూడసాగింది సరోజ. ఆమె కళ్ళు జ్యోతుల్లా మండిపోతున్నాయి. ముఖం అంతా పాలిపోయి వుంది. వరుసగా ఏడు రాత్రుళ్ళు నిద్రలేని మనిషిలా వుంది. "ఏమిటి సరోజా! ఏమయింది?" "ఏమయిందా? నువ్వు శెలవెందుకు పెట్టావో ఇప్పుడు నా కర్ధం అయింది-" అన్నది సరోజ వగరుస్తూ. సరళ సరోజ ముఖంలోకి అయోమయంగా చూసింది. "ఆమెగారు- అదే స్పెషల్ వార్డులో ఉన్న పేషంట్ రాజమణిదేవి-" అదే అడగాలని ఆగిపోయింది సరళ, సరోజ ముఖం చూసి. "పేషంట్ కాదు - షి యీజ్ ఎ డెవిల్! మెంటల్ హాస్పిటల్ లో ఉండాల్సిన మనిషిని తీసుకొచ్చి మన హాస్పిటల్లో పడేశారు మన ప్రాణాలు తియ్యటానికి." "ప్లీజ్! సరోజా, అలా అనొద్దు. ఆమెకెలా ఉందిప్పుడు?" సరళ కంఠం ఆర్ద్రమయింది. సరోజ ఓ క్షణకాలం సరళ ముఖంలోకి తీక్షణంగా చూసింది. "ఆమెగారు నీ కేమవుతుంది?" "ఏమీ - ఏమీ కాదు." "అబద్ధం! నువ్వేదో దాస్తున్నావు. మొదటిరోజు రాత్రంతా నీ గురించే అడిగింది. ఏదో సర్దిచెప్పాను. రాత్రంతా పక్కమీద కూర్చునే ఉంది. నేనేది అడిగినా నీగురించే మాట్లాడేది. ఇక రాత్రి సరేసరి, నా ప్రాణాలు తోడేసింది. హాస్పిటల్ వాళ్ళంతా కుట్రచేసి నిన్ను తననుంచి దూరం చేశారట! ఇలాగే ఏమేమో పిచ్చిమాటలు మాట్లాడింది. ఆమె చేత స్లీపింగ్ పిల్ కూడా మింగించలేకపోయాను! మందు విసిరికొట్టింది. రాత్రి పదకొండు గంటలకు బిగిసిపోయి బెడ్ మీద విలవిలా తన్నుకొంది. న్యూరాలజీ సర్జెన్ కు కబురుపెట్టి పిలిపించాను-." సరళ ఆదుర్దాగా లేవటం చూసి సరోజ ఆగిపోయింది. "సరళా! తల రేగివుంది. కనీసం చీరయినా మార్చుకో." సరళ మాట్లాడకుండా గదిబయటకు నడిచింది. సరోజ నిట్టూర్చి తన గదివైపుకు వెళ్ళింది. ఉదయం ఎనిమిది గంటలు దాటిపోయింది. తోటీలూ, నర్సులూ తమతమ పనుల్లో మునిగిపోయి వున్నారు. హాస్పిటల్ వార్డ్సు అన్నీ శుభ్రం చేస్తున్నారు ఒకవైపు. పేషెంట్సు బెడ్స్ సర్ది బట్టలు మారుస్తున్నారు నర్సులు. సరళ ఫిమేల్ వార్డు దాటి స్పెషల్ రూమ్ లకేసి నడవసాగింది. రాజమణిదేవి గదిలో అడుగు పెడ్తూనే ఆగిపోయింది సరళ. ఆమె పక్కమీదకు వంగి తల్లిని కూర్చోపెట్టటానికి ప్రయత్నిస్తున్నాడు మాధవరావు. "నేను పచ్చి గంగ మింగను. ఈ నరకంలో నేను ఒక్కక్షణం ఉండను." "అలాగే అమ్మా౧ మరో హాస్పిటల్లో చేర్పిస్తాను. ఈ ఒక్కరోజుకు ఓపికపట్టు. ముందు ఆ కాఫీ తీసుకో, చల్లారిపోయింది. నేను డాక్టరు రావుతో మాట్లాడి డిస్ ఛార్జి చేసేట్టు చూస్తాను." "ఆఁ! డాక్టర్ రావు! అతడు నన్ను పిచ్చి ఆసుపత్రిలో చేర్పిస్తాడు. నాకు తెలుసు." "ఏమిటమ్మా ఆ మాటలు?" "లేకపోతే ఏమిటిరా? వీళ్ళంతా కలిసి నా సరళను ఎందుకు నా దగ్గరకు రానివ్వకుండా చేశారు?" "ఎవరమ్మా ఆ సరళ?" రాజమణిదేవి తలెత్తి కొడుకు ముఖంలోకి చూసింది. మాధవ్ భుజాలకు వెనగ్గా మౌనంగా నిలబడ్డ సరళ కన్పించింది. రాజమణిదేవి కళ్ళు కాంతిమంతమయ్యాయి. ముఖం వికసించింది. చివాలున మంచం మీదనుంచి లేచింది. మాధవ్ ను తప్పుకొని ముందుకు అడుగులు వేస్తూ తూలింది. సరళ ఆమెను మెల్లగా నడిపించి బెడ్ మీద కూర్చోబెట్టింది. ఎడంగా జరుగుతున్న సరళను రాజమణిదేవి రెండు చేతుల్లో పొదవి పట్టుకొని గుండెలకు హత్తుకొంది. ఆమె ఆలింగనంలో సరళ చిన్నపిల్లలా అయిపోయింది! అనిర్వచనీయమైన ఆనందానుభూతిని పొందింది. సరళ చెంపలమీద జారుతున్న అశ్రువులను రాజమణిదేవి తన పమిటకొంగుతో తుడిచింది. మాధవరావు కళ్ళు పెద్దవి చేసుకొని వింతగా చూస్తూ ఉండిపోయాడు. "పిక్చిపిల్ల౧ నాకు దూరంగా ఉండటానికి ప్రయత్నించావు గదూ? అది నీ వల్లకాదు, నాకు తెలుసు. ప్రాణదానం చేసిన నువ్వు మళ్ళీ నా ప్రాణాల్ని తియ్యలేవని నాకు తెలియదా?" రాజమణిదేవి గర్వంగా తలెత్తి కొడుకు ముఖంలోకి చూసింది. ఎవరికోసం తన తల్లి ఇంతసేపు గొడవ చేసిందో, ఆమే ఈ సరళ అని అర్ధం చేసుకోటానికి మాధవరావుకు ఎంతోసేపు పట్టలేదు. తన తల్లి ఒడిలో తలదూర్చి వచ్చే దుఃఖాన్ని ఆపుకోటానికి ప్రయత్నిస్తోన్న ఆ అమ్మాయిని విస్మయంతో చూస్తూ ఉండిపోయాడు. ఏమిటీ వింత? తన తల్లికి కూతురు పోయినప్పటినుండి మతి సరిగా ఉండడం లేదు. కాని ఈ నర్సమ్మ ఏమిటి ఇలా ప్రవర్తిస్తుంది? ఈ అమ్మాయికి కూడా మతిస్థిమితం కొంచెం తక్కువేమో! లేకపోతే నాలుగు రోజుల పరిచయానికి ఈ పిల్ల అలా తన తల్లి ఒళ్ళో తలదూర్చి ఏడవటం ఏమిటి? "ఎన్నిమాటలు చెప్పావు? నాలో ఎన్ని ఆశలు కల్పించావు? కొత్త జీవితాన్ని, ఓ కొత్త లోకాన్నే సృష్టించుకొన్నానే? ఈ రెండు రోజులూ నేను ఎంత చిత్తక్షోభను అనుభవించానో నీకు తెలియదా సరళా?" "అదంతా పీడకల! మర్చిపోండి. నేను ఇంకెప్పుడూ అలా చెయ్యను-" కళ్ళు తుడుచుకుంటూ అంది సరళ. "నిజంగానే ఈ అమ్మాయికి కూడా కొంచెం పిచ్చి ఉంది-" అనుకొన్నాడు మాధవరావు. "మళ్ళీ నువ్వు అలా చేసే అవకాశం నీకుండదులే. నిజంగా నేను పిచ్చిదాన్ని కాబట్టే ఇలా జరిగిపోయింది. మళ్ళీ అలా జరగటానికి వీల్లేదు. వెళ్దాం పద!" "ఎక్కడికమ్మా? మీరీ స్థితిలో-" "ఎక్కడికా? నీ ఇంటికే!" "నా ఇల్లా? నాకు ఇల్లు-" "అమ్మకు పూర్తిగా మతిపోయినట్లుంది-" లోలోపలే విసుక్కున్నాడు మాధవరావు. "అవును, నీ ఇంటికే! నా ఇల్లు నీది కాదా? నేను నీదాన్ని కాదా?" సరళ బిత్తరపోయి చూసింది. ఆమె ధోరణికి అడ్డుపడటం ప్రస్తుతం శ్రేయస్కరం కాదనిపించింది. "మాధవ్! చూస్తావేంరా? అమ్మాయి, నేను ఇంటికి వస్తున్నాం. నువ్వు డాక్టరుగారితో మాట్లాడిరా!" అని రాజమణిదేవి బెడ్ మీదనుంచి లేచింది. మాధవరావు ఏదో అనాలని, తల్లి ముఖంచూసి ఏమీ అనలేక గది బయటకు వెళ్ళిపోయాడు.
25
కారు బంగళా గేటు దాటింది. పూలమొక్కల మధ్యగా పోర్టికోకేసి పోతూంది. రాజమణిదేవి ప్రక్కన వెనక సీట్లో కూర్చున్న సరళ విస్మయంగా చూడసాగింది. ఎంత పెద్ద బంగళా! ఎంత పెద్ద ఆవరణా! తనెప్పుడూ ఊహించనిది కళ్ళముందు చూస్తోంది. తోటలో ఆ మేడ ఎంత అందంగా ఉంది? సత్యం బావ ఇంత అందమైన బంగళా చూస్తే ఎంత ఉబ్బి తబ్బిబ్బై పోతాడో? ఈ అందమైన పూలబాటనీ, ఆ విశాలమైన ఇంటినీ రంగుల్లో రంగరించి ఎంతటి అద్భుత చిత్రాన్ని గీస్తాడో! కారు పోర్టికోలో ఆగింది. మాధవరావు ముందు సీట్లోనుంచి దిగివచ్చి వెనక డోర్ తెరచి నిలబడ్డాడు. రాజమణిదేవి సరళ భుజం మీద చెయ్యివేసి ఆనుకొని కారు దిగింది. "కుడికాలు పెట్టమ్మా!" - ఎడంపాదం మొదటి మెట్టుమీద దాదాపు ఆనించిన సరళను వారిస్తూ అన్నది రాజమణిదేవి. - మంగళవాద్యాలు తాళిబొట్టూ, తలంబ్రాలూ పారాణి పాదాలూ గడపదాటుతున్న పెళ్ళికూతురూ- క్షణంలో సగంసేపు సరళ మనస్సు సుందర మనోహర దృశ్యాలను దర్శించి, మధురాతి మధురమైన అనుభూతుల్తో తిరిగివచ్చింది. ఇది అసంభవం! ఇది నిజంగాదు! ఇది భ్రమ! పగటికల! సరళ తల తిరిగిపోతూంది. "మాధవ్! ఇలా రారా! సరళకు ఏదో అయిపోతుందిరా!" గట్టిగా అరిచింది రాజమణిదేవి. అంతవరకు వెర్రివాడిలా చూస్తూ నిలబడ్డ మాధవరావు ముందుకొచ్చాడు. "నాకేం కాలేదు. బాగానే ఉన్నా! ఒక్కక్షణం ఏదో తల తిరిగినట్టయింది. అంతే!" సరళ తెప్పరిల్లుకొని అన్నది. మాధవరావూ, సరళా రాజమణిదేవిని చెరొక రెక్క పట్టుకొని మెట్లు ఎక్కించారు. బెడ్ రూంలోకి దారితీస్తున్న వాళ్ళను ఆపుచేసి రాజమణిదేవి "ఇంక పడకలతో పనిలేదు. నన్నిక్కడే కూర్చోనీయండర్రా!" అంటూ హాల్లో ఉన్న సోఫాలో జారిగిలపడి కూర్చుంది. సరళకు ఏమి చెయ్యటానికి తోచలేదు. ఆమెకు రాజమణిదేవి తప్ప, ఆ ఇల్లూ, ఆ వాతావరణం అంతా కొత్తే. రాజమణిదేవి ముందు నిలబడి దిక్కులు చూడసాగింది. "ఏమిటమ్మాయ్! అలాగే నిలబడిపోయావు? నీ యింట్లో నువ్వే కొత్తదానివిలా దిక్కులు చూస్తూ నిలబడ్డావు?" "అమ్మకు నిజంగానే మతి భ్రమించినట్టుంది-" అనుకున్నాడు మాధవరావు. "ఒరేయ్! మాధవ్! అట్లా నీళ్ళు నములుతూ నిలబడిపోయావేరా? అమ్మాయిని తీసుకెళ్ళి ఇల్లంతా చూపించు. ఈ క్షణం నుంచి ఈ ఇంట్లో నా పెత్తనం ఏమీలేదు. అందరం సరళ చెప్పినట్టే వినాలి. ఆమె పెడ్తే తినాలి. కూర్చోమంటే కూర్చోవాలి. లేవమంటే లేవాలి. ఆఁ, తెలిసిందా?" రాజమణిదేవి ఆయాసానికి ఆవేశంతోడయి ఉక్కిరి బిక్కిరి అయిపోతూ చెప్పింది. సరళ స్థంభించిపోయి కొయ్యబొమ్మలా నిలబడింది. మాధవరావు సరళకేసి చూడకుండానే "రండి" అంటూ తల వొంచుకొని తల్లిముందునుంచి కదిలాడు. సరళ యాంత్రికంగా, అంతకంటే ఏం చేయాలో తోచనిదానిలా కదలి మాధవరావును అనుసరించింది. |
25,344 | అక్కడ నిగ్రహాన్ని కోల్పోయాడు రాఘవ.
"ఎందుకు నేను సిగ్గుపడాలి? ఏ అల్లుడ్ని ఏ మామ అడగకూడని ప్రశ్న వేస్తే నా తప్పు లేనప్పుడు నేనెందుకు సిగ్గుపడాలి? పెళ్ళయిన ఇన్ని నెలలు లేనిది ఈరోజు నేను మగాడ్ని అవునా, కాదా అని నిలదీసి అడుగుతుంటే నిక్కచ్చిగా మాట్లాడటానికి నేనెందుకు సిగ్గుపడాలి? ఏం తప్పు చేశానని? దగ్గరికి రానివ్వని అహం నీది, కాపురం చేయకుండా గాలికి తిరుగుతావా అని ప్రశ్నించే అహం ఆయనది, ఎందుకు? నేనెందుకు తల వంచాలి? మీ డాడి అయితేనేం? అయన కోటిశ్వరుడైతేనేం? నేను లక్ష్యం చేయను!"
"అవును, మీరెందుకు లక్ష్యం చేస్తారు?"
"ఓ పోస్ట్ గ్రాడ్యుయేట్......బ్యాంక్ ఆఫీసరు.....కవి.....అమ్మాయిల్ని, సునాయాసంగా వలలో వేసుకోగల సమర్ధులు."
"అపు!" ఉద్విగ్నంగా కంపిస్తు అన్నాడు. "మనం అనవసరమైన చర్చల్లోకి వెళ్ళొద్దు."
"ఏం నేనన్నది నిజం కాదా?"
"నిజమైనా కానీ, ఇప్పుడదంతా గతం."
"కాదు!" కసిగా అంది కిన్నెర.
"నేను తలచుకుంటే మీరు, మీ ప్రేమ కలాపాలు, ఆ అమ్మాయి అంతా గతంలా మారిపోతారు. అవును మీరు మరో కొత్త జీవితంలో అడుగు పెట్టాలి అన్నా నా అనుమతి కావాలి."
రెప్పలార్పకుండా చూశాడు, "బెదిరిస్తున్నావా?"
"బెదిరించడం కాదు. నిజం చెబుతున్నాను."
నవ్వాడు అవహేళనగా, "నువ్వా అవకాశాన్ని చేజార్చుకున్నావ్ కిన్నెరా! నన్ను శాసించి ఏదన్నా చేయగల గొప్ప అదృష్టాన్ని నీ అహంతో దూరం చేసుకున్నావ్. నీకు నీరాజనం కావాలి. నువ్వనుకున్నట్టు మాత్రమే బ్రతికే మగాడు నీకు భర్తగా వుండాలి.
వాడికి వుద్రేకాలు వుండకూడదు. నువ్వు దగ్గరకు తీసుకొమ్మని ఆదేశిస్తే పక్క మీదికి రావాలి. ఈ రోజు దూరంగా పడుకోండి అంటే, ఓ తుంగ చాప నేల మీద వేసుకుని నిద్రపోవాలి.
నీకు కావాల్సింది దాంపత్యం కాదు.
నీ సెల్ఫ్ కేరెక్టర్ ను పదిలంగా కాపాడే ఓ తోడు వాడికి చచ్చినా అభిమానం వుండకూడదు. నీ తాత గురించి నువ్వు చెబితే దానికి చెయ్యెత్తి జై కొట్టాలి. మీ గత ప్రాభవం గురించి ప్రతి క్షణమూ ప్రస్తుతిస్తూ విషమ వాంచలకు దూరంగా బ్రతకడం అలవాటు కావాలి. ఎందుకు కిన్నెరా? అలాంటప్పుడు ఏ డెబ్బై ఏళ్ళ వృద్దుడ్నో కట్టుకోక, నన్నెందుకు రొంపిలోకి లాగావు? నన్నెందుకు మానసికంగా హింసించావ్?"
"అవును, నేనదే కోరుతాను."
మండిపడి పోతుంది కిన్నెర మరింత అహం గాయపడినట్టు. "అలాగే జీవిస్తాను. ఎవరేమనుకున్నా నేనిలాగే బ్రతుకుతాను!"ఉన్మాదినిలా అరిచింది.
"సరే అలాగే బ్రతుకు. ఆ అహంతోనే కాపురం చెయ్యి జీవితం అంటే పంచుకోవడం అనే సూత్రాన్ని మరిచి, జీవిత మంటే గెలుపు అనే సిద్డంతంతో మొత్తం నీ యౌవనాన్ని సజీవ సమాధి చేసి, నువ్వు బ్రతికే ఈ లోగిలినే ఓ తాజ్ మహల్ గా భావిస్తూ అలాగే సాగించు."
బయటికి వేల్లబోయిన రాఘవ భుజం పైన చేయి పడింది బలంగా.
"ఎక్కడికి?" అడిగింది రౌద్రంగా చూస్తూ.
"నీ కోరిక ప్రకారం నటించటానికి వచ్చాను, ఇక వెళతాను."
"వీల్లేదు! మీరీ రాత్రికి ఇక్కడే వుండాలి."
"కుదరదు!" "ఉండి తీరాలి!"
"అయితే నువ్వు నాకు కంపెనీ ఇవ్వాలి."
"అంటే?" "అదే......నాతో బాటు పక్క పంచుకోవాలి."
ఆ క్షణంలో కిన్నెరకు ముందు రమణి గుర్తుకొచ్చింది. వెంటనే హోటల్లో 'ఆమె' ఏడుస్తుంటే నేనున్నానని రాఘవ అన్న మాటలు జ్ఞప్తికి వచ్చాయి.
రెండు చేతులతో అతడి మెడ పట్టుకుంది.....
"నా గురించి ఏమనుకుంటున్నావ్? నేను నీ ఉంపుడుగత్తె ననుకుంటున్నావా?"
పిచ్చి బలంతో రాఘవను కుదిపేస్తుంది.
ఆ స్పర్శతో ఏ ఆలోచనల వాగుకి గండి పడిందో ముందు విడిపించుకోవాలనుకున్నాడు.
అది సాధ్యం కాకపోవడంతో అమాంతం ఆమెను పైకెత్తుకుని పక్క మీదికి విసిరేశాడు.
ఆమె పైకి లేవబోయింది.
అవకాశం ఇవ్వలేదు రాఘవ.
అదురుతున్న ఆమె అధరాల్ని పెదవులతో నొక్కిపట్టి ఆమెలోని తరతరాల అహాన్ని పిల్చుతున్నట్టు బలాన్ని ప్రయోగిస్తూ- కాంక్షల వాక్యాలని పదాలుగా, పదాలని అక్షరాలుగా పరువుపై విడగోడుతూ......గొంతు గగనం నుంచి తేనె వాగులో కాంక్షల ఉల్కలో రాలిపడే వివశాత్వాన్ని ప్రదర్శిస్తూ....ఆమెను మరింత బలంగా అల్లుకుపోయాడు.
కిన్నెర పెనుగులాడుతోంది.
పిడుగుపాటు కాదది.
మోగుతున్న మనసు ఘోష.
దాస్యం కోసం లాస్యం.
అస్తమిస్తున్న స్వేచ్చ.
పెటేల్మని తెగుతున్న సంకెళ్ళు.
పలకని రాగవిపంచి నుంచి ఊడిపోతున్న ఉక్కు తీగల కలవరం. జలధిగా విస్తరిస్తున్న తరంగాంతరంగం......విభావరీ విస్ఫోటం.
సహకరిస్తూనే సహకరించలేని సంచలనం! లాయర్
నోటిస్.......రమణి ....హామీ.....నేనున్నాను.....కోర్కెల పడగలు....ఊర్పుల నిట్టూర్పులు......
శక్తిని కూడగట్టుకుంది. మలిన మవుతున్నది మరో మగాడితో అనిపించే టంత ద్వేషం.....ఉక్రోషం.....నెట్టేసింది రోషంగా.
హటాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది.
బడలికగా చూశాడు.
సగంలో గాయపడ్డ మృగంలా నిట్టూర్చాడు.
"అవుట్...."నెమ్మదిగా కాదు. ఆవేశంగా అరిచింది "గెట్ లాస్ట్!"
ఒక తుఫాను తర్వాత ప్రశంతత కాదది. ఇంకా ప్రభంజనంలోనే నిలబడి వున్నంత ఆరాటం ఆమెలో.
"వెళ్ళిపో రాఘవా! నీ ప్రియురాలి దగ్గరికి. నీ కోసం అక్కడెక్కడో ఎదురు చూస్తున్న నీ మనిషి దగ్గరికి వెళ్ళు.....నాకు నీ ముఖం చూపెట్టకు!"
తప్పు చేయాలని ప్రయత్నించి విఫలుడైన రాఘవ జవాబు చెప్పలేదు. నిశ్శబ్దంగా బయటికి నడిచాడు.
ఆ తర్వాత ఆవేశంగా తలుపు లేసుకోబోయిన కిన్నెర ఎదురుగా నిలబడి వున్న తండ్రిని చూసింది.
వీర్రాజు వెనుక రాయుడు కనిపించాడు.
కిన్నెర ఇంకా తేరుకోలేదు- "క్షమించండి నాన్నా! రాఘవా, నేనూ విదిపోవాలనుకుంటున్నాం. ప్రస్తుతానికి ఇంతకన్నా వివరాలు నన్నడక్కండి."
ద్వారం మూసుకుంది, వీర్రాజు మ్రాన్పడి చూస్తుండగానే.
నిశ్శబ్దంగా డాబా పైకి నడిచాడాయన.
ఎవరి మీద కోపగించుకోవాలి?
కిన్నెర అభీష్టం పైనే జరిగిన పెళ్ళయితే ఇప్పుడు తను నిలదీయాల్సిందేవర్నని?
దిగువ చీకటి.... |
25,345 | తేజ మాట్లాడలేదు.
"మీ అనుమానం నిజం కాదు. మీరనుకున్న వ్యక్తీ, అవంతీ ఒకరు కాదు" అవతల్నుంచి ఫోన్ డిస్ కనెక్టయింది.
రెండో ఫోన్ రింగయింది.
"ఆ కాల్ ఎక్కడ్నుంచి వస్తోందో ట్రేస్ చేశాం మేడం" అంటూ నంబర్ చెప్పాడు.
"ఆ నంబర్ ఎవరిది ?"
"మహావీర్ అనే వ్యక్తి ఆరునెల్ల క్రితం ఎనిమిదివేల రూపాయిలు కత్తి స్పెషల్ కోటా క్రింద తీసుకున్నాడు. ఎడ్రెస్ కూడా చెబుతాను" అంటూ వివరాలు చెప్పాడు.
"ఆ ఫోన్ కార్డ్ లెస్ సిస్టమ్ ద్వారా వైర్ లెస్ కు ఎటాచ్ చెయ్యబడి ఎక్కడ్నుంచయినా మాట్లాడడానికి అవకాశముంటుంది !"
"అఫిషియస్ గా కార్డ్ లెస్ సిస్టానికి పర్మిషన్ తీసుకోలేదు. అనఫిషియల్ గా అవకాశం లేకపోలేదు."
"మీ డిపార్ట్ మెంట్ వాళ్ళు ఫోన్ చెక్ చెయ్యటానికి వెళ్ళినప్పుడు కార్డ్ లెస్ సిస్టమ్ ఎటాచ్ చెయ్యబడి వుంటే తెలీదా ?"
"తెలుస్తుంది! కాని ఈ ఆరునెల్ల పీరియడ్ లో చెక్ చేసేటంతటి అవసరం కలిగి వుండకపోవచ్చు!"
"థ్యాంక్స్" అని ఫోన్ పెట్టేసి హాల్లోకి వచ్చింది.
అవంతి హాల్లో ఒక్కతే కూర్చుని వుంది. ప్రక్కనున్న పేము కుర్చీలో ఆమె హ్యాండ్ బ్యాగ్ వుంది.
"సారీ, మిమ్మల్ని ఒక్కరినే కూచోబెట్టాను" అంటూ హ్యాండ్ బ్యాగ్ తీసి పక్కన బెడుతూ తానా కుర్చీలో ఆసీనురాలు కాబోతుండగా చేతిలోంచి జారి బ్యాగ్ క్రిందపడింది.
"ఏమిటి!" అంది అవంతి ఆ చప్పుడు విని.
"మీ బ్యాగ్ పొరపాటున క్రింద పడేశాను" అని వంగి బ్యాగ్ అందుకుంటూ చప్పున తెరిచి చూసింది. అందులో టెలిఫోన్ లాంటి సాధనమేదీ కనబడలేదు. మళ్ళీ బటన్ నొక్కి అవంతి చేతికందించింది.
* * *
పోలీసులు మహావీర్ యింటి మీదకు రైడ్ చేసేసరికి ఇల్లంతా శూన్యంగా వుంది. ఒక వస్తువు కూడా కనబడలేదు. ఫోన్ కనెక్షనందిగానీ, దానికెటాచ్ చెయ్యబడిన ఏ సిస్టమ్ గానీ లేదు. అసలా యింట్లో మనుషులు నివాసం చేసిన సూచనలే గోచరించలేదు.
* * *
తాను పొరబడుతున్నదా ? అవంతి, ప్రజ్ఞ ఒకరు కారా ? ఈ హత్యాకాండతో అవంతికేమీ సంబంధం లేదా ? తను లోపల గదిలో వున్నప్పుడు కార్డులెస్ ఫోన్ ద్వారా అవంతే తనతో మాట్లాడిందని ఊహించింది తాను. ఎందుకంటే ఎక్కడో దూరాన వున్న వారికి తాను ఉపజ్ఞను కొడుతూన్న సంగతి సెకన్లమీద తెలియడానికి ఆస్కారం లేదు. అందుకే తాను ఇవతలకు రాగానే ఆమె హ్యాండ్ బ్యాగ్ చెక్ చేసింది. అందులో ఏమీ లేదు.
అయినా ఆమెలో అనుమాన ఛాయలు తొలిగిపోవడంలేదు.
ఫ్లాష్ లా ఓ ఆలోచన వచ్చి అవంతి నంబరుకి ఫోన్ డయల్ చేసింది తేజ.
అటునుంచి అవంతి గొంతు 'హలో' అంటూ వినిపించింది.
"ప్రజ్ఞా!" అంది గొంతు మార్చి.
"సారీ రాంగ్ నంబర్" అంటూ అవంతి వెంటనే ఫోన్ పెట్టేసింది.
ఆమె గొంతులో ఎలాంటి తొట్రుపాటూ లేదు.
* * *
ఫ్లాట్ ఫాం మీద నుంచి సర్కార్ ఎక్స్ ప్రెస్ బయల్దేరడానికి సిద్దంగా వుంది. అవధాని చిన్న సూట్ కేస్ తో హడావుడిగా నడుస్తూ ట్రెయిన్ దగ్గరకు వచ్చాడు. కంపార్టుమెంట్ నంబర్లు చూసుకుంటూ ఓ ఫస్ట్ క్లాస్ బోగీ దగ్గర ఆగాడు. తన బినామీ పేరు వెరిఫై చేసుకొని లోపలకి ఎక్కి 'డి' అని రాసివున్న భాగంలోకి వెళ్ళాడు.
లోపల వున్న నాలుగు బెర్తులూ ఖాళీగా వున్నాయి. అవి ఖాళీగానే వుంటాయని ఆ వ్యక్తి ముందుగానే చెప్పాడు.
అవధాని సూట్ కేస్ బెర్తుమీద పెట్టి ప్రక్కన కూర్చున్నాడు. అతని నదులు చెమటలు పడుతున్నాయి.
పోలీస్ డిపార్టుమెంట్ కి చెందిన అనుభవజ్ఞులైన నలుగురు ఆఫీసర్లు, మఫ్టీలో వుండి అతన్ని వాచ్ చేస్తున్నారు. అందులో ఒకరు వైర్ లెస్ లో తేజతో మాట్లాడాడు.
"అతన్ని నీడలా వెంటాడండి. అతని దగ్గరగా ఎవర్నీ పోనివ్వకండి. అనుమానించదగిన మనిషెవరయినా కనిపిస్తే కస్టడీలోకి తీసుకోండి" అని చెప్పింది తేజ.
రైలు బయల్దేరుతూండగా నలుగురు పోలీస్ ఆఫీసర్లూ లోపలికి ఎక్కేశారు.
వాళ్ళ ఐడెంటిటీ చూసేసరికి టి.సి. ఏమీ మాట్లాడలేదు.
రైలు గుంటూరు చేరేవరకూ ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనా జరగలేదు.
పోలీసాఫీసర్లు చాలా జాగ్రత్తగా వాచ్ చేస్తున్నారు.
గుంటూరు స్టేషన్ నుంచి రైలు ఇంకో అయిదు నిమిషాల్లో బయల్దేరుతుందనగా చిన్నారావు హడావుడిగా ఫ్లాట్ ఫాం మీదకొచ్చాడు. కంపార్టుమెంట్ నంబర్లన్నీ చూసుకుంటూ నడుస్తున్నాడు.
ఒక పోలీసాఫీసర్ వెంటనే తేజను కాంటాక్ట్ చేశాడు.
"మేడం! మనం ఎప్పట్నుంచో వెదుకుతూన్న చిన్నారావు కనిపించాడు. ఈ కంపార్టుమెంట్ లోకే వస్తున్నాడు. బహుశా యిద్దరూ వేరు వేరు చోట్ల కలిసి పలాయనమవటానికి ప్లాన్ వేసుకొన్నట్టుగా వుంది. అతని అరెస్ట్ చెయ్యమంటారా ?"
"ఒద్దు. అరెస్టు చేస్తే హంతకుడు వెనక్కి పారిపోతాడు.
"చిన్నారావు అవధానిని కలుసుకుంటే ?"
"కలుసుకోనివ్వండి. ఇద్దర్నీ కలిసి వాచ్ చేస్తూ వుండండి. చాలా మెలకువగా వుండాలి. వీళ్ళిద్దరూ కాకుండా మూడో మనిషెవరయినా వెంటనే అరెస్ట్ చేయండి. క్షణం సంకోచించినా ప్రమాదం ముంచుకొస్తుంది."
|
25,346 |
"నాన్నా! ఇవన్నీ పిచ్చివూహలు. అతడు నిన్ను గుర్తించి వస్తాడా?"
"రాకపోతే పోనీరా!"
"అలా అనకండి. మనం వెళ్ళి యాచిస్తేనే పనులు జరగటం కష్టం. అయినా మీరు మొదటినుంచీ అంతే..."
"ఏం చేశానోయ్?" నవ్వుతూ ప్రశ్నించారు.
"జ్యోతి విషయంలో పక్షపాతంగానే వ్యవహరిస్తున్నారు. ఆమెకి ఇప్పుడు ఉద్యోగం దొరక్కపోతే జరగదని కాదు. ఆమాటకొస్తే ఒక్కో నెలలో జీతం కంటే ఎక్కువే వస్తుంది. కానీ పర్మినెంటు ఉద్యోగం అయితే భద్రత వుంటుంది, గ్యారంటీ వుంటుంది."
"నిజమే కాదనను_ దానికి నేనేం చేయలేను."
"మీకనిపించవచ్చు ఆమె ఆదాయం అంతా తండ్రిగారికే ఇస్తుంది కదాని."
"నేనెప్పుడూ అలా అనుకోలేదు నాయనా కంగారుగా వారించారాయన.
అయినా జానకిరాం వినిపించుకోలేదు.
"ఆ తల్లిదండ్రులిద్దరూ పోయాక అదంతా మనదేకదా! ఆ యిల్లుచాలు_ కొన్ని వేలు చేస్తుంది. అయినా కొడుకయినా కూతురయినా జ్యోతి ఒక్కతే వాళ్ళకి దిక్కు. ఆమె వాళ్ళను ఆదుకోవటం తప్పంటారా?"
"తప్పని నేను అనలేదు_ ఇక ముందు అనబోను. ఆ ఉద్యోగం కోసం అడ్డమైన వాళ్ళ కాళ్ళు పట్టుకోవటం నాకు చేతకాదు" ఖచ్చితంగా అన్నారాయన.
పార్వతి ఏదో అనబోయింది_ కానీ భర్తముఖం చూసి వూరుకుండి పోయింది.
జ్యోతి లేచి నుంచుంది_
"మావయ్యా! మీకు శాస్త్రాలు తెలుసు. ధర్మాలు తెలుసు. అయితే ఏం లాభం? మీకు లౌక్యం తెలియదు" కోపంగా అనేసింది.
"వదినా!" అరిచాడు కోసలరాం.
"మీరు పెద్దవారు. మిమ్మల్నేమీ అనకూడదు_ ఒప్పుకుంటాను. కానీ ఇప్పుడు మాత్రం మీరు చాలా దురుసుగా ప్రవర్తించారు."
"నాకేం నువ్వు చెప్పనక్కర్లేదయ్యా" కోపంగా విదిలించేసింది జ్యోతి.
"కానీ_ కొన్ని కొన్ని సమయాల్లో చెప్పక తప్పదనిపిస్తుంది. నేనూ మీలాగా బి.ఏ. పాసయ్యాను. టైపు షార్టుహాండ్ వచ్చు. ఇంకా ఎధిలెటిక్ క్వాలిఫికేషన్సు వున్నాయి. అయినా నా ఉద్యోగం కోసం నాన్నగారు ఎవర్నీ యాచించలేదు."
"అవకాశం వచ్చినపుడు ప్రయత్నించటంలో తప్పు లేదుగా, అదేదో మహాపరాధమైనట్లు నీవు మీ నాన్నగారు ముఖం గంటు పెట్టుకోవడం దేనికి?"
"ఆత్మాభిమానం చంపుకోలేక. స్వతంత్రంగా బ్రతకమని నన్ను స్టాంపు వెండర్నీ చేశారు. నెలనెలా ఎల్.డి.సి. జీతం వస్తోంది నాకు. చాలు ఇండిపెండింట్ లైఫ్! మీరూ అంతే! ఉన్నదానితో తృప్తిపడక ఆయన్ని హింసిస్తారెందుకు?"
అసహ్యంగా చూసింది జ్యోతి. నీతో నాకేం అన్నట్లు తలెగరేసింది. జానకిరాంకి మండిపోయింది. అతనికి తమ్ముడిని తన్నేయ్యాలన్నంత కోపం వచ్చింది. కానీ తండ్రిముందు అవిధేయతగా ప్రవర్తించటం ఇష్టంలేక వెళ్ళిపోయాడు.
జ్యోతి అతన్ని అనుసరించింది.
"భోజనానికి లేస్తారా?" అంది పార్వతి.
"పద! మన మానసిక వ్యధలతో శరీరాన్నెందుకు కష్టపెట్టాలి" అని లేచారు శాస్త్రిగారు.
అప్పుడే శ్రీవిద్య వచ్చింది.
* * * *
"ఏమ్మా అలా వున్నావ్!" దీనంగా వున్న కూతుర్ని చూసి ప్రశ్నించారు శాస్త్రిగారు.
తండ్రి అంత ఆప్యాయంగా ప్రశ్నించేసరికి ఒక్కసారి ఏడ్చేసింది శ్రీవిద్య.
"ఏమైంది? ఏమైందమ్మా?" కంగారుగా ప్రశ్నించారందరూ.
"మా మాస్టారి చెల్లెలు చనిపోయింది నాన్నా!" వెక్కిళ్ళు పెడుతూ అంది.
నిర్ఘాంతపోయారాయన. "హిమాద్రి చెల్లెలు చనిపోయిందా?" తనలో తనే అనుకున్నారు.
"అవున్నాన్నా! ఎండ్రిన్ తాగి చనిపోయింది. హిమాద్రి మాష్టారు తోటకి స్ప్రే చేయించాలని ఇంట్లో తెచ్చి పెట్టారట, మధ్యాహ్నం నాలుగింటికి తాగేసింది. ఆరుగంటలదాకా కనుక్కోలేదు. పెరట్లో బావిగట్టున చెట్టుక్రింద అరుగుమీద నిద్రపోతోందనుకున్నారు.
"అంతసేపు కనుక్కోకుండా ఏం చేస్తున్నారూ?" పార్వతి నొచ్చుకుంది.
"తీరా కనుక్కోకుండా ఏం చేస్తున్నారూ?" పార్వతి నొచ్చుకుంది.
"తీరా ఇంత పొద్దయిందే అని లేవబోతే ఏముంది? చనిపోయింది తర్వాత ఓ అరగంటకే.
"తులసికేమైంది ఎండ్రిన్ త్రాగటానికి" అడిగాడు కోసలరాం.
"వాళ్ళ మేనత్త కొడుకుతో పెళ్ళి ఖాయం చేశారు. అతనికి బొకారాలో వుద్యోగం వచ్చింది. జాయినై తిరిగి వస్తూ వుంటే కటక్ వద్ద ట్రయిన్ యాక్సిడెంటులో పోయాడతను. వుదయం టెలిగ్రాం వచ్చిందట. మాష్టారుగారు నర్సాపురం వెళ్ళారుట.
పరధ్యానంగా వున్న తులసిని చూసి ఏమో అన్నదట వాళ్ళ వదినగారు. అంతే ఎండ్రిన్ తాగేసింది.
"శివశివా!" అన్నాడు శాస్త్రిగారు.
"అంత చిన్న విషయానికే చనిపోవాలా? ఎంత ధైర్యం చేసింది?" కోసలరాం బాధగా అన్నాడు.
"అసలు దానికి చావంటే భయమో నాన్నా! చనిపోయిన వాళ్ళని చూడటమన్నా, వాళ్ళని గురించి వినటమన్నా ఎంతో భయంతో వణికిపోయేది. అలాంటి పిల్ల ఎలా తెగించిందో ఏమో!" స్వాతికి దుఃఖం ఆగటంలేదు.
"ఏం కాలమో ఏమో! అందరికీ ఇదో తేలిక పనయిపోయింది. కాస్త కష్టం వస్తే చాలు. చావాలనుకోవటమే. దాన్ని ధైర్యం ఎదుర్కొందామానుకున్నారు. చచ్చి ఏం చేస్తారు? బ్రతికుంటే ఏమైనా చేయొచ్చు గాని" విచారంగా అంది పార్వతి.
"వాళ్ళ బావ చనిపోగానే దానికీ జీవితం మీదే విరక్తి పుట్టిందేమో! ఎటూ ఆలోచించకుండా ప్రాణాలు తీసేసుకుంది.
"స్నానం చెయ్యాలమ్మా! నువ్వు వెళ్ళు" అన్నారాయన కూతురితో. ఆమె అదే విషయం తలుచుకుని తలుచుకుని బాధ పడుతుంటే ఆయన భరించలేకపోయారు. |
25,347 | "ఏం జరిగింది డాక్టర్ జానకీ. అమ్మాయికి వాంతులు ఎందుకు అయినాయి?" అతని గొంతు కఠినంగా ధ్వనిస్తోంది.
డాక్టర్ జానకి ఆయన మొహంలోకి చూసింది.
"మీ అమ్మాయి ప్రెగ్నెంట్. అంటే కడుపుతో వుంది."
"ఆయ్...."
చేతిలో విస్కీ నిండి వున్న గ్లాసుని విసిరికొట్టాడు.
అతని దవడ కండరం బిగుసుకుంది. రెండు చేతుల్తో రెయిలింగ్ ని పట్టుకున్నాడు. అతని శరీరం కంపించిపోతోంది.
"నా కూతురికి కడుపా? పెళ్ళి కాకుండానే కడుపా?
తీసెయ్ డాక్టర్!
వెంటనే దాని కడుపుని తుంచి పారేయ్" ఆవేశంతో అరిచాడు బాపినీడు.
డాక్టర్ జానకి ఓ అడుగు కిందికి దిగింది.
"నేను చెప్పాను. కానీ అమ్మాయి వినడం లేదు. బిడ్డని కంటుందట!" అంది డాక్టర్ జానకి.
బాపినీడు పళ్ళు పట పటమని కొరికాడు.
"అది ఒప్పుకునేదేమిటి? నేను చెపుతున్నాను. అబార్షన్ చేసేయి జానకి."
"సారీ! ఆమె అనుమతి లేకుండా నేను చేయలేను."
"డాక్టర్! నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నీ ట్రాన్స్ ఫర్ ఆర్డర్ని క్యాన్సిల్ చేయించి నీ పిల్లల చదువుకి ఆటంకం ఏర్పడకుండా పరోపకారం చేసినవాడిని నేను."
"కాదనడంలేదు. కానీ అబార్షన్ చేయించుకోడానికి ఆమె అనుమతి లేనిదే చేయడానికి చట్టం ఒప్పుకోదు. ఆమెని ఒప్పించి నాకు కబురు చేయండి" అని ఆమె గబగబా వెళ్ళిపోయింది.
బాపినీడు పళ్ళు ఊడిపోయేలా పట పటమని కొరుక్కున్నాడు.
ఒక్కో అడుగు కూడదీసుకుంటూ జయశ్రీ గదికేసి నడిచాడు బాపినీడు.
గుమ్మానికి అడ్డంగా నిలబడ్డాడు.
జయశ్రీ గదిలో కిటికీ దగ్గర నుంచుని బయటికి నిర్వికారంగా చూస్తోంది.
అడుగుల చప్పుడు విని తలతిప్పి భుజం మీదుగా చూసింది తండ్రిని. ఆమె కళ్ళల్లో అప్పటికే నీటితెరలు అలుముకొని వున్నాయి.
బాపినీడుకి ఆవేశం ముంచుకొచ్చింది.
"ఏమే! వాడేనా? ఆ దిక్కుమాలిన రాస్కెల్ గాడేనా?"
చివ్వున వెనక్కి తిరిగింది జయశ్రీ.
"సరిగ్గా మాట్లాడు డాడీ!"
దాంతో మరింత రెచ్చిపోయాడు బాపినీడు.
"నా రాజకీయ చరిత్రకి సమాధి కట్టి, నా బంగారు జీవితంలో నిప్పులు పోసిన ఆ వెధవని 'వెధవగారు' అని పిలవాలటే! నలిపేస్తాను. నల్లిని నలిపేసినట్టు నలిపేస్తాను."
"అతని జోలికి వెళితే నేను సహించను" అంది జయశ్రీ.
"ఓహ్.... కడుపు చేసిన వాడిమీద ఎంత గౌరవం? పెళ్ళి చేసుకుంటానన్నాడా?"
"ఛీ! కన్నకూతురితో కూడా మాట్లాడ్డం చేతకానివాడివి."
"అడిగినదానికి సమాధానం చెప్పు. పెళ్ళి చేసుకోవాలనుకొంటున్నావా?"
"లేదు."
"మరెందుకు పడుకొన్నావు వాడి దగ్గర?"
"నీ ప్రోత్సాహంతోనే!"
"ఆయ్....."
"అరవకు డాడీ! నీ గెలుపుకోసం, నీ పరపతిని కాపాడుకోవడం కోసం నన్ను అతన్ని మచ్చిక చేసుకోమన్నావు. అతనితో తిరగమన్నావు. అతను ముద్దు పెట్టుకున్నా, కౌగలించుకున్నా సరిపెట్టుకోమని చెప్పావు. అప్పుడు లేని సిగ్గు, పోని పరువు ఇప్పుడు పోతున్నాయా నీకు?"
"అవును. ఏది జరిగినా గుట్టుగా జరగాలే తప్ప, గుట్టు రచ్చకెక్కితే ఈ బాపినీడు సహించడు.
నాకు తెలుసు నువ్వు ఆ వెధవ దగ్గర పడుకొన్నావని. కానీ నోరు మూసుకొన్నాను. ఏదీ జరగదులే అని. కానీ దాన్ని బయటపెడుతూ పెరిగే నీ కడుపుని నేను వుండనివ్వను. అందుకే హెచ్చరిస్తున్నాను. ఈ ఇంటి గుట్టు రచ్చకెక్కకముందే కడుపు తీయించుకో."
జయశ్రీ అదోలా నవ్వింది.
"నేనీ గర్భాన్ని మోస్తాను" స్థిరంగా అంది జయశ్రీ.
అంతే..... బాపినీడు ఆమె చెంప ఛెళ్ మని పగిలేలా కొట్టాడు.
అతని చేతివేళ్ళు ఆమె చెంపపైన తేలాయి.
"ఏమే, నీకు మతిగానీ పోయిందా! వాడిని పెళ్ళి చేసుకోనంటావు. వాడు చేసిన కడుపుని తీయించుకోనంటావు?"
"నేను అతన్ని పెళ్లి చేసుకొంటే నీకు అభ్యంతరం లేదా?" చెంపని చేత్తో సవరదీసుకుంటూ అడిగింది.
"ఉంది. చచ్చేంత అభ్యంతరం వుంది. ఆ చెత్తనా కొడుకుని నా అల్లుడిగా ఒప్పుకోను."
"అతనూ ఒప్పుకోడు. కారణం నీకు తెలుసా? హి ఈజ్ సఫరింగ్ విత్ క్యాన్సర్. ఒకవేళ అతనికి ఈ జబ్బు లేకపోయినా కూడా నన్నతను పెళ్ళి చేసుకొనేవాడు కాదు. దానికి కారణం తెలుసా?
అతను వేరే అమ్మాయికి మనసిచ్చాడు. వేరే అమ్మాయిని ప్రేమించినవాడు నన్నెలా తన అనుభవంలోకి తీసుకున్నాడని నువ్వు ప్రశ్నించవచ్చు.
మనిషికి మనిషికీ మధ్య ఎప్పుడే బంధం ఏర్పడుతుందో చెప్పలేం.
అపురూపమయిన మా మధ్య బంధానికి పేరు పెట్టి 'ఇది' అని చెప్పలేను.
అతని వ్యక్తిత్వాన్ని, మానవత్వాన్ని, మంచితనాన్ని నేను ఇష్టపడతాను.
అందుకే నేనతన్ని అభిమానించాను, ప్రేమించాను, ఆరాధించాను. నన్ను నేను కానుకగా అతనికి అర్పించుకున్నాను.
అతనితో సుఖాన్ని పొందినట్టుగానే, అతనివల్ల నా కడుపులో కానీ ఆ దీపం నాకు ప్రసాదించిన వెలుగుని మాత్రం పోగొట్టుకోలేను."
"ఎంత గొప్పగా చెప్పావే ఆ వ్యభిచారి గురించి."
"షటప్!" అని అరిచింది జయశ్రీ.
"ప్రతి మనిషిలోనూ ఓ బలహీనత వుంటుంది మిస్టర్ బాపినీడు.
కానీ అభినయ్ కి మానవత్వముంది......
ధైర్యం వుంది.......
కరుణ వుంది........
జాలి వుంది......
తెగింపు వుంది.......
ప్రేమించే మంచి మనసు వుంది. తోటి మనిషిని ఆదరించి, నిలబెట్టే సహృదయం వుంది. అందుకే అతని పరిస్థితిని చూసి అతన్ని కాపాడుకోవడానికి అతని మిత్రులు, శ్రేయోభిలాషులు ఎలా పాటుపడుతున్నారో చూస్తే అతనేమిటో నీకు తెలుస్తుంది. |
25,348 |
మళ్ళీ మా సుపుత్రుల జాడ తెలియలేదు. వాళ్ళు నాగిని ఇంటికి వస్తున్నారు, వెళ్తున్నారు. మాకు వార్తలు అందుతున్నవి. మనసులు కలక్కుమంటున్నవి! వాళ్ళు మాత్రం మా వీధిముఖం చూడలేదు.
"యది పుత్ర నజాయేథా మమశోకాయరాఘవ
నస్మద్దుఃఖమతో భూయః పశ్యేయ మహమప్రజాః" 2-20-36.
"రామా! నాకు దుఃఖకారకుడవుగా నీవు జన్మించావు. నీవు పుట్టకుంటే నాకీ బాధలు ఉండేవికావు. గొడ్రాలిని అనే బాధ ఒకటే మిగిలేది" అంటుంది కౌసల్య!
కౌసల్యది కన్నీటి బాట. తల్లులందరికీ కౌసల్య బాటయే!
నేను బాధపడ్తానని కమల నిబ్బరంగా ఉన్నట్లు కనిపిస్తుంది. గుండెలో మంటలు దాచుకుంటుంది. పెదవిమీద చిరునవ్వు నటిస్తుంది. నేనూ అంతే! పుత్రేషణ బహు చెడ్డది! అది మనతో పుట్టింది. మనతో పోవాల్సిందే! మంట ఆరినట్లనిపిస్తుంది. అది భ్రమ.
చెడ్డ పుత్రులుంటారు. కాని చెడ్డ తల్లి లోకంలో ఉండదు.
న ఆరోగ్యం అంతంతమాత్రమే! కాలమొక్క రీతి గడపాల్సిందే! 74లో డొక్కా ఆపరేషను అయ్యింది. 86 లో విపరీతం అయిన అజీర్ణం పట్టుకుంది. ఎంతోమంది డాక్టర్లు అయినారు. వారు మందులు ఇవ్వగలరు. నయం చేయలేరు!
అజీర్ణం అలా ఉండగా మూత్రవ్యాధి పట్టుకుంది. మూత్రం సరిగా రాదు. రాత్రికి నిద్ర ఉండదు. డాక్టర్లు చుట్టు తిరగడం - టెస్టులు - మందులు డాక్టర్లు మందులు ఇవ్వగలరు. నయం చేయలేరు!
అజీర్ణం - మూత్ర వ్యాధి ఉండగా - నాకు ఉండిన ఒకే ఒక ఆధారం ధైర్యం - ధైర్యం కోల్పోయాను. మనోవైకల్యం ఏర్పడింది. భయం - ఊరికే ఏడ్పు - ప్రాణం తీసుకోవాలని ఆరాటం!
భగవంతుడు కరుణామయుడు. కమల కల్పించుకున్న ధైర్యం నిలుపుకుంది. మా అన్నయ్య నీడలా మా వెంట ఉన్నాడు. మా అమ్మాయిలు, అల్లుళ్ళు, మా బావమరిది రమణ కుటుంబం, మా చెల్లెలు శకుంతల, ఆఫీసు మిత్రులు దయాశంకర్, నందకుమార్, దకతర్ బుచ్చిలింగం, మరెందరో మిత్రులు అండగా నిలిచారు. వారి రుణం తీరేది కాదు.
అన్నయ్య, నేను, కమల డాక్టర్ ఖాన్ సైక్యాట్రిష్టు దగ్గరికి వెళ్ళాం. అన్నయ్య అన్నీ వివరించాడు. "His sons have to come. There is no other way" అని పంపించాడు. అన్నయ్య నన్ను గురించి అంత బాధ ఎన్నడూ పడలేదు. మా ఉభయులకూ నమ్మకం లేని శని జపాలు - శని పూజలు - శని దానాలూ చేయించాడు!
అన్నయ్య మా మగపిల్లలు ఇద్దరికీ - పరిస్థితి వివరిస్తూ ఉత్తరాలు వ్రాశాడు. టెలిగ్రాములు ఇచ్చాడు. వారికి వార్తలు తెలుసు. ఇక్కడి పుట్టలు అందిస్తూనే ఉన్నాయి! ఇద్దరూ అన్నయ్య ఇంట్లో దిగారు. మామీద విషం కక్కారు. "డాడీ ఇక్కడికి వస్తే మాట్లాడ్తాం. డాడీకి ట్రీట్ మెంట్ ఇప్పిస్తాం. మమ్మీముఖం చూడం. వాళ్ళ గడపతొక్కం" అన్నారని అన్నయ్య వచ్చి ఎంతో బాధగా చెప్పాడు.
"తమ్ముడూ! మరదలు లేకుండా నువ్వు వాళ్ళతో మాట్లాడ్డం నాకు సమ్మతం కాదు. వాళ్ళు ఆకాశంలో విహరిస్తున్నారు. మనం పట్టుకోలేం. మరిచిపో" అన్నాడు. అన్నయ్యమాట కాదనలేం. భరించడానికే నిశ్చయించుకున్నాను. కమల మవునంగా ఉంది. మాట్లాడలేదు.
అన్నయ్య వెళ్ళిపోయాడు. 'ఏవండీ! వాళ్ళకు పనికిరానిది నేనే కదండి, మీరు వెళ్ళండి. వాళ్ళతో మాట్లాడండి. ఒకమార్గం ఏర్పడుతుందేమో?" అన్నది కమల బహు నిబ్బరంగా! ఆ తల్లి ఆశకు నా గుండె చెరువయింది! "కమలా! ఎంత ఆశయే నీకు?" అన్నాను. "మన బిడ్డలు గదండీ!" అంటే నా కన్నీరు నిలువలేదు. ఇద్దరం ఏడ్చాం.
మరుసటిరోజు - కమల మాట కాదనలేక - అన్నయ్య ఇంటికి వెళ్ళాను. వెంట మా చిన్నల్లుడు సురోత్తం వచ్చాడు. విజయ్, విరించి - మేమందరం ఆశ్చర్యపడేటంత - ఆప్యాయంగా మాట్లాడారు. "డాడీ! ఏ కష్టం వచ్చినా ముగ్గురం కలిసి ఎదిరిస్తాం. మేము వచ్చాం. ధైర్యంగా ఉండు" అన్నారు. వాస్తవంగా నాకు కొండంత ధైర్యం వచ్చింది! ఇంటికి వచ్చి కమలకు చెపితే పొంగిపోయింది! ఆడ పిల్లలు ఆనందం పట్టలేక ఏడ్చారు.
మా మగ పిల్లల ప్రత్యేకత ఏమంటే - వాళ్ళు మొత్తం కుటుంబంతో తెగతెంపులు చేసుకున్నారు. వారికి ఇద్దరు అక్కా, చెల్లెళ్ళు - ఇద్దరు బావలు - అప్పటికి ఒక మేనకోడలు, ఒక మేనల్లుడు - నలుగురు మేనమామల కుటుంబాలు - ముగ్గురు మేనత్తల కుటుంబాలు - ఒక పెదనాన్న కుటుంబంతో ఎవరితోనూ సంబంధం లేకుండా పోయింది. ఇంతటి మొనగాళ్ళు ఈ కాలంలో సైతం అరుదు!
25 అక్టోబరు 1986 నాడు మూత్రబాధ కోసం ఆపరేషను నిర్ణయం అయింది. రక్తంలో విపరీతంగా పెరిగిన చక్కెరను కంట్రోలు చేయడానికి ముందుగానే ఆస్పత్రిలో చేర్చుకున్నారు.
24 నాటి రాత్రి విజయ్ ఆస్పత్రిలో నా గదిలో ఉన్నాడు. కమల వచ్చింది. 83 మే తరువాత తొలిసారిగా కొడుకును చూచింది! ఆమెలో ఎన్ని సాగరాలు పొంగి పొర్లాయో! 'నాయనా! బాగున్నావా?' అన్నది. అంతే - విజయ్ మండిపడ్డాడు. కమలను నానామాటలన్నాడు. నాగును - ఉమను ఆమె ఎన్నడో తిట్టినందుకు తల్లిని రాక్షసి - పిశాచి, అన్నాడు లేచి వెళ్ళిపోయాడు.
"నేను ఏమన్నానండీ?" అని కమల నామీద పడి భోరుమన్నది. నా స్థితీ అలాగే ఉంది. డాక్టర్లు చూస్తే ఇద్దరికీ రక్తపు పోటు పెరిగింది. 'రేపు ఆపరేషను - ఇలా అయితే ఎలా?' అని డాక్టర్లు చీవాట్లు పెట్టారు. మందులిచ్చి నిద్రపుచ్చారు.
ఆపరేషను వాడు మా అన్నయ్య నన్ను వెన్నంటి ఉన్నాడు. ఆపరేషను అయింది. థియేటరునుంచి తెస్తున్న నన్ను కమల చూచింది. విరుచుకు పడిపోయింది. డాక్టర్లు ఆమెను గదికి చేర్చారు. ఇంజక్షన్లు వగయిరా నానా తంటాలు పడ్డారు. జనంతో ఆమె గది నిండిపోయింది. విజయ్ - విరించి అటు తొక్కి చూడలేదు!
ఆనాడు ఆసుపత్రి మా బంధుమిత్రులతో నిండిపోయింది. ఒకటి రెండు రోజుల్లో కమల కోలుకుంది. విజయ్ వెళ్ళిపోయాడు. విరించి ఉండిపోయాడు. వాడు కమలతో మాట్లాడితే ఆమె ఎంత పొంగిపోయిందో! విరించి నేను డిశ్చార్జి అయ్యేదాకా ఉన్నాడు. తానే ఆస్పత్రి బిల్లు కట్టాడు. నన్ను ఇంటికి పంపాడు. తాను రాలేదు, వెళ్ళిపోయాడు.
మూత్రవ్యాధి తగ్గింది. డిశ్చార్జి అయిన్నాడు, 30-10-1986 గురువారం రాత్రి మా ఇంట్లో మిత్రులకు - డాక్టర్లకు ఒక పార్టీ ఇచ్చాను. మా అన్నయ్య, మా అల్లుళ్ళు కూడా ఉన్నారు. ఆనాడు మద్యం వదిలేశాను. మళ్ళీ ముట్టలేదు.
మూత్రవ్యాధి ఉపశమనం అయింది. కాని రక్తంలో చక్కర పెరుగుతున్నాది. ఇన్సులిన్ కు కూడా లొంగడం లేదు. ఎంత తిన్నా చాలడం లేదు. ఆకలి ఆరడం లేదు. మానసిక వైకల్యం మరింత పెరిగింది. నిమిషా నిమిషానికీ ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది. టెస్టులు - సైక్యాట్రిస్టులు - ఇతర డాక్టర్లు విధించిన టెస్టులు - చికిత్సలు నిరవధికంగా సాగుతున్నాయి. అన్నయ్య ఎడతెరపి లేకుండా డాక్టర్ల చుట్టు తిరుగుతున్నాడు. కాస్త విషమస్థితిలో 1987 సెప్టెంబరులో ఆస్పత్రిలో చేరాను. డాక్టర్లు నిరంతరం ప్రయత్నిస్తున్నారు.
నాకు ప్రమాదంగా ఉంది. 9-10-87 న విరించి ఆస్పత్రికి వచ్చాడు. నాకు ఎంతో బలం వచ్చినట్లయింది. వాణ్ణి పడకలో కూర్చుండ బెట్టుకుని - చేయి పట్టుకొని "నాన్నా, విరించీ! నా పరిస్థితి అంత బావుండలేదు. ఆఫీసునుంచి సుమారు రెండు లక్షలు వస్తాయి. నలుగురూ సమానంగా పంచుకోండి" అన్నాను.
"డాడీ! నేను ఉమను పెళ్ళిచేసుకుంటాను."
"నాన్నా! నేను నిన్ను వద్దన్నానా?"
"మమ్మీ వద్దంటుంది."
"నువ్వు ఆమెను అడిగావా?"
"మమ్మీ ఉమను తిట్టింది కదా!"
నేను మాట్లాడలేదు. నాకు డిప్రెషన్ పెరిగిపోయింది. మనసు పరిపరివిధాల పోతున్నది. ఎంతో బాధగా ఉంది, చికాకుగా ఉంది, చింతగా ఉంది.
కమల వచ్చింది. నా పరిస్థితి చూచి కలవరపడింది.
"మమ్మీ! నేను ఉమను చేసుకుంటాను."
"నీ ఇష్టం, చేసుకునేది నువ్వు - అనుభవించేది నువ్వు" - చాలా నిబ్బరంగా సమాధానం చెప్పింది కమల.
అందుకే వచ్చినట్లు - ఎవరికో వార్త అందించాల్సినట్లు విరించి దిగ్గున లేచి వెళ్ళిపోయాడు. కమల డాక్టరుకోసం పరిగెత్తింది.
నాలుగు రోజుల్లో డిశ్చార్జి చేశారు. మావెంట విరించికూడా మా ఇంటికి వచ్చాడు!
ఎందరో పెద్ద పెద్ద డాక్టర్ల వల్ల నయం కాలేదు - ఆనాటికి ఒక పిల్ల డాక్టర్ చంద్రశేఖర్ మందుతో ఉపశమనం మొదలయింది. |
25,349 |
దాని మీద 'అఖిల్' అని తన పేరు టైప్ చేసి వుంది నీటుగా.
నీర్జావైపు చూశాడు అతను. ఆమె యింకా ఫోన్లో మాట్లాడుతూనే వుంది.
ఇంతవరకూ అతను నీర్జాని అంత దగ్గర్నుంచి అంత సావకాశంగా ఎప్పుడూ చూడలేదు.
ఆమె మొహంలో ఉన్న ప్రతిరేఖా కూడా 'పొగరు' అనిపించేటంత లెవెల్లో ఉండే ఆమె ఆత్మవిశ్వాసాన్ని ప్రస్పుటం చేస్తోంది. చెప్పలేనంత గ్లామరస్ గా ఉంది నీర్జా. ఆమెది ఒరిజినల్ అందం. దానికి ఎవరో ఎక్స్ పర్ట్ బ్యూటీషియన్ అత్యంత శ్రద్ధాశక్తులతో దిద్దిన మెరుగులు. ఉండవలసిన స్థానంలో లేదు ఆమె పమిట. కొద్దిగా పక్కకి తొలగి ఉంది. స్లీవ్ లెస్ జాకెట్ వేసుకొని వుందామె. అందంగా కనబడుతున్నాయి సన్నగా ఉన్న ఆమె భుజాలు.
నీర్జా మాట్లాడటం పూర్తయ్యింది. ఫోన్ పెట్టేసింది. ఒకసారి పమిట అంతా తీసేసి రెండుచేతులతో పట్టుకుని ఒక్కక్షణం ఆగి మళ్ళీ సరిగ్గా వేసుకుంది.
అప్పుడు చూసింది అఖిల్ వేపు సూటిగా, ఆరోపణగా.
'రోడ్డుమీద ఉన్నవాడిని నిన్ను తీసుకొచ్చి ఫైవ్ స్టార్ హోటల్ లో పడేస్తే కృతజ్ఞత లేకుండా ఆ వెధవలతో నువ్వు కూడా చేరిపోతావా?" అంది.
"రోడ్డుమీద ఉన్నందుకు నేనెప్పుడూ విచారించలేదే!" అన్నాడు అఖిల్ నిదానంగా.
అతన్ని కట్ చేస్తూ అంది నీర్జా_
"అది వదిలెయ్! నీ జీతం ఫిక్స్ చేయలేదనేకదా నీ ఆరాటం!"
"అది ఇంతకుముందు. ఇప్పుడు అందరి డిమాండ్స్ గురించీ ఆరాటపడుతున్నాను నేను" అన్నాడతను.
మాట పూర్తికాకముందే మళ్ళీ అతన్ని కట్ చేసింది నీర్జా.
"నీ జీతం ఫిక్స్ చేశాం. నీకు అరియర్స్ ఎనిమిదివేలు రావాలి. ఈ కవర్ లో పదహారు వేలున్నాయి. అంటే రావలసినదానికి రెట్టింపు. అనవసరమైన గొడవల్లో నువ్వు యిరుక్కోకు. మేనేజ్ మెంట్ పక్షాన ఉన్న వాళ్ళకి ఎప్పుడూ ఏదో ఒక లాభం చూపిస్తూనే వుంటాం. సెల్లార్ లో మీటింగ్ కు వచ్చిన వాళ్ళలో నా మనుషులు కొందరున్నారు. వాళ్ళ ద్వారా ఎప్పటికప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో నాకు తెలిసిపోతూనే ఉంటుంది. నువ్వు చదువుకున్నవాడివి కదా! అందుకని నీకూ మా పక్షాన ఉండే అవకాశం యిస్తున్నా! డోంట్ జాయిన్ హాండ్స్ విత్ దట్ రిఫ్ రాప్! అండర్ స్టాండ్!"
చదువుకున్నవాడిని కాబట్టి చదువుకున్నవాడిలా ప్రవర్తించడం నా ధర్మమనుకుంటాను. 'ఆకలితో ఉంటున్నాం' అన్న వాళ్ళ డిమాండ్ నన్ను కదిలించి వేసింది"
అసహనంగా అంది నీర్జా-
"ఆకలితో వుండేవాళ్ళు అరవై కోట్లమంది ఉన్నారు ఈ దేశంలో! అందర్నీ ఆదుకుంటావా?"
"కొందరినయినా ఆదుకోగలిగితే చాలు"
హటాత్తుగా నీర్జా మొహంలో ఎక్స్ ప్రెషన్ మారిపోయింది. అమ్మ తల్లిలా అయిపోయింది మళ్ళీ.
'మొహానికి కాస్సేపు మాస్క్ పెట్టుకుంది. అది యిప్పుడు జారిపోయింది' అనిపించింది అఖిల్ కి.
ఇంతలో ఇంటర్ కమ్ మోగింది.
"వచ్చారా! లోపలికి రండి" అంది నీర్జా.
మరుక్షణంలో ఎనిమిదిమంది మనుషులు లోపలికి వచ్చారు.
"రండి! ప్లీజ్ బి సీటెడ్" అంది నీర్జా. అంటూనే అఖిల్ తో అంది "నువ్వు లేచి అక్కడ నిలబడు"
కోపాన్ని ఆపుకుంటూ లేచాడతను. ఒక పక్కగా నిలబడ్డాడు. ఆ వచ్చినవాళ్ళు కుర్చీల్లో కూర్చున్నారు.
"ఏర్పాట్లు బాగా సాగిపోతున్నాయా?" అంది నీర్జా వచ్చినవాళ్ళలో ఒకతనితో కుతూహలంగా.
"ఏ వన్ ప్లస్ మేడమ్" అన్నాడతను భరోసా ఇస్తున్నట్లు.
ఆ తర్వాత ఇక అఖిల్ ఉనికిని మర్చిపోయింది నీర్జా.
బయటకు వెళ్ళిపోదామనిపించింది అఖిల్ కి.
