id
int64 1.71k
92.9k
| url
stringlengths 5
925
| title
stringlengths 0
772
| text
stringlengths 221
3.81k
| summary
stringlengths 85
1.62k
|
---|---|---|---|---|
31,808 | https://www.prajasakti.com/WEBSECTION/International/page577/rashtralo-maro-iddru | కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన మంత్రి హరీష్ రావు. | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అధికారుల బృందంతో కలిసి శనివారం అర్ధరాత్రి పరిశీలించారు. ధర్మారం మండలం నందిమేడారం వద్దగల 6, 7 ప్యాకేజీ పనులను, కరీంనగర్ జిల్లా రామడుగులో 8వ ప్యాకేజీ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్బంగా ఏడో ప్యాకేజీ పనుల్లో వేగం పెంచాలని అధికారులను మంత్రి హరీష్ ఆదేశించారు. అంతేగాక జూన్ నాటికి ఎత్తిపోతల పథకం ప్రారంభించేలా పనులు చేయాలన్నారు. | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన 6,7,8 ప్యాకేజీ పనులను పరిశీలించిన రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు 7వ ప్యాకేజీ పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. |
32,270 | https://www.prajasakti.com/WEBSECTION/National/page452/iddru-pakistaniyulku-medical-visal-sushma-swaraj | రాష్ట్రంలో ఇందిరమ్మ పథకంలో భాగంగా మధ్యలో నిలిచిపోయిన ఇళ్ళను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, హౌసింగ్ శాఖ మంత్రి కె మృణాళిని అధికారులను ఆదేశించారు. ఈమేరకు శనివారంనాడు మంత్రి ఆ శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్, చైర్మన్ వర్లరామయ్యలతో కలిసి అధికారులతో చర్చించారు. 13 జిల్లాల పరిధిలో ఇందిరమ్మ ఇళ్ళు, అవి ఏ పరిస్థితిలో ఉన్నాయి లాంటి అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మధ్యలో నిలిచిన ఇళ్ళను పూర్తి చేసేందుకు ప్రభుత్వం నిధులను తక్షణమే విడుదల చేస్తుందని, వాటిపై దృష్టిపెట్టి పూర్తి చేయాలని సూచించారు. | రాష్ట్రంలో పూర్తి కాకుండా నిలిచిపోయిన ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, హౌసింగ్ శాఖామంత్రి కె. మృణాలిని అధికారులను ఆదేశించారు. దీనికి అవసరమైన నిధులను ప్రభుత్వం ఇస్తుందని పేర్కొన్నారు. |
|
32,510 | https://www.prajasakti.com/WEBSECTION/National/page709/pavanku-rajkiya-sthiratvam-ledu | అలిపిరి తనిఖీ కేంద్రంలో టిటిడి విజిలెన్స్ అధికారులు 108 శ్రీవారి లడ్డూ టోకెన్లను పట్టుకున్నారు. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కౌంటర్ బారుగా పని చేస్తున్న పెరుమాల్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నడకదారిలో తిరుమలకు వచ్చే యాత్రికులకు పంపిణీ చేసే టోకెన్లను కౌంటర్ బారు వద్ద గుర్తించిన తనిఖీ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. తిరుమల కౌంటర్లో ఉండాల్సిన టోకెన్లు ఏ విధంగా బయటకు వెళ్లాయో బ్యాంకు అధికారులను, సిబ్బందిని విచారించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. | అలిపిరి తనిఖీ కేంద్రం లో టీటీడీ విజిలెన్స్ అధికారులు 108 శ్రీవారి లడ్డూ టోకెన్లు పట్టుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల వైకుంఠం క్యూకాంప్లెక్స్లో కౌంటర్ బారుగా పనిచేసే తిరుమల ను అదుపులోకి తీసుకుని విచారించారు. |
|
32,633 | https://www.prajasakti.com/WEBSECTION/International/page912/ru7-lakshal-gutka-packett-swadhina | రావులపాలెం మండలం గోపాలపురంలోని భవాని రైసుమిల్లుపై విజిలెన్స్ అధికారులు మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఎటువంటి రికార్డులూ లేకుండా నిల్వ ఉంచిన ధాన్యం, బియ్యం, నూకలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మూడు ఆటోల్లో తరలించేందుకు సిద్ధంగా ఉన్న 19.30 క్వింటాళ్ల రేషను బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, మూడు ఆటోలను సీజ్ చేశామని విజిలెన్స్ ఎస్పి టి. రామ్ప్రసాద్ తెలిపారు. మిల్లు యజమానిపై 61 ( ఎ ) కేసు నమోదు చేసినట్లు ఎస్పి చెప్పారు. | రావులపాలెం మండలం గోపాలపురం లోని భవాని రైస్ మిల్ పై విజిలెన్స్ అధికారులు రైడ్ చేసి అక్రమంగా నిల్వ ఉంచిన దాన్యం, బియ్యం, నూకలను మరియు తరలించడానికి సిద్ధంగా ఉంచిన మూడు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. |
|
32,750 | https://www.prajasakti.com/WEBSECTION/International/page793/shanfrancisco-bayalderalsin-airindia-vimana-alasya-prayanikul-andolan | విజయవాడ స్వర్ణబార్ కల్తీ మద్యం కేసులో ఎ9 నిందితునిగా ఉన్న మాజీ ఎంఎల్ఎ, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాది విష్ణును నాలుగు రోజులపాటు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ బుధవారం విజయవాడ రెండో మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. విష్ణును తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ప్రత్యేక దర్యాప్తు బృందం ( సిట్ ) అధికారులు రెండురోజుల క్రితం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఇదే సమయంలో మల్లాది విష్ణు వేసుకున్న బెయిల్ పిటీషన్ను వారం రోజులు వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో బుధవారం జరిగిన విచారణలో ఆయనను గురువారం ఉదయం నుండి పోలీస్కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. | పాలిటెక్నిక్ కోర్టు ఆదేశాల మేరకు విజయవాడ స్వర్ణ బార్ కల్తీ మద్యం కేసులో నిందితులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాది విష్ణును పోలీసు బృందం కస్టడీలోకి తీసుకుంది. ఇదే సమయంలో బెయిల్ కోసం దాఖలు చేసిన మల్లాది విష్ణు దరఖాస్తును కోర్టు వాయిదా వేసింది. |
|
32,939 | https://www.prajasakti.com/WEBSECTION/National/page530/bangladeshpai-bharat-ghanvijay | నూతన నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలోని అసైన్డ్ భూములను తెలుగుదేశం పార్టీ నేతలు లాక్కుంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. గురువారం హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ నేతలు విచ్చల విడిగా చట్టాలను అతిక్రమిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు. అలాంటి వారిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాపాడుతున్నారని ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో రాష్ట్రంలో వందల ఎకరాల అసైన్డ్ భూములు చేతులు మారాయని, ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే అసైన్డ్ భూముల వివరాలను వెంటనే బయటపెట్టాలని సవాల్ విసిరారు. | రాజధాని నిర్మాణం కొరకు టిడిపి నేతలు అసైన్డ్ భూములను కొల్లగొడుతున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి ఆరోపించారు. ఈ నేతల సీఎం చంద్రబాబు కాపాడుతున్నారని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అసైన్డ్ భూముల వివరాలను వెంటనే బయట పెట్టాలని సవాల్ విసిరారు. |
|
32,942 | https://www.prajasakti.com/WEBSECTION/International/page61/11ell-balikapai-atyachara | ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ( ఎపిటిడిసి ) శాఖ ఎగ్జీక్యూటీవ్ డైరెక్టర్గా ఆర్ మల్లిఖార్జునరావును ప్రభుత్వం నియమించింది. గుంటూరు జిల్లా సోషల్ వెల్ఫేర్ జాయింట్ డైరెక్టర్గా ఈయన విధులు నిర్వహిస్తున్నారు. డిప్యూటేషన్ పద్ధతిలో పర్యాటక శాఖ ఈడిగా నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. శాఖ హెడ్ క్వార్టర్స్ విజయవాడ నుంచి కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు, అమరావతి పర్యాటక ప్రాజెక్టులను మల్లిఖార్జునరావు పర్యవేక్షిస్తారని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. | గుంటూరు జిల్లా సోషల్ వెల్ఫేర్ జాయింట్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఆర్ మల్లికార్జున రావు ను రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. |
|
32,965 | https://www.prajasakti.com/WEBSECTION/National/page404/dalit-girijan-samasyal-parishkarinchandi | ఆర్టిసిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఎన్నికల షెడ్యూల్ను ఖరారు చేయడానికి కార్మిక శాఖ కమిషనర్ గురువారం కార్మిక సంఘాల నాయకులతో సమావేశం కానున్నారు. ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె పద్మాకర్, ఎన్ఎంయు అధ్యక్షుడు చంద్రయ్య, కార్యనిర్వాహక అధ్యక్షుడు రఘుమారెడ్డి, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జిలానీ భాషా, ప్రధాన కార్యదర్శి సుందరయ్య, వైఎస్ఆర్ ఆర్టిసి మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి టిఎస్ఎస్ ప్రసాద్, కోశాధికారి సిబిఎస్ ప్రసాద్ ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఎన్నికల షెడ్యూల్ను ఈ నెలాఖరు నాటికి విడుదల చేసి, మొత్తం ప్రక్రియను వచ్చే నెలలో పూర్తి చేసే అవకాశాలు ఉన్నట్లు కార్మికశాఖ అధికారులు చెబుతున్నారు. | ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ ఖరారు చేయుటకు కార్మిక శాఖ కమిషనర్ కార్మిక సంఘాల నాయకులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి ఈ కార్మిక సంఘ అధ్యక్షులతో పాటు పలువురు కార్మికులు కూడా హాజరయ్యారు. ఈ నెలాఖరుకు విడుదల చేసి వచ్చే నెలలో మొత్తం ప్రక్రియను ముగించనున్నట్లు కార్మిక శాఖ అధికారులు తెలిపారు. |
|
33,029 | https://www.prajasakti.com/WEBSECTION/International/page58/ill-nirmana-phurti-cheyalani-sipie-dharna | హక్కుల రక్షణకు జాతీయ స్థాయిలో కమిషన్ ఏర్పాటుచేయాలని దళిత్ శోషణ్ ముక్తి మంచ్ జాతీయ కన్వీనర్ వి. శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. 'మారుతున్న రాజకీయ నేపథ్యంలో దళితులు, గిరిజనులు కర్తవ్యం' అనే అంశం పై సోమవారం ఉక్కునగరంలోని సిఐటియు కార్యాలయంలో జరిగిన సెమినార్కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాజకీయ పదవుల్లో ఉన్న ఎంతటి వారైనా శిక్షలు పడితేనే వివక్ష అంతమవుతుందన్నారు. ప్రస్తుత ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాల వల్ల రిజర్వేషన్లు నిర్వీర్యం అవుతున్నాయని, ఈ తరగతులకు ఉన్న హక్కులు పోతున్న తరుణంలో కాపాడుకునేందుకు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. | 'మారుతున్న రాజకీయ నేపథ్యంలో దళితులు, గిరిజనుల కర్తవ్యం' అనే అంశంపై సిఐటియు కార్యాలయంలో జరిపిన నాకు కే అతిథిగా హాజరైన కన్వీనర్ వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వం అమలుచేస్తున్న విధానాల వల్ల రిజర్వేషన్లు కనుమరుగవుతున్న అని విమర్శించారు. |
|
33,036 | https://www.prajasakti.com/WEBSECTION/International/page329/asia-kap-vijetha-aapghanistan | ఇసుక మాఫియా ఆగడాలను అరికట్టేందుకు వెంటనే ఉన్నత స్థాయి కమిటీ ( హైపవర్ కమిటీ )లను వేయాలని తెలుగు రాష్ట్రాలను ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. ఈ కమిటీకి అక్రమ తవ్వకాలు, రవాణా, ఇతర అంశాల పై చర్యలు తీసుకునే అధికారం కూడా ఇవ్వాలని నిర్దేశించింది. తదుపరి విచారణను ఈ నెల 25 కి వాయిదా వేసింది. ఇసుక అక్రమ తవ్వకాలను అరికట్టాలని అరికట్టాలని ఆదేశించాలని అభ్యర్థిస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలిప్ బి బొసలే, జస్టిస్ ఎస్వీ భట్తో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. | ఇసుక మాఫియా ఆగడాలను అరికట్టేందుకు, వాటి తవ్వకాలను, రవాణాను మరియు ఇతర అంశాల పై చర్యలు తీసుకునే విధంగా అధికారం ఇస్తూ వెంటనే ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. |
|
33,136 | https://www.prajasakti.com/WEBSECTION/International/page832/acid-daadi-baadhituriki-ru12-lakshal-parihara-delhi-cort-adesha | హైదరాబాద్లో రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ శీతాకాల విడిది ముగిసింది. గురువారం ఉదయం పదకొండు గంటలకు హకీంపేట్ ఎయిర్ఫోర్స్ స్టేషన్ నుంచి వాయుసేన ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భ ంగా ఆయనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, డిప్యూటీ సిఎంలు కడియం శ్రీహరి, మహమూద్అలీ, మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, జగదీష్రెడ్డి, చందూలాల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ, ఇతర ఉన్నతాధికారులు అదర్సిన్హా, పోలీసు అధికారులు అనురాగ్శర్మ, సివి ఆనంద్, పలువురు ప్రజా పతినిధులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా కేసీఆర్ రాష్ట్రపతి ఫొటో అల్బమ్ను అందించారు. | హైదరాబాదులోని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శీతాకాల సమావేశాలు ముగిసిన సందర్భంగా హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి వాయిసేవ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయనకు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు పలువురు ఉన్నతాధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. |
|
33,239 | https://www.prajasakti.com/WEBSECTION/International/page465/choree-kesulo-aaruguru-arest | నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు సాగునీటి చెరువులకు తీవ్ర నష్టం వాటిల్లింది. భారీ వర్షాలకు 414 చెరువులకు గండ్లు పడినట్లు జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన సిఎం చంద్రబాబుకు వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలను పంపించారు. మొత్తం 414 చెరువులలో 131 చెరువులకు భారీగా గండ్లు పడటంతో పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లినట్లు అధికారులు నివేదించారు. | నైరుతి బంగాళాఖాతంలో చోటుచేసుకున్న అల్పపీడనం వల్ల పడుతున్న భారీ వర్షాలకు 414 చెరువులకు గండ్లు పడినట్లు జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్కుమార్ చెప్పారు. దీనికి ఆయన సిఎం చంద్రబాబుకు నష్ట వివరాలను అందించారు. |
|
33,286 | https://www.prajasakti.com/WEBSECTION/National/page228/dwichakra-vahanalapai-bhari-discount | కడప నారాయణ కళాశాలలో అనుమానాస్పదంగా మృతి చెందిన మనీషా, నందినిల ఆత్మహత్య ఘటనలపై పూర్తి స్థాయి విచారణ చేయించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. దుర్ఘటన చోటు చేసుకున్న నారాయణ కళాశాల గుర్తింపును రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ, ఎఐఎస్ఎఫ్ డిమాండ్ చేశాయి. నారాయణ విద్యా సంస్థల యాజమాన్యం నిర్లక్ష్యంగా కారణంగానే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని ఆరోపించారు. దోషులను గుర్తించి కఠినంగా శిదోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఎస్ నూర్మహ్మద్, ఎఐఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి ఐ బయ్యన్న మాధ్యమిక విద్యా కార్యదర్శి సిసోడియాకి విజ్ఞప్తి చేశారు. | కడప నారాయణ కళాశాలలో మృతి చెందిన మనీషా, నందినిల, ఘటన దృశ్యా పూర్తి విచారణ జరిపించాలి అని, కళాశాల గుర్తింపు ని రద్దు చెయ్యాలి అని విద్య సంఘాలు మరియు ఎస్ఎఫ్ఐ, ఎఐఎస్ఎఫ్ కోరారు. |
|
34,571 | https://www.prajasakti.com/WEBSECTION/National/page83/governor-to-marokoddisepatilo-bheti-kanunn-dinakarn-varg-ammelyes | రాష్ట్రంలో అత్యవసరమైన ప్రజా సమస్యలను చర్చించడానికి శాసన సభ, శాసన మండలి సమావేశాలను వెంటనే నిర్వహించాలని శాసన మండలి విపక్ష నేత సి. రామంద్రయ్య డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్లోని పార్టీ కార్యాలయం ఇందిరాభవన్లో మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి విషయంలోనూ చెప్పిన దానికి భిన్నంగా వ్యవహరిస్తూ చంద్రబాబు యూటర్న్ ముఖ్యమంత్రిగా మారారని ఎద్దేవా చేశారు. వచ్చే నెల 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందని, కానీ అంతకంటే ముందుగానే నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. | హైదరాబాదు పార్టీ కార్యాలయం ఇందిరాభవనలో మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ను శాసన మండలి విపక్ష నేత సి. రామంద్రయ్య కలిసి మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం వచ్చే నెల 17 నుండి అన్న అసెంబ్లీ సమావేశాలను తక్షణమే ఏర్పాటు చేయాలని అన్నారు. |
|
34,653 | https://www.prajasakti.com/WEBSECTION/International/page781/kott-titill-porku-vijender | విశాఖ గ్రామీణ జిల్లాకు ప్రధాన కేంద్రమైన అనకాపల్లిలోని ఎన్టిఆర్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మందుల కొరతను నివారించాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యాన శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ పట్టణ కార్యదర్శి వైఎన్ భద్రం మాట్లాడుతూ, ఎన్టిఆర్ ఆసుపత్రిని అప్గ్రేడ్ చేసినప్పటికీ అవసరమైన మందులు లేకపోవడంతో సుమారు 10 మండలాలకు చెందిన రోగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. మందుల కొరత లేకుండా చూస్తున్నట్లు అధికారులు పత్రికా ప్రకటనలు ఇస్తూ సమస్యలు లేనట్టు భ్రమ కల్పిస్తున్నారని విమర్శించారు. దీనిపై ఉన్నతాధికారులు దృష్టిసారించి మందుల కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. | విశాఖ జిల్లా అనకాపల్లిలోని ఎన్టిఆర్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఏర్పడిన మందుల కొరతను తొలగించాలని ధర్నా చేపట్టారు. చాల మంది ప్రజలు రోగాల భారిన పడి తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఉన్నతాధికారులు స్పందించాలని పార్టీ పట్టణ కార్యదర్శి వైఎన్ భద్రం డిమాండ్ చేశారు. |
|
34,939 | https://www.prajasakti.com/WEBSECTION/International/page421/maha-polisulku-chowkdharku-aushadhal | ప్రభుత్వాస్పత్రిలో నెలకొన్న ఇబ్బందులను అధిగమించేందుకు జిల్లా యంత్రాంగం సంయుక్తంగా కృషి చేస్తుందని, త్వరలోనే సమస్యలు పరిష్కారమవుతాయని జిజిహెచ్ నూతన సూపరింటెండెంట్ డాక్టర్ డిఎస్ రాజునాయుడు అన్నారు. శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆస్పత్రిలో ప్రత్యేక పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో బాధ్యతలు చేపట్టానని, జిల్లా అధికారులు, ఆస్పత్రి సిబ్బంది అధికారులను సమన్వయం చేసుకుని ఆస్పత్రికి పూర్వ వైభవం తెచ్చేలా కృషి చేస్తానని చెప్పారు. ఇప్పటికీ ఆస్పత్రిలో 500 మందితో పారిశుధ్య పనులు కొనసాగుతున్నాయని, విద్యుత్, ఇతర ఉపకరణాల మరమ్మతులు పూర్తయ్యే దశకు చేరుకున్నాయని వివరించారు. ఆస్పత్రిలో 300 ఫ్యాన్లు, 80 ఎసిలను యుద్ధ ప్రాతిపదికన అమర్చనున్నట్లు చెప్పారు. | సర్కారు దవాఖానలో వున్నా సమస్యలను పరిష్కరించడానికి జిల్లా యంత్రాంగం కలిసి కట్టుగా పని చేస్తుందని. దవాఖానాలకి పూర్వ వైభవం తీసుకొస్తామని , దవాఖానలో 300 ఫ్యాన్లు, 80 ఎసిలను యుద్ధ ప్రాతిపదికన పెట్టినట్లు చెప్పారు. జిజిహెచ్ నూతన సూపరింటెండెంట్ డాక్టర్ డిఎస్ రాజునాయుడు పేర్కొన్నారు . |
|
37,529 | https://www.prajasakti.com/WEBSECTION/National/page643/tatsth-vedikalapene-ranji-myachl | యూనివర్సిటీల్లో విసిలను నియమించాలంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి లేఖ | రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్లను నియమించాలనీ, ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలనీ కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ మంగళవారం లేఖ రాశారు. రాష్ట్రంలో ఎస్వీ, పద్మావతి మహిళా, నన్నయ, ద్రవిడ, నాగార్జునా, కృష్ణా, ఎస్కె యూనివర్సిటీలకు విసిలను నియమించలేదనీ, దీనికి తోడు యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయడం లేదనీ లేఖలో పేర్కొన్నారు. ఖాళీ అయిన విసిల పోస్టుల స్థానంలో తాత్కాలికంగా ఇన్చార్జిలను నియమిస్తున్నారే తప్ప పూర్తిస్థాయి విసిలను నియమించడం లేదని తెలిపారు. యూనివర్సిటీల్లో విసిల నియామకం, తగిన సిబ్బంది భర్తీ లేకుండా సమగ్ర విద్యావిధానం కొనసాగడం సాధ్యం కాదనీ, ఇప్పటికైనా విసిలను నియమించి, ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. | సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్లను నియమించాలని, ఖాళి పోస్టులను భర్తీ చేయుటకు చర్యలు చేపట్టాలంటూ సిఎం చంద్రబాబునాయుడుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. యునివెర్సిటీలలో తగిన సిబ్బంది లేకుండా, విసిల నియామకం లేకుండా సరైన విద్యావిధానం సాధ్యం కాదని వెంటనే విసిలను, తగిన సిబ్బందిని నియమించాలంటూ కోరారు. |
3,524 | https://www.prajasakti.com/WEBSECTION/International/page362/baxeng-rend-patakalu-khayam-saritadevi | రూ 1000, 500 నోట్ల రద్దును వ్యతిరేకిస్తున్నా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. | ప్రధాని మోడీకి సామాన్య ప్రజల పట్ల ఎంత నిర్లక్ష్యమో మరోసారి రుజువు చేసుకున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. రూ 1000,500 నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు కష్టాలు పడతారని, ప్రజలను గందరగోళంలోకి నెట్టారని రాహుల్ అన్నారు. నిజమైన దోపిడీదారులు తప్పించుకుంటున్నారని, విదేశాలతో పాటు, రియల్ ఎస్టేట్లలో దాచుకున్న నల్లధనాన్ని కేంద్రం వదిలి పెడుతోందని రాహుల్ ఆరోపించారు. ఇక నల్లధన నివారణకు రూ 1000 నోట్లను రద్దు చేస్తూ రూ 2000 నోట్లను ప్రవేశ పెడతామనడం మోడీ తన వ్యాఖ్యలకే విరుద్ధంగా వ్యవహరించారని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి రణ్దీప్ సూర్జీవాలా అన్నారు. | రూ 1000, 500 నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు కష్టాలు పడతారని ఎం చెయ్యాలో తెలియని సందిగ్ధంలో ప్రజలను ఉంచవద్దని రాహుల్ గాంధీ కోరారు. నిజమైన నిందితుల మీద ఎలాంటి ప్రాభవం చూపలేదని దానికి తోడు రూ 2000 నోట్లను మొదలుపెట్టడం సరికాదన్నారు. |
4,088 | https://www.prajasakti.com/WEBSECTION/National/page796/komp-munchutunn-america-rakshanatmak-vada | నూతన కలెక్షన్లతో నిండిన జహాపనా | వస్త్ర ఉత్పత్తులను విక్రయించే జహాపన వైవిధ్యమైన ఎథ్నిక్, క్లాసిక్ వస్త్రశ్రేణి విభిన్నమైన డిజైన్లు, రంగుల సమ్మెళనంతో అత్యాధునిక వివాహ కలెక్షన్లను ఆవిష్కరించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. వినూత్నమైన ట్రెండి ఫ్యాషనబుల్ కుర్తాలు, నెహ్రూ జాకెట్లు, బంద్గాలాలు, డిజైనర్ షెర్వాణీలు అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది. అంతర్జాతీయ స్థాయి ఫ్యాషన్ ఉత్పత్తులను అందిస్తున్నామని పేర్కొంది. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని జహాపనా స్ప్రింగ్ సమ్మర్ కలెక్షన్లు విక్రయిస్తోన్నట్లు తెలిపింది. | వస్త్రాలను విక్రయించే జహాపనా అందమైన, ఆధునికమైన వివాహ కలెక్షన్లను ఆవిష్కరించమని ఒక ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయ స్థాయి వస్త్రాలను మరియు వివిధ రకాల ఫ్యాషను వస్త్రాలను అందిస్తున్నామని తెలిపారు. |
4,402 | https://www.prajasakti.com/WEBSECTION/National/page3189/tivi-mid-padi-chinnari-mriti-
| టీవీ మీద పది చిన్నారి మృతి | మహబూబ్నగర్ జిల్లా మక్తల్ మండలం చిట్యాలలో విషాదం సంఘటన చోటు చేసుకుంది. టీవి మీద పడి రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. ఆడుకుంటూ వెళ్లి పాప టీవిని పట్టుకోవడంతో టీవి ఒక్కసారిగా పాపపై పడింది. చిన్నారి మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. | చిట్యాలలో ఒక చిన్నారి ఆడుకుంటూ టీవీని పట్టుకోగా మా టీవీ పాప పైన పడేసరికి చిన్నారి మృతి చెందింది. |
5,716 | https://www.prajasakti.com/WEBSECTION/International/page424/kohliki-ghananga-sanmana | 12 మందికి ప్రతీకార ఉరి | ఇరాక్ ప్రధాని హైదర్ అల్ అబాది ఆదేశాల మేరకు ఉగ్రవాద కేసుల్లో దోషులుగా తేలి మరణ శిక్ష పడిజైలులో వున్న 12 మందిని 'కేవలం ప్రతీకారం' కింద ఉరితీసినట్లు ఇరాక్ ప్రత్యేక బలగాలు వెల్లడించాయి. ఇరాక్లో ఇటీవల 8 మంది సైనికులను ఐఎస్ హతమార్చింది. మరో ఆరుగురు సైనికులను హతమార్చుతామంటూ సామాజిక మాధ్యమాల్లో వీడియోలు అప్లోడ్ చేసింది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రధాని తమ వద్ద శిక్ష అనుభవిస్తున్న ఉగ్రవాదులను హతమార్చాలంటూ ఆదేశించారు. | ఇరాక్ లో 8 మంది సైనిక్ లను ఐ ఎస్ హతమర్చగా, ఉగ్రవాద కేసులో దోషులుగా తేలిన 12 మందికి మరణ శిక్ష విధించమంటూ ప్రధాని హైదర్ అల్ అబాద్ ఆదేశించారు. |
5,718 | https://www.prajasakti.com/WEBSECTION/National/page299/kukkal-dodilo-duppi-gayas | లిబియాలో బోటు ప్రభుత్వం | లిబియా సముద్రతీరంలో జరిగిన ఒక బోటు ప్రమాదంలో 100 మందికి పైగా వలసవాదులు, శరణార్థులు గల్లంతయ్యారని లిబియా కోస్ట్గార్డ్ వెల్లడించింది. వీరంతా మరణించి వుంటారని భావిస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఇటలీకి అత్యంత సమీపంలో వున్న లిబియా క్రమంగా మధ్యధరా సముద్రం ద్వారా తరలివచ్చే శరణార్థులకు ఆవాసంగా మారుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ సముద్ర ప్రయాణం అత్యంత ప్రమాదకరమైనప్పటికీ వలసలు ఏ మాత్రం ఆగకపోవటం విశేషం. | లిబియా సముద్ర తీరంలో జరిగిన ఓ బోటు ప్రమాదంలో 100 మందికి పైగా గల్లంతైన వలస వాదులు, శరణార్థులు మరణించి ఉంటారని లిబియా కోస్ట్ గార్డ్ తెలిపారు. |
9,370 | https://www.prajasakti.com/WEBSECTION/International/page573/mod-nimishall-mod-billulu-aamoda | తెలుగు మహాసభలలో గవర్నర్ | తెలుగు భాష పరిరక్షణను అందరు బాధ్యతగా తీసుకోవాలని తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. కాగా, ఇవాళ ఆయన తెలుగు మహాసభల ముగింపు వేడుకలో పాల్గొని మాట్లాడుతూ తెలుగు మహాసభలు నేటితో ముగియనున్నాయని, కానీ, తెలుగు పరిరక్షణ కుటుంబం నుంచే మొదలు కావాలన్నారు. అందుకు ప్రతీ తల్లిదండ్రి కృషి చేయాలన్నారు. మీ పిల్లలు పుట్టిన రోజున, ఏ చిన్న కార్యక్రమం జరిగినా బహుమతిగా ఒక చిన్న తెలుగు పుస్తకాన్ని కొనివ్వాలని అన్నారు. | తెలుగు మహాసభల ముగింపు వేడుకల్లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పాల్గొన్నారు. తెలుగు పరిరక్షణ బాధ్యత అందరిదీ అని,పిల్లలకు ఒక చిన్న తెలుగు పుస్తకాన్ని తల్లితండ్రులు కొని ఇవ్వాలని ఆయన చెప్పారు. |
9,846 | https://www.prajasakti.com/WEBSECTION/National/page461/itishakh-tanikhi-chesukovacchu-asharan | కాన్పూర్ లో స్వచ్ఛత హీ సేవ ప్రారంభం | ఈనెల 14,15 తేదీల్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పర్యటనకు గాను గురువారం నాడు ఉత్తరప్రదేశ్ వెళ్తున్నారు. లక్నోలో జరిగే పౌరసన్మానంలో ఆయన పాల్గొంటారు. శుక్రవారంనాడు కాన్పూర్లోని ఐశ్వరిగంజ్ గ్రామంలో స్వచ్ఛత హీ సేవ ప్రోగ్రాంను ఆయన ప్రారంభిస్తారు. కోవింద్ రాష్ట్రపతి పదవి చేపట్టిన తర్వాత ఉత్తరప్రదేశ్లో పర్యటించనుండటం ఇదే మొదటిసారి. | రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్లో స్వచ్ఛత హీ సేవ ప్రోగ్రాంను ప్రారంభించనున్నారు. లక్నోలోని పౌరసన్మానంలో కూడా పాల్గొనబోతున్నారు. |
9,851 | https://www.prajasakti.com/WEBSECTION/National/page967/ammakaniki-america-adhyakshudi-car | ప్రతిరోజూ రక్షణ సమావేశాలు | రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు త్రివిధ దళాధిపతులతో సమావేశమయ్యారు. రోజువారీ ఉదయపు సమావేశాల పేరిట రక్షణ మంత్రి నిర్వహిస్తున్న ఈ సమావేశానికి ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ దళాల అధిపతులు హాజరయ్యారు. ప్రతిరోజూ త్రివిధ దళాల అధిపతులతో సమావేశాలు నిర్వహిస్తామని, రక్షణ కార్యదర్శితో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తామని తద్వారా త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందని రక్షణ మంత్రిత్వ శాఖ ఇప్పటికే ప్రకటించింది. అలాగే డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డిఎసి)తో పదిహేను రోజులకు ఒకసారి సమావేశం కానున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. | రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిరోజు త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్`అధిపతులతో సమావేశం జరుపుతామన్నారు. నిర్ణయాలు తొందరగా తీసుకోడానికి అనువుగా ఉంటుందని పేర్కొన్నారు. రక్షణ మరింత బలంగా చేయడానికి వారు కృషి చేస్తున్నారు. |
14,097 | https://www.prajasakti.com/WEBSECTION/International/page972/udta-punjabpai-steak-suprin-tiraskruti | పడకలు చాలక అవస్థలు | రాజస్థాన్లోని దోల్పూర్ జిల్లా సెంపావులో ఉన్న ప్రభుత్వాస్పత్రిలో 15 పడకలు మాత్రమే ఉన్నాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు వైరల్ జ్వరాలు వస్తుండటంతో ఆ ఆస్పత్రికి రోగుల తాకిడి ఎక్కువైంది. దీంతో వార్డుల్లో స్థలం లేక ఆస్పత్రి ఆవరణలో ఉన్న వేప చెట్ల కిందే వారికి చికిత్స అందిస్తున్నారు. అందులో భాగంగానే చెట్టు చుట్టూ సెలెన్ బాటిళ్లను వేలాడదీసి రోగులకు ఎక్కిస్తున్న దృశ్యం. | రాజస్థాన్లోని దోల్పూర్ జిల్లా సెంపావు లోని ప్రభుత్వాసుపత్రిలో ఉన్న 15 పడకలు చాలక, ఆస్పత్రి ఆవరణలో ఉన్న వేపచెట్ల కింద వచ్చే రోగులను చికిత్స అందజేస్తున్నారు. |