కానీ వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు అతన్ని అక్కడే నిలబెట్టేశాయి.
వాళ్ళ సంభాషణ తాలూకు సారాంశం ఏమిటంటే-
నీర్జా తమ్ముడు రాజ్ కుమార్ కి పెళ్ళి సెటిలయింది.
రాజ్ కుమార్ ఢిల్లీకి డాన్. రాజకీయాలలో పైపైకి వచ్చేస్తున్న ప్రామిసింగ్ యంగ్ మాన్.
ఇలాంటి సమర్ధుడు గనుక తన అల్లుడయితే మహారంజుగా ఉంటుందని మోజుపడ్డాడు మెహతా_భారీ హిందీ సినిమాలు తీసే మెగా ప్రొడ్యూసర్.
ఇక్కడ ఒక తమాషా వుంది.
ఒకవేపు సినిమాలు.
ఇంకొకవేపు రాజకీయాలు.
దేశంలో వున్న వ్యాపారాలన్నింటిలోకీ విపరీతమైన గ్లామర్ ఉన్న వ్యాపారాలు ఈ రెండూ!
ఒకానొక వ్యక్తి ఒక సక్సెస్ ఫుల్ డాక్టర్ కావచ్చు, ఒక సక్సెస్ ఫుల్ ఇంజనీరు కావచ్చు, లాయరు కావచ్చు, కాంట్రాక్టరు కావచ్చు, మరేదైనా కావచ్చు.
తన వృత్తి ఏదయినా కూడా అందులో బాగా సంపాదించాక యింక అతని దృష్టి రాజకీయాలవైపు మళ్ళుతుంది.
లేదా సినిమాలవైపన్నా వెళ్తుంది.
సంపాదించిన ఆస్తులు కాపాడుకోడానికి ఇంకా ఆస్తులు సంపాదించుకోవడానికి రాజకీయాలకు మించిన లాభసాటి వ్యాపారం లేదు! లేదు! లేదు!
లేదా సినిమాల్లోకి గనక డబ్బుని మళ్ళిస్తే అంతకుమించిన గ్లామరూ లేదు!
అందుకనే ఇండియాలో అనేకానేక మంది సక్సెస్ ఫుల్ పీపుల్ కి అంతిమ లక్ష్యం రాజకీయాలుగానీ, సినిమా పరిశ్రమగానీ అవుతోంది.
ఇక్కడ మరో విచిత్రం కూడా వుంది.
అది సినిమాలకీ, రాజకీయాలకీ వున్న అవినాభావ సంబంధం! సినిమాలూ, రాజకీయాలూ వ్యాపారాలన్నిటిలో అతి గ్లామరస్, అతి లాభసాటి వ్యాపారాలు కావచ్చు. కానీ సినిమాల్లో వున్నవాళ్ళు రాజకీయాల్లోకి రావాలనుకుంటారు.
అలాగే రాజకీయాల్లో వున్నవాళ్ళు చాలామంది సినిమా రంగంలోకి అడుగు పెట్టాలనుకుంటారు.
రాజుల్లో రారాజుల్లాంటివి ఈ రెండు వ్యాపారాలూ! నిజం!
డాన్ రాజ్ కుమార్ చాలా తెలివైనవాడు.
అతను చిన్నప్పుడే గ్రహించాడు రాజకీయాలని మించిన వ్యాపారం లేదని!
రాజకీయాల్లోకి రావడానికి అతి తేలిక మార్గం రౌడీయిజమే అని కూడా అతను పిన్నవయసులోనే గ్రహించేశాడు.
అందుకే అతను చదువూ గిదువూ అని తన టైం వేస్ట్ చేసుకోలేదు. ఒక ఓల్డ్ డాన్ కి అనుచరుడిగా చేరాడు రాజ్ కుమార్. తర్వాత తనే డాన్ అయ్యాడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడు.
వచ్చినవాళ్ళలో ఒకడు అంటున్నాడు నీర్జాతో-
"మెహతాసాబ్ మెగా ప్రొడ్యూసర్! పెళ్ళిలో కనీసం మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే తప్ప తన ఇమేజ్ కి భంగం అని భావిస్తున్నారు ఆయన. అందుకని పెళ్ళి ఏర్పాట్లు చాలా ఘనంగా చేస్తున్నాం!"
నీర్జా స్మైల్ చేసింది.
"పెళ్ళిలో మేమూ ఒక కోటి ఖర్చు చేయకపోతే మా ఇమేజ్ కూడా దెబ్బతింటుంది కదా!" అని సెక్రటరీ వైపు తిరిగింది.
"మన ఏర్పాట్లేమిటో చెప్పు!" అంది.
సెక్రటరీ గొంతు సవరించుకున్నాడు.
"పెళ్ళికి లక్షలాది మంది గెస్టులు వస్తారు. అందుకని మ్యారేజ్ హాలు కాకుండా ఒక స్టేడియం అద్దెకు తీసుకున్నాం! స్టేడియం మొత్తం పూలతో డెకరేషన్! పూలన్నీ ఫ్లయిట్ లో బెంగుళూరు నుంచి వస్తాయి. స్టేడియంని అంతా ఒక మాయాబజారుగా మార్చేస్తున్నాం. స్టేడియం నిండా షాపులు వుంటాయి. ఒక్కో షాపులో ఒక్కొక్క రకం తినుబండారాలు! ఒక షాపులో జిలేబీలు! ఒక షాపులో బాసుందీ. ఒక షాపులో పళ్ళు. ఒక షాపులో ఐస్ క్రీములూ-అలా ప్రతి డజను షాపులకీ మధ్య ఒక బార్ వుంటుంది. చిరుతిండి యిష్టపడే వాళ్ళకోసం ఛాట్ బజార ఏర్పాటు చేస్తున్నాం. భేల్ పూరీ దగ్గర్నుంచి గప్ చుప్ దాకా అన్నీ వుంటాయి. ఇదిగో! ఇతను ఆ ప్రిపరేషన్స్ లో ఎక్స్ పర్ట్!" అని అఖిల్ వైపు చూపించాడు సెక్రటరీ.
అందరూ అఖిల్ వైపు చూశారు.
సెక్రటరీ మళ్ళీ చెప్పడం మొదలెట్టాడు_
"ఇరవై రకాల బిర్యానీలు-ఇరవై రకాల కూరలు-షాంపేన్ ఫ్రాన్స్ నుంచి వస్తుంది. స్కాచ్ విస్కీ స్కాట్లాండ్ నుంచే! హాలెండ్ బీర్, రష్యన్ ఓడ్కా, గోవా నుంచి ఫెనీ, కావాలనుకున్న వాళ్ళకి కంట్రీలిక్కర్ .... దాదాపు అన్ని పదార్ధాలలో, మద్యాలలో పొడిచేసిన ముత్యాలు కలుపుతాం. పదార్ధాలమీద పల్చటి బంగారురేకు....
"వాటివల్ల రుచి వస్తుందా?" అన్నారెవరో.
"తెలీదు. కానీ ఖరీదు పెరుగుతుంది. తద్వారా మా ఇమేజ్" అన్నాడు సెక్రటరీ.
"ఒక చెట్టు పాతుతాం ఎంట్రన్స్ దగ్గర. దానికి ప్రపంచంలో పండే అన్ని జాతుల పళ్ళూ తెప్పించి వేళ్ళాడదీస్తాం! మేరేజ్ పండాల్ జైపూర్ హవామహల్ పాలెస్ షేపులో కట్టిస్తాం!
దానికే పది లక్షలు ఖర్చవుతుందని అంచనా!
అంతం లేకుండా అలా లిస్టు చదువుకుపోతూనే ఉన్నాడు సెక్రటరీ.
అఖిల్ పిడికిళ్ళు బిగుసుకున్నాయి.
ఎంత దారుణమైన, ఎంత వ్యర్ధమైన ఖర్చు!
అసహనంగా వెయిట్ చేసి వాళ్ళ మాటల మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు అన్నాడు అఖిల్ -
"మరి మా డిమాండ్స్ మాట ఏమిటి?" |
25,350 | గత స్మృతుల మీద తెర తలగిస్తున్నట్టుగా విచలితంగా చూసింది. అపురూప. "నాన్నగారికి చాదస్తం ఎక్కువయినట్టుంది. పరాయివాళ్ళకి ఇంటిగోల ఎందుకు ఏకరువు పెడతారో అర్ధంకావడంలేదు."
"నీ చిన్నతనం, నీ స్నేహితులు -అవేవీ నీకు గుర్తులేదా అప్రూపా?"
"ఉహూఁ ఉప్పెనలా మా మీద విరుచుకుపడ్డ కష్టాల వెల్లువలో ఆనాటి తీపి గుర్తులేవీ మిగలలేదు."
"నిన్ను 'అప్రూపా' అని పిలిచే స్నేహితుడు కూడా?"
"ఉహుఁ"
శిశిర్ నుండి ఒక బలమైన నిట్టూర్పు వెలువడింది.
"నీ చిన్నతనంలో నీతో ఆడుకొన్న స్నేహితుడిని! నీ శిశిర్ ని!" అని చెప్పాలనిపించలేదు. 'నా ఆరాధ్య దేవతవు నువ్వ'ని కూడా చెప్పలేదు.
ప్రతి మనిషికీ బాల్యం ఒక అందమైన స్వప్నం లాంటిది. ఆటలూ, పాటలూ, ఎక్కి దూకిన గోడలూ, దొడ్లూ..... గుర్తుచేసు కొంటున్న కొద్దీ ఏదో చిత్రమైన ప్రేమ పొంగుతూ ఉంటుంది. మళ్ళీ ఆ జీవితం గడపగలిగితే ఎంత బాగుంటుందీ అనిపిస్తుంది. చిన్ననాటి స్నేహితులెవరయినా కనిపిస్తే ప్రాణం లేచివచ్చినట్లుగా అవుతుంది. పసిమనస్సుల్లో పడిన ముద్ర పాలకంటే స్వచ్చమయిందీ, ప్రాణమయినా ఇచ్చి నిలుపుకొనేదీ!
పాపం అపురూప!
ఆ అందమైన స్వప్నాన్నే మరిచిపోయే చేదు జీవితాన్ని అనుభవించింది. చిన్ననాటి గుర్తులన్నీ చెరిగిపోయాయి. 'చిన్ననాడు నీతో ఆడుకున్న శిశిర్ ని' అని చెప్పినా ఆనాటి మధురమైన స్నేహ బాధవ్యాన్ని..... గుర్తు చేసుకొనే స్థితిలోలేదు. మగవాళ్ళని ఆమడ దూరంలో నిలబెట్టే అనుభవాలేవో ఆమె పొంది ఉంటుంది.
చిన్ననాటి స్నేహితుడినని చెప్పుకొని ఆమెను చేరడం ఎంత దుస్సాధ్యమో పాతికేళ్ళ యువకుడిగా ఆమెను చేరడం అంతకంటే దుస్సాధ్యం. ఆమె చుట్టూ లక్ష్మణ రేఖ ఉంది! అది ఆపే గీచుకుంది. బయటి వాళ్ళెవరూ లోనికి అడుగు పెట్టకుండా.
ప్రేమభిక్ష పట్టుకొని ఆమే రావాలి బయటికి!
రప్పించాలి!
రావణునిగా కాదు రాముడిగా?
చీకటి తెరలు వాలుతుండగా చెట్ల మీదికి చేరుతున్న పక్షుల కోలాహలంతో నిండిపోయింది తోట. అక్కడక్కడా ఆకాశంలో చుక్కలు కూడా తళుక్కు మనసాగాయి.
"ఇక నన్ను విడుదల చేస్తారా?"
"అంటే నువ్వు నా బందీగా ఫీలవుతున్నావా?" నొచ్చుకున్నాడు శిశిర్.
"ఒక విధంగా అంతే. మగాళ్ళతో స్నేహాలు, షికార్లు నాకు సరిపడవు. నా మనసుకు నచ్చవిపని ఇప్పుడు చేశావంటే రాత్రి మీరు చేసిన సాయం అంతలోనే మరిచిపోయేది కాదు కాబట్టి!"
"అది సాయమని నువ్వంటే నా మనసు గాయపడుతుంది అప్రూపా! నా అపురూపను రక్షించుకొనే అవకాశం నాకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను" మనసులో సుళ్ళు తిరిగిన మాట ఆమెతో చెప్పలేకపోయాడు శిశిర్.
ఇంటిముందు కారు దిగిన అపురూప "మళ్ళీ మళ్ళీ నన్ను కలవాలని ప్రయత్నించకండి. మీ మీద ఏర్పడిన సద్భావం మీ చేతులతోటే తుడిచేసుకొన్నట్టు అవుతుంది. గుడ్ నైట్ అండ్ గుడ్ బై!" అని, అతడి జవాబు కోసం చూడకుండా చరచరా ఇంట్లోకి వెళ్ళిపోయింది గేటు తెరుచుకొని.
అపురూపను కలుసుకొన్న ఆనందం ఆవిరైపోవడానికి ఎంతో సేపు పట్టలేదు శిశిర్ కు.
అతడి మనసులో ఏదో తెలియని అశాంతి గూడుకట్టుకోసాగింది.
శిశిర్ ఇంటికి వెళ్ళకుండా తిన్నగా ఉషోదయం ఆఫీసుకు వెళ్ళాడు.
పరంజ్యోతి పనులన్నీ చక్కబెట్టుకొని వెళ్ళడానికి తయారవుతున్నాడు.
శిశిర్ ఇచ్చిన విజిటింగ్ కార్డ్ ప్యూన్ నుండి అందుకొని, "లోపలికి రమ్మను!" అన్నాడు.
శిశిర్ వచ్చాడు.
"కూర్చోండి!" అతడికి కుర్చీచూపి తను రిలాక్స్ గా కుర్చీలో వెనక్కి వాలాడు. "చెప్పండి!"
"నిన్న రాత్రి అపురూప నా కారులోనే తలదాచుకొని దుండగుల బారినుండి తప్పించుకొంది"
"అపురూప మీ గురించి చెప్పింది ఇందాక వచ్చినప్పుడు. మెనీమెనీ థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్!"
"నేను వచ్చింది థ్యాంక్స్ చెప్పించుకోవడానికి కాదు! ఆ అమ్మాయి ఎలాంటి ఆపదలో చిక్కు కోబోతోందో ఒకసారి ఆలోచించమని చెప్పడానికి వచ్చాను. ఆమె తీసిన ఫోటోలు, చూసిన సంగతులూ పత్రికలో రాకుండాచూస్తే మంచిది" |
25,351 |
"హాట్ డ్రింక్, ఆర్ కూల్ డ్రింక్" సునంద పక్కనే కూర్చుంటూ అడిగింది రాణి. "నాకిప్పుడేమీ వద్దు." "డోన్ట్ బీ ఫప్సీ." అంతలోనే లక్ష్మి వచ్చి వాకిలిదగ్గర నిలబడింది. "లక్ష్మి! క్వీన్ ఫ్రిజ్ లోనుంచి రెండు గ్లాసులు ద్రాక్షపట్టుకురా!" అన్నది రాణి. "ఏదమ్మా ఆ పెద్ద సద్దిపెట్టెలోంచా!" అడిగింది లక్ష్మి. "నీ బొంద! సద్దిపెట్టేమిటే ఎన్నిసార్లు చెప్పినా.... రెండో ఫ్రిజ్ చిన్నది లేదూ....అందులో వున్నాయ్....కూల్ డ్రింక్స్." లక్ష్మి వెళ్ళగానే రాణి పకపక నవ్వింది. "ఇది వట్టి పల్లెటూరి మనిషి. ఎన్నిసార్లు చెప్పినా ఫ్రిజ్ అనడం రాదు. సద్దిపెట్టె అంటుంది" అన్నది సునందతో రాణి. "పాపం! పల్లెటూరివాళ్ళు! రాత్రి వండుకున్నది తెల్లవారికి దాచుకొని తింటారు" అన్నది సునంద. "అయితే నువ్వెప్పుడన్నా సద్దెన్నం తిన్నావా?" రాణి కుతూహలంగా అడిగింది. "ఓ! చిన్నప్పుడు రోజూ తినేదాన్ని! కాని మా యింట్లో ఈ సద్దిపెట్టె లేదోయ్ రాణీ!" అన్నది సునంద నవ్వుతూ. లక్ష్మి, కూల్ డ్రింక్స్ తెచ్చి టీపాయ్ మీదపెట్టి వెళ్ళింది. "కమాన్ హావ్ ఇట్" అంటూ రాణి కూల్ డ్రింక్ స్విప్ చేస్తూ స్టీల్ బీరువా తెరిచింది. హంగర్స్ కు తగిలించివున్న చీరలు ఒక్కొక్కటే తీసి బెడ్ మీద వెయ్యసాగింది. సునంద మౌనంగా కూల్ డ్రింక్ సిప్ చేస్తూ, చేస్తూ కూర్చుంది. రాణి తన నగలపెట్టెలు తెరిచి ఒక్కొక్కటే సునంద ముందు వుంచింది. పాతకాలపు పట్టెడనుంచి లేటెస్టు డైమండ్ నెక్ లెస్ వరకు వున్నాయి. సునంద రాణి గదంతా కలయజూసింది. డ్రెసింగ్ టేబుల్ మీద అనేకరకాల ఫారెన్ పౌడర్లూ, క్రీములూ, సెంట్లూ వున్నాయి. షెల్ఫ్ లో రకరకాల షేడ్స్ లో కూటెక్సులూ, లిప్ స్టిక్కులూ వున్నాయి. "ఈ రోజు క్లబ్బు ఫంక్షన్ వుంది. ఏ చీర కట్టుకోమంటావో చెప్పు సునందా?" అన్నది రాణి. సునంద అన్ని చీరల్నీ చూసింది. సింపుల్ గా వున్న ఓ గద్వాల చీర చూపించింది. "ఈ కలరూ, అంచూ బాగున్నాయి" అన్నది. "వాట్? ఈ శారీయా? నీది చాలా పూర్ టేస్టు సునందా!" అన్నది. "టేస్టుకు కూడా పూర్, రిచ్ తేడాలుంటాయా? గుడ్ అండ్ బాడ్ లు ఉండొచ్చు. అయినా ఎవరి టేస్ట్స్ వారివి" అన్నది సునంద. "మరి నీకు నచ్చనిచీర ఎందుకు కొన్నావ్?" మళ్లీ సునందే అడిగింది. "అది నేను కొన్నది కాదు. ఎవరో ప్రెజెంట్ చేశారు. ఎక్స్ క్యూజ్ మీ సునందా, నేను ఫైవ్ మినిట్స్ లో వచ్చేస్తాను. ఇవి చూస్తూ వుండు" అంటూ సునంద ముందు ఫెమీనా, స్టార్ డస్టు, ఫిలింఫేర్, ఇలస్ట్రేటెడ్ వీక్లీ పడేసి, టవల్ భుజానవేసుకొని రాణీ బాత్ రూంలోకి వెళ్ళింది. సునంద వీక్లీ తిరగేస్తూ ఆలోచనలో పడింది. రాణి తనను ఇంటికి ఎందుకు ఆహ్వానించినట్టు? తన ఐశ్వర్యాన్నీ ఆడంబరాన్నీ చూపించి తను మామూలు ఆడపిల్లను కానని చాటుకోడానికా? తన అంతస్థూ, కల్చరూ పై తరగతికి చెందినవని నిరూపించుకోవడానికా? సంస్కారానికీ, నాగరికతకూ భేదం తెలియని పిచ్చిపిల్ల. అజ్ఞానం అందించిన అహంకారం ఆమెలో అణువణువునా తొంగి చూస్తూంది. ఇదంతా తన ముందు పనికట్టుకొని ప్రత్యేకంగా ప్రదర్శించాల్సిన అవసరం ఏమిటో? "ఏమిటలాగే కూర్చున్నావ్? టైం అయిపోతుంటేను! లే! లే!" సునంద వీపుమీద అతని చెయ్యి పడింది. సునంద వంగి చదువుతున్న వీక్లీ ఒక్కసారిగా వదిలేసి, చివాలునలేచి నిల్చుంది. తిరిగి చూసింది. సోఫా వెనక నిలబడివున్న శేఖరం నివ్వెరపోయాడు. అతని ముఖం వెల వెల పోయింది. సునంద అతనికేసి తీక్షణంగా చూసి దూరంగా జరిగి నిలబడింది. శేఖరం తలవంచుకొని సోఫా అంచు గోటితో గీరుతూ "శారీ! మా రాణీ అనుకున్నాను!" గొంతు పెకలించుకొని అన్నాడు. ఆమె నుంచి సమాధానం రాకపోయే సరికి తలెత్తి చూశాడు. అంతవరకూ అతన్నే దీక్షగా చూస్తున్న చూపులు కిందకు వాలిపోయాయి. "క్షమించాలి. రాణీ గదిలో మీరున్నట్టు నాకు తెలియదు, తొందరపడ్డాను. పొరపాటు జరిగిపోయింది" నొచ్చుకుంటూ అన్నాడు శేఖరం. "ఇప్పుడు జరిగిపోయిన ప్రమాదం ఏమీ లేదులెండి క్షమించటానికి" సునంద సూటిగా, నిర్మలంగా అన్నది. "థ్యాంక్యూ!" "అయితే ఓ చిన్న సందేహం. మీకు కొంచెం తొందరపాటు వున్నట్టుంది. అవునా?" అన్నది సునంద శేఖరం ముఖంలోకి చూస్తూ. "అంతేకాదు కొంచెం ఉద్రేకం కూడా వుంది" నవ్వుతూ సమాధానం ఇచ్చాడు శేఖరం. "అది అంత మంచిది కాదేమో!" సునంద పెదవుల మీద ఓ క్షణకాలంపాటు హాసరేఖలు కదిలి అదృశ్యమైనాయి. టవల్ చుట్టుకొని బాత్ రూంలోనుంచి వచ్చిన రాణి శేఖరాన్ని చూసి చిలిపిగా కేకపెట్టి, మళ్లీ బాత్ రూంలోకి పరుగుతీసింది. శేఖరం నవ్వుతూ "అదికూడా తొందరపాటే కదండీ?" అని సునంద ముఖంలోకి చూశాడు. "ముందు మీరు బయటికి వెళ్ళండి." "మీరు నన్ను క్షమించినట్టేగదా?" "ప్లీజ్ డూ గో అవుట్!" "థాంక్యూ థాంక్యూ" అంటూ శేఖరం గదినుంచి బయటికి వెళ్ళాడు. "రాణీ! నువ్వు రావచ్చు!" సునంద బాత్ రూం తలుపు తడుతూ పిల్చింది. "వాట్ ఏ సిల్లీబాయ్" అంటూ రాణి బాత్ రూంలోనుంచి బయటికి వచ్చింది. "సునందా వై డోంట్ యూ హావ్ ఏ చేంజ్?" రాణి చీరకట్టుకుంటూ అన్నది. "నేనెందుకు చీర మార్చుకోవడం?" "నువ్వుకూడా మాతో క్లబ్బుకు రావాలి" అన్నది రాణి. "ఏం ఈ చీరతో క్లబ్బుకువస్తే, లోపలికి రానివ్వరా?" అన్నది సునంద. "ఆహాఁ అదికాదు. నీట్ గా డ్రెస్ అయితే బాగుంటుందని. నీ ఇష్టం వచ్చిన చీరకట్టుకో. ఆ గద్వాల్ చీర నీకు నచ్చిందిగా. అదే కట్టుకో. ఈ నెక్ లెస్ పెట్టుకో. ఇది నీకు చాలా బాగుంటుంది" అన్నది రాణి నెక్ లెస్ వున్న పెట్టె సునందకు అందిస్తూ. సునంద అందుకోలేదు. "థాంక్స్. నాకివేమీ వద్దు ఇప్పుడు. నేను త్వరగా హాస్టల్ కు వెళ్ళాలి" అన్నది సునంద నిర్లిప్తంగా. "క్లబ్బుకు రావడంలేదా?" "లేదు." "ఇప్పుడే హాస్టల్ కు వెళ్ళి ఏంచేస్తావ్? ఎప్పుడూ ఆ గదిలోనే వుంటావ్, ఎలా తోస్తుంది బాబూ! ఈ ఒక్కరోజు నాతో రా క్లబ్బుకు" అన్నది రాణి. "సారీ! రాలేను రాణీ!" రాణి ముస్తాబయి సునందతో బయటికి వచ్చింది. గదిముందు చిరాకుపడుతూ వేచివున్న శేఖరం, కళ్ళు చెదిరిపోయేలా అలంకరించుకున్న రాణీని "ఏమిటి నీ వేషం నువ్వూనూ?" అన్నట్టు చూశాడు. వెంటనే అతని కళ్ళు సునందవైపు తిరిగాయి. క్షణం చూసి కళ్ళు మరల్చుకున్నాడు. "నీ కసలు టైంసెన్సులేదు. గంటసేపట్నుంచి డ్రెస్ చేసుకుంటున్నావ్. ఇప్పుడు టైం ఎంతయిండో చూశావా? ఫంక్షన్ బిగిన్ అయే వుంటుంది" అన్నాడు శేఖరం చిరాకుపడుతూ. "ఫంక్షన్ ప్రారంభిస్తే ఇప్పుడు మునిగిపోయిందేమీ లేదులే. నువ్వేమన్నా ప్రారంభోత్సవం చెయ్యాలా ఏమన్నానా?" అన్నది రాణి విసురుగా. "సరేలే! ఇక నడువ్! ఆఁ మీ ఫ్రెండ్ ను పరిచయం చెయ్యలేదేం?" అన్నాడు స్కేహారం సునందకేసి చూస్తూ. " ఆ అవసరం లేదనుకున్నానే!" కొంటెగా అన్నది రాణి. "అంటే?" శేఖరం నొసలు ముడిచాడు. "ఆఁ హా! మీ ఇద్దరూ ఇంతకుముందే పరిచయం చేసుకున్నారనుకున్నానే?" "ఇంతకుముందా? ఎప్పుడు?" తడబడుతూ అన్నాడు శేఖరం. శేఖరం తడబాటు చూస్తుంటే సునందకు నవ్వొచ్చింది. పెదవులు బిగబట్టి నవ్వు ఆపుకుంది. "నేను బాత్ రూంలో వున్నప్పుడు" శేఖరం ప్రశ్నకు ఠపీమని జవాబిచ్చింది రాణి. ఇహ వాళ్ళ సంభాషణ అలా పెరగటం ఇష్టంలేని సునంద "నాపేరు సునంద. రాణి క్లాస్ మేటును" అన్నది. "నాపేరు...." శేఖరం మాటకు అడ్డొచ్చి మాబావ శేఖరం. పోష్టు గ్రాడ్యుయేట్. కావడానికి లిటరేచర్ పోస్టుగ్రాడ్యుయేటే, అయినా అప్పుడప్పుడూ పల్లెటూరికెళ్ళి అగ్రికల్చర్ చేస్తూ వుంటాడు" గబా గబా చెప్పింది రాణి. "మీ బావ వ్యవసాయం చేస్తాడా? చేయిస్తాడా? రాణీ?" అడిగింది సునంద నవ్వుతూ. శేఖరం సునంద ముఖంలోకి చూశాడు. సునంద కళ్ళు మరల్చుకుంది చురుగ్గావున్న అతని చూపుల్ని ఎదుర్కోలేక. |
25,352 |
"కరవ్వు. అదిగో చూడు. పాము కరచినా, తిరిగి ప్రార్థిస్తే అవి విషాన్ని వెనక్కి పీల్చుకుంటాయని ఈ సినిమాలో ఎంత బాగా చెప్తున్నారో.... ఈ సినిమాలో గొప్ప నీతికూడా వుంది గమనించావా?" "ఏమిటి?" "మొగవాడి విషం అతని పెదవుల్లో వుంటుంది. అన్నట్టు ఈ హాల్లో అటూ ఇటూ తిరుగుతున్న పాము సపోజ్ నిన్ను కరిచిందనుకో, పాము కాటుకు ప్రథమచికిత్స తెలుసా?" "లేదు" అంది స్నేహితురాలు భయంగా. "పాము కరవగా వెల్లకిలా పడుకుని నాగదేముణ్ణి ప్రార్థించాలి. అందమైన కుర్రవాడి రూపంలో అతనొచ్చి మనని ముద్దు పెట్టుకుంటాడన్నమాట- అన్నట్టు నువ్వుకూడా కా...ల...క్షే...ప....ం... సంఘం సభ్యురాలివేగా?" "అవును. ఏం?" "ఊరికే మీటింగులు పెట్టి ఊదరగొట్టే బదులు ఈ సినిమాల్ని ప్రభుత్వం బాన్ చేయాలని ఉద్యమం లేవదీయకూడదు? వాళ్ళు వప్పుకోకపోతే ఇలాగే సినిమాహాళ్ళల్లో పాముల్ని రహస్యంగా వదిలితేసరి! రెండుసార్లు పామొచ్చిందని తెలిస్తే పాముల సినిమాకి ఎవరూ రారు. అలాగే బూతుల సినిమాల్ని ప్రతిఘటించదానికి ఇంకో మార్గం ఏమిటంటే...." "సినిమా బోరుకొడ్తూంది వెళ్దామా" కాళ్ళకేసి చూసుకుంటూ స్నేహితురాలు అంది. "మరి అదే కదా నేను చెప్పింది కూడా" అంది విద్యాధరి లేస్తూ. ఇద్దరూ బయటకు వస్తూంటే విద్యాధరి రహస్యం పంచుకుంటున్నట్టు "టైటిల్సప్పుడు ఇలాగే పాకింది. అప్పుడే అడిగాను వెళ్ళిపోదామా అని. నువ్వు వినలేదు" అంది. "నిజమా! అమ్మో. ఎంత గండం తప్పిందో, అదృష్టం బావుంది" అంది గుండెలమీద చేయివేసుకుంటూ. "మీ కాలక్షేపం సంఘంవాళ్ళు అదృష్టాన్ని నమ్మరనుకుంటానే?" "పోన్లే ఇక ఆ సంగతి వదిలిపెట్టు-" రిక్షా పిలుస్తూ అంది. వాళ్ళిద్దరూ రిక్షా మాట్లాడుతూ వుండగా ఒక పోలీసు వాళ్ళ దగ్గరికి వచ్చి "మాడమ్. ఒక నిముషం" అన్నాడు. ఆడవాళ్ళిద్దరూ భయం భయంగా చూసుకున్నారు. "మా కమీషనర్ గారు పిలుస్తున్నారు" అంటూ కారువైపు చూపించాడు. ఇద్దరూ అనుమానంగా అటు వెళ్ళారు. కార్లో వున్న వ్యక్తిని గుర్తుపట్టగానే విద్యాధరి మొహం విప్పారింది. అయన ధర్మారావు. ఇరవై సంవత్సరాల క్రితం యస్సైగా చేసే రోజుల్లో ఇంటికొస్తూ వుండేవాడు. తండ్రికి పరిచయం. కథలూ, ఒకటి రెండు నవలలూ వ్రాశాడు. తండ్రి తాలూకు లంచగొండితనాన్ని ఎదిరించి ఆ గ్రూప్ లోంచి తప్పుకున్న ఇద్దరు ముగ్గురు రచయితల్లో ఆ రోజుల్లో అతనొకడు. ఇప్పుడు కమీషనర్ అయ్యాడన్నమాట. అప్పుడు ఇంటికొస్తే చాక్లెటిచ్చి ఎత్తుకునేవాడు. అంకుల్ అని పిలిచేది. మరి ఇప్పుడు అలా పిలవాలో లేదో తెలీదు. "నువ్వు విద్యాధరివి కదూ" అన్నాడాయన. పక్కనే ఆయన భార్య వుంది. విద్యాధరి తలూపి "అవునంకుల్" అంది అప్రయత్నంగా. "కారెక్కు. ఎక్కడికెళ్ళాలి?" ఆమె చెప్పింది. ఇద్దరూ కారు ఎక్కారు. స్నేహితురాలు జంక్షన్ లో దిగిపోతానంది. "ఎందుకు సినిమా మధ్యలో అలా అరిచారు?" అన్నాడాయన. "ఇంటర్వెల్ లోనే గుర్తుపట్టాను, మీ నాన్న చచ్చిపోయినప్పుడు వచ్చానుగా. పోలికలు గుర్తున్నాయి పలకరిద్దామనుకుంటే అరవటం ప్రారంభించావు. పక్కనెవడో కూర్చున్నాడు. కదూ, నువ్వు అరవటం మొదలు పెట్టగానే జారుకున్నాడు. అంతా గమనిస్తూనే వున్నాన్లే. మా యస్సైని పట్టుకొమ్మని పంపేను. స్టేషన్ కి తీసుకొస్తూ వుంటాడు. అసలేం జరిగింది." విద్యాధరి పూర్తిగా వినలేదు. "అనుదీప్ ని పట్టుకోవటానికి యస్సై వెళ్ళాడు" అతడు చెప్పిన వాక్యం దగ్గరే ఆమె గుండె వేగం హెచ్చింది. లాకప్ లో అనుదీప్....! అసలా ఆలోచనే భరించలేకపోయింది. ఆమె పైకి అలా వుందిగానీ మనసంతా కల్లోల జలపాతంలా వుంది. స్నేహితురాల్తో పాముల మీద జోకులు వేస్తూంది గానీ అనుదీప్ గురించీ, అనుదీప్ భుజం దగ్గర్నుంచీ శూన్యంగా వున్న ప్రదేశం గురించి ఆలోచిస్తూ వుంది. తనేదో సరదాగా అనుకుంది గాని దాని పరిణామం ఇంత ఘోరంగా వుంటుందని ఊహించలేదు. ఆమెకి అతడిమీద కోపం కూడా వచ్చింది. మరోవైపు జాలి. కత్తితో కోసుకుని వుంటాడా? గొడ్డలితో నరికేసుకుని వుంటాడా? లేక రైలు క్రింద భుజంవరకూ పెట్టేసి వుంటాడా? అసలంత బాధ ఎలా భరించి వుంటాడో... తెగిన చెయ్యి.... రక్తపు మడుగు.... ఆమె శరీరం జలదరించింది. సజావుగా సాగిపోతున్న తన జీవితంలోకి తుపానులా ప్రవేశించి అల్లకల్లోలం సృష్టించటం.... అంతవరకూ బాగానే వుంది. థ్రిల్లింగ్ గా కూడా వుంది, కానీ ఈ చెయ్యి తెగ్గొట్టుకోవటం.... ధర్మారావు ఆమె ఆలోచనలో వుండటం చూసి చెప్పటానికి ఆమె తటపటాయిస్తుందని గ్రహించాడు. ఈ లోపులో స్నేహితురాలు జంక్షన్ లో దిగిపోయింది. "విద్యాధరపురంలో ఎవరితో వుంటున్నావు?" అడిగాడు. ఆమె తల్లి చిన్నప్పుడే చచ్చిపోయిందని ఆయనకి తెలుసు. "ఒక్కదాన్నే.... రూమ్ లో." "అయితే ఇప్పుడెందుకమ్మా గదికి? మా ఇంటికిరా. భోజనంచేసి వెళ్దూగాని-" అప్పటివరకూ నిశ్శబ్దంగా వున్న కమీషనర్ భార్య అంది. నిజానికి విద్యాధరికి గదికి వెళ్ళాలని లేదు. ఈ రాత్రికి అనుదీప్ ఆలోచన్లతో నిద్రపట్టదు. ఒంటరితనం మరింత బాధాకరం. ఆమె మౌనం వహించటం చూసి కమీషనర్ డ్రైవర్ కి చెప్పాడు. కారు ఇంటివైపు మళ్ళింది. ధర్మారావుకి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. ఒక కొడుకు, కూతురు ఇంజనీరింగ్ చదువుతున్నారు. మరొకతను బి.యస్సీ. ముగ్గురూ ఇంట్లోనే వున్నారు. విద్యని స్నేహపూరితంగా ఆహ్వానించారు. రెండు నిముషాల్లో వారిలో కలిసిపోయింది ఆమె. ఆ కుంటుంబాన్ని చూస్తుంటే ఎంతో ముచ్చటగా అనిపించింది. పిల్లలందరూ విచ్చిన గులాబీల్లా ఫ్రెష్ గా వున్నారు. మగపిల్లలు విద్యని అక్కలాగే చూసుకున్నారు. కృతిమత్వం-ట్రాప్ చెయ్యటం కోసం కన్విన్సింగ్ గా మాట్లాడటం-ఇలాంటివేమీ లేవు. అన్నిటికన్నా ఎక్కువగా ఆ కుటుంబ సభ్యుల మధ్య పెనవేసుకున్న ఫ్రెండ్ షిప్ ఆమెకి అపురూపంగా తోచింది. తల్లిదండ్రులు బ్రతికున్న రోజుల్లో ఏ ఒక్కరోజు కూడా ఇలాంటి "దినం" తమ ఇంట్లో లేదు. ధర్మారావు అన్నాడు- "మీ నాన్నా నేనూ ఒకప్పుడు చాలా మంచి స్నేహితులమమ్మాయ్. ఆ రోజుల్లో నేను కథలు వ్రాసేవాడిని." "తెలుసు" అంది విద్యాధరి నవ్వి. ఆమెకి ఆయన చెప్పని విషయాలు కూడా చాలా తెలుసు. భోజనాలు పూర్తయ్యాయి. "మా యస్సై ఇంకా ఫోన్ చెయ్యలేదు ఎందుకో.... ?" సాలోచనగా అన్నాడు. అప్పుడప్పుడే సర్దుకుంటున్న ఆమె మనస్సు మళ్ళీ విచలితమైంది. అనుదీప్ ని ఈపాటికి లాకప్ లో పెట్టి వుంటారు. "నా పక్కన కూర్చున్న అబ్బాయి తప్పేమీ లేదంకుల్" అంది తొందర తొందరగా. ఆయన విస్మయంగా చూసి, "మరెందుకు అరిచావు?" అన్నాడు. పాము తాలూకు కథ చెప్పింది. ఆయన అంతా విని నవ్వేసి, "చూడమ్మాయ్! నా పోలీసు అనుభవంలో అబద్ధాలు చెప్పేవాళ్ళని కనీసం లక్షమందిని చూసి వుంటాను. అసలు జరిగిందేమిటో చెప్పు" అన్నాడు. విద్యాధరి సిగ్గుపడింది. పిల్లలూ, ఆయన భార్యా కుతూహలంతో చూస్తున్నారు. ఆమె ముందు కొద్దిగా ప్రారంభించింది. తరువాత అది ఆగలేదు. ఈ విషయాలన్నీ ఎవరికైనా చెప్పాలన్న కోర్కె ఆమె మనసులో ఎంతగా వున్నదీ తల్చుకుంటే ఆమెకే ఆశ్చర్యం అనిపించింది. ఒక మనిషి తన అనుభవాల్నీ ఆలోచన్లని మరో మనిషితో పంచుకోవాలన్న తాపత్రయమే హ్యూమన్ రిలేషన్స్ కి పునాది కాబోలు. తన శరీరంమీద అతడు ప్రేమలేఖ వ్రాయటం మినహా- మిగతా అంతా చెప్పింది. ఏడు సంవత్సరాల క్రితం తనని చూడటం, తపస్సుకి వెళ్ళటం వగైరా.... పిల్లలు అద్భుతమైన థ్రిల్లర్ సినిమాని చూస్తున్నట్టు ఆమె చెప్పినదంతా విన్నారు. ఆమె చెప్పటం పూర్తి అవుతూ వుండగా ఫోన్ మ్రోగింది. కమీషనర్ లేచి పక్కగదిలోకి వెళ్ళాడు. కుర్రవాళ్ళు ఇంకా ఆ అనుభూతి నుంచి తేరుకోలేదు. "ఇదంతా నేను నమ్మలేను. ఇంపాజిబుల్" అన్నాడు ఇంజనీరింగ్ చదువుతున్న కుర్రవాడు. "నిజంగా అతడి చెయ్యి భుజం దగ్గిర్నుంచీ లేదా అక్కా?" అడిగాడు రెండోవాడు. విద్యాధరి తలూపింది. తనతోపాటూ ఈ అనుభవాన్ని వాళ్ళు పంచుకోవటం ఆమెకి రిలీఫ్ గా వుంది. "అబ్బ నిజంగా అంత అలా ప్రేమించే వాళ్ళుంటారా?" తనలో అనుకోబోయి పైకి అని, మళ్ళీ తల్లి తన మాటలు విన్నదేమో అని భయంగా చూసింది కమీషనర్ గారి అమ్మాయి. "నేను అమ్మాయినైతే అలాటి వాడికోసం ప్రాణాలైనా ఇచ్చేసి వుండేవాడిని" గర్వంగా అన్నాడు రెండోవాడు. "ఊరికే కబుర్లు" వెక్కిరించింది చెల్లెలు. తల్లి వాళ్ళని మందలిస్తూ "ఈ వయసులో ఏమిట్రా ఆ మాటలు" అంది. పిల్లలు ముసిముసిగా నవ్వుకున్నారు వాళ్ళలో వాళ్ళే. ఈ లోపులో కమీషనర్ ఆ గదిలోకి వస్తూ "ఇంకెక్కడి నుంచో ఫోను. మా యస్సై కాదు-" అని వచ్చి కూర్చుంటూ, "అయితే వాడు నీ గురించి చెయ్యి తెగ్గోసుకున్నాడంటావ్?" అన్నాడు. "అవునంకుల్, కళ్ళారా చూశాను." ఆయన నవ్వేడు. "మెస్మరిజం అన్నమాట ఎప్పుడన్నా విన్నావా? దాని అర్థం తెలుసా?" "పేరు చాలాసార్లు విన్నాను, అర్థం సరీగ్గా తెలీదు." "మ్యాజిక్ హిప్నాటిజం- ఈ రెండింటికన్నా ఒక మెట్టుపైది. మనదేశంలో మెస్మరిస్టులు చాలా తక్కువ. వేళ్ళమీద లెక్క పెట్టవచ్చు. ఇదొక అద్భుతమైన కళ కాబట్టి, దాంతో ఎన్నో అద్భుతాలు చెయ్యవచ్చు. కాబట్టి మెస్మరిస్టులందరూ దాదాపు బాబాలుగా తయారయ్యారు. అవతలివాళ్ళ మనసుని చాలా సులభంగా వశీకరణలోకి తెచ్చుకుంటారు. అంగీలోంచి శివలింగం తీసినా గాలిలోంచే సృష్టించినట్లు మనకి భ్రమ కలుగుతుంది. అంతలా మనసుని కంట్రోలు చేస్తారన్నమాట. ఈ కోణంనుంచి - ఇప్పటివరకూ జరిగిన సంఘటనలన్నీ ఆలోచించు. నీకే బోధపడుతుంది." ఆమె అనుమానాలన్నీ ఒక్కసారిగా మంచు విడిపోయినట్టు విడిపోయాయి. తన శరీరంమీద అక్షరాలు వ్రాయలేదు అతడు. కేవలం అవి వున్నట్టు తనకి భ్రమ కలిగించాడంతే. అలాగే తన బ్యాగ్ లోంచి పువ్వు తీయటం.... చక్రధర్ కి ఫోటో చూపించటం.... అంతా తన భ్రమే. ఆమెకి వళ్ళు మండిపోసాగింది. తనని అతడు ఇంత బాగా ఫూల్ ని చేస్తాడనుకోలేదు. మూర్ఖురాలిలాగా అతడు చెప్పేసిందంతా నమ్మేసింది. ఏడు సంవత్సరాలు తపస్సు చేశానంటే నిజమేనేమో, అనుకుంది. |
25,353 | "ఇంతవరకు నువు అవతారం చెప్పింది విన్నావు. అవతారం దృష్టిలో శేషయ్య పరమ దుర్మార్గుడు. కాని శేషయ్య చెప్పేది ఇందుకు భిన్నంగా ఉండాలి--ఉంటుంది" "మరి శేషయ్య..." పరశురాం చిరునవ్వు నవ్వాడు. చేతిగడియారం కేసిచూశాడు. అవతారం ముఖంలోకి చూశాడు. అతడు ప్రశాంతంగా నిద్రలో ఉన్నాడు. "అవతారం?" అవతారం పలకలేదు. "అవతారం" లాలనగా పిల్చాడు పరశురాం అతనుపడుకొని ఉన్న మంచంమీదకువంగి. "ఊ(" "నువు ఇంకేమయినా చెప్తావా?" "లేదు. అయిపోయింది" "ఇక నువ్వెళ్ళిపోతావా?" "ఊ(హూ!" "లేదు. నువువెళ్ళిపోవాలి. మళ్ళీకలుస్తాగా!" "ఆ శేషయ్యగాడు వస్తానన్నాడా?" కసిగా అడిగాడు. "అవును" "వాడి మాటలు నమ్మి నన్ను..." "లేదు అవతారం నాకు ఆ శేషయ్య సంగతి తెలియనిదా ఏం? ఇక నువెళ్ళిపో" "సరే! వాడు వెళ్ళిపోయాక మళ్ళీ నన్నుపిలవాలి" మహతి కళ్ళు మూసుకొని పడుకొని మాట్లాడుతున్న శేషావతారాన్ని, అతనితోమాట్లాడుతున్న పరశురాం నూ మార్చి మార్చి చూడసాగింది. అవతారం వెళ్ళిపోతాడా? ఆ వెంటనే అంకుల్ పిలవగానే శేషయ్య వస్తాడా? ఏమిటో అంతా గందరగోళంగా వుంది. మహతికి జుట్టుపీక్కోవాలనిపించింది. "అవతారం వెళ్ళిపో వెళ్ళిపోతున్నావు, వెళ్ళిపోయావు. వెళ్ళిపోయావు." అని రెండు నిముషాలు ఆగి "శేషయ్యా? శేషయ్యా! "పిల్చాడు ప్రొఫెసర్ పరశురాం. మంచంమీద వ్యక్తిని కుతూహలంగా చూస్తూ వుంది మహతి. "శేషయ్యా!" "ఊ(" "నువ్వప్పుడు గాఢనిద్రలో వున్నావు--గాఢనిద్రలో ఉన్నావు--నా గొంతు వింటున్నావు--నా ప్రశ్నలకు సమాధానం చెబుతావు----నీపరిస్థితి ఇంతదీనంగా కావడానికి ఎవరు కారణం!" "ఇంకెవరు, ఆ శంకరయ్యగాడు!" దూకుడుగా అన్నాడు శేషయ్య. "శంకరయ్యెవరు?" "ఇంకెవడూ, నా బామ్మర్ది. సయానా మా ఇంటిదాని అన్నదమ్ముడు. వాడేనా కొంప దీశాడు. నన్ను నట్టేట్లో ముంచాడు" లబలబలాడుతూ చెబుతున్నవాడు ఒక్కసారిగా ఆగిపోయాడు. "చెప్పు శేషయ్యా! పూర్తికధ చెప్పు"
"ఆ దుర్మార్గుడు నా కొంపనిలువునా కూల్చాడు. నా నడుం విరగ్గొట్టాడు మళ్ళీ లేవకుండా. నన్ను దొంగనోట్ల వ్యాపారంలోకి దించాడు. ఎన్నో ఆశలు చూపించాడు. నమ్మించాడు. ఒక పట్టాన నేను నమ్మలేదు. ఎట్టయితే ఏం చివరకు నమ్మించాడు. బ్యాంకులో ఇల్లు హామీ వుంచి నాలుగు లక్షలు అప్పుతీసుకున్నాను. ఆ నాలుగు లక్షలూ నలభై లక్షల దొంగనోట్లు ఇచ్చి తీసుకెళ్ళడానికి శంకరయ్య నలుగుర్ని వెంటేసుకుని వచ్చాడు. డబ్బు మార్చుకుంటున్నాం. ఇంకా నోట్ల కట్టలు లెక్క పెట్టడం కానేలేదు. ఇంతలోవచ్చిపడ్డారు" ఆగిపోయాడు శేషయ్య. "ఎవరొచ్చారు?" "ఇంకెవరు? పోలీసులు మొత్తం డబ్బుగుంజుకెళ్ళారు" "పోలీసులకు ఎవరు ఇన్ ఫర్ మేషన్ ఇచ్చివుంటారంటావ్?" "అసలు వాళ్ళు పోలీసులేకారు" "మరి?" "అప్పుడు నాకు తెలియదు. పోలీసులానే అనుకున్నాను అందుకే భయంతో దొంగకు తేలు కుట్టినట్టుగా ఉండిపోయాను" "ఇంతకూ వాళ్ళెవరు?" "ఇంకెవరు? ఆ శంకరంగాడి మనుష్యులు". "శంకరంగాడి మనుషులా? అంటే?" "వాడే ఈ నాటకం ఆడాడు. తన వాళ్ళకే పోలీసుల వేషం వేయించి రప్పించాడు. ఆ సంగతులు నాకు ఆ తర్వాత ఎప్పటికోగాని తెలియలేదు. ఇల్లుమీద పెద్దగా ఆదా లేదు. అది ఖర్చులకూ, బ్యాంకులో తెచ్చిన అప్పు తాలూకు వడ్డీకి సరిపోయేది కాదు. వడ్డీ పెరిగిపోసాగింది. కొంపా గోడూ అమ్మికట్టినా ఇంకా బ్యాంకులో అసలు అలాగే వుండిపోయింది. చివరకు ఇల్లును బ్యాంకు అధికారులు సాధీనం చేసుకున్నారు. మా బామ్మర్ధి ఆ శంకరంగాడేనా ఇల్లు నిలువునాకూల్చాడు." "ఇక చాలుగాని కొంచెంసేపు నిద్రపో" అని పరశురాం ఒకనిముషం మౌనంగా వున్నాడు. పది నిముషాలాగి అతడ్ని నిద్ర లేపాడు. "ఇదుగో ఈ మందులువాడు" చీటీ రాసిఇచ్చాడు డాక్టర్. శేషావతారం మంచందిగాడు. చీటీ తీసుకుని డాక్టరుకు నమస్కరించి బయటకు వెళ్ళాడు. మహతి అతనిముఖంలో అంతకుముందులేని ఏదో ప్రశాంతతను చూసింది. "అంకుల్ అయితే ఇప్పుడు వెళ్ళిపోయింది ఎవరూ?" ప్రొఫెసర్ పరశురాం మహతి ముఖంలోకి చూస్తూ "శేషయ్య" అన్నాడు "మీకెలా తెలిసింది అంకుల్?" "నేను శేషయ్యతో మాట్లాడాను. వెంటనేలేపాను. శేషయ్య నిద్ర లేచాడు" "ఏమిటో అంకుల్, ఇదంతా చూస్తుంటే నాకు మతిపోయేలాగుంది" ప్రొఫెసర్ ఆమెకేసి సానుభూతిగా చూశాడు. "బేబీ! నువేడీలా పడిపోతే ఎలా?" భుజంమీదతట్టాడు. "అంకుల్" "ఏమ్మా" "నాకు ఈ కేసు కొంచెం వివరంగా చెబుతారా?"
"అలాగే" పరశురాం పైపులోకి పొగాకు దట్టిస్తూ ఆలోచిస్తున్నాడు. మహతి కుతూహలంగా అతని ముఖంలోకి చూస్తూండిపోయింది. ప్రొఫెసర్ చెప్పసాగాడు. "విన్నావుగా మహతీ?" ఏదో ఆలోచిస్తున్నమహతి తలెత్తి చూసింది. "ఏమిటి అంకుల్?" యధాలాపంగానే అన్నది. "నువేదో ఆలోచిస్తున్నావు. ఇప్పుడొద్దులే మరోసారి చెప్తాను" "వింటున్నాను చెప్పండి అంకుల్" "అతని పేరు అసలు----" "శేషయ్య...." మధ్యలోనే అందుకొని అంది మహతి, తను అతని మాటల్ని శ్రద్దగా వింటున్నట్టు తెలియజేయటానికి. "కాదు" "అవతారం" "కాదు" "సారీ శేషావతారం అతని పర్సనాలిటీ స్ప్లిట్ అయింది" "గుడ్! తర్వాత! ఎనలైజ్ చెయ్యగలవా అలా ఎందుకయిందో?" మహతి కొంచెంసేపు దీర్ఘంగా ఆలోచించింది. "మీరు చెప్పండి అంకుల్" అంది. "రామచంద్రయ్యకు అన్యాయం చేశాననే బాధ అతన్ని కలవరపెడుతోంది. అంతరాంతరాలలో ఆ బాధ గూడు కట్టుకుంది. మంగమ్మా, ఆమె పిల్లలచావుతో ఆ బాధ ఇనుమడించింది. మర్చిపోవాలనే ప్రయత్నం చేసినా మర్చిపోలేక పోయాడు" "అంకుల్, అడ్డం వచ్చినందుకు క్షమించండి. ఏదయినా తప్పుచేసి ఆ తర్వాత పశ్చాత్తాపపడటం మానవసహజం. అంతమాత్రానికే పర్సనాలిటీ స్ప్లిట్ అవుతుందా అంకుల్?" |
25,354 | శ్రీకారంకి ఏం చేయాలో తెలియలేదు. కోపంతో పళ్ళు పటపటలాడించాడు. "ఏదీ మరోసారి చెప్పు!" అన్నాడు.
"ఫైల్ నెం. వన్ లో మూడో కాలం, ఫైల్ నెం. టూ లో నాలుగో కాలం. వకసారి విన్నది ఒకసారి చూసింది నేను జన్మలో మర్చిపోను. అయినా మూడో కాలం నాలుగో కాలం అంటూ నా ప్రాణం తీస్తారేమిటి? కలికాలంలో ఇదో భాగమా?" వళ్ళు మండి వ్యంగ్యంగా అన్నది.
శ్రీకారం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తల తాటించాడు.
"ఓకే ఇహ నీతో మా పని అయిపోయింది. కరుస్తాం అంటే ఇంక నీ పని అయిపోయిందని అర్ధమన్నమాట. కరిచేముందు విషయం చెబుతాను. మావాళ్ళు వెళ్ళేసరికి-
ఆ ఇంటిమీద ఎవరికీ అనుమానం కలగలేదు. జాస్మిన్ శవం నీవు చెప్పిన చోటే పడివుంది. మావాళ్ళు అంగుళం అంగుళం గాలించారు. మాకు కావల్సింది అనగా నీవు చెప్పిన మూడోకాలం నాలుగోకాలం విషయం దొరకలేదు. ఆ ఇంటిని అగ్నికి ఆహుతి చేసివచ్చారు. కాలం అనేది అతి ముఖ్యమైంది కాబట్టి దాని విషయం నీకు తెలిసే దాస్తున్నావని మా గాడాభిప్రాయం. చావగొట్టి చెవులు మూసినా చెప్పేటట్లు లేవు. అందుకే ఇహ కరవటానికి నిశ్చయించుకున్నాను. చాలా ఈ సమాచారం?" మరింత వ్యంగ్యంగా అన్నాడు శ్రీకారం.
"బాస్" బన్నీ పిలిచింది.
"ఏమిటి? దీన్ని చంపే ఛాన్స్ నీ కిమ్మంటావా?" కోటు జేబులోంచి రివాల్వర్ తీస్తూ అడిగాడు శ్రీకారం.
"లేదు బాస్! నాదోమాట. ఈ పిల్లకి వాటి విషయం తెలుసుననుకుందాం. అలా తెలిసివుంటే ఈ మాటలు మోసుకొచ్చి మనకి చెప్పేది కాదు కదా! అటునుంచి అటే వుడాయించేది. నా అభిప్రాయం కరెక్టు కాదంటారా!"
బన్నీ వేపు కృతజ్ఞతా పూర్వకంగా చూసింది నందితాదేవి.
"ఎస్! నువ్వు చెప్పింది సెంట్ పర్సెంట్ కరెక్టు అనుకుందాం. అయినా తిండి దండగ. దీన్ని మేపటం దండగ. కరిచేద్దాం. ఆ పని నేను చేయనా. నీవు చేస్తావా!"
ఆమె భగవంతుడి మీద భారం వేసి గట్టిగా కళ్ళు మూసుకుంది.
"మీరే కరి చేయండి" బన్నీ అంది- కూరలోకి కరేపాకు తీసుకురండి అన్నంత తేలికగా.
"నా చావు వీడిచేతిలో రాసిపెట్టివుంది---" ఆమె ఆ మాట పూర్తిగా అనుకోలేదు.
సరీగా అప్పుడే వకతను గదిలో వచ్చాడు- "బాస్! ముఖ్యమైన సమాచారం" అంటూ. అతని పేరు పాండే.
"ఏమిటి?"
"యిబా సంగతి కొంతవరకూ తెలుసుకువచ్చాను"
అని పాండే నందితాదేవివి చూశాడు "అరె ఈమెని ఎక్కడో చూశాను" అంటూ ఆలోచనలో పడ్డాడు.
"గుడ్! కొంతవరకూ "యిబా" ముఠాగురించి తెలుసుకు వచ్చావన్నమాట. ముందు దీని సంగతి చూసి "యిబా" గురించి చర్చిద్దాము. బాగా గుర్తు తెచ్చుకో పాండే ఇది ఓ ముఖ్యవిషయం సగమే మనకి అందించింది. అందుకే ఇంక కరవబోతున్నాను. నీవు వచ్చావు! ఇది ఎవతంటావ్?" శ్రీకారం గెడకర్రలా ఏమాత్రం కదలకుండా నుంచుని తమ మామూలు ధోరణిలో అడిగాడు.
పాండే "ఇప్పుడే వస్తానని అవతలి గదిలోకి వెళ్ళి కొద్ది నిమిషాలలో పేపరు పుచ్చుకుని వచ్చాడు. "ఇది చదవండి చూడండి" అంటూ శ్రీకారం పేపరు అందించాడు.
శ్రీకారం పైకి చదివాడు.
ఆమె జరిగేదంతా వింటూ చూస్తూ కళ్ళప్పజెప్పి అలా వుండిపోయింది.
"ఓహ్! నందితాదేవి నీ పేరు కరెక్టుగానే చెప్పావ్. కాపోతే నాటకాల్లో వేషాలు వేసేదాన్ని అన్నమాట మాత్రం అబద్ధం అన్నమాట! గోపాలరావు మీ పెదనాన్న అన్నమాట. నీ ఫోటో ఈ పేపరులో చూసి..."
"అది నా ఫోటో కాదు. నా ఫోటోలు లేవు" ఆమె అంది. |
25,355 | పాఠకులతో
పది నిముషాలు
కొన్ని సంఘటనలు ఆశతోను మరికొన్ని సంఘటనలు పేరాశతోను కొన్ని వింతగాను...... విచిత్రంగాను......జరిగి.....అనుకోకుండా ఆపదల పాలవుతుంటారు మానవులు.
గతంలో.....
యదార్ధంగా జరిగిన అరవందాళ్ హత్యకేసులో కూడా (భార్యా, భర్త, ప్రియుడు) భర్త ఆమె ప్రియుడిని హత్యచేసి శవాన్ని పెట్టెలో పెట్టి ట్రైన్ లో ఎక్కించటం జరిగింది. ఆ శవం (పెట్టెలో) కొంత దూరం ప్రయాణించటం. ఆ పెట్టెనుంచి దుర్వాసన రావటంతో ప్రయాణీకులు గమనించి కంప్లెయింట్ ఇవ్వటం....ఆ తర్వాత తీగలాగగా డొంకంతా కదలటం జరిగింది. పెట్టె ఎక్కడ కొన్నది, హత్యా యుధం ఎక్కడా కొన్నది, ఎలా ప్లాన్ వేసి అతడిని హత్యచేసింది. ఆపై పెట్టెలో పెట్టి రైలుఎక్కించింది.....అన్నీ బయట పడటం....ఆ భార్యాభర్తలకి శిక్షపడటం కూడా జరిగింది.
అరవందాళ్ హత్యకేసు కోర్టులో చాలారోజులు నడిచింది. ఓ ప్రముఖ దినపత్రిక ఆ కేసుని కోర్టులో వాదనతో సహా ప్రచురించి పాఠకులకు థ్రిల్లింగ్ మేటర్ అందించింది.
ఈకేసు జరిగినప్పుడు నాకు తొమ్మిదోఏడో పదోఏడో సరీగా గుర్తులేదు. అరవందాళ్ హత్యకేసు మాత్రం కళ్ళకు కట్టినట్లు యీనాటికీ గుర్తువుంది.
1986 ఫిబ్రవరి లేక మార్చి అనుకుంటాను. ఉదయం దినపత్రిక గుంటూరు ఎడిషన్ లో ఫ్రంట్ పేజీలో ఫోటోలతో సహా ప్రచురణ అయినా ఓ హత్య తాలూకా కథా కమామీషు చదివి ఆ సంఘటన మనసులో అదేపనిగా మెదుల్తుండగా ఈ నవలకి (పెట్టె తీసిచూడు) ప్లాటు తట్టింది. ఆ వెంటనే నవలరాశాను.
ఓ ట్రంకుపెట్టెలో శవంతాలూకా బాడీని గుడ్డలో చుట్టేసి పెట్టారు. దానిపై చింతపండు కుక్కి ఆపై బియ్యపిండిపోసి పెట్టెకి తాళంవేయటం జరిగింది. రెండుసత్తుబిందెలతో తల, చేతులు కాళ్ళు కుక్కి పెట్టెలో విధంగానే వాటిపై చింతపండు కుక్కి బియ్యప్పిండి పోసి దళసరిగుడ్డతో (మూతలా) వాసెన కట్టినట్లు కట్టి పెట్టెని రెండు సత్తుబిందెలని ట్రెయినులో పైబెర్తుమీద వదిలేసి వెళ్ళారు. ఆ తర్వాత ప్రయాణీకులు చూడటం జరిగింది. పోలీసులు రంగంలోకి దిగారు. (అన్ని కేసులు లాగానే) వాళ్ళు యీ కేసుని విచారిస్తున్నట్లు ప్రచురించారు.
ఆ తర్వాత__
హత్యచేసింది ఎవరిని! హత్యకు కారణం ఏమిటి? ఈ హత్యతాలూకా హంతకుడు (లు) పట్టుబడ్డారా లేదా? తదితర వివరాలు మళ్ళీ పేపరులో రాలేదు. ట్రంకు పెట్టెలో శవాన్ని పెట్టింది ఎవరన్నది యింకా బయటకి రాలేదనుకుంటాను.
ట్రంకు పెట్టె రెండు సత్తుబిందెలలో కూరిన శవంతాలూకా వార్త చాలామంది పాఠకులు చదివే వుంటారు. ఆ ఫోటోలు కూడా చూసే వుంటారనుకుంటున్నాను.
ర్ర్ హత్య ఎందుకు చేశారు?
ఎవరు చేశారు?
ఆస్తీ తాలూకా ఆశతోనా?
ఆవేశంతో జరిగిన అనర్ధకమా?
కక్షతో కూడిన వ్యవహారమా?
ఏదయినా కావచ్చు. మరేదయినా కావచ్చు. హత్యజరిగింది అన్నది నిజం. శవాన్ని పెట్టెలోను బిందెల్లోను పెట్టి తెలివిగా వదిలించుకున్నారన్నది నిజం.
తనని కాని వస్తువులు ఇతరుల సామగ్రి ప్రయాణంలో ఎవరయినా ఏదయినా మరచిపోతే ఆశతో, పేరాశతో, దురాశతో వాటిని తీసుకురావటం మంచిదికాదు. పరాయివాళ్ళు వస్తువులు గప్ చిప్ గా ఆశపడి మురిసిపోతూ గూడులెగరేసుకుంటూ యింటికి తెస్తే గోల్డ్ కాయిన్స్ నగలు నట్రా ఖరీదైన సామాను దొరక్కపోగా ఏ శవంతాలూకా బాడీయో తలకాయో దర్శనం ఇవ్వటం ఖాయం. ఆ తర్వాత అది ఎలా వదుల్చుకోవాలో తెలియక తల ప్రాణం తోకకి రావటం ఖాయం. తోక వుండదు కాబట్టి పీకకి తాడు చుట్టుకోటం ఖాయం. |
25,356 |
"అవును ఏం చేద్దాం!" చంద్ర అడిగాడు.
"భోజనం చేయడం తప్పనిసరి కాబట్టి వంటచేయాలి"
"అవును నేను వంటచేయాలి. నాకు వంట చేయడంవచ్చు ఏదో ఒకటి చేస్తాను." చంద్ర కుర్చీలోంచి లేస్తూ అన్నాడు.
"నేను వంట చేయడంలో ఏ వన్ ని. ఇందర్ కి రోజూనేనే వంటచేసి పెట్టేదాన్ని. నన్ను రక్షించిన మీకు ఆ మాత్రం వంట చేసి పెట్టలేనా! నన్ను వంటచేయవద్దన్నారనుకోండి నాకు చచ్చేబాధ వేస్తుంది. చెప్పండి చేయనా వద్దా!"
"అయితే ఓ కండిషన్" అన్నాడు చంద్ర.
"చెప్పండి" అంది అవంతి.
"మనమధ్య ఈ మీరు. గారు నాకు బొత్తిగా నచ్చలేదు. మనం పేర్లుపెట్టి పిల్చుకుందాము"
"ఓస్....ఇంతేకదా?"
"ఎస్....ఇంతే"
అవంతి నవ్వుకుంటూ లేచివెళ్ళింది. చంద్ర తృప్తిపడ్డాడు.
* * *
అవంతి వంటచేస్తూ తను పారిపోయే పథకం తయారుచేసుకుంది. రాత్రికిరాత్రే ఇక్కడ నుంచి వెళ్ళిపోక నిద్రపోవడం పెద్ద పొరపాటు. పగలు ఎలాగూ కుదరదు కాబట్టి ఈ రాత్రి పన్నెండు లోపల వెళ్ళిపోదామనుకుంది. ఖర్మకాలి ఓ వేళ ఈ రాత్రి పన్నెండు గంటల లోపు తను ఇక్కడనుంచి వెళ్ళకపోతే ఇందర్ తిరిగి వచ్చేవాడు. దానికి తను ఓ ప్లాన్ ఆలోచించే రెడీగా ఉంది.
ఇందర్ ఇంట్లో ఉన్నప్పుడు వీధి తలుపు తాళం ఎలాగూ ఉండదు. ఇందర్ బాత్ రూంలో ఉన్నప్పుడు చప్పుడుగాకుండా బాత్ రూంబైట గడియవేసి వెళ్ళిపోవడం. ఇందర్ బలవంతుడు. బాత్ రూం తలుపులు పగల గొట్టగలడు. అతను బాత్ రూంలోంచి వచ్చే సరికి తను చాలాదూరం వెళ్ళిపోతుంది. అలాగాకపోతే అర్దరాత్రి ఇందర్ గాఢనిద్రలో ఉన్నప్పుడు అవాకులు, చవాకులతో ఓ లెటర్ రాసి దానిని అతని పక్కనపెట్టి ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవడం. ఓ వేళ అతనులేచి తన్ని పట్టుకుంటే మాట్లాడకుండా కళ్ళనీళ్ళు పెట్టుకుని లెటర్ వేపు వేలు పెట్టి చూపిస్తుంది.
ఆ లెటర్ చదివి అతను బాధపడతాడు. ఎందుకీ తొందరపాటు పని అంటూ ప్రేమగా మందలిస్తాడు. తను అంత బాగా లెటర్ రాస్తుంది కదా! ఇందర్ మీరు చాలామంచివారు. నేనే మంచిదాన్ని కాను. మీతో చెప్పకుండా వెళ్ళిపోతున్నాను. ఎన్నాళ్ళని మీ చేత వంట చేయించుకుంటూ తినను! ఇక్కడ నుంచి సరాసరి చాటుగా మాయింటికి వెళతాను. మా బుచ్చికక్కి వచ్చిందేమో అని తోటమాలి సీతారాముడిని అడిగిచూస్తాను. బుచ్చికక్కి లేదని చెప్పాడనుకోండి. ఇంకా మా ఇంట్లోకి వెళ్ళను. చచ్చిపోతాను అంతే....ఈవిధంగా రాసిన లెటర్ చూసి గురుడు నమ్మకేం చేస్తాడు!