14,347 | https://www.prajasakti.com/WEBSECTION/International/page938/rashtra-jaatiya-sthai-kridal-sheidul | అస్సాంలో బాంబు పేలుళ్లు | స్వాతంత్య్రదినోత్సవ సంబరాల్లో యావత్ భారత్ జరుపుకుంటున్న సమయంలోనే దేశంలోని పలు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి. అస్సాం, మణిపూర్ రాష్ట్రాల్లో నాలుగు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించినట్లు అధికారులు తెలిపారు. అయితే ఇవన్నీ జనావాసానికి సుదూర ప్రాంతాల్లో సంభవించడంతో ఎటువంటి ప్రాణనష్టమూ సంభవించలేదని డిజిపి ముఖేష్ సహాయి మీడియాకు తెలిపారు. అస్సాంలోని టిన్సుకియా, శివసాగర్, మణిపూర్ రాజధాని ఇంఫాల్ల్లో ఈ పేలుళ్లు సంభవించాయి. | అస్సాంలోని టిన్సుకియా, శివసాగర్, మణిపూర్ రాజధాని ఇంఫాల్ల్లో స్వతంత్ర దినోత్సవం నాడు బాంబు పేలుళ్లు జరిగినాయి. ఇవి జనావాసానికి దూరంగా ఉండడం వలన ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. |
14,349 | https://www.prajasakti.com/WEBSECTION/International/page115/gram-sachivalayas-paryavekshan-badhyat-adhikarulde | "లవ్ యువర్ కంట్రీ"-కంగనా రనౌత్ | దేశాన్ని ప్రేమించాలంటూ బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ సలహా ఇస్తోంది. 70వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆమె ఓ ఆల్బమ్ను రూపొందించింది. సామాజిక రుగ్మతలు, అత్యాచారాలు, భ్రూణ హత్యలు, బాల్య వివాహాలు, వరకట్నం లాంటి అంశాలను ప్రస్తావిస్తూ 'లవ్ యువర్ కంట్రీ' పేరుతో విడుదల చేసిన ఈ ఆల్బమ్కు మంచి స్పందన వస్తోంది. ఇటీవలే స్వచ్ఛత పాటించాలంటూ ఓ వీడియోతో కంగనా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. | బాలీవుడ్ బ్యూటీ క్వీన్ కంగనా రనౌత్ సామజిక సమస్యలపై దృష్టి పెట్టింది. 70వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా "లవ్ యువర్ కంట్రీ" అంటూ ఒక ఆల్బమ్ను విడుదల చేసింది. |
14,350 | https://www.prajasakti.com/WEBSECTION/International/page912/arundhati-rayku-suprinlo-vurat | కాశ్మీర్ విముక్తికి నేనుంటా-అబ్దుల్ బాసిత్ | భారత్లోని పాకిస్థాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగుతోంది. నేడు పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయం వద్ద ఆ దేశ జెండా ఎగురవేసిన ఆయన కాశ్మీర్ విముక్తికి తాము మద్ధతిస్తామన్నారు. జమ్మూ ప్రజల త్యాగాలు విజయం సాధిస్తాయనే నమ్మకం ఉందన్నారు. కాశ్మీర్ అంశంపై పాక్ ప్రతిపాదనను భారత్ తిరస్కరించిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలకు ప్రాధ్యానత ఏర్పడింది. | భారత్లోని పాకిస్థాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ కాశ్మీర్ విముక్తికి తానెప్పుడూ తోడుగా ఉంటానన్నారు. పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయన జెండా ఎగరేస్తూ ఇలా అన్న మాటలపై మంటలు రేగుతున్నాయి. |
18,525 | https://www.prajasakti.com/WEBSECTION/International/page274/alpaday-vargalk-kott-grihanirman-pathaka | అందాల పోటిలో ప్రియాంక | గతేడాది జరిగిన ఆస్కార్ ఉత్సవాల్లో తన అందాలతో అందరినీ ఆకర్షించిన ప్రియాంక ఈ ఏడాది ఆస్కార్ వేడుకలకు కూడా హాజరుకాబోతోంది. ఈ విషయాన్ని ప్రియాంక ప్రముఖ హాలీవుడ్ నటుడు, గాయకుడు మిక్ జాగర్తో విమానం ఎక్కబోయే ముందు సెల్ఫీని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ వెల్లడించింది. గతేడాది ప్రియాంక డిజైనర్ జుహైర్ మురాద్ డిజైన్ చేసిన తెల్లటి గౌనులో, వజ్రాల కమ్మలతో రెడ్కార్పెట్పై మెరిసిపోయింది. మరి ఈసారి ఆస్కార్స్లో ప్రియాంక ఎలా మెరుస్తుందో వేచి చూడాల్సిందే. | గతేడాది జరిగిన ఆస్కార్ ఉత్సవాల్లో పాల్గొన్న ప్రియాంక ఎ ఏడాది కూడా పాల్గొంటుంది అని ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసారు . ఇంకా తన డిజైనర్ జుహైర్ మురాద్ డిజైన్ గురించి వెల్లడించారు . |
20,208 | https://www.prajasakti.com/WEBSECTION/National/page219/domalpai-yudlo-odin-prabhutvan | గాజాస్ట్రిప్ లోని హమాస్ స్థావరాలపై ఇజ్రాయిల్ వాయుసేన దాడి | గాజాస్ట్రిప్లోని హమాస్ స్థావరాలపై ఇజ్రాయిల్ వాయుసేన శనివారం మరోసారి దాడులు చేసింది. పాలస్తీనా నుండి ఇజ్రాయిల్ దక్షిణ ప్రాంతంపై జరిగిన రాకెట్ దాడులకు ప్రతీకారంగా ఈ దాడులు చేపట్టినట్లు ఇజ్రాయిల్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఉత్తరాన వున్న బీట్ హనౌన్ నుండి దక్షిణాన వున్నరఫా వరకూ మొత్తం నాలుగు ఖాళీ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు నిర్వహించామని, ఇందులో ఆస్తినష్టం మినహా ఎవరూ గాయపడలేదని ఈ వర్గాలు వివరించాయి. గాజాస్ట్రిప్లోని హమాస్ సైనిక శిక్షణా శిబిరాలు, ఇతర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని తమ విమానాలు దాడులు చేశాయని ఇజ్రాయిల్ సైన్యం ప్రకటించింది. | పాలస్తీనా నుండి ఇజ్రాయిల్ దక్షిణ ప్రాంతం గాజాస్ట్రిప్లోని హమాస్లో సైనిక శిక్షణా శిబిరాలపై, ఇతర స్థావరాలపై రాకెట్ దాడులకు ధీటుగా, నాలుగు ఖాళీ ప్రాంతాలపై వాయుసేన దాడులు జరుగగా, ప్రాణహాని జరగలేదని, కేవలం ఆస్తి నష్టం మాత్రమే జరిగిందని ప్రభుత్వం తెలిపింది. |
20,646 | https://www.prajasakti.com/WEBSECTION/National/page74/rendoraundk-prajnesh | ట్విట్టర్ లో ఎన్నికల ప్రచారం | వెనెజులా శాసనసభకు డిసెంబర్ 6న జరిగే ఎన్నికల్లో విజయం సాధించేలా చూడాలని అధ్యక్షుడు నికోలస్ మదురో శనివారం ప్రజలను ట్విటర్ ద్వారా అభ్యర్థించారు. బారినాస్ కాపిటల్ డిస్ట్రిక్ట్, అంజోయాటెగురి రాష్ట్రాల్లో యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ వెనెజులా ప్రారంభించిన ఎన్నికల ప్రచారానికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేసారు. ఈ ప్రచార విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తారు. టచీరా, నుయేవా, ఎస్పార్టా, అపూరేలలో ఎన్నికల ఆదేశాలను ప్రారంభిస్తూ, దక్షిణ అమెరికా దేశంలో శాంతి పరిరక్షణకు ఈ ఎన్నికల్లో విజయం చాలా ముఖ్యం అన్నారు. | దక్షిణ అమెరికా శాంతి పరిరక్షణలో ఉండాలంటే వచ్చే వెనెజులా శాసనసభ ఎన్నికల్లో తప్పక విజయం సాధించాలని, పలు ప్రదేశాలలో ఎన్నికల ప్రచారానికి ప్రారంభించిన వారికీ అధ్యక్షుడు నికోలస్ మదురో ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. |
32,095 | https://www.prajasakti.com/WEBSECTION/International/page1/mahil-anumanaspad-mriti | స్వచ్ఛ భారత్ పై ప్రసంగించిన ప్రధానమంత్రి మోడీ | న్యూఢిల్లి : స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రజా ఉద్యమంగా రూపు దిద్దుకుందని ప్రధాని మోడీ చెప్పారు. స్వచ్ఛ భారత్ మిషన్ తృతీయ వార్షికోత్సవంలో మోడీ మాట్లాడుతూ ప్రతివారూ దేశంలో పరిశుభ్రంగా ఉండాలని అనుకుంటూ ఉంటారని, అయితే దీనిని ఎవరుచేపడతారనేదే మౌలిక ప్రశ్నగా మిగిలిందని ఆయన అన్నారు. స్వచ్ఛ భారత్ ప్రాధాన్యతను 125 కోట్ల భారతీయులు గుర్తించారని, కేవలం కొందరు నాయకులో, అధికారులో కాదని ఆయన అన్నారు. భారతదేశం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నదని, అయితే దానర్థం వాటినుంచి పారిపొమ్మని కాదని, సవాళ్లను ఎదర్కొని వాటిని అధిగమించడానికి కృషిచేయాలని ఆయన అన్నారు. | స్వచ్ఛ భారత్ మిషన్ మూడవ వార్షికోత్సవంలో ప్రధానమంత్రి మోడీ మాట్లాడుతూ స్వచ్ఛభారత్ ప్రజా ఉద్యమంగా రూపు దాల్చిందని అందుకే 125 కోట్ల భారతీయులు దీనికి ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. అయితే ఈ మిషన్లో ఎవరు పాల్గొంటారు అన్నది ప్రశ్న అన్నారు. |
32,239 | https://www.prajasakti.com/WEBSECTION/National/page56/tathanu-champin-manavd | కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలో బొమ్మల పరిశ్రమను ఆదివారం ఇన్ఫ్రాచర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీస్ లిమిటెడ్ ( ఎంఫ్యాక్ట్ ) అధికారి షర్మిష్టా మహాోపాధ్యాయ పరిశీలించారు. స్ఫూర్తి పథకం ద్వారా బొమ్మల తయారీలో శిక్షణ అందిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కార్మికులు ఆర్థికంగా బలోపేతం కావటానికి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. మార్కెట్ విలువ పెంపు వంటి సదుపాయాలు కల్పించేందుకు సంస్థ కృషి చేస్తోందన్నారు. | ఎంఫ్యాక్ట్ అధికారి షర్మిష్టా మహోపాధ్యాయ కొండపల్లి బొమ్మల పరిశ్రమ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్థికంగా వృద్ధి చెందేందుకు మార్కెట్ ధరల పెంపు వంటి కార్యక్రమాలు చేయడానికి కృషి చేస్తామన్నారు. |
|
32,348 | https://www.prajasakti.com/WEBSECTION/International/page813/puranpai-nalugu-myachl-nishedha-nisisi | మోకీలు చిప్ప మార్పిడి ఆపరేషన్లను వచ్చే నెల 1 వ తేది నుంచి గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో అమల్లోకి తెస్తున్నామని మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. జిజిహెచ్లో మోకీలు శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన బుధవారం డిశ్చార్జి అయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పిపిపి పద్ధతిలో నిర్వహించే మోకాలి చిప్ప మార్పిడి చికిత్సలు సాయిభాస్కర్ ఆస్పత్రి అధినేత బూసిరెడ్డి నరేంద్రరెడ్డి ఆధ్వర్యంలో చేస్తారని చెప్పారు. ఇందుకు అవసరమైన నిధులు, పరికరాలు సమకూరుస్తామని మంత్రి వెల్లడించారు. | మోకీలు చెప్ప మార్పిడి ఆపరేషన్ లను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఇందుకు కావాల్సిన నిధులను, పరికరాలను త్వరలోనే సమకూరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. |
|
32,738 | https://www.prajasakti.com/WEBSECTION/International/page870/sibitai-appaginchandi | నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఎయు ( ఆంధ్రా యూనివర్సిటీ ) న్యాయ కళాశాల ఆచార్యులు ఎ. రాజేంద్రప్రసాద్ నియమితులయ్యారు. సౌమ్యుడిగా, మృదుస్వభావిగా పేరుగాంచిన ఆచార్య రాజేంద్రప్రసాద్కు ఉపకులపతి పదవి లభించడం పట్ల ఎయు విసి జిఎస్ఎన్ రాజుతో పాటు పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ బోధన, బోధనేతర సిబ్బంది సహకారంతో వర్సిటీని అభివృద్ధి పథంలో నడిపిస్తానని తెలిపారు. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావులకు అభినందనలు తెలిపారు. | నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతిగా న్యాయ కళాశాల ఆచార్యులు ఎం. రాజేంద్రప్రసాద్ నియమితులయ్యారు. సౌమ్యుడిగా, మృదుస్వభావి గా పేరుగాంచిన రాజేంద్ర ప్రసాద్ ఉపకులపతిగా పదవీ స్వీకరణ చేయడం ఏయూ విశ్వవిద్యాలయంలో అందరికీ చాలా ఆనందదాయకంగా అగుపించింది. |
|
32,829 | https://www.prajasakti.com/WEBSECTION/National/page610/hakkul-netal-grihanirbandha-podigimp | డీజిల్ రేట్లు తగ్గించాలనే డిమాండ్తో ఈ నెల 22 న నిరసన కార్యక్రమాలు చేపట్టి, మార్చి 1 న చలో ఢిల్లీకి పిలుపునిచ్చిన్నట్లు ఆలిండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన ్ ( ఎఐఆర్టి డబ్ల్యూఎఫ్ ) తెలిపింది. కోల్కతాలో శని, ఆదివారాలు జరిగిన ఫెడరేషన్ జాతీయ కార్యవర్గ సమావేశాలను సమాఖ్య ప్రధాన కార్యదర్శి కెకె దివాకర్ మీడియాకు విడుదల చేశారు. డిజిల్ ధర ఏడాది కాలంలో ఆరు సార్లు లీటరుకు రూ. 23 లు అదనంగా పెంచారని ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్కె జిలానీ, సిహెచ్ సుందరరావు ప్రకటించారు. | డీజిల్ ధర ఈ ఏడాది కాలంలో ఆరుసార్లు లీటర్ కు 23 పెంచారని ఎస్డబ్ల్యూఎఫ్ కార్యదర్శి పేర్కొన్నారు. డీజిల్ రేట్లు తగ్గించాలని డిమాండ్ నిరసన చేపట్టి చలో ఢిల్లీకి ఏఐ ఆర్ టి సి డబ్ల్యూ ఎఫ్ పిలుపునిచ్చారు. |
|
33,083 | https://www.prajasakti.com/WEBSECTION/National/page842/kuldeep-paine-ottidi | కామేశ్వరరావు, అప్పల నాయుడు, సిపిఎం నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఖండించారు. జన్మభూమి కార్యక్రమానికి కమ్యూనిస్టులు వ్యతిరేకరం కాదని, తాము పాలనలోని లోపాలను ఎత్తి చూపుతామని, ప్రజా సమస్యలు పరిష్కరిస్తామంటే అడ్డు చెప్పబోమని స్పష్టం చేశారు. సిఎం చంద్రబాబుకు టిడిపి వారు మినహా మిగతా పార్టీలవారంతా శత్రువులేనా అని ప్రశ్నించారు. పోలీసులు అత్యుత్సాహంతో ఇలాంటి ముందస్తు అరెస్టులు చేయకుండా ఇకనైనా సిఎం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. | విజయనగరం జిల్లాలో జన్మభూమి కార్యక్రమానికి సీఎం వస్తున్నాడని నెపంతో టి ఐ నాయకులను ముందస్తుగానే అరెస్టు చేయడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఖండించారు. కమ్యూనిస్టు జన్మభూమి కి వ్యతిరేకం కాదని, తెలుగుదేశం పార్టీ ఇలా చేయడం సబబు కాదని ఆయన పేర్కొన్నారు. |
|
35,054 | https://www.prajasakti.com/WEBSECTION/International/page307/jiro-tallerence-baadhitull-bhartiyuras | ప్రజల ఆమోదం లేకుండా భావనపాడు పోర్టు కోసం భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడం దారుణ మని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు చౌదరి తేజేశ్వరరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం భావన పాడులో ఆయనతోపాటు సిపిఎం జిల్లా కార్యదర్శి భవిరి కృష్ణ మూర్తి, సిపిఎం నాయకులు గురువారం పర్యటించి గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తేజేశ్వరరావు మాట్లాడుతూ సముద్రాన్ని నమ్ముకొని జీవిస్తున్న మత్స్యకారులు భావనపాడు గ్రామంలో బతకాలంటే, పోర్టుకు వ్యతిరేకంగా పోరాడాల్సిందేనని అన్నారు. భూసేకరణకు కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్కు గడువు గత నెల 31తో పూర్తవుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం గత నెల 28న నోటిఫికేషన్ జారీ చేసి ఈ నెల 3న భూసేకరణ ప్రకటన విడుదల చేసిందని విమర్శించారు. | శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం భావనపాడు కి చెందిన భూసేకరణ కోసం ప్రభుత్వం విడుదల చేసి నోటిఫికేషన్ చాలా అన్యామని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు చౌదరి తేజేశ్వరరావు అసహనాన్ని తెలియజేసేవారు, చాలా మంది ప్రజలు సముద్రాన్ని నమ్ముకొని జీవిస్తుంటం వలన భూసేకరణ జరగకుండా ఆపాలి ని అక్కడ స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. |
|