తను ఇన్నిరకాల ప్లాన్లు వేసుకుంటే ఈ చిన్న గురుడు దిగాడు. ఈ చంద్రశేఖర్ ఆజాద్ మహాశయుడు. ఏక్షణాన అయినా రావచ్చు. అప్పుడు తన మోసం బైటపడుతుందనే కదా ఇక్కడ నుంచి వెళ్ళడానికి తను తొందరపడింది. తనువుండగానే చిన్నగురుడు రానేవచ్చాడు. ఇప్పుడు పెద్ద గురుడుకూడా వస్తే తనజాతకం మొత్తం తారుమారు అవుతుంది. కనుక....
ఈ రాత్రి పన్నెండు లోపల ఇక్కడ నుంచి ఎలాగో అలా బైటపడాలి.చంద్రని బాత్ రూంలోవుంచి వెళ్ళిపోడం లేకపోతే ఫస్ట్ షోకి ఇద్దరూ సినిమాకి వెళ్ళటం. సినిమా మధ్యలో బాత్ రూం కానీవెళ్ళి అటునుంచి అటే ఉడాయించడం. ఇదీకాకపోతే మరోప్లాను. వెళ్ళటం అనేది మటుకు ఖాయం. తనగురించి ఇందర్, చంద్ర తర్జనభర్జన పడతారు....
"ఏంటి అవంతీ రాకుమారి తనతో తాను నవ్వుకుంటున్నది" ఎప్పుడు వచ్చాడో తెలియదు చంద్ర గుమ్మానికి ఆనుకుని నవ్వుతూ ప్రశ్నించాడు.
అవంతి ఆలోచన స్రవంతి లోంచి బైట పడింది.
"నవ్వినమాట నిజమే. ఎందుకు నవ్వానో చెప్పుకో" అవంతి నవ్వుతూ అంది.
"నాకెలా తెలుస్తుంది! నేనేమన్నా డాక్టరునా హృదయం లోతులు చూడడానికి?"
"అయ్యో కవికుమారా! రవికాంచనిచోట కవికాంచును అన్న సత్యం ఆ మాత్రం తెలియదా! డాక్టర్లకి హృదయం ఉండదు. గుండె ఆపరేషన్ అప్పుడు మాత్రం పదునైన కత్తులతో హృదయాన్ని పరపరకోసి అప్పుడు హృదయం లోతులు చూస్తారు. అప్పుడైనా వాళ్ళకి కనిపించేది ఏముంది? మాంసం, రక్తం, పేగులు వగైరా వగైరా....
"నీ మాటలు భలేగుంటాయి అవంతీ"
"నాకొచ్చిన విద్య ఇదొక్కటే. మాట్లాడడం కూడా ఓ కళే అని పెద్దలు అన్నారు"
"నీకు ముఖం నాకేం తెలియదు. అదేం చిత్రమో ఇందర్ కూడా నాతో ఇదే మాట అన్నాడు"
"ఉన్నమాట ఎవరైనా ఒకటే అంటారు"
"ఏమో బాబూ" అంది అవంతి.
"ఇంతకీ నీలోనీవు ఎందుకు నవ్వుకుంటున్నావో చెప్పలేదు"
"చెప్పక తప్పదా!"
"తప్పదు"
"నీవు రాకముందు ఇందర్ నాకో విషయం చెప్పాడు. మనిద్దరము తమాషా చేసి చంద్రని ఏడిపిద్దాము" అని....
"ఆరి ఇడియట్. వాడికి నన్ను ఏడిపించడం తప్ప మరోపని లేదా! చూసి చూసి వాడిని నేనే ఏడిపిస్తాను." |
25,357 | "సవాలక్ష ఉంటాయి రాఘవా! అయితే మాత్రం నువ్వు చెప్పాలా?" అక్కడికి రాఘవనే సమర్ధిస్తున్నట్టుగా అన్నాడు రాయుడు. "అమ్మాయి సుకుమారి కాబట్టి నీకు సహకరించకపోవచ్చు. సహజమైన భయంతో నీకు దూరంగా ఉండొచ్చు. అసలు నీకు ఇంతదాకా తొలిరాత్రి జరిగి ఉండకపోవచ్చు. అంతమాత్రం చేత వాటన్నిటికి నువ్వు సంజాయిషీ ఇవ్వాలా? ఎవరనగలరు రాఘవా! నీ పర్సనాలిటి, నీ ముఖవర్చస్సు చూసి నువ్వు శారీరకంగా బలహీనుడివని ఎవరు చెప్పగలరు?"
"రాయుడుగారూ!" తటపటాయిస్తూ అన్నాడు రాఘవ. అడగటానికి సంకోచంతో ఆగిపోయేవాడే కాని, మాటలతో రాయుడు పడగొట్టేశాడు అప్పటికే. "అదేనండి....అసలు పెళ్ళయిన తర్వాత అమ్మాయిలు నెలల తరబడి భర్తను దగ్గరకు రాకుండా ఆపేసే అవకాశ ముందా?"
ఈ ప్రశ్నతోనే రాయుడికి అసలు సమస్య అర్ధమైపోయింది. "భలేవాడివయ్యా! నెలలా, ఒక్కోమారు సంవత్సరాలు గడిచిపోతుంటాయి." ప్రసన్నంగా నవ్వేశాడు రాయుడు- "ఎనకటికి నాకు తెలిసిన ఓ ఏగ్రోవామిస్ట్ ఉండేవాడు. ఎగ్రికల్చరర్ ఎమ్మెస్సీ చేసి, అనక డాక్టరేట్ సంపాదించి, చాలా విదేశాలు తిరిగాడు వ్యవసాయ సలహాదారుడుగా, ఓ రోజు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆహ్వానం మీద ఆ రాష్ట్రంలోని ఓ పల్లెకు వెళ్ళాడు. ఓ చోట బాగా బక్కచిక్కిపోయిన రైతొకడు ఓ భూమిని దున్నుతూ కనిపించాడు. నా స్నేహితుడు ఆ రైతును అడిగాడట........ఆధునికమైన పద్దతుల్లో వ్యవసాయం చేయొచ్చుకదా అని. దానికి అ రైతు మా అయ్యా మా తాత చెప్పినట్టు చేస్తే , నేను మా అయ్యా చెప్పిన పద్దతిలో చేస్తున్నాను' అన్నాడు. అంతే ఆ మూర్ఖత్వానికి మనవడికి మంట పుట్టింది. మీ అయ్య చెప్పినట్టు నువ్వు పండిస్తున్నావు సరే, ఏడాదికి ఓ బస్తా దాన్యమైన పండుతున్నయా' అని అడిగాడట. ఆ రైతు 'బస్తా కాదు, ఓ కిలో కూడా పండటం లెదూ' అని జవాబు చెప్పాడు. స్నేహితుడు ఇంకా షాక్ తిన్నాడు. 'కిలో ధాన్యం కూడా పండనప్పుడు నువ్వు అనుసరించే వ్యవసాయ పద్దతులు తప్పని నీ కనిపించడంలేదా' అని నిలదేస్తే ఆ రైతుకు ఒళ్ళుమండి 'అసలు ఇది గోధుమ పండించే నేలయితే, ధాన్యమేలా పండుతాయి పెద్దమనిషి' అన్నాడట. అంతే......మనవాడికి మొహం తిరిగి పోయింది." క్షణం ఆగాడు రాయుడు. "ఇప్పుడు నేను చెప్పిన కధలో సారాంశమేమిటి.......భూమి సంగతి తెలిసి వ్యవసాయం చేయాలి. అమ్మాయి సంగతి తెలుసుకుని కాపురం చేయాలి అని. అంతే రాఘవా! లేకపోతే కస్టాలు తప్పవు."
తడబడిపోయాడు రాఘవ "అబ్బే! నాకలాంటి సమస్య లేదనుకోండి. ఊరికినే అడుగుతున్నాను."
"ఆ విషయం నాకు తెలిదా రాఘవా?"
ఏ విషయమో తెలీని సందిగ్ధంలో రాఘవను ఇరికించి, యధాలాపంగా చెప్పుకుపోయాడు రాయుడు- "ఎంత ధియరీ చదివితే మాత్రం సుఖమేమిటి రాఘవా? గులాబీ, సుగంధం గురించి పుస్తకంలో వర్ణన చదివే దానికన్నా ఓ పువ్వును ప్రత్యక్షంగా పట్టుకు చూడటం మేలు కదూ? అసలు ఇలాంటి సమస్య ప్రతి మగాడికి సహజమేగా! ఈ మధ్యనే పెళ్ళయిన మన హోం మినిస్టర్ గారి అబ్బాయి ఏం చేశాడు? బెడ్ రూంలో అసలు సహకరించని భార్యకు వీడియో కేసట్స్ చూసే పిచ్చి అలవాటు వుండేసరికి ఓ రాత్రి బ్లూ ఫిలిం వేశాడట. అంతే. ఆ తర్వాత వీడియో చూస్తే ఒట్టు."
"మానేసిందా పూర్తిగా?"
"నా శ్రాద్ధం!" తల పట్టుకున్నాడు రాయుడు. "ఇంత అమాయకుడివెం రాఘవా? మానేసింది అంటే అర్ధం......ఆ కేసెట్ చూసిన దగ్గర్నుంచి భర్తతో వ్యవహారం మొదలుపెట్టింది అని."
స్థాణువైపోయాడు రాఘవ. గొప్ప 'క్లూ' దొరికిపోయింది. అర్జెంటుగా ఇదే రాత్రికి ఆ పద్దతి అవలంభించేద్దామని బలంగా నిర్ణయించుకున్నాడు. అ బ్లూ ఫిలిం దొరకడం కష్టమనిపించడంతో ఆ మద్యాహ్నం శెలవు పెట్టి మరీ ఓ బ్యాంక్ కొలీగ్ సహాయంతో వేట ప్రారంభించాడు.
ఇప్పటికి రాయుడనుకున్న దొక్కటే. కిన్నెర ఓడిపోవాలి! ఓడితే అది వీర్రాజు రాజకీయ సన్యాసానికి కారణం అవుతుంది. అలా బలహినుడైన వీర్రాజును అప్పుడు పట్టుకోవాలి. * * * *
మేఘవృతమైన ఆకాశం హటాత్తుగా వర్షించడం మొదలుపెట్టింది.
రోడ్ల మీద జనం హడావుడిగా అటూ ఇటూ పరుగెడుతున్నారు.
బామ్మ ప్రోద్భలంపై నూకాలమ్మ గుడికి వచ్చిన కిన్నెర కారు దగ్గరకు వెళ్ళటానికి ముందే వర్షం ఉదృతం కాగా, గుడి మండపం చూరు కింద నిలబడింది.
సరిగ్గా అదే సమయానికి గుడిలోకి వస్తున్న భవ్య కూడా అక్కడికి రావడం యాదృచ్చికమే.
మళ్ళీ తారసపడ్డారు. ఎదురెదుగా దైవికంగా క్షణంపాటు ఇద్దరూ ఒకర్నోకరు చూసుకున్నారు.
భవ్య వచ్చింది చెల్లి బ్రతుకును చక్కదిద్దమని అమ్మవారికి ముడుపు కట్టడానికైతే కిన్నెర వచ్చింది మరొకందుకు. |
25,358 | "అవంతీ!" పిలిచింది వైజయంతి.
"ఏమిటి?" వెనక్కు తిరిగింది.
"నిన్ను కలవడం నాకు చాలా సంతోషంగా వుంది. అయామ్ రియల్లీ హేపీ".
అవంతి నవ్వుతూ ఆమె చేతిని నొక్కివెళ్ళిపోయింది. ఆ సాయంత్రం ఇంటికి వెళుతూ దారిలో డైరీ కొనుక్కొని వెళ్ళింది వైజయంతి.
"జీవితంలో చదువు, ఉద్యోగం, పెళ్ళిలాంటివే ముఖ్యమయిన మలుపులనునేదాన్ని ఇన్నాళ్ళు. కాని ఒక మంచి స్నేహితురాలి పరిచయం కూడా జీవిత విధానాన్నే మార్చేస్తుందని తెలుసుకోగలిగాను. ఆలోచిస్తుంటే ఎంత జీవితాన్ని వ్యర్ధంగా గడిపానా అని దిగులేస్తోంది. హైదరాబాద్ జీవితం అంతా సాఫీగా గడిచింది. ఢిల్లీ జీవితం ఓ చాలెంజ్ లా అనిపిస్తోంది. నేనేమిటి, నేనేం కాదల్చుకున్నానులాంటి ప్రశ్నలు మొలకెత్తుతున్నాయి. ఈ ప్రశ్నలకు స్థిరమైన జవాబు ఇవ్వగలిగే స్థితిలోకి త్వరలోనే చేరుకోవాలి.
మొదటిరోజే డైరీలో రాసుకుంది. అదే విషయాన్ని స్నేహబృందానికి ఉత్తరం రాసేసింది ఆ రాత్రే.
అనూరాధ దగ్గర్నుంచి వెంటనే జవాబు వచ్చింది తనకు. అవంతి లాంటి స్నేహితురాలు దొరికినందుకు సంతోషంగా వుందని, ఆ స్నేహాన్ని నిలుపుకోమని రాసింది. భార్గవి గుంటూరులో చదువుతోందని కూడా రాసింది. విశాల జవాబే యివ్వలేదు.
నాల్గుదారుల్లో ఒక లింక్ తెగిపోయింది అప్పుడే.
అవంతిని నాలుగు రోజులదాకా కలవలేదు. తను సాధించాల్సినవన్నీ అయ్యాకే కలవాలని నిర్ణయించుకుంది. డబ్బుకి కొదవలేదు. ఆమెకే ఒక ఎకౌంటుంది బ్యాంకులో వారంరోజులు తిరిగేసరికి తన గదిలో పుస్తకాల లైబ్రరీ ఏర్పాటు చేసుకుంది.
ఏం చదవాలి మొదట? చిన్న చిన్న కథలతో, నవలలతో పఠనా వ్యాసంగం మొదలు పెడితే మంచిదనిపించింది. ముందుగా టాగోర్ నవలలు తీసుకుంది. ఆమె చదివిన మొదటి నవల "గోరా".
పార్సీ కుంటుంబంలో పుట్టి, ఆ విషయంతెలియక బ్రాహ్మణ కుటుంబంలో పెరిగి అతి ఛాందసుడిగా తయారయిన వ్యక్తి కథ అది. సనాతన ధర్మాలను, ఆచార వ్యవహారాలను నిష్టగా పాటించాలనే నమ్మకం కలిగిన వ్యక్తి చివరిలో తెలిసినప్పుడు ఎంత మధనపడతాడో, ఆ వేదానని వర్ణించాడు టాగోర్.
ఆ నవల-ఆమెకు చాలా నచ్చింది. "జన్మతః మనిషి కులం నిర్ణయింపబడదు. అతడి పెరుగుదల, స్వశక్తే అతడి కులాన్ని తెలుపుతాయి" అనుకుంది. ఆ విషయమే డైరీలో రాసుకుంది.
ఆమె చదివిన రెండో నవల చతురంగ అదీ టాగోర్ దే. అయితే ఆ నవల ఆమెలో ఆలోచనల్ని రేకెత్తించింది మరో విధంగా.
తన క్లాసు వెతుక్కుంటూ వచ్చిన వైజయంతిని సంతోషంగా పలకరించింది అవంతి.
"మధ్యాహ్నం లంచ్ కలిసి తీసుకుందాం క్యాంటిన్ కు వస్తావా?" అడిగింది వైజయంతి.
"తప్పకుండా ఏమిటి విశేషం?"
"ఏం లేదు నేను చదివిన ఒక నవల గురించి నీతో డిస్కస్ చేయాలని".
"చాలా సంతోషం వైజయంతీ! ఇంత కొద్ది కాలంలోనే నువ్వు పుస్తకాలు చదవడం, వాటి గురించి చర్చించాలనుకోవడం చాలా సంతోషించాల్సిన విషయం. ఈ శుభసమయంలో నేను పార్టీ యిచ్చేస్తాను మధ్యాహ్నం" నవ్వుతూ అంది అవంతి.
"నాలో ఈ మార్పుకి కారణం నువ్వు. నీకే నేను పార్టీ ఇవ్వాలి కాదనకు" ఎందుకో తెలీదుకానీ - వైజయంతి కళ్ళలో తడి కనిపించింది. ఒక్కోసారి చాలా చిన్న చిన్న కారణాలే-మనసుని ఉద్వేగపరుస్తాయి. వీటిల్లో కృతజ్ఞత మొదటిస్థానం.
"సర్లే ఇద్దరం కలిసి పార్టీ చేసుకుందాం. క్యాంటిన్ లో కలుస్తాను" తన క్లాసుకి తిరిగి వచ్చింది వైజయంతి.
అవంతి కెన్నో విషయాలు చెప్పాలనుకుంది. తను జాగింగ్ డ్రెస్ కొనుక్కుని ఉదయం కాలనీ గార్డెన్ లోకి పరుగెడుతుంటే తల్లిదంద్రులకి ఎంత ఆశ్చర్యంగా వుందో చెప్పాలనుకుంది. టేబుల్ టెన్నిస్ ఏ క్లబ్బులో వుందో తెలుసుకోవడానికి తనుపడ్డ రెండురోజల అవస్థ కూడా చెప్పాలనుకుంది. తను రాస్తున్న డైరీ చూపించాలనుకుంది. కాని చిన్నపిల్లలాగా ఆవేశపడి పోతున్నాననిపిస్తూందేమోనని ఊరుకుంది.
క్లాసులో కూడా ఆమెకు మంచి పేరొచ్చింది. ఆమె చాలా తెలివి గలదని, క్లాసు అంతటిలో ఫస్టుమార్కు కొట్టెయ్యగలదని అర్ధమయిపోయిందందరికీ.
ఆ రోజు క్లాసులో ఒక పీరియడ్ డిబేట్ కి కేటాయించారు. అది వైజయంతి కాలేజిలో చేరకముందే నిర్ణయించబడింది. అందుకే ఆమెకా విషయం తెలియదు. ఇచ్చిన టాపిక్... "మానవజాతి పురోభివృద్దికి అంతరిక్ష పరిశోధనలు అవసరమా లేదా" అని పేర్లు ఇచ్చినవాళ్ళు బాగా ప్రిపేరయి వచ్చారు.
ప్రపంచమంతా దారిద్ర్యం తాండవిస్తున్న ఈ రోజుల్లో అమెరికా, రష్యాలాంటి సంపన్న దేశాలు అంతరిక్షయాత్రలనీ, పరిశోధనలనీ కోట్ల కొద్దీ రూపాయలు ఖర్చుపెట్టడం అమానుషం అనీ, వాళ్ళు మానవాతా దృక్పథంతో ఆలోచించి లేనివాళ్ళకు సహాయం చేసే కార్యక్రమాలని చేపట్టాలని, అంత ఖర్చు పెట్టినా ఫలితం ఏముంటుందో చెప్పలేం కదాని కొందరు వాదించారు.
మరికొందరు మానవాభ్యుదయానికీ, ప్రగతికీ, అంతరిక్ష పరిశోధనలు అత్యవసరమని మానవుని మేధకి అదో పరీక్ష అనీ వాదించారు. డిబేట్ పీరియడ్ కింకా టైం మిగలడంతో ఎవరో వైజయంతి పేరుని సూచించారు.
ఒక్కనిమిషం బాగా గాభరాపడింది వైజయంతి. కాళ్ళు వణికాయి తనకు ముందు తెలీదనీ, ప్రిపేరయి రాలేదనీ తప్పించుకోబోయింది. కాని లెక్చరర్ వదలలేదు. కొద్దిసేపయినా మాట్లాడాలని అడిగింది. వైజయంతికి ఇలాంటి అలవాటు లేదు. ఎలాగో ధైర్యం తెచ్చుకుని లేచి నిలబడింది.
ఆమె మనోగవాక్షం అప్పుడప్పుడే విచ్చుకోవటం ప్రారంభించింది. భావవిహంగాలు నెమ్మదిగా రెక్కలుసాచి ఎగుర్తాయి.
మొదలు పెట్టింది. "ఆరునెలల పసిపాపని వెన్నెల్లో పడుకోబెడితే కాళ్ళు చేతులూ కొట్టుకొంటూ ఆ చంద్రుణ్ణి, నక్షత్రాల్నీ అందుకోవడానికి ఆరాటపడుతుంది. ఇక పెద్దయ్యేకొద్దీ ఖగోళశాస్త్రం చదువుతుంటే చిన్నప్పుడు విన్న కాకమ్మ కథలన్నీ కట్టుకథలని తెలిశాక అసలు విషయం ఏమిటో తెలుసుకోవాలని ఆరాటపడుతుంది".
క్లాసులో సూదిపడితే వినబడేటంత నిశ్శబ్దం. ఆమెలో ధైర్యం పెరిగింది.
"ఆదినుంచీ మానవుడిలో పరిశోధనాత్మకమైన దృక్పథం వుంది. కాబట్టి మనం ఈరోజు ఇలా చదువుకోగలుగుతున్నాం. లేకపోతే ఏ చెట్టుకొమ్మల్లోనో, చెట్ల ఆకులు శరీరానికి చుట్టుకుని కాలం గడుపుతూ వుండే వాళ్ళం.
పుక్కిటి పురాణాలు ఎన్ని ప్రచారంలో వున్నా మన పూర్వీకుల్లో కూడా అంతరిక్షాన్ని శోధించాలన్న కోర్కె వున్నట్లు ఆర్యభట్ట, భాస్కరుడులాంటి ఖగోళ శాస్త్రజ్ఞులద్వారా తెలుస్తుంది. అంతరిక్షాన్ని జయించటం మానవుడికి కేవలం ఆనందం కోసం కాదు. అదొక ఛాలెంజ్. అందుకే కొద్ది సంవత్సరాల క్రితం యూరిగగారిన్ మనదేశ పర్యటనకు వచ్చినప్పుడు ఆబాలగోపాలం హృదయ పూర్వకంగా ఆహ్వానించారు. రేపు వాలెంటినా వచ్చినా మన స్త్రీలందరం ఎగబడి ఆమెకు ధన్యవాదాలర్పిస్తాం. కారణం ఆ ఛాలెంజ్ ని వాళ్ళు ధైర్యంగా ఎదుర్కోబట్టే.
మానవుడి ఈ నిరంతర అన్వేషణలోనే ఈనాడు ఒకరి గురించి ఒకరం తెలుసుకోగలిగాం. కొలంబస్ అమెరికాను కనిపెట్టకపోతే ఏం జరిగేది? వాస్కోడిగామా ఇండియా రాకపోతే ఏం జరిగేది? ఈ విశాల విశ్వంలో మన భూమి ఒక చిన్న భాగం మాత్రమే అని తెలుసుకున్నాం. ఇక ఇతర గ్రహాల గురించి తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా వుంది.
మరొక్క విషయం అమెరికాలాంటి సంపన్న దేశాలు కోట్లకొద్దీ డబ్బు ఖర్చుపెట్టక మనలాంటి బీదదేశాలకు సహాయంచేస్తే బాగుంటుందని కొందరు సూచించారు.
ఒక్క విషయం అడుగుతాను జవాబు చెప్పండి. మనందరం ఆర్ధికంగా మంచి స్థాయిలో వున్నాం. గుడిసెలో నివసించే పేదవారికి, అపరిచితులకు మనంతట మనం వెళ్ళి సహాయపడుతున్నామా ఎప్పుడైనా? ఇంటికి అడుక్కుతినడానికి వచ్చిన ముష్టివాడికి ఒక ముద్ద పడేసి మన బాధ్యత తీరిపోయిందని సంతోషిస్తాం. మనం సినిమాకు పెట్టే ఖర్చు ఒక పేదకుటుంబానికి ఒకపూట అన్నం పెడుతుందని, సినిమా మానేసి ఎవరికయినా సహాయం చెయ్యగలుగుతున్నామా? మన దేశంలో ధనవంతులంతా తమ అవసరానికి వుంచుకుని మిగిలింది లేనివాడికి ధర్మంచేస్తే మరొకదేశం సహాయం లేకుండానే సగం బీదరికాన్ని తగ్గించవచ్చు. ఆదర్శాలు వల్లించడం సులభం, ఆచరణలో పెట్టడం కష్టం. మనం చేయలేనిది మరొకరు చేయడంలేదని విమర్శించడం సంస్కారం కాదు.
అంతరిక్ష పరిశోధన మనిషి మేధకు, ధైర్యానికి ఒక పరీక్ష, ఒక ఛాలెంజ్ దాన్ని ఎదుర్కొనే ధైర్యం గాని, అవకాశంగాని మనకు లేవు. అవి వున్నవాళ్ళను ప్రోత్సహించడం మన కనీస కర్తవ్యం. అదే నా అభిప్రాయం" ముగించింది వైజయంతి.
క్లాస్ రూం చప్పట్లతో మారుమోగింది తన సీట్లోకి వచ్చి కూర్చుంది వైజయంతి. ఆమె మొహం అఛీవ్ మెంట్ తో వెలిగిపోయింది.
పదిమందిలో నిలబడి మాట్లాడాలంటే భయం తనకు. క్లాసులో టీచరడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పడానికి కూడా సంకోచించేది. ఆ రోజుల్లో భార్గవి ఎప్పుడూ వెక్కిరిస్తుండేది. 'టిమిడ్ జీనియస్'....అలాంటిది తనేనా యింత ధైర్యంగా ప్రిపేరవకుండా లెక్చర్ యిచ్చింది? మధ్య మధ్యలో పాయింట్స్ వరస కుదరకపోవడం తెలుస్తూనే వుంది అయినా తడబడలేదు. ఈ ధైర్యం ఎలా వచ్చింది? అవంతితో పరిచయమా? |
25,359 |
"ఏం... రాకూడదా?" నేలచూపులు చూస్తూ అంది.
"రాకూడదని కాదు. పరీక్షలు... చదువుకోవాలి" గొణుగుతున్నట్టుగా అన్నాడు.
"తనూ ఓ పరీక్షలో అడుగుపెట్టిన అమ్మాయే. తనూ ఫలితం తెలుసుకోవాలని ఆరాటపడుతూంది. "పోనీలెండి మరోసారి వెళదాం."
"మీ ప్రశ్నకి జవాబు అడగలేదు."
బిడియంగా నవ్వింది "మీరు చెబితే వినాలనిపించింది"
"అడగొచ్చుగా?"
"ప్రిపేరయి వుండకపోతే హర్టవుతారని."
ఎంత మార్పు ఈ అమ్మాయిలో! తనకంటే అంతా అల్పులే అని భావించడమే అలవాటైన ప్రబంధ, తన విషయంలో మాత్రం కాస్త వెసులుబాటుని ప్రదర్శిస్తూంది. ఇది స్నేహం కోసమేనా?
చెప్పాడు బికినీ గురించి చెబుతుంటే గిల్టీగావుంది. అది ప్రణయ నుంచి తెలుసుకున్నదన్న భావం కావచ్చు.
అంతా విన్న ప్రబంధ విస్మయంగా అడిగింది. "నిజానికి ఇది మీకు ముందే తెలుసునన్నమాట."
"లేదు తరువాత తెలుసుకున్నాను."
"ఇంత స్వల్ప వ్యవధిలో.... నేన్నమ్మను!"
ప్రణయ చెప్పింది అనాలనుకున్నాడు కాని ఆమె ప్రసక్తి తీసుకురావడం సవ్యంగా అనిపించలేదు
"మీకు నిజంగా ముందే తెలుసు"
"తెలిస్తే అడిగినవెంటనే చెప్పేవాడినిగా?"
"అందరిముందూ కాక ఒంటరిగా ఇక్కడ కలుసుకున్నాక చెప్పాలని ఆగి వుండొచ్చుగా?"
"అదేం కాదు" టక్కున అన్నాడు "నిజంగా నాకు తెలీదు."
'అవును, నిజమే' అని ఆదిత్య అంటే ఆమె ఆనందపడేదేమో! "పాపం శ్రమ పెట్టానన్నమాట!"
"లేదు ప్రబంధా! మరో కొత్త విషయం తెలుసుకునే అవకాశం కలిగించారు మీరు"
"అంటే నేను బకాయి పడిపోయానన్నమాట"
"ఏమిటి?" విస్మయంగా అడిగాడు.
"మీరు చెప్పగలిగితే నేనేమిస్తానూ అని మీరు అడిగారుగా?"
"గుర్తుంది."
"ఏమిస్తాననుకుంటున్నారు?"
నవ్వేడు మృదువుగా "అదీ నాకు అర్ధంకాలేదు."
"నిజమా?"
"అవును ప్రబంధా! మరోలా అనుకోకండి. మీరు బహుశా చాలా విషయాల్లో నాకన్నా ముందున్నారని బోధపడింది. మరో పజిల్లాంటిది అది. విన్నాకనే."
"నిజంగా అర్ధం కాలేదా?"
"నేను అబద్దం చెప్పడంలేదు"
"అసలేమనిపించింది?" అడిగింది ఉత్సుకత చూపుతూ.
"ఏదో బూతు పదంలా..."
ప్రబంధ తల వాలిపోయింది సిగ్గుతో నిజమే దూకుడుగా తను అనేసింది కాని సామాన్యంగా స్నేహితురాళ్ళని మాత్రమే అడిగే ఆ పజిల్ ఆదిత్యతో చెప్పాల్సింది కాదు! నిజంగా అదేమిటో తెలిస్తే....?
చెంపలు ఎరుపెక్కిపోతుంటే గొణుగుతున్నట్టుగా అంది. "మరిచి పోండది!"
"అదేం కుదరదు అదేమిటో తెలుసుకోవాలనుకుంటున్నాను."
"వద్దు"
ప్రబంధ ఎందుకలా కంగారుపడుతున్నదీ అర్ధంకాలేదు. విడిచి పెట్టేవాడేమో, ఆ కంగారే మరింత వుత్సాహాన్ని కలిగించింది.
"ప్లీజ ప్రబంధా!"
"నేను చెప్పలేను."
"అంటే నిజంగా అది వల్గర్ పజిలా?"
"ఛ ఛ!"
"అయితే జవాబు విడమర్చి చెప్పొచ్చుగా."
"నేను చెప్పను. మీరు అర్ధం చేసుకోవాలి" నేలచూపులు చూస్తూ అంది. "పోనీ ఓ హింట్ ఇవ్వనా?"
"అది బెటర్."
"మినిట్ లో ఒకసారి వచ్చేది, మూమెంట్ లో రెండుసార్లు వచ్చేది, హండ్రడ్ ఇయర్స్ లో ఒక్కసారీ రానిది ఏమిటి?"
ఎక్కువ వ్యవధి అవసరం లేకపోయింది. టక్కున చెప్పాడు "ఎం" అని.
"నేను అడిగిన పజిల్ నీ ఇలాగే ఆలోచించి చూడండి"
ఆలోచనల్లో మునిగిపోయాడు. క్రమంగా బోధపడిపోయింది. ఉద్విగ్నంగా పక్కకు చూశాడు. కానీ ఆమె లేదక్కడ.
వెళ్ళిపోతూంది కారులో.
ఆదిత్య ఫాలభాగం పైన స్వేదం పేరుకుంది. తను పొరపాటు పడుతున్నాడా? మరోసారి పజిల్ ని మననం చేసుకున్నాడు.
'షాక్' లో అయితే చివరిదాన్ని...అంటే 'షాక్'లో ఆఖరి అక్షరం 'కె'
ఇన్ స్ట్రుమెంట్ గా అయితే ముందు వుండేదాన్ని అంటే మొదటి అక్షరం 'ఐ'
'మిస్'లో మిస్ చేసుకోకూడని రెండింటినీ అంటే రెండక్షరాలు 'ఎస్...ఎస్' మొత్తం కలిపితే కె.ఐ.ఎస్.ఎస్.
తను ఇవ్వాలనుకున్నది 'కిస్'
ప్రణయ గుర్తుకొచ్చింది అసంకల్పితంగా.
ప్రబంధలో ఇలామ్టి మార్పుకి కారణం ఆమె తనపైన ఇలామ్టి అభిమానాన్ని పెంచుకుంటోందా?
ఆందోళన కాదు, అలజడి రేగింది. ఇది అదృష్టమో, లేక దురదృష్టమో తేల్చుకోలేకపోయాడు. |
25,360 | "అమ్మ! అదృష్టమే మీరు వెళ్ళలేదు. అయ్యగారి బండిపడినది. స్మృతిలేదు. ఇంట్లో పడుకోపెట్టినము."అని చెప్పెను. శశిరేఖ ఇంక సందేహింపలేదు. ఇంటికి బయలుదేరెను. ఈ స్ధితిలో తానతనిని వదలినచో ఎంత దుఃఖించునో!అతనికి దిక్కెవరు? తనను నమ్మి పెండ్లయినను చేసి కొనలేదు కదా?
ఇంటికి వెళ్ళునప్పటికి సుందరరావుకు స్మృతిలేదు. పెద్ద డాక్టరునకు కబురు చేసియుండిరి. డాక్టరును ఎట్లున్నదని శశిరేఖ అడిగెను.
డాక్ట - మిరితని భార్యా?
శశిరేఖ కేమి చేప్పటకును తోచలేదు.తనవంక ఆశ్చర్యముతో చూచు అతని చూపులామెమనస్సు నాందోళన
పరచుచుండెను.
డాక్ట - సుందరరావుగారు మిక్కిలి ఆపాయ స్ధితిలో నున్నారు. ఏమి చెప్పటకును వీలులేదు. వారము రోజులు గడచిన కాని ఆశలేదు. రేయుంబవళ్ళు ఆయన్ని బహు జాగ్రత్తతో చూస్తో వుండాలి. మీరు చూడగలరా? నేనాయన్ని ఆస్పత్రికి తిసుకోనిపోతే బాగుండును. కాని కదిలించడం అపాయకరము. మీరా భారము తీసుకుంటారా? లేకపోతే నేనేవరినన్నా పంపనా?
శశి - నే నసమర్దురాలనని ఎందుకనుకున్నారు?
డాక్ట - కోపము వద్దు. మీకు ర్తెలు తప్పిపోవడంచేత యీ సాయంత్రం మిమ్మల్ని చూసే భాగ్యం నాకు కలిగింది.
శశి - ఉహు, సుందరరావుగారి విషయమై తగిన జాగ్రత్త నేను తీసుకోగలను.
డాక్ట- అట్లా అయితే సరే. అతని ప్రాణాలు మీ చేతుల్లో పెడుతున్నాను.
శశి - మరేమి భయపడనక్కర్లేదు.
డాక్టరు వెళ్ళిపోయెను. శశిరేఖ కతనికంఠము, మాటలూ,ఏవో తెలిసిన వానివలె నుండెను. ఆమె నౌకర్ల నతని విషయమై యడిగెను. అతనింగ్లాండు వెళ్ళివచ్చుటచే ఇంత పెద్ద పని మయ్యెను. అతడు బ్రాహ్మ సమాజమున చేరినవాడు. అతని అసలు నివాస స్ధలము గోవిందపురము. పేరు రామారావు.
ఆహ విచిథ్రము! తాను పెండ్లికి పూర్వము చిన్నప్పుడు ప్రేమించిన రామారావే యితడు!
10
పది రోజుల వరకును సుందరరావు ప్రాణాపాయస్ధితిలో నుండెను. రేయింబవళ్ళు ఒక్క నిముషమ్తెన నేమరక శశిరేఖ అతనిని కాచుకొని కూర్చుండెను. ఎప్పడాతడు కండ్లు తెరచి చూచినను,ఆమె మృదుహస్తము, సుందర నేత్రములు, అతనికి ద్తేర్యము నిచ్చుచుండెను. ఇంకొకరి నెవ్వరిని దరిజేరనిక ఆమె తానే స్వయముగ నన్ని సౌఖ్యముల సమకూర్చెను. కాని ఆమె మనసు మాత్రము అనేకాలోచనలతో నున్నది. తిరిగి ఇతని వద్ద చిక్కుకుంటేనే యని ఆలోచించెను.స్వస్ద్హత చెందిన తరువాత ఇతడేట్లుండునో కదా? ఎట్లుండిన నేమి, తాను వెళ్ళుట కేమి యటంకము? డాక్టరు వచ్చినపుడెల్ల అతని పై తలపులు తిరుగుచుండెను. అతడు తనను గుర్తు పట్టలేదు, అసలు చిన్నప్పటి శశిరేఖనే మరచి యుండును.అతనికి తనను జ్ఞాపకము చెయ్యవలేనా లేదా? అతనికి వివాహమ్తెనదో లేదో? అతని భార్య ఎట్లుండునో?ఎంత పొడుగుగా,బలముగా నుండెను అతడు? ఎంత జ్ఞానవంతముగా, ఉదారముగా, శాంతముగా, సుస్దిరముగా, నుండెను అతని ముఖము!ఎంత గౌరవముగా, మృదువుగా నుండే నాతని మాటలు! ఎంత అధికార మాతనికి!సుందరరావు కన్న ఎంతో అత్యుత్తమ పురుషుడుగా కన్పడెను. అతని యందే కళంకమును కానరాదు.
అతడును తానును పసితనమున ఆడుకోనిన ఆటలు, చేసిన స్నేహము, పొందిన సౌఖ్యములు కండ్లకు కట్టినట్లు జ్ఞప్తికి వచ్చుచుండెను. ఒకనాటి సాయంకాలము రామారావామెను ముద్దు పెట్టుకొని "నిన్ను తప్ప ఇంకెవరిని పెళ్ళి చేసికొను. నువ్వు నన్ను చేసుకుంటావా?" అని అడిగియుండెను. సిగ్గుతో "నిన్ను తప్ప ఎవరిని చేసుకో"నని ఆమె చెప్పెను. అతను ఎండాకాలము, శలవలకు వచ్చినప్పుడు, వూళ్ళో అందరూ,అతని చాదువుసంగతి చెప్పుకొని ఆశ్చర్యపడు టయును, అతడు చిన్నవాడయినను అతని తెలివిని బుద్ధిమంత తనాన్ని మేచ్చుకోనుటయు జ్ఞాపకముండెను.అతడు రాగానే కొంటెపిల్ల కాయలు అతడు ఇంగ్లండు వెళ్ళాక పూర్వము తనకోసరమువచ్చి "శశి, నేను సముధ్రముదటి దూరదేశం వెడుతున్నాను.కాని నిన్నెప్పడూ మరిచిపోను. ఈ జన్మలో మరిచిపోను. నా ప్రాణముననంతవరకు నివే నా భార్యవు. నేను వచ్చిందాకా నా కోసం పెళ్ళి చేసుకోకుండా వుంటానని వోట్టేయ్యి " అని ఏమి తెలియని తన చేత వొట్టు వేయించుకొని, తన చేతినున్న చిన్న గాజును జ్ఞపకార్ధము తీసుకుని వెళ్ళుటయు, అప్పుడు జరిగినట్లు తోచెను.కానీ తానెంత అతనిని ప్రేమించి పెళ్ళి వద్దని యేడ్చుచున్నను , బలవంతముగా తన నేవడికో పెళ్ళి చేసి యుండిరి.అటు తరువాత తాను అతనిని మరిచి యెన్నాల్లో అయినది. ఈ ఆలోచన లిప్పడెందుకు?
నెల దినముల తరవాత డాక్టరు రామారావు రోగిని పరిక్ష చేసి వెళ్ళి పోవుచు, శశిరేఖతో మాట్లాడేను.
రామ - ఇంక అపాయము లేదు. |
25,361 |
అతడి చేతిలో కప్పు తొణికి కాస్త టీ మీదపడింది. అదికూడా పట్టించుకోలేదు. స్తబ్ధుడై చూశాడు.
"చాలా గొప్ప ప్లాను వేశారు. జైలు మ్యాపుతో సహా వాళ్ళకి అందజేశారు. అయినా ఫలితం లేకపోయింది."
"నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్ధమవుతూందా?"
"వార్షికోత్సవ సందర్భంగా మీరు పంపిన ఆహ్వానపత్రం మీద వ్రాసిన కోడ్ 'ఆపరేషన్ నెంబర్ వన్ కంప్లీటెడ్' తో సహా అర్ధమయింది."
అతడి మొహంలో రక్తం ఇంకిపోయింది. చాలా సేపటివరకూ మాట్లాడలేకపోయాడు. "నాకు...నాకేం తెలీదు" అన్నాడు.
"ఏం తెలీదా?" వెటకారంగా అన్నాను. "బ్రెడ్ తో పాటూ రంపం పంపించటం గురించి తెలీదా? బయట్నుంచి సొరంగం తవ్వించటం గురించి తెలీదా? స్వీట్ లలో మత్తు కలపటం గురించి తెలీదా? ఏం తెలీదు నీకు?"
'చాలా తెలుసుకున్నావే" అన్నాడు. ఇప్పటికి సర్దుకున్నట్టు కనిపించాడు. "చాలా తెలుసుకున్నావ్" అన్నాడు మళ్ళీ ... "కానీ దేన్నీ నిరూపించలేవు."
తెల్లబోయాను. అతడు ఈ విధంగా వస్తాడని వూహించలేదు.
బహుశా నా మొహంలో కనిపించిన మార్పుల్ని గమనించి వుంటాడు. మళ్ళీ నవ్వేడు. "దేన్నీ నిరూపించగలవు నువ్వు? దేనికి సాక్ష్యాధారాలు లేవు."
నిజమే. దేన్నీ నిరూపించలేను.
ఓడిపోయాను. చాలా తొందరపడి అతడి దగ్గిర బయటపడ్డాను.
లేచి అక్కణ్ణుంచి వచ్చేసేను.
కానీ, నా వెనుక జగన్నాధం ఆలోచనలో పడటం గమనించాను. ఎంత కాదనుకున్నా అతడి భయం అతడి కుంటుంది. విషయం అంతా నాకు తెలిసిపోయింది. కాబట్టి నన్నెలా దెబ్బతీయాలా అని ఆలోచిస్తూ వుండి వుంటాడు. ఇకనుంచీ ప్రతీ క్షణమూ జాగ్రత్తగా వుండాలి.
అంతేకాదు.
అతడు ఎత్తు వేసేలోపులోనే దెబ్బకొట్టాలి. లేకపోతే ఎప్పటికైనా ప్రమాదమే.
ఈ సాయంత్రం అమ్మకంతా చెప్పాను. సాధారణంగా అమ్మనుంచి ఏదీ దాచను. ఈ ప్రపంచంలో నాకున్నది అమ్మ ఒక్కతే.
అమ్మ చాలా దిగులుపడింది. "ఎందుకురా అనవసరంగా పెద్దవాళ్ళతో గొడవ పెట్టుకుంటావు?" అంది.
"ప్రతివాడూ అలా అనుకుంటే ఎలాగమ్మా."
"మనకి కాని విషయాల్లో తలదూర్చకూడదురా."
నేను నవ్వేను. "గత నాల్రోజుల్నుంచీ ఆ గండ్రగొడ్డలిని తెగ పొగుడుతున్నావ్ కదమ్మా. అతడు కూడా ఆ రాత్రి 'నాకు కాని విషయంలో నేను తలదూర్చకూడదు' అని అనుకుని వుంటే ఈ రోజు ఇలా నీ ఎదురుగా కూర్చుని మాట్లాడటానికి నేను బ్రతికి ఉండి వుండేవాడిని కాను."
"అతడిని ఎప్పుడు ఉరి తీస్తున్నార్రా?"
"ఇంకా ఆర్డర్లు రాలేదమ్మా, ఎదో ఒకరోజు నిర్ణయించి తెలియపరుస్తారు."
"మరీ దారుణమైన హంతకుడట కదరా! కొంతమంది అలా అంటారు, కొందరు మరోలా చెప్తారు. ఏది ఏమైనా నీకు సాయపడ్డాడు. ఒకసారి అతడిని చూడటానికి వీలవుతుందట్రా?"
"నీకు అడ్డేమిటమ్మా."
"కలుసుకుని ఒకసారి కృతజ్ఞతలు చెప్పుకోవాల్రా."
నాల్గురోజుల తరువాత అమ్మ అతడిని కలుసుకుందట. నేను లేను.
అలా కలుసుకోవటంతో ఈ కథ ఒక అనూహ్యమైన మలుపు తిరిగింది.
* * *
బాత్ రూమ్ సంఘటన తరువాత రేఖ నాకు కాస్త దగ్గిరయింది. చనువు పెరిగింది. వయసులో వున్న అబ్బాయీ అమ్మాయిల మధ్య చనువు పెరగటం ఎంతసేపు....? జైలులో కూని జయప్రదంగా అణిచి వేసిన సందర్భంగా పేపర్లలో పడిన ప్రముఖుల ఫోటోల్లో నాది కూడా ఒకటి. ఆ వార్తలు అన్నీ చదివి నాకు ఫోన్ చేసింది.
"కంగ్రాట్స్"
"థాంక్యూ."
"హీరో అయిపోతున్నారే?"
"హీరోయిన్ ఒక్కతే తక్కువ."
"అయ్యో పాపం!"
ఇద్దరం నవ్వుకున్నాం.
"అది సరేకానీ, సాయంత్రం ఏమిటి ప్రోగ్రాం?" అడిగాను.
"ఏముంది, ఏమీలేదు."
"పరీక్షలు అయిపోయినయ్ కదా. నాతో రాకూడదూ."
"ఎక్కడికి?"
"అడికిలమెట్టకి... ఈవేళ పౌర్ణమి."
అక్కడికి ముప్పై కిలోమీటర్ల దూరంలో అడికిలమెట్ట వుంది. అక్కడ గుడిని పౌర్ణమి నాడు చూడటానికి చాలామంది వస్తారు.
"తిరిగి రావటం ఆలస్యం అవుతుందేమో?"
"తెలిసిన స్నేహితుడి కారు తీసుకుంటున్నాను. ఎనిమిదింటికి వచ్చేద్దాం."
"సరే అయితే.... నాన్నగారికి చెప్పి వస్తాను."
"నాన్నగారికా?"
"అవును"
"నాతో అంటే చచ్చినా వప్పుకోరు."
"ఇది నాకు సంబంధించిన విషయం. ఆయనకు సంబంధించినది కాదు."
"నీకు అంత ఇండివిడ్యువాలిటీ వుంటే మంచిదే."
"మీకు నా గురించి పూర్తిగా తెలీదు. సాయంత్రం కలుద్దాం. ఎన్నింటికి?"
"ఆరింటికి."
"ఓ.కే.!" ఫోన్ పెట్టేసింది. నేనుకూడా పెట్టేసి, మళ్ళీ వెంటనే రింగ్ చేశాను. నేను చేసింది- జైలు వ్యవహారాల్లో జరగిన ఈ ఘోరమైన 'కూ' నిమిత్తమై ప్రభుత్వం నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ రమేష్ వర్మకి.
నా పథకంలో (జగన్నాధం భాషలో చెప్పాలంటే) ఆపరేషన్ నెంబర్ వన్ కంప్లీటెడ్.
......
అమ్మ పులిహోర కట్టిచ్చింది. అమ్మకి 'స్నేహితుల్తో' అని చెప్పాను. కానీ నమ్మివుండదని నా అనుమానం. కర్కోటకుడిగా పేరుపడ్డ ఈ జైలు ఉద్యోగి, ఈ మధ్య ప్రతిరోజూ ఉదయాన్నే గెడ్డం గీసుకోవటం, అప్పుడప్పుడూ పరధ్యానంగా వుండటం ఆ మాత్రం గమనించకుండా వుంటుందా? కానీ ఎక్కడా బయటపడలేదు. అదీ ఆమె గొప్పతనం.
ఫ్రెండ్ ని అడిగి తీసుకున్న కారులో బయలుదేరాం. ఆరుంపావు అయింది. ఇంకా పూర్తిగా చీకటి పడలేదు.
అడికిలమెట్ట ఇటువైపే వుంది. ఊర్లోకి వెళ్ళక్కర్లేదు. రాజానగరం దగ్గిర మెయిన్ రోడ్డు నుంచి పక్కకి దారి వుంది. చిట్టడవిలో ఓ అయిదు కిలోమీటర్లు ప్రయాణం చెయ్యాలి.
రాజానగరం దగ్గిర కొచ్చేసరికి ఆరున్నర అయ్యింది. వెన్నెల రాత్రి అవడంవల్ల ఎంతో తేడా తెలియటం లేదు.
"నిజంగా గుడి చాలా బావుంటుందటకదూ" అందామె.
"మరీ అంత గొప్పగా వూహించవద్దు. ఇలాగే అనుకుంటూ తాజ్ మహల్ చూశాను. వెన్నెల్లో తాజ్ ఎంతో బావుంటుందంటారుకదా. చాలా గొప్ప వూహతో వెళ్ళాను. కానీ చూస్తే ఏముంది- జేగురురంగు కట్టడం. నేను చాలా నిరాశ చెందిన అనుభవాల్లో అది ఒకటి."
"స్పందన కావాలి. అదీ ముఖ్యం" అందామె క్లుప్తంగా. ఆమెవైపు ఆశ్చర్యంగా చూశాను. ఎందుకో ఆమె అలా మాట్లాడగలుగుతుందని నేను అనుకోలేదు. ఒక మామూలు కాలేజీ అమ్మాయిగానే తెలుసు ఇప్పటి వరకూ.
రాజానగరం దగ్గిర మలుపు తిరిగాము. మరికొంత సేపటికి అడవి ప్రారంభం అయింది. దూరంగా కొండలు నల్లగా కనపడుతున్నాయి. కారు గతుకుల్లో పడిలేస్తూంది. రెండు నిముషాల ప్రయాణం తరువాత ఆగి పోయింది.
"ఏమైంది?"
దిగి చూశాను. ముందు టైరు నేలకంటుకుపోయి వుంది.
"పంక్చర్" అన్నాను. "టైరు మార్చాలి. పది నిముషాలు పడుతుంది. సారీ!"
ఆమెకూడా కారు దిగుతూ "సారీ ఎందుకు? ఇక్కడ ఎంతో బావుంది" అంది. ఇక్కడ ఏం బావుందో నాకు అర్ధంకాలేదు. చుట్టూ చీకటి, ఎండుపుల్లలు, చెట్లు కీచురాళ్ళ శబ్దాలు.
కారు వెనుకనుంచి స్పేర్ టైర తీసుకువచ్చి ముందు పడేశాను. పంచర్ అయిన టైర్ విప్పటానికి సంసిద్దుడనవుతూంటే ఆమె వచ్చి పక్కన నిలబడింది. ఒక క్షణం ఇద్దరం అలానే ఒకర్నొకరు చూసుకుంటూ నిలబడ్డాం. చుట్టూ వున్న చీకటి, ఒంటరితనం ప్రోత్సహించాయి. ఆమె చేతుల్ని నా చేతుల్లోకి తీసుకున్నాను. ఆమె అప్రయత్నంగా అడుగు ముందుకు వేసింది. చెంపల క్రింద చేతులువేసి మొహాన్ని పైకెత్తి పెదవుల గాఢంగా ముద్దు పెట్టుకున్నాను.
నాజీవితంలో నేనెప్పుడూ అంత ఆశాభంగానికి గురి అవలేదు. చాలా మామూలుగా వుంది ఆ ముద్దు. హెరాల్డు రాబిన్స్ నుంచి హవలాక్ ఎల్లీస్ వరకూ నేను చదివిన పుస్తకాల్లో వర్ణించినది వేరు. నాకు తెలుగులో అంతగా పరిచయం లేకపోయినా మిత్రులు చెప్పిన శృంగార నైషధాల వర్ణన వేరు. కానీ ఇదేమిటి? చాలా సాధారణంగా, దానికి మరికొంత విశ్లేషణం చేర్చాలంటే- 'చప్పగా' వుంది. ఒక ప్లాస్టిక్ ముద్దనో- రబ్బరుబొమ్మనో పెట్టుకున్నట్టుంది. మధువులేదు, మాధుర్యం లేదు. ఈ కవులూ నవలాకారులు, అనుభవంలేని వాళ్ళని ఊహల్లోపెట్టి ఎంత మోసం చేస్తారో అర్ధం అయింది. అనుభవంకన్నా ఊహ యెంత భ్రమలో పడేస్తుందో తెలిసింది.
నేనిలా ఆలోచిస్తూ వుండగానే ఆమె నా చేతుల్లోంచి అడుగు వెనక్కి వేసి "తొందరగా వెళ్దాం" అంది. నేను వంగి టైరు మార్చటంలో నిమగ్నమయ్యాను. అనుకున్నట్లే దాదాపు పది నిముషాల్లో పని పూర్తయింది. ఇద్దరం కూర్చున్నాక కారు స్టార్ట్ చేశాను. ఏదో గిల్టీ కాన్షస్ పీలింగ్ నన్ను విడవకుండా వెంటాడసాగింది. "ఐయాం సారీ" అన్నాను. ఆమె మాట్లాడలేదు. ఆమె మౌనం నన్ను మరింత బాధపెట్టింది. అప్రయత్నంగా అన్నాను. "... మీ నాన్నగారితో మాట్లాడతాను మన వివాహ విషయం-"
ఆమె నెమ్మదిగా అంది "కంఠంలో ప్రాణం వుండగా ఆయన దీనికి వప్పుకుంటారనుకోను."
ఆశ్చర్యంగా "ఏం?" అన్నాను.
"మీ ప్రాణాలు తీయాలన్నంత స్థాయిలో ఆయన ఆలోచనలు సాగుతున్నాయి కాబట్టి"
దాదాపు కారు సడెన్ బ్రేక్ వేసినంత పని చేసి, "మీకు... మీకెలా తెలుసు?" అని అడిగాను.
"నాన్నా, దామోదరంగారూ నిన్న రాత్రి చాలా సేపటివరకూ యీ విషయం చర్చించుకున్నారు" వెనక్కి వెళుతున్న రోడ్డువంక కన్నార్పకుండా చూస్తూ అంది. ఆమె ఆలోచనలు ఎక్కడో వున్నట్టున్నాయి. భావాల్ని చదవటానికి ప్రయత్నించాను గానీ ఆమె మొహం నిర్వికారంగా వుంది.
"నీకు తెలుసా? జైల్లో కూ జరగటానికి మీ నాన్నగారే కారణం".
"తెలుసు" క్లుప్తమైన ఆమె జవాబు బుల్లెట్ లా దూసుకు వచ్చింది. ఒక పోలీస్ ఆఫీసర్ ని అల్లరి పట్టించిన అమ్మాయిలా లేదు యిప్పుడామె.
"ఇప్పుడిదంతా నాకు చెప్పటం ద్వారా మీ నాన్నగార్ని, ఆ అపాయకరమైన పరిస్థితిలో పడేస్తున్నావ్ ఆ విషయం తెలుసా?" |
25,362 |
"పోనీ నలభై వేలివ్వు" "నా దగ్గర పైసా లేదు" "అయితే నువ్వు రాజకీయ నాయకుడివే" "ఈ సత్యమెలా కనిపెట్టావ్ మహానుభావా?" తలను గోడకేసి కొట్టుకోవడం ఆపి అడిగాడు కనకారావు. "ఒక పార్టీ అధికారం నుంచి దిగి కొత్త పార్టీ అధికారంలోకి రాగానే పాత పార్టీ ఖజానాను ఖాళీ చేసిందని, నిధులు చక్కబెట్టుకోవాలని కొత్త పార్టీ సెలవిస్తుందిగా... మరలా ఈ పార్టీ తరువాత ఎలక్షన్స్ లో ఓడిపోయి మరో పార్టీ అధికారంలోకి వస్తే అదీ అలాగే చెబుతోంది. మన దేశంలో ఏ పార్టీ అయినా ప్రజలకేదీ చేయదు. మరి ప్రజలు కడుతున్న కోట్లాది రూపాయల పన్నులు ఏమయిపోతున్నాయో? ప్రభుత్వ ఖజానాలు ఎందుకు ఖాళీ అవుతున్నాయో ఏ పరమాత్ముడికి తెలీదు. ఇలాంటి స్వార్థపరులకు, దౌర్భాగ్యులకు, నీచ రాజకీయ వేత్తలకు, పార్టీలకు ఓట్లేయడానికి పిచ్చి ప్రజలు పోలింగ్ బూత్ ల ముందు బారులు తీరి నించుంటారు. ఎవరు మీటింగ్ పెట్టినా మందలా పోగయి, గొర్రెల్లా తలలూపి, వెర్రి వాళ్ళలా చప్పట్లు కొడతారు. వీళ్ళ కసలు ఓటు విలువ తెలుసా? తెలిస్తే గతంలో వందల కోట్లు సంపాదించుకున్న అవినీతిపరులకు ఓట్లేస్తారా? రౌడీలకు, గూండాలకు నీరాజనాలు పలుకుతారా? ఓట్లేయించుకోవడానికి నాయకుల కెలాగూ సిగ్గులేదు- వేసే వీళ్ళకయినా సిగ్గుండాలిగా?" "దొంగ వెధవలకి ఓట్లేసి గెలిపించిన జనాలకు సిగ్గులేదు. సరే, ఒప్పుకుంటాను. అయితే... దీనికి నేనేం చేయగలను చెప్పు? ఎందుకు నన్నిలా వేధిస్తావు?" పిచ్చివాడిలా అయిపోయాడు కనకారావు. "నాకెందుకో ఈ మధ్య రాజకీయ నాయకుల్ని చూసినా, రాజకీయాల గురించి విన్నా పిచ్చికోపం వస్తోంది" "నేను కాదుగా" "నువ్వు దొంగవెధవ్వి కదా..." "అయితే?" "దొంగ వెధవలంటే ఎవరు? రాజకీయ నాయకులేగా...?" "అట్లా పెట్టావా మెలిక మహానుభావా...? కోపగించుకున్నారు. తిట్టారు. చేసుకున్నవాడికి చేసుకున్నంత. లంచగొండులకు ఓట్లేస్తే వాళ్ళే అనుభవిస్తారు. వాళ్ళ చెప్పుతో వాళ్ళే కొట్టుకుంటారు. మధ్యలో నన్ను ఇరికించవద్దు. నీ కొడుకు చాలా బిజీగా వున్నాడు. క్షణం తీరికలేదు. అందుకే మిమ్మల్ని తీసుకురమ్మన్నాడు. వస్తారా పోదాం?" ఆశగా, సహనంగా అడిగాడు కనకారావు. అతను వెంటనే సమాధానం చెప్పలేదు. ఏదో ఆలోచిస్తున్నట్టు మౌనంగా వుండిపోయాడు.
* * * *
"విచిత్రమేమిటంటే డైమలర్, బెంజ్ నివాసాల మధ్య దూరం కేవలం వంద కిలోమీటర్లే అయినా ఎప్పుడూ ఆ ఇద్దరూ కలవలేదు. బెంజ్ వెస్ట్ జర్మనీలో మాన్ హెయిమ్ పట్టణంలో, డైమలర్ కేన్ స్టాట్ పట్టణంలో నివసిస్తూ ఎవరి వర్క్ షాపులు వాళ్ళు నిర్మించుకొని తొలి పెట్రోల్ ఇంజన్ కోసం నిరంతరం శ్రమించేవారు. మొత్తానికి 1886లోనే ఇద్దరూ విడివిడిగానే ఫస్ట్ పెట్రోల్ ఇంజన్ కార్లను కనిపెట్టడం జరిగింది. ప్రపంచంలోం మోటారు వాహనాలు సృష్టించిన మొదటి వ్యక్తులు వీళ్ళిద్దరే! 1886లో లెదర్ బ్రేక్స్ తో తయారుచేసిన మూడుచక్రాల మోటారు వాహనాన్ని నడపడానికి ఒక కెమిస్ట్ షాప్ నుంచి క్లీన్ చేసిన ఫ్లూయిడ్ ని కొన్నాడు బెంజ్" సామంత్ చాలా ఇంట్రెస్టింగ్ గా, ట్రాన్స్ లో వున్నట్లుగా చెప్పుకుపోతుంటే అందరూ ఆసక్తిగా వింటున్నారు. చివరకు అర్జునరావు, పీటర్ లు కూడా వాళ్ళ పథకం గురించి తాత్కాలికంగా మర్చిపోయి సామంత్ చెప్పేది వినడంలో పూర్తిగా లీనమయి పోయారు. "బెంజ్ కనిపెట్టిన మోటార్ వెహికల్ దాదాపు విజయవాడలో తిరిగే రిక్షాలా వుండేది. వెనుక చక్రాలు పెద్దవిగా, ముందు చక్రం చిన్నదిగా వుండి, రిక్షా వెనుకభాగంలో ఇంజన్ వుండేది. ఆ ఇంజన్ నుంచి వెనుక వున్న రెండు చక్రాలకి రెండు చెయిన్స్ బిగించి వుండేవి. 230 కిలోగ్రాముల బరువు వుండే ఆ వెహికల్ పాయింట్ నైన్ హార్స్ పవర్ శక్తిని కలిగి, పాయింట్ నైన్ ఎయిట్ లీటర్ తో ఒక సిలిండర్ ఇంజన్ తో గంటకు 15 కిలోమీటర్లు వేగాన్ని అధిగమించేది. దాన్ని 3000 మార్క్స్ కి అమ్మేదుకు సిద్ధపడ్డారు బెంజ్ (20,000 డి.ఎమ్-80 వేల రూపాయలు) అది ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరూ దాన్ని ఆసక్తిగా చూసేవారే తప్ప కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అయినా బెంజ్ నిరుత్సాహపడకుండా తన పరిశోధనను కొనసాగిస్తూ 1893లో నాలుగు చక్రాల మోటార్ వాహనాన్ని సృష్టించి రోడ్ మీదకు తీసుకువచ్చాడు. దానికి బెంజ్ విక్టోరియా అని పేరు పెట్టాడు. అప్పటికీ అతని ప్రయోగాలకు ఆదరణ లభించలేదు. దాంతో బెంజ్ లోని పట్టుదల రెట్టింపయింది. మరో సంవత్సరానికి అంటే 1894 నాటికి బెంజ్ లెలో అనే పేరుతో లైట్ ఎకానమీ కారుని సృష్టించాడు. దీనికి రివర్స్ గేర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. టూ ఫార్ వార్డ్ స్పీడ్ కలిగివున్న ఈ వాహనం 1.5 హార్స్ పవర్ ఇంజన్ ని కలిగి గంటకు 20 కిలోమీటర్లు వేగాన్ని అధిగమించగలిగేది. మూడు చక్రాల వాహనం కన్నా దీని వేగం అయిదు కిలోమీటర్లు ఎక్కువ. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కమర్షియల్ గా ఎక్కువ సంఖ్యలో ఒక సిరీస్ గా రిలీజ్ అయిన కారు ఇదే. ఇదిలా వుండగా మరోవేపు బెంజ్ కి వ్యాపార శత్రువైన డైమలర్ కూడా రోజు రోజుకి తన పరిశోధనలో ముందడుగు వేయసాగాడు. డైమలర్ రొట్టెలు తయారుచేసి అమ్ముకొనే పేద కుటుంబంలో పుట్టాడు. చదువుకోవాలనే ఆసక్తి, తపనా వున్నా చదివించే స్తోమత తన తల్లిదండ్రులకు లేదని తెల్సుకొని యుక్తవయస్సు రాగానే ఎన్.ఎ.ఓటోన్ గేస్ మోటోరన్ ఫేబ్రిక్ లో కొంతకాలం పనిచేసి డబ్బు కూడబెట్టుకొని దాంతో స్టేషనరీ గేస్ పవర్డ్ ఇంజన్ ని కనిపెట్టాడు. 1882లో విల్ హేమ్ మే బాబ్ అనే యువ ఇంజనీర్ ని తోడుగా తీసుకొని తన పరిశోధనను మరింత ముమ్మరం చేశాడు. డైమలర్ కి గ్రీన్ ఫౌస్ పేరుతో ఒక ఇల్లుండేది. దాన్ని తన వర్క్ షాప్ గా మార్చుకున్నాడు. ఆ మరుసటి సంవత్సరానికే 900 ఆర్.పి.ఎం. శక్తిగల ఇంజన్ ని సృష్టించాడు. |
25,363 | పైకి చెప్పకపోయినా తుఫాన్ గురించి ఎటువంటి వార్తలు తెలుస్తాయోనని అక్కడున్న అందరూ భయపడుతున్నారు. ఎందుకంటే అంతవరకూ అందిన వార్తలనుబట్టి ఇదిమిద్దమని ఏదీ తేలలేదు.
క్రమంగా చర్చలు ముగిసి అందరూ నిద్రకు పడ్డారు. రాజారావుకు మెలకువ వచ్చేసరికి ట్రయిన్ హైదరాబాదు చేరుకోబోతోంది. మెలకువగా ఉన్న మరొకాయన్ని అడిగి లేటు చాలావరకూ కలిసిపోయిందనీ, అర్ధగంటలోపే ఉందనీ తెలుసుకున్నాడు. అయినా అతని మనసాట్టే తేలికపడలేదు. ఆత్రుతగా, భయంగా బయటకు చూశాడతను. హైదరాబాదులో తుఫాన్ వచ్చిన జాడలు కనబడలేదు.
ట్రయిన్ సికిందరాబాదు చేరగానే రాజారావు తెలుసుకున్న మొదటి విశేషం-కృష్ణాఎక్స్ ప్రెస్ గురించి సికింద్రాబాదునుంచి కృష్ణాఎక్స్ ప్రెస్ గుంటూరు వెళ్ళబోతోంది. తమ ట్రయిన్ సకాలంలో అక్కడికి చేరుకుంది.
రాజారావు మనసులోనే భగవంతుడి నభినందించి వెంటనే కాలకృత్యాలు తీర్చుకున్నాడు. ఈశ్వర్రావు కూడాలేచి అంతవరకూ అన్నీ బాగానే ఉన్నాయని ఉత్సాహంగా ఉన్నాడు.
అతనూ కాలకృత్యాలు తీర్చుకుని కాఫీ తాగాడు. వార్తాపత్రికలు రాగానే చాలామంది క్షణాలమీద కొనేశారు. సాధారణంగా రైళ్ళలో వార్తాపత్రికలు ఒకరిద్దరికంటే ఎవ్వరూ కొనరు. అవే కంపార్టుమెంటంతా తిరుగుతాయి. ఇప్పుడైతే ఎవరిమటుక్కు వారికే వెంటనే వార్తలు తెలుసుకోవాలని కంగారుగా వుంది.
రాజారావు పేపరు తిరిగేశాడు.
అతని గుండె నీరయిపోయింది. మనసు పాడయిపోయింది.
కళ్ళలో అప్రయత్నంగా నీళ్ళు తిరిగాయి.
అతని ఆలోచనల్లోంచి ప్రయాణం కాసేపు తప్పుకుంది. సోదరాంద్రులమీదకి అతని ఆలోచనలు మళ్ళాయి?
తుఫాన్ లో పదివేలమంది చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఆ సంఖ్య ముప్పై వేలవరకూ చేరవచ్చునని ఆ పత్రిక అభిప్రాయపడుతోంది.
పత్రికలో ప్రచురించబడ్డ ఫోటోలు కొన్ని హృదయవిదారకంగా వున్నాయి.
అటు జన నష్టంతో పాటు, రాష్ట్రానికి ఆర్ధికంగా కలిగిన దెబ్బ సామాన్యమైనది కాదు. ఉప్పెన వచ్చి ఊళ్ళకు ఊళ్ళే ఎగిరిపోగా ధన, ధాన్య, పశు, జనసంపద- పూర్తిగా నీటిపాలయి పోయింది.
చరిత్రలో కని, విని ఎరుగని ప్రమాదమట ఇది!
పత్రికలో వార్తలకు కరువు లేనట్లుంది.
ఒక పత్రికలో ఆంధ్రదేశం ఇదివరలో గురయిన తుఫాను వివరాలన్నీ సేకరించి ప్రకటించడం జరిగింది.
అవి చదువుతూంటే రాజారావు పత్రికలవాళ్ళూ, దేవుడూ ఒకటేననిపించింది.
ఈ ప్రపంచం వెలిసి సృష్టి నడుస్తూండగా యింత వరకూ ఎన్నో అద్బుత సంఘటనలూ, ఘోర కృత్యాలూ జరిగాయి. అన్నింటికీ దేవుడు సమానదృష్టితో భరిస్తూనే వున్నాడు.
అలాంటి సంఘటనలు ఆయన ఆధిపత్యంలో మళ్ళీ మళ్ళీ జరుగుతూనే వున్నాయి. ఆయన నిర్లిప్తత వహిస్తూనూ వున్నాడు.
పత్రికలూ అంతే!
ఘోరాతి ఘోరమైనవీ, మహదానందకరమైనవీ__ఏమైనా వార్తలు ప్రకటిస్తాయి. ప్రజలకు సమాచారాన్నందిస్తాయి.
అత్యంత విషాదకర వార్త ప్రచురించిన పేజీలోనే సినిమా విడుదలయిందని కూడా ప్రకటిస్తాయి. ఎవరి అభిరుచులను బట్టి వారు ఆయా వార్తలు చదువుకుంటారు.
ఒక దురదృష్టకర సంఘటనను ప్రజలు చలించి పోయేలా వర్ణించిన ఒక పత్రిక దుఃఖభారంతో ఆగిపోదు. మరునాడు మరో ఆనందకర వార్తను ప్రకటించి అలా కొనసాగుతూనే వుంటుంది
వార్తలతో ప్రజలను చలింప చేయటమే కానీ వార్తలకవి చలించవు. |
25,364 |
అందుకే ఏమీ ఆలస్యం చేయకుండా అతనివంక చూసి నవ్వాను.
"అంటే నచ్చానన్నమాట" అతను రిలీఫ్ గా ఫీలవడం తెలుస్తూనే వుంది.
మా మాటలకు స్పీడ్ బ్రేకర్ లాగా పంటకాల్వ అడ్డొచ్చింది.
కాల్వదాటుతూ అతను తూలిపడబోయాడు. అనాలోచితంగానే ఠక్కున చేయి అందించాను. నా చేతి ఆసరాతో నిలదొక్కుకున్నాడు. నా చేయి వదలకుండానే కాల్వ దాటాడు.
అప్పుడు నేనేమైపోయానో నాకిప్పటికీ గుర్తే. పూరేకుల మధ్య నా శరీరాన్ని వత్తేసినట్లు పులకింతలాంటిది ఒళ్ళంతా పాకినట్లు నాకిప్పటికీ జ్ఞాపకమే.
తిరిగి నడక సాగించాం.
మా పొలాలకు కంచెలాగా రైల్వే ట్రాక్ వుంది. అక్కడి కెళ్ళి వంతెన కింద నిలబడ్డాం.
"ఇదిగోండి - ఇవే మా పొలాలు" అన్నాను.
ఆయన నానుంచి బలవంతంగా కళ్ళు తిప్పి చూసాడు.
"ఇది వంతెనలా లేదు. మనకోసం దేవతలు వేసిన పందిరిలా వుంది" అన్నాడు.
నేను చిన్నగా నవ్వాను.
"మీ నవ్వు ఎంత బావుందో తెలుసా? పౌర్ణమిరోజున మంచు శిఖరం మీద ఒంటరిగా నిలబడి వున్నప్పుడు ఆకాశంలోని మల్లెపూల వాన కురిస్తే ఎలా వుంటుందో అలా వుంది" అన్నాడు.
సిగ్గుతో ముఖాన్నంతా ఎరుపు చేసుకున్నాను.
అతని చూపులు నన్ను తడుముతున్నట్లే వుంది. నాకు బట్టలు లేని చోట్ల అతని నాలుకతో అద్దుతున్నట్లే వుంది నాకు ఇక అక్కడ వుండడం సాధ్యం కాదనిపించింది. "రండి! వెళదాం" అన్నాను.
ఏవో రెండు మూడు పొడిమాటలతో ఇల్లు చేరుకున్నాం.
అప్పటికి బస్సు టైమైంది.
"ఉండండి శకునం బాగా లేనట్టుంది. నీళ్ళు తీసుకొస్తాను" అని చెప్పి వదిన లోపలి కెళ్ళింది.
అలా అతన్ని ఊరకనే వీధిలో నిలబెట్టడం బాగుండదనిపించి "ఏమైనా మరిచిపోయారేమో చూసుకోండి" అన్నాను.
అతను సీరియస్ గా చొక్కా జేబులు, ప్యాంటు జేబులూ తడుముకుని "అవును చాలా విలువైనది మరిచిపోయాను" అన్నాడు.
నేను కంగారుగా "ఏమిటి?" అని అడిగాను.
"మనసు" అన్నాడు నా ముందుకి జరిగి చిన్నగా.
"అదయితే పెళ్ళిపీటల మీద ఇచ్చేస్తాన్లెండి" అన్నాను.
అంతలో వదిన వచ్చింది. అతను నీళ్ళు తాగి "వెళ్ళొస్తానండి" అని బయల్దేరాడు.
వీధి మలుపు తిరిగేవరకూ అక్కడే వుండి, ఆ తర్వాత లోపలికి వచ్చాం.
"పొలాల వెంబడి షికారు కెళ్ళారు కదా! ఏం మాట్లాడుకున్నారు?" అనడిగింది వదిన.
"ఏవో రెండు మూడు మాటలు"
"మీ ఇద్దరికీ ఏకాంతం కల్పించడానికే అలా పంపించాను. పెళ్ళికి ముందు ఎంతో కొంత పరిచయముంటేనే ఎదుటి వ్యక్తి మీద ఆకర్షణ పుడుతుంది. రెండు నిముషాలు పెళ్ళి చూపుల్లో గుర్తుంచుకోవడానికి, నెమరువేసుకోవడానికి ఏం వుంటుంది? అందుకే పెళ్ళి చూపుల్లో ఇద్దరికీ ఏకాంతం కల్పించాలి, వాళ్ళిద్దరి మధ్యా ఏదో జరిగినప్పుడే ఇద్దరూ పెళ్లెప్పుడా అని ఎదురు చూస్తారు. రెండు నిముషాల పరిచయమే అయినా రెండు జన్మల అనుబంధాలా తోస్తుంది కానీ చాలా ఇళ్ళల్లో యిలాంటివి అనుమతించరు. అందుకే పెళ్ళన్నా అమ్మాయిలో కానీ, అబ్బాయిలో కానీ ఉత్సుకత వుండదు. ఏదో యిది తప్పని తతంగంలా అనిపిస్తోంది.
వయసులో చిన్నదే అయినా బుర్రలో పెద్దదనిపించింది మా వదిన. ఆమె చెప్పింది అక్షరాలా నిజం. మేం అలా షికారు కెళ్ళడం ప్రతిక్షణమూ గుర్తు వచ్చేది.
తల వంచుకుని ఇల్లు ఊడుస్తుంటే నిశ్శబ్దంగా నా వెనకే అతను వచ్చి బొడ్లో దోపుకున్న పైటకొంగును లాగినట్లే వుండేది. ముంగిట్లో ముగ్గులు పెడుతుంటే వెనకే వచ్చి నా కళ్ళను మూసినట్లే తుళ్ళిపడేదాన్ని బావిలోంచి నీళ్ళు తోడుతున్నప్పుడు అతను నా ఎదురుగా నిలబడి నీళ్ళు పోయామని దోసిలి పట్టినట్టే ఊహించేదాన్ని.
రాత్రి చంద్రవంక కింద పడుకున్నప్పుడు అతను నా నడుం మడతల్లో ముత్యాలను కుమ్మరించి చక్కలిగింతలు పెట్టినట్లే భ్రమించేదాన్ని.
కాల్వదాటుతున్నప్పుడు అతను చేయి పట్టుకోవడం గుర్తు వస్తే ఇక ఏ పనీ చేయాలనిపించేది కాదు. రక్తమంతా దేనికోసమో శరీరంలో ప్రదక్షిణలు చేసేది. ఎద అంతా బరువుగా శృంగార ప్రబంధాన్ని అక్కడ ఒత్తుకున్నట్లు అనిపించేది. కళ్ళు మరో లోకంలో తెరుచుకుని ఊహల పట్టుచీరకు కలల జరీ అంచును నేసేవి.
ఇటువంటి రెండు ఉత్తరాలు అటు వెళ్ళడం - అటునుంచి రెండుజాబులు ఇటు రావడంతో పెళ్ళి ఫిక్సయి పోయింది.
నా ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
చాలా రోజుల్నుంచే పెళ్ళి హడావుడి మొదలయింది. నెల్లూరులోని ఓ సత్రంలో పెళ్ళి. ఆ రోజు సాయంకాలం నాలుగు గంటలకల్లా మేము నెల్లూరుకు చేరుకున్నాం. సత్రంలోని ఓ గదిలో మకాం. అతన్ని చూడాలన్న బలమైన కోరిక నేను కట్టుకున్న పట్టుచీర కంటే బరువుగా తయారయింది.
కానీ వీలుపడలేదు.
రాత్రి పదిగంటలప్పుడు ఆయన్ని నలుగు పెట్టడానికి పెళ్ళి పందిట్లోకి తీసుకొచ్చారు. అప్పుడే చూశాను. ఏదో ఆత్మీయతా భావం జీవితంలో మొదటిసారిగా ఫీలయ్యాను.
తెల్లవారుజమున మూడుగంటలకి పెళ్ళి. పెళ్ళి పీటలమీద కూర్చున్నప్పుడు మధ్యలో ఆయన "ఏది నా మనసు? పెళ్లి పందిట్లో తిరిగి ఇచ్చేస్తానన్నావ్" అని అడిగాడు.
"ఈ రాత్రికి శోభనం గదిలో తమలపాకు చిలకతో చుట్టి ఇచ్చేస్తాన్లెండి" అన్నాను.
"ఈ పెళ్ళి పందిరి కాస్తా పట్టెమంచం అయిపోయి, ఆహుతులంతా అదృశ్యమైపోతే బావుండు" అన్నాడు.
"ఎవరు మాయమై పోయినా మన పెళ్ళి జరిపిస్తున్న పురోహితుడు మాత్రం అదృశ్యం కాడు. దక్షిణ ఇచ్చేదాకా కదలడు"
ఇలా మేమిద్దరం పెళ్ళి పందిరిలోంచే మాట్లాడడం మొదలుపెట్టాం. మేమిద్దరం కొత్తవాళ్ళం కామన్న ఫీలింగ్ పెళ్ళిచూపుల్లో మామధ్య జరిగిన రెండుమూడు సంఘటనలవల్ల ఆ భావం కలిగిందనుకుంటాను. మా వదినకు మనసులోనే థాంక్స్ చెప్పుకున్నాను.
మధ్యాహ్నం భోజనాలయ్యాక బంధువులంతా వెళ్ళిపోయారు. నాన్న, అమ్మ, అన్నయ్య, వదినలు మొదటిరాత్రి ఏర్పాట్లు చూడడానికి మావూరు చేరుకున్నారు.
రాత్రి ఏడుగంటల ప్రాంతాన మేము సత్రం నుంచి వూరికి కారులో బయల్దేరాం. నేనూ, ఆనంద్ వెనక సీట్లో కూర్చున్నాం. డ్రయివర్ ప్రక్కన మా చిన్నాన్న కూర్చున్నాడు. |
25,365 |
"ఏమ్మా.... నేను ఉతక్కూడదా?" అలకగా అడిగింది.
"నాకు చేతులున్నాయి" కోపంగా చెప్పి బావి దగ్గరకు వెళ్ళాడు గణపతి.
నాగు కూడా వెళ్ళి, "బావా సినిమాహీరో అవుతావటకదా! హైదరాబాద్ వెళ్ళేటప్పుడు నన్నూ తీసుకెల్తావా?" వయ్యారంగా నిలబడి అడిగింది. పైట ఉండాల్సిన స్థానంలో లేకపోవడంతో గణపతి చిరాగ్గా వెనక్కి వీపు ఆమెవేపు పెట్టి కూర్చుని షర్టు విప్పి నీళ్ళల్లో తడిపాడు.
"అటు తిరిగావేం?" అడిగింది.
"ఔను మరి నీకు లేదుగా సిగ్గు?" అన్నాడు.
ఆ మాటకి పెద్దగా నవ్వి, "బావా నీ వీపు చలువరాతి గచ్చులా మెరుస్తోంది" అంది.
"ఛి! ఛీ! ఇంట్లోకి పో... నీకేం పనిలేదూ?" అని కోపంగా దండెం మీదున్న తువ్వాలుతీసి కప్పుకున్నాడు గణపతి.
"అంత సిగ్గేమిటి నీకూ! నేను నీతో మాట్లాడదామని వస్తేనూ!" అంటూ వచ్చి అతని ఎదురుగా చప్టామీద కూర్చుంది.
ఆమె చూపులు తన ఒంటిని సూదుల్లా పొడుస్తుంటే తెగ ఇబ్బంది పడ్డాడు గణపతి.
"నేను సినిమాల్లోకి పనికివస్తానా, బావా?" అడిగింది జడ తిప్పుకుంటూ.
గణపతి ఆ మాటకి తలెత్తి చూశాడు! కళ్ళకి ఒత్తుగా కాటుకపెట్టి, చివర్లు కొమ్ముల్లా దిద్దింది. బొట్టు పొడుగ్గా పెట్టి కింద మూడుచుక్కలు పెట్టింది. అరచెయ్యి మందాన పౌడరు అద్దింది. ఇదంతా సినిమాల్లో చేరాలనేనన్నమాట అనుకున్నాడు.
"పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు! నీ ఒంటికవేం పనికిరావుగానీ వెళ్ళు" అన్నాడు.
"నా ఒంటికి ఇంకేం పనికివస్తాయో చెప్పు!" చన్నీళ్ళు అతనిమీద జల్లుతూ అంది.
"ఏయ్.... వద్దు..... వద్దంటుంటే!" గణపతి అరుస్తున్నాడు.
"మరి చెప్పు! లేకపోతే ఈ బొక్కెననీళ్ళు నీ నెత్తిమీద పోస్తాను" నవ్వుతూ అంది.
"నీకే చెప్పేది.... చెప్తే అర్ధం కాదా? మనిషిని కాదా?" అరిచాడు.
"కాదు, దేవతని! నాగు నిజంగానే నీళ్ళతో వున్న బొక్కెన ఎత్తి అతని దగ్గరకొచ్చింది.
గణపతి "ఏయ్.... ఆగు!" అంటూ ఆమె చెయ్యి పట్టుకున్నాడు ఆమె బొక్కెన వదిలేయడంతో నీళ్ళన్నీ చింది యిద్దరిమీదా పడ్డాయి.
"అయ్యో! అయ్యో! ఏమిట్రా అదీ!! పెద్దాళ్ళు ఎవరూ లేకుండా చూసి పిల్లతో సరసాలాడుతున్నావా?" అంటూ అరుస్తూ వచ్చింది వెంకాయమ్మ.
"నేనేం సరసాలాడటంలేదు" కోపంగా అన్నాడు గణపతి.
"నా కళ్ళముందే పిల్ల చెయ్యి పట్టుకుని, పైగా సరసాలాడటం లేదంటావా.....నాకేం కళ్ళు కనిపించడం లేదనుకుంటున్నావా?" అరిచింది వెంకాయమ్మ.
శాంత బయటకొచ్చి, ఏమైందమ్మా?" అంది.
"చూడవే, నీ మేనల్లుడు.... పిల్లమీద నీళ్ళుపోసి ఒళ్ళంతా తడిపాడు పైగా నా కళ్ళముందే చెయ్యిపట్టుకుని ఎదిరించి మాట్లాడుతున్నాడు" అంది వెంకాయమ్మ.
గణపతి వెంటనే నాగు చెయ్యి వదిలిపెట్టేసి "అది కాదత్తయయా జరిగిందీ.....నేను బయటకెళ్తుంటే వచ్చి సీసా మూత తీయాలని మూత తీసే వున్న సీసా ఇచ్చింది. నూనె షర్టుమీద పడితే ఉతుక్కుంటున్నాను. ఇంతలో తనూవచ్చి నా మీద నీళ్ళుప్సోతుంటే కోపంవచ్చి పట్టుకుని ఆపాను" అన్నాడు.
"అమ్మో.... అమ్మో.... ఎన్ని కథలు చెపుతున్నాడూ? ఔను సినిమా పిచ్చోడు కదా! ఎన్నయినా చెప్తాడు. ఇది పల్లెటూరు. ఇలా ఈడొచ్చిన పిల్లతో వీడు సరసాలాడుతున్నాడని తెలిశాక యీ పిల్లని ఎవడయినా చేసుకుంటాడా?" గొంతు పెంచి అరిచింది వెంకాయమ్మ.
"నువ్వే అరుస్తున్నావు.... గొంతు తగ్గించు...." కోప్పడింది శాంత.
"నీకు ఎప్పుడూ నా తప్పులు పట్టడమే కానీ, ఇంట్లో ఆంద్రబ్బగా ఉన్న పిల్లలని అదుపులో పెట్టడం రాదు. నన్నే ఆన్నావు కానీ, నీ ఎదురుగా ఉన్న నీ అల్లుణ్ణి ఒక్కమాటయినా అన్నావా? ఈరోజు చెయ్యిపట్టుకున్నాడూ..... రేపు ఇంకోటి చేస్తాడూ!" అరిచింది వెంకాయమ్మ.
ఈ అరుపులకి ఇంట్లో జనమంతా పెరట్లోకి వచ్చారు.
"మా ఇంటి ఆడపిల్లలకి ప్రేమలూ, దోమలూ ఈ సరసాలూ తెలియవమ్మా! ఏదో పెద్దమ్మగారి ఊరు చూస్తానని సరదాపడితే తీసుకొచ్చాను. ఈ త్రాష్టుడు దాని వెనుకపడ్డాడు. రేపు దాని తల్లిదంద్రులకి నేనేం సమాధానం చెప్పుకోనూ?" గట్టిగా చేతులు తాటించి శోకాలు పెడుతూ కళ్ళు కొంగుతో తుడుచుకుంటూ అంది వెంకాయమ్మ.
గిరి అంతా విని, కోపంగా ముందుకు వచ్చి గణపతి మెడమీద చెయ్యి వేసి, "నీ కెంత ధైర్యంరా? నా మేనకోడలి మీదే చెయ్యి వేస్తావా? తాట వలుస్తా!" అని రంకెలు వేశాడు.
రాధ ఆపుకోలేక "బావ అలాంటివాడు కాదు!" అంది.
గిరి ఆమెను ఎర్రగా చూస్తూ "అంటే నేను అలాంటి వాడిననా? చూశావా అక్కా దాని పొగరూ?" అన్నాడు.
గణపతి వెంటనే "రాధని 'అదీ ఇదీ' అన్నావంటే మర్యాద దక్కదు!" అన్నాడు.
"ఏం చేస్తావురా?" అంటూ గిరి గణపతి మీద కలబడ్డాడు.
గణపతి కూడా ఊరుకోకుండా అతని దెబ్బలు తప్పించుకుంటూనే తలతో గిరి పొట్టలో పొడిచి కింద పడేసి, మీద కూర్చున్నాడు.
"గణపతీ! ఆగు! ఏమిటది? గిరీ! వూరుకోరా....!" అంటూ శాంత మధ్యలోకి వెళ్ళబోయింది.
గిరి లేస్తూనే గణపతిని ఒక్క తోపు తోయడం వల్ల అతడు వచ్చి శాంతని ఢీకొని ఆమెని కిందపడేశాడు. కిందపడ్డ శాంత నుదుటికి బొక్కెన కోన గుచ్చుకుని బొటబొటా రక్తం కారింది.
"అయ్యో... వీడు నా కూతుర్ని కూడా చంపేస్తున్నాడురా దేవుడోయ్!" అంటూ వెంకాయమ్మ పరిగెత్తి శాంతని లేపింది.
"పిన్నీ... పిన్నీ!" అంటూ రాధ వెళ్ళి చెయ్యి వెయ్యబోతే, "అవతలికి తప్పుకోండి! మీ వల్లే నా కూతురికి ఇంత దెబ్బ తగిలింది దూరంగా పొండి! ఈ రోజు అల్లుడుగారు రాగానే నాకూతురు ఈ కొంపలో ఉండాలో, అక్కర్లేదో తేల్చేస్తాను!" అని కేకలు పెట్టింది వెంకాయమ్మ.
శాంత బాధగా "అమ్మా... అమ్మా!" అంటూ మూల్గింది.
"అమ్మని ఉన్నాను కాబట్టే సరిపోయిందీ తల్లీ! లేకపోతే నీ గతి పట్టించుకునే వారెవరీ కొంపలో!" అంటూ గిరి సాయంతో శాంతను లోపలికి తీసుకెళ్ళింది వెంకాయమ్మ. |
25,366 |
"అర్థంకావడం లేదు." " ఏమిటి ఎస్పీ?" స్థిమితంగా నవ్వాడు అప్పారావు . "ఏమిటి అర్థంకానిది?" "మేనక ఆకేసుల్ని తిరగదోడటమేమిటి? ఆమెకి ఆ విషయాలే తెలీవుగా?" " ఇప్పుడు తెలియాలి శ్యాంసుందర్ . పీడితుల్ని ఉద్దరించడానికి కంకణం కట్టుకున్న ఆడదిగా! ఆ ఫైలు మేనక్కి ఇచ్చి అయిల్నాయుడి మీదకిఉసిగొలుపు." "కాని...... " ఏదో చెప్పబోయాడు ఎస్పీ. " అలస్యం చేయకు శ్యాంసుందరూ . సమస్యఅర్జెంటుగా పరిష్కారం కావాలీ అంటే అలాంటి పాము పుట్టని తవ్వించాలి. తప్పదు." ఆసాయంకాలం ఎస్పీ సరాసరి ఏ ఎస్ పి మేనక చాంబర్ కి వచ్చాడు. అవాక్కయ్యింది మేనక. "జరిగిందానికి సిగ్గుపడుతున్నాను" అన్నాడు మరెటోచూస్తూ. నిర్విణ్ణలైనా చూసింది. " దశాబ్దాల తరబడి ఆత్మవంచనతో ఉద్యోగాలు వెలగబెట్టిన తరం మాది. అందుకే రాజకీయ నాయకుల ముందు తల ఒగ్గి బ్రతకడం అలవాటయింది. బాగా ఆలోచించాక అనిపించిందొక్కటే మేనకా. భ్రష్టుపట్టిన మా తరంలో నీలాంటి యువత కలిసిపోకూడదు. ఎస్." ఓ ఫైలు ఆమె ముందుంచాడు. ఏం చేయాల్సీంది చెప్పాడు. అతని మాటల్లో నిజాయితీకి, అణువంత మంచితనానికీ సైతం స్పందించే అమ్మాయిగా కదిలింది తప్ప మరో డైనమైట్ ఇలా ప్రత్యర్థితో బలమైన పోరాటానికది అంకురమని అర్థంగాని మేనక..... మిస్ మేనక ఐ.పి.యస్. * * * *
అర్థరాత్రి దాటింది. అయినా మేనక ఇంటికి వెళ్ళిపోలేదు. ఎస్పీ ఇచ్చిన ఫైలునే స్టడీచేస్తూంది.
లిక్కర్ బేరన్ గా పేరుగాంచిన అయిల్నాయుడు లేండ్ గ్రేబింగ్ లో చాలా సంపాదించాడు.వ్యవహారంలో శ్రమపడి సంపాదించిన డబ్బుతో ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళెందరో అయిల్నాయుడు మూలంగా అన్యాయమైపోయారు. కొందరి ప్లాట్లలో బలవంతంగా తన మనుషులచేత గుడిసెలు వేయిస్తాడు. ఇది న్యాయం కాదని మొరపెట్టుకుంటే చదరపు గజం వందరూపాయలకి కొన్నవాడికి అయిదు రూపాయలే చెల్లిస్తాడు. కొన్న ధరైనా ఇమ్మని ప్రాధేయపడితే ఆ అయిదు రూపాయలు కూడా ఇవ్వడు. గూండాలచేత కొట్టిస్తాడు. పోలీసు కంప్లేయింటు ఇస్తే చంపుదతానని బెదిరిస్తాడు.అలా అతనికి ఎదురుతిరిగిన వాళ్ళు కొందురు సాక్ష్యం చెప్పే అవకాశం సైతం లేకుండా శవాలయ్యారు. కొందరు ఏక్సి డెంట్స్ లో పోతే, మరికొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. కాదు, అలా నిర్ధారించారు వాళ్ళ మరణాలను. ఒక ట్రక్ ట్రైవరుగా జీవితం ప్రారంభించిన అయిల్నాయుడు , ఇప్పుడు కోటిశ్వరుడు..... అటు పోలీసు వ్యవస్థనీ, ఇటు రాష్ట్ర్రాన్నీ పాలించే అధికారపార్టీ ప్రముఖుల్ని డబ్బుతో అదుపుచేస్తుంటాడు ఇంటలిజెన్స్ రిపోర్టు పుష్కలంగా ఉన్నా నేరస్థుడుగా నిరూపించగల ఒక్క ఆధారమూ లభించలేదింతవరకూ. అదికాదు మేనకని అంతగా కదిలించింది, లిక్కర్ కింగ్ గా ఓ దశాబ్ద కాలంనుంచి రాష్ట్ర్రంలో పెరిగిపోయిన అయిల్నాయుడు ఏ ఏటికాయేడు ఎక్కువ లాభాలు సంపాదించుకునే వీలుకల్పిస్తూ ఎక్సైజ్ పన్నుల మినహాయింపులాంటి " రిస్ట్ర్రక్టర్ " తో ఆ డిపార్ట్ మెంటు చాలా సహకరించింది. అలా ప్రభుత్వాన్ని అదుపు చేయగలిగిన అయిల్నాయుడు ఇప్పుడు ప్రజల ఆరోగ్యం గురించి అలమటింటిపోతున్నట్టు అధునాతనమైన హాస్పిటల్ కట్టిస్తున్నాడు. "లీగాలిటీ" తో సంబంధం లేకుండా ఆ హాస్పిటల్ పరిసరాల్లోని చాలా జాగాని ఆక్రమించుకున్నాడు. సాలోచనగా తల పైకెత్తింది. ఒయట దట్టంగా ఆవరించిన చీకటి. ఎవర్ని నిందించాలి? భయంతో ఎదుర్కోలేని బాధితుల మొరని కాగితాలకే పరిమితం చేస్తే అదుపుచేయగల చట్టం అతని "స్ట్ర్రాంగ్ ఆర్మ్ టేక్ట్ క్స్" కిమూగదైపోయింది.
పీడితులైన ప్రజలకోసం మేమున్నది అనే విషయం పాలితులకీ పట్టదు. లోతుగా ఆలోచించగల మేధావివర్గమూ జక్యం చేసుకోదు. రోజుకు రెండు రూపాయలకూలితో బ్రతుకు ప్రారంభించి, రెండు దశాబ్దాల కాలంలో సుమారు రెండువందలకోట్ల ఆస్తిని అయిల్నాయుడు ఎలా సంపాదిచాడూ అన్నది పరిశోధించి తెలుసుకోవాల్సిన టాక్స్ డిపార్టుమెంటుకీ పట్టదు. ఇదీ భారతం! ఆ భారతంలో తనూ ఒక మనిషే అయినా అందిరిలా విశ్రమించదు. గెలుపూ ఓటమి ప్రసక్తికాదు-కనీసం పోరాటానికి సిద్ధపడాలి . ప్రపంచాన్ని సంస్కరించగల శక్తి తనకు లేరకపోయినా , కనీసం ఏ ఒక్క వ్యక్తికైనా న్యాయం జరిగేట్టు చూడాలి. అలాంటి న్యాయం మరి కొందరికి మార్గదర్శకం కావచ్చు. అయిల్నాయుడులాంటి వ్యక్తుల చేతులకు ఫుల్ స్టాప్ కాకపోయినా ఓ " కామా" లా అయినా పనిచేయవచ్చు. |
25,367 |
అక్కడి రత్నకంబళ్ల మీద రంగురంగుల చీరలు కట్టిన సుందరాంగులు సీతాకోక చిలుకల్లా పడుకుని వున్నారు. మధుపానోన్మత్తలైన వారు రతిక్రీడల్లో అలసిపొలసిపడి పున్నాడు. హంసలు నిద్రిస్తున్న తామరకొలనిల వుందా భవనం. వాళ్లందరికీ మధ్యపడుకుని వున్న రావణుడు చుక్కల్లో చంద్రునిలా వున్నాడు. విశలైన వారి ఆభరణాలు ఎగుడు దిగుడుగా పడి వున్నాయి. కొందరి అందెల పిక్కలదాకా ఎగబాకాయి. కొందరిఅందెలు పిక్కలదాకా ఎగబాకాయి. కొందరి హారాలు పక్కలకు వ్రేలాడాయి. కొందరికి ముత్యాల హారాలు నిద్రిస్తున్న తెల్లహంసల్లా వున్నాయి. కొందరి భూషణాలు జారిపోయిన మృదువైన అంగాలమీదా, కుచాలమీదా వాటి వత్తిడివల్ల కలిగిన నొక్కులు ఇంకా భూషణాలున్నట్లే కనిపిస్తున్నాయి. మత్తులోనూ, నిద్రలోనూ వున్న ప్రమదలు కొందరు రావణుని ముఖాలే అనుకుని సవతుల ముఖాలు చుంబిస్తున్నాయి. ఒకతె రొమ్ము మీద తలపెట్టుకుని ఒకటె పడుకుంది. దానిమీద చెయ్యివేసుకుని వేరొకతె పడుకుంది. దాని పిరుదులమీద తలపెట్టి ఒకతె పడుకుంది. దాని చేతులమీద తల ఉంచుకుని ఇంకొకతె నిద్రిస్తూంది. అలా కలగాపులగంగా పడుకుని వుండడం వల్ల ఏచెయ్యి ఎవరిదో, ఏ నగ ఎవరిదో , ఏ వస్త్ర్రం ఎవరిదో ఎవరిదో చెప్పడం కష్టంగా వుంది. వా రిలో రాచకన్యలు వున్నారు. అప్సరసలున్నారు. గంధర్వాంగనులున్నారు. రాక్షసకన్యలూ వున్నారు. వారినందరినీ రావణుడు యుద్దాల్లో పట్టితెచ్చాడు. అయినా వారందరికీ రావణునిమీద అమితమైన ప్రేమ.
వారందరినీ చూశాడు హనుమంతుడు. ' వీరంతా రావణుడితో సుఖిస్తున్నారు. సీత కూడా రాముడితో ఇలాగే లుఖిస్తుంటే ఎంత బావుండేది? అనుకున్నాడు. మరిన్నీ, గుణవంతురాలైన సీతను ఈ రావణుడు పట్టితెచ్చాడే! అని విచారించాడు.
ఇంకొకచోట హనుమంతునికి ఒక గొప్ప మంచం కనిపించింది. అది ఏనుగు దంతంతోనూ బంగారంతోనూ చేయబడింది.దానికగల శ్వేతఛ్చత్రం చంద్రబింబంలా మెరుస్తోంది. ఆ మంచం చుట్టూ నుంచొని అందాలొలికే అతివలు కొందరు వింజామరులు వీస్తున్నారు. దానిమీద పరడుకుని నిద్రలో మునిగి వున్నాడు. రావణుడు.మదగజంలా పడుకున్న రావణుణ్ని ఒక్క అడుగు వెనక్కు వేశాడు హనుమంతుడు.
రావణుని భుజాలు ఇంద్రధ్వజాల్లా వున్నాయి. వాటిమీద వజ్రాయుధపు దెబ్బల గుర్తులూ, సుదర్శన చిహ్నాలు వున్నాయి. ఆ చేతులు పడకమీదికి పాకుతున్న అయిదు తలలత్రాచుల్లా వున్నాయి.అవి మందర పర్వతగుహల్లో నిద్రిస్తున్న విషసర్పాల్లా' వున్నాయి.
రత్నాలు పొదిగిన అతని కిరీటం నిద్రలో పక్కకి ఒరిగి వుంది. రత్నకుండల కాంతులు చెక్కిళ్లమీద తాండవిస్తున్నాయి. అతని వక్షస్థలం రక్తచందనంతోనూ, చంద్రహారాలతోనూ మల్లెదండలతోనూ, ముత్యాల పేర్లతోనూ నిండి వుంది. కాలసర్పం బుసలు కొట్టేస్తున్నాయి. అతని ఉచ్చ్వాస విశ్వాసలు. అతడు గంగానదిలో పడుతున్న మదగజంలా వున్నాడు. అతని భార్యలు చంద్రబింబాల్లా అతని కాళ్లకింద పడుకుని వున్నారు. వారిలో ఒకతే నృత్యభంగిమలో నిద్రించింది. మరొకతె నావను చుట్టబెట్టుకున్న పద్మలతలూ వీణను కౌగిలించుకుని నిద్రిస్తూంది. చంటిపిల్లను పక్కలో పెట్టుకుని నిద్రస్తున్నట్టు ఒకతె మడుకం అనే వాద్యాన్ని చంకలో పెట్టుకుని నిద్రిస్తూంది. ఒకతె చిరకాలానికి చేజిక్కిన ప్రియుణ్ణి కౌగిలించుకున్నట్లు పటహాన్ని కౌగిలించుకుంది. వేరొకతె కామోద్రేకంతో ఏకాంతాన కాముకుణ్ణి కౌగలించుకున్నట్లు వీణను కౌగలించుకుంది. ఒకతె బంగార కామోద్రేకంతో ఏకాంతాన కాముకుణ్ణి కౌగిలించుకున్నట్లు కౌగిలించుకుంది. ఒకతె బంగారు కుండల్లాటి తన పాలిండ్లను తానే పట్టుకుని పడుకుంది. ఇంకొక లతాంగి మరో చంద్రవదనను కౌగిలించుకుని నిద్రిస్తూంది.
వారందరిమధ్య ఘనమైన ప్రత్యేక శయ్యమీద మరొక అతివ నిద్రిస్తూంది. ఆ ఇంతటికీ ఆమె శోభ కలిగిస్తూంది. స్వర్ణమూర్తిలా వున్న ఆ యువతి మండోదరి. ఆ రూపమూ, ఆ సొగసూ చూసి ఆమె సీత అనుకున్నడు హనుమంతుడు.ఎగిరి గంతులు వేశాడు. చిందులు తొక్కాడు. స్థంబం తగిలి క్రింద పడిపోయేంతపని అయింది.
అలా ఎగిరి గంతులు వేస్తున్న హనుమంతునికి చప్పున ఒక ఆలోచన వచ్చింది. "సీత రాముని బాసి నిద్రించదు. భుజించదు. అలంకరించుకోదు. మద్యం పుచ్చుకోదు. (న రామేణ వియుక్తసా రోస్వప్తుమర్హతి భామినీ, నభోకుం నాప్యలంకర్తుం నపాన ముపన సేవితుమ్) కనుక ఈ స్త్ర్రీ యెవరోగాని సీత కాదు." అని నిశ్చయించుకొని సీత కనిపించలేదని మళ్లీ దుఃఖించాడు. పానశాలలో వెతకడానికి బైల్దేరాడు.
ఆ పానశాలలోని పదార్దాలు లేవు.అక్కడ అన్ని రకాల మాంసాలూ, మద్యాలూ వున్నాయి. ఫలజాతులు, పూలు,పూల దండలూ గుట్టలుగా పడివున్నాయి. సాగరమధన కాలంలో పుట్టిన మద్యం అంతా బంగారు గాజుల్లోను, వెండి గాజుల్లోను వుంది. కొన్ని కలశంలలో సగం సగం పుచ్చుకున్న మద్యంవుంది. కొన్ని పాత్రల్లో పోసినమద్యం పోసినట్లేవుంది. కొన్ని పానపాత్రలు బద్దలైనాయి. కొన్ని దొర్లుతున్నాయి. అక్కడి యువతులలో కొందరు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పడుకుని వుండగా కొందరు విడిపోయిన తమ బట్టలు విడిపోయింది. కూడా తెలియకుండా నిద్రపోయారు. వారి సన్నని వలిపాలూ పూరేకులూ వారి నిట్టూర్పుగాలులకు కదులుతున్నాయి.అలా పడుకున్న వారిలో కొందరు నల్లగాని, కొందరి పసిడిఛాయ గలవారూ,కొందరు ఛామనఛాయ గలిగినవున్నా అందరూ మంచి వయసులో వున్నారు. ఇటు నిద్రవల్లా అటు మద్యపానంవల్లా స్పృహ లేకుండా పడివున్న ఆ వనితలు వెదజల్లబడిన తామరాకలువల్లా వున్నారు.
హనుమంతుడు రావణాంతఃపురం అంతా వెదికాడు. ఇలా పర స్త్ర్రీలను పరికించడం తనకు ధర్మమేనా? అని ఆలోచించడా హనుమంతుడు. "అయితే నేను వారిని బుద్దిపూర్వకంగా చూడలేదు.వీరిని చూడ్డంవల్ల నా మనస్సులో కలవరపాటు లేదు. ఏ ఇంద్రియం పనిచేయాలన్నా మనస్సు పనిచేయాలి. నా మనస్సు నిర్మలంగానే వుంది" అని ధైర్యం తెచ్చుకున్నాడు.
రామాయణంలో ఆరు కాండలున్నాయి. ఉత్తరకాండ సహితంగా ఏడుకాండలు అవుతాయి. కాండాలన్నింటికి కథ జరిగిన ప్రదేశాన్ని బట్టి గాని, ప్రధాన సంఘటనలను బట్టిగాని పేర్లు పెట్టడం జరిగింది. రాముడు బాలుడుగా వున్నప్పుడు కథ బాలకాండ. అయోధ్యలో జరిగింది అయ్యోద్యకాండ. అడవిలో జరిగింది. అరణ్యకాండ. కిష్కింధలో జరిగింది కిష్కింధకాండ.యుద్ధం జరిగింది యుద్ధకాండ.పట్టాభిషేకం తరువాత జరిగిన కథ అత్తర కాండ.
సుందరకాండ అలాకాదు. అది జరిగిన స్థలం లంక. ఇది లంకా కాండ కావాలి కాని దీనికి సుందరకాండ అని పేరు పెట్టాడు.ఎంచాతంటె ఈ కాండ సుందరం అయింది.అందమైనది. సొగసయినది. సోయగంగలది.
సుందరకాండలో కథ తక్కువ వర్ణన లెక్కువ. కవి ఈ కాండము వర్ణనలతో నింపేశాడు. సుందరమూ, సులభమూ,మనోహరమూ అయిన వర్ణనలున్నాయి ఇందులో.ఇందులోని కవిత రమ్యం అయింది.మృదువయింది.మధురమైనది. మనసును దోసుకునేది.
సుందరకాండలోని కవితలు అనేకమంది మహా కవులను అకర్షించాయి. ఈ కవితలో ప్రభావితం అయిన కవుల వర్ణనలు అనేకమంది సంస్కృత మహాకవులు కావ్యాల్లో కనిపిస్తాయి.అశ్వఘోఘుని బుద్దచరితంలోని అంతఃపుర వర్ణన రావణుని అంతఃపురాన్ని తలపింపచేస్తుంది. వాల్మీకి కవికుల గరువు. అతనిని అనుసరించని కవిలేడు. కాళిదాసాదులే అతన్ని అనుసరించారు.
రావణే సుఖ సంవిష్టే తాస్త్ర్రియో వివిధ ప్రభాః
జ్వలంతం కాంచానా దీపాః ప్రైక్షంతా నిమిషా ఇవ.
రావణుడు నిద్రించాడు దీపాలు నిశ్చలంగా వెలుగుతున్నాయి.అని చెప్పడాన్కి ఎంత సొగసుగా చెప్పుతున్నాడో చూడండి. |
25,368 |
ఆ ప్రేమను వెతుక్కుంటూ తనకు నచ్చనవాడితో వెళ్ళిపోతుంది. మీలాంటి వాళ్ళ దృష్టిలో దాన్నే లేచిపోవడమంటారు. నేను చేయబోయే పని కడా అదే"
అమె చెప్పడం అపింది. అతని రియాక్షన్ ఏమిటో చూస్తోంది. అతని పరిస్ధితి వర్ణనాతీతం. నలుగురిలో తన హోదా పెరగాలని అందమైన భార్యను కట్టుకున్న అతడు ఆరోజు ఆ భార్యే వెళ్ళిపోతానంటూ వుంటే ఎలా వుంటుంది?
తన కాళ్ళకింద భూమి రెండు గా చీలిపోయి, తను అధః పాతాళానికి జారిపోతున్నట్టు ఉంటుంది. అతను చలించిపోయాడు. అతని ముఖం ఎలా మారిపోయిందంటే అమె కూడా జడుసుకుంది.
"నిజానికి నాకూ అతనికి మధ్య ప్రేమ తప్ప మరింకేం లేదు. మీ భార్యగా ఉన్నప్పుడు వేరే మగవాడు ఆ ఉధ్దేశ్యంతో నా చిటికెనవేలు పట్టుకోవడానికి కూడా నేను ఒప్పుకోను. ఎందులోనైనా, ఎవరితోనైనా నిజాయితిగా వుండాలనే అనుకుంటాను. నేనెప్పుడూ అలాగే ఉంటాను.
మొత్తం మీద చెప్పేశాను. ఇకనుంచి నేను మీ మనిషినికాను. పౌర్ణమిరోజున నేను అతనితో వెళ్ళిపోతున్నాను. అంటే మరో రెండు రోజులకన్నమాట"
నరేంద్ర అమె ముఖంవైపే కళ్ళార్పకుండా చూస్తున్నాడు. డీప్ షాక్ అంటారే అటువంటి స్ధితిలో పడిపోయాడు.
తన భార్య చెప్పిన " అతను" ఎవరో కూడా అడగలేకపోయాడు.
పౌర్ణమి------ అకాశంలో చందమామ పోలో దగ్గు మిఠాయిలా ఉన్నాడు. అక్కడక్కడా ఉన్న ఒకటీ అరా నక్షత్రాలు జిలకర్ర మిఠాయిల్లా వున్నాయి.
తెల్లటి మబ్బులు నోరూరించే పూతరేకుల్లా వున్నాయి. ఇక మొత్తం నీలాకాశమే బెంగుళూరు బేకరీవాళ్ళు చేసిన కేక్ లా వుంది.
శశిరేఖ ఇవేమీ గమనించే స్థితిలోలేదు. ఆమె ఒంటరిగా బస్టాప్ లో నిలబడి సురేష్ కోసం వెయిట్ చేస్తోంది. వాతావరణం అంత బాగున్నా ఆమెలో ఏదో అలజడి మనిషిని ఊపేస్తోంది. పట్టపగల్లా వెన్నెలున్నా చిట్టచీకట్లో నిలబడ్డట్టుంది. గాలి వీస్తున్నా ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి.
ఆకాశంలో నక్షత్రాలు ఉన్నా అక్కడేమీ లేనట్టు, అదీ నీలంగాజు ముక్కలా తప్ప మరోలా కన్పించడంలేదు. చందమామ అయితే ఏదో చెత్తకాగితాల గుజ్జులా అన్పిస్తోంది తప్ప నెలరాజులా కన్పించడంలేదు.
కారణం ఆమె ఉన్న పరిస్థితి అది.
మైసూరులో ఆమె తన మనసులోని మాటను సూటిగా చెప్పిన తరువాత ఒక్కోక్షణం ఒక్కోలా ప్రవర్తించాడు నరేంద్ర. అంతా విన్నాక అతను ఆమెను సుతారంగా నిలదీశాడు. "నేనేం తక్కువ చేశాను నీకు? అన్నీ బ్రహ్మాండంగా అరేంజ్ చేశానే. దేనికైనా లోటు చేశానా? ఇది లేదే అని ఎప్పుడైనా అనుకునేటట్టు చేశానా?
ఇంట్లో సామాను ఎప్పుడూ పుష్కలంగా ఉండేవే. చీరలు, నగలు- ఎప్పుడైనా ఏదైనా తీసుకుంటుంటే వద్దన్నానా? ఎప్పుడయినా నడిపించానా? కార్లు, విమానాలు, రైళ్ళలో ఏసీ ప్రయాణాలు- మరెందుకు ఇంత ఘోరమైన నిర్ణయం తీసుకున్నావ్?" అని ఘీంకరించాడు.
"ఒకటే తక్కువ- అది ప్రేమ" మెల్లగా ఒక్కో అక్షరాన్ని ఒత్తిపలుకుతూ చెప్పింది.
అతనికి కోపం ఒక్కసారిగా అందుకుంది. "ప్రేమ-ప్రేమ-ఏమిటది?" అది అరిచాడు.
"భార్యాభర్తలు ఈ దేశంలో మరిచిపోయింది అదే. కాపురం కూడా మనం నిష్కామకర్మలా చేస్తాం. అదీ విషాదం. భార్యాభర్తల సహజీవనానికి ప్రేమ పునాది కావాలి" విడమర్చి చెప్పింది శశిరేఖ.
అతనున్న ఆవేశంలో అతనికి అర్థం కాలేదు ఆమె మాటలు. మొదట్లో అయితే ఆమె విషయం చెప్పాక ఒక్కసారిగా బరస్ట్ అయిపోయాడు. ఎప్పుడూ ఆమెని అనని మాటలన్నాడు. 'ఒళ్ళు కొవ్వెక్కింది' అన్నవాక్యాలు సాధారణంగా దొర్లిపోయాయి.
"మొదటినుంచీ నీమీద నాకు అనుమానమే. నీలో ఏదో దుర్బుద్ధి వుండేది. దేన్నీ ఎంజాయ్ చేసేదానివికాదు. అప్పట్నుంచీ ఇట్లాంటి నీచమైన ఆలోచనలు నీలో వుండేవి" అని అరిచాడు.
ఈ మాటలకు ఆమె చాలా బాధపడింది. అందుకే ఘాటుగా సమాధానం చెప్పింది.
"మీలాంటివాళ్ళల్లో ఉన్న బలహీనతే ఇది. నేనీరోజు ఒకరిని ప్రేమిస్తున్నానని అనగానే మొదటినుంచి నా ప్రేమను, నా అభిమానాన్ని శంకించడం అన్యాయం" అంటూ దానికి చాలా ఉదాహరణలు చెప్పింది.
"పోనీ నా నుంచి ఎందుకు విడిపోవాలనుకుంటున్నావో చెబుతావా?" రెండు మూడు గంటల డిస్కషన్ జరిగిన తరువాత అడిగాడు నరేంద్ర.
"ప్రేమలేకుండా కాపురంచేస్తూ, పైకి ప్రేమ నటిస్తూ నిన్నూ నన్నూ మోసం చేసుకోవటం ఇష్టంలేక."
దీంతో మళ్ళీ ఆవేశపడిపోయాడు అతను. చివరికి అడిగాడు- "ఇంతకీ ఎవరతను? నీకూ అతనికీ మధ్య ఈ రహస్యసంబంధం ఎన్నాళ్ళ నుంచి జరుగుతోంది."
ఆమెకి అతని నైజం చూసి నవ్వొచ్చింది. ఇన్నేళ్ళు కాపురం చేసినా భార్య మనస్తత్వం ఏమిటో భర్తకి తెలియదు. భర్త మనస్తత్వం ఏమిటో భార్యకి తెలీదు. ఒకరి ఇష్టాయిష్టాలు మరొకరికి తెలీవు. తెలుసు కోవడానికి ఎప్పుడూ ప్రయత్నించరు. ఎదుటివ్యక్తి అభీష్టానికి అనుగుణంగా ప్రవర్తించాలని ఎప్పుడూ అనుకోరు.
కానీ ఒకే రూఫ్ కింద, ఒకరికొకరు అన్న పవిత్రబంధం పేరు పెట్టుకుని ఒకరంటే ఒకరికీ గౌరవం లేకుండా, అభిమానం లేకుండా బతికేస్తుంటాం.
ఆమె ఎంత నిజాయితీగా వ్యవహరిస్తుందో అతనికి తెలియకపోవడం క్షమించరాని విషయం.
"అట్లాంటి సంబంధమే కావాలనుకుంటే, ఆల్ రెడీ ఉండి ఉంటే కొత్తగా మీ నుంచి విడిపోవాలని ఎందుకనుకోవడం?" అని ప్రశ్నించింది.
కానీ అతను నమ్మలేదు. చాలారోజుల నుంచి ఇది జరుగుతోందని, తనే అమాయకంగా ఆమెను నమ్మానని అతను తనను తనే నిందించుకున్నాడు. జీవితంలో స్త్రీలను నమ్మకూడదని ఓ బలమైన నిర్ణయం కూడా చేసుకున్నాడు.
ఎవరితో వెళుతున్నావనడిగితే ఆమె సురేష్ వర్మ పేరు చెప్పింది. ఆమెకీ, అతనికీ మధ్య ఎప్పుడూ ఏ విధంగా సంబంధం కలిగుంటుందాని ఆలోచించాడు.
తను చాలా కాలంనుంచి మోసపోతున్నట్టు అనుకున్నాడు.
ఆమె అతని ఆలోచనల్ని పసిగట్టింది.
"మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. మా ఇద్దరిమధ్యా మీరనుకుంటున్నట్టు ఎలాంటి రహస్య సంబంధమూలేదు. మీ భార్యగా వున్నంతకాలం చాటుగా అతను నా చిటికెనవేలు పట్టుకోవడానికైనా నేను ఒప్పుకోను. అతనూ అంతే- నాలాగే. పూర్తిగా తనదైతే తప్ప నా పక్కన నన్ను తగులుతూ కూర్చోడు. కూర్చోలేదు కూడా. అంత నిజాయితీగా వున్న వ్యక్తి."
సురేష్ వర్మను పొగుడుతుంటే అతను భరించలేకపోయాడు.
కానీ చేసేది కూడా ఏమీలేదు.
"మరి రహస్య సంబంధాలు లేకుండానే లేచిపోవాలనుకుంటున్నారా?"
అతని మాటలు నవ్వు తెప్పించాయి.
"మీకు ఎప్పుడూ ఆ ఐదు నిముషాల కార్యక్రమంమీదే తప్ప మరేదానిమీదా ధ్యాస వుండదు. మీ దృష్టిలో ఓ మగాడు, స్త్రీకి మధ్య అది తప్ప ఏదీ వుండదనుకుంటారు. మీ అనుభవాలు అలాంటివి కాబట్టి. మామధ్య అది వుండదని కాదు. అదొక్కటే మామధ్య వుండదని చెబుతున్నా. ప్రేమలో అదీ ఒక భాగమే తప్ప మొత్తం అదేకాదు."
ఆమె అంత క్లియర్ గా చెబుతుంటే అతని నోటంట మాటరాలేదు. ఆమెమీద ప్రేమతో కాదుగానీ తన స్టేటస్ ను పెంచే అంత అందమైంది తననుంచి వెళ్ళిపోవడం ఇష్టంలేదు. అదీగాక తన గౌరవానికి ఎక్కువ భంగం కలుగుతుందేమోనన్న భయంతో ఆమెను బతిమిలాడాడు. ఐనా ఆమె తన నిర్ణయం మారదంది.
ఇక ఆమె తనతో వుండదని ఖచ్చితంగా తెలిసిపోయిన తరువాత ఈ విషయంలో కూడా తన పరువుపోకుండా ఎలా మేనేజ్ చేయాలో ఆలోచించాడు.
ఎంతకాలానికీ పిల్లలు కలగకపోవడంవల్ల తనే ఆమెను వదిలిపెట్టి, మరో అమ్మాయిని పెళ్ళి చేసుకున్నట్టు ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నాడు.
మైసూర్ నుంచి రాగానే కొత్త అమ్మాయిని చూసే కార్యక్రమాన్ని చేపట్టాడు. అమ్మాయి తొందరగానే దొరికింది.
లీగల్ గా అన్ని విషయాలు సెటిలయిపోయాక అధికారికంగా పెళ్ళి చేసుకున్నట్టు ప్రకటిస్తామన్న షరతుమీద ఆమెను ఇంటికి తీసుకొచ్చాడు నరేంద్ర.
ఆమె పేరు శృతి. ఎం.ఏ.ఎంఇడి. చదివింది. శశిరేఖ కంటే అందంలో తక్కువయినా. సెక్సీగా వుంది. ముఖ్యంగా ఆమె కళ్ళు. ఏం కలిస్తే ఆ కళ్ళు అలా కనిపిస్తాయో తెలియదు. మత్తుగా, ఏదో కోరిక బరువుకి తూలుతున్నట్టు ఆకళ్ళను చూస్తుంటే ఏ మగాడికైనా మనసు నిలవడం కష్టం.
రెండురోజుల క్రితమే ఆమెను తీసుకొచ్చాడు నరేంద్ర. "నువ్వెళ్ళినా నాకు ఇబ్బంది లేదు. చూడు ఎలాంటి పిల్లను తీసుకొచ్చానో" అని ఫోజు కొట్టడానికి ఆమెను తీసుకొచ్చాడని శశికి అర్ధమైంది. అంతేకాకుండా ఆ అర్ధం వచ్చేలా మాట్లాడాడు కూడా.
మనుషులకి ద్వేషించడం తెలిసినంత బాగా ప్రేమించడం చేతకాదనిపించింది శశిరేఖకి.
"ఈ అమ్మాయి నడవడికమీదైనా మీరు వూరెళ్లినప్పుడూ ఏ పసి పిల్లాడ్నో సిఐడిగా పెట్టకండి" అంది ఆమె ఇంటినుంచి వచ్చేటప్పుడు. |
25,369 | మరో గంట తరువాత మాడుగుల రేంజి నుంచి సమాచారం అందింది_చైతన్య జాడ లేదని.
ఇది జరుగుతున్న వేళకి నమ్రత అంత్యక్రియలు పూర్తయ్యాయి.
తోబుట్టిన చెల్లి విషయంలో ఆఖరి చూపయినా దక్కించుకోకబోవటం ఎంతటి శాపం.
26
ఇద్దరు గాయపడిన ప్రత్యర్ధుల మధ్య ఒకరి కోసం మరొకరు వేటాడే క్షణం మొదలయింది.
అప్పటికి భోజనం చేసి సుమారు ముప్పయి గంటలు కావడంతోనూ విపరీతంగా రక్తం పోవడంతోనూ చైతన్య చాలా అలిసిపోయాడు. ఐనా ఆగిపోవడంలేదు. మేనీటర్ పరిస్థితి ఇంచుమించు అలాగే ఉంది.
వెంట పడుతున్న చైతన్య వేటాడి ఆకలి తీర్చుకోనివ్వడం లేదు. పైగా గాయ పరిచాడు. అంతవరకూ ఏ మనిషికాని, వేటగాడు గాని మేనీటరులో అంతటి సంచలనాన్ని రేపలేదు కాబట్టే బలమయిన ప్రత్యర్ధిని నేల కరిపించే అవకాశం కోసం తను సయితం ఎదురుచూస్తుంది.
గెలుపెవరిదో తెలీక రెప్పలార్చుకుని అంతవరకూ పరికించి చూసిన సూర్యుడు అలిసినట్టు పశ్చిమాద్రిని చేరుకున్నాడు.
వాపు మూలంగా ఎడమ కన్ను పూర్తిగా మూసుకుపోయిన చైతన్య కేవలం మిగిలిన ఒక కన్ను ఆధారంతో పులి జాడని కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.
అది నిజానికి ప్రయత్నం కాదు. భావతీతధ్యానం ఆత్మ శోధనలో అన్న కోశాన్ని, వాయుకోశాన్ని దాటిన జ్ఞానిలా శారీరకమయిన బాధను సయితం మరిచి ఒకే లక్ష్యంలో అతడు ప్రయాణం చేస్తున్నాడు.
అతడు నడుస్తున్నది మేనీటర్ కు చెందిన బలమయిన సామ్రాజ్యం అన్నట్టు చెట్టుబోదెలపై పులిగుర్తులు, గోళ్ళ మధ్య చిక్కుకున్న మాంసాన్ని శుభ్రం చేయడానికి పంజాతో బోదెలపై రాస్తుంది మేనీటర్.
మేనీటర్ కు అనువయిన ఆ అడవిలో ఆగకుండా జింక ,దుప్పి, కొండముచ్చుల కేకలు హెచ్చరికగా వినిపిస్తున్నా, ఆడ నెమళ్లు, మైనాలు, కంజులు సందడి చేస్తూ మేనీటర్ ఉనికిని స్పష్టం చేస్తున్నా చైతన్య ఎప్పటిలా ఆ శబ్దాలపై ఏకాగ్రత చూపలేదు.
అతడిప్పుడు కేవలం పులి అడుగు జాడల్ని అనుసరిస్తున్నాడు.
గుట్ట ఎగువ భాగానికి దారితీసిన పాదాల గుర్తులు కొంతదూరం తిన్నగా మరికొన్నిచోట్ల ఓ పొద మాటు నుంచి మరో పొద చాటుకి అడ్డదిడ్డంగా కనిపిస్తుంటే తను వెంటాడుతున్న విషయాన్ని మేనీటర్ గమనించినట్టు అర్ధమయింది చైతన్యకు.
మరింత జాగ్రత్త వహించాడు. ఏ క్షణంలోనయినా ఏ పొదమాటు నుంచయినా ప్రమాదం ముంచుకు రావచ్చు.
గుట్ట పై భాగంలో సుమారు వంద గజాల వెడల్పులో గరికపోచలతో నిండిన ప్రాంతం. దాని వెనుకగా ఒక సన్నని మార్గంతో చీలిన వెదురు పొదల అడవి.
అతడికి ముందు కుడి ప్రక్కగావున్న వెదురు పొదలు ఎడమ ప్రక్కపొదలకంటే సుమారు ముప్పయి అడుగుల దగ్గరగా ఉండటంతో ముందు కుడిప్రక్క ప్రయత్నించాలనుకున్నాడు.
సుమారు ఇరవై అడుగుల దూరం నడిచేసరికి ఓ ఎండుపుల్ల విరిగిన చప్పుడు ఎడమప్రక్క ఓ భారీ మృగం కదిలినట్టు సూచనగా! అతడు సరాసరి ఎడమ ప్రక్కగా ప్రయాణం చేసి ఉంటే పర్యవసానం మరోలా వుండేది.
నిజానికి అతడి కోసమే ఎడమప్రక్క పొదలలో కాసుక్కూర్చుంది మేనీటర్_ దగ్గరకు చేరగానే పైకి చార్జి చేయాలని. కాని ఏ దేవుడో శాసించినట్టు కుడిప్రక్క పొదలవేపు వెళ్ళాడతను.
చప్పుడు విన్న అతడు ఎడమ ప్రక్కకు వెళ్ళేసరికి ఒకచోట నేలపై పొదలు అస్తవ్యస్తంగా ఒరిగి ఉన్నాయి. సరిగ్గా అదేచోట మేనీటర్. అంతవరకూ పొంచివుందన్న నిజం తెలుసుకోవడానికి అట్టేసేపు పట్టలేదు.
క్రమంగా చీకట్లు ఆవరించుకుంటున్న వేళలో తానెక్కడున్నదీ గుర్తులేని వాడిలా పులి అడుగుజాడల్ని బట్టి సాధ్యమయినంత వేగంతో గుట్ట పైభాగానికి నడిచాడు.
మోకాళ్ళ ఎత్తువరకూ ఎదిగిన కలుపు మొక్కల మధ్య నిలబడి కన్ను చిట్లించి చూశాడు. భయంకరమయిన నిశ్శబ్దం.
కలుపు మొక్కలను దాటితే ఏపుగా పెరిగిన గడ్డిదుబ్బులు, అందులో ఎక్కడో గాయపడిన మేనీటర్ పొంచి ఉంటుందని అతడికి తెలుసు. కానీ దట్టంగా పెరిగిన కలుపు మొక్కల మధ్య చప్పుడు లేకుండా నడవడం చాలా కష్టమయిన విషయం.
మేనీటర్ తను గమనించక ముందు తన ఉనికిని గుర్తిస్తే పరిణామం ఎంతటి ప్రమాదకరంగా ఉండేది ఆలోచిస్తూ క్షణాలు అలాగే నిలబడి పోయాడు.
ఎందర్నో పొట్టన పెట్టుకుని అపారమయిన అనుభవంతో అలజడిని సృష్టించిన నరమాంస భక్షకి అయిన ఓ పెద్దపులిని నేలపై ఎదుర్కొనడానికి సిద్ధపడడం నిజానికి ఆత్మహత్యా సదృశ్యం. పైగా చైతన్య అప్పటికే అలసిపోయాడు బాగా. అంతకుమించి ఏదీ స్పష్టంగా కనిపించని మునుమాపు వేళ అది.
ముందుకు సాగాలా, వద్దా అన్న సందిగ్ధత.
హఠాత్తుగా నిశ్శబ్దాన్ని చీల్చుతూ సమీపంలోని మరో గుట్టపై ఓ కణుసు హెచ్చరికగా అరచింది.