35,412 | https://www.prajasakti.com/WEBSECTION/International/page152/chattampai-gaurva-lekapote-rashtranni-vadilipondi-yogi-adityanath | పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి, బుట్టాయగూడెం మండలాల పరిధిలో చేపట్టిన జల్లేరు రిజర్వాయర్ నిర్మాణ పనులు నిర్వాసితులకు పూర్తి ప్యాకేజీ అమలు చేసిన తర్వాతే చేపట్టాలని సిపిఎం డిమాండ్ చేసింది. రిజర్వాయర్ నిర్మాణంతో ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో సిపిఎం పాదయాత్ర రెండోరోజైనా సోమవారం కొనసాగి, జీలుగుమిల్లి మండలం లంకాలపల్లిలో ముగిసింది. ఈ సందర్భంగా తాటిరామన్నగూడెం సభలో సిపిఎం పోలవరం డివిజన్ కార్యదర్శి ఎ. రవి మాట్లాడారు. నిష్ణాతులైన ఇంజనీర్లతో చర్చించి ముంపు తగ్గింపునకు చర్యలు తీసుకోవాలని కోరారు. | పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి, బుట్టాయగూడెం మండలాల పరిదిలో జరుగుతున్న జల్లేరు రిజర్వాయర్ పనులు అక్కడ నుండి తరలించిన ప్రజలకు ఇవ్వలిసిన ప్యాకేజీ ఇచ్చిన తరువాతనే జరగాలి అని సిపిఎం డిమాండ్ చేసింది. |
|
35,467 | https://www.prajasakti.com/WEBSECTION/International/page102/yuv-parishramikavettalku-prabhutva-sahakarmedi | అసంఘటిత రంగ కార్మికులకు పని భద్రత, కనీస వేతనాలు అమలు కోసం సెప్టెంబర్ 2న జరుగనున్న జాతీయ సార్వత్రిక సమ్మెలో కార్మికులంతా పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పి. రోజా పిలుపు నిచ్చారు. శనివారం విజయనగరంలోని దాబా తోటలో ముఠా కళాసీ కార్మికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అమలు చేయడంతోపాటు, కార్మిక హక్కులను కాలరాస్తున్నాయని వివరించారు. ఎన్నికలు ముందు అసంఘటిత రంగ కార్మికులకు పని భద్రత, కనీస వేతనాలు అమలు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా నేటికీ పట్టించు కోలేదన్నారు. | ఎన్నికలు ముందు అసంఘటిత రంగ కార్మికులకు పని, భద్రత కల్పిస్తాం అని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు వాటిని పట్టించుకోవట్లేదు అని, వాటికోసమే సెప్టెంబర్ 2 న చేసే సమ్మెకు కార్మికులు అంత వచ్చి సమ్మెని విజయవంతము చెయ్యాలి అని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పి. రోజా అన్నారు. |
|
1,792 | https://www.prajasakti.com/WEBSECTION/National/page372/prapanch-vyaptanga-aarthik-mandagamana | ఏపీలో సెన్సార్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయాలి : ఎంపీ మురళీమోహన్ | ఆంధ్రప్రదేశ్లో సెన్సార్బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయాలని ఎంపీ మురళీమోహన్ కోరారు. ఓబీసీ పార్లమెంట్ సభ్యులు ప్రధాని మోడీని కలిసిన అనంతరం మురళీమోహన్ మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్ర విభజనకు ముందు హైదరాబాద్లో కార్యాలయం ఉండేదన్నారు. ప్రతి రాష్ట్రంలో కేంద్ర సెన్సార్బోర్డు కార్యాలయం ఉండాలని కోరారు. విజయవాడ, విశాఖ, రాజమండ్రిలలో ఒక చోట ఏర్పాటు చేయాలన్నారు. | ఎంపీ మురళీమోహన్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో సెన్సార్ బోర్డ్ కార్యాలయం లేదు కాబట్టి ఏర్పాటు చేయాలనీ కోరారు. |
17,440 | https://www.prajasakti.com/WEBSECTION/National/page334/parishramikavettalto-netanyahu-vindu-bheti | జింబాబ్వే నూతన అధ్యక్షుడిగా ఇమ్మర్సన్ మనన్ గాగ్వా | జింబాబ్వే నూతన అధ్యక్షుడిగా ఇమ్మర్సన్ మనన్ గాగ్వా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాబర్ట్ ముగాబేను పదవీచ్యుతుడిని చేసిన సైన్యం ఆయన స్థానంలో ఇమ్మర్సన్ మనన్ గాగ్వాను అధ్యక్షుడిగా నియమించిన సంగతి తెలిసిందే. కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రజలు పండుగ చేసుకుంటున్నారు. ఆనందోత్సాహాలతో కొత్త అధ్యక్షుడికి స్వాగతం పలుకుతున్నారు. | జింబాబ్వే పాత అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే పదవి నుండి తప్పుకున్న తరణంలో ఆ దేశ ప్రజలు ఇమ్మర్సన్ మనన్ గాగ్వాను కొత్త అధ్యక్షుడిగా నియమించారు. |
19,654 | https://www.prajasakti.com/WEBSECTION/National/page914/neusiland-vedikaga-under19-prapanchakap | ఉగ్రవాద దాడిని ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందా లేదా? | ఉగ్రవాదులు దాడి చేసిన సందర్భంలో దానిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం ఏ మాత్రం సిద్ధంగా వుందన్న అంశం పై సమీక్షించాలని లండన్ నగర కొత్త మేయర్ సాదిక్ ఖాన్ అధికారులను ఆదేశించారు. ఇటీవల పారిస్, బ్రస్సెల్స్ నగరాల పై జరిగిన దాడుల నేపథ్యంలో ఈ అంశం పై నిశిత సమీక్ష నిర్వహించాలని మేయర్ నిర్ణయించారు. లండన్ నగర వాసులకు భద్రత కల్పించటం కన్నా మనకు ప్రధానమైన అంశం మరొకటి లేదని ఆయన మీడియా ప్రతినిధులకు స్పష్టం చేశారు. లండన్ నగరాన్ని సంరక్షిస్తున్న ప్రతి సంస్థ, ప్రతి వ్యక్తి అందుకు అవసరమైన వనరులు, ఉగ్రవాద దాడి జరిగిన సందర్భంలో దానిని తిప్పికొట్టే నైపుణ్యత కలిగి వుండాలన్నదే తన ఉద్దేశమన్నారు. | ఈ మధ్య పారిస్, బ్రస్సెల్స్ల పై జరిగిన దాడుల వలన లండన్ కొత్త మేయర్ సాదిక్ ఖాన్, టెర్రరిస్టులు ఎటాక్ చేసినప్పుడు అధికార యంత్రాంగం వెనక్కి తరిమే సామర్థ్యంతో ఉందా లేదా అని బాగా పరిశీలించామని అధికారులకు ఆర్డర్ వేశారు. లండన్ ప్రజలను కాపాడటం కంటే ముఖ్యమైనది లేదని మీడియాతో అన్నారు. |
19,658 | https://www.prajasakti.com/WEBSECTION/International/page906/srilankalo-petrol-korat | ఉక్కు ధరల నిర్ణయంలో చైనా ఉక్కు కంపెనీల ప్రధాన పాత్ర | అంతర్జాతీయంగా ఉక్కు ధరల నిర్ణయంలో చైనా ఉక్కు కంపెనీలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయంటూ అందతున్న ఫిర్యాదుల పై దర్యాప్తు జరపాలన్న అమెరికా ఇంటర్నేషనల్ ట్రెడ్ కమిషన్ (యుఎస్ఐటిసి) నిర్ణయం పై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా నిర్ణయం పై తాము తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నామన్న చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ, తమ ప్రయోజనాలను చట్టబద్ధంగానే కాపాడుకునేందుకు ప్రయత్నిస్తామని ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. అమెరికా అనుసరిస్తున్న రక్షణాత్మక విధానాలు ఉక్కు పరిశ్రమ సమస్యలను తీర్చటానికి బదులు ప్రపంచ వాణిజ్యాన్ని మరింత ధ్వంసం చేస్తాయని చైనా ఈ ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం ఉక్కు పరిశ్రమ ప్రపంచ వ్యాప్తంగా పెను సవాళ్లను ఎదుర్కొంటోందని, వీటిని పరిష్కరించేందుకు సమన్వయంతో కూడిన కృషి అవసరమని హితవు పలికింది. | అంతర్జాతీయంగా ముఖ్యంగా చైనా కంపెనీలు ఉక్కు వెలను ఫిక్స్ చేస్తున్నట్టు వస్తున్న వార్తల పై ఇన్వెస్టిగేట్ చేయాలన్న అమెరికా నిర్ణయాన్ని వ్యతిరేకించిన చైనా మంత్రిత్వశాఖ, ఇవి సమస్యని పరిష్కారించడానికి బదులు ప్రపంచ సంపదని నాశనం చేస్తాయని, దీనికి కోఆర్డినేషన్ అవసరమని ప్రకటించారు. తమ ప్రయోజనాలను చట్టబద్ధంగానే కాపాడుకోవడానికి ప్రయత్నిస్తామని తెలిపారు. |
33,045 | https://www.prajasakti.com/WEBSECTION/International/page97/deposits-upasanharistunn-patel-kamunity | ముఖ్యమంత్రి ఏజిల్లాకు వెళ్లినా ఆ స్థానిక అంగన్వాడీ, సిఐటియు, ప్రజాసంఘాల నాయకులను ముందస్తుగా అరెస్ట్లు చేస్తున్న ప్రభుత్వ వైఖరిని సిఐటియు, అంగన్వాడీ యూనియన్లు ఖండించాయి. ఈ మేరకు సోమవారం సిఐటియు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్. పుణ్యవతి, ఎంఎ. బేబిరాణి, కె. సుబ్బరావమ్మ విడివిడిగా ప్రకటనలు విడుదల చేశారు. మార్కాపురం జన్మభూమి సభలో సోమవారం పాల్గొంటారని ముందస్తుగా అర్ధరాత్రి 12 గంటల సమయంలో మహిళలని కూడా చూడకుండా అంగన్వాడీ నాయకులను అరెస్ట్ చేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు. | ముఖ్యమంత్రి జిల్లా వెళ్ళినా ఆ స్థానిక సీఐటీయూ, అంగన్వాడి, ప్రజా సంస్థల నాయకులు అరెస్టు చేస్తున్న వైఖరిని ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు. మార్కాపురం జన్మభూమి సభలో సీఎం పాల్గొన్నందుకు ముందుగానే మహిళా కార్మికులు అని కూడా చూడకుండా అంగన్వాడి సిబ్బందిని అరెస్టు చేయడం ప్రభుత్వానికి సిగ్గుచేటని పేర్కొన్నారు. |
|
34,671 | https://www.prajasakti.com/WEBSECTION/National/page925/21va-mahasabh-tirmana-prakarame-annikal-attugadle | లక్ష్యద్వీప్ పరిసరాల్లో కేంద్రీకృతమైన అల్పపీడనం రాగల 24 గంటల్లో తీవ్రరూపం దాల్చనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తమిళనాడులో రాగల 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈశాన్య రుతు పవనాలు చురుగ్గా కదులుతున్నందున అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ, లక్ష్యద్వీప్ పరిసరాల్లోనూ ఈశాన్య రుతు పవనాలు చురుగ్గా కదులుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. | లక్ష్యద్వీప్ పరిధిలో ఏర్పడిన అల్పపీడనం 24 గంటల్లో తీవ్రరూపం చూపెట్టబోతుందని వాతావరణ శాఖ చెప్తుంది. ఈ ప్రభావం తమిళనాడులో వర్షాలకు కారణం కాబోతుంది. ఆంధ్రప్రదేశ్లో ఈశాన్య రుతు పవనాల వల్ల వర్షాలు పడే పరిస్థితి కనిపిస్తుంది. |
|
90,563 | https://www.prabhanews.com/2019/03/%e0%b0%ae%e0%b1%81%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae%e0%b0%bf%e0%b0%a1%e0%b0%bf%e0%b0%b5%e0%b0%b0%e0%b0%82-%e0%b0%a8%e0%b1%87%e0%b0%b0%e0%b0%82-%e0%b0%9f%e0%b1%80%e0%b0%a1%e0%b1%80%e0%b0%aa%e0%b1%80/ | నేరం బయటపడిందని నా పై నెడతారా ? | తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి టీడీపీ ప్రభుత్వం నేరం చేసి నెపం నా మీద నెడుతున్నారన్నారు. ప్రజల డేటాను దొంగిలించి ప్రయివేట్ సంస్థలకు అప్పగించి, నేరం బయటపడిందని నెపం నా మీద నెడుతున్నారని, తన చిన్నాన్నను చంపి ఆ తప్పు నాపై నెడుతున్నారన్నారు . చంద్రబాబు చేసే ఆగడాలను, దోపిడీని మీడియా కప్పిపుచ్చడమే కాక నా మీద ఇష్టం వచ్చినట్లుగా ఆరోపణలు చేస్తున్నారన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి నా మీద దాడికి దిగుతున్నారనీ, మనం న్యాయం చేయమని అడిగితే, మీడియాతో ఇష్టం వచ్చినట్లుగా పిచ్చి రాతలు రాయిపిస్తారని, ఇంత అడ్డగోలు రాజకీయం తానెక్కడా చూడలేదన్నారు. | ముమ్మిడివరం ఎన్నికల ప్రచార ర్యాలీలో వైసీపీ నాయకుడు జగన్ ప్రసంగిస్తూ, టీడీపీ ప్రభుత్వం ప్రజల సమాచారాన్ని దొంగిలించి ప్రయివేటు సంస్థలకు అప్పగించిందని, తన చిన్నాన్నను చంపించి ఆ నేరం కూడా తనపై రుద్దుతున్నారన్నారు. మంత్రులు, ఎమ్మేల్యేలు తనపై కక్ష కట్టారని, దీనికి తోడు మీడియా కూడా వారికి సహకరిస్తుందన్నారు. |
90,569 | https://www.prabhanews.com/2019/03/%e0%b0%b8%e0%b0%a4%e0%b1%8d%e0%b0%af%e0%b0%b5%e0%b1%87%e0%b0%a1%e0%b1%81-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%a4%e0%b1%8d%e0%b0%af%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a5%e0%b1%81%e0%b0%b2-%e0%b0%a1%e0%b0%bf/ | సత్యవేడులో చంద్రబాబు ఎన్నికల ర్యాలీ | చిత్తూరు జిల్లా సత్యవేడులో ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికలలో ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతు కావాలన్నారు. అప్పులలో ఉండి కూడా ఐదేళ్లలో ఎంత చేసి చూపించానో, మరో పదేళ్లు ఇదే పట్టుదలతో ముందుకు పోతే దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాలలో ఏపీ ముందుంటుందన్నారు. కొందరు తెలంగాణలో ఉండి, జగన్ ను అడ్డం పెట్టుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చెందకుండా అడ్డుకుంటున్నారని, ప్రజలు తెలివిగా ప్రవర్తించకపోతే జీవితాలు తారుమారవుతాయన్నారు. మా ఐదేళ్ల పాలనలో ఎంత ఆనందంగా ఉన్నారో, రానున్న ఐదేళ్లలో మరింత సంపదను పెంచి, అంతకు మించి ఆనందంగా ఉంచుతామన్నారు. | సత్యవేడులో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, అప్పులలో ఉండి కూడా ఐదేళ్లలో ఎంతో అభివృద్ధి చేశామని, ఇలాగే సాగితే దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఏపీ ఉంటుందన్నారు. జగన్ సహకారంతో తెలంగాణలో కొందరు రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవటం శోచనీయమని ఆయన పేర్కొన్నారు. |
4,578 | https://www.prajasakti.com/WEBSECTION/National/page110/valsavasulku-abhyamicche-pranta-kaliphornia | మెట్రో రైళ్లపై ప్రజల అసంతృప్తి | హైదరాబాద్ మెట్రో రైలు నిర్ణీత సమయాల్లో గమ్యస్థానం చేర్చడం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. దీని బదులు సిటీ బస్పులు, బైకుల మీద వెళ్తే బాగుంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. మంగళవారం బేగంపేట ప్రాంతంలో ఓ మెట్రో రైలు సుమారు7 నిమిషాల పాటు ఆగిపోయిందని, ఓ వైపు ఛార్జీల భారం మరోవైపు ఆలస్యం ఏంటని ఓ ప్రయాణికుడు అసహనం వ్యక్తం చేశాడు. అటు మెట్రోలో ప్రయాణించేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయినట్లు సమాచారం. | మెట్రో రైలు సరైన సమయంలో గమ్యం చేరడంలేదని,చార్జీలు పేర్చడం పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెట్రోలో ప్రయాణించేవారి సంఖ్యా గణనీయంగా తగ్గుతుంది అని తెలుస్తుంది. |
5,711 | https://www.prajasakti.com/WEBSECTION/National/page891/prarambhamin-bijepi-karyavarg-samaveshal | జాకీర్ ను పంపడానికి నిరాకరించిన మలేషియా | తమ దేశంలో ఆశ్రయం పొందిన భారత్కు చెందిన వివాదాస్పద ఇస్లామిక్ మతబోధకుడు జకీర్ నాయక్ను తిరిగి భారత్కు పంపబోమని మలేసియా ప్రధాని మహతీర్ మహ్మద్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం తమ వద్ద ఆశ్రయం పొందిన జకీర్ నాయక్ తమ దేశానికి ఎటువంటి సమస్యా కలిగించనంత వరకూ ఆయన్ను వెనక్కి పంపబోమని అన్నారు. ఇస్లామిక్ రిసెర్చ్ ఫౌండేషన్ (ఐఆర్ఎఫ్) వ్యవస్థాపకుడైన జకీర్ నాయక్ 2016లో భారత్ను వదిలి మలేసియాకు వెళ్లటంతో అక్కడి ప్రభుత్వం ఆయనకు శాశ్వత నివాసహక్కు కల్పించింది. రెచ్చగొట్టే ప్రసంగాలతో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించిన ఆరోపణలపై భారత్ జకీర్ నాయక్ను 'మోస్ట్ వాంటెడ్ పర్సన్'గా ప్రకటించిన విషయం తెలిసిందే. | భరత్ మోస్ట్ వాంటెడ్ పర్సన్ గ ప్రకటించిన ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ వ్యవస్తపకుడిన జకీర్ నాయక 2016 నుండి శాశ్వత నివాస హక్కును మలేషియాలో పొందాడు. మలేసియా ప్రధాని మహతీర్ మహ్మద్ శుక్త్రవారం మీడియాతో మాట్లాడుతూ, సమస్యకు కారణం కానతవరకు జాకీర్ ను భరత్ కు పంపమని తెలిపారు. |