అది పరుగెత్తడం లేదు .ఒకే చోట స్థిమితంగా నిలబడి కేక పెడుతోందంటే తనకు ప్రమాదం లేనంత దూరంలో ఎక్కడో మేనీటర్ నడుస్తోందన్నమాట. |
25,370 |
ప్రతి ఇంట్లోనూ ఏవో పండ్ల చెట్లుండేవి. కూరగాయలు ఇండ్లలోనే కాసేవి. సొర పాదులు, గుమ్మడి పాదులు పాకిన గుడిసెలు ఎంతో అందంగా ఉండేవి. కూరగాయలు అమ్మటం ఎరుగరు. ఒకళ్లకు ఒకళ్లు ఇచ్చుకోవడమే! అయితే, ఎండాకాలం కూరగాయలు వుండవు. అందుకు సిద్ధంగానే ఉండేవారు. గొయ్యి తవ్వి దోసకాయలు, బూడిదలో పెట్టేవారు. ఒరుగులు, వడియాలు, పప్పులు, మామిడికాయలు, చింత పండుతో వెళ్లదీసుకునేవారు. తప్పాల చెక్క, ఉప్పుడు పిండి, కుడుములు, అట్లు, గారెలు - అప్పుడు తినే పిండి వంటలు. అరిశెలు, బూఱెలు, జంతికలు, చక్కినాలు, చేగోడీలు, అటుకులు, పోపుబియ్యం వగైరాలు - నిలవ ఉండే పిండి వంటలు. అది వంటరి బ్రతుకు కాదు. ఉమ్మడి బ్రతుకు. నిలవా పిండి వంటలకు ఊళ్లో బంధువులు లంతా కూడుతారు. ముచ్చట్లు, నవ్వులాటలు, పాటలు. పనిలా ఉండదు. ఆటలా ఉంటుంది. ఒక పండుగలా ఉంటుంది. పాడికూడా సర్వసాధారణం. పాలు అమ్మటం పాపంగా భావించేవారు. దాలిలో కాచిన పాలు - ఎర్రగా మీగడ కట్టి! పాడి ఉన్నా పాలు తాగడం లేదు. టీ కాఫీ పేరు తెలియదు. కవ్వంతో చల్ల చేయడం ఒక కళ. ఆ శబ్దం ఒక స్వరం. వెన్న తీసి నేయి కాస్తుంటే కమ్మని వాసన! ఏదండీ ఆ నేయి! ఏదండీ ఆ చల్ల! కాఫీ అంటే ఒక విషయం గుర్తుకు వస్తున్నది. నేను చాల చిన్న వాణ్ణి. మా అన్నయ్య మదర్సలో చదువుతున్నాడు. గుంటూరు నుంచి శేషాచార్యుల వారు వచ్చారు. వారు వైష్ణవపు ద్రావిడ మత గ్రంథాలను తెనిగిస్తారు. తమ ముద్రణాలయంలో అచ్చువేస్తారు. అవి అమ్ముకోవడానికి నైజాంలో సంచారం చేస్తారు. ఆ విధంగా మా ఇంటికి వచ్చారు. వారు "కాఫీ" అన్నారు. ఇంటివారికి అందరికీ ఆశ్చర్యం! వారు కాఫీ చేశారు. అది రుచి చూపించడానికి నేను స్కూలు నుంచి మా అన్నయ్యను పీల్చుకుని వచ్చాను. అది తొలిసారి కాఫీ వినడం - రుచి చూడడం. అది బహుశః 1931. నాకు మూడేళ్లు ఉంటాయి! వంటకు చాల వరకు అందరూ మట్టి పాత్రలే ఉపయోగించేవారు. మా ఇంట్లోనూ ఒక్క అన్నం వార్చడం తప్ప- కూరలు వగైరాలు మట్టి పాత్రలే. బిందెలు, గుండీలు, కంచాలు మాత్రం ఇత్తడివి. అప్పటివారు చాల ముందు చూపుగలవారు. బల్లపీటలు కుర్చీలు, పాత్రలు ఏమి చేయించినా తరతరాలు ఉండేటట్లు చేయించేవారు. భోజనాలు విస్తళ్లల్లోనే - అయినా కంచాలుండేవి. వాటికి కళాయి పోసేవారు. చద్దన్నంలో మామిడికాయ పచ్చడి - పేరిన నెయ్యి కలిపేది మా అమ్మ. మా అన్నయ్యనూ, నన్నూ కూర్చుండబెట్టుకునేది. చెరొక ముద్దా పెడ్తుండేది. ఆ ముద్ద అమృతం. అది అమృతానందం! ఇప్పుడు మృష్టాన్నాలు తింటున్నాం. ఆ ఆనందం రాదు! అది అమ్మ పెట్టింది కదా! మా అమ్మ 1960లో కన్నుమూసింది. "దేవుడు లేడనేవాడున్నాడు. అమ్మ లేదనే వాడున్నాడా?" అని మా అన్నయ్య సినీమా పాట వ్రాశాడు. "జననీ జన్మభూమిశ్చ" అన్నాడు వాల్మీకి. వరిపంట తక్కువ. మెరక పంటలు జొన్న, సజ్జలు ఎక్కువ పండేవి. బ్రాహ్మణులు, కోమట్లు, మరి కొందరు సంపన్నులు తప్ప - వరి అన్నం తినేవారు కారు. వరి ఒకేరకం "కోణామణి" పండేది. బియ్యం దొడ్డువి. ప్రతి బియ్యపు గింజమీదా ఒక ఎర్రటి చార ఉండేది. నా చిన్నతనంలో గ్రామస్తుల ఒక సంభాషణ విన్నాను. "సాంబలు వచ్చినయట - ముదనష్టపుపంట. మనిషి తింటే కుట్లు పడ్తయట. గడ్డి గొడ్డుకు వేస్తే వాతం కమ్ముతదట!" జొన్నలు - సజ్జలు తినేవారు. తెల్లవారు జామున పాటలు పాడుతూ వాటిని దంచేవారు. అది ఒక లయ. ఆ జీవితమే ఒక లయ!. ఇప్పటివి లయ తప్పిన జీవితాలు! ఆ జొన్నన్నం - సద్దన్నం తినేవారు. కంచుతో చేసిన లోయ గిన్నెలాంటి పళ్లెంలో అన్నం వేసుకునేవారు. కంచుడునిండా మజ్జిగ. ఉప్పు, ఉల్లిగడ్డ లేక ఉప్పు పచ్చిమిరపకాయతో తినేవారు. ఇందులో హెచ్చు తచ్చులు ప్రసక్తి లేదు. ఎవరి అలవాట్లు వారివి! ఆనాడు గ్రామం ఉమ్మడిగా జీవించింది. అది వంటరిగా జీవించలేని సమాజం. అనాదిగా వస్తున్న భారత సంప్రదాయం సామాజికం. "సహనావవతు, సహనౌభునక్తు, సహవీర్యం కరవావహై" అంటుంది కఠోపనిషత్తు. కలిసి కాపాడుకుందాం. కలిసి భుజింతాం. కలిసి ఎదిరింతాం. చిన్నగూడూరులో కులాలూ మతాలూ ఉన్నాయి. కాని, ఉన్నట్లు కనిపించవు. మహమ్మదీయులు మనవలెనే ఉండేవారు. వారు వేరు అనుకోలేదు. ఇస్మాయిల్ పటేల్ మా అన్నయ్యకు ఉర్దూ చెప్పేవాడు. మాలో కలిసి ఉండేవాడు. కులాలు స్థిరపడిపోయినాయి. ఎవరి అంతస్తు వారికి తెలుసు. ఉమ్మడిగా ఒక కులం - మరో కులంమీద పెత్తనంలాంటిది లేదు. పేర్లకు కులాలకు సంబంధించిన తోకలు - రెడ్డి, రావు, ఆచార్య ఉండేవికావు. రంగయ్య, కిష్టయ్య, వెంకటయ్య - అంతే. పేర్లు కావు, వరసలతో పిలుచుకునేవారు. చాకలి -మంగలి కులాల్లో "కుట్టు" అయిక్యత ఎక్కువ. ఒక్కడు కాదంటే అందరు కాదన్నట్లే. ఒకరికి పోటీగా మరొకరు పోరు. ఇది అనూచానంగా వస్తున్న ట్రేడ్ యూనియన్. నేను రచించిన "మోదుగుపూలు" నవలలో మంగళ్ల సంఘటిత శక్తిని చూపించాను. ఏ కులానికి ఆ కులానికి పెద్ద యింటారు. సాధారణంగా ఈ పెత్తనం వయసును బట్టి వస్తుంది. వారికి ఉన్న- కుటుంబ, కుల సమస్యలను వారే పరిష్కరించుకుంటారు. కుల తప్పుకింద వేసిన జరిమానాలు కులవిందులకే గాని వ్యక్తికి కాదు. ఇలాంటి ఒక కులపు తగాదాను నా నవల "శరతల్పం" లో చూపించాను. కుల పెద్దలు తీర్చలేని తగాదాలు దొర దగ్గరకు వెళ్తాయి. దొర పరిష్కారానికి సాధారణంగా తిరుగు ఉండదు. దొర పరిష్కారంలో దొర ప్రయోజనం కొంత ఉంటుంది. అయినా ఊరు దాటి కోర్టుకు ఎక్కడం అరుదు. సర్కారు బడికి పిల్లలను ఎక్కువమంది పంపేవారు కారు. ఉర్దూ చదువు నిత్యజీవితంలో పనికి వచ్చేది కాదు. పెద్ద చదువులు చదివినా - తురకలకు తప్ప - ఉద్యోగాలు రావు. అందువల్ల వీధి బళ్లలో చదువు. అక్షరాలు - పెద్ద బాల శిక్షతో చదువు ముగింపు. నిత్య జీవితానికి అక్కరకు వచ్చేవన్నీ పెద్ద బాలశిక్షలో ఉంటాయి. అంతకుపైన చదవదలచినవారు పండితుల వద్ద పోతన భాగవతం చదివేవారు. చిన్నగూడురులో ఆరు శ్రీవైష్ణవ కుటుంబాలు, ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది. మూడు కుటుంబాలు మా మాతామహుల సహితంగా నాలుగు ఉద్దండ పండిత కుటుంబాలు. ఎవరు కోరినా వారు ఉచితంగా ఆంద్ర, ద్రావిడ, సంస్కృతాలు బోధించేవారు. వాళ్ల ఇళ్లలో ఉంచుకొని భోజనాలు పెట్టి చదువు చెప్పిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఊళ్లో ఇద్దరు వైద్యులుండేవారు. ఒకరు మా పితామహులు, ఇంకొకరు వడ్లకుంట సాయెబు అని గౌండ్లతను. సాయెబుకు భారత భాగవతాలతో కూడా పరిచయం. మా తాతగారికి సాయెబుకు ప్రాణ స్నేహితం. కలిసి తినడం లేదు కాని, వారిది అవ్యాజమైత్రి. సాధారణంగా మందుల సంచీ తీసుకొని వైద్యులే రోగుల ఇళ్లకు వెళ్లేవారు. రోగులు వైద్యుల దగ్గరికి రావడం తక్కువ. ఒకసారి ఆకాశవాణి వారికి వైద్యాన్ని గురించి ఒక రూపకం వ్రాశాను. అందులో వైద్యుడు రోగి దగ్గరకు వెళ్లడం తెలిపాను. ఇది చైనా పధ్ధతి అన్నారు ఆకాశవాణివారు. ప్రాగ్దేశాలు - తూర్పుదేశాలన్నింటిలో అదే ఆచారం అని వివరించాల్సి వచ్చింది. మన జీవన విధానం, మనకు తెలియకుండా చేస్తున్నాయి - మన ప్రచార సాధనాలు! అసలు జీవన విధానంలోనే ఆరోగ్య సూత్రాలు, వ్యాయామం ఇమిడి ఉన్నాయి. కాబట్టి వైద్యుల అవసరం ఉండదు. ఉదయంలేచి వేపచెట్టు ఎక్కి పళ్ళపుల్ల విరుచుకోవాలి. దొడ్డికి చెంబు పట్టుకొని నడిచి పోవాలి. స్నానానికి ఏటికి గాని, చెరువుకు గాని వెళ్లాలి. లేకుంటే బావిలో నీళ్లు చేది పోసుకోవాలి. ఎక్కడికి పోయినా నడిచి పోవాలి. ఇదంతా పురుషులకు స్వతస్సిద్ధంగా జరిగే వ్యాయామం. స్త్రీలు ఇళ్లు అల్లుక్కోవాలి. దూరం నుంచి మంచినీళ్లు తెచ్చుకోవాలి. వడ్లు దంచుకోవాలి. పప్పులు విసురుకోవాలి. నీళ్లు తోడుకోవాలి. మజ్జిగ చేయాలి. వారి నిత్యకృత్యంలోనే కావలసినంత వ్యాయామం ఉంది. అవి 'కల్తీ' అనే పదం పుట్టని రోజులు! అన్నీ స్వచ్ఛమైన ఆహార పదార్థాలు. నువ్వులు గానుగనూనె, ఇంటవండిన ఆముదం, తెలియకుండానే స్వచ్ఛమైన వాతావరణం. అప్పుడు - వైద్యుని అవసరం ఎప్పుడో! అగ్గిపెట్టె సహితం లేని వ్యవస్థ అది. కుంపట్లో ఊక - పిడక వేసి ఉంచేవారు ఎప్పుడూ. చిన్నతనంలో నా కాలు కుంపట్లోపడి కాలింది. నూనెరాసి తుమ్మపొడి వేశారు. మరొకసారి రక్త విరేచనాలు అయినాయి. విసపుగోళ్లు ఇచ్చారు. ఇలాంటి గృహవైద్యాలు అందరికీ తెలుసు. |
25,371 | తను ఆషామాషీగా, గుర్తు పెట్టుకోకుండా, లెక్క తెలియకుండా ఖర్చుచేసే రెండువేలో, మూడువేలో ఆ అమ్మాయికి జీవన్మరణ సమస్యనా?
విధి ఒక్కొక్కరి పట్ల చాలా క్రూరంగా ఉండగలదు!
డబ్బు అంతా పోగొట్టుకుని తన సౌందర్య స్థితిలోకి వస్తే ఎలా ఉంటుంది?
ఆ ఆలోచనే అతని ఒంటిని భయంతో జలదరింపజేసి అతని చేతి మీద రోమాలు నిక్కబొడుచుకునేటట్లు చేసింది.
ఉద్వేగంతో వణుకుతున్న గొంతుతో అన్నాడు. "సౌందర్యా! హనీ! నువ్వు డబ్బు గురించి వర్రీ అవకు! వెధవ మూడువేలు కాదు, అయిదువేలయినా సరే! మనీ నో ప్రాబ్లెం! ధైర్యంగా ఉండు, బేబీ! ఎవ్వెరిథింగ్ విల్ బీ ఆల్ రైట్! నాకు తెలిసిన మంచి ఫిజిషియన్ ఉన్నాడు. ఆయనకి రింగ్ చేసి చెబుతాను. ఆయనతో కలిసి రేపు మీ ఇంటికి వస్తాను. డోంట్ వర్రీ హనీ! డోంట్ వర్రీ!"
రెండు చేతులూ జోడించి అతనికి నమస్కారం చేసి, ఆ రెండు చేతుల్లోనే మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది సౌందర్య.
అహ్లువాలియా లాంటి 'మగాడు' ఆ సమయంలో అక్కడుంటే గుండెలో వున్న దుఃఖంతో ఎగసిపడుతున్న ఆ ఆడపిల్ల గుండెని చూసి పెదిమలు తడి చేసుకునేవాడే!
* * * * *
"పిన్నీ! శ్రీరాంకి నువ్వు వెంటనే పెళ్ళి చేసెయ్యాలి. లేకపోతే ఇక లాభంలేదు!" అంది శృతి, సరస్వతి పక్కన కూర్చుంటూ.
"ఏమిటే విశేషం?" అంది సరస్వతి నవ్వుతూ.
శృతి గొంతు వినబడగానే శ్రీరాం అర్జెంటు పని వున్నట్లు బయటికి వెళ్ళిపోయాడు.
"వెళ్ళిపోకు! కూర్చో!" అంది శృతి, అతన్ని ఆటలు పట్టిస్తూ.
అప్పటికే శ్రీరాం కారు గేటు దాటింది.
అర్ధం అయీ కానట్లు చూసింది సరస్వతి.
"ఏమిటి చెప్పు?"
ఐక్యరాజ్యసమితి తరఫున వచ్చిన ప్రతినిధిలా గంభీరంగా ఫోజు పెట్టి చెప్పడం మొదలెట్టింది శృతి.
శ్రద్దగా విన్న సరస్వతి మొహంలో ఆశ్చర్యం, సంతోషం వంతులు వేసుకుని చూశాయి.
"వీడింత హఠాత్తుగా పెళ్ళికి ఒప్పుకుంటాడనుకోలేదు నేను! అంత బాగుంటుందా అమ్మాయి?"
"బాగుంటుందా అని మెల్లిగా అడుగుతావేమిటి, పిన్నీ! జయప్రదా, శ్రీదేవి, బోడెరెక్ - ఈ ముగ్గుర్నీ ట్రిక్ ఫోటోగ్రఫీలో కలిపేశామనుకో! ఎంత అందంగా ఉంటుందీ? అంత అందంగా ఉంటుందన్నమాట!"
"జయప్రదా, శ్రీదేవి తెలుసు కానీ, ఈ బోడెక్క ఎవరే?" అంది సరస్వతి నవ్వుతూ.
"బోడెక్క కాదు, పిన్నీ! బోడెరెక్! లాభం లేదు! నువ్వు ఇంగ్లీషు సినిమాలు విరివిగా చూడాల్సిందే!" అంది నిస్పృహగా తల వూపుతూ.
"ఇప్పుడు కాదు! మరో పదేళ్ళు పోయాక, మనవన్నో, మనవరాలినో వెంటేసుకుని అప్పుడు చూస్తాను ఇంగ్లీషు సినిమాలు!"
ఇద్దరూ నవ్వుకున్నారు.
"అయితే పెళ్ళి పెత్తనం అంతా నీ మీదే పెట్టుకున్నావు కదా! వెళ్ళి వాళ్ళ నాన్నగారిని కూడా నువ్వే పిలుచుకురా! రేపు దశమి! మంచి రోజు! మాట్లాడదాం" అంది సరస్వతి.
శృతి ఇష్టంగా, మెచ్చుకోలుగా చూసింది సరస్వతి వైపు.
"నువ్వు చాలా మోడరన్ గర్ ల్ వి పిన్నీ!" అంది నవ్వుతూ.
"నేనా గరల్ నా?"
"సారీ! మోడరన్ లేడీవి! నీది చాలా విశాల గుండె పిన్నీ!" "విశాల గుండెనా? చదవేస్తే ఉన్న మతి పోతూందేమిటి? దుష్ట సమాసం!"
"పోన్లెద్దూ! నాకు తెలుగు రాదు సరిగా."
"నెత్తి మీద ఒక్కటేస్తాను! ఎంత డాక్టరీ చదివినా తెలుగు రాదు అని గొప్పగా చెప్పుకునే వాళ్ళంటే చిరాకు నాకు."
"తిట్టకు పిన్నీ! నేను వెళుతున్నాను" అని నవ్వుతూ లేచి రెండడుగులు వేసి, "పెళ్ళిలో నాకు వెండి కంచమూ, కంచి పట్టుచీరె తప్ప వేరేవి పెడితే ఊరుకోను. ముందే చెబుతున్నాను!" అంది శృతి.
* * * * *
"ఏరా, కేశవా! కూతురికి పెళ్ళి చేసే ఉద్దేశమేమైనా ఉందా? చెప్పు! నా ఎరికలో బేషైన సంబంధం ఉంది. వాళ్ళు నేనెంత చెబితే అంత!" అంటూ గుమ్మడికాయలా దొర్లుతూ లోపలికి వచ్చాడు రమణయ్య.
మధ్య గదిలో కూర్చుని బియ్యంలో రాళ్లేరుతున్న ప్రతిమ, భోజనంలో పంటి కిందికి రాయి వచ్చినట్లు మొహం అదోలా పెట్టింది. ఈయన కూడా ఒక సంబంధం తీసుకొచ్చాడా ఇప్పుడు? ఇంకా శృతి రాలేదే?
కొంపదీసి ఈ సంబంధం ఇంట్లో అందరికీ ఇష్టమై ఒప్పేసుకుంటే తనేం చెయ్యాలి? శ్రీరాంనే చేసుకుంటానని ఎదురు తిరగాలా? ఎంత ఇబ్బందిగా ఉంటుంది! అంత దూరం రాకుండా శృతి నాన్నగారిని ఒప్పించి, శ్రీరాం సంబంధం కుదిర్చేయగలిగితే పెద్ద డ్రామా తప్పిపోతుంది.
పడక్కుర్చీలో పడుకుని పేపరు చదువుతున్న కేశవరావు చివుక్కున తలెత్తి చూశాడు. 'కూతురి పెళ్ళి' అన్నమాట వినగానే ఆయనకి షాక్ కొట్టినట్లు అయింది. సాయంత్రం ఆరున్నర అవుతూంది. మామూలుగా అయితే అది కేశవరావు బార్లో కూర్చుని బీర్ సేవిస్తూ ఉండాల్సిన సమయం. కానీ ఇవాళ నుంచీ ఆయన ఇంక తాగకూడదని నిశ్చయించుకున్నాడు.. ఇల్లు జరిగే మార్గమే లేనప్పుడు ఈ తాగుడు అలవాటు వదిలెయ్యక తప్పదని గ్రహించాడు ఆయన.
పాతికేళ్ళ నుంచీ వేళ తప్పకుండా గొంతులోకి మృదువుగా జారే ద్రవం ఇవాళ పడకపోయేసరికి ఆయనకి గొంతెండుకు పోయినట్లు ఉంది. అయినా నిగ్రహంగా అలా కూర్చునే ఉన్నాడు. ప్రతిమ అన్నం వండెయ్యగానే తినేసి నిద్రపోతే, ఇంక 'బాటిల్' గురించిన ఆలోచనలు రావని ఆయన ఆశ.
"కూచో!" అన్నాడు విసుగ్గా. ఈ సమయంలో రమణయ్య రావడం బొత్తిగా ఇష్టంగా లేదు కేశవరావుకి.
రమణయ్య కూర్చున్నాడు.
సారా పీపాలా ఉంటాడతను. కోరాగుడ్డతో కుట్టిన గంగాళం లాంటి చొక్కా, లుంగీ అతని యూనిఫారం. ఉద్యోగం సద్యోగం ఏమీ చెయ్యడు. వాళ్ళ పనులూ, వీళ్ళ పనులూ చేసిపెడుతూ వాళ్ళు తృణమో, పణమో ఇస్తే అది తీసుకుంటాడు. 'రేపొక రెండు వేలు రావాల్సి ఉంది. ఇవ్వాళ్టికో రెండ్రూపాయలు సర్దుదూ!' అన్నది అతని వాడుక డైలాగు. |
25,372 |
అభయారణ్యం
__కొమ్మనాపల్లి గణపతిరావు
" ఎక్కడున్నావో తెలీని ఓ నా ప్రియతమా... "
నా మాటల్లో...... చేతల్లో...... నా తలపుల్లో..... ప్రతి అణువులో.... తనువులోని ప్రతి కణములో..... విశ్వమంతా కూడా నాకు నువ్వు మాత్రమే అయి ఈ మామూలు జీవన ప్రపంచానికి వ్యర్ధురాలిని చేశావు. నిజం.... ఇప్పుడు నాలో మిగిలింది దిగులు కళ్ళు.... వెర్రి చూపులు..... నిన్నటి బాసల మెరుపుల మరకలే నేస్తం.
అప్పటి నీ స్పర్శ..... అప్పుడెప్పుడో విన్న నీ పిలుపు.... స్వప్నాల సందిట్లోని మన సంయోగం ఇవేగా నాలో ఈ మాత్రమైన జీవితేచ్ఛని మిగిల్చింది.
ఎందుకయ్యా నీకింత నిర్దయ.....
నీ కోసం వెతికి వెతికి అలసిన నా చూపులు తమలోకి తామే చూసుకుంటున్నాయి. ప్రియా.... ప్రియా అని పిలిచి ఇక పలికే శక్తిలేక నా హృదయం తనలో తానే గొణుక్కుంటుంది. నన్ను నమ్ము. నీ కోసం నేను పడే ఆరాటానికి దుక్కులే నవ్వాయి. చుక్కలన్నీ ఏడ్చాయి.
ఎలా సాధించావు నా పై ఇంతటి గెపులుని?
అసలు నీ చిరునవ్వు ఎలా వుంటుందో తెలుసా? నీకెలా తెలుస్తుందిలే...... అది చూసి, అనుభవించి, పరవశించిపోయే నన్నేవరైనా అడగాల్సిన ప్రశ్నది. యోగులు హృదయంలో వెలిగించుకునే దివ్వె నీ చురునవ్వు. నీ పెదవులపై విరిసే మనోజ్ఞ మైన చిరునవ్వు ఒక్కటే కాదు స్వామీ!చల్లని వెన్నెల్ని, మల్లెల సౌరభాన్ని , మంచిగంధపు స్పర్శనీ తలపించే నీ మనసు పరిచే మమతగానీ, బాధల్నీ ,నిషాదఛాయల్నీ మరిపించగల నీ కౌగిలి స్పర్శనీ మనిషినైనందుకు , నీ మనసును గెలుచుకున్నందుకు నన్ను పునీతని చేసిందని పులకించిపోయానే..... మరి ఇంతలోనే ఎందుకు చేజారిపోయావు. ఈమరో విశ్వంలో నక్షత్రాలమధ్య ఎక్కడని నిన్ను వెతికేది?
నిస్త్ర్రాణతో నలిగిపోతున్నాను ప్రియా!
ఏ అర్ధరాత్రో లేచి నిన్ను తలుచుకుని, నీ కోసం శూన్యం వైపు చేతులు చాచి-చాచి, ఏడ్చి ఏడ్చి -జబాబు చెప్పని ప్రకృతిని చూస్తూ పడుకుంటాను ప్రతి రాత్రి. సముద్రంలోకి నిరంతరమూ ప్రవహిస్తూ విసుగు చెందని నదిలా నిట్టూర్పులతో మిగిలిపోతుంటాను. ఋషుల తపస్సుకి స్పందించిన దేవుడైనా జాలిపడడేం ? ఒకలా మాట్లాడే, ఒకేలా ఆలోచించే మననిద్దరమూ వేరు వేరు కాదూ ఒకటే అని నిన్నటిదాకా మనల్ని సృష్టించిన దేవుడికి అంజలి ఘటించానే. మరి నాకు ప్రేమగీతాన్ని నేర్పించి, నక్షత్ర మార్గాల వూరేగించి ఇప్పుడు మన గాథని అగాధంగా మార్చిన నిన్ను వెదికి నాకు అందించడేం?
కానియ్..... సృష్టికి ఆ చివర నువ్వు, ఈ చివర నేను. కానియ్ స్వామీ!చిన్నప్పుడు నేను ఆడుకున్న బొమ్మల్లో, వూహ తెలిశాక నే చదవుకున్న పుస్తకాల్లో ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి క్షణమూ ఎక్కడో అక్కడ నువ్వు కనిపిస్తావని వెదుకుతూనే వుంటాను. ఎందుకో తెలుసా? నా ఆశలు, నా తలపులు, నా భావాలు, నా ఆలోచనలూ నీ చుట్టూ పరిభ్రమించటం అలవాటుగా మారింది మరి. నా సుఖం, నా దుఃఖం నా సంతోషం, నా విషాదం, నా పగలూ , నారాత్రి, ఉదయాలూ, అస్తమయాలూ అన్నీ నువ్వేగా నవ్వుకోకు.
ఈ బాధ కూడా సౌఖ్యమే అనిపించే రాధని నేను ప్రియా! అందుకే నా చుట్టూ అలుముకున్న నిశిరాత్రి సైతం నీ చేతుల స్పర్శలా నాకు దైర్యన్నిస్తుంది. నువ్వు లేకపోయినా చీకటిలో నన్ను తాకే చిరుగాలి కూడా నిన్నటి నీ బాసల్ని జ్ఞాప్తికి తెచ్చి నాగుండె ఘోషకి ఓదార్పునందిస్తూంది. అంతెందుకు..... నా క్రింద నలిగే పరువు కూడా నువ్వు ఒలికించిన అనురాగాల సరాగాల మెరుపుల ఊర్పుల్ని గుర్తుచేసి ఊరడిస్తూంది. ఎంతుంటేనేం- నువ్వు లేవుగా..."
" ఇంకా ఎంతసేపు?"
భాస్వంత్ పిలుపుతో చదువుతున్న నవల్లో నుంచి తల పైకెత్తింది ఆర్తి.
నిజానికి అది పిలుపు కాదు.... గర్జన.
"అర్ధరాత్రి దాటుతున్నా ఆ వేధవ చదువేమిటి?"
బెడ్ మీద నుంచి విస్సుగా అరిచాడు.
ఇది ఆమెకు క్రొత్త కాదు.
ప్రతి రాత్రీ వున్నదే.
ఆఫీసు నుంచి భాస్వంత్ ఇంటికి రావడం. పక్క గదిలో అపరాత్రి దాకా ఏవో ఫైల్సుతో కుస్తీలు పడుతూ గడపడం, తన పని పూర్తికాగానే బెడ్ మీద వాలిపోతూ ఆర్తిని పిలవడం.....
" నిన్నే..... ఇంకా అలా చూస్తున్నావేం?"
నిద్రపోటానికి టైం ముంచుకొస్తున్నట్టు తొందర చేస్తున్నాడు.
ఆర్తి నిర్లప్తంగా నవలని టేబుల్ మీద వుంచింది. భాస్వంత్ అలా అరుస్తూన్నది కోపంతో కాదని ఆమెకి తెలుసు. అది అతడి మనస్తత్వం. తన పని పూర్తి కాగానే భార్య బెడ్ మీదకి రావాలి. అణకువగా అతడ్ని అల్లుకుపోవాలి. ఆ తర్వాత.....
"అలా పక్కకి ఒరిగి పడుకున్నావేం?" ఆమె పై చేయి వేయబోయాడు భాస్వంత్.
ఆమె సహకరించేదేగాని ఇప్పుడు మూడ్ లేదు. ఇందాక చదివిన నవల్లోని పంక్తులు ఆమె మనసుని చాలా కలవరపరిచాయి. ఒక ఆడపిల్ల ప్రేమించిన వ్యక్తికోసం పడే ఆర్తిని చాలా అందంగా రాశాడు. ధర్మతేజ. చాలా స్వల్పకాలంలో అతడంత గొప్ప రచయిత కావటనికి బహూశా భావుకత్వంతో అంతగా ఆకట్టుకోగల శక్తే కారణమేమో కదూ! అయినా మగవాడయ్యుండీ ఓ స్త్ర్రీ అంతర్మధనాన్ని ఇంత పరిపూర్ణంగా ఎలా పూహించగులుగుతున్నాడు....
|
25,373 |
డాక్టర్ సుధీర్ రౌండ్స్ కి వచ్చాడు- పులి అడవిలో పచార్లు చెయ్యడానికి వెళ్ళినట్లు.
అతని కాళ్ళకి మెత్తటి కిడ్ లెదర్ బూట్లు ఉన్నాయి. వాటికి మెత్తటి క్రేప్ సోల్స్ వున్నాయి. శశి వాళ్ళ ఫ్రెండొకామె న్యూయార్కు నుంచి వస్తూ అవి తెచ్చింది. ఆ బూట్లు వేసుకుంటే అతను వేట కెళుతున్న పిల్లిలా నిశ్శబ్దంగా నడవగలడు.
ఒక్కొక్క పేషెంటునీ చూస్తూ నడుస్తున్నాడు.
ఆ గదిలో ఒక్కతే పడుకుని, నీరసంగా ఉన్న మొహంతో నిద్రపోతున్న శారద బెడ్ పక్కన ఆగాడు.
ఆ పక్కనే ఉన్న ఉయ్యాల్లో చిన్న పసిపాప.
వూలు బంతిలా, దూది పింజెలా, పౌడరు పువ్వులా పడుకుని ఉన్న పసిపాప!
తన కొడుకా? అయి వుండాలి! అవును, మరి! ఇన్నాళ్ళూ పిల్లల్లేని శారదకి పిల్లాడు పుట్టాడంటే.....పైగా అచ్చం తన పోలికే!
అతని మనసంతా చిరాగ్గా అయిపోయింది.
ఆరోజున సరదా కొద్దీ శారదని ఏదో చేసేశాడు తను. అంత మాత్రానికే ఒక్కసారికే ఈవిడ ప్రెగ్నెంట్ అయిపోవాలా? ఆ రోజు తరవాత ఇక తన కంటికి కనబడకుండా బెదిరి దూరంగా పారిపోతుందనుకున్నాడు.
చౌకరకం కాగితం మీద పిచ్చిగీత ఒకటి పెన్సిల్ తో గీశాడు తను. కాలమనే రబ్బర్ తో అదే క్షణంలో ఆ పిచ్చి గీతను చెరిపెయ్యవచ్చుననుకున్నాడు.
కానీ ఇండియన్ ఇంకుతో గీసిన గీతలాగా ఈ గీత చెరిగిపోదేం?
శశివదన కేంద్రంగా గీసిన వృత్తంలా ఇక్కడిక్కడే ఎందుకు తిరుగుతోంది? విషాద గాధకి ఇతివృత్తంలా ఎందుకలా దిగులుగా వుంటుంది? వెగటుగా వుంది అతని మనసు.
కాలుస్తున్న సిగరెట్ ఆర్పేసి, కొత్త సిగరెట్ అంటించాడు.
జేబులో పెట్టుకున్న చేతులు బయటికి తీశాడు - పులి పంజా చాచినట్లు.
ఎదురుగా తల్లీ, బిడ్డా!
మాయలకు గురై, అలిసిపోయిన దానిలా నిద్ర పోతూంది తల్లి.
ఇంకా మాయ పూర్తిగా తొలగని పాప అమాయకంగా నిద్రిస్తుంది.
చేతులు పాప వైపు చాచాడు.
"బే! బ! బ!" అని వినబడింది.
ఉలిక్కిపడి చేతులు వెనక్కి తీసుకుని చూశాడు.
దుర్గ!
మూగగా మాట్లాడుతూంది.
"ఇక్కడి కెందుకొచ్చావ్?" అన్నాడతను కర్కశంగా.
"మే! మామా! మే!" అంది దుర్గ, బెదిరిపోయిన మేకపిల్లలా, శారదని చూపిస్తూ. ఆమెవైపు తీక్షణంగా చూశాడు సుధీర్. తలుపు దగ్గర నిలబడి ఉంది దుర్గ. తనని డిస్టర్బ్ చేసినందుకు అతనికి ఒళ్ళు మండిపోయింది. అప్రయత్నంగా తలుపు వైపు అడుగు లేశాడు.
* * *
డైనింగ్ టేబిల్ మీద తల ఆనించి కూర్చుని ఉంది శశి.
ఇంక ఈ నాటకం ఆడలేదు తను! భరించలేనంత అసహ్యంగా, వికారంగా ఉంది తనకి! సుధీర్ చేసిన తప్పుని క్షమించి వూరుకోవడానికి తను సతీ సక్కుబాయి కాదు.
అందరి తప్పులూ భరించి, క్షమించగలననే గర్వం తనకుండేది ఇదివరకు!
అది తప్పేమో!
నిజంగానే తను భరించలేకపోతోంది.
తనది చాలా ఉదాత్తమైన హృదయమని తనని తాను నమ్మించుకోవడానికే శారదని నర్సింగ్ హోమ్ లో చేర్చుకుని డెలివరీ చేసిందా? డెలివరీ చేసేసి చేతులు డెట్టాల్ తో కడిగేసుకుంది గానీ, ఆ డెలివరీకి కారణభూతమైన తప్పుని తన మనసులోంచి కడిగేసుకోలేక పోతోంది.
ఎవరికీ కలలో కూడా రాకూడని ఈ దుర్భర స్థితి ఏమిటి?
దిగులుగా అయిపోయింది శశి మనసు. తను చిక్కుకున్న పరిస్థితి చూస్తే వాంతి వచ్చేటట్లు ఉంది.
నిజంగానే!
చటుక్కున లేచి సింక్ దగ్గరికి పరిగెత్తింది శశి. ఒంగి వామిట్ చేసేసుకుంది.
రెండు చేతులు వెనకనుంచి వచ్చి ఆమెను పట్టుకున్నాయి.
నీరసంగా తలెత్తి నుదుటిమీద నుంచి చూసింది శశి.
సుధీర్!
తనని పాతాళంలోకి తోసేసి, అంచుమీద నిలబడి తొంగిచూస్తున్నట్లు చూస్తున్నాడు. |
25,374 |
మాలతి ఆమె ప్రక్కకు వెళ్ళి కూర్చుంది. "లైటర్స్ టైప్ చెయ్యటం ఇవాళ కార్యక్రమంలో ఒక భాగం. అవునుగానీ ఇంతసేపటివరకు రాకపోతే ఏమనుకున్నావు?" అనడిగింది. భానుమతి స్నేహితురాలి చేతిని తన చేతిలోకి తీసుకుని వ్రేళ్ళతో మృదువుగా నిమురుతూ అంది "ఏ రాజకుమరుడో ఎత్తుకుపోయాడనుకున్నాను." "ఫో! ఆడదాని ఆలస్యానికి కారణాలు ఎత్తుకుపోబడటం లాంటివేనా? వేరే వుండవా?" "ఉన్నా, వేరే వాటిని గురించి ఆలోచించే ఓపిక వుండదు జనానికి. నేను కూడా జనంలో ఒక భాగాన్ని." "నువ్వు జనంలో ఒకదానివేం కాదు. అవసరమైనప్పుడు అబద్దాలు మాత్రం ఆడుతూవుంటావు. అసలేం జరిగిందంటే....." "ఏదో జరిగేవుంటుందని నీ మొహం చెబుతూనే వుంది. కానీ ఇప్పుడు వినే ఓపిక లేదు. ముందు అన్నం తినాలి. త్వరగా వెళ్ళి బట్టలు మార్చుకురా." "ఉహుఁ స్నానంచెయ్యాలి. అప్పటి దాకా వుండగలవా?" "ఉండగలను. కబుర్లు చెబుతూ కూర్చుంటే కడుపు నిండిపోతుంది గానీ ఆలోచిస్తూ కూర్చుంటే ఆకలి కరకరలాడుతూ కొనసాగుతూనే వుంటుంది. ఆకలిని వీలయినంతసేపు అలా వుంచెయ్యటంలో అందమూ వుంది. మరి వెళ్ళిరా..." మాలతి లేచి టవలూ, అల్మైరానుంచి చీరె వగైరాలు తీసుకుని బాత్ రూమ్ వైపు వెళ్ళిపోయింది. పది నిముషాల తరువాత ఆమె ఫ్రెష్ గా తయారై నవనవలాడుతూ తిరిగి వచ్చేసరికి భానుమతి ఇంకా అదే భంగిమలో పడుకుని వుంది. "రా భోం చేద్దాం." ఇద్దరూ నేలమీద ఒకరికెదురుగా ఒకరు కూర్చుని స్టెయిన్ లెస్ స్టీలు కంచాలు ముందు పెట్టుకుని కారియర్ విప్పారు. అందులోని భోజనపదాద్దాలు వడ్డించుకున్నాక భానుమతి ప్రక్కనే చిన్న రేక్ మీదనున్న సీసాలో వున్న ఆవకాయను చెంచాతో తీసుకుంది. "నీక్కూడా కావాలా?" మాలతి వద్దన్నట్లు తలాడించింది. "నిజానికి నేను ఉప్పు, కారం ఎక్కువ తినకూడదు. మా ఆయనకు దూరంగా వున్నాను కాబట్టి. అందులో కొన్నాళ్ళు కాపురంకూడా వెలగబెట్టిన దాన్ని. కానీ అదేం ఖర్మమో! కారంవైపే నా మనసు ఉరకలు వేస్తుంది. నీకు తెలుసుగా పచ్చిమిరపకాయ బజ్జిలన్నా నాకెంత ఇష్టమో?" మాలతికి ఆకలిగా లేదు. తినాలని అసలు లేదు. అయినా భానుమతికి కంపెనీ ఇవ్వకపోతే బాగుండదని అన్నం కలుపుకుని కొంచెం కొంచెం తింటోంది. "ఇప్పుడు చెప్పు. వింటానికి అభ్యంతరంలేదు. నీ ఆలస్యానికి కారణాలు..?" మాలతి మెల్లమెల్లగా జరిగినదంతా పూసగ్రుచ్చినట్లుగా చెప్పేసింది. అలా చెబుతుంటే గడిచేదంతా సినిమారీల్ లా కాళ్ళముందు తిరుగుతున్నట్లయి ఆమెకు ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఎంత స్తబ్దుగా వుందామనుకున్నా, ఈ స్తబ్దతాపూరితమైన తెరలను తొలగించుకుని వింత తొంగిచూస్తూనే వుంటుంది. అంతావిని భానుమతికూడా ఆశ్చర్యపడింది. "స్వేచ్ఛ, స్వేచ్ఛ అని మానవుడు గింజుకుంటాడు గానీ ఈ చరాచర ప్రపంచంలో తల్లి, తండ్రి, భార్య, మొగుడు, స్నేహం - వీటి పేరిట ఏదో ఒకరుపంలో పంజరంలో ఎలా బంధించబడుతూ వుంటుందో చూశావా? జీవితాలను నలగగొట్టేయడానికి ఈ శక్తి నీడ నిరంతరం ప్రసరిస్తూనే వుంటుంది" అన్నది. "అదంతా నాకుతెలీదు. అతన్లో ఏదో అజ్ఞాత వ్యధ వున్నట్లుగా నాకనిపించింది. ఆ బంగళా, అందులో తల్లి పేరుతో వున్న భయంకరమైన స్త్రీ మూర్తీ, యజమానికోసం సర్వం అర్పించడానికి సిద్ధపడినట్లుగా వున్న పసివాడూ- ఎంత వద్దనుకున్నా అదే పదే పదే గుర్తొస్తున్నాయి." "అందరిలో ఎవరు ఎక్కువగా గుర్తొస్తున్నారట?" అనడిగింది భానుమతి చిన్న చిరునవ్వుతో. "ఆ ఎక్కువతక్కువలు నాకు తెలీదు. అలాంటి తేడాలు కూడా వున్నాయని అనుకోను." "లేకపోతే మంచిదే" అని భానుమతి ఊరుకుంది. భోజనాలు పూర్తయినాయి. ఆకలి తీరిందేమో భానుమతి ముఖంలో ఓ రకం తృప్తి కనిపించింది. కంచాలు అక్కడ్నుంచి తీసేసి, ఆ జాగా శుభ్రంచేసి ఇద్దరూ పక్కలేసుకున్నారు. వాళ్లకు మంచాలు లేవు. చాపలు పరచుకుని వాటిమీద పరుపులు వేసుకుని పడుకోవటం అలవాటు. పడుకోవటంలోకూడా ఇద్దరికీ కొన్ని అలవాట్లు వున్నాయి. మాలతి ఒక ప్రక్కకి ఒదిగి, కొద్దిగా ముడుచుకుని పడుకుంటుంది. భానుమతి తెల్లవార్లూ అటూఇటూ కదులుతూ మాలతిని చేతుల్తో పొడుస్తూ, కాళ్ళతో తంతూ నానా రభసా చేస్తూ వుంటుంది. మాలతికి ఒక దిండువుంటే చాలు, భానుమతికి రెండు దిళ్ళున్నా చాలవు. అయినా కొంతసేపటికి తల నేలమీదే వుంటుంది. "ఇప్పుడు చెప్పు?" అంది మాలతి హాయిగా ప్రక్కమీద ఇమిడిపోయి. "దేన్నిగురించి?" "నువ్వు ఇన్నాళ్ళూ దాచిన రహస్యంగురించి." "నా పెళ్ళిగురించా అడుగుతున్నావు? నా జీవితంలో రహస్యాలంటూ ఏమీ లేవు. చెప్పవలసిన అవసరం రాకా, దానిమీద బుద్ధిపోకా చెప్పలేదంతే.... నా గతజీవితంలో ఆనందమోహన్ ఆనేవాడు కొన్నాళ్ళపాటు ప్రముఖపాత్ర నిర్వహించారు. అదీ మొగుడిపాత్ర...." చాలా తేలిగ్గా, సునాయాసంగా చెప్పింది. మనిషిలో ఏమీ గగుర్పాటు కనిపించలేదు. కానీ మాలతిమాత్రం భయంతో వణికిపోయినట్లయియింది. ముఖం నల్లబడిపోయింది. "అదేమిటి? అలా అయిపోయావేం?" అన్నది భానుమతి ఆమె వంటిమీద చెయ్యివేసి నిమురుతూ. "అదికాదు..... అంత ముఖ్యమైన విషయాన్ని అంత నిర్లక్ష్యంగా తేసేశావేం?" మాలతి గొంతు సహజంగా రాలేదు. "ఆ అనుభవాన్ని దాటేశాను గనుక. అంటే - అంత ముఖ్యమైన విషయమూ ఒకనాటి అనుభవం గనుక." "భానూ?" "భయపడకే మాలతీ! జరిగిపోయాక కొన్ని అల్పమైన విషయాలు అమూల్యమైనవిగానూ, గొప్పవని అనుకున్నవి సామాన్యమైనవిగానూ వస్తూ వుంటాయి. ఇంకో సంగతి తెలుసా? మేమిద్దరం ప్రేమించి పెళ్ళి చేసుకున్నాం." మాలతికి ఇది మరీ చోద్యమనిపించింది. |
25,375 |
"ఎస్. ఇట్స్ నేచురల్ ఫినామినా... అయితే?" అన్నాడు ప్రొఫెసర్. "అలాగే ఆత్మ కూడా భౌతికదేహ వాంఛలతో, లక్ష్యసిద్ధితో కుతకుతలాడే ఆత్మ మరుజన్మని కోరుకుంటుంది. అవునా ప్రొఫెసర్?" దానికేం సమాధానం చెప్పాలో వెంటనే ఆయనకు తోచలేదు. అందుకే అలా అన్నాడు. "మే బి... మే నాట్ బి" చిన్నగా నవ్వాడు విశ్వాత్మ. "మే బి ఈజ్ నాట్ కరెక్ట్... మస్ట్ బి...." సీరియస్ గా అన్నాడు విశ్వాత్మ. ఈ విషయంలో విశ్వాత్మతో చాలాసేపు ఆర్గ్యూ చెయ్యగలడు ప్రొఫెసర్ రామకృష్ణారావు. అయితే అనూహ్యమైన మానసిక మార్పులకు లోనవుతున్న విశ్వాత్మతో ఆర్గ్యూ చేయదలుచుకోలేదు రామకృష్ణారావు. దానిక్కారణం విశ్వాత్మలోని మార్పులకు వృద్ధాప్యమే ప్రధానమైన కారణమని భావిస్తున్నాడాయన. అందుకే విశ్వాత్మవైపు ఆపాదమస్తకం ఆశ్చర్యంగా చూశాడాయన. "ప్రొఫెసర్ రామకృష్ణారావ్ మీకిపుడెన్నేళ్ళు?" "యాభై అయిదు" "మీ అబ్బాయికి?" "ముప్పైరెండు" "పెళ్ళయిందా?" "మీకు వెడ్డింగ్ కార్డు పంపాను. మీరు రాలేదు. మా అబ్బాయి సంవత్సరం క్రితం పెళ్ళయింది" "మీ అబ్బాయికి పిల్లలు కలిగారా?" "మా కోడలు ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భవతి" చెప్పాడు రామకృష్ణారావు- అసలు అవన్నీ విశ్వాత్మ ఎందుకడుగుతున్నాడో అర్థంకాక. "మీకు మనవడో, మనవరాలో పుడితే ఏం పేరు పెడతారు?" అడిగాడు విశ్వాత్మ. "మనవడే పుడతాడు.... ఎందుకంటే స్కానింగ్ చేయించాం...." అన్నాడాయన. "గుడ్ పుట్టబోయే మీ మనవడికి నేనిప్పుడే పేరు పెడుతున్నాను. పెట్టమంటారా?" "అంతకంటే ఆనందకరమైన విషయం వుండదు. మీరే పేరు పెడితే ఆ పేరునే ఖాయం చేస్తాను. చెప్పండి" ఒక్కక్షణం సాలోచనగా సీలింగ్ ఫ్యాన్ వైపు చూసి చెప్పాడు విశ్వాత్మ. "ధృతకుమార్... బాగుందా?" "చాలా బావుంది... మావాడికి ఆ పేరే పెడతాను." "మర్చిపోరు కదా... నాకు ప్రామిస్ చెయ్యండి" విశ్వాత్మ ఎందుకో చెయ్యి ముందుకు సాచాడు ఒట్టు పెట్టమన్నట్టుగా. "నేను మీకు ప్రామిస్ చెయ్యడమేమిటి... ఇట్స్ ఎన్ ఆర్డర్... నా మనవడికి అధికారికంగా నేను పెట్టే పేరు ధృతకుమార్...." విశ్వాత్మ చేతిలో చెయ్యివేసి చెప్పాడు రామకృష్ణారావు. చాలా స్వల్ప విషయానికి సంబంధించి విశ్వాత్మ తన చేత ఒట్టు పెట్టించు కోవడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఆ ప్రొఫెసర్ కి. "డియర్ ప్రొఫెసర్... నా చేష్టకు ఆశ్చర్యపోతున్నారు కదూ? తప్పదు. ఎందుకంటే నేను పునర్జన్మ పొందాక ఎవర్నో పోల్చుకోవాలంటే భవిష్యత్తు కోసం కొన్ని గుర్తుల్ని తయారుచేసుకోవాలిగా ఏవంటారు?" అన్నాడు. ఈ మహానుభావుడికి పిచ్చి బాగా ముదిరిందని అనుకున్నాడు మనసులో రామకృష్ణారావు లోలోనే నిట్టూరుస్తూ. మరో అరగంట గడిచాక, రామకృష్ణారావు లేచి నిలబడ్డాడు. "థాంక్యూ మైడియర్ ఫ్రెండ్... మళ్ళీ మనం కలుస్తామో లేదో తెలీదు. నేను కలవటానికి వీలుపడదు. బికాజ్ ఐ యామ్ కౌంటింగ్ మై లాస్ట్ అవర్స్- మీరు కలవడానికొస్తే నేనుండను. ఒకవేళ కొన్నివందల సంవత్సరాల తర్వాత మనం ఎదురెదురుగా వున్నా పోల్చుకోలేని పరిస్థితుల్లో వుంటాం..." భవిష్యత్తులోని పునర్జన్మను తలుచుకుంటూ అన్నాడు విశ్వాత్మ. లాభం లేదు. ఈయన్ని కొన్నాళ్ళు సైకియాట్రిస్ట్ పర్యవేక్షణలో వుంచడం మంచిది. మనసులోనే అనుకుంటూ కరచాలనం చేస్తూ, విశ్వాత్మవైపు చూశాడు ప్రొఫెసర్ రామకృష్ణారావు. విశ్వాత్మ కళ్ళలో తడి. ఆ తడికి కారణం రామకృష్ణారావుకి తెలీదు. ముప్పైయేళ్ళ సాహచర్యానికి ఇదే ఆఖరి కలయిక అని పరోక్షంగా చెప్పడం. రామకృష్ణారావు వెనుతిరిగాడు- "మైడియర్ ప్రొఫెసర్! మీ మనవడి పేరు ధృతకుమార్... మరిచిపోకండి" మరోసారి పెద్దగా గుర్తుచేశాడు విశ్వాత్మ. * * * * జీవితంలో విలువైన కాలాన్ని ఆలోచనలతో కొలుస్తున్నాడు విశ్వాత్మ. తెల్లవారుజాము మూడుగంటలు దాటింది. ఆ రోజు తను పుట్టినరోజు. తేదీల ప్రకారం తను గొప్పగా జరుపుకునే ఆ పుట్టినరోజునాడు, వరుసగా గతంలో జరిగిన అరుదైన, అద్భుతమైన మరుపురాని సంఘటనలెన్నో గుర్తుకొచ్చాయి విశ్వాత్మకి. ప్రొఫెసర్ రామకృష్ణారావు వెళ్ళిపోయాక, మళ్ళీ వచ్చిన పరాంజపే... పుట్టినరోజుని వైభవంగా జరపాలని తన ఫ్యాక్టరీలో పనిచేసే ఉద్యోగస్తులు తీసుకొన్న నిర్ణయాన్ని తనతో చెప్పడం, తను కాదనడం గుర్తు వచ్చింది విశ్వాత్మకు. చనిపోయే ముందురోజు పుట్టినరోజేమిటి? నాన్సెన్స్... చిరాకు పడ్డాడు కూడా. తనవైపు అదోరకంగా చూస్తూ పరాంజపే వెళ్ళిపోవడం గుర్తు కొచ్చిందతనికి. వీళ్ళందరూ తనని పిచ్చివాడని అనుకోడానికి అవకాశం వుంది కదా! తను పిచ్చివాడా? నెమ్మదిగా విశ్వాత్మ పెదవులు విచ్చుకున్నాయి. అది నవ్వుగా మారడానికి అట్టే సమయం పట్టలేదు. మృత్యుహాసం వెనుక జనన ప్రతీక... తనెందుకు పుట్టినరోజు జరుపుకోకూడదు? ఆఖరి పుట్టినరోజునాటి విశేషాలను తలుచుకొని, పునర్జన్మలో ఆనందించటానికి అవకాశం వుంటుంది కదా! బెడ్ రూమ్ డోర్ తెరిచి వరండాలో కొచ్చాడు. మేడమెట్లు దిగుతూ కుంటుతున్న కుడికాలివైపు బాధగా చూసుకుని తనను తాను ఓదార్చుకున్నాడు. మెట్లక్రింద, కుడివైపున విశాలమైన డ్రాయింగ్ రూం. విశాలమైన ఆ గదినిండా ప్రపంచంలోని నలుమూలల నుండి తన భార్య వైదేహి కోసం సంపాదించిన అద్భుతమైన కళాఖండాలు అందంగా, అపురూపంగా అమర్చబడి వున్నాయి. కాసేపు భార్య జ్ఞాపకాల కళారాధనలో తన మధురస్మృతుల అలల్ని నెమరువేసుకుంటూ గడిపాడు విశ్వాత్మ. అర్ధనిమిలితంగా ఎంతసేపు గడిపాడో తెలీదు. పచ్చని, పల్చని కాంతి ఒంటికి తగిలేసరికి కళ్ళిప్పాడు. గవాక్షంలో సూర్యోదయం. తలుపు దగ్గర ఏదో ఆకారం సన్నగా కదిలిన చప్పుడికి తల తిప్పాడు విశ్వాత్మ. మళ్ళీ పరాంజపే. |
25,376 |
"అవును! మనమంతా పొదుపు చెయ్యాలి!" అంది రాజేశ్వరి.
"పొదుపంటే ఖర్చులోనే కాదు- అన్నిటిలోనూ పొదుపు చేయాలి" అంది సావిత్రమ్మగారు.
ఆ మర్నాటి నుంచే అన్ని విషయాల్లోనూ పొడుపు చెయ్యాలని అందరూ నిర్ణయించేశారు. దుబారా విషయంలో ఆడాళ్ళకంటే మగాళ్ళే ఎక్కువ చొరవ తీసుకోవాలని వాళ్ళనేసరికి మేము కొంచెం ఇబ్బందిలో పడ్డాం.
"రోజుకి ఓ సిగరెట్ పెట్టె కాల్చేవాళ్ళు సగం పెట్టే కాల్చాలి" అంది శ్రీవల్లి.
వాళ్ళాయనను సిగరెట్లు మాన్పించడానికి అంతకంటే మరో ఉపాయం తట్టలేదామెకి. సరేనన్నారు చాలామంది.
"సుపారీ పొట్లాలు కూడా తగ్గించాలి" అన్నారు వారు.
అదీ ఒప్పుకున్నాం.
సినిమాలు కూడా వారానికొకటల్లా నెలకు రెండుకి తగ్గించాలి.
ఎక్కువ పొదుపు చేసినవారికి కాలనీ కమిటీ తరపున 'పొదుపురత్న" అవార్డు కూడా ఇవ్వాలని రంగారెడ్డి సూచించాడు.
మర్నాటి నుంచీ పొదుపు డీల్ ప్రారంభమయింది.
"పొదుపు చేసిన ప్రతి నీటిచుక్కా ప్రగతికి సోపానం" అన్న అంశంతో రోజుని ప్రారంభించాలని అందరం అనుకోవడం చేత నేను రోజూ బక్కెట్ నీళ్ళు స్నానానికి వాడేవాడినల్లా అరా బక్కెట్ కి తగ్గించి స్నానం చేయాలని నిర్ణయించుకొని బకెట్ తీసుకొని బాత్ రూమ్ కి చేరుకున్నాను. తీరా చూస్తే పంపులో నీళ్ళు రావటం లేదు.
"వేసవికాలం మొదలయిందికదా! బహుశా నీళ్ళు మామూలు సప్లయ్ వుండదు కాబోలండీ" అంది మా ఆవిడ.
"మరిప్పుడెలా?"
"ఇవాళింకేం స్నానం చేస్తారూ- సాయంత్రం చేద్దురుగాన్లెండి! ఆఫీసుకి టైమవుతోంది వెళ్ళండి" అంది.
గత్యంతరం లేక స్నానం లేకుండా ముఖం కడుక్కుని డ్రస్ చేసుకొని బయటకొచ్చాను.
"ఇవాళ నీళ్ళు ఆదా చేయటానికి ఛాన్స్ దొరకలేదు" అన్నాడు రంగారెడ్డి.
పోన్లే రేపట్నుంచి చేద్దాం" అన్నాడు శాయిరామ్.
"ఏమిటి? ఎవరూ స్కూటర్లు లేకుండా వచ్చారా?" అడిగాడు జనార్ధన్ మేము రావటం చూసి.
మేము విజయగర్వంతో నవ్వాం.
"పిచ్చివాడా! ఇంధనాన్ని ఆదా చేయటం ద్వారా విదేశీ మారక ద్రవ్యం ఆదా చేయండి! అని మన దూరదర్శన్ చెప్పటం లేదూ?? ఈ పని మనం తేలికగా చేయగలం! కనీసం మనం తేలిగ్గా చేయగలిగిన పనులన్నా చేయకపోతే ఎలా?" అన్నాడు రంగారెడ్డి.
"నిజమే! నేనూ ఇవాళ్టినుంచి మోటార్ సైకిల్ బయటకు తీయను"
అందరూ బస్టాప్ లో నిలబడ్డారు.
బస్ లు వరుసగా వస్తున్నయ్ గానీ అన్నింట్లోనూ జనం పుట్ బోర్డ్ బయట ఓ మీటర్ డయామీటర్ లో వేలాడుతున్నారు.
చివరకు ఆ ఇరుకులోనే దూరి నిలబడ్డాం.
బస్ గంటకు ఐదు కిలోమీటర్ల వేగంతో నడుస్తోంది. కొంచెం రోడ్ ఎత్తు వచ్చినచోట మాత్రం ఓసారి ఎత్తు ఎక్కలేక వెనుకకు డొల్లి పోయింది గానీ డ్రయివర్ మళ్ళీ గేరు మార్చి ముందుకు నడిపాడు.
ప్రతి స్టేజీలోనూ లోపల్నుంచి దిగాలంటే ఐదు నిమిషాలు, ఎక్కాలంటే పది నిముషాలు పడుతోంది.
చివరకు మేము ఆఫీసు చేరుకునేసరికి పదకొండయింది.
ఆ పూటకి లీవ్ లెటర్ రాయించుకున్నాడు మా సూపర్నెంట్.
"అనవసరంగా లీవ్ తీసుకున్నాం! లీవ్ దుబారా ఐపోయింది" అన్నాడు రంగారెడ్డి.
"అంతేకాదు! అవసరం ఉన్నప్పుడు వాడుకోవడానికి లీవ్ దొరక్కుండాపోతుంది" అన్నాడు శాయిరామ్.
"థూ! నీ యవ్వ బస్ లు! రేపటికెళ్ళి నా స్కూటర్లో నేనొస్తాభయ్! ఈ పెట్రోల్ పొదుపు నాతోని కాదు" అన్నాడు యాదగిరి.
ఆ సాయంత్రం మళ్ళీ బస్ లో ఇల్లు చేరుకునే సరికి ఏడున్నరయిపోయింది.
"ఏమిటింత ఆలస్యంగా వచ్చారు? పిల్లలకు హోమ్ వర్క్ ఎప్పుడు చెప్తారింకా?" అన్నారు ఆడాళ్ళు.
"పెట్రోలు ఆదా చేశాం కాబట్టి హోమ్ వర్క్ కి టైముండదు. వాళ్ళనే చేసుకోమనండి!" అన్నారు మగాళ్ళు.
"ఇప్పుడు మనం కరెంట్ ఆదా చెయ్యాలి! త్వరగా భోజనం చేసేద్దాం పదండి" అంది మా ఆవిడ.
అందరం భోజనం గదిలో కెళ్ళేసరికి కరెంట్ పోయింది.
అరగంటసేపు ఎదుర్చూసినా గానీ కరెంట్ రాకపోయేసరికి మాకు నిరాశ కలగటం మొదలుపెట్టింది.
రోజూ పదిగంటల వరకూ లైట్లు వెలుగుతూండేవి. ఆ రోజు నుంచీ తొమ్మిది గంటలకే లైట్లు ఆర్పివేస్తే చాలా కరెంట్ కలిసొస్తుందని అనుకున్నాం.
రాత్రి పదయినా కరెంట్ రాలేదు.
అందరం కొవ్వొత్తులు కొనుక్కొచ్చి వాటిని వెలిగించుకున్నాం.
"ఇవాళ్టి నుంచీ 'పవర్ కట్' అని పేపర్ లో వేశారండీ మర్చేపోయాం" అంది పక్కింటావిడ.
ఎప్పుడు నిద్రపట్టిందో మాకు తెలీదు. తెల్లారుజామున నాలుగింటికి మెలకువ వచ్చింది. అదీ పార్వతీ గాంగ్ వాళ్ళు తలుపు తట్టబట్టి. "ఏమిటి ఇంత ప్రొద్దున్నే వచ్చారు?" అడిగింది మా ఆవిడ నిద్రకళ్ళల్లో.
"పొదుపు చేయటమంటే రాత్రంతా లైట్లు, ఫానులు వేసుకుని పడుకున్నారేమిటి? పైగా ఆ టీవీ కూడా ఆఫ్ చేసినట్లులేదు" అన్నారు వాళ్ళు.
"నిద్రపోయాక కరెంట్ వచ్చినట్లుంది" అన్నాను గొణుక్కుంటూ.
"త్వరగా లైటార్పి ఆదా చేయండి"
నేను లైట్ స్విచ్ దగ్గర కెళ్ళేసరికి మళ్ళీ 'పవర్ కట్' వచ్చేసి ఇల్లంతా చీకటయిపోయింది.
అప్పుడు వినిపించింది పంపు నుంచీ నీళ్ళు వస్తోన్న ధ్వని.
మా ఆవిడ కెవ్వున కేకవేసి వంటింట్లోకి పరుగెత్తింది.
"అయ్యయ్యో! ఇంట్లో చుక్క నీళ్ళు లేవు- వాడు రాత్రి నీళ్ళు వదిలినట్లున్నాడు. తెల్లార్లూ నీళ్ళు కాస్తా పోయాయ్ దుబారా అయిపోయాయ్" అని నెత్తీ నోరూ బాదుకుంటూ బక్కెట్లతో నీళ్ళు నింపసాగింది. రెండు బక్కెట్లు నిండేసరికి నీళ్ళు రావటం ఆగిపోయింది.
ఆడవాళ్ళంతా అప్పుడే బయట గుమిగూడి అందరినీ పిలవటం మొదలుపెట్టారు.
"ఇవాళ కాలనీ అంతా చెట్లు నాటాలికదా! కాలుష్యం నివారణకు మనకు చేతనైనంత సాయం మనం కూడా చేద్దాం!" అంటోంది పార్వతీదేవి.
మరికాసేపట్లో ఆడాళ్ళంతా కలసి కాలనీ కమిటీవాళ్ళు ఫారెస్టు డిపార్ట్ మెంట్ నుంచి తీసుకొచ్చిన మొక్కలు కాలనీ అంతా ప్రతి ఇంటి ముందూ ఓ మొక్క చొప్పున నాటారు. నాటాక గుర్తొచ్చింది అందరికీ- వాటికి పోయడానికి నీళ్ళులేవని.
"ఇప్పుడెలా?" అంది రాజేశ్వరి.
ఎవరికీ నోట మాట రాలేదు.
"పోనీ ఇవాళ ఒక్కరోజు ఎలాగోలా పోద్దామన్నా రేపట్నుంచి ఎలా? ఈ సమ్మర్ అంతా నీళ్ళు సరిగ్గా దొరకనే దొరకవ్? మనకి-" అంది సావిత్రమ్మ. |
25,377 |
హంసలేఖ అనుమానంగా కవర్ విప్పింది. లోపల వస్తువు చూడగానే తను చేసిన తప్పు అర్థమైంది. "గ్రామీణులారా! మీరు మీ జీవిత భాగస్వాముల్ని ముద్దు పెట్టుకోబోయే ముందు ఈ శుభ్రమైన, స్వచ్ఛమైన, ప్లాస్టిక్ కాగితాన్ని పెదవులకు అడ్డుగా పెట్టుకోండి" అంటూ కొనసాగించింది.
* * * ఇది ఇక్కడ జరుగుతున్న సమయానికి అక్కడ ప్రతిమ మీటింగ్ లో అంటోంది. "ఆ అమ్మాయి పేరు రేఖ. సర్పభూషణరావుకి కూతురంటే చాలా ప్రేమ. అయితే ఆ ప్రేమ సహజంగా వచ్చింది కాదు. డబ్బు వల్ల వచ్చింది. మిగతా వివరాలన్నీ ఈ ఫైల్లో వున్నాయి" అంటూ ఫైలు అందించింది. "ఫైలు చదవడాలు అవీ నాకింటరెస్టు లేదని ముందొకసారి చెప్పాను" అంటూ మొదటి పేజీ తిప్పాడు. లోపల కవరుంది. కవరు మీద రేఖ అని రాసి వుంది. లోపలనుంచి ఫోటో తీశాడు. అది హంసలేఖ ఫోటో. ప్రతిమ నాయనమ్మ హడావుడిలో మార్చి పెట్టిన ఫోటో అది. అతడు దానివైపే సూటిగా కన్నార్పకుండా చూశాడు. అతడికి ఆ ఫోటో చూడగానే ఆ రోజు తోటలో ఆ అమ్మాయి సర్పభూషణరావుతో మాట్లాడడం గుర్తొచ్చింది. ఫోటోలో హంసలేఖ అమాయకంగా చూస్తూంది. ఆ కళ్ళల్లో రవ్వంత చిలిపితనం, కుతూహలం కూడా వున్నాయి. "చాలా అమాయకంగా వున్నాయి కదూ ఆ కళ్ళు. ఆ కళ్ళని చూస్తే అసలు మోసం చేసే అమ్మాయిలా కనపడడం లేదు" అన్నాడు. "ఎల్. ఎస్. డి. ఇంజక్షన్లు తీసుకుని తీసుకుని అలా అయ్యాయి ఆ కళ్ళు" అంది ప్రతిమ. - ఆ ఫోటో వైపు చూడకుండా. "ఓకే! మిగతా విషయాలు నేను చూసుకుంటాను. ఈ అమ్మాయిని తండ్రితో సహా ఆ రోజే తోటలో చూశాను. నాకు గుర్తుంది" అన్నాడు. "ఈ సాయంత్రం హోటల్ బ్రాడ్ వేలో సర్పభూషణరావు కుటుంబం ఒక పార్టీకి వస్తూంది. డానికి ఇన్విటేషన్ కూడా సంపాదించాను. ఇదిగో......" అంటూ ఆహ్వానపత్రం ఇచ్చింది. తను చెప్పిన ప్లాన్ చీఫ్ మెచ్చుకోవడం, నేత్ర అంత తొందరగా వప్పుకోవడం ఆమెకి చాలా సంతోషంగా వుంది. నేత్ర బయటకొచ్చి అహోబిలతో "ఇదిగో...... ఈ ఫైలు రికార్డ్ రూంలో పడెయ్యి" అంటూ యిచ్చాడు. ఆమె దాన్ని అందుకని "ఈ సాయంత్రం ....." అంది- అతడిచ్చిన వాగ్దానం గుర్తు చేస్తూ. "సారీ అహూబిలా....... సాయంత్రం కాస్త గవర్నమెంటు వర్కుంది" అన్నాడు వెళ్ళడానికి ఉద్యుక్తుడవుతూ. ఆమె దిగులుగా అతను వెళ్ళినవైపే చూస్తూ వుండిపోయింది.
* * * లోపల పార్టీ జరుగుతూంది. చాలా ఖరీదైన పార్టీ అది. విశాలమైన హాలు. ఇవతల వరండాలో నిలబడి వున్నారు నేత్ర, ప్రతిమ. అద్దాల్లోంచి లోపల మనుష్యులు కనబడుతున్నారు. "అదిగో...... ఆ అమ్మాయే" అంది ప్రతిమ. "చేతిలో కోకాకోలా గ్లాస్ పట్టుకున్న అమ్మాయేగా.....?" హంసలేఖను చూస్తూ అన్నాడు నేత్ర. "పేరుకి కోకాకోలా...... ఎవరూ చూడకుండా అందులో రమ్ కలిపి వుంటుంది" కసిగా స్వర్ణరేఖను చూస్తూ అంది ప్రతిమ. "చూస్తుంటే నేనే నిజంగా ప్రేమలో పడేట్టు వున్నాను. అంత బాగుంది." ఓరగా ప్రతిమను చూస్తూ అన్నాడు. హంసలేఖ నిజంగా ఆ డ్రస్ లో అంత బావుంది. త్రిమూర్తుల భార్యలు ముగ్గురూ కలిసి ఆ అమ్మాయిని అలంకరించినట్టున్నారు. లక్ష్మీదేవి వాసుకి నడిగి మణుల దీప్తిని ఆ అమ్మాయి కళ్ళకి అరువిచ్చినట్టుంది. సరస్వతి భర్త నడిగి నాలుగు చేతులు అరువు తెచ్చుకుని మిగతా అలంకరణ పూర్తి చేసినట్టుంది. ఆ అమ్మాయిని చూస్తూ అతడా మాట అనడంలో తప్పులేదు. ప్రతిమ నవ్వి "నాకా భయమేమీ లేదు. ఆ అమ్మాయి చరిత్ర తెలిసినవారెవరూ ఆవిడ్ని యిష్టపడరు" అంది తేలిగ్గా.