5,760 | https://www.prajasakti.com/WEBSECTION/International/page321/10-milian-yuei-dirhala-geluchukunn-bhartiy | రాయలసీమపై వివక్ష చూపుతున్న చంద్రబాబు | కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయలసీమను వివక్షకు గురి చేస్తున్నాయని సీపీఎం పార్టీ కేంద్రకమిటీ సభ్యులు గఫూర్ పర్కొన్నారు. కర్నూలులోని సుందరయ్య భవన్లో ఆయన మాట్లాడారు. రాయలసీమలోని కరవు పట్ల చంద్రబాబు పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బుధవారం రాయలసీమ బంద్ పాటిస్తున్నామని దీనిని ప్రజలందరూ జయప్రదం చేయాలని గఫూర్ కోరారు. | రాయలసీమ పై కెంద్రం, రాష్ట్రం వివక్షత చూపుతున్నారంటూ, దీనికి నిరసిస్తు రాయలసీమ బంద్ ప్రకటిస్తుందని, కరువు పట్ల చంద్రబాబు పట్టించుకోవట్లేదని గఫుర్ తెలిపారు. |
9,850 | https://www.prajasakti.com/WEBSECTION/International/page440/syria-irakpai-america-rashya-terki-sainyadhipatul-carch | స్కూళ్లలో చిన్నారుల సంరక్షణకు మార్గదర్శకాలు | దేశవ్యాప్తంగా స్కూళ్ళలో చిన్నారుల భద్రత, సంక్షేమానికి హామీ కల్పిస్తూ ప్రస్తుతమున్న మార్గదర్శకాలను అమలు చేయాలని ఇద్దరు మహిళా లాయర్లు దాఖలు చేసిన పిటిషన్పై ఈ నెల 15న సుప్రీంకోర్టు విచారించనుంది. రేయాన్ స్కూలు విద్యార్థి హత్య కేసు సందర్భంగా వచ్చిన ఇటువంటి విజ్ఞప్తిపై తాము ఇప్పటికే నోటీసు ఇచ్చామని ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ తెలిపింది. గత పిటిషన్తో దీన్ని కూడా జతపరుస్తామని పేర్కొంది. స్కూలు బస్సులోకి ఎక్కేటపుడు పిల్లల భద్రతకు సంబంధించి స్కూళ్ళ యాజమాన్యాలకు గల బాధ్యతను తెలియచేసేలా అదనంగా మార్గదర్శకాలను రూపొందించాలని మహిళా న్యాయవాదులు కోరారు. | రేయాన్ స్కూల్లో విద్యార్ధి హత్య తర్వాత స్కూళ్లలో భద్రత విషయంలో అందరిలో భయం పట్టుకుంది. ఇద్దరు మహిళా లాయర్లు సుప్రీమ్ కోర్టులో దేశంలోని పాఠశాలల్లో చిన్నారులకు భద్రత,సంక్షేమం ఉండాలని,దానికి తగిన హామీలు కావాలని పెటిషన్ వేశారు. |
10,241 | https://www.prajasakti.com/WEBSECTION/National/page167/operesion-smilelo-bhari-sthilo-hall-gurtimpu | ఆ ఫీజులను వెంటనే విద్యార్థులకు తిరిగివ్వాలి | విద్యార్థుల నుండి వసూలు చేసిన అదనపు ఫీజులను నిర్దేశిత గడువులోగా తిరిగి చెల్లించకపోతే స్కూళ్లను స్వాధీనం చేసుకునేందుకు వెనుకాడబోమని ఢిల్లీలోని దాదాపు 449 ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలకు కేజ్రీవాల్ సర్కారు హెచ్చరిక జారీ చేసింది. శుక్రవారం ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్కూల్ యాజమాన్యాలను 'క్రమశిక్షణ'లో పెట్టేందుకు అవసరమైతే స్కూళ్ల నిర్వహణలో ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు ఆరవ వేతన సంఘ సిఫార్సులు అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఈ స్కూళ్ల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అదనపు ఫీజులను వసూలు చేసినట్లు న్యాయమూర్తి అనిల్దేవ్సింగ్ నేతృత్వంలోని కమిటీ గుర్తించింది. ఈ స్కూళ్లకు ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేశామని, రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని సూచించామని ఈ సమావేశంలో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి మనిష్ శిశోడియా వివరించారు. | అనిల్దేవ్సింగ్ ఆధ్వర్యంలోని కమిటి లెక్కకు మించి ఫీజులు తీసుకుంటున్న దాదాపు 449 పాఠశాలలను గుర్తించి ఇచ్చిన గడువు లోపు ఆ ఫీజులను వెంటనే విద్యార్థులకు ఇవ్వాలని ఢిల్లీ సర్కార్ ఆ పాఠశాల యాజమాన్యాలకు నోటీసులు పంపినట్లు ఉపముఖ్యమంత్రి మనిష్ శిశోడియా తెలిపారు. దీనిపై ఈ పాఠశాలలు రెండువారాల్లోపు వివరణ ఇవ్వాలని అన్నారు. |
11,577 | https://www.prajasakti.com/WEBSECTION/International/page746/not-ivvandi-otu-veyandi | ఆవులకీ ఆధార్ | న్యూఢిల్లీలో దేశవ్యాప్తంగా ఉన్న ఆవులన్నింటికీ ఆధార్ నెంబర్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఒక నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఆవుల అక్రమ రవాణాను అరికట్టడానికి ఆధార్ నెంబర్లు ఇవ్వడం సముచితమని కేంద్రం ఆ నివేదికలో పేర్కొంది. అలాగే పాలు ఇవ్వగలిగే దశ దాటిపోయిన ఆవుల రక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ అవసరమని కేంద్రం పేర్కొంది. | ఆవుల అక్రమరవాణాను అరికట్టి, వయసుపై పడిన ఆవులకి ప్రత్యేక శ్రద్ద చూపేందుకు, ఆవులకు ఆధార్ కార్ద్ ఇవ్వలని కేంద్ర ప్రభుత్వం యోచించి, సుప్రీంకోర్టుకు నివేదికను సమర్పించింది. |
20,253 | https://www.prajasakti.com/WEBSECTION/National/page511/aienephn-ashrainchin-palk | విద్యార్థులను సరిహద్దులో వదిలి పెట్టిన ఆస్ట్రియా | విద్యాభ్యాసం కోసం ఇతరదేశాల నుండి వచ్చిన విద్యార్ధులు తమ జాతీయతపై అసత్యాలు చెప్పారన్న ఆరోపణలతో వందలాది మందిని ఆస్ట్రియా ప్రభుత్వం వెనక్కిపంపి వేసింది. జర్మనీకి వెళ్లే బాల్కన్ మార్గంలో చివరి దేశమైన ఆస్ట్రియాలో ఆశ్రయం పొందే అవకాశాలు మెరుగు పడతాయన్న ఉద్దేశంతో ఆయా దేశాల విద్యార్ధులు తమ జాతీయతపై అసత్యాలు చెప్పారని, పోలీసుల ప్రతినిధి ఒకరు వివరించారు. ఆస్ట్రియా ప్రభుత్వం వీరిలో కొందరిని బస్సులు ఎక్కించి జర్మనీ సరిహద్దుల వద్ద వదిలి పెట్టేసింది. ఆస్ట్రియాలోని దక్షిణ ప్రాంతంలో వున్న కరింతియా ప్రావిన్స్లో వున్న చెక్పోస్టుల్లో సరిహద్దుల నుండి రోజూ వచ్చే దాదాపు 3 వేల మందికి పైగా విద్యార్ధులను తనిఖీలు చేసిన సమయంలో వారు తమ జాతీయత విషయంలో అబద్ధాలు చెప్పిన విషయం బయటపడిందని పోలీసు ప్రతినిధి వివరించారు. | ఆస్ట్రియాలో దక్షిణ ప్రాంతంలో ఉన్న కరింతియా ప్రావిన్స్లోని చెక్ పోస్టుల వద్ద వలస వస్తున్న విద్యార్థులను పోలీసులు తనిఖీ చేస్తుండగా తమ జాతీయతను తప్పుగా వెల్లండించిన విద్యార్థులు బయటపడ్డారు. స్ట్రియాలో సులువుగా ఆశయం పొందేందుకు వారు తప్పుడు వివరాలను ఇచ్చారని పోలీసు అధికారి తెలిపారు. ఆస్ట్రియా ప్రభుత్వం కొందరిని బస్సులో జర్మనీ సరిహద్దు దగ్గర వదిలిపెట్టింది. |
20,645 | https://www.prajasakti.com/WEBSECTION/National/page288/shubhakankshalato-saripettoddu-charchl-prarambhinchandi | రష్యా రాయబార కార్యాలయం పై దాడి | ఇక్కడి రష్యా రాయబార కార్యాలయంపైకి మంగళవారం నాడు రెండు రాకెట్లు రావటంతో పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న స్థానికులు తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. మంగళవారం నాడు దాదాపు 300 మంది ప్రజలు రష్యా వైమానిక దాడులకు సంఘీభావం తెలిపేందుకు రష్యా రాయబార కార్యాలయం వద్దకు చేరిన సమయంలో ఈ రాకెట్లు దౌత్య కార్యాలయంపైకి దూసుకు వచ్చాయి. దీనితో తీవ్ర భయాందోళనలకు లోనైన ప్రజలు పరుగులు తీయటంతో ఈ దాడిలో ఎవరైనా గాయపడినారా లేదా ప్రాణాలు కోల్పోయారా అనే విషయం వెంటనే తెలియరాలేదు. రష్యా దౌత్య కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని గతంలో తిరుగుబాటు దళాలు దాడులు చేసినప్పటికీ మంగళవారం నాటి దాడి ఎవరు చేసారన్న విషయంపై సందిగ్ధత నెలకొంది. | రష్యా వైమానిక దాడులకు సంఘీభావం తెలపడానికి రష్యా రాయబార కార్యాలయంకి వచ్చిన ప్రజల పై రెండు రాకెట్లు దూసుకురావడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. అయితే ఎంత ప్రాణనష్టం జరిగిందో ఇంకా వెలువడలేదు. తిరుగుబాటు దళాల దాడి చేశాయా లేదా ఇంకెవరైనా చేసారా అని ఇంకా స్పష్టత రాలేదు. |
8,442 | https://www.prajasakti.com/WEBSECTION/International/page13/bharat-pai-america-nigha | దీపావళి సందర్బంగా అమెజాన్ ఆఫర్స్ | రాబోయే దీపావళి సందర్బంగా అమెజాన్ డాట్ ఇన్ తన కార్పొరేట్ కస్టమర్లకు అనువైన గిఫ్ట్ కార్డులను ఆఫర్చేస్తోంది. ఇటువంటి గిఫ్ట్ కార్డుల ద్వారా వినియోగదారులను మరింతగా ఆకట్టుకుంటూ అమెజాన్ వేదికలోని 6 కోట్ల ఉత్పత్తులను వినియోగదారులకు మరింత చేరువచేయాలని సంస్థ యోచిస్తోంది. ఈ గిఫ్ట్ కార్డులను వినియోగదారులు, ఓచర్లను కొనుగోలు చేసేందుకు వినియోగించవచ్చు. అలాగే ఈ దీపావళి సందర్బంగా అమెజాన్ తన వెబ్సైట్లో పలు ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. | రాబోయే దీపావళి సందర్బంగా అమెజాన్, ఓచర్లను కొనుగోలు చేసేందుకు గిఫ్ట్ కార్డులను ఆఫర్చేస్తోంది. వీటి ద్వారా అమెజాన్ వినియోగదారులకు మరింత చేరువవ్వాలని యోచిస్తోంది. |
33,359 | https://www.prajasakti.com/WEBSECTION/National/page578/top10-lo-yuv-golfr-aditi | సిఎం చంద్రబాబు టిడిపిని తెలంగాణాలో టిఆర్ఎస్కు అమ్మేసుకుని, దుకాణం మూసేయబోతున్నారని వైసిపి అధికార ప్రతినిధులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు విమర్శించారు. గుంటూరులో బుధవారం వారు మీడియాతో మాట్లాడుతూ, వరంగల్ ఉపఎన్నికల్లో విపక్షాల నాయకులందరూ ప్రచారం చేస్తుంటే టిడిపి అధినేత మాత్రం అక్కడ కనిపించడం లేదన్నారు. టిఆర్ ఎస్కు మేలు చేయాలనే లక్ష్యంతోనే చంద్రబాబు ఉప ఎన్నికల వైపు కన్నెత్తి చూడడం లేదన్నారు. ప్రజల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈనెల 26న గుంటూరులో రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. | బుధవారం గుంటూరులో వైసిపి అధికార ప్రతినిధులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ, టిఆర్ఎస్కు టిడిపిని సిఎం చంద్రబాబు అమ్మేశారని అన్నారు. |
|
2,205 | https://www.prajasakti.com/WEBSECTION/International/page970/asharanku-bale-tiraskaran | ఏ.ఐ.ఏ.డీ.ఎం.కే నేతల సమావేశం | తమిళనాడులోని పోయెస్ గార్డెన్స్లో ఏ. ఐ. ఏ. డీ. ఎం. కే నేతల సమావేశం కొనసాగుతోంది. ఎం ఓ. పన్నీరు సెల్వం, ఆయన కేబినెట్ సహచరులు, కొందరు పార్టీ ప్రముఖులు సమావేశంలో పాల్గొన్నారు. తమిళనాడు సీ. ఎంగా శశికళను ఎన్నుకునే అవకాశం ఉందని వార్తలు వస్తోన్న నేపధ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. నేతల సమావేశం నేపథ్యంలో ఏ. ఐ. ఏ. డీ. ఎం. కే కార్యకర్తలు పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద గుమికూడారు. | తమిళనాడులోని పోయెస్ గార్డెన్స్లో ఏ. ఐ. ఏ. డీ. ఎం. కే నేతలు సమావేశమయ్యారు. రాష్ట్ర సీ. ఎంగా శశికళను ఎన్నుకునే అవకాశాలున్నాయని వార్తలు వస్తోన్న నేపధ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. |
2,433 | https://www.prajasakti.com/WEBSECTION/International/page940/airasku-tolisariga-mahila-saradhyam | ఇఎస్ ఐ చట్టం | ప్రైవేటుస్కూళ్లను ఇఎస్ఐ చట్టపరిధిలోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తాము వ్యతిరేకిస్తున్నట్లు ది నేషనల్ ఇండిపెండెంట్ స్కూల్స్ అలయెన్స్ (నిసా) ప్రకటించింది. కేంద్రం ఈ చర్యలు అమలు చేస్తే తాము ఫీజులు పెంచాల్సి వుంటుందని నిసా ఒక ప్రకటనలో వివరించింది. ఇటీవలి కాలంలో ఉద్యోగుల్ని భవిష్యనిధి చట్ట పరిధిలోకి తెచ్చేందుకు ప్రైవేటు స్కూళ్లపై ప్రభుత్వం తెస్తున్న ఒత్తిడి వల్ల తాము ఫీజులు పెంచాల్సిన పరిస్థితి కల్పిస్తోందని పేర్కొంది. వాస్తవానికి ప్రమాదకర పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల కోసం అమలులోకి తెచ్చిన ఇఎస్ఐ చట్టం ప్రైవేటు స్కూల్ టీచర్లకు వర్తింప చేయాలని చూడటం అర్ధరహితమని, ఇప్పుడు ఈ చట్టాన్ని గత కాలం నుండే స్కూళ్ళకు వర్తింప చేసేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో స్కూళ్లు గతకాలపు బకాయిలను చెల్లించే పరిస్థితిలో లేవని నిసా అధ్యక్షుడు కులభూషణ్ శర్మ ఈ ప్రకటనలో పేర్కొన్నారు. | ప్రైవేటుస్కూళ్లను ఇఎస్ఐ చట్టపరిధిలోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల వల్ల ఫీజులు పెంచాల్సి వస్తుందని నేషనల్ఇండిపెండెంట్స్కూల్స్ప్రకటించింది. వాస్తవానికి ప్రమాదకర పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల కోసం అమలులోకి తెచ్చిన ఇఎస్ఐ చట్టం ప్రైవేటు స్కూల్ టీచర్లకు వర్తింప చేయాలనిచూడటం అర్ధరహితమని నిసా అధ్యక్షుడు కులభూషణ్ శర్మ ఈ ప్రకటనలో పేర్కొన్నారు. |
2,606 | https://www.prajasakti.com/WEBSECTION/International/page414/kullin-vari-dubbulatho-raitul-nirsan | సిపిఎం పొలిట్ బ్యూరో భేటీ | శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ఇక్కడ సిపిఎం కేంద్ర కమిటీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో పార్టీ పొలిట్ బ్యూరో గురువారం నాడు భేటీ అయ్యింది. సిపిఎం రాష్ట్ర ప్రధానకార్యాలయం ఎకెజి కేంద్రంలో ఎస్ రామచంద్రన్ పిళ్లై అధ్యక్షతన పొలిట్ బ్యూరో భేటీ జరిగింది. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి, ప్రకాశ్కరత్, బిమన్ బసు, పినరయి విజయన్, బివి రాఘవులు, కొడియేరి బాలకృష్ణన్, ఎంఎ బేబి, సూర్యకాంత మిశ్రా, ఎకె పద్మనాభన్, బృందాకరత్, మహమ్మద్ సలీమ్, సుభాషిణి అలీ, హన్నన్ మొల్లా, జి రామకృష్ణన్ పాల్గొన్నారు. అత్యవసర అధికారిక కార్యక్రమాలు ఉండటం వలన ఈ సమావేశానికి త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ రాలేకపోయారు. | సిపిఎం కేంద్ర కమిటీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఎస్ రామచంద్రన్ పిళ్లై అధ్యక్షతన పొలిట్ బ్యూరో భేటీ జరిగింది. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరితో పాటు పలువురు ప్రముఖ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సమావేశానికి త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ రాలేకపోయారు. |
3,279 | https://www.prajasakti.com/WEBSECTION/International/page3589/gurtimpu-leni-hotelpai--foodsefti-adhikarulu-daadi- | గుర్తింపు లేని హోట ళ్ల పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడి | తెలంగాణ జీహెచ్ఎంసీ పరిధిలో హోటళ్లపై ఫుడ్సేఫ్టీ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. గుర్తింపు లేని షాపులు మటన్ ఉపయోగిస్తున్నారని, శ్రీనగర్ కాలనీలోని గ్రీన్బావార్చీ కి రూ. 10 వేలు జరిమానా విధించారు. మాదాపూర్లోని యువర్ ఫ్రెండ్ బావార్చీ హోటల్ని అధికారులు సీజ్ చేశారు. | తెలంగాణ జీహెచ్ఎంసీ పరిధిలో గుర్తింపు లేని హోటళ్లపై జరిమానా విధించి ఫుడ్సేఫ్టీ అధికారులు దాడులు జరుపుతున్నారు |