"సరే కుడి కాలు ముందు పెట్టి రంగంలోకి దూకనా.....?" "బెస్టాఫ్ లక్...... నేవెళ్ళి మిగతా ఏర్పాట్లు చూస్తాను. నేత్ర ఆశ్చర్యంగా "మిగతా ఏర్పాట్లేవిటి.....?" అన్నాడు. "ఆ అమ్మాయి నిన్ను తొందరగా ప్రేమించే వాతావరణం కల్పించాలిగా." "అవన్నీ నేను చూసుకోగలను. నిన్ను చూస్తుంటే శోభనం కూడా స్వయంగా ఏర్పాటు చేసేట్టున్నావ్." దేశం కోసం ఆ మాత్రం తెంపరరీగా త్యాగం చెయ్యకపొతే ఎలా....?" అని నవ్వేసింది ప్రతిమ. "నువ్వూ లోపలికి వస్తావా? ఆ అమ్మాయిని పరిచయం చేసుకుందాం-" "వద్దు. నేనుంటే కథ అడ్డం తిరగొచ్చు. వెళ్ళొస్తా. బెస్టాఫ్ లక్" అనేసి ప్రతిమ వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళాక నేత్ర లోపలికి అడుగు పెట్టాడు. ఎయిర్ కండిషన్ హాల్ అది. చల్లటి గాలి రివ్వున కొడుతూంది. అమ్మాయిల్తో పరిచయాలు పెంచుకోవడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. హంసలేఖ ఒక్కతే ఒక మూల నిలబడి కోక్ తాగుతూంది. అతడు తటపటాయించకుండా వెళ్ళి "కెన్ ఐ గివ్ కంపెనీ హియర్...." అన్నాడు చేత్తో గ్లాసుతో. ఆమె తని వైపు చూసింది. అతడి కళ్ళల్లో మాగ్నెటిక్ పవర్ వుంది. ఆమె అతనివైపు అలాగే చూస్తూ వుండిపోయింది. అతను నవ్వాడు. పైకి నవ్వాడేగాని మనసులో ఆ రోజు తోటలో శవాలుగా వ్యాన్ ఎక్కినా మనుష్యుల శరీరాలు కదలాడాయి. క్షణంలో మామూలుగా అయ్యాడు. "నా పేరు నేత్ర. మన్మధ నేత్ర" అన్నాడు. ఆమె కళ్ళు పెద్దవి చేసి. "మన్మధనేత్ర....? పేరు గమ్మత్తుగా వుందే. ఏం చేస్తూ వుంటారు మీరు.....?" అని అడిగింది. "సీక్రెట్ సర్వీస్....." "ఏమిటీ.....?" "రహస్య కార్యక్రమాలు." ఆమె ఫకాలున నవ్వి "భలే మాట్లాడతారే మీరు....." అంది. అతడామెవైపు సూటిగా చూశాడు. చాలా ఖరీదైన స్కర్ట్ లో వున్నదామె. ప్రతిమ చెప్పినట్టు చాలా ఫాస్ట్ గర్ల్ అయి వుండాలి. కానీ...... ఆమె కళ్ళల్లో అల్లరితోపాటు ఇంకా ఇంకా ఏదో వుంది ఏమిటి?...... భావుకత్వం? అతడి సునిశితమైన దృష్టినుంచి ఆమె తాలూకు ఏ ఒక్క ఫీచరూ తప్పించుకు పోలేదు. తన డిపార్ట్ మెంట్ తనకే పని అప్పగించిందో అతడికి కరెక్టుగా తెలుసు. ఏం చెయ్యాలో తెలుసు. అతడు తనుగానే ఈ వ్యవహారం కొనసాగించదల్చుకున్నాడు. పేరు అబద్ధం చెప్పడంగానీ, రహస్యంగా చేయడం గానీ చెయ్యదల్చుకోలేదు. తను ఎంత దాచిన ఈ విషయం ఆమె తండ్రికి ఎలాగూ తెలుస్తుంది. దాయడం అనవసరం. |
25,378 |
"అదేమిటండీ! మేము ఎప్పుడైనా చూస్తాం. ముందు ఇంకా చాలా సమయం వుంది. మీలాంటివారు ఇంకెప్పుడు చూస్తారు? బయలుదేరండి" అన్నాడు వెంకట్రావు. "మా నాయనే!" మనస్సులోనే మురిసిపోయింది పున్నమ్మ. పున్నమ్మ విశాఖపట్నంలో వున్న ఆ రెండు నెలలూ అల్లుడూ కూతురూ రోజూ ఎక్కడికో ఒక చోటకు తీసుకెడుతూనే వున్నారు. కూతురు కాపరం చూసి పున్నమ్మ పొంగిపోయింది. ఆరో నెల జొరబడకముందే కూతుర్ని తీసుకొని పున్నమ్మ పాలేనికి పయనం అయింది. బయలుదేరివస్తూ నాగమ్మ భర్తకు ఎన్నో అప్పగింతలు పెట్టింది. వేళకు భోజనం చెయ్యమనీ, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమనీ ఇంకా ఏమేమో చెబుతూనే వుంది. కూతురూ అల్లుడి అన్యోన్యతనూ, సంసారాన్నీ చూసి "అసలు చదువుకున్న వాళ్ళ దారే వేరు. ఇన్ని రోజులుగా చూస్తున్నా - ఒకర్నొకరు పొరపాటుగా కూడా నొప్పించుకోలేదు" అనుకుంది పున్నమ్మ. బండి బయలుదేరబోయేముందు కిటికీదగ్గర కూచున్న నాగమ్మ ప్లాట్ ఫారంమీద నిల్చున్న భర్త ముఖంలోకి దిగులుగా చూసింది. వెంకట్రావు చిరునవ్వుతోనేకనిపిస్తున్నాడు. కాని ఎందుకో అతనికీ చెప్పలేని దిగులుగా వుంది. "నేను చెప్పింది గుర్తుందా?" చిలిపిగా చూస్తూ అన్నాడు భార్యతో వెంకట్రావు. వెంటనే అర్ధంకాని నాగమ్మ తెల్లముఖం వేసింది. "అదే.....అమ్మాయి......" కొంటెగా చూశాడు. నాగమ్మ బుగ్గల్లోకి రక్తం చిమ్మింది. గులాబి ఛాయలు వెలుగు జిమ్ముతున్న పాలరాతి విగ్రహంలా ఉంది. "లేదా నువ్వు మళ్ళీ విశాఖపట్నం రానక్కరలేదు...." తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో అన్నాడు వెంకట్రావు. నాగమ్మ ఉలిక్కిపడింది. భర్త సరదాకే అన్నా ఆ మాటల్లో ఆమెకు ఏదో అపశ్రుతి వినిపించింది. పున్నమ్మ నోరుతెరుచుకొని కూతురి వైపు చూసింది. బండి కదిలింది. వెంకట్రావు కిటికీలోంచి భార్య చేతిని అందిపుచ్చుకొని మెత్తగా నొక్కాడు. ప్లాట్ ఫారం పైన భర్త కనిపించినంతవరకూ వంగి చూస్తూ చెయ్యి ఊపుతూనే వుంది. వెంకట్రావు కూడా కనిపించినంతవరకూ చెయ్యి వూపుతూ వీడ్కోలు యిచ్చాడు. "ఏమిటే అమ్మాయ్! బండి బయలుదేరేముందు అల్లుడు ఏదో అన్నాడు!" సందేహంగా అడిగింది పున్నమ్మ. నాగమ్మ మాట్లాడలేదు. ఆమెను ఆవరించిన దిగులు ఇంకా చుట్టుకొనే వుంది. "ఏం తల్లీ! మళ్ళీ విశాఖపట్నం రావద్దంటాడేమిటి?" భయంగానే అడిగింది పున్నమ్మ. నాగమ్మకు చెప్పాలంటే సిగ్గనిపించింది. మాట్లాడలేదు. కూతురు మౌనం పున్నమ్మను మరీ భయపెట్టింది. "చెప్పమ్మా! నా దగ్గర దాపరికం ఎందుకూ?" దిగులుగా వుంది పున్నమ్మ కంఠస్వరం. "ఏం లేదమ్మా, ఆయనకు ఆడపిల్లే కావాలంట!" అంటూ నాగమ్మ సిగ్గుతో ముఖాన్ని తల్లి గుండెల్లో దాచుకుంది. పున్నమ్మ ఆనందంతో పరవశమయిపోయింది. "నా తల్లీ! ఎంత సిగ్గే నీకు?" అంటూ బిడ్డను గుండెలకు అదుముకుంది. వారికి ఆ బండిలో ఇతర ప్రయాణీకులు వున్నారనేది కూడా జ్ఞాపకం లేదు. "పన్నెండువేల కట్నంతో లక్షరూపాయల అల్లుణ్ణి సంపాదించుకున్నాం!" అనుకుంది పున్నమ్మ.
13
పుట్టింటికి వచ్చిన నాగమ్మను అన్నలూ, వదినలూ ఆప్యాయంగానే ఆహ్వానించారు. "పెద్దవాణ్ణి! నాగమ్మ పురుడు నా ఇంట్లోనే పోసుకుంటుందమ్మా" అన్నాడు సుబ్బారాయుడు." "చిన్నవాణ్ణి గనుక ఆ అవకాశం నా కివ్వాలి" అన్నాడు నాగభూషణం. "మీ ఇల్లూ నా ఇల్లూ ఏమిటిరా? నాకు తెలియదూ మీకు చెల్లెలంటే ఎంత అభిమానామో? ఇంక పెద్దవాళ్ళం మేము బతికి వున్నాంగా? ఆ తరువాత ఎటూ దానికి మీరే వున్నారు" అంది పున్నమ్మ. "అలా అనకమ్మా! చెల్లాయి పురుడు అయిందాక నువ్వూ నాన్నా కూడా నా దగ్గరే వుండండి." ప్రాధేయపడుతూ అన్నాడు సుబ్బారాయుడు. "నేను పెద్దవాణ్ణి వున్నాగా, మీకెందుకులే ఇప్పటినుంచే ఈ బాధ్యతలు అన్నాడు మాధవయ్య. సుబ్బారాయుడు ముఖం చిన్నబుచ్చుకున్నాడు. "ఏమిటన్నయ్యా నీది మరీ చాదస్తం! అందరం ఒక ఇంట్లో ఒకేచోట వున్నాముగా. వేరు కుండలు కాగానే పరాయివాళ్ళం అయిపోయినట్లా! ఈ మర్యాదలేమిటి మనలో మనకి!" అంది నాగమ్మ. నాగమ్మని ముగ్గురు అన్నలూ వదినలూ ఆప్యాయంగానే చూశారు. నాగమ్మకు తినాలని వున్న పిండివంటలు వదినలు పోటీపడి చేసి పెట్టారు. నాగమ్మ అప్పుడప్పుడూ వదినెల బలవంతంమీద అన్నల ఇళ్ళల్లో భోజనం చేస్తూ వుండేది. అన్నల పిల్లలు 'అత్తయ్యా' అంటూ ఒక క్షణం వదిలేవారు కాదు. మధ్యాహ్న సమయాల్లో నాగమ్మ వదినల దగ్గర కూచుని పట్నం కబుట్లు చెబుతూవుంటే వాళ్ళు కుతూహలంగా వినేవారు. తను పురుడు పోసుకొని వెళ్ళాక వాళ్ళందర్నీ రమ్మని రోజుకు ఒకసారయినా చెప్పేది. నాగమ్మ ప్రసవించింది. ఆడపిల్లను కన్నది. అన్నలూ వదినెలూ, అందరూ హడావుడి చేశారు. ఆడపిల్ల అచ్చం నాగమ్మ పోలికే అన్నారు చూసినవాళ్ళంతా. ఆ మాటలు విని నాగమ్మ భర్తను తలుచుకుంటూ తృప్తిగా నిండుగా నవ్వుకొనేది. సుబ్బారాయుడు బామ్మరిదికి ఉత్తరం రాశాడు బారసాలకు రమ్మనమని. "మొగపిల్లవాడు కలిగితే బాగుండేది." భార్యదగ్గర గుణిసాడు మాధవయ్య. "అల్లుడికి ఆడపిల్ల కావాలటండీ! మేము వచ్చేరోజు స్టేషనుకు వచ్చి ఆడపిల్లను కనకపోతే మళ్ళీ విశాఖపట్నమే రానక్కర్లేదు అన్నాడండీ!" మాధవయ్య ముందు తెల్లబోయి, అంతలోనే తేరుకొని గొల్లున నవ్వాడు. ఆయన చాలాకాలానికి హాయిగా మనసారా నవ్వాడు. "ఏమండీ!" "ఆఁ- ఏమిటి?" భార్య ముఖంలోకి ప్రశ్నార్ధకంగా చూశాడు. "మనం కూడా అమ్మాయి దగ్గరకే వెళ్ళి ఉందామండీ!" అంది పున్నమ్మ బతిమలాడుకుంటున్నట్లు. మాధవయ్య అర్ధంకానట్లు చూశాడు. ఓ క్షణం గడిచాక అన్నాడు: "నీకేమయినా మతిపోయిందా? ఇంత బతుకు బతికి......" "తప్పేమిటి? మనకు ఏ పదిమంది వున్నారు గనుక!" "అందుకని అల్లుడింట్లో వుండమంటావు. నలుగురు కొడుకుల్ని పెట్టుకొని!" విసురుగా అన్నాడు మాధవయ్య. "అల్లుడింట్లో ఉంటే తప్పేమిటి? అల్లుడిల్లని కాదుగా- అమ్మాయి యిల్లని." "చాల్లే వూరుకో. ఎవరయినా నవ్విపోతారు." "కాదండీ! అలా అని అల్లుడే అమ్మాయితో చెప్పాడట. 'పెద్దవాళ్ళ అండ మనకూ వుంటుంది. వాళ్ళకూ కొంత మనశ్శాంతిగా ఉంటుంద'న్నాడట. అమ్మాయి వచ్చినప్పటినుంచీ ఒకటే గొడవ. అల్లుడు అందరిలాంటివాడు కాదండీ! ఎంత మంచివాడో! 'అత్తయ్యగారూ! అత్తయ్యగారూ!' అంటూ ఎంత యిదిగా పిల్చేవాడనుకున్నారు?" మాధవయ్య ఆలోచనలో పడ్డాడు. "మీకు అంతగా ఇష్టం లేకపోతే కొంతకాలం వెళ్ళివద్దాం. పసిపిల్ల తల్లిని ఒంటరిగా ఎలా పంపించను? మీరు ఈ వయసులో చెయ్యి కాల్చుకోవటం నా కిష్టంలేదు" అంది పున్నమ్మ భర్త జవాబుకోసం ఎదురుచూస్తూ. "సరే, చూద్దాంలే!" అన్నాడు మాధవయ్య. "నాన్నా!" పెద్దకొడుకు సుబ్బారాయుడు వచ్చాడు. "ఏరా! పొలంనుంచి వచ్చి ఎంతసేపయింది?" అన్నాడు మాధవయ్య. "ఇప్పుడే వస్తున్నాను. వస్తూవస్తూ వెంకట్రావుని తప్పక రమ్మని ఉత్తరం రాసి పడేసి వచ్చాను" అన్నాడు. "నేను కూడా రాశాలే. తప్పక వస్తాడనే అనుకుంటాను" అన్నాడు మాధవయ్య. "బారసాలకు ఎంతవుతుంది నాన్నా? తమ్ముళ్ళు కూడా అడగమన్నారు. తలకొక రెండొందలు వేసుకుందాం అనుకుంటున్నాం!" నీళ్ళు నములుతూ అన్నాడు సుబ్బారాయుడు. మాధవయ్య సుబ్బారాయుడి ముఖంలోకి అదోలా చూశాడు. ఆ చూపుని తట్టుకోలేని సుబ్బారాయుడు తల తిప్పుకున్నాడు. తల్లివైపు చూశాడు. తల్లికూడా ఆలోచిస్తూ ఎక్కడో చూస్తూంది. "ఏం నాన్నా?" తలవంచుకొని అన్నాడు. "ఎందుకురా! మొన్ననే పంట అమ్మానుగా, ఆ డబ్బు వుందిలే" అన్నాడు తండ్రి. తండ్రిమధ్యా తమమధ్యా చాలా పెద్ద ఆగాధమే ఏర్పడినట్లు అనిపించి బాధపడ్డాడు సుబ్బారాయుడు. బరువుగా అక్కణ్ణుంచి వెళ్ళిపోయాడు. "పోనీ తీసుకోకపోయారా? బిడ్డ మరీ చిన్నపుచ్చుకున్నాడు!" అంది పున్నమ్మ. ఎంత కాదన్నా మాతృహృదయం. "నువ్వూరుకో! నేను బతికుండగానే నా బిడ్డ మొదటికాన్పు ఖర్చు చందాలమీద జరిపిస్తారనుకున్నారా?" "చందా లేమిటండీ? అన్నలేగా ఆ మాత్రం ఇయ్యతగరా?" "అది వాళ్ళనుకోవాలిగా? నా దగ్గరకొచ్చి తలవొక రెండు వందలు వేసుకోవాలనుకుంటున్నాం అంటాడా?" మాధవయ్య గుర్రు మన్నాడు. పున్నమ్మ మరి మాట్లాడలేదు. ఇరవై ఒకటోరోజున పిల్లను తొట్లోవేసి బారసాల చేశారు. దగ్గర వాళ్ళను పదిమందిని పిల్చి చేతులు కడిగించింది పున్నమ్మ. ముగ్గురు వదినెలూ నాగమ్మకు పట్టు చీరెలు పెట్టారు. సుబ్బారాయుడు పిల్లకు పులి గోరుతో గొలుసు చేయించాడు. రామదాసు మొలకు బంగారు మొలతాడు చేయించాడు. నాగభూషణం చేతులకు మురుగులు చేయించాడు. "దానికేం తక్కువ? నలుగురు అన్నలున్నారు, రామలక్ష్మణుల్లా!" అనుకుంది ఇదంతా చూస్తున్న పున్నమ్మ. బారసాలనాటికి వచ్చిన బావమరిదిని బావలు చాలా గౌరవించారు. వెంకట్రావు కూతుర్ని చూసుకుని మురిసిపోయాడు. "చూశావా నా పంతమే నెగ్గించుకున్నాను" అన్నాడు వెంకట్రావు భార్య కళ్ళలోకి లోతుగా చూస్తూ. "మహా గొప్ప" ముద్దుగా మూతి తిప్పింది నాగమ్మ. పిల్లకు నాగమ్మ ఇష్టప్రకారమే "పార్వతి" అని నామకరణం చేశారు. వచ్చినప్పటినుంచీ వెంకట్రావు ఖళ్ళు ఖళ్ళున దగ్గటాన్ని గమనించింది నాగమ్మ. "మరీ చిక్కిపోయారు. ఒక్కటే దగ్గుతున్నారు. వచ్చినప్పటినుంచీ చూస్తున్నాను ఒంట్లో బాగుండటం లేదా?" భర్త మొహంలోకి దిగులుగా చూస్తూ ప్రశ్నించింది నాగమ్మ. వెంకట్రావు చిరునవ్వే సమాధానంగా ఇచ్చాడు. "నవ్వుతారేం? నేను వచ్చేటప్పటికి ఎంత బాగున్నారు? ఈ నాలుగు నెలల్లోనే ఏమయింది మీకు? హోటలు భోజనం పడటంలేదా?" బాధ ఉట్టిపడే గొంతుతో పలికింది. "ఏం లేదు, బాలా! ఆ మధ్య ఏదో నాలుగు రోజులు కాస్తజ్వరం వచ్చింది. అదే తగ్గిపోతుందిలే. అంత భయపడాల్సిందేమీలేదు. హోటలు భోజనం కదా! మళ్ళీ నువ్వు రాగానే మామూలుగా అవుతాను" అన్నాడు వెంకట్రావు మామూలుగానే." కాని నాగమ్మకు మాత్రం ఏదో దిగులు దిగులుగా అనిపించింది. పున్నమ్మ, మాధవయ్య కూడా అల్లుణ్ణి ఆరోగ్యం గురించి మరీ మరీ హెచ్చరించారు. బారసాల అయిన రెండోనాదే విశాఖపట్నం బయలుదేరిన భర్తను చూసి నాగమ్మ బెంబేలుపడిపోయింది. "నాలుగు రోజులు ఉండి పోకూడదూ? కాస్త మీ ఆరోగ్యం కుదుటపడుతుంది" అంది దిగులుగా. "సెలవులేదు పరీక్షలు దగ్గరకొస్తున్నాయి. ఈ రెండు రోజులు కూడా అతికష్టంమీద దొరికింది" అన్నాడు వెంకట్రావు. "అయితే పదండి నేనూ వస్తాను." భార్య మాటలకు తెల్లబోయాడు వెంకట్రావు. "నిజంగా అంటున్నాను. మిమ్మల్ని యీ స్థితిలో ఒంటరిగా వదిలి ఇక్కడ ఉండలేను." "ఓస్. అంతేగదా? ఇంకా ఏమో అనుకున్నాను. ఇప్పుడు నాకేం అయిందని? మనుషులన్నాక కాస్త చిక్కకుండా బలవకుండా వుంటారా" వెంకట్రావు నవ్వుతూ తేల్చేశాడు. "ఏమోనండి, నాకు భయంగా వుంది." "పిచ్చిదానా! వెర్రి వెర్రి ఆలోచనలు పెట్టుకోకు" అంటూ అక్కడనుండి వెళ్ళిపోయాడు. నాగమ్మ దిగాలుపడి కూర్చుంది. "ఏమిటే అమ్మాయి, అల్లుడు అప్పుడే వెళ్ళిపోతానంటున్నాడట?" "అవునమ్మా, సెలవు లేదట" అంది నాగమ్మ. "నాలుగు రోజులుంటే బావుణ్ణు. అబ్బాయి మరీ నలతగా కనిపిస్తున్నాడు." గొణుక్కున్నది పున్నమ్మ. మామగారు, బావలు కూడా వెంకట్రావును నాలుగు రోజులుంది వెళ్ళమన్నారు. వెంకట్రావు ప్రయాణమై వెళుతూ, ఉయ్యాలలో నిద్రపోతున్న కూతుర్ని ఒకసారి వంగి తనివితీరా చూసుకున్నాడు. నాగమ్మను "నీ ఆరోగ్యం జాగ్రత్త" అంటూ హెచ్చరించాడు. వెళ్ళిపోతున్న భర్తను చూస్తూ, మనిషి సగం అయిపోయారు అనుకుంది నాగమ్మ నిట్టూర్చి.
14
పుట్టింట్లో ఉన్నా నాగమ్మ ధ్యాసంతా భర్తపైనే. ఆరోగ్యం ఎలావుందో! రోజూ భోజనం సరిగా చేస్తున్నారో లేదో! డాక్టర్ కు చూపించుకున్నారో లేదో! ఆలోచించగా ఆలోచించగా ఒకరోజు నాగమ్మ మనసు మరీ కలతపడేది. రెక్కలు కట్టుకుని భర్తముందు వాలిపోవాలనిపించేది. వెంకట్రావునుంచి వారానికో ఉత్తరం వస్తూనే వుంది. అందులో సగభాగం కూతురును గురించి మిగతా సగభాగం నాగమ్మ ఆరోగ్యం గురించి ఉండేది. చివరి వాక్యంలో మాత్రం తన ఆరోగ్యం బాగానే వుందనీ, ఆ విషయం గురించి ఆదుర్దా పడవద్దనీ రాసేవాడు. అయినా నాగమ్మకు దిగులుగానే వుండేది. |
25,379 |
ఆమె ఏమీ జవాబు చెప్పలేదు. చెయ్యిచాచి అతని చేతిని అందుకోవాలన్న కోరికను బలవంతాన కంట్రోల్ చేసుకుంది. ఎందుకు అతన్ని చూసి తన మనసు చలిస్తోంది! ఎన్నడూ లేనిది- ఒక పురుషుడ్ని చూసి ఆకర్షణకు గురవుతోంది. హృదయంలో తియ్యని అలజడి. కారు మెల్లగా, మెత్తగా సాగిపోతోంది. చాలా యాంత్రికంగా డ్రైవ్ చేస్తోంది. ఏం జరిగిందీ, ఎలా జరిగిందీ తెలుసుకునే లోపల ఆమె చెయ్యి అతని చేతిలో వుంది. వ్రేళ్ళు వ్రేళ్ళతో ఆడుకుంటున్నాయి. చెవిలో అతని గొంతు చిన్నగా వినిపించింది. "ఆ గార్డెన్ లోకి వెళ్ళి కాసేపు గడుపుదాం." మంత్ర ముగ్ధురాలయి బ్రేక్ వేసింది. గ్రీన్ కార్డెన్స్ లో- ఆ రంగురంగుల, వికసించిన, అందంగా విచ్చుకొన్న మనోహరంగా విరబూచిన పూలసముదాయాల మధ్య చెయ్యీ చెయ్యి కలుపుకుని నడుస్తూంటే ఏదో మత్తు సోకినట్లు, స్వప్నావస్థలో విహరిస్తూన్నట్లు ఉండి కాలం తెలియలేదు. అతనేదో చెబుతున్నాడు. ఆమె వింటోంది. "ఇహ వెడదామా?" "ఊఁ" అంది. ఇద్దరూ కలసి బయటికొచ్చారు. "రేపు... ఇదే టైముకు ఇక్కడ... అంటున్నాడు. ఇంతలో ప్రక్కనుంచి "మేడమ్!" వినిపించింది. తలతిప్పి చూసేసరికి ఎ.ఎస్.పి. రాజశేఖర్ కనిపించాడు. "మీతో కొంచెం మాట్లాడాలి. ఇలా రండి!" అన్నాడు. అతని గొంతులో సౌమ్యతకన్నా, అధికారం చెలాయిస్తున్న ధోరణి కనిపించేసరికి ఆమెకు కోపమొచ్చింది. ఐనా దిగమ్రింగుకొంటూ కొంచెం ప్రక్కకి నడిచి "ఏమిటి?" అంది. "మీరతన్తో అంత ఫ్రీగా తిరగటం బాగాలేదు." "చెప్పటానికి మీరెవరు?" "ఒక బాధ్యత గల పోలీసాఫీసర్ని!" "మీ బాధ్యత, దర్పం నేరస్థులమీద చూపించండి. అంతే కాని..." "అతను నేరస్థుల లిస్ట్ లో ఉన్నాడు. ఏ క్షణానైనా అతను అరెస్ట్ కావడం, కటకటాల వెనక నా చేతిలో చావుదెబ్బలు తినటం ఖాయం!" "అంతవరకూ వస్తే చూద్దాంలెండి." "అంతేకాదు, మీమీద ఇంకో రకంగా కూడా నా బాధ్యత వుంది." "ఏమిటది?" "మిమ్మల్ని నేను పెళ్ళి చేసుకుందామనుకుంటున్నాను కాబట్టి!" "షటప్!" అని ఆమె విసురుగా వెనక్కి తిరిగింది.
* * *
మరునాటి మధ్యాహ్నం రాజశేఖర్ తండ్రితో ఏకాంతంగా మాట్లాడుతూ వుండటం ప్రక్కగదిలోంచి చూసింది. కొన్ని మాటలు అయిష్టంగా వినిపించాయి. "నేను ఐ.పి.ఎస్. ఆఫీసర్ని! డిపార్ట్ మెంట్ లో నాకు మంచి పేరుంది. కొన్నాళ్ళకు ఎలాగూ ఎస్.పి. నవుతాను. ఇంకా పైపైకి కూడా పోతాను. మంచి కుటుంబంలో నుంచి కూడా వచ్చాను... రసజ్ఞను నాకిచ్చి పెళ్ళి చెయ్యటానికి నాకేమీ అభ్యంతరం ఉండదనుకుంటాను." "అమ్మాయితో మాట్లాడకుండా ఏ సంగతీ చెప్పలేను." "మాట్లాడండి... కాని కొన్ని సందర్భాలలో ఆమెకు ఆలోచించుకునే శక్తి లేకపోతే తండ్రిగా మీరు..." "రసజ్ఞ ఆలోచించుకునే శక్తిలేని ఆడపిల్ల కాదు!" అతను వెళ్ళిపోయాక జయసింహ లోపలికొచ్చాడు. మొహం వ్యాకులపాటుతో ఉన్నట్లు కనిపించింది. "డాడీ!" అని పిలిచింది. "ఏమిటమ్మా?" "అలా ఉన్నారేం? "ఏమీ లేదమ్మా!" "రండి డాడీ, ఇద్దరం కలసి భోజనం చేద్దాం!" తనతో కలసి మీల్స్ తీసుకోవటం తండ్రికి ఎంతో సంతోషదాయకమైన విషయం. ఆయనకు కొసరి కొసరి వడ్డిస్తూ తినిపించటం తనకెంతో సంతోషం కలిగించే అంశం. తాను పెళ్ళి చేసుకుని వెళ్ళిపోతే- ఆయన ఒంటరిగా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. పెళ్ళి సంగతి, రాజశేఖర్ తో జరిగిన సంభాషణ ఎత్తుతాడేమోననుకుంది. ఎందుకనో ఆయన దాని ప్రస్తావన తీసుకురాలేదు. ఆ సాయంత్రం మబ్బు మబ్బుగా వుండి ఆరూ- ఆరున్నర అయ్యేసరికి చీకటి వ్యాపించింది. రసజ్ఞ గ్రీన్ గార్డెన్ లో అంతకుముందు రోజు ప్రఫుల్లకుమార్ తో గడిపిన ప్రదేశాన్ని చేరుకుని అతనికోసం చూసింది. కనబడలేదు. సరిగ్గా ఆరున్నరయ్యేసరికి వస్తానన్నాడు. ఐదు నిమిషాలపాటు ఎదురుచూసి, ఏమీతోచక ఒక్కొక్క అడుగూ నెమ్మదిగా వేసుకుంటూ నడవసాగింది. ఆ ప్రదేశమంతా మొక్కలు గుబురుగా పెరిగి నిర్మానుష్యంగా ఉంది. సుమారు పది గజాలు నడిచి వుంటుంది. ఉన్నట్లుండి వెనక అడుగుల చప్పుడైంది. ప్రఫుల్లకుమారేమోనని తలత్రిప్పి చూసింది. ఎవరూ కనబడలేదు. అటూ ఇటూ చూసి మళ్ళీ నడవసాగింది. తిరిగి వెనక అడుగుల చప్పుడు తనని ఎవరో అనుసరిస్తున్నారు. ఈసారి తల వెనక్కి త్రిప్పి చూడదల్చుకోలేదు. ఆమె చెయ్యి దుస్తుల్లో దాచుకున్న ఆయుధం మీదికి వెళ్ళింది. |
25,380 | "బాధగా వుందా?" అని ప్రశ్నిస్తోంది మృదుకంఠం.
ఆయన కళ్ళు తెరిచాడు "ఛీ ఛీ! అవతలకు పో, పాపిష్టిదానా" అని అవతలకు త్రోసేశాడు సావిత్రిని.
* * *
అబ్బ! కొడుకు ఎంత కఠినంగా రాశాడు ఉత్తరం? ఈ వృద్దాప్యంలో తనకిన్ని మనస్థాపాలా? "సావిత్రీ, సావిత్రీ" అని పిలిచాడు. సావిత్రి వచ్చింది.
"అబ్బాయి వచ్చాడా?"
"అతనికి మనమేమీ రాయలేదుగా?"
"రాయలేదు....వాడిక్కదికి రావటం నీకిష్టంలేదు. దగ్గరకు రాకు. అక్కడే వుండు...అవతలకు పో.. వీరయ్యా త్వరగా రారా. ఉన్నఫళంగా బయల్దేరి రమ్మని అబ్బాయిగారికి టెలిగ్రాం ఇప్పించు. ఆవిడ్నే రాయమను. ఊ త్వరగా పో."
* * *
రాత్రి ఒంటిగంటయింది. మాధవరావుగారు నిద్రపట్టక అటూ యిటూ పొర్లుతున్నాడు. సావిత్రి వేరేగదిలో పడుకుంది. ఏడుస్తోంది ఆమె ఏడుస్తోందాని ఆయనకు తెలుసు. "ప్రియుడికి సంభవించిన ఆపదను గురించి ఏడుస్తుందేమో? హు! ఆడది."
గదిలో చిన్నదీపం వెలుగుతోంది. సర్వత్రా నిశ్శబ్దంగా వుంది. బయట వీధిలో ఎక్కడా చడీచప్పుడు లేదు. ఆయన మెల్లగాలేచి కూర్చున్నాడు. పరమ నీరసంగా వుంది. అయినా పడుకోబుద్ది కావటంలేదు. అబ్బా! ఏమిటీ తపన? ప్రపంచమంతా చీకటిమయమై వుంటే బాగుండును. ఈ వెలుతురు భరించటం దుస్సహంగా వుంది. అతికష్టంమీద లేచి, నిల్చుని దీపం ఆర్పేద్దామని వెళ్ళసాగాడు. గోడకానుకుని నిల్చుని స్విచ్ ఆర్పేశాడు.
ఏం చేశాడు? తను ఏం చేశాడు?
గతమంతా కళ్ళకు కట్టినట్లు కనిపించసాగింది. తను సావిత్రి జీవితాన్ని నాశనం చేశాడా? కొడుక్కి ద్రోహం తలపెట్టాడా?
ఎక్కడో ఏదో వెలుగు గోచరించసాగింది. ఆర్పినా ఆరని దీపం. ఎక్కడిది? ఎందుకట్లా వెలుగుతోంది? ఆయన భయంతో కళ్ళు మూసుకున్నాడు. అయినా రేఖామాత్రంగా ఆ జ్యోతి కనిపిస్తూనే వుంది.
పశ్చాత్తాపంగా మింటికి ఎగసింది. తను అర్ధంలేని నమ్మకాలతో, చాదస్తాలతో, గర్వంతో యితరుల జీవితాలు పాడుచేస్తున్నాడు. తనలోనుంచి ఏదో అజ్ఞాతసక్తి నువ్విక బతకవని చెబుతోంది. కళ్ళు తెరవమని ఆజ్ఞాపిస్తోంది. తనకు ప్రాయశ్చిత్తం ఏమిటి? సావిత్రిని క్షమిస్తే? అది క్షమించటమౌతుందా? క్షమించాననుకోవటం స్వార్ధంకాదా? తనే క్షమాపణ కోరితే? తన అభిమానం ఒప్పుకుంటుందా? తను ఎలాగూ చచ్చిపోతాడు. ఏదో ఓ పరిష్కారం సూచించి చావటమా? అస్పష్టమైన దశలో పోవటమా?
"నేను సావిత్రిని పిలుస్తాను. నువ్వు రాఘవరావుని ప్రేమించావా? అని అడుగుతాను. ఆమె తల ఊపుతుంది. అతన్ని విడిపిస్తాను. పెళ్ళి చేసుకో అంటాను. అవును ఈ త్యాగం చేస్తాను. త్యాగమా యిది? కర్తవ్యం. అవును ఇది నా బాధ్యత."
"సావిత్రీ!" అని కేకేశాడు.
ప్రక్కగదిలో లైటు వెలిగింది. సావిత్రి గుమ్మందాకా వచ్చి చీకటిలో ఏమీ కనపడక "ఎక్కడున్నారు?" అంది హీనకంఠంతో.
ఆయన స్విచ్ నొక్కాడు. సావిత్రి ద్వారంలో నిలబడింది. ఆమెవంక ఏకాగ్రంగా చూశాడు. చెప్పాలనుకున్న మాటలు నోటిదాకా వచ్చి ఆగిపోయినై. ఆమెను చూస్తున్నకొద్దీ కోపం ఆవహించింది. "అవతలకు పో" అని అరిచాడు.
ఆమె అక్కడ్నుంచి వెళ్ళిపోయింది.
ఆయన నిస్పృహగా "ఎందుకు వెళ్ళగొట్టాను?" అనుకున్నాడు.
తను ఆమెతో నిర్ణయం ముఖంమీద చెప్పలేదు. ఏమిటోగా ఉంటుంది. చేసేపని గుట్టుచప్పుడు కాకుండా చేసిపోతే మంచిది. ఆఁఅదే బాగుంటుంది.
ఉన్నట్లుండి కొడుకుమీద ప్రేమ పొంగిపొర్లసాగింది. చిన్నతనానే తల్లిని కోల్పోయిన నిర్భాగ్యుడు. వాడిమీదనా తన పట్టుదల, పంతాలు? తనకు ఇష్టం లేకపోతే పోనియ్. సరోజిన్నే పెళ్ళి చేసుకోనియ్! సుఖపడనీ.
ఇప్పుడు బాగుంది. ప్రశాంతంగా వుంది. తృప్తిగా, వికాశంగా వుంది మనసు.
ఆయన మెల్లిగా మంచంమీదకు వచ్చి పడుకున్నాడు.
* * *
ఉదయం ఆరయేసరికి లేచి, తిన్నగా టెలిఫోన్ దగ్గరకు వెళ్ళాడు. పోలీస్ స్టేషన్ కు రింగ్ చేశాడు. "నేనే యిచ్చాను ఆ నెక్లెస్. అతను దొంగతనం చెయ్యలేదు. అతన్ని విడిచిపెట్టండి" అని చెప్పాలనుకున్నాడు.
"చూడండి ఇన్స్ పెక్టర్!" ఏమిటి? మాటరాదేం? మనసు ఎందుకు ఎదురు తిరుగుతోంది? ఆయన చెప్పలేకపోతున్నాడు "ఓసారి యిక్కడకు వస్తారూ? నేను రాలేను. చాలా జబ్బుగా వుంది."
గుండెలో ఏదో కలుక్కుమంది. సోఫాలో కూలబడిపోయాడు. తను అనుకున్నది ఎందుకు చెప్పలేకపోయాడు? ఇప్పుడు వస్తాడుగా ఇన్స్ పెక్టర్. వచ్చాక చెబుదాం.
సావిత్రి లోపలెక్కడో వుంది. తనని బ్రతిమిలాడదేం? తన ప్రియుడ్ని కాపాడమని అర్ధించదేం? ఒట్టి లాలన తీరటానికేగాని ప్రియుడు కాదేమో? అతడేమయినా ఆమెకు చింతలేదేమో?
నిముష నిముషానికీ గుండెల్లో పోటు ఎక్కువైపోతోంది. తలంతా విపరీతంగా దిమ్ముగా వుంది. ఏదో లోకంనుంచి ఎవరిదో కీచుగొంతుక అరుస్తున్నట్లుగా వుంది. చెయ్యివేసి గట్టిగా అదిమిపట్టాడు. "వీరయ్యా వీరయ్యా" అని అరిచాడు. వీరయ్య వచ్చాడు. "ఇట్లా రారా! నన్ను గట్టిగా పట్టుకో ప్రాణం పోతోంది. కాదు వద్దు. డాక్టర్ కి ఫోన్ చెయ్యి త్వరగా రమ్మని. నీ మొహం నువ్వేం చేస్తావ్? నేనే....అబ్బ! లేవలేను. ఈ బాధ భరించలేను. దాన్నిలా రమ్మను, ఫోన్ చెయ్యమను...
సావిత్రి వచ్చి ఫోనులో డాక్టరుగార్ని రమ్మని పిలిచింది.
"సావిత్రీ!" అన్నాడు.
దగ్గరకు వచ్చింది.
"ఆ దీపం ఆర్పెయ్యి. అబ్బ! అంత వెలుగు చూడలేకుండా వున్నాను."
"ఎక్కడండీ?" అనడిగింది ఆమె తడబడుతూ.
"అదిగో అక్కడే. అగ్నిదీపం కనబడటంలా? అక్కడే.....ఓ....నువ్వా? ఫో అవతలకు..."
పదినిముషాల్లో డాక్టర్ వచ్చాడు. పరీక్ష చేశాడు. అతని చెయ్యి గట్టిగా పట్టుకుని "చెప్పండి, ఇంకా ఎన్ని నిముషాల్లో నా గుండె....?"
అతను మృదువుగా విడిపించుకుని బలవంతంగా ఓ ఇంజెక్షన్ ఇచ్చి "మీరాలా గాభరా పడకూడదు. బాగా రెస్ట్ తీసుకోవాలి. ఈ సోఫాలో పడుకున్నా రేమిటి? లోపలకు పోయి హాయిగా పరుపుమీద పడుకోండి. దేన్నిగురించి ఆలోచించకండి. మళ్ళీ మధ్యాహ్నం వస్తాను" అని భుజంమీద తట్టి వెళ్ళిపోయాడు. సావిత్రి వెనకాలే వెళ్ళింది.
ఆమె తిరిగి వస్తూండగా "ఏ....మ....న్నా.....రు....?" అనడిగాడు వణుకుతున్న గొంతుతో.
ఆమె నిలబడిపోయి నిశ్శబ్దంగా ఊరుకుంది. |
25,381 | "అబ్బ, ఈ మగవాళ్ళతో కొన్ని విషయాలలో సర్దుకుపోవాలి."విసుగ్గా అంది జానకి.
ఏ విషయాలలో సర్దుకుపోవాలి! ఎందుకు! అని వాసంతి అడగలేదు.
"తప్పదుమరి భార్యాభర్త అంటే అర్ధం ఏమిటి!" అని కాస్త ఆగి "నువ్వయితే ఏంచేస్తావ్ వాసంతీ!" అంది జానకి.
జానకి చటుక్కున అడిగేటప్పటికి "నేనా...! నేనా...నేను...మరి మరి..." అంటూ కంగారుపడి మాటలు మింగేసింది వాసంతి.
పరధ్యాన్నంలో వున్న వాసంతి జానకి చెప్పే ప్రతిమాటా వినలేదు. అంతకు క్రితం ఏంచెపుతూ ప్రశ్నించిందో వూహకందలేదు. అందుకే తత్తరపడింది. వాసంతి చెప్పాచేయకుండా పుట్టింటి కొచ్చిన విషయంగాని శ్యాంసుందర్ కి వాసంతికి మధ్య ఏమయినా అభిప్రాయబేధాలు వచ్చాయా! అనేమాటగాని వాసంతి ముందు రాధాకృష్ణగాని, జానకిగాని ఎత్తలేదు .తన విషయంలో ఇంట్లోవాళ్ళు తర్జనబర్జనపడి రాధాకృష్ణతో సంప్రదించారని వాసంతి వూహించలేదు. వాసంతి వచ్చిపోతున్నది మామూలుగా మాట్లాడుతున్నారు. రాధాకృష్ణ జానకి "మీ అత్తారింట్లో అంతా కులాసానా!" అని ఓసారి "శ్యామ్ ఏమంటున్నా" డని మరోసారి అడిగారు అంతే.
"మాట్లాడవేం వాసంతీ!" అంది జానకి.
"ఏంమాట్లాడను?" అంది వాసంతి.
"మా సరదాలు మా కీచులాటలు అన్ని చెప్పాను .నే అడిగితే నువ్వేం చెప్పటంలేదు. నీకన్నా పెద్దదాన్ననా! అత్తయ్యననా?"
"అదేంలేదు"
"...మరి...పోనీ నీ ఫ్రెండ్ గా తలచి చెప్పకూడదా? ఇదివరకెప్పుడయినా నీ ముందు ఏ విషయాలయినా ఎత్తానా? పెళ్ళయింది కాపురానికెళ్ళావు. నీ కాపురం ఎట్లావుందో శ్యాంసుందర్ నీతో ఎంత సరదాగా వుంటాడో. మీరుకూడా కీచులాడుకుంటారా! ఇవి నే అడక్కూడదా? నీవు చెప్పకూడదా? అంతగా నీకు సిగ్గయితే నువ్వు చెప్పంగానే విని మర్చిపోతాను. ఎగతాళి చెయ్యను. ఎవరితో చెప్పను. సరేనా!" ఏమీ తెలియనిదానిలా మామూలుగా అడిగింది జానకి.
బాధగాని, సంతోషంగాని ఎవరికివారే అనుభవించటంలో తృప్తిపడరు. ప్రతి మనిషి తన ఆనందాన్ని పదిమందితో పంచుకుని రెట్టింపు ఆనందాన్ని అనుభవిస్తాడు. బాధ చెప్పుకుని అప్పుడు తన బాధ నలుగురికి తెలిసిందికదా అని తృప్తి పడతాడు. అప్పుడు మనసులో గూడుకట్టుకున్న బాధ తగ్గుతుంది. తప్పువప్పులు నిర్ణయించుకోలేక లోలోపల మధనపడుతూ తనకితానే నచ్చ చెప్పుకోలేక ఓ నిర్ణయానికి రాలేక వాసంతి చాలా బాధపడుతున్నది. పెళ్ళిగాకముందు కన్యగా ఎన్నేళ్ళయినా వుండగలరు. పెళ్ళయి కొద్దికాలం కాపురంచేసి విడిగావుంటే మనసు వూరుకోదు, శరీరము వూరుకోదు. వాసంతి మనసు శరీరం వాసంతి మాట వినటం లేదు. తన బాధ తాను వంటరిగా పడలేక పైకి గాంభీర్యంగా తిరుగుతూ లోలోపల పిచ్చిగా మధన పడుతున్న వాసంతికి జానకి మాటలతో ఏదోలా అయి అప్పటికప్పుడే ఎక్కిళ్ళు పెడుతు భోరున ఏడ్చింది. దిండులో ముఖం దాచేసుకుంది.
"అరె, ఏమయింది వాసంతీ! ఇప్పుడు కాని మాట నేనేమీ అనలేదే! శ్యామ్ గుర్తుకొచ్చాడా! ఏమయినా అన్నాడా! నాతో చెప్పు ఫరవాలేదు. అర్ధంచేసుకుంటాగాని నిన్ను నేనేమీ అనేదాన్ని కాదుకదా! అబ్బ పసిపిల్లలా ఏమిటా ఏడుపు! ధైర్యంగా ఎన్ని కబుర్లు చెప్పేదానివి! ఆ ధైర్యం ఏమయింది! ఈ ఏడుపేమిటి! శ్యామ్ నిన్ను కొట్టటం, తిట్టటం చేసేవాడా! నీదగ్గరకు రాడా! ప్రేమగా చూసుకోడా! ముండలముఠా కోరా!" ఓ పక్క వాసంతి హృదయంలో భారం దిగిపోయేటట్లు ఏడవనిస్తూనే మరో పక్క ప్రేమగా అక్కున చేర్చుకుని వూరడిస్తూ ప్రశ్నల మీద ప్రశ్నలేసింది జానకి.
అన్నిటికి కాదన్నట్లు తల అడ్డం తిప్పింది వాసంతి.
"ఏది కాదంటావు. చెప్పకపోతే ఎలా తెలుస్తుంది నాకు! చెప్పకపోతే నా మీద వట్టు." చిన్నపిల్లలా వట్టువేసింది జానకి.
జరిగిందంతా అక్షరం పొల్లుపోకుండా చెప్పింది వాసంతి.
అంతా బహుశ్రద్దగా విన్న జానకి, "నువ్వు రావటానికి కారణం చెప్పలేదు, ఏదయినా ఆ రాత్రి తర్వాత జరిగిందా! మీ అత్తగారికి ఏమని చెప్పివచ్చావు?" అంది.
"మా అత్తయ్యకేం తెలియదు. రాత్రి మావాళ్ళ మీద పీడకలలొచ్చాయి. ఈ క్షణాన బైలుదేరి వెళ్ళి చూడకపోతే మనసాగదు అని సామాను సర్దుకున్న తర్వాత చెప్పాను. శ్యామ్ కాలేజీకెళ్ళిన తర్వాతనే బైలుదేరాను."
"మీ అత్తగారు ఏమీ అనలేదా?"
"శ్యామ్ తో చెప్పావా అంది." ఉహూ, మా వాళ్ళని చూసిందాకా నా మనసాగదు. అందుకే వెళుతున్నాను వచ్చిన తర్వాత శ్యామ్ తో చెప్పండి అన్నాను. నాకు తోడుగా తను వస్తానంది. భయమేముంది వంటరిగా వెళ్ళగలను అని రిక్షా పిలిపించుకున్నాను. శ్యామ్ కి నాకు మధ్య ఏదో జరుగుంటుందని గ్రహించినట్లుంది. దగ్గరకొచ్చి భుజంమీద చెయ్యి వేసింది. "మీ వాళ్ళ మీద బెంగ తీరింతరువాతనే రా! కాని ఒకటి మర్చిపోకు. ఇది నీ యిల్లు మా అమ్మాయివయిపోయావు. నీవు నాలుగు రోజులు రావటం ఆలశ్యం అయితే నీ మీద బెంగపడేవాళ్ళం మేమున్నామని మర్చిపోకు" అంది. ఆవిడామాట అనంగానే నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. నోట్లోంచి మాట పెగలలేదు. తొందరగా రిక్షా ఎక్కి అక్కడనుంచి బైటపడ్డాను."
శ్రీదేవమ్మలాంటి అత్తగారు ఈలోకంలో వకరో అరో వుంటారు అనుకుంది జానకి. "వచ్చేటప్పుడు శ్యాంసుందర్ కి చెప్పి వచ్చావా?" అంది.
తప్పుచేసిన దానిలా తలవంచుకుంది వాసంతి. "ఓ లెటర్ రాసి డ్రస్సింగ్ టేబుల్ మీద పెట్టివచ్చాను. నా యిష్టం లేంది మా వూరు రావద్దు వస్తే నా మీద ప్రేమ లేనట్లే అని ఘాటుగా రాశాను. అందుకే శ్యామ్ లెటర్స్ రాస్తున్నాడుగాని రాలేదు." అంటూ చెప్పింది.
"జరిగిందేదో జరిగింది. ఇంకముందు చెయ్యాల్సింది ఏమిటి? చిన్న చిన్న కలహాలకి భార్యాభర్త విడిపోయి దూరంగా వుండటమేనా? నా మనసుకి బాధ కలిగించనని శ్యాంసుందర్ అన్నాడని అంటివి మరి...?" వాసంతి ఏంచెపుతుందో" అని ఆగింది జానకి.
వాసంతి చెప్పినదాన్నిబట్టి శ్యాంసుందర్ తప్పు లేశమాత్రం లేదని వాసంతి తొందరపడి వచ్చేసిందని జానకి తెలుసుకుంది. ఇదేమాట పైకి అంటే వాసంతి నొచ్చుకుని మనసువిప్పి చెప్పదని ఏమీ అనలేదు.
"మనసుకి నచ్చచెప్పుకోటానికి ప్రతినిమిషం ఏవేవో గుర్తుకువస్తున్నాయి. కళ్ళకి కనపడుతూ చెవిలో అవే మాటలు మారుమ్రోగుతుంటే అసహ్యంతో నా శరీరమంతా జలదరిస్తున్నది. భరించటం నా శక్యం కాదు." |
25,382 |
కారు ఎలా నడుపుతున్నానో నాకే తెలీదు. నా గుండెల్లో అగ్ని పర్వతాలు బ్రద్దలవుతున్నాయి.
కూతురి విషయం తెలిసిన అరగంటలోనే కొడుకు విషయం మరింత నాటకీయంగా తెలిసినా దాన్ని నేను నమ్మలేకపోదును. కానీ పోలిక? స్వంత కళ్ళకన్నా సాక్ష్యం ఇంకేమీ కావాలి? గోపీచంద్ ఆయన కొడుకు. ఎవరు కాదన్నా ఇది నిజం రక్తం చెప్పే నిజం.
నా తల పగిలిపోతూంది.
ఒక పక్క శ్రీదేవి-మరొకపక్క గోపీచంద్. నా ఇద్దరు సవతులకు పుట్టిన ఇద్దరు బిడ్డలు.
ఒక సవతి, వాళ్ళాయన చనిపోయాడనుకుని కొడుకుని తీసుకుని అమెరికా వెళ్ళిపోయింది.
మరొకామె తన భర్త కంపెనీ పన్లమీద టూర్లు తిరుగుతున్నాడనుకుని సంతృప్తి పడుతోంది.
ఇదంతా నిజమా? కలా.
కలే... అవును కలే.
నాకు బిగ్గరగా నవ్వొచ్చింది. రాత్రి ఆయన పాలగ్లాసు ఫోను ప్రక్కనే పెట్టి అలాగే నిద్రపోయాను. అంత కళ్ళమీద కొచ్చేసింది నిద్ర- ఆ నిద్రలో ఈ కళ ఆయనకి ఫోన్ రావటం.....నేను బయల్దేరటం- ఒక కొడుకూ కూతురు వెంట వెంటనే తగలటం- భలే కల నేను నవ్వుతూనే కారు నడుపుతున్నాను. అంతలో ఒక కుక్క అడ్డుగా రావటంతో బ్రేక్ వేసి ముందుకు తూలాను. కళ చెదిరినట్లు అనిపించింది.
అయినా కూడా నేను కార్లోనే వున్నాను.
పాల వ్యాను నా పక్కనుంచే వెళ్ళింది.
కాబట్టి ఇది కలకాదు. కేవలం 'కల' అయితే బావుణ్ణు అనుకున్న నా ఆలోచన.
శ్రీదేవి... గోపీచంద్.
ఇందిర....భాగ్యేశ్వరి.
ఇంతకాలం నేను ప్రత్యక్షదైవం అని నమ్మిన చెట్టు తాలూకు కొమ్మలు, ఫలాలు!
అదే నిజమైతే ఆ వృక్షాన్ని మొదలంతా నరికేసి, నేను ఆహుతి అవటం ఖాయం నేనెలాటిదాన్నో మీకు ముందే చెప్పాను. ఇదే సంఘటన మీకు ఎదురైతే బహుశా మీరు ఊరుకుంటారేమో! ఆయనకేం మొగ మహారాజు అనో, అమ్మో ఆయన కేమైనా అయితే నా మంగళసూత్రం ఏమవుతుందో అనో ఆత్మవంచన చేసుకుంటారేమో కదూ!
నేను చేసుకోను.
ఒక మొగవాడు తాను బ్రతికుండీ చనిపోయినట్టు నాటకం ఆడి ఒక స్త్రీని పరాయిదేశాలకు పంపిస్తే.... ఒక పురుషుడు తను వివాహితుడు అయివుండీ మరో స్త్రీని అబద్దం చెప్పి పెళ్ళాడితే- అతడు నా భర్తే అయినా అతడిని వదిలిపెట్టను.
అంతు తేలుస్తాను.
* * *
నేను వెళ్ళేసరికి ఇల్లంతా లైట్లు వేసి వున్నాయి. ఆయన కారు శబ్దం విని కంగారుగా పోర్టికోలోకి వస్తూ "ఎక్కడికి వెళ్ళావు! మేమంతా ఎంత గాభరా పడుతున్నామో తెలుసా?" అన్నారు.
ఆయనవైపు కన్నార్పకుండా చూశాను. ఇంతటి గొప్ప నటుడు అనుకోలేదు నా భర్త. శ్రీరాముడు నెమలిపింఛం ధరించి నట్టున్నాడు. మాట్లాడకుండా లోపలికి నడిచాను. సాహితి కూడా మెలకువగానే వున్నది కానీ ఏమీ అడగలేదు.
మేమిద్దరం మా గదిలోకి వెళ్ళాం.
"ఎక్కడికి వెళ్ళావ్?" మళ్ళీ అడిగారు ఆయన.
"నా బోయ్ ఫ్రెండ్ దగ్గరికి-"
ఆయన నవ్వటానికి శుష్కప్రయత్నం చేసి, "మరేమిటి అంత తొందరగా వచ్చేశావు?" అని అడిగారు.
"హోటల్ లో గది తీసుకోవటానికి ఇద్దరం వెళ్ళాం. అక్కడ పాత స్నేహితురాలు కనపడింది. ఆమె సాయం చేసింది. ఇప్పటివరకూ అక్కడే వున్నాను. ఆవిడ పేరేమిటి అని అడగరేం?"
"ఏమిటి?"
"-ఇందిర ఏ ఊర్నుంచి వచ్చింది అని అడగరేం?"
"చెప్పు" అన్నారు నేను స్నేహితురాలు అనేసరికి ఆతృత తగ్గిపోయింది.
"విజయనగరం-" ఆయన మోహంలో భావాలు గమనిస్తూ అన్నాను. అయితే ఆయనలో ఏ మార్పూలేదు. నా వళ్ళు భగభగా మండుతూంది. "ఇందిర కూతురు శ్రీదేవి కూడా వచ్చింది" అన్నాను కొసమెరుపుగా.
అయినా కూడా ఆయన మొహంలో ఏ మార్పూలేదు. "ఇంతకీ నేను వెళ్ళింది ఏ హోటల్ కి అని అడగరేం"?
"ఏ హోటల్ కి?"
"బంజారా". అప్పుడు కనిపించింది ఆయన మోహంలో మార్పు లోపల్నుంచి ఏదో తన్నుకొచ్చినట్టు ఒక్కసారిగా ఆయన మొహం మారిపోయింది. "నువ్వు.....నువ్వు బంజారాకి వచ్చావా?" అని అడిగారు.
"వెళ్ళావా అని అడక్కుండా 'వచ్చావా' అని అడుగుతారేమిటి? మీరు కూడా అక్కడికి వచ్చారా?" ఓరగా చూస్తూ అన్నాను.
ఆయన సమాధానం చెప్పలేదు. లేచి పచార్లు చేయటం మొదలు పెట్టారు. ఆయన మొహం కందగడ్డలా ఎర్రగా మారింది.
"ఇంకో అరగంటలో భాగ్యేశ్వరీదేవి కూడా మన దేశం వస్తోంది." నెమ్మదిగా, తూచి తూచి అన్నాను. ఆయన పచార్లు ఆగిపోయాయి.
"భాగ్యేశ్వరా?" అన్నారు మొహం చిట్లించి.
"ఏం? ఆవిడ కూడా మీకు తెలుసా? వాళ్ళాయన పేరు కూడా ఆనందరావే అట. పాపం పెళ్లవగానే ఆయన పోయార్ట. వాళ్ళబ్బాయి పేరు గోపీచంద్".
-ఆయన అంత వేగంగా కదలగలరని నేను కలలోకూడా అనుకోలేదు. ఊహించని వేగంతో వచ్చి నా రెక్క పట్టుకుని "ఏమన్నావ్?....గోపీచందా?" అని అరిచారు. ఆయన కంఠం కీచుగా ధ్వనించింది.
సరీగ్గా ఎక్కడ దొరకాలనుకున్నానో అక్కడ దొరికారు.
"ఏం? గోపీచంద్ తెలుసా మీకు?"
"ఎక్కడున్నాడు? గోపీ ఎక్కడున్నాడు?" ఆయన ఆవేశంగా అడిగారు.
"వాళ్ళ అమ్మగారు ఈ రోజు అమెరికా నుంచి ఈ తెల్లవారు ఝామున వస్తున్నారు. అందుకు ఎయిర్ పోర్ట్ కు వెళ్తున్నాడు. గమ్మత్తేమిటంటే వాళ్ళ ఇంటి పేరు కూడా మన ఇంటి పేరే..."
ఆయన నా మాటలు వినటం లేదు. మళ్ళీ షర్టు వేసుకుంటున్నారు. ఎక్కడికని అడిగాను.
"ఎయిర్ పోర్ట్ కి-"
"నేనూ వస్తాను-"
"ఏమిటీ?" అన్నారు అర్ధంకానట్టు నాలో అప్పటివరకూ అణిగివున్న ఆక్రోశం, రోషం కట్టలు తెంచుకున్నాయి. |
25,383 |
"పడుకో బావా ఏదో ఒకటి సూత్తాను" అంది పక్కపరిచి.
"నాకు నిదరరాదు"
"ఊరికేనే పడుకో"
కాని వీరయ్య పడుకున్న కాస్సేపట్లోనే నిద్రపోయాడు. రెండు రోజుల్నుండి తిండిలేక అలసిపోయాడు. మనస్సు తనకి తెలియకుండానే నిద్రనాశ్రయించి బాధనుంచి విముక్తి చెందింది. చంద్రి దొడ్డి తలుపులువేసి మేనమామ వినకుండా మెల్లగా అడుగులువేస్తూ రొడ్డుమీదకి వెళ్ళి క్రమంగా వ్యాపిస్తోన్న చిరుచీకట్లోకి మాయమయింది.
తెల్లవారగానే వీరయ్యకి ఎవరో తట్టి లేపుతున్నట్లయింది. చంద్రి వీరాచేతిలో బంగారపు గొలుసు ఒకటి పెట్టింది. "మరి తొరగా యెల్లిపో యీరయ్య బావా"
"ఎక్కడి దిదీ!" ఆశ్చర్యంగా అడిగాడు వీరయ్య.
"సిన్నప్పట్నుంచీ నాకుంది ఈ గొలుసు. అమ్మితే ఎనభై రూపాయలొత్తయ్. ఎల్లు ఎల్లిపో"
ఆమె తొందరనీ ఆందోళననీ గ్రహించాడు వీరయ్య.
"నిజంగా సెందిరీ?"
చంద్రి ముఖం పక్కకి తిప్పింది. పళ్ళు బిగబట్టి "లేందే యాడిత్తాడు నాకు బంగారపు గొలుసు?" అంది.
సందేహంతో, సందేహాన్ని మించిన అవసరం యొక్క బలంతో, గుప్పిటితో గట్టిగా పట్టుకొని వెళ్ళిపోయాడు వీరయ్య. చంద్రి గుడిసెలో కూర్చుని చాలాసేపు ఏడ్చింది.
"ఎందుకేడుత్తవు పిల్లా?" అన్నాడు మేనమామ.
"కడుపునొప్పి" అంది చంద్రి.
తెల్లని కిరణాలు తూర్పున తోచి గుడిసె గుమ్మాన్ని తాకాయి. చంద్రి కళ్లు మూసుకుని రెండు చేతులూ జోడించి. "ఓ నూకాలమ్మ తల్లీ, నా ఈరయ్యను రచ్చించు. నీకు కోడిపెట్టని బలిత్తాను" అని మొక్కుకుంది.
9
రెండేళ్ళు గడచిపోయాయి. అయినా సూర్యుడు తూర్పునే ఉదయిస్తున్నాడు. ఋతువులు వరుసక్రమంతోనే జరుగుతున్నాయి. రాత్రివేళ చీకటీ, పగటివేళ వెల్తురూ ఉంటున్నాయి. ఏ ఒక్కసారి మారకూడదూ అనుకుంది చంద్రి. కాని ప్రకృతియొక్క చర్యలో మార్పులేదు. నిద్ర లేచేముందు అదే -ఆ బూట్ల చప్పుడే వినబడుతుంది. కాకీ దుస్తులతో టోపీలతో బాధగా పోలీసులు ఇటూ అటూ తిరుగుతూంటారు. ముసలికాకి ఎప్పుడూ ఆ గొడమీదనే నుంచుని 'కావుకావు' మని అసహ్యంగా అరుస్తూంటుంది. పక్క కొట్లోంచి కొత్తగా శిక్షపడిన కుర్రాడు అస్తమాను 'ఇది నా ఇల్లాలని' అంటూ పాడుతూంటాడు. ఎర్రని రాళ్ళతో పెద్ద పెద్ద గోడలు తనచుట్టూ నిలబడి ఉంటాయి. ఆ గోడలు కదలవు, కరగవు , కబుర్లు చెప్పవు.
జైలులో ఉన్నప్పుడు మొదట ఏడ్చేది. గుండెపోటు వచ్చేటట్టు ఏడ్చేది. నిద్రపట్టేది కాదు. అన్నం సయించేది కాదు. తనవాళ్ళందరూ తన్ని హేళనచేస్తారు. గ్రామస్థులందరూ అసహ్యించుకుంటారు. ఈ రోజున ఇంత కష్టంలో తనకి బాబులేడు. అమ్మలేదు. వీరా ఏమైపోతాడో మనోవ్యధ ఎక్కువైపోయి, ఓ రోజున జైలు గోడలకి తలపెట్టి కొట్టుకుంది. గాయమైంది. రక్తం కారింది. పోలీసు సుబ్బారావు తిట్టాడు.
"సచ్చిపోతావ్"
"సావడానికే"
జైలులో ఉన్నన్నాళ్ళూ చాలా విషయాలు తెలుసుకుంది. పోలీసులంటే మనుషులనీ, వాళ్ళలోనూ మంచివాళ్ళున్నారనీ తెలుసుకుంది. వార్డెన్ సుబ్బారావు ఎప్పుడేనా ఇంటిదగ్గర చేసుకున్న మినపరొట్టె, జంతికలు లాంటివి తీసుకొచ్చి తనకి పెట్టేవాడు. తను ఏడుస్తూ వుంటే కబుర్లుచెప్పి ధైర్యం చెప్పేవాడు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడని తెలుసుకుంది. తెల్లవారగానే లేచి పరీక్షగా చూసేది. చాలాసార్లు పడమట ఉదయించకూడదా అని కసురుకుంది. తన అసంతృప్తిని వార్డెన్ సుబ్బారావుకు తెలియజేసింది. 'సూర్యుడికి బుద్దిలే'దన్నాడు సుబ్బారావు.
రోజూ మూడుపూటలా కటకటాల్ని లెక్క పెట్టేది. పాత సంగతులన్నీ తలచుకునేది. కామందుల విధవకూతురు సుబ్బమ్మ కూడా జైల్లో పడితే బాగుండును. గచ్చకాయలాడుకోవచ్చునుగదా అనుకుంది. చివరికి తన్ని వీరా ఎప్పటిలాగే గౌరవిస్తాడనీ, మనువు చేసుకుంటాడనీ, భూమ్మీద యిటుకలతో ఇల్లుకడతాడని - ఆశ. ఆ ఆశనే ఆహారం కింద, బలంకింద, ప్రాణంకింద మార్చుకుని బ్రతికింది.
కాని ఆమె మారిపోయింది. రెండేళ్ళలో క్రమంగా ఆమె నవ్వడం మరిచిపోయింది. ఆమెబుగ్గల్లో కళ్ళల్లో వుండే నిండైన ఆరోగ్యపు నిగనిగ పోయింది. చాతకాని నలిగిపోయిన వడలిపోయిన ఉదయపు కల్వపువ్వులాగ నీరసంగా అయిపోయింది.
జైలునుంచి యివతలకి రాగానే ముందుకు నడవలేకపోయింది. అక్కడే కూర్చుని ఏడ్చింది. చిన్నమూట చేత్తోపట్టుకుని సముద్రం వొడ్డున ఉన్న వీరయ్యపల్లెకి బయల్దేరింది. వార్డెన్ సుబ్బారావు చేతికొక పావలా యిచ్చి ఏదైనా కొనుక్కుతినమన్నాడు.
ఎర్రని కంకరరోడ్డుమీద దుమ్ములేచి ముక్కులోకి కళ్ళల్లోకి పడుతోంది. రోడ్డు ఎండకి కాలి కాలికి చుర్రుమని తగులుతోంది. కాళ్ళు నొప్పి పెడుతున్నాయి. |
25,384 |
"సరే నువ్వే విచారిస్తావు" అంటూ అతను విసురుగా బయటకు వెళ్ళి పోయాడు.
విశారద ఆ షాక్ నుంచి తట్టుకుని రెండు చేతుల్లో తల పెట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది.
"భగవాన్! ఏమిటిది? ఇంతటి దారుణమైన మలుపులతో ఎందుకిలా నన్ను దహించి వేస్తుంది విధి!"
21
"అమ్మా!"
విశారద ఉలిక్కిపడి తలెత్తి చూసింది.
విజ్ఞత!
అమాయకంగా మెరిసే కళ్ళతో హుందాగా, జాలిగా చాలా సాదా చీర, జాకెట్ తో నిలబడి ఉంది.
తన కూతురు.
ఏం మాట్లాడాలో తోచక నిస్సహాయంగా, నిశ్చేష్టితంగా చూస్తూ ఉండిపోయింది.
"అమ్మా!" అంది విజ్ఞత మళ్ళీ.
విశారద ఇంకా మాట్లాడలేని స్థితిలో అలాగే చూస్తూ ఉండిపోయింది.
"నన్ను చూస్తే మాట్లాడాలనిపించటం లేదా అమ్మా?"
విశారద పెదవులు కదిలాయి. కాని మాట వెలువడలేదు.
"అనుకోకుండా విరుచుకుపడిన గతం, ప్రళయంలా కమ్మేసిన పరిస్థితులు నీలో నుంచి మాతృప్రేమని కూడా దోచుకున్నాయా అమ్మా? ఎవరెలా అయినా ప్రవర్తించనీ, నీ వెనక నేనున్నా నమ్మా నిన్ను నేను విడిచిపెట్టనమ్మా ఈ ప్రపంచంలోని ప్రతిదాన్నీ వదులుకునైనా నిన్ను అంటిపెట్టుకుని ఉంటానమ్మా!"
మనసులో ఏ మూలనుంచో స్పందన కళ్ళప్పగించి అలానే చూస్తుంది.
"ఎన్ని పుణ్యాలు చేసుకుంటే నీలాంటి అమ్మ దొరుకుతుందమ్మా? నిన్ను దూరం చేసుకున్న వాళ్ళంతా దురదృష్టవంతులూ, నిర్భాగ్యులూ అమ్మా! నీకేమిటమ్మా బంగారు తల్లివి! నిన్ను చూసి, నువ్వు నా తల్లివయినందుకు నేను గర్వపడుతున్నానమ్మా ఒక్కసారి... ఒక్కసారి... నన్ను దగ్గరకు తీసుకో అమ్మా!"
మనసులోని స్ఫందన నరనరాల్లోకి ప్రాకి అణువణువునా వ్యాపించింది. అనురాగంతో, ఆప్యాయతతో, ప్రేమతో, ఆర్ద్రతతో వెన్నెల కురిపిస్తూన్న కళ్ళు ఆమె నాహ్వానించాయి.
విజ్ఞత ఆ ఆహ్వానం కోసమే ఎదురుచూస్తోంది. మరుక్షణంలో ఆమె గుండెను హత్తుకుపోయింది- కరిగిపోతూ.
"అమ్మా! అమ్మా" అంటోంది దుఃఖం అడ్డుపడుతూన్న గొంతుతో "నిజం చెప్పమ్మా నేనంటే నీకు ప్రేమ లేదా? నేను నీ కూతుర్నని తెలిశాక నాకోసం నీ హృదయం ఉవ్విళ్ళూరలేదా? నన్ను చూడాలనీ, తల్లీ అని పిలవాలనీ నీ గుండె ఉప్పొంగలేదా? ఎందుకమ్మా మాట్లాడవు? ఎంతో చదువుకున్నదానివి, విజ్ఞానవంతురాలవు- కొన్ని దుర్ఘటనలు జరిగినంత మాత్రాన ఎందుకమ్మా బెంబేలు పడిపోతావు- కొన్ని ఒంటరిగా, ఎవరూలేనట్లు, చూసినవారి మనసు ద్రవించేలా ఏమిటమ్మా ఈ బేలతనం? నువ్వేనా? నువ్వేనా అసలు.... ఇలా ప్రవర్తిస్తున్నది? నువ్వే తప్పూ చెయ్యలేదమ్మా! ఎప్పుడో జరిగిపోయిన యాదృచ్చికమైన సంఘటన- మనిద్దర్నీ తల్లీ కూతుళ్ళనూ చేసిన ఒకానొక చారిత్రక సత్యమమ్మా అంతేగాని అందులో కలత పడవలసింది ఏమీ లేదమ్మా నువ్వు ఆణిముత్యాని వమ్మా!"
విశారద చివరకు మాట్లాడింది. "నాలో ధైర్యం అంతరించిపోయింది. నా ప్రమేయం లేకుండా జరిగిపోయిన, నువ్వు చెప్పిన చారిత్రక సత్యాలన్నీ చరిత్రహీనురాల్ని చేసేసింది. కళంకినిగా మార్చేసింది. అనుక్షణం తరిమి తరిమి కొడుతున్న ఈ వేదనాగ్నిని భరించలేకపోతున్నాను....నాకు.... నాకు.... భయంగా ఉంది. చాలా భయం.... 'ఎటు చూస్తే అటు చీకటి... నేను..." దుఃఖం ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడుస్తోంది.
ఇద్దరి హృదయాల్లో దుఃఖసాగరం.
చిన్నప్పట్నుంచీ "మమ్మీ, మమ్మీ" అని పిలిపించుకుంటూ అలసిపోయిన మనస్సుకు 'అమ్మా' అన్న పిలుపు పన్నీటిజల్లు.
"అమ్మా! అమ్మా!"
విజ్ఞతని ఇంకా దగ్గరగా, ఆబగా, ఆర్తిగా గుండెల్లో పొదువుకుంది.
"నేను... ఎక్కడకూ పోనమ్మా నీ దగ్గరే ఉంటానమ్మా నిన్ను విడిచి ఉండలేనమ్మా."
విజ్ఞత ఆమె గుండెల్లో తలదాచుకుని ఏడ్చేస్తోంది.
* * *
వినూత్న తన గదిలో ఒక్కతే పడుకొని ఉంది. అర్దరాత్రి దాటినా ఆమెకు నిద్ర పట్టటం లేదు.
ఒక్క దుస్సంఘటన జరిగిపోయినప్పటికన్నా- ఒక్కొక్కరోజు గడిచిన కొద్దీ దాని తాలూకు విషాదమెక్కువవుతూ ఉంటుంది.
మమ్మీని తలుచుకుంటుంటే ఇదేమిటిలా జరిగిందని అనిపిస్తూ ఉంటుంది. ఆమె దగ్గరకు వెళ్ళాలనీ, ఆమెను చూడాలనీ చాలా కోరికగా ఉంది. అయినా ఏదో మబ్బుతెర అడ్డు వచ్చినట్లయి ఆ పని చెయ్యలేకపోతోంది.
ఆ రోజు సాయంత్రం ధర్మేంద్ర దగ్గరకు వెళ్ళలేదు. అతని దగ్గరకు వెళ్ళాలంటే ఏదో సంకోచంగా ఉంది. తనకూ, అతనికీ మధ్య జరగబోయిన ఆనాటి సంఘటన, దేవీప్రియనుగురించి విజ్ఞత చెప్పిన నిజం ఆమెలో కొంత కలవరాన్ని రేపాయి.
నిజానికి తనకు తప్పు చెయ్యాలన్న వ్యామోహమూ లేదు. కోరికాలేదు. ధర్మేంద్రను చూసి లైక్ చేసింది. అతను తనను దగ్గరకు తీసుకోబోతున్నప్పుడు కాదనలేకపోతుంది. దానికి తోడు హిమశైలజ మాటలు అప్పుడప్పుడూ ఏదో అలజడిని కలిగిస్తూ ఉంటాయి. |
25,385 |
"హలో!"
రేణుక ముఖం వికసించింది.
"ఏమిటి అంత చిక్కిపోయారు?"
రేణుక మాట్లాడలేదు.
రేణుక గురించి జయదేవ్ విన్నాడు. గుంటూరులో ఆమె కేసు చూస్తున్న లాయర్ జయదేవ్ స్నేహితుడని ఆమెకు తెలియదు.
జయదేవ్ తరచుగా గుంటూరు వస్తున్నాడు.
వచ్చినప్పుడల్లా రేణుకను చూస్తూనే ఉన్నాడు. అసలు ఆమెను చూడటానికే తరచుగా వస్తున్నట్టు అతనికి మాత్రమే తెలుసు.
క్రమంగా యిద్దరి మధ్య చనువు పెరిగింది.
కోర్టు విడాకులు మంజూరు చేసింది.
రామచంద్రం ఆకాశరామన్న ఉత్తరాలు రాయడం ద్వారా, ఫోన్లు చెయ్యడం ద్వారా ఆమెను బెదిరిస్తున్నాడు.
ఒకరోజు ఆమె ఆసుపహ్తిర్ గోడలనిండా జయదేవ్ రేణుకకు అక్రమసంబంధం ఉన్నట్టు ఎవరో రాశారు.
రామచంద్రం పనే అని ఆమెకు తెలుసు. అతనిలో అంత నీచత్వం ఉందని ఆమె ఊహించలేదు. ఆ రాతలు చూసి ఆమె తల వాలిపోయింది.
జూనియర్ ఆ రాతల్ని సున్నంతో తుదిపించింది.
రేణుక అది చూసి తనలో తనే నవ్వుకుంది.
తమ్ముడు రావడం మానేశాడు.
రాధ మళ్ళీ రాసాగింది. ఆమె ఎందుకు వస్తుందో రేణుకకు తెలుసు.
రేణుక అలసిపోయింది.
తనకు తానుగా నిలబడకలననే ఆత్మవిశ్వాసం కొరవడింది.
అదే సమయంలో జయదేవ్ వచ్చాడు.
ఆమెను "హైదరాబాద్ రమ్మనీ, తన నర్శింగ్ హోంలో పనిచెయ్యమనీ కోరాడు"
33
మూర్తీభవించిన సంస్కారం వలె కన్పించే జయదేవ్ నుంచి ఆమెకు నిజమైన ఆదరణ లభించింది.
తను వంటరిది కాదనే ధైర్యం వచ్చింది.
కొద్దిరోజులకే ఇద్దరూ పెద్దల ముందు దండలు మార్చుకున్నారు.
రేణుక తన అద్దె ఇల్లు ఖాళీచేసి రాంకోటిలో ఉన్న జయదేవ్ బంగళాలో అడుగుపెట్టింది.
చంద్రానికి ఉత్తరం రాసింది.
చంద్రం తన సంతోషాన్ని వెలిబుచ్చాడు.
పెద్ద పెద్ద వాళ్ళు జయదేవ్ ఇంటికి వస్తుంటారు.
అతను ఉన్నత కుటుంబానికి చెందినవాడు.
అతనికి తల్లిలేదు. కాని ఆమె చిరకాల భారతీయుల మనసుల్లో ఉండిపోయే కవయిత్రి విదుషీమణి. స్వాతంత్ర్యంకోసం జరిగిన పోరాటంలో గాంధీజీ పక్కన నిలబడింది.
ఐదేళ్ళు జయదేవ్ తో జీవితం ఐదురోజుల్లా గడిచిపోయింది.
చంద్రం మాత్రం ఈ మధ్యకాలంలో ఒక్కసారి వచ్చి వెళ్ళాడు.
దగ్గరలో ఉన్న రామంగాని, చెల్లెళ్ళు గానీ ఎవరూ కంటికి కన్పించలేదు.
జయదేవ్ ఆరు నెలలుగా ఉత్సాహంగా కన్పించడం లేదు.
అతనికి క్యాన్సర్ వచ్చింది. ఆ విషయం భార్య దగ్గిర దాచాడు.
34
అర్థరాత్రి చీకటి ఆ బంగళాను చుట్టివేసింది.
పార్టికోలో మీదినుంచి వేలాడుతున్న లతలూ, బంగళా ముందున్న లానూ, ఆ లానుకు ఇరువైపులా ఉన్న పూల మొక్కలూ, ప్రహరీగోడలకు ఆనుకొని ఉన్న ఎత్తయిన అశోక వృక్షాలూ ఊపిరి బిగబట్టి ఏదో విషాద వార్త చెప్పడానికి వచ్చిన దూతల్లా ఉన్నాయి.
ఆ బంగళా ప్రహరీగోడ ప్రక్కగా కుక్కలు ఏడుస్తూ ఆ అర్థరాత్రిని స్తబ్దతను భంగ పరుస్తున్నాయి.
ఆ కుక్కలు ఏడ్పు రేణుకాదేవి వెన్నెముకలోకి జరజర పాకుతూ ఉంది. ఆమె గుండె దడదడలాడింది.
వాడు ఆ మాలీ ఏం చేస్తున్నాడూ? కుక్కల్ని అదిలించడేం?
రేణుకాదేవి మాలీని కేక వెయ్యాలనుకుంది, కాని గొంతు పెగల్లేదు.
మాలీ కుక్కల్ని దూరంగా తోలడం వినిపించింది. కుక్కలా ఏడుపు దూరం నుంచి విన్పిస్తూ ఉన్నది.
ఆ బంగళా లోపల ఏదో అదృశ్య శక్తి పిల్లిలా నిశ్శబ్దంగా తిరుగుతున్నట్టు అన్పించింది రేణుకాదేవికి.
ఆమె నిలువెల్లా వణికిపోయింది.
జీరో వాల్టుబల్బ్ వెలుగులో మంచంమీద పడుకొని ఉన్న భర్త ముఖంలోకి తదేకంగా చూసింది.
మూడురోజులుగా మృత్యుదేవత తన కోరలతో క్షణక్షణం అతనిలోని జీవశక్తిని పీల్చడాన్ని చూస్తూనే ఉన్నది.
ఆ బంగళాలో మృత్యుదేవత తచ్చాడుతూ ఉన్నది. పొంచి పొంచి అతనికోసం చూస్తున్నది. అది ఆమె కళ్ళకు కన్పించకపోయినా, మనసుకు కన్పిస్తూనే ఉన్నది. స్పష్టంగా మనసు చూస్తూనే ఉన్నది.
రేణుకాదేవికి తన వెనక ఎవరో నిల్చున్నట్టూ చిరునవ్వు నవ్వుతున్నట్టూ అన్పించింది.
గిర్రున తిరిగి చూసింది.
ఎవరూ కన్పించలేదు.
ఎవరూ లేరు! ఏమిటి తనకీ భ్రమ. భయం! మృత్యు భయం! తన భర్త మరణశయ్య మీద ఉన్నాడు. తను డాక్టర్. ఆయనకు వచ్చింది నయం అయ్యే జబ్బు కాదు. అయినా తనకు ఇంకా ఆశ ఉంది. ఏదో మిరాకిల్ జరుగుతుందనీ, తన భర్త మృత్యుదేవత ఇనుప కౌగిలి నుంచి బయట పడ్తాడనీ అనిపిస్తూ ఉన్నది.
కాని...కాని...తను చదివిన చదువూ, తన సైన్సు పరిజ్ఞానం తన పిచ్చితనాన్ని పరిహసిస్తూ ఉన్నాయి.
"అబ్బా! రేణూ!"
రేణుక తృళ్ళిపడింది.
భర్త ముఖంలోకి ధీనంగా చూచింది.
రేణూ బాధ! భరించలేను!" |
25,386 | భర్తెందుకు ముక్కు మీద వేలేసుకున్నాడో సీతకి అర్ధం గాక ఆశ్చర్యపోయింది., ఎమన్నానని అంత వింత" అంది. "నీవి మాట తప్పక అడుగుతావని అమ్మ ముందే చెప్పింది. అమ్మ సర్వాంతర్యామి. ఎవరి మనసులో ఏముందో కూడా తెలుసు. అవును అవిడేమన్నా మానవమాత్రురలా, సాక్షాత్తూ ఆదిశక్తి అవతారం." అని రిక్షలోనే చెంప లేసుకుని, నమస్కారం పెట్టి ఆపై సీత వేపు తిరిగి "అనవసరం వాగుడు తగ్గించు. ఏదన్నా చెప్పాలంటే నే చెప్పను! ఊరికె ఆరాలు తీయకు. నే సహించను. ఏమిటి, నే చెప్పేది అర్ధమైందా" అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చి మిర్రున చూశాడు సుందరమూర్తి. తనిప్పుడు వున్నది ఇంట్లో కాదని రిక్షాలో అని గ్రహింపు వున్న సీత నోరు మూసుకుంది. 38
"ఇష్...ఇష్" అంటూ కిటికీ దగ్గర శబ్దం కావడంతో సీత ముందు గదిలోకి వచ్చింది. రోజులానే ఈ రోజు సుందరమూర్తి వీధి వాకిలికి తాళం వేసే ఆఫీసు కెళ్ళాడు. అందువల్ల సీత కిటికీ తలుపులు దగ్గరకేసి వుంచింది. కిటికీ తలుపులు తెరుచుకున్న చప్పుడుకి ఇష్ ఇష్ అని వినపడటంతో ముందు గదిలో, రాకతప్పలేదు సీతకి. కిటికీ అవతల వున్న శ్రీపతిని చూసి నిర్ఘాంత పోయి నిలబడిపోయింది.
"సీత ! మాట" అన్నాడు శ్రీపతి. "నాతో నీకేం మాటలు? వారు ఆఫీసు కెళ్ళారు. అక్కడికి వెళ్ళి మాట్లాడు." అంది సీత. "ఇది పరమరహస్యం, నీతో చెప్పాలి." "సాయంత్రం వారు ఆఫీసు నుంచోస్తారు. అప్పుడు రా. ఆ చెప్పేదేదో వారి ముందే చెబుదువు గాని." "నా మీద అనుమానం, నా మాటంటే లక్ష్యం లేదు సీతా! వీధి తలుపుకి తాళం ఏమిటి? నీకి చెర ఏమిటి?" చాలా భాధపడుతున్నవాడిలా అన్నాడు శ్రీపతి. సీత కళ్ళు ఈ మాటలతో మెరిశాయి. మంచి ఆలోచన వచ్చింది. శ్రీపతి మాటలవల్లనే సుందరమూర్తి మరాడా? మరో కారణం వుందా? తెల్సుకోవాలంటే శ్రీపతిని మాటల్లో పెట్టడమే అనుకుంది కిటికీకి కాస్త దగ్గరగా వచ్చింది. "అవును శ్రీపతి! నా బ్రతుకు బానిసలగా, ఇల్లు చెరసాలలాగా మారింది. వారికీ పిచ్చి ముదిరింది. నే కాపురానికొచ్చినప్పటినుంచి చూస్తూనే వున్నాగా! ఆ అమ్మగోల తప్ప మరొకటి లేదు. ఇప్పుడు మరీ ఎక్కువయింది. దీనికి విరుగుడు నేవేమయినా చెయ్యగలిగితే చెప్పు లేకపోతె వెళ్ళిపో." సీత అలా మాట్లాడేసరికి శ్రీపతి ఆశ్చర్యంతో అలా కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయాడు. సీత మాటలు నమ్మాలా వద్దా! డయిలమాలో పడ్డాడు. చివరికి పంజరంలో బంధించిన చిలక ఎగిరిపోవటానికి మార్గం వెదుకుతుంది కాబట్టి, సీత ఆ ప్రయత్నంలో ఉందని అనుకున్నాడు. "నేనా నాడు చెపితే విన్నావా సీతా" అన్నాడు శ్రీపతి. "వినలేదు, దానికి కారణం వుంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకుడదో తెలిలేదు. వారుత్త అనుమానం మనిషని అక్కడికి తగు జగ్రత్తలోనే వున్నాను. నే తొందరపడ్డానని నీవూ తొందరపడి ఇంత దూరం తీసుకువచ్చావు." "....నేనేం చేశాను?" "వారు చెప్పారు. నీ మాటలనుబట్టి ఇంత దూరం వచ్చింది, అందుకే తాళం." "సుందరం చెప్పాడా? చెప్పడే, ఉహూ నేనమ్మను. అమ్మ మీద వట్టు వేసిన సుందరం పొరపాటున కూడా నోరు జారదు." సీత ఫక్కున నవ్వింది. "గుమ్మడికాయల దొంగా అంటే భుజం తడుముకున్నట్టు, నువ్వు చేసింది నువ్వే భయతపెట్టుకున్నావు. నాకు తెల్సు ఇందులో నీ చెయ్యి వుందని. దుర్మార్గుడా! నేను నీకేం అపకారం చేశానని పగబట్టి సాధిస్తున్నావు? నే తల్చుకుంటే నిన్నేమయినా చేయగలను. ఈ మాట నీ ముఖాన చెప్పటానికే ఇందాకా ఆగాను. ఇహపై చూద్దువుగాని....."శ్రీపతి బుద్ది కనిపెట్టటానికి రెచ్చకొడుతూ మాటలంది. శ్రీపతి కళ్ళు ఎర్రపడ్డాయి. "పూర్! అమ్మ మీద ప్రమాణం చేసికూడా పెళ్ళాం ముందు నోరుజారి నిజం చెప్పేసి వుంటాడు. విడింత తెలివి తక్కువ వెధవేమిటి?" సుందరమూర్తి గురించి అనుకున్నాడు శ్రీపతి. సీత మాటలు నమ్మాడు. ఈ సమయంలో తెలివి ఒకరి సొత్తే కాదన్నమాట మర్చిపోయాడు. "ఇంకేందుకలా కిటికీ పట్టుకు వేలాడుతావు వెళ్ళు" అంది సీత. "సీత ! ఆడదాని కింత పొగరు పనికి రాదు. ముందే చెప్పాను. నా మాట విననివాళ్ళ గతి అదొగతేనని. రారాజుని చూసి నవ్విన ద్రౌపదికి ఎలా పరాజయం జరిగిందో నీకు తెలియంది కాదు. ఆఫ్ ట్రాల్ ఓ మాములు ఆడదానివి! నీ కింత అహమా! నడిబజారులో నలుగురి ముందూ నీ వంటిమిది గుడ్డలు వలచి నీ చేత పరుగులు తియిస్తాను. స్ట్రికింగ్ అన్నమాట. |
25,387 | తనముందు ప్రత్యక్షమైన వ్యక్తిని చూసి భీతావహురాలైపోయింది సుదేష్ణాదేవి.
ఆ వ్యక్తి బ్యాట్ మాన్!
సుదేష్ణాదేవి చేతిలో ఉన్న తేజను లాక్కుని ప్రేక్షకుల మధ్య నుంచి స్టేజిమధ్య కెళ్ళి నిలబడ్డాడు.
మిరుమిట్లు గొలుపుతున్న లైట్ల వెలుగులో ఆ నల్లటి ఆకారాన్ని అతని చేతుల్లో మళ్ళీ చిక్కిపోయిన తేజను చూసి, సి.ఐ. గబగబా స్టేజి ఎక్కడానికి ప్రయత్నిస్తున్నాడు.
సమర్ధు, హిమకుంద నిశ్చేష్టులై కిందనుంచి చూస్తున్నారు.
అందినట్టే అంది దూరమైపోయిన కొడుకును తల్చుకుని బావురుమంటూ ఏడుస్తూంది సుదేష్ణాదేవి.
అటూ ఆర్కెస్ట్రా హోరు, ఒకపక్క స్టేజిమీద చింపాంజీల కుపిగెంతులు...అమ్మాయిల విన్యాసాలు....
ఏం జరుగుతుందో తెలీక, ఆడియన్స్ లో కలవరం ఏర్పడింది. అందరూ స్టేజిమధ్యలో మైకు పట్టుకుని, ఒక చేత్తో పిల్లాడితో నుంచున్న బ్యాట్ మాన్ వేపు చూస్తున్నారు.
"మిస్టర్ ఇన్స్ పెక్టర్, మిస్టర్ కాళేశ్వరప్రసాద్....జాగ్రత్తగా వినండి....అనవసరంగా మీరు స్టేజివేపు వచ్చినా, అతి తెలివితేటలతో ప్రవర్తించినా, నా చేతుల్లో తేజ ముక్కలు, ముక్కలైపోతాడు."
సర్కస్ స్టేజ్ కంట్రోలర్ కి, ప్రేక్షకులకు అప్పటికిగాని సీరియస్ నెస్ అర్ధంకాలేదు. బ్యాట్ మాన్ బొంగురు గొంతుతో చేసినా హెచ్చరికకు ఎక్కడి షో అక్కడ ఆగిపోయింది.
"ఎవరు నువ్వు- నీకేం కావాలి?" అడిగాడు సి.ఐ.
సరిగ్గా అదే సమయంలో, స్టేజ్ ఎక్కి బ్యాట్ మాన్ వెనక్కి వచ్చిన ముగ్గురు కిడ్నాపర్ల వేపు చూశాడతను.
"ఎవడీ బ్యాట్ మాన్ బాసు...." వీర్రాజువేపు చూసి అడిగాడు సేతురాజు.
"ఎవడో ఒకడు మనకెందుకు... ముందు మనమిక్కడ నుంచి ప్రాణాల్తో బయటపడాలి." గుసగుసలాడాడు పోతురాజు.
"చెప్తాను జాగ్రత్తగా వినండి...ఎవరైనా, ఏ మాత్రమైనా ఎక్కదైనా కదిలినా, మమ్మల్ని పట్టుకోవడానికి ప్రయత్నించినా, ఈ చిరుతపులి నోటికి బాబుని ఆహారంగా అందిస్తాను!" అంటూ ఆవురావురుమంటూ తనవేపే చూస్తున్న చిరుతపులి వేపు చూసి, దాని నోటి దగ్గర తేజ తలను పెట్టాడు.
ప్రేక్షకుల్లోంచి సుదేష్ణాదేవి గాభరాగా ముందుకొచ్చింది.
"తేజను ఏమీ చెయ్యకు- నీకేం కావాలో చెప్పు!" కాళేశ్వరప్రసాద్ నిస్సహాయంగా అన్నాడు.
"గుడ్- మిస్టర్ కాళేశ్వర ప్రసాద్! నీ కోట్లాది ఆస్తికి ఏకైక వారసుడు తేజ! అవునా?"
"అవును!"
"ఆ ఆస్తిని నా పేరుమీద రాసివ్వు!"
ఆడిటోరియం లో పిన్ డ్రాప్ సైలెన్స్ నెలకొంది.
సరిగ్గా అదే సమయంలో సమర్ద్, స్టేజి వెనక నుంచి పైకెక్కుతున్నాడు.
"ముందు తేజను మాకప్పగించు!" కాళేశ్వర ప్రసాద్ ప్రాధేయపడుతున్నాడు.
"మిస్టర్ కాళేశ్వర ప్రసాద్! నీకు శ్రమ లేకుండా, డాక్యుమెంట్ పేపర్స్ కూడా నేనే తెప్పించాను...దీని మీద చిన్న సంతకం పెట్టు చాలు!" అంటూ కోటులోంచి డాక్యుమెంట్ పేపర్స్ ని తీసి వీర్రాజుకి అందించాడు. అతను ఆ డాక్యుమెంట్ పేపర్స్ ని తీసుకుని స్టేజీ దిగి, కాళేశ్వర ప్రసాద్ వేపు వెళ్తున్నాడు.
"మనకీ ఆస్తి, అంతస్తూ ఏమీ అక్కరలేదు... వాడికి కావల్సిన ఆస్తి వాడికిచ్చేయ్యండి! తేజా... బాబూ...తేజా..." అంటూ స్టేజి వేపు వెళ్తున్న సుదేష్ణాదేవికి అడ్డుగా వచ్చాడు ఇన్ స్పెక్టర్.
తన చేతిలో ఉన్న డాక్యుమెంట్ పేపర్స్ వేపు ఒకసారి చూసి, జేబులో పెన్నుని తీశాడు కాళేశ్వర ప్రసాద్.
"పెట్టు - సంతకం పెట్టు! కాళేశ్వర ప్రసాద్... నువ్వా కాగితాల మీద, అలా సంతకం పెట్టిన మరుక్షణం....నీ కొడుకునిలా నీ భార్యకప్పగించేస్తాను!"
"అంతవరకూ ఇక్కడెవరూ, గాజులు తొడుక్కుని కూచోలేదు మిస్టర్ సత్తిపండు!"
ఆ మాటల్ని విన్పించిన వేపు తల తిప్పి చూడబోయాడు- బ్యాట్ మాన్ వేషంలో ఉన్న సత్తిపండు.
సరిగ్గా సత్తిపండు వెనక__
సత్తిపండు వీపుకి పిస్టల్ని ఆనించి, నుంచున్నాడు సమర్ద్.
"సత్తిపండు....తేజ కిడ్నాపింగ్ డ్రామాకి మూలకారకుడు సత్తిపండా! ఒరేయ్- నువ్వు.." ఆవేశంగా ముందుకు రాబోయాడు కాళేశ్వర ప్రసాద్.
"అన్నగారూ- ఆవేశాన్ని తగ్గించుకోండి!"
"ఓరీ- నమ్మక ద్రోహీ! నిన్ను నేను బతకనివ్వను..." అంటూ ముందుకెళ్ళిన కాళేశ్వర ప్రసాద్ కి అడ్డంగా నుంచున్నాడు వీర్రాజు.
"ముందు సంతకం పెట్టు బాసూ!"
"ఒరేయ్ మెకానిక్కూ! నీ పిస్టల్ని కింద పడెయ్ - నా పాకెట్లో వున్న రిమోట్ కంట్రోల్ని ప్రెస్ చేసానంటే, అందరూ మాడి మసై పోతారు. కథ సుఖాంతం కావాలంటే, మీ ఆయుధాలన్నీటినీ కింద పడేయండి! కాళేశ్వర ప్రసాద్ సంతకంతో, ఆ డాక్యుమెంట్స్ నాకిచ్చెయ్యండి. తేజను మీకిచ్చేసి, మేం వెళ్ళిపోతాం- వీర్రాజూ! వెళ్ళి వ్యాన్ ని రెడీ చెయ్యి!" అనగానే, ముగ్గురూ స్టేజి మీద నుంచి కిందకు దిగుతున్నంతలో__ |
25,388 |
కొన్నినిమిషాల తేడాలో ఓకే నంబరు నుంచి తను అనుమానించే వ్యక్తులకు ఫోను వచ్చిందంటే ఆ కొత్త నంబరు ఎవరిదో తేలిస్తే కేసు చిక్కుముడి విడిపోతుందేమోననే ఆలోచన వచ్చింది.
అదిగాక ఆ ఒక్కరోజు మాత్రమే ఆ నంబరు నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి. తరువాత ఇంతవరకేప్పడూ ఆ నెంబర్ గల వాళ్ళు తిరిగి చేయకపోవడమూ దిరజకు మరింతగా అనుమానం బలపడేలా చేసినట్టయింది.
అందుకే నలుగురిని కలిసి ప్రశ్నించడానికి బయలుదేరింది.
"ముకుందరావుగారూ.....! నీలిమ అదృశ్యమయిన రోజు మీరు ఇంట్లోనే ....అదే ....ఐమిన్ మీరు ఊర్లోనే వున్నారనుకుంటాను కదూ?"
ఉపోద్ఘతంగా సంభాషణను ప్రారంభించింది ఇన్స్ పెక్టల్ ధీరజ.
"ఎస్! ఉన్నాను."
"ఆ రోజు మీకొక ఫోన్ వచ్చింది కదూ?"
"అదేం ప్రశ్న ఇన్స్ పెక్టర్! బిజినెస్ మాన్ అన్న తరువాత ఫోన్లు రాకుండా వుంటాయా ఏమిటి? ఒక్క టేమిటి....ఎన్నో వచ్చివుంటాయి కూడా."
"బట్....ఆ ఫోన్లన్నింటిలో ఒక ఫోన్ మాత్రం ప్రత్యేకమయిన సమాచారాన్ని మీకు తెలిపిన ఫోన్ కాబట్టి....అదేంటో మీకు బాగా గుర్తు వుండి వుండవచ్చుననుకుంటాను" ఆయన ముఖ కవళికలను జాగ్రత్తగా గమనిస్తూ ప్రశ్నించింది.
ముకుందరావులో ఎలాంటి తడబటూ లేదు.
"మీ మాటలు నాకు అర్ధం కావడంలేదు."
"అర్ధంకావడం లేడనవద్దు....చెప్పడం ఇష్టం లేదనండి....నమ్ముతాను."
"నాన్సెన్స్! అసలు మీకేం కావాలో అది సూటిగా చెప్పక, ఈ డొంకతిరుగుడు ప్రశ్నలు వేయకండి" దాదాపుగా కోపంతో అరిచినట్టుంది ముకుందరావు గొంతు.
ఆ ఫోన్ నంబర్ చెప్పిందమె.
"నో....ఆ నంబర్ ఎవరిదో నాకసలు తెలిదు ఇంతవరకేప్పడూ ఆ నంబర్ నుంచి నాకెవ్వరూ ఫోన్ చేయలేదు....నేను మాట్లాడలేదు కూడా" నిర్మోహమాటంగా చెప్పాడు.
ఎంత తరిచి ప్రశ్నించినా ఆయన నుంచి అదే సమాధానం రావడంతో అనుమానంగానే వెనుదిరిగింది ఇన్స్ పెక్టర్ ధీరజ.
తన దగ్గరున్న లిస్ట్ లో ఒకసారి కాదు....నాలుగుసార్లు ఆ ఫోన్ నంబర్ నుంచి ఓకే రోజు ఎవరో ఫోన్ చేసినట్టు తెలుస్తోంది.
అయినా తనకు ఎవరూ చేయలేదంటున్నాడు ముకుందరావు.
అంటే- అతను అబద్దం చెబుతుండాలి.
అతనే కాదు....ప్రేమ్ చంద్, లెక్చరర్ సుధాకర్ కూడా అలానే చెప్పారు.
ధీరజకు అప్పుడు ఇంకో అనుమానం బయలుదేరింది.....బహుశా అందరూ కూడాబలుక్కుని ఏమీ తెలిదనే సమాధానం చెప్పాలనుకున్నా రెమో!
అదేదో వ్తెస్ చాన్స్ లర్ ని కూడా కలిసిన తరువాత నిర్ణయించుకో వచ్చుననుకుని యూనివర్శిటికి వెళ్ళింది.
ఆ పరిశోధన ఏమతవరకూ వచ్చింది ఇన్స్ పెక్టర్?" వెళ్ళి వెళ్ళటంతో చిరునవ్వుతో పలకరిస్తూ అడిగాడు వ్తెస్ చాన్స్ లర్ .
"మీ వరకూ వచ్చి ఆగిపోయింది."
"వాట్ ....?" ఆయనలో ఖంగారు.
"మీరు నాకొక విషయంలో సహకరించినట్లయితే ఆ నేరస్దుడేవరో తెలుసుకోవడం సులభమవుతుంది, అందుకని అలా అన్నాను."
"మీకు ఏం కావాలన్నా సహకస్తూనే వున్నాను కదా?"
"దట్స్ గుడ్! ఆ మాటమిదే వుండండి.... నీలిమ యూనివర్శిటికి రాణి రోజు మీకు ఒక నెంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది..... ఆ నెంబర్ నుంచి చేసిందెవరో మీకు తప్పనిసరిగా తెలిసే వుంటుంది."
"ఆ నెంబర్ చెప్పండి."
ధీరజ చెప్పింది.
"ఈ నెంబర్ మా గెస్ట్ హౌస్ ది."
"వాట్ ....?"
"ఎస్! కొత్తగా కట్టిన గెస్ట్ హౌస్ ఒకటి మా యూనివర్శిటి కింద వుంది ప్రారంభోత్సవమయితే జరిగిందికానీ, కొన్ని కారణాల వలన ప్రస్తుతం అది లాక్ చేయబడి వుంది. ఒక విధంగా అది సిల్ వేయబడి వున్నదాని కిందే లెక్క."
ఈసారి ఆశ్చర్యపోవడం ధీరజ వంతయింది.
"అదేమిటి సార్ అలాగంటారు....అక్కడ్నించి ఆ రోజు మీకు కూడా ఫోన్ వచ్చింది." |
25,389 | 53 వ మరియు 54వ సర్గలు
సీత ఋష్యమూకముపైన ఆభరణములు వేయుట :-
1. ఋష్యమూకమను - కొండపైన
పంచ వానరుల - సీత గాంచెను I
తన వృత్తాంతము - శ్రీరామునకు
ఆ వానరులు - ఎరిగించుటకు I
ఉత్తరీయమును - కొన్ని సొమ్ములను
వారి నడుమ పడ సీత విసిరెను I
సీత నెత్తుకొని - గగన మార్గమున
దశకంఠుడు వెడ I లె లంక చేరగ .... IIశ్రీII
రావణుడు సీతతో లంక చేరుట :-
2. కొండకోనలు - అడవులు నదులు
పంపాసరసు - అధిగమించుకొని I
గంభీరమైన - కడలి దాటుకొని
సుందరమైన - లంక చేరుకొని I
అందమైన తన - అంతఃపురమున
అతి గోప్యముగ - సీతను ఉంచి I
వెడలిపోయె అం I దుండి రావణుడు
రాక్షస స్త్రీలను - కావలి ఉంచి .... IIశ్రీII
53 వ మరియు 54 వ సర్గలు సంపూర్ణము.
55 వ. సర్గ
రావణుడు సీతకు తన సౌధము జూపుట :-
1. మరుని శరములచే - బహుపీడితుడై
రావణాసురుడు - వెంటనె మరలి I
మదన తాపమున - మదోత్కటుడై
మందిరమును తిరి I గి ప్రవేశించి I
సీత చెంత నిలి I చి క్రూరనేత్రుడై
సీత పైననే - చూపులు నిలిపి I
పలుకరించెను - కుటిలచిత్తుడై
బాసలు జేసెను - అతి వినయుండై....IIశ్రీII
2. దివ్యమైన ప్రా I సాద హర్మ్యములు
రత్నఖచిత సు I వర్ణస్తంభములు I
మణిమయకాంచన - ద్వారబంధములు
మేలిమి బంగరు - తోరణములు I
పూలతోటలు - పక్షులు మృగములు
పద్మాకరములు - దిగుడు బావులు I
లంకేశ్వరుడు - దర్పమలరగ
సీతకు చూపెను - బలవంతముగ... IIశ్రీII
3. "ఓ సీతా నా - సర్వస్వమును
నీ కిపుడే స్వా I ధీనము జేతును I
వేనవేలు గల I రు నాకు భార్యలు
వారందరును - ఉత్తమ కాంతలు I
నన్ను నీవు వి I వాహమాడుము
వారందరికి - ఈశ్వరివి గమ్ము I"
అని పల్కినాడు - రావణాసురుడు
కామాతురుడు - లజ్జాహీనుడు .... IIశ్రీII
4. "నీ పాపము వన I వాసముతో సరి
నీ పుణ్యమిట - ఫలించు మరి I
నా రాజ్యమెల్ల - నీ అధీనము
ఈ లంక నింక - పరిపాలింపుము I
నీవు నాకు దే I వేరివి గమ్ము
నాతో కలసి - సుఖముల దేలుము I"
అని పల్కినాడు - రావణాసురుడు
కామాతురుడు - లజ్జాహీనుడు .... IIశ్రీII
5. "రాముడు దీనుడు - రాజ్యభ్రష్టుడు
నిరాధరుడు - నిర్భలుడు I
తాపసవృత్తిని - జీవించువాడు
ఏ తీరుగ నిను - సుఖపెట్టగలడు ?
అడవుల పాలై - తిరుగాడువాడు
ఏ రీతిగ నిను I కాపాడగలడు ?"
అని పల్కినాడు - రావణాసురుడు
కామాతురుడు - లజ్జాహీనుడు .... IIశ్రీII
6. "నా అన్నను కు I బేరుని గెలిచి
పుష్పకమను వి I మానము దెచ్చితి I
ఎందరెక్కినను - చోటివ్వగలదు
మనసున తలచిన - రీతి పోగలదు I
అట్టి విమానము I న మన మిరువురము
గగన మార్గమున - విహరించుదము I"
అని పల్కినాడు - రావణాసురుడు
కామాతురుడు - లజ్జాహీనుడు .... IIశ్రీII
7. నిగనిగలాడు నీ - పదములపైన
శిరముంచి మరీ - వేడుకొందును I
ఇంతవరకు నే I ను ఏ వనితకును
తల వంచలేదు - ప్రణమిల్లలేదు I
కావున నన్ను అ I నుగ్రహింపుము
నీ దాసునిగా - స్వీకరింపుము I"
అని పల్కినాడు - రావణాసురుడు
కామాతురుడు - లజ్జాహీనుడు .... IIశ్రీII
55 వ. సర్గ సంపూర్ణము |
25,390 |
అంతే.... ఆమెని చూడగానే అతడు శిలాప్రతిమలాగా అక్కడే ఆగిపోయాడు ఒక స్మృతికెరటం ఉప్పెనై సముద్ర జలాలన్నిటినీ అధిగమించి వెనుకనుంచి రివ్వురివ్వున వస్తూ ఒడ్డుని ముంచెత్తిన భావం అతడికి కలిగింది.
ఒక్కసారిగా అతడి కళ్ళముందు వేల వేల కాంతిపుంజాలు ప్రభవించాయి. సి....రి.....చం...ద...న...!
గ్రీష్మ యామినిలో శరత్ చంద్రికోదయం జరిగినట్లు అనిపించింది చైతన్యం పొందిన ఒక గాలి అల.... పరిమళాన్ని మోసుకొచ్చినట్టు, దాహార్తుడైన వ్యక్తికి నీటిజల కనిపించినట్టు అతడు సంతృప్తమైన ఉద్వేగంతో చేష్టలుడిగి నిలబడిపోయాడు. "గిరిగిరి తిరిగితి, విసిగితి, విరిగితి, విడిచితి, విరిదట్టు విరివిడి చూసితి. విధి కిరికిరి చివరికి మీ విరివి విని నగిడి నిలిచితి, సిరియిడి నిల్పితిని నిల్చిక్షితిమినిమ్మా...." అన్నట్టుగా- అతడు ఆమెకు అల్లంతదూరంలోనే ఆగిపోయి కోల్పోయిన వస్తువుని తిరిగి పొందిన మనిషిలా అపురూపంగా చూస్తూ నిలబడ్డాడు.
ఆమె 'విరి' లా అనిపించింది. విరాళి ఆమెలో కనిపించింది.
ఇన్నాళ్ళూ ప్రేమను కని- పెంచిన హృదయం విరాజమానమయింది.
రాక్షసుడు ఎత్తుకుపోయిన ప్రేయసిని, సప్తసముద్రాలుదాటి, అరణ్యాలు ఛేదించి, ఒంటిస్థంభపు మేడ ఎక్కివియోగం తర్వాత మొట్టమొదటిసారి కలుసుకున్న అనుభూతి.
అతడు తన స్థితి మర్చిపోయాడు. చుట్టూ వున్న పరిస్థితికి అర్చితుడయ్యాడు.
కళ్ళచుట్టూ ఒక వెలుగు. ఆ వెలుగు మధ్యలో ఆమె!
ఆమె తప్ప మరేమీ కనబడటంలేదు. కేవలం ఆమె ఒక్కతే. ఆమె తప్ప మరేమీలేదు. ఆమె తప్ప మరేమీ లేకపోవడం తప్ప, అతనికి ఇంకేమీలేదు. నిర్ద్వంద ప్రేమ నిష్వనాఘాతుడై అతడు అడుగు ముందుకేయబోయాడు.
సరిగ్గా అప్పుడే ఆమె గుండెమీద మెరిసిన మంగళసూత్రపు మెరుపు అతడ్ని అడుగు వెనక్కీ తీసుకునేలా చేసింది.
వసంతం వచ్చింది. అయినా వాస్తవం గుర్తొచ్చింది.
వాస్తవం!
ఆమెను తనదాన్నిగా చేసుకోవాలన్న ఆలోచన ఎప్పుడూ లేదు.'చూసుకొని తృప్తిపడాలి. తృప్తిపడి ఉరికంబం ఎక్కాలి' అన్న ఆలోచనే- అదీ వాస్తవం. ఆమె పరాధీనమన్న వాస్తవం, అతడ్ని ప్రేమతో వెన్నుతట్టి హెచ్చరించింది.
అతడు 'కదిలిపోతూనే' ముందుకు కదిలాడు.
అంతకుముందే ఆమె తేరుకుంది. దగ్గరికి వస్తున్న అతన్ని చూసి మహర్షీ.... నువ్విక్కడ.....?" అని ఆశ్చర్యంగా ప్రశ్నించింది. అందంగా, చిన్నపిల్లలాగా తీరాన్ని తాకబోతున్న ఒక చిన్న అలని, తీరం చేరేలోపులోనే పెద్ద అల మింగేసినట్టు అతడి ఆనందాన్ని, ఆమెకి సేవకుడిగా నియమింపబడ్డానన్న భావం కప్పేసింది.
పెదవులపై చిరునవ్వు పుట్టించి "మీ కోసం అప్పాయింట్ చేయబడిందినేనే" అన్నాడు.
"వ్వాట్?" అదిరిపడిందామె. ఒక మంచి మిత్రుడ్ని సేవకుడి స్థానంలో ఆమె సంస్కారం చూడలేకపోయింది. అతడి వైపు అయోమయంగాచూస్తూ "నీ కంత అవసరం ఏమొచ్చింది?" అంది ఆశ్చర్యంగా.
వెంటనే ఏం సమాధానం చెప్పాలో అతడికి అర్థంకాలేదు.
తల పక్కకి తిప్పుతూ "అవన్నీ తీరికగా మాట్లాడుకుందాంగానీ, ఇంతకీ మీ వారేరీ?" అంటూ కారు డోర్ తెరవబోయాడు.
"నేను తీసుకొస్తాను. ఈ బ్రీఫ్ కేస్ లోపలికి తీసుకెళ్ళు" అంటూ ఓ బ్రీఫ్ కేస్ అందించడంతో, అతడది తీసుకుని గెస్ట్ హౌస్ లోపలికి నడిచాడు. లోపల గదుల్లో సామాన్లన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసి, అతడు తిరిగి బయటికి వచ్చే సమయానికి, గంగమ్మ ప్లాస్క్ కప్పులు తీసుకొస్తూ కనిపించింది. ఆమె చేతినుండి అవి అందుకొని డ్రాయింగ్ రూంలో బల్లమీద సర్దాడు.
అతడింకా క్షణాలక్రితం తను చూసిన దృశ్యంనుంచి తేరుకోలేదు. విధి ఒక వృత్తంలాంటిదని, ఎక్కడ బయలుదేరినా అది కావాల్సినా చోటుకే వస్తుందని అతడికా క్షణం అర్థమైంది. తనని తాను సంబాళించుకుంటూ బయటికి వస్తూ ఉండగా కనిపించిందా దృశ్యం!
చేయి పట్టుకొని భర్తను తీసుకొస్తూంది ఆమె. తడుముకుంటూ నడుస్తున్న భర్తని కాటేజీ లోపలికి తీసుకువస్తూంది.
అతడికి మొదట అర్థంకాలేదు. ఈ లోపులో వెనకనించి చలమయ్య కూడా వచ్చి పక్కన నిలబడటంతో "అయ్యగారికేమైంది?" అని అడిగాడు.
"అయ్యో, మీకింకా తెలీదాబాబూ? ఆయనకీ ఈ మధ్యనే కళ్ళు పోయాయి. అందుకే మనశ్శాంతి కోసం ఇలా వచ్చారు" అని చెప్పాడు చలమయ్య.
అదిరిపడ్డాడు మహర్షి.
సిరిచందన భర్త ఒక అంధుడా!
అతడి హృదయమంతా నొక్కిపెట్టినట్టు అదోలా అయిపోయింది. ఎందుకూ పనికిరాని గడ్డిపరకని సైతం మంచుముక్క కడుగుతుంది. కటిక చీకటిని సైతం వెన్నెలముక్క వెలుగుతో నింపుతుంది. అలాంటిది ఒక అమాయక స్త్రీ మూర్తికి ఇంతటి శిక్ష వేసే హక్కు ఆ భగవంతుడి కెక్కడిది? అనుకున్నాడు.
రాలబోతున్న అశ్రుకణాలు కళ్ళకొలనులోనే నిలిచిపోతూ, తెరచాప తెరని అడ్డుగా వేసాయి. చెమ్మగిల్లిన కళ్ళలోంచి అస్పష్టంగా ఆ దంపతుల ఆకారాలు తనవైపుకి నడిచి రావటం కనిపించింది. కళ్ళలో నలక పడ్డట్టు ఓ కారణం సృష్టించుకొని, అతడు కళ్ళు తుడుచుకున్నాడు. తుడుచుకుంటూ తలెత్తి చూసేసరికి వాళ్ళు లోపలికి వెళ్ళిపోవటం కనిపించింది.
ఇంక అక్కడ వుండి చేయవలసిన పనులేమీ లేనట్టు అతడు గెస్ట్ హౌస్ నుంచి బయటికి వచ్చేశాడు. సాయంత్రం అయిదయ్యింది. గెస్ట్ హౌస్ కి దూరంగా వున్న రాతి బెంచీమీద అతడు కూర్చున్నాడు.
సిరిచందన, ఆమె భర్త బయటికి రాలేదు. మధ్యాహ్నం చలమయ్యే లోపలికి వెళ్ళి వారికి భోజనం ఏర్పాట్లు చేశాడు.
చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అనుకున్నది వేరు, జరుగుతున్నది వేరు. తానే ప్రశ్నించుకున్నాడు. నిన్నటివరకూ మనసుని ఊపేసిన కోరిక ఇప్పుడు అర్థరహితంగా కనబడుతోంది. ఇలా చూడటంలో మనసులో ఏమూలో చిన్నఆశకూడా వుందా? ఆమెకి వివాహం జరగకుండా వుండుంటే తను మరింత సంతోషంగా ఉండి ఉండేవాడా? సమాధానంలేని ప్రశ్నలు! అర్థంలేని సమాధానాలు!
అతడు లేచి అరగంటలో వస్తానని చలమయ్యతో చెప్పి మార్కెట్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడినుంచి వర్మకి ఫోన్ చేశాడు.
అట్నుంచి వర్మ గొంతు వినగానే "సిరిచందన కనపడింది" అన్నాడు.
అట్నుంచి వర్మ ఎగ్జయిటింగ్ గా "కనపడిందా? ఎక్కడ?" అని అడిగాడు.
"నేను పనిచేసే గెస్ట్ హౌస్ ఓనర్ కూతురే సిరిచందన. భర్తతో కలిసి ఇక్కడికొచ్చింది."
"మైగాడ్! ఆమెకి వివాహం జరిగిపోయిందా?"
మహర్షి సన్నగా నవ్వాడు. "ఆమెకి వివాహం జరగటం, జరగకపోవడం అనేది ఇక్కడ అప్రస్తుతం కాదా వర్మ! నేనూ ఊహించలేదనుకో. కానీ తరువాత ఆలోచిస్తే ఆ విషయానికి అంత ప్రాముఖ్యత లేదనిపించింది. ఇంతకీ ఇప్పుడు నేనెందుకు ఫోన్ చేశానంటే నువ్వక్కడ ఇంకా ఆ అమ్మాయి అడ్రస్ కోసం వెతుకుతూ వుంటావేమో, అది అనవసరం అని చెప్పటం కోసం".
"పోన్లే, వెదకబోయిన తీగ కాలికి తగిలిందిగా!"
"నేను ఈ సాయంత్రమే బయల్దేరి వచ్చేద్దామనుకుంటున్నాను."
"అదేమిటి?" ఆశ్చర్యంగా అడిగాడు వర్మ.
"అవును. ఇక్కడ నేనుండి చేసేదేముంది? తనని చూడాలనుకున్నాను, చూశాను."
"కానీ, ఇక్కడికొస్తే ప్రమాదం మహర్షీ."
"ఏం ప్రమాదం? పోలీసులనించేగా! నేను వెళ్ళి పోలీసులకి సర్రెండర్ అయిపోతాను."
"ఇంత కష్టపడి ఇన్నిప్రయత్నాలు చేసింది చివరికి సర్రెండర్ అయిపోవటానికా?"
"మరేం చెయ్యమంటావ్? ఆ గెస్ట్ హౌస్ బయట వరండాలో కూర్చొని లోపల ఆ దంపతులు ఎలా ఉన్నారో ఊహించుకుంటూ కాలం గడపమంటావా? లేకపోతే కాషాయ వస్త్రాలు వేసుకొని, గడ్డాలు పెంచుకొని, హిమాలయ పర్వతాలకు వెళ్ళామంటావా? లేదు వర్మ, ఆ రెండు పనూలు నేను చేయలేను. దీనికన్నా జైలుకి తిరిగి వెళ్ళటమే నాకు సంతోషాన్నిస్తుంది."
చాలాసేపు మౌనంగా వుండి వర్మ "నీ యిష్టం" అన్నాడు.
మహర్షి ఫోన్ పెట్టేసి తిరిగి గెస్ట్ హౌస్ కొచ్చాడు. అతడి మనసు ఇప్పుడు ప్రశాంతంగా వుంది. తను చెయ్యాలనుకున్న పని చేసేసాడు. కోరిక తీరింది. ఇప్పుడు చావు కూడా తనని భయపెట్టడం లేదు. ముఖ్యంగా ఇప్పటివరకూ వున్న అసంతృప్తి ఇకలేదు.
అలా ఆలోచిస్తూ అతను గెస్ట్ హౌస్ కి వచ్చేసరికి, బయట లాన్ లో అదే సిమెంటు బల్లమీద సిరిచందన కూర్చొని వుంది. అతన్ని చూసి "రా మహర్షీ. నువ్వెక్కడికో బయట కెళ్ళావని చలమయ్య చెప్పాడు" అంది. ఈ లోపులో చలమయ్య గార్డెన్ ఛెయిర్ తీసుకొచ్చి అక్కడి వేశాడు.
"కూర్చో" అంది.
"మీరక్కడ కూర్చోండి. నేనీ చప్టామీద కూర్చుంటాను" అన్నాడు.
"నాన్సెన్స్" అంది సిరిచందన. "మీరు ఏమిటి? మనం ఒకే క్లాసులో కలిసి చదువుకుంటున్నప్పుడు ఇలాగే గౌరవించుకునే వాళ్ళమా? ఫరవాలేదులే రా, "కూర్చో" అంది.
అతడు ఇబ్బందిగా ఇంకా అక్కడే నిలబడి ఉన్నాడు. ఆమె ఇంక ఆ విషయాన్ని పొడిగించకుండా తనే వెళ్ళి ఛెయిర్ లో కూర్చుంటూ "ఊ.... ఇప్పుడు చెప్పు ఏమిటి విశేషాలు? మన క్లాస్ మేట్స్ ఎవరన్నా కనబడుతూ ఉంటారా?" అని అడిగింది.
"సుశీల దుబాయ్ లో వుంది. అంతవరకే తెలుసు."
"అవునట. నాకూ తెలిసింది. కానీ అడ్రస్ లేదు. నీ క్లోజ్ ఫ్రెండ్ వర్మ ఎలా ఉన్నాడు?"
బాగానే వున్నాడు. ఇంకా పెళ్ళి చేసుకోలేదు."
"అన్నట్టు అడగటం మర్చిపోయాను. అంత చదువుకొని, ఇంత చిన్న ఉద్యోగం కోసం ఎందుకొచ్చావు నువ్వు?" అందామె.
అప్పటికి ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటే చాలనిపించింది. "ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండేవాడిని. నష్టం వచ్చిందంటూ కంపెనీ మూసేశారు. మరోటి దొరికేవరకూ ఖాళీగా ఉండటం దేనికని.....! అదీగాక నాకీ పరిసరాలంటే చాలా ఇష్టం."
అవును. పెళ్ళంటే గుర్తొచ్చింది. నువ్వు పెళ్ళిచేసుకోలేదా?"
అతనొక్క క్షణం తడబడ్డాడు. ఏం చెప్పాలి? భార్యని హత్య చేసినట్టు చెప్పాలా? ఆ నేరానికి ఉరిశిక్ష పడినట్టు చెప్పాలా? నిన్ను చూడటం కోసం జైలునుంచి తప్పించుకున్నానని చెప్పాలా? తప్పించుకు వచ్చి నా భార్య పప్రియుడ్ని హొటల్ పైనుంచి తోసేసానని చెప్పాలా? ఏం చెప్పాలి?
అతని మౌనాన్ని మరోలా అర్థం చేసుకుని, సిరిచందన నవ్వుతూ "ఓ మంచి అమ్మాయిని చూసి నేనే చేస్తాన్లే. అన్నట్టు అమ్మాయి..... ఎర్రగా, సన్నగా ఉండాలా? లేక తెల్లగా, బొద్దుగా వుండాలా? లేక నల్లగా కళగా వుండాలా?" అంది చిలిపిగా.
ఆమెలో సహజమైన చిలిపితనం కాలేజీ రోజుల్ని గుర్తుకు తెస్తూండగా అతడు నిర్లిప్తతని తాత్కాలికంగా ప్రక్కకు పెట్టి "ఉహూ.... అలా ఏమీవద్దు. పొట్టిగా, అస్థిపంజరంలా, చామన ఛాయగా వుండాలి" అన్నాడు.
ఆమె ఫక్కున నవ్వింది. అతడా నవ్వుని అపురూపంగా చూసుకున్నాడు.
అతడు తననే పరీశీలనగా చూడటం చూసి, నవ్వు ఆపి "ఏమిటిలా కొత్తగా చూస్తున్నావ్?" అంది.
"ఇంకా నువ్వు అప్పటి సిరిచందనలాగే ఉన్నావ్. అసలు ఏమీ మార్పులేదు నీలో" అన్నాడు. |
25,391 |
మొదటిసారి అతను ముద్దు పెట్టుకున్నప్పుడు నేను పొందిన తన్మయత్వం గుర్తొచ్చి నా కంట్లో నీరు తిరిగింది. 'వర్జిన్ కిస్సెస్ ట!' ఎంత గర్వం! "సందీప్... ఎవరు చెప్పారు నీకు నేను వర్జిన్ అని? నువ్వు నన్ను ముట్టుకున్న మొదటి మగవాడివి ఎంతమాత్రంకాదు! అలా అని నువ్వనుకుని ఉంటే ఫూలయ్యావన్నమాట" అని గబగబా క్లాస్ కి వచ్చేశాను. కళ్ళల్లోంచి నీళ్ళు కారిపోతున్నాయి. ఐనా గుండెకి ఎంతో సెవ్వనగా ఉంది. తనే నాకు మొదటివాడే ననుకుంటున్న అతని గర్వాన్ని దెబ్బకొట్టినందుకు నన్ను నేనే అభినందించుకొన్నాను. తను మాత్రం ఎక్స్ పీరియన్స్ గైన్ చెయ్యాలీ, ఆడపిల్ల మాత్రం వర్జిన్ అయి వుండాలీ! ఎంత మేల్ ఈగోయిజమ్!" వెడ్డింగ్ కార్డ్ చూస్తుంటే బాధ రెట్టింపవుతోంది. చిత్రా, వైజూ దగ్గరకొచ్చారు. చిత్ర నా కళ్ళుతుడిచి "వెడ్డింగ్ కార్డు ఇచ్చి పెళ్ళి...అని పిలవగానే యెగురుకొంటూ వెళ్ళిపోతాం అనుకుంటున్నాడు పాపం!" అంది కసిగా. "వెళ్దాం" కొంచెం గట్టిగా అన్నాను. "ఏవంటున్నావ్?" వైజూ ఆశ్చర్యంగా అడిగింది. "వెళ్దామనుకుంటున్నాను" అన్నాను. వాళ్ళిద్దరి కళ్ళల్లో ఆశ్చర్యాన్ని గమనించి చెప్పాను. "ఫ్రెండ్ షిప్ ఈజ్ స్మూతింగ్ ఆఫ్ ది పాత్ వెన్ ది గోయింగ్ బికమ్స్ రఫ్"
* * *
సందీప్ నన్ను పెళ్ళికి ఎందుకు పిలిచాడో అర్థమయింది. నాలాగే చాలామంది అమ్మాయిల్ని పిలిచాడు. పెళ్ళికి వచ్చిన అమ్మాయిల్లో సగం మంది అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ అంటే అతిశయోక్తిలేదు! అతను అదో పెద్ద ఎచీవ్ మెంట్ లా భావిస్తున్నాడనుకుంట! ప్రేమ పెద్ద అందగత్తెకాదు. కానీ అతని ఉద్దేశం ప్రకారం వర్జిన్ అయి వుంటుంది. శీలం...పవిత్రతా... అవి శరీరాల్లోనే ఉంటాయనుకుంటారు చాలామంది మగవాళ్ళు. "అన్నయ్యగారు" అంటూ పరాయిమగవాళ్ళతో గంటలతరబడి మాట్లాడేవాళ్ళనీ, క్రికెట్ స్టార్స్, సినిమా స్టార్స్ ఫోటోలకి ముద్దులు పెట్టే భార్యల్నీ తప్పు పట్టరు. ఎవరయినా పరాయిమగవాడి పక్కసీట్లో భార్య సినిమా హాల్లో కూర్చోవలసి వచ్చినా ఒప్పుకోరు! ఆ మూడు గంటల్లో ఆమె శీలం చెడిపోతుందని అతని భయం. వీళ్ళు మాత్రం బస్సులో పరాయి ఆడవాళ్ళని రాసుకుంటూ ముందు నుండే దిగుతారు! కోటీశ్వరుల ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు ఎంత ఆడంబరంగా జరుగుతాయో తెలిసినట్టయింది. ఒక్కొక్కళ్ళనీ సీల్ చేస్తే అంధ్రప్రదేశ్ మేప్ మొత్తం బంగారంతో నింపి స్వర్ణాంధ్రప్రదేశ్ అని ప్రూవ్ చేయచ్చు! నాకు ఈ మధ్య మరీ పిచ్చి పిచ్చి ఆలోచనలొస్తున్నాయి. సందీప్ మా నాన్నకి అల్లుడైతే అతని పెళ్ళి ఎలా జరిగేదీ...అని ఆలోచించి నవ్వుకున్నాను. చిత్రా, వైజయంతీ వచ్చినవాళ్ళ నగలూ, చీరలూ ఫుల్ ఎంజాయ్ మెంట్ తో చూసి చర్చించుకుంటున్నారు. ఈ జీవితం అనే మ్యూజికల్ చైర్స్ ఆటలో గెలుపు ఎవరిదో చివరివరకు తెలీదు.
* * *
"ప్రతాప్ వాళ్ళ వూరు యెప్పుడు వెళదాం?" అడిగింది వైజయంతి. "ఈ శనివారం కర్నూలు వెళ్తానేమో!" అన్నాను. "ఈ శనివారం మనం ప్రతాప్ వాళ్ళ ఊరువెళదాం. తర్వాతవారం నువ్వు కర్నూలు వెళ్దువుగాని" అంది చిత్ర. నేను అయిష్టంగా మొహం పెట్టాను. "పోనీ టాస్ వేద్దాం... బొమ్మపడితే కర్నూలు... బొరుసుపడితే నిజామాబాదు" అంటూ తన దగ్గరున్న రూపాయి బిళ్ళ తీసింది వైజయంతి. నా భవిష్యత్తు అంతా ఆ బిళ్ళమీదే ఆధారపడి ఉన్నట్లు నేను ఊపిరి బిగబట్టి చూస్తున్నాను. బొమ్మపడాలి... బొమ్మ... బొరుసు పడింది! ఉస్సూరుమన్నాను. వైజయంతి కళ్ళల్లో ఎనలేని మెరుపు! చిత్ర హుషారుగా "ఇంకేం చెప్పొద్దు... మాటంటే మాటే! ప్రయాణానికి సిద్ధమైపో. కావాలంటే నేనొచ్చి మీ అమ్మా నాన్నలతో మాట్లాడతాను" అంది. నేను వైజూ వైపు చూశాను. 'ప్రేమించనట్లు నటిస్తే ఏ బాధ లేదు! ప్రేమిస్తేనే బాధ...' అని ప్రతాప్ కి వీడ్కోలు ఇచ్చి వస్తున్న సందర్భంలో అది అన్న మాటలు గుర్తొచ్చాయి. ప్రేమించడం అంటే... ప్రతిరోజు గంటల తరబడి ఫోన్ లో మాట్లాడుకోవడం. దూరంగా ఉన్నామన్న విరహం అంతా కాయితాల నిండా నింపి పోస్ట్ చేయడం, కలిసి చెయ్యీ చెయ్యీ పట్టుకుని పార్కుల చుట్టూ, సినిమాహాళ్ళ చుట్టూ తిరగడం... ఇవన్నీ కావు! 'ఇట్ ఈజ్ నాట్ ది వర్డ్స్, బట్ ది థాట్ బిహైండ్ దెన్ కీప్స్ ది బాండ్ ఆఫ్ లవ్ స్ట్రాంగ్ అండ్ ట్రూ'. 'అతని ఆలోచననీ నిత్యజీవనాన్ని ఉత్సాహభరితం చెయ్యడమే నిజమైన ప్రేమ!" చిన్నక్క డైరీలో రాసింది అదే. ఆ చంద్ర ఎవరో చాలా దురదృష్టవంతుడు. అంతటి ప్రేమమయిని పోగొట్టుకున్నాడు! ఇప్పుడు అతని ఉనికి కావాలనుకునే ఓ ఆడపిల్లకి దొరక్కుండా దాక్కున్నాడు. నాకు చిన్నప్పటినుంచీ 'దాగుడుమూతలు' అనే ఆటంటే ఇష్టంలేదు. అయినా పెద్దయ్యాక కూడా తప్పడం లేదు. ఎంత కష్టం అయినా ఎక్కడదాక్కున్నా పట్టుకోక తప్పదు. |
25,392 | ఈ జోక్ కి ఎవ్వరూ నవ్వలేదు. కృష్ణని గురించి ఆలోచిస్తున్నారు. అతను జీవితాన్ని ఎంత తేలిగ్గా తీసుకుంటాడు! అతనికి ఒకరంటే భయంలేదు. ఒక పని చెయ్యాలంటే వెరుపులేదు. పైగా రహస్యం అంటూ ఏదీ దాచుకోడు. శివనాథరావు అనుకున్నాడు-ఆ సమయంలో అతనుగాక మరెవరి నోటంటయినా ఈ కథ విన్నట్లయితే తను ఛీ అని చీదరించుకునేవాడు.
చిన్నప్పుడు ఓసారి ఏప్రిల్ ఒకటిన కృష్ణ శివనాథరావు వీపుమీద ఎ.ఎఫ్.అని అచ్చుగుద్దాడు.
అతను కోపంతో అతని ముక్కుమీద గుద్దాడు.
తర్వాత ఏడాదివరకూ యిద్దరూ మాట్లాడుకోలేదు. ఒకరోజు హఠాత్తుగా కృష్ణ మిత్రుడికి ప్రేమలేఖ రాశాడు. అతడ్ని ప్రేమించాడట. అందులో చాలా విరహం వుంది. పొరపాటున-ఏ ఆడపిల్లకైనా రాసింది తనకు పంపించాడేమో అనుకున్నాడు శివనాథరావు. మళ్ళీ యిద్దరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
ఆ రోజునుంచీ కూడా కృష్ణకు అవే బుద్దులు ఎక్కడిదో పాత బైనాక్యులర్ పట్టుకువచ్చి వెనుక బెంచీమీద కూర్చుని ఆడపిల్లల్ని చూసేవాడు. ఒకసారి టీచర్ పసిగట్టి "నువ్వందులోంచి చూసేదేమిటిరా?" అని కుండ బ్రద్దలు కొట్టినట్లు అడిగేశాడు. క్లాసంతా ఘొల్లుమంది.
"ఎవరిని గురించి ఆలోచిస్తున్నావు" అని కృష్ణ కంఠస్వరం వినిపించి శివనాథరావు పరధ్యానంనుంచి కోలుకుని చూశాడు. అతను కొంటెగా నవ్వుతున్నాడు. "నిన్ను గురించే" అని ఎట్లా చెప్పడం?
తరువాత కాసేపటికి పేకాట మొదలుపెట్టారు. ఉషారైన రమ్మీ అది. చంద్రం క్లబ్బుల్లోకూడా ఆడతాడు. మిగతావాళ్ళు తమలోతాము తప్ప బయట ఆడరు. ఇవాళ చంద్రం రెండుమూడు డీల్ షోలు చూపించాడు. మోహనరావు స్నేహితుల బలవంతంవల్ల ఆడతాడే కానీ యింతవరకూ ఎన్నడూ గెలిచిన పాపాన పోలేదు. శివనాథరావు తను ఆడి డ్రాప్ చేసినప్పుడు అతనికి ఆడి పెడుతూండేవాడు....మధ్యలో అలిసిపోయి కాఫీలు కావాలన్నారు. వంటవాడు యింట్లో లేనందున అటువంటి సదుపాయాలేమీ వీలుపడనందుకు చాలా చింతిస్తున్నానని శివనాథరావు తప్పుకున్నాడు.
సరోజిని ఇంతసేపూ ప్రాణాలు బిగబెట్టుకుని పైన కూర్చుంది. ఆమె ఇంతవరకూ స్నానం అదీ ఏమీచేయలేదు. వీళ్ళు ఎంతసేపటికీ కదలరు ఇహ చేసేది లేక మెట్లు దిగి తలవంచుకుని లోపల గదిలోకి వెళ్ళిపోయింది. వచ్చిన స్నేహితులు ముగ్గురూ తలలెత్తి ఆమెకేసి ఆతృతగా చూశారు. మళ్ళీ ఏమీ జరగనట్లు కృత్రిమంగా తలలు వంచుకుని కూర్చున్నారు. కానీ ఎవరో తెలుసుకోవాలని అందరికీ ఆరాటంగానే వుంది. చివరకు కృష్ణ 'ఎవరోయ్" అని అడిగేశాడు.
"మా బంధువు."
ఎవరూ మాట్లాడలేదు.
"ఈ ఉదయం వచ్చారు వాళ్ళు."
ముక్కలు పంచుదామని చంద్రం పేక కలుపుతున్నాడు. కృష్ణ లేచి నిలబడి "ఒరేయ్, మీరంతా లేచి నిలబడండి. నువ్వొద్దు శివాయ్! నువ్వు కూర్చో" అన్నాడు.
చంద్రం, మోహనరావు అర్ధంగాకుండా లేచి నిలబడ్డారు.
"ఓహో!" అన్నాడు చంద్రం నవ్వి మోహనరావుకూడా తల పంకించాడు. వెళ్తున్నామనయినా చెప్పకుండా ముగ్గురూ హడావుడిగా బయటకు వెళ్ళిపోయారు. శివనాథరావుకు అర్ధంకాలేదు. లోపలకు వచ్చాడు.
* * *
"వెళ్ళిపోయారా?" అనడిగింది సరోజిని.
తల ఊపాడు.
"నువ్వు పైకి వెళ్ళికూర్చో. నేను స్నానంచేసి వస్తాను" అన్నది.