3,445 | https://www.prajasakti.com/WEBSECTION/International/page631/pratyek-railway-zone-erpat-cheyandi | ఉగాది బాలపురస్కారాలు | శిఖరం ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో రవింద్రభారతిలోని సమావేశ మందిరంలో ఉగాది బాలపురస్కారాల ప్రదానోత్సవం మంగళవారం జరిగింది. శాసన మండలి పూర్వ సభ్యులు రుద్రరాజు పద్మరాజు పాల్గొని మాట్లాడుతూ పేరుపొందిన వారికి అందించే పురస్కారాలు కంటే బాలలు ప్రొత్సహిస్తూ బాలలకు అందించే పురస్కారాలకు ప్రయోజనం ఉంటుందన్నారు. పూర్వ పోలీసు ఉన్నతాధికారి డా. సి. ఎల్ గోపినాథరెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ వివిధ రంగాలలో పిల్లలను తల్లిదండ్రులు ప్రొత్సహిస్తే వారు జాతి కీర్తిని నిలుపుతారని ఆకాంక్ష వ్యక్తం చేశారు. పురస్కారాలను అందుకున్న వారిలో త్రిశాంక్ శేఖర్ ( ఇంద్రజాలం ) , అమృత, గీష్మారెడ్డి, అక్షరా రెడ్డి, నిత్యశ్రీ ( కూచిపూడి నృత్యం ) బాలపురస్కారాలను అందుకోగా వివిధ రంగ ప్రముఖులకు ప్రతిభా పురస్కారాలను బహూకరించారు. జి. కృష్ణ స్వాగతం పలికిన కార్యక్రమంలో సమాజిక వేత్త కొత్త కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. | మంగళవారం రవింద్రభారతిలోని సమావేశ మందిరంలో జరిగిన ఉగాది బాలపురస్కారాల ప్రదానోత్సవానికి డా. సి. ఎల్ గోపినాథరెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులు మాట్లాడుతూ వివిధ రంగాలలో పిల్లలను తల్లిదండ్రులు ప్రోత్సహించాలని తెలిపారు. పురస్కారాలను అందుకున్న వారు వివిధ రంగ ప్రముఖులకు ప్రతిభా పురస్కారాలను బహూకరించారు. |
3,541 | https://www.prajasakti.com/WEBSECTION/International/page644/karti-vesin-pitishanpai-vadani-januarilo-wintamann-suprin-cort | స్పోర్ట్స్ స్పెషాలిటి క్లినిక్ | ఎల్బిట్ మెడికల్ డయాగస్టిక్స్ ప్రత్యేకంగా స్పోర్ట్స్ మెడిసన్ స్పెషాలిటి క్లినిక్ స్పోర్ట్స్ న్యూట్రీషన్, ఫిట్నెస్ న్యూట్రీషన్ క్లినిక్ను హైదరాబాద్ బంజారాహిల్స్లో అందుబాటులోకి తెచ్చింది. ఈ సందర్బంగా ఎల్బిట్ మెడికల్ డయాగస్టిక్స్ సిఒఒ కన్నన్ పెరుమాళ్ మాట్లాడుతూ ఈ తరహా క్లినిక్ నగరంలో ఇదే మొదటిదని ఇక్కడ స్పోర్ట్స్ మెడిసన్ సంబంధించి సమగ్ర సంరక్షణను అందించడం జరుగుతుందన్నారు. అన్ని క్రీడా విభాగాలకు చెందిన క్రీడాకారులు, మార్షల్ ఆర్ట్స్లో ప్రవేశం ఉన్నవారు, సాహస క్రీడలపై ఆసక్తి ఉన్నవారు, ఆధునిక, సాంప్రదాయ నృత్యకారులకు అపారమైన అనుభవం, నైపుణ్యం కలిగిన సీనియర్ స్పోర్ట్స్ మెడిసన్, ఫిట్నెస్, న్యూట్రీషన్ కన్సల్టెంట్స్ ఆత్యాధునికమైన చికిత్సను అందిస్తారని తెలిపారు. విజయవంతమైన క్రీడా వృత్తిని కొనసాగించేందుకు అవసరమైన కౌన్సిలింగ్ను, మార్గనిర్దేశాన్ని చేయడంతో పాటు, వారు తమ పూర్తి సామర్ద్యాన్ని సాధించేందుకు, క్రీడా గాయాలను తగ్గించుకునేందుకు, వాటినుండి రక్షించుకోవడం ద్వారా శిఖరస్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన కొనసాగేందుకు, వారి వృతిలో కొనసాగేందుకు సాయపడతుందన్నారు. | హైదరాబాద్ బంజారాహిల్స్లో స్పోర్ట్స్ మెడిసన్ స్పెషాలిటి క్లినిక్ స్పోర్ట్స్ న్యూట్రీషన్, ఫిట్నెస్ న్యూట్రీషన్ క్లినిక్ను ఎల్బిట్ మెడికల్ డయాగస్టిక్స్ వారు ప్రారంభించారు. అన్ని క్రీడా విభాగాలకు చెందినవారికి ఆత్యాధునికమైన చికిత్సను అందిస్తారని తెలిపారు. విజయవంతమైన క్రీడా వృత్తిని కొనసాగించేందుకు అవసరమైన కౌన్సిలింగ్ను, క్రీడా గాయలు తగ్గెలగా చికిత్సలు ఉంటాయని అన్నారు. |
4,174 | https://www.prajasakti.com/WEBSECTION/National/page554/verushangaku-maddatu-dhar-kalpistan | ఏర్పాటైన వక్ఫ్ బోర్డు | రాష్ట్ర వక్ఫ్ బోర్డు సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 11 మంది సభ్యులతో వక్ఫ్బోర్డు ఏర్పాటైంది. సభ్యులుగా ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్సీ సలీం, ఎమ్మెల్యే మొజాంఖాన్, బార్ కౌన్సిల్ సభ్యుడు జాకీర్ హుస్సేన్ జావేద్, మొసావలి సయ్యద్ అక్బర్ నిజాముద్దీన్ హుస్సేనీ, నిర్వాహక కమిటీ నుంచి మీర్జా అన్వర్బేగ్తో పాటు మరో ఐదుగురు నామినేటెడ్ సభ్యులతో వక్ఫ్ బోర్డు ఏర్పాటు నియామకం జరిగింది. రేపు ఉదయం 11.30 గంటలకు వక్ఫ్బోర్డు ఛైర్మన్ ఎన్నిక జరగనుంది. | వక్ఫ్ బోర్డు సభ్యులుగా ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్సీ సలీంతో పాటు మరో తొమ్మిది మంది నామినేట్ అయ్యారు. రేపు ఉదయం 11.30 గంటలకు వక్ఫ్బోర్డు ఛైర్మన్ ఎన్నిక జరగనుంది. |
4,964 | https://www.prajasakti.com/WEBSECTION/National/page728/prarambhamin-railway-baxing-poties | రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ కు గిన్నిస్ బుక్ రికార్డు | ప్రముఖ చిన్న పిల్లల వైద్య సేవల సంస్థ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రీమెచ్చూరిటీ పిల్లలను హైదరాబాద్లో ఒక్క చోటికి చేర్చి గిన్నిస్ బుక్ రికార్డులో స్థానం సంపాదించేలా చేసింది. 445 మంది ప్రిమెచ్యూర్డ్ ( నెలలు నిండకుండానే పుట్టిన ) పిల్లలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రిమెచ్యూరిటీ డే వేడుకల సందర్బంగా రెయిన్బో హాస్పిటల్స్ యాజమాన్యం చేసిన ఈ కార్యక్రమానికి గిన్నిస్బుక్ సంస్థ ప్రపంచ రికార్డుగా నమోదు చేసింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు, నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బాత్రా, రెయిన్బో హాస్పిటల్స్ సిఎండి డాక్టర్ రమేష్ కంచర్ల తదితరులు పాల్గొని మాట్లాడారు. | ప్రిమెచ్యూరిటీ డే వేడుకల సందర్బంగా రెయిన్బో హాస్పిటల్స్ యాజమాన్యం 445 మంది ప్రిమెచ్యూర్డ్ పిల్లలను ఒక్క చోటికి చేర్చి గిన్నిస్ బుక్ రికార్డులో స్థానం సంపాదించింది. ఇందులో భాగంగా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. |
5,136 | https://www.prajasakti.com/WEBSECTION/International/page408/kochi-cherukunn-pradhani-modi | సినీవినిలాకాశంలో వెలిగిన కాంతారావుకు నివాళులు | జానపద కథానాయకుడిగా పలు చిత్రాలలో నటించి తెలంగాణ ప్రాంతం నుంచి మెరుపులా సినీవినిలాకాశంలో వెలిగిన తెలంగాణ రత్నం కాంతారావు అని ప్రముఖలు నివాళులు అర్పించారు. రవీంద్రభారతిలోని సమావేశ మందిరంలో బుధవారం తెలంగాణ భాషాసాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కాంతారావు జయంతి సభ జరిగింది. రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ నాడు ఆంధ్రప్రాంతానికి చెందిన ఎన్టీఆర్, ఎఎన్ఆర్ వంటి దిగ్గజ నటులతో సముజ్జీగా నటించిన కాంతారావు సినీ పరిశ్రమలో మంచిపేరు తెచ్చుకున్నారని అన్నారు. ప్రముఖ దర్శక నిర్మాత అల్లాణి శ్రీధర్ మాట్లాడుతూ కాంతారావు స్నేహశీలి ధాతృత్వం గలవారని తొలినాళ్లలో బాగా సంపాదించిన చివరి రోజుల్లో అర్థికంగా ఇబ్బందులు పడ్డారని వివరించారు. | రవీంద్రభారతిలో తెలంగాణ భాషాసాంస్కృతిక శాఖ సమక్షంలో కాంతారావు జయంతి సభ జరిగింది. ఎన్టీఆర్, ఎఎన్ఆర్ వంటి నటులతో సమానంగా నటించి మెరుపులా సినీవినిలాకాశంలో వెలిగిన తెలంగాణ రత్నం అని ప్రముఖలు నివాళులు అర్పించారు. |
6,666 | https://www.prajasakti.com/WEBSECTION/International/page896/iraslo-america-rayabariga-kelli-craft | హరితహారం చేపట్టిన తల్వాకర్స్ బివిఎఫ్ లిమిటెడ్ ఉద్యోగులు | తల్వాకర్స్ బివిఎఫ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో హరితహార కార్యక్రమాన్ని నిర్వహించారు. మంగళవారం బంజారాహిల్స్ జిమ్ ప్రాంతంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తల్వాకర్స్ ఉద్యోగులు 200 మొక్కలు నాటారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకం చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని సంస్థ ఉద్యోగులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జీ గోవర్ధన్రెడ్డి, వెంకటేశ్వర నగర్ కార్పొరేటర్ కవితారెడ్డి తదితరులు పాల్గొన్నారు. | మంగళవారం బంజారాహిల్స్లో హరితహార కార్యక్రమంలో తల్వాకర్స్ ఉద్యోగులు 200 మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కవిత రెడ్డి తదితరులు పాల్గొన్నారు. |
6,671 | https://www.prajasakti.com/WEBSECTION/International/page228/medical-rips-samasyal-parishkarinchali | హాసం క్లబ్ కార్యక్రమాలు | హాసం క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి నెల నిర్వహిస్తున్న సంగీతం, హాస్యం మిళిత కార్యక్రమాలలో భాగంగా శ్రీ త్యాగరాయ గానసభలోని కళాసుబ్బారావు కళావేదికపై శనివారం స్వర గీతిక సంగీత నిలయం ఆధ్వర్యంలో డైరెక్టర్ సత్యభామ నిర్వహణలో సినీ భక్తి గీతాల విభావరి జరిగింది. తేజ ఇందరా రెడ్డి, నరేష్, హరిచందన మధురమైన సినీ గీతాలను ఆలపించగా వశ్య సమీక్ష భక్తి గీతాలను గానం చేశారు. సుబ్రహ్మణ్యం, ఎఎస్ ప్రకాష్, రవీందర్, శ్రీనివాస్ ప్రదర్శించిన హాస్య కథాంబం అలరించింది. ఈ సందర్భంగా హాసం క్లబ్ అధ్యక్షుడు ఎల్వీ ప్రసాద్ నిర్వాహణలో టీవీ, సినీ నటుడు మాణిక్యంతో సత్కారం జరిగింది. | హాసం క్లబ్ ఆధ్వర్యంలో శనివారం సినీ భక్తి గీతాల విభావరి జరిగింది. కొందరు సినీ గీతాలను ఆలపించగా మరి కొందరు హాస్యం తో అలరించారు. ఈ సందర్భంగా సినీ నటుడు మాణిక్యంతో సత్కారం జరిగింది. |
7,201 | https://www.prajasakti.com/WEBSECTION/International/page3/iset-sit-ketaimp-phurti | ఎమ్మెల్సీగా బి నరేష్ కుమార్ రెడ్డి | చిత్తూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బి నరేష్ కుమార్ రెడ్డి ఎన్నికైనట్టు ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. దేశాయి తిప్పారెడ్డి ఎన్నిక చెల్లదని ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్సీగా దేశాయి తిప్పారెడ్డి ఎన్నిక చెల్లదని సవాల్ చేస్తూ 2011 లో నరేష్కుమార్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను న్యాయమూర్తి జస్టిస్ ఎం సత్య నారాయణ మూర్తి విచారించి ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. రిజిస్ట్రార్ సమక్షంలో ఇరువురికి వచ్చిన ఓట్లను లెక్కించగా ఇద్దరికీ సమానంగా ఓట్లు పోలయ్యాయని, అందువల్ల ప్రజాప్రాతినిధ్య చట్టం ,1951 సెక్షన్ 102 ప్రకారం ఇరు పక్షాల న్యాయవాదుల సమక్షంలో లాటరీ తీయగా నరేష్కుమార్ రెడ్డి ఎన్నికయ్యారని న్యాయమూర్తి ఉత్తర్వులో పేర్కొన్నారు. | ఎమ్మెల్సీగా పోటి చేసిన బి నరేష్ కుమార్ రెడ్డి, దేశాయి తిప్పారెడ్డి సమాన ఓట్లు రావడం వల్ల 1951 సెక్షన్ 102 ప్రకారం ఇరు పక్షాల న్యాయవాదుల సమక్షంలో లాటరీ తీయగా నరేష్కుమార్ రెడ్డి ఎన్నికయ్యారని న్యాయమూర్తి ఉత్తర్వులో పేర్కొన్నారు. |
7,271 | https://www.prajasakti.com/WEBSECTION/International/page3/annikal-kamishnar-rajinama-cheyali | ఎస్టీలు ఆర్థికంగా ఎదగాలి | ఎస్టీలు ఆర్థికంగా ఎదిగేందుకు పలు నూతన పథకాలను చేపట్టనున్నట్టు రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖమంత్రి రావెలకిశోర్బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా ఆర్థిక ప్రోత్సాహక పథకం ద్వారా దరఖాస్తు చేసుకునే లబ్ధిదారుల వయో పరిమితిని 18 నుంచి 50 సంవత్సరాల పెంచామన్నారు. గతంలో 18 నుంచి 40 సంవత్సరాల వారు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు వీలుండేదని, ఇప్పుడు వయోపరిమితిని పెంచడం ద్వారా దరఖాస్తుదారులు, లబ్ధిదారుల సంఖ్యా పెరిగే అవకాశముందని పేర్కొన్నారు. గిరిజన సహకార ఆర్థిక సంస్థ ( ట్రైకార్ ) ద్వారా స్వయం ఉపాధి పొందే నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. | ఎస్టీలు ఆర్థికంగా ఎదిగేందుకు ఆర్థిక ప్రోత్సాహక పథకానికి వయో పరిమితి 50కి పెంపు, నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ వంటి పలు నూతన పథకాలను చేపట్టనున్నట్టు రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖమంత్రి రావెలకిశోర్బాబు ఒక ప్రకటనలో తెలిపారు |
7,543 | https://www.prajasakti.com/WEBSECTION/National/page143/manyaulo-kalpul-kalakalam | సెక్షన్ 377 కొట్టివేత | ఇండియన్ పీనల్ కోడ్(ఐపిసి)లోని సెక్షన్ 377ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు గురువారం ఇచ్చిన తీర్పును సిపిఎం స్వాగతించింది. తద్వారా స్వలింగ సంపర్కుల మధ్య పరస్పర సమ్మతితో కూడిన లైంగిక సంబంధాలు నేరం కాదని స్పష్టం చేసింది. తిరోగమన శక్తుల చేతిలో తీవ్ర అవమానాన్ని, హింసను ఎదుర్కొంటున్న ఎల్జిబిటి కమ్యూనిటీలకు ఇదొక చారిత్రక విజయమని పేర్కొంది. సెక్షన్ 377కి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటాన్ని సిపిఎం ఎప్పుడూ సమర్థిస్తూనే వచ్చిందని తెలిపింది. | స్వలింగ సంపర్కాలు నేరం కాదని స్పష్టం చేసి సెక్షన్ 377ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు చెప్పిన తీర్పును సిపిఎం స్వాగతించింది. ఎల్జిబిటి కమ్యూనిటీలకు ఇదొక చారిత్రక విజయమన్నారు. |
7,909 | https://www.prajasakti.com/WEBSECTION/International/page693/yo-yo-testlo-raina-pass | 23న రాజ్యసభ ఎన్నికలు : ఇసి ప్రకటన | రాజ్యసభలో ఖాళీ అవుతున్న 58 స్థానాలకు ఈ నెల 23న పోలింగ్ జరుగుతుందని ఎన్నికల కమిషన్ బుధవారం ప్రకటించింది. ఈ నెల 23వ తేదీ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకూ ఈ పోలింగ్ జరుగుతుందని కమిషన్ ఒక ప్రకటనలో వివరించింది. నామినేషన్లు దాఖలు చేయటానికి ఈ నెల 12 వ తేదీ, ఉపసంహరణకు 15వ తేదీని తుదిగడువుగా నిర్ణయించినట్లు తెలిపింది. యుపి నుండి పది, బీహార్, మహారాష్ట్ర నుండి ఆరు స్థానాల వంతున, మధ్యప్రదేశ్, బెంగాల్ రాష్ట్రాల నుండి ఐదు స్థానాల వంతున, గుజరాత్ కర్నాటక రాష్ట్రాల నుండి నాలుగు స్థానాల వంతున, ఒడిషా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల నుండి మూడేసి స్థానాలకు, జార్ఖండ్ నుండి రెండు, హర్యానా, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల నుండి ఒక్కో స్థానం వంతున మొత్తం 58 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. | భారతదేశంలో నుండి రాజ్యసభలో ఖాళీ అవుతున్న కొన్ని రాష్ట్రల్లో మొత్తం 58 స్థానాలకు ఈ నెల 23న ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఎన్నికల కమిషన్ బుధవారం పేర్కొంది. నామినేషన్లు దాఖలు చేయటానికి ఈ నెల 12 వ తేదీ, ఉపసంహరణకు 15వ తేదీని తుదిగడువుగా నిర్ణయించారు. |
8,030 | https://www.prajasakti.com/WEBSECTION/National/page434/kangress-party-koshadhikariga-ahmad-patel | ఘన వ్యర్థాల నిర్వహణలో బెస్ట్ ప్రైస్ కు పురస్కారం | తడి చెత్త, పొడి చెత్తకు సంబంధించిన ఘన వ్యర్థాల నిర్వహణలో వాల్మార్ట్ ఇండియాకు చెందిన బెస్ట్ ప్రైస్ సంస్థకు ప్రోత్సాహక పురస్కారం అవార్డు లభించింది. స్వచ్ఛ భారత్ మిషన్ పూర్తిగా సామాజిక, పర్యావరణ అంశాలపై తమ దీర్ఘకాలిక ప్రణాళికల్లో భాగంగా దేశ వ్యాప్తంగా ఉన్న తమ స్టోర్లలో మొత్తం వ్యర్థాలను బెస్ట్ ప్రైస్ సంస్థ వేరు చేస్తోంది. ఈ విధానంలో వాటిని డిస్పోజ్ చేస్తున్నందుకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ రాజమహేంద్రవరం స్టోర్ను అభినందించి, ప్రోత్సాహక పురస్కారాన్ని ప్రదానం చేసినట్లు వాల్మార్ట్ ఇండియా సిఇఒ కృష్ణ అయ్యర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రశంసపత్రాన్ని రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ విజరు రామరాజు బెస్ట్ ప్రైస్ స్టోర్ రాజ మహేంద్రవరం స్టోర్ మేనేజర్ కామేశ్వరరావుకు అందజేశారని తెలిపారు. | దేశ వ్యాప్తంగా ఉన్న స్వచ్ఛ భారత్ మిషన్ యొక్క స్టోర్లలో మొత్తం వ్యర్థాలను వాల్మార్ట్ ఇండియాకు చెందిన బెస్ట్ ప్రైస్ సంస్థ వేరు చేస్తోంది. దీనిలో భాగంగా వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ప్రోత్సాహక పురస్కారాన్ని పొందారు. |