సరేనని పైకివచ్చి ఈజీచైర్ లో కూర్చున్నాడు. గోవిందూ, వాసూ ఇంకా రాలేదు. గోవిందు ఈ పూట భోజనంమాట మరిచిపోయినట్లున్నాడు. రాగానే రెండు చివాట్లు వెయ్యాలి.
ఏమీ తోచక లేచివెళ్ళి ఫిడేలు తీశాడు. వసంతరాగంలో అష్టపది ఒకటి వాయించడం మొదలుపెట్టాడు. రెండుమూడు సంవత్సరాల క్రితం ప్రక్కింటి చిన్నపాప డ్యాన్స్ చేస్తోంటే యీ పాత వాయించేవాడు. ఆ రోజుల్లో ఎంతో ఇష్టం యీ పాటంటే అతనికి. ఆ పాప బుల్లిబుల్లి పాదాలు అడుగులు వేస్తూ చిన్న పెదాలు కదిలించి "లలిత, లలిత" అంటూంటే అతనిలో రక్తం కరిగి నీరయేది. అతనిలో రాధ నిలిచి కృష్ణా అని దీనంగా పిలచేది. చిన్నప్పుడు అతనూ నాట్యం నేర్చుకుందామని ప్రయత్నించాడు. కొత్తగా మద్రాసునుండి వచ్చిన నాట్యాచార్యుడు "ఒన్, టూ, త్రీ, ఫోర్" అంటూ ఇరవై ముఫ్ఫైమంది పిల్లలచేత అడుగులు వేయిస్తుంటే అతని హృదయంలో ఇరవై ముఫ్ఫైజతల సున్నితమైన పాదాలు ఎగిరి గంతులువేసేవి ప్రపంచంలో వున్న అన్ని విద్యలూ, కళలూ తనకే కావాలి. సర్వం ఆకళింపు చేసుకోవాలి.
"బావా! ఎంతబాగా వాయిస్తావ్!"
కమాను ఆగింది. తల త్రిప్పి చూడబోయేలోపున కళ్ళముందుకే వచ్చి నిలబడింది.
"నీకూ నేర్పిస్తాను. నేర్చుకుంటావా."
"బాబోయ్! నీకు కోపం ఎక్కువబాబూ! రాకపోతే చెంపలు వాయించేస్తావ్."
"మహా నేనంటే నీకు భయం వున్నట్టు" అని కదిపాడు.
"లేదా మరి?"
ఈ కంఠస్వరం చాలా ఆహ్లాదం కలిగించి ఆమె నేత్రద్వయంలోకి సూటిగా చూశాడు. అంతపెద్ద చక్రాలలాంటి .....సిగ్గుపడి, తలవంచుకుని తనలో తాను నవ్వుకుంటోంది.
"సరోజినీ! తల ఎత్తు"
అతనికి తనివి తీరలేదు "ఊఁ ఎత్తు" అన్నాడు.
పాపం తప్పనిసరిగా తల ఎత్తి చూసింది. విశాలమూ, విప్పారితమూ స్నిగ్ధమూ, స్విన్నమూ అయిన ఆ నాయన రవళిలోని తేజోకాంతులు యధాతథంగా కుంచెతో చిత్రించాలంటే ఎంత తపస్సు చేయాలి! అసలే అప్పుడు స్నానంచేసి వచ్చి, యింకా జడల్ని వేసుకోకుండా జుట్టు ఒదులుగా వదిలేసి, మృదు సుగందంలాంటి పరిమళంతో సరోజిని హాయిహాయి అనిపిస్తోంది.
అవి అరమోడ్పు కన్నులు అతను ముందుకు నడుస్తున్నాడన్న సంగతి స్ఫురించలేదు. అడుగులు తడబడుతున్నాయి. దూరం సంకోచంతో ముడుచుకుంది. అబ్బ! మనిషికీ, మనిషికీ ఎంత దగ్గర? అందమైన ఆ కనురెప్పల కదలికతో అతని ప్రతిబింబం పదిసార్లు మూసుకుని తెరుచుకుంటోంది. నిన్నటి గాలివాన తాలూకు మెరుపు ఒకటి అతని హృదయాంబరంలో మెత్తగా మెరిసింది. మేఘం విడివడి ఓ చుక్క కనిపించీ కనిపించనట్లుగా తృటికాలం మిలమిలలాడి అదృశ్యమైంది. అవి రెప్పలు, ఇవి రెప్పలు.....రెండూ స్ప్రుశించుకుంటున్నాయి. అది వణుకుతూన్న చెయ్యి-ఆమె భుజంమీద పడింది. క్షణంలో చీకటితెరలు చిరిగాయి. అతను వెనక్కి జరిగి కళ్ళు మూసుకున్నాడు.
అడుగుల చప్పుడు దూరమై క్రమంగా వినిపించడం మానేసింది. నెమ్మదిగా కళ్ళువిప్పాడు. తడిగా వున్నాయి. ఎవరిదీ తడి? స్త్రీ నయనాలు ఎప్పుడూ నీరు కారుస్తూనే వుంటాయా? అవేమిటో చెప్పాయే, తనెందుకు వినలేదు?
గోవిందు పైకి వచ్చాడు ఓ అరగంట గడిచాక.
"బాబూ".
"భలేవాడివే చుట్టాలుకూడా వచ్చారు కదా....తిండీ తిప్పలూ అక్కరలేదనుకున్నావా?" అన్నాడు కోపంతో.
అతను వినయంగా "ఏం చెయ్యను బాబూ! అలా వీరయ్య యింటికి వెళ్లాం. పాపం చాలా దురదృష్టం" అని నిట్టూర్చాడు.
"ఏం జరిగింది?"
వీరయ్య వాళ్ళింట్లో నౌఖరు.
"వాడి యిల్లు కూలిపోయింది. భార్యాబిడ్డలతో తిండీతిప్పలూ లేకుండా ఏడుస్తూ కూర్చున్నాడు."
"తీసుకురాలేకపోయావా?"
"తీసుకొచ్చాను బాబూ క్రింద వున్నాడు."
అతను గబగబ మెట్లుదిగి క్రిందకు వచ్చాడు. ఈ ముందుగదిలో వీరయ్య దిగాలుపడి గోడకు ఆనుకుని నిలబడి వున్నాడు.
"ఏం వీరయ్యా, ఇల్లు కూలిపోయిందా?"
పనివాడు ఏదో చెప్పబోయాడు. ఒకటిరెండు మాటలు అస్పష్టంగా వెలువడి గొంతు పూడుకుపోయింది. పైగుడ్డతో కళ్ళు వొత్తుకున్నాడు.
"దిగులుపడకు వీరయ్యా! ఏం జరిగిందో చెప్పు."
"అదికాదండీ మొన్న పాతిక రూపాయలు పెట్టి యిల్లు నేయించానండీ కర్రలు పాతవైనా యింకా కొంతకాలం పనికి వస్తాయని అలాగే వుంచాను. నిన్నటి గాలివాన దెబ్బకు అంతా నాశనమైపోయిందండీ. మా యింటిది నెలల్తో వుంది." |
25,393 |
కొంతమంది "పెద్దగా సమస్యలు తీరకపోయినా ఈ మాత్రం సాగిపోతున్నామంటే ఆయన చలవే" అంటుంటారు.
ఈ మాత్రం సాగిపోవటానికి అయన చలవ దేనికి? ఈ మాత్రం బతుకు బతకటానికి ఎవరి అనుగ్రహమూ అక్కర్లేదు. వాటిదారిన అవి జరిగిపోతూ వుంటాయి.
పోనీ వాళ్ళు సామాన్య ప్రజానీకానికి అందుబాటులో వుంటున్నారా?
ప్రేమతత్వాన్ని గురించి ఇన్ని కబుర్లుచెప్పే ఈ "దేవుళ్ళు" ఎప్పుడోగాని దర్సనమివ్వరు. ఇచ్చినా వారి అంతరంగిక శిష్యులతో తప్ప ఎంతో ఆశతో, వందల మైళ్ళ దూరంనుంచీ ప్రయాసపడి వచ్చిన భక్తులతో మాట్లాడరు. క్రమశిక్షణ పేరిట అక్కడి రూల్స్ చాలా కఠినంగా వుంటాయి. డబ్బు ఖర్చుపెడితే దర్శనం కొంత సులువుగా దొరుకుతూ వుంటుంది.
ఇమేజ్ సృష్టించుకోవటం... ఇదంతా దేనికి?
డబ్బు సంపాదన కోసమా?
కొందరు డబ్బు సంపాదించటం కోసం కొందరు కీర్తికండూతి కోసం.
కొందరు గ్లామర్ సృష్టించుకోవటం కోసం.
కొందరు ఓ ఉన్నతవ్యక్తిగా చలామణీ అవ్వటం కోసం.
కొందరు 'తాము' నిజంగా దేవుళ్ళమే అన్న ఆత్మవంచనతో కూడిన భావనతో.
ఇలా ఎన్నో కారణాలుంటాయి.
మొదట... ఏదో ఓ కారణంతో మొదలై, తర్వాత అన్ని జాడ్యాలూ అలుముకుని కలగాపులగంగా తయారవుతుంది.
వాళ్ళ ఉనికిని పటిష్టం చేసుకోటానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతుంటాయి.
వాళ్ళనేమన్నా సహించలేని వీరభక్తులు తయారవుతూ వుంటారు.
ఆ వీరభక్తులు ఇతర సాదాసీదా భక్తులను శాసిస్తూ వుంటారు.
సమాజంలో ఆ ధర్మానికో వర్గం, ఓ ఉనికీ, ఓ ఫాలోయింగ్, దాని నిర్వహణకు కొన్నినిధులూ... ఇలా సాగిపోతూ వుంటుంది.
పాపం, భక్తులు అయోమయస్థితిలో పడి తమను తాము పోగొట్టుకుంటూ, అనుక్షణం ఆత్మవంచనకు గురవుతూ, నిరర్ధకజీవుల్లా, నిస్సహాయులైన బానిసల్లా తయారవుతుంటారు.
ఒక్కోసారి నాలో ఆవేశం పెల్లుబుకుతుంటుంది.
ఈ మానవదేవుళ్ళను చూస్తే ఇలా అడగాలనిపిస్తుంది.
దేవుడు లేడనకుండా దేవుడు వున్నాడన్న మంచినమ్మకంతో వుండటమే ఈ మనుషులు చేసిన పాపమా?
పాపం ఈ దుర్భలులు ఏ పాపం చేశారని వాళ్ళమీద ఈ దండయాత్రలు?
ఏ అదృశ్యశక్తీనో నమ్ముకుంటూ....భజనలు చేసుకుంటూం పాటలు పాడుకుంటూ, పూజలు చేసుకుంటూ, హోమాలు చేసుకుంటూ వాళ్ళ దారిన వాళ్ళు బతుకుతున్నారు.
మధ్యలో వున్నట్టుండి "నేనున్నాను" నాటో చొరబడి నువ్వు వాళ్ళకు ఏమీ చెయ్యక, ఏమీ చెయ్యలేక, యాదృచ్చికంగా జరిగిందానికి 'నేనే చేశాను' అని ఫోజులిస్తూ జరగని దానికి "కర్మసిద్దాంతం, భక్తిలేదు, పరివర్తన రాలేదు" అని సవాలక్ష కారణాలు చూపుతూ...
నీ ఇమేజ్ కి భంగం రాకుండా,
నీ చుట్టూ బానిసలను తయారుచేసుకుంటూ,
నీకు లేని శక్తిని వున్నట్టు చాటుకుంటూ,
మిధ్యను 'నిజం'గా భ్రమింపచేస్తున్నావే...
నీకు సిగ్గనిపించటం లేదా? నీకు బాధనిపించటంలేదా?
నిన్ను చూస్తే నీకసహ్యం వేయటంలేదా?
నీలో ఎంత వికృతమైన కఠినత్వం?
సామాన్యభక్తునిలో వుండే స్పందన కూడా నీలో లేదే...!
సామాన్యభక్తునిలో వున్న ప్రేమతత్వం కూడా నీలో కనిపించటంలేదే....!
ఈ ఆధ్యాత్మిక కవచంలో ఎంత రక్షణ పొందుతున్నావు?
ఇంతమందిని ఇబ్బంది పెడుతున్న నిన్ను నీవు ఎలా భరిస్తున్నావు?
ఇంత గౌరవం పొందుతున్నావే! దానికి నీలో ఏ అర్హతలున్నాయి చెప్పు?
ఆ రాత్రి మణికుమారి నా మనసులో మెదులుతూంటే ఇన్ని ఆక్రోశాలు నాలో ప్రవహిస్తున్నాయి.
ఆమె ఏమైంది? జబ్బునుంచి తప్పించుకుందా? మృత్యువు నుంచి తప్పించు కుందా?
"దేవుడిలో ఐక్యమైపోయింది. దేవుడిలో ఐక్యమైపోయింది" అంటూ భక్తులు గర్వంగా విర్రవీగుతున్నారు.
అయినా కర్మలు చేస్తున్నారు. తద్దినాలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు.
దానికీ, దీనికి సంబంధం లేదంటున్నారు.
ఇక్కడెక్కడుంది మణికుమారి? అందరు మృతులలాగే నిజం చెప్పని, చెప్పలేని స్థానంలోకి వెళ్ళిపోయింది.
ఎన్నటికీ తేలని నిజాలు!
ఇక్కడ ఇంకో ప్రశ్న ఎదురవుతోంది. మనుషులు చాలా సమస్యల్లో చిక్కుకుని వుంటారు. ఈ కనిపించని దేవుళ్ళను కొలుస్తున్నా... చాలటంలేదు. ఊరట లభించటం లేదు. తోడు దొరకటం లేదు.
దుఃఖం తీరటంలేదు.
వారికి రిలీఫ్ దొరకటంలేదు.
అందుకని... "ఎక్కడన్నా... ఏమన్నా చేయూత దొరుకుతుందేమోనని వెదుక్కుంటున్నాం తప్పా?"
తప్పులేదు.
కాని ఒక సమస్యనుంచి ఇంకో సమస్యలోకి కాలుపెట్టే విషమపరిస్థితిలో మీరు చిక్కుకోకూడదు.
మీ నమ్మకం చాలా విలువైనదిగా వుండాలి. మీ నమ్మకాన్ని మీరు కించపరుచుకునే స్థాయిలోకి దిగజారకూడదు.
మీకో వ్యక్తిత్వముంది. దాన్ని మీరు చంపేసుకోకూడదు. మీ వ్యక్తిత్వమే మీకు రక్ష.
చాలా విషయాల్లో మీరు నిశితంగా ఆలోచించగలుగుతున్నారు. ఒక 'మాయ'లోకి అడుగుపెట్టేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించే అవసరం మీకు లేదా?
"సర్వస్య శరణాగతి' అంటే మీరు వినయంగా మేవే ఔన్నత్యాన్ని సమర్పించటం కాని వ్యక్తిత్వాన్ని కాదు.
ఒక ధర్మాన్ని మీరు గౌరవించాలి.
కాని ఆ ధర్మానికి బానిస కాకూడదు.
గౌరవించటానికీ, బానిస కాకుండా వుండటానికీ గల తేడా దయుంచి అర్ధం చేసుకోండి. |
25,394 |
తారురోడ్డు నీళ్ళోసుకున్న కొండజాతి పిల్లలా మెరిసిపోతోంది. దూరంగా ఓ రైలు ప్రియుడికోసం పరుగులు పెడుతున్న కన్నెపిల్లలా రయ్యిన సాగిపోతోంది. నల్లని కొండమీద తెల్లగా మెరుస్తూ కనిపిస్తున్న కాలిబాట సరసుల్ని తన వెంట లాక్కుపోతున్న నెరజాణలా వుంది.
ఈదురుగాలి పాట చెవిలోంచి గుండె లోతుల్లోకి దూరి వేడి సెగలు పుట్టిస్తోంది. ప్రకృతంతా స్త్రీత్వం సింగారించుకున్నట్లుగా అనిపిస్తోంది.
జయచంద్ర తల విదిలించి ఆమెను తన భుజంమీద నుండి జరిపి ప్రక్కన కూర్చోబెట్టాలనుకున్నాడు.
అతని ప్రయత్నం పూర్తవకుండానే ఆమె చెయ్యి అతని మెడ చుట్టూ పడింది.
మెత్తని పూలచెండు అయాచితంగా వచ్చి తన కంఠసీమని అలంకరించి నట్లుగా అనిపించింది అతనికి. ఆమె పాలమీగడలాంటి కపోలాలు అతని గరకు చెంపలకు మెత్తని రాపిడి పుట్టిస్తున్నాయి.
అతని ఎడమచేయి అప్రయత్నంగా ఆమెను పొదివిపట్టుకుంది.
* * *
"ఇన్ని రోజులు నాకు దూరంగా వుండి వచ్చాక నాతో ఇలాగేనా మాట్లాడడం?"
నేను స్నానం చేసి తల పిడప పెట్టుకుంటే "ప్లైన్ లో ఎయిర్ హోస్టెస్ ఇలాగే కొప్పు వేసుకుంది.....చాలా అందంగా వుంది" అన్నావు.
నేను పసుపుపచ్చ చీర కట్టుకుంటే "అక్కడ హోటల్లో రిసెప్షనిస్టు ఇలాంటి ఫ్రాక్ వేసుకునే నాకు సైగచేసింది" అన్నావు.
నేను ఆపిల్ పండు కోసి పెడుతుంటే "అక్కడ అమ్మాయిల బుగ్గలు ఇంత ఎర్రగా వుంటాయి" అన్నావు.
నా తలలోని సన్నజాజుల పరిమళం చూసి "అక్కడ నాకు పరిచయమైన నా గర్ల్ ఫ్రెండ్ పెర్ ఫ్యూమ్ వాడింది" అన్నావు.
నా పొత్తికడుపుమీద తల ఆన్చి ముద్దు పెట్టుకుంటూ "అక్కడ నాకు పిఏగా పనిచేసిన అమ్మాయి నన్ను తన ఇంటికి పిల్చి ఇలాంటి ఐస్ క్రీమ్ పెట్టింది" అన్నావు.
"పిచ్చి! నువ్వు నాకు అనుక్షణం గుర్తొచ్చావు అని చెప్పడానికి ఇదా పద్దతి? ఎప్పుడు నేర్చుకుంటావు మాట్లాడటం?"
డైరీ మూసి చిన్నగా నవ్వుకుంది కాంచన. గతించిన స్మృతులని సజీవంగా కళ్ళముందర నిలిపేది 'డైరీ' ఆ అనుభూతులని నెమరువేసుకోవడం అంటే మళ్ళీ గడిచిన జీవితాన్ని అనుభవించడమే!
ఎప్పుడూ అమ్మ కొంగు వదలకుండా తిరిగే పసిపిల్లాడిలాంటి భర్తని చూస్తే ఆమెకు చాలా తృప్తి, ఆనందం, జాలి, బాధ, దుఃఖం.
గడియారం పదిగంటలు కొట్టింది.
"ఎందుకంత ఆలస్యం అయిందబ్బా?" అనుకుంది.
'చీకటి గుహ నీవు, చింతల చెలి నీవు, కోర్కెల సెలవీవు, ఊడల ఉయ్యాలనే మనసా! తెగిన పతంగానివే' అన్న పాత లీలగా మనసులో మెదిలింది. అవును! ఇంటికొచ్చి మాత్రం ఏం చెయ్యాలి" ఆమె మనసు బాధగా మూలిగింది. తన మంచంమీద ఓ పక్కనంతా ఖాళీగా వుంది తన మనసులాగే!
అతను ఇంటికొస్తాడు తను మంచంమీద పడుకునే వుంటుంది.
అతను దగ్గరకొస్తాడు.
ఆమె కళ్ళు తెరుస్తుంది.
"మందు వేసుకున్నావా?" అని అడుగుతాడు.
తను తల వూపుతుంది.
"భోజనం చేసారా?" అంటుంది.
"లేదు. చేస్తాను నువ్వు పడుకో" అంటాడు.
అతను ముందుకు వంగుతాడు.
తను కళ్ళు మూసుకుని అతని పెదవుల స్పర్శకై ఎదురు చూస్తుంటుంది.
అతని పెదవులకి తన కనురెప్పల తడి అంటుకుంటుంది.
తన తలమీద అతనిచెయ్యి మృదువుగా కదులుతోంది. అతని స్పర్శకై తనలో ప్రకంపనలు మొదలవుతాయి. అతనిలోని అలజడి తనకి అతని వేళ్ళ కదలికద్వారా అర్ధం అవుతుంది.
"కాంచీ" అతను ముందుకి ఒరుగుతాడు.
తన పెదవులు విచ్చుకుంటాయి. అతని వీపు మీద తన చేతివేళ్ళు బిగుసుకుంటాయి. అతని ముద్దులతో తన ముఖం అంతా తడిసిపోతుంది. భరించలేని ఆనందం కలుగుతుంది. ఆ ఆనందాన్ని పట్టలేని గుండె తన పారవశ్యాన్ని తెలియజేస్తుంది.
సన్నగా మొదలైన నొప్పి తన విశ్వరూపాన్ని చూపిస్తుంది. తన చేతివేళ్ళ బిగువు సడలుతోంది. కళ్ళు బాధతో అరమోడ్పులౌతాయి.
"కాంచనా....కాంచీ" అతను గాభరాగా పిలుస్తాడు.
"ఏవండీ....' తను మాట పూర్తి చేయలేకపోతుంది.
అతను హడావుడిగా ఫోన్ దగ్గరకు పరిగెత్తుతాడు.
డాక్టర్ వచ్చి వెళ్ళిన తరువాత చాలా తప్పు చేసినట్లు తల వాల్చుకుని సిగ్గుపడుతూ "ఐయామ్ సారీ కాంచీ...." అంటాడు. అక్కడినుండి వ్యాకుల మనస్కుడై అసంతృప్తుడై వడివడిగా తన గదిలోకి వెళ్ళిపోతాడు.
ఇంతకన్నా నరకం ఏముంటుంది భార్యకు?
కాంచన కన్నీటితో దిండు తడిసిపోతోంది.
"ఏంచేస్తున్నారో?" దిగులుగా అనుకుంది.
* * *
జయచంద్రకి రోడ్డు కనిపించడంలేదు. శరీరం సన్నగా కంపించసాగింది. మనసు మాట అది వినడం మానేసింది.
అతని ప్రమేయం లేకుండానే కారు ఆగిపోయింది.
నెమ్మదిగా ఆమెని చేతుల్లోకి తీసుకున్నాడు.
అరవిచ్చిన ఆమె పెదాలు స్వాగత గీతాలు పలుకుతున్నాయి.
ఆమె శరీరం వేడిగా కాల్తోంది.
అతను ఠకీమని చేతిని తీసేసుకున్నాడు.
ఆమె అదురుతున్న పెదవులతో సన్నగా "దాహం....దాహం.....అంది.
జయచంద్ర వాటర్ బాటిల్ అందుకుని నోట్లో కొద్దిగా నీళ్ళు పోశాడు.
ఆమె నెమ్మదిగా గుటక వేసింది. కంఠంలో నుండి ఆ నీటిచుక్క దిగడం కనిపిస్తుందా అన్నంత పలుచగా వుంది పచ్చని ఆమె కంఠసీమ.
ఆమెనే నిశితంగా చూడసాగాడు. ముడుచుకుని పడుకున్న అద్భుతమైన పుస్తకంలా వుంది. తెరచి చూడడానికి అతనికి కొద్దిగా జంకు కలిగింది.
అందాన్ని భరించడం తేలికైన పనికాదు. కోహినూర్ వజ్రాన్ని ఇంట్లో పెట్టుకుని గుండెలమీద చెయ్యి వేసుకుని పడుకోవడం సాధ్యమా? |
25,395 |
"ప్రపంచంలో ఫిబ్రవరి పధ్నాలుగుని వాలంటీన్స్ డే లేదా ప్రేమికుల దినం అంటారు. ఆ పేరెలా వచ్చింది?" అదోలాంటి అసహనంతో "క్రీ.శ. మూడవ శతాబ్దంలో రోమన్ సామ్రాజ్యాన్ని రెండవ క్లాడియస్ అనే రాజు పాలించేవాడు. చాలా క్రూర స్వబావంగల క్లాడియస్ తన సైనికులు ప్రేమించడాలు, పెళ్లి చేసుకోడాలు వంటి బంధాలకి దూరంగా వుండకపోతే దేశ రక్షణ కష్టమని శాసనం విధించాడు. ఇది దారుణం అంటూ వాలెంటీన్స్ అనే తత్వవేత్త ప్రభుత్వానికి ఎదురు తిరిగి ప్రేమతత్వాన్ని బోధించడం ప్రారంభించగానే వాలెంటీన్స్ ని ఉరితీశాడు. అతని పేరుమీద మొదలైందే వాలెంటీన్స్ డే." "ఒక మగాడు ఆరునెలల కాలంలో ప్రపంచ జనాభాని సృష్టించగలడు. తండ్రిగా అటంటుంది మీ మోడరన్ సైన్స్ వివరంగా చెప్పగలరా?" రుత్వి అవాక్కయి చూస్తున్నాడు. క్షతగాత్రుడైన సైనికుడిలా. సరిగ్గా అప్పుడే బజర్ మోగింది టైం అయిపోయినట్లుగా ముందు రియాక్టయింది విజూష. మరో రెండు ప్రశ్నలకి జవాబు చెప్పి వుంటే... లేదు.... ఆ మాత్రం వ్వవధి వుంటే ఖచ్చితంగా రుత్వి గెలిచేవాడే. కానీ..... క్విజ్ మాస్టర్ రుత్విని రేపిడ్ ఫైర్ రౌండ్ లో అడిగింది క్లుప్తంగా జవాబిచ్చే అవకాశంలేని ప్రశ్నలు. ఎందుకలా జరిగినాగానీ రుత్వి ఓటమికోసం చాలా పకడ్బందీగా చేసిన ప్రణాళికలా అనిపించింది. క్విజ్ మాస్టర్ ఆదేశంపై ఫైనల్ స్కోర్ తెలియజేయడానికి సునంద సంసిద్దురాలవుతుండగా రుత్వి తన సీటుపైనుంచి లేచాడు నిర్లిప్తంగా. ఇంచుమించు డయాస్ దిగి ఇక వెళ్లిపోయేవాడే. "మిస్టర్ రుత్వి!" క్విజ్ మాస్టర్ అన్నాడు "ఫలితాన్ని ఇంకా అనౌన్స్ చేయలేదు." "అయినాగానీ మధ్యలో అలా వెళ్ళడం సభ్యతనిపించుకోదు" క్విజ్ మాస్టర్ కోపంగా అన్నాడు. "పోటీ అన్నాక కొన్ని నియమ నిబంధనలుంటాయి." "ఖచ్చితంగా నేనూ అదే విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను తిరుగుబాటు చేస్తున్నట్టుగాకాక చాలా సాత్వికంగా చెప్పాడు రుత్వి. "రేపిడ్ ఫైర్ రౌండ్ లో ప్రత్యేకించి నా మీదనే అలాంటి ప్రశ్నలని ఎందుకు సంధించారూ అని నేను అడగడంలేదు. కానీ కొన్ని ప్రశ్నలకి మీకే సరైన జవాబులు తేలీదని తెలిసినందుకు బాధపడుతున్నాను." "వాట్ డూ యూ మీన్?" రాష్ట్రస్థాయిలో చాలా క్విజ్ మాస్టర్ గా వ్యవహరించిన క్విజ్ మాస్టర్ సుందరం ఆవేశంగా ఏదో అనబోతుండగా హఠాత్తుగా టెలి ప్రసారం ఆగింది. ఇంతసేపూ చూసింది "లైవ్ టెలికాస్ట్" ఆయన క్విజ్ కాంపిటీషన్ గా అప్పటికి తెలుసుకున్న విజూష ఆశ్చర్యపోతుంటే స్క్రీన్ పైకి ఓ లేడి అనౌన్సర్ వచ్చింది. "అనివార్య కారణాల మూలంగా ప్రసారం నిలిపివేస్తున్నందుకు చింతిస్తున్నాం. క్విజ్ కాంపిటీషన్ వివరాలను సాధ్యమయినంత త్వరలో తెలియజేస్తాం." ఆ తర్వాత అనౌన్సర్ అదృశ్యమయ్యి సినిమా పాటలు మొదలయ్యాయి. రాష్ట్ర హ్యూమన్ రిసోర్సస్ మేనేజ్ మెంట్ విభాగం ఓ ప్రైవేట్ టెలిఛానల్ ద్వారా నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీ ఫైనల్స్ అలా ముగిసిపోవడంతో విజూష అదో గుర్తొచ్చినట్టు పక్కకి చూసింది. సశ్య లేదక్కడ.
రుత్వి ఓడినట్టు తెలుసుకున్న సశ్య అతడ్ని తను శాశ్వతంగా గెలుచుకున్నట్టు చెప్పడానికి ఉత్సాహంగా బయలుదేరింది. ఇలాంటి ఆలోచన రావడం విజూషకి నచ్చలేదు. కానీ....... అలా అనుకోకుండా వుండలేకపోయింది. ఎందుకలా జరుగుతున్నది ఆమెకి తెలీదు. ఆలోచన అలలపై అసంకల్పితంగా ఏ అక్షరాలలో అచ్చవుతున్నట్టు రుత్వి గురించి అయిష్టంగాగానీ ఇష్టంగాగానీ అదోలాంటి మధనానికి గురవుతూందామె. మొన్నెప్పుడో కలలో కనిపించిన వ్యక్తి వాస్తవంలో తారసిల్లి దూరాన్ని దృశ్యంగా మలిచి అంబరానికి వున్న బంధాన్ని అందంగా వ్యక్తం చేసి ఆమెకంటే ఇంటి చూరుల్లో చిక్కుకున్న స్వప్నాల రేఖల్ని కనుపాపల కాపలాతో మనసుదాకా మోసుకువెలుతుంటే వున్నట్టుండి పైకి లేచింది విజూష. "రవీంధ్రభారతికి వెళదామా?"అంది స్పూర్తి ఠక్కున. తనకే అందని ఆలోచనలకి ఆకృతిని గీస్తున్నట్టు స్పూర్తి మృదు మందహాసంతో మాటాడుతుంటే బిడియంగా వుంది విజూషకి. అదొక్కటే కాదు.... అహం కూడా బుసకొట్టింది. అంతే - "అక్కడికి దేనికి?" అనేసింది. విజూష మనోభావాల్ని చదివినాగానీ "నీకు వెళ్లాలని వుంది కాబట్టి" అనలేదు స్పూర్తి. "ఇప్పుడు జరిగింది స్టేట్ లెవెల్ క్విజ్ కాంపిటీషన్ విజ్జూ! దీని తర్వాత సౌత్ జోన్ పోటీలు. ఆ తర్వాత జాతీయస్థాయి పోటీలు నిర్వహించబడాలి అంటే పోటూ ఫలితాలు అనౌన్స్ చేయాలి. పైగా స్టేట్ హ్యూమన్ రిసోర్సస్ వాళ్లు పత్రికా విలేఖరులని పోటీ ఆహ్వానించి వుంటారుగా. రుత్వి అంత ఘాటయిన అభియోగం మోపేక వూరుకోరుగా అయినా రుత్వి అలా అనాల్సింది కాదు." స్పూర్తి వాక్యాలు ఇంకా పూర్తికానేలేదు. |
25,396 | 1947లోని స్వాతంత్ర్య సంబరాలు, ఆయన ఎంతోకాలం అనుభవించలేదు. స్వార్ధపరులై కుటిల రాజకీయాలవైపు మొగ్గు చూపుతున్న రాజకీయ నాయకులపై విరుచుకుపడసాగారు. ఏప్రిల్ 8న, 1950వ సంవత్సరంలో పెద్దకూతురు సావిత్రి వివాహం శేషగిరితో జరిపించాడు.
1950 సెప్టెంబర్ 13న మహబూబ్ కాలేజీ వ్యవస్థాపకులు పిలువగా హైద్రాబాదు కుటుంబంతో సహా వచ్చి ఆ రాత్రి తుల్జాభవన్ లో దిగారు.
తరువాత మిత్రులు భీమశంకరం గారింట్లో, కాచిగూడాలో కాపురం పెట్టారు. అక్కడే అక్టోబర్ 13న రెండో కుమార్తె శ్రీదేవి వివాహం నరసింహరావుతో జరిపించారు.
హైద్రాబాదులో డాక్టర్ మేల్కోటేతోటీ, డాక్టర్ జయసూర్య (సరోజినీ నాయుడు కుమారుడి) తోటీ చాలా స్నేహం ఏర్పడింది.
జయసూర్య ఫ్యామిలీ డాక్టర్ గా వ్యవహరిస్తూండేవాడు.
డాక్టర్ మేల్కోటేతో కలిసి "సప్రెస్స్డ్ డ్ గవర్నమెంట్ కంప్లైంట్స్" అనే ఆఫీసు పెట్టారు. అందులో గవర్నమెంటుచేత అణగత్రొక్కబడిన కంప్లైంట్సు తిరగతోడించి, వాదించి, న్యాయం చేకూర్చడమే తమ పనిగా పెట్టుకున్నారు.
గవర్నమెంటు ఆయన్ని 'కమ్యూనిస్టు'గా అభియోగీస్తూ అరెస్టు చేసింది. చంచలగూడా జైలులో పెట్టారు. డా|| మేల్కోటే, శ్రీహరిరావుని విడుదల చేయించాల్సిందంటూ, నెహ్రూగారికి ఓ లేఖ ద్వారా తెలియబర్చారు.
నెహ్రూగారు, "శ్రీహరిరావు నాకు చిరకాలంనుండీ తెలుసు! అతను కమ్యూనిస్టుకాడు. మంచి దేశభక్తుడు కావున వెంటనే విడుదల చేయవల్సింది" అంటూ ఆర్డరు పంపారు. రిలీజయిన వెంటనే ఆంధ్రాలో ఏదో కేసు అటెండవలేదని ఆంధ్రాకి తీసుకెళ్ళారు.
1956, ఏప్రిల్ 16న సత్యవతి పెళ్ళికి ముహూర్తం పెట్టుకున్నారు. అంకరాజు ఆనందభూషణరావుతో ఆమెకి వివాహం నిశ్చయించారు.
అశ్వారావు పేట జమీందారు, పెళ్ళికి సరిపడా సరుకులిచ్చి పంపుతూవుండగా, నల్లగోండలో ఏదో పాతకేసు తవ్వి, అరెస్టు చేసారు. లాఠీ డ్రైవర్ చేతికి ఓ చీటీ రాసిచ్చి, సామాన్లు ఇంట్లో అందచెయ్యమని చెప్పి అరెస్టయి వెళ్ళిపోయారు.
పెళ్ళివారు తరలి వచ్చారు. పెళ్ళికూతురి తండ్రి జాడలేదు. రమణమ్మ కాలుగాలిన పిల్లిలా తిరుగుతూ భర్త కోసం ఎదురుచూడసాగింది.
భర్త రాలేదు! కానీ అతని అరెస్టు వార్త అదింది. ఆమెకిది మామూలే! కానీ, ఆమె తల్లీ, చెల్లీ ఊర్కోలేదు! "మగపెళ్ళివారికి ఏమి చెప్తావు? వెళ్ళి విడిపించి తీసుకొద్దాము" అన్నారు. చెల్లెలి భర్త శేషగిరి వెంటనే భార్య మెడలోని చంద్రహారం తీసి ఇస్తూ, "వదినా బయల్దేరు, ఆలశ్యం చెయ్యకు" అన్నాడు.
"గవర్నరుగారు ఆయనకి ప్రాణస్నేహితులు. ఏ పుట్టలో ఏ పాముందో వెళ్ళి, ఒక్కసారి ప్రయత్నిస్తాను" అంటూ తల్లిని తీసుకుని, బూర్గుల రామకృష్ణారావుగారి దగ్గరికి వెళ్ళింది రమణమ్మ.
బూర్గుల రామకృష్ణారావుగారు ఎంతో ఆనందంగా ఆమెని ఆహ్వానించి, సానుభూతిగా పరిస్థితిని అర్ధం చేసుకున్నారు. చివరిగా ఇలా అన్నారు. "చూడమ్మా! నీ భర్తని సామాన్య మానవుడికుండాల్సిన ధైర్య సాహసాలు కావు. తప్పులు చేస్తున్న ప్రతి గవర్నమెంటు ఆఫీసర్ని నడిరోడ్డుమీద నిలబెట్టి కాల్చేయాలంటాడు. జంకూ, గొంకూ లేదు. గవర్నమెంటు ఎలా విడుదల చేస్తుంది? ఒకవేళ నేను విడుదల చేయించినా ఎంతకాలం బయట వుంటాడూ" అని జాలిపడ్డారు. ఆ తరువాత విడుదల చేయించారు.
కూతురి పెళ్లవగానే మళ్ళీ ఆంధ్రాలో ఏదో కేసుందని తీసుకెళ్ళి పోయారు.
శ్రీహరిరావు అలా జీవితంలో చాలాభాగం జైళ్ళలోనూ, తక్కువ భాగం తన వాళ్ళతోనూ గడుపుతూ వచ్చారు.
* * * *
1958వ సంవత్సరంలో.....
అవి ఆవకాయ పెట్టుకునే రోజులు.
"రమణా! నేను అర్జెంటుగా పర్వతనేని వెంకటరత్నం అనే స్నేహితుడ్ని కలవాలి! గుడివాడెళ్తున్నాను" అన్నారు.
"బాగానే వుంది! ఓపక్క కారాలవీ కొట్టించి ఊరగాయలకి సిద్దం చేస్తుంటే, కాయ తీసుకురాకుండా ఈ అర్ధాంతరపు ప్రయాణమేమిటండీ?" అందామె.
"మనవైపునుండి మంచి కాయ తెస్తానుగా! చూస్తూ వుండు!" అని చెప్పి, రెండో కూతురి కొడుకూ, మూడో కూతురి కొడుకూ బైట చాపమీద పడుకున్నారు. ఏడాదిలోపు పిల్లలు, వారిని ముద్దాడి వెళ్ళిపోయారు. వాళ్ళపేర్లు హనుమంతు, మురళీ.
పెద్దకూతురికి ఒక కొడుకు పుట్టి ఏడాది పెరిగి చనిపోయాడు. వాడు 'దాహోత్రుడని' వాడిమీద అలవికాని మమకారం పెంచుకున్న మనిషి కాస్తా, వాడు పోవడంతో చాలా క్రుంగిపోయారు. అప్పటినుండీ పిల్లల్ని దగ్గరికి తీయాలన్నా, ముద్దుచెయ్యాలన్నా భయపడిపోయేవారు! చాలారోజులకి పిల్లల్ని ముద్దాడి వెళ్ళిపోయారు.
* * * *
మే 25th, 1958.
నూజెళ్ళఫ్లాట్ ఫారమ్ మీద కాలుమోపారు. గుండెల్లో కాస్త నొప్పిగా అనిపించింది. పెద్దగా పట్టించుకోలేదు. అతనితో కలిసి అప్పటి దాకా ప్రయాణంచేసిన స్నేహితుడు సీతంరాజు రామారావుగారు గుడివాడలో దిగిపోయారు.
ఒక మూల బెంచీమీద నడుం వాల్చారు.
ఎవరో స్త్రీ పంపులోంచి నీళ్ళు పట్టుకుని వెళ్తోంటే పిలిచారు. "అమ్మా దాహం!" అనడిగారు. అదే ఆయన తనకోసం ఇతరులని అడిగిన సహాయం!
ఆయన ఎప్పుడూ చెప్పేవారు. "టూ సీక్ ఏ ఫేవర్ ఈజ్ టూ బార్టర్ ఎవే వన్స్ ఫ్రీడమ్" అని. మనిషి నుండి మనిషి ఆశించే ప్రతిపనికీ పునాది బార్టర్ సిస్టమ్. |
25,397 |
క్షణాలు నిముషాలుగా రూపాంతరం చెంది కాలం ముందుకు కదులుతోంది.
అభిరాం కాఫీ తాగి టీపాయ్ మీద కప్పుంచిన ధ్వనికి కళ్ళు తెరిచి-
"అభిరాంగారూ! చిన్న విషయం" అన్నాడు వరప్రసాదం.
"ఏమిటో చెప్పండి" మామూలుగా అన్నాడు అభిరాం.
"మీకు మహదేవ్ అనే ఫ్రెండున్నాడా?" అడిగాడు.
"అవునూ! అయితే ఏం?" ఆశ్చర్యంగా అడిగాడు అభిరాం.
"ఏం లేదు! అపోలో హాస్పిటల్ నుంచి ఆరున్నరకి మీకు ఫోనొచ్చింది..."
"ఏమని?" అతని మాటలు పూర్తికాక ముందే ఆందోళన నిండిన కంఠంతో అడిగాడు అభిరాం.
"అదే మీ ఫ్రెండ్ మహదేవ్ గారికి ఏక్సిడెంట్ అయిందట. అపోలోలో ఎడ్మిట్ చేశారట. అతని షర్ట్ జేబులో మీ విజిటింగ్ కార్డు వుంటే అందులో నెంబర్ ని బట్టి మనకు ఫోన్ చేశారు."
"మరి వెంటనే నన్ను లేపి చెప్పకపోయారా?" కాస్త కోపం ధ్వనించింది అభిరాం కంఠంలో.
"సారీ... కేవలం విజిటింగ్ కార్డున్నంత మాత్రాన ఫ్రెండ్ అవ్వాలనే ముంది. ఏ బిజినెస్ పర్సన్ తోనో మీరాయనకి కార్దిచ్చి వుంటారు. అతను మీ స్నేహితుడు అయి వుండడని అనుకున్నాను. పైగా రాత్రి బాగా ఆలస్యంగా నిద్రపోవటంవల్ల మీరు ఆదమరిచి నిద్రపోతుంటే లేపబుద్ది కాలేదు"
"సర్లెండి" అంటూ గబగబా బట్టలు ధరించి అమ్మమ్మకి మాత్రం విషయం చెప్పకుండా బయలుదేరాడు.
"నన్ను కూడా రమ్మంటే వస్తాను" అన్నాడు వరప్రసాదం.
కాదనలేకపోయాడు అభిరాం. పైగా అమరో మనిషి తోడు ఇటువంటి సమయంలో తప్పనిసరనిపించింది. దాంతో "రండి" అన్నాడు.
అప్పటికే లాల్చీ, పైజామల్లో వున్న వరప్రసాదం అతన్ని అనుసరించాడు.
* * * * *
'సినిమాల్లో తప్ప నిజజీవితంలో కూడా కారునింత స్పీడుగా డ్రైవ్ చేసే వాళ్ళుంటారా?' అనుకున్నాడు వరప్రసాదం అభిరాం డ్రైవింగ్ చూసి.
సరిగ్గా ఒకటిన్నర నిముషంలో మూడు నాలుగు మలుపులు తిరిగి అపోలో హాస్పిటల్ ముందుకు చేరుకుంది కారు.
"మహదేవ్ అనే పేషెంట్ కావాలి ఎర్లీ మార్నింగ్ ఏక్సిడెంట్ అయి జాయినైనతను" తనవంకే ప్రశ్నార్ధకంగా చూసిన రిసెప్షనిస్ట్ తో అన్నాడు అభిరాం.
అతను వివరాలు చెప్పగానే బాణంలా అటువైపుకు దూసుకు పోయాడు.
వరప్రసాదం అతన్ని అనుసరించాడు.
అద్దాలతో నిండిన ఇంటెన్సివ్ కేర్ లో నిస్తేజంగా పడి వున్నాడు మహదేవ్.
అతని ఒంట్లోంచి చాలా రక్తం పోయిందన్నట్టు ఖాళీ అయిన ప్లాస్టిక్ బ్లడ్ యూనిట్ ని మార్చి మరొకటి అమర్చింది నర్సు! మహదేవ్ తలకి కట్లు.
అభిరాం కళ్ళు అతనికి తెలియకనే చెమర్చాయి. వరప్రసాదం అతన్ని ఓదార్చాడు. మహదేవ్ ని ట్రీట్ చేస్తున్న డాక్టర్ దగ్గరికి నడిచాడు అభిరాం.
"ఎస్" హుందాగా అన్నాడతను. "నా పేరు అభిరాం. మీరు ట్రీట్ చేస్తున్న మహదేవ్ నా ప్రాణ స్నేహితుడు. అసలీ దారుణం ఎలా జరిగింది?"
అతని గొంతులో బాధనర్ధం చేసుకున్నాడు డాక్టర్.
"సైనిక్ పురి కాలనీ నుంచి సికిందరాబాద్ కెళ్ళే రోడ్డులో జరిగిందట ప్రమాదం. అప్పుడు సమయం ఆరు దగ్గర కావస్తుందట"
"ఎవరు చెప్పారు? అసలెవరు మహదేవ్ ను జాయిన్ చేశారు?" అడిగాడు.
"ఓ లారీ డ్రైవర్, అతని లారీకి కొన్ని గజాల దూరంలో వెళుతున్న ఆటో ప్రమాదానికి గురయితే డ్రైవర్, అందులోని పాసింజర్ నీ... అదే మీ ఫ్రెండ్ మహదేవ్ ని, ఆటో డ్రైవర్నీ బాగా గాయాలైన పరిస్థితిలో తీసుకొచ్చాడు. అతనొక విషయం చెప్పాడు" ఏదో గుర్తొచ్చిన వాడిలా మధ్యలో ఆగి అన్నాడు.
"ఏమిటది?" ఆతృతగా అడిగాడు అభిరాం.
"తన లారీకి కొంత దూరంలో స్పీడుగా సాగిపోతున్న ఆటో ఒక్కసారే గాల్లో పైకి లేచి గింగిరీలు తిరుగుతూ పడిపోయిందట....."
"అదేమిటి? కొంపతీసి తానే ఏక్సిడెంట్ చేసేసి తప్పించుకోవటానికి కట్టుకథలళ్ళుతున్నాడా?" ఆశ్చర్యపోతూ అన్నాడు అభిరాం.
"నేనూ ముందలాగే ఆలోచించి ఎందుకయినా మంచిదని లారీ నెంబర్, అతని లైసెన్స్ నెంబర్ నోట్ చేసుకున్నాను. అయినా తనే ఏక్సిడెంట్ చేసి హాస్పిటల్ కి తీసుకురాడుగా?" అన్నాడు డాక్టర్.
సాలోచనగా తలూపాడు అభిరాం.
"ఏదేమైనా పేషెంటు లిద్దరూ తెలివిలోకి వస్తే కానీ అసలేం జరిగిందో తెలుసుకోలేం" అన్నాడతను.
సరిగ్గా అప్పుడే సుడిగాలిలా దూసుకొచ్చిన నర్సు అంది- "సార్! ఇంటెన్సివ్ కేర్ లోని పేషెంట్ పోయాడు. అదే ఉదయం ఎడ్మిటైన వాళ్ళల్లో ఒకతను."
"వ్వాట్?" అంటూ దిగ్గున లేచాడు డాక్టర్. పరుగులాంటి నడకతో బయటపడ్డాడు.
నర్సు మాటలతో నవనాడులూ కృంగిపోయినట్లు అభిరాం కదల్లేక పోయాడు.
వరప్రసాదం మాత్రం త్వరత్వరగా బయటకు నడిచి మహదేవ్ వున్న వైపు చూశాడు.
అక్కడ డాక్టర్ కానీ, మరెవరు కానీ లేరు. అంటే పోయింది ఆటో డ్రైవరై వుంటాడు అని మరికొంచెం ముందుకు నడిచాడు. అక్కడ కనిపించారు ఇద్దరు డాక్టర్లు, ఓ నర్స్, ఓ ఆయా.
గబగబా వెనుదిరిగాడు వరప్రసాదం.
టేబుల్ మీద తలుంచి నిశ్శబ్దంగా వున్న అభిరాం భుజం మీద చెయ్యేసి- "పాపం ఆటోడ్రయివర్ పోయాడు. మహదేవ్ కులాసానే" అన్నాడు.
"నిజమా...?" మహదేవ్ కేమీ కాలేదన్న సంతోషం అతని మనసులో. ఇంతలో డాక్టర్ వచ్చాడు.
"మీ ఫ్రెండ్ విషయం కూడా ఇంకో ట్వెల్వ్ అవర్స్ వరకూ ఏం చెప్పలేం. ఆటోడ్రైవర్ పోయాడు" అని చెప్పాడు అభిరాంతో. |
25,398 |
గొప్ప యంత్రాంగం ఇది. సెక్రటేరియేట్లలోనూ, ఆఫీసుల్లోనూ జనం పనిచేస్తారు. అయిదు సంవత్సరాలు గడిచేసరికి మహా సంబరపడిపోతూ ఓట్లు వేస్తారు. మళ్ళీ ఇంకో ప్రభుత్వం వస్తుంది. మళ్లీ అయిదేళ్ళు పనిచేస్తారు. పనిచేసేవాళ్ళు చేస్తూనే వుంటారు. తెలివైనవాళ్ళు సంపాదిస్తూనే వుంటారు. అన్నిటిలోకి పెద్ద బిజినెస్ రాజకీయం... ... అరగంటలో వాణి పక పేపరుతో వచ్చింది. దాని హెడ్డింగ్ ఈ విధంగా వుంది- "ఒకటో క్లాసుకూడా పాసవకుండా డాక్టరేట్ సంపాదించటం ఎలా? - మూడు పద్ధతులు" అని. 4 విమానం రొద చేసుకుంటూ వచ్చింది ఆగింది. ప్రయాణీకులు ఒకరొకరే దిగసాగారు. మెట్లు దిగుతూన్న వృద్ధుడు దగ్గిరకి రాగానే "ఫాస్టస్!" అన్నాడతడు. "-మీ కోసమే వేచి వున్నాం. వెల్ కమ్ టు అవర్ కంట్రీ" అంటూ చెయ్యి అందించాడు. "సో దిస్ ఈజ్ ఇండియా" అన్నాడు ఫాస్టస్ ఎత్తుమీద నుంచి చుట్టూ పరికించి చూస్తూ. "ఏ దేశం గురించి మేము పవిత్రమయిన కథల్ని చెప్పుకుంటామో, ఏ దేశం నెహ్రూ, గాంధీలాటి వారికి జన్మనిచ్చిందో, ఏ దేశంలో మనిషి స్వేచ్చగా గొంతువిప్పి తన ప్రభుత్వపు అవకతవకల గురించి నిర్బయంగా మాట్లాడగలడో సశ్యశ్యామలమయిన పొలాల్తో, సదా ప్రవహించే నదీ జలాల్తో ఏ భూమి తల్లి పచ్చగా కళకళలాడుతుందో, ఎక్కడ మనుష్యులు శాంతి కాముకులో, ఎక్కడ స్త్రీలు శీలవంతులో- ఆ దేశ గడ్డమీద కాలిడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా వుంది". ఫాస్టస్ కి 'అతడు' సమాధానం చెప్పలేదు. మనసులో మాత్రం అనుకున్నాడు. "అవును. ఏ దేశంలో కేవలం గతమే పవిత్రంగా మిగిలిందో... ఏ దేశంలో నాయకులు తమ పూర్వీకులైన గాంధీ, నెహ్రూల పేర్లు చెప్పి ఓట్లు కొనుక్కుంటారో, ఏ దేశంలో మనిషి తనకి తిండి, నీరు, గుడ్డ లేకపోయినా కేవలం మాట్లాడే స్వేచ్చ వుంది కదా అని వెన్ను చరుచుకుంటూ సంతృప్తిపడతాడో, ఉన్న స్వేచ్చని ఉపయోగించుకుంటూ వార్తాపత్రికలు ఏ దేశంలో నిజాలకి చుట్టూ అద్భుతమయిన కథలల్లి వార్తలకి బదులు కల్పనలని ప్రజలకు అమ్ముతాయో, చొంగలు కార్చుకుంటూ ఆ వార్తల్ని చదివి ఏ దేశంలో ప్రజలు రాజకీయ పార్టీలపట్ల తమ అమూల్యాభిప్రాయాల్ని ఏర్పర్చుకుని కేవలం "చర్చలతోనే" కాలం గడిపే శాంతి కాముకులో, ఏ దేశంలో సదా ప్రవహించే నడుల్లోంచి పొలాల్లోకి నీళ్ళు వదలటానికి కూడా 'రేటు' వసూలు చేసే ప్రభుత్వ డిపార్టుమెంటులున్నాయో, ఏ దేశంలో స్త్రీలు గోడ పక్కనే నడుస్తూ 'స్త్రీ యొక్క అంగరహస్యములు' పోస్టర్లు చూసి కూడా దయతో, సహనంతో జీవితం గడిపే శీలవతులో, ఆ పవిత్ర భూమికి ఇదే మా హృదయ పూర్వక స్వాగతం..." కస్టమ్స్ క్లియరెన్సు అయ్యాక హైద్రాబాద్ బయల్దేరారు. డాక్టర్ ఫాస్టస్ "రాష్ట్ర" ప్రభుత్వాధికారి కాబట్టి కేంద్రం నుంచి ఎవరూ అక్కడ విమానాశ్రయానికి రాలేదు. కేంద్రానికీ, రాష్ట్రానికీ సంబంధ బాంధవ్యాలు సరీగ్గాలేకపోవటం- అది వేరే సంగతి. ఫాస్టస్ మాత్రం అతడిని ప్రభుత్వ తరఫు మనిషే అనుకున్నాడు. హైదరాబాద్ విమనాశ్రయంలో ప్రభుత్వాధికారులు ఫాస్టస్ ని రిసీవ్ చేసుకోవటానికి రాగానే 'అతడు' అక్కడి నుంచి తప్పుకున్నాడు. ఇక తన అవసరం లేదు. .... డాక్టర్ ఫాస్టస్ కి స్టార్ హోటల్లో బస ఏర్పాటు చేయబడింది. అతిథి గృహాలు ఖాళీలు లేవు. ఒక ప్రభుత్వ రెస్ట్ హౌస్ లో దేశపు రాష్ట్రపతిగారి బంధువర్గం 'బతకమ్మ పండుగల వైభావాల్ని' చూడటం కోసం వారం రోజుల్నుంచి తిష్టవేసి వుంది. మరో అతిథి గృహంలో ఆర్థికశాఖా మంత్రిగారి బావమరిది సినిమా షూటింగు ఏర్పాటు చేసుకున్నాడు... అఫీషియల్ గా! మరో అతిథి గృహంలో ముఖ్యమంత్రిగారి కొడుకు ఉంపుడుగత్తె తన భర్తతో సహా విడిది చేసి వుంది. అన్ అఫీషియల్ గా. డాక్టర్ ఫాస్టస్ ని హోటల్లో దింపి, అధికారులు నాలుగింటికి వస్తామని, రెస్ట్ తీసుకొమ్మని చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన అయిదు నిముషాలకి 'అతడు' హోటల్లోకి ప్రవేశించి తలుపు తట్టాడు. "ఉన్నట్లుండి ఎయిర్ పోర్టు నుంచి ఎక్కడికి మాయమైపోయావు" తలుపుతీస్తూ అడిగాడు ఫాస్టస్. "మీ కోసం ఇది తీసుకురావటానికి-" అంటూ నెపోలియన్ బ్రాందీ బల్లమీద పెట్టాడు. ఫాస్టస్ సంభ్రమంతో చూస్తూ "మైగాడ్! నా టేస్టు మీకు ఎలా తెలుసు? నిజంగా మీ ప్రభుత్వం చాలా గొప్పది?" అన్నాడు. "క్షమించండి. నాకూ ప్రభుత్వానికీ ఏ సంబంధమూ లేదు. మీరంటే నాకు గౌరవం, భక్తి! అంతే. లిమ్నాలజీలో మీరు పబ్లిష్ చేసిన ప్రతి పేపరూ నేనూ అత్యంత శ్రద్ధతో చదువుతాను. మీ ఇష్టాయిష్టాలూ, అభిరుచులూ అన్నీ ఉత్సాహంతో తెలుసుకుంటాను. మా గ్రంథాల్లో ఏకలవ్యుడని ఒకడున్నాడు. అలా అన్నమాట! కేవలం మీరంటే ఉన్న ఆరాధనతో నేను అక్కడికొచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకున్నానే తప్ప ప్రభుత్వం పంపగా వచ్చిన వాణ్ని కాదు". ఒక క్షణం తెల్లబోయినా, ఫాస్టస్ అమితంగా సంతోషించాడు. దేశం కాని దేశంలో తనని గుర్తించిన మనిషి వుండటం- తన కోసం అంతదూరం రావటం! అంతలో అతడన్నాడు - "మీ కిష్టమని దీన్ని కష్టపడి తెప్పించాను. అదృష్టవశాత్తూ నా తండ్రి జి.కె.కి చాలా పరపతి వుంది. కోట్ల కోట్ల డబ్బు మూలుగుతూ వుండటంతో పోలీస్ డిపార్టుమెంటు నుంచి ఎక్సయిజు డిపార్టుమెంటు వరకూ ఇలాటివి తెచ్చి ఇచ్చి సావనీర్ల కోసం చందాలు వసూలు చేసుకుపోతారు". "ఇంతకీ నువ్వేం చేస్తున్నావ్ అబ్బాయ్" "రెండ్రోజులక్రితమే లిమ్నాలజీలో నాకు డాక్టరేట్ వచ్చిందండీ". * * * ముఖ్యమంత్రితో మీటింగ్ ఇంకా గంట టైమ్ వుంది. ఈలోపు ఒక పెగ్ తాగుదామనుకున్నాడు డాక్టర్ ఫాస్టస్. నిజంగా అతడికి నెపోలియన్ బ్రాందీ అంటే చాలా ఇష్టం. ఫోన్ లో 'రూమ్ సర్వీస్ ని' పిలిచి ఐస్ కావాలని అడిగాడు. స్టార్ హోటల్ కాబట్టి మమూలుగా అది పావుగంట వరకూ రాలేదు. విసుగ్గా తలుపులు తీసుకుని బయట కారిడార్ లోకి వచ్చాడు. వరుసగా తలుపులు మూసి వున్న గదులు - క్రింద ఎర్రటి తివాచీ- సన్నగా శబ్దం చేస్తూ వేస్తూన్న చల్లటి గాలి. |
25,399 |
"నాలాంటి వాళ్ళలో కాదు" అన్నాడు రుద్రప్రసాద్. హఠాత్తుగా గమనానికొచ్చింది అప్సరకి. ఎప్పుడు ఎవరు ఎవరిని సమీపించారోగానీ తను అతని కౌగిట్లో వుంది. అతని కౌగిలి వదిలించుకొని దూరంగా వెళ్ళిపోవడానికి ఒక ప్రయత్నం చేసింది అప్సర. కానీ ఎలాంటి ప్రయత్నం అది? అతి దుర్భలమైన ప్రయత్నం: కొద్ది క్షణాలపాటు - మనసు అతడికి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటోంది. కానీ శరీరం అతడికి దగ్గరవుతుంది. మరికొద్ది క్షణాలపాటు... మనసు అతడికి దగ్గరయిపోవాలనుకుంటోంది. కానీ శరీరం దూరంగా వెళ్ళిపోవాలని కోరుకుంటోంది.
మరికొద్ది క్షణాల తర్వాత.. ఒళ్ళూ మనసూ, సంఘర్షణ మాని ఒకటయిపోయాయి. అతనికి మరింత దగ్గరగా హత్తుకుపోయింది అప్సర. అప్పుడు మొదలయింది రెండు శరీరాల మధ్య పరస్పర ఆకర్షణతో కూడిన సంఘర్షణ. వేడి, తాపం, సెగలు, నిట్టూర్పులు. తర్వాత... అలసటతో కళ్ళు తెరిచి అంది అప్సర "నువ్వు నిజంగా మెర్సినరీవే: అన్నివిధాలా: చూడు: నాకు తెలియకుండానే నా మనసునీ, నా శరీరాన్నీ కూడా ఎలా స్వాధీనం చేసుకుని కొల్లగొట్టావో?" ఆమె యింకేదో కూడా చెప్పబోతుంటే చెప్పనివ్వకుండా ఆమె పెదిమలని తన పెదిమలతో సీల్ చేసేసాడు రుద్రప్రసాద్. ఆ దీర్ఘ చుంబనానికి ఆమె ఊపిరందక తల అటూ ఇటూ విదిలిస్తుంటే, తల పైకెత్తి నవ్వి, ఆమె తలని తన రెండు చేతుల్లో పట్టుకుని ఆమె విశాలనయినాల్లోకి తొంగిచూస్తూ... "నేను పుట్టిన తర్వాత ఎవరితో చెప్పని ఒకమాట చెప్పనా?" ఏమిటన్నట్లు చూసింది అప్సర. "ఐలవ్ యూ: ఐలవ్ యూ అప్సరా: ఐ నీడ్ యూ:" లేచి చీర సవరించుకుంటూ అంది అప్సర. ఆమె మొహంలో సంతోషం, దిగులూ రెండూ కనబడుతున్నాయి. "నువ్వు ఏం చదివావు రుద్రా?" "చరిత్ర, ఆర్థికశాస్త్రం, ఫిలాసఫీ" అన్నాడు రుద్ర. అతడి పెదిమలని తన చూపుడువేలితో రాస్తూ, మృదువుగా అంది అప్సర." అందుకని నిన్ను చదువుకున్న మూర్ఖుడనాలి" నవ్వి, సిగరెట్ అంటించాడు రుద్ర. "ఆల్ రైట్: ఇక మనమిద్దరం ఒకటేనని నిశ్చయమయిపోయింది కదా: ఇంక మన ప్లాను అమలులో పెట్టడం ఎలాగో ఆలోచించాలి." "నీ ప్లాను ఎవరికీ చెప్పనంటివి కదా?" అంది అప్సర. "మీ డాడీతో చెప్పనన్నాను. నీతో చెప్పననలేదే: నువ్వూ నేనూ ఒకటే: నీతో చెప్పకుండా ఎలా?" "రుద్రా:" అంది అప్సర ఆర్తిగా. "నువ్వు ఏదన్నా చెప్పే ముందు నన్ను కాస్త చెప్పనీ: ఈ ఆపరేషన్ నాకు బొత్తిగా ఇష్టంలేదు. కానీ నువ్వు యిందులో వున్నావు కాబట్టి నేనూ వున్నాను. అంతే: రుద్రా: ఈ పని ఒక్కటీ అయిపోయిన తర్వాత నువ్వింక ఈ జీవితం మానెయ్యాలి. కనీసం నాకోసం: ఆ తర్వాత మనిద్దరమూ హాయిగా ఒక తోటలో చిన్న పొదరిల్లులాంటి ఇల్లు కట్టుకుని..." "తప్పకుండా: యిది నా ఫైనల్ అసైన్ మెంట్:" అన్నాడు రుద్ర. తర్వాత నెమ్మదిగా చెప్పడం మొదలెట్టాడు. "ఇప్పుడు మనం చేయబోయేది ఒక మిలియేచర్ వార్. సూక్ష్మరూపంలో ఉన్న యుద్ధం. నాతోపాటు మరో అయిదుమంది మెర్సినరీలు ఉంటారు. వీళ్ళందరూ, నాతోబాటు ఇంతవరకూ కొన్ని యుద్ధాలలో పని చేసిన వాళ్ళే. నేను ఎప్పుడు కబురు పంపిస్తే అప్పుడు వస్తారు. ఇకపోతే, ఈ యుద్ధానికి ఆయుధాలు కావాలి. ఆయుధాలు అమ్మే దేశాలు చాలా వున్నాయి. అమ్మే డీలర్లు చాలామంది వున్నారు. కానీ ఆయుధాలు అమ్మాలన్నా, కావాలన్నా ఒక ముఖ్యమైన పత్రం అవసరమవుతుంది. దాన్నే "ఎండ్ యూ సర్" సర్టిఫికెట్ అంటారు. అంటే ఆయుధాలు కొనబోతున్నది వాటిని ఉపయోగించదలుచుకొన్న వాళ్ళేనని. పాశ్చాత్యదేశాలకి సంబంధించినంత వరకూ ఎండ్ యూసర్ అంటే మరో ప్రభుత్వమే: ప్రైవేట్ వ్యక్తులకు వాళ్ళు ఆయుధాలు అమ్మారు. సీక్రెట్ సర్వీస్ ఆర్గనైజేషన్ దీనికన్నా ఆయుధాలు బహుమతిగా ఇస్తున్నప్పుడూ, లేకపోతే బ్లాక్ మార్కెట్ లో ఆయుధాలు కొంటున్నప్పుడూ తప్ప, ప్రతి డీల్ లోనూ ఈ 'ఎండ్ యూసర్' సర్టిఫికెట్ అత్యవసరం: "ఎండ్ యూ సర్ సర్టిఫికేట్ ని కొన్నిదేశాలు ఈకకి ఈకా, తోకకి తోకా పీకినట్లు పరీక్ష చేస్తాయి. కొన్ని కొన్ని దేశాలు "చూసీ చూడనట్లు" పోతాయి. తక్కిన డాక్యుమెంట్లు అన్నిటినీ ఫోర్జరీ చేసినట్లే 'ఎండ్ యు సర్' సర్టిఫికేట్ ని కూడా ఫోర్జరీ చేస్తూనే వుంటారు." శ్రద్ధగా వింటోంది అప్సర. "మనం డైరెక్టుగా యూరోపియన్ దేశాలకి అప్లయ్ చేసి ఆయుధాలు సంపాదించలేం కమ్యూనిస్టు దేశాలకేమో ఎందువల్లనోగానీ జనరల్ భోజా అంటే వల్లమాలిన ప్రేమ. అందుకని వాళ్ళనీ అడగలేం. అడిగితే పని కాకపోగా ప్లానుకూడా బెడిసికొట్టవచ్చు. అలాగే గవర్నమెంటు ఆధీనంలో ఉన్న ఫార్ బిక్ నేషనల్ ఆఫ్ బెల్ఖియమ్ కి కూడా మనం అప్లయ్ చెయ్యిలేము ఎందుకంటే మన అప్లికేషన్ వెంటనే గవర్నమెంటుకీ పంపబడుతుంది. పెద్దపెద్ద ఆయుధాల డీలర్లయిన భోఫోర్స్ ఆఫ్ స్వీడెన్ పార్కర్ హేల్ ఆఫ్ బ్ర్మంగ్ హామ్, ఓర్లికాన్ ఆఫ్ స్విడ్జర్లాండ్, జర్మనీ తాలూకు వెర్నర్ అండ్ అదర్స్. ఇటలీలో ఫియట్ - వీళ్ళందరినీ మనం అప్రోచ్ కాలేం ఎందుకంటే వీళ్ళెవరూ ఆయుధాలు మనకి అమ్మరు కాబట్టి." "పైగా మనకు కావలసిన ఆయుధాలు చాలా కొద్దిపాటి. ఇవి పెద్ద పెద్ద లైసెన్స్ డ్ డీలర్లకి అంత ఆసక్తి కలిగించవేమో" అంది అప్సర. మెల్లిమెల్లిగా తనుకూడా అడ్వెంచరస్ మూడ్ లోకి వచ్చేస్తూ. "ప్రపంచ ప్రఖ్యాత పొందిన ఆయుధాల వ్యాపారి ఆద్నాన్ ఖోషిగ్గీ అసలు మనవైపు కన్నెత్తికూడా చూడడేమో:" "ఆద్నాన్ ఖోషిగ్గీ కన్నెత్తి చూడడు. డాక్టర్ పెరిట్టీ, డాక్టర్ లాంగెన్ స్టెయిన్ లాంటి డీలర్లు అసలు పన్నెత్తి పలకరించరు." అని కాసేపు ఆలోచించాడు రుద్రప్రసాద్. |