8,044 | https://www.prajasakti.com/WEBSECTION/International/page639/kovindto-venkay-bheti | బుడుబుక్కల కులస్థులను విడిపించండి | బుడుబుక్కల కుల వృత్తి అయిన చిలకజోస్యం చెప్పేవారికి రక్షణ కల్పిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్రావు హామి ఇచ్చారు. అత్యంత వెనుకబడిన కులాల సంఘం ( ఎంబీసీ ) తెలంగాణ రాష్ట్ర కమిటి ఆధ్వర్యంలో శనివారం భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్రావుకు బుడుబుక్కల కులవృత్తి అయిన చిలకజోస్యం చెప్పేవారిపై ఫారెస్టు అధికారుల వేధింపుల నుండి కాపాడాలని వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా హరీష్రావు మాట్లాడుతూ తరతరాలుగా వస్తున్న చిలుక జోస్యం వృత్తిపై అటవీశాఖ అధికారులు వేదింపులు ఆపాలని, దీనిపై సంబంధిత మంత్రితో మాట్లాడి వీరికి న్యాయం జరిగేలా చూస్తామని హామి ఇచ్చారు. వెంకటేష్, బి. మోహన్ తదితరులు పాల్గొన్నారు. | బుడుబుక్కల కులవృత్తి అయిన చిలకజోస్యం చెప్పేవారిపై ఫారెస్టు అధికారుల వేధింపుల నుండి కాపాడాలని వినతి పత్రాన్ని తెలంగాణ రాష్ట్ర కమిటి ఆధ్వర్యంలో శనివారం భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్రావుకు సమర్పించారు. అందుకు ఆయన వెనుకబడిన కులాల సంఘం ( ఎంబీసీ ) వారికీ మరియు చిలకజోస్యం చెప్పేవారికి రక్షణ కల్పిస్తామని హామి ఇచ్చారు. |
8,132 | https://www.prajasakti.com/WEBSECTION/National/page812/rashtrasthai-saftball-vijetha-ananth | ఎద్దు దాడి చేయడంతో యువకుడి మృతి..మరో 20 మందికి గాయాలు. | తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలోని అవ్వారంగడు ప్రాంతానికి చెందిన 25 సంవత్సరాల సొలాయన్ది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఈ ప్రమాదంలో మరో 20 మందికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. మృతి చెందిన వ్యక్తి పుడుక్కొట్టారు జిల్లాలో జరుగుతున్న జల్లికట్టు ఆటను చూస్తుండగా, ఒక ఎద్దు మైదానం చివరలో అతనిపై దాడి చేసినట్లు పేర్కొన్నారు. మనపర్రారులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. . కాగా, తిరుచ్చిలో జరుగుతున్న జల్లికట్టులో ఇది రెండవదని, మొదట సోమవారం సురియుర్లో జరిగినట్లు అధికారులు తెలిపారు. | జల్లికట్టు ఆటను చూస్తుండగా, మైదానంలో ఎద్దు దాడి చేయడంతో 25 సంవత్సరాల సొలాయన్ది మనపర్రారులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందినట్లు, మరో 20 మందికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. |
8,397 | https://www.prajasakti.com/WEBSECTION/International/page456/rashtra-pradhan-annikal-adhikariga-vijayanand | అణుస్థావరాల జాబితాలు మార్పిడి | భారత్-పాకిస్తాన్లు తమ దేశాలలో వున్న అణు స్థావరాల జాబితాలను సోమవారం న్యూఢిల్లీ, ఇస్లామాబాద్లలో జరిగిన కార్యక్రమాలలో పరస్పరం మార్పిడి చేసుకున్నాయి. అణుస్థావరాలపై దాడుల నివారణ కోసం గతంలో ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ఈ జాబితాలను ఇరుదేశాలు పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నాయని విదేశాంగశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. 1988 డిసెంబర్ 31న ఇరుదేశాలు సంతకాలు చేసిన ఈ ఒప్పందం 1991 జనవరి 27 నుండి అమలులోకి వచ్చింది. ఈ ఒప్పందం ప్రకారం ఏటా జనవరి 1వ తేదీన ఇరుదేశాలు తమ అణుస్థావరాల జాబితాలను పరస్పరం అందచేసుకఁంటాయి. | జనవరి 1వ తేదీన భారత్-పాకిస్తాన్లు న్యూఢిల్లీ, ఇస్లామాబాద్లలో అణుస్థావరాల జాబితాలను అందజేసుకున్నాయి. అణుస్థావరాలపై దాడుల నివారణ కోసం ఇరు దేశాలు 1991 జనవరి 27లో ఒప్పందం కుదుర్చుకున్నాయి. |
9,352 | https://www.prajasakti.com/WEBSECTION/National/page320/dakshinafrica-aensi-net-ampikakai-oting | నిరసనలు | పద్మావతి సినిమా విడుదలను నిలిపివేయాలని రాజస్థాన్లో నిరసనలు మిన్నంటాయి. పద్మావతి చిత్రం విడుదలకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ చిత్తోర్ఘర్లో ఆందోళనకారులు భారీ నిరసనను చేపట్టారు. చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలున్నాయంటూ పద్మావతి మూవీని వ్యతిరేకిస్తూ చిత్తోర్ఘర్ బంద్ను పాటించారు. పద్మావతి సినిమాలో చరిత్రను వక్రీకరించారంటూ రాజ్పుట్ కర్ణి సేన రాజస్థాన్ అంతటా నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. | పద్మావతి సినిమాలో చరిత్రను వక్రీకరించారంటూ రాజ్పుట్ కర్ణి సేన రాజస్థాన్ అంతటా నిరసనలు చేపట్టి, బంద్ను పాటించారు. |
10,612 | https://www.prajasakti.com/WEBSECTION/National/page989/varus-sammelatho-mutapadutunn-france-rifanaries | నీట్ పరీక్ష - ప్రశ్నలను ఇంగ్లీష్లోకి అనువాదం | కోల్కతా : నీట్ పరీక్షలో ప్రాంతీయ భాషల్లో వున్న ప్రశ్నలను ఇంగ్లీష్లోకి అనువాదం మాత్రమే చేస్తామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో జవదేకర్ మాట్లాడుతూ 'వైద్య కళాశాల్లో కోసం జరిగే జాతీయ అర్హత మరియు ప్రవేశ పరీక్ష (నీట్)లో ప్రాంతీయ భాషల్లో వున్న ప్రశ్నలను కేవలం ఇంగ్లీష్లోకి అనువదిస్తాం' అని తెలిపారు. అన్ని ప్రాంతీయ భాషా విద్యార్థులు ఇంగ్లీష్, హిందీల్లో నిర్వహించే నీట్ పరీక్ష రాయాలనే నిబంధనపై ప్రశ్నలు వస్తున్న నేపథ్యంలో మంత్రి విషయం తెలిపారు. ప్రాంతీయ భాషల్లో వున్న ప్రశ్నలను కేవలం ఇంగ్లీష్లోకి అనువదించడం మాత్రమే చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. | కోల్కతా : కోల్కతాలో జరిగిన విలేకరుల సమావేశంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ నీట్ పరీక్షలో ప్రాంతీయ భాషల్లో ఉన్న ప్రశ్నలను కేవలం ఇంగ్లీషులోకి అనువాదం చేస్తామని స్పష్టం చేశారు. |
11,466 | https://www.prajasakti.com/WEBSECTION/International/page934/orishalo-41-mandi-raitul-atmahatya | తలాఖ్ మహిళలకు పెన్షన్! | తలాఖ్ బాధిత మహిళలకు పింఛన్లు ఇచ్చి ఆదుకోవాలని అస్సాం ప్రభుత్వం నిర్ణయించింది. విడాకులు పొందిన మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించడం కోసం వారికి నైపుణ్యాభివృద్ధి శిక్షణనిస్తామని అస్సాం ఆరోగ్య, విద్యాశాఖ మంత్రి హిమాంత విశ్వ శర్మ చెప్పారు. ముస్లిం మహిళలకు శిక్షణ సమయంలో ప్రత్యేకంగా పెన్షన్ మంజూరు చేయాలని నిర్ణయించామని మంత్రి చెప్పారు. విడాకులు పొందిన ఇతర మహిళలతో పోల్చినప్పుడు ముస్లిం మహిళలకు భర్తలనుంచి ఎలాంటి భరణం అందదని, ఆ కారణంగా వారిని ఆదుకోవడానికి ప్రత్యేకంగా పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించామని శర్మ అన్నారు. | తలాఖ్ బాధిత మహిళలకు పింఛన్లు ఇచ్చి వారి నైపుణ్యాభివృద్ధి శిక్షణని, శిక్షణ సమయంలో ప్రత్యేకంగా పెన్షనిస్తామని అస్సాం ఆరోగ్య, విద్యాశాఖ మంత్రి హిమాంత విశ్వ శర్మ చెప్పారు. |
16,088 | https://www.prajasakti.com/WEBSECTION/International/page2495/sushma-swaraj-charchku-siddha- | సుష్మా స్వరాజ్ చర్చకు సిద్ధం | లలిత్ మోడీ వివాదంపై చర్చకు తాను సిద్ధమేనని విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ చెప్పారు. ఆమె మంగళవారంనాడిక్కడ మాట్లాడుతూ, ''దీనిపై చర్చకు సిద్ధం. ఈ విషయాన్ని రాజ్యసభకు తెలియచేయమని మంత్రి అరుణ్ జైట్లీని కోరాను. '' అని ఆమె ట్వీట్ చేశారు. | విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్, లలిత్ మోడీ వివాదంపై చర్చకు తాను సిద్ధమని ట్వీట్ చేసారు |
17,773 | https://www.prajasakti.com/WEBSECTION/International/page269/25na-manyam-band | ట్రంప్ చర్యల వల్ల ప్రతికూల ఫలితాలే వుంటాయి | ఉత్తర కొరియా తన విధానాన్ని మార్చుకోకపోతే పూర్తిగా ధ్వంసం చేస్తామని అమెరికా నేత ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో రాజకీయ విశ్లేషకులు ఆ హెచ్చరికలను విశ్లేషిస్తున్నారు. ఆత్మ రక్షణ కోసమే అణ్వాయుధాలను అభివృద్ధిపరుస్తున్నామంటూ ఉత్తర కొరియా చెబుతున్న విషయాన్ని సమర్ధించే విధంగానే ట్రంప్ చర్యలు వున్నాయని వారు భావిస్తున్నారు. ట్రంప్ చర్యల వల్ల ప్రతికూల ఫలితాలే వుంటాయని పీటర్సన్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్కి చెందిన మార్కస్ నోలాండ్ పేర్కొంటున్నారు. అమెరికా దూకుడును తట్టుకోవాలంటే, వారి చర్యలను సమర్థవంతంగా ఎదుర్కొనాలంటే అందుకు ధీటుగా ఉత్తర కొరియా తయారవడం తప్పనిసరని చెప్పడానికి ట్రంప్ ప్రసంగాన్ని ఒక రుజువుగా చూపించే ప్రయత్నం జరుగుతుందని పేర్కొన్నారు. | ఉత్తర కొరియాను అమెరికా నేత ట్రంప్ పూర్తిగా ధ్వంసం చేస్తామని హెచ్చరించిన విధానాన్ని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ట్రంప్ చర్యల వల్ల ప్రతికూల ఫలితాలే ఉంటాయని పీటర్సన్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్కి చెందిన మార్కస్ నోలాండ్ అన్నారు. |
18,082 | https://www.prajasakti.com/WEBSECTION/International/page51/ipass-pustakan-raituku-bharosa-deputy-sita-mahamudli | పాకిస్తాన్ లో పేలిన కారు బాంబు. | వాయవ్య పాకిస్తాన్లోని బెలూచిస్తాన్ ప్రావిన్స్లో రాజధాని క్వెట్టా నగరంలో శుక్రవారం సంభవించిన శక్తివంతమైన కారు బాంబు పేలుడులో కనీసం 11 మంది మరణించారని, మరో 20 మందికి పైగా గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. నగరంలోని పోలీసు ప్రధాన కార్యాలయం ముందు జరిగిన ఈ పేలుడు శబ్దం నగరం అంతా వినిపించిందని, పరిసర ప్రాంతాల్లోని భవనాల కిటికీలు దెబ్బతిన్నాయని పోలీసు ప్రతినిధి షెహజాదా ఫర్హత్ చెప్పారు. కొంత మంది క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉందని ప్రభుత్వ ఆస్పత్రి ప్రతినిధి వాసింబేగ్ వివరించారు. టీవీ ఛానల్స్ తమ వార్తా కథనాలలో తీవ్రంగా దెబ్బతిన్న కార్లు, రోడ్డుపై చెల్లా చెదురుగా పడిన గాజు ముక్కలను చూపాయి. | శుక్రవారం పాకిస్తాన్లోని బెలూచిస్తాన్ ప్రావిన్స్లో రాజధాని క్వెట్టా నగరంలో కారు బాంబు పేలుళ్లు సంభవించడంతో కనీసం 11 మంది మరణించారని, మరో 20 పరిస్థితి విషమంగా ఉందని ప్రభుత్వ ఆస్పత్రి ప్రతినిధి వాసింబేగ్ తెలిపారు. |
18,163 | https://www.prajasakti.com/WEBSECTION/National/page3880/atmahuti-dodilo-20-mandi-mriti-
| ఆత్మాహుతి దాడిలో 20 మంది మృతి | హిల్లా (ఇరాక్): ఇరాక్ రాజధాని బాగ్దాద్ నగరం దక్షిణ ప్రాంతంలోని ముసయ్యిబ్ మార్కెట్ ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో కనీసం 20 మంది మరణించినట్లు భద్రతా దళాలు వెల్లడించాయి. ముసయ్యిబ్ మార్కెట్లో ఆత్మాహుతి దళ సభ్యుడొకరు తనను తాను పేల్చివేసుకున్న ఘటనలో 20 మంది మరణించారని హోం మంత్రిత్వశాఖ ప్రతినిధి ఒకరు వివరించారు. sఈ ఘటనలో మరో 34 మందికి పైగా గాయపడ్డారని పోలీసు అధికారి ఒకరు వివరించారు. తుది సమాచారం అందే సమయానికి ఈ దాడి జరిపింది తామేనంటూ ఎవరూ ప్రకటించకపోవటం విశేషం. | ఇరాక్ రాజధాని బాగ్దాద్లోని ముసయ్యిబ్ మార్కెట్లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 34 మంది గాయపడగా, కనీసం 20 మంది మరణించినట్లు భద్రతా దళాలు, హోం మంత్రిత్వశాఖ వెల్లడించాయి. |
18,526 | https://www.prajasakti.com/WEBSECTION/National/page6/gharshaello-aaruguru-dalit-vidyarthulku-gayas | ఆయుధాల లైసెన్సులను రద్దు | జమాత్-ఉద్-దవా(జెయుడి) ఉగ్రవాద సంస్థ స్థాపకుడు హఫీజ్ సయీద్కు గతంలో జారీ చేసిన ఆయుధ లైసెన్సులను రద్దు చేసినట్లు పాకిస్తాన్ ప్రభుత్వం తెలిపింది. భద్రతా కారణాల రీత్యా హఫీజ్తో పాటు జెయుడి సభ్యుల పేరుమీదున్న 44 ఆయుధాల లైసెన్సులను రద్దు చేసినట్లు పంజాబ్ హోంశాఖ మంగళవారం తెలిపింది. గతనెల 30న పాకిస్తాన్ ప్రభుత్వం హఫీజ్తోపాటు నలుగురు జెయుడి నేతలను 90 రోజులపాటు గృహనిర్బంధంలో వుంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పంజాబ్ హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. | జమాత్-ఉద్-దవా ఉగ్రవాద సంస్థ స్థాపకుడు హఫీజ్ సయీద్ తో పాటు జెయుడి సభ్యుల పేరుమీదున్న 44 ఆయుధాల లైసెన్సులను రద్దు చేసినట్లు పంజాబ్ హోంశాఖ స్పష్టం చేసింది. |
18,527 | https://www.prajasakti.com/WEBSECTION/National/page783/doclamlo-kramepi-sainik-dalal-pamp | విమాన ప్రమాదం | మంగళవారం నగరంలోని ఒక షాపింగ్ మాల్లోకి ఛార్టర్డ్ విమానం దూసుకుపోయిన ప్రమాద ఘటనలో అందులోని నలుగురు అమెరికన్ పర్యాటకులతో పాటు పైలట్ కూడా మరణించాడని అధికారులు చెప్పారు. వీరు రెండు ఇంజన్ల ఛార్టర్డ్ విమానంపై ఒక ఫ్యాక్టరీ ఔట్లెట్ మాల్ను ప్రారంభించేందుకు వస్తుండగా 45 నిముషాల ముందు ప్రమాదం జరిగిందని పోలీసు అధికారి లీసా నివెల్లే చెప్పారు. మృతుల్లో నలుగురు తమ దేశవాసులేనని కాన్బెర్రాలోని అమెరికా దౌత్య కార్యాలయం నిర్ధారించింది. ప్రమాదానికి ముందు విమానం ఇంజన్లలో సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలట్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. | నగరంలోని ఒక షాపింగ్ మాల్లోకి ఛార్టర్డ్ విమానం దూసుకుపోవడంతో లుగురు అమెరికన్ పర్యాటకులతో పాటు పైలట్ కూడా మరణించాడని అధికారులు చెప్పారు. విమానంలో సాంకేతిక లోపం వాళ్ళ ఎ ప్రమాదం జరిగిందని చెప్పారు. |
18,717 | https://www.prajasakti.com/WEBSECTION/International/page843/america-kriminal-nyayavyavasthalo-sanskarnalu | ఇటలీ కొత్త ప్రధానిగా ఎంపికయిన జెంటిలోని | ఇటలీ కొత్త ప్రధానిగా ప్రస్తుత విదేశాంగ మంత్రి పౌలో జెంటిలోని ఎంపికయ్యారు. ఇటీవలి రిఫరెండం అనంతరం ప్రధాని పదవికి మటెయో రెంజీ రాజీనామా చేయటంతో ఆయన స్థానంలో కొత్త ప్రధానిని ఎన్నుకోవాల్సి వచ్చింది. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అధ్యక్షుడు సెర్జియో మాటరెల్లా ఆయన్ను ఆహ్వానించారని అధ్యక్ష భవనం ప్రతినిధి ఒకరు ప్రకటించారు. పదవి నుండి వైదొలగుతున్న రెంజి సన్నిహిత సహచరుడైన జెంటిలోనీ బుధవారం నాడు పార్లమెంట్లో విశ్వాస ఓటింగ్ ఎదుర్కోనున్నట్లు తెలుస్తోంది. | పదవి నుండి వైదొలగుతున్న రెంజి సన్నిహిత సహచరుడైన జెంటిలోనీ ఇటలీ కొత్త ప్రధానిగా ఎంపికవ్వగా బుధవారం నాడు పార్లమెంట్లో విశ్వాస ఓటింగ్ ఎదుర్కోనున్నట్లు సంభందిత వర్గాలు వెల్లడించాయి. |
19,075 | https://www.prajasakti.com/WEBSECTION/National/page56/central-africa-ampi-desh-bahishkaran | శాస్త్ర పరిశోధనల అభివృద్ధికి పంచవర్షప్రణాళిక ఆవిష్కరించిన సిఎఎస్ | రానున్న ఐదేళ్ల కాలంలో కీలకమైన 60 ప్రాజెక్టులకు సంబంధించిన శాస్త్ర పరిశోధనల నిర్వహణకు అవసరమైన పంచవర్ష ప్రణాళికను చైనా అకాడమీ ఆఫ్ సైన్సెస్ (సిఎఎస్) ఆవిష్కరించింది. ప్రధానంగా ఎనిమిది రంగాలపై దృష్టి కేంద్రీకరించిన సిఎఎస్ 60 ప్రాజెక్టులకు లక్ష్యాలను నిర్దేశించింది. ఇందులో 17 ప్రాజెక్టులు జీవ, ఆరోగ్య శాస్త్రాలకు సంబంధించినవి కాగా 11 ప్రాజెక్టులు ప్రకృతి, పర్యావరణ రంగాలకు, ఎనిమిది ప్రాజెక్టులు భిన్న రంగాల పరిశోధనలకు, నాలుగు ఆధునిక పదార్థ విజ్ఞాన రంగానికి, ఐదు విద్యుత్ రంగానికి, మూడు సముద్ర జీవనానికి, ఏడు సమాచార రంగానికి, ఐదు ప్రాజెక్టులు ఆప్టిక్స్, అకస్టిక్స్, రోదసీ రంగాలకు సంబంధించినవి కావటం విశేషం. ఈ అన్ని ప్రాజెక్టుల్లో చంద్ర, అరుణగ్రహ యాత్రలు ప్రధానంగా అందరినీ ఆకర్షిస్తున్నాయి. | రానున్న ఐదేళ్ల కాలంలో 60 ప్రాజెక్టుల ఇందులో 17 ప్రాజెక్టులు జీవ, ఆరోగ్య శాస్త్రాలకు సంబంధించినవి కాగా 11 ప్రాజెక్టులు ప్రకృతి ఇలా మరికొన్ని రంగాలకు సంబంధించినవి ప్రాజెక్టులు సిఎఎస్ విష్కరించగ, ఇందులొ అన్ని ప్రాజెక్టుల్లో చంద్ర, అరుణగ్రహ యాత్రలు ప్రధానంగా అందరినీ ఆకర్షిస్తున్నాయి. |
19,130 | https://www.prajasakti.com/WEBSECTION/International/page106/nenu-norettite-tattucoleru | వైట్ హౌస్ ఫెలో ప్రోగ్రామ్ కు ఇద్దరు భారత సంతతి ఎంపిక. | అమెరికా ప్రభుత్వంలో అత్యున్నత స్థాయిల్లో అనుభవపూర్వకంగా పనిచేసే అవకాశం లభించే ప్రతిష్టాత్మక వైట్ హౌస్ ఫెలో ప్రోగ్రామ్కు ఇద్దరు భారత సంతతికి చెందిన అమెరికన్ మహిళలు ఎంపికయ్యారు. కాలిఫోర్నియాకు చెందిన ఆస్ట్రోఫిజిస్ట్ అంజలి త్రిపాఠి, చికాగోకు చెందిన ఫిజిషియన్ టినా ఆర్ షా 2015-16కు గాను ఎంపికైన 16 మంది వైట్ హౌస్ ఫెలోషిప్ పొందిన వారిలో ఉన్నారని అధికారులు వెల్లడించారు. దీర్ఘకాల వ్యాధులతో బాధపడే రోగులకు వైద్య సేవలందించడంలో పల్మనరీ ఫిజిషియన్, సైంటిస్ట్గా షా గుర్తింపు పొందారు. సీఓపీడీ వ్యాధులతో తరచూ ఆస్పత్రుల చుట్టూ రోగులు తిరిగే అవసరం లేని రీతిలో చికిత్సా పద్ధతిని యూనివర్సిటీ ఆఫ్ చికాగాలో ఆమె ఇటీవల అభివృద్ధి చేశారు. | భారత సంతతికి చెందిన అమెరికన్లు ఆస్ట్రోఫిజిస్ట్ అంజలి త్రిపాఠి, ఫిజిషియన్ టినా ఆర్ షా 2015-16కు గాను అమెరికా ప్రభుత్వంలో అత్యున్నత స్థాయిల్లో అనుభవజ్ఞులుగా పనిచేయటానికి లభించే వైట్ హౌస్ ఫెలోషిప్కు ఎంపికైన 16 మందిలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. |
19,266 | https://www.prajasakti.com/WEBSECTION/National/page749/git-enginiring-praveshalku-darkhastulu | బెల్జియంపై దాడి నేపధ్యంలో ఇద్దరు వ్యక్తుల అరెస్టు | బెల్జియంపై దాడి చేసేందుకు కుట్ర పన్నారన్న అనుమానంతో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం రాత్రి జరిగిన దాడుల్లో వారిని పట్టుకున్నట్లు ఫెడరల్ ప్రాసిక్యూటర్లు తెలిపారు. వారిని నూరుద్దీన్ అతని సోదరుడు హమ్జాగా గుర్తించారు. ఫ్రెంచి మాట్లాడే ప్రాంతాలైన మాన్స్, లిగేల్లో ఇళ్ళలో సోదాలు జరిగిన నేపథ్యంలో ఈ అరెస్టులు జరిగాయి. | శుక్రవారం రాత్రి బెల్జియంపై జరిగిన దాడుల్లో నూరుద్దీన్ అతని సోదరుడు హమ్జాను అనుమానితులుగా గుర్తిస్తూ పోలీసులు అరెస్టు చేశారు. |
19,732 | https://www.prajasakti.com/WEBSECTION/National/page517/pallo-kaltipai-nivedik-corin-madras-hacort | ఐరాస చీఫ్ బాన్ కీ మూన్ ట్రంప్ పై విమర్శలు | భవిష్యత్తులో దేశ సారథ్య బాధ్యతలు చేపట్టేందుకు పరుగులు తీస్తున్న కొందరు నేతలు చేస్తున్న విద్వేష వ్యాఖ్యలు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీస్తాయని ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్-కి-మూన్ అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ల తరపు నామినేషన్ కోసం పోటీలో ముందుపీఠిన వున్న డొనాల్డ్ ట్రంప్కు ఐరాస చీఫ్ పరోక్షంగా చురకలు వేశారు. ప్రతిష్టాత్మక కొలంబియా యూనివర్శిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో బాన్ కీ మూన్ మాట్లాడుతూ, కొందరు రాజకీయ వేత్తలు, భావి నేతలు చేస్తున్న విద్వేష పూరిత వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయని ట్రంప్నుద్దేశించి అన్నారు. సిరియాతో పాటు ప్రపంచంలోని పలు ప్రాంతాలలో చోటు చేసుకుంటున్న యుద్ధ నేరాలను మనం చూస్తూనేవున్నామని, ఈ పరిస్థితుల్లో ప్రజలను విడదీయకుండా ఒక్కతాటిపైకి తీసుకురావాల్సిన బాధ్యత ఈ నేతలపై వున్నదని అన్నారు. | ప్రతిష్టాత్మక కొలంబియా యూనివర్శిటీలో ఒక కార్యక్రమంలో ఐరాస చీఫ్ బాన్ కీ మూన్ మాట్లాడుతూ, కొందరు నేతల విద్వేష పూరిత వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయని ట్రంప్నుద్దేశించి అన్న ఆయన ప్రజల౦దరిని ఒకటిగా చెయ్యాల్సిన బాధ్యత ఈ నేతలపై వున్నదని అన్నారు. |
19,734 | https://www.prajasakti.com/WEBSECTION/International/page314/vruddhuralipai-yuvak-atyachara | ప్రస్తుత ప్రధాని డేవిడ్ కెమెరాన్ తీవ్ర విమర్శలు | ప్రస్తుత ప్రధాని డేవిడ్ కెమెరాన్ పాలన తప్పుదోవలో వెళ్తున్న డ్రైవర్లేని కారు తరహాలో వుందని లేబర్ పార్టీ నేత జెరిమి కార్బిన్ విమర్శించారు. కొత్త పార్లమెంట్ ప్రారంభ సమావేశంలో ఎలిజెబెత్ రాణి ప్రసంగించిన అనంతరం ఆయన మాట్లాడుతూ డ్రైవర్లేని కార్లను రోడ్లపైకి దించేందుకు కొత్త చట్టాలను ప్రభుత్వం సిద్ధం చేస్తోందంటూ స్వయం చలిత విద్యుత్ కార్ల విషయంలో ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మోడర్న్ ట్రాన్స్పోర్ట్ బిల్లుపై ఆయన విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న జైలు సంస్కరణలపై కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎవరైనా సమన్యాయం కావాలని కోరితే దానిని అందరి కోసం పనిచేసే ప్రభుత్వం వుంటేనే అందచేయగలం తప్ప డ్రైవర్లేని కారు తరహాలో తప్పుదో వన వెళ్లే ప్రభుత్వంతో అది సాధ్యం కాదన్నారు. | కొత్త పార్లమెంట్ ప్రారంభ సమావేశంలో ఎలిజెబెత్ రాణి ప్రసంగించిన అనంతరం లేబర్ పార్టీ నేత జెరిమి కార్బిన్ మాట్లాడుతూ ప్రస్తుత ప్రధాని డేవిడ్ కెమెరాన్ పాలనపై,మోడర్న్ ట్రాన్స్పోర్ట్ బిల్లుపై ఆయన తీవ్ర విమర్శలు చేసారు. |
20,938 | https://www.prajasakti.com/WEBSECTION/National/page685/nirudyogul-mose-chacin-sie | అంతర్యుద్ధంతో సురక్షిత ప్రాంతాలకు సిరియా నుండి వలస వస్తున్న ఇద్దరు చిన్నారులతో సహా 10 మంది శరణార్ధుల మరణం | అంతర్యుద్ధంతో సతమతమవుతున్న సిరియా నుండి సురక్షిత ప్రాంతాలకు వలస బాట పట్టిన దాదాపు 12 మంది శరణార్ధులు టర్కీ తీరంలో మునిగిపోయారని టర్కీ అధికార వార్తాసంస్థ అనదోలు న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ మృతులలో వున్న ఇద్దరు బాలుర మృతదేహాలకు సంబంధించిన చిత్రాలు ఇప్పుడు ఇంటర్నెట్ సామాజిక మీడియాలో కలకలం సృష్టిస్తున్నాయి. అత్యంత భయానకంగా వున్న ఈ చిత్రాలను అయిలన్ (3), అతడి ఐదేళ్ల సోదరుడు గాలిప్గా గుర్తించారు. నిర్జీవులైన ఈ చిన్నారులను చూసిన తరువాతైనా సిరియాలో యుద్ధానికి తెరదించేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకు వస్తుందన్న ఆశాభావాన్ని పరిశీలకులు భావిస్తున్నారు. | అంతర్యుద్ధంతో సురక్షిత ప్రాంతాలకు సిరియా నుండి వలస వస్తున్న ఇద్దరు చిన్నారులతో సహా 10 మంది శరణార్ధులు టర్కీ తీరంలో మునిగిపోయారని వార్తాసంస్థ అనదోలు న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. |
31,667 | https://www.prajasakti.com/WEBSECTION/International/page302/trampnku-america-cort-shock | గ్రూపు - 2 పై మూడు వారాలు స్టే విధించిన హైకోర్టు | తెలంగాణ గ్రూప్-2పై హైకోర్టు ఇవాళ స్టే విధించింది. గ్రూప్-2 లో అక్రమాలు జరిగాయని హైకోర్టులో పిటిషన్ వేయడంతో స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈనేపధ్యంలో మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశించింది. మూడు వారాల వరకు ఎలాంటి ప్రక్రియ నిర్వహించవద్దని టీఎస్పీఎస్సీకి ఉత్తర్వులు జారీ చేసింది. | తెలంగాణ గ్రూపు - 2 లో అక్రమాలు జరిగాయని మూడు వారాల పాటు ఎలాంటి ప్రక్రియ నిర్వహించవద్దని హైకోర్టు స్టే విధించింది. |
32,619 | https://www.prajasakti.com/WEBSECTION/International/page450/darjeeling-siarpiep-upasanharanku-suprin-cort-oke | అసెంబ్లీలో వచ్చే బడ్జెట్ సమావేశాలలో ప్రకాశం జిల్లా గురించి చర్చించి, వెనుకబడ్డ జిల్లాగా తీర్మానం చేసేలా 12 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా అభివృద్ది వేదిక నాయకులు డిమాండ్ చేశారు. ఒంగోలులోని ఎల్బిజి భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వేదిక ప్రధాన కార్యదర్శి వి మాలకొండారెడ్డి మాట్లాడుతూ ప్రకాశం జిల్లా అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలన్నారు. జిల్లాను వెనుకబడిన జిల్లాగా గుర్తించాలని కోరుతూ తీర్మానం ఆమోదించిన జడ్పి చైర్మన్ ఈదర హరిబాబుకు, సహకరించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జడ్పిటిసిలకు అభివృద్ధి వేదిక తరపున ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో వేదిక నాయకులు గోపాల్రెడ్డి, షంషేర్ అహ్మద్, గోపాలకృష్ణయ్య పాల్గొన్నారు. | అసెంబ్లీలో వచ్చే సమావేశాల్లో కాశం జిల్లా వెనుకబడిన జిల్లాగా తీర్మానం చేయాలని 12 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా అభివృద్ధి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకాశం జిల్లా అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలన్నారు. |
|
32,778 | https://www.prajasakti.com/WEBSECTION/National/page70/vistrut-sahakaranto-merugan-bhavith | అవినీతి నిరోధక శాఖ ( ఎసిబి ) రాష్ట్ర ప్రధాన కార్యాలయం విజయవాడలో ఏర్పాటు కానుంది. ఎసిబి డైరెక్టర్ జనరల్ కార్యాలయం హైదరాబాదు నుంచి రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. మార్చి 31 తర్వాత విజయవాడ నుంచే అవినీతి నిరోధక శాఖ పూర్తి స్థాయి కార్యకలాపాలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు నూతన రాజధాని అమరావతిలో ఎసిబికి స్థలం కేటాయించాలని సిఆర్డిఎ కమిషనర్ శ్రీకాంత్కు ఎసిబి డిజి మాలకొండయ్య లేఖ రాసినట్లు సమాచారం. | అవినీతి నిరోధక శాఖ రాష్ట్ర ప్రధాన కార్యాలయం విజయవాడలో ఏర్పాటు కానున్నట్లు మరియు ఈ శాఖ పూర్తి కార్యకలాపాలు విజయవాడ నుంచి జరగనున్నట్లు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. |
|
33,012 | https://www.prajasakti.com/WEBSECTION/International/page687/nedu-mumbaki-kesiar | తమ పట్ల టిటిడి పాలకమండలి, ఉన్నతాధికారులు అనుసరిస్తున్న నిర్లక్ష్యాన్ని వీడాలని కోరుతూ టిటిడి పరిపాలనా భవనం ఎదుట అన్నమయ్య కళాకారులు సంకీర్తనార్చనతో మంగళవారం వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. అన్నమయ్య కళాకారుల సంఘం గౌరవాధ్యక్షులు కందారపు మురళి మాట్లాడుతూ దశాబ్దాలుగా అన్నమయ్య కళాకారులు వినతులు సమర్పిస్తున్నారని, అధికారులు మాత్రం ఏ ఒక్కటీ పరిష్కరించిన దాఖలాలు లేవన్నారు. తమ సమస్యలు పరిష్కరించేంత వరకు నిరంతరాయంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కళాకారులు వయోలిన్ రాజా, తులసీబాయి, మండూరి లక్ష్మి, భానుప్రియ, లోకనాధంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. | తన పట్ల టిటిడి పాలకమండలి మరియు అధికారులు నిర్లక్ష్యాన్ని చెబుతున్నారని టిటిడి పరిపాలనా భవనం ఎదుట అన్నమయ్య కళాకారులు సంకీర్తనార్చనలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కళాకారులు మరియు కళాకారుల సంఘం పాల్గొన్నారు. |
|
34,501 | https://www.prajasakti.com/WEBSECTION/National/page62/anu-oppanda-drudaminadi-iran | రాష్ట్రంలో ఏడుగురు డీఎస్పీలకు బదిలీ చేస్తూ డిజిపి జెవి రాముడు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో ముగ్గురు ఇన్స్పెక్టర్లు డిఎస్పీలుగా పదోన్నతిపై బదిలీ అయ్యారు. గుంటూరు రేేంజి సిఐ కె జగదీశ్వర్ రెడ్డి గురటూరు అర్బన్ సిసిఎస్ డిఎస్పీ గాను, గుంటూరు రేంజిలోనే మరో ఇన్స్పెక్టర్ ఎన్ రామారావు నెల్లూరు ట్రాఫిర్ డిఎస్పీగాను, ఏలూరు రేంజి ఇన్స్స్పెక్టర్ వి సుబ్రహ్మణ్యం శ్రీకాకుళం మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీగాను పదోన్నతులతో బదిలీ అయ్యారు. డిఎస్పీల్లో గుంటూరు రేంజి సిసిఎస్ నుంచి కె ప్రకాశ్ బాబు ఎస్టీ, ఎస్సీ, ఎస్టీ-2, విజయవాడకు, పి మురళీధర్ ఎస్సీ, ఎస్టీ సెల్ నుంచి ఎస్సీ, ఎస్టీ సెల్, శ్రీకాకుళానికి, ఎం జనార్ధన్కు నెల్లూరు ట్రాఫిక్ నుంచి కర్నూలు మహిళా పోలీస్స్టేషన్కు, కాశీబుగ్గ సిఐడి నుంచి ఎల్ అర్జున్కు, అసిస్టెంట్ కమాండెంట్గా 5వ బెటాలియన్ విజయనగరానికి, కెఎస్ఎస్ శ్రీనివాస రావుకు ( ఏఆర్ ) వెయిటింగ్ నుంచి రాజమండ్రి హోమ్గార్డ్స్కు బదిలీలయ్యాయి. | డిజిపి జెవి రాముడు ఏడుగురుని డీఎస్పీలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ముగ్గురు ఇన్స్పెక్టర్లను, గుంటూరు రేంజిలోని సిఐ కె జగదీశ్వర్ రెడ్డి, న్స్పెక్టర్ ఎన్ రామారావు, నెల్లూరు ట్రాఫిర్, ఏలూరు రేంజి ఇన్స్స్పెక్టర్ వి సుబ్రహ్మణ్యం లను డీఎస్పీలుగా బదిలీ చేశారు. |
|
34,616 | https://www.prajasakti.com/WEBSECTION/International/page786/ukorea-adhikarulpai-america-ankshalu | జిహెచ్ఎంసిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు ఇక నుంచి ప్రతి నెలా వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు కమిషనర్ డా. బి. జనార్ధనరెడ్డి తెలిపారు. శనివారం అదనపు, జోనల్, డిప్యూటి కమిషనర్లతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల వైద్య అవసరాల కోసం ఈఎస్ఐకి నిధులు చెల్లిస్తున్నామన్నారు. ఐఎంఏ సహకారంతో నెలలో ఒకసారి కార్మికులకు వైద్య చికిత్సలు నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని శానిటేషన్ విభాగం అదనపు కమిషనర్ను ఆదేశించారు. | డిప్యూటీ కమిషనర్లతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్సీలో కమిషనర్ డా. బి. జనార్ధనరెడ్డి మాట్లాడుతూ, జిహెచ్ఎంసిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు నెలలో ఒకసారి వైద్య చికిత్సలు అందించాలన్నారు. |